BL Santhosh
-
తెలంగాణలో హంగ్.. సర్కార్ ఏర్పాటుపై లాజిక్ చెప్పిన రేవంత్
సాక్షి, సికింద్రాబాద్: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి సీరియస్ కామెంట్స్ చేశారు. పీఎం మోదీ, సీఎం కేసీఆర్ అపూర్వ సోదరులు అంటూ చురకలంటించారు. అలాగే, డిసెంబర్ నెల మిరాకిల్ మంత్ అని.. తెలంగాణ వచ్చింది అదే నెలలో..రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది అదే నెలలో అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కాగా, రేవంత్ శనివారం మీడియాతో మాట్లాడుతూ..పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేయాలి. కానీ, ప్రభుత్వాన్ని చూసి ప్రజలు భయపడే పరిస్థితి దేశంలో దాపురించింది. మైనారిటీలకు కాంగ్రెస్ అండగా ఉంటుంది. మైనారిటీల కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాం. మైనార్టీల డిమాండ్లను అమలు చేయాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. కర్ణాటకలో మైనారిటీలు కాంగ్రెస్ వైపు నిలబడ్డారు. అందుకే అక్కడ మైనారిటీల సంక్షేమం కోరే ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణలోనూ మైనారిటీలు కాంగ్రెస్‌కు అండగా నిలవండి. ఇదే సమయంలో తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో హాంగ్ వస్తుందని బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతుందని బీఎల్ సంతోష్ చెబుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ కలవవు అని అందరికీ తెలుసు. హాంగ్ వస్తే కలవబోయేది బీజేపీ, బీఆర్ఎస పార్టీలే. కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుట్ర చేస్తున్నాయి. కేసీఆర్, కేటీఆర్.. సోనియా గాంధీని దూషిస్తున్నారు. బీజేపీ.. కాంగ్రెస్ పార్టీని నిందిస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలది ఫెవికాల్ బంధం. మరి ఎంఐఎం పార్టీ.. కాంగ్రెస్‌ను ఎందుకు దూషిస్తోంది. పదవులు త్యాగం చేసినందుకా?.. దళితుడిని జాతీయ అధ్యక్షుడిని చేసినందుకా?. తెలంగాణలో కొప్పుల ఈశ్వర్ ప్రెస్ మీట్లో కూర్చుంటేనే కేసీఆర్ సహించలేదు. తెలంగాణలో జరిగే ఎన్నికలు దేశ రాజకీయాలను మలుపుతిప్పేవి. డిసెంబర్ నెల మిరాకిల్ మంత్. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన వచ్చింది. 2023 డిసెంబర్ నెలలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలకు బుద్ది చెప్పాలి. సోనియా గాంధీని విమర్శించే నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరిస్తున్నా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: రేవంత్ సినిమా మొత్తం మా దగ్గరుంది.. ఒవైసీ షాకింగ్ కామెంట్స్ -
వచ్చేది హంగ్.. మనదే పవర్!
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణలో హంగ్ తప్పదు.. అయినా అధికారం మనదే’అని బీజేపీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ అన్నారు. ‘బీజేపీ నిర్వహించిన సర్వేలు, అధ్యయనాలను పరిశీలిస్తే ఏ పార్టీకి 60 సీట్లు వచ్చే పరిస్థితి లేదు. సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని విశ్వసించొద్దు. వాటి ఉచ్చులో పడొద్దు..’అని చెప్పారు. శుక్రవారం ఘట్కేసర్ సమీపంలోని ఓ కాలేజీలో జరిగిన బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎన్నికల దిశానిర్దేశం చేశారు. మొత్తం 43 మంది అగ్రనేతల సభలు ‘వచ్చే 60 రోజులు టార్గెట్‌గా పెట్టుకొని గట్టిగా కృషి చేయాలి. రాత్రి, పగలు కష్టపడాలి. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మొత్తం 43 మంది అగ్రనేతలు, ముఖ్య నాయకుల సభలు నిర్వహిస్తాం. ఎప్పటినుంచో పని చేస్తున్నాం.. టికెట్ ఇవ్వాలి అంటే కుదరదు. 119 స్థానాల కోసం 2 వేల మంది అడుగుతున్నారు. స్థానిక బలం ఆధారంగానే టికెట్ ఇస్తాం. టికెట్లు ఢిల్లీలోనో, హైదరాబాద్‌లోనో డిసైడ్ కావు. నియోజకవర్గాల్లో చేసే పని ఆధారంగా స్థానికంగానే నిర్ణయిస్తాం. ముఖ్యమంత్రి ఎవరు అనేది జాతీయ నాయకత్వం చూసుకుంటుంది. ఎవరూ నేను ముఖ్యమంత్రి అని ప్రచారం చేసుకోవద్దు. అధికారంలోకి వస్తే అందరికీ పదవులు వస్తాయి..’అని సంతోష్ చెప్పినట్టు తెలిసింది. మనం ఓడిపోలేదు.. బలపడ్డాం ‘మనం సరిగ్గా పనిచేయాలి. మనలో మనం గొడవలు పడొద్దు. ఎవరూ లూజ్ టాక్ చేయవద్దు. అందరూ కలిసి పని చేయండి. మునుగోడులో ఓడిపోయాం అని మీరు అనుకుంటున్నారు. కానీ మనం బలపడ్డాం. 12 వేల ఓట్ల నుండి 90 వేల ఓట్లకు పెరిగాం. జీహెచ్ఎంసీలో నాలుగు సీట్ల నుండి 48 సీట్లు గెలిచాం. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచాం. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు ఎంఐఎం అవసరం. అందుకోసమే ఆ పార్టీతో అవి అంటకాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్, తెలంగాణ సీఎంలు ఒకేలా వ్యవహరిస్తున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే అక్రమ కేసులు పెడుతున్నారు. వీటికి భయపడాల్సిన అవసరం లేదు..’అని సంతోష్ పేర్కొన్నారు. కాగా పార్లమెంట్ ఉభయ సభలు ‘నారీశక్తి వందన్ బిల్లు’కు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రాష్ట్ర కౌన్సిల్ ఆమోదించింది. దీనితో పాటు రాజకీయ తీర్మానాన్ని, జీ–20 సమావేశాల విజయవంతం, చంద్రయాన్–2 విజయవంతంపై తీర్మానాలు కూడా ఆమోదించారు. బీజేపీకి మద్దతివ్వండి అన్నివర్గాల ప్రజలను దగా చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఓడించి, ప్రజాస్వామ్యయుత పాలన నెలకొల్పేందుకు బీజేపీకి తెలంగాణ ప్రజలు మద్దతునివ్వాలని కోరుతూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టారు. ‘మహమూద్ అలీ హోంమంత్రిగా ఉండటానికి అనర్హుడు. పోలీస్ చెంప పగలగొడతాడా?’అంటూ తీర్మానంలో ప్రశ్నించారు. సమావేశం ప్రారంభానికి ముందు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాలేజీ ప్రాంగణంలో మొక్క నాటారు. జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ ఛుగ్, సునీల్‌బన్సల్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్చార్జ్ ప్రకాష్ జవదేకర్, నేతలు అరి్వంద్ మీనన్, నల్లు ఇంద్రసేనారెడ్డి, సోయం బాపూరావు, పి.మురళీధర్‌రావు, వివేక్ వెంకటస్వామి, ఏపీ జితేందర్‌రెడ్డి, గరికపాటి మోహన్‌రావు, పొంగులేటి సుధాకరరెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, రవీంద్రనాయక్, ఎవీఎన్ రెడ్డి, చిత్తరంజన్‌దాస్, డా.కాసం వెంకటేశ్వర్లు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్, బంగారు శ్రుతి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణలో హంగ్.. బీఎల్ సంతోష్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో హంగ్ వస్తుందంటూ బీజేపీ సీనియర్ నేత బీఎల్ సంతోష్ వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ‘‘టికెట్లు హైదరాబాద్, ఢిల్లీలో ఇవ్వరు. అనవసరంగా నేతల చుట్టూ తిరగొద్దు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారు ప్రజల్లో ఉండాలి. నేతలు వివేకంతో ఆలోచించాలి’’ అని బీఎల్ సంతోష్ హితవు పలికారు. కాగా, నిన్న(గురువారం) జరిగిన బీజేపీ రాష్ట్ర పధాధికారుల సమావేశంలో కూడా బీఎల్ సంతోష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరి కోసమో పార్టీ విధానాలు మార్చుకోదని, 30 ఏళ్లుగా ఎలా ఉందో అలానే పార్టీ నడుస్తుందని, ఇతర రాష్ట్రాల్లో ఇదే విధానంతో అధికారంలోకి వచ్చామని సంతోష్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. చదవండి: ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో సీఎం పోస్టుపై కోమటిరెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ -
ఉండేవారు ఉంటారు.. పోయేవారు పోతారు.. బీఎల్ సంతోష్ షాకింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: ఎవరి కోసమో పార్టీ విధానాలు మార్చుకోదని, 30 ఏళ్లుగా ఎలా ఉందో అలానే పార్టీ నడుస్తుందని బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ అన్నారు. బీజేపీ రాష్ట్ర పధాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో ఇదే విధానంతో అధికారంలోకి వచ్చామన్నారు. ‘‘ పార్టీలో ఉండే వారు ఉంటారు.. పోయే వారు పోతారు. మోదీ-కేసీఆర్ కలిసి ఉంటే ఈ కార్యక్రమాలు ఎందుకు?. అనవసరపు మాటలు తగ్గించండి.. తప్పుడు ప్రచారాలు నమ్మకండి’’ అంటూ బీఎల్ సంతోష్ వ్యాఖ్యానించారు. సునీల్ బన్సల్ కీలక ఆదేశాలు.. ఎన్నికల వరకు 18 కార్యక్రమాలు నిర్వహించాలని జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ఆదేశించారు. ఈ నెల 20లోపు ఆరు కార్యక్రమాలు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. చదవండి: తమిళిసైపై హరీష్ రావు ఫైర్.. మీరు గవర్నర్ కావచ్చా? అంటూ.. -
మళ్లీ తెరపైకి ఎమ్మెల్యేల కొనుగోలు టాపిక్.. రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే పొలిటికల్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బీఆర్ఎస్, బీజేపీని టార్గెట్ చేస్తూ రేవంత్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా, రేవంత్ ట్విట్టర్ వేదికగా.. ‘కేసీఆర్!.. మీ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎరవేస్తున్నదని తెలంగాణ ప్రజలకు మొర పెట్టుకున్నది యాదికున్నదా?. అదే తెలంగాణలో రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి మీ ఇద్దరు తోడు దొంగలు ఆడిన నాటకం గుర్తొచ్చిందా?. ఆ కేసుకు ఏడాది కావొస్తున్న శుభ సందర్భంలో.. మీ సర్కారును కూలదోస్తామన్న కుట్రదారు బీఎల్ సంతోష్.. హైదరాబాద్ వచ్చిండటగా.. ఇన్నాళ్లు అడ్రస్ దొరకలేదని తప్పించుకుంటిరి.. మరి ఇప్పుడైనా ఆయన్ని అరెస్టు చేసే దమ్ముందా? ఆ కట్టుకథను ప్రజలు మర్చిపోతారులే అని అతిథ్యమిస్తారా? లేక సిట్ ను నిద్రలేపి అరెస్టేమైనా చేస్తారా? తెలంగాణ చూస్తోంది.. మీ సమాధానం కోసం..!!’ అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. కేసీఆర్! @TelanganaCMO మీ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎరవేస్తున్నదని తెలంగాణ ప్రజలకు మొర పెట్టుకున్నది యాదికున్నదా? అదే తెలంగాణలో రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి మీ ఇద్దరు తోడు దొంగలు ఆడిన నాటకం గుర్తొచ్చిందా? ఆ కేసుకు ఏడాది కావొస్తున్న శుభ… — Revanth Reddy (@revanth_anumula) October 5, 2023 ఇది కూడా చదవండి: బీజేపీ ఎన్నికల కమిటీల ప్రకటన.. 14 కమిటీలు.. రాజగోపాల్‌రెడ్డి, వివేక్, విజయశాంతిలకు చోటు -
బీజేపీ కీలక సమావేశం.. ఐదు రాష్ట్రాల్లో మార్పులు ఉంటాయా?
ఢిల్లీ: పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, సాధారణ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ స్పీడ్ పెంచింది. ఇందులో భాగంగానే నేడు ఢిల్లీలో బీజేపీ సంస్థాగత వ్యవహారాలపై కీలక సమావేశం తలపెట్టింది. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, అన్ని రాష్ట్రాల ఇంఛార్జ్‌లు, మోర్చాల అధ్యక్షులు, మోర్చాల ఇంఛార్జ్‌లతో జేపీ నడ్డా, అమిత్ షా, బీఎల్ సంతోష్ సమావేశం కానున్నారు. కాగా, ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, సంస్థాగత అంశాలు, 2024 సార్వత్రిక ఎన్నికలు, ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలపై చర్చ జరుగనుంది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు సాయంత్రం వరకు రెండు దఫాలుగా ఈ సమావేశం కొనసాగుతుంది. మొదట జాతీయ ప్రధాన కార్యదర్శులతో తర్వాత మోర్చాల అధ్యక్షులతో పార్టీ పరిస్థితులపై అధిష్టానం చర్చించనుంది. ఇదిలా ఉండగా.. ఈ సమావేశంలోనే మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తైన సందర్భంగా బీజేపీ చేపట్టిన మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా ఆయా రాష్ట్రాల్లో చేపట్టిన కార్యక్రమాల వివరాలను అధిష్టానానికి నేతలు.. ఒక నివేదిక రూపంలో సమర్పించనున్నారు. ఎన్నికలు జరుగనున్న తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరంలో రాజకీయ పరిస్థితులపై ప్రత్యకంగా చర్చించనున్నట్టు సమాచారం. ఎన్నికల వ్యూహాలు, క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై నేతలకు బీజేపీ పెద్దలు దిశా నిర్దేశం చేయనున్నారు. ఇది కూడా చదవండి: తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది.. హైఓల్టేజ్ పాలిటిక్స్ -
బీజేపీకి రాజీనామా.. బీఎల్ సంతోషే కారణం: జగదీష్ శెట్టర్
సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ బీజేపీలో రాజుకున్న అసంతృప్తి రగడ తీవ్ర స్థాయికి చేరింది. ఎన్నికల్లో టికెట్లు దక్కనివారు నేతలు ఒక్కొకరుగా తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. ఈ క్రమంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన సొంత నియోజకవర్గం హుబ్లీ-ధార్వాడ నుంచి బీజేపీ టికెట్ నిరాకరించడంతో.. ఈ పార్టీతో తెగదెంపులు చేసుకొని కాంగ్రెస్‌లో చేరారు. బెంగుళూరు ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలో జగదీష్ శెట్టర్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. పార్టీ నుంచి బయటకు రావడం వెనక బీజేపీ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్యే కారణమని ధ్వజమెత్తారు. బీఎల్ సంతోష్‌కు తనకు వ్యతిరేకంగా కుట్రలు పన్నారని శెట్టర్ విమర్శించారు. పార్టీ నుంచి టికెట్ రాకుండా చేసి ఘోరంగా అవమానించారని మండిపడ్డారు. బొమ్మై కేబినెట్లో మంత్రి పదవి ఇవ్వకున్నా పార్టీ కోసం కష్టపడి పనిచేశానని తెలిపారు. తన స్థానంలో మహేష్ తెంగినాకైకు టికెట్ ఇవ్వడం కోసం బీఎల్ సంతోష్ తన మీద కుట్ర చేశారని ఆరోపించారు. రాజకీయంగా తన ఎదుగుదలను అడ్డుకోవడానికి ఇలా చేశారని ధ్వజమెత్తారు. చదవండి: Karnataka Assembly Polls: డీకే శివకుమార్ ఆస్తులు అన్ని కోట్లా..? అదే విధంగా మైసూరు జిల్లా కృష్ణరాజ అసెంబ్లీ స్థానం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎస్ఎ రామదాస్‌ను కాదని కొత్త ముఖమైన శ్రీవాత్సకు బీజేపీ టికెట్ ఇచ్చారు. దీనిపై కూడా శెట్టర్ ఘాటుగా స్పందించారు. ‘రామదాస్ పరిస్థితి ఏమైందో చూడండి.. బీఎల్ సంతోష్ విధేయుడు కాదనే కారణంతో ఆయన్ను పక్కకు పెట్టేశారు. తన మాట వినే శ్రీవాస్తకు టిక్కెట్ ఇచ్చారు’ అని దుయ్యబట్టారు. బీఎల్ సంతోష్ వివిధ రాష్ట్రాల్లో బీజేపీ ఎన్నికల ఇన్చార్జ్గా నిమమించిన విఫలమయ్యారని శెట్టర్ విమర్శించారు. అయినా బీజేపీ అగ్ర నాయకులు ఆయన్ను ఎందుకు నమ్ముతున్నారో అర్థం కావడం లేదన్నారు. సంతోష్‌కు పార్టీ కంటే వ్యక్తులు ముఖ్యమని, ఇది బీజేపీ పరువును దిగజార్చుతుందని అన్నారు. ‘బీఎల్ సంతోష్‌ను కేరళ ఇన్‌ఛార్జ్‌గా నియమించినా రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలవలేదు. తమిళనాడు ఇన్‌ఛార్జ్‌గా చేసినా కొన్ని సీట్లు మాత్రమే గెలిచింది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. అక్కడ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇన్ని రాష్ట్రాల్లో ఘోరంగా విఫలమైన వ్యక్తి పార్టీలో నెంబర్ వన్, నెంబర్ టూ(ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా) స్థానంలో ఉన్న వారికి సలహాలు ఇస్తున్నాడు.’ అని శెట్టర్ దుయ్యబట్టారు. కాగా గతంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా, స్పీకర్‌గా, పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన జగదీష్ శెట్టర్‌కు పార్టీ నుంచి టిక్కెట్ దక్కలేదు. ఈసారి శెట్టర్‌ను కాదని మహేష్ తెంగినాకైను హుబ్లి-ధార్వాడ్ స్థానం నుంచి బరిలో దింపింది. దీంతో బీజేపీకి గుడ్‌బై చెప్పి.. అదే హుబ్లీ-ధార్వాడ సెంట్రల్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. వీరిద్దరిలో గెలుపెవరిదో తేలాలంటే మే 13వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు వరకు ఎదురుచూడాల్సిందే. చదవండి: బీజేపీ మూడో జాబితా విడుదల.. -
బండి సంజయ్ అరెస్ట్.. బొమ్మలరామారం పీఎస్ వద్ద హైటెన్షన్!
సాక్షి, బొమ్మలరామారం: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను పోలీసులు మంగళవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, తన అరెస్ట్‌కు కారణం చెప్పాలని, వారెంట్ చూపించాలని బండి సంజయ్.. పోలీసులను ప్రశ్నించడంతో వారి మధ్య వాగ్వాదం పెరిగింది. అనంతరం, జరిగిన పరిణామాలతో సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, టెన్త్ పేపర్ల లీకేజీకి సంబంధించి ప్రెస్‌మీట్ పెట్టనున్న నేపథ్యంలో సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. సీఆర్పీసీ 151 కింద బండి సంజయ్‌ను ముందస్తుగా అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. అనంతరం, సంజయ్‌ను బొమ్మలరామారం పీఎస్‌కు తరలించారు. ఇక, బండి సంజయ్ అరెస్ట్ నేపథ్యంలో పీఎస్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పీఎస్‌కు బీజేపీ నాయకులు, శ్రేణులు భారీగా తరలివస్తున్నారు. దీంతో, పీఎస్ ఎదుట పోలీసులు భారీగా మోహరించారు. కాగా, బీజేపీ శ్రేణులు స్టేషన్ లోపలకు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పీఎస్ ఎదుట కర్రలు వేసి బీజేపీ కార్యకర్తలు దగ్దం చేశారు. ఈ నేపథ్యంలో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా, బండి సంజయ్ అరెస్ట్‌ను బీజేపీ జాతీయ నాయకత్వం, స్థానిక నేతలు ఖండించారు. - ఈ నేపథ్యంలో బీఎల్ సంతోష్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయింది. రాజకీయంగా బీఆర్ఎస్ సమాధి అయ్యే రోజులు దగ్గరపడ్డాయి. కేసీఆర్‌కు పాలన చేతగాక సంజయ్‌ను అరెస్ట్ చేయించారు. బీఆర్ఎస్ మునిగిపోయే నావ అని ఘాటు కామెంట్స్ చేశారు. - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సంజయ్ అరెస్ట్‌ను ఖండిస్తున్నాం. కారణం లేకుండా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం. తెలంగాణలో అరాచక పాలన నడుస్తోంది అంటూ తీవ్ర విమర్శలు చేశారు. - డీకే అరుణ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లింది. ప్రజలు తర్వలోనే బీఆర్ఎస్ను బొందపెడతారు. అకారణంగా సంజయ్‌ను అరెస్ట్ చేయడం సిగ్గుమాలిన చర్య. బండి సంజయ్‌ను వెంటనే విడుదల చేయాలి. - ఈటల రాజేందర్ స్పందిస్తూ.. కారణం చెప్పకుండా సంజయ్‌ను అరెస్ట్ చేయడం దారుణం. కేసీఆర్ చెప్పినట్టు వింటూ పోలీసులు వెన్నముక లేకుండా వ్యవహరిస్తున్నారు. బండి సంజయ్‌ను వెంటనే విడుదల చేయాలి. - బీజేపీ సస్పెండెడ్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. బండి సంజయ్ అరెస్ట్‌ను ఖండిస్తున్నాను. అరెస్ట్‌లకు సంజయ్ భయపడరు. ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపినందుకే అరెస్ట్ చేశారు. ఆయన్ను జైలులో పెడితే ప్రభుత్వ తప్పులు బయటకిరావు అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. - బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు.. బండి సంజయ్‌ను కలిసేందుకు బొమ్మలరామారం పీఎస్ వెళ్లారు. దీంతో, ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం, రఘునందన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా అక్కడి నుంచి నేతలందరూ వెళ్లిపోవాలని పోలీసులు చెబుతున్నారు. -
బీజేపీ నేత బీఎల్ సంతోష్ కనబడుట లేదు.. హైదరాబాద్‌లో పోస్టర్ల కలకలం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో వెలిసిన వాల్‌పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. బీజేపీ నాయకుడు బీఎల్ సంతోష్ కనబడుట లేదంటూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. ‘ఎమ్మెల్యేల కొనుగోలులో సిద్ధహస్తుడు’ కనపడుట లేదు.. బీఎల్ సంతోష్‌ను పట్టిచ్చిన వారికి రూ.15 లక్షల బహుమానం.. అని పోస్టర్లు ఏర్పడ్డాయి. వీటిని నగరవాసులు ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. కాగా ఎమ్మెల్యేల కొనుగోలులో బీఎల్ సంతోష్ కీలక వ్యక్తి అని అందరూ చర్చించుకోవడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ అండతో విచారణ నుంచి తప్పించుకున్న వ్యక్తి ఇతడేనని పోస్టర్లను చూసుకుంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. మరోవైపు సంతోష్‌పై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలే ఈ పని చేసి ఉంటారని కాషాయ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అంటించిన పోస్టర్లను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో సూత్రధారి బీజేపీ సీనియర్ నేత సంతోష్యేనని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇప్పటికే ఆయనపై తెలంగాణలో కేసు నమోదయింది. తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ విచారణకు కూడా ఆయన హాజరుకాలేదు. అయితే ఈ కేసు దర్యాప్తును తెలంగాణ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. దీంతో సీబీఐ దర్యాప్తు జరపాలన్న హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేసు న్యాయస్థానం పరిధిలో ఉన్నందున తాము చెప్పేంత వరకు ఈ కేసును సీబీఐ విచారించవద్దని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. కేసు విచారణను జులై 31కి వాయిదా వేసింది. -
‘సంతోష్‌ను ఇరికించి సర్కార్ ఆరెస్సెస్‌తో పెట్టుకుంది’
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణలో ఒక యుద్ధవాతా వరణం మాదిరి పరిస్థితుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు సమష్టిగా కృషి చేయాలి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సమర్థంగా ఎదుర్కొని ఆరెస్సెస్ అనుకూల శక్తులు విజయం సాధించేందుకు ఇప్పటినుంచే కార్యరంగంలోకి దిగాలి. ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి (ఆరెస్సెస్ నేత) బీఎల్ సంతోష్‌ను ఇరికించి, నోటీసులివ్వడం ద్వారా కేసీఆర్ సర్కార్ ఆరెస్సెస్‌తో పెట్టుకుంది. ఇందుకు రాజకీయంగా తగిన గుణపాఠం చెప్పాలి..’ అని అన్ని పరివార, అనుబంధ సంఘాలకు సంఘ్ పరివార్ పిలుపునిచ్చింది. తెలంగాణ సెంటిమెంట్, ప్రత్యేక రాష్ట్ర వాదంతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కూడా బీఆర్ఎస్ ఏర్పాటుతో బలహీనపడడంతో పాటు ప్రజలెవరూ విశ్వసించని స్థితికి చేరుకున్నందున ఈ అవకాశాన్ని జారవిడుచుకోవద్దని చెప్పినట్టు తెలిసింది. ఆదివారం నగర శివార్లలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో.. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాలి్సన వ్యూహంపై సంఘ్ పరివార్, పరివార సంస్థలు, అనుబంధ విభాగాలతో ఆరెస్సెస్ జాతీయ నేతలు సమాలోచనలు జరిపారు. అధికారమే లక్ష్యంగా కృషి చేయాలి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చేపట్టాల్సిన కార్యాచరణ, పార్టీపరంగా ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు, ఇంకా బీజేపీ నాయకత్వం దృష్టికి రాని అంశాలు, పార్టీపరంగా లోటుపాట్లు, ఇతర అంశాలను వివిధ విభాగాలు ప్రస్తావించినట్టు సమాచారం. ఆరెస్సెస్, పరివార సంస్థలు, అనుబంధ విభాగాల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా పక్కా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావడమే ధ్యేయంగా పూర్తిస్థాయిలో కృషి చేయాలని సూచించినట్లు సమాచారం. ఆరెస్సెస్ జాతీయ సర్ కార్యవాహ (జాయింట్ జనరల్ సెక్రటరీ) ముకుంద్ ఈ మేరకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. కాగా తొలుత వీహేచ్‌పీ, భజరంగ్‌దళ్, బీఎంఎస్, ఏబీవీపీ, స్వదేశీ జాగరణ్ మంచ్, వనవాసి కళ్యాణ్ ఇతర క్షేత్రాల సమన్వయ సమావేశం జరిగింది. ఆ తర్వాత ఆదివారం రాత్రి దాకా ఆరెస్సెస్ ముఖ్యులు, సంఘ్‌పరివార్ అనుబంధ విభాగాల ముఖ్యులతో విడివిడిగా జరిగిన సమావేశాల్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్‌చుగ్, సునీల్ బన్సల్, సహ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) శివప్రకాష్, జాతీయ కార్యదర్శి, రాష్ట్రపార్టీ సహ ఇన్చార్జి అర్వింద్ మీనన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, మధ్యప్రదేశ్ ఇన్చార్జి పి.మురళీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ ప్రయత్నాలు గట్టిగా ఎదుర్కోవాలి విశ్వసనీయ సమాచారం మేరకు.. ‘కేవలం మైనారిటీ వర్గ సంతుష్టీకర విధానాలతోనే మళ్లీ అధికారంలోకి రావాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నందున, అలాంటి వాటిని గట్టిగా ఎదుర్కోవాలి. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడినందున దానికి ఎట్టిపరిస్థితుల్లో అవకాశం ఇవ్వకూడదు. వామపక్షాల ముఖ్యనేతలు అనుసరిస్తున్న స్వార్థ రాజకీయాలతో ప్రజలు ఆ పార్టీలను నమ్మే పరిస్థితి లేదు. అందువల్ల వాటికి మద్దతు తెలిపే కార్యకర్తలు, వర్గాలను కూడా అనుకూలంగా మలుచుకోవాలి. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీలో సమన్వయ లోపం వల్లనే ఓటమి చవిచూడాల్సి వచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా పరివార్ అనుబంధ సంస్థలు తమ వంతు పాత్రను సమర్థవంతంగా పోషించాలి..’అని సమావేశం సూచించింది. -
తెలంగాణకు ఎం చేశారని బీజేపీని ప్రజలు ఆదరిస్తారు : మంత్రి హరీష్ రావు
-
పర్యవసానం తప్పదు! కేసీఆర్ అవినీతి సర్కార్‌ను సాగనంపాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: తనను అనవసరంగా ఒక కేసులో ఇరికించి ప్రతిష్ట దెబ్బతీయడంతోపాటు అప్రతిష్టపాలు చేసినందుకు కేసీఆర్ సర్కారు పర్యవసానాలను ఎదుర్కోవాల్సిందేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్ హెచ్చరించారు. బీఆర్ఎస్ చేస్తున్న ‘ఎమ్మెల్యేలకు ఎర’ఆరోపణల్లో నిజానిజాలు త్వరలో నిగ్గుతేలుతాయని.. తనపై చేసిన అవాస్తవ ప్రచారానికి తగిన మూల్యంతోపాటు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. గురువారం శామీర్‌పేటలోని ఓ రిసార్ట్స్‌లో పార్టీ ముఖ్యనేతలు, కమిటీల నాయకులతో సంతోష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. నాయకులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ సంపద రాజకీయం కోసం.. రాష్ట్రంలో భూముల విక్రయం ద్వారా సంపాది స్తున్న వేల కోట్ల రూపాయలను కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో పంచుతున్నారని.. తెలంగాణ సంపదను రాజకీయ అవసరాలకు వాడుతున్నారని బీఎల్ సంతోష్ ఆరోపించినట్టు తెలిసింది. ‘‘పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన తెలంగాణ సర్కారును ఎట్టిపరిస్థితుల్లోనూ సాగనంపాల్సిందే. రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఒక్కటి మాత్రమే బీజేపీ పరమావధి కాదు. రాష్ట్రంలో అవినీతి నిర్మూలన కూడా ప్రధాన ధ్యేయం. కేసీఆర్ తెలంగాణ తల్లి పేరును ఉపయోగించుకుని ఆ తల్లికే ద్రోహం చేస్తున్నారు. పాడి ఆవును పూర్తిగా పీల్చిపిప్పి చేసినట్టు చేసి చంపేస్తున్నారు’’అని వ్యాఖ్యానించినట్టు సమాచారం. గతంలో తానెవరో తెలంగాణలో పెద్దగా ఎవరికీ తెలియదని.. సిట్‌తో నోటీసులు ఇచ్చి ప్రతి ఇంటికి తెలిసేలా చేశారని పేర్కొన్నట్టు తెలిసింది. తనపై జరిగిన ప్రచారం మీడియా, ప్రజల దృష్టిని ఆకర్షించిందని.. తనకు ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికేందుకు పెద్దసంఖ్యలో వచ్చారని, అంతకు ముందు ఒకరో, ఇద్దరో వచ్చి రిసీవ్ చేసుకునేవారని చెప్పినట్టు సమాచారం. ఆ నలుగురితో విజయం మనదే.. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు నియమించిన విస్తారక్, ప్రభారీ, ఇన్చార్జి, పాలక్‌లు సమన్వయంతో సమష్టిగా పనిచేస్తే బీజేపీ విజయం ఖాయమని బీఎల్ సంతోష్ చెప్పారు. క్షేత్రస్థాయిలో పోలింగ్‌బూత్, మండల స్థాయి, ఇతర కమిటీలు గట్టిగా కృషి చేస్తే పార్టీకి ఎదురనేదే ఉండదన్నారు. దక్షిణ, పశ్చిమ ప్రాంత రాష్ట్రాల లోక్‌సభ విస్తారక్ల శిక్షణ శిబిరంలో ఆయన దిశానిర్దేశం చేశారు. పార్టీ లోక్‌సభ, అసెంబ్లీ విస్తారక్‌లు ఏమాత్రం మొహమాటం లేకుండా వాస్తవదృష్టితో పనిచేయాలని సూచించారు. కచ్చితత్వంతో పనిచేయడంతోపాటు తీసుకునే నిర్ణయాలు, నిర్వహించే విధులను గురించి స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. ఆయా అంశాల గురించి పార్టీ అడిగితే.. వారు తీసుకున్న వైఖరిని కచ్చితంగా, స్పష్టంగా వివరించాలని పేర్కొన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల పరిధిలో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది అనిపించినా, సమస్యలు ఎదురైనా వెంటనే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఆయా రాష్ట్రాల సమన్వయకర్తలకు సమాచారం ఇవ్వాలని వివరించారు. 2024లోనూ బీజేపీదే విజయం: జేపీ నడ్డా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ పూర్తి మెజారిటీ సాధించి కేంద్రంలో అధికారంలోకి రావడం తథ్యమని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ విజయఢంకా మొగించడంతో పాటు, అత్యధిక ఎంపీ సీట్లను పార్టీ గెలుచుకుంటుందనే విశ్వాసం వ్యక్తంచేశారు.గత లోక్‌సభ ఎన్నికల్లో కంటే అధికసీట్లు సాధించి విజయపరంపరను కొనసాగించ బోతున్నామన్నారు. గురువారం లోక్‌సభ విస్తారక్ల శిక్షణా శిబిరం ముగింపు సందర్భంగా ఢిల్లీ నుంచి నడ్డా వర్చువల్‌గా మాట్లాడారు. దక్షిణా రాష్ట్రాలతో పాటు పశ్చిమబెంగాల్, ఒరిస్సా, తదితర రాష్ట్రాల నుంచి ఈ సారి బీజేపీ గెలిచే సీట్ల సంఖ్య పెరుగబోతోందన్నారు. లోక్‌సభ విస్తారక్లంతా తమ తమ కార్యక్షేత్రాల్లో చురుకుగా పనిచేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించగలమన్నారు. -
ఫామ్ హౌస్ కేసుపై BL సంతోష్ సంచలన వ్యాఖ్యలు
-
ఫామ్‌హౌజ్ కేసు.. బీఎల్ సంతోష్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: మొయినాబాద్ ఫామ్ హౌజ్ వ్యవహారంపై కర్ణాటక నేత, బీజేపీ సీనియర్ లీడర్ బీఎల్ సంతోష్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం నగరంలో జరిగిన బీజేపీ అసెంబ్లీ ఇంఛార్జి, విస్తారక్, పాలక్, కన్వీనర్ల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ అంశంపై స్పందించారు. తనపై ఆరోపణలు చేసిన వాళ్లు పర్యవసానాలు ఎదుర్కొక తప్పదంటూ కీలక వ్యాఖ్యలు చేశారాయన. నాపై చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఆరోపణలు చేసిన వాళ్లు ముందు ముందు పర్యవసానాలు ఎదుర్కొక తప్పదు. నేనంటే ఎవరికీ తెలియదు. కానీ, తెలంగాణలో ప్రతీ ఇంటికి నా పేరు తీసుకెళ్లారు. తెలంగాణ తల్లి పేరుతో ఆమెకే ద్రోహం చేశారు. ఇక్కడున్న ప్రభుత్వం, నాయకులు ప్రజాస్వామ్యానికి శాపం అని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సంపాదనను రాజకీయ అవసరాలకు దేశమంతా డబ్బులు పంపుతున్నారంటూ విమర్శించారాయన. -
తెలంగాణపై బీజేపీ నేత బీఎల్ సంతోష్ ఫోకస్
-
తెలంగాణకు బీఎల్ సంతోష్
బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ రాష్ట్రానికి వస్తున్నారు. మొయినాబాద్ ఫార్మ్ హౌస్ ఎపిసోడ్ తర్వాత మొదటిసారి ఆయన హైదరాబాద్‌లో అడుగుపెడుతున్నారు. ఓ పక్క పోలీస్ కేసులు, మరో పక్క కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం బిఎల్ సంతోష్‌కు నోటీసులు, నిందితుడిగా చేర్చే అంశం హైకోర్టులో విచారణ జరుగుతుంది. కోర్టు ఏం చెప్పింది? మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారం పై కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఎమ్మెల్యేలకు ఎర వేశారని వచ్చిన అభియోగాల కేసులో బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ సెంటర్ గా సిట్ విచారణ సాగుతుంది. ఆయనను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని... 41 సి ఆర్ పి సి నోటీసులు పై స్టే ను ఎత్తివేయాలని సిట్ కోర్టుని అడుగుతోంది. ఆ కేసు ఈ నెల 30 కి వాయిదా పడ్డది. మరో వైపు ఆయనను అరెస్ట్ చేయొద్దని కూడా ఉత్తర్వులు ఇచ్చింది. కేసుపై చర్చ, రాజకీయ రచ్చ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ మొదలైనప్పటి నుండి బిఎల్ సంతోష్ రాష్ట్ర పర్యటనకు రాలేదు. గత నెలలో జరిగిన బీజేపీ రాష్ట్ర శిక్షణ తరగతులు, కార్యవర్గ సమావేశాలకి ఆయన వస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగిన గుజరాత్ ఎన్నికలతో బిజీగా ఉండడం తో రాలేదు. కేసు కొనసాగుతున్న నేపథ్యంలోని ఆయన రాష్ట్రానికి రాలేదని గుసగుసలు కూడా వినిపించాయి. ఇప్పుడు బిఎల్ సంతోష్ తెలంగాణ పర్యటనకు రాబోతున్నారు. ఈనెల 28 29 తేదీల్లో హైదరాబాదులో జరిగే కార్యక్రమాల్లో ఆయన పాల్గొనబోతున్నారు. బీజేపీ దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ విస్తారక్ ల శిక్షణ తరగతులు హైదరాబాద్ శివారులోని ఒక రిసార్ట్‌లో జరగనున్నాయి. ఇవి ఈ నెల 28 న ప్రారంభం అయ్యి 29న ఉదయం తో ముగుస్తాయి. 29 మధ్యాహ్నం తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఇన్చార్జులు, కన్వీనర్లు, విస్తారక్ లు పాలక్ ల సమావేశం అక్కడే జరగనుంది. ఈ కార్యక్రమాల్లో పాల్గొని అయన మార్గ నిర్దేశనం చేయనున్నారు. బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలతో ను అయన భేటీ కానున్నారు. యాక్షన్ వర్సెస్ రియాక్షన్ బి ఎల్ సంతోష్ రాష్ట్రానికి వస్తుండడంతో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఫార్మ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అయన పైన వచ్చిన ఆరోపణలు, జరుగుతున్న పరిణామాల పై పార్టీ నేతలకు ఏమైనా చెబుతారా ? అనే డిస్కషన్ జరుగుతుంది. బిఎల్ సంతోష్ పర్యటన నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. అధికార పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది ? పోలీస్ లు ఎలా రియాక్టు అవుతారు అనే దాని పై ఉత్కంఠ నెలకొంది. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
ఈ నెల 28 తేదీన తెలంగాణకు బీఎల్ సంతోష్
-
28, 29న దక్షిణ విస్తారక్ల శిక్షణా శిబిరానికి బీఎల్ సంతోష్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ విస్తారక్ల శిక్షణశిబిరాన్ని మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలోని లియోనియా రిసార్ట్స్‌లో నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ నెల 28, 29 తేదీల్లో జరగనున్న ఈ శిక్షణాశిబిరానికి బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి(సంస్థాగత) బీఎల్ సంతోష్ హాజరుకానున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో విచారణకు హాజరవ్వాలంటూ సంతోష్‌కు సిట్ నోటీసులు జారీ, దానిపై హైకోర్టు స్టే తదితర పరిణామాల నేపథ్యంలోఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఒకటిన్నర రోజుల్లో అంటే 29వ తేదీ మధ్యాహ్నంకల్లా ఈ శిబిరం ముగియనుంది. అదేరోజు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు తెలంగాణలోని అసెంబ్లీ విస్తారక్‌లు, ఇన్చార్జీలతోనూ సంతోష్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. వచ్చేఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సంస్థాగతంగా పార్టీని అన్నిస్థాయిల్లో పటిష్టం చేయడంపై దిశానిర్దేశనం చేయనున్నారు. ముఖ్యంగా పోలింగ్ బూత్ కమిటీల నియామకం పూర్తి చేయడంతోపాటు రాష్ట్రంలోని అన్ని మండలస్థాయి కమిటీల ఏర్పాటు, సంస్థాగతంగా పార్టీ పటిష్టతపై చేపట్టాల్సిన చర్యలు తదితర అంశాలపై దృష్టి నిలపనున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన లోక్‌సభ నియోజకవర్గాల ఇన్‌చార్జీలకు ప్రత్యేకంగా ఈ శిక్షణకార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇతర ప్రాంతాలకు సంబంధించిన లోక్‌సభ విస్తారక్ల శిబిరాలు ఇప్పటికే ముగిశాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 160 నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపునకు బాటలు వేసేందుకు ఏమి చేయాలన్న దానిపై ఈ శిబిరాల్లో ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. బీజేపీ ఇంతవరకు గెలుపొందని లేదా రెండోస్థానంలో ఉన్న ఎంపీ స్థానాలు, దక్షిణాదిలోనే అధికంగా ఉండటంతో వీటిపై జాతీయ నాయకత్వం దృష్టి పెట్టింది. -
41ఏ నోటీసులపై స్టే పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్, కేరళ వైద్యుడు జగ్గు కొట్టిలిల్ (జగ్గుస్వామి), న్యాయవాది భూసారపు శ్రీనివాస్‌కు సిట్ జారీ చేసిన 41ఏ సీఆర్పీసీ నోటీసులపై విధించిన స్టేను హైకోర్టు పొడిగించింది. తదుపరి విచారణ 22వ తేదీ వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొంది. సంతోష్ కు జారీ చేసిన 41ఏ సీఆర్పీసీ నోటీసులపై గత నెల 25న స్టే విధించిన విషయం తెలిసిందే. తర్వాత జగ్గుస్వామి, శ్రీనివాస్‌లకు ఊరటనిచ్చింది. లుక్అవుట్ నోటీసులను కూడా నిలుపుదల చేసింది. సిట్ జారీ చేసిన 41ఏ, లుక్ అవుట్ నోటీసులను నిలుపుదల చేయాలని సంతోష్, జగ్గుస్వామి, శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ కె.సురేందర్ మంగళవారం విచారణ చేపట్టారు. బీఎల్ సంతోష్ తరఫున సీనియర్ న్యాయ వాది దేశాయ్ ప్రకాష్‌రెడ్డి, జగ్గుస్వామి తరఫు సీనియర్ న్యాయ వాది వి.పట్టాభి, ప్రభుత్వం తరఫు అడ్వొకేట్ జనరల్(ఏజీ) బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. సంతోష్‌కు జారీ చేసిన నోటీసులను పూర్తిగా కొట్టివేయాలని ప్రకాష్‌రెడ్డి కోరారు. ప్రతి ఒక్క వ్యక్తికి స్వేచ్ఛ ఉంటుందని, నోటీసులు ఇచ్చి ఆధారాలు లేకుండా అరెస్టు చేయాలని చూడటం చట్టవిరుద్ధమని పట్టాభి నివేదించారు. బీఎల్ సంతోష్, తుషార్ వెల్లపల్లి, జగ్గుస్వామి, శ్రీనివాస్‌లను నిందితులుగా చేర్చేందుకు ఏసీబీ కోర్టులో సిట్ మెమో దాఖలు చేయగా, న్యాయస్థానం తిరస్కరించిన విషయం తెలిసిందే. వీరిని నిందితులుగా చేర్చడానికి ఎలాంటి ఆధారాలు లేవని.. ఏసీబీ మాత్రమే ఈ కేసును విచారణ చేయాలని స్పష్టంచేసింది. ఈ అంశాలను హైకోర్టు న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నారు. అలాగే ట్రయల్‌కోర్టు ఉత్తర్వులను సిట్ సవాల్ చేయగా, ఇదే హైకోర్టు తీర్పును 21వ తేదీకి రిజర్వు చేసిన అంశాన్నీ రికార్డులోకి తీసుకున్నారు. దీంతో స్టేను పొడిగిస్తూ.. తదుపరి విచారణ ఈనెల 22కు వాయిదా వేశారు. -
కవిత, బీఎల్ సంతోష్ లను వెంటనే అరెస్ట్ చేయాలి - జగ్గారెడ్డి
-
‘బీఎల్ సంతోష్, కవితను వెంటనే అరెస్ట్ చేయాలి’
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తెలంగాణలో పొలిటికల్ హీట్‌ను పెంచింది. లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక పాత్ర ఉన్నట్టు ఈడీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల ఎపిసోడ్లో బీఎల్ సంతోష్‌కు సిట్ నోటీసులు పంపి విచారణకు రావాలని కోరిన ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. కాగా, లిక్కర్ స్కాం, ఎమ్మెల్యేల ఎపిసోడ్ వ్యవహారంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జగ్గారెడ్డి స్పందించారు. ఈ క్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవితను, బీజేపీ నేత బీఎల్ సంతోష్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి. బీఎల్ సంతోష్‌ను కాపాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. టీఆర్ఎస్, బీజేపీ నేతలు డ్రామాలు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద స్కాంలు చేశాయి. వారిద్దరినీ తక్షణమే అరెస్ట్ చేసి, వాస్తవాలు వెలికితీయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే బీఎల్ సంతోష్‌ను తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేస్తే మరిన్ని విషయాలు బయటికొస్తాయని కామెంట్స్ చేశారు. -
బీజేపీ నేత బీఎల్ సంతోష్ కు ఊరట
-
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. బీఎల్ సంతోష్‌కు ఊరట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో బీజేపీ కీలక నేత, కర్ణాటకకు చెందిన సీనియర్ పొలిటీషియన్ బీఎల్ సంతోష్‌కు ఊరట లభించింది. సిట్ నోటీసులపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం స్టే విధించింది. అంతేకాదు.. విచారణను వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసింది. సిట్ నోటీసులను సవాల్ చేస్తూ బీఎల్ సంతోష్ ఇవాళ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన క్వాష్ పిటిషన్లో.. సిట్ నోటీసులను రద్దు చేయాలని కోరారు. రోహిత్‌రెడ్డి చేసిన ఫిర్యాదులో బీఎల్ సంతోష్ పేరు లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఆయన తరపు న్యాయవాది. అంతేకాదు ఎఫ్ఐఆర్లో పేరు లేనప్పుడు.. ఆయన్ని నిందితుల జాబితాలో ఎలా చేరుస్తారని బీఎల్ సంతోష్ తరపు న్యాయవాది అభ్యంతరం లేవనెత్తారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. సిట్ నోటీసులపై స్టే విధించింది. అంతకు ముందు.. ఫాంహౌజ్ కేసులో మరో దఫా బీఎల్ సంతోష్‌కు నోటీసులు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దీంతో.. ఈ నెల 28వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ సిట్ నోటీసులు జారీ చేసింది. -
ఎమ్మెల్యేల కేసులో భలే ట్విస్ట్.. బీఎల్ సంతోష్ బిగ్ ప్లాన్ ఫలిస్తుందా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫాంహౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో సిట్ నోటీసులను సవాల్ చేస్తూ బీఎల్ సంతోష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో, ఈ కేసు మరో మలుపు తిరగనుందా?. వివరాల ప్రకారం.. బీజేపీ సీనియర్ నేత బీఎల్ సంతోష్ తెలంగాణ హైకోర్టులో శుక్రవారం క్వాష్ పిటిషన్ వేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ నోటీసులను రద్దు చేయాలని కోర్టుకు విన్నవించుకున్నారు. ఇక, సిట్ నోటీసులు చట్టవిరుద్ధమంటూ బీఎల్ సంతోష్ తన పిటిషన్లో పేర్కొన్నారు. మరోవైపు.. ఫాంహౌస్ కేసులో భాగంగా బీఎల్ సంతోష్ ఈనెల 28వ తేదీన విచారణకు హాజరుకావాలని సిట్ నోటీసుల్లో వెల్లడించింది. ఇదిలా ఉండగా.. అంతకుముందు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో భాగంగా బీఎల్ సంతోష్‌కు వాట్సాప్, మెయిల్ ద్వారా మరోసారి నోటీసులు ఇవ్వాలని హైకోర్టు సూచించింది. దీంతో, ఈ కేసులో ఇప్పటివరకూ ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక సూత్రధారుల్ని నిందితుల జాబితాలో చేర్చింది సిట్. ఏ-4గా బీఎల్ సంతోష్, ఏ-5గా తుషార్, ఏ-6గా జగ్గుస్వామి, ఏ-7గా న్యాయవాది శ్రీనివాస్‌లను నిందితుల జాబితాలో చేర్చింది. అదే సమయంలో సిట్ స్వర నమూల నివేదిక సిట్ చేతికి అందింది. -
ఎమ్మెల్యేల ఎర కేసు: మరో ఐదుగురికి సిట్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మరో అయిదుగురికి సిట్ నోటీసులు జారీ చేసింది. కేరళ వైద్యుడు జగ్గుస్వామి సోదరుడు మణిలాల్‌లోపాటు సిబ్బంది శరత్, ప్రశాంత్, విమల్, ప్రతాపన్‌కు నోటీసులు ఇచ్చింది. 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసింది. ఈసారి కూడా విచారణకు హాజరు కాకుంటే అరెస్ట్ చేస్తామని హెచ్చరించింది. రిమాండ్ పొడిగింపు ఎమ్మెల్యేలకు ఎర కేసులోని ముగ్గురు నిందితుల రిమాండ్ గడువు ముగియడంతో వారిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. దీంతో నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజిలకు వచ్చేనెల 9 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడించింది. విచారణకు నందకుమార్ భార్య టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. నంద కుమార్ భార్య చిత్ర లేఖ, న్యాయవాదులు ప్రతాప్ గౌడ్, శ్రీనివాస్‌లు విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులతో సంబంధాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. బ్యాంక్ ఖాతాలు, లావాదేవీలు.. ప్రతాప్ గౌడ్, నందకుమార్ ట్రాన్సెక్షన్‌పై విచారిస్తున్నారు. రామచంద్ర భారతి, సింహయాజులు తో పరిచయాలపై ప్రశ్నిస్తున్నారు. చదవండి: మల్లారెడ్డి ఇంటిపై ఐడీ దాడుల్లో కొత్త ట్విస్ట్..