cancer patients
-
ఆక్సిజన్ సిలిండర్‌తో.. నడి రోడ్డుపై..
ఏలూరు టౌన్: ఏలూరు ఎన్‌ఆర్‌పేటలోని ఒక ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యం తమ కర్కశత్వాన్ని ప్రదర్శించింది. కైకలూరు మండలం దేవిచింతపాడు గ్రామానికి చెందిన తానేటి నాగమణి 2 నెలల క్రితం ఏలూరు ఎన్‌ఆర్‌పేటలోని ఒక ప్రైవేటు హాస్పిటల్లో కడుపులో కణితి ఉందని శస్త్ర చికిత్స చేయించుకుంది. ఆపరేషన్ అనంతరం ఆమె ఇంటికి వెళ్ళగా కొద్ది రోజులకు తీవ్ర అనారోగ్యానికి గురైంది. కుటుంబ సభ్యులు ఆమెను వేరే హాస్పిటల్‌కు తీసుకువెళ్ళగా పరీక్షలు చేసిన వైద్యులు ఆమెకు క్యాన్సర్ ఉన్నట్లు తెలిపారని చెప్పారు. క్యాన్సర్ కణితిని శస్త్ర చికిత్స చేయటంతో ఇన్ఫెక్షన్ అయిందని, అది తీవ్ర అనారోగ్యానికి దారితీసిందని వైద్యులు చెప్పారని వివరించారు. ఈ నేపథ్యంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాధితురాలు నాగమణిని శనివారం సాయంత్రం.. ముందుగా ఆపరేషన్ చేసిన హాస్పిటల్‌కు తీసుకురాగా, తమకు సంబంధం లేదని, వైద్యం చేయబోమంటూ హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా చెప్పింది. రాత్రి 10.35 గంటల వరకూ ఆరున్నర గంటల పాటు రోడ్డుపైనే ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. -
శిరోజాలు దానం చేయండి
అన్నదానం, వస్త్రదానం, విద్యాదానం...ఇలా మన సంస్కృతిలో దానగుణానికి విశేష గౌరవం ఉంది.అయితే భువనేశ్వర్‌కు చెందిన హరిప్రియ నాయక్ ప్రచారం చేసేది మాత్రం ‘శిరోజాల దానం’. ‘మీరు దానం చేసే శిరోజాల పేద కేన్సర్ పేషెంట్ల ముఖంలో చిరునవ్వు తీసుకొస్తుంది’ అంటుందామె. సేకరించిన జుట్టుతో విగ్గులు తయారు చేయించి పంచుతున్న హరిప్రియ నాయక్ అనేక ప్రశంసలు పొందుతోంది. కేన్సర్‌తో పోరాడి గెలవ డానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. చాలామంది గెలుస్తారు. అయితే దిగువ మధ్యతరగతి స్త్రీలు, పేద స్త్రీలు ఈ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కేన్సర్ చికిత్స సమయంలో కిమోథెరపీ వల్ల జుట్టు రాలిపో తుంది. ఆ సమయంలో శిరోముండనం కూడా చేయించుకోవాల్సి వస్తుంది. స్తోమత కలిగిన వర్గాల స్త్రీలు తిరిగి పూర్తి జుట్టు వచ్చేవరకూ విగ్గులు ధరిస్తారు. కాని పేద వర్గాల స్త్రీలకు ఆ అవకాశం ఉండదు. వారి కోసం, వారి ఆత్మవిశ్వాసం కోసం ఉచితంగా విగ్గులు ఏర్పాటు చేస్తోంది హరిప్రియ నాయక్. ‘శిరోజాల దానం ఇవాళ్టి అవసరం’ అంటుందామె. సామాజిక సేవ ఒడిశ్సాలోని ఖుర్దా జిల్లాకు చెందిన 32 ఏళ్ల హరిప్రియ నాయక్ సామాజిక సేవారంగంలో పని చేస్తోంది. ‘ఒకసారి నేను కీమోథెరపీ వల్ల జుట్టు కోల్పోయిన పేదస్త్రీలను చూశాను. వారు ఇంటినుంచి బయటకు రావడానికే సిగ్గుపడుతున్నారు. కేన్సర్‌తో పో రాడే సమయంలో మానసికంగా, శారీరకంగా గట్టిగా ఉండాలి. మానసికంగా కుచించుకుపో తే కష్టం. స్త్రీలు జుట్టును ఇష్టపడతారు. వారికి సరైన విగ్గు ఇవ్వగలిగితే ఆత్మవిశ్వాసం వస్తుందని పనిలోకి దిగాను’ అంటుంది హరిప్రియ నాయక్. ఆమె 2021లో ‘మిషన్ స్మైల్ ఫర్ ది కేన్సర్ ఫైటర్స్’ పేరుతో ఒక కార్యక్రమాన్ని శిరోజాల సేకరణ కోసం మొదలుపెట్టింది. శిరోజాల దానం కోసం ప్రచారం కొనసాగించింది. 9 మంది సాయం ఒకరికి మేలు ‘సింథటిక్ విగ్గులు త్వరగా పాడవుతాయి. వాటివల్ల చర్మ సంబంధ ఇబ్బందులు వస్తాయి. అదే సహజమైన జుట్టుతో చేసిన విగ్గులు మన్నికగా ఉంటాయి. ఇందుకోసం ఎవరైనా సరే శిరోజాలు ఇవ్వొచ్చు. కాని 12 అంగుళాల కంటే ఎక్కువ పోడవు ఉన్నప్పుడే అవి ఉపయోగపడతాయి. 9 మంది ఇచ్చిన జుట్టుతో ఒక్క విగ్గు తయారవుతుంది. మా ప్రచారం ఒడిస్సాలో మాత్రమే కాదు జార్ఖండ్‌లో కూడా కొనసాగుతోంది. ఒక ఆరేళ్ల పాప మాకు శిరోజాలు ఇవ్వడం ఒక రికార్డు’ అంటుంది హరిప్రియ నాయక్. హెయిర్ డొనేషన్ ఒడిశా ‘హెయిర్ డొనేషన్ ఒడిశా’ పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంది హరిప్రియ నాయక్. వాలెంటీర్లు పని చేసేవారిని ఆహ్వానిస్తుంది. ఇప్పటికి 150 మంది వాలెంటీర్లు ఆమెతోపాటు పని చేస్తున్నారు. శిరోజాలు దానం చేసే వారి నుంచి వాటిని సేకరించి హైదరాబాదులోని ‘హైదరాబాద్ హెయిర్ డొనేషన్ ఫర్ కేన్సర్ పేషెంట్స్’ సంస్థకు పంపుతారు. అది ఉచితంగా విగ్గులు తయారు చేసి ఇస్తుంది. వాటిని కేన్సర్ ఫైటర్స్‌కు అందజేస్తారు.‘నా జుట్టు తగినంత పెరిగిన ప్రతిసారీ నేను దానం చేస్తుంటాను. మీరు కూడా చేయండి. ఇది కూడా పుణ్యకార్యమే’ అంటుంది హరిప్రియ నాయక్. -
Naga Chaitanya: చై గొప్ప మనసు.. క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారులకు బహుమతులు (ఫోటోలు)
-
లియో స్పెషల్ స్క్రీనింగ్.. వారికోసం 4,500 టికెట్లు!
హీరో విజయ్, త్రిష జంటగా నటించిన చిత్రం లియో. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో 7 స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై భారీ వసూళ్లు సాధిస్తోంది. కాగా చైన్నెలోని బిల్ రోత్ ఆస్పత్రి నిర్వాహకులు క్యాన్సర్ వ్యాధి బాధితుల్లో మానసిక వికాసాన్ని కలగించాలని నిర్ణయించింది. అందులో భాగంగా విజయ్ నటించిన లియో చిత్రాన్ని వారికి చూపించే ప్రయత్నం చేశారు. పీవీఆర్ సంస్థ సహకారంతో లియో చిత్రం ప్రదర్శింపబడుతున్న చైన్నెలోని థియేటర్లలో 4,500 టిక్కెట్లను కొనుగోలు చేసి ఆదివారం క్యాన్సర్ రోగులను చిత్రాన్ని చూపించారు. ఈ సందర్భంగా చైన్నెలోని బిల్ రోత్ ఆస్పత్రి వైద్యుడు రాజేశ్ జగనాధన్ మీడియాతో మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి ప్రాణాంతకం కాదన్నారు. తొలి దశలో వైద్యం అందిస్తే పూర్తిగా తగ్గించవచ్చన్నారు. ఈ వ్యాధిపై అవగాహన కలిగించడంలో భాగంలో క్యాన్సర్ రోగులను, వారి కుటుంబ సభ్యులకు లియో చిత్రాన్ని చూపించామని పేర్కొన్నారు. -
శభాష్ స్మృతి
ఒడిశా: కేన్సర్ రోగుల కోసం తన పొడవైన జట్టును దానంచేసి కొరాపుట్‌కు చెందిన యువతి ఔదార్యాన్ని చాటుకుంది. కొరాపుట్ జిల్లా కేంద్రానికి చెందిన స్మృతి సుధా సాహు భువనేశ్వర్‌లో ఉన్నత విద్యను అభ్యనిస్తూ, సివిల్స్ కోసం శిక్షణ పొందుతోంది. ఇటీవల కేన్సర్ పీడిత మహిళల సమస్యలు ఆమెను తీవ్రంగా ప్రభావితం చేశాయి. కేన్సర్ మహిళా రోగులకు కీమోథెరఫీ నిర్వహించిన తర్వాత జట్టు ఊడిపోతుంది. దీంతో వారికి విగ్గు అవసరం ఏర్పడుతుంది. ఇలాంటి మహిళల కోసం సోప్వ అనే స్వచ్ఛంద సంస్థ మహిళల నుంచి జట్టును విరాళంగా సేకరిస్తుంది. దీంతో వెంటనే కేన్సర్ పేషెంట్లకు కనీస తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో స్మృతి ఆ సంస్థను సంప్రదించింది. సన్నిహితులు, సహచర విద్యార్థుల సమక్షంలో తన జట్టును విరాళంగా అందజేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒడిశాలో సుమారు 50 వేల మంది కేన్సర్ బాధితులు ఉన్నారన్నారు. చికిత్స సమయంలో జుట్టు రాలిపోతే మానసికంగా వేదనకు గురవుతారని పేర్కొన్నారు. అలాంటి వారికి జట్టు ఇవ్వడం వలన వేగంగా కోలుకునే అవకాశం ఉంటుందని తెలియజేశారు. తన నిర్ణయం తల్లిదండ్రులకు చెబితే సగం జుట్టు కంటే, పూర్తిగా ఇవ్వాలని సూచించి మద్దతు తెలిపారని ఆనందం వ్యక్తం చేసింది. -
శభాష్ సిస్టర్స్
రాజుపాళెం : ఆడపిల్లలు తమ జడలను అపురూపంగా చూసుకుంటారు. ఒక్క వెంట్రుక రాలిపోతున్నా ఎంతో మనోవేదనకు గురవుతారు. క్యాన్సర్ బారిన పడిన వారికి కీమోథెరపీ ఇవ్వడం కారణంగా తల వెంట్రుకలు పూర్తిగా ఊడిపోయి గుండు ఏర్పడుతుంది. ఇలాంటి వారికి తల వెంట్రుకలు దాదాపుగా తిరిగి రావు. ఒక వైపు క్యాన్సర్ మహమ్మారి సోకిందనే వేదన.. మరోవైపు ఎంతో అపురూపంగా చూసుకున్న తలవెంట్రుకలు పోయి అందవిహీనంగా మారామనే బాధ వారిని తీవ్రంగా కలచి వేస్తుంది. ఇలాంటి వారికి కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు విగ్గులు తయారు చేసి ఉచితంగా అందిస్తున్నాయి. క్యాన్సర్ పేషెంట్ల కోసం మేము సైతం అంటూ అక్కా చెల్లెళ్లు తమ పొడవాటి జుట్టును దానం చేశారు. పుట్టిన రోజు సందర్భంగా.. రాజుపాళెం మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన అప్సానా, సుహానా అక్కాచెల్లెళ్లు. క్యాన్సర్ పేషెంట్ల కోసం పలువురు యువతులు, బాలికలు జుట్టు దానం చేసిన వీడియోలను వారు ఇటీవల సోషల్ మీడియాలో చూశారు. చూసిందే తడవుగా తాము కూడా తమ వంతుగా క్యాన్సర్ బాధితులకు జుట్టు ఇచ్చి సాయపడేందుకు నిర్ణయించుకున్నారు. సుహానా జన్మదినం సందర్భంగా శుక్రవారం చెల్లెలుతోపాటు అక్క అప్సానా కూడా జుట్టును దానం చేయడం విశేషం. కత్తిరించిన ఇరువురి జడలను ప్రొద్దుటూరులోని స్టార్ ఫౌండేషన్ అధ్యక్షుడు సిరాజ్‌కు అందజేశారు. చిన్నారుల్లో కలిగిన మంచి ఆలోచనను ఆయన అభినందించారు. కురులను క్యాన్సర్ పేషెంట్ల కోసం హైదరాబాద్‌లోని ప్రముఖ స్వచ్ఛంద సంస్థకు పంపనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ వీరి మాదిరే జుట్టును దానం చేసి క్యాన్సర్ పేషెంట్లకు సాయపడాలని ఆయన కోరారు. -
క్యాన్సర్‌కు రాష్ట్రంలోనే అధునాతన చికిత్స
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని క్యాన్సర్ రోగులకు ఇకమీదట ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే అధునాతన వైద్యం అందనుంది. క్యాన్సర్ రోగులు వ్యయప్రయాసలకోర్చి ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే మంచి వైద్యం అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వాస్పత్రులు రూపు దిద్దుకుంటున్నాయి. వీటిలో క్యాన్సర్ చికిత్సకు మెరుగైన సౌకర్యాలను కల్పించడానికి, వైద్యులకు అధునాతన చికిత్స పద్ధతులను అందుబాటులోకి తేవడానికి కీలకమైన ముందడుగు పడింది. రాష్ట్రంలో నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ (ఎన్సీజీ) ఏపీ చాప్టర్‌ను వైద్య శాఖ ప్రారంభించింది. ఎన్సీజీ నెట్‌వర్క్‌లోకి రాష్ట్రంలోని 11 ప్రభుత్వ బోధనాస్పత్రులను తీసుకెళ్లింది. ఎన్సీజీ చాప్టర్‌ను తొలుత కేరళలో ఏర్పాటు చేయగా, రెండో రాష్ట్రంగా ఏపీ ఘనత సాధించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న బోధనాస్పత్రుల్లోని క్యాన్సర్ విభాగాల్లో పనిచేస్తున్న వైద్యులు, లైబ్రరీలోని సమాచారం, ఇతర వివరాలను ఎన్‌సీజీకి అప్డేట్ చేస్తున్నారు. ఇది ముగిసిన తర్వాత ఎన్సీజీతో ఆస్పత్రులకు యాక్సెస్ లభిస్తుంది. దీంతో క్యాన్సర్ చికిత్సకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలు, వైద్యులు, పరిశోధకులతో మన వైద్యులు సంప్రదింపులు జరపవచ్చు. తద్వారా వ్యాధికి సంబంధించి నూతన పరిజ్ఞానం, ఇతరత్రా వివరాలను తెలుసుకొని, అధునాతన చికిత్సను రాష్ట్రంలోని రోగులకు అందజేసే అవకాశం కలుగుతుంది. క్యాన్సర్ కేర్‌లో అసమానతల తొలగింపునకే ఎన్సీజీ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద టాటా మెమోరియల్ సెంటర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం 2012లో ఎన్సీజీని ఏర్పాటుచేసింది. దేశంలో క్యాన్సర్ కేర్‌లో అసమానతల తొలగింపే దీని ప్రధాన లక్ష్యం. దేశవ్యాప్తంగా 266 ప్రముఖ క్యాన్సర్ ఆస్పత్రులు, పరిశోధన కేంద్రాలు ఈ నెట్‌వర్క్‌లో ఉన్నాయి. క్యాన్సర్ వ్యాధికి తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించడంపై నిరంతరం కసరత్తు జరుగుతుంది. క్యాన్సర్ నివారణ, రోగనిర్ధారణ, చికిత్స, రోగుల సంరక్షణ, ఆంకాలజీలో ప్రత్యేక శిక్షణ, వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచడం వంటి అంశాలపై ఏకరీతి ప్రమాణాల ఏర్పాటుకు ఇది కృషి చేస్తుంది. ఎన్సీజీలో భాగస్వామ్యంతో ప్రయోజనాలివీ.. ► అంతర్జాతీయంగా, దేశవ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ వ్యాధి నిపుణులు, ఆస్పత్రులు, పరిశోధన సంస్థలతో సంప్రదింపులకు అవకాశం ఉంటుంది. అభిప్రాయాలు, చికిత్స విధానాలను ఒకరికొకరు పంచుకోవడానికి వీలుంటుంది. ► దేశంలో ఎక్కడ నుంచైనా రోగులకు పరీక్షలు, చికిత్స, సంరక్షణ తదితర అంశాలపై నిపుణుల అభిప్రాయాలు పొందవచ్చు. ► ప్రభుత్వాస్పత్రుల్లో క్యాన్సర్ చికిత్స, నిర్ధారణ పరికరాలు, మందులను తక్కువ ఖర్చుతో పొందవచ్చు. ► ఎన్సీజీ సెక్రటేరియట్ ద్వారా క్యాన్సర్ పరిశోధనలు, చికిత్సకు సంబంధించిన గ్రంథాలయం మన వైద్యులకు అందుబాటులోకి వస్తుంది. దీనిద్వారా ప్రపంచవ్యాప్తంగా వస్తున్న నూతన చికిత్సా విధానాలు, మందులు, ఇతర అంశాలను తెలుసుకోవచ్చు. ► క్యాన్సర్ చికిత్సలో కీలకమైన ప్రణాళిక రచనలో ముఖ్య పాత్ర పోషించే ట్యూమర్ బోర్డుతో ప్రభుత్వాస్పత్రులకు యాక్సెస్ లభిస్తుంది. క్యాన్సర్‌ను ఎదుర్కోవడంలో ఎన్సీజీ కీలకపాత్ర ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న వ్యాధుల్లో క్యాన్సర్ ముఖ్యమైనది. దేశంలో దీనిని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ఎన్సీజీ కీలకపాత్ర పోషిస్తోంది. ఎన్సీజీ స్టేట్ చాప్టర్‌ను ఏపీ ప్రభుత్వం ప్రారంభించడం అభినందనీయం. ఏపీలో క్యాన్సర్ వ్యాధి నియంత్రణ, ఏకరీతి చికిత్స ప్రమాణాలతో ముందుకు వెళ్లడానికి ఇది ఎంతగానో అవకాశం కలి్పస్తుంది. – డాక్టర్ ఎం. ఉమేశ్, డైరెక్టర్, హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్, విశాఖపట్నం కీలక ఘట్టం రాష్ట్ర వైద్య శాఖ చరిత్రలో ఇది కీలక ఘట్టం. క్యాన్సర్ చికిత్సలో ప్రపంచవ్యాప్తంగా మార్పులు వస్తున్నాయి. వ్యాధిపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. (ఎన్సీజీ) లైబ్రరీలో పరిశోధనలు, కొత్త కొత్త చికిత్సల సమాచారం ఉంటుంది. ఆ నెట్‌వర్క్‌లోకి మన ఆస్పత్రులు వెళ్లడంతో మన వైద్యులకు చికిత్స, వ్యాధి నియంత్రణలపై మరింత అవగాహన పెరుగుతుంది. – నవీన్‌కుమార్, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి -
AP: క్యాన్సర్‌కు రాష్ట్రంలోనే కార్పొరేట్ వైద్యం
సాక్షి, అమరావతి: క్యాన్సర్ బాధితులకు రాష్ట్రంలోనే కార్పొరేట్ వైద్యం అందిచాలన్నదే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు అన్నారు. కాంప్రెహెన్సివ్ క్యాన్సర్ కేర్ రోడ్ మ్యాప్‌పై అధికారులతో సోమవారం ఆయన మంగళగిరి ఏపీఐఐసీ భవనంలోని వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రత్యేక కార్యదర్శి నవీన్‌కుమార్ రోడ్ మ్యాప్‌ను వివరించారు. కృష్ణబాబు మాట్లాడుతూ.. అధునాతన క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తెచ్చేందుకు విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న 11 ప్రభుత్వ బోధనాస్పత్రులలో క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఇందులో భాగంగా 7 బోధనాస్పత్రుల్లో రేడియోథెరపీ, మెడికల్, సర్జికల్ అంకాలజీ విభాగాలను అభివృద్ధి చేయాలన్నారు. మిగతా నాలుగుచోట్ల సేవలు విస్తరింపజేయాలన్నారు. క్యాన్సర్ చికిత్స కోసం సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని ఆయన సూచించారు. ఇక విశాఖలోని హోమీ బాబా క్యాన్సర్ ఆçస్పత్రికి సాంకేతిక బృందాన్ని పంపి శిక్షణాంశాలపై నివేదిక రూపొందించాలన్నారు. గ్రామస్థాయి వరకూ క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తెచ్చేందుకు సమగ్ర కార్యాచరణ సిద్ధంచేయాలని కోరారు. కొత్తగా నిర్మించే 16 వైద్య కళాశాలల్లోను క్యాన్సర్ చికిత్స పరికరాల కోసం బంకర్ల నిర్మాణం చేపట్టాలన్నారు. రేడియో అంకాలజీ కోసం లీనియర్ యాక్సిలేటర్, కొబాల్ట్, బ్రాఖీ థెరపీ, సి.టి స్టిమ్యులేటర్ పరికరాలపై ఆయన ఆరా తీశారు. క్యాన్సర్ కేర్ సెంటర్లుగా ఆ మూడు.. విశాఖ ఏఎంసీ, గుంటూరు జిల్లా చినకాకాని, తిరుపతిలోని బాలాజీ అంకాలజీ ఇన్స్టిట్యూట్ కాంప్రెహెన్సివ్ క్యాన్సర్ కేర్ సెంటర్లుగా అభివృద్ధి చేస్తామని కృష్ణబాబు చెప్పారు. టీచింగ్ ఆస్పత్రుల్లో రేడియోథెరపీని అందుబాటులోకి తేవాలన్నారు. సమావేశంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె. నివాస్, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, ఏపీవీవీపీ కమిషనర్ వినోద్ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఎంఈ రాఘవేంద్రరావు, డీహెచ్ హైమావతి పాల్గొన్నారు. -
క్యాన్సర్ రోగులకు ఆరోగ్యసిరులు
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెనిగండ్లకు చెందిన శ్రీనుది నిరుపేద కుటుంబం. భార్య పక్షవాతంతో బాధపడుతోంది. కుమార్తె, అల్లుడూ అనారోగ్యంతో బ్బందిపడుతున్నారు. వీరిద్దరి కుమార్తె దేవశ్రీ (5)కు బ్లడ్ క్యాన్సర్. దీంతో ఈ ముగ్గురి బాధ్యత కూడా శ్రీనుపై పడడంతో అతని ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ సమయంలో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం మనవరాలి వైద్యానికి అండగా నిలిచింది. పెదకాకానిలోని అమెరికన్ ఆంకాలజీ ఆసుపత్రిలో చిన్నారికి ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ఇప్పటివరకూ రూ.5,21,000లు ప్రభుత్వం ఖర్చుచేసింది. అలాగే, పాప పోషణకు వైఎస్సార్ ఆసరా అందుతోంది. ‘మనవరాలి చికిత్సకు అప్పులు చేయాల్సి వస్తుందని భయపడ్డాను. కానీ, ఆరోగ్యశ్రీ ఆదుకుంటోంది’.. అని శ్రీను అంటున్నాడు. విశాఖపట్నం నగరానికి చెందిన ఎస్. కొండమ్మ (28) కూడా క్యాన్సర్‌తో బాధపడుతోంది. వీరిదీ పేద కుటుంబమే. ఈమెకు కూడా ఆరోగ్యశ్రీ పథకం ఎంతగానో తోడ్పాటు అందించింది. నాలుగు కీమోథెరపీలు జరిగాయి. దీంతో పాటు రూ.11లక్షలతో బోన్‌మారో స్టెమ్‌సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్స అందించారు. ఇలా ఏకంగా రూ.18.80 లక్షలు కొండమ్మ చికిత్సకు ప్రభుత్వం ఖర్చుచేసింది. ‘ఆరోగ్యశ్రీ లేకపోయి ఉంటే కుటుంబం అప్పులపాలైపోయేది. నా కుటుంబాన్ని ప్రభుత్వం కాపాడింది. నాకు పునర్జన్మ ప్రసాదించింది’.. అని కొండమ్మ అంటోంది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న అనేకమంది రోగులకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కొండంత భరోసా ఇస్తోంది. కుటుంబాలు అప్పులపాలు కాకుండా ఆదుకుంటోంది. నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందిస్తోంది. కానీ, గత టీడీపీ ప్రభుత్వం క్యాన్సర్‌కు మొక్కుబడిగా చికిత్స అందించింది. దీంతో చేతి నుంచి డబ్బు ఖర్చుపెట్టలేక ప్రాణాలు వదులుకున్న వారు అనేకమంది ఉన్నారు. పథకంలో 400కు పైగా ప్రొసీజర్స్ 2019లో అధికారంలోకి రాగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసింది. ఏకంగా 2,446 ప్రొసీజర్స్‌ను పథకం పరిధిలోకి తెచ్చింది. ఈ క్రమంలో పేద, మధ్యతరగతి ప్రజలు క్యాన్సర్ వ్యాధి చికిత్సకు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో 400కు పైగా క్యాన్సర్ ప్రొసీజర్స్‌ను పథకంలో చేర్చారు. దీంతో ప్రస్తుతం అన్ని రకాల క్యాన్సర్ వ్యాధులకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం లభిస్తోంది. అదే టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం 200 క్యాన్సర్ చికిత్స ప్రొసీజర్స్ మాత్రమే పథకం కింద ఉండేవి. వీటి నిర్వహణ కూడా అంతంతమాత్రంగా ఉండేది. మూడేళ్లలోనే రూ.926 కోట్లు ఖర్చు 2014–19 మధ్య టీడీపీ సర్కారు క్యాన్సర్ చికిత్సకు రూ.751.56 కోట్లు ఖర్చుచేసింది. రూ.3.18 లక్షల చికిత్సలు అందించారు. కానీ, సీఎం జగన్ ప్రభుత్వం గడిచిన మూడేళ్లలోనే రూ.926.16 కోట్లు ఖర్చుచేసింది. అంటే టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో పెట్టిన ఖర్చును మూడేళ్లలోనే అధిగమించి అదనంగా రూ.174.6 కోట్లు వెచ్చించింది. అదే విధంగా 4,16,665 చికిత్సలను ప్రస్తుత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేసింది. ప్రభుత్వ రంగంలో క్యాన్సర్‌కు కార్పొరేట్ వైద్యం ఇక ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కలిగిన సీఎం జగన్.. ఆరోగ్యశ్రీ పరిధిలోకి అన్ని క్యాన్సర్ వ్యాధులను తీసుకొచ్చారు. దీంతోపాటు.. మరో అడుగు ముందుకేసి ప్రభుత్వ రంగంలో క్యాన్సర్‌కు కార్పొరేట్ వైద్యం అందించేలా వసతుల కల్పనకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా.. ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడిని ప్రభుత్వ సలహాదారు (క్యాన్సర్)గా ఇటీవల నియమించారు. ఈయన సూచనల మేరకు క్యాన్సర్ వైద్య సదుపాయాలు మెరుగుపరచడానికి కసరత్తు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ ఆపద్బాంధవిలా ఆదుకుంది నా భర్త ప్రైవేట్ ఉద్యోగి. కొద్ది నెలల క్రితం నాకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ అయింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షల్లో ఖర్చు అవుతుందన్నారు. అంత స్తోమతలేక ఆందోళన చెందాం. ఆరోగ్యశ్రీ ఆపద్భాందవిలా ఆదుకుంది. ఇప్పటికి ఏడు కీమోలు మణిపాల్ ఆసుపత్రిలో చేశారు. ఆసరా కింద ఏడు విడతలు ఆర్థిక సాయం అందింది. ప్రభుత్వం చేస్తున్న మేలును మేం మర్చిపోలేం. – కె. కృష్ణజ్యోతి, క్యాన్సర్ బాధితురాలు, మంగళగిరి గుంటూరు జిల్లా ఉచితంగా చికిత్స అందించారు నేను ఇంటి నిర్మాణ కూలిగా పని చేస్తుంటాను. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నాను. నిరుపేద కుటుంబానికి చెందిన మాకు క్యాన్సర్ చికిత్స చేయించుకోవడం కష్టతరం. అలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ ఆదుకుంది. ఇప్పటివరకు ప్రభుత్వం నా చికిత్సకు రూ.3.72 లక్షలు ఖర్చుచేసింది. ఇంకా చికిత్స జరుగుతోంది. పోషణకు ఆసరా కింద కూడా సాయం చేస్తున్నారు. – ఎస్.కె. వలి, ఇంటూరు బాపట్ల జిల్లా -
క్యాన్సర్ రోగులకు అధునాతన సేవలు
సాక్షి, అమరావతి: క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు రాష్ట్రం లోనే అధునాతన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా గుంటూరులో అధునాతన హాస్పైస్, పాలియేటివ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి (జీజీ హెచ్‌కి) అనుబంధంగా గుంటూరులోని బొంగరాలబీడులో అధునాతన హాస్పైస్ పాలియేటివ్ కేర్ సెంటర్ నిర్మించనున్నారు. ఇది అందుబాటులోకి వచ్చే వరకు గుంటూరు జీజీహెచ్‌లో తాత్కాలిక కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. తాత్కాలిక కేర్ సెం టర్లో ఇరవై నాలుగ్గంటలూ వైద్యుడు, ఆరుగురు నర్సులు, న్యూట్రిషియన్, సిబ్బంది రోగులకు సేవలందిస్తారు. పాలియేటివ్ కేర్‌పై రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులు, వైద్య సిబ్బందికి శిక్షణ ఇస్తారు. ఏమిటీ హాస్పైస్, పాలియేటివ్ కేర్ క్యాన్సర్‌తో బాధపడుతూ కీమోథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సలు చేయించుకొనే రోగుల్లో తీవ్రమైన నొప్పి, బాధ ఉంటుంది. రేడియేషన్, కీమోథెరపీ పూర్తయి వ్యాధి నయం అవ్వక అడ్వాన్స్డ్ స్టేజ్‌తో ఉన్న వారికి జీవితం నరకప్రాయమే అవుతుంది. ఆస్పత్రిలో ఉన్నా జబ్బు నయం కాదు. ఇంటి దగ్గర నొప్పి, బాధకు ఉపశమనం లభించదు. ఇటువంటి రోగులకు శారీరక, మానసిక సాంత్వన చేకూర్చడమే హాస్పైస్, పాలియేటివ్ కేర్ ఉద్దేశం. చినకాకానిలో అకడమిక్ రీసెర్చ్ సిద్ధార్థ మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో చినకాకానిలో నడుస్తున్న క్యాన్సర్ ఆసుపత్రిలో ప్రివెంటివ్ అంకాలజీ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ నెలాఖరుకు అందుబాటులోకి రాష్ట్రంలో క్యాన్సర్‌కు అధునాతన వైద్యం అందించాలన్నది సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. ఈ నెలాఖరు కు గుంటూరులో హాస్పైస్, పాలియేటివ్ కేర్ సెంట ర్, చినకాకానిలో ప్రివెంటివ్ అంకాలజీ, అకడమిక్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభించబోతున్నాం. – నవీన్ కుమార్, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి -
ఆపదలో అముద.. కేన్సర్ బారినపడిన దీనురాలు.. సాయం చేయండి ప్లీజ్!
కోదాడ: అముద ఆపదలో ఉంది.. ఒకప్పుడు చెత్తకుప్పల మధ్య తిరిగిన ఆమె.. అటెండర్ ఉద్యోగం వరకు ఎదిగింది. అయితే ఇప్పుడు కేన్సర్ బారినపడి మృత్యువు ముంగిట మరో జీవన్మరణ పోరాటం చేస్తోంది. నాడు ఆమెను ఆదరించి అండగా నిలిచిన నిరుపేద వెంకటేశ్వర్లుకు అముదకు చికిత్స చేయించే స్థోమత లేక సాయం చేసే చేతుల కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరీ అముద.. పది సంవత్సరాల క్రితం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ రోడ్డులో మతిస్థిమితం కోల్పోయి.. చెత్త కుప్పల మధ్య తిరుగుతున్న ఉన్న ఓ యువతిని.. సమీపంలో చెప్పులు కుట్టుకొని జీవిస్తున్న నిరుపేద వెంకటేశ్వర్లు చూసి ఆదరించి మంచి మనిషిగా మార్చారు. సొంత బిడ్డలా చూసుకుంటూ అండగా నిలిచారు. ఆమె మంత్రి హరీశ్‌రావు చొరవతో కోదాడ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో అటెండర్ ఉద్యోగం చేస్తూ జీవిస్తోంది. అముద గురించి ‘సాక్షి’దినపత్రికలో వచ్చిన కథనాలను చూసిన ఒకరు ఇటీవలే ఈమె జీవితాన్ని సినిమాగా తీస్తున్నారు. కాగా, అనారోగ్యంతో ఉద్యోగానికి వెళ్లలేకపోవడంతో మార్కెట్ కమిటీ అముద జీతం నిలిపి వేసింది. దీంతో ఆమె కష్టాలు తీవ్రమయ్యాయి. జ్వరం వచ్చిందని వెళితే.. నెల రోజుల క్రితం వరకు బాగానే ఉన్న అముదకు ఇటీవల జ్వరం రావడంతో వెంకటేశ్వర్లు ఆమెను కోదాడ ఆస్పత్రిలో చూపించారు. అక్కడ మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు వెళ్లాలని చెప్పడంతో.. ఓ డాక్టర్‌కు చూపించారు. ఆయన కేన్సర్ సోకిందనే అనుమానంతో బసవతారకం ఆస్పత్రికి సిఫార్సు చేశారు. ఆమెను పరీక్షించిన వైద్యులు కేన్సర్ సోకిందని నిర్ధారించడంతోపాటు వెంటనే చికిత్స చేయించాలని, లేకపోతే ప్రాణాలకు ప్రమాదం అని చెప్పడంతో వెంకటేశ్వర్లు అముదను అదే ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నా.. కొద్ది రోజుల్లోనే ఆమెకు ఆపరేషన్ చేయాలని వైద్యులు చెబుతున్నారు. నిరుపేద అయిన వెంకటేశ్వర్లు అముద చికిత్సకు చేయూతనందించాలని దాతలను కోరుతున్నారు. దాతలు అముద అకౌంట్‌కు తమకు తోచినంత డబ్బు పంపితే ఆమె బతుకుతుందని అంటున్నారు. పల్లె అముద నారాయణ నాడర్ అకౌంట్ నంబర్: 6247 8971579 ఐఎఫ్ఎస్సీ కోడ్ : ఎస్బీఐఎన్ 0020181 ఫోన్: 93915 42070 -
No Shave November: గడ్డాలు పెంచుతూ ఆకర్షణగా నిలుస్తున్న యువత
సాక్షి, కాజీపేట(వరంగల్): క్రాఫ్‌లో వివిధ రకాల స్టైల్స్.. ఆ మాదిరిగానే గడ్డంలోనూ తమకంటూ ఓ ప్రత్యేకత కోసం తాపత్రయ పడుతోంది నేటి యువత. తమ అందాన్ని గడ్డం రూపంలోనూ మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకునేందుకు మక్కువ చూపుతూ ఇదో స్టైల్ అంటూ కొత్త ట్రెండ్‌కు తెరలేపుతోంది. ‘నో షేవ్.. పెంచెయ్ గడ్డం’ అంటూ నగర యువత గడ్డం పెంచడంతో కొత్తదనం చూపుతోంది. అయితే ఏడాదిలో ప్రతి నెలకో ప్రత్యేకత ఉండగా.. కేన్సర్ మహమ్మారిని సమాజం నుంచి పారదోలేందుకు.. నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంపొందించేందుకు.. పేషెంట్లకు ఆర్థిక చేయూతనందించేందుకు నో షేవ్ నవంబర్ మాసంగా జరుపుకునేందుకు యువత ఉత్సాహం కనబరుస్తోంది. నవంబర్ నో షేవ్ మాసంగా.. గతంలో గడ్డం పెంచుకుంటే ఏంట్రా దేవదాసులా మారావు అనేవారు. కానీ.. ఇప్పుడు గడ్డం పెంచేసుకుందాం బాసూ అంటున్నారు. ప్రస్తుత యువతకు గడ్డం ఓ ట్రెండ్‌లా మారింది. తీరొక్క ఆకృతుల్లో.. ఇష్టమైన విధంగా మలచుకుంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. నవంబర్ మాసాన్ని నో షేవ్ నవంబర్ పేరిట.. గడ్డంపై కత్తెర పడనివ్వకుండా.. గడ్డానికి వెచ్చించే ఖర్చును మాసం మొత్తంలో పొదుపు చేసి కేన్సర్ పేషెంట్లకు అందజేయడంతోపాటు గడ్డం పెంచడంలో తమ స్టైల్‌ను కనబరుస్తూ.. డబ్బును ఆదా చేసి పేషెంట్లకు అందిస్తూ తమ ఉదారతను చాటుతున్నారు. ఇతరులకూ ఆదర్శంగా నిలుస్తున్నారు నగర యువకులు. ఇందుకోసం యువతను మరింతగా ప్రోత్సహించేందుకు ఆన్లైన్ నో షేవ్ నవంబర్ పేరిట స్వచ్ఛంద సంస్థ అందుబాటులో ఉండడం విశేషం. కాగా.. యువత ఫ్రెంచ్, అండర్ కట్ బియర్డ్, యాంకర్ బియర్డ్ వంటి వాటితోపాటు తమకు ఇష్టమైన హీరోల గడ్డాలను సరిపోలే విధంగా గడ్డాన్ని తీర్చిదిద్దుకునేందుకు నగరంలో ప్రత్యేకంగా మెన్స్ పార్లర్లు అందుబాటులో ఉన్నాయి. గడ్డం ప్రవీణ్ అంటారు.. నాకు గడ్డం పెంచడం అంటే చాలా ఇష్టం. నన్ను మా ఆఫీసులో అందరూ గడ్డం ప్రవీణ్ అనే పిలుస్తారు. నవంబర్ మాసంలో గడ్డంపై పెట్టే డబ్బులను కేన్సర్ పేషెంట్లకు అందజేయడం చాలా ఆనందంగా ఉంది. ఇదో మంచి సేవా కార్యక్రమంలా నేను భావిస్తున్నా. – సుందర ప్రవీణ్‌కుమార్, రైల్వే బుకింగ్ క్లర్క్ నా బియర్డ్ నా ఇష్టం నా బియర్డ్ నా ఇష్టం అంటాను నేను. మా ఇంట్లో వారు గడ్డం ఎందుకన్నా నాకు మాత్రం పెంచడం అంటే చాలా ఇష్టం. ప్రతి ఏడాది నవంబర్ మాసంలో నో షేవ్ నవంబర్‌ను పాటించి డబ్బులను ఆదా చేసి కేన్సర్ పేషెంట్లకు అందజేయడం బాధ్యతగా భావిస్తా. – ప్రియాంషు, ఎంటెక్, నిట్ వరంగల్ నో షేవ్ నవంబర్‌ను పాటిస్తాం.. నిట్ వరంగల్ ప్రతి అంశానికి ఆదర్శంగా నిలుస్తుంది. ఇందులో భాగంగా నిట్‌లో నవంబర్ నెలను నో షేవ్ నవంబర్‌గా పాటిస్తున్నాం. నాతోటి మిత్రులతో కలిసి బియర్డ్ కటింగ్‌కు అయ్యే డబ్బులను కేన్సర్ పేషెంట్ల చికిత్సకు ఉపయోగపడే విధంగా చేస్తున్నాం. – విదిష్రామ్, పీహెచ్డీ స్కాలర్, నిట్ -
నా కొడుకు గుండె పగిలింది, అందుకే : హీరోయిన్
సాక్షి, ముంబై: బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ కుమారుడు ర్యాన్ పెద్ద మనసుకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నేషనల్ కేన్సర్ అవేర్నెస్ డే (నవంబర్ 7) సందర్భంగా కేన్సర్ బాధితుల కోసం తన జుట్టును దానం చేయడం విశేషంగా నిలిచింది. స్వయంగా మాధురీ దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. (Kamal Haasan: తొలి భారతీయుడిగా కమల్ మరో సంచలనం) అలనాటి అందాల నటి, డ్యాన్సింగ్ క్వీన్ మాధురీ దీక్షిత్, శ్రీరామ్ నెనె దంపతుల చిన్న కుమారుడు ర్యాన్ తన పొడవైన జుట్టును కీమో థెరపీ చేయించుకున్న పేషెంట్ల కోసం డొనేట్ చేశాడు. సెలూన్లో ర్యాన్ హెయిర్‌కట్ చేయించుకుంటున్న వీడియోను షేర్ చేశారు మాధురి. కేన్సర్ బారిన పడి కీమో థెరపీ చేయించుకున్న వారిని చూసి ర్యాన్ చలించి పోయాడు. అందుకే కీమో ద్వారా జుట్టును కోల్పోయిన వారిలో ఆత్మవిశ్వాసం నింపేలా తన జుట్టును కేన్సర్ సొసైటీకి దానం చేయాలనుకున్నాడని మాధురి తెలిపారు. ఇది విని తాము చాలా ఆశ్చర్యపోయామని, దాదాపు రెండు సంవత్సరాలుగా పెంచు కుంటున్న తన జుట్టును డొనేట్ చేయడంపై చాలా గర్వ పడుతున్నామని మాధురి పేర్కొన్నారు. ర్యాన్ తీసుకున్న నిర్ణయంపై అభిమానులతో పాటు పలువురు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) -
మనసు చలించి జడ దానం.. గ్రేట్ కదా..!
నేత్రదానం.. అన్నదానం.. కిడ్నీ దానం.. ఊపిరితిత్తుల దానం.. చివరకు ఇటీవల హృదయదానం కూడా చూశాం. అయితే ఓ నృత్యకారిణి ఏకంగా బారెడు పొడవున్న తన జుత్తును దానం చేసింది. క్యాన్సర్ సోకిన రోగులు రేడియేషన్, కీమో థెరపీతో తల వెంట్రుకలు కోల్పోయి మానసికంగా బాధపడుతున్న వారిని చూసి చలించిపోయింది ఈ నృత్యకారిణి. అలాంటి వారికోసం తన జడను దానం చేసి తనలోని మానవత్వాన్ని చాటుకుంది. హైదరాబాద్‌లోని మోతీనగర్‌లో నివసించే శ్రావ్య మానస భోగిరెడ్డి కూచిపూడి నృత్యకారిణి. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నృత్యంలో పీహెచ్డీ చేస్తున్న శ్రావ్య కేవలం నృత్యకారిణిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పేరొందింది. బీటెక్, ఎంటెక్ తర్వాత మాస్టర్ ఇన్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ చేసిన శ్రావ్య తాను పలు ప్రదర్శనలకు వెళ్లే క్రమంలో రేడియేషన్‌తో జుత్తు కోల్పోయిన వారిని చూసి బాధపడేది. ఎప్పుడైనా తల దువ్వుకుంటున్నప్పుడు దువ్వెనకు నాలుగు వెంట్రుకలు చిక్కితేనే బాధపడతామని.. అలాంటిది మొత్తం జుత్తు లేకపోతే వారి బాధ ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే కష్టంగా ఉందని, అందుకే జుత్తును సేకరించే హెయిర్ డొనేషన్ ఆర్గనైజేషన్‌కు ఇటీవలనే అందజేసినట్లు చెప్పింది. క్యాన్సర్‌కు గురై కీమో థెరపీతో జుత్తు కోల్పోయిన వారికి వీరు దానం చేసిన జుత్తును విగ్గులాగ తయారు చేసి ఈ సంస్థ ఉచితంగా పంపిణీ చేస్తుంది. ప్రతిరోజూ 40 నుంచి 50 మంది ఈ ఆర్గనైజేషన్‌కు తమ తల వెంట్రుకల్ని అందజేస్తుంటారు. తన జడ .. మరొకరికి విగ్గులాగ ఉపయోగపడితే అంతకంటే ఆనందం తనకు ఇంకొకటి లేదని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. సుమధుర ఆర్ట్ అకాడమిని నడిపిస్తున్న శ్రావ్యలాగనే చాలామంది తమ జుత్తును ఈ సంస్థకు అందజేస్తున్నారు. ఆర్థికంగా సహాయం చేయకపోయినా తమ చేతిలో ఉన్న ఈ సహాయాన్ని చేయడంలో ఎంతో ఆనందం ఉందని ఆమె తెలిపారు. ఇంకో రెండు నెలలు పోతే తనకు మళ్లీ జుత్తు పెరుగుతుందని, కొద్ది రోజులు విగ్గుతో జడ వేసుకొని ప్రదర్శనలు ఇచ్చే అవకాశం తనకు ఉందని ఆమె తెలిపారు. – పురుమాండ్ల నరసింహారెడ్డి, సాక్షి, హైదరాబాద్ -
అమ్మ పడ్డ బాధ మరెవరూ పడకూడదు: హీరో
మనం తరచూ చూసే అనేక సినిమాల్లో నటీనటులు సాయం కోసం ఎదురు చూసేవారికి చెయ్యందించడం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం వంటివి చూస్తుంటాం. కానీ నిజ జీవితంలో సాయం చేసే నటులు అరుదుగా కనిపిస్తారు. ఇటువంటి అరుదైన నటుల సరసన తాజాగా బాలీవుడ్ యాక్టర్ అర్జున్ కపూర్ చేరారు. కేన్సర్ మహమ్మారితో పోరాడుతున్న నిరుపేదలకు సాయం చేయనున్నట్లు అర్జున్ కపూర్ ప్రకటించారు. ఈ ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా 100 మంది కేన్సర్ బారిన పడ్డ దంపతులకు సాయం చేయడానికి ఆయన ముందుకొచ్చారు. అర్జున్ తల్లి కేన్సర్‌తో మరణించారు. అమ్మ పడిన బాధ మరెవరూ పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు అర్జున్. ఇందులో భాగంగా కేన్సర్ పేషెంట్స్ ఎయిడ్ అసోసియేషన్ (సీపీఏఏ) బృందంతో కలిసి పనిచేయనున్నాడు. అర్జున్ మాట్లాడుతూ..‘‘కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళిస్తోన్న సమయంలో అందరం ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయాం. ఆ సమయం లో బీటలు వారిన మానవ సంబంధాలు, అనుబంధాలపై కొత్త ఆశలు చిగురించాయి. ఈ క్రమంలోనే ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ అండగా నిలబడుతూ మన ఆలోచనా విధానంలో మార్పులు చేసుకున్నాం. నా ఆలోచనా తీరు కూడ మారింది. ఫిబ్రవరిలో ప్రపంచమంతా వాలెంటైన్స్ డే జరుపుకుంటూ...మనం ఎంతో ఇష్టపడే వారు ప్రత్యేకంగా ఫీల్ అయ్యేలా వివిధ కార్యక్రమాలు చేస్తుంటాం. ఈ సారి నేను ఏదైనా కొత్తగా భిన్నంగా చేయాలనుకున్నాను. ఈ క్రమంలో ఈ నిర్ణయంతీసుకున్నా’’ నని చెప్పాడు. కేన్సర్ పేషెంట్స్ ఎయిడ్ అసోసియేషన్‌తో కలిసి నిరుపేద 100 మంది కేన్సర్ బాధిత జంటలకు సాయం చేస్తానని చెప్పాడు. భార్యాభర్తలలో ఒకరు క్యాన్సర్ బారిన పడితే రెండో వారు ఆ సమస్యను ఎదుర్కోవడంలో ప్రతి అడుగులో తమ పార్టనర్‌తో కలిసి సమస్యలను ఎదుర్కొన్నవారే. అందుకే దంపతులను ఆదుకోవాలనుకున్నాను. ఒక పక్క కేన్సర్‌తో బాధపడుతూ ఉంటే మరోపక్క కోవిడ్–19తో ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు. కనీసం ఆహారం కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడిన వారు ఎందరో ఉన్నారు. వీరిలో అందరికి కాకపోయిన కొందరికైనా సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీ కారం చుట్టానని అర్జున్ కపూర్ వివరించాడు. ఒక్కో పేషెంట్‌కు కీమో, రేడియో థెరపీలు, సర్జరీలు, మెడిసిన్స్ కోసం సంవత్సరానికి లక్ష రూపాయల వరకు అవసరమవుతాయి. అందువల్ల కేన్సర్ బారిన పడ్డ జంటకు లక్షరూపాయల నగదు సాయం చేస్తా’’ అని చెప్పాడు. కేన్సర్ బాధితులను ఆదుకునేందుకు మరింత మంది ముందుకు రావాలని అర్జున్ కపూర్ కోరాడు. చదవండి: నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా: హీరో -
8 ఏళ్ల తర్వాత జుట్టు కత్తిరించా: కొరియోగ్రాఫర్
ముంబై: కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ మెల్విన్ లూయిస్ క్యాన్సర్ పేషెంట్ల కోసం తన జుట్టును దానం చేశారు. ఈ విషయాన్ని ఆయన తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఓ భావోద్వేగ లేఖను షేర్ చేశారు. "క్యాన్సర్ రోగులకు దానం చేయడం కోసం నా జుట్టును పెంచుకుంటూ వచ్చాను. ఇప్పుడు దాన్ని కత్తిరించే సమయం ఆసన్నమైందని భావించాను. నిజానికి నాకు భుజాల వరకు జుట్టు ఉండటమే ఇష్టం. కానీ దాన్ని ఇంకా పొడవుగా పెంచుకుని.. క్యాన్సర్ పేషెంట్లకు అవసరమయ్యే విగ్గుల కోసం దానం చేయవచ్చు కదా అనిపించింది. ఈ క్రమంలో నేను పొడవు జుట్టుతో చేసిన వీడియోలు కొన్ని వైరల్ కూడా అయ్యాయి" (చదవండి: నేనేమీ తనను బలవంతపెట్టలేదు: సనా భర్త) "అయితే ఇలా ఎందుకు జుట్టు పెంచుకుంటున్నానన్నది కొందరికే తెలుసు. ఇప్పుడు అందరికీ తెలిసింది. 8 ఏళ్ల తర్వాత నేను నా జుట్టును కత్తిరించాను. క్యాన్సర్ మహమ్మారితో పోరాడేవారి కోసం నేను ఎప్పటికీ ప్రార్థిస్తాను, వారిపై నా ప్రేమ ఎల్లప్పటికీ ఉంటుంది. ఇలాంటి మంచి పనులు చేయడానికి నన్ను ప్రేరేపించిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు" అని రాసుకొచ్చారు. కాగా మెల్విన్ స్నేహితులు చిన్న వయసులోనే క్యాన్సర్ పేషెంట్ల కోసం జుట్టును దానం చేశారు. దాన్ని ప్రేరణగా తీసుకునే అతడు ఈ పనికి పూనుకున్నారు. మెల్విన్ చేసిన మంచిపనికి అభిమానులు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడు మీరు మాకు ఇన్స్పిరేషన్గా నిలిచారని కీర్తిస్తున్నారు. (చదవండి: క్యాన్సర్ పిల్లలకు తల్లిగా...) View this post on Instagram A post shared by Melvin Louis (@melvinlouis) View this post on Instagram A post shared by Melvin Louis (@melvinlouis) -
వయసులో చిన్నది.. ఔదార్యంలో గొప్పది
గాంధీనగర్: మనిషికి కొత్త అందాన్నిచ్చే జుట్టు గురించి ఎంత చెప్పినా తక్కువే.. మగువ అందంలో ఎనలేని పాత్ర పోషించే జుట్టును క్యాన్సర్ రోగుల కోసం దానం చేసి తమ ఔదార్యం చూపి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది సూరత్‌కు చెందిన ఓ చిన్నారి. వివరాలు.. దేవ్నా జనార్దన్ అనే పదేళ్ల చిన్నారి చైల్డ్ ఆర్టిస్ట్‌గా పని చేస్తుంది. ఈ క్రమంలో క్యాన్సర్ రోగులకోసం తన జుట్టును దానం చేసింది. దీని గురించి దేవ్నా మాట్లాడుతూ.. ‘నా జుట్టు దానం చేస్తే ఎవరైనా ఆనందం పొందుతారంటే.. వారి కోసం సంతోషంగా నా జుట్టు ఇచ్చేయాలనుకున్నాను’ అంటుంది ఈ చిన్నారి. తన 32 అంగుళాల పొడవాటి జుట్టును దానం చేసింది. భవిష్యత్తులో క్యాన్సర్ స్పెషలిస్ట్ కావాలని దేవ్నా కోరుకుంటుంది. పదేళ్ల ఈ చిన్నారి చూపిన ఔదార్యం ప్రస్తుతం తెగ వైరలవుతోంది. చిన్నదానివైనా.. మనసు మాత్రం గొప్పది అంటూ ప్రశంసిస్తున్నారు నెటిజనులు. (చదవండి: క్యాన్సర్ పిల్లలకు తల్లిగా...) -
క్యాన్సర్ పిల్లలకు తల్లిగా...
ముంబైకి వుంటున్న గీతాశ్రీధర్ 28 మంది క్యాన్సర్ బాధితులైన పిల్లల ఆలనాపాలనా చూస్తోంది. పగలు రాత్రీ తేడా లేకుండా పన్నెండు ఏళ్లుగా ఆ పిల్లల క్షేమానికే అంకితమయ్యింది. వ్యాధిబారిన పడిన పిల్లల మొహాల్లో నవ్వులు చూడాలని తపిస్తోంది. ఇదే కాకుండా ‘గీతు మా’ పేరుతో ‘టాటా మెమోరియల్ హాస్పిటల్’ క్యాన్సర్ రోగులకు ఆహార ఏర్పాట్లు చూస్తోంది. కొన్నేళ్లుగా స్వచ్ఛంద సేవకుల సహాయంతో ఫుడ్ బ్యాంకును నడుపుతోంది. చెన్నైకి చెందిన గీతా శ్రీధర్ 20 ఏళ్ల క్రితం పెళ్లి తర్వాత ముంబయికి మారింది. అక్కడే కొన్నాళ్లు ఒక ప్రాథమిక పాఠశాలలో టీచర్‌గా విధులను నిర్వర్తించింది. ఈ సమయంలోనే దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని చూసి వేదనకు గురైంది. తండ్రి మరణం తర్వాత దీర్ఘకాల జబ్బులతో బాధపడుతున్న పేదలకు సాయం చేయాలనుకుంది. క్యాన్సర్ పిల్లల మోముల్లో చిరునవ్వులు స్నేహితుల ద్వారా ఒకసారి పుణెలోని ఓ అనాథాశ్రమానికి వెళ్లినప్పుడు అక్కడ 2 నుండి 5 సంవత్సరాల వయసుగల 28 మంది పిల్లలు క్యాన్సర్‌తో బాధపడుతుండటం గమనించింది. వారికి చికిత్స చేస్తున్న డాక్టర్ని కలిసింది. కీమోథెరపీ, అధికమోతాదులో మందులను ఇస్తూ చికిత్సను అందిస్తున్నాన్నారు. బాధపడిన గీత ఈ పిల్లలకు తల్లిలాంటి సంరక్షణ అవసరమని తెలుసుకుంది. పిల్లలు బాగుండాలంటే వారి బాగోగులకు ఆర్థిక సాయం ఎంత అవసరమో, ఆ పిల్లలతో కలిసి జీవించడం కూడా ముఖ్యమే. అలా చేస్తే, పిల్లల సంరక్షణను దగ్గరుండి చూసుకోవచ్చనుకుంది. ఆశ్రమ నిర్వాహకులతో మాట్లాడి అక్కడ ఉన్న 28 మంది పిల్లలను తనతోపాటు ముంబయికి తీసుకెళ్లింది. తనకు ముంబయ్‌లో అదనంగా ఉన్న మరో ప్లాట్‌లో వారిని ఉంచింది. 24 గంటల సంరక్షణ గీత ఈ పిల్లల సంరక్షణ కోసం తన జీవితాన్ని అంకితం చేయాలనుకుంది. అందుకు గీత భర్త ఆమెకు సపోర్ట్‌గా నిలిచాడు. కొందరు ఫ్రెండ్స్ కూడా గీతకు భరోసాగా నిలిచారు. పిల్లల చేత గేమ్ సెషన్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ క్లాసులు, డ్యాన్స్, మ్యూజిక్ థెరపీ.. వంటివి ఏర్పాటు చేసింది. మెల్ల మెల్లగా పిల్లలందరూ గీతకు చేరువయ్యారు. ‘‘నన్ను వీరంతా ప్రేమగా ‘గీతు మా’ అని పిలుస్తుంటారు’’ అని ఆనందంగా చెబుతుంది గీత. దీంతో పాటు అనేక ఇతర సామాజిక పనులను కూడా చేస్తుంది. స్నేహితుల సలహా మేరకు ఆరేళ్ల క్రితం మాస్టర్ చెఫ్ ఇండియాలో సభ్యురాలిగా చేరింది. తన ఇద్దరు కుమార్తెలతో ఫుడ్ బ్లాగ్ రాయడం ప్రారంభించింది. ఇటీవల మైక్రో రెసిపీస్ కూడా చేయడం మొదలుపెట్టింది. లాక్డౌన్ కూడా గీత పనులకు అడ్డంకి కాలేదు. ఈ సమయంలో అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంది గీత. అందులో పోలీసుల సహకారం కూడా అందింది. స్వచ్ఛంద సేవకులతో కలిసి పేదవారికి ఆహారం అందివ్వడానికి ఫుడ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసింది. ‘ఒకరికొకరు సహాయం చేయడానికే దేవుడు మనలను పంపించాడు’ అంటుంది గీత. ఆమె తన పనులతో ఎప్పుడూ అలసిపోదు. అవసరమైన వారికి అండగా నిలవడంలో ఎప్పుడూ ముందుంటుంది. -
మానవత్వం చాటుకున్న బెంగళూరు పోలీసు
బనశంకరి: లాక్డౌన్ సమయంలో సంక్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్న క్యాన్సర్ రోగి కోసం ఓ కానిస్టేబుల్ 430 కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణించారు. ఈ నెల 11 తేదీన ఓ కన్నడ చానల్ నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి ధార్వాడకు చెందిన క్యాన్సర్ రోగి ఉమేశ్ ఫోన్ చేశారు. తనకు అత్యవసరమైన ఔషధాలు బెంగళూరులో మాత్రమే లభిస్తాయని, లాక్డౌన్ వల్ల అక్కడికి వెళ్లలేకపోతున్నానని గోడు వినిపించుకున్నాడు. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన బెంగళూరు పోలీస్ కమిషనరేట్ కంట్రోల్ రూమ్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా ఉన్న ఎస్.కుమారస్వామి స్పందించారు. 12న బైక్‌పై బెంగళూరు నుంచి 430 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధార్వాడకు వెళ్లి ఆ రోగికి ఔషధాలు అందించారు. -
కేన్సర్ బాధితులకు కేశాల దానం
అమ్మాయిల ముఖ వర్ఛస్సుకు జుట్టు ఎంత అవసరమో తెలియంది కాదు. అందుకేఅబ్బాయిల తరహాలో గుండుతో కనిపించే అమ్మాయిలను చూడడమే అరుదు. మరోవైపు కేశాలంకరణ కోసమే వేల రూపాయలు ఖర్చు చేసే వారు కోకొల్లలు. అయితే అందరికీ తెలిసిన మహిళల శైలికిభిన్నంగాముఖ సౌందర్యం కన్నా మానసిక సౌందర్యం మిన్న అని నమ్ముతున్నారు కొందరు. కేన్సర్ బాధితుల కోసం శిరోజాలను దానం చేస్తూ...స్ఫూర్తిని అందిస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: పెరుగుతున్న కాలుష్యం, మారుతున్న ఆహారపు అలవాట్లు, నిత్యావసర ఉత్పత్తుల్లో మితిమీరిన కేన్సర్ కారక రసాయనాల వాడకంతో చిన్నా పెద్దా తేడా లేకుండా కేన్సర్ మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ వ్యాధికి చికిత్సగా అందించే కీమోథెరపి కారణంగా జుట్టు మెత్తం రాలిపోవడం, తద్వారా ఆత్మనూన్యతకు గురికావడం కనిపిస్తోంది. అలాంటి బాధితుల్లో చిన్నారుల కోసం కొన్ని స్వచ్చంద సంస్థలు దాతల శిరోజాలతో కృత్రిమ విగ్స్ తయారు చేసి వ్యాధిగ్రస్త పిల్లలకు ఉచితంగా అందిస్తున్నాయి. ఈ క్రతువులో నగర మహిళలు ఎందరో మేము సైతం అంటున్నారు. బాధితుల కోసం.. నగరంలోని ఓ హెయిర్ సెలూన్లో స్టైలిస్ట్‌గా పనిచేసే శివ యాదవ్ కేన్సర్ భాధితులకు ఉచితంగా విగ్స్ తయారు చేసి అందించే మదత్ ట్రస్ట్ గురించి తెలుసుకున్నాడు. దీనికి తన వంతు సాయం చేయాలనే ఆలోచనతో.. హేర్ డొనేషన్ ఫర్ కేన్సర్ పేషెంట్స్ ప్రారంభించాడు. అలా సేవా తత్పరత కలిగిన వారి నుంచి జుట్టుని సేకరించి ట్రస్ట్‌కి పంపుతున్నాడు. ‘‘ఒక విగ్ తయారీకి కనీసం 5, 6గురి నుంచి జుట్టు అవసరం అవుతుంది.. అలాగే దాతల కేశాల పొడవు కనీసం 12 అంగుళాలు ఉండాలి. అందుకే అమ్మాయిలు జుట్టు మాత్రమే ఉపకయోగపడుతుంది. ఓ ప్రత్యేకమైన పద్ధతిలో ఆ జుట్టుని కత్తిరించి సేకరించిన అనంతరం దాతలకి ట్రస్ట్ తరపున ప్రశంసా పత్రం అందిన్తాం. ఉద్యోగంతో పాటు ఓ మంచి పని చేస్తున్నాననే ఆలోచన మరింత ఉత్సాహన్నిస్తోంది’’ అని సంతోషాన్ని వ్యక్తం చేశాడు శివ. జుట్టు లేకుండా తిరుగుతున్నా... నేను పని చేస్తున్న రంగంలో అందానికి ప్రాధాన్యత ఎక్కువ. గుండుతో బ్యూటీ ట్రైనర్‌గా కొనసాగడం సామాన్యమైన విషయం కాదు. అయినా సరే కేన్సర్ భాధిత చిన్నారుల్లో చిరునవ్వు చూడడం కోసం నా శిరోజాలను దానం చేశాను. అంతేకాదు.. దీని గురించి ప్రతి ఒక్కరిలో అవగాహన పెంచాలనుకుని క్యాప్ లేకుండానే తిరుగుతూ...ప్రశ్నించిన ప్రతి ఒక్కరికీ వివరంగా చెప్తున్నా. అందులో కొందరు తాము కూడా డొనేషన్‌కి ముందుకు రావడం మరింత ఆనందంగా అనిపిస్తోంది. – బిందు, బ్యూటీ ట్రైనర్ సకుటుంబసమేతంగా.... కేన్సర్ మహమ్మారితో కుదేలైన పిల్లల్ని చూసినప్పుడు ఎంతో బాధ అనిపించేది. వీరి గురించి మనమేం చేయలేమా అనుకునేదాన్ని. అలాంటి సమయంలోనే కేన్సర్ బాధితులకు హేర్ డొనేషన్ తెలిసింది. నాతో పాటు పిల్లలకు చిన్నప్పటి నుంచే సామాజిక, నైతిక విలువలు నేర్పించాలనే ఉద్దేశ్యంతో మా కుమార్తెలు శరణ్య, నూతన కేశాలు కూడా డొనేట్ చేశాను. నా ఆలోచనను నా భర్త పూర్తిగా ప్రోత్సాహించారు. – లత, ఎస్.ఆర్ నగర్ అమెరికా టు ఇండియా.. అమెరికాలో ఉంటూ ఇండియా వచ్చినప్పుడల్లా తిరుమలలో తలనీలాలను ఇవ్వడం ఆనవాయితి. అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా వెంట్రుకలను డొనేట్ చేయొచ్చు అని నిరూపించాలనుకున్నా. నా భార్య సలçహా మేరకు ప్రత్యేకంగా డొనేషన్‌కి సరిపోయేంత పొడవు వెంట్రుకలను పెంచా. గత డిసెంబర్లో ఇండియా వచ్చి కేశాలను దానం చేశా. – భరత్ నేటి నుంచి కేన్సర్‌పై అవగాహన గచ్చిబౌలి: కేన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం తప్పుతుందని కొండాపూర్ అపోలో క్లినిక్ డాక్టర్ విజయ్ కరణ్‌రెడ్డి తెలిపారు. సోమవారం కొండాపూర్ అపోలో క్లినిక్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ కేన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం నుంచి అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. వారం రోజుల పాటు ‘ఐయామ్ ఐ విల్’ పేరిట ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్‌ల ద్వారా అవగాహన కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు కేన్సర్‌పై తీసుకుంటున్న జాగ్రత్తలు, దురలవాట్లను విడనాడటం తదితర అంశాలను జోడించి ప్రతిజ్ఞ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్ చేస్తారని తెలిపారు. 50 వేల మందికి పోస్టింగ్‌లు పంపే లక్ష్యంగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముందుగా గుర్తిస్తే పూర్తిస్థాయి చికిత్స ఖైరతాబాద్: రోజు రోజుకూ పెరుగుతున్న లివర్ కేన్సర్ పై అవగాహన కల్పించడంతో పాటు ఆధునిక లివర్ శస్త్రచికిత్సలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్లెనిగల్స్ గ్లోబల్ హాస్పిటల్స్ చైర్మన్ సీనియర్ కన్సల్టెంట్, సర్టికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ కె.రవీంద్రనా«థ్ సోమవరాం తెలిపారు. వరల్డ్ కేన్సర్ డే సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మన శరీరంలో అతి పెద్ద అవయవం...ఎక్కువ క్రియలు నిర్వర్తించేది లివర్(కాలేయం) అన్నారు. కొంత కాలంగా లివర్ కేన్సర్ల బాధితుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఫ్యాటీ లివర్ సిర్రోసిస్‌గా మారి లివర్ కేన్సర్‌కు దారితీయడం, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం ఇలా అనేక కారణాల వల్ల లివర్ దెబ్బతిని లివర్ కేన్సర్‌కు కారణమవుతున్నాయన్నారు. ఎలాంటి కారణం లేకుండా బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, జాండీస్ రావడం వంటి లక్షణాలుంటే నిపుణులైన గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, లివర్స్పెషలిస్ట్ను సంప్రదించాలన్నారు. ప్రస్తుతం లివర్ కేన్సర్‌కు ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ముందుగానే గుర్తిస్తే లివర్ కేన్సర్‌ను చాలా వరకు పూర్తిగా నయం చేయవచ్చన్నారు. కరోనాపై అవగాహన ఖైరతాబాద్: కరోనా వైరస్ హై అలర్ నేపథ్యంలో గ్లెనిగల్స్ గ్లోబల్ హాస్పిటల్స్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మైక్రోబయాలజీ అండ్ ఇన్ఫెక్షన్ డిసీజ్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రంగనాథ్ ఎన్ అయ్యర్ సోమవారం అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. హాస్పిటల్ సిబ్బంది, నర్సింగ్ స్టాఫ్, క్రిటికల్ కేర్ సిబ్బందికి జాగ్రత్తలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ప్రాణాంతకమైన కరోనా వైరస్ లక్షణాలతో ఎవరైనా ఆస్పత్రికి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా నర్సింగ్ స్టాఫ్, క్రిటికల్ కేర్ సిబ్బంది తరచూ చేతులు వాష్ చేసుకోవడం, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు అడ్డుగా కడ్చీప్లు, ఎన్ 95 మాస్క్‌లు ఉపయోగించాలన్నారు. వైరస్ సోకిన వ్యక్తి లాలాజలం, ఇతరత్రా ద్రవాలను తాకడం, ఆ చేతులను తిరిగి మనం ముఖంపై పెట్టుకోవడం వల్ల కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని తెలిపారు. దీనికంటూ ప్రత్యేక చికిత్స ఏమీ ఉండదని, అవసరమైతే నగరంలో అందుబాటులో ఉన్న కరోనా వైరస్ పరీక్షలు చేయించాలన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, దగ్గు, జలుబు ఉన్నవారితో దగ్గర సంబంధాలను కొనసాగించరాదని, జనసంచారం ఉన్న ప్రదేశాల్లో జాగ్రత్తలు పాటించడం, శ్వాసకోస ఇబ్బందులుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో హాస్పిటల్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ మనీందర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
కేన్సర్ బాధితుల కోసం జుట్టు దానం
జూబ్లీహిల్స్: అతివలకు కొత్త అందాన్నిచ్చే జుట్టు గురించి ఎంతచెప్పినా తక్కువే.. మగువ అందంలో ఎనలేని పాత్ర పోషించే జుట్టును కేన్సర్ రోగుల కోసం దానం చేసి తమ ఔదార్యం చూపి ఎంతోమంది మహిళలు ఆదర్శంగా నిలిచారు. హోప్‌ఫర్ లైఫ్ ఫౌండేషన్ ఆద్వర్యంలో ఆదివారం జూబ్లీహిల్స్‌లో కేన్సర్ బాధిత మహిళల కోసం హెయిర్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. క్యాంప్‌లో పాల్గొన్న పలువురు మహిళలు తమ శిరోజాలను దానం చేశారు. భావన అనే మహిళ తన పూర్తి జుట్టును దానం చేశారు. కార్యక్రమంలో నిర్వాహకురాలు హిమజ తదితరులు పాల్గొన్నారు. పూర్తి జుట్టును దానం చేసిన భావన -
హాట్సాఫ్; రూ.300 కోట్ల భవనం దానం
బెంగళూరు: రూపాయి దానం చేయాలంటేనే వంద విధాలుగా ఆలోచించే రోజులు ఇవి. కానీ ఓ మహిళ మాత్రం దాన గుణానికి హద్దులు లేవని నిరూపించారు. ఏకంగా రూ.300 కోట్ల విలువైన తన ఆస్తిని దానం చేసింది. తనకు భగవంతుడు ఇచ్చిన దాంట్లో నుంచి చేసిన సహాయం ఎందరో నిరుపేదలకు ఇప్పుడు నీడలా మారబోతోంది. ఇంత మంచి మనసున్న ఆ అమ్మ పేరు మీరా నాయుడు. క్యాన్సర్‌తో బాధపడే బాలల సంక్షేమం కోసం 32 గదులున్న, రూ.300 కోట్ల విలువ చేసే ఆస్తిని కేటాయించి తన గొప్ప మనస్సును చాటుకున్నారు. చదవండి: మాయల్లేవ్..మంత్రాల్లేవ్..ప్రయత్నించానంతే! వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులో మెజిస్ట్రిక్ ప్రాంతంలో మూడంతస్తుల భవనం ఉంది. ఒకప్పుడు లక్ష్మీ హోటల్‌గా పేరుగాంచిన ఆ భవనం నేడు బాలల ఆరోగ్య కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. ఈ భవనాన్ని కొనుగోలు చేయడానికి ఎంతో మంది పోటీపడినా.. వారిని ఏ మాత్రం పట్టించుకోకుండా దానం చేయడానికే ఆమె ముందుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే క్యాన్సర్ బాధిత పిల్లల కోసం ఆ భవనాన్ని కేటాయించడానికి ఆమె నిర్ణయం తీసుకున్నారు. పేదలకు ఉచితంగా క్యాన్సర్ చికిత్స అందిస్తున్న నగరంలోని శంకర్ ఆసుపత్రికి మీరా నాయుడు దానిని అప్పగించారు. చదవండి: భర్త వెంటే భార్య ఎందుకు నడవాలంటే..! ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘భవనం ఉన్న ప్రదేశంలో నేను మరో బిల్డింగ్ కడితే ఇంకా డబ్బు వచ్చి చేరి నా సంపద పెరుగుతుంది. అంతేకానీ నాకు ఆత్మ సంతృప్తి ఉండదు. నా భర్త శ్రీనివాసులు నాయుడు ఎంతో కష్టపడి ఈ బిల్డింగ్ కట్టించాడు. దీన్ని పేదవారి కోసం దానం చేయడం వల్ల ఆయన పేరు ఎప్పటికీ నిలిచిపోతుందని' ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ భవనాన్ని ఆమె శంకర్ ఆస్పత్రి నిర్వాహకులకు అప్పగించారు. ఇక్కడికి వచ్చే క్యాన్సర్ బాధితులకు వీరు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. అలా వైద్యం పొందిన చిన్నారులకు ఇక్కడ వసతి కల్పించాలని ఆమె కోరారు. ఇది విన్నవారంతా మీరా నాయుడు నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. Mrs. Meera Naidu, donates Rs.300 crore "Lakshmi hotel" near Majestic to Shankara Cancer hospital to use it as a free accommodation for the patients and their families from outside Bengaluru. A noble gesture indeed! #Bengaluru #Karnataka — DP SATISH (@dp_satish) December 31, 2019 -
క్యాన్సర్ రోగులకు గౌతమి పరామర్శ
పెనమలూరు: క్యాన్సర్ వ్యాధిని తొలిదశలోనే గుర్తిస్తే చికిత్స ద్వారా పూర్తిస్థాయిలో కోలుకోవచ్చని సినీనటి లైప్ అగైన్ ఫౌండేన్ చైర్పర్సన్ టి.గౌతమి సూచించారు. ఆమె శనివారం కానూరు అశోక్‌నగర్‌లో రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. రూట్స్ ఉచిత సంరక్షణ కేంద్రంలో క్యాన్సర్ బాధితులను పరామర్శించి పండ్లు, దుప్పట్లు అందజేశారు. క్యాన్సర్ బాధితులకు సేవలు అందిస్తున్న రూట్స్ ఫౌండేషన్‌కు అభినందనలు తెలిపారు. ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పోలవరపు విజయభాస్కర్ మాట్లాడుతూ పదేళ్లుగా క్యాన్సర్ బాధితులకు సేవచేస్తున్నామని పేర్కొన్నారు. రూట్స్ హాస్పిల్ చైర్మన్ అన్నే శివనాగేశ్వరరావు, డాక్టర్ పద్మజ, రూట్స్ కన్వీనర్ కె.మాధవి, రామకృష్ణప్రసాద్ పాల్గొన్నారు. -
మాటువేసిన మాయదారిరోగం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కేన్సర్ రోగుల సంఖ్య పెరుగుతోంది. ఏడాదికి కొత్తగా 58 వేల మంది కేన్సర్ బారిన పడుతున్నారని టాటా ట్రస్టు తెలిపింది. తెలంగాణలో కేన్సర్ వ్యాధి వ్యాప్తిపై ‘టాటా ట్రస్ట్’సమగ్ర ప్రాజెక్టు నివేదిక–2018ను తాజాగా విడుదల చేసింది. కేన్సర్ బారిన పడుతున్న 58 వేల మందిలో 45 వేల మంది కింది మధ్యతరగతి ఆదాయ వర్గాలేనని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కేన్సర్ బారిన పడుతున్న వారి రేటు పురుషుల్లో లక్షకు 85, స్త్రీలలో 125గా ఉండటం గమనార్హం. అయితే అనేకచోట్ల కేన్సర్ రోగులు నమోదు కావటం లేదు. దాన్ని పరిగణనలోకి తీసుకుంటే లక్షకు 143గా ఈ రేటు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. దేశం లో ఈ రేటు పురుషుల్లో 110, స్త్రీలలో 102గా ఉండటం గమనార్హం. రాష్ట్రంలో కేన్సర్ రోగుల్లో అత్యధికంగా గ్యాస్ట్రో ఇంటెస్టినల్ కేన్సర్‌కు గురవుతున్న వారు 23% మంది ఉన్నారు. పొగాకు కారణంగా 15%కేన్సర్‌కు గురవుతున్నారు. 12% మంది గైనిక్ సంబంధిత కేన్సర్‌కు గురవుతున్నారు. థర్డ్ స్టేజ్‌లోనే ఆసుపత్రులకు... ఇతర అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలతో పోలిస్తే ఇండియాలో కేన్సర్ పెరుగుదల రేటు తక్కువగా కనిపిస్తుంది. అయితే వాస్తవంగా ఆ పరిస్థితి ఉందని కాదు. తక్కువ కనిపిస్తుండ టానికి ప్రధాన కారణం కేన్సర్‌ను ముందస్తుగా గుర్తించకపోవడం, పరీక్షలు చేయించుకోకపోవడం, రోగం వచ్చినా కూడా నమోదు కాకపోవడంగా నివేదిక తెలిపింది. అంతేకాదు కేన్సర్ సోకిన వారిలో 50 శాతం మంది థర్డ్ స్టేజీలోనే మొదటిసారి వైద్యానికి వస్తున్నారు. దీంతో భారీగా మరణాల రేటు నమోదవుతోంది. పైగా వైద్య వసతి లేకపోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉంటోంది. భారత్‌లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో కేన్సర్ చికిత్సకు రూ.4 లక్షల నుం చి రూ.10 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇప్పు డున్న రోగులకు వైద్యం చేయాలంటేనే దేశవ్యాప్తంగా 850 సమగ్ర ఆసుపత్రులు అవసరం. కేవలం 400 మాత్రమే అందుబాటులో ఉండ గా.. 67 శాతం ప్రైవేట్ రంగంలోనే అందుబాటులో ఉన్నాయి. తెలంగాణకు వస్తే మొత్తం 25 సమగ్ర కేన్సర్ ఆసుపత్రులుండగా, అం దులో 3 మాత్రమే ప్రభుత్వ రంగంలో ఉన్నా యి. నిమ్స్, ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రి, వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీల్లో కేన్సర్ చికిత్స అందుబాటులో ఉంది. 30 రేడియోథెర పీ మిషన్లు ఉంటే అందులో 25 ప్రైవేట్ ఆధ్వర్యంలోనే ఉన్నాయి. విచిత్రమేమంటే రాష్ట్రంలో 800 ప్రభుత్వ ఆసుపత్రులుంటే, కేవ లం మూడింటిలోనే వ్యాధికి వైద్యం అందుతోంది. ప్రభుత్వ ఆసుపత్రులపై ఒత్తిడి... ఆరోగ్యశ్రీ కింద అన్ని రకాల కేన్సర్లకు చికిత్స అందుబాటులో ఉంది. రోగుల్లో ఎక్కువ మంది దిగువ మధ్య తరగతికి చెందిన వారే ఉంటుండటంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రులపై పడుతోంది. అయితే ఆరోగ్యశ్రీ కింద రోగికి రూ.లక్షన్నర వరకే అనుమతి ఉండటంతో చాలావరకు ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ రోగులను పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వ ఆసుపత్రులు ఏడాదికి 12 వేల మంది కేన్సర్ రోగులకు చికిత్స చేస్తున్నాయి. ప్రైవేటు ఆసుపత్రులు 10 వేల మందికి చికిత్స చేస్తున్నాయి. 12 కేంద్రాల్లో చికిత్సకు ప్రతిపాదనలు... రోగుల సంఖ్యకు తగ్గట్లు కేన్సర్ చికిత్స అందుబాటులో లేకపోవడంతో టాటా ట్రస్ట్ కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. నిమ్స్సహా 12 కేంద్రాల్లో కేన్సర్ చికిత్స అందజేయాలని ప్రతిపాదించింది. వాటి ద్వారా 70 శాతం రోగులకు చికిత్స అందిస్తారు. పైగా రాష్ట్రంలో ఎక్కడివారైనా ఒకట్రెండు గంటల్లో వెళ్లి వైద్యం చేయించుకునేలా పలుచోట్ల ఆయా కేంద్రాలను అభివృద్ధి చేస్తారు. అంతేకాదు టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలంగాణలో 250 పడకలతో కేన్సర్ ఆస్పత్రి నెలకొల్పాలని భావిస్తుంది. -
‘బసవతారకం’లో వినూత్న కార్యక్రమం
బంజారాహిల్స్ : కేన్సర్‌తో స్వరపేటిక తొలగించిన రోగులు జాతీయ గీతాన్ని ఆలపించి కోల్పోయిన గొంతును తిరిగి సాధించవచ్చనే విశ్వాసాన్ని పొందారు. బంజారాహిల్స్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆస్పత్రిలో ఆస్పత్రిలో మంగళవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వరపేటిక తొలగించడంతో కృత్రిమ వాయిస్ బాక్స్ అమర్చిన రోగులు తాము మాట్లాడుతున్నామన్న విషయాన్ని నలుగురికీ తెలియజేసేందుకు జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ ఆస్పత్రిలో ఇప్పటి దాకా సుమారు 200 మందికి రోగంతో స్వరపేటిక తొలగించి దాని స్థానంలో ‘టీఈపీ’ మిషన్లను అమర్చారు. ఈ సందర్భంగా ఆంకాలజీ సర్జన్స్, ఫిజీషియన్స్, స్పీచ్ థెరపిస్టులు ఆధ్వర్యంలో కొందరు గీతాన్ని ఆలపించారు. ఆంకాలజీ విభాగం హెడ్ అండ్ నెక్ సర్జరీ వైద్యులు చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ.. స్వరపేటికను తొలగించిన వారు మాట్లాడే శక్తిని కోల్పోయి దివ్యాంగులుగా జీవితం గడపాల్సి వచ్చేదని, ఇటీవల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, చికిత్సా విధానాలతో వారికి ఊరట లభిస్తోందన్నారు. స్వరపేటిక లేనివారు పాడడం కష్టమైనా వారిలో ధైర్యం నింపేందుకు ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇలాంటి ప్రయత్నం దేశంలోనే తొలిసారిగా ఇక్కడ నిర్వహించామని తెలిపారు.