central team visits
-
‘ఉపాధి’ పనులను పరిశీలించిన కేంద్ర బృందం
ఓర్వకల్లు: ప్రధాని నరేంద్రమోదీ సలహాదారు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు సభ్యులు అమర్‌జిత్‌సిన్హా నేతృత్వంలోని కేంద్ర బృందం కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లెలో బుధవారం పర్యటించింది. ఆ గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పండ్ల తోటల పెంపకం, అభివృద్ధి పనులను పరిశీలించింది. రైతు వెంకటేశ్వర్లు సాగు చేసిన మునగ తోటను పరిశీలించి పంట దిగుబడి, పెట్టుబడుల ఖర్చుల వివరాలను బృందంలోని సభ్యులు అడిగి తెలుసుకున్నారు. మునగ సాగు లాభసాటిగా ఉందని, దిగుబడులకు తగ్గట్టు మార్కెట్లో ధరలు ఆశాజనకంగా ఉన్నాయని రైతు వివరించారు. సమీపంలో ఉపాధి హామీ పథకం కింద తవ్విన అమృత్ సరోవర్ (నీటి కుంట)ను కేంద్ర బృందం పరిశీలించింది. ఈ కుంట ద్వారా ప్రజలకు ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఎంత ఖర్చు చేశారనే వివరాలను అడిగి తెలుసుకుంది. అనంతరం జాతీయ గ్రామీణాభివృద్ధి పథకం ప్రయోజనాలు, పనితీరుపై గ్రామస్తులతో బృంద సభ్యులు సమీక్ష నిర్వహించారు. పేదరిక నిర్మూలనకు చేపట్టాల్సిన పనులపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఉపాధి పథకాన్ని మరింత విస్తృతం చేయాలని, రైతుల పంట పొలాలను అభివృద్ధి చేయాలని, పొలం రస్తాల వెంటవున్న కంపచెట్లను తొలగించాలని పలువురు కోరారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఉపాధి పథకమే తమను ఆదుకుందని, లేకపోతే ఎంతో మంది పస్తులుండాల్సి వచ్చేదని లక్ష్మీదేవి, శారదమ్మ అనే మహిళలు చెప్పారు. కేంద్ర బృందంలో కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ ప్రొఫెసర్ అశోక్ పంకజ్, ఎస్సీఏఈఆర్ ఎన్డీఐసీ డైరెక్టర్ సోనాల్డ్ దేశాయ్, గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ ఎకనామికల్ అడ్వైజర్ ప్రవీణ్ మెహతా, ఎన్ఐఆర్డి–పీఆర్ ప్రొఫెసర్ జ్యోతిస్ పాలన్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కోటేశ్వరరావు, డ్వామా పీడీ అమర్నాథ్రెడ్డి, డీఆర్డీఏ పీడి వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు. ఇదీ చదవండి: సమష్టిగా నడుద్దాం.. క్లీన్ స్వీప్ చేద్దాం -
వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాల పరిశీలన
చింతూరు/పోలవరం రూరల్: ఇటీవల గోదావరి వరదలతో ప్రభావితమైన ప్రాంతాల్లో బుధవారం కేంద్రబృందాలు పర్యటించాయి. నష్టాలను పరిశీలించాయి. రవినేష్‌కుమార్, మురుగానందం సభ్యులుగా ఉన్న బృందం అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం, చింతూరు మండలాల్లోను, కె.మనోహరన్, పి.దేవేందర్, అరవింద్‌కుమార్ సోని సభ్యులుగా ఉన్న బృందం ఏలూరు జిల్లా పోలవరం గ్రామంలోను పర్యటించాయి. ఆయా జిల్లాల కలెక్టర్లు సుమిత్‌కుమార్, ప్రసన్నవెంకటేష్ వరద నష్టాలను ఆయా బృందాల సభ్యులకు వివరించారు. బృందం సభ్యులు వరదలకు కూలిన ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. అలాగే ఏలూరు జిల్లా పోలవరం గ్రామంలోని నెక్లెస్‌బండ్ కోతకు గురైన ప్రాంతాన్ని, యడ్లగూడెం ప్రాంతంలో నెక్లెస్‌బండ్‌ను వారు పరిశీలించారు. -
AP: నష్టం అపారం.. వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాల పర్యటన
సాక్షి, నెల్లూరు: ‘కళ్లెదుటే వరద ప్రవాహం ముంచెత్తింది. వరదలో సామగ్రి అంతా కొట్టుకుపోయింది. కట్టుబట్టలతో మిగిలాం. ఇళ్లు కూలాయి. చేతికొచ్చిన పంట దెబ్బతినింది. పొలాల్లో ఇసుక మేటలేసింది. రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. రాకపోకలు నిలిచిపోయాయి. కళ్ల ముందే పశువుల ప్రాణాలు పోయాయి. మరికొన్ని నీటిలో కొట్టుకుపోయాయి. మాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇంత వరద ఎప్పుడూ రాలేదు. ఉదారంగా కేంద్ర సహాయం అందేలా చేసి ఆదుకోండి’ అంటూ వరద బాధితులు కేంద్ర బృందాన్ని వేడుకున్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆదివారం వర్షపు జల్లుల మధ్యే రెండు కేంద్ర బృందాలు పర్యటించాయి. అభయ్‌కుమార్, శ్రావణ్‌కుమార్ సింగ్, అనిల్ కుమార్ సింగ్‌లతో కూడిన ఒక బృందం తిరుపతి నుంచి నాయుడుపేట మీదుగా రోడ్డు మార్గంలో నెల్లూరుకు చేరుకుని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది. కడప నుంచి వచ్చిన కునాల్ సత్యార్థి, కె మనోహరన్, శ్రీనివాసుబైరి, శివన్‌శర్మలతో కూడిన రెండవ బృందం పెన్నా పరీవాహక ప్రాంతాలైన ఆత్మకూరు, కోవూరు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి వరద నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించింది. ఇసుక మేటలేసిన పంట పొలాలు, చేతికందే దశలో ఉన్న పంటలు నీటి పాలవ్వడం, దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు, కూలిన ఇళ్లు, కోతకు గురైన చెరువులు, సోమశిల జలాశయం, దెబ్బతిన్న జలాశయ అప్రోచ్ ప్రదేశాన్ని ప్రత్యక్షంగా తిలకించారు. బురద మధ్య అల్లాడుతున్న బాధితుల వేదన విన్నారు. నగరంలోని ఓ హోటల్లో వరద నష్టం ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. నష్టం పరిశీలన ఇలా.. ►జాతీయ రహదారి వెంబడి నష్టాన్ని పరిశీలించారు. కోవూరు నియోజకవర్గంలోని ఇందుకూరుపేట మండలం జేజేపేటలోని దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించి బాధిత రైతులు ఉజ్వల కృష్ణ, చైతన్యతో మాట్లాడారు. గంగపట్నంలో దెబ్బతిన్న ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రోడ్లను పరిశీలించారు. ఇసుక మేటలు వేసిన పంట పొలాలు, కోతకు గురైన చెరువును పరిశీలించారు. ►చెరువు తెగిపోవడంతో వరద ముంచెత్తిన ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాళెం సమీపంలో ఉన్న రాజుకాలనీని పరిశీలించారు. అక్కడి దయనీయ పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. తప్పక సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ►సంగం మండలం బీరాపేరు వాగు ఉధృతి వల్ల దెబ్బతిన్న పంట పొలాలు, రోడ్లు, విద్యుత్ లైన్లను పరిశీలించారు. బుచ్చిరెడ్డి పాళెం నుంచి జొన్నవాడ వరకు దెబ్బతిన్న ఆర్అండ్బీ రోడ్డును పరిశీలించారు. పెనుబల్లి వద్ద దెబ్బతిన్న జెడ్పీ హైస్కూల్ ప్రహరీ, పశు వైద్యశాల భవనం, పంటలను.. జొన్నవాడ నుంచి నెల్లూరు రూరల్ మండలం దేవరపాళెం వరకు దెబ్బతిన్న రహదారిని పరిశీలించారు. రూ.1,190.15 కోట్ల నష్టం ►పెన్నా, కాళంగి, స్వర్ణముఖి నదులు ఉప్పొంగడం వల్ల 23 మండలాల్లోని 109 గ్రామాల్లో అపార నష్టం జరిగింది. ఆయా గ్రామాల్లోని 1,22,254 మంది అష్ట కష్టాలు పడ్డారు. 11 గ్రామాలు పూర్తిగా మునిగిపోయాయి. 98 గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఐదుగురు ప్రాణాలు వదిలారు. వందలాది పశువులు మృత్యువాత పడ్డాయి. ►సీఎం జగన్ ఆదేశాలతో పునరావాస కేంద్రాలకు బాధితులను తరలించామని, ఆ తర్వాత ఆర్థిక సాయం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని అధికారులు తెలిపారు. పాక్షికంగా, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు, మృతి చెందిన వారి కుటుంబాలకు, పశువులు కోల్పోయిన వారికి నష్టపరిహారం అందించామని చెప్పారు. వివిధ శాఖల పరిధిలో రూ.1,190.15 కోట్ల నష్టం వాటిల్లిందని కలెక్టర్ చక్రధర్ బాబు కేంద్ర బృందానికి సమగ్ర నివేదిక అందజేశారు. -
పెద్ద కష్టమే.. వరద ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన, సాయంపై హామీ
సాక్షి, తిరుపతి/సాక్షి ప్రతినిధి, కడప: వరదల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తామని కేంద్ర బృందం బాధితులకు హామీ ఇచ్చింది. శాఖల వారీగా నష్టం అంచనాలతో కూడిన సమగ్ర నివేదికను అందజేయాలని అధికారులకు సూచించింది. చిత్తూరు, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లో ఆదివారం వరకు క్షేత్ర స్థాయిలో పర్యటించి వాస్తవాలను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని స్పష్టం చేసింది. ఇటీవలి భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో.. ప్రధానంగా చిత్తూరు, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లో ప్రభుత్వ ఆస్తులతో పాటు రైతులు, వ్యాపారులు, కూలీలు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వినతి మేరకు కేంద్ర బృందం శుక్ర, శనివారాల్లో చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లోని తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, పలమనేరు, రాజంపేట, కడప, కమలాపురం నియోజకవర్గాల పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించింది. వరదలకు కొట్టుకుపోయిన నివాసాలు, పంటలు, వంతెనలు, రహదారులు, చెరువులు, కాలువలను ప్రత్యక్షంగా తిలకించి.. బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణి, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల కలెక్టర్లు హరినారాయణన్, వి.విజయరామరాజులు ఆయా ప్రాంతాల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వరద నష్టాలను వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. వైఎస్సార్ జిల్లా మందపల్లెలో ప్రజలతో మాట్లాడుతున్న కేంద్ర బృందం పరిశీలన ఇలా.. తిరుపతి నగరంలో దెబ్బతిన్న ఎస్పీడీసీఎల్ రోడ్డును, ఎంఆర్‌పల్లె కూడలి, ముంపునకు గురైన 20వ వార్డు సచివాలయాన్ని కేంద్ర బృందం సభ్యులు కులాల్ సత్వార్థి, అభే కుమార్, మనోహరన్, శ్రీనివాసు భైరి, శివానీ శర్మ, శ్రవణ్ కుమార్ సింగ్, అనిల్ కుమార్ సింగ్ పరిశీలించారు. ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద దెబ్బతిన్న రోడ్డు, గొల్లవాణిగుంట, కృష్ణారెడ్డి నగర్, పూలవాణిగుంట, కొరమేనుగుంట ప్రాంతాల్లో ముంపునకు గురైన గృహాలు, రోడ్లు, లీలామహల్, కరకంబాడి మార్గంలో దెబ్బతిన్న డ్రైనేజీ కాలువను పరిశీలించారు. చంద్రగిరి మండలం నడింపల్లె గ్రామ రహదారిలో కుప్పకూలిన బ్రిడ్జిని, పాతచానంబట్ల వద్ద భారీగా కోతకు గురైన రోడ్డును, దెబ్బతిన్న ప్రాథమిక పాఠశాల, విద్యుత్ సబ్‌స్టేషన్, రాయలచెరువు కట్ట వద్ద లీకేజీ, ముంపునకు గురైన సూరావారిపల్లె రోడ్డును పరిశీలించారు. నియోజకవర్గ పరిధిలోని వరద నష్టాల గురించి ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కేంద్ర బృందానికి వివరించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఆర్.మల్లవరం, ఏర్పేడు మండలంలోని పాపానాయుడు పేట– గుడిమల్లం, జి.పాళెం–గాజులమండ్యం మధ్య స్వర్ణముఖి నదిపై కొట్టుకుపోయిన ఆర్అండ్బీ వంతెనలను పరిశీలించారు. రేణిగుంట మండలం కెఎల్ఎం ఆసుపత్రి వద్ద ముంపునకు గురైన కాలనీల్లో బాధితులతో మాట్లాడారు. గాజులమండ్యం నేషనల్ హైవేపై, పాడిపేట, తనపల్లె రోడ్డులోని వంతెనలను, వీరప్పల్లి ప్రాంతాన్ని, పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం పరిధిలో చెయ్యేరు వల్ల ముంపునకు గురైన పులపత్తూరు, ఎగువ మందపల్లె, దిగువ మందపల్లె గ్రామాలలో నేలమట్టమైన, దెబ్బతిన్న ఇళ్లు, పంట పొలాలను, తెగిపోయిన అన్నమయ్య డ్యామ్, బుగ్గవంక ప్రాజెక్టు, వల్లూరు మండలం పెద్దపుత్త గ్రామ పరి«ధిలోని పాపాఘ్ని నది పరివాహక ప్రాంతంలో దెబ్బతిన్న పంటలు, వల్లూరు–కమలాపురం మధ్య కూలిన హైలెవెల్ వంతెనను పరిశీలించారు. కడప ఆర్అండ్బీ అతిథి గృహంలో జిల్లా వ్యాప్తంగా వరద నష్టం వివరాలతో కూడిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించింది. వైఎస్సార్ జిల్లాలో రూ.1,320 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ఎంపీ అవినాష్‌రెడ్డి కేంద్ర బృందానికి వివరించారు. ఈ మేరకు సమగ్ర వివరాలతో వినతిపత్రం సమర్పించారు. చిత్తూరు జిల్లాలో రూ.1,200 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని అధికారులు, ప్రజాప్రతినిధులు వివరించారు. చిత్తూరు జిల్లా వీరప్పల్లిలో వరదలకు దెబ్బతిన్న వరిని కేంద్ర బృందానికి చూపిస్తున్న రైతులు నష్టం అపారం రాష్ట్రంలో నవంబర్ 13 నుంచి 20వ తేదీ వరకు చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర నష్టం వాటిల్లింది. నవంబర్ 19వ తేదీన చిత్తూరు జిల్లా పెద్దమండ్యంలో 200 మి.మీ, అనంతపురం జిల్లా నల్లచెరువులో 193 మి.మీ, నెల్లూరులో 140.3 మి.మీ వర్షపాతం నమోదైంది. చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో పలు రోడ్లు, చెరువులు దెబ్బతిన్నాయి. వైఎస్సార్ జిల్లాలో పింఛా, అన్నమయ్య రిజర్వాయర్లు తెగిపోవడంతో చాలా గ్రామాలు నీట మునిగాయి. నాలుగు జిల్లాల్లో 199 మండలాలు, 1,990 గ్రామాలకు భారీ ఎత్తున నష్టం సంభవించింది. 211 గ్రామాలు, 23 పట్టణాలు ముంపునకు గురయ్యాయి. 2.31 లక్షల మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగు జిల్లాల్లో 44 మంది చనిపోయారు. 15 మంది గల్లంతయ్యారు. 98,514 గృహాలు ముంపునకు గురయ్యాయి. 5,740 గృహాలు దెబ్బతిన్నాయి. 2.86 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగింది. కడప జిల్లాలో 56,139 హెక్టార్లు, అనంతపురం జిల్లాలో 28 వేల హెక్టార్లు, చిత్తూరు జిల్లాలో 12,744 హెక్టార్లలో కోతకు వచ్చిన వరి పంట నాశనమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 4.78 లక్షల మంది రైతుల పంటలకు నష్టం వాటిల్లింది. ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా వరి పంట దెబ్బతినింది. పంచాయతీ రాజ్ సెక్టార్లో 3,129 రోడ్లు, 20 భవనాలకు నష్టం వాటిల్లింది. ఆర్అండ్బీ రోడ్లు, ఇరిగేషన్, భారీ, చిన్న నీటి వనరులు, ట్రాన్స్‌కో పోల్స్, సబ్ స్టేషన్లు, గృహాలు తదితర శాఖల్లో భారీగా నష్టం వాటిల్లింది. తిరుపతిలో ఫొటో ప్రదర్శన ద్వారా నష్టాన్ని తెలుసుకుంటున్న కేంద్ర బృందం కనీవినీ ఎరుగని నష్టం వరద ఉప్పెనలో కొట్టుకుపోయాం. ఇళ్లు, పొలాలు పోయాయి. పంటలు నాశనమయ్యాయి. ప్రాజెక్టులు, రోడ్లు, బ్రిడ్జిలు తెగిపోయాయి. మనుషులతో పాటు పశువులు ప్రాణాలు కోల్పోయాయి. సర్వం కోల్పోయాం. కట్టుబట్టలతో మిగిలాం. కనీవినీ ఎరుగనంత నష్టం వాటిల్లింది. ప్రాథమిక అంచనా మేరకే వేల కోట్ల నష్టం వాటిల్లింది. కేంద్రం ఉదారంగా ఆదుకోవాలి. – బాధితులు, అధికారులు, ప్రజాప్రతినిధులు కష్టం కళ్లారా చూశాం తుపాను వల్ల కలిగిన నష్టాన్ని, ప్రజల కష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించాం. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో అధికారులు వివరాలన్నీ పొందుపరిచారు. నష్టం ఏ మేరకు జరిగిందో స్పష్టంగా తెలుస్తోంది. శాఖల వారీగా నష్టం అంచనాలను కేంద్రం దృష్టికి తీసుకు వెళతాం. బాధితులందరికీ న్యాయం జరిగేలా చూస్తాం. వరద సమయంలో ప్రభుత్వం చేపట్టిన తక్షణ సహాయక చర్యలు అభినందనీయం. అధికారుల స్పందన, ఫైర్, పోలీసు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సేవలు ప్రశంసనీయం. – కేంద్ర బృందం వేగంగా సహాయ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ముంపు వాసులను పునరావాస కేంద్రాలకు తరలించింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తక్షణం స్పందించి హైదరాబాద్ నుంచి 2 హెలికాప్టర్లను రప్పించారు. భారీ ప్రాణ నష్టాన్ని నివారించగలిగారు. నాలుగు జిల్లాల్లో 25 బృందాలు, 260 మంది ఎన్డీఆర్ఎఫ్, 300 మంది ఎస్డీఆర్ఎఫ్, 54 ఫైర్ సెర్వీస్, 22 బోట్లు, రెండు హెలికాప్టర్ల ద్వారా ప్రజలకు సత్వరం సహాయ సహకారాలు అందించాం. ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.2 వేలు ఆర్థిక సహాయం, బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది. మరణించిన వారి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేసింది. 319 రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసి, ముంపుకు గురైన 79,590 మందికి ఆహారంతో కూడిన వసతి కల్పించాం. 747 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశాం. తీవ్రంగా నష్టపోయాం వరదతో చెయ్యేరు నది పొంగి పొర్లడంతో నాలుగు ఎకరాల్లో సాగు చేసిన వరి పూర్తిగా మునిగిపోయింది. వరద నీటి ఉధృతికి పొలంలో మీటరు ఎత్తున ఇసుక పేరుకుపోయింది. పొలం తయారు చేసుకునే పరిస్థితి లేదు. నా పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. నాకు న్యాయం చేసి ఆదుకోవాలి. – రామ్మూర్తి, రైతు, మందపల్లె, వైఎస్సార్ జిల్లా రైతులను ఆదుకోవాలి శనగ, మినుము విత్తాము. వరదతో మొత్తం పంట పనికి రాకుండా పోయింది. ఎకరా వరి పంట పూర్తిగా నాశనమైంది. ఎకరాకు రూ.30 వేలు పెట్టుబడి పెట్టాము. డిసెంబరు నెల వచ్చింది. మళ్లీ పైరు పెట్టుకునే పరిస్థితి లేదు. రైతులను ఆదుకోవాలి. – లోకేశ్వరరెడ్డి, రైతు, పెద్దపుత్త, వైఎస్సార్ జిల్లా దిక్కుతోచడం లేదు నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. అందులో అప్పు చేసి అరటి తోట సాగు చేశా. ఆశలన్నీ పంట పైనే పెట్టుకున్నాం. అయితే భారీ వర్షాలకు పంట మొత్తం దెబ్బతింది. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో దిక్కుతోచడంలేదు. మీరు ఆదుకోకపోతే కుటుంబం మొత్తం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. – చలపతి, రైతు, చిత్తూరు జిల్లా మోకాటి లోతు నీళ్లల్లో గడిపాం అయ్యా.. వారం రోజులుగా మోకాటి లోతు నీళ్లల్లో గడిపాం. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ వరద నీటిలో పూర్తిగా కొట్టుకుపోయాయి. వర్షమంటేనే చాలా భయంగా ఉంది. మీరు ఆదుకోకపోతే మేమంతా రోడ్డున పడాల్సి వస్తుంది. – శ్రీరామ్ నగర్‌కాలనీ మహిళలు, తిరుపతి -
వైఎస్సార్ జిల్లాలో కేంద్ర బృందం పర్యటన
సాక్షి, వైఎస్సార్ జిల్లా: నివర్ తుపాను నష్టాన్ని జిల్లాలో కేంద్రం బృందం శుక్రవారం పరిశీలించింది. తుపాను నష్టంపై కేంద్ర బృందానికి ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి నివేదిక అందించారు. పూర్తి అంచనా వేసి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వ్యవసాయం, ఉద్యానవన, మౌలిక రంగాల్లో భారీ నష్టం వాటిల్లిందని కేంద్ర బృందం దృష్టికి ఆయన తీసుకెళ్లారు. వరి, వేరుశనగ సహా అన్ని పంటలూ దెబ్బతిన్నాయని వివరించారు. బాధితులకు న్యాయం చేయాలని కేంద్రబృందానికి అవినాష్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
నెల్లూరు జిల్లాలో కేంద్ర బృందం పర్యటన
సాక్షి, నెల్లూరు: జిల్లాలో కేంద్ర బృందం పర్యటించింది. నాయుడుపేట, గూడూరు, కావలిలో నివర్ తుపాను ప్రభావంతో జిల్లాలో జరిగిన నష్టాన్ని కేంద్ర బృందం అంచనా వేసింది. గూడూరు వద్ద దెబ్బతిన్న బ్రిడ్జిని పరిశీలించిన బృందానికి.. జేసీ హారేంద్ర ప్రసాద్ పరిస్థితిని వివరించారు. జిల్లాలో జరిగిన పంటల, ఆస్తి నష్ట వివరాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను కలెక్టర్ చక్రధర్ బాబు వివరించారు. జిల్లాలో రోడ్లు, బ్రిడ్జిలు, చెరువులు దెబ్బతిన్నాయని కలెక్టర్ బృందానికి తెలిపారు. నీటమునిగిన వరి పంటల చిత్రాల ప్రదర్శన ద్వారా కేంద్ర బృందానికి వివరించారు. -
ఏపీ: వచ్చే వారమే కేంద్ర బృందం పర్యటన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో వచ్చే వారం కేంద్ర బృందం పర్యటించనుంది. వరదల్లో సంభవించిన నష్టాన్ని కేంద్ర బృందం స్వయంగా పరిశీలించనుంది. భారీ వర్షాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4500 కోట్ల రూపాయల నష్టం జరిగిందని ప్రాథకమిక అంచానాల్లో వెల్లడైంది. తక్షణ సహాయ చర్యలు పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు వెంటనే రూ. 1000 కోట్లు విడుదల చేయాలని అదే విధంగా కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి పంపాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర మంత్రి అమిత్ షాకు లేఖ రాసిన విషయం తెలిసిందే. (చదవండి: ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించే ఆలోచన లేదు..) ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖలో సంయుక్త కార్యదర్శిగా పని చేస్తున్న రాకేశ్ కుమార్ సింగ్ నేతృత్వంలో ఒక బృందం వచ్చే వారమే రాష్ట్రంలో పర్యటించనుంది. వ్యవసాయం, ఆర్థిక, జల వనరులు, విద్యుత్, రోడ్డు రవాణా, జాతీయ రహదారులతో పాటు, గ్రామీణాభివృద్ధి శాఖలకు చెందిన అధికారులు ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో వరద పీడిత ప్రాంతాల్లో పర్యటించే కేంద్ర బృందం, జరిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించనుంది. పర్యటన ముగిసిన తర్వాత వారం రోజుల్లోనే కేంద్ర హోం శాఖకు ఆ బృందం సమగ్ర నివేదిక సమర్పిస్తుంది. (చదవండి: అక్కడి అరాచకాలు చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది) -
వరద ప్రాంతాలను పరిశీలించిన కేంద్ర బృందం
సాక్షి, హైదరాబాద్: భారీగా కురిసిన వర్షాలతో భాగ్యనగరం అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. దీంతో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రబృందం శుక్రవారం హైదరాబాద్‌లో పర్యటించింది. కర్మాన్‌ఘాట్, మీర్‌పేట నాలాలను కేంద్ర బృందం పరిశీలించింది. ఉదయ్‌నగర్, మల్రెడ్డి రంగారెడ్డినగర్, తపోవన్ కాలనీలో 2వేల ఇళ్లు ముంపునకు గురైనట్లు అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. అనంతరం సరూర్‌నగర్ చెరువును బృందం పరిశీలించింది. వరదల కారణంగా దెబ్బ తిన్న ప్రాంతాలను పరిశీలించిన ప్రవీణ్ వశిష్ఠ నేతృత్వంలోని కేంద్రబృందం దిల్ ఖుశ గెస్ట్ హౌస్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయ్యింది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వరద నష్టానికి సంబంధించిన నివేదిక ఇవ్వాలని కిషన్ రెడ్డి కేంద్ర బృందాన్ని కోరారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నష్టానికి సంబంధించి సమగ్ర రిపోర్టు ఇంకా అందలేదని వారు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఎమర్జెన్సీ రిలీఫ్ కింద స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నిధులను వెంటనే రాష్ట్రప్రభుత్వం ఖర్చు పెట్టాలని మంత్రి కిషన్ రెడ్డి కోరారు. బల్కంపేట,అంబర్ పేట, బషీర్‌బాగ్ అమ్మవారి గుళ్లలో జరిగిన ప్రత్యేక పూజ కార్యక్రమాలలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. చదవండి: వరదలు: కేంద్ర మంత్రి 3 నెలల జీతం విరాళం -
ముంపు ప్రాంతాలను పరిశీలించిన కేంద్ర బృందం
హైదరాబాద్ : చాంద్రాయణ గుట్ట ఫలక్‌నూమా వద్ద దెబ్బతిన్న ఆర్.ఓ.బి ని, ముంపుకు గురైన ప్రాంతాన్ని గురువారం కేంద్ర బృందం పరిశీలించింది. వరద బాధిత ప్రజలతో కేంద్ర బృందం సభ్యులు ప్రవీణ్ వశిష్ఠ, అధికారులు ఎం.రఘురామ్, ఎస్ కె కుష్వారా మాట్లాడారు. ఆర్ ఓ బి.కి రెండు వైపుల చేపట్టిన పునరుద్దరణ, నాలా నుండి తొలగిస్తున్న పూడిక తీత పనులను పరిశీలించారు. భారీ వర్షాలు, వరదలతో తమ ఇళ్లలోకి నీళ్లు వచ్చినట్లు ఆ ప్రాంత ప్రజలు కేంద్ర కమిటికి వివరించారు. ఇప్పటికి రోడ్లపై, ఇళ్లలోనూ నీళ్లు అలాగే పేరుకుపోయి ఉన్నట్లు తెలిపారు. 10 రోజుల పాటు నీళ్లలో నానడం పట్ల తమ ఇళ్ల గోడలు దెబ్బతిన్నాయని బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. (హైదరాబాద్‌లో కంపించిన భూమి ) ఈ సందర్భంగా జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, చీఫ్ ఇంజనీర్ జియాఉద్దీన్‌లు మాట్లాడుతూ 40 సంవత్సరాల క్రితం ఫలక్‌నూమా ఆర్.ఓ.బి ని నిర్మించినట్లు తెలిపారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు, చార్మినార్ ప్రాంతాలకు ఆర్.ఓ.బితో రోడ్డు సదుపాయం అనుసంధానం అయినట్లు తెలిపారు. అదేవిధంగా పల్లె చెరువు నుంచి వచ్చే వరద నీటి నాలా 7 మీటర్ల వెడల్పు ఉంటుందని, అది ఆర్.ఓ.బి కింద నుంచి వెళ్తుందని తెలిపారు. పల్లెచెరువు తెగిపోవడం వల్ల వచ్చిన వరదతో ఈ ప్రాంతానికి అపార నష్టం జరిగినట్లు తెలిపారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి ఆర్.ఓ.బి రిటైనింగ్ వాల్వ్ దెబ్బతిన్నదని, అదేవిధంగా అనేక కాలనీలు వరద ముంపుకు గురైనట్లు తెలిపారు. రోడ్లపై 5 మీటర్ల ఎత్తున వరద నీరు నిలిచినట్లు అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. (ప్రమాదకర స్థాయికి చెరువులు ) -
తెలంగాణ: నేడు రాష్ట్రానికి కేంద్ర బృందం
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: భారీ వర్షాలు, వరదలతో వాటిల్లిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. గురు, శుక్రవారాల్లో వరద ప్రభావిత ప్రాం తాల్లో పర్యటించి నష్టం తీవ్రతను తెలుసుకోనుంది. ఈనెల 13 నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో హైదరాబాద్ నగరం తో పాటు పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తి తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులతో మాట్లాడనుంది. వర్షాలు, వరదలతో రాష్ట్రానికి రూ.5 వేల కోట్ల నష్టం జరిగిందని రాష్ట్ర ప్రభు త్వం ఇప్పటికే ప్రాథమిక అంచనా వేసింది. తక్షణ సహాయంగా రూ.1,350 కోట్లు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. -
భారీ వర్షం: రేపు హైదరాబాద్‌కు కేంద్ర బృందం
సాక్షి, హైదరాబాద్: గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు మహా నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరద నీటితో మునిగిన ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సహాయక చర్యలు చేపడుతోంది. డీఆర్ఎఫ్ బృందాలు వర్షాభావ ప్రాంతాల్లో బోట్లను కూడా అందుబాటులో ఉంచారు. మరోవైపు వర్షాలతో నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు టాలీవుడ్ ప్రముఖులు సైతం తమవంతు ఆర్ధిక సాయాన్ని తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందించారు. చదవండి: సిటీలో పలు చోట్ల భారీ వర్షం ఇదిలా ఉండగా ఈ రోజు(బుధవారం) సాయంత్రం కేంద్ర బృందం హైదరాబాద్‌కు రానుంది. రెండు రోజులపాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఇక వర్షాలతో రాష్ట్రంలో వేల కోట్ల నష్టం వాటిల్లిందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందుకు తక్షణ సాయంగా రూ.1350 కోట్లు విడుదల చేయాలని ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం నగరానికి విచ్చేయనుంది. చదవండి: ఆర్థిక సాయం: ఇంటికి పదివేలు.. -
తెలంగాణలో ముగిసిన కేంద్ర బృందం పర్యటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న కరోనా కట్టడి చర్యలను పర్యవేక్షించడంలో భాగంగా కేంద్రం బృందం సోమవారం హైదరాబాద్‌లో పర్యటించింది. నగరంలోని కోవిడ్ ప్రత్యేక ఆస్పత్రులు టిమ్స్, గాంధీ ఆస్పత్రులను కేంద్ర బృందం సందర్శించింది. అదేవిధంగా దోమల్‌గూడలోని కంటైన్మెంట్ ప్రాంతాన్ని పరిశీలించింది. చెస్ట్ ఆస్పత్రిలో కరోనా పేషెంట్ మృతికి సంబంధించిన వివరాలను ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ అడిగి తెలుసుకున్నారు. (లాక్‌డౌన్‌పై చర్చించనున్న తెలంగాణ కేబినెట్) అంతకు ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్య శాఖ ఉన్నతాధికారులతో సుమారు ఐదు గంటల పాటు కేంద్ర బృందం చర్చించింది. తెలంగాణలో కరోనా కట్టడికి తీసుకుంటున్నచర్యలను అధికారులు కేంద్ర బృందానికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలో సర్వైలెన్స్, కంటైన్మెంట్ చర్యలు, ఆసుపత్రుల సన్నద్దత, వైద్య సంరక్షణ పరికరాల సమీకరణ, వైరెస్ నివారణ చర్యలపై అధికారులు కేంద్ర బృందానికి వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో 17081 బెడ్లు ఉన్నాయని మరింత మెరుగైన చికిత్స కోసం 4489 అదనపు సిబ్బందిని రిక్రూట్ చేశామని తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ తెలిపింది. వైద్య మౌలిక సదుపాయలు మెరుగుపరచడం కోసం రూ.475.74 కోట్లు మంజూరు చేయడం జరిగిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరించారు. కేంద్ర బృందం రాష్ట్రంలోని ఆసుపత్రుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసిందని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో కరోనా నియత్రణ చర్యలు, వైద్య పరీక్షల సామర్ధ్యం పెంచడం, కాంటాక్ట్ ట్రేసింగ్, క్లినికల్ మేనేజ్మెంట్పై కేంద్ర బృందం పలు సూచనలు చేసిందని చెప్పారు. కేసులు పెరుగుతున్ననేపథ్యంలో వచ్చే రెండు నెలలో చేపట్టవలసిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సీఎస్ అధికారులను అదేశించారు. అనంతరం కేంద్రం బృందం ఢిల్లీ బయలుదేరింది. మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై కేంద్ర బృందం నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. -
హైదరాబాద్ చేరుకున్న కేంద్ర బృందం
-
కరోనా: జూలై నెలాఖరుకు పరిస్థితి తీవ్రం
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ నిబంధనలకు దాదాపు పూర్తిగా మినహాయింపులిచ్చారని, ఇలాగే కరోనా కేసుల సంఖ్య నమోదవుతుంటే జూలై నెలాఖరుకు పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందని కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. కోవిడ్ వ్యాప్తిని నియంత్రించేందుకు హోమ్ కంటైన్మెంట్, కమ్యూనిటీ సహకారం చాలా కీలకమని చెప్పారు. బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర బృందం సభ్యులు వికాస్ గాడే, రవీందర్‌లతో కలసి జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్‌కుమార్, అదనపు కమిషనర్ బి.సంతోష్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, సీసీపీ దేవేందర్‌రెడ్డి, కోవిడ్ కంట్రోల్ రూం ఓఎస్డీ అనురాధలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యల గురించి చర్చించారు. జీహెచ్ఎంసీ పరిధిలో జోన్లు, సర్కిళ్లు, వార్డుల వారీగా నెలకొన్న పరిస్థితి గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. (మాకు రక్షణ ఏదీ?) అక్కడ 70 శాతం కేసులు ప్రైవేటులోనే.. ఢిల్లీ, ముంబై, చెన్నైలలో ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌లలో కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారని.. ప్రైవేటుగా నిర్వహించిన పరీక్షల్లోనే 70 శాతం పైగా పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయని సంజయ్ జాజు చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో గుర్తించిన పాజిటివ్ కేసుల సంఖ్య, సంబంధిత కేసుల కాంటాక్ట్ ట్రేసింగ్‌కు అనుసరిస్తున్న పద్ధతి, కోవిడ్ లక్షణాలు కనిపించిన వ్యక్తులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు ఉన్న సదుపాయాలు, ఆస్పత్రులు, హోం క్వారంటైన్, హోం ఐసోలేషన్, కంటైన్మెంట్ అంశాల గురించి వివరంగా చర్చించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ వ్యాప్తిని నియంత్రించేందుకు హోం కంటైన్మెంట్ మాత్రమే అందుబాటులో ఉన్న ఏకైక మార్గమన్నారు. ప్రస్తుతం రోజుకు 100 కేసుల కంటే ఎక్కువగా నిర్ధారణ అవుతున్నందున జీహెచ్ఎంసీ పరిధిలోని నాలుగు జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, డిప్యూటీ కమిషనర్లతో వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ సమన్వయాన్ని పెంచాలని సూచించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ సూచనలు, సహకారాన్ని పొందేందుకు సంబంధిత వాట్సాప్ గ్రూప్‌లో ప్రజారోగ్య సంచాలకులతో పాటు తనను కూడా చేర్చాలన్నారు. కోవిడ్ కంట్రోల్ రూం నిర్వహిస్తున్న విధుల గురించి వాకబు చేశారు. (ఇళ్లలోనే బోనాలు) -
నంద్యాలలో కేంద్రబృందం పర్యటన
సాక్షి, కర్నూలు: రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావంపై పరిస్థితులను సమీక్షించేందుకు వచ్చిన కేంద్ర ప్రత్యేక బృందం పర్యటన కొనసాగుతోంది. కర్నూలు జిల్లాలో వారం రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం రోజున నంద్యాలలో పర్యటించి కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పరిశీలించింది. కేంద్ర బృందం సభ్యుల్లో డాక్టర్ మధుమిత దూబే, డాక్టర్ సంజయ్ కుమార్ ఉన్నారు. నంద్యాల పట్టణంలో బయటి పేటలోని అర్బన్ హెల్త్ సెంటర్‌ను పరిశీలించారు. అనంతరం చాపిరేవు గ్రామంలోని కమ్యూనిటీ క్వారంటైన్ సెంటర్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ ఆకస్మిక తనిఖీ జిల్లాలోని ఆత్మకూరు పట్టణంలో రెడ్జోన్లను కలెక్టర్ వీరపాండియన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి లాక్‌డౌన్‌పై అధికారులకు పలు సూచనలు చేశారు. చదవండి: ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు -
వైద్యశాఖతో ముగిసిన కేంద్ర బృందం భేటీ
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ నియంత్రణ చర్యల పరిశీలినపై అంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డితో , కేంద్ర బృందం ఏర్పాటు చేసిన భేటీ ముగిసింది. కేంద్ర బృందం శుక్రవారం ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో వైద్యశాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరోనా మహమ్మారి నియంత్రణకు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర బృందాలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. ఏపీలో పెద్ద ఎత్తున పరీక్షలు చేస్తున్నామని, జిల్లాల వారిగా కరోనా మహమ్మారిపై నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. (దాతృత్వాన్ని పెంపొందించుకోవాలి: జవహర్‌రెడ్డి) క్షేత్రస్థాయిలో హౌస్‌హోల్డ్ సర్వే, జ్లిలాల వారీగా కరోనా పరీక్షలను వైద్యశాఖ అధికారుల కేంద్ర బృందానికి వివరించారు. క్వారంటైన్ కేంద్రాల్లో అందిస్తున్న పౌష్టికాహారం వివరాలు, ఫార్మసీ యాప్ పని తీరును అధికారుల వివరించారు. ఇక కరోనా అనుమానితుల శాంపిల్స్‌ను తొందరగా తెప్పిస్తున్నామని, ఇప్పటి వరకు లక్షా 84 వేల శాంపిల్స్‌ను తీసుకున్నామని అధికారులు వెల్లడించారు. ఇంకా 25, 539 శాంపిల్స ఫలితాలు పెండింగ్‌లో ఉన్నాయని, కరోనా డెత్ రేట్ విషయంలో మిగిలిన రాష్ట్రాల కంటే ఏపీ 2.07 శాతం మెరుగ్గా ఉందని చెప్పారు. ప్రతిరోజు వైద్య అధికారులు, ఆశా వర్కర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామని అధికారలు కేంద్ర బృందానికి వెల్లడించారు. (ఏపీలో 54 కరోనా పాజిటివ్ కేసులు) -
మెహిదీపట్నం రైతుబజార్లో కేంద్ర బృందం
-
మెహిదీపట్నం రైతుబజార్లో కేంద్ర బృందం
సాక్షి, హైదరాబాద్ : కరోనా పాజిటివ్ కేసులు హైదరాబాద్‌లో ఎక్కువగా నమోదు కావడంపై కేంద్ర బృందం నగరంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే కరోనా కట్టడి గురించి అధ్యయనం చేస్తున్న కేంద్ర బృందం హైదరాబాద్‌లో రెండో రోజు పర్యటన కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ డీజీపీ కార్యాలయానికి బృందం వెళ్లింది. వీరికి డీజీపీ మహేందర్‌రెడ్డి స్వాగతం పలికారు. తెలంగాణ వ్యాప్తంగా కరోనా కట్టడికి పోలీసులు, రాష్ట్రం తీసుకుంటున్న చర్యలను వారు పరిశీలించారు. దీనిలో భాగంగా సీనియర్ ఐఏఎస్ అధికారి అరుణ్ బరోకా నేతృత్వంలోని బృందం డీజీపీ, ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యింది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయడంలో పోలీస్ శాఖ తీసుకుంటున్న నిర్ణయాలపై ఆరా తీస్తోంది. (గ్రేటర్ ఫోకస్) నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు తీసుకున్న చర్యలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో పోలీసులు తీసుకుంటున్న చర్యలు, 100 డైల్ కాల్ చేస్తే పోలీస్ శాఖ స్పందించే తీరుపై వివరాలను సేకరించారు. అలాగే రాష్ట సరిహద్దుల్లో పోలీసులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారని ఆరా తీశారు. డీజీపీతో భేటీ అనంతరం కేంద్ర బృందం సభ్యులు మెహిదీపట్నం రైతు బజార్‌ను సందర్శించారు. అక్కడ కిరాణా వ్యాపారులు, రైతులు, మొబైల్ రైతు బజారు గ్రూపులు, కొనుగోలుదారులతో ధరల గురించి మాట్లాడి, నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత నేచర్ క్యూర్ హాస్పటల్లో పర్యటించారు. ఆస్పత్రిలో కల్పిస్తున్న క్వారంటైన్ సదుపాయాలు, సేవలపై ఆరా తీశారు. అలాగే గాంధీ ఆసుపత్రికి చేరుకొని కరోనా పరీక్షలు నిర్వహించే వైరాలజీ ల్యాబ్‌ను తనిఖీ చేయనుంది. పర్యటన ముగింపు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందించి ఢిల్లీ చేరుకొని క్షేత్రస్థాయి పరిస్థితిపై కేంద్రానికి నివేదిక అందజేయనుంది. -
గ్రేటర్ ఫోకస్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో అత్యధికంగా కేసులు నమోదైన హైదరాబాద్‌పైనే కేంద్ర బృందం దృష్టిసారించింది. ఇక్కడెందుకు ఎక్కువ కేసులు నమోదవుతున్నాయన్న దానిపై అధ్యయనం చేయనుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరణ, ఉధృతిని పరి శీలించేందుకు కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి అరుణ్ భరోకా ఆధ్వర్యంలో ప్రజారోగ్య సీనియర్ స్పెషలిస్టు డాక్టర్ చంద్రశేఖర్, ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ హేమలత, నేషనల్ కన్జూమర్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఎస్.ఎస్. ఠాకూర్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్కు చెందిన శేఖర్ చతుర్వేది లతో కూడిన బృందం 3 రోజుల రాష్ట్ర పర్యటనకు శనివారం హైదరాబాద్ చేరుకుంది. ఈ బృందాన్నే ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (ఐఎంసీఆర్)గా పిలుస్తున్నారు. వికారాబాద్, సూర్యాపేట జిల్లాల్లోనూ ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్నా హైదరాబాద్‌లో అంతకన్నా ఎక్కువ కేసులు నమోదవుతుండటంతో కేంద్ర బృందం జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రాంతాల్లోనే పర్యటించాలని నిర్ణయించింది. గచ్చిబౌలి ఆసుపత్రిలో సమీక్ష... గచ్చిబౌలిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1,500 పడకల కరోనా ఆసుపత్రిని కేంద్ర బృందం తొలుత సందర్శించింది. ఆసుపత్రిలోని ఐసీయూ, ఎమర్జెనీ వార్డులను, ఐసోలేషన్ వార్డులను క్షుణ్ణంగా పరిశీలించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం వేర్వేరు ప్రొటోకాల్ కమిటీలను ఏర్పాటు చేశారా లేదా అని బృంద సభ్యులు రాష్ట్ర అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే రోగులకు చికిత్స అందించే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య, పారామెడికల్ సిబ్బందికి ఎటువంటి శిక్షణ ఇచ్చారన్న అంశాన్ని వాకబు చేశారు. టెస్టింగ్ కిట్లు, వ్యక్తిగత పరిరక్షణ పరికరాలు, మాస్కులు, వెంటిలేటర్ సౌకర్యాలపై అధికారులతో సమీక్షించారు. ‘అక్షయపాత్ర’పై ఆసక్తి... గచ్చిబౌలి ఆసుపత్రి సందర్శన అనంతరం కేంద్ర బృందం రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని కోకాపేటలో ఉన్న అక్షయపాత్ర ఫౌండేషన్‌ను పరిశీలించింది. లాక్డౌన్ సమయంలో హైదరాబాద్‌లోని అన్నార్థుల ఆకలి బాధలు తీర్చేందుకు తీసుకుంటున్న చర్యలను బృంద సభ్యులు స్థానిక అధికారులు, ఫౌండేషన్ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్‌లోని 200 కేంద్రాల్లో లక్షన్నర మందికి నిత్యం మధ్యాహ్నం, సాయంత్రం భోజనం అందిస్తున్నట్లు నిర్వాహకులు బృందానికి వివరించారు. అక్షయపాత్రలో పూర్తి పారిశుద్ధ్య వాతావరణంతోపాటు మంచి పోషకాలున్న కూరగాయలతో వంటలను తయారు చేయడంపై కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. ఆ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో సమావేశమయ్యారు. చివరగా నగర పోలీస్ కమిషనరేట్‌లోని కంట్రోల్ రూంను పరిశీలించారు. నగర పోలీస్ కమిషనరేట్ అధికారులు కంటైన్మెంట్ ప్రాంతాల్లోనూ, నగరంలో చేపడుతున్న కరోనా నియంత్రణ చర్యలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పాతబస్తీలో కేంద్ర బృందం సభ్యులతో నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ సీఎస్ బృందంతో భేటీ... రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను కేంద్ర బృందానికి సీఎస్ సోమేశ్ కుమార్ సమగ్రంగా వివరించారు. బీఆర్కే భవన్ చేరుకున్న బృంద సభ్యులకు సీఎస్, ఇతర ఉన్నతాధికారులు వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేసేందుకు కరోనా మేనేజ్మెంట్ కోసం ప్రత్యేక వ్యూహాన్ని తయారు చేశామని వారికి తెలిపారు. రాష్ట్రంలో ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు, కంటైన్మెంట్ జోన్ల నిర్వహణ, క్వారంటైన్ సెంటర్లు, అసుపత్రుల సన్నద్ధత, నిఘా బృందాల ఏర్పాటు, వైద్య పరీక్షలు, హెల్ప్‌లైన్, వైద్య పరికరాల సేకరణ, తెల్ల రేషన్‌కార్డు లబ్దిదారులకు ఉచిత బియ్యం పంపిణీ, వలస కార్మికులకు అన్నపూర్ణ సెంటర్లు, షెల్టర్లు, తదితర అంశాలపై సీఎస్ వివరణాత్మకంగా కేంద్ర బృందానికి తెలియజేశారు. చదవండి: ఎత్తివేయాలా.. వద్దా..! ప్రజల ప్రాణాలు కాపాడటమే ముఖ్యమని, పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య తగ్గేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని వారికి వివరించారు. ఈ సందర్భంగా కరోనా వ్యాప్తి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర బృందం ప్రశంసించింది. ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నేడు, రేపు షెడ్యూల్ ఇలా.. కేంద్ర బృందం ఆదివారం ఉదయం డీజీపీతో సమావేశమై ఆ తర్వాత కంటైన్మెంట్ జోన్లను సందర్శిస్తుంది. నేచర్‌క్యూర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్‌ను పరిశీలించడంతోపాటు మొహిదీపట్నంలోని రైతుబజార్, మంగర్బస్తీలోని బస్తీ దవాఖానా, నైట్ షెల్టర్‌ను పరిశీలించనుంది. సోమవారం జీహెచ్ఎంసీ కంట్రోల్ రూంకు వెళ్లి చివరగా మరోసారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశం కానుంది. అనంతరం గాంధీ ఆసుపత్రికి చేరుకొని కరోనా పరీక్షలు నిర్వహించే వైరాలజీ ల్యాబ్‌ను తనిఖీ చేయనుంది. పర్యటన ముగింపు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందించి ఢిల్లీ చేరుకొని క్షేత్రస్థాయి పరిస్థితిపై కేంద్రానికి నివేదిక అందజేయనుంది. చదవండి: ‘తాలు’ తీస్తున్నారు! -
తెలంగాణకు కేంద్ర బృందం
సాక్షి, న్యూఢిల్లీ/అహ్మదాబాద్/లక్నో: తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలకు 5 బహుళ మంత్రిత్వ శాఖల బృందాలను(ఐఎంసీటీ) పంపుతున్నట్టు కేంద్ర హోం శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘విపత్తు నిర్వహణ చట్టం–2005’ నిబంధనలను అనుసరించి ఈ బృందాలను ఏర్పాటు చేశారు. గుజరాత్‌కు రెండు, తెలంగాణకు ఒకటి, తమిళనాడుకు ఒకటి, మహారాష్ట్రకు ఒకటి చొప్పున ఈ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి, కరోనా వైరస్‌పై పరిస్థితిని అంచనా వేసి, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాయి. దేశంలో అతిపెద్ద కరోనా హాట్‌స్పాట్ జిల్లాల్లో ఈ మహమ్మారి వ్యాప్తి అధికంగా ఉందని కేంద్ర హోంశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధానంగా తెలంగాణలోని హైదరాబాద్, గుజరాత్‌లోని అహ్మదాబాద్, సూరత్, తమిళనాడులోని చెన్నై, మహారాష్ట్రలోని థానే నగరాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని హెచ్చరించింది. ఆయా ప్రాంతాల్లో లాక్డౌన్ నిబంధనలను ప్రజలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని, దీనివల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతోపాటు ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని తేల్చిచెప్పింది. ఈ జిల్లాల్లో కేంద్ర బృందాలు పర్యటించి, లాక్డౌన్ నిబంధనల అమలు, నిత్యావసరాల సరఫరా, కరోనా నిర్ధారణ పరీక్షలు, ఆరోగ్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ కిట్ల లభ్యత, పేదలు, వలస కూలీల క్యాంపుల్లో పరిస్థితులను క్షుణ్నంగా పరిశీలిస్తాయి. అలా అయితే 73,400 కేసులు.. దేశంలో లాక్ డౌన్ విధించకుంటే ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 8 గంటల సమయానికి 73,400 కరోనా పాజిటివ్ కేసులు వచ్చి ఉండేవని కరోనా సాధికార బృందం–1 ఛైర్మన్ డాక్టర్ వీకే పాల్ శుక్రవారం తెలిపారు. కరోనా వ్యాప్తిపై జరిగిన ఒక అధ్యయనం వివరాలను ఆయన తెలిపారు. లాక్డౌన్ విధించడం వల్ల ఏప్రిల్ 24వ తేదీ ఉదయం నాటికి కరోనా పాజిటివ్ కేసులు 23,077కు పరిమితమయ్యాయని చెప్పారు. లాక్డౌన్ విధించని పక్షంలో ఈ కేసులు మే 5వ తేదీ నాటికి 4 లక్షలకు చేరేవని పేర్కొన్నారు. అహ్మదాబాద్‌లో ప్రమాదకరం గుజరాత్‌లోని ప్రధాన నగరం అహ్మదాబాద్‌లో నాలుగు రోజులకోసారి కరోనా పాజిటివ్ కేసులు రెట్టింపు అవుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే మే ఆఖరుకల్లా నగరంలో ఈ కేసులు ఏకంగా 8 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. గుజరాత్‌లోనే అత్యధికంగా అహ్మదాబాద్‌లో 1,638 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. యూపీలో సామూహిక ప్రార్థనలు.. రంజాన్ మాసం సందర్భంగా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి మసీదుల్లో సామూహిక ప్రార్థనలు చేసినందుకు గాను 32 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మా వాళ్లను వెనక్కి తీసుకొస్తాం యోగి ఆదిత్యనాథ్ లాక్డౌన్ వల్ల ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన తమ రాష్ట్రానికి చెందిన కూలీలను వెనక్కి తీసుకొస్తామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం హామీ ఇచ్చారు. ఈ మేరకు తగిన కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లోనే ఉండిపోయి, అక్కడ 14 రోజుల క్వారంటైన్ గడువును పూర్తి చేసుకున్నవారి జాబితాలను రూపొందించాలన్నారు. వారందరినీ దశల వారీగా రాష్ట్రానికి రప్పించాలని పేర్కొన్నారు. ఇప్పటికే యూపీ సరిహద్దుల వరకు చేరుకుని, అక్కడే వేచి చూస్తున్న కూలీలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని, వారిని వారి సొంత జిల్లాలకు చేర్చి, 14 రోజులపాటు క్వారంటైన్లో ఉంచాలన్నారు. -
'మహా'మ్మారి మెడలు వంచేదెలా ?
ముంబై: మహారాష్ట్రలో కరోనా చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఏప్రిల్ 30– మే 15 మధ్య మహారాష్ట్రలో కరోనా వికృతరూపాన్ని చూడడానికి సంసిద్ధంగా ఉండాలని ముంబై, పుణెలలో పర్యటించిన కేంద్ర బృందం ఉద్ధవ్‌ఠాక్రే ప్రభుత్వాన్ని హెచ్చరించింది. నాలుగు రోజుల్లోనే 2 వేలు తాజా కేసులు నమోదయ్యాయి. కొన్నాళ్లుగా ప్రతిరోజూ సుమారుగా 400 కొత్త కేసులు నమోదు కావడం, రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6 వేలకు చేరువలో ఉండడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (ఐఎంసీటీ) ముంబైలో ఏప్రిల్ 30నాటికి 42,604 కేసులు, మే 15నాటికి 6.56 లక్షలకి కేసులు పెరిగిపోతాయని అంచనా వేసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిఠాక్రేకు పరిపాలనా అనుభవం లేకపోవడం, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్‌లో సమన్వయ లోపాలతో కేసులు అత్యధికంగా పెరిగిపోతున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ముంబైలో 4 వేలకు చేరువగా కేసులు పెరుగుతున్నాయి. ఈ సంక్షోభ సమయంలో హోంశాఖ, ఆరోగ్య శాఖ మంత్రులు అనిల్ దేశ్‌ముఖ్, రాజేష్ తోపే ఎన్సీపీకి చెందినవారు కావడం, సీఎంకు వారికి మధ్య సమన్వయ లోపాలు బయటపడుతున్నాయి.∙పకడ్బందీగా అన్ని చర్యలు తీసుకున్నామని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్అంటున్నారు. ఆస్పత్రుల్లో సన్నద్ధత కరువు ముంబైలో దేశంలో మరెక్కడా లేనటువంటి వైద్య సౌకర్యాలు ఉన్నాయి. కానీ అవేవీ కరోనాను ఎదుర్కోవడానికి సన్నద్ధంగా లేవు. నిపుణులైన వైద్యులు ఉన్నప్పటికీ నిరుపేదలకు వైద్యం సరిగా అందడం లేదు. దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో 25 శాతం మహారాష్ట్రలో∙ఉన్నాయి. మృతుల రేటు ఇక్కడ ఎక్కువే. 6–7 శాతం మంది కోవిడ్‌తో మరణిస్తున్నారు. ప్రపంచ సగటు రేటు 3–4 శాతం కంటే ఇది రెట్టింపు కావడం కలవరపెట్టే అంశం. 4 ‘టీ‘లలో విఫలం ట్రాక్, ట్రేస్, టెస్ట్, ట్రీట్.. కోవిడ్‌పై పోరాటానికి ఈ నాలుగు ‘టీ’లను అమలు చేయాలి. ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ పనితీరు వీటన్నింటిలోనూ అసంతృప్తిని రాజేస్తోంది. రాజస్తాన్, కేరళ, ఢిల్లీ కంటే ఇక్కడ టెస్టులు తక్కువగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా జరిగే నిర్ధారణ పరీక్షల్లో కనీసం 17 శాతం కూడా మహారాష్ట్రలో జరగడం లేదు. మహారాష్ట్ర నుంచి మర్కజ్ సమావేశాలకు 58 మంది వెళితే ఇప్పటివరకు 40 మందినే గుర్తించారు. మరో 18 మందిని పట్టుకోవడంలో పోలీసు యంత్రాంగం విఫలమైంది. వారిలో ఎంతమందికి పాజిటివ్ ఉందో, వారి ద్వారా ఇంకెంతగా విస్తరిస్తుందోనన్న ఆందోళన నెలకొంది. లాక్డౌన్ అంతంత మాత్రం ! కరోనా వ్యాప్తిని ఆపాలంటే లాక్‌డౌన్‌కు మించింది లేదు. కేంద్రం లాక్‌డౌన్‌ని మే 3 వరకు పొడిగించినప్పటికీ మహారాష్ట్రలో యథేచ్ఛగా ఉల్లంఘన జరుగుతోంది. బాంద్రా స్టేషన్ దగ్గరకి 3 వేల మంది వలస కార్మికులు రావడం, ఎన్సీపీ నాయకుల ఇళ్ల దగ్గర అనుచరుల హంగామా వంటి చర్యలన్నీ లాక్‌డౌన్‌కు విఘాతం కలిగించాయి. ఇక ఏప్రిల్ 20 తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌కి మినహాయింపులు ఇవ్వడంతో ముంబై, పుణే వంటి నగరాల్లో రోడ్లపై జనాల తాకిడి పెరిగింది. వలస కార్మికుల్ని వారి స్వస్థలాలకు వెళ్లడానికి మహారాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి అమితాబ్ గుప్తా అనుమతినివ్వడం కూడా వివాదాస్పదమైంది. ఇక థానేకు చెందిన ఒక ఇంజనీర్‌ను ఎన్సీపీ మంత్రి జితేంద్ర అవ్హాద్ సమక్షంలోనే పోలీసులు తీవ్రంగా హింసించిన ఘటన కూడా కలకలం రేపింది. ఫేస్బుక్లో అనుచిత పోస్టు పెట్టారని ఆ ఇంజనీర్ని ఎన్సీపీ కార్యకర్తలు బలవంతంగా మంత్రి దగ్గరకు తీసుకువచ్చారు. అక్కడే పోలీసులు అతనిని చితకబాదారు. ఆ పోలీసుల్లో ఒకరికి కోవిడ్ పాజిటివ్ రావడంతో మరో 14 మంది కూడా కోవిడ్ బారిన పడడం ఆందోళన రేపింది. ఎన్సీపీ మంత్రి జితేంద్ర అవ్హాద్‌కు కరోనా పాజిటివ్ వచ్చిందని వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత మంత్రికి నెగిటివ్ అని చెప్పడంతో మహారాష్ట్ర సర్కార్ నిజాలు దాచిపెడుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కోవిడ్‌ను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతోందన్న విమర్శలు ఎక్కువైపోతూ ఉండడంతో శివసేన సంకీర్ణ సర్కార్ ముంబై, పుణెలో లాక్డౌన్ ఆంక్షల్ని మళ్లీ పూర్తి స్థాయిలో విధించింది. వలస కార్మికుల్ని రాష్ట్రం నుంచి వారి సొంత రాష్ట్రాలకు పంపించడానికి ప్రత్యేకంగా రైలు నడపాలని డిమాండ్ చేస్తోంది. మరి రాబోయే రోజుల్లో పొంచి ఉన్న ముప్పుని మహారాష్ట్ర సర్కార్ ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి. సవాళ్లు విసురుతున్న ముంబై మురికివాడలు రెండు కోట్ల జనాభా ఉన్న ముంబైలో జనసాంద్రత చాలా ఎక్కువ. ప్రతీ చదరపు కిలోమీటర్‌కి 20,634 మంది నివసిస్తారు. నగర జనాభాలో 40 శాతం మంది కనీస వసతుల్లేని ధారావి, గోవండీ, వొర్లికొలివాడ వంటి మురికివాడల్లో తలదాచుకుంటున్నారు. ఈ మురికివాడల్లో కోవిడ్–19 విస్తరిస్తూ ఉండడంతో పరిస్థితులు అదుపులోనికి తేవడానికి సైన్యాన్ని రంగంలోకి దింపుతారన్న ప్రచారమూ సాగుతోంది. -
కరోనా వైరస్: హైదరాబాద్‌కు కేంద్ర వైద్యుల బృందం
-
కరోనా వైరస్: హైదరాబాద్‌కు కేంద్ర వైద్యుల బృందం
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ఫీవర్ ఆసుపత్రికి కేంద్ర వైద్యుల బృందం మంగళవారం చేరుకున్నారు. ఆసుపత్రిలోని ఐసోలేటేడ్ వార్డులను, కరోనా వైరస్ అనుమానితుల చికిత్స వార్డులను కేంద్ర వైద్యుల బృందం పరిశీలించనున్నారు. కాగా తెలంగాణలో కరోనా వైరస్ ఉన్నట్టు ఇంకా ఎలాంటి నిర్దారణ కాలేదని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. వదంతులు నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని, రాష్ట్ర ఆరోగ్య శాఖ అన్ని విషయాలు మానిటర్ చేస్తుందన్నారు. రేపు(బుధవారం) కరోనా వైరస్‌పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తామని. కేంద్ర బృందం కూడా ప్రస్తుతం నగగరంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పర్యటిస్తుందని పేర్కొన్నారు.(80కి చేరిన కరోనా మృతుల సంఖ్య) సచివాలయం : కరోనా వైరస్‌పై డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కడా నమోదు కాలేదని, అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు కరోనా వైరస్ వ్యాప్తిపై అవగాహన కల్పించాలని తెలిపారు. చదవండి :కరోనా కలవరం.. చైనా నుంచి రాయచోటి విద్యార్థిని ఈ సందర్భంగా ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండ్ శంకర్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాకు సంబంధించి ఎలాంటికేసుకు నమోదు కాలేదని తెలిపారు. అనుమానితుల నుంచి నమూనాలు సేకరించి పుణెకు పరిక్షలకోసం పంపిస్తే నెగటివ్‌గా తేలిందని అన్నారు. ఈ రోజు మూడు కేంద్రప్రత్యేక వైద్య బృందాలు ఫీవర్ హాస్పిటల్ సందర్శించనున్నారని, చైనా నుంచి వచ్చిన ఇద్దరు అనుమానితులను ఫీవర్ ఆసుపత్రిలో పరిక్షించనున్నారని పేర్కొన్నారు. కరోనా వైరస్ సంబంధించి తగు సూచనలు సలహాలు ఇవ్వనున్నట్లు, ఫీవర్ హాస్పిటల్ లో 40 పడకలతో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. వ్యాధి లక్షణాలు ఉన్నఆసుపత్రి డాక్టర్లను సంప్రదించాలని సూచించారు. -
మిషన్ భగీరథ క్షేత్ర పర్యటనకు కేంద్ర బృందం
సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ ప్రాజెక్టు క్షేత్ర స్థాయి పరిశీలనకు కేంద్ర బృందం బుధవారం రాష్ట్రానికి రానుంది. దేశంలోని తాగునీటి సరఫరా పథకాల పనితీరు, తీరుతెన్నులను పరిశీలించేందుకు కేంద్ర తాగునీటి విభాగంలోని అధికారులు వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర తాగునీటి విభాగం డిప్యూటీ సలహాదారు డి.రాజశేఖర్ నేతృత్వంలో అధికారుల బృందం మూడు రోజుల పాటు వివిధ జిల్లాల్లో పర్యటించనుంది. బుధవారం నాగర్‌కర్నూలు జిల్లాలోని ఎల్లూరు ఇంటెక్ వెల్, వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్‌తో పాటు భగీరథ నీరు సరాఫరా అవుతున్న గ్రామాలను పరిశీలించనుంది. గురువారం సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ కోమటిబండ, సిద్దిపేట గ్రామాల్లో పర్యటించి అక్కడి ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకుంటుంది. శుక్రవారం ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో అధికారులతో కేంద్ర బృందం సమావేశం కానుంది. -
గోవాకు త్వరలో కొత్త సీఎం?
పణజి: ముఖ్యమంత్రి మనోహర్ పారికర్(62) ఆస్పత్రిలో చేరిన నేపథ్యంలో తలెత్తిన పరిస్థితులను సమీక్షించేందుకు అధికార బీజేపీ కేంద్ర పరిశీలక బృందం ఆదివారం మధ్యాహ్నం గోవా చేరుకుంది. సీఎం పారికర్ తీవ్ర అనారోగ్యంతో శనివారం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం కుదుటపడే వరకు సీఎంగా మరొకరిని ఎంపికచేసే అవకాశాలున్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ బృందం రాష్ట్రానికి రావడం గమనార్హం. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు బీఎస్ సంతోష్, రామ్ లాల్, రాష్ట్ర ఇన్చార్జి విజయ్ పురాణిక్‌లతో కూడిన ఈ బృందం ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోని పరిస్థితులపై పార్టీ నేతలతోపాటు సంకీర్ణ భాగస్వామ్య పక్షాలైన గోవా ఫార్వర్డ్ పార్టీ(జీఎఫ్‌పీ), మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీతో పాటు, స్వతం త్ర అభ్యర్థుల మనో గతం తెలుసుకుంటుం దని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వినయ్ టెండూల్కర్ తెలిపారు. 40 మంది సభ్యుల గోవా అసెంబ్లీలో బీజేపీ 14, సంకీర్ణంలోని జీఎఫ్‌పీ, ఎంజీపీలకు ముగ్గురు సభ్యుల బలం ఉండగా ముగ్గురు స్వతంత్రులు మద్దతిస్తున్నారు.కాంగ్రెస్‌కు 16, ఎన్సీపీకి ఒక్క సభ్యుడు ఉన్నారు. రాష్ట్రంలో జరిగే పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్లు కాంగ్రెస్ పేర్కొంది.‘మా ఎమ్మెల్యేలంతా ఐక్యంగా ఉన్నారు. అధికార పార్టీలో అంతర్గత కుమ్ము లాట మొదలైంది. అయితే, అధికారం చేపట్టాలనే ఆదుర్దా మాకు లేదు’ అని గోవా కాంగ్రెస్ కార్యదర్శి చెల్లకుమార్ తెలిపారు.