Chain snatchers
-
హైదరాబాద్‌లో మళ్లీ కాల్పుల కలకలం.. ఎక్కడంటే?
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లో పోలీసుల కాల్పుల ఘటన మరువకముందే నగరంలో మరో చోట కాల్పులు కలకలం రేగింది. గత కొన్ని రోజులుగా వరుసగా దొంగతనాలు చేస్తూ చెలరేగిపోతున్న చైన్స్నాచర్లపై సైదాబాద్ పోలీసులు కాల్పులు జరిపారు. సైదాబాద్‌లో అమీర్ గ్యాంగ్ చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు వారిని పట్టుకునేందుకు వెంబడించగా.. గ్యాంగ్ పోలీసులపై ఎదురుదాడికి దిగారు. దీంతో పోలీసులు తమ వద్ద ఉన్న తుపాకులతో ఫైరింగ్ చేశారు. రెండు రౌండ్లు కాల్పులు జరపగా భయపడిన అమీర్ పోలీసులకు లొంగిపోయాడు.కాగా, సికింద్రాబాద్‌లోని సిటీలైట్ హోటల్ వద్ద యాంటీ స్నాచింగ్ టీమ్ పోలీసులు.. పారిపోతున్న స్నాచర్ల బైక్ టైర్‌ను కాల్చాలని ప్రయత్నించగా.. ఆ తూటా బైక్ వెనుక కూర్చున్న నేరగాడి కాలులోకి దూసుకుపోయింది. గురువారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఉదంతంలో తప్పించుకున్న ఇద్దరు స్నాచర్లను పోలీసులు పట్టుకున్నారు. -
హైదరాబాద్ సీ‘రియల్’ స్నాచర్ల కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని రెండు కమిషనరేట్ల పరిధిలో వరుస స్నాచింగ్స్‌కు పాల్పడిన సీరియల్ స్నాచర్ల వ్యవహారంలో స్పష్టత వస్తోంది. నగరానికి వచ్చిన నలుగురు బవారియా గ్యాంగ్ సభ్యుల్లో ఇద్దరే నేరుగా నేరాలు చేసినట్లు తేలింది. ఏడు గొలుసు దొంగతనాలు, రెండు వాహన చోరీలు వీళ్లే చేయగా.. మిగిలిన ఇద్దరూ పథక రచనలోనే కీలకంగా వ్యవహరించినట్లు, వీరు కేవలం నాంపల్లి రైల్వేస్టేషన్ పరిసరాలకు పరిమితమయ్యారని వెలుగులోకి వచ్చింది. ఇద్దరు సీరియల్ స్నాచర్లలో ఒకడైన మంగళ్‌ను రాచకొండ పోలీసులు ఇటీవల పీటీ వారెంట్‌పై తీసుకువచ్చారు. ఇతడిని కోర్టు అనుమతితో తొమ్మిది రోజుల పాటు విచారణ జరిపారు. ఈ నేపథ్యంలోనే పలు కీలకాంశాలు వెలుగుచూశాయి. రైలులో వచ్చి.. నాంపల్లిలో దిగి... ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలోని ఉన్ మండలానికి చెందినదే ఈ బవారియా గ్యాంగ్. ఆ మండలంలోని పలు హామ్లెట్స్లో నివసించే పలు ముఠాలు దేశ వ్యాప్తంగా చైన్ స్నాచింగ్స్ సహా అనేక నేరాలు చేస్తుంటాయి. పంకజ్ అలియాస్ పింకు నేతృత్వంలో మంగళ్, దీపక్ అలియాస్ సెహ్వాగ్, సేవజ్ అలియాస్ లక్ష్మణ్ సభ్యులుగా ఉన్నారు. బెంగళూరులో వరుస స్నాచింగ్స్ చేసిన తర్వాత రైలులో గత నెల 7న నగరానికి వచ్చారు. ఉదయం 4 గంటల ప్రాంతంలో రైలు దిగిన నలుగురూ కాసేపు స్టేషన్ పరిసరాల్లోనే సంచరించారు. ఆ తర్వాత పింకు, మంగళ్ ఆటో ఎక్కగా మిగిలిన ఇద్దరూ స్టేషన్ బయట ఉన్న కేఫ్ వద్ద ఆగిపోయారు. కేవలం కొన్ని గంటల్లోనే తమ ‘పని’ పూర్తి చేసుకునే ఈ గ్యాంగ్ ఫోన్లు వాడదు. తమ వారి నుంచి ఎక్కడ వేరయ్యారో, మళ్లీ అక్కడికే వచ్చి కలుస్తుంటారు. మాస్టర్ ‘కీ’ వినియోగించి మ్యాస్ట్రో.. నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఆటో మాట్లాడుకున్న పింకు, మంగళ్ నేరుగా చార్మినార్ వద్దకు వెళ్లారు. అక్కడ ఆటోడ్రైవర్‌కు రూ.200 ఇచ్చి పంపేశారు. స్నాచింగ్స్ చేయడానికి అనువైన వాహనాన్ని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి తస్కరించడానికి గాలించారు. మిట్టీకా షేర్ వద్ద కనిపించిన మ్యాస్ట్రో వాహనాన్ని తమ వద్ద ఉన్న మాస్టర్ ‘కీ’ వినియోగించి చోరీ చేశారు. దానిపై నాంపల్లి ప్రాంతానికి చేరుకునేసరికే స్నాచింగ్స్ చేయడానికి అనువైందని కాదని భావించారు. అక్కడి శ్రీనివాస గ్రాండ్ హోటల్ వద్దకు అదే రోజు తెల్లవారుజామున 5.10 గంటలకు చేరుకున్న ఈ ద్వయం.. మ్యాస్ట్రో వాహనాన్ని వదిలి, అక్కడ ఉన్న పల్సర్ బైక్‌ను తస్కరించారు. దానిపైనే తిరుగుతూ ఉప్పల్, నాచారం సహా అయిదు పోలీసుస్టేషన్ల పరిధిలో ఏడు గొలుసు దొంగతనాలు చేసి 21 తులాల బంగారం అపహరించారు. తమ వారిని కలిసి తప్పుదారి పట్టిస్తూ.. రామ్‌గోపాల్‌పేట ప్రాంతంలో పల్సర్ వాహనాన్ని వదిలేసిన పింకు, మంగళ్ అక్కడ నుంచి ఆటోలో నాంపల్లి రైల్వేస్టేషన్ వద్దకు వచ్చారు. కేఫ్ సమీపంలో ఉన్న సెహా్వగ్, లక్ష్మణ్‌లను కలిశారు. అక్కడ నుంచి నలుగురూ పోలీసులను తప్పుదారి పట్టించేలా వివిధ ప్రాంతాల్లో తిరిగి చివరకు వరంగల్ జిల్లా కాజీపేట నుంచి కేరళ ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీ పారిపోయారు. చోరీ సొత్తు మొత్తం లక్ష్మణ్ తీసుకున్నాడని, అక్కడ నుంచి తాము స్వగ్రామాలకు వెళ్లిపోయారని మంగళ్ పోలీసుల వద్ద అంగీకరించాడు. ఇతడిచ్చిన వివరాల ఆధారంగా రాచకొండ పోలీసులు మిగిలిన ముగ్గురు నిందితులను అరెస్టు చేయడంతో పాటు సొత్తు రికవరీ చేయడానికీ సన్నాహాలు చేస్తున్నారు. మరోపక్క మంగళ్‌ను పీటీ వారెంట్‌పై అరెస్టు చేసి, విచారించడానికి మిగిలిన నాలుగు ఠాణాల అధికారులూ ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు ఆయా న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేశారు. -
దొరకని సీరియల్ చైన్ స్నాచర్ల జాడ.. తిరిగొస్తేనే పట్టుకునేది!
సాక్షి, హైదరాబాద్: సీరియల్ చైన్ స్నాచింగ్‌లలో కలకలం రేపిన బవారియా ముఠా జాడ ఇంకా చిక్కలేదు. పక్షం రోజుల క్రితం హైదరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఏడు ప్రాంతాలలో స్నాచింగ్‌లకు పాల్పడిన పింకు గ్యాంగ్.. పోలీసుల కళ్లుగప్పి పరారయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని శామ్లీ జిల్లాలకు చెందిన ముఠా కోసం వెళ్లిన పోలీసు బృందాలు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవటంతో తిరిగి వెనక్కి వచ్చేసినట్టు తెలిసింది. చేతిలోని డబ్బు అయిపోయాక మళ్లీ స్నాచింగ్‌ల కోసం తిరిగి ఈ పింకు గ్యాంగ్ నగరానికి వస్తేనే పట్టుకునే అవకాశం ఉందని ఓ పోలీసు అధికారి అభిప్రాయపడ్డారు. పంథా మార్చిన స్నాచర్లు.. ఆరేడేళ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం బవారియా గ్యాంగ్ స్నాచింగ్ పంథా మారింది. గతంలో వేరే రాష్ట్రంలో బైక్‌ను దొంగిలించి స్నాచింగ్ గూడ్స్ రైలులో బైక్‌ను పార్శిల్ చేసి తీసుకొచ్చేవారు. స్నాచింగ్ చేసేశాక బైక్‌లను ఇక్కడే వదిలేసి పరారయ్యేవాళ్లు. ప్రస్తుతం గూడ్స్ రైళ్లలో తనిఖీలు పెరగడంతో నేరస్తులు పంథా మార్చారని, స్థానికంగానే బైక్‌ను దొంగిలించే స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారని ఓ పోలీసు ఉన్నతాధికారి వివరించారు. అలాగే గతంలో ఒక వృద్దురాలిని వెంట తీసుకొచ్చి దుస్తులు విక్రయించేందుకో లేదా ఆసుపత్రికి వచ్చామనో స్థానిక ఇంటి యజమానికి నకిలీ గుర్తింపు పత్రాలను సమర్పించి అద్దెకు తీసుకునేవాళ్లు. ఆపైన పలు ప్రాంతాలలో రెక్కీ చేసి ఉదయం 6 నుంచి 8 గంటలు లేదా సాయంత్రం 7 నుంచి 9 గంటల మధ్య మ్యాత్రమే స్నాచింగ్‌లకు పాల్పడేవాళ్లు. కానీ, ఇప్పుడు నగరంలో షెల్టర్ తీసుకోకుండా ఒకేసారి పలు నగరాలలో చోరీ చేసి నేరుగా సొంతూళ్లకు పరారవుతున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే ఈ నెల 6న బెంగళూరులో వరుస చోరీలు చేసిన నిందితులు 7న నగరానికి వచి్చ.. ఉప్పల్, నాచారం, సికింద్రాబాద్‌లో వరుసగా ఏడు ఘటనల్లో 24 తులాల బంగారు గొలుసులను స్నాచింగ్ చేశారు. పక్కా ప్లానింగ్.. ఉత్తరప్రదేశ్‌లోని శామ్లీ జిల్లాలోని 10–12 గ్రామస్తులు బవారియా ముఠాగా ఏర్పడ్డాయి బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రో నగరాలలో మాత్రమే ఈ ముఠా స్నాచింగ్‌లకు పాల్పడుతుంటాయి. రూట్లు తెలిసిన 4 నుంచి 6 మంది వరుసగా 6 నుంచి 10 ప్రాంతాల్లో స్నాచింగ్ చేస్తారు. ఒక్కో చోట 3 నుంచి 5 తులాలు బంగారం స్నాచింగ్‌లు చేస్తుంటారు. పోలీసులకు దొరికిపోతామని స్నాచింగ్ కోసం దిగే సమయంలో సెల్ఫోన్లను అసలు వాడరు. పని పూర్తయ్యాక ఎక్కడ కలుసుకోవాలి? ఎలా పరారవ్వాలో ముందుగా ప్లానింగ్ చేసుకున్నాకే రంగంలోకి దిగుతారు. ఈ ముఠాపై హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి చాలా రాష్ట్రాలలో చాలా కేసులున్నాయని.. వీళ్లను పట్టుకునేందుకు వెళ్లితే పోలీసులపైనా కూడా దాడులు చేస్తారని, బయటి వాళ్లు వచ్చారనే సమాచారం సెకన్లలో వీరికి చేరిపోతుందని ఓ అధికారి తెలిపారు. -
చైన్ స్నాచింగ్‌లపై పోలీసులు అలర్ట్
-
హైదరాబాద్ లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
-
హైదరాబాద్: రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
సాక్షి, హైదరాబాద్: నగరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఉప్పల్, నాచారం, ఓయూ, నాచారం పరిధిలో ఆరు ఘటనలు జరిగాయి. దీంతో చైన్ స్నాచర్ల పట్టుకునేందుకు రంగంలోకి దిగారు పోలీసులు. పది బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. వరుస ఘటనల నేపథ్యంలో.. కాస్త అప్రమత్తంగా ఉండాలని మహిళలకు పోలీసులు సూచిస్తున్నారు. మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లిన వృద్ధులనే లక్ష్యంగా చేసుకుని ఈ దొంగతనాలకు పాల్పడ్డారు. మాస్క్‌లేసుకుని బైకులపై వచ్చి గొలుసులు, తాళి బొట్లు లాక్కెల్లారు. ఉప్పల్ నుంచి ఈ పర్వం మొదలైంది. కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే మూడు చోట్ల చైన్ స్నాచింగ్ ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం. ఇది ముఠా పనా? లేదంటే వేర్వేరు వ్యక్తుల ప్రమేయమా? అనేది తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. స్నాచింగ్‌లు ఇలా.. ఉదయం టైంలో.. ఉప్పల్ 6.20 గంటలకు, 6.40కి ఉప్పల్లోనే మరోచోట.. నాచారంలో 7.10కి ఓయూలో 7.40కి చిలకడగూడలో 8 గంటలకు రామ్ గోపాల్పేట పరిధలో 8.20 ఇప్పటికే ఆయా ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల గస్తీ నిర్వహిస్తూ.. అనుమానాదస్పదంగా కనిపిస్తున్న వాళ్లను ప్రశ్నిస్తున్నారు. జంట నగరాల్లో వరుస ఘటనలు చోటు చేసుకోవడంపై రాచకొండ, హైదరాబాద్ పోలీసులు సీరియస్‌గా ఉన్నారు. -
సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు.. ఇంటి బయట మహిళ.. బైక్‌పై వచ్చి ఒక్కసారిగా..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో చైన్ స్నాచర్స్ మరోసారి రెచ్చిపోయారు. ఇంటి బయట పనిచేస్తున్న ఓ మహిళ మెడలో నుంచి 5 తులాల చైన్‌ను బైక్‌పై వచ్చి లాక్కెళ్లారు. హైదరాబాద్ శివారులో నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు హైమావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దుండగులు కోసం గాలింపు చేపట్టారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. చదవండి: సినిమాను తలపించిన ఎటాక్ సీన్.. స్విగ్గీ డెలివరీ బాయ్‌పై వెంటపడి మరీ.. -
చైన్ స్నాచర్ల కోసం జొమాటో డెలివరీ బాయ్‌గా మారిన ముంబై పోలీసులు.. 3 రోజులపాటు
ముంబై: పోలీసులకు చిక్కకుండా దొంగలు వివిధ వేషాల్లో తిరుగుతుండటం అందరికీ తెలిసిందే. అప్పుడప్పుడు దొంగలను పట్టుకునేందుకు పోలీసులు కూడా సివిల్ డ్రెస్సుల్లో కనిపిస్తుంటారు. కానీ తాజాగా పోలీసులు దొంగలను పట్టుకునేందుకు జొమాటో డెలివరీ బాయ్‌లాగా మారారు. ఈ ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. ఇద్దరు చైన్ స్నాచర్లు అనేక దోపీడీలు చేసి పోలీసులకు దొరక్కుండా చుక్కలు చూపిస్తున్నారు. వీరిపై అనేక కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు ఓ కొత్త ప్లాన్ వేశారు. ముంబై పోలీసులు జొమాటో డెలివరీ బాయ్‌లుగా వేషాధారణ మార్చుకొని చాకచక్యంగా వారిని పట్టుకొని కటకటాల్లోకి నెట్టారు. ఈ కేసుకు సంబంధించిన వివారాల ముంబై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సోమ్‌నాథ్ ఘర్గే వివరించారు.. ఇద్దరు చైన్ స్నాచర్లపై కస్తూర్బా మార్గ్ పోలీస్ స్టేషన్లో 3, బంగూర్ నగర్ పీఎస్‌లో ఓ కేసు నమోదయ్యాయి. వీరిని గాలించేందుకు పోలీసుల బృందం రంగంలోకి దిగింది. దాదాపు 300 సిసిటీవీ ఫుటేజీలను పరిశీలించారు. విచారణలో దొంగతనం చేసే సమయంలో ఉపయోగించిన బైక్‌ను రైల్వే స్టేషన్ వద్ద పార్క్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు తమ బైక్‌ను తీసుకెళ్లేందుకు వస్తారని పోలీసులు ఖచ్చితంగా భావించారు. చదవండి: ఆశ్చర్యం..‘ఇలాంటివి మానవుల్లో కామనేగానీ.. పులుల్లో చాలా అరుదు’ దీంతో కస్తూర్బా పోలీసుల బృందమంతా జొమాటో డెలివరీ బాయ్‌ల దుస్తులను ధరించి స్టేషన్ వద్ద సుమారు 3 రోజులు వేచి ఉన్నారు. అనంతరం నిందితుల్లో ఒకరు తమ బైక్‌ను తీసుకోవడానికి వచ్చినప్పుడు అతన్ని రెడ్ హ్యండెడ్‌గా పట్టుకొని పీఎస్‌కు తరలించారు. అతడిచ్చిన సమాచారం మేరకు మిగితా వారిని నిందితులను పట్టుకున్నారు. నిందితుల నుంచి రెండు బైక్‌లు, దొంగిలించిన గొలుసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిని ఫిరోజ్ నాసిర్ షేక్, జాఫర్ యూసుఫ్ జాఫ్రీగా గుర్తించారు. ఇద్దరూ విఠల్వాడి, అంబివిలి నివాసితులుగా తెలిపారు. ఇద్దరు 20కి పైగా దోపిడీ కేసుల్లో నిందితులుగా ఉన్నారని తెలిపారు. -
ఇద్దరు చైన్ స్నాచర్లను అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు
-
చైన్ స్నాచర్‌ను చితక్కొట్టిన స్తానికులు
-
మేదక్ జిల్లాలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
-
బంధువులే ముఠాగా ఏర్పడి..
నెల్లూరు(క్రైమ్): వారు ముగ్గురూ బంధువులు. ముఠాగా ఏర్పడ్డారు. బైక్‌లను దొంగలించి వాటిపై సంచరిస్తూ మహిళ మెడల్లోని బంగారు గొలుసులను తెంపుకెళ్లసాగారు. నెల్లూరు సీసీఎస్, పొదలకూరు పోలీసులు వారి కదలికలపై నిఘా ఉంచి అరెస్ట్ చేశారు. శుక్రవారం నగరంలోని సీసీఎస్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీసీఎస్ ఇన్స్పెక్టర్ షేక్ బాజీజాన్ సైదా వివరాలను వెల్లడించారు. దగదర్తి మండలం చాముదల గ్రామానికి చెందిన కె.తిరుపతి, ఆత్మకూరుకు చెందిన డి.తిరుపతి అలియాస్ పులి, ఎన్.కిరణ్‌లు బంధువులు. వారు చెడు వ్యవసనాలకు బానిసలై దొంగలుగా మారారు. పలుమార్లు పోలీసులకు చిక్కి జైలు పాలై బెయిల్‌పై బయటకు వచ్చారు. తిరిగి దొంగతనాలు చేయడం ప్రారంభించారు. పలు ప్రాంతాల్లో.. నిందితులు కొంతకాలం క్రితం బుచ్చిరెడ్డిపాళెంలో ఓ మోటార్‌బైక్‌ను దొంగలించారు. దానిపై పొదలకూరు, రాపూరు, కండలేరు, కలువాయి ప్రాంతాల్లో తిరుగుతూ మహిళల మెడల్లోని బంగారు గొలుసులను తెంపుకెళ్లసాగారు. వీరి కదలికలపై సీసీఎస్, పొదలకూరు పోలీసులు నిఘా ఉంచారు. శుక్రవారం ఉదయం నిందితులు పొదలకూరు సంగం క్రాస్‌రోడ్డు వద్ద ఉన్నారనే సమాచారం పోలీసులకు అందింది. సీసీఎస్ ఇన్స్పెక్టర్ షేక్ బాజీజాన్ సైదా, పొదలకూరు సీఐ ఎండీ ఫిరోజ్, ఎస్సై రవినాయక్‌లు తమ సిబ్బందితో కలిసి నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించి విచారించగా నేరాలు చేసినట్లు అంగీకరించారు. దీంతో వారి వద్ద నుంచి రూ.3.25 లక్షలు విలువచేసే ఒక మోటార్‌బైక్, 140 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. సిబ్బందికి అభినందన నిందితులను అరెస్ట్ చేసి చోరీ సొత్తు రాబట్టేందుకు కృషిచేసిన సీసీఎస్ ఇన్స్పెక్టర్ బాజీజాన్ సైదా, పొదలకూరు సీఐ ఫిరోజ్, ఎస్సై రవినాయక్, సీసీఎస్ హెడ్‌కానిస్టేబుల్స్ ఆర్.సురేష్‌కుమార్, కె.వెంకటేశ్వర్లు, పి.సుబ్రహ్మణ్యం, కానిస్టేబుల్స్ జి.రాజేష్, జి.ప్రభాకర్, యు.సురేష్, సీహెచ్ శ్రీనివాసులను సీసీఎస్ డీఎస్పీ బి.నరసప్ప అభినందించి రివార్డులు ప్రకటించారు. నిందితులపై పలు కేసులు ♦ కె.తిరుపతిపై జలదంకి పోలీసు స్టేషన్లో బంగారు దొంగతనం కేసు ఉంది. ♦ డి.తిరుపతి అలియాస్ పులిపై పొదలకూరు పోలీసు స్టేషన్లో మర్డర్ ఫర్ గెయిన్ కేసు ఉంది. ♦ ఎన్.కిరణ్‌పై ఆత్మకూరు పోలీసు స్టేషన్లో రేప్, మర్డర్ కేసు ఉంది. మరో నిందితుడు పోలీసులకు చిక్కిన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు వారి బంధువైన దగదర్తి మండలం చవటపుత్తేడు గ్రామానికి చెందిన కె.వినోద్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.75 వేలు విలువచేసే రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. -
బెంగళూరు మహిళలే వారి టార్గెట్
బనశంకరి : విమానాల్లో బెంగళూరు నగరానికి చేరుకుని చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముంబైకి చెందిన మహ్మద్‌అలియాస్ మోహమ్మద్, సయ్యద్ కతరార్‌హుసేన్ అలియాస్ సైయ్యద్ అనే చైన్స్నాచర్లను ఈశాన్య విభాగం పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.15 లక్షల చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఈశాన్య విభాగం డీసీపీ కలాకృష్ణస్వామి మీడియాకు వివరాలు వెల్లడించారు. నిందితులు ముంబై నుంచి బెంగళూరు నగరానికి విమానాల్లో చేరుకుని అక్కడ నుంచి రైలులో కంటోన్మెంట్ రైల్వేస్టేషన్‌కు చేరుకునేవారు. అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న డ్యూక్ బైక్‌ల్లో సంచరిస్తూ ఒంటరిగా సంచరిస్తున్న మహిళలను టార్గెట్ చేసుకుని చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడేవారు. తర్వాత చోరీ సొత్తును రైలు లేదా బస్సులో ముంబైకి తరలించి విక్రయించేవారు. ఇప్పటి వరకు ఐదు సార్లు నగరానికి చేరుకున్న చైన్‌స్నాచర్లు విద్యారణ్యపుర, సదాశివనగర, ఆర్టీ.నగర, బాణసవాడి, అన్నపూర్ణేశ్వరినగర తదితర 20 కి పైగా ప్రాంతాల్లో చైన్‌స్నాచింగ్‌లకు తెగబడ్డారు. గత నవంబరులో విద్యారణ్యపుర సింగాపుర ఎక్స్‌ప్రెస్‌లేఔట్‌లో విజయలక్ష్మీ అనే మహిళ ఇంటి ముందు నడుచుకుని వెళుతుండగా ఆమె మెడలో ఉన్న 30 గ్రాముల బరువు గల బంగారుచైన్ లాక్కెళ్లారు. కంటోన్మెంట్ రైల్వేస్టేషన్లో అనుమానాస్పదంగాపార్కింగ్ చేసిన డ్యూక్ బైక్‌పై దృష్టిసారించి అక్కడి సీసీకెమెరాల ఫుటేజీల్లో నిక్షిప్తమైన దృశ్యాలను పరిశీలించిన అనంతరం తీవ్రంగా గాలించి నిందితులను అరెస్ట్ చేశామని డీసీపీ తెలిపారు. బెంగళూరు నగర మహిళలు అధిక బరువు కలిగిన బంగారుచైన్లు ధరిస్తారని, ఒక చైన్ దొంగలిస్తే రూ.2 లక్షల వరకు లభిస్తుందనే అంచనాతో నిందితులు బెంగళూరును టార్గెట్ చేసుకున్నట్లు విచారణలో తేలిందని డీసీపీ తెలిపారు. గ్యాంగ్‌లో మరికొందరు ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. -
చెలరేగిపోయిన చైన్‌స్నాచర్లు
చైన్‌స్నాచర్లు మరోసారి చెలరేగిపోయారు. పట్టపగలే ముగ్గురు మహిళల మెడల్లోని బంగారు ఆభరణాలు తెంపుకుని ఉడాయించారు. అగనంపూడి సమీప రాజీవ్‌నగర్ సమీపంలోనూ, ఎంపీవీ కాలనీలో రెండు చోట్ల జరిగిన ఈ ఘటనలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి విశాఖపట్నం, అగనంపూడి (గాజువాక): స్నేహితురాలితో కలిసి మార్కెట్‌కు వెళ్తున్న మహిళ మెడలో నుంచి ఇద్దరు దుండగులు బంగారు గొలుసు తెంపుకొని పరారైన సంఘటన దువ్వాడ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దువ్వాడ క్రైం ఎస్ఐ సంతోష్ తెలిపిన వివరాల ప్రకారం... రాజీవ్‌నగర్ సమీపంలోని శివసాయినగర్కు చెందిన దేవినేని పద్మ ఆమె స్నేహితురాలితో కలిసి గురువారం ఉదయం 11.30 గంటల సమయంలో రాజీవ్‌నగర్ మార్కెట్‌కు నడిచి వెళ్తున్నారు. మార్కెట్‌కు సమీపంలో గుర్తు తెలియని ఇద్దరు దుండగులు గ్రే కలర్ స్కూటీపై ఆమె పక్క నుంచి వాహనాన్ని పోనిచ్చి పద్మ మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసు తెంపుకొని పరారయ్యాయి. నిందితులను వెంబడించినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో బాధితురాలు దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి తెలిపిన వివరాలు ప్రకారం రాజీవ్‌నగర్ కూడలిలోని సీసీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులను నిందితుల చిత్రాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎంవీపీ కాలనీలో... పెదవాల్తేరు(విశాఖ తూర్పు): పట్టపగలు రోడ్డుపై చైన్‌స్నాచర్లు చెలరేగిపోయారు. ఇద్దరు మహిళల మెడలులో నుంచి బంగారు ఆభరణాలు చోరీ చేసి పారిపోయారు. ఈ రెండు దొంగతనాలకు పాల్పడిందని ఒకరేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎంవీపీ కాలనీ సెక్టార్ – 6 రోడ్డుపై నుంచి వస్తున్న ఎస్.రమావేది మెడలోని నాలుగు తులాల బంగారు చైనుని బైకుపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు తెంపుకుని పరారయ్యారు. సెక్టార్ – 6 నుంచి మహాత్మాగాంధీ ఆస్పత్రికి వచ్చే రోడ్డులో గురువారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఎస్.రమాదేవి (64) నడుచుకుని వస్తుండగా ఈ చైన్‌స్నాచింగ్ జరిగింది. నాలుగు తులాల బరువుగల చైన్ తెంపుకుని దుండగులు ఉడాయించారు. అలాగే ఎంవీపీ కాలనీ సెక్టార్ – 8 సత్యసాయి బాబా పాఠశాల రోడ్డులో టి.సావిత్రి (51) నడుచుకుంటూ వెళ్తుండగా బైకుపై వచ్చిన ఇద్దరు దొంగలు 7 తులాల బంగారు చైను, నల్లపూసలు దండ తెంపుకుని పరారయ్యారు. ఈ రోడ్డులో నడిచి వెళ్తుండగా వెనుక నుంచి బైకుపై వచ్చిన దొంగలు మెడలోని ఆభరణాలు చోరీ చేసి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎంవీపీ స్టేషన్ క్రైం ఎస్ఐ సూరిబాబు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తుపాకులకు ‘సుపరిచితులే’!
సాక్షి,సిటీబ్యూరో: రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో రెండు రోజుల్లో 11 నేరాలు చేసి హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కిన సీరియల్ స్నాచర్లు మోను వాల్మికి, ఛోకపై అక్రమ ఆయుధాల కేసులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారిలో ఒకరు పోలీసు కాల్పుల నుంచి తప్పించుకోగా, మరొకరు మూడు నెలల క్రితం తూటా తగిలి గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో వీరిని పట్టుకోవడానికి వెళ్లిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించాల్సి వచ్చింది. మరోపక్క గత నెలలో ‘సీరియల్ స్నాచింగ్స్’కు పథకం వేసిన ఈ గ్యాంగ్ మొత్తం ఆరుగురిని రంగంలోకి దింపినట్లు తేలింది. నొయిడా డెకాయ్ ఆపరేషన్‌లో ‘మోను’.. సీరియల్ స్నాచింగ్స్ కేసులో టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కిన ముగ్గురిలో ఒకడు నగరానికి చెందిన సూత్రధారి చింతమల్ల ప్రణీత్ చౌదరి కాగా, మిగిలిన ఇద్దరూ ఉత్తరప్రదేశ్ వారే. వీరిలో ఒకడైన మోను వాల్మికీకి ‘రాహుల్, గుడువా’ అనే మారుపేర్లూ ఉన్నాయి. నొయిడాలోని శ్రోక ప్రాంతంలో నివసించే ఇతగాడు పందుల పెంపకం చేస్తుండేవాడు. ఆపై నేరబాట పట్టి నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) పరిధిలోకి వచ్చే ఢిల్లీ, నొయిడా, ఘజియాబాద్ తదితర చోట్ల 150 స్నాచింగ్స్, దోపిడీలకు పాల్పడ్డాడు. స్నాచర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి నొయిడా పోలీసులు 2016లో డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించారు. ఆ ఏడాది జూలై 11న అక్కడి న్యూ స్పైస్ మాల్ ప్రాంతంలో కానిస్టేబుల్ అనురాధను డెకాయ్ పార్టీగా రంగంలోకి దింపారు. సాధారణ మహిళలా ఉన్న అనురాధ తన మెడలో బంగారం గొలుసుతో అక్కడ నిలబడ్డారు. ఈమెను గమనించిన వాల్మీకి తన అనుచరుడు రాజేంద్ర గౌతమ్‌తో కలిసి బైక్‌పై వచ్చి ఆమె మెడలోని చైన్ లాక్కుపోవడానికి ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించడంతో ఘర్షణకు దిగి తమ వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు ప్రారంభించారు. వెంటనే అక్కడకు చేరుకున్న సమీపంలోని పోలీసు బృందం గౌతమ్ కాళ్లపై కాల్చడంతో అతడితో పాటు వాల్మీకి సైతం లొంగిపోయాడు. మూడు నెలల క్రితం ఛోకపై.. హైదరాబాద్‌లో స్నాచింగ్స్‌కు వచ్చేప్పుడు కత్తితో తిరిగిన ఛోక స్వస్థలం యూపీలోని బులంద్ షహర్. దాదాపు 40కి పైగా స్నాచింగ్ కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇతడు మూడు నెలల క్రితం కాల్పులకు తెగబడ్డాడు. వృత్తిరీత్యా ఆటోడ్రైవర్ అయిన ఇతడు మరో వ్యక్తితో కలిసి వరుస స్నాచింగ్స్ చేస్తుండడంతో బులంద్ షహర్ పోలీసులు అప్రతమత్తమయ్యారు. ఓ ప్రాంతంలో కాపుకాసి పట్టుకోవడానికి ప్రయత్నించగా తుపాకీతో పోలీసులపై కాల్పులు ప్రారంభించాడు. పోలీసులు ఎదురు కాల్పులు జరపగా కుడి కాలుల్లోంచి తూటా దూసుకెళ్లింది. దీనికి సంబంధించి పోలీసులు తమపై హత్యాయత్నానికి పాల్పడినట్లు కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఈ గాయం మానకుండానే బెయిల్‌పై వచ్చి హైదరాబాద్‌లో పంజా విసరడానికి వాల్మీకితో వచ్చాడు. మరో నలుగురితో కలిసి రంగంలోకి.. ప్రణీత్ పథకం మేరకు హైదరాబాద్‌ను టార్గెట్ చేసుకున్న ఈ గ్యాంగ్ వరుసపెట్టి స్నాచింగ్స్ చేయాలని పథకం వేసింది. గత నెల 24న మరో నలుగురితో కలిసి వాల్మీకి, ఛోక హైదరాబాద్ చేరుకున్నారు. మిగిలిన వారు కాచిగూడలోని లాడ్జిలోనే ఉండగా.. ప్రణీత్, వాల్మీకి రెక్కీ చేసి వచ్చారు. తొలుత వాల్మీకి... ఛోకతో కలిసి వరుస స్నాచింగ్స్ చేసి నగరం వదిలి పారిపోవాలని పథకం వేశాడు. ఇది జరిగిన ఒకటిరెండు రోజుల తర్వాత మరో ఇద్దరు, ఆపై ఇంకో ఇద్దరు ఇలా వరుస స్నాచింగ్స్ చేయాలని వాల్మీకి సూచించాడు. దీని కోసమే సెకండ్ హ్యాండ్లో పల్సర్ వాహనం ఖరీదు చేశారు. అయితే, డిసెంబర్ 26, 27 తేదీల్లో వాల్మీకి, ఛోక చేసిన వరుస స్నాచింగ్స్ నగరంలో అలజడి సృష్టించాయి. దీంతో పోలీసులు అప్రమత్తం కావడం, మీడియాలో సీసీ కెమెరాల ఫుటేజ్ ప్రచారం చేయడంతో మిగిలిన వారు సిటీ నుంచి పారిపోయారు. విషయం తెలిసిన పోలీసులు ప్రస్తుతం వారి కోసం గాలిస్తున్నారు. -
ఒకేరోజు నాలుగు చోట్ల చైన్‌స్నాచింగ్‌లు
-
వైరల్ : బరితెగించారు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో చైన్‌స్నాచర్స్ రెచ్చిపోతున్నారు. ఒంటరిగా వెళ్తున్న మహిళలను బెదిరించి బంగారు ఆభరణాలను అపహరిస్తున్నారు. ఢిల్లీలోని దయాల్‌పుర్ ప్రాంతంలో ఓ బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు.. రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళ నుంచి బంగారు గొలుసును కాజేశారు. తన కొడుకుతో కలిసి రోడ్డుపై వెళ్తున్న ఆమెను బైక్ మీద వచ్చిన చైన్ స్నాచర్స్ ఆమె మెడలో ఉన్న గొలుసును లాక్కునే ప్రయత్నం చేశారు. మెడలో నుంచి గొలుసు రాకపోవడంతో బైక్ నుంచి కిందికి దిగి కత్తితో బెదిరించి లాక్కెళ్లారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డయింది. ఆ ఇద్దర్నీ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి బంగారు నగలను కూడా స్వాధీనం చేసుకున్నారు. #WATCH Two bike-borne men rob a woman at knifepoint in Delhi's Dayalpur (Source CCTV footage). Both the culprits were apprehended by the police and the robbed gold chain was recovered from their possession. (26/10/18) pic.twitter.com/4mr5VIdAAy — ANI (@ANI) November 3, 2018 -
స్నాచింగ్‌ల కలకలం
ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ)/విశాఖ క్రైం: నగరంలో చైన్‌స్నాచర్లు హడలెత్తించారు. గురువారం ఒక్క రోజే ఓ గంట వ్యవధిలోనే నాలుగు చోట్ల మహిళల మెడలోని బంగారు ఆభరణాలు తెంపుకుని ఉడాయించారు. బుచ్చిరాజుపాలెం సుసర్లకాలనీ, శాంతినగర్, మర్రిపాలెం ఉడా లే అవుట్, బాలయ్య శాస్త్రి లే అవుట్లో నలుగురు మహిళల మెడలోని 16తులాల బరువు గల చైన్లు లాక్కుని పారిపోయారు. ఒక బైక్‌పై ఇద్దరు యువకులు వచ్చి తెంపుకు పోయారని బాధితులంతా చెబుతుండడంతో... ఈ చోరీలన్నీ ఆ ఇద్దరే చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల చిత్రాలు విడుదల చేశారు. ప్రస్తుతం వారి కోసం గాలిస్తున్నారు. చైన్స్నాచర్లకు భయపడి బయటకు రావాలంటేనే మహిళలు బెంబేలెత్తిపోతున్నారు. చైన్‌స్నాచింగ్‌లు జరిగా యని తెలుసుకున్న ఎయిర్పోర్ట్ నేర విభాగ పోలీసులు ఘట నా స్థలాలకు చేరుకుని వివరాలు సేకరించారు. సీఐ సాయి, ఎస్ఐలు కుమార్, మన్మథరావు, ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ సీఐ మళ్ల శేషు, ఎస్ఐలు నర్శింగరావు, సురేష్, నాగేశ్వరరావు, జీడీ బాబు వివరాలు సేకరించారు. మహిళలు అప్రమత్తంగా ఉండాలి నగరంలోని పలు ప్రాంతాల్లో మహిళల మెడలోని బంగారు వస్తువులను దుండగులు తెంపుకుపోయిన నేపథ్యంలో మహిళలంతా అప్రమత్తంగా ఉండాలని నగర ఇన్చార్జి పోలీస్ కమిషనర్ దాడి నాగేంద్రకుమార గురువారం ఒక ప్రకటనలో సూచించారు. ద్విచక్ర వాహనంపై నీలం రంగు, నలుపు రంగు షర్టులు, జీన్ ఫ్యాంట్లు వేసుకుని, తలకు హెల్మెట్లు ధరించిన ఇద్దరు వ్యక్తులు వివిధ ప్రాంతాల్లో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడినట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు. అనుమానితులు కనిపిస్తే డయల్ 100, 1090 నంబర్‌కు, 9490624787, 0891–2565454, 0891 2704465 నంబర్లకు సమాచారమివ్వాలని కోరారు. వివరాలు తెలిపిన వారికి తగిన పారితోషకం ఇస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సమయం గురువారం ఉదయం 7:45 గంటలు ఎన్ఏడీ కూడలి బుచ్చిరాజుపాలెం సుసర్ల కాలనీ 80 అడుగుల రహదారి ప్రశాంతంగా ఉంది. అదే రహదారిలోని మైత్రి అపార్టుమెంట్లో నివాసముంటున్న మంగయ్యమ్మ(60) పాల ప్యాకెట్ల కోసం రోడ్డుపైకి వచ్చింది. సమీపంలోని దుకాణంలో ప్యాకెట్లు తీసుకుని తిరిగి ఇంటిముఖం పట్టిన ఆమెను బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు అనుసరించారు. ఆమె వారిని చూసేలోపే ఒక్కసారిగా మెడలోని పుస్తెల తాడు తెంపుకుని ఉడాయించారు. వెంటనే తేరుకున్న బాధితురాలు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. చోరీకి గురైన తాడు విలువ రెండు తులాలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొంది సమయం గురువారం ఉదయం 8:10 గంటలు ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్‌లో నివాసముంటున్న నిర్మలా కుమారి నారాయణ పాఠశాలలో తెలుగు టీచర్‌గా పని చేస్తోంది. ఎప్పటిలాగే పాఠశాలకు గురువారం ఉదయం ఆమె బయలుదేరింది. మరికొద్ది సేపటిలో స్కూల్‌కు చేరుకుంటుందనగా... ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెనుక నుంచి వచ్చి ఆమె మెడలోని రెండు తులాల తాడు తెంపుకుని పారిపోయారు. ఆ సమయంలో దొంగా... దొంగా... అని అరిచినా ఎవరూ పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇద్దరు యువకులు బైక్ ఉన్నారని తెలిపింది. జరిగిన ఘటనపై నిర్మలా కుమారి పోలీసులను ఆశ్రయించింది. సమయం గురువారం ఉదయం 8:15 గంటలు మర్రపాలెం ఉడా లే అవుట్లో నివాసముంటున్న హేమలత తన పిల్లలను స్కూల్లో దించేందుకు స్కూటీపై బయలుదేరింది. ఇంటి నుంచి ఉడా లే అవుట్ పార్క్ సమీపానికి వచ్చేసరికి... వెనుక నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలోని పుస్తెలతాడు, నల్లపూసలు దండ, చైన్ తెంచకుని పారిపోయారు. ఈ హఠాత్ పరిణామంతో హేమ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. రోడ్డుపైకి రాగానే ఇద్దరు వ్యక్తులు తనను కొంతదూరం అనుసరించారని, ఇలా చైన్‌స్నాచింగ్‌కు పాల్పడతారని తాను ఊహించలేదని ఆమె వాపోయింది. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమయం గురువారం ఉదయం 8:30 గంటలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలయ్య శాస్త్రి లే అవుట్‌లోని రాధాకృష్ణ లే అవుట్ ప్రాంతంలో నివాసం ఉంటున్న వై.వెంకటలక్ష్మి(58) గురువారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి పాలు కోసం దుకాణానికి బయలుదేరింది. ఆమె రోడ్డుపైకి వచ్చిన కొద్ది సేపటికే ఇద్దరు యువకులు బైక్‌పై వచ్చి మెడలోని పుస్తెలతాడుతోపాటు మరో చైన్ తెంపుకుపోయారు. దీంతో లబోదిబోమంటూ వెంకటలక్ష్మి నాలుగో పట్టణ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు క్రైం ఎస్ఐ వెంకటరావు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చైన్ స్నాచర్లున్నారు జాగ్రత్త
స్వప్న వారం కిందటే ఖరీదైన నెక్లెస్ కొనుక్కుంది. దానిని ధరించి ముస్తాబై స్నేహితురాలికి చూపిద్దామని స్కూటీపై బయల్దేరింది. కొంతదూరం వెళ్లగానే ఇద్దరు యువకులు బైక్‌పై వేగంగా వచ్చి గొలుసును లాక్కెళ్లారు. ఈ సంఘటనతో స్వప్న తీవ్ర షాక్‌కు గురైంది. పగలూ రాత్రి అదే చేదు ఘటన గుర్తుకొచ్చేది. తేరుకోవడానికి నెలరోజులు పైగా పట్టింది. నగరంలో పోలీసులు ఎంత గస్తీ తిరుగుతున్నా చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. బనశంకరి: సిలికాన్ సిటీలో రోజురోజుకు చైన్‌స్నాచర్లు పెట్రేగిపోతున్నారు. పోలీసులు ఇరానీగ్యాంగ్లను కష్టపడి అరెస్ట్ చేస్తున్నప్పటికీ గొలుసు చోరీలు ఆగడం లేదు. కొత్త కొత్త గ్యాంగ్‌లు రంగంలోకి దిగుతుండడంతో పోలీసులకు సవాల్‌గా మారింది. సోమ, మంగళవారాల్లో రెండురోజుల్లో నగరంలో ఏడుచోట్ల దుండగులు చైన్‌స్నాచింగ్‌లకు తెగబడ్డారు. జ్ఞానభారతి, జ్ఞానజ్యోతి నగర, హనుమంతనగర, కొడిగేహళ్లి, తిలక్‌నగర, జేపీ.నగర, జీవన బీమానగర, న్యూ తిప్పసంద్రలో మహిళల గొలుసులు దొంగల పాలయ్యాయి. జీవనబీమానగర నివాసి 48 గ్రాముల బంగారుచైన్, కాడుగోడిలో 30 గ్రాముల చైన్ లాక్కెళ్లారు. బ్లాక్ బైక్‌పై హల్చల్ బ్లాక్ హెల్మెట్, బ్లాక్ లెదర్ జాకెట్ దరించిన దుండగులు నలుపురంగు పల్సర్ బైకులో సంచరిస్తూ నగరంలో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. అడ్రస్ అడిగే నెపంతో మహిళలతో మాటలు కలిపి మెడల్లో బంగారుచైన్ లాక్కెళుతున్నారు. అంతేగాక వాకింగ్ ముగించుకుని ఇంటికి వెనుతిరుగుతున్న మహిళల మెడల్లో మాంగల్యం చైన్, బంగారుగొలుసులు అఫహరిస్తున్నారు. వెంటనే ఫిర్యాదు చేయండి బెంగళూరునగరంలో జనవరి నుంచి జూన్ వరకు 138 చైన్ స్నాచింగ్ కేసులు నమోదుకాగా రాష్ట్రవ్యాప్తంగా 347 జరిగాయి. చైన్‌స్నాచింగ్‌కు ఎవరైనా పాల్పడిన వెంటనే ఏ వాహనంలో పారిపోయారు, వీలైతే నంబర్‌ను జ్ఞాపకం ఉంచుకోవాలి. ఘటనపై వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ 100 ఫోన్ చేస్తే దొంగలు త్వరగా దొరికే అవకాశం ఉంది. ఇక చోరీ జరిగితే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. ఎప్పుడైనా దొంగసొత్తు స్వాధీనమైతే తిరిగి దక్కే చాన్సుంది. కనీస జాగ్రత్తలు పాటించడం మేలు ♦ మహిళలు బయటకు వచ్చినప్పడు జాగ్రత్తగా ఉండాలి. చుట్టుపక్కల ఎవరున్నారు అనేది గమనిస్తుండాలి. అపరిచితులు కనిపిస్తే అప్రమత్తం కావాలి. ♦ ఆభరణాలు ధరించినట్లయితే బయటకు కనిపించకుండా చీర కొంగు, స్కార్ఫ్‌తో కప్పుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ♦ నిర్జన ప్రదేశాల వైపు వెళ్లకుండా జనసమ్మర్ధం ఉండే ప్రాంతాల్లోనేసంచరించడం ఉత్తమం. ♦ వాకింగ్‌కు వెళ్లే మహిళలు రోడ్లపైకి వెళ్లకుండా ఉద్యానవనాల్లోనే వాకింగ్ చేయాలి. ♦ యువకులు, పురుషులు అడ్రస్ అడిగే నెపంతో మాట్లాడాలని ప్రయత్నిస్తే దూరంగా ఉండి మాట్లాడడం, లేదా తెలియదని చెప్పేయాలి. -
మియాపూర్‌లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
-
ఇద్దరు చైన్ స్నాచర్లకు దేహశుద్ధి..!
ఇద్దరు చైన్ స్నాచర్లు ఒకేరోజు ఇద్దరు మహిళల మెడల్లోంచి రెండు బంగారు గొలుసులను చోరీ చేశారు. వర్ని మండలం మోస్రాలో ఒకటి, నిజామాబాద్ రూరల్ మండలం లింగితండా వద్ద మరో మహిళ మెడలోని బంగారు గొలుసులను చోరీ చేశారు. చివరకు ఎడపల్లి మండలం ఠాణాకలాన్ వద్ద గ్రామస్తులు వారిని పట్టుకుని దేహశుద్ధి చేశాక పోలీసులకు అప్పగించారు. ఎడపల్లి(బోధన్): మండలంలోని ఠాణాకలాన్‌వాసులు మంగళవారం ఇద్దరు చైన్స్నాచర్లను పట్టుకొని దేహశుద్ధి చేశారు. వర్ని మండలం మెస్రాలో రోడ్డుపై వెళుతున్న మహిళతోపాటు నిజామాబాద్ రూరల్ మండలం లింగితండా వద్ద మరో మహిళ మెడలోంచి రెండు చైన్లను తెంపుకుని కుర్నాపల్లి మీదుగా ఠాణాకలాన్ వైపు బైక్‌పై పారిపోతున్న వారిని గ్రామస్తులు పట్టుకున్నారు. మోస్రా, కుర్నాపల్లి గ్రామస్తులు ఫోన్లో పారిపోతున్న చైన్‌స్నాచర్ల వివరాలను ఠాణాకలాన్వాసులకు తెలిపారు. దీంతో గ్రామస్తులు చైన్స్నాచర్లను సాహసించి పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బాధితులతో ఎస్ఐ టాటాబాబు మాట్లాడి వర్ని పోలీసులకు చైన్స్నాచర్లను అప్పగించారు. సాహసంతో పట్టుకున్న ఠాణాకలాన్వాసులను పోలీసులు అభినందించారు. వర్ని(బాన్సువాడ): మండలంలోని మోస్రాలో బస్టాండ్ వద్ద నిలబడిన మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును మంగళవారం దుండగులు ఎత్తుకెళ్లినట్టు స్థానికులు తెలిపారు. నిర్మల్ జిల్లాకు చెందిన మహిళ మోస్రాలోని బంధువుల ఇంటికి వచ్చి తిరుగు ప్రయాణంలో బస్టాండ్ వద్దకు రాగానే ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి మెడలోని గొలుసు తెంపుకుని పరారయ్యారు. ఈ ఘటనను గమనించిన స్థానికులు వారిని వెంబడించారు. విషయం తెల్సుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
కేపీహెచ్బీలో రెచ్చిపోయిన చైన్‌స్నాచర్లు
-
సీఎం సభలో దొంగల చేతివాటం
సంగెం: సీఎం సభలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. సీఎం సభ వేదికపై వచ్చిన సందర్భంలో కళాకారుల వేదికపైకి ఒక్కసారిగా మహిళలు, పురుషులు ఎక్కి సీఎం కేసీఆర్‌ను చూడడానికి ఎగబడ్డారు. ఇదే అదనుగా భావించిన దొంగలు చేతివాటం ప్రదర్శించారు. ఆత్మకూర్ మండలం రాఘవాపూరానికి చెందిన మడిపెల్లి అరుణ అనే మహిళ మెడలోని మూడు తులాల పుస్తెలతాడు తెంపుకునిపోయాడు. తన మెడలోంచి పుస్తెల తాడు తెంపుకున్నట్లు గ్రహించిన మహిళ లబోది బోమని రోదిస్తు అక్కడ విధి నిర్వహణలో ఉన్న పోలీ సుల కాళ్లావేళ్లపడింది. అలాగే అక్కడ కొందరి పర్సులు, సెల్పోన్లు కొట్టేసినట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఇద్దరు చైన్స్నాచర్లకు జైలు
ఇరగవరం: చైన్ స్నాచింగ్ కేసులో ఇద్దరికి 10 నెలలు జైలు శిక్ష విధించినట్టు ఇరగవరం ఎస్సై జి.శ్రీనివాస్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని ఏలేటిపాడులో రోడ్డుపై నడిచివెళ్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును తూర్పుగోదావరి జిల్లా చిన కాపవరానికి చెందిన వానపల్లి అ య్యప్ప, జిల్లాలోని కడియద్దకు చెందిన పొట్లకర్ల స్వామి లా క్కుపోయారు. ఈ కేసులో నిందితులిద్దరికీ న్యాయమూర్తి జి. వీణ 10 నెలల చొప్పున జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. -
చైన్ స్నాచర్ల హల్చల్, అరెస్టు
నూజివీడు: కృష్ణా జిల్లాలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. నూజివీడు పట్టణంలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 2 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు సమాచారం.