Chandrayaan
-
అంతరిక్షంలో మన జైత్రయాత్ర
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనల్లో మరో ముందడుగు పడింది. అంతరిక్ష రంగంలో భారత్ జైత్రయాత్రకు మార్గం సుగమమైంది. ఈ దిశగా పలు కీలక కార్యక్రమాలకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. చందమామపైకి భారత వ్యోమగాములను పంపించి, అక్కడ నమూనాలు సేకరించి, క్షేమంగా వెనక్కి తీసుకురావడానికి ఉద్దేశించిన చంద్రయాన్–4 మిషన్‌కు ఆమోద ముద్రవేసింది. వ్యోమగాములను పంపించడానికి అవసరమైన సాంకేతికత పరిజ్ఞానాన్ని, వ్యూహాలను ఈ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేస్తారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.2,104.06 కోట్లు ఖర్చు చేయబోతోంది. చంద్రయాన్–4 స్పేస్‌క్రాఫ్ట్ అభివృద్ధి, లాంచింగ్ బాధ్యతను ఇస్రోకు అప్పగించబోతున్నారు. ఈ నూతన మిషన్‌కు పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీనే ఉపయోగించనున్నారు. చంద్రయాన్–3 ప్రయోగం విజయవంతం కావడంతో చంద్రయాన్–4ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. అంతరిక్షంలో సొంతంగా ‘భారతీయ అంతరిక్ష కేంద్రం’ నిర్మించుకోవడంతోపాటు 2040 నాటికి వ్యోమగాములను చంద్రుడిపైకి పంపించాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగానే చంద్రయాన్–4కు శ్రీకారం చుడుతోంది. ఈ మిషన్‌లో భారతీయ పరిశ్రమలను, విద్యా సంస్థలను భాగస్వాములను చేస్తారు. ఎన్జీఎల్వీ సూర్య పాక్షిక పునరి్వనియోగ తదుపరి తరం లాంచ్ వెహికల్(ఎన్జీఎల్వీ) ‘సూర్య’ అభివృద్ధికి సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇస్రో లాంచ్ వెహికల్ మార్క్–3 కంటే మూడు రెట్లు అధికంగా పేలోడ్‌ను ఇది మోసుకెళ్లగలదు. మార్క్–3తో పోలిస్తే ఖర్చు మాత్రం కేవలం 50 శాతమే పెరుగుతుంది. ఎన్జీఎల్వీ ‘సూర్య’ అభివృద్ధికి ప్రభుత్వం రూ.8,240 కోట్లు కేటాయించింది. గగన్‌యాన్ కార్యక్రమాన్ని మరింత విస్తరింపజేస్తూ భారతీయ అంతరిక్ష స్టేషన్లో మొదటి మాడ్యూల్(బీఏఎస్–1) అభివృద్ధికి కేబినెట్ పచ్చజెండా ఊపింది. గగన్‌యాన్‌లో భాగంగా 2028 డిసెంబర్ నాటికి ఎనిమిది మిషన్లు పూర్తిజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గగన్‌యాన్‌కు రూ.20,193 కోట్లు కేటాయించింది. కార్యక్రమ విస్తరణ కోసం అదనంగా రూ.11,170 కోట్లు కేటాయించింది. → బయోటెక్నాలజీ రీసెర్చ్ ఇన్నోవేషన్, ఎంటర్ప్రెన్యూర్íÙప్ డెవలప్మెంట్(బయో–రైడ్) పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. బయో టెక్నాలజీ రంగంలో పరిశోధనలు, అభివృద్ధికి ఈ పథకం తోడ్పాటు అందించనుంది. ఈ పథకం అమలుకు రూ.9,197 కోట్లు కేటాయించారు. → యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్టెండెడ్ రియాలిటీ రంగాల్లో నేషనల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్(ఎన్సీఓఈ) ఏర్పాటు ప్రతిపాదనకు కేబినెట్ అంగీకారం తెలిపింది. ఈ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ద్వారా ఇండియాను కంటెంట్ హబ్‌గా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. → 2024–25 రబీ సీజన్లో ఫాస్ఫేట్, పొటాష్ ఎరువులపై రూ.24,474.53 కోట్ల రాయితీ ఇచ్చేందుకు కేబినెట్ సుముఖత వ్యక్తంచేసింది. ఈ రాయితీ వల్ల సాగు వ్యయం తగ్గుతుందని, రైతులకు భరోసా లభిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రైతన్నలకు కొరత లేకుండా నిరంతరాయంగా ఎరువులను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. → ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్(పీఎం–ఆశా)కు కేబినెట్ నుంచి ఆమోదం లభించింది. రైతులకు తగిన మద్దతు ధర అందించడంతోపాటు మార్కెట్లో నిత్యావసరాల ధరలను నియంత్రించడానికి 2025–26లో రూ.35,000 కోట్లతో ఈ పథకం అమలు చేస్తారు. పీఎం–ఆశాతో రైతులతోపాటు వినియోగదారులకు సైతం లబ్ధి చేకూరుతుందని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. → దేశవ్యాప్తంగా గిరిజన వర్గాల సామాజిక–ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చడమే లక్ష్యంగా ‘ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్’కు మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ఈ పథకానికి రూ.79,156 కోట్లు కేటాయించారు.‘వీనస్ ఆర్బిటార్ మిషన్’ శుక్ర గ్రహంపై మరిన్ని పరిశోధనలకు గాను ‘వీనస్ ఆర్బిటార్ మిషన్’ అభివృద్ధికి కేంద్ర కేబినెట్ అంగీకారం తెలిపింది. డిపార్టుమెంట్ ఆఫ్ స్పేస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అమలు చేస్తారు. శుక్ర గ్రహం కక్ష్యలోకి సైంటిఫిక్ స్పేస్‌క్రాఫ్ట్ పంపించాలని నిర్ణయించారు. ‘వీనస్ ఆర్బిటార్ మిషన్’కు కేంద్ర కేబినెట్ రూ.1,236 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.824 కోట్లతో స్పేస్‌క్రాఫ్ట్‌ను అభివృద్ధి చేస్తారు. -
ఘనంగా ‘స్పేస్ డే’ వేడుకలు
సాక్షి,హైదరాబాద్ : చంద్రయాన్-3 విజయంతో అంతరిక్ష పరిశోధనల్లో భారత్ కీర్తి పెరిగింది. ఆ రికార్డుకు గుర్తుగా ఏటా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకోవడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ అంశాలపై నెల రోజులుగా వేడుకలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ అధునాతన పరిశోధన కేంద్ర పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ఏఆర్‌సీఐ), డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ విభాగం ఉద్యోగులు రెండ్రోజుల పాటు నేషనల్ స్పేస్డే వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు విద్యార్ధులు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలవైపు మొగ్గు చూపేలా ప్రోత్సహించారు. నేషనల్ స్పేస్ డే వేడుకల్ని పుస్కరిచుకొని తొమ్మిది పాఠశాలల విద్యార్ధులను ఆహ్వానించారు. వారికి మోడల్ మేకింగ్ పోటీ, క్విజ్, డ్రాయింగ్/పెయింటింగ్ పోటీలతో సహా అనేక రకాల పోటీలను నిర్వహించారు. దీంతో పాటు హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) ‘స్పేస్ ఆన్ వీల్స్’ పేరుతో ప్రదర్శించిన వాహనం ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఈ వాహనంలో స్పేస్‌కి సంబంధించిన కీలక అంశాలను ఇందులో ప్రదర్శించారు. ఎన్ఆర్ఎస్సి సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ ఈ మొబైల్ ఎగ్జిబిషన్‌ను కోఆర్డినేట్ చేయగా.. విద్యార్థులు, ఎన్ఆర్సీఐ ఉద్యోగులు,యువ సైంటిస్ట్‌లు వీక్షించారు. ఏఆర్‌సీఐ డైరెక్టర్ డాక్టర్ ఆర్.విజయ్ విజేతలకు బహుమతులు అందించారు. నేషనల్ స్పేస్ డే వేడుకల్లో పాల్గొన్న అన్ని పాఠశాలలకు ప్రశంసా పత్రంగా ‘స్పేస్ ఎన్సైక్లోపీడియా’ పుస్తకాలను బహుమతిగా అందించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ పాపియా బిశ్వాస్,డాక్టర్ సంజయ్ ధాగే, మనీష్ తక్,డాక్టర్ నవీన్, ఎం.చవాన్, ఎన్.అపర్ణరావు,ఎం.ఇళయరాజా, ఎన్.అరుణ,ఎం.ఆర్.రెంజు,రీ డి.రమేష్, పి.అంజయ్య తదితరులు పాల్గొన్నారు. -
అంతరిక్ష పర్యాటకం సాధ్యమే!
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తులో అంతరిక్ష పర్యాటకం సాధ్యమేనని.. మన దేశం పూర్తిస్థాయి దేశీయ పరిశోధనలతో ముందుకు వెళ్తోందని ఇస్రో శాస్త్రవేత్త కల్పన కాళహస్తి, మిస్సైల్ విమెన్ ఆఫ్ ఇండియాగా పేరుపొందిన డీఆర్డీవో శాస్త్రవేత్త టెస్సీ థామస్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ది పార్క్ హోటల్లో ఫిక్కీ ఫ్లో ఆధ్వర్యంలో శుక్రవారం ‘స్టెల్లార్ జరీ్నస్’కార్యక్రమం నిర్వహించారు. ఫిక్కీ చైర్పర్సన్ ప్రియా గజ్దర్.. పలువురు శాస్త్రవేత్తలు, ఫిక్కీ ఆధ్వర్యంలోని 200 మంది మహిళలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెస్సీ థామస్, కల్పన కాళహస్తి తమ అనుభవాలను పంచుకున్నారు. మార్స్‌పైకి మనిషి వెళ్లడం చూడాలి.. సైన్స్‌కు లింగ భేదం లేదని.. డీఆర్డీఓ, ఇస్రో వంటి వేదికల్లో పురుషులు, మహిళలు ఉమ్మడి లక్ష్యం కోసం కలసి పనిచేస్తున్నారని టెస్సీ థామస్ పేర్కొన్నారు. తాను డీఆర్డీఓ వేదికగా పరిశోధన రంగంలోకి అడుగుపెట్టినప్పుడు మహిళలు ఒకట్రెండు శాతమే ఉండేవారని.. ఇప్పుడు 15 శాతం ఉన్నారని తెలిపారు. వినయం, నిబద్ధతను తన గురువు అబ్దుల్ కలాం వద్ద నేర్చుకున్నానని చెప్పారు. దేశ రక్షణ వ్యవస్థ కోసం అగ్ని క్షిపణులను రూపొందించడంలో కృషి తనకు జీవితకాల సంతృప్తిని ఇచి్చందన్నారు. అగి్న–4, అగ్ని–5 క్షిపణుల రూపకల్పనలో దేశీయ సాంకేతికత వాడుతున్నామని వివరించారు.మార్స్‌పైకి మనిíÙని పంపడాన్ని చూడాలనేది తన కోరిక అని చెప్పారు. ఏలియన్స్ లేవని చెప్పలేం..: సాధారణ హాలీవుడ్ సినిమా బడ్జెట్ కన్నా తక్కువ ఖర్చుతో భారత్ మూన్ ల్యాండర్‌ను ప్రయోగించడం దేశ ఆర్థిక క్రమశిక్షణకు అద్దం పడుతుందని ఇస్రో శాస్త్రవేత్త కల్పన కాళహస్తి తెలిపారు. ‘‘మూన్ ల్యాండర్ 4 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి, అధిక వేగంతో చంద్రుడి సమీపానికి చేరుకుంది. ఆ వేగాన్ని సమర్థవంతంగా నియంత్రించి.. చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ చేయగలిగాం. శక్తివంతమైన భారత పరిశోధనలకు ఇది మంచి ఉదాహరణ. భవిష్యత్‌లో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తాం. ప్రయోగాల్లో పూర్తిస్థాయిలో దేశీయ సాంకేతికతను ఉపయోగించనుండటం గర్వకారణం..’’అని చెప్పారు. అంతరిక్ష పర్యాటకం దిశగా ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్నాయన్నారు. అంగారకుడిపై పరిశోధన కూడా తన కలల ప్రాజెక్టు అని చెప్పారు. ఏలియన్ల గురించి ప్రస్తావిస్తూ.. విశ్వంలో మనకు తెలియని అద్భుతాలెన్నో ఉన్నాయని, అందులో ఏలియన్స్ కూడా భాగం కావొచ్చని పేర్కొన్నారు. -
Aditya L1: ఆసక్తికర విషయాలు వెల్లడించిన ఇస్రో చీఫ్
ముంబై: ఆదిత్య ఎల్1 సూర్యునికి, భూమికి మధ్యలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్‌కు జనవరి 6వ తేదీన చేరుకుంటుందని ఇస్రో చీఫ్ సోమనాథ్ తెలిపారు. ముంబై ఐఐటీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన సోమనాథ్ సెప్టెంబర్‌లో ప్రయోగించిన ఆదిత్య ఎల్1, అంతకముందు విజయవంతమైన చంద్రయాన్ 3 మిషన్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘ఆదిత్య ఎల్1 దాదాపుగా గమ్యాన్ని చేరుకుంది. జనవరి 6వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఎల్-1 పాయింట్‌కు చేరుకుంటుంది. ఎల్-1 కక్ష్యలోకి పంపేందుకు మండించాల్సిన ఆరు ఇంజన్లు చక్కగా పనిచేస్తున్నాయి. ఎల్-1 పాయింట్లో భూమికి సూర్యునికి మధ్య గ్రావిటీ ఉండదు. అయితే అక్కడ జీరో గ్రావిటీ ఉండటం మాత్రం అసాధ్యం ఎందుకంటే చంద్రుడు, మార్స్, వీనస్ గ్రహాలకు సంబంధించిన గ్రావిటీ ప్రభావం ఈ పాయింట్లో కొంత మేర ఉంటుంది’ అని సోమనాథ్ తెలిపారు. ‘శాటిలైట్ ఎల్1 పాయింట్లో కుదరుకున్నప్పటి నుంచి ఎప్పటికీ పనిచేస్తూనే ఉంటుంది. అందులోని పరికరాలు పనిచేసినంత కాలం సూర్యునికి సంబంధించిన డేటా భూమికి పంపిస్తూనే ఉంటుంది. సూర్యునిలో జరిగే చాలా చర్యలకు భూమి మీద వాతావరణ మార్పులకు మధ్య ఉండే సంబంధాన్ని ఎల్1 ద్వారా పరిశోధనలు చేసి కనిపెట్టగలమని ఆశిస్తున్నాం’ అని సోమనాథ్ చెప్పారు. ప్రజ్ఞాన్ రోవర్ కథ ఇక ముగిసినట్లే.. ‘14 రోజుల మిషన్ తర్వాత చంద్రయాన్ 3లో భాగమైన ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుని మీద హాయిగా నిద్ర పోతున్నాడు. రోవర్ ఇక ఎప్పటికీ నిద్ర పోతూనే ఉంటాడు. ప్రజ్ఞాన్ స్లీప్‌మోడ్‌లోకి వెళ్లిన తర్వాత మళ్లీ పనిచేస్తాడనుకున్నాం. ల్యాబ్‌లో కూడా ఇది విజయవంతంగా పరీక్షించి చూశాం. దురదృష్టవశాత్తు చంద్రునిపై మాత్రం ఇది జరగలేదు. ల్యాబ్‌లో సాధ్యమైనవి కొన్ని చంద్రునిపై నిజంగా సాధ్యపడవు. రేడియేషనే ఇందుకు కారణం’అని సోమనాథ్ తెలిపారు. దేశ అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో సూర్యున్ని అధ్యయనం చేసేందుకుగాను భారత్ తొలిసారిగా ఆదిత్య ఎల్1ను ప్రయోగించిన విషయం తెలిసిందే. -
2040 కల్లా చందమామపై భారత వ్యోమగామి: ఇస్రో
తిరువనంతపురం: 2040 ఏడాదికల్లా చంద్రుడిపై భారతీయ వ్యోమగామి అడుగుపెట్టేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్ మంగళవారం చెప్పారు. ‘‘వ్యోమగాములుగా తీర్చిదిద్దేందుకు నలుగురు భారత వాయుసేన పైలట్లను ఎంపికచేశాం. వారికి శిక్షణలో కొనసాగుతోంది. వ్యోమగాములను ముందు లోయర్ ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈఓ)లోకి ప్రవేశపెట్టి సురక్షితంగా హిందూ మహాసముద్ర జలాల్లో దించుతాం’’ అని వెల్లడించారు. ‘‘గగన్‌యాన్ కోసం మనుషులు ప్రయాణించే హెచ్ఎల్వీఎం3 వ్యోమనౌక, క్రూ మాడ్యుల్ ఉండే ఆర్బిటల్ మాడ్యూల్, సరీ్వస్ మాడ్యల్, ప్రాణాధార వ్యవస్థలు కావాలి. ముందు మానవరహిత ప్రయోగాలను పూర్తిచేయాలి. ఒకే పోలికలు ఉండే రెండు మానవరహిత మిషన్లు(జీ1, జీ2), ఎయిర్ డ్రాప్ టెస్ట్, ప్యాడ్ అబార్ట్ టెస్ట్, టెస్ట్ వెహికల్ పరీక్ష తదితరాలను విజయవంతంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. చంద్రుడిని చేరాక సురక్షితంగా తిరిగొచ్చేందుకు వ్యోమగాములు ఉండే క్రూ మాడ్యుల్(సీఎం) తయారీ, అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది తప్పించుకునే క్రూ ఎస్కేప్ సిస్టమ్(సీఈఎస్)లనూ అభివృద్ధిచేసుకోవాల్సి ఉంది’’ అని సోమనాథ్ చెప్పారు. -
చంద్రయాన్ 3 పోర్టల్ ప్రారంభం
ఢిల్లీ: చంద్రయాన్ 3 ప్రాజెక్టుపై కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రయాన్ 3పై పోర్టల్‌ను నేడు ప్రారంభించనుంది. కోర్సులను కూడా ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేసింది. చంద్రయాన్‌పై ప్రత్యేక కోర్సు మాడ్యూళ్లను ప్రారంభించినట్లు పేర్కొంది.'అప్నా చంద్రయాన్' వెబ్సైట్ ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. పోర్టల్‌ను ప్రోత్సహించాలని ఉన్నత విద్యా సంస్థలను కోరింది. విద్యార్థులు, ఉపాధ్యాయులలో అవగాహన కల్పించి ప్రచారం చేయాలని తెలిపింది. విద్యార్థులందరినీ ఈ ప్రత్యేక కోర్సుల్లో చేరేలా ప్రోత్సహించాలని కోరింది. చంద్రయాన్-3 మహా క్విజ్‌కు రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిర్వహించాలని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ విద్యా సంస్థలను కోరింది. చంద్రయాన్-3 మిషన్, అంతరిక్ష శాస్త్రం గురించి విద్యార్థుల జ్ఞానాన్ని పరీక్షించేందుకు వీలుగా క్విజ్ నిర్వహించనున్నారు. అంతరిక్ష కార్యక్రమాలపై తెలుసుకోవడానికి విద్యార్థులను ప్రోత్సహించడం ఈ క్విజ్ ప్రధాన లక్ష్యం. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో అక్టోబర్ 31, 2023 వరకు నమోదు చేసుకోవచ్చు. ఇదీ చదవండి: స్వలింగ జంటల వివాహంపై సుప్రీంకోర్టు తీర్పు -
నిన్ను చంద్రయాన్ ఎక్కిస్తా.. హర్యానా సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు..
చండీగఢ్: ఇటీవల నూహ్ అల్లర్ల నేపథ్యంలో వార్తల్లో నిలిచిన హర్యానా రాష్ట్రం తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వివాదాస్పదమైన వ్యాఖ్యల వలన మరోసారి వార్తల్లో నిలిచింది. హర్యానా ప్రభుత్వం నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్‌కు ఓ మహిళ తన గోడు వినిపించగా సీఎం వెటకారంగా నిన్ను చంద్రయాన్-4 ఎక్కించి పంపిస్తానని వెటకారం చేశారు. మహిళ పట్ల సీఎం వ్యవహరించిన తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి. హర్యానా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి స్వయం సహాయక గ్రూపు మహిళలు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్బంగా మొదట మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను సందర్శించిన ముఖ్యమంత్రి తర్వాత మహిళలతో కాసేపు మాట్లాడారు. వారు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. ఇదే క్రమంలో ఓ మహిళ తమ గ్రామానికి సమీపంలో ఒక ఫ్యాక్టరీని నిర్మిస్తే మాలాంటి కొంత మహిళలకు ఉపాధి దొరుకుతుందని అభ్యర్ధించగా అందుకు సీఎం బదులిస్తూ.. మళ్ళీ ఇక్కడి నుంచి చంద్రయాన్ వెళ్తే అందులో నిన్ను పంపిస్తానని ఎద్దేవా చేశారు.. దీంతో అక్కడి వారంతా ఆ మహిళను వెంటనే కూర్చోమని బలవంతం చేశారు. ఇంకేముంది ఇలాంటి అవకాశం కోసమే కాచుకుని కూర్చున్న ప్రతిపక్షాలు ఆప్, కాంగ్రెస్ పార్టీలు ఊరుకుంటాయా. సీఎం మాట్లాడిన వీడియోతో సహా విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. అధికారంలోకి వచ్చే వరకు ఒకలా ఉంటారు.. అధికారం దక్కించుకున్నాక ఒకలా ఉంటారని ఉదహరించారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ అయితే ఇదే కోరిక ప్రధాని మోదీ సన్నిహితులెవరైనా కోరి ఉంటే ఆఘమేఘాల మీద ఫ్యాక్టరీని నిర్మించేవారని విమర్శించింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే అంశంపై స్పందిస్తూ బీజేపీ ఆరెస్సెస్ మహిళలకు అంతకంటే ఏమి గౌరవమిస్తుందని విమర్శించింది. "अगली बार #Chandrayaan जाएगा तो उसमें तुमको भेज देंगे।" धिक्कार है ऐसे मुख्यमंत्री पर। जिन्हें जनता ने सेवा करने के लिए चुना था आज वही जनता का मज़ाक़ उड़ा रहे हैं। महिला का अपराध इतना था कि उसने रोजगार के लिए फैक्ट्री मांगी यही मांग अगर मोदी जी के अरबपति मित्रों ने अपने… pic.twitter.com/OERfbfaCGt — AAP (@AamAadmiParty) September 7, 2023 BJP के मुख्यमंत्री की सोच देखिए... हरियाणा में एक महिला ने CM खट्टर से कहा कि उसके क्षेत्र में फैक्ट्री लगा दी जाए, जिससे उसे और दूसरी महिलाओं को काम मिल सके। इसके जवाब में CM चेहरे पर बेशर्म हंसी लिए कहते हैं- अगली बार तुम्हें चंद्रयान से चांद पर भेजेंगे। और उस गरीब महिला की… pic.twitter.com/wdV47Ow2db — Congress (@INCIndia) September 7, 2023 ఇది కూడా చదవండి: నాగ్‌పూర్ పోలీస్ శాఖ క్రియేటివ్ యాడ్ -
ల్యాండర్ విక్రమ్ 3డీ చిత్రం
ఢిల్లీ:చంద్రయాన్ 3 ప్రాజెక్టుని ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్‌ని విజయవంతంగా దింపింది. చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరిన మొదటి దేశంగా భారత్ అజేయంగా నిలిచింది. చంద్రునిపై ప్రజ్ఞాన్ రోవర్ సంచరిస్తూ అనేక విషయాలను వెలుగులోకి తెచ్చింది. అయితే.. జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ దిగిన దృశ్యాలను 3డీ ప్రింటింగ్‌ని ఇస్రో తాజాగా విడుదల చేసింది. Chandrayaan-3 Mission: Anaglyph is a simple visualization of the object or terrain in three dimensions from stereo or multi-view images. The Anaglyph presented here is created using NavCam Stereo Images, which consist of both a left and right image captured onboard the Pragyan… pic.twitter.com/T8ksnvrovA — ISRO (@isro) September 5, 2023 చంద్రయాన్–3 మిషన్‌లో భాగంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై క్షేమంగా దిగిన ల్యాండర్ విక్రమ్ 3డీ చిత్రమిది. ఆనాగ్రిఫ్ టెక్నిక్‌ను ఉపయోగించి ఇస్రో ఈ చిత్రాన్ని రూపొందించింది. -
చంద్రయాన్–3 ప్రయాణం సాగిందిలా ..
గత ఏడాది ఏప్రిల్‌లో చంద్రయాన్–3 ఫస్ట్‌లుక్‌ను ఇస్రో విడుదల చేసింది. తొలుత 2020లో చంద్రయాన్‌ను ప్రయోగించాలని భావించారు కానీ కోవిడ్–19తో ఆలస్యమైంది. ఈ మిషన్ కోసం ఇస్రో రూ.615 కోట్లు ఖర్చు చేసింది. చంద్రయాన్–2 కంటే తక్కువ ఖర్చుతో ఈ మిషన్ పూర్తయింది. చంద్రయాన్–2కి రూ.978 కోట్లు ఖర్చు చేశారు. చంద్రయాన్–3 మూడు భాగాలుగా ఉంది. 1. ల్యాండర్ మాడ్యూల్ (ఎల్ఎం) 2. ప్రొపల్షన్ మాడ్యూల్ (పీఎం) 3. రోవర్ ► చంద్రయాన్ ల్యాండర్ నిర్దేశించిన చంద్రుడి ఉపరితలంపై సాప్ట్‌గా ల్యాండ్ అయ్యే సామర్థ్యం కలిగి ఉంది.చంద్రుడిపై ఈ ల్యాండర్ (విక్రమ్) దిగిన తర్వాత రోవర్ (ప్రజ్ఞాన్) బయటకి వస్తుంది. ఈ రెండూ కలిసి చంద్రుడి ఉపరితలంపై పరిశోధనల్ని చేస్తాయి. ల్యాండర్, రోవర్లు పరిశోధనలకు అనుగుణమైన సైంటిఫిక్ పే లోడ్స్‌ను కలిగి ఉన్నాయి. ► ఇక ల్యాండర్ మాడ్యూల్‌ను చివరి 100 కి.మీ. దూరం వరకు మోసుకుపోవడమే ప్రొపల్షన్ మాడ్యూల్ ప్రధాన విధి. ► చంద్రయాన్–3 మిషన్ లాంచ్‌వెహికల్ మార్క్–3 (ఎల్వీఎం–3) రాకెట్‌ని ఆంధ్రప్రదేశ్‌లో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జులై 14 మధ్యాహ్నం 2.35 గంటలకు విజయవంతంగా ప్రయోగించారు. మొత్తం 41 రోజుల పాటు ఈ వ్యోమనౌక ప్రయాణించి సూపర్ సక్సెస్ కొట్టింది. ► ఆ మర్నాడు జులై 15న మొదటి ఆర్బిట్ రైజింగ్ (కక్ష్య దూరం పెంపుదల) మొదటి విడతలో భూమికి దగ్గరగా 173 కిలోమీటర్లు ఎత్తుకు, భూమికి దూరంగా 41,762 కిలోమీటర్లు ఎత్తుకు పెంచారు. ► అలా అయిదుసార్లు కక్ష్యం పెంచాక ఆగస్టు 1న అర్థరాత్రి చంద్రయాన్–3 మిషన్‌ను పెరిజీలోకి అంటే భూమికి దగ్గరగా వుచ్చిన సమయంలో లూనార్ ట్రాన్స్ ఇంజెక్షన్ అనే అపరేషన్‌తో భూమధ్యంతర కక్ష్య నుంచి చంద్రుడి కక్ష్య వైపుకు విజయవంతంగా మళ్లించారు. ► ఆగస్టు 5న భూ మధ్యంతర కక్ష్య నుంచి 3,69,328 లక్షల కిలోమీటర్లు దూరం ప్రయాణించి లూనార్ ఆర్బిట్ (చంద్రుని కక్ష్య)లో 164‘‘18074 ఎత్తుకు చేరుకుంది. ► అప్పట్నుంచి కక్ష్యను అయిదుసార్లు తగ్గించుకుంటూ వచ్చారు. ఆగస్టు 6, 9, 14, 16 తేదీలలో కక్ష్య తగ్గిస్తూ రావడంతో చంద్రయాన్–3 చంద్రుడికి మరింత చేరువైంది. ► ఆగస్టు 18న ల్యాండర్ మాడ్యూల్లో వున్న కొద్దిపాటి ఇంధనాన్ని మండించి చంద్రుడికి చేరువగా అంటే 113‘‘157 కిలోమీటర్లు దగ్గరగా వెళ్లింది. ► చంద్రయాన్–3లో మరో కీలకఘట్టం విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లతో కూడిన లాండర్ మాడ్యూల్ (ఎల్ఎమ్) ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ఆగస్టు 17న విజయవంతంగా విడిపోయింది. దీంతో చంద్రయాన్–3 ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడి చుట్టూ ఉన్న 100 కి.మీ. వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశించింది. ► ల్యాండర్ మాడ్యూల్ చిట్టచివరి డీ బూస్టింగ్ ప్రక్రియ ఆగస్టు 20న విజయవంతంగా పూర్తయింది. అప్పట్నుంచి ఆ ల్యాండర్ చంద్రుడి చుట్టూ 25 ్ఠ134కి.మీ. కక్ష్యలో పరిభ్రమించింది. ► ఈ ప్రయోగంలో ఇస్రో మొట్టమొదటి సారిగా థొరెటల్–అబల్ అనే లిక్విడ్ ఇంజిన్లను ఉపయోగించింది ► ఆగస్టు 23 సాయంత్రం 5. 44 గంటలకు ల్యాండర్ విక్రమ్ ఈ ప్రత్యేక ఇంజిన్ల సాయంతో దశల వారీగా వేగాన్ని తగ్గించుకుంటూ వచ్చింది. సరిగ్గా 6.04 గంటలకు జాబిల్లి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగిన విక్రమ్ ల్యాండర్ దిగడంతో భారత్ కీర్తి పతాక చంద్రుడిపై రెపరెపలాడింది. ► రోవర్ చంద్రుడి ఉపరితలంపైకి వచ్చాక సెకెండ్‌కు ఒక సెంటీమీటర్ వేగంతో కదులుతూ ఒక లూనార్ డే (చంద్రరోజు) పనిచేస్తుంది. ఒక లూనార్ డే అంటే భూమి మీద కొలిస్తే 14 రోజులు అవుతుంది. అంటే సెప్టెంబర్ 7 దాకా 500 మీటర్లు దూరం ప్రయాణిస్తుంది. -
చంద్రయాన్‌లో మనోళ్లు..
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా)/ఒంటిమిట్ట/విజయనగరం అర్బన్/రాజంపేట టౌన్ : పున్నమి చంద్రుడి సొగసు చూస్తూ మురిసిపోయిన భారతావని.. ఇప్పుడా నెలరాజుపై పరిశోధనలకు ల్యాండర్ విక్రమ్‌ను దింపి విజయగర్వంతో ఉప్పొంగుతోంది. ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూసేలా చేసింది. ఉత్కంఠగా ఎదురుచూసిన ఈ ప్రక్రియను విజయవంతం చేయడంలో మన రాష్ట్రానికి చెందిన శాస్త్రవేత్తలూ ఉన్నారు. వీరిలో చిత్తూరుకు చెందిన కె. కల్పన, వైఎస్సార్ కడప జిల్లా యువతి అవ్వారు చందన.. విజయనగరానికి చెందిన డా. కరణం దుర్గాప్రసాద్.. రాజంపేటకు చెందిన ఎర్రబాలు రాజేంద్ర ఉండటం మనందరికీ గర్వకారణం. అలాగే.. చిత్తూరుకు చెందిన కె. కల్పన ప్రముఖ పాత్ర పోషించడం తెలుగు వారికి గర్వకారణం. ల్యాండర్ సేఫ్ ల్యాండింగ్ అయిన వెంటనే బెంగళూరులోని ఇ్రస్టాక్ కేంద్రంలో ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఈ ప్రాజెక్టులో ఆమె అసోసియేట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ల్యాండర్‌ను సేఫ్‌గా దించడం తన జీవితంలో మర్చిపోలేని అనుభూతి.. మధురమైన జ్ఞాపకమన్నారు. ఈ ప్రయోగం సక్సెస్‌తో కల్పనకు ప్రత్యేకమైన గౌరవం లభించడమే కాక తెలుగుజాతి మొత్తం ఆమెకు అభినందనలు తెలియజేస్తోంది. మిగిలిన ముగ్గురూ చంద్రయాన్–3లో తమ అనుభవాలను ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు.. థర్మోఫిజికల్ లీడ్స్‌లో ఒకడిని.. అహ్మదాబాద్‌లోని అంతరిక్షం ఇస్రో విభాగమైన ఫిజికల్ రీసెర్చ్ లా»ొరేటర్ (పీఆర్ఎల్)లో ప్లానెటరీ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. చంద్రయాన్–1 నుంచి ప్రస్తుత చంద్రయాన్–3 వరకు పనిచేసిన అనుభవం ఉంది. చంద్రుని ఉపరితల థర్మోఫిజికల్ ప్రయోగం (సీహెచ్ఏఎస్టీఈ) అనే పరికరం లీడ్స్‌లో నేను ఒకడిని. ఇదొక థర్మామీటర్‌లా పనిచేస్తుంది. చంద్రుని మొదటి ఉపరితలం సీటు థర్మల్ ప్రొఫైల్‌ను అందించేందుకు చంద్రుని ఉష్ణోగ్రతలను కొలుస్తుంది. చంద్రునిపై నీటి ఉనికి, స్థిరత్వం, చలనశీలతను నిర్దేశించే ప్రయోగం ఇది. భవిష్యత్తులో చంద్రుని అన్వేషణలో ముఖ్యమైన అంశం అయిన నీరు–మంచు, ఇతర వనరుల స్థిరత్వ మండలాల గురించి చెప్పే ముఖ్యమైన ప్రయోగం చంద్రయాన్–3. – డాక్టర్ కరణం దుర్గాప్రసాద్, విజయనగరం మాటల్లో వర్ణించలేని ఆనందమిది.. చంద్రయాన్–3 ప్రయో గం జరుగుతున్న తరుణంలోనే నేనూ సైంటిస్ట్ అయ్యి ఈ ప్రయోగంలో భాగస్వామ్యం కావడం, అలాగే చంద్రయాన్–3 విజయవంతం కావ డం మాటల్లో వర్ణించలేని ఆనందాన్ని ఇస్తోంది. విక్రమ్ ల్యాండర్ చందమామకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఉత్కంఠభరితమైన క్షణాలను గడిపాం. చందమామపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్‌గా ల్యాండ్ అయిన క్షణం నాకు తెలియకుండానే నా కళ్ల నుంచి ఆనందభాష్పాలు వచ్చాయి. ఈ ప్రయోగం నా జీవితంలో మరచిపోలేని ఓ తీపిగుర్తు. నేను ఎంటెక్ పూర్తిచేశాక హైదరాబాద్‌లోని క్వాల్కం కంపెనీ తమ సంస్థలో ఉద్యోగం ఇ చ్చేందుకు రూ.43 లక్షల ప్యాకేజీ ఆఫర్ ఇచ్చింది. అయితే, తన మేధస్సును దేశానికి ఉపయోగించాలన్న ఆలోచనతో ఆ ఉద్యోగాన్ని తిరస్కరించా. ఆ తరువాత తన అడుగులు శా స్త్రవేత్తగా ఈ రంగంపై పడ్డాయి. అన్నమ య్య జిల్లా రాజంపేట మండలం దిగువ బసినా యుడుగారిపల్లె ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసే వై.సుబ్రమణ్యంరెడ్డి, చ ంద్రకళ.. రాజేంద్రప్రసాద్‌రెడ్డి తల్లిదండ్రులు. – ఎర్రబాలు రాజేంద్ర ప్రసాద్‌రెడ్డి, రాజంపేట ఇది చిన్నప్పటి కల.. వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట మండలం, కొత్తమాధవరం మా స్వగ్రామం. తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలో హైదరాబాద్ వారు నిర్వహించిన యంగ్ సైంటిస్ట్ కార్యక్రమంలో ప్రతిభ చూపడంతో శాస్త్రవేత్తగా ఎదిగేందుకు అవసరమైన సూచనలు చేశారు. ఇంటర్లో ఉపకార వేతనం లభించింది. కడపలోని అంబేద్కర్ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతూ డీఏఐడీ పూర్తిచేశాను. విజయవాడలో డీఎస్సీ శిక్షణ తీసుకున్న అనంతరం ఇస్రో పరీక్షలకు సిద్ధమై ఎంపికయ్యాను. మూడో స్థానం దక్కింది. తల్లి ఆదిలక్ష్మి, అమ్మమ్మ సాలమ్మల ప్రోత్సాహం మరువలేనిది. ఇస్రోకు ఎంపికైన తర్వాత బెంగళూరు యుఆర్.రావు శాటిలైట్ సెంటర్లో పనిచేస్తున్నాను. అబ్దుల్ కలాం స్ఫూర్తితో రాకెట్ లాంచ్ అంశంపై అవగాహన పెంచుకున్నా. చంద్రయాన్–3 డిజైనర్‌గా నేను భాగస్వామి కావడం నాకు ఆనందంగా ఉంది. ఇది నా చిన్నప్పటి కల. మరిన్ని విజయాల్లో నేనూ భాగస్వామి కావాలని ఉంది. – చందన, కొత్త మాధవవరం, ఒంటిమిట్ట మండలం -
చంద్రయాన్-3పై ఇస్రో చైర్మన్ కీలక ప్రకటన.. మళ్లీ అదే జరిగితే..
బెంగుళూరు: చంద్రయాన్-2 ప్రయోగం దాదాపుగా విజయవంతంగా జరిగిందనుకుంటున్న తరుణంలో విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలాన్ని బలంగా ఢీకొట్టడంతో చివరి నిముషంలో ల్యాండర్ నుండి సంకేతాలు అందడం ఆగిపోయాయి. ఈ సారి చంద్రయాన్-3లో అలా కాకుండా విక్రమ్ ల్యాండర్ తన వైఫల్యాలను తానే సరిచేసుకునే విధంగా రూపొందించామని అన్నారు ఇస్రో చైర్మన్ సోమనాథ్ అన్నారు. చంద్రయాన్-2 వైఫల్యాన్ని ఇస్రో సవాలుగా స్వీకరించి చంద్రయాన్-3 ప్రాజెక్టుని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. అనుకున్నట్టుగానే చంద్రయాన్-3 జులై 14, 2023న విజయవంతంగా ప్రయోగించారు ఇస్రో శాస్త్రవేత్తలు. నిర్ణీత సమయం ప్రకారం ఇది ఆగస్టు 23న చంద్రుడిపై అడుగుపెట్టాల్సి ఉండగా ఒకరోజు అటు ఇటుగా చంద్రయాన్-3 చంద్రుడిపై ల్యాండ్ అవ్వనుంది. ఇదిలా ఉండగా ఈ ప్రయోగం జరిగిన నాటి నుండి చంద్రయాన్-2 లా ఇందులో కూడా చివరి నిముషంలో ఏవైనా సమస్యలు తలెత్తితే పరిస్థితి ఏమిటనే అనుమానాలు కలుగుతూనే ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చారు ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్. దిశా భారత్ అనే సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చంద్రయాన్-3లో విక్రమ్ ల్యాండర్ తన వైఫల్యాలను తానే సరిచేసుకోగలదని, సెన్సార్లతో సహా అందులోని అన్నీ ఫెయిల్ అయినా కూడా విక్రమ్ ల్యాండర్ చంద్రుడి మీద సాఫ్ట్ ల్యాండింగ్ కావడం ఖాయమని అన్నారు. ప్రపల్షన్ వ్యవస్థను ఆ విధంగా సిద్ధం చేశామని తెలిపారు. ఆగస్టు 9,14,16 తేదీల్లో చంద్రయాన్-3 చంద్రుడిని సమీపిస్తుండగా ఒక్కో కక్ష్య మారుతూ వెళుతుందని అనంతరం ల్యాండర్ ప్రపల్షన్ ప్రక్రియ మొదలవుతుందని ఆ సమయంలోనే క్రాఫ్ట్ వేగం తగ్గించుకుని చివరిగా ఆగష్టు 23న క్షేమంగా ల్యాండ్ అవుతుందని అన్నారు. అందులోని రెండు ఇంజిన్లు పనిచేయకపోయినా కూడా సాఫ్ట్ ల్యాండింగ్ జరుగుతుందని, ఆర్బిటర్ నుండి ల్యాండర్ వేరు కాగానే అడ్డంగా తిరిగే ప్రక్రియను క్రమపద్ధతిలో నిలువుగా కిందకు దిగేలా ల్యాండర్ డిజైన్ చేశామని, గతంలో ఇక్కడే పొరపాటు జరిగిందని ఈసారి ఆ పొరపాటు పునరావృతం కాదని ఆయన అన్నారు. చంద్రయాన్-3 ల్యాండర్లో నాలుగు పేలోడ్లు ఉన్నాయి.. మొదటిది చంద్ర సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్పెరిమెంట్ (ChaSTE) చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతను కొలుస్తుంది. రాంబా-LP చంద్రుడి ఉపరితల ప్లాస్మా సాంద్రత, మార్పులను కొలుస్తుంది. భవిష్యత్తులో ల్యాండర్ల ల్యాండింగ్ స్థానాన్ని గుర్తించి నాసాకు నిర్దేశించడానికి రెట్రోరిఫ్లక్ట్రర్, చంద్రుడి కంపించే కోలాటాన్కు లెక్కించడానికి ఒక పరికరం ఉంటాయి. ఇది కాకుండా ప్రగ్యాన్ రోవర్ లో మరో మూడు పేలోడ్లు ఉంటాయని ఇస్రో చైర్మన్ తెలిపారు. ఇది కూడా చదవండి: త్రివిధ దళాల్లో ఖాళీలను భర్తీ చేయండి -
చంద్రయాన్–3.. త్రీ ఇన్ వన్
సూళ్లూరుపేట: చందమామ గురించి తెలుసుకోవడానికి గత 60 ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. అమెరికా 1958 నుంచి చంద్రుడిపై పరిశోధనలు సాగిస్తోంది. 1969లో అపోలో రాకెట్ ద్వారా ముగ్గురు వ్యోమగాములను చంద్రుడిపైకి పంపించింది. రష్యా, జపాన్, చైనా, ఇజ్రాయెల్, జర్మనీ, భారత్ తదితర దేశాలు చంద్రుడి రహస్యాలను ఛేదించేందుకు కృషి చేస్తున్నాయి. భారత్ 2008లో చంద్రుడి మీదికి చంద్రయాన్–1 పేరుతో ఆర్బిటార్‌ను ప్రయోగించింది. అక్కడ నీటి జాడలున్నాయని గుర్తించింది. చంద్రుడిపై రెండు ప్రయోగాలు చేసిన భారత్ మూడో ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. సైంటిస్టులు ఏర్పాట్లను దాదాపు పూర్తిచేశారు. చంద్రయాన్–1, చంద్రయాన్–2 ప్రయోగాల వల్ల ఆర్బిటార్ ద్వారా ల్యాండర్‌ను, ల్యాండర్ ద్వారా రోవర్‌ను పంపించిన నాలుగో దేశంగా భారత్ గుర్తింపు పొందింది. చంద్రయాన్–3లో మూడింటినీ ఒకేసారి పంపిస్తున్నారు కనుక దీన్ని త్రీ ఇన్ వన్ ప్రయోగంగా ఇస్రో శాస్త్రవేత్తలు పరిగణిస్తున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2008 అక్టోబర్ 22న చేపట్టిన చంద్రయాన్–1 ప్రయోగం విజయవంతమైంది. 2019 జూలై 15న చంద్రయాన్–2కు శ్రీకారం చుట్టింది. ఆర్బిటార్ ద్వారా ల్యాండర్, ల్యాండర్ ద్వారా రోవర్‌ను పంపించడమే కాకుండా 14 రకాల పేలోడ్స్‌ను పంపించారు. ప్రయోగమంతా సక్సెస్ అయిందనుకున్న తరుణంలో ఆఖరు రెండు నిమిషాల్లో ల్యాండర్ చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టడంతో సంకేతాలు ఆగిపోయాయి. దాంతో ఆ ప్రయోగం పాక్షిక విజయం మాత్రమే సాధించింది. దాదాపు నాలుగు సంవత్సరాలు తరువాత చంద్రయాన్–3 పేరుతో మూడోసారి ప్రయోగానికి ఇస్రో ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 14వ తేదీన ఈ ప్రయోగం చేపట్టనుంది. చంద్రయాన్–3లో ప్రపొల్షన్ మాడ్యూల్లో రెండు పేలోడ్స్, ల్యాండర్లో 4 పేలోడ్స్, రోవర్లో రెండు పేలోడ్స్, అమెరికాకు చెందిన ఒక పేలోడ్‌ను అమర్చి పంపించనున్నారు. రూ.1,600 కోట్ల వ్యయం ► చంద్రయాన్ ప్రాజెక్టులో భాగంగా మూడు ప్రయోగాలకు సుమారు రూ.1,600 కోట్లు వ్యయం చేస్తున్నారు. ► చంద్రయాన్–3 ద్వారా చంద్రుడి రహస్యాలు తెలుసుకోవడమే కాకుండా వ్యోమగాములను పంపించే ప్రయత్నాలు సైతం ప్రారంభమయ్యే అవకాశం వుంది. ► చంద్రయాన్–1 ప్రయోగానికి రూ.380 కోట్లు ఖర్చు చేశారు. ► చంద్రయాన్–2 ప్రాజెక్టును రూ.425 కోట్లతో చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇచి్చంది. ఈ ప్రయోగాన్ని నిర్వహించేందుకు పదేళ్లు సమయం పట్టడంతో ఖర్చు అదనంగా రూ.173 కోట్లు పెరిగింది. అంటే చంద్రయాన్–2కు రూ.598 కోట్లు వ్యయం చేశారు. ► చంద్రయాన్–3 ప్రయోగానికి దాదాపు రూ.615 కోట్లు వెచ్చిస్తున్నారు. -
ఎల్వీఎం3–ఎం4 రాకెట్‌కు ఎలక్ట్రికల్ పరీక్షలు పూర్తి
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): స్థానిక సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం 2.35 గంటలకు నిర్వహించనున్న చంద్రయాన్–3 ప్రయోగానికి సంబంధించి ఎల్వీఎం3–ఎం4 రాకెట్‌కు శుక్రవారం ఎలక్ట్రికల్ పరీక్షలను పూర్తిచేశారు. చంద్రయాన్–3 ప్రయోగాన్ని ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అదేవిధంగా ఇది గ్రహాంతర ప్రయోగం కావడంతో ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోంది. కాబట్టి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రయోగానికి సంబంధించిన అన్ని అంశాలను శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ నెల 14వ తేదీ వరకు రోజూ అనేక రకాల పరీక్షలు చేసిన తర్వాత ప్రయోగాన్ని నిర్వహిస్తారు. చంద్రయాన్–3 ప్రయోగాన్ని వీక్షించేందుకు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి ఈ నెల 14న చంద్రయాన్–3 ప్రయోగాన్ని వీక్షించేందుకు ఆసక్తిగలవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని షార్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సందర్శకులు శుక్రవారం నుంచే https://lvg. shar.gov.in అనే వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి పేరు, పూర్తి వివరాలు నమోదు చేసుకోవచ్చని, ఆధార్ కార్డు, కోవిడ్ పరీక్ష సర్టిఫికెట్ కూడా ఉండాలని పేర్కొన్నారు. -
14న చంద్రయాన్–3 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): కీలకమైన చంద్రయాన్–3 ప్రయోగాన్ని ఈ నెల 14న చేపట్టనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) గురువారం తెలిపింది. మొదటగా ఈ నెల 12న అని ప్రకటించింది. ఆ తర్వాత 13కు వాయిదా వేసింది. తాజాగా, 14న మధ్యాహ్నం 2.35 గంటలకు ప్రయోగం ఉంటుందని షార్ వర్గాలు ప్రకటించాయి. స్వల్ప సాంకేతిక లోపాలను సరిచేసుకోవడంతో పాటు చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చే సమయంలోనే ప్రయోగిస్తారనే వాదన కూడా ఉంది. 2019లో చంద్రయాన్–2ను కూడా జులై 15న ప్రయోగించారు. షార్‌లోని రెండో వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్ (వ్యాబ్)లో రాకెట్ అనుసంధానం పూర్తి చేసి గురువారం ఉదయాన్నే వ్యాబ్ నుంచి ప్రయోగవేదికకు అనుసంధానించే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. పీఎస్ఎల్వీ రాకెట్‌ను 4 దశల్లో ప్రయోగిస్తే అదే జీఎస్ఎల్వీ రాకెట్‌ను మాత్రం 3 దశల్లోనే ప్రయోగిస్తారు. పీఎస్ఎల్వీ కంటే జీఎస్ఎల్వీ–మార్క్–2 రాకెట్ కొంచెం బరువు ఎక్కువ, 2 వేల కిలోలు బరువున్న ఉపగ్రహాలు తీసుకెళుతుంది. అదే ఎల్వీఎం మార్క్–3 అత్యంత శక్తివంతమై రాకెట్. ప్రెంచి గయానా కౌరు అంతరిక్ష కేంద్రం రూపొందించి ఏరియన్–5 రాకెట్ తరహాలో వుంటుంది. మూడు వేలు కిలోల నుంచి 6 వేలు కిలోల బరువైన ఉపగ్రహాలను సునాయాసంగా రోదసీలోకి తీసుకెళ్లగలుగుతుంది. ఈ రాకెట్‌కు అత్యంత శక్తివంతమైన రెండు స్ట్రాపాన్ బూస్టర్లు వుంటాయి. ఒక్కో స్ట్రాపాన్ బూస్టర్‌లో 200 టన్నుల ఘన ఇంధనం వుంటుంది. మొదటిదశలో రెండు స్ట్రాపాన్ బూస్టర్లలో వున్న 400 టన్నుల ఘన ఇంధనంతో మొదటి దశను పూర్తి చేస్తారు. 110 టన్నుల ద్రవ ఇం««ధనంతో (ఎల్–110)తో రెండోదశను, 25 టన్నుల క్రయోజనిక్ ఇంధనం (సీ–25)తో మూడోదశతో ప్రయోగాన్ని పూర్తి చేసేలా ఈ రాకెట్‌ను రూపకల్పన చేశారు. ప్రయోగానికి ముందు తుది విడత మిషన్ సంసిద్ధతా సమావేశాన్ని 11న నిర్వహించనున్నారు. అనంతరం ప్రయోగ సమయాన్ని, కౌంట్‌డౌన్ సమయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. ప్రస్తుతానికి ఈనెల 14న ప్రయోగమని తెలిపారు. ఎల్వీఎం3–ఎం4 రాకెట్ ప్రయోగసమయంలో 640 టన్నులు బరువు కలిగి వుంటుంది. 3,900 కిలోలు బరువు కలిగిన చంద్రయాన్–3 ఉçపగ్రహాన్ని నింగివైపు మోసుకెళ్లనుంది. చంద్రయాన్–3 ఉపగ్రహంలో 2,148 కిలోలు బరువు కలిగిన ప్రపోల్షన్ మా డ్యూల్, 1,752 కిలోలు బరువు కలిగిన ల్యాండర్, 26 కిలోలు బరువు కలిగిన రోవర్లను అమర్చి పంపుతున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించి 60 శాతం పనుల వరకు దేశంలోని 120 ప్రయివేట్ పరిశ్రమల సహకారం తీసుకున్నారు. -
విభిన్నం, వినూత్నం.. చంద్రయాన్–3
చల్లని వెన్నెలను ఇచ్చే చందమామను మనం చూసేది కేవలం ఒకవైపే. కంటికి కనిపించని అవతలి భాగంలో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని దేశాలు కొంతవరకు విజయం సాధించాయి. అంతరిక్ష నౌకలను క్షేమంగా పంపించాయి. చంద్రుడి ఉపరితలంపై ఆయా అంతరిక్ష నౌకలు కాలుమోపాయి. ఈ జాబితాలో చేరాలని భారత్ సైతం ఉవి్వళ్లూరుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్–3 ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. వచ్చే నెలలో జరిగే ఈ ప్రయోగం కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) సైంటిస్టులు తుది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. చంద్రుడిపైకి రోవర్‌ను పంపించి, అక్కడి వాతావరణ, భౌగోళిక పరిస్థితులను తెలుసుకోవడ మే ఈ మిషన్ లక్ష్యం. చంద్రయాన్–3 స్పేస్‌క్రాఫ్ట్‌ను జీఎస్ఎల్వీ–ఎంకే–3 రాకెట్ ద్వారా చందమామపైకి పంపించనున్నారు. చంద్రయాన్–3 మిషన్‌ను కచి్చతంగా సఫలం చేయాలని, చంద్రుడిపై ప్రయో గాల్లో మనదైన ముద్ర వేయాలని ఇస్రో సైంటిస్టులు అహోరాత్రులూ శ్రమిస్తున్నారు. భవిష్యత్తులో మనుషులను చంద్రుడిపైకి పంపించడానికి ఈ ప్రయోగం కీలకం అవుతుందనడంలో సందేహం లేదు. మీకు గుర్తుందా? చంద్రయాన్–2 ప్రయోగం దేశ ప్రజలకు చేదు జ్ఞాపకాలను మిగిలి్చంది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్, ఆర్బిటార్‌తో వెళ్లిన చంద్రయాన్–2 స్పేస్‌క్రాఫ్ట్ చంద్రు డి ఉపరితలంపై క్షేమంగా దిగలేకపోయింది. సాంకేతిక లోపం తలెత్తడంతో 2019 సెపె్టంబర్ 6న క్రాష్ ల్యాండ్ అయ్యింది. ప్రయోగం విఫలం కావడంతో అప్పటి ఇస్రో చైర్మన్ కె.శివన్ ప్రధాని మోదీ సమక్షంలో కన్నీరు పెట్టుకున్నారు. దేశ ప్రజలంతా సానుభూతి ప్రదర్శించారు. చంద్రయాన్–2తో పోలిస్తే చంద్రయాన్–3 ప్రయోగం చాలా విభిన్నంగా, వినూత్నంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. రెండింటి మధ్య ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయని అంటున్నారు. అవేమిటో తెలుసుకుందాం... ► ఆర్బిటార్, మిషన్ కంట్రోల్ సెంటర్‌తో సమన్వయం చేసుకుంటూ పనిచేసే ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్ అండ్ అవాయిడెన్స్ కెమెరా చంద్రయాన్–2లో కేవలం ఒక్కటే ఉంది. చంద్రయాన్–3లో ఇలాంటివి రెండు కెమెరాలు అమర్చుతున్నారు. చంద్రుడిపై ల్యాండర్ భద్రంగా దిగడానికి ఇవి ఉపకరిస్తాయి. ► చంద్రయాన్–2లో 9 కీలక పరికరాలు ఉన్నాయి. ఇవి చంద్రుడి కక్ష్యలో ఇంకా చక్కగా పనిచేస్తూనే ఉన్నాయి. చంద్రయాన్–3 ప్రొపల్షన్ మాడ్యూల్లో కేవలం స్పెక్ట్రో–పోలారీమెట్రీ ఆఫ్ హ్యాబిటబుల్ ప్లానెట్ ఎర్త్(ఎస్హెచ్ఏపీఈ) అనే పేలోడ్ కూడా ఉంటుంది. ఇతర గ్రహాలపై మానవ నివాస యోగ్యమైన ప్రదేశాల అన్వేషణకు అవసరమైన సమాచారాన్ని ఈ పరికరం అందజేస్తుంది. ► చంద్రయాన్–3లో ల్యాండర్‌తోపాటు లేజర్ రెట్రోరిఫ్లెక్టర్ అరే(ఎల్ఆర్ఏ)ను సైతం పంపించ బోతున్నారు. జాబిల్లిపై పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఇది తోడ్పడుతుంది. తాజా ప్రయోగం విజయవంతం కావడం ఖాయమని సైంటిస్టులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధనల్లో ఒక కీలకమైన మైలురాయి కానుంది. ► చంద్రయాన్–2లో జీఎస్ఎల్వీ ఎంకే–3 రాకెట్ ఉపయోగించారు. చంద్రయాన్–3లోనూ ఇలాంటి రాకెట్‌ను వాడుతున్నారు. చంద్రయాన్–2 రాకెట్లో ల్యాండర్, రోవర్, ఆర్బిటార్ ఉన్నాయి. మూడో ప్రయోగంలో ల్యాండర్, రోవర్ మాత్రమే ఉంటాయి. చంద్రయాన్–2లో భాగంగా ప్రయోగించిన ఆర్బిటార్‌ను ఈ తాజా ప్రయోగంలోనూ ఉపయోగించుకుంటారు. ఈ ఆర్బిటార్ ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో క్షేమంగా ఉంది. సమాచారం ఇచి్చపుచ్చుకోవడానికి, ఉపరితలంపై మ్యాపింగ్ కోసం ఆర్బిటార్‌ను వాడుకుంటారు. ► చంద్రయాన్–2 వైఫల్యం నుంచి సైంటిస్టులు పాఠాలు నేర్చుకున్నారు. అందుకే చంద్రయాన్–3లో కొన్ని మార్పులు చేశారు. చదవండి: మెట్రోలో యువకుల పిడిగుద్దులు.. వీడియో వైరల్.. జూలై 13న చంద్రయాన్–3 ప్రయోగం! న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్–3 ప్రయోగానికి రంగం సిద్ధమైంది. జూలై 13న మధ్యాహ్నం 2.30 గంటలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా శ్రీహరికోట లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి ఈ ప్రయోగం ప్రారంభించనున్నట్లు సీనియర్ శాస్త్రవేత్త ఒకరు బుధవారం చెప్పా రు. అయితే, ప్రయోగ తేదీని ఇంకా ఖరారు చేయలేదని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ అన్నారు. జూలై12 నుంచి 19వ తేదీల మధ్య ఏదో ఒక రోజు ప్రయోగం చేపట్టే అవకాశముందని వివరించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.615 కోట్లు కేటాయించింది. చంద్రయాన్–1 ప్రయోగం 2008 అక్టోబర్22న, చంద్రయాన్–2 ప్రయోగం 2019 జూలై 22న ప్రయోగం నిర్వహించారు. చంద్రయాన్–1 విజయవంతమైంది. జాబిల్లి ఉపరితలంపై నీడ జాడ లను గుర్తించింది. చంద్రుడి చుట్టూ తిరుగుతూ 312 రోజులపాటు సేవలందించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జూలైలో చంద్రయాన్–3
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): చంద్రయాన్–3 ప్రయోగాన్ని జూలై మొదటి వారంలో నిర్వహించనున్నట్లు ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. శుక్రవారం రాత్రి చంద్రయాన్–3 ఉపగ్రహం బెంగళూరు నుంచి షార్ కేంద్రానికి చేరుకుందని చెప్పారు. సోమవారం నిర్వహించే జీఎస్ఎల్వీ ఎఫ్12 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని కోరుకుంటూ శనివారం సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ బోర్డు చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి, ఈవో శ్రీనివాసులురెడ్డి, సభ్యులు ఇస్రో చైర్మన్‌కు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆయన్ని ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఆ తర్వాత సోమనాథ్ మీడియాతో మాట్లాడారు. జీఎస్ఎల్వీ ఎఫ్12 ప్రయోగానికి ఆదివారం ఉదయం 7.12 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం సేవలందిస్తున్న ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్(ఐఆర్ఎన్ఎస్ఎస్) సిరీస్‌లోని 7 ఉపగ్రహాల శ్రేణిలో 4 ఉపగ్రహాల కాలపరిమితి పూర్తి కానుండటంతో.. వాటి స్థానంలో నావిక్ ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నామని తెలిపారు. ఇకపై ఆరు నెలలకొకసారి నావిగేషన్ శాటిలైట్‌ను ప్రయోగిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఐఆర్ఎన్ఎస్ఎస్–1జీ స్థానంలో నావిక్–01 ఉపగ్రహాన్ని రోదసీలోకి ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. గగన్‌యాన్ ప్రయోగానికి సంబం«ధించి ఇంకా పలు పరీక్షలు నిర్వహించాల్సి ఉందన్నారు. 2024 చివరికల్లా మానవ రహిత ప్రయోగానికి సిద్ధమయ్యేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో షార్ గ్రూప్ డైరెక్టర్ గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
‘చంద్రయాన్–3’లో కీలక పరీక్ష విజయవంతం
బెంగళూరు: చంద్రయాన్–3 ప్రాజెక్టులో భాగంగా నిర్వహించిన ఎలక్ట్రో–మ్యాగ్నెటిక్ ఇంటర్ఫియరెన్స్/ఎలక్ట్రో–మ్యాగ్నెటిక్ కంపాటిబిలిటీ(ఈఎంఐ/ఈఎంసీ) పరీక్ష విజయవంతమైందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఆదివారం ప్రకటించింది. బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్లో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకూ ఈ పరీక్ష నిర్వహించినట్లు తెలియజేసింది. శాటిలైట్ ఉప వ్యవస్థలు అంతరిక్ష వాతావరణంలో సక్రమంగా పనిచేసేలా చూడడానికి ఈఎంఐ/ఈఎంసీ టెస్టు నిర్వహించారు. శాటిలైట్ ప్రయోగాల్లో ఇది ముఖ్యమైన పరీక్ష అని ఇస్రో పేర్కొంది. చంద్రుడిపైన లూనార్ను క్షేమంగా దించడమే లక్ష్యంగా చంద్రయాన్–3 ప్రయోగాన్ని ఈ ఏడాది జూన్‌లో చేపట్టే అవకాశం ఉంది. 2019లో చంద్రయాన్–2 ప్రయోగం విఫలమైన సంగతి తెలిసిందే. -
ISRO: జూన్‌లో చంద్రయాన్ 3
న్యూఢిల్లీ: చందమామపై శోధనకు ఉద్దేశించిన చంద్రయాన్–3 ప్రయోగం వచ్చే ఏడాది జూన్‌లో ఉంటుందని భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చైర్మన్ ఎస్.సోమ్‌నాథ్ ప్రకటించారు. గురువారం ఢిల్లీలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మీడియాతో సోమ్‌నాథ్ మాట్లాడారు. ‘ గగన్‌యాన్ ప్రాజెక్ట్ కోసం తొలి రోదసీనౌక పరీక్షను వచ్చే ఏడాది తొలినాళ్లలో చేపడతాం. లాంచ్ వెహికల్ మార్క్–3 ద్వారా చంద్రయాన్–3ను ప్రయోగిస్తాం. పలుమార్లు మానవరహిత వాహకనౌక పరీక్షల తర్వాత 2024 చివరికల్లా భారతీయ వ్యోమగాములు విజయవంతంగా కక్ష్యలో అడుగుపెట్టేలా చేస్తాం. 2019 సెప్టెంబర్‌లో విక్రమ్ ల్యాండర్‌ను చంద్రుడిపై దింపేందుకు చేసిన చంద్రయాన్–2 ప్రయోగం విఫలమైంది. ఈసారి అలా జరగబోదు. ఇది భిన్నమైన ఇంజనీరింగ్. ఉపరితలంపై ల్యాండర్ దిగేటపుడు పాడవకుండా ఉండేందుకు శక్తివంతమైన కాళ్లు సిద్ధంచేస్తున్నాం. ఈ ప్రక్రియలో ఏవైనా పొరపాట్లు జరిగితే, ప్రయోగం సజావుగా సాగేందుకు ‘మరో పరిష్కారం’ రంగంలోకి దిగుతుంది. ‘చంద్రుడిని చేరే క్రమంలో ఎంత ఎత్తులో ప్రయాణించాల్సి రావచ్చు? చంద్రుడి ఉపరితలంపై సమస్యలు లేని స్థలాల గుర్తింపు వంటి అంశాల్లో మరింత స్పష్టత సాధిస్తున్నాం’ అని అన్నారు. -
చంద్రుడిపై నీటికి భూమే ఆధారం
అలాస్కా: చంద్రుడిపై నీటిజాడలను భారతీయ చంద్రయాన్ మిషన్ నిర్ధారించి 14ఏళ్లవుతోంది. చంద్రుడిపై నీటికి భూమే ఆధారమని తాజాగా అలాస్కా యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. భూమి ఉపరితల వాతావరణ పొరల నుంచి తప్పించుకున్న హైడ్రోజన్, ఆక్సిజన్ అయాన్లు చంద్రుడిపై చేరి ఉంటాయని, అక్కడ వీటి సంయోగం ద్వారా నీటి అణువులు ఉద్భవించాయని తెలిపారు. చంద్రుడి ఉపరితలం లోపల పల్చని మంచురూపంలో దాదాపు 3,500 క్యూబిక్ కిలోమీటర్ల మేర నీరు వ్యాపించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ వివరాలను జర్నల్సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో ప్రచురించారు. భూమి మాగ్నటోస్పియర్ పరిధిలోకి చంద్రుడు ప్రతినెలా ఐదురోజులు వస్తాడు. ఆ సమయంలో భూమిపైనుంచి ఆక్సిజన్, హైడ్రోజన్ అయాన్లు భూఆకర్షణను తప్పించుకొని చంద్రుడిపైకి చేరి ఉంటాయని, ఇది లక్షల ఏళ్ల పాటు జరిగిన ప్రక్రియని వివరించారు. తాజా వివరాలు భవిష్యత్ అంతరిక్షయానాలకు ఉపయోగపడతాయని తెలిపారు. -
నూతన సంవత్సరంలో నింగికి నిచ్చెనలు
కొత్త సంవత్సరంలో నింగిని మరింత లోతుగా శోధించేందుకు భారత్ సిద్ధమవుతోంది. 2022లో వివిధ అంతరిక్ష ప్రయోగాలను దిగ్విజయంగా నిర్వహించి, అగ్రరాజ్యాలకే పరిమితమైన ఘనతను భారత్‌కు కూడా కట్టబెట్టాలని ఇస్రో (ఇండియన్ స్పేస్రీసెర్చ్ ఆర్గనైజేషన్) పట్టుదలగా కృషి చేస్తోంది. గతంలో కరోనా కారణంగా నిలిచిపోయిన కీలక ప్రాజెక్టులను పూర్తి చేయడమే కాకుండా సరికొత్త ప్రయోగాలను కూడా చేపడతామని ఇస్రో వెల్లడించింది. ఈ నేపథ్యంలో 2022ను అంతరిక్ష నామ సంవత్సరంగా మార్చేందుకు ఇస్రో చేపట్టనున్న కీలక ప్రాజెక్టుల వివరాలు ఇలా ఉన్నాయి... గగన్ యాన్ అంతరిక్షంలోకి భారత వ్యోమగాములను తొలిసారి సొంతంగా పంపేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఇందుకోసం ముందుగా ఇస్రో మానవ రహిత యాత్రను చేపట్టనుంది. క్రూ ఎస్కేప్సిస్టం పనితీరు పరిశీలనకు, గగన్ యాన్ మానవ రహిత మిషన్ కోసం 2022 ద్వితీయార్ధంలో ఇస్రో ఒక టెస్ట్ వెహికిల్ ఫ్లైట్‌ను నిర్వహించేందుకు సమాయత్తం అవుతోంది. దీని అనంతరం ఏడాది చివరిలో మరోమారు మానవ రహిత ప్రయోగాన్ని నిర్వహించాలని ఇస్రో భావిస్తోంది. ఈ రెండు మిషన్లు విజయవంతంగా పూర్తైతే అప్పుడు నింగిలోకి వ్యోమగాములను పంపుతారు. ఇందుకోసం ముగ్గురు భారతీయ వాయు సేన అధికారులను ఎంచుకొని శిక్షణ ఇస్తారు. ఇప్పటికే ఈ ప్రయోగానికి నలుగురిని ఎంపిక చేశారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే వీరి వివరాలు బహిర్గతం కాలేదు. మానవ సహిత గగన్ యాన్‌ను 2023లో ఎలాగైనా పూర్తి చేయాలని పనిచేస్తున్నట్లు కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి జితేందర్‌సింగ్ చెప్పారు. లో ఎర్త్ ఆర్బిట్‌లోకి దేశీయ లాంచ్ వెహికిల్ ద్వారా మనుషులను పంపి, తిరిగి దిగ్విజయంగా భూమికి తీసుకురావడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. ఆదిత్య మిషన్ సూర్యుడిపై అధ్యయనానికి భారత్ తొలిసారి ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం ఆదిత్య ఎల్1 మిషన్‌ను చేపట్టింది. 2021లో ఆరంభించాలనుకున్నా, కోవిడ్ కారణంగా వాయిదా పడింది. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఎల్ 1 పాయింట్(లాంగ్రేజియన్ పాయింట్) చుట్టూ ఉండే కక్ష్యలోకి ఈ మిషన్‌ను ప్రవేశపెడతారు. మార్స్ ఆర్బిటర్ తర్వాత ఇస్రో చేపట్టే రెండో హైప్రొఫైల్ స్పేస్ మిషన్ ఇదే కావడం విశేషం చంద్రయాన్ 3 2008లో ఆరంభించిన చంద్రయాన్‌కు కొనసాగింపుగా 2022 మూడో త్రైమాసికంలో ఇస్రో చంద్రయాన్ 3 మిషన్ చేపట్టనుంది. చంద్రయాన్ విజయవంతమైన తర్వాత చేపట్టిన చంద్రయాన్ 2 విఫలమైంది. ప్రయోగించిన లాండర్, రోవర్లు చంద్రుడిపై పడిపోయాయి. కానీ ఆర్బిటర్ మాత్రం ఇంకా భద్రంగానే ఉంది. దీన్ని చంద్రయాన్ 3లో ఉపయోగించుకోవాలని ఇస్రో భావిస్తోంది. ఎస్ఎస్ఎల్వీ లో ఎర్త్ ఆర్బిట్ (భూ ఉపరితలం నుంచి 160 కి.మీ. – 2 వేల కి.మీ. ఎత్తు లోపు ఉపగ్రహాలు సంచరించే కక్ష్య)లో ఉప గ్రహాలను ప్రవేశపెట్టే మిషన్ల విషయంలో భారత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. దీన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు ఇస్రో ఒక స్మాల్ సాటిలైట్ లాంచ్ వెహికల్(ఎస్ఎస్ఎల్వీ)ని అభివృద్ది చేస్తోంది. ఈ వెహికిల్‌ను 2022 తొలి త్రైమాసికంలో ప్రయోగిస్తారు. సుమారు 500 కిలోలను 500 కిలోమీటర్ల కక్ష్యలోకి తీసుకుపోయే పేలోడ్ సామర్ధ్యం దీని సొంతం. పీఎస్ఎల్వీతో పోలిస్తే ఇది చిన్న, తేలికపాటి ఉపగ్రహాలను తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోకి తీసుకుపోగలదు. దీని అభివృద్ధికి కేంద్రం రూ. 169 కోట్లు కేటాయించింది. ఈ వెహికిల్ ఒకేమారు పలు నానో, మైక్రో ఉపగ్రహాలను మోయగలదు. 2021–23 కాలంలో నాలుగు దేశాలతో ఉపగ్రహ ప్రయోగాలకు సంబం ధించి ఇస్రో ఆరు ఒప్పందాలు చేసుకుంది. వీటి ద్వారా సంస్థకు సుమారు 13.2 కోట్ల యూరోల ఆదాయం సమకూరుతుంది. – నేషనల్ డెస్క్, సాక్షి -
2022లోనే చంద్రయాన్-3 ప్రయోగం
న్యూఢిల్లీ: భారతదేశ ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 ప్రయోగాన్ని 2022 మూడో త్రైమాసికంలో చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ నేడు(జూలై 28) తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా దాని పురోగతికి ఆటంకం కలిగిందని నొక్కి చెప్పారు. లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ చంద్రయాన్-3 ప్రయోగాన్ని రీషెడ్యూల్ చేసినట్లు మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ ప్రాజెక్టు పనులకు ఆటంకం కలిగింది అని ఆయన అన్నారు. అయితే, లాక్ డౌన్ సమయాల్లో కూడా ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి పనులు చేసినట్లు పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కాలంలో ఇస్రో శాస్త్రవేత్తలు సాధ్యమైన అన్ని పనులు చేశారు అన్నారు. అన్ లాక్ తర్వాత చంద్రయాన్-3 ప్రాజెక్టు వేగం పెరిగింది, ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులు చివర దశలో ఉన్నట్లు ఆయన చెప్పారు. 2019 జూలై 22న అత్యంత శక్తివంతమైన జియోసింక్రోనస్ లాంచ్ వెహికల్ ద్వారా చంద్రయాన్-2 మిషన్ చేపట్టారు. అయితే, సెప్టెంబర్ 7, 2019న చంద్రుని ఉపరితలం మీద దిగే క్రమంలో విక్రమ్ ల్యాండర్ హార్డ్ ల్యాండ్ అయింది. ఈ ప్రయోగంతో తొలి ప్రయత్నంలోనే చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా దిగిన మొదటి అంతరిక్ష సంస్థగా ఇస్రో నిలవాలని అనుకుంది. కానీ, చంద్రయాన్-2 ప్రయోగం విఫలం కావడంతో ఇస్రో భవిష్యత్తులో చేపట్టేబోయే అంతరిక్ష ప్రయోగాలకు చంద్రయాన్-3 కీలకం కానుంది. -
2022లో చంద్రయాన్–3
న్యూఢిల్లీ: చంద్రునిపైకి మూడో మిషన్ ప్రయోగం చంద్రయాన్–3ని 2022లో ప్రయోగించే అవకాశముందని ఇస్రో చీఫ్ కె.శివన్ వెల్లడించారు. కోవిడ్–19 లాక్డౌన్ కారణంగా ఇస్రో చేపట్టాల్సిన చంద్రయాన్–3 వంటి పలు ప్రాజెక్టులు వాయిదా పడ్డాయని తెలిపారు. వాస్తవానికి చంద్రయాన్–3ని 2020 చివర్లో ప్రయోగిం చాల్సి ఉందన్నారు. చంద్రయాన్–2లో ప్రయోగించిన ఆర్బిటర్‌నే చంద్రయాన్–3లో ఉపయోగిస్తామన్నారు. 2019లో చంద్ర యాన్–2 మిషన్‌లో ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగడంలో విఫలమైన విషయం తెలిసిందే. ఇస్రో భవిష్యత్తులో చేపట్టే గ్రహాంతర ప్రయోగాలకు చంద్రయాన్–3 కీలకం కానుంది. గత ఏడాది డిసెంబర్లో చేపట్టాల్సిన మొట్టమొదటి మానవ రహిత గగన్‌యాన్ ప్రాజెక్టును ఈ ఏడాది డిసెంబర్లో చేపట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు. దీని తర్వాత, మరో మానవ రహిత మిషన్ ప్రయోగం ఉంటుం దని, మూడో విడతలో ప్రధాన ప్రయోగం చేపడతామన్నారు. గగన్‌యాన్ ద్వారా 2022లో ముగ్గురు భారతీయులను అంతరిక్షం లోకి పంపనున్నారు. ఇందుకుగాను ఎంపికైన ముగ్గురు పైలట్లు ప్రస్తుతం రష్యాలో శిక్షణ పొందుతున్నారు. మూడో విడత ప్రయోగించే గగన్‌యాన్ మాడ్యూల్‌కు ఎంతో సాంకేతిక పరిజ్ఞానం అవసరం ఉంటుందన్నారు. సరైన సమయంలో అందుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తామన్నారు. -
వచ్చే ఏడాది చంద్రయాన్-3 ప్రయోగం : ఇస్రో
బెంగళూరు : చంద్రునిపై పరిశోధనలో భాగంగా చంద్రయాన్ ముఖ్యపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చంద్రయాన్ 1, చంద్రయాన్ 2లను ప్రయోగించిన ఇస్రో తాజాగా చంద్రయాన్ 3 ప్రయోగానికి సిద్ధమైంది. వచ్చే ఏడాది మొదట్లో చంద్రయాన్ 3 నిర్వహించనున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా బెంగళూరుకు 215 కిమీ దూరంలో ఉన్న చల్లాకేరెలోని ఉల్లార్తి కావల్లో ఇస్రో ప్రయోగం చేపట్టనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే టెండర్ పనులు పూర్తి చేసినట్లు పేర్కొంది. సెప్టెంబర్ చివరి కల్లా చంద్రయాన్ లో ఉపయోగించనున్న మూన్ క్రెటర్కు సంబంధించిన టెండరింగ్ పనులు పూర్తవుతాయని తెలిపింది. కాగా మూన్ క్రెటర్ వ్యయం రూ. 24.2 లక్షలు కానున్నట్లు పేర్కొంది. చంద్రయాన్ 3కి ఉపయోగించనున్న క్రెటర్ 10 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పు ఉండనుంది. చంద్రయాన్ 3లో ఉయోగించనున్న సెన్సార్స్ చంద్రుని వైపు వేగంగా సాగేందుకు కక్క్ష్యలో ల్యాండర్ సెన్సార్ పరికరాలను అమర్చినట్లు తెలిపింది. దీనికి ఇప్పటికే ల్యాండర్ సెన్సార్ పర్ఫార్మెన్స్ టెస్ట్(ఎల్పీటీ) కూడా నిర్వహించారు. -
చంద్రయాన్ 3 విజయవంతానికి కృషి: శివన్
చంద్రయాన్-3 ప్రయోగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చైర్మన్ కే.శివన్ తెలిపారు. శివన్ మీడియాతో మాట్లాడుతూ..చంద్రయాన్-2 ప్రయోగానికి రూ. 250కోట్లు ఖర్చు కావచ్చని తెలిపారు. చంద్రయాన్-3 కూడా విజయవంతం అవుతుందని తెలిపారు. చంద్రయాన్-3లో ల్యాండర్, ప్రొపల్షన్ మాడ్యుల్ రోవర్ ఉంటాయని అన్నారు. చంద్రయాన్-2 ప్రయోగంతో సైన్స్ డేటాను ఉత్పత్తి చేయడానికి 7 సంవత్సరాలు పనిచేస్తుందని తెలిపారు. చంద్రుడి భూ ఉపరితలంపై పరిశోధనలు జరిపేందుకు ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్–2 చివరి నిమిషంలో విఫలం అవడం పట్ల కే. శివన్, ఇతర శాస్త్రవేత్తలు నిరాశ చెందడం, ప్రధాని నరేంద్ర మోదీ వారిని ఓదార్చిన విషయం తెలిసిందే. 2019లో ఇస్రో విజయాలను శివన్ ప్రస్తావిస్తూ.. కొత్త సంవత్సరంలో ఇస్రో ప్రణాళికలను మీడియాకు తెలియజేశారు. 2020లో చంద్రయాన్-3, గగన్‌యాన్ ప్రయోగాల విజయవంవతం అవ్వడానికి కృషి చేస్తామన్నారు. గగన్‌యాన్ ప్రయోగం దిశగా 2019లో మంచి పురోగతి సాధించాం. అంతరిక్షంలోకి మనుషులను పంపేందుకు భారత్ తొలిసారిగా చేపడుతున్న ప్రయోగం కోసం.. నలుగురు వ్యోమగాములను గుర్తించామని, వీరికి త్వరలోనే శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని శివన్ తెలిపారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ..2020లో చంద్రయాన్-3 ప్రయోగాన్ని ప్రారంభస్తారని.. చంద్రయాన్-2 కంటే చంద్రయాన్-3 చాలా తక్కువ ఖర్చవుతుందని అభిప్రాయపడ్డారు. చివరి నిమిషంలో చంద్రయాన్-2 విఫలమవ్వడం పట్ల శివన్ స్పందిస్తూ..రెండు దశలు కొనసాగిన చంద్రయాన్-2 ప్రయోగంలో మొదటి దశలో చంద్రయాన్ 3,84,400 కిలోమీటర్లు అంతరిక్షంలో విజయవంవతంగా ప్రయాణించిందని అన్నారు. రెండో దశ చాలా క్లిష్టమైందని, అందులోనే కొంచెం విఫలమయ్యామని అన్నారు ప్రపంచంలో చంద్రయాన్-2 ప్రయోగం ద్వారా చంద్రుడి ఉపరితలంపై ప్రవేశించిన మొదటి దేశం భారత్ అని పేర్కొన్నారు. అగ్ర దేశాలైన అమెరికా, చైనా కూడా ఇంత వరకు ప్రయత్నించలేదని శివన్ గుర్తు చేశారు. -
చంద్రయాన్ 3 పై ఇస్రో అధికారిక ప్రకటన