Chevireddy Bhaskar Reddy
-
రాజకీయ స్వార్థంతోనే బాలినేని వ్యాఖ్యలు : చెవిరెడ్డి
సాక్షి,ప్రకాశం జిల్లా : విద్యుత్ కొనుగోలుకు ఒప్పందంపై టీడీపీ నేత బాలినేని శ్రీనివాస్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సెకితో జరిగిన ఒప్పందంపై చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ.. బాలినేని భ్రమలో ఉన్నారు. ఎమ్మెల్సీ కోసం రూ.9 కోట్లు కప్పం కట్టాడని ప్రచారం జరుగుతోంది. అబద్ధాలు ఎలా మాట్లాడాలో బాలినేనిని చూసి నేర్చుకోవాలి. సెకి ఒప్పందం రాష్ట్రానికి ప్రయోజనం. గత టీడీపీ ప్రభుత్వంలో రూ.4.50కు ఒప్పందం జరిగితే.. వైఎస్సార్సీపీ హయాంలో రూ.2.48కే ఒప్పందం జరిగింది. గత టీడీపీ హయాంతో పోల్చుకుంటే 50 శాతం తక్కువే.రాజకీయ స్వార్థంతోనే బాలినేని వ్యాఖ్యలు. ఎనర్జి కమిటీ ఫైల్‌పై బాలినేని సంతకం పెట్టలేదా?.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బాలినేనికి ఉన్న స్వేచ్ఛ ఎవరికీ లేదు.బాబు అపాయింట్మెంట్ కోసమే బాలినేని ఇలా మాట్లాడుతున్నారేమో? బాలినేని మనస్తత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. -
బాబు నిజస్వరూపం బయటపెట్టిన చెవిరెడ్డి
-
పోలీసులకు సవాల్..
-
విచారణ పేరుతో వేధింపులు.. న్యాయ పోరాటం చేస్తా: చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
సాక్షి, తిరుపతి: టీడీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందన్నారు వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. కావాలనే కక్షపూరితంగా కేసులో ఇరికించారని ఆయన మండిపడ్డారు. విచారణ పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, మోహిత్ రెడ్డి ఆదివారం ఉదయం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘నాపై పెట్టిన తప్పుడు కేసులపై న్యాయ పోరాటం చేస్తాం. పులివర్తి నానిపై ఎక్కడా దాడి జరగలేదు. ఘటన జరిగిన 52 రోజుల తర్వాత ఏ-37గా నా పేరును చేర్చారు. ఈ ఘటన జరిగిన రోజు నా ఎదురుగానే జయింట్ కలెక్టర్ కూడా ఉన్నారు. సెల్‌ఫోన్ కూడా లోపలికి తీసుకెళ్లకూడదు అంటే నేను తీసుకెళ్లలేదు. నా ఫోన్‌ను నా పీఏకు ఇచ్చి నేను లోపలికి వెళ్లాను. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోంది. కావాలనే కేసుల్లో ఇరికిస్తున్నారు. సీఆర్‌పీఎసీ 41ఏ కింద నోటీసులు ఇచ్చి ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలని పోలీసులు చెప్పారు. మా నాన్నను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి కేసులు పెడుతున్నారు. మా నాన్నను స్ఫూర్తిగా తీసుకుని పోరాడుతాం. మేము బ్రతికి ఉన్నంత కాలం ప్రజల కోసమే పోరాడుతాం. టీడీపీ నేతలు చంద్రగిరి నియోజకవర్గంలో బీభత్సం సృష్టిస్తున్నారు. మీరు చేసే అన్ని దందాలను ప్రజలకు వివరిస్తాం. ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటాం. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదు’ అంటూ కామెంట్స్ చేశారు. తప్పుడు కేసులతో మనుగడ సాధించలేరు: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిచంద్రగిరి మాజీ ఎమ్మెల్యే అంతకుముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. మోహిత్ రెడ్డిపై 52 రోజులు తర్వాత తప్పుడు కేసు పెట్టారు. మేము నిత్యం ప్రజల్లో ఉండే వాళ్లం. నా పోరాటం ఎలా ఉంటుందో నేను చూపిస్తా అంటున్నాడు మోహిత్ రెడ్డి. తప్పుడు కేసులతో మనుగడ సాధించలేరు. మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే మెజిస్ట్రేట్ ముందు మీరు హాజరుపరచాలి. జడ్జి ముందు హాజరు పరిచే ధైర్యం లేదు. మీరు పెట్టిన తప్పుడు కేసులు చూసి వాళ్లకు ఖచ్చితంగా చివాట్లు పెడతారు.ఒక సెన్సేషనల్ కోసమే అదుపులోకి తీసుకున్నారు. 41 కింద నోటీసు ఇచ్చేందుకు తీసుకు వచ్చారు. మోహిత్ రెడ్డిపై ఏ రకంగా లుక్ అవుట్ నోటీస్ ఇస్తారు. మీ దగ్గర ఆధారాలు ఉంటే జడ్జి ముందు ప్రవేశ పెట్టండి. ఇప్పుడు 41 నోటీస్ ఇచ్చి వదిలి పెట్టారు. తిరుపతి నగరం మొత్తం దిగ్బంధం చేశారు. భారీ ఎత్తున పోలీసులు మోహరింపు ఎందుకు?. 41 నోటీసులు ఇవ్వడానికా ఇంత రాద్దంతం చేస్తారా?. ఓటు వేసిన ప్రజల్ని వదిలేట్టే ప్రసక్తే లేదు. ప్రజలపై ఉన్న కోపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై చూపిస్తున్నారు. పులివర్తి నానిపై దాడి జరగలేదు అని స్విమ్స్ డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. 37 మంది దాడి చేస్తే నానిపై ఒక్కగాయం కూడా కాలేదు. ఈ దాడిలో ఉన్నాడని ఎలా కేసు పెడతారు. కావాలనే కక్ష్య పూరితంగా కేసులో ఇరికించారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
కిలారు రాజేష్ పేరుతో ఎమ్మెల్యే నాని దందాలు
తిరుపతి రూరల్ : చంద్రబాబు, లోకేశ్‌కి దగ్గరి వ్యక్తి అయిన కిలారు రాజేష్ పేరుతో తిరుపతి జిల్లాలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దందాలు, అక్రమాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోపించారు. నాని చర్యలతో అధికారులు, వ్యాపారులంతా భయాందోళనలకు గురవుతున్నారని, ఇలా భయానక వాతావరణం సృష్టించడం చంద్రగిరికి మంచి సంస్కృతి కాదని ఆవేదన వ్యక్తం చేశారు.ఆయన శనివారం తిరుపతిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గాడ్‌ఫాదర్ లాంటి కిలారు రాజేష్ తన చెప్పుచేతల్లో ఉన్నాడని, ఎంత చెబితే అంత చేస్తాడంటూ నాని అధికారులు, వ్యాపారులను బెదిరిస్తున్నట్లు ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌తో ఆయన, రాజేష్ ఉన్న ఫొటోలు, వీడియోలను చూపుతూ వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు ఉద్యోగులు వాపోతున్నారన్నారు. మామూళ్లు ఇవ్వలేదని ఆర్య వైశ్య సంఘం రాష్ట్ర నాయకుడు కిషోర్‌కు చెందిన రైస్ మిల్లును మూయించాడని, వైఎస్సార్సీపీ సర్పంచ్‌కు చెందిన రూ.7 కోట్ల విలువైన రెండెకరాల భూమిని కాజేసేందుకు ప్రయతి్నంచారని తెలిపారు. అంతేకాకుండా తిరుపతి రూరల్ మండలం అవిలాల పంచాయతీలో రూ.250 కోట్ల విలువైన దేవదాయ శాఖకు చెందిన 10 ఎకరాల భూమిని ఆక్రమించారని చెప్పారు. చిత్తూరు నుంచి వంద మంది రౌడీలను తీసుకువచ్చి ఎండోమెంట్ అధికారులను బట్టలు విప్పించి, గదిలో బంధించి, మోకాళ్లపై నిలబెట్టి మరీ దాని చుట్టూ కాంపౌండ్ వాల్ నిరి్మంచారని ఆరోపించారు. ఈ విషయాలన్నీ వివరిస్తూ ఎండోమెంట్ డిప్యూటీ కలెక్టర్ రమే‹Ùనాయుడు జిల్లా కలెక్టర్‌కు, ప్రభుత్వానికి రాతపూర్వకంగా ఫిర్యాదు కూడా చేశారన్నారు.రోజూ రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఇంటికి పిలిపించుకుని డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. గట్టిగా ప్రశి్నంచిన వారిపై చిత్తూరు నుంచి రప్పించిన రౌడీ మూకలకు ముసుగులు వేయించి కత్తులు, రాడ్లు, బ్లేడ్లతో దాడులు చేయిస్తున్నారని తెలిపారు. నాని దందాలు, ఆక్రమణలపైనా విచారణ చేయించాలని అన్నారు. -
చంద్రగిరి రాజకీయం.. సై అంటే సై..
-
ఎమ్మెల్యే పులివర్తి నానికి చెవిరెడ్డి సవాల్
సాక్షి, తిరుపతి: టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని తీరుపై చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మండిపడ్డారు. వ్యక్తిగత విమర్శలు సరైనవి కాదు.. మనిషిలో నిజాయితీ లేనప్పుడు వ్యక్తిగత విమర్శలు చేస్తారంటూ ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న తాను ఏ ఒక్క టీడీపీ నేత, కార్యకర్తను కూడా వేధింపులకు గురిచేయలేదన్నారు.‘‘2014-19 వరకు టీడీపీ ప్రభుత్వంపై పోరాటం చేశాం. నాపై ఎన్నో కేసులు నమోదు చేసినా పోరాడా.. గతంలో మా పార్టీ కోసం ఎన్నో దెబ్బలు తిన్నా... నేనెప్పుడు పార్టీ కోసమే పనిచేశానని తెలిపారు. ‘‘నేను ఏ బాధ్యత తీసుకున్నా సమర్థవంతంగా నిర్వహించాను. టీడీపీ అధ్యక్షుడిగా నువ్వు ఏ రోజైనా పోరాటాలు చేశావా?. ‘టీడీపీ ప్రభుత్వం హయాంలో 2014-19 మధ్య నాపై 88 కేసులు పెట్టారు. 7నెలలు జైల్లో పెట్టారు’’ అంటూ చెవిరెడ్డి ధ్వజమెత్తారు.‘‘2019 నుంచి 2024 వరకు మీ క్వారీలు ఏనాడైనా అపారా?. మీ 12 లారీలు ఏ రోజైన ఆపారా..?. కరెంట్ చార్జీలు బకాయిలు ఉన్నా.. మీ పాలిషింగ్ యూనిట్ నడిచిందా లేదా?. పచ్చటి పల్లెల్లో విద్వేషాలు రెచ్చ గొడుతున్నావు.. మీకుటుంబం పైనా నేను ఆరోపణలు చేయడం నా సంస్కృతి కాదు. కిలారు రాజేష్ పేరుతో దందాలు చేయలేదా?, అధికారులను బెదిరించ లేదా?. కిరోసిన్, పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించలేదా? నేను ఓడిపోతే 4వ తేదీన ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించలేదా?. చంద్రగిరి నియోజకవర్గం రాయలచెరువు రోడ్డు నెలరోజులకే వేశానంటే ప్రజలు ఎలా నమ్ముతారు?’’ అని చెవిరెడ్డి ప్రశ్నించారు‘‘ప్రజలు అధికారం మీకు ఇచ్చారు.. ప్రశ్నించడం మాకు ఇచ్చారు. మేము పోరాటాలకు సిద్ధంగా ఉన్నా, ఏరోజూ వెనక్కు తగ్గం.. నా కుమారుడు మోహిత్ రెడ్డిపై కేసులు పెట్టారు, నా కొడుకు ఏరోజు కేసులకు భయపడే వ్యక్తి కాదు. తుడా పరిధిలో అవినీతిపై మీరు విచారణ చేసుకోవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండా తుమ్మలగుంటలో 133 అడుగుల ఎత్తులో నిర్మాణం చేశాం. జాతీయ జెండా కూడా ఎగర నీయకుండా అడ్డుకున్నది నువ్వు కాదా?. తుడా అధికారులను బెదిరించలేదా?’’ అంటూ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నిలదీశారు. -
పులివర్తి నాని నటనకు చంద్రబాబు నంది అవార్డు ఇవ్వాల్సిందే
-
‘పులివర్తి నాని నటనకు చంద్రబాబు నంది అవార్డు ఇవ్వాల్సిందే’
సాక్షి, తిరుపతి: టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని నటనకు చంద్రబాబు నంది అవార్డు ఇవ్వాల్సిందేనని అన్నారు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. 50 రోజుల కాలంలో 34 మంది వైఎస్సార్సీపీ నేతల ఆస్తులను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. ముసుగులు వేసుకుని వచ్చి అర్ధరాత్రి వైఎస్సార్సీపీ నేతలపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాగా, ఏపీలో ఎన్నికల కౌంటింగ్ అనంతరం జరిగిన దాడులపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పులివర్తి నానిపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. కానీ, ఇప్పుడు ఆయన తన క్వారీని మూసివేసినట్టు చెబుతున్నాడు. సీఎం చంద్రబాబు దగ్గర నన్ను విలన్‌గా చూపించి పులివర్తి పదవులు పొందాలని చూస్తున్నాడు. నాని నటనకు చంద్రబాబు నంది అవార్డు ఇవ్వాలిజపులివర్తి నాని నటన కారణంగా ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు సస్పెండ్ అయ్యారు. ఆయన ఇన్ని డ్రామాలు చేస్తుంటే పోలీసుల సంఘం ఏం చేస్తోంది. సస్పెండ్ అయిన అధికారులు జీతాలు లేక రోడ్లపైకి వచ్చారు. ఎన్నికల్లో ఓడిపోతే నా శవం చూస్తారని, ఇంటింటికీ వెళ్లి నాని ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేశారు. దేనికైనా పోరాటం చేసే వ్యక్తిని నేను. నాకు పోరాటాలు కొత్త కాదు. నా ఓపికను బలహీనతగా అనుకోవద్దు. ఇంకా ఎన్ని గొడవలు చేస్తారో చేయ్యండి. చర్యకు ప్రతి చర్య కచ్చితంగా ఉంటుంది. అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. న్యాయం, ధర్మం కోసం పనిచేయండి. అన్యాయంగా అధర్మంగా పని చేయడానికి వచ్చే అధికారులను వదిలిపెట్టను. ఇకపై పూర్తి సమయం కేడర్‌తోనే ఉంటాను’ అని చెప్పారు. -
ఎంతవరకైనా సిద్ధం..
-
కార్యకర్తలకు అండగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
-
పులివర్తి నానికి గాయాలవ్వలేదు, ఆయనదంతా డ్రామా: చెవిరెడ్డి
సాక్షి, తిరుపతి: చంద్రగిరిలో అల్లర్లపై స్పందించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. పులివర్తి నానిని తాను రాజకీయ ప్రత్యర్థిగానే చూశానని..తనపై ఎన్ని విమర్శలు చేసినా తిరిగి విమర్శ చేయలేదని తెలిపారు. తన బావ మరిదిపై పులివర్తి నాని చేయి చేసుకున్నాడని, నామినేషన్ రోజు తన కారుపై దాడి చేశారని మండిపడ్డారు. తనను ఎంత ఇబ్బంది పెట్టినా నానిపై ఒక్క కేసు పెట్టలేదని పేర్కొన్నారు.శ్రీ పద్మావతి వర్సిటీ వద్ద ఘర్షణలో నానికి గాయాలు కాలేదని, అక్కడి నుంచి యాక్టివ్‌గా నాని నడుచుకుంటూ వెళ్లిపోయారని అన్నారు. రెండు గంటల తర్వాత వీల్‌చైర్‌లో ఉన్నాడని, ఇదంతా డ్రామా అని తెలిపారు. పులివర్తి నాని డ్రామాల వల్ల నియోజకవర్గంలో శాంతి భద్రతలు దెయ్యతిన్నాయని విమర్శించారు.‘ఎవరినో విమర్శలు చేయాలని, తప్పు పట్టడం నా ఉద్దేశ్యం కాదు. ఒక అవాస్తవం ప్రచారం చేస్తుంటే...వాస్తవాలు మీ దృష్టికి తీసుకువస్తున్నా. సామాజిక శాస్త్రంలో పట్టా పుచ్చుకున్న వాడిని, న్యాయ శాస్త్రంలో పట్టా పుచుకున్నవాడిపి. కర్మ సిద్ధాంతం నమ్ముకున్న వాడిని. గత అయిదేళ్లుగా నాపై విమర్శలు చేస్తున్నా, ఏ రోజు చిన్న విమర్శ చేయలేదుజచంద్రగిరిలో నారా లోకేష్ పాదయాత్ర చేస్తే ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగలేదు. నారా భువనేశ్వరి పర్యటన చాలా ప్రశాంతంగా జరిగింది. పులివర్తి నాని , అతని భార్య అసభ్య పదజాలంతో నన్ను రోజు తిడుతూ ఉన్నారు. పోలింగ్ రోజు మోహిత్ కారు దగ్ధం చేశారు. సర్పంచ్ ఇంటికి నిప్పు పెట్టారు. సుధాకర్ అనే వ్యక్తి కాలికి బుల్లెట్ దిగింది, చెన్నై అపోలో చికిత్స పొందుతూ ఉన్నాడు. కాలికి తీవ్రగాయం అయ్యింది. మాపై విష ప్రచారం చేస్తున్నారు,పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి చిత్తూరు మహానటి ప్రదర్శన చేశారు. స్విమ్స్ ఆసుపత్రిలో పేషెంట్‌ను చూసేందుకు వచ్చిన బంధువుపై దాడి చేశారు. నాయకుడు అనేవాడు ఆదర్శంగా ఉండాలి. ’ అని తెలిపారు. -
చంద్రగిరిలో చిత్తూరు రౌడీయిజం
సాక్షి, తిరుపతి: ఓటమి భయంతో కూటమి అభ్యర్థులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి పోలింగ్ శాతాన్ని తగ్గించాలని పక్కా ప్లాన్‌తో విధ్వంసాలు సృష్టించారు.అల్లర్లు సృష్టించి..అసత్యాలకు పదును పెట్టి ఎన్నికల్లో అల్లర్లు, విధ్వంసాలు సృష్టించేందుకు కూటమి అభ్యర్థులు నోటిఫికేషన్ వెలువడక ముందు నుంచే విధ్వంసాలకు పథక రచన చేశారు. అందులో భాగంగానే నామినేషన్ రోజున ఆర్డీఓ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వాహనంపై దాడికి తెగబడ్డారు. ఆపై విచక్షణారహితంగా పోలీసులపైన, వైఎస్సార్సీపీ శ్రేణులపై రాళ్ల వర్షం కురిపించారు. మరోవైపు తిరుపతి నగరంలో జరుగుతున్న ప్రచారంలో జనసేన రౌడీలు స్థానికులు, వైఎస్సార్సీపీ శ్రేణులపైన దాడులకు తెగబడ్డారు. ఇదంతా కుట్రలో భాగమేనని ఓటర్లు చర్చించుకుంటున్నారు. రిగ్గింగ్‌ని అడ్డుకున్నందుకే విధ్వంసాలు పోలింగ్ రోజు చంద్రగిరి నియోజకవర్గ ఓటర్లంతా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికే పట్టం కడుతున్నారన్న విషయాన్ని గ్రహించిన కూటమి అభ్యర్థి పులివర్తి నాని అనుచరులు రామంద్రాపురం మండలం, బ్రాహ్మణకాలువ పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్‌కు యతి్నంచారు. తమకు అడ్డుగా ఉన్న దళిత ఏజెంట్‌ని బయటకు లాక్కొచ్చి అతనిపై దాడిచేశారు. వైఎస్సార్సీపీ పాకాల మండల పార్టీ అధ్యక్షులు నంగా నరే‹Ùరెడ్డి కుమారుడు లవంత్రెడ్డిపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. తర్వాత పులివర్తివారి పల్లెలో రిగ్గింగ్‌కు యతి్నంచారు. వైఎస్సార్సీపీ ఏజెంట్‌పై మాజీ జెడ్పీటీసీ సురేష్ చౌదరి, పులివర్తి నాని కుమారుడు వినీల్ దాడికి దిగారు. నారావారిపల్లె పరిధిలోని పోలింగ్ కేంద్రంలో ఉన్న వైఎస్సార్సీపీ ఏజెంట్‌పైనా టీడీపీ మూకలు దాడిచేశారు. అదేవిధంగా కూచువారిపల్లె పరిధిలోని పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్‌కి అడ్డుగా ఉన్న వైఎస్సార్సీపీ ఏజెంట్ రాజశేఖర్‌ని, రిలీవ్ ఏజెంట్‌గా ఉన్న సర్పంచ్ కొట్టాల చంద్రశేఖర్‌రెడ్డిపై దాడి చేశారు. చంద్రశేఖర్‌రెడ్డి ఇంటిని ధ్వంసం చేశారు. గ్రామానికి చేరుకున్న చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిపై దౌర్జన్యానికి దిగారు. మోహిత్‌రెడ్డి వాహనానికి నిప్పు పెట్టి, మరో ఎస్కార్ట్ వాహనాన్ని ధ్వంసం చేశారు. కార్యకర్తలపై దౌర్జన్యం చేశారు. కూచువారిపల్లెలో కార్యకర్తలను బేడ్లతో కోసి రక్త గాయాలు చేశారు.అక్కడే ఎందుకు తిష్ట? పోలింగ్ రోజున ఎటూ ఓటింగ్ శాతాన్ని తగ్గించలేకపోయామని భావించిన కూటమి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని అనుచరులు రెచ్చిపోతున్నారు. మహిళా విశ్వవిద్యాలయం ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉండగా స్ట్రాంగ్ రూమ్ పరిసరాల్లో పులివర్తి నాని అనుచరులు మారణాయుధాలతో పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ పరిధిలో ఉన్న రౌడీ మూకలు మహిళా యూనివర్సిటీ సమీపంలో వైఎస్సార్సీపీ స్టిక్కర్‌తో ఉన్న ద్విచక్ర వాహనాన్ని కిందపడేసి ధ్వంసం చేశారు. ఆపై దానికి నిప్పంటించారు. అదేవిధంగా వైఎస్సార్సీపీ నాయకుడికి కారును కూడా ధ్వంసం చేశారు. -
ప్రకాశం: ఎస్పీని కలిసిన బాలినేని, చెవిరెడ్డి
సాక్షి, ప్రకాశం జిల్లా: ఒంగోలులో పోలింగ్ సజావుగా జరగకుండా టీడీపీ కుట్ర పన్నుతోందని ఎస్పీకి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. టీడీపీ గొడవలకు ప్లాన్ చేస్తోంది. మాకు ఉన్న సమాచారంతో ఎస్పీకి ఫిర్యాదు చేశాం. టీడీపీ ‘‘వుయ్’’ యాప్‌లో ఓటర్ల డేటా తీసుకొని మహిళలకు భద్రత లేకుండా చేస్తున్నారు. ‘వుయ్’ యాప్‌పై పోలీసులు చర్యలు తీసుకోవాలని బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కోరారు. -
30 ఏళ్ళు మహానేతతో ఉన్న..సీఎం జగన్ గురించి ఒక్కటే చెప్తున్నా
-
ఎన్ని పార్టీలు ఏకమైనా యుద్ధానికి సీఎం జగన్ సిద్ధం: చెవిరెడ్డి
సాక్షి, బాపట్ల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పుడూ రైతులు గురించే ఆలోచించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. అద్దంకి మేదరమెట్లలో ఆదివారం అత్యంత ప్రతిష్టాత్మకంగా వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న సిద్ధం సభలో చెవిరెడ్డి ప్రసంగించారు. ‘సీఎం జగన్ ప్రతి ఊర్లో రైతు భరోసా కేంద్రాన్ని పెట్టారు. మహిళలు, విద్యార్థులకు ఎంతో చేశారు. ఒకటో తేదీనే రూ.3 వేల పెన్షన్ అందిస్తున్నారు. ఎన్ని పార్టీలు ఏకమై వచ్చినా యుద్ధానికి జగన్ సిద్ధం. సంక్షేమానికి సీఎం జగన్ సిద్ధం అంటున్నారు’ అని చెవిరెడ్డి తెలిపారు. -
వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎంగా గెలిపించుకుందాం: బాలినేని
సాక్షి, ప్రకాశం : జిల్లా వైఎస్సార్సీపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. దర్శి వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డిలు కలిసి ప్రారంభించారు. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్‌గా చెవిరెడ్డి నియమించబడిన తర్వాత మొదటిసారిగా మాజీమంత్రి బాలినేనితో కలిసి పార్టీ కార్యక్రమానికి హాజరు కావడం గమనార్హం. అంతకు ముందు.. ఈ ఉదయం ఒంగోలులో బాలినేని నివాసంలో బాలినేనితో భేటీ అయిన చెవిరెడ్డి ,అనంతరం ఇద్దరు కలిసి ఒకే కారులో దర్శి వచ్చారు. దీంతో పార్టీ కేడర్‌లో జోష్ నెలకొంది. దర్శి నియోజకవర్గ ఇంచార్జి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని నేతలు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి జిల్లాలో అన్ని సీట్లు గెలిపించుకునేందుకు అందరం సమిష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. నాయకులు మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం కృషి చేద్దామన్నారు. మన నాయకుడు వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకునేందుకు పట్టుదలతో పని చేద్దాం. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని గెలిపించుకునేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, పేదలను గుండెల నిండా నింపుకున్న పార్టీ వైఎస్సార్సీపీ అని.. ప్రజా బలంతో పేదల అండతో సీఎం జగన్ ముందుకెళ్తున్నారన్నారు. అసంతృప్తులు, మనస్పర్ధలను పక్కనపెట్టి అందం సీఎం జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇదీ చదవండి: వైఎస్సార్సీపీని వీడే ప్రసక్తే లేదు: ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి -
కాలినడకన వెళ్లి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి
-
ఆరోగ్య చంద్రగిరే చెవిరెడ్డి అభిమతం!
తిరుపతి రూరల్: చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్యం అందించాలన్నదే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అభిమతమని, అందులో భాగంగానే ఉచిత మెగావైద్య శిబిరాలను ఏర్పాటు చేశారని, రూ.3 వేల ఖరీదైన 43 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా చేయించారని తిరుపతి జిల్లా కలెక్టర్ కే.వెంకటరమణారెడ్డి కొనియాడారు. ఆరు నెలల క్రితం చంద్రగిరిలో చేపట్టిన ఉచిత మెగా ఆరోగ్య పరీక్షల కార్యక్రమం స్ఫూర్తితోనే జగనన్న ఆరోగ్య సురక్ష పథకం రాష్ట్రంలో పురుడుపోసుకుందని చెప్పారు. చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన ఉచిత మెగా వైద్యశిబిరాలు విజయవంతం కావడంతో సోమవారం తిరుపతి రూరల్ మండల పరిధిలోని రామానాయుడు కల్యాణ మండపంలో విజయోత్సవ సభను నిర్వహించారు. మెగా ఆరోగ్య పరీక్షల కార్యక్రమంలో భాగస్వామ్యులైన 9,700 మంది అధికారులు, సిబ్బందికి రైస్ కుక్కర్లను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కలెక్టర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఏ పనిచేసినా పట్టువదలకుండా విజయవంతంగా పూర్తిచేస్తారన్నారు. ఆరు నెలల క్రితం చంద్రగిరి నియోజకవర్గంలో ప్రారంభమైన ఉచిత మెగావైద్య శిబిరాలను ప్రభుత్వం నిశితంగా గమనించిందన్నారు. ఆ వైద్య శిబిరాలకు ప్రజల నుంచి వచ్చే స్పందన, ఆరోగ్యం పట్ల జనం చూపిన శ్రద్ధ వంటి విషయాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని అమలు చేసిందన్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లోనూ అధికారుల వద్ద ప్రస్తావించారని గుర్తుచేశారు. అంతకుముందు తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి మాట్లాడుతూ చంద్రగిరి ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలిచే ఎమ్మెల్యే చెవిరెడ్డి ఉండడం నిజంగా ఈ నియోజకవర్గ ప్రజల అదృష్టమన్నారు. తుడా వీసీ హరిక్రిష్ణ మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడేలా ఉచిత మెగా వైద్య శిబిరాలు ఏర్పా టు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో తుడా కార్యదర్శి లక్ష్మి, డిప్యూటీ కలెక్టర్ భాస్కర్‌నాయుడు, ప్రివియా హెల్త్ సంస్థ నిర్వాహకులు ఫణీతో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆరు మండలాలు.. ఆరు నెలలు.. 1.22 లక్షల మందికి పరీక్షలు ఆరు మండలాలు.. 109 గ్రామ సచివాలయాలు.. ఆరు నెలలు.. 500పైగా ఉచిత మెగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి 1.22 లక్షల మందికి వైద్య పరీక్షలు పూర్తిచేయించారు. ప్రతి గ్రామంలో శిబిరం ఏర్పాటు చేసి రక్త పరీక్షలతో పాటు గుండె పరీక్షలు చేయించారు. గుండె పరీక్షల్లో అత్యంత ప్రమాదకర పరిస్థితులు కలిగిన వారిని గుర్తించి పెద్ద ఆస్పత్రిలకు పంపి సకాలంలో వైద్య సేవలు అందించారు. ఇలా నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 3 వేల మందిని ప్రాణాపాయం నుంచి ఎమ్మెల్యే చెవిరెడ్డి రక్షించారు. అసాధ్యాలను సుసాధ్యం చేశారు చంద్రగిరిలో ఏ కార్యక్రమం చేసినా రాష్ట్రమంతా చెప్పుకుంటారని, అసాధ్యాలను సుసాధ్యం చేయగల సత్తా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మాత్రమే ఉంటుందని తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి వెల్లడించారు. ఉచిత మెగా వైద్య శిబిరాల వల్ల ఎంతో మంది నిరుపేదలకు ఆరోగ్యాన్ని అందించామన్న ఆత్మ సంతృప్తి కలుగుతోందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 60 వేల మందికిపైగా ఈసీజీ తీస్తే అందులో సుమారు 3వేల మందికి హఠాత్తుగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉన్నట్టు గుర్తించగలిగామన్నారు. తొండవాడ పంచాయతీ కార్యదర్శి నజిరీన్ బేగం భర్తకు ఈసీజీ తీసిన వెంటనే అత్యంత ప్రమాదకరంగా ఉందని గుర్తించి స్విమ్స్ ఆస్పత్రికి తరలించామని చెప్పారు. అక్కడి వైద్యులు ఆగమేఘాలపై యాంజియో తీసి స్టంటు వేసి ప్రాణం నిలబెట్టారంటూ కన్నీరు పెట్టుకున్నారు. 9,700 మందికి రైస్ కుక్కర్లు పంపిణీ ఉచిత వైద్య శిబిరాలు విజయవంతం కావడానికి కష్టపడిన ప్రభుత్వ వైద్యాధికారులు, వైద్య, ఆరోగ్య సిబ్బంది, పారా మెడికల్ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు, ఆశావర్కర్లు, 104 సిబ్బందితో పాటు ప్రివియా హెల్త్ సంస్థ ప్రతినిధులు, మండల స్థాయి అధికారులు అందరినీ విజయోత్సవ సభకు ఆహ్వానించి పది రకాల వంటకాలతో శాఖాహార భోజనం ఏర్పాటు చేశారు. సభకు హాజరైన 9,700 మంది ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ 7.5 లీటర్ల మల్టీ పర్పస్ రైస్ కుక్కర్లను బహుమతిగా అందించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డితో పాటు ఆయన సతీమణి చెవిరెడ్డి లక్ష్మి, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి వారికి సర్టిఫికెట్లతో పాటు బహుమతులను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలే నా కుటుంబం.. వారి కోసం ఏదైనా చేస్తా.. ‘చంద్రగిరి నియోజకవర్గ ప్రజలే నా కుటుంబంగా భావించాను.. వారి క్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాను.. కరోనా వంటి కష్టం వచ్చినా.. వరదలు వంటి విపత్తు వచ్చినా.. పండుగలు వచ్చినా.. పర్వదినాలైనా అందరికీ మంచి చేయాలన్న తపనతో వారి వెంట నిలబడుతున్నాను. నా కుటుంబం వేరు కాదు.. నా ప్రజలు వేరు కాదని బలంగా నమ్మిన వ్యక్తిని కనుకనే నా బిడ్డ మోహిత్‌రెడ్డికి కూడా ఈ వేదికపై నుంచి సూచిస్తున్నా.. రాజకీయాల్లోకి వచ్చాక కుటుంబం వేరు, ప్రజలు వేరు అనుకుంటే రాజకీయనాయకుడే అవుతావు.. కుటుంబం, ప్రజలు ఇద్దరూ ఒక్కటే అనుకుంటే నాయకుడు అవుతావు’ అంటూ ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రజలపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు అత్యధిక సమయం విజయవాడలో గడపాల్సి వస్తున్నందున తన బిడ్డ మోహిత్‌రెడ్డిని తనలాగా ఆదరించి ఆశీర్వదించాలని ఆయన విజ్ఞిప్తి చేశారు. -
ఏపీలో పవన్ పొలిటికల్ భవిష్యత్‌పై మంచు విష్ణు కామెంట్!
మంచు విష్ణు, వర్సిటైల్ యాక్టర్ మంచు మోహన్‌బాబు కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా తర్వాత తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకుని పలు సేవా కార్యక్రమాలతో పాటు సినిమా రంగంలోని పేద కళాకారులకు సాయం చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. అందులో భాగంగానే అయన్ను వారు 'మా అధ్యక్షుడి'గా కూడా ఎన్నుకున్నారు. ప్రస్తుతం ఆయన 'భక్త కన్నప్ప' సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన ప్రముఖ యూట్యూబ్ ఛానల్లో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఏపీలో పవన్ రాజకీయాలపై పవన్ రాజకీయాల గురించి చెప్పడానికి నేనే ఏమైనా బ్రహ్మంగారినా..? అంటూ మంచు విష్ణు ఇలా చెప్పుకొచ్చా రు. 'పవన్ సినిమాల గురించి అయితే చెప్పగలుగుతాను. సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఆయన సూపర్ స్టార్. సందేహమే లేదు. పవన్‌కు సంబంధించి ఒక సినిమా ఆడకపోయిన మరో సినిమాలో అయినా మంచి కలెక్షన్స్ వస్తాయి. కానీ ఆయన రాజకీయాల గురించి మాత్రం చెప్పలేను.' అని అన్నారు. రాజకీయాల విషయంలో ప్రజలు చాలా స్మార్ట్‌గా ఉన్నారని మంచు విష్ణు అన్నారు. సినిమా వస్తే చూస్తారు. కానీ ఓటేయాలనుకున్నప్పుడు వాళ్లకు నచ్చిన వ్యక్తికే ఓటేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమా రంగానికి చెందిన మహానుభావులు లాంటి వారే రాజకీయాల్లో ఓడిపోయారని ఆయన గుర్తు చేశారు. ఒక్కోసారి పాలిటిక్స్‌లో పేరుపొందిన లెజండరీ పర్సన్స్‌ను కూడా ప్రజలు ఓడించారన్నారు. రాజకీయాల ద్వారా ఎవరైతే తన గ్రామాన్ని, తన దేశాన్ని, తన జీవితాన్ని బాగుచేస్తారని నమ్మితే వారివైపే ప్రజలు ఉంటారని ఆయన తెలిపారు. మరో ఆరు నెలలు ఆగితే రాజకీయాల్లో పవన్ భవిష్యత్ ఏమిటనేది చెబుతానని విష్ణు అన్నారు. (ఇదీ చదవండి: పవన్‌తో విడాకుల టైమ్‌లో జరిగింది ఇదే.. రేణుదేశాయ్ వైరల్ కామెంట్స్) ప్రస్తుతం తన ఏకాగ్రత సినిమాలపై ఉందని పేర్కొన్నారు. భారీ బడ్జెతో 'భక్త కన్నప్ప' సినిమా తీస్తున్నామని ఆయన ప్రకటించారు. ఇందులో భారీగా ఆగ్ర నటులు ఉంటారని ఆయన తెలిపారు. ఈ సినిమా కోసం తన మార్కెట్‌కు మించి బడ్జెట్ పెడుతున్నామని, అందుకోసం రూ.150 కోట్లకు పైగానే ఖర్చుచేస్తున్నామని మంచు విష్ణు తెలిపారు. అతను నా తమ్ముడు.. ఏపీ రాజకీయాలపై తాను చంద్రగిరిలో పోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని విష్ణు ప్రకటించారు. అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వాల్లబ్బాయి మోహిత్‌నే చంద్రగిరిలో నిలబడబోతున్నాడని తెలుస్తోంది. మోహిత్ నా తమ్ముడు. అతన్ని నేను చాలా అభిమానిస్తాను. అవసరమైతే అతనికి సపోర్ట్ చేస్తానని కూడా ఆ ఇంటర్వ్యూలో విష్ణు పేర్కొన్నారు. ఏపీలో నవరత్నాలు ప్రోగ్రాం చాలా బాగుంది. దాని వల్ల చాలా మంది పేద ప్రజలు లబ్ధిపొందుతున్నారు. దీనిని బట్టి చూస్తే ఏపీలో మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోన్ రెడ్డిగారే అని ఆయన పేర్కొన్నారు. ఇదే విషయాన్ని దేశంలో పేరుపొందిన ఎన్నికల సర్వేలన్నీ తెలుపుతున్నాయని ఆయన గుర్తుచేశారు. -
తుడా ఛైర్మన్‌గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
సాక్షి, తిరుపతి: చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(తుడా) ఛైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో చెవి రెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు
-
సామాన్య భక్తులకే ప్రాధాన్యం
సాక్షి, తిరుపతి/తిరుమల: సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం చేయించడానికే ప్రాధాన్యత ఇస్తానని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి చెప్పారు. ఆయన టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో టీటీడీ ఈవో ఎ.వి.ధర్మారెడ్డి.. భూమన కరుణాకరరెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం అన్నమయ్య భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కరుణాకరరెడ్డి మాట్లాడుతూ స్వామి సేవకులకు సేవకుడిగా పనిచేస్తానన్నారు. శ్రీవేంకటేశ్వరస్వామి దయ, ఆశీస్సులతో తనకు రెండోసారి టీటీడీ చైర్మన్‌గా సేవచేసే మహద్భాగ్యం దక్కిందన్నారు. ఇంతటి అదృష్టం ఇచ్చిన స్వామికి, మరోసారి పనిచేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సనాతన హిందూధర్మాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయడంతోపాటు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేలా తమ ధర్మకర్తల మండలి పనిచేస్తుందని చెప్పారు. స్వామి వైభవాన్ని ప్రజల హృదయాల్లో తీర్చిదిద్దేలా వారిలో ఆధ్యాత్మిక వెలుగులు నింపుతామని, స్వామిని భక్తుల దగ్గరికే తీసుకెళ్లి భక్తిప్రసాదం పంచుతామని తెలిపారు. దేశవిదేశాల్లోని హిందువులందరినీ ఏకతాటిపైకి తెచ్చి హిందూ ధర్మాన్ని ప్రచారం చేసేలా టీటీడీ నాయకత్వం వహిస్తుందని చెప్పారు. తాను 2006 నుంచి 2008 వరకు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు సనాతన హిందూధర్మాన్ని దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేశామని, సామాన్య భక్తులకు అవసరమైన వసతులు కల్పించటమేగాక సామాజిక సేవాకార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ద్వారా ఉద్యోగులకు ఇంటిస్థలాలు ఇచ్చామన్నారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సహకారంతో ఉద్యోగులకు ఇంటిస్థలాలు ఇప్పిస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు ఆర్.కె.రోజా, అంబటి రాంబాబు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మోహిత్‌రెడ్డికి అడుగడుగునా బ్రహ్మరథం
పాకాల : మండలంలోని పంటపల్లె పంచాయతీలో వైఎస్సార్ సీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బుధవారం పంటపల్లె పంచాయతీలో మోహిత్‌రెడ్డి గడప గడపకు మహా పాదయాత్ర సాగింది. ఇంటింటికీ వెళ్లి ఆయన ప్రజలతో మమేకమయ్యారు. పథకాల ద్వారా పొందిన లబ్ధిని వివరించి సంక్షేమ బావుటా బుక్‌లెట్‌ను అందించారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకు వస్తే వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులపై ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపారు. జగనన్న పాలనలో రామరాజ్యం ముఖ్యమంత్రి జగనన్న పాలనలో ప్రజలు రామరాజ్యాన్ని చూస్తున్నారని చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ జగనన్న చేదోడు పథకంతో మహిళలను ఆర్థికంగా బలపడుతున్నారని తెలిపారు. హామీలను నెరేవేర్చిన ఏకై క సీఎంగా జగనన్న చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. అద్భుతమైన పథకాల అమలుతో రాష్ట్రంలో జనరంజక పాలన కొనసాగుతోందని తెలిపారు. ప్రజలంతా జగనన్న వైపే ఉన్నారని, రానున్న ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం తథ్యమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తన కుటుంబసభ్యుల కంటే నియోజకవర్గ ప్రజలనే ఎక్కువగా అభిమానిస్తారని వివరించారు. నిరంతరం ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలనే తపనతో పని చేసే వ్యక్తి మన ఎమ్మెల్యే అని గుర్తు చేశారు. 2024 ఎన్నికల్లో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, తనను ఆశీర్వదించి గెలిపించాలని మోహిత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎంపీపీ లోకనాథం, వైఎస్సార్ సీపీ కన్వీనర్ నంగా నరే ష్‌రెడ్డి, నాయకులు వల్లివేడు విక్రమ్‌రెడ్డి, మునీశ్వర్‌రెడ్డి, రఘుపతి, కపిలేశ్వర్‌రెడ్డి, సర్పంచ్ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. -
కల్యాణ వెంకన్న వేద పాఠశాలకు టీటీడీ సంపూర్ణ సహకారం
తిరుపతి రూరల్: తుమ్మలగుంటలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వేద పాఠశాలకు టీటీడీ సంపూర్ణ సహకారం అందిస్తుందని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. తుమ్మలగుంటలోని ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న శ్రీకళ్యాణ వేంకటేశ్వర వేద పాఠశాల మొదటి స్నాతకోత్సవం గురువారం వైభవంగా సాగింది. ఒక్కొక్క విద్యార్థికి రూ.3 లక్షల నగదు, వెండి డాలరు, యోగ్యతాపత్రం ఈ వేడుకకు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 8 సంవత్సరాల పాటు శుక్ల, యజుర్వేదం విద్యను అభ్యసించిన విద్యార్థులకు యోగ్యతా పత్రాలను అందజేశారు. చెవిరెడ్డి సొంత నిధులతో ఒక్కొక్క విద్యార్థికి రూ.3 లక్షల నగదు, 10 గ్రాములు వెండి డాలరును బహూకరించారు. అవకాశం దేవుడిచ్చాడు, సంకల్పం చెవిరెడ్డి తీసుకున్నారు ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ వేదవిద్య పరిరక్షణ బాధ్యత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు తీసుకోవడం చాలా గొప్ప విషయమన్నారు. వేద పాఠశాల నిర్వహణ చాలా కష్టతరమైనదని, అయినా చెవిరెడ్డి దంపతులు వేద పాఠశాల నిర్వహణకు సంకల్పించడం అభినందనీయమని కొనియాడారు. నేటి కాలంలో చెవిరెడ్డి వంటి వ్యక్తులు అరుదుగా ఉంటారన్నారు. ఏ పని అయినా ముందుండి కష్టపడి ఇలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగే వ్యక్తులను తన 58 ఏళ్ల కాలంలో ఎక్కడా చూడలేదన్నారు. నాడు నలుగురు.. నేడు ప్రపంచ స్థాయి నలుగురు విద్యార్థులతో ప్రారంభమైన వేద పాఠశాలను నేడు 200 మంది విద్యార్థులతో 25 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దేందుకు సంకల్పించడం శుభ పరిణామమన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు, స్వామిపై చెవిరెడ్డికి ఉన్న అపారమైన నమ్మకంతో వేద పాఠశాల విజయవంతంగా అభివృద్ధి పథంలో పయనించాలని ఆకాంక్షించారు. టీటీడీ తరఫున తుమ్మలగుంట వేద పాఠశాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. శ్రీవారి కటాక్షంతోనే వేద పాఠశాల తుమ్మలగుంట శ్రీకళ్యాణ వేంకటేశ్వర వేద పాఠశాల నిర్వహణ దైవ సంకల్పమని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. ఏ గ్రామంలో అయితే భగవంతుడికి మూడు పూటలా నైవేద్యం పెడతారో.. ఆ గ్రామంలో ప్రజలకు ఆహార కొరత ఉండదన్న టీటీడీ మాజీ ఈఓ అజయ్‌కల్లాం మాటలతోనే శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి పునాది పడిందని గుర్తుచేశారు. వేదిక్ యూనివర్సిటీ గుర్తింపు ఆ తరువాత అనేక నిర్మాణాలు వాకింగ్ ట్రాక్, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యాయామం చేసి, వ్యాయామశాలను ప్రారంభించారని వెల్లడించారు. ఈ క్రమంలోనే వేద పాఠశాల నిర్వహణకు అడుగులు పడ్డాయన్నారు. నేడు దాదాపు 200 మంది విద్యార్థులకు చేరడం దైవ సంకల్పమేనన్నారు. పాఠశాలకు టీటీడీ వేదిక్ యూనివర్సిటీ గుర్తింపు ఇచ్చిందని చెప్పారు. అతి పెద్ద పాఠశాల ఇక్కడే టీటీడీ వేద పారాయణ పథకం కింద అధ్యాపకుల నియామకానికి సహకారం అందించేందుకు టీటీడీ పాలక మండలి ఆమోదం లభించిందని తెలిపారు. దేశంలోనే కాక, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 25 ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద వేద పాఠశాలను తుమ్మలగుంటలో నిర్మించనున్నట్లు తెలిపారు. వేద పాఠశాల అభున్నతికి సంపూర్ణ సహకారం అందించాలని ధర్మారెడ్డిని కోరారు. ఉద్యోగ విరమణ అనంతరం వేద పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. అందరి ఆశీస్సులు జయేంద్ర సరస్వతి, చిన్నజీయర్ స్వామి తుమ్మలగుంట వేదపాఠశాలకు విచ్చేసి వేద విద్య ఆవశ్యకతను తెలియజేశారని గుర్తుచేశారు. తుమ్మలగుంట వేద పాఠశాల చైర్పర్సన్ చెవిరెడ్డి లక్ష్మి, ప్రిన్సిపల్ బ్రహ్మాజీ శర్మ, వేదిక్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ రాధేశ్యామ్, టీటీడీ ప్రాజెక్ట్ ఆఫీసర్ విభీషణ శర్మ, వేదిక్ యూనివర్సిటీ అధికారులు ముష్టి పవన్, ఫణియాజుల, కేంద్రీయ సంస్కృత విద్యా పీఠం ప్రొఫెసర్ రాఘవన్, తుడా సెక్రటరీ లక్ష్మి తదితరులు ప్రసంగించారు.