Chitoor distict
-
చిత్తూరులో రూ.250 కోట్లతో.. అమరరాజా కొత్త ప్లాంట్
సాక్షి, అమరావతి : చిత్తూరు జిల్లా తేనిపల్లి వద్ద రూ.250 కోట్లతో కొత్త తయారీ యూనిట్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు అమరరాజా గ్రూపు ప్రకటించింది. అమరరాజా గ్రూపునకు చెందిన మంగళం ఇండస్ట్రీస్ 2.15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆటో బ్యాటరీ విడిభాగాల తయారీ యూనిట్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ యూనిట్ ద్వారా దేశంలోని ప్రముఖ కంపెనీలకు సరఫరా చేసేలా ఆటో విడిభాగాలు, మెటల్ ఫాబ్రికేషన్, బ్యాటరీ విడిభాగాలను డిజైన్ చేసి సరఫరా చేయనున్నట్లు పేర్కొంది. ఇక ఈ ప్రాంతంలో తమ వ్యాపార విస్తరణకు కట్టుబడి ఉన్నట్లు కూడా అమరరాజా గ్రూపు సహ వ్యవస్థాపకుడు జయదేవ్ గల్లా ఆ ప్రకటనలో స్పష్టంచేశారు. స్థానికులకు ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని, రానున్న కాలంలో ఈ కొత్త యూనిట్ ఏర్పాటు ద్వారా మరో 1,000 మంది స్థానికులకు ఉపాధి కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. అమరరాజా గ్రూపు 15,000 మందికి ఉపాధి కల్పిస్తుండగా అందులో మంగళం గ్రూపు 3,000 మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. ఇంధన పరికరాల ఉత్పత్తిపై దృష్టి మరోవైపు.. సుస్థిర ఇంధన అవకాశాలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నామని, ఇందులో భాగంగా సౌర విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన పరికరాల ఉత్పత్తిపై దృష్టిసారిస్తున్నట్లు మంగళం ఇండస్ట్రీస్ డైరెక్టర్ హర్షవర్థన్ గోగినేని కూడా ఆ ప్రకటనలో తెలిపారు. ఈ కొత్త ప్లాంట్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే నిర్మాణ పనులను ప్రారంభిస్తామన్నారు. (చదవండి: రాష్ట్రంలో తొలి టెన్నిస్ అకాడమీ) -
తుఫాన్ ప్రభావంతో చిత్తూరు జిల్లా యంత్రాంగం అలర్ట్
-
యశ్వంతపూర్ - హౌరా ఎక్స్‌ప్రెస్ లో మంటలు
-
చిత్తూరు జిల్లాలో ఐటీ కంపెనీ
సాక్షి,చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం సమీపంలోని కొట్టార్లపల్లెలో ఐటీ హబ్ ఏర్పాటు కానుంది. బెంగళూరుకు చెందిన స్మార్ట్ డీవీ గ్రూప్ ఆఫ్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కంపెనీ ఏర్పాటుతో వచ్చే మూడేళ్లలో 3 వేల మందికి ఉపాధి లభించనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆ కంపెనీ అధినేత దీపక్‌కుమార్ తాల శనివారం చిత్తూరులో మీడియాకు వెల్లడించారు. కొట్టార్లపల్లె వద్ద 1.60 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ కంపెనీని 20 వేల కోర్లతో క్లౌడ్ సర్వీస్‌తో ఏర్పాటు చేయనున్నట్టు ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఈనెల 14న భూమి పూజ చేస్తున్నామని, జూన్‌లో పనులు ప్రారంభించి, ఏడాదిలోపు నిర్మాణాలు పూర్తి చేస్తామని వివరించారు. ఇప్పటికే తమ కంపెనీలో తయారవుతున్న సెమీ కండక్టర్లు ప్రపంచంలోనే పేరున్న అన్ని ఎలక్ట్రానిక్స్‌లో ఉపయోగిస్తున్నారన్నారు. యాపిల్, ఐ వాచెస్, తోషిబా, శామ్సంగ్ ఉత్పత్తుల్లోను, కొన్ని దేశాల రక్షణ రంగ సంస్థల్లోను తమ ప్రొడక్టస్ ఉపయోగిస్తున్నారని చెప్పారు. తమ సంస్థకు అమెరికాలో 2, చైనాలో 1, ఇండియాలో 2 చోట్ల బ్రాంచ్‌లు ఉన్నాయని, జపాన్, సింగపూర్, రష్యాతో పాటు యూరప్ మొత్తం మార్కెటింగ్ చేస్తున్నామని వివరించారు. ఆయన వెంట ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎంసీ విజయానందరెడ్డి ఉన్నారు. (చదవండి: నవరత్నాలు.. సుస్థిర అభివృద్ధికి మార్గాలు) -
కుప్పంలో ఎవరినీ అరెస్ట్ చేయలేదు: ఎంపీ మిథున్‌రెడ్డి
-
భూమా సినీ కాంప్లెక్స్‌లో చెలరేగిన మంటలు
-
చిత్తూరు : ప్రభుత్వ భూముల్లో నిర్మించిన భవనాలు కూల్చివేత
-
చిత్తూరు జిల్లాలో చిరుత కలకలం
-
తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీతో జనసేన కటిఫ్?
తిరుపతి ఉప ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే ఎన్నికల నామినేషన్ల ఘట్టం ప్రారంభం కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఆయా పార్టీల అగ్ర నేతలు క్షేత్ర స్థాయిలోకి దిగేసి రాజకీయ సమీకరణలకు తెర తీస్తున్నారు. నామినేషన్ల దాఖలుకు ఇంకా ఆరు రోజులే గడువు ఉంది. అయితే బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిత్వంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. కొన్ని పేర్లు తెరపైకి వచ్చినా ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, జనసేన వైఖరి చూస్తుంటే బీజేపీ తప్పులు ఎత్తి చూపించి బయటపడి.. ఆంతరంగిక మిత్ర పార్టీ టీడీపీకి మద్దతుగా నిలవాలనే లోపాయికారి ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో చూస్తే జనసేన, బీఎస్పీ ఉమ్మడి అభ్యర్థి కంటే.. నోటాకే అత్యధిక ఓట్లు రావడం.. జిల్లాలో ఆ పార్టీ బలాన్ని తేటతెల్లం చేస్తోంది. సాక్షి, నెల్లూరు: తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై ప్రధాన పార్టీలు హడావుడి చేస్తుంటే.. బీజేపీ, జనసేన మధ్య తీవ్ర అంతరం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇరు పార్టీల ఉమ్మడి అభ్యర్థి పోటీ చేస్తారని బీజేపీ ముందు నుంచే హడావుడి చేసినా.. నామినేషన్లు ప్రారంభమై రెండు రోజులు గడిచినా ఇంకా అభ్యర్థి ఖరారు కాకపోవడంపై అనేక అనుమానాలు తలెత్తున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలతో స్నేహబంధాన్ని తెగదెంపులు చేసుకున్న జనసేన బీఎస్పీ పార్టీతో జతకట్టింది. ఎన్నికల తర్వాత ఎక్కడా ఆ పార్టీకి సరైన ఓట్లు రాకపోవడంతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీతో స్నేహబంధానికి తెర తీసింది. ఇటీవల గ్రేటర్ హైదరాబాద్, తెలంగాణలో ఉప ఎన్నికల్లో బీజేపీతో కలిసి పని చేసిన జనసేన.. హఠాత్తుగా ఆ పార్టీతో విభేదించి తెగదెంపులు చేసుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని భావించినట్లుగానే ఇటీవల విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ సహకరించలేదంటూ ఆ పార్టీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేశారు. అయితే తిరుపతి ఉప ఎన్నికలల్లో మాత్రం కలిసి పనిచేస్తామని చెప్పుకుంటూ వచ్చినప్పటికీ ఎన్నికల సమన్వయ కమిటీలో స్థానం కల్పించలేదని అసహనంతో జనసేన నేతలు ఊగిపోతున్నారు. ఈ పరిస్థితే ఇంకా ఒప్పందంపై ఒక కొలిక్కి రాలేదని తెలుస్తోంది. ఆంతరంగిక మిత్ర పార్టీతో.. తిరుపతి ఉప ఎన్నికల్లో ఆంతరంగిక మిత్ర పార్టీతో కలిసి పనిచేయాలనే చీకటి ఒప్పందం కుదిరినట్లు విశ్వసనీయ సమాచారం. పార్లమెంట్ పరిధిలో జనసేన, బీజేపీ ఉమ్మడి కమలం అభ్యర్థికి మద్దతు ఇచ్చేలా ఇప్పటికే ఒప్పందం జరిగిపోయింది. అయితే ఇప్పుడు ఆ ఫార్ములా ప్రకారం పొత్తు క్షేత్రస్థాయిలో పొడవలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కలిసి రాని జనసేన నాయకులను పక్కన పెట్టి బీజేపీ ఒక అడుగు ముందుకు వేసి ఉప ఎన్నికల బాధ్యుల కమిటీలో జనసేనకు చోటు ఇవ్వకుండా టీడీపీ నుంచి వచ్చిన జంప్ జిలానీలకు పెద్ద పీట వేసింది. ఈ కమిటీలో చోటు ఇవ్వని కమలనాథులపై గ్లాసు నేతలు గుర్రుగా ఉన్నారు. నామినేషన్ల ఘట్టం ప్రారంభమవుతున్నా ఇప్పటికీ జనసేనకు ఆహ్వానం కూడా లేదు. స్థానిక నేతలను కూర్చొ బెట్టుకొని మద్దతు ఇవ్వాలని కోరిన దాఖలాలు లేవు. తమను చిన్న చూపు చూస్తున్న కమలనాథులతో జత కట్టలేమని తెగేసి చెప్పి పాత స్నేహ హస్తం అందించేందుకు చర్చలు జరుగుతున్నాయి. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జనసేన లోపాయికారికంగా పాత స్నేహం మనస్సులో పెట్టుకుని టీడీపీకి మద్దతు ఇచ్చేలా ఒప్పందాలు జరుగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తిరుపతిలో అయితే టీడీపీతో జతకట్టడం కంటే నోటా వైపు మొగ్గు చూపితే బావుంటుందని ఆ నేతలు ఇప్పటికే రహస్య సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బీజేపీకి ఆరో స్థానం 2019 ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్ పరిధిలో బీజేపీకి ఆరో స్థానం దక్కింది. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్‌రావుకు 7,22,877 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 4,94,501 ఓట్లు రాగా మూడో ప్లేస్‌లో నోటాకు 25,781 ఓట్లు వచ్చాయి. నాలుగో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్‌కు 24,039 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీ అభ్యర్థి బొమ్మి శ్రీహరికి 16,125 ఓట్లు రాగా ఆరో స్థానంలో నిలిచారు. వైఎస్సార్సీపీ, టీడీపీ మినహాయించి మిగిలిన రాజకీయ పార్టీలకు మాత్రం డిపాజిట్ కూడా రాకపోవడం విశేషం. -
మదనపల్లిలో అగ్ని ప్రమాదం
సాక్షి, చిత్తూరు: జిల్లాలోని మదనపల్లిలోని అప్పారావు వీధిలో సోమవారం ఉదయం ప్రదీప్ ట్రేడర్స్ భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తును మంటలు ఎగిసిపడ్డాయి. అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తోంది. అగ్నిప్రమాదంతో రూ.కోట్లలో నష్టం ఉండొచ్చని పోలీసులు ప్రథమిక అంచనా వేస్తున్నారు. ఇక మదనపల్లిలో అతిపెద్ద వ్యాపార సముదాయం ప్రదీప్ ట్రేడర్స్ అన్న విషయం తెలిసిందే. అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. -
చిత్తూరు జిల్లా పుత్తూరులో టిడిపి నేత వీరంగం
-
త్రీస్టార్.. తిరుపతి వన్
స్మార్ట్ తిరుపతి మెరిసింది. త్రీస్టార్ రేటింగ్‌లో జాతీయ స్థాయిలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. స్వచ్ఛత, పరిశుభ్రత నెలకొల్పడంలో అత్యున్నత ప్రమాణాలు అమలు చేస్తున్నందుకు అత్యున్నత గౌరవం దక్కింది. దేశవ్యాప్తంగా ఉన్న నగరాల్లో స్వచ్ఛత, పరిశుభ్రత అమలు విధానంపై కేంద్ర ప్రభుత్వ మినిస్టరీ ఆఫ్ అర్బన్ హౌసింగ్ అఫైర్స్‌శాఖ పర్యవేక్షణలో ఫైవ్, త్రీస్టార్ ర్యాంకింగ్‌లను మంగళవారం ప్రకటించారు. ఆశాఖ మంత్రి హర్దీప్సింగ్పూరీ ర్యాంకుల వివరాలను ఢిల్లీ కేంద్రంగా ప్రకటించారు. త్రీస్టార్ రేటింగ్‌లో పోటీపడ్డ తిరుపతి నగరం జాతీయ స్థాయిలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. సాక్షి, తిరుపతి: గార్బేజ్ ఫ్రీసిటీ స్టార్ రేటింగ్‌లో తిరుపతి నగరం జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకును సొంతం చేసుకుంది. 2019లో నిర్వహించి రేటింగ్స్‌లో 51వ స్థానంలో ఉన్న తిరుపతి నగరం 2020 పోటీల్లో టాప్–1 ర్యాంకులో నిలిచి తన సత్తాను చాటుకుంది. గత ఏడాది విజయవాడ నగరం 50వ స్థానంలో ఉండగా ఈ సారి జాతీయ స్థాయిలో 2వ స్థానానికి చేరింది. త్రీస్టార్ రేటింగ్‌లో టాప్–10లో ఉన్న నగరాలు మాత్రమే టాప్ 5 ర్యాంకింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. త్రీస్టార్ రేటింగ్‌లో అగ్రస్థానంలో నిలిచిన తిరుపతి వచ్చే ఏడాది ఫైవ్ స్టార్ ర్యాంకింగ్‌లో పోటీపడనుంది. 1,435 నగరాలు పోటీ స్వచ్ఛతను పాటించే నగరాలకు కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ స్టార్ రేటింగ్స్ పోటీ నిర్వహించింది. నిపుణులు నగరాల్లో అమలవుతున్న స్వచ్ఛత, పరిశుభ్రత, ప్రజలకు మౌలిక వసతులు, వాటి నిర్వహణకు ఉపయోగిస్తున్న అత్యున్నత ప్రమాణాలు, ప్రజల అభిప్రాయాల సేకరణ ఆధారంగా ర్యాంకింగ్‌ను కేటాయించారు. దేశంలోని 1,435 నగరాలు పోటీడ్డాయి. ఫైవ్ స్టార్ రేటింగ్‌లో ఆరు నగరాలు సొంతం చేసుకోగా 63 నగరాలకు త్రీస్టార్, 70 నగరాలు ఒక స్టార్ రేటింగ్‌ను కేంద్రం ప్రకటించింది. మెరిసిన తిరుపతి కీర్తి పతాకం తిరుపతిలో స్వచ్ఛత, పరిశుభ్రతకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. చెత్తను వంద శాతం సది్వనియోగం చేస్తున్నారు. ఇందుకోసం పీపీపీ పద్ధతిన కార్పొరేషన్ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. పారిశుద్ధ్య కార్మికుల ద్వారా ఇంటింటా తడి, పొడి చెత్తను స్వీకరిస్తున్నారు. రూ.15 కోట్ల వ్యయంతో తూకివాకంలో నిర్మించిన బయో మెథనైజేషన్ ప్లాంట్‌కు తరలించి గ్యాస్ ఉత్పత్తి చేస్తున్నారు. రూ.19 కోట్ల వ్యయంతో రామాపురం డంపింగ్ యార్డులో బయో మైనింగ్ ద్వారా 5 లక్షల టన్నుల చెత్తను రీసైక్లింగ్ చేస్తున్నారు. రూ.7 కోట్ల వ్యయంతో నిర్మించిన భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్‌ను తూకివాకంలో నిర్వహిస్తున్నారు. రూ.3 కోట్ల వ్యయంతో పొడిచెత్త ద్వారా సేంద్రియ ఎరువుల తయారీ చేపట్టారు. ఇలా శాశ్వత ప్రతిపాదికన చెత్త నిర్వహణను నిర్వహిస్తున్నారు. ప్రజలకు అత్యుత్తమ సేవలను అందిస్తుండడంతో తిరుపతి ఈ ఘనతను సొంతం చేసుకుంది. సమష్టి కృషితోనే సాధ్యం నగర ప్రజలకు పరిశుభ్రత, స్వచ్ఛతను అందించేందుకు కృషి చేస్తున్నాం. మౌలిక వసతులు కలి్పస్తున్నాం. చెత్త నిర్వహణ కోసం కోట్లు వె చ్చించి పలు ప్లాంట్లు నిర్వహిస్తున్నాం. ప్రజల సహకారం, పారిశుద్ధ్య కార్మికుల కష్టం, అధికారుల సమష్టి కృషితోనే ఈ ఘనత సాధించాం. – పీఎస్ గిరీషా, కమిషనర్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ -
లాక్డౌన్: 128 ఏళ్లనాటి వాతావరణం..!
సాక్షి, తిరుమల: నిత్యం భక్తుల గోవింద నామాలతో మారుమోగే తిరుమలగిరుల్లో లాక్‌డౌన్‌తో రెండు వారాలుగా నిశ్శబ్ద వాతావరణం నెలకొనడంతో వన్యమృగాలు జన సంచారంలోకి వచ్చేస్తున్నాయి. మనుషుల అలికిడి లేకపోవడంతో శేషాచల అడవుల్లోని జంతువులు తిరుమల వీధుల్లోకి వచ్చి స్థానికులను, ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న కల్యాణ వేదిక, శ్రీవారి సేవ సదన్ వద్ద చిరుత, ఎలుగు బంట్లు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. మ్యూజియం వెనుక భాగంలో ఉన్న అటవీ ప్రాంతంలో రేసు కుక్కలు దుప్పిలపై దాడికి దిగిన ఘటనలతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. స్థానికులు నివాసం ఉంటున్న బాలాజీ నగర్, ఈస్ట్ బాలాజీ నగర్లలో సైతం చిరుతలు, అడవి పందులు, దుప్పి, పాముల సంచారం అధికంగా ఉంటోంది. ఇక పాపవినాశనం మార్గంలో గజరాజుల గుంపు సంచరిస్తోంది. ఘాట్ రోడ్డులో అధికం.. ముఖ్యంగా రెండు ఘాట్ రోడ్లలో చిరుతల సంచారం పెరిగింది. నాలుగు రోజుల క్రితం రెండు ఘాట్ రోడ్లను అనుసంధానం చేసే లింక్ రోడ్డులో చిరుత కనపడింది. దీంతో అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది భయభ్రాంతులకు గురి అయ్యారు. మొదటి ఘాట్ రోడ్డుపై జింకలు, కణితి, దుప్పిలు సైతం గంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. వన్య మృగాలు జనావాసంలోకి వస్తుండడంతో సాయంత్రం తరువాత బయట తిరగరాదని టీటీడీ, పోలీసు అధికారులు స్థానికులకు గట్టి ఆంక్షలు విధించారు. 128 ఏళ్లనాటి వాతావరణం..! 1900 తర్వాత నుంచి తిరుమలకు భక్తుల రాక క్రమంగా పెరుగుతూ రావడంతో వన్యమృగాలు జనసంచారంలోకి రావడంతో క్రమంగా తగ్గిపోతూ వచ్చింది. ఇప్పుడు ఏకంగా రెండు వారాలుగా ఆలయం మూత, ఘాట్‌రోడ్లపై రాకపోకల నిషేధంతో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. దీంతో వన్యమృగాలు స్వేచ్ఛగా తిరుమల వీధుల్లోకి ఘాట్ రోడ్లపైకి వచ్చేశాయి. 128 ఏళ్ల క్రితం మాత్రం ఒకసారి రెండు రోజుల పాటు గుడి మూతపడిన సమయంలో ఇలాంటి పరిస్థితి కనిపించింది. అప్పట్లో ఆలయం చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం కావడం, శ్రీవారి ఆలయం మాత్రమే తిరుమలలో ఉండడంతో ఉదయం తిరుపతి నుంచి గుర్రాలపై అర్చకులు తిరుమలకు చేరుకునేవారు. సంధ్యా సమయం మొదలు కాకముందే తిరుపతికి తిరుగు ప్రయాణం అయ్యేవారు. ఇప్పుడు మళ్లీ అలాంటి వాతావరణం కనిపిస్తోంది. -
కరోనా: ఒక్క వారం ప్లీజ్..!
సాక్షి, చిత్తూరు: కోవిడ్–19 వైరస్ కట్టడికి ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ వారంలో ముగియనుంది. మరో ఏడురోజుల పాటు ప్రజలు ఇళ్లకే పరిమితమైతే కరోనా వ్యాప్తిని నియంత్రించే అవకాశముంది. జిల్లాలో రెండు వారాల క్రితం ఒక పాజిటివ్ కేసు నమోదు కాగానే యంత్రాంగం ఉలిక్కిపడింది. తర్వాత వారం వరకు మరో కేసు జాడ లేకపోవడంతో కొద్దిగా ఊపిరిపీల్చుకుంది. ఈ క్రమంలో 1వ తేదీ నుంచి 5 లోపు వరసగా 16 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడడంతో పరిస్థితి మారిపోయింది. తాజాగా మరో 3 కేసులు నమోదు కావడంతో జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 20కి చేరుకుంది. పక్కజిల్లాలతో పోలిస్తే ఇక్కడ పాజిటివ్ కేసులు కాస్త తక్కువనే చెప్పాలి. చిత్తూరు అంతర్రాష్ట్ర జిల్లాలకు సరిహద్దు కావడంతో లాక్‌డౌన్‌ను పోలీసులు సమర్థవంతంగా వినయోగించుకున్నారు. పక్క జిల్లాల నుంచి వచ్చేవారిని సరిహద్దుల్లో నిలువరిస్తున్నారు. అయితే స్థానిక ప్రజలను మాత్రం ఇళ్ల నుంచి బయటకు రానివ్వకుండా కట్టడి చేయడంలో మాత్రం పూర్తిస్థాయిలో సఫలం కాలేదనే చెప్పాలి. నిత్యావసర సరుకుల కొనుగోలుకు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మాత్రమే జనాన్ని రోడ్లపైకి అనుమతించారు. అదే సమయంలో ఇంటికి ఒక్కరు మాత్రమే రావాలని సూచించారు. కానీ, జిల్లావ్యాప్తంగా నిత్యం సగటున 4 వేల మంది బయటకు వస్తున్నారు. అందులో అవసరం లేకపోయినా వెలుపలికి వచ్చేవారి సంఖ్య దాదాపు వెయ్యి వరకు ఉంటుంది. ప్రస్తుతం సమాజం ఎలాంటి ఆపదలో చిక్కుకుని ఉందో ఏమాత్రం ఆలోచించడం లేదు. వీళ్లు ఇకనైనా మేల్కొని ఈవారం రోజులు ఇళ్లలో ఉంటే పెద్ద ప్రమాదం నుంచి గట్టెక్కినట్లే. ఈ వారం ఎంతో కీలకం విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన 1816 మందిలో 1810 మంది ఇప్పటికే రెండు వారాల గృహనిర్భందం (క్వారంటైన్) పూర్తి చేసుకున్నారు. వీళ్లుకాకుండా మరో 554 మంది జిల్లాలోని పలు ఆసుపత్రులు, హౌస్ క్వారంటైన్లో ఉన్నారు. ఇందులో ఢిల్లీలోని జమాత్‌కు వెళ్లివచ్చిన వాళ్లు 163 మంది ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే 20 మంది మాత్రం జిల్లాకు చెందినవాళ్లు కాదని, మరొకరి ఆచూకీ తెలియలేదని పేర్కొన్నారు. అంటే 142 మంది ఢిల్లీకి వెళ్లివచ్చినవాళ్లు క్వారంటైన్లో ఉన్నారు. ఇప్పటికే వారం రోజుల క్వారంటైన్ పూర్తిచేసుకున్న వీరందరికీ మరో ఏడురోజుల తర్వాత కూడా కరోనా లక్షణాలు లేకుంటే పెద్ద ప్రమాదం తప్పినట్లే. జిల్లాలో తొలి కాంటాక్టు కేసు.. బుధవారం అధికారులు విడుదల చేసిన బులెటిన్‌లో తిరుపతిలో ఓ కేసు, నగరిలో రెండు కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే తిరుపతిలోని త్యాగరాజనగర్‌లో వెలుగుచూసిన కేసులో తండ్రి నుంచి కుమారుడికి వైరస్ సంక్రమించినట్లు వైద్యులు వెల్లడించారు. జిల్లాలో తొలి కాంటాక్టు కేసు ఇదేకావడం గమనార్హం. ఇలాంటి పరిస్థితి మరోచోట తలెత్తకుండా ఉండాలంటే ప్రజలు స్వీయనియంత్రణ పాటించడం ఉత్తమం. -
కరోనా నియంత్రణకు టీటీడీ సహకారం
సాక్షి, తిరుమల: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు టీటీడీ తరఫున అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమల లోని ధర్మగిరి వేదవిజ్ఞానపీఠంలో మూడు రోజుల పాటు జరిగిన శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం శనివారం మహాపూర్ణాహుతితో ముగిసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ ఈఓ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న లాక్డౌన్ కారణంగా కొంత మంది తిరుపతిలో ఆహారం దొరక్క ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. టీటీడీ బోర్డు చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి సూచనల మేరకు ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ద్వారా ఈనెల 28 నుంచి తిరుపతిలో ఆహార పొట్లాల పంపిణీని ప్రారంభించినట్లు తెలిపారు. అవసరమైతే ఒక పూటకు 50 వేల ఆహార పొట్లాలు తయారుచేసి పంపిణీ చేసేందుకు టీటీడీ సిద్ధంగా ఉందని వివరించారు. బర్డ్ ఆస్పత్రిలో కరోనాకు వైద్యం రాయలసీమ జిల్లాల నుంచి కరోనా అనుమానిత కేసులు ఎక్కువగా తిరుపతిలోని స్విమ్స్‌కు వస్తున్నాయని, అవసరమైతే బర్డ్ ఆస్పత్రిని కూడా వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించేందుకు, క్వారంటై¯Œన్గా వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చామని ఈఓ వెల్లడించారు. ఇందుకోసం టీటీడీ అధికారులు తగిన ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ఇప్పటికే తిరుపతిలోని రుయా ఆస్పత్రితోపాటు స్విమ్స్, పద్మావతి వైద్య కళాశాలలో కరోనా వ్యాధి అనుమానితుల కోసం తగిన ఏర్పాట్లు చేశారని, తిరుచానూరులోని శ్రీ పద్మావతి నిలయం వసతి సముదాయాన్ని క్వారంటైన్ కేంద్రంగా వినియోగిస్తున్నారని తెలియజేశారు. స్విమ్స్‌కు అవసరమైన వెంటిలేటర్లను కొనుగోలు చేసేందుకు సాయం చేస్తామని ఈఓ తెలిపారు. -
చిన్నారి వర్షిత హత్య కేసు వాయిదా
-
చిత్తూరు చేరుకున్న సీఎం జగన్
-
పనులు చేశారా.. నిధులు దోచేశారా?
సాక్షి, బి.కొత్తకోట: గత టీడీపీ ప్రభుత్వంలో బి.కొత్తకోట మండలంలో జరిగిన హంద్రీ–నీవా ప్రాజెక్టు కాలువలు, కాంక్రీటు, సొరంగం, అండర్ రైల్వే టన్నెల్ పనులపై బుధవారం విజయవాడ, తిరుపతికి చెందిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఉన్నతాధికారుల బృందం విచారణ చేపట్టింది. విజిలెన్స్ ఎస్పీ రమేషయ్య, విజయవాడ నుంచి ఎస్ఈ శ్రీనివాసమూర్తి, డీఈ నాగసురేష్, ఏఈలు సౌజన్య, ప్రకాష్, రామ్మోహన్ల బృందం విస్తృతంగా విచారణ, పరిశీలనలు నిర్వహించింది. గత ప్రభుత్వంలో బి.కొత్తకోట మండలంలో 27వ ప్యాకేజి (కాలువ, కాంక్రీటు నిర్మాణాలు) విలువ రూ.72.73 కోట్ల పనిలో మిగిలిన రూ.1.16కోట్ల పనిని రూ.9 కోట్లకు, 28వ ప్యాకేజీ (కాలువ, కాంక్రీటు నిర్మాణాలు) పని విలువ రూ.83.80కోట్లలో మిగిలిన రూ.78 లక్షల పనిని రూ.3.69కోట్లకు అంచనాలు పెంచి టెండర్లు నిర్వహించి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తొలుత బి.కొత్తకోట మండలంలో 27, 28 ప్యాకేజీల్లో జరిగిన పుంగనూరు ఉపకాలువ, శీతివారిపల్లె సమీపంలో నిర్మించిన రైల్వే అండర్ టన్నల్ పనులను క్షణ్ణంగా పరిశీలించారు. బి.కొత్తకోట మండలంలోని జాతీయ రహదారికి సమీపంలో శీతివారిపల్లె వద్ద పాకాల –ధర్మవరం రైల్వే మార్గం వెళ్తోంది. ఈ మార్గం దాటి పుంగనూరు ఉపకాలువ పనులు పూర్తి చేయాల్సి ఉంది. అయితే రైల్వే మార్గం కారణంగా రైల్వే లైను కింద సొరంగం పనులు చేసి ఇరువైపులా కాలువను కలిపే పనులు చేశారు. ఈ పనుల్లో భాగంగా కంట్రోల్ బ్లాస్టింగ్ పనులు చేసినట్టు రికార్డుల్లో ఉంది. 27 ప్యాకేజీ పనుల్లో మిగిలిన పనిని 60సీ కింద తొలగించి, 28వ ప్యాకేజీ పరిధిలో వచ్చే కాంక్రీటు నిర్మాణాలు, సొరంగం పని కలిపి 60సీ కింద తొలగించి రూ.3.26 కోట్లకు టెండర్ పనిని అప్పగించారు. ఇందులో 1500 క్యూబిక్ మీటర్ల కంట్రోల్ బ్లాస్టింగ్ పనులుచేశారు. ఈ పనులు వాస్తవంగా చేశారా లేక అనవసరంగా చేయించారా.. అన్న కోణంలో పరిశీలించారు. అనంతపురం సరిహద్దులో పెద్దతిప్పసముద్రం మండలం మీదుగా బి.కొత్తకోట మండలంలో సాగే 27వ ప్యాకేజీ కాలువ పనులను పరిశీలించారు. అనంతరం కురబలకోటలో జరిగిన పనులు, ఎత్తిపోతల పథకం పనులు పరిశీలిస్తూ మదనపల్లె సమీపంలోని సొరంగం చేరుకున్నారు. 59వ ప్యాకేజీలోని ఈ సొరంగం పనుల్లో రూ.36.92 కోట్ల పనులు పెండింగ్ ఉండగా గత ప్రభుత్వం అందులోంచి రూ.34.27 కోట్ల పనులు రద్దు చేసి 2.5కిలోమీటర్ల సొరంగం పనులు, కాలువ, సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల నిర్మాణానికి 59ఏ ప్యాకేజి కింద రూ.160.518 కోట్లకు అంచనాలు పెంచి నిర్వహించిన టెండర్‌ను రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థ దక్కించుకుంది. అయితే 2.5కిలోమీటర్ల సొరంగానికి లైనింగ్ పనులు చేయలేదు. విజిలెన్స్ బృందం ఈ పనులతోపాటు కాలువలో కంట్రోల్ బ్లాస్టింగ్ పనులు చేయించడంపైనా పరిశీలించారు. ప్రాజెక్టు అధికారుల నుంచి తీసుకున్న రికార్డుల ఆధారంగా ఈ విచారణ సాగుతుండగా, అసలు పనులు చేశారా, అవసరం లేని చోట కంట్రోల్ బ్లాసింగ్ పెట్టి నిధులు దోచుకున్నారా, అసలు పనులే చేయాలేదా అన్న కోణంలో విచారణ చేశారు. -
శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై
సాక్షి, తిరుమల: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో టీటీడీ అడిషనల్ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలంగాణ గవర్నర్‌కు శ్రీవారి లడ్డూ ప్రసాదాలు, చిత్రపటం అందించి, ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ గవర్నర్ హోదాలో తొలిసారి తిరుమలేశుని ఆశీస్సులు పొందడం చాలా ఆనందంగా ఉందన్నారు. శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల కోసం టీటీడీ చేస్తున్న ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. -
టీటీడీకి రూ. 5 కోట్ల డిపాజిట్
సాక్షి, తిరుపతి: వినాయక స్వర్ణరథం తయారి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఖాతాకి గురువారం కాణిపాకం వినాయక దేవస్థానం రూ. 5 కోట్లను డిపాజిట్ చేసింది. ఈ మేరకు కాణిపాకం దేవస్థానం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా ఆ మొత్తాన్ని వినాయక స్వర్ణరథం తయారీ కోసము డిపాజిట్ చేసినట్టు పేర్కొంది. గతంలో వినాయక బంగారు రథం తయారీ కోసం టీటీడీకి రూ. కోటి డిపాజిట్ చేసినట్టు కాణిపాకం దేవస్థానం వెల్లడించింది. అయతే తాజాగా కాణిపాకం వినాయక స్వర్ణరథం తయారీకి అంచనాలు పెరిగాయి. దీంతో రథం తయారికి రూ. 6.5 కోట్ల ఖర్చు అవుతుందని టీటీడీ అంచనా వేస్తోంది. కాగా వచ్చే ఏప్రిల్ నాటికి వినాయక స్వర్ణరథం సిద్ధం చేసేందుకు టీటీడీ టెండర్లు పిలువనుంది. -
సత్యవేడులో బాంబు కలకలం
సాక్షి, సత్యవేడు, చత్తూరు: స్వాతంత్య్ర దినోత్సవం తెల్లవారు జామున సత్యవేడులో బాంబు కలకలం సమాచారం స్థానిక పోలీసులకు ముచ్చెమటలు పట్టించింది. పోలీసుల కథనం.. తమిళనాడుకు చెందిన ఓ యువకుడు గురువారం తెల్లవారు జామున 3 గంటలకు రాష్ట్ర పోలీస్ అత్యవసర సేవ అయిన 100కు ఫోన్ చేసి సత్యవేడులోని వీఎంకే కల్యాణ మండపంలో బాంబు బ్లాస్ట్ చేయనున్నట్లు సమాచారం ఇచ్చాడు. దీనిపై స్పందించిన తమిళనాడు రాష్ట్ర డీజీపీ, ఏపీ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన చిత్తూరు జిల్లా ఎస్పీ వెంటనే పుత్తూరు డీఎస్పీ మురళీకృష్ణ, సత్యవేడు సీఐ బీవీ శ్రీనివాసులుకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేశారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. హుటాహుటిన వీరందరూ కలసి సత్యవేడులోని వీఎంకే కల్యాణ మండపాన్ని తెల్లవారుజామున పరిశీలించారు. అక్కడ ఆ సమయానికి వివాహం జరుగుతుండగా వారిని వెలుపలికి పంపి మండపం పరిసరాలను అణువణువునా తనిఖీ చేశారు. అనంతరం అక్కడ వివాహ కార్య క్రమానికి వచ్చిన వారిని విచారణ చేశారు. అక్కడ ఎలాంటి బాంబులు అమర్చినట్లు ఆధారాలు లభ్యం కాకపోవడం, ఎలాంటి దుస్సంఘటనలు జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై సత్యవేడు సీఐ బీవీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఉద్దేశపూర్వకంగా అలజడి సృష్టించేందుకు తమిళనాడు 100కు ఎవరో ఆగంతకుడు ఫోన్ చేసినట్లు వెల్లడించారు. ఫోన్ చేసిన నెంబరు ఆధారంగా కొందరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. తనిఖీలలో సత్యవేడు ఎస్ఐ నాగార్జునరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
నా కుమార్తె మృతిపై న్యాయం చేయాలి
సాక్షి, తిరుపతి: భవానినగర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఈనెల 5వ తేదీన అనుమానాస్పదంగా తన కుమార్తె పవిత్ర మృతి చెందడంపై సంబంధిత అధికారులు విచారణ చేసి తమకు న్యాయం చేయాలని పవిత్ర తల్లి ప్రమీల కోరా రు. మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈనెల ఒకటో తేదీన తన కుమార్తె పవిత్రను కళాశాలలో బీఎస్సీ కోర్సులో చేర్చి హాస్టల్లో ఉంచామన్నారు. అయితే 5వ తేదీన కళాశాలలో ఆరు అంతస్తుల భవనం నుంచి పడి తన కుమార్తె చనిపోయిందని కళాశాల యాజమాన్యం తెలిపిందని, తన బిడ్డ ప్రమాదవశాత్తు చనిపోయినా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని రుయా మార్చురీకి తరలించారని ఆవేదన వ్యక్తం చేసింది. తన కుమార్తె స్నేహితురాలి సమాచారంతో తాము రుయా ఆసుపత్రికి చేరుకున్నామని, పవిత్ర మృతి విషయమై కళాశాల యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానం చెబుతోందని తెలిపారు. దీనిపై పోలీసు కేసు కూడా నమోదు చేసినా ఎలాంటి న్యాయం జరగలేదని, సమగ్ర విచారణ చేసి తగు న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో ఆమెతో పాటు మృతు రాలి బంధువులు చంద్రశేఖర్, కుమార్, నాగరాజు, అనిత పాల్గొన్నారు. -
అత్యాచారం కేసులో ఏడేళ్ల జైలు
సాక్షి, తిరుపతి: ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో తిరుపతి రూరల్ జీవకోన క్రాంతినగర్‌కు చెందిన కుసునూరు చరణ్‌కుమార్‌కు ఏడేళ్ల జైలుశిక్ష, రూ.25 వేలు జరిమానా విధిస్తూ తిరుపతి నాలుగో అదనపు జిల్లా జడ్జి రాంగోపాల్ మంగళవారం తీర్పు చెప్పారు. జరిమానా సొమ్ము రూ.25 వేలులో రూ.20వేలు బాధిత యువతికి చెల్లించాలని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. కోర్టు మానిటరింగ్ అధికారులు, కోర్టు కానిస్టేబుల్ రమేష్ కథనం మేరకు గంగాధర నెల్లూరు మండలానికి చెందిన 19 సంవత్సరాల యువతి స్థానిక ఎస్వీ మెడికల్ కళాశాలలోని డీఎంఎల్టీ సెకండ్ ఇయర్ కోర్సు చదువుతూ స్థానిక ఎమ్మార్‌పల్లెలోని ప్రభుత్వ బీసీ బాలికల హాస్టల్లో ఉండేవారు. చరణ్‌కుమార్ అదే కళాశాలలో మొదటి సంవత్సరం చదివి మధ్యలో చదువు ఆపేశాడు. ఆ యువతి వెంట ఇతడు ప్రేమ పేరుతో రోజూ వెంటపడేవాడు. 2011 ఫిబ్రవరి 28వ తేదీ ఉదయం 8.45 ప్రాంతంలో ఆ యువతి కళాశాలకు నడిచి వెళుతుండగా చరణ్‌కుమార్ క్రైమ్ పోలీసు స్టేషన్ సమీపంలో వెంబడించాడు. తన ఇంట్లో పూజా కార్యక్రమం ఉందని, తనతో రావాలని తిరిగి వదిలి పెడతానని చెప్పాడు. అందుకు ఆ యువతి ఒప్పుకోలేదు. అయితే అతడు మాయమాటలు చెప్పి బలవంతంగా ద్విచక్ర వాహనంలో టౌన్ క్లబ్ సమీపంలోని ఇంటిలోకి ఆమెను తీసుకెళ్లాడు. ఆ ఇంటి యజమాని టీ గిరి, అతని బంధువు కే నాగరాజ సహాయంతో ఆమెకు కూల్‌డ్రింక్స్‌లో మత్తుమాత్రలు కలిపి ఇచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండు గంటల తర్వాత మత్తు వదలిన ఆ యువతిని గిరి ఆటోలో హాస్టల్‌కు పంపాడు. బాధితురాలు ఈ సంఘటన విషయాలను ఇద్దరు స్నేహితురాళ్లకు, హాస్టల్ వార్డన్‌కు తెలిపింది. తరువాత కూడా నిందితుడు చరణ్‌కుమార్ బాధిత యువతికి ఫోన్‌చేసి విషయాన్ని ఎవరికైనా చెబితే అంతుచూస్తానని బెదిరించాడు. బాధితురాలు ఈ మేరకు స్థానిక వెస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితులు గిరి, నాగరాజపై నేరం రుజువుకాకపోవడంతో వారిపై కేసును కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు చరణ్కుమార్పై అత్యాచారం కింద కేసు నిరూపణ కావడంతో అతనికి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. -
చుడా చైర్మన్‌గా పురుషోత్తంరెడ్డి
సాక్షి, చిత్తూరు: పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వ్యక్తిని ఉన్నత పదవిలో కూర్చోబెడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (చుడా) చైర్మన్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడు కట్టమంచి పురుషోత్తం రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2005లో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో పురుషోత్తం రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున చిత్తూ రు మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆయన్ని మునిసిపల్ వైస్ చైర్మన్‌గా నియమించారు. 2009లో జరిగిన మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కట్టమంచి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కార్పొరేటర్‌గా ఎన్నికై కా ర్పొరేషన్‌లో ఫ్లోర్ లీడర్‌గా ఉన్నారు. పార్టీకి నమ్మకంగా ఉన్న ఈయనకు చుడా చైర్మన్ పదవి దక్కడంతో చిత్తూరులోని పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఏడాది కాలంపాటు ఆయన చుడా చైర్మన్‌గా కొనసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. -
లోక్‌సభలో మన వాణి
దేశ రాజధానిలో జిల్లాకు చెందిన ఎంపీలు ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై లోక్‌సభలో ప్రస్తావించారు. బడ్జెట్ సమావేశాల్లో జిల్లాలో నెలకొన్న వివిధ సమస్యల పరిష్కారం కోసం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆయా శాఖల కేంద్ర మంత్రులను కలిసి విన్నవించారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి లోక్‌సభలో అరుదైన గౌరవం లభించింది. లోక్‌సభా పక్ష నేతగా.. ప్యానల్ స్పీకర్‌గా ఎంపికయ్యారు. సాక్షి, తిరుపతి: పార్లమెంటు సమావేశాల్లో జిల్లాకు చెందిన ఎంపీల సూచనలపై కేంద్ర మంత్రులు స్పందించారు. అభివృద్ధికి సహకరిస్తామని హామీలు ఇచ్చా రు. రాష్ట్రానికి ప్రత్యేకహోదాపై 2014లో కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని అమలుచేయాలని లోక్‌సభలో ఎంపీ మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు. ట్రిపుల్ తలాక్ బిల్లుకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున ఆయన ప్రసంగించా రు. కడప స్టీల్‌ప్లాంట్ గురించి బడ్జెట్లో ప్రస్తావనే లేదన్నారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాల్సి ఉండగా గడచిన రెండేళ్లుగా ఇవ్వలేదని ప్రస్తావించారు. కస్తూర్బా బాలికా రెసిడెన్షియల్ విద్యాలయాల్లో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఇతర విభాగాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని కోరారు. చింతపండుపై విధించిన 5 శాతం జీఎస్టీతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చింతపండుపై చిన్నచిన్న వ్యాపారులు ఆధారపడి జీవిస్తున్నారని, ఇది నిత్యావసర వస్తువు కావడంతో ప్రజలపై భారం పడకుండా చిన్న వ్యాపారులు చితికిపోకుండా జీఎస్టీని పూర్తిగా తొలగించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. కొత్త రైల్వేలైన్ల ఏర్పాటుకు నిధులివ్వండి చిత్తూరు–బెంగళూరు మధ్య కొత్త రైల్వేలైన్ ఏర్పాటుకు నిధులు కేటాయించాలని చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప లోక్‌సభలో రైల్వే పద్దులపై జరిగిన చర్చలో మాట్లాడారు. కడప–బెంగళూరు మధ్య కొత్త రైల్వే లైన్ 2008–09లో ప్రకటించినా ఇప్పటివరకు నిధులు విడుదల చెయ్యలేదని గుర్తుచేశారు. చిత్తూరు–బెంగళూరు వయా కోలార్ రైల్వే లైన్ కూడా ఏళ్ల క్రితం ప్రకటించినా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదన్నారు. దామలచెరువు వద్ద ఉన్న మ్యాంగో నగర్ నుంచి వేల లారీల ద్వారా మామిడి కోల్‌కతా, చెన్నై, బెంగళూరుకు మామిడి ఎగుమతులు జరుగుతున్నాయని, ఎగుమతులను మరింతగా ప్రోత్సహించేందుకు రైల్యే లైన్ ఏర్పాటు చెయ్యాలని కోరారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు జిల్లా అయిన చిత్తూరులో రైల్వే స్టేషన్ ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదని, సరిపడా నిధులు విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. దేశం నలుమూలల నుంచి భక్తులు తిరుపతి, తిరుచానూరు, కాణిపాకం, శ్రీకాళహస్తి స్టేషన్లకు వస్తుంటారని, వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు, సదరు రైల్వే స్టేషన్ల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. ఆ 34 మంది విద్యార్థులకు న్యాయం చెయ్యండి తిరుపతి కేంద్రీయ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న 34 మంది విద్యార్థులు సైన్స్‌లో ఫెయిల్ అయ్యారని, తిరిగి సప్లిమెంటరీ పరీక్షలు రాసినా మరోసారి ఫెయిల్ అయిన విషయాన్ని లోకసభలో తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ప్రస్తావించారు. ఆ 34 మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులను కలిస్తే వేరే పాఠశాలలో చేర్చుకోమని చెప్పి పంపిన విషయాన్ని తప్పుబట్టారు. ఆ విద్యార్థులను పదో తరగతికి ప్రమోట్ చెయ్యాలని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిని కోరారు. విద్యార్థులకు తాగునీటి కొరత ఉందని, అయితే ఉపాధ్యాయులు నీటి కొనుగోలుకు విద్యార్థుల నుంచి డబ్బు వసూలు చెయ్యటం అన్యాయమన్నారు. ప్రభుత్వ నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం, తిరుచానూరుకు అనేకమంది భక్తులు వస్తుంటారని అయితే విమాన సర్వీసులు అందుబాటులో లేవని ఆయన లోక్‌సభలో ప్రస్తావించారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలో నెలకొన్న అనేక సమస్యలను ఆయన సభ దృష్టికి తీసుకెళ్లారు.