CM Stalin
-
సీఎం ఎంకే స్టాలిన్‌కు ఆ అధికారంలేదు : అన్నమలై
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో 'సీఏఏ వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడానికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌కు అధికారాలు లేవని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై అన్నారు. స్టాలిన్ రాజకీయంగా సీఏఏని వ్యతిరేకించినప్పటికీ, తమిళనాడులో కేంద్ర చట్టాన్ని అమలు చేయడానికి వ్యతిరేకంగా అతను అధికారికంగా తీసుకోలేరు. సీఏఏ సంబంధిత నిబంధనలను అమలు చేయకూడదని నిర్ణయించే రాజ్యాంగం ప్రకారం అతనికి ఎటువంటి అధికారం లేదని అన్నామలై నొక్కిచెప్పారు. కీలక వ్యాఖ్యలు పౌరసత్వ (సవరణ) చట్టం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం చట్టాన్ని అమలు చేయదని సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. ‘సిఏఏ అనవసరం. రద్దు చేయాలి. తమిళనాడులో చట్టాన్ని అమలు చేయడానికి మేము ఏ విధంగానూ అనుమతించము. భారతదేశాన్ని ప్రభావితం చేసే ఏ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం చోటు ఇవ్వదని నేను తమిళనాడు ప్రజలకు స్పష్టం చేస్తున్నాను అని తెలిపారు. -
పాత కారులో సీఎం ప్రయాణం
సాక్షి, చైన్నె: పాత జ్ఞాపకాలను నెమర వేసుకునే విధంగా సీఎం స్టాలిన్ ఆదివారం తన పాతకాలపు కారును స్వయంగా నడుపుకుంటూ నగర రోడ్ల మీదకు వచ్చారు. సీఎం కాన్వాయ్‌లో హఠాత్తుగా పాత కారు కనిపించడం, దానిని స్టాలిన్ స్వయంగా నడుపుకుంటూ వెళుతుండటం చూసిన జనం ఆ దృశ్యాలను వీడియోల రూపంలో వైరల్ చేశారు. సీఎం స్టాలిన్ కాన్వాయ్‌లో సాధారణంగా ఆధునిక హంగులతో కూడిన వాహనాలే ఉంటాయి. ప్రత్యేక వాహనంలో ఆయన కూర్చుంటే డ్రైవర్ నడుపుకుంటూ వెళ్తుండటాన్ని జనం చూసి ఉన్నారు. అయితే, ఆదివారం అడయార్‌లోని పార్కులో వాకింగ్‌కు వెళ్లిన సీఎం స్టాలిన్ తన పాత కారును, దానితో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అంతేకాక స్వయంగా నడుపుకుంటూ వెళ్తుండటం, వెనుక సీటులో మంత్రులు పొన్ముడి, ఎం.సుబ్రమణియన్ కూర్చుని ఉండటం ఆసక్తికరంగా మారింది. -
ఇద్దరు మహిళా ఐపీఎస్‌లపై వేటు
సాక్షి, చైన్నె: ఓవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ర్యాలీ, మరోవైపు సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ సంగీత కచేరి కారణంగా దురైన ట్రాఫిక్ కష్టాలు ఇద్దరు మహిళా ఐపీఎస్‌లకు కష్టాలు తెచ్చిపెట్టాయి. దీంతో ఆ ఇద్దరు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ కంపల్సరీ వెయిటింగ్లో ఉంచారు. ఈ మేరకు మంగళవారం హోంశాఖ కార్యదర్శి పి. అముదా ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు.. బీజేపీ నేతృత్వంలో సోమవారం సాయంత్రం చైన్నెలో సనాత ధర్మానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. నుంగంబాక్కంలోని హిందూ దేవదాయ శాఖ కార్యాలయం వైపుగా బీజేపీ శ్రేణులు చొచ్చుకెళ్తున్నా పోలీసులు కొంత దూరం వరకు అడ్డుకోలేదు. ఈ పరిణామాలతో నుంగంబాక్కం పరిసరాలు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కాయి. ఫలితంగా వాహనదారుల అవస్థలు వర్ణణాతీతంగా మారాయి. అంతకు ముందు ఆదివారం రాత్రి పనయూరు సమీపంలో జరిగిన సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ సంగీత కచేరి రూపంలో ట్రాఫిక్ కష్టాలు తీవ్రమయ్యాయి. ఈ సెగ ఏకంగా సీఎం స్టాలిన్‌కు కూడా తగిలింది. ఆయన కాన్వాయ్ ట్రాఫిక్‌లో చిక్కుకుంది. ఈ రెండు ఘటనల పరిణామాలతో ఇద్దరు మహిళా ఐపీఎస్‌లపై పోలీసు బాసులు కన్నెర్ర చేశారు. అన్నామలై ర్యాలీ పుణ్యమా గ్రేటర్ చైన్నె పోలీసు(తూర్పు) లా అండ్ ఆర్డర్ డీఐజీ, జాయింట్ కమిషనర్ దిశా మిట్టల్, ఏఆర్ రెహ్మాన్ కారణంగా తాంబరం కమిషనరేట్ పరిధిలోని పల్లికరణై డిప్యూటీ కమిషనర్ దీపా సత్యన్‌ను బదిలీ చేశారు. ఈ ఇద్దర్నీ కంపల్సరీ వెయిటింగ్లో ఉంచారు. అలాగే, చైన్నె ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్స్ ఎన్ఫోర్సుమెంట్ సెల్ ఎస్పీగా ఉన్న ఆదర్శ్ పచిరాను తిరునల్వేలి తూర్పు డిప్యూటీ కమిషనర్‌గా నియమించారు. రచ్చకెక్కిన మరక్కుమా..నెంజం! -
మీరు అలా మాట్లాడుతుంటే సిగ్గేస్తోంది సార్: సీఎం తీరుపై సింగర్ ఫైర్
సింగర్ చిన్మయి పరిచయం అక్కర్లేని పేరు. సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై ఇప్పటికీ పోరాడుతూనే ఉంది. గతంలో మీటూ ఉద్యమంలో పలువురిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. తమిళ పాటల రచయిత వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలతో ఆమెను కోలీవుడ్ నుంచి నిషేధానికి కుడా గురైంది. అయితే తాజాగా గురువారం వైరముత్తు బర్త్ డే సందర్భంగా సీఎం స్టాలిన్ చేసిన పనికి మరోసారి వార్తల్లో నిలిచింది. ట్విటర్ వేదికగా ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. (ఇది చదవండి: నాది చాలా చిన్న వయసు.. వారి ఉద్దేశమేంటో గుర్తించలేకపోయా: బుల్లితెర నటి) సింగర్ చిన్మయి చేసిన ట్వీట్ కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వైరముత్తు బర్త్ డే సందర్భంగా సీఎం స్టాలిన్ వ్యక్తిగతంగా కలిసి.. ఇంటికి వెళ్లి మరీ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సింగర్ చిన్మయికి ఆగ్రహం తెప్పించింది. రాజకీయ నాయకులు మహిళల భద్రతల గురించి మాట్లాడితే సిగ్గేస్తోందని ఘాటుగా విమర్శించింది. రాజకీయ నాయకుల అండతోనే వారు మరింత రెచ్చిపోతున్నారని ఆరోపించింది. ట్వీట్లో చిన్మయి రాస్తూ.. 'తమిళనాడు ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇంటికి వెళ్లి అతని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపడం. నేను ఒక మహిళగా అతనిపై మీటూ ఉద్యమంలో ఆరోపణలు చేసినందుకు 2018 నుంచి తమిళ ఇండస్ట్రీలో బ్యాన్ విధించారు. రాజకీయ అండతో ఒక రచయిత ఏ స్త్రీపైనా చేయి వేయగలడని ఫిక్స్ అయిపోయాడు. రాజకీయ నాయకులతో అతనికి ఉన్న సాన్నిహిత్యంతో మౌనంగా ఉండమని ఓ మహిళను బెదిరించాడు. అందుకే పద్మ అవార్డులు, సాహిత్య నాటక అకాడమీ, జాతీయ అవార్డులను అందుకున్నాడు. ఈ మనిషికి ఉన్న శక్తి ఇది. నన్ను చాలా మంది మహిళలు ఇంతకు ముందు ఎందుకు మాట్లాడలేదని అడిగారు. తమిళనాడులో రాజకీయ నాయకులు చేసే ప్రసంగాల్లో మహిళల భద్రత కోసం మాట్లాడడం తలుచుకుంటే సిగ్గేస్తోంది. ఎందుకంటే వైరముత్తు అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు వారంతా మౌనంగా ఉంటారు. ఈ భూమి అద్భుతమైన సంస్కృతిని కలిగి ఉంది. ప్రతి సంవత్సరం మహిళలను వేధించేవారి పుట్టినరోజు జరుపుకుంటారు. కానీ వీటిపై మాట్లాడిన మహిళలను వేధిస్తారు. మనకు సున్నితత్వం, సానుభూతి, విద్యపైనా అవగాహన మాత్రం శూన్యం. బ్రిజ్ భూషణ్ నుంచి వైరముత్తు వరకు ఎల్లప్పుడు రాజకీయ నాయకులు వీరిని కాపాడతారు. ఈ భూమిలో ప్రాథమికంగా దొరకని న్యాయం కోసం ఎదురుచూడటం బాధాకరమైన విషయం' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (ఇది చదవండి: ప్రియుడిని పెళ్లాడిన హీరోయిన్, వీడియో వైరల్) The Chief Minister of Tamilnadu personally visits the home of a man accused by several women of sexual harassment to wish him on his birthday; I, as a multiple award winning singer and voice over artiste, face a work ban by the Tamil Film Industry since 2018, for naming this poet… https://t.co/8RpQ120swZ — Chinmayi Sripaada (@Chinmayi) July 13, 2023 -
ఆసుపత్రిలో చేరిన తమిళనాడు సీఎం స్టాలిన్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ సాధారణ చెకప్ నిమిత్తం గ్రీమ్స్ రోడ్ లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. గత కొద్ది రోజులుగా జీర్ణకోశ సమస్యతో బాధపడుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రెగ్యులర్ చెకప్ నిమిత్తం గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు ప్రెస్ నోటును విడుదల చేశాయి. ఆయనకు సాధారణ ఎండోస్కోపీ పరీక్ష నిర్వహించి మంగళవారం ఉదయాన్నే డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు అపోలో వైద్యులు. ఇది కూడా చదవండి: ఇప్పుడు మాది డబుల్ ఇంజిన్ కాదు, ట్రిపుల్ ఇంజిన్ సర్కార్.. షిండే -
సీఎం జగన్ కోసం వచ్చిన సీఎం స్టాలిన్, సీఎం కేసీఆర్
-
తగ్గేదేలే.. ముఖ్యమంత్రి స్టాలిన్
సాక్షి, చైన్నె: రాష్ట్ర హక్కుల పరిరక్షణలో తగ్గేది లేదని సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. డీఎంకే కార్యకర్తలకు ఆదివారం ఆయన లేఖ రాశారు. ఇందులో రాష్ట్రంలో ఇటీవల కాలంగా జరుగుతున్న పరిణామాలను గుర్తు చేశారు. కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టారు. దివంగత నేత కరుణానిధి శత జయంతి ఉత్సవాలను గుర్తుచేస్తూ, ఏడాది పొడవునా వేడుకలను జయప్రదం చేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రాల హక్కులను హరించే విధంగా కేంద్రం తీరు ఉందని ధ్వజమెత్తారు. తమిళనాడు హక్కుల పరిరక్షణలో తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఎంత వరకై నా వెళ్లి ఢీకొట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు వ్యాఖ్యలు చేశారు. యువత మేధాసంపతికి దోహదపడే విధంగా మదురైలో కలైంజ్ఞర్ కరుణానిధి స్మారక గ్రంథాలయం రూపుదిద్దుకుంటున్నదని వివరించారు. ఇది మరి కొద్ది రోజుల్లో ప్రజాపయోగంలోకి వస్తుందని పేర్కొన్నారు. తిరువారూర్‌లో నిర్మించిన కలైంజ్ఞర్ కోట్టం ఈనెల 20న ప్రారంభం కాబోతోందన్నారు. ఈ వేడుకకు బిహార్ సీఎం నితీష్కుమార్హాజరు కానున్నారని గుర్తు చేశారు. ఈ వేడుక జయప్రదం చేయడానికి పెద్ద ఎత్తున కేడర్ తరలిరావాలని పిలుపునిచ్చారు. బెదిరింపులకు భయపడ వద్దని, తాను ఉన్నానని కేడర్‌కు భరోసా ఇచ్చారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం స్వస్థలం తిరువారూర్‌కు ఆదివారం రాత్రి సీఎం స్టాలిన్ బయలుదేరి వెళ్లారు. సీఎం రాకతో మూడు రోజుల పాటు తిరువారూర్‌లో డ్రోన్లపై నిషేధం విధించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి సీఎం పర్యటనకు భద్రతను పోలీసు యంత్రాంగం మరింత కట్టుదిట్టం చేసింది. -
గవర్నర్ Vs సీఎం స్టాలిన్:సెంథిల్ బాలాజీ అంశంలో మరో వివాదం..
తమిళనాడు:తమిళనాడులో గవర్నర్, రాష్ట్ర సీఎం మధ్య వివాదం.. మనీలాండరింగ్ కేసులో అరెస్టైన మంత్రి సెంథిల్ బాలాజీ విషయంలో మరోసారి వెలుగులోకి వచ్చింది. ఆరోగ్యం బాగులేని కారణంగా మంత్రి సెంథిల్ బాలాజీ నిర్వహిస్తున్న శాఖలను ఇతర మంత్రులకు కేటాయించే అంశాన్ని గవర్నర్ తోసిపుచ్చారు. రాష్ట్రంలో విద్యుత్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలను ప్రస్తుతం మంత్రి సెంథిల్ బాలాజీ నిర్వహిస్తున్నారు. ఈ శాఖలను ఆర్థిక శాఖ మంత్రి తంగం తెన్నెరసు, గృహ శాఖ మంత్రి ఎస్. ముత్తుస్వామికి కేటాయిస్తున్నట్లు పేర్కొని సీఎం స్టాలిన్.. గవర్నర్‌కు లేఖ పంపారు. దీనిపై స్పందించిన గవర్నర్ ఆర్.ఎన్. రవి.. ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. ఈ ప్రతిపాదన మనీలాండరింగ్ కేసును తప్పదారిపట్టించేదిగా ఉందని పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని అధికార డీఎంకే వర్గాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. గవర్నర్ పూర్తిగా బీజేపీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని మంత్రి పొన్ముడి ఆరోపించారు. మనీలాండరింగ్ కేసులో మంత్రి సెంథిల్ బాలాజీ హస్తం ఉందనే ఆరోపణలపై ఆయన్ని కేబినెట్ నుంచి తొలగించాలని గవర్నర్ మే31 న సీఎం స్టాలిన్‌కు లేఖ రాశారని పొన్ముడి ఆరోపించారు. కేవలం ఆరోపణలపై ఎలాంటి చర్య తీసుకోబోమని సీఎం స్టాలిన్ తిరిగి లేఖలో అప్పుడే సమాధానమిచ్చినట్లు చెప్పారు. సెంథిల్ బాలీజీ కేసు.. ‘క్యాష్ ఫర్ జాబ్స్’ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు విద్యుత్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ(47)ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు బుధవారం అరెస్టు చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద ఆయనను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రవాణా శాఖలో ఉద్యోగాలిప్పిస్తానంటూ మంత్రి సెంథిల్ బాలాజీ పలువురి నుంచి భారీఎత్తున నగదు తీసుకున్నారని ఈడీ ఆరోపించింది. తమిళనాడు సీఎం స్టాలిన్ మంత్రివర్గంలో ఈ చట్టం కింద అరెస్టయిన తొలి మంత్రి సెంథిల్ కావడం విశేషం. ఇదీ చదవండి:తమిళ మంత్రి అరెస్టు -
కళాక్షేత్రంలో విద్యార్థినిలపై లైంగిక వేధింపులు!.. సీఎం స్టాలిన్ సీరియస్!
చెన్నై: అతను శాస్త్రీయ కళలకు పాఠాలు బోధించే అసిస్టెంట్ ప్రొఫెసర్. కానీ, హద్దులు మీరి.. శిక్షణ పొందుతున్న యువకులతో అనుచితంగా ప్రవర్తించాడు. వారిని బాడీ షేమింగ్ లైంగిక వేధింపులకు గురిచేశాడు. దీంతో, దాదాపు 200 మంది విద్యార్ధినిలు అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనలకు దిగారు. ఈ నేపథ్యంలో తమిళనాడు పోలీసులు అతడిపై లైంగిక దాడి కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై సీఎం స్టాలిన్ కూడా స్పందిస్తూ.. విచారణలో ఆరోపణలు నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని యవతులకు హామీ ఇచ్చారు. వివరాల ప్రకారం.. చెన్నైలోని సాంప్రదాయ కళలను బోధించే ప్రతిష్టాత్మక కళాక్షేత్ర ఫౌండేషన్‌లో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ హరి పద్మన్‌పై లైంగిక దాడి కేసు నమోదైంది. అయితే, పద్మన్.. ఓ మాజీ విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు బుక్ చేశారు. ఆ ప్రొఫెసర్, మరో ముగ్గురు రిపర్టరీ ఆర్టిస్టులు తమను లైంగికంగా వేధిస్తున్నారని, బాడీ షేమింగ్, దుర్భాషలాడుతున్నారని ఆమెతో పాటు మరో 200 మంది విద్యార్థినిలు ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థినిలు, వారి పేరెంట్స్ కూడా నిరసనలు దిగారు. అయితే, గతంలో కూడా హరి పద్మన్‌పై లైంగిక వేధింపుల కారణంగా చర్యలు తీసుకోవాలని పలువురు విద్యార్థినిలు జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. కాగా, ఇందులో నిజం లేదని తప్పుడు ప్రచారం అంటూ కమిషన్ వారి ఫిర్యాదును కొట్టివేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం కూడా దాదాపు 90 మంది విద్యార్థినులు రాష్ట్ర మహిళా కమిషన్ చీఫ్‌కి ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం, విద్యార్థినిలు.. డైరెక్టర్ రేవతి రామచంద్రన్‌ను తొలగించాలని, అంతర్గత ఫిర్యాదుల కమిటీని పునర్నిర్మించాలని కోరుతూ కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్‌రెడ్డి, ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్లకు లేఖ రాశారు. దీంతో, స్పందించిన సీఎం స్టాలిన్ నిందితులపై కఠినంగా లీగల్ చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. కళాక్షేత్ర ఫౌండేషన్‌ను 1936లో నర్తకి రుక్మిణీ దేవి అరుండేల్ స్థాపించారు. ఇది భరతనాట్యం, కర్ణాటక సంగీతం, ఇతర సాంప్రదాయ కళలలో కోర్సులను అందించే జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ. ఇది శ్రేష్ఠత, క్రమశిక్షణ వంటి ఉన్నత ప్రమాణాలకు ప్రసిద్ధి చెందింది. దశాబ్దాలుగా అనేక మంది ప్రముఖ కళాకారులు ఇక్కడి నుంచి శిక్షణ పొందారు. Hundreds of students and staff are protesting at Chennai's iconic Kalakshetra foundation. They are demanding action on sexual harassment allegations against 4 faculty members. Watch the video here#kalakshetra #kalakshetraprotest #kalakshetraharassment pic.twitter.com/h255MoH5OT — Mirror Now (@MirrorNow) March 31, 2023 -
బిహార్ కార్మికులూ మా కార్మికులే
సాక్షి, చెన్నై: తమిళనాడులోని వలస కార్మికులంతా సురక్షితంగా ఉన్నారని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ బిహార్ సీఎం నితీశ్ కుమార్‌కు తెలిపారు. తమిళనాడు అభివృద్ధికి తోడ్పాటునిస్తున్న కార్మికులంతా తమ వాళ్లేనని, వారికి ఎటువంటి హాని జరగనివ్వబోమని హామీ ఇచ్చారు. అదేవిధంగా, రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలుగనివ్వమన్నారు. వదంతులు వ్యాప్తి చేస్తూ భయాందోళనలు సృష్టించే వారిపై తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పారు. తమిళనాడులో బిహార్, జార్ఖండ్ వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న కథనాల నేపథ్యంలో స్టాలిన్ శనివారం నితీశ్‌కుమార్‌తో ఫోన్లో మాట్లాడారు. అనంతరం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గౌరవనీయ సోదరుడు నితీశ్‌తో ఫోన్లో మాట్లాడినట్లు అందులో చెప్పారు. బిహార్ సహా ఉత్తరాది వలస కార్మికుల భద్రతపై ఆయనకు హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. బిహార్‌కు చెందిన ఒక జర్నలిస్ట్ తమిళనాడులో వలసకార్మికులపై దాడులపై ఒక ఫేక్ వీడియోను మొదట ఆన్లైన్లో సర్క్యులేట్ చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. వలస కార్మికులు పేర్లు నమోదు చేసుకునేందుకు వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. కార్మికులకు నచ్చజెప్పిన పోలీసులు ఉత్తరాది వలస కార్మికులపై దాడుల పుకార్ల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో వలస కార్మికులు భయంతో స్వస్థలాలకు బయలు దేరారు. దీంతో బస్, రైల్వే స్టేషన్లు నిండిపోయాయి. రిజర్వేషన్ రైలు బోగీల్లో కార్మికులు పెద్దఎత్తున ఎక్కడంతో శనివారం వారికి పోలీసులు నచ్చజెప్పి కిందికి దించివేశారు. కాగా, ఈ వ్యవహారంపై బిహార్, జార్ఖండ్ ప్రభుత్వాలు తమిళనాడు అధికారులతో సంప్రదింపులు జరిపాయి. అలాగే ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక బృందాలు తమిళనాడుకు శనివారం చేరుకుని క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించాయి. కాగా, వదంతుల వీడియోలకు సంబంధించి పోలీసులు బీజేపీ అధికార ప్రతినిధులు తదితరులపై కేసులు నమోదు చేశారు. -
ఓలా సంచలనం: ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఈవీ హబ్, భారీ పెట్టుబడులు
చెన్నై: ఓలా సీఈవోభవిష్ అగర్వాల్ వ్యాపార విస్తరణలో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్న ఓలా తాజాగా మరో అడుగుముందుకేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద EV హబ్‌ను ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఎలక్ట్రిక్ కార్లు, లిథియం-అయాన్ సెల్‌లను తయారు చేసేందుకు ఓలా రూ.7,614 కోట్ల పెట్టనుంది. ఇందుకోసం తమిళనాడు ప్రభుత్వం ఎంఓయూ కూడా కుదుర్చుకుంది. ఓలా వ్యవస్థాపకుడు, సీఈవో భవిష్ అగర్వాల్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ తన అనుబంధ కంపెనీలైన ఓలా సెల్ టెక్నాలజీస్ (OCT) , ఓలా ఎలక్ట్రిక్ టెక్నాలజీస్ (OET) ద్వారా ఒక ఒప్పందంపై సంతకం చేసారని శనివారం ట్వీట్ చేశారు. (ఇవీ చదవండి: ఎయిరిండియా మెగా డీల్: 2 లక్షలకు పైగా ఉద్యోగాలు) (భారీగా లిథియం నిక్షేపాలు: ఇక భవిష్యత్తంతా అద్భుతమే! ఆనంద్ మహీంద్ర) తమిళనాడులో టూ వీలర్, కార్ల లిథియం సెల్ గిగాఫ్యాక్టరీలతో ప్రపంచంలోనే అతిపెద్ద EV హబ్‌ను ఏర్పాటు చేస్తుంది. తమిళనాడుతో ఈరోజు ఎంఓయూపై సంతకం చేశామని భవిష్ వెల్లడించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, అగర్వాల్ మధ్య ఒప్పందం కుదిరిందంటూ ఒక ఫోటోను కూడా షేర్ చేశారు. కృష్ణగిరి జిల్లాలో ఈ 20 గిగా వాట్ల బ్యాటరీ తయారీ యూనిట్ఏర్పాటు కానుంది. మొత్తం పెట్టుబడిలో దాదాపు రూ.5,114 కోట్లు సెల్ తయారీ ప్లాంట్‌లోకి, మిగిలిన రూ.2,500 కోట్లు కార్ల తయారీ యూనిట్లోకి వెళ్తాయి. Ola will setup the worlds largest EV hub with integrated 2W, Car and Lithium cell Gigafactories in Tamil Nadu. Signed MoU with Tamil Nadu today. Thanks to Hon. CM @mkstalin for the support and partnership of the TN govt! Accelerating India’s transition to full electric! 🇮🇳 pic.twitter.com/ToV2W2MOsx — Bhavish Aggarwal (@bhash) February 18, 2023 సంవత్సరానికి 140,000 ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్లను ఉత్పత్తి చేయడానికి ఒక యూనిట్‌ను ఏర్పాటు చేయాలనేది ప్రణాళిక. 2024 నాటికి కార్లను విడుదల చేయాలని యోచిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు 500కిలోమీటర్ల రేంజ్‌తో కారును తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. ఈ క్రమంలో ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ 2024 నాటికి ఫోర్-వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (EVలు) ప్రారంభించాలనే ప్రణాళికను మరింత ముందుకు తీసుకువెళ్లే క్రమంలో తాజా డీల్ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పెట్టుబడుదల ద్వారా 3,111 ఉద్యోగాలను సృష్టించనుందట. తమిళనాడు కొత్త ఈవీ పాలసీని తీసుకొచ్చిన కొన్ని రోజుల తర్వాత ఈ డీల్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఆటో హబ్‌గా ఉన్న తమిళనాడులో హోసూర్‌లోని కంపెనీ ప్రస్తుత సౌకర్యం ప్రపంచంలోనే అతిపెద్దఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ యూనిట్లలో ఒకటి అని తమిళనాడు ప్రభుత్వపెట్టుబడి ప్రమోషన్ ఏజెన్సీ గైడెన్స్ తమిళనాడు సీఎండీ విష్ణు అన్నారు. తమిళనాడు ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీ 2023 ప్రకారం రాష్ట్ర వస్తువులు, సేవల పన్ను (SGST), పెట్టుబడి లేదా టర్నోవర్ ఆధారిత సబ్సిడీ , అధునాతన కెమిస్ట్రీ సెల్ సబ్సిడీ 100 శాతం రీయింబర్స్మెంట్ ఉన్నాయి. తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ నుండి కొనుగోలు చేసే విద్యుత్‌పై ఐదేళ్లపాటు విద్యుత్ పన్నుపై 100 శాతం మినహాయింపు, స్టాంప్ డ్యూటీపై మినహాయింపు ,భూమి ధరపై సబ్సిడీని కూడా రాష్ట్రం అందిస్తుంది. గత ఐదేళ్లలో, ఈవీ సె క్టార్లో 48,000 ఉద్యోగాల ఉపాధి అవకాశాలతో కూడిన ప్రాజెక్టులను సాధించింది. -
స్టాలిన్ సర్కార్ Vs గవర్నర్.. ట్విస్ట్ ఇచ్చిన మద్రాస్ హైకోర్టు
సాక్షి, చెన్నై: రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవికి వ్యతిరేకంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. వివరాల ప్రకారం.. ద్రవిడ కళగం నేత కన్నదాసన్ మద్రాసు హైకోర్టులో గవర్నర్ ఆర్ఎన్ రవికి వ్యతిరేకంగా గత నెలలో పిటిషన్ దాఖలు చేశారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని ఆధారాలతో సహా అందులో వివరించారు. బహిరంగ సభలు, వేదికలపై గవర్నర్ బాధ్యతలను విస్మరించి, సనాతన ధర్మానికి అనుకూలంగా, ద్రావిడ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. అలాగే తమిళనాడు సర్కారు పంపించే నివేదికలు, తీర్మానాలపై సంతకాలు పెట్టకుండా కాలయాపన చేస్తున్నారని వివరించారు. రాష్ట్ర గవర్నర్‌గా పదవిలో ఉన్న వ్యక్తి ఇతర సంస్థలు, సంఘాలలో పనిచేయడానికి వీలు లేదని ఆ పిటిషన్ ద్వారా కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే గవర్నర్‌గా ఉన్న ఆర్ఎన్ రవి పుదుచ్చేరిలోని ఆరోవిల్ ఫౌండేషన్‌కు అధ్యక్షుడిగా కూడా వ్యవహరించడం రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొన్నారు. ఈ పదవి ద్వారా ఆయనకు వేతనం, పదవీ విరమణ పెన్షన్ వంటి సౌకర్యాలు అందుతున్నాయని వివరించారు. ఈ దృష్ట్యా గవర్నర్‌ను రీకాల్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్ గురువారం ఇన్చార్జ్ సీజే రాజ, న్యాయమూర్తి భరత చక్రవర్తి బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. విచారించలేం.. న్యాయమూర్తులు స్పందిస్తూ, గవర్నర్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఉన్నత కోర్టుల తీర్పులు, రాజకీయ శాసనాల ఆధారంగా నియమితులైన వారిపై ఎలాంటి చర్యలకు గానీ, వారికి వ్యతిరేకంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంటూ ఈ పిటిషన్ విచారణను తోసిపుచ్చారు. టీఆర్ బాలు ఫైర్.. గవర్నర్ తీరుపై మండిపడుతూ డీఎంకే పార్లమెంటరీ నేత టీఆర్ బాలు ఓ ప్రకటన చేశారు. ఆయన రాష్ట్రానికి గవర్నర్ తరహాలో కాకుండా, బీజేపీకి మరో అధ్యక్షుడి వ్యవహరిస్తున్నట్లుందని మండిపడ్డారు. తన బాధ్యతలను విస్మరించి వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. -
కేబినెట్ మంత్రిగా ఉదయనిధి స్టాలిన్ ప్రమాణం
సాక్షి, చెన్నై: తమిళనాడు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్. రాజ్‌భవన్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన చేత గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రమాణం చేయించారు. క్రీడల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి తన తండ్రి కేబినెట్లోకి అడుగుపెట్టారు ఉదయనిధి. సినీ నటుడు, నిర్మాత-పంపిణీదారుడు అయిన ఉదయనిధి మొదటిసారిగా.. 2021లో చెపాక్-తిరువల్లికెని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆయన డీఎంకే యువజన విభాంగ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఆ పదవిలో ఎంకే స్టాలిన్ సుమారు మూడు దశాబ్దాల పాటు కొనసాగారు. ఆ తర్వాత మాజీ సీఎం ఎం కరుణానిధి మరణానంతరం 2018లో డీఎంకే అధ్యక్షుడిగా స్టాలిన్ బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో యూత్ వింగ్ బాధ్యతలను ఉదయనిధికి 2019లో అప్పగించారు. ఇదీ చదవండి: Sarathkumar: రమ్మీ నాలెడ్జ్ గేమ్!.. నటుడు శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు -
Udhayanidhi Stalin: స్టాలిన్ వారసుడు ఇక మంత్రిగా..
చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, అధికార డీఎంకే యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి(45)కి త్వరలో∙మంత్రి యోగం దక్కనుంది. 14న రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమంలో ఉదయనిధి మంత్రిగా ప్రమాణం చేయనున్నారని సోమవారం రాజ్‌భవన్ తెలిపింది. మంత్రివర్గంలోకి ఉదయనిధిని తీసుకోవాలంటూ డీఎంకే చీఫ్, ముఖ్యమంత్రి స్టాలిన్ పంపిన సిఫారసును గవర్నర్ రవి ఆమోదించారని పేర్కొంది. సినీ నటుడు, నిర్మాత-పంపిణీదారుడు అయిన ఉదయనిధి మొదటిసారిగా 2021 ఎన్నికల్లో చెపాక్–తిరువల్లికెని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఉదయనిధికి మంత్రి పదవి కట్టబెట్టాలనే డిమాండ్ పార్టీ వర్గాలతోపాటు మంత్రుల నుంచి ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తోందని డీఎంకే నేతలు అంటున్నారు. -
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై స్టాలిన్ సర్కార్ సంచలన నిర్ణయం!
సాక్షి, చెన్నై: ఆర్థికంగా వెనుకబడిన జనరల్ కేటగిరిలోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లను తమిళనాడులో అమలు చేసే ప్రసక్తే లేదని అఖిలపక్ష సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా పునఃసమీక్ష పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు. సామాజిక న్యాయమే లక్ష్యంగా తమ కార్యాచరణ ఉంటుందని సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. వివరాల ప్రకారం.. ఆర్థికంగా వెనుకబడిన జనరల్ కేటగిరీలోని పేదలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పనకు కేంద్రం తీసుకున్న చర్యలకు బలాన్ని కలిగించే విధంగా సోమవారం సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును డీఎంకేతో పాటు కొన్ని పారీ్టలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో ఈ తీర్పుపై చర్చించి తదుపరి చర్యలకు అఖిల పక్ష సమావేశానికి సీఎం స్టాలిన్ నిర్ణయించారు. అఖిల పక్షం సమావేశంలో సుదీర్ఘ చర్చ డీఎంకే ప్రభుత్వ పిలుపునకు ఆ పార్టీ మిత్రపక్షాలు కదిలాయి. అసెంబ్లీలోని 13 పారీ్టల ప్రతినిధులకు ఆహా్వనం పంపించగా, అన్నాడీఎంకే, బీజేపీ సభ్యులు గైర్హాజరయ్యారు. సచివాలయంలో శనివారం ఉదయం 10 గంటల నుంచి గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. ఇందులో కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత సెల్వ పెరుంతొగై, ఎమ్మెల్యే హసన్ మౌలానా, ఎండీఎంకే నేత, ఎంపీ వైగో, సదన్ తిరుమలైకుమార్, వీసీకే నేతలు, ఎంపీలు తిరుమావళన్, రవికుమార్ సీపీఐ నేత ముత్తరసన్, తమిళర్ వాల్వురిమై కట్చి నేత వేల్ మురుగన్, కొంగునాడు మక్కల్ దేశీయ కట్చి నేతలు చిన్న రాజ్, సూర్యమూర్తి, పురట్చి భారతం కట్టి నేత జగన్ మూర్తి, మనిద నేయ మక్కల్ కట్చి నేత జవహరుల్లా, డీఎంకే తరపున మంత్రులు దురై మురుగన్, పొన్ముడి, రఘుపతి, సీఎస్ ఇరై అన్భు ఈ సమావేశానికి హాజరయ్యారు. సీఎం స్టాలిన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అన్ని పారీ్టలు తమ తమ అభిప్రాయా లను వ్యక్తం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు మద్దతుగా ఉంటామని ప్రకటించాయి. తీర్మానాలు.. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, తీర్మానాలను మంత్రి పొన్ముడి మీడియాకు వివరించారు. వెనుకబడిన తదితర సామాజిక వర్గాలకు తమిళనాట కేటాయిస్తున్న 69 శాతం రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. కేంద్రం పేర్కొంటున్న 10 శాతం రిజర్వేషన్ తమిళనాటు అమలు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఆయా పారీ్టల ప్రతినిధుల సూచనలు, అభిప్రాయాల మేరకు తీర్మానాలు చేశామని తెలిపారు. జాతీయస్థాయిలో కొన్ని పారీ్టలు 10 శాతం రిజర్వేషన్‌కు మద్దతు ఇచ్చి ఉన్నా, అదే పార్టీలు తమిళనాడులో మాత్రం ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడుతామని ప్రకటించడం అభినందనీయమని కొనియాడారు. సుప్రీంకోర్టు తీర్పుపై పునః సమీక్ష పిటిషన్ దాఖలు చేయనున్నామని, బలమైన వాదనలు కోర్టు ముందు ఉంచుతామని వివరించారు. గతంలో ఈ రిజర్వేషన్లను వ్యతిరేకించిన అన్నాడీఎంకే, ఇప్పుడు అనుకూలంగా వ్యవహరించడం శోచనీయమని విమర్శించారు. తమిళనాడులో సామాజిక న్యాయమే లక్ష్యమని, 10 శాతం రిజర్వేషన్లకు ఇక్కడే చోటు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కాగా సామాజిక న్యాయం కోసం ఎంత వరకైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈ సమావే శంలో సీఎం స్టాలిన్ ప్రకటించడం గమనార్హం. -
జయలలిత మృతి: 600 పేజీలతో నివేదిక.. సీఎం స్టాలిన్ చేతికి రిపోర్టు
సాక్షి, చైన్నై: తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనుమానాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జయలలిత మృతిపై ఆర్ముగ స్వామి కమిషన్ నివేదిక కీలకంగా మారింది. కాగా, జయలలిత మృతిపై రిటైర్డ్ జడ్జి ఆర్ముగ స్వామి తన నివేదికను సీఎం స్టాలిన్‌కు అందజేశారు. 600 పేజీలతో కమిషన్ రిపోర్టును తయారు చేసింది. ఇక, కమిషన్ ఏర్పాటైన ఐదేళ్ల తర్వాత నివేదిక అందించడం విశేషం. అయితే, 2016 సెప్టెంబర్ 22వ తేదీన జయలతిత ఆసుపత్రిలో చేరారు. 2016, డిసెంబర్ 5వ తేదీన ఆమె తుదిశ్వాస విడిచారు. కాగా, జయలలిత మరణం వెనుక గల కారణాలు తెలుసుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం 2017 సెప్టెంబర్‌లో మాజీ జడ్జీ జస్టిస్ ఆర్ముగ స్వామి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కాగా, ఈ కమిషన్.. ఐదేళ్ల కాలంలో జయలలిత సహచరులు, బంధువులు, అధికారులు, మాజీ మంత్రులను విచారించింది. కమిషన్ పరిశీలించిన 75 మంది సాక్ష్యులలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, చెన్నై అపోలో ఆసుపత్రి వైద్యులు, విధుల్లో ఉన్న చెన్నై పోలీసులు ఉన్నతాధికారులు సైతం ఉన్నారు. అయితే, విచారణలో భాగంగా ఆర్ముగ స్వామి కమిషన్ సుమారు రెండు వందల మందిని ప్రశ్నించింది. ఇది కూడా చదవండి: తమిళనాట ట్విస్ట్.. పన్నీర్‌సెల్వానికి బిగ్ షాక్ -
‘చౌరస్తా’లో రాజ్యాంగ విలువలు
దేశంలో జరుగుతున్న ఎన్నో ఘటనలు పడిపోతున్న ప్రజాస్వామిక విలువలను సూచిస్తున్నాయి. అసహనాన్ని సూచిస్తున్నాయి. న్యాయంగా ఉండటానికి రోజులు కావని చెబుతున్నాయి. ఇది కొత్త రాజకీయ వాదనలు చేయడానికి కారణమవుతోంది. నిజానికి ఇలాంటి ధోరణులు ప్రబలడానికి మూలం ఎక్కడ ఉందో అంతా ఆలోచించాలి. యావద్భారత రాజకీయాల్ని తారుమారు చేసే ‘పుండు’ అంతా స్వార్థపూరిత పార్టీల పాలకులలో ఉంది. అంబేడ్కర్ ఆశించినట్టుగా సంపన్న వర్గాల ఆధిపత్యం నుంచీ, కుల వ్యవస్థ పట్టు నుంచీ విడివడిన సామాజిక వ్యవస్థ నిర్మాణం జరగలేదు. వామపక్షాల మధ్య ఐక్యత కొరవడిన ఫలితంగా బలమైన ఉద్యమాలు లేక జనం మితవాద పార్టీల వైపు ఆకర్షితులవుతున్నారు. ఇది మౌనం వీడాల్సిన సమయం. ‘‘తమిళనాడును స్వయంప్రతిపత్తిగల ప్రాంతంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి. స్వతంత్ర దేశంగా ప్రకటించుకునే స్థితికి మా తమిళనాడును నెట్టవద్దు. తమిళనాడును ప్రత్యేక దేశంగా మేము ప్రకటించుకునే స్థితికి మమ్మల్ని నెట్టవద్దు. స్వపరిపాలనా ప్రాంతంగా తమిళనాడును కేంద్రం ప్రకటిం చాలి. అందాకా మేము విశ్రమించేది లేదు. తమిళనాడు వేరే దేశంగానే వృద్ధి చెందాలన్న పెరియార్ విశ్వాసం వైపుగా మమ్మల్ని నెట్టవద్దు.’’ – సీఎం ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే సీనియర్ నాయకుడు, నీలగిరి పార్లమెంట్ సభ్యుడైన ఎ.రాజా (4 జూలై 2022). ‘‘ద్రవిడియన్ ప్రాంతీయ పార్టీ రాజకీయాల వైఫల్యాన్ని డీఎంకే నాయకుడు రాజా ఆమోదించినట్టే’’ అని బీజేపీ జాతీయ కార్యదర్శి సి.టి. రవి దీనికి స్పందించారు. రాజా ప్రకటన దేశ విభజనకు దారితీసే పచ్చి చీలుబాట రాజకీయమని బీజేపీ తమిళనాడు ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి ప్రకటించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ మౌనంగా ఉండిపోవడాన్ని ఖండిస్తున్నాననీ, రాజ్యాంగానికి బద్దులై ఉంటానని హామీపడి కూడా స్టాలిన్ ప్రేక్షకుడిగా ఉండిపోయారనీ తిరుపతి అన్నారు. నిజానికి దేశంలో ఇలాంటి ధోరణులు ప్రబలడానికి మూల మంతా ఎక్కడ ఉందో నిష్పాక్షికంగా ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది. వేర్పాటు ధోరణుల మూలం అంతా ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఉందని దక్షిణ, తూర్పు భారత రాష్ట్రాలు ఇప్పటికే గ్రహించాయి. యావద్భారత రాజకీయాల్ని తారుమారు చేసే ‘పుండు’ అంతా స్వార్థపూరిత పార్టీల పాలకులలో ఉంది. కేంద్రాధి కారంలో ఉన్న రాజకీయ పక్షాల ఉసురును ఇంతవరకూ కాపాడి నిలబెడుతున్న ఏకైక ‘చిట్కా’ – యూపీలోని 80 లోక్‌సభ సీట్లు. ఈ ‘గుట్టు’ చేతుల నుంచి జారిపోకుండా జాగ్రత్త పడటానికే ఉత్తర– దక్షిణ భారతదేశాల మధ్య గండి కొట్టాల్సిన అవసరం పాలకులకు అనివార్యం అయిపోయింది. భారతదేశ పాలనలో ఈ ‘గుట్టు’ను కాస్తా పసిగట్టి ‘రట్టు’ చేసిన తొలి దార్శనికుడు, భారత రాజ్యాంగ నిర్మాతలలో అగ్రగణ్యుడైన అంబేడ్కర్. కనుకనే దక్షిణ భారతదేశానికి హైదరాబాద్ నగరాన్ని రాజధానిగా తక్షణం ప్రకటించాలని అంబేడ్కర్ కోరారని మరచి పోరాదు. అప్పుడుగానీ ఉత్తరప్రదేశ్‌లోని లోక్‌సభ సీట్ల ఆధారంగా దక్షిణ భారత రాష్ట్రాలకు కేంద్ర పాలకులు నిరంతరం తలపెడుతున్న అన్యాయానికి అడ్డుకట్టు వేయడం సాధ్యపడదు. అందుకే అంబేడ్కర్ ప్రతిపాదనకు (దక్షిణ భారత రాజధానిగా హైదరాబాద్) అంతటి విలువ! ఈ దృష్టితో చూస్తే డీఎంకే నాయకుడు ఎ.రాజా ఆందోళనను కూడా తప్పుగా అర్థం చేసుకోనక్కర్లేదు. అంబేడ్కర్ 1956లో విస్తృత స్థాయిలో భారత రిపబ్లికన్ పార్టీని ఏర్పరచి, దానిని లౌకిక (సెక్యులర్) ప్రాతిపదికపైన ‘సోషలిస్టు ఫ్రంట్’గా తీర్చిదిద్దారు. బౌద్ధంలోని హేతువాద సూత్రాల అండ దండలనూ తోడు చేసుకున్నారు. తద్వారా సంపన్న వర్గాల ఆధిపత్యం నుంచీ, కుల వ్యవస్థ పట్టు నుంచీ, మూఢ విశ్వాసాల నుంచీ, సామాజిక దురన్యాయాల నుంచీ విడివడిన కుల రహిత సామాజిక వ్యవస్థ నిర్మాణాన్ని ఆశించారు. అందువల్లే వ్యవసాయ రంగంలోని పేద రైతాంగ వర్గాలనూ, సామాజికంగా వెనుకబడిన, నిరక్ష్యానికి గురైన వర్గాలనూ ఆకర్షించగలిగారు. అయితే అప్పటికి కుల వర్గ విభేదాలనూ, దౌర్జన్యాలనూ, హింసాకాండనూ బలంగా ఎదురొడ్డి, అగ్రకుల పెత్తనాలకు వ్యతిరేకంగా నిలబడగల బలవత్తర ఉద్యమాలు లేకపోవడంవల్ల... దళిత, బహుజన, పేద వర్గాలు మితవాద రాజకీ యాల వైపు ఆకర్షితులవుతూ వచ్చిన ఉదాహరణలూ ఎన్నో అని ప్రొఫెసర్ హరీష్ వాంఖడే (జేఎన్‌యూ ప్రొఫెసర్) అభిప్రాయం. ఆ మాటకొస్తే అప్పుడే కాదు, ఇప్పటి వర్తమాన రాజకీయాల లోనూ ఇదే పరిస్థితి. వామపక్షాల మధ్య ఐక్యత, ఏకవాక్యత కొరవడిన ఫలితంగా పేద, మధ్యతరగతి వర్గాలు పలు అన్యాయాలకూ, దాష్టీకాలకూ బలి కావలసి వస్తున్న సత్యాన్ని గుర్తించాలి. ఈ రోజుకీ భూమి తగాదాల మిషపైన ఆదివాసీ మహిళల పైన దాడులు జరుగుతున్నాయి. ఒక ఆదివాసీ మహిళనుగానీ, పురుషుడినిగానీ దేశ రాష్ట్రపతి స్థానంలో ఒక పాలకవర్గ పార్టీ కూర్చోబెట్టినంత మాత్రాన ఏ ప్రయోజనమూ లేదు. ‘స్టాంపు డ్యూటీ’తో నిమిత్తం లేకుండా, కేవలం ‘రబ్బర్ స్టాంప్’గా రాష్ట్రపతి ఉన్నంతకాలం దేశానికీ, ప్రజలకూ ఒరిగేదేమీ ఉండదు. బీజేపీకి చెందిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ హయాంలో, లక్నోలోని 140 ఏళ్ల చరిత్రగల ఒక హయ్యర్ సెకండరీ స్కూలు, కళాశాల ఉన్నట్టుండి అంతర్ధానమై, వాటి స్థానంలో ఒక ప్రైవేట్ స్కూలు వెలిసింది. దాంతో విద్యార్థులు పాఠాలన్నీ రోడ్డుపైనే నేర్చుకోవలసిన గతి పట్టింది. స్కూలు పేరు మారిపోయింది. స్కూలు లోకి విద్యార్థుల్నీ, ఉపాధ్యాయుల్నీ రానివ్వలేదు. వందలాదిమంది ఆ బడి పిల్లలు గేటు బయటే కూర్చునివుంటే, రోడ్డుమీదనే టీచర్లు పాఠాలు చెప్పాల్సిన గతి పట్టింది. ‘పేరు ధర్మరాజు, పెను వేప విత్తయా’ అన్నట్టు ప్రసిద్ధ చరిత్ర గల ఆ పాఠశాలకు బీజేపీ పాలకులు ఎందుకు ఆ గతి పట్టించారంటే – లక్నోలో ప్రసిద్ధికెక్కిన ఆదర్శ విద్యావేత్త రెవరెండ్ జేహెచ్ మెస్మోర్ ఆ పాఠశాలను నెలకొల్పి ఉండటమే! అలాగే కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి హెచ్.పి. సందేశ్ అవినీతి నిరోధక సంస్థ (ఏసీబీ)ను విమర్శిస్తూ, అవినీతికి పాల్పడిన ఒక అధికారిని శిక్షించాలని ఆదేశించారు. అయితే నిజాయితీపరుడైన న్యాయమూర్తి సందేశ్‌కు దక్కిన ప్రతిఫలం – బదిలీ ఉత్తర్వులు! బదిలీకి సిద్ధంగా ఉన్నానని సందేశ్ ప్రత్యుత్తరమిచ్చారు. ఈ సంద ర్భంగా, ఏసీబీ తరఫున హాజరైన న్యాయవాదిని ప్రశ్నిస్తూ సందేశ్ చేసిన ప్రకటన దిమ్మ తిరిగిపోయేలా ఉంది: ‘‘ఇంతకూ మీరు ప్రజల ప్రయోజనాల్ని రక్షిస్తున్నారా లేక అవినీతితో గబ్బు పట్టిపోయిన అధికారుల్ని కాపాడుతున్నారా? ఈ నల్ల కోట్లు ఉన్నవి అవినీతిపరుల్ని రక్షించడానికి కాదు. లంచగొండితనం, అవినీతి క్యాన్సర్ వ్యాధిగా తయారైంది. ఈ వ్యాధి ఇక ఆఖరి దశ వరకూ పాకడానికి వీల్లేదు’’ అని హెచ్చరించారు. ఇక గుజరాత్ అల్లర్లానంతరం నరేంద్ర మోదీని ఒకప్పుడు సుప్రీంకోర్టు ‘నయా నీరో’గా విమర్శించింది. కానీ, అదే గుజరాత్ కేసులో మోదీకి ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బృందం’ ఇచ్చిన ‘క్లీన్ చిట్’ సరైనదేనంటూ సుప్రీం ఇటీవల చెప్పడం మరో చిత్రమైన ట్విస్టు. కాగా, ఈ సందర్భంగా 92 మంది సుప్రసిద్ధులతో కూడిన రాజ్యాంగ పరిరక్షణా మండలి ఒక ప్రకటన విడుదల చేసింది: ‘‘ఇంతకూ 2002 నాటి గుజరాత్ ఊచకోతలపైన జాతీయ మానవ హక్కుల కమిషన్ నివేదికలు, నాటి సుప్రీంకోర్టు ప్రత్యేక సలహాదారైన ప్రసిద్ధ న్యాయ వాది రాజు రామచంద్రన్ సమర్పించిన ప్రత్యేక నివేదిక ఏమైనట్టు?’’ అని రాజ్యాంగ పరిరక్షణ మండలి ప్రశ్నించింది. ఈ 92 మంది ఉద్దండులలో సమాచార శాఖ మాజీ కమిషనర్ హబీబుల్లా, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సునీల్ మిత్రా, హోంశాఖ మాజీ కార్య దర్శి జి.కె. పిళ్ళై, విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి సుజాతాసింగ్, తదితర పెక్కుమంది మాజీ ప్రధాన కార్యదర్శులూ, రిటైర్డ్ రాష్ట్ర పోలీస్ అధికారులూ ఉన్నారు. ఆ ప్రకటనలో వారిలా పేర్కొ న్నారు: ‘‘జీవించే హక్కును, పౌర స్వేచ్ఛను హరించే ప్రభుత్వ చర్యలను ప్రశ్నించి, వాటిని కాపాడుకోవడం పౌరుల విధి.’’ అందుకే ‘మౌనం’ అనేది ఒక్కో సందర్భంలో మంచికి దోహదం చేయొచ్చు. ఇంకొన్ని చోట్ల ఆ లక్షణమే మానవుడి ఉనికికే ప్రమాదభరితం కావొచ్చు. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
హెల్త్అప్డేట్: ‘కెప్టెన్’ విజయకాంత్ కాలివేళ్లు తొలగింపు
తమిళ సీనియర్ నటుడు, దేశీయ ముర్పొక్కు ద్రవిడ కళగమ్ (DMDK) అధ్యక్షుడు విజయకాంత్ ఆరోగ్యం విషమంగా ఉందంటూ కొన్ని రోజులుగా కోలీవుడ్ మీడియాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల అనారోగ్యంతో ఆయన ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి విజయకాంత్ ఆరోగ్యంపై రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన హెల్త్ అప్డేట్ బయటకు వచ్చింది. ఆయన కుడి కాలి మూడు వేళ్లను వైద్యులు తొలగించారు. మధుమేహంతో బాధపడుతున్న ‘కెప్టెన్’ కాలి వేళ్లకు రక్తం సరఫరా కాకపోవడంతో వైద్యులు అత్యవసరంగా ఆ వేళ్లను తొలగించినట్టు డీఎండీకే తెలిపింది. చదవండి: పండంటి కవలలకు జన్మనిచ్చిన సింగర్ చిన్మయి ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారని కూడా పార్టీ పేర్కొంది. మరో రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని, ఆయన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను పట్టించుకోవద్దని అభిమానులు, కార్యకర్తలను కోరింది. విషయం తెలిసిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన స్నేహితుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ట్వీట్ చేశాడు. ‘నా ప్రియ మిత్రుడు విజయకాంత్ త్వరగా కోలుకుని మునుపటిలా కెప్టెన్‌గా గర్జించాలని సర్వశక్తిమంతుడైన దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ రజనీ పేర్కొన్నాడు. என் அருமை நண்பர் விஜயகாந்த் அவர்கள் விரைவில் குணமடைந்து பழையபடி கேப்டனாக கர்ஜிக்க வேண்டும் என்று எல்லாம் வல்ல இறைவனை வேண்டுகிறேன். — Rajinikanth (@rajinikanth) June 21, 2022 -
తమిళనాడులో.. ప్రపంచస్థాయి మేధస్సు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రపంచం మొత్తం మీద మేధస్సు, నైపుణ్యం కలిగిన విద్యార్థులు తమిళనాడులోనే ఉండేలా నాన్ ముదల్వన్ అనే పథకాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి స్టాలిన్ చెప్పారు. చెంగల్పట్టు జిల్లా పయనూరులోని సాయ్ యూనివర్సిటీలో కొత్తగా నిర్మించిన భవనాలను ప్రారంభించి, మరికొన్నింటికి సీఎం స్టాలిన్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ, తమిళనాడు ప్రభుత్వ అజమాయిషీలో 13 యూనివర్సిటీలు ఉండగా, నేడు ప్రైవేటు విద్యాసంస్థ అయిన సాయ్ యూనివర్సిటీ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. గతంలో ముఖ్యమంత్రి కరుణానిధి ఉన్నతవిద్యకు ప్రవేశ పరీక్షను రద్దు చేశారని గుర్తుచేశారు. అందుకే ప్రస్తుతం తమిళనాడులో 51.4 శాతానికి పైగా విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘనత కరుణానిధికే చెందుతుందన్నారు. ఇంజినీరింగ్, వైద్య విద్యలో ప్రవేశపరీక్ష రద్దును సుప్రీంకోర్టు ద్వారా ఆయన సాధించారని గుర్తు చేశారు. అందుబాటులోకి సంచార వైద్య వాహనాలు పేదల ఆరోగ్య సంరక్షణకై రెండోదశ సంచార వైద్యసేవలను సీఎం స్టాలిన్ మంగళవారం ప్రారంభించారు. తొలిదశలో ఏప్రిల్ 8వ తేదీన 133 సంచార వైద్యవాహనాలను, మలిదశగా మంగళవారం 256 సంచార వైద్య వాహనాలను జెండా ఊపి ఆవిష్కరించారు. ఈసీఆర్ ఇకపై.. కలైంజ్ఞర్ కరుణానిధి రోడ్డు చెన్నై–మహాబలిపురం మధ్యనున్న రహదారి ఈసీఆర్ (ఈస్ట్ కోస్ట్ రోడ్డు)గా పేరుగాంచింది. ఈ రహదారికి స్టాలిన్ ప్రభుత్వం ‘కలైంజ్ఞర్ కరు ణానిధి రోడ్డు’గా నామకరణం చేసింది. ఇందుకు సంబంధించి మంగళవారం జీవో జారీ చేసింది. చదవండి: Karti Chidambaram: కార్తీ చిదంబరం ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు.. సెటైర్ వేసిన ఎంపీ -
తమిళనాడు అసెంబ్లీలో ‘నీట్’ రగడ
సాక్షి ప్రతినిధి, చెన్నై: నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్) అంశం సోమవారం అసెంబ్లీలో మ రోమారు చర్చకు వచ్చింది. నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని రాష్ట్రపతి ఆమోదానికి పంపించేందుకు, గవర్నర్ ఎన్ఆర్ రవి సమ్మతించారంటూ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ నే పథ్యంలో వాస్తవ పరిణామాలను పరిశీలించిన తరువాత అవసరమైతే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని సోమవారం సీఎం స్టాలిన్ సభలో వెల్లడించారు. తేనేటి విందుకు గైర్హాజరుపై లేఖ.. తమిళనాడు అసెంబ్లీలో 110 విధుల కింద సీఎం స్టాలిన్ ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులోని వివరాలు.. ‘ఏడున్నర కోట్ల తమిళ ప్రజానీకం ప్రతిఫలించేలా అసెంబ్లీలో ఆమోదించిన నీట్ వ్యతిరేక తీర్మానం గత 210 రోజులుగా రాజ్‌భవన్‌లోనే పడి ఉంది. వందేళ్లు పూర్తి చేసుకున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నీట్ మినహాయింపు బిల్లు చెన్నై గిండీలోని రాజ్‌భవన్ ప్రాంగణంలో ఎవరికీ పట్టని విధంగా మూలవేశారు. అలాంటి రాజ్‌భవన్‌లో జరిగిన తేనీటి విందుకు ప్రభుత్వ ప్రతినిధులు హాజరుకావడం ప్రజాభీష్టాన్ని అవమానించడమే అవుతుంది. అందుకే గవర్నర్ ఇచ్చిన తేనీటి విందుకు గైర్హాజరయ్యాం. ఈ పరిస్థితులకు సంబంధించి గవర్నర్‌కు నేనే ఓ ఉత్తరం రాశాను. మీతో నాకు వ్యక్తిగతంగా ఎలాంటి భేధాభిప్రాయం లేదు, సామాజిక బాధ్యతకు కట్టుబడే తేనీటి విందుకు రాలేదని ఆ ఉత్తరంలో స్పష్టం చేశాను. మా ప్రభుత్వ విధానాల గురించి గవర్నరే బహిరంగ వేదికలపై ప్రశంసించారు. గవర్నర్ అనే హోదాకు మా ప్రభుత్వం ఎల్లప్పుడూ తగిన గౌరవం ఇస్తూనే ఉంటుంది. వ్యక్తిగతంగా నాకు లభించే ప్రశంసల కంటే రాష్ట్ర ప్రజల సంక్షేమమే నాకు ముఖ్యం. అలాగే గవర్నర్ సైతం ఈ అసెంబ్లీని గౌరవించి నీట్ వ్యతిరేక తీర్మానాన్ని రాష్ట్రపతి ఆమోదానికి పంపాలి. అలా పంపక పోవ డం తమిళనాడు ప్రజలను అవమానించడమే అవుతుంది. ఇదే గవర్నర్ గతంలో తిప్పిపంపిన నీట్ వ్యతిరేక తీర్మానంపై ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి మరోసారి తీర్మానం చేసి రాజ్‌భవన్‌కు పంపి 70 రో జులు అవుతోంది. ఈ పరిస్థితుల్లో సదరు తీర్మానా న్ని రాష్ట్రపతి ఆమోదానికి పంపాలని గవర్నర్ నిర్ణయించుకున్నట్లు మీడియాలో ప్రచారం అవుతోంది. ఈ ప్రచారాన్ని వాస్తవం చేస్తూ జరిగే పరిణామాలను గమనిస్తాం, అవసరమైతే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని తదుపరి చర్యలపై ముందుకు సాగుతాం..’అని స్టాలిన్ పేర్కొన్నారు. ముల్‌లెపైరియార్ వ్యవహారంపై.. ముల్‌లెపైరియార్ ఆనకట్ట వ్యవహారంలో చట్టపరమైన చర్యలపై సీఎం, అఖిలపక్ష నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని నీటిపారుదల శాఖ మంత్రి దురైమురుగన్ అసెంబ్లీలో తెలిపారు. అన్నాడీఎంకే, డీఎంకే, కాంగ్రెస్, పీఎంకే పార్టీల అసెంబ్లీ సభ్యులు సోమవారం నాటి అసెంబ్లీలో ముల్‌లెపైరియార్ ఆనకట్టపై ప్రవేశపెట్టిన తీర్మానానికి మంత్రి దురైమురుగన్ ఈ మేరకు బదులిచ్చారు. ఈ సమయంలో ప్రధాన ప్రతిపక్ష ఉప నేత ఓ పన్నీర్‌సెల్వం మాట్లాడుతూ, కేరళ ప్రభుత్వం ముల్‌లెపైరియార్ ఆనకట్ట విషయంలో ఏకపక్షంగా సర్వే చేస్తోందని, అక్కడి బేడీ ఆనకట్ట, సిట్రనై ఆనకట్ట దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలన కోసం తమిళనాడు నుంచి వెళ్లినవారిని కేరళ ప్రభుత్వం అడ్డుకుంటోందని చెప్పారు. కేరళ ప్రభుత్వంతో తమిళనాడు సీఎంకు మంచి స్నేహ సంబంధాలు ఉన్నందున తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే తమిళనాడులో వేసవి కాలంలో డిమాండ్‌కు సరిపడా విద్యుత్ సరఫరాకు యుద్ధ ప్రాతిపదిక చర్యలు తీసుకుంటున్నాం.. రాష్ట్రంలో విద్యుత్ కోత అనే మాటకు ఎంతమాత్రం చోటు లేదని మంత్రి సెంథిల్ బాలాజీ స్పష్టం చేశారు. మధుర మీనాక్షిని దర్శనానికి మధుౖ రెకి వచ్చే భక్తుల కోసం రూ.35 కోట్లతో అతి గృహాలు నిర్మిస్తున్నట్టు మంత్రి శేఖర్‌బాబు తెలిపారు. ఇది చదవండి: సాధ్వి రితంబర వివాదాస్పద వ్యాఖ్యలు -
కోలీవుడ్ ఫస్ట్ ప్లేస్‌లో దూసుకుపోతోంది: ముఖ్యమంత్రి
చెన్నై సినిమా: తమిళ సినిమా రంగం దేశంలో ప్రథమస్థానంలో దూసుకుపోతుందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ పేర్కొన్నారు. సౌత్ ఇండియా మీడియా, ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (సదస్సు) శనివారం ఉదయం చెన్నైలో మొదలైంది. స్థానిక నందంబాక్కంలోని ట్రేడ్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం స్టాలిన్ ముఖ్య అతిథిగా పాల్గొని సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తానూ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించానని పేర్కొన్నారు. తమిళ సినిమా భారతీయ సినిమాలో ప్రథమస్థానంలో దూసుకుపోతుందని ప్రశంసించారు. చిత్ర పరిశ్రమ ఐక్యతకు తాను సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. ఈతరం యువత గంజాయి, గుట్కా వంటి మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నారని, అలాంటి వాటిపై సినిమాల్లో అవగాహన కలిగించే విధంగా సంభాషణలు పొందుపరచాలని సీఎం స్టాలిన్ తెలిపారు. దక్షిణ్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు సత్యజ్యోతి ఫిలిమ్స్ త్యాగరాజన్ అధ్యక్షత వహించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో దక్షిణాదికి చెందిన సినీ ప్రముఖులు దర్శకుడు మణిరత్నం, నటుడు జయంరవి, టాలీవుడ్ నుంచి డైరెక్టర్ రాజమౌళి, సుకుమార్, మల్లువుడ్ నుంచి నటుడు జయరాం, ఫాహత్ ఫాజిల్, శాండిల్‌వుడ్ నుంచి శివరాజ్‌కుమార్ మొదలగు 300 మందికి పైగా పాల్గొని సినిమాకు చెందిన వివిధ అంశాలపై ప్రసంగించారు. సినీ పరిశ్రమ అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం, సినిమా మార్కెట్ విస్తరణ, ఓటీటీ ప్రభావంపై తమ అనుభవాలను, అభిప్రాయాలను వ్యక్తం చేశారు. చదవండి: బుల్లితెర నటుడి కొత్త ఇల్లు.. కోట్లల్లో ధర.. -
సూపర్ ఉమెన్.. ఆమె తెగువకు సీఎం స్టాలిన్ ప్రశంసలు..
సాక్షి, చెన్నై: ఆమె ఓ మహిళా అధికారి.. రాత్రివేళ అని కూడా చూడకుండా తన విధి నిర్వహణలో తెగువ చూపించింది. అర్థరాత్రి సైకిల్‌పై పెట్రోలింగ్ చేసి ఆమె చూపించిన సాహసం తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం మెప్పించింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ఇంతకీ ఆమె ఎవరూ అనుకుంటున్నారా..? చెన్నై నార్త్ జోన్‌కు చెందిన మహిళా ఐపీఎస్ అధికారిణి, జాయింట్ కమిషనర్ ఆర్వీ రమ్యా భారతి.. గురువారం అర్ధరాత్రి విధుల్లో భాగంగా సైకిల్‌పై పెట్రోలింగ్‌కు వెళ్లారు. తన వ్యక్తిగత భద్రతతో పాటు తెల్లవారుజామున 2.45 గంటల నుంచి 4.15 గంటల వరకు రైడ్ చేస్తూ ఉత్తర చెన్నైలో దాదాపు 9 కిలోమీటర్లు ప్రయాణించి పోలీసు అధికారులను ఆశ్చర్యానికి గురిచేశారు. వాలాజా పాయింట్ నుండి ఆమె పెట్రోలింగ్ ప్రారంభించి ముత్తుసామి బ్రిడ్జి, రాజా అన్నామలై మండ్రం, ఎస్ప్లానేడ్ రోడ్, కురలగం, ఎన్ఎస్సీ బోస్ రోడ్, మింట్ జంక్షన్, వాల్ టాక్స్ రోడ్, ఎన్నూర్ హై రోడ్, ఆర్కేనగర్, తిరువొత్తియూర్ హై రోడ్‌తో సహా అనేక ప్రాంతాలను ఆమె కవర్ చేశారు. తన పెట్రోలింగ్‌లో భాగంగా పలువురు అనుమానితులను సైతం ఆమె పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఆమె చూపించిన తెగువ తమిళనాడులో హాట్ టాపిక్ మారింది. ఈ విషయం కాస్తా సీఎంకు చేరడంతో స్టాలిన్ స్పందించారు. ముఖ్యమంత్రి ట్విట్టర్ వేదికగా..‘‘రమ్యా భారతికి అభినందనలు.. తమిళనాడులో మహిళలపై హింసను తగ్గించాలని, మహిళలకు భద్రత కల్పించాలని డీజీపీని ఆదేశించాను అంటూ కామెంట్స్ చేశారు. అనంతరం, విధి నిర్వహణలో భాగంగా అర్దరాత్రి పూట రోడ్లపై తిరుగుతూ మహిళల భద్రతను పర్యవేక్షించిన ఐపీఎస్ రమ్యా భారతిపై తమిళనాడు పోలీసు శాఖ హర్షం వ్యక్తం చేసింది. దీంతో, ఆమెను డ్రగ్స్‌పై డ్రైవ్‌కు నోడల్ ఆఫీసర్‌గా చెన్నై పోలీస్ కమిషనర్ నియమించారు. ఈ క్రమంలో ఒక్క రాత్రిలోనే ఆమె వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. రాష్ట్రంలో మహిళా పోలీసులకు ఆమె ఆదర్శంగా నిలిచారంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
తమిళనాడులో రెడ్ అలర్ట్!! 2 వందల యేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు..
సాక్షి, చెన్నై: తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఆదివారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తీర ప్రాంత జిల్లాల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. నవంబర్ 29 నాటికి దక్షిణ అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ముమ్మరంగా సహాయక చర్యలు తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలకు రాజధాని చెన్నై సహా పలు ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. తూత్తుకూడి, చెంగల్పట్టు, నాగపట్టణంలోని అనేక ప్రాంతాలు నీటి ముంపులో చిక్కుకున్నాయి. ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద ప్రభావిత జిల్లాల్లో వందకు పైగా సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ముంపు తీవ్రత అధికంగా ఉన్న కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో జాతీయ విపత్తు స్పందన బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నం అయ్యాయి. పలు కాలనీల్లో చేరుకున్న వరద నీటిని నీటి ఇంజన్లతో తోడుతున్నారు. కాగా చెన్నైలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. తమిళనాడులో నవంబరు మాసంలో వంద సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైందని స్టాలిన్ తెలిపారు. గత రెండువందల సంవత్సరాలలో ఇంత వర్షపాతం నమోదు కావడం ఇది నాలుగోసారి అని మీడియకు తెలిపారు. మరో అల్పపీడనం దక్షిణ అండమాన్ సముద్రంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. రాగల 48 గంటల్లో ఇది తీవ్ర అల్పపీడనంగా బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తుందని వాతావరణశాఖ తెలిపింది. డిసెంబరు 2వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని, లోతట్టు ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. చదవండి: ఆ దేశంలో విదేశీయుల రాకపై 14 రోజుల పాటు ఆంక్షలు..! -
Tomato Price Hike: రూ.150కు చేరిన టమాటా.. సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం
సాక్షి, చెన్నై: టమాటా ధరల కట్టడికి ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సహకార శాఖ పరిధిలోని దుకాణాల్లో కిలో రూ. 79కి విక్రయించేందుకు చర్యలు చేపట్టారు. వర్షాలు, దిగుమతి తగ్గడంతో టమాట ధరలకు రెక్కలు వచ్చాయి. రాష్ట్రంలోని మార్కెట్లలో కిలో రూ. 130 నుంచి రూ. 150 వరకు పలుకుతోంది. ధరలు మరింత పెరగొచ్చన్న సంకేతాలతో మహారాష్ట్ర నుంచి టమాటాలను దిగుమతి చేసుకుంటున్నారు. సహకారశాఖ పరిధిలో తోట పచ్చధనం దుకాణాల ద్వారా బుధవారం నుంచి కిలో రూ. 79కి విక్రయాలు ప్రారంభించింది. చెన్నైలో 40, ఇతర ప్రాంతాల్లోని మరో 65 దుకాణాల్లో విక్రయాలు సాగుతున్నాయి. కొన్నిరోజులుగా దక్షిణాది రాష్ట్రాలలో కురిసిన వానలకు కూరగాయల ధరలు గణనీయంగా పెరిగాయి. వానలతో దిగుబడి తగ్గడమే ఇందుకు కారణం. ఇప్పటికే తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాలలోనూ టమాటా ధర రికార్డు స్థాయికి చేరింది. ఇక హైదరాబాద్‌లో టమాటా ధర నెల రోజుల క్రితం కిలో రూ.30 ఉండగా ప్రస్తుతం రూ.100కు చేరింది. అటు ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లిలోనూ టమాట ధర రూ.100 దాటింది. వైఎస్సార్ కడప జిల్లాలో మార్కెటింగ్‌శాఖ ప్రత్యేక చొరవ తీసుకుని సామాన్యులకు భారం కాకుండా టమాటను బయటి ప్రాంతం నుంచి తెప్పించింది. కడప రైతు బజార్లో బుధవారం కిలో ధర రూ. 65 చొప్పున విక్రయాలను చేపట్టారు. చదవండి: పెళ్లి ఊరేగింపుపై దూసుకెళ్లిన లారీ.. ఒక్కసారిగా ఆనందం ఆవిరైంది -
Tamil Nadu: మరో వరుణ‘గండం’!
రాష్ట్రానికి మరో వరుణ‘గండం’ ఎదురుకానుంది. ఇప్పటికే అల్పపీడనాలు, ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో దాదాపు అన్ని జిల్లాలోనూ భారీ వర్షాలు కురిశాయి. ఫలితంగా రోడ్లు దెబ్బతినడంతో పాటు పంటనష్టం వాటిల్లింది. ఇక లోతట్టు ప్రాంతాలు నీట మునిగి ప్రజలు అవస్థలు పడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో ముప్పు రానుంది. వాయుగుండం కారణంగా నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధనా కేంద్రం స్పష్టంచేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సాక్షి, చెన్నై(తమిళనాడు): తమిళనాడులో మళ్లీ భారీ వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలోని అండమాన్ దీవుల సమీపంలో కేంద్రీకృతమైన అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. ఇది ఉత్తర తమిళనాడు–దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లోని సముద్రతీర ప్రాంతాల మీదుగా ఈనెల 18వ తేదీన తీరం దాటనుంది. ఫలితంగా మంగళవారం అర్ధరాత్రి లేదా బుధవారం తెల్లవారుజాము నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెన్నై వాతావరణ పరిశోధనా కేంద్రం సంచాలకులు పువియరసన్ ప్రకటించారు. దీని ప్రభావంతో చెన్నై సహా పలు జిల్లాల్లో 17,18 తేదీల్లో భారీ వర్షాలు పడుతాయి. 17వ తేదీన చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, సేలం, అరియలూరు, పెరంబలూరు, పుదు చ్చేరి రాష్ట్రంలోని కారైక్కాల్ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయి. అలాగే 18వ తేదీన చెన్నై, తిరువళ్లూరు, రాణీపేట్టై, కాంచీపురం, సేలం, ధర్మపురం, కృష్ణగిరి, కల్లకురిచ్చి, ఈరోడ్, కడలూ రు, అరియలూరు, పెరంబలూరు, తిరుచ్చిరాపల్లి, విళుపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలకు అవకాశం ఉంది. అండగా ఉంటాం.. భారీ వర్షాల వల్ల పంట దెబ్బతిని నష్టపోయిన వారికి అండగా ఉంటాం.. ఆదుకుంటామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హామీ ఇచ్చారు. చేతికొచ్చిన పంటను కోల్పోయిన వ్యవసాయ కుటుంబాలకు హెక్టారుకు రూ.20వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈశాన్య రుతువపనాల ప్రభావంతో సుమారు 15 రోజులపాటూ విరుచుకుపడిన భారీ వర్షాలు రాష్ట్రాన్ని కుదిపేశాయని దీంతో జన జీవనం అతలాకుతలమై పోయిందన్నారు. వర్షాలు అదుపులోకి వచ్చిన తరుణంలో ఏడుగురు మంత్రులు, పలువురు ఐఏఎస్ అధికారులతో నియమించిన సర్వే బృందం ఈనెల 12వ తేదీన డెల్టా జిల్లాల్లో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసింది. ఇందుకు సంబంధించిన నివేదికను ఆ బృందం సీఎంకు మంగళవారం సమర్పించింది. ఈ నివేదికపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరయన్బు, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన అనంతరం సీఎం స్టాలిన్ ఓ ప్రకటన విడుదల చేశారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటకు హెక్టారుకు రూ.20వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని తీర్మానించినట్లు సీఎం చెప్పారు. నీట మునిగిన పంటకు సంబంధించి.. నష్టపోయిన రైతులకు అవసరమైన మేరకు వ్యవసాయ పనిముట్లు అందజేయాలని, అలాగే ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు సరఫరా చేయాలని ఆదేశించారు. దెబ్బతిన్నరోడ్లు, సైడు కాలువల మరమ్మతుల కోసం రూ.300 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇక చెన్నైలో బుధవారం నుంచి మళ్లీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్తల దృష్ట్యా నగరానికి తాగునీటి సరఫరా చేసే చెంబరబాక్కం, పుళల్, పూండి చెరువుల నుంచి బుధవారం ఉపరితల నీటిని విడుదల చేశారు. వరద ముంపు బాధిత ప్రాంతాల పునరుద్ధరణ పనులు బుధవారంతో పూర్తవుతాయని చెన్నై కార్పొరేషన్ కమిషనర్ గగన్‌దీప్‌సింగ్ బేడీ మీడియాకు తెలిపారు.