columbia
-
పూల కోసమే ప్రత్యేకమైన పండుగ! ఇది ఒకరోజు పండుగ కాదు.. ఏకంగా..
పూలతోటలు పెంచడం, దైవారాధనలోను, గృహాలంకరణలోను పూలను ఉపయోగించడం దాదాపు ప్రతి దేశంలో ఉన్న వ్యవహారమే! మన దేశంలోనైతే మహిళలు పూలను సిగలో కూడా ధరిస్తారు. ప్రాచీన సంస్కృతుల ప్రభావం గల కొన్ని ఇతర దేశాల్లోనూ మహిళలు పూలను తమ అలంకరణలో భాగంగా ఉపయోగిస్తుంటారు. మన దేశంలో పండుగల్లో పూలను విరివిగా వినియోగిస్తారు గాని, పూల కోసం ప్రత్యేకమైన పండుగ ఏదీ లేదు.అయితే, కొలంబియాలో మాత్రం పూల కోసమే ప్రత్యేకమైన పండుగ ఉంది. ఇది ఒకరోజు పండుగ కాదు, ఏకంగా పదిరోజులు జరుపుకొనే భారీ వేడుక. ఏటా ఆగస్టు 2 నుంచి 11 వరకు ఈ పండుగ జరిగినన్ని రోజులూ కొలంబియాలో ఊరూ వాడా ఎటు చూసినా రంగు రంగుల పూల సోయగాలు కనువిందు చేస్తాయి. చిత్రవిచిత్రమైన పుష్పాలంకరణలు చూపరులను కట్టిపడేస్తాయి.కొలంబియా వాసులు ఈ పండుగను ‘ఫెరియా డి లాస్ ఫ్లోరెస్’ అని పిలుచుకుంటారు. కొలంబియాలో అత్యంత ప్రాధాన్యమున్న సాంస్కృతిక వేడుకల్లో ఈ పూల పండుగ ఒకటి. వర్ణ మహోత్సవంలా సాగే ఈ పూల పండుగను తిలకించడానికి పెద్దసంఖ్యలో విదేశీ పర్యాటకులు ఇక్కడకు చేరుకుంటారు. ఈ పండుగలో భాగంగా జరిగే ఆటపాటల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. కొలంబియా రాజధాని బొగోటాలోని చరిత్రాత్మక కట్టడం ‘ఎల్ ఒబెలిస్కో’ వద్ద పూలబుట్టలతో, పూలతో అలంకరించిన వాహనాలతో జనాలు పెద్దసంఖ్యలో చేరుకుని, అక్కడ సంగీత కార్యక్రమం నిర్వహించడంతో ఈ పూల పండుగ సంబరాలు మొదలవుతాయి.ఈ సందర్భంగా వీథుల్లో పూలతో భారీ పరిమాణంలో నిర్మించిన జంతువులు, పక్షుల విగ్రహాలు సందర్శకులకు స్వాగతం పలుకుతాయి. వివిధ సాంస్కృతిక కేంద్రాల్లోను, ప్రధాన కూడళ్లలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వేదికలపైన సంగీత, నృత్య, నాటక ప్రదర్శనలు జరుగుతాయి. ముగింపు రోజు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పూల రైతులు తమ తమ తోటల్లో పూసిన పూలను బుట్టల్లో నింపుకుని, వాటిని వీపున కట్టుకుని ‘సిలెటరోస్ పరేడ్’ ఊరేగింపును నిర్వహిస్తారు. -
స్వగ్రామానికి తెలుగు విద్యార్థి మృతదేహం
జి.కొండూరు: కొలంబియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన తెలుగు విద్యార్థి బేతపూడి సుధీర్‌కుమార్ మృతదేహం స్వగ్రామమైన ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరుకు సోమవారం ఉదయం చేరింది. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్ కృషి, రాష్ట్ర ప్రభుత్వం చొరవతో బాధిత తల్లిదండ్రులకు కుమారుడి చివరిచూపు దక్కింది. జి.కొండూరుకు చెందిన బేతపూడి దేవదాసు కుమారుడు సుదీర్‌కుమార్ అలియాస్ జోషీ (34) ఎంఎస్ చదివేందుకు 2018లో స్పెయిన్ వెళ్లాడు. అనేక కారణాలతో ఎంఎస్ పూర్తి చేయలేకపోయాడు. అక్కడే ఉంటూ పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తూ చదువు కొనసాగిస్తున్నాడు. గతనెల 15వ తేదీన తన స్నేహితురాలైన తోటి విద్యార్థి జెస్సికా జన్మదిన వేడుకల నిమిత్తం కొలంబియా వెళ్లాడు. 19వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో మృతుడి తల్లిదండ్రులు బేతపూడి కేథరీన్, దేవదాసు తమ కుమారుడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని తమ కుమారుడి ఆఖరి చూపు క ల్పించాలని వారు అభ్యర్థించారు. దీనిపై స్పందించిన స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీ) ద్వారా కొలంబియాలోని ఇండియన్ ఎంబసీతో సంప్రదింపులు జరిపి, జి.కొండూరు తరలించి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. బంధువులు, కుటుంబ సభ్యుల చివరిచూపు అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. తమ కుమారుడి చివరిచూపును కల్పించిన ఎమ్మెల్యేకు, రాష్ట్ర ప్రభుత్వానికి తామెప్పుడూ రుణపడి ఉంటామని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. -
కొలంబియాలో తెలుగు విద్యార్థి అనుమానాస్పద మృతి
జి.కొండూరు(మైలవరం): కొలంబియాలో స్నేహితురాలి జన్మదిన వేడుకలకు హాజరైన తెలుగు విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు గ్రామానికి చెందిన బేతపూడి సుదీర్‌కుమార్ అలియాస్ జోషి (34) టెలీ కమ్యూనికేషన్లో ఎంఎస్ చేసేందుకు 2018లో స్పెయిన్ వెళ్లాడు. అక్కడ యూనివర్సిటీ ఆఫ్ లే డే జైన్‌లో ఎంఎస్‌లో చేరాడు. కరోనా కారణంగా చదువు పూర్తి కాకపోవడం, సబ్జెక్ట్‌లు మిగిలిపోవడంతో అక్కడే ఉండి పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసుకుంటూ ఎంఎస్ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. తనతోపాటు అదే యూనివర్సిటీలో చదువుతున్న కొలంబియాకు చెందిన యువతి జెస్సికాతో సుదీర్‌కుమార్‌కు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఈ నెల 15వ తేదీన తన స్నేహితురాలి జన్మదిన వేడుకల నిమిత్తం సుదీర్‌కుమార్ స్పెయిన్ నుంచి కొలంబియా రాజధాని బోగోటో వెళ్లాడు. అక్కడి నుంచి రియో బ్లాంకోలోని స్నేహితురాలి నివాసానికి చేరుకున్నాడు. అక్కడ జన్మదిన వేడుకల అనంతరం ఏం జరిగిందో ఏమో కానీ ఈ నెల 19వ తేదీన మంగళవారం తెల్లవారుజామున కొలంబియాలోని జెస్సీకా నుంచి జి.కొండూరులోని సుదీర్‌కుమార్ తల్లిదండ్రులు బేతపూడి కేథరీన్, దేవదాసుకు సుదీర్‌కుమార్ మరణ వార్త అందింది. తన ఇంట్లోనే సుదీర్‌కుమార్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని జెస్సీకా తెలిపినట్లు కేథరీన్, దేవదాసు చెబుతున్నారు. స్నేహితురాలి జన్మదిన వేడుకలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను సైతం తమతో వాట్సాప్‌లో పంచుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జన్మదిన వేడుకలలో భాగంగా తాగిన డ్రింక్ వల్ల మత్తుగా ఉందని, తర్వాత మాట్లాడతానని తమతో చివరిగా ఫోన్లో మాట్లాడినట్లు చెబుతున్నారు. తమ కుమారుడిని జన్మదిన వేడుకల పేరుతో రప్పించి కావాలని హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే తాము ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని తమ కుమారుడి భౌతికకాయం తమకు అప్పగించేలా చూడాలని మృతుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. -
‘ఆకలేస్తోంది.. అమ్మ చనిపోయింది!’
ఆశలు వదిలేసుకుంటున్న తరుణంలో.. ఏదో అద్భుతం జరిగినట్లు నలుగురు చిన్నారులు అమెజాన్ అడవుల నుంచి బయటపడ్డారు. ఓవైపు 40 రోజులు వాళ్లు ఎలా అడవిలో గడిపారనే దానిపై ప్రపంచం చర్చించుకుంటుండగా.. అదే టైంలో రెస్క్యూ టీం శ్రమపై కొలంబియాలో సర్వత్రా అభినందనలు కురుస్తున్నాయి. రియల్ హీరోలుగా అభివర్ణిస్తోంది ఆ దేశమంతా. ఈ తరుణంలో.. సదరు రెస్క్యూ గ్రూప్ ఆదివారం ఓ మీడియా ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. శుక్రవారం సాయంత్రం చిన్నారుల జాడ దొరకగా.. వాళ్లను ప్రత్యేక విమానంలో రాజధాని బోగోటాకు తరలించి చికిత్స అందించడంతో వాళ్లు కోలుకున్నట్లు తెలిపింది. హుయిటోటోకు చెందిన ఆ పిల్లలు సర్వైవర్ స్కిల్స్(ఆపదలో తమను తాము రక్షించుకోవడం) ద్వారా బయటపడినట్లు చెప్పింది. అంతేకాదు.. రెస్క్యూ టీంలో సభ్యుల్లో చాలా మంది స్థానిక తెగకు చెందిన వాళ్లే కావడం గమనార్హం. ‘‘ఆ నలుగురిలో పెద్ద లెస్లీ. తన చేతిలో చిన్న పసికందు ఉంది. నన్ను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆకలిగా ఉందంటూ కన్నీళ్లు పెట్టుకుంది. వెనకాల ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్లలో ఒక పిల్లాడు మమ్మల్ని చూసి కిందపడిపోయాడు. దగ్గరికి వెళ్లగానే ఏడుస్తూ మా అమ్మ చనిపోయిందని చెప్పాడు. వెంటనే వాళ్లకు ధైర్యం అందించాలనుకున్నాం. మేం మీ నాన్న పంపితేనే వచ్చాం. మీమూ మీ కుటుంబం లాంటివాళ్లమే అని చెప్పాం అని బృందంలోని సభ్యులు ఒక్కొక్కరుగా వివరించుకుంటూ వచ్చారు. పిల్లల్ని రక్షించాక వాళ్లను నవ్వించేందుకు తాము చేయని ప్రయత్నమంటూ లేదని చెబుతున్నారు వాళ్లు. వాళ్లు ఆరోగ్యంగానే కనిపించారు. అయినా తాగడానికి నీళ్లు, ఎనర్జీ డ్రింక్స్ అందించాం. సరదాగా మాట్లాడుతూ ఉన్నాం. కానీ, వాళ్ల ముఖాల్లో నవ్వు రాలేదు. తల్లి లేదన్న బాధ నెలరోజులైనా ఆ చిన్నారుల ముఖం నుంచి వీడిపోలేదు. సరదాగా వాళ్లతో కబుర్లు చెప్పాం. పొగాకు తాగుతూ.. పాటలు పాడుతూ వాళ్లను నవ్వించే యత్నం చేశాం. అక్కడున్న పవిత్రమైన చెట్ల ఆకుల్ని పూజించాం. కథలు చెప్పాం. అందులో చిన్నారితో పాటు ఐదేళ్ల బాబు కూడా ఈ 40 రోజుల గ్యాప్‌లోనే పుట్టినరోజులు అయిపోయాయట. అందుకే వాళ్లకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పాటలు పాడాం. వాళ్లు తేరుకుంటున్న సమయంలోనే ఎయిర్‌లిఫ్టింగ్ చేశాం. ఆస్పత్రిలో వాళ్లు కోలుకుంటున్నారు అని బృందం సభ్యులు చెప్పుకొచ్చారు. నాలుగు రోజులపాటు కొనప్రాణంతో.. ఇదిలా ఉంటే.. చిన్నారుల తండ్రి పిల్లలతో మాట్లాడాక ఆ వివరాలను ఆదివారం సాయంత్రం మీడియాకు వివరించారు. తన భార్య ప్రమాదం జరిగిన వెంటనే చనిపోలేదని పిల్లలు ఆ విషయం తనకు చెప్పారని ఆయన వివరించారు. మాగ్దలీనా ముకుటుయ్ తెగ నాయకురాలు. ఆమె ప్రమాదానికి గురయ్యాక తీవ్రంగా గాయపడింది. నాలుగు రోజుల పాటు ఆమె కొనప్రాణంతో కొట్టుమిట్లాడింది. ఆ టైంలో పిల్లలు ఆమె వెంటే ఉన్నారు. ఊపిరి ఆగిపోయేముందు ఆమె వాళ్లను.. ఎలాగైనా అడవి నుంచి బయటపడమని చెప్పి కన్నుమూసింది. మే 1వ తేదీన ఆ పిల్లలు, వాళ్ల తల్లి, ఓ తెగ నాయకుడు ప్రయాణిస్తున్న తేలికపాటి విమానం ప్రమాదానికి గురైంది. విమానం ముందు భాగం ధ్వంసం కావడంతో.. అక్కడ ఉన్న ముగ్గురు(పిల్లల తల్లి కూడా) మరణించారు. అయితే వెనకభాగంలో కూర్చున్న పిల్లలు సురక్షితంగా బయటపడి.. భయంతో అడవి నుంచి బయటపడేందుకు ప్రయత్నించారు. దాదాపు 40 రోజుల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత వాళ్ల జాడను గుర్తించింది ఓర్డోనెజ్ గోమెస్ నేతృత్వంలోని బృందం. ఆ నలభై రోజులపాటు అడవుల్లో దొరికే పండ్లు, గింజలు, దుంపలు, వేళ్లు తిని బతికారు వాళ్లు. ఆ చిన్నారుల ధైర్యానికి ముఖ్యంగా తన తోబుట్టువుల్ని రక్షించుకునేందుకు లెస్లీ చేసిన సాహసానికి అభినందనలు కురుస్తున్నాయి. ఇదీ చదవండి: డాల్ఫిన్ కోసం వెళ్తే.. జరిగింది ఇది! -
కంపు చేస్తున్నాయని.. భారత్‌కు తరలిస్తున్నారు
ఒకప్పుడు వాటి సంఖ్య నాలుగు మాత్రమే. ఇప్పడు ఆ కౌంట్ 130కి చేరింది. పెరిగితే పెరిగాయ్. కానీ, ఆ ప్రాంతమంతా కంపు కంపు చేస్తున్నాయి. అందుకే వాటిని వదిలించుకునేందుకు అధికారులు, ప్రభుత్వం శతవిధాల ప్రయత్నించాయి. ఇక చివరి ప్రయత్నంగా వాటిని భారత్‌కు తరలించేందుకు సిద్ధం అయ్యాయి. కొలంబియా ప్రభుత్వం తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. డెబ్భై హిప్పోపోటమస్లను పట్టుకుని వాటిని భారత్‌తో పాటు మెక్సికోకు తరలించాలని నిర్ణయించుకుంది. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఇవి డ్రగ్ లార్డ్‌గా పేరుగాంచిన పాబ్లో ఎస్కోబార్‌కు చెందినవి కావడం. 1980లో ఎస్కోబార్ నాలుగు హిప్పోపోటమస్(నీటి ఏనుగులను) ఆఫ్రికా నుంచి అక్రమంగా తెప్పించుకున్నాడు. ఆ టైంలో అతని దగ్గర ఏనుగులు, జిరాఫీలు.. ఇలా జంతువుల కలెక్షన్స్‌తో ఒక పెద్ద జూ ఉండేది. పశ్చిమ ప్రాంతంలోని తన ఎస్టేట్‌లో వీటిని ఉంచాడు. అయితే.. 1991లో ఎస్కోబార్ లొంగిపోయాక.. అక్కడి ప్రభుత్వం వాటికి స్వేచ్ఛ కల్పించింది. అటుపై.. ఆ ఈ ముప్పై ఏళ్లలో ఆ నాలుగు నీటి ఏనుగుల సంఖ్య కాస్త 130కి చేరుకుంది. ప్రస్తుతం అవి మాగ్డలీనా నది ప్రాంతంలో ఉంటున్నాయి. అయితే.. అక్కడి నేల సారవంతాన్ని పాడు చేయడంతో పాటు, అక్కడి నీటిని కలుషితం చేస్తున్నాయి. మొక్కలను పాడు చేస్తున్నాయి. పైగా స్థానికులు సైతం వాటి వల్ల ప్రాణపాయం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో.. వాటి జనాభాను నియంత్రించేందుకు కొలంబియా ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ, ఆ చర్యలు ఫలించలేదు. చేసేది లేక వాటిని చంపేందుకు కూడా అనుమతులు మంజూరు చేసింది. దీంతో తీవ్ర ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో ఆ ఆదేశాలను వెనక్కి తీసుకుంది. ఇక చివరి ప్రయత్నంగా వాటిని దూరంగా తరలించడమే మార్గమని కొలంబియా ప్రభుత్వం భావిస్తోంది. భారత్‌కు 60, మెక్సికోకు పది హిప్పోలను తరలించాలని నిర్ణయించుకుంది కొలంబియా ప్రభుత్వం. అయితే.. ఈ కొలంబియా ప్రతిపాదనపై భారత్ స్పందన తెలియాల్సి ఉంది. -
Football: కుప్పకూలి.. యువ ఆటగాడు కన్నుమూత
కొలంబియా ఫుట్‌బాల్ జట్టులో విషాదం నెలకొంది. ఆ జట్టు మిడ్‌ఫీల్డర్ 22 ఏళ్ల ఆండ్రెస్ బలంతా కన్నుమూశాడు. ఇటీవలే అట్లెటికో టుకుమన్ ట్రెయినింగ్ సెషన్లో ఆండ్రెస్ పాల్గొన్నాడు. ట్రెయినింగ్ సెషన్ జరుగుతుండగానే ఆండ్రెస్ బలంతా ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో భయపడిన నిర్వాహకులు ఆండ్రెస్‌ను టుకుమన్ హెల్త్ సెంటర్ ఆసుపత్రిలో చేర్చారు. కాగా చికిత్స తీసుకుంటూనే మంగళవారం గుండెపోటుతో ఆండ్రెస్ మరణించినట్లు వైద్యులు ద్రువీకరించారు. ఎంత ప్రయత్నించినా ఆండ్రెస్‌ను కాపాడలేకపోయామని వైద్యులు పేర్కొన్నారు. ఇక 2021-22 సీజన్లో అట్లెటికో టుకుమన్కు ప్రాతినిధ్యం వహించిన ఆండ్రెస్ బలంతా ఏడు మ్యాచ్‌లు ఆడాడు. కాగా ఆండ్రెస్ మృతిపై కొలంబియా ఫుట్‌బాల్ జట్టు తమ సంతాపం తెలిపింది. ఇక మాంచెస్టర్ సిటీ దిగ్గజం సెర్జియో ఆగురో ఆండ్రెస్ మృతిపై విచారం వ్యక్తం చేశాడు. ''బలంతా చనిపోవడం బాధాకరం. అతని ఆరోగ్య పరిస్థితి దృశ్యా వైద్యులు ఇకపై ఆండ్రెస్ ఫుట్‌బాల్ ఆడేందుకు వీల్లేదని చెప్పారు. కానీ ఇంతలోనే మృతి చెందడం ఎంతో బాధ కలిగిస్తుంది. ఆ స్థానంలో నేనున్నా బాగుండేది.. భరించడం కష్టంగా ఉంది. మిస్ యూ ఆండ్రెస్ బలంతా'' అంటూ కన్నీటిపర్యంతం అయ్యాడు. ఇక ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌కు కొలంబియా అర్హత సాధించడంలో విఫలమయింది. 2014లో క్వార్టర్ ఫైనల్స్, 2018 వరల్డ్‌కప్‌లో రౌండ్ ఆఫ్ 16లో వెనుదిరిగిన కొలంబియా ఈసారి మాత్రం మెగాటోర్నీకి అర్హత సాధించలేకపోయింది. దీంతో కొలంబియా జట్టులోని స్టార్ ఆటగాళ్లు లుయిస్ డియాజ్, జేమ్స్ రోడ్రిగ్వేజ్, డేవిన్సన్ సాంచెజ్లు వరల్డ్‌కప్ ఆడే చాన్స్ మిస్సయ్యారు. -
FIFA WC: సెల్ఫ్ గోల్ ఆటగాడి ప్రాణం తీసింది..
ఫుట్‌బాల్‌లో సెల్ఫ్ గోల్ అంటే సొంతజట్టు గోల్బాక్స్లో కొట్టడం. ఇలా చేస్తే ప్రత్యర్థి జట్టు ఖాతాలోకి గోల్ వెళ్లిపోతుంది. ఇలాంటి సంఘటనలు గతంలో చాలానే జరిగాయి. అయితే అదే సెల్ఫ్ గోల్ ఒక ఫుట్‌బాల్ ఆటగాడి ప్రాణం తీసిందంటే నమ్ముతారా. కానీ నమ్మి తీరాల్సిందే. విషయంలోకి వెళితే.. 1994 ఫిఫా వరల్డ్‌కప్‌లో కొలంబియా తన తొలి మ్యాచ్‌లో రొమేనియాతో తలపడింది. ఆ మ్యాచ్‌లో కొలంబియా 1-3 తేడాతో రొమేనియా చేతిలో ఓడిపోయింది. ఇక రెండో మ్యాచ్ అమెరికాతో జరిగింది. నాకౌట్ దశ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిందే. కొన్ని కారణాల రిత్యా జట్టులో కీలక ఆటగాడైన గాబ్రియెల్ గోమెజ్‌ను ఆఖరి నిమిషంలో జట్టు నుంచి తప్పించారు. కీలక ఆటగాడు లేకుండానే బరిలోకి దిగిన కొలంబియా తొలి అర్థగంట మంచి ఆటను ప్రదర్శించింది. అయితే ఆట 35వ నిమిషంలో కొలంబియా ఆటగాడు ఎస్కోబార్ పెద్ద తప్పిదం చేశాడు. అమెరికా ఆటగాడు హర్కీస్ బంతిని కొలంబియా గోల్‌పోస్టు సమీపంలో ఉన్న స్టెవార్ట్ దిశగా కొట్టాడు. కానీ ఆండ్రెస్ ఎస్కోబార్ స్టెవార్ట్కు బంతిని అందకుండా చేసే ప్రయత్నంలో అతడి కాలుకి తాకిన బంతి అనూహ్యంగా గోల్‌పోస్ట్‌లోకి వెళ్లింది. ఎస్కోబార్ సెల్ఫ్‌గోల్ కారణంగా అమెరికాకు 1-0 ఆధిక్యం లభించింది. ఇది కొలంబియాకు పెద్ద షాక్. ఆ తర్వాత ఆట 52వ నిమిషంలో యూఎస్ఏ ప్లేయర్ స్టెవార్ట్ మరో గోల్ కొట్టడంతో అమెరికా 2-0తో స్పష్టమైన ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఆట చివర్లో కొలంబియా ఆటగాడు వాల్సేనియా గోల్ చేసినప్పటికి లాభం లేకపోయింది. దీంతో కొలంబియా 2-1 తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ తర్వాత స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌ను కొలంబియా 2-0 తేడాతో ఓడించింది. కానీ అమెరికాతో మ్యాచ్‌లో ఓటమి కొలంబియాను ఇంటిబాట పట్టేలా చేసింది. దీనికి ప్రధాన కారణం ఎస్కోబార్ సెల్ఫ్‌గోల్ చేయడమే. అమెరికాతో మ్యాచ్‌లో ఎస్కోబార్ ఆ గోల్ చేయకపోయుంటే మ్యాచ్ డ్రా అయ్యి కొలంబియాకు నాకౌట్ చాన్సులు ఉండేవి. ఇక కొలంబియా గ్రూప్ దశలోనే వెనుదిరగడంతో ఎస్కోబార్ స్వదేశానికి వచ్చాడు. స్నేహితులతో కలిసి నైట్‌క్లబ్‌కు వెళ్లిన ఎస్కోబార్ అక్కడే చాలాసేపు గడిపాడు. ఆ తర్వాత తెల్లవారుజామున మూడు గంటలకు ఇంటికి బయలుదేరిన ఎస్కోబార్‌తో కొందరు వ్యక్తులు గొడవకు దిగారు. ఆ తర్వాత తుపాకీ తీసి ఎస్కోబార్‌పై కాల్పులు జరిపారు. కాల్చిన ప్రతీసారి 'గో.. గో' అని అరిచారు. దక్షిణ అమెరికాలో ఆటగాళ్లు గోల్ చేసిన ప్రతీసారి అక్కడి వ్యాఖ్యతలు గో అనే అంటారు. అరగంట పాటు రోడ్డుపైనే రక్తపు మడుగులో పడి ఉన్న ఎస్కోబార్‌ను కొందరు స్థానిక ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అలా ఒక సెల్ఫ్ గోల్ ఒక ఫుట్‌బాల్ ఆటగాడి ప్రాణం పోవడానికి కారణమైంది. ఆ మరునాడు ఎస్కోబార్ అంతిమయాత్రలో దాదాపు లక్షా 20వేల మంది పాల్గొన్నట్లు అంచనా. -
భారత రిలే జట్టుకు రజతం
కలి (కొలంబియా): ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత మిక్స్డ్ రిలే జట్టు 4X400 మీటర్ల పరుగులో రజత పతకం సాధించింది. శ్రీధర్, ప్రియా మోహన్, కపిల్, రూపల్ చౌదరీలతో కూడిన భారత జట్టు రేసును 3 నిమిషాల 17.67 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. వరల్డ్ అండర్–20 అథ్లెటిక్స్‌లో భారత మిక్స్డ్ టీమ్ మెరుగైన ప్రదర్శనతో పతకంతో నిలబెట్టుకుంది. గతేడాది నైరోబీలో మొదటిసారిగా నిర్వహించిన ప్రపంచ అండర్ –20 అథ్లెటిక్స్‌లో మిక్స్డ్ జట్టు కాంస్యం గెలిచింది. అప్పుడు రూపల్ మినహా భరత్, ప్రియా, కపిల్ ముగ్గురు కాంస్యం గెలిచిన బృందంలో ఉన్నారు. 🇮🇳The Indian U-20 4x400m mixed relay team of Bharath, Priya, Kapil & Rupal make the nation proud💥 They finish with a timing of 3.17.76, a new Asian U-20 record, to win 🥈 at the #U20WorldChampionships #Athletics pic.twitter.com/2890EMphNM — The Bridge (@the_bridge_in) August 2, 2022 That effort by #TeamIndia 🇮🇳🫡 pic.twitter.com/gkOW1y1MZk — Athletics Federation of India (@afiindia) August 3, 2022 -
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. ఎంత ఈజీగా జైలు నుంచి తప్పించుకున్నాడో!
వాడొక కరడు గట్టిన క్రిమినల్. డ్రగ్ సప్లయ్‌తో యువత జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. పోలీసులు కష్టపడి పట్టుకుంటే.. చావు నాటకం ఆడి తెలివిగా తప్పించుకున్నాడు. ఆపై ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని రూపు మార్చుకున్నా.. టైం బాగోలేక దొరికిపోయాడు. కానీ, ఇప్పుడు ఏదో చుట్టాల ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు జైలు, అదీ కఠినమైన భద్రత నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోలే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జువాన్ క్యాస్ట్రో అలియాస్ మటాంబా.. కరడుగట్టిన కొలంబియన్ డ్రగ్ డీలర్. నైరుతి కొలంబియా నారినో ప్రావిన్స్‌లో 20 శాతం కొకైన్ మాఫియాకు కారణం ఇతనే. బోగోటాలోని లా పికోటా జైల్ నుంచి గత శుక్రవారం తప్పించుకున్నాడు. అది అలా ఇలా కాదు. సెక్యూరిటీ గార్డు దుస్తుల్లో, ముసుగు ధరించి చాలా క్యాజువల్‌గా బయటకు వచ్చేశాడు. గట్టి భద్రత, ఏడు హైసెక్యూరిటీ గేట్లు ఉన్నా, అలవోకగా దాటేశాడు. 🔴 En los videos se aprecia al poderoso narcotraficante salir por una reja que le deja abierta un inspector de apellido Jiménez ► https://t.co/66DoBnmIKk 📹: cortesía. pic.twitter.com/2iTgOgZYgQ — EL TIEMPO (@ELTIEMPO) March 20, 2022 సిబ్బంది తొలగింపు ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై కొలంబియా అధ్యక్షుడు Iván Duque Márquez సీరియస్ అయ్యారు. హై లెవల్ ఎంక్వైరీకి ఆదేశించారు. దర్యాప్తులో.. జువాన్ క్యాస్ట్రో పారిపోయేందుకు సహకరించిన గార్డును పోలీసులు అరెస్ట్ చేశారు. జైలు అధికారి మిల్టన్ జిమెనెజ్తో పాటు 55 మంది గార్డులపైనా వేటు వేశారు. సుమారు ఐదు మిలియన్ డాలర్ల లంచం పోలీసులకు చెల్లించి.. తప్పించుకున్నాడని పోలీసులు నిర్దారణకు వచ్చారు. అంతేకాదు ఈమధ్యకాలంలో కొంత మంది జువాన్‌ను వచ్చి కలిసినట్లు పేర్కొన్నారు. 🚨 Finalmente, alias Matamba sale por la puerta haciendo un gesto con su mano derecha en señal de que todo está bien. Acá los detalles ► https://t.co/66DoBnmIKk Vía @JusticiaET pic.twitter.com/dGzH7s3q9x — EL TIEMPO (@ELTIEMPO) March 20, 2022 కంత్రిగాడు జువాన్ ఇప్పటివరకు పన్నెండుసార్లు అరెస్ట్ అయ్యాడు. అయితే తప్పించుకోవడం మాత్రం రెండోసారి. 2018లో జైలు నుంచి మెడికల్ లీవ్‌లో వెళ్లిన అతను చనిపోయినట్లు తప్పుడు పత్రాలు సృష్టించాడు స్వేచ్ఛగా తిరిగాడు. ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని కొత్త లుక్‌తో స్వేచ్చగా తిరిగాడు. కిందటి ఏడాది.. పుట్టినరోజు వేడుకల్ని ఫ్లారిడాబ్లాంకాలో ఓ లగ్జరీ అపార్ట్మెంట్లో నిర్వహించుకున్నాడు. అయితే పేరుతో ఇన్విటేషన్ ఇవ్వడంతో.. ఎట్టకేలకు పోలీసులు పట్టేసుకునేవారు. జువాన్ క్యాస్ట్రో అలియాస్ మటాంబా మే 2021లో అరెస్ట్ అయ్యాడు. ఇంకో నెలలో అతన్ని అమెరికాకు అప్పగించాల్సి ఉంది. ఈలోపే తప్పించుకుని పోవడంతో అధికారుల్లో టెన్షన్ నెలకొంది. -
విమానంలో మహిళను టాయిలెట్‌కు వెళ్లనీయకుండా..
బొగటా : కొలంబియాలో దారుణం జరిగింది. విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళను ఘోరమైన వేధింపులకు గురి చేశారు సిబ్బంది. మూత్ర విసర్జన కోసం టాయిలెట్లోకి అనుమతి ఇవ్వలేదు. రెండు గంటల పాటు ప్రాధేయపడినా కనికరించలేదు. చివరకు తన సీటులోనే మూత్ర విసర్జన చేశారు. అయినప్పటికీ సిబ్బంది కనికరించకుండా ఆదే సీటులో ఆమెను కూర్చోబెట్టి 7 గంటల ప్రయాణం చేయించారు. ఈ దారుణ ఘటన కొలంబియాలోని బొగటాలో జరిగింది. గత నెలలో ఐర్లాండ్‌లోని డబ్లిన్ వెళ్లేందుకు ఓ 26 ఏళ్ల మహిళ కొలంబియా విమానాశ్రయంలో ఎయిర్ కెనడా విమానం ఎక్కారు. అయితే సాంకేతిక లోపం వల్ల ఆ విమానం రెండు గంటల పాటు నిలిచిపోయింది. ఈ క్రమంలో విమానంలో ఉన్న మహిళ మూత్ర విసర్జన కోసం టాయిలెట్‌కు వెళ్లబోయారు. విమాన సిబ్బంది టాయిలెట్లోకి అనుమతించలేదు. తనకు ఇబ్బందిగా ఉందని, త్వరగా టాయిలెట్‌కు వెళ్లాలని సిబ్బందిని ప్రాధేయపడినా కనికరించలేదు. టాయిలెట్లోకి వెళ్లేందుకు వెళ్లిన ప్రతిసారి ఆమెను అడ్డుకున్నారు. దీంతో చేసేది ఏమిలేక తాను కూర్చున సీటులోనే మూత్ర విసర్జన చేశారు. అయినప్పటికీ సిబ్బంది కనికరించకుండా ఆమెను అదే సిటులో కూర్చొబెట్టి 7గంటల ప్రయాణం చేయించారు. ఆమె కెనాడియన్ సీటీకి వెళ్లాక ఓ హోటల్‌కి వెళ్లి స్నానం చేసి దుస్తులు మార్చుకున్నారు. అనంతరం విమానాశ్రయానికి వెళ్లి సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. తనను ఘోరంగా వేధించారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
కొలంబియా నుంచి కొకైన్
సాక్షి, హైదరాబాద్: భారత్‌కు సరఫరా అవుతున్న కొకైన్ మాదకద్రవ్యం ఆఫ్రికా దేశమైన కొలంబియా నుంచి వస్తోంది. భారీ ఓడల్లో ప్రాదేశిక జలాల వరకు తీసుకువస్తున్న స్మగ్లర్లు అక్కడ నుంచి నాటు పడవల్ని ఆశ్రయిస్తున్నారు. ముంబై, గోవాల కేంద్రంగా దందా చేస్తున్న వారిలో అత్యధికులు నైజీరియన్లే ఉంటున్నారు. పోలీసు నిఘాకు చిక్కకుండా, డిపోర్టేషన్‌కు ఆస్కారం లేకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ జాన్ పాల్ ఒనెబూచి అలియాస్ యుగోచుకువను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గత వారం అదుపులోకి తీసుకున్నారు. భారీగా పెరిగిన సాగు కొకైన్‌ను కోకా మొక్కల నుంచి తయారు చేస్తారు. ఈ మొక్కల సాగులో కొలంబియా ప్రపంచంలోనే టాప్. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవుతున్న కొకైన్‌లో 85 శాతం ఇక్కడే ఉత్పత్తి అవుతోంది. అక్కడ కోకా మొక్కల సాగు విస్తీర్ణం ఏడాదిలో లక్ష ఎకరాలకు పైగా పెరిగింది. 2016లో ఈ విస్తీర్ణం 4,64,558 ఎకరాలుగా ఉండగా.. 2017 నాటికి ఇది 5,16,450 ఎకరాలకు పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి. కొలంబియా నుంచి కొకైన్‌ను ఓడల్లో ఇతర దేశాలకు తరలిస్తుంటారు. భారత్ విషయానికి వస్తే భారీ ఓడల్లో ముంబై తీరానికి 12 నాటికల్ మైళ్ల వరకు (22.2 కిమీ) తీసుకొస్తారు. అక్కడి వరకు అంతర్జాతీయ జలాలే అయినా.. ఆపై దేశ ప్రాదేశిక జలాలు మొదలవుతాయి. ఇక్కడ కోస్ట్‌గార్డ్ నిఘా ఉంటుంది. దీనికోసం అంతర్జాతీయ జలాల్లోనే ఓడల్ని ఆపేసి అనువైన ప్రాంతంలో డ్రగ్ పార్శిల్స్‌ను నాటు పడవల్లోకి ఎక్కిస్తారు. అంతర్జాతీయ, ప్రాదేశిక జలాల్లోకి మారుతూ ఎవరి కంటా పడకుండా ముంబై, గోవా తీరాలకు నాటు పడవల్ని తీసుకొస్తున్నారు. ఇలా తీరానికి చేరుకున్న మాదకద్రవ్యం హోల్‌సేల్‌గా ప్రధాన స్మగ్లర్ల చేతికి చేరుతుంది. వారి నుంచి రిటైల్‌గా విక్రయించే పెడ్లర్లు కొనుక్కొని దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. చిక్కితే చిరునామా మారుతుంది మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసుల్లో అరెస్టయిన నైజీరియన్లు తమ ఉనికి బయటపడకుండా, పోలీసు నిఘా ఉండకుండా ఉండేందుకు పక్కా పథకం ప్రకారం వ్యవహరిస్తున్నారు. ఒనెబూచి ఉదంతమే దీనికి తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నైజీరియాలోని లాగోస్ నుంచి 2008లో వచ్చిన ఇతడు కేరళలో స్థిరపడ్డాడు. 2015లో హైదరాబాద్‌కు మకాం మార్చి పెడ్లర్‌గా మారాడు. గోవాలో అరెస్టయ్యాక జైలు నుంచి బయటకొచ్చిన ఒనెబూచి హైదరాబాద్‌లో టోలిచౌకి నుంచి జవహర్‌నగర్‌కు మకాం మార్చాడు. 2016లో ఎల్బీనగర్ పోలీసులు మరోసారి అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈసారి జైలు నుంచి బయటకు రాగానే బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని సయ్యద్‌నగర్‌కు మకాం మార్చాడు. తాజాగా వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌కు అక్కడే చిక్కాడు. దాదాపు ప్రతి పెడ్లర్ కూడా ఇలా తరచూ మకాం మారుస్తుండటంతో నిఘా కష్టమవుతోందని పోలీసులు చెబుతున్నారు. అంతా ఒకచోట పెట్టకుండా.. హోల్సేలర్ల నుంచి 50 నుంచి 100 గ్రాముల చొప్పున ఖరీదు చేస్తున్న పెడ్లర్లు దాన్ని భద్రపరిచే విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మొత్తం ఒకే చోటనో, తమ దగ్గరో ఉంచితే పోలీసులకు చిక్కితే మొత్తం నష్టపోవాల్సి వస్తుందని నాలుగైదు భాగాలుగా చేస్తున్నారు. వాటిని వేర్వేరు ప్రాం తాల్లో, స్నేహితుల వద్ద ఉంచుతున్నారు. కొద్దికొద్దిగా తీసుకొచ్చి వినియోగదారులకు విక్రయిస్తున్నారు. దీ నికి తోడు ఇంత మొత్తం డ్రగ్‌తో అరెస్టు అయితే జైలు నుంచి వచ్చాక తమ దేశాలకు బలవంతంగా తిప్పి పంపుతారనే (డిపోర్టేషన్) భయం పెడ్లర్స్‌లో ఉం టోంది. దీంతో ఒకే వ్యక్తికి 3 గ్రాములు మించి అమ్మకుండా, ఒకేసారి ముగ్గురు కంటే ఎక్కువ మంది కస్టమర్లకు అందించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నా రు. అందువల్లే ఇటీవల పోలీసులకు చిక్కిన పెడ్లర్స్ లో ఎవరి వద్దా భారీ మొత్తంలో డ్రగ్ రికవరీ కాలేదు. -
పక్కా దేశీ పేరెంట్స్ అనిపించుకున్నారుగా..!
ఎంత మోడ్రన్‌గా ఉన్నా.. ఆధునికంగా ఆలోచించినప్పటికి కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం ఇండియన్ పేరెంట్స్ మార్పు అంగీకరించరు. ముఖ్యంగా ఆడపిల్లలు మద్యం సేవించే విషయాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేరు. మద్యపానం మగవారికి మాత్రమే అని ఏళ్లుగా నమ్ముతున్న సమాజం మనది. అయితే ఇప్పుడిప్పుడే ఈ ట్రెండ్ మారుతన్నప్పటికి నేటికి మన సమాజంలో నూటికి 95 శాతం కుటుంబాల్లో ఆడవారు తాగకూడదు అనే నియమం చాలా కఠినంగా పాటిస్తారు. ఒక వేళ అందుకు భిన్నంగా జరిగితే తల్లిదండ్రుల రియాక్షన్ ఇలా ఉంటుందంటన్నారు మిషా మాలిక్. కొలంబియాలో నివసిస్తున్న మిషా మాలిక్ రెండు రోజుల క్రితం తన ట్విటర్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. దీనిలో మిషా తన తల్లిదండ్రుల ఎదురుగా మద్యం సేవిస్తూంటుంది. మరో వైపు మిషా తల్లి.. కూతుర్ని తాగవద్దని బతిమిలాడటం వినిపిస్తుంది. ‘ఇది జరిగాక మా అమ్మానాన్నలు నన్ను ఇండియా తిరిగి పంపిచడానికి టికెట్లు బుక్ చేశారు’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ‘ఇండియన్ పేరెంట్స్ అంటేనే ఓవర్ కేరింగ్ అని నిరూపించుకున్నారం’టూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. It was at this moment that my parents decided they were sending me back to India pic.twitter.com/MQ64wuYESO — Misha Malik (@MishaMalik138) March 18, 2019 -
దోపిడీల దొరసాని
జయనగర: ఓ విదేశీ ముఠా హాలీవుడ్ సినిమా తరహాలో బెంగళూరులో ఇళ్లను కొల్లగొడుతూ చివరికి పోలీసులకు దొరికిపోయింది. దక్షిణ అమెరికాలోని కొలంబియాకి చెందిన ఓ మహిళ చాలాకాలం క్రితం టూరిజం వీసాపై భారత్‌కు వచ్చింది. దేశమంతటా పర్యటిస్తూ బెంగళూరుకు చేరుకుంది. ఇక్కడ విదేశీయులు అధికంగా ఉండడం, ధనిక నగరంగా పేరున్నట్లు గుర్తించిన మహిళ డబ్బు సంపాదించుకోవడానికి దొంగతనాలకు సిద్ధమైంది. తమ దేశానికి చెందిన మరో నలుగురితో కలసి ముఠాగా ఏర్పడి ఎవరికీ అనుమానం రాని రీతిలో హైటెక్ పద్ధతుల్లో చోరీలు చేయడం ప్రారంభించింది. కారులో వచ్చి కాలింగ్‌బెల్ నొక్కి.. ముందుగా లక్ష్యంగా చేసుకున్న ఇంటి ముందు మహిళ ఖరీదైన కారులో దిగుతుంది. ఇంట్లో వ్యక్తులు తమకు పరిచయస్థులనే విధంగా ఇంటి గేటును తీసుకొని కాలింగ్‌బెల్ నొక్కుతుంది. అలా రెండుసార్లు మీట నొక్కిన అనంతరం ఎవరైనా తలుపు తీస్తే ఏదో చిరునామా కావాలంటూ చీటి చూపించి అక్కడి నుంచి మెల్లగా జారుకుంటుంది. ఒకవేళ పావు గంట వరకు ఎవరూ తలుపు తీయకపోతే ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకుని, కారులో ఎదురుచూస్తున్న ముఠా సభ్యులకు వాకీటాకీలో సంకేతాలు ఇస్తుంది. అందరూ వచ్చి తలుపులు విరగ్గొట్టి లోపలికి ప్రవేశించి నగలు, నగదు దోచుకెళతారు. ఇలా హెచ్ఎస్ఆర్ లే అవుట్, బాణసవాడి, జయనగర్ ప్రాంతాల్లో ఆరు ఇళ్లల్లో చోరీలకు పాల్పడి భారీ మొత్తంలో నగదు, ఆభరణాలు దోచుకెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. గతనెల 16న హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో నివాసముంటున్న మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌశిక్ ముఖర్జీ ఇంట్లోకి చొరబడిన ఈ ముఠా రూ.25 లక్షల విలువ చేసే నగలు, నగదు ఎత్తుకెళ్లింది. ఆ కేసు విచారణలో పోలీసులకు ఒక స్క్రూ డ్రైవర్ దొరికింది, అది విదేశాల్లో మాత్రమే లభ్యమవుతుంది, దానిని బట్టి ఈ చోరీ విదేశీయుల పనేనని ఖాకీలు తేల్చారు. ఇలా దొరికారు.. గత నెల 22న జయనగర్ ఐదో క్రాస్ తొమ్మిదవ మెయిన్రోడ్లోని దుస్తుల వ్యాపారి రాజారాం ఇంట్లో చోరీకి విఫలయత్నం చేశారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి విదేశీ ముఠా బన్నేరుఘట్టలో ఓ అపార్ట్మెంట్లో ఉన్నట్లు పసిగట్టి శుక్రవారం దాడి చేశారు. దొంగలు పారిపోవడానికి యత్నించగా పోలీసులు నిందితులపై పెప్పర్ స్ప్రే చల్లి పట్టుకున్నారు. విచారణలో వారు చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు. కేసు నమోదు చేసుకున్న జయనగర్ పోలీసులు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టగా నిందితులకు ఏడురోజుల రిమాండ్ విధించారు. నిందితులకు స్పానిష్ తప్ప మరో భాష రాదని తెలిపారు. నిందితుల పేర్లను గోప్యంగా ఉంచుతున్నారు. -
సిద్దిపేట చిన్నోడు..కొలంబియా కుమారి
సిద్దిపేటజోన్ : చదువు కోసం కొలాంబియా వెళ్లిన సిద్దిపేట యవకుడు భరత్‌కు అక్కడి అమ్మాయి మేరీతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో కులాలు, సంప్రదాయాలు పక్కన పెట్టి ఎల్లలు దాటి వారు ఒక్కటయ్యారు. హిందూ సంప్రదాయం ప్రకారం హైదరాబాద్‌లో వివాహం చేసుకున్నారు. భారతదేశ సాంస్కృతిని చాటి చెప్పేలా వీరి కులాంతర, మతాంతర వివాహం జరిగిందని ఎంఎల్సీ ఫారుక్ హుస్సేన్ అన్నారు. వివాహంలో వరుడి తల్లిదండ్రులు రమాదేవి, రాధాకృష్ణ, వధువు తల్లిదండ్రులు రాబర్ట్, గ్యాబ్రియేలు, బంధు మిత్రులు పాల్గొన్నారు. -
ఆకలి, ద్రవ్యోల్బణం, రాజకీయ అస్థిరత
కారాకాస్, వెనెజులా : ఆ బ్రిడ్జి దాటితే చాలు.. గుక్కెడు నీళ్లు తాగొచ్చు. ఆ బ్రిడ్జి దాటితే చాలు ఒక్క ముద్ద యంగిలి పడొచ్చు. ఇది సగటు వెనెజులా వాసి ఆలోచన. కొలంబియా దేశానికి వలస పోవడమే లక్ష్యంగా వేలాది మంది వెనెజులియన్లు కదులుతున్నారు. రోజు రోజుకూ తీవ్రమవుతోన్న ఆర్థిక సంక్షోభం, పరుగెడుతున్న ద్రవ్యోల్బణం, ఆకలి, రాజకీయ అస్థిరత వెనెజులా ప్రజల పాలిట శాపంగా మారింది. రాయిటర్స్ ప్రకారం.. ఈ ఏడాది జనవరిలో వెనెజులా రాజధాని కరాకస్‌లో 162 దోపిడీలు జరిగాయి. వీటిలో 42 ట్రక్కుల దోపిడీలు ఉన్నాయి. ఈ దోపడిల్లో ఎనిమిది హత్యలు జరిగాయి. అత్యధిక హత్యలు జరుగుతున్న దేశాల్లో వెనెజులా కూడా ఒకటి. ట్రక్కులపై దాడులు పెరుగుతుండటంతో రవాణా ఖరీదు కూడా బాగా పెరిగింది. ఆకలిని తట్టుకోలేక.. ప్రజలు దొంగతనాలకు పాల్పడుతున్నారు. రవాణా మార్గం ద్వారా తరలిస్తున్న ఆహార పదార్థాలను దోచుకునే గ్రూపులు సైతం ఏర్పడ్డాయి. రవాణా చేస్తున్న వాహనంలో ఉన్న వారిని హత్య చేసి పదార్థాలను దుండగులు దోచుకెళ్తున్నారు. ఇలాంటి సంఘటనలు విపరీతంగా పెరగడంతో వాటికి ‘మ్యాడ్ మ్యాక్స్ వైలెన్స్’ అని పేరు పెట్టారు. వెనెజులా-కొలంబియాల మధ్య కీలక మార్గంగా ఉన్న సిమోన్ బొలివర్ ఇంటర్నేషనల్ బ్రిడ్జి గుండా కొలంబియాలోకి ప్రవేశించేందుకు వెనెజులియన్లు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఆత్మరక్షణలో పడిన కొలంబియా సరిహద్దు ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించింది. దేశంలోకి ప్రవేశించడానికి యత్నించేవారిని అడ్డుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కొలంబియాను ఆనుకుని ఉన్న బ్రెజిల్ సైతం సరిహద్దులో భద్రతను పెంచింది. అక్రమ వలసదారులను అడ్డుకునేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు చెప్పింది. -
చావు, బతుక్కి మధ్య అర క్షణం; షాకింగ్ వీడియో
సెలేమ్(యూఎస్) : ఆఫ్‌డ్యూటీలో ఉన్న ఓ పోలీసాయన దోస్తులతో కలిసి సరదాగా చేపలవేటకు వెళ్లి.. అట్నుంచే మృత్యువు అంచులదాకా వెళ్లొచ్చాడు! కొలంబియా నదిలో చిన్న చేపల పడవను భారీ స్పీడ్ బోటు ఢీకొట్టిన ఘటన తాలూకు వీడియో నెటిజన్లను గగుర్పాటుకు గురిచేస్తోంది. క్షణాల్లో కకావికలం : బ్రియాన్ మెస్ అనే పెద్దమనిషి ఆరెగాన్ రాష్ట్రంలో పోలీసుగా పనిచేస్తున్నాడు. ఓ సెలవునాడు తన స్నేహితులైన రోనీ డుర్హామ్, క్రిస్టోఫర్ మెక్మహూన్లను వెంటేసుకుని కొలంబియా నదిలో చేపలవేటకు వెళ్లాడు. కాలం సరదాగా గడుస్తుండగా.. దూరం నుంచి తెల్లటి మృత్యుశకటం దూసుకొస్తున్నట్లు కనిపించింది. దాదాపు 30 అడుగుల పొడవున్న ఆ తెల్లటి స్పీడ్‌బోటు.. కొద్దిసేపట్లోనే చేపల పడవను బలంగా ఢీకొట్టి వెళ్లిపోయింది. పడవలోని ఆ ముగ్గురూ నీళ్లలోకి దూకడం క్షణం ఆలస్యమై ఉంటే ప్రాణాలు కోల్పోయేవారే! డ్రైవర్ వింత వాదన.. బాధితుల భారీ దావా : 2017, ఆగస్టులో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి స్పీడ్ బోటు యజమానిపై మార్లిన్ లార్సెన్‌పై కేసు నమోదయింది. అయితే జరిగినదాంట్లో తన తప్పేమీ లేదని, డ్రైవింగ్ సీట్లో కూర్చున్నప్పుడు.. ఎదురుగా ఉన్న బోటు కనిపించలేదని లార్సెన్ వాదించాడు. తద్వారా పరిహారం చెల్లించకుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే, బాధితులు మాత్రం ముమ్మాటికీ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని అంటున్నారు. ప్రమాద సమయంలో స్పీడ్ బోటు డ్రైవర్ లార్సెన్.. మొబైల్ ఫోన్ మాట్లాడుతూ కనిపించాడని కోర్టుకు చెప్పారు. ఓ మోస్తారు గాయాలతో బయటపడిన బాధితులు ముగ్గురూ.. భారీ పరిహారాన్ని డిమాండ్ చేస్తూ స్పీడ్ బోటు డ్రైవర్‌పై మరో దావా వేశారు. -
చావుకు, బతుకుకు మధ్య అరక్షణం
-
దొంగ ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతి
-
దొంగ ఆచూకీ తెలపండి.. చోరీ వీడియో వైరల్
బొగోటా : మెక్డోనాల్డ్స్లోకి దూరి చోరీచేసిన ఓ మహిళ ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతి అంటూ కొలంబియా హోవార్డ్ కౌంటీ పోలీసులు గురువారం ప్రకటించారు. మహిళ చోరీకి పాల్పడ్డ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నవంబర్ 5న అర్థరాత్రి వేళ మెక్‌డోనాల్డ్స్ లోకి ఓ మహిళ ప్రవేశించింది. మొదట ఓ కిటికీలోంచి తనకు కావాల్సిన కూల్ డ్రింక్ తీసుకోవాలని చూడగా వీలు కాలేదు. అతికష్టం మీద కిటికీలోంచి లోనికి ప్రవేశించిన ఆ మహిళ క్యాష్ కౌంటర్లో నగదుతో పాటు కొన్ని వస్తువులను కాటన్లో వేసుకుని అక్కడినుంచి పరారైంది. పదిరోజుల పాటు వెతికినా ఆమె జాడ తెలియకపోవడంతో.. ఆమె ఆచూకీ తెలిపిన వారికి 500 అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 32 వేలు) అందజేస్తామని హోవార్డ్ కౌంటీ పోలీసులు చోరి వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అది మొదలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Recognize this suspect? #HoCoPolice offering up to a $500 reward for info on suspect who stole cash and food in Nov. 5 burglary at McDonald's in Columbia. Call 410-313-STOP or HCPDcrimetips@howardcountymd.gov. pic.twitter.com/Iq3VWu6ZVF — Howard County Police (@HCPDNews) 14 November 2017 -
ఈ ఫొటోలు చూస్తే ఆశ్చర్యపోతారు
పోర్ట్లాండ్ : చిన్నమంటలు వ్యాపిస్తేనే వాటిని చూసి భయంతో బెంబేలెత్తిపోయి పరుగులు పెడుతుంటారు. అలాంటిది కార్చిచ్చు దూసుకొస్తుందంటే అక్కడ ఎవరైనా ఉంటారా? కాని ఉన్నారు. ఒక పక్క భారీ మొత్తంలో అటవీ ప్రాంతాన్ని దహనం చేస్తూ నిప్పులు కక్కుతూ మంటలు దూసుకొస్తున్నా ఏమాత్రం చీకు చింత లేనట్లు కొంతమంది వ్యక్తులు గోల్ఫ్ అడుతూ కనిపించారు. పోర్ట్లాండ్లోని కొలంబియా నది గుండా ఉన్నా అటవీ ప్రాంతాన్ని దహించుకుంటూ పెద్ద దావానలం వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అది 33,400 ఎకరాల అటవీ సంపదను బుగ్గిపాలు జేసింది. ప్రస్తుతం బెకాన్ రాక్ గోల్ఫ్ కోర్స్ వైపు ఆ కార్చిచ్చు వస్తున్నప్పటికీ అక్కడి వారు ఏమాత్రం భయపడకుండా ఎంత తాఫీగా గోల్ఫ్ ఆడుతున్నారో చూస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే. -
వారెవ్వా.. ఈ దొంగలు సూపరో సూపర్
లండన్: పురుషులందు పుణ్య పురుషులు వేరయా అని వేమన చెప్పినట్లే దొంగలందు మంచి దొంగలు వేరయా అని చెప్పక తప్పదేమో ఈ సంఘటన చూస్తుంటే. దొంగిలించుకెళ్లిన బైక్‌ను తిరిగి తీసుకురావడమే కాకుండా దానిలో తిరిగి పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేసి, కొత్త తాళం చేయించి పెట్టి క్షమాపణలు కోరుతూ ఓ లేఖ కూడా రాసి పెట్టిపోయే బాధితులు ఆశ్చర్యపోయేలా ఇద్దరు దొంగలు. తాము ఏ యువకుడిదో ఆ బైక్ అనుకొని పొరబడ్డామని అందుకు క్షమించాలని ఆ లేఖలో వివరించారు. వివరాల్లోకి వెళితే..రెండు వారాల కిందట మెల్ ఫిషర్ అనే బ్రిటన్ మహిళ తన ఫేస్బుక్ పేజీలో ఒక విజ్ఞాపన కథనాన్ని వెలువరించింది. తన ప్రియుడి కుమారుడి బైక్‌ను ఎవరో దొంగిలించుకెళ్లారని, దయచేసి ఆ బైక్ కనిపిస్తే వివరాలు అందించాలని అందులో కోరారు. అయితే, ఆమె అలా పోస్ట్ చేసిన వారం రోజుల్లోనే అనూహ్యంగా ఒక రోజు ఆ పిల్లాడి బైక్ ఇంటిముందే కనిపించింది. పైగా దానికి కొత్త తాళం చేయించి ఉండటంతోపాటు ఫుల్‌గా పెట్రోల్, ఓ క్షమాపణ పత్రం కనిపించింది. దీంతో మెల్ ఫిషర్, ఆమె ప్రియుడి ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. 'మీ కుమారుడి బైక్ దొంగిలించినందుకు ముందుగా క్షమాపణలు చెబుతున్నాం. వాస్తవానికి మేం చేసిన తప్పు క్షమార్హం కాకపోయినప్పటికీ వివరణ ఇచ్చుకుంటున్నాం. మేం ఎవరో టీనేజర్ది ఆ బైక్ అని ఎత్తుకెళ్లాం. అయితే, మీ ఫేస్బుక్ పోస్ట్ చూశాక వెంటనే మీ బైక్ తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాం. అందుకే మీ పిల్లాడి బైక్‌కు ఇక ఎవరూ దొంగిలించలేనంత బలమైన తాళాన్ని కొనుగోలు చేశాం. తాళాలు బైక్‌లో పెట్టాము. మీరు సూచించిన చోటే బైక్ ఇవ్వలేకపోతున్నాం. కానీ, ఈ బైక్ చూశాకనైనా గుండెపలిగిన మీ పిల్లవాడు సంతోషపడతాడని భావిస్తున్నాం. ఈ బైక్‌ను నడిపే యోగ్యత అతడికే ఉంది' అంటూ ఆ లేఖలో వివరించారు. -
విదేశీ ముడుపులపై ట్రంప్‌పై కేసు
న్యూయార్క్: అమెరికా పార్లమెంట్ అనుమతి లేకుండా దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విదేశాల నుంచి ఆర్థిక లబ్ధి పొందుతున్నారని, ఇది రాజ్యాంగంలోని ఆర్థిక వ్యవహారాల నిబంధనలను ఉల్లంఘించడమేనని ఆరోపిస్తూ మేరీలాండ్, కొలంబియా జిల్లాల అటార్నిజనరళ్లు సోమవారం నాడు కేసు దాఖలు చేశారు. ఈ విదేశీ సొమ్ము లావాదేవీలకు వాషింగ్టన్ డీసీలోని ట్రంప్ లగ్జరీ హోటల్ ప్రధాన కేంద్రంగా మారిపోయిందని వారు ఆరోపించారు. హోటళ్ల నెటవర్క్, తన గోల్ఫ్ కోర్సులను ఉపయోగించుకొని విదేశాల నుంచి ఆర్థిక లబ్ధి పొందుతున్నారని వారు పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు తమకు అనుకూలంగా వ్యవహరించేందుకు వీలుగా విదేశాలు ముడుపులు ముట్టచెబుతున్నాయన్నది అటార్నీ జనరళ్ల ప్రధాన ఆరోపణ. తన వ్యాపారాలకు, తనకు ఎలాంటి సంబంధం ఉండదని కూడా ట్రంప్ పదవీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రతిజ్ఞ చేశారని, అయితే ఆయన ఇప్పుడు ట్రంప్ ట్రస్ట్ పేరుతో వ్యాపారాలను యధావిథిగా నిర్వహిస్తున్నారని కూడా వారు ఆరోపించారు. ట్రంప్ హోటల్ ప్రభావం వల్ల మేరీలాండ్, కొలంబియా జిల్లాలోని కన్సెన్షన్ సెంటర్లు, ఇతర రెస్టారెంట్లేవి నడవడం లేదని కూడా వాపోయారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఇద్దరు అటార్నీ జనరళ్లు వేసిన ఈ కేసును కొట్టివేయాల్సిందిగా కోర్టును కోరుతామని అమెరికా స్వేత సౌధం ప్రెస్ సెక్రటరీ సియాన్ స్పయిసర్ తెలిపారు. ఇదివరకు దాఖలైన ఇలాంటి ఓ కేసును కొట్టివేయాల్సిందిగా అమెరికా న్యాయశాఖ ఇప్పటికే కోర్టును కోరింది. -
భర్తతో గొడవ.. డాలర్లు మింగిన భార్య
చెడు మార్గాల్లో పయనిస్తున్న భర్తకు డబ్బు అందకుండా చేసేందుకు యత్నించిన ఓ మహిళ.. అతను పద్దతి మార్చుకోకపోవడంతో ఆ డబ్బు మొత్తాన్ని మింగేసింది. ఈ సంఘటన అమెరికాలోని కొలంబియా నగరంలో చోటు చేసుకుంది. 28 ఏళ్ల శాండ్రా మిలేనా భర్తతో చెడు అలవాట్లు మాన్పించేందుకు తమ సంపాదనను ఇంట్లోని ఓ రహస్య ప్రదేశంలో దాచి పెట్టడం మొదలుపెట్టింది. దీంతో వ్యసనాలకు అలవాటు పడిన ఆమె భర్త డబ్బు కోసం పలుమార్లు మిలేనాతో గొడవ పెట్టుకున్నాడు. అయినా పట్టువదలని మిలేనా అతనికి డబ్బు అందకుండా ఉంచేందుకు యత్నించింది. అయితే ఎలాగో భార్య డబ్బు దాచి పెడుతున్న ప్రదేశాన్ని కనుక్కున్న భర్త ఆ డబ్బు మొత్తాన్న ఎత్తుకుపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో భర్తను అడ్డుకున్న మిలేనా ఆ డబ్బు మొత్తాన్ని మింగేసింది. కొద్దిసేపటికి ఆమెకు తీవ్ర కడుపునొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు 57 వంద డాలర్ల నోట్లను వెలికితీశారు. మిగిలిన నోట్లను గ్యాస్ట్రిక్ ఫ్లూయిడ్స్ కరిగించేశాయని చెప్పారు. పూర్తిగా కోలుకున్న ఆమెను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. -
ఆపరేషన్ థియేటర్లో ఇవేం పిచ్చి పనులు!
-
ఆపరేషన్ థియేటర్లో ఇవేం పిచ్చి పనులు!
న్యూయార్క్: ఆస్పత్రికి తీసుకువచ్చిన పేషెంట్ పరిస్థితి సీరియస్‌గా ఉంటే డాక్టర్లు చాలా అలర్ట్ అవుతారు. ఆ పేషెంట్‌కు సాధ్యమైనంత త్వరగా ట్రీట్మెంట్ చేయడానికి వైద్య సిబ్బంది ప్రయత్నిస్తుంది. అసలే పేషెంట్ ఐసీయూలో ట్రీట్మెంట్కు సిద్ధంగా ఉంటే వారి బంధువులు ఆపరేషన్ సక్సెస్ కావాలని ప్రార్థిస్తుంటారు. అయితే అమెరికాలోని ఓ ఆస్పత్రిలో ఇందుకు భిన్నంగా పిచ్చిపని చేసిన ఐదుగురు వైద్య సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. ఓ వైపు పేషెంట్ కాలిన గాయాలతో సతమతమవుతున్నాడు. మరోవైపు సర్జరీ చేయాల్సిన డాక్టర్, సిబ్బంది(అంతా మహిళలే) మాత్రం తమకు ఇష్టం వచ్చినట్లుగా డ్యాన్స్ చేస్తూ అందరూ విస్తుపోయేలా చేశారు. కొలంబియాలోని బొలివర్ శాంతాక్రూజ్ డీ బోకాగ్రాండ్ ఆస్పత్రిలో జరిగిన ఈ ఉదంతం వీడియో రూపంలో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రోగికి ఇబ్బంది కలిగేలా ప్రవర్తించారని.. ఆపరేషన్ థియేటర్లో ఇవేం పిచ్చిపనులు అంటూ ఆ మహిళా సిబ్బందిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆస్పత్రి మేనేజ్మెంట్ ఈ విషయాన్ని సిరీయస్‌గా తీసుకుంది. సర్జరీ సమయంలో పేషేంట్‌కు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకుంది. ఆ సిబ్బందిలో ఐదుగురిని సస్పెండ్ చేస్తున్నట్లు హాస్పిటల్ మేనేజ్మెంట్ ప్రకటించింది. ట్రీట్మెంట్ సందర్భంగా కొన్ని నియమాలు పాటించని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.