cricket coach
-
హైదరాబాద్ లో మహిళా క్రికెటర్లతో కోచ్ అసభ్య ప్రవర్తన
-
కోచ్ రహంతుల్లా బేగ్ మృతి క్రికెట్ లోకానికి తీరని లోటు
సాక్షి, విశాఖపట్నం: సీనియర్ క్రికెట్ కోచ్ రహమతుల్లా బేగ్ మృతి పట్ల ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు పి. శరత్ చంద్రారెడ్డి, కార్యదర్శి ఎస్.ఆర్. గోపినాథ్ రెడ్డితో పాటు అపెక్స్ సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు. బేగ్ కుటుంబ సభ్యులకు వీరు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రహమతుల్లా బేగ్ మృతి క్రికెట్ లోకానికి తీరని లోటని అన్నారు. క్రికెట్‌కు ఆయన చేసిన సేవలు ఎల్లప్పుడూ గుర్తుంటాయని తెలిపారు. కోచ్‌గా ఆరు దశాబ్దాల పాటు సేవలు అందించిన ఆయన నేటి తరానికి స్ఫూర్తి అని.. తన కెరీర్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌తో పాటు ఎస్ఏఐ, శాప్, బీసీసీఐ, హెచ్.సీ.ఏ లకు ఎన్నో సేవలు అందించారని పేర్కొన్నారు. కపిల్ దేవ్, రవిశాస్త్రి, అజారుద్దీన్, శివరామ కృష్ణన్, భరత్ అరుణ్, సంజయ్ మంజ్రేకర్, రాహుల్ ద్రవిడ్, వి.వి.ఎస్. లక్ష్మణ్, ఎం.ఎస్.కె ప్రసాద్ లతో పాటు ఎంతో మంది అంతర్జాతీయ క్రికెటర్లకు ఆయన శిక్షణ ఇచ్చారని వారు గుర్తు చేశారు. -
'ఎక్కడ తగ్గాలో తెలిసినోడు'.. చిన్ననాటి కోచ్ కాళ్లు మొక్కి
టీమిండియా స్టార్ కింగ్ కోహ్లి ఏం చేసినా క్షణాల్లో వైరల్‌గా మారుతోంది. గౌతమ్ గంభీర్‌తో గొడవ కోహ్లి తాను ఎంత అగ్రెసివ్ అనేది మరోసారి నిరూపించింది. అయితే తాను అగ్రెసివ్ మాత్రమే కాదని.. మంచి మనసు కూడా దాగుందని కోహ్లి చూపించాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ ప్రారంభానికి ముందు కోహ్లి తన చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మను కలుసుకొని కాళ్లు మొక్కడం వైరల్‌గా మారింది. తన క్రికెట్లో ఓనమాలు నేర్పిన గురువును చూడగానే కోహ్లీ చేస్తున్న ప్రాక్టీసును ఆపేశాడు. నేరుగా రాజ్ కుమార్ శర్మ వద్దకు చేరుకుని వినయంగా పాదాలకు నమస్కరించాడు. కోహ్లీ విధేయత పట్ల ఎంతో సంతోషించిన ఆయన శిష్యుడి వీపు తట్టి దీవెనలు అందించాడు. అనంతరం ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయండి. ఇక కోహ్లి ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 12 పరుగుల స్కోరు వద్ద ఐపీఎల్లో ఏడువేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. A wholesome meet & greet 🤗@imVkohli catches up with his childhood coach 👌🏻👌🏻#TATAIPL | #DCvRCB | @RCBTweets pic.twitter.com/YHifXeN6PE — IndianPremierLeague (@IPL) May 6, 2023 చదవండి: 'కింగ్' కోహ్లి చరిత్ర.. ఐపీఎల్లో తొలి బ్యాటర్‌గా -
చేసిందే చెడ్డ పని పైగా ఆత్మహత్యాయత్నం
భారత మహిళా క్రికెటర్ స్నేహ్ రానా కోచ్ నరేంద్ర షాపై లైగింక వేధింపుల కేసు నమోదు అయింది. ఒక అమ్మాయిని వేధిస్తున్నట్టు ఆడియో ఆధారం లభించడంతో అతడిపై ఉత్తరాఖండ్ పోలీసులు పోక్సో(POCSO Act) చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆడియో లీక్ విషయం తెలియగానే నరేంద్ర ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నరేంద్ర షా డెహ్రాడూన్‌లో క్రికెట్ అకాడమీ నిర్వహిస్తున్నాడు. మోలి జిల్లాకు చెందిన మైనర్ యువతి చదువుకుంటూనే నరేంద్ర షా క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటోంది. కొన్నాళ్లుగా నరేంద్ర సదరు యువతితో అసభ్యంగా ప్రవర్తించేవాడు. మైనర్‌తో నరేంద్ర షా ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడిన ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. ఆ ఆడియో వైరల్ కావడంతో అతడిపై పోక్సో చట్టం, ఐపీసీ సెక్షన్ 506తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు బుక్ చేశామని నెహ్రూ కాలనీ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ లోకేంద్ర బహుగుణ తెలిపాడు. అంతేకాదు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును ముమ్మరం చేశామని ఆయన వెల్లడించాడు. ఆడియో లీకేజీతో తన పరువు పోయిందని నరేంద్ర ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం స్నేహ్ రానాకు కోచ్‌గా ఉన్న నరేంద్ర షా ఉత్తరాఖండ్ క్రికెట్ సంఘం మాజీ సభ్యుడు. నరేంద్రపై పోక్సో కేసు నమోదైనట్లు తెలుసుకున్న ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ అతడిని పదవి నుంచి తొలగించింది. టీమిండియా మహిళా క్రికెట్లో ఆల్‌రౌండర్‌గా సేవలందిస్తున్న స్నేహ్ రానా ఇటీవలే వుమెన్స్ ఐపీఎల్ తొలి సీజన్ ఆడింది. గుజరాత్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆమె రెగ్యులర్ కెప్టెన్ బెత్ మూనీ గాయంతో టోర్నీకి దూరమవడంతో జట్టును నడిపించింది. కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించిన గుజరాత్ ప్లే ఆఫ్స్‌కు చేరలేదు. టేబుల్ టాపర్స్ ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్లో అడుగుపెట్టాయి. ఉత్కంఠ రేపిన టైటిల్ పోరులో ముంబై 7 వికెట్ల తేడాతో ఢిల్లీపై గెలుపొందింది. నాట్ స్కీవర్ బ్రంట్ అర్ధ శతకంతో చెలరేగడంతో ఆ జట్టు తొలి సీజన్ చాంపియన్‌గా అవతరించింది. చదవండి: Kedar Jadhav: తండ్రి మిస్సింగ్ కేసులో క్రికెటర్‌కు ఊరట 'నెట్ బౌలర్‌గా ఆఫర్.. బోర్డు పరీక్షలను స్కిప్ చేశా' -
మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కోచ్ కన్నుమూత
మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కోచ్.. బరోడా మాజీ రంజీ ఆటగాడు నారాయణ్ రావు సాథమ్(73) కన్నుమూశారు. ఆదివారం ఆయన గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు దృవీకరించారు. 1970,80వ దశకంలో బరోడా తరపున దేశవాలీ క్రికెట్లో బెస్ట్ ఆల్రౌండర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక దులీప్ ట్రోఫీలో భాగంగా వెస్ట్‌జోన్‌కు ఆడుతున్న సమయంలో సునీల్ గావస్కర్, అశోక్ మన్కడ్, అజిత్ వాడేకర్‌లతో కలిసి డ్రెస్సింగ్‌రూమ్ షేర్ చేసుకున్నాడు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత కోచ్‌గా మారిన నారాయణ్ సాథమ్ ఎంతో మంది క్రికెటర్లను వెలుగులోకి తెచ్చాడు. అలా వచ్చినవారే కిరణ్ మోరే, మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్లు. కాగా నారాయణ్ సాథమ్ మృతిపై మాజీ క్రికెటర్ కిరణ్ మోరే ఎమోషన్ అయ్యాడు. ట్విటర్ వేదికగా కిరణ్ మోరే స్పందించాడు. ''నా జీవితంలో ఈరోజు చాలా దుర్దినం. నా మెంటార్, కోచ్, గురువు నారాయణ్ రావు సాథమ్ కన్నుమూశారు. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి ఆయనే కారణం. నా గురువును చాలా మిస్సవుతున్నా.. బరోడా జట్టుకు ఇది పెద్ద నష్టం అని చెప్పుకోవాలి'' అంటూ ట్వీట్ చేశాడు. తన ఫస్ట్‌క్లాస్ కెరీర్లో నారాయణ్ సాథమ్ 84 మ్యాచ్‌లాడి 3119 పరుగులతో పాటు 193 వికెట్లు పడగొట్టాడు. Today is a very sad day for me personally. My mentor, coach and Guru, Narayan Rao Satham, has passed away. What I have achieved till today was all because of him. I am going to miss him and this is a big loss for Baroda #cricket #OmShanti pic.twitter.com/wG6rdrC4Nu — Kiran More (@JockMore) February 12, 2023 చదవండి: మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడిన ఫకర్ జమాన్ ప్రపంచానికి తెలియని ఆసీస్ క్రికెటర్ల ప్రేమకథ -
Viral: మైనర్‌తో బాడీ మసాజ్ చేయించుకున్న క్రికెట్ కోచ్
క్రికెట్ క్రీడకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఉత్తర్‌ప్రదేశ్ క్రికెట్‌కు సంబంధించిన ఈ వీడియోలో అబ్దుల్ అహద్ అనే కోచ్.. మైనర్ క్రికెటర్‌తో బాడీ మసాజ్ చేయించుకుంటూ దర్శనమిచ్చాడు. యూపీలోని రవీంద్ర కిషోర్ షాహీ స్పోర్ట్స్ స్టేడియంలో ఈ ఉదంతం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సోషల్‌మీడియాలో ఈ వీడియో వైరలవ్వడంతో సదరు కోచ్‌ను ఉత్తర్‌ప్రదేశ్ స్పోర్ట్స్ డైరెక్టర్ ఆర్పీ సింగ్ సస్పెండ్ చేశారు. ఈ ఉదంతాన్ని సుమోటోగా తీసుకున్న పోలీసులు అబ్దుల్ అహద్‌పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అబ్దుల్ అహద్‌పై విచారణ జరుగుతుందని, డిప్యూటీ స్పోర్ట్స్ డైరెక్టర్ ఆర్ఎన్ సింగ్‌ను విచారణాధికారిగా నియమించామని యూపీ స్పోర్ట్స్ డైరెక్టర్ పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించారు. కాగా, అబ్దుల్ అహద్ రవీంద్ర కిషోర్ షాహీ స్పోర్ట్స్ స్టేడియంలో కోచ్‌గా విధులు నిర్వహిస్తూనే అక్కడే వార్డన్‌గా కూడా పని చేస్తున్నాడు. ఈ స్టేడియంలో క్రికెట్‌తో పాటు వాలీబాల్ క్రీడాకారులకు హాస్టల్ సదుపాయం ఉంది. వార్డన్ కూడా అయిన అబ్దుల్ అహద్ హాస్టల్లోనే మకాం వేసి తరుచూ ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటాడని యువ క్రీడాకారులు కంప్లైంట్ చేశారు. నెట్టింట చక్కర్ల కొడుతున్న వీడియోలో మైనర్ క్రికెటర్ ఒంటిపై షర్టు లేకుండా కోచ్‌కు అయిష్టంగా బాడీ మసాజ్ చేస్తూ కనిపించాడు. ఈ వీడియో గతేడాది ఆగస్ట్‌లో రికార్డు చేసినదిగా పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు తరుచూ వెలుగుచూస్తున్నాయి. స్పోర్ట్స్ హాస్టల్లలో ఉండే యువ క్రీడాకారులు, క్రీడాకారిణులు కోచ్, ఇతర సిబ్బందిపై ఫిర్యాదులు చేస్తున్నారు. కోచ్‌లు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఇటీవలికాలంలో చాలా కంప్లైంట్లు రిజిస్టర్ అయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. -
'ఆడమని ఎవరిని అడుక్కోం'.. విండీస్ కోచ్; రసెల్ స్ట్రాంగ్ కౌంటర్
వెస్టిండీస్ క్రికెటర్లు తమ దేశానికంటే బయటి దేశాలు నిర్వహించే లీగ్స్‌లోనే ఎక్కువగా కనబడుతుంటారు. కారణం డబ్బు. విండీస్‌కు ఆడితే వచ్చే డబ్బుతో పోలిస్తే.. ప్రైవేట్ లీగ్స్‌లో ఆ డబ్బు రెండింతల కంటే ఎక్కువుంటుంది. అందుకే క్రిస్ గేల్, డ్వేన్ బ్రావో, కీరన్ పొలార్డ్ , ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే తయారవుతుంది. మొత్తంగా చెప్పాలంటే.. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న వివిధ క్రికెట్ లీగ్స్ అందరికంటే ఎక్కువగా కనబడేది కరేబియన్ క్రికెటర్లే. మన ఐపీఎల్‌తోనూ వారికి విడదీయరాని బంధం ఉంది. డబ్బులు ఎక్కువొస్తాయంటే అవసరమైతే జాతీయ జట్టుకు ఆడే విషయాన్ని పక్కకుబెట్టడం విండీస్ ఆటగాళ్ల నైజం. అందుకే టి20 ఫార్మాట్లో రెండుసార్లు చాంపియన్ అయినప్పటికి ఆ జట్టులో ఎప్పుడు నిలకడ ఉండదు. ఈ మధ్య కాలంలో అది మరోసారి నిరూపితమైంది. ఇటీవలే భారత్‌తో జరిగిన టి20 సిరీస్‌లో 4-1 తేడాతో దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ క్రమంలోనే విండీస్ జట్టు కోచ్ ఫిల్ సిమ్మన్స్ రెండు రోజుల క్రితం దేశానికంటే విదేశీ లీగ్స్‌కే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్న కొందరు క్రికెటర్లపై వ్యంగ్యంగా స్పందించాడు. ''వెస్టిండీస్ కోసం కాస్త ఆడండయ్యా అంటూ మేము ప్లేయర్లను అడుక్కోవాలని అనుకోవడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ ఆధారిత లీగ్‌లు ఆడుతున్న ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్ తదితర స్టార్లు.. జాతీయ జట్టుకు ముఖం చాటేస్తున్నారు. అక్టోబర్‌లో జరగబోయే టీ20 ప్రపంచకప్ కోసం వెస్టిండీస్ జట్టులో అత్యుత్తమ ప్లేయర్లను బరిలోకి దించడానికి బోర్డు తీవ్రంగా కష్టపడుతున్నప్పటికీ.. చాలా మంది క్రికెటర్లు డబ్బు కోసం ఫ్రాంచైజీ లీగ్‌కే మొగ్గు చూపుతున్నారు. ఇంకొంతమంది గాయాలతో జట్టుకు అందుబాటులో ఉండట్లేదంటూ అబద్దాలు చెబుతూ తప్పించుకుంటున్నారు. దీంతో మాకు వేరే మార్గం లేకుండా పోయింది.. ఈ విషయంలో ఎవరూ ఏమీ చేయలేరు. స్టార్ ప్లేయర్లు తన జాతీయ జట్టు కోసం ఆడాలని తాపత్రాయపడితే మార్పు వస్తుందని నమ్ముతున్నా. అందుకు తగ్గట్లు వాళ్లు కొన్ని లీగ్‌లను వదులుకుంటే తప్పితే మేము ఏం చేయలేని పరిస్థితి'' అని ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా విండీస కోచ్ ఫిల్ సిమ్మన్స్ చేసిన వ్యాఖ్యలపై విండీస్ సీనియర్ ప్లేయర్ ఆండ్రీ రసెల్ కాస్త ఘూటుగానే స్పందించాడు. ఫిల్ సిమ్మన్స్ ఆర్టికల్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ''ఇలాంటిది వస్తుందని నాకు ముందే తెలుసు.. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సైలెంట్‌గా ఉండడమే ఉత్తమం..'' అంటూ క్యాప్షన్ జత చేసి కోపంతో ఉన్న ఎమోజీలను షేర్ చేశాడు. రసెల్ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక రసెల్ వెస్టిండీస్ తరపున 67 టి20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఆఖరిసారిగా వెస్టిండీస్ తరపున టి20 ప్రపంచకప్ 2021లో పాల్గొన్నాడు. అయితే యూఏఈ వేదికగా జరిగిన ఆ ప్రపంచకప్‌లో వెస్టిండీస్ దారుణ ప్రదర్శన కనబరిచింది. రసెల్ మాత్రమే కాదు సునీల్ నరైన్ కూడా 2019 నుంచి జాతీయ జట్టుకు రెగ్యులర్‌గా అందుబాటులో ఉండడం లేదు. గాయాల సాకు చెప్పి డబ్బులు బాగా వచ్చే ఐపీఎల్, బిగ్‌బాష్ లీగ్, కరేబియన్ లీగ్‌ల్లో ఆడుతూ బిజీగా గడుపుతున్నారు. View this post on Instagram A post shared by Andre Russell🇯🇲 Dre Russ.🏏 (@ar12russell) చదవండి: MI Emirates: 'పొలార్డ్ నుంచి బౌల్ట్ దాకా'.. ఆరంభం కాకముందే టైటిల్‌పై కన్నేశారు Dwayne Bravo: 600 వికెట్లతో ప్రపంచ రికార్డు.. టి20 క్రికెట్లో తొలి బౌలర్‌గా -
ఇంగ్లండ్ వైట్‌బాల్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్!
ఇంగ్లండ్ టెస్టు కోచ్‌గా క్రిస్ సిల్వర్‌వుడ్‌పై వేటు పడినప్పటి నుంచి అతని స్థానంలో కొత్త కోచ్ ఎవరనే దానిపై ఈసీబీలో పెద్ద చర్చ నడిచింది. గత ఏడాది కాలంగా ఇంగ్లండ్ టెస్టుల్లో దారుణ ప్రదర్శన కనబరుస్తూ వచ్చింది. వరుస సిరీస్ ఓటములకు బాధ్యత వహిస్తూ ఇటీవలే జో రూట్ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు ఈసీబీ(ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు) టెస్టు పగ్గాలు అప్పజెప్పింది. ఇక టెస్టు ప్రధాన కోచ్‌గా సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం గ్యారీ కిర్‌స్టన్‌ను ఎంపిక చేసింది. 2011లో వన్డే వరల్డ్‌కప్ టీమిండియా గెలవడంలో కిర్‌స్టన్ పాత్ర మరువలేనిది. ఇక టెస్టు కోచ్‌తో పాటు.. వైట్‌బాల్ క్రికెట్ కోచ్‌ను ఈసీబీ ఎంపికచేయనుంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్కల్లమ్.. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కోచ్‌గా ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. న్యూజిలాండ్‌కు ఆడిన సమయంలో బెస్ట్ బ్యాటర్‌గా గుర్తింపు పొందిన మెక్కల్లమ్.. మంచి వ్యూహాలు పన్నగల కెప్టెన్‌గా రాణించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో మెక్కల్లమ్ ఇంగ్లండ్‌ను గాడిలో పెడతాడని ఈసీబీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇంగ్లండ్ కోచ్‌గా పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తున్నట్లు మెక్కల్లమ్ ఒక ప్రకటనలో తెలిపాడు. ఇక కిర్‌స్టన్ లాగే మెక్కల్లమ్ కూడా సక్సెస్ఫుల్ కోచ్. ప్రస్తుతం ఐపీఎల్లో మెక్కల్లమ్ రెండుసార్లు విజేతగా నిలిచిన కేకేఆర్‌కు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక 2012లో న్యూజిలాండ్ క్రికెట్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అతని కెప్టెన్సీలో కివీస్ 2015 వన్డే ప్రపంచకప్‌లో తొలిసారి ఫైనల్ చేరింది. అయితే ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భంగపడి రన్నరప్‌గా నిలిచింది. చదవండి: IPL 2022: నైట్‌షిప్టులు..ఏడాది పాటు ఒక్క పూట భోజనం; ఎవరీ కుమార్ కార్తికేయ? Ajaz Patel: భారత్‌పై పదికి పది వికెట్లు తీసిన బౌలర్ టీషర్ట్ వేలానికి.. -
రిషబ్ పంత్, ధావన్ క్రికెట్ గురువు కన్నుమూత
cricket coach Tarak Sinha Lost Life Battle With Cancer.. టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ గురువు, క్రికెట్ కోచ్ తారక్ సిన్హా(71) క్యాన్సర్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ శనివారం కన్నుమూశారు. తారక్ సిన్హా ఢిల్లీలో సోనెట్ క్రికెట్ క్లబ్‌ను నడిపేవాడు. ఈ సందర్భంగా ఆయన ఎందరో క్రికెటర్లను తీర్చిదిద్దారు. అతని పర్యవేక్షణలో రాటుదేలిన ఆటగాళ్లలో 12 మంది అంతర్జాతీయ క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించడం విశేషం. ఆశిష్ నెహ్రా, ఆకాశ్ చోప్రా, శిఖర్ ధావన్, అంజుమ్ చోప్రా, రిషబ్ పంత్, మనోజ్‌ప్రభాకర్, అజయ్ శర్మ, కె.పి. భాస్కర్, సంజీవ్ శర్మ, రామన్ లంబా, అతుల్ వాసన్, సురేందర్ ఖన్నా, రణ్‌దీర్ సింగ్ లాంటివారు ఉన్నారు. వీరిలో ప్రస్తుతం ధావన్, పంత్‌లు టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా క్రీడా పురస్కారాల్లో ప్రతిష్టాత్మకంగా భావించే ద్రోణాచార్య అవార్డు అందుకున్న ఐదో క్రికెట్ కోచ్‌గా తారక్ సిన్హా నిలిచాడు. క్రికెట్ భాషలో అతన్ని అందరూ ''ఉస్తాద్ జీ'' అని ముద్దుగా పిలుచుకుంటారు. కాగా తారక్ సిన్హా కంటే ముందు రమాకాంత్ అచ్రేకర్, దేశ్ ప్రేమ్ ఆజాద్, గురుచరన్ సింగ్, సునీత శర్మలు ద్రోణాచార్య అవార్డు అందుకున్నారు. చదవండి: Syed Mushtaq Ali Trophy 2021: కెప్టెన్ సెంచరీ మిస్.. అయితేనేం హైదరాబాద్ భారీ విజయం -
బాలికతో క్రికెట్ కోచ్ అసభ్యకర ప్రవర్తన..భుజాలు, ఇతర భాగాలను తాకుతూ..
పుదుచ్చెరి: శిక్షణ కోసం వచ్చిన 16 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించిన ఆరోపణలపై క్రికెట్ కోచ్‌పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ ఘటన పుదుచ్చేరిలో చోటు చేసుకుంది. సీనియర్ క్రికెటర్, కోచ్ అయిన నిందితుడు తన వద్ద శిక్షణ తీసుకుంటున్న టీనేజర్‌తో అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు ఆమెను లైంగికంగా వేధించాడు. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత క్రికెట్ అసోయేషన్ ఆఫ్ పాండిచ్చేరి (సీఏపీ)కి చెందిన ఐదుగురు ప్రతినిధులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సీనియర్ ప్లేయర్, కోచ్ అయిన తమరైకన్నన్ వద్ద శిక్షణ తీసుకుంటున్న తనని అసభ్యంగా తాకి వేధించినట్టు మెట్టుపాళయంలోని పోలీసులకు చైల్డ్ లైన్ ద్వారా ఓ బాలిక ఫిర్యాదు చేసింది. పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. కోచ్ తమరైకన్నన్ ప్రేమిస్తున్నట్టు మెసేజ్ చేశాడని, అంగీకరించకపోతే కోచింగ్ ఇవ్వనని బెదిరించినట్లు బాధితురాలు ఆరోపించింది. చివరకు కోచ్ ఆగడాలను భరించలేని ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుంది. అయితే బాలిక తన మీద ఫిర్యాదు ఇవ్వబోతోందన్న విషయాన్ని తెలుసుకున్న కోచ్ తన భార్యతో కలిసి బాధితురాలి ఇంటికి వెళ్లాడు. పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని ఆమెను బతిమలాడినట్లు తెలిపింది. అయినప్పటికీ అతనికి తగిన బుద్ధి చెప్పాలనే ఉద్దేశ్యంతో చైల్డ్ లైన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె వెల్లడించింది. దీంతో తమరైకన్నన్ సహా ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బోర్డులోని ఐదుగురిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. చదవండి: స్నేహం ముసుగులో యువతులను లొంగదీసుకుని.. ఆతర్వాత -
Vasoo Paranjape: గవాస్కర్, సచిన్‌ల కోచ్ కన్నుమూత
ముంబై: మాజీ క్రికెటర్, ప్రముఖ కోచ్ వాసు పరంజపే సోమవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు. వాసు.. 1956-1970 మధ్య ముంబై, బరోడా జట్ల తరఫున 29 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 23.78 సగటుతో 785 పరుగులు చేశాడు. వాసు.. బాంబేలోని దేశీయ క్రికెట్లో దాదర్ యూనియన్‌కు ప్రాతినిధ్యం వహించేవాడు. ఈ జట్టు బాంబేలో అత్యంత శక్తివంతమైన జట్లలో ఒకటి. I feel that a piece of me has left the world. Rest in Peace Vasu Sir. 🙏 pic.twitter.com/0ynyJ7LQNu — Sachin Tendulkar (@sachin_rt) August 30, 2021 ఆటగాడిగా విరమణ పొందిన తర్వాత వాసు కోచ్‌గా మారారు. సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్ సర్కార్, రవిశాస్త్రి, వినోద్ కాంబ్లి, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ లాంటి చాలా మంది క్రికెటర్లకు మెలకువలు నేర్పాడు. అంతేకాదు వాసు అనేక జట్లకు కోచ్‌గా, జాతీయ క్రికెట్ అకాడమీకి కోచ్‌గా సేవలనందించారు. వాసు మరణం పట్ల సచిన్, రోహిత్ సహా చాలామంది ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా, వాసు కుమారుడు జతిన్ పరంజపే కూడా టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. జతిన్ కొంతకాలం జాతీయ సెలెక్టర్‌గా కూడా వ్యవహరించాడు. చదవండి: ఒకే గ్రూప్‌లో తలపడనున్న కోహ్లి, రోహిత్, కేఎల్ రాహుల్ జట్లు -
జాఫర్ బాయ్.. 'నీకు అసిస్టెంట్ అవసరం ఉన్నాడా?'
ఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్‌ను ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైకెల్ వాన్ ఫన్నీ ట్రోల్ చేశాడు. జాఫర్ గురువారం ఒడిశా క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా నియామకమయ్యాడు. 2021- 2023 మధ్య కాలంలో రెండేళ్లపాటు జాఫర్ ఈ పదవిలో కొనసాగనున్నాడు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వాన్ ట్విటర్ వేదికగా జాఫర్‌ను ట్రోల్ చేశాడు. '' జాఫర్ బాయ్‌కి అసిస్టెంట్ అవసరం ఉన్నాడా?.. ఒకవేళ అసిస్టెంట్ అవసరం ఉంటే పిలువు.. నేను వెంటనే వచ్చేస్తా'' అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం వాన్ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకముందు భారత్, ఇంగ్లండ్ సిరీస్ సమయంలో జాఫర్, వాన్ల మధ్య ట్విటర్లో చాలాసార్లే మాటలయుద్ధం జరిగింది. ఇక భారత్, ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు కరోనా కలకలం రేపింది. టీమిండియా యువ ఆటగాడు రిషబ్ పంత్‌కు యూకే డెల్టా వేరియంట్ లక్షణాలు ఉన్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. పంత్‌తో పాటు జట్టు ట్రైనింగ్ అసిస్టెంట్/ నెట్ బౌలర్ అయిన దయానంద్ గరాని కూడా కరోనా బారిన పడ్డాడు. అతనితో సన్నిహితంగా మెలిగిన మరో ముగ్గురిని కూడా ముందు జాగ్రత్తగా ఐసోలేషన్‌కు పంపించారు. గరానితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, రిజర్వ్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ 10 రోజుల పాటు తమ హోటల్ గదుల్లోనే సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటారని బీసీసీఐ పేర్కొంది. ఇక భారత్, ఇంగ్లండ్ మధ్య ఆగస్టు 4 నుంచి ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. Does he need an assistant 😜😜 https://t.co/he2g0eKBFs — Michael Vaughan (@MichaelVaughan) July 15, 2021 -
పాపం మనీశ్ పాండే.. అవకాశాలివ్వకుండా తొక్కేశారు!
బెంగళూరు: అడపాదడపా భారత జట్టులో కనపడే కర్ణాటక స్టార్ బ్యాట్స్‌మన్ మనీష్ పాండేపై అతని చిన్ననాటి కోచ్ ఇర్ఫాన్ సేట్ సానుభూతిని వ్యక్తం చేశాడు. మనీష్‌కు తగినన్ని అవకాశాలివ్వకుండా టీమిండియా మేనేజ్మెంట్ అతన్ని తోక్కేసిందని ఆరోపణలు గుప్పించాడు. అందరు క్రికెటర్లకులా మనీష్‌కు కూడా అవకాశాలు ఇచ్చి ఉంటే, ఈ పాటికే స్టార్ ప్లేయర్ అయ్యేవాడని అభిప్రాయపడ్డాడు. మనీష్ టీమిండియా తరఫున ఆడిన మ్యాచ్‌ల కన్నా బెంచ్‌పై కూర్చున్న మ్యాచ్‌లే ఎక్కువని, జట్టు యాజమాన్యం ఇకకైనా అతనిపై చిన్నచూపు చూడటం మానుకుని, అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశాడు. నిజాయతీగా ఇవ్వాల్సినన్ని అవకాశాలిస్తే మనీష్ గొప్ప క్రికెటర్‌గా ఎదుగుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. మనీష్.. పరిణితి చెందిన ఆటగాడని, సవాళ్లను ఇష్టపడతాడని, టెక్నిక్, వేగం కలబోసిన టాలెంట్ అతని సొంతమని ప్రశంసలు కురిపించాడు. అతనిప్పటి వరకు సరైన బ్యాటింగ్ ఆర్డర్లో రాలేదని, పూర్తి స్థాయి సిరీస్‌కు అవకాశమిస్తే తనేంటో తప్పక నిరూపించుకుంటాడని జోస్యం చెప్పాడు. కాగా, 2015లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన మనీష్ పాండే.. జట్టులో స్థానం సుస్థిరం చేసుకోలేకపోయాడు. అయితే, తాజాగా శ్రీలంక పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో ఈ కర్ణాటక బ్యాట్స్‌మెన్ చోటు దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2009లో డెక్కన్ చార్జర్స్ తరఫున బరిలో నిలిచిన పాండే 73 బంతుల్లోనే 114 సూపర్ శతకాన్ని సాధించి అందరి మన్ననలు పొందాడు. ఆతర్వాత 2016లో ఆస్ట్రేలియాపై 81 బంతుల్లోనే శతకం సాధించి అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఎందుకో ఏమో తెలీదు కానీ మనీష్‌కు ఆతర్వాత అవకాశాలు పలచబడ్డాయి. కాగా, మనీష్ ఇప్పటివరకు 26 వన్డేల్లో సెంచరీ, 2 అర్ధసెంచరీల సాయంతో 492 పరుగులు చేశాడు. టీ20ల్లో 33 ఇన్నింగ్స్‌ల్లో 3 అర్ధశతకాల సాయంతో 709 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే మనీష్‌కు ఐపీఎల్లో మాత్రం మెరుగైన రికార్డే ఉంది. ఐపీఎల్లో 151 మ్యాచ్‌ల్లో శతకం, 20 అర్ధశతకాలతో సాయంతో 3461 పరుగులు చేశాడు. చదవండి: లంక పర్యటనకు ఎంపికైన ఆటగాళ్లందరికీ అవకాశం ఇస్తాను.. -
గుండెపోటుతో క్రికెట్ కోచ్ కన్నుమూత.. విషాదంలో కోహ్లి
ఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి చిన్ననాటి కోచ్ సురేశ్ బాత్రా శనివారం గుండెపోటుతో మరణించారు. 53 ఏళ్ల సురేశ్ ప్రస్తుతం ఢిల్లీ క్రికెట్ అకాడమీలో అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. కోహ్లి టీనేజ్ వయసులో ఉన్నప్పుడు సురేశ్ బాత్రా అతనికి బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించారు. కోహ్లి బ్యాటింగ్ స్టైల్లో మార్పు రావడంలో సురేశ్ కీలకపాత్ర పోషించారు. కాగా ఢిల్లీ క్రికెట్ అకాడమీలో హెడ్ కోచ్‌గా ఉన్న రాజ్‌కుమార్ శర్మ ట్విటర్లో స్పందించారు. ' నేను ఈరోజు నా తమ్ముడిని కోల్పోయాను. సురేశ్‌బాత్రాతో నాకు 1985 నుంచి ప్రత్యేక అనుబంధం ఉంది. ఎందరో క్రికెటర్లను తయారు చేసిన సురేశ్ కోహ్లికి కూడా కోచ్‌గా వ్యవహరించాడు. అతని మృతి మాకు తీరని లోటు అంటూ ట్వీట్ చేశారు. కాగా కోహ్లి ప్రస్తుతం డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడేందుకు టీమిండియాతో కలిసి జూన్ 2న ఇంగ్లండ్ బయల్దేరనున్నాడు. కివీస్‌తో టెస్టు చాంపియన్‌షిప్ ముగిసిన అనంతరం టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. చదవండి: 'కోహ్లిని ఉదాహరణగా తీసుకోమని చెప్పా' Suresh Batra (striped t-shirt), who coached @imVkohli when he was a teenager, passed away on Thursday. He had finished his daily morning puja and collapsed. He was 53. "I lost my younger brother. Knew him since 1985," said Rajkumar Sharma. May his soul Rest in Peace.... pic.twitter.com/pW3avt6NpP — Vijay Lokapally (@vijaylokapally) May 21, 2021 -
‘బాగా ఆడింది వారైతే నాకెందుకు ఆ క్రెడిట్’
బెంగళూరు: ఇటీవల ఆసీస్ గడ్డపై టీమిండియా సాధించిన సంచలన విజయాల్లో కీలక పాత్ర పోషించిన యువ ఆటగాళ్లను భారత జట్టు మాజీ సారధి, ప్రస్తుత భారత అండర్-19, ఇండియా-ఏ జట్ల కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆకాశానికెత్తాడు. ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో యువ ఆటగాళ్లు రిషబ్ పంత్, మహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, శార్ధూల్ ఠాకూర్, శుభ్‌మన్ గిల్ అద్భుతంగా రాణించి టీమిండియాకు చారిత్రక సిరీస్ విజయాన్ని అందించారు. వారి ఆ స్థాయి ప్రదర్శన వెనుక 'ది వాల్' రాహుల్ ద్రవిడ్ కృషి ఉందన్నది బహిరంగ రహస్యమే అయినప్పటికీ.. రాహుల్ మాత్రం దాంతో ఏకీభవించడం లేదు. సీనియర్ ఆటగాళ్ల గైర్హాజరీలో కుర్రాళ్లు చేసిన అద్భుత ప్రదర్శనకు క్రెడిట్ మొత్తం వారికే దక్కాలని ఓ స్పోర్ట్స్ చానెల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మైదానంలో కుర్రాళ్లు చూపిన తెగువ, ధైర్యం, ఆట పట్ల నిబద్ధత ఎంతో అద్భుతమని, వారి వ్యక్తిగత ప్రతిభ కారణంగానే కుర్రాళ్లు ఈ స్థాయికి చేరారని ద్రవిడ్ ప్రశంసలతో ముంచెత్తాడు. ప్రస్తుత సీనియర్ జట్టులో సభ్యులైన కుర్రాళ్లకు అండర్-19 జట్టు సభ్యులుగా ఉన్నప్పుడు తాను కోచింగ్ ఇచ్చానన్న కారణంగా కుర్రాళ్లు సాధించిన ఘనతను తనకు ఆపాదించడం సమంజసం కాదని అన్నాడు. క్రెడిట్ మొత్తానికి వారు మాత్రమే అర్హులని పేర్కొన్నాడు. కాగా, యువకుల్లో దాగివున్న ప్రతిభను వెలికితీసి, ఆటలో వారికి మెళకువలు నేర్పించి, కుర్రాళ్ల అద్భుత ప్రదర్శనకు కారకుడైన ద్రవిడ్‌పై యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం ప్రశంసల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో ద్రవిడ్ పైవిధంగా స్పందించాడు. -
ఉత్తరాఖండ్ కోచ్‌గా వసీమ్ జాఫర్
ముంబై: ఆటగాడిగా క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత టెస్టు జట్టు మాజీ ఓపెనర్ వసీమ్ జాఫర్ ఇకపై కోచ్‌గా కనిపించనున్నాడు. ఉత్తరాఖండ్ జట్టుకు హెడ్ కోచ్‌గా ఎంపికైనట్లు అతడే స్వయంగా మంగళవారం తెలిపాడు. ఈ పదవిలో జాఫర్ ఏడాదిపాటు కొనసాగనున్నాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు దేశవాళీ క్రికెట్లో కొనసాగిన అతడు ముంబై, విదర్భలకు ప్రాతినిధ్యం వహించాడు. అంతేకాకుండా రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ ఏడాది మార్చిలో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన జాఫర్... కోచ్ పదవి తనకు ఒక సవాల్‌లాంటిదని అభిప్రాయపడ్డాడు. ‘నేను మొదటిసారి ఒక జట్టుకు హెడ్ కోచ్‌గా పనిచేయబోతున్నా. ఈ పదవి ఒక సవాల్ లాంటిది. ఉత్తరాఖండ్ జట్టుతో కలిసి పనిచేయడం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా’ అని జాఫర్ పేర్కొన్నాడు. -
మహిళా క్రికెటర్లతో అసభ్య ప్రవర్తన
వడోదర: భారత మాజీ క్రికెటర్, ప్రస్తుతం బరోడా మహిళల జట్టుకు హెడ్ కోచ్‌గా ఉన్న అతుల్ బెదాడే తీవ్ర వివాదానికి కేంద్రంగా మారాడు. తాను కోచ్‌గా వ్యవహరిస్తున్న టీమ్ క్రికెటర్లతో అతను అసభ్యకరంగా ప్రవర్తించినట్లు విచారణలో తేలింది. దాంతో బెదాడేను సస్పెండ్ చేస్తున్నట్లు బరోడా క్రికెట్ సంఘం (బీసీఏ) ప్రకటించింది. ఈ మేరకు బెదాడేకు లేఖ రాసిన కార్యదర్శి అజిత్ లెలె పలు అంశాలు వెల్లడించారు. ‘మహిళా క్రికెటర్ల శారీరక విషయాల గురించి, వారి ఆరోగ్య విషయాల గురించి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం, అసభ్యకర భాష మాట్లాడటం, లైంగికపరమైన అంశాల గురించి కూడా చర్చించే ప్రయత్నం చేయడంలాంటివి’... బెదాడేపై వచ్చిన ప్రధాన ఆరోపణలని ఆయన చెప్పారు. క్రికెటర్ల రాతపూర్వక ఫిర్యాదు తర్వాత తాము విచారణ జరపడంతో అనేక విషయాలు బయటపడ్డాయని లెలె పేర్కొన్నారు. ప్రస్తుతానికి సస్పెండ్ చేసినా... ఈ అంశంపై ఇక ముందు పూర్తి స్థాయి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని కూడా బీసీఏ ప్రకటించింది. 53 ఏళ్ల అతుల్ బెదాడే 1994లో భారత్ తరఫున 13 వన్డేలు ఆడి 22.57 సగటుతో 158 పరుగులు చేశాడు. -
50 లక్షల డాలర్లు చెల్లించండి: కోచ్ లేఖ
కొలంబో: తనను అర్ధాంతరంగా శ్రీలంక క్రికెట్ జట్టు కోచ్ పదవి నుంచి తొలగించినందుకు నష్టపరిహారంగా 50 లక్షల డాలర్లు (రూ. 35 కోట్ల 89 లక్షలు) చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆ జట్టు మాజీ కోచ్ చండిక హతురసింఘ శ్రీలంక క్రికెట్ బోర్డుకు లేఖ రాశారు. ఒప్పందం ప్రకారం తాను మరో 18 నెలలు కోచ్ పదవిలో కొనసాగాల్సి ఉన్నా... శ్రీలంక క్రికెట్ బోర్డు తనను ముందుగానే తొలగించిందని... వారి చర్య తన కోచింగ్ కెరీర్‌పై ప్రభావం చూపుతుందని గతంలో శ్రీలంక తరఫున 26 టెస్టుల్లో, 35 వన్డేల్లో ఆడిన 51 ఏళ్ల హతురసింఘ తన లేఖలో పేర్కొన్నారు. అయితే శ్రీలంక క్రికెట్ మాత్రం ఆరు నెలల వేతనాన్ని పరిహారం రూపంలో చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఒకానొక సందర్భంలో హతురసింఘకు చెల్లిస్తున్న జీతంపై ఆ దేశ క్రీడా శాఖ మంత్రి హరిన్ ఫెర్నాండో విస్మయం వ్యక్తం చేశారు. ‘నెలకు 60 వేల డాలర్లు జీతంగా తీసుకుంటున్న హతురసింఘ... జట్టును విజయపథంలో మాత్రం నడిపించలేకపోతున్నారు’ అంటూ చండికను ఫెర్నాండో విమర్శించాడు. 2019 ప్రపంచ కప్‌లో శ్రీలంక క్రికెట్ జట్టు దారుణ వైఫల్యం అనంతరం ఆ దేశ క్రికెట్ బోర్డు కోచ్ హతురసింఘను, ఆయన శిక్షణ సహాయక సిబ్బందిని తొలగించింది. -
యంగెస్ట్ క్రికెట్ కోచ్.. పేదరికంతో ఎదగలేక
బంజారాహిల్స్: లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించాడా యువకుడు. పేదరికంలో ఉన్నా పట్టుదలతో సాధన చేసి తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు నగరానికి చెందిన పంతొమ్మిదేళ్ల షేక్ మహ్మద్ గౌస్. ఈ పేద యువకుడు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్లో ఇండియా నుంచి యంగెస్ట్ కోచ్‌గా ఎంపికయ్యాడు. అహర్నిశలు కష్టపడి సాధన చేసి పెద్దలను మెప్పించి ఈ స్థాయికి చేరుకున్నాడు. ఈ క్రమంలో అతడి ప్రయాణం అంత సాదాసీదాగా సాగలేదు. టోలిచౌకిలో నివసించే గౌస్ తండ్రి అబ్దుల్ ఖాదర్ వలీ వికలాంగుడు కాగా, తల్లి పర్వీన్ చీరలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. కృష్ణానగర్‌లోని విద్యానికేతన్ స్కూల్లో పదో తరగతి వరకు చదివిన మహ్మద్ గౌస్ ప్రస్తుతం కూకట్‌పల్లిలోని గౌతమి డిగ్రీ కళాశాలలో బీఎస్సీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. తన పదో ఏట నుంచే క్రికెట్ పట్ల మక్కువ పెంచుకున్న ఇతడు స్కూల్‌తో పాటు కాలేజీలోనూ క్రికెట్ టీమ్‌లో అద్భుత ప్రతిభ చూపించాడు. అయితే, ఆర్థికంగా వెనుకబడటం, పెద్దల ప్రోత్సాహం లేకపోవడంతో ప్రతిభ ఉన్నా జాతీయ జట్టులో చోటు సంపాదించుకోలేకపోయాడు. అండర్–19 జట్టులోకి వెళ్లడానికి ఇతడు చేసిన ప్రయత్నాలకు కూడా ప్రోత్సాహం లేకపోవడంతో విఫలమయ్యాయి. సురేందర్ అగర్వాల్ టీమ్‌లో ఆడిన మహ్మద్ గౌస్ ప్రతిభ దశదిశలా చాటినట్లయింది. గత ఆగస్టులో దుబాయ్‌లో జరిగిన ఐసీసీ సమావేశంలో మహ్మద్ గౌస్‌ను ఎంగెస్ట్ కోచ్‌గా నియమించారు. యూఏఈ క్రికెట్ యాజమాన్యం ఈ యువకుడ్ని కోచ్‌గా రావాలంటూ పిలిచినా వెళ్లలేదు. మనదేశాన్ని వదిలి మరో దేశానికి వెళ్లి కోచింగ్ ఇవ్వడానికి మనసొప్పలేదని చెబుతున్నాడీ యువకుడు. క్రికెట్లో చిన్నారులకు శిక్షణ ఇస్తున్న గౌస్ నాలా ఎవరూ కాకూడదు.. ప్రస్తుతం తాను అమీర్‌పేట ధరంకరం రోడ్డులో 11 మంది చిన్నారులకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పాడు గౌస్. ఇందులో ఫీజు కట్టలేని వారికి మినహాయింపునిచ్చి ఉచితంగా శిక్షణ ఇస్తున్నాడు. వచ్చే జనవరి నాటికి 25 మందికి శిక్షణ ఇవ్వనున్నట్టు వెల్లడించాడు. ప్రతిభ ఉండికూడా పేదరికంతో క్రికెట్ ఆడలేని ఎంతోమంది తనలాగే నిస్సహాయులుగా మిగిలిపోతున్నారని, జాతీయ జట్టులో ఆడలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనలాగా మరొకరు కాకూడదని క్రికెట్లో ప్రతిభ గల పేద విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్టు చెబుతున్నాడు. ఉత్తమ క్రీడాకారులను తయారు చేస్తా.. తాను కోచింగ్ తీసుకోవడానికి ఆర్థిక పరిస్థితులు అడ్డొవచ్చాయని, దీంతో ముందుకు వెళ్లలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసిన మహ్మద్ గౌస్.. రాబోయే రోజుల్లో హైదరాబాద్ నుంచి ఉత్తమ క్రీడాకారులను తయారు చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడేలా తీర్చిదిద్దుతానన్నాడు. తనకు కోచింగ్ ఇవ్వడానికి మంచి స్థలం కేటాయిస్తే ఎంతోమంది పేద విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉంటుందన్నాడు. క్రికెట్ ఆడాలకునే ఎంతో మంది చిన్నారులకు శిక్షణ తీసుకోవాలని ఉన్నా మైదానాలు, సౌకర్యాలు లేక వెనకబడిపోతున్నారని ఇలాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వాలు ముందు చూపుతో గ్రౌండ్లు కేటాయించాలని కోరాడు. 110 ఏళ్ల క్రికెట్ చరిత్రలో.. క్రికెట్‌కున్న 110 ఏళ్ల చరిత్రలో 19 ఏళ్ల వయసులో ఇంతవరకు ఎవరూ కోచ్ కాలేదని, ఈ ఘనత తనకు మాత్రమే దక్కిందని గౌస్ ఆనందం వ్యక్తం చేశాడు. అయితే తనకు లభించిన ఈ ఘనతను ఇంకా చాలా మంది గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ‘యంగెస్ట్ కోచ్’గా తనకు లభించిన గుర్తింపు సంపన్నుల పిల్లలకు లభించి ఉంటే ఎంతో ఆర్భాటం చేసి ఉండేవారని.. ప్రభుత్వాలు కూడా గౌరవించేవన్నాడు. కానీ పేదలు ఎన్ని విజయాలు, ఘనతలు సాధించినా దానికి ప్రభుత్వం నుంచి ఏమాత్రం గుర్తింపు లేదనడానికి తానే నిదర్శనమన్నాడు. -
బలిపశువును చేశారు.. పాక్ కోచ్ ఆవేదన
ఇస్లామాబాద్ : ‘కోచ్‌గా పాకిస్తాన్ జట్టును నా భుజస్కంధాలపై మోశాను. కష్టకాలంలో ఆటగాళ్లలో మనోధైర్యాన్ని నింపాను. పాకిస్తాన్ క్రికెట్ జట్టులో సమూల మార్పులు తీసుకొచ్చాను. విజయాల బాట పట్టించాను. యువ ఆటగాళ్లకు అండగా నిలిచాను. అయితే నా కోచ్ కాంట్రాక్టు ముగుస్తుండటంతో మరో రెండేళ్లు పొడగించమని కోరాను. కానీ వాళ్లు ప్రపంచకప్ ఓటమికి బాధ్యుడిని చేస్తూ నన్ను బలిపశువును చేశారు. నన్ను తప్పించడం తీవ్ర నిరాశ, బాధను కలిగించాయి. అయితే ఒక్కటి మాత్రమ గర్వంగా చెప్పగలను. కోచ్‌గా పాక్ జట్టును అత్యున్నత స్థాయికి తీసుకొనిపోయాను’అంటూ పాక్ తాజా మాజీ కోచ్ మికీ అర్థర్ తన ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రధాన కోచ్ మికీ అర్థర్‌కు ఉద్వాసన పలికింది. దీంతో పైవిధంగా ఆర్థర్ స్పందించాడు. అతడితో పాటు సపోర్టు స్టాఫ్ కాంట్రాక్టులను కూడా పొడిగించేందుకు పీసీబీ సుముఖంగా లేదని తెలిసింది. ప్రపంచకప్‌లో ఘోర ఓటమి అనంతరం పీసీబీ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఓటమిపై నివేదిక కోరుతూ వసీం ఆక్రమ్, మిస్బావుల్ హక్‌లతో కూడిన ఓ కమిటీని నియమించింది. రెండ్రోజుల క్రితం అర్థర్‌తో భేటి అయిన ఈ కమిటీ కోచ్ ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందలేదు. ఇక ఇదే భేటిలో సర్ఫరాజ్ అహ్మద్‌ను సారథ్య బాధ్యతల నుంచి తొలగించాలని కమిటీకి అర్థర్ సూచించారు. గత రెండేళ్లుగా సర్ఫరాజ్ సారథిగా విఫలమవుతున్నాడని, జట్టును ఏకతాటిపై నడిపించడంలో విఫలమయ్యాడని వారికి వివరించారు. అయితే కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం కోచింగ్ బృందం కాంట్రాక్టును పొడగించకూడదని భావిస్తున్నట్లు పీసీబీ అధికారికంగా తెలిపింది. దీంతో ఆర్థర్ దక్షిణాఫ్రికాకు పయనమయ్యాడు. -
‘ప్రధాన కోచ్‌ను కొనసాగించే ముచ్చటే లేదు ’
ఇస్లామాబాద్: ప్రపంచకప్‌లో కనీసం సెమీస్‌కు చేరకుండానే ఇంటిబాట పట్టడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) దిద్దుబాటు చర్యలకు దిగింది. పాక్ క్రికెట్ జట్టును ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఏర్పడిందని అన్ని వైపుల విమర్శలు వస్తుండటంతో పీసీబీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15తో ముగుస్తున్న కోచింగ్ బృందం కాంట్రాక్టును పొడగించకూడదని నిశ్చయించుకుంది. దీంతో 2016 నుంచి పాక్ క్రికెట్ జట్టుకు సేవలందిస్తున్న మికీ అర్థర్‌కు ఉద్వాసన పలకనుంది. అతడితో పాటు బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్, బౌలింగ్ కోచ్ అజహర్ మహ్మద్, ఇతర సిబ్బందిని కూడా కొనసాగించకూడదని పీసీబీ నిర్ణయం తీసుకుంది. ప్రపంచకప్‌లో పాక్ వైపల్యానికి కోచింగ్ బృందం పొరపాట్లు కూడా ఉన్నాయని పీసీబీ విశ్వసిస్తోంది. దీంతో వారిపై వేటు వేయనుంది. ఇక జట్టును విజయపథంలో నడిపించే కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియను త్వరలోనే ప్రారంభించనున్నట్లు పీసీబీకి చెందిన ఓ అధికారి తెలిపారు. 2016 నుంచి పాక్ జట్టుకు మికీ అర్థర్ విశేష సేవలందిస్తున్నాడు. అతడి కోచ్‌గా ఉన్న సమయంలోనే 2017 చాంపియన్ ట్రోఫీని పాక్ గెలుచుకుంది. ఇక అర్థర్ కూడా పాక్ జట్టుకు కోచ్‌గా కొనసాగేందుకు ఆసక్తి కనబర్చటం లేదని తెలుస్తోంది. శ్రీలంక క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. రెండ్రోజుల క్రితమే ప్రపంచకప్ ఓటమిపై సమీక్ష జరగగా పీసీబీ ఏర్పాటు చేసిన కమిటీకి అర్థర్ కెప్టెన్సీ మార్పుపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాడని సమాచారం. గత రెండేళ్లుగా సారథిగా సర్ఫరాజ్ అహ్మద్ పూర్తిగా విఫలమయ్యాడని, అతడిని సారథ్య బాధ్యతల నుంచి తప్పించాలని పీసీబీకి అర్థర్ సూచించినట్టు సమాచారం. -
సూపర్ ఓవర్ టెన్షన్.. ప్రాణాలు వదిలిన కోచ్
ఆక్లాండ్: వన్డే ప్రపంచకప్‌లో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్ అత్యంత కీలక ఇన్నింగ్స్ ఆడుతుండగా విషాదం చోటుచేసుకుంది. అతడి చిన్ననాటి కోచ్, ఆక్లాండ్ గ్రామర్ స్కూల్ మాజీ టీచర్ డేవిడ్ జేమ్స్ గొర్డాన్ మరణించాడు. మ్యాచ్ ఫలితాన్ని తేల్చే సూపర్ ఓవర్లో రెండో బంతిని నీషమ్ సిక్సర్ కొట్టిన సమయంలోనే జేమ్స్ గొర్డాన్ కన్నుమూసినట్టు ఆయన కుమార్తె లియోనీ వెల్లడించారని స్థానిక మీడియా తెలిపింది. ‘గొర్డాన్ తుదిశ్వాస విడిచారని సూపర్ ఓవర్ జరుగుతుండగా నర్స్ వచ్చి మాతో చెప్పారు. నీషమ్ సిక్సర్ బాదిన క్షణంలోనే ఆయన చనిపోయివుండొచ్చని అన్నారు. మా నాన్న హాస్యప్రియుడు. మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. అందరితో ప్రేమగా ఉండేవార’ని లియోనీ గుర్తు చేసుకున్నారు. గొర్డాన్ మృతికి నీషమ్ ట్విటర్ ద్వారా సంతాపం తెలిపాడు. ‘డేవిడ్ జేమ్స్ గొర్డాన్.. నా హైస్కూల్ టీచర్, కోచ్, స్నేహితుడు. క్రికెట్ అంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఆయన దగ్గర మేమంతా ఆట నేర్చుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఉత్కంఠభరితంగా జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో మా ఆటతీరును ఆయన గర్వించే ఉంటారు. మాకు ప్రతిదీ నేర్పినందుకు ధన్యవాదాలు. సంతాపం’ అంటూ నీషమ్ ట్వీట్ చేశాడు. నీషమ్‌ను తన తండ్రి ఎంతగానో అభిమానించేవారని లియోనీ పేర్కొన్నారు. ఆక్లాండ్ గ్రామర్ స్కూల్లో 25 ఏళ్లుపైగా టీచర్‌గా పనిచేసిన డేవిడ్ జేమ్స్ గొర్డాన్ ఎంతో మంది విద్యార్థులకు క్రికెట్, హాకీ నేర్పించారు. నీషమ్, ఫెర్గూసన్‌లతో పాటు చాలా మంది హైస్కూల్ విద్యార్థులకు కోచింగ్ ఇచ్చారు. (చదవండి: విశ్వవిజేతగా ఇంగ్లండ్) -
సచిన్ టెండుల్కర్ క్రికెట్ గురువు ఆచ్రేకర్ కన్నుమూత
-
మహిళల క్రికెట్ జట్టు కోచ్ ఎవరో తెలుసా?
ముంబై: భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త కోచ్‌గా డబ్ల్యూవీ రామన్ ఎంపికయ్యారు. గ్యారీ కిర్‌స్టెన్, హెర్షల్ గిబ్స్, ట్రెంట్ జాన్స్టన్, మార్క్ కోల్స్ వంటి హేమాహేమీలను అధిగమించి కోచ్ పదవిని దక్కించుకున్నారు. ఆయనను మాజీ క్రికెటర్లు కపిల్‌దేవ్ అన్షుమన్ గైక్వాడ్, శాంతా రంగస్వామిలతో కూడిన కమిటీ గురువారం ఇంటర్వ్యూ చేసి.. ఎంపిక చేసింది. తాత్కాలిక ప్రాతిపదికపై ఇటీవలి ప్రపంచ కప్ వరకు కోచ్ బాధ్యతలు నిర్వహించిన రమేశ్ పొవార్ పదవీకాలం గత నెల 30తో ముగియడంతో కొత్త కోచ్‌ను ఎంపిక చేయాల్సి వచ్చింది. (ఆ ఒక్కరు ఎవరో?) డబ్ల్యూవీ రామన్ ప్రస్తుతం బెంగాల్ రంజీ టీమ్ కోచ్‌గా ఉన్నారు. క్రికెట్‌పై విశేష పరిజ్ఞానం ఉన్న 53 ఏళ్ల రామన్.. భారత అండర్–19తో పాటు బెంగాల్, తమిళనాడు రంజీ జట్లకు, ఐపీఎల్లో కోల్‌కతా, పంజాబ్ జట్లకు శిక్షకుడిగా వ్యవహరించారు. టీమిండియా మాజీ ఓపెనర్ అయిన ఆయన ఆటగాడిగా కంటే కోచ్‌గానే ఎక్కువ పేరు సంపాదించుకున్నారు. టీమిండియా తరపున 11 టెస్టులు ఆడి 448 పరుగులు చేశారు. 27 వన్డేల్లో 617 పరుగులు సాధించారు. ఈ రెండు ఫార్మాట్లలో రెండేసి వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు. -
ఏడాది ఉండగానే క్రికెట్ కోచ్ పదవికి గుడ్ బై..
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కోచ్ పదవి నుంచి మైక్ హెస్సెన్ ఉన్నపళంగా తప్పుకున్నాడు. దాదాపు ఆరేళ్లుగా కివీస్ క్రికెట్‌కు సేవలందిస్తున్న హెస్సన్.. ఇంకా ఏడాదిపాటు కాంట్రాక్ట్ ఉండగానే కోచ్ పదవికి గుడ్ బై చెప్పేశాడు. ఈ మేరకు కోచ్ పదవికి వీడ్కోలు చెబుతున్నట్లు హెస్సన్ గురువారం ప్రకటించాడు. కాగా, వచ్చే నెల చివరి వరకూ జట్టుతో కొనసాగుతానని స్పష్టం చేశాడు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతోనే కోచ్ పదవి నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు హెస్సెన్ తెలిపాడు. ఆకస్మికంగా హెస్సెన్ తీసుకున్న నిర్ణయం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డును కలవరపాటుకు గురిచేసింది. ఇంకా వన్డే వరల్డ్‌కప్‌కు ఏడాది మాత్రమే సమయం ఉన్న తరుణంలో హెస్సెన్ వైదొలగడం కివీస్‌కు పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. సుదీర్ఘ కాలంగా కివీస్ క్రికెట్ జట్టుతో పని చేస్తున్న హెస్సెన్ ఇలా షాకివ్వడం పట్ల న్యూజిలాండ్ క్రికెట్ పెద్దలు జీర్ణించుకోలేకుండా ఉన్నారు. ఇటీవల క్రికెట్ బోర్డులో పెద్దలతో చోటు చేసుకున్న విభేదాల కారణంగా హెస్సెన్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.