delayed
-
42 గంటలే ప్రయాణం.. మూడేళ్లకు స్టేషన్ చేరింది
రైలు ఆలస్యంగా రావడం సర్వసాధారణమే. ఆలస్యం అంటే ఒక గంట, రెండు గంటలు.. మహా అయితే ఒక రోజు అనుకుందాం. కానీ 42 గంటల్లో గమ్యాన్ని చేరాల్సిన రైలు.. తన గమ్యాన్ని చేరుకోవడానికి 3 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి ఉత్తరప్రదేశ్‌లోని బస్తీకి వెళుతున్న గూడ్స్ రైలు 42 గంటల్లో గమ్యాన్ని చేరాల్సి ఉంది. 2014లో బస్తీలోని వ్యాపారవేత్త 'రామచంద్ర గుప్తా' తన వ్యాపారం కోసం విశాఖపట్నంలోని ఇండియన్ పొటాష్ లిమిటెడ్ నుంచి సుమారు రూ.14 లక్షల విలువైన డైమోనియం ఫాస్ఫేట్ (డీఏపీ) కోసం ఆర్డర్ ఇచ్చాడు.నవంబర్ 10, 2014న, షెడ్యూల్ ప్రకారం బయలుదేరిన గూడ్స్ రైలులో 1,316 బస్తాల డీఏపీ లోడ్ చేశారు. కానీ చేరుకోవాల్సిన సమయానికి ట్రైన్ చేరలేదు. రామచంద్ర గుప్తా అనేక ఫిర్యాదుల తరువాత, రైలు మార్గమధ్యంలో అదృశ్యమైనట్లు అధికారులు కనుగొన్నారు.ఇదీ చదవండి: రైల్వే ‘ఎం1’ కోచ్ గురించి తెలుసా..?2014 నవంబర్ 10న బయలుదేరిన గూడ్స్ ట్రైన్.. జూలై 25, 2018న బస్తీ స్టేషన్‌కు చేరింది. కానీ రామచంద్ర గుప్తా ఆర్డర్ చేసిన డీఏపీ మొత్తం పాడైపోయింది. అయితే ఇండియన్ రైల్వే చరిత్రలోనే ఇంత ఆలస్యంగా గమ్యాన్ని చేరుకున్న ట్రైన్ ఇదే కావడం గమనార్హం. ఇప్పటి వరకు కూడా ఏ ట్రైన్ ఇంత ఆలస్యంగా ప్రయాణించలేదు. -
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దట్టమైన పొగమంచు.. ఏడు విమానాలు రద్దు
న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీని కాలుష్యం కమ్మేసింది. పొల్యూషన్ కారణంగా ఏర్పడిన పొగమంచు విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దట్టమైన పొగమంచు కారణంగా దృశ్యమానత(విజిబులిటీ) తగ్గడంతో ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం 8.30 గంటల వరకు దాదాపు 160 విమానాలు ఆలస్యంగా నడిచాయి.ఫ్లైట్-ట్రాకింగ్ వెబ్సైట్ తెలిపిన వివరాల ప్రకారం విమానాలు బయలుదేరే సమయంలో సగటున 22 నిమిషాల ఆలస్యం జరిగింది. ఢిల్లీలో పొగమంచు కారణంగా దృశ్యమానత తక్కువగా ఉండటంతో ఐదు విమానాలను (జైపూర్-04, డెహ్రాడూన్-01) దారి మళ్లించారు. ప్రస్తుతం అన్ని విమాన కార్యకలాపాలు సాధారణంగానే ఉన్నాయని విమనాశ్రయ అధికారులు పేర్కొన్నారు.ఎకనామిక్ టైమ్స్ వార్తల ప్రకారం దట్టమైన పొగమంచు కారణంగా దృశ్యమానత తగ్గినందున సోమవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో ఏడు విమానాలను రద్దు చేశారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానాల రాకపోకలపై ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ప్రస్తుతం ఢిల్లీలో ఏర్పడిన పొగమంచు విజిబులిటీని ప్రభావితం చేస్తోంది. ఫలితంగా విమాన షెడ్యూళ్లలో జాప్యం జరగవచ్చు. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు విమాన రాకపోకల స్థితిని ఒకసారి చెక్ చేసుకోవాలి’ అని తెలియజేసింది. స్పైస్‌జెట్ కూడా ఇదే విధమైన సూచన చేసింది. ఢిల్లీలో ప్రస్తుతం గాలి అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 481కి చేరింది. కాలుష్యం కారణంగా ఏర్పడిన అధ్వాన్న పరిస్థితుల దృష్ట్యా నేటి (సోమవారం) నుంచి ఢిల్లీలో గ్రాప్-4 నిబంధనలను అమలు చేశారు.ఇది కూడా చదవండి: Gujarat: ర్యాగింగ్‌కు ఎంబీబీఎస్ విద్యార్థి బలి -
చేదు వార్త.. నైరుతి రుతుపవనాలు ఆలస్యం.. రాక ఎప్పుడంటే?
న్యూఢిల్లీ: కేరళ తీరాన్ని ఇప్పటికే తాకాల్సిన నైరుతి రుతుపవనాల రాక ఇంకాస్త ఆలస్యం కానుంది. మరో మూడు, నాలుగు రోజులు పడుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సాధారణంగా ఏటా నైరుతి రుతుపవనాలు జూన్ 1న కేరళ తీరాన్ని తాకి దేశమంతటా విస్తరించడంతో వానలు కురుస్తాయి. ఒక్కో ఏడాది వాటి రాక వారం దాకా ఆలస్యమవుతుంది. గత అంచనాల మేరకు జూన్ 4 కల్లా రుతుపవనాలు కేరళకు రావాల్సింది. ‘‘వాటి రాకకు అన్నీ అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయి. పశ్చిమం నుంచి వస్తున్న గాలులు దక్షిణ అరేబియా సముద్రం మీదుగా బలంగానే వీస్తున్నాయి. ఆదివారం నాటికి సముద్ర మట్టానికి 2.1. కిలోమీటర్ల పైకి వీస్తున్నాయి. ఆగ్నేయ అరేబియా సముద్రంపై ఆకాశం దట్టంగా మేఘావృతమై ఉంది. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండడం వల్ల మరో మూడు నాలుగు రోజుల్లో రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశాలున్నాయి. ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నాం’’ అని ఐఎండీ ప్రకటనలో వివరించింది. -
కాస్త ఆలస్యం నైరుతి రాక.. జూన్ 4న దేశంలోకి! ఐఎండీ వెల్లడి
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు ఈసారి కాస్త ఆలస్యం కానున్నాయి. అవి జూన్ 4న దేశంలోకి ప్రవేశించవచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు తొలుత కేరళలో ప్రవేశిస్తాయి. ఈ ఏడాది రుతుపవనాలు కొంత ఆలస్యమైనప్పటికీ దేశవ్యాప్తంగా పంటల సాగుపై, మొత్తం వర్షపాతంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని ఐఎండీ చీఫ్ ఎం.మొహాపాత్రా స్పష్టం చేశారు. రుతుపవనాలు ప్రవేశించే తేదీకి, ఈ సీజన్లో నమోదయ్యే మొత్తం వర్షపాతానికి సంబంధం లేదని తెలిపారు. సాధారణ వర్షపాతమే! నైరుతి రుతుపవనాలు సాధారణంగా ఏటా జూన్ 1న కేరళలో అడుగు పెడతాయి. 2018లో మే 29న, 2019లో జూన్ 8న, 2020లో జూన్ 1న, 2021లో జూన్ 3న, 2022లో మే 29న ఈ రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాల రాకపై తమ అంచనాలు 2015 మినహా గత 18 ఏళ్లలో ఎప్పుడూ తప్పలేదని ఐఎండీ పేర్కొంది. మోకా తుఫాను కారణంగానే ఈసారి రుతుపవనాల రాక ఆలస్యమవుతున్నట్లు చెప్పలేమని కేంద్ర ఎర్త్ సైన్సెస్ శాఖ మాజీ కార్యదర్శి ఎం.రాజీవన్ అన్నారు. ఈ ఏడాది నైరుతి రతుపవనాల సీజన్లో దేశంలో సాధారణ వర్షపాతమే నమోదవుతుందని తాము అంచనా వేస్తున్నట్లు ఐఎండీ గత నెలలో తెలియజేసింది. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కానుందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. దేశంలో గత నాలుగేళ్లు సాధారణం, సాధారణం కంటే అధిక వర్షాలు కురిశాయి. దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ఆహారంలో 40 శాతం ఆహారం వర్షాధార సాగుతోనే ఉత్పత్తి అవుతోంది. ఆహార భద్రతకు, ఆర్థిక స్థిరత్వానికి తగిన వర్షపాతం నమోదు కావడం చాలా కీలకం. మన దేశంలో 52 శాతం సాగుభూమి వర్షాలపైనే ఆధారపడి ఉంది. -
ఇడియట్స్ అని తిడుతూ..సహనం కోల్పోయిన ఎమ్మెల్యే
కొందరూ ఎమ్మెల్యే కింద స్ధాయి ఉద్యోగులపై తమ ఆవేశాన్ని వెళ్లగక్కడం మామూలే. మరికొందరూ ఏకంగా చేయి జేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అచ్చం అలానే ఇక్కడొక ఎమ్మెల్యే రోడ్డునిర్మాణ పనులను ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ కాంట్రక్టర్ని తిడుతూ..భౌతిక దాడికి దిగారు. ఏకంగా ఆ కాంట్రాక్టర్ కళ్ల అద్దలను కూడా పగలు కొట్టేసి..తోసేస్తానంటూ బెదిరింపులకు దిగారు. ఈఘటన కర్ణాటకలోని రాయచూర్ జిల్లా కవితా పట్టణంలో చోటు చేసుకుంది. కర్ణాటకలోని రాయ్‌చూర్‌లో నిర్మాణ పనుల ప్రాజెక్టును తనిఖీ చేసేందుకు వచ్చిన జేడీఎస్ ఎమ్మెల్యే రాజా వెంకటప్ప సహనం కోల్పోయారు. ఈ పనుల్లోజాప్యం ఎందుకు జరుగుతోందంటూ నిర్మాణ పనుల బాధ్యులపై మండిపడ్డారు. అక్కడు ఉన్న కాంట్రాక్టర్‌ని చూస్తూ..ఇడియట్స్ మీరు గుల్బర్గా నంచి ఇక్కడికి ఎందుకు వలస వచ్చారని ప్రశ్నించారు. మన జిల్లా నుంచి ఉద్యోగానికి ఎవరూ లేరా? అంటూ తిట్టిపోశారు. మనవాళ్ల అయినతే ఈపాటికి పని పూర్తి అయిపోయేదంటూ విరుచుకుపడ్డారు. అంతేగాదుఎమ్మెల్యే ఆ కాంట్రాక్టర్ ముఖానికి ఉన్న కళ్లద్దాలను లాక్కొని పగలు కొట్టడమే గాక ఇక్కడ నుంచి తోసేస్తానని బెదరించారు. ఆ తర్వాత జేఈ శ్యామలప్ప అనే మరో వ్యక్తిని కూడా దుర్భాషలాడారు. వాస్తవానికి రోడ్డు నిర్మాన పనులు ప్రారంభించి ఏడాది దాటిని పూర్తవ్వకపోవడంపై కవితా పట్టణం స్థానికులు ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జేడీఎస్ ఎమ్మెల్యే వెంకటప్ప రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్లపై మండిపడ్డారు. మీరంతా నాప్రతిష్టను దిగజార్చాలనే ప్రయత్నం చేస్తున్నారంటూ వారిపై ఆరోపణలు చేశారు. చెప్పుడు మాటలు వింటూ కావాలనే జాప్యం చేస్తూ..నాసిరకంగా పనులు చేస్తున్నారంటూ శారీరక దాడికి దిగారు. అందుకు సంబంధించిన దృశ్యాలు కొందరూ కెమరాలో బంధించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. (చదవండి: మీకు జీవితఖైదు సరైనదే: షాక్ ఇచ్చిన హైకోర్టు) -
తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం వాయిదా
న్యూఢిల్లీ: దేశంలోనే తొలి ప్రైవేటు రాకెట్ విక్రమ్- ఎస్ ప్రయోగం వాయిదా పడింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవటంతో మరో మూడు రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు హైదరాబాద్‌కు చెందిన స్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ ఆదివారం ప్రకటించించింది. ఈ నెల 15నే విక్రమ్-ఎస్ ప్రయోగం నిర్వహించాలని భావించినప్పటికీ.. నవంబర్ 18కి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. ‘వాతావరణం అనుకూలించకపోవటం వల్ల విక్రమ్-ఎస్ రాకెట్ లాంఛ్‌ను మరో మూడు రోజులు 15-19 మధ్య చేపట్టాలని నిర్ణయించాం. నవంబర్ 18 ఉదయం 11.30 గంటల ప్రాంతంలో జరిగేందుకు అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరి కోట ఇస్రో లాంఛ్‌పాడ్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది.’ అని తెలిపింది స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ. దేశంలో మొట్టమొదటిసారిగా ప్రైవేటు రంగంలో నిర్మించిన రాకెట్ విక్రమ్-ఎస్. ‘ప్రారంభ్’ అనే ఈ మిషన్‌లో రెండు భారతీయ, ఒక విదేశీ ఉపగ్రహం ఉంటాయని హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ తెలిపింది. స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ మూడు వేరియంట్లలో విక్రమ్ రాకెట్‌ను డెవలప్ చేస్తోంది. విక్రమ్–1 రాకెట్ 480 కిలోల పేలోడ్‌ను తక్కువ ఎత్తు ఉన్న కక్ష్యలోకి మోసుకెళ్లగలదు. విక్రమ్–2 595 కిలోలు, విక్రమ్–3 815 కిలోల పేలోడ్‌ను భూమి నుంచి 500 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి మోసుకెళ్తాయి. ఇదీ చదవండి: తిండి లేని రోజుల నుంచి.. అమెరికాలో సైంటిస్ట్ దాకా.. ఆయన ప్రయాణం స్ఫూర్తిదాయకం -
పట్టాలు తప్పిన రైలు.. విశాఖ వైపు వెళ్లే పలు ట్రైన్స్ ఆలస్యం!
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి బాలాజీపేట వద్ద గూడ్స్ రైలు పట్టింది. విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా, బుధవారం తెల్లవారుజామున గూడ్స్ రైలు భోగి పూర్తిగా పట్టాలపై పడిపోయింది. ఇక, ఈ ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు వెంటనే స్పందించారు. ఘటనా స్థలానికి చేరుకుని భోగిని పట్టలాపై నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం కారణంగా విశాఖ వైపునకు వెళ్లు ప్యాసింజర్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అత్తిలి వద్ద పలు రైళ్లు నిలిచిపోయాయి. -
Pensions: ప్రతినెలా ఇదే తంతు.. సర్వర్ మొరాయింపు
కీసర(మేడ్చల్ జిల్లా): ఆసరా పింఛన్ల పంపిణీ ప్రహాసనంగా మారింది. పింఛన్ల సోమ్ము తీసుకునేందుకు వృద్ధులకు ఆగచాట్లు తప్పడం లేదు. సర్వర్లు మొరాయించడంతో వేలిముద్రలు తీసుకోవడం ఆలస్యం అవుతుండటంతో వృద్ధులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. దీంతో పింఛను పంపిణీ కేంద్రాల వద్ద లబ్ధిదారులు బారులుతీరుతున్నారు. ఒక్కోసారి రోజుల తరబడి తిరగాల్సి వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు. ప్రతినెలా ఇదే తంతు నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలో నిలబడాల్సి వస్తోందని వాపోతున్నారు. రోజంతా పింఛన్ కేంద్రం వద్ద ఉన్నా పింఛన్ డబ్బులు తీసుకుంటామన్న నమ్మకం లేదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. తిప్పలు తప్పాలంటే నేరుగా ఖాతాలోకి వేయాలి రెండు, మూడు రోజులుగా పింఛన్ల కోసం తిరుగుతున్నా సర్వర్ సమస్యతో డబ్బులు తీసుకోలేకపోతున్నానని ఎస్వీనగర్‌కు చెందిన మోహన్‌రావు వాపోయారు. మరికొందరు ఉదయం 7 గంటలకు టిఫిన్ తీసుకొని వచ్చి పింఛన్ల డబ్బుల కోసం మధ్యాహ్నం వరకు అక్కడే ఉంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ తిప్పలు తప్పాలంటే తమకు బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా చూడాలని ఉన్నతాధికారులను లబ్ధిదారులు కోరుతున్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో చాలా ప్రాంతాల్లో ఫించన్ డబ్బులను నేరుగా లబ్ధిదారుల ఖాతాలో వేస్తున్నారని మున్సిపాలిటీల్లోనూ ఇది అమలు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు. -
ఆస్తుల విక్రయంలో ఫ్యూచర్ సప్లైకు ఎదురు దెబ్బ
న్యూఢిల్లీ: అవసరమైన అనుమతులు పొందడంలో జాప్యం జరుగుతుందన్న అంచనాలతో ఆస్తుల విక్రయ ప్రణాళికలను రద్దు చేసుకుంటున్నట్లు ఫ్యూచర్ సప్లై చైన్స్ లిమిటెడ్(ఎఫ్ఎస్సీఎల్) తాజాగా పేర్కొంది. ఇందుకు బోర్డు ఒక తీర్మానాన్ని ఆమోదించినట్లు వెల్లడించింది. అయితే వ్యాపార కార్యకలాపాల పునరుద్ధరణకున్న ఇతర అవకాశాల అన్వేషణ, పరిశీలన చేపట్టనున్నట్లు ఎక్సే్ఛంజీలకు ఇచ్చిన సమాచారంలో తెలియజేసింది. అంతేకాకుండా ప్రస్తుతం ఎదుర్కొంటున్న వివిధ సవాళ్ల పరిష్కారాలను వెదకనున్నట్లు వివరించింది. ఈ అంశాలలో తుది నిర్ణయాలకు వచ్చినప్పుడు వివరాలను అందించనున్నట్లు తెలియజేసింది. ఎఫ్ఎస్సీఎల్ దేశీయంగా ఆర్గనైజ్డ్ విభాగంలో అతిపెద్ద థర్డ్‌పార్టీ సప్లై చైన్, లాజిస్టిక్స్ సేవలు సమకూర్చే కంపెనీగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. రిటైల్, ఫ్యాషన్, ఆటోమోటివ్ తదితర పలు రంగాల కస్టమర్లకు వేర్‌హౌసింగ్, పంపిణీ, ఇతర లాజిస్టిక్స్ సొల్యూషన్లు అందిస్తోంది. 2022 జులై 26న కంపెనీ బోర్డు అవసరమైన అనుమతులు పొందాక వేర్‌హౌస్ ఆస్తులతోపాటు కొన్ని విభాగాలను విక్రయించేందుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తిరిగి ఈ నెల 13న నిర్వహించిన అత్యవసర వాటాదారుల సమావేశం(ఈజీఎం)లో ఆస్తుల విక్రయానికి ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. అయితే తాజాగా ఈ ప్రణాళికలను వొదిలిపెడుతున్నట్లు వెల్లడించడం గమనార్హం! -
ఇన్ఫ్రా ప్రాజెక్టులు.. ప్రజల నెత్తిన రూ 4.38 లక్షల కోట్ల భారం!
న్యూఢిల్లీ: ఒకటో వంతు మౌలిక రంగ ప్రాజెక్టులు అధిక వ్యయ భారంతో, జాప్యంతో కొనసాగుతున్నట్టు కేంద్ర ప్రణాళికలు, కార్యక్రమాల అమలు శాఖ తెలిపింది. రూ.150 కోట్ల వ్యయాలకు మించి 1,679 కోట్ల ప్రాజెక్టులకు గాను సుమారు 439 ప్రాజెక్టులు.. మొత్తం మీద రూ.4.38 లక్షల కోట్ల అధిక వ్యయ భారంతో నెట్టుకొస్తున్నాయని పేర్కొంది. ‘‘1,679 ప్రాజెక్టుల వాస్తవ వ్యయం రూ.22,29,544 కోట్లు. కానీ, వీటిని పూర్తి చేసేందుకు రూ.26,67,594 కోట్లు అవసరమవుతుంది. అదనంగా రూ.4,38,049 కోట్లు కావాలి. ఇది 19.65 శాతం అధికం’’ అని ప్రణాళిక శాఖ తెలిపింది. 2021 నవంబర్ నాటికి ఈ ప్రాజెక్టుల కోసం చేసిన ఖర్చు రూ.12,88,558 కోట్లు కాగా, మొత్తం అంచనా వ్యయాల్లో 48.30 శాతమని వివరించింది. ‘‘నిర్ణీత కాలవ్యవధికి అనుగుణంగా కాకుండా, ఆలస్యంగా నడుస్తున్న 541 ప్రాజెక్టుల్లో.. 90 ప్రాజెక్టులు 1–12 నెలలపాటు ఆలస్యం కాగా, 113 ప్రాజెక్టులు 13–24 నెలలుగా జాప్యంతో నడుస్తున్నాయి. 212 ప్రాజెక్టులు 25–60 నెలలుగా పూర్తికాకుండా ఉన్నాయి. మరో 126 ప్రాజెక్టులు 61 నెలల జాప్యంతో ఉన్నాయి’’ అని ప్రణాళిక శాఖ తెలిపింది. చదవండి:ఏఏఐకు ఎయిర్‌లైన్స్ బకాయిలు రూ.2,636 కోట్లు -
భారత్ బయోటెక్ కు మళ్ళీ షాక్
-
రిలయన్స్ కొంపముంచిన జియోఫోన్..!
ముంబై: ప్రపంచంలోనే అత్యంత చౌక స్మార్ట్‌ఫోన్‌గా పేర్కొన్న జియోఫోన్ నెక్ట్స్ లాంఛింగ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. రిలయన్స్ 44 ఏజీఎం సమావేశంలో వినాయక చవితికి తమ ఫోన్‌ను లాంఛ్ చేస్తామని కంపెనీ చైర్మన్ ముఖేశ్ అంబానీ పేర్కొన్నారు. కాగా ఈ ఫోన్‌ను దీపావళి పండుగకు లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా జియోఫోన్‌నెక్ట్స్ లాంచ్ రిలయన్స్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ వాయిదా పడడంతో రిలయన్స్ షేర్లు సోమవారం రోజున 2 శాతం మేర నష్టపోయాయి. చదవండి: జియో నుంచి మరో సంచలనం..! త్వరలోనే లాంచ్..! సోమవారం జరిగిన బీఎస్ఈ ఇంట్రా డే ట్రేడ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 2 శాతం క్షీణించి రూ .2,382.85 వద్ద నిలిచింది. ట్రేడింగ్ ప్రారంభంలో రిలయన్స్ షేర్ విలువ రూ. 2425.60 వద్ద ఉండగా ట్రేడింగ్ ముగిసే సమయానికి సుమారు రూ. 55.80 మేర నష్టపోయి షేర్ విలువ రూ. 2,382.85 వద్ద నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సెమీకండక్టర్ కొరత కారణంగా జియోఫోన్‌నెక్ట్స్ లాంచింగ్ వాయిదా పడిందని వ్యాపార నిపుణులు అంచనా వేస్తున్నారు. జియోఫోన్ నెక్ట్స్ స్మార్ట్‌ఫోన్‌ను రిలయన్స్, గూగుల్ కంపెనీలు కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. మరింత మెరుగుదల కోసం రెండు కంపెనీలు పరిమిత వినియోగదారులతో జియోఫోన్ నెక్స్ట్ ను పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. దీపావళి పండుగ సీజన్లో ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు కంపెనీ చర్యలు తీసుకుంటుంది. స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ను వాయిదా వేయడంతో వచ్చే అదనపు సమయం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సెమీకండక్టర్ కొరతను తగ్గించడంలో సహాయపడుతుందని జియో, గూగుల్ ఒక ప్రకటనలో పేర్కొంది. చదవండి: భూమ్మీద అత్యంత సురక్షితమైన ఫోన్ ఇదే..! -
భారత తొలి ఆపిల్ స్టోర్‌పై కోవిడ్-19 దెబ్బ..!
ఆపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్‌కు క్రేజ్ మామూలుగా ఉండదు.సెక్యూరిటీ విషయంలో ఇతర మొబైల్ ఫోన్లతో పోలిస్తే ఆపిల్ ఐఫోన్‌కు పోటి అసలు ఉండదు. ఐఫోన్‌ను చాలా మంది వినియోగించడానికి ప్రధాన కారణం భద్రత. ఆపిల్ తన వినియోగదారుల ప్రైవసీ,భద్రత విషయంలో అసలు రాజీ పడదు. భారత మార్కెట్లలో ఆపిల్ స్మార్ట్ఫోన్లకు ఉన్న ఆదరణ అంతాఇంతా కాదు. భారత మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని ఆపిల్ అధికారిక ఆన్లైన్ స్టోర్‌ను 2020 సెప్టెంబర్ నెలలో ప్రారంభించింది. ఆపిల్ తన తొలి అధికారిక ఫిజికల్ రిటైల్ స్టోర్‌ను ముంబైలో ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 రాకతో భారత్‌లో ఫిజికల్ రిటైల్ స్టోర్‌ను ఏర్పాటు చేయడంలో నీలినీడలు కమ్ముకున్నాయి. ఆపిల్ తొలి ఫిజికల్ రిటైల్ స్టోర్ ఏర్పాటు ఆలస్యమయ్యేలా ఉన్నట్లు తెలుస్తోంది. ఆపిల్ సీఈవో టిమ్ కుక్ గత ఏడాది 2021 నుంచి భారత్‌లో ఆపిల్ తన తొలి ఫిజికల్‌స్టోర్‌ను తెరవనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా భారత రిటైల్ రంగంలో ఆపిల్ తన స్థానిక ఉనికిని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు కూడా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆపిల్ తన పరికరాలను ప్రాంచైజ్ రిటైల్ నెట్వర్క్ కింద పనిచేసే పంపిణీదారుల ద్వారా దేశంలో విక్రయిస్తోంది. ఆప్‌ట్రాన్సిక్స్ వంటి ఫ్రాంచైజ్‌లతో ఆపిల్ తన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తుంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఆపిల్ రెండంకెల వృద్ధితో రికార్డు స్థాయిలో ఆదాయాన్ని నమోదుచేసింది. ఆపిల్ టర్నోవర్ 36 శాతం అధికమై రూ.6,05,616 కోట్లు సాధించినట్టు సంస్థ సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.4.43 లక్షల కోట్లుగా ఉంది. నికరలాభం రూ.83,328 కోట్ల నుంచి రూ.1,61,448 కోట్లకు చేరింది. ఏ దేశం నుంచి ఎంత మొత్తం ఆదాయం సమకూరింది వంటి వివరాలను కంపెనీ వెల్లడించలేదు. -
చేపా.. చేపా ఏం చేద్దాం?
సాక్షి, హైదరాబాద్: మత్స్యకారులకు చేయూతనందించేందుకు ప్రభుత్వం అమలుచేస్తున్న ఉచిత చేపపిల్లల పంపిణీ ఈసారి ఆలస్యమయ్యే సూచనలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ముందస్తుగా చేపపిల్లలను చెరువుల్లో వదలాలని ప్రభుత్వం తొలుత భావించింది. అయితే చెరువులు అలుగు దూకుతుండడంతో పంపిణీకి కొద్దిరోజులు ఆగితే మంచిదనే ఆలోచనలో మత్య్సశాఖ ఉంది. కొన్ని చెరువులు పూర్తిగా నిండగా, మరికొన్ని చెరువులు సగంకంటే ఎక్కువగా నిండాయి. నిండిన చెరువుల్లో ఇప్పుడే చేపపిల్లలు వదిలితే.. మళ్లీ భారీ వర్షాలు కురిస్తే.. అవి కొట్టుకుపోయే ప్రమాదముంది. అలాగని, సకాలంలో వదలకపోతే ఎదుగుదల లోపిస్తుంది. దీంతో అధికారులు తర్జనభర్జనపడుతున్నారు. గతేడాది తేలని లెక్క గతేడాది ప్రభుత్వం గుర్తించిన చెరువుల్లో ఉచిత చేపపిల్లలు వదిలిన తర్వాత భారీ వర్షాలతో చెరువులు అలుగుదూకాయి. దాదాపు 80 శాతం చెరువుల్లోని చేపలు కొన్ని ఎదురెక్కిపోతే, మరికొన్ని కొట్టుకుపోయాయి. దీంతో ఏ చెరువులో ఎన్ని చేపలున్నాయనే లెక్క తేలలేదు. ఈసారి 43,870 చెరువుల్లో 24వేల చెరువులు పూర్తిగా నిండి అలుగు దూకాయి. మిగతా చెరువుల్లో సగానికంటే ఎక్కువగానే అలుగు దూకేందుకు సిద్ధంగా ఉన్నాయి. గతేడాది చేప, రొయ్యలు కలిపి 71.02 కోట్ల మేరకు చెరువుల్లో వదిలారు. ఈసారి రెండూ కలిపి 99 కోట్ల వరకు వదలాలని మత్స్యశాఖ యోచిస్తోంది. అందుకనుగుణంగా టెండర్లను సిద్ధం చేసింది. అప్పుడే కాదు భారీ వర్షాలు కురుస్తుండడంతో కొద్ది రోజులు ఆగిన తర్వాత చెరువుల్లో చేప, రొయ్యపిల్లలు వదలాలని అనుకుంటున్నాం. ఈసారి వంద శాతం రాయితీపై చేపపిల్లలు పంపిణీ చేస్తాం. – తలసాని శ్రీనివాస్‌యాదవ్, మత్స్యశాఖ మంత్రి -
ఒలింపిక్స్ ముగిశాకే జాతీయ క్రీడా పురస్కారాలు
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ ముగిశాకే జాతీయ క్రీడా పురస్కారాల విజేతల వివరాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి. త్వరలోనే ఒలింపిక్స్ జరుగనున్న నేపథ్యంలో ఎంపిక కసరత్తు మాత్రం ఆలస్యం కానుందని క్రీడా శాఖ వర్గాలు తెలిపాయి. టోక్యోలో భారత అథ్లెట్ల ప్రదర్శన, పతక విజేతలను బట్టి పురష్కారాలను ఖాయం చేయాలని క్రీడా శాఖ భావి స్తోంది. ‘నామినేషన్లు వచ్చాయి. గడువు కూడా ముగిసింది. కానీ టోక్యో పతక విజేతలకూ ఇందులో చోటివ్వాలని గత సమావేశంలో నిర్ణయించాం. ఒలింపిక్స్ క్రీడలు ఆగస్టు 8న ముగుస్తాయి. ఆ తర్వాత మరోసారి సమావేశమై ఎంపిక ప్రక్రియపై తుది కసరత్తు పూర్తి చేస్తాం. ఒలింపిక్స్ ముగిసిన వారం పది రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయితే ఎప్పట్లాగే ఆగస్టు 29న అవార్డుల ప్రదానం జరుగుతుంది’ అని కేంద్ర క్రీడాశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. -
ఇంటి ఈఎంఐలు చెల్లించట్లేదు..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత కొన్నేళ్లుగా తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్న రియల్ ఎస్టేట్ రంగానికి కరోనా వైరస్ రూపంలో కొత్త కష్టాలొచ్చాయి. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లలో గృహ కొనుగోలుదారులు 65% వాయిదా చెల్లింపులు చేయటం లేదని ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్(ఐసీసీ) తెలిపింది. కొత్త ప్రాజెక్ట్‌లలో గృహ అమ్మకాలు క్షీణించడంతో పాటూ వాయిదా చెల్లింపుల్లేక నిర్మాణ సంస్థలు పీకల్లోతు కష్టాల్లో ఉన్నాయని ఐసీసీ డైరెక్టర్ రజనీష్ షా తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో గృహ కొనుగోలుదారులు కూడా లిక్విడిటీ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. దీంతో చాలా మంది కస్టమర్లు తమ చెల్లింపులను వాయిదా వేయాలని డెవలపర్లను కోరుతున్నారు. వచ్చే కొన్ని నెలల్లో ఈ తరహా అభ్యర్థనలు మరింత పెరిగే సూచనలున్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశీ రియల్టీ రంగం విలువ 12 బిలియన్ డాలర్లుగా ఉంది. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో రియల్టీ రంగం వాటా 5%గా ఉంటుంది. రియల్టీకి పేమెంట్ యాక్ట్ తేవాలి.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీలకు(ఎంఎస్ఎంఈ) మాదిరిగానే ఆలస్యం చెల్లింపు చట్టం (డిలేయిడ్ పేమెంట్ యాక్ట్) రియల్ ఎస్టేట్ రంగానికి కూడా వర్తింపజేయాలని.. ఈ మేరకు కొన్ని సిఫార్సులను ఐసీసీ కేంద్రానికి సూచించింది. ఈ చట్టంతో కస్టమర్ల డిఫాల్ట్ పేమెంట్స్‌ను నిరుత్సాహపరుస్తుందని.. ఒకవేళ డెవలపర్లు అంగీకరించిన కాలానికి వాయిదా చెల్లింపులు మించిపోతే గనక సంబంధిత ఆలస్య చెల్లింపులపై జరిమానా వడ్డీని వసూలు చేయడానికి వీలవుతుందని రజనీష్ తెలిపారు. రియల్టీకి అత్యవసర ప్రాతిపదికన సహాయ ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. గడువును 6 నెలలు పొడిగించాలి.. కార్మికులు, ముడిసరుకుల కొరత కారణంగా నివాస ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడం కష్టమవుతుంది. అందుకే సంబంధిత ప్రాజెక్ట్‌ల నిర్మాణ గడువు తేదీని రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) నుంచి 6 నెలల కాలం పొడిగించాలని షా కోరారు. కనీస ఒక త్రైమాసికం పాటైనా మున్సిపల్ పన్నులను మాఫీ చేయాలని సూచించింది. పన్నులు, బిల్లులు చెల్లించలేని సంస్థలకు జరిమానాలు విధించరాదని, ఆయా సంస్థలు తిరిగి చెల్లించడానికి 3–6 నెలల సమయం ఇవ్వాలని సూచించారు. వడ్డీ లేని రుణ వాయిదాలను 6 నెలల పాటు అందించాలన్నారు. -
కొత్త విద్యాసంవత్సరం ఆలస్యం!
సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖలో ఈసారి నిర్దేశిత పని దినాలు పూర్తికాకుండా విద్యా సంవత్సరం ముగుస్తోంది. కరోనా నేపథ్యంలో అకడమిక్ కార్యక్రమాలకు 220 పనిదినాలు లేకుండానే విద్యాసంవత్సరం పూర్తి కానుంది. అంతేకాదు ఈ పరిస్థితి ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతుందో తెలియని పరిస్థితుల్లో ఎలా ముందుకు సాగాలో అర్థం కాకుండా తయారైంది. విద్యాశాఖ నిబంధనల ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో అన్ని సెలవులు పోగా కనీసంగా 220 పనిదినాలు పాఠశాలలు, కాలేజీలు పనిచేయాలి. ఆయా రోజుల్లోనే సిలబస్ పూర్తయ్యేలా ముందుగానే ఆయా విభాగాలు అకడమిక్ క్యాలెండర్‌ను రూపొందిస్తాయి. అందుకు అను గుణంగా బోధన కార్యక్రమాలను చేపట్టి పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో విద్యా సంస్థలు,ముఖ్యంగా స్కూళ్లన్నీ మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రెండో శనివారాల్లో పని చేసేలా షెడ్యూల్ జారీ చేసి పనిదినాలను సర్దుబాటు చేసింది. అయితే ఇప్పుడు కరోనాతో కొత్త సమస్య వచ్చిపడింది. దీంతో ఈసారి నిర్దేశిత పని దినాలు లేకుండా ఈ విద్యా సంవత్సరం ముగియనుంది. వాస్తవానికి ఏప్రిల్ 23వ తేదీ పాఠశాలలకు చివరి పని దినం. కానీ రాష్ట్రంలో కరోనా కారణంగా దాదాపు నెలన్నర రోజుల ముందుగానే పాఠశాలలు బంద్ అయ్యాయి. మార్చి 15 నుంచి 31వ తేదీ వరకు సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. వాటిని ఈనెల 14వ తేదీ వరకు పొడిగించింది. అంటే అప్పటి వరకు పాఠశాలలు ప్రారంభమయ్యే పరిస్థితి లేదు. పైగా వేసవి ఎండల కారణంగా ఇప్పుడు నిర్వహించాల్సినవి ఒంటి పూట బడులే. అవీ మూత పడ్డాయి. ఈనెల 14 తర్వాత మరో 9 రోజులు గడిస్తే విద్యా సంవత్సరమే పూర్తి కానుంది. అప్పటివరకు కూడా కరోనా అదుపులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో 220 పనిదినాల నిబంధనకు విఘాతం కలుగుతోంది. 40 రోజుల ముందుగానే విద్యా సంవత్సరాన్ని ముగించే పరిస్థితి వచ్చింది. వచ్చేది వేసవి కాబట్టి ఆ 40 రోజులు పాఠశాలలను నిర్వహిద్దామన్నా సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఏం చేయాలన్న దానిపై విద్యాశాఖలో స్పష్టత లేకుండా పోయింది. దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ‘పరీక్షల్లేకున్నా పాస్’ఉత్తర్వుల్లో జాప్యం ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గత నెల 19న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ఈనెల 6వ తేదీలోగా పూర్తి కావాలి. కరోనా కారణంగా మార్చి 23వ తేదీ నుంచి నిర్వహించాల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి.అకడమిక్ కేలండర్ ప్రకారం ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు ఈనెల 7వ తేదీ నుంచి నిర్వహించాల్సిన పరీక్షలు జరిగేలా లేవు. ప్రభుత్వం అన్ని విద్యా సంస్థలకు ఈనెల 14 వరకు సెలవులను ప్రకటించింది. 15న పాఠశాలలు ప్రారంభ మైనా విద్యా సంవత్సరం ముగిసే 23వ తేదీలోగా పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదు. అందుకే ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులను ఆటోమేటిక్‌గా పాస్ చేసి పైతరగతికి పంపించాలని భావిస్తోంది. అయితే దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఇంకా జారీ చేయలేదు. ఈ విషయంలో విద్యాశాఖలో కిందిస్థాయి అధికారులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. పాఠశాల విద్యా కమిషనర్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఒకరే కావడంతో ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందన్నది కింది స్థాయి అధికారులకు తెలియని పరిస్థితి. అందుకే ప్రభుత్వం నుంచి నిర్ణయం వచ్చే వరకు వేచి చూడాల్సిందేనని ఓ ఉన్నతాధికారి చెప్పారు. జూన్ 1న బడులు ప్రారంభమయ్యేనా? ఇక కరోనా ప్రభావం ఈ నెలంతా ఉండే పరిస్థితులే కనిపిస్తున్నాయి. మే నెలలో ఆ ప్రభావం ఉండవచ్చన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. అదే జరిగితే జూన్ 1న వేసవి సెలవులు ముగిసి, తిరిగి బడులు ప్రారంభం కావడం (కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం) కష్టమేనని అధికారులు పేర్కొంటున్నారు. పరిస్థితులు చక్కబడితే ఈ నెలాఖరులో మిగిలిపోయిన పదో తరగతి పరీక్షలను నిర్వహించే అవకాశముంటుంది. లేదంటే మే నెలలోనే నిర్వహించాల్సి వస్తుంది. దాంతో ప్రాథమిక పాఠశాలలకు బోధించే టీచర్లంతా మే నెలలోనూ ఇన్విజిలేటర్లుగా పని చేయాల్సి వస్తుంది. అంతేకాదు పరీక్షలు అయ్యాక సబ్జెక్టు టీచర్లు జవాబు పత్రాల మూల్యాంకనం చేయాల్సి వస్తుంది. దీంతో వారికి అదనంగా సెలవులు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి వాటిని సర్దుబాటు చేస్తూ కొత్త విద్యా సంవత్సరాన్ని ఆలస్యంగా ప్రారంభించాల్సి వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. -
ఉరి మళ్లీ వాయిదా
-
సేఫ్ సిటీ ఏమైంది?
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లో మహిళా భద్రత కోసం ఉద్దేశించిన ‘సేఫ్ సిటీ’ ప్రాజెక్టు పనులు నత్తనడకన నడుస్తున్నాయి. దిశ ఘటనతో ఈ ప్రాజెక్టు అమలు మరోసారి చర్చనీయాంశంగా మారింది. 2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన అనంతరం కేంద్ర ప్రభుత్వం రూ.1000 కోట్ల బడ్జెట్‌తో సేఫ్‌సిటీ ప్రాజెక్టును ప్రారంభించింది. ఇందుకోసం హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, లక్నో, అహ్మదాబాద్ నగరాలను ఎంపిక చేసింది. అంతర్జాతీయ ప్రాజెక్టులు, ఐటీ, ఫార్మా, తదితర రంగాల్లో నగరం సాధిస్తున్న పురోగతి కారణంగా ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. బహుళ జాతి కంపెనీలకోసం మహిళలు అధిక సంఖ్యలో పనిచేస్తున్నారు. వీరి భద్రత కోసం ఉద్దేశించిందే ఈ ప్రాజెక్టు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా దీన్ని చేపడతాయి. ఇందుకోసం ప్రతి నగరానికి రూ.280 కోట్లు వెచ్చించాలి. ఇందులో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాయి. ఏమేం చేస్తారు..? ఈ ప్రాజెక్టు అమలులో జీహెచ్ఎంసీ, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు, రవాణాశాఖ కమిషనర్, డీజీపీ, విమెన్‌సేఫ్టీ వింగ్, ఐజీ తదితరులు భాగస్వాములుగా ఉంటారు. ఈ ప్రాజెక్టుకు ఐజీ స్వాతి లక్రా కన్వీనర్‌గా, హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ నోడల్ ఆఫీసర్‌గా ఉన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా నగరంలో మహిళల భద్రతకోసం అదనంగా 3వేల సీసీ కెమెరాలు బిగించాలి. రాత్రిపూట మహిళల రవాణా కోసం ప్రత్యేక బస్సులు, క్యాబ్‌లు నడపాలి. అందులో సీసీ కెమెరాలు అమర్చాలి. మహిళల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు, అదనంగా మహిళా పోలీసుల రిక్రూట్మెంట్, మొబైల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలి. అయితే దీనిపై పలుమార్లు సమావేశమయ్యారే తప్ప.. ఇంతవరకూ ఈ ప్రాజెక్టు కోసం చెప్పుకోదగ్గ కార్యక్రమాలు చేపట్టలేదు. ఇక నిధుల విషయానికి వస్తే.. రూ.282 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో రూ.138 కోట్ల మేర పనులకు అనుమతులు లభించాయి. ఈ పనులు ప్రస్తుతం నగరంలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో నిదానంగా సాగుతున్నాయి. అధికారులు మాత్రం త్వరలోనే పూర్తవుతాయని చెబుతున్నారు. -
రుతు పవనాల రాక మరింత ఆలస్యం
న్యూఢిల్లీ: రుతుపవనాల రాక మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ తాజాగా అంచనా వేసింది. రుతుపవనాల్లో మందగమనం కారణంగా జూన్ 7వ తేదీకి రెండు రోజులు అటూఇటుగా కేరళను తాకనున్నాయని పేర్కొంది. ఇంతకు ముందు అంచనా ప్రకారం జూన్ 4వ తేదీకి రెండు రోజులు అటూఇటుగా కేరళను తాకవచ్చని తెలిపింది. రుతుపవనాల పురోగమనం మందకొడిగా సాగడంతో ఈ అంచనాలను మార్చుకోవాల్సి వచ్చిందని స్కైమెట్ ప్రెసిడెంట్ జీపీ శర్మ తెలిపారు. రుతుపవనాలు నెమ్మదిగా కదలటానికి సొమాలియా తీరంలో అల్పపీడనం, మధ్య అరేబియా సముద్రంపై అధికపీడనం, సొమాలియా తీరంపై వైపు నుంచి వీస్తున్న బలమైన గాలులే కారణమన్నారు. -
చంద్రయాన్–2 మరోసారి వాయిదా
న్యూఢిల్లీ : చంద్రయాన్–2 ప్రయోగం మరోసారి వాయిదా పడింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్–2 ప్రయోగం వాయిదా పడటం ఇది రెండోసారి. తొలుత ఈ ప్రయోగాన్ని ఏప్రిల్‌లో నిర్వహించాలని భావించారు. ప్రయోగానికి ముందు మరికొన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉందని, దీంతో ప్రయోగాన్ని అక్టోబర్ లేదా నవంబర్‌కు వాయిదా వేయాలని ఇస్రో చైర్మన్ కె.శివన్ ప్రభుత్వాన్ని కోరారు. దీంతో అది వాయిదా పడింది. తాజాగా అక్టోబర్ మొదటి వారంలో చేపట్టాల్సిన ప్రయోగం డిసెంబర్ చివరికి లేదా వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసినట్టు ఇస్రో వెల్లడించింది. చంద్రుడి కక్ష్య చుట్టూ అధ్యయనం చేయడం కోసమే చంద్రయాన్–1 ప్రయోగాన్ని చేపట్టారు. చంద్రుడి కక్ష్యతోపాటు ఉపరితలంపై రోవర్‌ను దింపి అక్కడ పరిస్థితులపై పరిశోధనలు చేసేందుకు గాను చంద్రయాన్–2 ప్రయోగాన్ని చేపట్టనున్నారు. ఇటీవల ఇస్రో చేపట్టిన ఉపగ్రహ ప్రయోగాలు సరైన ఫలితాలనివ్వలేక పోయాయి. జీశాట్–6ఏతో సంబంధాలు కోల్పోవడం, జీశాట్–11 ప్రయోగ తేదీని మార్చడం, ఐఆర్ఎన్ఎస్ఎస్–1హెచ్ నేవిగేషన్ ఉపగ్రహంలో హీట్‌షీల్డ్ పనిచేయక పోవడంతో అది విఫలమవడం లాంటి సంఘటనల నేపథ్యంలో చంద్రయాన్–2పై ఇస్రో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. -
ఐడియా–వొడాఫోన్ విలీనం ఆలస్యం!
న్యూఢిల్లీ: ఐడియా–వొడాఫోన్ విలీనం ముందు అనుకున్నట్టు ఈ నెల 30లోపు పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. వొడాఫోన్ ఇండియా వన్‌టైమ్ స్పెక్ట్రమ్ చార్జీల రూపంలో రూ.4,700 కోట్ల మేర బకాయి ఉంది. దీంతో ఐడియాలో విలీనానికి ముందే ఈ బకాయిలను చెల్లించాలని టెలికం శాఖ కోరనుంది. లేదా బ్యాంకు గ్యారంటీలను సమర్పించాలని కోరనున్నట్టు సమాచారం. నిజానికి 2015లో వొడాఫోన్ తన సబ్సిడరీలైన వొడాఫోన్ ఈస్ట్, వొడాఫోన్ సౌత్, వొడాఫోన్ సెల్యులర్, వొడాఫోన్ డిజిలింక్‌లను వొడాఫోన్ మొబైల్ సర్వీసెస్‌లో విలీనం చేసింది. ఇదే ఇప్పుడు వొడాఫోన్ ఇండియాగా మారింది. అయితే, విలీనం సమయంలోనే రూ.6,678 కోట్ల వన్‌టైమ్ స్పెక్ట్రమ్ బకాయిలను చెల్లించాలని టెలికం శాఖ డిమాండ్ నోటీసు చేయడంతో వొడాఫోన్ కోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో వొడాఫోన్ రూ.2,000 కోట్ల బకాయిలనే చెల్లించింది. దీంతో బకాయిలపై టెలికం శాఖ న్యాయ సలహా కోరగా, వొడాఫోన్ నుంచి బకాయిల చెల్లింపునకు డిమాండ్ చేయవచ్చని వచ్చింది. దీంతో వడ్డీ సహా మొత్తం ఎంత బకాయి అన్నది ఖరారు చేసే పనిలో ఉన్నట్టు ఆ అధికారి తెలిపారు. -
ఈసారీ ఆలస్యమే
విద్యాసంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుందన్న విషయం ప్రభుత్వానికి తెలుసు. పాఠశాలలు పునఃప్రారంభం నాటికి పాఠ్యపుస్తకాలు ఇవ్వాలనీ తెలుసు. అయినా పాఠ్యపుస్తకాల పంపిణీ చేయడంలో ఏటా సర్కారు విఫలమవుతోంది. ఇది విద్యార్థులకు శాపంగా మారుతోంది. సర్కారు పాఠశాలల్లో ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీకి ఏటారూ.కోట్లు వెచ్చిస్తున్నా, వాటిని సకాలంలో అందుబాటులోకితీసుకురావడం లేదు. ఈ ఏడాది అదే పరిస్థితినెలకొననున్నదన్న విసయం స్పష్టమవుతోంది. సాక్షి, తిరుపతి:ప్రైవేటు పాఠశాలల కంటే ఒకడుగు ముందుగా ఉండాల్సిన సర్కారు బడులు వెనకడుగు వేస్తున్నాయి. ఓ వైపు ప్రైవేటు పాఠశాలలు సెలవుల్లోనూ గప్‌చిప్‌గా తరగతులు నిర్వహిస్తున్నారు. అందుకు తగ్గట్టు వారు ముందే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించారు. అయితే సర్కారు మాత్రం పాఠాలు నేర్వలేకపోతోంది. మరో నెల రోజుల్లో బడులు తెరవనున్నా... ఇంత వరకు పాఠ్యపుస్తకాల ముద్రణ ప్రారంభమే కాలేదు. అందుకు అవసరమైన ఇండెంట్ కూడా క్షేత్రస్థాయి నుంచి విద్యాశాఖకు అందలేదని విశ్వసనీయ సమాచారం. దీంతో ఈ సారి పాఠ్యపుస్తకాలు సమయానికి అందే అవకాశాలు లేవని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండెంట్‌పై స్పష్టత లేదు జిల్లాలోని ప్రతి పాఠశాలల నుంచి ఎన్ని పాఠ్యపుస్తకాలు అవసరమనే వివరాలను మండల విద్యాశాఖ అధికారులు సేకరించి ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ మార్చి నెలలోనే పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియకు స్వస్తి పలికినట్లు ప్రచారం జరుగుతోంది. అలా సేకరించిన వివరాలను మండలాల నుంచి జిల్లాలకు, అక్కడ నుంచి రాష్ట్రా ఉన్నతాధికారులకు పుస్తకాల ఇండెంట్ పంపాల్సి ఉంది. అయితే క్షేత్రస్థాయి నుంచి పాఠ్యపుస్తకాల ఇండెంట్ విద్యాశాఖ సేకరించలేదని తెలిసింది. కేవలం డైట్ లెక్కల ప్రకారమే పాఠ్యపుస్తకాలను ముద్రించటానికి విద్యాశాఖ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందులో భాగంగా గత ఏడాది ముద్రించిన పాఠ్యపుస్తకాల్లో 2.50 లక్షలు మిగులు ఉన్నాయని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు చెబుతున్న మాట. మిగులు పోను 19.50 లక్షల పాఠ్యపుస్తకాలు ముద్రించి పంపుతామని జిల్లా విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అయితే జిల్లా అధికారులు మాత్రం తమ వద్ద మిగులు పుస్తకాలు లేవని చెబుతున్నారు. అయితే రాష్ట్ర, జిల్లా అధికారుల మధ్య ఈ లెక్కలు తేలాల్సి ఉంది. ముద్రణ ఎప్పుడు..పుస్తకాలు చేరేదెప్పుడు? గత ఏడాది ఏప్రిల్‌లోనే పుస్తకాల ముద్రణ పూర్తి చేశారు. ఆ పుస్తకాలు జిల్లాకు చేరి, అక్కడి నుంచి మండలాలకు, గ్రామాలకు చేరటానికే ఆలస్యమైంది. గత ఏడాది పాఠశాలలు పునఃప్రాంభమైనా సమయానికి పుస్తకాలు అందించలేకపోయా రు. అయితే ఈ ఏడు ఇంకా పుస్తకాల ముద్రణే ప్రారంభం కాలేదంటే... పరిస్థితి అర్థం చేసుకోవ చ్చు. వచ్చే నెలలో పాఠశాలలు ప్రారంభమైలే... జూలైలో కాని పుస్తకాలు అందే అవకాశాలు లేవని ఉపాధ్యాయులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వారంలో టెండర్లు పిలుస్తాం పాఠ్యపుస్తకాల పంపిణీకి సంబంధించి మరో వారం రోజుల్లో టెండర్లు పిలుస్తాం. డైట్ లెక్కల ప్రకారమే పాఠ్యపుస్తకాల ముద్రణ జరుగుతుంది. పాఠ్యపుస్తకాలు ముద్రిస్తున్నారా? లేదా? అనే విషయంపై మా వద్ద స్పష్టమైన సమాచారం లేదు. – పాండురంగ స్వామి -
టీటీడీ బడ్జెట్టుపై తీవ్ర ఉత్కంఠ
వారం రోజుల్లో మార్చి నెల ముగియనుంది. ఇంత వరకూ టీటీడీ వార్షిక బడ్జెట్టుపై స్పష్టత రాలేదు. అధికారుల తీరు చూస్తుంటే ‘సెనగలు తిని చేయి కడుక్కున్నట్లుంది. బడ్జెట్టు ప్రతిపాదనలను ఎప్పుడో ప్రభుత్వానికి పంపామ ని, రేపోమాపో అక్కడి నుంచి గ్రీన్‌సిగ్నల్ లభిస్తుందని చెబుతున్న టీటీడీ అ«ధికారులు రోజులు గడుస్తున్న కొద్దీ సందిగ్ధంలో పడుతున్నారు. బడ్జెట్టు విషయంలో నిత్యం ఉత్కంఠను చవిచూస్తున్నారు. ఏం జరుగుతుందో ఏమోనంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి : ఏటా వ్యయ అంచనాలతో కూడిన వార్షిక బడ్జెట్టును టీటీడీ జనవరిలోనే సిద్ధం చేస్తుంది. జనవరి 15 లోగానే దీన్ని తయారు చేసి పాలక మండలి ముందుంచుతుంది. ప్రత్యేక సమావేశం ద్వారా బడ్జెట్టును ఆమోదించడం ఆనవాయితీ. ఈసారి టీటీడీలో ఊహించని విపత్కర పరిస్థితి నెలకొంది. పది నెలలుగా ధర్మకర్తల మండలి లేదు. స్పెసిఫైడ్ అథారిటీ కూడా లేదు. నూతన పాలకమండలి ఏర్పాటుపై సీఎం చంద్రబాబు నిర్లక్ష్యం కనబరిచారు. రాజకీయ సమీకరణల నేపథ్యంలో పాలకమండలి ఎన్నిక ప్రహసనంగా మారింది. ఇదిగోఅదిగో అంటూనే ప్రభుత్వం పది నెలలు నెట్టుకొచ్చింది. ఈ కాలంలో అధికారులే పాలనాపరమైన, ఆదాయ వ్యయాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు కీలక సమయం ఆసన్నమైంది. ఏప్రిల్ మాసం మొదలైతే ఏ పనికి ఎంతెంత ఖర్చు పెట్టాలో, ఏయే పనులకు శ్రీవారి సొమ్ములను వినియోగించాలో బోధపడని పరిస్థితి. టీటీడీ హిందూ దేవాదాయ ధార్మిక చట్టం ప్రకారం పాలకమండలి లేకుండా అధికారులు నిధులు ఖర్చు చేయకూడదు. దేవాదాయ చట్టం కూడా ఇదే చెబుతోంది. ధర్మకర్తల మండలి లేనపుడు స్పెసిఫైడ్ అథారిటీ అన్నా ఉండాలి. అదీ లేనప్పుడు మేనేజ్మెంట్ కమిటీ అయినా ఉండాలి. ఇవేమీ లేకుండా తామే నిర్ణయాలు తీసుకున్నామని అధికారులు చెబితే రేపటి రోజున ఆడిట్ అధికారులకు, కొత్తగా వచ్చే ధర్మకర్తల మండలి సభ్యులకు ఎవరు సమాధానం చెబుతారన్నది ప్రశ్న. బోర్డు లేకుండా తీసుకున్న నిర్ణయాలన్నీ చట్టవిరుద్ధమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 2018–19 వార్షిక బడ్జెట్టు ఎంత.. గత ఏడాది రూ.2,858 కోట్ల బడ్జెట్టుకు ఆమోదం లభించింది. ఈ ఏడాది సుమారు రూ.3 వేల కోట్ల మేర బడ్జెట్టు అంచనాలు ఉండవచ్చని అంటున్నారు. ఆదాయ వ్యయాలను బేరీజు వేసుకుని సంక్షేమ కార్యక్రమాలు, బ్రహ్మోత్సవాలను నిర్వహించాల్సి ఉంది. ఏటా సుమారు రూ.570 కోట్లకు పైగా ఉద్యోగుల వేతనాలు, ఇంజినీరింగ్ పనులకు రూ.200 కోట్లు, హిందూ ధార్మిక ప్రచారం కోసం రూ.125 కోట్లు, ఉద్యోగుల పెన్షన్ల కోసం రూ.125 కోట్లు, విద్యా ఆరోగ్య సదుపాయాలకు రూ.112 కోట్లు, విజిలెన్సు విభాగానికి రూ.90 కోట్లు ఇలా విభాగాల వారీగా అయ్యే వార్షిక వ్యయాలను అంచనా వేసుకుని ఏడాది మొత్తం గా అయ్యే వ్యయాన్ని వార్షిక బడ్జెట్టుగా తయారు చేసి పంపుతుంటారు. ఆలయ చరిత్రలో ఎన్నడూ లేనట్లు ఈ ఏడాది పది నెలలుగా ధర్మకర్తల మండలి లేకపోవడం, బడ్జెట్టు విషయంలో సందిగ్ధత నెలకొనడం టీటీడీ వర్గాల్లో తీవ్ర గందరగోళాన్ని రేపుతోంది. పాలక మండలి లేకపోవడాన్ని అదునుగా తీసుకున్న టీటీడీ శ్రీవారి సొమ్ములను దుబారా చేస్తోందన్న ప్రచారం విస్తృతమైంది. ప్రభుత్వ పెద్దలకు భయపడి స్వామివారి నిధులను దారి మళ్లించి ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగిస్తున్నారని భక్త జనావళి మండిపడుతోంది. -
డబుల్
సాక్షి, మెదక్: జిల్లాలో డబుల్ బెడ్ ఇళ్ల నిర్మాణాల ప్రక్రియ ముందకు సాగడం లేదు. నిర్మాణానికి కాంట్రాక్టర్లు మందుకు రాకపోవడం ఒక కారణమైతే, కావల్సిన మెటీరియల్ ధరలు అమాంతంగా పెరగడం మరో కారణం. దీంతో ఇళ్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పలు చోట్ల ఇంకా టెండర్ల ప్రక్రియ సైతం పూర్తి కాలేదు. జిల్లాలోని లబ్ధిదారులు ఇళ్ల కోసం మరింత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అర్హులైన పేదలకు వారి సొంతింటి కల నెరవేర్చాలని భావిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులకు అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. జిల్లాలో నేటికీ ఒక్క ఇంటి నిర్మాణం కూడా పూర్తి కాలేదు. ప్రభుత్వం జిల్లాకు 4,929 డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేసింది. ఇందులో అధికారులు 4,589 ఇళ్ల నిర్మాణం పనులు చేపట్టేందుకు ఆమోదం తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో 950, గ్రామీణ ప్రాంతాల్లో 3,639 ఇళ్ల నిర్మాణం పనులను పంచాయతీరాజ్ శాఖకు అప్పగించారు. 1,854 ఇళ్ల నిర్మాణం పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు మందుకు వచ్చారు. మిగితా 2,735 ఇళ్ల నిర్మాణాలకు ఇంకా టెండర్లు ఖరారు కాలేదు. ఎన్నికలు సమీపిస్తున్నా.. జిల్లాలో 1,854 ఇళ్ల నిర్మాణాలకు టెండర్లు ఫైనల్ అయ్యాయి.వీటిలో 1,704 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. మెదక్ మండలం పల్లికొటాల, చేగుంట, బోనాలకొండాపూర్, తూప్రాన్ మండలం కోనాయిపల్లి, నర్సాపూర్, శివ్వంపేట మండలంలోని దంతాన్పల్లి, వెల్దుర్తిలో పనులు ప్రారంభమయ్యాయి. వీటిలో 1,430 ఇళ్ల నిర్మాణం పనులు ఇంకా పునాది దశలోనే ఉన్నాయి. 85 ఇళ్ల నిర్మాణం పనులు పిల్లర్ల దశలో ఉండగా.. 100 వరకు రూఫ్ లెవల్‌కు చేరుకున్నాయి. 63 ఇళ్ల గోడలు నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నాయి. 26 ఇళ్ల గోడలు పూర్తి అయ్యాయి. ఆయా ఇళ్ల నిర్మాణానికిగాను ఇప్పటి వరకు రూ.1.44 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పటి వరకు ఒక్కచోటా కూడా ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాలేదు. దీనికి తోడు ఇంకా 2,735 ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉంది. ఓవైపు ఎన్నికల సమయం సమీపిస్తున్నా ఇంకా డబుల్ పనులు పూర్తికాక పోవడంతో ప్రజాప్రతినిధుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ముందుకు రావడం లేదు.. ప్రభుత్వం సూచించిన రూ.5.30 లక్షల వ్యయంతో డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యే అవకాశం లేదు. ఈ కారణంగానే కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. హైదరాబాద్‌లో స్క్వయర్ ఫీట్‌కు రూ.1,350 చెల్లిస్తుండగా.. జిల్లాలో మాత్రం రూ.900 చెల్లిస్తోంది. దీంతో కాంట్రాక్టర్లు నిర్మాణం పనులు చేపట్టేందుకు ముందుకు రావడం లేదు. స్టీల్ ధర గణనీయంగా పెరగడంతో మరింత భయపడుతున్నారు. ప్రసుత్తం నిర్మాణం పనులు చేపడితే ఆర్థికంగా నష్టపోతామన్న భావన కాంట్రాక్టర్లలో నెలకొంది. దీంతో ఇళ్ల నిర్మాణం పనులు సకాలంలో పూర్తికాని పరిస్థితి ఉంది.