Disappearance
-
చైనా విదేశాంగ మంత్రి అదృశ్యం.. హత్యా? ఆత్మహత్యా?
వాషింగ్టన్: ఒకప్పుడు అమెరికాలో చైనా రాయబారిగా పనిచేసి వెంటనే అత్యున్నత పదవి పొంది చైనా విదేశాంగ మంత్రిగా సేవలందించిన క్విన్ గాంగ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారనే విషయంపై అంతర్జాతీయ మీడియా కొత్త అంశాలను మోసుకొచి్చంది. చివరిసారిగా జూన్ నెలలో కనిపించిన ఆయన ప్రస్తుతం జీవించి లేరని మీడియాలో వార్తలొచ్చాయి. ఆత్మహత్య చేసుకున్నారని కొన్ని పత్రికల్లో, చైనా ప్రభుత్వమే హింసించి చంపిందని మరి కొన్నింటిలో భిన్న కథనాలు వెలువడ్డాయి. ఈ ఏడాది జూన్‌లో చివరిసారిగా కనిపించి అప్పటి నుంచి కనిపించకుండా పోయిన క్విన్‌గాంగ్ ఉదంతం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. జూలై నెలలో బీజింగ్‌లోని మిలటరీ ఆస్పత్రిలో ఆయన కన్నుమూశారని చైనా ప్రభుత్వంలోని ఇద్దరు అత్యున్నత స్థాయి అధికారులు చెప్పినట్లు ‘పొలిటికో’ వార్తాసంస్థ ఒక కథనం వెలువరిచింది. క్విన్ అమెరికాలో చైనా రాయబారిగా కొనసాగిన కాలంలో ఆయన నెరిపిన ఒక వివాహేతర సంబంధమే ఈ అదృశ్యం ఘటనకు అసలు కారణమని గతంలో వాల్‌స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. ఈ విషయంలో చైనా ప్రభుత్వం చేపట్టిన దర్యాప్తునకు ఆయన సహకరించారట. ‘‘అమెరికా పౌరసత్వమున్న చైనా అధికారిక ఫీనిక్స్ టీవీ మహిళా రిపోర్టర్ ఫ్యూ గ్జియోíÙయాన్‌తో వివాహేతర సంబంధం కారణంగా చైనా జాతీయ భద్రత ప్రమాదంలో పడిందని జిన్‌పింగ్ సర్కార్ బలంగా నమ్మింది. ఆ మహిళ సరోగసీ పద్ధతిలో ఒక బిడ్డకు జన్మనిచి్చంది. ఇప్పుడా తల్లీబిడ్డల ఆచూకీ సైతం గల్లంతైంది. క్విన్‌గాంగ్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని జిన్‌పింగ్ వెంటనే ఆయనను జూన్‌లో చైనా విదేశాంగ శాఖ మంత్రి పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో మాజీ దౌత్యవేత్త వాంగ్ యీను పదవిలో కూర్చోబెట్టారు’’ అని ఆ కథనం పేర్కొంది. కేవలం ఆరునెలలు పదవిలో ఉన్న క్విన్‌గాంగ్ ఆ తర్వాత కనిపించకుండా పోయారు. 2014–2018 కాలంలో దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌కు చీఫ్ ప్రోటోకాల్ ఆఫీసర్‌గా పనిచేసి క్విన్ ఆయనకు అత్యంత ఆప్తుడయ్యాడు. అందుకే అత్యంత నమ్మకస్తులకు మాత్రమే దక్కే ‘అమెరికాలో చైనా రాయబారి’ పదవిని క్విన్‌కు జిన్‌పింగ్ కట్టబెట్టారు. వివాహేతర బంధమే క్విన్‌గాంగ్ మరణానికి కారణమన్న అంతర్జాతీయ మీడియా -
మహిళల అదృశ్యంపై తప్పుడు లెక్కలు
సాక్షి, అమరావతి: మహిళల అదృశ్యంపై తెలుగుదేశం పార్టీ తప్పుడు లెక్కలతో అవాస్తవాలు ప్రచారం చేస్తోందని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత ధ్వజమెత్తారు. ఆమె శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘రాష్ట్రంలో 2019–21 మధ్య 24,557 మిస్సింగ్ కేసుల్లో 23,399 మంది ఆచూకీ లభించింది. వారిని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇంకా ఆచూకీ తేలాల్సింది 1,158 కేసుల్లోనే.. వాస్తవాలిలా ఉంటే.. చంద్రబాబు, లోకేశ్, పవన్ కాకి లెక్కలతో ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు దుశ్శాసన పాలనలో ఎన్నో అఘాయిత్యాలు జరిగాయి. కాల్‌మనీ సెక్స్‌రాకెట్, వనజాక్షి, రిషితేశ్వరి వంటి ఘటనల్ని మహిళలు మరువరు. మహిళలపై వేధింపుల్లో నాడు రాష్ట్రం దేశంలోనే 4వ స్థానంలో, అక్రమ రవాణాలో రెండో స్థానంలో ఉండేది. స్వార్థ రాజకీయాలకు మహిళల్ని అడ్డుపెట్టుకునే నీచుడు చంద్రబాబు. ఆనాడు లక్ష్మీపార్వతిని అడ్డం పెట్టుకుని ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచాడు. ఇటీవల సొంత భార్యను కూడా స్వార్థ రాజకీయానికి వాడుకోవాలని చూసిన దుర్మార్గుడు. బాబు దత్తపుత్రుడైన పవన్ ఉన్మాదంతో ప్రభుత్వంపై దు్రష్పచారం చేస్తున్నాడు’ అని దుయ్యబట్టారు. సీఎం జగనన్న అంటే రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకం, ధైర్యమని సునీత చెప్పారు. -
పనిఒత్తిడితో సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం
భాగ్యనగర్‌కాలనీ: పనిఒత్తిడి కారణంగా ఓ వ్యక్తి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగిరాని సంఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దయాల్గూడ ఎలైట్ ఎన్‌క్లేవ్‌లో నివాసముంటున్న భగవాన్ నానక్‌రాంగూడలోని ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఆరు నెలల క్రితమే వివాహమైంది. అయితే ఈ నెల 14వ తేదీన ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన భగవాన్ తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు చుట్టు పక్కల ప్రాంతాలతో పాటు తెలిసిన వారి వద్ద విచారించినా ఫలితం లేదు. దీంతో కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కనిపించకుండా పోయిన కిమ్.. ఆఖరికి సైనిక వార్షికోత్సవానికి..
తరుచుగా వార్తలో నిలిచి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తాజాగా అదృశ్యమై మరోసారి వార్తల్లో నిలిచారు. దీంతో ఆయనకు ఆరోగ్యం బాగోలేదని అందువల్లే.. గతకొద్ది రోజులుగా ఆర్మీ ముందుకు రావడం లేదంటూ ఉహగానాలు హల్చల్ చేస్తున్నాయి. అదీగాక ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్లో పీపుల్స్ ఆర్మీ వ్వవస్థాపక వార్షికోత్సవ పురస్కరించుకుని సాముహిక కవాతులను నిర్వహించనున్నారు. ఈ సమయంలో ఆయన కనిపంచకపోవటం ఉత్తర కొరియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐతే కిమ్ అనుహ్యంగా గత నెల రోజులుగా బహిరంగంగా కనిపించటం లేదని స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. అఖరికి ఆదివారం జరిగిన పొలిబ్యూటో సమావేశాన్ని కూడా కిమ్ దాటవేసినట్లు సమాచారం. వాస్తవానికి కిమ్ ఇలా గతంలో 2014లో దాదాపు 40 రోజుల పాటు పబ్లిక్‌గా కనిపించకుండా ఉన్నట్లు ఉత్తర కొరియా స్థానిక మీడియా పేర్కొంది. కానీ సరిగ్గా ఇదే సమయంలో పీపుల్స్ ఆర్మీ 75వ వ్యవస్థాపక వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం లేదా బుధవారం ప్యోంగ్యాంగ్లో సాముహిక కవాతులు నిర్వహించనుంది. అయితే వార్షికోత్సవంలో కనిపిస్తాడా లేదా అనేది సందిగ్ధంగా ఉంది. అలాగే కిమ్ కూడా ఈ సాముహిక కవాతు ప్రదర్శన ద్వారా తన యుద్ధ సన్నద్ధత సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉత్సుకతతో ఉన్నారు కూడా. ఇదిలా ఉండగా, మరోవైపు ఈ వార్షికోత్సవాన్ని కిమ్ అడ్వాంటేజ్‌గా తీసుకుని తన అణ్వాయుధాల క్షిపణి సామర్థాన్ని ప్రదర్శిస్తుందేమనని యూఎస్ దాని మిత్ర దేశాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. అదీగాక ఇటీవలే దక్షిణ కొరియా, యూఎస్ ఉమ్మడి సైనిక విన్యాసాలపై ఉత్తరకొరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే యూఎస్ సైనిక ఎత్తుగలను తిప్పికొట్టేలా అత్యంత శక్తిమంతమైన అణ్వాయుధాలను ప్రయోగిస్తానని బెదిరింపులకు దిగింది కూడా. అంతేగాక ఉత్తరకొరియా 2022లోనే దాదాపు 70 కంటే ఎక్కువ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇందులో దక్షిణ కొరియాలోని లక్ష్యాలను చేధించడానికి లేదా యూఎస్ ప్రధాన భూభాగాన్ని చేరుకునేనే సామర్థ్యం ఉన్న అణ్వయుధాలు ఉన్నాయి. (చదవండి: యూఎస్‌లో పోలీసులకు పట్టుబడ్డ తెలుగు అబ్బాయ్) -
తెలంగాణలో అసలు టీడీపీ ఉందా?
జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న టీడీపీ తెలంగాణలో ఎప్పుడో జెండా ఎత్తేసింది. గత ఎన్నికల్లో గెలిచిన ఒకరిద్దరు కారులో ఎక్కేశారు. మొత్తం పార్టీ ముక్క చెక్కలయింది. నాయకులంతా తలో దిక్కు వెళ్లి పోయారు. అయితే ఖమ్మం జిల్లాలో ఇంకా బలం ఉందనే భ్రమల్లో ఉండిపోయారు పచ్చ పార్టీ నాయకులు. అందుకే తెలంగాణలో పార్టీని తిరిగి బతికిస్తామని బీరాలు పలుకుతున్నారు. మరి తెలంగాణలో అసలు సైకిల్ పార్టీ ఉందా? రండి.. మా పరువు కాపాడండి రండి బాబూ రండి.. ఆలసించిన ఆశాభంగం అంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. తెలంగాణలో రాబోయే రోజు మనవే అని ఊరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది సైకిల్ పార్టీయే అంటూ జోకులు పేలుస్తున్నారు. విరిగిపోయిన సైకిల్ పార్టీకి రిపేర్ చేయడానికి ఈ నెల 21న ఖమ్మం నగరంలో బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు పచ్చ పార్టీ నాయకులు. బహిరంగ సభకు జనాన్ని సమీకరించడానికి రెండు వారాలుగా నానా పాట్లు పడుతున్నారట. మరి సభకు ఎంతమంది వస్తారో.. ఎక్కడి నుంచి వస్తారో చూడాలి.. తుమ్మలపై కోటి ఆశలు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రసంగించే ఈ సభలో ఇతర పార్టీల నుంచి అసంతృప్త నేతల్ని చేర్చుకోవడానికి ప్లాన్ చేశారట. ఇప్పటికే తెలంగాణలో టీడీపీ ఖాళీ అయిపోయింది. నాయకులంతా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో సెట్ అయిపోయారు. ఇప్పుడు వారెవరూ తిరిగి సైకిల్ ఎక్కే ఛాన్స్ అయితే లేదు. అయితే ఖమ్మం జిల్లాలోని కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశానికి మద్దతుగా నిలుస్తుందనే ప్రచారం సాగుతోంది. కాని ఒక్క జిల్లాలో టీడీపీకి మద్దతిస్తే మిగిలిన రాష్ట్రం సంగతేంటి? బీఆర్ఎస్ నాయకత్వం పట్టించుకోవడంలేదనే కోపంతో ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టీడీపీలోకి వస్తారంటూ ఈ మధ్యన ప్రచారం స్టార్ట్ చేశారు. అయితే ఆయన కూడా అలాంటిదేమీ లేదని.. కేసీఆర్ నాయకత్వం నుంచి బయటకు వచ్చే ప్రసక్తి లేదని తేల్చేశారు. వాస్తవానికి బీఆర్ఎస్లో ఇమడలేని నాయకులు, నాయకత్వం మీద అసంతృప్తిగా ఉన్న నాయకులు ఇక్కడే ఉన్న బీజేపీలోకో..లేక కాంగ్రెస్లోకో వెళతారు గాని.. పక్క రాష్ట్రం పార్టీలోకి వెళతారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో కూడా కారు దిగాలనుకుంటున్న నేతలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి గాని.. టీడీపీ నాయకత్వంతో టచ్‌లో ఉన్నట్లు ఎవరి గురించి మాటే లేదు. తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పేరు ఎత్తడానికే నాయకులు ఇష్టపడటంలేదు. అటువంటపుడు ఆ పార్టీలో చేరడానికి ఎవరు ముందుకు వస్తారు. బీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేస్తా గాని టీడీపీలో మాత్రం చేరనని కుండబద్దలు కొట్టి మరీ చెబుతున్నారు. తెలంగాణలో అంతో ఇంతో బలం ఉన్న ఖమ్మం జిల్లాలోనే టీడీపీలో చేరడానికి ఎవరు ముందుకు రాని పరిస్థితుల్లో ఇతర జిల్లాల్లో ఆ పేరు పలకడానికైనా ఎవరైనా సాహసిస్తారా అనే చర్చ సాగుతోంది. చదవండి: చంద్రబాబు ‘ముందస్తు’ డ్రామా.. ఆ వ్యాఖ్యలు దేనికి సంకేతం? ఓటుకు నోటు కేసు తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ఆ పార్టీలోని నేతలు, కార్యకర్తలంతా ఇతర పార్టీల్లో చేరిపోయారు. సైకల్ రిపేర్ చేయడానికి వీల్లేని విధంగా ముక్కలైపోయింది. మళ్లీ ఇప్పుడు కొత్తగా రీ ఎంట్రీ ఇచ్చి సైకిల్‌ను రిపేర్ చేసుకోవాలని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. పునర్వైభవ పోరాటం... ఆత్మగౌరవ ఆరాటం లాంటి బారీ ట్యాగ్ లైన్లతో ప్రచారం చేసుకుంటోంది. మరి ఈ నెల 21న జరిగే చంద్రబాబు సభ ఎలా జరుగుతుందో.. ఎంత మంది వస్తారో చూడాలి. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
అసలు విషయం తెలిస్తే షాకే.. సినిమాను తలపించిన లవ్‌స్టోరీ.. యువతి అదృశ్యం కథ
రొంపిచర్ల(గుంటూరు జిల్లా): తుంగపాడు బస్టాండ్ సమీపంలో శనివారం రాత్రి జరిగిన యువతి అదృశ్యం కథ సుఖాంతమైంది. యువతి పరారైందన్న భయంలో యువకుడు ఇచ్చిన పొంతనలేని సమాధానాలతో పోలీసులు అష్టకష్టాలు పడ్డారు. ఎట్టకేలకు యువతి సురక్షితంగా ఉందని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈపూరు మండలం ఇనిమెళ్లకు చెందిన యువకుడు, రొంపిచర్ల మండలం విప్పర్లరెడ్డిపాలెం గ్రామానికి చెందిన యువతి ఐదేళ్లుగా ప్రేమించకుంటున్నారు. ఇద్దరూ కలిసి బైక్‌పై వస్తుండగా తుంగపాడు బస్టాండ్ సమీపంలోని సుబాబుల్ తోటల వద్ద యువతి బైక్ దిగి తనను పెళ్లి చేసుకోవాలని అడిగింది. ఈ విషయంపై ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో వాగ్వాదం జరిగింది. దీంతో యువతి సుబాబుల్ తోటల్లోకి పరారైంది. యువకుడు ఎంతసేపు వెతికినా ఆమె ఆచూకీ తెలియకపోవడంతో భయపడి ఏం చేయాలో పాలుపోని యువకుడు యువతిని కొందరు కిడ్నాప్ చేసి సుబాబుల్ తోటల్లోకి లాక్కెళ్లారని బాటసారులకు చెప్పాడు. వారిచ్చిన సమాచారంతో నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కర్, రూరల్‌సీఐ భక్తవత్సల రెడ్డి, ఎస్ఐ సురేష్‌బాబులు తమ సిబ్బందితో ఘటనా చేరకుని సుబాబుల్ తోటను జల్లెడ పట్టారు. ఓ దశలో యువకుడు యువతిని హత్య చేశానని చెప్పడంతో మృతదేహం ఆచూకీ కోసం రాత్రంతా వెతికారు. ఎంతకీ లభించకపోవడం, యువకుడు పదేపదే పొంతన లేని మాటలు చెబుతుండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. తమదైన శైలిలో ఆరా తీస్తే యువకుడు అసలు విషయం బయటపెట్టాడు. ఎట్టకేలకు తన కోసం సుబాబుల్ తోటలో వెతుకుతున్న విషయం తెలుసుకున్న ఆ యువతి నేరుగా డీఎస్పీకి ఫోన్ చేసి తాను సురక్షితంగా ఉన్నానని, తన కోసం వెతకవద్దని, తానే పోలీస్‌స్టేషన్‌కు వస్తానని సమాచారం ఇచ్చింది. ఆదివారం మధ్యాహ్నం స్టేషన్‌కు వచ్చిన యువతి రాత్రి జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపింది. తర్వాత యువతి, యువకులు తామిద్దరం వివాహం చేసుకుంటామని పోలీసులకు తెలిపారు. దీంతో ఇద్దరి కుటుంబ పెద్దలతో పోలీసులు మాట్లాడి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. చదవండి: ఆర్టీసీ బస్టాండ్‌లో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన కొత్త పెళ్లికూతురు -
వాట్సాప్‌లో ఫొటోలూ మాయం కానున్నాయి!
ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లలో వాట్సాప్ ముందు వరుసలో ఉంటుదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల కొత్త ప్రైవేసీ నిబంధనలు తీసుకొచ్చిన నేపథ్యంలో ప్రజలలో వాట్సాప్‌పై వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వాట్సాప్ తన యూజర్లను నిలుపుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే కొత్త ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. కొద్దీ రోజుల క్రితమే స్టేటస్ మ్యూట్ వీడియో ఫీచర్ తీసుకొచ్చిన వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతుంది. వాట్సాప్‌లో ఇప్పటికే డిస్అపియరింగ్ మెసేజెస్ ఫీచర్ ఉంది. అయితే, ఈ ఫీచర్ యాక్టివ్ చేసుకుంటే వారం తర్వాత మెసేజ్‌లు ఆటో మెటిక్ గా డిలీట్ అవుతాయి. అదేవిదంగా ఇప్పుడు మీడియా డిస్అపియరింగ్ అనే ఫీచర్ తీసుకువస్తుంది. ఈ ఫీచర్‌తో ఫొటోలు/వీడియోలు అవతలి వ్యక్తి చూడగానే డిలీట్ అయిపోతాయి. దీని కోసం ఫొటో/వీడియోను షేర్ చేసే ముందు, యాడ్ కాప్షన్ అనే బాక్స్ పక్కన ఉండే గడియారం సింబల్‌ను టచ్ చేసి యాక్టివేట్ సరిపోతుంది. ఆ తర్వాత మీరు పంపిన ఫొటో/వీడియోను అవతలి వ్యక్తి చూశాక డిలీట్ అయిపోతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ కొంతమందికి ప్రయోగాత్మకంగా అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ తరహా ఫీచర్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటీకే స్వయంగా స్టిక్కర్ మేకర్ యాప్ ని కూడా ప్లే స్టోర్, యాప్ స్టోర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. WhatsApp is working on self-destructing photos in a future update for iOS and Android. • Self-destructing photos cannot be exported from WhatsApp. • WhatsApp didn't implement a screenshot detection for self-destructing photos yet. Same concept from Instagram Direct. ⏱ pic.twitter.com/LLsezVL2Hj — WABetaInfo (@WABetaInfo) March 3, 2021 చదవండి: గేమింగ్ టీవీ లాంచ్ చేసిన ఎల్జీ భారత టెలికామ్ రంగంలో మరో విప్లవం -
వరంగల్‌లో అదృశ్యం.. కశ్మీర్లో ప్రత్యక్షం
నర్సంపేట రూరల్: మతిస్థిమితం లేని కుటుంబ పెద్ద తప్పిపోయి.. 13 ఏళ్ల తర్వాత ఇంటికి చేరడంతో ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేవు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లికి చెందిన కీర్తి మల్లయ్య, శాంతమ్మ దంపతులకు కుమారుడు యాకయ్య, కుమార్తె ఉన్నారు. తండ్రి మల్లయ్యకు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో కొడుకు యాకయ్య వరంగల్ ఎంజీఎంలో చికిత్స చేయించేవాడు. ఈ క్రమంలో 2007 ఎండాకాలంలో పరీక్షల నిమిత్తం కొడుకుతో కలసి ఎంజీఎంకు వెళ్లిన మల్లయ్య అక్కడ తప్పిపోయాడు. అప్పటి నుంచి ఆయన ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతకని ప్రదేశం లేదు. ఎన్నిచోట్ల వాకబు చేసినా ఫలితం దక్కలేదు. దీంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇంటికి చేరాడిలా.. గత నెల 25న జమ్మూ, కశ్మీర్లో మల్లయ్య తిరుగుతూ కనిపించడంతో సీఆర్పీఎఫ్ జవాన్లు అదుపులోకి తీసుకుని విచారించారు. అతడిని నర్సంపేట వాసిగా గుర్తించి క్యాంప్‌లో ఉన్న తెలంగాణ సీఆర్పీఎఫ్ సిబ్బందితో పాటు తెలంగాణ రిటైర్డ్ సెంట్రల్ పారామిలటరీ ఫోర్సెస్ వెల్ఫేర్ ఫౌండేషన్‌కు సమాచారం అందించారు. స్థానిక పోలీçసుల సహాయంతో మల్లయ్యను కుటుంబ సభ్యులతో వీడియోకాల్ ద్వారా మాట్లాడించడంతో అతడిని గుర్తు పట్టారు. ఈనెల 9న జమ్మూలో ఫౌండేషన్ ప్రతినిధులకు మల్లయ్యను అప్పగించడంతో శనివారం రాత్రి స్వగ్రామానికి తీసుకువచ్చారు. ఆదివారం ఫౌండేషన్ అధ్యక్షుడు మావురం సత్యనారాయణరెడ్డి, నర్సంపేట ఎస్సై యుగేందర్, మల్లయ్యను కుటుంబ సభ్యులకు అప్పగించారు. సోషల్ మీడియాలో ఫొటో పంపించాం.. సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ, మల్లయ్యను కుటుంబ సభ్యులు గుర్తించడంతో సోషల్ మీడియాలో ఫొటో పంపించామని, దాంతో జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ అధికారులు మల్లయ్యను అప్పగించారని తెలిపారు. కాగా తండ్రిని తమకు అప్పగించిన సీఆర్‌పీఎçఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులు, నర్సంపేట పోలీసులు, ఫౌండేషన్ బృందానికి యాకయ్య కృతజ్ఞతలు తెలిపాడు. -
ఢిల్లీలో ఇద్దరు తెలుగు వైద్యులు అదృశ్యం
సాక్షి, న్యూఢిల్లీ: ఇద్దరు తెలుగు వైద్యులు ఢిల్లీలో అదృశ్యం కావడం కలకలం సృష్టిస్తోంది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన డాక్టర్ హిమబిందు, ఆమె స్నేహితుడు, అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన డాక్టర్ దిలీప్ సత్య డిసెంబర్ 25న కనిపించకుండా పోయారు. హిమబిందు భర్త డాక్టర్ శ్రీధర్ అదేరోజు ఢిల్లీలోని హాజ్‌కాస్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 6 రోజులైనా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. శ్రీధర్, దిలీప్ సత్య, హిమబిందు.. ముగ్గురూ వైద్యులే. ఆత్మీయ మిత్రులే. వీరంతా 2007లో ఎంబీబీఎస్‌లో క్లాస్మేట్స్. హిమబిందు, శ్రీధర్ భార్యా భర్తలు. శ్రీధర్ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో పిల్లల వైద్య నిపుణుడిగా పనిచేస్తున్నాడు. హిమబిందు ఎయిమ్స్‌లో పీజీ చేశారు. ప్రస్తుతం ఢిల్లీలోనే ఒక ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తున్నారు. ఇక దిలీప్ సత్య చండీగఢ్‌లో పీజీ చేశాడు. అక్కడే సీనియర్ రెసిడెన్సీగా చేసి, 2 నెలల క్రితం మానేశాడు. ఉన్నత చదువులకు సన్నద్ధమవుతున్నాడు. డీఎం పరీక్ష రాశాడు. సోమవారం రాత్రి శ్రీధర్ ఏపీ భవన్ వద్ద మీడియాతో మాట్లాడాడు. ‘‘జిప్మర్ కౌన్సెలింగ్ కోసం దిలీప్ చెన్నై వెళ్లాడు. చెన్నై నుంచి 25వ తేదీన ఉదయం 7 గంటలకు ఢిల్లీ వచ్చాడు. మధ్యాహ్నం 2.30 గంటలకు చండీగఢ్ వెళ్లే ట్రైన్ ఉందని, ఇంటికొస్తానని నాకు ఫోన్‌చేసి చెప్పాడు. నేను ఉదయం 7.30 గంటలకే డ్యూటీకి వెళ్లాను. ఢిల్లీ వచ్చిన దిలీప్ ఉదయం 8.45–9.00 గంటల మధ్య మా ఇంటికి చేరినట్టు ఫోన్ చేశాడు. క్రిస్మస్ సెలవు కావడంతో నా భార్య ఇంట్లోనే ఉంది. వారిద్దరూ అల్పాహారం తీసుకున్నారు. ఉదయం 11.20 గంటలకు నా భార్య ఫోన్ చేసింది. చర్చికి వెళుతున్నామంది. దిలీప్‌తో కలిసి వెళ్తానని, అతడు అటునుంచి అటే రైల్వే స్టేషన్‌కు వెళతాడని చెప్పింది. నా డ్యూటీ అయ్యాక మధ్యాహ్నం 2 గంటలకు ఫోన్ చేస్తే నా భార్య ఫోన్ స్విచ్ఛాఫ్ అని వచ్చింది. వెంటనే దిలీప్‌కు ఫోన్ చేశాను. అతడి ఫోన్ స్విచ్ఛాప్ వచ్చింది. సాయంత్రం వరకూ చాలాసార్లు చేశా. స్విచ్ఛాప్ అనే సమాధానం వచ్చింది. సాయం త్రం 6 గంటలకు దిలీప్ భార్య దివ్యకు ఫోన్ చేశా. ఆమె చండీగఢ్‌లోనే జాబ్ చేస్తోంది. దివ్య ఫోన్ చేసి నా స్విచ్ఛాప్ అని వస్తున్నట్లు చెప్పింది. దిలీప్ ఉద యం ఫోన్ చేసి చర్చికి వెళుతున్నట్టు చెప్పాడంది. దిలీప్ చండీగఢ్‌కు చేరుకోకపోవడంతో దివ్య అక్కడి నుంచి ఢిల్లీకి వచ్చేసింది’’అని శ్రీధర్ తెలిపాడు. ఒక్క క్లూ దొరకలేదు ‘‘దిలీప్, హిమబిందు అదృశ్యంపై ఇప్పటిదాకా ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఎక్కడికెళ్లారో తెలియడం లేదు. వాళ్ల బ్యాంకు స్టేట్మెంట్ చూశాం. డిసెంబర్ 21 తర్వాత వాళ్లు ఏ కార్డు వాడలేదు. చేతి లో 3, 4 వేల కంటే నగదు లేదు. బిందు తో నా పెళ్లి దిలీపే జరిపించాడు. మాది లవ్ మ్యారేజ్. నేను లేనప్పుడు నా భార్యను సురక్షితంగా పంపించగలిగేది దిలీప్‌తోనే. బయటికి ఎక్కడికైనా వెళ్లాలన్నా దిలీప్‌తోనే పంపిస్తా. దిలీప్ నా భార్యకు సొంత అన్నలాంటివాడు. దిలీప్ తల్లిదండ్రులు నా భార్యను కూతురిలా చూసుకుంటారు. దయచేసి ఈ ఘటనను మీడియా తప్పుగా చూపించొద్దు’’అని శ్రీధర్ వేడుకున్నాడు. -
ఇజ్రాయేల్‌లో ఇద్దరు తెలుగువారి అదృశ్యం
సంతబొమ్మాళి (శ్రీకాకుళం జిల్లా): ఇజ్రాయేల్ దేశానికి విహార యాత్రకు వెళ్లిన ఇద్దరు తెలుగువారు ఐదు రోజుల క్రితం అదృశ్యమయ్యారు. ఈనెల 20తో వారి వీసా గడువు ముగియనుండడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం గొలుగువానిపేటకు చెందిన గొల్ల శ్రీనివాసరావు (35), తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన తరుణ్ కుమార్‌తోపాటు 43మంది టూరిస్ట్ వీసాతో ఇజ్రాయేల్ వెళ్లారు. ముంబైకి చెందిన కేసరి టూర్స్ ద్వారా ఈనెల 8వ తేదీ రాత్రి ముంబైలో విమానం ఎక్కారు. ఈ నెల 13 వరకు జోర్డాన్ పరిసర ప్రాంతాల్లో తిరిగి 14న ఇజ్రాయేల్ చేరుకున్నారు. ఆ రోజు రాత్రి అందరితోపాటు భోజనం చేసిన తరువాత శ్రీనివాసరావు, తరుణ్ వారి గదులకు వెళ్లారు. మరుసటి రోజు ఉదయం యాత్రకు రాకపోవడంతో ట్రావెల్ సిబ్బంది వారుంటున్న గదులను పరిశీలించారు. అక్కడ లేకపోవడం, ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఎక్కడికో వెళ్లి ఉంటారనుకొని ఎదురుచూశారు. ఫలితం లేకపోవడంతో 16న అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై శ్రీకాకుళం జిల్లా గొలుగువానిపేటలో ఉంటున్న బాధితుడు శ్రీనివాసరావు భార్య రాజులమ్మకు టూరిస్ట్ ఏజెంట్ సమాచారమివ్వడంతో ఆమె గురువారం సంతబొమ్మాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు -
మా కొడుకు జాడ చెప్పండి
సాక్షి, పెద్దపల్లి : జిల్లా విద్యాశాఖలోని సర్వశిక్ష అభియాన్ విభాగంలో డివిజినల్ లెవల్ మానిటరింగ్ టీం మెంబర్ (డీఎంఎల్టీ)గా పనిచేస్తున్న ఎలగందుల రమేశ్ అదృశ్యం మిస్టరీ ఇంకా వీడలేదు. లేఖ రాసి గత శనివారం నుంచి ఆచూకీ లేకుండా పోయిన అతని ఉదంతం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. రమేశ్ జాడ తెలియక కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమకొడుకు ఆచూకీ చెప్పాలంటూ జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట కుటుంబ సభ్యులు రమేశ్ చిత్రపటాలతో మంగళవారం ఆందోళనకు దిగారు. తమ కుమారుడు కనిపించకుండా పోవడానికి కారణమైన జీసీడీవో పద్మను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తమ కుమారుని ఆచూకీ దొరికే వరకు కదిలేది లేదని కార్యాలయం ఎదుట భీష్మించుకు కూర్చున్నారు. బాధ్యులను సస్పెండ్ చేయాలి.. తనకు రావాల్సిన సెక్టోరల్ అధికారి పోస్టును ఇతరులకు ఇప్పించడంతో మనస్థాపానికి గురైన ఎలగందుల రమేశ్ నాలుగు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. తన చావుకు కారణం జీసీడీవో పద్మ పేరును ప్రస్తావిస్తూ లేఖను రాసిన విషయం విధితమే. కుటుంబ సభ్యులకు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మద్దతుగా నిలిచారు. రమేశ్‌కు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. అనంతరం డీఈవో జగన్మోహన్రెడ్డికి వినతిపత్రాన్ని సమర్పించి జీసీడీవో పద్మను వెంటనే సస్పెండ్ చేసి విచారణ జరిపించాలని కోరారు. స్పందించిన డీఈవో ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకువెళ్తానని చెప్పడంతో ఆందోళన విరమించారు. కలిచివేసిన కన్నీళ్లు.. రమేశ్ ఆచూకీ కోసం డీఈవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టిన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యాంతమయ్యారు. రమేశ్ తల్లి మధునమ్మ తన కొడుకును క్షేమంగా తనకు అప్పగించాలని గుండెలవిసేలా రోధించింది. తాము పేదవాళ్లమని, అందుకే పోలీసులు, అధికారులు తమ కొడుకు కనిపించకుండా పోయినా పెద్దగా పట్టించుకోవడం లేదని క్షేమంగా వస్తే చాలని వేడుకుంది. రమేశ్ తమ్ముడు, చెల్లె, బంధువులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. -
విషం కాంగ్రెస్ కాదు..సిద్దూతో గొడవ లేదు!
న్యూఢిల్లీ: గరళకంఠుడిలా సంకీర్ణ ప్రభుత్వ హాలాహలం మింగుతున్నానంటూ ఇటీవల కన్నీళ్లతో ప్రకటించిన కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి.. బుధవారం తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఇండియాటుడే వార్తాచానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలను ఆయన వెల్లడించారు. తన గత వ్యాఖ్యల్లో విషం అన్నది కాంగ్రెస్‌నో, లేక సంకీర్ణ ప్రభుత్వాన్నో ఉద్దేశించి కాదని వివరణ ఇచ్చారు. తాను ముఖ్యమంత్రి అవ్వడం ఇష్టం లేక ఒక సామాజిక వర్గం వారు విషం కక్కుతున్నారని ఆయన అన్నారు. గతంలో తనకు ఎంతో మద్దతుగా నిలిచిన కొన్ని టీవీ చానెళ్ల విలేకరులు.. సీఎం అయ్యాక మాత్రం తానెన్ని మంచి పనులు చేయాలని చూస్తున్నా వాటిలో తప్పులనే వెదుకుతూ అసత్యాన్ని ప్రచారం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు వ్యతిరేకంగా ఉన్న సామాజిక వర్గం వారే ఇదంతా చేయిస్తున్నారని తెలిసి తనకు కన్నీళ్లు వచ్చాయని చెప్పారు. మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్దరామయ్య మిమ్మల్ని బహిరంగంగానే తీవ్రంగా విమర్శిస్తున్నందుకే ఆ రోజు అలా మాట్లాడారా అని ప్రశ్నించగా అలాంటిదేమీ లేదనీ, సిద్దరామయ్య తనకు ఎన్నో విషయాల్లో సలహాలు ఇస్తూ సహకరిస్తున్నారని కుమారస్వామి పేర్కొన్నారు. సిద్దరామయ్యే కాకుండా స్థానిక నేతలు సహా మొత్తం కాంగ్రెస్ పార్టీ తనకు మద్దతుగానే ఉందనీ, నిర్ణయాల్లో కూడా స్వేచ్ఛను ఇచ్చిందని స్పష్టం చేశారు. కుమారస్వామివన్నీ డ్రామాలేనని బీజేపీ అంటుండటాన్ని ప్రస్తావించగా, వారి నుంచి మంచిమాటలు వస్తాయని తాను ఎప్పుడూ ఆశించలేదన్నారు. లోపల ఎంతో బాధ ఉంటేగానీ మనుషులకు కన్నీళ్లు రావనీ, అది అర్థం చేసుకోకుండా తనను విమర్శించేవారికి భావోద్వేగాలు, మానవీయత అంటే ఏంటో తెలిసుండకపోవచ్చని కుమారస్వామి పేర్కొన్నారు. సహజంగానే తనలో భావోద్వేగాలు అధికమన్నారు. అధికారుల బదిలీల్లో కాంగ్రెస్ ఒత్తిడేమీ లేదనీ, ఒకవేళ ఉన్నా అలాంటివన్నీ తనకు చిన్నచిన్న విషయాలే తప్ప కన్నీళ్లు పెట్టుకునేంత పెద్దవి కావని చెప్పారు. ప్రభుత్వాన్ని ఐదేళ్లూ నడపడమే జేడీఎస్, కాంగ్రెస్‌ల ఉమ్మడి లక్ష్యమనీ, 2019 సాధారణ ఎన్నికల్లో కర్ణాటకలో ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకం పెద్ద సమస్యే కాదని కుమారస్వామి తేల్చి చెప్పారు. -
యువతి అదృశ్యం
మిరుదొడ్డి(దుబ్బాక): ఓ యువతి అదృశ్యమైన ఘటన మండల పరిధిలోని మల్లుపల్లిలో చోటు చేసుకుంది. మిరుదొడ్డి ఎస్ఐ విజయభాస్కర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మచ్చ ఎల్లవ్వ, స్వామి కూతురు కల్యాణి ఈ నెల 8న ఉదయం 10 గంటలకు బొప్పాపూర్‌లోని తన చిన్నమ్మగారి ఇంటికి వెళ్తున్నానని చెప్పి వెళ్లింది. నాటి నుంచి ఆమె ఆచూకీ ఎక్కడా లభించలేదు. బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ఫలితం లేదు. యువతి తల్లి ఎల్లవ్వ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
సాగర్ కాలువలో ఇద్దరి గల్లంతు
వర్ని(బాన్సువాడ): ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి.. చదువుల ఒత్తిడి నుంచి బయట పడేందుకు ఐదుగురు స్నేహితులు నిజాంసాగర్ కాలువలో సరదాగా ఈతకు వెళ్లారు. అయితే, నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఇద్దరు గల్లంతయ్యారు. వర్ని మండల కేంద్రానికి చెందిన ఇంటర్ విద్యార్థులు సోహెల్ (17), ప్రభురాజ్ (17) బుధవారం చివరి పరీక్ష రాశారు. పుస్తకాలతో కుస్తీ పట్టి అలసిపోయిన ఆ మిత్రులు ఇద్దరు సహా ఐదుగురు స్నేహితులు గురువారం సరదాగా స్నానం చేయడానికి సత్యనారాయణ పురం సమీపంలో గల నిజాంసాగర్ కాలువలోకి దిగారు. కాలువలో నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో సోహెల్, ప్రభురాజ్ కొట్టుకుపోయారు. వీరిని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తోటి స్నేహితులతో పాటు సమాచారమందుకున్న బంధువులు కాలువ వెంబడి సాయంత్రం వరకు గాలించారు. రబీ పంటల కోసం వారం రోజులుగా నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి కాలువ ద్వారా నీటిని వదులుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఏడు అడుగుల ఎత్తులో నీటి ప్రవాహం ఉంటుందని స్థానికులు తెలిపారు. విద్యార్థులు గల్లంతు కావడంతో తల్లితండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. -
రెప్పపాటులో మాయం
తణుకు: సార్.. నేను షాపింగ్‌మాల్‌కు వెళ్లి వచ్చేసరికి నా బైక్ మాయమైంది.. పార్కింగ్ ప్రాంతంలో ఉంచిన మోటారుసైకిల్ లోనికి వెళ్లి వచ్చేంతలోనే కనపడకుండా పోయింది.. బ్యాంకులోకి అలా వెళ్లి వచ్చేసరికి ఎవరో నా మోటారుసైకిల్ ఎత్తుకెళ్లారు.. ఇలాంటి ఫిర్యాదులు ఇటీవల కాలంలో ఆయా పోలీస్స్టేషన్లలో పెరిగిపోయాయి. తణుకు సర్కిల్ పరిధి లో నెలకు 10 నుంచి 15 మోటారు సైకిళ్లు చోరీకు గురవుతున్నట్టు అంచనా. పోలీసు సిబ్బంది సైతం వాహనాల చోరీ ఉదంతాలను తేలిగ్గా తీసుకుంటున్నారు. దీం తో మోటారుసైకిళ్లు చోరీ చేసే అగంతకులు రెచ్చిపోతున్నారు. తణుకు పట్టణ పరిధిలోని సీసీ కెమేరాలు ఏర్పాటు చేసినప్పటికీ ఆయా ప్రాంతాల్లో వాహనాలను అగంతకులు దొంగిలించుకుపోతున్నారు. అసలేమవుతున్నాయ్..? తణుకు సర్కిల్ పరిధిలో అపహరణకు గురవుతున్న వాహనాల్లో 30 శాతం వ రకు పోలీసులు రికవరీ చేస్తున్నారు. మో టారు సైకిళ్లను అపహరించే వ్యక్తులు వా టిని లభించిన ధరకు తెగనమ్మేస్తున్నారు. ఆ డబ్బుతో జల్సాలు చేస్తున్నట్లు తెలు స్తోంది. తక్కువ ధరకు కొనుగోలు చేసిన వాహనాలను పట్టణంలోని కొందరు సెకండ్ హ్యాండ్ వాహనాల వ్యాపారం చేస్తున్న వారు కొనుగోలు చేసి నకిలీ పత్రాలు సృష్టించి జిల్లాలు దాటిస్తున్నట్టు తెలుస్తోంది. మరికొన్ని వాహనాలను పాత సామాన్లు కొనుగోలు చేసే వ్యక్తులు కొనుగోలు చేసి ఆయా భాగాలను విడదీసి మరమ్మతులు చేసే షాపుల్లో విక్రయిస్తున్నట్టు సమాచారం. పార్కింగ్ ప్రదేశాల్లో రక్షణ ఏదీ..? కార్యాలయాలకు, షాపింగ్‌కు వచ్చే వినియోగదారులే తమ వాహనాలపై నిఘా ఉంచాల్సిన పరిస్థితి. పట్టణంలోని రైల్వేస్టేషన్, బస్టాండ్, సినిమా హాళ్లు తదితర ప్రాంతాల్లో పార్కింగ్ ప్రదేశాల్లో రుసుం తీసుకుని వాహనాలకు భద్రత కల్పిస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో అం టే ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక మా ర్కెట్, హోటళ్లు వంటి ప్రాంతాల్లో ఇలాం టి ఏర్పాట్లు లేవు. ముఖ్యంగా కల్యాణ మండపాలు, సినిమా హాళ్లు, బహిరంగ సభలు జరిగే ప్రాంతాల్లో నిఘా లేకపోవడంతో ఇక్కడ మోటారుసైకిళ్లు తరచూ చోరీకు గురవుతున్నాయి. అపార్టుమెం ట్లలో కార్యాలయాల నుంచి రూ.వేలు ని ర్వహణ ఖర్చులను వసూలు చేస్తున్నారు. అయినా కాపలా సిబ్బందిని మాత్రం అన్నిచోట్ల నియమించడం లేదు. ఫలితంగా ఆయా ప్రాంతాల పార్కింగ్ ప్రదేశాల్లో నిలిపి ఉంచిన వాహనాలు చోరీకు గురికావడం, వాటి యాజమానులు పో లీసులకు ఫిర్యాదు చేయడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా పెద్ద ఎత్తున వ్యా పారాలు చేసే కొన్ని మద్యం దుకాణాలు, బార్లు ముందు వాహనాల రక్షణకు సిబ్బందిని నియమించకపోవడంతో తర చూ వాహనాల చోరీ ఫిర్యాదులు పోలీసులకు అందుతున్నాయి. చాలా సందర్భాల్లో కేసులు నమోదు చేయడానికి నిరాకరిస్తున్నట్టు బాధితులు చెబుతున్నారు. ఇలా చేయాలి.. అనివార్య పరిస్థితుల్లో ఆరుబయట, రోడ్ల వెంబడి, వ్యాపార ప్రాంతాల్లో వాహనాలను నిలిపి ఉంచడానికి కొన్ని చిట్కాలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. వాహనానికి అందించే తాళాలు కొన్నాళ్లకు అరిగిపోతాయి. ఆటో మొబైల్ షాపుల్లో రూ.150 నుంచి రూ.300 వెచ్చిస్తే వెనుక చక్రానికి తాళం వేయడానికి వీలుగా ప్రత్యేక తాళం ఇస్తారని, వీటిని వేస్తే కొంత మేర భద్రత ఉంటుందని చెబుతున్నారు. ఇళ్ల బయట పార్కింగ్ చేసేవారు కిటికీలకు గట్టి ఇనుప గొలుసుతో వాహనానికి లాక్ చేయడం మంచిదని సూచిస్తున్నారు. వాహనాలకు బీమా ఉండటం వల్ల ఫిర్యాదు చేసిన మూడు నెలల వరకు వాహనం దొరక్కపోతే ఆయా సం స్థల నుంచి బీమాను పొందవచ్చని, ఇందుకు సంబంధిత పోలీసుస్టేషన్ల నుంచి చివరి నివేదిక తీసుకుని దరఖాస్తు చేసుకోవచ్చని పోలీసులు సూచిస్తున్నారు. నిఘా ఉంచాం ఇటీవల కాలంలో మోటారుసైకిళ్లు చోరీకు గురవుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ముఖ్యంగా పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ప్రత్యేక నిఘా ఉంచాం. వాహనదారులు సైతం వాహనంతోపాటు వచ్చే తాళంతోపాటు మరొకటి కూ డా బైకులకు తప్పకుండా వేసుకో వాలి. అపార్టుమెంట్ నిర్వాహకులు విధిగా కాపలా సిబ్బందిని నియమించుకోవాలి. వాహనదారులు సైతం స్వయంగా ప్రత్యేక నిఘా ఉంచుకోవాలి. – కేఏ స్వామి, సీఐ తణుకు -
ఖాతాదారులందరికీ న్యాయం చేస్తాం
మొయినాబాద్ రూరల్(చేవెళ్ల): ఖాతాదారులందరికీ న్యాయం చేసేందుకే విజిలెన్స్ అధికారులతో పాటు సీబీఐ అధికారులు, బ్యాంకు అధికారులు కృషి చేస్తున్నారని.. ఎలాంటి భయాయందోళనలకు గురికావొద్దని విజిలెన్స్ అధికారి కేబీఎస్ రాజు పేర్కొన్నారు. బుధవారం మండలంలోని అజీజ్ నగర్లో గల తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఎదుట బాధితులు ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేసేంత వరకు బ్యాంకును తెరవొద్దంటూ ఆందోళన నిర్వహించారు. 30 రోజులు గడిచినా బ్యాంకు అధికారుల నుంచి ఎలాంటి స్పందనా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ బ్యాంకు మేనేజర్ రాంమోహన్ రావును బ్యాంకు తెరవకుండా అడ్డుకున్నారు. దీంతో ఈ విషయాన్ని మేనేజర్.. ఆర్ఎం రవీందర్ రెడ్డికి తెలపడంతో మధ్యాహ్నం రెండు గంటలకు ఆర్ఎంతో పాటు విజిలెన్స్ అధికారి కేబీఎస్ రాజు తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు విచ్చేసి ఆందోళన చేస్తున్న ఖాతాదారులతో మాట్లాడి నచ్చజెప్పడంతో సమస్య సద్దుమణిగింది. దీంతో బ్యాంకును తెరిచి సిబ్బంది యథావిధిగా పనులను కొనసాగించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అధికారి కేబీఎస్ రాజు మాట్లాడుతూ బ్యాంకులో దాచుకున్న డబ్బులు ఎక్కడికీ పోవని.. ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ బ్యాంకులో 126 మంది ఖాతాదారుల నుంచి డబ్బులు రూ. 8.94 కోట్లు మాయమైనట్లు ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. సోమవారం నుంచి నెల రోజుల్లో ఖాతాదారులందరి ఖాతాలను పూర్తిగా పరిశీలించి తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే సీబీఐ దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. 13 చోట్ల దాడులు నిర్వహించారని.. అజీజ్ నగర్లో రెండు చోట్ల దాడులు చేయడం జరిగిందన్నారు. మొయినాబాద్ పోలీసులు సీఐ సునీతా, ఎస్సై నయిమోద్దీన్‌లు, సిబ్బందితో భద్రత నిర్వహించారు. -
బ్యాంకు ఖాతాలో డబ్బులు మాయం
రంగారెడ్డి జిల్లా : మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ గ్రామంలో గల దక్కన్ గ్రామీణ బ్యాంకులో ఖాతాదారుల బ్యాంకు ఖాతాలో డబ్బులు మాయం అయ్యాయి. సుమారు 30 మందికి సంబంధించిన ఖాతాలలో అవకతవకలు జరిగినట్లు సమాచారం అందింది. ఈ బ్యాంకు పరిధిలో ఎక్కువ మంది రైతులే బాధితులుగా ఉన్నట్లు తేలింది. బ్యాంక్ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి నిధులు కాజేసినట్లు వెల్లడైంది.ఈ రోజు కొందరు ఖాతాదారులు వారి డబ్బులను తీసుకోవడానికి బ్యాంకుకి రావడంతో సిబ్బంది వారి ఖాతాలు పరిశీలించారు. అందులో డబ్బులు లేకపోవడంతో విషయం బయటికి తెలిసింది. అంతే కాక వారికి బ్యాంక్‌లో డిపాజిట్ చేసినట్లు ఇచ్చిన ధ్రువీకరణ పత్రంలో సంతకం ఫోర్జరీ చేసినట్లు తేలింది. సుమారు రూ.3 కోట్ల నిధులు మాయం అయినట్లు తెలుస్తోంది. దీనిపై బ్యాంకు అధికారులను వివరణ కోరగా వారు ఇప్పుడే ఏమి చెప్పలేమని తెలిపారు. దీంతో బాధితులు మీడియాని ఆశ్రయించారు. -
ఆ ముసుగు ధరిస్తే మాయం అవడం ఖాయం!
బీజింగ్: మాయా ముసుగును ధరిస్తే మనుషులు కూడా కనిపించకుండా మాయం అయ్యే దృశ్యాలను నాటి పౌరాణిక చిత్రాల నుంచి నేటి సైన్స్ ఫిక్షన్ చిత్రాల వరకు చూస్తూనే ఉన్నాం. ఏ వస్తువునైనా కనిపించకుండా మాయం చేసే గడియారాన్ని (క్లాక్) కనిపెట్టవచ్చంటూ కొంతమంది శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో పరిశోధనలు, ప్రయోగాలు చేశారు. ఎవరూ కూడా ఈ విషయంలో పూర్తి విజయాన్ని సాధించిన దాఖలాలు ఇప్పటి వరకు లేవు. అయితే చైనా ప్రజా భద్రత మంత్రిత్వ శాఖలో నేర దర్యాప్తు విభాగంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న చెన్ షికు అలాంటి ఓ మాయా ముసుగును ప్రదర్శించారు. అత్యంత పారదర్శకంగా ఉన్న ఓ టేబుల్ క్లాత్ లాంటి గుడ్డను ఆయన తన విభాగంలోని పార్క్‌లో ప్రదర్శించారు. ఆ క్లాత్‌ను తనముందు ఏ మేరకు పట్టుకుంటే ఆ మేరకు ఆయన నిజంగా కనిపించకుండా పోతున్నారు. వెనుతిరిగి, ముందుకు తిరిగి ఆయన ఈ మాయను అద్భుతంగా ప్రదర్శించి చూపారు. క్వాంటమ్ థియరీని ఉపయోగించి ఈ పారదర్శక క్లాత్‌ను తయారు చేశామని, అందుకనే దీన్ని ‘క్వాంటమ్ ఆఫ్ ఇన్విజుబిలిటీ క్లాక్’ అని పిలుస్తున్నామని చెప్పారు. మనిషి మీద పడి పరావర్తనం చెందే కాంతి మనిషి చుట్టూ తిరిగి బయటకు పోవడం వల్ల మనిషి కనిపించకుండా పోతారని ఆయన వివరించారు. దొంగలను పట్టుకునే పోలీసులకు, టెర్రరిస్టులను పట్టుకునే భద్రతా దళాలకు ఈ క్లాత్‌లను డ్రెస్‌లుగా కుట్టిస్తే ఎంతో ఉపయోగమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అదే దొంగలకు, టెర్రరిస్టులకు కూడా ఈ క్లాత్ దొరికితే ఎలా ఉంటుందన్న విషయాన్ని మాత్రం ఆయన ఆలోచించలేకపోయారు. ఈ క్లాత్ ప్రదర్శనకు సంబంధించిన వీడియోను ఆయన డిసెంబర్ 4వ తేదీన చైనా సోషల్ మీడియా ‘వైబో’ సైట్లో విడుదల చేయడంతో ఇప్పటి వరకు 2.11 కోట్ల మంది వీక్షించారు. చూసిన వారంతా అబ్బురపడ్డారు. అయితే ఇలాంటి ‘ఇన్విజబుల్ క్లాక్’ అనేది ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా లేదని ‘క్వాంటమ్ వీడియో ప్రొడక్షన్ కంపెనీ’కి చెందిన ప్రొడ్యూసర్ జూ జెన్సాంగ్ తెలిపారు. నీలి లేదా ఆకుపచ్చ ప్లాస్టిక్ క్లాత్‌ను ఉపయోగించి వీడియో తీసి దాన్ని అతి జాగ్రత్తగా ఎడిట్ చేశారని చెప్పారు. అడోబ్స్కు చెందిన ‘ఆఫ్టర్ ఎఫెక్ట్స్’, ‘బ్లాక్‌మేజిక్ ఫ్యూజన్’ లాంటి ఎడిటింగ్ సాఫ్ట్వేర్లను ఉపయోగించి దృశ్యాల బ్యాక్‌గ్రౌండ్‌ను సులభంగానే ఎడిట్ చేయవచ్చని ఆయన వివరించారు. -
నటి డిస్కోశాంతి మేనకోడలు అదృశ్యం
పెరంబూరు: డిస్కోశాంతి మేనకోడలు గత ఐదు రోజుల క్రితం అదృశ్యం అయ్యింది. చెన్నై త్యాగరాయనగర్‌లో నివశిస్తున్న అరుణ్ మోళి వర్మన్, సెరిల్ దంపతుల పెద్దకూతురు అబ్రిన(17) స్థానిక అన్నాశాలైలోని చర్చ్‌పార్క్ పాఠశాలలో ప్లస్ టూ చదువుతోంది. కాగా అబ్రిన్ గత 6వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక టీ.నగర్, పాండిబజార్ పోలీస్ స్టేషన్లో పిర్యాదుచేశారు. అయితే ఇవాల్టికి ఐదు రోజులు అయానా అబ్రిన్ ఆచూకీ తెలియక పోవడంతో నటి డిస్కోశాంతి సోదరి లలితకుమారి, ఆమె సొదరుడి కుటుంబం సోమవారం మీడియాను ఆశ్రయించారు. ఈ సందర్భంగా లలితకుమారి మాట్లాడుతూ పోలీసులు ఆమె కోసం తీవ్రంగా గాలీస్తున్నా ఇంకా ఆచూకీ లభించలేదనీ పేర్కొన్నారు. అబ్రిన చదువుతున్న పాఠశాలలో 56 సీసీ కెమెరాలు ఉన్నా తమకు సంబంధించిన ప్రాంతంలోని సీసీ కెమెరాలు పని చేయడం లేదన్నారు. అయితే పాఠశాల యాజమాన్యం ఈ విషయంలో ఉదాసీనతగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. మీడియా ద్వారా తమ అబ్రినను పొందగలమనే నమ్మకంతో ఉన్నామని లలితాకుమారి కన్నీరు మున్నీరవుతూ పేర్కొన్నారు. -
‘నా బిడ్డ ఎక్కడుందో.. ఎలా ఉందో..’
► కుమార్తె అదృశ్యంపై ఆందోళనలో తల్లిదండ్రులు ► 44 రోజులక్రితం బాలిక అదృశ్యం ► రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలి విచారణ ► దర్యాప్తు వేగవంతం చేయాలని పోలీసులకు ఆదేశం ఆచంట : ‘నా బిడ్డ చెప్పాపెట్టకుండా వెళ్లి పోయి 44 రోజులైంది.. ఎక్కడుంతో ఎ లా ఉందో తెలియడం లేదు.. తిండి కూడా తినాలనిపించడంలేదు.. వెతకని చోటులేదు.. మొక్కని దేవుడు లేడు.. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు.. మీరైనా నా బిడ్డ ఆచూకీ తెలుసుకుని తీ సుకురండమ్మా..’ అంటూ ఓ తల్లి గుండెలవిసేలా మహిళా కమిషన్ సభ్యుల ఎ దుట బోరుమంది. వివరాల్లోకి వెళితే ఆ చంట పంచాయతీ పోరకు చెందిన వేండ్ర శ్రీనివాసు, శ్రీదేవి దంపతుల కుమార్తె వి జయభవాని (17) గత నెల 6న అదృశ్యమైంది. తండ్రి టైలరింగ్ చేసుకుంటూ గుంటూరులో ఉంటుండగా, తల్లి శ్రీదేవి ఉపాధి నిమిత్తం రెండేళ్ల క్రితం గల్ఫ్ దేశాలకు వెళ్లింది. దీంతో భవాని తాత, నా నమ్మ సంరక్షణలో ఉంటోంది. ఇంటర్ వరకూ చదువిని భవాని ఆచంటలో టైలరింగ్ నేర్చుకుంటోంది. గతనెల 6న టైలరింగ్ షాపునకు వెళ్లిన భవాని సైకిల్‌కు తా ళం వేసి బ్యాంకుకు వెళ్లి వస్తానని చెప్పి తి రిగి రాలేదు. మరుసటి రోజు బంధువులు ఆచంట పోలీసులకు ఫిర్యాదు చేశా రు. గుంటూరు నుంచి తండ్రి రాగా ఇటీవల తల్లి గల్ఫ్ నుంచి వచ్చింది. వీరంతా దుర్గాభవాని కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. విచారణ చేపట్టిన మహిళా కమిషన్ భవాని అదృశ్యమైన విషయం తెలుసుకున్న రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు శిరిగినీడి రాజ్యలక్ష్మి శనివారం గ్రామంలో బాధితులు, స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ఎస్సై ఏజీఎస్ మూర్తి నుం చి కేసు దర్యాప్తు వివరాలు తీసుకున్నారు. ఎస్సై ఏజీఎస్ మూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని పోలీస్స్టేషన్లకు సమాచారం ఇచ్చామని, కొందరు అనుమానితులను కూడా విచారించామని చెప్పా రు. బాధిత కుటుంబానికి తాము అండగా ఉంటామని, భవానీని క్షేమంగా తీసుకువస్తామని మహిళా కమిషన్ సభ్యురాలు రాజ్యలక్ష్మి చెప్పారు. కేసు దర్యాప్తును ప్రతిష్టాత్మకంగా తీసుకుని వేగవంతం చేయాలని ఎస్సైను ఆదేశించారు. రాష్ట్ర కమిటీ, జిల్లా ఉన్నతాధికారులను కలిసి దర్యాప్తు వేగవంతానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోడూరు ఐసీడీఎస్ సీడీపీఓ సత్యకల్యాణి, టీడీపీ మండల మహిళా కమిటీ మాజీ అధ్యక్షురాలు చిలుకూరి సత్యవతి పాల్గొన్నారు. -
తల్లి, కూతురు అదృశ్యం
నాగోలు: ఇంట్లో ఎవరికీ చెప్పకుండా తల్లి, కూతురు అదృశ్యమైన సంఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వెంకటేశ్వరరావు భార్య అనంతలక్ష్మీ (35), కూతురు గౌరి (15)లు నగరానికి వచ్చి గుంటిజంగయ్యనగర్కాలనీలో నివాసముంటున్నారు. అనంతలక్ష్మీ సితారా హోటల్లో పనిచేస్తుండగా గౌరి స్థానిక పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఈ నెల 16వ తేదీన అనంతలక్ష్మీ, గౌరిలు కనిపించకుండాపోయారు. చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికినా ప్రయోజనం లేకపోవడంతో వెంకటేశ్వరరావు ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
‘దయచేసి నన్ను వెతకకండి’..
దయచేసి నాకోసం వెతకకండి అని మెసేజ్ పెట్టి వివాహిత అదృశ్యమైంది. ఈ సంఘటన నగరంలోని కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నిజాంపేటలో బుధవారం రాత్రి వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న జండారావు భార్య చందనాప్రతిమ(38) బుధవారం తన అన్న ఫోన్‌కు నాకోసం వెతకొద్దు అని మెసేజ్ పెట్టి అజ్ఞాతంలోకి వెళ్లింది. దీంతో జేండారావు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
మతి స్థిమితం లేని యువకుడి అదృశ్యం
లింగగిరి(చెన్నారావుపేట) : మతి స్థిమితం లేని ఓ యువకుడు అదృశ్యమైన సంఘటన మండలంలోని లింగగిరి గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన అశోక్(22) 12 రోజుల క్రితం ఇంట్లో నుంచి బయటికి వెళ్లాడు. రోజూ ఊరంతా తిరిగి ఇంటికొచ్చే కుమారుడు, ఎంతకూ రాకపోవడంతో ఆందోళనకు గురైన తండ్రి కొమ్మాలు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఆచూకీ దొరకలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పులి వెంకట్‌గౌడ్ తెలిపారు. -
పరుగుల వీరుడు బుదియా సింగ్ ఎక్కడ?
భువనేశ్వర్: మూడేళ్ల కే మారథాన్ పరుగు.. నాలుగేళ్ల వయసులోనే 40 మైళ్లు పరిగెత్తిన రికార్డు .. అతి చిన్న వయసులో ఏకంగా 48 మారథాన్లు పూర్తిచేసి చరిత్ర సృష్టించిన పరుగుల (వీరుడు) బుడతడు.. ఒడిశా వండర్ కిడ్ బుదియా సింగ్ నెలరోజులుగా ఎక్కడున్నాడో ఆచూకీ లేదు. బుదియా సింగ్ మిస్సింగ్ పై తమకు నివేదిక ఇవ్వాలని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఒడిశా ప్రభుత్వాన్ని ఆదేశించింది. బుదియా సింగ్ స్పోర్ట్స్ హాస్టల్ లో ఉంటున్నాడు. ఆచూకీ లేకుండా పోయిన బుదియా గురించి తీసుకున్న చర్యలు ఏమటి? పోలీసులకు ఫిర్యాదు చేశారా? అనే విషయంపై మూడు రోజుల్లోగా తమకు నివేదిక సమర్పించాలని స్పోర్ట్స్ హాస్టల్ ఇంచార్జ్ ని సీడబ్ల్యూసీ సభ్యుడు బెనుధర్ సేనాపతి ఆదేశించారు. సీడబ్ల్యూసీ కృషి వల్లనే బుదియా కళింగ స్టేడియంలోని స్పోర్ట్స్ హాస్టల్లో ఉంటున్నాడని సేనాపతి తెలిపారు. మే 10న వేసవి సెలవులకి తన తల్లి దగ్గరికి వెళ్లిన బుదియా ఇప్పటివరకు స్పోర్ట్స్ హాస్టల్ కు రాలేదు. -
ఎల్కేజీ చిన్నారి అదృశ్యం
పాఠశాల సిబ్బంది గమనించకపోవటంతో ఓ చిన్నారి స్కూలు నుంచి ఎటో వెళ్లిపోయాడు. వనస్థలిపురంలోని గౌతం మోడల్ స్కూలులో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆడుకుంటూ బయటకు వెళ్లిన ఎల్కేజీ స్టూడెంట్ అయాన్ తిరిగి రాలేదు. స్కూలు సిబ్బంది ఈ విషయం గమనించలేదు. అన్నం పెట్టేందుకు వచ్చిన బాలుడి తల్లిదండ్రులు తమ కుమారుడు కనిపించకపోయేసరికి సిబ్బందిని నిలదీశారు. అప్పుడు తెలివి తెచ్చుకున్న సిబ్బంది తెల్లమొఖం వేశారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజి సాయంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.