division cricket league
-
హైదరాబాద్ వాండరర్స్ గెలుపు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఎ–3 డివిజన్ వన్డే లీగ్‌లో హైదరాబాద్ వాండరర్స్ జట్టు ఘనవిజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన ఆ జట్టు ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో షాలిమార్ సీసీపై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన షాలిమార్ సీసీని బౌలర్లు జితేందర్ (4/32), వెంకట్ (3/21) కట్టడి చేశారు. వీరిద్దరి ధాటికి షాలిమార్ 39.1 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైంది. హర్షిత్ (51) అర్ధసెంచరీ సాధించగా, అమిత్ (46) రాణించాడు. అనంతరం హైదరాబాద్ వాండరర్స్ 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తుమ్మల్ (108 నాటౌట్) అజేయ సెంచరీతో ఆకట్టుకున్నాడు. తుకారాం (34) రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో హర్షిత్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు రుషిరాజ్: 267/5 (మలిక్ 65, సాద్విక్ రెడ్డి 84; అవినాశ్ 2/45, అభినవ్ 2/52), యూత్ సీసీ: 147 (కేశవ్ 38; నితాయ్ 4/28, రషీద్ 3/32). రాయల్ సీసీ: 189/9 (రామానుజ 60, అఫ్జల్ 46; సాయి కార్తికేయ 3/39, శరత్ 3/42, ఇమ్రోజ్ 2/13), గ్రీన్లాండ్స్: 190/5 (సాయి కార్తికేయ 73, ముదస్సిర్ 48). సూపర్‌స్టార్ సీసీ: 186 (ఆర్యన్ 57; రవి కుమార్ 5/42, విక్రాంత్ 2/23), సఫిల్‌గూడ సీసీ: 160 (వంశీ 41; విమల్ 3/45, రహీమ్ 3/25). యంగ్ సిటిజన్స్: 174/8 (చరణ్ దీప్ 36; అబ్దుల్లా 2/12, రోహిత్ 2/29, ఒమర్ 2/8), సౌథెండ్ రేమాండ్స్: 177/3 (కౌశిక్ 66, దావూద్ 53; మహేశ్ 1/30, అభిరామ్ 1/34). న్యూస్టార్స్: 102 (సాజిద్ 23; నేహాంత్ 5/27, అంకిత్ 2/24), ధ్రువ్ ఎలెవన్:105/3 (ఆశ్లేష్ 50). -
స్పోర్టింగ్ ఎలెవన్ 335 ఆలౌట్
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీఏ ఎ–1 డివిజన్ మూడు రోజుల క్రికెట్ లీగ్‌లో భాగంగా స్పోర్టింగ్ ఎలెవన్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. బుధవారం ఆట రెండోరోజు తొలిఇన్నింగ్స్ ప్రారంభించిన స్పోర్టింగ్ ఎలెవన్ 71 ఓవర్లలో 335 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఎస్బీఐకి 20 పరుగుల ఆధిక్యం లభించింది. స్పోర్టింగ్ ఎలెవన్ బ్యాట్స్‌మన్ భవేశ్ సేత్ (138 బంతుల్లో 104; 16 ఫోర్లు) సెంచరీతో ఆకట్టుకోగా... తనయ్ త్యాగరాజన్ (79), యుధ్వీర్ సింగ్ (57) అర్ధసెంచరీలతో రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో సయ్యద్ అహ్మద్ 5 వికెట్లతో చెలరేగాడు. రవికిరణ్ 3 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఎస్బీఐ ఆటముగిసే సమయానికి 6 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది. నేడు ఆటకు చివరి రోజు. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు ఈఎంసీసీ తొలి ఇన్నింగ్స్: 137 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్: 63/4 (32 ఓవర్లలో), ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ తొలి ఇన్నింగ్స్: 246 (జి. శ్యామ్ సుందర్ 101, ఆర్ఏ విశ్వనాథ్ 67; రాజమణి ప్రసాద్ 3/43, మికిల్ జైస్వాల్ 3/82). జెమిని ఫ్రెండ్స్ తొలి ఇన్నింగ్స్: 135 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్: 36/0, ఎవర్గ్రీన్ తొలి ఇన్నిం గ్స్: 344/8 (కుమార్ ఆదిత్య 113 నాటౌట్, టి. రోహన్ 41; అబ్దుల్ ఖురేషి 4/72). బీడీఎల్ తొలి ఇన్నింగ్స్: 337 ఆలౌట్ (టి. సంతోష్ గౌడ్ 47, ఆకాశ్ సనా 48; శుభమ్ బిస్త్ 6/94), జై హనుమాన్ తొలి ఇన్నింగ్స్: 86/3 (38 ఓవర్లలో). కేంబ్రిడ్జ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 414 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్: 75/2 (23 ఓవర్లలో), ఇండియా సిమెంట్స్ తొలి ఇన్నింగ్స్: 148 (మొహమ్మద్ ఫహాద్ 6/34). దయానంద్ సీసీ తొలి ఇన్నింగ్స్: 246 ఆలౌట్, ఆంధ్రాబ్యాంక్ తొలి ఇన్నింగ్స్: 293/8 (టి. రవితేజ 82, అమోల్ షిండే 102 బ్యాటింగ్). హైదరాబాద్ బాట్లింగ్ తొలి ఇన్నింగ్స్: 197 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్: 60/1 (రవీందర్ 34), కాంటినెంటల్ తొలి ఇన్నింగ్స్: 277 (హృషికేశ్ 66, ఒమర్ మొహమ్మద్ 43; జయరామ్ 3/80, బి. అఖిలేశ్ రెడ్డి 3/68). -
సంకీర్త్ డబుల్ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీఏ ఎ–1 డివిజన్ మూడు రోజుల క్రికెట్ లీగ్‌లో కాంటినెంటల్ సీసీ బ్యాట్స్‌మన్ జి. సంకీర్త్ (380 బంతుల్లో 202; 34 ఫోర్లు) డబుల్ సెంచరీతో దుమ్మురేపాడు. ఎన్ఎఫ్సీ గ్రౌండ్లో జెమిని ఫ్రెండ్స్ జట్టుతో జరుగుతోన్న ఈమ్యాచ్‌లో సంకీర్త్ సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడటంతో కాంటినెంటల్ సీసీ తొలి ఇన్నింగ్స్‌లో భారీస్కోరు సాధించింది. సంకీర్త్‌తో పాటు హర్‡్ష జున్‌జున్‌వాలా (63; 9ఫోర్లు, 1 సిక్స్), హృషికేశ్ (76; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో ఆకట్టుకోవడంతో కాంటినెంటల్ సీసీ 9 వికెట్లకు 491 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ప్రత్యర్థి బౌలర్లలో ఎం. రాధాకృష్ణ 3, ఎన్. అనిరుధ్, ఖురేషి చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన జెమిని ఫ్రెండ్స్ రెండోరోజు బుధవారం ఆటముగిసే సమయానికి 25 ఓవర్లలో వికెట్ నష్టానికి 57 పరుగులతో నిలిచింది. ఇతర మ్యాచ్‌ల వివరాలు కేంబ్రిడ్జ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 174 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్: 129 (మల్లికార్జున్ 31, సర్తాజ్ 34; జయరామ్ 5/81), హైదరాబాద్ బాట్లింగ్: 337 (శ్రీ చరణ్ 50, సయ్యద్ చాంద్ పాషా 157; ఆశిష్ శ్రీవాస్తవ్ 4/124). బీడీఎల్ తొలి ఇన్నింగ్స్: 256 (టి. సంతోష్ గౌడ్ 31; రక్షణ్ రెడ్డి 5/50), ఇన్కమ్ ట్యాక్స్: 323/3 (చరణ్ 115,అక్షత్ రెడ్డి 114). ఏఓసీ తొలి ఇన్నింగ్స్: 481/9 డిక్లేర్డ్, రెండో ఇన్నింగ్స్: 216/4 డిక్లేర్డ్ (శివం తివారి 62, సుమిత్ సింగ్ 46, అమిత్ పచేరా 57), ఇండియా సిమెంట్స్ తొలి ఇన్నింగ్స్: 76 ఆలౌట్ (త్రివేండ్ర 6/21), రెండో ఇన్నింగ్స్: 33/3 (13 ఓవర్లలో). స్పోర్టింగ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 315 (భవేశ్ ఖాన్ 74, యుధ్వీర్ సింగ్ 51; షేక్ సలీమ్ 3/79, భగత్ వర్మ 3/94), ఆర్. దయానంద్ సీసీ: 335/6 (దీపాన్‡్ష బుచర్ 104, బి. యతిన్ రెడ్డి 71 బ్యాటింగ్; తనయ్ త్యాగరాజన్ 3/128). జై హనుమాన్ తొలి ఇన్నింగ్స్: 512/7 డిక్లేర్డ్ (జి.శశిధర్ రెడ్డి 146, ఎన్. సూర్యతేజ 107, ప్రతీక్ రెడ్డి 82; అమోల్ షిండే 3/157, హితేశ్ యాదవ్ 3/151), ఆంధ్రా బ్యాంక్ తొలి ఇన్నింగ్స్: 73/2 (రొనాల్డ్ రోడ్రిగ్స్ 36). ఈఎంసీసీ తొలి ఇన్నింగ్స్: 54/3 (మికిల్ జైస్వాల్ 40), డెక్కన్ క్రానికల్‌తో మ్యాచ్. ఎస్బీఐ తొలి ఇన్నింగ్స్: 268/5 (టి. సుమన్ 44, డానీ డెరెక్ ప్రిన్స్ 84, చైతన్య 51, ఆకాశ్ భండారి 53), ఎస్సీఆర్ఎస్ఏతో మ్యాచ్. ఎంపీ కోల్ట్స్ తొలి ఇన్నింగ్స్: 339/3 (మోహుల్ భౌమిక్ 135, ఎ. వైష్ణవ్ రెడ్డి 72, నిఖిలేశ్ సురేందరన్ 74), ఎన్స్కాన్స్తో మ్యాచ్. -
అభినవ్ డబుల్ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఎ–2 డివిజన్ రెండు రోజుల క్రికెట్ లీగ్‌లో బాలాజీ కోల్ట్స్ బ్యాట్స్‌మన్ జి. అభినవ్ (246 బంతుల్లో 208; 20 ఫోర్లు, 5 సిక్సర్లు) డబుల్ సెంచరీతో చెలరేగాడు. దీంతో సాయిసత్య సీసీ జట్టుతో సోమవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో బాలాజీ కోల్ట్స్ భారీస్కోరు సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బాలాజీ కోల్ట్స్ తొలిరోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 8 వికెట్లకు 442 పరుగులు సాధించింది. అభినవ్ ద్విశతకంతో మెరవగా, ప్రథమేశ్ (90) కొద్దిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. జి. గోపీకృష్ణ రెడ్డి (59), ఎ. జయచంద్ర (39) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో సూరజ్ సక్సేనా 4 వికెట్లు దక్కించుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల వివరాలు ఎంసీసీ: 144 (భాను ప్రకాశ్ 91; ఎన్. నితిన్ సాయి 5/46), హైదరాబాద్ టైటాన్స్: 150/1 (రోహిత్ సాగర్ 86 నాటౌట్). ఫ్యూచర్‌స్టార్: 184 (ఇషాన్‌శర్మ 42; పృథ్వీ రెడ్డి 3/22, రమణ 3/60, ఇబ్రహీం ఖాన్ 3/28), హెచ్‌పీఎస్–బేగంపేట: 116 (డి. సిద్ధార్థ్ ఆనంద్ 31; సందీప్ యాదవ్ 5/55). బడ్డింగ్ స్టార్: 170 (జమీరుద్దీన్ 44, ఫర్హాన్ 40; అమీర్ 3/43, రమావత్ సురేశ్ 5/60), అపెక్స్ సీసీ: 171/5 (విక్రాంత్ 43, నారాయణ 71; తౌసీఫ్ 3/43). డెక్కన్ బ్లూస్: 95 (రాహుల్ 3/15, జె. హరీశ్ కుమార్ 5/38), క్లాసిక్ సీసీ: 93 (సాయితేజ రెడ్డి 37, అక్షయ్ 6/33, దీపక్ 3/23). విశాక సీసీ: 89 (టి. అక్షయ్ 31; కె. చంద్రకాంత్ 4/37, వి. భార్గవ్ ఆనంద్ 5/33), పోస్టల్: 93/1 (టి. విజయ్ కుమార్ 65). జై భగవతి: 195 (పి. శివ 42, మొహమ్మద్ సక్లాయిన్ 59; రోహిత్ గిరివర్ధన్ 5/65, సాత్విక్‌రెడ్డి 3/54), గౌడ్స్ ఎలెవన్:138/4 (సాత్విక్‌రెడ్డి 108). కాంకర్డ్: 336 (వై. సాయి వరుణ్ 62, జి. హేమంత్ 58, ఆర్. ప్రణీత్ 80, టి. ఆరోన్ పాల్; వినయ్ 3/39, అద్నాన్ అహ్మద్ 3/100). సీసీఓబీ: 367/8 (అర్షద్ 59, మీర్జా బేగ్ 136; సౌరవ్ 3/67, వికాస్ 4/103), వీనస్ సైబర్టెక్తో మ్యాచ్. ఖల్సా: 181 (ఆర్యన్ 40; అజ్మత్ ఖాన్ 3/41, ప్రమేశ్ పాండే 4/22), న్యూబ్లూస్: 85/3 (అజిత్ సింగ్ 39, ఆర్యన్ సింగ్ 3/35). నేషనల్: 247 (మొహమ్మద్ ఖాలిద్ 87, ఎస్కే మొహమ్మద్ 47; నితీశ్ 5/70, సుమిత్ 3/39), ఉస్మానియాతో మ్యాచ్. మహమూద్ సీసీ: 285 (హుస్సేన్ 92, భరత్‌రాజ్ 51; మొహమ్మద్ హష్మీ 5/76, విశాల్ సింగ్ 3/92), గ్రీన్‌టర్ఫ్: 13/1 (7 ఓవర్లలో). రోహిత్ ఎలెవన్: 341/9 (సాత్విక్ భరద్వాజ్ 46, అర్జున్ చౌదరి 44, గంగా సింగ్ 43, అబ్దుల్ 50; విశేష్ 4/88), పాషాబీడీతో మ్యాచ్. -
చెలరేగిన ప్రిన్స్, సుమన్
సాక్షి, హైదరాబాద్: ఓపెనర్లు డానీ డారిక్ ప్రిన్స్ (111 బంతుల్లో 103 నాటౌట్; 16 ఫోర్లు, 1 సిక్స్), తిరుమలశెట్టి సుమన్ (98), చెలరేగడంతో హెచ్‌సీఏ ఎ–1 డివిజన్ మూడు రోజుల లీగ్‌లో ఇన్‌కంట్యాక్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ‘డ్రా’ చేసుకుంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన ఎస్బీఐ జట్టుకు 3 పాయింట్లు దక్కగా... ఇన్‌కంట్యాక్స్ జట్టుకు 1 పాయింట్ లభించింది. ఓవర్‌నైట్ స్కోరు 279/5తో మూడో రోజు ఆట కొనసాగించిన ఇన్‌కంట్యాక్స్ జట్టు మరో 41 పరుగులు జతచేసి తొలి ఇన్నింగ్స్‌లో 320 పరుగులకు ఆలౌటైంది. ప్రత్యర్థి బౌలర్లలో రవి కిరణ్ 5, ఆకాశ్ భండారి 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఎస్బీఐ గురువారం ఆట ముగిసే సమయానికి 38 ఓవర్లలో వికెట్ నష్టానికి 269 పరుగులు చేసింది. ప్రిన్స్, సుమన్‌లు ప్రత్యర్థి బౌలర్లను ఆటాడుకున్నారు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. సుమన్ ఔటయ్యాక వచ్చిన కేఎస్కే చైతన్య (51 నాటౌట్) కూడా ధాటిగా ఆడటంతో చివరకు మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. రాణించిన రవీందర్, నిఖిల్... ఇండియా సిమెంట్స్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో హైదరాబాద్ బాట్లింగ్ బ్యాట్స్‌మెన్ రవీందర్ (306 బంతుల్లో 219; 35 ఫోర్లు, 3 సిక్స్‌లు) డబుల్ సెంచరీకి తోడు నిఖిల్ రామ్ రెడ్డి (88; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగడంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 606 పరుగులు చేసింది. ప్రత్యర్థి బౌలర్లలో మారుతి, మూడు వికెట్లు పడగొట్టాడు. ఇండియా సిమెంట్స్ తొలి ఇన్నింగ్స్‌లో 298 పరుగులకు ఆలౌట్ కాగా... రవీందర్, నిఖిల్‌లతో పాటు సయ్యద్ చాంద్ పాషా (83) రాణించడంతో హైదరాబాద్ బాట్లింగ్ భారీ స్కోరు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా సిమెంట్స్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు ఈఎమ్సీసీ తొలి ఇన్నింగ్స్: 267, స్పోర్టింగ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 214 (విఘ్నేశ్ అగర్వాల్ 3/26, మికిలి జైస్వాల్ 3/51), ఈఎమ్సీసీ రెండో ఇన్నింగ్స్: 180/7 (మికిలి జైస్వాల్ 57; ఆంజనేయులు 3/40). పాయింట్లు: ఈఎమ్సీసీ–3, స్పోర్టింగ్ ఎలెవన్–1. ఎవర్గ్రీన్ తొలి ఇన్నింగ్స్: 280, ఎన్స్‌కాన్స్ తొలి ఇన్నింగ్స్: 172, ఎవర్గ్రీన్ రెండో ఇన్నింగ్స్: 208 (బి. మనోజ్ కుమార్ 80; సయ్యద్ మెహదీ హసన్ 4/31), ఎన్స్‌కాన్స్ 181 (రౌల్ రోహాన్ 32, ఒవైస్ 33; నవీన్ 4/21, బుద్ది రాహుల్ 3/49), పాయింట్లు: ఎవర్గ్రీన్–6, ఎన్స్‌కాన్స్–0. ఎంపీ కోల్ట్స్: 257, జెమిని ఫ్రెండ్స్: 403/9 (ఠాకూర్ తిలక్ వర్మ 203 నాటౌట్, ఎన్. అనిరుధ్ 35; గిరీశ్ గౌడ్ 3/72, ఆకాశ్ 3/32), ఎంపీ కోల్ట్స్ రెండో ఇన్నింగ్స్: 176/3 (మేహుల్ భౌమిక్ 51, వైష్ణవ్ రెడ్డి 100 నాటౌట్), పాయింట్లు: జెమిని ఫ్రెండ్స్ 3, ఎంపీ కోల్ట్స్–1. డెక్కన్ క్రానికల్ తొలి ఇన్నింగ్స్: 251, ఆంధ్రాబ్యాంక్ తొలి ఇన్నింగ్స్: 73, డెక్కన్ క్రానికల్ రెండో ఇన్నింగ్స్: 191 (టి. రవితేజ 3/57, కనిష్క్ నాయుడు 3/26), ఆంధ్రాబ్యాంక్ రెండో ఇన్నింగ్స్: 191/4 (ఆశిష్ రెడ్డి 98 నాటౌట్, అమోల్ షిండే 37 నాటౌట్), పాయింట్లు: డెక్కన్ క్రానికల్–3, ఆంధ్రాబ్యాంక్–1. ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ తొలి ఇన్నింగ్స్: 309/9, బీడీఎల్ తొలి ఇన్నింగ్స్: 227 (షేక్ ఖమ్రుద్దీన్ 5/39), ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ రెండో ఇన్నింగ్స్: 214/7 (కపిల్ 32, విశ్వంత్ 47, జగదీశ్ 40, ఎస్కేఎమ్ బాషా 31 నాటౌట్, సధన్ 3/68), పాయింట్లు: ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ–3, బీడీఎల్–1. దయానంద్ సీసీ: 371, జై హనుమాన్: 357/8 (జి. వినీత్ రెడ్డి 35, జి. శశిధర్ రెడ్డి 30, ఎన్. సూర్య తేజ 116 నాటౌట్, కె. సాయి పూర్ణానంద్ రావు 50, ప్రయాస్ సింగ్ 36; షేక్ సలీమ్ 4/67), పాయింట్లు: జై హనుమాన్–3, దయానంద్ సీసీ–1. -
చరణ్, తిలక్ సెంచరీలు
సాక్షి, హైదరాబాద్: ఓపెనర్ ఎంఎస్ఆర్ చరణ్ (192 బంతుల్లో 111; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో అదరగొట్టడంతో హెచ్‌సీఏ ఎ–1 డివిజన్ మూడు రోజుల లీగ్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో జరుగుతోన్న మ్యాచ్‌లో ఇన్‌కంట్యాక్స్ జట్టు దీటుగా బదులిస్తోంది. బుధవారం ఆట ముగిసే సమయానికి ఇన్‌కంట్యాక్స్ 93.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 279 పరుగులు చేసింది. చేతిలో మరో ఐదు వికెట్లు ఉన్న ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 112 పరుగులు వెనుకబడి ఉంది. ఎస్బీఐ తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 14/1తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇన్‌కంట్యాక్స్ జట్టును చరణ్ ఆదుకున్నాడు. రక్షణ్ రెడ్డి (182 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్) తో కలిసి రెండో వికెట్‌కు 137 పరుగులు జోడించి మంచి పునాది వేశాడు. ఓ వైపు చరణ్ బౌండరీలతో చెలరేగుతుంటే రక్షణ్ మాత్రం చాలా నెమ్మదిగా ఆడాడు. ఆ తర్వాత వంశీ వర్ధన్ రెడ్డి (60; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), షాదాబ్ తుంబి (54 బ్యాటింగ్; 8 ఫోర్లు) కూడా రాణించడంతో ఇన్‌కంట్యాక్స్ మంచి స్థితిలో నిలిచింది. ప్రత్యర్థి బౌలర్లలో రవికిరణ్, డానియల్ మనోహర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. తిలక్ వర్మ జోరు... ఎంపీ కోల్ట్స్‌తో జరుగుతున్న మరో మ్యాచ్‌లో జెమిని ఫ్రెండ్స్ జట్టు బ్యాట్స్‌మన్ ఠాకూర్ తిలక్‌వర్మ అజేయ సెంచరీతో అదరగొట్టాడు. తిలక్ సెంచరీ కారణంగా జెమిని ఫ్రెండ్స్ ఆట ముగిసే సమయానికి ఎనిమిది వికెట్లకు 275 పరుగులు చేసింది. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు కాంటినెంటల్ సీసీ తొలి ఇన్నింగ్స్: 80, ఏఓసీ: 341/9 డిక్లేర్డ్ (ఇర్ఫాన్ ఖాన్ 40, లలిత్ మోహన్ 4/101) కాంటినెంటల్ సీసీ రెండో ఇన్నింగ్స్: 170 (హృషికేశ్ 39, సంహిత్ రెడ్డి 40; సచిన్ షిండే 4/30, సాగర్ శర్మ 3/40). ఈఎమ్సీసీ: 267, స్పోర్టింగ్ ఎలెవన్: 207/9 (భవేశ్ సేత్ 112, విఘ్నేశ్ అగర్వాల్ 3/26). ఎవర్గ్రీన్ తొలి ఇన్నింగ్స్: 280, ఎన్స్‌కాన్స్ తొలి ఇన్నింగ్స్: 172 (మెహదీ హసన్ 97, మొహమ్మద్ అజహర్ 37; నవీన్ 3/83, ప్రణీత్‌రెడ్డి 3/41), ఎవర్గ్రీన్ రెండో ఇన్నింగ్స్: 139/2 (జి. విక్రమ్ నాయక్ 41, బి. మనోజ్ కుమార్ 70 బ్యాటింగ్). ఎంపీ కోల్ట్స్: 257, జెమిని ఫ్రెండ్స్: 275/8 (ఎం. అభిరత్ రెడ్డి 47, ఠాకూర్ తిలక్ వర్మ 129 బ్యాటింగ్, రచ్నేశ్ దూబే 32, గిరీశ్ గౌడ్ 3/51, ఆకాశ్ 3/17). డెక్కన్ క్రానికల్ తొలి ఇన్నింగ్స్: 251, ఆంధ్రాబ్యాంక్ తొలి ఇన్నింగ్స్: 73 (టీపీ అనిరుధ్ 5/27, ఎం. పృథ్వీ 3/37), డెక్కన్ క్రానికల్ రెండో ఇన్నింగ్స్: 152/7 (పి. సాయి వికాస్ రెడ్డి 68). ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ: 309/9 (రఫూస్ రోడ్రిగ్స్ 33 నాటౌట్, సుదీప్ త్యాగి 3/57, ఆకాశ్ సన 3/71) బీడీఎల్: 227/9 (ప్రతీక్ పవార్ 40, కె. సుమంత్ 56, షేక్ ఖమ్రుద్దీన్ 4/39). ఇండియా సిమెంట్స్: 298, హైదరాబాద్ బాట్లింగ్: 313/5 (సాయి ప్రణయ్ 39, రోహన్ 75, రవిందర్ 104 బ్యాటింగ్, నిఖిల్ 31 బ్యాటింగ్). దయానంద్ సీసీ: 371 (భగత్ వర్మ 71, కార్తికేయ 3/57), జై హనుమాన్: 181/5 (జి. వినీత్ రెడ్డి 35, జి. శశిధర్ రెడ్డి 30, ఎన్. సూర్య తేజ 45 బ్యాటింగ్). -
గుణ విజృంభణ
సాక్షి, హైదరాబాద్: సన్‌షైన్ బౌలర్ గుణ (6/7)తో చెలరేగడంతో ఆ జట్టు ఘన విజయం సాధించింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా కాస్మోస్ జట్టుతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో 128 పరుగుల తేడాతో సన్‌షైన్ జట్టు గెలుపొందింది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌షైన్ జట్టు 34 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది. ఫ్రీజన్ (45) రాణించాడు. కాస్మోస్ బౌలర్లలో రమేశ్, మోహన్ చెరో 3 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం గుణ బౌలింగ్ దాటికి కాస్మోస్ జట్టు 15 ఓవర్లలో 33 పరుగులు మాత్రమే చేసి ఓడిపోరుుంది. గుణ కేవలం 7 పరుగులిచ్చి 6 వికెట్లను దక్కించుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు విజయ్‌పురి విల్లోమెన్: 242 (విజయ్ కుమార్ 62, విక్రమ్ 46; యశ్వర్ధన్ 3/49, అమర్నాథ్ 3/54), ఎస్ఎన్ గ్రూప్: 151 (చంద్రలోక్ 4/35). ఎలెవన్ మాస్టర్స్: 105 (ఆర్ఆర్ మల్లికార్జున్ 5/30), రుషిరాజ్ సీసీ: 106/1 (అలీ బేగ్ 39 నాటౌట్, సయ్యద్ అస్మత్ 32 నాటౌట్). సదరన్ స్టార్స్: 153/8 (స్వరూప్ 42; నర్సింహా 3/33), పీఎస్వైసీసీ: 155/3 (సయ్యద్ నూర్ ముజస్సిమ్ 44, భాను 71 నాటౌట్). సౌతెండ్ రేమండ్‌స: 143 (అబ్దుల్లా 35; సిద్ధార్థ్ మిట్టల్ 5/30), విక్టోరియా సీసీ: 125 (సిద్ధార్థ్ మిట్టల్ 42; ఒమర్ 3/7). రోషనారా: 299/9 (ముకేశ్ 52, శ్రీకాంత్ 79, ఇర్ఫాన్ 64; నవీన్ 3/56), తారకరామ సీసీ: 216 (యోగి 65, శ్రావణ్ 51; కునాల్ 3/38, అమీర్ 3/32, బిజయ్ 3/33). ఇంపీరియల్:102 (చిరంజీవి 36; రాజ్ 6/22), లాల్ బహదూర్ సీసీ: 103 (శ్రీధర్ 70 నాటౌట్). సత్య సీసీ: 79 (అబ్దుల్ యూసుఫ్ 4/22), షాలిమార్ సీసీ: 82/2 (దేవేశ్ 35). సూపర్‌స్టార్స్: 203/7 (రోహిత్ రెడ్డి 40, శ్రీకాంత్ గౌడ్ 52 నాటౌట్; భవన్ 3/25), కన్సల్ట్ సీసీ: 204/6 (రాహుల్ 74, భాను 38; రోహిత్ 4/28). సెరుుంట్ మేరీస్:165 (శైలేందర్ కుమార్ 44, కల్యాణ్ 31; మానస్ 3/35, సుధీర్ 5/40), నవ్‌జీవన్ ఫ్రెండ్స: 166/7 (రాజ 42; రాఘవ్ 5/48). పికెట్ సీసీ: 252/9 (శాశ్వత్ 61, నాగ నితిన్ 40; రోహిత్ యాదవ్ 5/30), హైదరాబాద్ వాండరర్స్: 112 (అక్షయ్ 60; తాత్విక్ 5/22). -
సచిన్ కుమార్ సెంచరీ వృథా
సాక్షి, హైదరాబాద్: ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో పి.ఎన్.యంగ్‌స్టర్స్ 2 వికెట్ల తేడాతో ఆడమ్స్ ఎలెవన్‌పై గెలిచింది. ఆడమ్స్ బ్యాట్స్‌మెన్ సచిన్ కుమార్ (101), జయంత్ (80)లు వీరవిహారం చేసినప్పటికీ ప్రత్యర్థి ముందు భారీలక్ష్యాన్ని నిర్దేశించలేకపోవడంతో ఓటమి ఎదురైంది. మొదట ఆడమ్స్ జట్టు 5 వికెట్లకు 251 పరుగులు చేసింది. సచిన్ సెంచరీతో కదంతొక్కాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన పి.ఎన్.యంగ్‌స్టర్స్ 35.3 ఓవర్లలోనే 7 వికెట్లు కోల్పోరుు 252 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ శ్రీకాంత్ (96) మెరుపు ఆరంభాన్నివ్వ గా, నరసింహ (51), హసీబ్ (41) రాణించారు. ఆడమ్స్ బౌలర్లలో దుర్గేశ్ 3, మాజిద్ 2 వికెట్లు తీశారు. మరో మ్యాచ్‌లో సీకే బ్లూస్ బౌలర్ అశ్వద్ రాజీవ్ (6/18) ధాటికి సఫిల్‌గూడ బ్యాట్స్‌మెన్ విలవిల్లాడారు. దీంతో సీకే బ్లూస్ జట్టు 254 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట సీకే బ్లూస్ 347 పరుగుల వద్ద ఆలౌటైంది. సుశాంత్ (110), సాయి సుశాంత్ (81), బాలకృష్ణ (56 నాటౌట్) చెలరేగారు. తర్వాత సఫిల్‌గూడ 93 పరుగులకే కుప్పకూలింది. అశ్వద్ రాజీవ్ 6, ప్రతీక్ 3 వికెట్లు తీశారు. ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్ స్కోర్లు క్లాసిక్ సీసీ: 36 (మహతాబ్ అలమ్ 6/20), డబ్ల్యూ ఎంసీసీ: 152/8 (అజయ్ సింగ్ 81 బ్యాటింగ్; నాగ నరసింహ 5/60). ఎంసీసీ: 82 (ఫాతిమా రెడ్డి 5/17), తెలంగాణ సీసీ: 356/2 (ఫాతిమా రెడ్డి 55, రాకేశ్ నాయక్ 159, రాహుల్ 119 బ్యాటింగ్). గ్రీన్‌టర్ఫ్: 265/9 డిక్లేర్డ్ (ఓవైస్ అబ్దుల్ వాహిద్ 37, సయ్యద్ షాబాజుద్దీన్ 51, అక్షయ్ కుమార్ 65; ఆశిష్ బాలాజీ 4/50), పీకేఎంసీసీ: 100/6 (వివేకానంద్ 44; త్రిశాంత్ గుప్తా 3/36). చీర్‌ఫుల్ చమ్స్: 256/9 డిక్లేర్డ్ (అభిషేక్ 31, సాయి ప్రఫుల్ 78, మోహన్ కుమార్ 50; అక్తర్ 3/34, నితీశ్ కుమార్ 4/102), ఎలిగెంట్ సీసీ: 58/3 (నిఖిల్ రెడ్డి 31). దక్కన్ బ్లూస్: 71 (సుమిత్ జోషి 3/10), నేషనల్ సీసీ:181/9 (సారుురాజ్ 78, వరుణ్ రెడ్డి 43 బ్యాటింగ్; సంపత్ కుమార్ 4/58). -
రాణించిన శివ
⇒ ఆల్ సెయింట్స్ గెలుపు ⇒ ఎ-డివిజన్ వన్డే లీగ్ హైదరాబాద్: శివ (131 బంతుల్లో 80; 3 ఫోర్లు) రాణించడంతో ఆల్‌సెయింట్స్ హైస్కూల్ 3 పరుగుల తేడాతో యంగ్ మాస్టర్ జట్టుపై విజయం సాధించింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేపట్టిన ఆల్‌సెయింట్స్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 189 పరుగులు చేసింది. సాత్విక్ రెడ్డి 33, సయ్యద్ ఇబ్రహీం 22 పరుగులు చేశారు. ప్రఫుల్ 3, రాహుల్ 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన యంగ్ మాస్టర్స్ జట్టు 45.4 ఓవర్లలో 186 పరుగుల వద్ద ఆలౌటైంది. సూరి (55) అర్ధసెంచరీ చేయగా, విష్ణువర్ధన్ 36, ప్రఫుల్ కుమార్ 36 పరుగులు చేశారు. ముస్తాక్ అహ్మద్, సాత్విక్, ముజ్తాబా తలా 2 వికెట్లు తీశారు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు అను సీసీ: 267 (జై మాన్సింగ్ 89, రోహిత్ భగత్ 45; పృథ్వి 3/52), భారతీయ సీసీ: 214 (చంద్రశేఖర్ 52, తుషార్ 31; రోహిత్ భగత్ 5/20). మహావీర్ సీసీ: 128 (బాలాజీ 51; వివేక్ 5/14, విష్ణు 5/18), ఆర్జేసీసీ:132/7 (వివేక్ 45 నాటౌట్). టీమ్ కున్: 180/7 (సహస్ర రెడ్డి 95; అభినవ్ 5/31), తారకరామ: 98 (అనిరుధ్ 5/29, ధీరజ్ 3/15). విజయ్ సీసీ: 215/9 (అర్జున్ కుమార్ 119, హర్ష్ 3/32, రుత్విక్ 3/55), సఫిల్‌గూడ: 66 (అర్జున్ 3/33, ఫరీద్ బాబా 5/30). హైదరాబాద్: 326/5 (సౌభిక్ 110 నాటౌట్, మానవ్ 48, పీయూశ్ 33), సత్యం కోల్టస్: 90 (రంగస్వామి 4/17). -
సలీమ్ నగర్ జట్టు గెలుపు
సాక్షి, హైదరాబాద్: బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్లు రాణించడంతో ఎ- డివిజన్ రెండు రోజుల లీగ్‌లో సలీమ్‌నగర్ జట్టు ఘనవిజయాన్ని సాధించింది. హెచ్‌బీసీసీ జట్టుపై 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. శుక్రవారం 8/0 ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్‌సను ప్రారంభించిన సలీమ్‌నగర్ జట్టు 48 ఓవర్లలో 246 పరుగులు చేసింది. పుష్కర్ (54), జమీరుద్దీన్ (60) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. హెచ్‌బీసీసీ బౌలర్లలో దాస్, భరత్ 3 వికెట్లు తీశారు. అంతకుముందు తొలి ఇన్నింగ్సలో 184 పరుగులు చేసిన హెచ్‌బీసీసీ జట్టు రెండో ఇన్నింగ్సలో 21.3 ఓవర్లలో 77 పరుగులకు ఆలౌటై కేవలం 16 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది. సలీమ్‌నగర్ జట్టు రెండో ఇన్నింగ్సలో 1.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. ఇతర మ్యాచ్‌ల వివరాలు.. రోహిత్ ఎలెవన్: 251/4 (తన్మయ్ 86 నాటౌట్, అంకుర్ 76 నాటౌట్); అపెక్స్ సీసీ: 54 (శివకాంత్ 8/20), రెండో ఇన్నింగ్స: 34/1 క్రౌన్ సీసీ: 55 (సౌరవ్ కుమార్ 5/20), రెండో ఇన్నింగ్స 92/4 (రాజా 40); బడ్డింగ్ స్టార్: 226/4 (సన్నీ 80, భరత్ 50, సంజయ్ 33). డెక్కన్ బ్లూస్: 125, రెండో ఇన్నింగ్స:109 (అఖిలేశ్ 33, ఆబిద్ 6/30); బాలాజీ కోల్టస్:114 (సచిన్ కులకర్ణి 4/22, సంపత్ 5/33). నిజాం కాలేజ్: 225 (అన్వేష్ రెడ్డి 100; సుమిత్ 5/49, కేశవులు 3/40), రెండో ఇన్నింగ్స 55/1; నేషనల్ సీసీ: 185 (నరేశ్ 53, ఆకాశ్ సింగ్ 37 నాటౌట్; అక్షయ్ 3/65, అన్వేష్ 4/35). -
హడలెత్తించిన అనిరుధ్
సాక్షి, హైదరాబాద్: గౌడ్స్ ఎలెవన్ బౌలర్ అనిరుధ్ శ్రీవాస్తవ (5/71) విజృంభించడంతో ఎవర్గ్రీన్ బ్యాట్స్‌మెన్ విలవిల లాడారు. ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో రెండో రోజు ఆటలో ఎవర్గ్రీన్ జట్టు 225 పరుగుల వద్ద ఆలౌటైంది. జితేందర్ త్యాగి 44, చందన్ సహాని 47 పరుగులు చేశారు. భౌమిక్ (33 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. గౌడ్స్ ఎలెవన్ జట్టుకు 62 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. మొదటి రోజు ఆటలో గౌడ్స్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్‌లో 287 పరుగులు చేసింది. మరో మ్యాచ్‌లో కాంటినెంటల్ బౌలర్ మనీష్ (5/73) చెలరేగడంతో గుజరాతీ జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. రెండో రోజు బ్యాటింగ్‌కు దిగిన గుజరాతీ జట్టు 67.3 ఓవర్లలో 220 పరుగులు చేసి ఆలౌటైంది. రోహిత్ రెడ్డి (59), ఆదిత్య (65) అర్ధసెంచరీలతో రాణిం చగా... శ్రవణ్ కుమార్ 34 పరుగులు చేశాడు. తొలిరోజు ఆటలో కాంటినెంటల్ జట్టు 94.3 ఓవర్లలో 236 పరుగులు చేసింది. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు ఏఓసీ: తొలి ఇన్నింగ్స్ 481/9 (విష్ణు తివారి 80; సతీశ్ 3/89, యశ్‌పురి 3/114), జెమినీ ఫ్రెండ్స్: 99 (కోటేశ్వర్ రావు 3/26), ఫాలో ఆన్: 5/1 (1.5 ఓవర్లు). స్పోర్టింగ్ ఎలెవన్: 395/9 డిక్లేర్డ్ (సూర్యప్రసాద్ 37; రవితేజ 4/86), ఎంపీ కోల్ట్స్: 218/6 (హర్ష జున్‌జున్‌వాలా 51, నిఖిల్ యాదవ్ 30, రవితేజ 77 బ్యాటింగ్, ప్రణీత్ 38; సాత్విక్ రెడ్డి 3/72). -
ఎంసీసీ 231 ఆలౌట్
సాక్షి, హైదరాబాద్: ఎలిగెంట్ సీసీ బౌలర్ అశ్విన్ విజయ్ (6/44) చెలరేగడంతో ఎ డివిజన్ రెండు రోజుల లీగ్‌లో ఎంసీసీ జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎంసీసీ జట్టు 74.5 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. సంతోష్ (80 బంతుల్లో 81; 11 ఫోర్లు), ముకుంద్ (139 బంతుల్లో 50; 4 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించారు. ఎలిగెంట్ సీసీ బౌలర్లలో నిహాల్ 3 వికెట్లు, నితీష్ కుమార్ ఒక వికెట్ పడగొట్టారు. ఎ-డివిజన్ వన్డే లీగ్ మ్యాచ్‌లో వెంకట చైతన్య (7/12) చెలరేగడంతో కన్సల్ట్ సీసీ 106 పరుగుల తేడాతో సఫిల్‌గూడ సీసీపై ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కన్సల్ట్ సీసీ 48.2 ఓవర్లలో 158 పరుగులు చేసి ఆలౌటైంది. నజీర్ 37, చెన్నారావు 33 పరుగు లు చేయగా... ప్రత్యర్థి బౌలర్లలో నిశాంత్ 4, కార్తీక్, జయంత్ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన సఫిల్‌గూడ సీసీ 21.2 ఓవర్లలో 52 పరుగులకే కుప్పకూలింది. హర్ష (20) మినహా ఇంకెవరూ రెండంకెల స్కోర్లు చేయలేదు. వెంకట చైతన్య చక్కని స్పెల్ (8.2-3-12-7)తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను వణికించాడు. భవన్ రెడ్డికి 3 వికెట్లు దక్కాయి. -
శశి, సుమిత్‌ల శ్రమ వృథా
హైదరాబాద్: సెయింట్ ప్యాట్రిక్స్ బౌలర్లు సుమిత్ కుమార్ (5/72), శశి కుమార్ యాదవ్ (5/50) విజృంభించినా... బ్యాటింగ్ వైఫల్యంతో జట్టు ఓడిపోయింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో స్వస్తిక్ యూనియన్ 118 పరుగుల తేడాతో సెయింట్ ప్యాట్రిక్స్‌పై గెలిచింది. మొదట స్వస్తిక్ యూనియన్ 234 పరుగుల వద్ద ఆలౌటైంది. మోహిత్ (66) రాణించగా, విజయ్ 35, ఈశ్వర్ 28 పరుగులు చేశారు. సుమిత్, శశిలిద్దరూ ఐదేసి వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన సెయింట్ ప్యాట్రిక్స్ 116 పరుగులకే కుప్పకూలింది. స్వస్తిక్ బౌలర్లలో శివరుద్ర 5, విజయ్ 3, ఈశ్వర్ 2 వికెట్లు పడగొట్టారు. మరో మ్యాచ్‌లో విశాల్ కృష్ణ శతకంతో మహావీర్ జట్టు 235 పరుగుల తేడాతో ఆల్ సెయింట్స్ హైస్కూల్‌పై జయభేరి మోగించింది. తొలుత మహావీర్ 396 పరుగుల భారీస్కోరు చేసింది. సురేశ్ వికాస్ (91) రాణించాడు. ఆల్‌సెయింట్స్ బౌలర్ ముజ్తాబా మొహమ్మద్ 6 వికెట్లు తీశాడు. తర్వాత బరిలోకి దిగిన ఆల్ సెయింట్స్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 161 పరుగులే చేయగల్గింది. సాత్విక్ రెడ్డి (48), శివ (32) మెరుగ్గా ఆడారు. ప్రేమ్ సుందర్ 4, విజేందర్ రెడ్డి 2 వికెట్లు తీశారు. -
విజృంభించిన శివ: ఆజాద్ సీసీ గెలుపు
సాక్షి, హైదరాబాద్: వై. శివ (6/23) విజృంభించడంతో ఆజాద్ సీసీ 8 వికెట్ల తేడాతో సెయింట్ మేరీస్‌పై ఘనవిజయం సాధించింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేపట్టిన సెయింట్ మేరీస్ 33.2 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. శివ ధాటికి ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. తర్వాత ఆజాద్ సీసీ 13.5 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 83 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. హుస్సేన్ 42, ఇస్మాయిల్ 33 పరుగులు చేశారు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు: అభినవ్ కోల్ట్స్: 264 (సుందర్ 50, అజ్మత్ అలీ 72; తరుణ్ 6/33), లాల్‌బహదూర్ పీజీ: 124 (తరుణ్ 74; సాయిప్రసాద్ 4/46, అషీర్ 5/42). రెడ్‌హిల్స్: 249/8 (అద్నాన్ 88, జాఫర్ 43; గుల్షన్ 3/51, రాజశేఖర్ 3/51). తిరుమల సీసీ: 128/6 (రిత్విక్ 41). హెచ్‌సీఏ అకాడమీ: 318/9 (సాత్విక్ రెడ్డి 89, సత్య 55, శ్రీనివాస్ రావు 44), విజయ్ సీసీ: 159/9 (శృతీశ్ రెడ్డి 3/23). అమీర్‌పేట్ సీసీ: 236/8 (గుర్విందర్ సింగ్ 103, భార్గవ్ రెడ్డి 64; అవినాశ్ 5/35), స్టార్లెట్స్ సీసీ: 164 (సృజన్ 33; నైరుత్ రెడ్డి 3/36, సుశీల్ 3/29). ఆర్జేసీసీ: 128 (కరణ్ 4/22), ఎంపీ స్పోర్టింగ్: 130/6 (రాజశేఖర్ 30; శ్రీధర్ 3/24). టీమ్‌కున్: 185 (సహస్ర 61, విఘ్నేశ్వర్ 52; ఫజల్ 3/10), ఎల్‌ఎన్‌సీసీ: 186/8 (గంగాధర్ 66, ఓబుల్ రెడ్డి 36). యాదవ్ డెయిరీ: 163/9 (ప్రణవ్ 51 నాటౌట్; అఖిలేశ్ 4/37), తారకరామ: 169/5 (నవీన్ కుమార్ 63). మయూర్ సీసీ: 196/6 (విరించి యాదవ్ 85), ఎస్కే బ్లూస్: 143 (యాకుబ్ 53; గోవర్ధన్ 5/30). యంగ్మాస్టర్స్: 177/8 (విశాల్ 44), డెక్కన్ కోల్ట్స్: 134 (నరేంద్ర 39; రిచి 4/28, ప్రఫుల్ 3/21). -
చెలరేగిన తౌసీఫ్
హైదరాబాద్: ఎ డివిజన్ రెండు రోజుల లీగ్‌లో రోహిత్ ఎలెవన్ బౌలర్ తౌసీఫ్ బంతితో విజృంభించాడు. శుక్రవారం జరిగిన రెండో రోజు ఆటలో 4 వికె ట్లు పడగొట్టి బ్రదర్స్ ఎలెవన్ జట్ల బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ ఎలెవన్ జట్టు 85.5 ఓవర్లలో 8 వికెట్లకు 251 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. ఆరిఫ్ (72), ఆరి్ఫ్ మొహమ్మద్ (51) అర్ధసెంచరీలతో రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కుదిగిన బ్రదర్స్ ఎలెవన్ తౌసీ్ఫ్ ధాటికి 26 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 41 పరుగులు మాత్రమే చేసింది. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు విశాక సీసీ: 161 (లియాఖత్ హుస్సేన్ 37, సాయి అనూప్ 38; శ్రీకిర ణ్ 6/47); సాయి సత్య: 192/5 (సాయి సందీప్ 82, శివ దత్తా 32; షేక్ ఇబ్రహీం 3/45). టీమ్‌స్పీడ్: తొలి ఇన్నింగ్స్ 166/9 డిక్లేర్డ్, రెండో ఇన్నింగ్స్ 104/3 (సాగర్ 86 నాటౌట్); శ్రీచక్ర: 169/9 డిక్లేర్డ్ (అబ్దుల్ ఖురేషి 88; రన్‌ధీర్ కుమార్ 4/47). డెక్కన్ వాండరర్స్: 251/9 డిక్లేర్డ్; ఉస్మానియా: 104/9 (ఆశిష్ 48, హర్షవర్ధన్ 15), ఫాలోఆన్ 171/7(సిద్ధాంత్ 47, బరణ్ కుమార్ 36 నాటౌట్; అతుల్ వ్యాస్ 3/22). న్యూబ్లూస్: 219; అవర్స్ సీసీ: 101/2 (అభిలాష్ 37నాటౌట్, రాజేందర్ 38). బడ్డింగ్ స్టార్: తొలి ఇన్నింగ్స్ 138, రెండో ఇన్నింగ్స్ 75/1 (జునైద్ 51); శ్రీ శ్యామ్: 226 (సయ్యద్ అలీ 82, వినయ్ 35, మాజిద్ 30; ఈశ్వర్ 4/74). జైభగవతి: 184/8 డిక్లేర్డ్ (తుషార్ 86; శ్రీవాస్ శుభమ్ 4/46); అపెక్స్ సీసీ: 142/2 (కిష్టారెడ్డి 58, శ్రీవాస్ 65). ఖల్సా సీసీ: 216/7 (రంజిత్ 40, భవేశ్ 57, జితేందర్ 61, ఓంపాల్ 33; సూర్య తేజ 5/44); మెగా సిటీ: 34/8. -
టైటాన్స్‌ను గెలిపించిన గౌరవ్
ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్ సాక్షి, హైదరాబాద్: ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో హైదరాబాద్ టైటాట్స్ ఆటగాడు గౌరవ్ శర్మ (49 పరుగులు, 6/36, 5/30 వికెట్లు) ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 11 వికెట్లు పడగొట్టాడు. దీంతో టైటాన్స్ 150 పరుగుల తేడాతో క్లాసిక్‌పై ఘనవిజయం సాధించింది. మొదటి రోజు టైటాన్స్ తొలి ఇన్నింగ్స్‌లో 99 పరుగులు, క్లాసిక్ 64 పరుగులు చేసి ఆలౌటయ్యాయి. మంగళవారం 107/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన టైటాన్స్ రెండో ఇన్నింగ్స్‌లో 203 పరుగుల వద్ద ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని (35) కలుపుకొని ప్రత్యర్థి ముందు 239 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన క్లాసిక్... గౌరవ్ దెబ్బకు రెండో ఇన్నింగ్స్‌లో 88 పరుగుల వద్ద ఆలౌటైంది. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు అక్స్‌ఫర్డ్ బ్లూస్ తొలి ఇన్నింగ్స్: 136, చీర్‌ఫుల్ చమ్స్ తొలి ఇన్నింగ్స్: 318/5 డిక్లేర్డ్, ఆక్స్ఫర్డ్ రెండో ఇన్నింగ్స్: 139/4 (రమేశ్ నాయక్ 66, శామ్యూల్ 34). డబ్ల్యూఎంసీసీ తొలి ఇన్నింగ్స్: 87, ఎలిగెంట్ తొలి ఇన్నింగ్స్: 112, డబ్ల్యూఎంసీసీ రెండో ఇన్నింగ్స్: 60 (హబీబ్ 38; అద్నాన్ 6/29), ఎలిగెంట్ రెండో ఇన్నింగ్స్: 36/3. రాజు సీసీ తొలి ఇన్నింగ్స్: 188, హెచ్‌యూసీసీ తొలి ఇన్నింగ్స్: 147/9 డిక్లేర్డ్ (జగదీశ్ రెడ్డి 5/33), రాజు సీసీ రెండో ఇన్నింగ్స్: 76/7 (కార్తీక్ 3/29). -
శతక్కొట్టిన ఫయాజ్, నదీమ్
పాషా బీడి 413/9 డిక్లేర్డ్ ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్ హైదరాబాద్: పాషా బీడి బ్యాట్స్‌మెన్ ఫయాజ్ (174 బంతుల్లో 152; 19 ఫోర్లు, 2 సిక్సర్లు), నదీమ్ (131 బంతుల్లో 115; 15 ఫోర్లు) సెంచరీలతో కదంతొక్కారు. ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో శనివారం ఎంసీసీ జట్టుతో మొదలైన ఈ మ్యాచ్‌లో పాషా బీడి భారీస్కోరు సాధించింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 86.1 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 413 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. అభినవ్ 34, జయచంద్ర 33 పరుగులు చేశారు.