dubbing artist
-
నా కూతురు చూసిన ఒకే ఒక్క సినిమా ఆదిపురుష్: నటుడు
ప్రభాస్ కెరీర్లో అత్యంత డిజాస్టర్ మూవీ ఆదిపురుష్. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏమాత్రం ఆదరించలేదు. నిర్మొహమాటంగా తిరస్కరించారు. అయితే తన కూతురు మాత్రం ఇప్పటివరకు చూసిన ఏకైక సినిమా ఆదిపురుష్ అంటున్నాడు బాలీవుడ్ నటుడు, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ శరద్ కేల్కర్.ఇదే బెటర్తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. 'నేను ఏయే సినిమాలు చేశాను, అసలు ఏం చేస్తున్నాననేది నా కూతురు కేశ పెద్దగా పట్టించుకోదు. అసలు నేను నటించిన సినిమాలే చూడదు. టీవీ షోలు, సినిమాలపై అంతగా ఆసక్తి చూపించదు. కాబట్టి నా వృత్తేంటో తనకు తెలియదు. ఒకరకంగా చెప్పాలంటే ఇదే నయం. తనిలా అమాయకంగా ఉంటేనే బాగుంటుంది. సమయం వచ్చినప్పుడు నేనేంటో, నా పాపులారిటీ ఎలా ఉంటుందో తనకు నేనే పరిచయం చేస్తాను.గొంతు గుర్తుపట్టిందిఅప్పటివరకు అందరు పిల్లల్లాగే తను కూడా బాల్యాన్ని సాధారణ బాలికలా ఎంజాయ్ చేయాలి. తను ఇంతవరకు నా సినిమాలేవీ చూడలేదు. ఆమె చూసిన ఏకైక చిత్రం ఆదిపురుష్. అప్పుడప్పుడు యానిమేషన్ చిత్రాలు మాత్రమే చూస్తూ ఉంటుంది. ఆదిపురుష్ మూవీలో నా గొంతును గుర్తుపట్టి ఆశ్చర్యపోయింది. ఇప్పుడు తను ఎదుగుతోంది కాబట్టి నెమ్మదిగా యాక్షన్ కామెడీ సినిమాలు కూడా చూపించడం మొదలుపెడతాను' అని చెప్పుకొచ్చాడు.నటుడిగా, వాయిస్ ఆర్టిస్టుగాశరద్ కేల్కర్ మొదట్లో సీరియల్స్‌లో నటించాడు. తర్వాత సినిమాలకు షిఫ్ట్ అయ్యాడు. హిందీ, మరాఠీ చిత్రాల్లో ఎక్కువగా నటిస్తున్నాడు. తెలుగులో సర్దార్ గబ్బర్ సింగ్‌లో రాజా భైరవ్ సింగ్‌గా మెప్పించాడు. ఇటీవలే అయలాన్ చిత్రంతో తమిళంలో ఎంట్రీ ఇచ్చాడు. పలు హాలీవుడ్ సినిమాల్లోని పాపులర్ పాత్రలకు హిందీలో డబ్బింగ్ చెప్పాడు. అలాగే రామ్‌చరణ్ (వినయ విధేయ రామ), ప్రభాస్ (సలార్, బాహుబలి 1, 2, ఆదిపురుష్)కు హిందీలో డబ్బింగ్ చెప్పాడు. దసరా హిందీ వర్షన్లో నానికి గొంతు అరువిచ్చాడు.చదవండి: ఇండస్ట్రీలోకి రావాలనుకునే వారికి వర్మ ఆహ్వానం.. జూన్ 9న లిస్ట్ విడుదల -
ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అనంతరాం కన్నుమూత
ప్రముఖ తెలుగు డబ్బింగ్ , వాయిస్ ఆర్టిస్ట్ అత్తిలి అనంతరాం శనివారం అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. అడ్వర్టైంజింగ్ రంగంలో సుమారు 40 ఏళ్లకు పైగా సేవలందించిన అనంతరాం కొన్ని వందల యాడ్స్‌కు, కార్పోరేట్ ఫిల్మ్స్‌కు వాయిస్ ఇవ్వడంతో పాటు స్క్రిప్ట్ కూడా అందించారు. అమితాబ్, సచిన్,మహేశ్‌బాబు వంటి బిగ్ సెలబ్రెటీలతో పాటు అనేక బాలీవుడ్ స్టార్ల ప్రకటనలకు వాయిస్ అందించారు. 2012లో జరిగిన IPL మ్యాచ్‌కి సంబంధించిన పాటను తెలుగులో రాయడమే కాకుండా స్వయంగా తానే పాట పాడటం మరో విశేషం. నేషనల్, ఇంటర్నేషనల్ యాడ్ ఏజన్సీలన్నీ ఎక్కువశాతం ముంబయ్‌లో ఉంటాయి. అక్కడ తెలుగు వాయిస్‌లకు, రైటింగ్స్కు మంచి డిమాండ్. దీంతో స్వస్థలం హైదరాబాద్ నుంచి ముంబయ్ చేరుకుని 40 ఏళ్లుగా ఇదే రంగంలో ఉంటున్నారు. తెలుగుపై అత్యంత మక్కువ కలిగిన వ్యక్తి. హైదరాబాద్‌లో తెలుగుకు సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా తరచూ హాజరవుతూ ఉండేవారు. తెలుగు అడ్వర్టైజింగ్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న అత్తిలి అనంతరాం దూరం కావడం తమకు తీరని లోటని పలు యాడ్ సంస్థలు తమ సంతాపాన్ని తెలిపాయి. -
దశాబ్ది ఉత్సవాలు: తెలుగు సినిమా, సీరియల్స్ డబ్బింగ్ కళాకారుల సందడి!
హైదరాబాద్: శ్రీ నగర్ కాలనీ శ్రీ సత్యసాయి నిగమాగమంలో డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెలుగు సినిమా, సీరియల్స్‌కి సంబంధించిన డబ్బింగ్ కళాకారులు పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. DAATT అధ్యక్షుడు, ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ RCM రాజు మాట్లాడుతూ ఇన్ని గళాలతో కలిసి పండగ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది, రోజంతా బిజీగా గడిపే మా జీవితాలకు అన్ని పండగలు కలిసి ఓకే రోజు చేసుకున్నట్టుగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా సీనియర్ నటి రోజా రమణి, తెలుగు టెలివిజన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ వినోద్ బాల, కాదంబరి కిరణ్, మ్యూజిక్ డైరెక్టర్ బంటి , DAATT కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్ వర్మ, టీవీ విఎస్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: ‘మ్యూజింగ్ ఆఫ్ ఏ టీనేజ్ గర్ల్’ ఆవిష్కరణ -
దిక్కులేని అనాథలా నటుడి మరణం.. చివరి చూపునకు ఎవరూ రాలే!
మలయాళ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ కేడీ జార్జ్ అనారోగ్యంతో డిసెంబర్ 29న మరణించాడు. తనను చివరి చూపు చూసుకోవడానికి, అంత్యక్రియలు జరిపేందుకు కుటుంబసభ్యులు, బంధువులెవరూ ముందుకు రాలేదు. రెండు వారాలుగా మార్చురీలోనే ఆయన శవం కుళ్లిపోతోంది. దీంతో డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ చొరవ తీసుకుని ప్రభుత్వాన్ని సంప్రదించింది. ప్రభుత్వ జోక్యంతో సంక్రాంతి పండగరోజే ఆయన మృతదేహానికి అంత్యక్రియలు జరిపారు. సొంతిల్లు.. వెళ్లడానికి డబ్బు లేదు జార్జ్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రముఖ నిర్మాత జి. శిబు సుశీలన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. '1993లో ఏవీఎమ్ స్టూడియోలోని ఎడిటింగ్ రూమ్‌లో తొలిసారి జార్జ్‌ను కలిశాను. సినిమాలపై ఆసక్తితో అతడు చెన్నై నుంచి కేరళ వచ్చేశాడు. గంభీరమైన కంఠంతో మాట్లాడే అతడి స్వరాన్ని ఇట్టే గుర్తుపట్టవచ్చు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పేరు గడించాడు. తనకు చెన్నైలో సొంతిల్లు ఉంది. కానీ అక్కడికి వెళ్లడానికి డబ్బు లేదని ఆయన నాతో చెప్పిన మాట నాకింకా గుర్తుంది. సినిమాల ద్వారా తనకు పెద్దగా డబ్బులు వచ్చేవి కావు. సొంతింటికి వెళ్లి బతకాలన్న కోరిక అలాగే మిగిలిపోయింది. డిసెంబర్ 27న ఆస్పత్రిలో.. కరోనా సమయంలో చాలా ఇబ్బందులు పడ్డాడు. ఫెఫ్కా(డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్) వంటి కొన్ని సంస్థల సాయం వల్ల బతుకుబండి లాగించాడు. ఆ తర్వాత తిరిగి సినిమా ప్రాజెక్టులు చేశాడు. డిసెంబర్ 27 సాయంత్రం అతడు ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం అందింది. వెంటనే మా యూనియన్‌తో మాట్లాడి తనకు మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి అధికారులను ఆదేశించాం. వెంటనే అతడిని ఐసీయూలోకి షిఫ్ట్ చేశారు. కానీ తను పోరాటం చేసీచేసీ అలిసిపోయాడు. అనాథ శవంలా.. డిసెంబర్ 29న కన్నుమూశాడు. అతడు చనిపోయి 16 రోజులపైనే అవుతున్నా తన మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాలేదు. డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ అంత్యక్రియల బాధ్యతను భుజానెత్తుకుంది. కానీ అనాథ శవాన్ని తీసుకెళ్లేందుకు వీల్లేదని ఆస్పత్రి యాజమాన్యం తేల్చి చెప్పింది. బంధువులు ఎవరో ఒకరు వస్తేనే మృతదేహాన్ని అప్పజెప్తామంది. ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో ఎట్టకేలకు జనవరి 15న ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి' అని తెలిపాడు. చదవండి: చరణ్-ఉపాసనల కూతురిపై స్పెషల్ సాంగ్ రిలీజ్.. -
సినిమాల్లో ఎంట్రీ ఇవ్వనున్న శుబ్‌మన్ గిల్.. స్పైడర్ మ్యాన్‌తో!
ఐపీఎల్-2023లో అదరగొడుతున్న టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ సరికొత్త అవతరమెత్తనున్నాడు. హాలీవుడ్ మూవీ "స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్-వెర్స్"కు శుబ్‌మన్ గిల్ డబ్బింగ్ చెప్పబోతున్నాడు. గిల్ హిందీతో పాటు పంజాబీ వెర్షన్లకు తన వాయిస్‌ను అందించనున్నాడు. ఇక ఈ విషయాన్ని ఓ వీడియో ద్వారా మూవీ మేకర్స్ సోమవారం రివీల్ చేశారు. ఈ యానిమేషన్ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా దేశవ్యాప్తంగా జూన్ 2న విడుదల చేయనుంది. ఈ మూవీ 10 భాషల్లో రిలీజ్ కానుంది. కాగా పవిత్ర్ ప్రభాకర్ అలియాస్ ఇండియన్ స్పైడర్ మ్యాన్ అనే క్యారెక్టర్ నేపథ్యంలో ఇండియన్ వెర్షన్ మూవీ సాగనుంది. ఇండియన్ వెర్షన్లో స్పైడర్ మ్యాన్ చిత్రం తొలిసారి తెరక్కించారు. హిందీ, పంజాబీ భాషల్లో ఇండియన్ స్పైడర్ మ్యాన్ చిత్రానికి వాయిస్ అందించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను'' అని ఓ ప్రకటనలో గిల్ పేర్కొన్నాడు. గిల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన గిల్.. నాలుగు హాఫ్ సెంచరీలతో 469 పరుగులు చేశాడు. చదవండి: #WTC Final: రాహుల్ స్థానంలో యువ వికెట్ కీపర్ బ్యాటర్.. బీసీసీఐ ప్రకటన View this post on Instagram A post shared by Taran Adarsh (@taranadarsh) -
అవి వేసుకోవడం మన కల్చర్ కాదు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!
ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద గురించి పరిచయం అక్కర్లేదు. సింగర్‌గా మాత్రమే డిబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ రాణించారు. అయితే మహిళల సమస్యలపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోరాటం చేస్తూనే ఉన్నారు. ఎలాంటి విషయాన్నైనా ముక్కుసాటిగా మాట్లాడే చిన్మయి.. తాజాగా మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. కొందరు యువకులు చేసిన ఇన్‌స్టా వీడియోపై ఆమె స్పందించారు. భారతీయ స్త్రీల వస్త్రధారణపై ఆమె చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. బ్లౌజ్‌లు వేసుకోవడం మన దేశ సంస్కృతి కాదంటూ చిన్మయి తెలిపారు. (ఇది చదవండి: ఎస్పీ బాలు చనిపోయినప్పుడు రోడ్డుపై ఏడ్చుకుంటూ వెళ్లాను: సింగర్) కొందరు మహిళలు కనీసం చున్నీలు కూడా వేసుకోవడం లేదని ఓ యువకుడు ఇన్‌స్టాలో వీడియో షేర్ చేశాడు. దీనికి తనదైన శైలిలో సమాధానమిచ్చారు చిన్మయి. చున్నీలు వేసుకోవాలని చెప్పేవాళ్లు ముందు మన దేశ సంస్క్రృతి ఏంటో తెలుసుకోవాలని హితవు పలికారు. చిన్మయి మాట్లాడుతూ..'రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నయ్య సత్యేంద్రనాథ్ ఠాగూర్ భార్య జ్ఞానానందిని దేవి ఆడవాళ్లు వేసుకునే బ్లౌజ్ కల్చర్‌ను తీసుకొచ్చారు. అప్పటివరకు మనదేశంలో అసలు జాకెట్లు వేసుకునేవారు కాదు. మహిళలను చున్నీ వేసుకోమని చెప్పే మగవాళ్లు.. షర్ట్, ప్యాంట్లు వదిలి పంచెలు కట్టుకోండి. జాకెట్ లేకుండా ఉండటం చూసి బ్రిటిషర్లు షాక్ అయ్యారని.. అలా చూడడం వల్ల వారికి కలిగే లైంగిక కోరికల వల్లే భారతీయ మహిళలు జాకెట్లు వేసుకోవడం మొదలుపెట్టారు. మీ అమ్మమ్మలు, నాన్నమ్మలు బ్లౌజ్ వేసుకునేవారు కాదు. బ్లౌజ్ అనేది బ్రిటిష్ కల్చర్. ముందు మన కల్చర్ ఏంటో తెలుసుకోండి.' అంటూ ఘాటుగానే సమాధానమిచ్చారు. (ఇది చదవండి: PS 2లో జూనియర్ ఐశ్వర్యగా నటించిన ఈ చైల్డ్ఆర్టిస్ట్ ఎవరో తెలుసా?) View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) -
కోట శ్రీనివాసరావుకు గొంతు అరువిచ్చిన డబ్బింగ్ ఆర్టిస్ట్ మృతి
ప్రముఖ బాలీవుడ్ నటుడు షానవాజ్ ప్రధాన్(56) గుండెపోటుతో మరణించారు. ముంబైలో శుక్రవారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో షానవాజ్ ఛాతీలో నొప్పి అంటూ స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే ఆయన్ను కోకిలాబెన్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అవార్డుల ఫంక్షన్ కార్యక్రమంలో పాల్గొన్న లగాన్ నటుడు యశ్పాల్ శర్మ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించాడు. 'ముంబైలో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరయ్యాను. వందలాది మంది ఆర్టిస్టులతో ప్రాంగణం కళకళలాడుతోంది. ఇంతలో అవార్డు అందుకున్న షానవాజ్ అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే ప్రోగ్రాం నిలిపివేసి ఆయన్ను హాస్పిటల్‌కు తీసుకెళ్లినప్పటికీ బతికించుకోలేకపోయాం. అందరి కళ్ల ముందే ఆయన ప్రాణాలు వదిలారు' అని భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా షానవాజ్.. 'అలిఫ్ లైలా', 'హరి మర్చి లాల్ మిర్చి', 'బంధన్ సాత్ జన్మోన్ కా' సహా పలు సీరియల్స్‌లో నటించారు. 'ప్యార్ కోయ్ ఖేల్ నహీ', 'ఫాంటమ్', 'రేస్' వంటి చిత్రాల్లోనూ యాక్ట్ చేశారు. 'బెటర్ లైఫ్ ఫౌండేషన్', 'మీర్జాపూర్', 'హోస్టేజెస్' వంటి వెబ్‌సిరీస్‌లో కూడా ఆయన పలు పాత్రలు పోషించారు. అంతే కాకుండా 'దూకుడు', 'బృందావనం', 'అతడు', 'జులాయి', 'రేసు గుర్రం', 'రచ్చ', 'ఛత్రపతి', 'మున్నా' సహా ఎన్నో తెలుగు సినిమాలకు, ఫారిన్ సినిమాలకు హిందీ డబ్బింగ్ చెప్పారు. ఎక్కువగా కోట శ్రీనివాసరావుకు ఆయన హిందీ వర్షన్లో డబ్బింగ్ చెప్పినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Yashpal Sharma (@iyashpalsharma) చదవండి: కమెడియన్ గీతాసింగ్ ఇంట తీవ్ర విషాదం -
డబ్బింగ్ ఆర్టిస్ట్ కన్నుమూత.. సూర్య ఎమోషనల్ ట్వీట్
సూర్య, అజిత్, విక్రమ్ లాంటి తమిళ స్టార్ హీరోలకు తెలుగు డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి ఇవాళ కన్నుమూశారు. చెన్నైలో నివాసం ఉంటున్న ఆయన గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న హీరో సూర్య ఎమోషనల్ ట్వీట్ చేశారు. శ్రీనివాస మూర్తి సేవలను గూర్తు చేసుకుంటూ నివాళి అర్పించారు. (ఇది చదవండి: ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ కన్నుమూత) సూర్య ట్విటర్లో రాస్తూ.. 'ఇది నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. తెలుగులో నా నటనకు శ్రీనివాసమూర్తి వాయిస్, భావోద్వేగాలు ప్రాణం పోశాయి. నిన్ను కోల్పోతున్నందుకు చాలా బాధగా ఉంది. ' అంటూ ట్వీట్ చేశారు. కాగా.. సూర్య నటించిన సూపర్ హిట్ సినిమాలు సింగంలో డబ్బింగ్ చెప్పారు. ఈ రంగంలో ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న శ్రీనివాస మూర్తి.. సూర్యతో పాటు అజిత్, మోహన్‌లాల్, రాజశేఖర్, విక్రమ్ లాంటి అగ్రహీరోలకు తెలుగులో డబ్బింగ్ చెప్పారు. ఇటీవల విడుదలైన ‘తెగింపు’ చిత్రంలో అజిత్ పాత్రకి కూడా ఆయనే డబ్బింగ్ చెప్పడం విశేషం. శ్రీనివాస మూర్తిలాంటి గొప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్ కోల్పోవడంపై తెలుగు, తమిళ ఇండస్ట్రీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. This is a huge personal loss! Srinivasamurthy Garu’s voice & emotions gave life to my performances in Telugu. Will miss you Dear Sir! Gone too soon. — Suriya Sivakumar (@Suriya_offl) January 27, 2023 -
చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ కన్నుమూత
చిత్ర పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి కన్నుమూశారు. చెన్నైలో నివాసం ఉంటున్న ఆయన గుండెపోటుతో మృతి చెందారు. డబ్బింగ్ రంగంలో ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న శ్రీనివాస మూర్తి.. సూర్య, అజిత్, మోహన్‌లాల్, రాజశేఖర్, విక్రమ్ లాంటి అగ్రహీరోలకు తెలుగులో డబ్బింగ్ చెప్పారు. ఇటీవల విడుదలైన ‘తెగింపు’ చిత్రంలో అజిత్ పాత్రకి కూడా ఆయనే డబ్బింగ్ చెప్పారు. శ్రీనివాస మూర్తిలాంటి గొప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్ కోల్పోవడంపై తెలుగు, తమిళ ఇండస్ట్రీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఆయన ఎన్నో గొప్ప చిత్రాలకు, పెద్ద పెద్ద స్టార్లకు తన గాత్రాన్ని అందించారు. ఆయన చిన్న వయసులోనే గుండెపోటుతో చనిపోవడం పట్ల అభిమానులు, తోటి డబ్బింగ్ ఆర్టిస్టులు విచారం వ్యక్తం చేస్తున్నారు. -
కార్తికేయ 2 సినిమాతో భారీ హిట్ కొట్టిన డబ్బింగ్ కంపెనీ!
పోస్ట్ ప్రో (Post Pro) ఒక పాన్ ఇండియా డబ్బింగ్ కంపెనీ. ఈ కంపెనీని వసంత్ స్థాపించారు. పోస్ట్ ప్రో కంపెనీలో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ (ఆల్ లాంగ్వేజెస్ డబ్బింగ్) జరిగిన మొదటి పాన్ ఇండియా సినిమా కార్తికేయ 2. తెలుగు సినిమాలను ఇతర భాషల్లో అనువదించినప్పుడు మన నిర్మాతలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని అన్ని భాషల అనువాదాలు ఏకకాలంలో హైదరాబాద్‌లో జరిగేటట్లుగా పోస్ట్ ప్రో కంపెనీని డిజైన్ చేశారు. తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి సారిగా ఇతర భాషల్లో ఉన్న డబ్బింగ్ కళాకారులను, రచయితలను హైదరాబాద్‌కు రప్పించి నిర్మాతల సౌలభ్యం కోసం కార్తికేయ 2 సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను హైదరాబాద్‌లో పూర్తి చేశారు. దీనివల్ల నిర్మాతకు బడ్జెట్ కంట్రోల్లో ఉండడమే కాకుండా డైరెక్టర్ తన సినిమా అనువాద కార్యక్రమాలను రోజు చూసుకొని అవసరమైన మార్పులు చేసుకోనే వీలు ఉంటుంది, అలాగే చాలా సమయం ఆదా అవుతుంది. కార్తికేయ 2 సినిమాను ఇతర భాషల్లో అనువదించే అవకాశాన్ని ఎంతో నమ్మకంతో పోస్ట్ ప్రో (Post Pro) కంపెనీకి అప్పగించిన నిర్మాతలు టీ. జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల, అభిషేక్ అగర్వాల్, దర్శకుడు చెందు మొండేటి, హీరో నిఖిల్ సిద్ధార్థ్‌కు వసంత్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రో కంపెనీ పలు భారీ సినిమాలను అనువదించే పనిలో ఉంది. చదవండి: ప్రియుడు మరణించాక కొరియోగ్రాఫర్‌తో డేటింగ్, స్పందించిన నటి థియేటర్, మల్టీప్లెక్స్‌లో టికెట్ రేట్లు తగ్గిస్తాం -
Sahasra: బాల నటి భళా.. కుట్టి
ఏ తల్లిదండ్రి అయినా సంతృప్తిగా.. సంతోషంగా.. ఉన్నారు అంటే వారి పిల్లల ఎదుగుదలను చూసినపుడే.. అనేది వంద శాతం వాస్తవం. పిల్లలు పెరిగి పెద్దవారు అయ్యాక కొంతమంది సంతోష పడితే, మరికొందరు మాత్రం బుడిబుడి అడుగులు వేస్తున్ననాటి నుంచి తల్లిదండ్రులను ఎంతో సంతోష పెడుతున్నారు. ఆ కోవకు చెందినదే మన బాల్యనటి సహస్ర. చిన్నతనం నుంచి తన నటనతో ఎంతో మంది హృదయాల్లో నిలిచింది. మాటీవిలో ప్రసారమయ్యే ‘పాపే మా జీవన జ్యోతి’ ధారావాహిక చైల్డ్ ఆర్టిస్ట్ కుట్టి పాత్రలో జీవిస్తూ ఎంతో మంది ప్రేక్షకుల నుంచి మన్ననలు పొందుతోంది ఈ సహస్ర. – చింతల్ సహస్ర ప్రస్థానం ఇలా.. ► నిజాంపేటలోని భాగ్యలక్ష్మిహిల్స్లో నివాసముండే దర్పల్లి అనిల్‌కుమార్, లీలా దంపతులకు 2013 డిసెంబర్ 9వ తేదీన సహస్ర జన్మించడంతో వారి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ► తండ్రి అనీల్‌కుమార్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే కుత్బుల్లాపూర్ హెచ్ఎంటీ కాలనీలో నిర్మాణ్ మానసిక వికలాంగుల కేంద్రాన్ని నడిపిస్తూ తనవంతు సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తుండగా, తల్లి ప్రైవేట్ టీచర్‌గా కొనసాగుతోంది. ► చిన్నతనంలోనే సహస్ర హావభావాల వీడియోలను అనీల్‌కుమార్ దంపతులు మొబైల్లో రికార్డ్ చేస్తూ ఉండేవారు. చిన్ననాటి నుంచే డ్యాన్స్‌లో.. ► పువ్వుపుట్టగానే పరిమళించును అన్న చందంగా చిన్ననాటి నుంచే సహస్ర టీవీలో వచ్చే పలు ప్రకటనలు, సీరియల్స్‌ను ఆసక్తిగా గమనించేది. ►సహస్ర తల్లిదండ్రులు అనీల్‌కుమార్, లీల దంపతులు విద్యావంతులు కావడంతో తమ కుమార్తెకు ప్రోత్సాహాన్ని అందించారు. ► తమకు తెలిసిన మిత్రుల సహాకారంతో సహస్ర పోషించిన పాత్రలు, నృత్యాలకు సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమమైన యూట్యూబ్‌లో అప్లోడ్ చేసేవారు. ► ఆ విధంగా బుల్లితెరకు పరిచయమై తన సహజమైన నటనతో ‘పాపే మా జీవనజ్యోతి’ అనే మాటీవీ సీరియల్లో కుట్టి పాత్రకు ఎంపికైంది. ► ఇలా టెలివిజన్ రంగంలో అడుగుపెట్టిన సహస్ర తనకు ఇచి్చన కుట్టి పాత్రకు జీవం పోస్తూ.. ఎందరో అభిమానులను సంపాదించుకుంది. తెలుగు భాషపై పట్టు.. ► సహస్ర జేన్ఎటీయూ కూకట్‌పల్లిలోని నారాయణ హైస్కూల్లో మూడో తరగతి చదువుతోంది. ► ఈ బాల నటి గ్రామీణ భాష నుంచి నవీన భాషలోని మాండళికం తన తోటి కళాకారులను సైతం అబ్బురపరుస్తూ.. భావితరాలకు స్ఫూర్తిదాయకమై.. సినీ వినీలాకాశంలో తళుక్కున మెరుస్తున్న నక్షత్రం ఈ సహస్ర. ► తెలుగు కళామతల్లి వడిలో ఓనమాలు దిద్దుకుంటున్న ఈ చిన్నారి మున్ముందు సినీ రంగంలో ఉన్నత శిఖరాలను ఆధిరోహించాలని ఆశిస్తూ.. నేటి చిల్డ్రన్స్ డే సందర్భంగా ఆశీర్వదిద్దాం. అన్నింటిలోనూ ముందే.. చదువుతో పాటు నటన, నాట్యం, సంగీతంలో తన ప్రతిభను చాటుతోంది. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పలు సీరియళ్లకు, సినిమాలకు తన వాయిస్‌ను సైతం అందిస్తోంది. చక్కని ప్రతిభతో అనేక వెబ్ సిరీస్‌లలో న టిస్తోంది. పలు వ్యాపార సంస్థల ప్రకటనల్లో వంట పాత్రలను కడిగినంత సులువుగా తనకు తానే పోటీగా ఇచ్చిన పాత్రలో అంతలా ఒదిగి పోతుంది ఈ చిచ్చర పిడుగు. -
ఆ ‘అగ్ని’ రాజేసిన ఆవేశం ఇప్పటికీ చల్లారలేదు
‘‘ఒక్కసారి పురాణాలు దాటి వచ్చి చూడు, అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలే తప్ప, హీరోలు, విలన్లు లేరీ నాటకంలో’’.. తెలుగు సినీ చరిత్రలో కలకలం గుర్తుండిపోయే డైలాగ్ ఇది. ‘ప్రస్థానం’ ద్వారా ఈ ఆణిముత్యం లాంటి డైలాగ్‌ను అందించిన క్రెడిట్ సగం దర్శకుడు దేవకట్టాది అయితే.. తన నటనతో, కంఠంతో పవర్‌ఫుల్‌గా ఆ డైలాగ్‌ను ప్రజెంట్ చేసి మిగిలిన సగభాగం క్రెడిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు నటుడు సాయి కుమార్. డైలాగ్ కింగ్‌గా, అంతకు మించి విలక్షణ నటుడిగా తెలుగు, కన్నడ ప్రేక్షకుల అభిమానాన్ని చురగొంటూ వస్తున్నాడాయన. ఇవాళ ఆయన 61వ పుట్టినరోజు.. పుడిపెద్ది సాయి కుమార్..1960 జులై 27న జన్మించాడు. తండ్రి డబ్బింగ్ ఆర్టిస్ట్ కమ్ నటుడు పీజే శర్మ సొంతూరు విజయనగరం, తల్లి నటి జ్యోతి బెంగళూరువాసి. చెన్నైలో ఎంఫిల్ విద్య పూర్తి చేసుకున్నాక.. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో ఆవైపు ఆకర్షితుడయ్యాడు సాయి కుమార్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా డబ్బింగ్ సినిమాలకు పని చేసిన ఆయన.. పెద్దయ్యాక కూడా తండ్రి బాటలోనే పయనిస్తూ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానే కొనసాగాడు. 1977లో ‘స్నేహం’ ద్వారా నటనలోకి అడుగుపెట్టాడు. స్పష్టమైన తెలుగు ఉచ్ఛారణ.. పవర్ఫుల్ టోన్ కావడంతో బిజీ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఆయనకు గుర్తింపు దక్కింది. మధ్య మధ్యలో చిన్నాచితకా పాత్రలు చేసినప్పటికీ..పూర్తిస్థాయి నటుడి గుర్తింపుదక్కలేదు. అలాంటి టైంలో.. అగ్ని.. ఆ... ఏం జరిగిందో ఏమోగానీ.. డబ్బింగ్ కోసం కొందరు హీరోలు వేరే వాళ్ల వాయిస్ అరువు తెచ్చుకోవడం, మరో వైపు హీరో-ఆర్టిస్ట్‌గా అవకాశాలు పల్చబడడంతో సాయి కుమార్ ఢీలా పడిపోయాడు. సరిగ్గా ఆ టైంలో థ్రిల్లర్ మంజు డైరెక్షన్లో వచ్చిన ‘పోలీస్ స్టోరీ’ సాయి కుమార్ సినీ ‘జీవితాన్ని’ నిలబెట్టింది. కన్నడ నటుడు కుమార్ గోవింద్ చేయాల్సిన ఆ సినిమా అనుకోకుండా సాయి కుమార్ దగ్గరికి వెళ్లడం.. ఆయన సినీ కెరీర్‌ను మలుపు తిప్పింది. 1996లో కన్నడనాట ‘పోలీస్ స్టోరీ’ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో పాటు తమిళ, తెలుగు భాషల్లోనూ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. ఆవేశం ఉన్న పోలీసాఫీసర్ అగ్ని పాత్రలో కలకాలం గుర్తుండిపోయే అమోఘమైన నటన అందించాడాయన. ‘సత్యా.. ధర్మా.. అమ్మా..’ అంటూ ఎమోషనల్‌గా చెప్పే డైలాగులు, విలన్లను ఉద్దేశించి ‘ ఏయ్ లబ్బే’ అంటూ ఊగిపోతూ చెప్పే పవర్ఫుల్ పంచ్ డైలాగులు ఇప్పటికీ జనాల చెవులో మారుమోగుతుంటాయి. ఆ సినిమాతో కన్నడనాట స్టార్ హీరోగా ఆయనకంటూ ఓ గుర్తింపు దక్కింది. నటనా ప్రస్థానం కన్నడలో హీరోగా ఫేడవుట్ అయ్యాక.. తిరిగి టాలీవుడ్లో, మధ్య మధ్యలో కన్నడ, తమిళంలోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీ అయ్యాడు సాయి కుమార్. 2002 తర్వాత సుమారు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ‘సామాన్యుడు’ రూపంలో ఆయన కెరీర్ మలుపు తిరిగింది. ఆ సినిమాకుగానూ బెస్ట్ విలన్‌గా టాలీవుడ్లో తొలి నంది అవార్డును అందుకున్నారు ఆయన. ఆ తర్వాత ‘ప్రస్థానం’ లోక్‌నాథ్ నాయుడు రోల్ రూపంలో మరిచిపోలేని గుర్తింపు తెచ్చిపెట్టింది. అంతేకాదు బెస్ట్ సపోర్టింగ్ నటుడిగా రెండో నందిని అందించింది. ఆపై ‘అయ్యారే, ఎవడు, పటాస్, సరైనోడు, సుప్రీం, జనతా గ్యారేజ్, జై లవ కుశ, రాజా ది గ్రేట్, మహర్షి.. ఇలా కమర్షియల్ డ్రామాలతో కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. ఈ మధ్యలో కన్నడనాట ‘రంగితరంగ’ ఇంటర్నేషనల్ ఫేమ్ తెచ్చిపెట్టింది. వెండితెరపైనే కాదు.. ‘కట్ చేస్తే’ బుల్లితెరపై కూడా హోస్టింగ్‌తో మెప్పిస్తూ వస్తున్నారాయన. వాయిస్‌తో మ్యాజిక్ సుమన్, రాజశేఖర్ల కెరీర్‌కు సాయి కుమార్ అందించిన గొంతుక ఒక ‘పుష్అప్’ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భాషా, పెదరాయుడు ద్వారా రజినీకాంత్‌ను తెలుగు ప్రేక్షకులకు చేరువ చేసింది కూడా ఈయన గొంతే. ఇక బాలీవుడ్ మెగాస్టర్ అమితాబ్ బచ్చన్‌కు ‘ఖుధా గవా’(1992) ‘కొండవీటి సింహం’ పేరుతో తెలుగులోకి డబ్ కాగా.. అందులో బిగ్‌బీకి వాయిస్ఓవర్ అందించాడు సాయి కుమార్. మోహన్‌లాల్, మమ్మూటీ, మనోజ్ జయన్, అర్జున్ సార్జా, విష్ణువర్ధన్ పోలీస్ రోల్స్‌కిగానూ సురేష్ గోపీ, విజయ్‌కాంత్ లాంటి వాళ్లకు తన పవర్ఫుల్ వాయిస్ అందించి.. ఆయా నటులను తెలుగు ఆడియొన్స్‌కు దగ్గరయ్యేలా చేశాడు డైలాగ్ కింగ్ సాయి కుమార్. -సాక్షి, వెబ్‌డెస్క్ -
ఘంటసాల రత్నకుమార్ కన్నుమూత
మధురమైన గానం, సంగీతంతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన దివంగత ఘంటసాల వెంకటేశ్వరరావు రెండో కుమారుడు ఘంటసాల రత్నకుమార్ (63)కన్నుమూశారు. చాలా రోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన కొన్ని రోజులుగా డయాలసిస్ చేయించుకుంటున్నారు. చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రత్నకుమార్ పరిస్థితి విషమించడంతో గురువారం తుదిశ్వాస విడిచారు. కాగా ఇటీవల కరోనా బారిన పడిన ఆయనకు రెండు రోజుల క్రితమే నెగటివ్ వచ్చింది. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు... ఘంటసాల వెంకటేశ్వరరావు అమర గాయకుడిగా పేరు గడిస్తే, రత్నకుమార్ మాత్రం డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ తొలినాళ్లలో తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ గాయకుడు కావాలనుకున్నా, సరైన బ్రేక్ రాలేదు రత్నకుమార్‌కి. ఆ సమయంలో తమిళ చిత్రం ‘కంచి కామాక్షి’కి తెలుగులో డబ్బింగ్ చెప్పారాయన. అప్పటినుంచి నాలుగు దశాబ్దాల కెరీర్లో వెయ్యికిపైగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, సంస్కృత చిత్రాలకు రత్నకుమార్ డబ్బింగ్ చెప్పారు. పదివేలకు పైగా తమిళ, తెలుగు టీవీ సీరియల్ ఎపిసోడ్స్‌కు గాత్రాన్ని ఇచ్చారు. 50కి పైగా డాక్యుమెంటరీలకు వాయిస్ ఓవర్ అందించారు. ఓ సందర్భంలో ఎనిమిది గంటలపాటు ఏకధాటిగా డబ్బింగ్ చెప్పి, ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించుకున్నారు. అదే విధంగా ‘అమేజింగ్ వరల్డ్ రికార్డ్స్, తమిళనాడు బుక్ ఆఫ్ రికార్డ్స్’లోనూ ఆయన పేరు నమోదైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి ‘ఉత్తమ అనువాద కళాకారుడి’గా ‘తాత–మనవడు’ చిత్రంలో వినోద్‌కుమార్ పాత్రకు చెప్పిన డబ్బింగ్‌కి నంది అవార్డును అందుకున్నారు. ఇంకా తెలుగులో రోజా, బొంబాయి సినిమాల్లో అరవింద్ స్వామి పాత్రలకు, ‘పుణ్యస్త్రీ, అభినందన’ చిత్రాల్లో కార్తీక్ పాత్రలకు, ‘అన్నమయ్య’ తమిళ డబ్బింగ్ ‘అన్నమాచార్య’లో నాగార్జున పాత్రకు... ఇలా తన గాత్రంతో ఆ పాత్రలు హైలైట్ అయ్యేలా చేశారు రత్నకుమార్. ‘డాక్టర్ అంబేద్కర్’ చిత్రంలో టైటిల్ రోల్ చేసిన ఆకాష్ ఖురానాకి చెప్పిన డబ్బింగ్ తనకు చాలా సంతృప్తినిచ్చిందని పలు సందర్భాల్లో రత్నకుమార్ పేర్కొన్నారు. తెలుగులో ‘వీరుడొక్కడే’, ‘ఆట ఆరంభం’ వంటి 30కి పైగా సినిమాలకు రత్నకుమార్ మాటలు అందించారు. అలాగే ఒక మెగా సీరియల్, ఒక సినిమాకి దర్శకత్వం వహించాలనుకున్నారు. తన తండ్రి ఘంటసాల జ్ఞాపకార్థం ఓ భారీ సినిమా తీయాలనుకున్నారు. అయితే ఆ కోరిక తీరకుండానే తుది శ్వాస విడిచారు. రత్నకుమార్‌కి భార్య కృష్ణకుమారి, కుమార్తెలు వీణ, వాణి ఉన్నారు. తల్లి సావిత్రమ్మ కూడా కొడుకు వద్దే ఉంటున్నారు. రత్నకుమార్ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖలు సంతాపం తెలిపారు. ఘంటసాల రత్నకుమార్ మరణం దక్షిణ భారత చలన చిత్ర రంగానికి తీరని లోటు అని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఘంటసాల రత్నకుమార్ ఆకస్మిక మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగ¯Œ మోహ¯Œ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రత్నకుమార్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
'ఖైదీ' నటుడి అకాల మరణం
చెన్నై: తమిళ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ అరుణ్ అలెగ్జాండర్ కన్నుమూశారు. సోమవారం నాడు ఆయనకు గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచారు. 48 ఏళ్ల వయసులోనే ఆయన మృత్యువాత పడటం చిత్రసీమను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మృతికి అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు. "ఇంత త్వరగా మమ్మల్ని వదిలి వెళ్లిపోతావని ఊహించలేదు. దుఃఖం ఆగట్లేదు. నీ లోటును ఎవరూ పూడ్చలేరు. నా గుండెలో ఎప్పటికీ నువ్వు పదిలంగా ఉంటావు" అంటూ దర్శకుడు కనగరాజ్ ఎమోషనల్‌గా ట్వీట్ చేశారు. కాగా అరుణ్ అలెగ్జాండర్ 'కోలమావు కోకిల', 'బిగిల్', 'ఖైదీ', 'మాస్టర్' వంటి చిత్రాల్లో నటించారు. ఆయన చివరిసారిగా నటించిన 'మాస్టర్' సినిమాలో స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో నటించగా ఈ చిత్రం జనవరిలో విడుదల కానుంది. (చదవండి: విషాదం: ప్రముఖ నటుడు దుర్మరణం) (చదవండి: జీఎస్టీ టీజర్ బాగుంది) Actor #ArunAlexander who was seen with Thalapathy in Bigil is no more! He had acted in Master too. #RIP pic.twitter.com/GDCmGBp7dA — Actor Vijay Fans (@Actor_Vijay) December 28, 2020 -
నరుడి బతుకు నటన... ఈశ్వరుడి తలపు ఘటన
బాలూ ఇళయరాజాల స్నేహం ఈశ్వరుడి తలపు అనిపిస్తుంది. తమిళనాడులోని మారుమూల పల్లె నుంచి దర్శకుడు భారతీరాజా పూనికతో చెన్నై చేరుకున్న ఇళయరాజా అతని ఇద్దరు సోదరులు మొదట బాలూ ట్రూప్‌లోనే చేరారు. ఇళయరాజా బాలు దగ్గర గిటార్ వాయించేవారు. ఆ తర్వాత ఇళయరాజా ‘అన్నక్కిళి’తో సంగీత దర్శకుడుగా మారారు. బాలు–ఇళయరాజాల స్నేహం దాదాపు నలభై ఏళ్ల నాటిది. వారిరువురూ కలిసి గొప్ప పాటలు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఇచ్చారు. ‘నా ట్యూన్ వల్ల నువ్వు గొప్పవాడివయ్యావ్’ అని ఇళయరాజా అంటే ‘నీ ట్యూన్‌ను నేను పాడటం వల్లే నువ్వు పెద్దవాడివయ్యావ్’ అని బాలు సరదాగా అనుకునేవారు. బాలు–ఇళయరాజా కాంబినేషన్లో వందల పాటలు సంగీత ప్రియులకు స్ట్రెస్ బస్టర్స్‌గా మారాయి. ‘ఇలాగే ఇలాగే సరాగమారితే’ (వయసు పిలిచింది), ‘పరువమా చిలిపి పరుగు తీయకు’ (మౌనగీతం), ‘ఈ లోకం అతి పచ్చన’ (వసంత కోకిల), సుమం ప్రతి సుమం సుమం (మహర్షి), కీరవాణి (అన్వేషణ), ఉరకలై గోదావరి (అభిలాష), ఈనాడే ఏదో అయ్యింది (ప్రేమ), ఆమని పాడవే హాయిగా (గీతాంజలి) ఎన్ని చెప్పినా మరొకటి మిగిలిపోయే పాట ఉంటుంది. ఇళయరాజా కోసం బాలు గొంతుకు స్ట్రయిన్ ఇస్తూ గీతాంజలిలో ‘నందికొండ వాగుల్లోనా’ పాడారు. ఆయనే మళ్లీ ‘ఇంద్రుడు చంద్రుడు’ కోసం ‘నచ్చిన ఫుడ్డు’ పాటకు గొంతు పోయేలా పాడి ఇబ్బంది పడ్డారు. అయినా ఇళయరాజా కోసం ఇదంతా ప్రేమగా చేసేవారు. ఇళయరాజా కంపోజ్ చేసిన ‘సాగర సంగమం’ పాటలు బాలూకు గొప్ప పేరు తెచ్చి పెట్టాయి. అందులోని ‘తకిట తధిమి తకిట తధిమి తందానా’ పాట సంగీతాభిమానులకు ఎంతో ఇష్టమైనది. వీరి మధ్యే కాకుండా వీరి కుటుంబాల మధ్య కూడా స్నేహం ఉంది. ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ ప్రేమ విషయంలో అమ్మాయి వాళ్ల ఇంట్లో మాట్లాడింది బాలూనే. యస్పీబీ కుమారుడు యస్పీ చరణ్ నిర్మించే సినిమాలకు రాజా తనయుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుంటారు. రాజా మేనల్లుళ్లు వెంకట్ ప్రభు (దర్శకుడు), ప్రేమ్‌జీ అమరన్ (నటుడు–సంగీతదర్శకుడు) కూడా యస్పీ చరణ్‌తో తరచూ సినిమాలు చేస్తారు. ఇలాంటి అనుబంధంలో మనస్పర్థలు లేవా? అంటే ఉన్నాయి. ‘నా పాటలను నా అనుమతి లేకుండా వేదికల మీద పాడొద్దు. పాడితే రాయల్టీ చెల్లించాలి’ అని ఒక సందర్భంలో కోప్పడ్డా కొద్ది రోజులకే ఇద్దరూ కలిసిపోయారు. బాలు అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిన వెంటనే ‘త్వరగా తిరిగిరా బాలూ’ అంటూ చెమర్చిన కళ్లతో ఓ వీడియో పంచుకున్నారు ఇళయరాజా. హీరో ఎవరైనా గొంతు బాలూదే(డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా బాలు) ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంను డబ్బింగ్ ఆర్టిస్టుగా మార్చింది సంగీత దర్శకుడు చక్రవర్తి. ఆ రోజుల్లో చక్రవర్తి చాలా సినిమాలకు డబ్బింగ్ చెప్పేవారు. ‘మన్మథలీల’ (1976)లో కమలహాసన్‌కు డబ్బింగ్ చెబుతూ అందులోని ఒక బ్రాహ్మణుడి పాత్రకు బాలు గొంతు సూట్ అవుతుందని చెప్పించారు. ఆ తర్వాత ‘కల్యాణ రాముడు’ (1979) సినిమా నుంచి కమల్ హాసన్‌కు బాలు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మారారు. దాదాపు తెలుగులో డబ్ అయిన అన్ని కమల్ సినిమాలకు బాలు డబ్బింగ్ చెప్పారు. వసంత కోకిల, నాయకుడు, డాన్స్‌మాస్టర్, గుణ, మైకేల్ మదన్కామరాజు, విచిత్రసోదరులు... ఇవన్నీ ముఖ్యమైనవి. ‘దశావతారం’లో పది కమల్ పాత్రలకు పది విధాలుగా కేవలం రెండున్నర రోజుల్లో డబ్బింగ్ ముగించారు బాలు. హీరో నరేశ్ ‘నాలుగు స్తంభాలాట’కు, హీరో జగపతిబాబు ‘అడవిలో అభిమన్యుడు’ సినిమాకు బాలు డబ్బింగ్ చెప్పారు. కె.భాగ్యరాజాకు కూడా బాలు గొంతు బాగా సూట్ అయ్యేది. కె.భాగ్యరాజా తెలుగులో డబ్బింగ్ చేసిన ‘డార్లింగ్ డార్లింగ్’, ‘అమ్మాయిలు ప్రేమించండి’, ‘చిన్నరాజా’, ‘నేనూ మీవాడినే’ వంటి సినిమాలకు బాలు డబ్బింగ్ చెప్పి భాగ్యరాజాను తెలుగువారికి దగ్గర చేశారు. తమిళ నటుడు విసు నటించిన తెలుగు సినిమాలు ‘ఆడదే ఆధారం’, ‘ఇల్లు–ఇల్లాలు–పిల్లలు’ సినిమాల్లో విసుకు డబ్బింగ్ చెప్పారు. ‘రుద్రవీణ’లో జెమినీ గణేశన్‌కు చెప్పిన డబ్బింగ్ చాలా ప్రతిభావంతమైనది. ‘అన్నమయ్య’లో సుమన్ శ్రీవేంకటేశ్వర స్వామి పాత్ర ధరిస్తే బాలూయే డబ్బింగ్ చెప్పి ఆయనకు పేరు రావడానికి కారకులయ్యారు. బాలు తమిళంలో నాగార్జునకి, రజనీకాంత్‌కి, బాలకృష్ణకి డబ్బింగ్ చెప్పారు. అన్నింటికి మించి అటెన్‌బరో ‘గాంధీ’ చిత్రం తెలుగులో డబ్ అయినప్పుడు గాంధీ పాత్రకు ఎంతో అద్భుతంగా డబ్బింగ్ చెప్పారు బాలు. అందులో రకరకాల వయసుల్లో ఉన్న గాంధీకి రకరకాల ధ్వని స్వభావంతో చెప్పే తీరు ఔత్సాహికులకు పాఠం లాంటిది. దేశంలోని పది మంది గొప్ప డబ్బింగ్ ఆర్టిస్టులను లెక్కిస్తే వారిలో బాలు తప్పక వస్తారు. చూడు పిన్నమ్మా పాడు పిల్లోడు(మిమిక్రీ ఆర్టిస్ట్ బాలు) బాలు గొప్ప మిమిక్రీ ఆర్టిస్ట్. ఆర్టిస్ట్‌ను బట్టి, ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్‌ను బట్టి పాడి తాను పాడినట్టుగా కాకుండా పాత్ర పాడినట్టుగా అనిపించగలరు. దాసరి తీసిన ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’ (1977)లో నటుడు మాడా ‘పేడి’ పాత్ర ధరిస్తే ఆ పాట కోసం బాలూ ‘చూడు పిన్నమ్మా పాడు పిల్లోడు’ పాడారు. ఆ పాట బాలూకు, మాడాకు చిరకాల కీర్తి తెచ్చి పెట్టింది. మాడాకు జీవితకాలం ఆ పాత్రే భుక్తి కల్పించిందని చెప్పవచ్చు. గతంలో కిశోర్ కుమార్ ‘హాఫ్టికెట్’ సినిమా కోసం స్త్రీ,పురుష గొంతుల్లో పాడారు. బాలు కూడా అలా గొంతు మార్చి తన ప్రతిభ చాటుకున్నారు. రాజేంద్రప్రసాద్ తీసిన ‘మేడమ్’ సినిమా కోసం స్త్రీ వేషంలో ఉన్న రాజేంద్రప్రసాద్ పాటను స్త్రీ గొంతుతో బాలు పాడారు. ఇలా మేల్ సింగర్ పూర్తి స్త్రీ గొంతుతో పూర్తి పాట పాడటం ఒక రికార్డ్. అల్లు రామలింగయ్య కోసం బాలు పాడిన ‘ముత్యాలు వస్తావా’ పాట పెద్ద హిట్. ‘మనుషులంతా ఒక్కటే’ (1976) కోసం అల్లు రామలింగయ్య, రమాప్రభల మీద చిత్రీకరించిన పాట సినిమా హిట్ కావడానికి ఒక కారణమైంది. కొంచెం ముక్కుతో పాడి అచ్చు అల్లు పాడినట్టే అనిపించారు బాలు. కామెడీ నటులకు బాలు పాడిన పాటలు కూడా హిట్ అయ్యాయి. రాజబాబుకు ‘తాతా–మనవడు’ కోసం ‘సోమా మంగళ బుధ’ పాడారు బాలు. పద్మనాభంకు బాలు పాడిన ‘ఆకలయ్యి అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్లు’ (దేశోద్ధారకులు–1973) కూడా పెద్ద హిట్టే. ‘ప్రతిఘటన’ (1985) సినిమాలో సుత్తి వేలుకు బాలూ పాడిన ‘తందనాన భళ తందనాన’ ఆ సమయంలో ఒక ఉద్వేగగీతంగా నిలిచింది. శుభలేఖ సుధాకర్‌కు ‘రెండు జళ్ల సీత’ కోసం బాలు పాడిన ‘కొబ్బరినీళ్ల జలకాలాడి’ ఇప్పటికీ ఒక వినోద గీతమే. కామెడీ స్టార్ అలీకి పాడిన ‘చినుకు చినుకు అందెలలో’ (శుభలగ్నం) పెద్ద హిట్. బాలుఅనే శంఖంలో ఎన్నో తీర్థాలు. రాగాలు. రసాలు. అందులో హాస్యరసం కూడా తరించింది. సుశీలమ్మ – బాలు బాలసుబ్రహ్మణ్యం విజయంలో ఆయన వాటా ఎంత ఉందో ఆయనతో పాటు గొంతు కలిపిన సుశీలమ్మ వాటా కూడా అంత ఉంది. బాలూ కంటే ఎంతో సీనియర్ అయినప్పటికీ సుశీలమ్మ బాలూను ప్రోత్సహించారు. బాలు అంత హుషారుగా తనను తాను ఉత్సాహపరుచుకుని యుగళగీతాలు ఆలపించారు. వీరిద్దరి హిట్స్ లెక్కబెట్టే కొలది వస్తూనే ఉంటాయి. ‘మానసవీణ మధుగీతం’ (పంతులమ్మ), ‘ఝుమ్మందినాదం సయ్యంది పాదం’ (సిరిసిరిమువ్వ), ‘ఇది పున్నమి వెన్నెల రేయి’ (ప్రేమ లేఖలు), ‘మావిచిగురు తినగానే’ (సీతామాలక్ష్మి), ‘గోరంత దీపం కొండంత వెలుగు’ (గోరంత దీపం), ‘శ్రీరస్తు శుభమస్తు’ (పెళ్లిపుస్తకం) లాంటి అద్భుతమైన పాటలు ఉన్నాయి. కమర్షియల్ సినిమాల జోరు పెరిగి మాస్ సాంగ్స్ కావాలని నిర్మాతలు పట్టుబట్టినప్పుడు, దర్శకులు కోరినప్పుడు సుశీల బాలూతో కలిసి అలాంటి మాస్ సాంగ్స్ పాడారు. ముఖ్యంగా చక్రవర్తి ఆమెను ఒప్పించి బాలూతోటి ‘గుగ్గుగుగ్గు గుడిసుంది’ (డ్రైవర్ రాముడు) పాడించారు. అలాగే వీళ్లద్దరూ ‘వేటగాడు’లో ‘పుట్టింటోళ్లు తరిమేశారు’ పాడారు. అక్కినేనికి బాలు పాడిన డ్యూయెట్స్‌లో ఎన్నో హుషారైనవి సుశీల పాడారు. వాటిలో ‘ఒక లైలా కోసం’ (రాముడు కాదు కృష్ణుడు), ‘కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్న’ (ప్రేమాభిషేకం), ‘తొంగి తొంగి చూడమాకు చందమామా’ (శ్రీరంగ నీతులు)..లాంటివి ఎన్నో ఉన్నాయి. కృష్ణకు ‘ఇదిగో తెల్ల చీర’ (ఊరికి మొనగాడు), శోభన్‌బాబుకు ‘వెల్లువచ్చి గోదారమ్మ’ (దేవత), చిరంజీవికి ‘గోరింట పూసింది’ (ఖైదీ) హిట్ పాటలకు లెక్క లేదు. సుశీల పాడిన ‘పాలకడలిపై శేషతల్పమున’ పాటను పాడి చిన్నప్పుడు పాటల పోటీలో ప్రైజులు తెచ్చుకున్నానని బాలు చాలాసార్లు చెప్పుకున్నారు. -
కుర్రాళ్ల మతులు పోగొట్టిన ‘ఈవేళలో...’
సాక్షి, తెనాలి: ఈ వేళలో నీవు...ఏం చేస్తు ఉంటావో...‘అందంగా లేనా...అసలేం బాలేనా...’ అంటూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించిన గాత్రం అది. పాటల తోటలో పాతికేళ్లుగా అలుపెరగని ఆ కోయిల, గాయని సునీత అని చెప్పకుండానే తెలిసిపోతుంది. ‘వెళ్లవయ్యా వెళ్లూ’ అంటూ ప్రేక్షక జనాన్ని మంత్రముగ్ధులను చేసిన మాట కూడా తనదే సుమా! మూడు వేల పాటలు గానం చేసి, ఏడొందలకు పైగా సినిమాలకు డబ్బింగ్ చెప్పి, ‘ఝుమ్మంది నాదం’తో ఎందరో ప్రసిద్ధ గాయకులను పరిచయం చేసిన గాయని సునీత. పాతికేళ్ల పాట ప్రస్థానానికి గుర్తింపుగా ఈనెల 22న గుంటూరులోని కళాదర్బార్ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించనున్నారు. చిన్నతనంలో తాను పాటలు పాడిన శ్రీవేంకటేశ్వర విజ్ఞానమందిరంలోనే జరిగే సత్కార సభకు సినీప్రముఖులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా రెండున్నర దశాబ్దాల పాటల కోయిల సునీత జీవిత విశేషాలు, అంతరంగ చిత్రణ.. స్వస్థలం గుంటూరు.. సునీత స్వస్థలం గుంటూరు. తల్లిదండ్రులు సుమతి, నరసింహారావు. సునీతకు సమత అనే చెల్లెలు. రవి పబ్లిక్ స్కూల్లో పదోతరగతి, బీహెచ్ బాలికల కాలేజిలో ఇంటర్ చదివిన సునీతకు చిన్నతనంనుంచీ సంగీతమే ప్రపంచమైంది. ఇంట్లో అమ్మ, మేనత్త కలిసి ప్రారంభించిన ‘అన్నమాచార్య సంగీత నృత్య కళాశాల’లో డాన్స్, వీణ, ఓకల్, వయొలిన్, ఫ్లూట్...వంటివి నేరి్పస్తూ వచ్చారు. శని, ఆదివారాల్లో విజయవాడ తీసుకెళ్లి బ్రహ్మరాజు సూర్యారావు దగ్గర శాస్త్రీయ సంగీత సాధన చేయించారు. కె.కృష్ణమోహన్ దగ్గర లైట్ మ్యూజిక్ నేర్చుకున్నారు. మరోవైపు విజయవాడ ఆకాశవాణిలో బాలానందం, వర్షానందిని కార్యక్రమాల్లో పాటలు పాడటం అలవాటు. చిలకలూరిపేట కళానిలయం సంగీత పోటీల్లో పాల్గొని తనకన్నా ఎంతో పెద్దవారితో పోటీపడి ద్వితీయ బహుమతిని గెలిచారు. 1994లో ఆలిండియా రేడియో నిర్వహించిన జాతీయస్థాయి లైట్‌మ్యూజిక్ పోటీల్లో విజయవాడ నుంచి పాల్గొన్న సునీత బహుమతిని గెలిచారు. జాతీయ బహుమతి సాధించిన గాయనిగా సునీతను పరిచయం చేస్తూ, ‘పాడవే కోయిల’ పేరుతో దూరదర్శన్ ఓ ప్రాయోజిత కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. తాను పాడిన పాటలకు తొలి గుర్తింపునిచ్చిందా ప్రత్యక్ష ప్రసారం. కుర్రాళ్ల మతులు పోగొట్టిన ‘ఈవేళలో...’ ఇంటర్ ఫస్టియర్ పరీక్షల తర్వాత హైదరాబాద్‌లో అత్తయ్య ఇంటికని వెళ్లిన సునీతను ‘పాడవే కోయిల’ తిరిగి రానివ్వలేదు. క్యాసెట్లు, అల్బమ్‌లో పాడే అవకాశాలనే కాదు, సినిమా చాన్సునూ ఇప్పిచ్చింది. శశిప్రీతమ్ సంగీత దర్శకత్వంలో ‘గులాబి’ సినిమాలో ‘ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో’ పాడిన పాట సూపర్‌హిట్ కావటంతో సునీత అక్కడే సెటిలయ్యారు. ‘ఎగిరే పావురమా’సినిమాలో ‘మాఘమాసం ఎప్పుడొస్తుందో’ పాటకని ఇచ్చిన అవకాశంతో నిరూపించుకోవటంతో మొత్తం నాలుగు పాటలు పాడించారు. అప్పట్నుంచి వెనుదిరిగి చూసే పనిలేకుండాపోయింది. కీరవాణి సంగీతంలో ‘సీతారాముల కల్యాణం చూతము రారండి’లో పాడే అవకాశం దక్కించుకున్నారు. ‘చివరకు మిగిలేది’తో మరో ఎత్తుకు.. వేటూరి సలహాపై గోదావరి సినిమాలో ‘అందంగా లేనా, అసలేం బాలేనా’ పాట పాడటంతో ఆయన చెప్పినట్టే మంచి పేరుతెచ్చుకున్నానని ఒక సందర్భంలో సునీత చెప్పారు. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో ‘పుణ్యవది’ తమిళ సినిమాలో పాడారు. ఇప్పటివరకు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో మూడు వేల పాటలు పాడారు. మహానటి సినిమాలో ‘చివరకు మిగిలేది’ పాట తనలోని గాయనిని మరింత ఎత్తుకు తీసుకెళ్లిందంటే అతిశయోక్తి కాదు. కేవలం సినిమాలే కాకుండా ఆధ్యాత్మిక గీతాలు మరికొన్ని వందలు గానం చేయటం సునీత ప్రత్యేకత. గాత్రదానంతో పాత్రలకు ప్రాణప్రతిష్ట.. తొలుత డబ్బింగ్ చెప్పేందుకు విముఖత చూపినా ‘చూడాలని ఉంది’లో సౌందర్య పాత్రకు డబ్బింగ్ చెప్పమన్నపుడు ఇష్టం లేదని నిష్కర్షగా చెప్పినా, తర్వాత ‘పద్మావతి’ అన్న డైలాగ్ నచ్చి, గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఆనంద్, మల్లీశ్వరి, మన్మథుడు, శంకర్‌దాదా ఎంబీబీఎస్, జయం, రాధాగోపాళం, గోదావరి, శ్రీరామరాజ్యం...వంటి వందలాది సినిమాలకు తన గళంతో హీరోయిన్ పాత్రకు ప్రాణప్రతిష్ట చేశారు. మరోవైపు స్టేఈ షోలు, యాంకరింగ్ చేస్తూ వస్తున్నారు. మూడేళ్లపాటు టీటీడీ చానల్లో ‘అన్నమయ్య పాటకు పట్టాభిõÙకం’చేశారు. ఇప్పటివరకు తొమ్మిది నంది అవార్డులు వస్తే, అందులో అయిదు డబ్బింగ్‌కు అందుకున్నారు. సునీత కుమారుడు ఆకాష్ ఉద్యోగంలో స్థిరపడ్డారు. కుమార్తె శ్రేయ ‘సవ్యసాచి’ సినిమాలో కీరవాణి స్వరకల్పనలో ఓ పాట పాడారు. -
చిన్మయి వర్సెస్ రాధా రవి
‘మీటూ’ ఉద్యమం మన దేశంలోనూ ఊపందుకున్నప్పుడు సౌత్ ఇండస్ట్రీల్లో ఎక్కువగా వినిపించిన పేరు చిన్మయి. గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా చిన్మయి పాపులర్. సాధారణంగా సినిమాల్లో హీరోయిన్లకు గొంతుగా ఉండే చిన్మయి, ఈ ఉద్యమంలో ఎందరో బాధితులకు గొంతుగా నిలిచారు. ధైర్యంగా నిలబడ్డారు. ‘మీటూ’ ఉద్యమంలో ఆమె ఎదుర్కొన్న లైంగిక వేధింపులను నిర్భయంగా బయటకు చెప్పడమే కాకుండా దాని వెనుక ఉన్నది ప్రముఖ గేయ రచయిత వైరముత్తు అని ఆయన పేరుని బయటపెట్టారు. తమిళ పరిశ్రమలో అది సంచలనం సృష్టించింది. ఆ తర్వాత తన ట్వీటర్ వేదికగా వైరముత్తు, నటుడు, నిర్మాత రాధారవిపై ఆరోపణలు చేసిన స్త్రీల వివరాలను గోప్యంగా ఉంచి వాళ్ల చేదు సంఘటనలు షేర్ చేస్తూ ఉన్నారు. ఇది జరిగిన కొన్ని రోజులకే చిన్మయి డబ్బింగ్ యూనియన్ సభ్యత్వం రద్దయింది. సభ్యత్వం కొనసాగించకపోవడానికి వార్షికరుసుము చెల్లించకపోవడమే కారణం అని, అందుకే సభ్యత్వాన్ని రద్దు చేశామని యూనియన్ పేర్కొంది. అప్పుడు డబ్బింగ్ యూనియన్ ప్రెసిడెంట్ పదవిలో రాధారవి ఉన్నారు. సభ్యత్వం రద్దు విషయమై చిన్మయి కోర్టుని ఆశ్రయించగా, కోర్టు చిన్మయి వాదనకు అనువుగా ఇంటర్న్ ఆర్డర్ (ఈ కేసు పరిశీలనలో ఉన్నంత కాలం ఆమె డబ్బింగ్ యూనియన్ సభ్యురాలిగానే పరిగణించాలి) మంజూరు చేసింది. ఆ తర్వాత తమిళంలో చిన్మయి డబ్బింగ్ కెరీర్ మందకొడిగా సాగుతోంది. తాజాగా ఈ నెల డబ్బింగ్ యూనియన్ ఎన్నికలు జరగనున్నాయనే ప్రకటన విడుదలైంది. మరోసారి ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయడానికి రెడీ అయ్యారు రాధారవి. ఆయనకు ప్రత్యర్థిగా, రామరాజ్యం పార్టీ తరపున ప్రెసిడెంట్ పదవికి నామినేషన్ వేశారు చిన్మయి. విశేషం ఏంటంటే సభ్యత్వం రద్దు చేసినప్పుడే డబ్బింగ్ యూనియన్ ఓటర్ల జాబితాలో నుంచి చిన్మయి పేరును తొలగించారు. ‘సభ్యులు కానివారు ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారు?’ అని ఒక వర్గం వారు చిన్మయిని విమర్శించారు. ‘‘కోర్టు మంజూరు చేసిన ఆర్డర్లో ఎన్నికల్లో పోటీ చేసే హక్కు నాకుంది’’ అని పేర్కొన్నారు చిన్మయి. ప్రస్తుతం చిన్మయి నామినేషన్ పత్రాలు పరిశీలనలో ఉన్నాయి. ఫిబ్రవరి 15న ఎన్నికలు జరగనున్నాయి. మరి ఎలాంటి నాటకీయత చోటు చేసుకుంటుంది? చిన్మయి వర్సెస్ రాధారవి.. గెలుపు ఎవరిది? అని తమిళ పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. -
బిగ్‌బీ శంకర్... మనోడు అదుర్స్
ఆయన పాత్రకు ప్రాణమయ్యాడు.. వెండితెరపై మాటల తూటాలు పేల్చాడు.. ప్రేక్షకుల మది దోచాడు. ఆయనే డబ్బింగ్ ఆర్టిస్ట్ శంకర్. కొత్తగూడెం పట్టణానికి చెందిన ఈయన డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సినీ పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీ సమీపంలోని బౌద్ధనగర్‌లో నివాసముంటున్న శంకర్ ఇప్పటి వరకు 300 సినిమాలు, 70 టీవీ సీరియల్స్‌కు గాత్రం అందించాడు. ఇటీవల విడుదలైన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో అమితాబ్ బచ్చన్ పాత్రకు తెలుగులో డబ్బింగ్ చెప్పి అందరి మన్ననలు అందుకున్నాడు. అయ్యారే చిత్రంతో ప్రస్థానం ప్రారంభించిన శంకర్... రేసుగుర్రం, ఎవడు, పద్మావతి, మణికర్ణిక, ఖైదీ నంబర్ 150 తదితర చిత్రాలతో ఫేమస్ అయ్యాడు. మమ్ముట్టి, సుమన్, అర్జున్, భానుచందర్, ప్రదీప్‌రావత్, నాజర్ తదితరులకు డబ్బింగ్ చెప్పాడు. నాడు క్షీర సాగర మథనం సందర్భంగా వెలువడిన గరళాన్ని శంకరుడు తన కంఠంలో ఉంచుకుని లోకానికి మేలు చేశాడు. నేడు డబ్బింగ్ కళా సాగర మథనంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ గళాన్ని తన కంఠంతో పలికించాడు ఈనాటి మన శంకరుడు. ఇటీవల విడుదలై విజయ ఢంకా మోగిస్తున్న ‘సైరా’ నరసింహారెడ్డి సినిమాలో బిగ్ బీకి తెలుగులో డబ్బింగ్ చెప్పి అదరహో అనిపించాడు రేణికుంట్ల శంకర్‌కుమార్. డబ్బింగ్ కళాకారుడిగానే కాకుండా సినిమాలు, టీవీ సీరియళ్లు, వ్యాపార ప్రకటనలు, ప్రోమోలు, నేషనల్ జియోగ్రఫీ, డిస్కవరీ టీవీ చానెళ్లతో పాటు ప్రభుత్వ పథకాల ప్రకటనలకు వాయిస్ ఓవర్ చెబుతూ ప్రతిభ చాటుతున్నాడు ఈ గళజీవి. ఓయూ సమీపంలోని బౌద్ధనగర్‌లో సాధారణ జీవితం గడుపుతున్న కంచుకంఠం శంకర్‌కుమార్ ‘కళా’త్మక ప్రస్థానంపై ప్రత్యేక కథనం. – ఉస్మానియా యూనివర్సిటీ ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం పట్టణం 7వ ఇంక్లెయిన్‌కు చెందిన సింగరేణి ఉద్యోగి రేణికుంట్ల మదనయ్య, రాంబాయి దంపతుల కుమారుడు శంకర్. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తిలోని ఓయూ అనుబంధంగా ఉన్న సాయికృష్ణ కాలేజీలో ఎంబీఏ పూర్తి చేశాడు. తొలుత ప్రవేటు ఇన్సూరెన్స్, బ్యాంకుల్లో పని చేశాడు. ఆ తర్వాత సొంత వ్యాపారం ప్రారంభించాడు. కొంత కాలం తర్వాత వ్యాపారంలో నష్టం రావడంతో మానేసి డబ్బింగ్ వైపు ఆసక్తి పెంచుకున్నాడు. గత పదేళ్లలో 300 సినిమాలు, 70 టీవీ సీరియళ్లకు డబ్బింగ్ చెప్పాడు. ఇటీవల విడుదలైన చిరంజీవి సినిమా ‘సైరా నరసింహరెడ్డి’లో అమితాబ్‌బచ్చన్‌కు తెలుగులో డబ్బింగ్ చెప్పి తన ప్రతిభను చాటుకున్నాడు. అమితాబ్‌కు డబ్బింగ్ చెప్పడం తొలుత ఎంతో భయమేసిందని, సినిమా పూర్తయిన తర్వాత బంధువులు, స్నేహితులు అభినందించారని శంకర్ ఈ సందర్భంగా సంతోషం వెలిబుచ్చాడు. తొలి సినిమా ‘అయ్యారే’ రాజేంద్రప్రసాద్ నటించిన ‘అయ్యారే’ చిత్రంలో శంకర్ తొలిసారిగా డబ్బింగ్ చెప్పారు. రేసుగుర్రం, గౌతంనందా, విన్నర్, నాయక్, ఇంటెలిజెంట్, కురుక్షేత్రం, పద్మావతి, మణికర్ణిక, సత్య–2, జక్వార్, తుఫాన్, ఎవడు, ఖైదీనంబర్ 150 తదితర సినిమాల్లో డబ్బింగ్ చెప్పాడు. డబ్బింగ్ సేవలకు గుర్తింపుగా 2013లో మాటీవీ అవార్డును అందుకున్నాడు. స్నేహితుల ప్రోత్సాహంతోనే.. నీ వాయిస్ చాలా బాగుంటుంది. సినిమాలో ప్రయత్నించు అని శంకర్ స్నేహితులు, బంధువులు చెబుతుండేవారు. తనలోని టాలెంట్‌ను గుర్తించిన శంకర్‌కు డబ్బింగ్‌పై ఆసక్తి కలిగింది. ఈ క్రమంలోనే చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో జరిగిన ఓ కార్యక్రమం ఆయన జీవితాన్ని మలుపుతిప్పింది. ప్రఖ్యాత డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్సీఎం రాజుతో పరిచయం ఏర్పడింది. ‘నీ వాయిస్ బాగుంది’ అని కితాబు ఇచ్చారు. డైరెక్టర్ కస్తూరి శ్రీనివాస్ వద్దకు పంపించారు. అప్పట్లో ఏపీ మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ నిర్వహించిన ఆడిషన్స్‌లో 170 మంది పాల్గొన్నారు. శంకర్ 2వ స్థానంలో నిలిచాడు. ఇలా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న శంకర్‌కు తూర్పువెళ్లే రైలు టీవీ సీరియల్లో డబ్బింగ్ చెప్పే అవకాశం వచ్చింది. అదే ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్ జీవితానికి నాంది పలికింది. పరకాయ ప్రవేశం చేస్తా.. డబ్బింగ్ చెప్పాలంటే పరకాయ ప్రవేశం చేయాల్సి ఉంటుంది. నటుడి హావభావాలు, బాడీ లాంగ్వేజ్ తదితర అంశాలను నిశితంగా పరిశీలించి డబ్బింగ్ చెబితేనే సక్సెస్ అవుతుంది. డబ్బింగ్ చెబుతుంటె నటుడే మాట్లాడుతున్నట్లు ప్రేక్షకులకు భ్రమ కల్పించాలి. భాషపై పట్టు ఉండాలి. జీవంలేని బొమ్మకు ప్రాణం పోసే ప్రక్రియే డబ్బింగ్. నటనపై నాకు ఆసక్తి లేదు. – శంకర్‌కుమార్ -
డబ్బింగ్ చెప్పనిస్తారా?
‘మీటూ’ ఉద్యమంలో డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్ చిన్మయి శ్రీపాద కీలకపాత్ర పోషించారు. ప్రముఖ తమిళ కవి వైరముత్తుపై ఆరోపణలు చేయడమే కాకుండా, అజ్ఞాతంగా ఉంటూ ఆయనపై ఆరోపణలు చేసినవారి ట్వీట్స్‌ను తన ట్వీటర్లో పోస్ట్ చేశారామె. అది మాత్రమే కాదు.. నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ అధ్యక్షుడు రాధారవిపై కూడా చిన్మయి ఆరోపణలు చేశారు. దాంతో గత ఏడాది నవంబర్‌లో ఎటువంటి ముందస్తు సమాచారం అందించకుండానే డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ సభ్యత్వ ఫీజు చెల్లించలేదనే కారణం చూపి చిన్మయిని యూనియన్ నుంచి పక్కనపెట్టారు. ఈ విషయంలో న్యాయం కోసం చిన్మయి మద్రాస్ హై కోర్టును ఆశ్రయించారు. తాజాగా హై కోర్టు టెంపరరీ స్టే ఇస్తూ, ఈ విషయం మీద మార్చి 25లోగా వివరణ ఇవ్వాలని రాధారవిని ఆదేశించింది. ‘‘ఇది కేవలం కొన్ని రోజుల స్టే మాత్రమే. రాధారవి, అతని అనుచరులు ఎలా స్పందిస్తారో, అప్పుడు కేసు ఎలా ముందుకు నడుస్తుందో చూడాలి. ఇది వరకు యూనియన్ నుంచి తప్పించబడ్డ వాళ్ల అనుభవాలు వింటే ఇది కొన్నేళ్లపాటు సాగే పోరాటం అని అర్థం అవుతోంది’’ అని పేర్కొన్నారు చిన్మయి. ఇలా కేసు ఏళ్ల తరబడి సాగితే చిన్మయి గొంతు తమిళంలో మళ్లీ ఎప్పుడు వినిపించాలి? అసలు చిన్మయికి మళ్లీ డబ్బింగ్ చెప్పుకునే అవకాశం ఇస్తారా? కాలమే చెప్పాలి. -
నల్ల పిల్ల హీరోయినా..?
ఇది వెండితెర వెనకాల కథ ఏ ఇంటి అమ్మాయికీ జరగకూడని కథ ఇప్పటివరకూ బయటపడని కథ మగాహంకారం కప్పేసిన కథ ఒక మహిళకు ఉన్న పోరాట గుణం చెప్పే కథ సరైన కథ.. మరో సరిత కథ. వెండితెరపై అద్భుతంగా నటించే సరిత తెర మీద కనిపించే వేరే నటీమణుల పాత్రలకు తెరవెనక తన గొంతుతో ప్రాణం పోస్తుంటారు. ‘మరో చరిత్ర’ ఆమె తొలి చిత్రం. నటిగా 40 ఏళ్లు. 150కి పైగా సినిమాలు, ఎందరో నటీమణులకు డబ్బింగ్.. సరిత ఇప్పుడు తెర మీద కనిపించకపోయినా వినిపిస్తూనే ఉన్నారు. ఇటీవల ఓ వేడుకలో పాల్గొనడానికి దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఆమెతో ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ. ‘మరో చరిత్ర’లాంటి ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే సినిమా ద్వారా కథానాయికగా పరిచయమయ్యారు. ఈ రిజల్ట్‌ని ఊహించే వయసు కాదు కాబట్టి ఆశ్చర్యపోయి ఉంటారేమో? సరిత: నిజమే. టీనేజ్‌లో ఉన్నప్పుడు ఆ సినిమా చేశాను. సినిమా అంటే ఏంటో తెలియదు. ఇక హిట్, ఫ్లాప్ గురించి తెలియని ఏజ్, స్టేజ్. బాలచందర్‌గారితో చేసిన ఆ సినిమా నాకో మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఆ సక్సెస్ పెద్ద సర్ప్రైజ్. రోజులు కాదు.. సంవత్సరాలు ఆడింది. అలాంటి హిట్ మళ్లీ నా కెరీర్లో రాలేదు. లవ్ స్టోరీస్ అంటే ‘మరోచరిత్ర’లా ఉండాలి అన్నట్లు ఆ సినిమా ఓ బెంచ్‌మార్క్ అయిపోయింది. ఇప్పటికీ ఆ సినిమాలోని సన్నివేశాలను కొన్ని సినిమాల్లో వాడటం భలే అనిపిస్తుంది. అసలు బాలచందర్‌గారి కళ్లలో ఎలా పడ్డారు? మా నాన్నగారు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా, ఫైనాన్షియర్‌గా ఉండేవారు. రైటర్ గణేశ్ పాత్రోగారు మా నాన్నగారికి ఫ్రెండ్. ఆయనోసారి మా ఇంటికి వచ్చారు. అప్పుడు నేను 8వ తరగతి చదువుతున్నా. నేను స్కూల్ నుంచి వచ్చి, షూస్ విప్పి లోపలకు వెళ్లిపోయాను. గణేశ్‌గారు మా నాన్నగారిని ‘పాప యాక్ట్ చేస్తుందా? బాలచందర్‌గారు హీరోయిన్ కోసం చూస్తున్నారు. కొత్తమ్మాయిని తీసుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికి 160 మందిని చూశారు’ అని మా నాన్నగారితో అన్నారట. నాకప్పుడు పధ్నాలుగేళ్లే అయినా వయసుకి మించి కనిపించేదాన్ని. గణేశ్‌గారు నాకు పదహారేళ్లు ఉంటాయనుకున్నారు. మా నాన్న నన్ను పిలిచి, ‘యాక్ట్ చేస్తావా?’ అని అడిగితే, ‘నో’ అన్నాను. ఆయన వెళ్లిపోయాక నాన్నగారు ‘ఇది కమల్‌హాసన్ పిక్చర్’ అన్నారు. నా ముఖం బల్బ్‌లా వెలిగిపోయింది. ఒప్పుకున్నాను. మర్నాడు స్కూల్‌కు సెలవు పెట్టి షాపింగ్‌కు వెళ్లాం. చీర, బ్లౌజ్ కొనడానికి. అది కట్టుకుని ఆడిషన్స్‌కి వెళ్లాలనుకున్నాను. మోడ్రన్ డ్రెస్‌లో వెళ్లాలని ఎందుకు అనుకోలేదు? అంతకుముందు చీర కట్టుకునే అలవాటు ఉందా? చీర అలవాటు లేదు. అయితే మామూలు డ్రెస్‌లో చిన్నపిల్లలా కనిపిస్తే హీరోయిన్ లుక్ లేదని సెలక్ట్ చేయరనుకున్నా. అంతకుముందు ‘అనార్కలి’ అనే సినిమాకు టెస్ట్ చేసి చిన్నపిల్లలా ఉన్నానని తీసుకోలేదు. రిజెక్షన్ అంటే నాకు ఇష్టం ఉండదు. అప్పటికి ‘మరోచరిత్ర’ కోసం 160 మందిని చూశారు. వాళ్లలా రిజెక్ట్ కాకూడదనుకున్నాను. నాకింకా గుర్తు. ‘పర్ఫెక్ట్ టైలర్స్’ అనే టైలరింగ్ షాప్ ఉండేది. అక్కడే నా ఫస్ట్ బ్లౌజ్ కుట్టించుకున్నాను. చీర కట్టుకుని, నేను నచ్చకుండా ఉండకూడదు అనే ఫీలింగ్‌తో వెళ్లాను. యన్టీఆర్గారి మేకప్‌మేన్ పీతాంబరంగారే మేకప్ చేశారు. బాలచందర్‌గారు ఆడిషన్ చేశారు. సెలక్ట్ అయ్యాను. అయితే ఫస్ట్‌డే సజావుగా సాగలేదు. ఏమైంది? కమల్‌హాసన్‌గారి చేతిని ముద్దుపెట్టుకుని, ‘ఏం? తప్పా?’ అని అడగాలి. అప్పుడు ఆయన ‘ముద్దు పెట్టుకున్న చోటే తప్పు’ అంటారు. నేను సిగ్గుపడుతున్న ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. అది రాలేదు. 7 టేక్స్ అయ్యాయి. మా నిర్మాతగారు నన్ను పంపించడానికి టికెట్స్ బుక్ చేయడానికి వెళ్లిపోయారు. సాయంత్రం బాలచందర్‌గారి అసోసియేట్ అనంత్ నాతో ‘కమల్ అంటే ఇష్టమేనా? అని అడిగారు. ‘చాలా’ అన్నాను. ‘అది ఫేస్‌లో చూపించాలి’ అన్నారు. మర్నాడు షూటింగ్లో కమల్‌గారి మీద ఉన్న ఇష్టాన్ని ముఖంలో చూపించాను. సీన్ ఓకే అయింది. ‘మరోచరిత్ర’కు మిమ్మల్ని తీసుకున్నప్పుడు ‘నల్ల పిల్ల హీరోయినా?’ అనే కామెంట్స్ వినబడ్డాయి. మీరేమైనా హర్ట్ అయ్యారా? అలా అన్నారని రియాక్ట్ అవ్వాలని కూడా తెలియదు. సినిమా రిలీజయ్యాక అమ్మాయి వల్లే పిక్చర్ రన్ అవ్వడం లేదు. తనే మైనస్ అని రాశారు. కానీ సెకండ్ వీక్‌కు ఈ అమ్మాయే ఈ సినిమాకు ప్లస్ అన్నారు. యాక్చువల్‌గా హిందీ రీమేక్‌లోనూ కమల్‌హాసన్‌గారు నన్నే చేయమన్నారు కూడా. ఆ సంగతలా ఉంచితే నాకు ఫెయిర్‌గా ఉండేవాళ్లంటే ఇష్టం. కానీ తర్వాత నా రంగే నాకు ప్లస్ అని, టాలెంటే ముఖ్యం అనితెలుసుకున్నాను. రిజెక్షన్ అంటే ఇష్టపడనన్నారు. ఒకవేళ ‘మరో చరిత్ర’కు సెలక్ట్ కాకపోయుంటే? చదువుకునేదాన్ని. అయితే ‘మరో చరిత్ర’ తర్వాత ఇక నాకు చదువుకునే అవకాశం దక్కలేదు. ఎనిమిదో తరగతితోనే చదువు అయిపోయింది. అందుకే మా పిల్లలను బాగా చదివిస్తున్నాను. సౌందర్య, విజయశాంతి, నగ్మా, రమ్యకృష్ణ, సిమ్రాన్, టబు, నదియా.. ఇలా చాలా మందికి డబ్బింగ్ చెప్పారు.. చెబుతున్నారు. అసలు డబ్బింగ్ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? డబ్బింగ్ జర్నీ బ్యూటిఫుల్ అంటాను. ఫస్ట్ దాసరి నారాయణరావుగారు స్టార్ట్ చేశారు. ‘గోరింటాకు’ పిక్చర్‌కు అడిగారు. అందులో సావిత్రిగారికి డబ్బింగ్ చెప్పాను. డబ్బింగ్‌కి నన్ను ఎందుకు అడుగుతున్నారా? అనుకున్నాను. నా వాయిస్ బాగుంటుందని, డబ్బింగ్ బాగా చెబుతానని నాకు నేను తెలుసుకోవడానికి టైమ్ పట్టింది. సౌందర్య, విజయశాంతి, నగ్మా వాళ్లైతే సరిత డబ్బింగ్ చెబితే బావుంటుందని నా పేరుని సూచించేవారు కూడా. డైరెక్ట్‌గా కాల్ చేసి ‘సరూ.. చెప్పు’ అని అడిగేవారు. హీరోయిన్గా మూడు షిఫ్ట్స్ పని చేసినప్పటికీ రాత్రంతా కూర్చుని డబ్బింగ్ చెప్పేదాన్ని. టఫ్‌గా ఉండేది. కానీ స్నేహితుల కోసమే కదా అని హ్యాపీగా అనిపించేది. పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చాను. డబ్బింగ్ పూర్తి స్థాయి ప్రొఫెషన్ అయింది. పెళ్లి తర్వాత బ్రేక్ ఎందుకు తీసుకున్నారు? నేను కావాలని తీసుకున్న నిర్ణయం అది. నా పిల్లల్ని ఆయాలకు వదిలేసి, పని చేయలేను. యాక్టింగ్ అంటే 100 శాతం, డబ్బింగ్ అంటే 100 శాతం.. ఇలా ఏ పని చేసినా నా బెస్ట్ ఇవ్వాలనుకుంటాను. మా అబ్బాయికి పది నెలల వయసప్పుడు ‘కుట్టయేట్టన్’ అనే మలయాళ సినిమా చేశాను. బాబుకు పాలు పట్టి రండి అని బ్రేక్స్ కూడా ఇచ్చేవాళ్లు. కానీ నా వర్క్‌ని ఎంజాయ్ చేయలేకపోయాను. బిడ్డకు, పనికి నా బెస్ట్ ఇవ్వడం లేదనే ఫీలింగ్ కలిగింది. బాబు ఏం చేస్తున్నాడో అనే ఆలోచన. ఇదే నా లాస్ట్ సినిమా అని నిర్ణయించేసుకున్నాను. అలా బ్రేక్ తీసుకున్నందుకు పశ్చాత్తాపం ఏమైనా? లేదు. యాక్టింగ్‌కు బ్రేకిచ్చినా సినిమాలకు టచ్‌లోనే ఉన్నాను కదా. డబ్బింగ్ చెబుతూనే ఉన్నాను. అయితే కొన్ని మంచి సబ్జెక్ట్స్ మిస్సయ్యాను. వాటిలో తమిళంలో ‘మగళిర్ మట్టుమ్’ (తెలుగులో ‘ఆడవాళ్లకు మాత్రమే’) అనే సినిమా ఒకటి. కమల్‌హాసన్ అయితే ‘వాహినీ స్టూడియోలో ఊయల పెట్టిస్తాను. నువ్వు మాత్రం ఈ సినిమా చేయాల్సిందే’ అన్నారు. నేను మ్యానేజ్ చేయలేనని చెప్పాను. ‘నీకింకా పదిరోజులు టైమ్ ఇస్తాను ఆలోచించుకో’ అని లండన్ వెళ్లిపోయారు. అక్కడినుండి ఫోన్ చేశారు. అప్పుడు నో అన్నాను. తిట్టేశారు. ‘ఇలా అనుకుంటే నువ్విక వర్క్ చేయలేవు’ అని కోప్పడ్డారు (నవ్వుతూ). భర్త (మలయాళ నటుడు ముఖేష్) సపోర్ట్ చేస్తే స్త్రీలకు వాళ్ల వృత్తిలో కొనసాగడం సులువు అవుతుంది. మీ భర్త సహకారం అందలేదా? మా ఆయన సపోర్ట్ అస్సలు లేదు. ముఖేష్‌గారు, మీరు ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు కదా? నాకు ఆయన కరెక్ట్ కాదు. ఆ తర్వాత తెలిసింది. ఆప్యాయత, అనురాగాలు ఏం లేవు మా మధ్యలో. దేవుడు నాకు బంగారం లాంటి ఇద్దరి పిల్లల్ని ఇచ్చాడు. అది చాలని అనుకుంటున్నాను. ఆయన మీద డిపెండ్ కూడా అవ్వడం లేదు. ఎందుకంటే బాధ్యతలు పంచుకోవడంలో ఆయనెప్పుడూ మాతో లేరు. మనసులు కలవలేదనే విడాకులు తీసుకున్నారా? నాకు డైవర్స్ ఇవ్వకుండానే ఆయన వేరే పెళ్ళి చేసుకున్నాడు. ఫ్రాడ్ చేసి డైవర్స్ పేపర్స్ తీసుకున్నాడు. మేమిద్దరం సెలబ్రిటీలం. డైవర్స్ తీసుకున్నా, డైవర్స్‌కు అప్లై చేసినా కచ్చితంగా మీడియాలో వస్తుంది. కానీ మేమిద్దరం విడాకులు తీసుకోవాలనుకుంటున్నామని, తీసుకున్నామని న్యూస్ వచ్చిందా? ఎందులోనూ రాలేదు. ఒకవేళ నేను ఈ విషయం మీద కేసు పెడితే ఏడేళ్లు జైలులో ఉండిపోతాడు. కానీ అలా చేయలేను. ఎందుకంటే నేను ఏ లాయర్‌ను అపాయింట్ చేసుకున్నా వాళ్లను కొనేస్తున్నాడు. ఎవరూ నిలబడలేదు. నిలబడనివ్వలేదు. నాకు ఇలా జరిగిందనే బాధకంటే ఈ వ్యవస్థ ఇలా ఉన్నందుకు ఎక్కువ బాధ కలిగింది. మన పిల్లలు ఈ సమాజం నుంచి ఏం నేర్చుకుంటారు? అనే బాధ. ఈ సిస్టమ్ తప్పుని తప్పు అని ఎందుకు చెప్పడం లేదు? ఎందుకంటే ఆయన చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆయన్ని ఏమీ చేయలేం. నువ్వు నన్ను కేరళాలో ఏమీ చేయలేవు అని డైరెక్ట్‌గా చాలెంజ్ కూడా విసిరాడు. దాంతో ఆ విషయాన్ని దేవుడికి వదిలేశాను. నా ఇద్దరు కొడుకులే నా ధైర్యం. పిల్లలకు బాధ లేదా? ఉండకుండా ఎలా ఉంటుంది? కానీ వాళ్లు నాతోనే ఉండాలనుకున్నారు. నాకు ధైర్యాన్ని ఇస్తున్నారు. వాళ్ల కోసం బతుకుతున్నాను. నా బాధ అంతా సెలబ్రిటీస్‌కే ఇలా ఉంటే మామూలు అమ్మాయిల పరిస్థితి ఏంటి? మీడియాను కూడా తనవైపే తిప్పుకుంటున్నాడు. కేరళలో ఉన్న ఓ ప్రముఖ దినపత్రిక వాళ్లు నన్ను ఓ 5 గంటలు ఇంటర్వ్యూ చేశారు. మా పిల్లలతో కూడా మాట్లాడారు. అయితే ఆ తర్వాత ఆ అమ్మాయి కాల్ చేసి మా ఎడిటర్‌గారికి మీ ఆయన ఫోన్ చేశారు అని చెప్పింది. ఆ ఇంటర్వ్యూ బయటకు రాదని అర్థమైంది. ఇంటర్వ్యూ బయటకు రాకూడదని ఎందుకు అంటారు? తప్పు వాళ్ల వైపు ఉండబట్టే కదా. ఆయన లా చదువుకున్నాడు. ఆయన క్లాస్మేట్స్ అందరూ లాయర్లు, జడ్జీలు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ సంఘటన వల్ల పిల్లలను పెంచే విధానంలో ఏదైనా మార్పు వచ్చిందా? మనం ఎదుర్కొనే పరిస్థితులను బట్టి మనం మన పిల్లలను పెంచుతాం. నా జీవితం నాకిప్పటి వరకూ నేర్పిన పాఠాలను పిల్లల పెంపకానికి ఉపయోగిస్తున్నాను. అయితే సిస్టమ్‌ను నేనెలా మార్చగలను? పెళ్లి విషయంలో నాకు జరిగినది తెలుసుకుని, ‘మమ్మీ.. డబ్బులుంటే న్యాయాన్ని కొనేయొచ్చుగా’ అంటున్నారు. అది ఎంత ప్రమాదకరమైన ఆలోచన? ఆ ఆలోచనతో పిల్లలు పెరగకూడదు. ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ధోరణిలో ఉంటారు. మేం మాట్లాడుకున్న లాయర్ వాళ్ల వైపు వెళ్లేసరికి మా పిల్లలు బాగా అప్సెట్ అయ్యారు. ఆ టైమ్‌లో నేను కూడా అలా అయిపోతే పిల్లలు వీక్ అవుతారు. అందుకే నా బాధను బయటకు చూపించలేదు. ఎందుకంటే ఏం జరిగినా ధైర్యంగా ఉండాలని వాళ్లు నేర్చుకోవాలనుకున్నా. ఇప్పుడు కూడా పిల్లల కోసం దుబాయ్‌లోనే ఉంటున్నారు. సినిమా చాన్సులు వస్తే? నా పిల్లలు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను. నా ఫస్ట్ ప్రయారిటీ వాళ్లే. ఒక అబ్బాయి డాక్టర్, రెండో అబ్బాయి ఇన్సూరెన్స్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. నా జీవితాన్ని సంపూర్ణం చేసేది వాళ్లే కాబట్టి నేనూ పిల్లలతోపాటు దుబాయ్‌లో ఉంటున్నాను. మంచి సినిమాకి అవకాశం వస్తే షూటింగ్ చేసి మళ్లీ వెళ్లిపోతాను. ఒక్కసారి మళ్లీ మేకప్ వేసుకుంటే బ్యాక్ ఆన్ ట్రాక్‌లా ఉండాలి. అంత మంచి క్యారెక్టర్ రావాలి. ఎందులో అయినా కాంప్రమైజ్ అవుతాను కానీ పాత్ర విషయంలో కాంప్రమైజ్ కాను. ఇప్పటికీ డబ్బింగ్ చెబుతున్నాను. మీ పిల్లలకు సినిమాల మీద ఆసక్తి ఉందా? ఉంది. కచ్చితంగా వస్తారు. ఇద్దరూ ఆరడుగుల పైనే ఉంటారు. హీరోలుగానే వస్తారు. ఈ ఏడాదిలోనే వద్దాం అనుకుంటున్నారు. దేవుడి దయ వల్ల మంచి బ్రేక్ రావాలి. వ్యక్తిగతంగా పెళ్లి విషయంలో చేదు అనుభవం ఎదురైంది. వృత్తిపరంగా ఏమైనా? కెరీర్‌వైజ్‌గా అలాంటిదేం లేదు. కానీ ఇప్పుడు కొందరు ఆర్టిస్టులు చేదుఅనుభవాలు ఎదురయ్యాయని చెబుతుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. బాధగా కూడా ఉంది. ఆ రోజుల్లో పని వాతావరణం ఎలా ఉండేది? ప్రతి ఒక్కరూ వేరేవాళ్లను గౌరవించుకునేవాళ్లం. షూటింగ్లో ఒక్కచోటే కూర్చునేవాళ్లం. ఇప్పుడు ఎవరి కార్‌వ్యాన్‌లో వాళ్లు ఉంటున్నారు. డబ్బింగ్ చెబుతూ ఇంకా ఇండస్ట్రీతో టచ్‌లోనే ఉన్నాను కాబట్టి ఈ మార్పులు తెలుస్తున్నాయి. మద్రాస్‌లో వాహినీ, ఏవీయం స్టూడియోస్‌లో ఎక్కువగా షూటింగ్స్ జరిగేవి. ఎవరి షూటింగ్లో వాళ్లు ఉన్నా లంచ్ టైమ్‌లో కలిసేవాళ్లం. శ్రీదేవి అమ్మగారైతే లంచ్ ప్రిపేర్ చేసి, దేవుడికి నైవేద్యం పెట్టి మా అందరికీ కలిపి ముద్దలు పెట్టేవారు. అంత బాగుండేవాళ్లం. మీకు వంట వచ్చా? షూటింగ్స్‌కు వండి తీసుకెళ్లిన సందర్భాలున్నాయా? బాగా వచ్చు. ‘అర్జున్’ సినిమా అప్పుడు బిర్యానీ చేశాను. దర్శకుడు గుణశేఖర్‌గారి దగ్గర ‘మధ్యాహ్నం ఆవిడను వదిలేయండి .. మనకు బిర్యానీ వండి పెడతారంట’ అని ప్రకాశ్ రాజ్‌గారు పర్మిషన్ ఇప్పించారు. మహేశ్ కూడా టేస్ట్ చేశారు. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? సావిత్రిగారు. సినిమాల్లోకి రాకముందు నేను ఆవిడ సినిమాలు ఎక్కువగా చూడలేదు. తమిళంలో పని చేసేటప్పుడు చాలామంది నన్ను ఆవిడతో పోల్చేవారు. సావిత్రిలా.. అంటూ నా గురించి రివ్యూస్‌లో రాసేవారు. దాంతో ఆవిడ సినిమాలన్నీ చూడటం మొదలెట్టాను. అప్పుడు ఆవిడ ఏ రేంజ్ యాక్టరో అర్థం అయింది. ఆమె అంత పేరు రాకపోయినా కొంచెం అయినా తెచ్చుకోవాలనుకునేదాన్ని. ఆవిడ లైఫ్‌ను చూసి మీరు నేర్చుకున్నదేంటి? ఆవిడ గురించి వినడమే తప్ప నేను సావిత్రిగారి జీవితాన్ని చూడలేదు. ‘గోరింటాకు’ సినిమాలో ఆమె చేసిన పాత్రకు డబ్బింగ్ చెప్పాను. ఆ సినిమాలో ఆవిడ లుక్ మారిపోయింది. బాధ అనిపించింది. నటిగా, వ్యక్తిగా అద్భుతమైన మనిషి సావిత్రిగారు. కానీ ఆరోగ్యం గురించి పట్టించుకోకపోతే చాలా సమస్యలు వస్తాయి. ఆవిడ జీవితం తెలుసుకున్నాక ఈ విషయం నా మనసులో నాటుకుపోయింది. ఇండస్ట్రీలో మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? ఎవరితో కష్టసుఖాలు షేర్ చేసుకుంటారు? నాకు అందరూ ఫ్రెండ్సే. ఆనందం, బాధ రెండూ నేనే పంచుకుంటాను. నా పెళ్లి విషయాలు షేర్ చేసుకోవడం సిగ్గనిపించింది. దేవుడున్నాడని నమ్ముతారా? కచ్చితంగా. ఏదో పవర్ ఉందని నమ్ముతాను. నేను సాయిబాబా భక్తురాలిని. మద్రాస్‌లో మైలాపూర్‌లో సాయిబాబా గుడి ఉంది. అక్కడకు తరచూ వెళ్లేదాన్ని. షిరిడీకి కూడా వెళుతుంటాను. కష్టాల్లో బాబా తోడుంటాడని నమ్ముతాను. ‘అర్జున్’లో విలనిజమ్ షేడ్ ఉన్న అత్త పాత్ర చేసినప్పుడు ఎలా అనిపించింది? ఫస్ట్ చేయడానికి సంకోచించాను. ఆ తర్వాత ఆ టీమ్ నన్ను కన్విన్స్ చేసింది. మహేశ్‌బాబు, గుణశేఖర్గార్ల కాంబినేషన్ అంటే చిన్న విషయం కాదు. కథ, నా పాత్ర బాగుంటాయి. నటిగా నా పర్ఫార్మెన్స్ మీద నాకు నమ్మకం ఉంది. అయితే అంత బాగా విలనిజమ్ పండించగలనని ‘అర్జున్’ చేసిన తర్వాతే తెలిసింది (నవ్వుతూ). తమిళ సినిమా ‘అగ్ని సాక్షి’లో పాట పాడారు. ఆ తర్వాత సింగర్‌గా కంటిన్యూ కాలేదేం? నేను సింగర్‌ని అవుదామనుకున్నాను. అయితే ట్రైన్డ్ సింగర్ కాదు. అందుకే కంటిన్యూ కాలేదు. ఇప్పుడంటే పాటలో ఒకటీ రెండూ లైన్లు కూడా పాడిస్తున్నారు. అప్పుడు పాట అంటే ఫుల్ సాంగ్ పాడాల్సిందే. ఫైనల్లీ ఇప్పుడు మీకు మీరే అండ.. పిల్లలకు మీరే అండ. ఎలా ఉన్నారు? హెల్త్ బావుంటే అంతా సెట్ అవుతుంది. ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేవు. పాజిటివ్‌గా ఉంటాను. ఫైనాన్షియల్‌గా ఆహా ఓహో అని చెప్పను కానీ మాకు సరిపడినంత ఉన్నాయి. ఐయామ్ హ్యాపీ. – డి.జి. భవాని -
తమిళంలో చిన్మయి గొంతు వినిపించదు
‘మీటూ’ ఉద్యమం గురించి సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి నిర్భయంగా మాట్లాడిన సంగతి గుర్తుండే ఉంటుంది. తన ట్వీటర్ ఖాతా ద్వారా చాలా మంది అజ్ఞాత స్త్రీల ఆరోపణలకు గొంతునిచ్చారు. ప్రముఖ పాటల రచయిత వైరముత్తు, నటుడు రాధారవి మీద ఆరోపణలు చేశారు. వీటివల్ల మీకు అవకాశాలేమైనా తగ్గుతాయనుకుంటున్నారా? అని ఆ మధ్య ‘సాక్షి’ అడిగినప్పుడు ‘అలాంటిదేం లేదు. ఏం జరిగినా ధైర్యంగా ఎదుర్కొంటా’’ అని చిన్మయి అన్నారు. మరి.. తాజా పరిణామాన్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి. విషయం ఏంటంటే.. చిన్మయిని డబ్బింగ్ అసోసియేషన్ నుంచి తొలగించారు. ‘‘నన్ను డబ్బింగ్ యూనియన్ నుంచి తొలగించారు. అంటే.. ఇక తమిళ సినిమాలకు డబ్బింగ్ చెప్పలేను. రెండు సంవత్సరాలుగా నేను యూనియన్ ఫీజŒ కట్టలేదన్నదాన్ని కారణంగా చూపించారు. కానీ, ఇన్ని రోజులు డబ్బింగ్ చెప్పడం వల్ల నాకొచ్చిన ఆదాయంలో 10శాతం తీసుకున్నారు. పాత బకాయిలున్నట్టు మెసేజ్ కానీ, లెటర్ కానీ పంపకుండా నా మెంబర్షిప్ తొలగించారు. మళ్లీ తమిళ సినిమాలకు డబ్ చేస్తానో లేదో తెలియదు’’ అని చిన్మయి ట్వీట్ చేశారు. విశేషం ఏంటంటే.. డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్‌కు రాధారవి ప్రెసిడెంట్. -
శ్రీ కృష్ణుడికి డబ్బింగ్ చెప్పాను!
పొద్దున్నే ఖురాన్ తెలుగులో చదవడం...సాయంత్రం శ్రీకృష్ణుడిపాత్రకు గాత్రం ఇవ్వడం...సినిమాలు, సీరియల్స్, ప్రకటనలు, డాక్యుమెంటరీలు... అన్ని విభాగాలలోను తన గొంతుతో సుపరిచితులయ్యారు యూసఫ్. సుమారు 500 కు పైగా చిత్రాలకు, సీరియల్స్‌కు డబ్బింగ్ చెప్పిన యూసఫ్ ప్రస్తుతం ఉద్యోగరీత్యా అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటున్నారు.తన డబ్బింగ్ ప్రయాణంగురించి ఫోన్ ద్వారా సాక్షితో సంభాషించారు.. మాది ఖమ్మం జిల్లా ఇష్టాపురం. నాన్నది టైలర్ వృత్తి. అమ్మ గృహిణి. నేను ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంకామ్ చదివాను. ఒక చిన్న కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేయడానికి హైదరాబాద్ వచ్చాను. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడ్డాయి. కొత్త స్నేహాలు కలిశాయి. మిత్రులందరితో తరచూ ఫోన్లో సంభాషించేవాడిని. నా గొంతు విన్నవారంతా ‘నీ గొంతు బాగుంది, చక్కగా వాడుకోవచ్చు కదా’ అని తరచుగా అనేవారు. వారి ప్రోత్సాహంతో కొన్ని వ్యాపార ప్రకటనలను స్వయంగా రచించి, నేనే నటించి, నా గాత్రంతో వినిపించాను. కొన్ని ఆడియో క్యాసెట్లకు కూడా గొంతు ఇచ్చాను. ఆ తరవాత మిత్రుల సహకారంతో సినిమాలో డబ్బింగ్ చాన్స్ కోసం ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలో భాగంగానే ‘జెండా’ చిత్రంలో డబ్బింగ్ చెప్పడానికి అవకాశం వచ్చింది. ఆ సినిమా కొత్తవారితో తీస్తున్నారని తెలిసి నేను కూడా ఒక ప్రయత్నం చేద్దామని, సెలక్షన్స్ కోసం రామానాయుడు స్టూడియోకి వెళ్లాను. ఎన్నో పరీక్షల తరవాత నన్ను ఎంపిక చేశారు. అక్కడే డబ్బింగ్ ఎలా చెప్పాలనే విషయంలో మంచి శిక్షణ పొందాను. ‘రెండు మూడు రోజుల తరవాత ప్రారంభిద్దాం’ అనడంతో వెళ్లిపోయాను. సినీ రంగ ప్రవేశం మళ్లీ పిలుస్తాను అనడం, పిలుపు రాకపోవడం మామూలే. ఎంత కాలం గడిచినా నాకు పిలుపు రాలేదు. డబ్బింగ్ యూనియన్‌లో మెంబర్షిప్ లేకపోవడం వల్ల అవకాశం చేజారిపోయిందని తరవాత తెలిసింది. ‘జెండా’ సినీ నిర్మాత ప్రోత్సాహంతో డబ్బింగ్ యూనియన్‌లో మెంబర్షిప్ తీసుకున్నాను. ఆ సినిమాకి డబ్బంగ్ ఇన్చార్జ్గా ఉన్న మిఠాయి చిట్టిగారు ‘ధైర్యం కోల్పోవద్దు’ అని నన్ను ప్రోత్సహించారు. ఆ తరవాత జరిగిన ఆడిషన్స్‌లో నేను సెలక్ట్ అయ్యాక, మంచి మంచి అవకాశాలు వచ్చాయి. డబ్బింగ్ ఆర్టిస్ట్స్ యూనియన్ వ్యవస్థాపక సభ్యులైన గోగినేని ప్రసాద్, కాంచనబాబు, మరికొందరు అవకాశాలు ఇవ్వడంతో నేను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశాను. అలా సినిమా రంగంలోకి అడుగుపెట్టాను. ఒకేరోజు పాతిక సీరియల్స్ సినిమాలలో చెబుతుండగానే, ‘చక్రవాకం’ సీరియల్‌తో బుల్లితెర అవకాశాలు వచ్చాయి. ఆ తరవాత వరుసగా సీరియల్స్‌కి డబ్బింగ్ ఇవ్వడం ప్రారంభించాను. సినిమాలు, టీవీ సీరియల్స్‌తో బాగా బిజీ అయిపోయాను. ఉదయం ఏడు నుంచి రాత్రి పది గంటల వరకు పనిచేసినా, కొన్ని సీరియల్స్ వదులుకోవలసి వచ్చింది. సినిమా అవకాశాలు మాత్రం వదులుకోలేదు. ఒకేరోజు టెలికాస్ట్ అయ్యే సీరియల్స్‌లో సుమారు పాతిక సీరియల్స్‌లో నా గొంతు ఉండేది. గొంతుకు గుర్తింపు సినిమాలు, సీరియల్స్‌తో పాటు ఎన్జిసి, డిస్కవరీ చానల్స్‌లో కూడా వాయిస్ ఓవర్ ఇస్తుండేవాడిని. ఆకాశవాణి నాటకాలలో, ఆడియో క్యాసెట్లు ... ఒక్కమాటలో చెప్పాలంలో 2004 నుంచి టీవీ చూసేవారందరికీ తప్పనిసరిగా నేను చిరపరిచితుడిని. నన్ను వ్యక్తిగతంగా గుర్తుపట్టరు కాని, నా గొంతును గుర్తుపడతారు. అలా డబ్బింగ్లో స్థిరపడిపోయాను. నా డబ్బింగ్ ప్రయాణంలో పెద్ద ఇబ్బందులేవీ ఎదుర్కోలేదు. వచ్చిన అవకాశాలన్నీ జాగ్రత్తగా ఉపయోగించుకున్నాను. ముందస్తు డబ్బింగ్ రెండుమూడు రోజులు ఊరు వెళ్లవలసి వస్తే, ముందుగానే డబ్బింగ్ చెప్పి వెళ్లేవాడిని. పనులన్నిటినీ జాగ్రత్తగా సర్దుబాటు చేసుకోవలసి వచ్చేది. నాకు శ్రావణితో వివాహం అయ్యింది. ఇద్దరు పిల్లలు, ఆర్యన్, రయాన్. నా వివాహ సమయంలో సెలవు పెట్టవలసి వచ్చింది. వేరే వారితో డబ్బింగ్ చెప్పిస్తే, సీరియల్స్ దెబ్బ తింటాయని చెప్పడంతో, ముందుగానే డబ్బింగ్ పని పూర్తిచేసుకున్నాను. 2017 వరకు దాదాపుగా 500 పైగా సీరియల్స్, చిత్రాలకు డబ్బింగ్ చెప్పాను. ఇందిరా ప్రొడక్షన్స్, గోపీకృష్ణ మూవీస్, శ్రీకాంత్ ప్రొడక్షన్స్, అన్నపూర్ణ... వంటి అనేక మంచి మంచి సంస్థలలో డబ్బింగ్ చెప్పాను. 2013లో జరిగిన మహాకుంభమేళాకు సంబంధించి అరవై నిమిషాల నిడివితో ఒక కార్యక్రమం రూపొందించారు. అందులో నా గాత్రం ఉపయోగించుకున్నారు. శ్రీకృష్ణుడికి గాత్రం ఎన్ని సినిమాలు, సీరియల్స్‌కి చెప్పినా నాకు బాగా గర్వంగా, తృప్తిగా అనిపించింది మాత్రం శ్రీకృష్ణుడి పాత్రధారికి చెప్పిన డబ్బింగ్. టీవీలో వస్తున్న మహాభారతం సీరియల్లో శ్రీకృష్ణుడి పాత్రకు నాలుగైదు సార్లు అంటే నాలుగైదు సీరియల్స్‌లో డబ్బింగ్ చెప్పాను. బి.ఆర్చోప్రా రూపొందించిన మహాభారత్‌ను తెలుగులోకి డబ్ చేసినప్పుడు, అందులో శ్రీకృష్ణుడిగా వేసిన ‘నితీష్ భరద్వాజ్’కి తెలుగులో డబ్బింగ్ చెప్పాను. నా కోసమే ఆగారేమో అన్నట్లుగా ఎంతోకాలం తరవాత ఆ సీరియల్‌ని తెలుగులో డబ్ చేశారు. నాకెంత సంతోషం కలిగిందో చెప్పలేను. ‘జై హనుమాన్’ చిత్రంలో శ్రీరాముడు పాత్రకు, ఆ తర్వాత శ్రీకృçష్ణుడి పాత్రకు నాలుగైదు సార్లు డబ్బింగ్ చెప్పాను. ‘హరహరమహాదేవ’ సీరియల్లో విష్ణుమూర్తి ప్రాతకు కూడా డబ్బింగ్ చెప్పాను. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కోయిలమ్మ, కుంకుమభాగ్య, శ్రీఆంజనేయం సీరియల్స్‌లో ప్రముఖంగాడబ్బింగ్ చెప్పాను. ‘ఆడదే ఆధారం’ సీరియల్లో మొదటిసారిగా విక్రమ్‌భాయ్ అనే విలన్ పాత్రకి డబ్బింగ్ చెప్పడం నాకొక టర్నింగ్ పాయింట్. అప్పటి నుంచి విలన్‌కి చెప్పే అవకాశాలు కూడా వచ్చాయి. ఇలా అన్ని విలక్షణ పాత్రలకు చెప్పాను. పౌరాణికాలంటే ఇష్టం ఉదయం ‘తెలుగు ఖురాన్’ రికార్డు చేసి, సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు శ్రీకృష్ణుడి పాత్రకు డబ్బింగ్ చెప్పాను. నాకు చిన్నప్పటి నుంచి పౌరాణికాలంటే ఇష్టం. శ్రీకృష్ణుడు నా డ్రీమ్ క్యారెక్టర్. మహాభారతం ద్వారా నా కల నెరవేరడం నా అదృష్టం. శ్రీకృష్ణుడి పాత్రకు గట్టి పోటీనే ఎదురైంది. 50 మంది గొంతుకలలో నా గొంతును ఎంపిక చేశారు. ‘నేను ఎవరు’ అనేది పట్టించుకోకుండా, నిష్పక్షపాతంగా ఆలోచించి, నాకు ఆ అవకాశం వచ్చేలా చేశారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, విష్ణుమూర్తి... ఇలా నా డ్రీమ్ క్యారెక్టర్స్‌కి అనేకమార్లు డబ్బింగ్ చెప్పడం నా పూర్వజన్మ సుకృతంగా భావించాను. ఎంతోమంది కలలు కన్నా దక్కని అదృష్టం, నాకు రావడం నిజంగా నా పూర్వజన్మ పుణ్యమే. ప్రకటనలకు... ∙శ్రీరామావారి కాలమానం (థియేటర్లలో ప్రదర్శించారు), నివేదిత గ్రామర్ స్కూల్, జ్ఞానభారతి, కేర్ మినరల్ సోడా, డంకన్స్ నంబర్ వన్ టీ (నటన కూడా. దక్షిణభారతదేశంలో అన్ని భాషలలోను వచ్చింది) ∙కొందరు రాజకీయనాయకులకు పాటలు, డైలాగులు కూడా రాశాను. చిత్రాలు ∙ప్రిన్స్ ఆఫ్ పర్షా్య (తెలుగులోకి అనువాదమైన హాలీవుడ్ చిత్రం) ∙దాసరి గారి ‘యంగ్ ఇండియా’ లో మహానటి సావిత్రి మనవడు అభినయ్‌కి డబ్బింగ్ చెప్పాను ∙50 పర్సెంట్ లవ్, అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ (రణ్‌బీర్ కపూర్), జబ్ వి మెట్ (షాహిద్ కపూర్) ∙20కి పైగా చిన్న సినిమాలలో హీరోలకు చెప్పాను ∙ ఆదిత్య ఓం (మా అన్నయ్య బంగారం) ఇలా అనేక చిత్రాలలో నా గొంతు ప్రముఖంగా వినిపిస్తుంది. నాకు బాగా నచ్చిన చిత్రం ‘అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ). హబ్సిగూడ స్ట్రీట్ నంబర్ 8, కెప్టెన్ వీరరాజారెడ్డి వీధి... కాశ్మీర్లో టెర్రరిస్టుల అటాక్‌లో 26 సంవత్సరాల వయసులో మరణించిన వీరరాజారెడ్డి పేరు పెట్టారు ఆ వీధికి. ఆయన మరణించిన సంవత్సరం తరువాత వచ్చిన గణేశ్ నవరాత్రుల సమయంలో అంటే 2003లో ఆయనకు సంబంధించిన వివరాలు డ్రామాగా రూపొందించి ‘సౌండ్ అండ్ లైట్’æ షోగా ప్రదర్శించాను. అందులో కాశ్మీరు సెట్ వేసి, తొమ్మిదిరోజులూ ప్రదర్శించాం. నేను స్క్రిప్ట్ రాసి, వాయిస్ ఓవర్ చెప్పాను. ఆయన పాత్ర కూడా నేనే పోషించాను. హిమాలయాలతో కూడిన, కాశ్మీర్ సెట్, ఆయనకు బుల్లెట్స్ తగలడం అంతా లైవ్‌గా చేశాం. అది నా జీవితంలో ముఖ్యమైన ఘట్టం. – సంభాషణ: వైజయంతి -
స్వరకాయ ప్రవేశం
బంజారాహిల్స్: తెరపై పాత్ర హావభావాలు మనల్ని కట్టిపడేస్తాయి. అయితే తెరవెనుక ఆ భావాలు పలికించేది మరో పాత్ర. సినిమాలోని పాత్రలకు ప్రాణం పోసేది డబ్బింగ్. సినీ ఇండస్ట్రీలో మాటల మాంత్రికులకు ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది. చాలామంది నటీనటుల పాత్రలకు తమ గొంతుతో డబ్బింగ్ కళాకారులు ప్రాణం పోస్తున్నారు. తెరవెనుక రారాజులుగా నిలుస్తున్నారు. కదిలే బొమ్మలకు స్వరదాతలుగా నిలుస్తూ తెరమీద ఆటను రక్తికట్టిస్తున్నారు. నవరసాలను పలికిస్తూ అద్భుత: అనిపిస్తున్నారు. సినిమా తీయడం ఎంత కష్టమో, పాత్రలకు తగిన విధంగా డబ్బింగ్ చెప్పడం అంతే కష్టం. పాత్రలకు అనుగుణంగా డబ్బింగ్ ఆర్టిస్ట్‌లు డైలాగులు చెప్పాల్సి ఉంటుంది. తెరపై మనకు కనిపించే ఇలియానా, త్రిష, సమంత, అనుష్క, రకుల్‌ప్రీత్‌సింగ్, కాజల్, ప్రభుదేవా, మమ్ముటి, కమల్‌హాసన్, రజనీకాంత్, మోహన్‌లాల్... ఇలా చాలామందికి డబ్బింగ్ చెప్పే ఆర్టిస్టులు కృష్ణానగర్, ఇక్కడి పరిసర ప్రాంతాల వారే. కేవలం డబ్బింగ్ ఆర్టిస్టులే కాదు.. సౌండ్ ఇంజినీర్లు, ఎడిటŠూర్ల ఇక్కడున్నారు. ఇక డబ్బింగ్ స్టూడియోలకు కృష్ణానగర్ కేంద్రమని చెప్పొచ్చు. సినిమా, సీరియల్ ఏదైనా సరే... డబ్బింగ్ ఇక్కడే. ఇదొక కళ... డబ్బింగ్ ఒక కళ. కేవలం మాటలు వస్తే సరిపోదు. పాత్రలో పరకాయ ప్రవేశం చేయాలి. డబ్బింగ్ ఆర్టిస్టుకు ముందుగా సీన్లపై పట్టుండాలి. భాషా స్పష్టంగా ఉండాలి. డైలాగులు అనర్గళంగా చెప్పాలి. ఇవన్నీ ఒక ఎత్తైతే పాత్రలో పరకాయ ప్రవేశం చేసి, నవరసాలు పండించాలి. ఒక విధంగా చెప్పాలంటే తెర వెనుక వీరంతా నటించాల్సి ఉంటుంది. అప్పుడే వారు చెప్పే డైలాగులలో భావం ఉట్టిపడుతుంది. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా... కొత్త బంగారు లోకంలో ‘ఎకాడా...’ అంటూ శ్వేతబసుప్రసాద్ చెప్పిన, శ్రీమంతుడులో ‘ఊరికి ఎంతో కొంత ఇవ్వాలి. లేదంటే లావైపోతాము’ అంటూ శ్రుతిహాసన్ పలికించిన భావాలు అస్సలు మరిచిపోలేం. ఈ ఇద్దరికీ గాత్రదానం చేసింది డబ్బింగ్ ఆర్టిస్ట్ హరిత. ఇలియానా, తమన్నా, శ్రుతిహాసన్, నివేదాథామస్, రకుల్‌ప్రీత్‌సింగ్... ఇలా చాలామంది తారలకు ఆమె గాత్రదానం చేశారు. ఒక్కో నటితో దాదాపు రెండు, మూడు సినిమాలు చేసింది. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా, సినిమా పాత్రలకు అనుగుణంగా గొంతును సవరించుకోవాల్సి ఉంటుందని చెప్పారు హరిత. వర్షాకాలంలో ఇబ్బంది... నేను చాలామంది విలన్లకు డబ్బింగ్ చెప్పాను. టీవీ షోల్లోనూ నా గొంతు వినిపిస్తుంటుంది. డబ్బింగ్ ఆర్టిస్టులు గొంతును జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. వర్షాకాలంలో జలుబు తదితర సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్కో పాత్ర మాకు చాలెంజింగ్‌గా ఉంటుంది. – డాక్టర్ రాధాకృష్ణారెడ్డి,డబ్బింగ్ ఆర్టిస్ట్ సాంకేతిక దన్ను... డబ్బింగ్ స్టూడియోలన్నీ దాదాపు కృష్ణానగర్ పరిసర ప్రాంతాల్లోనే ఉంటాయి. ఒకప్పుడు డబ్బింగ్ చెప్పడం కష్టంగా ఉండేది. మూడు లైన్ల స్క్రిప్ట్‌ను ఒకే టేక్‌లో చెప్పాల్సి వచ్చేది. అప్పుడు వీడియో క్యాసెట్లు ఉండేవి. కానీ ఇప్పుడు టెక్నాలజీ పూర్తిగా మారిపోయింది. ముక్కలు ముక్కలుగా చేసి, మాటలను అతికించేసి కనికట్టు చేస్తున్నారు. అంతటి సాంకేతికత ఇప్పుడు పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. రికార్డింగ్, సింకింగ్, మిక్సింగ్.. ఇలా అన్నింటినీ ఇప్పుడు తేలికగా చేసే వీలుందని చెప్పారు సౌండ్ ఇంజినీర్ రాంరెడ్డి. ఇక డబ్బింగ్ కళాకారులకు ఇప్పుడు మంచి ఉపాధి లభిస్తోంది. సీన్ల వారీగా డబ్బులు చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు మొదలు వివిధ రంగాల్లోని వారు డబ్బింగ్ చెప్పేందుకు ఆసక్తి చూపుతున్నారు. సులువేం కాదు.. డబ్బింగ్ చెప్పడం సులువేం కాదు. సినిమాలోని పాత్రలు, అందులోని సందర్భం, డైరెక్టర్ ఆలోచనలకు అనుగుణంగా డైలాగులు చెప్పాల్సి ఉంటుంది. ఒకే నటికి ఎక్కువసార్లు గాత్రదానం చేసినప్పుడు, ఆయా సినిమాల్లోని పాత్రలకు అనుగుణంగా చెప్పాల్సి వస్తుంది. డైలాగ్ చెప్పే రీతిని బట్టే, అది హిట్టవుతుంది. – హరిత, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఈజీ... గతంతో పోలిస్తే డబ్బింగ్ రికార్డింగ్ ఇప్పుడు చాలా సులువైంది. గతంలో రికార్డింగ్ చేయాలంటే క్యాసెట్లతో చేయాల్సి వచ్చేది. అందులోనూ పెద్దపెద్ద డైలాగులు చెప్పాలంటే డబ్బింగ్ కళాకారులకు ఇబ్బంది ఉండేది. కానీ ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీతో ఈ సమస్య తీరింది. – శేఖర్, సౌండ్ ఇంజినీర్ -
గొంతు కూడా ఒక డిక్షనరీయే
‘‘రేయ్! నీ అన్న గురించే నీకు తెలుసురా! నా అన్న గురించి నీకు తెలియదు! నా అన్న తలుచుకుంటే ట్విన్ సిటీస్ రెండూ ఉండవు. పులి పంజాలో బలముంటుంది, సింహం కళ్లల్లో పొగరుంటుంది, మా అన్న గుండెల్లో పవరుంటుంది, నడిచే నరసింహస్వామిరా మా అన్నంటే’’ అంటూ ‘లక్ష్మీ’ చిత్రంలో వెంకటేశ్ చెల్లెలి పాత్రకు చెప్పిన డబ్బింగ్‌తో అందరికీ ఆ గొంతు పరిచితమైంది. అది ఆ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ డైలాగ్. ‘‘ఇది నాకు నచ్చిన డైలాగు’’ అంటారు డబ్బింగ్ కళాకారిణి భవాని. తండ్రి మురళీధరరావు, తల్లి విజయలక్ష్మి కూడా డబ్బింగ్ కళాకారులే. ‘‘మా నాన్నగారు డబ్బింగ్ యూనియన్ వ్యవస్థాపకులలో ఒకరు. సినిమాలకి డబ్బింగ్ ఇన్చార్జ్గా పనిచేశారు’’ అంటారు భవాని. గోకులంలో సీత, నవ్వులాట, మా ఆయన బంగారం, రథయాత్ర... వంటి చిత్రాలకు మురళీధరరావు ఇన్చార్జ్గా ఉండటంతో, తల్లి విజయలక్ష్మి కూడా డబ్బింగ్ చెప్పేవారు. ‘‘నాన్నగారు ఇన్చార్జ్గా చేసిన సినిమాలలో చిన్న పిల్లలకు నాతో డబ్బింగ్ చెప్పించేవారు. అలా చైల్డ్ ఆర్టిస్టుగా నేను డబ్బింగ్లోకి ప్రవేశించాను. మా తమ్ముడు కూడా చైల్డ్ డబ్బింగ్ ఆర్టిస్టుగా ప్రవేశించడంతో మాది డబ్బింగ్ కుటుంబం అయింది’’ అంటారు భవాని. మొదటి సినిమా... ‘అయ్యప్ప కరుణ’ చిత్రంతో చైల్డ్ డబ్బింగ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించాను. ‘శ్రీకారం’లో బేబి శ్రేష్ఠకు డబ్బింగ్ చెప్పాను. శుభాకాంక్షలు, ఆస్తా, అమ్మా దుర్గమ్మా, అమ్మా నాగమ్మా చిత్రాలలో చిన్నపిల్లలకు డబ్బింగ్ చెప్పాను. ‘అమ్మా దుర్గమ్మా’ చిన్న పాపకు డబ్బింగ్ చెబుతున్న సమయంలో బ్రహ్మానందం గారు కూడా డబ్బింగ్‌కి వచ్చారు. నా గొంతు విని ‘డబ్బింగ్ చాలా బాగా చెబుతున్నావు’ అని ప్రశంసించారు. అది నా జీవితంలో నేను మర్చిపోలేను. కొంచెం పెద్దయ్యాక ‘కలిసుందాం రా’ సినిమాలో వెంకటేశ్ చెల్లి పాత్రకు డబ్బింగ్ చెప్పాను. ఈ సినిమాతోనే యంగ్ గర్ల్స్‌కి డబ్బింగ్ ప్రారంభించాను. అయితే ఆ వయసు అటు చిన్నపిల్లలకు, ఇటు యువతరానికి కూడా సరిపోదు. పాత సినిమాలు చూశాను... డైలాగ్ మాడ్యులేషన్, భావాలు పలికించడం తెలుసుకోవడం కోసం పాత సినిమాలు చూశారు భవాని. హీరోయిన్స్ భావాలు, మాడ్యులేషన్ ప్రాక్టీసు చేయడం ప్రారంభించారు. డైలాగుతో భావాన్ని పలికించడం నేర్చుకున్నారు. ‘‘నా డైలాగులో మెచ్యూరిటీ లేదు అన్నవారితోనే ‘చాలా బాగా చెప్పావు’ అనిపించుకున్నాను’’ అంటారు భవాని. రవితేజ నటించిన ‘చంటి’ సినిమాలో రవితేజ చెల్లెలు పాత్రకు డబ్బింగ్ చెప్పే అవకాశం వచ్చింది. ‘‘డైరెక్టర్ శోభన్ నా గొంతు విని డబ్బిం గ్ అవకాశం ఇచ్చారు. అందులో ‘ఇలా ఎందుకు చేశావు అన్నయ్యా’ అని అన్నయ్యను నిలదీసే ఇమోషనల్ సీన్ ఒకటి ఉంది. డబ్బింగ్ చెప్ప వలసిన రోజున నా గొంతు నొప్పిగా ఉండటంతో, మరుసటి రోజు చెప్పించారు. అయితే ఆ రోజు డైరెక్టర్ రాలేదు. ఆయన తరవాత వచ్చి వింటానన్నారని చెప్పారు డబ్బింగ్ ఇన్చార్జి. నేను సీన్ అంతా చెప్పేశాను’’ అంటున్న భవానికి రెండు రోజుల తరవాత ‘కరెక్షన్స్ ఉన్నాయి, స్టూడియోకి రావాలి’ అని పిలుపు వచ్చింది. అసలే పెద్ద సీను, మళ్లీ చెప్పాలేమో అనుకుంటూ స్టూడియోకి వెళ్లారు భవాని. ‘‘లోపల అడుగు పెడుతుండగానే, ‘ఆ సీన్ అలా చెప్పారేంటి’ అని సీరియస్‌గా అన్నారు శోభన్. నాకు భయం వేసింది. ఆయన చిలిపిగా నవ్వుతూ, ‘ఎంత అద్భుతంగా చెప్పావో తెలుసా! ఆ సీన్ చూసేటప్పుడు నా కళ్లల్లో నీళ్లు వచ్చాయి. నిన్ను అభినందించడానికే పిలిచాను’ అనడంతో నాకు పట్టరాని ఆనందం కలిగింది. ఆర్. నారాయణమూర్తి సినిమాలో... ఆర్. నారాయణమూర్తి దర్శకత్వంలో ‘వేగు చుక్కలు’ చిత్రంలో డబ్బింగ్ చెప్పడానికి వెళ్లాను. అది ఇమోషనల్ సీన్. ఆయన సమక్షంలో ఆయన ముఖం చూస్తూ, ఏడుస్తూ ఆ డైలాగు చెప్పమన్నారు. సినిమా చూడకుండా, ఆయన ఎదురుగా నిలబడి చెప్పాలంటే బిడియంగా అనిపించింది. అంతలోనే, ఎంతమంది ఉన్నా భయపడకుండా డైలాగు చెప్పాలి అని నిశ్చయించుకున్నాను. నేనే నటిస్తే ఎలా ఉంటుందో ఊహించుకుంటూ, ఏడుస్తూ డైలాగు చెప్పేశాను. ఆయన సంతోషంతో ‘పాపగారు చాలా అద్భుతంగా చెప్పారు’ అని మెచ్చుకోవడం నేను మర్చిపోలేను. ‘డిక్షనరీలో చాలా పదాలుంటాయి. వాటి అర్థాలుంటాయి. ప్రయత్నిస్తే గొంతులో కూడా ఎన్నో అర్థాలు వ్యక్తీకరణలు ఉంటాయి. గొంతు కూడా ఒక డిక్షనరీయే’ అంటారామె. ఈ సినిమాలలో... నీ స్నేహం (సెకండ్ లీడ్), నువ్వు నేను (హీరోయిన్ స్నేహితురాలి పాత్ర), నీ మనసు నాకు తెలుసు (తరుణ్ చెల్లి పాత్ర), లవ్‌టుడే ‘సునీల్ భార్య), ఖుషీ (శివాజీ భార్య), అన్నవరం (పవన్‌కల్యాణ్ చెల్లి సంధ్య), షిరిడీ సాయిబాబా (హీరోయిన్), నా ఊపిరి (హీరోయిన్), సరదాసరదా (శివబాలాజీ పక్కన వేసిన పాత్ర), అమ్మో ఒకటోతారీకు (ఎల్.బి. శ్రీరామ్ కూతురు), ఆ నలుగురు (రాజేంద్రప్రసాద్ కూతురు), నిన్ను చూడాలని (ఎన్టీఆర్ చెల్లెలు) చిత్రాలలో ప్రముఖంగా డబ్బింగ్ చెప్పిన భవాని ఇప్పటివరకు 700 చిత్రాలకు చెప్పారు. సీరియల్స్‌కి కూడా చెబుతున్నారు. ప్రస్తుతం ‘కుంకుమపువ్వు’ సీరియల్ హీరోయిన్ అమృత పాత్రకు, ‘భార్య’ సీరియల్ హీరోయిన్ ఆనంది పాత్రకు, ‘ప్రతిఘటన’ సీరియల్ పవిత్ర పాత్ర సుదీపకు చెబుతున్నారు. ‘రాములమ్మ’ సీరియల్లో రుద్రమ్మ పాత్రకు 2016లో అవార్డు అందుకున్నారు. ‘‘డెయిలీ సీరియల్స్ అయితే ప్రతిరోజూ చెప్పాలి. అందువల్ల ఫంక్షన్లకి హాజరుకాలేకపోతున్నాను. అటువంటి సమయంలో మా వారు రాజేశ్ నాకు బాగా సహకరిస్తున్నారు. మా అత్తమామల సహకారం లేకుండా నేను ఇంతస్థాయికి రాలేను’ అన్నారామె.‘‘నాకు తెలియకుండానే ఇది నా వృత్తి అయిపోయింది. డబ్బింగ్ యూనియన్ నా కుటుంబం అయిపోయింది. ఇంత పెద్ద కుటుంబంలో నేను సభ్యురాలిని కావడం నాకు భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తాను’’ అంటూ సంభాషణ ముగించారు. – సంభాషణ: వైజయంతి పురాణపండ సాయికుమార్ తమ్ముడు అయ్యప్ప డైరెక్ట్ చేసిన ‘హైదరాబాద్’ సినిమాలో హీరోయిన్ రవళికి డబ్బింగ్ టెస్ట్‌కి పిలిచారు. వాయిస్ టెస్ట్ చేసి ‘చిన్నపిల్ల గొంతులా ఉంది’ అన్నారు. ఒకటికి పదిసార్లు చెప్పించినా నా గొంతులో మెచ్యూరిటీ రాకపోవడంతో బాధపడుతుంటే, అయ్యప్పగారు, ‘పది అపజయాలు ఒక గొప్ప విజయాన్ని ఇస్తాయి’ అని ప్రోత్సహించారు. ఆ మాటతో నాలో పట్టుదల, ఉత్సాహం పెరిగాయి. – భవాని డబ్బింగ్ కళాకారిణి -
కుమారి 21 ఎఫ్‌తో...
విలక్షణమైన పేరుతో అందరికీ పరిచితులయ్యారుపాటల రియాలిటీ షోలో రన్నరప్ అయ్యారు డబ్బింగ్ ఆర్టిస్టుగా సుమారు 40 చిత్రాల ద్వారా పాపులర్ అయ్యారుయూట్యూబ్లో సొంత వీడియోలతో సోషల్ మీడియాలో అట్రాక్షన్ అయ్యారుకుమారి 21 ఎఫ్ చిత్రంతో తన గొంతుతో ప్రేక్షకులకు సుపరిచితురాలైన లిప్సిక తన కెరీర్ అనుభవాలను సాక్షితో పంచుకున్నారు... ఒక నటి తెర మీద బాగా కనపడాలంటే డబ్బింగ్ ప్రధానం. వాళ్లు ఎంత బాగా నటించినా, డబ్బింగ్ బాగుండకపోతే ‘ఆ నటి అస్సలు బాగా నటించలేదు’ అనేస్తారు. ఎందరో డబ్బింగ్ ఆర్టిస్టులు నటుల నటనకు జీవం పోస్తున్నారు. ఎంబీఏ (హెచ్ఆర్) పూర్తి చేసిన లిప్సిక గాయనిగా తన కళా జీవితం ప్రారంభించి, హెబ్బాపటేల్, మెహరీన్ వంటి కొత్త కథానాయికలకు డబ్బింగ్ చెబుతూ, మంచి డబ్బింగ్ ఆర్టిస్టుగా దూసుకుపోతున్నారు. తన అనుభవాలను సాక్షితో పంచుకున్నారు... ‘‘నా నాలుగో ఏట నుంచే సంగీతం పాడేదాన్ని. చాలాకాలం వరకు నాకు పాటల మీద అంత ఆసక్తి ఉండేది కాదు. ఇంట్లోవారి బలవంతం మీద పాటలు నేర్చుకునేదాన్ని. ‘పాడుతా తీయగా’ లో క్వార్టర్ ఫైనల్స్‌కి వచ్చాక నాకోసం నేను పాడటం మొదలుపెట్టాను. ఆ కార్యక్రమం ద్వారా సినిమాలలో అవకాశాలు వచ్చాయి. 2010 నుంచి సినిమాలలో పాడుతున్నాను. స్టేజ్ షోల కోసం అనేక దేశాలు తిరిగి వచ్చాను’’ అంటున్న లిప్సిక తల్లి విద్యుల్లత డిగ్రీ కాలేజీలో ఫ్రెంచ్ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. తండ్రి జగన్మోహన్ ఒక మ్యూజిక్ అకాడమీ నడుపుతున్నారు. ఆయన గిటార్, పియానో, కీబోర్డు, గాత్రం అన్నీ నేర్పిస్తారు. ఉద్యోగరీత్యా ఐఐపీఎంకి పని చేస్తున్నారు. ‘‘మా ఇంట్లో అందరూ సంగీతానికి సంబంధించినవారే’’ అంటున్న లిప్సికకు డబ్బింగ్ చెప్పాలనే కోరికే లేదు. వాళ్ల ఇంట్లో కూడా ఆ ఆలోచన లేదు. ‘చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకున్నావు కదా! అందువల్ల సంగీతంలోనే నిలబడు’ అని తల్లిదండ్రులు అనడంతో, కొంతకాలం పాటలు మాత్రమే పాడారు లిప్సిక. ‘‘అనుకోకుండా ఒకరోజు ‘మేం వయసుకు వచ్చాం’ చిత్రానికి డబ్బింగ్ చెప్పమని ఫోన్ వచ్చింది. ఇంట్లో వద్దంటారని తెలుసు. అతి కష్టం మీద అమ్మ వాళ్లని ఒప్పించాను. అలా డబ్బింగ్ ఆర్టిస్టుగా నా తొలి అడుగు పడింది. ఐదారు సినిమాలకు చెప్పాక, ‘కుమారి 21 ఎఫ్’ లో హెబ్బాపటేల్‌కి చెప్పిన డబ్బింగ్‌తో ఇంక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఒక డబ్బింగ్ ఆర్టిస్టుగా నాకు హిట్ ఇచ్చిన సినిమా ఇదే’’ అంటున్న లిప్సిక, ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పడానికి చాలా కష్టపడినప్పటికీ తనకు ఆ చిత్రమంటే చాలా ఇష్టమనీ, ఆ సినిమాతోనే తనకు గుర్తింపు వచ్చిందని చెబుతారు. ‘‘ఇప్పటి వరకు సుమారు 40 చిత్రాలకు డబ్బింగ్ ఇచ్చాను. ఒక్క సీరియల్‌కి కూడా చెప్పలేదు. సినిమా మాడ్యులేషన్‌కి, సీరియల్స్ మాడ్యులేషన్‌కి చాలా తేడా ఉంటుంది. అదీకాకుండా సీరియల్స్ అంటే కనీసం వెయ్యి ఎపిసోడ్స్ చెప్పాలి. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నాను. భవిష్యత్తులో నాకు టైమ్ కుదిరితే తప్పకుండా సీరియల్స్‌కి కూడా చెబుతాను’’ అంటున్నారు లిప్సిక ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రానికి డబ్బింగ్ ఆర్టిస్టుగా నంది బహుమతి అందుకున్నారు. కర్ణాటక సంగీతం, లలిత సంగీతం, సినిమా సంగీతం లయాత్మకంగా పాడుతూ పెద్దల ప్రశంసలు అందుకున్న లిప్సిక, డబ్బింగ్ చెప్పడం ప్రారంభించిన కొత్తలో కొద్దిగా ఇబ్బంది పడ్డారు. అసలు డబ్బింగ్ ఎలా చెప్పాలో కూడా తెలియకపోవడంతో, ఒక్కో డైలాగుకి ఎక్కువ సమయమే తీసుకున్నారు. ‘‘కొత్తలో బాగా కష్టపడ్డాను. మా డైరెక్టరు నాతో చాలా జాగ్రత్తగా చెప్పించారు. కష్టాలు ఎదురుచూస్తేనే జీవితం అంటే ఏమిటో అర్థమవుతుంది. అందుకే నాకు కష్టాలు ఎదురుచూడటం చాలా ఇష్టం’’ అంటారు లిప్సిక. ఆమె పేరు గురించి లిప్సిక ‘‘అమ్మకి రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే చాలా ఇష్టం. ఆయన రాసిన ‘లిపిక’ కథ అమ్మకు మరీ ఇష్టం. ఆ పేరే నాకు పెట్టాలనుకుంది. ‘స’ అక్షరం చేరిస్తే అదృష్టం కలిసి వస్తుందని ఎవరో చెప్పడంతో, లిప్సిక అని పెట్టారు. ఎక్కడకు వెళ్లినా, అందరూ నా పేరు గురించి అడుగుతుంటారు. అసలు నాకు గుర్తింపు కూడా నా పేరు వల్లే వచ్చిందేమో’’ అంటున్న లిప్సిక ఇప్పటివరకు 40 సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. ఇటీవల విడుదలైన చలో, జవాన్, మరి కొన్ని చిన్న సినిమాలలో పాటలు పాడారు. యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు. ట్రాక్‌లు పాడుతున్నారు. అనేక షోలలో పాల్గొంటున్నారు. డబ్బింగ్ చెప్పిన కొన్ని చిత్రాలు కుమారి 21 ఎఫ్, కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిల్‌మ్యాన్, జవాన్, చల్ మోహన రంగా, లై డైలాగులు నా పేరు కుమారి, నా ఏజ్ 21 (కుమారి 21 ఎఫ్ చిత్రం) చెప్పానా! నేను చెప్పానా! నీకు చెప్పానా! (కృష్ణగాడి వీర ప్రేమగాథ) డబ్బింగ్ చెప్పిన తారలు హెబ్బా పటేల్, మెహరీన్, సురభి, లావణ్య త్రిపాఠి, మేఘా ఆకాశ్, ఇంకా కొందరు కొత్త తారలకు – ఇంటర్వ్యూ: వైజయంతి