Electrocuted
-
HYD: సంక్రాంతి పండుగ వేళ విషాదం.. గాలిపటం ఎగరవేస్తూ..
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ వేళ అత్తాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. కైట్ ఎగరవేస్తూ విద్యుత్ తీగలకు బాలుడు తాకాడు. దీంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు. గాలి పటాలు ఎగుర వేయడానికి తన స్నేహితులతో కలిసి మేడపైకి వెళ్లిన తనిష్క్.. పతంగి ఎగరేస్తూ విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అప్పటికే బాలుడు మృతిచెందాడు. బాలుడు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎంత విషాదం.. జిమ్‌లో వర్కౌట్లు చేస్తూ కుప్పకూలిన యువకుడు
న్యూఢిల్లీ: యువతలో ఆకస్మిక మరణాలు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలు, హార్ట్ఎటాక్లు.. కారణాలేవైనా నూరేళ్ల జీవితం అనుభవించాల్సిన యంగ్‌స్టర్స్.. అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. అర్ధాంతరంగా ఎంతో ఆరోగ్యంగా ఉండే వారు సైతం ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై వ్యాయామం చేస్తుండగా విద్యుద్ఘాతానికి గురై ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. నగరంలోని రోహిని ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బీటెక్ పూర్తి చేసిన 24 ఏళ్ల యువకుడు సాక్షం పృథి.. గురుగ్రామ్‌కు చెందిన కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రోహిణి సెక్టార్ 19లో నివాసముంటున్నాడు. ఇతడు స్థానికంగా సెక్టార్ 15లో ఉన్న జిమ్‌ప్లెక్స్ ఫిట్నెస్ జోన్లో తరుచుగా వ్యాయామానికి వెళ్తుంటాడు. ఇదే క్రమంలో గత మంగళవారం జిమ్‌కు వెళ్లాడు. ఉదయం 7.30 సమయంలో ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన తోటివారు, సిబ్బంది.. యువకుడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. అయితే పోస్టుమార్టం రిపోర్టులో విద్యుదాఘాతమే బాధుతుడి మృతికి కారణమని తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. జిమ్ మేనేజర్ అనుభవ్ దుగ్గల్‌ను అరెస్ట్ చేశారు. దీనిపై విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. చదవండి: యాక్సిడెంట్‌ను చూడబోతే.. 9 మంది మృతి -
ఉత్తరాఖండ్: కరెంట్ షాక్‌తో 16 మంది దుర్మరణం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో బుధవారం ఘోరం జరిగింది. అలకనంద నది Alaknanda River చమోలి డ్యామ్ దగ్గర ట్రాన్స్‌ఫారమ్ పేలిన ఘటనలో పదహారు మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో పోలీసు సిబ్బంది.. ముగ్గురు హోంగార్డులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు అంటున్నారు. ట్రాన్స్ఫార్మర్ పేలి.. బ్రిడ్జి గుండా కరెంట్ పాస్ అయ్యింది. ఆ సమయంలో బ్రిడ్జిపై ఉన్నవాళ్లకు కరెంట్ షాక్ తగిలింది. కొందరు అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడగా.. వాళ్లను చికిత్స కోసం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్పీ పరమేంద్ర దోవల్ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. నమామి గంగా ప్రాజెక్టులో భాగంగా అలకనంద నదిపై ఈ బ్రిడ్జిని నిర్మించారు. Uttarakhand | 10 people died and several injured after a transformer exploded on the banks of the Alaknanda River in the Chamoli district. Injured have been admitted to the district hospital: SP Chamoli Parmendra Doval — ANI (@ANI) July 19, 2023 -
యాత్రలో అపశ్రుతి. భక్తుల బస్సుకు హై టెన్షన్ వైర్లు తగిలి..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. మతపరమైన యాత్రలో కరెంట్ షాక్ తగిలి ఐదుగురు భక్తులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. దక్షిణ ఉత్తరప్రదేశ్‌లోని మిరట్ జిల్లా, భవాన్‌పురీ రాలీ చౌహాన్ గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. శివుని భక్తులుగా పేరుగాంచిన కన్వరియాలు యాత్రకు వెళ్లారు. హరిద్వార్‌లో గంగాజలంతో తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న బస్సు.. భవాన్‌పురీ గ్రామానికి చేరుకోగానే కిందికి వంగి ఉన్న హై టెన్షన్ వైర్లకు తగిలి విద్యుదాఘాతానికి గురైంది. దీంతో బస్సులో ఉన్న యాత్రికులకు కరెంట్ షాక్ తగిలింది. ఈ దుర్ఘటనలో ఓ భక్తుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగులు చికిత్స తీసుకుంటూ మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పలువురు గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అప్రమత్తమైన గ్రామస్తులు విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి కరెంట్ సరఫరాను నిలిపివేశారు. కానీ అప్పటికే ప్రమాదం తీవ్రత పెరిగిపోయింది. ఈ ఘటనపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ అధికారులు ఈ ఘటనకు బాధ్యత వహించాలంటూ నిరసన చేపట్టారు. హై టెన్షన్ వైర్లు కిందికి ఉన్నాయని పలుమార్లు ఫిర్యాదు చేసినా సరిచేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. కన్వార్ యాత్ర భారతదేశంలో అతిపెద్ద మతపరమైన యాత్రల్లో ఒకటి. ప్రతీ ఏడాది ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, చంఢీగర్, ఒడిశా, జార్ఖండ్ నుంచి కోటీ ఇరవై లక్షల వరకు భక్తులు హాజరవుతారు. కన్వారియాలు కాశాయ వస్త్రాలు ధరించి చెప్పులు లేకుండా యాత్రకు వెళతారు. ఇదీ చదవండి: ఆజం ఖాన్‌కు మరో కేసులో రెండేళ్ల జైలు -
బంజారాహిల్స్ పాఠశాలలో దారుణం.. విద్యార్థికి కరెంట్ షాక్..
హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో దారుణం జరిగింది. పాఠశాలలో ఆడుకుంటున్న ఇంటర్ విద్యార్థి విద్యుదాఘాతానికి గురయ్యాడు. మధ్యాహ్న భోజన సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. బాధిత విద్యార్థిని ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స కొనసాగుతుందని వెల్లడించారు. మెరీడియన్ స్కూల్లో హస్సన్ అనే విద్యార్థి పదకొండవ తరగతి చదువుతున్నాడు. మధ్యాహ్న భోజన సమయంలో పాఠశాలలో పిల్లలందరు అటలాడుతున్నారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్కు ఆనుకుని ఉన్న ఓ ఇనుప కడ్డీని తగిలాడు పిల్లాడు. ఈ విద్యుత్ ప్రమాదంలో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే పాఠశాల యాజమాన్యం విద్యార్ధిని ఆస్పత్రిలో చేర్పించారు. 45 నుంచి 50 శాతం వరకు గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. ఇప్పటికే రెండు సర్జరీ చేశామని పేర్కొన్నారు . ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. వారి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసుల కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదీ చదవండి: విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి మిడ్‌మానేర్‌లో దూకిన తల్లి -
సంపు క్లీన్ చేస్తుండగా విద్యుత్ షాక్.. ముగ్గురు మృతి..
చిత్తూరు: చౌడేపల్లి మండలం పెద్ద కొండామారిలో విషాద ఘటన జరిగింది. విద్యుత్ షాక్‌కు గురై ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. సంపు క్లీన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు విడిచారు. మృతులను రమణ, మునిరాజా, రవిలుగా గుర్తించారు. మోటారు వైరు తెగి సంపులో పడిపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ముగ్గురిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారని కుటుంబసభ్యులు తెలిపారు. విగతజీవులుగా మారిన వారిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. చదవండి: ఘోర ప్రమాదం.. ముగ్గురు విద్యార్థులు దుర్మరణం.. -
బట్టల తీగకు కరెంట్.. కాపాడబోయి భార్య, అత్త కూడా..
క్రైమ్: బట్టలు ఆరేసుకునే తీగకు కరెంట్ వైర్ తగలడం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని బలి తీసుకుంది. ఇజార్ అక్తర్ అనే వ్యక్తి ఆదివారం ఉదయం బట్టలు ఆరేసేందుకు యత్నించాడు. ఈ క్రమంలో ఆ ఇనుప తీగకు గాలిదుమారం కారణంగానే ఆ పక్కనే ఉన్న కరెంట్ తీగ తగిలింది. దీంతో ఇజార్‌కు కరెంట్ షాక్ కొట్టగా.. విలవిలలాడిపోయాడు. అది గమనించిన భార్య ముంతాహ బేగం, ఆమె తల్లి ఖైరుల్ నెస్సా, ఇజార్‌ను ఆలస్యం చేయకుండా రక్షించేందుకు యత్నించారు. ఈ క్రమంలో వాళ్లిద్దరికీ కరెంట్ షాక్ తగిలింది. వాళ్లిద్దరూ అక్కడికక్కడే మరణించారు. అయితే.. ఇజార్‌కు మాత్రం కరెంట్ షాక్‌తో తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఇజార్ కన్నుమూశాడు. కోల్‌కతా(పశ్చిమ బెంగాల్) ఏక్బల్పోర్లో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఈ ఘటన విషాదం నింపింది. ఇదీ చదవండి: గురుద్వారా ఆవరణలో మద్యం తాగిన మహిళ.. కాల్చి చంపిన సేవాదార్ -
సెలవులపై ఇంటికొచ్చి మృత్యు ఒడికి.. విద్యుత్ షాక్‌తో జవాన్ మృతి..
సాక్షి, ములుగు: సెలవుపై ఇంటికి వచ్చిన ఐటీబీపీ జవాన్ విద్యుత్ షాక్ తో మృతిచెందాడు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని శ్రీరామ్‌నగర్‌లో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. బంధువుల కథనం ప్రకారం.. తాటి మహేంద్ర కుమార్ (29) ఐటీబీపీ 53 బెటాలియన్‌లో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఛత్తీ›స్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా సోంపూర్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. గత ఏడాది హనుమకొండ జిల్లాకు చెందిన ప్రసన్నతో వివాహం జరిగింది. ఈ మధ్యనే వారికి పాప పుట్టింది. భార్యాబిడ్డలతో గడపాలని నెల రోజులపాటు సెలవు పెట్టి మార్చి 30న సొంత ఊరైన శ్రీరామ్‌నగర్ వచ్చాడు. శనివారం కూలర్‌లోని నీటిపంపు పనిచేయకపోవడంతో దానిని పరిశీలిస్తున్న సమయంలో విద్యుత్ షాక్‌కుగురై మహేంద్ర కింద పడి పోయాడు. ఈ విషయాన్ని గమనించిన ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యులు మహేంద్రను మొదట వాజేడు, అక్కడినుంచి ఏటూరునాగారం ఆస్పత్రికి తరలించారు. మహేంద్ర కుమార్‌ను పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందిననట్లు తెలిపారు. బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చదవండి: తండ్రిని చంపిన కిరాతకుడు -
చంద్రబాబు నూజివీడు పర్యటనలో అపశ్రుతి.. మహిళలకు విద్యుత్ షాక్
సాక్షి, ఏలూరు: చంద్రబాబు నూజివీడు పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. బాబు సభకు వచ్చిన మహిళలకు విద్యుత్ షాక్ తగిలింది. చంద్రబాబు రాగానే జెండాలు పైకెత్తమని టీడీపీ నేతలు వీరికి సూచించారు. అయితే ఆ జెండాలు విద్యుత్ తీగలకు తగలడంతో షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనలో 9 మంది మహిళలు గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించారు. బాబు సభలో జనం కన్పించేందుకు ఒక్కో మహిళకు రూ.300 ఇస్తామని చెప్పి టీడీపీ నేతలు వీరిని తీసుకొచ్చారు. మహిళలు విద్యుత్ షాక్‌కు గురయ్యారని తెలిసి కూడా చంద్రబాబు వారిని పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీంతో డబ్బులు ఇస్తామని ఆశ చూపి తమను పట్టించుకోకుండా వదిలేశారంటూ బాధిత మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: దగాకోరు డ్రామాలు! -
మద్యం మత్తులో విద్యుత్ స్తంభం ఎక్కి..
వెల్దుర్తి (తూప్రాన్): మద్యం మత్తులో ఓ యువకుడు విద్యుత్ స్తంభం ఎక్కాడు. వివిద్యుదాఘాతంతో తీవ్రగాయాలై కిందపడ్డాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం శంకరాజ్ కొండాపూర్ గ్రామానికి చెందిన యాట సాయిరాం (24) శుక్రవారం సాయంత్రం వెల్దుర్తి నుంచి తన స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఉప్పులింగాపూర్ గ్రామ శివారులో పోలీసులు వాహన తనిఖీలతోపాటు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నారు. ఆ సమయంలో అక్కడకు చేరుకున్న సాయిరాం మద్యం మత్తులో హల్చల్ చేస్తూ పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం ఎక్కాడు. గమనించిన పోలీçÜులు కిందకు దించి అక్కడి నుంచి పంపించారు. అనంతరం యథావిధిగా తనిఖీలు చేస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత సాయిరాం మళ్లీ తిరిగొచ్చి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభంపైకి ఎక్కి తీగలు పట్టుకోవడతో విద్యుదాఘాతంతో కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని తూప్రాన్ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. -
బాపట్లలో విషాదం: చెట్టు మీదే ప్రాణం విడిచిన చిన్నారి
సాక్షి, బాపట్ల: జిల్లాలో ఆదివారం విషాదకర ఘటన చోటు చేసుకుంది. కొరిశపాడు మండలం దైవాల రావూరులో ఆటాడుకుంటూ విద్యుత్ తీగలు తగిలి ఓ చిన్నారి చెట్టు మీదే కన్నుమూశాడు. మరో చిన్నారి ఈ ఘటనలో గాయపడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు ఆదివారం కావటంతో.. స్థానికంగా ఉన్న సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న చెట్టు మీద ఎక్కి ఆడుకుంటున్నారు. ఈ తరుణంలో.. చెట్టు మధ్యలో ఉన్న కరెంటు తీగలు గమనించక ముందుకు వెళ్లారు. దీంతో విద్యుద్ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు ఓ చిన్నారి. ఇక మరో చిన్నారి కరెంట్ షాక్ దెబ్బకు కింద పడిపోయి గాయాలపాలయ్యాడు. మృతి చెందిన చిన్నారి గడ్డం బుజ్జి కుమారుడు అఖిల్ గా స్థానికులు గుర్తించారు. మరొక బాలుడిని చికిత్స నిమిత్తం మేదరమెట్ల లోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రాణం విడిచి చెట్టు మీదే పడి ఉన్న చిన్నారి అఖిల్ మృతదేహం చూసి గ్రామస్తులంతా విలపించారు. -
భార్య హత్యకు స్కెచ్.. ఊహించని పరిణామంతో పరుగులు
ఆ తాగుబోతు భర్తతో రోజూ ఆమెకు గొడవే. ఇక భరించలేక పుట్టింటికి వెళ్లిపోయింది. అది అవమానంగా భావించి.. ఆమెను ఎలాగైనా చంపాలని ప్లాన్ వేశాడు. చివరికి ఆ భర్తకే పెద్ద షాకే తగిలింది. భార్యకు బదులుగా ఆమె తల్లి కన్నుమూసింది. దీంతో ఆ భర్త అక్కడి నుంచి పరుగులు అందుకున్నాడు. మధ్యప్రదేశ్ బేతుల్ జిల్లా కోట్వాలి స్టేషన్ పరిధిలోని సైఖేదా గ్రామంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. నిత్యం తాగుతూ ఉండే ఆ భర్త.. రోజూ భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కూడా ఇద్దరూ గొడవ పడ్డారు. భర్తను భరించలేక.. నానా తిట్లు తిట్టి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో కోపం పెంచుకున్న ఆ తాగుబోతు.. అత్తింటికి వెళ్లి మరీ భార్యను చంపాలని అనుకున్నాడు. సోమవారం సాయంత్రం అత్తింటికి వెళ్లి.. బయట ఉన్న ఇనుప గేటుకు కరెంట్ వైర్లను కనెక్ట్ చేశాడు. అయితే భార్య బదులు ఆమె తల్లి వచ్చి గేట్‌ను ముట్టుకుంది. దీంతో కరెంట్ షాక్‌తో విలవిలలాడి అక్కడికక్కడే ఆ మహిళ(55) మృతి చెందింది. అది చూసి స్థానికులు కేకలు వేయగా.. ఊహించని పరిణామంతో భయాందోళనకు గురై ఆ భర్త అక్కడి నుంచి పారిపోయాడు. దర్యాప్తులో అసలు విషయం వెలుగు చూడగా.. పరారీలో ఉన్న తాగుబోతు భర్త గురించి పోలీసులు వెతుకుతున్నారు. ఇదీ చదవండి: గంజాయికి బానిసైన కొడుకు.. నల్లగొండలో దారుణ హత్య -
ఊహించని ప్రమాదం: వరద నీటిలో స్కూటీ స్కిడ్.. కరెంట్ స్తంభం పట్టుకోవడంతో
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు మహానగరాన్ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్నిరోజులుగా కురుస్తున్న కుంభవృష్టి వానలతో ఐటీ కారిడార్ సహా అనేక ప్రాంతాలు నీట మునిగాయి. వరద నీటితో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్‌తో వాహనాల రాకపోకలు స్తంభించాయి. భారీ వర్షాల కారణంగా నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిచొట్ల ఊహించని ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి. More video from Marathahalli, Bengaluru.#Bangalore #Bengaluru #BengaluruRains #SiliconValleyofIndia #bengalururains #bengalurufloods #Karnataka pic.twitter.com/q5owjkUnhG — Anil Kumar Verma (@AnilKumarVerma_) September 6, 2022 తాజాగా రోడ్డుపై వెళుతోన్న ఓ యువతి ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్ తగిలి అక్కడిక్కడే మృతువ్యవాత పడింది. ఈ విషాద ఘటన బెంగళూరు నగరంలోని వైట్‌ఫీల్డ్ సమీపంలో సోమవారం రాత్రి 9.30 నిమిషాలకు చోటుచేసుకుంది. 23 ఏళ్ల అఖిల అనే యువతి పాఠశాలలో ఆడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. విధులు నిర్వహించుకొని రాత్రి స్కూల్ నుంచి తన స్కూటీపై ఇంటికి బయల్దేరింది. ఈ క్రమంలో వరద నీటితో నిండిన రోడ్డుపై వెళ్తుండగా ఒక్కసారిగా స్కూటీ స్కిడ్ అయ్యింది. చదవండి: ఎంత పనైపాయే.. స్కెచ్ ఒకరికి.. మర్డర్ మరొకరిని.. దీంతో యువతి కిందపడకుండా ఉండేందుకు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించింది. అయితే అదే స్తంభానికి కరెంట్ పాస్ అవుతుండటంతో షాక్ తగిలి కిందపడిపోయింది. దీనిని గమనించిన స్థానికులు యువతిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. కాగా బెంగళూరులో విద్యుత్ అధికారులు, మున్సిపల్ అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించడం లేదని.. తన కూతురు చావుకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. Situation at Marathahalli, Bengaluru.#Bangalore #Bengaluru #BengaluruRains #SiliconValleyofIndia #bengalururains #bengalurufloods #Karnataka pic.twitter.com/6rftd868Ro — Anil Kumar Verma (@AnilKumarVerma_) September 6, 2022 -
వ్యానులోని డీజేతో కరెంటు షాక్.. 10 మంది కన్వరియాలు దుర్మరణం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ కూచ్బిహార్లో ఘోర ప్రమాదం జరిగింది. పికప్ వ్యాన్ విద్యుదాఘాతానికి గురై అందులో ప్రయాణిస్తున్న 10 మంది కన్వరియాలు ప్రాణాలు కోల్పోయారు. వ్యాను జల్పేష్ వెళ్తుండగా ఆదివారం అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వ్యానులో మొత్తం 29 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరందరినీ స్థానిక ఆస్పత్రికి తరలించగా.. పది మంది అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారని పేర్కొన్నారు. 16 మందిని జల్పాయ్ గుడి ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించినట్లు పేర్కొన్నారు. వ్యాను వెనుకాల ఏర్పాటు చేసిన డీజే జనరేటర్ తీగలతోనే విద్యుదాఘాతం సంభవించిందని ప్రాథమిక విచారణలో తేలినట్లు అధికారులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వాహనాన్ని సీజ్ చేశారు. ప్రస్తుతం డ్రైవర్ పరారీలో ఉన్నాడు. గంగనది పవిత్ర జలం కోసం కన్వరీలతో యాత్ర చేపట్టే శివుని భక్తులను కన్వరియాలు అంటారు. వీరు ఏటా కన్వరియాత్రలో పాల్గొంటారు. చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కుమార్తె మృతి -
Tamil nadu: రథయాత్రలో అపశ్రుతి.. ఘోర ప్రమాదం
తమిళనాడులో మంగళవారం అర్ధరాత్రి దాటాక ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పదిమందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. తంజావూరులో రథయాత్ర సందర్భంగా.. షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. తమిళనాడులోని తంజావూరులో ఆలయ రథోత్సవం సందర్భంగా విద్యుదాఘాతంతో 11 మంది మృతి చెందారు. కలిమేడు గ్రామంలో, ఎగువ గురుపూజ కోసం చిత్రై పండుగ ఊరేగింపు సాధారణంగా అర్ధరాత్రి 12 గంటల నుండి తెల్లవారుజాము వరకు జరుగుతుంది. ఈ నేపథ్యంలో కలిమేడు ఎగువ ఆలయంలో తిరునారు కరసు స్వామి 94వ చిత్రై ఉత్సవాల సందర్భంగా నిన్న(మంగళవారం) రాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. రథాన్ని బంకమట్టిలోని పలు వీధుల గుండా తీసుకొచ్చారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కలిమేడు ప్రాంతంలోని పూతలూరు రోడ్డులో రథం నిలిచిపోగా, హైవోల్టేజీ వైరు తగిలి రథంపైకి విద్యుదాఘాతం ఏర్పడింది. మంటలు చెలరేగడంతో.. ఇద్దరు పిల్లలు సహా పది మంది అక్కడికక్కడే మృతి చెందారు. 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ తంజావూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో మరొకరు మృతి చెందడంతో.. మృతుల సంఖ్య 11కి చేరింది. సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి తంజావూర్ ప్రమాదంపై సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు సీఎంవో కార్యాలయం తెలిపింది. అంతేకాదు.. క్షతగాత్రులను సీఎం స్టాలిన్ పరామర్శించనున్నట్లు తెలుస్తోంది. தஞ்சாவூர் மாவட்டம் களிமேடு கிராமத்தில் மின்சார விபத்தில் உயிரிழந்தவர்களின் குடும்பத்தாருக்கு ஆறுதல் மற்றும் நிவாரண உதவிகளை மாண்புமிகு முதலமைச்சர் @mkstalin அவர்கள் அறிவித்துள்ளார். pic.twitter.com/v4FSMClq0q — CMOTamilNadu (@CMOTamilnadu) April 27, 2022 మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ కూడా విషాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తూ.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశించారాయన. అంఏతకాదు.. పీఎం ఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల పరిహారం, గాయపడిన వాళ్లకు రూ.50వేలు ప్రకటించారు. Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of those who have lost their lives due to the mishap in Thanjavur, Tamil Nadu. The injured would be given Rs. 50,000: PM @narendramodi — PMO India (@PMOIndia) April 27, 2022 -
ఏందబ్బా ఇది.. ఊరు ఊరంతటికి షాక్ కొడుతోంది!
సాక్షి,సత్తుపల్లి(ఖమ్మం) : ఊరంతా ఉలిక్కిపడింది.. విద్యుత్ పరికరాలను పట్టుకుంటే షాక్ కొడుతున్నాయి.. స్విచ్ వేయబోయిన ఓ వ్యక్తి షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సత్తుపల్ల మండలం జగన్నాథపురం గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామంలో టీవీ, స్విచ్‌బోర్డు ఇలా ఏది పట్టుకున్నా షాక్ కొడుతోంది. ఫేస్, న్యూట్రల్వైర్లు కలవడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయి ఇళ్లంతా విద్యుత్ సరఫరా అవుతుందని, విద్యుత్ వైరింగ్ సరిగా లేనందున ఈ పరిస్థితి నెలకొందని గుర్తించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో గురువారం గ్రామంలోని ఇళ్లను పరిశీలించటానికి వచ్చిన విద్యుత్‌శాఖ సిబ్బంది ఒకరు టీవీ ముట్టుకోగానే ఎగిరి పడ్డాడు. బుధవారం రాత్రి నుంచే సరఫరా నిలిపివేసి గ్రామంలో విద్యుత్ శాఖ సిబ్బంది మరమ్మత్తు చేపట్టారు. కాగా సింగరేణి ఓపెన్ కాస్టు విస్తరణలో జగన్నాథపురం గ్రామం కనుమరుగు కానుంది. ఇక్కడి ప్రజలకు చెరుకుపల్లిలో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ఇళ్ల స్థలాలు మంజూరు చేయడంతో గ్రామస్తులందరూ కొత్త ఇళ్ల నిర్మాణంలో తలమునకలయ్యారు. ట్రాన్స్ఫార్మర్ ఎర్త్ ఫెయిల్ అయితే? ఫేస్, న్యూట్రల్ వైర్లు కలవడం వల్ల ఫీజ్ కొట్టేసి ఆ ఇంటి వరకు విద్యుత్ సరఫరా ఆగిపోతుందని, ఊరిలోని ఇళ్లన్నింటికీ షాక్ ఎందుకు కొడుతుందని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ గ్రౌండ్ ఎర్త్ న్యూట్రల్ వైర్ సరిగా లేకపోవటం వల్ల ఇలా జరిగిందని సమాచారం. కానీ ఈ విషయాన్ని విద్యుత్‌శాఖ సిబ్బంది చెప్పకుండా తప్పు కప్పి పుచ్చుకునే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాగా, ఫ్యాను స్విచ్ వేయబోయిన జగన్నాథపురానికి చెందిన ఒగ్గెల కాంతారావు(45) బుధవారం రాత్రి షాక్‌కు అక్కడికక్కడే కుప్పకూలాడు. ఆయనను సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించే సరికి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి భార్య రాజమ్మ మాట్లాడుతూ కూలీ చేసుకొని కుటుంబాన్ని వెళ్లదీస్తున్నామని.. కొన్ని రోజుల్లో కొత్త ఇంటికి వెళ్లామని భావిస్తుండగా ఈ ఘోరం జరిగిందని కన్నీరుమున్నీరైంది. కాగా, సర్పంచ్ ఇరుపా లలిత, ఎంపీటీసీ సభ్యులు ఇరపా కృష్ణారావు, డాక్టర్ మట్టా దయానంద్, ఉడతనేని అప్పారావు తదితరులు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఇళ్లు పరిశీలించాం.. బుధవారం రాత్రి నుంచే గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిపివేశాం. గురువారం ఉదయం ఐదారు ఇళ్లను పరిశీలించాం. ఫేస్,న్యూట్రల్ ఎర్త్ కావడంతోనే ఇళ్లకు విద్యుత్ సరఫరా అయిందని, ఇళ్లల్లో వైరింగ్ సరిగా లేదని తేలింది. దీంతో మా సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. ఒగ్గెల కాంతారావు విద్యుత్ షాక్‌తో మృతి చెందినట్లు నివేదిక అందజేస్తాం. – వెంకటేశ్వర్లు, ఏఈ, సత్తుపల్లి -
నిద్రలోనే మహిళ సజీవ దహనం
సాక్షి,మెదక్ రూరల్: విద్యుదాఘాతంతో పూరి గుడిసె దగ్ధమైన ఘటనలో మహిళ సజీవ దహనం కాగా తండ్రి, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మెదక్ మండలం తిమ్మానగర్ గ్రామంలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన పోలబోయిన నర్సింహులు, మంగమ్మ(35) దంపతులకు ఎనిమిదో తరగతి చదువుతున్న కుమారుడు రవి ఉన్నాడు. ఇద్దరూ వ్యవసాయ కూలీలుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం సాయంత్రం పనులు ముగించుకొని తిరిగి ఇంటికొచ్చి రోజూ మాదిరిగానే నిద్రించారు. ఈ క్రమంలో అర్ధరాత్రి 1 గంటకు నిద్రలో ఉండగా విద్యుత్ షాక్ జరిగి మంటలు చెలరేగాయి. అప్రమత్తమై తేరుకునే లోపే క్షణాల్లో పూరి గుడిసె మంటల్లో పూర్తిగా కాలిపోయింది. గుడిసెలో నిద్రిస్తున్న మంగమ్మ సజీవదహనం కాగా మృతురాలి భర్త నర్సింహులు, కుమారుడు రవికి 50 శాతానికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు మెదక్ డీఎస్పీ సైదులు, రూరల్ ఎస్ఐ మోహన్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో నిత్యావసర వస్తువులు, బట్టలు, ధాన్యం, వంట సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా విషాదచాయలు అలుముకున్నాయి. మెదక్ తహసీల్దార్ శ్రీనివాస్ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. సర్పంచ్ లక్ష్మితో కలిసి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొని పంచనామా నిర్వహించారు. -
కరెంట్ తీగలు తెగిపడి 26 మంది దుర్మరణం
మధ్య ఆఫ్రికా దేశం కాంగోలో ఘోరం జరిగింది. రద్దీ మార్కెట్లో హై వోల్టేజ్ కేబుల్ తెగిపడి 26 మంది దుర్మణం చెందారు. కాంగో రాజధాని కిన్షాసా శివారులో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాలు, వరదల కారణంగా.. నాలా వ్యవస్థ దెబ్బతిని నీరు రోడ్ల మీదకు చేరుకుంది. ఆ సమయంలో మార్కెట్ దగ్గర్లోని బస్సు కోసం కొందరు ఎదురు చూస్తుండగా.. హఠాత్తుగా వైర్ తెగిపడి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో 24 మంది మహిళలు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. -
గుంటూరు జిల్లా టీడీపీ కార్యకర్త కేసును చేధించిన పోలీసులు
-
‘వెంకట్ నారాయణ కేసులో టీడీపీ హైడ్రామా చేస్తోంది’
సాక్షి, గుంటూరు: నాలుగు రోజుల క్రితం బోయపాలెంలో గాయపడ్డ తెలుగుదేశం కార్యకర్త వెంకటనారాయణ కేసును పోలీసులు చేధించారు. ఈ కేసుకు సంబంధించి గుంటూరు జిల్లా క్రైమ్ డీఎస్పీ ఎన్వీఎస్ మూర్తి మాట్లాడుతూ.. కేసును పూర్తిస్థాయిలో విచారించాగా అందులో.. వెంకట్ నారాయణ కరెంటు ట్రాన్స్ఫార్మర్లు లో కాపర్ వైర్ దొంగిలించే దొంగగా తేలిందన్నారు. అంతకు ముందే వెంకట్ నారాయణ పై 11 కాపర్ వైరు దొంగతనాలు కేసులు నమోదు కావాడంతో పాటు నాలుగు నెలల జైలు శిక్ష కూడా పడిందని తెలిపారు. బోయ పాలెం సమీపంలో వైజయంతి స్పిన్నింగ్ మిల్ లోని ట్రాన్స్ఫార్మర్ లోని కాపర్ వైర్ ను దొంగతనం చేయడానికి ప్రయత్నించగా, దొంగతనం చేస్తూ ఉండగా ఒక్కసారిగా కరెంట్ రావడంతో కరెంట్ షాక్ తగిలి అతనికి గాయాలయ్యాయని చెప్పారు. ఆ స్పిన్నింగ్ మిల్లు వాచ్మెన్ 108కు ఫోన్ చేసి ఆస్పత్రికి తరలించారని తెలపారు. అయితే వెంకట్ నారాయణను అడ్డుపెట్టుకుని తెలుగుదేశం పార్టీ హైడ్రామా చేస్తోందని, అతని పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేసి అతనిపై పెట్రోలు పోసి తగలబెట్టారంటూ తెలుగుదేశం తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. ఈ కేసును గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ సీరియస్ తీసుకున్నారు. -
హైదరాబాద్‌లో విషాదం: రేకులపై పడిన చెప్పును తీసుకోబోయి..
సాక్షి, హైదరాబాద్: ఇంటి పైకప్పు రేకులపై పడిన చెప్పును తీసుకోబోయిన ఓ యువకుడు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఈ విషాద ఘటన గురువారం హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... భాగ్యలతలోని శాంతినగర్‌లో నివసించే రిచ్‌పాల్ కొడుకు రాహుల్ (18) జ్యువెలరీ షాపులో పని చేస్తున్నాడు. గురువారం ఉదయం రాహుల్ చెప్పు తన ఇంటి మొదటి అంతస్తులోని రేకుల షెడ్డుపై పడింది. అల్యూమినియం రాడ్డుతో దానిని తీసేందుకు యత్నించగా అది పొరపాటున పక్కనే ఉన్న హైటెన్షన్ విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో విద్యుత్ షాక్‌కు గురైన రాహల్ తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతడ్ని వనస్థలిపురంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ప్రేమ పేరుతో మోసం.. ఆరు నెలలుగా ప్రేమ.. శారీరకంగా లొంగదీసుకొని.. -
‘పాడె’ కట్టె అతనికి మృత్యువుగా మారింది
సాక్షి,వర్గల్(సిద్దిపేట): ‘పాడె’ కట్టె కాలనాగైంది. అంత్యక్రియల కలప కోసం వచ్చిన వ్యక్తిని విద్యుత్‌షాక్ రూపంలో కాటేసింది. పాడె కట్టేందుకు అవసరమైన వెదురు చెట్టును కొడుతుండగా అది విద్యుత్‌లైన్‌కు తాకడంతో ఈ దుర్ఘటన సంభవించింది. మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.... మజీద్‌పల్లికి చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు లింగ లక్ష్మినర్సయ్య అనారోగ్యంతో మృతిచెందాడు. బుధవారం అతడి అంత్యక్రియల కోసం పాడె కట్టేందుకు అవసరమైన వెదురు కట్టెలు తెచ్చేందుకు గ్రామశివారులోని విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రాంతానికి గాలం స్వామి(38), పాలేటి ధర్మరాజు, చిగురుఎత్తు రాజు వెళ్లారు. అక్కడ వెదురు చెట్టును స్వామి గొడ్డలితో కొడుతుండగా అది పక్కనే ఉన్న విద్యుత్ లైన్ వైర్లను తాకింది. దీంతో అతను తీవ్ర విద్యుత్ షాక్‌కు గురై అపస్మారక స్థితిలో పడిపోయాడు. పక్కనే ఉన్న మిగతా ఇద్దరు అప్రమత్తమై దూరంగా జరిగి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వారు వెంటనే తెలిసిన వారికి సమాచారం చేరవేసి స్వామిని గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పేద కుటుంబంలో పెను విషాదం గాలం స్వామి మృత్యువాత పడిన సమాచారంతో కుటుంబసభ్యులు బోరుమని విలపించారు. మృతుడికి భార్య లక్ష్మి, 18 సంవత్సరాలలోపు ఏసుమణి, సంధ్య, కార్తీక్ పిల్లలు ఉన్నారు. తండ్రి సత్తయ్య కూడా వీరి వద్దనే ఉంటున్నాడు. పెద్దగా ఆస్తిపాస్తులు లేని ఆ కుటుంబం స్వామి సంపాదనపైనే ఆధారపడి జీవిస్తోంది. పెద్ద దిక్కును కోల్పోయి ఆ కుటుంబం పెనువిషాదంలో మునిగిపోయింది. ఆస్పత్రి వద్ద వారి రోదనలు ఆపడం ఎవరి తరం కాలేదు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పెళ్లి కావడం లేదని బాధ.. ఉదయం తలుపు బద్దలు కొట్టి చూస్తే.. -
తోడుగా ఒకరు.. కుటుంబం కోసం మరొకరు.. వారి ప్రయాణం ఒకచోటే ఆగింది
సాక్షి,కంచిలి(శ్రీకాకుళం): ఒకరు భర్తకు తోడుగా పరిశ్రమ నడిపిస్తున్నారు. మరొకరు కట్టుకున్న వాడితో కష్టాన్ని పంచుకుంటున్నారు. కానీ వీరిద్దరి ప్రయాణం ఒక్క చోటే ఆగిపోయింది. పరిశ్రమ ఏర్పాటు చేసి పది మందికి ఉపాధి కల్పించి తామూ ఎదగాలనుకున్న మహిళ ఆశ అడియాస కాగా.. నెలకింత సంపాదించి భర్తతో పాటు కుటుంబ భారాన్ని మోస్తున్న భార్య పిల్లలను ఒంటరి చేసి వెళ్లిపోయింది. మండలంలోని పద్మతుల గ్రామంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో కప్ప హేమలత(24), పిరియా రజని(35)లు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని మిక్చర్ తయారు చేసే పరిశ్రమ ఉంది. ఈ మధ్యన పనులు పెద్దగా లేకపోవడంతో కార్మికులు ఎవరూ రావడం లేదు. దీంతో నిర్వాహకుడు కప్ప వెంకటరావు భార్య హేమలత(24), అక్కడ పనిచేసే కార్మికురాలు మకరాంపురం గ్రామానికి చెందిన పిరియా రజని(35)లు బుధవారం ఆ ప్రాంగణాన్ని శుభ్రం చేయడానికి దిగారు. నీటితో కడుగుతుండగా మిక్చర్ తయారీలో పిండి మిక్సీ చేసే యంత్రం నుంచి కరెంటు పాస్ కావడంతో ఇద్దరూ విద్యుదాఘాతానికి గురయ్యారు. (చదవండి: నాన్న.. నాకు చదువొద్దు చనిపోతున్నా..) కార్మికురాలు పిరియా రజని అక్కడికక్కడే మృతి చెందగా, యజమాని భార్య కప్ప హేమలత కొద్దిసేపటి వరకు మృత్యువుతో పోరాడి తర్వాత మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికి హేమలత కొన ఊపిరితో ఉన్నట్లు గుర్తించి ఆమెను బతికించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వేర్వేరు గ్రామాల నుంచి వచ్చి.. ఈ పరిశ్రమ యాజమాని కప్ప వెంకటరావు స్వగ్రామం కేసరపడ. భార్య హేమలత కన్నవారి గ్రామం పద్మతుల. ఆరు నెలల కిందటే ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేశారు. కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్న సమయంలో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడంతో భర్త వెంకటరావుతోపాటు మిగతా కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. వీరికి ఐదేళ్ల కుమారుడు, మూడేళ్ల కుమార్తె ఉన్నారు. ఇక్కడ పని చేస్తున్న రజని భర్త నారాయణ సమీపంలో ఉన్న ఒక పీచు పరిశ్రమలో పనిచేస్తున్నారు. భార్య కూడా ఇక్కడ పనిచేస్తూ కుటుంబ భారాన్ని మోస్తున్నారు. వీరికి వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో సాయి ఆరో తరగతి చదువుతుండగా, సాత్విక్ మూడో తరగతి చదువుతున్నాడు. వీరి స్వగ్రామం సోంపేట మండలం బెంకిలి. బతుకు తెరువుకోసం కొన్నాళ్ల నుంచి మకరాంపురంలో నివాసముంటూ ఇక్కడ పనిచేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కంచిలి ఎస్ఐ ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అంగన్వాడీ కార్యకర్త.. వామ్మో అవినీతి సొమ్ము అంత వెనకేసిందా? -
పతంగులు ఎగరేస్తూ విద్యుత్ షాక్‌కు గురైన బాలుడు
భైంసా: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని రామ్‌నగర్ కాలనీకి చెందిన అభిలాష్ అనే బాలుడు పతంగులు ఎగరేస్తూ విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాపాయస్థితిలో కొట్టిమిట్టాడుతున్నాడు. సంక్రాంతి పండుగ కావడంతో స్నేహితులతో కలిసి గాలిపటాలు ఎగరేస్తున్న అభిలాష్.. విద్యుత్ తీగలకు గాలిపటం తట్టుకోవడంతో దాన్ని విడిపించే క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై తీవ్రగాయాలపాలయ్యాడు. ఇది గమనించిన ఇరుగుపొరుగు వారు బాలుడిని సమీపంలోని ఏరియా అసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం బాలుడిని హైదరాబాద్‌కు తరలించారు. సంక్రాంతి పండుగ కావడంతో స్నేహితులతో కలిసి ఇంటి డాబాపై గాలిపటాలు ఎగరేస్తున్న అభిలాష్.. విద్యుదాఘాతానికి గురై పక్కనే ఉన్న రేకుల షెడ్డుపై పడిపోయాడు. విద్యుత్ తీగలు బాలుడికి అతుక్కుపోవడంతో తీవ్ర రక్తస్రావమై, చావుబతుల మధ్య కొట్టిమిట్టాడాడు. కరెంటు తీగలు రేకులపైనే ఉండటంతో బాలుడిని కాపాడే సాహసం ఎవ్వరూ చేయలేకపోయారు. దయనీయ పరిస్థితిలో బాలుడు రోదిస్తున్న తీరు చుట్టుపక్కల వారని కలచి వేసింది. కాగా, అభిలాష్ విద్యుత్ షాక్‌కు గురైన సమయంలో ఇంట్లో తల్లిదండ్రులు కూడా లేరు. -
వేటగాళ్ల ఉచ్చుకు ఎంపీటీసీ బలి
మందమర్రి రూరల్(చెన్నూర్): మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని మామిడిగట్టు సమీపంలో అటవీ ప్రాంతానికి షికారుకు వెళ్లి విద్యుత్ తీగలకు తగిలి వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. షికారుకు వెళ్లిన వ్యక్తులు చెప్పిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి సండ్రోనిపల్లికి చెందిన బైర్నేని ప్రశాంత్, సారంగపల్లి నివాసి, చిర్రకుంట ఎంపీటీసీ ఎండీ ఆసిఫ్, తుర్కపల్లికి చెందిన ఎండీ అఫ్రోజ్, మామిడిగట్టుకు చెందిన సయ్యద్ షరీఫ్ షికారుకు వెళ్లారు. సోమవారం తెల్లవారుజామున తిరిగి వస్తున్న క్రమంలో అడవిజంతువుల కోసం అమర్చిన జే వైర్ ముందుగా వస్తున్న ఆసిఫ్ కాలుకు తగలడంతో ఒక్కసారిగా పైకిఎగిరి కిందపడి మృతి చెందాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరిపై కేసు నమోదు అడవి జంతువుల షికారుకోసం విద్యుత్ తీగలు అమర్చి ఆసిఫ్ మృతికి కారణమైన మామిడిగట్టుకు చెందిన గజ్జె దుర్గయ్య, నాంపెల్లి రాజంలపై సయ్యద్ షరీఫ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రామకృష్ణాపూర్ ఎస్సై రవిప్రసాద్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిద్రమత్తులో అధికారులు అటవీ ప్రాంతంలో అడవిజంతువుల షికారు జరుగుతున్నా అధికారులు నిద్రమత్తు వీడడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. షికారుకు వెళ్లామని బహిరంగంగానే చెబుతున్నా వారిని కనీసం అదుపులోకి తీసుకోలేదంటే వారి విధి నిర్వహణ అర్ధమవుతోందని పలువురు విమర్శిస్తున్నారు. అటవీశాఖ అధికారులు అడవిని, వన్యప్రాణులను రక్షించాలని ఎన్నో ఆంక్షలు విధిస్తూ కఠిన చట్టాలు చేసినా ఇలాంటి వ్యవహారం జరుగుతుందంటే అధికారుల చేయి లేనిదే జరగడం లేదని, అధికారులు సక్రమంగా విధులు నిర్వహించి ఉంటే ఎంపీటీసీ మృతి చెందేవాడు కాదని మండల ప్రజలు పేర్కొంటున్నారు.