Express trains
-
సామాన్యులకూ ఒక సీటు
సాక్షి, హైదరాబాద్: ఎక్స్‌ప్రెస్ రైళ్లలో జనరల్ కోచ్‌ల సంఖ్య పెంచాలని నిర్ణయించిన రైల్వే శాఖ.. ఆ మేరకు ఏర్పాట్లు ప్రారంభించింది. అల్పాదాయ వర్గాల ప్రయాణికుల కోసం ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అదనంగా రెండు జనరల్ క్లాస్ కోచ్‌లను జత చేస్తున్నారు. దీంతో ఇక నుంచి ప్రతి ఎక్స్‌ప్రెస్ రైల్‌కు నాలుగు జనరల్ క్లాస్ కోచ్‌లు ఉండనున్నాయి. నవంబర్ నెల చివరి నాటికి దేశవ్యాప్తంగా వేయి జనరల్ కోచ్‌లు అందుబాటులోకి రానుండగా.. దక్షిణ మధ్య రైల్వేకు 165 కేటాయించారు. దేశవ్యాప్తంగా అన్ రిజర్వ్డ్ కోచ్‌లలో ప్రయాణికులు కిక్కిరిసిపోయి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న అంశంపై సాక్షి మీడియా పలు కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే.అన్నీ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లే..ప్రస్తుతం దేశంలో సంప్రదాయ ఐసీఎఫ్ కోచ్‌ల తయారీని రైల్వే శాఖ నిలిపేసింది. వాటి స్థానంలో తక్కువ బరువుండే, ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రాణనష్టం తగ్గించే రీతిలో ఉండే ఎల్‌హెచ్‌బీ కోచ్‌లనే తయారు చేస్తోంది. ఈ కోచ్‌ల తయారీ పెరుగుతున్నకొద్దీ సంప్రదాయ కోచ్‌లను తొలగిస్తున్నారు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రైళ్లకు మొత్తం 5,748 కోచ్‌లున్నాయి. వీటిల్లో ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల సంఖ్య 2,181. మొత్తం జోన్ పరిధిలో 272 రైళ్లు ఉంటే, ఎల్‌హెచ్‌బీ కోచ్‌లున్న రైళ్ల సంఖ్య 88. మరో ఏడు జతల రైళ్లకు ఈ ఏడాది ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను అమర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా జనరల్ కోచ్‌లను ఏర్పాటు చేస్తున్న దృష్ట్యా.. అన్నీ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లనే సరఫరా చేస్తున్నారు. అవసరమైతే రిజర్వ్డ్ కోచ్‌లు తగ్గించి.. దేశవ్యాప్తంగా ఏసీ కోచ్‌ల సంఖ్య పెంచుతూ సాధారణ ప్రజలు వినియోగించే జనరల్ కోచ్‌ల సంఖ్య తగ్గిస్తున్నారంటూ కొంతకాలంగా రైల్వేశాఖపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇది వాస్తవం కాదు అని ఎప్పటికప్పుడు ఖండిస్తున్న రైల్వేశాఖ.. ఇప్పుడు ప్రత్యక్ష కార్యాచరణ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా అన్ రిజర్వ్డ్ కోచ్‌లలో ప్రయాణికుల అవస్థలను పరిశీలించేందుకు సర్వే చేసింది. అన్ రిజర్వ్డ్ కోచ్‌లలో నిలబడేందుకు కూడా స్థలం లేక ప్రయాణికులు టాయిలెట్ల వద్ద కూర్చుని ప్రయాణిస్తున్న వాస్తవాలను గుర్తించింది. రిజర్వేషన్ చార్జీలను భరించే స్తోమత లేక అలాగే ఇబ్బందులతో ప్రజలు ప్రయాణిస్తున్నారు.దీంతో వెంటనే జనరల్ కోచ్‌ల సంఖ్య పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో నడుస్తున్న ఎక్స్‌ప్రెస్ రైళ్లకే ఈ నిర్ణయం వర్తించనుంది. క్రమంగా ఐసీఎఫ్ కోచ్‌ల స్థానంలో ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో నడిచే రైళ్లకు జనరల్ కోచ్‌ల సంఖ్య పెంచుతారు. సాధారణంగా ఒక ఎక్స్‌ప్రెస్ రైలులో 24 కోచ్‌లుంటాయి. వాటిల్లో రెండు జనరల్ కోచ్‌లుంటాయి. ఇప్పుడు అదనంగా రెండు జనరల్ క్లాస్ కోచ్‌లను అనుసంధానించటం కుదరదు. చేరిస్తే అప్పుడు ఆ రైలు కోచ్‌ల సంఖ్య 26కు పెరుగుతుంది. అన్ని రూట్లు అంత పొడవైన రైలు నడిచేందుకు అనువుగా ఉండవు. దీంతో రెండు రిజర్వ్డ్ కోచ్‌లను తగ్గించి వాటి స్థానంలో రెండు జనరల్ కోచ్‌లను చేర్చాలని నిర్ణయించారు. ఫలితంగా ఎక్కువ మంది అన్ రిజర్వ్డ్ ప్రయాణికులకు ప్రయాణ వెసులుబాటు కలగటమే కాకుండా, టాయిలెట్ల వద్ద కూర్చుని ప్రయాణించే సమస్య కొంతమేర తగ్గుతుంది. నవంబర్‌లో వేయి కోచ్లునవంబర్ మాసం చివరి నాటికి దేశవ్యాప్తంగా ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనంగా వేయి జనరల్ కోచ్‌లు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా ఇలా పదివేల కోచ్‌లు ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. వీటిలో 6 వేలు అన్రిజర్వ్డ్ కోచ్‌లు కాగా.. మిగతా 4 వేలు నాన్ ఏసీ స్లీపర్ కోచ్‌లు ఉండనున్నాయి. రెండేళ్లలో అందుబాటులోకి వచ్చే పదివేల జనరల్ కోచ్‌లలో అదనంగా రోజుకు మరో 8 లక్షల మంది రైళ్లలో ప్రయాణించగలరని అంచనా వేశారు. అంకెల్లో భారతరైల్వే⇒ 4 ప్రపంచంలో అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో భారత్ స్థానం⇒ 2023 నాటికి మొత్తం రైల్వే ట్రాక్ 1,32,310 కి.మీ రైల్వేలో మొత్తం ఉద్యోగులు 12 లక్షల మందికి పైగా⇒ ఇండియన్ రైల్వేలో మొత్తం జోన్లు 17 దేశంలో మొత్తం రైల్వే స్టేషన్లు 7,325⇒ దేశంలో రోజూ నడుస్తున్న ప్యాసింజర్ రైళ్లు 13,000⇒ దేశంలో రైళ్లలో రోజూ ప్రయాణిస్తున్న ప్రయాణికులు 2.40 కోట్ల మంది రోజూ దేశంలో నడుస్తున్న రైళ్లలో ప్యాసింజర్ కోచ్‌ల సంఖ్య 84,863⇒ 2024 మార్చి నాటికి (2023ృ24) ఇండియన్ రైల్వే ఆదాయం రూ.2.40 లక్షల కోట్లు రోజువారీ రైల్వే ఆదాయం రూ.600 కోట్లు⇒ రైలు ప్రమాదాలను నివారించడానికి ఇప్పటిదాకా కవచ్‌ను ఏర్పాటు చేసిన రైల్వే ట్రాక్ 37 వేల కి.మీ⇒ దేశంలో రోజూ నడుస్తున్న సరుకు రవాణా రైళ్లు 8,000⇒ 2024 అక్టోబర్ నాటికి దేశంలో నడుస్తున్న వందే భారత్ రైళ్లు 66 వచ్చే మూడేళ్లలో ప్రవేశపెట్టనున్న వందే భారత్ రైళ్ల సంఖ్య 400⇒ 2024, మార్చి నాటికి దేశంలో విద్యుత్ రైల్వే మార్గాలు 62,119 కి.మీ⇒ 202-24 లెక్కల ప్రకారం సగటున ఆన్లైన్లో రోజుకు బుక్ అవుతున్న రైల్ టికెట్లు 12.38 లక్షలు⇒ ఆన్లైన్లో నిమిషానికి బుక్ అవుతున్న రైల్ టికెట్లు 28,000⇒ రోజుకు రైళ్లలో అందిస్తున్న భోజనాలు 16 లక్షలు⇒ కేటరింగ్ ద్వారా ఆదాయం రూ.1,947.19 కోట్లు⇒ ఐఆర్సీటీసీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నవారు 12.21 కోట్లు -
దిగడం సరే.. ఎక్కడమెలా!
రాజంపేట: ఒక రైలుకు ఒక స్టేషన్లో హాల్టింగ్ ఇస్తే.. ఆ రైలు అప్, డౌన్లకు హాల్టింగ్ ఉన్నట్లే.. అయితే గుంతకల్లు డీవోఎం(కోచ్) పేరిట విడుదలైన ఉత్తర్వులలో హాల్టింగ్స్ పై వింతవైఖరి శనివారం బట్టబయలైంది. పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కన్ఫ్యూజ్ హాల్టింగ్ ఆర్డర్స్ జారీ చేసి ప్రయాణికులను గందరగోళంలోకి నెట్టేశాయి. మోదీ పాలనలో అడ్డగోలుగా అధికారులు తీసుకుంటున్న వింత నిర్ణయాలతో కేంద్రం పేద, మధ్యతరగతి వారి నుంచి చెడ్డపేరు మూటకట్టుకుందనే విమర్శలున్నాయి. ఈ పరిస్థితి ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో రైల్వేపరంగా గుర్తింపు కలిగిన నందలూరు రైల్వేకేంద్రంలో చోటుచేసుకుంది. కడప నుంచి విశాఖకు (17487) తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలుకు నందలూరులో హాల్టింగ్ ఎత్తివేశారు. అయితే విశాఖ నుంచి తిరుపతికి వచ్చే తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలుకు నందలూరులో హాల్టింగ్ ఇచ్చారు. ఎక్కేందుకు వీలులేకుండా, వచ్చేందుకు వీలు కల్పించే హాల్టింగ్ ఇచ్చారు. అలాగే 17415 నంబరుతో నడిపించే తిరుపతి నుంచి కోల్హాపూర్‌కు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలుకు హాల్టింగ్‌ను ఎత్తివేశారు. అయితే కోల్హాపూర్ నుంచి తిరుపతికి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌కు నందలూరు హాల్టింగ్‌ను ఇచ్చారు. ఈ విధంగా హాల్టింగ్స్ ఇవ్వడం విడ్డూరంగా ఉందని రైల్వే వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఓబులవారిపల్లె, రాజంపేటలో..ఓబులవారిపల్లెలో రైల్వే జంక్షన్లో నందలూరు రైల్వేకేంద్రం తరహాలోనే 17415 నంబరు గల తిరుపతి –కోల్హాపూర్, తిరుపతి–నిజాముద్దీన్, నిజాముద్దీన్–తిరుపతి మధ్య నడిచే (12793/12794) రైలుకు పూర్తిగా హాల్టింగ్ ఎత్తివేశారు. రాజంపేట రైల్వేస్టేషన్లో మధురై నుంచి లోకమాన్యతిలక్ (22102)కు హాల్టింగ్ ఎత్తేశారు. ఎక్కడానికి మాత్రమే హాల్టింగ్, దిగడానికి హాల్టింగ్ లేకుండా చేశారు. రాజంపేట పరిసర ప్రాంతాల నుంచి అనేక మంది కంటి ఆపరేషన్లకు మధురైకు వెళుతుంటారు. అదే రైల్లో తిరిగి తమ గమ్యాలకు చేరుకుంటున్నారు. వారు రైల్వే అధికారులు తీసుకున్న వింత నిర్ణయాలపై పెదవి విరిస్తున్నారు. ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్లో కాచిగూడ నుంచి చెంగల్పట్టుకు వెళ్లే (17652)రైలుకు హాల్టింగ్ ఎత్తివేశారు. -
రైలు పట్టాలపై జీవితం ఆరంభించా: ప్రధాని మోదీ
అహ్మదాబాద్/పోఖ్రాన్: రైలు పట్టాలపైనే తన జీవితాన్ని ప్రారంభించానని, రైల్వే శాఖకు సంబంధించిన కష్టాలు, ప్రయాణికుల ఇబ్బందులన్నీ తనకు తెలుసని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. నరకం లాంటి పరిస్థితి నుంచి రైల్వేలను బయటకు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. రైల్వే రంగం అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అప్పటి ప్రభుత్వాలు రైల్వేశాఖ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయని, సొంత రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చాయని విమర్శించారు. 21వ శతాబ్దంలో రైల్వేల ప్రగతిని దృష్టిని పెట్టుకొని రైల్వే బడ్జెట్‌ను కేంద్ర బడ్జెట్లో విలీనం చేశామని వెల్లడించారు. తద్వారా రైల్వేల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిధులు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. ప్రధాని మోదీ మంగళవారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పర్యటించారు. సబర్మతి ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ.1,06,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. కొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఇందులో రూ.85,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయి. పది నూతన వందేభారత్ రైళ్లను ప్రధానమంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు. ఇందులో సికింద్రాబాద్–విశాఖపట్నం, పూరీ–విశాఖపట్నం వందేభారత్ రైళ్లు కూడా ఉన్నాయి. తిరుపతి–కొల్లాం స్టేషన్ల మధ్య కొత్త రైలుకు పచ్చజెండా ఊపారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. ఎన్నికల్లో లబ్ధి కోసం కాదు 2004–2014తో పోలిస్తే గత పదేళ్లలో తమ ప్రభుత్వం రైల్వేల అభివృద్ధికి 6 రెట్లు అధికంగా ఖర్చు చేసిందని ప్రధానమంత్రి అన్నారు. గతంలో రైళ్లు ఆలస్యంగా నడవడం అనేది సాధారణ వ్యవహారంగా ఉండేదన్నారు. 2014 వరకు దేశంలో కేవలం 35 శాతం రైల్వే లైన్లు విద్యుదీకరణకు నోచుకున్నాయని గుర్తుచేశారు. రైళ్లలో ప్రయాణానికి రిజర్వేషన్ దొరకడం చాలా కష్టంగా ఉండేదని, టికెట్ల కోసం ప్రయాణికులు గంటల తరబడి క్యూలో నిల్చునేవారని, ఏజెంట్లు కమీషన్లు వసూలు చేసేవారని చెప్పారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని పేర్కొన్నారు. దేశ ప్రగతి అనే మిషన్‌లో భాగంగానే అభివృద్ధి పనులు, ప్రాజెక్టులు చేపడుతున్నామని, అంతేతప్ప కొందరు ఆరోపిస్తున్నట్లు ఎన్నికల్లో లబ్ధి కోసం ఎంతమాత్రం కాదని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వారసత్వ సంపదను కాపాడుకోవాలి సొంత వారసత్వ సంపదను కాపాడుకోని దేశానికి భవిష్యత్తు ఉండదని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. మన దేశ వారసత్వ సంపదను కాపాడే విషయంలో గత ప్రభుత్వాలు ఏమాత్రం నిబద్ధత చూపలేదని విమర్శించారు. మంగళవారం అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమంలో దండి యాత్ర వార్షికోత్సవంలో మోదీ పాల్గొన్నారు. రూ.1,200 కోట్లతో అమలు చేయనున్న గాంధీ ఆశ్రమ్ మెమోరియల్ మాస్టర్‌ప్లాన్‌ను ప్రారంభించారు. ఆధునీకరించిన కోచ్రాబ్ ఆశ్రమాన్ని ప్రారంభించారు. మహాత్మాగాంధీ ఆరంభించిన సబర్మతి ఆశ్రమం కేవలం మన దేశానికే కాదు, మొత్తం మానవాళికే వారసత్వ సంపద అని తేల్చిచెప్పారు. పోఖ్రాన్లో అబ్బురపర్చిన ‘భారత్ శక్తి’ భారతదేశ ఆత్మనిర్భరత, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవానికి పోఖ్రాన్ ఒక ఘనమైన సాక్షి అని ప్రధానమంత్రి మోదీ వ్యాఖ్యానించారు. రాజస్తాన్ రాష్ట్రం పోఖ్రాన్‌లోని ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో మంగళవారం భారత త్రివిధ దళాలు ‘భారత్ శక్తి’ పేరిట సైనిక విన్యాసాలు నిర్వహించారు. దాదాపు 50 నిమిషాల పాటు జరిగిన ఈ విన్యాసాలను మోదీ ప్రత్యక్షంగా తిలకించారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ఆయుధాలు, రక్షణ పరికరాల విన్యాసాలు చూపరులను అబ్బురపర్చాయి. తేజస్, ఏఎల్ఎస్ ఎంకే–4 యుద్ధ విమానాలు, యుద్ధ ట్యాంకులు అర్జున్, కె–9 వజ్ర, ధనుష్ వంటివి ఆకట్టుకున్నాయి. పినాకా ఉపగ్రహ వ్యవస్థతోపాటు డ్రోన్ల విన్యాసాలు సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. ఆకాశంలో మన యుద్ధ విమానాల గర్జనలు, నేలపై మన జవాన్ల సాహసాలు నవ భారత్(న్యూ ఇండియా)కు ఆహ్వానం పలుకుతున్నామని మోదీ పేర్కొన్నారు. -
40 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు తాత్కాలిక హాల్ట్‌లు.. స్పందన ఉంటే కొనసాగింపు
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 40 ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్టాపుల జాబితాను పెంచింది. ఇక నుంచి కొన్ని స్టేషన్లలో తాత్కాలికంగా ఆగనున్నట్లు పేర్కొంది. ఆరు నెలలు పరిశీలించి, ప్రయాణికుల నుంచి స్పందన మెరుగ్గా ఉంటే కొనసాగిస్తామని తెలిపింది. తిరుపతి–లింగంపల్లి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్, చెన్నై–సికింద్రాబాద్–విశాఖ ఎక్స్‌ప్రెస్, నాగర్సోల్–నర్సాపూర్, లింగంపల్లి–నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్, భద్రాచలం రోడ్డు– బల్లార్షా ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్–హజ్రత్ నిజాముద్దీన్ దక్షిణ్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–రాయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్, సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్, ఎర్నాకులం–పట్నా ఎక్స్‌ప్రెస్, మైసూరు–దర్బంగా భాగమతి ఎక్స్‌ప్రెస్, రామేశ్వరం–బెనారస్ ఎక్స్‌ప్రెస్, హజ్రత్ నిజాముద్దీన్–తిరుపతి çసంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–మణుగూరు ఎక్స్‌ప్రెస్, చార్మినార్–పద్మావతి ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం–మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్, రాయలసీమ ఎక్స్‌ప్రెస్, ధర్మవరం–మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్, కొండవీడు ఎక్స్‌ప్రెస్, యశ్వంతపూర్–లక్నో ఎక్స్‌ప్రెస్, కాచిగూడ–చెంగల్పట్టు ఎక్స్‌ప్రెస్, లోకమాన్య తిలక్–మధురై ఎక్స్‌ప్రెస్, లోకమాన్య తిలక్–కరైకల్ ఎక్స్‌ప్రెస్, నాగర్‌కోయల్–సీఎస్ఎంటీ ఎక్స్‌ప్రెస్, నాగర్‌కోయల్– కాచిగూడ ఎక్స్‌ప్రెస్, చెంగల్పట్టు–కాకినాడ ఎక్స్‌ప్రెస్, డెల్లా ఎక్స్‌ప్రెస్, హిమసాగర్ ఎక్స్‌ప్రెస్, పూరి–తిరుపతి ఎక్స్‌ప్రెస్, బిలాస్పూర్–ఎక్స్‌ప్రెస్, తిరుపతి–కాకినాడ టౌన్ ఎక్స్‌ప్రెస్, రాప్తి సాగర్ ఎక్స్‌ప్రెస్, గుంటూరు–రాయగడ ఎక్స్‌ప్రెస్, గుంటూరు–నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్, యశ్వంత్‌పూర్–కాచిగూడ ఎక్స్‌ప్రెస్, సెవెన్‌హిల్స్ ఎక్స్‌ప్రెస్, యలహంక–కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌లలో కొన్ని తాత్కాలిక స్టాపులను ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజలు, సంఘాలు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తుల ఆధారంగా దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. -
Train Accident: లూప్లైన్లోకి మళ్లించినందుకే?
సాక్షి, విశాఖపట్నం: ఊహించని ఉత్పాతం.. రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రమాదానికి గురై, వందల సంఖ్యలో ప్రయాణికులు మృత్యువాత పడగా, మరికొన్ని వందల మంది క్షతగాత్రులయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో రైలు వేగాన్ని పరిగణనలోకి తీసుకున్న అధికారులు దాని తీవ్రతను అంచనా వేశారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల 55 నిమిషాల 28 సెకన్లకు గంటకు 128 కిలోమీటర్ల వేగంతో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణిస్తోంది. అదే సమయంలో ప్రమాదం సంభవించడంతో 6 గంటల 55 నిమిషాల 51 సెకన్లకు వేగం సున్నాకు పడిపోయింది. సాధారణంగా గంటకు దాదాపు 130 కి.మీ. వేగంతో వెళ్లే రైలు వేగం సున్నాకు చేరుకునేందుకు అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే 60 నుంచి 80 సెకన్లకు పైగా సమయం పడుతుంది. కానీ, ప్రమాదం జరిగి 23 సెకన్లలోనే జీరో స్పీడ్‌కు చేరుకుందంటే పట్టాలపై ఉన్న గూడ్సు రైలును ఎంత బలంగా ఢీకొట్టిందో అర్థం చేసుకోవచ్చని, దీన్నిబట్టి ప్రమాద తీవ్రతను ఊహించడానికే భయం కలుగుతోందని రైల్వే అధికారులు చెబుతున్నారు. అధికారులు ఏం చెబుతున్నారంటే... రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ ప్రమాదం ఎలా జరిగిందన్న అంశంపై స్పందించారు. సాయంత్రం 6.55 గంటల సమయంలో బహనాగ రైల్వేస్టేషన్ వద్ద స్టాప్ లేకపోవడంతో వేగంగా వెళ్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలు ఒక్కసారిగా పట్టాలు తప్పాయి. పక్కన ఉన్న ట్రాక్‌పైకి కోరమండల్ కోచ్‌లు పడిపోయాయి. అదే సమయంలో ఆ ట్రాక్‌పై వస్తున్న యశ్వంత్‌పూర్–హౌరా ఎక్స్‌ప్రెస్ పడిపోయిన కోచ్‌లని ఢీకొట్టడంతో ఆ ట్రైన్‌కు సంబంధించిన నాలుగు బోగీలు పట్టాలు తప్పాయని వివరించారు. అసలు జరిగిందేమిటి? అధికారులు చెబుతున్న దానికి, ప్రమాదం సంభవించిన పరిస్థితుల్ని గమనిస్తే.. ఒకదానికొకటి పొంతన లేకుండా ఉన్నాయి. వేగంగా వెళ్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిందని అధికారులు చెబుతున్నారు. కానీ, ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు చూస్తే అక్కడ గూడ్స్ రైలు కూడా ఉందని స్పష్టమవుతోంది. స్టేషన్ వద్ద.. మధ్యలో ఉన్న లూప్లైన్లో గూడ్స్ రైలు ఆగి ఉంది. స్టేషన్లో స్టాప్ లేనప్పుడు రైలుకు మెయిన్ లైన్లో ట్రాక్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, కోరమాండల్‌కు లూప్లైన్లో సిగ్నల్ ఇచ్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెయిన్ లైన్లో నుంచి వెళ్లకుండా లూప్లైన్లోకి రావడం వల్ల అక్కడ ఆగి ఉన్న గూడ్స్ రైలుని బలంగా ఢీకొట్టడమే ప్రమాదానికి ప్రధాన కారణమన్న వాదన వినిపిస్తోంది. ఇది ముమ్మాటికీ రైల్వే శాఖ తప్పిదమని కొందరు సిబ్బంది చెబుతున్నారు. గంటకు 128 కి.మీ. వేగంతో వస్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ లోకో గూడ్స్ రైలు బోగీపైకి వెళ్లినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా అలాంటిదేమీ జరగలేదన్నట్లుగా రైల్వే అధికారులు చేస్తున్న ప్రకటనలు మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ ప్రమాదంపై పూర్తిస్థాయి దర్యాప్తునకు రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. -
‘కృష్ణా’ వాసుల కష్టాలు.. ఆగని ఎక్స్‌ప్రెస్.. రాయచూర్ రైల్వేస్టేషన్‌కు వెళ్లాల్సిందే!
కృష్ణా (మహబూబ్‌నగర్): కృష్ణా రైల్వేస్టేషన్‌కు ఓ విశిష్టమైన చరిత్ర ఉంది. దేశంలో మొదటిసారి రైల్వేలైన్ ఏర్పాటు చేసిన సమయంలోనే ఈ రైల్వేస్టేషన్ ఏర్పడింది. అప్పటి నుంచి ఈ ప్రాంతంలోని కృష్ణానదిలో పూజ కార్యక్రమాలకు మహారాష్ట్ర, కర్ణాటక తదితర సూదూర ప్రాంతాల నుంచి ఇక్కడకు భక్తులు వచ్చేవారు. ఆ భక్తులకు ఉపయోగపడే విధంగా ఈ స్టేషన్లో అన్ని సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలిపేవారు. కాగా కరోనా మహామ్మారి కారణంగా గత కొంత కాలంగా ఈ స్టేషన్లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇక్కడ నిలపకుండగా రద్దు చేశారు. దీంతో కృష్ణానదికి వచ్చే భక్తులు చుట్టూ పక్కల గ్రామాలకు చెందిన ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ ప్రాంత ప్రజలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు గాను పక్కన ఉన్న కర్ణాటకలోని రాయచూర్ రైల్వేస్టేషన్‌కు వెళ్లాల్సి వస్తుందన్నారు. తక్షణమే గతంలో మాదిరిగా ఈ స్టేషన్లో రైళ్లను అన్నింటిని నిలిపే విధంగా తగు చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారులకు, కేంద్ర రైల్వే మంత్రికి ప్రత్యేక విజ్ఞప్తులు చేశారు. ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలపాలని రైల్వేజీఎంకు విజ్ఞప్తి చేస్తున్న కృష్ణా గ్రామస్తులు (ఫైల్) అయినా అధికారుల్లో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఈ విషయంపై రైల్వే స్టేషన్ ముందు అఖిల పక్షాల మద్దతుతో రిలే నిరాహార దీక్షలు చేపడుతామని అంటున్నారు. ఈ ప్రాంత నుంచి ప్రతి నిత్యం వందలాది మంది ప్రయాణికులు ముంబాయి, చెన్నై, బెంగుళూర్ ప్రాంతాలకు వెళ్తుంటారు. వారు ప్రస్తుతం ఇక్కడ రైళ్లను నిలపకపోవడంతో రాయచూర్ స్టేషన్‌కు వెళ్లాల్సి వస్తుంది. దీని మూలంగా కృష్ణాలోని చిన్న చిన్న వ్యాపారాలు, ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారు. ఈ విషయంపై రైల్వే అధికారులు మరోమారు ఆలోచించి తమకు న్యాయం చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. రిలే నిరాహార దీక్ష చేపడతాం.. స్టేషన్లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలపాలని అప్పటి కేంద్ర రైల్వే మంత్రిని ఒప్పించాం. అప్పటి నుంచి కృష్ణానదికి వచ్చే భక్తులకు చాల ఉపయోగకరంగా మారింది. అదే సమయంలో జిల్లాలోని అన్ని గ్రామాల ప్రజలకు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఉపయోగకరంగా ఉండేది. కరోనా కారణంగా రద్దు చేసిన రైళ్లను పునరుద్దరించినా ఈ స్టేషన్లో వాటిని నిలపడం లేదు. దీని మూలంగా ప్రయాణికులకు, భక్తులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించకపోతే రిలే నిరాహార దీక్షలు చేపడుతాం. – అమర్‌కుమార్ దీక్షిత్, పురోహితుడు. కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేస్తాం ఈ స్టేషన్లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలపాలని కోరుతూ త్వరలోనే అఖిల పక్షాల అధ్వర్యంలో కేంద్ర రైల్వే మంత్రిని, దక్షణ మధ్య రైల్వే ధ్యెంను కలిసి విజ్ఞప్తి చేస్తాం. అప్పటికి మా సమస్య పరిష్కారం కాకపోతే ప్రత్యక్ష ఆందోళనకు పూనుకుంటాం. – మహాదేవ్, కృష్ణా మాజీ సర్పంచ్ రాయచూర్‌కు వెళ్తున్నాం మా పిల్లలు ఉన్నత చదువుల నిమిత్తం బెంగుళూర్లో ఉంటున్నారు. మేము, మా పిల్లలు బెంగుళూర్‌కు వెళ్లాలంటే రాయచూర్ స్టేషన్‌కు వెళ్లాల్సి వస్తుంది. గతంలో కృష్ణాలోనే రైళ్లు నిలవడంతో ఇబ్బందులు ఉండేవి కాదు. ఇప్పుడు నిలపకపోవడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. – విశ్వనాథ్‌గౌడ, గుర్జాల్ -
కొత్త నంబర్లతో ఎక్స్‌ప్రెస్ రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): విజయవాడ మీదుగా నడిచే పలు రైళ్లను నూతన నంబర్లతో నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. 08117 నంబరు గల హౌరా–మైసూర్ ఎక్స్‌ప్రెస్ 2022 జనవరి 7వ తేదీ నుంచి 08017 నంబరుతో నడుస్తుందని పేర్కొన్నారు. 08118 నంబరు గల మైసూర్–హౌరా రైలు జనవరి 9వ తేదీ నుంచి 08018 నంబరుతో నడుస్తుందని తెలిపారు. 08645 నంబరు గల షాలిమార్–హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ జనవరి 2వ తేదీ నుంచి 08045 నంబరుతో నడుస్తుందని పేర్కొన్నారు. 08646 నంబరు గల హైదరాబాద్–షాలిమార్ రైలు జనవరి 4వ తేదీ నుంచి 08046 నంబరుతో నడుస్తుందని వివరించారు. -
మళ్లీ ఎక్స్‌ప్రెస్‌ల పరుగులు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ రెండో వేవ్‌లో ప్రయాణికుల రద్దీ లేక నిలిచిపోయిన ఎక్స్‌ప్రెస్ రైళ్లు మళ్లీ పట్టాలెక్కుతున్నాయి. గత ఏడాది కోవిడ్ మొదలైన తర్వాత లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా కొంతకాలం అన్ని రైళ్లను నిలిపేసిన విషయం తెలిసిందే. మొదట్లో సరుకు రవాణా రైళ్లను మాత్రమే నడిపారు. అన్‌లాక్ మొదలయ్యాక స్పెషల్ సర్వీసులుగా కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించి.. ఏప్రిల్ ఒకటి నాటికి 90 శాతం సర్వీసులు పట్టాలెక్కించారు. కానీ రెండో వేవ్‌తో రైళ్లకు మళ్లీ బ్రేకులు పడ్డాయి. రైళ్లకు లాక్డౌన్ నిబంధనలను అమలు చేయకున్నా.. ప్రజలే భయాందోళనతో ప్రయాణాలను తగ్గించేశారు. ఓ దశలో ఆక్యుపెన్సీ రేషియో 20 శాతం కంటే తక్కువకు పడిపోవడంతో.. రైల్వేబోర్డు క్రమంగా రైళ్లను తగ్గిస్తూ వచ్చింది. జూన్ మొదటివారం నాటికి నామమాత్ర సంఖ్యలో రైళ్లు నడిచాయి. ప్రస్తుతం కోవిడ్ కేసులు తగ్గడం, టీకాలు వేయించుకోవటంతో రైళ్ల ఆక్యుపెన్సీ పెరగటం మొదలైంది. దీంతో వారం రోజులుగా రైళ్ల సంఖ్య పెంచుతూ వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నిత్యం తిరిగే అన్ని ప్రధాన రైళ్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. గురువారం నాటికి మొత్తం 126 ఎక్స్‌ప్రెస్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఇందులో దక్షిణ మధ్య రైల్వేకు సంబంధించినవి 87 కాగా, మిగతావి ఇతర జోన్ల నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించేవి. ప్రస్తుతం రైళ్లలో ఆక్యుపెన్సీ రేషియో 50 శాతానికి చేరుకుందని.. ఈ నెలాఖరు నాటికి 80 శాతానికి చేరుతుందని అధికారులు భావిస్తున్నారు. జూలైలో ప్యాసింజర్, ఎంఎంటీఎస్ సేవలు! గతేడాది మార్చిలో లాక్డౌన్ ప్రారంభమైనప్పుడు నిలిచిపోయిన ఎంఎంటీఎస్, ప్యాసింజర్ రైలు సేవలు ఇప్పటివరకు మొదలుకాలేదు. ఇంత సుదీర్ఘకాలం అవి నిలిచిపోవటం రైల్వే చరిత్రలోనే తొలిసారి. ప్రయాణికుల సంఖ్యను నియంత్రించే అవకాశం లేకపోవటం, కోవిడ్ నిబంధనల అమలు సాధ్యం కాదన్న ఉద్దేశంతో ప్యాసింజర్, ఎంఎంటీఎస్ రైళ్లను పునరుద్ధరించలేదు. రెండో దశ తగ్గుముఖం పడుతున్నందున జూలైలో వాటిని తిరిగి ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఎంఎంటీఎస్ సేవలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వినతి ఏదీ రాలేదని రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
ఏప్రిల్ 1 నుంచి 12 కొత్త రైళ్లు
సాక్షి, విజయవాడ: కరోనా సమయంలో రద్దయిన రైళ్లను ఒకొక్కటిగా పునరుద్ధరిస్తున్నారు. ఇప్పటికే విజయవాడ మీదుగా రోజూ 110 రైళ్లు తిరుగుతు న్నాయి. ఏప్రిల్ 1 నుంచి మరో 12 రైళ్లను పునరుద్ధ రించనున్నారు. విజయవాడ–సాయినగర్ షిర్డి– విజయవాడ (07207/07208) మధ్య రెండు రైళ్లు, అలాగే విజయవాడ–సికింద్రాబాద్–విజయవాడ (02799/02800), విశాఖపట్నం–సికింద్రాబాద్–విశాఖపట్నం (02739/02740), గుంటూరు –విశాఖపట్నం–గుంటూరు (07239/0740), గూడూరు –విజయవాడ–గూడూరు (02734/02644), నర్సాపూర్–ధర్మవరం–నర్సాపూర్ (07247/ 07248) మార్గాల్లో రెండేసి రైళ్ల చొప్పున ఏప్రిల్ 1 నుంచి పునరుద్ధరిస్తున్నారు. షిర్డి, సికింద్రాబాద్, విశాఖపట్నం, ధర్మవరం, గూడూరులకు విజయవాడ మీదగా రైళ్లు రానున్నాయి. వీటిని ప్రత్యేక రైళ్లుగానే నడుపుతున్నారు. రెగ్యులర్ రైళ్ల కోసం ఎదురుచూపులు గతంలో 250 రైళ్లు విజయవాడ జంక్షన్ మీదగా ప్రతి రోజూ నడిచేవి. ప్రస్తుతం నడుస్తున్న 110 రైళ్లకు అడ్వాన్సు బుకింగ్ ఇస్తున్నారు. ఈ బుకింగ్‌లు నెల రోజులు ముందుగానే అయిపోతున్నాయి. ఎక్స్‌ప్రెస్ రైళ్లను పునరుద్ధరిస్తున్నారే కానీ ప్యాసింజర్ రైళ్లను మాత్రం పునరుద్ధరించలేదు. రెగ్యులర్ రైళ్లు ఎప్పుడు వస్తాయా అని ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు. -
ఆ పాసింజర్లు ఇక ఎక్స్‌ప్రెస్‌లు!
సాక్షి, అమరావతి:ఇన్నాళ్లూ పాసింజర్లుగా నడుస్తున్న పలు రైళ్లు ఎక్స్‌ప్రెస్‌లుగా మారబోతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ, గుంటూరు డివిజన్లలో దాదాపు 20 వరకు పాసింజర్లు ఇలా ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా అప్‌గ్రేడ్ కానున్నాయి. దేశంలోని వివిధ జోన్ల పరిధిలో నడుస్తున్న పాసింజర్ రైళ్లను ఎక్స్‌ప్రెస్/మెయిల్‌లుగా మార్పు చేస్తూ తాజాగా రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. రైల్వే బోర్డు వాటి వివరాలను వెల్లడించింది. పాసింజర్ రైళ్లు గమ్యాన్ని చేరడంలో ఆలస్యమవుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎక్స్‌ప్రెస్‌లుగా అప్‌గ్రేడ్ చేయాల్సిన పాసింజర్ రైళ్ల వివరాలను ఆయా రైల్వే జోనల్ కార్యాలయాల నుంచి రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు/సిఫార్సులు వెళ్లాయి. వాటిని అనుసరించి పలు పాసింజర్ రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మార్పు చేసింది. అమలు ఎప్పటినుంచంటే.. అయితే ఈ రైళ్లు ఎప్పట్నుంచి ఎక్స్‌ప్రెస్‌లుగా రూపాంతరం చెందుతాయన్నది రైల్వే బోర్డు ఇంకా స్పష్టం చేయలేదు. ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో కొన్ని స్పెషల్ రైళ్లను మాత్రమే నడుపుతున్నారు. తిరిగి పూర్తి స్థాయిలో రెగ్యులర్ రైళ్లను నడపడం ప్రారంభించాక అప్‌గ్రేడ్ చేసిన రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా నడపుతారని తెలుస్తోంది. వేగంగా గమ్యానికి.. ఇవి ఎక్స్‌ప్రెస్‌లుగా మారితే ప్రయాణ వేగం మరింతగా పెరగనుంది. దీంతో గమ్యానికి చేరుకునే సమయం బాగా తగ్గుతుంది. ప్రయాణం కలిసొస్తుంది. కాగా ప్రస్తుతం ఆగుతున్న పాసింజర్ హాల్టుల్లో ఇకపై ఈ ఎక్స్‌ప్రెస్‌లు ఆగవన్నమాట! అయితే కొత్తగా ఎక్స్‌ప్రెస్‌లుగా మారిన రైళ్లకు పాసింజర్ హాల్టులున్న కొన్ని ముఖ్య స్టేషన్లలో హాల్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఎక్స్‌ప్రెస్‌లుగా మారగా మిగిలిన పాసింజర్ రైళ్లు మాత్రం నిర్ణీత స్టేషన్లలో యథావిధిగా ఆగుతాయి. కొత్తగా ఎక్స్‌ప్రెస్‌లుగా మారాక ఈ రైళ్లలో స్లీపర్ క్లాస్ బోగీలు, మరికొన్ని రైళ్లలో థర్డ్ ఏసీ కోచ్‌లను కూడా ఏర్పాటుతో పాటు రిజర్వేషన్ సదుపాయం కూడా ఉండే వీలుంది. ఎక్స్‌ప్రెస్‌లుగా మారనున్న పాసింజర్ రైళ్లు ఇవే.. -
శివారుల వరకు కీలక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే తగు ప్రణాళికలను రూపొందిస్తోంది. దీనిలో భాగంగా దూరప్రాంతాలకు నడిచే పలు రైళ్ల సేవలను శివారుల నుంచి నడపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నగరంలో అధిక సంఖ్యలో నివసించే వివిధ ప్రాంతాల ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా పలు రైళ్లను లింగంపల్లి వరకు పొడిగించింది. దీంతోపాటు ఉత్తరాదికి వెళ్లే కొన్ని రైళ్లనూ హిస్సార్, శ్రీగంగానగర్ వరకు విస్తరించింది. త్వరలోనే మరిన్ని రైళ్లను శివారు ప్రాంతాల నుంచి నడిపే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎందుకు పొడిగించారు? నిత్యం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి 75 ఎంఎంటీఎస్, 90 సబర్బన్, ఇతర ప్రాంతాలకు వెళ్లే వాటితో కలిపి మొత్తం 215 రైళ్లు ప్రయాణం సాగిస్తాయి. దాదాపు 1,80,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. హైదరాబాద్ మహానగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. నగరంలో వలసలు పెరుగుతున్న దరిమిలా.. ట్రాఫిక్ సమస్యలూ రెట్టింపవుతున్నాయి. ఈ భారం రైల్వేపైనా పడుతోంది. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కొంతకాలంగా ట్రాఫిక్ ఇబ్బందులు పెరిగిపోవడంతో ఉన్న 10ప్లాట్‌ఫారాలు ఇరుగ్గా మారాయి. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌పై భారం తగ్గించేందుకు శివారు ప్రాంతాల్లో ఉన్న రైల్వేస్టేషన్ల అభివృద్ధిపై దక్షిణ మధ్య రైల్వే దృష్టి సారించింది. దీనిలో భాగంగా లింగంపల్లి స్టేషన్‌ను అభివృద్ధి చేసింది. ఇక్కడ నుంచే రైళ్లను నడపడం ద్వారా ప్రజలకు సికింద్రాబాద్ దాకా రావాల్సిన ఇబ్బంది తప్పుతుంది. పలు రైళ్ల వేగం పెంపు.. పట్టాల సామర్థ్యం పెంచడం, నిర్వహణ పనులు ఆధునీకరించడంతో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేగం పెరిగింది. ఫలితంగా ప్రయాణికులు గమ్యస్థానాలకు ముందుగానే చేరుకునే వీలుచిక్కింది. ఏటా వివిధ మార్గాల్లో జరిగే అభివృద్ధి పనులు, ట్రాక్ నాణ్యతా మెరుగు ఆధారంగా ద.మ.రైల్వే తన టైంటేబుల్‌ను మారుస్తుంటుంది. ఈసారి మారిన టైంటేబుల్ వల్ల వేలాది ప్రయాణికులకు సమయం కలిసి రావడం గమనార్హం. వివిధ రైళ్లు ముందస్తుగా చేరుకునే సమయం ఇదే.. 1. ఎన్సీజే ముంబై ఎక్స్‌ప్రెస్– నాగర్ కోయిల్ – ఛత్రపతి శివాజీ టెర్మినల్ (75 నిమిషాలు) 2. చెన్నై సెంట్రల్ – అహ్మదాబాద్ (25 ని.మి) 3. చెన్నై సెంట్రల్ – అహ్మదాబాద్ హమ్‌సఫర్ (25 ని.మి) 4. కాచిగూడ – నాగర్‌కోయిల్ జంక్షన్ (18 ని.మి) 5. ఛత్రపతి శివాజీ టెర్మినల్– నాగర్ కోయిల్ ఎక్స్‌ప్రెస్ (15 ని.మి) 6. మద్రాస్ – ఛత్రపతి శివాజీ టెర్మినల్ (10 ని.మి) 7 తిరుపతి – జమ్మూతావి (10 ని.మి) 8. ఆదిలాబాద్ – తిరుపతి కృష్ణా ఎక్స్‌ప్రెస్ (10 ని.మి) 9. చెంగల్పట్టు– కాకినాడ పోర్ట్ (8 ని.మి) 10. హైదరాబాద్ – జైపూర్ (5 ని.మి) -
ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలిపేదెప్పుడో!
సాక్షి, దేవరకద్ర రూరల్ : దేవరకద్ర రైల్వేస్టేషన్లో ఎక్స్‌ప్రెస్ రైలు ఆగకపోవడంతో ప్రయాణికులు ఇబ్బం దిపడుతున్నారు. ఇక్కడ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపాలని ప్రయాణికులు కొన్నేళ్లుగా రైల్వే అధికారులకు వినతిపత్రాలు ఇస్తున్నారు. అలాగే వివిధ సందర్భాలలో ఉన్నత స్థాయి అధికారులు ఇక్కడికి వచ్చినప్పుడు విన్నవిస్తున్నా వారు పట్టించుకోకపోవడంపై ప్రయాణికులు, స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఈ స్టేషన్ నుంచి ఇటు హైదరాబాద్ వైపు, అటు కర్నూల్ వైపు దాదాపు 25కు పైగా ఎక్స్‌ప్రెస్ రైళ్లు వెళ్తుంటాయి. కానీ ఏ ఒక్కటీ రైల్వేస్టేషన్లో నిలుపడం లేదు. 40గ్రామాలకు కూడలి దేవరకద్రలో వ్యవసాయ మార్కెట్‌యార్డుతో పాటు మూడు మండలాలు 40కి పైగా గ్రామాలకు దేవరకద్ర కూడలిగా ఉంది. మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం, స్విట్స్ ఇంజనీరింగ్ కళాశాల దేవరకద్రకు 6కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. నియోజకవర్గ కేంద్రం కావడం వల్ల రద్దీ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపడం వల్ల రోజురోజుకూ దూరప్రాంతాలకు ప్రయాణికులు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ అవకాశం లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. మహబూబ్‌నగర్ వెళ్లి అక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ప్రతిరోజు దేవరకద్ర రైల్వేస్టేషన్ మీదుగా మూడు ప్యాసింజర్ రైళ్లు హైదరాబాద్ వైపు, మూడు ప్యాసింజర్ రైళ్లు కర్నూలు వైపు వెళ్తున్నాయి. ఇవి మాత్రమే ఇక్కడ ఆపుతున్నారు. రద్దీకి తగ్గట్టుగా రైల్వేస్టేషన్‌ను తీర్చిదిద్దినా, తమ అభిప్రాయాలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరిస్తామని ఎన్నికల సమయంలో నాయకులు, పాలకులు హామీలు ఇచ్చి తర్వాత పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఇప్పటికైనా పాలకులు, రైల్వే అధికారులు స్పందించాలని, దేవరకద్ర రైల్వేస్టేషన్లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపేలా కృషి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఇబ్బందిగా ఉంది ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపకపోవడంతో చాలా ఇబ్బందిగా ఉంది. కొన్నేళ్లుగా ఈ సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదు. దీనిగురించి చాలా సార్లు రైల్వే ఉన్నతాధికారులకు విన్నవించాం. అయినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే అవకాశం ఉంటేనే ఇక్కడి స్టేషన్ నుంచి ప్రయాణికుల రద్దీ రోజురోజుకూ పెరుగుతుందనే విషయం రైల్వే అధికారులు గుర్తించాలి. – కల్వ నరేశ్, దేవరకద్ర -
రైళ్లలో పెరగనున్న థర్డ్ ఏసీ బోగీలు
► ‘స్లీపర్’ సంఖ్య తగ్గించి వాటిని పెంచే యోచన ►మూడో తరగతి ఏసీకి డిమాండ్ పెరగడమే కారణం ►సొంత సర్వేతో ‘రైల్వే’ నిర్ణయం ►తొలుత తొమ్మిది ఎక్స్‌ప్రెస్ రైళ్లలో పెంచే అవకాశం సాక్షి, హైదరాబాద్: రైళ్లలో మూడో తరగతి ఏసీ బోగీల సంఖ్య పెరగబోతోంది. ప్రస్తుతం ముఖ్యమైన రైళ్లు మినహా మిగతావాటిల్లో మూడో తరగతి ఏసీ బోగీల సంఖ్య ఒకటి.. రెండుకు మించడం లేదు. కానీ కొంతకాలంగా ఏసీ మూడో తరగతి ప్రయాణికుల సంఖ్య పోటెత్తుతుండటంతో వాటి సంఖ్యను పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ మేరకు త్వరలో ప్రధాన రైళ్లలో వాటి సంఖ్యను పెంచబోతున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలుత తొమ్మిది ఎక్స్‌ప్రెస్ రైళ్లలో వీటి సంఖ్యను పెంచే అవకాశం ఉంది. డిమాండ్ ఆధారంగా ఇటీవలే దక్షిణ మధ్య రైల్వే అధికారులు రైల్వే బోర్డుకు ఈ తొమ్మిది రైళ్ల పేర్లను పంపించారు. ఆదాయం పెరగటంతో .... గతంలో ఏసీ క్లాస్ ప్రయాణం అంటే కేవలం డబ్బున్నవారికి సంబంధించిందనే అభిప్రాయం ఉండేది. కానీ ప్రస్తుతం ప్రజల్లో మార్పు వచ్చింది. చాలామంది మూడో తరగతి ఏసీ బోగీల్లో ప్రయాణానికి ఆసక్తి చూపుతున్నారు. వారి ఆదాయాల్లో పెరుగుదలే దీనికి కారణమని ఇటీవల రైల్వే శాఖ నిర్వహించిన సర్వేలో స్పష్టమైంది. దీంతో గతంలో ఎన్నడూ లేనట్టుగా థర్డ్ ఏసీ బోగీల్లో వెయిటింగ్ లిస్టు బాగా పెరిగిపోయింది. వాటి సంఖ్యను రెట్టింపు చేసినా సరిపోయే సంఖ్యలో టికెట్ల కొనుగోలు ఉంటోందని రైల్వే గుర్తించింది. 2016 ఏప్రిల్ నుంచి 2017 మార్చి మధ్య కాలంలో చోటుచేసుకున్న మార్పులను రైల్వే శాఖ విశ్లేషించింది. ఏడాది క్రితం మొత్తం ప్రయాణికుల్లో స్లీపర్ తరగతి ప్రయాణికుల వాటా 61 శాతంగా ఉండగా అది ఈ సంవత్సరం మార్చిలో 59 శాతానికి పడిపోయిందని, ఆ శ్రేణిలో టికెట్ ఆదాయం 46 శాతం నుంచి 44 శాతానికి పడిపోయిందని గుర్తించింది. అదే మూడో తరగతి ఏసీ ప్రయాణికుల వాటా 32 శాతం నుంచి 34 శాతానికి, టికెట్ ఆదాయం 16 శాతం నుంచి 17 శాతానికి పెరిగినట్టు గుర్తించింది. దీంతో మూడో తరగతి ఏసీ బోగీలపై ఒత్తిడి పెరుగుతున్నందున వాటి సంఖ్య పెంచాలని నిర్ణయించింది. అదనంగా బోగీల సంఖ్య పెంచటానికి అవకాశం లేనందున స్లీపర్ బోగీల సంఖ్యను తగ్గించి వాటి స్థానంలో మూడో తరగతి ఏసీ బోగీల సంఖ్యను పెంచాలని భావిస్తోంది. ఈ సంఖ్య ఆయా రైళ్ల డిమాండ్ ఆధారంగా 4 నుంచి 6 వరకు ఉంటుందని సమాచారం. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఏపీ, తెలంగాణ, దక్షిణ్, గోదావరి, గౌతమి, చెన్నై, ఢిల్లీ ఏపీ సంపర్క్‌క్రాంతి, నారాయణాద్రి, వెంకటాద్రి రైళ్లలో తొలుత వీటి సంఖ్య పెంచుతారని సమాచారం. ఆ తర్వాత మిగతావాటికి విస్తరిస్తారు. సౌకర్యంగా ఉండడంతో పెరిగిన ఆసక్తి ఏసీలో ప్రయాణం హాయిగా ఉండటంతోపాటు, బయటి శబ్దాలు లేకుండా రాత్రి వేళ నిద్రకు ఇబ్బంది ఉండకపోవటంతో ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఫస్ట్, సెకండ్ క్లాస్‌తో పోలిస్తే థర్డ్ ఏసీ టికెట్ ధర బాగా తక్కువగా ఉండటంతో దాన్ని భరించే వారి సంఖ్య కూడా బాగా పెరిగింది. మరోవైపు ఈ నిర్ణయం వల్ల రైల్వే ఆదాయం కూడా పెరుగుతుందని అంటున్నారు.. త్వరలోనే ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని రైల్వే భావిస్తోంది. -
ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేళలు మార్పు
గుంతకల్లు : గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని వాడి–గుంతకల్లు సెక్షన్లో మట్మర్రి–మంత్రాలయం స్టేషన్ల మధ్య డబుల్‌లైన్ పనుల దృష్ట్యా ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేళలు మార్పు చేయడంతో పాటు కొన్ని ప్యాసింజర్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ (డీసీఎం) సీహెచ్ రాకేష్ వెల్లడించారు. ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు ఈ పనులు చేస్తున్నామన్నారు. ఈ పనుల దృష్ట్యా కోయంబత్తూరు–లోకమాన్యతిలక్ (నంబర్ 11014) ఎక్స్‌ప్రెస్ రైలు కోయంబత్తూరులో ఉదయం 8.50 గంటలకు బదులు మధ్యాహ్నం 12.20 గంటలకు బయలుదేరుతుందని తెలిపారు. అలాగే మైసూర్–బాగల్‌కోట (17307) ఎక్స్‌ప్రెస్ రైలు మైసూర్లో మధ్యాహ్నం 1.30 గంటలకు బదులు సాయంత్రం 4.15 గంటలకు, యశ్వంతపూర్–బీదర్ (16571) రైలు యశ్వంతపూర్‌లో సాయంత్రం ఏడు గంటలకు బదులు రాత్రి 9.25 గంటలకు, బెంగళూరుసిటీ–న్యూఢిల్లీ (12627) మధ్య తిరిగే కర్ణాటక ఎక్స్‌ప్రెస్ బెంగళూరు సిటీ స్టేషన్లో రాత్రి 7.20 బదులు రాత్రి 9.45 గంటలకు, యశ్వంతపూర్–షోలాపూర్ (22134) ఎక్స్‌ప్రెస్ యశ్వంత్‌పూర్‌లో రాత్రి 8.50 బదులు అర్ధరాత్రి 12.10 గంటలకు, బెంగళూరు–నాందేడ్ (16594) రైలు బెంగళూరులో రాత్రి 10.45 గంటలకు బదులు అర్ధరాత్రి 1.20 గంటలకు బయలుదేరతాయని వెల్లడించారు. అలాగే గుల్బర్గా–గుంతకల్లు (నం–57631/32) మధ్య నడిచే ప్యాసింజర్ రైలు గుల్బర్గా నుంచి రాయచూర్ వరకు మాత్రమే నడుస్తుందన్నారు. గుంతకల్లు–రాయచూర్ (నం–57427/28) ప్యాసింజర్ గుంతకల్లు నుంచి ఆదోని వరకు మాత్రమే ప్రయాణిస్తుందన్నారు. ఈ మార్పులు మూడు రోజులపాటు ఉంటాయని, ప్రయాణికులు గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
పుదుచ్చేరి–సంత్రగచ్చి (కోల్‌కతా) మధ్య 26 ప్రత్యేక రైళ్లు
సాక్షి, అమరావతి: ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పుదుచ్చేరి –సంత్రగచ్చి (కోల్‌కతా) మధ్య 26 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. పుదుచ్చేరి–సంత్రగచ్చి (06010) ప్రత్యేక రైలు ఏప్రిల్ 1, 8, 15, 22, 29, మే 6, 13, 20, 27, జూన్ 3, 10, 17, 24 తేదీల్లో నడుస్తుంది. సంత్రగచ్చి–పుదుచ్చేరి (06009) రైలు ఏప్రిల్ 3, 10, 17, 24, మే 1, 8, 15, 22, 29, జూన్ 5, 12, 19, 26 తేదీల్లో నడుపుతారు. 16 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు: వెయిటింగ్ లిస్ట్ ప్రయా ణీకుల సౌకర్యార్ధం మార్చి 5 నుంచి జూన్ 1 వరకు 22 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. గుంటూరు– వికారాబాద్ (పల్నాడు), విజయవాడ–సికింద్రాబాద్ (శాతవాహన), విజయ వాడ–చెన్నై (పినాకిని), విజయవాడ–విశాఖపట్టణం (రత్నా చల్), సికింద్రా బాద్ – గుంటూరు (ఇంటర్ సిటీ), సికింద్రాబాద్ –కర్నూల్ టౌన్ (తుంగ భద్ర), సికింద్రాబాద్–విజయవాడ (ఇంటర్ సిటీ), తిరుపతి–ఆదిలాబాద్ (కృష్ణా) రెండు వైపులా నడిచే రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేస్తారు. -
ఎక్స్‌ప్రెస్ రైళ్లకు తాత్కాలికంగా అదనపు బోగీలు
సాక్షి, అమరావతి: వెయిటింగ్ జాబితాలో ఉన్న ప్రయాణికుల కోసం 14 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఈ నెలాఖరు వరకు అదనపు బోగీలు ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నాందేడ్–ముంబయి సీఎస్టీ తపోవన్ ఎక్స్‌ప్రెస్, ముంబయి సీఎస్టీ–నాందేడ్ ఎక్స్‌ప్రెస్, గుంటూరు–వికారాబాద్, వికారాబాద్–గుంటూరు, హైదరాబాద్–నర్సాపూర్, నర్సాపూర్–హైదరాబాద్, హైదరాబాద్–త్రివేండ్రం శబరి ఎక్స్‌ప్రెస్, త్రివేండ్రం–హైదరాబాద్ శబరి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–విజయవాడ ఇంటర్ సిటీ, విజయవాడ–సికింద్రాబాద్ ఇంటర్ సిటీ, సికింద్రాబాద్–విశాఖపట్నం గరీబ్‌ర«థ్ ఎక్స్‌ప్రెస్‌లకు అదనపు ఏసీ బోగీలను ఏర్పాటు చేస్తున్నట్లు సీపీఆర్వో ఉమాశంకర్ తెలిపారు. -
నరకం.. ఆ రైళ్లలో ప్రయాణం!
♦ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఐదు ఎక్స్‌ప్రెస్‌లలో తీవ్ర సమస్యలు ♦ ప్రయాణంలో భారీ కుదుపులు.. బెర్తుల్లోంచి కిందపడుతున్న ప్రయాణికులు ♦ బోగీలు విడిపోకుండా ఏర్పాటు చేసిన సీబీపీ కప్లర్లతో తలెత్తిన సమస్య సాక్షి, హైదరాబాద్: అది హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న తెలంగాణ ఎక్స్‌ప్రెస్.. అర్ధరాత్రి.. రైల్లో అంతా గాఢనిద్రలో ఉన్నారు. ఇంతలో భారీ కుదుపు.. బెర్తుల్లోంచి కొందరు కిందపడిపోగా, పక్క బెర్తుల్లో పడుకున్న వారి తలలు బోగీ గోడలకు బలంగా గుద్దుకు న్నాయి.. అప్పర్ బెర్తుల్లోని లగేజీ కిందపడి పోయింది. అందరూ గాఢ నిద్రలో ఉండ టంతో బోగీలు పట్టాలు తప్పాయేమో అని భయాందోళనకు గురయ్యారు. తర్వాత అది సాంకేతిక పరమైన సమస్యతో ఏర్పడ్డ కుదుపు అని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకు న్నారు. బోగీ–బోగీని కలిపి ఉంచే కప్లింగుల్లో చేసిన మార్పు ఇప్పుడు ప్రయాణికులకు నరకాన్ని చూపుతోంది. గతంలో ఉన్న సంప్ర దాయ స్క్రూ కప్లర్ల స్థానంలో కొత్తగా సెంటర్ బఫర్ కప్లర్ల (సీబీపీ)ను ఏర్పాటు చేయటంతో కొత్త సమస్యలు ఏర్పడ్డాయి. పాత కప్లర్లకు కుషన్ విధానం ఉండేది. ఇంజిన్ వేగం పెరిగి నా, బ్రేకు వేసినా బోగీబోగీ మధ్య ఘర్షణ ఏర్పడ్డప్పుడు కప్లర్లకు ఉన్న కుషన్ వల్ల కుదుపు ఏర్పడేది కాదు. కానీ కొత్తగా ఏర్పా టు చేసిన కప్లర్లలో కుషన్ విధానం లేక రెండు బోగీల కప్లర్లు వేగంగా గుద్దుకుని బోగీల్లో భారీ కుదుపులు ఏర్పడుతున్నాయి. రైలు భారీ వేగంలో ఉన్న సమయంలో కుదుపులు ఏర్పడితే బెర్తుల్లోంచి కిందపడిపోయేంతగా ఉంటున్నాయి. బెర్తుల్లో పడుకు ని ఉన్నవారు కిందపడిపోవటం, తలలు బోగీ పార్టీషన్ గోడకు ఢీకొని గాయపడటం వంటివి జరుగు తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ రైళ్లలోనే ఇబ్బందులు... దక్షిణ మధ్య రైల్వేలో హైదరాబాద్–ఢిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–కాకినాడ టౌన్ గౌతమి ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్– విశాఖపట్నం గోదావరి ఎక్స్‌ప్రెస్, హైదరా బాద్–కోల్‌కతా షాలీమార్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–చెన్నై చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లకు ఈ సీబీపీ కప్లర్లు అమర్చారు. కానీ, వీటివల్ల కుదుపులతో ప్రయాణికులు గాయపడుతు న్నారు. వారి నుంచి ఫిర్యాదులు అధికంగా వస్తుండటంతో కొత్త కప్లర్లను మార్చాలని రైల్వే నిర్ణయించింది. కానీ ఉన్న వాటిని మా త్రం తొలగించలేదు. తాజాగా తెలంగాణ, గౌతమి, గోదావరి తదితర ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు పెరిగాయి. దీంతో అధికారులు విషయాన్ని రైల్వే బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. ఎందుకీ పరిస్థితి.. పాత కప్లర్లలో భద్రత పరమైన లోపాలున్నాయని గుర్తించిన రైల్వే.. కొత్త సీబీపీ కప్లర్లను తయారు చేయిస్తోంది. రైల్వేనే సొంతంగా వాటిని సిద్ధం చేసుకుం టోంది. గతంలో వేగంగా వెళ్తున్న కొన్ని రైళ్ల బోగీలు విడిపోయి ప్రమాదాలు జరగడానికి కప్లర్ల డిజైన్ లోపమే కారణమని గుర్తించిన రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. దూరప్రాంతాల మధ్య తిరిగే ఎక్కువ బోగీలుండే రైళ్లు, వేగంగా వెళ్లే రైళ్లకు తొలుత వీటిని ఏర్పాటు చేస్తున్నారు. 21, అంతకంటే ఎక్కువ బోగీ లున్న రైళ్లలో బోగీలు విడిపోయే ప్రమాదం ఉందని, వాటికి యుద్ధప్రాతిపదికన కొత్త కప్లర్లను అమరుస్తున్నారు. -
ఆగని ఎక్స్‌ప్రెస్ రైళ్లు
ప్యాసెంజర్ రైల్లు ప్రయాణికులతో ఫుల్ – అవస్థలు పడుతున్న ప్రయాణికులు – రైల్వేస్టేషన్‌ను ఉన్నా ఫలితం లేదంటున్న జనం ముదిగుబ్బ : ముదిగుబ్బ మండల కేంద్రంలో రైల్వేస్టేషన్ ఉంది.. కానీ రైలు ఎక్కలేని పరిస్థితి. నియోజకవర్గంలో ముదిగుబ్బ అతిపెద్ద మండలం. దాదాపుగా 60వేల జనాభా ఉంది. ముదిగుబ్బ రైల్వేస్టేషన్ నుంచి ప్రయాణించడానికి నియోజకవర్గంలోని బత్తలపల్లి, తాడిమర్రి మండలాల నుండే కాక పొరుగు జిల్లా అయిన వైఎస్సార్ జిల్లాలోని పలు మండలాలు, జిల్లాలోని బుక్కపట్నం మండలంలోని శివారు ప్రాంత గ్రామాల నుంచి ప్రయాణించడానికి వస్తుంటారు. అయితే ముదిగుబ్బ రైల్వేస్టేషన్ మీదుగా రోజుకు రెండు ప్యాసింజర్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. వందలాది మంది ప్రయాణికులు ముదిగుబ్బ రైల్వేస్టేషన్లో వేచి ఉంటున్నారు. తీరా రైలు రావడమే ప్రయాణికులతో రద్దీగా వస్తుండటంతో నిలబడటానికి చోటు లేకుండాపోతోంది. గుంతకల్ ప్యాసెంజర్ రైలుకు కేవలం 9 బోగీలు మాత్రమే ఉండగా వాటిలో రెండు బోగీలు రిజర్వేషన్ సౌకర్యం ఉంటాయి. అవి గుంతకల్ అనంతపురం, ధర్మవరం స్టేషన్లకు రాగానే ప్రయాణికులతో బోగీలన్నీ నిండిపోతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎంత వరకు ప్రయాణిస్తే అంత వరకు ప్రయాణికులు నిలబడే ప్రయాణించాల్సి వస్తోంది. మరికొంత మంది రైలు డోర్ వద్ద వేలాడుతూ వెళ్లాల్సిన పరిస్థితి. ప్యాసింజర్ రైళ్ల పరిస్థితి ఇలా ఉంటే వారానికి 4ఎక్స్‌ప్రెస్ రైళ్లు ముదిగుబ్బ మీదుగా వెళ్తుంటాయి. అయితే రైల్వేస్టేషన్లో స్టాపింగ్ పాయింట్ లేక పోవడంతో ప్రయాణికులకు ఏమాత్రం ఉపయోగం లేకుండా ఉంది. కనీసం ఎక్స్‌ప్రెస్ రైళ్లు పద్మావతి, సెవెన్‌హిల్స్, అమరావతి రైళ్లనైనా ముదిగుబ్బలో నిలబడేలా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు. సర్కస్ ఫీట్లు తప్పడం లేదు గుంతకల్ ప్యాసింజర్ రైలు ముదిగుబ్బ చేరుకునే సరికి బోగీలన్నీ పూర్తిగా నిండిపోతున్నాయి. 5 బోగీలు మాత్రమే సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండటంతో రైలులో వెళ్లాలంటే సర్కస్‌ఫీట్లు చేయక తప్పలేదు. – వెంకటనాయుడు, ముదిగుబ్బ బోగీల సంఖ్యను పెంచాలి గుంతకల్ ప్యాసెంజర్ రైలులో బోగీల సంఖ్య తక్కువగా ఉండటంతో ముదిగుబ్బ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు పిల్లలతో వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అధికారులు స్పందించి బోగీల సంఖ్యను పెంచి ప్యాసింజర్ రైళ్లను ఆపేలా చర్యలు తీసుకోవాలి. – శివానంద, పొడ్రాళ్లపల్లి -
యువర్ అటెన్షన్ ప్లీజ్..!
ఎక్స్‌ప్రెస్ రైళ్లు కోసం ఎదురుచూపు ‘లూజ్‌టైమ్’ ఉన్నా ఆపని వైనం ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపాలని వినతి కోహీర్: దేశంలో చాలా తక్కువ ఖర్చుతో ప్రయాణించే అవకాశం ఉన్న ఏకైనా రవాణా వ్యవస్థ రైల్వే శాఖ మాత్రమే. దేశ జనాభాలో ఎక్కువ శాతం దూరప్రయాణాలు చేసేది కూడా రైలులోనే. భద్రతతోపాటు అలసట చెందకుండా గమ్యస్థానాలకు చేరుకోవడం ఒక్క రైలులోనే సాధ్యం. అయితే కొన్ని స్టేషన్లలో ఎక్స్‌ప్రెస్‌రైళ్లు ఆపకపోవడంతో ప్రజలు నిరాశ చెందుతున్నారు. తమకు కూడా రైల్వే సేవలను అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. అటువంటి రైల్వేస్టేషన్లలో ఒకటి కోహీర్ దక్కన్. కోహీర్ రైల్వేస్టేషన్ అతిపురాతనమైన రైల్వేస్టేషన్. రైల్వేస్టేషన్‌ను దేశానికి స్వాతంత్య్రం రాక ముందు నిర్మించారు. అప్పట్లో కేవలం రోజుకు రెండు ప్యాసింజర్ రైళ్లు మాత్రమే నడిచేవి. కోహీర్ ప్రాంతంలో భూగర్భ జలాల్లో లవణాలు, క్యాల్షియం శాతం తక్కువగా ఉండడంతో రైలుకు అవసరమైన నీటిని ఇక్కడే తీసుకునేవారు. దాని కోసం స్టేషన్లో అరగంటపాటు రైలును నిలిపేవారు. అయితే సాంకేతిక పరిజ్ఞానం వృద్ధితో బొగ్గుతో నడిచే స్టీమ్ ఇంజన్లకు బదులుగా, డిజిల్ ఇంజన్లను ప్రవేశపెట్టారు. దీంతో నీటితో అవసరం లేకుండా పోయింది. కోహీర్ రైల్వేస్టేషన్లో రైలు ఆగే సమయాన్ని పూర్తిగా తగ్గించి వేశారు. ప్రస్తుతం నాలుగు ప్యాసింజర్ రైళ్లతో పాటు 14 ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. అయితే నాలుగు ప్యాసింజర్ రైళ్లు, ఇంటర్ సీటీ ఎక్స్‌ప్రెస్ మినహా మిగతా ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగడం లేదు. ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగకపోవడంతో 65 వేల జనాభా ఉన్న కోహీర్ మండల ప్రజలు ఎక్స్ ప్రెస్ సేవలు పొందలేకపోతున్నారు. దూరప్రాంతాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న జహీరాబాద్ లేదా 40 కిలోమీటర్ల దూరం ఉన్న వికారాబాద్‌కు వెళ్లాల్సి వస్తుంది. కర్ణాటక సరిహద్దులో ఉన్న కోహీర్ మండల ప్రజలకు ఆ రాష్ట్రంలోని బీదర్, గుల్బర్గా, హుమ్నాబాద్ తదితర ప్రాంతాల ప్రజలతో సంబంధ భాందవ్యాలు ఉన్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తోపాటు వ్యవసాయ మార్కెట్ కేంద్రాలైన మర్పల్లి, వికారాబాద్‌కు రైతులు, ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. పుణ్యక్షేత్రాలైన షిర్డీ, తిరుపతికి ఎక్కువగా వెళుతుంటారు. అయితే కాకినాడ-షిర్డీ, విజయవాడ-షిర్డీ, సికింద్రాబాద్-షిర్డీ, నాందేడ్-బెంగుళూరు, యశ్వంత్‌పూర్-బీదర్, ఔరంగబాద్-రేణిగుంట రైళ్లు కోహీర్ రైల్వేస్టేషన్ గుండానే వెళ్లుతుంటాయి. ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ హాల్ట్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ గతంలో కోహీర్‌లో ఆగేదికాదు. కోహీర్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపాలని మండల ప్రజలు, నాయకులు చేపట్టిన ఆందోళన ఫలితంగా రెండేళ్ల క్రితం ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌కు కోహీర్‌లో నిలిపే అవకాశాన్ని కల్పించారు. ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్యను బట్టి మిగతా రైళ్లను ఆపే ప్రయత్నం చేస్తామని రైల్వే అధికారులు అప్పట్లో హామి ఇచ్చారు. ప్రయాణికుల సంఖ్య అధికారుల అంచనాలకు తగ్గట్టుగాఉన్నా కోహీర్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపడంలేదు. ఈ రూట్లో ప్రయాణిస్తున్న ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ‘లూజ్‌టైమ్’ ఉన్నప్పటికీ రైళ్లను ఆపకపోవడం విడ్డూరంగా ఉందని స్థానికులు మండిపడుతున్నారు. కోహీర్ రైల్లేస్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపడానికి కృషి చేయాలని ప్రజాప్రతినిధులను, రైల్వే అధికారులను కోరుతున్నారు. ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపక ఇబ్బందులు కోహీర్ రైల్వేస్టేషన్లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. దూర ప్రాంతాలకు వెళ్లాలంటే 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న జహీరాబాద్, 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న వికారాబాద్‌కు వెళ్లాల్సి వస్తోంది. ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు కోసం చేపట్టిన ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీ ఇంతవరకు అమలు చేయాలేదు. ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలి. - చందునాయక్, లాల్‌సింగ్‌తండా రైలు సౌకర్యాన్ని కోల్పోతున్నాము కోహీర్ రైల్వేస్టేషన్లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపకపోవడంతో హైదరాబాద్‌తోపాటు షర్డీ, తిరుపతి, హుమ్నాబాద్ వంటి పుణ్య క్షేత్రాలకు వెళ్లడానికి వీలు లేకుండా ఉంది. వ్యాపార కేంద్రాలైన మర్పల్లి, వికారాబాద్, బీదర్ ప్రాంతాలకు వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయలేక పోతున్నాం. స్థానికంగా సరైన మార్కెట్ సౌకర్యాలు అందుబాటులో లేక తీవ్రంగా నష్టపోతున్నాం. కోహీర్ రైల్వేస్టేషన్లో ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపాలి. - మొగులయ్య, రైతు నాగిరెడ్డిపల్లి. ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపడానికి అర్హత ఉంది కోహీర్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. ఇక్కడ ప్యాసింజరు రైళ్ల కంటే ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లో ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారు. ఇంటర్‌సిటీలో రోజుకు సరాసరి 80 మంది ప్రయాణిస్తారు. ప్రస్తుతం కోహీర్ రైల్వేస్టేషన్‌కు ఇంటర్ సిటీ ద్వారానే ఎక్కువ ఆదాయం లభిస్తోంది. ఇక్కడ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగితే మరింత ఆదాయం లభించే అవకాశం ఉంది. - అరుణ్‌కుమార్, స్టేషన్‌మాస్టర్ -
రైల్వే స్టేషన్లో తెగిన ఓవర్ హెడ్ వైర్
- థానేలో ఘటన.. పలు లోకల్ రైళ్లు రద్దు - తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులు - ఆలస్యంగా ముంబై చేరుకున్న పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు సాక్షి, ముంబై: థానేలో శుక్రవారం ఉదయం ఫ్లాట్ నెంబరు రెండు వద్ద ఓవర్‌హెడ్ వైర్ తెగిపోవడంతో కొన్ని లోకల్ రైళ్లు రద్దు కాగా, మరి కొన్ని దారి మళ్లించి నడిపినట్లు అధికారులు తెలిపారు. వైర్ తెగిపోవడంతో స్లో అప్, డౌన్ లోకల్ రైళ్లతోపాటు మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. ఉదయం 9.53 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది హుటాహుటిన ఓవర్‌హెడ్ వైరుకు మరమ్మతు పనులు ప్రారంభించారు. ఈ పనుల కోసం విద్యుత్ సరఫరా నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో థానే రైల్వేస్టేషన్‌లోని ఫ్లాట్‌ఫాం నెంబరు ఒకటి, రెండు, మూడు, నాలుగుపై లోకల్ రైళ్ల సేవలు ఆగిపోయాయి. అనంతరం స్లో లోకల్ రైళ్లన్నింటిని ఫాస్ట్ అప్, డౌన్ ట్రాక్‌లపై మళ్లించి నడిపించారు. సుమారు రెండు గంటల తర్వాత నాలుగో నెంబర్ ఫ్లాట్‌ఫాంపై ముంబై సీఎస్టీ వైపు స్లోలోకల్ రైళ్లను ప్రారంభించారు. మిగిలిన ఫ్లాట్‌ఫాంలపై చాలా సేపు లోకల్ రైళ్లు నడవలేదు. వీటన్నింటి కారణంగా దూరప్రాంతాల నుంచి వచ్చే మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యంగా ముంబైకి చేరుకున్నాయి. కల్వా-థానే మధ్య లోకల్ రైలు రద్దు కావడంతో అనేక మంది కాలిబాటన థానే వరకు నడుచుకుంటూ వెళ్లారు. రైలు నిలిపివేయడంపై ప్రయాణికులు తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా థానే రైల్వే పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగిన సమయంలో కోపోద్రిక్తులైన ప్రయాణికులు మోటర్‌మెన్, గార్డులపై దాడి జరిపిన సంఘటనలు అనేకం ఉన్నాయి. పాత ఘటనల దృష్ట్యా రైలు నడిపే మోటర్‌మెన్, గార్డుల వద్ద పోలీసులను భద్రత కోసం ఏర్పాటు చేశారు. కాగా, రైళ్లు ఆలస్యంగా నడవడంతోపాటు కొన్నింటిని రద్దు చేయడంతో రద్దీ తీవ్రంగా పెరిగింది. థానే రైల్వేస్టేషన్‌లోని ఐదు, ఆరో నంబరు ఫ్లాట్ఫాంలన్ని ప్రయాణికులతో నిండిపోయాయి. వైర్ తెగిపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. -
విసుగెత్తిస్తున్న ప్రయాణం
- చిత్తూరు మార్గంలో రైలు ప్రయాణం నరకమే - 72 కి.మీ లకు 3 గంటల ప్రయాణం - క్రసింగ్‌లు పడ్డాయో ఇక నరకమే - డబ్లింగ్ రైల్వేలైన్ లేకే అవస్థలు తిరుపతి అర్బన్: తిరుపతి నుంచి జిల్లా కేంద్రమైన చిత్తూరుకు ఉన్న దూరం 72 కి.మీలు. అయితే ప్యాసింజర్ రైలులో ఈ దూరానికి అయ్యే ప్రయాణ సమయం దాదాపు 3 గంటలు పడుతుంది. అది కూడా ఎలాంటి క్రాసింగ్‌లు లేకుండా ఉంటే...పై సమయం పడుతుంది. ఇక ఏదైనా ఎక్స్‌ప్రెస్‌కో, సూపర్ ఫాస్ట్‌కో క్రాసింగ్ ఇవ్వాల్సి వచ్చిందో ప్రయాణ సమయం మరో గంటైనా అదనంగా పడుతుంది. ఇలా ఏడాది పొడవునా తిరుపతి-చిత్తూరు, చిత్తూరు-తిరుపతి మార్గంలో నరక ప్రయాణం అనుభవిస్తున్న సగటు మనిషి దీనస్థితి ఇది. తిరుపతి-చిత్తూరు మధ్య ప్రతిరోజూ సుమారు 300 మంది ఉద్యోగులు, 250 మంది టీచర్లు, 2వేల మందికి పైగా విద్యార్థులు, వందల సంఖ్యలో చిరువ్యాపారులు, వేలల్లో యాత్రికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇన్ని వేల మంది ఇబ్బందులు లేకుండా నిర్ణీత సమయంతో ప్రయాణం చేయాలంటే కేంద్రం నుంచి ఈ మార్గంలో డబ్లింగ్ రైల్వేలైన్‌కు అనుమతి రావాలి, పుష్కలంగా నిధుల మంజూరు జరగాలి. ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన మొదటి వ్యక్తులు ఎంపీలు. అయితే మన జిల్లా ఎంపీలు ఎప్పుడో ఒకసారి ఈ మార్గానికి డబ్లింగ్ లైన్ అవసరమని ప్రస్తావించి ఊరుకునేశారు. ఆ తర్వాత వారి ప్రస్తావనలకు ఊపిరి పోసేవిధంగా రైల్వే ఉన్నతాధికారులు రూపొందించి న ప్రతిపాదనలు 12ఏళ్లుగా ఫైళ్లు దాటడం లేదు. నిత్యం జనానికేమో తిప్పలు తప్పడం లేదు. మూడు రెట్లు పెరిగిన ఎక్స్‌ప్రెస్ రైళ్లు 2003లో బ్రాడ్‌గేజ్‌గా మార్పు జరిగిన చిత్తూరు రైల్వే మార్గంలో తొలుత రెండే రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు మాత్రమే నడిచేవి. అయితే ఈ 12 ఏళ్లలో ఎక్స్‌ప్రెస్ రైళ్ల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. ఈ మార్గంలో రోజూ 11 ట్రిప్పులు తిరుగుతున్న ప్యాసింజర్ రైళ్లకు అడుగడుగునా క్రాసింగ్‌ల సమస్య తప్పడం లేదు. అలాగే తిరుపతి నుంచి పాకాల మీదుగా అనంతపురం జిల్లావైపు నడుస్తున్న ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా చిత్తూరు మార్గంలో నడిచే ప్యాసింజర్ రైళ్లకు క్రాసింగ్ ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అంతేగాక చిత్తూరు వైపు వెళ్లేందుకు తిరుపతిలో ముందుగా ప్యాసింజర్ రైలు బయల్దేరినా తర్వాత బయల్దేరే ఎక్స్‌ప్రెస్ రైలుకు ఎక్కడో ఒకచోట క్రాసింగ్ ఇవ్వకతప్పదు. ఎదురుగా వచ్చే రైళ్లతోనే కాకుండా వెనుక వచ్చే ఎక్స్‌ప్రెస్ రైళ్లతో కూడా ప్యాసింజర్లకు క్రాసింగ్ తిప్పలు తప్పేటట్లు లేదు. ఇలా నిత్యం ప్యాసింజర్లలో ప్రయాణం చేస్తున్న సామాన్యుల గురించి పట్టిం చుకునే నాథుడే కరువయ్యాడు. -
పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు
హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ నుంచి బయలుదేరే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు స్లీపర్ బోగీలు ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. విశాఖ, మచిలీపట్నం, నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లకు అదనపు బోగీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 5వ తేదీ నుంచి 17 వ తేదీ వరకు ఈ తాత్కాలిక అదనపు బోగీల సౌకర్యం ఉంటుందని పేర్కొంది. ఈ అదనపు బోగీల వల్ల 4752 బెర్తులు అందుబాటులోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. -
రైళ్ల వేళల్లో మార్పు
గుడివాడ టౌన్ : పట్టణానికి వచ్చే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేళలు మారినట్లు స్టేషన్ మేనేజర్ పొట్లూరి శేషగిరిరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నంబర్ 17213/ 17231 నర్సపూర్-నాగర్సోల్ ఎక్స్‌ప్రెస్ గతంలో మధ్యాహ్నం 12.50 గంటలకు వచ్చి 12.55 బయల్దేరేదని, ప్రస్తుతం 12.30కు వచ్చి 12.32కు వెళ్తుందని పేర్కొన్నారు. ట్రైన్ నంబర్ 18519 విశాఖ-ఎల్టిటి ఎక్స్‌ప్రెస్ గతంలో ఉదయం 5.08 గంటలకు వచ్చి 5.10కు వెళ్లేదని ప్రస్తుతం 5.03కు వచ్చి 5.05కు వెళ్తుందని చెప్పారు. ట్రైన్ నంబర్ 17643 చెన్నై-కాకినాడ సర్కార్ ఎక్స్‌ప్రెస్ గతంలో 4.20కు వచ్చి 4.22 గంటలకు వెళ్లేదని, ప్రస్తుతం 3.58కు వచ్చి 4.00 గంటలకు వెళ్తుందని, ట్రైన్‌నంబర్ 18520 ఎల్టిటి-విశాఖ ఎక్స్‌ప్రెస్ గతంలో 5.08 గంటలకు వచ్చి 5.10కు వెళ్లేదని, ప్రస్తుతం 5.03కు వచ్చి 5.05కు వెళ్తుందని తెలిపారు. ట్రైన్ నంబర్ 17250 సికింద్రాబాద్ -మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ గతంలో ఉదయం 5.58కు వచ్చి 6.00కు వెళ్లేదని, ది, ప్రస్తుతం 5.45కు వచ్చి 5.47కు వెళ్తుందని,అలాగే ట్రైన్ నంబర్ 17212 యశ్వంత్‌పూర్-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ ఉదయం 5.46కు వచ్చి 5.48కు వెళ్లేదని, ప్రస్తుతం 6.05కు వచ్చి 6.07కు వెళ్తుందని చెప్పారు. ట్రైన్ నంబర్ 57229 మచిలీపట్నం-విశాఖపట్నం పాసింజర్ ప్రస్తుతం రాత్రి 10.15కు వచ్చి 10.30కు వెళ్తుందని తెలిపారు. -
కాజీపేట నుంచి చుక్.. చుక్
కొత్త రైళ్లు ప్రారంభం కాజీపేట-ముంబయి, ముంబయి-కాజీపేట బెల్లంపెల్లి, విజయవాడ మార్గంలో నాలుగు ట్రైన్లు కాజీపేట మీదుగా రాకపోకలు..మారిన పలు ఎక్స్‌ప్రెస్‌ల వేళలు కాజీపేట రూరల్ : నిజాం రైల్వే కాలంలో నిర్మించిన కాజీపేట జంక్షన్‌కు తెలంగాణ రాష్ర్టం ఏర్పాటయ్యాక మొదటిసారిగా రైల్వే పరంగా ప్రాధాన్యం లభించింది. ఉత్తర, దక్షిణ భారతదేశానికి గేట్వేగా ఉంటున్న అతి ప్రధానమైన ఈ జంక్షన్ నుంచి దక్షిణ మధ్య రైల్వే తొలిసారిగా నాలుగు ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టింది. 2014-15 రైల్వే బడ్జెట్లో రైల్వేమంత్రి సదానందగౌడ ప్రకటించిన మేరకు కాజీపేట-ముంబయి వేళ్లే ఎక్స్‌ప్రెస్ సోమవారం నుంచి రాకపోకలు సాగించనుంది. వరంగల్, కరీంనగర్ జిల్లావాసుల 30 ఏళ్ల డిమాండ్‌ను పరిశీలించిన రైల్వే శాఖ ఎట్టకేలకు కాజీపేట జంక్షన్ నుంచి నేరుగా ముంబయికి అప్ అండ్ డౌన్లో రెండు సర్వీసులను ప్రవేశపెట్టింది. ఈ మేరకు కాజీపేట రైల్వే అధికారులు సోమవారం కాజీపేట నుంచి ప్రారంభం కానున్న రైలు, ఈ జంక్షన్ మీదుగా ప్రయాణించే రైళ్ల వేళల్లో మార్పులను వివరించారు. కాజీపేట-ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్ కాజీపేట జంక్షన్ నుంచి లోకమాన్యతిలక్ టర్మినల్ (ఎల్టీటీ) వెళ్లే 11804 నంబర్ గల ముంబయి ఎక్స్‌ప్రెస్ ప్రతి శనివారం సాయంత్రం 5.45 గంటలకు బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో 11083 నంబర్ గల ముంబయి ఎక్స్‌ప్రెస్ ఎల్టీటీ నుంచి బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు కాజీపేటకు చేరుకుంటుంది. ఈ రైలుకు అప్ అండ్ డౌన్లో జమ్మికుంట, పెద్దపెల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపెల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్లార్షా, ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ ఉంది. విశాఖపట్నం-సికింద్రాబాద్ ఏసీ ఎక్స్‌ప్రెస్ 12783 నంబర్ గల విశాఖ పట్నం-సికింద్రాబాద్ వెళ్లే ఏసీ ఎక్స్‌ప్రెస్ కాజీపేటకు ప్రతి సోమవారం ఉదయం 4.44 గంటలకు చేరుకుని 4.46 గంటలకు వెళ్తుంది. తిరుగు ప్రయాణంలో 12784 నంబర్ గల సికింద్రాబాద్-విశాఖపట్నం వెళ్లే ఏసీ ఎక్స్‌ప్రెస్ ప్రతి శనివారం కాజీపేటకు రాత్రి 7.43 గంటలకు చేరుకుని 7.45 గంటలకు వెళ్తుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌కు మౌళాలి, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, తాడిపెల్లి గూడెం, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు. పలు రైళ్ల వేళల్లో మార్పులు కాజీపేట జంక్షన్ మీదుగా ప్రయాణించే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేళలు మారాయి. సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. 18520 నంబర్ గల ఎల్టీటీ-విశాఖపట్నం వెళ్లే లోకమాన్యతిలక్ ఎక్స్‌ప్రెస్ కాజీ పేటకు ప్రతి రోజు రాత్రి 11.30 గంటలకు చేరుకుంటుంది. 17250 నంబర్ గల సికింద్రాబాద్-మచిలీపట్నం వెళ్లే మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ ప్రతి రోజు కాజీపేటకు అర్ధరాత్రి 12.25 గంటలకు వస్తుంది. 12710 నంబర్ గల సికింద్రాబాద్-గూడూరు వెళ్లే సిం హపురి ఎక్స్‌ప్రెస్ కాజీపేటకు ప్రతిరోజు అర్ధరాత్రి 12.55 గంటలకు చేరుకుంటుంది. 17026 నంబర్ గల సికింద్రాబాద్-మణుగూర్ ఎక్స్‌ప్రెస్ ప్రతి రోజు కాజీపేటకు అర్ధరాత్రి 1.45 గంటలకు వస్తుంది. 12709 నంబర్ గల గూడూర్-సికింద్రాబాద్ వెళ్లే సింహపురి ఎక్స్‌ప్రెస్ కాజీపేటకు ప్రతి రోజు తెల్లవారుజాము 6.05 గంటలకు చేరుకుంటుంది. -
సదా.. నిరాశ
రైల్వే బడ్జెట్లో జిల్లాకు మొండిచేయి - ఒక్క ప్రాజెక్ట్‌నూ ప్రస్తావించని రైల్వే మంత్రి - కమిటీ నివేదిక వచ్చాకే నిర్ణయమని దాటవేత - ఊసే లేని కాజీపేట డివిజన్ హోదా - వ్యాగన్, కోచ్ ఫ్యాక్టరీ, కోల్ కారిడార్‌దీ అదే దారి - కంటితుడుపుగా రెండు హైస్పీడ్.. - మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లు సాక్షి, హన్మకొండ : కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్... జిల్లా ప్రజల ఆశలపై నీళ్లు చల్లింది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో రైల్వేపరంగా హైదరాబాద్ తర్వాత కీలకమైన కాజీపేటపై దృష్టిసారించాలని, అభివృద్ధి పనుల మంజూ రుతోపాటు నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధాని నరేంద్రమోడీని కోరినా ఫలితం లేకుం డాపోరుంది. ఐదేళ్ల క్రితం మంజూరైన వ్యాగన్ పరిశ్రమ, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లులో ప్రతిపాదించిన కోచ్ ఫ్యాక్టరీ ఊసే ఎత్తలేదు. మూడేళ్ల కిందటి కాజీపేట-విజయవాడ మూడో రైల్వే లేన్ నిర్మాణం సంగతి ఎటూ తేల్చకుండానే సికింద్రాబాద్-నాగ్‌పూర్, హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైలు అని కొత్త పాటందుకున్నారు. ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పెండింగ్ ప్రాజెక్ట్‌లు, అభివృద్ధి పనులపై ఓ కమిటీని నియమించాం.. నివేదిక వచ్చాక వాటిపై నిర్ణయం తీసుకుంటాం’ అని రైల్వే శాఖ మంత్రి దాటవేత వైఖరిని ప్రదర్శించారు. తెలంగాణకు... అందులోనూ వరంగల్ జిల్లా ప్రాజెక్ట్‌ల ప్రస్తావన లేకుండానే మమ అనిపించారు. ‘వ్యాగన్'కు మొండిచేయి ‘గతంలో మంజూరై... నిధుల కోసం ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌ల జాబితానే పెద్దగా ఉంది. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిన ప్రాజెక్టుల నిర్మాణం చేపడతాం.’ అని బడ్జెట్‌కు రెండు రోజుల ముంగిట రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ సెలవిచ్చారు. ఈ మేరకు ఐదేళ్ల కిత్రం పీపీపీ పద్ధతిలో మంజూరైన వ్యాగన్ వర్క్‌షాప్ ఏర్పాటుకు నిధులు మంజూరవుతాయని అందరూ భావించారు. కానీ... రైల్వే బడ్జెట్లో దీనిపై ఊసే ఎత్తలేదు. అదేవిధంగా.... ఉత్తర, దక్షిణ, పశ్చిమ భారతదేశాలను కలిపే కీలక జంక్షన్ కాజీపేట మీదుగా న్యూఢిల్లీ-చైన్నై, హైదరాబాద్-చెన్నై మార్గంలో అధిక సంఖ్యలో ప్యాసింజర్, గూడ్స్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ మార్గంలో కొత్త రైళ్లు నడిపేందుకు స్లాట్ దొరకడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో మూడేళ్ల క్రితమే కాజీపేట-విజయవాడ, బల్లార్షా-కాజీపేట మధ్య మూడో లేను నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ను సైతం ప్రత్యేక కమిటీకే అప్పగించి చేతులు దులుపుకున్నారు. కోచ్ ఫ్యాక్టరీ, కాజీపేట డివిజన్దీ అదే దారి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లులో తెలంగాణలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వం కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనువైన ప్రాంతంగా కాజీపేటను ఎంపిక చేసి, కేంద్రానికి తెలిపింది. అంతేకాదు... రైల్వేపరంగా అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని కాజీపేట కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలని కోరింది. ఈ అంశాలన్నింటీని సదానందగౌడ తన బడ్జెట్లో పక్కన పెట్టారు. అదే సమయంలో తన సొంత రాష్ట్రమైన కర్నాటకలోని బెంగళూరు సమీపంలో కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేసుకున్నారు. దక్షిణ భారతదేశంలో ఇప్పటికే చెన్నైలో కోచ్ ఫ్యాక్టరీ ఉండగా... రెండేళ్ల క్రితం కేరళలోని పాలక్కాడ్‌కు మంజూరైన నూతన కోచ్ ఫ్యాకరీ నిర్మాణ దశలో ఉంది. పెద్దసంఖ్యలో ఉపాధి కల్పించేటువంటి భారీ పరిశ్రమలైన రైల్ కోచ్ ఫ్యాక్టరీలు ఇప్పటికే మూడు ఉండగా... మరోసారి దక్షిణ భారతదేశానికి మంజూరు కావడం కష్టమేనన్న సందేహాలు జిల్లావాసుల్లో వ్యక్తమవుతున్నాయి. కారు చీకట్లో కోల్ కారిడార్ భారతదేశ పారిశ్రామిక అభివృద్ధికి దోహదం చేసేలా బొగ్గు గనులు ఉన్న ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ పెంచేలా క్రిటికల్ కోల్‌కారిడార్ బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో రైల్వే లేన్లు నిర్మిస్తున్నట్లు ప్రకటించిన మంత్రి మణుగూరు-రామగుండం ప్రాజెక్ట్‌కు మొండిచేయి చూపించారు. దక్షిణ భారతదేశంలో బొగ్గు ఉత్పత్తి కేవలం తెలంగాణలోనే ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే పలుమార్లు సర్వేలు పూర్తి కాగా... మణుగూరు-రామగుండం కోల్కారిడార్కు నిధులు మంజూరు చేస్తారని అందరూ ఆశించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కోటాతో ముడిపెట్టి ఈ ప్రాజెక్ట్‌ను నట్టేట ముంచారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం నిడివి 200 కిలోమీటర్లు ఉంటే, ఇందులో 130 కి.మీ నిడివి వరంగల్ జిల్లాలోనే ఉంది. ఈ ప్రాజెక్ట్ మంజూరైతే ఏజెన్సీలో అభివృద్ధి పట్టాలపై పరుగులు పెట్టేది. కంటితుడుపుగా రెండు హైస్పీడ్ రైళ్లు కాజీపేట మీదుగా సికింద్రాబాద్-నాగ్‌పూర్, హైదరాబాద్ -చెన్నై మధ్య హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ ప్రకటించారు. కంటితుడుపు చర్యగా వీటిని ప్రవేశపెట్టింది. దేశంలో ప్రయోగాత్మకంగా న్యూఢిల్లీ-ఆగ్రా మధ్య హైస్పీడ్ రైలును ఈ నెల మొదటి వారంలో నడిపించారు. ఈ హైస్పీడ్ రైళ్ల వల్ల ఇప్పటికిప్పుడు ఒనగూరే ప్రయోజనం లేదు. ప్రకటించిన రెండు మార్గాల్లో హైస్పీడ్ రైళ్లను నడిపేందుకు గల అవకాశాలను పరిశీలించడం.. అవసరమైన మార్పులు చేసిన తర్వాతే ఈ మార్గంలో కొత్తవి పరుగెడతాయి. ఇందుకు ఏడాది సమయం పట్టొచ్చు. మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లు మాత్రమే... మొక్కుబడిగా మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లు జిల్లా మీదుగా ప్రయాణించడం ఒక్కటే ఈ బడ్జెట్లో జిల్లాకు చేకూరిన ప్రయోజనం. సికింద్రాబాద్-హజ్రత్‌నిజాముద్దీన్ జనసాధరణ్, విజయవాడ-న్యూఢిల్లీ ప్రీమియం ఏసీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కాజీపేట, వరంగల్ మీదుగా ప్రయాణం సాగిస్తాయి. వీటిలో విజయవాడ-న్యూఢిల్లీ ప్రీమియం రైలు కావడం వల్ల సాధారణ ప్రయాణికులకు దీని వల్ల ఉపయోగం తక్కువ. సికింద్రాబాద్-నిజాముద్దీన్ జనసాధరణ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఫ్రీక్వెన్సీ వస్తే తప్ప... ఎంత ఉపయోగమనేది తేలదు. కాగా, షోలాపూర్-చెన్నై మధ్య మరో రైలును ప్రకటించినా... ఇది కాజీపేట మీదుగా వెళ్లేది, లేనిది అనే అంశంపై స్పష్టత లేదు. కాగా, నిత్యం రద్దీగా ఉండే కాజీపేట- బల్లార్షా మార్గంలో మరో రైలు రానుంది. కాజీపేట నుంచి ముంబరుుకి నేరుగా రైళ్లు నడపాలని ఎన్నాళ్ల నుంచో ఉన్న డిమాండ్‌ను ఈ బడ్జెట్లో రైల్వేశాఖ ఆమోదించింది. కాజీపేట నుంచి బల్లార్ష మీదుగా ముంబరుుకి వీక్లీ రైలును ప్రకటించారు. మొత్తంగా కాజీపేట మీదుగా మూడు రైళ్లు నడుస్తుండగా... ఈ రైలు వల్లనే జిల్లా వాసులకు ఎక్కువ ప్రయోజనం చేకూరనుంది. అదేవిధంగా ప్రయాణికుల సౌకర్యార్థం స్టేషన్లలో ఎస్కలేటర్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. ఇదే జరిగితే వరంగల్, కాజీపేట స్టేషన్లలో ఎస్కలేటర్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎంపీలు ప్రయత్నిస్తే.. రైల్వే యూనివర్సిటీ ఈ సారి రైల్వే బడ్జెట్లో సదానందగౌడ ప్రకటించిన ఆసక్తికర అంశాల్లో రైల్వే యూనివర్సిటీ ఏర్పాటు స్థాపన ముఖ్యమైనది. ప్రస్తుతం ఉన్న టెక్నికల్, రెగ్యులర్ యూనివర్సిటీల సహాయ సహకారాలతో సాధారణ, సాంకేతిక అంశాల్లో పట్టు సాధించేలా రైల్వే యూనివర్సిటీని నెలకొల్పుతామని పేర్కొన్నారు. అరుతే... ఈ వర్సిటీని ఎక్కడ నెలకొల్పుతారనే అంశాన్ని ఆయన నేరుగా ప్రస్తావించలేదు. ప్రతిష్టాత్మాక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)తోపాటు కాకతీయ వర్సిటీ వరంగల్‌లో ఉన్నందున ఈ ప్రాజెక్ట్ ఏర్పాటుకు కాజీపేట అనువైన ప్రాంతంగా చెప్పుకోవచ్చు. సాధ్యాసాధ్యాలను బట్టి ఈ వర్సిటీని కాజీపేటలో ఏర్పాటు చేసే దిశగా... జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఐదుగురు ఎంపీలు ఇప్పటి నుంచే కృషి చేయాల్సిన అవసరం ఉంది. మహిళలకు ప్రత్యేక కోచ్‌లు మహిళలకు ప్రత్యేక కోచ్‌లు ప్రవేశపెడుతున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించారు. ప్రయాణికులకు ఎస్ఎంఎస్ ద్వా రా భోజనం అందించనున్నట్లు, రైళ్లలో మహిళల భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రైళ్ల లో, రైల్వే స్టేషన్లలో ఆహారం బాగా లేకపోతే వెండర్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని, రైల్వే ఆస్తుల పరిరక్షణ విషయంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) పోలీసులకు సెల్ఫోన్లు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. రైల్వే బడ్జెట్ నిరాశపరిచింది... రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి, జిల్లాకు ప్రత్యేక ప్రతిపాదనలు ఏమీ లేవు. రెండు రాష్ట్రాలకు కలిపి కమిటీ వేసినట్లు ప్రకటించడానికే పరిమితమయ్యారు. ఇందులో ఏముంటుందో వారికే తెలియాలి. రైల్వే బడ్జెట్ నిరాశజనకంగా ఉంది. జిల్లాకు సంబంధించిన కాజీపేట కోచ్, వ్యాగన్ ఫ్యాక్టరీలు, డివిజన్ గురించి ఏం తేలలేదు. సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి ఒక ప్రిమియర్ రైలు వేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణను పక్కనపెట్టినట్లున్నది. మోడీ తరహా బడ్జెట్ అంటున్నప్పటికీ... మనకు వచ్చిందేమీలేదు. రానున్న రోజుల్లో కేంద్రం... తెలంగాణతో ఇదే తీరుగా వ్యవహరిస్తుందా... అనే అనుమానం కలుగుతోంది. - సీతారాం నాయక్, మహబూబాబాద్ ఎంపీ ప్రస్తావనకు రాని అంశాలు కాజీపేట రైల్వే ఆస్పత్రిని సబ్ డివిజన్ ఆస్పత్రిగా అప్‌గ్రేడ్, రైల్వే మిక్స్డ్ హైస్కూల్లో సెంట్రల్ సిలబస్ ప్రవేశ పెట్టడం, ఎలక్ట్రిక్, డీజిల్ లోకోషెడ్లలో అప్రెంటీస్ ట్రైనింగ్ సెంటర్, పిరియాడికల్ ఓవరాలింగ్ షెడ్ (పీఓహెచ్) ఏర్పాటు అంశాలు రైల్వే బడ్జెట్లో ప్రస్తావనకే రాలేదు. కాజీపేట జంక్షన్ మీదుగా సికింద్రాబాద్ -గౌహతి వెళ్లే గౌహతి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-విశాఖపట్నం వెళ్లే గరీబ్థ్ ్రఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-కాకినాడ ఏసీ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కాజీపేటలో హాల్టింగ్ కల్పిస్తారని ఆశించిన ప్రయాణికులకు నిరాశే ఎదురైంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ను వారం రోజులు పొడిగిస్తారని అనుకున్నప్పటికీ ఆశాభంగమే మిగిలింది. - కాజీపేట రూరల్ కార్మిక, ప్రజా వ్యతిరేక ప్రాజెక్ట్ రైల్వే మంత్రి సదానంద గౌడ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ రైల్వే కార్మికులు, ప్రజలకు వ్యతిరేకంగా ఉంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ షిప్ (పీపీపీ) విధానానికి పెద్దపీట వేశారు. చైనా దేశంలో అనుసరిస్తున్న రైల్వే విధానాన్ని భారత్ రైల్వేలో ప్రవేశపెడతామని, అభివృద్ధి చేస్తామన్న రైల్వే మంత్రి మాటలు సాధ్యమయ్యేవి కావు. కాజీపేట డివిజన్, వ్యాగన్‌షెడ్ ప్రస్తావనకు రాకపోవడం శోచనీయం. ఈ రైల్వే బడ్జెట్లో కార్మికుల సమస్యలు పట్టించుకోలేదు. - కె.శ్రీనివాస్, సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ జోనల్ ప్రెసిడెంట్ తెలంగాణ ప్రాజెక్ట్‌లపై స్పష్టత లేదు రైల్వే బడ్జెట్లో తెలంగాణ ప్రాజెక్ట్‌లపై స్పష్టత లేదు. 2010-11 బడ్జెట్లో రైల్వే కార్మికులకు సొంత ఇల్లు కట్టిస్తామని అప్పటి మంత్రి ప్రకటించారు. ఈ రైల్వే బడ్జెట్లోనైనా కార్మికుల సొంతింటి కల నెరవేరుతుందని అనుకున్నారు. కార్మికుల ఆశలు అడియాసలే అయ్యూరుు. కార్మికుల పిల్లలకు ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టలేదు. - దేవులపెల్లి రాఘవేందర్, కాజీపేట రైల్వే జేఏసీ కన్వీనర్