Extramarital relationship
-
‘అమ్మ’ వద్దంది.. ఆస్పత్రి అమ్మేసింది!
కామారెడ్డి క్రైం: పుట్టబోయే బిడ్డను వదిలించుకోవాలనుకున్న ఓ గర్భిణి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా డెలివరీ చేయడంతోపాటు నవజాత శిశువును విక్రయించిన ఓ ప్రైవేటు ఆస్పత్రి నిర్వాకం కామారెడ్డి జిల్లా కేంద్రంలో బట్టబయలైంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆస్పత్రి వైద్యుడు, సిబ్బంది సహా మొత్తం 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పట్టణ పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌హెచ్‌వో చంద్రశేఖర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. పెళ్లికి ముందే గర్భం దాల్చడంతో.. జిల్లాలోని తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన లావణ్యకు కామారెడ్డి మండలం పోసానిపేట గ్రామానికి చెందిన మహేశ్‌తో ఫిబ్రవరిలో వివాహం జరిగింది. పెళ్లికి ముందే ఆమెకు మరొకరితో సాన్నిహిత్యం ఉండటంతో ఆ కారణంగా పెళ్లి సమయానికే ఆమె గర్భం దాలి్చంది. పెళ్లయిన నెల రోజులకు భర్తకు ఈ విషయం తెలియడంతో నాటి నుంచి లావణ్య పుట్టింట్లోనే ఉంటోంది. పుట్టబోయే బిడ్డ తనతో లేకపోతే భర్త మళ్లీ చేరదీస్తాడని భావించిన లావణ్య.. ఏప్రిల్‌లో శ్రీరాంనగర్ కాలనీలో ఉన్న సమని్వత ఆస్పత్రిని సంప్రదించింది. గాంధారి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వైద్యుడు ఇట్టం ప్రవీణ్‌కుమార్, ఆయన తండ్రి నడిపి సిద్దిరాములు ఈ ఆస్పత్రిని నడుపుతున్నారు. అందుకు అంగీకరించిన వారు మొత్తం రూ. 2 లక్షలకు లావణ్య, ఆమె కుటుంబ సభ్యులతో బేరం కుదుర్చుకున్నారు. అందులో భాగంగా కాస్త నగదు, ఫోన్ పే ద్వారా రూ. లక్షా 30 వేలను లావణ్య కుటుంబ సభ్యులు చెల్లించారు.ఏప్రిల్ 11న అర్ధరాత్రి లావణ్యకు డెలివరీ చేయగా ఆడపిల్లకు జన్మనిచి్చంది. అప్పటికే రాజంపేటకు చెందిన ఇట్టం బాలకృష్ణ ద్వారా అతని బంధువైన సిరిసిల్లకు చెందిన దేవయ్యతో బిడ్డను కొనే వారితో డాక్టర్, ఆయన తండ్రి ఒప్పందం చేసుకున్నారు. సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రేపాన గ్రామానికి చెందిన భూపతి అనే వ్యక్తికి పిల్లలు లేకపోవడంతో పసిబిడ్డను కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చాడు. రూ. 20 వేలు తీసుకుని ఏప్రిల్ 12న పాపను భూపతి దంపతులకు అప్పగించారు. మహేశ్ ఫిర్యాదుతో విషయం వెలుగులోకి.. విషయం తెలుసుకున్న లావణ్య భర్త మహేశ్ డీసీపీవో స్రవంతికి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వైద్యుడు ఇట్టం ప్రవీణ్ కుమార్, ఆయన తండ్రి నడిపి సిద్దిరాములు, ఆస్పత్రి మేనేజర్ ఉదయ్ కిరణ్, వాచ్‌మన్ బాలరాజుతోపాటు లావణ్య, మధ్యవర్తులు బాలకృష్ణ, దేవయ్య, భూపతిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. పసిపాపను బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. 2021లో కౌసల్య మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని నడిపిన డాక్టర్ ప్రవీణ్, ఆయన తండ్రి ఓ గర్భిణికి లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు తేలడంతో సిద్దిరాములుతోపాటు కొందరిని అరెస్టు చేసి ఆస్పత్రిని సీజ్ చేశారు. -
కూతురు సాయంతో భర్తను చంపేసింది
సిరిసిల్ల క్రైం: మద్యానికి బానిసైన ఇంటిపెద్ద, వివాహేతర సంబంధాలకు అలవాటుపడి.. ఇంట్లోవారిని కొట్టడం, దుర్భాషలాడటంతో భరించలేకపోయిన భార్య, కూతురు కలిసి అతన్ని పాశవికంగా హత్య చేశారు. సిరిసిల్లలో వారం క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణం శివనగర్‌కు చెందిన లేచర్ల ప్రకాశ్‌రావు (44) జల్సాలకు అలవాటు పడటంతోపాటు, ఇంట్లో వారిపై తరచూ భౌతిక దాడులకు దిగేవాడు. వేధింపులు తాళలేని భార్య స్వప్న, కుమార్తె ఉషశ్రీ ఎలాగైనా అతడి అడ్డు తొలగించుకోవాలని, ఇందుకు చంపడమే మార్గమని అనుకున్నారు. ప్లాన్ ప్రకారం ఈ నెల 1న రాత్రి ప్రకాశ్‌రావు మెడపై కూరగాయలు కోసే కత్తితో భార్య దాడి చేయగా, కూతురు తండ్రి ముఖం మీద దిండుతో ఒత్తిపట్టి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని గొడ్డలితో ముక్కలు చేసేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నం విఫలంకావడంతో మృతదేహాన్ని ఎలాగైనా మాయం చేయాలన్న ఆలోచనతో ఇంట్లోనే గుంత తవ్వి పాతిపెడదామనుకున్నారు. కానీ అలా చేస్తే శవం నుంచి వాసన వచ్చి బయటకు విషయం తెలుస్తుందని భావించారు. తదుపరి పెట్రోలు పోసి కాల్చేసే ప్రయత్నం చేసినా మృతదేహం పూర్తిగా కాలిపోలేదు. దీంతో స్వప్న ఈనెల 3న తన తమ్ముడితో మరింత పెట్రోలు తెప్పించి శవానికి నిప్పటించారు. మంటలు ఎగిసిపడడంతో బయటకు తెలుస్తుందని నీళ్లు, దుప్పట్లతో మంటలు ఆరి్పవేశారు. ఇలా కుదరదని నిర్ణయించుకుని ఎట్టకేలకు హత్యను కాస్తా ఆకస్మిక మృతిగా చిత్రించి దహన సంస్కారాలు చేయాలని ప్రణాళిక చేశారు. దీనిలో భాగంగా ఈనెల 4న నిందితురాలు తన చిన్నాన్నను వేకువజామున పిలిపించుకుని జరిగిన విషయాన్ని వివరించింది. ఈక్రమంలో ప్రకాశ్‌రావు నిద్రలో చనిపోయినట్లు కథ సృష్టించి దహనసంస్కారాలు చేసేందుకు దగ్గరి బంధువులకు సమాచారం అందించారు. చివరిచూపునకు కొద్ది మంది బంధువులు రాగానే హుటాహుటిన విద్యానగర్‌లోని వైకుంఠధామంలో దహన సంస్కారాలు పూర్తిచేశారు. ఇలా వెలుగులోకి.. ప్రకాశ్‌రావు నిద్రలో మృతిచెందాడని బంధువులకు సమాచారం ఇచ్చిన నిందితులు, బంధువులందరూ వచ్చే వరకు ఎదురుచూడకుండా దహన సంస్కారాలు పూర్తి చేయడంతో మృతిపై పలువురికి అనుమానం వచ్చింది. ఈక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ మృతుడి ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉంది. ఇంట్లోంచి దుర్వాసన వచ్చింది. దీంతో ప్రకాశ్‌రావు మృతిపై అనుమానం ఉందని సిరిసిల్ల టౌన్పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన టౌన్ సీఐ ఉపేందర్ హత్య ఉదంతాన్ని ఛేదించారు. నిందితులు స్వప్న, ఉషశ్రీని రిమాండ్‌కు తరలించగా, హత్యకు సహకరించిన మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు సీఐ వెల్లడించారు. ప్రకాశ్‌రావు (ఫైల్) -
పంచాయితీ పెట్టినా వినలేదు.. ఆమెతో వివాహేతర సంబంధం.. చివరకు
బేతంచెర్ల: వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. ఈ దారుణ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. కాగా, బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి చెందిన కమలపాటి అశోక్ (28)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానికంగా ఆటోనడుపుకుంటూ జీవిస్తున్నాడు. అయితే, అశోక్ వరుసకు వదిన అయిన వివాహిత(27)తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలియడంతో పెద్దలు ఇద్దరికి నచ్చ జెప్పారు. అయినా, వారిలో మార్పు రాలేదు. దీంతో అశోక్‌ను వదిలి నెలరోజుల క్రితం భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. మరోవైపు వివాహితను కుటుంబ సభ్యులు మందలించారో మరెమో తెలియదు మంగళవారం ఉదయం ఆమె అశోక్ ఇంటికెళ్లింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. అశోక్ ఉరివేసుకోగా, ఆమె పురుగుల మందు తాగింది. కొద్ది సేపటి తర్వాత ఇంటి పక్కల వారు గమనించి తలుపులు తీయగా ఇద్దరు విగతజీవులుగా కనిపించారు. సమాచారం అందుకున్న సీఐ ప్రియతం రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. తర్వాత ఇరువురి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం బనగాన పల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
వీడియో: లవర్‌తో భర్త షికార్లు.. పాపం ఇలా దొరికిపోతాడని అనుకోలేదేమో..
అతడికి అప్పటికే ఆమెతో వివాహం జరిగింది. వారి వివాహ బంధంలో కలతల కారణంగా భార్య.. భర్తకు దూరంగా పుట్టింట్లో ఉంటోంది. ఈ క్రమంలో భర్త మరో యువతితో ఎంజాయ్ చేస్తూ షికార్లు చేస్తుండగా భార్య.. వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. షాకింగ్ మాల్లో అందరి ముందే చితకబాదింది. దీనికి సంబంధించిన ఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. యూపీలోని ఘజియాబాద్‌కు చెందిన ఓ జంట మధ్య గొడవల కారణంగా భార్య.. తన పుట్టింట్లో ఉంటోంది. కాగా, కార్వా చౌతా పండుగ సందర్భంగా ఆమె తన తల్లితో కలిసి షాపింగ్ చేసేందుకు ఓ మాల్‌కు వెళ్లింది. ఈ సందర్భంగా తన భర్త మరో యువతితో క్లోజ్ ఉండటం, షాపింగ్ చేస్తుండటాన్ని ఆమె గమనించింది. దీంతో, వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని నిలదీసింది. భర్త కాలర్ పట్టుకుని.. నాకు ఎందుకు అన్యాయం చేస్తున్నావంటూ చితకబాదింది. అటు భర్తతో వచ్చిన సదరు యువతిని సైతం ఆమె కుటుంబ సభ్యులు చితకబాదారు. करवा चौथ के दिन दूसरी महिला काे शॉपिंग करवाने आया था पति। पत्नी ने पकड़ा। https://t.co/T3jB1xVOWn pic.twitter.com/gSFGxGaghn — Ankit tiwari/अंकित तिवारी (@ankitnbt) October 13, 2022 మరోవైపు.. ఈ ఘటనపై సదరు వ్యక్తి భార్య.. పోలీసులను ఆశ్రయించినట్టు సమాచారం. ఇక, ఈ ఘటన జరుగుతున్న సందర్భంగా షాపింగ్ మాల్లో పెద్ద సంఖ్యలో కస్టమర్లు అక్కడ గుమ్మిగూడారు. దీంతో, మాల్లోని కొందరు దుకాణాల యజమానులు బయటకు వెళ్లిపోవాలని సూచించారు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. -
కాకినాడలో దారుణం.. వివాహేతర సంబంధమే కారణమా?
సాక్షి, కాకినాడ: ఏలేశ్వరం మండలంలో దారుణం జరిగింది. అప్పన్నపాలెంలో ఓ ఉన్నాది ఏడు నెలల గర్భిణీ అని కూడా చూడకుండా ఆమెను కిరాతకంగా కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటనతో గ్రామ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వివరాల ప్రకారం.. అప్పన్నపాలెంకు చెందిన దూసర నాగరత్నంకు వివాహమైంది. ప్రస్తుతం ఆమె ఆరు నెలల గర్భవతి. కాగా, సోమవారం వారి బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉండటంతో భర్త, కుటుంబ సభ్యులు వేరే ఊరికి వెళ్లారు. ఈ క్రమంలో నాగరత్నం మాత్రమే ఇంట్లో ఉండగా.. అదే అదునుగా పిల్లి రాజు అనే వ్యక్తి ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు. కాగా, వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని తెలుస్తోంది. ఎవరూలేని సమయంలో నాగరత్నం వద్దకు పిల్లిరాజుతో రావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పిల్లిరాజుకు కూడా వివాహం కాగా.. ఓ కుమారుడు ఉన్నాడు. హత్య సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న పిల్లిరాజు కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. అయితే, పిల్లి రాజుపై అంతకుముందు కూడా పలు నేరాలపై పోలీసు కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. -
విడాకులు తీసుకుని ఒంటరి జీవితం.. అతడితో క్లోజ్‌గా ఉంటూ..
తిరువళ్లూరు: ఓ మహిళను గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కత్తితో పొడిచి పరారయ్యారు. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. కాంచీపురం జిల్లా శ్రీపెరంబదూరు తాలుకా వలర్పురం గ్రామానికి చెందిన కార్తికేయన్ (45) దుబాయ్‌లోని ప్రింటింగ్ ప్రెస్‌లో తనతో పాటు పని చేసే శ్రీలంకకు చెందిన రోహిణివసంతి(41)ని 2005లో ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంతకాలం తరువాత తమ సొంత గ్రామానికి వచ్చి జీవనం సాగిస్తున్నారు. అయితే రోహిణి పలువురు పురుషులతో సన్నిహితంగా మెలుగుతుండడంతో పాటు ప్రవర్తనలో మార్పురాకపోవడంతో విడాకులు తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు 2017 నుంచి నెలకు రూ.50 వేలు పిల్లల పోషణ కోసం కార్తికేయన్ చెల్లిస్తున్నాడు. కాగా, తిరువళ్లూరులోని అద్దె ఇంట్లో నివాసం ఉంటూ ఆమె టైలరింగ్ షాపు నిర్వహిస్తోంది. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో టైలర్‌షాపులోనే ఆమెను ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి పరారయ్యారు. ఇన్స్పెక్టర్ పద్మశ్రీబబ్బి రక్తపుమడుగులో పడి ఉన్న ఆమెను తిరువళ్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి విచారణ చేపట్టారు. విచారణలో ఈమె కమలకన్నన్‌తో సహజీవనం చేస్తూనే, మరో కొంతమందితో సన్నిహితంగా మెలుగుతున్నట్టు తేలింది. అక్రమ సంబంధాలే హత్యాయత్నానికి కారణమై ఉండొచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: నాలుగేళ్ల క్రితమే భర్త మృతి.. అతడితో పరిచయం కాస్తా.. -
భర్తకు దూరంగా ఒంటరి జీవితం.. అతడితో జల్సాలు.. చివరకు..
మైసూర్: వివాహేతర సంబంధాలు కుటుంబాలను బజారునపడేస్తున్నాయి. క్షణికావేశాల కారణంగా వారి పిల్లలు అనాథలుగా మారుతున్నారు. తాజాగా ఇద్దరు పిల్లలున్న వ్యక్తి.. వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అది కాస్తా ప్రాణాలను తీసింది. ఈ ఘటన కర్నాటకలో చేసుకుంది. వివరాల ప్రకారం.. మైసూర్‌కు చెందిన టి. నరసీపుర తాలూకాలోని తలకాడుకు చెందిన సుమిత్ర(26)కు రవిశంకర్‌తో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. కాగా, కుటుంబ కలహాల వల్ల సుమ్రిత.. తన భర్తకు దూరంగా ఉంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో మైసూర్‌కు చెందిన సిద్దిరాజుతో సుమిత్రకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరి సంబంధం విషయం సిద్దిరాజు భార్యకు తెలియడంతో ఆమె.. భర్తను నిలదీసింది. పెద్దల సమక్షంతో పంచాయితీ పెట్టించింది. అనంతరం.. విడాకులు ఇస్తానని బెదిరించింది. అయినప్పటికీ తీరు మార్చుకోకుండా సిద్దరాజు.. సుమిత్రతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. సీక్రెట్‌గా సుమిత్రను కలుస్తూ.. వారిద్దరూ ఎంజాయ్ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో విహారయాత్రలకు వెళ్లి జల్సా చేశారు. ఇంతలో తలకాడు కావేరి నది సమీపంలోని నిసర్గధామా ప్రాంతంలో సుమిత్రా శవమై కనిపించింది. సుమిత్రా శవం పక్కనే ప్రియుడు సిద్దరాజు కూడా ఉరి వేసుకున్న స్థితిలో శవమై కనిపించడం కలకలం రేపింది. అయితే, సిద్దరాజు చనిపోయే ముందు.. అతని స్నేహితుడికి వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్ పంపించాడు. మెసేజ్‌లో సుమిత్రా చనిపోయింది.. ఆమె లేని జీవితం నాకు వద్దు, నేను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాను అని చెప్పాడు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: ఆ తల్లికి ఏ కష్టం వచ్చిందో! తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇద్దరు పిల్లలతో కలిసి.. -
ExtraMarital Affair: మామా నీ కూతుర్ని చంపేశా..
సాక్షి, కదిరి (అనంతపురం): భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం సాగించడం కళ్లారా చూసిన భర్త రగిలిపోయి రోకలిబండతో ఆమె తలపై బాది హతమార్చిన సంఘటన కదిరి మండల పరిధిలోని పట్నం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన శివశంకర్ అనే వ్యక్తి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి పదేళ్ల క్రితం సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామానికి చెందిన గోపాలప్ప కుమార్తె హేమలత (28) అనే అమ్మాయితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. ఏడేళ్ల బాలుడు మురళి, ఐదేళ్ల బాలిక కీర్తన ఉన్నారు. చదవండి: (ఏడాది కిందట పెళ్లి.. అంతలోనే ఆత్మహత్య!) పట్నం గ్రామంలో రామాంజినేయులు అనే వ్యక్తితో హేమలత గత కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం సాగిస్తోంది. ఈ విషయమై పలుమార్లు పద్దతి మార్చుకోవాలని భార్యను భర్త హెచ్చరించడం జరిగింది. అయినా ఆమె ఖాతరు చేయలేదు. బుధవారం అర్ధరాత్రి ఇంట్లో తన భార్య రామాంజినేయులుతో కలసి ఉండడం కళ్లారా చూసిన శివశంకర్‌కు ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. దీంతో పక్కనే ఉన్న రోకలి బండతో ఆమె తలపై బాదాడు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. చదవండి: (ఆ ప్రేమికుల్ని బలవంతంగా బంధించి.. పూలు చల్లి, పెళ్లి చేసి.. యువతి శరీరంపై..) ఇది చూసి భయపడిపోయిన రామాంజినేయులు పారిపోయాడు. ఆ వెంటనే తన మామ (హేమలత తండ్రి) గోపాలప్పకు నీ కూతురు అక్రమ సంబంధం పెట్టుకుంది. పలుమార్లు హెచ్చరించినా పట్టించుకోలేదు. అందుకే చంపేశానంటూ ఫోన్ చేసి చెప్పాడు. ఘటనపై సమాచారం తెలుసుకున్న పట్నం ఎస్సై సాగర్ ఘటనా స్థలానికి వెళ్లి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. శివశంకర్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్ తరలించారు. -
హత్య చేసి శవంతో పోలీస్ స్టేషన్‌కు..
సాక్షి, యశవంతపుర: సోదరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని వ్యక్తిని హత్య చేసి శవాన్ని తీసుకొచ్చి లొంగిపోయిన ఘటన బెంగళూరు అన్నపూర్ణేశ్వరినగర పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. కోలారు జిల్లా మాలూరుకు చెందిన మహిళ ఒక గార్మెంట్స్‌లో పని చేస్తూ అన్నపూర్ణేశ్వరినగర చంద్రశేఖర్ లేఔట్లో నివాసముంటోంది. ఆమె భర్త మాలూరులోనే ఉండేవాడు. ఈ సమయంలో తమిళనాడుకు చెందిన భాస్కర్ అనే వ్యక్తితో ఆమెకు రెండేళ్ల కిందట పరిచయమై అక్రమ సంబంధం ఏర్పడింది. చదవండి: (బుల్లితెర నటి ఉమామహేశ్వరి కన్నుమూత) దసరా రోజున ఆమె భర్త వద్దకు మాలూరు వెళ్లగా, అక్రమ సంబంధంపై గొడవ జరిగింది. ఇక బెంగళూరుకు వెళ్లవద్దని భర్త హెచ్చరించాడు. అయితే ఆమె చిన్న కొడుకును తీసుకొని బెంగళూరుకు వచ్చేసింది. శనివారం సాయంత్రం ఆమెను ప్రియుడు భాస్కర్ కలిశాడు. ఈ విషయాన్ని ఆమె కొడుకు మేనమామ మునిరాజుకు ఫోన్లో చెప్పాడు. మహిళ, ప్రియుడు ఆటోలో వెళ్తుండగా మునిరాజు, అతని మిత్రులు మారుతీ, నాగేశ్, ప్రశాంత్‌లు అడ్డుకుని మహిళను పంపించివేశారు. భాస్కర్‌ను తీవ్రంగా కొట్టడంతో చనిపోయాడు. అదే ఆటోలో మృతదేహాన్ని తీసుకుని అన్నపూర్ణేశ్వరినగర పీఎస్‌లో లొంగిపోయారు. నిందితులను అరెస్టు చేసినట్లు డీసీపీ సంజీవ్ పాటిల్ తెలిపారు. చదవండి: (ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. అంతలోనే భార్యను..) -
జీవితాంతం తోడుంటానన్నాడు.. మరో మహిళతో సంబంధం పెట్టుకుని
సాక్షి, గుణదల (విజయవాడ తూర్పు): జీవితాంతం తోడుంటానని పెళ్లాడిన భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను విస్మరించాడన్న మనస్తాపంతో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. మాచ వరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మొగల్రాజపురం ప్రాంతంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మాచవరం సీఐ ప్రభాకర్ కథనం మేరకు.. గుంటూరు జిల్లా, యర్రబాలెం ప్రాంతానికి చెందిన భువనగిరి నాగవెంకట అంజన్‌కృష్ణ (30)కు అదే ప్రాంతానికి చెందిన రేణుక శ్రీదేవి (19)తో గత యేడాది నవంబర్‌లో పెద్దల సమక్షంలో వివాహమైంది. కొన్ని నెలల క్రితం అంజన్‌కృష్ణ, రేణుకశ్రీదేవి విజయవాడ మొగల్రాజపురం అమ్మకల్యాణ మండపం సమీపంలోని ఓ ఇంట్లో అద్దెకు దిగారు. అదే ప్రాంతంలో సెల్‌ఫోన్ షాపు నిర్వహిస్తున్న అంజన్‌కృష్ణ భార్యను పట్టించుకోకుండా వేరే మహిళతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడు. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. అంజన్‌కృష్ణ మద్యానికి బానిసై భార్యను మానసికంగా, శారీరకంగా హింసించడం మొదలు పెట్టాడు. ఈ నేపథ్యంలో కొన్ని సార్లు పెద్దల మధ్య పంచాయితీలు జరిగాయి. ఇక పై తన భార్యను ఇబ్బందులకు గురిచేయనని పంచాయితీలో అంజన్ కృష్ణ మాటచ్చాడు. కొద్ది రోజులకే వివాహేతర సంబంధం నెరపుతూ, మద్యంతాగడం మొదలు పెట్టాడు. దీంతో దంపతుల మధ్య గొడవలు మరింతగా పెరిగాయి. చదవండి: (సీఐ గారి రైస్‌మిల్ కథ!.. సుప్రియ పేరుతో) ఆదివారం రాత్రి భార్యతో గొడవ పడిన అంజన్ కృష్ణ సోమవారం ఉదయం సెల్‌ఫోన్‌షాపు వద్దకు బయలుదేరగా, భారీ వర్షం, బంద్ కారణంగా బయటకు వెళ్లొద్దని రేణుక అతడిని వేడుకుంది. అయినా అంజన్ కృష్ణ గొడవ పడి వెళిపోయాడు. దీంతో తన భర్త చేయిదాటిపోయాడని, తన జీవితం నాశనమైపోయిందన్న మనస్తాపంతో రేణుక చున్నీతో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రాత్రి 9 గంటల సమయంలో ఇంటికి వచ్చిన అంజన్‌కృష్ణకు తన భార్య ఉరికి వేళాడుతూ కన్పించింది. ఈ సమాచారం అందుకున్న మాచవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: (సైబర్ కేఫ్‌లో ఇద్దరు బాలికలపై గ్యాంగ్ రేప్) -
వివాహేతర సంబంధం: నడిరోడ్డుపై భార్యను చంపేశాడు
సాక్షి, తూర్పుగోదావరి : పెంటపాడు మండలంలో వివాహితను భర్త దారుణంగా హత్య చేశాడు. మరో వ్యక్తితో మోటార్‌సైకిల్‌పై వెళుతున్న ఆమెను శుక్రవారం ఉదయం భర్త అడ్డగించి విచక్షణారహితంగా మెడపై కత్తితో నరికి చంపడం సంచలనం రేకిత్తించింది. తాడేపల్లిగూడెం టౌన్ సీఐ ఆకుల రఘు తెలిపిన వివరాల ప్రకారం.. గణపవరం మండలం చిలకంపాడు గ్రామానికి చెందిన దువ్వారపు చంటియ్యకు అదే మండలం మొయ్యేరు గ్రామానికి చెందిన చంద్రికతో ఆరేళ్లక్రితం వివాహం జరిగింది. వీరికి పిల్లలు లేరు. చదవండి: (నవ జంట ఆత్మహత్య.. మొదటి భర్త అండమాన్‌లో..) కొంతకాలంగా తరచూ గొడవలు పడుతున్న వీరి కుటుంబంలో సోషల్‌మీడియా చిచ్చుపెట్టింది. సోషల్‌మీడియాలో ఉంగుటూరు మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన కొమ్ము జెర్సీతో చంద్రికకు పరిచయం ఏర్పడింది. నాలుగునెలులుగా తన భర్తకు దూరంగా ఉంటున్న చంద్రిక ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో జెర్సీతో కలిసి నివసిస్తోంది. ఈ విషయంపై భార్యా, భర్తల మధ్య మరింత అగాధం ఏర్పడింది. తన భర్తను వదిలి వేరుగా ఉండాలని నిర్ణయించుకుని కుటుంబసభ్యులతో చర్చించి పెద్దల సమక్షంలో విడిపోదామనుకొంది. అదే సమయంలో గొల్లగూడెం నుంచి పెంటపాడు వైపు మోటార్‌సైకిల్‌పై వస్తున్న జెర్సీ, చంద్రికలను భర్త చంటియ్య, మరో ఇద్దరితో కలిసి అడ్డగించి వాగ్వాదానికి దిగారు. చదవండి: (పెళ్లయినా మరదలిపై కన్నేసి.. ఎంత పనిచేశాడంటే..!) తనతో తెచ్చుకొన్న కత్తితో చంటియ్య తన భార్యను మెడపై నరికాడు. కాగా తీవ్ర గాయాలతో చంద్రిక మృతి చెందింది. భర్తతో పాటు, మరో ఇద్దరు పరారయ్యారు. జెర్సీ పెంటపాడు పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై కె. శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. ఇన్చార్జి సీఐ ఆకుల రఘు పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కొవ్వూరు ఇన్చార్జ్ డీఎస్పీ లలిత సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సంఘటనా స్థలం వద్ద చంద్రిక తల్లిదండ్రులు కృష్ణవేణి, శ్రీనివాసరావులు తీవ్రంగా రోధించారు. చంద్రిక మృతదేహాన్ని గూడెం ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. చదవండి: (మళ్లీ ప్రేమలో పడ్డా) -
వివాహేతర బంధం ఆ మహిళకు యమపాశమైంది
సాక్షి, బాపట్ల: వివాహేతర బంధం ఆ మహిళకు యమపాశమైంది. ఓ వ్యక్తి చెడు వ్యవసనాలు అప్పులుపాలు చేయటంతోపాటు హత్య చేసేందుకు పురిగొల్పాయి. భర్త చేసిన నేరంలో పాలుపంచుకున్న భార్య కూడా కటకటలపాలైంది. బాపట్ల సబ్ డివిజన్లోని నగరం స్టేషన్ పరిధిలో జరిగిన మహిళ హత్య కేసులో నిందితులైన భార్యాభర్తలను పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు. డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో హత్య కేసు వివరాలను వెల్లడించారు. చదవండి: (హైటెక్ వ్యభిచారం: వాట్సాప్‌లో ఫొటోలు.. ఓకే అయితే) నవంబరు 4వ తేదీన ఇంటూరు సమీపంలోని పూడివాడ మురుగుకాలువలో మహిళ మృతదేహం ఉన్నట్లు గుర్తించిన వీఆర్ఓ ఎం.విజయసాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ జి.శ్రీనివాసరావు, ఎస్సై వాసు దర్యాప్తు చేపట్టారు. మృతురాలు చెరుకుపల్లిలోని కొత్తపేటకు చెందిన కొటారి సామ్రాజ్యంగా గుర్తించారు. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించే సామ్రాజ్యంకు ఇంటూరు గ్రామానికి చెందిన పోతర్లంక శ్రీనివాసరావుతో 20 సంవత్సరాలుగా వివాహేతర సంబంధం ఉంది. ఇంటూరులో అప్పులు చేసిన శ్రీనివాసరావు అక్కడ నుంచి వచ్చి బాపట్లలోని బేస్తపాలెంలో నివాసం ఉంటున్నాడు. మాట్లాడుతున్న డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ జి.శ్రీనివాసరావు, ఎస్సై వాసు శ్రీనివాసరావు చెరుకుపల్లి వెళ్లి సామ్రాజ్యాన్ని నవంబరు 3వతేదీన ఆమె బంధువులు నిజాంపట్నం మండలం కోనఫలం గ్రామంలో ఉండటంతో ద్విచక్రవాహనంపై తీసుకుపోయాడు. బంధువుల ఇంట్లో శుభకార్యంలో పాల్గొని సాయంత్రం ఊరిబయట తన కోసం ఎదురుచూస్తున్న శ్రీనివాసరావుతో కలిసి ద్విచక్రవాహనంపై తిరుగు ప్రయాణమైంది. పథకం ప్రకారం శ్రీనివాసరావు కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి ఆమెతో తాగించి మురుగుకాలువలో ముంచి హత్య చేశాడు. ఆమె వద్ద ఉన్న ఐదున్నర సవర్ల బంగారం, కొద్దిగా వెండి, రూ.400 తీసుకుని మృతదేహాన్ని అక్కడే వదిలివెళ్లాడు. అక్కడ నుంచి బాపట్లలోని బెస్తపాలెంకు చేరుకుని భార్య పద్మావతికి జరిగిన విషయం తెలియజేసి రూ.1.25 లక్షలకు బంగారం విక్రయించి వచ్చిన వాటితో అప్పులు తీర్చుకోవటంతోపాటు గుంటూరు, విజయవాడ, నెల్లూరు, గిద్దలూరు, ఖమ్మం, తల్లాడ వంటి ప్రాంతాల్లో తిరిగి మొత్తం ఖర్చు చేసుకున్నారు. సామ్రాజ్యం మృతదేహాన్ని గుర్తించినట్లు తెలుసుకున్న భార్యాభర్తలు వీఆర్వో విజయ్‌సాగర్ వద్దకు వచ్చి 5వతేదీన లొంగిపోయారు. నిందితులు విక్రయించిన బంగారాన్ని రికవరీ చేయటంతోపాటు వారిపై హత్య కేసు నమోదు చేసి జైలుకు పంపినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కేసును అత్యంత వేగంగా చేధించిన సీఐ జి.శ్రీనివాసరావు, ఎస్సై వాసులతోపాటు సిబ్బందికి రూరల్ ఎస్పీ విశాల్ గున్ని దృష్టికి తీసుకుపోయి రివార్డు అందించేందుకు కృషి చేస్తామని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. -
నాయనా.. తప్పు చేసినా సచ్చిపోతున్నాను!
సాక్షి, తిరుపతి క్రైమ్: ‘‘నాయనా! తప్పు చేసినాను..మళ్లీ ఇంటికి రావాలంటే ఏదోలా ఉంది..నన్నెవరూ క్షమించరు..పిలకాయలతో ఓసారి మాట్లాడించు నాయనా..మీకు నా ముఖం చూపలేక సచ్చిపోతున్నాను.’’ అని ఫోన్లో చెప్పి ఓ వివాహిత ఆత్మహత్యకు యత్నించింది. చికిత్స పొందుతూ గురువారం మరణించింది. ఈస్ట్ ఎస్ఐ జయచంద్ర కథనం...శ్రీకాళహస్తికి చెందిన సురేష్ కుమార్తె చెంచమ్మ (27)కు పాపానాయుడుపేటకు చెందిన వ్యక్తితో 8 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే చెంచమ్మ అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇది తెలుసుకున్న ఆమె భర్త, తల్లిదండ్రులు ఎన్నోసార్లు మందలించినా తీరు మారలేదు. ఈ నేపథ్యంలో చెంచమ్మ గత నెల 11న తన ప్రియుడితో కలిసి జంప్ అయ్యింది. చదవండి: (ప్రేమ పెళ్లి.. అనంతరం ప్రియుడి మోజులో..) ఎక్కడెక్కడో తిరిగి ఈ నెల 1న వారిద్దరూ తిరుపతికి చేరుకున్నారు. ఆమె ప్రియుడు మాత్రం నేరుగా తన ఇంటికి వెళ్లిపోయాడు. అయితే చెంచమ్మ మాత్రం ఇంటికి వెళ్లేందుకు జంకి, అదే రోజు సాయంత్రం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుంచి తండ్రికి ఫోన్ చేసింది. తన పిల్లలతో ఒకసారి మాట్లాడించాలని కోరింది. తాను విషం తాగానని, చనిపోతున్నానని చెప్పి ఉన్నఫళాన పడిపోయింది. స్థానికులు గమనించి 108లో ఆస్పత్రికి తరలించారు. ఆందోళన చెందిన ఆమె తండ్రి తిరిగి ఫోన్ చేయడంతో స్థానికులు జరిగిన విషయాన్ని తెలిపారు. రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున చెంచమ్మ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. చదవండి: (పెళ్లయిన తొమ్మిది నెలలకే...) -
ప్రేమ పెళ్లి.. అనంతరం ప్రియుడి మోజులో..
సాక్షి, కర్ణాటక (మండ్య): ప్రేమపెళ్లి చేసుకుని కొడుకుతో అన్యోన్యంగా ఉన్న ఒక కుటుంబంలో ప్రియుడు చిచ్చుపెట్టాడు. అతని మోజులో పడి భార్య కట్టుకున్న భర్తనే కాటికి పంపింది. ఈ ఘోరం మండ్య తాలూకాలోని హనకెరెలో ఆలస్యంగా వెలుగు చూసింది. మండ్య గ్రామీణ పోలీసులు తెలిపిన మేరకు... గ్రామానికి చెందిన ప్రదీప్ (35), భార్య శిల్ప (30) 13 ఏళ్ల కిందట ప్రేమించుకుని పెళ్లాడారు. వారికి 12 ఏళ్ల కొడుకు ఉన్నాడు. దంపతులు సంతోషంగా ఉన్నారు. ఇంతలో మూడేళ్ల కిందట మధు నాయక్ (34) అనే వ్యక్తి శిల్పకు పరిచయమయ్యాడు. ఇతను కేఆర్ నగరవాసి. స్వయం సేవా సంఘాల వారికి రుణాలను ఇప్పించడం వంటి దళారీ పనులు చేసేవాడు. శిల్ప, మధుల పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. శిల్ప భర్త ఇంట్లో లేని సమయంలో నేరుగా ఇంటికే వచ్చివెళ్లేవాడు. బయట షికార్లు సరేసరి. ఇది తెలిసి ప్రదీప్ భార్యను తీవ్రంగా మందలించగా ఎన్నోసార్లు గొడవలూ జరిగాయి. చదవండి: (పెళ్లయిన తొమ్మిది నెలలకే...) బంధువులకు అనుమానం ఇలా తమ ఆనందానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని ప్రేయసీప్రియులు పథకం వేశారు. నవంబర్ 18వ తేదీన రాత్రి గుట్టుగా భోజనంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. దీంతో మత్తులోకి జారుకున్న భర్తను ప్రియునితో కలిసి గొంతు నులిమి చంపింది. తెల్లవారుజామున గుండెపోటుతో చనిపోయాడని శిల్ప ఉత్తుత్తి ఏడుపు ఏడ్చి అనుమానం రాకుండా అంత్యక్రియలు జరిపించింది. అప్పటినుంచి ప్రియుడు మధుతో జల్సాలు చేస్తుండడం చూసి ప్రదీప్ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపి నిజాలు చెప్పించారు. తామే హత్య చేశామని శిల్ప, మధు అంగీకరించారు. అరెస్టు చేసి జిల్లా జైలుకు తరలించారు. -
కాబోయే భర్తతో కలిసి బాస్‌ను హత్యచేసిన మహిళ
సాక్షి, ఢిల్లీ: కాబోయే భర్తతో కలిసి ప్రియుడ్ని హత్యచేసిందో మహిళ. ఢిల్లీలో నీరజ్ గుప్తా అనే వ్యాపారవేత్త వాయువ్య ఢిల్లీలో ఆదర్శ్ నగర్లో ఉంటున్నాడు. అయితే అతను తప్పిపోయినట్లు భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొన్ని రోజులుగా తన భర్త కనిపించడం లేదని, ఈ ఘటన వెనుక ఫైజల్ అనే మహిళ ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఈ కోణంలో విచారించగా గుప్తాను హత్య చేసినట్లు తేలింది. ఇందులో పైజల్ హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల దర్యాప్తులో ఫైసల్ గుప్తా దగ్గర పనిచేసేదని, గత 10 సంవత్సరాలుగా అతనితో వివాహేతర సంబంధం కలిగి ఉందని వెల్లడైంది.చదవండి:(భర్త దోపిడీ వెనుక భార్య.. ఐదుకోట్లు స్వాహా) వివరాల్లోకి వెళితే.. పైజల్‌కు జుబేర్ అనే వ్యక్తితో నిశ్చితార్థం కాగా, ఆ విషయాన్ని నీరజ్ గుప్తాకు తెలిపింది. అయితే వివాహానికి గుప్తా అభ్యంతరం తెలపడంతో నవంబరు 13న ఆదర్శ్ నగర్ లో కేవాల్ పార్క్ ఎక్స్టెన్షన్లో పైజల్ అద్దె ఇంటికి వచ్చి తల్లి, జుబెర్, తీవ్ర వాగ్వాదానికి దిగాడు. వారి మధ్య వాగ్వాదం తీవ్ర కావడంతో ఫైజల్ కాబోయే భర్త గుప్తా తలపై ఇటుకతో కొట్టి , కడుపులో పొడిచిన తరువాత అతని గొంతును కోశారు. మృతదేహాన్ని తరలించడంలో పైజల్. ఫైజల్ తల్లి జుబెర్‌కు సహయాన్ని అందించారు.అతని మృతదేహాన్ని సూట్‌కేస్‌లో ఉంచి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో తీసుకెళ్లారు. గుజరాత్ భరూచ్ సమీపంలో రైలు నుంచి బయటకు విసిరేశారు. హత్య చేసిన నిందితులు పైజల్ (29), ఆమె తల్లి షాహీన్ నాజ్ (45), కాబోయే భర్త జుబెర్ (28)ను అరెస్టు చేసినట్లు నార్త్‌వెస్ట్ జోన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ విజయంత ఆర్య తెలిపారు. -
వివాహేతర సంబంధం.. నీవు లేక నేను లేనంటూ
సాక్షి, చెన్నై : వివాహేతర సంబంధానికి స్వస్తి పలకలేక ఓ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో యువకుడు మరణించాడు. వివాహిత ప్రాణాపాయం నుంచి బైటపడింది. ఎస్ఐ నాగేశ్వర్ కథనం ప్రకారం.. మండలంలోని తెల్లరాళ్లపల్లెకు చెందిన దిలీప్ కుమార్(22) అదే గ్రామానికి చెందిన 20 ఏళ్ల వివాహితతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఇది ఆమె భర్తకు తెలియడంతో అతను మందలించాడు. అయినా వీరి తీరు మారలేదు. ఈ నేపథ్యంలో మరోసారి తీవ్రంగా హెచ్చరించారు. దీంతో వారిద్దరూ ఆదివారం మధ్యాహ్నం అదృశ్యమయ్యారు. (ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం; ఆరుగురు మృతి) మండలంలోని దొనిరేవులపల్లెకు ఆనుకుని ఉన్న తమిళనాడు సరిహద్దులోని అటవీప్రాంతంలో విషం సేవించి స్పృహ కోల్పోయారు. సాయంత్రం ఆ మహిళ స్పృహలోకి వచ్చింది. దిలీప్ అప్పటికే చనిపోయాడు. ఇంతలో వారి బంధువులు గాలిస్తూ అక్కడికి చేరుకున్నారు. ఆమెను చీలాపల్లె సీయంసీకి తరలించడంతో కోలుకుంది. చిత్తూరులో పోస్టుమార్టం అనంతరం దిలీప్ మృతదేహాన్ని సోమవారం అతడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియుడి మోజులో.. సెల్‌ఫోన్ చార్జింగ్ వైరుతో..
సాక్షి, కొత్తూరు: ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తనే కడతేర్చిన భార్య ఉదంతమిది. సెల్‌ఫోన్ చార్జింగ్ వైరును మెడకు చుట్టి దారుణంగా హతమార్చి.. ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూసినప్పటికీ పోస్టుమార్టం నివేదికలో హత్యగా తేలింది. ఈ దారుణానికి సంబంధించి కొత్తూరు ఎస్సై వై.సింహాచలం తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తూరు కాలేజీ రోడ్డుకు ఆనుకొని నివాసం ఉంటున్న దూలి రాము(35) ఈ నెల 26వ తేదీన చనిపోయాడు. అయితే తొలుత అత్మహత్యగా భావించారు. తల్లి లక్ష్మి మాత్రం రామును హత్య చేశారని ఆరోపిస్తూ అదేరోజున పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాము మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. నివేదికలో హత్యగా వైద్యులు నిర్ధారించినట్టు ఎస్సై వివరించారు. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. రాము భార్య కుమారి ఇదే గ్రామానికి చెందిన సొండి సతీష్‌తో వివాహేతర సంబంధం కలిగి ఉన్నట్టు గుర్తించి వారిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించినట్టు ఎస్సై చెప్పారు. తమ ఆనందానికి రాము అడ్డుగా ఉండేవాడని, దీంతో ప్రాణం తీసి అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నామని చెప్పినట్టు వివరించారు. (ప్రేమకథ విషాదాంతం) సెల్‌ఫోన్ చార్జింగ్ వైరును రాము మెడకు గట్టిగా బిగించి ప్రాణం తీశారన్నారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులను నమ్మించేందుకు ఉరివేసుకున్నట్లు పీకకు చున్నీ చుట్టి ఫ్యాన్‌కు వేలాడిదీసినట్టు కుమారి, సతీష్‌లు అంగీకరించారన్నారు. ఇద్దరినీ అరెస్టు చేసి శ్రీకాకుళం జ్యుడిషియల్ మెజిస్టేట్ కోర్డులో హజరు పరిచినట్లు చెప్పారు. కాగా తండ్రి చనిపోవడం, జైలుకి వెళ్లడంతో పాప శ్రీజ(7), బాబు సిద్దూ(5) ఒంటరయ్యారు. -
ప్రేమ వివాహం.. భర్త హత్య
సాక్షి, బెంగళూరు: మాదేశ్(35) అనే వ్యక్తి హత్య కేసులో అతని భార్యతో పాటు ముగ్గురిని జిగణి పోలీసులు అరెస్ట్‌చేశారు. వివరాలు.. డెంకణికోటకు చెందిన ప్రేమా, మాదేశ్‌లది ప్రేమ వివాహం. వీరికి ఒక కూతురు ఉంది. మాదేశ్ టైలర్‌గా, ప్రేమ జిగణి సమీపంలో గార్మెంట్స్‌లో పనిచేసేది. లాక్డౌన్ సమయంలో ఇంటివద్దనే ఉండే ప్రేమకు శివమల్ల అనే వ్యక్తితో సంబంధం ఏర్పడింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని వెళ్లిపోవాలనుకున్నారు. ఇందుకు అడ్డుగా ఉన్నాడని మాదేశ్‌ను చంపేయాలని నిర్ణయించారు. ఈ నెల 17 తేదీ రాత్రి అతడు ఒంటరిగా ఉండగా రాళ్లతో కొట్టి చంపి పరారయ్యారు. పోలీసులు గాలించి ప్రేమా, శివమల్లుతో పాటు వారికి సహకరించిన మల్లేశ్‌ను అరెస్ట్ చేశారు. (అన్న కొడుకుతో ప్రేమ వ్యవహారం.. మందలించడంతో) -
వివాహేతర సంబంధం: మెడలో చెప్పులతో
రాంచీ: జార్ఖండ్‌లో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకున్నారన్న కారణంతో గ్రామపంచాయతీ పెద్దలు ఆ జంటకు మెడలో బూట్ల దండలు వేసి గ్రామమంతా ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు వారిని కాపాడారు. వివరాల్లోకెళ్తే.. జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్‌లోని జుహిబోనా గ్రామానికి సమీపంలో ఈ సంఘటన జరిగింది. బకూరీకి చెందిన ఓ మహిళ మోడికోలా గ్రామంలో వివాహం చేసుకుంది. అయితే ఈ మధ్య శివ పహాద్ ప్రాంతంలోని తన బంధువులతో కలిసి ఉండటానికి వచ్చింది. (బస్సులో మంటలు.. 13 మంది సజీవదహనం) ఈ క్రమంలో జుహిబోనా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడి, అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామపెద్దలు ఈ జంటను గ్రామపంచాయతీకి పిలిచారు. వారి కుటుంబ సభ్యులను కూడా సమావేశానికి హాజరుకావాలని కోరారు. ఈ సందర్భంగా.. గ్రామ పంచాయతీ వారికి రూ.5లక్షల జరిమానా విధించింది. పంచాయతీ ఆదేశం మేరకు ఈ జంట బలవంతంగా బూట్ల దండతో గ్రామమంతా తిప్పారు. సంప్రదాయాలను, కట్టుబాట్లను అతిక్రమించకుండా ఉండటం తమ ప్రధాన కర్తవ్యం అని పంచాయతీ పేర్కొంది. వైరల్ అయిన ఈ వీడియో పోలీసుల దాకా వెళ్లడంతో వెంటనే అక్కడకు చేరుకొని వారిని రక్షించారు. (ఘోర రోడ్డు ప్రమాదం; గర్భిణి సహా ఏడుగురు మృతి) -
ప్రియుడితో పారిపోయి.. భర్తపై నెపం వేసి
సాక్షి, బెంగళూరు : నేర నేపథ్యం కలిగిన ప్రియుడితో పారిపోయిన వివాహిత, భర్తను జైలుకు పంపించాలనే పథకం బెడిసికొట్టి చివరికి అడ్డంగా దొరికిపోయింది. వివరాలు... వైట్‌ఫీల్డ్‌కు చెందిన కారు డ్రైవర్ (32)తో ఎనిమిదేళ్ల క్రితం ఓ యువతికి వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల కుమార్తె ఉంది. ఇదిలా ఉంటే మూడు రోజుల క్రితం కుటుంబ సలహా కేంద్రానికి సదరు మహిళ ఫోన్ చేసి తన భర్త వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా చీటీలు నడుపుతున్నాడని, వ్యతిరేకించినందుకు తనను ఇంటి నుంచి గెంటివేశాడని పేర్కొంది. దీంతో కుటుంబ సలహా కేంద్రం సభ్యులు అపర్ణ పూర్ణేశ్ ఆమె భర్త ఫోన్ నెంబర్ తీసుకుని విచారణ చేయగా సదరు మహిళ అసలు రంగు బయటపడింది. (వైరల్: వాట్సప్ గ్రూప్‌లోకి అశ్లీల చిత్రాలు) ప్రియుడితో కాపురం : కొద్ది నెలల క్రితం సదరు మహిళ స్నేహితులతో విహార యాత్రకు వెళ్లింది. ఆ సమయంలో వారితో వచ్చిన ఓ యువకుడి పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరు తరచూ ఫోన్ల ద్వారా మాట్లాడుకునేవారు. స్నేహం ప్రేమగా మారింది. పది రోజుల క్రితం సదరు యువతి ఇల్లు వదిలి ప్రియుడితో వెళ్లిపోయింది. భార్య కనిపించకపోవడంతో ఆందోళన చెందిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో అత్తిబెళలో మరో వ్యక్తితో ఉన్నట్లు తేలింది. దీంతో రంగంలోకి దిగిన కుటుంబ సలహా కేంద్ర సభ్యురాలు అపర్ణ ఆ యువతిని తీసుకువచ్చి కౌన్సెలింగ్ ఇచ్చారు. తప్పుడు ఫిర్యాదులో భర్తను జైలుకు పంపాలని తానే కట్టుకథ అల్లానని యువతి విచారణలో చెప్పినట్లు అపర్ణ తెలిపారు. ప్రస్తుతం భర్త ఆమెతో కాపురం చేయడానికి అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య సయోధ్యకు యత్నిస్తున్నారు. -
వివాహేతర సంబంధానికి దారితీసిన టిక్‌టాక్
సాక్షి, వేలూరు: టిక్‌టాక్ ద్వారా పరిచయమైన వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడడంతో.. భార్యకు విడాకులు ఇచ్చేందుకు భర్త నిర్ణయించిన ఘటన సంచలనం కలిగించింది. వేలూరుకు చెందిన 30 ఏళ్ల మహిళకు వివాహం అయ్యి, ఇద్దరు పిల్లలున్నారు. ఈమె భర్త ప్రయివేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇద్దరు పిల్లలకు తల్లయిన ఈమె తరచూ టిక్ టాక్‌లో కవితలు చెప్పడం, డ్యాన్స్ చేయడం, పాటలు పాడడం లాంటివి చేస్తుండేది. ఆ వీడియోలను వాట్సాప్ ద్వారా ఇతరులకు పంపేది. ఈమె టిక్‌టాక్‌లను గమనించిన వేలూరులో పనిచేస్తున్న ఇతర రాష్ట్రానికి చెందిన వివాహమైన 32 సంవత్సరాల వ్యక్తి లైక్ ఇవ్వడం, కామెంట్ పెట్టడం ప్రారంభించాడు. ఐదు నెలల క్రితం వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఫోన్లో మాట్లాడడం ప్రారంభించారు. అప్పటి నుంచి వీరి స్నేహం ప్రేమగా మారింది. అక్రమ సంబంధానికి దారితీసింది. ఆ మహిళ తన కుటుంబ సభ్యులను సక్రమంగా పట్టించుకునేది కాదు. భార్యపై అనుమానం వచ్చిన భర్త ఆమె సెల్‌ఫోన్‌ను పరిశీలించగా టిక్‌టాక్‌కు బానిసైనట్టు గమనించారు. మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్న విషయాన్ని గమనించాడు. వీటిపై పలు మార్లు భార్యను ఖండించినప్పటికీ వినలేదు. వేలూరు మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు స్పందించారు. ఆక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని ప్రయివేటు కంపెనీలో పనిచేయడాన్ని నిలుపుదల చేశారు. ఆపై ఆంధ్ర రాష్ట్రానికి పంపి వేశారు. అనంతరం ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపి వేశారు. అయినప్పటికీ ఆమె టిక్ టాక్ మోజులో పడడంతో విడాకులు ఇచ్చేందుకు భర్త అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: వివాహిత ప్రాణం తీసిన టిక్‌టాక్ మోజు ‘తిక్క’టాక్ యువకుడి అరెస్టు తిరువొత్తియూరు: పుదుకోటై బస్టాండ్‌లో ప్రజలు భయాందోళనకు గురయ్యోలా ప్రవర్తిస్తూ టిక్‌టాక్ చేస్తున్న యువకుడిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పుదుకోటై కొత్త బస్టాండ్, తిరుచ్చి రైల్వే స్టేషన్, బస్టాండ్ తదితర చోట్ల ఓ యువకుడు ప్రజలు భయాందోళనకు గురయ్యేలా విద్యార్థులను ఢీకొట్టడం, వారి ముందు నృత్యం చేయడం, వింతగా ప్రవర్తించడంపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ అరుణ్ శక్తికుమార్ ఆదేశాలకు మేరకు పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. విచారణలో వడగాడు సమీపంలోని కరుక్కానుకురిచ్చి ప్రాంతానికి చెందిన కన్నన్ (21)గా తెలిసింది. ఇతను పుదుకోటైలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతున్నాడు. -
వీడిన వివాహిత హత్య మిస్టరీ
పుత్తూరు : నారాయణవనంలో వివాహిత హత్య మిస్టరీ ఒక రోజు వ్యవధిలోనే వీడింది. వివాహేతేర సంబంధాలకు అడ్డుగా ఉందని సాక్షాత్తు భర్తే కిరాయి వ్యక్తులతో హత్య చేయించాడు. తన అక్క కొడుకుతో కలిసి దీనికి స్కెచ్ వేశాడు. పుత్తూరు ఇన్చార్జి డీఎస్పీ సూర్యనారాయణ మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించిన కథనం..వైఎస్సార్ కడప జిల్లా, రైల్వే కోడూరుకు చెందిన సాధు శివకుమార్‌కు 15 ఏళ్ల క్రితం అదే ఊరికి చెందిన సుజాతతో వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. శివకుమార్ నారాయణవనంలో ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. కొంతకాలంగా సుజాత మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతోంది. దీం తో శివకుమార్ ఇతర స్త్రీలతో సన్నిహిత సంబంధాలు నెరపేవాడు. విడాకులు ఇవ్వాలని కోరినా సుజాత ససేమిరా అనడంతో ఆమె అడ్డు తొలగించుకోవాలని శివకుమార్ వ్యూహరచన చేశాడు. అక్క కొడుకు సహకారంతో... విషప్రయోగంతో సుజాతను కడతేర్చేందుకు దారులు అన్వేషించి , చివరకు హత్యనే మార్గంగా ఎంచుకున్నాడు. ఆపై, తిరుపతిలోని కాటన్ మిల్లు వద్ద కాపురముంటున్న తన అక్క కొడుకు రవికుమార్‌తో కలిసి ఆటోనగర్‌లో ఉంటున్న ఉపేంద్ర, నాగరాజును సంప్రదించి స్కెచ్ వేశాడు. నెత్తురు చిందించకుండా సుజాతను అంతమొందించాలంటూ రూ. 50 వేలతో డీల్ కుదుర్చుకున్నాడు. సుజాతను గుర్తు పట్టేందుకు వీలుగా పది రోజుల క్రితం వీరిద్దరినీ నారాయణవనానికి పిలిపించి తన స్నేహితులుగా ఆమెకు పరిచయం చేశాడు. గొంతు నులిమి చంపేశారు ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం ఊరికి వెళుతున్నట్లు చెప్పి సోమవారం ఉదయం శివకుమార్ ఇంట్లో నుంచి వచ్చేశాడు. అప్పటికే బైపాస్ సమీపంలో సిద్ధంగా ఉన్న ఉపేంద్ర, నాగరాజును కలిశాడు. ఆ తర్వాత మద్యం సేవించిన ఉపేంద్ర, నాగరాజు మధ్యాహ్నం 12.15 సమయంలో శివకుమార్ ఇంటికి వెళ్లారు. తన భర్త వారిని స్నేహితులుగా పరిచ యం చేసి ఉండడంతో వారిని ఇంట్లోకి రమ్మంది. ఇదే అవకాశంగా ఆమెను హత్య చేసేందుకు వారు యత్నించారు. ఉపేంద్ర సుజాత కాళ్లూచేతులను పట్టుకోగా, నాగరాజు లెగ్గిన్‌తో ఆమె గొంతు బిగించాడు. సుజాత కేకలు పెట్టడడంతో మిద్దెపై కాపురముంటున్న వాళ్లు వచ్చి తలుపులు తట్టడంతో నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారు. స్థానికుల సమాచారంతో ఇరువురినీ అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. సుజాతను పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ ఆమె మృతి చెందిందిందని చెప్పారు. మరో నిందితుడు రవికుమార్ పరారీలో ఉన్నాడని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఆయన చెప్పారు. 24 గంటల్లో కేసును ఛేదించిన సీఐ కొండయ్య, ఎస్ఐ హనుమంతప్ప, పురుషోత్తం, ఏఎస్ఐ సురేష్, కానిస్టేబుళ్లు రాకేష్‌లను ప్రత్యేకంగా అభినందిస్తూ వీరికి ఎస్పీ రాజశేఖర్‌బాబు రివార్డులు ప్రకటించినట్లు ఆయన చెప్పారు. -
వివాహేతర సంబంధం: ఒకరి హత్య
గోనెగండ్ల: కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్దమర్రివీడు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వీరన్న(26) అనే యువకుడు ఓ వివాహితతో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం ఆమె ఇంట్లోనే వీరన్న దారుణ హత్యకు గురయ్యాడు. ఆమెతో సన్నిహితంగా ఉండటం గమనించి భర్తే, వీరన్న తలపై మోది చంపి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సర్ధార్ హత్యకు వివాహేతర సంబంధమే కారణమా?
తలపై బండరాయితో మోది మట్టుబెట్టిన దుండగులు కోదాడ మండలం గణపవరంలో ఘటన కోదాడరూరల్: ఇంటి ఆరుబయట నిద్రిస్తున్న వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దుండగు లు బండరాయితో తలపై బలంగా మోదడంతో అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. కోదాడ మండలం గణపవరం గ్రామంలో మంగళవారం ఈ ఘటన వెలుగుచూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన షేక్.సర్ధార్ (52) లారీడ్రైవర్‌గా పని చేస్తు జీవిస్తున్నాడు. ఎప్పటిలాగే డ్యూటీ ముగించుకుని సోమవారం ఇంటికి వచ్చాడు. అన్నం తిన ్న తర్వాత ఇంటి ఎదురుగా ఉన్న అరుగుపై పడుకునేందుకు వెళ్లాడు. అదే అరుగుపై పడుకోవాడానికి ఇంటి పక్కన ఉన్న మరో వ్యక్తి అక్కడకు వచ్చి చూడగా సర్ధార్ తలపై రాయిపడి ఉండటం గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. ఈలోపు చుట్టుపక్కల ఇంటి వారు గుమిగూడి అతడిని పరిశీలించగా అప్పటికే మృతిచెంది ఉన్నాడు. దాదాపుగా 50 కేజీల బరువున్న రాయిని తలపై ఎత్తివేయడంతో నుదుటి భాగం నుజ్జునుజ్జై తీవ్ర రక్తస్రావమై మృతి చెందాడు. సమాచారం తెలుసుకుని కోదాడ రూరల్ సీఐ మధుసూదన్‌రెడ్డి, ఎస్ఐ విజయ్‌ప్రకాశ్ ఆధ్వర్యంలో సిబ్బంది ఘటన స్థలాన్ని పరిశీలించారు. జిల్లా కేంద్రం నుంచి డ్వాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీంను పిలిపించి విచారణ చేపట్టారు. జాగిలాలు గ్రామ వీధుల నుంచి మేళ్లచెర్వు మండలం రామాపురం వైపు ఉన్న కల్వకట్ట వరకు వెళ్లి నిలిచి పోయాయి. మృతదేహానికి కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. వివాహేతర సంబంధమే కారణమా? సర్ధార్ హత్యకు వివాహేతర సంబంధమే కారణమై ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సర్ధార్ గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని పదిహేనేళ్లుగా అక్కడే ఉన్నాడు. నాలుగేళ్ల క్రితం కుమారుడి వివాహానికి వచ్చి భార్య వద్దనే ఉంటున్నాడు. తమను దూరం చేశాడనే ఉద్దేశంతోనే వివాహేతర సంబంధం పెట్టుకున్న సదరు మహిళ, ఆమె కుమారుడు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ మృతుడి కుమారుడు జానీపాషా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లారీడ్రైవ ర్గా పనిచేస్తున్న సర్ధార్ ఇంకా ఎరితోనైనాన గొడవలు పెట్టుకున్నాడా.. అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, వివాహాలైన ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
హంతకుడెవరు?
మహిళ మృతి, వివాహేతర సంబంధం, సునీత భర్తా? ప్రియుడా? హత్యకు ప్రేరేపించిన వివాహేతర సంబంధం మిస్టరీగా గిరిజన వివాహిత హత్య వీరఘట్టం: శ్రీకాకుళం జిల్లాలో గిరిజన మహిళ హత్యకేసు మిస్టరీగా మారింది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని తెలుస్తుండగా.. ఇంతకీ హంతకుడు ఎవరన్నది అంతుచిక్కకుండా ఉంది. వీర ఘట్టం మండలంలోని దశుమంతుపురం పంచాయతీ పరిధిలోని పెద్దూరు గ్రామసమీపంలో వివాహిత బిడ్డిక సునీత(35) శనివారం హత్యకు గురైన ఘటన విదితమే. ఆమెకు వేరొక వ్యక్తితో ఉన్న వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను భర్త అంతమొందించాడా? లేదా, ప్రియుడే కాలయముడయ్యాడా? తేలాల్సి ఉంది. పాలకొండ డీఎస్పీ సి.హెచ్ ఆదినారాయణ, సీఐ ఎన్.వేణుగోపాలరావు ఆదివారం సంఘటన స్థంలో ఉన్న సునీత మృతదేహాన్ని పరిశీలించారు. ఇమె బంధువులతో మాట్లాడారు. హత్యకు గల కారణాలపై పలువురిని అడిగి ఆరా తీశారు. ఈ హత్యపై వీఆర్వో రామమూర్తినాయుడు ఫిర్యాదు మేరకు వీరఘట్టం ఎస్సై బి.రామారావు కేసు నమోదు చేశారు. బంధువుల సమక్షంలో పంచనామా పెద్దూరు గ్రామస్తులు, మృతురాలి బంధువుల సమక్షంలో పోలీసులు శవ పంచనామా చేశారు.అనంతరం మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సీఐ వేణుగోపాలరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధమే పోలీసులు, హతురాలి భర్త గుండయ్య (మూగవాడు) చెబుతున్న వివరాల ప్రకారం.. కొనేళ్ళుగా సునీతకు వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. రోజూ సునీతకు ఫోన్‌కాల్స్ వస్తుండేవని, ఇదే విషయమై ప్రశ్నిస్తే తన భార్య తన పట్ల నిర్లక్షంగా వ్యవహరించేదని గుండయ్య చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో గ్రామ సమీపంలోని జీడితోటలో ప్రియుడితో శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో సునీత కనిపించింది. దీంతో అతనికి గుండయ్యకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో గుండయ్య తన భార్యను గట్టిగా చేతితో తలపై కొట్టడంతో ఆమె పక్కనే ఉన్న రాయిపై పడిపోయిందని, దీంతో ఆమె నోటికింద భాగంలో బలమైన గాయం తగిలి తీవ్ర రక్తస్రావమై మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రియుడు పారిపోయాడని, అతను ఎవరనేది తెలుసుకొనేందుకు గుండయ్యను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ప్రియుడే హంతకుడు? గిరిజన మహిళ కావడంతో ప్రియుడే ఆమెకు మాయ మాటలు చెప్పి మోసగించి, హతమార్చి ఉంటాడని మృతురాలి బంధువులు పోలీసులకు తెలిపారు. మూగవాడైన గుండయ్యకు ఏ పాపం తెలీదని డీఎస్పీ ఆదినారాయణకు వివరించారు. సంఘటనా స్థలంలో రెండు సెల్ఫోన్లు దొరకడంతో ఆ వ్యక్తి ఎవరనేది కొద్ది రోజుల్లోనే గుర్తిస్తామని పోలీసులు చెబుతున్నారు. అనాథలుగా మిగిలిన పిల్లలు సీతంపేట మండలం జయపురానికి చెందిన గుండయ్యకు, అదే మండలం కుసుమి పంచాయతీ బిల్లుగూడకు చెందన సునీతకు 2003 సంవత్సరంలో వివాహం జరిగింది. ఈ దంపతులకు సంధ్యారాణి, సౌజన్య, కవిత అనే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. తండ్రి మూగవాడు కావడం, తల్లి హత్యకు గురి కావడంతో ఆ ముగ్గురు పిల్లలు బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూస్తున్నారు. తల్లి చనిపోయి, తండ్రి జైలు పాలు కావడంతో అనాథలుగా మిగిలారు. ఆ పిల్లలను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.