Galla Jaydev
-
టీడీపీపై నమ్మకం లేకే ఈ రాజకీయ డ్రామానా?
గుంటూరు తెలుగుదేశం లోక్‌సభ సభ్యుడు గల్లా జయదేవ్ మాటల్లో నిజాయితీ కనిపిస్తోందా? ఆయన నిజమే చెబుతున్నారా?వచ్చే ఎన్నికలలో గెలవలేనన్న భయంతో మాట్లాడుతున్నారా? ఆయన ఇంతకీ వ్యాపారం కోసం రాజకీయాల నుంచి తప్పుకున్నారా? లేక కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు వేధిస్తున్నాయన్న ఆరోపణతో తప్పుకున్నారా?పరస్పర విరుద్దంగా రెండు మాటలూ ఆయనే మాట్లాడుతున్నారు.ఆయన మొత్తం మీద చూస్తే ,తాను ధైర్యవంతుడనని చెప్పుకుంటూ ,పిరికితనంతో వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం కలుగుతుంది. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారటకాని, తెలుగుదేశంకు రాజీనామా చేయడం లేదట. ఇంతకీ ఆయన ఏమి చెప్పదలిచారు. కాకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ లతో ఏర్పడిన బలమైన రహస్య బంధాన్ని వదలుకోలేకపోతున్నారన్న విషయం అర్ధం అవుతుంది. ప్రత్యేక హోదా కోసం పోరాడాను కాబట్టి కేంద్ర ప్రభుత్వం తన సంస్థలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసిందని ఆయన అన్నారు. అనుమతులు ఉన్నా కేసులు పెడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై నింద మోపారు. ఆయనలో చిత్తశుద్ది ఉంటే పూర్తి వివరాలు వెల్లడించి ఉండేవారు. తన సంస్థలలో ఈడి సోదాలు చేసినప్పుడు ,విచారణకు పిలిచినప్పుడు ఏమి జరిగింది? ఏ అంశాలలో ఆరోపణలు వచ్చాయి అన్న విషయాలపై ఎందుకు వివరణ ఇవ్వలేదు. వైఎస్సార్సీపీ నేతలు కొందరు చెబుతున్నదాని ప్రకారం ఆయన గుజరాత్ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌కు సాయం చేసేందుకు చంద్రబాబు తరపున వందదల కోట్ల రూపాయల పంపిచారట.ఇందులో నిజం ఉందో లేదో తెలియదు. ఆ నేపద్యంలోనే ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆయన సంస్థలపై దాడులు చేసిందన్నది వారి అబియోగం. చంద్రబాబు నాయుడు గత టరమ్ లో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ తో సంబంధాలు పెట్టుకుని ఆ పార్టీకి ఆయా రాష్ట్రాలలో ఆర్ధిక వనరులు సమకూర్చారని ప్రచారం జరిగింది. రాజస్తాన్ లో అప్పట్లో అశోక్ గెహ్లాట్ కు నిధులు సమకూర్చారన్న టాక్ కూడా వచ్చింది. అలాగే కర్నాటక ఎన్నికలలో కూడా తన వంతు పాత్ర పోషించారని అంటారు. అందువల్ల వైఎస్సార్సీపీ నేతల ఆరోపణలలో నిజం ఉండే అవకాశం లేకపోలేదు.కేవలం ప్రత్యేక హోదా అంశంపైన జయదేవ్ పార్లమెంటులో మాట్లాడిన దానికే ఎలాంటి కనీసం సమాచారం లేకుండా ఒక కంపెనీపై ఈడి దాడులు చేస్తుందా? అన్న ప్రశ్న వస్తుంది. అలా జరగకూడదని లేదు కాని, ప్రత్యేక హోదా అంశంపై వైఎస్సార్సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారు కదా!వారిలో కొందరికి సొంత కంపెనీలు ఉన్నాయి కదా!వారిపై కూడా దాడులు జరిగాయా?అలాగే టీడీపీలో మరికొందరు ఎంపీలకు కూడా పరిశ్రమలు ఉన్నాయి.వారిపై ఎందుకు దాడులు జరగలేదు?అనంతపురం టీడీపీ ఎంపీగా జెసి దివాకరరెడ్డి 2014లో ఎన్నికయ్యారు.ఆయన కుటుంబానికి సంబంధించి బస్ ల లావాదేవీలపై పలు ఆరోపణలు ఉన్నాయి. కాని వారిమీద అప్పట్లో ఎందుకు ఈడి దాడి జరగలేదు? అవన్ని ఎందుకు!టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా పై ఎన్నిసార్లు మాట మార్చారు? ఆయన హోదా వద్దు..ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అన్నప్పుడు గల్లా జయదేవ్ నోరు విప్పలేదే! అంటే ఈ అంశంపై జయదేవ్ కు ఉన్న చిత్తశుద్ది ఇదేనా?చంద్రబాబు ప్రధాని మోడీపై పలుమార్లు వ్యక్తిగత విమర్శలు చేసినా, ఆయన భార్య గురించి మాట్లాడినా ఈడి దాడులు ఎందుకు చేయలేదో కూడా గల్లా చెబితే బాగుంటుంది. చంద్రబాబు పిఎస్ పై ఐటి శాఖ దాడి చేసి రెండువేల కోట్ల అక్రమాలు కనుగొన్నా, ఇన్నేళ్లుగా ఒక్క అడుగు ముందుకు ఎందుకు పడలేదో కూడా ఆయన చెబుతారా? అవిశ్వాస తీర్మానంపైన లోక్ సభలో మాట్లాడితేనే కేసులు వచ్చేస్తే, ప్రతిపక్షంలో ఉన్న ఎంపీలలో చాలామందిపై కేసులు రావాలి కదా! మొత్తం మీద గల్లా జజయదేవ్ ఏదో దాస్తున్నట్లుగా ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన విమర్శలు కూడా అసంబధ్దంగా ఉన్నాయి.అమరరాజా బాటరీ పరిశ్రమ నుంచి కాలుష్యం విడుదలై స్థానిక ప్రజల ఆరోగ్యానికి ముప్పు తెస్తోందని నివేదికలు చెప్పింది వాస్తవం కాదా? దానిపై ఆయన హైకోర్టుకు వెళ్లినా కాలుష్యం విషయంలో నిబంధనలు పాటించాలని చెప్పిందా? లేదా? ఆ సంగతి వెల్లడించకుండా వేధించారని తప్పుడు ఆరోపణ చేయడం సరైనదేనా? రాజకీయ నాయకుల పరిశ్రమల జోలికి వెళ్లరాదని గల్లా జయదేవ్ పార్లమెంటులో బిల్లు పెట్టి ఉంటే బాగుండేది. ఒకవైపు పరిశ్రమ విస్తరణకు, వ్యాపారాభివృద్దికి గాను రాజకీయాలకు దూరం అవుతానని చెబుతూ,మరోవైపు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై ఆరోపణలు చేసి అందువల్లే తప్పుకుంటున్నట్లు చెప్పడంలో అర్ధం ఏమైనా ఉంటుందా? ఏపీలో పరిశ్రమ విస్తరణకు జయదేవ్ ప్రయత్నించారా? అలా చేసినా అనుమతులు రాలేదా? లేక తెలంగాణలో విస్తరించాలన్న ఉద్దేశంతో అక్కడ ప్రతిపాదించారా? అదే టైమ్ లో ఏపీలో 250 కోట్ల పెట్టుబడులు పెడుతున్నానని జయదేవ్ ఆ రోజుల్లో చెప్పరా? లేదా? తెలంగాణతో పాటు యుపి , పశ్చిమాసియా దేశాలలో కూడా కంపెనీలు పెడుతున్నామని చెప్పేవారు ఏపీ ప్రభుత్వం పై ఆరోపణలు చేయవలసిన అవసరం ఏముంది? పోనీ తెలుగుదేశం 2014-2019 వరకు అధికారంలోనే ఉంది కదా!చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా! అప్పుడు ఎందుకు ఒక్క రూపాయి కూడా ఏపీలో కొత్త పెట్టుబడులు పెట్టలేదు? అంటే అప్పుడు కూడా వేధింపులే వచ్చాయని అనుకోవాలా? మీ వ్యాపారం మీ ఇష్టం. కాని దిక్కుమాలిన రాజకీయాల కోసం ఏపీపై ఎందుకు విమర్శలు చేస్తారు! వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నంతమాత్రాన కొత్త పెట్టుబడులు పెట్టరా? నిజంగానే అప్పట్లో ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోతే లోక్ సభలోనే ప్రస్తావించేవారు కదా? అసలు ప్రతిపాదనే చేయకుండా ఇలాంటి రాజకీయాలు చేస్తే ఎవరు నమ్ముతారు! 'నన్ను కొట్టినా,తిట్టినా,జైలుకు పంపినా ఫర్వాలేదు.. గమ్మున కూర్చోమంటే నా వల్ల కాదు"అని జయదేవ్ అన్నారు. అదే నిజమైతే , అంత ధైర్యవంతుడవైతే వచ్చే ఎన్నికలలో పోటీచేసి గెలిచి లోక్ సభలో ఈ అంశాలపై తన వాణి వినిపించవచ్చు కదా! అంటే ఒక పక్క పిరికితనంతో వ్యవహరిస్తూనే మరో పక్క ఇలా మేకపోతు గాంభీర్యపు ప్రకటనలు దేనికి! అంతగా తప్పులు చేయకపోతే, భయం లేని వ్యక్తి అయితే గత మూడు సంవత్సరాలుగా రాజకీయాలలో ఎందుకు క్రియాశీలకంగా లేరో కూడా చెప్పాలి కదా! మరో సందర్భంలో ప్రజల గొంతుకగా ఉండలేకపోతున్నానన్న కారణంతో రాజకీయాలకు దూరం అవుతున్నానని చెబుతారు. మరో వైపు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలనై బురద జల్లుతున్నారు. ఇప్పుడు కూడా తెలుగుదేశంలోనే ఉంటానని అంటున్నారు కదా!అప్పుడు ప్రభుత్వాలకు కోపం రాదా . దీనిలో డొల్లతనం కనిపించడం లేదా? తన వ్యాపార స్వార్ధం కోసం ప్రత్యేక హోదా అంశాన్ని వెనక్కి నెట్టేశానని ఆయన ఒప్పుకుంటున్నారా? ఒకదానికి మరోదానికి పొంతన లేకుండా ఆయనమాట్లాడుతన్నారనిపిస్తుంది. అమరరాజా బాటరీస్ టర్నోవర్ ను 58వేల కోట్లకు తీసుకు వెళ్లే లక్ష్యం పెట్టుకున్నానని చెప్పినప్పుడు మధ్యలో ఈ అనవసర రాజకీయ ప్రకటనలు చేయడం వల్ల ఎవరికి ప్రయోజనం ఉంటుంది? మరో రెండునెలల్లో లోక్‌సభ శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి కదా!తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తమ గెలుపు ఖాయమని అంటున్నారు కదా? అది నిజమే అని జయదేవ్ నమ్మి ఉంటే ఎంపీగా పోటీచేయవచ్చు కదా! టీడీపీ ప్రభుత్వం వస్తే వేధింపులు ఉండవని ఆయన చెప్పదలిచారనుకుందాం. అలాంటప్పుడు రాజకీయాలకు తాత్కాలిక విరామం ప్రకటించడం ఎందుకు? టీడీపీ కొత్త అభ్యర్ధిని వెతుక్కోవలసిన అవసరం కల్పించడం ఎందుకు?ఇవిన్ని పరిశీలిస్తే జయదేవ్ అసత్యాలు చెబుతున్నారని తేలిపోతుంది. అంతేకాక ఆయన తన మీద తనకే విశ్వాసం లేక, టీడీపీ విజయంపై నమ్మకం లేక ఈ రాజకీయ డ్రామాకు తెరదీశారా అన్న సందేహం వస్తుంది. చంద్రబాబుతో ఉన్న రహస్య ఆర్ధిక సంబంధాల రీత్యానే టీడీపీలో కొనసాగుతున్నానని చెబుతన్నట్లుగా ఉంది తప్ప మరొకటి కాదు. జయదేవ్ గారూ.. మీరు వ్యాపారానికి వెళ్తే వెళ్లండి. కాని ఆ పనిమీద వెళుతూ ఎవరి మీదో రాయివేసి వెళ్లినా, బురద వేసినా అవి మీమీదే పడతాయని గమనించండి. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
గెస్ట్ హౌస్ నుంచి పారిపోయి తప్పించుకుని తిరుగుతున్న లోకేష్
-
గల్లా వ్యాఖ్యలకు వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి కౌంటర్
-
గన్ షాట్ : ఏపీ కంపెనీలపై ఎల్లో మీడియా విషం కక్కుతుందా ..!
-
హైకోర్టు ఉత్తర్వులా.. డోంట్ కేర్
సాక్షి ప్రతినిధి, తిరుపతి: అధికార వ్యవస్థలను కనీసం ఖాతరు చేయని అమర్‌రాజా సంస్థల యాజమాన్యం చివరకు హైకోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయడం లేదు. టీడీపీకి చెందిన ఎంపీ గల్లా జయదేవ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న అమర్‌రాజా ఫ్యాక్టరీల విష కాలుష్యంపై ఇటీవల హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫ్యాక్టరీల చుట్టుపక్క గ్రామాల ప్రజలు, పనిచేస్తున్న కార్మికుల ప్రాణాలకు హాని కలిగించే చర్యలను సహించేది లేదని స్పష్టం చేసింది. కార్మికుల రక్త నమూనాల్లో సీసం ఆనవాళ్లు ఉన్నాయంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. సంస్థ ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని నాలుగు రోజుల కిందట కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)ని ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి అమర్‌రాజా ఫ్యాక్టరీల్లోని కార్మికులకు వైద్య పరీక్షలు చేయాల్సిందిగా మంగళగిరి ఎయిమ్స్‌కు పీసీబీ బాధ్యతలు అప్పగించింది. వేచిచూసి వెనుదిరిగిన వైద్యులు దీంతో 20 మంది ఎయిమ్స్ వైద్యుల బృందం సోమవారం ఉదయం 9 గంటలకు తిరుపతికి సమీపంలోని కరకంబాడి పంచాయతీ పరిధిలో గల అమర్‌రాజా ఫ్యాక్టరీ వద్దకు చేరుకుంది. మహిళా కార్మికుల కోసం ప్రత్యేకంగా మహిళా వైద్యుల బృందం కూడా విచ్చేసింది. కానీ ఒక్కరంటే ఒక్క కార్మికుడిని కూడా వైద్యుల వద్దకు ఫ్యాక్టరీ యాజమాన్యం పంపించలేదు. ఉదయం షిఫ్ట్‌లో వెయ్యిమందికి పైగా కార్మికులున్నా వైద్యులు ఉన్న రూమ్ వైపునకు ఎవరూ పోలేదు. కార్మికులను పంపాలంటూ వైద్యులు ఎన్నిసార్లు అడిగినా ఫ్యాక్టరీ సంబంధీకుల నుంచి నిర్లక్ష్యపు సమాధానమే వచ్చింది. పరీక్షలకు కార్మికులెవరూ రానంటున్నారని.. కావాలంటే వాళ్లు పనిచేస్తున్న మిషినరీ వద్దకు వెళ్లి అడగాలని వైద్యులకు చెప్పుకొచ్చారు. ఈ విషయమై ఓ వైద్యుడు మాట్లాడుతూ.. ‘అలా చేస్తే కార్మికుల విధులకు ఆటంకం కలిగించారనే నెపంతో మమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చని యాజమాన్యం ఆలోచించింది. అందువల్ల మేం వైద్య శిబిరం వద్దే వేచి చూశాం’ అని ‘సాక్షి ప్రతినిధి’తో చెప్పారు. దీంతో సాయంత్రం 5.30 గంటల వరకు వేచిచూసిన తాము చేసేది లేక వెనుదిరిగామని వైద్యులు చెప్పుకొచ్చారు. -
గల్లా కుటుంబంలోని 12 మంది పై కేసు
-
విషం పీల్చుతూ.. తాగుతూ..
సాక్షి ప్రతినిధి, తిరుపతి: రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీలో ఉన్న అమరరాజా పవర్ సిస్టం లిమిటెడ్, అమరరాజా బ్యాటరీస్ ఇండస్ట్రీస్, మంగళ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లు అక్కడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఆయా కర్మాగారాల నుంచి వెలువడుతున్న కాలుష్యం ధాటికి చుట్టుపక్కల గ్రామాలు బలిపీఠంపై ఉన్నాయి. వాస్తవానికి ఆ ఫ్యాక్టరీలు శుద్ధి చేసిన నీటిని వాడాలి. కానీ అమరరాజా ఫ్యాక్టరీస్ శుద్ధి చేసిన నీటిని కాకుండా పలుమార్లు ప్రాసెస్ చేసిన నీటిని అక్కడే మొక్కలకు వదిలేస్తున్నారు. వాస్తవానికి ఆ నీటిని దూరంగా సముద్రంలోకి తీసుకువెళ్లి వదిలేయాలి. కానీ అక్కడే వదిలేయడంతో అవి ఇంకిపోయి మొత్తం భూగర్భజలాలన్నీ పాడవుతున్నాయి. ఇక ఆయా ఫ్యాక్టరీల నుంచి వచ్చే సీసం గాఢత తీవ్రంగా ఉంది. ఏ స్థాయిలో ఉందంటే కార్మికులు వేసుకునే దుస్తులపైనే కాదు.. కార్మికుల రక్తంలోనూ ఉంది. 20 శాతం ఉద్యోగుల రక్తంలో సీసం శాతం ఆందోళనకర స్థాయిలో ఉందని పరీక్షల్లో తేలింది. నిబంధనల ప్రకారం ఆయా ఫ్యాక్టరీల్లో పనికి వెళ్లే కార్మికులు ప్రత్యేక యూనిఫాం ధరించాలి. విధులు ముగించుకుని ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చే ముందు ఆ యూనిఫాం తీసివేసి,.. వేరే దుస్తులు వేసుకోవాలి. కానీ సదరు ఫ్యాక్టరీల యాజమాన్యం ఎక్కడా ఇలాంటి ఏర్పాటు చేయలేదు... ఫలితంగా కార్మికుల ప్రాణాలకు అక్కడ భద్రత లేకుండా ఉంది.’’ అని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) అధికారులు ఆందోళన వక్తం చేస్తున్నారు.. ‘అమరరాజా లెడ్తో అంతులేని వ్యధ’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో వచ్చిన కథనంపై పీసీబీ అధికారులు స్పందిస్తూ... నిజంగానే అక్కడి పరిస్థితి అదుపుతప్పుతోంది.. కానీ యాజమాన్యానికి చీమ కుట్టినట్టు కూడా లేదు.. అని వ్యాఖ్యానించారు. ఫ్యాక్టరీల నుంచి వచ్చే సీసం గాఢతకు చుట్టుపక్కల ఉన్న నాలుగు చెరువులూ కాలుష్యకాసారంలా మారాయని చెప్పుకొచ్చారు. టీడీపీ హయాంలో పీసీబీ తనిఖీలే లేవట గత టీడీపీ ఐదేళ్ల హయాంలో గానీ, అంతకుముందు నాలుగేళ్లలో గానీ మొత్తంగా తొమ్మిదేళ్ల కాలంలో అమరరాజా ఫ్యాక్టరీస్‌లో ఏనాడూ పీసీబీ తనిఖీలు చేసిన దాఖలాలే లేవని స్వయంగా సదరు అధికారులే చెప్పుకొస్తున్నారు. అప్పట్లో ఎప్పుడైనా మొక్కుబడిగా పీసీబీ అధికారులు వెళ్లి రావడం తప్పించి తనిఖీలు, దాడులు, విచారణల ప్రసక్తే లేదని గుర్తు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్లలోనే కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పలుమార్లు తనిఖీలు చేయడం వల్లనే వాస్తవాలు బయటికొచ్చాయని చెప్పుకొచ్చారు. అక్కడ కాలుష్య నివారణ ప్రమాణాలు కనీసంగా పాటించడం లేదని తేలిందన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే వరకూ అక్కడ రోడ్లు కూడా లేవు వాస్తవానికి ఎక్కడ ఫ్యాక్టరీలు నెలకొల్పినా.. ఆయా చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధికి సదరు ఫ్యాక్టరీల యాజమాన్యాలు కృషి చేస్తుంటాయి. ఇక ఫ్యాక్టరీల కాలుష్యపు దుష్ప్రభావంతో కునారిల్లే గ్రామాలకు ఇంకెంత ఖర్చు చేస్తారో చెప్పనక్కర లేదు. కానీ ఇక్కడ అమరరాజా ఫ్యాక్టరీ .. గేటు పక్కనే ఉన్న తారకరామానగర్ గ్రామం గురించే కనీసంగా పట్టించుకోలేదు. పైగా ఓ దశలో ఆ ఊరి ప్రజలను తమ ఫ్యాక్టరీ మీదుగా నడవొద్దని హుకుం జారీచేశారు. దీన్ని నిరసిస్తూ గ్రామస్తులు ఆందోళన చేపట్టడంతో ఎట్టకేలకు దారి ఇచ్చారు. ఆ ఊరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు సిమెంట్ రోడ్డు లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వైఎస్సార్సీపీ పాలన వచ్చిన తర్వాతే మా గ్రామంలోకి సిమెంట్ రోడ్లు వచ్చాయని స్థానికంగా నివసిస్తున్న ఫొటోగ్రాఫర్ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. రెండు వారాల్లో ఏం చేస్తారో చూడాలి ‘అమరరాజా ఫ్యాక్టరీల కాలుష్యం, అందులోని లెడ్ శాతంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.. కాలుష్య నివారణ చర్యలకు ఉన్నత న్యాయస్థానం రెండు వారాల గడువిచ్చింది. ఈ లోగా సదరు యాజమాన్యం ఏం చేస్తుందో చూడాలి...’ అని పీసీబీ జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ కె.వెంకటేశ్వరరావు శుక్రవారం సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు. ఈ లోగా తమ పీసీబీ తరఫున ఓ కమిటీ అక్కడ పరిస్థితులపై మరోసారి క్షుణ్ణంగా పరిశీలన చేస్తుందన్నారు. – పీసీబీ జేసీఈఈ వెంకటేశ్వరరావు -
అమరరాజా లెడ్తో.. అంతులేని వ్యథ
సాక్షి ప్రతినిధి, తిరుపతి: సరిగ్గా తిరుపతి పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరకంబాడి పంచాయతీలో 1985లో తొలిసారిగా అమరరాజా పవర్ సిస్టం లిమిటెడ్‌ను నెలకొల్పిన యాజమాన్యం.. తర్వాతి కాలంలో అమరరాజా బ్యాటరీస్ ఇండస్ట్రీస్, మంగళ్ ఇండ్రస్టీస్ లిమిటెడ్‌ను నెలకొల్పి వ్యాపార సామ్రాజ్యాన్ని భారీగా విస్తరించుకుంది. ఇదంతా బాగానే ఉన్నా.. సదరు ఫ్యాక్టరీల నుంచి వచ్చే విషవాయువులు, జల కాలుష్యం గురించి కనీస మాత్రంగా కూడా పట్టని యాజమాన్య నిర్లక్ష్య ధోరణే ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమవుతోంది. స్వయంగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఫ్యాక్టరీలో లెడ్, ఇతర కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉన్నందున దానిని మూసి వేయాలన్న రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు ఈమధ్యనే విచారించింది. అమరరాజా ఫ్యాక్టరీలో లెడ్ శాతం ప్రమాదకరంగా ఉందని కాలుష్య నియంత్రణ మండలితోపాటు హైదరాబాద్‌లోని కేంద్రప్రభుత్వ సంస్థ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఈపీటీఆర్ఐ) నివేదిక స్పష్టం చేసిన విషయాన్ని హైకోర్టు ప్రముఖంగా ప్రస్తావించింది. ఇకనైనా కాలుష్యశాతం తగ్గించకుంటే ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు యాజమాన్యాన్ని హెచ్చరించింది. హైకోర్టుతో సహా ఎన్ని సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేసినా.. అమరరాజా ఫ్యాక్టరీస్ యాజమాన్యానికి చీమకుట్టినట్టు కూడా లేదని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారంటే వాస్తవ పరిస్థితి అవగతమవుతోంది.ఆ ఫ్యాక్టరీల నుంచి వెలువడే వ్యర్ధాలను దూరప్రాంతాలకు తీసుకువెళ్లి విడిచిపెట్టకుండా చుట్టుపక్కల ఊళ్లలోకి వదిలేయడంతోనే అనర్థాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. యాసిడ్, కెమికల్స్‌ను అక్కడే భూగర్భంలో వదిలేయడంతో భూగర్భజలాలు మొత్తం కలుషి తమైపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్య రక్కసి ఫలితంగా గ్రామస్తుల్లో చాలామందికి ఒళ్లంతా దురదలు, చర్మవ్యాధులు.. గుళ్లలు, బొబ్బలు, ఆయింట్మెంట్ వాడినా పోని మచ్చలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. ఇదే విషయమై తారకరామానగర్‌కే చెందిన శ్రీనివాసాచారి ‘సాక్షి’తో మాట్లాడుతూ ఫ్యాక్టరీ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వేలాదిమంది గ్రామస్తుల ప్రాణాలంటే యాజమాన్యానికి లెక్కేలేదని వ్యాఖ్యానించారు. ఆర్థిక దన్నుతో వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ ఇన్నాళ్లూ కాలుష్య శాతం కూడా ఎవరికీ తెలియనివ్వకుండా దాచేశారని ఆరోపించారు. ఇదే ప్రాంతానికి చెందిన మహిళ నాగరత్నమ్మ మాట్లాడుతూ బోరు నీళ్లలో చిలుము వాసన వస్తుందని చెప్పుకొచ్చారు. నీళ్లను వేడి చేస్తే పాత్ర కింద తెల్లగా మడ్డి పేరుకుపోతోందని వాపోయారు. రెండు చెరువులు మాయం ఫ్యాక్టరీ నుంచి వెలువడే కాలుష్యపు భూతంతో గ్రామస్తులు అల్లాడిపోతుంటే... మరోవైపు ఊళ్లలో ఉన్న చెరువులను సైతం మింగేసిన అమరరాజా యాజమాన్యం దందాలతో అక్కడి ప్రజలకు నీటిసౌకర్యం కూడా కరువైంది. తారకరామానగర్‌లోని 137 సర్వే నెంబర్లోని 28 ఎకరాల చెరువును చెరబట్టేసిన అమరరాజా ఫ్యాక్టరీ.. మరో నాలుగు ఎకరాల చెరువును పూర్తిగా ధ్వంసం చేసేసింది. చెరువు రూపు రేఖలు మార్చేసి రోడ్లు వేసేసింది. మంచినీటి కోసం బోరింగ్ వద్ద వృథాప్రయాస పడుతున్న ఈమె పేరు కల్పన.. గృహిణి, తారకరామానగర్ వాసి.. ఊరిలో ఇలాంటి బోర్లు చాలానే ఉన్నా ఎక్కడా మంచినీరు రాదు.. ఊరి చివర సుందరయ్యనగర్ సమీపాన ఉన్న ఈ బోరు నీరు చూస్తే పొరబాటున కూడా అవి తాగాలని అనిపించవు. ఎరుపు రంగుతో కూడిన కాలుష్యపు ధార అది. -
నీకు బుర్ర కూడా లేదని అర్థమైంది: మిథున్‌రెడ్డి
సాక్షి, అమరావతి: దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిపోతుందంటూ టీడీపీ ఎంపీ జయదేవ్ గల్లా చేసిన ప్రచారాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభా పక్షనేత, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. బాధ్యత గల ఎంపీ స్థానంలో ఉండి ఇలాంటి అవాస్తవాలను ఎందుకు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కియా మోటార్స్ రాష్ట్రంలోనే ఉంటుందని ఆ సంస్థ ఎండీ స్పష్టం చేసిన విషయాన్ని ట్విటర్ వేదికగా జయదేవ్‌కు గుర్తుచేశారు. టీడీపీ లోక్‌సభా వేదికగా చేసిన దుష్ప్రచారానికి ఇదే సమాధానం అంటూ కియా ఎండీ చేసిన ప్రకటనకు సంబంధించిన వార్తా కథనాన్ని జోడించారు. (కియాపై ఎండీ కీలక ప్రకటన.. ఇక్కడి నుంచే ప్రపంచస్థాయి కార్లు) ఈ మేరకు... ‘‘నీ తలపై జుట్టు మాత్రమే లేదనుకున్నాను. కానీ బుర్ర కూడా లేదని ఇప్పుడే అర్థమైంది. ఏపీలో ఉన్న పెట్టుబడిదారులను తరిమేయాలని ఎందుకంత తొందర మీకు? ఎవరు బాధ్యతరాహిత్యంతో ప్రవర్తిస్తున్నారో ఇప్పటికైనా అర్థమైందా. కియా మోటార్స్ రాష్ట్రం నుంచి తరలిపోవడం లేదని ఆ సంస్థ సమాధానం ఇచ్చింది. ఒక ఎంపీగా ఉండి అసత్యాలు ప్రచారం చేస్తావా? అయినా నీ నుంచి ఇంతకన్నా ఎక్కువ ఏం ఆశించగలం’’ అని మిథున్‌రెడ్డి ట్వీట్ చేశారు. లోక్‌సభలో తన ప్రసంగాన్ని విమర్శిస్తూ జయదేవ్ చేసిన ట్వీట్‌కు సమాధానంగా మిథున్‌రెడ్డి ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు. కాగా కియా పరిశ్రమ ఎక్కడికీ తరలిపోవడం లేదంటూ మిథున్‌రెడ్డి గురువారం లోక్‌సభలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ‘‘చంద్రబాబు ప్రభుత్వం ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే పేరుతో ఓ డమ్మీ కంపెనీ సృష్టించి రూ. 30 కోట్ల పెట్టుబడికి.. రూ. వెయ్యి కోట్ల విలువైన భూములు ఇచ్చింది. దీని గురించి ప్రశ్నిస్తే.. కియా పరిశ్రమ తరలిపోతుందంటూ దుష్ప్రచారం చేస్తోంది’’ అని ఆయన విమర్శించారు.(దురుద్దేశంతోనే దుష్ప్రచారం) ఉదయమే కియా ఎండీతో మాట్లాడా: మిథున్‌రెడ్డి "You had asked for this. Here's the answer. KIA motors has clarified that they are not moving out of AP. Mr. @JayGalla why are you spreading fake news? Don't you know that an MP should be responsible? Or is it too much to expect from you?"https://t.co/OHckEoU0Kq — Mithunreddy (@MithunReddyYSRC) February 7, 2020 -
నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే
-
మహేశ్ బాబు అల్లుడి మూవీ లాంచ్ డేట్ పిక్స్
సూపర్‌స్టార్ మహేశ్ బాబు బావ, గుంటూరు పార్లమెంట్ సభ్యుడు జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. `భలే మంచి రోజు`, `శమంతక మణి`, `దేవదాస్` చిత్రాలతో ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా.. కమర్షియల్ విజయాలను దక్కించుకున్న యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై పద్మావతి గల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామానాయుడు స్టూడియోలో నవంబర్ 10న గ్రాండ్ లెవల్లో జరగనున్న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. తనదైన స్టైల్లో డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య డిఫరెంట్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. నరేశ్, సత్య, అర్చనా సౌందర్య ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తుండగా రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. -
టీడీపీ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేతగా నారా చంద్రబాబునాయుడు ఎన్నికయ్యారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో బుధవారం జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు ఆయన్ను తమ నేతగా ఎన్నుకున్నారు. టీడీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో ఒకరు గైర్హాజరు కాగా మిగిలిన 21 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తొలుత తాను కాకుండా వేరే వారిని శాసనసభపక్ష నేతగా ఎంపిక చేయాలని భావించిన చంద్రబాబు చివరికి మనసు మార్చుకుని ప్రతిపక్ష నేత బాధ్యత స్వీకరించేందుకు సిద్ధమయ్యారు. శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న తర్వాత ఆయన మాట్లాడుతూ ఐదేళ్లలో కాలంతో పరుగెత్తి అనేక పనులు చేశామని చెప్పారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకున్నా అనేక కార్యక్రమాలు చేశామని అయినా ప్రజాతీర్పు భిన్నంగా వచ్చిందన్నారు. అయినా 39.2 శాతం ఓట్లు రాబట్టామని తెలిపారు. ఏదైనా కొంతకాలం వేచిచూద్దామని, కొత్త ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దామని పార్టీ నేతలకు చెప్పారు. అన్నింటినీ నిశితంగా పరిశీలించి.. తర్వాతే స్పందిద్దామని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తమ వాణిని బలంగా వినిపించాలన్నారు. ఆయా నియోజకవర్గాల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించి, సకాలంలో పరిష్కారం అయ్యేలా చూడాలని సూచించారు. ప్రతి ప్రాంతంలో ప్రజలతో నాయకులంతా మమేకం కావాలన్నారు. ఎక్కడా పార్టీపైన, ప్రభుత్వంపైన ప్రజల్లో వ్యతిరేకత లేదని, జగన్మోహన్రెడ్డిపై సానుభూతి ఉండడం వల్లే గెలిచారని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో స్థానిక పరిస్థితులపై ప్రజల్లో భిన్నాభిప్రాయం ఉందన్నారు. భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుందామని, అన్నివర్గాల ప్రజల మద్దతు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఓటమికి కారణాలేమిటని చంద్రబాబు అందరినీ ప్రశ్నించారు. ఒక్క ఛాన్స్ ఇవ్వాలనే జగన్ నినాదం బాగా పనిచేసిందని మెజారిటీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. ఓటమిపై పూర్తి స్థాయిలో విశ్లేషణ చేయాల్సివుందని, ఇందుకోసం కొద్దిరోజుల్లో మళ్లీ సమావేశమవుదాని చంద్రబాబు తెలిపారు. జగన్ ప్రమాణ స్వీకారానికి ప్రతినిధి బృందం ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా వైఎస్ జగన్ ఆహ్వానించిన నేపథ్యంలో వెళ్లాలా వద్దా అనే దానిపై సమావేశంలో చర్చించారు. ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు వెళితే ఇబ్బందిగా ఉంటుందని పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో పార్టీ తరఫున ప్రతినిధి బృందాన్ని పంపించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు వెళ్లి జగన్‌కు తన తరఫున శుభాకాంక్షలు తెలపాలని, తొలుత ఆయన ఇంటికి వెళ్లి తాను శుభాకాంక్షలు తెలుపుతూ రాసిన లేఖ ఇవ్వాలని సూచించారు. గుంటూరులోని పార్టీ కార్యాలయం నుంచే కొద్దికాలం పనిచేయాల్సి ఉందని చంద్రబాబు చెప్పగా పలువురు నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. గుంటూరు పార్టీ కార్యాలయం అందరికీ అందుబాటులో ఉండదని, విజయవాడ అయితేనే బాగుంటుందని చెప్పారు. దీంతో మంగళగిరిలో పార్టీ కార్యాలయ నిర్మాణం పూర్తయ్యే వరకూ విజయవాడలోనే తాత్కాలికంగా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకుందామని చెప్పి ఆ బాధ్యతను విజయవాడ ఎంపీ కేశినేని నానికి అప్పగించారు. కాగా శాసనసభాపక్ష సమావేశానికి విశాఖపట్నం వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు గైర్హాజరయ్యారు. పార్లమెంటరీ పార్టీ నేతగా గల్లా జయదేవ్ శాసనసభాపక్ష సమావేశం తర్వాత ఎంపీలతో సమావేశమైన చంద్రబాబు పార్లమెంటరీ పార్టీ నేతగా గల్లా జయదేవ్ నియమిస్తున్నట్లు చెప్పారు. లోక్‌సభలో టీడీపీ పక్ష నేతగా కింజరాపు రామ్మోహన్నాయుడు, రాజ్యసభలో టీడీపీ పక్ష నేతగా సుజనా చౌదరి ఉంటారని తెలిపారు. -
హైకోర్టును ఆశ్రయించనున్న మోదుగుల
సాక్షి, అమరావతి : గుంటూరు, శ్రీకాకుళం లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రకటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఈ రెండు స్థానాల్లో పూర్తి ఓట్లను లెక్కించకుండానే రిటర్నింగ్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఫలితాలను ప్రకటించారని ఆ పార్టీ నేతలు చెప్పారు. ఈ రెండు నియోజకవర్గాల్లో స్వల్ప మెజారిటీతో టీడీపీ అభ్యర్థులు గెలిచినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపులో సరైన నిబంధనలు పాటించకుండా అధికారులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించారని గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆరోపించారు. మోదుగులపై టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ 4205 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో గెలుపొందారు. ఈ స్థానంలో దాదాపు 9700 పైచిలుకు పోస్టల్ బ్యాలెట్లను లెక్కించకుండా తిరస్కరించడంతో ఫలితం తారుమారైందని, అధికారులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. మొత్తం నమోదైన 14 వేలకు పైచిలుకు పోస్టల్ బ్యాలెట్లలో 4600 పైచిలుకు ఓట్లను మాత్రమే లెక్కించగా, వాటిల్లో మోదుగులకు దాదాపు 3 వేలు, గల్లాకు 12 వందలపైచిలుకు వచ్చాయి. మరో 9700 ఓట్లను తిరస్కరించారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు ఫారమ్ 13 (ఎ) ద్వారా నమోదు చేసిన పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి 13 (బి) నంబర్ ను కవర్ పైన వేయలేదన్న సాకుతో ఆఓట్లను తిరస్కరించారని, ఇందుకు జిల్లా ఎన్నికల అధికారి బాధ్యత వహించాల్సి ఉంటుందని మోదుగుల చెప్పారు. రాజ్యాంగం కల్పించిన హక్కు మేరకు ఎన్నికల విధుల్లో నమగ్నమయ్యే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి తీసుకోవలసిన జాగ్రత్తలన్నింటిపైనా తగిన తర్ఫీదు ఇవ్వడంతో పాటు మొత్తం బాధ్యత ఎన్నికల అధికారిదేనని వివరించారు. ఎన్నికల అధికారి తన బాధ్యతలను నిర్వర్తించకుండా పోస్టల్ బ్యాలెట్లను ఏకపకంగా తిరస్కరించడానికి వీలులేదని, ఇది ఓటర్లకు ఉన్న హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు. పైగా ఈ రకంగా 9700 ఓట్లను తిరస్కరించారని, మెజారిటీ తక్కువగా వచ్చిన సందర్భాల్లో ఇలాంటి ఓట్లను మళ్లీ మళ్లీ లెక్కించాలని నిబంధనలు, సుప్రీంకోర్టు, హైకోర్టు రూలింగ్స్ ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. మొత్తం ఓట్లను లెక్కించకుండా ఎన్నికల జర్నల్స్ కు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంపై హైకోర్టును ఆశ్రయించనున్నట్టు మోదుగుల చెప్పారు. గుంటూరు లోక్‌సభ స్థానంతో పాటు శ్రీకాకుళం నియోజకవర్గంలోనూ ఇదే తరహా చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తెచ్చారు. పార్టీ సీనియర్ నేతలతో సమాలోచనలు జరిపారు. ఈ అంశంపై హైకోర్టులో రిట్ దాఖలు చేయాలని నిర్ణయించినట్టు మోదుగుల మీడియాతో చెప్పారు. గుంటూరు లోక్‌సభ పరిధిలో.. గుంటూరు లోక్‌సభ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాలరెడ్డి ప్రత్యర్థి గల్లా జయదేవ్ కంటే 4,205 ఓట్లు తక్కువగా వచ్చాయి. గుంటూరు లోక్‌సభ పరిధిలో సుమారు 9,700 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లనివిగా కౌంటింగ్ అధికారులు తేల్చి పక్కన పడేశారు. అందుకు కవర్‌పై 13–సీ నంబరు లేకపోవడమే కారణంగా చెబుతున్నారు. కవర్లో ఉన్న పోస్టల్ బ్యాలెట్లో తప్పులు లేనప్పుడు అవి లెక్కించాలంటూ మోదుగుల అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ లెక్కింపు రోజున అధికారులు అంగీకరించలేదు. శ్రీకాకుళం లోక్‌సభ పరిధిలో.. శ్రీకాకుళం సిట్టింగ్ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కేవలం 6,658 ఓట్ల స్వల్ప మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌పై గెలుపొందారు. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఇచ్ఛాపురం, టెక్కలిలో మాత్రమే టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. మొత్తం మీద స్వల్ప మెజార్టీతో రామ్మోహన్ నాయుడు గట్టెక్కారు. ఇక పలు చోట్ల అసెంబ్లీ నియోజక వర్గాల్లో సైతం పోస్టల్ బ్యాలెట్లు జారీ చేసిన ఉద్యోగులు చేసిన పొరపాట్లు వల్ల అవి చెల్లుబాటు కాకుండా పోయాయి. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : శ్రీకాకుళం గుంటూరు ఎంపీ ఎన్నికలపై కోర్టుకెళ్లనున్న వైఎస్ఆర్సీపీ -
శ్రీకాకుళం గుంటూరు ఎంపీ ఎన్నికలపై కోర్టుకెళ్లనున్న వైఎస్ఆర్సీపీ
-
క్రాస్ ఓటింగ్‌తో గట్టెక్కారు!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/సాక్షి, అమరావతి బ్యూరో/ గుంటూరు : రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్ ప్రభంజనంలో టీడీపీ ఎంపీ అభ్యర్థులందరూ కొట్టుకుపోయినా ముగ్గురు మాత్రం తక్కువ మెజారిటీతో గట్టెక్కారు. ఇందుకు ప్రధాన కారణం క్రాస్ ఓటింగేనని పోలింగ్ సరళిని బట్టి అర్ధమవుతోంది. శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు ఎంపీ ఫలితాలను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతోంది. శ్రీకాకుళం సిట్టింగ్ ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు కేవలం 6,658 ఓట్ల స్వల్ప మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌పై గెలుపొందారు. 2014 ఎన్నికలలో రామ్మోహన్నాయుడు 1,27,692 ఓట్ల మెజారిటీ సాధించారు. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఇచ్ఛాపురం, టెక్కలిలో మాత్రమే టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. అయితే క్రాస్ ఓటింగ్ కారణంగా రామ్మోహన్ గట్టెక్కారు. - ఇచ్ఛాపురం నియోజకవర్గంలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి బెందాళం అశోక్‌కు 79,405 ఓట్లు వస్తే రామ్మోహన్‌కు 82,640 ఓట్లు వచ్చాయి. ఇక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థి పిరియా సాయిరాజ్‌కు 71,931 ఓట్లు వస్తే ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌కు కేవలం 68,570 ఓట్లు వచ్చాయి. ఈ ప్రకారం 3,361 ఓట్లు క్రాసింగ్ జరిగింది. - పలాసలో గెలుపొందిన వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ సీదిరి అప్పలరాజుకు 75,357 ఓట్లు రాగా ఎంపీ అభ్యర్థి దువ్వాడకు కేవలం 65,939 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే.. 9,418 ఓట్లు తగ్గిపోయాయి. ఇక్కడ టీడీపీ అభ్యర్థి గౌతు శిరీషకు 59,873 ఓట్లు రాగా రామ్మోహన్‌కు 68,813 ఓట్లు వచ్చాయి. - రామ్మోహన్, దువ్వాడ శ్రీనివాస్ ఇద్దరికీ సొంత ప్రాంతమైన టెక్కలి నియోజకవర్గంలో కూడా క్రాస్ ఓటింగ్ జరిగినా స్వల్పమే. - పాతపట్నం నియోజకవర్గంలో విజయం సాధించిన వైఎస్సార్సీపీ అభ్యర్థి రెడ్డి శాంతికి 75,669 ఓట్లు రాగా, ఇక్కడ దువ్వాడకు 70,698 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి కలమట వెంకటరమణకు 60,975 ఓట్లు రాగా రామ్మోహన్‌కు 64,656 ఓట్లు వచ్చాయి. నరసన్నపేటలో గెలుపొందిన వైఎస్సార్సీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్‌కు 85,622 ఓట్లు రాగా దువ్వాడకు 80,855 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడి టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తికి 66,597 ఓట్లు రాగా రామ్మోహన్‌కు 72,890 ఓట్లు వచ్చాయి. - శ్రీకాకుళం నియోజకవర్గంలో విజయం సాధించిన వైఎస్సార్సీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావుకు 82,388 ఓట్లు రాగా దువ్వాడకు 75,253 ఓట్లు వచ్చాయి. ఇక్కడ టీడీపీ అభ్యర్థి గుండ లక్ష్మీదేవికి 77,575 ఓట్లు రాగా రామ్మోహన్‌కు 84,631 ఓట్లు వచ్చాయి. ఆమదాలవలస నియోజకవర్గంలో గెలిచిన వైఎస్సార్సీపీ అభ్యర్థి తమ్మినేని సీతారాంకు 76,801 ఓట్లు రాగా, దువ్వాడకు 74,781 ఓట్లు వచ్చాయి. ఇక్కడ టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్‌కు 63,274 ఓట్లు రాగా రామ్మోహన్‌కు 62,722 ఓట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం మీద 6,658 ఓట్ల స్వల్ప మెజార్టీతో రామ్మోహన్నాయుడు గట్టెక్కారు. గుంటూరు లోక్‌సభ పరిధిలో.. గుంటూరు పార్లమెంట్ విషయానికొస్తే.. ఇక్కడి వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాలరెడ్డి కూడా క్రాస్ ఓటింగ్ కారణంతోనే ఓటమి పాలయ్యారు. ఇక్కడ గుంటూరు వెస్ట్ మినహా మిగతా ఆరు అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఆరు చోట్లా వైఎస్సార్సీపీ అభ్యర్థులకు 53,731 ఓట్ల మెజార్టీ వచ్చింది. మోదుగులకు మాత్రం ప్రత్యర్థి గల్లా జయదేవ్ కంటే 4,205 ఓట్లు తక్కువగా వచ్చాయి. సుమారు 55 వేల ఓట్ల మేర క్రాస్ ఓటింగ్ జరిగింది. మరో విచిత్ర విషయం ఏమిటంటే.. గుంటూరు పార్లమెంట్ పరిధిలో సుమారు 10వేల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లనివిగా కౌంటింగ్ అధికారులు తేల్చి పక్కన పడేశారు. అందుకు కవర్‌పై 13–సీ నంబరు లేకపోవడమే కారణంగా చెబుతున్నారు. కవర్లో ఉన్న పోస్టల్ బ్యాలెట్లో తప్పులు లేనప్పుడు అవి లెక్కించాలంటూ మోదుగుల పట్టుబట్టినప్పటికీ అధికారులు అంగీకరించలేదు. విజయవాడలోనూ ఇంతే.. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. తిరువూరు, జగ్గయ్యపేట, మైలవరం, నందిగామతో పాటు విజయవాడ నగరంలోని సెంట్రల్, పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థుల కంటే టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నానికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. అటొక ఓటు.. ఇటొక ఓటు వేసిన ఫలితంగా వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వీరప్రసాద్ ఓటమి పాలయ్యారు. - విజయవాడ నగరంలోని సెంట్రల్, పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ తరఫున పోటీచేసిన అభ్యర్థులకు మొత్తం 1,21,460 ఓట్లు రాగా.. కేశినేనికి మాత్రం 1,43,307 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ అభ్యర్థులతో పోలిస్తే కేశినేని నానికి 21,847 ఓట్లు అదనంగా లభించాయి. - ఇక జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం, నందిగామ నియోజకవర్గాల్లోనూ క్రాస్ ఓటింగ్ ద్వారా కేశినేని లబ్ధిపొందారు. ఈ నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు 3,40,369 ఓట్లు రాగా, కేశినేని నానికి 3,48,652 ఓట్లు లభించాయి. అసెంబ్లీ అభ్యర్థుల కంటే ఎంపీ అభ్యర్థికి 8,283 ఓట్లు అదనంగా వచ్చాయి. ఇదే నాలుగు నియోజకవర్గాల పరిధిలోని వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థులకు మొత్తం 3,79,516 ఓట్లు లభించగా, ఆ పార్టీ లోక్‌సభ అభ్యర్థి పొట్లూరి వీరప్రసాద్‌కు 3,64,744 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ అభ్యర్థులతో పోలిస్తే పొట్లూరికి 14,772 ఓట్లు తగ్గాయి. క్రాస్ ఓటింగ్ జరిగిందనడానికి ఇవే తార్కాణాలు. -
ఆ ఆరు స్థానాల్లో టీడీపీ విజయం
సాక్షి నెట్వర్క్: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఆలస్యంగా వెల్లడైన మూడు లోక్‌సభ, మూడు శాసనసభ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. శ్రీకాకుళం ఎంపీ ఓట్ల లెక్కింపులో ఉత్కంఠ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపులో ఈవీఎంల కంటే.. పోస్టల్ బ్యాలెట్, సర్వీసు ఓట్ల లెక్కింపు పెద్ద సవాల్‌గా మారింది. ఈ పార్లమెంటు స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈసారి పోçస్టల్ బ్యాలెట్లు ఎక్కువగా పోలయ్యాయి. శ్రీకాకుళం పార్లమెంటుకు సర్వీసు ఓట్లు, పోస్టల్ ఓట్లు కలిసి మొత్తం 21,276 ఓట్లు పోల్ కాగా.. వీటిలో 14,626 మాత్రమే లెక్కించారు. ఇందులో టీడీపీకి 5,324 ఓట్లు రాగా.. వైఎస్సార్సీపీకి 6,948 ఓట్లు వచ్చాయి. మిగిలిన 6,980 ఓట్లు చెల్లకుండా పోయాయి. వీటిలో ఎక్కువ ఓట్లు వైఎస్సార్సీపీకి చెందినవి కావడంతో ఆ పార్టీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. శ్రీకాకుళం సిట్టింగ్ ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు కేవలం 6,658 ఓట్ల స్వల్ప మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌పై గెలుపొందారు. టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నిమ్మాడ పరిసరప్రాంతాల్లోని 259, 287, 288, 290, 291 పోలింగ్ బూత్‌లలో టీడీపీ మినహా ఇతర పార్టీలకు ఒక్క ఓటు కూడా నమోదు కాలేదు. ఈ ఐదు బూత్‌లు నిమ్మాడ పరిధిలో ఉన్నందున అక్కడ కింజరాపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడుల ప్రోద్బలంతో ఓటర్లను భయపెట్టి రిగ్గింగ్‌కి పాల్పడ్డారని పోలింగ్ సరళి స్పష్టంచేస్తోంది. ఈ విషయాలపై వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ శ్రీకాకుళం పార్లమెంటు రిటర్నింగ్ అధికారి, పరిశీలకులకు ఫిర్యాదు చేశారు. చెల్లని ఓట్లను మళ్లీ లెక్కించాలని కోరినా ఆర్వో అనుమతివ్వలేదు. దీనిపై దువ్వాడ కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గుంటూరు, విజయవాడ లోక్‌సభ పరిధిలో.. గుంటూరు ఎంపీ స్థానంలో వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి మోదుగుల క్రాస్ ఓటింగ్ కారణంతోనే ఓటమి పాలయ్యారు. ఇక్కడ గుంటూరు వెస్ట్ మినహా మిగతా ఆరు అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఆరు చోట్లా వైఎస్సార్సీపీ అభ్యర్థులకు 53,731 ఓట్ల మెజార్టీ వచ్చింది. టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ 4,205 ఓట్ల మెజార్టీతో తన ప్రత్యర్థి మోదుగులపై గెలుపొందారు. విజయవాడ ఎంపీ నియోజకవర్గంలో 8,726 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి కేశనేని నాని వైఎస్సార్సీపీ అభ్యర్థి పొట్లూరి వీర ప్రసాద్‌పై నెగ్గినట్లు అధికారులు ప్రకటించారు. విశాఖ నార్తులో రీపోలింగ్ నిర్వహించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ విశాఖ నార్తు నియోజకవర్గంలో వివాదాస్పద ఈవీఎంలో పడిన ఓట్లతో సంబంధం లేకుండా సీఈసీ ఆదేశాల మేరకు 1,944 ఓట్ల మెజార్టీతో గెలిచినట్లు గంటాకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. వివాదాస్పదమైన ఐదు ఈవీఎంలకు చెందిన బూత్‌ల్లో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ అభ్యర్థి కేకే రాజు సీతమ్మధార తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. వివాదాస్పదమైన ఈవీఎంలో ఓట్ల వల్ల ఫలితంలో పెద్దగా మార్పు లేని కారణంగా ఆ ఓట్లను పరిగణనలోకి తీసుకోకుండానే ఫలితాన్ని ప్రకటించవచ్చని సీఈసీ సూచించడంతో ఆర్వో ఫలితాన్ని ప్రకటించారు. ఉరవకొండలో స్వల్ప మెజార్టీతో నెగ్గిన కేశవ్ అనంతపురం జిల్లా ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గ ఫలితం ఇరు పార్టీలతోనూ దోబూచులాడింది. మొదటి 14 రౌండ్లలో వైఎస్సార్సీపీ ఆధిక్యం కనబరచగా, ఆ తర్వాత టీడీపీ పుంజుకుంది. కౌంటింగ్ సమయంలో ఐదు ఈవీఎంలపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో వాటిని లెక్కించకుండా పక్కన పెట్టారు. ఇతర ఈవీఎంల కౌంటింగ్ ముగిసిన తరువాత పక్కనపెట్టిన ఈవీఎంల లెక్కింపుపై ఇరు పార్టీల నేతలు వాగ్వాదానికి దిగారు. ఎన్నికల అధికారి వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు చేపట్టారు. కౌంటింగ్ పక్రియ శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు ముగియగా.. 2,138 ఓట్ల మోజార్టీతో కేశవ్ గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. పర్చూరులో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఓటమి ప్రకాశం జిల్లా పర్చూరు అసెంబ్లీ ఫలితం శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు వెలువడింది. వైఎస్సార్సీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు 1,503 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్టు అధికారులు ప్రకటించారు. మొత్తం 22 రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావుకు 96,077 ఓట్లు రాగా, వైఎస్సార్సీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరావుకు 94,574 ఓట్లు వచ్చాయి. -
టీడీపీ నేతల దౌర్జన్యం
సాక్షి, గుంటూరు : గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని నల్లచెరువులోగల 244వ పోలింగ్ బూత్‌లో సోమవారం జరిగిన రీపోలింగ్‌లో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. గత నెల 11న ఇదే బూత్ వద్ద టీడీపీ నేతలు గొడవకు దిగడంతో పోలింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో ఇక్కడ రీపోలింగ్ నిర్వహించారు. ఈ పోలింగ్ కేంద్రంలో 1,396 మంది ఓటర్లు ఉండగా, 180 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో భారీ బందోబస్తును ఏర్పాటుచేశారు. కానీ, టీడీపీ నేతలు మాత్రం పోలింగ్ మొదలైనప్పటి నుంచి నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ కేంద్రం వద్ద హల్చల్ చేశారు. పోలీసులు ఎంత వారించినా వినకుండా వారిపై సైతం దౌర్జన్యానికి తెగబడ్డారు. పచ్చ కండువాతో పోలింగ్ బూత్‌కు ‘గల్లా’ కాగా, గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ పచ్చకండువా వేసుకుని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసు అధికారులు అడ్డుకున్నారు. కండువా తీసి వెళ్లాలంటూ వారు సూచించడంతో సహనం కోల్పోయిన గల్లా.. ‘డోన్ట్ టాక్’ అంటూ వారిపై ఊగిపోయారు. ఇదే సమయంలో అక్కడే ఉన్న కలెక్టర్ కోన శశిధర్, అర్బన్ ఎస్పీ సీహెచ్ విజయరావు సైతం కండువా తీయాలంటూ సూచించారు. కలెక్టర్ తన వద్ద ఉన్న తెల్ల కండువాను తీసి ఇవ్వబోయినా తీసుకోకుండా తాను పచ్చకండువాతోనే వెళ్తానంటూ ‘గల్లా’ మొండికేయడంతో ఆర్వో ఆదేశాలతో వెళ్లాలంటూ సూచించి కలెక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయినా, గల్లా జయదేవ్ అలాగే పోలింగ్ బూత్‌లోకి వెళ్లారని తెలుసుకున్న జనసేన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, తోట చంద్రశేఖర్ సైతం బయటకు వెళ్లి ఎర్ర కండువాలు వేసుకుని మరీ పోలింగ్ బూత్‌లోకి వెళ్లారు. టీడీపీ, జనసేన అభ్యర్థులు ఈ తరహాలో వ్యవహరిస్తున్నప్పటికీ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రగిరి ఏసురత్నం మాత్రం సంయమనంతో పోలింగ్ సజావుగా జరిగేందుకు పోలీసులు, పోలింగ్ అధికారులకు సహకరించారు. ఎస్సైపై చేయిచేసుకున్న టీడీపీ మహిళా నేత ఇదిలా ఉంటే.. టీడీపీకి చెందిన ఓ మహిళా నాయకురాలు ఉదయం నుంచి పోలీసులు ఎంత వారిస్తున్నా వినకుండా పోలింగ్ జరిగే ప్రాంతంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. సోమవారం సా.4 గంటల సమయంలో ఏకంగా పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్ల క్యూలైనులోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడ విధుల్లో ఉన్న ట్రైనీ ఎస్సై ఆమెను ఆపేందుకు ప్రయత్నించారు. దీంతో ఆమె ఆగ్రహంతో దుర్భాషలాడుతూ ఎస్సై చెంప చెళ్లుమనిపించింది. దీంతో ఎస్సై ధరించిన బాడీవార్న్ కెమెరా పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. ఈ పరిణామంతో అక్కడున్న ఓటర్లు, పోలీసు అధికారులు విస్తుపోయారు. ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసు వాహనంలో తరలించారు. అయితే, టీడీపీ నేతల ఒత్తిడితో ఆమెపై కేసు నమోదు చేయలేదని తెలిసింది. ఓ పోలీసు ఉన్నతాధికారి అయితే ఆమె జోలికి ఎందుకు వెళ్లావంటూ ఎస్సైనే తిట్టడంపై అధికారులు, సిబ్బంది మండిపడుతున్నారు. -
ఆంధ్రజ్యోతి పేరు మారిస్తే బాగుంటుందేమో..
సాక్షి, గుంటూరు : టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌పై గుంటూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారమిక్కడ ఎన్నికల ప్రచారంలో ఆయన ... జయదేవ్ మీద భూకబ్జా కేసులున్నాయని ఆరోపించారు. ఓట్లు గుంటూరువి.. నోట్లు మాత్రం చిత్తూరుకా అని మండిపడ్డారు. ఇక మంగళగిరి అని స్పష్టంగా పలకలేని నారా లోకేష్.. మంగళగిరి టీడీపీ అభ్యర్థా అని ప్రశ్నించారు. చంద్రబాబు మీడియా సాక్షిగా ఎన్టీఆర్‌ను వాడు అన్నాడంటే.. రూమ్‌లో ఇంకేం మాట్లాడాడో అర్థం చేసుకోవచ్చని మోదుగుల అన్నారు. ఆంధ్రజ్యోతి దినపత్రికకు జ్యోతి లక్ష్మీగా పేరు మారిస్తే బాగుంటుందని మోదుగుల ఎద్దేవా చేశారు. రాధాకృష్ణ.. జ్యోతి లక్ష్మీ భంగిమలా ఎన్ని మాటలైన మాట్లాడతాడని ఆయన మండిపడ్డారు. టీడీపీకి చంద్రబాబు, లోకేష్‌లు నాయకులుగా పనికిరారన్నారు. మీ పార్టీకి నాయకులను మార్చుకోండి అంటూ టీడీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా వైఎస్సార్‌సీపీతోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. గుంటూరు అభివృద్ధి కోసం ఏమేమి పనులు చేపట్టాలో తెలిపేలా తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసిందని మోదుగుల తెలిపారు. -
‘అద్దెకిచ్చిన ఇంటినే ఆక్రమించుకున్నావ్’
సాక్షి, గుంటూరు : గుంటూరులో గల్లా జయదేవ్ తనకు అద్దెకిచ్చిన ఇంటినే బ్యాంకు అధికారులతో కుమ్మక్కై ఆక్రమించుకున్నాడని జనసేన గుంటూరు లోక్‌సభ అభ్యర్థి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. సోమవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గుంటూరు తెలుగుదేశం పార్టీ ఎంపీగా పోటీ చేస్తున్న గల్లా జయదేవ్ పెద్ద భూ కబ్జాదారుడన్నారు. రాజధానిలో రాజన్న ట్రస్ట్ పేరుతో పది ఎకరాల భూమిని కొట్టేయడానికి జయదేవ్ ప్లాన్ చేస్తున్నారన్నారు. ప్రభుత్వానికి.. ప్రైవేట్ కంపెనీల మధ్య గల్లా జయదేవ్ బ్రోకర్‌గా పని చేస్తున్నాడని విమర్శించారు. చిత్తూరు జిల్లా ప్రజలు గల్లా కుటుంబాన్ని తన్ని తరిమేస్తే.. గుంటూరు జిల్లా వచ్చి రాజకీయం చేస్తున్నారని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు. రాజధానిలో బీసీలపై జరిగిన దాడి ముమ్మాటికి రాజకీయ హత్యేనని స్పష్టం చేశారు. టీడీపీకి ఓట్లు వెయ్యం అన్న పాపానికి తెలుగుదేశం నాయకులు రాజధానిలో బీసీలను కారుతో గుద్ది చంపేస్తున్నారని ఆరోపించారు. ఈ కేసును రూపుమాపడానికి జయదేవ్ ప్రయత్నం చేస్తున్నాడని.. దీని వెనక అతని హస్తం కూడా ఉనట్లు శ్రీనివాస్ యాదవ్ అనుమానం వ్యక్తం చేశారు. -
లోకల్ వర్సెస్ నాన్ లోకల్
రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందిన ప్రాంతం గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం. ఇప్పుడు రాష్ట్ర పరిపాలనకు కూడా కేంద్ర బిందువు. ఈ నియోజకవర్గం ఎంతో మంది మహానేతలకు రాజకీయ భవిష్యత్తును ఇచ్చింది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గుంటూరు పార్లమెంట్ స్థానంలో లోకల్ వర్సెస్ నాన్ లోకల్ వార్ నడుస్తోంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గుంటూరు మిర్చి యార్డు, విద్యా సంస్థలు, యూనివర్సిటీలు ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. వాణిజ్య పంటలైన మిర్చి, పత్తి, పసుపులతో పాటు వరి, జొన్న, మొక్క జొన్న పంటలు రైతులు ఎక్కువగా పండిస్తుంటారు. గుంటూరు తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు(ఎస్సీ), తాడికొండ(ఎస్సీ), పొన్నూరు, మంగళగిరి, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కమ్మ, కాపు, ముస్లిం ఓటర్లు ఇక్కడ పోటా పోటీగా ఉంటారు. వారి తర్వాత రెడ్డి, ఎస్సీ, బీసీ ఓటర్లు నిలుస్తారు. రాజకీయ చరిత్ర ఇలా.. గుంటూరు పార్లమెంట్ రాజకీయ ఉద్దండులకు నెలవైన నియోజకవర్గం. కొత్త రఘురామయ్య, ఎన్జీ రంగా వంటి మహానేతలు ఇక్కడి నుంచే రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1952లో మొదటిసారి ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి ఎస్.వి.ఎల్. నరసింహం విజయం సాధించారు. 16 సార్లు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్(ఐ) ఏడుసార్లు, కాంగ్రెస్ ఐదుసార్లు, టీడీపీ మూడుసార్లు, ఇండిపెండెంట్ ఒకసారి విజయం సాధించాయి. 1984 టీడీపీ ప్రభంజనంలోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. కొత్త రఘురామయ్యను ఐదుసార్లు, ఎన్జీ రంగా, రాయపాటి సాంబశివరావులను మూడుసార్లు ఈ నియోజకవర్గ ప్రజలు ఆదరించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్, వైఎస్సార్సీపీ అభ్యర్థి బాలశౌరిపై విజయం సాధించారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ స్థానానికి టీడీపీ సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్, వైఎస్సార్సీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి పోటీలో ఉన్నారు. ఐదేళ్లకోసారి గల్లా దర్శనం 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందిన గల్లా జయదేవ్‌పై స్థానికేతరుడు అనే ముద్ర బలంగా పడింది. ఈయనపై ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తారని నమ్మి ఓటేసిన ప్రజలను గల్లా మోసం చేశారనే విమర్శలున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ఆ పార్టీ కార్యకర్తలు, డివిజన్ స్థాయి నేతలతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గల్లా మాట్లాడుతూ ‘‘ఐదు సంవత్సరాల తర్వాత మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది.’’ అన్నారని ఆ పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు. గల్లా గెస్ట్ ఎంపీ అనడానికి ఈ ఒక్క ఉదాహరణే నిదర్శనం. దూసుకుపోతున్న మోదుగుల... నరసరావుపేట ఎంపీగా ఉన్న సమయంలో రాష్ట్ర విభజన, జిల్లా సమస్యలపై పార్లమెంట్లో గళం విప్పిన మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి అందరికీ సుపరిచితులే. ‘తాడికొండ నియోజకవర్గం నా సొంత ఊరు, పొన్నూరు నియోజకవర్గం నా అత్త గారి ఊరు, గుంటూరులో పుట్టి పెరిగిన నేను పక్కా లోకల్. రాజకీయాలకు వలస వచ్చి గుంటూరు ప్రజలను వాడుకుంటున్న గల్లాను గుల్ల చేస్తానంటూ మోదుగుల దూకుడు పెంచుతున్నారు. ఇదే సందర్భంలో సొంత పార్టీలో అసమ్మతి సెగలు, జిల్లా సమస్యల పరిష్కారంలో టీడీపీ ఘోరంగా విఫలం అవడం మోదుగులకు సానుకూలంగా మారింది. అభివృద్ధి ఆనవాళ్లే లేవు.. ఐదేళ్ల టీడీపీ పాలనలో గుంటూరు పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి ఏమీ జరగలేదు. గత ప్రభుత్వ హయాంలో గుంటూరుకు 24 గంటలు తాగు నీరు అందించేందుకు కేంద్ర నిధులతో ప్రారంభించిన సమగ్ర మంచి నీటి పథకం, 2014లో ప్రారంభించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్ల విస్తరణ పనులు ఎక్కడ వేసినవి అక్కడే అన్నట్లున్నాయి. ఎంపీ దత్తత తీసుకున్న గ్రామాల్లో సైతం అభివృద్ధి ఆనవాళ్లు లేకపోవడం గమనార్హం. అభివృద్ధిలో వైఎస్ ముద్ర పదిలం... ∙గుంటూరు వాసుల దాహార్తి తీర్చేలా 24 ఎంఎల్డీ నీటి శుద్ధి కర్మాగారాలను రక్షిత నీటి పథకంలో భాగంగా నిర్మించారు. ∙ఆరోగ్యశ్రీ –2ను గుంటూరులోనే ప్రారంభించారు. ∙అడవితక్కెళ్ళపాడులో రాజీవ్ గృహకల్ప తొలి విడతలో ఇళ్లు నిర్మించి ఇచ్చారు. ∙తెనాలికి రూ.100 కోట్ల వ్యయంతో రక్షిత మంచినీటి పథకానికి శంకుస్థాపన చేశారు. ∙మంగళగిరిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ∙సీమాంధ్రలో ఎక్కడా లేని విధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ∙పొన్నూరులో మున్సిపాలిటీ భవన నిర్మాణానికి రూ.కోటి మంజూరు చేశారు. ∙తాడేపల్లిని మున్సిపాలిటీ చేసేందుకు, రూ.40 కోట్లతో మంచి నీటి పథకం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొత్తం ఓటరు 15,67,557 పురుష ఓటర్లు 7,68,216 మహిళలు 7,99,196 జనాభా 21,64,356 పురుషులు 10,82,385 మహిళలు 10,81,948 -
సభా మర్యాదలు పాటించాలి
న్యూఢిల్లీ: మోదీని కౌగిలించుకున్నందుకు స్పీకర్ సుమిత్రా మహాజన్ రాహుల్‌ను మందలించారు. సభ్యులంతా సభా మర్యాదలు పాటించాలని ఆమె కోరారు. రాహుల్ ఎవరిని కౌగిలించుకున్నా తానేమీ వ్యతిరేకిని కాననీ, అయితే సభలో మర్యాదతో నడచుకోవాలని ఆమె కోరారు. తనకెవరూ శత్రువు కాదనీ, రాహుల్ తన కొడుకులాంటి వాడని ఆమె పేర్కొన్నారు. ఆయన మోదీని కౌగిలించుకోవడం తనకు ఓ డ్రామాలా అనిపించిందన్నారు. హోదాపై మాట లేదు సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని రాహుల్ తన ప్రసంగంలో కనీసం ప్రస్తావించలేదు. గంటకుపైగా ప్రసంగించినా ఎక్కడా ఏపీకి ఇచ్చిన విభజన హామీల గురించి చిన్న మాట కూడా ఎత్తలేదు. కేవలం గల్లా జయదేవ్ ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ.. ఏపీ తీరును ఆయన వివరించారని చెప్పి ముగించారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకిచ్చిన అన్ని హామీలనూ బీజేపీ సమ్మతించిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, పన్ను రాయితీలు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలపడం, ఆర్థిక లోటు భర్తీ హామీలను అమలు చేసేందుకు బీజేపీ అంగీకరించిందని అన్నారు. ఏపీకిచ్చిన హామీలను 2016లో మాజీ ప్రధాని మన్మోహన్ రాజ్యసభలో తిరిగి ప్రస్తావించారన్నారు. -
జయదేవ్ నోట జగన్ పలుకులు ..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రత్యేక హోదాపై కేంద్రం మోసపూరిత వైఖరిని మూడేళ్ల కిందట అసెంబ్లీలో విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎండగడుతూ చెప్పిన అంశాలనే అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్‌సభలో చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదాకు 14వ ఫైనాన్స్ కమిషన్ అభ్యంతరం చెప్పలేదని, ప్రత్యేక హోదాను రద్దు చేయాలని తాము సిఫార్సు చేయలేదని స్వయంగా 14వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వైవీ రెడ్డి పలు సందర్భాల్లో వెల్లడించిన విషయాన్ని అసెంబ్లీలో జగన్ పేర్కొన్నారు. ప్రత్యేక హోదాను రద్దు చేయాలని తాము సూచించలేదని పేర్కొంటూ కమిషన్ సభ్యులు అభిజిత్ సేన్ లేఖ రాశారని, మరో సభ్యుడు గోవిందరావు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారని అసెంబ్లీలో జగన్ తేల్చిచెప్పారు. హోదాను మించి కేంద్రం ప్యాకేజ్ రూపంలో సాయంచేస్తుందని చెబుతూ ప్యాకేజ్‌ను సీఎం చంద్రబాబు స్వాగతించడాన్ని జగన్ తప్పుపట్టారు. అయితే లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా సరిగ్గా జగన్ ప్రస్తావించిన అంశాలనే గల్లా జయదేవ్ లోక్‌సభలో వల్లె వేశారు. -
చర్చ ప్రారంభం.. బీజేడీ ఔట్
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ఎక్కుపెట్టిన అవిశ్వాస తీర్మానంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి నెలకొంది. భరత్ అనే నేను సినిమాను ప్రస్తావిస్తూ.. అవిశ్వాసం తీర్మాన చర్చను టీడీపీ తరుఫున కేశినేని నానికి బదులు గల్లా జయదేవ్ ప్రారంభించారు. ఇది ఓ ధర్మ యుద్ధమని, పార్లమెంట్ చరిత్రలోనే ఇది చాలా ముఖ్యమైన రోజని అభివర్ణించారు. ఇది మెజారిటీకి, మొరాలిటీకి జరిగే యుద్ధమని గల్లా జయదేవ్ అన్నారు. అయితే లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభం కావడానికి కంటే ముందే బిజూ జనతాదళ్(బీజేడీ) సభ నుంచి వాకౌట్ చేసింది. విపక్షాలకు మాట్లాడేందుకు ఇచ్చిన సమయం సరిపోదంటూ కాంగ్రెస్ విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతున్న వేళ, బీజేడీ పక్ష నేత తనకు మైక్ కావాలని తీసుకున్నారు. తాము సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని, అవిశ్వాసంతో ఒడిశాకు ఒరిగేదే ఏమీ లేదన్నారు. ఒడిశాకు జరిగే అన్యాయంపై ఏ ప్రభుత్వంపై పట్టించుకోవడం లేదని, అందుకే సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని తెలిపారు. తమ రాష్ట్రానికి కేంద్రం చాలా అన్యాయం చేసిందని, కేంద్రం వైఖరికి నిరసనగానే తాము వాకౌట్ చేస్తున్నామని, రెండు మాటలు చెప్పి బయటకు వెళ్లిపోయారు. కాగ, అవిశ్వాసంపై చర్చలో మాట్లాడేందుకు బీజేడీకి స్పీకర్ 15 నిమిషాల సమయం కేటాయించిన సంగతి తెలిసిందే. మొత్తం లోక్‌సభలో బీజేడీ తరుఫున 20 మంది ఎంపీలున్నారు. వీరెవరూ అవిశ్వాసంపై జరిగే ఓటింగ్‌లో పాల్గొనరని తెలిసింది. మరోవైపు అవిశ్వాసంపై చర్చకు స్పీకర్ కేటాయించిన సమయం సరిపోదని, మరికొంత సమయం కావాలని విపక్షాలు కోరుతున్నాయి. అయితే లంచ్ సమయంలో కూడా చర్చను కొనసాగిస్తామని స్పీకర్ చెప్పారు. అవిశ్వాసంపై చర్చలో పాల్గొనకుండా ముందే సభ నుంచి వెళ్లిపోయిన బీజేడీపై కాంగ్రెస్ పార్టీ సైతం సీరియస్ అయింది. బీజేపీకి కొమ్ము కాస్తూ సభ నుంచి వెళ్లిపోతారా? అంటూ వ్యాఖ్యానించింది. -
రాజ్‌ఘాట్ వద్ద టీడీపీ ఎంపీల మౌన దీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి ఇచ్చిన హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీడీపీ ఎంపీలు సోమవారం ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద మౌన దీక్ష చేపట్టారు. ఎంపీలు సుజనా చౌదరి, మాగంటి బాబు, జయదేవ్ తదితరులు మౌనదీక్ష చేపట్టారు. హామీల సాధనకు కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామని, బీజేపీ చేసిన మోసాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు. -
హైకోర్టుకు మళ్లీ ‘ఏపీ ఒలింపిక్’ వివాదం
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఒలింపిక్ సంఘ వివాద పరిష్కారం కోసం ఏర్పాటైన మధ్యవర్తిత్వ కమిటీని సవాల్ చేస్తూ అనంతపురం లోక్‌సభ సభ్యుడు జేసీ దివాకర్‌రెడ్డి తనయుడు జేసీ పవన్‌రెడ్డి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తమదే అసలైన ఏపీ ఒలింపిక్ సంఘమంటూ పవన్‌రెడ్డి గతంలో వ్యాజ్యం దాఖలు చేయగా బైలా ప్రకారం మధ్యవర్తిత్వ కమిటీ ద్వారా పరిష్కరించుకోవాలని ఇరుపక్షాలకు హైకోర్టు సూచించింది. అందుకు ఏపీ ఒలింపిక్ సంఘ అధ్యక్షుడైన గుంటూరు లోక్‌సభ సభ్యుడు గల్లా జయదేవ్ కూడా అంగీకరించారు. ఈ వ్యవహారంపై గౌహతి హైకోర్టు రిటైర్డ్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీధర్‌రావు అధ్యక్షతన ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) అధ్యక్షుడు రామచంద్రన్ ఓ మధ్యవర్తిత్వ కమిటీని ఏర్పాటు చేశారు. దీనిలో మరో ఇద్దరు రిటైర్డు న్యాయమూర్తులు సభ్యులుగా ఉన్నారు. ఐఓఏలోని ప్యానెల్ ఆర్బిట్రేటర్లుగా ఉన్న వారితోనే మధ్యవర్తిత్వ కమిటీని ఏర్పాటు చేయాలని, కమిటీ ఏర్పాటుకు ముందు కార్యనిర్వాహక కమిటీ సమావేశం కాలేదని, ప్యానెల్లో లేని వారితో కమిటీని ఏర్పాటు చేశారని, ఈ నేపథ్యంలో ఈ కమిటీ చెల్లదని పిటిషనర్ జేసీ పవన్‌రెడ్డి తన తాజా వ్యాజ్యంలో పేర్కొన్నారు. గల్లా జయదేవ్ కంపెనీలో రామచంద్రన్ కుమారుడు డైరెక్టర్‌గా పని చేస్తున్నారని, అందువల్లే జయదేవ్ అధ్యక్షతన ఉన్న ఏపీ ఒలింపిక్ సంఘానికి రామచంద్రన్ గుర్తింపు ఇచ్చారని, కానీ, తన అధ్యక్షతన ఉన్న సంఘమే అసలైనదని పవన్‌రెడ్డి గతంలో హైకోర్టును ఆశ్రయించారు. అయితే, రిటైర్డ్ జడ్జీలతో కూడిన మధ్యవర్తిత్వ కమిటీ ద్వారా మూడు నెలల్లో సమస్యను కొలిక్కి తేవాలని గత సెప్టెంబర్ 5న హైకోర్టు ఆదేశించింది. ఐఓఏ అధ్యక్షుడు ప్యానెల్ ఆర్బిట్రేటర్స్‌ను కాదని ఇతరులతో కమిటీ ఏర్పాటు చేయడంతో మళ్లీ వివాదం హైకోర్టుకు చేరింది.