girl rape
-
బాలికపై అత్యాచారం కేసు..
సోన్‌భద్ర: బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రామ్‌దులార్ గోండ్‌కు ప్రత్యేక న్యాయస్థానం 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, మరో రూ.10 లక్షల జరిమానా విధించింది. దీంతో, శాసనసభ సభ్యత్వానికి ఆయన అర్హత కోల్పోనున్నారు. తొమ్మిదేళ్ల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటనపై ఈ నెల 12న కోర్టు విచారణ ముగిసింది. సోన్‌భద్ర అడిషనల్ జడ్జి, ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు సెషన్ జడ్జి అహ్సానుల్లా ఖాన్ తాజాగా తీర్పు వెలువరించారు. జరిమానా మొత్తాన్ని బాధితురాలి కుటుంబ సంక్షేమం కోసం వినియోగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2014లో ఈ ఘటన చోటుచేసుకోగా ఆ సమయంలో రామ్‌దులార్ గోండ్ భార్య గ్రామ సర్పంచిగా ఉన్నారు. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు మియోర్పూర్ పోలీస్ స్టేషన్లో గోండ్‌పై పోక్సో సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. మొదట్లో పోక్సో ప్రత్యేక కోర్టులో కేసు విచారణ సాగింది. బీజేపీ తరఫున గోండ్ దుద్ధి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయ్యాక ఈ కేసు ఎంపీ/ఎమ్మెల్యే కోర్టుకు బదిలీ అయ్యింది. -
ఉజ్జయిని కేసులో వారిపై కూడా చట్టపరమైన చర్యలు: ఏఎస్పీ
భోపాల్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉజ్జయిని మైనర్ బాలిక రేప్ సంఘటనలో నిందితుడిని కనుగొనేందుకు పోలీసులు విపరీతంగా శ్రమించారని తెలిపారు ఉజ్జయిని అడిషనల్ సూపెరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జయంత్ సింగ్ రాథోడ్. ఈ సందర్భగా సంఘటన జరిగిన తర్వాత బాధితురాలు అన్ని ఇళ్లు తిరుగుతూ సహాయం కోరినప్పుడు సాయం చేయడానికి నిరాకరించిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. శభాష్ పోలీస్.. ఉజ్జయిని ఏఎస్పీ జయంత్ సింగ్ రాథోడ్ మాట్లాడుతూ ఈ సంఘటన జరిగినప్పుడు తామంతా రాష్ట్రపతి రాష్ట్రానికి వచ్చిన కార్యక్రమంలో బిజీగా ఉన్నామని వీడియో బయటకు రాగానే షాక్‌కు గురయ్యామన్నారు. విషయం తెలిసిన వెంటనే మొదట ఆసుపత్రికి వెళ్లి బాలికను పరామర్శించామని అనంతరం విచారణ చేపట్టి సుమారు 700 సీసీటీవీ ఫుటేజిలను పరిశీలించి భరత్ సోనీ అనే ఆటో డ్రైవర్‌ను నిందితుడిగా గుర్తించామన్నారు. దాదాపు 30-35 మంది పోలీసులు నిద్రాహారాలు మాని ఇన్వెస్టిగేషన్లో పాల్గొన్నారని వారందరికీ పేరుపేరునా అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. బాధ్యతారాహిత్యం.. సంఘటన జరిగిన తర్వాత ఆమె మరో ఆటోలో కొంతదూరం ప్రయాణించిందని.. ఆ ఆటో డ్రైవర్ రాకేష్ మాలవ్య విషయం తెలిసి కూడా పోలీసులకు సమాచారం అందించకపోవడం వలన విషయం తెలిసేసరికి ఆలస్యమైందన్నారు. పోక్సో చట్టం ప్రకారం రాకేష్ చేసింది కూడా నేరమేనని అందుకే అతడిని కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు. అత్యాచారం జరిగిన తర్వాత బాలిక ఒక్కో ఇల్లు తిరుగుతూ సాయమడిగినా ఎవ్వరూ స్పందించకపోవడంపై స్పందిస్తూ మానవతా కోణంలో వారు చేసింది తప్పేనని వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. మరణశిక్ష విధించండి.. ఈ కేసులో నిందితుడైన ఆటో డ్రైవర్ భరత్ సోనీ తండ్రి జరిగిన సంఘటన గురించి మాట్లాడుతూ తన కుమారుడు తప్పు చేసినట్లు నిరూపితమైతే మరణశిక్ష విధించామని అంతకంటే పెద్ద శిక్ష మరొకటి లేదు కాబట్టి అదే అమలు చేయాలన్నారు. ఈ కేసును ఛేదించిన ఉజ్జయిని మహాకాల్ ఎస్సై అజయ్ వర్మ వారి బంధువులకు అభ్యంతరం లేకపోతే బాలికను దత్తత తీసుకుంటానని ప్రకటించి పెద్దమనసు చాటుకున్నారు. ఇది కూడా చదవండి: గ్యాంగ్‌స్టర్ సునీల్ నాహక్ హత్య -
ఏపీ-టీఎస్: చిన్నారులపై వరుస అత్యాచారాలు
సాక్షి, హైదరాబాద్: చాక్లెట్లు కొనిపెడతానంటూ చిన్నారి పాపను తీసుకెళ్లి దారుణంగా అత్యాచారం చేశాడో వృద్ధుడు... బాలికను గర్భవతిని చేశాడు మరో ముసలోడు... నాలుగు నెలలుగా విద్యార్థినిపై అఘాయిత్యం జరుపుతూ పట్టుపబడ్డాడో ట్యూషన్ టీచర్! తెలుగు రాష్ట్రాల్లో ఒక్క శనివారం రోజే మధ్యాహ్నం వరకు రిపోర్ట్ అయిన కీచకపర్వాలివి. రాత్రికి వరకు ఇంకా ఎన్ని జరుగుతాయో, అసలు వెలుగులోకి రాకుండాపోయే ఘటనలెన్నో!! దాచేపల్లిలో మరో దారుణం: గుంటూరు జిల్లా దాచేపల్లిలో మరో దారుణం వెలుగుచూసింది. 55 ఏళ్ల వృద్ధుడు కొద్దిరోజులుగా బాలికపై అత్యాచారానికి పాల్పడేవాడు. ఇంట్లోవాళ్లకు చెబితే అందరినీ చంపేస్తానని బెదిరించేవాడు. ఇటీవలే పాప ఆరోగ్యం దెబ్బతినడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యపరీక్షల్లో ఆమె గర్భవతని తేలింది. భయంతో వణికిపోయిన పాప.. తనపై జరిగిన అకృత్యాన్ని చెప్పేసింది. తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు నిందితుడు మహబూబ్వలీపై పోలీసులు కేసు నమోదుచేశారు. చిన్నారిపై అఘాయిత్యం.. బియ్యం ఇచ్చే యత్నం: నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఐదేళ్ల చిన్నారిపై గురుస్వామి అనే వృద్ధుడు అత్యాచారానికి యత్నించాడు. చాక్లెట్లు, బిస్కెట్లు కొనిస్తానంటూ తీసుకెళ్లి అఘాయిత్యం జరుపబోగా.. చిన్నారి నానమ్మ గమనించింది. చేసినతప్పుకు ప్రతిగా ఐదు కేజీల బియ్యం ఇచ్చి తప్పించుకోవాలని చూశాడా కీచకుడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితుడు గురుస్వామిని అదుపులోకి తీసుకున్నారు. మీర్పేట్లో విద్యార్థినిపై ట్యూటర్: హైదరాబాద్‌లోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల లెనిన్ నగర్లో దారుణం వెలుగుచూసింది. 12 ఏళ్ల విద్యార్థినిపై ఆమెకు పాఠాలు చెప్పే ట్యూటర్ గోపి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తీవ్రరక్తస్రావం అవుతున్న స్థితిలో బాలికను తల్లిదండ్రులు గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. ట్యూటర్ గోపి.. గడిచిన నాలుగు నెలలుగా బాలికపై అత్యాచారం జరుపుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. -
అత్యాచారం, వేధింపులు.. వ్యాపారి అరెస్ట్
అగర్తలా: కఠిన చట్టాలు చేస్తూ నిందితులకు శిక్షలు వేస్తున్నా మృగాళ్లలో మార్పు రావడం లేదు. తాజాగా త్రిపురలో ఇలాంటి కీచక ఘటన వెలుగుచూసింది. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు వ్యాపారవేత్త, బీజేపీ మద్దతుదారుడు మనోజ్ డెబ్(54)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలిలా.. త్రిపుర ఖోవాయి జిల్లా తెలియమురాకు చెందిన మనోజ్ డెబ్ పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు. బీజేపీ నేతగా ప్రచారం చేసుకునే ఈ నిందితుడు ఛంప్లాయ్‌లోని తన ఫామ్‌హౌస్‌లో బాలిక(14)పై ఈ ఏడాది ఫిబ్రవరి 11న తొలిసారి అత్యాచారం చేశాడు. ఆపై ఆ కీచకపర్వాన్ని అలాగే కొనసాగించాడు. ఈ క్రమంలో ఇప్పటివరకూ నాలుగు పర్యాయాలు బాధితురాలిపై లైంగికదాడి చేశాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లు ఫిర్యాదులో బాలిక పేర్కొంది. గతవారం మళ్లీ ఫామ్‌హౌస్‌కు రావాలని నిందితుడు మనోజ్ కోరగా.. బాలిక తన స్నేహితురాలికి విషయం చెప్పింది. బిషాల్‌గఢ్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని ఫ్రెండ్ సూచించగా.. ధైర్యం తెచ్చుకుని తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించింది. ఖోవాయి ఎస్పీ క్రిష్ణేందు చక్రవర్తి మాట్లాడుతూ.. నిందితుడు మనోజ్ డెబ్‌కు తెలియమురాలో పెద్ద వ్యాపారవేత్త అని, కేసును ప్రభావితం చేయగల వ్యక్తి కూడా అని తెలిపారు. బాలిక ఫిర్యాదు చేయగా అత్యాచారంతో పాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. -
ఇదీ సోషల్ మీడియా చేసిన 'న్యాయం'
సాక్షి, న్యూఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్‌లోని లోహిత్ జిల్లా నాంగో మిషిమి గ్రామంలో ఫిబ్రవరి 12వ తేదీన ఐదేళ్ల పాప అదశ్యమైంది. వారం రోజుల తర్వాత తల నుంచి వేరైన ఆ పాప మొండెం ఆ పాప ఇంటికి 300 మీటర్ల దూరంలోని తేయాకు తోటలో దొరికింది. పాపను రేప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించి ఆ మేరకు కేసు నమోదు చేసుకున్నారు. అదే రోజు అంటే ఫిబ్రవరి 18, ఆదివారం రోజు సాయంత్రం సంజయ్ సోబర్ అనే 30 ఏళ్ల యువకుడిని, జగదీష్ లోహర్ అనే పాతికేళ్ల యువకుడిని పోలీసులు నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశారు. వారిని జిల్లా కేంద్రమైన తేజు పట్టణంలోని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. నిందితులు ఇద్దరు తేయాకు తోటల్లో పనిచేయడానికి వలస వచ్చిన వాళ్లు. సోబర్ అనే యువకుడు ఆ పాపను రేప్ చేసినట్లు లోహర్ అనే యువకుడు వాంగ్మూలం ఇచ్చినట్లు ఆ మరుసటి రోజు, అంటే సోమవారం సోషల్ మీడియా ద్వారా జిల్లా అంతటా పాకింది. మధ్యాహ్నానికి ఇనుప రాడ్లు, కర్రలు, సుత్తెలు పట్టుకొని దాదాపు 1500 మంది ప్రజలు పోలీసు స్టేషన్‌ను చుట్టుముట్టారు. రేపిస్టులను తమకు అప్పగించాల్సిందిగా డిమాండ్ చేశారు. అందుకు పోలీసులు అప్పగించక పోవడంతో పోలీసు స్టేషన్‌పై దాడిచేసి లాకప్ తాళాన్ని పగులగొట్టి ప్రజలు నిందితులను పట్టుకెళ్లారు. పట్టణంలో వారిని కొట్టుకుంటూ, తన్నుకుంటూ తిప్పారు. చివరకు నిందితులిద్దరు చనిపోయారు. వారి భౌతిక దేహాలను తగులబెట్టేందుకు ప్రయత్నించగా, పోలీసులు వచ్చి వాటిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఈ మత్యుదండన సీన్లను కూడా సోషల్ మీడియా విపరీతంగా షేర్ చేసుకొంది. 'ఇది మూకుమ్మడి న్యాయం....ప్రజల తీర్పు.....ప్రజల న్యాయం.....రాష్ట్రవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రానికి ప్రజలిచ్చిన బహుమతి' అంటూ పలువురు మెచ్చుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ మాత్రం చాలా బాధ్యతాయుతంగా స్పందించారు. 'రాజ్యాంగానికి, చట్టానికి నిబద్ధతతో కట్టుబడే గొప్ప దేశానికి మనం పౌరులం. చట్టాన్ని చేతుల్లోకి మనం తీసుకోవడాన్ని మన దేశం అనుమతించదు. అందుకు పోలీసు యంత్రాంగం, న్యాయవ్యవస్థలు ఉన్నాయి. ఆ రెండు వ్యవస్థలను మనం గౌరవించాలి' అని చెప్పారు. ఏ రాజకీయ పార్టీలు ఈ సంఘటనపై ఇంతవరకు స్పందించలేదు. అంతర్జాతీయ ఆమ్నెస్టీ సంఘం మాత్రం ఖండించింది. 'భారత దేశంలో బాలికలు, మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్న హింస అంతా, ఇంతా కాదు. దాన్ని తీవ్రంగా పరిగణించాల్సిందే. అంతమాత్రాన ప్రజలు హింసకు పాల్పడరాదు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు. చట్టాలను గౌరవించాల్సిందే. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని రేపిస్టులను చంపిన వారిని కూడా చట్టం ప్రకారం శిక్షించాల్సిందే' అని పౌర హక్కుల పరిరక్షణకు నిరంతరం పోరాడే అంతర్జాతీయ ఆమ్నెస్టీ సంఘం వ్యాఖ్యానించింది. ప్రజలు ఇంతగా ఆగ్రహానికి గురికావడానికి కారణం అస్సాంలో రేప్‌లు ఎక్కువగా జరుగుతుండడం, వాటిల్లో నేరస్థులకు సరిగ్గా శిక్షలు పడక పోవడం కారణమని కొందరు విజ్ఞులు వాదిస్తున్నారు. రాష్ట్రంలో 2015 నుంచి 2017, నవంబర్ నెల వరకు 225 రేప్ కేసులు నమోదయ్యాయి. ఒక్క 2016లోనే 91 కేసులు నమోదయ్యాయి. కొన్ని కేసుల్లో నెలలు, నెలలు గడుస్తున్నా నిందితుల అరెస్ట్‌లు కూడా జరుగలేదు. రాష్ట్ర రాజధాని ఇటా నగర్‌కు సమీపంలో గత ఆగస్టు నెలలో ఓ యూనివర్శిటీ విద్యార్థిని శవం దొరికింది. ఆమెను రేప్ చేసి, హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. కానీ ఇంతవరకు ఆ కేసులో ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఇదే ఫిబ్రవరి కేసులో రెండు రేప్ కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 17వ తేదీన సియాంగ్ జిల్లాలోని యింకియాంగ్లో ఐదేళ్ల బాలికను ఆమెకు పాఠాలు చెప్పే టీచరే రేప్ చేసినట్లు కేసు నమోదయింది. 14వ తేదీన సుభాన్‌సిరి జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికను రేప్ చేశారు. ఈ సంఘటనలో 23 ఏళ్ల ఓ ప్రభుత్వ ఉద్యోగిని ప్రజలే పట్టుకొని ఊరంతా తిప్పి పోలీసులకు అప్పగించారు. -
ఇంతటి దారుణంలో నిజమైన నేరస్థులెవరు?
సాక్షి, జమ్మూ : ‘వెయ్యి మంది కూడా వస్తారనుకోలేదు. మూడు నుంచి నాలుగు వేల మంది వరకు వచ్చారు. ఆడవాళ్లు కూడా పెద్ద సంఖ్యలో రావడం ఆశ్చర్యం’ అని కథువా జిల్లాలోని హీరానగర్ మేజిస్ట్రేట్ కోర్టు వద్ద వారి రాకకోసం ఎదురు చూస్తున్న విజయ్ శర్మ అనే న్యాయవాది విజయ హాసంతో వ్యాఖ్యానించారు. జుడీషియల్ కస్టడీలో ఉన్న ప్రత్యేక పోలీసు అధికారులు దీపక్ కజూరియా, సురీందర్ వర్మలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హీరానగర్, దానికి అనుకుని ఉన్న రసనా గ్రామం పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు నిరసన ప్రదర్శనగా మూడు రోజుల క్రితం అక్కడికి తరలి వచ్చారు. న్యాయవాదే కాకుండా, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న విజయ్ శర్మ ఇటీవలే మరో కొత్త బాధ్యతలను కూడా స్వీకరించారు. జనవరి 23న ఏర్పాటు చేసిన ‘హిందూ ఏక్తా మంచ్’కు ఆయన అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయన హిందూ ఏక్తా మంచ్ పేరిట ఇచ్చిన పిలుపు మేరకు ఆ మూడు, నాలుగువేల మంది ప్రజలు తరలి వచ్చారు. వారు విడిచిపెట్టాల్సిందిగా డిమాండ్ చేస్తున్న నిందితులు సాధారణ పౌరులు కాదు, మిలిటెన్సీని అణచివేసేందుకు కశ్మీర్ వచ్చిన ప్రత్యేక పోలీసు దళానికి చెందిన ఇద్దరు అధికారులు. వారిని అరెస్ట్ చేసింది కూడా సాధారణ నేరారోపణలపై కాదు. రసనా గ్రామానికి చెందిన ముక్కుపచ్చలారని ఎనిమిదేళ్ల బాలికను దారుణంగా రేప్ చేసి, హత్య చేసిన నేరంపై. ఆ పాపకు డ్రగ్స్ కూడా ఇచ్చి రేప్ చేశారన్నది రాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చెబుతున్నారు. రసనా గ్రామంలో బాకర్‌వాలాగా పిలిచే ఓ ముస్లిం తెగకు చెందిన బాలిక అవడం వల్లనే హిందూ మంచ్ ఆధ్వర్యంలో నిందితులను విడుదల చేయాల్సిందిగా నేటికి ఆందోళనలు కొనసాగుతున్నాయి. రేపు (ఫిబ్రవరి 22న) కథువా జాతీయ రహదారి దిగ్బంధనానికి హిందూ మంచ్ పిలుపునిచ్చింది. రసనా సమీపంలోని అటవి ప్రాంతంలో ఎనిమిదేళ్ల ముస్లిం బాలిక శవం జనవరి 17వ తేదీన పోలీసులకు దొరికింది. ఆ పాపకు డ్రగ్స్ ఎక్కించినట్లు, పలుసార్లు రేప్ చేసినట్లు ఫోరెన్సిక్ రిపోర్టులో తేలింది. అంతకు వారం రోజుల ముందే ఆ పాప అదృశ్యం అయింది. ఆ విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాప ఆచూకీ కోసం పోలీసులు కూడా పెద్దగా ప్రయత్నాలేమీ చేయలేదని తెల్సింది. ఆ తర్వాత జనవరి 21వ తేదీన దీపు భయ్యాగా పిలిచే 15 ఏళ్ల బాలుడిని పోలీసులు పట్టుకొచ్చి నిందితుడిగా చూపారు. హీరానగర్ ప్రాంతానికి చెందిన ఆ బాలుడు అలాంటి వాడు కాదని స్థానికులు చెప్పడం, పోలీసుల చిత్ర హింసలకు ముందుగా నేరాన్ని అంగీకరించినా ఆ తర్వాత ప్రజల సమక్షంలో తానేపాపం చేయలేదని మొరపెట్టుకోవడం పలు అనుమానాలకు దారితీసింది. దీనిపై మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో రాష్ట్ర ప్రభుత్వం కేసును స్థానిక పోలీసుల నుంచి క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు జనవరి 23వ తేదీన అప్పగించింది. వారు ప్రత్యేక పోలీసు బలగానికి చెందిన దీపక్ కజూరియా, సురీందర్ వర్మలను అరెస్ట్ చేసింది. వారు ఏ ప్రత్యేక పోలీసు బటాలియన్‌కు చెందిన వారో, అందులో వారి హోదా ఏమిటో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బహిర్గతం చేయలేదు. వారు హిందులు కావడం, రాష్ట్రస్థాయిలో కేసు దర్యాప్తు పర్యవేక్షిస్తున్న అధికారి ముస్లిం కావడంతో కేసు హిందువులు–ముస్లింల గొడవగా మారింది. బీజేపీ, ఆరెస్సెస్‌ల పిలుపుతో ఫిబ్రవరి 14వ తేదీన, 17వ తేదీన నిరసనగా ప్రదర్శనలు జరిగాయి. ఇదో రకమైన జిహాద్ అని, అందులో భాగంగా హిందూ అధికారులను అరెస్ట్ చేశారని లాయర్ విజయ్ శర్మతోపాటు కథువా జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమ్‌నాథ్ డోగ్రా ఆరోపిస్తున్నారు. ఈ కేసులో మొదట అరెస్టై, విడుదలైన నిందితుడు హిందువే. తర్వాత అరెస్టయిన అధికారులు హిందువులే. దారుణమైన రేప్‌కు, హత్యకు గురైన బాలిక మాత్రం ముస్లింకదా! ఆ పాపకు న్యాయం జరగాలి కదా! అంటూ మీడియా ప్రశ్నిస్తే కేసును సీబీఐకి అప్పగించి దోషులెవరో తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 17న భారీ ఎత్తున జరిగిన నిరసన ప్రదర్శనలో భారత్ మాతా జిందాబాద్!, పాకిస్థాన్ ముర్దాబాద్! నినాదాలతోపాటు జాతీయ జెండాలు కనిపించాయి. రేప్ అండ్ మర్డర్ కేసుకు జాతీయవాదానికి సంబంధం ఏమిటని మీడియా ప్రశ్నించగా, ముస్లింలు మన జాతి వ్యతిరేకులని, రసనా గ్రామంలోని బాకర్‌వాలా ముస్లింలు కూడా పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు ఇస్తారని వారన్నారు. రసన గ్రామంలోని బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మీడియా ప్రశ్నలకు పెంపుడు తండ్రి మొహమ్మద్ యూసుఫ్ సమాధానం ఇచ్చారు. తాము ఫలానా వారు నిందితుడు కావచ్చనిగానీ, ఫలానా వ్యక్తిపై అనుమానాలు ఉన్నాయనిగానీ పోలీసులకు చెప్పలేదన్నారు. తమ పాపకు న్యాయం చేయమని మాత్రమే కోరామని అన్నారు. తమ గ్రామంలో మూడొంతుల మంది హిందువులేనని, వారి పొలాల్లోనే కాయం కష్టం చేసి బతుకుతూ వస్తున్నామని తెలిపారు. తమ బిడ్డకు అన్యాయం జరిగితే శవాన్ని పాతిపెట్టడానికి కూడా ఎవరూ అనుమతించలేదని, దానితో సమీపంలోని కూఠ గ్రామానికి వెళ్లి అక్కడ పజ్వాలా కమ్యూనిటీ స్థలంలో బిడ్డను పాతిపెట్టామని, అందుకు కూడా హిందువులు అడ్డుపడ్డారని మొహమ్మద్ వాపోయారు. తన బిడ్డకు అన్యాయం జరిగిందన్న బాధ కంటే తన బిడ్డ కారణంగా ఇప్పుడు గ్రామంలో హిందువులు, ముస్లింలు విడిపోవడం ఎక్కువ బాధ కలిగిస్తోందంటూ ఆ వృద్ధుడు కన్నీళ్ల పర్యంతం అయ్యారు. ఫిబ్రవరి 17వ తేదీన హిరానగర్‌లో హిందూ నాయకులు సమావేశమై ముస్లిలను వెలివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వారితో ఎలాంటి వ్యాపార లావాదేవీలు నెరపరాదని, పొలం పనులు, ఎలాంటి పనులకు పిలవరాదని నిర్ణయించారు. ఈ సమావేశానికి సహాయ మంత్రి హోదా అనుభవిస్తున్న రాష్ట్ర ఇతర వెనకబడిన వర్గాల సంక్షేమ బోర్డు వైస్ చైర్మన్ రష్పాల్ వర్మ, హీరానగర్ బీజేపీ శాసన సభ్యుడు కుల్దీప్ వర్మ, కాంగ్రెస్ పార్టీ కథువా జిల్లా అధ్యక్షుడు సుభాష్ గుప్తా హాజరయ్యారు. మొన్నటి వరకు కలసి ఉన్న ఓ మతస్థులను ఇలా వెలివేయడం ఎంతవరకు సమంజసమని ఓ దుకాణదారు ఓం ప్రకాష్‌ని ప్రశ్నిస్తే ‘మనగడ్డపై ఉంటూ పాకిస్థాన్ జిందాబాద్’ అంటారు, వారికి అలాంటి శాస్తి జరగాల్సిందే’ అన్నారు. వారు పాకిస్థాన్ జిందాబాద్ అని నినాదం ఇవ్వడం ఎప్పుడైనా విన్నారా? అన్న ప్రశ్నకు తాను ఎన్నడూ వినలేదని, విన్నవాళ్లు చెప్పారని చెప్పారు. రేపటి జాతీయ రహదారి దిగ్బంధం ఎటుదారి తీస్తుందో చూడాలి! -
స్కూల్లోనే ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం
-
బాలికపై లైంగిక దాడి
పెద్దాపురం డీఎస్పీ విచారణ సామర్లకోట (పెద్దాపురం) : పట్టణంలోని ఒక బాలికపై ఒక యువకుడు లైంగిక దాడి చేశాడు. పోలీసులు, స్థానికుల కథ నం ప్రకారం ఈ బాలిక శని వారం సాయంత్రం ఇంటి ఎదురుగా ఉన్న కిరాణా షాపునకు బిస్కెట్లు కొనుగోలుకు వెళ్లింది. ఆ సమయంలో అక్కడకి వచ్చిన గంటా సుబ్బారావు ఆమె ఇంటి బాత్రూమ్లోకి తీసుకువెళ్లి లైంగిక దాడి చేశాడని స్థానికులు, బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెనుగులాటలో చెంపపై యువకుడు కొట్టడంతో ఆమె సృహ తప్పి పడిపోయిందన్నారు. సుమారు గంట తరువాత మెలకువ వచ్చిన తరువాత ఆమె బాత్రూమ్ తలుపు కొట్టడంతో.. ఆ ప్రాంతంలోని నీలం నవ్య, పురుషోత్తం వజ్రం వచ్చి ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. తల్లిదండ్రులు ఆదివారం ఉదయం స్థానికుల సహకారంతో పోలీసులను ఆశ్రయించారు. అదనపు ఎస్సై ఎస్.లక్షి్మకి ఈమేరకు బాలిక ఫిర్యాదు చేసింది. దీంతో పెద్దాపురం డీఎస్సీ ఎస్.రాజశేఖరరావు, సీఐ వీరయ్యగౌడ్, ఎస్సై ఆకుల మురళీకృష్ణ, వీఆర్వోలు సంఘటనా స్థలానికి చేరుకుని సమాచారం సేకరించారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇలాంటి వ్యక్తిని ఉరి శిక్ష వేయాలని మానవ హక్కుల సంఘ జిల్లా అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ డిమాండ్ చేశారు. ఈ కేసు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ బాలికకు న్యాయం చేయాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ బాలాత్రిపుర సుందరి, అంగ¯ŒSవాడీ కార్యకర్తలు ఎంవీ శ్రీలక్ష్మీ, శ్యామల కోరారు. -
ఆటోలో చిన్నారిపై దారుణం
థానె: మహారాష్ట్రలో థానెలో ఆరేళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబ్రా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. తినుబండారాలు కొనేందుకు వెళ్లిన చిన్నారిని, ఇంటి పక్కనే ఉండే మహ్మద్ నాసిర్ అబ్దుల్ రషీద్ షేక్ (48) అనే కార్మికుడు మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. రషీద్ ఆ అమ్మాయిని రోడ్డు పక్కన ఆపిన ఉన్న ఆటోలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు. బాధితురాలు ఇంటికి పరిగెత్తుకెళ్లి జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. -
అద్దెకున్న అమ్మాయిపై ఎస్ఐ దారుణం
ఉస్మానాబాద్: మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌కు చెందిన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ సుఖ్‌దేవ్ బన్సొడె (26) తన ఇంట్లో అద్దెకున్న అమ్మాయిని (16) తుపాకీతో బెదిరించి లైంగికదాడి చేశాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బాధితురాలిని, ఆమె కుటుంబ సభ్యులను బెదిరించాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆనంద్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రేమ్ సుఖ్‌దేశ్ సాంగ్లి జిల్లాలోని విష్రామ్బాగ్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తుండగా, ఆయన కుటుంబం ఉస్మానాబాద్‌లో ఉన్నట్టు ఏఎస్పీ దీపాలీ గాడ్జె చెప్పారు. బాధితురాలి కుటుంబం ఉస్మానాబాద్‌లో ప్రేమ్ సుఖ్‌దేవ్ ఇంట్లో అద్దెకు ఉంటోంది. నిందితుడు తన ఇంట్లోనే ఆ అమ్మాయిని బెదిరించి దారుణానికి పాల్పడ్డాడు. ప్రేమ్ సుఖ్‌దేవ్‌ను ఉస్మానాబాద్‌లో అరెస్ట్ చేసినట్టు ఏఎస్పీ తెలిపారు. -
బాలికపై గ్యాంగ్‌రేప్.. వీడియో షూట్!
ఆసిఫాబాద్: కామంతో కళ్లు మూసుకుపోయిన ముగ్గురు యువకులు ఓ బాలికను చెరబట్టారు. లైంగికదాడికి పాల్పడి సెల్ఫోన్లో చిత్రీకరించి.. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. ఈ వీడియో రెండ్రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. శనివారం ఆదిలాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలివీ.. కాగజ్‌నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ మల్లేశ్ తిర్యాణి మండలం టేకం లొద్దికి చెందిన బాలికతో పరిచయం పెంచుకున్నాడు. మూడు నెలల క్రితం మల్లేశ్ తన మిత్రుడితో కలిసి ఆసిఫాబాద్ వచ్చాడు. అదే సమయంలో ఆసిఫాబాద్‌లో ఉన్న బాలికకు ఫోన్ చేయడంతో బస్టాండ్ వద్ద కలుసుకున్నారు. అక్కడి నుంచి ఆమెను చిన్నరాజూర రోడ్‌కు తీసుకవెళ్లారు. వీరిని గమనించిన ఆసిఫాబాద్‌కు చెందిన మాచెర్ల రాజు, రౌతు రంజిత్, సయ్యద్ మతీన్ అక్కడికి వచ్చారు. ఆ ముగ్గురూ కలసి మల్లేశ్‌ను, అతడి స్నేహితుడు బాలికను బెదిరించి సెల్ఫోన్లు లాక్కున్నారు. అనంతరం బాలికను పక్కకు తీసుకెళ్లి రాజు(27), రంజిత్(25), మతీన్(23)లు వరుసగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనను వీడియో తీశారు. విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించి వదిలిపెట్టారు. రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఈ వీడియో హల్చల్ కావడంతో బాలిక తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సతీశ్‌కుమార్ తెలిపారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, సామూహిక అత్యాచారం, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. -
నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం!
జైపూర్: గత ఎనిమిది రోజుల్లో జైపూర్‌లో జరిగిన రెండు అత్యాచార ఘటనలు కలకలం సృష్టించాయి. మూడన్నర ఏళ్ల బాలిక అత్యాచారానికి గురైన ఘటన మరవకముందే మరో చిన్నారి కీచకుడి చేతిలో అత్యాచారానికి గురైంది. ఈ ఘటన ఆదివారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. వికలాంగురాలైన తల్లితో పాటు మూడేళ్ల బాలిక సవాయ్ మాన్సింగ్ ఆస్పత్రి ప్రాంగణంలో నిద్రపోతోంది. ఆ సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఆకస్మాత్తుగా వచ్చి నిద్రిస్తున్న బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. మరుసటి రోజు ఉదయం తీవ్ర రక్తస్రావంతో ఆ బాలిక ఏడ్చుకుంటూ కనిపించడంతో వెంటనే అక్కడి స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం ఆస్పత్రి ప్రాంగణంలోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. జూన్ 11న అదే ప్రాంతంలోని ట్రాన్స్‌పోర్టు నగర్లో మూడున్నర ఏళ్ల బాలిక అత్యాచారం కేసులో జూన్ 15న ఆటో రిక్షా డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
బాలికపై అత్యాచారం.. నిందితుడి అరెస్ట్
హైదరాబాద్: ఇంటికి ఎదురుగా ఉండే ఎనిమిదేళ్ల బాలికపై కన్నేశాడో కీచకుడు. నాచారం అంబేద్కర్‌నగర్‌కు చెందిన నీలేందర్ (33) అనే వ్యక్తి.. గత నెల 29న బాలిక ఇంట్లో ఎవరూ లేనిది గమనించి మభ్యపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే వీధిలో నివాసముండే బాధితురాలు ఈ విషయాన్ని తన తండ్రి దృష్టికి ఆలస్యంగా తీసుకరావడంతో గురువారం వెలుగులోకి వచ్చింది. దీంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు నాచారం పోలీసు ఇన్స్పెక్టర్ రవీందర్ రావు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఏ అమ్మాయికి ఈ పరిస్థితి రాకూడదు
జలావున్: కొన్ని అంశాలు బయటకు చెప్పేందుకు సిగ్గుగా అనిపించినా వాస్తవం కాబట్టి.. అది నిప్పులాంటిదయినందున చెప్పక తప్పదు. ఆమెకు పద్దెనిమేదేళ్లు. గత నాలుగేళ్లుగా కన్నతండ్రే ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ విషయం తన కన్నతల్లికి చెప్తే నమ్మడం లేదు. ఎన్నిసార్లు చెప్పిచూసిన ఆ తల్లి పెడచెవిన పెట్టింది. ఫలితంగా ఆ అమ్మాయి ఎవరూ చేయకూడని సాహసాన్ని చేసింది. తన ఆత్మగౌరవాన్ని కాసేపు పక్కనపెట్టి స్నేహితుడితో ఈ విషయాన్ని పంచుకుంది. అంతేకాదు, తన తండ్రి తనపై అత్యాచారం చేసే సమయంలో వీడియో తీయమని, ఆ వీడియోను తన తల్లికి ప్రూఫ్‌గా చూపిస్తానని చెప్పింది. ఉత్తరప్రదేశ్‌లోని జలావున్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. తన తండ్రిలాంటివాడు ఉండకూడదని, పబ్లిక్ గా చంపేందుకు అర్హుడని చెప్పింది. 'అతడిని పలు శిక్షలతో బహిరంగంగా చంపేయాలి. అతడు మాములుగా చావాలని నేను కోరుకోను. ఎంతోబాధలకు గురై అతడు చావాలి. బహిరంగంగా ఉరితీయాలి. ప్రజలందరి చేతుల్లో చెప్పుదెబ్బలు తినేందుకు అర్హుడు. అప్పుటికైనా అతడికి తాను చేసిన నేరం తెలిసివస్తుందేమో' అని ఆ కూతురు కన్నీళ్లు పెట్టుకుంది. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం.. హత్య
వైఎస్ఆర్ జిల్లా: ఇంటి వద్ద ఆడుకుంటున్న అభం శుభం తెలియని ఓ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా దారుణంగా హత్య చేశాడో కీచకుడు. ఈ ఘటన వైఎస్ఆర్ జిల్లాలోని చింతకొమ్మదిన్నె మండలం కొప్పర్తిలో గురువారం వెలుగుచూసింది. చిన్నారిపై కన్నేసిన ఓ కామాంధుడు ఇంటివద్ద ఆడుకుంటుండగా బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి ఆపై హత్యచేసి పాతిపెట్టాడు. గమనించిన కీచకుడి భార్య పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన శైలీలో నిందితుడిని ప్రశ్నించడంతో చిన్నారిని పాతిపెట్టిన స్థలాన్ని చూపించాడు. చిన్నారి మృతదేహాన్ని వెలికితీసిన అనంతరం స్థానికులు ఆగ్రహంతో కీచకుడిపై దాడికి పాల్పడ్డారు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బాలికను నిర్బంధించి అత్యాచారం
దోమ: ఓ యువకుడు బాలికను నిర్బంధించి అత్యాచారం చేశాడు. ఈ సంఘటన ఆలస్యంగా గురువారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. దోమ మండల కేంద్రానికి చెందిన యువకుడు ముక్తియార్(22) గత నెల 9 వ తేదీన మండల పరిధిలోని మైలారం గ్రామానికి చెందిన ఓ బాలిక(17)ను తన స్నేహితుల సాయంతో కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆమెను హైదరాబాద్‌కు తీసుకెళ్లి ఓ గదిలో నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. నాలుగు రోజుల క్రితం బాలికను ఓ స్నేహితుడి సాయంతో స్వగ్రామానికి పంపించే యత్నం చేశాడు. విశ్వసనీయ సమాచారం తెలుసుకున్న పోలీసులు.. కాపుకాసి మార్గంమధ్యలో చేవెళ్ల సమీపంలో బాలికతోపాటు యువకుడి స్నేహితుడు విక్కీని అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. అనంతరం బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాడు. ప్రధాన నిందితుడు ముక్తియార్ పరారీలో ఉన్నాడు. అతడికి సహకరించిన కుల్కచర్ల మండలం ముజాహిద్పూర్కు చెందిన విక్కీ, పరిగి మండలం ఎర్రగడ్డపల్లికి చెందిన సోనులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితుడిపై అక్రమ నిర్బంధం, అత్యాచారం కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
బీజేపీ కార్యాలయంలోనే దారుణం
కోల్ కత్తా: కోల్ కత్తాలోని బీజేపీ కార్యాలయంలోనే దారుణం జరిగింది. బెహలా నగరంలోని మండల బీజేపీ ఆఫీసులో అయిదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి తెగబడ్డాడు. తమ పాప కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పార్టీ ఆఫీసు తలుపు తట్టారు. దీంతో ఆ యువకుడు అక్కడ నుంచి పరారయ్యాడు. లోపల రక్తస్రావంతో బాధపడుతున్న బాలికను గమనించి కోపోద్రిక్తులైన స్థానికులు ఆఫీసుపై దాడికి ప్రయత్నించారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలికను హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నారు. అత్యాచారం జరిగినట్టుగా వైద్యులు ధ్రువీకరించినట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్ రషీద్ మునీర్ ఖాన్ తెలిపారు. మరోవైపు తృణమూల్ ఎంపీ ఈ సంఘటను ఖండించగా, బీజేపీ అధికార ప్రతినిధి ఈ సంఘటన దురదృష్టకరమని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా బీజేపీ ఆఫీసు పక్కనే ఉండే ఒక షాపులో కార్యాలయం తాళాలు ఉంటాయని, నిందితుడు షాపు యజమాని కొడుకని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
పెళ్లి పేరుతో నమ్మించి బాలికపై అత్యాచారం
మండ్య : పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలిక(14)పై అత్యాచారానికి పాల్పడిన ఘటన నాగమంగల తాలూకా శికారిపురలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల సమాచారం మేరకు... గత ఏడాది డిసెంబర్ 25న శికారిపురకు చెందిన సంజయ్(28) అదే గ్రామానికి చెందిన బాలిక(14)ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఇటీవల ఆ బాలిక తన తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో గ్రామీణ పోలీసులకు బాధిత కుటుంబసభ్యులు ఆదివారం ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తమం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు సంజయ్‌ను అరెస్ట్ చేశారు. గతంలో సంజయ్‌కు ఓ యువతిని పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చినట్లు సమాచారం. -
బాలికపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారం
మంఢ్య : బెంగళూరు నగరంలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారం చేసి పారిపోయిన సంఘటణ సోమవారం రాత్రి పాండవపుర తాలూకాలోని నీలనహళ్ళి గేట్ సమీపంలోని చోటు చేసుకుంది. పాండవపుర పోలీసులు తెలిపిన వివరాల మేరకు... బెంగళూరులోని ఒక ప్రవేట్ పాఠశాల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక సోమవారం తన తల్లిదండ్రులతో గొడవ పడి మైసూరు రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అయితే తిరిగి ఇంటికి వెళ్లడానికి ఆదే రోజు సాయంత్రం ఐదు గంటలకు ఆ స్టేషన్లో రైలు కోసం వేచిచూడసాగింది. ఆ బాలికను చూసిన గుర్తు తెలియని వ్యక్తి (40) తనను ఇంటి దగ్గర వదిలిపెడతానంటూ తన వాహనంలో తీసుకెళ్లాడు. పాండవపుర సమీపంలోని నీలనహళ్ళి గేట్ వద్దకు చేరుకొని రాత్రి సుమారు ఏడు గంటల సమయంలో ఆ బాలికపై అత్యాచారం చేశారు. అనంతరం ఆ బాలికను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. అనంతరం ఆ బాలిక అక్కడి నుంచి కిలో మీటరు దూరాన్ని చీకటిలో నడుచుకుంటూ సమీపంలోని మహదేశ్వర గ్రామానికి చేరుకుంది. ఆ గ్రామస్తులకు జరిగిన సంఘటన చెప్పి బోరున విలపించింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ బాలికను ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. మెరుగైన చికిత్స కోసం ఆ బాలికను మండ్య జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
బాలికపై అత్యాచారం, ఆపై హత్య
సాక్షి, ముంబై: 12 సంవత్సరాల బాలికను కొందరు అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. గోవండీ నివాసి అయిన హతురాలి ఆచూకీ శనివారం సాయంత్రం నుంచి గల్లంతైంది. ఆమె తల్లిదండ్రులు గాలించినా ఫలితం దక్కలేదు. ఈ విషయమై ఆదివారం మధ్యాహ్నం వారు శివాజీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అన్వేషణ ప్రారంభించారు. భాంగన్వాడి ప్రాంతంలోని అంబేద్కర్ ఉద్యానవనం సమీపంలోగల చెత్తకుండీలో సోమవారం సాయంత్రం బాలిక మృతదేహం దొరికింది. మృతదేహాన్ని ఓ చాపలో చుట్టి పారేశారని పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్టు చేశామన్నారు. -
పదిరోజుల తర్వాత తెరుచుకున్న 'విబ్జియర్'
బెంగళూరు: ఆరేళ్ల బాలికపై అత్యాచారం కేసులో మరో ఇద్దరిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు జిమ్ ఇన్స్ట్రకర్లను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు మంళవారం వెల్లడించారు. ఇదే కేసులో ఇంతకుముందు స్కేటింగ్ శిక్షకుడిని అరెస్ట్ చేశారు. ఇతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా మిగతా ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు పోలీసు కమిషనర్ తెలిపారు. నిందితుడు నేరం అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి. విబ్జియర్ పాఠశాలతో ఒకటవ తరగతి చదువుతున్న విద్యార్థిని జులై 2న అత్యాచార ఘటన జరిగినప్పటికీ స్కూలు యాజమాన్యం ఆ విషయం బయటికి పొక్కకుండా దాచిపెట్టింది. ఈనెల 9వ తేదీన బాలిక తల్లిదండ్రులు స్కూలు యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. 14న పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా పదిరోజుల విరామం తర్వాత విబ్జియర్ స్కూల్ మళ్లీ సోమవారం(జూలై 28న) తెరుచుకుంది. -
అత్యాచార ఘటనలో స్కూల్ చైర్మన్ అరెస్ట్
బెంగళూరు : బెంగళూరులో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార ఘటనకు సంబంధించి విబ్జియర్ పాఠశాల స్కూల్ చైర్మన్‌ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అత్యాచారానికి సంబంధించి ఆధారాలు లేకుండా చేయడానికి ప్రయత్నించారంటూ రోస్టమ్ కేరవాల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన స్కూల్ చైర్మన్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు బెంగళూరు నగర పోలీస్ కమిషన్ ఎం.ఎన్. రెడ్డి తెలిపారు. విద్యార్థిని జులై 2న అత్యాచార ఘటన జరిగినప్పటికీ స్కూలు యాజమాన్యం ఆ విషయం బయటికి పొక్కకుండా దాచిపెట్టింది. ఈనెల 9వ తేదీన బాలిక తల్లిదండ్రులు స్కూలు యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. యాజమాన్యం పట్టించుకోకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. ఇక బాలికపై అత్యాచారం జరిపిన ఇద్దరు పాఠశాల సిబ్బందిని వర్థూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఈ ఘటనపై బెంగళూరు నగరం ఆందోళనలు, నిరసనలతో అట్టుడికింది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టిన విషయం తెలిసిందే. -
బెంగళూరులో కొనసాగుతున్న ఆందోళన
బెంగళూరు: ఆరేళ్ల చిన్నారిపై పాఠశాలలో అత్యాచారానికి చేసిన ఘటనపై ఆందోళనలు శుక్రవారం కూడా కొనసాగాయి. బాధితురాలి కుటుంబ సభ్యులతో పాటు వందలాది మంది ఇతర విద్యార్థులు తల్లిదండ్రులు, ప్రజాసంఘాలకు చెందిన వారు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రికత్తంగా మారడంతో భారీగా పోలీసులను మొహరించారు. బెంగళూరులోని విబ్జియర్ హై అనే స్కూల్లో ఈ దారుణం జరిగింది. 1వ తరగతి చదువుతున్న ఆరేళ్ల బాలికపై స్కూలు స్పోర్ట్స్ టీచర్, ఫిజికల్ ఇన్స్టక్టర్లు ఈ నెల 2న అత్యాచారానికి పాల్పడ్డారు. 9వ తేదీన బాలిక తల్లిదండ్రులు స్కూలు యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. యాజమాన్యం పట్టించుకోకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. -
బెంగళూరులో రెండోరోజూ కొనసాగిన ఆందోళన
బెంగళూరు: ఆరేళ్ల బాలికపై ఇద్దరు పాఠశాల సిబ్బంది అత్యాచారానికి పాల్పడిన ఘటనపై వరుసగా రెండో రోజు ఆందోళనలు కొనసాగాయి. పసిబాలికపై ఘోరానికి పాల్పడిన కామాంధులను కఠినంగా శక్షించాలని డిమాండ్ చేస్తూ బాధితురాలి తరపువారు, ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో పాఠశాలపై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. తూర్పు బెంగళూరులోని ఓ టాప్ ఇంటర్నేషనల్ స్కూల్ లో సోమవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. నిందితులపై ఇప్పటివరకు చర్య తీసుకోకుండా, జరిగిన నేరాన్ని దాచిపెట్టేందుకు పాఠశాల యాజమాన్యం ప్రయత్నిస్తోందని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని బాధితురాలి తండ్రి నీలేష్ స్పష్టం చేశారు. ఇంగ్లీషు వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బాలికపై వివాహితుడు అత్యాచారం
ఇంట్లో జొరబడి ఎత్తుకెళ్లిఅఘాయిత్యం పోలీసుల అదుపులో కామాంధుడు దొడ్డబళ్లాపురం : కామంతో కళ్లు మూసుకు పోయిన వివాహితుడు పక్కింట్లో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం జరిపిన దారుణ సంఘటన బుధవారం సాయంత్రం తాలూకా పరిధిలో జరిగింది. తాలూకా సమీపంలోని తండాకు చెందిన కామాంధుడు వెంకటేశ్ నాయక్(31)ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు... వెంకటేశ్ నాయక్ పక్క ఇంటిలో బాలిక (17) తల్లిదండ్రులతో కలిసి నివాసముంటోంది. తల్లిదండ్రులు కూలి పనికి వెళ్లిన సమయంలో బాలిక వంటరిగా ఉన్నట్లు పసిగట్టిన వెంకటేశ్ నాయక్ బాలికను పిలిచి సిగిరెట్లు తీసుకురమ్మని పురమాయించాడు. అయితే బాలిక నిరాకరించింది. కొద్దిసేపు అన ంతరం బాలిక ఇంటి ముందు ఊడ్చుతుండగా వెనుక నుంచి వచ్చిన వెంకటేశ్ నాయక్ నోరు అదిమిపట్టి ఇంటిలోకి లాక్కెళ్లి అత్యాచారం జరిపాడు. ఘటన తరువాత నిందితుడు పరారీ కాగా బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.