gopal reddy
-
వేంపల్లికి చెందిన ప్రకాష్ పై బీటెక్ రవి అనుచరుల దాడి
-
దళారి రాజకీయం
రాజీవ్ కనకాల, ‘షకలక’ శంకర్, అక్షా ఖాన్ ప్రధాన పాత్రల్లో కాచిడి గోపాల్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘దళారి’. వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ని నిర్మాతలు సి. కల్యాణ్, దామోదర ప్రసాద్ విడుదల చేశారు. సి. కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘వెంకట్ రెడ్డిగారిలాంటి కొత్తవారు వస్తేనే ఇండస్ట్రీ బాగుంటుంది. ‘దళారి’ ట్రైలర్ బాగుంది.. సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘మా సినిమాని ఆకృతి క్రియేషన్స్ పతాకంపై రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు వెంకట్ రెడ్డి. ‘‘సమాజంలో ఏ పని జరగాలన్నా ఒక దళారి ఉంటాడు. అలాంటి దళారి పాత్ర రాజకీయంలో ఉంటే ఎలా ఉంటుందో తెలిపేదే మా సినిమా’’ అన్నారు గోపాల్ రెడ్డి. -
తునికి నల్లపోచమ్మ అమ్మవారి గొలుసు.. అసలు ఏమైంది..??
మెదక్: తవ్వినకొద్దీ అక్రమాలే.. అన్నట్లుగా మారింది ఏడుపాయల ఆలయ ఈఓ వ్యవహార శైలి. వనదుర్గామాత ఆభరణాల వ్యవహారం ఇంకా సమసిపోకముందే తునికి నల్లపోచమ్మ అమ్మవారి గొలుసు విషయం తెరమీదకు వచ్చింది. మొక్కులో భాగంగా 2018లో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అమ్మవారికి బంగారు గొలుసును సమర్పించారు. దీనిని అప్పటి ఈఓ శ్రీనివాస్‌కు అప్పగించారు. కాగా ప్రస్తుతం ఆ గొలుసు రికార్డుల్లో లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. బయటకొచ్చింది ఇలా.. 2016 నుంచి 2019 వరకు కౌడిపల్లి మండలం తునికినల్ల పోచమ్మ ఆలయంలో శ్రీనివాస్ ఈఓగా విధులు నిర్వర్తించారు. అప్పట్లో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అమ్మవారికి 5 తులాల బంగారు గొలుసును బహూకరించారు. 2019 జూన్‌లో ఈఓ శ్రీనివాస్ ఏడుపాయల ఆలయానికి బదిలీ కాగా, ఆయన స్థానంలో మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ఎమ్మెల్యే దంపతులు నల్లపోచమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి వస్తున్నారని, ఆయన అందించిన బంగారు గొలుసును అమ్మవారికి అలంకరించాలని ఆలయ చైర్మన్ గోపాల్‌రెడ్డి ప్రస్తుత ఈఓ మోహన్‌రెడ్డికి సూచించారు. కాగా.. శ్రీనివాస్ బదిలీ అయిన సమయంలో తనకు చెక్‌బుక్, క్యాష్‌బుక్‌లు మాత్రమే ఇచ్చారని, అమ్మవారి ఆభరణాలు ఏమీ ఇవ్వలేదంటూ మోహన్ రెడ్డి చెప్పడంతో అసలు విషయం బయటకువచ్చింది. ఆలయానికి సంబంధించిన లావాదేవీల వివరాలను ఎందుకు రికార్డు చేయలేదనే ప్రశ్న తలెత్తుతుంది. ఎమ్మెల్యే బహూకరించిన గొలుసునే రికార్డులో లేదంటే మామూలు భక్తులు అందించిన కానుకల మాటేమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నల్లపోచమ్మ అమ్మవారి గొలుసు విషయంపై ఈఓ సార శ్రీనివాస్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి బంగారు చైన్ బహూకరించిన మాట వాస్తవమేనని అంగీకరించారు. కాగా అది తన సంరక్షణలోనే ఉందని చెప్పడం కొసమెరుపు. -
మార్చిలో దళారి
‘షకలక’ శంకర్ హీరోగా, అక్సఖాన్, రూపిక హీరోయిన్లుగా రాజీవ్ కనకాల ప్రధాన ΄ాత్రలో నటించిన చిత్రం ‘దళారి’. కాచిడి గోపాల్ రెడ్డి దర్శకత్వంలో ఎడవెల్లి వెంకట రెడ్డి నిర్మించిన ఈ సినిమా మార్చిలో రిలీజ్ కానుంది. కాగా తెలంగాణలోని వేములవాడలో ‘ఇండస్ట్రీ ఆఫ్ తెలంగాణ ఫోక్ సింగర్స్’(ఐటీఎఫ్) నిర్వహించిన గూగులమ్మతల్లి బోనాలు కార్యక్రమంలో ‘దళారి’ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ‘‘ఈ కరీంనగర్ జిల్లా బిడ్డగా అందర్నీ మెప్పించే కథతో ‘దళారి’ సినిమా తీశాను’’ అన్నారు కాచిడి గోపాల్ రెడ్డి. ‘‘ఈ సినిమా కథ,పాటలు, డ్యాన్సులు, ఎమోషన్స్ ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఉంటాయి’’ అన్నారు వెంకట్ రెడ్డి. -
ర్యాలీలో చంద్రబాబు భౌతిక దూరం పాటించలేదు
-
అందనంత దూరం అక్షర జ్ఞానం
సాక్షి, ఒంగోలు టౌన్: ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్‌గా 1973 నుంచి 1982 వరకు పనిచేసిన గోపాల్ రెడ్డి.. 1982–2006 వరకు వయోజన విద్యాశాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి జాయింట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2003లో సత్యమత్ర మెమోరియల్ లిటరసీ అవార్డును అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ రామకృష్ణతో కలిసి కేంద్ర ప్రభుత్వం నుంచి గోపాల్‌రెడ్డి అందుకున్నారు. విద్యా రంగంలో విశేష అనుభవం కలిగిన ఆయన చంద్రబాబు ప్రభుత్వ హయంలో ప్రభుత్వ విద్య ఏవిధంగా నిర్వీర్యమైంది, జగన్ ప్రకటించిన నవరత్నాల్లోని అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా డ్రాపవుట్స్ సంఖ్య ఎలా నిర్మూలన అవుతుందో ‘సాక్షి’కి వివరించారు. క్వాలిటీ విద్యకు కేరాఫ్ ‘గతంలో క్వాలిటీ విద్యకు ప్రభుత్వ పాఠశాలలు కేరాఫ్‌గా నిలిచేవి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో పరిశోధన చక్కగా నిర్వహించేవారు. విద్యార్థులకు సబ్జెక్టు పరంగా మంచి పట్టు వచ్చేది. టీచింగ్ నోట్స్ రాసుకుని విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠాలు బోధించేవారని’ గోపాల్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ‘ప్రస్తుతం అలాంటి పరిస్థితులు చూద్దామన్నా కనిపించడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ అజమాయిషీ తగ్గిపోయింది. దాంతో అనేక మంది ఉపాధ్యాయులు విద్యేతర అంశాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పడిపోతున్నాయి. చివరకు ప్రాథమిక పాఠశాలలు మూతపడే స్థితికి చంద్రబాబు ప్రభుత్వం తీసుకువచ్చింద’ని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్‌కు పెద్దపీట! ‘సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం ప్రైవేట్ విద్యకు చంద్రబాబు పునాదిరాయి వేశారు. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి ప్రభుత్వ విద్యను చిన్నచూపు చూస్తూ వచ్చారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ విద్యను పరుగెత్తించారు. ఒక విద్యా సంస్థల అధినేతను తన క్యాబినెట్లో మంత్రిగా చేర్చుకున్నారంటే ప్రైవేట్ విద్యపట్ల చంద్రబాబుకు ఎంత మక్కువ ఉందో అర్థం చేసుకోవచ్చని’ తాటిపర్తి వ్యాఖ్యానించారు. రాష్ట్ర మునిసిపల్ శాఖామంత్రిగా నారాయణ, ఆయన బంధువైన గంటా శ్రీనివాసరావు మానవ వనరుల అభివృద్ధి శాఖామంత్రిగా వ్యవహరించిన సమయంలో ప్రభుత్వ విద్యను కనుమరుగు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రాథమిక పాఠశాలల్లో విద్యపై ప్రభుత్వ పర్యవేక్షణ లోపించింది. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలు అవసాన దశకు చేరుకున్నాయి. ఇదే ఒరవడి కొనసాగితే ఉన్నత పాఠశాలలకు కూడా ఈ దుస్థితి పట్టే ప్రమాదం ఉంద’ని అన్నారు. వయోజన విద్యకు గండి ‘జిల్లాలో అక్షరాస్యత శాతం ఏటా పెరుగుతోందని ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటోంది. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. వయోజనుల్లో అక్షరాస్యత శాతం క్రమేణా పడిపోతోంది. రాష్ట్రంలో అక్షరాస్యత శాతం 74 శాతం చూపించగా, ప్రకాశం జిల్లాలో 63 శాతంగా ప్రకటించారు. వయోజన విద్యను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం దానిని కూకటివేళ్లతో పెకలించేసింది. రాష్ట్రంలో వయోజన విద్యకు సంబం«ధించి గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నియమితులైన 23 వేల మందిని చంద్రబాబు ప్రభుత్వం తొలగిండడం దారుణమైన చర్య. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దిన తరువాత వారు నేర్చుకున్న చదువు మర్చిపోకుండా ఉండేందుకు ఏర్పాటు చేసిన సాక్షర భారత్ కేంద్రాలు కనుమరుగైపోయాయి. ‘అమ్మ ఒడి’ కొండంత అండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన అమ్మ ఒడి పేదలకు అండగా ఉంటోంది. అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా పేద విద్యార్థుల చదువుకు భరోసా కలగనుంది. అమ్మ ఒడి ద్వారా తల్లిదండ్రులకు కూడా ప్రోత్సాహాలు ఇవ్వడం మంచి పరిణామమ’ని గోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత అమలుచేసే కార్యక్రమాల్లో అమ్మ ఒడిని ఇతర రాష్ట్రాలు కూడా ఆచరణలోకి తీసుకువచ్చేందుకు ముందుకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
సోమిశెట్టీ.. నోరు అదుపులో పెట్టుకో
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): టీడీపీ జిల్లా అధ్యక్షుడు, కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని వైఎస్సార్సీపీ నంద్యాల, కర్నూలు పార్లమెంటరీ జిల్లాల ప్రధాన కార్యదర్శులు గోపాల్‌రెడ్డి, కరుణాకరరెడ్డి, శ్రీనివాసరెడ్డి హితవు పలికారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడారు. ప్రజా సమస్యలు తెలుసుకొని..పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల కోసం వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర చేశారన్నారు. ఇది చరిత్రాత్మకమవడంతో టీడీపీ నేతల్లో వణుకు పుడుతోందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే అర్హత సోమిశెట్టికి లేదన్నారు. ప్రజాసంకల్ప యాత్రపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బిందె నీళ్లతో చంద్రబాబునాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసినట్లు నటించడం కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డికే చెల్లుతుందన్నారు. టీడీపీ నాయకులు ఎన్ని కుయుక్తులు పన్నినా.. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకుడు పెరుగు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీలో సీఈసీ సభ్యుల నియామకం
సాక్షి, హైదరాబాద్ : నెల్లూరు జిల్లాకు చెందిన ఎల్లసిరి గోపాల్ రెడ్డి, గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ, టీజీ కృష్ణారెడ్డిలు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి (సీఈసీ) సభ్యులుగా నియమితులయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వీరి నియామకం జరిగింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. -
బుట్టా.. నోరు అదుపులో పెట్టుకో!
ఆదోని టౌన్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పుణ్యాన కర్నూలు ఎంపీగా గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన బుట్టా రేణుక...మా ఎంపీలను విమర్శించడం హేయమని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోపాల్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు దేవా, జిల్లా మాజీ కార్యదర్శి ప్రసాద్‌రావు, అర్చకపురోహిత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదనశర్మ ఖండించారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలని, లేని పక్షంలో గుణపాఠం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. దేవనకొండ మండలంలో గురువారం జరిగిన నవ నిర్మాణ దీక్షలో వైఎస్ఆర్ ఎంపీలపై బుట్టా చేసిన విమర్శలపై శుక్రవారం ద్వారకా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ ఎంపీలు చేసిన రాజీనామాలు... ఆమరణ దీక్షలపై బుట్టా చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. హోదా, డబ్బుకోసం పార్టీ ఫిరాయించిన మీకు రాజకీయ విలువలు ఏమి తెలుసని ప్రశ్నించారు. ఏదైనా మాట్లాడేప్పుడు నోరు అదుపులోఉంచుకోవాని, లేని పక్షంలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. జగన్ ప్రజా సంకల్పయాత్రకు జనం నీరాజనం పలుకుతున్న తీరును ఓర్వలేక విమర్శలు చేస్తున్నారనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసని చెప్పారు. సమావేశంలో వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్‌మండల అధ్యక్షుడు కల్లుపోతుల సురేష్, మహిళౠ విభాగం నాయకురాలు శ్రీలత, కౌన్సిలర్ సుధాకర్, నాయకులు రామలింగేశ్వర యాదవ్, నజీంవలి, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
పంబలిలో భార్గవ్‌రెడ్డి అంత్యక్రియలు
వాకాడు : సినీ నిర్మాత, దివంగత ఎస్.గోపాల్‌రెడ్డి తనయుడు ఎస్.భార్గవ్‌రెడ్డి అంత్యక్రియలు గురువారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాకాడు మండలం పంబలిలో నిర్వహించారు. భార్గవ్‌రెడ్డి సముద్రంలో మునిగి మంగళవారం మృతిచెందిన సంగతి తెలిసిందే. పంబలిలోని తల్లిదండ్రులు గోపాల్‌రెడ్డి, రాజేశ్వరమ్మ సమాధుల వద్దనే భార్గవ్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. భార్గవ్‌రెడ్డికి అంత్యక్రియలు నిర్వహించేందుకు సోదరి పావని తప్ప కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో ఆమే అంత్యక్రియలు నిర్వహించారు. తన చేతులతో అన్నకు తల కొరివి పెట్టాల్సి వచ్చిందని కన్నీరు మున్నీరుగా విలపించారు. హీరో విశాల్ తల్లిదండ్రులు జీకే రెడ్డి, జానకీ దేవి, సోదరి ఐశ్వర్యరెడ్డి, సినీ నటుడు చిన్నాతోపాటు పలువురు సినీ నటులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
అనుమానాస్పదస్థితిలో భార్గవ్‌రెడ్డి మృతి
వాకాడు: సినీ నిర్మాత, భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత దివంగత ఎస్.గోపాల్‌రెడ్డి కుమారుడు ఎస్.భార్గవ్‌రెడ్డి (42) అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పంబలి వద్ద తన భార్గవ్ రొయ్యల హేచరీ వద్దకు సోమవారం సాయంత్రం 4.30 గంటలకు భార్గవ్‌రెడ్డి కారులో (ఏపీ 09 బీఎన్ 4885) వచ్చాడు. అక్కడ పనిచేస్తున్న సెక్యూరిటీ, పనివాళ్లతో మాట్లాడి వారికి జీతాలు, హేచరీ కరెంట్ బిల్లులు, తదితర లెక్కలు చూసి డబ్బులు అందజేశాడు. అనంతరం రాత్రి 8 గంటల సమయంలో ఆయన తను ప్రాణ సమానంగా పెంచుకుంటున్న కుక్కకు స్నానం చేయించే నిమిత్తం హేచరీ ముందు భాగంలో ఉన్న సముద్రం ఒడ్డుకు తీసుకెళ్లాడు. ఒక్కరే సముద్రం వద్దకు వెళ్లొద్దు.. మేము వస్తామని సిబ్బంది కోరగా ఆయన ఎవరూ అవసరం లేదు. నేనే వెళ్తానని కుక్కని తీసుకెళ్లాడు. రాత్రంతా వెతికినా.. సముద్రం వద్దకు వెళ్లి భార్గవ్‌రెడ్డి గంట దాటినా తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన హేచరీ సిబ్బంది సముద్రం వద్దకు వెళ్లారు. అక్కడ ఎవరూ కనిపించలేదు. ఒడ్డున భార్గవ్‌రెడ్డి చెప్పులు, ప్యాంట్ మాత్రమే ఉన్నాయి. అందులో ఏటీఎంలు, ఆధార్, పాన్, డ్రైవింగ్ లెసెన్స్, ఓటర్ కార్డు, కొంత నగదు, విస్టింగ్ కార్డులున్నాయి. కంగారు పడిన సిబ్బంది వెంటనే వాకాడు గొల్లపాళెం గ్రామంలోని భార్గవ్‌రెడ్డి పెద్దమ్మ కుమారుడు పాపారెడ్డి మనోజ్‌కుమార్‌రెడ్డి, నెల్లూరులో ఉన్న చిన్నాన్న ఎస్.కృష్ణారెడ్డిలకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వారు పంబలికి చేరుకుని గ్రామస్తుల సాయంతో సముద్రం ఒడ్డున మంగళవారం తెల్లవారుజాము వరకు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఉదయం 6.00 గంటల సమయంలో సుమారు 6 కిలోమీటర్ల దూరంలో శ్రీనివాసపురం గ్రామం వద్ద సముద్రం ఒడ్డుకు భార్గవ్‌రెడ్డి మృతదేహం కొట్టుకువచ్చింది. కుక్క ఆచూకీ మాత్రం తెలియరాలేదు. మృతిపై అనుమానాలు భార్గవ్‌రెడ్డి మృతిపై అనుమానాలు చోటు చేసుకుంటున్నాయి. ఆయన ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోయాడా? లేదా ఇతర కారణాలు ఉన్నాయా? అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. మృతదేహాన్ని పంబలిలోని భార్గవ్ హేచరీకి తీసుకెళ్లారు. బంధువుల ఫిర్యాదు మేరకు వాకాడు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే పంబలి గ్రామంలోనే మృతదేహానికి వైద్యులు పోస్ట్‌మార్టం నిర్వహించారు. నాయుడుపేటలో విషాదం నాయుడుపేటటౌన్: భార్గవ్‌రెడ్డి (44) మృతిచెందడంతో మంగళవారం నాయుడుపేటలోని బేరిపేట సమీపంలో ఉన్న ఆయన నివాసం వద్ద విషాదం నెలకొంది. ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత ఎస్.గోపాల్‌రెడ్డి 2008లో మృతిచెందిన తర్వాత భార్గవ్ ఒక్కరే నివాసం ఉంటున్నారు. ఆయన ఇంట్లో నుంచి ఎప్పుడూ బయటకు వచ్చే వారు కాదని, పనివారే అన్ని వసతులు సమకూర్చేవారని స్థానికులు చెబుతున్నారు. సోమవారం మధ్యాహ్నం పదిరోజుల పాటు ఇంటికి రానని చెప్పి పంబలిలో ఉన్న గెస్ట్‌హౌస్ వద్దకు వెళుతున్నానని భోజనాలు ఏర్పాటుచేసే నిర్వాహకులకు భార్గవ్ తెలిపారు. ఆయన సోదరి పావని తైవాన్‌లో నివాసం ఉంటున్నారు. ఆమె ఐక్యరాజసమితి సభ్యురాలిగా పనిచేస్తున్నారని, పదిరోజుల క్రితం నాయుడుపేటలో ఉన్న భార్గవ్‌రెడ్డిని చూసేందుకు వచ్చి తిరిగి వెళ్లినట్లుగా కుటుంబసభ్యులు తెలిపారు. పావని వచ్చేందుకు మూడురోజులకు పైగా పడుతుందని చెబుతున్నారు. ఆమె వచ్చిన తర్వాత అంత్యక్రియలు జరిపే అవకాశం ఉంది. నెల్లూరులోని ఓ ఆస్పత్రి మార్చురీలో ఉన్న మృతదేహాన్ని చూసేందుకు పలువురు వెళుతున్నారు. -
ఎస్. గోపాల్‌రెడ్డి తనయుడి అనుమానాస్పద మృతి
సాక్షి, నెల్లూరు: బాలకృష్ణ హీరోగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత ఎస్. గోపాల్‌రెడ్డి తనయుడు భార్గవ్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. నెల్లూరి జిల్లా వాకాడు మండలం పంబలి వద్ద సముద్రంలో భార్గవ్ మృతదేహం కొట్టుకు వచ్చింది. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. భార్గవ్ రెడ్డి మృతిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతడు ఎలా చనిపోయాడనే దాని గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగి చనిపోయాడా, మరేదైనా కారణం ఉందా అనేది పోలీసుల దర్యాప్తులో తేలనుంది. కొడుకు భార్గవ్ పేరు మీదే భార్గవ్ ఆర్ట్స్ బ్యానర్‌ను స్థాపించిన గోపాల్ రెడ్డి.. బాలకృష్ణ, కోడి రామకృష్ణలతో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. 2008లో గోపాల్‌రెడ్డి మరణం తరువాత ఆయన కుటుంబసభ్యులెవరు ఇండస్ట్రీలో కొనసాగలేదు. -
అగ్నిప్రమాదం: రూ.7 లక్షల ఆస్తి నష్టం
మెదక్: జిల్లాలోని జగదేవ్‌పూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో గోపాల్ రెడ్డి ఇంట్లో షార్ట్ సర్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. ఇల్లు పూర్తిగా తగులబడింది. ఇంట్లో ఉంచిన రెండు క్వింటాళ్ల పత్తి, 100 డ్రిప్ పైపులు తగులబడ్డాయి. ఆయన బట్టల వ్యాపారం చేస్తుంటారు. బట్టలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. మొత్తం ఆస్తి నష్టం, సుమారు రూ.7 లక్షలు ఉంటుందని బాధితుడు తెలిపారు. మెదక్ నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలార్పారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శిగా గోపాల్‌రెడ్డి
ఆదోని టౌన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శిగా ఆదోనికి చెందిన ఎస్ గోపాల్‌రెడ్డిని అధిష్టానం ఎంపిక చేసింది. ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఆదివారం ఆదోనిలో రాజశ్రీ ఫంక్షన్‌హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోపాల్‌రెడ్డి మాట్లాడారు. మూడేళ్లుగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ పార్టీ పటిష్టతకు కృషి చేశానన్నారు. పార్టీ అధిష్టానం తన సేవలను గుర్తించి పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి పదవిని ఇచ్చిందన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రాణమున్నంతవరకు సాయిప్రసాద్‌రెడ్డిని వదిలి ఎక్కడికీ వెళ్లనని చెప్పారు. సమావేశంలో కల్లుబావి వార్డు ఇన్చార్జ్ నాయకులు వీరభద్రారెడ్డి, మోహన్‌రెడ్డి, మాధవరెడ్డి, వెంకటేష్ పాల్గొన్నారు. -
ప్రజాక్షేత్రంలో బాబుకు ఓటమి తప్పదు
– పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనం – గోపాల్‌రెడ్డి విజయంతో సంబరాలు – కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్న కైవాసం చేసుకుంటామని ధీమా కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : అధికార బలం, డబ్బు, దౌర్జన్యాలతో ప్రజాతీర్పును అడ్డుకోవాలని చూస్తే ప్రజాక్షేత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఓటమి తప్పదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య హెచ్చరించారు. పార్టీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి విజయం సాధించిన సందర్భంగా బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా కార్యాలయంలో ఒకరికొకరు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు, కడప, నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టి గెలిచారన్నారు. అదే పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఎన్ని కోట్లు గుమ్మరించి ఓటర్లను కొనాలని చూసినా ఓటమి తప్పలేదన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలే తెలియజేశాయన్నారు. 2019 ఎన్నికల్లో విజయం తథ్యం తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేస్తే 2019 ఎన్నికల్లో విజయం తథ్యమని, తద్వారా వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఖామన్నారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఏ ఎన్నికల్లో మూడు స్థానాల కోసం 300 కోట్లను ఖర్చు చేయలేదన్నారు. కర్నూలు మునిసిపల్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని నగర కమిటీ అధ్యక్షుడు నరసింహులు యాదవ్ తెలిపారు. వెంటనే కేఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాజావిష్ణువర్దన్‌రెడ్డి, మహిళా అధ్యక్షురాలు విజయకుమారి, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఫిరోజ్‌ఖాన్, నాయకులు జహీర్ అహ్మద్‌ఖాన్, సత్యం యాదవ్, స్వరూప్‌కుమార్, రసూల్‌ఖాన్, నురుల్లాఖాద్రీ, హెచ్ఏ రహిమాన్, షబ్బీర్, ఫిరోజ్, రామకృష్ణ, ఈశ్వర్, మహబూబ్‌బాషా పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం
అనంతపురం: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి గోపాల్‌రెడ్డి ఘన విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి కేజే రెడ్డిపై 14,146 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. మొదటి ప్రాధాన్య త ఓట్లలో గోపాల్ రెడ్డికి 53,714 ఓట్లు లభించగా.. కేజే రెడ్డికి 41,037, గేయానంద్‌కు 32,810 ఓట్లు పోలయ్యాయి. పోలైన మొత్తం ఓట్లలో చెల్లని ఓట్లను మినహాయిస్తే మిగిలిన 1,35,772 ఓట్లలో ‘మ్యాజిక్ ఫిగర్’గా నిర్ధారించిన 67,887 ఓట్లను.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో గోపాల్‌రెడ్డి దక్కించుకున్నారు. ఫలితాల అనంతరం గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగులు, నిరుద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేస్తానన్నారు. ప్రజాక్షేత్రంలో వైఎస్ఆర్సీపీకి మద్దతు ఉండటం మూలంగానే ఈ విజయం సాధ్యమైందన్నారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటాలే తనను గెలిపించాయన్నారు. టీడీపీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప్రజలు వైఎస్ఆర్ సీపీ వైపే మొగ్గు చూపారన్నారు. వైఎస్ఆర్ ఆశయాల కోసం కౌన్సిల్లో సమస్యలపై పోరాడతానని తెలిపారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం
-
విజయం ముంగిట గోపాల్‌రెడ్డి
- పూర్తయిన మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు - 12,677 ఓట్ల మెజారిటీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి - ‘మ్యాజిక్ ఫిగర్’ దాటాలంటే మరో 14,173 ఓట్లు అవసరం - రెండు, మూడో స్థానాల్లో కేజే రెడ్డి, గేయానంద్ - కొనసాగుతున్న ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు - నేడు తుది ఫలితం వెలువడే అవకాశం అనంతపురం: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి ఆయన తన సమీప ప్రత్యర్థి, టీడీపీ కేజే రెడ్డిపై 12,677 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అయితే, విజయానికి అవసరమైన ‘మ్యాజిక్ ఫిగర్’ గోపాల్‌రెడ్డికి రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. మొదటి ప్రాధాన్యతలో కేజే రెడ్డి, పీడీఎఫ్ అభ్యర్థి గేయానంద్‌కు పోలైన ఓట్లు, ‘మ్యాజిక్ ఫిగర్’కు అవసరమయ్యే ఓట్లను పరిగణనలోకి తీసుకుంటే గోపాల్‌రెడ్డికే విజయావకాశాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. వైఎస్సార్సీపీ అభ్యర్థి గెలుపు వాకిట నిలవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వ్యక్తమవుతోంది. ప్రతి రౌండ్లో వైఎస్సార్సీపీకి మెజారిటీ ఈ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలో 1,55,711 ఓట్లు పోలయ్యాయి. వీటిని సగటున 26 వేల ఓట్ల చొప్పున విభజించి ఆరు రౌండ్లలో లెక్కింపు పూర్తిచేశారు. సోమవారం రాత్రి 8 గంటలకు ప్రారంభమైన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మంగళవారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. మొదటి రౌండ్ నుంచి ఆరో రౌండ్ వరకూ ప్రతి రౌండ్లోనూ గోపాల్‌రెడ్డికి ఆధిక్యత లభించింది. ఆరు రౌండ్ల లెక్కింపు పూర్తయ్యే సరికి ఆయనకు 53,714 ఓట్లు లభించాయి. కేజే రెడ్డికి 41,037, గేయానంద్‌కు 32,810 ఓట్లు పోలయ్యాయి. మిగిలిన అభ్యర్థులు స్వల్ప ఓట్లు సాధించారు. మ్యాజిక్ ఫిగర్‌కు 14,173 ఓట్ల దూరంలో... పోలైన మొత్తం ఓట్లలో చెల్లని ఓట్లను మినహాయిస్తే మిగిలిన 1,35,772 ఓట్లలో 50 శాతం కంటే ఒక్క ఓటు ఎక్కువ.. అంటే 67,887 ఓట్లను ‘మ్యాజిక్ ఫిగర్’గా ఎన్నికల అధికారులు నిర్ధారించారు. ఈ సంఖ్యకు గోపాల్‌రెడ్డి 14,173 ఓట్ల దూరంలో ఉన్నారు. అలాగే కేజే రెడ్డి 26,850, గేయానంద్ 35,077 ఓట్ల దూరంలో ఉన్నారు. దీంతో విజయానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకునేందుకు గోపాల్‌రెడ్డికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తవ్వాలంటే మరో 10 గంటలకుపైగా సమయం పట్టే అవకాశం ఉంది. బుధవారం తెల్లవారుజామున లేదా ఉదయం తుదిఫలితం వెలువడనుంది. -
కర్నూలులో పేపరు మిల్లును పునరుద్ధరించాలి
– ఎమ్మెల్సీ అభ్యర్థి గోపాల్‌రెడ్డి డిమాండ్ కర్నూలు (ఓల్డ్‌సిటీ): కర్నూలులో రాయలసీమ పేపర్‌మిల్లు ప్రారంభించాలని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే, సీఈసీ మెంబర్ కొత్తకోట ప్రకాశ్‌రెడ్డిలతో కలిసి మంగళవారం స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయలసీమ యువకులు నిరుద్యోగ సమస్యతో ఆందోళనకు గురవుతున్నారన్నారు. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగు నింపాలంటే కర్నూలులో ఎస్ఆర్పీఎం, హిందూపురంలో నిజాం షుగర్స్, గుంతకల్లులో స్పిన్నింగ్ మిల్లు, కడపలో బ్రాహ్మణి స్టీల్స్ ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. ఇచ్చిన హామీ మేరకు ఇంటికో ఉద్యోగం లేక నిరుద్యోగ భృతి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తనకు అవకాశం లభిస్తే ప్రభుత్వాన్ని నిలదీసి సాధించుకొస్తానని తెలిపారు. ఎన్నోరకాల అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. రాయలసీమకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. ఆయన 100 అబద్ధాలు చెబితే, ప్రస్తుతం రంగంలో ఉన్న టీడీపీ అభ్యర్థి కె.జె.రెడ్డి పరిశ్రమలు స్థాపిస్తానంటూ 150 అబద్ధాలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం ఉద్యమాలు చేస్తే పీడీ యాక్టు, నిరుద్యోగులపై నాసా యాక్టు పెడతామనడం అప్రజాస్వామికమన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఉద్యమాలను అణచివేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా క్రూరత్వం తగ్గించుకోకపోతే ముఖ్యమంత్రి పాలనకు కాలంచెల్లే రోజులొస్తాయని హెచ్చరించారు. సీమ సమస్యలపై పోరాడతారు.. రాయలసీమ జిల్లాల అభివృద్ధి పాలకులకు పట్టడం లేదని వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కర్నూలు, అనంతపురం, కడప జిల్లా ప్రజలకు ఈ ప్రభుత్వ పాలనలో అన్యాయం జరుగుతుందన్నారు. వెన్నపూస గోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీగా అన్ని ప్రాంతాల సమస్యలను తెలుసుకుంటూ ఎంతో చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. ఆయన గెలిస్తే చట్టసభల్లో సీమవాసుల వాణి వినిపించి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని, తద్వారా రాయలసీమ వాసులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. అవగాహన కలిగిన అభ్యర్థి అవసరం.. రాష్ట్ర ఎన్జీవోల సంఘం చైర్మన్‌గా పనిచేసిన వెన్నపూస గోపాల్‌రెడ్డికి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సమస్యలపై మంచి అవగాహన ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి అభ్యర్థి ఎంతో అవసరమని వైఎస్ఆర్సీపీ సీఈసీ మెంబర్, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. అభ్యర్థికి మూడు జిల్లాల పరిధి ఉండటం వల్ల అందర్ని కలుసుకోకపోయినా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు గ్రామగ్రామాల్లో, ఇల్లిల్లూ తిరిగి ప్రచారం చేయడం అభినందనీయమన్నారు. ప్రజాసేవా అనుభవం కలిగిన వ్యక్తిని గెలిపించుకోవడం వల్ల సమస్యలు సునాయాసంగా పరిష్కారమవుతాయని తెలిపారు. నమోదు చేసుకున్న గ్రాడ్యుయేట్లందరు ఓటుహక్కును వినియోగించుకోవాలని సూచించారు. విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు శ్రీకర్, వైద్యనాథ్రెడ్డి, కుమారస్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గోపాల్‌రెడ్డి విజయానికి పిలుపు
కోవెలకుంట్ల: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి విజయానికి కృషి చేయాలని నిరుద్యోగుల జేఏసీ జిల్లా కన్వీనర్ దేవరాజు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా నిరుద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. 26వేలకు పైగా గ్రూప్ -1,2 పోస్టులు ఖాళీగా ఉండగా 980 పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేశారన్నారు. 1.60 లక్షల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే 8వేల పోస్టులు భర్తీ చేశారని, మిగిలిన శాఖల్లో పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోలేదన్నారు. నెలకు రూ. 2వేలు నిరుద్యోగ భృతి హామీని గాలికి వదిలేశారని, నిరుద్యోగులకు ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి నిరుద్యోగులు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ సభ్యులు దస్తగిరి, బాషా, నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
బాబు వచ్చాడు ... జాబులు ఊడాయి
– ప్రతి నిరుద్యోగికి రూ.60 వేల బకాయి చెల్లించాలి – వైఎస్సార్సీపీ పట్టభధ్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస కదిరి టౌన్ : ఎన్నికల్లో జాబు కావాలంటే బాబు రావాలని నిరుద్యోగులకు హామీ ఇచ్చి ఇప్పుడు దాన్ని తుంగలో తొక్కారని వైఎస్సార్సీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి విమర్శించారు. ఒక్కో నిరుద్యోగికి రూ.2 వేలు ఇస్తామని మాటతప్పారన్నారు. ఒక్కో నిరుద్యోగికి రూ. 60 వేల చొప్పున సీఎం చంద్రబాబు బకాయి పడ్డారన్నారు. సోమవారం సాయంత్రం వైఎస్సార్సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డా.పీవీ సిద్దారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనను ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపిస్తే వెనుకబడిన రాయలసీమలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. విభజన చట్టంలోని హామీ ప్రకారం కడపలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పడానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. ఉపాధ్యాయులకు సీపీఎస్ విధానం రద్దు అయ్యేవరకు పోరాటం చేస్తామని చెప్పారు. అన్ని శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణకై నిరంతర పోరాటం చేస్తామనీ, మహిళా ఉపాధ్యాయ, ఉద్యోగులకు 22 నెలల ఛైల్డ్ కేర్ లీవ్‌లను సాధన కోసం కృషిచేస్తామని తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టుల భర్తీ కోసం కృషి చేస్తామన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతాన్ని ఫ్రీజోన్‌గా ప్రకటించేలా సర్కారుపై మరింత ఒత్తిడి పెంచుతామని చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డా.పీవీ సిద్దారెడ్డి, లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగాల లోకోశ్వర్రెడ్డి, పట్టణ అ«ధ్యక్షుడు కేఎస్ బహవుద్దీన్, కౌన్సిలర్ ఖాదర్‌బాషా, కదిరి, గాండ్లపెంట మండల కన్వీనర్లు ప్రకాష్, చంద్రశేఖర్రెడ్డిలు పాల్గొన్నారు. -
తీవ్రంగా కొట్టి.. గొంతులో సూది గుచ్చారు
ఎర్రవల్లి: మెదక్ జిల్లాలోని ఎర్రవల్లి లో గురువారం దారుణం చోటు చేసుకుంది. పొలానికి వెళ్లి వస్తున్న ఓ వ్యక్తిపై దుండగులు కర్రలతో దాడి చేశారు. అనంతరం తీవ్రంగా హింసించి గొంతులో సూది గుచ్చారు. మల్లన్న సాగర్ ముంపు ప్రాంతంలో ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంచిన భూమిని ఇతరుల పేరుతో దొంగ రిజిస్ట్రేషన్ చేశారని గత కొన్ని రోజులుగా గోపాల్ రెడ్డి అనే వ్యక్తి పోరాడుతున్నాడు. సదరు వ్యక్తి ఈ రోజు వ్యవసాయ బావి వద్ద నుంచి వస్తుండగా గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. అనంతరం గొంతులో సూదిని గుచ్చారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఓయూ సెట్ దరఖాస్తు గడువు పెంపు
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూసెట్-2016 ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 12 వరకు పొడిగించినట్లు పీజీ అడ్మిషన్స్ డెరైక్టర్ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ చివరి గడువు శనివారంతో (7న)తో ముగిసినా విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రూ.500 అపరాధ రుసుముతో ఈ నెల 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు ఉస్మానియా వెబ్సైట్ చూడవచ్చు. -
టీడీపీ కుట్ర
అనంతపురం అగ్రికల్చర్ : పెద్దవడుగూరు మండలం కిష్టపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) అధ్యక్ష పీఠాన్ని అడ్డదారుల్లో కైవసం చేసుకునేందుకు టీడీపీ కుట్ర చేస్తోంది. గతంలో సొసైటీ పరిధిలోని 13 డెరైక్టర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. మెజార్టీ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయం సాధించారు. దీంతో ఆ పార్టీకి చెందిన అప్పేచెర్ల విజయభాస్కర్‌రెడ్డి సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇటీవల గోపాల్‌రెడ్డి అనే డెరైక్టర్ చనిపోవడంతో డెరైక్టర్ల సంఖ్య 12కు చేరింది. దీన్ని ఆసరాగా చేసుకుని అధ్యక్ష పీఠాన్ని ఎలాగైనా చేజిక్కించుకునేందుకు టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. కొందరు డెరైక్టర్లను ప్రలోభాలకు గురి చేశారు. అధ్యక్షుడికి మెజార్టీ లేదంటూ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇప్పించారు. సోమవారం అవిశ్వాస తీర్మానం జరగనుంది. వాస్తవానికి నోటీసు ఇవ్వాలంటే తొమ్మిది మంది డెరైక్టర్ల సంతకాలు తప్పినిసరి. అయితే, ఏడుగురి సంతకాలతోనే నోటీసు ఇచ్చినా.. అధికారులు ఆమోదముద్ర వేయడం గమనార్హం. ఈ ఏడుగురిలోనూ కంబన్న అనే డెరైక్టర్ అవిశ్వాస తీర్మానం నోటీసుపై వేలిముద్ర వేయలేదని, వేరొక వ్యక్తితో వేయించి కంబన్నవిగా చూపారని కొందరు డెరైక్టర్లు ఆరోపిస్తున్నారు. రెండు వర్గాల్లో ఆరుగురు చొప్పున డెరైక్టర్లు ప్రస్తుతం టీడీపీ, వైఎస్సార్సీపీ శిబిరాల్లో ఆరుగురు చొప్పున డెరైక్టర్లు ఉన్నారు. వైఎస్సార్సీపీకి చెందిన చింతలచెరువు శేషు, రావులుడికి జయశంకర్, అప్పేచెర్ల విజయభాస్కర్‌రెడ్డి, జయరామిరెడ్డి, భీమునిపల్లి కంబన్న, రావులుడికి రామలక్ష్మమ్మ అవిశ్వాస తీర్మానానికి గైర్హాజరు కానున్నారు. ఈ విషయాన్ని కొందరు డెరైక్టర్లు ఫోన్ ద్వారా ‘సాక్షి’కి తెలిపారు. ఈ క్రమంలోనే టీడీపీ నాయకులు పెద్ద కుట్రకు వ్యూహం పన్నినట్లు వారు వివరించారు. తాము అందుబాటులో లేకపోయినా తమ పేర్లతో బయటి వ్యక్తులను డెరైక్టర్లుగా హాజరుపరిచి.. ఓటింగ్ నెగ్గాలని చూస్తున్నారని వారు తెలిపారు. కాబట్టి సొసైటీ సీఈవో దాదాపీర్, డివిజనల్ సహకార అధికారి (డీఎల్సీవో) ఇ.అరుణకుమారి అప్రమత్తంగా వ్యవహరించాలని వారు సూచించారు. డెరైక్టర్లుగా ఎన్నికైన తర్వాత గుర్తింపుకార్డులు ఇచ్చారని, వాటితో పాటు ఆధార్‌కార్డులను పరిశీలించి డెరైక్టర్లు ఎవరనేది గుర్తించాలని వారు తెలిపారు. ఈ క్రమంలో అధికారులు ఎలా వ్యవహరిస్తారనేది అంతుచిక్కడం లేదు. అవిశ్వాస తీర్మానం ముందుకెళ్లాలంటే కచ్చితంగా ఏడుగురు డెరైక్టర్లు హాజరుకావాలి. లేదంటే కోరం సమస్య తలెత్తుతుంది. తీర్మానం మరుసటి రోజుకు వాయిదా పడుతుంది. మరుసటి రోజు కూడా కోరం లేకపోతే ప్రస్తుతమున్న పాలకవర్గాన్నే కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం జరిగే అవిశ్వాస తీర్మానానికి హాజరయ్యే డెరైక్టర్లను గుర్తించడానికి అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది. -
ప్రతి రైతుకూ రుణమాఫీ వర్తింపజేస్తాం
ఎర్రచందనం స్మగ్లర్లందరినీ ఏరేస్తాం పింఛన్ల విషయంలో రాద్ధాంతం తగదు మాట వినని అధికారులను మార్చేస్తాం టీడీపీ సమావేశంలో మంత్రి బొజ్జల చిత్తూరు(సిటీ): రాష్ట్రంలోని అర్హులైన ప్రతి రైతుకూ రుణమాఫీ వర్తింపజేస్తామని రాష్ట్ర అటవీ, సహకారశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చెప్పారు. గురువారం ఇక్కడి టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ సర్వసభ్య సమావేశం సీనియర్ నాయకుడు ముద్దుకృష్ణమనాయుడి అధ్యక్షతన నిర్వహించారు. రుణమాఫీ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని, అంతా మేలు జరుగుతుందని మంత్రి చెప్పారు. డ్వాక్రా రుణాలకు సంబంధించి గ్రూపునకు వర్తింపజేయాలా, సభ్యులవారీగా వర్తింపజేయాలా అనే అంశాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. పింఛన్ల విషయంలో కొంతమంది రాజకీయం చేస్తున్నారని, అలా చేయడం తగదని చెప్పారు. భర్తలు ఉన్నవారు, వృద్ధులు కాని వారు పింఛన్లు తీసుకుంటున్నారని, అలాంటి వాటిని రద్దు చేసేందుకే సర్వే చేస్తున్నారని తెలిపారు. ఎర్రచందనం స్మగ్లర్లందరినీ ఏరిపారేస్తామన్నారు. గత 100 రోజుల పాలనలో ఏమీ చేయలేదనే అపోహలో అందరూ ఉన్నారని, అలాంటివేమి పెట్టుకోవద్దని చెప్పారు. ఇకపై అంతా మంచే జరుగుతుందని, పార్టీ నాయకులు, కార్యకర్తల మాటలను ఖాతరు చేయని అధికారులను తప్పక బదిలీ చేస్తామని స్పష్టం చేశారు. మద్దుకృష్ణమనాయుడు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ మెజారిటీ వచ్చే గ్రామాల్లోనే పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. చిత్తూరు ఎమ్మేల్యే డీఏ సత్యప్రభ మాట్లాడుతూ సీఎం సహకారంతో చిత్తూరు నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బీఎన్ రాజసింహులు మాట్లాడుతూ వచ్చే నెల 15 తరువాత పార్టీకి కొత్త అడహాక్ కమిటీలను ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదు చేస్తామని వెల్లడించారు. జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి, నగర మేయర్ కఠారి అనురాధ తదితరులు ప్రసంగించారు. ఉద్యానపంటలకూ రుణమాఫీ చేయాల్సిందే - తంబళ్లపల్లె నియోజకవ ర్గ తమ్ముళ్లు ఉద్యానపంటలకూ రుణమాఫీ చేయాల్సిందేనని తంబళ్లపల్లె నియోజకవర్గం తెలుగు తమ్ముళ్లు సమావేశంలో పట్టుబట్టారు. 100 రోజులుగా రుణమాఫీపై కాలయాపన చేస్తున్నందున కార్యకర్తలతో పాటు, రైతులు మనోవేదనకు గురవుతున్నారని మండిపడ్డారు. మంత్రి కలగజేసుకుని అధికార పార్టీలో ఉంటూ సీఎం ప్రకటనలకు మద్దతు పలకకుండా, వ్యతిరేకంగా మాట్లాడటం తగదని వారిని వారించారు. మంత్రి ఎంత చెప్పినా వినకుండా రుణమాఫీ, పింఛన్ల విషయంపై కార్యకర్తలు నిలదీస్తుండటంతో సమావేశ మందిరం వద్ద గందరగోళం నెలకొంది. దీంతో చేసేదిలేక సమావేశాన్ని అర్ధంతరంగా ముగించారు. -
భర్త కళ్లల్లో జిల్లేడు పాలు
ప్రియుడితో కలిసి భార్య ఘాతుకం చూపు కోల్పోయిన భర్త నిందితుల రిమాండ్ నాగోలు: వివాహేతర సంబంధం పెట్టుకొని.. కట్టుకున్న భర్త కళ్లల్లో జిల్లేడు పాలు పోసి కళ్లు పోవడానికి కారణమైన భార్యను, ఆమె ప్రియుడిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ కాశీవిశ్వనాథ్ కథనం ప్రకారం... ఎల్బీనగర్ మెడికేర్ ఆసుపత్రి సమీపంలోని పరిమళ అపార్ట్మెంట్లో నివాసముండే కొత్తకొండ రాఘవేందర్ (40), సరిత (32) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. రాఘవేందర్ వివాహాలకు డెకరేషన్ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన స్టీల్ వ్యాపారి గోపాల్‌రెడ్డి (37) ఇంట్లో ఓ శుభకార్యానికి డెకరేషన్ చేశాడు. నగరానికి వచ్చిన గోపాల్‌రెడ్డి ఓసారి ఎల్బీనగర్లోని రాఘవేందర్ ఇంటికి వచ్చాడు. తిరిగి వెళ్లే క్రమంలో ల్యాండ్‌లైన్‌తో పాటు రాఘవేందర్ భార్య సరిత ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. తరచూ ఆమెతో ఫోన్లో మాట్లాడుతూ లోబర్చుకున్నాడు. తమ ఆనందానికి అడ్డుగా ఉన్న రాఘవేందర్‌ను హత్య చేయాలని సరిత తన ప్రియుడు గోపాల్‌రెడ్డితో కలిసి పథకం వేసింది. 2012, డిసెంబర్, 29న రాఘవేందర్ ఇంట్లో పడుకొని ఉండగా... ఇద్దరూ కలిసి కంట్లో జిల్లేడు పాలు పోశారు. కళ్లు ఎంతకూ తెరుచుకోకపోవడంతో సమీపంలోని ఆసుపత్రిలో చూపించుకున్నాడు. అదే సమయంలో సరిత కొడుకును హయత్‌నగర్‌లోని ప్రైవేట్ హాస్టల్లో చేర్పించి కూతురిని తీసుకుని గోపాల్‌రెడ్డి వద్దకు వెళ్లిపోయింది. కళ్లు కోల్పోయిన రాఘవేందర్ ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఈనెల 13న ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అలాగే, గోపాల్‌రెడ్డి తనకు డెకరేషన్ పని నిమిత్తం రూ. 5 లక్షలు చెల్లించాల్సి ఉండగా.. రూ. లక్ష మాత్రమే చెల్లించాడని, మిగతాది ఎగ్గొట్టాడని రాఘవేంద్ర తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాఘవేందర్‌ను హత్య చేయడానికి ప్రయత్నించిన భార్య సరిత, గోపాల్‌రెడ్డిలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
ఉపాధ్యాయులలో ఉత్కంఠ
సుదీర్ఘకాలం తర్వాత ప్రభుత్వం విద్యాశాఖలో బదిలీలు, రేషనలైజేషన్, సర్వీసు నిబంధనల మార్పును చేపడుతోంది. దీంతో ఉపాధ్యాయులలో ఒకింత ఉత్కంఠ నెలకొంది. ఉన్నతస్థాయి కమిటీ వెలువరించే నివేదిక, నియమ నిబంధనల కోసం వారు ఎదురుచూస్తున్నారు. ఈ దసరా సెలవులలో ఈ ప్రక్రియను పూర్తిచేయాలని సర్కారు భావిస్తోంది. నిజామాబాద్ అర్బన్: ఉపాధ్యాయులలో ఉత్కంఠ నెలకొంది. వచ్చే దసరా సెలవులలో రేషనలైజేషన్, సర్వీసు నిబంధనలు, పదోన్నతులకు సంబంధించి ప్రభుత్వం వేగంగా కసరత్తు చేయనుండడమే దీనికి ప్రధాన కారణం. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఏకీకృత సర్వీసు నిబంధనల గురించి కమిటీని వేసింది. పాఠశాల విద్య అదనపు డెరైక్టర్ గోపాల్‌రెడ్డి, మోడల్ స్కూల్స్ డెరైక్టర్ సత్యనారాయణరెడ్డి, పాఠ్య పుస్తకాల ప్రచురణ విభాగం డెరైక్టర్ సుధాకర్‌రెడ్డి, జాయింట్ డెరైక్టర్ శ్రీహరితో కూడిన ఈ కమిటీ వీటిపై కసరత్తు చేయనుంది. ఇదివరకే ప్రాథమిక నివేదికను విద్యాశాఖ మంత్రికి అందించారు. ఇందులో ఉన్న నియమ నిబంధనలు ఏమిటో తెలియక ఉపాధ్యాయులు కలవరపడుతున్నారు. అందరి దృష్టీ అటే! జిల్లాలో 463 ఉన్నత పాఠశాలలు, 973 ప్రాథమిక పాఠశాలలు, 753 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. రెండున్నర లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. 10 వేల మంది విద్యా బోధన చేపడుతున్నారు. వీరికి బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ, రేషనలైజేషన్ ముఖ్యంగా మారాయి. ఈ ఏడాది ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలో ఒకే సారి బదిలీలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనిని ఎలా చేస్తారన్నదే ఉపాధ్యాయులకు సందేహం. నాలుగేళ్లు పూర్తిచేసుకున్న ప్రధానోపాధ్యాయులకు ఈసారి త ప్పనిసరిగా స్థాన చలనం కలిగించనున్నారు. ఐదేళ్లు పూర్తయిన ఉనాధ్యాయులను బదిలీ చేయనున్నారు. కనీస బదిలీకి రెండేళ్లుగా నిర్ణయించారు. బదిలీల్లో అదనపు పో స్టులకు సంబంధించి సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులను, సీనియర్ ఉపాధ్యాయులను ఎవరిని పక్కకు జరుపుతారనేది సందేహం. జిల్లాస్థాయిలో బదిలీలు చేపడతారా, మండల స్థాయికే పరిమితం చేస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 2012 మేలో జరిగిన బదిలీలలో టీచర్లు నేటికీ రీలివ్ కాలేదు. వీరి పరిస్థితి ఏమిటన్నదీ తెలియడం లేదు. ఈ బదిలీలు మేనేజ్మెంట్ ప్రకారమా, జిల్లా మొత్తం ఒక యూనిట్‌గా బదిలీ చేస్తారా అన్నది చర్చనీయాంశమైంది. ఎంఈఓల నియామకం తర్వాతనే బదిలీలు చేసే అవకాశం ఉంది. రేషనలైజేషన్‌తో 30 పాఠశాలలకు ప్రమాదమే! రేషనలైజేషన్‌తో జిల్లాలో 30 పాఠశాలలు మూతపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 20 మంది కన్న తక్కువ విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలలను సమీప పా ఠశాలలలో విలీనం చేయనున్నారు. 1:30 ప్రకారం రేషనలైజేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు. 50 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న ఉన్నత పాఠశాలలను మూసి వేయనున్నారు. దీంతో జిల్లాలో 14 పాఠశాలలు ఇతర ప్రాంతాలకు తరలిపోయే అవకాశం ఉన్నట్లు తెలిసింది. రేషనలైజేషన్ ద్వారా వచ్చే టీచర్లను, కచ్చితమైన నిబంధనలు పాటించి అత్యవసరం ఉన్న మారుమూల ప్రాంతాల పాఠశాలలకే కేటాయించాలని నిర్ణయించారు. సర్ప్లస్ టీచర్లు ఉన్నప్పుడు, ఇందులో జూనియర్ ఉన్న టీచ ర్ సర్వీసును, సీనియర్ ఉన్న సర్వీసును ఏది పరిగణలోకి తీసుకుంటారో ముఖ్యంగా మారింది. రేషనలైజేషన్‌లో పాఠశాలలను మూడు కిలోమీటర్ల దూరం, పాఠశాలల సంఖ్య ఆధారంగా చేస్తారన్నది టీచర్లు ఆలోచిస్తున్నారు. ఈసారి పాఠశాలల సహాయకులు సబ్జెక్టును మార్చుకునే అవకాశం కల్పించారు. దీని ప్రకారం టీచర్లకు సబ్జెక్టు పై పట్టుదొరికే అవకాశం ఏర్పడుతుంది. మరో మూడు రోజులలో ఉన్నత స్థాయి కమిటీ నివేదిక, నిబంధనలను బహిర్గతం చేయనుంది. అప్పుడే సందేహాలు తీరు అవకాశముంది. -
బొజ్జలే.. భూబకాసురుడు
శ్రీకాళహస్తి: ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబుగారూ... రాజధాని నిర్మాణం కోసం రైతులు భూములు విరాళంగా ఇవ్వాలని కోరుతున్నారు.. బాగానే ఉంది. అయితే మీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి భూబకాసురుడి అవతారమెత్తారు. ఆయన మాటేంటో స్పష్టం చేయండి.’’ అని వైఎస్సార్సీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి డిమాండ్ చేశారు. భూఆక్రమణలపై పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద గురువారం రైతులు పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. వైఎస్సార్సీపీ నాయకులు వారికి మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా బియ్యపు మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ దేశ విదేశాల భక్తులు శ్రీకాళహస్తీశ్వరాలయంలో రాహుకేతు పూజలు చేయించుకుంటూ ఈ ప్రాంత ఖ్యాతిని ప్రపంచానికి చాటుతున్నారని, మంత్రి గోపాలకృష్ణారెడ్డి మాత్రం శ్రీకాళహస్తి ప్రాంతానికే భూమచ్చ తెచ్చారని విమర్శిం చారు. సొంత మండలంలోని ప్రభుత్వ మిగుల భూములను ఆక్రమించుకోవడానికి బొజ్జల నలుగురు కింకరులను తయారుచేశారని ఆరోపించారు. వంద రోజుల్లో మండలంలోని నలుగురు టీడీపీ నాయకులు ఇనగలూరు, గోవిందరావుపల్లె, మన్నవరం, కలవగుంట గ్రామాల్లో వెయ్యి ఎకరాల భూములను ఆక్రమించి చరిత్ర సృష్టించారని అన్నారు. ఇనగలూరు గ్రామంలో 300 ఎకరాల భూములు ఆక్రమించి నెల్లూరు జిల్లా పొదలకూరు వ్యక్తులకు లీజుకు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. మంత్రి ఒత్తిడితో 300 ఎకరాలు ఆక్రమించిన వ్యకిపై కేసు కూడా నమోదుచేయకపోవడం.. రెవెన్యూ అధికారులు వారి కార్యాలయంలో ఆ నాయకుడితో చర్చలు జరిపి పంపడం సిగ్గుచేటన్నారు. ఒక్క క్షణం కూడా బొజ్జల మంత్రిగా కొనసాగడానికి అర్హుడుకాదని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ నాయకుడు అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకాళహస్తి చరిత్రలో ఇంతటి భూకుంభకోణం ఇప్పటి వరకు లేదన్నారు. బొజ్జల సొంత మండలంలో భూఆక్రమణల్లో మంత్రి హస్తం ఉందని స్పష్టంగా తెలుస్తోందన్నారు. ముఖ్యమంత్రి వెంటనే శ్రీకాళహస్తి మండలంలోని భూ ఆక్రమణలపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి ఒత్తిళ్లకు తలొగ్గకండి ‘సార్ ఒత్తిళ్లకు తలొగ్గి ఉదాసీనత చూపకండి.. మండలంలో వెయ్యి ఎకరాలు ఆక్రమిస్తే నిద్రపోతున్నారా...’ అంటూ తహశీల్దార్ చంద్రమోహన్‌ను నాయకులు, రై తులు నిలదీశారు. మండలంలోని భూములపై ఆంక్షలు విధించామని చెప్పారు.. టీడీపీ నాయకులకు ఆంక్షలు వర్తించవా అంటూ ప్రశ్నించారు. భూములు స్వాధీనం చేసుకోవాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ చంద్రమోహన్ మాట్లాడుతూ తాను నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గే అధికారిని కాదని.. మండలంలో భూఆక్రమణలపై పూర్తి సమాచారం జిల్లా ఉన్నతాధికారులకు పంపుతున్నట్లు పేర్కొన్నారు. పూర్తిగా భూములు స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. -
సత్యవేడు ఎమ్మెల్యేను నిలదీసిన జనం
రుణాలన్నీ మాఫీ చేయండి బుచ్చినాయుడుకండ్రిగ: రైతు, డ్వాక్రా రుణాలను పూర్తి గా మాఫీ చేయాలని స్థానిక ఎమ్మెల్యే తలారి ఆదిత్యను వైఎస్సార్ సీపీ నాయకుడు గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతులు, మహిళలు అడ్డుకున్నారు. గురువారం మండలంలోని పల్లమాల గ్రామంలో ఎమ్మెల్యే ఆదిత్య పర్యటించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నాయకుడు గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక వంచించడం దారుణమన్నారు. ఇచ్చిన మాటను నిలుపుకోవాలని కోరారు. చంద్రబాబునాయుడు ప్రజలను నమ్మించి మోసం చేశారన్నారు. రైతు, డ్వాక్రా మహిళల రుణాలను వెంటనే పూర్తిగా మాఫీ చేయాలన్నారు. దీంతో ఎమ్మెల్యే ఆదిత్య, టీడీపీ నాయకులు, రైతులు, మహిళలకు, వైఎస్సార్ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకొంది. టీడీపీ నాయకులు గొడవకు దిగటంతో ఎస్ఐ ఈశ్వరయ్య రంగంలోకి దిగి సర్దిచెప్పారు. గొడవ సద్దుమణిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు బ్రహ్మయ్య, శ్రీరాములురెడ్డి, అధికసంఖ్యలో రైతులు, మహిళలు పాల్గొన్నారు. -
మూసేసిన స్కూల్లో టీచర్ పోస్టులా?!
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): జిల్లాలో వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన పాఠశాల అది. రెండేళ్ల క్రితం విద్యార్థులు లేరన్న సాకుతో మూతవేశారు. ఆ స్కూల్లో పదేళ్ల కిందట మంజూరైన టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు ఇప్పటికీ విశ్వప్రయత్నాలు చేస్తోంది యాజమాన్యం. అందుకు విద్యాశాఖలోని కొందరు లోపాయకారిగా పావులు కదుపుతున్నారు. సాక్షాత్తు అడిషనల్ జాయింట్ కలెక్టర్‌ను సైతం తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో ఈ ప్రక్రియను నిర్వహించిన నెల్లూరు డిప్యూటీ ఈఓను తప్పించి తాజాగా గూడూరు డిప్యూటీ ఈఓకు ఆ బాధ్యతను అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం. మళ్లీ ఆ ఉపాధ్యాయ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించిన మూసేసిన సీఏఎం స్కూల్ తరుపున ఉద్యోగాలు కల్పించి ఇతర ఎయిడెడ్ స్కూళ్లకు డిప్యుటేషన్‌పై పంపాలని యాజమాన్యం ప్రయత్నిస్తోంది. అందుకు ప్రస్తుతం ఇన్చార్జీ డీఈఓ తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు, బాధితులు అందజేసిన విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని సీఏఎం ఉన్నత పాఠశాలను వందేళ్ల క్రితం మిషనరీలు ప్రారంభించాయి. ఎయిడెడ్ పాఠశాలలకు ప్రభుత్వం వేతనాలు చెల్లించే క్రమంలో ఎయిడెడ్ పాఠశాలగా మారింది. 1980వ దశకం వరకు అప్రహతిహతంగా విద్యారంగంలో ఆ పాఠశాల ఓ వెలుగు వెలిగింది. జస్టిస్ అన్సారీ, బెజవాడ గోపాల్‌రెడ్డి వంటి ఉద్దండులు ఈ పాఠశాలలో విద్యనభ్యసించారంటే ఈ పాఠశాల ప్రత్యేకతలను చెప్పనవసరంలేదు. యాజమాన్య నిర్లిప్తత, ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం స్కూళ్ల ప్రభావంతో 90వ దశకం నుంచి విద్యార్థుల సంఖ్య క్రమేపి తగ్గనారంభించింది. ఈ క్రమంలో 2004లో ఎనిమిది టీచర్‌పోస్టుల నియామకానికి యాజమాన్యం నిర్ణయించింది. అప్పుడు పాఠశాల మొత్తం విద్యార్థుల సంఖ్య 774. 2004 ఆగస్టులో నాలుగు స్కూల్‌అసిస్టెంట్లు, నాలుగు ఎస్జీటీ పోస్టులకు మొత్తం ఎనిమిది మందికి ఉద్యోగ అవకాశం కల్పించేందుకు ప్రకటన విడుదల చేసింది. ఇందులో మ్యాథ్స్ అసిస్టెంట్ మూడు, ఫిజికల్సైన్స్ ఒకటి, ఎస్జీటీలు నాలుగు పోస్టులున్నాయి. అదే ఏడాది అక్టోబర్‌లో 32 మందికి అర్హత పరీక్షను నిర్వహించారు. ఫలితాలు విడుదల చేయకముందే 2004 డిసెంబర్లో ఎయిడెడ్ స్కూళ్లలో టీచర్ పోస్టుల భర్తీని రద్దుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. కొంతకాలం తరువాత పాఠశాల యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. ఎయిడెడ్ స్కూళ్లలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి బ్యాన్ ప్రకటించకముందు ఇంటర్వ్యూలు నిర్వహించిన వారికి పోస్టులు ఇవ్వవచ్చని సుప్రీంకోర్టు 2013 మార్చిలో తీర్పునిచ్చింది. ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని యాజమాన్యం అధికారులు, అభ్యర్థులకు చెబుతూ మభ్యపెట్టేందుకు ప్రయత్నించింది. అదే నెలలో ఇంటర్వ్యూల పేరుతో 32 మంది అభ్యర్థులకు సీఏఎం హైస్కూల్లో ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు సన్నాహాలు చేపట్టారు. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లిమూసేసిన పాఠశాల్లో టీచర్ పోస్టులు ఎలా భర్తీ చేస్తారని ప్రశ్నించారు. యాజమాన్యం, విద్యాశాఖ అధికారులు పొంతనలేని సమాధానాలతో చల్లగా జారుకున్నారు. అనంతరం స్కూల్ పనిచేయడంలేదని, ఇంటర్వ్యూలకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు లేవని, ఇంటర్వ్యూలు పంపిన కాల్‌లెటర్లు, అభ్యర్థుల హాల్ టికెట్లు, జవాబుపత్రాలు లేవని డిప్యూటీ ఈఓ ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. అప్పుడు డీఈఓగా వ్యవహరిస్తున్న మువ్వా రామలింగం ఈ వ్యవహారంలో తలదూరిస్తే ఉన్న ఆరోపణలకు మరింత ఆజ్యం పోసినట్లు అవుతుందని మిన్నకుండిపోయారు. ఆర్జేడీ కార్యాలయం ఒత్తిడి, జిల్లా విద్యాశాఖ తాజాగా ఈ ఏడాది జూన్‌లో మళ్లీ పోస్టుల భర్తీకి ప్రయత్నాలు జరిగాయి. దీంతో ఈ పంచాయతీ ఏజేసీకి చేరింది. విద్యాశాఖ అధికారులను, పాఠశాల యాజమాన్య ప్రతినిధిని పిలిపించి విచారణ చేపట్టారు. అవసరమైన పత్రాలు లేకుండా పోస్టులు ఎలా భర్తీ చేస్తారంటూ ఇంటర్వ్యూ నిర్వహణాధికారి అడిగిన పత్రాలను చూపాలని యాజమాన్యప్రతినిధులు పలు సూచనలు చేశారు. కొద్ది రోజులు మిన్నకున్న ఆ ప్రతినిధి లోపాయకారి ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రస్తుతం ఇన్చార్జీ డీఈఓ తన వంతు సహాయ సహకారాలందిస్తున్నట్లు సమాచారం. మూసేసిన పాఠశాల్లో పోస్టులు భర్తీచేయడం ఏమిటని? విద్యాశాఖలోని ఉద్యోగులు విస్మయం చెందుతున్నారు. మూసివేసింది ఇలా : చరిత్ర క లిగిన పాఠశాలకు రెండు అతిపెద్ద భవనాలు, విశాలమైన మైదానం ఉంది. ఇప్పటికే సీఏఎం హైస్కూల్లో చాలా భాగం అన్యాక్రాంతమైంది. యాజమాన్యం విడతలు విడతలుగా దాన్ని విక్రయించేసింది. స్కూల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్న సమయంలో ఉన్న విద్యార్థులను బలవంతంగా బయటి స్కూళ్లకు పంపివేశారు. అదే ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ బాలికల హాస్టల్‌ను సైతం పక్క స్కూల్లో చేర్పించారు. 2012లో సుమారు 180 మంది విద్యార్థులు ఉన్నప్పుడు స్కూల్‌ను ఆకస్మికంగా మూసివేశారు. ఇందుకు సంబంధించిన సమాచారం ముందుగా విద్యాశాఖకు పంపలేదు. అప్పుడు పనిచేస్తున్న ఏడుగురు ఉపాధ్యాయులను, ముగ్గురు నాన్‌టీచింగ్ స్టాఫ్‌ను వివిధ ప్రాంతాల్లో డిప్యుటేషన్‌పై పంపారు. ఎందుకింత శ్రద్ధ?... ముడుపులు ముట్టినందుకేనా? 2004లో రాతపరీక్ష నిర్వహించామని చెప్పే యాజమాన్యం ఈ అంశంపై విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఎనిమిది పోస్టులకు సుమారు పది మంది వద్ద రూ. లక్షల్లో వసూలు చేశారనేది బహిరంగ రహస్యం. వారి ఒత్తిడి తట్టుకోలేక కోర్టును ఆశ్రయించేందుకు ఆ అభ్యర్థుల నుంచే మళ్లీ డబ్బులు వసూలు చేశారు. ఉన్న పోస్టులకంటే ఎక్కువ మంది దగ్గర అధిక మొత్తంలో వసూలు చేసినట్లు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు వద్ద నుంచి తీసుకున్నట్లు సమాచారం. అప్పడు రాతపరీక్షకు హాజరైన పలువురు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిపోయారు. కొంత మందికి రిటైర్మెంట్ డేట్ దగ్గర పడింది. ఈ నేపథ్యంలో డబ్బులు ఇచ్చిన అభ్యర్థుల ఒత్తిడికి తట్టుకోలేక ప్రభుత్వాన్ని, విద్యాశాఖను, అభ్యర్థులను తప్పుదోవ పట్టించేందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. పాఠశాలను పునఃప్రారంభించకుండా పోస్టులను భర్తీ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోర్టు ఆదేశాలను పాటించాల్సి ఉంది కోర్టు ఉత్తర్వులను పాటించాలి . సీఏఎం స్కూల్ ఉపాధ్యాయుల భర్తీపై పూర్తి నివేదికను ఏజేసీ ఇవ్వమన్నారు. సాధ్యాసాధ్యాలను ఉన్నతాధికారుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఉష, డీఈఓ -
పీజీ కోర్సులపై యూత్ క్రేజీ!
టాప్ స్టోరీ: ఏదో ఒక డిగ్రీ పూర్తిచేసి.. ఏదో ఒక ఉద్యోగంలో సర్దుకుపోవడానికి మన నగర యువత సిద్ధంగా లేరు. అందరూ వెళ్లేదారిలో వెళ్తే ‘పోటీ ఎక్కువ.. ఫలితం తక్కువ’ అని గ్రహించారు. అందుకే భవిష్యత్‌లో డిమాండ్ పెరిగే, ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్న కోర్సులేవో తెలుసుకుంటున్నారు. అలాంటివాటిలో చేరడానికే మొగ్గు చూపుతున్నారు. దీనికి నిదర్శనమే.. ప్రస్తుతం నగరంలో జరుగుతున్న ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కౌన్సెలింగ్. కొరగావని పలువురు భావించే ఆర్ట్స్ కోర్సులకు డిమాండ్ పెరగడం.. డిగ్రీలో సైన్స్ చదివిన విద్యార్థులు సైతం ఆర్ట్స్ కోర్సుల్లో చేరడానికి ఆసక్తి చూపించడం ఓయూ పీజీ కౌన్సెలింగ్ తాజా విశేషం. ఈ నేపథ్యంలో ఓయూ పీజీ కౌన్సెలింగ్‌లో విద్యార్థుల మన్ననలందుకుంటున్న కోర్సులేవో తెలుసుకుందాం.. భారీ సంఖ్యలో దరఖాస్తులు ఉస్మానియా యూనివర్సిటీ.. 52 కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఓయూపీజీసెట్కు ఈ ఏడాది భారీగా 66,000 దరఖాస్తులు వచ్చాయి. ఈ ప్రవేశపరీక్ష ద్వారా ఉస్మానియా యూనివర్సిటీతోపాటు మహాత్మాగాంధీ యూనివర్సిటీ -నల్గొండ, పాలమూరు యూనివర్సిటీ -మహబూబ్‌నగర్, తెలంగాణ యూనివర్సిటీ -నిజామాబాద్‌ల పరిధిలో 500కుపైగా ప్రభుత్వ, ప్రైవేటు పీజీ కళాశాలల్లో పీజీ కోర్సులను భర్తీ చేస్తారు. నాలుగు యూనివర్సిటీల పరిధిలో పీజీలో సైన్స్, ఆర్ట్స్.. పీజీ డిప్లొమా కోర్సుల్లో మొత్తం 18,625 సీట్లున్నాయి. ఇందులో 4,867సీట్లు యూనివర్సిటీల కాలేజీల పరిధిలో ఉండగా.. మిగతా 13, 758 సీట్లు అనుబంధ కాలేజీల్లో ఉన్నాయి. కోర్సులెన్నో.. ఎంఏలో.. యానిసెంట్ ఇండియన్ హిస్టరీ- కల్చర్ అండ్ ఆర్కియాలజీ, అరబిక్, ఇంగ్లిష్, హిందీ, ఇస్లామిక్ స్టడీస్, కన్నడ, లింగ్విస్టిక్స్, మరాఠీ, పర్షియన్, ఫిలాసఫీ, సంస్కృతం, తమిళం, తెలుగు, ఉర్దూ, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, థియేటర్ ఆర్ట్స్ వంటి కోర్సులు ఉన్నాయి. ఎంఎస్సీలో.. ఆస్ట్రానమీ/ఆస్ట్రోఫిజిక్స్, బోటనీ, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ (ఆర్గానిక్/ఇనార్గానిక్/ఫిజికల్/ఫార్మాస్యూటికల్/ఎనలిటికల్), ఎలక్ట్రానిక్స్, జాగ్రఫీ, జియోఇన్ఫర్మేటిక్స్, జియాలజీ, జెనెటిక్స్, మ్యాథమెటిక్స్/అప్లైడ్ మ్యాథమెటిక్స్, మైక్రో బయాలజీ, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్/అప్లైడ్ స్టాటిస్టిక్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, బయోటెక్నాలజీ, న్యూట్రిషన్ అండ్ డైటిటిక్స్, ఫోరెన్సిక్ సైన్స్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు పీజీ డిప్లొమా కోర్సులు, ఎంకాం, ఎంకాం(ఐఎస్), ఎంసీజే, ఎంఈడీ, బీఎల్ఐఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ, ఎంపీఈడీ, ఎంఎస్డబ్ల్యు, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు కూడా ఉన్నాయి. ఎంకాంకు పెరిగిన ప్రాధాన్యం రాబోయే ఐదేళ్లలో బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, ఐటీ రంగాలు భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోనున్నాయి. వచ్చే ఐదేళ్లలో ఒక్క బ్యాంకింగ్ రంగంలోనే దాదాపు 8 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. వివిధ సంస్థల సర్వేలు ఇదే విషయాన్ని తెలుపుతున్నాయి. అంతేకాకుండా నగరంలో అనేక బహుళజాతి సంస్థలూ, దేశీయ కంపెనీలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేశాయి. ఇక దుస్తులు, సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, రిటైలింగ్ ఔట్లెట్లు కోకొల్లలు. వీటన్నింటిలో ఎంకాం చేసినవారికి అపార అవకాశాలు ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎంకాం కెరీర్ ఎవెన్యూగా నిలుస్తోంది. అందుకే చాలామంది విద్యార్థులు ఎంకాం కోర్సును ఎంచుకోవడానికి మొగ్గు చూపారు. నగరంలోని పీజీ కళాశాలల్లో ఎంకాంలో ఉన్న సీట్ల సంఖ్య కేవలం 1444 మాత్రమే. కానీ అత్యధికంగా 10,000 మంది ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకున్నారు. ఓయూ పరిధిలో రెండేళ్ల వ్యవధి కలిగిన ఎంకాం, మాస్టర్ ఆఫ్ కామర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ , ఏడాది వ్యవధి ఉన్న పీజీ డిప్లొమా ఇన్ ట్యాక్సేషన్ కోర్సులున్నాయి. బీకాం కంప్యూటర్స్ పూర్తికాగానే.. మరో ప్రత్యామ్నాయం ఆలోచించకుండా ఎంకాంలో చేరతానంటున్నాడు అహ్మద్ అలీ. బీఎస్సీ మ్యాథ్స్ తర్వాత.. ఎంకాం చేస్తానంటోంది మరో విద్యార్థిని రేఖ. ‘సంప్రదాయ కోర్సులకు గతంలో ఇంత క్రేజ్ లేదు. టెక్నికల్తో పోల్చితే సేవా రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువ కావడం వల్ల విద్యార్థులు పీజీ కోర్సులను ఎంచుకుంటున్నారు’ అని ఓయూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం ప్రొఫెసర్ చంద్రిక తన అభిప్రాయం వెలిబుచ్చారు. పేద, మధ్యతరగతి గ్రామీ ణ యువత ఉన్నత చదువులకు మొగ్గుచూపడం కూడా డిమాండ్‌కు మరో కారణమంటారామె. ఫిజిక్స్, మ్యాథ్స్లే హాట్ ఫేవరెట్ సైన్స్ కోర్సులకూ విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం జరుగుతున్న ఓయూ పీజీ కౌన్సెలింగ్‌లో ఎక్కువమంది విద్యార్థులు ఎంఎస్సీలో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌లను ఎంచుకుంటున్నారు. రీసెర్చ్‌కు అపార అవకాశాలు, డీఆర్డీవో, బార్క్, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ వంటి విభాగాల్లో ఉన్న ఉద్యోగావకాశాలు విద్యార్థులను ఫిజిక్స్, మ్యాథ్స్‌లను ఎంచుకునేలా చేశాయి. వీటితోపాటు బోధన రంగంలో ఫిజిక్స్, మ్యాథ్స్ ఎప్పటికీ ఎవర్గ్రీన్. వేతనాలు కూడా భారీగానే ఇస్తుండటంతో ఫిజిక్స్, మ్యాథ్స్‌లు విద్యార్థుల హాట్ ఫేవరెట్‌గా నిలిచాయి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో యువత ప్రాతినిధ్యం పెరగాలని, చదువు పూర్తవగానే ఉద్యోగం వెతుక్కోకుండా ఉన్నతవిద్య వైపు దృష్టి సారించాలని ఏఆర్‌సీఐ శాస్త్రవేత్త జి.పద్మనాభం సూచిస్తున్నారు. సైన్స్‌లో ఉన్నతవిద్య అభ్యసించే విద్యార్థులు సంఖ్య పెరగడం వల్ల నూతన ఆవిష్కరణలు వెలుగుచూసే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గతంతో పోల్చితే తల్లిదండ్రుల దృక్పథంలో మార్పు వచ్చింది. ఆడపిల్లల్నీ ఉన్నత విద్యావంతుల్ని చేసేందుకు ప్రోత్సహిస్తున్నారని ఓయూ ప్రొఫెసర్ సెల్వరాణి బాలన్ తెలిపారు. సామాజిక సేవ.. కేరాఫ్ సోషల్‌వర్క్ ఎంకాం తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న కోర్సు.. మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్(ఎంఎస్‌డబ్ల్యూ). కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్చంధ సంస్థలు గ్రామీణాభివృద్ధికి, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి చర్యలు చేపడు తున్నాయి. భారీగా నిధులు కేటాయిస్తున్నాయి. క్షేత్రస్థాయి పర్యవేక్షణ తోపాటు నిధులు దుర్వినియోగం కాకుండా చూడటం, సంబంధిత సంస్థల మధ్య వారధిగా వ్యవహరించడం సోషల్ వర్కర్లు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సోషల్ వర్క్ అవకాశాల పెన్నిధిగా మారింది. ఈ కోర్సులో ఉన్న సీట్లు కేవలం 250. పోటీ మాత్రం తీవ్రంగా ఉంది. ఈ 250 సీట్లకు 7 వేల మంది విద్యార్థులు పోటీలో ఉన్నారు. బీఎస్సీ(సీబీజెడ్)లో ఫస్ట్‌క్లాస్ మార్కులు, బీఎడ్‌లో మంచి ర్యాంకు వచ్చినా తాను మాత్రం ఎంఎస్‌డబ్ల్యూలో చేరతానంటోంది నల్గొండకు చెందిన కత్తుల అమరేశ్వరి. బీఎస్సీ పూర్తిచేసి ఓయూ పీజీసెట్‌లో ఓపెన్ కేటగిరీలో ర్యాంకు సాధించిన ఎ.యాదగిరి కూడా తన ఓటు ఎంఎస్డబ్ల్యూకేనని తెలిపాడు. ఉద్యోగ అవకాశాలకు లోటులేకపోవడం.. అవసరమైతే సొంతగా సంస్థను ఏర్పాటుచేసుకుని సమాజానికి సేవ చేసే వెసులుబాటు ఉండటం కూడా ఈ కోర్సును ఎంచుకునేందుకు కారణమంటున్నాడు. రీసెర్చపై విద్యార్థుల దృష్టి సైన్సలో నాలెడ్జ్‌ను పెంచుకుని రీసెర్చ్ వైపు వెళ్లాలనుకొనే విద్యార్థులు సంఖ్య పెరగడం శుభసూచకం. ప్రస్తుతం ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌కు మంచి డిమాండ్ ఉంది. - ప్రొ. గోపాల్‌రెడ్డి, జేడీ, ఓయూ అడ్మిషన్స్ టెక్నాలజీని నడిపించేది సైన్సే టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా.. మిషనరీ ఎంత ఆధునికమైనా.. వాటిని నడిపించేది సైన్సే. ఆ నాలెడ్‌జ అకడమిక్స్ ద్వారానే సాధ్యం. - ప్రొఫెసర్ శివరాజ్, ఓయూ డెరైక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ -
సీఎం కేసీఆర్ పేషీలోకి గోపాలరెడ్డి రావట్లేదు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేషీలోకి మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన గోపాలరెడ్డి వస్తారని అనుకున్నా.. ఆయన ఇప్పుడు రావడం లేదని సమాచారం. 1985 బ్యాచ్‌కు చెందిన గోపాలరెడ్డి ప్రస్తుతం కేంద్ర హోం శాఖలో సంయుక్త కార్యదర్శి హోదాలో (కేంద్ర పాలిత ప్రాంతాలు) బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఆయనను కేసీఆర్ తన పేషీలో నియమించుకోవాలని నిర్ణయించి, ఆయనను అక్కడ నుంచి డెప్యుటేషన్‌పై కేటాయించాలని కోరారు. అయితే గోపాలరెడ్డి కంటే ఒక ఏడాది జూనియర్ అయిన నర్సింగరావు ప్రస్తుతం ముఖ్యమంత్రి వద్ద ముఖ్యకార్యదర్శి హోదాలో పనిచేస్తున్నందున.. ఆయన దగ్గర పనిచేయడం ఇబ్బందికరంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే గోపాలరెడ్డి రావడానికి ఇప్పుడు విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆయన రాష్ట్రానికి వచ్చే అవకాశం లేదని ఉన్నతాధికార వర్గాలు వివరించాయి. -
తెలంగాణ తొలి ముఖ్యకార్యదర్శిగా గోపాల్‌రెడ్డి
-
సీమాంధ్రకు తొలి సీఎం జగనే
ఓటమిని జీర్ణించుకోలేక బాబు అస్యత ఆరోపణలు ఎన్జీఓ మాజీ రాష్ట్ర అధ్యక్షులు గోపాల్‌రెడ్డి అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఎన్జీఓ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస గోపాల్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటమిని జీర్ణించుకోలేని చంద్రబాబునాయుడు ప్రతి సారి ఆ నెపాన్ని ఉద్యోగులపైన నెట్టడం ఆనవాయితీగా వస్తోందన్నారు. 2004, 2009 ఎన్నికల్లో ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు ఈవీఎంలను ఇళ్లకు తీసుకుపోయి మరుసటి రోజు స్ట్రాంగ్‌రూంలో అప్పజెప్పారని ఆరోపించి అభాసుపాలయ్యారన్నారు. ఈ సారి ఏకంగా గవర్నర్, ఎన్నికల కమిషన్లపైనే ఆరోపణలు చేస్తుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నకిలీ కరెన్సీ, కల్తీ మద్యం అరికట్టడంలో రాష్ట్ర గవర్నర్ విఫలమయ్యాడని విమర్శించడం సిగ్గు చేటన్నారు. ఎక్కడైనా నకిలీ కరెన్సీ, కల్తీ మద్యం పంపిణీ చేసినట్లు ఫిర్యాదులు వస్తే పోలీస్, ఎక్సైజ్ అధికారులు ప్రకటించాలి కానీ, ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు ఇలాంటి ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. ఓటమి భయంతో పోలింగ్ శాతాన్ని తగ్గించేందుకు శతవిధాల ప్రయత్నించిన ఆయన గ్రామాల్లో గొడవలు సృష్టించాడని ఆరోపించారు. అయినా ఎక్కడా రీపోలింగ్ లేకుండా ఎన్నికలు నిర్వహించడంలో రాష్ట్ర గవర్నర్, ఎన్నికల కమిషన్ విజయం సాధించాయని హర్షం వ్యక్తం చేశారు.సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీకి 120 నుంచి 135 సీట్లు వస్తాయని తాము నిర్వహించిన సర్వేలో తేలిందని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో వైఎస్సార్ ట్రేడ్‌యూనియన్ జిల్లా అధ్యక్షులు కొర్రపాడు హుసేన్‌పీరా, ఎన్జీఓ నాయకులు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
బాబూ.. ఉద్యోగులను పురుగుల్లా చూశాడు: గోపాల్‌రెడ్డి
* బాబు హయాం.. ఉద్యోగులకు నరకప్రాయం * పనికిరారంటూ నిత్యం తిట్టేవారు * కూర్చోమనే మర్యాద కూడా తెలియదు * ఆ చీకటి రోజులనెవరు కోరుకుంటారు? * జన్మభూమి పేరుతో నానా వేధింపులు చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో ప్రభుత్వోద్యోగులు దినదిన గండంగా పని చేసేవారని, ఆ రోజులను గుర్తు చేసుకుంటే ఇప్పటికీ ఒళ్లు జలదరిస్తుందని ఏపీ ఎన్జీవో మాజీ రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస గోపాల్‌రెడ్డి అన్నారు. అలాంటి చీకటి రోజులను, నియుంత పాలనను ఎవరైనా కోరుకుంటారా అని ప్రశ్నించారు. బాబు పాలనలో ప్రభుత్వోద్యోగులు ఎదుర్కొన్న ఇక్కట్లు గోపాల్‌రెడ్డి మాటల్లోనే... చంద్రబాబు పాలన నాటి రోజులను ఎందుకు గుర్తు చేసుకోవడం? ఉద్యోగులంటే బాబుకు ఏమాత్రం గౌరవముండేది కాదు. వారిని పురుగుల్లా చూసేవారు. మా సమస్యలపై విన్నవించడానికి ఎప్పుడు వెళ్లినా గద్దిం పు స్వరమే సమాధానమయ్యేది. సమస్య వినకుండానే, మా చేతుల్లోని వినతి పత్రాలను లాక్కుని పక్కనే ఉన్న ఐఏఎస్ అధికారుల చేతుల్లో పెట్టి వెళ్లిపోయేవారు. కనీసం కూర్చోబెట్టే మర్యాద కూడా తెలియదు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఐదున్నరేళ్ల కాలం ప్రభుత్వ ఉద్యోగులకు సువర్ణయుగంలా గడిచింది. ఏ సమస్యపై వెళ్లినా చిరునవ్వుతో ప్రతి ఒక్కరిని పేరుపెట్టి పలకరించే వారు వైఎస్. ఆ రోజులను ఎలా మరచిపోతాం? చెప్పిన సమస్యను సావధానంగా వినడమే గాక, ‘ఇంకేమైనా ఉన్నాయా?’ అని ప్రశ్నించడం మాకిప్పటికీ గుర్తే. నిలబెట్టి అవమానించేవారు జన్మభూమి గ్రామసభలకు వెళ్లిన అధికారులను చంద్రబాబు నిలబెట్టి అవమానించేవారు. స్టేజీపైకి పిలిచి, ‘వీరిని ఎక్కడైనా చూశారా? వీరి పేరు తెలుసా?’ అంటూ ప్రజలను ప్రశ్నించేవారు. తెలియదని చెబితే ఆ ఉద్యోగులను నానా తిట్లు తిట్టి, ‘నీవు ఉద్యోగానికి పనికిరావు పో’ అంటూ అప్పటికప్పుడు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించి జనంతో చప్పట్లు కొట్టించుకునే శాడిస్టు మనస్తత్వం బాబుది. అందరికీ తెలియడానికి ఉద్యోగులేమైనా సినీ నటులా? బది లీపై కొత్తగా వచ్చిన అధికారులు, జిల్లా స్థాయి అధికారులు గ్రామీణ ప్రజలకు ఎలా తెలుస్తారు? బాబు చేసిన ఇలాంటి అవమానాలను తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడిన వారు, గుండెపోటుతో మరణిం చిన వారు కూడా ఉన్నారు. చంద్రబాబు చేసిన అవమానాన్ని తట్టుకోలేక నీటిపారుదల శాఖ ఇంజనీర్ అప్పారావు గుండెపోటుతో మరణించారు. అనంతపురం జిల్లా శింగనమల జన్మభూమి కార్యక్రమంలో లక్ష్మిరెడ్డి అనే పంచాయతీ ఆఫీసర్‌ను పంచాయతీ కా ర్యదర్శి అనుకుని ప్రజల ముందే తిట్టిపోశారు బాబు. ఆయన కార్యదర్శి కాదని అక్కడే ఉన్న డీపీఓ, కలెక్టర్ చెప్పడంతో నాలుక్కరుచుకుని కూడా, ‘సరే పో’ అంటూ ఆయన్ను విసుకున్నారు. అలా తనను అంద రి ముందూ బాబు అకారణంగా తిట్టడమే గాక విసుక్కోవడంతో లక్ష్మిరెడ్డి మనస్తాపానికి గురయ్యారు. సంఘాలను తొక్కేసిన బాబు చంద్రబాబు తన హయాంలో ఉద్యోగ సంఘాలను, వాటి నాయకులను అణగదొక్కేశారు. అప్పట్లో ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడిగా ఉన్న జి.పూర్ణచంద్రరావును తొత్తుగా మార్చుకుని, ఉద్యోగుల సమస్యలపై నోరెత్తకుండా చేశారు. అదే పూర్ణచంద్రరావు ఇప్పుడు టీడీపీలో కీలక పదవి అనుభవిస్తున్నారు. ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ కోసం కొన్నిసార్లు మేం బాబును కలిసినా ఆయన పట్టించుకోలేదు. అసలు పెన్షనర్లకు ఐదు విడతల డీఆర్ కూడా ఎగరగొట్టిన ఘనత కూడా బాబుదే. దీనిపై అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడును కలిస్తే, విచిత్రంగా స్పందించారు. ‘మీరు ఉద్యోగులు. మీ పనులు మీరు చేసుకోండి. ఏం చేయాలో మాకు తెలుసు. ఇంతకు మించి ఏమైనా అడిగితే పరిణామాలు కూడా అలాగే ఉంటాయి’ అంటూ బెదిరించారు. పైగా ‘ఎన్నికల్లో చక్రం తిప్పి ప్రభుత్వాన్ని మార్చేస్తామని కలలు కంటున్నారేమో! అలాంటివేమీ సాధ్యం కాదు. గెలిచే వారిని మీరు ఓడించలేరు. ఓడిపోయే వారిని గెలిపించనూ లేరు’ అనేవారు. ఆ రోజులు తలచుకుంటే ఇప్పటికీ భయుమేస్తుంది. కరెంటు చార్జీలు తగ్గించాలంటూ ఆందోళన చేసిన రైతులపై కాల్పులు బాబు జరిపించారు. కరెంటు బిల్లులు కట్టలేని రైతులపై కేసులు పెట్టించి అరెస్టు చేయించారు. కానీ అదే చంద్రబాబు నెల్లూరు జిల్లాలోని తన 40 ఎకరాల వ్యవసాయ క్షేత్రం తాలూ కు పంపుసెట్లపై ఒక్కరోజు కూడా కరెంటు బిల్లు కట్టిన పాపాన పోలేదు. వేతనాలు పెంచాలంటూ ధర్నా చేసిన అంగన్వాడీ మహిళలను గుర్రాలతో తొక్కించిన రోజులు ఇప్పటికీ గుర్తున్నాయి. ప్రభుత్వ నియామకాలను ఆపేసి కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది బాబే. ఎన్టీరామారావు మధ్య నిషేధం విధిస్తే దాన్ని నానా సాకులతో ఎత్తేసి మద్యపుటేరులను పారించారు. బెల్టుషాపులనే పదాన్ని పరిచయం చేసింది కూడా బాబే. వైఎస్ వచ్చాకే... 2004లో వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వోద్యోగుల సమస్యలన్నీ తీరాయి. అసలు ప్రభుత్వోద్యోగిని మనిషిగా చూడటం వైఎస్ పాలనలోనే జరిగింది. విధి నిర్వహణలో కూడా సమయం తెలిసేది కాదు. గంటలకు గంటలు ఎంతో సంతోషంగా గడిచిపోయేవి. ఎంత ఒత్తిడినైనా భరించి ఆహ్లాదకరమైన వాతావరణంలో పనిచేసేవాళ్లం. ధర్నాలనేవి లేవు. శాశ్వతంగా కడుపుకోత... ‘‘అది 2001. చంద్రబాబు సీఎంగా ఉన్న కాలం. మండువేసవిలో అనంతపురం జిల్లా కదిరి మండలం ఎర్రదొడ్డి గ్రామంలో బాబు జన్మభూమి గ్రామ సభ నిర్వహించారు. ఆ సభ నుంచి మినహాయింపు ఇవ్వండంటూ ఓ పశువైద్యాధికారి నోడల్ ఆఫీసర్‌ను ప్రాధేయపడ్డారు. ‘‘నా భార్య గర్భవతి. నెలలు నిండాయి. నేడో, రేపో కాన్పు కావచ్చు. మా ఇల్లు పట్టణానికి దూరం. తనను చూసుకోవడానికి నేను ఇంటి దగ్గరే ఉండాలి’ అంటూ వేడుకున్నారు. అయినా బాబు భయంతో ఆ అధికారి ససేమిరా అన్నారు. జన్మభూమికి గైర్హాజరైతే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. విధి లేక దానికి హాజరై, సాయంత్రం ఇంటికెళ్లే సరికి ఆయన భార్య అపస్మారక స్థితిలో పడిపోయి కన్పించింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. గంటల కొద్దీ ప్రసవవేదన అనుభవించి, తాళలేక కింద పడిపోవడంతో బిడ్డ కడుపులోనే చనిపోరుుందని వైద్యులు చెప్పారు. ఆపరేషన్ చేసి మృత శిశువును బయటికి తీశారు. ఆ దంపతులకు ఇప్పటిదాకా పిల్లలు కలగలేదు! ఆ రోజు తాను ఇంట్లో ఉండి ఉంటే ఈ దుర్గతి పట్టేది కాదంటూ ఆ పశువైద్యాధికారి ఇప్పటికీ ఆవేదనకు లోనవుతుంటారు. ప్రభుత్వోద్యోగులను అప్పట్లో బాబు ఎంతగా హడలగొట్టారో చెప్పేందుకు ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి?’’ - గోపాల్‌రెడ్డి, ఏపీఎన్జీవో మాజీ అధ్యక్షుడు -
వైఎస్సార్సీపీలోకి గోపాల్‌రెడ్డి
హైదరాబాద్: ఏపీఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గోపాల్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడారు. ‘‘నేను వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానిని. ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షునిగా, ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌గా పలుమార్లు ముఖ్యమంత్రి వైఎస్‌ను కలిశాను. ఉద్యోగుల విషయంలో ఆయన ఎంతో స్నేహపూర్వకంగా ఉండేవారు. ఉద్యోగుల సంక్షేమానికి ఎన్నో చర్యలు చేపట్టారు. తొమ్మిదో పీఆర్సీ సమయంలో గరిష్టంగా ఐఆర్ ఇచ్చారు. తన తండ్రి తరహాలో ఉద్యోగులను సొంత కుటుంబసభ్యులుగా చూసుకుంటానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. విశ్వసనీయతకు మారుపేరైన వైఎస్ కుటుంబం.. మేనిఫెస్టోను అమలు చేస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానిగా నేను పార్టీలో చేరాను. పార్టీ విజయానికి ప్రచారం చేస్తా’’ అని ఆయన తెలిపారు -
బాబుపై నిప్పులు చెరిగిన ఏపీఎన్జీవో మాజీ అధ్యక్షుడు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై ఏపీఎన్జీవో మాజీ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి ఆదివారం అనంతపురంలో నిప్పులు చెరిగారు. చంద్రబాబు అధికారంలో ఉన్న హయాంలో ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్ల మోసం చేశారని ఆరోపించారు. ఓ విధంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రజల నోట్లో మట్టి కొట్టారని విమర్శించారు.అధికారం కోసం బాబు మళ్లీ అబద్దాలు ఆడుతుకున్నారని ఎద్దేవా చేశారు. ఆ అబద్దాలలో భాగంగానే సాధ్యం కానీ పలు హామీలు గుప్పిస్తున్నారన్నారు.సెంట్రల్ పీఆర్సీ అమలు చేస్తానని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు హామీ ఇస్తున్నారు. ఆ హామీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శాపమని తెలియదా అని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు.9 ఏళ్ల ముఖ్యమంత్రిని అని చెప్పుకునే చంద్రబాబుకు బడ్జెట్‌పై కనీసం అవగాహాన కూడా లేదన్నారు. ఎన్నికలలో గెలిచేందుకు రూ. 5 లక్షల కోట్ల హామీ ఇచ్చారని గోపాల్ రెడ్డి గుర్తు చేశారు. ఇంట్లో ఉద్యోగం అని బాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.చంద్రబాబును ఉద్యోగులు నమ్మరని గోపాల్ రెడ్డి తెలిపారు. -
విభజన’ ఎమర్జెన్సీని తలపిస్తుంది.
విభజన’ ఎమర్జెన్సీని తలపిస్తుంది. గూడూరు, దేశ చరిత్రలో రాష్ట్ర విభజన బిల్లును లోక్‌సభలో ఆమోదించిన రోజు చీకటి రోజని.. ఎమర్జెన్సీని తలపించేలా లోక్‌సభలోకి మీడియాకు కూడా ప్రవేశం లేకుండా రాష్ట్రాన్ని ముక్కలు చేయడం దారుణమని వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త పాశం సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక టవర్‌క్లాక్ సెంటర్ నుంచి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా బయల్దేరి ముత్యాలపేట మీదుగా రైల్వే స్టేషన్, రాజావీధి మీదుగా గాంధీబొమ్మ సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ్నుంచి సంగం థియేటర్ మీదుగా తిరిగి టవర్‌క్లాక్ సెంటర్‌కు ర్యాలీ చేరింది. అక్కడ రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. బంద్‌కు మద్దతుగా పట్టణంలోని దుకాణాలను స్వచ్ఛందంగా మూసేశారు. ఈ సందర్భంగా ఎల్లసిరి మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ సోనియాగాంధీ సీమాంధ్ర ప్రజల మనోభిష్టాలను పరిగణలోకి తీసుకోకుండా రాక్షసత్వంగా రాష్ట్రాన్ని ముక్కలు చేసిందన్నారు. సమైక్యాంధ్ర కోసం మొదటి నుంచి వైఎస్సార్సీపీ కట్టుబడి ఉందని, ఈ మేరకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీలో సమైక్య పోరు చేపట్టారన్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక బలీయమైన శక్తిగా మారుతుండటంతో అది తట్టుకోలేక ఏ విధంగానైనా దెబ్బతీయాలన్న లక్ష్యంతోనే పాలక, ప్రతిపక్షాలు ఒక్కటై దుశ్చర్యలకు పాల్పడుతున్నాయన్నారు. పాశం సునీల్‌కుమార్ మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్రెడ్డేనని, చంద్రబాబు, కిరణ్‌లు రెండు కళ్ల సిద్ధాంతాలు పాటిస్తూ ప్రజలను మభ్యపెట్టే యత్నాలు చేస్తున్నారన్నారు. వీటన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌కు సీమాంధ్ర ప్రజలు ఓట్లతో గట్టిగా బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు నాశిన నాగులు, రాజేశ్వరరెడ్డి, ఎల్లా శ్రీనివాసులురెడ్డి, రాజశేఖరరెడ్డి, శివకుమార్, మధురెడ్డి, సత్యం, లక్ష్మీనారాయణ, మాజీ కౌన్సిలర్లు గురవయ్య, బొమ్మిడి శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, పెల్లేటి శ్రీనివాసులురెడ్డి, వెంకట్రావు, వెంకటేశ్వర్లు, కిరణ్, రంగారెడ్డి, గిరి, బుజ్జయ్యనాయుడు, షణ్ముగం, సరస్వతమ్మ, నవీన్ జయకుమార్, సునీల్, మల్లిగౌడ్ పాల్గొన్నారు. అలాగే టీడీపీ ఆధ్వర్యంలో పట్టణంలో మోటారుబైక్ర్యాలీ నిర్వహించి దుకాణాలను మూయించారు. ఈ కార్యక్రమంలో బల్లి కల్యాణ్, శీలం కిరణ్‌కుమార్, బిల్లు చెంచురామయ్య, ప్రభాకర్ పాల్గొన్నారు. వాకాడులో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు వాకాడులో పార్టీ మండల కన్వీనర్ నేదురుమల్లి ఉదయశేఖరరెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, బ్యాంక్‌లను మూయించి సమైక్య నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్లంటి వెంకటసుబ్బారెడ్డి, పెళ్లూరు కోటిరెడ్డి, పూనమల్లి బాలకృష్ణయ్య, నజీర్‌బాషా, ఎస్కే కాలేషా, కడూరు భాస్కర్, తీపలపూడి చెంగయ్య, రావిగుంటపాళెం రమేష్, సుబ్బయ్య, సుధాకర్ పాల్గొన్నారు. -
విద్యార్థుల్లో వైజ్ఞానిక స్ఫూర్తిని నింపాలి
-
అట్టహాసంగా రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు
ప్రొద్దుటూరు కల్చరల్, న్యూస్‌లైన్: స్థానిక రాయలసీమ వ్యాయామ కళాశాలలో 59వ రాష్ట్ర స్థాయి అండర్-19 అథ్లెటిక్ పోటీలు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని 22 జిల్లాల నుంచి 400 మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే లింగారెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులు జాతీయ స్థాయిలో ప్రఖ్యాతులు గడించాలన్నారు. ఆర్సీపీఈ ప్రిన్సిపాల్ గోపాల్‌రెడ్డి, ఆర్‌ఐపీఈ భానుమూర్తి రాజులు మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతాయన్నారు. ముందుగా క్రీడా జెండాను ఎగురవేసి క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా జూనియర్ కళాశాలల వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం కార్యదర్శి వెంకటరెడ్డి, వ్యాయామ సంచాలకులు ఓబులరెడ్డి, జోనల్ స్థాయి పాఠశాలల కార్యదర్శి శ్రీనివాసులరెడ్డి, బాషా అథ్లెటిక్ ఫౌండేషన్ అధ్యక్షుడు మహబూబ్‌బాషా, ఆర్సీపీఈ విద్యార్థులు, అధ్యాపకులు ఈ పోటీలను పర్యవేక్షించారు. తొలి రోజు పరుగు పోటీలో 400 మీటర్లలో బాలుర విభాగంలో రమేష్ (ఖమ్మం), గోపాలకృష్ణ (ఖమ్మం), శ్రవణ్(వరంగల్), బాలికల విభాగంలో జ్యోతి (రంగారెడ్డి), భాగ్యలక్ష్మి (హైదరాబాద్), సుమాంజలి(ప్రకాశం), 300 మీటర్ల బాలుర పరుగు పోటీలో బి.తిరుపతి (వరంగల్), శ్రీనివాస్ (రంగారెడ్డి), నవీన్‌రెడ్డి(గుంటూరు), బాలికల విభాగంలో సుష్మిత (ఖమ్మం), వెంకటలక్ష్మి (వెస్ట్ గోదావరి), స్వాతి (వైఎస్ఆర్)లు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. , 4ఁ100 బాలికల విభాగంలో హైదరాబాద్ ప్రథమ, ఖమ్మం ద్వితీయ, వెస్ట్ గోదావరి తృతీయస్థానం నిలిచింది. -
పింఛన్ల పంపిణీ ఇలాగేనా?
గూడూరు, న్యూస్‌లైన్: దివంగత మ హానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను ఈ ప్రభుత్వం గాలికి వదిలేసిందని వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి దుయ్యబట్టారు. పట్టణంలో వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లు సక్రమంగా పంపిణీ చేయకపోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి దిగ్బంధించి నిరసన వ్యక్తం చేశారు. కమిషనర్ వచ్చేంత వరకు ఇక్కడి నుం చి కదిలేది లేదంటూ నినాదాలు చేశా రు. దీంతో కమిషనర్ అక్కడకు రాగా పింఛన్లు సక్రమంగా పంపిణీ చేయక పోవడంపై పలువురు వృద్ధులు ఆమె ను నిలదీశారు. నెలనెలా కాళ్లరిగేలా తిరుగుతూ పడరానిపాట్లు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్లసిరి గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ హయాంలో పట్టణంలో 5 వేలకు పైగా పింఛన్లను ప్రతినెల 1వ తేదీనే కచ్చితం గా ఇచ్చేవారన్నారు. పస్తుతం రెండు మూడు నెలలకోసారి కూడా ఇవ్వడంలేదన్నారు. కొన్ని వార్డులకు కలిపి ఒకే చో ట ఇస్తుండటంతో వృద్ధులు ఇబ్బంది పడుతున్నారన్నారు. వారికి వచ్చే పిం ఛన్ ఆటోలకే సరిపోతుందన్నారు. సుమారు వెయ్యి మందికిపైగా అర్హులైన వారు పింఛన్ల కోసం అర్జీలిచ్చినా ఇప్ప టి వరకు పింఛన్లు మంజూరు చేసిన దాఖలా లేదన్నారు. వైఎస్సార్సీపీ పట్టణ, మండల కన్వీనర్లు నాశిన నాగులు, మల్లు విజయ్‌కుమార్‌రెడ్డి, నాయకులు బొమ్మిరెడ్డి మధురెడ్డి, మాజీ కౌన్సిలర్లు చంద్రయ్య, గురవయ్య, శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వర్లు, నవీన్జయకుమార్, రంగారెడ్డి, మల్లిగౌడ్ పాల్గొన్నారు. పించన్ల కోసం పడిగాపులు మనుబోలు : పింఛన్ల కోసం లబ్ధిదారులు స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారు. మనుబోలులో మూడు నెలలుగా పింఛన్ల పంపిణీ సక్రమంగా జరగడం లేదు. రెండు నెలల క్రితం వరకు సీఎస్పీ లక్ష్మి పింఛన్లు పంపిణీ చేసేది. వేరే కారణంతో ఆమెను తొలగించడంతో అక్టోబర్‌లో నెల్లూరు నుంచి వచ్చిన డీఆర్డీఏ సిబ్బంది ఒక్క రోజు మా త్రమే పింఛన్లు పంపిణీ చేశారు. దీంతో సగం మందికి గత నెలలో పింఛన్లు అందలేదు. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో సైతం అందరికీ పింఛన్లు ఇవ్వలేదు. వరుసగా మూడు నెలలు పింఛన్లు తీసుకోకుంటే వారి పింఛన్ రద్దు చేస్తారు. దీంతో తమ పింఛను ఎక్కడ రద్దవుతుందోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 2వ తేదీ నుం చి పంచాయతీ కార్యాలయం వద్ద వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పడిగాపులు కాస్తున్నారు. అయితే ఇంత వరకూ వారి నిరీక్షణ ఫలించలేదు. -
నేడు విదర్భకు శరద్ పవార్
నాగపూర్: గత నెలలో విదర్భలో కురిసిన భారీ వర్షాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ శుక్రవారం నుంచి పర్యటించనున్నారు. వరద బాధితులకు భరోసా కల్పించే ప్రయత్నం చేయనున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో జరిగిన నష్టానికి సంబంధించిన లెక్కలను తేల్చేందుకు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి గోపాల్ రెడ్డి నేతృత్వంలోని బృందం పర్యటిస్తోంది. అయితే పవార్ నాలుగు రోజులు పర్యటనలో భాగంగా ఈ నెల 14న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అత్యధిక వర్షపాతం వల్ల వచ్చిన వరదలు, దీనివల్ల కలిగిన నష్టాన్ని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అధికారులు పవార్‌కు లెక్కలు వినిపించనున్నారు. అనంతరం పవార్ వర్ధాలో పర్యటించి అక్కడ ఆస్తి, పంట నష్టాల గురించి తెలుసుకోనున్నారు. యావత్మల్లోనే రాత్రి బస చేసి 16న గోండియా, భండారా జిల్లాలకు వెళ్లి వరద ముంపునకు గురైన ప్రజల బాధలను అడిగి తెలుసుకోనున్నారు. 17న తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళతారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇదిలాఉండగా వరదముంపునకు గురైన ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ సురభ్ రావ్, ఇతర అధికారులు, కేంద్ర బృందం సభ్యులతో కలిసి బుధవారం పర్యటించారు. అయా గ్రామాల సర్పంచ్‌లు, స్థానిక అధికారులతో మాట్లాడారు. జిల్లాపరిషత్ అధ్యక్షుడు సంధ్యా గోతమరేపంటనష్టం గురించి ఓ నివేదికను కేంద్ర బృందానికి సమర్పించారు. జిల్లాలోని హింగానా తాలూకాలో 123 హెక్టార్లలో, కనోలిబారా తాలూకాలోని 648 హెక్టార్లలో పంటనష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. భండారా, చంద్రపూర్, గడ్చిరోలి, అమరావతి, అకోలా, యావత్మల్ కేంద్ర బృందం పర్యటిస్తోంది. అలాగే పవార్ పర్యటనకు ముందు వర్ధాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జయంత్ భాటియా గురువారం పర్యటించారు.