Healthy life
-
షుగర్‌ను కంట్రోల్ చేసే నల్ల జీలకర్ర.. ఇలా వాడితే నొప్పులన్నీ పరార్
జీలకర్రను దాదాపు అన్ని వంటల్లో ఉపయోగిస్తారు. దీనివల్ల రుచి మాత్రమే కాదు, రోగనిరోధక శక్తి సైతం పెరుగుతుంది. అయితే జీలకర్రతో పోలిస్తే నల్ల జీలకర్రలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని కలోంజీ విత్తనాలు అని కూడా అంటారు. మరి నల్ల జీలకర్ర వల్ల కలిగే ఉపయోగాలు ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. ►నల్ల జీలకర్ర జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. పొట్టలో రసాయనాలు విడుదలయ్యేందుకు సహాయపడుతూ, మలబద్దకాన్ని నివారిస్తుంది. కొలెస్ట్రాల్ పెరగనివ్వకుండా నివారిస్తూ, లావు, ఉబ్బసం వంటి సమస్యలను అదుపు చేస్తుంది. ► నల్ల జీలకర్రతో తయారు చేసిన నూనెని నుదిటి పైన రుద్దుకోవడం వళ్ళ తలనొప్పి దూరం అవ్వడమే కాకుండా, ప్రశాంతంగా నిద్ర పడుతుంది. ► నల్ల జీలకర్ర నూనె పంటికి సంబంధించిన సమస్యలను, చిగుళ్ళకి సంబంధించిన సమస్యలను, బలహీనమైన పంటి నొప్పిని తగ్గిస్తుంది,కేవలం కొన్ని నూనె చుక్కలను జల్లడంతో నొప్పి తగ్గుతుంది. నల్ల జిలకరలో థైమోక్విన్ అనే కెమికల్ ఉంటుంది అది మీ చిగుళ్లను ఆరోగ్యగా ఉంచుతుంది. ► వయసు పైబడిన వారిలో మతిమరుపు సమస్య కనిపిస్తుంటుంది. అలాంటి వాళ్లు ఖాళీ కడుపుతో నల్ల జీలకర్రను తీసుకుంటే మెమరీ పవర్ పెరుగుతుంది. ► నల్ల జీలకర్ర నూనెలో ఉండే ప్రోటీన్స్,ఫాటీ ఆసిడ్స్ బ్లడ్ సర్క్యూలేషన్‌కు ఎంతో ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనె, నల్ల జీలకర్ర నూనెను కలిపి తలకు రాసుకుంటే జుట్టు పెరిగి ధ్రుడంగా తయారవుతుందని, అంతేగాక చుండ్రును కూడా తగ్గిస్తుందని తేలింది. ► మెటబాలింజను మెరుగుపర్చడంలో నల్లజీలకర్ర తోడ్పడుతుంది. ఇది కిడ్నీ ఆరోగ్యాన్ని సైతం మెరుగుపరుస్తుంది. ► ఆడవాళ్లకు నెలసరి ఇబ్బందులను దూరం చేస్తుంది. పీరియడ్స్ టైంలో వచ్చే కడుపునొప్పిని తగ్గిస్తుంది. ► కళ్లు ఎర్రగా మారడం, నీరు ఎక్కువగా రావడం వంటి కంటి సమస్యలను నివారించి కంటిచూపును మెరుగుపరుస్తుంది ► షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేస్తూ టైప్-2 డయాబెటిస్‌ని అదుపు చేస్తుంది. నల్ల జీలకర్ర నూనెని బ్లాక్ టీతో కలిపి కాళీ కడుపుతో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ► శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించడంతో పాటు గుండెకి సంబంధించిన సమస్యలను ఇది తగ్గిస్తుంది. ► పెరుగుతున్న కాలుష్యం కారణంగా ఆస్థమా ఒక సాధారణ జబ్బు గా మారింది.నల్ల జీలకర్ర నూనె, తేనె, గోరు వెచ్చని నీటిలో కలిపి రోజు తీసుకుంటే ఆస్థమా ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ► నల్ల జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా ఉంటాయి. ఇవి బ్రెస్ట్ కాన్సర్, సెర్వికల్ కాన్సర్, లంగ్ కాన్సర్, పాంక్రియాటిక్ కాన్సర్ లను నివారిస్తాయి. ► నిమ్మరసం,నల్ల జీలకర్ర నూనెను కలిపి రోజుకు రెండు సార్లు మొహానికి అప్లై చేస్తే మొటిమలు తగ్గుతాయి. ► నల్ల జీలకర్ర, తేనెను గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సీజన్లో వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. నల్ల జీలకర్ర ఎలా తీసుకోవాలి? పొడి అయితే రోజు మధ్యాహ్నం అలాగే రాత్రి తిన్న తరువాత అర టీ స్పూన్ తీసుకోవాలి. టాబ్లెట్ అయితే రోజుకు 2 టాబ్లెట్స్ మధ్యాహ్నం అలాగే రాత్రి తిన్న తరువాత తీసుకోవాలి. నూనె రూపంలొ తీసుకుంటే రోజుకి అర టీ స్పూన్ మధ్యాహ్నం అలాగే రాత్రి తిన్న తరువాత తీసుకోవాలి. -నవీన్ నడిమింటి, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు -
ఆల్కహాల్ తాగని వారిలోనూ లివర్ సమస్యలు.. అదొక్కటే పరిష్కారం
కాలేయ సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. ఇది సక్రమంగా పనిచేస్తేనే శరీరం కూడా అదుపు తప్పకుండా ఉంటుంది. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో, మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కాలేయం సహాయపడుతుంది. అందుకే కాలేయ ఆరోగ్యంపై దృష్టిపెట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మరి, కాలేయాన్ని ఆరోగ్యం ఉంచుకోవాలంటే ఏం చేయాలి? అన్నది ఈ స్టోరీలో చదివేద్దాం. మన శరీరావయవాల్లో పునరుత్పత్తి అయ్యే ఒకేఒక అవయవం కాలేయం. అందుకే వైద్యులు దీనిని ఫ్రెండ్లీ ఆర్గాన్ అని పిలుస్తారు. అటువంటి కాలేయాన్ని మనం ఒక మంచి స్నేహితుడిలా జాగ్రత్తగా చూసుకోవాలని, ఏం కాదులే అని అశ్రద్ధ చేస్తే ప్రాణానికే ప్రమాదం దాపురించే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. భారత్‌లో ప్రతి ఏటా దాదాపు పది లక్షల మంది లివర్ సమస్యల బారిన పడుతున్నారు. వారిలో లివర్ సిర్రోసిస్ కేసులు కూడా ఉంటున్నాయని వైద్యులు చెపుతున్నారు. ఆహారపు అలవాట్లు కారణంగా ప్రతి వంద మందిలో 60 మందికి ఫాటీ లివర్ ఉంటుండగా, 15 శాతం మందిలో గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. లివర్ సిర్రోసిస్‌కు గురైన వారిలో ఆల్కహాల్ తాగే వారితో పాటు, ఆల్కాహాల్ తాగని వారు సైతం ఆ వ్యాధికి గురవడం ఆందోళన కలిగిస్తోంది. అలాంటి వాళ్లు జాగ్రత్తగా ఉండాలి లివర్ సమస్యలు ఎక్కువగా మధుమేహులు, హోపోథైరాయిడ్ ఉన్న వారు, హెపటైటీస్ సి, రక్తంలో కొలస్ట్రాల్ స్థాయిలు అబ్నార్మల్గా ఉన్న వారిలో వస్తున్నాయి. ఫాటీలివర్ కామన్‌గా భావించి అశ్రద్ధ చేస్తుండటంతో అది కాస్తా సిర్రోసిస్‌కు దారితీస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఫాటీలివర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3లో దుష్ఫలితాలు లేకుండా చూడవచ్చునని, కానీ సిర్రోసిస్‌కు దారితీస్తే లివర్ గట్టిపడి వెనక్కి వచ్చే పరిస్థితి ఉండదని, లివర్ ఫంక్షన్లో తేడా వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆ పరిస్థితుల్లో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయడం ఒక్కటే మార్గమని అంటున్నారు. 40ఏళ్లు దాటితే.. శారీరక శ్రమలేని జీవన విధానానికి ప్రతి ఒక్కరూ అలవాటు పడ్డారు. దానికి తోడు ఫాట్ ఎక్కువగా ఉన్న జంక్ఫుడ్స్ తింటున్నారు. దీంతో శరీరంలో కొలస్ట్రాల్ స్థాయిలు విపరీతంగా పెరిగి, లివర్‌పై ప్రభావం చూపుతున్నాయి. వయస్సు 40 ఏళ్లు దాటిన వారు ప్రతి ఏటా లివర్ ఫంక్షన్ టెస్ట్, కొలస్ట్రాల్ లెవల్స్, థైరాయిడ్, షుగర్ పరీక్షలతో పాటు, ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ కూడా చేయించుకుంటే మంచిది. ఇప్పుడు లివర్ పనితీరును కచ్చితంగా నిర్ధారించేందుకు ఫైబ్రో స్కాన్ అందుబాటులోకి వచ్చింది. ఆయా పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారించుకుని ముందు జాగ్రత్తలు తీసుకుంటే మేలని వైద్యులు సూచిస్తున్నారు. లివర్ వ్యాధులకు కారణాలివే... శ్రమ లేని జీవన విధానం ఆహారపు అలవాట్లు పెరుగుతున్న మధుమేహులు ఫాస్ట్‌ఫుడ్ ఎక్కువగా తినడం ఆల్కహాల్ వ్యసనం ఫాటీ లివర్‌ను అశ్రద్ధ చేయొద్దు పెరుగుతున్న లివర్ సిర్రోసిస్ కేసులు ఏడాదికోసారి పరీక్షలు తప్పనిసరి వీటికి దూరంగా ఉండాలి ►మంచి పోషకాహారం తీసుకోవాలి. కూరగాయలు, పండ్లను శుభ్రంగా కడిగిన తర్వాతే తినాలి. ► మద్యానికి దూరంగా ఉండాలి. అతిగా ఆల్కహాల్ తాగేవారిలో కాలేయం త్వరగా పాడవుతుంది. ► కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం, నూనెలో బాగా వేయించిన పదార్థాలు అతిగా తినొద్దు. ► చేపలు, అవిసె గింజలు, అక్రోట్లు,పొట్టుతీయని ధాన్యాలు వంటివి డైట్లో ఉండేలా చూసుకోవాలి. ► చక్కెర ఎక్కువగా ఉండే కూల్డ్రింకులు, పానీయాలకు దూరంగా ఉండాలి. ► ప్రాసెస్ చేసిన పిండి, ధాన్యాలను అస్సలు తీసుకోవద్దు. ఇవి పాటిస్తున్నారా? వాల్ నట్స్, ఆలీవ్ ఆయిల్, అవకడోస్‌లు ఎక్కువగా తీసుకోవడం మంచిది నీరు ఎక్కువ తాగితే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. పసుపు,గ్రీన్ టీ, ఆపిల్ పండ్లు కాలేయం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇది కాలేయం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. లివర్ సమస్యలు పెరిగాయి ఇటీవల కాలంలో కాలేయ సమస్యలతో వస్తున్న వారిని ఎక్కువగా చూస్తున్నాం. ఒకప్పుడు ఆల్కహాల్ తాగే వారిలోనే లివర్ సిర్రోసిస్ వ్యాధి సోకేది. కానీ ఇప్పుడు కొలస్ట్రాల్ కారణంగా నాన్ ఆల్కహాలిస్టుల్లో కూడా సిర్రోసిస్ చూస్తున్నాం. ప్రతిరోజూ వ్యాయామంతో పాటు, ఆహార నియమాలు పాటిస్తూ, శరీరంలో కొలస్ట్రాల్ పెరగకుండా చూసుకోవాలి. – డాక్టర్ బీఎస్వీవీ రత్నగిరి, అసోసియేట్ ప్రొఫెసర్, గాస్ట్రో ఎంట్రాలజీ -
రాత్రిళ్లు నిద్రపట్టడం లేదా? ఈ చిట్కాలు పాటిస్తే చాలు
ఈ మధ్య కాలంలో చాలామందిని పీడిస్తున్న సమస్య నిద్రలేమి. బిజీ లైఫ్ షెడ్యూల్ కారణంగా చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. నిద్ర కష్టాలు చిన్నవిగా అనిపించినా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నిద్ర లేకపోవడం వల్ల రోజంతా తలనొప్పి, అలసట వంటి సమస్యలు వస్తాయి. కంటినిండా నిద్ర ఉంటేనే ఆరోగ్యం భద్రంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన నిద్రకు 10 చిట్కాలు పాటిస్తే సరి.అవేంటో చూద్దామా ఆరోగ్యకరమైన నిద్రకు 10 చిట్కాలు నిద్రపోవడానికి, నిద్రలేవడానికి ఒక సమయాన్ని కేటాయించండి. పగలు నిద్రపోయే అలవాటు ఉంటే, దాన్ని 30 నిమిషాలకు మించకుండా చూసుకోవాలి. నిద్రవేళకు 4 గంటల ముందు మద్యం తీసుకోవడం,ధూమపానం చేయవద్దు. నిద్రవేళకు 6 గంటల ముందు కెఫిన్ మానుకోండి. నిద్రవేళకు 4 గంటల ముందు ఎక్కువగా, కారంగా లేదా చక్కెర కలిగిన ఆహారాన్నితీసుకోవద్దు. నిద్రపోవడానికి ముందు తేలికపాటి చిరుతిండి తీసుకోవడం మంచిది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి, కాని నిద్రపోయే ముందు చేయడం మంచిది కాదు. సౌకర్యవంతమైన పరుపులను వాడండి. దీనితో పాటు, ఉష్ణోగ్రత కూడా నిద్రకు అనుకూలంగా ఉండాలి. చాలా వేడి, చల్లని వాతావరణంలో కూడా నిద్రపోలేరు కాబట్టి సరైన టెంపరేచర్ ఉండేలా వెంటిలేషన్ ఏర్పాటు చేసుకోండి. నిద్రపోయే ముందు శబ్ధాలకు దూరంగా ఉండండి. బెడ్ రూంలో సాధ్యమైనంత ఎక్కువ కాంతి ఉండకుండా చూడండి. -
కూరల్లో ఆలివ్ ఆయిల్ వాడుతున్నారా? ఏమవుతుందో తెలుసా?
మనం తినే ఆహారం మీదనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. చాలామంది రోజంతా మందకొడిగా ఉన్నట్లు ఫీలవుతుంటారు.మంచి పోషకాలు, విటమిన్లు ఉండే ఆహారం తీసుకుంటే శరీరం యాక్టివ్‌గా పనిచేస్తుంది. మెదడు చురుగ్గా పనిచేయాలంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలన్నది ఇప్పుడు చూద్దాం. ►వాల్‌నట్స్‌ను రోజూ తీసుకోవడం వల్ల మన జ్ఞాపక శక్తి పెరుగుతుంది. వాల్‌నట్స్‌లోని ప్రోటీన్ శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు మెదడు పనితీరుకు చక్కగా పనిచేస్తాయి. ఒక గుప్పెడు వాల్ నట్స్ తినడం వల్ల, మెమరీ పవర్ మెరుగుపడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ► చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరు మెరుగుపరచడానికి చక్కగా పనిచేస్తాయి. చేపలను రెగ్యులర్ డైట్ లో తీసుకుంటే మెమరీ పవర్ పెరుగుతుంది. ► స్ట్రాబెర్లీలు మెదడు చురుగ్గా పనిచేయడంలో సహాయపడుతుంది.షఆహారంలో ఎక్కువగా ఉడికించిన పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. కూరగాయలతో ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. ► నట్స్ ఆహారంలో అధికంగా ఉండేలా డైట్ ప్లాన్ చేసుకోవడం మంచిది. ► మాంసాహారం ఇష్టమైతే, దానితోపాటు ఆకుకూరలు కూడా ఎక్కువగా తీసుకోండి. ► ఆహారంలో వాడే నూనెలకు బదులు ఆలివ్ ఆయిల్ ఉండేలా చూసుకోండి. ∙రోజులో ఎక్కువసార్లు నీళ్లు తాగండి. ► కాఫీ, టీ లను పరిమితంగా తీసుకోండి. ఒకవేళ తాగాల్సి వస్తే దానికి బదులు గ్రీన్ టీ, లెమన్ టీ వంటివి తీసుకోండి. ►ఫ్రూట్ జ్యూస్ తీసుకోడానికి బదులు తాజా పళ్లను తీసుకోవడం మంచిది. -
తలనొప్పితో బాధపడుతున్నారా? ఈ ఆకుతో వెంటనే రిలీఫ్
వాము ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనేక ఔషధ గుణాలు కలిగి ఉన్న వామును పలు చికిత్సల్లో వాడతారు. సుగంధ లక్షణాలు కలిగి ఉన్న వాము వంటల్లో రుచిని రెట్టింపు చేస్తుంది. అందుకే వీటిని చాలా రకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. అంతేకాకుండా దీన్ని పలు చికిత్సల్లోనూ వాడతారు. వాము గింజలతోనే కాదు, ఆకులతోనూ అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దామా.. ►జీర్ణ సమస్యలు,అజీర్తి, గ్యాస్,కడుపు ఉబ్బరం సమస్యలు, మలబద్దకం వంటి సమస్యలను దూరం చేసే శక్తి వాము ఆకుల్లో ఉంది. ►వాము ఆకులను నమిలితే జీర్ణ సమస్యల నుంచి త్వరగా బయట పడొచ్చు. గ్యాస్ట్రిక్ జ్యూస్‌లను విడుదల చేయడంలో వాము ఆకు ఉపయోగపడుతుంది. ► చిన్న పిల్లల్లో వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యలను తగ్గిస్తుంది. ► వాము ఆకులో యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉండుట వలన శరీరంపై గాయాలను,మచ్చలను తగ్గిస్తుంది. ► చిన్నపిల్లల్లో వచ్చే కడుపునొప్పికి వాము ఆకు బెస్ట్ మెడిసిన్. ► ప్రతి రోజు భోజనం పూర్తయ్యాక వాము ఆకును తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే ఆకలి తక్కువ ఉన్నవారిలో ఆకలి పుడుతుంది. ► చిన్న పిల్లలకు వాము ఆకు రసంలో తేనే కలిపి ఇస్తే వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ► తలనొప్పి నివారణకు కూడా వాము ఆకు ఔషధంలా పనిచేస్తుంది. వాము ఆకుల్ని నొప్పి ఉన్న ప్రాంతంలో రుద్దితే తలనొప్పి తగ్గుతుంది. ► ఏవైనా పురుగులు, కీటకాలు కుట్టినప్పుడు వాము ఆకుల్ని ఆ ప్రాంతంలో రుద్దినా విషం బయటకు వచ్చేస్తుంది. ► వాము ఆకులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు.. జుట్టు సమస్యల్ని దూరం చేస్తుంది. అలాగే జుట్టు ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా వాము ఆకులు హెల్ప్ చేస్తాయి. ► ఈ వాముని ఔషధంగానే కాదు ఆహారపదార్ధాల్లో కూడా ఉపయోగించవచ్చు. వాము ఆకుతో బజ్జీలు వేసుకొని తినవచ్చు.. వాము ఆకుతో పెరుగు పచ్చడి చేసుకుని తింటే రుచికరంగా ఉండడంతో పాటు అజీర్తి సమస్యలు కూడా దూరమవుతాయి. ► వాము ఆకును నమలడం వల్ల నోటిలోని బ్యాక్టీరియా కూడా దూరం అవుతుంది. నోరు రిఫ్రెష్‌గా ఉంటుంది. నోటి దుర్వాసనను దూరం చేస్తుంది ► వామాకులో ఎ, బి, సి విటమిన్లు, అమినో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, క్యాల్షియం ఉన్నందున ఇది మంచి పోషకాహారం. ► వామాకు నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ► వాము ఆకులతో తయారుచేసిన టీ ని ప్రతిరోజు తాగడం వల్ల జీర్ణక్రియ సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. ఇందులో ఉండే గుణాలు పొట్ట సమస్యల నుంచి సులభంగా విముక్తి కలిగిస్తాయి. అంతేకాకుండా బరువు తగ్గాలనుకునేవారు ఈ టీ ని ప్రతిరోజు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
రుచిగా ఉందని ఎక్కువగా తింటున్నారా? క్యాన్సర్ వచ్చే ఛాన్స్!
మనం తినే ఆహారమే మన క్వాలిటీ లైఫ్‌ను నిర్ణయిస్తుంది. ఆహారం అనేది రుచి కోసమో, బలం కోసమో మాత్రమే కాదు, సంపూర్ణ ఆరోగ్యం కోసం సరైన ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఆహారం తక్కువగా తీసుకుంటే పోషకాహార లోపాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగని ఎక్కువ తింటే అది ఊబకాయానికి దారి తీయొచ్చు. అందుకని ఆహారాన్ని ఎప్పుడు కంట్రోల్లో తినాలి. ఒక హెల్తీ డైట్‌ను నిర్ణయించుకొని సరైన ఆహారాన్నే తినాలి. ఆహార అలవాట్లను నియంత్రించకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయంటే.. ఊబకాయం: ఊబకాయం అనేది అధిక బరువు లేదా అధిక కొవ్వు కలిగి ఉండటం. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది, వీటిలో గుండె జబ్బులు, మధుమేహం, స్థూలకాయం మరియు క్యాన్సర్ ఉన్నాయి. గుండె జబ్బులు: గుండె జబ్బులు అనేవి గుండెను ప్రభావితం చేసే అనేక రకాల పరిస్థితులను సూచిస్తాయి. అవి అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, ఊబకాయం వంటి ఆహారపు అలవాట్ల ద్వారా వచ్చే అవకాశం ఉంది. మధుమేహం: మధుమేహం అనేది శరీరం రక్తంలో చక్కెరను సరిగ్గా నియంత్రించలేకపోవడం. ఇది అధిక కొవ్వు, అధిక చక్కెర మరియు తక్కువ ఫైబర్ ఉన్న ఆహారాలు తినడం వల్ల ప్రభావితమవుతుంది. క్యాన్సర్: క్యాన్సర్ అనేది కణాలు అసాధారణంగా పెరిగే పరిస్థితి. కొన్ని రకాల క్యాన్సర్లు ఆహారపు అలవాట్ల ద్వారా ప్రభావితమవుతాయి, వీటిలో కడుపు క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ ఉన్నాయి. హెల్తీ డైట్ కోసం ఇలా చేయండి తాజా పండ్లు, కూరగాయలు మరియు తృణధాన్యాలు ఎక్కువగా తినండి. గోధుమ, బ్రౌన్ రైస్ మరియు ఓట్స్ వంటివి తినండి తక్కువ కొవ్వు, తక్కువ చక్కెర మరియు తక్కువ ఉప్పు ఉన్న ఆహారాలను ఎంచుకోండి. ఆహారాన్ని మితంగా తినండి. ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి.. -నవీన్ నడిమింటి, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు -
సంగీతంతో ఒత్తిడి, డిప్రెషన్ దూరం.. అధ్యయనాల్లో వెల్లడి
పాటకు రాళ్లను కరిగించే శక్తి కూడా ఉందంటారు. అంతేకాదు.. ఇటీవల కాలంలో పెద్ద పెద్ద ఆపరేషన్లు కూడా ఎలాంటి మత్తు ఇంజెక్షన్ ఇవ్వకుండా కేవలం మ్యూజిక్ వింటూనే చేయించుకున్న ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఎలాంటి వ్యాధినైనా సంగీతం నయం చేస్తుందనే విషయం ఎన్నో పరిశోధనలు రుజువు చేశాయి. కొన్ని క్లిష్టమైన రోగాలను సైతం నయం చేయగలిగే సత్తా సంగీతానికి ఉంటుంది. మరి సంగీతం వల్ల ఇంకా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందామా.. సంగీతం ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు? మనసు బాగోకపోయినా, సంతోషంగా ఉన్నా, జర్నీలో ఉన్నా.. ఇలా ఏ సందర్భంలో అయినా పాటలు వింటూ ఉంటే చెప్పలేని సంతోషం.ఎలాంటి వ్యాధినైనా సంగీతం నయం చేస్తుందనే విషయం ఎన్నో పరిశోధనలు రుజువు చేశాయి. అమెరికాలో నిర్వహించిన ఓ పరిశోధన ఇదే విషయాన్ని వెల్లడి చేస్తోంది. రెండు రూములను ఎంచుకొని, ఒకే విధమైన విత్తనాలను వాటిలో పెంచడం మొదలుపెట్టారు. వీటిలో ఒక రూములో శాసీ్త్రయ సంగీతం అదనంగా ఏర్పాటు చేశారు. అనూహ్యంగా ఈ మొక్కల ఎదుగుదల ఆరోగ్యకరంగా ఉన్నట్లు పరిశోధన ఫలితం వెల్లడైంది. ►గుండె పనితీరు సక్రమంగా ఉండేందుకు సంగీతం కీలకపాత్ర పోషిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ► ప్రతిరోజు ఒక అరగంటపాటు ఇష్టమైన సంగీతాన్ని వినడం వల్ల గుండె పనితీరు పెరుగుతుందని అధ్యయనాల్లో తేలింది. అంతేకాదు సంగీతం వింటూ తేలికపాటి వ్యాయామాలు చేయటం వల్ల గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదని పరిశోధకులు చెబుతున్నారు. ఇలా చేయటం వల్ల శరీరంలో గుండెకు మేలు కలిగించే ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. దీని వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. ► డిప్రెషన్, యాంగ్జయిటీ, పెయిన్, స్ట్రెస్ మొదలైన సమస్యలకు ఇప్పుడు సంగీతం కూడా చికిత్సగా ఉపయోగపడుతోంది. సంగీతం వినడం వల్ల విద్యార్థులు మరియు ఉద్యోగులకు చాలా ప్రయోజనాలు ఉన్నాయని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. ► సంగీతం వినడం వల్ల మెదడు పనితీరు పెరుగుతుంది. ► మనకు నచ్చిన సంగీతం వింటే శరీరంలో హ్యాపీహార్మోన్లు విడుదల అవుతాయి. ఇవి ఒత్తిడిని పూర్తి స్ధాయిలో పోగొడతాయి. ► సంగీతం వినడం వల్ల మతిమరుపు సమస్య కూడా దూరమవుతుంది. దీనికారణంగా అల్జీమర్స్ వంటి సమస్యలు చాలా వరకూ దరిచేరవని నిపుణులు చెబుతున్నారు. మ్యూజిక్ థెరపీ అనేది చాలా మంది మతిమరుపు సమస్యల్ని దూరం చేశాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నారు. ► ప్రతిరోజూ సంగీతం వినడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు. -
కొవ్వు ఉన్న ఆహార పదార్థాలు తినడం మానేశారా? ఈ విషయాలు తెలిస్తే..
లావవుతామనే భయంతో చాలామంది కొవ్వు పదార్థాలు ఉండే ఆహారాలను తినడం మానేస్తున్నారు. కొందరైతే నెయ్యి తినడం ఎప్పుడో మానేశారు. అయితే శరీరంలోని ఎ, డి, ఇ, కె విటమిన్లు కొవ్వులో మాత్రమే కరుగుతాయి. కాబట్టి తగిన పరిమాణంలో మంచి కొలెస్ట్రాల్ ఎంతో అవసరం. అలాగని అన్నిరకాల కొవ్వులూ ఆరోగ్యం కాదు. ఇంతకూ ఆరోగ్యకరమైన కొవ్వు లభించాలంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసుకుందామా? అవకాడో: మీరు ఆరోగ్యం పట్ల చాలా కాన్షియస్గా ఉండి..అధిక పరిమాణంలో కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలకు దూరంగా ఉంటే తప్పకుండా ఈ అవకాడోను ఆహారంలో చేర్చుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే మోనోశాచురేటెడ్ కొవ్వు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆలివ్ ఆయిల్: వేపుళ్లకు దూరంగా ఉండేవారు తప్పకుండా ఆహారాల్లో ఆలివ్ ఆయిల్‌ను తప్పకుండా వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు, మోనోశాచురేటెడ్ కొవ్వులు గుండెను ఆరోగ్యంగా చేసేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా శరీర బరువును నియంత్రించేందుకు కూడా సహాయపడతాయి. పెరుగు: బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన ఆహారాలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకుంటే శరీరంలోని కొవ్వును సమతుల్యంగా చేస్తుంది. కాబట్టి శరీరం ఆరోగ్యంగా ఉండడానికి తప్పకుండా కొవ్వు పాలతో చేసిన పెరుగు తినడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు ప్రేగును కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. కొబ్బరి: కొబ్బరి లేదా కొబ్బరి నూనె తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో జీర్ణక్రియను మెరుగుపరిచే చాలా రకాల పోషకాలు దొరుకుతాయి. దీనివల్ల ట్రైగ్లిజరైడ్ ఫుడ్ సులభంగా జీర్ణమవుతుంది. అంతేకాకుండా మలబద్ధకం, ఇతర పొట్ట సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. చేపలు: చేపలలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంపొందించే లక్షణాలున్నాయి. అందుకే ఇతర విధాలైన మాంసాహారాలకు దూరంగా ఉండమని హెచ్చరించే వైద్యులు సైతం పరిమితంగా అయినా చేపలు తీసుకోవచ్చునని చెబుతారు. బాదం పప్పు, జీడిపప్పు: వీటిని తీసుకోవడం వల్ల కొవ్వు పెరుగుతుందని అనుకుంటాం. అయితే వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు మాత్రమే ఉంటాయి. అందువల్ల బాదం, జీడిపప్పు తీసుకోవడం మంచిది. బాదం పప్పును నీటిలో నానబెట్టి, పైన పొట్టు తీసి తినడం మంచిది. జీడిపప్పును అయితే వేయించకుండా నేరుగా తీసుకోవడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెంపొందుతుంది. నెయ్యి: ఇదివరకటిలో ఆహారంలో నేతిని బాగా ఉపయోగించేవారు. అరిసెలు, గారెలు వంటి వాటిని నేతితోనే చేసేవారు. అయితే రానురానూ నెయ్యి తినడం ఆరోగ్యానికి మంచిది కాదనే అభిప్రాయం స్థిరపడిపోయింది. నిజానికి నేతిలో శరీరానికి అవసరమైన పోషకాలెన్నో ఉన్నాయి. అలాగని ముద్ద ముద్దకీ నెయ్యి వేసుకోవడం, నేతితోనే చేసిన డీప్ ఫ్రైలు విపరీతంగా తీసుకోవడం మాత్రం అంత మంచిది కాదు. గేదె నెయ్యి కన్నా ఆవు నెయ్యి మంచిది. -
ప్రతి నలుగురిలో ఒకరికి మధుమేహం.. స్టెరాయిడ్స్ వాడటం వల్లేనా?
ఒకప్పుడు ఫలానా వ్యక్తికి షుగర్ (చక్కెర) వ్యాధి వచ్చిందంట అని చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు ఈయనకు కూడా షుగర్ వచ్చిందా అని మాట్లాడుకుంటున్నారు. షుగర్ జబ్బు ఇప్పుడు సాధారణమైంది. ప్రతి నలుగురిలో ఒకరు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఒకప్పుడు డయాబెటీస్ వ్యాధి (షుగర్) పట్టణ వాసుల్లోనే అధికంగా కనిపించేది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని వారిలోనూ ఈ వ్యాధి అధికమవుతోంది. మారిన ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిళ్లు, జీవనశైలిలో మారుల వల్ల ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. ఈ నెల 14వ వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. సాక్షి, కర్నూల్: ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన ఇంటింటి సర్వేలో పట్టణ ప్రాంతాల్లో 20 శాతం గ్రామీణ ప్రాంతాల్లో 15 శాతం మంది మధుమేహం రోగులున్నట్లు తేలింది. ఈ రోగం ఉందన్న విషయం తెలియని వారు మరో 25 శాతం మంది ఉండే అవకాశం ఉందని వైద్యులు భావిస్తున్నారు. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు చేసిన రక్తపరీక్షల్లో ఎక్కువ శాతం మందికి చక్కెర వ్యాధి బయటపడుతోంది. ఇలా జిల్లాలో ప్రీ డయాబెటీస్‌తో బాధపడుతున్న వారు మరో 15 శాతం మంది ఉన్నట్లు వైద్యులు అంచనా వేస్తున్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ఎండోక్రైనాలజి విభాగంలో ప్రతి మంగళ, శుక్రవారాలు ఓపీ చికిత్స చేస్తారు. ప్రతి ఓపీకి 200 మంది చికిత్సకు రాగా అందులో వంద మందికి ఇన్సులిన్‌ను ఉచితంగా అందజేస్తున్నారు. మొత్తం ఓపీలో 80 శాతం మంది షుగర్ రోగులే ఉండటం గమనార్హం. ప్రైవేటు ఆసుపత్రుల్లోని ఎండోక్రైనాలజిస్టులు, జనరల్ ఫిజీషియన్ల వద్దకు సైతం ప్రతి యేటా 16 వేల మంది చికిత్స కోసం వస్తున్నట్లు అంచనా. డయాబెటీస్ రకాలు టైప్ 1 డయాబెటీస్ : శరీరం అతి తక్కువ ఇన్సులిన్‌ను తయారు చేస్తుంది. ఈ రకం మధుమేహం గల వ్యక్తులు ఇన్సులిన్‌ను విధిగా తీసుకోవాలి. లేకపోతే ప్రాణాంతకమైన డీకేఏ అనే పరిస్థితిలోకి జారుకుంటారు. ఇది చాలా మందికి పుట్టుకతోనే వస్తుంది. లక్షణాలు ఇందులో అధిక దాహం, ఎక్కువ మూత్ర విసర్జన, ఎక్కువ ఆకలి, హటాత్తుగా బరువు తగ్గిపోవడం, అలసట వంటి లక్షణాలు ఉంటాయి. టైప్ 2 డయాబెటీస్ శరీరానికి తగినంత ఇన్సులిన్ ఉతత్తి కాదు. సాధారణంగా 40 ఏళ్ల వయస్సు దాటిన వారికి ఈ సమస్య ప్రారంభం అవుతుంది. స్థూలకాయం, మానసిక ఒత్తిళ్లు, ఆహారపు అలవాట్లు దీనికి కారణాలు. లక్షణాలు ముందుగా ఎలాంటి లక్షణాలు కనిపించవు. తర్వాత తీవ్ర అలసట, చేతులు,కాళ్లలో తిమ్మిరి, మొద్దుబారడం, తరచూ మూత్రవిసర్జన, లైంగిక అసమర్ధత, గాయాలు త్వరగా మానకపోవడం, అతిగా ఆకలి, అతిగా దాహం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ పరీక్షలు చేయించాలి. ☛ షుగర్ పేషెంట్లు రక్తంలో షుగర్ స్థాయిని తెలుసుకునే పరీక్ష నెలకొకసారి చేయించాలి. ☛ సంవత్సరానికి ఒకసారి మూత్రపిండాల పనితనం (బ్లడ్ యూరియా, క్రియాటినిన్) చేయించాలి. ☛ ఆరు నెలలకోసారి రక్తంలోని కొవ్వుశాతం చేయించుకోవాలి. ☛ మూడు నెలలకోసారి హెచ్‌బీఏ1సీ చేయించుకోవడం మంచిది. తెల్లని పదార్థాలకు దూరంగా ఉండాలి తెల్లగా కనిపించే ఆహార పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. చక్కెర, పిండి పదార్థాలు, తెల్లగా కనిపించే నూనెలు, మైదాతో చేసిన పదార్థాలు, జంక్‌ఫుడ్ లాంటివి మానేయాలి. దానికి బదులుగా ఆకుకూరలు, పండ్లను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. రోజూ వ్యాయామం తపనిసరి ప్రతిరోజూ అరగంట వాకింగ్‌తో మధుమేహం నియంత్రణలోకి వస్తుందని వైద్యులు చెబుతున్నా రు. దీంతో పాటు యోగా, ప్రాణాయామం, ధ్యానం సైతం ఎంతో మేలు చేస్తాయి.వ్యాయామం వల్ల గుండెపోటు, గుండెకవాటాల వ్యాధుల ముప్పు తగ్గి టైప్–2 మధుమేహంతో బాధపడే వారికి మేలు చేస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా సేవలు జిల్లాలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు ఆదోనిలోని ఏరియా ఆసుపత్రి, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, అర్బన్‌హెల్త్ సెంటర్లలో షుగర్ వ్యాధికి అవసరమైన షుగర్, లిపిడ్ ప్రొఫైల్, ఆర్ఎఫ్టీ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేస్తోంది. ప్రస్తుతం షుగర్ ఉన్న వారికి ఉచితంగా చికిత్స, మందులు అందజేస్తున్నారు. కోవిడ్ తర్వాత పెరిగిన కేసులు కోవిడ్–19 ప్రపంచాన్ని అతలాకుతలం చేయడమే గాక ఇప్పటికీ దాని తాలూకు నష్టం వెంటాడుతూనే ఉంది. ఇందులో ముందుగా షుగర్వ్యాధి మొదటి వరుసలో ఉంది. ఇప్పటికే షుగర్ ఉన్న వారికి కోవిడ్ తర్వాత షుగర్ లెవెల్స్ పెరగగా, కొత్తగా షుగర్ రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కోవిడ్ సమయంలో స్టెరాయిడ్స్, యాంటిబయాటిక్స్, ఇతర ఔషధాలు అధికంగా వాడటంతో పాటు అధికంగా మాంసాహారం, కొవ్వు పదార్థాలు తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాల వల్ల షుగర్ కేసులు పెరిగినట్లు వైద్యులు చెబుతున్నారు. పీ డయాబెటీస్ రోగుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది ఇటీవల ప్రీ డయాబెటీస్ రోగుల సంఖ్య 15 శాతం ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇది ఆందోళనకర విషయం. పరిస్థితి మారకపోతే భవిష్యత్‌లో దేశ జనాభాలో సగం మంది షుగర్బారిన పడే అవకాశాలు ఉన్నట్లు ఈ గణాంకాలను బట్టి అర్థం అవుతోంది. ఇది అటు దేశ, ఇటు కుటుంబ ఆర్థిక, ఆరోగ్యానికి తీవ్ర నష్టం చేకూరుస్తుంది. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేయాల్సి ఉంది. –డాక్టర్ పి. శ్రీనివాసులు, ఎండోక్రైనాలజి హెచ్ఓడీ, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల డయాలసిస్ రోగుల్లో 60 శాతం షుగర్ రోగులే...! ప్రస్తుతం డయాలసిస్ చేయించుకుంటున్న వారిలో 50 నుంచి 60 శాతం షుగర్ రోగులే ఉంటున్నారు. దీనిని బట్టి కిడ్నీలపై షుగర్ ఎలాంటి ప్రభావం చూపుతుందో అర్థం అవుతుంది. మూత్రంలో ప్రోటీన్ ఎక్కువగా పోతుంటే జాగ్రత్త పడాలి. ఇందుకోసం ఇప్పటికే షుగర్ ఉన్న వారు నెలకోసారి మూత్రపరీక్ష చేయించుకోవాలి. ముందుజాగ్రత్తగా షుగర్, బీపీని నియంత్రణలో ఉంచుకోవాలి. –డాక్టర్ పీఎల్. వెంకట పక్కిరెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, నెఫ్రాలజి విభాగం, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల -
పాలు తాగని పిల్లలకు అలాంటి పేస్ట్ ఉపయోగించకండి
దంతాలను శుభ్రంగా ఉంచుకుంటే చాలా వరకు వ్యాధులను తగ్గించుకోవచ్చు. ఎందుకంటే నోటి శుభ్రత మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. దంతాల వ్యాధి కారణంగా అనేక తీవ్రమైన వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. అందుకే ఆరోగ్యంగా ఉండేందుకు నోరు శుభ్రం చేసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా చిన్న పిల్లల్లో దంతాలకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. మరి పిల్లల దంతాలు శుభ్రం చేయడం ఎలా?అన్నది ప్రముఖ ఆయుర్వేద వైద్యులు నవీన్ నడిమింటి మాటల్లోనే.. ►చిన్న పిల్లలకు సాధారణంగా 8-9 నెలల వయసు నుంచి దంతాలు రావడం జరుగుతుంది. కొంత మందికి ముందుగా రావచ్చు. మరికొందరికి ఆలస్యంగా రావొచ్చు. పాలు తాగే వయసులో తొలిసారి వచ్చే దంతాలను పాలదంతాలు అంటారు. ఈ దశలో వీరికి వచ్చే దంతాలు అంతగా శుభ్రపరచవలసిన అవసరం లేదు. ► ఒక సంవత్సరం లోపు పిల్లలకు దంతాల కంటే ముఖ్యంగా నాలుకను శుభ్రపరచాలి, లేదంటే పాచి ఎక్కువగా ఉండి పాలు సరిగా తాగరు. నాలుకను శుభ్రపరచడానికి పెద్ద వాళ్ళు వేలిని పసుపులో అద్ది నాలుకపై రాస్తూ శుభ్రం చేస్తారు. లేదంటే మెత్తటి గుడ్డపై మౌత్ పేయింటు వేసి నాలుకపై రాసి శుభ్రం చేయొచ్చు ► పిల్లలు ఎప్పుడు పాలు తాగినా నోరు శుభ్రం చేసుకోడం నేర్పించాలి. రాత్రి పడుకునేముందు బ్రష్ చేసుకోవడం చాలా మంచి అలవాటు. ► సంవత్సరం దాటిన పిల్లలకు కూడా పూర్తి సంఖ్యలో దంతాలు రావు. వీరికి దంతధావనం చేయించడానికి సాధారణ బ్రష్ బదులు ఫింగర్ బ్రష్ ఉపయోగించడం మంచిది . ఇది రబ్బరులా మెత్తగా ఉండడం వల్ల వారి దంతాలకు , చిగుళ్ళకు ఎటువంటి హానీ జరగదు. ► సాధారణంగా పిల్లలకు తీపి పదార్థాలు అంటే మక్కువ ఎక్కువ కాబట్టి టూత్ పేస్ట్‌ను కూడా తింటారు. దీనికి నివారణగా మనం చేయాల్సింది తియ్యగా ఉన్న టూత్ పేస్ట్ ఉపయోగించకపోవడమే. కొద్దిగా కారంగా / ఘాటు రుచి గల టూత్ పేస్ట్ వాడాలి. లేదా తీపి లేని టూత్ పౌడర్ ను వాడడం ఉత్తమం. ► పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి ఇంట్లో తయారుచేసినవి పెట్టడానికే ఇష్టపడతారు. అలాగే టూత్ పౌడర్‌ను ఇంట్లో తయారు చేసుకుని వాడడం శ్రేయస్కరం. హోం మేడ్ టూత్ పౌడర్ తయారీ విధానం యూట్యూబ్ లో వీడియోలు రూపంలో అందుబాటులో ఉన్నాయి.ఏది మీకు, మీ పిల్లలకు సరిపడుతుందో లేదా నచ్చుతుందో దానిని తయారు చేసుకుని వాడుకోవచ్చు. -
బ్రేక్‌ఫాస్ట్ మానేస్తున్నారా?బీపీ నుంచి హార్ట్ఎటాక్ వరకు..
ఇవాళ ధనత్రయోదశి. దీనినే ధన్ తేరస్ అని కూడా అంటారు. ఈ పర్వదినాన సాధారణంగా అందరికీ బంగారం, వెండి, గృహోపకరణాలు, వస్తు వాహనాల వంటి వాటి మీదికే దృష్టి మళ్లుతుంది. ఆరోగ్య ప్రదాత అయిన ధన్వంతరి జయంతి కూడా ఇదే రోజు అని గుర్తు రాదు. అయితే ఆరోగ్యం కూడా ధనమే కాబట్టి ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు ఏం చేయాలో తెలుసుకుని అందుకు తగినట్లు నడుచుకుంటే ఆరోగ్య ధనం, ఆరోగ్య మహాభాగ్యం సమకూరుతుంది. ధన త్రయోదశి సందర్భంగా ఆరోగ్య సంపదను ఏవిధంగా పెంపొందించుకోవాలో చూద్దాం... సంపూర్ణ ఆరోగ్యానికి ఆహార విహారాలు ఎంత అవసరమో, నిత్యం నడక, వ్యాయామం, యోగా కూడా అంతే అవసరం. ప్రధానంగా ఇవి అనేక రుగ్మతలకు దివ్య ఔషధాలు. అజీర్తి నుంచి ఆర్థరైటిస్ వరకు.. బీపీ నుంచి హార్ట్ ఎటాక్ వరకు, మధుమేహం నుంచి మానసిక సమస్య వరకు ఏదైనా నయం కావాలంటే రోజూ వ్యాయామం, యోగా చేస్తుండాలి. సమయానికి తగు... మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పౌష్టికాహారాన్ని తీసుకోవడం ఎంత అవసరమో ఆ ఆహారాన్ని తగిన సమయానికి తీసుకోవడం కూడా అంతే అవసరం. వేళ తప్పి భోజనం చేస్తే అది మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. అందువల్ల ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సరైన సమయాలకు భోజనం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరి రోజూ ఉదయాన్నే టిఫిన్ చేయడం వల్ల ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. కొందరికి అలా బ్రేక్ ఫాస్ట్ చేయడం అలవాటు ఉండదు. అలాంటి వారు అల్పాహారంగా నానబెట్టిన బాదం, ఎండు ద్రాక్ష, వాల్నట్స్, మొలకెత్తిన గింజలు, అవిసెలు, తాజాపండ్లు, కూరగాయల ముక్కలు లాంటివి అయినా తప్పనిసరిగా తీసుకోవాలి. లంచ్‌గా ఇవి... మధ్యాహ్నపు భోజనంగా సగం కంచంలో తాజా కూరగాయలు, మిగతా సగంలో పిండిపదార్థాలు, మాంసకృత్తులు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండేలా చూసుకోవాలి. రక్తంలో చక్కెర నిల్వల్ని అదుపులో ఉంచుకోవడానికి, లో గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు లాంటి చిరు ధాన్యాన్ని ప్రయత్నించవచ్చు. ప్లాస్టిక్ వినియోగాన్ని వీలైనంత మేరకు తగ్గించాలి. ఎందుకంటే, మనం వాడే ప్లాస్టిక్ వస్తువుల నుండి, రోజుకి కొన్ని లక్షల సూక్ష్మరేణువులు విడుదలవుతాయి. వాటిలో ఉండే రసాయనం హార్మోన్ల సమతౌల్యాన్ని దెబ్బ తీస్తుంది. మానసిక దృఢత్వం మానసిక ఆరోగ్యం బాగుంటేనే సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు. ఇందుకోసం నిత్యం నడక, వ్యాయామం, యోగా తప్పనిసరి. ప్రధానంగా ఇవి అనేక రుగ్మతలకు దివ్య ఔషధాలు. కంటినిండా నిద్ర కడుపు నిండా తిని కంటినిండా నిద్రపోతే ఏ జబ్బూ ఉండదని పెద్దవాళ్లనేవారు. వేళకు తగినంత రాత్రి నిద్ర ఉంటే పొద్దున లేవగానే ఉత్సాహంగా ఉంటుంది. లేదంటే నిస్సత్తువగా... ఏదో పోగొట్టుకున్నట్లుగా అనిపిస్తుంది. నిద్ర లేమి వల్ల రకరకాల ఇతర జబ్బులు వస్తాయి. అందువల్ల వీలయినంత వరకు వయసును బట్టి, చేసే శారీరక శ్రమను అనుసరించి తగినంత నిద్ర పోవడం ప్రతి ఒక్కరికీ అవసరం. ఈ ధన త్రయోదశి నాడు అందరూ ఆరోగ్య ధనాన్ని పెంపొందించుకునే దిశగా అడుగులు వేస్తారని, వేయారనీ ఆశిద్దాం. -
రక్తహీనతతో బాధపడుతున్నారా? మీ డైట్లో ఇవి చేర్చుకోండి
మన రక్తంలో ఎర్ర రక్త కణాలు తక్కువగా ఉండడం, హీమోగ్లోబిన్ తక్కువ శాతంలో ఉంటే రక్తహీనత ఏర్పడుతుంది. ఎర్ర రక్త కణాల్లో ఉండే ప్రధాన ప్రొటీన్ హిమోగ్లోబిన్. మన శరీరంలోని అన్ని కణాలకు ఆక్సిజన్, ఇతర పోషకాలు మోసుకెళ్లి అందించేంది ఇదే. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో రక్తహీనతతో బాధపడుతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది.మోగ్లోబిన్ లెవల్స్ పడిపోయిన వారిలో రక్తం శరీర అవయవాలకు అందక శరీరం చచ్చుబడిపోయేలా మారుతుంది.మరి రక్తహీనత నుంచి ఎలా బయటపడాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి అన్నది ఇప్పుడు చూద్దాం. ►రక్తహీనతకు సరైన మందు మంచి ఆహారం తీసుకోవడమే. ఐరన్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, పొట్టుతో కూడిన ధాన్యాలు, మాంసాహారం తీసుకోవాలి. ► బాదం, జీడిపప్పు, ఎండు ఖర్జూరాలను నిత్యం తీసుకోవాలి. మొలకెత్తిన పప్పుధాన్యాలు, విటమిన్–సి ఎక్కువగా ఉండే నిమ్మ, ఉసిరి, జామ తీసుకుంటే రక్తహీనతకు దూరంగా ఉండవచ్చు. ► అన్ని రకాల తాజా ఆకుకూరల్లో ఐరన్ అధిక మోతాదులో ఉంటుంది. ముఖ్యంగా తోటకూర, గోంగూర, పాలకూర, మెంతి కూర లాంటివి రోజూ తీసుకోవడం వల్ల రక్తహీనత నుంచి మనల్ని రక్షించుకోవచ్చు. అలాగే చిక్కుళ్లు వంటి కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ► దానిమ్మ, బీట్రూట్లు రక్తవృద్ధితోపాటు రక్తశుద్ధిని కూడా చేస్తాయి. వీటిని అలాగే తినడం లేదా రసం తాగడం వల్ల ఓ వారంలోనే మంచి ఫలితాలు కలుగుతాయి. ► నువ్వులు– బెల్లంతో చేసిన లడ్డు తినవచ్చు. నువ్వుల పొడి చేసుకుని కూరల్లో, అన్నంలో కలుపుకోవచ్చు. ► రక్తహీనతతో బాధపడే వారు సోయాబీన్ తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇది దేహానికి పోషకాలను గ్రహించే శక్తినిస్తుంది. బీట్రూట్ లో ఐరన్, ప్రొటీన్ లు ఎక్కువగా ఉంటాయి. ఇది తీసుకోవడం వల్ల రక్తం శుభ్రపడుతుంది. ► రక్తహీనత తగ్గడానికి ఉపయోగపడే ఆహార పదార్థాలలో నువ్వులది ప్రథమ స్థానం అని చెప్పవచ్చు. నువ్వులను విడిగా కానీ బెల్లంతో కలిపి కాని తీసుకుంటే రక్తహీనత తగ్గుతుంది. ► కిస్మిస్ లేదా ద్రాక్షపండ్లు బాగా తింటూ ఉంటే రక్తం వృద్ధి అవుతుంది. పచ్చివి దొరకనప్పుడు ఎండువి తినవచ్చు. రాత్రులు గుప్పెడు ఎండు ద్రాక్ష పళ్ళు గ్లాసెడు నీటిలో నానవేసి ఉదయం వాటిని బాగా పిసికి ఆ పిప్పిని పారవేసి ఆ నీటిని తాగాలి. అలా రోజూ తాగుతుంటే ఒక నెలలోనే రక్తం వృద్ధి అవుతుంది. ► రాత్రిపూట గుప్పెడు శనగలు నీటిలో నానవేసి ఉదయం తింటూ ఉంటే రక్తం వృద్ధి అయ్యి శరీరం పుష్టిగా అవుతుంది. వ్యాయామం చేసేవారికి ఈ విధానం చాలా మంచిది. ► అంజీర్ పండ్లు తింటున్నా రక్తం వృద్ధి అవుతుంది. ► లేత కొబ్బరి నీరు, లేత కొబ్బరి తింటూ ఉంటే శరీరంలో రక్తం బాగా వృద్ధి అవుతుంది. ► ఎండు ఖర్జూరాలతో కూడా పైన చెప్పిన విధంగా చేసి ఆ నీటిని తాగుతుంటే రక్తం వృద్ధి అవుతుంది. -
క్యాన్సర్.. ఇలా గుర్తిస్తే త్వరగా కోలుకోవచ్చు
క్యాన్సర్.. ఈ పేరు వింటేనే అందరూ హడలిపోతారు. ఎందుకంటే ఇదో ప్రాణాంతక వ్యాధి. సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే ప్రాణాలు పోతాయి. ఈమధ్య కాలంలో క్యాన్సర్ కేసులు ఎక్కువగా చూస్తున్నాం. సమస్య వచ్చాక ఏం చేయాలి అని ఆలోచించే కంటే ముందు నుంచే జాగ్రత్తలు పాటిస్తే ఒకటిలో మూడోవంతు క్యాన్సర్లను నయం చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. క్యాన్సర్ నివారణకు మన చేతుల్లో ఉన్నది, మనం చేయగలిగింది, మన జీవన శైలిని ఆరోగ్యంగా మార్చుకోవటం మాత్రమే! క్యాన్సన్ నివారణలో అత్యంత కీలక పాత్ర పోషించే ఐదు అలవాట్లు ఏంటంటే.. 1.మొదటిది ఆహార అలవాట్లు, మన ఆహారంలో పండ్లూ, కూరగాయలు భాగం అయ్యేలా సరైన పోషకాలు అందేలా తీసుకోవాలి. 2 ఎక్కువగా ఒత్తిడికి లోనవ్వకూడదు, మానసిక ఒత్తిడి పరోక్షంగా క్యాన్సర్‌కు కారణం అవ్వొచ్చు. 3.రోజూ శారీరక శ్రమ తప్పనిసరి. క్రమం తప్పకుండా కనీసం ముప్పై నిముషాలు వ్యాయామం చేయాలి. 4.అప్రమత్తంగా ఉండి ఏదైనా క్యాన్సర్ సంకేతం కనిపిస్తే క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్స్ చేయించుకోవాలి. 5. ధూమపానం ,మద్యపానం వంటి అలవాట్లకువీలైనంత దూరంగా ఉండాలి. క్యాన్సర్.. ఎలా గుర్తించాలి? క్యాన్సర్ శరీరంలో ఏ భాగానికైనా ఏ వయసులోనైనా రావచ్చు . చాలా క్యాన్సర్లకు లోతుగా పరీక్షలు జరిపితే గానీ గుర్తించలేము . మన శరీరం గురించి మనకంటే బాగా ఎవరికీ తెలియదు. అందుకే డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు ఎలాంటి సంకోచాలు లేకుండా మన ఇబ్బందులను పూర్తిగా చెప్పేయాలి. ఏదైనా సమస్యగా అనిపించినపుడు నిర్లక్ష్యం చేయకూడదు . మన పెద్దలకు , పూర్వీకులకు క్యాన్సర్ ఉన్నట్లైతే మనకు వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి సంబంధిత వైద్యుల సలహాలను పాటించి కుటుంబంలో అందరు ఎప్పటికప్పుడు అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. అంతే త్వరగా కోలుకోవచ్చు.. ►క్యాన్సర్ అని పలకడానికి,చెప్పడానికి చాలామంది భయపడతారు, ఇష్టపడరు. క్యాన్సర్ అనగానే ఇక ఆ మనిషి బతకడమే కష్టమన్నట్లు ఆలోచిస్తారు. క్యాన్సర్ వచ్చినవారిని జాలిగా,చులకనగా , అంటరానివారుగా చూడడం , ఏదో పాపం చేయడం వల్లనే వారికి క్యాన్సర్ వచ్చిందని దెప్పిపొడవడం చేయకూడదు .క్యాన్సర్ అని చెప్పడానికి భయపడడం, బాగా దిగులుపడడం , నిరాసక్తంగా నిస్పృహలో ఉంటూ వైద్యులకు సహకరించకపోవడం చేయకూడదు. ► సగానికి పైగా క్యాన్సర్లు మామూలు వ్యాధుల్లానే సరైన వైద్యంతో నివారించబడతాయి. ముఖ్యంగా వ్యాధి నిర్థారణ ఎంత త్వరగా జరుగుతుందో అంత త్వరగా కోలుకోవచ్చు. ► వైద్యుల దగ్గర దాపరికం ఉండకూడదు. అలానే అనుమానం కూడా ఉండకూడదు . వారి సలహాల పట్ల నిర్లక్ష్యం ఉండొద్దు.నమ్మకంతో ధైర్యంగా వైద్యం తీసుకోవాలి . ► 6 నెలలకు,సంవత్సరానికి ఒకసారి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. ఏదైనా శారీరక ఇబ్బంది, సమస్య వచ్చినపుడు వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం. ► మనం తీసుకునే ఆహారమే ఆరోగ్యానికి ముఖ్య కారణం. సరైన నిద్ర , ఆహారం , జీవనశైలి , ఆలోచనా విధానం వల్ల సగానికి పైగా వ్యాధులు తగ్గుతాయి. ► ఎంతటి ప్రమాదకర సమస్య అయినా సరైన అవగాహనతో , సానుకూల దృక్పథంతో , ఆరోగ్యకర జీవనశైలితో ప్రయత్నస్తే తప్పకుండా బయటపడగలం. -నవీన్ నడిమింటి ప్రముఖ ఆయుర్వేద వైద్యులు -
పరగడుపున ఖర్జూరాలు తింటున్నారా? ఈ విషయాలు తెలుసా?
ఏ పని చేయకపోయినా నీరసంగా అనిపిస్తుందా? చిన్న పని చేసినా వెంటనే అలసిపోతున్నారా? రాత్రంతా నిద్రపోయినా ఉదయం లేవగానే అలసత్వంగా అనిపిస్తుందా? ఇన్స్టంట్ ఎనర్జీ కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి?సింపుల్‌గా మన వంటింట్లో దొరికే వస్తువులతో ఆరోగ్యంగా ఎలా ఉండొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ►అరటిపండులో ఎన్నో ఆరోగ్య పోషకాలు ఉంటాయి. ఫ్రక్టోజ్, గ్లూకోజ్, సుక్రోజ్ వంటి సహజ చక్కెరలు కలిగిన అద్భుతమైన పండు అరటి పండు. ఇందులో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది.కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. అరటిపండు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అలసట, బద్ధకం దూరం అవుతుంది. ►శరీరానికి తగినంత నీళ్లు తీసుకోవడం తప్పనిసరి. హైడ్రెటెడ్‌గా ఉండడం వల్ల శరీరానికి శక్తిని అందిస్తుంది. అదేవిధంగా అలసట, నీరసం కూడా దూరమవుతాయి. ► రోజుకో కొబ్బరి బోండం తాగండి. ఇది ఇన్స్టంట్ ఎనర్జీని ఇస్తుంది. ► అప్పుడప్పుడు దాల్చిన చెక్కని బుగ్గన పెట్టుకుని దాని రసాన్ని మింగుతూ ఉంటే నీరసం పోతుంది. ► ఖర్జూరం ప్రతిరోజూ తినడం వల్ల శరీరానికి మంచి బలం చేకూరుతుంది. నాలుగు ఎండు ఖర్జూరాలు ఒక గ్లాసు నీటిలో రాత్రి సమయంలో నానబెట్టి ఉదయం పరగడుపున ఆ నీళ్లను తాగితే శరీరానికి మంచి రక్తం పట్టి ముఖం కాంతిమంతంగా మారుతుంది. ► రోజూ ఒక గిన్నె పెరుగు తీసుకుంటే ఆరోగ్యానికి చాలామంచిది. ఇందులో ప్రొటీన్ ఉంటుంది. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలసట, నీరసాన్ని కూడా దూరం చేస్తుంది. ► గ్రీన్ టీ ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఎనర్జీ రావడమే కాకుండా బరువు కూడా కంట్రోల్లో ఉంటుంది. ► రోజుకి ఒకసారి నేలవేము కషాయాన్ని పావుకప్పు మోతాదుగా నీరసం పోతుంది. ► తుమ్మజిగురు శరీరానికి మంచి టానిక్‌లా పనిచేస్తుంది. ఉసిరికాయ అంత జిగురుని కప్పు నీటిలో కలిపి కొంచం పంచదార చేర్చి రోజుకి ఒకసారి తాగితే నీరసం పోయి శక్తి అందుతుంది. ► తాజా తాటికల్లుని పులవకుండా ఒక మోతాదుగా రోజూ తీసుకుంటూ ఉంటే శరీరానికి మంచి పుష్టి , బలం కలుగును.దీన్నే నీర అని అంటారు. రోజుకో వెలగపండు తింటే నీరసం పోయి శరీరానికి బలం చేకూరుతుంది. ► ఓట్స్‌లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి.ఇక క్రమం తప్పకుండా ఓట్స్ తినడం వల్ల శరీరానికి మంచి బలం వస్తుంది. -
చలికాలంలో నెయ్యి తింటున్నారా?యాంటీ ఇన్‌ఫ్లేమేటరీ గుణాల వల్ల..
మన భారతీయ వంటకాల్లో చాలావరకు నెయ్యి ఉపయోగిస్తామన్న విషయం తెలిసిందే. వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకొని కాస్త నెయ్యి కలుపుకొని తింటే ఆ రుచే వేరు కదా. స్వీట్ల దగ్గర్నుంచి ఘుమఘుమలాడే బిర్యానీల వరకు చాలా వంటకాల్లో నెయ్యిని వాడుతుంటాం. ప్రతిరోజూ నెయ్యి తీసుకుంటే బరువు పెరగతామని చాలామంది అనుకుంటారు. కానీ ఇది ఒట్టి అపోహ మాత్రమే. శీతాకాలంలో నెయ్యి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ►నెయ్యిలో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక చెంచా నెయ్యి తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.నెయ్యి ప్రేగులలోని ఆమ్ల pH స్థాయిని తగ్గించి చిన్న పేగును శుద్ధిచేస్తుంది. దాంతో పాటు మలబద్ధకం సమస్య కూడా దూరమవుతుంది. ► నెయ్యి యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. నెయ్యి మన డైట్లో చేర్చుకుంటే.. చలికాలంలో తరచుగా ఇబ్బంది పెట్టే బలుబు, దగ్గు, ఫ్లూ, అలర్జీల నుంచి రక్షణ లభిస్తుంది ► ఇందులో విటమిన్లుఎ, ఇ, డి, కె.. వంటి కొవ్వుల్ని కరిగించుకునే విటమిన్లు, ఒమేగా-3, ఒమేగా-6 వంటి ఫ్యాటీ యాసిడ్స్, లినోలిక్, బ్యుటిరిక్ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. నిరోధకత శక్తి మెరుగుపడుతుంది. ► చలికాలంలో నెయ్యి తినడం వల్ల శరీరం లోపలి నుంచి వెచ్చగా ఉంటుంది. శరీరంలోనిని అంతర్గత ఉష్ణాన్ని క్రమబద్ధీకరించి ఉంచేందుకు నెయ్యి సహకరిస్తుంది. నెయ్యికి స్మోకింగ్ పాయింట్ అధికంగా ఉంటుంది. ► పసుపు, మిరియాలతో కలిపి నెయ్యిని తీసుకుంటే వాపును తగ్గించడంతో పాటు ఒత్తిడి తొలిగి నిద్రలేమిని అధిగమించవచ్చు. ►హార్మోన్ల సమతుల్యాన్ని కాపాడడంలో నెయ్యి కీలక పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్‌ను కాపాడుతుంది. ► క్యాన్సర్ కణాలను నాశనం చేసే గుణాలు నెయ్యిలో ఉంటాయి. దీంతో రోజూ నెయ్యి తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ► కంటి సంబంధిత వ్యాధితో భాధపడే వారు నెయ్యి ని ఆహారంతో పాటు తీసుకుంటే ఆ సమస్యల నుండి బయటపడవచ్చు.ఎందుకంటే ఇందులో మిటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ► నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనే భావన చాలా మందిలో ఉంది.అయితే నిజానికి నెయ్యి చెడు కొలెస్ట్రాల్ పెంచదు..మంచి కొలెస్ట్రాల్‌ను మాత్రమే పెంచుతుంది.దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. అందానికి నెయ్యి నెయ్యి కేవలం ఆరోగ్యానికే కాదు.. అందానికీ మేలు చేస్తుంది. ఇది న్యాచురల్ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. నెయ్యిని చర్మానికి అప్లై చేస్తే.. చర్మం మృదువుగా ఉంటుంది. నెయ్యి తీసుకోవడం వల్ల ముఖంపై మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. అంతేకాదు, ప్రతిరోజూ నెయ్యిని తీసుకుంటే ముఖం కాంతిమంతంగా తయారవుతుంది. ఇలాంటి వారు రాత్రి పడుకొనే ముందు నెయ్యితో పెదాలపై నెమ్మదిగా మర్దన చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే పెదాల రంగు మెరుగవ్వడమే కాకుండా మృదువుగా మారతాయి. నెయ్యి చర్మంలో కొల్లాజెన్ అభివృద్ధిని ప్రేరేపిస్తుంది. ఇది చర్మ ప్రకాశాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అలాగే పిగ్మెంటేషన్ సమస్యను తగ్గిస్తుంది. -
ఫ్రైడ్ రైస్ ఇష్టంగా తింటున్నారా? ఈ విషయాలు తెలిస్తే..
ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారాన్ని పదే పదే వేడి చేసి తింటున్నారా? దీనివల్ల అనేక లేనిపోని రోగాలను కొని తెచ్చుకున్నట్లే. ఒకసారి వండిన ఆహారాన్ని మళ్లీ వేడి చేయద్దని వైద్యులు హెచ్చరిస్తున్నా ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇటీవలె ఓ వ్యక్తి ఫ్రైడ్‌రైస్ తిని మరణించాడు. దీనికి కారణం ‘ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్’ (Fried Rice Syndrome) అని తేలింది. ఇంతకీ ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్ అంటే ఏంటి? దీని లక్షణాలు ఎలా ఉంటాయన్నది ఓసారి తెలుసుకుందాం. ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్ అనేది 2008లో తొలిసారి కనుగొన్నారు. 20 ఏళ్ల ఓ యువకుడు నూడుల్స్ ప్రిపేర్ చేసుకుని తిన్నాక మిగిలిన దాన్ని ఫ్రిజ్‌లో ఉంచాడు. అలా మిగిలిపోయిన దాన్ని ఫ్రిజ్‌లో పెట్టి 5 రోజుల తర్వాత మళ్లీ వేడి చేసి తిన్నాడు. దీంతో పాయిజన్ అయ్యి ఆఖరికి ప్రాణాలను కోల్పోయాడు. తాజాగా మరో యువకుడు ఫ్రైడ్‌రైస్‌ను మళ్లీ వేడి చేసి తినడంతో పాయిజన్ అయ్యి ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్ గురించి మరోసారి చర్చనీయాంశమైంది. ఈ ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్ గురించి అమెరికన్ జర్నల్ ఆఫ్ బయోమెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఓ నివేదిక విడుదల చేసింది. ఈ ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్ అనేది ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధి అని, ఇది బాసిల్లస్ సెరియస్ (Bacillus cereus) అనే బ్యాక్టీరియ ద్వారా ఫుడ్ పాయిజన్ అవుతుందని తేలింది.వండిన ఆహారాన్ని గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ సేపు ఉంచినప్పుడు బాసిల్లస్ సెరియస్అనే బ్యాక్టీరియా చేరి ఆహారాన్ని విషతుల్యం చేస్తుంది. ఈ ఆహారం జీర్ణాశయ వ్యాధులకు కారణమవుతుంది. అలా కలుషిత ఆహారాన్ని తింటే వాంతులు, డయేరియా, జీర్ణాశయ వ్యాధులు వస్తాయని గుర్తించారు. ఈ సిండ్రోమ్ అటాక్ అయినప్పుడు వికారం, కడుపు నొప్పి వంటివి కనిపిస్తాయి. అయితే ఇందులో మరణించడం అనేది అరుదుగా మాత్రమే జరుగుతుందని వివరించారు. బ్యాక్టీరియా ఉత్పత్తికి కారణాలివే: సాధారణంగా అన్ని రకాల ఆహారాల్లో బ్యాక్టీరియా అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అయితే సరైన పద్దతిలో నిల్వ చేయని కొన్ని రకాల ఆహారాల్లో ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్ (Fried Rice Syndrome) అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. వండిన కూరగాయలు, మాంసం వంటి వాటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచితే అందులో ట్యాక్సిన్లు ఉత్పత్తి అవుతాయి. ఫుడ్‌ను పదేపదే వేడి డి చేయడం వల్ల అవి విషతుల్య రసాయనాలను విడుదల చేస్తాయి. ఫలితంగా కొన్ని అరుదైన కేసుల్లో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా తలెత్తుతుంది. #Bacillus cereus is a Gram-positive #spore-forming #bacterium, that produces two different toxins. The commonest is the emetic or vomiting #toxin referred to as cereulide. The second type of B. cereus toxin is an #enterotoxin causing a diarrhoeal type of #food #poisoning. pic.twitter.com/ijoA0Ttfc3 — Food and Industrial Microbiology (@microbiology121) July 17, 2021 ► చాలామంది రాత్రి మిగిలిన అన్నాన్ని ఫ్రిజ్‌లో పెట్టి ఉదయం వేడి చేసి తింటారు. అలాగని ఉదయం మిగిలిన దానిని రాత్రికి వేడి చేసి తినడం మంచిదనుకోకండి. అది కూడా మంచి పద్ధతి కాదు. కొన్ని నివేదికల ప్రకారం అన్నాన్ని మళ్లీ మళ్లీ వేడి చేసి తింటే ఫుడ్ పాయిజన్ జరుగుతుందని తేలింది. ► గుడ్లని ఆమ్లెట్ వేసుకొని, ఉడకబెట్టుకొని తింటారు. కొన్నిసార్లు వీటితో కూరలు కూడా వండుతారు. గుడ్లలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే గుడ్లు వండిన వెంటనే తినడం మంచిది. ఫ్రిజ్‌లో పెట్టి వేడి చేసిన తర్వాత తినకూడదు. దీనివల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ► పాస్తా, ఫ్రైడ్ రైట్ సహా వండిన వంటకాలని మళ్లీ వేడి చేసినప్పుడు అవి క్యాన్సర్ కారకాలను విడుదల చేస్తాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. అందుకే అప్పటికప్పుడు వండుకొని తినడం మంచిది. Can #Eating #Leftover #Rice #Kill You? Here’s The #Science Behind #FriedRiceSyndrome 😱😞🤣🤡 https://t.co/AWzWEREJok — Garry Dulgar (@GarryDulgar) October 28, 2023 -
మీలో ఈ లక్షణాలు ఉంటే లోబీపీ ఉన్నట్లే.. లేట్ చేస్తే ప్రాణాంతకమే!
ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో తక్కువ రక్తపోటు కూడా ఒకటి. దీనినే హైపోటెన్షన్ అని కూడా అంటారు. వంశపారంపర్యంగా, సరైన ఆహారం తీసుకోకపోవడం,సరైన రక్త ప్రసరణ లేకపోవడంతో, చాలా మందికి కాలక్రమేణా తక్కువ రక్తపోటు సమస్య ఏర్పడుతుంది. లో బీపీ అనేది మనిషి సాధారణ రక్తపోటు కంటే తక్కువగా ఉంటే దాన్ని లో బీపీ అంటారు. సాధారణంగా రక్తపోటు 120/80 mmHg ఉంటుంది. ఇంతకంటే తక్కువగా ఉంటే అది లో బీపీగా పరిగణిస్తారు. చాలా మంది తక్కువ రక్తపోటు సమస్యను చాలా తేలికగా తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఊహించకుండా ఒక్కసారిగా కుప్పకూలిపోవచ్చు. అంతేకాకుండా గుండెపోటు, గుండెకు సంబంధించిన అనేక తీవ్రమైన సమస్యలకు కూడా దారి తీసే అవకాశాలు ఉంటాయి. లక్షణాలు ఇలా ఉంటాయి ►మైకము,అలసట ► తలనొప్పి ► కళ్ళు తిరగడం ► కడుపులో తిమ్మిరి ► హృదయ స్పందన రేటు పెరగడం ► శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లో బీపీ ఎందుకు వస్తుంది? లోబీపీ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. డీ హైడ్రేషన్, గుండె కొట్టుకునే వేగం తగ్గడం, గుండెలో రక్తం గడ్డకట్టడం, విటమిన్ బీ12 లోపం, అడ్రినలైన్ హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం, సెప్టిసీమియా, వేసో వ్యాగల్ రియాక్షన్లు, పోస్టురల్ హైపో టెన్షన్, హై బీపీ కోసం మందులు వేసుకోవడం, ఆల్కహాల్ ఎక్కువగా తాగడం, డ్రగ్స్ వాడకం కారణంగా లోబీపీ వచ్చే అవకాశం ఉంది. ఈ జాగ్రత్తలు పాటించండి హైపోటెన్షన్ అనేది తీవ్రమైన సమస్య. అయితే దానిని నుండి బయటపడటం కష్టమేమి కాదు. తీసుకునే ఆహారం, జీవనశైలిని మార్చుకోవటం ద్వారా, లో బీపీ సమస్యను సులభంగా నివారించవచ్చు.దీనికోసం ఏం చేయాలంటే.. ►తగినంత నీరు తాగాలి ► ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి ► క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ► ఆల్కహాల్, పొగత్రాగడం వంటి అలవాట్లు ఉంటే మానుకోండి ► మీరు ఏదైనా మందులు తీసుకుంటుంటే, వాటి సైడ్ ఎఫెక్ట్స్ గురించి మీ డాక్టర్‌తో మాట్లాడండి. ► ఆహారంలో కొంచెం ఎక్కువ ఉప్పు తీసుకొండి ► తక్కునగా ఎక్కువసార్లు భోజనం చేయండి లో బీపీ వస్తే ఏం చేయాలి? రక్తపోటులో ఆకస్మిక తగ్గుదలకు సరైన చికిత్స అవసరం. ఆ సమయంలో స్వీయ చికిత్స కంటే ఆసుపత్రిని సందర్శించడం మంచిది. ఒక గంటలోపు ఆసుపత్రికి రావడం వల్ల ప్రమాదకర పరిణామాలను నివారించవచ్చు. అక్కడ లోబీపీకి కారణాన్ని గుర్తించి చికిత్స అందిస్తారు. మనం పైన చెప్పుకున్నట్టుగా... లోబీపీ లక్షణాలు కనిపించగానే అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించాలి. వారి సలహా మేరకు మీ జీవనశైలిని సరిచేసుకోవాలి. తగిన పోషకాహారం, తగినంత నిద్ర, తేలికపాటి వ్యాయామాలు తప్పనిసరిగా మీ దినచర్యలో చేర్చుకోవాలి. 5నిమిషాల్లో బీపీ నార్మల్ లోబీపీతో కళ్లు తిరిగి పడిపోవడం, మైకం కమ్మినప్పుడు వెంటనే ఒక గ్లాస్ నీటిలో అర టీస్పూన్ సైంధవ లవణం(Himalayan rock salt ) కలుపుకొని తాగితే బీపీ వెంటనే నార్మల్ అవుతుంది. ఇది టేస్ట్‌లో కొంచెం ఉప్పగా, తీపిగా ఉంటుంది.సైంధవ లవణంలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది బీపీని కంట్లోల్ చేసి, నార్మల్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. మన శరీరానికి కావాల్సిన కాల్షియం, కాపర్, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సల్ఫర్, జింక్, అయోడిన్, ఆక్సిజన్ వంటి అనేక పోషక విలువలు సైంధవ లవణంలో ఉన్నాయి. -
సాల్మన్ చేపలు తింటున్నారా?,ఇందులోని విటమిన్ బి6 వల్ల జుట్టుకు..
అందం అంటే చర్య సౌందర్యం మాత్రమే కాదు.. జుట్టు సౌందర్యం కూడా. అందుకే అమ్మాయి, అబ్బాయి అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జుట్టును చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. కాస్త జుట్టు ఊడిపోతున్నా తెగ ఫీల్ అవుతుంటారు. ఈ మధ్య కాలంలో హెయిర్ ఫాల్ చాలా కామన్ ప్రాబ్లమ్. రకరకాల షాంపులు, ఆయుల్స్, పొల్యూషన్ వల్ల చాలామందిలో జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. మరి వెంట్రుకలు బాగా పెరిగి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, మీ డైట్లో ఎలాంటి మార్పులు చేసుకుంటే మంచిది అన్నది ఇప్పుడు చూద్దాం. ఆకుకూరలు జుట్టు రాలడానికి ప్రధాన కారణం ఖనిజాలను కోల్పోవడం. ఫోలేట్, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి తదితర పోషకాల లోపం వల్ల జుట్టు బాగా రాలుతుంది. కాబట్టి ఇవి డైట్లో ఉండేలా చేసుకోవాలి. అందకు పాలకూరను ఎక్కువగా తీసుకోవాలి.పాలకూరలో ఉండే పోషకాలు జుట్టు పెరుగుదలకు సహాయ పడతాయి. పాలకూర జుట్టుకు సహజసిద్ధమైన కండిషనింగ్‌ను అందిస్తుంది. పాలకూరలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. నట్స్ ఆహారంలో ప్రతిరోజూ నట్స్ తీసుకోవలి. బాదంపప్పు, పిస్తాపప్పు, కాజు మొదలైన డ్రైఫ్రూట్స్‌ని ప్రతిరోజూ డైట్లో చేర్చుకోవాలి. ఇందులో విటమిన్ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, బయోటిన్ సహా ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు జుట్టు, చర్మం ఆరోగ్యానికి గొప్పగా పనిచేస్తాయి. ముఖ్యంగా ప్రతిరోజూ బాదం తీసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లను బలంగా, సిల్కీగా ఉండేలా చేస్తుంది. గుడ్లు కోడిగుడ్లలో ప్రొటీన్, విటమిన్ బి12, ఐరన్, జింక్ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ కురుల పెరుగుదలకు సహాయపడతాయి. గుడ్డు పచ్చసొనలో ఉండే.. విటమిన్ A,E, బయోటిన్, ఫోలేట్ జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరిగేలా తోడ్పడతాయి. అందువల్ల ప్రతిరోజూ ఓ గుడ్డు తినాలి. చేపల్లో ఒమెగా 3, ఒమెగా 6 తదితర ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ డి, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచేలా చూస్తాయి. జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి. గుడ్డులోని జింక్, బయోటిన్ ఆరోగ్యవంతమైన జుట్టుకు తోడ్పడుతుంది. చేపలు సాల్మన్ చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపర్చడమే కాకుండా డెడ్ హెయిర్ సెల్స్‌ను తగ్గిస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. సాల్మన్, సార్డినెస్, మాకెరెల్ వంటివి ఆరోగ్యకరమైన కొవ్వును కలిగి ఉండే చేపలు. ఈ చేపల్లో ప్రొటీన్లు, విటమిన్ డి, విటమిన్ బి6 కూడా అధికంగా లభిస్తాయి. వీటన్నింటిలో సాల్మన్ చేపలు మరీ ఆరోగ్యకరమైనవి. చిలగడదుంప జుట్టు రాలే సమస్యతో ఇబ్బందిపడుతుంటే ఆహారంలో చిలగడదుంపను చేర్చుకోవాలి. ఎందుకంటే ఇందులో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ A లోపాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి జుట్టు పెరుగుదలకు చిలగడదుంపను మీ డైట్లో ఉండేలా చూసుకోండి. బెర్రీలు బెర్రీలు ప్రతిరోజూ బెర్రీలను తీసుకుంటే జుట్టు కుదుళ్లు బలపడతాయి. ఎందుకంటే బెర్రీస్‌లో జుట్టుకు ఉపయోగపడే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందుకే ప్రతిరోజూ బెర్రీలను డైట్లో చేర్చుకోండి. పెరుగు పెరుగు జుట్టుకు మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది. ఇందులోని పోషకాలు, ఔషధ గుణాలు జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది.వెంట్రుకలకు బలాన్ని ఇచ్చి మెరుపును అందిస్తాయి. పెరుగును తినడమే కాకుండా ప్యాక్ వేసుకోవడం వల్ల కూడా జుట్టు సమస్యలను కంట్రోల్లో ఉంచుతుంది. చుండ్రుతో బాధపడుతున్న వాళ్లు వారానికి ఒకసారి పెరుగుతో ప్యాక్ వేసుకుంటే చుండ్రు పూర్తిగా తొలగిపోతుంది. -
కీటకాలతో ఔషధం...హార్ట్ఎటాక్ రిస్క్‌ను తగ్గిస్తుంది
ప్రస్తుతం గుండెపోటు మరణాలు ఎక్కువగా చూస్తున్నాం. ఒకప్పుడు 50దాటిన వారిలో గుండెపోటు వచ్చే అవకాశం ఉండేది. కానీ కోవిడ్ ఎఫెక్ట్‌తో కొంతకాలంగా దేశంలో గుండెపోటు మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సాంప్రదాయ చైనీస్ మెడిసిన్‌తో గుండెపోటు వచ్చే రిస్క్ తగ్గుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. మరి ఏంటా మెడిసిన్? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఇటీవల కాలంలో ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిన ఘటనలు చూస్తున్నాం. డ్యాన్స్ చేస్తూనో, జిమ్ చేస్తూనో అకస్మాత్తుగా కుప్పకూలి చనిపోతున్నారు. ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు మొదటిసారి హార్ట్ ఎటాక్ వచ్చినవారిలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. స్టెమీ(ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ STEMI)లాంటి తీవ్రమైన గుండెపోటు అటాక్ అయినప్పుడు ఈ తరహా పరిస్థితి ఎదురవుతుంటుంది. గుండెలోని రక్త నాళాల్లో రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడటం, రక్తనాళాలు పూడుకుపోవడం, రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేకపోవడం తదితర కారణాల వల్ల గుండె పోటు వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. కోవిడ్ అనంతరం గుండెపోటు కేసులు ఎక్కువగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో దీనికి తగ్గ కారణాలు, ఓషధాలపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో Tongxinluo అనే సాంప్రదాయ చైనీస్ మెడిసిన్ ద్వారా గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని, ఈ మెడిసిన్ ప్రభావం సుమారు ఏడాది పాటు ఉంటుందని సైంటిస్టులు తెలియజేశారు. చైనాలో హార్ట్ స్ట్రోక్ వచ్చిన రోగులకు అందించే చికిత్సలో ఈ మెడిసిన్‌ను చాలాకాలంగా ఉపయోగిస్తున్నారని పరిశోధకులు పేర్కొన్నారు. ఇది ప్రధానంగా జిన్సెంగ్, జలగ, తేలు, సికాడా, సెంటిపెడ్, బొద్దింక, గంధం సహా పలు సహజసిద్ధ మూలికలతో తయారు చేసిన ఓ సాంప్రదాయ ఔషధం. టెక్సాస్‌లోని UT సౌత్‌వెస్ట్రన్ మెడికల్ సెంటర్లో 3,777 మందిపై ఏడాదిపాటు జరిపిన పరిశోధనల్లో Tongxinluo మెడిసిన్ ఊహించని ప్రయోజనాలను నమోదు చేసిందని సైంటిస్టులు గుర్తించారు. Tongxinluo తీసుకోనివారితో పోలిస్తే, తీసుకున్నవారిలో హార్ట్ రిస్క్ 30% తక్కువగా ఉన్నట్లు వారు కనుగొన్నారు. అంతేకాకుండా ఈ మెడిసిన్ వాడిన ఏడాది వరకు దాని ప్రయోజనాలు ఉన్నట్లు, దీనివల్ల 25% కార్డియాక్ డెత్ ప్రమాదం తగ్గిందని సైంటిస్టులు పేర్కొన్నారు. దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని వారు వివరించారు. -
ఇక రోజూ ఇన్సులిన్ అవసరం లేదు!
మధుమేహం అనేది ఒక దీర్ఘకాలిక అనారోగ్య సమస్య. ఈ వ్యాధి ఒకసారి వస్తే ఎప్పటికీ నయం కాదు. ఎందుకంటే దీనిని పూర్తిగా నయం చేసే చికిత్స లేదు. అందుకే మధుమేహం రాకముందే అదుపులో ఉంచుకోవడం మంచిది. ఇక షుగర్ వ్యాధి వచ్చిందంటే ప్రతిరోజూ మందులు, ఇన్సులిన్ ఇంజెక్షన్లు వాడాల్సిందే. అయితే ఇకపై ఆ కష్టాలు కొంతవరకు తీరనున్నాయి. ప్రతిరోజూ కాకుండా వారంలో ఒకసారి మాత్రమే ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుందట. సైంటిస్టులు జరిపిన క్లినికల్ ట్రయల్స్‌లో ఈ విషయం వెల్లడైంది. భారత్‌లో మధుమేహం దూకుడు పెంచుతోంది. ఏటా మధుమేహం బాధితుల సంఖ్య పెరుగుతోంది. దాదాపుగా 10 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ‘లాన్సెట్’లో పబ్లిష్ చేసిన ఒక అధ్యయనంలో తేలింది. కేంద్ర ఆరోగ్య శాఖ నిర్వహించిన ఈ అధ్యయనంలో దాదాపు 13.6 కోట్ల మందికి ప్రీడయాబెటిస్ ఉందని అంచనా వేశారు. మనుషుల్లో తగినంత ఇన్సులిన్, హార్మోన్ తయారుకాకపోవడం లేదా ఆ పరిస్థితిలో సరిగ్గా ప్రతిస్పందించలేకపోవటం వల్ల హై బ్లడ్ షుగర్ వస్తుంది. లైఫ్ స్టైల్లో మార్పులు, ఫ్యామిలీ హిస్టరీ వల్ల ఈమధ్య కాలంలో తక్కువ వయసులోనే పలువురు మధుమేహం బారిన పడుతున్నారు. డయాబెటిస్‌ను నియంత్రణలో పెట్టకపోతే ప్రాణానికే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు కిడ్నీ ఫెయిల్యూర్, కంటిచూపు పోవడం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. అందుకే మధుమేహం రాకముందే పరిస్థితిని అదుపులో ఉంచుకోవడం మంచిది. మధుమేహం రెండు రకాలుగా ఉంటుంది. ఇందులో టైప్-2 డయాబెటిస్ సాధారణమైంది. ప్రతిరోజూ మందులు వాడితే సరిపోతుంది. ఇక టైప్-1 డయాబెటిస్ వారు మాత్రం జీవితాంతం ప్రతిరోజూ ఇన్సులిన్ తీసుకోవాల్సిందే. ఒకరోజూ ఇన్సులిన్ తీసుకోకపోయినా పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు వీరికి కాస్త ఉపశమనం లభించనుంది. శాస్త్రవేత్తలు తాజాగా రూపొందించిన 'ఐకోడెక్' అనే ఇన్సులిన్‌తో కేవలం వారానికి ఒకసారి మాత్రమే ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది. ఇది డైలీ తీసుకునే ఇన్సులిన్ షాట్స్‌కి సమానంగా ఉంటుందని క్లినికల్ ట్రయల్స్‌లో వెల్లడైంది. 'ఐకోడెక్' ఇన్సులిన్ రక్తంలో గ్లూకోజ్ లెవల్స్‌ను సమర్థవంతంగా నియంత్రించడంలో సహాయపడుతుందని తేలింది. టైప్-1 డయాబెటిస్తో బాధపడుతున్న 582 మంది రోగులపై ఈ ట్రయల్స్ నిర్వహించారు. వీరిలో సగం మందికి 'ఐకోడెక్' అనే ఇంజెక్షన్‌ను ఇవ్వగా, మిగతా సగం మందికి 'డెగ్లుడెక్' అనే సాధారణ ఇన్సులిన్ ఇంజెక్షన్(రోజూ వాడేది)ను ఇచ్చారు. దాదాపు 26 వారాల తర్వాత వీరి HbA1C(గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్)లెవల్స్‌ను పరిశీలించగా.. ఊహించని మార్పులను కనుగొన్నారు. డెగ్లుడెక్ ఇన్సులిన్‌తో పోలిస్తే తాజాగా శాస్త్రవేత్తలు కొనిపెట్టిన ఐకోడెక్ ఇన్సులిన్‌ను వాడిన వాళ్లలో హైపోగ్లైసీమిక్ (తక్కువ గ్లూకోజ్ స్థాయిలు) కాస్త ఎక్కువ ఉన్నప్పటికీ ఇదంత పెద్ద విషయం కాదని, ఈ రకమైన ఇన్సులిన్‌తో వారానికి ఒకసారి మాత్రమే ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుందని వెల్లడించారు. -
మాంగనీస్... రక్తనాళాలు సాఫ్!
మాంగనీస్... రక్తనాళాలు సాఫ్! పళ్లపై గారపడితే... డెంటిస్ట్‌తో తీయించుకోవచ్చు! కానీ... రక్తనాళాల గోడల్లోపల గారలాంటి గట్టి పొరలు ఏర్పడితే? ఆరోగ్యసమస్యలు తలెత్తుతాయి. గుండెజబ్బులు, గుండెపోటులకూ దారితీయవచ్చు. అయితే రక్తనాళాల్లోపలి ‘ప్లేక్’ను ఇకపై తేలికగానే తొలగించవచ్చునని అంటున్నారు శాస్త్రవేత్తలు. అదెలాగో చూసేయండి... గుండెజబ్బులు వచ్చిన వారిలో రక్తం పలుచగా ఉంచేందుకు స్టాటిన్లు అనే రకం మందులు వాడుతూంటారు. రక్తనాళాల్లోని ప్లేక్‌ను ఈ మందులు కొంత వరకూ నియంత్రించగలవు. అయితే ఒకసారి ప్లేక్ ఏర్పడిన తరువాత మాత్రం ఈ స్టాటిన్ల ప్రభావం పెద్దగా ఉండదు. పేరుకుపోయిన ప్లేక్స్ను తొలగించలేవన్నమాట. ఈ సమస్యను అధిగమించేందుకు శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా... చైనాలోని వేర్వేరు యూనివర్శిటీల శాస్త్రవేత్తలు కలిసికట్టుగా జరిపిన పరిశోధనల్లో ఓ వినూత్న పరిష్కారం ఆవిషృ్కతమైంది. శరీరానికి అవసరమైన సాధారణ పోషకం మాంగనీస్ ఈ ప్లేక్‌ను రక్తనాళాల నుంచి తుడిచిపెట్టేయగలదని ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో స్పష్టమైంది. మాంగనీస్ మన ఆరోగ్యానికి చాలా కీలకమైంది. కార్బోహైడ్రేట్లు, కొవ్వులు జీర్ణమయ్యేందుకు కో ఎంజైమ్‌గా ఉపయోగపడుతూంటుంది. అంతేకాకుండా.. మన నాడులు, మెదడు బాగా పనిచేయడంలోనూ కీలకపాత్ర పోషిస్తూంటుంది. కండరాలను కలిపే కణజాలం, సెక్స్ హార్మోన్లు, ఎముకలకూ చాలా అవసరం. సాధారణంగా మనం తీసుకునే ఆహారం ద్వారానే మనకు కావాల్సినంత మాంగనీస్ లభ్యమవుతూంటుంది. నట్స్, పచ్చటి ఆకు కూరలు, కొన్ని రకాల చేపలు, మిరియాలు, కాఫీ, టీ, గింజల వంటి వాటిల్లో మాంగనీస్ ఉంటుంది. శరీరంలో మాంగనీస్ తగ్గితే కండరాలు బలహీన పడతాయి. సంతానం కలగడంలో సమస్యలూ రావచ్చు. మూర్ఛ వచ్చేందుకూ అవకాశం ఉంటుంది. చైనా శాస్త్రవేత్తల తాజా పరిశోధనల కారణంగా ఇప్పుడు ఈ మాంగనీస్ రక్తనాళాల శుద్ధికీ ఉపయోగపడుతుందని స్పష్టమైంది. చైనా శాస్త్రవేత్తలు ఎలుకలకు తగిన మోతాదులో మంగనీస్ అందించి పరిశీలించగా.. వాటి రక్తనాళాల్లో ప్లేక్ ఏర్పడేందుకు కారణమైన కొవ్వుల మోతాదు గణనీయంగా తగ్గినట్లు స్పష్టమైంది. అంతేకాదు.. ఏర్పడ్డ ప్లేక్ కూడా రక్తనాళాల గోడల నుంచి విడిపోయి శుభ్రమయైనట్లు కూడా తెలిసింది. ‘‘శరీరానికి అత్యవసరమైన మూలకాల్లో మాంగనీస ఒకటి. కానీ దీన్ని ఇప్పటివరకూ పూర్తిగా అర్థం చేసుకోలేదు. ఎంజైమ్ ఆధారిత రియాక్షన్స్‌కు ఇదెలా సాయపడుతోందో తెలుసుకోలేదు’’ అని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త షావ్ వాంగ్ తెలిపారు. రక్తంలో కొవ్వుల రవాణా విషయంలో మాంగనీస్ కీలకపాత్ర పోషిస్తున్నట్లు తమ ప్రయోగాల ద్వారా వెల్లడైందని చెప్పారు. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ల వంటి సంక్లిష్ట కొవ్వులకు మాంగనీస్ అతుక్కుపోగలదని, తద్వారా అక్కడి రసాయన కూర్పును మార్చేయడం ద్వారా ప్లేక్ ఏర్పడకుండా నిరోధిస్తుందని వాంగ్ తదితరులు ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో తేలింది. పరిశోధన వివరాలను లైఫ్ మెటబాలిజమ్ జర్నల్ ప్రచురణకు స్వీకరించింది. -
ఉప్పు ఎక్కువగా వాడుతున్నారా? షుగర్ వ్యాధి వస్తుందట
ఉప్పు ఎక్కువగా వాడితే రక్తపోటు(బీపీ)వస్తుందనే ఇప్పటి వరకు విన్నాం. కానీ ఉప్పు వల్ల మధుమేహం కూడా వస్తుందని మీకు తెలుసా? లండన్‌కు చెందిన సైంటిస్టులు తాజాగా జరిపిన రీసెర్చ్‌లో ఈ విషయం వెల్లడైంది. మోతాదుకు మించి ఉప్పు తీసుకుంటే మధుమేహం వస్తుందని పరిశోధకులు తేల్చిచెప్పారు. మరి రోజువారి మొత్తంలో ఎంత మేరకు ఉప్పు తీసుకోవాలి? అన్నది ఈ స్టోరీలో చూసేద్దాం. ఉప్పు లేకుండా వంట చేయడం దాదాపు అసాధ్యం. ఏ వంట చేయాలన్నా ఉప్పు తప్పనిసరి. చాలామంది కూర చప్పగా ఉందనో, రుచి కోసమో మోతాదుకు మించి ఉప్పు వాడేస్తుంటారు. ఊరగాయ పచ్చళ్ల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బోలెడంత ఉప్పు ఉంటుంది అందులో. అయితే ఇలా అవసరానికి మించి ఉప్పు తినడం వల్ల రక్తపోటు వస్తుందనే ఇప్పటి వరకు మనకు తెలుసు. కానీ తాజాగా ఉప్పు వల్ల మధుమేహం కూడా వస్తుందని పరిశోధకులు తెలిపారు. అధిక ఉప్పు వాడటం వల్ల టైప్-2 డయాబెటిస్ వస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. యూకేలోని 'తులనే' యూనివర్సిటీ నిర్వహించిన రీసెర్చ్‌లో ఈ షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. 12 ఏళ్ల పాటు 13 వేల మందిపై జరిపిన అధ్యయనంలో.. మోతాదుకు మించి ఉప్పు వాడే వారిలో టైప్-2 డయాబెటిస్ వచ్చే రిస్క్ అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. ఉప్పు తక్కువ తీసుకునే వారితో పోలిస్తే, ఎక్కువగా కొన్నిసార్లు తీసుకునే వ్యక్తుల్లో 13 శాతం, సాధారణంగా తీసుకునే వారిలో 20 శాతం, ఎల్లప్పుడూ తీసుకునే వారిలో 39 శాతం టైప్ 2 డయాబెటిస్ వచ్చినట్లుగా అధ్యయనంలో వెల్లడైంది. ఉప్పు తక్కువగా తీసుకుంటే బీపీ మాత్రమే కాదు, మధుమేహం వచ్చే ఛాన్స్ కూడా తగ్గించుకోవచ్చని సైంటిస్టులు తెలిపారు. కొంతమంది ఆహారం తీసుకొనేటప్పుడు టేబుల్ సాల్ట్ వాడతారని దీని వల్ల టైప్ 2 మధుమేహం 40 శాతం పెరిగే అవకాశం ఉందని కొత్త పరిశోధనలో తేలిందని తులనే యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. రోజుకు రెండు టీ స్పూన్ల ఉప్పుును తీసుకునే వారిలో డయాబెటిస్ ముప్పుు ఎక్కువగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఉప్పుతో డయాబెటిస్ బారిన పడకుండా ఉండాలంటే మాత్రం రోజు 1500 మి. గ్రా లకు మించి ఉప్పు వాడరాదని నిపుణులు సూచిస్తున్నారు. అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల బరువు పెరగడంతో పాటు బీపీ, షుగర్ సహా గుండె సంబంధిత సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. -
షుగర్ పేషెంట్స్.. పచ్చి కూరగాయలు, పండ్లు తింటున్నారా?
ఇటీవలి కాలంలో ఎక్కువమందిని వేధిస్తున్న సమస్య మధుమేహం. ఆధునిక జీవనశైలిలో చోటుచేసుకుంటున్న మార్పులు, అధిక క్యాలరీలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం, వంశపార్యపరంగాగా, ఒత్తిడి..ఇలా రకరకాల కారణాల వల్ల చాలామంది టైప్-2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. శరీరంలో గ్లూకోజ్ పరిమాణం పెరిగినప్పుడు వచ్చే ఈ పరిస్థితిని డయాబెటిస్ అంటారు. ప్రస్తుతం వయసులో సంబంధం లేకుండా అందరిలోనూ డయాబెటిస్ సమస్య వస్తోంది. ఈ క్రమంలో కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే డయాబెటిస్ కంట్రోల్లో ఉందని పరిశోధనల్లో వెల్లడైంది. డయాబెటిస్ అనేది మెటబాలిక్ కండిషన్. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచుకోవాలంటే మీ డైట్లో తప్పకుండా ఫైబర్ ఫుడ్‌ని చేర్చుకోవాల్సిందే. ఎందుకంటే కరిగే ఫైబర్ రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రించి..రక్తంలో గ్లూకోజ్ స్పైక్‌లను తగ్గిస్తుంది. దీంతో షుగర్ లెవల్స్ తగిన పరిమాణంలో ఉంటాయి. స్టార్(సర్వే ఫర్ మేనేజ్మెంట్ ఆఫ్ డయాబెటిస్ విత్ ఫైబర్-రిచ్ న్యూట్రిషన్ డ్రింక్) జరిపిన అధ్యాయనంలోనూ ఇదే విషయం వెల్లడైంది. టైప్-2 డయాబెటిస్ ఉన్న సుమారు 3,042మంది రోగులపై ఈ పాన్ ఇండియా సర్వే నిర్వహించారు. ఇందులో భాగంగా మూడు నెలల పాటు ఫైబర్ రిచ్ సప్లిమెంట్స్ తీసుకున్న వారిని ఒక గ్రూపుగా, సప్లిమెంట్ తీసుకోనివారిని మరో గ్రూపుగా విభజించి వారిలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయన్నది గమనించారు. గ్లూకోజ్ స్థాయి గణనీయంగా తగ్గింది ►HbA1C(గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్)స్థాయి గణనీయంగా 8.04 నుండి 7.32కి తగ్గింది ► సుమారు 82% మంది రోగులలో 3కిలోల వరకు బరువు తగ్గడం కనిపించింది. ► సప్లిమెంట్ తీసుకున్న వారు ఉత్సాహంగా ఉన్నట్లు గమనించారు. దీని ప్రకారం..ఫైబర్ రిచ్ సప్లిమెంట్ రోజువారి వినియోగంలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఎలా నియంత్రిస్తుందన్నది సర్వే ఆధారంగా మరోసారి రుజువైంది. ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ కంట్రోల్లో ఫైబర్ పాత్ర ఎంత ముఖ్యం అన్నది ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేలిపోయింది. RSSDI, అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ వంటి సంస్థలు కూడా మధుమేహం ఉన్నవారు తమ డైట్లో రిచ్ ఫైబర్(పీచు పదార్థం) ఫుడ్స్‌ని తీసుకోవాల్సిందిఆ సిఫార్సు చేస్తున్నారు. మధుమేహం ఉన్నవారు రోజుకి 25-40 గ్రా.ల ఫైబర్ తీసుకోవాల్సిందిగా RSSDI సిఫార్సు చేసింది. మధుమేహం నియంత్రణలో సనైన పోషకాహారం పాటించడం ఎంతో అవసరమని సౌత్ ఏషియన్ ఫెడరేషన్ ఆఫ్ ఎండోక్రైన్ సొసైటీస్ (SAFES) ప్రెసిడెంట్, డాక్టర్ సంజయ్ కల్రా అన్నారు. మధుమేహంతో బాధపడేవాళ్లు తమ ఆహారంలో కార్బోహైడ్రేట్లు, చక్కెర వినియోగాన్ని తగ్గించడమే కాకుండా ఫైబర్ రిచ్ ఫుడ్స్‌ని పెంచుకోవాల్సిందిగా తెలిపారు. ఫైబర్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కొంచెం తిన్నా ఎక్కువ తిన్న అనుభూతిని కలిగించడమే కాకుండా, కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. అంతేకాకుండా ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలివే.. ►పచ్చి కూరగాయలు, పండ్లు ► గోధుమలు, ఓట్స్ ► బ్రౌన్ రైస్,క్వినోవా, బార్లీ ► జీడిపప్పు, బాదం, పిస్తా వంటి నట్స్ ► బీన్స్, ధాన్యాలు ► అవిసె గింజలు ► బ్రకోలి,యాపిల్ ► స్ట్రా బెర్రీలు, గూస్ బెర్రీలు,బ్లూబెర్రీలు ► అరటి పండు, అవకాడో మొదలైనవి. -
వీగన్స్: కనీసం జంతువుల పాలు కూడా తాగరు..మరి ప్రోటీన్స్ ఎలాగంటే..
ప్రపంచ వ్యాప్తంగా చాలామంది వీగన్స్గా మారిపోతున్నారు. ఈమధ్య వీగన్ డైట్‌ను పాటించే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. సోషల్ మీడియాలో ప్రచారం పెరగడం, ఈ కొత్త రకం డైట్ వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతుండడం, సెలబ్రిటీలు కూడా వీగన్స్గా మారిపోతుండటంతో చాలామంది ఈ డైట్‌ను ఫాలో అవుతున్నారు. వీగన్లు పాల ఉత్పత్తులు, తేనె, తోలు, ముత్యాల వంటి వాటికి దూరంగా ఉంటారు. మొక్కల నుంచి లభించే పదార్థాలను మాత్రమే తీసుకుంటారు. ఏటా నవంబర్ 1న వరల్డ్ వీగన్ డే గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ సందర్భంగా వీగన్ డైట్ వల్ల అన్నీ ప్రయోజనాలేనా? ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా అన్నది ఈ స్టోరీలో చూద్దాం. జంతువులకు హానీ చేయకుండా, శాకాహారాన్ని ప్రోత్సహిస్తూ ఈ మధ్య అందరూ వీగన్స్గా మారుతున్నారు. ముఖ్యంగా యువత ఎక్కువగా ఈ డైట్‌ను ఫాలో అవుతున్నారు.1944 నవంబర్ నెలలో ది వీగన్ సొసైటీని డొనాల్డ్ వాట్సన్ ఏర్పాటు చేశాడు. వీగన్, వీగనిజమ్ అనే పదాలు పుట్టింది కూడా అప్పుడే. వీగన్ డైట్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే పూర్తిగా శాఖాహార పదార్థాలనే తీసుకోవడం. జంతు సంబంధిత ఆహార పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉంటూ, కేవలం వృక్ష సంబంధిత ఆహారాలను తీసుకోవడం ఈ డైట్ ముఖ్య ఉద్దేశం. ఇక వీగనిజం పాటించే వాళ్లు ముఖ్యంగా కఠినమైన ఆహార పద్దతులను పాటిస్తారు. కేవలం మొక్కల ద్వారా లభించే ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. పాలపదార్థాలు గానీ, జంతువుల నుంచి వచ్చే ఏ ఆహారాన్ని తీసుకోరు. కానీ వాటికి ప్రత్యామ్నాయంగా ఆహారంలో పోషక విలువలు తగ్గకుండా జాగ్రత్తలు వహిస్తారు. పాలకు బదులుగా పల్లీలనుంచి తీసిన పాలు, కొబ్బరి, జీడిపప్పుతో చేసిన ఛీజ్ కేక్ లాంటివి తిని పోషకాహార లోపాన్ని అధిగమిస్తారు. వీగన్లు తాము వేసుకునే దుస్తుల్లోనూ జంతు సంబంధమైనవి లేకుండా కేవలం లెనిన్, కాటన్‌తో రూపొందిన దుస్తులకే ప్రాధాన్యత ఇస్తారు. చలిని తట్టుకోవడానికి మనం ధరించే కోట్లు, బెల్టులు, టోపీల తయారికి లక్షల కొద్ది మూగజీవుల్ని వధిస్తున్నారనే కారణంతోనే వీగన్లు.. ఈ దుస్తులను నిషేధిస్తున్నారు. జంతు చర్మంతో తయారవుతున్న ఉత్పత్తులకు బదులుగా కృత్రిమ నార, సోయా ఉత్పత్తులు, రీసైకిల్డ్ నైలాన్, కార్డ్ బోర్డులతో రూపొందిన దుస్తులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అమీర్ ఖాన్, కంగనా రనౌత్, సోనమ్ కపూర్, అనుష్క శర్మ, శ్రద్ధా కపూర్ వంటి సెలబ్రిటీలు సైతం కొన్నేళ్లుగా వీగన్స్గా మారి అలాంటి డైట్‌ను ఫాలో అవుతున్నారు. ఆ రిస్క్ తక్కువ పూర్తి శాకాహారాన్ని అనుసరించడం వల్ల చక్కెర స్థాయిలను, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది. ఎందుకంటే ఈ తరహా ఆహారాలు సంతృప్త కొవ్వులో తక్కువగా, ఫైబర్‌ను ఎక్కువగా కలిగి ఉంటాయి. ఫ్యాట్ కంటెంట్ ఉండదు కాబట్టి గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువ. అంతేకాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలను బ్యాలెన్స్ చేస్తూ బరువు కూడా కంట్రోల్లో ఉంటుంది. వీగన్ డైట్‌తో నష్టాలివే ►వీగన్ డైట్‌తో ఎన్నో లాభాలున్నప్పటికీ కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. వీగన్ ఫుడ్ తీసుకునేవారికి ఐరన్ సమస్యలు వచ్చే అవకాశముంది. చాలా మంది శాకాహారులు ఐరన్ లోపంతో రక్తహీనతకు గురవుతున్నారు. ► వీగన్స్‌లో ప్రొటీన్లు, కాల్షియం, విటమిన్ B12 పోషకాల లోపం ఉండే అవకాశం ఉంది. చివరగా చెప్పేదేంటంటే.. వెజీటేరియన్స్ అయినా, వీగన్స్గా మారినా తమ శరీర తత్వాన్ని బట్టి డైట్‌ను ఫాలో అవ్వాలి. శృతి మించితే లేనిపోని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. -
గుడ్డులోని పచ్చసొన మంచిదేనా? ఇన్నాళ్లకు సమాధానం దొరికింది
గుడ్డు ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలామందికి గుడ్డు రోజువారీ ఆహారంలో భాగం. అయితే చాలామంది గుడ్డులోని తెల్లసొన మాత్రం తిని పచ్చసొన వదిలేస్తుంటారు. ఎందుకంటే పచ్చసొన మంచిది కాదేమోనని కొందరి అనుమానం.గుడ్డులోని పచ్చసొన తీసుకోవటం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందని భ్రమ పడతారు. అందుకే కేవలం ఎగ్‌వైట్ మాత్రమే తినడానికి ఇష్టపడుతుంటారు. ఇంతకీ కోడిగుడ్డు పచ్చసొన తినొచ్చా? తినకూడదా? ఎప్పటినుంచో ఉన్న ఈ సందేహానికి రీసెంట్గా యూనివర్శిటీ ఆఫ్ కనెక్టికట్ సైంటిస్టులు జరిపిన రీసెర్చ్‌తో ఫుల్స్టాప్ పడింది. ఇంతకీ ఆ అధ్యయనంలో ఏం తేలింది? అన్నది ఈ స్టోరీలో చదివేయండి. కామన్ పీపుల్ నుంచి సెలబ్రిటీల వరకు బ్రేక్‌ఫాస్ట్‌లో చాలామంది గుడ్డు తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఉడకబెట్టిన గుడ్లు. అమ్లెట్, ఫ్రై ఇలా అనేక రూపాల్లో తీసుకుంటారు. అయితే, మనలో చాలామంది పచ్చసొనను తీసుకోవటం అంతగా ఇష్టపడరు. ఎందుకంటే ఇది ఫ్యాట్ ఫుడ్ అని, దీనివల్ల కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుందని భావిస్తారు. తాజాగా ఇదే అంశంపై యూనివర్శిటీ ఆఫ్ కనెక్టికట్ (యుకాన్) సైంటిస్టులు జరిపిన అధ్యయనంలో ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఇందుకోసం 18-35ఏళ్ల వయసున్న 28 మంది ఆరోగ్యవంతులను ఈ రీసెర్చ్ కోసంఎంచుకున్నారు. వీళ్లలో కొందరిని కేవలం ఎగ్ వైట్ తినేలా, మరికొందరిని పచ్చసొనతో కలిపి గుడ్డు మొత్తం తినేలా, మిగిలిన వాళ్లకు గుడ్డు లేని ఆహారం అందించారు. నాలుగు వారాల తర్వాత వారి డైట్‌ను బట్టి జీవక్రియ, హెమటోలాజికల్ ప్రొఫైల్‌లపై గుడ్డు ప్రభావాన్ని పరిశీలించారు. వీరిలో మొత్తం గుడ్డు తిన్న వారి శరీరంలో కోలిన్ అనే పోషకం గణనీయమైన పెరుగుదలను చూపించిందని సైంటిస్టులు తెలిపారు. కోలీన్.. మెదడు, నాడీ వ్యవస్థ, జ్ఞాపకశక్తి, మానసిక స్థితి, కండరాల నియంత్రించడానిక కోలిన్ సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది ట్రైమిథైలామైన్ N-ఆక్సైడ్ (TMAO) ను ఉత్పత్తి చేస్తుంది. సాధారణంగా గుడ్డు పచ్చసొన తింటే కొవ్వు పెరిగి గుండెపై ప్రభావం చూపిస్తుందని అనుకుంటారు. కానీ సైంటిస్టులు జరిపిన ప్రయోగం ప్రకారం.. పచ్చసొన కలిపిన గుడ్డు తిన్నవారిలో TMAO మారలేదని పరిశోధకులు గమనించారు. గుడ్డు మొత్తాన్నితినడం వల్ల మైక్రోన్యూట్రియెంట్ డైట్ క్వాలిటీ, కోలిన్, మంచి కొలెస్ట్రాల్‌లో పెరుగుదల కనిపించిందని సైంటిస్టుల పరిశోధనలో తేలింది. వాస్తవానికి గుడ్డు తెల్లసొనలో ప్రోటీన్ మరియు విటమిన్ B2 చాలా ఎక్కువ. కానీ గుడ్డు పచ్చసొనలో వివిధ విటమిన్లు మరియు ఖనిజాలు ఉన్నాయి, ఇవి మన శరీరానికి కూడా చాలా ముఖ్యమైనవి.ఒక కంప్లీట్ ఎగ్ తినడం వల్ల ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ సమతులంగా అందుతాయి గుడ్డులోని పచ్చసొనలో విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ కె, ఒమేగా 3 వంటి కొవ్వు కరిగే విటమిన్లు ఉన్నాయి. గుడ్డు పచ్చసొనలో సెలీనియం పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. థైరాయిడ్ ఆరోగ్యంలో సెలీనియం కీలకపాత్ర పోషిస్తుంది. పచ్చసొనలో కేలరీలు కూడా తక్కువగా ఉన్నందున బరువు పెరిగే అవకాశాలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. రక్తపోటును నియంత్రించి, గుండె పనితీరును మెరుగుపరచడంలో గుడ్లు ఎంతో ఉపయోగపడతాయని అధ్యయనంలో తేలింది.అసలు చెడు కొవ్వు శరీరంలోకి చేరడానికి ఆహారపు అలవాట్లే కారణమట. జంక్ ఫుడ్స్, మధ్యపానం, ధూమపానం లాంటి వాటితో దీని పరిమాణం పెరుగుతుంది తప్ప గుడ్డులోని పచ్చసొన తీసుకుంటే కాదని తేలింది. ముఖ్యంగా బీపీ, షుగర్ ఉన్న పేషెంట్స్ మినహాయించి ఎవరైనా పచ్చసొనతో కలిపి గుడ్డును తీసుకోవచ్చు. కాబట్టి ఇప్పట్నుంచి నిక్షేపంగా గుడ్డులోని పచ్చసొనను కూడా తినొచ్చన్నమాట.