hiked
-
స్పెషల్ బస్సు పేరుతో టీజీ ఆర్టీసీ నిలువు దోపిడీ
నల్గొండ, సాక్షి: ప్రత్యేక బస్సుల పేరుతో టీజీ ఆర్టీసీ నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయి. దసరా పండుగ ముగిసిన తర్వాత కూడా స్పెషల్ బస్సులు అంటూ రేట్లు పెంచి నేటికి అమలు చేస్తున్నారు. మామూలు రోజుల్లో మిర్యాలగూడ నుంచి హైదరాబాద్‌కు రూ. 290 చార్జ్ ఉండగా.. దసరా సందర్భంగా స్పెషల్ బస్సుల పేరుతో అదనంగా రూ. 70లను ఆర్టీసీ వసూలు చేసింది. ప్రస్తుతం మరో రూ. 40 పెంచి రూ. 110లు అదనంగా వసూలు చేస్తోంది. ప్రస్తుతం మిర్యాలగూడ నుంచి హైదరాబాద్‌కు టికెట్ ధర రూ. 400 వసూలు చేస్తున్నారు. ఇదేంటని ప్రయాణికులు ప్రశ్నిస్తే.. ఉన్నతాధికారులే అమలు చేయమన్నారని కండక్టర్లు సమాధానం ఇస్తున్నారు. ఈ వ్యవహారంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: రైతుల ద్రోహి కాంగ్రెస్: కేటీఆర్ -
షెల్ డీజిల్ లీటర్ 20 పెంపు
న్యూఢిల్లీ: షెల్ ఇండియా తన అవుట్లెట్ల ద్వారా విక్రయించే డీజిల్ ధరను లీటర్‌పై రూ.20 పెంచుతున్నట్టు ప్రకటించింది. వారం లోపే రెండో విడత ధరలను పెంచింది. దేశంలో అధిక వాటా కలిగిన ప్రభుత్వరంగ సంస్థలు మాత్రం ఎలాంటి మార్పుల్లేకుండా అవే రేట్లను కొనసాగిస్తున్నాయి. 2022 ఏప్రిల్ నుంచి ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు విక్రయ ధరల్లో ఎలాంటి సవరణలు చేయకపోవడం గమనించొచ్చు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మే నెలలో 75 డాలర్లలోపు ఉంటే, ప్రస్తుతం 95 డాలర్లపైకి చేరుకోవడం తెలిసిందే. షెల్ ఇండియా గత వారం కూడా లీటర్ డీజిల్‌పై రూ.4 చొప్పున పెంచింది. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 346 పెట్రోల్ స్టేషన్లు ఉన్నాయి. ముంబైలో లీటర్ డీజిల్‌ను రూ.130కు, చెన్నైలో రూ.129 చొప్పున విక్రయిస్తోంది. పెట్రోల్ లీటర్ ధర రూ.117–118గా ఉంది. అదే ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు లీటర్ డీజిల్‌ను రూ.95, లీటర్ పెట్రోల్ ధరను రూ.107 స్థాయిలో విక్రయిస్తుండడం గమనార్హం. ప్రాంతాలను బట్టి ఈ రేట్లలో స్వల్ప మార్పులు ఉంటాయి. -
ముడిచమురుపై విండ్‌ఫాల్ ట్యాక్స్ పెంపు
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపైన, డీజిల్ ఎగుమతులపైన కేంద్రం విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను పెంచింది. దీనితో క్రూడాయిల్‌పై ట్యాక్స్ టన్నుకు రూ. 7,100 మేర పెరిగింది. అలాగే, డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని (ఎస్ఏఈడీ) లీటరుకు రూ. 1 చొప్పున కేంద్రం పెంచింది. దీంతో ఇది లీటరుకు రూ. 5.50కి చేరింది. అటు విమాన ఇంధనం (ఏటీఎఫ్)పై కూడా లీటరుకు రూ. 2 చొప్పున సుంకం విధించింది. ఇప్పటి వరకు ఏటీఎఫ్‌పై ఎస్ఏఈడీ లేదు. తాజా మార్పులు ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్రం తెలిపింది. క్రూడ్ రేట్ల కారణంగా చమురు కంపెనీలు అసాధారణంగా ఆర్జిస్తున్న లాభాలపై కేంద్రం 2022 జూలై 1 నుంచి విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను విధిస్తోంది. -
పెట్రోల్‌కు పెరిగిన డిమాండ్
న్యూఢిల్లీ: పెట్రోల్ విక్రయాలు జూలైలో గతేడాది ఇదే నెలతో పోల్చినప్పుడు 4 శాతం వరకు పెరిగాయి. 2.76 మిలియన్ టన్నుల అమ్మకాలు నమోదయ్యాయి. ముఖ్యంగా జూలై మాసంలో మొదటి 15 రోజుల్లో పెట్రోల్ వినియోగం తగ్గగా, తదుపరి 15 రోజుల్లో గణనీయంగా పుంజుకుంది. అయితే నెలవారీగా (జూన్‌తో పోలి్చనప్పుడు) చూస్తే పెట్రోల్ అమ్మకాలు 4.6 శాతం తగ్గాయి. మరోవైపు డీజిల్ అమ్మకాల్లో విరుద్ధమైన పరిస్థితి కనిపించింది. ప్రధానంగా డీజిల్‌ను రవాణా రంగంలో వినియోగిస్తారు. కనుక, వర్షాల ప్రభావం వినియోగంపై పడినట్టు తెలుస్తోంది. డీజిల్ అమ్మకాలు 4.3 శాతం తగ్గి 6.15 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. దేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే పెట్రోలియం ఉత్పత్తి ఇదే కావడం గమనార్హం. వర్షాల సమయంలో ఏటా డీజిల్ అమ్మకాలు తగ్గుతుండడం సాధారణంగానే కనిపిస్తుంటుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 6.7 శాతం, మే నెలలో 9.3 శాతం చొప్పున డీజిల్ అమ్మకాలు పెరగడం గమనించొచ్చు. ఇక ఈ ఏడాది జూన్ నెలలోని అమ్మకాలతో పోల్చి చూసినా, జూలైలో డీజిల్ విక్రయాలు (7.13 మిలియన్ టన్నులు) 13.7 శాతం తగ్గాయి. భారత్‌లో ఆయిల్ డిమాండ్ రోజువారీగా 0.2 మిలియన్ బ్యారెళ్ల చొప్పున 2023లో ఉంటుందని చమురు ఉత్పత్తి దేశాల సమాఖ్య ఓపెక్ అంచనాగా ఉంది. ఇక విమాన సేవలకు డిమాండ్ గణనీయంగా పెరగడంతో ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) డిమాండ్ సైతం 10 శాతం పెరిగి జూలైలో 6,03,500 టన్నులుగా నమోదైంది. 2021 జూలైలో వినియోగంతో పోలిస్తే రెట్టింపు కాగా, కరోనా ముందు నాటి సంవత్సరం 2019 జూలైలో వినియోగంతో పోల్చి చూస్తే 2.9 శాతం తక్కువగా ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. జూలైలో వంటగ్యాస్ (ఎల్పీజీ) అమ్మకాలు క్రితం ఏడాది ఇదే నెలతో పోలి్చచూసినప్పుడు 1.7 శాతం తగ్గి 2.46 మిలియన్ టన్నులుగా నమోదైంది. జూన్ నెలతో పోల్చి చూస్తే కనుక 8 శాతం ఎల్పీజీ అమ్మకాలు పెరిగాయి. -
హైదరాబాద్‌లో పెరిగిన ప్రాపర్టీల ధరలు
న్యూఢిల్లీ: హైదరాబాద్ సహా దేశంలోని ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ఇళ్ల ధరలు జనవరి–మార్చి మధ్య పెరిగినట్టు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) గణాంకాలు వెల్లడించాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్లో ధరలు 7.9 శాతం పెరిగాయి. అత్యధికంగా కోల్‌కతాలో 11 శాతం, అహ్మదాబాద్‌లో 10.8 శాతం, బెంగళూరులో 9.4 శాతం మేర ఇళ్ల ధరలు ఎగిశాయి. చెన్నైలో 6.8 శాతం, ఢిల్లీలో 1.7 శాతం, ముంబైలో 3.1 శాతం, పుణెలో 8.2 శాతం చొప్పున పెరిగినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా టాప్–50 పట్టణాల్లో కేవలం ఏడు పట్టణాల్లోనే ఇళ్ల ధరలు తగ్గాయి. గృహ రుణాలపై రేట్లు ఇప్పటికీ కరోనాకు ముందున్న నాటితో పోలిస్తే తక్కువలోనే ఉండడం, కొనుగోళ్లకు మద్దతుగా నిలుస్తోంది. 50 పట్టణాల్లో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంక్‌ల వద్దనున్న ప్రాపర్టీ వ్యాల్యూషన్లను ఎన్‌హెచ్‌బీ పరిగణనలోకి తీసుకుంది. ఈ పట్టణాల్లో ఇళ్ల ధరలు సగటున 5.8 శాతం మేర మార్చి త్రైమాసికంలో పెరిగినట్టు తెలుస్తోంది. (సరికొత్త ఫీచర్లతో ప్రీమియం హీరో బైక్ వచ్చేస్తోంది: ఎప్పుడంటే?) క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రేట్ల పెరుగుదల 5.3 శాతంగా ఉండడం గమనార్హం. టాప్–50లో అత్యధికంగా గాంధీనగర్‌లో ఇళ్ల ధరలు 19.6 శాతం పెరిగితే, లుధియానాలో 12.9 శాతం తగ్గాయి. ఇక త్రైమాసికం వారీగా చూస్తే.. అంటే 2022 చివరి మూడు నెలలతో పోలిస్తే, 2023 మొదటి మూడు నెలల్లో ఇళ్ల ధరలు 50 పట్టణాల్లో సగటున 1.3 శాతం పెరిగాయి. 2021 జూన్ నుంచి ప్రతీ త్రైమాసికానికి రేట్లు పెరుగుతూ వస్తుండడాన్ని ఉండడాన్ని నివేదిక ప్రస్తావించింది. ఇదీ చదవండి: 1200 లోన్‌తో మొదలై.. రూ 2.58 లక్షల కోట్లకు మరిన్ని రియల్టీ వార్తలు, బిజినెస్ అప్డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త ధరలు - ఇలా ఉన్నాయి
Ola Electric Price Hiked: భారతదేశంలో రోజు రోజుకి మంచి అమ్మకాలతో దూసుకెళ్తున్న 'ఓలా ఎలక్ట్రిక్' ఇప్పుడు కస్టమర్లకు ఒక షాకింగ్ న్యూస్ వెల్లడించింది. కంపెనీ ఇప్పుడు తన ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను అమాంతం పెంచినట్లు ప్రకటించింది. ఓలా ఎలక్ట్రిక్ కొత్త ధరలను గురించి మరికొన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కొత్త ధరలు.. నివేదికల ప్రకారం.. ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 & ఎస్1 ప్రో ధరలు మాత్రమే పెరిగాయి. ఎంట్రీ లెవెల్ మోడల్ అయిన 'ఎస్1 ఎయిర్' ధరలు మారలేదు. ఓలా మిడ్-స్పెక్ ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేరియంట్లనులో లభిస్తుంది. అవి ఒకటి 2 కిలోవాట్ బ్యాటరీ కలిగిన వేరియంట్, రెండు 3 కిలోవాట్ బ్యాటరీ కలిగిన వేరియంట్. గతంలో ఎస్1 3kWh ధర రూ. 1.15 లక్షలు కాగా, ఇప్పుడు ఈ స్కూటర్ ధర రూ. 15,000 పెరిగి రూ. 1.30 లక్షలు చేరింది. అదే సమయంలో S1 ప్రో ధర రూ. 1.40 లక్షలకు చేరింది. (ఇదీ చదవండి: ఇప్పుడు ప్రపంచ కుబేరుడు ఇతడే..) ఇక ఓలా ఎలక్ట్రిక్ ఎంట్రీ లెవెల్ మోడల్ ఎస్1 ఎయిర్ విషయానికి వస్తే, ఇది 2kWh, 3kWh, 4kWh అనే మూడు బ్యాటరీ ఫ్యాక్స్ కలిగి ఉంటుంది. వీటి ధరలు వరుసగా రూ. 84999, రూ. 99999, రూ. 1.10 లక్షలు. రేంజ్ విషయానికి వస్తే 85 కిమీ, 125 కిమీ, 165 కిమీ. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇవి చాలా ఉత్తమంగా ఉంటాయి. ధరల పెరుగుదల అమ్మకాలపైన ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నాము. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
బంగారం డిమాండ్‌కు ధర సెగ
ముంబై: దేశంలో బంగారం ధరలు తీవ్ర స్థాయికి చేరడంతో, జనవరి–మార్చి త్రైమాసికంలో డిమాండ్ భారీగా 17 శాతం పడిపోయింది. వినియోగదారులు తీవ్ర ధరల కారణంగా కొనుగోళ్లను వాయిదా వేసుకునే పరిస్థితి నెలకొంది. ‘మొదటి త్రైమాసికంలో పసిడి డిమాండ్ ట్రెండ్స్’ పేరుతో ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) విడుదల చేసిన ఒక నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు... ► ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో భారత్ పసిడి డిమండ్ 112.5 టన్నులు. 2022 ఇదే కాలంలో ఈ విలువ 135.5 టన్నులు. ► పసిడి ఆభరణాల డిమాండ్ ఇదే కాలంలో 94.2 టన్నుల నుంచి 78 టన్నులకు పడిపోయింది. 2010 నుంచి ఒక్క మహమ్మారి కరోనా కాలాన్ని మినహాయిస్తే పసిడి ఆభరణాల డిమాండ్ మొదటి త్రైమాసికంలో 100 టన్నుల దిగువకు పడిపోవడం ఇది నాల్గవసారి. ► విలువల రూపంలో చూస్తే, మొత్తంగా పసిడి కొనుగోళ్లు 9 శాతం క్షీణించి రూ.61,540 కోట్ల నుంచి రూ.56,220 కోట్లకు పడిపోయాయి. ► ఒక్క ఆభరణాల డిమాండ్ విలువల్లో చూస్తే, 9 శాతం పడిపోయి రూ.42,800 కోట్ల నుంచి రూ.39,000 కోట్లకు పడిపోయాయి. ► పెట్టుబడుల పరిమాణం పరంగా డిమాండ్ (కడ్డీలు, నాణేలు) 17 శాతం తగ్గి 41.3 టన్నుల నుంచి 34.4 టన్నులకు క్షీణించింది. ప్రపంచ పసిడి డిమాండ్ కూడా మైనస్సే.. ఇదిలావుండగా, ప్రపంచ వ్యాప్తంగా కూడా పసిడి డిమాండ్ మొదటి త్రైమాసికంలో బలహీనంగానే నమోదయ్యింది. 13 శాతం క్షీణతతో ఈ పరిమాణం 1,080.8 టన్నులుగా ఉంది. రూపాయి ఎఫెక్ట్... పసిడి ధరలు పెరడానికి అంతర్జాతీయ అంశాలు ప్రధాన కారణంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ ఫండ్ రేటు పెరుగుదలను ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. డాలర్ బలోపేతం, రూపాయి బలహీనత వంటి కారణాలతో గత ఏడాదితో పోల్చితే పసిడి ధర 19 శాతం పెరిగింది. పసిడి 10 గ్రాముల (స్వచ్ఛత) ధర రూ.60,000 పైన నిలకడగా కొనసాగుతోంది. ధర తీవ్రతతో తప్పనిసరి పసిడి అవసరాలకు వినియోగదారులు తమ పాత ఆభరణాల రీసైక్లింగ్, తద్వారా కొత్త కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పెట్టుబడులకు సంబంధించి డిజిటల్ గోల్డ్ ప్లాట్‌ఫామ్‌ను ఆశ్రయిస్తున్నారు. ఈ విభాగంలో కొనుగోళ్ల పరిమాణాలు కొంత మెరుగుపడుతున్నాయి. డిమాండ్ వార్షికంగా 750 నుంచి 800 టన్నలు శ్రేణిలో నమోదుకావచ్చు. – సోమసుందరం, డబ్ల్యూజీసీ భారత్ రీజినల్ సీఈఓ -
డెబిట్ కార్డు చార్జీల పెంపు!
ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ కస్టమర్లకు చేదు వార్త చెప్పింది. డెబిట్ కార్డ్ వార్షిక చార్జీలను రూ.60 మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బ్యాంక్ కస్టమర్లకు ఈ-మెయిల్ ద్వారా తెలియజేసింది. ఇదీ చదవండి: అనుకోకుండా అన్నా.. ‘డాలర్ ఫైనాన్సియల్ టెర్రరిస్ట్’ వ్యాఖ్యపై ఉదయ్ కోటక్ వివరణ రూ.60 బాదుడు కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇప్పటివరకు డెబిట్ కార్డ్ వార్షిక చార్జీ కింద రూ.199 వసూలు చేస్తోంది. దీనికి జీఎస్టీ అదనం. ఈ చార్జీని ఇప్పుడు రూ.259 లకు పెంచింది. దీంతో పాటు జీఎస్టీ అదనంగా ఉంటుంది. అంటే రూ.60 మేర చార్జీ పెరుగుతుందన్న మాట. పెరిగిన చార్జీలు మే 22 నుంచి అమలులోకి వస్తాయి. అలాగే ఈ చార్జీలు బ్యాంకులోని అన్ని రకాల ఖాతాలకు వర్తిస్తాయి. ఇక జూన్ 1 నుంచి సేవింగ్స్, శాలరీ అకౌంట్లకు సంబంధించి అమలయ్యే ఛార్జీలు ఇలా ఉన్నాయి.. అకౌంట్లో కనీస బ్యాలెన్స్ లేకుంటే.. 6 శాతం లేదా గరిష్టంగా రూ. 600 వరకు ఛార్జీ వసూలు చేస్తుంది. ఇష్యూ చేసిన చెక్ ఏదైనా నాన్ ఫైనాన్షియల్ కారణంతో రిటర్న్ అయితే రూ. 50 ఛార్జీ పడుతుంది. అలాగే చెక్ డిపాజిట్ అయిన తర్వాత రిటర్న్ అయితే రూ.200 చార్జీ ఉంటుంది. ఇదీచదవండి: International labour Day: 23 దేశాల్లో జీతాలు రూ.లక్షకుపైనే.. మరి భారత్‌లో...? -
వీసా దరఖాస్తు ఫీజులు పెంచిన అమెరికా
న్యూఢిల్లీ: అమెరికాకు వచ్చే వారి టూరిస్ట్, స్టూడెంట్ వీసా దరఖాస్తుల ఫీజును పెంచుతున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. విజిటర్ వీసాలు, నాన్ పిటిషన్ బేస్డ్ నాన్ ఇమిగ్రాంట్ వీసాల ఫీజును ప్రస్తుతమున్న 160 డాలర్ల నుంచి 185 డాలర్లకు పెంచుతున్నట్లు పేర్కొంది. అదేవిధంగా, తాత్కాలిక వృత్తిదారులు(టెంపరరీ వర్కర్స్)కిచ్చే కొన్ని రకాల నాన్ ఇమిగ్రాంట్ వీసాల ఫీజు ప్రస్తుతం ఉన్న 190 డాలర్ల నుంచి 205 డాలర్లకు పెరుగుతుందని తెలిపింది. ప్రత్యేక వృత్తినిపుణు(స్పెషలిజం ఆక్యుపేషన్)లకు ఫీజును 315 డాలర్లకు పెంచుతున్నట్లు పేర్కొంది. ఈ నిర్ణయం మే 30వ తేదీ నుంచి అమల్లోకి రానుందని ప్రకటించింది. కాన్సులర్ సేవల ఫీజుల్లో ఎటువంటి మార్పులు లేవని స్పష్టం చేసింది. -
ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరలు.. భారీగా పెరగనున్న కార్లు, బైక్‌ల ధరలు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా అన్ని రకాల వాహనాల ధరలు ప్రియం కానున్నాయి. కాలుష్యాన్ని కట్టడి చేసే చర్యల్లో భాగంగా భారత్ స్టేజ్ - 6 రెండవ దశ ఉద్గార ప్రమాణాలు వచ్చే నెల నుంచి అమలులోకి వస్తుండడమే ఇందుకు కారణం. ప్యాసింజర్, ద్విచక్ర, వాణిజ్య వాహనాలకు ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరలు వర్తించనున్నాయి. చాలా కంపెనీలు ఇప్పటికే ధరలను సవరిస్తున్నట్టు ప్రకటించాయి. మారుతీ సుజుకీ, హోండా కార్స్, టాటా మోటార్స్, హీరో మోటోకార్ప్ వంటి సంస్థలు వీటిలో ఉన్నాయి. ఖరీదు రూ.30,000 వరకు.. ప్రమాణాలకు అనుగుణంగా కంపెనీలు తమ వాహనాలను అప్‌గ్రేడ్ చేశాయి. దీంతో ప్యాసింజర్ కార్లు మోడల్, వేరియంట్‌నుబట్టి రూ.10,000 మొదలుకుని రూ.30,000 వరకు ధరలు పెరగనున్నాయి. ప్రారంభ స్థాయి ద్విచక్ర వాహనాలు రూ.2,500 దాకా భారం కానున్నాయి. ఇప్పటికే ముడిసరుకు వ్యయాలకు అనుగుణంగా కంపెనీలు వాహనాల ధరలను పెంచుతూ వస్తున్నాయి. అన్ని రకాల వాహన విభాగాల్లోనూ తయారీ కంపెనీలు ధరలను సవరించాయి. వాహనాల్లో మార్పులు.. నూతన ఉద్గార ప్రమాణాల కింద వాహనాలకు ఆధునిక సాంకేతికత వినియోగించాల్సి వస్తోంది. ప్రోగ్రామ్‌తో కూడిన ఫ్యూయల్ ఇంజెక్టర్స్, సెల్ఫ్ డయాగ్నోస్టిక్ డివైసెస్ ఏర్పాటు తప్పనిసరి అయింది. వాహనం నుంచి వెలువడే కాలుష్య స్థాయిని తెలిపే పరికరం అమర్చాల్సి ఉంటుంది. యూరప్‌లో అమలులో ఉన్న యూరో- 6 ప్రమాణాలకు సమానంగా భారత్ స్టేజ్- 6 రెండవ దశ ఉద్గార ప్రమాణాలను తీర్చిదిద్దారు. దీంతో వాహనాల్లోని ఇంజిన్లను అప్‌గ్రేడ్ చేయాల్సి వస్తోంది. ఇప్పటికే పరిశ్రమలో 7,00,000 ప్యాసింజర్ కార్లకు బుకింగ్స్ నమోదై ఉన్నాయి. ధర పెరగడం వల్ల డిమాండ్ తగ్గే అవకాశం లేదని కంపెనీలు ధీమాగా ఉన్నాయి. వ్యయ భారంతో.. ప్రమాణాలకు అనుగుణంగా ఇంజన్లలో మార్పుల ప్రక్రియ ఖర్చుతో కూడుకున్నది. అధికంగా డిమాండ్ ఉన్న మోడళ్లను మాత్రమే కంపెనీలు అప్‌గ్రేడ్ చేస్తున్నాయి. డిమాండ్ తక్కువ ఉన్న మోడళ్లకు స్వస్తి పలకడం తప్పడం లేదు. ఏప్రిల్ 1 నుంచి ఇటువంటివి కనుమరుగు కానున్నాయి. వీటిలో మారుతీ సుజుకీ ఆల్టో 800, హోండా జాజ్, డబ్ల్యూఆర్–వి, అమేజ్ డీజిల్, సిటీ జనరేషన్-4, సిటీ జనరేషన్-5 డీజిల్, మహీంద్రా ఆల్టరస్ జీ4, కేయూవీ100, మరజ్జో, స్కోడా అక్టావియా, సూపర్బ్, హ్యుండై ఐ20 డీజిల్, వెర్నా డీజిల్, రెనో క్విడ్ 800, నిస్సాన్ కిక్స్, టాటా ఆ్రల్టోజ్ డీజిల్, టయోటా ఇన్నోవా క్రిస్టా పెట్రోల్ మోడళ్లు ఉన్నాయి. -
ఒకటి తగ్గింది.. మరొకటి పెరిగింది: ఇదీ టయోటా హైలెక్స్ ధరల వరుస!
భారతదేశంలో కేవలం కార్లకు, బైకులకు మాత్రమే కాకుండా పికప్ ట్రక్కులకు కూడా మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని టొయోటా కంపెనీ గత ఏడాది 'హైలెక్స్' (Hilux) విడుదల చేసింది. అయితే కంపెనీ ఇప్పుడు ఒక వేరియంట్ ధరలను కొంత తగ్గించింది, మరో వేరియంట్ ధరలను పెంచింది. వేరియంట్స్ & ధరలు: నిజానికి టొయోటా హైలెక్స్ స్టాండర్డ్, హై అనే రెండు ట్రిమ్‌లలో లభిస్తుంది. ఇప్పుడు స్టాండర్డ్ మోడల్ మీద ఏకంగా రూ. 3.59 లక్షలు తగ్గించింది. కావున ప్రస్తుతం ఈ వేరియంట్ ధర రూ. 30.40 లక్షలు. అదే సమయంలో హై మ్యాన్యువల్, ఆటోమాటిక్ మీద వరుసగా రూ. 1.35 లక్షలు, రూ. 1.10 లక్షలు పెంచింది. దీని ప్రస్తుత ధరలు రూ. 37.15 లక్షలు, రూ. 37.90 లక్షలు. టయోటా ఈ ఏడాది ప్రారంభంలో తన రెండవ బ్యాచ్ బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. కాగా ఇప్పుడు ఒక మోడల్ మీద భారీగా ధరలను తగ్గించి, మరో మోడల్ ధరలను పెంచింది. ధరల పెరుగుదల అమ్మకాల మీద ప్రభావం చూపే అవకాశం ఉందా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. డిజైన్ & ఫీచర్స్: టయోటా హైలక్స్ ఆధునిక డిజైన్ పొందుతుంది. ఇందులో పెద్ద హెక్సాగోనల్ ఫ్రంట్ గ్రిల్ ఉంటుంది, దీనికి రెండు వైపులా ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్లైట్లు ఇవ్వబడ్డాయి. ఈ పికప్ ట్రక్కు అల్లాయ్ వీల్స్‌తో పాటు వీల్ ఆర్చ్‌ల చుట్టూ ప్లాస్టిక్ క్లాడింగ్ పొందుతుంది. దీని డిజైన్ దాదాపు ఫార్చ్యూనర్ మాదిరిగానే ఉంటుంది. ఇది వర్టికల్ టెయిల్ లైట్ మరియు డబుల్ క్యాబ్ స్టైలింగ్ పొందుతుంది. (ఇదీ చదవండి: భార్య గురించి అలా ట్వీట్ చేసిన అష్నీర్ గ్రోవర్) ఇంటీరియర్ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో ఆపిల్ కార్ప్లే & ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 8.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మౌంటెడ్ కంట్రోల్‌లతో కూడిన మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. కొలతలు: టయోటా ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యూనర్ మాదిరిగానే ఈ కొత్త పికప్ ట్రక్కును కూడా IMV-2 ల్యాడర్ ఫ్రేమ్ ఛాసిస్‌పై నిర్మించబడింది. కావున దీని పొడవు 5,325 మి.మీ, వెడల్పు 1,855 మి.మీ, ఎత్తు 1,865 మి.మీ, వీల్‌బేస్ 3,085 మి.మీ వరకు ఉంటుంది. అదే సమయంలో దీని గ్రౌండ్ క్లియరెన్స్ 216 మి.మీ కాగా, బరువు 2.1 టన్నులు వరకు ఉంటుంది. మొత్తం మీద భారతదేశంలో అమ్ముడవుతున్న వాహనాల్లో ఇదే భారీ వాహనం అని చెప్పాలి. ఇంజిన్: టయోటా హైలక్స్ 2.8 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ ద్వారా 204 బిహెచ్పి పవర్ 420 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇందులో ఫోర్ వీల్ డ్రైవ్ స్టాండర్డ్‌గా అందుబాటులో ఉంటుంది. (ఇదీ చదవండి: విడుదలకు సిద్దమవుతున్న మారుతి కార్లు: కొత్త జిమ్నీ నుంచి ఫ్రాంక్స్ వరకు..) ప్రత్యర్థులు: దేశీయ మార్కెట్లో అమ్ముడవుతున్న టయోటా హైలక్స్ ఒక ప్రత్యేకమైన విభాగంలో ఉండటం వల్ల దీనికి ప్రధాన ప్రత్యర్థులు లేదు. అయిత్ ఇది 'ఇసుజు D-Max V-క్రాస్'కి అమ్మకాల్లో ప్రత్యర్థిగా నిలిచే అవకాశం ఉంది. కానీ దీని ధర హైలక్స్ కంటే చాలా తక్కువ. -
మరోసారి వడ్డీరేట్లు పెంచిన RBI
-
కేంద్ర ప్రభుత్వోద్యోగులకు... 4% డీఏ పెంపు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక లభించింది. ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని (డీఏ), 4 శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈ పెరుగుదల జులై 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వంలోని 41.85 లక్షల మంది ఉద్యోగులకు, 69.76 లక్షల మంది ఫించనుదారులకు లబ్ధి చేకూరుతుంది. మూల వేతనంపై 34శాతంగా ఉన్న డీఏకి అదనంగా 4% పెంచడంతో 38శాతానికి చేరుకుంది. ఈ పెంపుతో ఖజానాపై ఏడాదికి 12.852 కోట్ల అదనపు భారం పడుతుంది. మరో మూడు నెలలు ఉచితంగా రేషన్ కరోనా సంక్షోభ సమయంలో లాక్డౌన్లతో ఉపాధి కోల్పోయిన నిరుపేదల్ని ఆదుకోవడానికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) పేరుతో ఉచితంగా ఇచ్చే రేషన్ పథకం ఈ శుక్రవారంతో ముగిసిపోనుంది. ధరల భారం, పండుగ సీజన్ వస్తూ ఉండడంతో మరో మూడు నెలలు ఉచితంగా రేషన్ అందించాలని కేంద్ర మంత్రిమండలి నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎంజీకేఏవై కింద ఉచిత రేషన్ పథకాన్ని మరో మూడు నెలలు కొనసాగించాలని నిర్ణయించింది. వివరాలను కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు గరీబ్ కళ్యాణ్ అన్న యోచన పథకం కింద నిరుపేదలు ఒక్కొక్కరికి ప్రతీ నెల 5 కేజీల బియ్యం, గోధుమలు ఉచితంగా అందిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఈ పథకాన్ని పొడిగించడంతో కేంద్రానికి అదనంగా రూ.44,762 కోట్లు ఖర్చు అవుతుంది. ప్రతీ నెల 80 కోట్ల మంది ఉచిత రేషన్‌ని తీసుకుంటున్నారు. రైల్వేల అభివృద్ధికి రూ.10వేల కోట్లు రైల్వేల అభివృద్ధి ప్రాజెక్టుకి రూ.10 వేల కోట్లు కేటాయించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయింది. న్యూఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై సీఎస్ఎంటీ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కోసం రైల్వే చేసిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అత్యంత ఆధునిక టెక్నాలజీతో ఈ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ 2.5 నుంచి మూడున్నరేళ్లలో పూర్తి చేయనున్నట్టు రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ వెల్లడించారు. -
మూడు నెలల కనిష్టమే.. అయినా రెండంకెల పైనే!
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జూన్‌లో 15.18 శాతంగా నమోదయ్యింది. అంటే 2021 జూన్‌తో పోల్చితే ఈ బాస్కెట్ ధర 15.18 శాతం పెరిగిందన్నమాట. ఇది మూడు నెలల కనిష్ట స్థాయి. మే నెలతో పోల్చితే ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ, రెండంకెలపైనే ఈ రేటు కొనసాగడం ఇది వరుసగా 15వ నెల. ఆహార ధరలు మాత్రం తీవ్రంగా కొనసాగుతుండడం ఆందోళన కలిగించే అంశం. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం కొన్ని కీలక విభాగాలను పరిశీలిస్తే.. ► ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం జూన్‌లో 14.39 శాతం. మేతో ఈ రేటు 12.34 శాతంగా ఉంది. కూరగాయలు (56.75%), ఆలూ (39.38%), పండ్ల (20.33%) ధరలు భారీగా పెరిగాయి. ► ఖనిజాల ధరలు మాత్రం 8.55% తగ్గాయి. ► క్రూడ్ పెట్రోలియం, సహజవాయువు ధరలు 77.29 శాతం ఎగశాయి. ► కాగా, జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.01%గా నమోదైంది. -
ఎరుపెక్కుతున్న టమాటా.. కిలో రూ.100
సాక్షి, న్యూఢిల్లీ: టమాటా ఎరుపెక్కుతోంది. సరఫరా తగ్గడంతో పలు రాష్ట్రాల్లో టమాటా ధరలు కొండెక్కుతున్నాయి. కేరళలో రూ.100 మార్కును చేరింది. ఒడిశాలో రూ.90, కర్నాటకలో రూ.70, ఏపీ, తెలంగాణల్లోనూ రూ.60కి పైగా పెరిగినట్టు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ నివేదిక చెప్తోంది. తీవ్ర ఎండలకు వేడిగాలులు తోడవడంతో టమాటా ఉత్పత్తి బాగా పడిపోయింది. టమాటా ఉత్పత్తిలో ముందున్న ఏపీ, ఒడిశాల్లో అసని తుఫాన్‌తో పంట బాగా దెబ్బ తింది. ఏపీలో విశాఖ, కర్నూలు, తిరుపతిల్లో కిలో రూ.50–70 పలుకుతున్నట్టు వినియోగదారుల శాఖ నిత్యావసర సరుకుల ధరల డేటా పేర్కొంది. -
ఎల్లుండి నిర్మాణ పనులు బంద్
సాక్షి, హైదరాబాద్: సిమెంట్, స్టీల్, అల్యూమి నియం, పీవీసీ పైపులు వంటి అన్ని రకాల నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదలను అన్ని డెవలపర్ల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ధరల పెరుగుదలకు నిరసనగా ఈనెల 4న (సోమవారం) హైదరాబాద్ వ్యాప్తంగా ఒక్క రోజు నిర్మాణ పనులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ధరలు పెరగడం వల్ల నగదు ప్రవాహానికి ఇబ్బందిగా మారడంతో పాటు డెవలపర్లకు వర్కింగ్ క్యాపిటల్ సమస్య కూడా వస్తుందని సంఘాలు ముక్తకంఠంతో తెలిపాయి. నిర్మాణ వ్యయాలు గణనీయంగా పెరగడం వల్ల 600కు పైగా డెవలపర్లపై తీవ్ర ప్రభావం పడుతుందని, దీంతో గృహాల ధరలు 10–15 శాతం మేర పెరుగుతాయని తెలిపాయి. క్రెడాయ్, ట్రెడా , టీబీఎఫ్, టీడీఏ ప్రతినిధులు శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) తెలంగాణ చైర్మన్ సీహెచ్ రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ.. అనిశ్చితి పరిస్థితులలో కొంతమంది బిల్డర్లు ప్రాజెక్ట్‌ల నిర్మాణాలను ఆపేశారని, ముడి పదార్థాల ధరలు తగ్గిన తర్వాత ప్రాజెక్ట్‌లను పునః ప్రారంభించడానికి యోచిస్తున్నారన్నారు. దేశంలో రెండో అతిపెద్ద ఉపాధి రంగమైన స్థిరాస్తి రంగంలో నిర్మాణ పనులను నిలిపివేస్తే.. ఈ రంగంపై ఆధారపడిన వారి జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. అలాగే ఆర్థిక వ్యవస్ధ వృద్ధిపై కూడా ప్రభావం చూపుతుందన్నారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లపై ఇన్పుట్ ట్యాక్స్ తగ్గించడంతో పాటు జీఎస్టీని సరళీకృతం చేయాలని ఆయన సూచించారు. నిర్మాణ రంగ ముడి పదార్థాల ప్రస్తుత ధరలను హేతుబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ తెలంగాణ ప్రెసిడెంట్ డీ మురళీ కృష్ణారెడ్డి, హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ పీ రామకృష్ణారావు, జనరల్ సెక్రటరీ వీ రాజశేఖర్ రెడ్డిలు కూడా పాల్గొన్నారు. వీళ్లేమన్నారంటే.. ► తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) అధ్యక్షులు సునీల్ చంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఇన్పుట్ వ్యయాలు పెరగడం, మార్జిన్లు తగ్గడంతో డెవలపర్లకు ఆర్థిక కష్టాలు పెరిగాయి. పెరిగిన నిర్మాణ సామగ్రి ధరల నేపథ్యంలో డెవలపర్లకు ప్రస్తుత ప్రాజెక్ట్‌లలో ధరలు పెంచడం మినహా వేరే అవకాశం లేదని ఆయన తెలిపారు. ► తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్) అధ్యక్షులు సీ ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. మార్కెట్లో తిరిగి సానుకూల వాతావరణం నెలకొనాలంటే.. కేంద్ర జీఎస్టీ రేట్లను తగ్గించి ఇన్పుట్ క్రెడిట్‌ను అందించాలని, అలాగే రాష్ట్ర ప్రభు త్వం స్టాంప్ డ్యూటీ తగ్గించాలన్నారు. ► తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ (టీడీఏ) ప్రెసిడెంట్ జీవీ రావు మాట్లాడుతూ.. ఇన్పుట్ వ్యయం పెరిగిన నేపథ్యంలో డెవలపర్లు ధరలను పెంచక తప్పదని అయితే ఈ పెంపు అన్ని రకాల గృహాలపై పడుతుందన్నారు. పర్సంటేజీ పరంగా చూస్తే అందుబాటు ధరల విభాగంలోని గృహాలపై ధరల పెరుగుదల ప్రభావం ఉంటుందన్నారు. -
14 కేజీల వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెంపు
-
సంపద పెరిగింది.. సంతోషం తగ్గింది!
ముంబై: దేశీయంగా డాలర్ మిలియనీర్ల (రూ. 7 కోట్ల పైగా వ్యక్తిగత సంపద ఉన్న వారు) సంఖ్య 2021లో 4.58 లక్షల కుటుంబాల స్థాయికి చేరింది. అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే ఇది 11 శాతం అధికం. హురున్ రిపోర్ట్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2026 నాటికి భారత్‌లో డాలర్ మిలియనీర్ల సంఖ్య 30 శాతం పెరిగి 6 లక్షల కుటుంబాల స్థాయికి చేరనుంది. ముంబైలో అత్యధికంగా 20,300 కుటుంబాలు, ఢిల్లీలో 17,400, కోల్‌కతాలో 10,500 కుటుంబాలు డాలర్ మిలియనీర్ల కేటగిరీలో ఉన్నాయి. మరోవైపు, ఇటు వ్యక్తిగత అటు వృత్తిగత జీవితాల్లో సంతోషంగా ఉన్న వారి సంఖ్య మాత్రం 72 శాతం నుంచి 66 శాతానికి తగ్గింది. ఈ అంశానికి సంబంధించి హురున్ నిర్వహించిన సర్వేలో 350 మంది డాలర్ మిలియనీర్లు పాల్గొన్నారు. ‘భారత మార్కెట్లో అడుగు పెట్టడానికి లేదా ఇప్పటికే ఉన్న తమ కార్యకలాపాలను మరింత పటిష్టం చేసుకోవడానికి లగ్జరీ బ్రాండ్లు, సర్వీస్ ప్రొవైడర్లకు వచ్చే దశాబ్ద కాలంలో ఎన్నో అర్థవంతమైన అవకాశాలు లభించగలవు‘ అని హురున్ ఇండియా ఎండీ, చీఫ్ రిసర్చర్ అనాస్ రెహ్మాన్ జునైద్ చెప్పారు. 130 కోట్ల పైగా జనాభా గల దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్న ప్రస్తుత తరుణంలో కుబేరులపై హురున్ నివేదికలోని అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. స్వచ్ఛంద సంస్థ ఆక్స్‌ఫామ్ ఇటీవలి నివేదిక ప్రకారం భారత్‌లోని టాప్ 100 మంది సంపన్నుల సంపద ఏకంగా 775 బిలియన్ డాలర్లుగా ఉంది. 2021లో ప్రపంచం మొత్తం మీద కడు పేదరికంలోకి జారిపోయే వారి సంఖ్యలో దాదాపు సగభాగం (4.6 కోట్ల మంది) భారత్‌లోనే ఉంటారని ఆక్స్‌ఫామ్ అంచనా వేసింది. సర్వేలోని ఇతర విశేషాలు.. ► పన్నులు చెల్లించడమనేది తమ సామాజిక బాధ్యతకు నిదర్శనంగా భావించే వారి సంఖ్య.. సర్వేలో పాల్గొన్న వారిలో మూడో వంతుకన్నా తక్కువే ఉంది. ► సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని అభిప్రాయపడిన వారి సంఖ్య కేవలం 19 శాతమే. ► మూడింట రెండొంతుల మంది తమ సంతానాన్ని ఉన్నత విద్య కోసం విదేశాలు పంపించేందుకు ప్రాధాన్యమిస్తామని చెప్పారు. ఫేవరెట్ గమ్యంగా అమెరికా ఉండగా, బ్రిటన్, న్యూజిలాండ్, జర్మనీ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ► ఇక వినియోగంపరమైన అంశాల విషయానికొస్తే.. నాలుగో వంతు మంది తమ కార్లను ప్రతి మూడేళ్లకోసారి మార్చేస్తున్నారు. చాలా మందికి మెర్సిడెస్ బెంజ్ కార్లు ఫేవరెట్‌గా ఉంటున్నాయి. ఇంకా మిలియనీర్లకు అత్యంత ఇష్టమైన హాబీల్లో.. వాచీల కలెక్షన్ కూడా ఉంది. సర్వేలో పాల్గొన్న మూడింట రెండొంతుల మంది.. తమ దగ్గర కనీసం నాలుగు వాచీలైనా ఉన్నట్లుగా తెలిపారు. మళ్లీ వీటిలో రోలెక్స్ అత్యంత ఇష్టమైన బ్రాండ్‌గా ఉంది. ► ఆతిథ్యానికి సంబంధించి అత్యధిక శాతం మంది ఇష్టపడే హోటల్‌గా ఇండియన్ హోటల్స్‌కి చెందిన తాజ్, ఫేవరెట్ ఆభరణాల రిటైలర్‌గా తనిష్క్ (రెండూ టాటా గ్రూప్‌నకు చెందివే) అగ్రస్థానంలో ఉన్నాయి. లగ్జరీ ఉత్పత్తుల బ్రాండ్ లూయి విటన్, ప్రైవేట్ జెట్ బ్రాండ్ గల్ఫ్‌స్ట్రీమ్.. అత్యధిక శాతం మంది డాలర్ మిలియనీర్లకు ఫేవరెట్‌గా ఉన్నాయి. ► చెల్లింపుల కోసం యూపీఐని ఉపయోగిస్తున్న డాలర్ మిలియనీర్ల సంఖ్య 2021లో రెట్టింపై 36 శాతానికి చేరింది. -
ఈ ఏడాదీ మొబైల్ టారిఫ్‌ల మోత!
న్యూఢిల్లీ: మొబైల్ కాల్ టారిఫ్‌ల మోత మోగించేందుకు టెలికం సంస్థలు సిద్ధమవుతున్నాయి. అవసరమైతే రేట్ల పెంపు విషయంలో మిగతా సంస్థల కన్నా ముందుండాలని భారతీ ఎయిర్టెల్ భావిస్తోంది. ‘2022లో టారిఫ్‌లు పెరగవచ్చని అంచనా వేస్తున్నాను. వృద్ధి అవసరాలు, కనెక్షన్ల స్థిరీకరణ వంటి అంశాల కారణంగా వచ్చే 3–4 నెలల్లో ఇది జరగకపోవచ్చు కానీ.. ఈ ఏడాది ఏదో ఒక సమయంలో రేట్ల పెంపు మాత్రం ఉండవచ్చు. పోటీ సంస్థల పరిస్థితిపై కూడా ఇది ఆధారపడి ఉంటుంది. ఇటీవల చేసినట్లుగా ఈ విషయంలో (రేట్ల పెంపు) అవసరమైతే నేతృత్వం వహించేందుకు మేము సందేహించబోము‘ అని అనలిస్టుల సమావేశంలో భారతీ ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విఠల్ తెలిపారు. 2021 నవంబర్‌లో టారిఫ్‌లను అన్నింటికన్నా ముందుగా 18–25 శాతం మేర ఎయిర్టెల్ పెంచింది. ఇటీవల ప్రకటించిన మూడో త్రైమాసికం ఆర్థిక ఫలితాల ప్రకారం యూజర్‌పై కంపెనీకి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) రూ. 163గా ఉంది. వార్షికంగా చూస్తే 2.2 శాతం తగ్గింది. సంస్థ లాభదాయకతను సూచించే ఏఆర్పీయూను రూ. 200కి పెంచుకోవాలని ఎయిర్టెల్ భావిస్తోంది. ఇందులో భాగంగానే టారిఫ్‌ల పెంపును పరిశీలిస్తోంది. ‘2022లోనే పరిశ్రమ ఏఆర్పీయూ రూ. 200 స్థాయికి చేరగలదని.. ఆ తర్వాత మరికొన్నేళ్లకు రూ. 300 చేరవచ్చని ఆశిస్తున్నాం. అప్పుడు పెట్టుబడిపై రాబడి దాదాపు 15 శాతంగా ఉండగలదు‘ అని విఠల్ చెప్పారు. నెట్‌వర్క్‌లు .. డివైజ్‌ల అప్‌గ్రెడేషన్, క్లౌడ్ వ్యాపారాన్ని మెరుగుపర్చుకునేందుకు 300 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2,250 కోట్లు) వెచ్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
టయోటా వాహన కొనుగోలుదారులకు షాకింగ్ న్యూస్..!
టయోటా వాహనాలను కొనుగోలుచేసే కస్టమర్లకు కంపెనీ భారీ షాకిచ్చింది. భారత్‌లోని అన్ని రకాల మోడల్ వాహనాల ధరలను పెంచుతూ టయోటా నిర్ణయం తీసుకుంది. వాహనాల ధరల పెంపు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి రానుంది. దీంతో టయోటాలోని బెస్ట్ సెల్లర్స్ ఫార్చ్యూనర్ ఎస్యూవీ, ఇన్నోవా క్రిస్టాల ధరలు భారీగా పెరగనున్నాయి. కారణం ఇదే..! ఇప్పటికే పలు ఆటోమొబైల్ కంపెనీలు వచ్చే ఏడాది నుంచి వాహనధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వారితో పాటుగా టయోటా కూడా చేరింది. ముడి పదార్థాలతో సహా ఇన్పుట్ ఖర్ఛులు స్థిరంగా పెరగడం కారణంగా ధరల పెంపు అనివార్యమైందని టయోటా ఒక ప్రకటనలో వెల్లడించింది. తమ కస్టమర్లపై ఖర్చుల పెరుగుదల ప్రభావం వీలైనంత తక్కువగా ఉండేలా చర్యలు తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. చిప్ కొరత..పడిపోయిన అమ్మకాలు..! ప్రపంచవ్యాప్తంగా పలు దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీల తయారీ ఇన్పుట్లు ధరలు భారీగా పెరగడం, సెమీకండక్టర్ చిప్ కొరత కారణంగా అనేక కంపెనీలకు పెద్ద సవాళ్లు ఎదురయ్యాయి.దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు తగ్గుముఖం పట్టడంతో వాహనాలకు డిమాండ్ పెరిగింది. అయితే ఉత్పాదకలో, సరఫరా సమస్యలు 2022లో కూడా వెంటాడే అవకాశం ఉన్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) అభిప్రాయపడింది. గడిచిన నెలలో పలు కంపెనీల కార్ల అమ్మకాలు అత్యంత దారుణంగా ఉందని పేర్కొంది. చిప్ కొరత ఆయా కంపెనీలకు ఉత్పత్తిలో ప్రభావితం చేశాయి. ప్యాసింజర్ వాహనాల రిజిస్ట్రేషన్లు 3,24,542 యూనిట్లుగా ఉండగా.., గత ఏడాది నవంబర్ నెలలో 4,39,564 యూనిట్ల నుంచి 26 శాతం మేర తగ్గాయి. చదవండి: టయోటా దూకుడు.. లైనప్‌లో 30 ఎలక్ట్రిక్ మోడళ్లు -
సామాన్యుడి షాక్..క్యూ కట్టిన బ్యాంకులు..!
New Atm Withdrawal Charges From 2022: కొత్త ఏడాది నుంచి సామాన్యులపై చార్జీల మోత మోగించేందుకు బ్యాంకులు సిద్ధమయ్యాయి. జనవరి 1 నుంచి ఎవరైతే ఏటీఎం సెంటర్ల నుంచి డబ్బులు డ్రా చేస్తారో వారి వద్ద నుంచి బ్యాంకులు అదనపు ఛార్జీల్ని వసూలు చేయనున్నాయి. ఇప్పటికే ఆర్బీఐ సైతం జనవరి 1నుంచి ఏటిఎం నగదు విత్ డ్రాకు సంబంధించిన కొత్త నిబందనలు అమలులోకి తెస్తున్నట్లు తెలిపింది. తాజా నిబంధనలు వచ్చే ఏడాది కొత్త సంవత్సరం నుంచి ప్రారంభం కానున్నాయి. పలు నివేదికల ప్రకారం..నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని యాక్సిస్ బ్యాంక్ ఆర్బీఐ నిబంధనల్ని అమలు చేయనుంది. ప్రతి నెల బ్యాంక్ అకౌంట్ హోల్డర్లు ఏటీఎం సెంటర్లలో ఐదు లావాదేవీలు దాటితే యాక్సిక్ బ్యాంక్ అదనపు ఛార్జీలను విధించనుంది. పరిమితి దాటితే ప్రతి ట్రాన్సాక్షన్‌పై రూ.20 ఎటీఎం చార్జీ వసూలు చేయనుంది. ఇప్పుడు యాక్సిక్ బ్యాంక్ బాటలో మరో ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ సైతం సేవింగ్ అకౌంట్ పై సర్వీస్ ఛార్జీలతో పాటు, ఏటీఎం నగదు లావా దేవీలలో పరిధి దాటితో ప్రతి ట్రాన్సాక్షన్‌పై రూ.20 ఎటీఎం చార్జీ వసూలు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మెట్రో నగరాల్లో నెలకు మూడుసార్లు, ఇతర నగరాల్లో ఐదుసార్లు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆర్బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం వివిధ బ్యాంకుల ఖాతాదారులు తమ సొంత బ్యాంకుతోపాటు ఇతర బ్యాంకుల ఏటీఎంల వద్ద పరిమితికి మించి చేసే విత్డ్రాయల్స్పై చార్జీలు పెరుగనున్నాయి. చదవండి : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త..! -
వరుసగా ఏడో రోజు పెంపు.. రూ. 120 దిశగా పెట్రోలు రేటు
పెట్రోలు ధరలకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. దీంతో వరుసగా ఏడో రోజు కూడా పెట్రోలు ధరలు భగ్గుమన్నాయి. మరోసారి లీటరు పెట్రోలుపై 35 పైసల వంతున ధరను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఈసారి పెంపు నుంచి డీజిల్‌కి మినహాయింపు ఇచ్చాయి. పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ 114.47 కి చేరుకుంది. ఈ ఏడాదిలో రూ.27 పెట్రోలు ధరలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఈ ఏడాది జనవరి 1న లీటరు పెట్రోలు ధర రూ. 87.06 ఉండగా... ఇప్పుడు ఏకంగా రూ.114.37కి చేరుకుంది. జనవరి నుంచి మార్చి వరకు పెట్రోలు రేట్లు పెంచుకుంటూ పోయిన చమురు సంస్థలు బెంగాల్ ఎన్నికల కారణంగా మార్చి, ఏప్రిల్‌లో ధరల పెంపుకు విరామం ఇచ్చాయి. ఆ తర్వాత మే నుంచి జూన్ వరకు తాజాగా అక్టోబరులో ఎడాపెడా రేట్లు పెంచుతూ వస్తున్నాయి. -
వరుసగా ఐదో రోజు పెరిగిన చమురు ధరలు
-
పసిడి దిగుమతులు జూమ్..
న్యూఢిల్లీ: దేశీయంగా డిమాండ్ పెరగడంతో ఈ ఏడాది ఏప్రిల్ – సెప్టెంబర్ మధ్య కాలంలో పసిడి దిగుమతులు భారీగా పెరిగాయి. ఏకంగా 24 బిలియన్ డాలర్లకు చేరాయి. గతేడాది ఇదే వ్యవధిలో బంగారం దిగుమతుల విలువ సుమారు 6.8 బిలియన్ డాలర్లు. కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. నెలవారీగా చూస్తే గతేడాది సెపె్టంబర్లో 601.4 మిలియన్ డాలర్లుగా ఉన్న పసిడి దిగుమతులు ఈ ఏడాది సెపె్టంబర్లో 5.11 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. మరోవైపు, ఏప్రిల్ – సెప్టెంబర్ మధ్య కాలంలో వెండి దిగుమతులు 15.5 శాతం తగ్గి 619.3 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అయితే, కేవలం సెప్టెంబర్ నెలే పరిగణనలోకి తీసుకుంటే 9.23 మిలియన్ డాలర్ల నుంచి 552.33 మిలియన్ డాలర్లకు చేరాయి. పసిడి దిగుమతులు ఎగియడంతో దేశ వాణిజ్య లోటు సెప్టెంబర్ లో (దిగుమతులు, ఎగుమతుల మధ్య వ్యత్యాసం) 2.96 బిలియన్ డాలర్ల నుంచి 22.6 బిలియన్ డాలర్లకు చేరింది. భారత్ ఏటా 800–900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా పండుగ సీజన్, భారీ డిమాండ్ తదితర అంశాలు పసిడి దిగుమతులు పెరగడానికి కారణమని రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) చైర్మన్ కొలిన్ షా తెలిపారు. -
రెండు రెట్లు పెరిగిన ఇళ్ల విక్రయాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు ఈ ఏడాది జూలై–సెపె్టంబర్ కాలంలో రెండు రెట్లు పెరిగాయి. మొత్తం 62,800 యూనిట్లు విక్రయమైనట్టు అనరాక్ సంస్థ తెలిపింది. గృహ రుణాలపై తక్కువ రేట్లు, ఐటీ/ఐటీఈఎస్ రంగాల్లో నియామకాలు పెరగడం డిమాండ్ పెరిగేందుకు కారణమైనట్టు ఈ సంస్థ విశ్లేíÙంచింది. క్రితం ఏడాది సరిగ్గా ఇదే కాలంలో ఇళ్ల విక్రయాలు 29,520 యూనిట్లుగా ఉన్నట్టు తెలిపింది. అలాగే, క్రితం త్రైమాసికం ఏప్రిల్–జూన్‌లో ఇళ్ల విక్రయాలు 24,560 యూనిట్లుగా ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం (ఎంఎంఆర్), ఢిల్లీ–ఎన్సీఆర్, పుణే పట్టణాల్లోని విక్రయాలపై ఓ నివేదికను అనరాక్ బుధవారం విడుదల చేసింది. ఇళ్ల ధరలు ఈ పట్టణాల్లో సగటున 3 శాతం మేర పెరిగాయి. చదరపు అడుగు రూ.5,760గా ఉంది. 2020 సెపె్టంబర్ త్రైమాసికంలో సగటు చదరపు అడుగు ధర రూ.5,600గా ఉండడం గమనార్హం. ఇళ్ల నుంచే కార్యాలయ పని విధానం (డబ్ల్యూఎఫ్‌హెచ్) నివాస గృహాల డిమాండ్‌ను నిర్ణయించనున్నట్టు అనరాక్ పేర్కొంది. టీకాలను పెద్ద మొత్తంలో వేస్తుండడంతో ప్రాజెక్టుల నిర్మాణ ప్రదేశానికి వచ్చి ఇళ్లను చూసే వారి సంఖ్య పెరిగినట్టు తెలిపింది. హైదరాబాద్‌లో నాలుగు రెట్లు అధికం 2021 జూలై–సెపె్టంబర్ కాలంలో హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాలు నాలుగు రెట్లు అధికంగా నమోదయ్యాయి. 2020 జూలై సెపె్టంబర్లో 1,650 యూనిట్లే అమ్ముడుపోగా.. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ మధ్య 6,735 యూనిట్లు విక్రయమయ్యాయి. చెన్నైలో విక్రయాలు రెట్టింపై 3,405 యూనిట్లుగా ఉన్నాయి. ఢిల్లీ–ఎన్సీఆర్ ప్రాంతంలో విక్రయాలు 10,220 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 5,200 యూనిట్లుగా ఉన్నాయి. ముంబై ఎంఎంఆర్ ప్రాంతంలోనూ అమ్మకాలు నూరు శాతానికి పైగా పెరిగి 20,965 యూనిట్లుగా ఉన్నాయి. బెంగళూరులో 58 శాతం అధికంగా 8,550 యూనిట్లు అమ్ముడుపోయాయి.