Huge Loss
-
యూకే ఎన్నికల్లో లేబర్ పార్టీ భారీ విక్టరీ
లండన్: యూకే సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ భారీ విజయం సాధించింది. అత్యధికంగా 400కి పైగా స్థానాల్లో నెగ్గి చరిత్రాత్మక విజయం కైవసం చేసుకుంది. మరోవైపు.. దశాబ్దంన్నరపాటు అప్రతిహతంగా బ్రిటన్ను ఏలిన కన్జర్వేటివ్ పార్టీకి ఈ ఎన్నికల్లో భంగపాటు ఎదురైంది. రిషి సునాక్ సారధ్యంలో ఆ పార్టీ కేవలం 119 స్థానాల్లో నెగ్గి ఓటమి చవిచూసింది. గురువారం యూకే హౌజ్ ఆఫ్ కామన్స్ 650 స్థానాలకు పోలింగ్ జరిగింది. పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ వెలువడగా.. ఆ వెంటనే కౌంటింగ్ మొదలైంది. శుక్రవారం ఉదయం నుంచి ఫలితాలు వెల్లడయ్యాయి. ఊహించినట్లుగానే.. లేబర్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటుతూ వచ్చారు. తాజా సమాచారం ప్రకారం.. లేబర్ పార్టీ 411 స్థానాల్లో నెగ్గి ఘన విజయం సాధించింది. కన్జర్వేటివ్ పార్టీ 119 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యింది. లిబరల్ డెమోక్రట్స్ పార్టీ 71 స్థానాలు దక్కించుకుంది. సంబంధిత వార్త: 50 ఏళ్లకు రాజకీయాల్లోకి ఎంట్రీ.. ఎవరీ కీర్ స్టార్మర్ఇదిలా ఉంటే.. ఫలితాలు వెలువడ్డాక కాసేపటికే రిషి సునాక్ ఓటమిని అంగీకరించారు. ఈ ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలిచిన వాళ్లకు రిషి సునాక్ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే యూకే కాబోయే ప్రధాని, లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్‌కు అభినందనలు తెలియజేశారు. సంబంధిత వార్త: నన్ను క్షమించండి: రిషి సునాక్ఘోర పరాభవం నుంచి..2019 సార్వత్రిక ఎన్నికల్లో జెర్మీ కోర్బిన్ నేతృత్వంలో లేబర్ పార్టీ కేవలం 201 స్థానాలే గెల్చుకుంది. 1935 తర్వాత ఆ పార్టీ ఎదుర్కొన్న ఘోరమైన పరాభవం ఇదే. అదే సమయంలో బోరిస్ జాన్సన్ నేతృత్వంలో 365 స్థానాలు గెలిచి వరుసగా అధికారం కైవసం చేసుకుంది. అయితే 14 ఏళ్లుగా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీని.. ఈసారి ఓటర్లు పక్కనపెట్టేశారు. లేబర్ పార్టీని ఆదరించి అఖండ మెజారిటీతో గెలిపించారు. వ్యతిరేకత ఇలా.. బ్రెగ్జిట్ తర్వాత మందగించిన ఆర్థిక వ్యవస్థ, అధికార పార్టీ కన్జర్వేటివ్ కుంభకోణాలు ప్రజారోగ్య వ్యవస్థ, మౌలిక సదుపాయాల కల్పనలో వైఫ్యలం, 14 ఏళ్ల పాలనలో ఐదుగురు ప్రధానుల్ని మార్చడం, వాళ్ల అనాలోచిత నిర్ణయాలు.. ఇలా కన్జర్వేటివ్ పార్టీ పట్ల జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్ తర్వాత.. అనూహ్య పరిణామాల మధ్య బ్రిటన్ ప్రధాని పదవి చేపట్టారు రిషి సునాక్. అయితే కన్జర్వేటివ్ పార్టీ ప్రజా వ్యతిరేకతను పసిగట్టి ఆరు నెలల ముందుగానే ఎన్నికలకు వెళ్లారాయన. అయినప్పటికీ ఫలితాలు వ్యతిరేకంగానే వచ్చాయి. Thank you, Holborn and St Pancras, for putting your trust in me again.Change begins right here. pic.twitter.com/XZfi5OIoyH— Keir Starmer (@Keir_Starmer) July 5, 2024 To the hundreds of Conservative candidates, thousands of volunteers and millions of voters:Thank you for your hard work, thank you for your support, and thank you for your vote. pic.twitter.com/GcgvI7bImI— Rishi Sunak (@RishiSunak) July 4, 2024 లేబర్ పార్టీ అధికారంలోకి వస్తే అధిక పన్నులు చెల్లించాల్సి వస్తుందని సునాక్ ఎన్నికల ప్రచారం వర్కవుట్ కాలేదు. అదే సమయంలో.. తరచూ ప్రధానులు మారే అస్థిర ప్రభుత్వాన్ని దించేయాలని, దారి తప్పిన బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ గాడిన పడాలంటే లేబర్ పార్టీని గెలిపించాలని స్టార్మర్ ఓటర్లకు చేసిన విజ్ఞప్తి ఫలించింది. ఎగ్జిట్‌పోల్స్ నిజమయ్యాయి!యూకేలోని ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ వ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి. మొత్తం 650 సీట్లు ఉన్న యూకే పార్లమెంట్ దిగువ సభ(హౌజ్ ఆఫ్ కామన్స్)లో ఏకంగా 410 స్థానాలు కీర్ స్మార్టర్ నేతృత్వంలో లేబర్ పార్టీ దక్కించుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు తెలిపాయి. కన్జర్వేటివ్ కేవలం 131 స్థానాలకు పరిమితం కావొచ్చని తెలిపాయి. -
Vishaka: స్టీల్ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో శనివారం( జనవరి 13) సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్టీల్ ప్లాంట్‌లోని బ్లాస్ట్ ఫర్నేస్-3లో పేలుడు సంభవించడంతో మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి అక్కడే పనిచేస్తున్న పలువురు గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ప్లాంటుకు చేరుకుని మంటలార్పుతున్నారు. అగ్నిప్రమాదం కారణంగా ప్లాంటులో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. గతంలోనూ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన పలు అగ్ని ప్రమాదాల్లో ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించాయి. ఇదీచదవండి.. లొంగిపోయి పూచికత్తులు సమర్పించిన చంద్రబాబు -
అన్నదాతలను నట్టేట ముంచిన అకాల వర్షాలు
-
సింగిల్ ట్రాన్సాక్షన్లో కోటి తగలెట్టేశా, ఈ ఘోర తప్పిదం నావల్లే!
సాక్షి, ముంబై: ట్రేడింగ్ అంటేనే చాలా అవగాహన అంతకుమించిన అప్రతమత్తత అవసరం. అందులోనూ ఇక క్రిప్టో మార్కెట్ ట్రేడింగ్‌లో మరింత జాగ్రత్తగా ఉండాలి. అలా క్రిప్టో లావాదేవాల్లో చోటుచేసుకున్న ఒక్క పొరపాటు అతని జీవితాన్ని నాశనం చేసింది. అనుకోకుండా కోటిరూపాయల ఎన్ఎఫ్టీలని కోల్పోయాడు. అంతేకాదు అతని నికర విలువ దాదాపు మూడో వంతు తుడిచి పెట్టుకు పోయింది. ఆనక పొరబాటు గుర్తించి లబోదిబోమన్నాడు. ఈ విషయాన్ని బాధితుడు స్వయంగా ట్విటర్ ద్వారా తెలియజేశాడు. వివరాలను పరిశీలిస్తే.. బ్రాండన్ రిలే ఎన్ఎఫ్టీ కలెక్టర్. ఈక్రమంలో CryptoPunk #685 అనే NFTని 77 ఈథర్లు లేదా దాదాపు 1 కోటి రూపాయలకు కొన్ని వారాల కిందట కొనుగోలు చేశాడు. దీన్ని ప్రపంచ రెండో అతిపెద్ద క్రిప్టో ఎథేరియం మార్కట్ ప్లేస్‌లో ర్యాపింగ్ (ర్యాపింగ్అంటే ఓపెన్‌సీ లేదా రారిబుల్ వంటి Ethereum మార్కెట్‌ప్లేస్‌లలో NFTల ట్రేడింగ్) చేసే సమయంలో పొరపాటున బర్న్ ఎడ్రస్‌కి షేర్చేశాడు. (బర్న్ ఎడ్రస్ కి చేరితే ఇక జీవితంలో అది తిరిగి రాదు. ప్రైవేట్ కీ లేని దీన్ని యాక్సెస్ చేయలేరు) డిజిటల్ వాలెట్లోని నిధులను యాక్సెస్ చేయడానికి ఉపయోగించే ప్రైవేట్ కీ..వర్చువల్ వాలెట్ ‘బర్న్’ అడ్రస్‌కి చేరితే సంబంధిత ఎన్ఎఫ్టీ శాశ్వతంగా నాశన మవుతుంది. రిలే విషయంలో అదే జరిగింది. తనుకెదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన రిలే తనకు ఈ విషయాలపై అవగాహన లేదనీ అన్ని సూచనలను కచ్చితంగా పాటించినప్పటికీ లావాదేవీలో చిన్న పొరపాటు నాశనం చేసిందని వాపోయాడు. అసలు ర్యాప్డ్ నెట్ వర్క్ ఎలా పనిచేస్తుందో అవగాహన లేదు..ఇది కచ్చితంగా నేను చేసిన తప్పే..అదే నన్ను ముంచేసింది..దీనిపై అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించాడు. Today I accidentally burned a @cryptopunksnfts trying to wrap punk 685. I was so focused on following the instructions exactly, that I slipped up, destroying a third of of my net worth in a single transaction. @yugalabs please sell me the @v1punks 685 as a consolation. 🙏🏼 pic.twitter.com/jHoTGvlc7j — Brandon Riley (@vitalitygrowth) March 25, 2023 -
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
-
టెస్లా.. సింగిల్ డేలో 100 బిలియన్ డాలర్లు ఢమాల్
ప్రపంచంలో ఆటోమేకర్ కింగ్‌గా ఉన్న విరజిల్లుతున్న టెస్లాకు ఘోరమైన దెబ్బ పడింది. ఒక్కరోజులో.. కేవలం ఒకేఒక్క రోజులో 100 బిలియన్ డాలర్ల మేర కంపెనీ మార్కెట్ వాల్యూ పడిపోయింది. స్టాక్ మార్కెట్లో గురువారం టెస్లా షేర్లు 12 శాతం పడిపోవడమే ఈ భారీ నష్టానికి కారణమని తెలుస్తోంది. 2022 ఆరంభంలోనే ఈమేర భారీ దెబ్బ పడగా.. చాలాకాలం తర్వాత ఈ మేర దిగజారిపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే అమెరికన్ ఆటో మేకర్ టెస్లా.. బుధవారం నాడు 2021 ఏడాదికి నాలుగో క్వార్టర్ ఫలితాల్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే కిందటి ఏడాది భారీ లాభాల్ని ఆర్జించిన ఏకైక ఈవీ ఆటోమేకర్‌గా టెస్లా నిలవడం విశేషం. అయితే ఇంత లాభాల్లో ఉన్నా చిప్ కొరతల కారణంగా.. 2022లో కొత్త మోడల్స్‌ను తీసుకురాలేమని టెస్లా సీఈవో ఎలన్ మస్క్ స్వయంగా ప్రకటించడం ఇన్వెస్టర్ల ఆసక్తిని దెబ్బ తీసింది. ముఖ్యంగా లేబర్ షార్టేజ్ ప్రస్తావనతో పాటు సైబర్‌ట్రక్ ఆలస్యం, కొత్త మోడల్స్ తేలేకపోతున్నట్లు(మోడల్ 3 కంటే చౌకైన ఈవీ మోడల్ తేబోతున్నట్లు ప్రకటించి.. కస్టమర్లు, ఇన్వెస్టర్లలో ఆశలు రేపాడు) ప్రకటించడంతో ఇన్వెస్టర్లు టెస్లా షేర్ల మీద ఆసక్తి కనబరచలేకపోయారు. పైగా అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మీద ఫోకస్‌ను జీర్ణించుకోలేకపోయారు. ఈ పరిణామాలతో షేర్ల అమ్మకానికే మొగ్గు చూపించగా.. గురువారం ఒక్కరోజే 100 బిలియన్ డాలర్ల మేర టెస్లా వాల్యూ పడిపోయింది. ప్రస్తుతం కంపెనీ విలువ 1.2 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్ గణాంకాలు చెప్తున్నాయి. సంబంధిత వార్త: లాభాల్లో కింగూ.. అయినా ఇలాంటి నిర్ణయమా? రీజన్ ఏంటంటే.. -
పాపం.. మిలియనీర్ల పుట్టి ముంచుతున్న బిట్‌కాయిన్
Bitcoin Crash Effect Thousands Of Investors Vanished: బిట్‌కాయిన్.. క్రిప్టోకరెన్సీలో అత్యంత విలువైంది. దీని దరిదాపుల్లో మరే కరెన్సీ లేకపోవడం గమనార్హం. ఏళ్ల తరబడి వీటికి నమ్ముకున్న వాళ్లకు అదృష్టం కలిసొచ్చి.. ఇప్పుడు విపరీతమైన లాభాలు తెచ్చిపెడుతోంది. ఇప్పటివరకు బాగానే ఉన్నా.. ఈ మధ్యకాలంలో పరిణామాలతో బిట్‌కాయిన్‌కు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది!. ప్రస్తుతం ఇది చేస్తున్న నష్టం మాత్రం మామూలుగా ఉండడం లేదు. సుమారు 30 వేలమంది బిట్‌కాయిన్ మిలియనీర్లు క్రిప్టో మార్కెట్ నుంచి పూర్తిగా కనుమరుగు అయిపోయారు. కారణం.. గత మూడు నెలల్లో బిట్‌కాయిన్ డిజిటల్ మార్కెట్లో జరుగుతున్న పరిణామాలు. నవంబర్‌లో 69,000 డాలర్లుగా ఉన్న బిట్‌కాయిన్ విలువ తాజాగా(గురువారం) 36,000 డాలర్లకు చేరుకుంది. క్రిప్టోకరెన్సీపై పలు దేశాల నియంత్రణ పరిశీలన, భౌగోళిక రాజకీయ అశాంతి, అల్లకల్లోలం అవుతున్న మార్కెట్లు, కరోనా పరిస్థితుల వల్లే ఇదంతా అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫిన్బోల్డ్ అనే పోర్టల్ సమాచారం ప్రకారం.. అక్టోబర్ నుంచి జనవరి మధ్య 1 మిలియన్ డాలర్ కంటే ఎక్కువ ఉన్న బిట్‌కాయిన్ కలిగి ఉన్న వాలెట్లు 28,186( 24.26 శాతం) తగ్గాయి. ముఖ్యంగా ఈ మూడు నెలల్లో గతంలో బిట్‌కాయిన్ ద్వారా ధనవంతులైన ఎంతో మంది.. భారీ నష్టంతో బికారీలుగా మారిపోయారు. అంతేకాదు ‘‘1,00,000డాలర్లు కంటే ఎక్కువ ఉన్న వాలెట్లు 30.04 శాతం పడిపోయి 505,711 నుండి 353,763కి చేరుకున్నాయి. ఒక మిలియన్ డాలర్, అంతకు మించి ఉన్నవి 105,820 నుండి 80,945కి 23.5 శాతం పడిపోయి 80,945కి పడిపోయింది. 10 మిలియన్ల డాలర్లు.. అంతకంటే ఎక్కువ ఉన్న వాలెట్లు కూడా 32.08 శాతం తగ్గి 10,319 నుండి 7,008కి పడిపోయాయి’’ అని ఫిన్బోర్డ్ నివేదిక పేర్కొంది. అయితే పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా రక్షణగా బిట్‌కాయిన్‌ను అభివర్ణిస్తున్నారు కొందరు ఆర్థిక నిపుణులు. బిట్‌కాయిన్ చేస్తున్న డ్యామేజ్‌ను పరిగణనలోకి తీసుకోవద్దని చెప్తూ.. ముందు మంచి భవిష్యత్తు ఉందని అంచనా వేస్తున్నారు. కానీ, బిట్‌కాయిన్, ఇతర డిజిటల్ క్రిప్టోకరెన్సీలు కనిష్టానికి చేరుకోవడంతో పాటు గ్లోబల్ క్రిప్టో మార్కెట్లో 1 ట్రిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లజేశాయి మరి!. చదవండి: బిట్‌కాయిన్ చెల్లదంటే చెల్లదు- ఐఎంఎఫ్ -
సెన్సార్ చిక్కులు.. రూ.40 వేల కోట్ల నష్టం!!
సెన్సార్ చిక్కులు సాధారణంగా ఈ మాటను తరచూ సినీ పరిశ్రమలో వింటుంటాం. అయితే వెబ్ కంటెంట్ విషయంలో ఆ చిక్కులు తక్కువే!. అందుకే ఫిల్మ్ మేకర్స్ డిజిటల్ కంటెంట్‌కు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. కానీ, ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ కంటెంట్‌కూ కోతలు తప్పడం లేదు. దీనివల్ల గ్లోబల్ ఎకానమీకి వేల కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఇంటర్నెట్ సెన్సార్షిప్ వల్ల పోయినేడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. డిజిటల్ సెక్యూరిటీ & రైట్స్ గ్రూప్ ‘టాప్10వీపీఎన్’ నివేదిక ప్రకారం.. ఈ నష్టం మొత్తంగా 5.5 బిలియన్ డాలర్లకు(సుమారు 40 వేల కోట్ల రూపాయలకు పైనే) ఉందని తెలుస్తోంది. 2021లో ఇంటర్నెట్-సోషల్ మీడియాపై ఆంక్షలు, ఇంటర్నెట్ అంతరాయం(షట్‌డౌన్), సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై ప్రభుత్వాల ఆధిపత్యం-కఠిన చట్టాల అమలు, వెబ్ కంటెంట్‌పై ఉక్కుపాదం.. తదితర కారణాల వల్ల ఈ మేర నష్టం వాటిల్లినట్లు నివేదిక పేర్కొంది. ►ఎక్కువ నష్టపోయింది మయన్మార్ దేశం. సుమారు 2.8 బిలియన్ డాలర్ల(మన కరెన్సీలో 18 వేల కోట్ల రూపాయలపైనే) నష్టపోయింది. మిలిటరీ చర్యల వల్లే ఈ నష్టం కలిగినట్లు తెలుస్తోంది. ఇక నైజీరియా ఈ లిస్ట్‌లో రెండో ప్లేస్‌లో ఉంది. జూన్‌లో ట్విటర్‌ను బ్లాక్ చేయడం తదితర పరిణామాల వల్ల నైజీరియా 1.5 బిలియన్ డాలర్ల నష్టం చవిచూసినట్లు తెలుస్తోంది. ►భారత్‌లో కొత్త ఐటీ రూల్స్ వల్ల ఈ నష్టం ప్రధానంగా వాటిల్లింది. దీనికి తోడు పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్పై నిషేధం-ఆంక్షలు, ఓటీటీ కంటెంట్‌పై ఉక్కుపాదం(పూర్తిస్థాయి సెన్సార్షిప్ రాలేదింకా), కరోనాపై ఫేక్- అశ్లీల కంటెంట్, ఇతర కథనాల నియంత్రణ తదితర కారణాలు ఉన్నాయి. (లెక్కపై స్పష్టత రావాల్సి ఉంది). ►2021 ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ఆంక్షలతో 486 మిలియన్ ప్రజలు ఇబ్బందిపడగా.. 2020లో 268 మిలియన్ ప్రజలు ఇబ్బందిపడ్డారు. అంటే 81 శాతం పెరిగిందన్నమాట. కేవలం ప్రభుత్వాల ఆంక్షలు-నిషేధాజ్ఞల కారణంగా వాటిల్లిన నష్టం 36 శాతానికి(2020తో పోలిస్తే) పెరిగింది. ఎలాగంటే.. ఇంటర్నెట్ షట్‌డౌన్, కఠిన ఆంక్షల వల్ల ఈమేర నష్టం వాటిల్లితే.. ఒకవేళ మొత్తంగా ఇంటర్నెట్ ఆగిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో కదా!. అసలు నష్టం ఎందుకు వాటిల్లుతుందంటే.. ఇంటర్నెట్ బ్రౌజింగ్, ఇతరత్ర సేవలు, అడ్వర్టైజింగ్, కస్టమర్ సపోర్ట్ సేవలకు విఘాతం, ప్రత్యేకించి సోషల్ మీడియా ఆగిపోవడం వల్ల ఆదాయానికి భారీ గండిపడుతుంది. 2022లో మొదలైంది.. ఇక ఈ ఏడాదిలోనూ ఇంటర్నెట్ స్వేచ్ఛకు అడ్డుకట్ట పడడం ఇప్పటికే మొదలైంది. కజకస్తాన్(మధ్య ఆసియా దేశం), సూడాన్‌లలో నెలకొన్న సంక్షోభాల దృష్ట్యా ఇంటర్నెట్ షట్‌డౌన్ కొనసాగుతోంది. వీటి నష్టం వివరాలు ఇప్పట్లో చెప్పడం కష్టం. చదవండి: భారత్‌లో ఇక ఏరకంగానూ పోర్న్ వీడియోల వీక్షణ కుదరదు! -
భలేవాడివి బాసు! 97 కోట్లు లాస్.. హ్యాపీగా ఉందన్న సీఈవో
‘గెలిస్తే ఏముంటుంది? ఓడితేనే కదా.. అసలు కిక్కు ఉండేది’ అనే టైప్ కాదు ఈ బాస్. అలాంటప్పుడు అంత లాస్లో ఆనందమా? ఈయనేం మనిషిరా బాబూ! అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఆయన సంతోషంలో ఒక పరమార్థం ఉంది కాబట్టి. యూకేకి చెందిన ప్రముఖ కాస్మోటిక్ కంపెనీ లష్ శుక్రవారం కీలక అడుగు వేసింది. లష్ తన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్, స్నాప్‌ఛాట్ అకౌంట్లను పూర్తిగా డిలీట్ చేసి పారేసింది. కేవలం ఒక్క ఫేస్బుక్ అకౌంట్ క్లోజ్ చేసినందుకే 10 మిలియన్ పౌండ్లు(13.3 మిలియన్ డాలర్లు.. మన కరెన్సీలో 97కోట్ల 50 లక్షలకు పైమాటే) నష్టం వాటిల్లిందని కంపెనీ సీఈవో మార్క్ కంస్టాన్‌టైన్ సంతోషంగా ప్రకటించుకున్నారు. మిగతావి కలిపితే ఆ నష్టం మరో మూడునాలుగు మిలియన్ పౌండ్ల మధ్య ఉండొచ్చని ఆయన చెప్తున్నారు. ‘‘ఇదేం పీఆర్స్టంట్ కాదు. దీనివల్ల మాకు పెద్ద దెబ్బే. అయినా ఈ నిర్ణయం తీసుకోవడానికి గట్టి కారణం ఉంది. సోషల్ మీడియా వల్ల టీనేజర్ల మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న ఆరోపణల్ని లష్ కంపెనీ నమ్ముతోంది. ఓవైపు పిల్లల ప్రాణాలు పోతుంటే.. ఆ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా మేం ఎలా ప్రమోట్ చేసుకోగలం. కస్టమర్ల ప్రాణాలకు విలువ ఇవ్వకుండా చేసే వ్యాపారం మాకెందుకు!. దీనికి తోడు దశాబ్దానికిపైగా క్లైమేట్ ఛేంజ్‌పై ఆందోళన వ్యక్తం అవుతున్నా.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు పట్టించుకోవట్లేదని, అందుకే వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని తృణప్రాయంగా వదిలేస్తూ ఆ అకౌంట్లను తొలగిస్తున్నాం ఒక ప్రకటనలో లష్ పేర్కొంది. అంతేకాదు కొవిడ్ సమయంలో కఠిన ఆంక్షల మధ్యే తమ వ్యాపారం ఆటుపోట్లను ఎదుర్కొంటూ నిలదొక్కుకుందని, అలాంటిది సోషల్ మీడియా ప్రమోషన్ దూరమైనంత మాత్రాన తామేం ఇబ్బందిగా భావించబోమని, తాము కస్టమర్లని నమ్ముకున్నామని మార్క్ కంస్టాన్‌టైన్ చిరునవ్వుతో ధీమాగా చెప్తున్నారు. సోషల్ మీడియా ప్రమోషన్ ఎంత పవర్ఫుల్దో తెలియంది కాదు. ప్రస్తుతం ఇయర్ ఎండ్ సీజన్ నడుస్తోంది. సాధారణంగా షాపింగ్ బిజీ ఉంటుంది. ఈ తరుణంలో సోషల్ మీడియా అకౌంట్లను ప్రమోషన్ కోసం వాడుకుంటాయి కంపెనీలు. కానీ, లక్షల మంది ఫాలోవర్స్‌ను దూరం చేసుకుంటూ లష్ ఇలా నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ పరిణామం. ఇదిలా ఉంటే లష్కు ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో కలిపి 11 మిలియన్‌కు పైగా ఫాలోవర్స్ ఉండేవాళ్లు డిలీట్ చేసిన నాటికి(శుక్రవారం, 26 2021). గతంలో 2019లోనూ లష్ ఆల్గారిథమ్ విషయంలో ఫేస్‌బుక్‌పై అసంతృప్తితో కొన్నాళ్లు దూరం పెట్టింది కూడా. ఇదిలా ఉంటే జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం తర్వాత ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను చాలా కంపెనీలు తొలగించడం చేశాయి. చదవండి: ది గ్రేట్ అలెగ్జాండర్ గుర్రం కనిపెట్టిన పదార్థం.. వందల కోట్ల వ్యాపారానికి నాంది -
భారీ నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు
-
ఫేస్బుక్, వాట్సాప్ డౌన్.. జుకర్‌బర్గ్ పుట్టి ముంచిన ఆ ఒక్కడు!
WhatsApp, Facebook, Instagram restore services after 6-hours of outage: ఫేస్బుక్ స్థాపించినప్పటికీ ఇప్పటిదాకా చూసుకుంటే.. సోమవారం(అక్టోబర్ 4న) తలెత్తిన సమస్య ఆ సంస్థకు భారీ నష్టాన్ని చేసింది. ఆరు గంటలపాటు ఆగిపోయిన ఫేస్బుక్ దాని అనుబంధ యాప్ సర్వీస్‌లు ఫేస్బుక్ మెసేంజర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ సేవలను సైతం స్తంభింపజేసింది. తిరిగి సర్వీసులు ప్రారంభమైనప్పటికీ.. మొదట్లో మొండికేశాయి కూడా. ఈ ప్రభావం ఇంటర్నెట్పై పడగా.. ట్విటర్, టిక్‌టాక్, స్నాప్‌ఛాట్ సేవలు సైతం కాసేపు నెమ్మదించాయి. ఏది ఏమైనా ఈ బ్రేక్‌డౌన్ ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌కు మాత్రం కోలుకోలేని నష్టాన్ని మిగిల్చినట్లు తెలుస్తోంది. ఫేస్బుక్, దాని అనుబంధ సేవల సర్వీసుల విఘాతం వల్ల మార్క్ జుకర్‌బర్గ్ భారీ నష్టం వాటిల్లింది. సుమారు ఏడు బిలియన్ల డాలర్ల(మన కరెన్సీలో దాదాపు 50 వేల కోట్ల రూపాయలకు పైనే) నష్టం వాటిల్లింది. ఫేస్బుక్ స్థాపించినప్పటి నుంచి ప్రపంచం మొత్తం మీద ఇంత సమయం పాటు సర్వీసులు నిలిచిపోవడం, ఈ రేంజ్లో డ్యామేజ్ జరగడం ఇదే మొదటిసారి. అంతేకాదు ఈ దెబ్బతో జుకర్‌బర్గ్ స్థానం అపర కుబేరుల జాబితా నుంచి కిందకి పడిపోయింది. సెప్టెంబర్ మధ్య నుంచి ఫేస్బుక్ స్టాక్ 15 శాతం పడిపోగా.. ఒక్క సోమవారమే ఫేస్బుక్ సర్వీసుల విఘాతం ప్రభావంతో 5 శాతం పడిపోయిందని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. దీంతో ఐదో స్థానం నుంచి కిందకి జారిపోయాడు జుకర్‌బర్గ్. ప్రస్తుతం 120.9 బిలియన్ డాలర్లతో బిల్‌గేట్స్ తర్వాత రిచ్ పర్సన్స్ లిస్ట్‌లో ఆరో ప్లేస్‌లో నిలిచాడు మార్క్ జుకర్‌బర్గ్. అతని వల్లే.. ఇక ఫేస్బుక్ అనుబంధ సర్వీసులు ఆగిపోవడంపై యూజర్ల అసహనం, ఇంటర్నెట్లో సరదా మీమ్స్‌తో పాటు రకరకాల ప్రచారాలు సైతం తెర మీదకు వచ్చాయి. ది వాల్ స్ట్రీట్ జర్నల్ ‘నెగెటివ్’ కథనాల ప్రభావం వల్లే ఇలా జరిగి ఉంటుందని, కాదు కాదు ఇది హ్యాకర్ల పని రకరకాల అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఇది సాంకేతికపరమైన సమస్యే అని తెలుస్తోంది. డొమైన్ నేమ్ సిస్టమ్(డీఎన్ఎస్).. ఇంటర్నెట్కు ఫోన్ బుక్ లాంటిది. ఇందులో సమస్య తలెత్తడం వల్ల సమస్య తలెత్తవచ్చని మొదట భావించారు. ఆ అనుమానాల నడుమే.. బీజీపీ (బార్డర్ గేట్‌వే ప్రోటోకాల్)ను ఓ ఉద్యోగి మ్యానువల్‌గా అప్లోడ్ చేయడం కారణంగానే ఈ భారీ సమస్య తలెత్తినట్లు సమాచారం. అయితే ఆ ఉద్యోగి ఎవరు? అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? కావాలనే చేశాడా? పొరపాటున జరిగిందా? తదితర వివరాలపై స్పష్టత రావాల్సింది ఉంది. సర్వీసులు ఎందుకు నిలిచిపోయాయనేదానిపై ఫేస్బుక్ నుంచి స్పష్టమైన, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బీజీపీ రూట్స్‌లో సర్వీసులకు విఘాతం కలగడం వల్ల ఫేస్బుక్, దానికి సంబంధించిన ప్రతీ వ్యాపారం ఘోరంగా దెబ్బతిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు కొద్దిగంటల పాటు ఫేస్బుక్ ఉద్యోగుల యాక్సెస్ కార్డులు పని చేయకుండా పోయాయట. దీంతో వాళ్లంతా కాలిఫోర్నియాలోని మెన్లో పార్క్ హెడ్ ఆఫీస్ బయటే ఉండిపోయారు. ఇక బోర్డర్ గేట్‌వే ప్రోటోకాల్ (BGP) అనేది గేట్‌వే ప్రోటోకాల్‌ను సూచిస్తుంది, ఇది స్వయంప్రతిపత్త వ్యవస్థల మధ్య రూటింగ్ సమాచారాన్ని మార్పిడి చేయడానికి ఇంటర్నెట్‌ని అనుమతిస్తుంది. Seeing @Facebook's BGP announcements getting published again. Likely means service is on a path to getting restored. — Matthew Prince 🌥 (@eastdakota) October 4, 2021 చదవండి: వాట్సాప్, ఇన్‌స్టా, ఫేస్బుక్ సేవలు పునరుద్ధరణ చదవండి: ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సేవలకు విఘాతం -
ఒక్క టెస్ట్ మ్యాచ్ రద్దవడం వల్ల ఇంత భారీ నష్టమా..?
మాంచెస్టర్: ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సిన ఆఖరి టెస్ట్ కరోనా కారణంగా రద్దైన విషయం తెలిసిందే. భారత శిబిరంలో కోచ్ రవిశాస్త్రి సహా నలుగురు కోచింగ్ సిబ్బంది కరోనా బారిన పడటంతో ఇరు దేశాల క్రికెట్ బోర్డుల పరస్పర అంగీకారంతో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ఒక్క మ్యాచ్ రద్దు కావడం వల్ల లాంకషైర్ క్రికెట్‌కు, ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)కు భారీ నష్టం వాటిల్లిందని సమాచారం. ఈ నష్టం భారత కరెన్సీలో వందల కోట్లకు పైగా ఉండవచ్చని ఈసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రసార హక్కులు ఇతరత్రా మార్గాల ద్వారా 30 మిలియన్ పౌండ్లు (దాదాపు రూ. 304 కోట్లు) వరకు నష్టం వాటిల్లిందంటూ ఈసీబీకి అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అర్ధంతరంగా రద్దైన ఈ మ్యాచ్‌ను వచ్చే ఏడాది భారత పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్‌తో పాటు నిర్వహించాలని ఇరు బోర్డులు పరస్పర అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. ఈ విషయమై బీసీసీఐ సూచనప్రాయంగా అంగీకారం తెలిపినట్లు జై షా వెల్లడించారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23లో భాగం జరుగుతున్న సిరీస్ కాబట్టి ఇరు జట్లకు అన్యాయం జరగకుండా ఉండేందుకే ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా, మ్యాచ్ రద్దు ప్రకటన అనంతరం తొలుత టీమిండియా మ్యాచ్‌ను వదులుకోవడానికి సిద్ధమైందంటూ (forfeit the match) ప్రకటన విడుదల చేసిన ఈసీబీ.. నిమిషాల వ్యవధిలోనే ఆ పదాన్ని తొలగించి.. టీమిండియా కరోనా కేసుల భయం కారణంగా జట్టును బరిలోకి దించలేకపోతుందంటూ మార్చేసింది. మరోవైపు సిరీస్ ఫలితంపై ఐసీసీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోగా ఈసీబీ మాత్రం ఓ విషయాన్ని స్పష్టం చేసింది. ఒకవేళ మ్యాచ్ రీ షెడ్యూల్ అయినా.. ఆ మ్యాచ్‌తో ప్రస్తుత సిరీస్‌కు సంబంధం ఉండదని, అది స్టాండ్ అలోన్ మ్యాచ్ అవుతుందని(సెపరేట్ మ్యాచ్) ఈసీబీ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఈ సిరీస్‌ను టీమిండియా(2-1) అనధికారికంగా కైవసం చేసుకున్నట్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: రీ షెడ్యూల్ అయినా సిరీస్‌తో సంబంధం ఉండదు: ఈసీబీ చీఫ్ -
బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి మూవీ మేకర్స్‌కు భారీ నష్టం
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ రీమేక్ చిత్రం ‘ఛత్రపతి’ మేకర్స్‌కు భారీ నష్టం వాటిల్లినట్లు సమాచారం. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ తెలుగు రీమేక్ చిత్రం ఏప్రిల్‌లో సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఛత్రపతి కోసం మేకర్స్ హైదరాబాద్‌లో 6 ఎకరాల స్థలంలో ఓ భారీ విలేజ్ సేట్ వేశారట. ఇప్పటికే కోవిడ్‌తో నష్టపోయిన నిర్మాతలకు ప్రస్తుతం కురుస్తున్న వరుస వర్షాల కారణంగా దాదాపు 3 కోట్ల రూపాయల నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. అప్పడు షూటింగ్ కోసం వేసిన ఈ భారీ విలేజ్ సేట్ ఈ వర్షాలకు తీవ్రంగా దెబ్బతినట్లు సమాచారం. ఇంకా సినిమా షూటింగ్ మొదలు కాకముందే మేకర్స్‌కు 3 కోట్ల నష్టం రావడం నిజంగా బాధించే విషయమే. ఇక ఈ సెట్ సినిమాకు చాలా కీలకం కానుండటంతో మరో ఆలోచన లేకుండా నిర్మాతలు దీనిని పున:నిర్మించే ఆలోచనలో పడ్డారట. ఈ వర్షాలు తగ్గిన వెంటనే తిరిగి సెట్‌ను నిర్మించే పనులు చేపట్టాలని మేకర్స్ నిర్ణయించినట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. కాగా అల్లుడు శీను సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయిన బెల్లంకొండ శ్రీనివాస్‌కు ఇప్పటిదాకా ఒక్క పెద్ద హిట్ కూడా పడలేదు. దీంతో రీమేక్ చిత్రాలనే నమ్ముకొని సినిమాలు చేస్తున్నాడు. తమిళ రీమేక్ రాక్షసుడు అనంతరం ప్రస్తుతం బెల్లంకొండ చేస్తోన్న రీమేక్ చిత్రం ఛత్రపతి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పానక్కర్లేదు. ఈ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బెల్లంకొండ సరసన అనన్య పాండే నటిస్తున్నట్లు సమాచారం. చదవండి: ఛత్రపతి రీమేక్‌లో సాయి శ్రీనివాస్ -
పరిశ్రమలు పాతాళానికి!
న్యూఢిల్లీ: భారత పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) 2020 జూన్‌లో భారీ క్షీణతను నమోదుచేసుకుంది. 2019 జూన్‌తో పోల్చుకుంటే, అసలు వృద్ధిలేకపోగా ఏకంగా మైనస్ 16.6 శాతం క్షీణతలోకి జారిపోయింది. తయారీ, మైనింగ్, విద్యుత్ ఉత్పత్తి రంగాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. మంగళవారం మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను చూస్తే... ► మొత్తం సూచీలో దాదాపు 60 శాతంపైగా ప్రాతినిధ్యం వహించే తయారీ రంగంలో ఉత్పత్తి ఏకంగా 17.1% క్షీణతను నమోదుచేసుకుంది. ► మైనింగ్ రంగం మైనస్ 19.8 శాతం క్షీణ రేటును నమోదుచేసుకుంది ► ఇక విద్యుత్ ఉత్పత్తి మైనస్ 10 శాతం పడిపోయింది. ► రిఫ్రిజిరేటర్లు, స్పోర్ట్స్ పరికరాలు, బొమ్మలు వంటి కన్జూమర్ డ్యూరబుల్స్ ఏకంగా –35.5 శాతం క్షీణించాయి. ► త్వరిత వినియోగ వస్తువుల విభాగంలో (కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్) మాత్రం 14 శాతం వృద్ధి నమోదుకావడం గమనార్హం. ► భారీ యంత్ర పరికరాలకు సంబంధించిన క్యాపిటల్ గూడ్స్ విభాగంలో ఈ క్షీణ రేటు ఏకంగా 36.9 శాతంగా ఉంది. ► మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో 40 శాతంపైగా వెయిటేజ్ ఉన్న ఎనిమిది మౌలిక పరిశ్రమల గ్రూప్– జూన్‌లో (2019 జూన్‌తో పోల్చి) అసలు వృద్ధిలేకపోగా మైనస్ 15 శాతం క్షీణించింది. ఎనిమిది రంగాల్లో ఏడు – బొగ్గు (–15.5 శాతం), క్రూడ్ ఆయిల్ (–6 శాతం) , సహజ వాయువు (–12 శాతం), రిఫైనరీ ప్రొడక్టులు (–8.9 శాతం), స్టీల్ (–33.8 శాతం) , సిమెంట్ (–6.9 శాతం), విద్యుత్ (–11 శాతం) ఉత్పత్తి క్షీణ రేటును నమోదుచేసుకోవడం గమనార్హం. ఒక్క ఎరువుల రంగం మాత్రం వృద్ధి ధోరణిని కనబరచింది. నెలవారీగా మెరుగుపడిన ఇండెక్స్ కాగా, సాంప్రదాయకంగా గణాంకాలను వార్షికంగా పోల్చి చూసినా, కరోనా ప్రభావిత నెలల లెక్కలను అంతక్రితం లెక్కలతో పోల్చడం అంత సబబుకాదని గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ పేర్కొనడం గమనార్హం. వార్షికంగా క్షీణ రేట్లు కనబడినా, నెలవారీగా గణాంకాలు కొంత మెరుగుపడ్డం ఊరటనిచ్చే అంశం. ఏప్రిల్‌లో 53.6 వద్ద ఉన్న సూచీ, మేలో 89.5కు ఎగసింది. జూన్‌లో మరింతగా పెరిగి 107.8కి ఎగసింది. క్యూ1లో 35.9 శాతం క్షీణత ఇక ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో చూసినా కూడా పారిశ్రామిక ఉత్పత్తి మైనస్ 35.9 శాతం క్షీణతను నమోదు చేసుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 3 శాతం వృద్ధి నమోదయ్యింది. -
'దుబాయ్' భారం..!
ఎన్ని అవాంతరాలొచ్చినా ఐపీఎల్ సీజన్–13 జరగడం ఖాయమైంది. కరోనా కబళిస్తున్నా... భారత్–చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నా, ఉన్నపళంగా భారీ ఆర్థిక నష్టం వాటిల్లినా లీగ్ నిర్వహణకే బీసీసీఐ మొగ్గు చూపింది. నిర్వహణపై అమితాసక్తితో ఎదురు చూసిన ఫ్రాంచైజీలకు యూఏఈలో టోర్నీ జరగడం మొత్తం ఆర్థికంగా నష్టపరిచే అంశం. వారి ఆదాయంపై పెద్ద ఎత్తున దెబ్బ పడనుంది. అయితే పూర్తిగా లీగ్ రద్దు కావడంతో పోలిస్తే ఎంతో కొంత ఆదాయం రానుండటం ఊరట కలిగించే అంశం. సాక్షి క్రీడా విభాగం: ఐదేళ్లకు ఏకంగా రూ. 2199 కోట్ల భారీ డీల్... సాలీనా రూ. 440 కోట్ల చెల్లింపులు... ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ కోసం వివో 2017లో చేసుకున్న ఒప్పందం ఇది. ఐపీఎల్ రెవిన్యూ షేరింగ్ అగ్రిమెంట్లో ఫ్రాంచైజీలకు టైటిల్ స్పాన్సర్షిప్ అనేది కీలక ఆదాయ వనరు. మొత్తం టైటిల్ స్పాన్సర్‌షిప్‌లో సగభాగం (దాదాపు 1000 కోట్లు) లీగ్‌లోని 8 ఫ్రాంచైజీలకు అందజేస్తారు. అంటే ఏడాదికి రూ. 20 కోట్లకు పైగానే ఫ్రాంచైజీలు ఆర్జిస్తున్నాయి. రాజకీయ కారణాలతో చైనా మూలాలున్న వివో తప్పుకోవడంతో ఆ ప్రభావం ఫ్రాంచైజీలపై పడనుంది. ప్రస్తుత ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో ‘వివో’ ఇచ్చే మొత్తాన్నే ఇవ్వగల కొత్త స్పాన్సర్ దొరకడం కష్టమే. మరోవైపు ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు నిర్వహిస్తుండటంతో టిక్కెట్ల విక్రయం ద్వారా లభించే గేట్ రెవెన్యూ కూడా ఫ్రాంచైజీలు కోల్పోనున్నాయి. మీడియా హక్కులే ఆలంబన... ప్రస్తుతం ఫ్రాంచైజీల్ని లీగ్ నిర్వహణ వైపు నడిపిస్తోన్న ఆదాయ వనరు మీడియా హక్కులు. ఈ హక్కుల్ని స్టార్ ఇండియా యాజమాన్యం 2017లో రికార్డు మొత్తానికి సొంతం చేసుకుంది. ఐదేళ్ల కాలానికి రూ. 16,347 కోట్లతో ఈ ఒప్పందం కుదిరింది. క్రికెట్ మీడియా హక్కుల ఒప్పందంలో చరిత్ర సృష్టించిన ఈ భారీ డీల్‌తో ఫ్రాంచైజీలు ఏటా రూ. 150 కోట్లు ఆర్జిస్తున్నాయి. ఈ మీడియా హక్కుల ఫలితంగా ప్రతి సీజన్‌కు రూ. 50 కోట్లు లాభం ఉంటుందని అంచనా. ఇతర ఆదాయ మార్గాల్లోనూ కోత! మీడియా హక్కులతో పాటు కిట్, జెర్సీ, హెల్మెట్లకు వేరు వేరు సంస్థలు స్పాన్సర్లుగా వ్యవహరిస్తుంటాయి. వీటి ద్వారా ఫ్రాంచైజీలు సీజన్‌కు రూ. 45–50 కోట్లు ఆర్జిస్తున్నాయి. అయితే గత సీజన్లో ఒక జట్టుకు రూ. 33 కోట్లు ఆదాయాన్ని సమకూర్చిన ఒక ప్రధాన స్పాన్సర్... ఈ సారి అంత మొత్తం ఇవ్వలేమంటూ సంప్రదింపులకు దిగింది. మిగతా జట్లకూ ఇదే అనుభవం ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. కరోనా కారణంగా ఈ సారి ఈ ఆదాయంలో కూడా గండిపడే అవకాశముంది. ఖర్చులు అదనం యూఏఈలో జరిగే టోర్నీ కోసం ఆటగాళ్ల భద్రత దృష్ట్యా చార్టెడ్ ఫ్లయిట్స్‌ను ఫ్రాంచైజీలు వినియోగించనున్నాయి. లీగ్ జరిగినన్ని రోజులు ఆటగాళ్ల వసతి, వారుండే హోటళ్లలో బయో సెక్యూర్ పరిస్థితుల ఏర్పాటు, రవాణా వీటన్నింటికి భారీగా ఖర్చయ్యే అవకాశముంది. వీటి కోసమే దాదాపు రూ. 10–12 కోట్లు ఖర్చయ్యే అవకాశముందని ఫ్రాంచైజీలు పేర్కొన్నాయి. భారత్‌లో ఖర్చుతో పోలిస్తే ఇది 50–60 శాతం అదనం. మరో వైపు టికెట్లు అమ్మకపోవడం ద్వారా తాము కోల్పోయే ‘గేట్ రెవెన్యూ’కు నష్టపరిహారం చెల్లించాలంటూ ఫ్రాంచైజీలు చేసిన విజ్ఞప్తిని బీసీసీఐ నిర్ద్వద్వంగా తిరస్కరించింది. అదే విధంగా ఈ ఏడాది మ్యాచ్‌లు జరగకపోయినా దేశంలో ఎనిమిది ఐపీఎల్ జట్లకు కేంద్రాలుగా ఉన్న రాష్ట్ర సంఘాలకు ప్రతీ ఏటా ఒక్కో ఫ్రాంచైజీ చెల్లించే రూ. 8 కోట్లు (మొత్తం రూ. 64 కోట్లు) కూడా ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మొత్తాన్ని దిగువ స్థాయి క్రికెట్‌ను ప్రోత్సహిస్తేందుకు ఉపయోగిస్తామని, ఈ డబ్బు లేకపోతే ఆయా సంఘాల్లో క్రికెట్ దెబ్బ తింటుందని బోర్డు అభిప్రాయ పడింది. -
విజన్ ఫండ్ సీఈఓకు రెట్టింపు వేతనం
ముంబై: జపాన్ దిగ్గజ సంస్థ సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్‌కు చెందిన విజన్ ఫండ్ తీవ్ర నష్టాలను చవిచూస్తుంది. ప్రస్తుతం విజన్ ఫండ్ రూ.1700 కోట్ల నష్టాలను ఎదుర్కొంటుంది. ఈ సంక్షోభ సమయంలో విజన్ ఫండ్ సీఈఓ రాజీవ్ మిశ్రాకు రెట్టింపు వేతనాన్ని(కోటి యాబై లక్షల డాలర్లు) పెంచడం పట్ల మార్కెట్ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే విజన్ ఫండ్ పది శాతం ఉద్యోగులకు ఉద్వాసన పలకనుందన్న ఊహాగానాల నేపథ్యంలో రాజీవ్ మిశ్రాకు రెట్టింపు వేతనం పెంచడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం టోక్యో, కాలిఫోర్నియాలో విజన్ ఫండ్ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. తాజాగా సాప్ట్ బ్యాంక్ తిరిగి పుంజుకోవడానికి అక్షయ్ నహేతా సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా, సీనియర్ అడ్వైజర్‌గా కెంటారోను నియమించుకోనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. సీఈఓ వేతన పెంపుకు సంబంధించి కారణాలను మాత్రం కంపెనీ వెల్లడించలేదు. -
లాక్డౌన్ ఎఫెక్ట్ : నష్టం ఎంతంటే..
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కట్టడికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన 21 రోజుల లాక్డౌన్ దేశ ఆర్థిక వ్యవస్ధపై పెనుప్రభావం చూపింది. ఫ్యాక్టరీలు, వ్యాపారాల మూతతో పాటు.. థియేటర్లు, మాల్స్, షాపుల షట్‌డౌన్.. విమానాలు, రైళ్లు సహా రవాణా నిలిచిపోవడంతో ఆర్థిక కార్యకలాపాలకు బ్రేక్ పడి పెద్దమొత్తంలో లావాదేవీలు స్తంభించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద లాక్‌డౌన్‌తో ఈ మూడువారాల్లో భారత ఆర్థిక వ్యవస్థ రూ 7లక్షల కోట్ల నుంచి రూ 8 లక్షల కోట్లను కోల్పోయింది. కరోనా కట్టడికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన మేరకు మార్చి 25 నుంచి అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్‌తో నిత్యావసరాల సరఫరా మినహా 70 శాతం మేర ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటున్న తరుణంలో మహమ్మారి ఎకానమీపై విరుచుకుపడిందని విశ్లేషకులు, పరిశ్రమ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో ఆర్థిక వ్యవస్థకు రూ 8 లక్షల కోట్ల వరకూ నష్టం వాటిల్లిందని సెంట్రమ్ ఇనిస్టిట్యూషనల్ రీసెర్చి అంచనా వేసింది. లాక్‌డౌన్‌తో రోజుకు రూ 35,000 కోట్లకు పైగా నష్టమని, 21 రోజులకు రూ 7.5 లక్షల కోట్ల నష్టం తప్పదని ఎక్యూట్ రేటింగ్స్ అండ్ రీసెర్చ్ లిమిటెడ్ ఇప్పటికే వెల్లడించింది. చదవండి : లాక్డౌన్ పక్కాగా అమలు చేస్తే ఇలాగే ఉంటది! కోవిడ్-19 వ్యాప్తితో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం కావడంతో పాటు భారత్‌లోని పలు ప్రాంతాల్లో మార్చి తొలివారం నుంచే పాక్షిక షట్‌డౌన్, మార్చి 25 తర్వాత దేశమంతటా లాక్డౌన్ అమలు అనివార్యమైందని ఆ సంస్థ పేర్కొంది. లాక్డౌన్ పొడిగించిన పక్షంలో ఆర్థిక వ్యవస్థ భారీగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి వ్యాప్తి, లాక్డౌన్ ప్రభావంతో రవాణా, హోటల్, రెస్టారెంట్, రియల్ఎస్టేట్, వినోద రంగం సహా పలు రంగాలు తీవ్రంగా దెబ్బతింటాయని పేర్కొంది. ఇక లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా ట్రక్కులు నిలిచిపోవడంతో ట్రక్కు రవాణా రంగానికి 15 రోజుల లాక్‌డౌన్‌తో రూ 35,200 కోట్ల నష్టం వాటిల్లిందని ఏఐఎంటీసీ ప్రధాన కార్యదర్శి నవీన్ గుప్తా వెల్లడించారు. మరోవైపు లాక్‌డౌన్‌తో నిర్మాణ రంగం కుదేలైందని, మహమ్మారి ప్రభావంతో కొనుగోలుదారుల సెంటిమెంట్ దెబ్బతినడం..కొనుగోళ్లు నిలిచిపోవడంతో రియల్ఎస్టేట్ రంగానికి రూ లక్ష కోట్ల నష్టం ఎదురైందని జాతీయ రియల్ఎస్టేట్ అభివృద్ధి మండలి అధ్యక్షలు నిరంజన్ హిరనందాని వెల్లడించారు. లాక్‌డౌన్‌తో రిటైల్ రంగానికి రూ 30,000 కోట్ల పైగా నష్టం వాటిల్లిందని అఖిలభారత వర్తక సమాఖ్య అంచనా వేసింది. మరోవైపు ప్రజల ప్రాణాలతో పాటు ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడం రెండూ కీలకమైనవని ప్రధాని పేర్కొనడంతో మంగళవారం ఉదయం జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేసే ప్రసంగంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. లాక్డౌన్ కొనసాగింపు విధివిధానాలు, మినహాయింపులపై ఎలాంటి ప్రకటన చేస్తారనేది ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు పేదలు, వలస కూలీల ప్రయోజనాలు కాపాడుతూనే లాక్డౌన్ పొడిగింపుపై నిర్ణయం ఉంటుందని భావిస్తున్నారు. చిన్నమధ్యతరహా పరిశ్రమల కార్యకలాపాలకూ మినహాయింపు ఇస్తారని చెబుతున్నారు. -
కడగండ్లు మిగిల్చిన అకాల వర్షం
సాక్షి, నెట్వర్క్: రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గురువారం కురిసిన అకాల వర్షాలు రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. కోత కు వచ్చిన వరి పైర్లు నేలకొరిగాయి. కొన్ని చోట్ల మామిడి తోట లకు నష్టం వాటిల్లింది. ఇతర పంటలు కూడా దెబ్బతిన్నాయి. ► ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాల్వంచ, అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట, మణుగూరు, అశ్వాపురం, సత్తుపల్లి మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తో పాటు కల్లాల్లోని మిర్చి, మొక్కజొన్న పంట తడిసిపోయిం ది. కొన్నిచోట్ల మామిడి కాయలు నేలరాలాయి. ► సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. కొమురవెళ్లి మండలంలో వడగళ్లు పడ్డాయి. నంగునూరులో ధాన్యం నేలరాలింది. గజ్వేల్ మండలంలో వరి, మామిడితోటలకు నష్టం జరిగింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నష్టం అపారం యాదాద్రి భువనగిరి జిల్లాలో రాజాపేట, తుర్కపల్లి మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లిం ది. రాజాపేట మండలంలో మామిడి తోటలు దెబ్బతినగా తు ర్కపల్లి మండలంలో మామిడి తోటలతో పాటు వరికి తీరని నష్టం వాటిల్లింది. విద్యుత్æ స్తంభాలు కూలిపోవడంతో కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గాలులకు పలు చోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరి పడ్డాయి. చెట్లు కూలిపోయాయి. కోతకు వచ్చి న వరి పంట 2,963 ఎకరాల్లో పూర్తిగా ధ్వంసమైంది. నిమ్మ, మామిడి, కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. ఇక నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలో వడగండ్లతో కూడిన వర్షం కురవడంతో చేతికొచ్చిన వరిపైరు పూర్తిగా నేలపాలైంది. చింతపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో వసతులు లేకపోవడంతో ధాన్యం నీటిపాలైంది. అలాగే వింజమూరు, వర్కాల గ్రామాల్లో వరి పైరుకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఉమ్మడి పాలమూరులో భారీ నష్టం.. : మహబూబ్‌నగర్ జిల్లాలోని చిన్నచింతకుంట, మూసాపేట, అడ్డాకుల, రాజాపూర్, మహబూబ్‌నగర్ రూరల్, బాలానగర్ మండలాల్లో దాదాపు వెయ్యి ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని అంచనా. వనపర్తి జిల్లాలో రెండు గంటల పాటు భారీ వర్షం కురవడంతో పంటలకు పెద్ద ఎత్తున నష్టం జరిగింది. కొత్తకోట, వనపర్తి, పెద్దమందడి మం డలాల్లో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. శుక్రవారం ఉద్యాన, వ్యవసాయ శాఖ అధికారులు నష్టం వివరాల ను అంచనా వేయనున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మం డలంలోని ఖానాపూర్, పంచలింగాల, కర్ని, రుద్రసముద్రం, కాట్రెవ్‌పల్లి, మక్తల్ గ్రామాల్లో వెయ్యి ఎకరాల్లో పంట నేల వాలింది. నర్వ మండలం కొత్తపల్లి, జక్కన్నపల్లి, రాయికోడ్, నర్వ, యాంకి గ్రామాల్లో వడ్లు రాలిపోగా.. మామిడి తోటలు దెబ్బతిన్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లా చింతరేవుల, నర్సన్‌దొడ్డి, రేవులపల్లి, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో వడగండ్ల వానతో పండ్ల తోటలు దెబ్బతిన్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం ఉపరితల ద్రోణి ప్రభావంతో గురువారం గ్రేటర్ హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సాయంత్రం వేళ కురిసిన వర్షానికి పలు ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు పోటెత్తింది. తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని.. తూర్పు విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో నగరంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు ప్రకటించింది. కాగా అత్యధికంగా బొల్లారంలో 3.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. క్యాంప్ ఆఫీస్‌పై పిడుగు.. దేవరకొండ ఎమ్మెల్యేకు తప్పిన ముప్పు నల్లగొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రనాయక్ క్యాంప్ కార్యాలయం పెంట్‌హౌస్æ ప్రహరీపై గురువారం పిడుగుపడింది. పిడుగుపాటుకు క్యాంప్ కార్యాలయం పెంట్‌హౌస్ ప్రహరీ గోడ పాక్షికంగా దెబ్బతిన్నది. ఆ సమయంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కుటుంబసభ్యులతో కలసి భోజనం చేస్తున్నారు. ఎమ్మెల్యే, ఆయన కుటుంబసభ్యులు సురక్షితంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
పసుపు రైతులపై కరోనా ఎఫెక్ట్
-
వంద రోజుల్లో రూ 12.5 లక్షల కోట్లు ఆవిరి..
ముంబై : నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తొలి వంద రోజుల్లో రూ 12.5 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైంది. మే 30 నుంచి బీఎస్ఈ సెన్సెక్స్ ఆరు శాతం (2357 పాయింట్లు), ఎన్ఎస్ఈ నిఫ్టీ ఏడు శాతం (858 పాయింట్లు) కోల్పోవడంతో ఇన్వెస్టర్ల సంపద భారీగా హరించుకుపోయింది. మోదీ ప్రభుత్వం రెండోసారి పాలనా పగ్గాలు చేపట్టే ముందు రోజు బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ 1,53,62,936 కోట్లు కాగా, సోమవారం మార్కెట్ ముగిసిన సమయానికి దాని విలువ రూ 1,41,15,316 కోట్లకు పడిపోయింది. ఆర్థిక మందగమనం, విదేశీ నిధులు వెనక్కిమళ్లడం, కార్పొరేట్ ఫలితాలు సానుకూలంగా లేకపోవడం వంటి అంశాలు స్టాక్ మార్కెట్ల పతనానికి కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా విదేశీ మదుపరులు మార్కెట్ నుంచి పెట్టుబడులను వెనక్కితీసుకుంటుండటంతో ఈక్విటీ మార్కెట్లు డీలా పడుతున్నాయని చెబుతున్నారు. మోదీ సర్కార్ తిరిగి అధికారం చేపట్టిన అనంతరం ఇప్పటివరకూ విదేశీ మదుపరులు రూ 28,260 కోట్ల విలువైన షేర్లను విక్రయించారని ఎన్ఎస్డీఎల్ డేటా వెల్లడించింది. 2018 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను విధించడంతో పాటు, డివిడెండ్ పంపిణీ పన్ను పొందుపరచడంతో అప్పటినుంచే మార్కెట్లో స్లోడౌన్ ప్రారంభమైందని ఐడీబీఐ క్యాపిటల్ రీసెర్చ్ హెడ్ ఏకే ప్రభాకర్ చెప్పుకొచ్చారు. -
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
-
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబై : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసంలో జీడీపీ వృద్ధి ఐదు శాతానికి పరిమితమైందనే గణాంకాలతో స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. జీడీపీ వృద్ధి రేటుతో పాటు అమెరికా-చైనా ట్రేడ్‌వార్ భయాలు మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి. ఆర్థిక మందగమనాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం పలు చర్యలు ప్రకటించినా మదుపుదారులు కొనుగోళ్లకు దూరంగా ఉన్నారు. అన్ని రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొనడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 460 పాయింట్ల నష్టంతో 36,872 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 143 పాయింట్ల నష్టంతో 10,879 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. -
అకాల వర్షాలు : ప్రధాని తీరుపై విపక్షం ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్, రాజస్ధాన్, గుజరాత్, మహారాష్ట్రలో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులతో 34 మంది మరణించారు. అకాల వర్షాలు నాలుగు రాష్ట్రాలను ముంచెత్తడంతో భారీ నష్టం వాటిల్లింది. మధ్యప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షంతో 11 మంది మృత్యువాతన పడ్డారు. ఖర్గోనే జిల్లాలో ఈదురుగాలులు, భారీ వర్షాలకు వందలాది ఇళ్లు నీటమునిగాయి. జముదిర్ సర్వార్ గ్రామంలో పిడుగుపాటుతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. ఇక గుజరాత్లో భారీ వర్షాలు, పిడుగుపాటుకు 9 మంది మరణించారు. మెహసనా, బనస్కంత, సబర్కంత ప్రాంతాల్లో భారీ వర్షాలతో భారీగా పంట నష్టం వాటిల్లింది. మరోవైపు మహారాష్ట్రలో భారీ వర్షాలు, పిడుగుపాటు కారణంగా ఏడుగురు వ్యక్తులు మరణించారు. నాసిక్, పుణేలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్థం చేసింది. రాజస్ధాన్‌లో భారీ వర్షాలకు ఏడుగురు వ్యక్తులు మరణించారు. అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడంతో పాటు పెద్దసంఖ్యలో మట్టిఇళ్లు దెబ్బతిన్నాయి. మోదీపై భగ్గుమన్న కాంగ్రెస్ గుజరాత్లో భారీ వర్షాలతో ఆస్తి, ప్రాణ, పంట నష్టం వాటిల్లడంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రధాని సహాయ నిధి నుంచి రూ 2 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రధాని కార్యాలయం ప్రకటించింది. కాగా గుజరాత్ సహా నాలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తే ప్రధాని కేవలం గుజరాత్‌నే ప్రస్తావించడం పట్ల విపక్ష కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. గుజరాత్లో భారీ వర్షాలతో వాటిల్లిన నష్టంపై ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం సంతోషమే..కానీ కాంగ్రెస్ పాలిత మధ్యప్రదేశ్‌లోనూ అకాల వర్షాలతో ప్రాణ నష్టం జరిగిందని, ఇక్కడ బీజేపీ అధికారంలో లేకపోయినా తమ రాష్ట్రంలో అకాల వర్ష బాధితులకు కూడా ప్రధాని సంతాపం తెలపాలని ఆ రాష్ట్ర సీఎం కమల్ నాధ్ ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్‌లో బాధితులకు ఎలాంటి సాయం చేయని ప్రదాని గుజరాత్ పట్ల పక్షపాతం చూపారని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఆక్షేపించారు. -
సంపద కోల్పోవడంలోనూ ప్రపంచ కుబేరుడి అరుదైన రికార్డు
ముంబై : అంతర్జాతీయ మార్కెట్లు ముఖ్యంగా అమెరికా మార్కెట్లు భారీగా పతనమవడంతో ప్రపంచ కుబేరుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ భారీగా సంపద కోల్పోయారు. గడిచిన రెండు రోజులుగా ఆయన 19.2 బిలియన్ డాలర్లు(సుమారు 1.40 లక్షల కోట్ల రూపాయలు) నష్టపోయారని బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది జూలైలో ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ 16.5 బిలియన్ డాలర్లు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంపద కోల్పోవడంలోనూ జెఫ్ బెజోస్ కొత్త రికార్డు సృష్టించారని నివేదిక పేర్కొంది. సోమవారం నాడు అమెరికా మార్కెట్ సూచీ భారీగా కుదుపులకు లోనవడంతో అమెజాన్ షేర్లు 6.3 శాతం మేర పడిపోయాయి. కాగా అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదం ముదురుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థ వృద్ధి అంచనాలను ప్రపంచ ఆర్థిక సంస్థ కుదించింది. ఈ రెండు దేశాలూ వచ్చే ఏడాదిలో వాణిజ్య వివాద ప్రభావాలను చవి చూడాల్సి వస్తుందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత నెల రోజులుగా ప్రపంచంలోని 500 మంది టాప్ బిలియనీర్లు భారీగా సంపద కోల్పోతున్నారని బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. ఈ ర్యాంకింగ్‌లో జెఫ్ బెజోస్ మొదటి స్థానంలో కొనసాగుతుండగా.. మెక్సికన్ టెలికాం టైకూన్ కార్లస్ స్లిమ్ 2.5 బిలియన్ డాలర్ల సంపద కోల్పోయి రెండో స్థానాన్ని ఆక్రమించారు. -
తెలంగాణలో వర్షాలతో రైతులకు భారీ నష్టం