IICT
-
హైడ్రోజన్‌తో స్వావలంబన దిశగా..
సాక్షి, హైదరాబాద్: ఇంధన రంగంలో మన దేశం స్వావలంబన సాధించేందుకు హైడ్రోజన్ ఉపయోగపడుతుందని, ఈ దిశగా పరిశోధనలూ వేగంగా సాగుతున్నాయని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) హైడ్రోజన్ విభాగం జనరల్ మేనేజర్ డీఎంఆర్ పాండా వెల్లడించారు. జాతీయ సైన్స్ దినోత్సవాల్లో భాగంగా మంగళవారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో డీఎంఆర్ పాండా ‘గ్రీన్ హైడ్రోజన్ ఎమర్జింగ్ ట్రెండ్స్’’అన్న అంశంపై కీలకోపన్యాసం చేశారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పర్యావరణ అనుకూలమైన విధానాల్లో హైడ్రోజన్‌ను వినియోగంలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. ఇందులో భాగంగా లేహ్, ఢిల్లీల్లో హైడ్రోజన్ బస్సులు ఇప్పటికే నడుస్తుండగా, సౌర విద్యుత్ సాయంతో హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వలకు కూడా పైలెట్ ప్రాజెక్టులు నిర్వహిస్తున్నామని చెప్పారు. గత పదేళ్లలో హైడ్రోజన్ ధర పదిరెట్లు తగ్గింది.. దేశంలో సౌర, పవన విద్యుదుత్పత్తులకు అపార అవకాశాలున్నాయని, ఇలా ఉత్పత్తి అయిన విద్యుత్‌తో వేర్వేరు పద్ధతులను ఉపయోగించుకుని హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా దేశం పెట్రో ఉత్పత్తుల దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం తప్పుతుందని పాండా వివరించారు. అలాగే కర్బన ఉద్గారాల తగ్గింపూ సాధ్యమవుతుందన్నారు. ప్రస్తుతం హైడ్రోజన్ ఉత్పత్తి ఖర్చులు ఎక్కువైనప్పటికీ, ఐఐసీటీ, ఇతర విద్యా, పరిశోధన సంస్థల సహకారంతో దాన్ని తగ్గించి విస్తృత వినియోగంలోకి తేవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. గత పదేళ్లలో హైడ్రోజన్ ధర పదిరెట్లు తగ్గిందని గుర్తు చేశారు. ఎలక్ట్రలైజర్లు, ఒత్తిడిని తట్టుకోగల సిలిండర్లు, హైడ్రోజన్‌ను చిన్న చిన్న సిలిండర్లలోకి పంపేందుకు అవసరమైన కంప్రెషర్ల విషయంలో దేశం ఇప్పటికీ విదేశాలపైనే ఆధారపడుతోందని, ఫలితంగా ఈ ఇంధనాన్ని అందరికీ అందుబాటులోకి తేవడంలో ఆలస్యం జరుగుతోందని చెప్పారు. ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ డి.శ్రీనివాస రెడ్డి, డాక్టర్ సమీర్ దవే, డాక్టర్ నెట్టెం వి.చౌదరి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు ఎన్టీపీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గురుదీప్ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ దేశంలో హైడ్రోజన్ ఉత్పత్తి, వినియోగంపై జరుగుతున్న ప్రయత్నాలను క్లుప్తంగా వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో హైడ్రోజన్ హబ్ దేశంలో హైడ్రోజన్ ఉత్పత్తి, వినియోగాలను పెంచే కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో హైడ్రోజన్ హబ్ ఒకదాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఎన్టీపీసీ జనరల్ మేనేజర్ (హైడ్రోజన్ విభాగం) డీఎంఆర్ పాండా తెలిపారు. విశాఖపట్నంలోని ఎన్టీపీసీ కేంద్రానికి దగ్గరగా ఈ హబ్ ఏర్పాటు కానుందని ఆయన విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. మొత్తం 1200 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే హైడ్రోజన్ హబ్‌లో హైడ్రోజన్ ఉత్పత్తితోపాటు దానికి సంబంధించిన టెక్నాలజీలు, రవాణా వ్యవస్థలపై విస్తృతమైన పరిశోధనలు జరగనున్నాయని, సౌర శక్తి కోసం పెద్ద ఎత్తున సోలార్ ప్యానెల్స్ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ హబ్ ఏర్పాటుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని, అన్నీ సవ్యంగా సాగితే ఇంకో వారం రోజుల్లో ఎన్టీపీసీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య దీనిపై ఒక అవగాహన ఒప్పందం కూడా జరగనుందని వివరించారు. రానున్న పదేళ్లలో ఈ హబ్ ఏర్పాటుకు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు పాండా తెలిపారు. ‘వన్ వీక్.. వన్ ల్యాబ్’ ఈ నెల ఏడు నుంచి! కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) పరిశోధనశాలల కార్యకలాపాలను ప్రజలకు వివరించేందుకు ఉద్దేశించిన ‘వన్ వీక్.. వన్ ల్యాబ్’కార్యక్రమం ఈ నెల ఏడవ తేదీ నుంచి ప్రారంభం కానుందని ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ డి.శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఆరు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా ఐఐసీటీలో జరుగుతున్న పరిశోధనలు, అభివృద్ధి చేసిన ఉత్పత్తులను ప్రదర్శించనున్నామని చెప్పారు. పరిశోధకులు, ఉపాధ్యాయులు, పారిశ్రామికవేత్తలు, టెక్నాలజిస్టులు, స్టార్టప్‌లు, సాధారణ ప్రజలు ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చునని సూచించారు. -
వంట నూనె ఒంటికి మంచిదా? ఎంతవరకు! ఐఐసీటీ మాజీ శాస్త్రవేత్త క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: వంట నూనె వినియోగంపై భిన్న వాదనలు ఉన్నాయి. నూనె లేని ఆహార పదార్థాలు తింటేనే ఆరోగ్యకరమని కొందరు అంటారు. అసలు నూనెలే వాడకపోవడం అనారోగ్యానికి దారి తీస్తుందని మరికొందరు చెబుతుంటారు. మూడు, నాలుగు దశాబ్దాల క్రితం వరకు గానుగ (కోల్డ్ ప్రెస్) నూనెనే ఎక్కువగా వినియోగించేవారు. క్రమంగా రిఫైన్డ్ (శుద్ధి చేసిన) ఆయిల్స్ మార్కెట్‌ను ఆక్రమించాయి. ప్యాకేజ్డ్ నూనెల వినియోగం పెరిగిపోయింది. కొన్నాళ్లకు శుద్ధి చేసిన నూనెలు మంచివి కావనే వాదన మొదలైంది. దీంతో మళ్లీ గానుగ నూనె వినియోగం మొదలైంది. అయితే గానుగ నూనెలే మంచివని, శుద్ధి చేసిన నూనెలు మంచివి కావన్న ప్రచారం ఏమాత్రం సరికాదని భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ)లోని ఆయిల్స్, ఫ్యాట్స్ సైంటిఫిక్ ప్యానెల్ జాతీయ చైర్మన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) మాజీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్‌బీఎన్ ప్రసాద్ అంటున్నారు. ‘అసలు నూనెలే వాడకపోవడం అనారోగ్యానికి దారితీస్తుంది. సాధారణంగా ప్రతి మనిషికి రోజుకు 2 వేల వరకు కేలరీలు కావాలి. కష్టపడి పని చేసేవారికి 2,500 వరకు కేలరీలు అవసరం. అయితే అందులో 25 నుంచి 30 శాతం నూనెలు, కొవ్వుల ద్వారానే రావాలి..’అని స్పష్టం చేశారు. అయితే ఎలాంటి నూనె మంచిది, ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి తదితర అంశాలపై ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 85 శాతం శుద్ధి చేసిన వంట నూనెలే.. ప్రస్తుతం ప్రపంచంలో వాడుతున్న వంట నూనెల్లో 85 శాతం శుద్ధి చేసినవే. రిఫైన్డ్ నూనెల్లో వాడే రసాయనాలు అన్నీ కోడెక్స్ (నాణ్యతా ప్రమాణాలు నిర్ధారించే అంతర్జాతీయ సంస్థ) నిర్ధారించినవే. కోడెక్స్ సహా మన దేశంలోని ఎఫ్ఎస్ఎస్ఏఐ సిఫారసు చేసిన హాని చేయని రసాయనాల్ని రిఫైనింగ్‌లో వాడుతున్నారు. కాబట్టి ఎలాంటి భయం లేకుండా రిఫైన్డ్ ఆయిల్స్ వాడుకోవచ్చు. అందులో విషం ఉంటుందనేది ఏమాత్రం నిజం కాదు. అంతేకాదు కొన్ని గింజల నుంచి గానుగ పద్ధతిలో నూనెను తయారు చేయలేం. వేరుశనగ, నువ్వులు, ఆవాలు, కొబ్బరి, కుసుమ గింజలనే గానుగ చేసి నూనె తీయవచ్చు. కానీ పామాయిల్, సోయాబీన్ నూనెలను ఆ పద్ధతిలో తీయలేం. వాటిని రిఫైన్ చేయకుండా వాడలేం. ప్రపంచంలో మూడింట రెండో వంతు పామాయిల్, సోయాబీన్ నూనెలనే వాడతారు. మన దేశంలో ఏడాదికి 23 మిలియన్ టన్నుల నూనె వాడతారు. కానీ మనం 8 మిలియన్ టన్నులే ఉత్పత్తి చేస్తున్నాం. మిగిలినది దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి గానుగ నూనె అందరికీ ఇవ్వలేం. గానుగ నూనె మంచిది కాదని కూడా చెప్పడం లేదు. శుద్ధి చేసిన నూనెలు మంచివి కావని ప్రచారం చేయడమే తప్పు. ఎక్కువ రాదు కాబట్టి గానుగ నూనె ధర ఎక్కువ గింజలను గానుగ ఆడించినప్పుడు వాటి నుంచి నూనె మొత్తం రాదు. దాదాపు 25 శాతం చెక్కలోనే ఉండిపోతుంది. కాబట్టి వాటి ధర ఎక్కువ ఉంటుంది. ఇక శుద్ధి చేసిన నూనెలను తయారు చేసే కంపెనీలు పెద్దమొత్తంలో తక్కువ ధరకు ముడిపదార్థాలు కొంటాయి. పైగా యంత్రాలతో నూనె మొత్తాన్నీ తీస్తాయి. అందువల్ల వాటి ధర తక్కువగా ఉంటుంది. ఇక గానుగ చేసేందుకు వాడే గింజల్లో పుచ్చిపోయినవి ఉంటే వాటి నూనె విషంగా మారుతుంది. ఉదాహరణకు పుచ్చిపోయిన పల్లీలతో నూనె తీస్తే అందులో ఎఫ్లాటాక్సిన్ అనే విష పదార్థం ఉంటుంది. ఇది క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు కారణం అవుతుంది. అయితే అవే గింజలను రిఫైన్ చేస్తే ఎఫ్లాటాక్సిన్ పోతుంది. అప్పుడు అది మంచిదవుతుంది. పెద్ద పెద్ద కంపెనీలు తయారు చేసే రిఫైన్డ్ నూనెల్లో కల్తీ జరుగుతుందని చెప్పడం నిజం కాదు. ఆమ్లాలు సమాన నిష్పత్తిలో ఉండాలి నూనెల్లో సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు, మోనో అన్ సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు, పాలి అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు ఉండాలి. ఈ మూడూ సమాన నిష్పత్తిలో ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్పష్టం చేసింది. ఈ మూడూ సమతూకంలో లేకపోతే అనేకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పాలి అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాల్లో ఒమెగా–3, ఒమెగా–6 ఆమ్లాలుండాలి. ఒమెగా–3 ఆమ్లాలు అన్ని నూనెల్లో ఉండవు. కేవలం సోయాబీన్, ఆవనూనెల్లో మాత్రమే 5–10 శాతం ఉంటాయి. ఒమెగా–3 లేని నూనెలను వాడితే శారీరక రుగ్మతలు తలెత్తుతాయి. కాబట్టి ఒమెగా–3 ఉన్న నూనెలను వాడనివారు, ఇతర నూనెలు వాడుతున్నవారు తప్పనిసరిగా అవిసె గింజలు దోరగా వేయించినవి రోజూ కొద్దిగా తింటే సరిపోతుంది. అవిసె గింజల్లో 55 శాతం ఒమెగా–3 ఆమ్లాలుంటాయి. నిత్యం చేపలు తినేవారికి ఒమెగా–3 లభిస్తుంది. కానీ మన వద్ద నిత్యం చేపలు తినే పరిస్థితి ఉండదు. అలాగే అందరూ చేపలు తినరు. కాబట్టి ఆ ఆమ్లాలున్న నూనెలు వాడాలి. ఆలివ్‌నూనెలో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు దాదాపు 75 శాతం ఉంటాయి. సన్‌ఫ్లవర్, సోయాబీన్, మొక్కజొన్న, పత్తి గింజ, అవిసె నూనెల్లో పాలి అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు 50 శాతం కంటే ఎక్కువగా ఉంటాయి. కొబ్బరి నూనెలో 90 శాతం, పామాయిల్లో 50 శాతం వరకు సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలుంటాయి. నూనెల మిక్సింగ్ మంచిది రెండు అంతకంటే ఎక్కువ నూనెలను కలిపి వాడాలి. ఒక నూనెలో మూడు ఫ్యాటీ ఆమ్లాలు సమాన నిష్పత్తిలో లేనప్పుడు, సమాన నిష్పత్తిలోకి తీసుకొచ్చేలా ఏవైనా రెండు అంతకంటే ఎక్కువ నూనెలు ఇంట్లోనే కలిపి వాడుకోవచ్చు. ప్రతి నూనె ప్యాకెట్ మీద ఆ మూడు ఫ్యాటీ ఆమ్లాల నిష్పత్తి ఉంటుంది. మూడు ఫ్యాటీ ఆమ్లాల నిష్పత్తితో పాటు నూనెల్లో అతి తక్కువ పరిమాణంలో ఉండే కొన్ని గామా ఒరిజినాల్, టోకోఫిరాల్స్ (విటమిన్–ఈ), పైటోస్టిరాల్ వంటి పదార్థాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఉదాహరణకు రైస్బ్రాన్లో ఒరిజనాల్ అనే పదార్థం ఉంటుంది. దీనివల్ల గుండెకు మేలు జరుగుతుంది. దాదాపు అన్నింటిల్లోనూ పైటోస్టిరాల్ ఉంటుంది. దీనికి కొలెస్టరాల్ తగ్గించే స్వభావం ఉంది. నువ్వుల నూనెలో సిసీమోల్, సిసీమోలిన్ అనే యాంటీæ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవన్నీ లేబిలింగ్‌లో చూసుకోవాలి. ప్యాకింగ్‌పై ఉన్న అధికారిక సమాచారంతోనే దాన్ని వాడాలా లేదా తెలుసుకోవచ్చు. నూనె లూజ్‌గా అమ్మకూడదు లూజ్ ఆయిల్ అమ్మడం నిషేధం. చట్ట ప్రకారం నేరం. లూజ్ అంటే ప్యాక్ చేయకుండా కొలిచి అమ్మే నూనె. దీనిని కొనకూడదు. ప్యాకేజ్డ్ నూనెనే కొనుగోలు చేయాలి. ప్యాకెట్లు, ప్లాస్టిక్ సీసాల్లో విక్రయించే నూనెలకు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ ఉండాలి. పోషక విలువలు, కొలెస్ట్రాల్ వంటివి ఎంతున్నాయో ముద్రించాలి. ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ ఉన్న బ్రాండెడ్ కంపెనీలవే వాడాలి. ప్యాకింగ్‌ను ట్యాంపరింగ్ చేసినట్లు ఉంటే బ్రాండెడ్ కంపెనీల నూనెలనైనా కొనకూడదు. సైంటిఫిక్ రిఫరెన్స్ లేబిలింగ్ ఉందో లేదో చూసుకోవాలి. గడువు తేదీ కూడా చూసుకోవాలి. లైసెన్స్ లేకున్నా, నిబంధనల ప్రకారం నూనె ప్యాకెట్లపై వివరాలు లేకున్నా ఎఫ్ఎస్ఎస్ఏఐ టోల్ ఫ్రీ నంబర్ (1800112100) కు ఫోన్ చేయవచ్చు. -
వైరస్ల విరుగుడుకు ప్రత్యేక ప్రాజెక్టు
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తులో కరోనా వంటి మహ మ్మారులను నియంత్రించేందుకు... వైరస్‌లకు విరుగుడుగా పనిచేయగల మందులను గుర్తించేందుకు యాంటీ వైరల్ మిషన్ పేరిట ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టామని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) నూతన డైరెక్టర్ డాక్టర్ డి.శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మందులుగా ఉపయోగపడగల రసాయన పరమాణువుల బ్యాంక్ (మోల్ బ్యాంక్) వైరస్‌లను నాశనం చేసేందుకు ఎంత వరకు ఉపయోగపడుతుందో తెలుసుకొనేందుకు ఈ మిషన్ ఉపకరించనుందని తెలిపారు. అయితే గుర్తించిన మందులను పరీక్షించేందుకు బీఎస్ఎల్–3 స్థాయి పరిశోధనశాల అవసరమవుతుందని, దీని ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇటీవలే పదవీబాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంలో తన ప్రాథమ్యాలను వివరించారు. కొత్త రసాయనాలు దోమల్ని చంపేస్తాయి.. డెంగీ, జీకా వంటి వైరల్ వ్యాధులు ప్రబలేందుకు కారణ మైన దోమలను నియంత్రించేందుకు ఇప్పటికే వినూత్న రసాయనాలను గుర్తించినట్లు శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రస్తుతం వాడుతున్న రిపెల్లెంట్ల రసాయనాల గాఢత ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. తాము గుర్తించిన కొత్త రసాయనాలు సహజసిద్ధమైన వాటిని పోలి ఉన్నందున ప్రమాదం తక్కువని... పైగా ఇవి దోమలను నిరోధించడమే కాకుండా చంపేస్తాయన్నారు. ప్రస్తుతం పారిశ్రామిక సంస్థలతో కలసి ఈ రసాయనాలను పరీక్షించే ప్రయత్నాల్లో ఉన్నామన్నారు. ఫలితాల ఆధారంగా ముందుకు వెళ్తామన్నారు. అలాగే కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే వ్యాధులకు కొత్త మందులు కనుక్కునేందుకు సిలికాన్ స్విచ్ విధానం ఉపయోగపడుతుందన్నారు. యువ శాస్త్రవేత్తలూ కష్టే ఫలి... సమాజ హితానికి సైన్స్ ఎంతో ఉపయోగపడుతున్నందున శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా సమాజానికి మేలు జరిగేలా చూడాలని శ్రీనివాసరెడ్డి కోరారు. యువ శాస్త్రవేత్తలు కష్టే ఫలి సిద్ధాంతాన్ని గుర్తించాలన్నారు. అవార్డులు అనేవి కష్టానికి దక్కే ప్రయోజనాలు మాత్రమే అన్నారు. ప్రాజెక్టు అసిస్టెంట్ నుంచి ఐఐసీటీ డైరెక్టర్ దాకా.. నల్లగొండ జిల్లా శోభనాద్రిపురానికి చెందిన సాధార ణ రైతు కుటుంబంలో పుట్టిన డాక్టర్ డి.శ్రీనివాసరె డ్డి దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థ ఐఐసీటీ డైరెక్టర్ స్థానాన్ని చేపట్టడం ఒక విశేషమైతే..జమ్మూలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్, లక్నోలోని సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లకు తాత్కాలిక డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండటం మరో విశేషం. ప్రాజెక్టు అసిస్టెంట్‌గా పనిచేసిన ఐఐసీటీకే ఆయన డైరెక్టర్‌గా రావడం గమనార్హం. సూపర్‌వైజర్‌నైతే చాలనుకున్నా... ‘రైతు కుటుంబంలో పుట్టిన నేను టెన్త్ వరకు రామన్నపేటలో, ఇంటర్ సికింద్రాబాద్‌లోని మహబూబ్ కాలేజీలో, బీఎస్సీ (బీజెడ్సీ) సర్దార్ పటేల్ కాలేజీలో చేశా. ఖర్చులకు అవసరమైన డబ్బు సంపాదన కోసం వార్తాపత్రికల పంపిణీ, హోం ట్యూషన్లు, కట్టెల మండీలో పని చేశా. ఆ దశలోనే ఓ సూపర్‌వైజర్‌నైతే చాలనుకున్నా. నిజాం కాలేజీలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ తర్వాత పీహెచ్డీ చేద్దామనుకున్నా ఫెలోషిప్ లేక ఐఐసీటీలో ప్రాజెక్టు అసిస్టెంట్‌గా చేరా. కొంతకాలానికి సీఎస్ఐఆర్ నెట్ పరీక్ష పాసై ప్రఖ్యాత శాస్త్రవేత్త ప్రొఫెసర్ గోవర్ధన్ మెహతా వద్ద పీహెచ్డీ (సెంట్రల్ యూనివర్సిటీ) చేశా. షికాగో, కాన్సస్ యూనివర్సిటీల్లో చదువుకున్నాక భారత్‌కు తిరిగి వచ్చి పలు ప్రఖ్యాత సంస్థల్లో పనిచేశా. ఆపై విద్యాబోధన వైపు మళ్లా. 2010లో పుణేలోని నేషనల్ కెమికల్ లేబొరేటరీలో చేరా. 2020లో జమ్మూలోని ఐఐఐఎంకు డైరెక్టర్‌గా ఎంపికయ్యా’ అని డాక్టర్ శ్రీనివాసరెడ్డి తన గతాన్ని గుర్తుచేసుకున్నారు. -
ఆత్మనిర్భర్ భారత్‌కు ఐఐసీటీ సాయం
సాక్షి, హైదరాబాద్: దేశం ఆత్మనిర్భరత సాధించే విషయంలో హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) గణనీయమైన సాయం చేస్తోందని డీఆర్డీవో చైర్మన్, రక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి తెలిపారు. కోవిడ్ టీకాలకు అవసరమైన కీలక రసాయనాలు మొదలుకొని అనేక ఇతర అంశాల్లోనూ విదేశాలపై ఆధారపడాల్సిన అవసరాన్ని ఐఐసీటీ తప్పించిందని ఆయన అన్నారు. ఐఐసీటీ 79వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఏర్పాటైన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సతీశ్‌రెడ్డి దేశం ఆత్మనిర్భరత సాధించాల్సిన అవసరాన్ని... అందుకు చేస్తున్న ప్రయత్నాలను సోదాహరణంగా వివరించారు. ప్రభుత్వం ప్రకటించక ముందు కూడా ఐఐసీటీ పలు అంశాల్లో రక్షణ శాఖ అవసరాలను తీర్చిందని ఆయన గుర్తుచేశారు. నావిగేషనల్ వ్యవస్థల్లో కీలకమైన సెన్సర్ల విషయంలో దేశం స్వావలంబన సాధించడం ఐఐసీటీ ఘనతేనని కొనియాడారు. ప్రస్తుతం అత్యాధునిక బ్యాటరీలు, ఎలక్ట్రోడ్లు, ఎలక్ట్రోలైట్ల విషయంలోనూ ఇరు సంస్థలు కలసికట్టుగా పనిచేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. కోవిడ్‌కు ముందు దేశంలో ఏడాదికి 47 వేల పీపీఈ కిట్లు మాత్రమే తయారయ్యేవని.. ఆ తరువాత కేవలం నెల వ్యవధిలోనే ఇది రోజుకు 6 లక్షలకు పెరిగిందని చెప్పారు. వెంటిలేటర్లు, ఆక్సిజన్ తయారీ విషయాల్లోనూ ఇదే జరిగిందని, అనేక సృజనాత్మక ఆవిష్కరణల కారణంగా దేశం వాటిని సొంతంగా తయారు చేసుకోవడంతోపాటు ఉత్పత్తి చౌకగా జరిగేలా కూడా చేశామని వివరించారు. డిజైన్‌తో మొదలుపెట్టి... ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం సాకారం కావాలంటే దేశానికి అవసరమైనవన్నీ ఇక్కడే తయారు కావాలని డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. వివిధ ఉత్పత్తుల డిజైనింగ్ మొదలుకొని అభివృద్ధి వరకు అవసరాలకు తగ్గట్టుగా భారీ మోతాదుల్లో వాటిని తయారు చేయగలగడం, ఆధునీకరణకు కావాల్సిన సాధన సంపత్తిని సమకూర్చుకోవడం కూడా ఆత్మనిర్భర భారత్‌లో భాగమని స్పష్టం చేశారు. అతితక్కువ ఖర్చు, మెరుగైన నాణ్యత కూడా అవసరమన్నారు. అదే సమయంలో దేశం కోసం తయారయ్యేవి ప్రపంచం మొత్తమ్మీద అమ్ముడుపోయేలా ఉండాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్భర భారత్ కార్యక్రమం కారణంగా ఇప్పుడు దేశంలోని యువత రాకెట్లకు అవసరమైన ప్రొపల్షన్ టెక్నాలజీలు, గ్రహగతులపై పరిశోధనలు చేస్తున్నాయని... స్టార్టప్ కంపెనీలిప్పుడు దేశంలో ఓ సరికొత్త విప్లవాన్ని సృష్టిస్తున్నాయని ప్రశంసించారు. సృజనాత్మక ఆలోచనలకు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల కింద అన్ని రకాల మద్దతు లభిస్తోందన్నారు. కార్యక్రమంలో ఐఐసీటీ డైరెక్టర్ డి.శ్రీనివాసరెడ్డి, మాజీ డైరెక్టర్లకు ఏవీ రామారావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఐఐసీటీలో ప్రతిభ కనపరిచిన సిబ్బంది, శాస్త్రవేత్తలకు మాజీ డైరెక్టర్, కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ కార్యదర్శి డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ అవార్డులు అందజేశారు. -
ఐఐసీటీ శాస్త్రవేత్తలకు అరుదైన గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)కి చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలకు కెమికల్ రీసెర్చ్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఆర్‌ఎస్‌ఐ) నుంచి అరుదైన గుర్తింపు లభించింది. దేశవ్యా ప్తంగా రసాయన శాస్త్ర పరిశోధనలు చేస్తున్న 30 మంది శాస్త్రవేత్తలను కాంస్య పతకాలకు ఎంపిక చేయగా అందులో ఐఐసీటీలో సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్‌లుగా పనిచేస్తున్న డాక్టర్ ప్రథమ ఎస్.మైన్‌కర్, డాక్టర్ దేబేంద్ర కె.మహాపాత్ర, ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ డి.శ్రీనివాసరెడ్డి ఉన్నారు. డాక్టర్ డి.శ్రీనివాసరెడ్డికి దర్శన్ రంగనాథన్ స్మారక ఉపన్యాసకుడిగా గుర్తింపు లభించింది. మొహాలీలో ఇటీవల జరిగిన 29వ సీఆర్‌ఎస్‌ఐ జాతీయ సదస్సులో ఈ అవార్డులను అందజేశారు. మెడిసినల్ కెమిస్ట్రీ, కృత్రిమ సేంద్రియ రసాయన శాస్త్రం, కొత్త మందుల ఆవిష్కరణ వంటి రంగాల్లో డాక్టర్ ప్రథమ పరిశోధనలు చేస్తుండగా.. వైద్యానికి కీలకమైన సంక్లిష్టమైన సహజ రసాయనాలు గుర్తించేందుకు డాక్టర్ దేబేంద్ర కృషి చేస్తున్నారు. ఫార్మా రంగంతోపాటు సీఎస్ఐఆర్ వ్యవస్థలోనూ అనుభవం గడించిన డాక్టర్ డి.శ్రీనివాసరెడ్డి సేంద్రియ, మెడిసినల్ రసాయన శాస్త్ర రంగాలను మానవ సంక్షేమానికి వర్తించే దిశగా కృషి చేస్తున్నారు. -
ఐఐసీటీ డైరెక్టర్‌గా డి.శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) నూతన డైరెక్టర్‌గా డాక్టర్ డి.శ్రీనివాసరెడ్డి శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఐఐసీటీ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహి స్తున్న ఎన్జీఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ వీఎం తివారీ నుంచి శ్రీనివాసరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. 2020 నుంచి జమ్ములోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ డైరెక్టర్‌గా పని చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి, ఫిబ్రవరి నుంచి లక్నోలోని సీఎస్ఐ ఆర్ సంస్థ సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరె క్టర్గానూ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఐఐసీటీ డైరెక్టర్‌గా నియమితు లైన నేపథ్యంలో ఆయన మిగిలిన రెండు సంస్థలకు అదనపు డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు. మెడిసినల్ కెమిస్ట్రీలో అపారమైన అనుభవం.. ఉస్మానియా వర్సిటీలో పట్టభద్రుడైన శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో 2000లో సింథ టిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్డీ చేశారు. తరువాత షికాగో కాన్సస్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరల్ పరిశోధనలు చేశారు. 2003లో అడ్వినస్ థెరప్యూ టిక్స్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీల్లో కొంతకాలం పని చేసి 2010లో పుణేలోని నేషనల్ కెమికల్ లేబొరేటరీలో చేరారు. మెడిసినల్ కెమిస్ట్రీ, ఔషధ ఆవిష్కరణల్లో శ్రీనివాస రెడ్డికి 20 ఏళ్ల అనుభవం ఉంది. ఇప్పటివరకు సుమారు 120 పరిశోధన వ్యాసాలను ప్రచురించారు. పంటల పరిశోధన రం గంలోనూ కృషి చేశారు. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డుతో పాటు జేసీ బోస్ ఫెలోషిప్ కూడా అందుకున్న శ్రీనివాస్‌రెడ్డి ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో సభ్యులు -
ఫ్రిడ్జ్ అవసరం లేని ఇన్సులిన్!
సాక్షి, హైదరాబాద్: మధుమేహ నియంత్రణకు ఉపయోగించే ఇన్సులిన్ ఇంజెక్షన్లను ఫ్రిడ్జ్‌లలోనే నిల్వ చేసే పద్ధతికి ఇక స్వస్తి చెప్పవచ్చు. గది ఉష్ణోగ్రతలోనే కాదు.. మరింత ఎక్కువ వేడిని కూడా తట్టుకొని పనిచేయగల సరికొత్త ఇన్సులిన్‌ను హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ), కోల్‌కతాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ (ఐఐసీబీ) సంయుక్తంగా అభివృద్ధి చేయడం దీనికి కారణం. ఇప్పటివరకూ ఇంజెక్షన్ల రూపంలో తీసుకొనే ఇన్సులిన్‌ను కచ్చితంగా రిఫ్రిజరేటర్లలోనే నిల్వ చేయాల్సి వచ్చేది. లేదంటే కొన్ని గంటల వ్యవధిలోనే అందులో ఫిబ్రిలేషన్స్ (చిన్నచిన్న గడ్డలు కట్టడం) జరిగిపోయి అది వాడకానికి పనికిరాకుండా పోతుంది. అలాగని ఎక్కువ కాలం కూడా ఫ్రిడ్జ్‌లో ఉంచినా అది పాడైపోతుంది. ఈ కారణంగానే ఇన్సులిన్ ధరలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఇలా కాకుండా.. సాధారణ ఉష్ణోగ్రతల్లో ఉంచినా చెడిపోని ఇన్సులిన్‌ను తయారు చేయగలిగితే ఎన్నో లాభాలుంటాయి. దీనిపై దృష్టిపెట్టిన ఐఐసీటీ, ఐఐసీబీ శాస్త్రవేత్తలు... ఓ పెప్టైడ్ ద్వారా ఇన్సులిన్‌కు ఉన్న లోపాలను పరిష్కరించవచ్చునని గుర్తించారు. నాలుగు అమినోయాసిడ్లతో కూడిన ఈ పెప్టైడ్‌కు వారు ‘ఇన్సులక్’ అని పేరు పెట్టారు. ఈ పెప్టైడ్ ఇన్సులిన్ గడ్డకట్టకుండా ఉండగలదని, వేడి కారణంగా జరిగే నష్టాన్నీ అడ్డుకోగలదని ఎలుకలపై జరిపిన ప్రయోగాల ద్వారా శాస్త్రవేత్తలు నిర్ధారించుకున్నారు. అలాగే ఇన్సులక్ చేర్చడం వల్ల ఇన్సులిన్ పనితీరులో ఏ మార్పులూ కనిపించలేదు. ఇన్సులక్తో కూడిన ఇన్సులిన్‌ను సాధారణ గది ఉష్ణోగ్రతల్లోనే నెలలకొద్దీ నిల్వ చేయవచ్చని అంతర్జాతీయ జర్నల్ ‘ఐసైన్స్’లో ప్రచురితమైన పరిశోధన వ్యాసం తెలిపింది. చదవండి: NGT: తాగునీటి కోసమే రిజర్వాయర్లు -
హైదరాబాద్‌లో సైంటిస్ట్ పోస్టులు.. నెల జీతం లక్షపైనే
హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన సీఎస్ఐఆర్–ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ).. సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 10 ► పోస్టుల వివరాలు: సైంటిస్ట్–05, సీనియర్ సైంటిస్ట్–02, ప్రిన్సిపల్ సైంటిస్ట్–03. ► సైంటిస్ట్: జీతం:నెలకు రూ.1,03,681 చెల్లిస్తారు. వయసు: 27.08.2021 నాటికి 32 ఏళ్లు మించకూడదు. ► సీనియర్ సైంటిస్ట్: జీతం: నెలకు రూ.1,19,332 చెల్లిస్తారు. వయసు: 27.08.2021 నాటికి 37ఏళ్లు మించకూడదు. ► ప్రిన్సిపల్ సైంటిస్ట్: జీతం: నెలకు రూ.1,81,795 చెల్లిస్తారు. వయసు: 27.08.2021 నాటికి 45ఏళ్లు మించకూడదు. ► అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత అనుభవం ఉండాలి. ► ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సెక్షన్ ఆఫీసర్, రిక్రూట్మెంట్ సెక్షన్, సీఎస్ఐఆర్–ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ఉప్పల్ రోడ్, తార్నాక, హైదరాబాద్–500007, తెలంగాణ చిరునామాకు పంపించాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 27.08.2021 ► దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 10.09.2021 ► వెబ్సైట్: http://www.iict.res.in -
హైదరాబాద్: సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్
భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని సీఎస్ఐఆర్–ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ).. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 18 ► పోస్టుల వివరాలు: జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(జనరల్)–08, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)–05, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(ఎస్ అండ్ పీ)–05. ► జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(జనరల్): అర్హత: ఇంటర్మీడియట్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్ టైపింగ్‌లో ప్రొఫిషియన్సీ ఉండాలి. వయసు: 28ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.29,000 చెల్లిస్తారు. ► జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(ఫైనాన్స్ అండ్ అకౌంట్స్): అర్హత: అకౌంటెన్సీ ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియట్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్ టైపింగ్‌లో ప్రొఫిషియన్సీ ఉండాలి. వయసు: 28ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.29,000 చెల్లిస్తారు. ► జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(ఎస్ అండ్ పీ): అర్హత: ఇంటర్మీడియట్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్ టైపింగ్‌లో ప్రొఫిషియన్సీ ఉండాలి. వయసు: 28ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.29,000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, టైప్ రైటింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిక్రూట్మెంట్ సెక్షన్, సీఎస్ఐఆర్ ఐఐసీటీ, ఉప్పల్ రోడ్, తార్నాక, హైదరాబాద్ –500007 చిరునామాకు పంపించాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 08.08.2021 ► దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 23.08.2021 ► వెబ్సైట్: https://iictindia.org ఎన్ఐఏబీ, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ, బయోటెక్నాలజీ విభాగానికి చెందిన హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (ఎన్ఐఏబీ).. ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 08 ► పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ అసోసియేట్(1,2)–04, ఫీల్డ్ అసిస్టెంట్–04. ప్రాజెక్ట్ అసోసియేట్ ► అర్హత: సంబంధిత లైఫ్ సైన్స్ సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి. నెట్ అర్హతతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. వయసు: 35ఏళ్లు మించకూడదు. ఫెలోషిప్: ప్రాజెక్ట్ అసోసియేట్–1కు నెలకు రూ.31,000+24% హెచ్ఆర్ఏ, ప్రాజెక్ట్ అసోసియేట్–2కు నెలకు రూ.35,000+24% హెచ్ఆర్ఏ చెల్లిస్తారు. ఫీల్డ్ అసిస్టెంట్ ► అర్హత: ఇంటర్మీడియట్‌తోపాటు యానిమల్ హస్బెండరీ/వెటర్నరీ సైన్స్‌లో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. వయసు: 30ఏళ్లు మించకూడదు. ఫెలోషిప్ మొత్తం: నెలకు రూ.20,000+24% హెచ్ఆర్ఏ చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 19.07.2021 ► వెబ్సైట్: http://www.niab.org.in -
మాస్కే మంత్రం.. టీకానే దివ్య ఔషధం..!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ తీసుకోవడం మేలైన మార్గమైతే.. ఆ తర్వాత కూడా మాస్కు వేసుకోవడం, భౌతికదూరం పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడం అత్యవసరమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నా రు. కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో సామాన్యుల్లో వ్యాధిపై మరింత అవగాహన పెంచే లక్ష్యంతో హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, సీసీఎంబీ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్, జాతీయ పోషకాహార సంస్థలు సంయుక్తంగా బుధవారం ఆన్లైన్ చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కరోనాపై పలు సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేశాయి. టీకా లభ్యతపై.. ప్రస్తుతం కోవాగ్జిన్, కోవిషీల్డ్ మాత్రమే అందుబాటులో ఉన్నా.. మే 10–15 మధ్య సమయానికి రష్యా తయారుచేసిన స్పుత్నిక్–వీ అందుబాటులోకి వస్తుందని ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ తెలిపారు. క్యాడిల్లా ఫార్మా తయారు చేస్తున్న సెప్సివ్యాక్ కూడా ప్రభుత్వ అనుమతులు పొందే అవకాశముందని పేర్కొన్నారు. కుష్టు వ్యాధి కోసం అభివృద్ధి చేసిన సెప్సివ్యాక్.. రోగ నిరోధక శక్తిని పెంచుతుందని చెప్పారు. కాగా, కోవాగ్జిన్ తయారీకి అవసరమైన ముడిపదార్థాల కొరత లేదని, రసాయనాలను దేశీయంగానే తయారు చేసుకుంటున్నామని డాక్టర్ చంద్రశేఖర్ వివరించారు. కోవి షీల్డ్ ముడిపదార్థాల కొరత కూడా త్వరలోనే తీరుతుందని పేర్కొన్నారు. ఒక్క డోసు వ్యాక్సిన్ తీసుకున్న వారికి వైరస్ సోకితే లక్షణాల తీవ్రత తక్కువగా ఉంటోందని చెప్పారు. వ్యాక్సినేషన్ నత్తనడకపై.. వ్యాక్సినేషన్ కార్యక్రమం నత్తనడక సాగడానికి వ్యాక్సిన్ ఉత్పత్తిలోని లోటుపాట్లు కొంతవరకు కారణమైనా.. తొలి దశ వ్యాక్సినేషన్లో వైద్యులు, సిబ్బందిలో వేచి చూద్దామన్న ధోరణి వల్లే టీకా కార్యక్రమం వేగం తగ్గిందని జాతీయ పోషకాహార సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్.హేమలత అభిప్రాయపడ్డారు. సెకండ్ వేవ్ కరోనా కేసుల్లో 85 శాతం మంది తక్కువ స్థాయి లక్షణాలతో బయటపడుతున్నారని తెలిపారు. తొలి దశతో పోలిస్తే రెండో దశలో సైటోకైన్ స్టార్మ్, న్యుమోనియా వంటివి తక్కువగా ఉన్నాయని తెలిపారు. తొలి డోసు టీకా తీసుకున్న 7 రోజులకే శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నా రోగ నిరోధక వ్యవస్థ స్పందించేందుకు 2,3 వారాల సమయం పడుతుందని వివరించారు. మ్యూటెంట్ల గురించి.. కరోనా వైరస్‌తో పాటు ఏ వైరస్ అయినా కాలక్రమంలో రూపాంతరం చెందుతుంది కాబట్టి.. బ్రెజిల్, యూకే, దక్షిణాఫ్రికా, డబుల్, ట్రిపుల్ మ్యూటెంట్ వైరస్ల గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సీఈవో ఎన్.మధుసూదనరావు స్పష్టం చేశారు. తొలి దశతో పోలిస్తే రెండో దశలో ప్లాస్మా ట్రీట్మెంట్ ప్రభావం కొంత తగ్గినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో కొందరికి తప్పుగా నెగెటివ్ రావడంపై మాట్లాడుతూ.. శాంపిల్‌ను ఎంత సమర్థంగా తీయగలరు? ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసే యంత్రాలు తదితర అంశాలూ ప్రభావం చూపుతా యని తెలిపారు. ధూమపానం చేసేవారు, శాఖాహారులు, ఫలానా గ్రూపు రక్తం ఉన్న వారిలో కరోనా తీవ్రత తక్కువగా ఉందనేందుకు ఆధారాల్లేవని చెప్పారు. మహిళల్లో నిరోధకత ఎక్కువ? పురుషులతో పోలిస్తే మహిళల రోగ నిరోధక వ్యవస్థ కొంచెం మెరుగ్గా ఉంటుందని, ఆరోగ్య సమస్యల నుంచి కోలుకునే వేగం కూడా ఎక్కువని, కోవిడ్–19 విషయంలోనూ ఇదే జరుగుతోందని జాతీయ పోషకాహార సంస్థ డైరెక్టర్ ఆర్.హేమలత తెలిపారు. నెలసరి సమయంలో వ్యాక్సిన్ తీసుకోరాదన్నది అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. పాలిచ్చే తల్లులు టీకా తీసుకోవడం అపాయమేమీ కాదని, కోవిడ్–19 విషయంలో ప్రభావంపై ఇంకా తెలియదని చెప్పారు. కరోనా బారిన పడ్డవారు తగిన పౌష్టికాహారం తీసుకోవడం అత్యవసరమని తెలిపారు. రోజువారీ ఆహారంలో కనీసం సగం పండ్లు, కాయగూరలు ఉండేలా చూసుకోవాలని వివరించారు. విటమిన్–డి తక్కువగా ఉన్న వారిలో వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని, మరణాల రేటూ ఎక్కువని, ఇప్పటివరకు జరిగిన పరిశోధనలు కూడా ఇదే చెబుతున్నాయని పేర్కొన్నారు. ఇంట్లోనూ మాస్కు అవసరమా? రెండో దఫా కేసులు ప్రబలుతున్న తీరును చూస్తే ఇళ్లలోనూ మాస్కులు ధరించాలన్న కేంద్ర ప్రభుత్వ అధికారుల సూచన సరైందేనని భావిస్తున్నట్లు ఐఐసీటీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శిష్ట్లా రామకృష్ణ తెలిపారు. గాలి, వెలుతురు సరిగా లేని ప్రాంతాల్లో ముగ్గురు కంటే ఎక్కువ మంది ఉంటే.. తప్పనిసరిగా మాస్కు పెట్టుకోవాలని కోరారు. కరోనా వైరస్ నోరు, ముక్కు, కళ్లద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువ కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో ఆరడుగుల దూరం పాటించాలని, ప్రజలు వీటిని సరిగ్గా పాటించి ఉంటే సెకండ్‌వేవ్ కేసులు ఈ స్థాయిలో పెరిగేవి కావేమోనని అభిప్రాయపడ్డారు. ఆ రెండే కరోనా నుంచి మనల్ని కాపాడుతాయి.. -
సీఎస్ఐఆర్, ఐఐసీటీల మధ్య పరిశోధన ఒప్పందం
సాక్షి, అమరావతి: స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ సైన్సెస్(ఎస్ఏఎస్), వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం, సీఎస్ఐఆర్-ఐఐసీటీల మధ్య విద్య, పరిశోధనా రంగాలలో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లోని ఐఐసీటీలో జరిగింది. ఈ ఒప్పందం కుదుర్చుకున్న తరువాత వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎస్.వి.కోటారెడ్డి మాట్లాడుతూ.. అధ్యాపకులకు, విద్యార్థులకు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలలో పరిశోధనలు చేయడానికి ఈ సహకారం ఉపయోగపడుతుందని తెలిపారు. అధ్యాపకులు, విద్యార్థులు పరస్పరం ఆసక్తి ఉన్న రంగాలలో నిధుల కోసం ప్రాజెక్ట్ ప్రతిపాదనలను వివిధ ఏజెన్సీలకు పంపవచ్చని పేర్కొన్నారు. దీంతో నిర్వహించే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లు(ఎఫ్‌డిపిలు), జాతీయ, అంతర్జాతీయ సమావేశాలు, సెమినార్లు, సింపోజియం, వర్క్‌షాప్‌లు ద్వారా సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే పరిశోధనలు చేయవచ్చని తెలిపారు. సీఎస్ఐఆర్-ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ ఎస్.చంద్రశేఖర్ మాట్లాడుతూ.. వీఐటీ-ఏపీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఆసక్తి ఉన్న యువతీ యువకులు పరిశోధనలో రంగంలో ఎదగడానికి ఎంఎస్సీ, పీహెచ్డీ కోర్సుల ఉపయోగపడతాయని పేర్కొన్నారు. దీని ద్వారా విద్యార్థుల ప్రాజెక్ట్, పరిశోధన, ఇంటర్న్‌షిప్, సిఓ-ఓపీ, సీనియర్ డిజైన్ ప్రాజెక్టులకు సహకారం అందించటం జరుగుతుందని చెప్పారు. ఐఐసీటీ సహకారంతో అందించే కోర్సులపై గెస్ట్ లెక్చర్లు, శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, విద్యార్థుల ఎక్స్చేంజి ప్రోగ్రాంలు, ప్రాజెక్టులకు పూర్తి సహకారంతో పాటు ద్వైపాక్షిక కార్యక్రమాలకు దరఖాస్తు చేసుకొనుటకు సహాయపడుతుందని తెలియజేశారు. వీఐటీ-ఏపి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ సీ.ఎల్.వీ. శివ కుమార్, ఐఐసీటీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ ఎన్.వీ. సత్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చదవండి: గ్రామ, వార్డు వలంటీర్లకు సెల్యూట్: సీఎం జగన్ -
సరికొత్త సాన్స్ మాస్క్!
సాక్షి, హైదరాబాద్: కరోనా నిరోధానికి ప్రస్తుతం అందరూ మాస్కులు ధరిస్తున్నారు. అయితే మనం వాడే ఫేస్ మాస్కులు చిన్న చిన్న తుంపర్లను సైతం అడ్డుకోగలిగితే.. వైరస్ సోకే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. అచ్చం ఇదే ఆలోచనతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) శాస్త్రవేత్తలు వినూత్న మాస్క్‌ను డిజైన్ చేశారు. సాన్స్ పేరు గల ఈ మాస్కు అత్యధిక నాణ్యతతో పాటు 2 కంటే ఎక్కువ పొరలు కలిగి ఉంటుంది. దీన్ని చౌక ధరకే తయారు చేయొచ్చు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ మాస్కులను పెద్దఎత్తున పంచేందుకు దేశంలోనే ప్రముఖ ఫార్మా కంపెనీ సిప్లా తన ఫౌండేషన్ ద్వారా ముందుకొచ్చింది. ఈ మాస్కుల తయారీ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఐఐసీటీ శాస్త్రవేత్త డాక్టర్ శైలజ తెలిపారు. యాంటీ బ్యాక్టీరియా కూడా..: ఐఐసీటీ డిజైన్ చేసిన ఈ మాస్క్ బ్యాక్టీరియాను దరిచేరనివ్వని ప్రత్యేక వస్త్రంతో తయారుచేస్తారు. 3 నుంచి 4 పొరలుండే ఇది వైరస్ నుంచి 60 – 70 శాతం రక్షణ కల్పిస్తుంది. అదే సమయంలో తుంపర్లను 95 నుంచి 98 శాతం వరకు అడ్డుకుంటుంది. తుంపర్ల సైజు 0.3 మైక్రోమీటర్లున్నా సాన్స్ వాటిని లోపలికి రానీయకుండా అడ్డుకుంటుంది కాబట్టి వైరస్ వ్యాప్తి దాదాపు అసాధ్యం. ఈ మాస్క్‌ను 2–3 నెలల వరకూ పదేపదే వాడొచ్చని, 30సార్లు ఉతికేంత వరకు దాని ప్రభావం అలాగే ఉంటుందని ఐఐసీటీ సీ నియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్. శ్రీధర్ తెలిపారు. సాన్స్ ద్వారా ఊపిరి తీసుకోవడం ఇతర మాస్కుల కంటే సులువుగా ఉంటుందన్నారు. సిప్లా లాంటి సం స్థ ఐఐసీటీతో చేతులు కలపడంపై సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సి. మాండే హర్షం వ్యక్తం చేశారు. సాన్స్ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ నిరోధం మరింత సమర్థంగా జరుగుతుందని భావిస్తున్నట్లు ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. -
లైఫ్ సైన్సెస్‌తో కలసి పనిచేయనున్న ఐఐసీటీ
సాక్షి, హైదరాబాద్ : ఔషధాల ఉత్పత్తి పరిమాణం రీత్యా, ప్రపంచంలోనే మూడవ అతిపెద్దదిగా ఉన్న భారతీయ ఔషధ పరిశ్రమ, చైనా ముడి పదార్థాలపై ఎక్కువగా ఆధారపడుతుండడాన్ని ప్రస్తుత పరిణామాలు బహిర్గతం చేశాయి. ముడి సరకు సరఫరాలో జాప్యం, ధరల పెంపు కారణంగా భారతీయ ఫార్మా పరిశ్రమ ముడిపదార్థాల సరఫరాలో కొరతను ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలో ఔషధ భద్రత, ప్రజారోగ్యానికి అత్యవసర మందుల అందుబాటు కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తించారు. ఈ మేరకు శుక్రవారం మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్, భారతదేశంలో బల్క్ డ్రగ్ తయారీని ప్రోత్సహించేందుకు తద్వారా చైనాపై ఆధారపడడాన్ని తగ్గించేందుకు ఒక ప్యాకేజ్ని ఆమోదించారు. పరిశ్రమ వర్గాలు, భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అనుగుణంగా, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్)కు చెందిన హైదరాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ), హైదరాబాద్‌కు చెందిన సమీకృత ఔషధ తయారీ కంపెనీ లక్సాయ్ లైఫ్ సైన్సెస్‌తో కలిసి సంయుక్తంగా క్రియాశీల ఔషధ తయారీ పదార్థాలు( యాక్టివ్ ఫార్మాసూటికల్ ఇంగ్రీడియెంట్స్), ఇంటర్మీడియేట్‌లను భారతీయ ఔషధ తయారీ పరిశ్రమకోసం ఉత్పత్తి చేస్తాయి. దీనితో చైనా దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుంది. కరోనా వైరస్ వ్యతిరేక పోరాటంలో వాడుతున్న ఔషధాల సంశ్లేషణ కోసం ఐఐసీటీ, లక్సాయ్‌తో కలిసి పనిచేస్తోంది. ఈ సంస్థలు ప్రధానంగా యుమిఫెనోవిర్, రెమ్‌డెసివిర్, హైడ్రాక్సీ క్లోరోక్విన్ (హెచ్‌సిక్యూ)కీ ఇంటర్మీడియట్పై దృష్టి పెట్టనున్నాయి. మలేరియాపై పోరాటానికి వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఉత్పత్తి చేసే అతిపెద్ద దేశాలలో భారత్ ఒకటి. ఇటీవలి కాలంలో దీని డిమాండ్ బాగా పెరిగింది. గత కొద్ది రోజులలో అమెరికాతో సహా 50 దేశాలకు భారతదేశం హైడ్రాక్సి క్లోరోక్విన్‌ను పంపింది. ఈ కొలాబరేషన్, చైనాపై నామమాత్రంగా ఆధారపడే రీతిలో కీలక ముడి పదార్థాలను చౌకగా తయారు చేసే ప్రక్రియకు దోహదపడుతుంది. -
కోవిడ్‌కు కూడా ఎబోలా మందే!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్–19 వైరస్‌కు ఔషధాన్ని హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) అభివృద్ధి చేస్తోంది. దశాబ్దం కింద వచ్చిన ఎబోలా వైరస్ లక్షణాలే కోవిడ్‌లోనూ ఉన్నాయని.. అందుకే ఎబోలా యాంటీ వైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్‌ను రివర్స్ ఇంజనీరింగ్ పద్ధతిలో యాక్టివ్ ఫార్మాసూటికల్ ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ) అభివృద్ధి చేస్తున్నామని ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో చెప్పారు. ఇప్పటికే ప్రపంచ ఫార్మా దిగ్గజం, రెమిడిస్‌విర్‌ను అభివృద్ధి చేసిన గిలియడ్ సైన్సెస్ కంపెనీ.. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అనుమతితో చైనా, దక్షిణ కొరియా దేశాల్లో కోవిడ్ సోకిన వారిపై ఫేజ్–3 క్లినికల్ ట్రయల్స్ చేసింది. ఇది విజయవంతమైతే మన దేశీయ అవసరాల కోసం ఇతర దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా మనమే ఔషధాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని పేర్కొన్నారు. 2 నెలల్లో ఏపీఐ తయారీ.. ‘ఏపీఐ అభివృద్ధి కోసం అవసరమైన రైబోస్, పిర్రోల్, అలనీన్, కార్బోహైడ్రేట్స్–5 వంటి ముడి పదార్థాలను పెద్ద ఎత్తున సమీకరించాం. తొలుత శాంపిల్ ఏపీఐ కోసం 50 గ్రాములను తయారు చేస్తున్నాం. 15 మంది శాస్త్రవేత్తలు 2 విడతలుగా అభివృద్ధి పనిలో నిమగ్నమయ్యారు. 2 నెలల్లో పూర్తి స్థాయి ఏపీఐ సిద్ధమవుతుంది’అని చంద్రశేఖర్ తెలిపారు. ముంబై ఫార్మాతో ఒప్పందం.. ‘ఐఐసీటీలోని 3 స్టార్టప్ కంపెనీలు ఏపీఐకి అవసరమైన సాంకేతిక అభివృద్ధిలో సాయం చేస్తున్నాయి. ఏపీఐ తయారీ పూర్తయి, దేశీయ అవసరాల కోసం ఔషధ తయారీ అవసరమని కేంద్రం భావిస్తే.. బల్క్‌లో తయారు చేసేందుకు ముంబైకు చెందిన ఫార్మా కంపెనీతో ఒప్పందం చేసుకున్నాం. స్థానిక మార్కెట్ కోసం ఔషధ తయారీకి హైదరాబాద్‌కు చెందిన రెండు, మూడు ఫార్మా కంపెనీలకు ఏపీఐలను అందిస్తాం’అని వివరించారు. రోగ నిరోధక శక్తి పెంచుకుంటే చాలు.. ఎక్కువ ఉష్ణోగ్రతలో వైరస్ తన రూపాన్ని, నిర్మాణాన్ని మార్చుకుంటుంది. ఇప్పుడు సాంకేతికత, అవగాహన పెరిగింది కాబట్టి వైరస్‌ను సమర్థంగా నివారించొచ్చు. వైరస్ సోకాలంటే ఏదైనా పరాన్నజీవి కావాలి. కోవిడ్‌ను తట్టుకునే రోగనిరోధక శక్తి మన శరీరానికి ఉంటుంది. దాన్ని బలోపేతం చేస్తే చాలు. ఆస్తమా, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధి ఉన్నవారికి సంక్రమించే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అందరూ 2–3 నెలలు ఐసోలేషన్‌లో ఉంటే సరిపోతుంది. -
ఎన్ఎంఆర్ కేంద్రానికి ఎఫ్‌డీఏ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ)లోని న్యూక్లియర్ మాగ్నెటిక్ రెజొనెన్స్ (ఎన్ఎంఆర్) కేంద్రం... అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ) తనిఖీలను విజయవంతంగా అధిగమించింది. ఈ మేరకు ఐఐసీటీ మంగళవారం ఒక పత్రిక ప్రకటన విడుదల చేసింది. ఫార్మా మందులతోపాటు రసాయనాల నిర్మాణాన్ని పరిశీలించేందుకు ఈ న్యూక్లియర్ మాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కొపీని ఉపయోగిస్తారన్నది తెలిసిందే. యూఎస్ ఎఫ్‌డీఏ ఈ కేంద్రాన్ని ఆగస్టు 21, 22 తేదీల్లో తనిఖీ చేసిందని, అన్ని ప్రమాణాలను పాటిస్తున్నట్లు గుర్తించిందని ఆ ప్రకటనలో తెలిపారు. ఇందుకు అనుగుణంగా ఈ కేంద్రానికి నో యాక్షన్ ఇనిషియేటెడ్ (ఎన్ఏఐ) వర్గీకరణను కేటాయించింది. ‘‘దేశంలో ఎన్ఏబీఎల్ అక్రిడిటేషన్ ఉన్న అతిపెద్ద ఎన్ఎంఆర్ వ్యవస్థల్లో ఐఐసీటీ ఒకటి. ఇందులో అత్యాధునిక హైఫీల్డ్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోమీటర్లను ఏర్పాటు చేశాం. యూఎస్ఎఫ్డీఏ ఆమోదం లభించడంతో ఇక్కడ నాణ్యమైన క్వాలిటీ అనలిటికల్స్, ఏపీఐ సేవలు అందుబాటులోకి వస్తాయి’’ అని ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ తెలిపారు. -
8 నిమిషాలు.. 80 వేల కణాలు
సాక్షి, హైదరాబాద్: అత్యంత చౌకగా ఇకనుంచి అరుదైన జన్యువ్యాధులను అతివేగంగా గుర్తించవచ్చని కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన, వైద్య శాఖల మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. హైదరాబాద్‌లోని సీఎస్ఐఆర్ సీసీఎంబీలో రూ.8 కోట్లతో ఏర్పాటు చేసిన అత్యాధునిక జన్యుక్రమ నమోదు యంత్రాన్ని కేంద్రమంత్రి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జన్యువైవిధ్యత అధికంగా ఉన్న మనదేశంలో అరుదైన జన్యువ్యాధుల గుర్తింపును వేగవంతం చేసేందుకు జన్యుక్రమ నమోదు యంత్రం ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. మరో మూడేళ్లలో సరికొత్త భారతాన్ని నిర్మించాలన్న ప్రధాని నరేంద్రమోదీ స్వప్నాన్ని సాకారం చేసేందుకు శాస్త్రవేత్తలందరూ తమవంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఆ తరువాత సంస్థ ఆవరణలోనే నిర్మించే ఆడిటోరియానికి శంకుస్థాపన కూడా చేశారు. మూడోతరం ఎరువులు, క్రిమి, కీటకనాశినుల తయారీ కోసం ఐఐసీటీ ఏర్పాటు చేసిన కొత్త విభాగాన్ని గురించి ఆయన వివరిస్తూ.. ఎరువులు, క్రిమి, కీటకనాశినులను వీలైనంత తక్కువ ధరకే రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఐఐసీటీ విభాగం ఉపయోగపడుతుందన్నారు. సభలో మెడికల్ కమిషన్ బిల్లు కేంద్ర కేబినెట్ గత బుధవారం ఆమోదించిన జాతీయ మెడికల్ కమిషన్ బిల్లును సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రమంత్రి హర్షవర్ధన్ తెలిపారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండి యా స్థానంలో ఏర్పాటు కానున్న కమిషన్ దేశంలో వైద్య విద్య, నీట్, నెక్స్ట్ పరీక్షల నిర్వహణ బాధ్యతలు చేపట్టనుంది. ప్రైవేట్ వైద్య కళాశాల ల్లో 50% కన్వీనర్ కోటా ఫీజుల నియంత్రణ బాధ్యతలను కూడా కమిషనే చేపట్టనుంది. ఎంసీఐని ఇప్పటికే బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ తన ఆధీనంలోకి తీసుకుందని, కమిషన్ అందుబాటులోకి వస్తే వైద్య విద్యలో మార్పులు వస్తాయని మంత్రి చెప్పారు. చౌకగా వ్యాధుల నిర్ధారణ: డాక్టర్ తంగరాజ్ ఇల్యూమినా కంపెనీ తయారు చేసిన జన్యుక్రమ నమోదు యంత్రం సేవలను సామాన్యులూ ఉపయోగించుకోవచ్చని సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ తంగరాజ్ తెలిపారు. ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ..జన్యుక్రమ నమోదుకు రూ.లక్ష వరకూ ఖర్చు కావొచ్చని..నిర్దిష్ట వ్యాధుల నిర్ధారణకు మాత్రం ఇంతకంటే తక్కువ ఖర్చు అవుతుందన్నారు. దేశ జనాభాలో మూడొంతుల మందికి మాత్రమే జన్యు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, జన్యుక్రమ విశ్లేషణ ద్వారా ఈ వ్యాధులకు కారణాలు గుర్తిస్తే భవిష్యత్తులో ఆయా వ్యాధుల నిర్ధారణ కొన్ని రూ.వందలతోనే పూర్తవుతుందన్నారు. వేగంగా గుర్తించవచ్చు: రాకేశ్ మిశ్రా సీసీఎంబీలో శనివారం ఏర్పాటైన జన్యుక్రమ నమోదు యంత్రం కేవలం 8 నిమిషాల్లోనే 80 వేల కణాల్లోని జన్యుక్రమాలను, బార్‌కోడింగ్ పద్ధతిలో వేర్వేరుగా గుర్తించగలదని సంస్థ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. ఈ పరికరాన్ని వైద్యులు, ఆస్పత్రులు, పరిశోధన సంస్థలు కూడా ఉపయోగించుకోవచ్చన్నారు. వ్యాధులు వాటి చికిత్సలకు సంబంధించిన పరిశోధనలు మొత్తం ప్రస్తుతం కాకేసియన్ జాతి జనాభా ఆధారంగా జరుగుతున్నాయని..భారతీయుల అవసరాలకు తగ్గ జన్యు సమాచారం సేకరించేందుకు ఈ యంత్రం ఉపయోగపడుతుందని చెప్పారు. -
విపత్తులో.. సమర్థంగా..
సాక్షి, హైదరాబాద్: ప్రకృతి వైపరీత్యాల సమర్థ నిర్వహణకు కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) పరిశోధనశాలలు తమవంతు కృషి చేస్తున్నాయని సంస్థ డైరెక్టర్ జనరల్ శేఖర్ సి.మండే తెలిపారు. ఇటీవలి ఫానీ తుపాను సమయంలో చెన్నైలోని సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థ ఎస్ఈఆర్సీ డిజైన్ చేసి, రెడ్‌క్రాస్ సంస్థ నిర్మించిన తుపాను బాధితుల కేంద్రాలు ఎంతో ఉపయోగపడ్డాయని, అలాగే గుజరాత్‌లోని మరో పరిశోధన సంస్థ తుపాను బాధితులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు మొబైల్ నీటి శుద్ధీకరణ ప్లాంట్లను సరఫరా చేసిందని చెప్పారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)లో పద్మభూషణ్ ఎ.వి.రామారావు ‘కిలో’ల్యాబ్‌ను ఆవిష్కరించిన సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో శేఖర్ మాట్లాడుతూ, తుపాను బాధితులకు అందించే ఆహారం శుభ్రంగా ఉండేందుకు, ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేసేందుకు మైసూరులోని సీఎస్ఐఆర్ సంస్థ సీఎఫ్టీఆర్ఐ ప్రత్యేక ప్యాకేజింగ్‌ను అభివృద్ధి చేసిందని, దీని సాయంతో అతితక్కువ కాలంలోనే పెద్ద సంఖ్యలో ఆహారపు పొట్లాలను సిద్ధం చేయగలిగామ ని వివరించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో సముద్రపు నీటితోపాటు ఎలాంటి మురికి నీటినైనా శుద్ధి చేసి గంటకు నాలుగు వేల లీటర్ల తాగునీరు ఇవ్వగల మొబైల్ వ్యాన్ పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేశామని తెలిపారు. దేశం మొత్తమ్మీద పదుల సంఖ్యలో సీఎస్ఐఆర్ సంస్థలు ఉన్నాయని.. వేర్వేరు పరిశోధన సంస్థలు కలిసికట్టుగా ప్రాజెక్టులు చేపట్టడం కూడా ఇటీవలి కాలంలో ఎక్కువగా జరుగుతోందని, వ్యవసాయ సంబంధిత ఆగ్రో మిషన్‌లో ఎనిమిది సంస్థలు పాల్గొంటుండగా.. ఫార్మా మిషన్‌లోనూ ఐదు సంస్థలు భాగస్వాములుగా పనిచేస్తున్నాయని వివరించారు. కిలో ల్యాబ్ ప్రత్యేకమైంది: శ్రీవారి చంద్రశేఖర్ ఐఐసీటీ ప్రాంగణంలో ఆవిష్కృతమైన పద్మభూషణ్ ఎ.వి.రామారావు కిలో ల్యాబ్ చాలా ప్రత్యేకమైందని.. అత్యంత పరిశుద్ధమైన వాతావరణంలో మం దుల తయారీకి అవసరమైన రసాయనాలను పెద్ద ఎత్తున తయారు చేసేందుకు వీలు కల్పిస్తుందని ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ తెలిపారు. సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ శేఖర్‌తో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన ల్యాబ్ ప్రత్యేకతలను వివరించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇలాంటి పరిశోధనశాల ఏర్పాటు కావడం ఇదే తొలిసారి అని తెలిపారు. మొత్తం రూ.పదికోట్ల వ్యయంతో నిర్మించామని, ఫార్మా రంగపు స్టార్టప్ కంపెనీలు, చిన్న, మధ్య స్థాయి కంపెనీలు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చునని చెప్పారు. యాంటీ వైరల్, కేన్సర్ చికిత్సకు ఉపయోగించే అత్యంత ప్రమాదకరమైన రసాయనాలతోనూ సురక్షితంగా పనిచేసేందుకు ఇందులో ఏర్పాట్లు ఉన్నాయన్నారు. ఈ పరిశోధన శాలలో తయారైన రసాయనం మరే ఇతర శుద్ధీకరణ అవసరం లేకుండా ఫార్మా కంపెనీలు క్లినికల్ ట్రయల్స్ కోసం వాడుకోవచ్చునన్నారు. 2021 నాటికి దేశీయంగానే కీటకనాశినులు, పురుగుల మందులు తయారు చేసేందుకు ఐఐసీటీ ప్రయత్నాలు చేస్తోందని.. డ్యూపాంట్, సిన్జెంటా తదితర అంతర్జాతీయ కంపెనీల 15 కీటకనాశినుల పేటెంట్లకు కాలం చెల్లనున్న నేపథ్యంలో వాటిని మరింత మెరుగుపరిచి సొంతంగా తయారు చేస్తామని చెప్పారు. -
కేన్సర్‌కు చెక్!
తార్నాక: కేన్సర్ ఓ ప్రాణాంతకమైన మహమ్మారి. ఈ వ్యాధి నిర్మూలనకు మందులే కాని పూర్తి స్థాయి నివారణ చికిత్స లేదు. కేన్సర్ నివారణ కోసం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న 100 రకాల మందులు ఉన్నా వాటితో వ్యాధి తగ్గకపోగా అనేక రకాలుగా నష్టం కలుగుతోంది. ఇప్పుడున్న మందులు వాడటంతో రోగి శరీరం పూర్తిగా విషపూరితంగా మారుతోందని.. కేన్సర్ కణాల నివారణకు వాడే మందులు శరీరంలోని ఆరోగ్యవంతమైన కణాలను కూడా నాశనం చేస్తున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ద ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ శాస్త్రవేత్తల బృందం కేన్సర్ వ్యాధి నివారణ మందుల తయారీకి అవసరమైన ఫార్ములాను రూపొందించింది. ఇవి కేన్సర్ సోకిన కణాలను మాత్రమే నాశనం చేస్తాయని, రోగి శరీరంలోని ఇతర కణాలకు ఎలాంటి హాని జరగదని వెల్లడించారు. ఇందుకు సంబంధించి మంగళవారం ఐఐసీటీ, నానోదేవ్ థెరపిటిక్ సంస్థల ప్రతినిధులు అమెరికాలోని మాయో క్లినికల్ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తల బృందంతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఐఐసీటీ అవగాహన ఒప్పందం.. కేన్సర్ వ్యాధి మందుల తయారీకి అమెరికాలోని మాయో క్లినిక్, భారత్‌లోని నానోదేవ్ థెరపిటిక్ (ఎన్డీటీ)తో 2011లో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా కేన్సర్ మందుల తయారీని పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన ఐఐసీటీ అప్పటికే కేన్సర్ వ్యా«ధులపై పరిశోధనలు చేస్తున్న ఎన్డీటీ సంస్థ ఇచ్చిన లిపిడ్ ఫార్ములాతో పరిశోధనలు చేశారు. ఐఐసీటికి చెందిన రాజ్‌కుమార్ బెనర్జీ, సురేందర్‌రెడ్డి, సునిల్ మిశ్రా, కుమార్ప్రణవ్ నారాయణ్ (బిట్స్) శాస్త్రవేత్తల బృందం ఆరేళ్ల పాటు పరిశోధనలు సాగించారు. ఈ పరిశోధనల్లో భాగంగా పాంక్రియాటిక్ కేన్సర్, రొమ్ము క్యాన్సర్, మెలనోమా, లుకేమియా వంటి వ్యాధులకు సంబంధించి జంతువులపై ప్రీ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. లిపిడ్ ఫార్ములాతో తయారైన ఈ మందును కేన్సర్ సోకిన కణంపైకి పంపించి దానిని ఉత్తేజపరుస్తారు. మందు ప్రభావంతో కేన్సర్ కణం పూర్తిగా నశించి దాని పక్కనే ఉండే ఆరోగ్యకరమైన కణానికి ఎలాంటి హాని జరగదు. దీనిపై ఐఐసీటీ పేటెంట్ కూడా పొందింది. ఎన్డీటీకి మందుల తయారీ బాధ్యతలు.. ఇలా ప్రీ క్లినికల్ ట్రాయల్స్ నిర్వహించిన ఐఐసీటీ ఈ మందులకు సంబంధించిన ఫార్ములాపై పేటె ంట్ పొందింది. ఇక అసలైన మందుల తయారీ బాధ్యతలను భారత్‌లోని నానోదేవ్ థెరపిటీక్ (ఎన్డీటీ) పరిశోధనా సంస్థకు అప్పగించింది. పేటెంట్‌పై రెండు సంస్థల మధ్య మంగళవారం కుదిరిన అవగాహన ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నారు. 18 నెలల్లో క్లినికల్ ట్రయ ల్స్, 5 ఏళ్లలో మార్కెట్లోకి కేన్సర్ నివారణ మం దులు అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు. -
కేన్సర్‌పై పరిశోధనకు ‘ఈపీఆర్ జీన్ టెక్నాలజీ’
సాక్షి, హైదరాబాద్: కేన్సర్‌పై పరిశోధన, మందుల తయారీవంటి అంశాలపై ‘ఈపీఆర్ జీన్ టెక్నాలజీ’కంపెనీ ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో రీసెర్చి ఇన్నోవేషన్ సెంటర్ ఆఫ్ హైదరాబాద్ (రిచ్) ఆధ్వర్యంలో మంగళవారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)లో జరిగిన ఒక కార్యక్రమంలో పలు కంపెనీలను ఎంపిక చేశారు. కేన్సర్‌పై పరిశోధన, దాని నివారణకు ‘రిచ్’ఆహ్వానం మేరకు 60 కంపెనీలు ప్రతిపాదనలు పంపించాయి. అందులో ఆరింటిని తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసింది. అందులో ఈపీఆర్ జీన్ టెక్నాలజీ ఒకటి. ఈపీఆర్ జీన్ టెక్నాలజీ ఇప్పటికే కేన్సర్‌పై పరిశోధన పూర్తి చేసింది. అందుకుగాను ఆ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం అవార్డు బహూకరించింది. అవార్డును సైంటిఫిక్ అడ్వైజర్‌గా ఉన్న ప్రొఫెసర్ అర్జుల రామచంద్రారెడ్డి అందుకున్నారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, ఇప్పటికే తాము అమెరికాలోనూ, ఇండియాలోనూ కేన్సర్ నివారణకు పరిశోధనలు పూర్తి చేసి మందును కనుగొన్నామన్నారు. ఈ మందుకు రెండు దేశాల్లోనూ అనుమతి కావాల్సి ఉందని, క్లినికల్ ట్రయల్స్ జరగాల్సి ఉందని పేర్కొన్నారు. అలాగే మందు తయారీకి భారత్‌లో అనుమతి కూడా అవసరమన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభు త్వం తమ కంపెనీ ప్రతిపాదనను ఎంపిక చేయ డం పట్ల ఆయన సంతోషం వ్యక్తంచేశారు. -
గాలి నుంచి నీటిని తెచ్చారు..
సాక్షి, హైదరాబాద్ : ప్రజలందరికీ స్వచ్ఛమైన, కాలుష్యరహిత తాగునీరు అందించేందుకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) శాస్త్రవేత్తలు వినూత్నమైన ఆవిష్కరణ చేశారు. గాల్లోని తేమను నీటిగా ఒడిసిపట్టడంతో పాటు, నీటిలో లవణాలు చేర్చేందుకు ఓ యంత్రాన్ని తయారు చేశారు. ఇలాంటి యంత్రాలు విదేశాల్లో అందుబాటులో ఉన్నప్పటికీ తాము తయారు చేసిన మేఘ్‌దూత్ యంత్రం చౌక అని, సౌరశక్తితో పనిచేస్తుందని ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ఎస్.శ్రీధర్ తెలిపారు. మైత్రీ ఆక్వాటెక్ అనే సంస్థతో తాము ఇప్పటికే అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని, ఈ యంత్రాలను ఈ ఆగస్ట్ నుంచి తయారు చేయనున్నట్లు చెప్పారు. దాదాపు 9 యూనిట్ల విద్యుత్ ద్వారా ఈ యంత్రం రోజులో వెయ్యి లీటర్ల తాగునీరు అందిస్తుందన్నారు. గాలిలోని 45 శాతం తేమ ఉన్నా సరే ఇది నీటిని ఒడిసిపడుతుందని, తేమశాతం ఎక్కువగా ఉండే సముద్ర తీర ప్రాంతాల్లో రోజుకు 1,400 లీటర్ల నీరు ఉత్పత్తి చేయొచ్చని చెప్పారు. కలాం స్టెంట్ స్థాయి ఆవిష్కరణ ఇది మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో కలసి తాము అభివృద్ధి చేసిన చౌక స్టెంట్‌తో సరిపోలగల ఆవిష్కరణ మేఘ్‌దూత్ అని ఈ ప్రాజెక్టులో కీలకపాత్ర పోషించిన అరుణ్ తివారీ తెలిపారు. స్వచ్ఛమైన తాగునీరు అందరికీ అందుబాటులో ఉంటే, రోగాల భారం గణనీయంగా తగ్గుతుందని ఈ లక్ష్యంతోనే తాము మేఘ్‌దూత్‌ను అభివృద్ధి చేశామని ఐఐసీటీ డైరెక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ చెప్పారు. -
రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పెద్దపీట
-
యువ శాస్త్రవేత్తలకు అవార్డుల ప్రదానం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నామని ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తార్నాకలోని ఐఐసీటీలో శనివారం తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్స్ యువ శాస్త్రవేత్తలకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో శాస్త్ర పరిశోధనలు అధికంగానే జరుగుతున్నాయని తెలిపారు. శాస్త్ర, సాంకేతిక ఫలాలు సామాన్య ప్రజలకు అందాలన్నారు. శాస్త్రవేత్తల పరిశోధనలు వ్యవసాయ రంగానికి ఎంతో అవసరమన్నారు. హైదరాబాద్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇస్రో 100 ఉపగ్రహాలకు పైగా ఒకేసారి నింగిలోకి పంపటం ఎంతో గర్వకారణమన్నారు. దేశాభివృద్ధికి శాస్త్ర, సాంకేతిక రంగాలు ఎంతో దోహదం చేస్తాయని వెల్లడించారు. Minister @KTRTRS presented the Young Scientist Awards to Research Associates, Scientists and Assistant Professors at Indian Institution of Chemical Technology (IICT) campus in Hyderabad. pic.twitter.com/6GaqxegYDu — Min IT, Telangana (@MinIT_Telangana) April 28, 2018 -
‘ఎల్ఈడీ’ చిక్కులకు చెక్
సాక్షి, హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించిన ఎల్ఈడీ బల్బులు భవిష్యత్తులో దృష్టి లోపాలను సరిదిద్దేందుకూ ఉపయోగపడొచ్చని నీలిరంగు ఎల్ఈడీల సృష్టికర్త, నోబెల్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ హిరోషీ అమానో తెలిపారు. మనం విరివిగా వాడుతున్న తెల్లని ఎల్ఈడీ బల్బుల వల్ల నిద్రలేమి వంటి సమస్యలొస్తాయన్న మాట వాస్తవమేనని పేర్కొన్నారు. వీటిని సరిదిద్దేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని వివరించారు. గురువారం హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) ప్లాటినమ్ జూబ్లీ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎల్ఈడీల కాంతి మెలటోనిన్ అనే రసాయన ఉత్పత్తిని తగ్గిస్తున్న కారణంగా కొందరిలో నిద్రలేమి సమస్యలొస్తున్నాయని పేర్కొన్నారు. టీవీ, మొబైల్, కంప్యూటర్ స్క్రీన్ల కాంతి తీవ్రతను తగ్గించుకోవడం ద్వారా ఈ సమస్యను కొంతవరకు అధిగమించొచ్చని సూచించారు. 1,500 సార్లు విఫలం.. నీలిరంగు ఎల్ఈడీ సృష్టికి జరిగిన ప్రయత్నాలు, ప్రాముఖ్యం గురించి ఆయన ఈ సందర్భంగా వివరించారు. ‘విద్యతో మానవుడి కష్టాలు తీర్చాలి’ అన్న తన ప్రొఫెసర్ మాటలు ఎంతో ప్రభావితం చేశాయని హిరోషీ పేర్కొన్నారు. అప్పటివరకు చదువుపై పెద్దగా అంతగా శ్రద్ధ పెట్టలేదని, ఆ తర్వాతే ఏదైనా చేయాలనే తపనతో కృషి చేసినట్లు వివరించారు. నీలి రంగు ఎల్ఈడీలు చేసేందుకు ఒకే ప్రయోగాన్ని 1,500 సార్లు చేసి విఫలమయ్యానని, అయినా పట్టు వదలకుండా ప్రయత్నించినట్లు వివరించారు. చివరికి గాలియం నైట్రైట్ అనే పదార్థంతో విజయం సాధించినట్లు పేర్కొన్నారు. నీలిరంగు ఎల్ఈడీ ఎంతో కీలకం.. ఎరుపు, పచ్చ రంగు ఎల్ఈడీలు దశాబ్దాల కిందే తయారైనా, విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు.. అందరికీ అనుకూలంగా ఉండే తెల్లటి బల్బుల కోసం నీలి రంగు ఎల్ఈడీలు తయారు చేసే సాంకేతికత ఎంతో కీలకమైందని చెప్పారు. నీలిరంగు బల్బులకు ప్రత్యేక పదార్థపు పొరను జోడించడంతో తెలుపు ఎల్ఈడీలు తయారయ్యాయని వివరించారు. సాధారణ బల్బుల కంటే ఎన్నో రెట్లు తక్కు విద్యుత్‌తో ఎక్కువ వెలుగునిచ్చే ఎల్ఈడీలు పేదల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చిందని, ఇది తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని వివరించారు. ఐఐసీటీతో కలసి పనిచేయాలని.. తెలుపు ఎల్ఈడీలతో వస్తున్న ఆరోగ్య సమస్యలను అధిగమించేందుకు 360 నానోమీటర్ల స్థాయి తరంగాలను వెదజల్లే డయోడ్లు పనికొస్తాయని హిరోషీ వివరించారు. ఈ రకమైన బల్బుల తయారీకి ప్రయత్నాలు ఇప్పటికే జరుగుతున్నాయని చెప్పారు. ఇవి అందుబాటులోకి వస్తే చిన్న పిల్లల్లో కనిపించే హ్రస్వదృష్టిని సరిచేసేందుకు కూడా అవకాశం ఉంటుందని వివరించారు. ప్రస్తుతం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉందని.. తాము మాత్రం ఇంటర్నెట్ ఆఫ్ ఎనర్జీ గురించి ఆలోచిస్తున్నామని తెలిపారు. వైర్లెస్ పద్ధతిలో 120 మీటర్ల దూరానికి కూడా విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఉపయోగపడే ఈ టెక్నాలజీతో భవిష్యత్తులో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్నారు. 20 నుంచి 60 నిమిషాలు మాత్రమే గాల్లో ఎగరగల డ్రోన్లను ఇంటర్నెట్ ఆఫ్ ఎనర్జీ ద్వారా రోజంతా ఎగిరేలా చేయొచ్చని పేర్కొన్నారు. దీంతో రోడ్లపై వాహనరద్దీ తగ్గించే ఎయిర్ ట్యాక్సీలు విస్తృతంగా అందుబాటులోకి వస్తాయని వివరించారు. ఈ విషయంలో ఐఐసీటీలోని యువ శాస్త్రవేత్తలతో కలసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. -
కలువలతో మధుమేహం నియంత్రణ!
• ప్రయోగ పూర్వకంగా నిరూపించిన ఐఐసీటీ • కలువగింజలు, దుంపలతో ఆరోగ్యానికి మేలు • శాస్త్రవేత్త అశోక్ తివారీ వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఈ రోజుల్లో తినేతిండితో వస్తున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. బాగా పాలిష్ చేసిన వరి, గోధుమలు.. శుద్ధీకరణ కారణంగా వంటనూనెలు అనేక సూక్ష్మ పోషకాలను కోల్పోతున్నాయి. ఫలితంగా శరీరంలో జీవక్రియల్లో తేడాలు వచ్చి.. మధుమేహం మొదలుకుని.. కేన్సర్ వరకూ అనేక వ్యాధులకు దారితీస్తున్నట్లూ తాజా పరిశోధనలు తేల్చారుు. మరి మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలు రాకుండా కాపాడుకోవడం ఎలా? దీనికి మన తాతలు, ముత్తాతలు తిన్న ఆహారాన్ని మళ్లీ తినడం మొదలుపెడితే చాలు అంటున్నారు సీఎస్ఐ ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) శాస్త్రవేత్త అశోక్ తివారీ. ఆయుర్వేద, యునానీ వైద్యవిధానాల్లో ప్రస్తావిం చిన కొన్ని ఆహార పదార్థాలు మందులుగా ఎలా పనిచేస్తాయన్న విషయాన్ని ఆధునిక పద్ధతుల ద్వారా ఆయన నిరూపిస్తున్నారు. నీలికలువ మొక్కల గింజలు, దుంపలు మధుమేహం, ఊబకాయ సమస్యలను సమర్థంగా ఎదుర్కోగలవని ప్రయోగపూర్వకంగా నిరూపించారు. అధికం గా శుద్ధి చేసిన ఆహారాలను తిన్న వెంటనే రక్తంలోని చక్కెర, కొవ్వుల మోతాదు అకస్మాత్తుగా పెరిగిపోతుందని, ఇవి కాస్తా.. శరీరంలో ఫ్రీరాడికల్స్ పెరిగేందుకు, తద్వారా జీవక్రియల్లో తేడాలు వచ్చేందుకు కారణమ వుతోందని తివారీ బుధవారం మీడియాకు చెప్పారు. ఈ నేపథ్యంలో తాము ఒకప్పుడు ఆహారంగా వాడిన నీలి కలువల విత్తనాలు, దుంపలు జీవక్రియలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకునేందుకు ప్రయోగాలు చేశామని చెప్పారు. గింజలు, దుంపల సారాన్ని ద్రవరూపంలో సేకరించి ప్రయోగశాలలో పరిశీలించినప్పుడు అవి కార్బోహైడ్రేట్లు, కొవ్వులను విడగొట్టే ఎంజైమ్‌లపై ప్రభావం చూపుతున్నాయని, తద్వారా జీర్ణక్రియను మందగింప జేయడంతో పాటు శరీరానికి అవసరమైన శక్తిని కూడా నెమ్మదిగా విడుదలయ్యేలా చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న మధుమేహ మందు ఎకార్బోజ్, కొవ్వులు తొందరగా జీర్ణమయ్యేందుకు వాడే ఒర్లిస్టాట్ మందుల కంటే మెరుగ్గా నీలికలువ విత్తనాలు, దుంపలు పనిచేస్తున్నట్లు తమ ప్రయోగాల ద్వారా తెలిసిందని అశోక్ తివారీ తెలిపారు. అంతేకాక.. ఇవి అనేక వ్యాధులకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను శరీరం నుంచి తొలగించేందుకు కూడా బాగా ఉపయోగపడతాయని ఆయన వివరించారు. -
డాక్టర్ ప్రథమకు ఫార్మా అవార్డు
హైదరాబాద్: ఫార్మా రంగానికి చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ప్రథమకు ఆర్గనైజేషన్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఇండియా ఉమన్ సైంటిస్ట్ అవార్డు లభించింది. కేన్సర్, క్షయ, కేంద్ర నాడీ వ్యవస్థ సంబంధిత వ్యాధుల చికిత్సకు ఉపయోగపడే కొత్త కొత్త రసాయనాలను గుర్తించడంలో డాక్టర్ ప్రథమ కీలక పాత్ర పోషిస్తున్నారు. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో అవార్డును ఆమెకు అందజేసినట్లు ఐఐసీటీ ఒక ప్రకటనలో తెలిపింది. అవార్డు కింద రూ.లక్ష నగదు బహుమతి, ప్రశంసా పత్రం అందజేశారు.