Indias economy
-
దేశ ఆరోగ్య వ్యయంలో సగం భారం ప్రజలదే
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యారోగ్య రంగంలో ఎన్ని పథకాలు తీసుకువస్తున్నా.. వైద్య సదుపాయాలు పెంచుతున్నట్టు చెప్తున్నా.. ప్రజలపై భారం మాత్రం తగ్గడం లేదు. దేశంలో ఆరోగ్యంపై జరుగుతున్న మొత్తం వ్యయంలో సగం ఖర్చును ప్రజలే సొంతంగా భరించాల్సిన పరిస్థితి ఉంది. ఇది పేద, మధ్య తరగతి వర్గాలపై మోయలేని భారంగా మారుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా పరిస్థితుల్లో ఆరోగ్యం కోసం ఖర్చు గణనీయంగా పెరిగినా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చు అవసరమైన మేర పెరగడం లేదని, ప్రజలపైనే భారం పడుతోందని స్పష్టం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నివేదికలోనే.. దేశంలో రాష్ట్రాల వారీగా ఆరోగ్యంపై ప్రభుత్వాలు, ప్రజలు చేస్తున్న ఖర్చుపై కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. 2018–19 నాటి అంచనాల ప్రకారం తయారు చేసిన ఈ నివేదికపై ఇటీవల పార్లమెంటులోనూ చర్చ జరిగింది. దాని ప్రకారం దేశంలో ఆరోగ్యంపై మొత్తంగా రూ.5,96,440 కోట్లు వ్యయం అవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి భరిస్తున్నది రూ.2,42,219 కోట్లే. అంటే సుమారు 41 శాతం మాత్రమే. అదే ప్రజలు సొంతంగా చేసిన ఖర్చులు రూ.2,87,573 కోట్లు (సుమారు 48శాతం) కావడం గమనార్హం. ఇక ప్రైవేటు ఆరోగ్య బీమా ద్వారా అందుతున్నది రూ.39,201 కోట్లు (6.57 శాతం), మిగతా సొమ్ము వివిధ స్వచ్చంద సంస్థలు, ఇతర మార్గాల ద్వారా ఆరోగ్య ఖర్చుల కోసం అందుతోంది. ప్రభుత్వాల వ్యయం పెరుగుతున్నా.. ఆరోగ్యం కోసం ప్రజలు చేస్తున్న సొంత ఖర్చు తగ్గుతోందని.. ప్రభుత్వాల వ్యయం పెరుగుతోందని కేంద్ర నివేదికలోని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2015–16లో ప్రభుత్వాల ఖర్చు సుమారు 30 శాతం వరకే ఉండగా ఇప్పుడు 41 శాతానికి చేరింది. ప్రజలు సొంతంగా చేస్తున్న ఖర్చు 62 శాతం నుంచి 48 శాతానికి తగ్గింది. ఆరోగ్య వ్యయంలో ప్రభుత్వాల వాటా గణనీయంగా పెరగడం మంచి పరిణామమే అయినా.. సగం కూడా లేకపోవడం, మిగతా భారం ప్రజలపై పడటం సరికాదని నిపుణులు చెప్తున్నారు. మొత్తం ఆరోగ్య వ్యయంలో ప్రజల ఖర్చు 10 శాతం వరకే ఉండాలని, ప్రభుత్వాలే వ్యయం పెంచాలని స్పష్టం చేస్తున్నారు. యూపీలో ఎక్కువ ఖర్చు దేశంలో ఆరోగ్యానికి అత్యధికంగా ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ రాష్ట్రంలో రూ.78,297 కోట్లు ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తున్నారు. మహారాష్ట్రలో రూ.66,703 కోట్లు, పశ్చిమబెంగాల్లో రూ.45,277 కోట్లు, కేరళ రూ.34,548 కోట్లు, తమిళనాడులో రూ.32,767 కోట్లు, కర్ణాటకలో రూ.32,198 కోట్లు, రాజస్థాన్‌లో రూ.29,905 కోట్లు, గుజరాత్లో రూ.26,812 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ.25,828 కోట్లు, మధ్యప్రదేశ్‌లో రూ.20,725 కోట్లు ఖర్చు చేశారు. ప్రభుత్వాలే భరించే ఖర్చు ప్రకారం చూస్తే.. ఉత్తరాఖండ్ 61 శాతంతో టాప్‌లో నిలిచింది. నివేదికలో ముఖ్యాంశాలివీ.. ► దేశంలో 2018–19 సంవత్సరానికి మొత్తం ఆరోగ్య వ్యయం రూ.5,96,440 కోట్లు (ఇది జీడీపీలో 3.16 శాతం.. తలసరి ఖర్చు రూ.4,470). ► మొత్తం ఆరోగ్య వ్యయంలో ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చు రూ.2,42,219 కోట్లు (తలసరి రూ.1,815)కాగా.. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 34.3 శాతం, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 65.7 శాతంగా ఉంది. ►కేంద్రం జాతీయ ఆరోగ్య మిషన్‌పై చేస్తున్న వ్యయం రూ.30,578 కోట్లు, డిఫెన్స్ మెడికల్ సర్వీసెస్ కింద రూ.12,852 కోట్లు, రైల్వే హెల్త్ సర్వీసెస్ రూ.4,606 కోట్లు, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్ఎస్) రూ.4,060 కోట్లు, ఎక్స్ సర్వీస్‌మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్‌కు రూ.3,226 కోట్లు, అన్ని ప్రభుత్వ ఆర్థిక ఆరోగ్య బీమా పథకాల ద్వారా ఖర్చులు కలిపి రూ.12,680 కోట్లు. ► ఆరోగ్యంపై ప్రజలు సొంతంగా చేసిన ఖర్చులు రూ.2,87,573 కోట్లు (మొత్తం ఆరోగ్య వ్యయంలో 48.21 శాతం.. తలసరిన చూస్తే రూ.2,155), ప్రైవేటు ఆరోగ్య బీమా ద్వారా అందుతున్నది రూ.39,201 కోట్లు (6.57 శాతం). ►మొత్తంగా ఆరోగ్యానికి అయ్యే ఖర్చులో రూ.93,689 కోట్లు ప్రభుత్వ ఆస్పత్రులకు, ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.1,55,013 కోట్లు (28.69%). ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, డిస్పెన్సరీలు, కుటుంబ నియంత్రణ కేంద్రాలకు కలిపి చేసే ఖర్చు రూ.41,875 కోట్లు, ఇతర ప్రైవేట్ ప్రొవైడర్లకు (ప్రైవేట్ క్లినిక్‌లతో సహా) రూ.23,610 కోట్లు, పేషెంట్ ట్రాన్స్పోర్ట్, ఎమర్జెన్సీ రెస్క్యూ ప్రొవైడర్లకు రూ.18,909 కోట్లు, మెడికల్ అండ్ డయాగ్నస్టిక్ లేబొరేటరీలకు రూ.21,162 కోట్లు, ఫార్మసీలకు రూ.1,22,077 కోట్లు, ఇతర రిటైలర్లకు రూ.643 కోట్లు, ప్రివెంటివ్ కేర్ ప్రొవైడర్లకు రూ.28,841 కోట్లు, హెల్త్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్సింగ్ ప్రొవైడర్లు, ఇతర ఆరోగ్య సంరక్షణలకు దాదాపు రూ. 21,612 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మరిన్ని నిధులు ఇతర అవసరాలకు ఖర్చవుతున్నాయి. ► తెలంగాణలో జీఎస్డీపీలో మొత్తం ఆరోగ్య ఖర్చు 1.8 శాతంగా ఉంది. ఇందులో ప్రభుత్వ ఖర్చు 0.7 శాతం, ప్రజలు సొంతంగా చేస్తున్న ఖర్చు 0.9 శాతం, ఆరోగ్య బీమా, ఇతర వ్యవస్థల ద్వారా 0.2శాతం ఖర్చు జరుగుతోంది. దేశంలో ఆరోగ్యంపై వ్యయం తీరు ఇలా.. (రూ.కోట్లలో) అంశం 2015–16 2016–17 2017–18 2018–19 ప్రభుత్వ ఖర్చు 1,61,863 1,88,010 2,31,104 2,42,219 ప్రజల సొంత ఖర్చు 3,20,211 3,40,196 2,76,532 2,87,573 ప్రైవేట్ బీమా కంపెనీలు 22,013 27,339 33,048 39,201 క్యూబాలో జనం సొంత ఖర్చు 8 శాతమే.. ప్రపంచంలో ఆరోగ్యంపై చేస్తున్న ఖర్చులో ప్రజలు సొంతంగా చేస్తున్నది 36 శాతమే. మన దేశంలో అది 48 శాతంగా ఉంది. అదే క్యూబా వంటి దేశంలో కేవలం 8 శాతమే. మన దేశంలో ప్రజల ఖర్చు తగ్గుతూ వస్తున్నట్టు కేంద్ర గణాంకాలు చెప్తున్నా.. ప్రభుత్వాలు భరించే మొత్తం గణనీయంగా పెరగాల్సి ఉంది. బడ్జెట్లో ఆరోగ్యానికి కేటాయింపులు పెంచడం వల్ల ప్రజల జేబు ఖర్చు తగ్గుతుంది. ప్రైవేట్ బీమా కంపెనీలు ఆరోగ్య రంగంలో భాగస్వామ్యం కావడం, ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్, ఇతర ఆరోగ్య పథకాలతో ప్రయోజనం ఉంటోంది. డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ మెడికల్ కాలేజీ జేబు ఖర్చు 10శాతం లోపే ఉండాలి ఆరోగ్య వ్యయంపై ప్రభుత్వ లెక్కలు సరిగా లేవని అనిపిస్తోంది. మాకున్న అంచనా ప్రకారం 80శాతం ఆరోగ్య ఖర్చును ప్రజలే భరిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వ లెక్కలనే పరిగణనలోకి తీసుకున్నా.. అది ప్రజలపై పెను భారమే. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆరోగ్యంపై ప్రజలు చేస్తున్న ఖర్చు కేవలం 10 శాతమే. డెన్మార్క్, చెకోస్లావేకియా, చైనా, వియత్నాం, ఉత్తర కొరియా వంటిచోట్ల ఎక్కువగా ప్రభుత్వాలే ఖర్చు చేస్తున్నాయి. అమెరికా వంటి చోట్ల బీమా పథకాలు ఉన్నాయి. కానీ బీమా కంపెనీలు ఎక్కువ ధరలతో కూడిన మందులు ఇవ్వడానికి, ఖర్చుకు ముందుకు రావు. అమెరికాలో వస్తున్న సమస్య ఇదే. అందువల్ల దేశంలో ప్రభుత్వమే ఖర్చు పెంచాలి. – డాక్టర్ యలమంచి రవీంద్రనాథ్, ప్రముఖ వైద్యుడు, ఖమ్మం -
ధనాధన్ ‘నవంబర్’!
భారత్ ఆర్థిక వ్యవస్థ నవంబర్‌లో మంచి ఫలితాలను నమోదుచేసినట్లు గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. వస్తు, సేవల పన్ను వసూళ్లు, ఎగుమతులు, తయారీ రంగం ఇలా ప్రతి కీలక విభాగమూ వృద్ధిలో దూసుకుపోయింది. ఆయా రంగాలను పరిశీలిస్తే.. జీఎస్టీ ఆదాయం రూ.1,31,526 కోట్లు న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు నవంబర్‌లో రూ.1,31,526 కోట్లుగా నమోదయ్యాయి. ఎక్సైజ్ సుంకం, సేవల పన్ను, వ్యాట్ వంటి పలు రకాల పరోక్ష పన్నులను ఒకటిగా మార్చుతూ 2017 జూలై నుంచి అమల్లోకి వచ్చిన తర్వాత, జీఎస్టీ ద్వారా ఈ స్థాయి వసూళ్లు జరగడం ఇది రెండవసారి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో వసూలయిన రూ.1,39,708 కోట్లు ఇప్పటి వరకూ భారీ వసూలుగా రికార్డయ్యింది. కాగా, 2020 నవంబర్ నెలతో (1.05 లక్షల కోట్లు) పోల్చితే తాజా సమీక్షా నెల వసూళ్లలో 25 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. ఇక 2019 ఇదే నెలతో పోల్చితే వసూళ్లు 27 శాతం ఎగశాయి. వ్యాపార క్రియాశీలత మెరుగుపడ్డం, ఎకానమీ రికవరీ పటిష్టత వంటి అంశాలు తాజా సమీక్షా నెల్లో మంచి ఫలితాలకు కారణం. ఇక జీఎస్టీ వసూళ్లు లక్షకోట్లు పైబడ్డం కూడా ఇది వరుసగా ఐదవనెల. పన్ను ఎగవేతలను నిరోధించడానికి కేందం తీసుకుంటున్న చర్యలు ఫలితమిస్తున్నాయని, జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరగడానికి ఇదీ ఒక కారణమని ఆర్థిక శాఖ పేర్కొంది. అంకెల్లో చూస్తే... ► నవంబర్‌లో మొత్తం స్థూల వసూళ్లు రూ.1,31,526 కోట్లలో సెంట్రల్ జీఎస్టీ రూ.23,978 కోట్లు. ► స్టేట్ జీఎస్టీ రూ.31,127 కోట్లు. ► ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.66,815 కోట్లు (వస్తు దిగుమతులపై రూ.32,165 కోట్లు సహా) ► సెస్ రూ.9,606 కోట్లు (వస్తు దిగుమతులపై వసూలు చేసిన రూ.653 కోట్లుసహా) ఇదిలాఉండగా, ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకటన ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే నెలల జీఎస్టీ వసూళ్ల అంకెల్లో సవరణ జరిగింది. ఎగుమతులు 26 % అప్ భారత్ ఎగుమతులు నవంబర్‌లో గత ఏడాది ఇదే నెలతో పోల్చితే 26.49 శాతం ఎగశాయి. విలువ రూపంలో 29.88 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇంజనీరింగ్, పెట్రోలియం, రసాయనాలు, మెరైన్ ఉత్పత్తుల వంటి పలు విభాగాలు పురోగతిలో నిలిచాయి. 2020 నవంబర్‌లో ఎగుమతుల విలువ 23.62 బిలియన్ డాలర్లు. ఇక దిగుమతులు 57.18 శాతం పెరిగి 53.15 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెల్లో ఈ విలువ 38.81 బిలియన్ డాలర్లు. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 23.27 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వార్షికంగా చూస్తే, వాణిజ్యలోటు రెట్టింపు కావడం గమనించాల్సిన మరో అంశం. కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► మొత్తం ఎగుమతుల్లో 28.19 శాతం వాటా ఉన్న ఇంజనీరింగ్ ఎగుమతులు 37% పెరిగి 8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► పెట్రోలియం ప్రొడక్ట్స్ ఎగుమతులు 145.3% పెరిగి 3.82 బిలియన్ డాలర్ల్లకు చేరాయి. ► రత్నాభరణాల దిగుమతులు మాత్రం 11% క్షీణించి 2.4 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ► సమీక్షా నెల్లో పసిడి దిగుమలు 8 శాతం పెరిగి 4.22 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► పెట్రోలియం, క్రూడ్ ఉత్పత్తుల దిగుమతులు 132.44 శాతం పెరిగి 14.68 బిలియన్ డాలర్లకు చేరాయి. ► బొగ్గు, కోక్, బ్రికెట్స్ దిగుమతులు 135.81% పెరిగి 3.58 బిలియన్ డాలర్లకు చేరాయి. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ... కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ చూస్తే ఎగుమతులు విలువ 50.71 శాతం పెరిగి 174.15 బిలియన్ డాలర్ల నుంచి 262.46 బిలియన్ డాలర్లకు ఎగసింది. కరోనా ముందస్తు సమయం 2019 ఏప్రిల్–నవంబర్‌తో పోల్చినా ఎగుమతులు 24 శాతం పెరగడం గమనార్హం. అప్పట్లో ఈ విలువ 211.17 బిలియన్ డాలర్లు. 10 నెలల గరిష్టానికి ‘తయారీ’ భారత్ తయారీ రంగం నవంబర్‌లో పురోగమించింది. ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 57.6కు ఎగసింది. అక్టోబర్‌లో ఈ సూచీ 55.9 వద్ద ఉంది. గడచిన 10 నెలల్లో ఈ స్థాయి మెరుగుదల ఇదే తొలిసారి. కాగా ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగానే పరిగణిస్తారు. ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా లెక్కించడం జరుగుతుంది. దీర్ఘకాలిక సగటు 53.6కన్నా కూడా సూచీ పైన ఉండడం తాజా సమీక్షా నెల ముఖ్యాంశం. మూడు నెలల వరుస క్షీణత అనంతరం నవంబర్‌లో ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా మెరుగుపడినట్లు ఐహెచ్ఎస్ మార్కిట్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పాలీయానా డీ లిమా పేర్కొన్నారు. వరుసగా ఐదు నెలల తర్వాత నిర్వహణా పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని కూడా ఆమె తెలిపారు. -
Indian Economy: ఆందోళన కలిగిస్తున్న సెకండ్‌వేవ్
న్యూఢిల్లీ: భారత్‌లో సెకండ్‌వేవ్ అందోళన కలిగిస్తోందని బుధవారం ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) 2021 అవుట్‌లుక్ పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ పటిష్ట రికవరీకి ఇది అడ్డంకిగా మరుతోందని తెలిపింది. అయితే 2022 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరంలో 11 శాతం ఎకానమీ వృద్ధి నమోదవుతుందని అంచనావేస్తున్నట్లు తెలిపింది. వ్యాక్సినేషన్ కార్యక్రమం అమలు జరుగుతుండడం, రానున్న నెలల్లో ఈ కార్యక్రమం మరింత విస్తృతం కావడానికి చర్యలు తన వృద్ధి అంచనాలకు కారణమని పేర్కొంది. మనీలా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బహుళజాతి బ్యాంకింగ్ సంస్థ ఏడీబీ తాజా ‘అవుట్‌లుక్’ లో మరికొన్ని అంశాలను పరిశీలిస్తే.. ►మౌలిక రంగంలో పెట్టుబడులు, తయారీ రంగానికి ప్రోత్సాహకాలు, గ్రామీణ ఆదాయాలకు చేయూత వంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ వ్యయాలు పెరుగుతున్నాయి. వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. దేశీయ డిమాండ్ మెరుగ్గానే ఉంది. ఆయా అంశాలు ఆర్థిక రంగాన్ని పట్టాలు తప్పనీయకపోవచ్చు. అయితే వ్యాక్సినేషన్ దేశ వ్యాప్తంగా విస్తృతంగా పంపిణీ అవుతుందని, తద్వారా సెకండ్‌వేవ్ కట్టడి జరుగుతుందన్న అంచనాలే తాజా అవుట్‌లుక్‌కు ప్రాతిపదిక. కాగా, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంలో లోపాలు ఉన్నా, మహమ్మారి కట్టడిలో అది విఫలమైనాకోవిడ్–19 కేసుల పెరుగుదల ఆందోళనకరంగా మారుతుంది. ►దీనికితోడు అంతర్జాతీయ ఫైనాన్షియల్ పరిస్థితులు మరింత కఠినతరంగా మారే అవకాశం ఉండడం భారత్‌కు ఆందోళకరం. ఆయా అంశాలు దేశీయ మార్కెట్ వడ్డీరేట్ల పెరుగుదలకు దారితీస్తుంది. ఇదే జరిగితే ఆర్థికరంగం సాధారణ స్థితికి చేరుకోవడానికి అడ్డంకులు ఏర్పడతాయి. ►2021–22లో 11 శాతం వృద్ధి అంచనాకు బేస్ ఎఫెక్ట్ (2020–21లో తక్కువ స్థాయి గణాంకాల)ప్రధాన కారణం. బేస్ ఎఫెక్ట్‌ను పరిగణనలోకి తీసుకోకపోతే 7 శాతం వృద్ధి ఉంటుంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో 8 శాతం క్షీణత నమోదయ్యే అవకాశం ఉంది. ►ఆరోగ్యం, నీటి సరఫరా, పారిశుధ్యం వంటి రంగాల్లో ప్రభుత్వ వ్యయాలు పెరగాలి. దీనివల్ల భవిష్యత్తులో తలెత్తే మహమ్మారి సంబంధ సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ప్రైవేటు పెట్టుబడులు పెరగడం, తగిన రుణ పరిస్థితులు ఉండడం ప్రస్తుతం దేశానికి తక్షణ అవసరం. ►ద్రవ్యోల్బణం వార్షిక సగటు 6.2 శాతం నుంచి 5.2 శాతానికి తగ్గవచ్చు. తగిన వర్షపాతం, పంట సాగు, సరఫరాల చైన్ మెరుగుపడే అవకాశాలు దీనికి కారణం. ►ఇక దక్షిణ ఆసియా పరిస్థితిని పరిశీలిస్తే, 2021 క్యాలెండర్ ఇయర్లో ఉత్పత్తి వృద్ధి 9.5 శాతంగా ఉండే వీలుంది. 2022లో ఇది 6.6 శాతానికి తగ్గవచ్చు. ఆసియా మొత్తంగా వృద్ధి ధోరణి మెరుగుపడుతున్నప్పటికీ, కోవిడ్–19 కేసుల పెరుగుదల రికవరీకి ఇబ్బందిగా మారుతోంది. ►ఒక్క చైనా విషయానికివస్తే, ఎగుమతులు పటిష్టంగా ఉన్నాయి. గృహ వినియోగంలో రికవరీ క్రమంగా పెరుగుతోంది. 2021లో చైనా ఎకానమీ 8.1 శాతం వృద్ధిని నమోదుచేసుకునే వీలుంది. 2022లో ఇది 5.5 శాతానికి తగ్గవచ్చు. ►సెంట్రల్ ఆసియా, తూర్పు ఆసియా, దక్షిణ ఆసియా, ఆగ్నేయ ఆసియా, పసిఫిక్ ప్రాంత దేశాలుసహా ఏడీబీలో ప్రస్తుతం 46 సభ్య దేశాలు ఉన్నాయి. -
పుంజుకోనున్న భారత్ ఆర్థిక వ్యవస్థ!
న్యూఢిల్లీ/వాషింగ్టన్: భారత్ ఆర్థిక వ్యవస్థ 2019, 2020లో ఊపందుకోనున్నదని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) పేర్కొంది. ఈ రెండు సంవత్సరాల్లో వరుసగా 7.5 శాతం, 7.7 శాతం వృద్ధి నమోదవుతుందని విశ్లేషించింది. అంతకుముందు అంచనాలకన్నా ఇది 10 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) ఎక్కువ. ఈ రెండు సంవత్సరాల్లో చైనా ఆర్థిక వృద్ధి రేటు 6.2 శాతంగా ఉంటుందని వివరించింది. తద్వారా భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే వేగవంతమైన అభివృద్ధిని సాధిస్తున్న దేశంగా నిలుస్తుందని ఐఎంఎఫ్ పేర్కొంది. క్రూడ్ ధరలు తక్కువగా ఉండడం, నిత్యావసరాల ధరల పెరుగుదల స్పీడ్ తగ్గడం, కఠిన ద్రవ్య పరపతి విధాన ప్రక్రియ నెమ్మదించడం భారత్ వృద్ధి పురోగతికి కారణంగా వివరించింది. ఐఎంఎఫ్ మొట్టమొదటి మహిళా చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్ విడుదల చేసిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు... ►ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటుపై భారత్‌లో ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నాయి. ► ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగిస్తోంది. 2019, 2020ల్లో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 3.5, 3.6 శాతాలుగా ఉంటాయి. గతంతో పోల్చితే ఈ అంచనాలు వరుసగా 0.2 శాతం 0.1 శాతం తక్కువ. పలు దేశాల్లో వృద్ధి మందగమనం దీనికి కారణం. పెరగనున్న రాష్ట్రాల ద్రవ్యలోటు: ఇండియా రేటింగ్స్ ఎన్నికల సంవత్సరంలో రాష్ట్రాల ద్రవ్యలోటు పెరగనుందని ఫిచ్ గ్రూప్ కంపెనీ– ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ తాజా నివేదిక తెలిపింది. వ్యవసాయ రుణాల మాఫీ, ఇతర స్కీమ్‌లు ఇందుకు ప్రధాన కారణమని విశ్లేషించింది. 28 ఏళ్ల కనిష్టానికి చైనా వృద్ధి వెల్లడించిన చైనా ఎన్బీఎస్ బీజింగ్: చైనా గత ఏడాది 6.6 శాతం వృద్ధిని సాధించింది. 1990 తర్వాత ఇదే అత్యంత తక్కువ స్థాయి జీడీపీ వృద్ధి రేటు. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో 6.5 శాతంగా ఉన్న వృద్ధి ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో 6.4 శాతానికి పడిపోయిందని చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఎన్బీఎస్) వెల్లడించింది. 2017లో 6.8 శాతంగా ఉన్న జీడీపీ 2018లో 6.6 శాతానికి తగ్గింది. ఇది 28 సంవత్సరాల కనిష్ట స్థాయి. అమెరికాతో ఉన్న వాణిజ్య సవాళ్లు దీనికి ప్రధాన కారణం. కార్పొ బ్రీఫ్స్... శ్రేయీ ఎక్విప్మెంట్ ఫైనాన్స్ లిస్టింగ్‌పై కసరత్తు.. విలీన స్కీమ్ ద్వారా ఎక్విప్మెంట్ ఫైనాన్స్ వ్యాపార విభాగాన్ని స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయనున్నట్లు శ్రేయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ చైర్మన్ హేమంత్ కనోడియా తెలిపారు. సిడ్బిలో వాటా విక్రయించనున్న కెనరా బ్యాంక్.. చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ (సిడ్బి)లోని కోటి షేర్లను విక్రయించాలని కెనరా బ్యాంక్ ప్రతిపాదించింది. ఈ అమ్మకానికి సంబంధించి.. ఒక్కో షేరు ఫ్లోర్ ప్రైస్ రూ.225 వద్ద నిర్ణయించినట్లు రాయిటర్స్ వెల్లడించింది. మరోవైపు ఎన్ఎస్డీఎల్లోని 4 లక్షల షేర్లను రూ.850 ఫ్లోర్ ప్రైస్ వద్ద విక్రయించనున్నట్లు తెలుస్తోంది.గుజరాత్లో నూతన సెల్లో ప్లాంట్ ప్రారంభం బీఐసీ సెల్లో ఇండియా రూ.300 కోట్ల వ్యయంతో గుజరాత్‌లోని వాపిలో ఏర్పాటుచేసిన అతిపెద్ద స్టేషనరీ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించింది. ఇందులో 1,500 మంది ఉద్యోగులను నియమించుకోగా.. వీరిలో 70 శాతం మహిళలే ఉన్నట్లు తెలిపింది. టాటా టెలీ, ఎయిర్టెల్ విలీనానికి ఆమోదంనష్టాల్లో కూరుకుపోయిన టెలికం సంస్థ– టాటా టెలీసర్వీసెస్‌ను భారతీ ఎయిర్ టెల్లో విలీనం చేసేందుకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. ఈ విలీనానికి టెలికమ్యునికేషన్స్ శాఖ అనుమతి లభించాల్సి ఉంది. అక్టోబర్ 2017లో విలీన ప్రకటన వెలువడింది. -
ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యలోటు భయాలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం... ద్రవ్యలోటు భారత్ ఆర్థిక వ్యవస్థకు ఆందోళన కలిగిస్తోంది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) బుధవారం ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి నాటి ద్రవ్యలోటు పరిస్థితిపై తాజా గణాంకాలను ఆవిష్కరించింది. దీని ప్రకారం– ఆర్థిక సంవత్సరం ఇంకా ఒకనెల మిగిలిఉండగానే ద్రవ్యలోటు బడ్జెట్ (2017–18) లక్ష్యాలను దాటి, ఏకంగా 120.3%కి చేరింది. విలువ రూపంలో ఇది రూ.7.15 లక్షల కోట్లు. సవరించిన అంచనాల ప్రకారం రూ.5.94 లక్షల కోట్లుగా ఉండాలి. ఆందోళన వద్దంటున్న ప్రభుత్వం నిజానికి 2017–18 బడ్జెట్ ప్రకారం ద్రవ్యలోటు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో 3.2 శాతంగానే ఉండాలి. అయితే 2018–19 బడ్జెట్లో దీనిని కేంద్రం 3.5 శాతానికి సవరించింది. ఈ సవరిత శాతంపైనే ఇప్పుడు అనుమానాలు నెలకొన్నాయి. కాగా ద్రవ్యలోటు లక్ష్యాలకు కట్టుబడి ఉన్నట్లు బుధవారం ఫైనాన్స్ సెక్రటరీ హాస్ముఖ్ ఆదియా స్పష్టం చేశారు. ఈ అంశంపై బుధవారం ఒక కీలక సమావేశాన్ని నిర్వహించినట్లూ వెల్లడించారు. రూపాయి విలువపై ఎఫెక్ట్... ద్రవ్యలోటు ఎఫెక్ట్ బుధవారం మనీ మార్కెట్‌పై పడింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 21 పైసలు నష్టపోయి 65.18కి చేరింది. వాణిజ్య యుద్ధ భయాలు, దేశ కరెంట్ అకౌంట్‌లోటు(క్యాడ్) ఆందోళనలు కూడా జతకావడంతో ఒక దశలో బుధవారం రూపాయి విలువ 65.30కి పడిపోవడం గమనార్హం. -
వాణిజ్య యుద్ధంతో భారత్‌కు దెబ్బ!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్ధం మరింత తీవ్రతరమైతే భారత్‌పై ప్రతికూల ప్రభావం ఉంటుందని, ముఖ్యంగా ఎగుమతులు దెబ్బతింటాయని పారిశ్రామిక మండలి అసోచామ్ పేర్కొంది. ‘ఇప్పుడు మొదలైన వాణిజ్య యుద్ధం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తే, భారత్ ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లుతుంది. ఎగుమతులు పడిపోవడంతోపాటు కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) ఎగబాకేందుకు దారితీయొచ్చు. దీంతో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు దిగజారే ప్రమాదం ఉంటుంది’ అని అసోచామ్ ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికా మొదలుపెట్టిన ఈ రక్షణాత్మక చర్యలతో భారత్‌లో కూడా ఆర్థికపరమైన సెటిమెంట్ తీవ్రంగా దెబ్బతింటుందని అభిప్రాయపడింది. ఒకవేళ భారత్ కూడా దిగుమతులపై ఇలాంటి ప్రతిచర్యలకు దిగితే... ఎగుమతులపై ప్రభావం పడుతుందని, విదేశీ మారకం రేట్లలో తీవ్ర కుదుపులను చవిచూడాల్సి వస్తుందని పేర్కొంది. ఈ ముప్పునుంచి తప్పించుకోవడం కోసం ఒక నిర్ధిష్ట ప్రణాళికను ముందుగానే రూపొందించుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ రక్షణాత్మక చర్యల ప్రభావం నుంచి తప్పించుకోవడం కోసం కీలక వాణిజ్య భాగస్వామ్య దేశాలతో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత పెంపొందించుకోవాలని అభిప్రాయపడింది. మన క్యాపిటల్ మార్కెట్లో ఇన్వెస్టర్ల విశ్వాసం దెబ్బతింటే.. పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు తిరోగమన బాటపడతాయని.. దీనివల్ల డాలరుతో రూపాయి మారకం విలువపై తీవ్ర ప్రతికూలత తప్పదని అసోచామ్ పేర్కొంది. -
సవాళ్లున్నాయ్... పరిష్కరించాలి..!
⇒ భారత్ ఆర్థిక వ్యవస్థపై విశ్లేషణలు ⇒ మొండిబకాయిల సమస్య తక్షణ పరిష్కారం ఆవశ్యకత: దీపక్ పరేఖ్ ⇒ గణాంకాల్లో మరింత స్పష్టత కావాలన్న క్రిసిల్ ⇒ ఇకపై భారత్ వృద్ధికి దేశీయ అంశాలే కారణమవుతాయంటున్న నిపుణులు న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ మరింత పురోగమించడానికి ఇకపై దేశీయ అంశాలే కారణమవుతాయని పలువురు ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఫెడ్ ఫండ్ రేటును 0.25–0.50 శాతం నుంచి 0.75– 1 శాతానికి పెంచిన నేపథ్యంలో ప్రముఖ ఆర్థికవేత్తలు తాజా పరిస్థితులపై చేసిన విశ్లేషణల ఇదీ... మొండి బాకాయిల సమస్య తీవ్రం: పరేఖ్ ‘‘దేశంలో మొండిబకాయిల సమస్య తీవ్రంగా ఉంది. ఈ సమస్య పరిష్కారంపై కేంద్రం తక్షణం దృష్టి పెట్టాలి. అయితే దీనికి ప్రభుత్వ బెయిలవుట్ తరహా చర్యలు పనికిరావు. ఇక్కడ పన్ను చెల్లింపుదారుల డబ్బు వృధా కాకూడదన్నది నా అభిప్రాయం. మౌలిక రంగంపై రీఫైనాన్షింగ్, రుణాన్ని ఈక్విటీలోకి మార్చుకునే విధంగా రుణ పునర్వ్యవస్థీకరణ వంటి చొరవల ద్వారా ఈ సమస్యను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలి. అలాగే బ్యాంకింగ్‌కు తగిన మూలధనం అందుబాటులో ఉంచే చర్యలను కేంద్రం తీసుకోవాలి’’ అని హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ చెప్పారు. ఎల్ఎస్ఈ స్టూడెంట్స్ యూనియన్ ఇండియా ఫోరంలో ఆర్థిక సంస్కరణలపై జరిగిన సెమినార్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బ్యాంకింగ్ విలీనాలపై మాట్లాడుతూ, కొన్ని ప్రత్యేక సందర్భాలో ఇలాంటి చొరవలు అవసరమేనన్నారు. బ్యాంకింగ్ దిగ్గజం– ఎస్బీఐలో ఐదు బ్యాంకుల విలీనం తగిన నిర్ణయమేనని ఆయన అన్నారు. గణాంకాల మధ్య పొంతన ఉండడం లేదు: క్రిసిల్ భారత్‌లో పలు కీలక గణాంకాల మధ్య పొందన కుదరడం లేదని రేటింగ్, విశ్లేషణా సంస్థ– క్రిసిల్ చీఫ్ ఎకనమిస్ట్ ధర్మాదికారి జోషి పేర్కొన్నారు. ముఖ్యంగా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలకు, క్షేత్రస్థాయిలో వివిధ విభాగాల గణాంకాలకు మధ్య తీవ్ర వ్యత్యాసం ఉంటోందని తాజా విశ్లేషణా పత్రంలో పేర్కొన్నారు. 2008 సెప్టెంబర్ ప్రపంచ ఆర్థిక సంక్షోభం నుంచి చూస్తే... జీడీపీలో తయారీ రంగం వాటా గణాంకాలకు, నెలవారీగా విడుదలవుతున్న పారిశ్రామిక ఉత్పత్తి సూచీకీ (ఐఐపీ) మధ్య వ్యత్యాసం కనబడుతోందని చెప్పారు. దేశీయ అంశాలే వృద్ధికి ఊతం: అరవింద్ సుబ్రమణ్యం అమెరికా ఫెడ్ నిర్ణయాన్ని భారత్ ఆర్థిక వ్యవస్థ ముందే డిస్కౌంట్ చేసుకుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఏప్రిల్ 5–6 తేదీల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పాలసీ నిర్ణయాలపై ఈ ప్రభావం పడబోదనీ వారు విశ్లేషిస్తున్నారు. రేట్లు పెంపు ఇకపై ఉండబోదని క్రితం పాలసీ సందర్భంగానే ఆర్బీఐ సూచించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం ఫెడ్ రేటు పెంపు అంశంపై మాట్లాడుతూ, భారత్‌పై ఈ ప్రభావం స్వల్పమేనని అన్నారు. దేశీయంగా తీసుకునే నిర్ణయాలే మున్ముందు దేశాభివృద్ధికి దోహదపడతాయని అన్నారు. స్థిరత్వం, అన్ని విభాగాల్లో వృద్ధి పరిస్థితులు బాగుండడం వంటి అంశాలు వృద్ధి చోదకాలుగా ఉంటాయని అన్నారు. కాగా స్వల్పకాలంలో రూపాయి భారీగా బలపడినా, 2017 చివరినాటికి 66.50–67.50 శ్రేణికి చేరుతుందన్న అభిప్రాయాన్ని ఎస్బీఐ ఇకోవ్రాప్ అంచనావేసింది. అయితే ఫెడ్ రేటు పెంపునకు సంబంధించి ఇతర దేశాల సెంట్రల్ బ్యాంకులు అనుసరించే విధానాలపై ఇది ఆధారపడి ఉంటుందనీ పేర్కొంది. -
4వ త్రైమాసికంలో వృద్ధి పుంజుకుంటుంది
⇒ వ్యవస్థలో నగదు లభ్యత పెరగడమే కారణం ⇒ ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి నాల్గవ త్రైమాసికంలో (2016–17 జనవరి–మార్చి) వేగం పుంజుకుంటుందని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అభిప్రాయపడ్డారు. ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఫిబ్రవరి 7,8 తేదీల్లో సమావేశమై రెపో (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు (రెపో)ను 6.25 శాతంగా కొనసాగించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ఇకమీదట మరింత రేటు పుంపు ఉండబోదనీ ఆర్బీఐ ఈ సందర్భంగా సంకేతాలు ఇచ్చింది. ఈ సమావేశం మినిట్స్ బుధవారం విడుదలయ్యాయి. ‘‘పెద్ద నోట్ల రద్దు వెన్వెంటనే వినియోగ డిమాండ్ తగ్గింది. అయితే ఇది తిరిగి పుంజుకుంటుందని భావిస్తున్నాం. వ్యవస్థలో నగదు లభ్యత పెరగడమే దీనికి ప్రధాన కారణం’’ అని పటేల్ ఈ సమావేశంలో అన్నారు. 2017–18 బడ్జెట్ తగిన విధంగా ఉందని, మౌలిక రంగం, హౌసింగ్‌కు బడ్జెట్ ప్రాధాన్యత ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఇక ప్రపంచ వృద్ధి 2016లోకన్నా 2017లో బాగుంటుందన్న అభిప్రాయాన్నీ ఆయన వ్యక్తం చేశారు. -
2040 నాటికి అమెరికాను అధిగమించనున్న భారత్!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ 2040 నాటికి అమెరికా ఆర్థిక వ్యవస్థను అధిగమిస్తుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ– పీడబ్ల్యూసీ అంచనావేసింది. కొనుగోలు శక్తి వైవిధ్యం (పీపీపీ) ప్రాతిపదికన 2040 నాటికి ప్రపంచంలో రెండవ ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందన్నది తమ అంచనాగా వివరించింది. అంతర్జాతీయ ఆర్థికవేదిక వచ్చే కొన్ని దశాబ్దాల్లో అభివృద్ధి చెందిన దేశాల నుంచి వర్థమాన దేశాలవైపునకు మారుతుందని నివేదిక అంచనా. వచ్చే 34 సంవత్సరాల్లో బ్రెజిల్, చైనా, ఇండియా, ఇండోనేషియా, మెక్సికో, రష్యా, టర్కీలతో కూడిన ఈ–7 దేశాల వార్షిక వృద్ధి సగటు 3.5 శాతంగా ఉంటుందని వివరించింది. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా దేశాలతో కూడిన జీ7 దేశాల విషయంలో ఈ రేటు కేవలం 1.6 శాతంగా ఉంటుందని అంచనావేసింది. -
అతి పెద్ద మార్కెట్‌గా భారత్: ఉదయ్ కొటక్
డావోస్: రాబోయే కాలంలో ప్రపంచంలోనే భారత్ అతి పెద్ద మార్కెట్‌గా అవతరించనుందని ప్రముఖ బ్యాంకరు ఉదయ్ కొటక్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం భారత్ ఆర్ధిక వ్యవస్థ మెరుగ్గా ఉందని తెలిపారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ప్రపంచీకరణతో ఇండియాకు అధిక లబ్ధి చేకూరతోందని, ఇప్పటికే సాఫ్ట్వేర్ విప్లవం నేపథ్యంలో దేశంలోకి 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. అంతేకాక 300 బిలియన్ డాలర్ల పోర్ట్‌ఫోలియో పెట్టుబడులుగా వచ్చాయన్నారు. అనిశ్చిత అంతర్జాతీయ పరిస్థితుల మధ్య భారత్‌ను వెలుగురేఖగా ఇన్వెస్టర్లు భావిస్తున్నారని తెలిపారు. ‘అమెరికా వృద్ధిని పెంచేందుకు డొనాల్డ్ ట్రంప్ చర్యలు తీసుకుంటారన్న నేపధ్యంలో భారత్‌కు కూడా భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. తక్కువ ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు అదుపులో వుండటం వంటి అంశాలతో భారత్ భారీ పెట్టుబడుల్ని ఆకర్షించగలుగుతుంది. విదేశీ ఇన్వెస్టర్లకు జనాభా పరంగా భారత్ అనువైన దేశంగా మారింది ’’అని వివరించారు. -
నోట్ల రద్దుతో మందగమనం
గోల్డ్‌మన్ శాక్స్.. న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ .. రాబోయే కొంత కాలం మందగించే అవకాశాలు ఉన్నాయని కన్సల్టెన్సీ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కరెన్సీ సంస్కరణలే ఇందుకుప్రధాన కారణం కాగలవని సంస్థ చీఫ్ ఎకానమిస్ట్ జాన్ హట్జియస్ వివరించారు. ప్రస్తుతానికి ఎకానమీ స్వల్పంగా మందగిస్తోందని, సమీప కాలంలో వృద్ధి మరింత దిగువముఖంగా వెళ్లే రిస్కులున్నాయని భావిస్తున్నట్లుఆయన తెలిపారు. ఇక, 2017లో అమెరికా సారధ్యంలో ప్రపంచ ఎకానమీ వృద్ధి 3.5 శాతం మేర ఉండొచ్చని జాన్ తెలిపారు. ట్రంప్ నేతృత్వంలో అమెరికాలో కొన్ని పన్నులపరమైన సంస్కరణలు, కొంత మేర ఉదారవాదద్రవ్య విధానాలు అమలు, ఇన్ఫ్రాపై వ్యయాలు పెరగడం మొదలైన పరిణామాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన వివరించారు. ఇవి ఆర్థిక వృద్ధిపై సానుకూలంగా ప్రభావం చూపగలవని జాన్ పేర్కొన్నారు.మరోవైపు, యూరో దేశాల్లో వృద్ధి దాదాపు అదే స్థాయిలో 1.5 శాతం మేర ఉండొచ్చని అంచనాలు నెలకొన్నట్లు వివరించారు. కనిష్ట స్థాయికి వృద్ధి సూచీలు: నొమురా పెద్ద నోట్ల రద్దుతో గ్రామీణ ప్రాంతాల్లో వినియోగంపై గణనీయంగా ప్రతికూల ప్రభావం పడినట్లు జపాన్‌కి చెందిన బ్రోకరేజ్ సంస్థ నొమురా పేర్కొంది. దీంతో కీలకమైన వృద్ధి ఆధారిత సూచీలు 1996 తర్వాత కనిష్టస్థాయిలకు పడిపోయాయని వివరించింది. డీమోనిటైజేషన్ కారణంగా సమీప భవిష్యత్‌లో మందగమనం ఉండొచ్చని ఈ పరిణామం సూచిస్తున్నట్లు పేర్కొంది. నవంబర్‌లో వచ్చిన డేటాలో మందగమనం పాక్షికంగానేకనిపించిందని, వృద్ధిపై పడిన పూర్తి ప్రభావం డిసెంబర్ డేటా వచ్చిన తర్వాతే తెలుస్తుందని వివరించింది. పెద్ద నోట్ల దెబ్బ ప్రభావం పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ కన్నా ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగంపైనేపడిందని నొమురా తెలిపింది. భారత్‌కి చెందిన కాంపోజిట్ లీడింగ్ ఇండెక్స్ (సీఎల్ఐ) 2017 తొలినాళ్లలో వృద్ధికి సంబంధించి గణనీయంగా క్షీణించిందని పేర్కొంది. 1996లో దీన్ని రూపొందించినప్పట్నుంచి ఇది అత్యంతకనిష్ట స్థాయి అని, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 6%కన్నా తక్కువగానే ఉంటుందన్న అంచనాలకిది అనుగుణంగా ఉందని నొమురా తెలిపింది. ఫిబ్రవరి ఆఖరు నాటికి నగదు కొరత కష్టాలు తీరవచ్చని, 2017 జూన్త్రైమాసికం నుంచి మాత్రమే వృద్ధి రికవరీ మొదలుకాగలదని వివరించింది. -
మన ఆర్థిక వ్యవస్థ వెలిగిపోతోంది!
♦ ఇప్పుడున్నంత పటిష్టంగా ఎన్నడూలేదు.. ♦ వృద్ధిరేటు మరింత దూసుకెళ్తుంది... ♦ ఇదంతా కేంద్రంలో పటిష్ట నాయకత్వం, ♦ కీలక సంస్కరణల ఫలితమే... ♦ హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ వ్యాఖ్యలు ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థ మునుపెన్నడూలేనంత పటిష్టంగా ఉందని, రాబోయే కాలంలో వృద్ధి రేటు మరింతగా పరుగులు తీసే సంకేతాలు స్పష్టంగా కనబడుతున్నాయని హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ పేర్కొన్నారు. ప్రధానంగా కేంద్రంలో బలమైన నాయకత్వం ఉండటంతోపాటు ప్రభుత్వం చేపడుతున్న పలు కీలక సంస్కరణలు ఆర్థిక వ్యవస్థ జోరుకు దోహదం చేస్తున్నాయని చెప్పారు. సోమవారమిక్కడ భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) నిర్వహించిన ‘రిస్క్ సమిట్’లో మాట్లాడుతూ ఆయన ఈ అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా పరేఖ్ మోదీ సర్కారు పనితీరుపై సానుకూల వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘స్థూల ఆర్థిక అంశాలను పరిశీలిస్తే... మన ఎకానమీ ఇప్పుడున్నంత బలమైన స్థాయిలో ఇదివరకెన్నడూ లేదు.ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ హయాంలో భారీస్థాయి అవినీతి అనేది పూర్తిగా తొలగింది. 7.5 శాతం పైగా వార్షిక జీడీపీ వృద్ధిరేటు అంచనాలతో ఇతర దేశాలతో పోలిస్తే మన ఎకానమీ ప్రగతి పథంలో దూసుకెళ్తోంది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థతో పాటు అద్భుతమైన వృద్ధి సామర్థ్యం కూడా ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. అంతేకాదు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దిగిరావడం ఎనానమీకి తోడ్పాటునందిస్తోంది’ అని పరేఖ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వ్యయం ఆసరా... ప్రైవేటు రంగ కంపెనీల పెట్టుబడులు ఇంకా మందగమనంలోనే కొనసాగుతున్నప్పటికీ.. ప్రభుత్వ వ్యయం ముఖ్యంగా మౌలికసదుపాయాల కల్పనపై చేస్తున్న పెట్టుబడులు పుంజుకోవడంతో ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తున్నట్లు ఆయన చెప్పారు. ‘పోర్టులు, జల మార్గాలు, విమానాశ్రయాలు, స్మార్ట్ సిటీస్ ఇలా ఇన్ఫ్రా రంగంలో అనేక ప్రాజెక్టులకు సంబంధించి కార్యకలాపాలు చకచకా జరుగుతున్నాయి. అంతేకాదు పునరుత్పాదక ఇంధన రంగంలో సామర్థ్యాల పెంపు కూడా వేగవంతమైంది. సేవల మెరుగుదల కోసం రైల్వే శాఖ అనేక చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ టెండర్లు, బిడ్డింగ్ ప్రక్రియల్లో ఈ-వేలాన్ని పూర్తిగా ప్రవేశపెట్టడం దేశంపై విశ్వసనీయత పెరిగేలా చేస్తోంది. భారత్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అధిక రాబడులను ఆశించే దీర్ఘకాలిక ఇన్వెస్టర్లను మరింత ఆకర్షించడంపై దృష్టిసారించాలి.’ అని అభిప్రాయపడ్డారు. ప్రపంచ మార్కెట్లపట్ల అప్రమత్తంగా ఉండాలి.. ప్రపంచ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. యూరోపియన్ బ్యాంకుల ఇబ్బందులు ఇంకా కొనసాగుతుండటం... ఇతరత్రా ప్రతికూలతలు ఉన్నప్పటికీ.. పలు కీలక ప్రపంచ స్టాక్ మార్కెట్లు ఆల్‌టైమ్ గరిష్టాలను తాకడం లేదా దానికి దరిదాపుల్లో కదలాడుతున్నాయి. వర్థమాన మార్కెట్లలో అధిక రాబడులకు ఆస్కారం ఉండటంతో ఇన్వెస్టర్లు వీటిపై దృష్టిసారిస్తున్నారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో 3-4 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులు భారత్ క్యాపిటల్ మార్కెట్ల నుంచి తరలిపోవడంతో రూపాయి విలువ తీవ్ర కుదుపులకు గురైంది. అయితే, ఇప్పుడు విదేశీ ఇన్వెస్టర్లలో భారత్‌తో పాటు ఇతర వర్ధమాన దేశాలపట్ల సెంటిమెంట్ మెరుగుపడింది. గడిచిన వారంలో విదేశీ ఈక్విటీ ఫండ్స్ వర్ధమాన మార్కెట్లలో 5 బిలియన్ డాలర్ల నిధులను కుమ్మరించాయి. అంతేకాదు 20 బిలియన్ డాలర్లను బాండ్లలో పెట్టుబడి పెట్టారు. అయితే, రానున్న రోజుల్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపుపై తీసుకోబోయే నిర్ణయానికి సంబంధించి అంచనాల మేరకు వర్ధమాన దేశాల మార్కెట్లు ఒడిదుడుకులకు గురయ్యే అవకాశం ఉంది. పెంపు దిశగా స్పష్టత వచ్చేకొద్దీ విదేశీ నిధులు మళ్లీ భారీగా వెనక్కివెళ్లేందుకు ఆస్కారం ఉంది. మళ్లీ కరెన్సీ విలువలు, స్టాక్స్‌లో తీవ్ర హెచ్చు తుగ్గులు ఉండొచ్చు. -
ఎలాంటి సవాళ్లకైనా రెడీ!
దీటుగా ఎదుర్కొనే సత్తా భారత్ ఆర్థిక వ్యవస్థకు ఉంది.. ♦ ఆర్బీఐ ఫైనాన్షియల్ స్టెబిలిటీ నివేదిక ♦ ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు, ఎన్పీఏలపై భయం అక్కర్లేదని భరోసా ముంబై: వర్థమాన దేశాల్లో భారత్ ఆర్థిక వ్యవస్థ చక్కటి పనితీరు ప్రదర్శిస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఫైనాన్షియల్ స్టెబిలిటీ నివేదిక (ఎఫ్ఎస్ఆర్) పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు, బ్యాంకింగ్ రంగ సమస్యలు ఉన్నప్పటికీ భారత్ ఆర్థిక వ్యవస్థకు వీటిని తట్టుకుని నిలబడే సత్తా ఉందనీ వివరించింది. ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మంగళవారం నివేదికను విడుదల చేశారు. నివేదికలో రాజన్ తొలి వాక్యం రాస్తూ... రుణ వృద్ధి వేగానికి తొలుత బ్యాంకింగ్ మొండిబకాయిల సమస్య పరిష్కారం అవసరమని పేర్కొన్నారు. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు... ⇔ వర్థమాన దేశాల్లో భారత్ వృద్ధి తీరు బాగుంది. భారత్ ఫైనాన్షియల్ వ్యవస్థ స్థిరంగా కొనసాగుతోంది. ⇔ కమోడిటీ ముఖ్యంగా చమురు ధరలు తక్కువగా ఉండటం సానుకూల అంశం. ఇందుకు సంబంధించి జీ-20 దేశాల్లో అత్యధిక వాణిజ్య ప్రయోజనాలను పొందిన దేశం భారత్ అని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనావేసింది. ⇔ ఆర్థిక వ్యవస్థ పటిష్ట వృద్ధికి భారీగా పెట్టుబడులు పెరగడం, వినియోగ వృద్ధి అవసరం. ⇔ తగిన స్థాయిలో విదేశీ మారకద్రవ్య నిల్వలు (363.83 బిలియన్ డాలర్లు), తక్కువ స్థాయి వాణిజ్యలోటు అంతర్జాతీయంగా భారత్‌కు లాభదాయక అంశాలు. ⇔ రెవెన్యూ లోటును తగ్గించుకోడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సబ్సిడీలు దుర్వినియోగం కాకుండా ఈ విభాగంలో హేతుబద్ధీకరణకూ కృషి కొనసాగుతోంది. అయితే పన్ను ఆదాయాలు మరింత పెరగాలి. ఇందుకు ట్యాక్స్ బేస్ మరింత విస్తృతం కావాల్సి ఉంది. ⇔ 2016 మార్చిలో 7.6 శాతంగా ఉన్న ఎన్పీఏలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 8.5% నుంచి 9.3 శాతం శ్రేణిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. 2015లో ఎన్పీఏలు 5.1 శాతం. ⇔ 2015-16 మధ్య కార్పొరేట్ల ఇబ్బందులు కాస్త తగ్గుముఖం పట్టాయి. రుణ ఒత్తిడిలో ఉన్న కంపెనీల రేటు మార్చి 2015లో 19 శాతంకాగా 2016 మార్చిలో ఈ రేటు 14 శాతానికి తగ్గింది. ⇔ జూన్ 7న రేటు నిర్ణయానికి మెజారిటీనే ప్రాతిపదిక! జూన్ 7వ తేదీన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు- రెపోను యథాతథంగా 6.50 వద్దే ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) ఏకాభిప్రాయం ప్రాతిపదికన తీసుకున్నారు. మంగళవారంనాడు ఇందుకు సంబంధించి మినిట్స్ అంశాలు వెల్లడయ్యాయి. ఐదుగురు సభ్యుల కమిటీలో ముగ్గురు రేటు కోతకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు, ముందు ద్రవ్యోల్బణం 5% స్థాయికి రావాలని, అటు తర్వాతే రేటు కోత సమంజసమని పేర్కొన్నారు. అప్పటికి మరో వారం రోజుల్లో వెలువడనున్న అమెరికా ఫెడ్ ఫండ్ రేటు నిర్ణయానికి వేచి చూడాలనీ వారు సూచించారు. కాగా మరో ఇరువురు సభ్యులు మాత్రం పాలసీ రేటును పావుశాతం తగ్గించాలని సూచించారు. మే 24-30 తేదీల మధ్య ఆన్లైన్ ద్వారా టీఏసీ సభ్యులు తమ అభిప్రాయాలను తెలిపారు. ప్రస్తుత విధానం ప్రకారం... వీరి అభిప్రాయాలతో పనిలేకుండా ఆర్బీఐ గవర్నర్ రెపో రేటు నిర్ణయం తీసుకునే వీలుంది. ఎన్పీఏల సమస్య పరిష్కారం కీలకం: రాజన్ మొండిబకాయిల పరిష్కారం తక్షణం కీలకాంశమని నివేదిక తొలి వాక్యంలో రాజన్ పేర్కొన్నారు. పటిష్ట దేశీయ విధానాలు, సంస్కరణలు ఇందుకు అవసరమని అన్నారు. కార్పొరేట్ రంగంలో ఉన్న ఒత్తిడికి బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిలు ప్రతిబింబమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో వ్యాపార నిర్వహణకు ఉన్న పలు అడ్డంకుల పరిష్కారం దిశలో సంస్కరణలు మొండిబకాయిల సమస్య పరిష్కారానికీ దోహదపడతాయని వివరించారు. అంతర్జాతీయంగా ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకుని నిలబడే పరిస్థితి ఉన్నా... దేశీయంగా వ్యవస్థీకృత సంస్కరణల అమలూ వృద్ధి పటిష్టతకు కీలకమని వివరించారు. అలాగే ఆర్బీఐ విధాన రుణ రేటు ప్రయోజనం బ్యాంకింగ్ కస్టమర్లకు బదలాయించే వెసులుబాటు కల్పించేలా చర్యలు అవసరమన్నారు. -
భారత్ ఆర్థిక వ్యవస్థపై బ్రెగ్జిట్ ఎఫెక్ట్!: మోర్గాన్ స్టాన్లీ
ముంబై: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వేరుపడిన (బ్రెగ్జిట్) ప్రభావం భారత్ ఆర్థిక వ్యవస్థపై తప్పనిసరిగా ఉంటుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం- మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. ఈ పరిణామం వల్ల రానున్న రెండేళ్లలో స్థూల దేశీయోత్పత్తి 60 బేసిస్ పాయింట్ల వరకూ తగ్గే అవకాశం ఉంటుందని తన తాజా నివేదికలో పేర్కొంది. వాణిజ్య, ఫైనాన్షియల్ మార్గాల్లో ఈ ప్రతికూలత ఉంటుందనీ వివరించింది. అయితే ఇతర వర్థమాన దేశాలతో పోల్చితే భారత్‌పై ఈ ప్రభావం తక్కువగా ఉంటుందని కూడా నివేదిక అభిప్రాయపడింది. కనీస స్థాయిలో జీడీపీపై ఈ ప్రభావం 10 నుంచి 20 బేసిస్ పాయింట్లు ఉంటుందన్నది తమ అంచనాఅనీ, గరిష్ట స్థాయిలో 30 నుంచి 60 బేసిస్ పాయింట్లు తగ్గుతుందని భావిసున్నామనీ వివరించింది (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం). దేశ ఆర్థిక వ్యవస్థ విస్తృత స్థాయిలో రికవరీ దిశగా అడుగులు వేస్తున్నట్లు కూడా నివేదిక పేర్కొంది. -
5 లక్షల కోట్ల డాలర్లకు ఎకానమీ
♦ కొద్ది సంవత్సరాల్లోనే ఆ స్థాయికి చేరతాం ♦ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వచ్చే ఏడాది నుంచీ జీఎస్టీ ♦ అమలవుతుందని స్పష్టీకరణ ఒసాకా: భారత్ ఆర్థిక వ్యవస్థ వేగంగా పురోగమిస్తోందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. ప్రస్తుతం 2 ట్రిలియన్ డాలర్లు (రెండు లక్షల కోట్ల డాలర్లు)గా ఉన్న ఆర్థిక వ్యవస్థ కొద్ది సంవత్సరాల్లోనే 5 ట్రిలియన్ డాలర్లకు (ఐదు లక్షల కోట్ల డాలర్లు) పరుగు పెడుతుందని అన్నారు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వచ్చే ఏడాది నుంచీ అమలవుతుందన్న ధీమాను సైతం ఆయన వ్యక్తం చేశారు. భారత్‌కు పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా జపాన్‌లో జైట్లీ జరుపుతున్న ఆరు రోజుల పర్యటన గురువారం ఐదవరోజుకు చేరింది. ఒసాకాలో సీఐఐ, డీఐఐపీ నిర్వహించిన ఇండియా ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ సెమినార్‌ను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలను చూస్తే... ♦ సంస్కరణల అమలుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. భారత్ ఆర్థిక వ్యవస్థ భారీగా వృద్ధి చెందడానికి ఈ చర్యలు దోహదపడతాయి. ♦ ప్రపంచ వ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నా... వృద్ధిలో భారత్ పురోగమిస్తోంది. వినియోగ వ్యయం, పట్టణ ప్రాంత డిమాండ్ పటిష్టంగా ఉన్నాయి. గ్రామీణ డిమాండ్ సైతం పటిష్టపడుతోంది. వాతావరణ శాఖ అంచనాలకు అనుగుణంగా తగిన వర్షపాతం గ్రామీణాభివృద్దికి మరింతగా దోహదపడుతుంది. ♦ వ్యాపార నిర్వహణకు సంబంధించి ప్రపంచబ్యాంక్ ఇండెక్స్‌లో భారత్ ర్యాంక్ గతంకన్నా ఇప్పుడు మరింత మెరగుపడింది. ప్రస్తుతం 189 దేశాల్లో 136వ స్థానంలో ఉన్న ర్యాంంక్ రానున్న కాలంలో మరింత మెరుగుపడ్డానికి తగిన చర్యలు అన్నింటినీ భారత్ తీసుకుంటోంది. ♦ భారత్ మౌలిక రంగంలో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయి. ♦ గతం నుంచీ వర్తించే పన్ను నిబంధనలకు సంబంధించి రెట్రాస్పెక్టివ్ పన్ను అమలును పక్కనబెట్టడంసహా, ఇన్వెస్టర్లకు తగిన పన్ను సంస్కరణలను ప్రభుత్వం చేపట్టింది. ♦ నక్సలైట్ల తీవ్రవాదం వంటి సమస్యలు సైతం గతంలో ఉన్న తీవ్రంగా లేవు. ఆయా ఘటనలు ఇప్పుడు తగ్గాయి. -
స్వర్ణ యుగంలో దేశ ఆర్థిక వ్యవస్థ: సీఈఏ
చెన్నై: భారత్ ఆర్థిక వ్యవస్థ స్వర్ణ యుగంలో పయనిస్తోందని ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ అభివర్ణించారు. ప్రతికూల, నిరాశాధోరణి వార్తలకు దూరంగా ఉండాలని ఆయన విద్యార్థులకు సూచించారు. శ్రీ సిటీ ప్రత్యేక ఆర్థిక జోన్‌లోని ఇన్స్టిట్యూట్ ఫర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ రిసెర్చ్ (ఐఎఫ్ఎంఆర్)లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ... పలు సవాళ్లతో కూడిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ మంచి పనితీరును ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. రానున్న మూడు సంవత్సరాల్లో భారత్ 8 నుంచి 10 శాతం శ్రేణిలో వృద్ధిని సాధించగలదన్నది తమ అభిప్రాయమని తెలిపారు. ఉన్నత లక్ష్యం ఉంటే... దీని సాధనలో ఎదురయ్యే తాత్కాలిక వైఫల్యాలను సులభతరంగా ఎదుర్కొనవచ్చని అన్నారు. -
భారత్ ఆర్థిక వ్యవస్థ చైనా జీడీపీని అధిగమించలేదు
చైనా అధికార పత్రిక విశ్లేషణ బీజింగ్: భారత్ ఆర్థిక వ్యవస్థ చైనా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)ని ఎంతమాత్రం అధిగమించలేదని ఆ దేశ అధికార ఆంగ్ల వార్తా దినపత్రిక గ్లోబల్ టైమ్స్ విశ్లేషించింది. ఒక ఆర్థిక శక్తిగా ఎదిగే అవకాశం ఉన్నా... చైనా జీడీపీని మాత్రం అధిగమించలేదని ఒక ఆర్టికల్‌లో పేర్కొంది. అంచనాలు అవాస్తవ చిత్రాన్ని కళ్లముందు ఉంచుతున్నట్లు అభిప్రాయపడింది. అసలు చైనా జీడీపీకి ఎంతో దూరంలో భారత్ జీడీపీ ఉన్న విషయాన్ని పేర్కొంది. 2015లో చైనా జీడీపీ 10.42 ట్రిలియన్ డాలర్లు కాగా, భారత్‌కు సంబంధించి ఈ విలువ కేవలం 2.18 ట్రిలియన్ డాలర్లు ఉన్న విషయాన్ని ఆర్టికల్ ఉటంకించింది. భవిష్యత్తులో చైనా ఆర్థిక వ్యవస్థ వృద్ధి కొంత మందగిస్తే... మందగించవచ్చుకానీ, జీరో, క్షీణ స్థాయిలకు పడిపోయే అవకాశాలు ఎంతమాత్రం లేవని స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో భారత్ జీడీపీ చైనా జీడీపీని ఎలా అధిగమిస్తుందని ప్రశ్నించింది. ఐఎంఎఫ్, మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్‌మన్ శాక్స్ వంటి అంతర్జాతీయ సంస్థలు భారత్ వృద్ధి అవకాశాలను గోరంతలు కొండంతలు చేసి చూపెడుతున్నా... అంతర్జాతీయ ఆర్థిక చిత్రపటంలో భారత్ కీలకపాత్ర ఇప్పటికీ పోషించడం లేదని అభిప్రాయపడింది. అంతర్గతంగా భారత్ ఇంకా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోందని పేర్కొన్న పత్రిక, ఈ సందర్భంగా విద్యుత్, పట్టణ నీటి సరఫరా, రవాణా, ఇతర మౌలిక రంగ సమస్యలను ప్రస్తావించింది. భారత్ సగటు జీవిత కాలం, విద్య, విద్యుత్ వినియోగం, పేదరికం వంటి సామాజిక అంశాలు ఇప్పటికీ... చైనా 20వ శతాబ్దపు స్థాయిలోనే ఉన్నాయని పేర్కొంది. -
ఇండియా రికవరీనే కీలకం..
⇒ అమెరికా ఫెడ్, చైనా కాదు.. ఎఫ్ఐఐలు మళ్లీ వస్తారు ♦ 2008 పరిస్థితులు పునరావృతం కావు ♦ రూపాయి క్షీణతకే ఆర్బీఐ మొగ్గు ♦ ఆరు నెలలవరకూ ఫెడ్ రేట్లు పెంచకపోవచ్చు.. ♦ ఆటో, ప్రైవేటు బ్యాంకింగ్, ఆయిల్ షేర్లు సానుకూలం డీఎస్పీ బ్లాక్‌రాక్ ఏఎంసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హరీష్ జవేరీ అది జరిగితే మన మార్కెట్లోకి ఇండియా ఆర్థిక వ్యవస్థ కోలుకుంటే అమెరికా, చైనా ప్రభావాలు మన మార్కెట్‌పై ఉండవని, వెనక్కి వెళ్లిన ఎఫ్ఐఐలు వెతుక్కుంటూ వెనక్కి వస్తారంటున్నారు డీఎస్పీ బ్లాక్‌రాక్ ఏఎంసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఫండ్ మేనేజర్ హరీష్ జవేరీ. అంతర్జాతీయ పరిణామాల కంటే దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడమే స్టాక్ మార్కెట్లకు ముఖ్యమంటున్న జవేరీతో ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రత్యేక ఇంటర్వ్యూ.. సాక్షి, బిజినెస్ బ్యూరో ♦ప్రస్తుతం అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లో నెలకొన్న ఒడిదుడుకులను చాలామంది 2008 ఆర్థిక సంక్షోభంతో పోలుస్తున్నారు. అటువంటి పరిస్థితులున్నాయా? 2008లో స్టాక్ మార్కెట్లు లిక్విడిటీ కొరత వల్ల పతనమయ్యాయి. కానీ ఇప్పుడు లిక్విడిటీ కొరత లేదు. కానీ 2008 తర్వాత అమెరికా వంటి దేశాలు లిక్విడిటీ పెంచడానికి వ్యవస్థలోకి అదనపు నిధులను విడుదల చేశాయి. ఇక ఇప్పుడు అటువంటి చౌక మనీ లభించే రోజులు పోయాయి. ప్రస్తుతం మన దేశ ఆర్థిక వ్యవస్థ 2012 నాటికి పూర్తి భిన్నంగా ఉందని చెప్పొచ్చు. 2012లో అధిక ద్రవ్యలోటుతో ఇబ్బందులు ఎదుర్కొంటే, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడంతో ప్రస్తుతం ద్రవ్యలోటును కట్టడిలోకి వచ్చింది. కాబట్టి 2008 పరిస్థితులు పునరావృతం అయ్యే అవకాశాలు లేవు. ♦గత రెండేళ్లుగా లార్జ్‌క్యాప్ కంటే మిడ్‌క్యాప్ ఇండెక్స్ మంచి పనితీరు కనపరుస్తోంది? ఈ ఏడాదీ ఇదే విధమైన ట్రెండ్ కొనసాగే అవకాశముందా? ఈ ఏడాది షేర్ల కదలికలు గత రెండేళ్లకు భిన్నంగా ఉండే అవకాశముంది. ఇప్పటి వరకు పెరిగిన మిడ్‌క్యాప్ షేర్లు మరింత పెరుగుతాయని చెప్పలేం. ఇక నుంచి ఫండమెంటల్‌గా పటిష్టంగా ఉన్న కంపెనీలు మాత్రమే పెరుగుతాయి. ఇక లార్జ్‌క్యాప్‌లో కూడా ఆటో, ప్రైవేటు బ్యాంకులు, ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీల షేర్లు పెరిగే అవకాశాలున్నాయి. మొత్తం మీద స్మాల్ అండ్ మిడ్ క్యాప్ షేర్ల కంటే లార్జ్ క్యాప్ షేర్లకే ఎక్కువ మొగ్గు చూపుతాను. ♦ఎఫ్ఐఐలు వైదొలుగుతున్నా.. దేశీయ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున స్టాక్ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారు. ఈ ఏడాది కూడా దేశీయ నిధుల ప్రవాహం ఇదే విధంగా ఉండే అవకాశం ఉందా? స్టాక్ మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గతేడాది దేశీయ మ్యూచువల్ ఫండ్స్ లక్ష కోట్ల నికర కొనుగోళ్లు జరిపాయి. ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే సంఖ్యతో పాటు, సగటు సిప్ మొత్తం కూడా భారీగా పెరిగాయి. వచ్చే రెండు నెలలు మ్యూచువల్ ఫండ్స్ డివిడెండ్లు ప్రకటిస్తాయి కాబట్టి నిధుల ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది కూడా దేశీయ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు ఇదే విధంగా కొనసాగుతాయి. కానీ ఇదే సమయంలో ఎఫ్ఐఐలు అమ్మకాలు చేస్తున్నాయి. చైనా, దక్షిణాసియా కరెన్సీ విలువ, వర్థమాన దేశాల వృద్ధి వంటి అంశాలపై ఎఫ్ఐఐల నిధుల ప్రవాహం కొనసాగే అవకాశం ఉంది. మిగిలిన దేశాలతో పోలిస్తే మన ఫండమెంటల్స్ బాగున్నా.. వారి ఆలోచనలు ఏ విధంగా ఉండొచ్చన్న సంగతి ఇప్పుడే చెప్పలేం. ♦ ఏయే రంగాలపై బుల్లిష్‌గా ఉన్నారు? వేటికి దూరంగా ఉంటున్నారు? ఆటో (మారుతీ, టాటా మోటార్స్, అశోక్ లేలాండ్) ఆటో యాన్సిలరీ, ప్రైవేట్ బ్యాంకులు (ఇండస్ ఇండ్, హెచ్డీఎఫ్సీ, కోటక్)లపై బుల్లిష్‌గా ఉన్నాం. రాస్ గ్యాస్ ఒప్పందం, గ్యాస్ రంగంలో సంస్కరణల నేపథ్యంలో ఆయిల్-గ్యాస్ షేర్లలో పెట్టుబడులు కొనసాగించొచ్చు. అలాగే గ్యాస్, బొగ్గు సరఫరా మెరుగవ్వడం, ఉదయ్ స్కీం కింద అప్పులు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవడం వంటి నిర్ణయాల కారణంగా దీర్ఘకాలానికి విద్యుత్ కంపెనీలకేసి చూడొచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో కన్జూమర్ బేస్డ్ కంపెనీలు (హెచ్‌యూఎల్, ఐటీసీ, నెస్లే), యూఎస్ఎఫ్డీఏ నిర్ణయాల వల్ల ఫార్మా, ఐటీ రంగాలకు దూరంగా ఉంటున్నాం. ఎన్పీఏ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకుంటాయన్న దానిపై పీఎస్‌యూ బ్యాంకుల కదలికలు ఆధారపడి ఉంటాయి. ♦అమెరికా వడ్డీరేట్లు మరింత పెంచే అవకాశం ఉందా? పెంచితే మనపై ప్రభావమేంటి? ఇప్పటికే అమెరికా వడ్డీరేట్లను ఒకసారి పెంచింది. దానీ ప్రభావం మనపై అంతగా లేదనే చెప్పొచ్చు. ప్రస్తుతం వచ్చే ఆరు నెలల వరకు ఫెడరల్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచకపోవచ్చు. ♦చమురు ధరలు తగ్గడం అంతర్జాతీయంగా వృద్ధిలేదనడానికి సంకేతం కదా? ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూరుస్తుందా? అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధిరేటు సరిగా లేనందునే చమురు ధరలు తగ్గుతున్నాయనడంలో సందేహం లేదు. కానీ ఈ ధరలు తగ్గడం ఇప్పటి వరకు బాగా లబ్ధిపొందిన దేశాల్లో ఇండియా ఒకటి. ప్రపంచ వాణిజ్యంలో మన వాటా చాలా తక్కువ కాబట్టి సంస్కరణలు అమలు చేస్తూ ముందుకెళ్తున్నంత కాలం మనపై అంతగా ప్రతికూల ప్రభావం ఉండదు. చమురు ధరలు తగ్గడం వల్ల మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే రెమిటెన్స్‌లు తగ్గొచ్చు. కానీ ఇదే సమయంలో రూపాయి పతనం వల్ల మిగిలిన దేశాల నుంచి వచ్చే రెమిటెన్స్‌లు ఆ లోటును భర్తీ చేస్తాయనుకుంటన్నాం. ♦ చైనా కరెన్సీ విలువ తగ్గించడం వల్ల మన ఆర్థిక వ్యవస్థతో పాటు, స్టాక్ మార్కెట్లపై ఏ విధంగా ప్రభావం ఉంటుంది? చైనా కరెన్సీ యువాన్ విలువ తగ్గించడం వల్ల ఎగుమతుల్లో పోటీ తట్టుకోవడానికి ఇతర దేశాలు కూడా కరెన్సీ విలువను తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లేకపోతే చైనా ఎగుమతులతో ఈ దేశాలు పోటీ పడలేవు. ప్రస్తుతం ఇతర దేశాల కరెన్సీతో పోలిస్తే మన రూపాయి విలువ పటిష్టంగా కనిపిస్తున్నా.. రానున్న కాలంలో రూపాయి విలువ బలహీనపడటానికే ఆర్బీఐ మొగ్గు చూపొచ్చు. వచ్చే సెప్టెంబర్ నాటికి డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 70 పడిపోవచ్చని అంచనా వేస్తున్నాం. ♦ రానున్న కాలంలో దేశీయ మార్కెట్ కదలికలను ఏ అంశాలు నిర్దేశిస్తాయని అనుకుటున్నారు? దేశీయ సూచీల కదలికలు ప్రధానంగా రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి అంతర్జాతీయంగా ఎఫ్ఐఐల రూపంలో వచ్చే నిధుల ప్రవాహం, దేశ ఆర్థిక వృద్ధిరేటు కోలుకోవడానికి ఎంత దూరంలో ఉన్నా అంశాలు కీలకమైనవి. ప్రస్తుతం దేశీయంగా కొత్త పెట్టుబడులు, ఎగుమతుల పరిస్థితి అంత ఆశావహంగా లేదు. కానీ దేశీయ వినిమయ శక్తి బాగుండటంతో ఇతర దేశాల మార్కెట్ల కంటే మనం కొద్దిగా బాగుండటానికి కారణం. ఒకసారి మన ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాట పట్టిందంటే చైనా, అమెరికా ప్రభావాలు మన మార్కెట్లపై పెద్దగా ఉండవు. వెనక్కి వెళ్లిన ఎఫ్ఐఐలు కూడా తిరిగి వస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే అంతర్జాతీయ పరిణామాల కంటే మన ఆర్థిక వ్యవస్థ ఎంత తొందరగా కోలుకుంటుందన్న దానిపైనే మార్కెట్ కదలికలు ఆధారపడి ఉంటాయని చెప్పొచ్చు. ♦ మూడో త్రైమాసిక ఫలితాలు ఎలా ఉంటాయని భావిస్తున్నారు? సెన్సెక్స్‌లోని 30 కంపెనీలు సగటున 1% వృద్ధిని నమోదు చేయొచ్చు. ఇందులోంచి మెటల్ కంపెనీలను తీసేస్తే మిగిలిన సెన్సెక్స్ కంపెనీల్లో 8-10% వృద్ధి కనపడుతుంది. కమోడిటీ ధరలు బాగా తగ్గడం వల్ల మెటల్ కంపెనీల ఆదాయాల్లో క్షీణత కనిపిస్తోంది. ఇదే సమయంలో ఇతర కంపెనీలకు నిర్వహణ వ్యయాలు తగ్గడంతో ఆదాయం పెరక్కపోయినా లాభాలు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ. చెన్నై వరదల వల్ల మూడో త్రైమాసికం ఫలితాలు అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు. నాల్గవ త్రైమాసిక ఫలితాల తర్వాత కానీ ఒక స్పష్టతకు అవకాశం లేదు. ♦ ఆర్బీఐ వడ్డీరేట్లను మరింత తగ్గించే అవకాశం ఉందా? వచ్చే మూడు నుంచి ఆరు నెలలు వడ్డీరేట్లలో ఆర్బీఐ ఎటువంటి మార్పులు చేయదని భావిస్తున్నాం. వడ్డీరేట్లు పెరిగే అవకాశం లేదు కానీ.. మరింత తగ్గుతాయా లేదా అన్నదానిపై మరో ఆరు నెలలు ఆగితే కాని స్పష్టత రాదు. -
వచ్చే పదేళ్లూ టాప్ స్పీడ్..
► భారత్ ఆర్థిక వ్యవస్థపై హార్వర్డ్ వర్సిటీ విశ్లేషణ ► వార్షిక వృద్ధి రేటు 7%గా అంచనా న్యూయార్క్: భారత్ వచ్చే పదేళ్లూ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా కొనసాగుతుందని హార్వర్డ్ యూనివర్సిటీ ఆర్థిక విశ్లేషకులు అంచనా వేశారు. వార్షిక వృద్ధి రేటు సగటున 7 శాతంగా ఉంటుందన్నది వీరి అంచనా. యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (సీఐడీ)లో వీరు సమర్పించిన ఆర్థిక పరిశోధనా నివేదిక ప్రకారం... చైనా వృద్ధి తగ్గుతోంది. భారత్ మాత్రం దాన్ని పక్కకునెట్టి, వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం హోదాను కొనసాగించనుంది. 2024 నాటికి చైనా వార్షిక వృద్ధి రేటు 4.3 శాతానికి పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. దక్షిణ ఆసియా, తూర్పు ఆఫ్రికా దేశాలు వేగవంతమైన వృద్ధిని సాధించే అవకాశం ఉంది. అయితే చమురు, ఇతర కమోడిటీ ఆధారిత దేశాలు మాత్రం వృద్ధి మందగమనం సమస్యలను ఎదుర్కొంటాయి. భారత్‌కు విభిన్న రంగాల ఉత్పత్తుల్ని ఎగుమతి చేసే సామర్థ్యం పెరగనుంది. ఫార్మా, వాహనాలు, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలు వీటిలో కీలకం. చైనా ఇప్పటికే ఈ తరహా ప్రయోజనాన్ని పొందింది. కేవలం పదేళ్లలోనే తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేసుకోగలిగింది. 2024 నాటికి అమెరికా సగటు వార్షిక వృద్ధి రేటు 2.8%గా ఉంటుంది. బ్రిటన్ విషయంలో ఇది 3.2%. స్పెయిన్ 3.4%, ఇటలీ 1.8%, జర్మనీ 0.35% వృద్ధిని నమోదుచేసుకునే వీలుంది. -
వడ్డీ రేట్లు మరింత తగ్గుతాయ్
ఇన్ఫ్రాలో మరిన్ని పెట్టుబడులు డిజిన్వెస్ట్మెంట్కు పీఎస్‌యూల లిస్టు సిద్ధం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ అధిక వృద్ధి సాధించాలంటే వడ్డీ రేట్లు తక్కువ స్థాయిలో ఉండాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో కీలక వడ్డీ రేట్లు మరింత తగ్గగలవన్నారు. అయితే, తగ్గుదల ఎంత మేర ఉంటుందనే దానిపై నిర్ణయాధికారం రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ)దేనని బుధవారం ఇన్వెస్టర్లతో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. వచ్చే నెల 7న ఆర్బీఐ వార్షిక పరపతి విధాన సమీక్ష జరగనున్న నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, కరెన్సీ మారక విలువల నియంత్రణను ఆర్బీఐ సమర్థంగా నిర్వహిస్తోందని, దీని గురించి ప్రభుత్వం ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని ఆరుణ్ జైట్లీ చెప్పారు. జీఎస్టీకి త్వరలో మోక్షం.. మౌలిక రంగంలో ప్రభుత్వ పెట్టుబడులను మరింతగా పెంచనున్నట్లు తెలిపారు. వివిధ కారణాలతో 77 హైవే ప్రాజెక్టులు నిల్చిపోగా.. సమస్యలను పరిష్కరించడంతో 24 ప్రాజెక్టులు మళ్లీ పట్టాలపైకి ఎక్కాయని ఆయన చెప్పారు. తయారీ రంగానికి ఊతమిచ్చే దిశగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు చెప్పారు. విదేశీ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులను ఆకర్షించేలా అడ్డంకులను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీంతో రక్షణ రంగంలోనూ కార్యకలాపాలు జోరందుకుంటున్నాయని చెప్పారు. అలాగే వస్తు, సేవల పన్నుల విధానాన్ని (జీఎస్టీ) త్వరలో అమల్లోకి తేగలమని ఆయన తెలిపారు. ఇక, భూసేకరణ చట్టం గ్రామీణ ప్రాంతాలకు ప్రయోజనమే చేకూరుతుందని మంత్రి తెలిపారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో వాటాలను వ్యూహాత్మకంగా విక్రయించనున్న ప్రభుత్వ సంస్థల (పీఎస్‌యూ) జాబితాను కేంద్రం సిద్ధం చేసిందని జైట్లీ తెలిపారు. ప్రస్తుత 2014-15 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయ లక్ష్యాన్ని పూర్తిగా చేరుకోలేకపోయినప్పటికీ... గణాంకాల పరంగా భారీ స్థాయిలోనే డిజిన్వెస్ట్‌మెంట్ జరిగినట్లేనని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరింత భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు. డిజిన్వెస్ట్‌మెంట్ జాబితాలో ఓఎన్జీసీ, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్(బీహెచ్ఈఎల్), తదితర సంస్థలు ఉన్నాయి. -
భారత్ వెలిగిపోతోంది..!
ఆసియా-పసిఫిక్ దేశాల్లోకెల్లా అత్యుత్తమ ఆర్థిక ప్రగతి... ⇒ రేటింగ్ దిగ్గజం ఎస్అండ్పీ వెల్లడి... ⇒ 2015-16 జీడీపీ వృద్ధి అంచనాలు భారీగా పెంపు ⇒ 7.9 శాతానికి ఎగబాకే అవకాశం... ⇒ బడ్జెట్ ముందు మోదీ సర్కారుకు బూస్ట్ ముంబై: మరో రెండు రోజుల్లో తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న మోదీ సర్కారుకు ఊహించని బూస్ట్ లభించింది. ఆసియా-పసిఫిక్ దేశాన్నింటిలో భారత్ ఆర్థిక వ్యవస్థ వెలుగు రేఖలా కనిపిస్తోందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్(ఎస్అండ్పీ) గురువారం పేర్కొంది. అంతేకాదు రానున్న ఆర్థిక సంవత్సరం(2015-16)లో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) అంచనాలను భారీగా పెంచింది. 7.9 శాతం వృద్ధి సాధించవచ్చని తాజాగా లెక్కగట్టింది. అంతక్రితం ఈ అంచనా 6.2 శాతం మాత్రమే కావడం గమనార్హం. 2016-17లో వృద్ధి అంచనాను కూడా ఏకంగా 6.6 శాతం నుంచి 8.2 శాతానికి పెంచింది. జీడీపీ గణాంకాలకు బేస్ రేటును కేంద్రం ప్రభుత్వం ఇటీవలే 2004-05 నుంచి 2011-12కు మార్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం 2013-14 వృద్ధి రేటును 5 శాతం నుంచి 6.9 శాతానికి సవరించారు. ఈ ఏడాది(2014-15) వృద్ధి రేటు అంచనాలను 7.4 శాతానికి(గతంలో 6%) పెంచారు కూడా. అయితే, తాజా వృద్ధి అంచనాల పెంపులో ఈ కొత్త బేస్ రేటును పరిగణనలోకి తీసుకున్నారా లేదా అనేది ఎస్అండ్పీ విడుదల చేసిన నోట్లో స్పష్టం చేయలేదు. క్రూడ్ వరం... అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు నేలకు దిగిరావడం... దేశీయంగా పెట్టుబడులు పెరుగుతుండటం భారత్ ఆర్థిక వ్యవస్థ పుంజుకునే అవకాశాలను పెంచుతున్నాయని ఎస్అండ్పీ అభిప్రాయపడింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో వృద్ధి రేటు కాస్త తగ్గనున్నప్పటికీ.. భారత్ ఎకానమీ మాత్రం వెలుగులు విరజిమ్ముతోందని తెలిపింది. అయితే, చైనా, జపాన్లలో మందగమనం కారణంగా మొత్తం సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతోందని రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది. గతేడాది జూన్‌లో 100 డాలర్లకు పైగా ఉన్న క్రూడ్ బ్యారెల్ ధర.. ప్రస్తుతం 50 డాలర్ల స్థాయిలో కదలాడుతున్న విషయం విదితమే. దీనివల్ల అత్యధికంగా క్రూడ్ దిగుమతులపై ఆధారపడిన భారత్‌కు దిగుమతుల బిల్లు భారీగా తగ్గడంతోపాటు కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) మరింత అదుపులో ఉండేందుకు దోహదం చేస్తోంది. మరోపక్క, ప్రభుత్వానికి ఇంధన సబ్సిడీల భారం కూడా భారీగా తగ్గేందుకు వీలుకల్పిస్తోంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రేపు(శనివారం) ప్రవేశపెట్టనున్న తొలి పూర్తిస్థాయి బడ్జెట్లో వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి లక్ష్యం... అదేవిధంగా ద్రవ్యలోటు కట్టడి(గతేడాది జీడీపీలో 4.1 శాతంగా నిర్ధేశించారు)కి తీసుకోబోయే చర్యలను కూడా వెల్లడించనున్నారు. ఈ నేపథ్యంలో ఎస్అండ్పీ తాజా అంచనాలు చర్చనీయాంశంగా మారాయి. మూడు రోజుల్లోనే ఎంత మార్పు... భారత్‌లో అధిక ద్రవ్యలోటు, తక్కువ తలసరి ఆదాయాలపై తీవ్ర ఆందోళనలను వ్యక్తం చేయడంతోపాటు ఇలాగైతే రేటింగ్ పెంపు కష్టమేనంటూ చెప్పిన కొద్ది రోజులు కూడా కాకుండానే ఎస్అండ్పీ వృద్ధి రేటు అంచనాలను అనూహ్యంగా పెంచేయడం విశేషం. గతేడాది మోదీ నేతృత్వంలో ఏర్పాటైన సుస్థిర ప్రభుత్వం సంస్కరణలకు సానుకూల పరిస్థితులను సృష్టించాయని, అయినప్పటికీ.. పాలనా సామర్థ్యం ఒక్కటే పరపతి రేటింగ్ పెంపునకు సరిపోదని కూడా ఈ నెల 23న ఒక నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం భారత్‌కు బీబీబీ మైనస్(స్థిరమైన అవుట్‌లుక్‌తో) సార్వభౌమ పరపతి రేటింగ్‌ను ఎస్అండ్పీ కొనసాగిస్తోంది. ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్‌లో ఇదే అత్యంత తక్కువ స్థాయి రేటింగ్. దీనికంటే తగ్గితే జంక్(పెట్టుబడులకు పూర్తిగా ప్రతికూలం) గ్రేడ్‌కు దిగజారినట్లే. మరో అగ్రగామి రేటింగ్ ఏజెన్సీ మూడీస్ కూడా ద్రవ్యలోటు కట్టడి, సంస్కరణల పురోగతిపైనే భవిష్యత్తులో రేటింగ్ మెరుగుదల అవకాశాలు ఆధారపడి ఉంటాయని తాజాగా స్పష్టం చేయడం తెలిసిందే. -
2015లో 5-6 శాతం వృద్ధి
మూడీస్ అంచనా న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ 2015లో 5 నుంచి 6 శాతం శ్రేణిలో వృద్ధిని నమోదుచేసే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ పేర్కొంది. దేశీయంగా పటిష్ట డిమాండ్ బేస్, ఎగుమతులు పెరగడానికి ప్రణాళికలు వంటి అంశాలు దీనికి దోహదపడతాయని వివరించింది. ఆయా అంశాలు చైనా, యూరోజోన్, జపాన్ నుంచి ఆర్థికంగా వచ్చే ప్రతికూల ప్రభావాల నుంచి భారత్ తట్టుకునేలా చేస్తామని పేర్కొంది. 2014లో వృద్ధి రేటు దాదాపు 5 శాతం వరకూ ఉంటుందని విశ్లేషించింది. పొదుపు, పెట్టుబడుల రేటు గణనీయంగా ఉండటం భారత్‌కు కలసి వచ్చే అంశంగా వివరించింది. ‘2015 అవుట్‌లుక్-అంతర్జాతీయ స్థాయి రుణ పరిస్థితులు’ శీర్షికన మూడీస్ ఒక నివేదికను విడుదల చేసింది. ముఖ్యాంశాలు... ⇒ భారత్‌లో ఉపాధి, వినియోగం పెరగనుంది. ⇒అంతర్జాతీయంగా తగ్గిన కమోడిటీ ధరలు దేశంలో ద్రవ్యోల్బణం దిగిరావడానికి దోహదపడతాయి. ⇒ఆర్థిక వ్యవస్థలో రికవరీ ఉన్నా.. బ్యాంకింగ్ వ్యవస్థకు మాత్రం మొండిబకాయిల (ఎన్పీఏ) భారం కొనసాగే అవకాశం ఉంది. ఇది ఒక ప్రతికూలాంశం. కార్పొరేట్ రంగం మందగమనం ఎన్పీఏలకు ఒక కారణం. దీనివల్ల బ్యాంకింగ్‌లో ప్రొవిజనింగ్, పటిష్ట మూలధనం నిర్వహణ, ఇందుకు ప్రభుత్వం నుంచి నిధుల కేటాయింపు అవసరం కొనసాగుతుంది. ⇒భారత్ పటిష్ట ఆర్థికాభివృద్ధికి విధాన సంస్కరణలు దోహదపడతాయి. ⇒దవ్యలోటు, ద్రవ్యోల్బణం, మౌలికరంగం పురోగతి బాట పడితే, భారత్ రేటింగ్‌కు సంబంధించి ఔట్లుక్ మెరుగుపడుతుంది. వ్యవస్థీకృత సంస్కరణలు అవసరం: సిన్హా భారత్... 7 నుంచి 8 శ్రేణిలో జీడీపీ వృద్ధి రేటును నమోదుచేసుకోడానికి, అలాగే రానున్న 12 ఏళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించడానికి వ్యవస్థీకృత సంస్కరణలు అవసరమని ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా బుధవారం అన్నారు. ఢిల్లీలో ప్రారంభమైన రెండు రోజుల ఆర్థిక సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
మందగమనం నుంచి భారత్ బయటకు
న్యూఢిల్లీ: పాతికేళ్లలో ఎప్పుడూ చూడనంత తీవ్ర మందగమన పరిస్థితుల నుంచి భారత్ ఆర్థిక వ్యవస్థ బయటపడుతోందని పారిస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆర్థిక విశ్లేషణ సంస్థ- ఓఈసీడీ ఆర్థిక సర్వే ఒకటి తెలిపింది. అయితే భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్ట 8 శాతం వృద్ధిని నమోదుచేసుకోడానికి తాజా ఆర్థిక సంస్కరణల అమలు కీలకమని కూడా ఆర్థిక సహకార, అభివృద్ధి సంఘం వ్యాఖ్యానించింది. ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్లు, బలహీనమైన పెట్టుబడుల నేపథ్యంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు గడచిన రెండు ఆర్థిక సంవత్సరాల కాలంలో ఐదు శాతం దిగువున నమోదయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (2014-15, ఏప్రిల్-జూన్) కాలంలో ఈ రేటు 5.7 శాతంగా నమోదయ్యింది. వృద్ధి అంచనాల పెంపు 2015-16లో 6.6 శాతం వృద్ధిరేటు నమోదవుతుందని సంస్థ తన తాజా అంచనాల్లో ప్రకటించింది. ఈ మేరకు గత అంచనాలను 5.7 శాతం నుంచి పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి 5.4 శాతం నమోదవుతుందని తెలిపింది. 2016-17 నాటికి 6.8 శాతానికి ఈ రేటు చేరుతుందని పేర్కొన్న ఓఈసీడీ, 8 శాతం వృద్ధికి చేరడానికి మరికొన్ని చర్యలను సూచించింది. ఇందులో సామాజిక, భౌతిక మౌలిక రంగానికి సబ్సిడీల వ్యయాన్ని బదలాయించడం, పన్ను సంస్కరణలు, మౌలిక రంగానికి అధిక నిధులు అందేలా బ్యాంకింగ్ వ్యవస్థలో మార్పులు, ఉపాధి కల్పనలో వ్యవస్థీకృత అడ్డంకుల తగ్గింపునకు కృషి... ఈ దిశలో కార్మిక సంస్కరణలు వంటి చర్యలు అవసరమని తెలిపింది.