Instant Loan App
-
లోన్‌యాప్‌లు డౌన్లోడ్ చేయొద్దు.. కీలక సూచనలు.. మరిచారో అంతే!
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్న లోన్‌యాప్‌ల మాయాజాలంలో చిక్కుకోవద్దని తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు. లోన్‌యాప్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా తెలంగాణ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ పలు సూచనలు చేసింది. లోన్‌యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవద్దని, తప్పక డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని వారు హెచ్చరించారు. ఇవి మరవొద్దు ♦ లోన్‌యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీ ఫోన్లో ఉన్న యాప్స్, కాంటాక్ట్ నంబర్లు, లొకేషన్, ఫొటోలు, మీ వ్యక్తిగత విషయాలన్నీ మీకు లోన్ ఇచ్చేవాళ్లకు వెళతాయని గుర్తించాలి. మీరు తీసుకున్న లోన్ తీర్చకపోతే తీవ్రంగా వేధిస్తారు. ♦ ఫోన్ కాంటాక్ట్ నంబర్లు, ఫొటోలు యాక్సెస్ ఉండడంతో లోన్‌యాప్ ఏజెంట్లు మహిళల ఫొటోలను అశ్లీలంగా మార్చి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, బంధువులకు పంపి మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారు. ♦ లోన్‌యాప్‌ల నుంచి వేధింపులు శ్రుతి మించితే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు www. cybercrime.gov.in వెబ్సైట్లో లేదా 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. -
ఇన్ స్టెంట్ లోన్స్ తీసుకుంటున్నారా ..?
-
ఇన్స్టంట్ లోన్స్ తీసుకుంటున్నారా?
డిజిటల్ వినియోగంతో పెరిగిపోతున్న సైబర్ నేరాల పట్ల వినియోగదారుల్ని ఎస్బీఐ అప్రమత్తం చేసింది. ముఖ్యంగా ఇన్స్టంట్ లోన్లు తీసుకునే యూజర్ల భద్రతా దృష్ట్యా మార్గదర్శకాలను జారీ చేసింది. లోన్ యాప్స్ పట్ల కస్టమర్లను హెచ్చరిస్తూ, అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయడం, బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ సంస్థలకు వ్యక్తిగత సమాచారం అందించడం మానుకోవాలని కోరింది. ఈ సందర్భంగా యాప్స్‌లో రుణాలు తీసుకునేవారికి పలు జాగ్రత్తలు చెప్పింది. కస్టమర్లకు ఎస్బీఐ చెప్పిన జాగ్రత్తలివే ► ఇన్స్టంట్లోన్, లేదంటే లోన్ తీసుకునేందుకు ప్రయత్నించే ముందు సదరు ఫైనాన్స్ అందించే యాప్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. అవి వినియోగదారులకు హాని చేస్తాయా? లేదా అనేది డౌన్లోడ్ చేసుకునే ముందు చెక్ చేసుకోవాలి. ► అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయొద్దు ► మీ డేటాను చౌర్యానికి పాల్పడుతున్న అనధికారిక యాప్స్ వినియోగించడం మానుకోవాలి. ► ఒకవేళ మీరు యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకుంటే.. మీ వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా ఉండేలా యాప్స్‌లో సెట్టింగ్స్ మార్చుకోవాలి. ► అనుమానాస్పద రీతిలో లోన్లు ఇచ్చే యాప్స్ నిర్వహణ సంస్థలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ► నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో సైబర్ క్రైమ్‌లను రిపోర్ట్ చేయాల్సిందిగా వినియోగదారులను కోరింది. కాగా, గతంలో ఆన్లైన్ బ్యాంక్ లావాదేవీలు చేసే సమయంలో సైబర్ నేరస్తుల నుంచి వినియోగదారులు సురక్షితంగా ఉండేలా పలు సూచనలు చేసింది. స్ట్రాంగ్ పాస్వర్డ్, పాస్ వర్డ్ వెరిఫికేషన్ చేసుకోవాలని స్పష్టం చేసింది. వీటితో పాటు ►బయోమెట్రిక్స్, ఇందులో ఫేస్ లాక్, ఫింగర్ ప్రింట్ ►ఇమెయిల్ వన్-టైమ్ పాస్వర్డ్ (OTP) ►ఎస్ఎంఎస్ ఓటీపీ ►భద్రతా పరమైన ప్రశ్నల్ని జత చేయాలని వెల్లడించింది. -
ఎంసెట్ స్టేట్ ర్యాంకర్ ప్రాణం తీసిన లోన్ యాప్ వేధింపులు
సాక్షి, కరీంనగర్: లోన్ యాప్స్ నిర్వాహకుల ఆగడాలకు అడ్డులేకపోతుంది. రోజురోజుకీ వీటి ఆకృత్యాలు ఎక్కువైపోతున్నాయి. ఎంతో భవిష్యత్తు ఉన్న యువత జీవితం లోన్ యాప్స్ మోసాలకు అర్దాంతరంగా ముగిసిపోతోంది. తాజాగా లోన్ యాప్ వేధింపులు మరో యువకుడి ప్రాణం తీశాయి. కరీంనగర్ జిల్లా నగునూరుకు చెందిన శ్రీధర్-పధ్మ దంపతుల కుమారుడు మని సాయి. ఇటీవల విడుదలైన ఎంసెట్ ఫలితాలలో 2వేల ర్యాంక్ సాధించాడు. హైదరాబాద్‌లోని స్నేహితుడి రూమ్‌కు వచ్చి కౌన్సిలింగ్‌కు సిద్ధమవుతున్నాడు. అంతకుముందే డబ్బులు అవసరం ఉండి లోన్ యాప్‌లో రూ. 6 వేలు అప్పుగా తీసుకున్నాడు. గత ఆరు నెలలుగా రూ. 45 వేలు కట్టినా.. నిర్వహాకుల వేధింపులు మాత్రం ఆగడం లేదు. దీంతో లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక ఈనెల 20న శంషాబాద్‌లోని తన రూమ్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతన్ని గమనించిన స్నేహితులు ఆసుపత్రికి తరలించడగా.. చికిత్స పొందుతూ మణి సాయి శుక్రవారం మృతి చెందాడు. మునిసాయి వైద్యం కోసం తల్లిదండ్రులు లక్షలు ఖర్చు చేసినా.. ప్రాణం దక్కలేదు. ఎంసెట్‌లో స్టేట్ ర్యాంక్ సాధించిన మనిసాయి వెబ్ కౌన్సిలింగ్‌కు హాజరు కావాల్సి ఉండగా ఈ విషాదం చోటుచేసుకుంది. లోన్ యాప్‌ల వలలో చిక్కి ప్రాణాలు కోల్పోవడంతో యువకుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చదవండి: డ్రైవర్‌ను చితక్కొట్టిన కానిస్టేబుల్.. కొట్టింది నిజమేనన్న ఇన్స్పెక్టర్ -
ఒక క్లిక్‌తో డబ్బులు అని ఆశపడితే.. మీ చరిత్ర మొత్తం వారి చేతుల్లోకి..
నెల్లూరు(క్రైమ్): ఇన్స్టంట్ లోన్‌యాప్‌ల విషయలో అప్రమత్తంగా ఉండాలని.. లేని పక్షంలో అనర్థాలు తప్పవని ఎస్పీ సీహెచ్ విజయారావు ప్రజలకు సూచించారు. శనివారం ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్ హాలులో లోన్‌యాప్‌ల మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన పోస్టర్లను ఎస్పీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక అత్యవసరాల నిమిత్తం ఇన్‌స్ట్టంట్ లోన్యాప్లో నగదు తీసుకుంటున్న వారు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఒక క్లిక్‌తో డబ్బులు వస్తాయని ఆశపడితే ఆపై నిర్వాహకులు వేధింపులకు గురి చేయడమే కాకుండా అంతకు అంత నగదు వసూళ్లు చేస్తున్నారన్నారు. లోన్‌యాప్‌లను డౌన్లోడ్ చేసుకున్న మరుక్షణం నేరగాళ్లు మీ మొబైల్లోని వ్యక్తిగత సమాచారంతో పాటు వాట్సాప్, గ్యాలరీలోని ఫొటోలను హ్యాక్ చేస్తారన్నారు. చిన్న మొత్తంలో నగదు ఇచ్చి పెద్ద మొత్తంలో కట్టాలని ఒత్తిడి తీసుకువస్తారన్నారు. పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఎస్పీ తదితరులు కట్టని పక్షంలో మీ ఫొటోలను, వీడియోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి బంధువులకు, సన్నిహితులకు పంపుతూ బ్లాక్మెయిల్ చేస్తారన్నారు. కొందరు లోన్‌యాప్ నిర్వాహకుల ఉచ్చులో చిక్కుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. యాప్‌లను డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఫోన్ కాంటాక్ట్స్, మీడియా, గ్యాలరీ, కెమెరాలకు సంబంధించిన ఆప్షన్లను నియంత్రించుకుంటే వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతికి వెళ్లకుండా ఉంటుందన్నారు. లోన్ తీసుకునేవారు ఆ యాప్‌కు ఆర్బీఐ గుర్తింపు ఉందో లేదో చూడాలన్నారు. ప్రజలు రుణాలు అవసరమైతే బ్యాంకు లేదా తెలిసిన వారి ద్వారా నగదు తీసుకోవడం మంచిదన్నారు. లోన్‌యాప్‌ల ద్వారా మోసపోతే పోలీసు స్టేషన్లో లేదా, 1930, సైబర్‌క్రైమ్.జీఓవీ.ఇన్‌కు ఫిర్యాదు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు డి. హిమవతి, శ్రీనివాసరావు, ఎస్బీ, నెల్లూరు నగర ఇన్చార్జ్ డీఎస్పీ కోటారెడ్డి, అబ్దుల్ సుబహాన్, నెల్లూరు నగర ఇన్స్పెక్టర్లు సురేంద్రబాబు, టీవీ సుబ్బారావు, అన్వర్‌బాషా, దశరథరామారావు, నరసింహరావు, మధుబాబు, వివిధ వర్గాల ప్రజలు పాల్గొన్నారు. -
ఆ ఘటనపై చలించిపోయిన సీఎం జగన్.. కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి/తూర్పుగోదావరి: ఆన్లైన్ లోన్ యాప్ బారినపడి రాజమహేంద్రవరంలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చలించిపోయారు. తల్లిదండ్రుల మృతితో అనాథలైన చిన్నారులు నాగసాయి(4), లిఖిత(2) ఇద్దరికి చెరో రూ.5 లక్షల సాయం అందించాలని సీఎం ఆదేశించారు. చిన్నారుల సంరక్షణకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ మాధవీలతకి ఆదేశాలు జారీ చేశారు. చదవండి: న్యూడ్ ఫోటోలు పంపుతామంటూ బెదిరింపులు.. లాడ్జిలో దంపతుల ఆత్మహత్య కాగా, అల్లూరి సీతారామ రాజు జిల్లా రాజవొమ్మంగి చెందిన కొల్లి దుర్గాప్రసాద్ (32), రమ్యలక్ష్మి (24) దంపతులు గత కొంతకాలంగా రాజమహేంద్ర వరంలోని శాంతినగర్‌లో నివసిస్తున్నారు. వీరికి మూడేళ్లు, రెండేళ్ల వయసు ఉన్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దుర్గాప్రసాద్ జొమాటో డెలివరీ బాయ్‌గా, అతడి భార్య రమ్యలక్ష్మి మిషన్ కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా కొద్దిరోజుల క్రితం ఇంటి అవసరాల నిమిత్తం సెల్‌ఫోన్ ద్వారా లోన్ యాప్‌లో కొంత సొమ్మును అప్పుగా తీసుకున్నారు. అయితే అది సకాలంలో చెల్లించకపోవడం, వడ్డీ పెరిగిపోవడంతో లోన్ యాప్‌కు సంబంధించిన టెలీకాలర్స్ తరచూ ఫోన్ చేసి వేధించేవారు. ‘మీ నగ్న చిత్రాలు మా వద్ద ఉన్నాయి.. అప్పు చెల్లించకపోతే వాటిని బయటపెడతాం’ అని బెదిరించారు. అంతేకాకుండా దుర్గాప్రసాద్ బంధువులకు, స్నేహితులకు ఫోన్ చేసి అప్పు తీసుకున్న విషయాన్ని చెప్పారు. దీంతో పరువు పోయిందని భార్యాభర్తలిద్దరూ మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ క్రమంలో లోన్ యాప్‌ల ఆగడాలపై కఠిన చర్యలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతి లేని లోన్‌యాప్‌లపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఏపీ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. -
లోన్‌యాప్ ఆగడాలపై ఏపీ ప్రభుత్వం సీరియస్
సాక్షి, తాడేపల్లి: లోన్ యాప్‌ల ఆగడాలపై కఠిన చర్యలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతి లేని లోన్‌యాప్‌లపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఏపీ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే, బుధవారం రోజున రుణ యాప్ వలలో పడి రాజమహేంద్రవరానికి చెందిన కొల్లి దుర్గారావు, రమ్యలక్ష్మి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో వారి ఇద్దరి చిన్నారులు నాగసాయి (4), లిఖిత శ్రీ(2)లు అనాధలుగా మిగిలారు. అయితే ఈ ఘటనపై చలించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిన్నారులు ఇద్దరికి చెరో రూ.5లక్షల సహాయం అందజేయాలని జిల్లా కలెక్టర్ కె.మాధవీలతకి ఆదేశాలిచ్చారు. చదవండి: (న్యూడ్ ఫోటోలు పంపుతామంటూ బెదిరింపులు.. లాడ్జిలో దంపతుల ఆత్మహత్య) -
లోన్‌యాప్స్ లోగుట్టు: తొందర పడ్డారో.. ఇక అంతే సంగతులు
అప్పులు ఇచ్చేటపుడు చాలా మర్యాదగా మాట్లాడతారు. ఇచ్చిన తర్వాత బాకీల వసూలు సమయంలో బండబూతులు తిడుతున్నారు. బంధుమిత్రుల్లో పరువు తీసేలా అప్పులు తీసుకున్న వారి ఫోటోలను అసభ్యంగా మార్చి వైరల్ చేస్తున్నారు. ఈ అవమానాలు భరించలేక అమాయక ప్రజలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయిన వాళ్లకి విషాదాన్ని మిగులుస్తున్నారు. ఇంతటి దారుణ మారణ కాండలకు తెగబడుతోన్న యాప్ లో వెనక చైనా మూలాలు ఉన్నాయని అంటున్నారు. ఇటువంటి యాప్ లపై ఉక్కుపాదం మోపకపోతే పరిస్థితి మరింతగా విషమించే ప్రమాదం ఉంది. లోన్‌యాప్స్.. లోగుట్టు వాటి కథా కమామిష్షు ఏంటో చూద్దాం!! అవసరానికి అప్పులు ఇస్తాం.. పేపర్స్.. ప్రాసెస్ ఏమీ అవసరంలేదు ..గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్‌లో తరచుగా వినిపించే మాటలివి. ఆప్యాయంగా మాటలు కలిపి అప్పులు అంటకడుతోన్న యాప్‌లో ఆ తర్వాత బాకీల వసూలులో రాక్షసుల్లా వ్యవహరిస్తున్నారు. లోన్ రికవరీ ఏజెంట్లను పంపి రక రకాలుగా అవమానిస్తున్నారు. వేధిస్తున్నారు. కాల్చుకు తినేస్తున్నారు. బంధుమిత్రుల్లో పరువు తీసేలా వ్యవహరిస్తున్నారు. ఈ వేధింపులు తట్టుకోలేక ఎంతో మంది అప్పులు తీసుకున్న వాళ్లు ఆత్మహత్యలతో తమ జీవితాలకు సెలవు ప్రకటిస్తున్నారు. అయిన వాళ్లకి గుండెల నిండా విషాదాన్ని మిగిల్చి పోతున్నారు. అప్పుల వసూళ్ల ముసుగులో లోన్ యాప్ సిబ్బంది చేస్తోన్న దుర్మార్గాలకు అడ్డుకట్ట లేకపోతోంది. చాలా మంది ఈ వేధింపులను తమలో తామే దిగమింగు కుంటున్నారు. ఎవరికైనా చెబితే పరువు పోతుందేమోనని మౌనంగా నరకాన్ని అనుభవిస్తున్నారు. ఇక భరించలేని స్థితికి రాగానే ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు. పాపం ప్రత్యూష కృష్ణాజిల్లా మచిలీ పట్నం శారదానగర్ కు చెందిన జూనపూడి ప్రత్యూష డబ్బు అవసరమై ఇండియన్ బుల్స్ అనే లోన్ యాప్‌లో అప్పు కోసం ప్రయత్నించింది. లోన్ ఇవ్వాలంటే ముందుగా పదివేల రూపాయలు డిపాజిట్ చేయాలని షరతు విధించారు. ఆ పదివేల కోసం రూపెక్స్ అనే మరో లోన్ యాప్ ను ఆశ్రయించింది ప్రత్యూష. ఆ డబ్బును ఇండియన్ బుల్స్ కు చెల్లించింది. అయితే ఆ తర్వాత నుంచి ఈ యాప్ ఏజెంట్లు ప్రత్యూషను వేధించడం మొదలు పెట్టారు. ఈ బాధలు భరించలేక తన తల్లి నుండి 90వేలు తీసుకుని రెండు యాప్ లకూ చెల్లించింది. అయినా ఇంకా బాకీ ఉందంటూ ఫోన్లలో వేధించడంతో ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇటువంటి ఘటనలు ఈ మధ్య కాలంలో పెరుగుతున్నాయి. అసలు నిబంధనలేం చెబుతున్నాయి? సామాన్య, మధ్యతరగతి వర్గాలే టార్గెట్ గా లోన్ యాప్ లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఇలా అప్పులు ఇవ్వాలంటే ఈ యాప్ లకు NBFC లైసెన్స్ తప్పని సరిగా ఉండాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే ఈ లైసెన్సులు మంజూరు చేస్తుంది. ఈ లైసెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే లోన్ యాప్ లు గూగుల్ ప్లే స్టోర్ లో అప్ లోడ్ అవుతాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఎవరికైనా అప్పులు ఇస్తే అది తీర్చడానికి కనీసం 60 రోజుల గడువు ఇవ్వాలి. ఆ నిబంధన పాటించే యాప్ లే గూగుల్ ప్లే స్టోర్ లో రిజిస్టర్ అవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడా లోన్ యాప్ కంపెనీలు చట్టంలోని లొసుగులను అడ్డుపెట్టుకుంటున్నాయి. పైకి ఒకరకమైన షరతులను పేర్కొంటూ డబ్బులు వసూలు చేసేటప్పుడు మరో పద్ధతి ఫాలో అవుతున్నాయి. లోన్లు ఇచ్చే సంస్థలెన్ని.? ఆర్బీఐ డేటా ప్రకారం.. ఫిబ్రవరి 29, 2020 నాటికి 10వేల వరకు NBFC లైసెన్స్ లు ఉన్నాయి. వారిలో 803 మాత్రమే 100 కోట్ల విలువ కలిగిన సంస్థలు ఉన్నాయి. 60 రోజుల కంటే తక్కువ కాల పరిమితి లోన్లు ఇచ్చే యాప్స్‌కు గూగుల్ ప్లే స్టోర్ అనుమతి ఇవ్వదు.పుడు మరో రకమైన నిబంధనలను అమలు చేస్తున్నాయి. ఇలా దేశంలో పదివేలకు పైగా లోన్ యాప్స్ ఉన్నాయి. వీటిలో మెజారిటీ యాప్ ల మూలాలు చైనాలో ఉన్నాయి. గతంలో లోన్ యాప్‌లతో మన నిబంధనలను చట్టాలను అడ్డగోలుగా ఉల్లంఘించిన చైనా కంపెనీలను అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే. ఆ కంపెనీలు మూసివేసినా.. చైనా కంపెనీలు కొత్త కంపెనీలతో మళ్లీ ఆ దందా సాగిస్తున్నారు. లోన్ వెనక లోగుట్టు ఏంటీ? మామూలుగా బ్యాంకుల్లో పర్సనల్ లోన్ లు కావాలంటే బోలెడు డాక్యుమెంట్లు సమర్పించాలి. అదే లోన్ యాప్‌లో అయితే ఎలాంటి డాక్యుమెంట్లూ అవసరం ఉండదు. కేవలం ఆధార్ నంబర్ ఇస్తే చాలు. ఒక్కసారి ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటే మన ఫోనులోని సమస్త సమాచారం యాప్ నిర్వాహకులకు వెళ్లిపోతుంది. ఇక ఆ సమాచారాన్ని పట్టుకుని వారు ఇష్టారాజ్యంగా వేధింపులకు తెగబడుతున్నారు. వేధింపుల పర్వం అప్పులు తీసుకున్న వాళ్లు అనుకున్న సమయానికి బాకీ తీర్చకపోతే వారి ఫోటోలను న్యూడ్ గా మార్చేసి బంధుమిత్రుల ఫోన్లకు పంపుతున్నారు. ఫోన్లు చేసి మీకు సిగ్గులేదా? తీసుకున్న అప్పు తీర్చరా? అంటూ బూతులు తిడుతున్నారు. పరువు తీసేలా మెసేజీలు పెడుతున్నారు. ఇవి తట్టుకోలేకనే సున్నిత మనస్కులైన వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తీసుకున్న అప్పుమీద లోన్ యాప్ నిర్వాహకులు వడ్డీలు, చక్రవడ్డీలు ఆపై భూచక్ర వడ్డీలూ వేసేసి పాపం పెంచినట్లు వడ్డీలు పెంచేసుకు పోతున్నారు. తీసుకున్న అప్పులకు వందల రెట్లు వడ్డీ కట్టినా ఇంకా అసలు అలానే ఉంటోంది. అదే ప్రజల ప్రాణాలు తీస్తోంది. ఫోటో, ఆధార్ కార్డ్, కాంటాక్ట్ నెంబర్లే ష్యూరిటీగా మూడు వేల నుంచి 2 లక్షల వరకు రుణాలను అందిస్తున్నాయి ఈ యాప్స్. ఈ అప్పును పది నుంచి 15 రోజుల్లోనే తీర్చేయాలి. అప్పు సరైన సమయంలో చెల్లిస్తే సరి.. లేదంటే అప్పటి నుంచి మొదలవుతాయి వేధింపులు. తల్లిదండ్రులు, బంధువులు, ఫ్రెండ్స్‌కు ఫోన్లు చేస్తామంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతూ.. యువతీ, యువకుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఇంకా కొంత మందికైతే లోన్ కట్టడం చేతకాని నువ్వు బతకడం ఎందుకంటూ వాయిస్ మేసెజ్‌లు కూడా వస్తున్నాయి. అందుకే అసలు ఇటువంటి యాప్ లను గూగుల్ ప్లే స్టోర్ లో లేకుండా చేయాలన్న డిమాండ్లూ వినపడుతున్నాయి. లోన్ యాప్ ల దుర్మార్గాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించింది. ఎన్.బి.ఎఫ్.సి. లైసెన్సులు పొందిన లోన్ యాప్ లకు అనుబంధంగా పనిచేసే యాప్ లపై ఉక్కుపాదం మోపడానికి సిద్ధమైంది. ఇప్పటికే చైనాకు 4వేల 430కోట్ల రూపాయల మేరకు నిధులను తరలించిన లోన్ యాప్ లను గుర్తించిన ఈడీ ఆ యాప్ లకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసింది. ఈ అక్రమ దందాలకు పాల్పడుతోన్న వారికోసం వేట మొదలు పెట్టింది. అప్పులు లేకుండా ఎవరూ బతుకులు వెళ్లదీయలేరు. అయితే అప్పులు తీసుకునే ముందు చాలా అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. అప్పులు మనల్ని నిండా ముంచేసేలా ఉంటే మన అవసరాలను వాయిదా వేసుకున్నా ఫరవాలేదు కానీ తొందరపడి అప్పులు తీసుకుని ఊబిలో కూరుకు పోరాదు. అన్నింటినీ మించి అప్పులు ఇస్తానన్నాడు కదా అని మన సమస్త సమాచారాన్ని లోన్ యాప్ లకు తాకట్టు పెట్టేయడంలోనే అతి పెద్ద ముప్పు ఉంది. -
ఇన్స్టంట్ లోన్ ముఠా గుట్టు రట్టు... నిర్వహించేది చైనావాళ్లే!
న్యూఢిల్లీ: ఇన్స్టంట్ లోన్ దోపిడి మాయను బట్టబయలు చేశారు ఢిల్లీ పోలీసులు. సుమారు రెండు నెలలపాటు సాగిన ఈ గ్యాంగ్ అపరేషన్ పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఈ గ్యాంగ్ నెట్వర్క్ విస్తరించి ఉందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....లక్నోలోని కాల్ సెంటర్లలో ఉన్న ఈ ముఠా తొలుత చిన్నమొత్తాల్లో రుణం అందించడానికి దరఖాస్తులు కోరుతుంది. ఆ తర్వాత యూజర్ అప్లికేషన్లను డౌన్లోడ్ చేసి యాప్‌కు అనుమతులు మంజూరు చేసిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే వారి ఖాతాలో రుణం జమ అవుతుంది. అంతేకాదు ఫేక్ ఐడీలపై సేకరించిన వివిధ నంబర్ల నుంచి వినియోగదారులకు ఫోన్ చేసి ఒత్తిడి చేయడం మొదలు పెడతాయి. ఒకవేళ పట్టించుకోకపోతే వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తామని బెదిరింపులకు దిగుతుంది. దీంతో బాధితులు భయంతో అధిక మొత్తంలో డబ్బులు చెల్లించడం జరుగుతోంది. ఇలా వసూలు చేసిన మొత్తాన్ని ఆ ముఠా హవాల ద్వారా లేదా క్రిప్టోకరెన్సీలను కొనుగోలు చేసి చైనాకు పంపిస్తున్నట్లు విచారణలో తేలింది. ప్రతి ఖాతాకు కోటి రూపాయాల పైనే డబ్బులు జమ అవుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు దాదాపు 500 కోట్ల ఇన్స్టంట్ లోన్ దోపిడి రాకెట్‌తో ప్రమేయం ఉన్న సుమారు 22 మందిని అరెస్టు చేశారు. అంతేకాదు ఈ దందా కోసం ఆ ముఠా దాదాపు వంద లోన్‌యాప్‌లను ఉపయోగించనట్లు వెల్లడించారు. నిందుతుల నుంచి 51 మొబైల్ ఫోన్లు, 25 హార్డ్ డిస్క్‌లు, తొమ్మిది ల్యాప్‌టాప్‌లు, 19 డెబిట్ కార్డ్‌లు/క్రెడిట్ కార్డ్‌లు, మూడు కార్లు, సుమారు రూ. 4 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చైనా జాతీయులు సూచనల మేరకే ఈ రాకెట్‌ని తాము నిర్వహిస్తున్నామని నిందితులు చెప్పనట్లు సమాచారం. ఈ క్రమంలో పోలీసుల చైనాకు చెందిన కొంతమంది దుండగులను గుర్తించామని, వారి ఆచూకి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. -
వడ్డీ ఎక్కువైనా లోన్ యాప్స్ నుంచి రుణం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్రెడిట్ హిస్టరీ చూడకుండానే లోన్ యాప్స్ రుణం అందిస్తున్నాయి. బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే నిముషాల్లో డబ్బులు వచ్చి పడుతున్నాయి. లోన్ యాప్స్ ద్వారా రుణం పొందితే అధిక వడ్డీ చెల్లించాల్సిందే. ఈ విషయం తెలిసి కూడా కస్టమర్లు వీటినే ఎంచుకుంటున్నారని ఇన్ఫోటైన్మెంట్ యాప్ వే2న్యూస్ సర్వేలో తేలింది. ఇటీవలి కాలంలో లోన్ యాప్స్ మోసాలు, వేధింపులు మితిమీరాయి. ఈ నేపథ్యంలో చేపట్టిన సర్వేలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నుంచి 2 లక్షల పైచిలుకు మంది పాలుపంచుకున్నారు. వీరిలో 35 శాతం మంది మహిళలు ఉన్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో 44 శాతం మంది 21–30 ఏళ్ల వయసువారే. ఇవీ సర్వే ముఖ్యాంశాలు.. లోన్ యాప్స్ ద్వారా రుణం తీసుకుంటే అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తుందనే విషయం తమకు తెలుసు అని సర్వేలో పాల్గొన్న వారిలో 1,40,387 (70 శాతం) మంది తెలిపారు. లోన్ ఇస్తామంటూ వచ్చే కాల్స్, సందేశాలను 86,796 (43 శాతం) మంది అందుకున్నారు. సర్వేలో పాల్గొన్నవారుగానీ వారి సన్నిహితులు, బంధువుల్లో లోన్ యాప్స్ ద్వారా రుణం పొందినవారు 1,02,106 (51 శాతం) ఉన్నారు. తాముగానీ, తమకు తెలిసినవారిలో లోన్ యాప్స్ బాధితులూ ఉన్నారని 1,34,607 మంది (67 శాతం) వెల్లడించారు. ఈ స్థాయిలో బాధితులు ఉన్నప్పటికీ సమస్య వస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియదని 79 శాతం మంది చెప్పడం గమనార్హం. -
Loan Apps: నలుగురికి చెప్పాల్సిన బ్యాంకు ఉద్యోగే ఇలా చేశాడేంటి?
బెంగళూరు: ఇన్స్టాంట్ లోన్ యాప్‌ల వలలో చిక్కుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. అయితే.. కొందరు అన్నీ తెలిసి కూడా వాటి ఉచ్చులో చిక్కుకుంటున్నారు. వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనే కర్ణాటకలో వెలుగు చూసింది. అయితే.. నలుగురికి చెప్పాల్సిన ఓ బ్యాంకు ఉద్యోగి లోన్‌యాప్ ఉచ్చులో పడి చనిపోవటం గమనార్హం. కేవలం రూ.40వేలు లోన్‌యాప్‌ల ద్వారా తీసుకుని, వారి వేధింపులు తట్టుకోలేక ట్రైన్ కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కెంగరీ జిల్లాలోని దొడ్డగొల్లారహట్టి గ్రామానికి చెందిన టీ నంద కుమార్(52) అనే వ్యక్తి కోఆపరేటివ్ బ్యాంకులో విధులు నిర్వర్తిస్తున్నారు. పశ్చిమ బెంగళూరులోని నయాందహల్లి సమీపంలో సోమవారం రైలు కింద పడి చనిపోయారు. లోన్‌యాప్‌తో పాటు తనకు డబ్బులు ఇచ్చిన స్థానికుల వేధింపులు తట్టుకోలేకే జీవితాన్ని ముగిస్తున్నానని సూసైడ్ నోట్ రాసి చనిపోయారు నంద. తనకు మెయిల్ ద్వారా లోన్‌యాప్ ప్రతినిధులు అసభ్యకర సందేశాలు పంపారని, అలాంటి వాటిని నిషేధించాలని సూసైడ్ నోట్లో కోరినట్లు బెంగళూరు నగర రైల్వే పోలీసులు తెలిపారు. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగోలేక మొదట లోన్‌యాప్ ద్వారా రూ.3వేలు అప్పు తీసుకున్నారు నంద. ఈ క్రమంలో లోన్‌యాప్ ఉచ్చులో పడిపోయారు. పాత లోన్ తీర్చేందుకు మరో యాప్ ద్వారా రుణం తీసుకున్నారు. వివిధ యాప్‌ల ద్వారా మొత్తం రూ.36,704 రుణం తీసుకున్నారు నంద. వాటిని వసూలు చేసుకునేందుకు అసభ్యకర మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ చేశారు యాప్ ప్రతినిధులు. దాంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. నంద తన వద్ద రూ.3.6 లక్షల అప్పు చేశాడని, కేవలం రూ.1.5 లక్షలు చెల్లించినట్లు ఓ మహిళ అతడిపై కేసు పెట్టింది. మొత్తం రూ.5 లక్షలు ఇప్పించాలని ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతం నంద ఆత్మహత్య చేసుకున్న క్రమంలో 46 లోన్‌యాప్‌లు సహా మహిళపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదీ చదవండి: తినేందుకు రోటీ ఇవ్వలేదని గొడవ.. కత్తితో పొడిచి హత్య -
గుంటూరులో లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య
సాక్షి, గుంటూరు: లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. మంగళగిరి మండలం చిన్నకాకాని గ్రామానికి చెందిన బండపల్లి ప్రత్యూష ఇండియన్ బుల్స్, రూపెక్స్ యాప్స్ నుంచి రూ.20,000 లోన్ తీసుకుంది. రూ.20 వేల రుణానికి లోన్ యాప్స్ నిర్వాహకులు రూ. 2 లక్షల వరకు వసూలు చేశారు. అయినా ఇంకా డబ్బులు కట్టాలని, లేకుంటే ప్రైవేటు ఫోటోలు సోషల్ మీడియాలో పెడతామని కేటుగాళ్లు బెదిరించారు. రుణం తీర్చకపోతే బంధువులకు ఫోన్ చేసి చెప్తానని సైబర్ నేరగాళ్లు భయపెట్టారు. వాట్సాప్‌లో అసభ్యకర మెసెజ్‌లు పంపుతూ వేధింపులకు గురిచేశారు. దీంతో మనస్తాపం చెందిన ప్రత్యూష ఇంటిపైన ఉన్న ఫ్లెక్సీ హోర్డింగ్‌కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకునే ముందు తల్లిదండ్రులకు, భర్తకు సెల్ఫీ వీడియో పంపింది. ఈ మేరకు ప్రత్యూష భర్త మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చదవండి: పట్టమంటాడు... వదలమంటాడు! ►ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
బ్యాంకుకు వెళ్లిన సాగర్‌కు మతి పోయినంతపనైంది.. భద్రం బ్రదరూ! ఇంతకూ ఏమైంది?
సాగర్‌కు రెండు క్రెడిట్ కార్డులున్నాయి. పరిమితి కూడా ఎక్కువ. దేనికైనా వీటినే వాడుతూ ఉంటాడు. క్రెడిట్ స్కోరుకు ఢోకా లేకుండా బిల్లు కరెక్టుగా చెల్లిస్తుంటాడు. కానీ ఈ మధ్య ఓ లోన్కోసం వెళితే... తన క్రెడిట్ స్కోరు తక్కువగా ఉందన్నారు. రిపోర్టు చూసి అదిరిపడ్డాడు సాగర్. ఎందుకంటే తన పేరిట 5 క్రెడిట్ కార్డులున్నాయి. వాటిలో కొన్నింటికి బకాయిలున్నాయి. మరికొన్నిటి చెల్లింపులు ఆలస్యమయ్యాయి. దానివల్లే క్రెడిట్ స్కోరు తగ్గింది. బ్యాంకుకు వెళ్లి ఇదేంటని అడిగిన సాగర్‌కి... విషయం తెలిసి మతి పోయినంతపనైంది. ఇంతకీ ఏంటది? సాధారణంగా షాపింగ్‌కో, ఆన్లైన్ పేమెంట్లకో క్రెడిట్ కార్డు వాడటం సాగర్‌కు అలవాటు. కానీ ఈ మధ్య ఆన్లైన్లో అత్యంత సౌకర్యంగా ఉండటంతో ఇన్స్టంట్ లోన్/పేమెంట్ యాప్‌లను ఎడాపెడా వాడటం మొదలెట్టాడు. తరువాత చెల్లింవచ్చు కదా (పోస్ట్ పెయిడ్) అనే ఉద్దేశంతో చాలా యాప్‌లలో కొంత మొత్తం చొప్పున వాడేశాడు. వాటిలో కొన్నింటి గడువు తేదీ వారం రోజులే!. మరికొన్నింటికి 10 రోజులు– 15 రోజులు ఇలా బిల్లింగ్ సైకిల్స్ ఉన్నాయి. అంత తక్కువ వ్యవధి కావటంతో వాటిని తిరిగి చెల్లించటంలో కిరణ్ అంత శ్రద్ధ పెట్టలేకపోయాడు. ఇవిగో... ఇవే సిబిల్ రిపోర్టులో కొంప ముంచాయి. పోస్ట్‌పెయిడ్–లోన్ యాప్స్ వేరువేరు కస్టమర్లను ఆకట్టుకోవటానికి కొన్ని... వ్యాపారాన్ని పెంచుకోవటానికి కొన్ని. కారణమేదైనా ఇపుడు చాలా కంపెనీలు పోస్ట్‌పెయిడ్ మొదలెట్టేశాయి. అంటే... ‘ఇప్పుడు కొను–తరువాత చెల్లించు’ (బీఎన్‌పీఎల్) అన్నమాట. షాపింగ్ యాప్‌లతో పాటు సర్వీసులందించే యాప్‌లు కూడా వీటిని అందిస్తున్నాయి. ఉదాహరణకు క్యాబ్ అగ్రిగేటర్ ‘ఓలా’నే తీసుకుంటే... క్యాబ్ బుక్ చేసిన వెంటనే చెల్లించాల్సిన పనిలేదు. కొంత మొత్తం పరిమితికి లోబడి... ఓలా పోస్ట్ పెయిడ్ సేవలందిస్తోంది. ఆ మొత్తం వరకూ సర్వీసులు వాడుకోవచ్చు. ఈలోపు బిల్లింగ్ తేదీ వస్తే బిల్లు అందుతుంది. చెల్లిస్తే సరి. మరిచిపోతే కాస్త జరిమానాలూ ఉంటాయి. ఓలాతో పాటు ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటివి కూడా కొంత పరిమితి వరకూ ‘పే లేటర్’ సేవలందిస్తున్నాయి. ఇదంతా పోస్ట్‌పెయిడ్ వ్యవహారం. లోన్‌యాప్స్ కూడా ఇంచుమించుగా... మారుతున్న కాలానికి తగ్గట్టుగా క్రెడిట్ కార్డుల్లానే ఆన్లైన్ లోన్ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. కార్డులు లేకున్నా, వాలెట్లలో డబ్బులు లేకున్నా సరే... ఈ యాప్స్‌తో అప్పటికప్పుడు ఈజీగా పే చేసేయొచ్చు. లేజీ పే, సింపుల్, బుల్లెట్, పేటీఎం పోస్ట్‌పెయిడ్, ఫ్రీచార్చ్ పే లేటర్, మొబిక్విక్ జిప్ పేలేటర్, పే లేటర్ బై ఐసీఐసీఐ... ఇవన్నీ అలాంటివే. ఆన్లైన్లో కొన్న వస్తువుకో, అందుకున్న సర్వీసుకో దీనిద్వారా తక్షణం చెల్లించేయొచ్చు. బిల్లులు కూడా. వీటన్నిటినీ కూడా క్రెడిట్కార్డుల్లానే భావించాల్సి ఉంటుంది. అందించేవన్నీ ఆర్థిక సేవల కంపెనీలే కాబట్టి... సిబిల్ జాబితాలో వీటిని కూడా క్రెడిట్ కార్డుల్లానే చూడాల్సి వస్తుంది. చిన్నచిన్న పేమెంట్లే కనక వీటి చెల్లింపు గడువు కూడా తక్కువే. జరిమానాలూ ఎక్కువే. ఉదాహరణకు 100 రూపాయల బిల్లు గనక చెల్లించకపోతే... మరో 100 ఫైన్ కట్టాల్సి రావచ్చు. ఎందుకంటే చాలా సంస్థలు కనీస ఫైన్ మొత్తాన్ని ఈ రకంగా నిర్ధారిస్తున్నాయి. శాతంలోనైతే ఇది 100. చాలామందికి రూ.100 అనేది చిన్న మొత్తంగానే కనిపిస్తుంది కాబట్టి పెద్ద సమస్య ఉండదు. కాకపోతే వీటిని విస్మరిస్తే సిబిల్ రిపోర్టులో స్కోరుపై మాత్రం ప్రభావం చూపిస్తాయని మరిచిపోకూడదు. పోస్ట్‌పెయిడ్–లోన్ యాప్స్‌కు తేడా ఏంటి? పోస్ట్‌పెయిడ్‌లో సదరు సంస్థ తమ దగ్గర కొన్న వస్తువుకో, అందుకున్న సర్వీ సుకో దీన్ని అందిస్తుంది. కానీ లోన్‌యాప్స్ అయితే ఏ కంపెనీలో కొన్న వస్తువుకైనా, ఎక్కడ తీసుకున్న సర్వీసుకైనా వీటి నుంచి చెల్లింపులు చేయొ చ్చు. నిజానికిప్పుడు లేజీ పే వంటి చాలా లోన్‌యాప్స్ అస్సలు వడ్డీలు వసూలు చేయటం లేదు. మరి వాటి మనుగడ ఎలా? అనే సందేహం సహజం. ప్రస్తుతానికైతే ఆలస్య రుసుములే వీటికి ప్రధాన ఆదాయ వనరు. పైపెచ్చు ఇవన్నీ యూజర్ బేస్‌ను (కస్టమర్ల సంఖ్య) పెంచుకోవటంపైనే దృష్టిపెడుతున్నాయి. అక్కడ సక్సెస్ అయితే పెట్టుబడులొస్తాయి. ఏదో ఒక దశలో ఆ పెట్టుబడులపై లాభాన్ని అందించాల్సిన బాధ్యత ప్రమోటర్‌కు ఉంటుంది. కాబట్టి మున్ముందు ఇవన్నీ వడ్డీల రూపంలోనో... నెలవారీ ఫీజుల రూపంలోనో యూజర్ల నుంచి చార్జీలు వసూలు చేయక తప్పదు కూడా. ఇంతకీ వీటిని వాడొచ్చా? క్రెడిట్ కార్డుల్ని సైతం ఎడాపెడా వాడితే ఆ తరువాత ఇబ్బందులు తప్పవన్నది చాలామందికి అనుభవంలోకి వచ్చిన వాస్తవం. అలాంటిది అందుబాటులో ఉన్నాయి కదా అని ఎడాపెడా లోన్ యాప్స్ నుంచి రుణాలు తీసుకుంటే?. వీటి బిల్లింగ్‌ను ఎప్పటికప్పుడు చెల్లిస్తూ అప్డేటెడ్గా ఉండటం అంత తేలికేమీ కాదు. బిల్లుకు సంబంధించిన మెసేజ్ వచ్చాక... ఏ కాస్త నిర్లక్ష్యం చేసినా మరిచిపోయి ఫైన్ పడే ప్రమాదం ఎక్కువ. అందుకని వీటికి దూరంగా ఉండటమే మంచిదని చెప్పాలి. సిబిల్ రిపోర్టులో సైతం మీరు ఉపయోగించిన ఒక్కో లోన్ యాప్ ఒక్కో క్రెడిట్లైన్ మాదిరి కనిపిస్తుంది. వాటిలో జరిమానాలు, ఆలస్యపు చెల్లింపులు ఉంటే స్కోరు దెబ్బతినే అవకాశం తప్పకుండా ఉంటుంది. మరో ముఖ్యమైన అంశమేంటంటే కొన్ని యాప్‌లు తమ బకాయిల వసూలుకు రకరకాల అనైతిక మార్గాలు కూడా అనుసరిస్తున్నాయి. రుణం తీసుకున్న వారి కాంటాక్టు లిస్టులో ఉన్నవారందరికీ ఫోన్లు చేయటం... భయపెట్టడం... వారి దగ్గర ఈ వ్యక్తిని అవమానించటం వంటివన్నీ చేస్తున్నాయి. కాబట్టి వీలైనంతవరకూ వీటికి దూరంగా ఉండటమే మంచిదని చెప్పాలి. -మంథా రమణమూర్తి -
‘మమ్మీ.. డాడీ నన్ను క్షమించండి.. నేను కరెక్ట్‌గా లేను’
సాక్షి, హైదరాబాద్: మమ్మి, డాడీ నన్ను క్షమించండి, మీరు కరెక్ట్‌గా ఉన్నారు. నేను కరెక్టుగా లేను, నేనేమీ చేయలేను... నేను మిమ్మల్ని వదిలి వెళ్లిపోతున్నా.. అమ్మా.. నన్ను క్షమించు మీరు నా ప్రాణం... మీకు అందనంత దూరం వెళ్లిపోతున్నా అంటూ లోన్ యాప్స్ ద్వారా రుణం తీసుకున్న ఓ యువకుడు సూసైడ్‌నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయ విధారక సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. జవహర్‌నగర్ పోలీసులు, స్ధానికులు తెలిపిన మేరకు.. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఖాధర్ కుటుంబ సభ్యులతో కలిసి చెన్నాపురంలోని సాయిగణేష్ కాలనీలో పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ముర్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఖాజా మోహినుద్దీన్ (23) ఉన్నారు. ఇద్దరు కుమార్తెల వివాహం జరిగింది. మదర్సాలో చదువుతున్న ఖాజా ఇంట్లో ఆన్లైన్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆరు నెలల క్రితం ఖాజా ఫోన్‌తో పాటు ఇంట్లో ఉన్న తండ్రికి ఫోన్ ద్వారా లోన్ యాప్ నుంచి రూ. లక్ష లోన్ తీసుకున్నాడు. అసలు వడ్డీ లోన్‌కు సంబంధించి రూ. 40 వేలు కట్టాలని లోన్‌యాప్ నిర్వాహకులు వేధింపులకు గురిచేశారు. దీంతో తండ్రి కొంత డబ్బును కట్టాడు. ఈ నెల 8న ఖాజాను తండ్రి మందలించాడు. జీతం వస్తుంది కడతానని చెప్పాడు. అదేరోజు ఖాజా తల్లిదండ్రులు సోదరి ఒక గదిలో నిద్రిస్తుండగా వంటగదిలోకి వెళ్లిన ఖాజా మోహినూద్ధీన్ సూసైడ్‌నోట్ రాసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ట్రాప్ చేసింది ప్రజాప్రతినిధుల కుమారులే! ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
‘నీ అప్పు తీరలేదు.. ఇంకా చెల్లించాలి, లేదంటే మీ అమ్మ ఫోటో మార్ఫింగ్ చేసి’
సాక్షి, ఖమ్మం: ‘నువ్వు తీసుకున్న అప్పు తీరలేదు. ఇంకా చెల్లించాలి. లేకపోతే.. మీ అమ్మ ఫోటోను మార్ఫింగ్ చేసి.. పోర్న్సైట్లో అప్లోడ్ చేస్తాం’.. ఇది లోన్ యాప్ నిర్వాహకులు చేస్తున్న ఆరాచకాలు. మంచిర్యాల ఘటన మరవకముందే ఖమ్మం జిల్లా మధిరలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. తీసుకున్న డబ్బు చెల్లించినా ఆన్లైన్ లోన్ యాప్ నిర్వాహకులు ఓ యువకుడిని వేధిస్తుండడంతో పాటు ఆయన తల్లి ఫొటోను మార్ఫింగ్ చేసి ఇతరులకు పంపిస్తున్న ఘటన ఇది. మధిరకు చెందిన ప్రదీప్ ఆన్లైన్ యాప్ ద్వారా రుణం తీసుకున్నాడు. ఆ సమయాన ప్రదీప్‌తో పాటు ఆయన ఆధార్‌కార్డుతో పాటు తల్లి పాన్‌కార్డును యాప్ నిర్వాహకులు తీసుకున్నారు. అయితే, రుణం తిరిగి చెల్లించేందుకు యత్నించగా, వెబ్సైట్ పనిచేయలేదు. దీంతో నిర్వాహకులకు ఫోన్ చేస్తే యూపీఐ లింక్ పంపడంతో డబ్బు చెల్లించాడు. అయినప్పటికీ ఇంకా బకాయి ఉందంటూ ప్రదీప్‌ను ఫోన్ చేసి వేధించసాగారు..రాత్రి, పగలు తేడా లేకుండా రకరకాల ఫోన్ నెంబర్ల నుంచి ఫోన్లు చేస్తు నరకం చూపిస్తున్నారని ప్రదీప్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయన తల్లి పాన్‌కార్డులోని ఫొటోను మార్ఫింగ్ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయాడు. అంతేగాక ఆయన ఫోన్లో నంబర్లు ఉన్న వారికి సదరు మహిళ మోసాలకు పాల్పడుతోందంటూ మెసెజ్‌లు పంపడం ప్రారంభించారు. ఈ విషయమై ప్రదీప్ చేసిన ఫిర్యాదుతో సోమవారం కేసు నమోదు చేసినట్లు మధిర టౌన్ ఎస్సై సంకీర్త్ తెలిపారు. -
వీళ్లని ఏం చేద్దాం..! లోన్ యాప్ నిర్వాహకులకు ఆర్బీఐ షాక్..!
Reserve Bank Of India: మన దేశంలో ఇల్లీగల్ లోన్ యాప్స్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్ధమైంది. నిబంధనలకు విరుద్దంగా ఉన్న లోన్ యాప్స్‌పై చర్యలు తీసుకునేందుకు కొత్త చట్టాన్ని అమలు చేయనుంది. ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్ సిఫార్సులు ఇన్ స్టంట్లోన్, క్విక్ లోన్ పేరుతో ఆన్లైన్ కొన్ని మనీ లోన్ యాప్స్ సామాన్యుల్ని ఊరించేవి. దీంతో ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు పలువురు లోన్ యాప్స్‌లో అవసరానికి తగ్గట్లు మనీని తీసుకునే వారు. తీసుకున్న తరువాత అధిక వడ్డీల పేరుతో వేధించేవారు. కొన్నిసార్లు లోన్ యాప్ నిర్వహకులు బెదిరింపులు తట్టుకోలేక పలువురు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి. దీంతో ఆర్బీఐ ఈ ఏడాది జనవరి 13, 2021న యాప్ నిర్వహకులపై చర్యలు తీసుకునేలా ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్ (డబ్ల్యుజి) పేరుతో ప్రత్యేకంగా ఓ ప్యానల్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్యానల్ సభ్యులు యాప్‌ల ద్వారా అక్రమ రుణాలను నివారించేందుకు ప్రత్యేక చట్టం తీసుకోవాలని ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్ సిఫార్సు చేసింది. అలాగే డిజిటల్ రుణాల యాప్‌లకు నోడల్ ఏజెన్సీ ద్వారా ధ్రువీకరణ ప్రక్రియ అమలు చేయాలని పేర్కొంది. డిజిటల్ రుణాల వ్యవస్థలోని సంస్థలకు స్వయం నియంత్రణ సంస్థ (ఎస్ఆర్వో) ఉండాలని సూచించింది. కస్టమర్ల ప్రయోజనాలు కాపాడటం, నవకల్పనలను ప్రోత్సహిస్తూనే డిజిటల్ రుణాల వ్యవస్థను సురక్షితంగా మార్చడంపై కమిటీ నివేదిక ప్రధానంగా దృష్టి పెట్టినట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ సిఫార్సులపై సంబంధిత వర్గాలు డిసెంబర్ 31లోగా తమ అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ప్లాట్‌ఫాంలు, మొబైల్ యాప్‌ల ద్వారా రుణాలపై అధ్యయనం చేసేందుకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జయంత్ కుమార్ దశ్ సారథ్యంలో 2021 జనవరిలో ఆర్బీఐ ఈ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సిఫర్సులు బట్టి డిజిటల్ రుణాల సంస్థలు లోన్లను నేరుగా రుణగ్రహీతల బ్యాంకు ఖాతాల్లోనే వేయాల్సి ఉంటుంది, అలాగే ఖాతాల నుంచే చెల్లింపులు తీసుకోవాలి. రికవరీ విషయంలో ప్రతిపాదిత ఎస్ఆర్వో నైతిక నియమావళి ప్రకారం నడుచుకోవాలి. రుణాల సంస్థలకు సంబంధించి ఎస్ఆర్వో ప్రత్యేకంగా నెగెటివ్ లిస్ట్ నిర్వహించాలి. 600ఫేక్ యాప్స్ ఆర్బీఐ ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్ సభ్యుల ప్యానల్ ఆన్లైన్లో మొత్తం 1100లోన్ యాప్స్ ఉండగా వాటిలో 600యాప్స్ చట్టవిరుద్దంగా ఉన్నాయని గుర్తించింది. చట్టానికి వ్యతిరేకంగా లోన్స్ ఇచ్చే యాప్స్‌ను బ్యాన్ చేసేలా కొత్త చట్టాన్ని అమలు చేయాలని తెలిపారు. వర్క్ గ్రూప్ ప్యానల్ సభ్యుల నివేదిక ఆర్బీఐ ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్ సభ్యులు..లోన్ యాప్స్‌పై జనవరి 2020 నుండి మార్చి 2021 వరకు దాదాపు 2,562 ఫిర్యాదులు అందినట్లు గుర్తించారు. ఆర్బిఐ నివేదిక ప్రకారం మహారాష్ట్రలో అత్యధికంగా ఫిర్యాదులు అందగా, కర్ణాటక, ఢిల్లీ, హర్యానా, తెలంగాణ,ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. చదవండి: ఇస్మార్ట్ హోటల్..ఇవేమన్నా "మార్చురీ" గదులా?,సెటైర్లు పడ్డా ఎలా సక్సెస్ అయ్యిందంటే -
లోన్‌యాప్ కేసు : పీసీఎఫ్ఎస్ ఫెమా నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించింది
హైదరాబాద్: లోన్‌యాప్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెట్(ఈడీ)దర్యాప్తును వేగవంతం చేసింది. ఫైనాన్స్ కంపెనీ పీసీ ఫైనాన్షియల్ సర్వీసెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన మరో రూ.131 కోట్లను ఈడీ జప్తు చేసింది. క్యాష్ బీన్ మొబైల్ యాప్ ద్వారా రుణాలను పీఎస్ఎఫ్ఎస్ రుణాలు ఇచ్చినట్లు ఈడీ గుర్తించింది. చైనాకు చెందిన జో యాహుయ్ ఆధీనంలో పీఎస్ఎఫ్ఎస్ పనిచేస్తోందని ఈడీ తెలిపింది. బోగస్ సాఫ్ట్వేర్ ఎగుమతుల పేరిట చైనా, హాంకాంగ్, తైవాన్, యూఎస్, సింగపూర్‌లకు నిధులు మళ్లించినట్లు ఈడీ వెల్లడించింది. ప్రధానంగా.. ఫెమా నిబంధలను పీసీఎఫ్ఎస్ పూర్తిగా ఉల్లంఘించిందని ఈడీ గుర్తించింది. కాగా, ఈడీ గతంలో పీసీఎఫ్ఎస్కు చెందిన రూ.106 కోట్లను జప్తు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: ‘కిలేడి’ మహిళ.. ఇద్దరు పిల్లలతో బ్యాంక్‌కు వచ్చి.. -
లోన్ యాప్‌ల కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం
సాక్షి, హైదరాబాద్: లోన్ యాప్‌ల కేసులో దర్యాప్తును ఈడీ ముమ్మరం చేసింది. పీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన రూ.106 కోట్లు అధికారులు జప్తు చేశారు. క్యాష్ బీన్ మొబైల్ యాప్ ద్వారా రుణాలు ఇచ్చిన పీసీఎఫ్ఎస్.. చైనాకు చెందిన జో యాహుయ్ ఆధీనంలో పనిచేస్తోందని ఈడీ తెలిపింది. బోగస్ సాఫ్ట్వేర్ ఎగుమతుల పేరిట విదేశాలకు నిధులు మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. చైనా, హాంకాంగ్, తైవాన్, యూఎస్, సింగపూర్‌కు నిధులు తరలించినట్లు ఈడీ వెల్లడించింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినందుకు పీసీఎఫ్ఎస్ సొమ్ము జప్తు చేసినట్లు ఈడీ పేర్కొంది. ఇవీ చదవండి: వరుస పేలుళ్ల కలకలం, 13 మంది మృతి సముద్రంలో అల్లకల్లోలం: ముందుకొచ్చి.. వెనక్కి మళ్లి.. -
Paytm: వడ్డీ లేకుండానే క్షణాల్లో స్వల్ప రుణాలు!
డిజిటల్ పేమెంట్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ పేటిఎమ్ తన వినియోగదారులకు శుభవార్త అందించింది. తాజాగా కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. పోస్ట్‌పెయిడ్ మిని పేరుతో కొత్త సేవలను లాంచ్ చేసింది. బై నౌ.. పే లేటర్ సర్వీసులకు ఇవి ఎక్స్టెన్షన్ అని చెప్పొచ్చు. ఆదిత్య బిర్లా ఫైనాన్స్ భాగస్వామ్యంతో పేటిఎమ్ ఈ కొత్త సేవలు అందుబాటులోకి తీసుకొని వచ్చింది. ప్రస్తుత కరోనా కాలంలో ఎటువంటి వడ్డీ లేకుండా రూ.250 నుంచి రూ.1,000 వరకు స్వల్ప రుణాలను తీసుకోవచ్చు. తీసుకున్న రుణాలను ముప్పై రోజుల్లోపు తిరిగి చెల్లించాలి. పేటిఎమ్ ఇప్పటికే రూ.60,000 వరకు ఇన్స్టంట్ క్రెడిట్ అందిస్తుంది. ఇప్పుడు నెలవారీ ఖర్చుల కోసం ఈ పోస్ట్‌పెయిడ్ మిని ద్వారా డబ్బులు పొందొచ్చు. తీసుకునే నగదుపై ఎలాంటి ఫీజులు, యాక్టివేషన్ ఛార్జీలు లేవు. కేవలం కన్వీనియన్స్ ఛార్జీలు మాత్రమే ఉంటాయి. ఇకపోతే పేటీఎం ఐపీవోకు సిద్దం అవుతుంది. దీని ద్వారా ఏకంగా రూ.22 వేల కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. -
లోన్‌యాప్స్ కేసులో ఛార్జీ షీట్ సిద్ధం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇన్స్టంట్ లోన్ యాప్స్ కేసులో సైబర్ క్రైమ్స్ (సీసీఎస్) పోలీసులు చార్జిషీట్ సిద్దం చేశారు. గూగుల్ ప్లే స్టోర్‌లోని 197 మొబైల్ యాప్స్ ద్వారా లక్షలాది మందికి అత్యధిక వడ్డీతో పదివేల రూపాయల లోపు రుణాలు ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ఇప్పటి వరకు మొత్తం 22 వేల కోట్ల మేరకు రుణాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. దేశంలోని పలు నగరాల్లో లోన్‌యాప్స్ నిర్వహకులపై పోలీసులు దాడిచేశారు. ఇప్పటివరకు 20 మంది నిర్వహకులను అరెస్ట్ చేశారు. ఢిల్లీలో ఆరుగురు, హైదరాబాద్‌లో ఆరుగురు, బెంగుళూరులో ఏడుగురు, కర్నూల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. చైనాకు చెందిన లాంబోను లోన్ యాప్స్ ముఠా ప్రధాన నిర్వాహకుడిగా పోలీసులు గుర్తించారు. బెంగుళూరు కేంద్రంగా పిన్ పింగ్ టెక్నాలజీస్, ల్యూఫాన్గ్ టెక్నాలజీస్, నా బ్లూమ్ టెక్నాలజీస్, హార్ట్ ఫుల్ టెక్నాలజీస్ పేరుతో నాలుగు సంస్థలను లాంబో ఏర్పాటు చేశాడని పోలీసులు తెలిపారు. రాష్ట్రాల వారీగా స్థానిక ఫైనాన్స్ వ్యాపారులను ఉచ్చులోకి లాగారు. ఎన్‌బిఎఫ్‌సీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు విచ్చలవిడిగా వాడి, అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చాడు. వేగంగా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలలో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి రుణాలను ఇచ్చేవారని పోలీసులు తెలిపారు. అమాయకులైన నిరుద్యోగ బీటెక్ విద్యార్థులను ఉద్యోగాల పేరిట మోసం చేసి, వారిపేరు మీద రుణాలను పొందేవారని పోలీసులు పేర్కొన్నారు. పైసా పెట్టుబడి లేకుండా వేలకోట్ల వ్యాపారానికి పడగలేత్తారని వివరించారు. ప్రధాన సూత్రధారి అయిన చైనా దేశీయుడు యోన్ యౌన్ అలియాస్ జెన్నిఫర్ చైనా నుంచే లాంబో ద్వారా భారత్ లో కార్యకలాపాలు నిర్వహించే వాడని పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన ఛార్జీషీట్‌ను బుధవారం పోలీసులు కోర్టులో దాఖలు చేయనున్నారు. (చదవండి: కారుకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి మరి ప్రేమ వేధింపులు) -
సింగపూర్ సంస్థ.. చైనా సూత్రధారి
సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లాలో నమోదైన ఇన్స్టంట్ లోన్ యాప్స్ కేసులో సింగపూర్ దేశానికి చెందిన సంస్థ మూలం కాగా.. చైనా దేశీయుడు ప్రధాన సూత్రధారి అని అర్బన్ జిల్లా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇన్స్టంట్ లోన్ యాప్స్ ఫైనాన్సర్ల వేధింపులు తాళలేక గత ఏడాది డిసెంబర్ 21న తీగత దుర్గ అనే మహిళ స్పందన కార్యక్రమంలో అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిని ఆశ్రయించింది. కేసు నమోదుచేసిన సీఐ రాజశేఖర్‌రెడ్డి దర్యాప్తులో భాగంగా ఇదే విధమైన కేసుల్లో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేసినట్టు గుర్తించారు. వారిలో నలుగురు ఇక్కడ నమోదైన కేసుల్లో నిందితులుగా ఉన్నట్టు నిర్ధారించుకున్నారు. నిందితులు చైనాకు చెందిన భాయ్ అలియాస్ డెన్నీస్, రాజస్థాన్‌కు చెందిన సత్యపాల్ క్యాలియా, అనిరుథ్ మల్హోత్ర, వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన హేమంత్ సేథ్‌లను ఇటీవల పీటీ వారెంట్‌పై తీసుకువచ్చి రిమాండ్‌కు తరలించారు. అనంతరం వీరిని ఐదు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. బుధవారంతో పోలీస్ కస్టడీ ముగియనుంది. విచారణలో వెలుగు చూసిన విషయాలివీ.. సింగపూర్ దేశానికి చెందిన ఓ సంస్థ ఇన్స్టంట్ లోన్ యాప్స్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించగా.. మన దేశంలో ఈ సంస్థ వ్యవహారాలను చైనాకు చెందిన డెన్నిస్ చక్కబెట్టాడు. అతడు మన దేశానికి వచ్చి గుర్‌గ్రామ్‌లో సింగపూర్ సంస్థ తరఫున ‘స్కైలిన్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్’ను ప్రారంభించాడు. ఈ కంపెనీ ద్వారా ఇన్స్టంట్ లోన్ యాప్స్‌ను తయారు చేశాడు. ఈ లోన్ యాప్స్‌కు ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలను లింక్ చేసుకుని రుణాలు మంజూరు చేయడం మొదలు పెట్టారు. రుణాలు మంజూరు చేసే సమయంలో రుణగ్రహీత అందజేస్తున్న ఫొటో, ఆధార్, ఓటర్, బ్యాంక్ పాస్ బుక్ స్టేట్మెంట్స్ సరైనవో కాదో నిర్ధారించుకోవడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వీరు వినియోగించారు. రుణం ఇచ్చే మొత్తం నుంచి 20 నుంచి 30 శాతం ప్రాసెసింగ్ ఫీజుల రూపంలో మినహాయించుకునే వారు. వడ్డీ మాత్రం తీసుకున్న రుణ మొత్తానికి వసూలు చేసేవారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ) రిజర్వు బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా వారానికి 24 శాతం వడ్డీని రుణగ్రహీతల నుంచి వసూలు చేస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైనట్టు తెలుస్తోంది. ఈముఠా యాప్‌లు 200 ఈ ముఠా 200 ఇన్స్టంట్ లోన్ యాప్స్‌ను రూపొందించగా.. వీటిలో చాలావరకు తెలంగాణ పోలీసులు గుర్తించి గూగుల్‌కు సిఫార్సు చేయగా, గూగుల్ వాటిని తొలగించింది. మరికొన్నింటిని ముఠా సభ్యులే తొలగించారని తెలిసింది. నిందితులు భారతదేశంలో నెలకొల్పిన సింగపూర్ బ్రాంచ్ కంపెనీ 11 రకాల పేర్లతో ఫైనాన్షియల్ టెక్నాలజీలకి సంబంధించిన యాప్‌లను అభివృద్ధి చేసింది. వీటిని గూగుల్ ప్లే స్టోర్‌లో ఉంచి ప్రజలకు వాటికి సంబంధించిన లింక్‌లను పంపుతూ యాప్ డౌన్లోడ్లు చేసుకునేలా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. వీళ్లు అభివృద్ధి చేసిన 11 యాప్‌ల పేర్లు ఇవీ.. మనీ బాక్స్, లోన్ గ్రామ్, లోన్ కార్డ్, ఆ క్యాష్, మింట్ క్యాష్, క్యాష్ ట్రైన్, సూపర్ క్యాష్, హ్యాపీ క్యాష్, సూపర్ బస్, రూపీ వన్, మనీ క్యాష్. కాలయాపనను బట్టి వేధింపులు రుణగ్రహీతల నుంచి డబ్బు తిరిగి వసూలవడంలో జరిగే కాలాన్ని బట్టి వీరి వేధింపుల స్థాయి పెరుగుతుంటుందని తెలిసింది. ఒక రోజు ఆలస్యంగా డబ్బు చెల్లిస్తే సాధారణం, రెండు రోజులైతే మధ్యస్తం, మూడు నాలుగు రోజులైతే అసభ్య పదజాలంతో దూషించడం, ఐదు రోజులు ఆపైన ఆలస్యమైతే డబ్బు తీసుకుని ఎగ్గొడుతున్నారని బంధువులు, స్నేహితులకు సందేశాలు పంపడం వీరి వేధింపుల్లో భాగమని సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్‌లో, ఉత్తరాది రాష్ట్రాల కోసం ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల కోసం బెంగళూరు, ఇలా వివిధ నగరాల్లో వీరు కాల్ సెంటర్లను నెలకొల్పినట్టు నిందితులు పోలీస్ విచారణలో వెల్లడించారు. ఆటకట్టించే పనిలో పోలీసుల నిమగ్నం గుంటూరు నగరంలోని కొత్తపేటలో నమోదైన కేసులో బాధిత మహిళకు ఏ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు జమ అయింది? బాధితురాలు ఏ బ్యాంక్ ఖాతాకు డబ్బు జమ చేసింది? అనే సమాచారాన్ని రాబట్టి ఫైనాన్సర్ల ఆటకట్టించే పనిలో అర్బన్ పోలీసులు నిమగ్నమయ్యారు. ఆర్థిక లావాదేవీలన్నీ ఆన్లైన్ పేమెంట్ యాప్స్ ద్వారా జరిగినట్టు విచారణలో గుర్తించారు. ఈ నేపథ్యంలో ట్రాన్సాక్షన్ ఐడీల ద్వారా బ్యాంక్ ఖాతాలను గుర్తించి నోటీసులు పంపినట్టు సమాచారం. హైదరాబాద్ పోలీసులు ఇదే తరహాలో నోటీసులు ఇవ్వగా రూ.వేల కోట్లలో నగదు ఆయా బ్యాంక్ ఖాతాల్లో ఫ్రీజ్ అయినట్టు సమాచారం. కొత్తపేట కేసులో అరెస్టయిన ఈ నలుగురు నిందితులకు తాడేపల్లి, పాత గుంటూరు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లోనూ ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తాడేపల్లి పోలీసులు నిందితులను పీటీ వారెంట్‌పై అరెస్ట్ చూపి, అనంతరం నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించనున్నట్టు తెలుస్తోంది. ఎవరూ మోసపోవద్దు మీ ఫోన్లకు ఇన్స్టంట్ లోన్స్ అంటూ సందేశాలు, ఫోన్లు వస్తే నమ్మొద్దు. అప్రమత్తంగా వ్యవహరించాలి. ఈ తరహా లోన్లు తీసుకుని ఇబ్బందులకు గురవుతుంటే పోలీసులను సంప్రదించాలి. – ఆర్ఎన్ అమ్మిరెడ్డి, అర్బన్ ఎస్పీ -
లోన్ యాప్స్‌పై గూగుల్ ప్లేస్టోర్ ఉక్కుపాదం
సాక్షి, హైదరాబాద్ : ఇన్స్టాంట్ లోన్ యాప్స్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పోలీసుల రిక్వెస్ట్‌తో యాప్స్ తొలగింపు ప్రక్రియ మొదలుపెట్టిన గూగుల్ ప్లేస్టోర్ ఇప్పటివరకు 200కు పైగా లోన్‌యాప్స్‌ను తొలగించింది. మరో 450కి పైగా లోన్ యాప్స్‌ను తొలగించాలని పోలీసులు గూగుల్‌కు లేఖ రాశారు. హైదరాబాద్ నుంచి 288.. సైబరాబాద్‌లో 110.. రాచకొండ నుంచి 90 లోన్ యాప్స్ తొలగించాలని లేఖలో పేర్కొన్నారు. ( యూట్యూబ్ వీడియోల స్పూర్తితో.. ) ఈ కేసుకు సంబంధించి పోలీసులు వందల సంఖ్యలో బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. ఇప్పటివరకు 3 కమిషనరేట్లలో కలిపి రూ.450 కోట్ల నగదు ఫ్రీజ్ అయింది. ఆన్లైన్ బెట్టింగ్‌లో కొట్టేసిన డబ్బులతో చైనీయులు ఈ లోన్ యాప్‌లను నడిపారు. ఇప్పటివరకు నలుగురు చైనా దేశస్తులు అరెస్టయ్యారు. -
వేధించే లోన్ యాప్స్ ఔట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్స్టాంట్ లోన్ యాప్స్ ఆగడాలపై దేశవ్యాప్తంగా వేడివేడి చర్చ జరుగుతున్న వేళ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ఘాటుగా స్పందించింది. వినియోగదార్ల భద్రతా విధానాలను ఉల్లంఘిస్తున్న వ్యక్తిగత రుణ యాప్‌లను ఆన్‌డ్రాయిడ్ ప్లే స్టోర్ నుంచి తొలగించినట్టు వెల్లడించింది. కస్టమర్లు, ప్రభుత్వ సంస్థలతోపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు వందలాది యాప్స్‌ను సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ఆన్‌డ్రాయిడ్ సెక్యూరిటీ, పైవసీ ప్రొడక్ట్ వైస్ ప్రెసిడెంట్ సుజాన్నే ఫ్రే ఒక బ్లాగ్ పోస్ట్ ద్వారా తెలిపారు. కస్టమర్లకు అధిక వడ్డీ రేట్లకు రుణాలు ఇవ్వడమేగాక, వసూలు చేసేందుకు యాప్స్ ప్రతినిధులు వేధింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అయితే ఎన్ని యాప్స్‌ను తొలగించారో గూగుల్ అధికారికంగా వెల్లడించనప్పటికీ.. గత 10 రోజుల్లో సుమారు 120 యాప్స్‌ను తీసివేసినట్టు సమాచారం. ఇలా ప్లే స్టోర్ నుంచి గుడ్‌బై చెప్పిన యాప్స్ సంఖ్య డిసెంబర్ చివరి వారం నుంచి ఇప్పటి వరకు వందల్లోనే ఉంటుందని తెలుస్తోంది. నోటీసు లేకుండానే..: స్థానిక చట్టాలు, ఆర్బీఐ నిబంధనల మేరకు ఉన్నాయా లేవా అని నిరూపించాలని ఇతర గుర్తించిన యాప్ డెవలపర్లను గూగుల్ ఆదేశించింది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి పొందిన లైసెన్సు పత్రాలను తమ ముందు అయిదు రోజుల్లో ఉంచాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. గూగుల్ ప్లే డెవలపర్ డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్‌కు లోబడే డెవలపర్లు పనిచేయాల్సి ఉంటుందని సంస్థ గుర్తు చేసింది. విఫలమైన యాప్స్‌ను ముందస్తు నోటీసు లేకుండానే తొలగిస్తామని హెచ్చరించింది. ఆన్లైన్ రుణ వేధింపుల సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో.. డిజిటల్ రుణాల క్రమబద్ధమైన వృద్ధిని ప్రోత్సహించడానికి, నియంత్రణ చర్యలను సూచించడానికి ఒక బృందాన్ని నియమించినట్టు ఆర్బీఐ బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొస్తున్న ఫిన్‌టెక్ యాప్స్‌పై కన్నేసి ఉంచాలన్న ఆర్బీఐ ఆదేశాల నేపథ్యంలో గూగుల్ తాజా చర్యలకు దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. కీలక వివరాలు ఉండాల్సిందే..: వ్యక్తిగత రుణాలను అందిస్తున్న ఫైనాన్షియల్ సర్వీసెస్ యాప్స్.. రుణాలను తిరిగి చెల్లించాల్సిన కనీస, గరిష్ట కాల పరిమితి, గరిష్ట వార్షిక వడ్డీ శాతం, మొత్తం లోన్‌కు అయ్యే ఖర్చు వంటి కీలక వివరాలను ముందస్తుగా వెల్లడించాల్సిందేనని గూగుల్ స్పష్టం చేసింది. తద్వారా నిర్ణయం తీసుకోవడానికి కస్టమర్లకు ఆస్కారం ఉంటుందని, మోసానికి గురయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తుందని తెలిపింది. రుణం జారీ చేసిన తేదీ నుండి 60 రోజులు, అంతకన్నా ఎక్కువ రోజుల్లో తిరిగి చెల్లించాల్సిన వ్యక్తిగత రుణ యాప్స్‌ను మాత్రమే గూగుల్ అనుమతిస్తుంది. డెవలపర్లు ప్రస్తుత సేవలను అమలు చేయడానికి అవసరమైన అనుమతులను మాత్రమే యూజర్ల నుంచి అభ్యర్థించాలి. వారు బహిర్గతం చేయని, అమలు చేయని, అనుమతించని ప్రయోజనాల కోసం వినియోగదారు లేదా వారి మొబైల్లో ఉన్న సమాచారాన్ని ఉపయోగించరాదని హెచ్చరించింది. అనుమతి తీసుకోవాలి.. డెవలపర్లు వినియోగదారు అంగీకరించిన ప్రయోజనాల కోసం మాత్రమే డేటాను ఉపయోగించాలి. తరువాత వారు ఇతర ప్రయోజనాల కోసం డేటాను ఉపయోగించాలనుకుంటే, వారు అదనపు ఉపయోగాలకు వినియోగదారు అనుమతి పొందాలని గూగుల్ స్పష్టం చేసింది. దర్యాప్తులో భాగంగా చట్టాన్ని అమలు చేసే సంస్థలకు సహకరిస్తామని సంస్థ తెలిపింది. ‘గూగుల్ ఉత్పత్తుల ద్వారా సురక్షిత, భద్రమైన అనుభవాన్ని కస్టమర్లకు అందించడం మా ప్రాధాన్యం. మా గ్లోబల్ ప్రొడక్ట్ పాలసీలు ఈ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించి, అమలు చేయబడ్డాయి. వినియోగదార్ల భద్రతను పెంచడానికి మా పద్ధతులను మెరుగుపరచడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తున్నాము’ అని వివరించింది. -
లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలి
ఇల్లంతకుంట(మానకొండూర్): లోన్‌యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గాలిపల్లికి చెందిన మల్లుగారి పవన్‌కళ్యాణ్‌రెడ్డి (22) కరీంనగర్లో డిగ్రీ పూర్తిచేసి ఇంట్లోనే ఉంటున్నాడు. వ్యక్తిగత అవసరాలకు ఇటీవల ఆన్లైన్ లోన్ యాప్ ద్వారా రుణం తీసుకున్నాడు. కొద్దిరోజుల క్రితం తన సోదరి వద్ద రూ.10,000 తీసుకుని కొంత అప్పు తీర్చాడు. మిగతా డబ్బు కోసం లోన్‌యాప్ నిర్వాహకులు పవన్కళ్యాణ్రెడ్డిని వేధించడంతోపాటు అతడి సోదరికి కూడా ఫోన్ చేశారు. (చదవండి: అగ్ని ప్రమాదం.. 10 మంది శిశువులు మృతి) ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఇబ్బందులు ఎదురవుతాయేమోననే భయంతో శుక్రవారం తెల్లవారుజామున పవన్ ఇంట్లో దూలానికి ఉరివేసుకున్నాడు. అయితే, పవన్‌కళ్యాణ్‌రెడ్డి ఎంత మొత్తం రుణం తీసుకున్నాడనేది ఆరా తీస్తున్నామని పోలీసులు చెప్పారు. అప్పు విషయం తల్లిదండ్రులకు చెప్పకపోవడం, దాన్ని ఎలా తీర్చాలో తెలియకనే ఆందోళనతో ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. మృతుడి తండ్రి రాజిరెడ్డి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. (చదవండి: కరోనా భయంతో బ్యాంక్ ఉద్యోగిని ఆత్మహత్య) -
లోన్ యాప్.. కటకటాల్లోకి బెంగళూరు కీర్తి
సాక్షి, బెంగళూరు: అక్రమ మైక్రో ఫైనాన్సింగ్‌కు పాల్పడిన లోన్ యాప్స్ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మరో యువతిని అరెస్టు చేశారు. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించిన ఎన్యూ టెక్నాలజీస్ సంస్థ హెచ్ ఆర్ విభాగం మేనేజర్ కీర్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్ తీసుకువచ్చారు. ఈ సంస్థకు హెడ్‌గా వ్యవహరించిన సూత్రధారి నాగరాజు సోదరుడు ఈశ్వర్‌ను గత వారమే అరెస్టు చేశారు. అప్పటినుంచి పరారీలో ఉన్న కీర్తి కోసం గాలించిన ప్రత్యేక బృందం ఆదివారం పట్టుకోగలిగింది. ఈ ద్ఙారుణ’ యాప్స్ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించిన, ఇండోనేషియా కేంద్రంగా కార్యకలాపాలు నడిపిన చైనీయురాలు యాన్ యాన్ అలియాస్ జెన్నీఫర్‌తో ఈమె నేరుగా సంబంధాలు కలిగి ఉన్నట్లు ఆధారాలు సేకరించారు. ఆమెతో వాట్సాప్ ద్వారా తరచు సంప్రదింపులు జరిపినట్లు పేర్కొంటున్నారు. (చదవండి: లోన్ యాప్.. కటకటాల్లోకి చైనీయులు) లోన్ యాప్స్ వేధింపులకు సంబంధించి సిటీలో ఇప్పటి వరకు 28 కేసులు నమోదు కాగా... చైనీయుడితో సహా 17 మందిని అరెస్టు చేశారు. 27 బ్యాంకు ఖాతాలతో సహా వర్చువల్ ఖాతాల్లో ఉన్న రూ.100 కోట్లకు పైగా మొత్తాన్ని ఫ్రీజ్ చేశారు. ఈ లోన్ యాప్స్‌కు ఢిల్లీ, గుర్గావ్, బెంగళూరుల్లో ఉన్న మరికొన్ని కంపెనీలతోనూ లింకులు ఉన్నట్లు గుర్తించారు. వాటి వ్యవహారాలను దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. వీటి ఏర్పాటులో కీలకమైన చైనీయులు వివిధ నగరాల్లో ట్రాన్స్‌లేటర్లను ఏర్పాటు చేసుకున్నారు. రిజిస్ట్రేషన్లు, బ్యాంకు ఖాతాల తెరవడం తదితర సందర్భాల్లో వీరి సేవల్ని వినియోగించుకున్నట్లు తెలిపారు. ఢిల్లీకి చెందిన ట్రాన్స్‌లేటర్ ఇంద్రజిత్‌ను గుర్తించిన పోలీసులు మిగిలిన ప్రాంతాల్లో ఉన్న వారి ఆచూకీ కనిపెట్టి వాంగ్మూలాలు నమోదు చేయాలని నిర్ణయించారు. వీరి ద్వారా చైనీయులు కార్యకలాపాలకు సంబంధించి కీలక సమాచారం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. (చదవండి: ఇన్స్టంట్ లోన్స్‌తో ఈ అనర్థాలు తప్పవు)