Intermediate examinations
-
ఇంటర్ స్పాట్ షురూ
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ మొదలైంది. ఈ నెల 16 నుంచి ఈ ప్రక్రియ మరింత ఊపందు కుంటుందని అధికారులు తెలిపారు. నెల రోజు ల పాటు ఇది కొనసాగుతుందని, పరీక్ష ముగిసిన వెంటనే విద్యార్థుల సమాధాన పత్రాలను మూల్యాంకన కేంద్రాల (స్పాట్ వాల్యూయేషన్)కు తరలిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం కలిపి దాదాపు 10 లక్షల మంది వరకు పరీక్షలు రాస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మూల్యాంకన కేంద్రాలనూ పెంచారు. ఆదిలాబాద్ జిల్లాలో ఒకటి, భద్రాద్రి కొత్తగూడెంలో మరో కేంద్రం అదనంగా ఏర్పాటు చేశారు. ఇంటర్ పరీక్షలు గు రువారం ముగియనున్న నేపథ్యంలో మూల్యాంకనం చేపట్టాల్సిన అధ్యాపకులు కొందరు ఇంకా ఇన్విజిలేషన్ విధుల్లోనే ఉన్నారు. పరీక్షలు ముగిసిన వెంటనే వీరు కూడా ‘స్పాట్’లో భాగస్వాములవుతారని ఇంటర్ పరీక్షల విభాగం తెలిపింది. ఈ ఏడాది నుంచి మూల్యాంకనాన్ని ఆన్లైన్లో పూర్తిస్థాయిలో చేపట్టాలని భావించారు. కానీ ప్రభు త్వం నుంచి ఆమోదం లభించకపోవడంతో ఎప్పటిలాగే సాధారణ పద్ధతిలో మూల్యాంకనం చేపడుతున్నారు. నిరంతర పర్యవేక్షణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల సమాధాన పత్రాలు 60 లక్షల వరకూ ఉంటాయి. ఇవి ఎప్పటికప్పుడు మూల్యాంకన కేంద్రానికి చేరుకోగానే ఓఎంఆర్ షీట్లో ఉన్న విద్యార్థి వ్యక్తిగత సమాచారం తొలగిస్తారు. దీని స్థానంలో కోడ్ నంబర్ ఇస్తారు. కోడింగ్ మొత్తం ఇంటర్ బోర్డుకు ఆన్లైన్ ద్వారా అనుసంధానమై ఉంటుంది. తద్వారా సమాధాన పత్రం ఎవరిది అనే విషయం మూల్యాంకనం చేసే వ్యక్తికి తెలియకుండా జాగ్రత్త పడతారు. ఆయా కేంద్రాల్లో నిర్దేశిత సబ్జెక్టు అధ్యాపకులు సమాధాన పత్రాలను పరిశీలించి మార్కులేస్తారు. వీటిని మూడు దఫాలుగా అధికారులు పరిశీలిస్తారు. ఆ తర్వాత మార్కుల వివరాలు ఆన్లైన్ ద్వారా బోర్డుకు అందుతాయి. మార్కులు కంప్యూటరైజ్ చేసిన తర్వాత అధికారులు డీ కోడ్ చేస్తారు. అన్ని సబ్జెక్టు మార్కులను క్రోడీకరిస్తారు. ఆ తర్వాత ఉన్నతాధికారులు సగటున కొన్ని పేపర్లను మరోసారి పరిశీలిస్తారు. ఈ ప్రక్రియ అంతటిపై ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. ఆయా దశలను దాటిన తర్వాత ఫలితాలను వెల్లడిస్తారు. వారం ముందుగానే ఫలితాలు? ఇంటర్ పరీక్ష ఫలితాలను వీలైనంత త్వరగా వెల్లడించాలని బోర్డు భావిస్తోంది. ప్రతి ఏటా ఏ ప్రిల్ నాలుగోవారంలో వెల్లడించడం ఆనవాయితీ. అయితే ఈసారి ఇంతకన్నా ముందే రిజల్ట్స్ ఇవ్వాలని అధికారులు అనుకుంటున్నారు. మూల్యాంకన ప్ర క్రియతో పాటు డీకోడింగ్ విధానాన్ని వేగంగా పూర్తి చేసి మూడో వారంలోనే ఫలితాలు ప్రకటించే ఆలోచనలో ఉన్నారు. వీలైనంత త్వరగా ఫలితాలు ప్రకటించేందుకు కృషి చేస్తున్నామని ఇంటర్ పరీక్షల విభాగం అధికారిణి జయప్రదాభాయ్ తెలిపారు. -
పేపర్ లీక్‌లు ఉండొద్దు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 28 నుంచి ఇంటర్మిడియెట్ థియరీ పరీక్షలు మొదలుకానున్నాయి. 9 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరవుతున్నారు. వచ్చే నెల 18న ప్రారంభంకానున్న పదవ తరగతి పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది హాజరుకానున్నారు. ఈ రెండు పరీక్షలను ప్రభుత్వం కీలకంగా భావిస్తోంది. ఉన్నతాధికారులు ఇప్పటికే పలు దఫాలుగా పరీక్షల నిర్వహణపై సమీక్షలు చేశారు. ముఖ్యమంత్రి కూడా పరీక్షల తీరుపై స్పష్టమైన ఆదేశాలిచ్చారు. గతం కన్నా భిన్నంగా పరీక్షల నిర్వహణ ఉండాలని చెప్పారు. ఎక్కడా పేపర్ లీక్‌లు ఉండొద్దని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో అధికారుల్లో టెన్షన్ కన్పిస్తోంది. ప్రతీ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారు. ప్రశ్నపత్రాల రూపకల్పన మొదలుకొని, వాటిని చేరవేయడం, పరీక్షల తర్వాత సమాధాన పత్రాలను మూల్యాంకన కేంద్రాలకు తరలించడం, మూల్యాంకన నిర్వహించడం, ఫలితాల క్రోడీకరణ, వెల్లడి వరకూ సిబ్బందిని మరింత అప్రమత్తం చేశారు. గతంలో ఫిర్యాదులు లేని వారినే విధుల్లోకి తీసుకునేందుకు ప్రాధాన్యమి చ్చినట్టు అధికారులు చెబుతున్నారు. ఆ భయం తొలగేనా? కొన్నేళ్లుగా ఇంటర్, టెన్త్ పరీక్షల నిర్వహణ అధికారులకు సవాల్‌గా మారుతోంది. హాల్‌టికెట్లు మొదలుకొని, ఫలితాల వరకూ ఏదో ఒక పొరపాటు జరుగుతూనే ఉంది. ప్రశ్నపత్రాల్లో తప్పులు సర్వసాధారణం అవుతున్నాయి. మూల్యాంకన, ఫలితాల వెల్లడిలో జరిగిన కొన్ని పొరపాట్ల కారణంగా 2019లో ఇంటర్ బోర్డ్ వ్యవహారం వివాదాస్పదమైంది. ఆ సమయంలో 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినా ఇంటర్ బోర్డ్ పెద్దగా దిద్దుబాటు చర్యలు చేపట్టలేదనే విమర్శలున్నాయి. ఆ తర్వాత కూడా ఎక్కడో ఒకచోట ప్రశ్నపత్రాల్లో తప్పులు రావడం సమస్యలు తె చ్చిపెట్టింది. ఈసారి ఇలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా బోర్డ్ ముందే అప్రమత్తమైంది. నిపుణులతో ప్రశ్నపత్రాలను రూపొందించారు. గతంలో ఎలాంటి వివాదాలు లేని వారినే ఎంపిక చేసుకున్నారు. అధికారులు ముందే ఈ వివరాలను తెప్పించుకుని మరీ పరిశీలించారు. టెన్త్ పరీక్షలు గత ఏడాది వివాదాలకు దారి తీశాయి. పేపర్ లీకేజీ రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. సమస్యాత్మక కేంద్రాల్లో ఈసారి ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేసినట్టు, ప్రైవేటు స్కూళ్లతో సంబంధాలున్న ఉపాధ్యాయులను విధులకు దూరంగా ఉంచుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. హాల్‌టికెట్ల ఆలస్యంపై దృష్టి : టెన్త్, ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్ల ఆలస్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వం భావించింది. దీనికోసం ప్రత్యేక యంత్రాంగాన్ని నియమించనుంది. ఫీజులు చెల్లించని విద్యార్థులపై ప్రైవేటు స్కూల్, కాలేజీలు పరీక్షల సమయంలో తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నాయి. డౌన్లోడ్ చేసుకునే హాల్‌టికెట్లపై కాలేజీ ప్రిన్సిపల్, స్కూల్ హెచ్ఎం సంతకాలు అవసరమన్న ఆందోళన కల్గిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందుగానే హాల్‌టికెట్ల పంపిణీ చేపట్టాలని నిర్ణయించారు. పరీక్షలు సక్రమంగా నిర్వహించాలి టెన్త్, ఇంటర్ పరీక్షల విషయంలోతప్పిదాలు లేకుండా ముందస్తు జాగ్రత్తలుతీసుకోవాలి. పరీక్షల సమయంలో విద్యార్థులను ప్రైవేటు కాలేజీలు, స్కూళ్లు వేధించకుండా చూడాలి. పేపర్ లీకేజి వంటి ఘటనలు జరగకుండా చూడాలి. –చింతకాయల ఝాన్సీ (ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి) ప్రైవేటుకు కొమ్ముకాయొద్దు ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు అధికారులు సహక రిస్తున్నట్టు గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. ఈసారి అలాంటివి పునరావృతం కాకుండా చూడాలి. పరీక్షలు సజావుగా, ఎలాంటి ఆందోళనలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. –టి నాగరాజు (ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి) -
పరీక్షల నిర్వహణకు అనుమతి ఇవ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిన నేపథ్యంలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. అనుభ శ్రీవాస్తవ సహాయ్ వర్సెస్ కేంద్రప్రభుత్వం కేసులో జస్టిస్ ఏఎంఖన్విల్కర్ , జస్టిస్ దినేష్ మహేశ్వరిలతో కూ డిన ధర్మాసనం ఆదేశాల మేరకు పాఠశాలవిద్య ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ తరఫున ప్రభుత్వ న్యాయవాది మెహ్‌ఫూజ్ నజ్కీ బుధవారం అఫిడవిట్ దాఖలు చేశారు. మే నెలతో పోలిస్తే జూన్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని, నిపుణులు కూడా పరీక్షల నిర్వహణ సాధ్యమేనని సూచించారని ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొంది. కరోనా ప్రొటోకాల్ పాటిస్తూ జూలై చివరివారంలో పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపింది. సుమారు పదిమంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు చొప్పున సిబ్బందిని నియమిస్తున్నట్లు తెలిపింది. కళాశాలలు నిర్వహించే ఇంటర్నల్ పరీక్షల ఫలి తాలపై ఇంటర్మీడియట్ బోర్డుకు ఎలాంటి నియంత్రణ ఉండదని, ఈ పరిస్థితుల్లో ఫైనల్ పరీక్షలకు వందశాతం మార్కులు ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొంది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఎంట్రన్స్ టెస్ట్ (ఈఏపీసెట్)లో 12వ తరగతి మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉందని, ఆయా అంశాలు పరిశీలించి పరీక్షల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరింది. అఫిడవిట్‌లోని మరికొన్ని ప్రధానాంశాలు ► 15 రోజుల ముందుగానే పరీక్ష తేదీలు వెల్లడిస్తాం ► 12వ తరగతి ఫలితాల వెల్లడికి పరీక్షల నిర్వహణ తప్ప ప్రత్యామ్నాయం లేదు. ఎందుకంటే.. పదో తరగతి ఫలితాలు గ్రేడ్లలో ఉంటాయి. కళాశాలల్లో నిర్వహించే ఇంటర్నల్ పరీక్షల మా ర్కులపై బోర్డుకు నియంత్రణ ఉండదు. ఈ నేపథ్యంలో 12వ తరగతి ఫైనల్ ఫలితాలు వందశాతం వెల్లడికి, ఇంటర్నల్ మార్కుల అసెస్మెంట్కు అవకాశం ఉండదు. ► పరీక్షలకు 12వ తరగతికి 5,19,510 మంది, 11వ తరగతికి 5,12,959 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ► ఒకరోజు 11వ తరగతి, మరోరోజు 12వ తరగతి పరీక్షలు నిర్వహిస్తాం. ► పరీక్ష హాలులో 15 నుంచి 18 మంది మాత్రమే విద్యార్థులను అనుమతిస్తున్నాం. గది సైజు 25–25 పరిమాణంలో ఉంటుంది. విద్యార్థుల మధ్య 5 అడుగుల దూరం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాం ► విద్యార్థి పరీక్ష గది వివరాలు కళాశాల ప్రాంగణంలో పలుచోట్ల ప్రదర్శిస్తాం. దీంతో విద్యార్థులు గుమిగూడే అవకాశం ఉండదు. ఒక రోజు ముందే ఆ వివరాలు వెల్లడిస్తాం. ► bei.ap.gov.inలో నో యువర్‌సీట్ ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చు. ► పరీక్ష కేంద్రం వద్ద వైద్యాధికారి, మెడికల్ కిట్ ఏర్పాటు చేస్తున్నాం. ► విద్యార్థులు గుంపులుగా రాకుండా.. ముందుగానే వారిని అనుమతించాలని పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించాం. ► కళాశాలలోకి ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు వేర్వేరుగా ఉంటాయి. ► పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం కోసం 50 వేల సిబ్బందిని నియమించాం. ► పరిస్థితులు కఠినంగా ఉన్నప్పటికీ విద్యార్థుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని తగిన భద్రత, రక్షణ ఏర్పాట్లతో పరీక్షలు నిర్వహిస్తాం. -
ఇంటర్ హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి: మంత్రి ఆదిమూలపు
-
ఏపీ: ఈరోజు సాయంత్రం నుంచి ఇంటర్ హాల్‌టికెట్లు డౌన్లోడ్
సాక్షి, విజయవాడ: ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్లో ఎటువంటి మార్పులు లేవని, మే5 నుంచి పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఇంటర్ పరీక్షలు అనివార్యమని, కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్రంలో మే 5 నుంచి 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి విద్యార్థలు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈరోజు(ఏప్రిల్ 29) సాయంత్రం ఆరు గంటల నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ‘‘కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తాం. ఇందకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇంటర్ పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1452 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశాం. గతేడాదితో పోల్చితే ఈ సారి అదనంగా 41 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశాం. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 146 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా.. అత్యల్పంగా గుంటూరులో 60 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశాం. ప్రతి జిల్లాకు కోవిడ్ స్పెషల్ అధికారిని నియమించాం. పరీక్షా కేంద్రాలను ప్రతిరోజు శానిటైజ్ చేస్తాం. ప్రతి పరీక్షా కేంద్రంలో థర్మల్ స్కానింగ్ ఏర్పాటు చేశాం. విద్యార్థుల భవిష్యత్, భద్రత ప్రభుత్వ బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు. ‘‘ప్రతి సెంటర్లో ఒక పారా మెడికల్ సిబ్బందితో పాటు ఐసోలేషన్ రూమ్ ఏర్పాటు చేస్తాం. కోవిడ్ లక్షణాలు ఉంటే వారిని ఐసోలేషన్ రూమ్‌లో పరీక్ష రాయిస్తాం. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని పరీక్షల నిర్వహణ జరపనున్నాం. దేశంలో ఎక్కడా ఇంటర్ పరీక్షలు రద్దు చేయలేదు. అన్ని భద్రతా ప్రమాణాలతో పరీక్షలు నిర్వహిస్తాం. పరీక్షలపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. విద్యార్థుల జీవితాలతో రాజకీయాలు చేయొద్దు’’ అని సురేష్ కోరారు. చదవండి: సీఎం జగన్ నన్ను బతికిస్తున్నాడమ్మా.. -
జూన్ 7 నుంచి టెన్త్ పరీక్షలు
సాక్షి, అమరావతి: ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను జూన్ 7 నుంచి 16వ తేదీ వరకు నిర్వహిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను బుధవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా వెలగపూడిలోని సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వచ్చే విద్యా సంవత్సరం జూలై 1 నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. టెన్త్, ఇంటర్మీడియెట్ పరీక్షలకు సంబంధించి ఆయన వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. టెన్త్‌లో 7 పేపర్లు: పాఠశాలలను 220 రోజులు నిర్వహించాల్సి ఉండగా కరోనా వల్ల ఈసారి 167 రోజులే నిర్వహించగలుగుతున్నాం. సిలబస్‌లో 35 శాతం తగ్గించి పరీక్షలు నిర్వహిస్తాం. జూన్ 5వ తేదీ వరకు పదో తరగతి క్లాసులు నిర్వహిస్తాం. జూన్ 7నుంచి 16వ తేదీ వరకు నిర్వహించే పదో తరగతి పరీక్షల్లో ఏడు పేపర్లు ఉంటాయి. లాంగ్వేజ్–1, లాంగ్వేజ్–2, ఇంగ్లిష్, లెక్కలు, సాంఘిక శాస్త్రం సబ్జెక్టులలో 100 మార్కులకు ఒక్కొక్క పేపర్ చొప్పున ఉంటుంది. సైన్స్‌కు మాత్రం రెండు పేపర్లు ఉంటాయి. ఫిజికల్ సైన్స్ 50 మార్కులకు, బయలాజికల్ సైన్స్ 50 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తాం. జూలై 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం మే నెల 15వ తేదీ వరకు 1 నుంచి 9వ తరగతి క్లాసులు నిర్వహిస్తాం. ఈ సారి వేసవి సెలవులు లేవు. పరిస్థితిని బట్టి ఒంటిపూట బడులు నిర్వహించే విషయంపై నిర్ణయం తీసుకుంటాం. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు మే 3 నుంచి 15 వరకు వార్షిక పరీక్షలు నిర్వహిస్తాం. మే 16 నుంచి జూన్ 30 వరకు సెలవులు ఇస్తాం. జూలై 1న కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. మే 5 నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు ఇంటర్మీడియెట్ బోర్డు ఇప్పటికే ప్రకటించిన విధంగా మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్మీడియెట్ పరీక్షలు నిర్వహిస్తాం. మార్చి 31 నుంచి ఏప్రిల్ 24 వరకు రెండు సెషన్లుగా జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్స్ నిర్వహిస్తాం. ఈ ఏడాది ఇంటర్మీడియెట్ పరీక్షల ఫీజును 30 శాతం పెంచాల్సి ఉంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఫీజులు పెంచొద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. దాంతో గత ఏడాది మాదిరిగానే పరీక్ష ఫీజు రూ.490, దరఖాస్తు ఫీజు రూ.10, ప్రాక్టికల్స్ ఫీజు రూ.190 చొప్పున మాత్రమే ఈ ఏడాది వసూలు చేస్తాం. గత ఏడాది కరోనా కారణంగా అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ నిర్వహించలేకపోయాం. ఈ ఏడాది నిర్వహించే పరీక్షలతోపాటు ప్రస్తుతం రెండో సంవత్సరంలో ఉన్నవారు మొదటి ఏడాది పరీక్షలు ఇంప్రూవ్మెంట్ కోసం రాసుకోవచ్చు. గత ఏడాది ఇంటర్మీడియెట్ పాస్ అయిన వారు కూడా ఇప్పుడు ఆ పరీక్షలకు ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాసే అవకాశం కల్పించాం. -
ఇంటర్ మూల్యాంకనం ప్రారంభం
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ భౌతికదూరం తదితర జాగ్రత్తలతో సోమవారం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రారంభమైంది. మొత్తం 10.64 లక్షల మంది వివిధ కాంబినేషన్ల కోర్సులతో ఇంటర్ మొదటి, రెండో సంవత్సర పరీక్షలు రాశారు. వీరికి సంబంధించి 60 లక్షలకుపైగా సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉందని ఇంటర్మీడియెట్‌బోర్డు కార్య దర్శి ఎం.రామకృష్ణ తెలిపారు. రోజూ రెండు షిఫ్టుల్లో మూల్యాంకనం జరుగుతుందని పేర్కొన్నారు. ఒక్కొక్క ఎగ్జామినర్‌కు ఉదయం 15, మధ్యాహ్నం 15 చొప్పున 30 పేపర్లు ఇస్తామని, పరిస్థితిని బట్టి వీటి సంఖ్య కొంత పెంచి మూల్యాంకనాన్ని త్వరగా ముగించి ఫలితాలు వెల్లడిస్తామనిì తెలిపారు. గతంలో జిల్లాకొకటి చొప్పున 13 మూల్యాంకన కేంద్రాలుండగా ఇప్పుడు వాటిని మొత్తం 46 కేంద్రాలకు పెంచినట్లు తెలిపారు. కృష్ణా జిల్లాలో 6 కేంద్రాలు, అనంతపురం జిల్లాలో 5, నెల్లూరు, ప్రకాశం, తూ.గోదావరి జిల్లాల్లో 4 చొప్పున, శ్రీకాకుళం, విశాఖ, ప.గోదావరి, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో 3 చొప్పున, విజయనగరం జిల్లాలో 2 కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
జూన్ 3న ఇంటర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా లాక్డౌన్ అమల్లోకి రావడంతో వాయిదా పడిన ఇంటర్మీడియెట్ పరీక్షలను నిర్వహించేందుకు బోర్డు సిద్ధమైంది. ఈ మేరకు జూన్ 3వ తేదీన ఇంటర్ ద్వితీయ సంవత్సర జియాగ్రఫీ పేపర్–2, మోడర్న్ లాంగ్వేజ్ పేపర్–2 పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, పాత పరీక్ష కేంద్రాల్లోనే పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. విద్యార్థులు పాత హాల్ టికెట్లతోనే హాజరు కావచ్చని వెల్లడించారు. -
మార్చి 21 నుంచి టెన్త్ పరీక్షలు!
సాక్షి,హైదరాబాద్: పదోతరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 21నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈమేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం కసరత్తు ముమ్మరం చేసింది. ఇంటర్మీడియేట్ పరీక్షలు ముగిసే రెండ్రోజుల ముందు టెన్త్ పరీక్షలు ప్రారంభిస్తుండగా...ఈ సారి కూడా అదే తరహాలో పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. వారంలోపు పరీక్షల షెడ్యూల్‌ను ప్రభు త్వ పరీక్షల విభాగంప్రకటించే అవకాశం ఉంది. మార్చి21 నుంచి పరీక్షలు ప్రారంభించే అంశంపై అధికారులు చర్చించినప్పటికీ.. షెడ్యూ ల్లో ఒకట్రెండు రోజులు అటుఇటు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్‌ను బోర్డు విడుదల చేసింది. మార్చి 4 నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలను, 5 నుంచి ద్వితీయ సంవత్సర పరీక్షలను ప్రారంభించేలా షెడ్యూలును (టైంటేబుల్) బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ప్రకటించారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇంటర్ జనరల్, వొకేషనల్ విద్యార్థులకు 2020 ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షను జనవరి 28న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, ఎని్వరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను అదే నెల 30న నిర్వహిస్తామని వెల్లడించారు. వొకేషనల్ పరీక్షలకు కూడా ఇవే తేదీలను వర్తింపజేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలకు ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 9.5 లక్షల మంది హాజరుకానున్నారు. -
రీ వెరిఫికేషన్ ప్రాసెసింగ్‌కు స్వతంత్ర సంస్థ
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయి లైన విద్యార్థుల జవాబు పత్రాల రీ వెరిఫికేషన్ చేయా లని నిర్ణయించిన బోర్డు.. వాటి ప్రాసెసింగ్ కోసం మరో స్వతంత్ర సంస్థను నియమించనుంది. ప్రస్తు తం ఫలితాల ప్రాసెసింగ్ చేస్తున్న గ్లోబరీనా సంస్థకు సమాంతరంగా మరో సంస్థ చేత రీ వెరిఫికేషన్ ఫలితాల ప్రాసెసింగ్ చేయించేలా ఏర్పాట్లు చేస్తోంది. స్వతంత్ర సంస్థ ఎంపిక బాధ్యతను తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్‌కు (టీఎస్టీఎస్) అప్పగించింది. ఈ ప్రక్రియ ఒకట్రెండు రోజుల్లో పూర్తి కానుంది. ఇంటర్ ఫలితాల్లో తప్పులపై ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ సూచనల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు బోర్డు కార్యదర్శి అశోక్ పేర్కొన్నారు. భారీ కసరత్తు చేయాల్సిందే... ఇంటర్ పరీక్షల్లో 3.28 లక్షల మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. ఫలితాల్లో చాలా మంది విద్యార్థులకు మార్కులు వచ్చినా సున్నాలు పడటం, పరీక్షలకు హాజరైనా ‘ఆబ్సెంట్’ అని రావడం వంటి తప్పిదాలు చోటుచేసుకోవడం తెలిసిందే. దీంతో విద్యా ర్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కొందరు విద్యార్థులు ఫెయిలయ్యామనే బాధతో ఆత్మహత్యలు సైతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించి నివేదిక తెప్పించుకుంది. పొరపాట్లు దొర్లడం వాస్తవమని గుర్తించిన కమిటీ... ఫెయిలైన విద్యార్థులందరి జవా బు పత్రాలనూ రీ వెరిఫికేషన్ చేయాలని సూచించింది. దీంతో 3.28 లక్షల మంది విద్యార్థులకు చెందిన దాదాపు 11 లక్షల జవాబు పత్రాలను రీ వెరిఫికేషన్ చేసేందుకు బోర్డు చర్యలు చేపట్టింది. మరోవైపు 48,960 మంది విద్యార్థులు తమకు తక్కువ మార్కు లు వచ్చాయంటూ రీ వెరిఫికేషన్ కోసం బోర్డుకు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే మరో 10,576 మంది రీ కౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారికి సంబంధించిన 1,13,339 జవాబు పత్రాలను కూడా రీ వెరిఫికేషన్ చేయాల్సి ఉంది. మొత్తంగా 3,76,960 మంది విద్యార్థులకు సంబంధించిన దాదాపు 12 లక్షల జవాబు పత్రాలను రీ వెరిఫికేషన్ చేయాల్సి ఉంది. లెక్చరర్ల ఆధ్వర్యంలో పది రోజులకుపైగా జరిగే రీ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యాక గ్లోబరీనాతోపాటు కొత్త కంప్యూటర్ సంస్థ ఆధ్వర్యంలో సమాంతరంగా రీ వెరిఫికేషన్ ఫలితాల ప్రాసెసింగ్‌ను బోర్డు చేపట్టనుంది. -
టైమ్‌కి వెళ్లినా.. ఎగ్జామ్‌కు నో ఎంట్రీ!
సాక్షి, హైదరాబాద్/ అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియెట్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షలు బుధవారం ప్రారంభం కాగా... కానీ కొన్ని పరీక్ష కేంద్రాల్లో రూమ్ వెతుక్కోవడంలో అలస్యమైనందుకు ఎగ్జామ్ రాసేందుకు విద్యార్థులను అనుమతించలేదు. సూర్యాపేట జిల్లా కోదాడలో వాగ్దేవి కాలేజీ ఇంటర్ విద్యార్థినిని ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనతో సిబ్బంది బయటకు గెంటేశారు. దీంతో విద్యార్థి సంఘాల ఆందోళన చేపట్టగా పోలీసులు నచ్చజెప్పే యత్నం చేశారు. బాధిత విద్యార్థిని రమాదేవి మాట్లాడుతూ.. నిర్ణీత సమయానికే ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లిన తాను రూమ్ వెతుక్కోవడంలో అలస్యమైనందుకు బయటకు పంపారని చెప్పింది. పరీక్ష రాసేందుకు అనుమతించాలని వేడుకున్నా సిబ్బంది తన మాట వినలేదని వాపోయింది. కాగా, ఏపీలో మొత్తం 1,423 కేంద్రాల్లో, తెలంగాణలో 1,294 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. అయితే నిమిషం నిబంధన కొన్ని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు చిక్కులు పెట్టి పరీక్ష రాయకుండా అడ్డుకుంది. ఉదయం 8.45 నుంచి పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులకు అనుమతించారు. 15 నిమిషాల గ్రేస్ పీరియడ్‌తో ఉదయం 9 గంటల వరకు పరీక్ష కేంద్రాల్లోకి చేరుకున్న విద్యార్థులను పరీక్ష రాసేందుకు అనుమతించినట్లు సిబ్బంది చెబుతున్నారు. -
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు బుధవారం (నేడు) నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం 1,423 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు 10,26,891 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీటిలో 48 కాలేజీల్లో సెల్ఫ్ సెంటర్లను ఏర్పాటుచేశారు. మార్చి 19 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ప్రశ్నపత్రాల సెట్‌ను బుధవారం ఉదయం మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేస్తారని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి చెప్పారు. 28న ఫస్టియర్, 29న సెకండియర్ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఫస్టియర్‌కు 5,09,898 మంది, సెకండియర్‌కు 5,16,993 మంది హాజరవుతారు. వీరిలో వొకేషనల్ విద్యార్థులు 63,419 మంది ఉన్నారు. కాగా, అధికారులు సమస్యాత్మక, సున్నితమైన కేంద్రాలను గుర్తించి ఆయాచోట్ల అదనపు భద్రతా చర్యలు చేపట్టడంతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. పరీక్షలు ఉ.9 గంటల నుంచి మ.12 గంటల వరకు జరుగుతాయి. పరీక్షల్లో కాపీ చేస్తూ పట్టుబడితే నాలుగేళ్ల వరకు అనుమతించకుండా డిబార్ చేసేలా కొత్త నిబంధన పెట్టారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలను సులువుగా గుర్తించేందుకు ‘ఐపీఈ సెంటర్ లొకేటర్’ అనే ప్రత్యేక యాప్‌ను కూడా బోర్డు రూపొందించింది. హాల్‌టికెట్ నెంబర్ నమోదుచేస్తే సెంటర్ రూట్‌మ్యాప్ చూపిస్తుంది. ఇదిలాఉంటే.. ఈ ఏడాది నుంచి ర్యాంకుల స్థానంలో గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెడుతున్న సంగతి తెలసిందే. సందేహాలుంటే సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు: పరీక్షలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే 0866–2974130, ఫ్యాక్స్ నెంబర్ 0866–2970056, టోల్ ఫ్రీ నెంబర్ 18002749868కు తెలియజేయాలని కార్యదర్శి పేర్కొన్నారు. -
ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
► రాష్ట్ర ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్ ► 9వ తేదీ పరీక్షలు 19వ తేదీకి మార్పు ► జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఆదిలాబాద్ అర్బన్ : మార్చి ఒకటి నుంచి 19వ తేదీ వరకు ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ఇంటర్‌బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్, ప్రిన్సిపల్ సెక్రెటరీ రంజీవ్ ఆచార్య అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్మ నిర్వహించారు. పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై చర్చించారు. మార్చి 9న నిర్వహించే గణితం, జువాలజీ, హిస్టరీ పరీక్షలను ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా 19వ తేదీకి మార్చిన విషయాన్ని విద్యార్థులకు తెలియజేయాలని ఆదేశించారు. విద్యార్థులు bietelangana.cgg.gov.in వెబ్సైట్ ద్వారా హాల్‌టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు. తెలంగాణ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ వారు పరీక్ష కేంద్రం లోకేషన్ యాప్‌ను విడుదల చేసిందని, దీని ప్రకారం విద్యార్థి హాల్‌టికెట్ నంబర్, కేంద్రం నంబర్ నమోదు చేస్తే యాప్ ద్వారా పరీక్ష కేంద్రానికి వెళ్లేందుకు రూట్‌మ్యాప్, చేరే సమయం తెలుసుకునే వీలుందని అన్నారు. కలెక్టర్ జ్యోతిబుద్ధ ప్రకాశ్ మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షల్లో మొత్తం 56,655 మంది విద్యార్థులకు గాను 90 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉదయం 8.15 నుంచి 9గంటల వరకు పరీక్ష కేంద్రాల్లో అనుమతిస్తారని అన్నారు. నూతన ఆదిలాబాద్ జిల్లాలో మార్చి 14 నుంచి 30 వరకు, ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు నిర్వహించే 10వ తరగతి పరీక్షల్లో మొత్తం 10,410 విద్యార్థులకు 52 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు.విద్యార్థులు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్షల సమయంలో కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తామని, పరీక్ష సమయంలో అన్ని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని జిరాక్స్ సెంటర్ల యజమానులను ఆదేశించామని తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి, డీఆర్ఓ బానోత్ శంకర్, డీఐవో నాగేందర్, డీఈవో లింగయ్య, డీఎస్పీ లక్షీ్మనారాయణ, మున్సిపల్ కమిషనర్ మంగతాయరు తదితరులు పాల్గొన్నారు. -
నిమిషం ఆలస్యమైనా..
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు పరీక్ష కేంద్రాలకు అరగంట ముందుగానే చేరుకోవాలి.. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు ఈ–హాల్‌టికెట్లు చెల్లుబాటు సందేహాలుంటే సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ : 08462–245333 నిజామాబాద్ అర్బన్ : జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని, 18వ తేదీ వరకు కొనసాగుతాయని, ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి ఒడ్డెన్న తెలిపారు. గురువారం నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. పరీక్ష కేంద్రానికి ఆరగంట ముందుగానే చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రంలోకి అనుమతించబడదని అధికారులు పేర్కొంటున్నారు. సర్వం సిద్ధం జిల్లాలో 43 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 18,101 మంది జనరల్ విద్యార్థులు, 1,607 మంది వోకేషన్ విద్యార్థులు మొత్తం 19,708 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో రెగ్యులర్ విద్యార్థులు 15,649, ప్రైవేట్ విద్యార్థులు 2,440 మంది.. మొత్తం 18,089 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వొకేషనల్‌లో రెగ్యులర్ విద్యార్థులు 1,321, ప్రైవేట్ విద్యార్థులు 177 మంది మొత్తం 1,498 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం మొత్తం మంది విద్యార్థులు 39,295 మంది విద్యార్థులు ఉన్నారు.ప్రభుత్వ కళాశాలలు 17 సెంటర్లు, ఎయిడెడ్–2, రెసిడెన్షియల్–2, మోడల్ స్కూళ్లు–2, ప్రైవేట్‌లో–19 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు 1,007 ఇన్విజిలేటర్లను కేటాయించారు. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు 43 మందిని కేటాయించారు. మాస్‌కాపీయింగ్ నిరోధానికి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్ఐవో తెలిపారు. ఇందుకు సంబంధించి జిల్లాలోని ఫ్లయింగ్స్కా ్వడ్ బృందాలు 2, ఆరు సిట్టింగ్ స్కా ్వడ్ బృందాల తనిఖీలు చేయనున్నారు. కలెక్టర్ అధ్యక్షతన హైపవర్ కమిటీ అందుబాటులో ఉంటుంది. పరీక్ష కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లు మూసివేయనున్నారు. విద్యార్థులు వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లు చెల్లుబాటు అవుతాయని ఆర్ఐవో తెలిపారు. అలాగే విద్యార్థులకు పరీక్ష కేంద్రాలు తెలుసుకునేందుకు లోకేషన్ మ్యాప్‌ను అందుబాటులో తీసుకొచ్చినందుకు విద్యార్థుల హాల్‌టికెట్ నంబర్‌తో సెంటర్లు సులువుగా తెలుసుకోవచ్చును. మార్చి 9న పరీక్ష 19 తేదీకి మార్పు మార్చి 9వ తేదీన నిర్వహించవల్సిన సెకండరీయర్ గణితం–2, జువాలాజీ, హిస్టరీ పరీక్షలు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 19వ తేదీన నిర్వహించనున్నారు. విద్యార్థులకు పాత పరీక్ష కేంద్రాలలోనే పరీక్ష నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఏమైన సందేహాలు ఉంటు 08462–245333 నెంబర్లకు సంప్రదించవచ్చును. -
మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు
ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్ పరీక్షలు షెడ్యూల్ జారీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల వార్షిక పరీక్షల తేదీలను ప్రభుత్వం ఖరారు చేసింది. వచ్చే ఏడాది (2017) మార్చి 1 నుంచి 18వ తేదీ వరకు.. రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహించనుంది. ప్రథమ సంవత్సర పరీక్షలు మార్చి 1 నుంచి 17వ తేదీ వరకు... ద్వితీయ సంవత్సర పరీక్షలు మార్చి 2 నుంచి 18వ తేదీ వరకు జరుగుతారుు. ఈ మేరకు పరీక్షల టైం టేబుల్‌ను ఇంటర్ బోర్డు సోమవారం విడుదల చేసింది. ఇక ‘నైతికత-మానవ విలువల (ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్)’ అంశంపై పరీక్షను 2017 జనవరి 28న, పర్యావరణ విద్య పరీక్షను 31వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తామని తెలిపింది. ఇక ప్రాక్టికల్ పరీక్షలను ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. జనరల్‌తో పాటు వొకేషనల్ విద్యార్థులకు కూడా ఇవే పరీక్ష తేదీలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థారుు సమావేశంలో ఈ టైం టేబుల్‌ను ఖరారు చేశారు. ద్వితీయ భాషా సబ్జెక్టుతో పరీక్షలను ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. -
ఒకటో తేదీ నుంచి ‘ఓపెన్’ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 1 నుంచి 14 వరకు ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఓపెన్ స్కూల్ సొసైటీ డెరైక్టర్ వెంకటేశ్వర శర్మ తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు గురువారం తెలిపారు. 57 కేంద్రాల్లో నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యేందుకు 17,490 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. 67 కేంద్రాల్లో నిర్వహించే ఎస్సెస్సీ పరీక్షలకు 20,659 మంది హాజరు కానున్నట్లు తెలిపారు. హాల్‌టికెట్లను telanganaopenschool.org వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఉదయం 8.30 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని చెప్పారు. మొదటి రోజు పరీక్షకు 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తామని, ఉదయం 9.35 గంటల తర్వాత, మధ్యాహ్నం పరీక్షకు 2.05 గంటల తర్వాత పరీక్ష హాల్లోకి అనుమతించబోమని వెల్లడించారు. రెండో రోజు నుంచి 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పరీక్ష రాసేందుకు రైటింగ్ ప్యాడ్, పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్లు, స్కేల్ వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని చెప్పారు. -
ఇంటర్లో ఫెయిలయ్యారని..
ఇంటర్మీడియట్ పరీక్షలో ఫెయిల్ అయ్యారనే కారణంతో ఈపూర్ మండలంలో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో కోతి చిరంజీవి(17) అనే విద్యారి ప్రాణాలు కోల్పోగా.. వనికుంట గ్రామానికి చెందిన సత్తి శౌరిరాజు(16) అనే విద్యార్థి చేతులు, కాళ్లు, మెడ కోసుకుని స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చిరంజీవి అనే విద్యార్థి తన ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఇంటర్ ఫలితాల రోజు ఈపూర్లో విషాదం నెలకొంది. -
అంతా ఓపెన్
► సార్వత్రిక పరీక్షల్లో చూచిరాతలు ► నిర్వహణ కమిటీలు పనిచేయడం లేదనే ఆరోపణలు ► మెటీరియల్ వెంట తెచ్చుకుని రాస్తున్న విద్యార్థులు సత్తెనపల్లి: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలు చూచి రాతలుగా తయారయ్యాయి. చదువు మధ్యలో మానేసిన వారికి, వివిధ వృత్తుల్లో ఉన్నవారు, గృహిణులు కనీస విద్యార్హతను పెంచుకునేందుకు వీలుగా పరీక్షలకు హాజరవుతున్నారు. పబ్లిక్ పరీక్షల్లో పొందే ఉత్తీర్ణత సర్టిఫికెట్తో సమానంగా దీనికి కూడా విలువ కల్పించారు. నాల్గవ తరగతి ఉద్యోగులుగా కొనసాగుతూ పదోన్నతులు పొందాలనుకునేవారు, అంగన్వాడీ కార్యకర్తల ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారు, ఇతరత్రా ఉద్యోగాల్లో చేరాలనుకునే వారికి ఈ ధ్రువీకరణ పత్రాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. జిల్లాలో పరీక్షలకు 7,838 మంది అభ్యర్థులు జిల్లాలో ఈ నెల 7 నుంచి ప్రారంభమైన ఓపెన్‌స్కూల్ పరీక్షలు 19 వరకు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇంటర్‌కు-11, పదవ తరగతికి- 12 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటర్‌కు 4,120 మంది, పదవ తరగతికి 3,715 మంది హాజరు కావాల్సి ఉంది. పరీక్షల నిర్వహణకు జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా హైపవర్, జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు సక్రమంగా పనిచేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పరీక్ష కేంద్రాల నిర్వాహకులను అభ్యర్థులు సానుకూలపరచుకొని వారు కోరిన విధంగా నగదు సమర్పించి ఏ మాత్రం భయపడకుండా మెటీరియల్ వెంట తెచ్చుకొని పరీక్షలకు హజరౌతున్నారు. పాస్ కావాలంటే తప్పదు ఓపెన్‌స్కూల్ నిబంధనల ప్రకారం ఇంటర్‌కు ప్రవేశ ఫీజు రూ. 3వేలు, పరీక్ష ఫీజు రూ. 750 చెల్లించాలి. పదవ తరగతికి ప్రవేశ ఫీజు రూ. 2 వేలు, పరీక్ష ఫీజు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఒక్కో అభ్యర్థి నుంచి ఇంటర్‌కు రూ. 12 వేలు, పదవ తరగతికి రూ.10 వేలు చొప్పున ఒక మొత్తంగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఆ విధంగా ఇస్తే అన్నీ తామే చూసుకుంటామని, ప్రశాంతంగా పరీక్షలకు హాజరు కావచ్చని ముందే చెప్పి వసూళ్ళకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా అందినకాడికి వసూలు చేసినట్లు తెలుస్తోంది. అభ్యర్థులు కూడా ఏదో విధంగా ఉత్తీర్ణత అయితే చాలన్నట్లు వేలకు వేలు అందజేస్తున్నారు. ఉన్నతాధికారుల తనిఖీలు సత్తెనపల్లిలో ఇంటర్‌కు ఒక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయగా ఇప్పటికి వరుసగా మూడు రోజుల పాటు 19 మందిపై మాల్ ప్రాక్టీస్ కింద కేసులు నమోదు చేశారు. మొదట ఓపెన్ స్కూల్ డెరైక్టర్, గుంటూరు ఆర్జేడీ పి.పార్వతి తనిఖీలు చేపట్టి 12 మందిని మాల్ ప్రాక్టీస్ కింద పట్టుకున్నారు. దీంతో విద్యాశాఖాధికారుల్లో భయాందోళన మొదలై మరుసటి రోజు ఆరుగురిని, మంగళవారం ఒకరిని పట్టుకున్నారు. మొదటి రోజు నలుగురు ఇన్విజిలేటర్లు, ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్టుమెంటల్ ఆఫీసర్‌పై చర్యలకు సిఫార్స్ చేశారు. మిగిలిన రెండు రోజలు పర్యవేక్షకులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదనేది సమాచారం. ఇంత జరిగినా మార్పు లేకపోగా ఇంకా చూచిరాతలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
అంతా ‘ఓపెన్’
► ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో చూచిరాతలు ► ఒకరికి బదులుగా మరొకరు రాస్తున్న వైనం కదిరి టౌన్:- ఓపెన్ స్కూల్ (సార్వత్రిక విద్యాపీఠం) ఇంటర్మీడియట్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు తెరలేపారు. ఈ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. కదిరి పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, హిందూపురం రోడ్డులోని మునిసిపల్ ఉన్నతపాఠశాల, సరస్వతీ విద్యామందిరం కేంద్రాల్లో సుమారు 1,500 మంది పరీక్షలు రాస్తున్నారు. మొదటిరోజే చూచిరాతలను తలపించాయి. యథేచ్ఛగా మాస్ కాపీయింగ్ జరుగుతున్నా ఇన్విజిలేటర్లు, అధికారులు ఏమాత్రమూ పట్టించుకోలేదు. విద్యార్థులు పుస్తకాలను పక్కనే పెట్టుకుని పరీక్ష రాశారు. ఒక బెంచీపై ముగ్గురు కూర్చొని ఒకరికొకరు సమాధానాలు చెప్పుకుంటూ రాయడం కన్పించింది. ఒకరికి బదులు మరొకరు కూడా రాస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అధ్యయన కేంద్రాల నిర్వాహకులు విద్యార్థుల నుంచి పెద్దమొత్తంలో వసూలు చేసి..‘పాస్ గ్యారంటీ’ పేరుతో మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నారు. వారే సమాధాన పత్రాలు తయారు చేసి పంచుతుండటం గమనార్హం. ఈ తంతును చిత్రీకరించేందుకు కెమెరాలతో వెళ్లిన పాత్రికేయులను కొందరు ఇన్విజిలేటర్లు, అధికారులు అడ్డుకున్నారు. కెమెరాలను లాక్కునేందుకు ప్రయత్నించారు. మరి కొందరు పరీక్ష కేంద్రంలోకి మీడియాకు అనుమతి లేదని బుకాయించారు. ఇదే సమయంలో నిర్వాహకులు, ఇన్విజిలేటర్లు అలర్ట్ అయ్యి..విద్యార్థులను వరుస క్రమంలో కూర్చోబెట్టేందుకు ప్రయత్నించారు. పరారైన నకిలీ విద్యార్థులు గుత్తి: పట్టణంలోని మోడల్ స్కూల్, ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో బుధవారం ఓపెన్ ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. మోడల్ స్కూల్ పరీక్ష కేంద్రంలో పది మంది నకిలీ అభ్యర్థులు పరారయ్యారు. పుట్లూరు హైస్కూల్ హెడ్మాస్టర్ లక్ష్మినారాయణను ఇక్కడ స్క్వాడ్‌గా వేశారు. ఈయన విద్యార్థులను చెక్ చేస్తుండగా సుమారు పది మంది నకిలీలు పరీక్ష కేంద్రం నుంచి పరుగులు తీశారు. జి.సంధ్యరాణి (హాల్ టికెట్ నం:1512169558) డి.విశ్వనాథ్(1512169607), శ్యామ్‌లాల్(1512169626), కట్టుబడి సాబ్(1512169629),చక్రవర్తి(1512169642),సురేష్‌బాబు(1512169683)తో పాటు మరో నలుగురి స్థానాల్లో ఇతరులు పరీక్ష రాయడానికి వచ్చారు. స్క్వాడ్ రావడంతో భయపడి పరీక్ష హాల్లో నుంచి పరారయ్యారు. -
ఇదేం ‘పరీక్ష’?
♦ కుర్చీలు, బెంచీలు లేక ఇంటర్ విద్యార్థుల వెతలు ♦ ‘నిమిషం’ నిబంధనతో పలువురు పరీక్షకు దూరం ♦ తొలి రోజు 94.51 శాతం హాజరు నమోదు సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షల నిర్వహణలో తొలి రోజు కొన్ని గందరగోళ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పలు జిల్లాల్లో కూర్చునేందుకు కుర్చీల్లేక, రాసుకునేందుకు బల్లల్లేక విద్యార్థులు అవస్థలు పడ్డారు. గ్రామాల నుంచి పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు సకాలంలో బస్సులందక జిల్లాల్లో, ట్రాఫిక్ సమస్య వల్ల హైదరాబాద్‌లో పలువురు విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు ఆలస్యంగా చేరుకున్నారు. ‘నిమిషం లేటు’ నిబంధన వల్ల వందలాది మంది పరీక్షకు దూరమయ్యారు. పలు జిల్లాల నుంచి మాస్ కాపీయింగ్ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బుధవారం జరిగిన ఇంటర్ ఫస్టియర్ ద్వితీయ భాష పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 4,82,666 మందికి గాను 4,56,148 మంది (94.51శాతం) హాజరైనట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, మాల్‌ప్రాక్టీస్ కేసులూ నమోదు కాలేదని పేర్కొంది. నల్లగొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పరీక్షల పర్యవేక్షణకు ప్రత్యేక పరిశీలకులను పంపారు. ► నిజామాబాద్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో పలు ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో విద్యార్థులకు సరిపడా బెంచీల్లేక నేల మీద కూర్చునే రాయాల్సి వచ్చింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కొన్ని కేంద్రాల్లో కుర్చీలు వేసినా రాసే బల్లల్లేక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ► యాజమాన్యం హాల్టికెట్లివ్వలేదంటూ రాజేంద్రనగర్‌లోని విజనరీ కాలేజీ ముందు విద్యార్థులు ఆందోళన చేశారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఈ కాలేజీ రాజేంద్రనగర్‌లో అనధికారిక శాఖను నడుపుతున్నట్టు తెలిసింది. ► మహబూబ్‌నగర్ జిల్లా నారాయణ్‌పేట్‌లో ఇంటర్ విద్యార్థిని ప్రమాదానికి గురైంది. చికిత్స చేయించుకొని గంట ఆలస్యంగా రాగా పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. ► హైదరాబాద్‌లో మైత్రివనం వద్ద ట్రాఫిక్‌జామ్ కావడంతో యూసుఫ్‌గూడలోని చైతన్య జూనియర్ కాలేజీ పరీక్ష కేంద్రానికి ప్రశ్నపత్రాలు 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చాయి. విద్యార్థులకు ఆ మేర అదనపు సమయమి చ్చా రు. హయత్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కూడా ప్రశ్నపత్రాలు ఆలస్యమయ్యాయి. ► మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్, ఖమ్మం జిల్లా ఇల్లెందు, నల్గొండ జిల్లా ఆత్మకూరు, వరంగల్ జిల్లా సంగెం, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, వికారాబాద్ల్లోని పలు కేంద్రాల్లో భారీగా మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు కంట్రోల్‌రూమ్‌కు ఫిర్యాదులు రావడంతో అక్కడ నిఘా పెంచారు. ► వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని కొన్ని కేంద్రాల్లో విద్యార్థులకు తాము చదువుకున్న సిలబస్ నుంచి కాకుండా వేరే సిలబస్, వేరే గ్రూప్ తాలూకు ప్రశ్నపత్రాలు వచ్చాయి. అధికారులు వెంటనే వాటిని మార్చినట్లు సమాచారం. -
ప్రశాంతంగా ప్రారంభం
కంబాలచెరువు (రాజమండ్రి) : ఇంటర్మీడియట్ పరీక్షలు జిల్లాలో బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఇంటర్ ప్రథమ సంవత్సరంలో సెకండ్ లాంగ్వేజ్‌లో పేపర్- 1 విభాగంలో తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 49,807 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 47,269 మంది హాజరయ్యూరు. 2,538 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలోని మొత్తం 128 కేంద్రాల్లో ఎక్కడా మాల్‌ప్రాక్టీస్, ఆలస్యంగా పరీక్షకు వచ్చిన ఉదంతాలు నమోదు కాలేదు. పరీక్షా కేంద్రాలవద్ద 144 సెక్షన్ విధించారు. ఉదయం 8 గంటలకే కేంద్రాలవద్ద సందడి నెలకొంది. విద్యార్థులు ముందుగానే వచ్చి వారికి కేటాయించిన రూమ్ నంబర్లను హాల్ టిక్కెట్లతో పోల్చిచూసుకున్నారు. పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు ముగిసింది. పరీక్షా కేంద్రాలకు చేరువలోని జిరాక్స్ సెంటర్లను మూసివేశారు. పరీక్ష రాసిన 22 మంది అంధ విద్యార్థులు జిల్లావ్యాప్తంగా 22 మంది అంధ విద్యార్థులు బ్రెయిలీ లిపిలోఇంటర్ పరీక్షలు రాసారు. వీరితో పాటు వికలాంగ విద్యార్థులు 79 మంది, చెవిటి, మూగ విద్యార్థులు 44 మంది, మతిస్థిమితం లేని విద్యార్థులు ముగ్గురు పరీక్షలను రాసారు. వీరందరికీ వ్యక్తిగత సహాయకులను అనుమతించారు. మూడు సిట్టింగ్ స్వ్కాడ్స్, నాలుగు ఫ్లైయింగ్ స్వ్కాడ్స్‌తో పాటు హైపవర్ టీం, ఆర్ఐవో టీం, డీవీఈవో టీంలు పరీక్షా కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాయి. 128 మంది చీఫ్ సూపరిండెండెంట్లు, 128 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లు పరీక్షల నిర్వహణలో పాలు పంచుకున్నారు. రాజమహేంద్రవరం దానవాయిపేటలో ఒకే ప్రాంతంలో నాలుగు పరీక్ష కేంద్రాలు ఉండడంతో ఉదయం సుమారు గంటసేపు ట్రాఫిక్ స్తంభించింది. దీంతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. టెన్షన్‌తో టెన్త్ హాల్ టిక్కెట్ సామర్లకోట : ఎంత కష్టపడి చదివినా, ఎంత ఆత్మవిశ్వాసంతో ఉన్నా.. పిల్లలకు పబ్లిక్ పరీక్షలంటేనే ఏదో కలవరం. తప్పనిసరి తడబాటు. అదిగో.. అలాంటి మానసిక స్థితితో సతమతమయ్యే కాబోలు.. ఓ ఇంటర్ విద్యార్థి నిరుటి పదో తరగతి పరీక్షల హాల్ టిక్కెట్‌తో సామర్లకోట ప్రగతి కళాశాలలోని పరీక్షా కేంద్రానికి వచ్చాడు. ప్రశ్నాపత్రం ఇచ్చే సమయంలో ఆ హాల్ టిక్కెట్‌ను పరిశీలించిన ఇన్విజిలేటర్ అది టెన్త్ హాల్ టిక్కెట్టని, ఇంటర్ హాల్‌టిక్కెట్ ఏదని ప్రశ్నించగా ఆ విద్యార్థి బిత్తరపోరుు, నిస్సహాయంగా ఉండిపోయూడు. అరుుతే పరీక్షా కేంద్రం అధికారులు విద్యార్థికి నష్టం కలుగకుండా ఆన్లైన్లో అప్పటికప్పుడు హాల్‌టిక్కెట్ ను డౌన్లోడ్ చేసి ఇచ్చి పరీక్ష రాసే అవకాశం కల్పించారు. -
సర్వం సిద్ధం
నేటినుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జిల్లాలో రాయనున్న విద్యార్థుల సంఖ్య 47,773 66 కేంద్రాల్లో పరీక్షలు అర్ధగంట ముందే చేరుకోవాలని సూచన నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టీకరణ వెబ్సైట్ ద్వారా ‘హాల్‌టికెట్’ డౌన్లోడ్ విజయనగరం అర్బన్: జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలిరోజున ప్రథమ ఇంటర్ పరీక్షలు, రెండో రోజు సీనియర్ ఇంటర్ పరీక్షలు ప్రారంభం అవుతాయి. జిల్లాలోని 170 ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ కళాశాలలకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయి. ప్రథమ సంవత్సరం 24,062 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 23,711 మంది కలిపి మొత్తం 47,773 మంది పరీక్షలు రాయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 66కేంద్రాలను ఏర్పాటు చేశారు. 66 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 66 మంది డిపార్ట్మెంట్ అధికారులు, పదిమంది సిట్టింగ్ స్క్వాడ్లు, 10 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పనిచేస్తాయి. ప్రతి కేంద్రంలోనూ జంబ్లింగ్ విధానం అమలు చేస్తున్నారు. అరగంట ముందే చేరుకోవాలి పరీక్షల సమయపాలనలో స్వల్ప మార్పులు చేశారు. గతేడాది ఉదయం 9 గంటల్లోగా పరీక్ష కేంద్రానికి తప్పనిసరిగా చేరుకోవాలనే నిబంధన విధించారు. ఈసారి అర్ధగంట ముందే అంటే ఉదయం 8.30 గంటలకు కేంద్రానికి చేరుకోవాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించే ప్రసక్తే లేదని బోర్ఢు అధికారులు స్పష్టం చేశారు. ప్రశ్నపత్రాలను సైతం 8.45 గంటలకు పరీక్ష కేంద్రాలకు తరలిస్తారు. ఒకసారి విద్యార్థికి ప్రశ్నపత్రం ఇచ్చాక ఏకారణం చేతనైనా మాట్లాడించడం, ప్రశ్నలు వేయటం చేయకూడదు. కేంద్రాల్లో ఫర్నిచర్, తాగునీరు, వెలుగు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. వెబ్సైట్ ద్వారా హాల్‌టికెట్ కళాశాల యాజమాన్యం ఏ కారణం చేతనైనా హాల్‌టిక్కెట్ ఇవ్వని నేపధ్యంలో విద్యార్థి పరీక్షకు హాజరుకాలేని పరిస్థితి రాకూడదని ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పోటీ పరీక్షల మాదిరిగానే అభ్యర్థి నేరుగా హాల్‌టికెట్‌ను ‘బిఐఇఏపీ.సీజీజీ.జిఓవిటి.ఐఎన్’ వెబ్సైట్ నుంచి తీసుకునే అవకాశం కల్పించారు. -
రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు
* జిల్లాలో 128 కేంద్రాల్లో నిర్వహణ * ప్రతిచోటా గట్టి బందోబస్తు * 144 సెక్షన్ విధింపు * 0883-2473430తో హెల్ప్‌డెస్క్ కంబాలచెరువు (రాజమండ్రి) : జిల్లాలో బుధవారం నుంచి ఇంటర్మీడియేట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 128 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు అధికారులు సన్నాహాలు చేశారు. ప్రథమ సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభం కానుండగా, ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం మొదలవుతాయి. ప్రథమ సంవత్సరం పరీక్షలను 48,330 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం పరీక్షలను 49,178 మంది విద్యార్థులు రాయనున్నారు. వీరిలో వృత్తి విద్యాకోర్సుల పరీక్షలకు ప్రథమ సంవత్సరంలో 5,892 మంది, ద్వితీయ సంవత్సరంలో 5,237 మంది హాజరు కానున్నారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా 8.30 గంటలకే విద్యార్థులంతా పరీక్షాకేంద్రానికి చేరుకోవాలని, 8.45 గంటలకు కచ్చితంగా పరీక్ష హాలులో ఉండాలని ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎ.వెంకటేష్ చెప్పారు. ప్రతి కేంద్రం వద్దా 144 సెక్షన్ విధించి, గట్టిబందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 8 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించి, మరింత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో అడ్డతీగల, కూనవరం కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే సమస్యాత్మకంగా ఉన్న రంపచోడవరం, రాజోలు కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని జిల్లా ఇంటర్‌బోర్డు అధికారులు ఉన్నతాధికారులను కోరారు. పరీక్షలు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. ఈ ఏడాదినుంచి జీపీఆర్ఎస్ విధానాన్ని పూర్తిగా అమలు చేయనున్నారు. దీనివల్ల పరీక్షా కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికాలు తీసుకు వస్తే సులువుగా గుర్తించవచ్చు. పరీక్షల నిర్వహణకు మొత్తం 128 మంది డిపార్ట్మెంట్స్ ఆఫీసర్లు, 128 మంది చీఫ్ సూపరింటెండెంట్లతో పాటు ఐదు ఫ్లైయింగ్ స్క్వాడ్లు, నాలుగు సిట్టింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశారు. ఈసారి పరీక్షా కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రం పరిసర ప్రాంతాల్లోని అన్ని జిరాక్స్ సెంటర్ల విధిగా మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తితే సహాయం కోసం ఆర్ఐవో కార్యాలయం వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. సహాయం కావాల్సిన వారు నేరుగా లేక 0883- 2473430 నంబర్‌కు ఫోన్ ద్వారా తెలియజేయవచ్చు. -
ఇంటర్ స్పాట్ పైకం పెంపు
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ పరీక్షలు, మూల్యాంకనం (స్పాట్) నిర్వహణలో పాల్గొనే అధికారులకు, అధ్యాపకులకు ఇంటర్మీడియెట్ బోర్డు తీపికబురు అందించింది. ప్రస్తుతం అందజేస్తున్న రెమ్యూనిరేషన్కు మరో 25 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకొంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి ఎంవీ సత్యనారాయణ జారీచేశారు. దీంతో ఇంటర్ పరీక్షలతోపాటు, మూల్యాంకనంలోను పాల్గొనే సుమారు రెండు వేల మంది మంది అధికారులు, అధ్యాపకులు, సిబ్బందికి లబ్ధిచేకూరనుంది. ఇంటర్ ప్రాక్టికల్స్‌కు సైతం పెంచిన రెమ్యూనిరేషన్ వర్తించనుంది. ప్రతి మూడేళ్లకొకసారి పెంపు ఇదిలా ఉండగా ఇకపై ప్రతి మూడేళ్లకు ఒకసారి ఇంటర్మీడియెట్ పరీక్షలు, మూల్యాంకనంలో పాల్గొనే సిబ్బంది రెమ్యూనిరేషన్ పెంచాలని బోర్డు భావించింది. ప్రస్తుతం రోజుకు 30 పేపర్లు దిద్దే ఎగ్జామినర్లకు పేపర్‌కు రూ.12.10 చొప్పున రూ.363 చెల్లిస్తుండగా పెరిగిన రెమ్యూనిరేషన్‌తో రూ.15.125 చొప్పున రూ.453 చెల్లించనున్నారు. పెరుగుతున్న నిత్యవసర ధరలు, భోజన, బస్సు ఛార్జీల నేపథ్యంలో ప్రతి మూడేళ్లకొకసారి రెమ్యూనిరేషన్ను కనీసం 20 శాతం పెంచే దిశగా చర్యలు తీసుకుంటామని బోర్డు కూడా స్పష్టం చేసింది. డీఏ కూడా పెరగనుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన బోర్డుకు, జూనియర్ లెక్చరర్ల సంఘం మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ప్రస్తుతం పెరిగిన ధరలతో పోలిస్తే ఈ రెమ్యూనిరేషన్ ఏ మూలకు సరిపోదని అధ్యాపకులు భావిస్తున్నారు. మూడేళ్లకొకసారి కాకుండా ప్రతి ఏడాది కనీసం 10 శాతం మేర రెమ్యూనిరేషన్ పెంచేలా బోర్డు చొరవతీసుకోవాలని అధ్యాపకులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే వెలువడిన షెడ్యూల్.. ఇదిలా ఉండగా మార్చి 2వ తేదీ నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభంకానుండగా మార్చి 16తో జనరల్ కోర్సుల పరీక్షలు ముగియనున్నాయి. దాదాపు మార్చి 17 నుంచి జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను మొదలుపెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకు జిల్లా అధికార యంత్రంగం ఇప్పటి నుంచి ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నారు. -
మార్చి 2 నుంచి ఏపీ ఇంటర్ పరీక్షలు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షలను వచ్చే ఏడాది మార్చి 2 నుంచి మొదలయ్యే తెలంగాణ పరీక్షలతోపాటే ప్రారంభించేలా షెడ్యూల్‌ను రాష్ట్రప్రభుత్వం ఖరారు చేసింది. ఇందుకు సంబంధించిన ఫైలుపై రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి గంటా శ్రీనివాసరావు సంతకం చేశారు. ఇంటర్ బోర్డు దీనిపై అధికారికంగా ప్రకటన వెలువరించాల్సి ఉంది. ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఏపీ, తెలంగాణ ప్రశ్నపత్రాలు దాదాపు ఒకే మాదిరిగా ఉంటున్నందున.. వేర్వేరు తేదీల్లో ఈ పరీక్షలు జరిగే సమయంలో ముందుగా పరీక్ష జరిగే రాష్ట్రం పేపర్లను ప్రైవేటు కళాశాలల వారు మరో రాష్ట్రానికి పంపి కాపీలు చేయిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ తాను ముందుగా ప్రకటించిన(మార్చి 11 నుంచి 30వ తేదీవరకు) షెడ్యూల్‌కు బదులు తెలంగాణ ఇంటర్ బోర్డు షెడ్యూల్‌ను అనుసరించాలని నిర్ణయించింది. మార్చి 2 నుంచి 21 వరకు నిర్వహించేలా తెలంగాణ షెడ్యూల్ వెలువడడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అదే షెడ్యూల్‌కు స్వల్ప మార్పులు చేసిన ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డు ఫైలును మంత్రి ఆమోదానికి పంపింది.