Kathmandu
-
నేపాల్‌లో విమాన ప్రమాదం
కఠ్మాండు: హిమాలయాల నేల నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. కాఠ్మాండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వేపై శౌర్య ఎయిర్‌లైన్స్ విమానం కుప్పకూలిన ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక చిన్నారిసహా ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు ఉన్నారు. పైలట్ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్రగాయాలైన పైలట్ మనీశ్ రత్న శాక్యకు కంటి, వెన్నుముక శస్త్రచికిత్స చేస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 11 గంటల సమయంలో కఠ్మాండు ఎయిర్పోర్ట్ నుంచి పొఖారా సిటీకి బయల్దేరేందుకు టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే బంబార్డియర్ తయారీ సీఆర్జే–200 రకం విమానం కూలింది. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. టేకాఫ్ అయ్యాక ఎడమ వైపుగా పయనించాల్సిన విమానం దిశను హఠాత్తుగా కుడి వైపునకు తిప్పడంతో స్థిరత్వం కోల్పోయి నేలరాలిందని ఎయిర్పోర్ట్ చీఫ్ జగన్నాథ్ నిరౌలా ‘బీబీసీ న్యూస్ నేపాలీ’ వార్తాసంస్థతో చెప్పారు. కూలిన విమానంలో సాధారణ ప్రయాణికులెవరూ లేరుగానీ పైలెట్, సాంకేతిక సిబ్బంది, ఇద్దరూ విమాన సిబ్బందితో కలిపి మొత్తం 19 మంది ఉన్నారు. విమానం రన్ వే మీద పడిన వెంటనే మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. వెంటనే రంగంలోకి దిగిన అగి్నమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మంటలను ఆర్పేశారు. 15 మంది ఘటనాస్థలిలో ముగ్గురు ఆస్పత్రుల్లో చికిత్సపొందుతూ మరణించారు. ఘటనాస్థలిని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి సందర్శించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. టేబుల్ టాప్ రన్‌వే చుట్టూతా ఉండే హిమాలయ పర్వతాల మధ్య నుంచి దిగుతూ నేపాల్ ఎయిర్‌పోర్ట్‌ల గుండా రాకపోకలు సాగించడం ఇక్కడి పైలెట్లకు కత్తిమీద సామే. పర్వతప్రాంతం కావడంతో ఇక్కడి గాలి వీచే దిశ, వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు అనూహ్యంగా మారిపోతుంటాయి. తక్కువ ఎత్తులో నడపడం సవాల్‌తో కూడిన పని. అందులోనూ కఠ్మాండు విమానాశ్రయంలో టేబుల్ టాప్ రన్‌వే ఉంది. అంటే రన్‌వే దాటి ఏమాత్రం ముందుకు వెళ్లినా లోయలో పడే ప్రమాదముంది. రన్‌వేకు ఒక వైపు గానీ, రెండు వైపులా గానీ లోయ లేదా ఏటవాలు భూమి టేబుల్ టాప్ రన్‌వేగా పిలుస్తారు. దీనిపై టేకాఫ్, ల్యాండింగ్ ఖచి్చతత్వంతో చేయకుండా ప్రమాదమే. బుధవారం జరిగిన ప్రమాదానికి ఈ రకం రన్‌వే కూడా ఒక కారణమని వార్తలొచ్చాయి. భారత్‌లో సిమ్లా, కాలికట్, మంగళూరు, లెంగ్‌పుయ్ (మిజోరం), పాక్యోంగ్ (సిక్కిం)లలో ఈ టేబుల్–టాప్ రన్వేలు ఉన్నాయి. వీటిలో కేరళ, మంగళూరులో గతంలో పెద్ద విమాన ప్రమాదాలు జరగడం గమనార్హం. -
నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం.. 18 మంది దుర్మరణం
ఢిల్లీ: నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఖాట్మాండ్‌లోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో రన్‌వే నుంచి టేకాఫ్ తీసుకునే విమానం జారిపోయి కుప్పకూలింది. దీంతో విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న 19 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు 14 మృతదేహాలు లభ్యం అయ్యాయి. పైలట్ ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన్ను ఖాఠ్మాండ్‌లోని మెడికల్ కాలేజీ టీచింగ్ ఆసుపత్రికి తరలించారు. #WATCH | Plane crashes at the Tribhuvan International Airport in Nepal's KathmanduDetails awaited pic.twitter.com/DNXHSvZxCz— ANI (@ANI) July 24, 2024ప్రమాదానికి గురైన విమానం శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందింది. ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకున్నాయి. సహాయక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నేపాల్ ఆర్మీ తమ బృందాన్ని పంపించింది. కొన్నేళ్ల క్రితం త్రిభువన్ ఎయిర్పోర్ట్ వద్ద బంగ్లాదేశ్ ప్రయాణికుల విమానం కూలిపోయింది. ఈ ప్రమదంలో కూడా పదుల సంఖ్యలో ప్రయాణికులు మృతి చెందారు. #BREAKING : A plane has crashed at Tribhuvan International Airport. Sources at TIA reported that the aircraft skidded off the runway during takeoff as it was departing for Pokhara with 19 passengers. #Nepal #planecrash #TribhuvanInternationalAirport #skid #landing #airport… pic.twitter.com/ILnl0zQnZH— mishikasingh (@mishika_singh) July 24, 2024 -
Earthquake in Nepal: నేపాల్‌లో భూకంపం
కాఠ్మండు: నేపాల్ రాజధాని కాఠ్మండును ఆదివారం శక్తివంతమైన భూకంపం కుదిపేసింది. ధడింగ్ జిల్లా కేంద్రంగా ఉదయం 7.39 గంటలకు రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో భూమి కంపించిందని యంత్రాంగం తెలిపింది. మరో 29 నిమిషాల అనంతరం ధడింగ్ జిల్లాలోనే భూ ప్రకంపనలు మరో నాలుగుసార్లు సంభవించినట్లు పేర్కొంది. దీంతో, రాజధాని ప్రాంతంలోని 20 ఇళ్ల వరకు దెబ్బతిన్నాయని, మరో 70 వరకు ఇళ్ల గోడలు బీటలువారాయని పేర్కొంది. ఎటువంటి ప్రాణనష్టం సంభవించినట్లు సమాచారం లేదని వెల్లడించింది. భూకంపం ప్రభావం బాగ్మతి, గండకి ప్రావిన్స్‌ల వరకు కనిపించింది. -
ఆదిపురుష్‌పై బ్యాన్ ఎత్తివేత! జరగనివ్వనంటున్న మేయర్..
మొదట్లో బాక్సాఫీస్ దుమ్ము దులిపిన ఆదిపురుష్ ఇప్పుడు కలెక్షన్ల వేటలో నెమ్మదించింది. అయితే వివాదాలు, విమర్శలు మాత్రం ఇంతవరకు తగ్గనేలేదు. పైపెచ్చు రోజుకో వివాదం సినిమాను చుట్టుముడుతూనే ఉంది. ఇకపోతే ఆదిపురుష్‌లోని ఓ డైలాగ్ వల్ల నేపాల్ ప్రభుత్వం భారతీయ సినిమాలపై కన్నెర్రజేసింది. ఈ సినిమాలో.. సీత భారత్‌లో పుట్టిందని అర్థం వచ్చేలా ఓ డైలాగ్ ఉంది. దీనిపై నేపాల్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నేపాల్ రాజధాని అయిన ఖాట్మండులో సినిమాపై నిషేధం విధించారు. అంతేకాకుండా హిందీ సినిమాలను సైతం బ్యాన్ చేశారు. దీనిపై మేకర్స్ క్షమాపణలు కోరినప్పటికీ అక్కడి ప్రభుత్వం మాత్రం కనికరం చూపించలేదు. దీంతో నేపాల్ ఫిలిం యూనియన్ ఆదిపురుష్‌పై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ పఠాన్ హై కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. సెన్సార్ బోర్డు ఆమోదించిన ఏ సినిమా ప్రదర్శనను కూడా ఆపడానికి వీల్లేదని తెలిపింది. ఆదిపురుష్‌పై బ్యాన్‌ను ఎత్తివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కోర్టు మాటలు కూడా వినేదే లేదంటున్నాడు ఖాట్మండు మేయర్ బాలెన్ షా. 'దేశ సార్వభౌమాదిధికారం, స్వతంత్రత విషయానికి వస్తే నేను ఏ చట్టానికి, న్యాయానికి కూడా కట్టుబడి ఉండను' అని ఫేస్బుక్లో రాసుకొచ్చాడు. చదవండి: మెగా ప్రిన్సెస్ రాక.. నిహారిక రియాక్షన్ చూశారా? నువ్వు లేకుండా ఇల్లు బోసిపోతోంది: నటి ఎమోషనల్ -
నేపాల్ అధ్యక్షుడికి తీవ్ర అస్వస్థత.. ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలింపు
న్యూఢిల్లీ: నేపాల్ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఢిల్లీలోని ఏయిమ్స్‌కు తరలించారు. మంగళవారం ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో రామ్ చంద్రనుతో ఖాట్మాండులోని మహారాజ్‌గంజ్ త్రిభువన్ యూనివర్సిటీ టీచింగ్ హాస్పిటల్‌కు తరలించారు. వైద్య పరీక్షల్లో ఆయన ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఈ క్రమంలో ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో బుధవారం ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. కాగా గత నెల రోజుల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో పౌడెల్ ఆసుపత్రిలో చేరడం ఇది రెండోసారి. ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో ఆయన్ను త్రిభువన్ టీచింగ్ దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. గత 15 రోజులుగా యాంటీబయోటిక్స్ తీసుకుంటున్నప్పటికీ ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మార్పు రాలేదని ఖాట్మండు వార్తాపత్రిక పేర్కొంది. నేపాల్ అధ్యక్షుడిగా రామచంద్ర పౌడెల్ ఈఏడాది మార్చి 10న ఎన్నికయ్యారు. అదేనెల 13న అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. నేపాలీ కాంగ్రెస్‌కు చెందిన రామచంద్ర.. పార్లమెంటులో రెండో అతిపెద్ద పార్టీ సీపీఎన్-యూఎంఎల్ మద్దతునిచ్చిన అభ్యర్థి సుభాష్ చంద్ర నెబ్‌మాంగ్‌పై విజయం సాధించారు. ఈయనకు 214 మంది ఎంపీలు, 352 మంది ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యుల ఓట్లు వచ్చాయి. చదవండి: అమెరికాలో పోలీసుల అదుపులో 17 మంది ‘వాంటెడ్’ సిక్కులు -
నేపాల్ విమాన ప్రమాదం.. జానపద గాయని మృతి
నేపాల్‌లో ఆదివారం జరిగిన విమాన ప్రమాదం అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ సంఘటనలో అయిదుగురు భారతీయులతో సహా 68 మంది మృత్యువాతపడ్డారు. రష్యా సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, ఫ్రెంచ్, అర్జెంటీనా దేశస్థులు కూడా ఉన్నారు. ప్రమాదం నుంచి ఇప్పటి వరకు ఎవరు ప్రాణాలతో బయటపడలేదు. మరో నలుగురి ఆచూకీ తెలియాల్సి ఉంది. ప్రమాద స్థలం వద్ద రెస్కూ చర్యలు సోమవారం తిరిగి ప్రారంభించారు. జానపద గాయని మృతి విమానం కుప్పకూలిన ప్రమాదంలో నేపాల్ ప్రముఖ జానపద గాయని నీరా ఛాంత్యల్ ప్రాణాలు కోల్పోయింది. విమాన ప్రమాదంలో నీరా చనిపోయిందనే విషయాన్ని ఆమె సోదరి హీరా ఛాంత్యల్ షెర్చాన్ వెల్లడించింది. ‘పోఖారాకు విమానంలో బయలుదేరిన నీరా మరణించింది. ఆమె మాఘ్ సంక్రాంతి సందర్భంగా పోఖారరాలో నిర్వహిస్తున్న ఓ ఈవెంట్లో పాల్గొనడం కోసం వెళ్లింది. అంతకుముందు నీరా.. అభిమానులకు మాఘ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది. అందులో రేపు పొఖారాలో చాలా ఎంజాయ్ చేస్తాను అంటూ రాసుకొచ్చింది. ఎవరీ నీరా? కాగా నేపాల్‌లోని బగ్లుండ్ ప్రాంతంలో పుట్టి పెరిగన నీరా.. కొంతకాలంగా రాజధాని ప్రాంతమైన ఖాట్మాండులో నివసిస్తోంది. జానపద పాటలలో పాపులారిటీ సాధించిన ఆమె గొంతుకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. జాతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా వస్తధారణతో ఈవెంట్స్‌లో పాల్గొనే నీరా తన పాటలనుసోషల్ మీడియాలో పోస్టూ చేస్తూ ఉంటుంది. అయితే నీరా ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురవ్వడంతో మాఘ్ సంక్రాంతి కార్యక్రమాన్ని రద్దు చేశామని నేపాల్ ఛంత్యాల్ యువజన సంఘం అధ్యక్షుడు నవీన్ ఘాత్రి ఛంత్యాల్ తెలిపారు. చదవండి: నేపాల్ విమాన దుర్ఘటన.. అయ్యో దేవుడా! ఏ ఒక్కరిని ప్రాణాలతో గుర్తించలేదు.. బ్లాక్ బాక్స్ స్వాధీనం తాజాగా ఆర్మీ అధికారులు సంఘటన స్థలం నుంచి బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి గురైన విమానం బ్లాక్ బాక్స్ లభ్యమైందని ఖాట్మండు విమానాశ్రయ అధికారి షేర్ బాత్ ఠాకూర్ తెలిపారు. కాగా ఈ బ్లాక్ బాక్స్ ద్వారా కాక్‌పిట్‌లో పైలెట్ల మధ్య సంభాషణను రికార్డ్ చేస్తోంది. అంతేగాక ఫ్లైట్ డేటా ఇందులో రికార్డ్ అవుతుంది. ఈ బ్లాక్ బాక్స్ సహాయంతో ప్రమాదానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: గాల్లో ఎగురుతున్నామని ఎంత ఉత్సాహం.. కానీ, గాల్లోనే కలిసిపోతామని..! -
గాల్లో ఎగురుతున్నామని ఎంత ఉత్సాహం.. కానీ, గాల్లోనే కలిసిపోతామని..!
విమాన ప్రమాదం నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం సోమవారం ‘జాతీయ సంతాప దినం’ ప్రకటించింది. విమాన కూలిన ఘటనపై విచారణ జరిపేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ అధ్యక్షతన మంత్రి మండలి అత్యవసర సమావేశాన్ని నిర్వహించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా విమాన దుర్ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 68 మంది మృతదేహాలను గుర్తించగా.. ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదు మరో నలుగురి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయిదుగురు భారతీయులు రెండు ఇంజిన్లు ఫెయిల్ కావడం వల్లనే ప్రమాదం జరిగినట్టు అధికారులు చెప్తున్నారు. ప్రమాదం సమయంలో విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో సహా 72 మంది ఉన్నారు. వీరిలో అదుగురు భారతీయులతో కలిపి మొత్తం 15 విదేశీ ప్రయాణికులు ఉన్నారు. మరణించిన ఐదుగురు భారతీయులను అభిషేక్ కుష్వాహా(25), విషాల్ శర్మ(22), అనిల్ కుమార్ రాజ్‌భర్(27), సోను జైస్వాల్(35),సంజయ్ జైస్వాల్గా గుర్తించారు. అయిదుగురిలో యూపీకి చెందిన నలుగురు శుక్రవారమే(జనవరి 13) ఖట్మాండుకు వచ్చారు. వీరు పర్యాటక కేంద్రమైన లేక్ సిటీ పోఖారాలో పారాగ్లైడింగ్ అస్వాదించేందుకు వచ్చినట్లు దక్షిణ నేపాల్‌లోని సర్లాహి జిల్లా నివాసి అజయ్ కుమరా్ తెలిపారు. తామంతా ఒకే వాహనంలో భారత్ నుంచి వచ్చినట్లు పేర్కొన్నారు. పోఖారాకు బయలు దేరే ముందు పశుపతినాథ్ ఆలయంలో పూజలు నిర్వహించారని,కి సమీపంలోని గౌశాలో, తరువాత హౌట్ డిస్కరీ ఆఫ్ తమెలో బస చేశారని వెల్లడించారు. ఫోఖారా నుంచిగోరఖ్‌పూర్ మీదుగా ఇండియాకు తిరిగి వెళ్లేలా ప్లాన్ చేసుకున్నారని చెప్పారు. యూసీ సీఎం సంతాపం ఘోర ప్రమాదంలో మరణించిన ఐదుగురు భారతీయులలో నలుగురు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. నలుగురు యువకుల మృతదేహాలను సురక్షితంగా ఇంటికి తీసుకురావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి ముందు ఫేస్బుక్ లైవ్ నేపాల్ ప్రమాద ఘటన ముందు విమానంలో ఓ భారతీయ ప్రయాణికుడు ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. సోనూ జైశ్వాల్ అనే అనే యూపీకి చెందిన యువకుడు విమాన ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు.. నవ్వుతూ వీడియో లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. 58 సెకన్ల వీడియోలో విమానం ఒక్కసారిగా ఎడమవైపు మళ్లింపు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. అనంతరం నేలను ఢీకొని, మంటలు వ్యాపించాయి. ఈ దృశ్యాలన్నీ ఫోన్ కెమెరాలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. During the Nepal plane accident,a passenger who was the victim of the accident was doing Facebook Live, the video went viral on social media. At least 68 people have died after a 72-seater plane crashed. #planecrash #NepalPlaneCrash #Nepal #pokhra #NepalPlaneCrashVideo pic.twitter.com/KSLpWhBIRp — Gajraj Singh Parihar (@GAJRAJPARIHAR) January 15, 2023 అసలేం జరిగిందంటే.. నేపాల్ రాజధాని ఖాట్మాండు నుంచి కాస్కీ జిల్లాలోని పొఖారాకు వెళ్తోన్న యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఆదివారం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఖాట్మాండు త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి ఉదయం 10.33 నిమిఫాలకు టేకాఫ్ అవ్వగా.. 20 నిమిషాలు ప్రయాణించిన తర్వాత 10.50 నిమిషాలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి. పోఖారా చేరుకోవడానికి క్షణాల ముందు సెటి గండకి నది ఒడ్డున ఈ దుర్ఘటన జరిగింది. కాగా రెండు వారాల క్రితమే జనవరి 1న ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. విమాన శిథిలాల నుంచి వెలికితీసిన మృతదేహాలను వెలికితీసి పోస్ట్‌మార్టం కోసం గండకి ఆసుపత్రికి తరలించినట్లు జిల్లా అధికారులు తెలిపారు. చాలా మృతదేహాలు తీవ్రంగా కాలిపోయి, గుర్తించలేని విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. కూలిపోయిన విమానం నుంచి భారీగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
నేపాల్ విమాన దుర్ఘటన.. అయ్యో దేవుడా! ఏ ఒక్కరు కూడా..
నేపాల్‌లోని పోఖారా సమీపంలో ఆదివారం విమానం కుప్పకూలిన ఘటన ఘోర విషాదాన్ని మిగిల్చింది. సమయం గడిచే కొద్దీ ప్రమాదంలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దుర్ఘటన సమయంలో మొత్తం 72 మంది ప్రయాణికులు ఉండగా.. ఎవరూ ప్రాణాలతో బయట పడేలా కనిపించడం లేదు. ఒక్కరైనా బతికి బట్టకడతారనే ఆశలు అడియాశలుగా మారుతున్నాయి. ప్రమాద స్థలం నుంచి అధికారులు ఇప్పటివరకు 68 మృతదేహాలను వెలికితీశారు. కాగా యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏటీఆర్-72 విమానం ఆదివారం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఖాట్మండు నుంచి బయలుదేరిన విమానం పోఖారా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు సమీపంలో కుప్పకూలింది. మరికొద్ది క్షణాల్లో ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుందనగా ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం మరింత బాధాకరం. ఘటన సమయంలో విమానంలోప్రయాణికులు, సిబ్బంది సహా మొత్తం 72 మంది ఉన్నారు. వీరిలో 68 ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. విమాన శిథిలాల నుంచి ఆర్మీ అధికారులు 68 మృతదేహాలను వెలికితీయగా.. మరో నలుగురి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఘటన జరిగిన ప్రాంతం ప్రమాదకర ప్రదేశం కావడంతో రెస్క్యూ ప్రయత్నాలకు ఆటంకం కలిగిందని ఆర్మీ సిబ్బంది చెబుతున్నారు. అలాగే ఆదివారం రాత్రి చీకటి పడటంతో రెస్క్యూ చర్యలకు బ్రేక్ పడిందని సోమవారం ఉదయం నుంచి సెర్చ్ ఆపరేషన్ మళ్లీ ప్రారంభం కానుందని వెల్లడించారు. ఇప్పటి వరకు ఎవరిని ప్రాణాలతో గుర్తించలేదని నేపాల్ ఆర్మీ అధికార ప్రతినిధి క్రిష్ణ ప్రసాద్ బండారి తెలిపారు. చదవండి: కేంద్ర మంత్రి కాన్వాయ్‌కు ప్రమాదం.. మరణించిన వారి మృతదేహాలను వెలికితీసి పోస్ట్‌మార్టం కోసం గండకి ఆసుపత్రికి తరలించినట్లు జిల్లా అధికారులు తెలిపారు. చాలా మృతదేహాలు తీవ్రంగా కాలిపోయి, గుర్తించలేని విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రయాణీకులలో 15 మంది విదేశీ పౌరులు ఉన్నారని చెప్పారు. వీరిలో అయిదుగురు భారతీయులు, నలుగురు రష్యన్లు, ఇద్దరు దక్షిణ కొరియన్లు, ఒక ఆస్ట్రేలియన్, ఒక ఫ్రెంచ్, ఒకరు అర్జెంటీనా కాగా మరొకరు ఐర్లాండ్‌కు చెందిన వ్యక్తి. नेपाल प्लेन हादसे से पहले फेसबुक का लाइव वीडियो#NepalPlaneCrash pic.twitter.com/N7lyXS8HEV — Dhyanendra Singh (@dhyanendraj) January 15, 2023 Tragic plane crash in #Pokhara . In this difficult situation, we must acknowledge the bravery of the pilot in potentially preventing further loss of life by avoiding a crash in a populated area.#YetiAirlines #planecrash #Nepalcrash #PokharaAirport #NepalPlaneCrash pic.twitter.com/6yGLgUqEvK — Mutahir Showkat (@mutahirshowkat) January 15, 2023 -
ఎన్నికలు సజావుగా సాగేందుకు... గిఫ్ట్‌గా 200 వాహనాలు
నవంబర్ 20న నేపాల్‌లో ఫెడరల్ పార్లమెంట్‌తో సహా, ప్రావీన్షియల్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసింది. ఐతే అక్కడ సార్వత్రిక ఎన్నికలు సజావుగా సాగేందుకు నేపాల్ వాహనాల కోసం భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించినట్లు భారత కార్యరాయబార కార్యాలయం పేర్కొంది. దీంతో భారత ప్రభుత్వం మంగళవారం వివిధ నేపాలీ సంస్థలకు లాజిస్టకల్ మద్దతు కోసం దాదాపు 200 వాహనాలను బహుమతిగా ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారత ప్రభుత్వం తరుఫున నేపాల్‌లోని భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ్ 200 వాహానాలను నేపాల్ ఆర్థిక మంత్రి జనార్దన్ శర్మకు అందజేశారు. ఈ రెండు వందల వాహనాల్లో సుమారు 120 భద్రతా బలగాలకు, 80 వాహనాలు నేపాల్ ఎన్నికల కమిషన్‌కు చెందినవని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. ఈ మేరకు శీవాస్తవ్ మాట్లాడుతూ...నేపాల్ ప్రభుత్వ ఎన్నికల కార్యక్రమాలను ఏర్పాటు చేయడంలో ఈ వాహనాలు ఉపకరిస్తాయని ఆశిస్తున్నాను. ఈ ఎన్నికలు నేపాల్ విజయవంతంగా నిర్వహించాలి అని ఆకాంక్షించారు. ఈ వాహానాలను గిఫ్ట్‌గా ఇచ్చినందుకు, అలాగే నేపాల్ అభివృద్ధిలో నిరంతరం భాగస్వామ్యం అవుతున్నందుకు భారత్ ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ్క్షతలు తెలిపారు నేపాల్ మంత్రి జనార్దన్ శర్మ. అదీగాక ఎన్నికల సమయంలో వివిధ నేపాలీ సంస్థలకు దాదాపు 2400 వాహానాలు గిఫ్ట్‌గా వచ్చాయి. అందులో నేపాల్ పోలీసులకు, సాయుధ బలగాలకు సుమారు 2000 వాహనాలు కాగా, నేపాల్ సైన్యం, ఎన్నికల కమిషన్‌కి దాదాపు 400 వాహనాలు బహుమతులుగా వచ్చాయి. (చదవండి: మాకు సరైన నాయకుడే లేడంటూ 100 ఏళ్ల వ్యక్తి పార్లమెంట్ బరిలోకి) -
‘త్రీ’ చీర్స్.. చరిత్ర సృష్టించిన అక్కాచెల్లెళ్లు
కాఠ్మాండు: చాలా మంది పిల్లలు వాళ్ల తల్లిదండ్రుల ఆస్తులను వారసత్వంగా పొందుతారు. కానీ తండ్రి ఇష్టాన్నే తమ ఇష్టంగా భావించారీ ముగ్గురు అక్కాచెల్లెళ్లు. తండ్రికి ఇష్టమైన పర్వతారోహణను వారూ స్వీకరించి ముగ్గురికి ముగ్గురూ ఎవరెస్ట్‌ను అధిరోహించారు. తద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డునూ నెలకొల్పారు. ఇప్పటివరకూ ఇంతమంది అక్కాచెల్లెళ్లు ఒకేసారి ఎవరెస్ట్ ఎక్కలేదట. ఆ రికార్డును వారు తమ తండ్రికి అంకితం కూడా చేశారు. ఇది తమ మొదటి అడుగేనని, త్వరలో రష్యాలోని ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహిస్తామని చెబుతున్నారు. అంతేకాదు.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరాలైన ‘సెవెన్ సమ్మిట్స్’ పూర్తి చేసి రికార్డ్ నెలకొల్పాలనే ప్లాన్‌లో ఉన్నారు నేపాల్‌కు చెందిన దావా ఫుతి షెర్పా, నిమా జంగ్మూ షెర్పా, సెరింగ్ నంగ్యా షెర్పా. వీళ్ల తాత కూడా పర్వతారోహకుడే. ఇక వాళ్ల నాన్న డోర్జీ షెర్పా పర్వతారోహణ శిక్షకుడిగా, గైడ్‌గానూ పనిచేశాడు. మొట్టమొదటి సారి ఆయన 1982లో జపనీస్ పర్వతారోహకులతో కలిసి చలికాలంలో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినప్పుడు ఆ చల్లదనానికి ఆయన ఎనిమిది వేళ్లు పాడైపోయాయి. అయినా ఆయన పర్వతారోహణను మానలేదు. 2007 వరకు కొనసాగించాడు. ఆ తండ్రి వారసత్వాన్ని పిల్లలూ తీసుకున్నారు. ఈ అక్కాచెల్లెళ్లకంటే ముందు వాళ్ల సోదరుడు మింగ్మా సైతం ఆరుసార్లు ఎవరెస్టును అధిరోహించాడు. అంటే.. ఫ్యామిలీ ఫ్యామిలీ పర్వతారోహకులన్నమాట. చదవండి: రిషి సునాక్‌కు ఇబ్బందికర ప్రశ్నలు.. ఎందుకు వెన్నుపోటు పొడిచారని అడిగిన టోరీ సభ్యులు -
ఒక్కసారి కాదు.. ఏకంగా 26 సార్లు ఎవరెస్టు ఎక్కేశాడు
కఠ్మాండూ: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని జీవితంలో కనీసం ఒక్కసారైన అధిరోహించాలన్నది ఎందరో పర్వతారోహకుల కల. అలాంటిది, నేపాల్‌కు చెందిన షెర్పా కామి రీతా ఎవరెస్టును ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు, ఏకంగా 26 సార్లు అధిరోహించాడు! ఆ క్రమంలో తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. 52 ఏళ్ల కామి 10 మందితో కూడిన బృందానికి నేతృత్వం వహిస్తూ శనివారం 26వ సారి ఎవరెస్టును ఎక్కినట్టు సెవన్ సమ్మిట్ ట్రెక్స్ ప్రైవేటు లిమిటెడ్ మేనేజర్ దావా షెర్పా వెల్లడించారు. 1953లో సర్ ఎడ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్కే తొలిసారి వెళ్లిన ఏ మార్గంలోనే కామి బృందం కూడా శిఖరానికి చేరింది. రీతా తొలిసారి 1994లో ఎవరెస్టును అధిరోహించాడు. ప్రపంచంలో రెండో ఎత్తైన మౌంట్ గాడ్విన్ ఆస్టిన్ (కే2)తో పాటు హోత్సే, మనాస్లూ, చో ఓయూ శిఖరాలను కూడా ఆయన ఎక్కాడు. 8 వేల మీటర్ల కంటే ఎత్తైన ఎక్కువ శిఖరాలను అధిరోహించిన రికార్డు కూడా రీతాదే! 8,848.86 మీటర్ల ఎత్తైన ఎవరెస్టును ఎక్కడానికి నేపాల్ పర్యాటక శాఖ ఈ ఏడాది 316 మందికి అనుమతినిచ్చింది. -
నేపాల్‌లో వర్ష బీభత్సం.. భారత్‌లోనూ ప్రభావం
ఖాట్మండూ: నేపాల్‌లోని సింధుపాల్‌చౌక్‌లో వర్షం బీబత్సం సృష్టించిందని మధ్య నేపాల్ జిల్లా అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై సింధుపాల్‌చౌక్ చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అరుణ్ పోఖ్రెల్ మాట్లాడుతూ.. మంగళవారం ఎడతెగని వర్షం వల్ల ఇంద్రవతి, మేలంచి నదిలో నీటి మట్టం పెరిగినట్లు తెలిపారు. వదల్లో చిక్కుకుని ఓ వ్యక్తి మరణించినట్లు వెల్లడించారు. కాగా పదుల సంఖ్యలో జనం వదల్లో కొట్టుకుపోయినట్లు అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక వరదల్లో చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ వర్ష ప్రభావం భారత్‌లోని కొన్ని ప్రాంతాలపై ఉన్నట్లు తెలుస్తోంది. నేపాల్‌లో నిరంతర వర్షం కారణంగా బీహార్‌లోని గండక్ నదిలో నీటి మట్టం చాలా వరకు పెరిగింది. చదవండి: భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో ఉగ్రవాది హతం -
నేపాల్ ప్రధానికి సుప్రీం షాక్
కఠ్మాండు: నేపాల్ ప్రధానమంత్రి కేపీ ఓలి ప్రయత్నాలకు సుప్రీంకోర్టు గట్టి షాకిచ్చింది. మధ్యంతర ఎన్నికల ద్వారా తిరిగి అధికారంలోకి వచ్చేందుకు పార్లమెంట్‌లోని ప్రతినిధుల సభను రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమంటూ తీర్పునిచ్చింది. ఆ నిర్ణయం చెల్లుబాటుకాదని తెలిపింది. పునరుద్ధరించిన పార్లమెంట్ దిగువ సభను 13 రోజుల్లోగా తిరిగి సమావేశపర్చాలంటూ ఆదేశించింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చోళేంద్ర షంషేర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ మేరకు మంగళవారం సంచలన తీర్పు వెలువ రించింది. అధికార పార్టీకి, ప్రధాని కేపీ ఓలికి మధ్య తలెత్తిన విభేదాల నేపథ్యంలో దేశంలో రాజకీయ సంక్షోభం ప్రారంభమైంది. గతేడాది డిసెంబర్ 20వ తేదీన దిగువ సభ రద్దు, ఏప్రిల్‌లో ఎన్నికల నిర్వహణకు తేదీలను ప్రకటిస్తూ అధ్యక్షురాలు విద్యాదేవి భండారీ ఉత్తర్వులు జారీ చేశారు. -
విరిగిపడిన కొండచరియలు.. 12 మంది మృతి
ఖాట్మండు : నేపాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తుతున్నాయి. కొన్నిచోట్ల నదులవెంట ఉన్న ఇండ్లు కొట్టుకుపోయాయి. మరికొన్నిచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ముఖ్యంగా కస్కీ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ ఘటనల్లో ఇప్పటికే 12 మంది మృతిచెందగా మరో 19 మంది శిథిలాల్లో చిక్కుకుపోయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగి నివాస స్థలాలపై పడడంతో చాలా ఇండ్లు నేలమట్టమయ్యాయి. దీంతో చాలామంది వాటికింద చిక్కుకుపోయారు. అన్ని ప్రాంతాల్లో కలిపి ఇప్పటివరకు 44 మంది గల్లంతైనట్లు గుర్తించామని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నేపాల్ అధికారులు అంచనా వేశారు. శిథిలాల కింద గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ముఖ్యంగా పొఖారా పట్టణానికి సమీపంలోని సారంగ్‌కోట్, హేమ్‌జాన్ ప్రాంతాల్లో ఎక్కువగా కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు వెల్లడించారు. మ్యాగ్డీ జిల్లాలోనూ కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో మరో 12 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లోనూ ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు. -
ఎన్‌బీఐతో ఎస్బీఐ ఒప్పందం
ముంబై: ఖాట్మండు నేషనల్ బ్యాంకింగ్ ఇనిస్టిట్యూట్ (ఎన్‌బీఐ)తో అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై సంతకం చేసినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రకటించింది. మౌలిక, పరిపాలనా సదుపాయాలను ఇరు సంస్థలు వినియోగించుకునేందుకు ఈ ఎంఓయూ వీలు కల్పిస్తుందని ఒక ప్రకటనలో వివరించింది. బ్యాంకింగ్ రంగంలో అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన మానవ వనరులను సమకూర్చడం కోసం వ్యూహాత్మక కూటమి ఏర్పాటు ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమని పేర్కొంది. -
కూలిన హెలికాప్టర్.. ఏడుగురు గల్లంతు
ఖాట్మండు : సెంట్రల్ నేపాల్‌లోని కొండప్రాంతంలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆల్టిట్యూడ్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఓ హెలికాప్టర్ కుప్పకూలడంతో పైలట్ సహా ఏడుగురు గల్లంతయ్యారు. ఇందులో ఓ జపాన్ పర్యాటకుడితోపాటూ ఐదుగురు నేపాలీలు ఉన్నట్టు సమాచారం. నేపాల్‌లోని గోర్ఖా జిల్లాలోని సమాగౌన్ నుంచి హెలికాప్టర్ బయల్దేరిన కొద్దిసేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూంతో సంబంధాలు తెగిపోయాయి. దట్టమైన అటవీ ప్రాంతమైన సత్యవాహిలో హెలికాప్టర్ శకలాలు ఉన్నట్టు గుర్తించారు. శకలాలు ఉన్న ప్రాంతం ఎత్తైన కొండపైన ఉండటం, ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు ఇబ్బందిగా మారింది. -
ఖట్మాండు; ఇండియన్ ఎంబసీ వద్ద పేలుడు
ఖట్మాండు: నేపాల్ రాజధాని ఖట్మాండులో మంగళవారం ఉదయం పేలుడు సంభవించింది. బిరత్‌నగర్ ప్రాంతంలోని భారత రాయబార కార్యాలయానికి సమీపంలో పేలుళ్లు జరగడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. అయితే ఈ ఘటనలో ప్రాణనష్టంగానీ, గాయపడటంగానీ జరగలేదని అధికారులు . పేలుడు తీవ్రత స్వల్పమే అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా రాయబార కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. మంగళవారం ఉదయం సుమారు 8:20 గంటలకు ఘటన జరిగిందని, పేలుడు ధాటికి కార్యాలయం ప్రహారీ గోడ ధ్వంసమైందని, అయితే ఆ సమయంలో ఆఫీసులో ఎవరూ లేరని నేపాల్ పోలీసులు చెప్పారు. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, పేలుడుకు గల కారణాలను కనిపెడతామని చెప్పారు. ప్రస్తుతం భారతీయ రాయబార కార్యాలయంలో సాధారణ స్థితి నెలకొందని అధికారులు పేర్కొన్నారు. -
ప్రపంచ వలసల సదస్సులో పాల్గొన్న డా. త్రిలోక్
ఖాట్మండు : నేపాల్ దేశ రాజధాని ఖాట్మండు లో జరిగిన ఆసియా ప్రాంతీయ సదస్సుకు తెలంగాణ ఇమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరమ్ (తెలంగాణ ప్రవాసి సంక్షేమ వేదిక) పక్షాన డా. కలాలి త్రిలోక్ చందన్ గౌడ్ హాజరయ్యారు. 'ప్రపంచ వలసల సమగ్ర విధాన ప్రక్రియ' అనే అంశంపై ఐక్యరాజ్య సమితి రూపొందించిన తుది ముసాయిదాపై ఈనెల 21 నుండి 23 వరకు జరిగిన సమావేశాల్లో త్రిలోక్ పాల్గొన్నారు. భారతీయ వలస కార్మికులు, కార్మిక సంఘాలు, సామాజిక సంస్థల అభిప్రాయాలను డా. త్రిలోక్ మూడు రోజుల సదస్సులో వివరించారు. వలసకార్మికుల హక్కుల రక్షణ, సంక్షేమం గురించి అన్ని ప్రభుత్వాలు కృషిచేయాలని ఆయన కోరారు. ప్రవాస భారతీయ కార్మికుల స్థితిగతుల గురించి పరిశోధన చేసిన త్రిలోక్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పొందారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన డా. త్రిలోక్ తెలంగాణ ప్రవాసి సంక్షేమ వేదిక సంస్థలో ప్రవాస భారతీయుల విభాగం కోఆర్డినేటర్ గా సేవలందిస్తున్నారు. -
నేపాల్‌లో జరిగే అంతర్జాతీయ వలసల శిక్షణకు బషీర్
ఖాట్మండు : నేపాల్ రాజధాని ఖాట్మండులో ఈనెల 21 నుంచి 23 వరకు నిర్వహిస్తున్న అంతర్జాతీయ స్థాయి గల్ఫ్ వలసల భాగస్వామ్య వ్యూహాల శిక్షణకు వరంగల్ జిల్లాకు చెందిన తమ సంస్థ సభ్యుడు మహ్మద్ బషీర్ అహ్మద్ కు ఆహ్వానం అందిందని ఇమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మంద భీంరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఒమన్ దేశంలోని మస్కట్ లో 12 సంవత్సరాలపాటు ఉపాధ్యాయులుగా పనిచేసిన బషీర్ హైదరాబాద్ లో స్థిరపడ్డారు. తెలంగాణ ఇమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం (తెలంగాణ ప్రవాసి వేదిక) లో రిటర్న్డ్ ఓవర్సీస్ ప్రొఫెషనల్స్ (విదేశాల నుండి తిరిగి స్వదేశం వచ్చిన నిపుణులు) విభాగానికి కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ కేంద్రంగా పనిచేసే 'డిప్లొమసి ట్రేనింగ్ ప్రోగ్రాం', ఫిలిప్పీన్స్ లోని మనీలా కేంద్రంగా పనిచేసే 'మైగ్రెంట్ ఫోరమ్ ఇన్ ఏసియా', నేపాల్ లోని ఖాట్మండు కేంద్రంగా పనిచేసే 'నేషనల్ నెట్ వర్క్ ఫర్ సేఫ్ మైగ్రేషన్' అనే మూడు సంస్థలు సంయుక్తంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. గల్ఫ్ మైగ్రేషన్ కారిడార్ (గల్ఫ్ కు వలసలు వెళుతున్న ప్రాంతాలు) లో పనిచేసే సివిల్ సొసైటీ అడ్వొకేట్స్ సమీక్ష కార్యక్రమంలో భాగంగా శిక్షణ ఇవ్వడానికి వివిధ దేశాల నుండి పలువురు వలస కార్మిక నాయకులు, సమాజ సేవకులను ఆహ్వానించారు. కార్మికులను పంపే దేశాలు, కార్మికులను స్వీకరించే దేశాల మధ్య సమర్థవంతమైన వలసల భాగస్వామ్య వ్యూహాలపై ప్రధానమైన చర్చ జరుగుతుంది. -
నేపాల్ విమాన ప్రమాదం
-
కఠ్మాండు ఎయిర్‌పోర్ట్‌లో కుప్పకూలిన విమానం
-
విమానం క్రాష్‌ల్యాండ్: 50 మంది మృతి
కఠ్మాండు : నేపాల్‌లోని కఠ్మాండు విమానాశ్రయంలో సోమవారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఢాకా నుంచి అమెరికాకు బయలుదేరిన బంగ్లాదేశ్ విమానం కఠ్మాండు అంతర్జాతీయ విమానాశ్రయంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 50మంది ప్రయాణికులు మరణించినట్టు సమాచారం. మరో 20 మంది ప్రయాణికులను సహాయక సిబ్బంది కాపాడి.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఢాకా నుంచి వచ్చిన విమానం.. ఇక్కడి త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగే సమయంలో ఒక్కసారిగా నిలకడ కోల్పోయి.. క్రాష్ ల్యాండ్ అయింది. దీంతో విమానం నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు వెలువడ్డాయి. విమానం క్రాష్‌ల్యాండ్ కావడంతో మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే నేపాల్ ఆర్మీ రంగంలోకి దిగి.. సహాయక చర్యలు చేపట్టింది. అగ్నిమాపక బృందాలు విమానంలో ఎగిసిన మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్నాయి. ఇప్పటివరకు 20మంది ప్రయాణికులను కూలిన విమానం నుంచి కాపాడామని, మరింతమందిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని నేపాల్ ఆర్మీ తెలిపింది. నలుగురు సిబ్బంది, 67మంది ప్రయాణికులు సహా మొత్తం 71మంది విమానంలో ఉన్నారు. వారిలో 50 మంది ప్రయాణికులు మృతిచెందారని రాయిటర్స్ వార్తాసంస్థ పేర్కొంది. సహాయకర చర్యలు కొనసాగుతున్నాయని, కూలిన విమానంలో ప్రాణాలతో ఉన్న కాపాడేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఆర్మీ అధికారులు తెలిపారు. తమ కళ్లముందే విమానం క్రాష్‌ల్యాండ్ అయిందని, ఒక్కసారిగా దట్టమైన పొగలు ఎగిశాయని ఎయిర్‌పోర్టులో ఆ సమయంలో ఉన్న పలువురు ప్రయాణికులు ట్వీట్ చేస్తున్నారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
88 కేజీల బంగారాన్ని కారులో వదిలి పరార్..
ఖాట్మండూ: చైనా నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని భారీ మొత్తంలో పట్టుకుని నేపాల్ పోలీసులు రికార్డు సృష్టించారు. ఈ కేసులో నిందితులైన చైనా దంపతుల కోసం వేట కొనసాగుతోంది. వివరాల్లోకి వెళితే.. వాన్‌మియ్ మింగ్(50), యాంగ్ వై మింగ్ అనే చైనా దంపతులు నేపాల్‌లోని తామెల్ ప్రాంతంలో ఉంటూ ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్నారు. ఈ ముసుగులోనే వారు బంగారం అక్రమంగా తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. సోమవారం ఉదయం వారు తమ కారులో చైనా-నేపాల్ సరిహద్దు ‘రాసువగాది- కెరుంగ్’ మార్గంలో ప్రయాణిస్తుండగా.. పోలీసులు అనుమానంతో వారిని అనుసరించారు. ఈ విషయాన్ని గమనించిన వింగ్ దంపతులు.. కారును రోడ్డు పక్కన వదిలేసి పరారయ్యారు. అనంతరం పోలీసులు కారును తనిఖీ చేయగా.. 88 కేజీల బంగారం బిస్కెట్లు బయటపడ్డాయి. వీటి విలువ దాదాపు 440 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. కారు రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పరారైన దంపతుల కోసం గాలిస్తున్నారు. ఖట్మాండూ పోలీసుల చరిత్రలోనే ఇది అతిపెద్ద పట్టివేత కావడం గమనార్హం. -
అష్టముఖ పశుపతినాథుడు
పశుపతినాథుడి త్రినేత్రం నుంచి పుట్టిన ఆయుధం పాశుపతాశ్రం. దీనిని మించిన ఆయుధం లేదని శివపురాణం చెబుతుంది. త్రిపుర సంహారంలో కాళికాదేవికి, ద్వాపరయుగంలో అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని వరంగా ఇచ్చినవాడు పశుపతినాథుడు. పశుపతినాథ్ దేవాలయం అనగానే మనకు నేపాల్‌లోని కఠ్మాండూ నగరమే ముందుగా గుర్తుకొస్తుంది. అయితే, మన దేశంలోనే శివ్నా నది ఒడ్డున కొలువుదీరిన పశుపతినాథుడు ఎన్నో ప్రత్యేకతలు గలవాడుగా పేరొందాడు. శివ్నా నది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మంద్సౌర్ పట్టణంలో ఉంది. ఈ నదీ తీరంలో ప్రపంచంలో మరెక్కడా లేని మూర్తిగా అష్ట ముఖాలతో ఈశ్వరుడు భక్తకోటిచే పూజలు అందుకుంటున్నాడు. శివ్నా నది గలగలలతో, పశుపతినాథుడిని కీర్తించే భజనలతో ఈ ప్రాంతం ఆధ్యాత్మికతకు అసలు సిసలైన చిరునామాగా నిలుస్తోంది. మంద్సౌర్ పట్టణంలోని శివ్నా నదికి 90 అడుగుల ఎత్తులో 30 అడుగుల విస్తీర్ణంలో 101 అడుగుల పొడవుతో పశుపతినాథ్ దేవాలయం అత్యంత నయనానందకరంగా భాసిల్లుతుంది. దేవాలయం పైన 100 కిలోల స్వర్ణంతో చేసిన గోపుర భాగం సూర్యకిరణాల కాంతిలో మెరుస్తూ భక్తులను అలౌకికమైన ఆనందానికి చేరువచేస్తోంది. ఎక్కడా లేని విధంగా ఈ ఆలయానికి నాలుగు వైపులా నాలుగు మహాద్వారాలు ఆశ్చర్యచకితులను చేస్తాయి. భక్తులు అంతా పశ్చిమ మహాద్వారం గుండానే లోపలికి ప్రవేశిస్తారు. ముందుగా అతి పెద్ద నంది దర్శనమిస్తాడు. నంది ఆశీస్సులు తీసుకొని గర్భాలయంలో అడుగుపెట్టగానే వర్ణించనలవి కానంత అద్భుతంగా స్వామి మూర్తి దర్శనమిస్తుంది. 3.5 మీటర్ల ఎత్తులో శివలింగం పై భాగంలో 4 ముఖాలు, కింది భాగంలో మరో 4 ముఖాలు మొత్తం ఎనిమిది ముఖాలతో ఉన్న స్వామి మూర్తి ప్రకాశవంతమైన నల్లని అగ్నిశిల. పై 4 ముఖాలు స్పషం్టగా, కింది ముఖాలు అస్పష్టంగా కనిపిస్తాయి. మానవజీవితంలోని 4 దశలకు ఈ ముఖాలను సూచికగా చూపుతారు. రుద్ర మూర్తిగా దర్శనమిచ్చే ముఖం మాత్రం ద్వారానికి ఎదురుగా ఉంటుంది. తలకట్టును పాములతో ముడివేసినట్టుగా, మూడో కంటితో స్వామి భక్తులను అనుగ్రహిస్తున్నట్టుగా ఉంటుంది. నాలుగు తలలపైన ఉండే లింగం మీద ‘ఓంకారం’ దర్శనమిస్తుంది. భవ, పశుపతి, మహదేవ, ఈశాన, రుద్ర, వర్వ, ఉగ్ర, అశని రూపాల ముఖాలతో స్వామి భక్తులచే పూజలు అందుకోవడం ఇక్కడి ప్రత్యేకత. మహాశివరాత్రి, కార్తీక ఏకాదశి పర్వదినాలు ఇక్కడ ఘనంగా జరుగుతాయి. ఈ సమయాలలో భక్తులే స్వామికి నైవేద్యాలు సమర్పిస్తారు. స్వామి బరువును తూచతరమా! సృష్టికి ఆద్యుడైన స్వామి ఎత్తు, బరువు ఎంతో చెప్పడం అసంభవమని శివపురాణం స్పష్టం చేస్తోంది. అయితే, ఇక్కడ కొలువున్న పశుపతినాథుడి మూర్తి బరువు 4,665 కిలోలని, స్వర్ణయుగంగా భాసిల్లే గుప్తుల కాలంలో స్వామి ప్రతిష్ట, ఆలయ నిర్మాణం జరిగినట్లుగా ఇక్కడి ఆధారాల ద్వారా తెలుస్తోంది. నాలుగు వేల సంవత్సరాలు అష్టముఖి పశుపతినాథ్ మహాదేవుని రూపాల గురించి వర్ణించడం ఎంత దుర్లభమో ఆయన పుట్టుపూర్వోత్తరాల గురించి తెలుసుకోవడం అసంభమని శివపురాణం చెబుతుంది. పశువులను సంరక్షించేవాడు పశుపతి అని,. సింధూ నాగరికతలో పశుపోషణ ప్రధానంగా ఉండేది కాబట్టి ఆ కాలంలోనే ఈ స్వామి ఆవిర్భవించి ఉంటాడనే కథనాలూ ఉన్నాయి. ఆ విధంగా ఆధారాలను బట్టి చూస్తే 46 వేల ఏళ్ల క్రిందటే స్వామి ఇక్కడ వెలశాడనేది అవగతం అవుతుంది. అగ్నిశిల కావడం వల్లే నేటికీ ఈ రూపం చెక్కుచెదరలేదని తెలుస్తోంది. స్వయంభువు అష్టదిక్కులను సంరక్షించే అధినాయకుడిగా వెలుగొందే స్వామి ఇక్కడ స్వయంభువు. 500 ఏళ్ల కిందట శివ్నా నది ఒడ్డున గల పెద్ద బండరాయి వద్దకు ఒక రజకుడు రోజూ బట్టలు ఉతుక్కోవడానికి వెళుతుండేవాడట. ఒకరోజు అతనికి శివుడు కలలో దర్శనమిచ్చి ఆ చోట బట్టలు ఉతకడం మానేసి, అక్కడ తనను వెలికి తీసి, గుడి కట్టమని, ఈ మూర్తిని దర్శించుకున్నవారికి మోక్షప్రాప్తి కలుగుతుందని తెలియజేశాడట. మరునాడు ఆ రజకుడు తన సహచరులతో వెళ్లి, అక్కడ తవ్వి చూడగా స్వామి విగ్రహం కనిపించింది. దాంతో అక్కడే విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారట. వెలుగు చూసిన విధం వేల ఏళ్లక్రితమే ఇక్కడ వెలిసినా 1940 వేసవి వరకు శివ్నా నది నీటిలో మునిగే ఉన్నాడు పశుపతినాథుడు. నది నీటి మట్టం తగ్గడంతో భక్తులకు పూర్తి రూపంతో 1961లో దర్శనమిచ్చాడు. ఆ మరుసటి యేడు అత్యంత ఘనంగా స్వామి ఆలయ పునరుద్ధరణ జరిగింది. ఆ తరువాత పార్వతి, గణేశ, కార్తికేయ, గంగ, విష్ణు, లక్ష్మి, ఆదిశంకరాచార్య మూర్తులను ప్రతిష్టించారు. ఇక్కడ స్వామిని అందరూ చేత్తో స్పర్శించవచ్చు. అభిషేకాలు చేయవచ్చు. మహాశివరాత్రికి రుద్రాభిషేకం, బిల్వపత్రాలతో పూజలు జరుపుతారు. జలమే అభిషేకించే పుణ్యస్థలి శివుడు అభిషేకప్రియుడనే విషయం తెలిసిందే! అయితే, జలమే జలాభిషేకం చేయడం ఇక్కడి అరుదైన ఘటన. ప్రతి వర్షాకాలం శివ్నా నది ప్రవాహం పెరుగుతుంది. 90 అడుగులకు ఉప్పొంగిన నది శివలింగం అగ్రభాగాన్ని తాకుతూ ప్రవహిస్తుంది. ఈ కాలంలో ఈ ప్రాంతాన్ని దూరం నుంచే దర్శించే వేలాది మంది భక్తులు ఈ అద్భుత దృశ్యానికి పులకించిపోతుంటారు. - చిలుకమర్రి నిర్మలారెడ్డి ప్రత్యేక ప్యాకేజీ మధ్యప్రదేశ్ పర్యాటకశాఖ పశుపతినాథ్, మహాకాళేశ్వర్.. ఇతర ఆలయాల సందర్శ నకు6 రోజుల ప్యాకేజీని అందిస్తోంది. సోమవారం: హైదరాబాద్ - అజ్మీర్ (ట్రెయిన్) ఎక్స్‌ప్రెస్ 20:30 గంటలకు స్టార్ట్. మంగళవారం: మంద్సౌర్ రైల్వేస్టేషన్‌కు 21:51 గంటలకు చేరుతుంది. స్టేషన్ నుంచి ట్యాక్సీ, హోటెల్లో బస, భోజన వసతి. బుధవారం: ఉదయం పశుపతినాథ్ ఆలయ సందర్శనం. ఉజ్జయిని వయా రత్నలమ్. ఇక్కడి విరూపాక్ష, బైద్యనాథ్ మహాదేవ్‌ల దర్శనం. గురువారం: ఉదయం మహాకాళేశ్వర్ భస్మహారతి, జ్యోతిర్లంగ, హరసిద్ధి మాత శక్తిపీఠం, గడకాళిక, కాలభెరవ్, మంగళనాథ్ దేవాలయాల సందర్శన. శుక్రవారం: ఉదయం ఓంకారేశ్వర్ దర్శ నం, మహేశ్వర్ కోట, సాయంకాలం ఓంకార మాంధాత, అమలేశ్వర్ జ్యోతిర్లింగం, నర్మదా నది హారతి దర్శనం. శనివారం: ఉదయం దేవాలయాల సందర్శన. అల్పాహారం. 11 గంటలకు ఖండ్వా రైలేస్టేషన్ నుంచి హైదరాబాద్‌కు అజ్మీర్ ఎక్‌ప్రెస్‌లో తిరుగు ప్రయాణం. ఈ మొత్తం సందర్శన ప్యాకేజీ ధర ఒకరికి: రూ. 8200/- (మినిమమ్ 6 పర్సన్స్) అన్ని చోట్ల బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, బస. అన్ని చోట్ల లగ్జరీ వసతి సదుపాయాలున్నాయి. మరిన్ని వివరాలకు: మధ్యప్రదేశ్ టూరిజమ్, టూరిజమ్ ప్లాజా, బేగంపేట్, హైదరాబాద్ ఫోన్: 040-40034319, 9866069000 -
నేపాల్‌లో భూకంపం
ఖాట్మాండు: నేపాల్‌లో మరోసారి స్వల్ఫ భూప్రకంపనలు సంభవించాయి. శనివారం రాత్రి నేపాల్ రాజధాని ఖాట్మాండులో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.5గా నమోదైంది. ప్రజలు భయంతో ఒక్కసారిగా తమ ఇళ్లలో నుంచి బయటకు పరుగులు పెట్టారు. కాగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఖాట్మాండుకు సమీపంలో ఉన్న లలిత్‌పూర్‌లోని భైన్సేపతిలో భూకంప కేంద్రాన్ని నేషనల్ సెస్మలాజికల్ సెంటర్ గుర్తించింది.