Kerala Governor
-
Narendra Modi: అధైర్యపడొద్దు.. ఆదుకుంటాం
వయనాడ్: భీకర వరదలతో అతలాకుతలమైన కేరళలోని వయనాడ్ జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. వరదల ధాటికి కొట్టుకుపోయిన గ్రామాలు, దెబ్బతిన్న వంతెనలు, ధ్వంసమైన రహదారులు, శిథిలమైన ఇళ్లను పరిశీలించారు. సహాయక శిబిరంలో బాధితులతో స్వయంగా మాట్లాడారు. వరదల్లో ఆప్తులను కోల్పోయిన కుటుంబాల ఆవేదన విని చలించిపోయారు. అధైర్యపడొద్దని, అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వెంట కేరళ గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేంద్ర మంత్రి సురేశ్ గోపీ తదితరులు ఉన్నారు. బురద దారుల్లో మోదీ నడక ప్రధాని మోదీ తొలుత ఢిల్లీ నుంచి కేరళలోని కన్నూర్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి వయనాడ్ జిల్లాలోని చూరమల, ముండక్కై, పుంచిరిమట్టామ్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను పరిశీలించారు. తర్వాత కాల్పెట్టాలో దిగారు. రోడ్డు మార్గంలో చూరమలకు చేరుకున్నారు. బురద, రాళ్లతో నిండిపోయిన దారుల్లో కాలినడకన కలియదిరిగారు. వరద బీభత్సాన్ని స్వయంగా అంచనా వేశారు. ప్రభుత్వ అధికారులతో, సహాయక సిబ్బందితో మాట్లాడారు. సహాయక చర్యలు, క్షేత్రస్థాయి పరిస్థితులను అధికారులు వివరించారు. అనంతరం ప్రధానమంత్రి మెప్పడిలో సహాయక శిబిరానికి చేరుకొని, బాధితులతో సంభాíÙంచారు. వారికి జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. స ర్వం కోల్పోయామంటూ బోరుమని విలపించారు. ప్రధాని మోదీ వారిని ఓదార్చారు. భుజాలపై చేతులు వేసి మాట్లాడారు. గూడు లేని తమకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని బాధి తు లు కోరగా, తప్పకుండా ఇస్తామంటూ మోదీ చెప్పారు. పలువురు చిన్నారులతోనూ ఆయ న సంభాíÙంచారు. వరదల తర్వాత భారత సైన్యం నిర్మించిన 190 అడుగుల బెయిలీ వంతెనపై కాసేపు నడిచారు. మోదీ పర్యటన సందర్భంగా చూరమలలో రహదారికి ఇరువైపులా వందలాది మంది జనం గుమికూడారు. ప్రధానమంత్రి నుంచి సహాయం అరి్థంచడానికి వచ్చామని వారు చెప్పారు. -
కేరళ ప్రభుత్వంపై గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
తిరువనంతపురం: కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ కేరళ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేరళ ప్రభుత్వం.. అధికార సీపీఐ(ఎం) అనుంబంధ విద్యార్థి సంస్థ అయిన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(SFI), ఉగ్రవాద నిరోధక చట్టం(UAPA) కింద కేంద్ర హోంశాఖ నిషేధించిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా( పీఎఫ్ఐ) మధ్య సంబంధాలు కొనిసాగిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేరళ ప్రభుత్వం, గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ మద్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కేరళ ప్రభుత్వం పగలు ఎస్ఎఫ్ఐ కోసం పనిచేస్తే రాత్రి నిషేధిత పీఎఫ్ఐ కోసం పని చేస్తుందని మండిపడ్డారు. ఎస్ఎఫ్ఐ-పీఎఫ్ఐ మధ్య అనుబంధం కొనసాగుతుందని తెలపడానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. కేరళ ప్రజల నుంచి కూడా ఈ విషయాన్ని తాను విన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఖచ్చితమైన పేర్లును చెప్పలేనని.. కానీ కేంద్ర దర్యాప్తు సంస్థల వద్ద దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఉందన్నారు. రాష్ట్రంలోని పలు కీలక అంశాలు, విశ్వవిద్యాలయాల్లో నియామకాలకు సంబంధించి ప్రభుత్వంతో గవర్నర్‌కు విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. ‘క్రేంద దర్యాప్తు సంస్థలకు అన్ని విషయాలు తెలుసు. అరెస్ట్ చేసినవారిలో సుమారు సగం మంది పీఎఫ్ఐకి చెందినవారు ఉన్నారు. ఇది కేరళలో కొత్తకాదు. గతంలో కూడా దీనికి సంబంధించిన పలు ఆరోపణలు.. కేరళ అసెంబ్లీ కూడా చర్చకు వచ్చాయి. కేరళలో పీఎఫ్ఐని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు’ అని గవర్నర్ అన్నారు. గత నెలలో కొల్లం జిల్లాలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి కార్యకర్తలు నల్ల జెండాలు ప్రదర్శింస్తూ గవర్నర్‌కు నిరసన తెలిపారు. దీంతో గవర్నర్ తన కాన్వాయ్ దిగి రోడ్డు పక్కన ఉన్న ఓ షాప్ కూర్చోని ఎస్ఎఫ్ఐ నిరసనకారులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పలు ప్రభుత్వం కార్యక్రమల్లో కూడా కేరళ సీఎం పినరయి విజయన్, గవర్నర్ ఆరిఫ్ కనీసం పలకిరించుకోకుండా వార్తల్లో నిలుస్తున్నారు. -
రోడ్డు పక్కన కూర్చుని కేరళ గవర్నర్ నిరసన
తిరువనంతపురం/కొల్లం: కేరళ గవర్నర్, వామపక్ష ప్రభుత్వం మధ్య విభేదాలు ముదిరిన నేపథ్యంలో శనివారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈసారి కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ రోడ్డు పక్కన రెండు గంటలపాటు కూర్చుని దాదాపు ధర్నాకు దిగినంత పనిచేశారు. శనివారం ఉదయం కొట్టరక్కరలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనే ందుకు గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ వెళ్తుండగా అధికార సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు నిలామెల్ వద్ద నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ‘సంఘీ చాన్సెలర్ గో బ్యాక్’అంటూ ఆయన్నుద్దేశించి నినాదాలు చేశారు. ఆగ్రహించిన గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ తన కారును ఆపించి, కిందికి దిగారు. తన వద్దకు రావాలంటూ పెద్దగా అరుస్తూ వారి సమీపానికి వెళ్లారు. దీంతో, పోలీసులు నినాదాలు చేస్తున్న ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు, గవర్నర్‌కు మధ్య అడ్డుగా నిలబడ్డారు. అనంతరం, గవర్నర్ సమీపంలోని దుకాణం నుంచి కుర్చీ తెప్పించుకుని రెండు గంటలపాటు రోడ్డు పక్కనే కూర్చున్నారు. నిరసనకారులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను గట్టిగా డిమాండ్ చేశారు. నిరసనల్లో పాల్గొన్న 17 మంది ఎస్ఎఫ్ఐ కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీని చేతికి అందించాకే ఆయన నిరసన విరమించారు. ముఖ్యమంత్రి విజయన్ రాష్ట్రంలో అరాచకాన్ని ప్రోత్సహిస్తున్నారని, రాష్ట్ర అధినేతగా వాటిని సహించబోనన్నారు. వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే వామపక్ష ప్రభుత్వం తనపై దాడులకు ఉసిగొల్పుతోందని ఆరోపించారు. ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను గూండాలు, రోజువారీ కూలీలుగా ఆయన అభివరి్ణంచారు. దేశంలోని ఏరాష్ట్ర గవర్నర్ కూడా ఇలా వ్యవహరించ లేదని కేరళ విద్యామంత్రి వి.శివన్కుట్టి వ్యాఖ్యానించారు. నిలామెల్ ఘటన జరిగిన గంటలోపే ఆయనకు సీఆర్పీఎఫ్ బలగాలతో కూడిన జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలి్పంచినట్లు కేంద్ర హోం శాఖ సమాచారం అందించిందని రాజ్‌భవన్ ప్రకటించింది. గవర్నర్ తిరిగి తిరువనంతపురంలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనగా ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు అక్కడ కూడా నిరసనలు కొనసాగించడం గమనార్హం. -
కేరళ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
తిరువనంతపురం: కేరళ గవర్నర్ ఆరిఫ్ మహహ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన శనివారం కాలికట్ యూనివర్సిటీ సందర్శించిన క్రమంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థులు గవర్నర్‌కు తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. ఆయన వాహనాన్ని ఎస్ఎఫ్ఐ విద్యార్థులు, నాయకులు అడ్డుకున్నారు. అయితే ఈ ఘటనపై గవర్నర్ ఆరీఫ్ సీరియస్ అయ్యారు. తనపై విద్యార్థులు దాడి చేయడానికి ప్రయత్నించారని వారంతా నేరస్థులు అని మండిపడ్డారు. ఈ ఘటనకు పాల్పడిన వారి వెనకాల ముఖ్యమంత్రి పినరయి విజయన్ హస్తం ఉందని ఆరోపించారు. తనపై దాడి చేయించడానికి సీఎం విజయన్.. నిరసనకారులను ఉసిగొలిపాడని మండిపడ్డారు. తనను అడ్డుకుని దాడి చేయడానికి ప్రయత్నించిన విద్యార్థులంతా నేరస్థులని, సీఎం వ్యక్తిగతంగా విద్యార్థులను తనపైకి నిరసకు దిగాలని సూచించినట్లు ఆరోపించారు. అయితే గవర్నర్ ఆరీఫ్.. పలు యూనివర్సిటీల్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తులను వివిధ పదవులకు నామినెట్ చేస్తున్నరని ఆరోపణలు ఉన్నాయి. వాటి నేపథ్యంలో ఆయన కలికట్ యూనివర్సిటీ సందర్శనకు రావటంతో ఎస్ఎఫ్ఐ విద్యార్థులు నిరసనకు దిగినట్లు తెలుస్తోంది. ఈ ఆరోపణలపై స్పందించిన గవర్నర్.. తాను కేవలం రాష్ట్రపతికి మాత్రమే జవాబుదారినని వెల్లడించారు. అదీకాక తాను విద్యార్థుల ముసుగులో ఉన్న నేరస్థులకు జవాబుదారి కాదని స్పష్టం చేశారు. చదవండి: మతగురువు దారుణ హత్య.. పోలీసులపై గ్రామస్థుల ఆగ్రహం -
మూడేళ్లు ఏం చేసినట్లు?
న్యూఢిల్లీ: ఆమోదముద్ర కోసం తన వద్దకు వచ్చిన బిల్లులకు మూడేళ్లుగా ఇంకా ఏ నిర్ణయమూ వెల్లడించని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం ఆగ్రహం వ్యక్తంచేసింది. డీఎంకే సర్కార్ అసెంబ్లీలో ఆమోదింపజేసిన బిల్లులను గవర్నర్ ఉద్దేశపూర్వకంగా తొక్కిపెడుతున్నారంటూ తమిళనాడు రాష్ట్ర ప్రభత్వం దాఖలుచేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పై విధంగా స్పందించింది. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం విచారించింది. ‘ పంజాబ్ ప్రభుత్వ కేసులో మేం ఆదేశాలు జారీచేసేదాకా తమిళనాడు గవర్నర్ మేలుకోలేదు. 2020 జనవరి నుంచి తన వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులకు ఆమోదముద్ర వేయలేదు. మూడేళ్లు ఆయన ఏం చేసినట్లు? ఇదే తరహా పంజాబ్ ప్రభుత్వ కేసులో నవంబర్ 10న మేం ఆదేశాలిచ్చాకే అది చూసి ఆర్ఎన్ రవి పాత బిల్లులపై నిర్ణయం తీసుకున్నారు. ఇంతటి తీవ్ర నిర్లక్ష్య వైఖరి ప్రమాదకరం’ అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఐదే ఉన్నాయి కోర్టు వ్యాఖ్యానాలపై గవర్నర్ తరఫున హాజరైన అటార్నీ జనరల్(ఏజీ) ఆర్. వెంకటరమణి వాదనలు వినిపించారు. ‘ ఈ బిల్లుల్లో ఎన్నో సంక్షిష్టమైన అంశాలున్నాయి. అయినా ఇవి పాత బిల్లులు. ప్రస్తుత గవర్నర్ 2021 నవంబర్ 18న బాధ్యతలు స్వీకరించకముందు నాటివి. బిల్లుల ఆమోదం ఆలస్యాన్ని ఈ గవర్నర్‌కు ఆపాదించొద్దు. ప్రస్తుతం గవర్నర్ వద్ద కేవలం ఐదు బిల్లులే పెండింగ్‌లో ఉన్నాయి. మిగతా 10 బిల్లులను శనివారమే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో మళ్లీ ఆమోదించింది’ అని వాదించారు. కేరళ గవర్నర్, కేంద్రానికి నోటీసులు పెండింగ్ బిల్లులకు ఆమోదం తెలపకుండా ఆలస్యం చేస్తున్నారని కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌పై ఆ రాష్ట్ర సర్కార్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. దీనిపై స్పందన తెలపాలని కేరళ గవర్నర్, కేంద్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ‘గవర్నర్ రాష్ట్రానికి అతీతులుగా వ్యవహరిస్తున్నారు. ఆరిఫ్ వద్ద 7–21 నెలలుగా ఎనిమిది బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి’ అని కేరళ ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వొకేట్ కేకే వేణుగోపాల్ వాదించారు. -
బీబీసీ డాక్యుమెంటరీ రచ్చ.. బ్రిటీష్ అరాచకాలపై కేరళ గవర్నర్ ఫైర్
Kerala Governor Arif Mohammad.. దేశంలో ప్రధాని మోదీ, గుజరాత్ అల్లర్లపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ వివాదాస్పదంగా మారింది. ఈ డ్యాకుమెంటరీపై భారత ప్రభుత్వం బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. బీబీసీ డాక్యుమెంటరీ దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తుంది. కాగా, ఈ బీబీసీ డాక్యుమెంటరీపై కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే బీబీసీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, కేరళ గవర్నర్ ఖాన్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గుజరాత్ అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీ రూపొందించిన వారు భారతదేశంలో బ్రిటీష్ పాలనలో జరిగిన దురాగతాలను ఎందుకు వీడియోలు తీయలేదని ప్రశ్నించారు. వందల సంవత్సరాలు బ్రిటీష్ పాలనలో భారతీయులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాటిని ఎందుకు డాక్యుమెంటరీ తీయలేదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భారత్ ఎన్నో రంగాల్లో ముందంజలో ఉంది. ఆర్థికంగా బలోపేతమై ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో కొందరు నిరాశకు గురవుతున్నారు. అందుకే ఇలా డాక్యుమెంటరీ పేరుతో వివాదం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని సీరియస్ అయ్యారు. ఇదే సమయంలో.. భారతదేశం జీ20 అధ్యక్ష పదవిని చేపట్టిన సమయం ఇది. ఇప్పుడు భారత్ పేరును చెడగొట్టడానికే దీని ముందుకు తీసుకువచ్చారు. ఇప్పుడే డాక్యుమెంటరీని బయటకు తీసుకురావడాని కారణమేంటి? అని ప్రశ్నల వర్షం కురిపించారు. భారత్ ఎదుగుదలను చూడలేకనే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే, న్యాయవ్యవస్థ తీర్పులపై డాక్యుమెంటరీని విశ్వసిస్తున్న కొందరిని చూస్తే జాలివేస్తోంది అంటూ కామెంట్స్ చేశారు. మరోవైపు.. 2002 గుజరాత్లో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అల్లర్లకు సంబంధించి బీబీసీ డాక్యుమెంటరీని విడుదల చేసింది. అల్లర్ల సమయంలో కొన్ని అంశాలను పరిశోధించినట్లు పేర్కొంటున్న రెండు భాగాల డాక్యుమెంటరీని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డాక్యుమెంటరీపై బీబీసీ వివరణ కూడా ఇచ్చింది. ప్రధాని మోదీపై రూపొందించిన డాక్యుమెంటరీని ఆయా అంశాలపై విస్తృతంగా పరిశోధించిన తర్వాతనే దీన్ని రూపొందించినట్టుగా తెలిపింది. దీనికోసం అప్పటి సాక్ష్యులు, నిపుణులను సంప్రదించామని.. బీజేపీ నాయకుల నుంచి కూడా అభిప్రాయాలు సేకరించామని పేర్కొంది. -
కేరళ: విజయన్ సర్కార్‌కు ఎదురు దెబ్బ
తిరువనంతపురం: కేరళలో గవర్నర్ వర్సెస్ ప్రభుత్వ వ్యవహారం మరో మలుపు తిరిగింది. హైకోర్టులో పినరయి విజయన్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ఫిషరీస్ మరియు ఓషన్ స్టడీస్ యూనివర్సిటీకి వీసీని నియమించడాన్ని తప్పుబడుతూ ప్రభుత్వ ఆదేశాలను సోమవారం పక్కపెట్టింది ఉన్నత న్యాయస్థానం. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) రెగ్యులేషన్స్ 2018 ను ఉల్లంఘించేదిగా ఆ నియామకం ఉందన్న హైకోర్టు డివిజన్ బెంచ్.. ఈ మేరకు యూజీసీ మార్గదర్శకాల ప్రకారం కొత్త వీసీని నియమించాలని ఛాన్స్లర్ ఆఫ్ వర్సిటీస్ అయిన గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్‌ను ఆదేశించింది. కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ మరియు ఓషన్ స్టడీస్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా ఈమధ్యే డాక్టర్ రిజీని నియమించింది కేరళ ప్రభుత్వం. అయితే ఆ నియామకం చెల్లుబాటు కాదని, యూజీసీ మార్గదర్శకాలను ఉల్లంఘించేదిగా ఉందని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ మణికుమార్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. ఇక.. ఏపీజే అబ్దుల్ కలాం టెక్నాలజీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ నియామకాన్ని సైతం సుప్రీంకోర్టు తన దేశాలతో రద్దు చేసింది. యూజీసీ రూల్స్ ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వ కమిటీ మూడు పేర్లను గవర్నర్‌కు ప్రతిపాదనగా పంపాల్సి ఉంటుంది. అయితే కలాం యూనివర్సిటీకి మాత్రం ఒకే ఒక్క పేరు ప్రతిపాదించింది కేరళ ప్రభుత్వం. ఆపై తొమ్మిది యూనివర్సిటీల వీసీలను తప్పుకోవాలని గవర్నర్ ఆరిఫ్ ఖాన్ ఆదేశించడం.. కేరళ ప్రభుత్వంతో జరుగుతున్న జగడం తెలిసిందే. ఈ నెల ప్రారంభంలో, గవర్నర్‌ను విశ్వవిద్యాలయాల ఛాన్సలర్‌గా తొలగించడానికి ఆర్డినెన్స్ తీసుకురావడానికి కేరళ రాష్ట్ర కేబినెట్ ఓటు వేసింది. -
కేరళ గవర్నర్‌కు బిగ్ షాక్.. ఛాన్సలర్‌గా తప్పిస్తూ ఆర్డినెన్స్?
తిరువనంతపురం: కేరళ గవర్నర్, ప్రభుత్వం మధ్య వివాదం మరింత ముదురుతోంది. యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ పదవి నుంచి తప్పుకోవాలని ఆదేశించటంతో ఈ వివాదం తారస్థాయికి చేరింది. ఈ క్రమంలో గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌ను యూనివర్సిటీల ఛాన్సలర్‌గా తప్పించేందుకు సిద్ధమవుతోంది ఎల్డీఎఫ్ నేతృత్వంలోని కేరళ సర్కార్. గవర్నర్‌ను తప్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆర్డినెన్స్ ముసాయిదాపై మంత్రివర్గంలో చర్చించినట్లు పేర్కొన్నాయి. యూనివర్సిటీల ఛాన్సలర్‌గా గవర్నర్‌ను తొలగించి.. ఆయన స్థానంలో నైపుణ్యం గల వ్యక్తిని తీసుకురావాలని భావిస్తున్నట్లు ఎల్డీఎఫ్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొద్ది రోజుల క్రితం కేరళలోని 9 వర్సిటీల వైస్ ఛాన్సలర్‌గా రాజీనామా చేయాలంటూ ఆదేశించారు గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్. దీంతో వివాదం మొదలైంది. గవర్నర్ అధికారాలపై ప్రభుత్వం ప్రశ్నించగా.. వివాదం ముదిరింది. రాష్ట్రవ్యాప్తంగా గవర్నర్‌కు వ్యతిరేకంగా ఎల్డీఎఫ్ శ్రేణులు నిరసనలు తెలిపే కార్యక్రమానికి పిలుపునిచ్చారు. మరోవైపు.. వైస్ ఛాన్సలర్ల అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కేరళ హైకోర్టు సైతం సూచించినట్లు సమాచారం. ఇదీ చదవండి: గవర్నర్ వైఖరిపై ఎల్డీఎఫ్ విస్తృతస్థాయి నిరసన -
గవర్నర్ వైఖరిపై అధికార పార్టీ విస్తృతస్థాయి నిరసన
తిరువనంతపురం: కేరళలో అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) ప్రభుత్వాన్ని బహిరంగంగా తీవ్రంగా తప్పుబట్టే ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌పై క్షేత్రస్థాయి విస్తృత నిరసన కార్యక్రమాలకు ఎల్డీఎఫ్ శ్రేణులు తెరతీశాయి. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గవర్నర్ ఖాన్‌కు వ్యతిరేకంగా కరపత్రాలు పంచిపెట్టాయి. భారత రాజ్యాంగంపై కనీస అవగాహనలేని గవర్నర్ పూర్తిగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తరఫున పనిచేస్తున్నారని ఆ కరపత్రాల్లో ప్రచురించారు. ఉన్నత విద్య పరిరక్షణకు ఖాన్‌కు వ్యతిరేకంగా పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ సొసైటీ పేరిట ఈ కరపత్రాలు ముద్రితమయ్యాయి. ఈనెల 15వ తేదీన రాజ్‌భవన్ ఎదుట ఏకంగా లక్షమందితో భారీ నిరసన కార్యక్రమానికి ఏర్పాటుచేస్తున్నట్లు ఎల్డీఎఫ్ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో సీపీఐ(ఎం) పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులను ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమిస్తున్నారని, గుత్తాధిపత్యం రాజ్యమేలుతోందని గవర్నర్ ఖాన్ సోమవారం విమర్శించిన విషయం తెల్సిందే. ఇదీ చదవండి: గవర్నర్‌కు ఇలా చేసే అధికారం ఉందా?.. ఏ నిర్ణయం ఎవరు తీసుకోవాలి? -
మ్యాగజైన్ స్టోరీ : గవర్నర్స్ " వర్సెస్ " గవర్నమెంట్
-
గోల్డ్ కేసులో జోక్యం చేసుకోవాల్సి వస్తుంది
తిరువనంతపురం/న్యూఢిల్లీ : కేరళ గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్, ఎల్డీఎఫ్ ప్రభుత్వం మధ్య మరోసారి దుమారం చెలరేగింది. గవర్నర్ ఖాన్ ఈసారి గోల్డ్ స్మగ్లింగ్ వివాదాన్ని లేవనెత్తారు. ముఖ్యమంత్రి విజయన్ రాష్ట్రంలో ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంలో తాను జోక్యం చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గవర్నర్ ఖాన్ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, యూనివర్సిటీల్లో ఆర్ఎస్ఎస్ ఎజెండాని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆరోపించిన మర్నాడు గురువారం గవర్నర్ ఖాన్ న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. యూనివర్సిటీల్లో ఆరెస్సెస్ అజెండాపై సీఎం ఒక్క ఉదాహరణ అయినా చూపగలరాని ప్రశ్నించారు. యూనివర్సిటీల్లో ఆరెస్సెస్‌కి చెందిన వారిని నియమించడానికే ప్రస్తుతమున్న వైస్ ఛాన్సలర్లపై చర్యలు తీసుకుంటున్నానని ప్రభుత్వం ఆరోపిస్తోంది. దానిని రుజువు చేస్తే గవర్నర్ పదవికి తాను రాజీనామా చేస్తానని, అలా రుజువు చెయ్యలేకపోతే సీఎం రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. ‘‘కేరళ ప్రజలు ప్రస్తుతం గోల్డ్ స్మగ్లంగ్ గురించి, అందులో ముఖ్యమంత్రి కార్యాలయం ప్రమేయం గురించి చర్చించుకుంటున్నారు. ఈ కేసులో శివశంకర్ పాత్ర ఏంటి ? ఎందుకు ఆయనని తొలగించారు ? ఈ కేసులో సీఎంఒ ప్రమేయం ఉందని తేలితే నేను ఇందులో జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది’’ అని గవర్నర్ హెచ్చరికలు జారీ చేశారు. -
వీసీలు రాజీనామా చేయాలని గవర్నర్ లేఖలు.. మండిపడ్డ సీఎం
తిరువనంతపురం: కేరళ గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆ రాష్ట్రంలోని 9 యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు రాజీనామా చేయాలని లేఖలు పంపారు. సోమవారం ఉదయంలోగా పదవుల నుంచి తప్పుకోవాలని ఆదివారం సాయంత్ర కోరారు. అయితే వారు రాజీనామాలు చేయకపోవడంతో సోమవారం అందిరికీ షోకాజ్ నోటీసులు పంపారు. వారంతా పదవుల్లో కొనసాగేందుకు ఉన్న చటబద్ధమైన హక్కేమిటో చెప్పాలని అడిగారు. దీంతో వైస్ ఛాన్సలర్లంతా కేరళ హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం ప్రత్యేకంగా సమావేశమైన న్యాయవస్థానం.. వీరికి తాత్కాలిక ఊరటనిచ్చింది. రాజీనామా చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. గవర్నర్ షోకాజ్ నోటీసులు పంపిన తర్వాత.. రాజీనామా చేయాలని పంపిన లేఖకు ఔచిత్యం లేకుండాపోయిందని పేర్కోంది. అయితే యూనివర్సీల ఛాన్సలర్ అయిన గవర్నర్.. ఈ సమస్యపై తుది నిర్ణయం తీసుకునేవరకు వైస్ ఛాన్సలర్లు పదవుల్లోనే కొనసాగుతారని స్పష్టం చేసింది. ఒకవేళ గవర్నర్ వీరిని పదపుల నుంచి తొలిగిస్తూ చట్టపరమైన ఆదేశాలిస్తే అందరూ పదవులను కోల్పోతారు. ఈ వైస్ ఛాన్సలర్లంతా చట్టవిరుద్ధంగా పదవులు దక్కించుకున్నారు, ఎల్డీఎఫ్ సహకారంతో పదవులు చేపట్టారని గవర్నర్ ఆరోపిస్తున్నారు. అందుకే వారు రాజీనామాలు చేయాలని లేఖలు పంపారు. గవర్నర్ తీరుపై కేరళ సీఎం పనిరయ్ విజయన్ మండిపడ్డారు. అరిఫ్ ఖాన్ తన పరిధి మేరకు నడుచుకోవాలని హితవుపలికారు. వైస్ ఛాన్సలర్లను నియమించింది ఆయనే అని, అలాంటప్పుడు చట్టవిరుద్ధంగా జరిగిందేమిటని ప్రశ్నించారు. గవర్నర్ తీరు రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందని ధ్వజమెత్తారు. చదవండి: పాసైన బిల్లుల ఆమోదం నా పరిధిలోనిది.. ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్ తమిళిసై! -
కరోనా వ్యాప్తి : సెలవుల్లో గవర్నర్
సాక్షి, తిరువనంతపురం: దేశ వ్యాప్తంగా కరోనాను(కోవిడ్) ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు పలు కీలక చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ సెలవుపై వెళ్లారంటూ అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. ఆయన తనవెంట వ్యక్తిగత, పోలీసు, వైద్య సిబ్బందిని తీసుకెళ్లడంపై కేరళ ప్రభుత్వం అసహనం వ్యక్తం చేస్తోంది. గవర్నర్‌కు సెక్యూరిటీ కల్పించాలనే ఉద్దేశ్యంతో నేదుమన్‌గడ్ డీఎస్పీ ముఖ్యమైన కరోనా సమావేశానికి గైర్హాజరయ్యాడని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎప్పుడైనా సెలవులు తీసుకునే హక్కు గవర్నర్‌కు ఉంటుందని, కానీ ఇది సరియైన సమయం కాదని ఎమ్మెల్యే వీ.కె ప్రశాంత్ పేర్కొన్నారు. ఆరోపణలపై గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ స్పందిస్తూ.. తాను గిరిజన ప్రజల సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా అటవీ అధికారి కెఐ.ప్రదీప్ కుమార్, రేంజ్ ఆఫీసర్ పలోడ్‌లతో చర్చించడానికి వెళ్లానని ట్విటర్లో వివరణ ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లో వ్యాధుల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులతో చర్చించామని తెలిపారు. కాగా కేరళలో ఇప్పటి వరకు 22 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. చదవండి: షాకింగ్‌గా ఉంది.. కరోనాపై రాజమౌళి ట్వీట్ -
నాకు చెప్పకుండా సుప్రీంకు వెళతారా?
తిరువనంతపురం: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై తనకు సమాచారం ఇవ్వకుండానే సుప్రీంకోర్టుకు వెళ్లడంపై కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఆ రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. సీఏఏ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలంటూ కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడంతోపాటు ఈ నెల 13వ తేదీన సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చట్టబద్ధ పాలన కొనసాగేలా చేయడం తన బాధ్యతని, ప్రేక్షకుడిగా చూస్తూ ఊరుకోబోనని బెంగళూరులో ఆయన వ్యాఖ్యానించారు. -
జరిమానా చెల్లించిన గవర్నర్
రాజ్యాంగ పదవిలో ఉన్న కూడా రవాణా శాఖ అధికారులు తన వాహనానికి విధించిన జరిమానా చెల్లించారు కేరళ గవర్నర్ పి సదాశివం. వివరాల్లోకి వెళితే.. సదాశివం అధికారిక వాహనం మెర్సిడెస్ బెంజ్ కారు 10 రోజుల కిందట నిబంధనలకు విరుద్ధంగా అతి వేగంతో ప్రయాణించింది. కౌడియర్ రోడ్డులో 55 కి.మీ వేగ పరిమితి ఉండగా.. గవర్నర్ వాహనం మాత్రం 80 కి.మీ వేగంతో దూసుకెళ్లింది. ఆ సమయంలో కారులో గవర్నర్ లేకపోవడంతో డ్రైవర్ స్పీడ్‌గా వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడి స్పీడ్ డిటెక్టర్ సెన్సార్లలో కారు అధిక వేగంతో వెళ్లినట్టు రికార్డయింది. దీంతో రవాణా శాఖ అధికారులు గవర్నర్ వాహనానికి 400 రూపాయల జరిమానా విధించారు. ఈ విషయం తెలుసుకున్న గవర్నర్ వెంటనే ఆ ఫైన్ చెల్లించాల్సిందిగా తన సిబ్బందిని ఆదేశించారు. గవర్నర్ ఆదేశాలతో ఆయన సెక్రటరీ రవాణా శాఖ కార్యాలయంలో జరిమానా చెల్లించారు. దీనిపై రవాణా శాఖ అధికారులు స్పందిస్తూ.. తొలుత గవర్నర్ వాహనానికి ఫైన్ విధించే అంశంలో వెనుకడుగు వేసినప్పటికి.. నిబంధనల ప్రకారం నడుచుకున్నామని తెలిపారు. గవర్నర్ చేసిన ఈ పని పలువురికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. -
ఆలస్యంగా వస్తే.. గవర్నరైనా అంతే!
కేరళ గవర్నర్ పి.సదాశివానికి చేదు అనుభవం ఎదురైంది. సాధారణంగా వీఐపీలు, వీవీఐపీలు విమానాలు ఎక్కడానికి చిట్టచివరి నిమిషం వరకు రారు. మామూలు ప్రయాణికులను అయితే అలా అనుమతించరు. కానీ వీఐపీలకు మాత్రం ఆ వెసులుబాటు ఉండేది. అయితే కొచ్చి నుంచి తిరువనంతపురం వెళ్లేందుకు ఎయిరిండియా విమానం ఎక్కాల్సిన కేరళ గవర్నర్.. విమానం టేకాఫ్ తీసుకోవాల్సిన చిట్టచివరి నిమిషం వరకు రాలేదు. దాంతో ఎయిరిండియా వర్గాలు ఆయనను అనుమతించలేదు. నిజానికి రాత్రి 9.20 గంటలకు బయల్దేరాల్సిన ఎయిరిండియా విమానం ఎఐ 048 రాత్రి 11.40 గంటల వరకు బయల్దేరలేదు. అంతసేపు ఆపినా.. గవర్నర్ మాత్రం 11.28 గంటలకు టర్మాక్ వద్దకు చేరుకున్నారు. ఆయనకు నేరుగా అక్కడి నుంచే విమానం ఎక్కే అవకాశం ఉంది. కానీ అప్పటికే విమానం టేకాఫ్ తీసుకోడానికి సిద్ధం కావడంతో.. నిచ్చెనను ఇవతలకు లాగేశారు. దాంతో గవర్నర్ విమానం ఎక్కడానికి వీలు కుదరలేదు. ఎయిరిండియాకు చెందిన ఓ అధికారి గవర్నర్ బోర్డింగ్ పాస్ పట్టుకుని ఉన్నా.. దాంతో ఎలాంటి ఉపయోగం కనిపించలేదు. గవర్నర్ సదాశివం కాసేపు అక్కడే ఉండి.. తర్వాత అక్కడినుంచి వెళ్లిపోయారు. త్రిసూర్‌లో అధికారిక కార్యక్రమానికి హాజరై అక్కడి నుంచి నేరుగా విమానాశ్రయానికి వచ్చారని రాజ్‌భవన్ ఉద్యోగులు తెలిపారు. సాధారణంగా గవర్నరే విమానం ఎక్కే చివరి వ్యక్తి అవుతారని.. అయితే ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇలా జరిగి ఉంటుందని అన్నారు. 2014 ఏప్రిల్ వరకు సదాశివం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. పదవీ విరమణ చేసిన నాలుగునెలల తర్వాత ఆయన కేరళ గవర్నర్ అయ్యారు. -
గవర్నర్ మార్పు?
- జస్టిస్ సదాశివం, ఈఎస్ఎల్ నరసింహన్ - కేంద్రం కసరత్తు - పరిశీలనలో జస్టిస్ సదాశివం పేరు సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఏపీ ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ స్థానంలో మరొకరిని నియమించేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో ‘ఎట్ హోం’ కార్యక్రమానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించినా రాకపోవడంతో.. మనస్తాపం చెంది బాధ్యతల నుంచి తప్పుకుంటానని ఆయన కేంద్రానికి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఒకవైపు నరసింహన్ అన్ని అంశాల్లో తెలంగాణ వైపు మొగ్గుచూపుతున్నారని ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేస్తూ పదేపదే గవర్నర్‌ను మార్చాలని పట్టుబడుతోంది. ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాలన్నీ పరిష్కారం కావాలని, ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరాలని కేంద్రం భావిస్తోంది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు న్యాయ నిపుణులైన వారిని గవర్నర్‌గా నియమించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కేరళ గవర్నర్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. -
కొత్త గవర్నర్ గా జస్టిస్ సదాశివం?
-
కేరళ గవర్నర్‌గా సదాశివం ప్రమాణ స్వీకారం
తిరువనంతపురం: కేరళ గవర్నర్‌గా పి.సదాశివం శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. తిరువనంతపురంలోని రాజ్‌భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పి.సదాశివం చేత కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అశోక్ భూషణ్ ప్రమాణ స్వీకారం చేయించారు. గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ, ఆయన మంత్రివర్గ సహాచరులు, ఉన్నతాధికారులతోపాటు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పి.జె.కురియన్, కేరళ అసెంబ్లీ స్పీకర్ జి.కార్తీకేయన్లు హాజరయ్యారు. అయితే కేరళ గవర్నర్‌గా యూపీఏ హాయాంలో నియమితులైన షీలా దీక్షిత్ రాజీనామా చేయడంతో... బీజేపీ ప్రభుత్వం పి.సదాశివంను ఆ పదవిలో నియమించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించిన సదాశివం ఈ ఏడాది ఏప్రిల్‌లో పదవి విరమణ చేసిన సంగతి తెలిసిందే. -
'నా నియామకంపై వివాదం లేదు'
తిరువనంతపురం: కేరళ గవర్నర్ గా తనను నియమించడం పట్ల ఎటువంటి వివాదం లేదని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి పళనిస్వామి సదాశివం అన్నారు. తాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు నియామకం జరిగివుంటే ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సివుండేదని, కానీ తాను పదవీవిరమణ చేసి కొన్ని నెలలు గడిచినందునా వివాదం లేదని ఆయన వివరించారు. తాను ఎటువంటి వ్యాపారాలు చేయబోనని, కార్పొరేట్ సంస్థలకు సలహాలు అందించబోనని పదవీ విరమణ రోజే చెప్పానని అన్నారు. కేరళ గవర్నర్ గా సదాశివంను కేంద్ర ప్రభుత్వం నియమించడాన్ని కాంగ్రెస్ పార్టీ, కేరళ ప్రభుత్వం తప్పుబట్టిన నేపథ్యంలో ఆయనీ వివరణయిచ్చారు. -
కేరళ గవర్నర్‌గా సదాశివం
-
కేరళ గవర్నర్‌గా సదాశివం
న్యూఢిల్లీ: విపక్ష విమర్శలను ఖాతరు చేయకుండా కేంద్ర ప్రభుత్వం.. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) పళనిస్వామి సదాశివంను బుధవారం కేరళ గవర్నర్‌గా నియమించింది. దీంతో 65 ఏళ్ల సదాశివం ప్రొటోకాల్ ప్రకారం సీజేఐ హోదాకంటే తక్కువదైన గవర్నర్ పదవి చేపట్టనున్న తొలి సీజేఐగా రికార్డులకెక్కారు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఈ పదవిలో నియమితులైన రాజకీయేతర వ్యక్తి కూడా ఆయనే. గతవారం కేరళ గవర్నర్ పదవికి షీలా దీక్షిత్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించి, సదాశివంను ఆ రాష్ట్ర గవర్నర్‌గా నియమించారని రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో పేర్కొంది. సదాశివం శుక్రవారం బాధ్యతలు చేపడతారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఈ ఏడాది ఏప్రిల్‌లో రిటైరైన సదాశివంను గవర్నర్‌గా నియమించే అంశంపై కాంగ్రెస్ విమర్శించటం తెలిసిందే. ఆయనను గవర్నర్‌గా నియమించొద్దని సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్, కేరళ బార్ అసోసియేషన్లు రాష్ట్రపతిని కోరడమూ విదితమే. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కేసులో ఆయనకు అనుకూలంగా ఇచ్చిన తీర్పునకు ప్రతిఫలంగానే ఈ పదవి కట్టబెట్టారంటూ కాంగ్రెస్ ప్రతినిధి ఆనంద్ శర్మ మంగళవారం విమర్శించారు. సదాశివంతో కూడిన సుప్రీం ధర్మాసనం.. ఓ నకిలీ ఎన్కౌంటర్ కేసులో షాపై రెండో ఎఫ్ఐఆర్ను గతంలో కొట్టేసింది. మాట మారుస్తారా?: కాంగ్రెస్ రిటైరైన జడ్జీలు తిరిగి పదవులు చేపట్టొద్దని బీజేపీ నేతలు గడ్కారీ, జైట్లీలు 2012లో చెప్పారని, మోడీ ప్రభుత్వం మాటలు మార్చే ప్రభుత్వమని కాంగ్రెస్ ప్రతినిధి శోభా ఓజా విమర్శించారు. అయితే మాజీ సీజేఐ గవర్నర్ పదవి చేపట్టొద్దన్న నిషేధమేమీ లేదని పార్టీ నేత మనీశ్ తివారీ అన్నారు. సదాశివం నిజాయితీని శంకించకూడదని బీజేపీ పేర్కొంది.రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పాటుపడతా తన నియమాకం వ్యవహారంలో వస్తున్న విమర్శలను సదాశివం పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం బాగా పనిచేస్తానని చెప్పారు. -
కేరళ గవర్నర్‌గా జస్టిస్ సదాశివం
న్యూఢిల్లీ: కేరళ గవర్నర్‌గా సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం నియమితులయ్యారు. రాష్ట్రపతి భవన్ బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా సదాశివం నియామకంపై కాంగ్రెస్ పార్టీ సహా న్యాయవాదుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనా కేంద్ర ప్రభుత్వం ఆయన వైపే మొగ్గు చూపింది. ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ పర్యటన ముగించుకుని స్వదేశం తిరిగొచ్చిన వెంటనే కేరళ గవర్నర్‌గా సదాశివం నియామక ఉత్తర్వులు వెలువడ్డాయి. -
అమిత్‌షా కేసులో అనుకూల తీర్పుకు ప్రతిఫలమా?
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సదాశివంను కేరళ గవర్నర్‌గా నియమించాలన్న ప్రభుత్వ ఉద్దేశాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. అమిత్‌షా కేసులో సదాశివం ఇచ్చిన తీర్పునకు ఇది ప్రతిఫలమా? అని ప్రశ్నించింది. ‘తమకు అనుకూలంగా ఆయన చేసిన వ్యాఖ్యానించారు. కాగా, సదాశివంను కేరళ గవర్నర్‌గా నియమించవద్దని రాష్ట్రపతిని అభ్యర్థిస్తూ కేరళ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. షీలా దీక్షిత్ రాజీనామా చేయడంతో కేరళ గవర్నర్ పదవి ఖాళీ అయింది. -
కేరళ గవర్నర్‌గా జస్టిస్ సదాశివం?
న్యూఢిల్లీ: కేరళ గవర్నర్‌గా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సదాశివంను నియమించే అవకాశాలున్నాయి. కేరళ గవర్నర్‌గా పనిచేసిన షీలా దీక్షిత్ ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ పదవిలో జస్టిస్ సదాశివంను నియమించవచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం.