komaram bheem district
-
TG: మళ్లీ పులి దాడి.. వ్యక్తికి తీవ్ర గాయాలు
సాక్షి,కొమరంభీంజిల్లా: జిల్లాలో పులి మళ్లీ పంజా విసిరింది. తాజాగా మరొకరిపై పులి దాడి చేసింది. సిర్పూర్ (టీ) మండలం దుబ్బగూడకు చెందిన రైతు సురేష్‌పై శనివారం(నవంబర్30) పులి దాడి చేసి గాయపరిచింది. సురేష్ పొలంలో పనిచేస్తుండగా పులి ఒక్కసారిగా దాడి చేసింది.పులి గాట్లతో సురేష్ తీవ్రంగా గాయపడ్డాడు. సురేష్‌ను చికిత్స కోసం సిర్పూర్(టీ) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదే ప్రాంతంలో పులి దాడిలో శుక్రవారమే ఒక మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. పులి కోసం కాగజ్‌నగర్ కారిడార్‌లో ఫారెస్ట్ అధికారులు ఆపరేషన్ మ్యాన్ఈటర్ నిర్వహస్తున్నారు.మొత్తం 15 గ్రామాల్లో పులి కోసం వేట కొనసాగుతోంది.ఇదీ చదవండి: పులి కోసం డ్రోన్లతో వేట.. కాగజ్‌నగర్‌లో హై అలర్ట్ -
పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. చికిత్స పొందుతూ విద్యార్థిని శైలజ మృతి
సాక్షి, హైదరాబాద్ : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజన అశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్కి గురై గత కొన్ని రోజులుగా నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ సోమవారం మృతి చెందింది. అక్టోబర్ 30న వాంకిడి ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరగగా 64 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ముగ్గురు (మహాలక్ష్మి, జ్యోతి, శైలజ) పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చేర్పించారు.వీరిలో మహాలక్ష్మి, జ్యోతి కోలుకోగా శైలజ ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆమెకు ఉపిరితిత్తుల సమస్యతో పాటు మూత్రపిండాలపై ప్రభావం పడింది. దీంతో పలుసార్లు వైద్యులు డయాలసిస్ చేశారు. ఈ నెల 11 నుంచి శైలజను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో శైలజ నేడు మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. కాగా దీనిపై బీఆర్ఎస్ నేతలు స్పందిస్తూ శైలజ మృతి ప్రభుత్వం చేసిన హత్య అని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యానికి బలైపోయిన వాంకిడి గిరిజన గురుకుల విద్యార్థిని శైలజకు కన్నీటి నివాళి అర్పిస్తున్నట్లు మాజీ మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు. మీ ప్రాణాలు బలి తీసుకున్న పాపం.. ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతదన్నారు. గిరిజన విద్యార్థినీ కుటుంబానికి బాధ్యత వహించి రూ. 50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పరిపాలన మరో పేదబిడ్డ ప్రాణం తీసిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కన్నతల్లికి కడుపు కోత మిగిల్చింది. వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం వల్ల అస్వస్థతకు గురై 20 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శైలజ మరణ వార్త తననును ఎంతగానో కలచి వేసింది అని కవిత పేర్కొన్నారు.ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం వందలాది ప్రాణాలు బలి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సంక్షేమ పాఠశాలలో కనీసం బుక్కెడు బువ్వ కూడా పెట్టకుండా, పదకొండు నెలల్లో 43 మంది విద్యార్థుల ప్రాణాలు తీసింది. ఇవన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్యలే అని కవిత ఆరోపించారు. -
నాన్నా.. నన్ను కాపాడు
కౌటాల: ‘నాన్నా.. నన్ను కాపాడు’.. తీవ్ర జ్వరంబారిన పడిన ఓ టెన్త్ విద్యార్థిని తన తండ్రితో పలికిన చివరి మాటలు ఇవి. దీంతో ఆ తండ్రి మెరుగైన వైద్యం కోసం శనివారం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె మృతిచెందింది. కుమా ర్తె మృతిని తట్టుకోలేకపోతున్న తండ్రి.. ‘నిన్ను కాపాడుకోలేక పోయిన బిడ్డా’అంటూ గుండెలవిసేలా రోదిస్తున్నాడు. ఈ ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా గుండాయిపేటలో విషాదం నింపింది. స్థానికుల కథనం ప్రకారం.. గుండాయిపేటకు చెందిన జాడె కిశోర్, సురేఖ దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తె పూజ (16) జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల వసతిగృహంలో ఉంటూ టెన్త్ చదువుతోంది. జ్వరం రావడంతో గత శనివారం తండ్రికి ఫోన్ చేసింది. ‘నాన్నా జ్వరమొచి్చంది.. చేతనైతలేదు.. కాళ్లు చేతులు గుంజుతున్నయ్.. ఇంటికి తీసుకుపో’అని చెప్పింది. దీంతో ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. స్థానిక ఆర్ఎంపీల వద్ద వైద్యం చేయించినా జ్వరం తగ్గకపోగా శుక్రవారం సాయంత్రానికి మరింత ఎక్కువైంది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా శనివారం మధ్యాహ్నం పరిస్థితి విషమించింది. దీంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గమధ్యలో పూజ తన తండ్రి చేయి పట్టుకొని తనను కాపాడాలని కోరింది. దీంతో తండ్రి ఏమీ కాదని ధైర్యం చెప్పాడు. కానీ కాసేపటికే పూజ మరణించింది. కాగా, గుండాయిపేట గ్రామంలో కొద్ది రోజులుగా విష జ్వరా లు ప్రబలుతున్నాయి. ప్రతి ఇంట్లోనూ జ్వర బాధితులు ఉన్నారు. జ్వరాల నియంత్రణకు వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
హోలీ రోజు విషాదం.. వార్దా నదిలో గల్లంతైన యువకులు మృతి
సాక్షి, కొమురంభీం జిల్లా: హోలీ పండుగ రోజు అసిఫాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నదిలో స్నానికి వెళ్లి గల్లంతయిన యువకుల కథ విషాదంగా ముగిసింది. కౌటాల మండలం తాటిపల్లి సమీపంలోని వార్దా నదిలో ఈతకు వెళ్లిన నలుగురు యువకులు విగతజీవులుగా మారారు. మృతులను కౌటాల మండలం నదీమబాద్‌కు చెందిన కమలాకర్(22), సంతోష్(25), ప్రవీణ్(23), సాయి(22)గా గుర్తించారు. కౌటాల మండలం నదిమాబాద్ గ్రామానికి చెందిన నలుగురు యువకులు సోమవారం సంతోషంగా హోలీ ఆడుకున్నారు. స్నేహితులపై రంగులు చల్లుకుంటూ.. సెల్పీలు దిగి హోలీ సంబురాలు జరుపుకున్నారు. అనంతరం స్నేహితులతో కలిసి స్నానం చేసేందుకు తాటిపల్లి వద్దనున్న వార్ధా నదికి వెళ్లారు. నీటిలో స్నానం చేస్తుండగా.. నలుగురు కొట్టుకుపోయారు. గమనించిన స్థానికులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రిస్య్కూ టీం అక్కడికి చేరుకొని గజ ఈతగాళ్లతో గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చెపట్టిన ఫలితం లభించలేదు. నలుగురు నీటిలో మునిగి మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను కౌటాల దవాఖానకు తరలించారు. పండుగ నాడుఒకే సారి నలుగురు స్నేహితులు మృతి చెందడంతో బాధితుల కుంటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.. -
TS: హమ్మయ్యా.. ఆ పులులు సేఫ్!
కొమురం భీం, సాక్షి: కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలో కలకలం రేపిన పులుల మృత్యువాత సంఘటనలో అనేక సంచలన విషయాలు బయటకు వచ్చాయి.. రెండు పులులపై విష ప్రయోగం జరిగినట్టు గుర్తించిన అటవీశాఖ సెర్చ్ ఆపరేషన్ ను సీరియస్ గా తీసుకుంది. చివరికి మూడు రోజుల పాటు అడవిని జల్లెడ పట్టిన అనంతరం తల్లి పులి రెండు పిల్లల జాడ ట్రాప్ కెమెరాలకు చిక్కడంతో ఆపరేషన్ ను నిలిపివేసింది. కొమురంభీం జిల్లా కాగజ్ నగర రేంజ్ దరిగాం అడవుల్లో టైగర్ సర్చ్ ఆపరేషన్ సక్సెస్ అయింది. మూడు రోజుల విస్తృత గాలింపు తర్వాత ఎట్టకేలకు కనిపించకుండా పోయిన S6 పులి దాని రెండు పిల్లలు ట్రాప్ కెమెరాకు చిక్కాయి. దరిగాం అడవిలో విష ప్రయోగంతో చనిపోయిన రెండు పులులతో పాటు మరో రెండు పులులు మిస్ అవడంపై అలర్ట్ అయిన జిల్లా అటవీశాఖ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది.. మూడు వందల మంది సిబ్బందిని రంగంలోకి దింపింది. 72 బృందాలు , 105 ట్రాప్ కెమెరాల తో మూడు రోజుల పాటు అడవిని జల్లెడ పట్టారు అటవీ శాఖ అధికారులు.. అయితే సిబ్బందికి మిస్ అయిన పులులు కనిపించడంతో ఆపరేషన్ సక్సెస్ గా ముగిసింది. ఎస్ 6 తల్లి పులితో పాటు కనిపించకుండా పోయిన పులి పిల్లలు సైతం క్షేమంగా ఉన్నాయంటూ తేల్చింది కొమురంభీం జిల్లా అటవీ శాఖ. గత ఏడాది డిసెంబర్ 27 న దరిగాం అటవి ప్రాంతంలో ఎస్ 9 పులి ఓ పశువు పై దాడి చేయగా.. ఆ పశువును మరోసారి తిన్న కే15 పులి ఈనెల 6 న మృత్యువాత పడింది. ఆ ఘటన జరిగిన మరుసటి రోజే ఐదేళ్ల మగపులి ఎస్ 9 సైతం మరణించింది. దీంతో పులి మరణాల కేసును సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాదికారులు లోతుగా దర్యాప్తు చేయడంతో.. పశువుపై విష ప్రయోగం జరిగినట్టు తేలింది. ఆ పశువు మృతి చెందిన సమీపంలో నాలుగు పులుల పాదముద్రలు లభించడంతో ఆందోళన చెందింది అటవీశాఖ. దీంతో అలర్ట్ అయిన అటవిశాఖ చనిపోయిన పులులతో పాటు పశువు మాంసం తిన్న మరో రెండు పులుల కోసం అన్వేషణ సాగించింది. ఈనెల 9 న టైగర్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభింవింది.. మొదటి రోజు 14 ట్రాకింగ్ టీములు, 22 ట్రాప్ కెమెరాలతో దరిగాం అటవి ప్రాంతాన్ని జల్లెడ పట్టింది. 24 గంటలు దరిగాం అడవిని జల్లెడ పట్టిన మిస్ అయిన పులుల ఆచూకీ లభించకపోవడంతో ట్రాకింగ్ టీంను 72 కు పెంచింది. దరిగాం అటవీ ప్రాంతంతో పాటు సర్కపల్లి, గోంది అటవి ప్రాంతంలోను సర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేసిన అటవీ శాఖ 105 కెమెరాలను ఏర్పాటు చేసి మానిటరింగ్ చేసింది. దీంతో ఈనెల 11 న దరిగాం గోంది అటవి ప్రాంతంలో మరో పశువుపై పులిదాడి చేసి హతమార్చగా.. ఆ పశువు వద్ద ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాకు పులి చిక్కింది. దాని పాదముద్రల ఆధారంగా మూడేళ్ల వయస్సున ఆడపులి.. ఎస్ 6 గా గుర్తించిన అటవిశాఖ ఊపిరి పీల్చుకుంది. 73వ క్యాంపు వారికి కే 14 పులి పాదముద్రలు 51 క్యాంప్ టీంకు కే 16, 17 పాదముద్రలు లభించడంతో సర్చ్ ఆపరేషన్ ని నిలిపివేసింది. 62 గంటల పాటు ఓ యుద్దంలా సాగిన టైగర్ సర్చ్ ఆపరేషన్ పులులు క్షేమంగా ఉన్నాయన్న సమాచారంతో సక్సెస్ గా ముగియగా.. దరిగాం అటవీ ప్రాంతంలో లెక్కకు మించి పులుల సంచారం సాగుతుందన్న సమాచారంతో అటవిశాఖకు మరింత దృష్టి సారించింది. ఇప్పుడు ఆ పులులను వేటగాళ్ల కంటపడకుంటా క్షేమంగా కాపాడటం.. ఆ పులులతో మనుషులకు ఎలాంటి ప్రమాదం రాకుండా చూడటం తప్పని సరిగా మారింది. మరోవైపు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామంలోని ఓ రైతుకు పత్తి చేనులో పులి కనిపించింది. వెంటనే రైతు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. పులి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పారెస్ట్ అదికారులు గుంపులు గుంపులు చేనులల్లో పనులు చేసుకోవాలని ఫారెస్ట్ కర్జెల్లి రేంజ్ అధికారి నవ్య రైతులకు సూచిస్తున్నారు. ఇటు దరిగాం అటవీ సంఘటన లో పలువురిని అదుపులోకి తీసుకున్న అధికారులు దర్యాప్తు వేగం చేశారు.. నిర్లక్ష్యం వహించిన అధికారులపై సైతం చర్యలు తీసుకునే అవకాశం లేపోలేదని తెలుస్తోంది. -
కొమురంభీం జిల్లాలో టైగర్ సెర్చ్ ఆపరేషన్ సక్సెస్
-
సీఎం కేసీఆర్ హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం
కొమరంభీం జిల్లా: కాగజ్‌నగర్‌లో సీఎం కేసీఆర్ హెలికాఫ్టర్‌కు సాంకేతిక లోపం తెలెత్తింది. సిర్పూర్లో హెలికాఫ్టర్ టేకాఫ్ కాలేదు. సాంకేతిక సమస్య కారణంగా పైలట్ చాపర్‌ను నిలిపివేశారు. దీంతో రోడ్డు మార్గాన సీఎం ఆసిఫాబాద్ బయలుదేరారు. సోమవారం కూడా కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో సీఎం కేసీఆర్‌కు ప్రమాదం తృటిలో తప్పిన సంగతి తెలిసిందే. సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి మహబూబ్ నగర్ పర్యటన కోసం హెలికాఫ్టర్ బయలుదేరారు. అయితే హెలికాఫ్టర్ పైకి లేచిన కొద్ది సమయానికే సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలెట్ వెంటనే అక్కడే సేఫ్ ల్యాండింగ్ చేశారు. కాగా, సీఎం కేసీఆర్ నేడు ఉమ్మడి ఆదిలాబాద్‌లో పర్యటిస్తున్నారు. సిర్పూర్ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అనంతరం ఆసిఫాబాద్, బెల్లంపల్లిలో జరిగే బహిరంగసభలో ఆయన ప్రసంగించనున్నారు. -
సంతోషంగా నిశ్చితార్థం.. బంధువును దిగబెట్టి వస్తుండగా..
వాంకిడి(ఆసిఫాబాద్): ప్రేమించిన అమ్మాయిని మనువాడేందుకు పెద్దలను ఒప్పించాడు. సంతోషంగా నిశ్చితార్ధం చేసుకుని.. ఆ శుభ కార్యక్రమానికి వచ్చిన బంధువును ఊళ్లో దిగబెట్టి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. ఇది తట్టుకోలేని అతని తండ్రి పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటనలు గురువారం కొమురంభీం జిల్లా వాంకిడి మండలంలోని సామెల గ్రామంలో చోటుచేసుకున్నాయి. గ్రామానికి చెందిన వసాకే తులసీరాం(21) అదే ఊరికి చెందిన యువతిని ప్రేమించగా, ఇరు కుటుంబాల అంగీకారంతో బుధవారం నిశ్చితార్థం జరిగింది. దీనికి హాజరైన బంధువుల్లో ఒకరైన ఆసిఫాబాద్ మండలం ఎల్లారానికి చెందిన అంజన్నను గురువారం స్కూటీపై అతడి గ్రామంలో దింపి తులసీరాం ఇంటికి బయలుదేరాడు. బుదల్‌ఘాట్ వాగు దాటిన తర్వాత జైత్పూర్ రోడ్డు వద్ద కంకర క్రషర్ సమీపంలో జాతీయ రహదారి– 363పై వేగంగా వచి్చన డీబీఎల్ కంపెనీకి చెందిన టిప్పర్ స్కూటీని ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. లారీ టైర్ల కింద స్కూటీ ఇరుక్కుపోగా తులసీరాం అక్కడికక్కడే మృతిచెందాడు. కొడుకు మృతి తట్టుకోలేక: కుమారుడి మరణ వార్త విన్న తండ్రి భీంరావు(45) తీవ్ర మనస్తాపంతో ఇంట్లోకి వెళ్లి పురుగుల మందు తాగాడు. స్థానికులు అంబులెన్స్‌లో ఆసిఫాబాద్‌లోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. తండ్రీకుమారుల మరణంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు వాంకిడి ఎస్సై సాగర్ తెలిపారు. -
ఆసిఫాబాద్: ఛాతీలో నొప్పి.. దూకేసిన ఆర్టీసీ డ్రైవర్
కుమ్రం భీం ఆసిఫాబాద్: జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటన చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న మార్గంలో ప్రమాదం సంభవించింది. బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో డ్రైవర్ బస్సు నుంచి బయటకు దూకేశాడు. అదుపు తప్పిన బస్సు.. బోల్తా పడింది. ప్రమాదం జరిగినప్పుడు సదరు సూపర్ లగ్జరీ బస్సులో బస్సులో ఏడుగురు ప్రయాణికులు ఉండగా.. ఒకరికి గాయాలైనట్లు సమాచారం. ప్రయాణికుడితో పాటు ఛాతీ నొప్పికి గురైన డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. -
కొమరంభీం జిల్లా జైనూర్ లో హైమన్ ధర్ఫ్ 36వ వర్థంతి సభ
-
పంట చేనుకు కాపలా వెళ్లిన యువతి.. చివరికి ఊహించని ఘటన..
పెంచికల్పేట్(సిర్పూర్)కొమరంభీం జిల్లా: మండలంలోని కమ్మర్గాం గ్రామానికి చెందిన దుర్గం దస్రుబాయి(22) అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం సదరు యువతి శుక్రవారం ఉదయం గ్రామ సమీపంలోని పంట చేనుకు కాపలా వెళ్లింది. మధ్యాహ్నం వరకూ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించగా పంటచేనులో మృతదేహం కనిపించింది. స్థానికుల సమాచారంతో ఎస్సై విజయ్‌కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిర్పూర్(టి) ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. యువతి తల్లి శకుంతల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. మృతిపై అనుమానాలు దస్రుబాయి మృతి పట్ల తల్లి శకుంతల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పంట చేనుకు కాపలా వెళ్లిన తన కూతురును హత్య చేసి నోట్లో పురుగుల మందు పోసి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. భూతగాదాల నేపథ్యంలో హత్య చేశారని నిందితులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చదవండి: విజయవాడలో స్పా మాటున హైటెక్ వ్యభిచారం.. -
ప్రేమ.. పెళ్లికి తల్లి అడ్డు చెప్పిందని..
దహెగాం: ప్రేమ..పెళ్లి వద్దని తల్లి మందలించడంతో మనస్తాపం చెందిన ఒక బాలిక ఆత్మహత్య చేసు కుంది. కుమురంభీం జిల్లా దహె గాం మండలం రాళ్లగూడ గ్రామంలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఎస్ఐ సనత్‌కుమార్ కథనం ప్రకారం.. రాళ్ల గూడ కు చెందిన నాగపురి స్వరూపకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. భర్త మోహన్ చనిపోయాడు. చిన్నకూతురు శిరీష(16) ఇంటర్ ఫెయిల్ కావడంతో ఇంటివద్దే ఉంటోంది. అదే గ్రామానికి చెందిన యువకుడిని 8 నెలలుగా ప్రేమిస్తోంది. ఈ విషయం తల్లికి తెలియడంతో ఇప్పుడే ప్రేమ, పెళ్లి ఏంటని మందలించింది. దీంతో మనస్తాపం చెందిన శిరీష బుధవారం వేకువజామున ఇంటి వెనకాల పురుగు మందు తాగింది. వెంటనే శిరీషను తల్లి కాగజ్‌నగర్‌లోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయింది. మృతు రాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
పత్తిలో దాక్కుని.. ఊపిరందక..
కౌటాల: దాగుడుమూతలు ఆట ఓ బాలుడి ప్రాణం తీసింది. తమ్ముడు, చెల్లికి దొరక్కుండా పత్తిలో దాక్కునే ప్రయత్నంలో ఊపిరి ఆగిపోయింది. ఈ సంఘటన కుమురంభీం జిల్లా కౌటాల మండలం కన్నెపల్లిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. కన్నెపల్లికి చెందిన చెన్నూరి కైలాష్, రుమలకు ముగ్గు రు సంతానం అభిషేక్, హర్షిత్, అవంతిక ఉన్నారు. అభిషేక్ (12) కౌటాలలోని ప్రైవేటు పాఠశాల్లో 4వ తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు కౌటాల వారసంతలో కూరగాయలు విక్రయించడానికి వెళ్లారు. పాఠశాల ముగిసిన తర్వాత ఇంటికి వచ్చిన అభిషేక్ తమ్ముడు, చెల్లితో దాగుడుమూతలు ఆడుతూ ఇంట్లో నిల్వ ఉంచిన పత్తిలో దాక్కునే ప్రయత్నం చేశాడు. దీంతో ఊపిరాడక అపస్మారక స్థితికి చేరాడు. ఇంట్లోకి వచ్చిన హర్షిత్ పత్తిలో తన అన్న తలదూర్చి కాళ్లు పైకి ఉండటం గమనించాడు. భయపడి కేకలు వేయడంతో బంధువులు వచ్చి బయటకు తీశారు. కౌటాలలోని ప్రైవేటు ఆస్పత్రి వైద్యుల సూ చన మేరకు కుటుంబ సభ్యులు కాగజ్‌నగర్‌కు తరలించారు. అప్పటికే అభిషేక్ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. -
అంగన్వాడీ సెంటర్లో ఆమ్లెట్ దొంగలు!
సాక్షి, కొమరంభీం ఆసిఫాబాద్: జిల్లాలోని తిర్యాణి మండలం పరిధిలోని ఓ అంగన్వాడీ సెంటర్లో ‘ఆమ్లెట్ దొంగలు’ హల్ చేశారు. గంభీరావుపేట్ గ్రామపంచాయతీలోని అంగన్వాడీ కేంద్రంలో వీరంగం సృష్టించారు. అంగన్వాడీ కేంద్రానికి ఉన్న తాళాన్ని పలగొట్టి కేంద్రం లోపలికి ప్రవేశించి.. అక్కడే ఉన్న గుడ్లను, వంట పాత్రలు ఉపయోగించి ఉపయోగించి ఆమ్లెట్లు వేసుకున్నారు. గర్భిణీలకు, పిల్లలకు పౌష్టికాహారంలో భాగంగా ఇచ్చే గుడ్లను వాడేశారు. ఈ తరుణంలో నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని.. ఆ ఆగంతకులను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఇది తాగుబోతుల పనేనని గ్రామస్తులు భావిస్తున్నారు. -
బీఆర్ఎస్కు షాక్.. సర్పంచ్ల మూకుమ్మడి రాజీనామా
సాక్షి, వాంకిడి(ఆసిఫాబాద్): అధికార పార్టీకి చెందిన ఆదివాసీ సర్పంచ్‌లు రాజీనామా అస్త్రం సంధించారు. నిధుల్లేక గ్రామాల అభివృద్ధి అడుగు కూడా ముందుకు సాగడంలేదంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కుమురంభీం జిల్లా వాంకిడి మండలంలోని 18 మంది సర్పంచ్‌లు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వాంకిడి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం సర్పంచ్‌లు సమావేశమై గ్రామాల అభివృద్ధికి నిధులు ఇవ్వకపోవడంతో పనులు చేపట్టలేకపోతున్నామని, అందుకే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు. ఆదివాసీ సర్పంచుల సంఘం మండల ప్రధానకార్యదర్శి సిడాం అన్నిగా విలేకరులతో మాట్లాడుతూ 2021 నుంచి నేటి వరకు ప్రభుత్వ విధానాలతోపంచాయతీల పాలన అస్తవ్యస్తంగా మారిందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు సక్రమంగా అందడంలేదని, గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తుగా చేపట్టిన పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులు ఇప్పటికీ అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మారుమూల గిరిజన గ్రామాల్లోని సమస్యలను పలుమార్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆరోపించారు. భూప్రక్షాళన తర్వాత చాలామంది రైతులకు కొత్తపట్టాలు రాలేదని, రేషన్‌కార్డులు ఇవ్వలేదని, డబుల్బెడ్రూం ఇళ్ల పంపిణీపై ప్రజలు నిలదీస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జెడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి వ్యవహారశైలి నచ్చక పార్టీని వీడుతున్నట్లు రాజీనామా పత్రంలో పేర్కొన్నారు. రాజీనామా ప్రతులను వాట్సాప్ ద్వారా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడికి పంపినట్లు తెలిపారు. రాజీనామా చేసినవారిలో ఆదివాసీ సర్పంచుల మండల అధ్యక్షుడు కోట్నాక కిష్టు, సర్పంచులు దేవ్‌రావు, పెందూర్ పవన్, జంగు, మనోహర్ తదితరులు ఉన్నారు. గతంలోనూ రాజీనామా.. ఏడాది క్రితం మండలంలోని సర్పంచులు ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. జెడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మికి రాజీనామా పత్రాన్ని ఇచ్చేందుకు సైతం వెళ్లారు. సమస్యలు పరిష్కరిస్తామని ఆమె హామీ ఇవ్వడంతో రాజీనామా ఆలోచనను విరమించుకున్నారు. -
వేటగాళ్ల ఉచ్చుకు యువకుడు బలి
తిర్యాణి(లింగాపూర్): కొమురంభీమ్ జిల్లా లింగాపూర్ మండలం దంపూర్ గ్రామంలో అడవి జంతువుల కోసం వేటగాళ్లు వేసిన ఉచ్చుకు గురువారం రాత్రి ఓ యువకుడు బలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తిర్యాణి మండలం దంతన్‌పెల్లి గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు భీమన్న దేవుని గంగస్నానం కోసం గురువారం దంపూర్ గ్రామం మీదుగా కాలినడకన జన్నారం వైపు వెళ్లారు. గంగస్నానం ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో రాత్రివేళ దంపూర్ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో జంతువుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి దంతన్‌పల్లి గ్రామానికి చెందిన ఆత్రం భీమ్రావు(21) అక్కడికక్కడే మృతి చెందాడు. భీమ్రావుతోపాటు ఉన్న ఆత్రం పావుగా అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇతడికి లింగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అనంతరం ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఆత్రం భీము ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపార -
కొమరం భీం జిల్లా: కాగజ్ నగర్ పట్టణంలో పులి కలకలం
-
TS: మూడు జిల్లాలను వణికిస్తున్న మ్యాన్ ఈటర్స్
సాక్షి, కొమరం భీమ్ ఆసిఫాబాద్: చలితో పాటు ఉమ్మడి అదిలాబాద్ జిల్లాను పెద్దపులి కూడా వణికిస్తోంది. పులి దాడిలో ఓ రైతు మృతి చనిపోవడంతో కలవరపాటుకి గురి చేస్తున్నాయి. పశువులపైనా దాడులు చేస్తున్నాయి. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల జిల్లాల్లోని ఎనిమిది మండలాల ప్రజలను పులుల కదలికలు జనాలకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాయి. మరోవైపు వాటిని ట్రేస్ చేసి పట్టుకునేందుకు అటవీ శాఖ తీవ్ర యత్నం చేస్తోంది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ టౌన్లో టెన్షన్ టెన్షన్ నెలకొంది. గురువారం దాదాపు పన్నెండు గంటలపాటు పులి సంచారించిందన్న ప్రచారం.. ప్రజలను భయాందోళనకు గురి చేసింది. మరోవైపు ఉదయం పూట వాకింగ్‌కు వెళ్లడంపై ఆంక్షలు విధించారు పోలీసులు. అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేస్తూ పహారా కాస్తున్నారు. బయటకి రావొద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో చివరి సారిగా పులి జాడ తెలియగా.. టౌన్ దాటి పెద్ద వాగు గుండా అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయి ఉండవచ్చని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. దీంతో అటవీ సమీప గ్రామాలను అప్రమత్తం చేశారు. మరోవైపు ఖానాపూర్ శివారులో సిడాం భీము అనే వ్యక్తిని పులి దాడి చేసి చంపేసింది. ఆ పులే కాగజ్ నగర్లోనూ సంచరించి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదిక.. కాలి ముద్రల ఆధారంగా పులి ఆనవాలును నిర్ధారించుకునే యత్నం చేస్తున్నారు. ఇక పులి సంచారంతో స్థానికులు భయం భయంగా గడిపారు. తలుపులు తీయడానికే జనం వణికిపోతున్నారు. మూడు జిల్లాలు, 8 మండలాలు, 18 గ్రామాలను ఇప్పుడు మ్యాన్ ఈటర్స్ వణికిస్తున్నాయి. తొలుత మ్యాన్ ఈటర్స్ కాదని అధికారులు ప్రకటించినా.. ఖానాపూర్ రైతు మరణంతో ఆ భయం రెట్టింపు అయ్యింది. మరోవైపు అదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం లోకారి దారిలో పులి కలకలం రేగింది. రోడ్డు దాటుతూ వాహనదారులకు పులి కనిపించిందన్న ప్రచారంతో అక్కడా భయం నెలకొంది. మైక్‌ల ద్వారా ప్రజలను బయటకు రావొద్దని అటవీశాఖ అధికారులు ప్రచారం చేస్తున్నారు. దహేగాం మండలం ఖర్జి గ్రామంలో పశువుల మందపై పులి పంజా విసిరినట్లు తెలుస్తోంది. భీంపూర్ , తాంసి , జైనథ్ మండలాల పరిదిలోని పెనుగంగ తీరం వెంట ఏకంగా నాలుగు పులులు సంచరిస్తున్నట్లు పలువురు చెబుతున్నారు. తీవ్ర యత్నం అటవీ శాఖ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతుండగా.. తమ ప్రయత్నం గురించి అధికారులు వివరిస్తున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 20 మంది ప్రత్యేక అటవీశాఖ టీంతో ట్రాకింగ్ చేస్తున్నారు. 35 కెమెరాలు, 50 మంది టైగర్ ట్రాకర్స్ తో పులి సంచార ప్రాంతాల్లో అణువణువునా గాలిస్తున్నారు. ఖానాపూర్, గోవిందపూర్, చౌపన్ గూడ అటవీ ప్రాంతాలపై ప్రధానంగా దృష్టిసారించారు. కోల్‌బెల్ట్‌లోనూ ప్రచారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లోనూ పులి సంచారం కలకలం రేపింది. దీంతో స్థానికులు, సింగరేణి కార్మికుల్లో భయాందోళన నెలకొంది. విషయం దృష్టికి రావడంతో.. శ్రీరాంపూర్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. పులి ఆనవాళ్లు కనిపించలేదని, ప్రజలు భయాందోళన చెందవద్దని ప్రజలకు భరోసా ఇస్తున్నారు అటవీశాఖ అధికారులు. ఇదీ చదవండి: దళితబంధులో ఎమ్మెల్యేల జోక్యమా? -
కొమరం భీమ్ జిల్లాలో టైగర్ టెన్షన్
-
ప్రసవం కోసం పడవ ప్రయాణం
చింతలమానెపల్లి(సిర్పూర్): దిందా వాసుల కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు..వరదతో ఉప్పొంగే వాగుపై వంతెన నిర్మించాలని పోరుబాట పట్టినా ఫలితం దక్కలేదు. ఈ క్రమంలో ఓ నిండు గర్భిణిని అష్టకష్టాలు పడి ఆస్పత్రికి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కుమురంభీం జిల్లా సిర్పూర్(టి) మండలం నవేగాం గ్రామానికి చెందిన లొకండే సాయిరాం భార్య పద్మ రెండో కాన్పు కోసం చింతలమానెపల్లి మండలం దిందా గ్రామంలోని పుట్టింటికి వచ్చింది. నెలలు నిండటంతో వైద్యుల సూచన మేరకు శుక్రవారం కాగజ్‌నగర్‌లో శస్త్రచికిత్స చేయించాల్సి ఉంది. బుధవారమే ఆస్పత్రికి చేరుకోవాల్సి ఉన్నా దిందా వాగులో వరద అధికంగా ఉండటంతో వెళ్లలేదు. రెండ్రోజులుగా వరద తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నాటు పడవపై గర్భిణిని వరద దాటించాలని నిర్ణయించారు. గురువారం ఉదయం ప్రాణహిత నది వద్ద నుంచి నాటు పడవను తీసుకువచ్చారు. వాగు దాటేందుకు పద్మ పత్తి చేల గుండా కాలినడకన వాగు వద్దకు చేరుకుంది. ఆ తర్వాత నాటు పడవ ద్వారా స్థానికులు వాగు దాటించారు. అనంతరం అవతలి ఒడ్డున ఏర్పాటు చేసిన 108 వాహనంలో కాగజ్‌నగర్‌కు తరలించారు. -
కౌటాల కస్తూర్బా స్కూల్లో 15 మందికి అస్వస్థత
కౌటాల (సిర్పూర్): కుమురంభీం జిల్లా కౌటాల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 15 మంది విద్యార్థినులు అస్వస్థత బారినపడ్డారు. గురువారం సాయంత్రమే కొందరు విద్యార్థులు వాంతులు, తలనొప్పి, జ్వరం బారినపడ్డారు. శుక్రవారం నాటికి ఇలా అనారోగ్యానికి గురైనవారి సంఖ్య మరింత పెరిగింది. దీంతో 15 మందిని అంబులెన్స్‌లో కౌటాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో తీవ్ర అనారోగ్యంగా ఉన్న నలుగురికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని.. మిగతా వారిని హాస్టల్‌కు తిరిగి పంపిస్తున్నామని వైద్యులు తెలిపారు. వైద్య సిబ్బంది విద్యాలయానికి వెళ్లి.. విద్యార్థులందరి నుంచి రక్త పరీక్షల కోసం నమూనాలు సేకరించారు. చదవండి: ఇంటర్ ఛేంజర్లకు అదనంగా భూసేకరణ -
వరుస విషాదాలు.. హాస్టళ్లలో దారుణాలు.. అసలు ఏం జరుగుతోంది?
సాక్షి ప్రతినిధి మంచిర్యాల/కాగజ్‌నగర్‌టౌన్: కుమురంభీం జిల్లాలో ఓ విద్యార్థిని జ్వరంతో మంగళవారం రాత్రి చనిపోయింది. కాగజ్‌నగర్ మండలం అంకుశాపూర్‌కు చెందిన శంకర్, నీలాబాయి దంపతుల పెద్ద కూతురు ఐశ్వర్య (14) కాగజ్‌నగర్ కేజీబీవీలో 8వ తరగతి చదువుతోంది. మంగళవారం సాయంత్రం తలనొప్పిగా ఉందని డ్యూటీ టీచర్‌కు చెబితే పెయిన్‌బామ్ రాసుకోమనడంతో, జండూబామ్ రాసుకుని నిద్రపోయిన ఐశ్వర్య ఉదయంఎంతకీ నిద్రలేవలేదు. నోరు, ముక్కు నుంచి నురగలు రావడంతో విద్యార్థులు డ్యూటీ టీచర్‌కు చెప్పారు. చదవండి: ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ.. ఇంతలోనే షాకింగ్ ఘటన సమాచారం అందుకున్న తండ్రి శంకర్ వచ్చి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఐశ్వర్య మృతిచెందిందని వైద్యులు తెలిపారు. బాలిక మరణవార్త తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు, విద్యార్థి సంఘాలు, అఖిలపక్ష నాయకులు మృతదేహంతో హాస్టల్ ముందు 8గంటలపాటు ధర్నా చేశారు. కొందరు స్కూల్లోకి చొచ్చుకెళ్లి డీఈవో అశోక్ ముందే ఫర్నిచర్ ధ్వంసం చేశారు. డీఎస్పీ కరుణాకర్ ఆందోళనకారులకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బాలిక మృతికి కారణమైన ఎస్వో స్వప్న, ఏఎన్ఎం భారతి, డ్యూటీ టీచర్ శ్రీలతను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం తెలిపారు. విద్యార్థిని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఎక్స్‌గ్రేషియాగా రూ.15లక్షల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతోపాటు తక్షణ సాయం కింద రూ.50వేలు నగదు ప్రకటించడంతో బాధితులు ఆందోళన విరమించారు. కాగా, గత 15 రోజుల్లో జిల్లాలోని పలు గురుకులాల్లో చదువుతున్న ఐదుగురు విద్యార్థులు మృతిచెందారు. ఇందులో ఒకరు డిగ్రీ విద్యారి్థని. హాస్టళ్లపై ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడటం వల్లే ఘటనలు జరుగుతున్నాయని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. -
కోమరంభీం జిల్లాలో టీఆర్ఎస్కు షాకిచ్చిన నేతలు... లేఖలో ఆవేదన
సాక్షి, కొమరంభీం జిల్లా: కోమరంభీం జిల్లాలోని బెజ్జూర్ మండలంలో టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. మండలంలోని పలు అభివృద్ధి పనులు జరగడం లేదని పలువురు ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇచ్చిన హమీలు నేరవేయడం లేదని ముగ్గురు సర్పంచ్‌లు, జడ్పీటీసీ పుష్పలత, ఎంపీటీసీతో పాటు కాగజ్‌నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్, బెజ్జూర్ సహాకర సంఘం డైరెక్టర్ రాజీనామా చేశారు. ఏళ్లుగా ఉన్న సమస్యలు పరిష్కరించకపోడవం వల్లే రాజీనామా చేశామని సదరు ప్రజా ప్రతినిధులు తెలిపారు. ఈమేరకు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడికి లేఖ రాశారు. -
ఈ ఊరికి చేరాలంటే.. 8 కి.మీ. నడవాలి
ఎనిమిది కిలోమీటర్ల దూరం కొండలు ఎక్కిదిగితే గానీ ఆ గ్రామానికి చేరుకోలేం. గుక్కెడు నీటికోసం పిల్లాజెల్లా అంతా కలిసి బిందెలు ఎత్తుకుని పాడుబడ్డ బావి దగ్గరికి వెళ్లాల్సిందే. ఊరు విడిచిపోతేగానీ పెద్ద చదువులకు అవకాశం లేదు. అటవీ ప్రాంతంలో కష్టాలతో సహవాసం చేస్తున్న కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా భీమనగొంది గ్రామస్తుల వ్యథ ఇది. సిర్పూర్(యూ): ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం చోర్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో భీమనగొంది ఉంది. ఇక్కడ 31 ఆదివాసీ కుటుంబాలకు చెందిన 150 మందికిపైగా జీవిస్తున్నారు. ఈ గ్రామానికి చేరుకోవాలంటే చోర్పల్లి నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరం అటవీ ప్రాంతంలో కొండల మధ్య ప్రయాణించాల్సిందే. అదీ ఎగుడు దిగుడుగా ఉండే అధ్వానపు రహదారి మీద స్థానికంగా రేషన్ దుకాణం లేకపోవడంతో చోర్‌పల్లికి కాలినడకన వెళ్లి.. 20, 30 కిలోల బియ్యం మూటలు నెత్తిన మోసుకుంటూ తెచ్చుకోవాల్సిందే. గ్రామస్తులు వినియోగిస్తున్న బావి ఇక వానాకాలం వచ్చిందంటే మట్టిరోడ్డు బురదతో నిండి.. కాలు తీసి కాలువేయలేని పరిస్థితి ఉంటుంది. ఎంత అత్యవసరమైనా 108 వాహనం రాదు. ఎవరైనా అనారోగ్యం బారినపడితే ఎడ్లబండిపై చోర్పల్లి వరకు తీసుకెళ్లి.. అక్కడి నుంచి ఆటోలు, ప్రైవేట్ వాహనాల్లో జైనూర్, సిర్పూర్(యూ) మండల కేంద్రాలకు చేరుకుంటారు. నీళ్లకు నిండా గోస.. గ్రామంలో రెండేళ్ల క్రితం భగీరథ ట్యాంకు నిర్మించారు. కానీ ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇవ్వలేదు. ట్యాంకును సైతం 20 రోజులకోసారి నింపుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఊరి చివరన నిర్మించుకున్న బావి నుంచే నీటిని తెచ్చుకుంటున్నారు. బావి ప్రహరీ సగం వరకు కూలిపోయి శిథిలావస్థకు చేరుకుంది. భీమనగొంది గ్రామ రహదారి అదికూడా ఈ బావి వాగులో ఉండటంతో వానాకాలంలో చెత్తాచెదారంతో నిండిపోతుంది. గ్రామానికి చెందిన వృద్ధులు వృద్ధాప్య పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటివరకు మంజూరు కాలేదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు కనీస సౌకర్యాలు కల్పించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. పింఛన్ వస్తలేదు నాకు అరవై ఏళ్లు దాటినా ఇప్పటివరకు పింఛన్ వస్తలేదు. నాకు ఏ పని చేతకాదు. సర్కారు పింఛన్ అందిస్తే బతుకుతా. – ఆత్రం బాగుబాయి, గ్రామస్తురాలు రోడ్డు, నీటి సమస్య పరిష్కరించాలి మా గ్రామానికి రోడ్డు పెద్ద సమ స్య. ఊరి నుంచి పంచాయతీకి వెళ్లాలంటే ఎనిమిది కిలోమీటర్లు నడవాల్సిందే. రోడ్డు, నీటి సమ స్య పరిష్కరిస్తే గ్రామం బాగు పడుతుంది. – మర్సుకోల సోనేరావు, గ్రామస్తుడు -
కుమురంభీం జిల్లా అటవీ అందాలు.. సరిహద్దుల్లో సందర్శనీయం
చింతలమానెపల్లి(సిర్పూర్): కరోనా కారణంగా గత రెండేళ్లుగా ప్రజలు పర్యాటక ప్రాంతాలకు వెళ్లడం తగ్గింది. ప్రస్తుతం కోవిడ్ ప్రభావం తగ్గడం.. నిబంధనలు సడలించడం కారణంగా ఈ వేసవిలో పర్యాటక ప్రాంతాలను చుట్టి రావాలనే ఆసక్తి చాలామందిలో కనిపిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులోనూ సందర్శనీయ స్థలాలు ఎన్నో ఉన్నాయి. కుమురంభీం జిల్లా అటవీ అందాలు.. ప్రకృతి రమణీయతకు అద్దం పడుతుంది. వచ్చే నెల 13నుంచి ప్రాణహిత పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాంతాలన్ని ప్రాణహిత నది చుట్టుపక్కల ఉన్నాయి. అటు పుష్కరస్నానం.. ఇటు పర్యాటక ప్రాంత సందర్శన రెండూ సాధ్యమవుతాయి. జిల్లా సరిహద్దులోని సందర్శనీయ స్థలాలపై ప్రత్యేక కథనం. బామ్రాఘడ్.. వన్యప్రాణుల నిలయం కుమురంభీం జిల్లాను ఆనుకుని ఉన్న గడ్చిరోలి జిల్లాలోని బామ్రాఘడ్ ప్రాంతం ప్రకృతి రమణీయతను చాటుతోంది. తహసీల్‌గా ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న ఈ ప్రాంతం జిల్లాలోని సరిహద్దు మండలం చింతలమానెపల్లి నుంచి 80కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బామ్రాఘడ్లోని హెమల్కాస వద్ద సామాజిక సేవా కార్యకర్త బాబా ఆమ్టె ఆధ్వర్యంలో లోక్బిర్దారి ప్రకల్ప్ ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. గిరిజనులకు ఉచితంగా వైద్యం చేస్తారు. ఆస్పత్రి ఆవరణలో వన్యప్రాణుల సందర్శనశాల(జూ పార్కు) ఉంది. చిరుత పులులు, ముళ్ల పందులు, ఎలుగుబంట్లు ఇలా ఎన్నో రకాల అరుదైన జంతువులు ఉన్నాయి. బామ్రాఘడ్ సమీపంలో ఇంద్రావతి నది త్రివేణి సంగమం అరుదైనదిగా చెబుతుంటారు. ఇంద్రావతి, వాముల గౌతమి, వర్లకోట నదుల కలయికతో సంగమ దృశ్యం అద్భుతంగా కనిపిస్తుంది. గిరిజనుల సంస్కృతి, ఆచారాలు, ప్రయాణంలో కనిపించే దృశ్యాలు, అటవీ అందాలు ప్రకృతి ప్రేమికుల మదిని దోచుకుంటాయి. బామ్రాఘడ్ వెళ్లే మార్గంలో వచ్చే గ్లోరీ ఆఫ్ ఆల్లపల్లి చూడాల్సిన ప్రదేశం.. కమలాపూర్.. గజరాజుల అడ్డా చింతలమానెపల్లి మండల కేంద్రం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో కమలాపూర్ ఏనుగుల సంరక్షణ కేంద్రం ఉంది. 10 వరకు పెద్ద ఏనుగులు, రెండు చిన్న ఏనుగులు ఉన్నాయి. స్థానిక అటవీశాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు. ఏనుగుల సంరక్షకుల సమక్షంలో సందర్శకులు నేరుగా పండ్లు, ఆహారం అందించవచ్చు. ఈ కేంద్రాన్ని స్థానికంగా హాథీ క్యాంప్ అని పిలుస్తారు. ఇక్కడి రిజర్వాయర్, అటవీ అందాలు, చల్లెవాడ రాబందుల సంరక్షణ కేంద్రం, ఏనుగు రూపంలో ఉన్న కొండ సందర్శకులను ఆకట్టుకున్నాయి. చెప్రాడ ప్రశాంత ధాం చెప్రాడ ప్రశాంత ధాం ఆలయం కుమురంభీం, మంచిర్యాల జిల్లా వాసులకు సుపరిచిత ప్రదేశం. పెన్‌గంగా, వార్ధా నదుల సంగమ స్థలం ప్రాణహిత జన్మస్థలంలో ఈ దేవస్థానం ఉంది. చెప్రాడలో కార్తీక మçహారాజ్ స్వామి చేతుల మీదుగా ప్రతిష్టించిన ప్రశాంత ధాం హనుమాన్ ఆలయం ప్రసిద్ధి చెందింది. స్థానిక ప్రజలు మహారాజ్‌గా పిలుచుకునే కార్తీక్ స్వామి ఇక్కడ ఆలయ అభివృద్ధికి ఎన్నో పనులు చేపట్టారు. శ్రీకృష్ణ, రామ, శివ, దుర్గా, సాయిబాబా, గజానన్ మహరాజ్ ఆలయాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్మించారు. మూడేళ్ల క్రితం కార్తీక మహారాజ్ పరమపదించగా, ఆయన భక్తులు మహా సమాధిని నిర్మించారు. యేటా శివరాత్రి, కార్తీక పౌర్ణమి, హనుమాన్ జయంతి, శ్రీరామనవమి, దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. జనవరి ఒకటిన నూతన సంవత్సరం సందర్భంగా మంచిర్యాల, కుమురంభీం జిల్లాల నుంచి వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి వందల కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహిస్తుంటారు. తోగ వెంకటాపూర్.. చెట్టుకాండంలో వేంకటేశ్వరుడు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా చామూర్శి తాలూకాలో మార్కండ ఆలయం ఉంది. గడ్చిరోలి జిల్లాలో ప్రజలు కొలిచే దేవస్థానాల్లో తోగ వెంకటాపూర్ ఒకటి. కుమురంభీం, మంచిర్యాల, గడ్చిరోలి జిల్లాల సరిహద్దుల్లో ఈ ప్రాంతం ఉంది. కాగజ్‌నగర్ నుంచి కౌటాల, చింతలమానెపల్లి, మహారాష్ట్రలోని అహెరి మీదుగా 80 కిలోమీటర్ల రోడ్డు మార్గం ప్రయాణిస్తే తోగ వెంకటాపూర్ చేరుకోవచ్చు. ఇక్కడ వేరుమద్ది చెట్టు కాండంలో వేంకటేశ్వరస్వామి కొలువుదీరి ఉన్నారు. 800 ఏళ్ల చరిత ఉన్న ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అహెరి రాజ వంశీయులు తమ కుల దైవంగా భావిస్తారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ దేవస్థానం ప్రకృతి అందాలతో అలరారుతూ ఉంటుంది. వేల సంవత్సరాల నాటి అరుదైన వృక్షాలు అబ్బుర పరుస్తాయి. చప్పట్లు కొడితే పైకి ఉబికే నీటి ఊటలు మనుషుల అలజడికే ఎగిసిపడే నీటి అలలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. పులుల అభయారణ్యం.. తాడోబా జిల్లాకు సమీపంలో ఉండి పర్యాటక ప్రేమికులకు ఆనందాన్ని ఇచ్చే ప్రదేశం తాడోబా. కాగజ్‌నగర్ పట్టణం నుంచి వంద కిలోమీటర్ల దూరంలో చంద్రాపూర్ జిల్లా కేంద్రం ఉంది. చంద్రాపూర్‌కు రోడ్డు, రైలు మార్గాల ద్వారా ఏ సమయంలోనైనా చేరుకోవచ్చు. తాడోబా అటవీ ప్రాంతం చిరుతలు, పెద్ద పులులు, జింకలు, ఎలుగుబంట్లు, ఇతర ఎన్నో రకాల వన్యప్రాణులకు ప్రసిద్ధి. ఇక్కడి తాడోబా సఫారి టూర్ వేసవిలో ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఈ అటవీ ప్రాంతంలో పర్యటనకు పలు మార్గాలు ఉండగా, మొహార్లి గేట్ మార్గం గుండా వెళ్తే పూర్తిస్థాయిలో అందాలను ఆస్వాదించవచ్చు. పర్యటనకు సఫారి టూర్ ఆన్లైన్లో రిజర్వు చేసుకోవాల్సి ఉంటుంది. వాహనానికి నిర్ణీత రుసుం చెల్లించి అటవీ ప్రాంతంలో పర్యటించాల్సి ఉంటుంది. పులులు, జింకలు, ఎలుగుబంట్లు, ఇతర జంతువులను వాటి సహజ స్థితిలో సమీపం నుంచి చూసే అవకాశం పర్యాటకులకు ఉంటుంది. వసతిపరంగా తాడోబాలో మహారాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రిసార్ట్లు, చంద్రాపూర్‌లో పర్యాటకులకు అనువైన ధరల్లో హోటళ్లు, రిసార్చ్టులు ఉన్నాయి. చంద్రాపూర్‌లో మహంకాళి ఆలయం, చంద్రాపూర్ కోట, అందమైన పార్కులు సందర్శనీయ స్థలాలు. దాబా కొండయ్య మహారాజ్ ఆలయం కాగజ్‌నగర్ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరుదైన ఆధ్యాత్మిక స్థలం స్థలం దాబా. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా గోండ్పిప్పిరి తాలూకాలోని దాబా విశిష్టత కలిగిన దేవస్థానం. ఇక్కడ సజీవ సమాధి పొందిన కొండయ్య మహారాజ్ ఆలయం ఉంది. వీరశైవుడు అయిన కొండయ్య మçహారాజ్ ఎన్నో మహిమలు కలిగిన వ్యక్తిగా స్థానికులు చెబుతారు. నిజాం ప్రభువు ఎదుట మహిమలు చూపించడంతో నిజాం ప్రభువు సైతం ఆశ్చర్యపోయి బహుమతులు అందించారని కథనం. వరంగల్‌లో శిలానందికి గడ్డి తినిపించడం, ఎన్నో రకాల రోగాలను ప్రత్యక్షంగా నయం చేయడం, ఇతర ఎన్నో మహిమలను చూపించిన వ్యక్తిగా స్థానికులు ఆయనను కొలుస్తారు. ఆధ్యాత్మిక భావనలు పెంచడంలో భాగంగా జిల్లాలోని బెజ్జూర్, కాగజ్‌నగర్, సిర్పూర్(టి) మండలాల్లో పర్యటించిన ఆయన ఎన్నోరకాల మహిమలు చూపించడాన్ని ఇప్పటికి పెద్దలు కథలు కథలుగా చెప్పుకుంటుంటారు. సిర్పూర్(టి) మండలం లోనవెల్లికి చెందిన అంబేద కొండయ్య మçహారాజ్ దాబాలో స్థిరపడ్డారు. ఇప్పటికి ఆయన వంశీకులు లోనవెల్లిలో నివసిస్తున్నారు. 1834లో జన్మించిన ఆయన కార్తీక శుద్ధ తృతీయ 1939 నవంబర్ 14న అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం అనుమతితో యోగ సమాధి అయ్యారు. ప్రతిఏటా మాఘశుద్ధ తృతీయ నాడు ఐదు రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. శివరాత్రి జాతరకు భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారు. ఇక్కడ ఇప్పటికీ ఆయన వంశీయులు పూజలు చేస్తున్నారు.