kotamreddy sirdhar reddy
-
గంటా రాజీనామా ఆమోదం.. టీడీపీలో కొత్త టెన్షన్!
టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదం తర్వాత తొలిసారి స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. ఈ క్రమంలో ఆయన రాజీనామాను స్పీకర్‌గా ఆమోదించడంలో రాజకీయ కుట్ర ఏముందని తమ్మినేని ప్రశ్నించారు. గడువు తర్వాతే నిర్ణయం.. గంటా శ్రీనివాసరావు రాజీనామా లేఖను నాకు ఎప్పుడో ఇచ్చారు. పైగా స్పీకర్ ఫార్మాట్లోనే ఆయనే ఇచ్చారు. ఎమ్మెల్యేగా తప్పుకుంటానని తెలిపారు. లేఖ ఇవ్వగానే ఆమోదించడం సరికాదని వేచిచూశాం. మనసు మార్చుకుంటాడన్న మానవతా దృక్పథంతో ఇప్పటివరకు ఆగాను. ఇప్పుడు స్పీకర్‌గా నా పదవీకాలం ముగుస్తుండటంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కదా. ఇన్నాళ్లు అవకాశం ఇచ్చినా నిర్ణయాన్ని మార్చుకోలేని ఇప్పుడెలా మార్చుకుంటాడని భావించాను. పదవీ కాలం సమీపిస్తుండడంతో రాజీనామాను ఆమోదించాను. ఇది కూడా చదవండి: చంద్రబాబుకు అమ్ముడుబోయి.. చరిత్రహీనులుగా మిగిలి.. ఈ విషయంలో గంటా శ్రీనివాసరావు ఏదైనా భిన్నంగా ఆలోచిస్తే.. కోర్టుల ద్వారా ముందుకు వెళ్లొచ్చు. రాజీనామా ఇవ్వడం, వెనక్కి తీసుకోవడం అనేది సరికాదు. చట్టసభల విషయంలో నియమ నిబంధనలను పాటించాలి. ఒక వేళ గంటా శ్రీనివాసరావు ఓటుతోనే అధికార పార్టీ రాజ్యసభ సీట్లు ఆధారపడిలేవు కదా. వైఎస్సార్సీపీ రాజ్యసభ సీటు కోల్పోతుంది అని ప్రచారం చేస్తున్న విషయమే కరెక్టయితే అందరికీ నోటీసులు ఎందుకు ఇస్తాం? ఇప్పటివరకు పార్టీ మారిన ఎమ్మెల్యేలందరికీ నోటీసులు ఇచ్చాను. వారంలోపు అన్ని పిటిషన్లు క్లియర్ చేస్తాం. స్పీకర్ లేఖలు.. ఒక పార్టీ నుంచి గెలిచి.. పదవికి రాజీనామా చేయకుండా పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడ్డ నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇరుకునపడ్డారు. ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు ఇప్పటికే అనర్హతా వేటు ఎదుర్కొంటున్నారు. వీరిపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేయడంతో స్పీకర్ వీరికి నోటీసులిచ్చారు. ఈ నెల 25లోగా సమాధానం చెప్పాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ఈ నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు నాలుగు వారాలు గడువు కావాలంటూ రెబల్ ఎమ్మెల్యేలు కోరినట్టు తెలిసింది. వారంలో ఏం జరగనుంది? స్పీకర్‌గా తన పదవీ కాలం సమీపిస్తుండడంతో పెండింగ్‌లో ఉన్న అన్ని పిటిషన్లపై వారంలోగా నిర్ణయం తీసుకుంటానని తమ్మినేని ప్రకటించడం తెలుగుదేశంలో గుబులు రేపుతోంది. వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన నలుగురిని వెంటనే లాగేసుకున్న చంద్రబాబు.. తాజాగా జరుగుతున్న పరిణామాలపై గుంభనంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నలుగురికి తెలుగుదేశం టికెట్ ఇచ్చి పోటీ చేయించాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నాడు. పక్కపార్టీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకోవడం చంద్రబాబుకు కొత్తేం కాదు. 2014-19 మధ్య ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా బోలెడు డబ్బు గుమ్మరించి లాగేసుకున్న చంద్రబాబుకు ఎన్నికల్లో 23 సీట్లతో సరిపెట్టారు ఓటర్లు. ఇక ఇప్పటి విషయానికి వస్తే.. అనర్హతా పిటిషన్‌పై స్పీకర్ నిర్ణయం తీసుకుని వేటు వేస్తే.. ఈ నలుగురు కూడా పోటీ చేసేందుకు అర్హతా కోల్పేయే అవకాశం ఉంది. అది స్పీకర్ విశిష్టాధికారం అనర్హత వేటు అన్నది పూర్తిగా స్పీకర్ నిర్ణయం. స్పీకర్ వ్యవస్థ పూర్తి స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థ. గంటా రాజీనామాను ఆమోదించాలన్నది స్పీకర్ నిర్ణయం. ఎప్పుడు ఆమోదించాలో అన్నది కూడా ఆయన నిర్ణయమే. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో మూడు స్థానాలు YSRCP గెలుస్తుంది. 19 మంది ఎమ్మెల్యేలతో టీడీపీ ఎలా గెలుస్తుందనుకుంటారు? అసలు టీడీపీకి తగినంత సంఖ్యాబలమే లేదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. -
బాలకృష్ణకు స్పీకర్ తమ్మినేని వార్నింగ్.. ముగ్గురు ఎమ్మెల్యేలు సస్పెండ్
సాక్షి, అమరావతి: ఏపీలో మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించారు. చంద్రబాబు అరెస్ట్‌పై చర్చించాలని నినాదాలు చేస్తూ శాసనసభ, మండలిలో ఓవరాక్షన్ చేశారు. దీంతో, రెండు సభలు కాసేపు వాయిదా పడ్డాయి. ► కొంత విరామం తర్వాత అసెంబ్లీ ప్రారంభమైంది. అనంతరం, కూడా టీడీపీ సభ్యులు తమ తీరు మార్చుకోలేదు. దీంతో, టీడీపీ సభ్యులతో స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడే ప్రయత్నం చేశారు. అయినా కూడా వారు వినకపోవడంతో టీడీపీ సభ్యులను ఈరోజుకు సభ నుంచి సస్పెండ్ చేశారు. అలాగే, సభలో అనుచితంగా ప్రవర్తించిన టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణను స్పీకర్ హెచ్చరించారు. ► సభలో బాలకృష్ణ మీసం మెలేసిన ఘటనపై స్పీకర్ హెచ్చరించారు. స్పీకర్ స్థానాన్ని టీడీపీ సభ్యులు అగౌరవపరిచారు. దీన్ని మొదటి తప్పుగా క్షమిస్తున్నాం. స్పీకర్ పోడియం దగ్గర నిలుచుని మీసం మెలేసి సభా సంప్రదాయాలను బాలకృష్ణ ఉల్లఘించారు. ఇలాంటి వికృత చేష్టలు చేయడం తప్పు. ఇలాంటి చర్యలు మళ్లీ పునారవృతం కాకూడదు. ► ఇక, సభలో ఓవరాక్షన్ చేస్తూ స్పీకర్‌తో అనుచితంగా ప్రవర్తించిన సభ్యులను స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు. ఈ సమావేశాలు ముగిసే వరకు ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. సస్పెన్షన్‌కు గురైన వారిలో ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్ ఉన్నారు. ఇక, టీడీపీ సభ్యులతో పాటు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇది కూడా చదవండి: బాలకృష్ణ ఓవరాక్షన్.. మంత్రి అంబటి స్ట్రాంగ్ కౌంటర్ -
కోటంరెడ్డికి ఊహించని షాక్.. దెబ్బ అదుర్స్!
తనకు రాజకీయ భిక్ష పెట్టి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన పార్టీపై టీడీపీ ట్రాప్‌లో పడి నిందారోపణలు చేసిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా మారింది. టీడీపీతో లాలూచీ పడి ప్రభుత్వంపై ‘ఫోన్ ట్యాపింగ్’ నిందలు వేసి సొంత పార్టీపై ధిక్కార స్వరం వినిపించిన ఆయనకు తెలుగు తమ్ముళ్లు అడ్డుపడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం జిల్లా టీడీపీ నేతల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని కోటంరెడ్డికి ముఖం చాటేసిట్లు తెలిసింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పరిస్థితి ప్రస్తుతం రెంటికీ చెడ్డ రేవడిలా తయారయింది. నిందారోపణలతో సొంత పార్టీలో స్థానం కోల్పోయిన ఆయన టీడీపీలో ఎంట్రీకి గేట్లు పడినట్లు తెలుస్తోంది. ‘అయటగ్యయ్యో.. కోటంరెడ్డి.. పుట్టింట్లోళ్లు తరిమేశారు.. నమ్ముకున్నోళ్లు వదిలేశారు..’ అన్నట్లు మారింది. నిన్నటి వరకు వెన్నంటి ఉంటామన్న కొందరు కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు తమకు వైఎస్సార్సీపీయే ముఖ్యమని కోటంరెడ్డికి ఝలక్ ఇచ్చారు. తనకు తానుగా టీడీపీ నుంచి రూరల్ అభ్యర్థిగా పోటీ చేస్తానని బాహాటంగా చెప్పుకున్న ఆయన్ను టీడీపీలోకి రానివ్వద్దంటూ జిల్లా తమ్ముళ్లు చంద్రబాబు వద్ద మొర పెట్టుకోవడంతో కోటంరెడ్డి పరిస్థితి రివర్స్ అయినట్లు తెలుస్తోంది. నిన్న.. మొన్నటి వరకు అధికార మదంతో ఘీంకరించి రౌడీమూకలతో దాడులు చేయించిన కోటంరెడ్డిని టీడీపీలోకి తీసుకుంటే పార్టీ పరువు పోతుందని, తర్వాత రాజకీయ పరిస్థితులను చంద్రబాబుకు వివరించడంతో ఆయన సైతం పార్టీ నేతల అభిప్రాయాలను పరిగణిలోకి తీసుకుని సరే అన్నట్లు సమాచారం. దీంతో టీడీపీ కోటంరెడ్డిని అక్కున చేర్చుకునే పరిస్థితి కనిపించడం లేదు. ముందుగానే నో ఎంట్రీ పార్టీ కండువా మారకముందే తానే టీడీపీ అభ్యర్థినని ప్రకటించుకోవడంపై టీడీపీ యకులు మూకుమ్మడిగా చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వారం రోజులుగా కోటంరెడ్డి ఎపిసోడ్ పరిశీలిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు కూడా నో ఎంట్రీ అన్నట్లు తెలిసింది. కోటంరెడ్డి రాకను ఆ పార్టీ నాయకులే అడ్డుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. నిన్నటి వరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దౌర్జన్యకాండతో టీడీపీ నేతలను అల్లాడించాడని, కోటంరెడ్డిని పారీ్టలోకి ఆహా్వనిస్తే పార్టీ నేతలు ఆయనతో కలిసి పనిచేయరని, పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోతుందని నేతలు తమ పార్టీ అధినేత వద్ద మొరపెట్టుకున్నట్లు తెలుస్తోంది. మూడున్నర ఏళ్లుగా కోటంరెడ్డి చేసిన అవినీతి, అరాచకాలపై ప్రెస్మీట్లు పెట్టి దుమ్మెత్తి పోసిన అజీజ్, అతని మిత్రబృందం, పార్టీ కేడర్ ప్రస్తుతం కోటంరెడ్డిని పారీ్టలోకి అహా్వనిస్తే వీరంతా దూరమవుతారని సీనియర్ నేతల ద్వారా చంద్రబాబుకు చెప్పించినట్లు సమాచారం. దీంతో చంద్రబాబు సైతం కోటంరెడ్డి ఆశలకు బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది. కోటంరెడ్డికి కార్పొరేటర్ల షాక్ నెల్లూరు రూరల్ పరిధిలో 26 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అందరూ తన అడుగుజాడల్లో నడుస్తారని భ్రమించిన కోటంరెడ్డికి ఇప్పటికే 18 మంది కార్పొరేటర్లు ఝలక్ ఇచ్చారు. స్థానిక ప్రజాప్రతినిధులు వైఎస్సార్సీపీని వీడమని స్పష్టం చేశారు. మా జెండా, అజెండా పారీ్టనే అంటూ కోటంరెడ్డికి తెగేసి చెప్పారు. తాజాగా నియోజకవర్గ సమన్వయకర్తగా ఎంపికైన ఆదాల ప్రభాకర్‌రెడ్డికి జై కొట్టారు. మరికొందరు జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ త్వరలోనే గుర్తింపు ఇచ్చిన పారీ్టతోనే పయనించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అటు కార్పొరేటర్లే కాదు రూరల్ పరిధిలో ఉండే సర్పంచ్‌లు, ఎంపీటీసీలు సైతం పార్టీతోనే పయనిస్తుండడంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి ఏకాకి అయ్యారు. నిన్న మొన్నటి వరకు వాపును బలుపుగా భావించిన కోటంరెడ్డికి షాక్‌ల మీద షాక్‌లు తగిలి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయిందని పరిశీలకులు భావిస్తున్నారు. ‘చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మా ఒంటరి నడకా.. తెలిసీ అడుగేసినావె ఎడారంటి ఆశల వెనకా..’ అంటూ ఆయన సన్నిహితులు, అభిమానులు విచార గీతం ఆలపిస్తున్నారు. ఆదరించిన పార్టీకే సున్నం 2014 ఎన్నికల ముందు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి రాజకీయంగా ఏ చిన్న పదవి లేదు. విద్యార్థి దశ నుంచి ఉద్యమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న శ్రీధర్‌రెడ్డి అప్పుడెప్పుడో బీజేపీ తరఫున ఎంపీపీ పదవికి పోటీచేసి ఓటమి చెందారు. ఆ పార్టీ నుంచే బహిష్కరణకు గురైన ఆయన సొంతంగా భగత్‌సింగ్ యువమోర్చా పార్టీని పెట్టి ఏడాది కూడా నడిపించలేక కాంగ్రెస్‌లోకి వెళ్లాడు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలెప్మెంట్ డైరెక్టర్ పదవి పొందాడు. వైఎస్సార్ మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట నడిచారు. దీంతో ఏకంగా 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యేగా అవకాశం కలి్పంచారు. దివంగత వైఎస్సార్ చరిష్మాతో పాటు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభతో రెండు దఫాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పార్టీ బలంతో గెలిచిన ఆయన తన బలంగా భ్రమించి మత్తగజంలా వ్యవహరించాడు. ఆదరించి... అందలమెక్కించిన పారీ్టకే సున్నం పెట్టడానికి ప్రయత్నించాడు. మూడున్నర ఏళ్లుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎమ్మెల్యేగా కోటంరెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. ప్రజాసేవతో ప్రభుత్వానికి కీర్తిప్రతిష్టలు తీసుకురావాల్సిన ఆయన అధికార మదంతో రౌడీమూకలను నెలవారీ జీతాలతో ప్రోత్సహించి పార్టీలకు అతీతంగా తనకు గిట్టని వారిపై, ప్రత్యర్థులపై దాడులు చేయించి భయభ్రాంతులకు గురి చేశాడు. టీడీపీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీశాడు. ఆదరించిన పారీ్టకే సున్నం చీటీడీపీ ట్రాప్‌లో పడి.. కోటంరెడ్డి ఎపిసోడ్ గమనిస్తున్న టీడీపీకి చెందిన అబ్ధుల్అజీజ్ నుంచి మాజీమంత్రి సోమిరెడ్డి, బీద రవిచంద్ర, నారాయణ వంటి కీలక నేతలు అతన్ని రాజకీయ సమాధి చేయాలని వ్యూహాత్మకంగా పావులు కదిపారు. వైఎస్సార్సీపీలో కోటంరెడ్డి భవిష్యత్ ప్రశ్నార్థకంగా ఉండడంతో టీడీపీ అధిష్టానం వ్యూహాత్మకంగా తమ ట్రాప్‌లో పడేలా చేసింది. గతేడాది నుంచి టీడీపీ అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగానే వ్యవహరిస్తూ వచ్చాడు. అమరావతి రైతులకు స్వాగతాల నుంచి తరచూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వచ్చి చివరకు పారీ్టపైనే నిందలు వేసి బయటకు వెళ్లాడు. అంతవరకు వ్యూహాత్మకంగా పావులు కదిపిన టీడీపీ తమ వలలో చిక్కుకున్న కోటంరెడ్డికి పారీ్టలో ఎంట్రీకి చెక్ పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. -
‘అందుకే కోటంరెడ్డిని అడ్డం పెట్టుకుని డైవర్ట్ పాలిటిక్స్’
సాక్షి, పల్నాడు జిల్లా: ప్రజలు టీడీపీని నమ్మే పరిస్థితి లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. మాచర్లలో రూ.480 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి సురేష్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి ఆదిమూలపు మీడియాతో మాట్లాడుతూ, ‘‘కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చంద్రబాబును కలవలేదా?. కోటంరెడ్డి అడ్డంగా దొరికిపోయి ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నాడు. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని కోటంరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే అతను చూపించే విశ్వాసం ఇదేనా?’’ అంటూ దుయ్యబట్టారు. లోకేష్ పాదయాత్ర అట్టర్ ప్లాప్: ఎమ్మెల్యే పిన్నెల్లి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ‘‘లోకేష్ పాదయాత్ర అట్టర్ ప్లాప్ అయింది. అందుకే చంద్రబాబు.. శ్రీధర్‌రెడ్డిని అడ్డం పెట్టుకుని ఫోన్ ట్యాపింగ్ అంటూ డైవర్ట్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నాడు. శ్రీధర్ రెడ్డి దమ్ముంటే 51 సెకండ్ల ఆడియోను బయట పెట్టాలి. చంద్రబాబుతో కుమ్మక్కై అడ్డంగా దొరికిపోయి దొంగ నాటకాలు ఆడుతున్నాడు. ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి ఇలా ఎంతమంది పోయిన పార్టీకి నష్టం లేదు. పార్టీలో ఇలాంటి కోవర్టులు ఉంటే సీఎం జగన్ కచ్చితంగా బయటికి పంపుతారు’’ అని పిన్నెల్లి అన్నారు. చదవండి: కోటంరెడ్డికి మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి సవాల్ -
కోటంరెడ్డికి మంత్రి కాకాణి స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, నెల్లూరు: 2014 ఎన్నికల సమయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిత్వం విషయంలో ఎంత పోటీ ఉందనేది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి తెలుసని, ఆనాడు జగన్మోహన్రెడ్డి స్థానంలో ఎవరున్నా కోటంరెడ్డికి సీటు దక్కి ఉండేది కాదని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాతిక్రేయ సమావేశం నిర్వహించగా.. దానికి కౌంటర్ ప్రెస్‌మీట్ నిర్వహించారు కాకాణి. పార్టీ మారాలనేది కోటంరెడ్డి వ్యక్తిగత విషయం. కానీ, వైఎస్ఆర్సీపీపై బురద జల్లడం సరికాదు. అక్కడ జరిగింది ఫోన్ ట్యాపింగ్ కాదు.. మ్యాన్ ట్యాపింగ్ జరిగింది. చంద్రబాబు నాయుడు, కోటంరెడ్డిని ట్యాప్ చేశారు. చంద్రబాబు ట్రాప్‌లో పడ్డారు కోటంరెడ్డి. ఒకవేళ నిజంగా ట్యాపింగ్ జరిగి ఉంటే.. అవమానం, అనుమానం అనే బదులు విచారణకు ముందుకు వెళ్లొచ్చు కదా అని కాకాణి పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఇన్నిరోజులు కోర్టుకు ఎందుకు వెళ్లలేదు. కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని చెప్పావు.. ఏమైంది?. అది ఆడియో రికార్డ్ అని తెలుసు కాబట్టే అవమానించారని డ్రామాలు ఆడుతున్నావు అంటూ కోటంరెడ్డిపై మండిపడ్డారు మంత్రి కాకాణి. టీడీపీ అభ్యర్థిగా ఖరారైన తర్వాతే ఆరోపణలు చేస్తున్నావ్. కోటంరెడ్డి నువ్వు వీరవిధేయుడివి కాదు.. వేరే వాళ్లకు విధేయుడివి. సీఎం జగన్ టికెట్ ఇచ్చారు కాబట్టే.. ఎమ్మెల్యే అయ్యావు. ఈ స్థితిలో ఉండడానికి ఆయన కారణం కాదా?. సీఎం జగన్ 1 అయితే.. ఆ ముందు ఉండే సున్నాలం మనం. ఆ ఒక్కటే లేకపోతే.. మనమంతా జీరోలం. ఒకరిద్దరు పార్టీ నుంచి వెళ్లిపోయినంత మాత్రాన వైసీపీకి నష్టం లేదు. అంతకంటే మంచి నేతలు పార్టీలోకి వస్తారు. కోటంరెడ్డి తీసుకున్న నిర్ణయం ఆత్మహత్యా సదృశ్యంగా మారబోతోందని కాకాణి జోస్యం పలికారు. -
ముందే మాట్లాడుకుని పార్టీపై నిందలా?
నెల్లూరు (సెంట్రల్)/ఒంగోలు సబర్బన్: తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు ముందుగానే చంద్రబాబుతో మాట్లాడుకుని వైఎస్సార్సీపీపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి నిందలు వేయడం సరికాదని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. టీడీపీ వాళ్లతో మాట్లాడకుండా ఉంటే.. 2024లో రూరల్ నుంచి టీడీపీ తరఫున పోటీచేస్తామని ఏ విధంగా చెప్పగలవని ప్రశ్నించారు. పార్టీ మారాలనుకుంటే వెళ్లవచ్చని, కానీ సొంత పార్టీపై నిందలు వేసి వెళ్లడం సరికాదని చెప్పారు. ఆయన మంగళవారం నెల్లూరులోను, ఒంగోలులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మూడురోజులుగా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని, ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటున్నారని చెప్పారు. కానీ రుజువులు చూపడం లేదన్నారు. ఏ ఆధారం లేకుండా నిందలు వేయడం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. మరో పార్టీ నాయకుడితో ఫోన్లో మాట్లాడుకుని, అది బయటకు రాగానే ఫోన్ ట్యాపింగ్ అంటారా? అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపిస్తూ, మీడియాకు లీకులిస్తున్న కోటంరెడ్డి.. ట్యాపింగ్ జరుగుతోందని ఎప్పుడైనా సీఎం వైఎస్ జగన్‌కు చెప్పారా అని అడిగారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి దయవల్ల రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తుచేశారు. ఎవరు ఉన్నా లేకున్నా పార్టీ స్ట్రాంగ్‌గా ఉందని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీలో పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. -
మానవత్వం చాటుకున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి
-
మరోసారి మానవత్వం చాటుకున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి
సాక్షి, నెల్లూరు: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి మానవవత్వాన్ని చాటుకొన్నారు. బాధ్యత గల ప్రజాప్రతినిధిగా మసులుకొన్నారు. వర్షంలో తడుస్తూనే తనవంతు సహయ సహకారం అందించి అందరి మన్ననలు పొందారు. తెల్లవారుజాము నుంచి కురిసిన వర్షానికి నిత్యం రద్దీగా ఉండే నెల్లూరులోని మాగుంటలే అవుట్ అండర్ బ్రిడ్జిలోకి మోకాళ్లలోతు నీరు చేరింది. చదవండి: జగనన్న విదేశీ విద్యాదీవెనకు దరఖాస్తుల ఆహ్వానం ఓ పెళ్లకి హాజరయ్యేందుకు వచ్చిన ఎమ్మెల్యే కోటంరెడ్డి బ్రిడ్జి ముందే ఆగిపోయారు. కార్పొరేషన్ అధికారులకు విషయం చెప్పి మోటార్లతో నీటిని తోడేయాలని ఆదేశించారు. పెళ్లిళ్లు ఎక్కువగా ఉండటం ముహూర్తానికి టైం అయిపోతుండటంతో సాహసం చేసిన ఇద్దరు వాహన చోదకులు బ్రిడ్జి దాటే ప్రయత్నం చేసి మధ్యలో ఇరుక్కు పోయారు. జనం చోద్యం చూస్తూ ఉండిపోయారు. స్పందించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్షంలో తడుస్తూనే తన అనుచరులతో కలిసి నీటిలో ఆగిపోయిన వాహనాలను ఒడ్డుకు చేర్చారు. ఎమ్మెల్యే స్వయంగా రంగంలోకి దిగటంతో మిగిలిన వాళ్లు కూడా ముందుకొచ్చారు. బాధ్యతగా మసులుకొన్న ఎమ్మెల్యేకి చేతులెత్తి నమస్కరించారు. -
కోటంరెడ్డికి సీఎం జగన్ పరామర్శ.. పనితీరుపై ప్రశంసల వర్షం
నెల్లూరు(సెంట్రల్): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిని ఫోన్లో అడిగి తెలుసుకున్నారు. ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురి కావడం, నెల్లూరు అపోలో వైద్యశాల నుంచి మెరుగైన వైద్యం కోసం చెన్నై తరలించడం తెలిసిందే. చికిత్స అనంతరం కోలుకున్న శ్రీధర్‌రెడ్డి నెల్లూరుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మంగళవారం ఫోన్ చేసి కోటంరెడ్డితో పలు విషయాలు చర్చించారు. అసలేమి జరిగింది, వైద్యులు ఏమి చెప్పారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నా.. ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని కోటంరెడ్డికి ముఖ్యమంత్రి సూచించారు. రూరల్ నియోజకవర్గంలో ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం విషయాలపై చర్చించారు. చదవండి: (మనం చేయాల్సిందల్లా.. ప్రజల మద్దతు తీసుకోవడమే: సీఎం జగన్) మొదటి విడత ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం పూర్తి చేశామని, త్వరలోనే రెండో విడత ప్రారంభిస్తానని ముఖ్యమంత్రికి కోటంరెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, క్షేత్ర స్థాయిలో వాటి ఫలితాలు అనుభవిస్తున్న ప్రజల మనోభావాలను ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అత్యంత బలంగా ఉందని అన్ని సర్వేల్లో అత్యున్నత గ్రాఫ్ కనిపించిందని కోటంరెడ్డి పనితీరుపై ప్రశంసలు కురిపించారు. రానున్న ఒకటిన్నర సంవత్సరంలో కూడా ఇదే విధంగా పని చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. నెల్లూరు రూరల్‌కు సంబంధించి ఎటువంటి సహాయ సహకారాలు కావాల్సి ఉన్నా.. తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే కోటంరెడ్డికి ముఖ్యమంత్రి చెప్పారు. -
అప్పుడే వచ్చారు.. అంతలోనే అస్వస్థత
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఆమంచర్లలో గ్రామస్తులు, కార్యకర్తలు, పార్టీ నేతలను కలిసి ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రకటించక ముందే ఏప్రిల్ 11 నుంచి ‘జగన్న మాట గడప గడపకు శ్రీధరన్న బాట’ అనే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రారంభించారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ, కలిసి భోజనం చేయడం, అక్కడే నిద్రించడం, తర్వాత రోజు మళ్లి కొనసాగించడం ఇలా నిరంతరాయంగా కొనసాగించారు. నెల రోజుల తర్వాత ఉప్పుటూరులో ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి కాలికండరాలు పట్టుకొని నడవలేని స్థితిలో అస్వస్థతకు గురయ్యారు. పరీక్షించిన వైద్యుల సూచనలను పరిగణలోకి తీసుకుని గ్రామాల్లో బస లేకుండా ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుంటున్నారు. తర్వాత గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. 47వ రోజు శుక్రవారం ఆమంచర్లలోకి ప్రవేశించారు. ఉదయం గ్రామస్తుల ఇళ్లకు వెళ్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆరా తీశారు. అక్కడే ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమంలో అందరికీ దగ్గరుండి వడ్డించారు. అరుంధతీయుడు దర్శిగుంట చిన్నయ్యతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమాన్ని ముగించుకొని ఇంటికి చేరుకుని సేద తీరుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. శరీరం చెమటతో తడిసి పోయింది. వెంటనే తేరుకున్న ఆయన సతీమణి సుజిత సమీపంలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరే సమయంలో పల్స్ రేటు 160/170 ఉండడంతో ఒక దశలో వైద్యులు హైరానా చెందారు. ప్రాథమిక చికిత్స అనంతరం పల్స్ కంట్రోల్ అయ్యాక చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం తప్పింది ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి ప్రాణాపాయం తప్పిందని అపోలో సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరామ్ సతీమణి, తెలిపారు. ఆస్పత్రికి చేరే సమయంలో సాధారణ స్థితి కంటే హార్ట్ రేట్ బాగా పెరిగి బీపీ తగ్గింది. ట్రీట్మెంట్ తర్వాత కండీషన్ సాధారణ స్థితికి వచ్చింది. మెరుగైన వైద్యం కోసం చెన్నై అపోలోకి రెఫర్ చేశాం. రెండు వారాల క్రితం అస్వస్థతకు గురైన ఆయనకు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఆ మేరకు విశ్రాంతి లేకపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సకాలంలో ఆస్పత్రికి తీసుకురావడంతో ప్రాణాపాయం తప్పింది. పరామర్శించిన మంత్రి కాకాణి ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారని తెలుసుకుని హటాహుటిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అపోలో ఆస్పత్రికి చేరుకొని పరామర్శించారు. ఆరోగ్యంపై వైద్యులతో, ఎమ్మెల్యే సోదరుడు రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డితో చర్చించి చెన్నై అపోలో ఆస్పత్రికి వెంటిలేటర్ అంబులెన్స్‌లో తరలించారు. ఎమ్మెల్యే అస్వస్థతకు గురయ్యారని తెలుసుకున్న డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్‌యాదవ్, కార్పొరేటర్లు వైఎస్సార్సీపీ కేడర్ పెద్ద ఎత్తున అపోలో అస్పత్రికి తరలివచ్చారు. సజ్జల, విజయసాయిరెడ్డి పరామర్శ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి ఫోన్లో పరామర్శించారు. ఎమ్మెల్యే సోదరుడు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డికి ఫోన్ చేసి యోగక్షేమాలను తెలుసుకున్నారు. సత్వర వైద్య సేవలు అందించాలని ఎలాంటి అవసరమొచ్చిన తక్షణమే తెలపాలని కోరారు. ఒంగోలు, నెల్లూరు రీజనల్ సమన్వయకర్త బాలినేని శ్రీనివాసులరెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి వైద్యులతో చర్చించి గిరిధర్‌రెడ్డిని ఫోన్ పరామర్శించారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో చెన్నై ఆస్పత్రికి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేరుకున్నారు. ఇది కూడా చదవండి: కేంద్ర మంత్రి గడ్కరీకి సీఎం జగన్ బర్త్‌డే విషెస్ -
42 రోజుల పాటు కార్యకర్తలను కలుసుకుంటా
-
‘పేదలు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు’
సాక్షి, నెల్లూరు : లాక్‌డౌన్‌తో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో భోజనం కోసం పేదలు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. గుండ్లపాలెం, కొత్తూరు గ్రామాల్లో ఆయన పేదలకు కూరగాయాలు, నిత్యావసరాలు, కోడిగుడ్లు, శానిటైజర్లను సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయించారు. ఎవరైనా దాతలు తమ సహాయాన్ని సచివాలయాల్లో అందిస్తే, అవసరం ఉన్నవారికి వాలంటీర్లు అందిస్తారన్నారు. దీని వల్ల నిజమైన పేదలకు న్యాయం జరుగుతుందని కోటంరెడ్డి అన్నారు. -
పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేసిన కోటంరెడ్డి
-
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అస్వస్థత
సాక్షి, విజయవాడ: నెల్లూరు రూరల్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డికి హైబీపీ రావడంతో వైద్యులు ప్రాథమిక చికిత్సనందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు శ్రీధర్‌రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. తర్వాత మంత్రులు ఆళ్ల నాని, పేర్ని నాని, ఎమ్మెల్యే జోగి రమేష్‌లు కోటంరెడ్డిని పరామర్శించారు. -
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్ట్
సాక్షి, నెల్లూరు : రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకటాచలం ఎంపీడీవో సరళ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. కాగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అతని అనుచరులు తన ఇంటిపైకి వచ్చి రభస సృష్టించారని వెంకటాచలం ఎంపీడీవో సరళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీరియస్ అయ్యారు. అధికారులతో అనుచితంగా ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించవద్దని డీజీపీ గౌతం సవాంగ్‌కు ఆయన స్పష్టం చేశారు. -
శాకంబరిగా రాజరాజేశ్వరి దేవి
సాక్షి, నెల్లూరు : ఆషాఢమాస శుక్రవారాన్ని పురస్కరించుకొని రాజరాజేశ్వరి అమ్మవారు శాకంబరి అలంకారంలో నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. అమ్మవారు శ్రీవిద్యవంచ కల్పగణపతి అలంకారంలో ఫల, కాయగూరలతో భక్తులను కటాక్షించారు. రాహుకాల పూజలు, రాజరాజేశ్వరి అమ్మవారు శాకంబరిగా దర్శనమివ్వడంతో దర్శించుకునేందుకు భక్తులు బారులుదీరారు. ఆలయ ప్రధానార్చకుడు తంగిరాల రాధాకృష్ణశర్మ ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు అమ్మవారికి సహస్రనామార్చనలు, చండీహోమం, ఖడ్గమాల స్తోత్రపారాయణం, తదితర పూజలను నిర్వహించారు. అనివెట్టి మండపాన్ని ఫల, కాయగూరలతో సుందరంగా తీర్చిదిద్దారు. బెంగళూరు, చెన్నై, విజయవాడ, తదితర ప్రాంతాల నుంచి సుమారు ఐదు టన్నులకుపైగా ఫల, కాయగూరలతో అమ్మవారిని, ఆలయాన్ని తీర్చిదిద్దారు. రాజరాజేశ్వరి అమ్మవారి భక్తబృందం ఆధ్వర్యంలో కోలాటాలు, నృత్య ప్రదర్శనలను వేడుకగా నిర్వహించారు. సుమారు మూడువేల మందికి పైగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. శాకంబరి అలంకారానికి ఉభయకర్తలుగా కొలపర్తి వెంకట రమేష్‌కుమార్, సువర్ణలక్ష్మి దంపతులు వ్యవహరించారు. ఈఓ వెండిదండి శ్రీనివాసరెడ్డి పర్యవేక్షించారు. పట్టువస్త్రాల సమర్పణ శాకంబరి అలంకారం సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోదరుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ కార్యాలయ ఇన్చార్జి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి ఎమ్మెల్యే తరఫున రాజరాజేశ్వరి అమ్మవారు, దేవస్థాన ప్రాంగణంలోని మీనాక్షి సుందరేశ్వరస్వామికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఆలయ అర్చకులు, వేదపండితులు ఆశీర్వచనాలను అందజేశారు. రాజరాజేశ్వరి అమ్మవారి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సన్నపురెడ్డి పెంచలరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ నెల్లూరు మదన్‌మోహన్‌రెడ్డి, చెక్కా సాయిసునీల్, మురళీకృష్ణయాదవ్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు. -
ఎప్పుడూ అండగా ఉంటాం- మంత్రి అనిల్‌కుమార్
సాక్షి, నెల్లూరు సిటీ: ప్రతిపక్షంలో మీ సమస్యల పరిష్కార పోరాటంలో అండగా ఉన్నాం.. అధికారపక్షంలోనూ మీ సమస్యలను మా సమస్యలుగా భావించి పరిష్కరించి తోడుంటామని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి సొంత నిధులతో భోజనాలు, దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో తనపై పోటీ చేసిన వ్యక్తి వందల కోట్లు ఖర్చు చేసినా, మీ అందరి ఆశీస్సులతో గెలిచానని గుర్తుచేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత కార్మికుల జీతాలు రూ.12 వేల నుంచి రూ.18వేలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. రూ.6వేలు లెక్కన జీతాలు పెంచితే ప్రభుత్వంపై భారం పడుతుందని కొందరు అధికారులు జగన్ వద్ద ప్రస్తావించిగా ఆయన మాత్రం కార్మికులు చేసే పని ఇంకెవరూ చేయలేరని, వారికి అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అన్నారని తెలిపారు. అలాంటి ముఖ్యమంత్రి వద్ద మంత్రిగా పనిచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ కార్మికులకు నిత్యం అండగా ఉంటామన్నారు. ఐదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్మికుల సమస్యల పై పోరాటం చేశామన్నారు. అధికారంలోకి వచ్చినా కార్మికులకు తోడుంటామని చెప్పారు. 279 జీఓను ప్రభుత్వం రద్దు చేసింది కార్మికులను ప్రైవేటీకరణ చేసేందుకు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 279జీఓను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రద్దు చేశారని మంత్రి అనిల్ తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి నెలా సమయానికి జీతాలు చెల్లింపులు జరిగేలా చూస్తామన్నారు. ఆ తర్వాతే ఇతర అభివృద్ధి పనులకు చెల్లింపులు జరుగుతాయన్నారు. నెల్లూరును పరిశుభ్రంగా ఉంచేందుకు మీ సహకారం ఇవ్వాలని కోరారు. మీరు పని చేసే ఎనిమిది గంటలు కష్టపడాలన్నారు. మీకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి నాకు పెద్ద బాధ్యత అప్పగించారని, మంత్రిగా ఎక్కువ సమయం నెల్లూరులో ఉండలేకపోయినా నెలలో వారం, పది రోజులు అందుబాటులో ఉండేలా సమయం కేటాయిస్తానని హామీ ఇచ్చారు. మీకు ఏ సమస్య వచ్చినా డైరెక్టగా నా దృష్టికి తీసుకుని రావచ్చని తెలిపారు. మంత్రి సొంత నిధులతో కార్మికులకు భోజనాలు నెల్లూరు చరిత్రలో ఇప్పటి వరకు ఏ మంత్రి కూడా కార్మికులకు సొంత నిధులతో భోజనాలు ఏర్పాటు చేసి, దుస్తులు పంపిణీ చేసిన పరిస్థితి లేదు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్ తన సొంత నిధులు ఖర్చు చేసి సోమవారం పారిశుద్ధ్య కార్మికులు మొత్తం 1,500 మందికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. కార్మికులందరికీ దుస్తులు పంపిణీ చేశారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి మంత్రి అనిల్ భోజనం చేశారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న కార్మికులు ఎవరూ తమతో కలిసి భోజనం చేయలేదని, తమకు బట్టలు పెట్టి మా మంచి కోరుకుంటున్న అనిల్‌కుమార్ నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆశీస్సులు అందించారు. కొందరు కార్మికులు కంటతడిపెట్టారు. కార్యక్రమంలో డిప్యూటీ మాజీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పి.రూప్‌కుమార్‌యాదవ్, నాయకులు ఆనం రంగమయూర్‌రెడ్డి, గోగుల నాగరాజు, ఎండీ ఖలీల్‌అహ్మద్, వేలూరు మహేష్, నూనె మల్లికార్జున్‌యాదవ్, కుంచాల శ్రీనివాసులు వందవాశి రంగా పాల్గొన్నారు. -
పెన్నా పాపం టీడీపీదే
సాక్షి, నెల్లూరు : గత టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపడంతోనే పెన్నా బ్యారేజీ నిర్మాణ పనులు పూర్తి కాలేదని, రైతాంగానికి ఎంతో అవసరమైన ప్రాజెక్ట్‌ను ఏళ్ల తరబడి పూర్తి చేయలేకపోయిన పాపం టీడీపీదేనని ఇరిగేషన్ శాఖ మంత్రి పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్ పేర్కొన్నారు. నెల్లూరు పెన్నా బ్యారేజీ పనులను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో కలిసి మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2007లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.127 కోట్లతో పెన్నా బ్యారేజీని మంజూరు చేయడం జరిగిందన్నారు. వైఎస్సార్ హయాంలోనే ప్రాజెక్టు పనులు ప్రాంభమయ్యాయన్నారు. దాదాపుగా పన్నెండేళ్లు గడిచినా ఇంత వరకు ప్రాజెక్టు పనులు పూర్తి కాకపోవడం సిగ్గుచేటన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేయించడంలో విఫలమైందన్నారు. చంద్రబాబు నెల్లూరుకు వచ్చిన ప్రతిసారి పెన్నా బ్యారేజీని పూర్తి చేస్తామని చెప్పడమే తప్ప, పూర్తి చేయించలేదన్నారు. గత ప్రభుత్వం సరిగా నిధులు విడుదల చేయకపోవడంతో పాటు బ్యారేజీ పనులపై నిర్లక్ష్యం వహించడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. రంగనాయకులపేట ఘాట్ పరిశీలన రంగనాయకులపేటలోని ఘాట్‌ను మంత్రి అనిల్‌కుమార్ పరిశీలించి పనులు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఘాట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం సంతపేట మార్కెట్ ను పరిశీలించి వ్యాపారులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, ముక్కాల ద్వారకానాథ్, వైవీ రామిరెడ్డి , కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్‌లోగా పూర్తి చేస్తాం లక్షల ఎకరాలకు సాగునీరు, నెల్లూరు నగర తాగునీటి అవసరాలకు ఎంతో పెన్నా బ్యారేజీ నిర్మాణం ఎంతో అవసరమని మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ అన్నారు. ప్రస్తుతం బ్యారేజీలో నీరు లేకపోవడంతో భూగర్భజలాలు పూర్తిగా అడుగంటాయన్నారు. పెన్నా బ్యారేజీని వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తిచేసి అంకితం చేస్తామన్నారు. పెన్నా బ్యారేజీ అందుబాటులోకి వస్తే రైతులతో పాటు నగర ప్రజల తాగునీటి అవసరాలు తీరుతాయన్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో అవినీతికి తావులేకుండా చూస్తామన్నారు. తనకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇరిగేషన్ శాఖ అప్పగించారని, తప్పకుండా న్యాయం చేస్తామన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలకమైన ఇరిగేషన్‌శాఖను అనిల్‌కుమార్‌యాదవ్‌కు ఇచ్చారన్నారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు అన్ని సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించడం కూడా జరిగిందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అనిల్‌కుమార్‌ను అభినందించారన్నారు. త్వరతిగతిన పెన్నా బ్యారేజీ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు. జిల్లా వాసుల పక్షాన మంత్రికి అభినందనలు తెలిపారు. -
వైఎస్ జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వండి
సాక్షి, నెల్లూరు(సెంట్రల్): నిరంతరం ప్రజల కోసం పోరాటాలు చేస్తున్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్‌కు రానున్న ఎన్నికలలో ఒక్క అవకాశం ఇవ్వాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కోరారు. స్థానిక 29వ డివిజన్ రిత్విక్ ఎన్క్లేవ్ ప్రాంతంలో శ్రీధర్‌రెడ్డి సమక్షంలో మంగళవారం 150 మంది పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సాధారణంగా అధికార పార్టీలోకి వలసలు వెళుతుంటారని, అయితే ప్రస్తుతం అందుకు భిన్నంగా పరిస్థితి ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అనేకమంది చేరుతున్నారని, దీనిని బట్టి చూస్తే ఈసారి వైఎస్ జగన్ సీఎం కావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో నాయకులు బొబ్బల శ్రీనివాసయాదవ్, మాదా బాబు, రాజా, మస్తాన్‌రెడ్డి, వంశీ, కుమార్, శ్యామ్సింగ్, సతీష్, రంగారెడ్డి, మురహరి, గౌతమ్, మేరీ తదితరులు పాల్గొన్నారు. -
ఆ ముగ్గురి టార్గెట్.. వైఎస్సార్సీపీ
సాక్షి, నెల్లూరు: ఈ ఇద్దరూ ప్రజలతో ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలే. కానీ వారి పార్టీలు వేరు. పశ్చిమగోదావరి జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో విధినిర్వహణలో ఉన్న అధికారులపై దౌర్జన్యాలు, దాడులు చేసినా కూడా స్టేషన్ వద్దకు కూడా పిలిపించకుండా నోటీసు ఇచ్చి అక్కడ పోలీసులు మమ అనిపించారు. నెల్లూరు జిల్లాలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేపై మాత్రం ఎఫ్ఐఆర్ నమోదైన గంటల వ్యవధిలో భారీ పోలీసుల బలగాల సాయంతో అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇదీ ప్రస్తుతం చంద్రబాబు పాలనలో నడిచిన పోలీస్ ‘పచ్చ’పాతం. వైఎస్సార్సీపీకి కంచుకోటగా ఉన్న జిల్లాలో ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేసి ఆ పార్టీ శ్రేణుల్ని భయభ్రాంతులకు గురి చేసేందుకు చినబాబు సారథ్యంలో జిల్లాకు చెందిన టీడీపీ పెద్దలు పోలీస్ శాఖలోని కీలక పదవుల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించుకుని పచ్చ కుట్రలకు తెర తీశారు. నెల్లూరురూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై కేసు నమోదు నుంచి అరెస్ట్‌ల పర్వం వరకు ఆ ముగ్గురు పోలీస్ అధికారులే స్క్రీన్‌ప్లే దర్శకత్వం వహించి జైలుకెళ్లేలా వ్మూహాత్మకంగా వ్యవహరించినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. జిల్లాపై పెద్దగా అవగాహన లేని పోలీస్ బాస్‌ను సైతం తప్పదోవ పట్టిస్తూ ఆ శాఖను ఆ ముగ్గురు తమ గుప్పెట్లో పెట్టుకొని ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేసేలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కీలక పదవుల్లో వారే.. పోలీస్‌శాఖలో ప్రధానమైన ఇంటెలిజెన్స్, నగరంలో ఉన్న లా అండ్ఆర్డర్, స్పెషల్ బ్రాంచ్ శాఖలో ఉన్న పోలీస్ అధికారులు ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి వారే. టీడీపీ అధినేత సామాజిక వర్గానికి చెందిన ఆ ముగ్గురు అధికారులు పథకం ప్రకారం ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించేలా ప్రభుత్వ పెద్దలతో ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం ఉంది. అందులో భాగంగానే తొలి విడతగా ఎమ్మెల్యే కోటంరెడ్డిని జైలుపాలు చేయించారు. ఇంటెలిజెన్స్ విభాగంలో ఉన్న అధికారి ఏడాది కిందటే విజయవాడ నుంచి నెల్లూరుకు బదిలీపై వచ్చారు. అప్పటి నుంచి కేవలం ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేస్తూ ఆ పార్టీ నేతలపై ప్రత్యేక నిఘా పెట్టి ఎప్పటికప్పుడు ప్రభుత్వ పెద్దలకు సమాచారం చేరవేస్తున్నారు. అధికార పార్టీలో అసంతృప్తులను గుర్తించి వారి సమాచారం టీడీపీ పెద్దలకు చేరవేయడంతో పాటు వీరే నేతలను బుజ్జగించే పని కూడా చేస్తున్నట్లు సమాచారం. వైఎస్సార్సీపీ ఓటర్ల తొలగింపు, ప్రభుత్వ అనుకూల సర్వేలు కూడా ఇంటెలిజెన్స్ విభాగం అధికారి కనుసన్నల్లో నడుస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల నెల్లూరు రూరల్‌లో ప్రభుత్వ అనుకూలంగా సర్వే చేస్తూ పట్టుబడిన యువకులకు ఇంటెలిజెన్స్ అధికారి బహిరంగంగా అండగా నిలవడంతో పాటు సర్వే చేసిన యువకులను పట్టించిన వారిపై కేసులు నమోదు వరకు ఆ అధికారి అన్ని తానై నడిపించినట్లు తెలిసింది. నగరంలో ఉన్న లా అండ్ ఆర్డర్లో ఉన్న పోలీస్ అధికారి సైతం ప్రతిపక్ష పార్టీ నేతలపై చిన్న ఫిర్యాదు వచ్చిన వెంటనే ఆయన స్వయంగా కలగజేసుకోవడం పాటు కేసులు పెట్టించి వారిని భయభ్రాంతులకు గురి చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. పోలీస్ బాస్ కనుసన్నల్లో నడిచే స్పెషల్ బ్రాంచ్ విభాగంలో పనిచేసే ఓ అధికారి కూడా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల బదిలీల్లో కూడా ఆయన పాత్రే కీలకంగా ఉందని విమర్శలు లేకపోలేదు. అధికార పార్టీకి సహకరించే వారికే పోస్టులు ఇప్పించేలా వ్యవహరించారని ఆ శాఖలోనే విమర్శలు వెల్లువెత్తాయి. గత ఎన్నికల సమయంలోనే జిల్లాలోనే పని చేసిన ఆ అధికారి ప్రస్తుత ఎన్నికల సమయంలో కూడా కీలక పోస్టులోనే ఉన్నారు. జిల్లా పోలీస్ బాస్నుకు అన్ని తానై వ్యవహరించే సదరు అధికారి అధికార పార్టీకి అనుకూలంగా ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తూ ప్రతిపక్ష పార్టీకి నష్టం కలిగేలా వ్యవహరిస్తున్నాడన్న విమర్శలు ఆశాఖ నుంచే వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్ట్ వెనుక ఈ అధికా రి పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈ ముగ్గురే ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేస్తూ ఎన్నికల సమయంలో అధికార పార్టీకి అనుకూలంగా కుట్రలు పన్నే అవకాశాలు ఉంటాయన్న ఆరోపణలున్నాయి. ‘పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విధి నిర్వహణలో ఉన్న అధికారులను అడ్డుకోవడంతో పాటు దాడులు చేసిన ఘటనల్లో అక్కడ పోలీసులు 353 సెక్షన్ కింద కేసులు నమోదు చేసినప్పటికి స్టేషన్‌కు కూడా పిలిపించకుండా సుప్రీంతీర్పు ప్రకారం 41 నోటీసు ఇచ్చారు’ ‘నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తే స్టేషన్‌కు వెళ్లి సీఐని ప్రశ్నిస్తే మాత్రం విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకున్నారంటూ కేసు నమోదు చేసి సుప్రీం తీర్పునకు విరుద్ధంగా 41 నోటీసు ఇవ్వకుండా కోర్టుకు హాజరు పరిచి జైలుకు పంపారు.’ -
ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్ట్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని శనివారం తీవ్ర ఉద్రిక్తతలు, హైడ్రామా నడుమ పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అనాయ్యంగా అరెస్ట్ చేయడాన్ని ప్రశ్నించేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆయనను తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నారని పేర్కొంటూ పోలీసులు నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. శనివారం ఉదయం శ్రీధర్‌రెడ్డి తన కార్యాలయంలో ఉన్నారన్న సమాచారంతో ఏఎస్పీ పి.పరమేశ్వరరెడ్డి నేతృత్వంలో నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ భారీగా పోలీసు బలగాలతో వచ్చి అరెస్ట్ చేసేందుకు యత్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పటికే పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న కార్యకర్తలు పోలీసుల తీరుపై ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు కార్యకర్తలను చెల్లాచెదురుచేసి ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నారు. కార్యకర్తలు అడుగడుగునా అడ్డుకోగా పెనుగులాట జరిగింది. వారిని చెదరగొట్టి అక్కడనుంచి ఎమ్మెల్యేను తీసుకెళ్లారు. ఆ సమయంలో ఎమ్మెల్యే సొమ్మసిల్లారు. అయినా పోలీసులు ఆయనను నగరంలో పలు ప్రాంతాల్లో తిప్పి చివరికి నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొచ్చారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా కోర్టు ఈనెల 23 వరకు రిమాండ్ విధించడంతో ఎమ్మెల్యేను జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు. అంతకు ముందు ఏం జరిగిందంటే.. మూడురోజుల కిందట నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని నేతాజీనగర్‌లో ముగ్గురు యువకులు ట్యాబ్‌లతో సర్వే పేరిట ఓట్లు తొలగిస్తున్నారన్న సమాచారం అందుకున్న స్థానిక వైఎస్సార్సీపీ కార్యకర్తలు వారిని వేదాయపాళెం పోలీసులకు అప్పగించారు. ఆ సమయంలోనే సర్వే బృందంలోని వారికి ఇంటెలిజెన్స్ డీఎస్పీ చెంచుబాబు ఫోను చేయడమే కాక వారిపై చర్యలు తీసుకోవద్దంటూ స్థానిక పోలీసులను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో సర్వే బృందం నుంచి ఫిర్యాదు తీసుకుని వైఎస్సార్సీపీ క్యాడర్‌పై అక్రమంగా కేసు నమోదు చేయడమే కాకుండా సర్వేకు వచ్చిన యువకులను వదిలివేశారు. విషయం తెలిసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గురువారం రాత్రి పోలీసుస్టేషన్‌కు చేరుకుని ఇదే అన్యాయం అంటూ వేదాయపాళెం ఇన్స్పెక్టర్ కె.నరసింహరావును ప్రశ్నించారు. వెంటనే వారిని కోర్టులో హాజరుపరచాలని పట్టుబట్టారు. అక్కడే మూడు గంటల పాటు కూర్చున్నారు. దీంతో 24 గంటలు మౌనం వహించిన పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి హడావుడిగా కేసు నమోదు చేశారు. అనంతరం కోటంరెడ్డి తిరిగి ఇంటికి వచ్చారు. అయితే తర్వాత తమ విధులకు భంగం కల్గించారంటూ ఎమ్మెల్యేతోపాటు వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ నాయకులు సాయి సునీల్, బెజవాడ మేఘనాథ్‌సింగ్, మురహరి, పిండి సురేష్, పురుషోత్తంనాయుడు, శామ్యూల్, విష్ణు, శ్రీనివాసులపై (ఎఫ్ఐఆర్ 70/2019) 143, 353, 506 రెడ్‌విత్ 149 ఐపీసీ కింద నాన్‌బెయిల్‌బుల్ కేసు నమోదు చేశారు. అస్వస్థతతో కింద పడిపోయిన కోటంరెడ్డి.. నిరసన వ్యక్తం చేస్తున్న కోటంరెడ్డి కుటుంబ సభ్యులు, కార్యకర్తలు జైలులో ఆమరణదీక్ష.... పోలీసుల తీరుకు నిరసనగా కేంద్రకారాగారంలో ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి ఆమరణదీక్షకు దిగారు. తమపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని, నియోజకవర్గంలో తొలగించిన ఓట్లన్నింటినీ తిరిగి నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో తనకేమైనా జరిగితే నెల్లూరు జిల్లా పోలీసు యంత్రాంగానిదే పూర్తి బాధ్యత అని కారాగార అధికారులకు లిఖితపూర్వకంగా ఇచ్చినట్లు సమాచారం. ఎంత కాలం ఈ దుర్మార్గం: కోటంరెడ్డి అధికారాన్ని అడ్డంపెట్టుకుని ప్రతిపక్షపార్టీకి చెందిన ఓట్లు తొలగించి దుర్మార్గపు పాలన సాగిస్తున్నారంటూ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరులోని రూరల్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. తాను నాలుగు నెలలుగా కార్యకర్తల సాయంతో నియోజకవర్గంలో అక్రమంగా తొలిగించిన 32 వేల ఓట్లను తిరిగి చేర్పించానన్నారు. అయితే అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ప్రత్యేక సర్వే బృందం పదే పదే అదే పనిచేస్తోంది. వారి అక్రమాలను అడ్డుకుంటున్న మా కార్యకర్తలపై కేసులు పెట్టడం, దాన్ని ప్రశ్నించినందుకు నాపై తప్పుడు కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్య అని దుయ్యబట్టారు. తమ కార్యకర్తలను రాత్రి 11 గంటల దాకా కోర్టుకు హాజరుపర్చకపోవడంతో తాను స్టేషన్‌కు వెళ్లి ఇప్పటి వరకు కోర్టుకు హాజరుపర్చలేదేమిటని గౌరవంగా సీఐని అడిగానన్నారు. అప్పుడు మూడు గంటల సేపు తాను స్టేషన్లో ఉన్నానని, సీఐతో పాటు ఎస్ఐలు, పోలీసు సిబ్బంది ఉన్నారన్నారు. తాను నిజంగా దౌర్జన్యం చేసి ఉంటే తనను ఎందుకు అప్పుడే అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. అధికార పార్టీ ఒత్తిళ్లతోనే ఇదంతా జరిగిన 24 గంటలు గడిచిన తరువాత శుక్రవారం రాత్రి నుంచి తనపై కుట్ర ప్రారంభమైందన్నారు. అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్లతో ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, జిల్లా డీఎస్పీ చెంచుబాబు, సీఐ నరసింహారావు కుట్రపూరితంగా తనపై కేసులు పెట్టారన్నారు. తాము తప్పుచేయలేదని, తమ కార్యకర్తలకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా తాను పోరాటాలకు సిద్ధంగా ఉంటానన్నారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని స్పష్టం చేశారు. -
జగన్ సీఎం అయ్యాక మహిళలకు భరోసా
సాక్షి, నెల్లూరు(సెంట్రల్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక మహిళలకు భరోసా దొరికి వారి కుటుంబాల్లో వెలకట్టలేని సంతోషం ఉంటుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. వేదాయపాళెంలోని ఎమ్వీఎస్ కల్యాణమండపంలో రూరల్ నియోజకవర్గానికి చెందిన మహిళలతో గురువారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫోన్ కొడితే 108 కంటే వేగంగా మద్యం వస్తోందని ఆరోపించారు. ఆదాయం పెంచుకునేందుకు మద్యం దుకాణాలను విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తుండటం సిగ్గుచేటని విమర్శించారు. జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన మద్యాన్ని విక్రయించకూడదని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిస్తే, చంద్రబాబు మాత్రం విక్రయించుకోవచ్చని జీఓ ఇవ్వడం దుర్మార్గమన్నారు. జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక దశలవారీగా మద్యనిషేధాన్ని అమలు చేయనున్నారని చెప్పారు. జగన్మోహన్రెడ్డికి ఒక్క అవకాశమివ్వాలని కోరారు. పార్టీ నెల్లూరు పార్లమెంటరీ మహిళా విభాగ అధ్యక్షురాలు మొయిళ్ల గౌరి, కార్పొరేటర్ లక్ష్మీసునంద, తోట శోభారాణి, చేజర్ల కవిత, హురియా, తిప్పిరెడ్డి మమతారెడ్డి, జమునమ్మ, నీళ్ల పెంచలమ్మ, భారతి, సుజితారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అనూహ్య నిరసన
సాక్షి, నెల్లూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనూహ్య రీతిలో నిరసన తెలిపారు. నెల్లూరులోని ఒక వీధిలో మురికి కాలువపై వంతెన నిర్మించాలని కోరుతూ ఏకంగా మురుగులోకి దిగి నిరసన తెలియజేశారు. మురుగు కాలువపై వంతెన నిర్మించాలని స్థానికులు చాలా కాలంనుంచి అడుగుతున్నారు. ఈ విషయాన్ని మున్సిపల్ అధికారుల దృష్టికి స్థానిక ఎమ్మెల్యే తీసుకెళ్లినప్పటికి ఎవరూ స్పందించలేదు. దీంతో శ్రీధర్ రెడ్డి ఏకంగా సమస్యగా మారిన మురుగు కాలువలోకి దిగి నిలబడ్డారు. అధికారులు వచ్చే వరకు తాను మురుగు కాలువలోనే ఉంటానని ప్రకటించారు. ఎమ్మెల్యే అలా మురుగు కాలువలో ధర్నాకు దిగడంతో స్థానికులు, వైఎస్సార్ సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలి వచ్చారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే మురుగు కాలువలో నిరసన తెలుపుతున్న విషయం తెలుసుకున్న అధికారులు నానా హైరానా పడ్డారు. -
ఆ కేసులో పోలీసుల తీరు సరిగా లేదు
సాక్షి, నెల్లూరు: క్రికెట్ బెట్టింగ్ కేసులో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు. ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష ఎమ్మెల్యేపై ఇలాంటి ఆరోపణలు చేయడం ఎంత వరకు సమంజసం అని పేర్కొన్నారు. కోడి పందేలు నిషేధం అని హైకోర్టు చెబితే అధికార పార్టీ ఎమ్మెల్యేలు బహిరంగంగానే ఆడారని గుర్తుచేశారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోకుండా బెట్టింగ్తో ఎలాంటి సంబంధం లేకపోయినా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిరెడ్డి శ్రీధర్‌రెడ్డిని వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని, ప్రభుత్వం చెప్పినట్లు వ్యవహరించడం మంచి పద్దతి కాదని సూచించారు. జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో కలెక్టర్‌పై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యేపై ఏం చర్యలు తీసుకున్నారని సూటిగా ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ నేతలంతా కలిసి ఈ దారుణాలపై సంఘటితంగా పోరాడతామని చెప్పారు. నెల్లూరు రూరల్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ.. జరిగింది ఒకటి, మీడియాకు పోలీసులు ఇచ్చే లీకులు మరొకటని మండిపడ్డారు. మొదట రెండు సార్లు విచారణకి పిలిచారని, దానిపై స్పష్టత ఇవ్వకుండా మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారని తెలిపారు. క్రికెట్ బెట్టింగ్ కేసు అంతం అవ్వాలంటే ఏసీబీ విచారణ కావాలని తానే మొదట అడిగానని తెలిపారు. క్రికెట్ బుకీల కాల్ లిస్ట్ ఆధారంగా మంత్రులు, ఎమ్మెల్సీలపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణసింగ్ అనే బుకీతో తాను ఎక్కడైనా ఉన్నట్లు కనబడితే సీసీ ఫుటేజీని బయటపెట్టాలని, ఫుటేజీని బయటపెడితే గంటలో నా పదవికి రాజీనామా చేస్తానని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సవాల్ విసిరారు. -
నిరూపిస్తే గంటలో నా పదవికి రాజీనామా చేస్తా
సాక్షి, నెల్లూరు : రాజకీయ కక్షతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అప్రతిష్ట పాలు చేయాలనుకుంటే సహించేదిలేదని నెల్లూరు రూరల్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. క్రికెట్ బుకీలకు మద్దతుగా పోలీసులకు తాను ఫోన్ చేసివుంటే వాటి వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. తాను ఎవరికి ఫోన్ చేశానో ఆ అధికారుల పేర్లు ఎందుకు ఎస్పీ బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. కొందరు బుకీలు మంత్రులకు సన్మానాలు చేశారని, అలాగే ఫ్లెక్సీలు కూడా కట్టారని, దీనిపై ఎందుకు విచారణ చేయడం లేదని సూటిగా అడిగారు. కృష్ణ సింగ్ అనే బుకీతో తాను విజయవాడలోని ఓ హోటల్, కడప ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో ఉన్నట్లు చెబుతున్నారని, అలా ఉంటే సీసీటీవీ ఫుటేజీ బయటపెట్టాలని అడిగారు. ఒకవేళ తాను ఉన్నట్లు నిరూపిస్తే గంటలో నా పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే కోటంరెడ్డి సవాల్ విసిరారు.