KOVVURU
-
కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు కన్నుమూత
సాక్షి, తూర్పుగోదావది: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత పెండ్యాల వెంకట కృష్ణ బాబు మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. నేడు తెల్లవారుజామున కృష్ణబాబు చనిపోయినట్లు వైద్యులు, కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.కృష్ణబాబు మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామం దొమ్మేరుకు తరలించారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. కాగా 1953లో పాలకొల్లులో జన్మించిన కృష్ణబాబు.. కొవ్వూరు నియోజకవర్గంలో అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983 నుంచి 1994 వరకు(1983,1985, 1989, 1994) నాలుగుసార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999లో ఓటమి చెందిన ఆయన తిరిగి 2004లో అయిదవసారి కొవ్వూరు ఎమ్మెల్యేగా గెలిచారు.ఇక 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో కొవ్వూరు ఎస్సీ రిజర్వ్ కావడంతో ప్రత్యక్ష రాజకీయాలకు కృష్ణబాబు దూరంగా ఉన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుదీర్ఘకాలం రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతగా కృష్ణబాబు పేరొందారు. ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు ప్రస్తుతం స్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న పలువురు నేతలు సంతాపం తెలియజేస్తున్నారు. -
15 కోట్లు కొవ్వూరు సీట్...టీడీపీ సంచలన ఆడియో..
-
కొవ్వూరు పచ్చపార్టీలో వర్గపోరు
గోదావరి ఒడ్డున ఉన్న కొవ్వూరు టీడీపీలో వర్గపోరు తీవ్రమవుతోంది. ఈ ఎస్సీ నియోజకవర్గంలో ఇద్దరు నేతలు ఘర్షణ పడుతుంటే చంద్రబాబు వినోదం చూస్తున్నారు. సీటు కోసం ప్రయత్నిస్తున్న మాజీ మంత్రిని అక్కడి క్యాడర్ అడ్డుకుంటోంది. మరో నేతను బరిలో దించేందుకు ప్లాన్ చేస్తున్న మాజీ మంత్రి వ్యతిరేకులు. రెండు వర్గాల మధ్య కుంపటి వెలిగించి చలి కాచుకుంటున్న చంద్రబాబు. అసలు కొవ్వూరు పచ్చ పార్టీలో ఏం జరుగుతోంది? తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ మాజీ మంత్రి కేఎస్ జవహర్ పై అసమ్మతి తీవ్రమవుతోంది. చంద్రబాబే రగిల్చిన కుంపట్లు చల్లార్చడానికి ఆయనే నియమించిన ద్విసభ్య కమిటీ ఒక వర్గం గానూ.. నియోజకవర్గంలో పార్టీని ప్రభావితం చేయగల మరో ముఖ్యనేత అచ్చిబాబు వర్గం మరోపక్క జవహర్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నాయి. ఈ రెండు వర్గాలు నియోజకవర్గంలోని వారి సానుభూతిపరులతో రహస్య సమావేశాలు పెట్టి చర్చలు జరుపుతున్నాయి. జవహర్ కు కొవ్వూరు స్థానం కేటాయిస్తే అందరం కలిసి చిత్తుగా ఓడిస్తామని టీడీపీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశాయి రెండు వర్గాలు. జవహర్ వద్దు - టీడీపీ ముద్దు అంటూ జవహర్ వ్యతిరేకులు పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పార్టీ నాయకత్వం కూడా స్పష్టత ఇవ్వకపోవడంతో కొవ్వూరు తెలుగుదేశంలో సీటు వ్యవహారం హీటెక్కింది. టీడీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న జవహర్ కొవ్వూరులో తనకంటూ ఒక బలమైన వర్గాన్ని తయారు చేసుకున్నా ఆయన పెత్తనం మాత్రం సాగడం లేదు. కొవ్వూరు వ్యవహారాల్లో తలదూర్చవద్దని గతంలో అధిష్టానం కూడా ఆయన్ను హెచ్చరించింది. కొవ్వూరులోనే నివాసం ఉంటున్న జవహర్ ను ద్విసభ్య కమిటీ నియోజకవర్గ రాజకీయాల్లో వేలు పెట్టనివ్వడంలేదు. ప్రస్తుతం సుబ్బరాయ చౌదరి, కంఠమని రామకృష్ణ ఆధ్వర్యంలోని ద్విసభ్య కమిటీ సారధ్యంలోనే కొవ్వూరు టీడీపీ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఈ పరిణామంపై జవహర్ వర్గం ఎప్పడినుంచో గుర్రుగా ఉంది. కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును బరిలోకి దింపేందుకు జవహర్ వ్యతిరేక వర్గాలు పావులు కదుపుతున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు సైతం ముప్పిడి అభ్యర్థిత్వాన్ని అంగీకరించారన్న ప్రచారం సాగుతుండగా..ఆయన రంగంలోకి దిగి నియోజకవర్గం అంతా పర్యటిస్తున్నారు. ద్విసభ్య కమిటీలోని ఓ సభ్యుడైన జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి గతంలో మాజీ మంత్రి జవహర్‌తో సన్నిహితంగానే ఉన్నారు. ఆ తర్వాత వారి మధ్య తలెత్తిన ఆర్థిక వివాదాల కారణంగా చౌదరి సైతం జవహర్‌కు దూరమయ్యారు. జవహర్ మంత్రిగా ఉన్న సమయంలో అచ్చిబాబును వ్యతిరేకించడంతో ఆయన కూడా ఇప్పుడు వ్యతిరేకం అయ్యారు. తమ పంతం నెగ్గించుకోవడానికి ద్విసభ్య కమిటీ, అచ్చిబాబు వర్గాలు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇటీవల జవహర్ పుట్టిన రోజు సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల ఏర్పాటు దొమ్మేరు గ్రామంలో వివాదంగా మారింది. ఓ వర్గం నేతలు గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి మరీ జవహర్‌పై విమర్శలు గుప్పించారు. 2014 నుంచి సీనియర్ నాయకులను, కార్యకర్తలను పక్కన పెట్టిన ఆయన వర్గ విభేదాలకు కారకుడయ్యారని వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరుతున్నా టీడీపీ అధినేత చంద్రబాబు వాటిని చక్కదిద్దే ప్రయత్నం చేయడం లేదు. సీటు ఎవరికి ఇస్తారన్న స్పష్టత ఇవ్వకపోవడంతో ఇరు వర్గాల మధ్య రోజు రోజుకూ విభేదాలు తీవ్రమవుతున్నాయి. జవహర్ వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నారని ఆయన వర్గం ప్రచారం చేసుకుంటోంది. ఇదే జరిగితే జవహర్‌ను వ్యతిరేకిస్తున్న వర్గాలు టీడీపీకి దూరమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ జవహర్‌ను కాదంటే ఆయన వర్గం దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ పరిస్థితుల్ని పచ్చ పార్టీ అధినేత ఎలా చక్కదిద్దుకుంటారో చూడాలి. -
కొవ్వూరు రైల్వేస్టేషన్లో రైళ్లను పునరుద్ధరించాలి: తానేటి వనిత
సాక్షి, విజయవాడ: కరోనా సమయంలో లాక్ డౌన్ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా కొవ్వూరు రైల్వేస్టేషన్లో రద్దు చేసిన రైళ్లును పునరుద్దరించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత కోరారు. శనివారం ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న నిర్మలా సీతారామన్‌ను విజయవాడలో కలిసి ఈ మేరకు ఆయా రైళ్ల వివరాలను ప్రత్యేక లేఖ ద్వారా ఆమె దృష్టికి తీసుకెళ్లారు. కొవ్వూరు రైల్వేస్టేషన్లో రెగ్యులర్‌గా నిలుపుదల చేయవలసిన రైళ్లను నిలుపుదల చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. హైదరాబాద్, మద్రాసు, బెంగుళూరు, తిరుపతి వెళ్లే ప్రయాణికులు రైళ్లు నిలుపుదల చేయకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారని, వ్యయ ప్రయాసలకు గురై రాజమహేంద్రవరం వెళ్లి రైళ్లు ఎక్కవలసి వస్తుందన్నారు. ప్రజలశేయస్సు దృష్ట్యా కొవ్వూరు స్టేషన్లో కొవిడ్ కారణంగా రద్దుచేసిన రైళ్లును పునరుద్ధరించాలని కోరారు. సదరు విజ్ఞప్తిని కేంద్ర రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి కొవ్వూరు నియోజకవర్గ ప్రజల ఇబ్బందులను తొలగించాలని నిర్మలా సీతారామన్ ను హోంమంత్రి తానేటి వనిత కోరారు. కొవ్వూరు రైల్వేస్టేషన్ కొవ్వూరు, పోలవరం, గోపాలపురం మొత్తం మూడు నియోజకవర్గాల్లోని ప్రజలకు అందుబాటులో ఉంటుందని వివరించారు. కరోనా లాక్ డౌన్ అనంతరం 4 రైళ్లను మాత్రమే పునరుద్దరించారని.. మరో 9 రైళ్లను పునరుద్దరించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు. కొవ్వూరులో పునరుద్దరించాల్సిన రైళ్ల జాబితాను అందజేశారు. పునరుద్దరించాల్సిన రైళ్లలో విజయవాడ వైపు, విశాఖపట్నం వైపు తిరిగే రైళ్లున్నాయి. తిరుమల ఎక్స్ ప్రెస్ (17488, 17487), సర్కార్ ఎక్స్ ప్రెస్ (17644, 17643), బొకారో ఎక్స్ ప్రెస్ (13351, 13352), కాకినాడ-తిరుపతి ఎక్స్ ప్రెస్ (17250, 17249), సింహాద్రి ఎక్స్ ప్రెస్ (17240, 17239), తిరుపతి-పూరి ఎక్స్ ప్రెస్ (17479, 17480), మచిలీపట్నం-విశాఖపట్నం ఎక్స్ ప్రెస్ (17220, 17219), రాయగడ-గుంటూరు ఎక్స్ ప్రెస్ (17244, 17243), బిలాస్ పూర్ ఎక్స్ ప్రెస్ (17482, 17481) రైళ్లకు కొవ్వూరు రైల్వేస్టేషన్ లో ఆగేవిధంగా పునరుద్దరించాలని హోంమంత్రి అందజేసిన లేఖలో పేర్కొన్నారు. హోంమంత్రి విజ్ఞప్తి పై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారు. కొవ్వూరు రైల్వే స్టేషన్లో రైళ్లు నిలుపుదల పునరుద్ధరణకు తన వంతు కృషి చేస్తానని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. -
చలించిపోయిన సీఎం జగన్.. విద్యార్థిని దివ్య కుటుంబానికి ఇంటి స్థలం
తాళ్లపూడి: ఇటీవల కొవ్వూరులో జరిగిన జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో తనకు విద్యా దీవెన పథకం ఎలా మేలు చేసిందో చెబుతూ అందరినీ ఆకట్టుకున్న పెద్దేవం గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థిని తిరిగిపల్లి దివ్యకు అభినందనలు వెల్లువెత్తాయి. దివ్య కుటుంబం కష్టాలు విని సీఎం వైఎస్ జగన్ చలించిపోయారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కె.మాధవీలత నుంచి విద్యార్థిని దివ్యకు శుక్రవారం పిలుపు వచ్చింది. ఆ గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి తోట రామకృష్ణ, గ్రామ సర్పంచ్ తిరిగిపల్లి వెంకటరావు విద్యార్థిని దివ్యను వెంట పెట్టుకుని కలెక్టర్ వద్దకు తీసుకువెళ్లారు. విద్యార్థి దివ్య కుటుంబానికి ఇంటి స్థలం తక్షణమే కేటాయించినట్టు కలెక్టర్ తెలిపారు. అతి త్వరలో మంత్రి చేతుల మీదుగా అందజేస్తామన్నారు. అలాగే ఉన్నత చదువుకు, ఆ తర్వాత మంచి ఉద్యోగ అవకాశం కల్పించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం దివ్య హోంమంత్రి తానేటి వనితను కూడా కలిసింది. -
సీఎం వైఎస్ జగన్ కొవ్వూరు పర్యటన ఫొటోలు
-
రాబోయే రోజుల్లో ఏపీ దేశానికే దశ దిశ చూపిస్తుంది: సీఎం జగన్
సాక్షి, తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొవ్వూరు పర్యటనలో ఉన్నారు. కాగా, సీఎం జగన్ శ్రీకారం చుట్టిన జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా జనవరి–ఫిబ్రవరి–మార్చి 2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన నిధులను జమచేశారు. దీంతో, జనవరి–మార్చి 2023 త్రైమాసికానికి 9.95 లక్షల మంది విద్యార్థులకు లబ్ధిచేకూరనుంది. రూ.703 కోట్లను సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘విద్యాదీవెన ద్వారా ఇప్పటి వరకు రూ.10,636 కోట్లు ఖర్చు చేశాం. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు, నా నిరుపేదలు సామాజికంగా ఎదగాలి. వివక్ష పోవాలన్నా, పేదరికం పోవాలన్నా చదవన్నదే గొప్ప అస్త్రం. జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లాలంటే విద్యతోనే సాధ్యం. తరాల తలరాతలు మారాలంటే విద్య ఒక్కటే మార్గం. అందుకే నాలుగేళ్ల పాలనలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చాం. పిల్లల చదువులపై చేస్తున్న ఖర్చు హ్యూమన్ కేపిటల్ ఇన్వెస్ట్మెంట్. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ దేశానికే దశ దిశ చూపిస్తుంది. పిల్లలు చదువుకుంటే భావితరాలు బాగుపడతాయి. ప్రతీ పేద కుటుంబం నుంచి డాక్టర్, కలెక్టర్ రావాలన్నారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారుస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య 30 లక్షల నుంచి 40 లక్షలకు పెరిగింది. ఉన్నత విద్యలో కరిక్యులమ్ మార్చేశాం. జాబ్ ఓరియోంటెడ్‌గా కరిక్యులమ్ మార్చాం. దేశంలోనే తొలిసారిగా నాలుగేళ్ల హానర్స్ కోర్స్ ప్రవేశపెట్టాం. పిల్లల్లో స్కిల్ డెవలప్మెంట్ కోసం మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాం. రాష్ట్రంలోని ప్రతీ కుటుంబం నుంచి ఒక సత్యా నాదెళ్ల రావాలి. ప్రతిభ చూపించే ప్రతీ విద్యార్థికి తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. గత పాలకులు గజదొంగల ముఠాగా ఏర్పడ్డారు. ఆ ముఠా చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు. గత పాలనలో దోచుకో, పంచుకో, తినుకో అన్నట్టుగా ఉండేది. ఒక్క జగన్‌ను ఎదుర్కొనేందుకు తోడేళ్లంతా ఏకమవుతున్నాయి. పేదవాడికి, పెత్తందార్లకు మధ్య క్లాస్‌వార్ జరుగుతోంది’ అని అన్నారు. -
Live: కొవ్వూరులో జగనన్న విద్యా దీవెన
-
కొవ్వూరులో విద్యా దీవెన పథకం నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్
-
సమస్యలకు భగవద్గీతలో పరిష్కారాలు
కొవ్వూరు: మానవుని జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు భగవద్గీత పరిష్కారం చూపుతుందని కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతీ స్వామి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు సంస్కృత పాఠశాల ప్రాంగణంలో చంద్రశేఖరేంద్ర సరస్వతీ ఆరాధనోత్సవాల్లో భాగంగా సోమవారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీమద్భగవద్గీత దశ సహస్ర పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతీ స్వామి మాట్లాడుతూ మార్గశిర ఏకాదశి రోజున భగవద్గీత పారాయణం వల్ల విశేష ఫలితాలు ప్రాప్తిస్తాయన్నారు. అనంతరం విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు భగవద్గీత పుస్తకాలు అందజేశారు. తమిళనాడుకు చెందిన మహిళా బృందం సౌందర్యలహరి పారాయణ చేశారు. సాయంత్రం ఆధ్యాత్మిక వేత్తల ప్రసంగాలు, సంగీత విభావరీ, హరికథ నిర్వహించారు. -
Mega Job Fair: కొవ్వూరులో 9న మెగా జాబ్‌మేళా
కొవ్వూరు: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్ధ, జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, సీడాప్ సంయుక్తంగా తూర్పుగోదావరి జిల్లాలో ఈనెల 9న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర హోమ్ మంత్రి తానేటి వనిత తెలిపారు. తన క్యాంపు కార్యాలయంలో సోమవారం దీనికి సంబంధించిన పోస్టరును ఆమె ఆవిష్కరించారు. ఈసందర్భంగా వనిత మాట్లాడుతూ కొవ్వూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి మేళా ప్రారంభం అవుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని కోరారు. 15 ప్రముఖ కంపెనీలు మేళాలో పాలుపంచుకుంటాయన్నారు. 1,367 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారన్నారు. పాలిటెక్నిక్, ఐటీఐ, బీఎస్సీ కెమీస్ట్రీ, బీకామ్, పదో తరగతి, ఎంఫార్మసీ,బీ ఫార్మసీ, డీఫార్మసీ, ఇంటర్ మీడియట్ పూర్తి చేసుకున్న 19 నుంచి 30ఏళ్ల లోపు యువతీ యువకులంతా జాబ్ మేళాను సద్వినియోగ పరుచుకోవాలన్నారు. ఎంపికైన అభ్యర్ధులకు రూ.10వేల నుంచి రూ.20వేల వరకు ఆయా కంపెనీలు వేతనం చెల్లిస్తాయన్నారు. ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక నిర్వహిస్తారని జిల్లా ఉపాధి కల్పనా అధికారి కె.హరీష్ చంద్రప్రసాద్ తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ముందుగాపూర్తి వివరాలతో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. జాబ్ మేళాకు వచ్చే అభ్యర్ధులు తమ ఆధార్, పాన్, ఇతర సర్టిఫికెట్స్‌ను వెంట తెచ్చుకోవాలన్నారు. వివరాల కోసం 6303889174, 96664 72877, 90596 41596 నెంబర్లను సంప్రదించాలని సూచించారు. జిల్లా నైపుణ్యావృద్ధికారి శీలం ప్రశాంత్, జేడీ ఎం. సుమలత, ప్లేస్మెంట్ ఎగ్జిక్యూటివ్ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. (క్లిక్ చేయండి: ఆరు గంటల్లోనే విజయవాడ నుంచి బెంగళూరు..) జగనన్న పాలనలో బీసీలకు ప్రాధాన్యం చాగల్లు: బీసీల సంక్షేమం కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విశేష కృషి చేస్తున్నారని హోంశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. చాగల్లు మండలం ఊనగట్లలో నియోజకవర్గ బీసీ నాయకులతో సోమవారం ఆమె సమావేశమయ్యారు. విజయవాడలో జరగనున్న జయహో బీసీ మహాసభకు అధిక సంఖ్యలో తరలి రావాలని మంత్రి పిలుపు నిచ్చారు. బీసీ ప్రజాప్రతినిధులు, నాయకులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. కార్పొరేషన్ డైరెక్టర్లు సంసాని రమేష్, పొన్నాడ సింహాద్రి, చాగల్లు, తాళ్లపూడి, కొవ్వూరు వైఎస్సార్సీపీ మండల బీసీ సెల్ అధ్యక్షులు మేకా రాజు, ఎం.పోసిబాబు, కట్టా బ్రాహ్మజీ, వైఎస్సార్సీపీ బీసీ నాయకులు అక్షయపాత్ర రవింద్ర శ్రీనివాస్, మట్టా వెంకట్రావు, పిల్లి తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. (క్లిక్ చేయండి: నేనూ బీసీ ఇంటి కోడలినే.. మంత్రి రోజా) -
కొవ్వూరు టీడీపీలో మరోసారి బయటపడ్డ వర్గ విబేధాలు
-
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు టీడీపీలో వర్గ విభేదాలు
-
కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ నాయకుల బాహాబాహీ
సాక్షి, కొవ్వూరు: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. అమరావతి రైతుల పాదయాత్ర నేపథ్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ రెండు వర్గాలకు చెందిన టీడీపీ నాయకులు బాహాబాహీకి దిగారు. కొవ్వూరులో మాజీ మంత్రి జవహర్‌కు సంబంధం ఏంటని వ్యతిరేక వర్గం నిరసనకు దిగింది. ద్విసభ్య కమిటీ ముందే ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. చదవండి: (మహా పాదయాత్రతో టీడీపీ ముసుగు తొలిగి పోయింది: మంత్రి కారుమూరి) -
రాజమౌళి తండ్రి హైస్కూల్ వరకూ చదివింది ఇక్కడే..
కొవ్వూరు(తూర్పుగోదావరి): రాష్ట్రపతి కోటాలో ప్రముఖ సినీ కథా రచయిత కోడూరి విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభకు ఎంపిక కావడంపై ఆయన స్వస్థలం కొవ్వూరులో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యసభకు బుధవారం ఎంపిక చేసిన నలుగురు దక్షిణాది ప్రముఖుల్లో విజయేంద్ర ప్రసాద్ ఒకరు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణకు విజయేంద్ర ప్రసాద్ స్వయానా పెదనాన్న కొడుకు. చదవండి: దక్షిణాదికి అగ్రపీఠం.. తన కంటే పదిహేను రోజులు చిన్నవాడంటూ శివరామకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. ఈయన పెదనాన్న కోడూరి అప్పారావుకు ఆరుగురు కుమారులు. వీరిలో ఆరో సంతానం విజయేంద్ర ప్రసాద్. ఈయన హైస్కూలు విద్యాభాస్యం వరకూ కొవ్వూరులోనే సాగింది. అనంతరం ఏలూరులో చదివారు. 1975–76 సంవత్సరాల్లో ఆయన కుటుంబం కర్ణాటకలోని తుంగభద్ర ప్రాంతానికి వెళ్లిపోయింది. కొన్నాళ్లు కర్ణాటక, కొవ్వూరులో కొన్ని వ్యాపారాలు చేశారు. వాటిలో రాణించలేకపోయారు. అప్పటికే సినీరంగంలో స్ధిరపడిన సోదరుడు శివదత్త ప్రోత్సాహంతో ఆ వైపు వెళ్లినట్లు విజయేంద్ర సన్నిహితులు చెబుతున్నారు. మద్రాసు సినీరంగంలో అడుగుపెట్టి వెండితెరకెక్కిన పెద్ద చిత్రాలకు రచయితగా కొనసాగారు. బాహుబలి..ఆర్ఆర్ఆర్ ఆయన కలం నుంచి రూపం దిద్దుకున్నవే. విజయేంద్ర కుమారుడు, ప్రముఖ సినీదర్శకుడు రాజమౌళి విద్యాభాసం కుడా కొవ్వూరులోని దీప్తీ పాఠశాలలోనే సాగింది. విజయేంద్ర ప్రసాద్ సినీరంగంపై వేసిన ప్రభావవంతమైన ముద్రకు గుర్తింపుగా రాజ్యసభ సీటు ఇవ్వడం ఆనందంగా ఉందని ఆయన కుటుంబీకులు న్యాయవాది కోడూరి నరసింహారావు అన్నారు. తన తాతయ్య విజయేంద్ర ప్రసాద్ తండ్రి, శివరామకృష్ణ తండ్రి అన్నదమ్ములని నరసింహారావు చెప్పారు. -
కవల కానిస్టేబుళ్లు.. రోజూ చూస్తున్నా సరే.. కనుక్కోవడం కష్టమే సుమా!
వారిద్దరూ కవలలు. పైగా ఒకే చోట పోలీసులుగా ఉద్యోగాలు. దీంతో రోజూ చూస్తున్నా సరే.. స్టేషన్‌కు వచ్చే ప్రజలతో పాటు అధికారులు కూడా ఒకింత కన్ఫ్యూజన్ అవ్వాల్సిందే. యూనిఫాం వేశారంటే ఎవరు.. ఎవరో గుర్తుపట్టడం అంత ఈజీ కాదు మరి. ఇద్దరూ ఒకేసారి జననం, కానిస్టేబుళ్లుగా ఉద్యోగాల్లో చేరడం, పెళ్లిళ్లూ ఒకేసారి కావడం.. ఇలా వీరి జీవితం అద్భుతాలమయంగా సాగుతోంది. కొవ్వూరు: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పోలీసు స్టేషన్లో ఈ ఇద్దరు కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు. ఒకరి పేరు యు.లక్ష్మణకుశ, మరొకరి పేరు యు.రాములవ. వీరి స్వస్థలం తాళ్లపూడి. ఊబా సన్యాసిరావు, సావిత్రి దంపతులకు ఆరుగురు మగపిల్లలు సంతానం. వీరు మూడు, నాలుగో సంతానంగా జన్మించారు. వీరి కంటే మరో ఇద్దరు కవలలు రామ్, లక్ష్మణ్ పుట్టి చనిపోయారు. తర్వాత నాలుగో కాన్పులో వీరు జన్మించారు. దీంతో రామ్, లక్ష్మణ్‌ల పేర్లు కలిసేలా వీరికి పేర్లు పెట్టారు. మరో విశేషం ఏమిటంటే ఈ అన్నదమ్ములు ఒకేరోజు పోలీసు, రైల్వే కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. ఇద్దరూ పోలీసు కానిస్టేబుళ్లుగా ఉద్యోగాల్లో చేరడం, వీరిద్దరి పెళ్లిళ్లు సైతం ఒకే రోజు కావడం విశేషం. -
హోం శాఖ అప్పగించడం అదృష్టంగా భావిస్తున్నా: తానేటి వనిత
ఉమ్మడి ఆంధ్రపదేశ్‌లో తొలిసారి మహిళకు హోం మంత్రి పదవి కట్టబెట్టిన ఘనత దివంగత మహానేత వైఎస్సార్‌దైతే, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మరో అడుగు ముందుకేశారు. వరుసగా ఇద్దరు దళిత మహిళలకు కీలకమైన ఈ బాధ్యతలు కేటాయించారు. రాష్ట్ర హోం, ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత ఈ మాటలన్నారు. మొదటి విడతలోనే మంత్రి పదవి వస్తుందని ఊహించలేదన్నారు. రెండోసారి హోం శాఖ అప్పగించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నియోజకవర్గానికి వచ్చిన వనిత బుధవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంకా ఏమన్నారంటే.. –కొవ్వూరు ప్రశ్న: పోలీసులపై పని ఒత్తిడి అధికంగా ఉంది. వారాంతపు సెలవులు కొన్నిచోట్ల సక్రమంగా అమలు కావడం లేదన్న వాదనలు ఉన్నాయి? మంత్రి: క్షేత్ర స్థాయిలో సిబ్బంది ఇబ్బందులను తెలుసుకుంటాను. పోలీసులకు కచ్చితంగా వారాంతపు సెలవులు అన్నిచోట్లా అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం. ముఖ్యమంత్రి ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. దీనిపై మీ అభిప్రాయం? ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎంతో అవసరం. ఏ సమస్యపైనైనా ప్రజలు నిర్భయంగా స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలంటే ప్రజలకు, పోలీసులకు మధ్య çసుహృద్భావ వాతావరణం ఉండాలి. దీనివల్ల ప్రజల్లో సదభిప్రాయం కలుగుతుంది. సమస్యలు పరిష్కారం అవుతాయి. మహిళలు, యువతులపై అకృత్యాల నివారణకు ఏవిధమైన చర్యలు తీసుకుంటారు? ఇప్పటికే ప్రభుత్వం ప్రతి పోలీసు స్టేషన్లో మహిళా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసింది. దిశ సహాయ కేంద్రం పేరుతో మహిళా కానిస్టేబుల్‌ను నియమించి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ప్రతి జిల్లాకి ఒక దిశ పోలీసు స్టేషన్‌తో పాటు ప్రత్యేకంగా దిశ వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. దిశ యాప్ ద్వారా పోలీసుల నుంచి ఆపదలో ఉన్న మహిళలకు తక్షణ సాయం అందేలా చర్యలు తీసుకున్నాం. మంత్రివర్గ పునర్ వ్యవస్ధీకరణ ఎలా ఉంది? మంత్రి వర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు 70 శాతం పదవులు కేటాయించడం ద్వారా సామాజిక విప్లవానికి సీఎం జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, కాపు, మైనారిటీ వర్గాలకు చెందిన ఐదుగురు మంత్రులకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడం ఓ చారిత్రక నిర్ణయం. భవిష్యత్తు తరాల రాజకీయాలకు సీఎం ఓ దిక్సూచిగా నిలిచారు. హైవే పెట్రోలింగ్ వాహనాల్లో పోలీసుల పని తీరుపై విమర్శలున్నాయి. దీనిపై మీ స్పందన.? హైవేల్లో ప్రమాదాలు సంభవించిన సమయంలో తక్షణ సాయం అందించేందుకు నిర్దేశించిన హైవే పెట్రోలింగ్ వాహనాల పనితీరు మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటాం. నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పని చేసేలా చూస్తాం. పోలీసుల్లో అవినీతి నియంత్రణకు ఏవిధమైన చర్యలు తీసుకుంటారు.? అవినీతి అధికారులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటాం. అందుకు ప్రజల వైఖరిలోను మార్పు రావాల్సిన అవసరం ఉంది. డబ్బులిస్తేనే తొందరగా పని అవుతుందన్న భావన నుంచి ప్రజలు బయటికి వస్తేనే అవినీతి కట్టడి అవుతుంది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ఏవిధమైన చర్యలు తీసుకుంటున్నారు.? రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ముఖ్యమంత్రి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అసాంఘిక శక్తులపై ప్రత్యేక నిఘా ఉంచుతాం. శాంతిభద్రతలకు విఘాతం కలించే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం. ఇటీవల తాడేపల్లిగూడెం నిట్ కళాశాలలో ర్యాగింగ్ అంశం తెరపైకి వచ్చింది. కళాశాలల్లో ర్యాగింగ్ నియంత్రణకు ఏవిధమైన చర్యలు తీసుకుంటారు.? ర్యాగింగ్‌కి పాల్పడితే కలిగే అనర్థాలు, శిక్షల గురించి విద్యార్థుల్లో అవగాహన పెంపొందిస్తాం. విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తాం. ప్రతీ కళాశాలలో ర్యాగింగ్ నియంత్రణ కమిటీల పనితీరును మెరుగు పరిచేలా చర్యలు తీసుకుంటాం. -
కొవ్వూరులో జగనన్న విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించిన మంత్రి తానేటి వనిత
-
విజయవంతమైన ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమం
సాక్షి, ఏలూరు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో ఘనంగా ప్రారంభమయ్యింది. ఉదయాన్నే రేషన్ పంపిణీ వాహనాల్లో బియ్యాన్ని నింపుకున్న వాలంటీర్లు, ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేశారు. ఇప్పటి వరకు లబ్ధిదారులు రేషన్ షాప్‌కి వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి రేషన్ తీసుకోవాల్సి వచ్చేది. దీని కోసం వారు ఒక రోజు పనిని కూడా కోల్పోవాల్సి వచ్చేది. అయితే ప్రభుత్వమే ఇంటింటికి వాహనాల ద్వారా బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడంతో రేషన్ తీసుకోవడం చాలా సులభతరమైందని లబ్ధిదారులకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముందుగా కేటాయించిన సమయానికి రేషన్ నేరుగా ఇంటికే రావడంతో లబ్ధిదారుల ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి. లబ్ధిదారుల కళ్లెదుటే బియ్యాన్ని కాటా వేసి, ప్రత్యేక సంచుల్లో వారికి అందిస్తున్నారు. నాణ్యమైన బియ్యం ఇంటికే రావడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువతులు మృతి
సాక్షి, కొవ్వూరు: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. స్కూటీపై వెళుతున్న ఇద్దరు యువతులను క్వారీ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దాంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. స్కూటీని లారీ ఢీకొని వారిపై నుండి వెళ్లిపోవడంతో యువతుల శరీరాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతి చెందిన యువతులు కొవ్వూరు 23వ వార్డుకు చెందిన ఈర్ని భార్గవి, తనూషగా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
ఇద్దరు కూతుళ్లతో తల్లి ఆత్మహత్యాయత్నం
సాక్షి, పశ్చిమగోదావరి : పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో సహా గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అక్కడే ఉన్న స్థానికులు గమనించి. తల్లి వరికూటి స్థాయి, పెద్ద కుమార్తె లాస్య లను కాపాడగా చిన్న కుమార్తె దర్శిని మాత్రం గోదావరిలో మునిగి గల్లంతయింది. భావిస్తున్నారు. తల్లి కుమార్తెలు ఇద్దరు ఆస్పత్రికి తరలించి చికిత్స పొందుతుండగా చిన్న కుమార్తె మృతదేహం కోసం పోలీసులు గోదావరిలో గాలిస్తున్నారు. 5 నెలల క్రితం వరికూటి సాయి భర్త ప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందగా అత్త, మరిది కుటుంబ కలహాల నేపథ్యంలో వేధించడంతో ఈ సంఘటన జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. చదవండి: యువతి అదృశ్యం: రెండేళ్ల తర్వాత.. -
'తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవు'
సాక్షి, పశ్చిమగోదావరి : అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయకుంటే చర్యలు తప్పవని మంత్రి తానేటి వనిత హెచ్చరించారు. కొన్ని శాఖల అధికారులపై అవినీతి ఆరోపణలు తన దృష్టికి వచ్చాయని, పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని ఆమె పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వనిత మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులతో ఎంత సఖ్యతగా మెలుగుతారో వారు కూడా ప్రజలతో అంతే స్నేహపూర్వంగా మెలగాలని మంత్రి తెలిపారు. ప్రజా సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా కృషి చేయాలని పేర్కొన్నారు. (ముంపు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి అవంతి) -
మాజీ మంత్రికి బాధ్యతలు; కార్యకర్తల నిరసన
సాక్షి, పశ్చిమగోదావరి : మాజీ మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్‌కు టీడీపీ అధిష్టానం రాజమండ్రి పార్లమెంటరీ ఇంచార్జి బాధ్యతలు ఇవ్వడంపై కొవ్వూరు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు భగ్గుమన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని ముక్తకంఠంతో ఖండించారు. ఈ సందర్భంగా కొవ్వూరు పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన పార్టీ కార్యకర్తలు నాయకులు నిరసన వ్యక్తం చేశారు. జవహర్‌ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని లేదంటే కొవ్వూరు నియోజకవర్గానికి ఇంచార్జ్ వేరే ఒకరిని నియమించాలని తీర్మానించారు. (టీడీపీ కుట్ర.. ఆధారాలు బట్టబయలు) కొవ్వూరు నియోజకవర్గంలో మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి మంచి పట్టు ఉందని ఇప్పటి వరకు నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా, 2014లో కొవ్వూరు నియోజకవర్గంలో పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టాక పార్టీలో వర్గ విభేదాలు సృష్టించి కార్యకర్తలపై కేసులు పెట్టించి పార్టీ ఓడిపోవడానికి కారణమయ్యారని నాయకులు వాపోయారు. అందువల్ల కొవ్వూరు నియోజకవర్గానికి వేరొకరిని నియమించి పార్టీని ఆదుకోవాలని ఆయన కోరారు. (‘అందుకే సబ్బం హరి నిర్మాణాన్ని తొలగించాం’) -
కుమార్తెల ముందే అశ్లీలం.. భార్యపై డంబెల్‌తో దాడి
-
కుమార్తెల ముందే అశ్లీలం.. భార్యపై డంబెల్‌తో దాడి
సాక్షి, తూర్పు గోదావరి : జిల్లాలోని కాకినాడ రూరల్ మండలం కొవ్వూరులో దారుణం చేసుకుంది. మద్యం మత్తులో కన్న పిల్లలతో కూడా అసభ్యకరంగా ప్రవర్తించాడో తండ్రి. కుమార్తెల ముందే అశ్లీల దృశ్యాలు చూస్తూ భార్యను, కూతుర్లను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే నిలదీసిన భార్యపై డంబెల్‌తో దాడికి పాల్పడ్డాడు. భార్య మాధవి పోలీసులకు చేసిన ఫిర్యాదు వివరాల ప్రకారం.. ఏపీఎస్ ఆర్టీసీలో డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్న భర్త దంగేటి శ్రీను గతకొంత కాలం నుంచి మద్యానికి బానిస అయ్యాడు. పుటుగా తాగి వచ్చి కుమార్తెల ముందే నీలి చిత్రాలు చూసేవాడు. భర్త తీరు నచ్చని భార్య మాధవి ఈ విషయంపై అనేకమార్లు భార్తతో వాగ్వాదానికి దిగింది. రెండు రోజుల క్రితం కూడా ఇలాంటి సీనే రిపీట్ అయ్యింది. ఈ క్రమంలోనే భార్యపై కోపంతో ఇంట్లో ఉన్న డంబెల్ తీసుకుని తలపై బలంగా కొట్టాడు. అమ్మను కొట్టవద్దూ.. పోలీసులకు ఫిర్యాదు చేస్తాం అని పిల్లలు బతిలాడినా ఏమాత్రం పట్టించుకోకుండా దాడికి పాల్పడ్డాడు. ఈ దృశ్యాలను కుమార్తెలు ఫోన్లో రికార్డు చేయడంతో అవికాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భర్త దాడి ఘటనలో తీవ్ర గాయాల పాలైన మాధవిని స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. అనంతరం తన భర్త నుంచి కుమార్తెలకు, తనకు ప్రాణహాని ఉందని స్థానిక ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే గతంలోనూ భార్యా, పిల్లలు చిత్ర హింసలకు గురిచేస్తే పోలీసులకు భార్య ఫిర్యాదు చేసిందని, కేసు నమోదు అయితే డ్రైవర్‌ఉద్యోగం పోతుందనే భయంతో ఫిర్యాదును ఉపసంహరించుకుంది. అప్పటి నుంచి వేదింపులు మరింత ఎక్కువయ్యాని బాధితురాలు తెలిపింది.