kumar vishwas
-
ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్.. తజీందర్ బగ్గాకు రిలీఫ్
చండీగఢ్: ఆమ్ ఆద్మీ పార్టీకి పంజాబ్, హర్యానా హైకోర్టు షాక్ ఇచ్చింది. బీజేపీ నేతలు తజీందర్ సింగ్ బగ్గా, కుమార్ విశ్వాస్‌లపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేసింది. వారు తమ హక్కులు, రాజకీయ హోదాకు అనుగుణంగానే మాట్లాడారని, కేజ్రీవాల్‌పై విమర్శలు రాజకీయపరమైనవేనని స్పష్టం చేసింది. ఈమేరకు బుధవారం తీర్పు వెలువరించింది. ఆప్ మాజీ నేతలైన తజీందర్ బగ్గా, కుమార్ విశ్వాస్ కొద్ది రోజుల క్రితం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ది కశ్మీర్ ఫైల్స్ చిత్రానికి ఢిల్లీలో పన్ను మినాహాయింపు ఇవ్వకపోవడాన్ని తప్పుబడుతూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే వీరిపై పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీన్ని ఇద్దరూ హైకోర్టులో సవాల్ చేయగా.. న్యాయస్థానం అనుకూలంగా తీర్పునిచ్చింది. తీర్పు అనంతరం తజీందర్ బగ్గా స్పందించారు. సత్యమే గెలుస్తుందని నిరూపితమైందని, అరవింద్ కేజ్రీవాల్‌కు ఇది చెంపపెట్టులాంటి తీర్పు అని విమర్శలు గుప్పించారు. చదవండి: నిప్పంటించుకోబోయిన భార్యాభర్తలు.. రెప్పపాటులో.. -
Punjab: సీఎం భగవంత్ మాన్కు కవి వార్నింగ్..
చండీగఢ్: ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నేత, కవి కుమార్ విశ్వాస్ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్కు వార్నింగ్ ఇచ్చారు. పంజాబ్ పోలీసులు తన ఇంటి ముందు నిల్చున్న ఫోటోలను ట్విటర్లో పోస్టు చేస్తూ.. సీఎం భగవంత్ మాన్, ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను హెచ్చరించారు. ‘ఈ రోజు ఉదయం పంజాబ్ పోలీసులు మా ఇంటి వద్దకు వచ్చారు. ‘పంజాబ్ ప్రజలు ఇచ్చిన అధికారంతో ఆడుకోవడానికి ప్రయత్నిస్తున్న ఢిల్లీలో కూర్చున్న వ్యక్తిని హెచ్చరిస్తున్నాను. అతను ఏదో ఒక రోజు నిన్ను(భగవంత్ మాన్) పంజాబ్ ప్రజలను కూడా ద్రోహం చేస్తాడు. నా హెచ్చరికను దేశం గుర్తించుకుంటుంది’ అని ట్వీట్ చేశాడు. सुबह-सुबह पंजाब पुलिस द्वार पर पधारी है।एक समय, मेरे द्वारा ही पार्टी में शामिल कराए गए @BhagwantMann को आगाह कर रहा हूँ कि तुम, दिल्ली में बैठे जिस आदमी को, पंजाब के लोगों की दी हुई ताक़त से खेलने दे रहे हो वो एक दिन तुम्हें व पंजाब को भी धोखा देगा।देश मेरी चेतावनी याद रखे🙏🇮🇳 pic.twitter.com/yDymGxL1gi — Dr Kumar Vishvas (@DrKumarVishwas) April 20, 2022 అయితే ఈ ట్వీట్లో విశ్వాస్ కేజ్రీవాల్ పేరును ట్వీట్లో ప్రస్తావించలేదు. కాగా కుమార్ విశ్వాస్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. విశ్వాస్ ట్వీట్ చేసిన వెంటనే ఆప్ నాయకుడు నరేష్ బల్యాన్ స్పందించాడు.. విశ్వాస్ ఎందుకు అంతలా భయపడుతున్నాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికలకు ముందు తమరు చెప్పిన దానికి పోలీసులు రుజువు అడుగుతున్నారని, సాక్ష్యాధారాలు ఇచ్చి ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలంటూ హితవు పలికారు. काँप काहे रहे हो? जो बोला था चुनाव से पहले आपने उसी का तो सबूत माँगने पहुँची है पंजाब पुलिस, दे दो । बात ख़त्म। ऐसे कैसे चलेगा? मै पंजाब जीत की ख़ुशी में मिठाई खिलाने पहुँचा तो भी आप नही खाये। फ़िलहाल आप पंजाब पुलिस की चेतावनी याद रखो @DrKumarVishwas ! pic.twitter.com/CdbTre5cLU — MLA Naresh Balyan (@AAPNareshBalyan) April 20, 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌పై కుమార్ విశ్వాస్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. దేశాన్ని విచ్చిన్నం చేసేలా అరవింద్ జ్రీవాల్ మాట్లాడారని ఆరోపించారు. కేజ్రీవాల్, ఆప్‌కు వ్యతిరేకంగా చేసిన ప్రకటనలకు సంబంధించి విశ్వాస్‌పై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే అతని ఇంటికి పోలీసులు చేరుకున్నారు. -
ఎన్నికల వేళ కేంద్ర హెం శాఖ కీలక నిర్ణయం.. ఆయనకు ‘వై’ కేటగిరి భద్రత
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల వేళ నాయకుల మధ్య విమర్శల దాడి కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మాజీ నేత కుమార్ విశ్వాస్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్.. పంజాబ్ ముఖ్యమంత్రి లేదంటే ఖలిస్తాన్ ప్రధాని కావాలని అనుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. తాను వేర్పాటు వాదినే అయితే అరెస్ట్ చేయలేదన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఇలా నేతల మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కుమార్ విశ్వాస్‌కు వై కేటగిరీ భద్రత కల్పిస్తున్నట్టు హోం శాఖ శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే కుమార్ విశ్వాస్‌కు ముప్పు పొంచి ఉందనే నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రత కల్పించినట్టు హోం శాఖ తెలిపింది. ‘వై’ కేటగిరీ భద్రత ఇదే.. వై కేటగిరి భద్రతలో మొత్తం 11 మంది భద్రతా సిబ్బంది ఉంటారు. వీరిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ కమాండోలు విధులు నిర్వర్తిస్తారు. అయితే, వీరిలో కొంత మంది కుమార్ విశ్వాస్ నివాసం వద్ద భద్రతలో ఉంటారు. మిగిలిన వారు కుమార్ విశ్వాస్ ఎటు వెళ్లినా ఆయనతో పాటే వెళ్తారు. -
నన్ను ఎందుకు అరెస్ట్ చేయించ లేదు :కేజ్రివాల్
-
కేజ్రీవాల్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కుమార్ విశ్వాస్
-
జైట్లీ క్షమించేశారు...!
సాక్షి, న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అసంతృప్త నేత కుమార్ విశ్వాస్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకుంటున్నట్లు కోర్టుకు తెలిపిన కుమార్ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. జైట్లీకి, ఆయన కుటుంబ సభ్యులకు కలిగిన అసౌకర్యానికి తనను క్షమించాలంటూ తన లాయర్ అమిత్ యాదవ్ ద్వారా కోర్టును కోరారు. కుమార్ క్షమాపణను స్వీకరిస్తున్నట్లు జైట్లీ తరపున కోర్టుకు హాజరైన ఆయన లాయర్లు రాజీవ్ నాయర్, మాణిక్ డోగ్రా తెలిపారు. దీంతో కుమార్ విశ్వాస్‌పై ఉన్న పరువు నష్టం దావా కేసును ఎత్తివేస్తున్నట్లు కోర్టు తెలిపింది. కాగా, 13ఏళ్ల పాటు ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన జైట్లీ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని కేజ్రీవాల్‌తో సహా పలువురు ఆప్ నేతలు ఆయనపై ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో జైట్లీ వారిపై పరువు నష్టం దావా కేసు వేశారు. ఢిల్లీ హైకోర్టులో కేసు దాఖలు చేసిన జైట్లీ పరువు నష్టం కింద రూ. 10 కోట్లు చెల్లించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ సహా, ఆప్ నేతలు రాఘవ్ చద్దా, అశుతోష్, సంజయ్ సింగ్, దీపక్ బాజ్‌పేయిలు కూడా క్షమాపణలు తెలిపారు. తాజాగా కుమార్ విశ్వాస్ కూడా క్షమాపణలు తెలపడంతో జైట్లీ ఫిర్యాదును ఉపసంహరించుకున్నారు. -
‘ఆప్’ రాజస్థాన్ ఇంచార్జ్ తొలగింపు
న్యూఢిల్లీ : రాజస్థాన్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని చూస్తోన్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ ఆప్ ఇంచార్జ్‌గా ఉన్న కుమార్ విశ్వాస్ను ఆ పదవి నుంచి తప్పించింది. ఈ విషయాన్ని ఆప్ జాతీయ అధికార ప్రతినిధి అశుతోష్ వెల్లడించారు. విశ్వాస్ స్థానంలో దీపక్ బాజ్పాయిని ఇంచార్జ్‌గా నియమిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. విశ్వాస్‌కు తీరిక లేనందువల్లే ఆయనను ఈ బాధ్యతల నుంచి తప్పించినట్టు అశుతోష్ తెలిపారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతను దీపక్‌కు అప్పగించామని, జాబితాపై తుది నిర్ణయం మాత్రం పొలిటికల్ కమిటీ తీసుకుంటుదని ఆయన పేర్కొన్నారు. అయితే విశ్వాస్‌కు, పార్టీ సీనియర్ నేతలకు మధ్య సంబంధాలు దెబ్బతినడం వల్లే ఆయనను పదవి నుంచి తొలగించినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. పంజాబ్ మంత్రికి క్షమాపణలు చెప్పడంపై విశ్వాస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
‘సీఎం శివగామి, రాయ్ కట్టప్ప’
సాక్షి, న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ అసంతృప్తి నేత కుమార్ విశ్వాస్ మరోసారి పార్టీ కన్వీనర్ గోపాల్ రాయ్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. గతంలో ఎమ్మెల్యే అమానుతుల్లాను లక్ష్యంగా చేసుకొన్న గోపాల్ రాయ్ ఇప్పుడు తనపై అదే విధంగా కక్షకట్టారని విమర్శించారు. బాహుబలి-2 సినిమాలో కట్టప్ప క్యారెక్టర్ గోపాల్ రాయ్‌కు సరిగ్గా సరిపోతుందని ఎద్దేవా చేశారు. సినిమాలో శివగామి దేవి తనకు ఎవరైనా ఎదురుతిగితే అంతం చేయడానికి కట్టప్పను ఉసిగొల్పుతుందని, చివరకు కొడుకు బాహుబలిని కూడా చంపేయిస్తుందని, ఇప్పుడు పార్టీలో కూడా అదే పరిస్థితి నెలకొని ఉందని కుమార్ విశ్వాస్ అన్నారు. అధిస్థానానికి ఎదురు తిరిగితే తమ పార్టీ అధినేత కేజ్రీవాల్, తిరుగుబాటుదారులపై గోపాల్‌రాయ్ అనే కట్టప్పను ప్రయోగిస్తారని దుయ్యబట్టారు. పార్టీలోని చాలామంది కార్యకర్తలు తనని రాజ్యసభ సభ్యుడిగా చూడాలనుకున్నారని, ఈ విషయంపై పార్టీలో ఎన్నిక కూడా నిర్వహించాలని సూచించానని అన్నారు. కానీ తన మాటను పార్టీ పక్కన పడేసిందని, కావాలనే వ్యాపార వేత్త సుశీల్ గుప్తా, చార్టెడ్ అకౌంటెంట్ ఎన్డీ గుప్తా, పార్టీ నేత సంజయ్ సింగ్‌లను పార్టీ ఎంపిక చేసిందని విమర్శించారు. ఇది పార్టీలో నిజాలు మాట్లాడినందుకు దక్కిన ఫలితం అన్నారు. ఇది తన బలిదానంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అయితే దీనిపై పార్టీ సీనియర్ నేత స్పందించారు. గోపాల్ రాయ్‌పై కుమార్ విశ్వాస్ ఆరోపణలు చేసినప్పటికీ ఆయన్ను పార్టీ బుజ్జగించే ప్రయత్నం చేసిందని అన్నారు. ఒకవేళ పార్టీ కుమార్‌ను నిర్లక్ష్యం చేస్తే రాజస్తాన్ ఎన్నికల ఇన్చార్జ్గా విశ్వాస్ను ఎందుకు ఎంపిక చేస్తారంటూ ప్రశ్నించారు. ఇక రాజ్యసభ ఎన్నికల విషయానికి వస్తే శుక్రవారం నామినేషన్ల గడువు ముగిసింది. 8 వరకూ నామినేషన్లు ఉపసంహరణకు గడువు ఉంది. జనవరి 16న ఎన్నికలు జరగనున్నాయి. -
'కేజ్రీవాల్.. నువ్వు చనిపోయినవాడితో పెట్టుకోవద్దు'
సాక్షి, న్యూఢిల్లీ : ఒప్పందాలు పొసగనప్పుడు పార్టీలో కలిసి ముందుకు సాగడం సాధ్యం కాదని ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్ అన్నారు. రాముడు, గౌతమ బుద్ధుడితోపాటు ప్రతి ఒక్కరు తమ యుద్ధం తామే చేసుకున్నారని గుర్తు చేశారు. ఢిల్లీ రాజ్యసభ సీట్ల వ్యవహారం గత కొద్ది రోజులుగా చడీచప్పుడు లేకుండా ముందుకెళుతున్న ఆమ్‌ఆద్మీపార్టీలో ఒక్కసారిగా అగ్గిని రాజేసిన విషయం తెలిసిందే. ఈ సీట్ల పంపకం కారణంగా ఆ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన కుమార్ విశ్వాస్ ఏకంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై యుద్ధం ప్రకటించారు. ఢిల్లీకి ఉన్న మూడు రాజ్యసభ సీట్లలో తనకు సీటు కేటాయించకపోవడంపై ఆయన బహిరంగంగా కేజ్రీవాల్‌ను టార్గెట్ చేశారు. బుధవారం ఆమ్ ఆద్మీపార్టీ ఢిల్లీ రాజ్యసభ స్థానాలకోసం తన అభ్యర్థులను ప్రకటించింది. ఈ మూడు కూడా ఆప్ గెలుచుకునేందుకు అవకాశం ఉన్నవే. సంజయ్ సింగ్, సుశీల్ గుప్తా, ఎన్డీ గుప్తా అనే ముగ్గురుకి రాజ్యసభ సీట్లను కేటాయించింది. ఈ నేపథ్యంలో కుమార్ విశ్వాస్ మాట్లాడుతూ నిజాలు మాట్లాడినందుకు తనను ఇలా శిక్షించారని అన్నారు. ఇలా జరుగుతుందని కూడా తాను ముందే ఊహించానని అన్నారు. గత ఏడాదిన్నర కిందట తనను చూస్తూ కేజ్రీవాల్ ఓనవ్వు నవ్వుతూ తనను రాజకీయంగా దెబ్బకొడతామని అన్నారని చెప్పారు. ఒప్పందాలు కుదరనప్పుడు పార్టీలో కలిసి ఉండటం సాధ్యం కాదని చెప్పారు. 'నేను చనిపోయినవాడినని, నన్ను వీరజవానుగా మిగిలిపోనివ్వనని కేజ్రీవాల్ అన్నారు. కానీ, ఈ రోజు నేను చెబుతున్నాను.. ఆయన(కేజ్రీవాల్) చనిపోయిన శరీరంతో జోక్యం చేసుకోవద్దు.. దుర్వాసనను వెదజల్లవద్దు' అని విశ్వాస్ అన్నారు. కాగా, కుమార్ విశ్వాస్ మద్దతుదారులు పార్టీ ఆఫీసు ముందు పెద్ద మొత్తంలో చేరి తమ నేత విశ్వాస్ను పార్లమెంటుకు పంపించాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. కాగా, తనపై కుట్రలు చేశారని కుమార్ విశ్వాస్‌పై కేజ్రీవాల్ గతంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. -
నేను అభిమన్యుడిని.. మరణం కూడా విజయమే!
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సభలో పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సహా సీనియర్ నేతలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ అసమ్మతి నేతలు, భిన్న స్వరాలకు సైతం వేదికపై అవకాశం కల్పించడం గమనార్హం. ఆప్ రాజస్థాన్ ఇన్చార్జ్, అసమ్మతి నేతగా ముద్రపడ్డ కుమార్ విశ్వాస్ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని తనదైన శైలిలో ప్రసంగించారు. ఎప్పటిలాగే అసమ్మతి గళాన్ని వినిపిస్తూ.. పార్టీ నాయకత్వంపై పరోక్ష వ్యంగ్యాస్త్రాలు, ఆరోపణలు సంధించారు. అధినేత కేజ్రీవాల్‌పై విరుచుకుపడేందుకు ఈ వేదికను కుమార్ విశ్వాస్ ఉపయోగించుకున్నారు. ‘గత ఏడెనిమిది నెలలుగా నేను మాట్లాడలేదు. అందుకు కారణం స్వేచ్ఛాయుత చర్చలు జరిగే రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాలు జరగకపోవడమే. కమిటీ చివరి సమావేశంలో నన్ను మాట్లాడనివ్వలేదు’ అని కుమార్ విశ్వాస్ అన్నారు. తాను ఫుల్‌టైమ్ రాజకీయ నాయకుడిని కాదని పార్టీలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని, కానీ, తాను ఫుల్‌టైమ్ భారతీయుడిని, పార్ట్‌టైమ్ రాజకీయ నాయకుడిని అని ఆయన అన్నారు. ప్రతి మహాభారతంలోనూ ధర్మరాజు ఆవశ్యకత ఉందని పేర్కొంటూ.. పార్టీలో అసమ్మతివాదులకు సైతం గళమెత్తే అవకాశం కల్పించాలని కోరారు. పార్టీలో తమలో తాము కొట్లాడటం మాని.. ప్రజల స్వప్నాలను సాకారం చేసేందుకు పోరాడాలని సూచించారు. ‘20-22 మంది నాపై విరుచుకుపడి దాడి చేశారు. నిన్ను అవమానించి.. పార్టీ నుంచి పారిపోయేలా చేస్తామని బెదిరించారు. నేను పార్టీ నుంచి వెళ్లిపోయే ప్రసక్తే లేదని ఈ వేదిక నుంచి స్పష్టం చేస్తున్నా.. నేను అభిమన్యుడిలాంటివాణ్ని.. మరణం కూడా నాకు విజయమే’ అని కుమార్ విశ్వాస్ ఉద్ఘాటించారు. -
మీరు చస్తే.. పాక్‌లో సమాధి చేస్తారా?
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌పై పాకిస్థాన్ విజయం పట్ల సంబరాలు జరిపిన కశ్మీరీ వేర్పాటువాద నేత మిర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఫరూఖ్ పేరును ప్రస్తావించనప్పటికీ ఆయనను ఉద్దేశించి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత కుమార్ విశ్వాస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారత్ పరాజయం పట్ల సంబరాలు చేసుకోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. కశ్మీర్ వరదల సమయంలో భారత ఆర్మీ వల్ల ప్రాణాలు దక్కించుకున్న వాళ్లు నేడు భారత పరాజయంపై సంబరాలు చేసుకుంటున్నారని ట్విట్టర్లో పేర్కొన్నారు. అలాంటివాళ్లకు మాతృభూమి పట్ల ఏమాత్రమైన వీధేయత ఉందా? అని ప్రశ్నించారు. ఇలా సంబరాలు చేసుకునేవారు చనిపోయిన తర్వాత తమ మృతదేహాలు పాకిస్థాన్‌లో సమాధి చేయాలని కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు. వేర్పాటువాద నేత ఫరూఖ్‌ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ సైతంగా తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఫరూఖ్ పాకిస్థాన్ వెళ్లిపోవాలని, ఇందుకు తాను సహకరిస్తానని ఘాటుగా పేర్కొన్నారు. -
కుమార్ విశ్వాస్ ఒంటరయ్యారా?
న్యూఢిల్లీ : కుమార్ విశ్వాస్‌పై ఆరోపణలు సంధించేవారి సంఖ్య ఆమ్ ఆద్మీ పార్టీలో రోజు రోజుకు పెరుగుతోంది. కుమార్ విశ్వాస్ బిజెపితో కుమ్మక్కయ్యారని ఎమ్మెల్యే అమానతుల్లా చేసిన ఆరోపణలు సద్దుమణకగముందే తాజాగా ఆయనను బిజెపి మిత్రునిగా అభివర్ణిస్తూ ఆప్ కార్యాలయం వెలుపల పోస్టర్లు వెలిశాయి. కుమార్ విశ్వాస్ను బిజెపికి మిత్రునిగానే కాకుండా ఆప్ ద్రోహిగా, మోసగాడికి ఈ పోస్టర్లు పేర్కొన్నాయి. బిజెపి పట్ల కుమార్ విశ్వాస్ అనుసరిస్తోన్న మెతక వైఖరిని ప్రశ్నిస్తూ ఆప్ నేత దిలీప్ పాండే ట్వీట్ చేసిన కొద్ది రోజులకే వెలుగు చూసిన ఈ పోస్టర్లు కుమార్ విశ్వాస్ గురించిన నిజాన్ని బయటపెట్టినందుకు దిలీప్ పాండేకు కృతజ్ఞతలు తెలిపాయి. పోస్టర్లు ముద్రించిన వారు తమ పేరు బయట పెట్టకుండా కేవలం కుమార్ విశ్వాస్ను పార్టీ నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. కాగా అమానతుల్లా ఖాన్ ఆరోపణలతో ఆగ్రహించిన కుమార్ విశ్వాస్ను ఆప్ బుజ్జగించి రాజస్థాన్‌గా ఇన్చార్జిగా చేసిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ ఇన్చార్జ్ హోదాలో నిర్వహించిన సమావేశంలో కుమార్ విశ్వాస్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో చాలా మందికి రుచించడం లేదు. దానితో పార్టీలో పలువురు నేతలు ఆయనపై కత్తులు నూరుతున్నారు.దిలీప్ పాండే వంటి వారు కొందరు బాహాటంగా ఆయనపై విమర్శలు చేస్తున్నారు.కొత్తగా పార్టీ ట్రెజరర్‌గా నియమితుడైన దీపక్ బాజ్‌పేయి కూడా ఇటీవల ఆయనపై మండిపడ్డారు. గోవా ఎన్నికలలో పార్టీ నేతలు ఐదు నక్షత్రాల హోటళ్లలలో బస చేసి పార్టీ నిధులను దుర్వినియోగం చేశారని కుమార్ విశ్వాస్ చేసిన వ్యాఖ్యలపై దీపక్ బాజ్‌పేయి ట్విట్టర్‌పై మండిపడ్డారు. నలువైపుల నుంచి వెల్లువెత్తుతున్న ఆరోపణలతో, విమర్షలతో కుమార్ విశ్వాస్ పార్టీలో ఒంటరైన సూచనలు కనిపిస్తున్నాయి. ఆయనను పార్టీ నుంచి బయటకు తరిమేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆప్ నుంచి సస్పెండైన మాజీ మంత్రి కపిల్ మిశ్రా వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. కుమార్ విశ్వాస్ను కొద్ది రోజులలో ఆప్ బహిష్కరిస్తుందని ఆయన అన్నారు కూడా. -
‘ఆయన శత్రువు కూడా ఈ మాటలు నమ్మరు’
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మొన్న ఆయనపై ధిక్కార స్వరం వినిపించి అవసరం అయితే పార్టీని సైతం వీడిపోతానంటూ వ్యాఖ్యానించిన కుమార్ విశ్వాస్ అండగా నిలిచారు. కపిల్ మిశ్రా చేసిన ఆరోపణలు అర్థరహితం అని ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత అయిన విశ్వాస్ అన్నారు. కేజ్రీవాల్ శత్రువు కూడా కపిల్ చేసిన ఆరోపణలు నమ్మబోరంటూ వ్యాఖ్యానించారు. ‘నేను కేజ్రీవాల్‌తో పనిచేశాను. ఆయన అవినీతికి పాల్పడతారనే విషయాన్నిగానీ, ఒకరి నుంచి లంచం తీసుకుంటారనే విషయాన్నిగానీ నేను అస్సలు ఊహించుకోలేకపోతున్నాను. కావాలనే కేజ్రీవాల్‌పై బురద జల్లుతున్నారు. పార్టీలో ఏ నేత అవినీతికి పాల్పడినా వారిని వెంటనే తొలగిస్తానంటూ చెప్పిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అలాంటి వ్యక్తి అవినీతికి పాల్పడ్డారంటూ చేసిన ఆరోపణలు బాధ్యతారహితమైనవి, నిర్లక్ష్యంతో ఉద్దేశ పూర్వకంగా చేసినవి. కేజ్రీవాల్ శత్రువు కూడా ఈ ఆరోపణలు నమ్మలేరు’ అని కుమార్ విశ్వాస్ చెప్పారు. -
దిగొచ్చిన కేజ్రీవాల్.. సాహో కుమార్ విశ్వాస్
-
దిగొచ్చిన కేజ్రీవాల్.. సాహో కుమార్ విశ్వాస్
ఎప్పుడూ తన వ్యతిరేకుల విషయంలో ఫైర్‌బ్రాండ్ కామెంట్లు చేసే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దిగొచ్చారు. పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు, తనకు అత్యంత సన్నిహితుడు అయిన కుమార్ విశ్వాస్ను వదులుకోడానికి ఏమాత్రం ఇష్టపడక.. ఆయన పెట్టిన షరతులకు తలొగ్గారు. గత కొన్ని రోజులుగా ఆమ్ ఆద్మీ పార్టీలో నెలకొన్న సంక్షోభాన్ని నివారించడానికి ఇంతకాలం తనకు ఏ మాత్రం అలవాటు లేని రాజీ ధోరణిలోకి వచ్చారు. పార్టీలో జరుగుతున్న వ్యవహారాల మీద బహిరంగంగా ధ్వజమెత్తిన కుమార్ విశ్వాస్.. బీజేపీ, ఆర్ఎస్ఎస్లతో కలిసిపోయారని, అందుకే అలా మాట్లాడుతున్నారని పీఏసీ సభ్యుడు అమానతుల్లా ఖాన్ ఆరోపించిన విషయం తెలిసిందే. తనతో పాటు దాదాపు 30 మంది ఎమ్మెల్యేలను ఆయన బీజేపీలోకి తీసుకెళ్లిపోతున్నారని, అందుకు ఒక్కొక్కరికి రూ. 30 కోట్ల చొప్పున ముట్టజెబుతున్నారని కూడా ఆయన అన్నారు. దీంతో ఒక్కసారిగా ఆమ్ ఆద్మీ పార్టీలో కలకలం రేగింది. అమానతుల్లాఖాన్ ఆరోపణలను ఖండించిన కుమార్ విశ్వాస్.. ఆయన ముసుగులో ఎవరు మాట్లాడుతున్నారో కూడా తనకు తెలుసని వ్యాఖ్యానించారు. పరోక్షంగా పార్టీ అగ్ర నాయకత్వం మీద ఆయన విమర్శలు గుప్పించారు. కేజ్రీవాల్ ఎందుకు తగ్గారు... తాను మోనార్క్‌నని, తనను ఎవరూ ఏమీ చేయలేరని ఎప్పుడూ మండిపడుతుండే అరవింద్ కేజ్రీవాల్ తొలిసారిగా ఒక నాయకుడి విషయంలో మాత్రం తలవంచారు. ఎందుకంటే.. పార్టీ వ్యవస్థాపకులలో కుమార్ విశ్వాస్ కూడా ఒకరు. ఆయన పార్టీ కోసం పోస్టర్లు అతికించిన స్థాయి నుంచి వచ్చారు. అవినీతి మరకలు ఏమాత్రం అంటని వ్యక్తి. దానికితోడు క్షేత్రస్థాయిలో ఆయనకు బ్రహ్మాండమైన మద్దతు ఉంది. ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు కావడంతో.. పొరపాటున ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్తే సామాన్య ప్రజల్లో కూడా పార్టీ బాగా దెబ్బతింటుందని కేజ్రీవాల్ భావించారు. దానికితోడు ఇటీవల జరిగిన ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా పార్టీ ఘోరంగా దెబ్బతింది. ఇలాంటి పరిస్థితుల్లో అత్యంత కీలకమైన నాయకులలో ఒకరైన కుమార్ విశ్వాస్ను పోగొట్టుకుంటే రాబోయే ఎన్నికల్లో మరింత నష్టం తప్పదని కేజ్రీవాల్ భావించారు. అందుకే పార్టీలో కొనసాగాలంటే.. అంటూ ఆయన పెట్టిన షరతులను కూడా ఆమోదించారు. అందుకే ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా చర్చల తర్వాత బయటకు వచ్చి.. కుమార్ విశ్వాస్ పార్టీలోనే కొనసాగుతారని, రాజస్థాన్ వ్యవహారాల ఇన్చార్జిగా ఉంటారని చెప్పారు. -
‘నేను పార్టీలో ఉండాలంటే మూడు కండీషన్లు’
ఢిల్లీ: సొంతపార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముందు మూడు డిమాండ్లు పెట్టినట్లు పార్టీ వర్గాల సమాచారం. వాటిని పరిగణనలోకి తీసుకుంటేనే తాను పార్టీలో ఉంటానంటూ కూడా కేజ్రీవాల్‌కు ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన విశ్వాస్.. ఆ మాటలు మాట్లాడించింది ఎవరో తనకు తెలుసంటూ పరోక్షంగా పార్టీ అగ్ర నాయకత్వాన్నే టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. బీజేపీ, ఆర్ఎస్ఎస్ల ప్రోద్బలంతోనే కుమార్ విశ్వాస్ వ్యవహరిస్తున్నారని ఖాన్ ఆరోపించిన విషయం తెలిసిందే. తనగురించి అమానతుల్లా ఖాన్ చేసిన వ్యాఖ్యలు అందరూ చూశారని.. అలాంటి వ్యాఖ్యలే అరవింద్ కేజ్రీవాల్ మీద గానీ, మనీష్ సిసోదియా మీద గానీ చేసి ఉంటే పది నిమిషాల్లో అతడిని పార్టీ నుంచి బయటకు పంపేసేవారని, కానీ తన గురించి ఎన్నిసార్లు అతడు ఏం మాట్లాడినా పార్టీ నుంచి తొలగించలేదు సరికదా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని కుమార్ విశ్వాస్ మండిపడ్డారు. దీంతో విశ్వాస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు బయలుదేరాయి. దీంతో పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన విశ్వాస్ వెళ్లిపోతే పార్టీకి తీరని దెబ్బవుతుందని గ్రహించిన కేజ్రీవాల్ బుధవారం సమావేశం ఏర్పాటుచేసి ఆయన అసంతృప్తిని తెలుసుకున్నారు. దీంతో కుమార్ విశ్వాస్ మూడు షరతులు పెట్టినట్లు సమాచారం. అవేమిటంటే.. 1. అవినీతి, జాతీయవాదంపై ఎలాంటి రాజీ పడొద్దు. 2.పార్టీ కార్యకర్తలో నిత్యం కమ్యునికేషన్లో ఉండాలి.. వారి తరుపు వాదనలు కూడా వినాలి. 3.అమనతుల్లా ఖాన్ తొలగింపు అంశంపై తప్పకుండా చర్చ జరగాలి. -
ఆప్‌లో ఆయన ఉన్నట్లా.. లేనట్లా?
-
ఆప్‌లో ఆయన ఉన్నట్లా.. లేనట్లా?
ఆమ్ ఆద్మీ పార్టీలో సంక్షోభం నానాటికీ మరింత తీవ్రతరం అవుతోంది. అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన కుమార్ విశ్వాస్ పార్టీని వీడిపోయే లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన విశ్వాస్.. ఆ మాటలు మాట్లాడించింది ఎవరో తనకు తెలుసంటూ పరోక్షంగా పార్టీ అగ్ర నాయకత్వాన్నే టార్గెట్ చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ల ప్రోద్బలంతోనే కుమార్ విశ్వాస్ వ్యవహరిస్తున్నారని ఖాన్ ఆరోపించిన విషయం తెలిసిందే. తనగురించి అమానతుల్లా ఖాన్ చేసిన వ్యాఖ్యలు అందరూ చూశారని.. అలాంటి వ్యాఖ్యలే అరవింద్ కేజ్రీవాల్ మీద గానీ, మనీష్ సిసోదియా మీద గానీ చేసి ఉంటే పది నిమిషాల్లో అతడిని పార్టీ నుంచి బయటకు పంపేసేవారని, కానీ తన గురించి ఎన్నిసార్లు అతడు ఏం మాట్లాడినా పార్టీ నుంచి తొలగించలేదు సరికదా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని కుమార్ విశ్వాస్ మండిపడ్డారు. ఇదంతా ఎందుకు జరుగుతోందో తనకు తెలుసని, అమానతుల్లా కేవలం ఒక ముసుగు మాత్రమేనని, ఆ ముసుగులో ఎవరు మాట్లాడుతున్నదీ తనకు తెలుసని అన్నారు. పరోక్షంగా ఆయన పార్టీ అగ్ర నాయకత్వం మీద విమర్శలు గుప్పించారు. పార్టీ కోసం తాను మొదట్లో పోస్టర్లు అతికించానని, అందువల్ల తనపై విమర్శలు చేయడం సరికాదని చెప్పారు. తనకు ముఖ్యమంత్రి పదవి గానీ, పార్టీ అధ్యక్ష పదవి గానీ ఏమాత్రం అక్కర్లేదని, జాతికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లకు మాత్రం తగిన సమాధానం ఇస్తానని తెలిపారు. ఆప్ ఎమ్మెల్యేలు అరెస్టయినప్పుడు అజిత్ దోవల్, బస్సీలతో కుమార్ విశ్వాస్ పార్టీ చేసుకున్నారని అమానతుల్లా ఖాన్ ఆరోపించిన విషయం తెలిసిందే. పీఏసీ పదవికి అమనాతుల్లా ఖాన్ రాజీనామా చేసిన తర్వాత.. పార్టీ ఎమ్మెల్యేలు గానీ, ఇతర నాయకులు గానీ ఎవరూ బహిరంగంగా ప్రకటనలు చేయొద్దని, మనందరికీ పార్టీ మీద పార్టీ నాయకత్వం మీద విశ్వాసం ఉండాలని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా అన్నారు. ఎవరికైనా ఏమైనా సమస్య ఉంటే నేరుగా వెళ్లి కేజ్రీవాల్‌తో మాట్లాడుకోవాలని, ఆయన ఎప్పుడూ అందుబాటులోనే ఉంటారని చెప్పారు. ఇలా బహిరంగ వ్యాఖ్యలు చేయడం వల్ల పార్టీ పరువు దెబ్బ తింటుందన్నారు. కొంతమంది వ్యక్తులు పార్టీని గుప్పిట్లోకి తీసుకోవాలనుకుంటున్నారని, కుమార్ విశ్వాస్ తనతో పాటు పలువురిని బీజేపీలోకి తీసుకెళ్లాలనుకుంటున్నారని, ఒక్కొక్కరికి రూ. 30 కోట్ల బేరం కుదిరిందని అమానతుల్లా ఖాన్ ఆరోపించారు. దాంతో ఆయనను పార్టీ నుంచి తొలగించాలని 37 మంది ఎమ్మెల్యేలు అరవింద్ కేజ్రీవాల్‌ను డిమాండ్ చేశారు. -
చీపురు పార్టీలో భారీ సంక్షోభం!
-
చీపురు పార్టీలో భారీ సంక్షోభం!
ఆప్‌కు కుమార్ విశ్వాస్ రాంరాం! న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఘోర పరాభవం నేపథ్యంలో భగ్గుమన్న అంతర్గత అసమ్మతి అధికార ఆమ్ ఆద్మీ పార్టీని కుదిపేస్తూనే ఉంది. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంపై అసమ్మతి సెగలు ఎగిసిపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అసమ్మతి తీరంలో చేరిన ఆప్ కీలక నేత కుమార్ విశ్వాస్ సైతం ఇక కేజ్రీవాల్‌కు రాంరాం చెప్పాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కుమార్ విశ్వాస్ బీజేపీ ఏజెంట్ అని, ఆప్‌లో చీలిక తెచ్చేందుకు అతన్ని బీజేపీ, ఆరెస్సెస్ వాడుకుంటున్నాయని ఆ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ బాహాటంగా విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ విమర్శలు ఖండించకపోగా.. ఎవరూ బహిరంగ ప్రకటనలు చేయవద్దంటూ సీఎం కేజ్రీవాల్ ఆదేశించారు. అయితే, అధినేత కేజ్రీవాల్ తీరుపై కుమార్ విశ్వాస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ విమర్శించినట్టు తాను బీజేపీ ఏజెంటును కాదని, తాను ఎవరికీ క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. 24గంటల్లోనే భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ నివాసంలో ఆప్ అగ్రనేతలు భేటీ అయ్యారు. కుమార్ వ్యవహారంపై చర్చించినట్టు సమాచారం. కాగా, పార్టీకి వ్యతిరేకంగా బహిరంగ ప్రకటనలు చేస్తున్న కుమార్ విశ్వాస్‌పై సీనియర్ నేత మనీష్ సిసోడియా మండిపడ్డారు. సమస్య ఏమైనా ఉంటే పార్టీలో చర్చించుకొని పరిష్కరించుకోవాలని ఆయన హితవు పలికారు. ఆయనను పార్టీ నుంచి తొలగించే అవకాశం కూడా ఉందని వినిపిస్తోంది. మొత్తానికి రోజురోజుకు ఆప్ నాయకత్వానికి వ్యతిరేకంగా సొంత పార్టీలోనే అసమ్మతి గళాలు ఎగిసిపడుతున్నాయి. -
ఆప్‌లో లుకలుకలు, సిసోడియాతో కేజ్రీవాల్ భేటీ
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో పరాజయం మూటగట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీలో లుకలుకలు కొనసాగుతున్నాయి. ఆ పార్టీలో కుమార్ విశ్వాస్ వ్యవహారం ముగిసిపోకముందే...తాజాగా ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ పేరు తెర మీదకు వచ్చింది.ఆప్‌ను చీల్చేందుకు అమానతుల్లా ఖాన్ కుట్ర పన్నుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. 40మంది ఎమ్మెల్యేలు అతనిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే పీఏసీ అధ్యక్ష పదవి నుంచి అమానతుల్లా ఖాన్ ను తొలగించాలంటూ వారు ఈ సందర్భంగా సీఎంకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఆప్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో అత్యవసరంగా భేటీ అయ్యారు. పార్టీలో తాజా పరిణామాలపై చర్చలు జరుపుతున్నారు. కాగా పార్టీ వ్యవస్థాపకులలో ఒకరైన ఎమ్మెల్యే కుమార్ విశ్వాస్ కూడా చేజారిపోతున్నట్లు సంకేతాలతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకుని మరీ కుమార్ విశ్వాస్ బీజేపీలో చేరుతారని పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే కుమార్ విశ్వాస్ తన సోదరుడి లాంటివాడంటూ కొంతమంది వ్యక్తులు తామిద్దరి మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని వాళ్లు పార్టీకి శత్రువులని సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యలు చేశారు. -
తమ్ముడితో నాకు గొడవలేంటి: సీఎం
ఆప్ కోటకు బీటలు వారుతున్నాయి. పార్టీ వ్యవస్థాపకులలో ఒకరైన కుమార్ విశ్వాస్ కూడా చేజారిపోతున్నట్లు సంకేతాలు అందుతుండటంతో.. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కలవరపడ్డారు. కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకుని మరీ కుమార్ విశ్వాస్ బీజేపీలో చేరుతారని పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఆరోపించడంతో వెంటనే సీఎం స్పందించారు. తనకు, కుమార్ విశ్వాస్‌కు అసలు గొడవలేమీ లేవని.. అతడు తన తమ్ముడి లాంటి వాడని చెప్పారు. అయితే ఒక్కొక్కరికి రూ. 30 కోట్ల చొప్పున ఆఫర్ ఇచ్చి మరీ కుమార్ వివ్వాస్ కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లిపోతున్నారని అమానతుల్లా ఖాన్ అంటున్నారు. ఈ మేరకు ఆయన వాట్సప్‌లో ఓ మెసేజ్ ఫార్వర్డ్ చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలను పిలిపించి.. తనను పార్టీ కన్వీనర్ చేయాలని కుమార్ విశ్వాస్ చెప్పారన్నది ఖాన్ వాదన. ఇదంతా బీజేపీయే చేయిస్తోందని ఆయన అన్నారు. సుమారు 14 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆరోపించారు. అతడు నా తమ్ముడు.. కుమార్ విశ్వాస్ తనకు సొంత తమ్ముడి లాంటి వాడని, కొంతమంది వ్యక్తులు తామిద్దరి మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని.. వాళ్లు పార్టీకి శత్రువులని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తమను ఎవ్వరూ వేరు చేయలేరని స్పష్టం చేశారు. ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో పార్టీ నాయకత్వం మార్పు దిశగా ఆలోచనలు జరుగుతున్నాయని కుమార్ విశ్వాస్ ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచినా.. ఆప్‌కు వచ్చిన స్థానాలు చాలా తక్కువ. -
ఢిల్లీ సీఎంగా కుమార్ విశ్వాస్!
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్‌ను గద్దె దించుతారంటూ జోరుగా సాగుతున్న ప్రచారానికి మరింత ఊతమిచ్చేలా బీజీపీ కీలక నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార ఆప్‌కు చెందిన 34 మంది ఎమ్మెల్యేలు సీఎం కేజ్రీవాల్ పట్ల అసంతృప్తిగా ఉన్నారని, వారంతా వేరుకుంపటి పెట్టి ఆప్ కీలక నేత కుమార్‌విశ్వాస్ ను ముఖ్యమంత్రిగా ఎన్నుబోతున్నారంటూ ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి పాల్ ఎస్ బగ్గా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం 34 ఆప్ ఎమ్మెల్యేలు అరవింద్ కేజ్రీవాల్ రాజీనామాకు పట్టుపట్టినట్లు బగ్గా తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలను ఆప్ నేత కుమార్ విశ్వాస్ ఖండిచారు. ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందని, అందుకే పార్టీకి ఓట్లు దక్కలేదని, అయితే ఆత్మ పరిశీలన చేసుకొని తిరగి పుంజుకుంటామని కుమార్‌విశ్వాస్ తెలిపారు.కాగా సీఎం కేజ్రీవాల్ వాదనకు విరుద్ధంగా.."ఓటర్లు ఓట్లువేయనప్పుడు ఈవీఎం లను విమర్శించడం తగదు" అని ఆయన అన్నారు. -
ప్రజలు మా పార్టీకి ఓట్లు వేయలేదు
న్యూఢిల్లీ: ఎన్నికల్లో వరుస ఓటములు, పార్టీ నేతల రాజీనామాలతో ఢీలా పడ్డ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు మరో షాక్ తగిలింది. ఎన్నికల్లో పార్టీని గెలిపించడంలో కేజ్రీవాల్ సామర్థ్యంపై ఆయన సన్నిహితుడు కుమార్ విశ్వాస్ సందేహం వ్యక్తం చేశారు. ఇటీవల ఎదురైన వరుస పరాజయాలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. నాయకత్వ మార్పు సహా, కఠిన నిర్ణయాలు తీసుకునే విషయాన్ని పార్టీ పరిశీలించాలని కుమార్ విశ్వాస్ కోరారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు, రాజౌరి ఉప ఎన్నిక, అలాగే ఎంసీడీ ఎన్నికల్లో ఆప్ ఓటమిపై కేజ్రీవాల్ ఆత్మరక్షణలో పడటాన్ని ప్రశ్నించారు. ఈవీఎంల వల్ల ఆప్ ఓడిపోలేదని, ప్రజలు పార్టీకి ఓట్లు వేయలేదని చెప్పారు. 'ఈవీఎంలను నిందించడం మంచిది కాదు. ఓటర్లకు, కార్యకర్తలకు చేరువ కావడంలో విఫలమయ్యాం. సర్జికల్ దాడులపై కేజ్రీవాల్ వైఖరి తప్పు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించకుండా ఉండాల్సింది. తప్పుడు నిర్ణయాల వల్లే పంజాబ్‌లో ఆప్ ఓడిపోయింది' అని విశ్వాస్ అన్నారు. -
కేజ్రీవాల్‌పై కుమార్‌కు విశ్వాసం పోయిందా?
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక నేత కుమార్ విశ్వాస్‌కు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై విశ్వాసం పోయినట్లుందని సోషల్ మీడియాలో ధుమారం రేగుతోంది. కేజ్రీవాల్‌ను కుమార్ విశ్వాస్ పరోక్షంగా ప్రశ్నించారు. అవినీతి మరకలు అంటుకున్నవారిని కాపాడే ప్రయత్నం చేస్తే ప్రజలు ప్రశ్నిస్తారని అన్నారు. అవినీతిని అంతమొందిస్తామనే హామీతో ఢిల్లీలో అధికారం చేజిక్కించుకుని ఆ తర్వాత అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని రక్షించే ప్రయత్నం చేస్తే ప్రజలు తప్పకుండా నిలదీస్తారని చెప్పారు. ఈ మేరకు ఆయన మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అంతేకాదు, పలువురు నాయకులపై విశ్వాస్ విమర్శనస్త్రాలు ఎక్కుపెట్టారు. ముఖ్యమైన సమస్యలు అన్నింటిని పక్కకు పెట్టి భజన చేయించుకోవడం నాయకులకు అలవాటుగా మారిందని అన్నారు. వారంతా మోదీ, మోదీ, అరవింద్ అరవింద్ అంటుంటే ఆ భజనల్లో మునిగి తేలుతున్నారని చెప్పారు. ‘మోదీ, మోదీ, అరవింద్ అరవింద్, రాహుల్ రాహుల్, యోగి రాజా ఆగయా, ఏకే రాజ్ ఆగయా అనే భజనల్లో మనమంతా తీరిక లేకుండా ఉన్నాం’ అని నాయకులను విమర్శించారు. అలాగే, కశ్మీర్లో జవానులకు జరుగుతున్న అవమానాలను ప్రశ్నించారు. పలు నియామకాల్లో అవినీతికి పాల్పడిన వ్యక్తులకు చోటు కల్పిస్తున్నారని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. వీటిని ఉద్దేశించే తాజాగా విశ్వాస్ ఓ వీడియోలో పరోక్షంగా ప్రశ్నించారు. -
టీడీపీలో చేరబోతున్న ప్రధాని మోదీ!?
కొన్ని వదంతులు పదేపదే ప్రచారమవ్వడం ఎవరికైనా చీకాకు పరుస్తుంది. అలాంటి వదంతే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత కుమార్ విశ్వాస్ గురించి మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఆప్ అధినేత అరవింద్ క్రేజీవాల్‌కు అత్యంత నమ్మకస్తుడైన కుమార్ విశ్వాస్ పార్టీని వీడి.. బీజేపీలోకి జంప్ చేయబోతున్నారని, యూపీ ఎన్నికల్లో ఆయన బీజేపీ టికెట్ మీద పోటీ చేస్తారని వదంతులు చెలరేగాయి. సోషల్ మీడియాలో గుప్పుమన్న ఈ వదంతులు మీడియా కూడా ప్రసారం చేయడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వదంతులను ఇటు ఆప్, అటు కుమార్ విశ్వాస్ వ్యంగ్యంగా తోసిపుచ్చారు. గతంలోనూ బీజేపీలో చేరుతున్నట్టు వచ్చిన వదంతులను సెటైరిస్ట్ అయిన కుమార్ ఖండించారు. తాజాగా వచ్చిన వదంతులను కూడా ఆయన వెరైటీగా ఖండించారు. ఏకంగా ప్రధాని మోదీ ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో చేరబోతున్నారంటూ బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రధాని మోదీ టీడీపీలో చేరబోతున్నారని తెలిసింది. దీనిని వార్తాకథనంగా ప్రసారం చేయండి. మీలాగే జోక్ చేస్తున్నా గైస్’ అంటూ కుమార్ విశ్వాస్ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ ’సెన్స్ ఆఫ్ హ్యుమర్’ పెంచుకోమని చెప్తే.. భక్తులు ’సెన్స్ ఆఫ్ రూమార్’ను పెంచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మరో అడుగు ముందుకువేసి ప్రధాని మోదీ కాంగ్రెస్‌లో చేరబోతున్నారని, త్వరలోనే రాహుల్‌ను కలుస్తారని వ్యంగ్యంగా అన్నారు. అమిత్ షా ఆప్‌లో చేరబోతున్నారా? అంటూ మరో ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా పేర్కొన్నారు. -
కేజ్రీవాల్‌కు ఝలక్ కీలక నేత బీజేపీలోకి..
-
కేజ్రీవాల్‌కు ఝలక్.. కీలక నేత బీజేపీలోకి..
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు సొంతపార్టీ నేత కుమార్ విశ్వాస్ ఝలక్ ఇవ్వనున్నారు. పార్టీలో అత్యంత నమ్మకస్తుడిగా ఉంటున్న ఆయన త్వరలోనే కమలదలం(బీజేపీ)లోకి అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే ఆయనకు బీజేపీకి మధ్య చర్చలు దాదాపు పూర్తి కావొచ్చని, బీజేపీలోకి అడుగుపెడుగుతున్న విషయంపై ఆయన ఏ సమయంలోనైనా అధికారికంగా ప్రకటించవచ్చని సమాచారం. విశ్వాస్ కుమార్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని సహిబాబాద్ నుంచి పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిసింది. విశ్వాస్‌తో చర్చలు ఇప్పటికే చాలా ముందుకెళ్లాయని, ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌కు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున ఇక నిర్ణయం కూడా త్వరగానే వెలువడనుందని బీజేపీ వర్గాల సమాచారం. అంతేకాదు.. త్వరలోనే బీజేపీ చీఫ్ అమిత్ షాతో కుమార్ విశ్వాస్ భేటీ అయ్యే అవకాశం ఉంది. గతంలో కుమార్ విశ్వాస్ అమేథీలో ఆమ్ ఆద్మీ పార్టీ తరుపున రాహుల్‌గాంధీ, స్మృతి ఇరానీపై పోటీ చేశారు. -
హజారేతో 'ఆప్' నేతల భేటీ
రాలెగావ్ సిద్ధి(మహారాష్ట్ర): ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకులు కుమార్ విశ్వాస్, సంజయ్ సింగ్ మంగళవారం అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారేను కలిశారు. ఢిల్లీ అసెంబ్లీలో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జనలోక్ పాల్ బిల్లు గురించి హజారేకు వివరించారు. ఈ బిల్లులోని ముఖ్యాంశాలను ఆయన తెలిపారు. దీని ద్వారా అవినీతిని సమర్థవంతంగా అరికడతామని పేర్కొన్నారు. హజారేను ఆప్ నాయకులు కలిసిన విషయాన్ని ఆయన అనుచరుడు దత్త అవారి ధ్రువీకరించారు. జనలోక్ పాల్ బిల్లును కేజ్రీవాల్ సర్కారు సోమవారం ఢిల్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ బిల్లును తెచ్చింది. 2011లో తయారు చేసిన జనలోక్ పాల్ బిల్లుకు ఇది సమానంగా ఉంటుందని 'ఆప్' వర్గాలు చెబుతున్నాయి. ఈ బిల్లు చట్టరూపం దాల్చాలంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదించాల్సి ఉంటుంది. -
ఆప్ నేత, భార్యపై బెదిరింపు కేసు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి వరుస చిక్కులు వస్తున్నాయి. ఒకరి తర్వాత ఒకరిపై కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఆపార్టీకి చెందిన న్యాయశాఖ మాజీ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ పై నకిలీ సర్టిఫికెట్ల కేసులు నమోదవ్వగా.. అదే పార్టీకి చెందిన మరో నేత కుమార్ విశ్వాస్ ఆయన భార్యపై తాజాగా పోలీసులు కేసులు నమోదు చేశారు. నోయిడాలోని ఓ వ్యక్తిని బెదిరించనట్లు ఫిర్యాదు అందడంతోవారిపై కేసులు నమోదయ్యాయి. అయితే, తానుగానీ, తన భార్యగానీ ఎవరినీ బెదరించలేదని, ఇదంతా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయ కుట్రలో భాగమేనని ఆరోపించారు. -
మౌనంగా ఉండడమే మంచిది: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ప్రభుత్వానికి సంబంధంలేని విషయాలపై మీడియాలో వచ్చే కథనాల పట్ల మౌనం వహించాలని ఆమ్ ఆద్మీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తమ పార్టీ నేతలకు సూచించారు. హస్తినలో బంఫర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తమపై మీడియాలో ఒక వర్గం బురద చల్లేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఇందులో భాగంగా తమ పార్టీపై వదంతులు ప్రచారం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 'ఆప్' అప్రదిష్ట పాలు చేసేందుకు మీడియాలో ఒక వర్గం ప్రయత్నిస్తోందని వాపోయారు. కుమార్ విశ్వాస్ తో వివాహేతర సంబంధాలు ఉన్నట్టు వదంతులు పుట్టించారని ఆప్ మహిళా కార్యకర్త ఆరోపించిన నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ సూచనలు చేశారు. -
'వదంతుల వల్ల నా భర్త నన్ను వదిలివేశారు'
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మరో వివాదంలో చిక్కుకుంది. ఆ పార్టీ నాయకుడు కుమార్ విశ్వాస్‌పై ఆప్ మహిళా కార్యకర్త ఆరోపణలు చేశారు. తనకు ఆయనతో వివాహేతర సంబంధాలు ఉన్నట్లు వస్తున్న వదంతులను విశ్వాస్ ఖండించటం లేదని, దీనివల్ల తన ప్రతిష్ట దెబ్బతింటోందని ఆమె ఢిల్లీ మహిళా కమిషన్(డీసీడబ్ల్యు)కు ఫిర్యాదు చేశారు. దీంతో తమ ముందు హాజరు కావలసిందిగా డీసీడబ్ల్యు కుమార్ విశ్వాస్‌కు, ఆయన భార్యకు నోటీసులు పంపించింది. తాను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు, ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు వేర్వేరుగా లేఖలు రాసినప్పటికీ, స్పందన లేదని అందువల్లే మహిళా కమిషన్‌ను ఆశ్రయించానని ఆమె తెలిపారు. 2014 ఎన్నికల్లో కుమార్ విశ్వాస్ తరపున అమేథీ లోక్‌సభ నియోజకవర్గంలో ప్రచారం చేసినట్లు ఆమె చెప్పుకొచ్చారు. రకరకాల పుకార్లు పుట్టించటం ద్వారా తన ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఆమె ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలన్నీ నిరాధారాలనీ, ఆప్‌ను అప్రతిష్టపాల్జేయటం కోసం ప్రత్యర్థి పార్టీలు పుట్టిస్తున్న కథనాలని విశ్వాస్ సోమవారం ఖండించారు. 'కొన్నాళ్ల క్రితం సదరు మహిళ, బీజేపీ ప్రతినిధి సహా కొందరు వ్యక్తులు తనపై అబద్ధాలు పుట్టిస్తున్నారని, తనకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో బీజేపీ ప్రతినిధి పేరు కూడా ప్రస్తావించారు. కానీ పోలీసులు ఎలాంటి చర్యా తీసుకోలేదు. అప్పుడు నాకు ఆమె కుమార్ భయ్యా ఏం చేయాలో చెప్పండంటూ మెయిల్ పంపించారు. అప్పుడు ఆప్ న్యాయ విభాగం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలని ఆమెకు సూచించింది' అని అన్నారు. డీసీడబ్ల్యు నోటీసులు అందిన తరువాత తగిన విధంగా స్పందిస్తానని ఆయన అన్నారు. తనపై వస్తున్న పుకార్లను ఖండించకపోవటంపై మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. 'కేవలం ఈ వదంతుల వల్ల నా భర్త నన్ను వదిలేశాడు. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మాది మధ్యతరగతి కుటుంబం. కుమార్ విశ్వాస్ ఆప్‌లో అందరికీ తెలిసిన నాయకుడు కాబట్టి ఇద్దరి మధ్య ఏదైనా ఉండవచ్చని భావించవచ్చు. అందుకే ఆయన వివరణ ఇవ్వాలని కోరుతున్నా. కానీ, ఆయన మాత్రం మాట్లాడటం లేదు'అని ఆందోళన చెందారు. డీసీడబ్ల్యు చైర్పర్సన్ బర్ఖాసింగ్ మాట్లాడుతూ 'ఆప్‌కు చెందిన ఈ పార్టీ కార్యకర్త కొద్ది రోజులుగా మా దగ్గరకు వస్తున్నారు. తమ సొంత పార్టీ కార్యకర్త వచ్చి ఆరోపిస్తున్నప్పుడు ఆయనకు(విశ్వాస్) వచ్చి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఈ వందంతుల ఆరోపణల వల్ల ఆమె వివాహ బంధం దెబ్బతినే అవకాశాలున్నాయి'అని అన్నారు. ఇదిలా ఉండగా, మహిళా కార్యకర్త ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ రాసినట్లు ఉత్తర ఢిల్లీలోని నందగిరి పోలీస్ స్టేషన్ పోలీసులు తెలిపారు. ఐపీసీ 509 సెక్షన్, ఐటీ యాక్ట్ సెక్షన్ 67ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఢిల్లీ న్యాయశాఖ మంత్రి తోమర్ నకిలీ న్యాయవాద డిగ్రీ సర్టిఫికేట్ కలిగి ఉన్నారన్న ఆరోపణల వివాదం నుంచే ఆప్ బయటపడలేదు. అంతకు ముందు ఆప్ ర్యాలీలో రైతు ఆత్మహత్య, అంతలోనే కుమార్ విశ్వాస్ ఉదంతం.. ఇలా వరుస వివాదాలు ఆప్‌ను సతమతం చేస్తున్నాయి. -
ఆప్ నేతకు సమన్లు
న్యూఢిల్లీ: సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీని వివాదాల మీద వివాదాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా మహిళా కార్యకర్తను వేధించారనే ఆరోపణలపై ఢిల్లీ మహిళా కమిషన్ ఆప్ నేతకు సమన్లు జారీ చేసింది. పార్టీ నేత కుమార్ విశ్వాస్ పార్టీ మహిళా కార్యకర్తను వేధించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతూ కమిషన్ నోటీసులు జారీ చేసింది. కమిషన్ ముందు హాజరవ్వాలని ఆప్ నేతను కోరామని కమిషన్ ప్రతినిధి సోమవారం తెలిపారు. గతం సంవత్సర కాలంలో అమేధీలో పార్టీ క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తున్నమహిళను లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా వేధించినట్టుగా తమకు ఫిర్యాదు అందిందని ఆమె చెప్పారు. అయితే ఈ ఆరోపణలను ఆప్ కొట్టి పారేసింది. ఇంతవరకు తమకెలాంటి సమన్లు అందలేదని ఆప్ తెలిపింది. కాగా అవినీతి రహిత సమాజమే లక్ష్యమనే నినాదంతో ఢిల్లీ గద్దెనెక్కిన ఆప్ ప్రభుత్వాన్ని వరుస వివాదాలు పట్టి పీడిస్తున్నాయి. ఢిల్లీలో ప్రభుత్వాన్ని స్థాపించిన అనతికాలంలోనే పార్టీలో చీలిక అలజడి సృష్టించింది. ఆప్ ర్యాలీలో రైతు ఆత్మహత్య ప్రకంపనలురేపింది. న్యాయశాఖ మంత్రి విద్యార్హతలపై రగడ ఇంకా చల్లారనేలేదు. ఇపుడు మహిళను వేధించిన కేసు. దీంతో ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. -
బీజేపీలో చేరితే ఢిల్లీ సీఎం పదవి ఇస్తామన్నారు
బీజేపీ ఎంపీ ఒకరు ఆశ చూపారన్న ఆప్ నేత విశ్వాస్ ఆ ఎంపీ మనోజ్ తివారీ అన్న మరో ఆప్ నేత సంజయ్‌సింగ్ సాక్షి, న్యూఢిల్లీ: కొంతమంది ఆప్ ఎమ్మెల్యేలతో కలసి బీజేపీలో చేరితే తనను ఢిల్లీ సీఎం చేస్తామంటూ బీజేపీ ఎంపీ ఒకరు ఆశ చూపినట్టు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత కుమార్ విశ్వాస్ శనివారం ఆరోపించారు. గత మే నెల 19న ఘజియాబాద్‌లోని తన ఇంటికి వచ్చిన బీజేపీ ఎంపీ ఒకరు ఈ ప్రతిపాదన తనముందు ఉంచారని, ఇందుకు ఒప్పుకుంటే.. బీజేపీ సీనియర్ నేతలతో మాట్లాడతానని ఆయన పేర్కొన్నట్టు విశ్వాస్ తెలిపారు. ఇందుకు తాను నిరాకరించానని, ఈ వ్యవహారాన్ని మరుసటి రోజు తమ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ దృష్టికి తీసుకుపోయానని చెప్పారు. ఈ విషయాలను ఎకనమిక్స్ టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. విశ్వాస్ గత లోక్‌సభ ఎన్నికల్లో అమేథీలో రాహుల్‌గాంధీపై పోటీచేసి ఓటమి పాలవడం తెలిసిందే. లెఫ్టినెంట్ గవర్నర్ తమను ఆహ్వానించిన పక్షంలో ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమేనని బీజేపీ సంకేతాలిచ్చిన నేపథ్యంలో విశ్వాస్ చేసిన ఆరోపణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బీజేపీకి ప్రస్తుతం 28 మంది సభ్యులున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆ పార్టీకి మొత్తం 34 మంది సభ్యుల మద్దతు అవసరం. అంటే మరో ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు బీజేపీకి కావాలి. కాగా తనకు ఆశ చూపిన బీజేపీ ఎంపీ ఎవరో తెలిపేందుకు విశ్వాస్ నిరాకరించారు. అయితే ఆ ఎంపీ మనోజ్ తివారీ అయి ఉండవచ్చని ఆప్ కీలక నేత సంజయ్‌సింగ్ వెల్లడించారు. 18 మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తే సీఎం పోస్టు ఇస్తామని ఆశ చూపినట్టు ఆయన ఆరోపించారు. కాగా, తనపై ఆరోపణలను ఎంపీ మనోజ్ తివారీ ఖండించారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు తన పేరును లాగారన్నారు. -
మూవీ బజ్: బాలీవుడ్ బరి.. విశ్వాస్ గురి
బాలీవుడ్ బరి.. విశ్వాస్ గురి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, వివాదాస్పద వికటకవి కుమార్ విశ్వాస్ బాలీవుడ్లో రంగప్రవేశం చేశారు. త్వరలో విడుదల కానున్న ‘భైరవి’ చిత్రానికి ఆయన పాట రాశారు. వెటరన్ గాయని ఆశాభోంస్లే ఈ పాట పాడనున్నారు. తాను రాసిన పాటను ఆమె పాడటం వల్ల తన కల నెరవేరిందంటున్నాడు విశ్వాస్. విజయనారి.. సాండ్రా సరి ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీతో మల్టీబిలియన్ కంపెనీ స్థాపించే స్థాయికి ఎదిగిన మార్కెటర్ బ్రౌనీ వైస్ జీవితకథ ఆధారంగా తెరకెక్కనున్న ‘టప్పర్‌వేర్ అన్సీల్డ్’లో సాండ్రా బుల్లక్ ప్రధాన పాత్ర పోషించనున్నట్లు సమాచారం. బ్రౌనీ జీవిత కథను రాసిన బాబ్ కీలింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. పొడగరి.. సొగసరి ‘బాలీవుడ్లో అత్యంత పొడగరి హీరోయిన్ ఎవరు?’... ఎ) హుమా ఖురేషీ, బి) కత్రినా కైఫ్, సి) దీపికా పడుకొనే, డి) ప్రీతీజింటా. ఇదేమీ ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో ప్రశ్న కాదు. కేరళ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇటీవల నిర్వహించిన పోటీపరీక్షలోనిది. పరీక్షలో ఇలాంటి ప్రశ్న అడగటంతో ‘ట్విట్టర్’లో రచ్చ మొదలైంది. సమాధానం దీపిక పడుకొనే! -
'అమేథీలో యథేచ్చగా బూత్ ల ఆక్రమణ'
అమేథి: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటి చేస్తున్న నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు బూత్ లను ఆక్రమించుకుంటున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్ ఆరోపించారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ అడ్డదారుల తొక్కుతోందని ఆయన అన్నారు. అమేథీ నియోజకవర్గంలోని మహ్మమూద్ పూర్ లోని 42 నెంబర్ బూత్ లో బూత్ లను ఆక్రమించకున్నారని కుమార్ విశ్వాస్ ట్విటర్ లో పోస్ట్ చేశారు. పెద్ద ఎత్తున బూత్ ల అక్రమణ జరుగుతోందని, దొంగ ఓట్ల వేస్తున్నారని, పోలింగ్ సిబ్బందిని బెదిరిస్తున్నారని ఆయన మరో ట్విట్ లో పేర్కొన్నారు. ఓటర్లకు ఎస్ఎంఎస్, ఈమెయిల్, మొబైల్ ఫోన్ లతో ప్రచారం నిర్వహిస్తున్నారని ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అయితే విశ్వాస్ ఆరోపణల్లో వాస్తవం లేదని.. ఎన్నికలు సజావుగానే సాగుతున్నాయని జిల్లా మెజిస్ట్రేట్ జగత్ రాజ్ త్రిపాఠి అన్నారు. అమేథిలో కుమార్ విశ్వాస్ ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో రాహుల్ 3.70 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. -
'అమేథీ విడిచి వెళ్లమని హెచ్చరించారు'
అమేథీ: తన కుటుంబం అమేథీ నియోజకవర్గాన్ని వదిలి వెళ్లాలని జిల్లా అధికార యంత్రాంగం ఆదేశించిందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అభ్యర్థి కుమార్ విశ్వాస్ ఆరోపించారు. తన భార్య, సోదరి, ఇతర బంధువులు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించినట్టు తెలిపారు. అమేథీ విడిచి వెళ్లకుంటే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారని చెప్పారు. పోలీసులు తమ ఇంటికి వచ్చి మైక్‌లో హెచ్చరించారని వెల్లడించారు. అలాగే తన మద్దతుదారులు కొందరిని సోమవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు. వారి బ్యాగులు విసిరేసి మరీ పోలీసు స్టేషన్‌కు లాక్కేళ్లారని తెలిపారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత స్థానికేతరులెవరూ ఉండకూడదంటూ పోలీసులు దురుసుగా ప్రవర్తించారని కుమార్ విశ్వాస్ వాపోయారు. ఈ విషయమై జిల్లా మేజిస్ట్రేట్‌ను అడగ్గా ఈసీ ఆదేశాల ప్రకారమే నడుచుకుంటున్నామని సమాధానమిచ్చారని తెలిపారు. అమేథీలో రాహుల్ గాంధీపై విశ్వాస్ పోటీ చేస్తున్నారు. బీజేపీ తరపున స్మృతి ఇరానీ బరిలో ఉన్నారు. -
అమేథి వీడాలంటూ ఆప్ అభ్యర్థి కుటుంబానికి హుకుం
లక్నో: అమేథి నియోజవర్గం విడిచి వెళ్లాలని, లేకుంటే బలవంతంగానైనా పంపిస్తామని పోలీసులు తన కుటుంబాన్ని బెదిరించారని, అక్కడ నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కుమార్ విశ్వాస్ ఆరోపించారు. జిల్లా పోలీసు అధికారులు సోమవారం రాత్రి కుమార్ విశ్వాస్ అద్దెకుంటున్న ఇంటికి వెళ్లినట్టు ఆప్ వర్గాలు తెలిపాయి. విశ్వాస్ భార్య, పిల్లలు, ఇతర బంధువులందరూ అమేథి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రచార గడువు ముగిసినందున నియోజకవర్గంలో ఓట్లులేనివారు, అభ్యర్థుల మద్దతుదారులు, ప్రచారకర్తలు నియోజకవర్గంలో ఉండరాదని ఓ ఉన్నతాధికారి చెప్పారు. పోలీసులు అర్ధరాత్రి తన ఇంటికి వచ్చి భార్య, సోదరిని బెదిరించారని కుమార్ విశ్వాస్ ట్వీట్ చేశారు. ధైర్యముంటే కాంగ్రెస్ కంపెయినర్ ప్రియాంక వాద్రా, ఆమె మద్దతుదారులపైనా ఇలాగే వ్యవహరించాలని సవాల్ చేశారు. -
'అమేథిని చూసి షాక్ కు గురయ్యాను'
పానాజి: అభివృద్దికి నోచుకోని అమేథీ పట్టణాన్ని చూసి షాక్ గురయ్యానని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరిక్కర్ అన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథి నియోజకవర్గంలో ఇటీవల బీజేపీ అభ్యర్ధి స్మృతి ఇరానీ తరపున ప్రచారం నిర్వహించారు. 'అమేథిలో పర్యటించాను. నిజంగా షాక్ గురయ్యాను. అక్కడ కనీస వసతులైన నీరు, విద్యుత్ సౌకర్యాలు కూడా లేవు. కేవలం 3-4 గంటలు మాత్రమే విద్యుత్ అందుబాటులో ఉంది. సరైన నీటి సరఫరా లేదు' అని పరిక్కర్ అన్నారు. కేవలం 51 శాతం ఎంపీ నిధులు మాత్రమే వినియోగించారని ఆయన అన్నారు. గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న అమేథిలో ముక్కోణపు పోరు నెలకొంది. ఆమ్ ఆద్మీ పార్టీ తరపున కుమార్ విశ్వాస్, బీజేపీ నుంచి స్మృతి ఇరానీ బరిలో ఉన్నారు. -
FIRలో ప్రియాంక,రాబర్ట్ వాద్రాల పేర్లు
-
500 కె.జిల పూలతో రాహుల్ గాంధీకి స్వాగతం
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం ఉత్తరప్రదేశ్ లోని అమేథీలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాహుల్ గాంధీకి ఘనస్వాగతం చెప్పేందుకు స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు అయిదు వందల టన్నుల పూలను ఇప్పటికే సిద్ధం చేశారు. రాహుల్ వచ్చే దారి మొత్తం పూల బాటగా మార్చేస్తామని కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్నారు. గత లోకసభ ఎన్నికల్లో 3.75 లక్షల మంది ఓట్ల మెజారిటీతో రాహుల్ గెలుపొందారు. ఈ సారి ఆ అంకెను దాటేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు పట్టుదలతో ఉన్నారు. మరో వైపు సుప్రసిద్ధ కవి కుమార్ విశ్వాస్ ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున, టీవీ నటి స్మృతి ఇరానీ బిజెపి తరఫున రాహుల్ ను సవాలు చేస్తున్నారు. వారు అమేథీ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో రాహుల్ గాంధీని బహిరంగ చర్చకు సవాలు చేశారు. కానీ రాహుల్ మాత్రం ఇప్పటి వరకూ దీనిపై స్పందించలేదు. రాహుల్ కు మద్దతుగా ప్రచారం చేసేందుకు సోదరి ప్రియాంకా వాద్రా రంగంలోకి దిగనున్నారు. ఆమె ఈ సారి తల్లి, తమ్ముడికి మాత్రమే ప్రచారం చేస్తానని ప్రకటించారు. ప్రియాంక ప్రచారం చేస్తే కాంగ్రెస్ కు చాలా ఉపయోగంగా ఉంటుందని కాంగ్రెస్ కార్యకర్తలు భావిస్తున్నారు. -
రాహుల్ గాంధీ మంచి యాక్టర్: కుమార్ విశ్వాస్
అమేథి: కాంగ్రెస్ పార్టీ 'యువరాజు' రాహుల్ గాంధీ, టెలివిజన్ తార స్మృతి ఇరానీలపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత, అమేథి అభ్యర్థి కుమార్ విశ్వాస్ తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోశారు. రాహుల్ గాంధీ నటుడు ఇప్పటికే బరిలో ఉన్నారని.. అమేథి బరిలోకి మరో తార స్మృతి ఇరానీ వచ్చారు అని మీడియాతో మాట్లాడుతూ కుమార్ విశ్వాస్ వ్యాఖ్యలు చేశారు. గత 40 రోజులుగా అమేథి లోకసభ నియోజకవర్గంలో పర్యటిస్తున్నాను. ఎవరికి ఓటు వేయాలో అనే అంశంపై ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు అని విశ్వాస్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయని, అందుకే అమేథిలో స్మృతి ఇరానీని బీజేపీ బరిలోకి దించిందని ఆయన ఆరోపించారు. అమేథి నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ 2004, 2009లో గెలుపొందిన విషయం తెలిసిందే. -
'అమేథీలో రాహుల్ గాంధీకి భారీ ఓటమి...'
రానున్న లోకసభ ఎన్నికల్లో స్వంత నియోజకవర్గం అమేథీలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి భారీ తేడాతో ఓటమి తప్పదని ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కుమార్ విశ్వాస్ హెచ్చరించారు. ఉత్తర ప్రదేశ్ లో సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్ లకు ఈ ఎన్నికల్లో భంగపాటు తప్పదని కుమార్ విశ్వాస్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లతో మాట్లాడిన తర్వాత రాహుల్ గాంధీకి భారీ ఓటమి తప్పదని ఆయన అన్నారు. అమేథీ ఎన్నికల్లో తనకు విజయంపై కుమార్ విశ్వాస్ ధీమా వ్యక్తం చేశారు. అమేథి నియోజకవర్గంలో అనేక సమస్యలు తన దృష్టికి వచ్చాయని కుమార్ విశ్వాస్ తెలిపారు. అమేథి నియోజకవర్గంలోని శంకర్ గంజ్ గ్రామంలో ఓ బ్రిడ్జి నిర్మాణం గత ఏడేళ్లలో సగమే పూర్తయిందన్నారు. 1980 నుంచి గాంధీ కుటుంబమే అమేథి నియోజకవర్గంలో గెలిచారని ఆయన అన్నారు. సంజయ్ గాంధీ (1980), రాహుల్ గాంధీ (1984, 1989), సోనియా గాంధీ (1999), రాహుల్ గాంధీ (2004, 2009) గెలిచినా.. అమేథిలో అభివృద్ధి శూన్యమని కుమార్ విశ్వాస్ తెలిపారు. అమేథీ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరపున కుమార్ విశ్వాస్ బరిలో నిలిచారు. -
‘ఆప్’ నేత కుమార్ విశ్వాస్‌పై ఎఫ్ఐఆర్ నమోదు
అమేథీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్‌పై, సిందుర గ్రామ్ ప్రధాన్‌పై శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో ఎఫ్ఐఆర్ నమోదైంది. కాగా అల్లర్లో తమ పార్టీ కార్యకర్తలు ఎవరూ పాల్గొనలేదని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అల్లర్లకు కారణమంటూ ఆప్ నేత చేసిన ఆరోపణలను కాంగ్రెస్ కొట్టిపారేసింది. ఈ విషయమై కమ్రౌలీ పోలీస్ స్టేషన్ అధికారి ఏపీ తివారీ మాట్లాడుతూ.. ఆప్ నేత కుమార్ విశ్వాస్‌తోపాటు ఆ పార్టీకి చెందిన 65 మందిపై కేసు నమోదు చేశాం. అంతేకాక సిందుర గ్రామ్ ప్రధాన్‌పై, అతని అనుచరులు 20 మందిపై కూడా కేసులు నమోదయ్యాయని చెప్పారు. -
రాహుల్‌పై 'ఆప్' అభ్యర్థిగా విశ్వాస్
-
రాహుల్‌పై 'ఆప్' అభ్యర్థిగా కుమార్ విశ్వాస్
న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) దృష్టి సారించింది. ఇందులో భాగంగా 20 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. జాతీయ పార్టీల అగ్రనేతలు, కేంద్రమంత్రులపై అభ్యర్థులను పోటీకి నిలిపింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న అమేధీ నుంచి కుమార్ విశ్వాస్ను పోటీ చేస్తారని ఆప్ నేత మనీష్ షిసోడియా వెల్లడించారు. కేంద్ర మంత్రులు కపిల్ సిబల్పై అశతోష్(చాందీ చౌక్), సల్మాన్ ఖుర్షీద్పై ముకుల్ త్రిపాఠి(ఫరూకాబాద్), మనీష్ తివారిపై హెచ్ఎస్ ఫూల్కా(లూధియానా), మిలింద్ దేవ్‌రాపై మీరా సన్యాల్(దక్షిణ ముంబై), బీజేపీ అగ్రనేత నితిన్ గడ్కరీపై అంజలి దామానియా (నాగపూర్), ములాయంసింగ్ యాదవ్‌పై బాబా హరదేవ్, సురేష్ కల్మాడీపై సుభాష్ వడే పోటీ చేయనున్నారు. యోగేంద్ర యాదవ్(గుర్గావ్), మీరా సన్యాల్(దక్షిణ ముంబై), మేధా పాట్కార్(ఈశాన్య ముంబై), మయాంక్ గాంధీ(వాయవ్య ముంబై) పోటీ చేస్తారని ఆప్ ప్రకటించింది. -
ఓ ఆప్ నేతా.. ఇదేం కవితా?
సానియా మీర్జా వివాహంపై కుమార్ విశ్వాస్ కుళ్లు జోకులు న్యూఢిల్లీ: ‘మనిషన్నాక.. కాసింత కళా పోసన ఉండాల’ అన్న డైలాగును ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్ బాగానే ఒంట బట్టించుకున్నట్టున్నారు! కానీ అదే ఇప్పుడు ఆయనకు, పార్టీకి చిక్కులు తెచ్చిపెడుతోంది. కళా పోషణను ‘కాసింత’ కాదు.. కాస్త ‘ఎక్కువగా’ ఒంట బట్టించుకోవడమే ఇందుకు కారణం!! తన కవితాత్మక భావాలతో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఇప్పటికే పలు అంశాలపై దుమారం సృష్టించి తర్వాత లెంపలేసుకున్న ఈయన.. ఇప్పుడు మరో వివాదంలో ఇరుక్కున్నారు. హైదరాబాదీ, ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ వివాహానికి సంబంధించి విశ్వాస్ గతంలో ఓ కవి సమ్మేళనంలో చేసిన ప్రసంగం వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో చక్క ర్లు కొడుతోంది. అందులో ఆయన షోయబ్‌ను ‘మగతనం’ లేనివాడు అన్న భావన వచ్చేలా మాట్లాడారు. ‘‘సానియా పెళ్లి చేసుకోవడంలో తప్పేమీ లేదు. తన క్రీడారంగంలో ఇక ముందుకు వెళ్లలేనని భావించి వేరే రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించాలనుకుంది. ఆమె ఓ ‘హిట్టర్’ను పెళ్లాడాలనుకుంటే ఎవరైనా భారతీయుడిని చేసుకోవాల్సింది. కానీ పాకిస్థాన్ ఎందుకు వెళ్లింది?’’ అని వ్యాఖ్యానించారు. దీంతో ఆ కార్యక్రమంలో ఉన్నవారంతా గొల్లున నవ్వారు. -
వీడియో వివాదంలో ‘కుమారుడు’!
ఆమ్ ఆద్మీ పార్టీ కార్యదర్శి కుమార్ విశ్వాస్ను కూడా వివాదాలు చుట్టుముడుతున్నాయి. నిజానికి ఆప్‌లోకి అడుగుపెట్టాక ఆయన చేసిన వివాదాస్పదమైన చర్యలేవీ లేకపోయినా ఎప్పుడో.. ఓ కవి సమ్మేళనంలో సరదాగా చేసిన ఓ వ్యాఖ్య తాలూకు వీడియో ఆయననిప్పుడు ఇబ్బందులోకి నెట్టింది. మళయాళీ నర్సులకు సంబంధించి 2008లో రాంచీలో జరిగిన ఓ కవి సమ్మేళనంలో కుమార్ విశ్వాస్ చేసిన ప్రసంగం తమను అవమాన పరిచేలా ఉందంటూ కేరళలో పెద్దపెట్టున ఆందోళనలు జరిగాయి. స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కల్పించుకొని, ఆప్ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన కుమార్ విశ్వాస్ ఆ రాష్ట్ర ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పారు. ఎవరినీ బాధపెట్టే ఉద్దేశం తనకు లేదని, ఓ పాత వీడియోలో తాను చేసిన ప్రసంగం కేరళవాసుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందనే విషయం తన దృష్టికి వచ్చిందని, అందుకు తాను క్షమాపణ చెబుతున్నానని అన్నారు. ‘కులం, మతం, ప్రాంతం, లింగ, జాతి వివక్షపూరితమైన వ్యాఖ్యలు, చర్యలను నేనెప్పుడూ సమర్థించను. ఇతరుల మనోభావాలను దెబ్బతీసేందుకు నేనెప్పుడూ ప్రయత్నించను. నా వ్యాఖ్యలు ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే అందుకు నేను క్షమాపణ కోరుతున్నా. నా మాటలు కేరళలో ఉంటున్న నా స్నేహితుల మనోభావాలను దెబ్బతీశాయనే విషయం నా దృష్టికి రావడంతోనే నేనీ క్షమాపణ చెబుతున్నా. హృదయపూర్వకంగా క్షమాపణ కోరుతున్నాన’ని చెప్పినట్లు ఆప్ ప్రకటించింది. కేరళ విభాగానికి చెందిన ఆ పార్టీ అధికార ప్రతినిధి కూడా కుమార్ విశ్వాస్ వ్యాఖ్యలపై క్షమాపణ కోరారు. దీంతో మొత్తానికి ‘కుమారుడు’ బతికి బయటపడ్డాడు. -
వారసత్వ రాజకీయాలకు ఓ సవాలు
-
వారసత్వ రాజకీయాలకు ఓ సవాలు : కుమార్ విశ్వాస్
లక్నో: అమేథీలో ర్యాలీ నిర్వహించడం వారసత్వ రాజకీయాలు, అవినీ తికి సవాలువంటిదని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కుమార్ విశ్వాస్ పేర్కొన్నా రు. అమేథీకి వెళుతూ మార్గమధ్యలో ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘ఇక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అమేథీయే. నేనొక సామాన్యుడిని. రాహుల్‌గాంధీ రాకుమారుడు. అమేథీ కోరుకుంటే వారసత్వ రాజకీయాలకు తెరదించవచ్చు. గెలుపు లేదాఓటమి అనేది విషయమే కాదు. అవినీతి, వారసత్వ రాజకీయాలను సవాలు చేయడమనేదే అత్యంత కీలకమైనది’ అని ఆయన పేర్కొన్నారు. శనివారం నిర్వహించిన మీడియా సమావేశంవద్ద నిరసనపై నిరసన అంటే ఏమిటని ఆయన ప్రశ్నించారు. ‘అమేథీ వారసత్వ రాజకీయాలను సవాలు చేయకూడదనేదే కారణం కావొచ్చేమో. నేను చదివిన పద్యకవిత్వం కొందరికి బాధ కలిగించి ఉండొచ్చు. అందుకు నేను వారికి ఇప్పటికే క్షమాపణ చెప్పాను’ అని అన్నారు. కాగా శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఓ వ్యక్తి కుమార్ విశ్వాస్‌పై కోడిగుడ్డు విసిరిన సంగతి విదితమే. ఈ చర్యకు పాల్పడిన వ్యక్తిని ఆప్ కార్యకర్తలు పోలీసులకు అప్పగించారు. కాగా అమేథీ పర్యటనకు వెళుతున్న కుమార్‌కు వ్యతిరేకంగా కొందరు స్థానికులు నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేశారు. -
రాహుల్‌పై ఆప్ నేత కుమార్ విశ్వాస్ పోటీ
న్యూఢిల్లీ : ఢిల్లీని పదిహేనేళ్లపాటు పాలించిన షీలాదీక్షిత్‌ను మట్టికరిపించిన ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీపై రణభేరి మోగించింది. లోక్‌సభ ఎన్నికల్లో అమేధీ నుంచి రాహుల్ గాంధీపై పోటీకి దిగనున్నట్లు ఆప్ నేత కుమార్ విశ్వాస్ శనివారమిక్కడ వెల్లడించారు. కుటుంబ రాజకీయాలకు బద్దలు కొట్టడమే తమ పార్టీ లక్ష్యమని ఆయన అన్నారు. ఒకవేళ రాహుల్ అమేధీ నుంచి కాకుండా మరెక్కడైనా పోటీ చేసినా.. తాను అక్కడే నిలబడతానని కుమార్ విశ్వాస్ స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే రాహుల్ తమకు అగ్గిపుల్లతో సమానమని ఆప్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో రాహుల్ నియోజకవర్గంలో ఇప్పటికే కుమార్ బిశ్వాస్ పర్యటించి....పరిస్థితిని సమీక్షించారు కూడా. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీలో పాగా వేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), పార్లమెంటుపై గురిపెట్టింది. దేశంలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు కసరత్తు ప్రారంభించింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో దాదాపు అన్ని రాష్ట్రాల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని యోచిస్తోంది. -
లోక్‌సభ బరిలో ‘ఆప్’ వీరులెవరో..
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. నగరంలో ఏడు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఆయా స్థానాల్లో ‘ఆప్’ ఎవరెవరిని నిలబెట్టనుందోననే దానిపై ఇప్పటినుంచే ఊహాగానాలు మొదలయ్యాయి. విధానసభ ఎన్నికల్లో ‘ఆప్’ అనూహ్య విజయం సాధించడంతో ప్రజలకు ఆ పార్టీ పట్ల ఆసక్తి పెరిగింది. విధానసభ ఎన్నికల్లో మాదిరిగానే లోక్‌సభ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించాలని ఆప్ ఆశిస్తోంది. విధానసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా నిలబడిన వారిలో కొందరు సామాన్యులే అయినా పార్టీ పేరుపైనే ఎన్నికల్లో నెగ్గారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోకుండా గట్టి అభ్యర్థులను బరిలోకి దింపి తన సత్తా చాటుకోవాలని పార్టీ యోచిస్తోంది. జనవరి 20లోగా పార్టీ జారీ చేసే లోక్సభఅభ్యర్థుల జాబితాలోనే ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాల నుంచి పోటీచేసే వ్యక్తుల పేర్లను ప్రకటించవచ్చని రాజకీయపండితులు అంటున్నారు. ఆప్ కన్వీనర్, ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ లోక్‌భ ఎన్నికలలో పోటీచేయబోనని ఇప్పటికే ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీలో మరో నేత మనీష్ సిసోడియా ఇప్పటికే ఢిల్లీ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. యోగేంద్ర యాదవ్ హర్యానాలోనూ సంజయ్ సింగ్ యూపీలోనూ పోటీచేయవచ్చని అంటున్నారు. కుమార్ విశ్వాస్ అమేథీ నుంచి పోటీచేసే అవకాశముంది.ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఏడు స్థానాల నుంచి పోటీచేసేందుకు షాజియా ఇల్మీ, గోపాల్ రాయ్‌లకు అవకాశం లభించవచ్చని అంటున్నారు, షాజియా ఇల్మీ విధానసభ ఎన్నికల్లో ఆర్కె పురం నుంచి పోటీచేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆమెను దక్షిణ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నా యి. గోపాల్‌రాయ్ చాందినీ చౌక్ నుంచి పోటీచేయవచ్చని అంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలో తెరవెనుక వ్యవహారాలు చక్కబెడ్తున్న ఆశిష్ తల్వార్, దిలీప్ పాండే లోక్‌సభ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించవచ్చని అంటున్నారు. ప్రస్తుతం ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తోంది. చాందినీచౌక్ ఎంపీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ కాగా, దక్షిణ ఢిల్లీకి సజ్జన్‌కుమార్ సోదరుడు రమేష్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
అమేథీలో పర్యటించనున్న ఆప్ నేత కుమార్ విశ్వాస్
లక్నో/ఢిల్లీ: ఆమ్ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ నియోజక వర్గ పర్యటనకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈ నియోజక వర్గం నుంచి విశ్వాస్ రాహుల్ మీద పోటీకి దిగనున్నట్లు భావిస్తున్నారు. ‘జాదు సందేశ్ యాత్రలో’ పాల్గొనడం ద్వారా నియోజక వర్గపు రాజకీయ పరిస్థితిని పరిశీలించనున్నట్లు ఆయన ప్రకటించారు. డిసెంబర్ 27వ తేదీ నుంచి ఈ యాత్ర ప్రారంభమౌతుందని వివరించారు. ఉత్తరప్రదేశ్‌లో పాదుకొనడానికి ఈ యాత్ర ఉపకరించే అవకాశం ఉందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఢిల్లీ సంచలన విజయం తర్వాత దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర నిర్వహించాలని భావిస్తున్న ఆప్ పార్టీ కళ్లు పలు ప్రముఖులు ప్రాతినిథ్యం వహిస్తున్న లోక్‌సభ స్థానాల మీద గురి నిలిపింది. అరవింద్ కేజ్రీవాల్‌కు సన్నిహితుడుగా భావించే మనీష్ సిసోడియా విశ్వాస్ రాహుల్‌పై బరిలోకి దిగనున్నట్లు కొద్ది రోజుల కిందట ప్రకటించారు. మరో ఆప్ పార్టీ సీనియర్ నేత మాట్లాడుతూ ‘‘ జాదు సందేశ్ యాత్ర’ ప్రజలను సమీకరించే లక్ష్యంతో నిర్వహిస్తున్నాం. ఈ యాత్ర సందర్భంగా విశ్వాస్ పలు బహిరంగ సభలను ఏర్పాటు చేస్తారు’’ సాయినాథ రోడ్డులోని ఆప్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకుల మీద దండెత్తడంలో విశ్వాస్ అతి చురుకుగా వ్యవహరించేవాడు. ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వ ఏర్పాటులో వెలుపలి నుంచి మద్దతు అందుకొంటున్న ఆప్ పార్టీ ఏవిధంగా వ్యవహరించాల్సి వస్తుందో వేచిచూడాల్సిందే అని పలువురు రాజకీయ విశ్లేషకులు వాక్యానిస్తున్నారు. కాగా ఉత్తరప్రదేశ్ ప్రజాపనుల శాఖ మంత్రి శివపాల్ సింగ్ యాదవ్ రాష్ట్రంలో ఆప్ పోటీకి దిగుతుందనే వార్తలను కొట్టిపారేశారు. మంగళవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆప్ పార్టీ ప్రభావం ఉత్తరప్రదేశ్‌లో పెద్దగా ఉండదని వ్యాఖ్యానించారు.