Leh
-
కశ్మీర్లో స్థానికేతరులపై ముష్కరుల కాల్పులు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రమూకలు మళ్లీ పేట్రేగిపోయాయి. శ్రీనగర్–లేహ్ జాతీయ రహదారిపై టన్నెల్ నిర్మాణ పనుల ప్రాంతంలో ఉన్న ఒక వైద్యుడు, ఐదుగురు స్థానికేతర కార్మికులను చంపేశారు. గందేర్బల్లోని గుండ్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఘటన చోటుచేసుకుంది. పనులు చేస్తున్న స్థానిక, స్థానికేతర కార్మికులు, ఇతర సిబ్బందిపై ఇద్దరు ఉగ్రవాదులు యథేచ్ఛగా కాల్పులకు తెగబడినట్లు సమాచారం. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా, మరో ఐదుగురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని అధికారులు తెలిపారు. గాయపడిన మరో ఐదుగురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. మృతులను డాక్టర్ షెహనవాజ్, ఫహీమ్ నజిర్, కలీం, మహ్మద్ హనీఫ్, శశి అబ్రోల్, అనిల్ శుక్లా, గుర్మిత్ సింగ్‌లుగా గుర్తించారు. ముష్కరులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు ఆప్రాంతాన్ని దిగ్బంధించి, గాలింపు చేపట్టాయి. కశ్మీర్ ఐజీ వీకే బిర్డి తదితర అధికారులు ఘటనాస్థలికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. ఘటనను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఖండించారు. ఉగ్రమూకలను వదిలేది లేదని స్పష్టం చేశారు. కాల్పుల ఘటనను సీఎం ఒమర్ అబ్దుల్లా ఖండించారు. ఘటనలో మృతుల సంఖ్య పెరగొచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, శుక్రవారం బుల్లెట్ గాయాలతో ఉన్న బిహార్‌కు చెందిన కార్మికుడి మృతదేçహాన్ని షోపియాన్ జిల్లాలో గుర్తించామని అధికారులు తెలిపారు. -
Lok Sabha Election 2024: లద్దాఖ్‌లో త్రిముఖ పోటీ
ఒకప్పుడు జమ్మూకశ్మీర్‌లో భాగమైన లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతంగా మారాక స్థానికంగా పరిణామాలు ఎన్నో మలుపులు తీసుకున్నాయి. భిన్న ధ్రువాలుగా ఉండే బౌద్ధులు–ముస్లింలు ఇప్పుడు ఉమ్మడి ప్రయోజనాల కోసం కలిసి పోరాడుతున్నారు. లేహ్‌లో బౌద్ధులు ఎక్కువ. కార్గిల్‌లో ముస్లిం జనాభా ఎక్కువ. వీరంతా తమ ప్రయోజనాలను పరిరక్షించాలని, తమ డిమాండ్లకు రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చోటు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతం కావడంతో.. తమకూ జమ్మూ కశీ్మర్ మాదిరిగా రాజకీయ అవకాశాలు కలి్పంచాలన్నది వీరి ప్రధాన డిమాండ్లలో ఒకటి. కేంద్రపాలిత ప్రాంతంగా మారాక లేహ్ కేంద్రంగా పనిచేసే సామాజిక, రాజకీయ సంస్థలన్నీ కలసి లేహ్ అపెక్స్ బాడీ (ఎల్ఏబీ)గా ఏర్పడ్డాయి. కార్గిల్ కేంద్రంగా పనిచేసే సామాజిక, మత, రాజకీయపరమైన సంస్థలన్నీ కలసి కార్గిల్ డెమొక్రటిక్ అలయన్స్ (కేడీఏ)గా అవతరించాయి. ఈ రెండూ కొన్నేళ్లుగా డిమాండ్ల సాధనకు కలసికట్టుగా పోరాటం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో లద్దాఖ్ లోక్‌సభ స్థానానికి ఈ నెల 20న జరగనున్న పోలింగ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విజయం ఎవరిని వరించేనో? లద్దాఖ్‌లో త్రిముఖ పోటీ నెలకొంది. ఇది బీజేపీ సిట్టింగ్ స్థానం. ఈసారి సిట్టింగ్ ఎంపీ జామ్యంగ్ సేరింగ్ నామ్‌గ్యాల్ బదులు తాషి గ్యాల్సన్ బరిలో ఉన్నారు. గత ఎన్నికల హామీలు నెరవేరలేదన్న అసంతృప్తి ఇక్కడ బాగా ఉంది. దాంతో ప్రజా వ్యతిరేకతను అధిగమించేందుకు బీజేపీ ఈ ప్రయోగం చేసింది. గ్యాల్సన్ లద్దాక్ ఆటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్, సీఈవోగా ఉన్నారు. పార్టీ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో నామ్‌గ్యల్ స్వతంత్ర అభ్యరి్థగా బరిలోకి దిగాలని యోచించినా అధినాయకత్వం జోక్యంతో వెనక్కు తగ్గారు. గ్యాల్సన్కు మద్దతుగా ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. 2014లోనూ లద్దాఖ్‌లో బీజేపీయే గెలిచింది. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి తుప్స్టాన్ చెవాంగ్ కేవలం 36 ఓట్ల ఆధిక్యంతో స్వతంత్ర అభ్యర్థి గులామ్ రాజాపై నెగ్గారు. చెవాంగ్ 2009 ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి విషయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. శ్రీనగర్, బారాముల్లా, అనంతనాగ్ స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్; ఉదంపూర్, లద్దాఖ్, జమ్మూల్లో కాంగ్రెస్ పోటీ చేసేలా అంగీకారం కుదిరింది. కానీ కార్గిల్ ఎన్సీ నాయకత్వం అధిష్టానం నిర్ణయంతో విభేదించింది. హాజీ హనీఫా జాన్‌ను లద్దాక్‌లో పార్టీ అభ్యర్థిగా పోటీకి దింపింది. కాంగ్రెస్ కూడా సేరింగ్ నామ్గ్యల్ను అభ్యరి్థగా ప్రకటించింది. కానీ కార్గిల్ కాంగ్రెస్ నాయకులు కూడా అనూహ్యంగా హాజీ హనీఫాకే మద్దతు ప్రకటించారు. దాంతో కాంగ్రెస్, ఎన్‌సీలకు ఏం చేయాలో పాలుపోలేదు. చివరికి ఇండియా కూటమి తరఫున సేరింగ్ నామ్గ్యల్ను అధికారిక అభ్యర్థిగా రెండు పారీ్టలూ ప్రకటించాయి. అలా బీజేపీ నుంచి గ్యాల్సన్, కాంగ్రెస్–ఎన్సీ ఉమ్మడి అభ్యరి్థగా సేరింగ్ న్యామ్‌గల్, ఆ రెండు పారీ్టల స్థానిక నేతల మద్దతుతో హాజీ హనీఫా పోటీలో ఉన్నారు. వీరిలో హనీఫా ఒక్కరే కార్గిల్ వాసి. మిగతా ఇద్దరూ లేహ్‌కు చెందిన వారు. దీంతో గెలుస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. కార్గిల్, లేహ్ వాసులు ఎప్పటి మాదిరే భిన్నమైన తీర్పు ఇస్తారేమో చూడాలి. ఇదే కారణంతో లద్దాఖ్‌ను కార్గిల్, లేహ్ రెండు లోక్‌సభ స్థానాలుగా విడగొట్టాలని ఎల్ఏబీ, కేడీఏ డిమాండ్ చేస్తున్నాయి. ఓటర్లు తక్కువ 1,73,266 చదరపు కిలోమీటర్లతో విస్తీర్ణపరంగా లద్దాఖ్ దేశంలోనే అతి పెద్ద లోక్‌సభ నియోజకవర్గం. కానీ ఓటర్లు మాత్రం కేవలం 1,82,571 మందే! గత మూడు లోక్‌సభ ఎన్నికలుగా ఇక్కడ 71 శాతానికి పైనే ఓటింగ్ నమోదవుతోంది.స్థానికుల డిమాండ్లులద్దాక్కు రాష్ట్ర హోదా, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చడంతో పాటు ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమీషన్, రెండు లోక్‌సభ స్థానాలు స్థానికుల డిమాండ్లు. ఆరో షెడ్యూల్లో చేరుస్తామని బీజేపీ 2019 మేనిఫెస్టోలో హామీ ఇచి్చంది. రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ కింద సాంస్కృతిక, స్థానిక గుర్తింపుల పరిరక్షణకు స్వతంత్ర మండళ్ల ఏర్పాటు కూడా ఒక డిమాండ్. లద్దాఖ్‌లో లేహ్, కార్గిల్ కేంద్రంగా రెండు స్వతంత్ర మండళ్లు ఇప్పటికే ఉన్నా అవి 1995 చట్టం కింద ఏర్పాటైనవి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కొత్త రకం బస్సు.. దేశంలో తొలిసారి
దేశంలో ఇప్పటి వరకూ ఎన్నో రకాల బస్సులను చూశాం. డీజిల్ నడిచే బస్సులతోపాటు ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ బస్సులు కూడా పెరుగుతున్నాయి. అయితే దేశంలో తొలిసారిగా కొత్త రకం బస్సు పరుగులు తీయనుంది. అదే హైడ్రోజన్ ఇంధనంతో నడిచే బస్సు. అత్యంత ఎత్తైన హిమాలయాల్లోని లేహ్ రోడ్లపై తిరగనుంది. ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్‌ను ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) చేపట్టింది. కార్బన్-న్యూట్రల్ లడఖ్‌ను సాధించే దిశగా ఎన్టీపీసీ హైడ్రోజన్ ఫ్యూయలింగ్ స్టేషన్, సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. లేహ్ ఇంట్రాసిటీ రూట్లలో ఆపరేషన్ కోసం ఐదు ఫ్యూయల్ సెల్ బస్సులను అందజేస్తున్నట్లు కంపెనీ ప్రకటన తెలిపింది. మూడు నెలలపాటు ఉండే ఫీల్డ్ ట్రయల్స్, రోడ్వర్తీనెస్ టెస్ట్‌లు, ఇతర చట్టబద్ధమైన ప్రక్రియల్లో భాగంగా మొదటి హైడ్రోజన్ బస్సు ఆగస్టు 17న లేహ్‌కు చేరుకుంది. దేశంలో హైడ్రోజన్ ఇంధన బస్సులను వినియోగించడం ఇదే మొదటిసారి. 11,562 అడుగుల ఎత్తులో గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా 1.7 మెగావాట్ల ప్రత్యేక సోలార్ ప్లాంట్‌ను ఎన్టీపీసీ ఏర్పాటు చేసింది. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల్లో ప్రతికూల వాతావరణానికి సరిపోరిపోయేలా ఈ బస్సులను రూపొందించారు. 2032 నాటికి 60 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించి గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీలో అగ్రగామిగా నిలవాలని ఎన్టీపీసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బస్సుల సరఫరాకు సంబంధించిన కాంట్రాక్ట్‌ను 2020 ఏప్రిల్‌లో దక్కించుకున్న అశోక్ లేలాండ్ సంస్థ.. ఒక్కొక్కటి రూ. 2.5 కోట్లకు అందజేసింది. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే ఈ బస్సుల్లో ఛార్జీలు సాధారణ డీజిల్ బస్సుల్లో ఛార్జీల మాదిరిగానే ఉంటాయి. దీనివల్ల వాటిల్లే నష్టాన్ని ఎన్టీపీసీనే భరించనుంది. -
అందరూ చూస్తుండగానే ..గుండెపోటుతో ఈకామర్స్ సంస్థ సీఈవో హఠాన్మరణం
అప్పటి వరకు నవ్వుతూ, సరదాగా ఉంటున్న వ్యక్తులు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. అందరితో కలివిడిగా ఉన్న వారు అంతలోనే అనంత లోకాలకు వెళ్లిపోతున్నారు. ఇటీవల ఇలాంటి సంఘటనలు సర్వసాధారణంగా మారాయి. తాజాగా, ప్రముఖ ఫర్నీచర్,హోమ్ డెకార్ ఈకామర్స్ సంస్థ పెప్పర్ ఫ్రై కో-ఫౌండర్ అంబరీష్ మూర్తి గుండె పోటుతో కన్నుమూశారు. అంబరీష్‌కు రైడింగ్ అంటే మహా ఇష్టం. అందుకే వీలు చిక్కినప్పుడల్లా ఢిల్లీ నుంచి లేహ్‌కు బైక్ రైడ్ చేస్తుండేవారు. ఈ క్రమంలో ఎప్పటిలాగా లేహ్‌కు వెళ్లిన ఆయన అక్కడ అందరు చూస్తుండగానే గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. హార్ట్ అటాక్‌తో ఆయన కన్నుమూసినట్లు పెప్పర్ ఫ్రై మరో కో-ఫౌండర్ ఆశిష్ ట్వీట్ చేశారు. Extremely devastated to inform that my friend, mentor, brother, soulmate @AmbareeshMurty is no more. Lost him yesterday night to a cardiac arrest at Leh. Please pray for him and for strength to his family and near ones. 🙏 — Ashish Shah (@TweetShah) August 8, 2023 2012లో అంబరీష్ మూర్తి, అశిష్తో కలిసి పెప్పర్‌ఫ్రైను స్థాపించారు. 2020 నాటికి ఆ సంస్థ విలువ 500 మిలియన్లుగా ఉంది. అదే ఏడాది 8 రౌండ్లలో 244 మిలియన్ల పెట్టుబడులన్ని సంపాదించింది. ఇన్వెస్ట్ చేసిన సంస్థల్లో గోల్డ్‌మన్ సాచ్స్, బెర్టెల్స్‌మాన్ ఇండియా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. క్రంచ్ బేస్ నివేదిక ప్రకారం.. ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుండి ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ పూర్తి చేశారు. ఐఐటీ కోల్కత్తా పూర్వ విద్యార్ధి. గ్రాడ్యుయేషన్ సమయం నుంచి ఎంట్రప్రెన్యూషిప్లో మెళుకువలు సంపాదించారు. కాలేజీకి వెళ్లే సమయంలో ఇంట్లో ట్యూషన్లు చెప్పడం ప్రారంభించారు. అదే సమయంలో పాఠశాల విద్యార్ధులకు టూటర్లను అనుసంధానం చేస్తూ ట్యూటర్స్ బ్యూరో అనే సంస్థను ప్రారంభించారు. రెండేళ్ల పాటు ఆ వ్యాపారాన్ని నిర్వహించారు. ఇదీ చదవండి : ఆనంద్ మహీంద్రాకు వేలకోట్లు అలా కలిసొచ్చాయ్! -
Travel Couple: ప్రేమ పెళ్లి.. సొంత కారవ్యాన్‌లో కుటుంబంతో కలిసి..
ప్రయాణంలో ఏమున్నది? అనే ఒకే ప్రశ్నకు వందల సమాధానాలు దొరుకుతాయి. సేద తీర్చే సెరువున్నది... నీడ కోసం చింత చెట్టున్నది... సిటారు కొమ్మన తేనెపట్టున్నది. వీటికి మించి మనల్ని కొత్తగా వెలిగించే తత్వం దాగున్నది. అందుకే రుచీపాండే, దీపక్ దంపతులు వ్యాన్నే ఇంటిని చేసుకొని లోకసంచారం చేస్తున్నారు... దెహ్రాదూన్(ఉత్తరాఖండ్) కాలేజీలో చదువుకునే రోజుల్లో రుచీ పాండే, దీపక్‌లు మంచి స్నేహితులు. ప్రేమలో పడడానికి ముందే ‘ట్రావెలింగ్’తో ప్రేమలో పడ్డారు. ప్రయాణం అంటే ఇద్దరికీ చెప్పలేనంత ఇష్టం. మొదట్లో దెహ్రాదూన్ నగరం ప్రతి మూలా చుట్టేశారు. ఆ తరువాత పొరుగు నగరాలు. ‘పెళ్లికి ముందు ఎన్నో అనుకుంటాం. పెళ్లి తరువాత అన్నీ ఆవిరైపోతాయి’ అని భారంగా నిట్టూర్చేవాళ్లను చూస్తుంటాం. అయితే ఒకేరకమైన అభిరుచులు ఉన్న రుచీ, దీపక్‌లు పెళ్లి తరువాత కూడా తమకు ఇష్టమైన ప్రయాణాలను మానలేదు. దీపక్‌ది రెండు సంవత్సరాలకు ఒకసారి బదిలీ అయ్యే ఉద్యోగం. ఎక్కడికి బదిలీ అయినా అక్కడి చుట్టుపక్కల కొత్త ప్రదేశాల గురించి ఆరా తీసి రుచీపాండేతో కలిసి ప్రయాణానికి ఛలో అనేవాడు. మొదట్లో టాటా ఇండికా వాడేవారు. ఆ తరువాత సఫారిలోకి షిఫ్ట్ అయ్యారు. ఒకప్పుడంటే తాము ఇద్దరమే కాబట్టి ఈ వాహనం ఓకే. కాని ఇప్పుడు ఇద్దరు పిల్లలు, రెండు పెంపుడు శునకాలు. కరోనా వల్ల హోటల్లో ఉండలేని పరిస్థితి, ఎక్కడ పడితే అక్కడ తినే వీలు లేకపోవడం... వీటిని దృష్టిలో పెట్టుకొని ‘కారవ్యాన్’పై దృష్టి పెట్టారు. గత సంవత్సరం ఫోర్స్ ట్రావెలర్ 3350 కొనుగోలు చేశారు. తమ సౌకర్యాలకు అనుగుణంగా దీన్ని మార్చుకోవడానికి యూఎస్ నుంచి విడిభాగాలను దిగుమతి చేసుకోవడానికి బాగా ఖర్చయింది. ఇది ఒక ఎత్తయితే ‘వైట్–బోర్డ్ వెహికిల్’ కోసం ఆర్టీవో నుంచి అనుమతి పొందడం అనేది మరో ఎత్తు. ‘ఈ వాహనం మా కుటుంబం కోసమే, కమర్షియల్ వర్క్ కోసం కాదు అని ఉన్నతాధికారులను నమ్మించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది’ అంటుంది రుచీపాండే. విదేశాలకు చెందిన రకరకాల కారవ్యాన్లను చూస్తూ డిజైన్‌పై ఒక అవగాహనకు వచ్చారు. ఈ వీడియోలను నిపుణులైన పనివాళ్లకు చూపిస్తూ వ్యాన్ డిజైన్ చేయించారు. మూడు నెలలు నాన్–స్టాప్‌గా కష్టపడిన తరువాత తమ కలల వాహనం సిద్ధం అయింది. ఖర్చు లక్షలు అయింది ఇందులో సౌకర్యవంతమైన సీట్లు, కిచెన్, బాత్రూమ్, రెండు బెడ్లు, వాటర్ ట్యాంక్, షవర్, గ్యాస్, మైక్రోవేవ్, పైన సోలార్ ప్యానల్స్, కెమెరాలు...ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇంటిని మరిపించే సంచార ఇల్లు ఇది. దీన్ని తమ అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దుకోవడానికి చేసిన ఖర్చుతో సెకండ్ హ్యాండ్ వ్యాన్ కొనుగోలు చేయవచ్చు. తొలి ప్రయాణం లేహ్, లద్దాఖ్. దీపక్ తల్లిదండ్రులు కూడా వచ్చారు. నచ్చిన చోట ఆగడం, ప్రకృతి అందాలను వీక్షించడం...ప్రయాణంలోని మజాను దీపక్ తల్లిదండ్రులు ఆస్వాదించారు. ‘సాధారణ కారులో సుదూర ప్రాంతాలు ప్రయాణం చేయడం కష్టం. భోజనం నుంచి నిద్ర వరకు రకరకాల ఇబ్బందులు ఎదురవుతాయి. అన్ని రకాలుగా సౌకర్యవంతంగా ఉండడం, స్మూత్ డ్రైవింగ్ వల్ల మా వ్యాన్‌లో పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంజాయ్ చేశారు. గ్రామీణప్రాంతాలలో పార్కింగ్ అనేది కష్టం కాదు. అయితే పట్టణ ప్రాంతాలలో మాత్రం హోటల్ పార్కింగ్‌లను ఎంచుకునేవాళ్లం. వ్యాన్లోనే అన్ని సౌకర్యాలు ఉండడం వల్ల బయట క్యాంప్ ఏర్పాటు చేసుకునే అవసరం రాలేదు’ అంటుంది రుచీ పాండే. గుజరాత్లో 5,000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిన అనుభవం తమకు ప్రత్యేకమైనది. వీరి భవిష్యత్ ప్రణాళిక ఏమిటి? ఈ కారవ్యాన్పై నలభై దేశాలు చుట్టి రావాలనేది వారి కల. చదవండి: ఉచితంగా చదువుకోండి.. ఉన్నతంగా ఎదగండి -
తెలుగు బాలుడి సాహసయాత్ర.. రోజుకు 150 కిలోమీటర్లు సైకిల్‌పై..
సాక్షి, న్యూఢిల్లీ: తల్లిదండ్రులు తమ కలల్ని పిల్లలపై రుద్దకుండా, పిల్లల ఇష్టాయిష్టాలను గౌరవించాలంటూ 10వ తరగతి పూర్తిచేసిన తెలుగు బాలుడు 15 ఏళ్ల ఉర్దనపల్లి ఆశిష్ చెన్నై నుంచి లద్దాఖ్ రాజధాని లేహ్ వరకు సైకిల్ మీద సాహసయాత్ర చేశాడు. వైఎస్సార్ కడప జిల్లా రాజంపేట ప్రాంతానికి చెందిన ఆశిష్ కుటుంబం వ్యాపారరీత్యా కొన్నేళ్ల కిందట చెన్నైలో స్థిరపడింది. సైక్లింగ్‌పై ఆసక్తి ఉన్న ఆశిష్ జూలైలో చెన్నై నుంచి సైకిల్‌పై బయలుదేరి 41 రోజుల్లోనే లేహ్‌కు చేరుకున్నాడు. సైకిల్‌యాత్రను పూర్తిచేసి తిరుగుప్రయాణంలో ఢిల్లీకి చేరుకున్న ఆశిష్ సహా అతడి కుటుంబసభ్యులు ఏపీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఆశిష్ మాట్లాడుతూ సైకిల్ యాత్రలో మైదాన ప్రాంతంలో రోజూ 120 నుంచి 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు చెప్పాడు. చండీఘడ్ నుంచి పర్వత ప్రాంత ప్రయాణం మొదలయ్యాక ప్రతికూల వాతావరణం, వర్షం కారణంగా తీవ్రంగా ఇబ్బందిపడినా యాత్రను కొనసాగించినట్లు తెలిపాడు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరాలన్నదే తన కల అని పేర్కొన్నాడు. తనపై తల్లిదండ్రులెప్పుడూ ఎలాంటి ఒత్తిడి చేయలేదని, మిగతా పిల్లల తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానని తెలిపాడు. చెన్నై నుంచి లండన్‌కు సైకిల్‌యాత్ర చేయనున్నట్లు ఆశిష్ చెప్పాడు. (క్లిక్: 23 నిమిషాల్లో 2005 కిక్స్.. తైక్వాండోలో బాలిక ప్రతిభ) -
భళా.. బాలకా.. 15 ఏళ్లకే చెన్నై నుంచి లేహ్‌కు సైకిల్ యాత్ర
సాక్షి, న్యూఢిల్లీ: తల్లిదండ్రులు తమ కలల్ని పిల్లలపై రుద్దకుండా, పిల్లల ఇష్టాయిష్టాలను గౌరవించాలంటూ 10వ తరగతి పూర్తిచేసిన తెలుగు బాలుడు 15 ఏళ్ల ఆశిష్ చెన్నై నుంచి లద్దాఖ్ రాజధాని లేహ్ వరకు సైకిల్ మీద సాహసయాత్ర చేశాడు. కడప జిల్లా రాజంపేట ప్రాంతానికి చెందిన ఆశిష్ కుటుంబం వ్యాపారరీత్యా కొన్నేళ్ల కిందట చెన్నైలో స్థిరపడింది. సైక్లింగ్‌పై ఆసక్తి ఉన్న ఆశిష్ జూలైలో చెన్నై నుంచి సైకిల్‌పై బయలుదేరి 41 రోజుల్లోనే లేహ్‌కు చేరుకున్నాడు. సైకిల్‌యాత్రను పూర్తిచేసి తిరుగుప్రయాణంలో ఢిల్లీకి చేరుకున్న ఆశిష్ సహా అతడి కుటుంబసభ్యులు ఏపీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఆశిష్ మాట్లాడుతూ సైకిల్ యాత్రలో మైదాన ప్రాంతంలో రోజూ 120 నుంచి 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు చెప్పాడు. చండీఘడ్ నుంచి పర్వత ప్రాంత ప్రయాణం మొదలయ్యాక ప్రతికూల వాతావరణం, వర్షం కారణంగా తీవ్రంగా ఇబ్బందిపడినా యాత్రను కొనసాగించినట్లు తెలిపాడు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరాలన్నదే తన కల అని ఆశిష్ పేర్కొన్నాడు. తనపై తల్లిదండ్రులెప్పుడూ ఎలాంటి ఒత్తిడి చేయలేదని, మిగతా పిల్లల తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానని తెలిపాడు. చెన్నై నుంచి లండన్‌కు సైకిల్‌యాత్ర చేయనున్నట్లు ఆశిష్ చెప్పాడు. చదవండి: అద్దాలతో మెరిసిపోతున్న ట్విన్ టవర్స్.. నెటిజన్ల విమర్శల ట్విస్ట్ -
మనాలి నుంచి లేహ్ వరకూ..చిరుతలా పరిగెత్తింది
అల్ట్రా రన్నర్ సూఫియా ఖాన్. లక్ష్యం 480 కిలోమీటర్లు. కాని మామూలు దారి కాదు. సముద్ర మట్టానికి 2000 మీటర్ల నుంచి 3000 మీటర్ల ఎత్తున. చలి, మంచు, పర్వతాల దారి. కాని 146 గంటల్లో సాధించింది. ఈ దారిలో పరిగెత్తిన మొదటి మహిళ ఆమె. ‘ప్రపంచం మొత్తం పరిగెత్తాలని ఉంది’ అంటోందామె. అందుకు లేసులు కూడా బిగిస్తోంది. సంప్రదాయ మారథాన్ గరిష్టంగా 42 కిలోమీటర్లు ఉంటుంది. దానికి మించిన మారథాన్‌ను ఆల్ట్రా మారథాన్ అంటారు. సూఫియా ఖాన్ ఆల్ట్రా రన్నర్. అంటే ఏకధాటిగా వందల కిలోమీటర్ల మారథాన్ చేసే రన్నర్ అన్నమాట. ప్రపంచంలో ఆమెలా పరిగెడుతున్నవారు... రికార్డ్స్ సృష్టిస్తున్నవారు బహుశా మరొకరు లేరు. ఎందుకంటే ఆమె కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పరిగెత్తి ఒక రికార్డు, గోల్డెన్ ట్రయాంగిల్ (జైపూర్, ఢిల్లీ, ఆగ్రా)లో పరిగెత్తి ఒక రికార్డు, తాజాగా మనాలి నుంచి లేహ్‌కు పరిగెత్తి ఒక రికార్డు నమోదు చేసింది. 35 ఏళ్ల వయసులో చిరుతలా పరిగెత్తే ఈమెను అందుకోవడం కష్టమేమి కాదు. కాకపోతే అందుకు మనమూ పరిగెత్తాల్సి ఉంటుంది. అజ్మీర్ అమ్మాయి అజ్మీర్‌లో పుట్టి పెరిగిన సూఫియాకు 16 ఏళ్ల వయసులోనే తండ్రి చనిపోయాడు. తల్లి ఆమెను పెంచింది. డిగ్రీ చేశాక ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం చూసుకోమ్మా అంది. కాని సూఫియాకు ఏవియేషన్ రంగంలో పని చేయాలనిపించి ఒక ప్రయివేట్ ఎయిర్‌లైన్స్‌లో గ్రౌండ్స్టాఫ్గా చేరింది. అక్కడ బండ చాకిరీ. సంవత్సరాలు గడిచిపోతుండేవి. దానికి తోడు ఆరోగ్యం, ఉత్సాహం సన్నగిల్లడం కూడా. ‘నన్ను నేను ఒకరోజు అద్దంలో చూసుకుంటే నా ఫిట్నెస్ అంతా పోయిందనిపించింది. డ్యూటీ చేస్తూనే ఆరోగ్యం కాపాడుకోవాలంటే రోజూ ఒక 15 నిమిషాలన్నా పరిగెత్తాలని అనుకున్నాను. అలా పరిగెత్తడం మొదలెట్టాను. అప్పటి వరకూ నాకు ఆటలంటే ఇష్టం లేదు. కాని పరిగెడుతుంటే నా శరీరం చిరుతలా మారేది. నాకు పరుగు సరిౖయెనది అని ఇంకా సాధన చేశాను’ అంటుంది సూఫియా. మారథాన్‌లో సూఫియా సందేశం కోసం పరుగు పరుగులో ఆనందం తెలిశాక రొడ్డకొట్టుడు ఉద్యోగాన్ని వదిలేసింది సూఫియా. ఒక సందేశం కోసం తన పరుగును దేశానికి చూపాలనుకుంది. ‘మానవత్వమే ముఖ్యం’ అనే సందేశంతో 2018లో మొదట ఇండియన్ గోల్డెన్ ట్రయాంగిల్ మధ్య పరిగెత్తింది. 720 కిలోమీటర్ల ఈ దూరాన్ని 16 రోజుల్లో ముగించి రికార్డు స్థాపించిందామె. దాంతో ఆమె పరుగు మీద అందరి దృష్టి పడింది. ఆ తర్వాత 2019లో అంతకు మించి సాహసం చేసింది సూఫియా. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు 4000 కిలోమీటర్ల దూరం– శ్రీనగర్‌తో మొదలయ్యి లూధియానా మీదుగా గజియాబాద్, కోట, ఇండోర్, ముంబై, బెలగామ్, బెంగళూరు, మదురైలను దాటి కన్యాకుమారి వరకూ ఆమె పరిగెత్తింది. ఏప్రిల్ చివరి వారంలో మొదలెట్టి రోజుకు 50 కిలోమీటర్ల లెక్కన పరిగెడుతూ దాదాపు 90 రోజులలో ఆమె ఈ పరుగును పూర్తి చేసి మరో రికార్డును స్థాపించింది. ఇప్పుడు ‘నీ హద్దుల్ని దాటు’ అనే సందేశంతో మనాలి, లేహ్‌ల మధ్య పరిగెత్తింది. ‘నీ హద్దుల్ని దాటు’ స్త్రీలకు అన్నీ హద్దులే. స్త్రీలు చేసే సాహసాలకు అన్నీ ఆటంకాలే. అందుకే సూఫియా ‘నీ హద్దుల్ని దాటు’ అనే సందేశంతో సెప్టెంబర్ 25, 2021 ఉదయం తన ‘హిమాలయన్ ఆల్ట్రా రన్ ఎక్స్‌పెడిషన్’ మనాలి నుంచి మొదలెట్టింది. 480 కిలోమీటర్ల దూరాన్ని అక్టోబర్ 1న లేహ్‌లో ముగించింది. ఇలా ముగించడం సామాన్యం కాదు. ఇలా ముగించిన మహిళ గతంలో లేదు. అందుకే సూఫియా సాహసం గొప్ప స్ఫూర్తిదాయకం అయ్యింది. మనాలి సముద్ర మట్టానికి 6,700 అడుగుల ఎత్తు ఉంటుంది. లేహ్ 11, 500 అడుగుల ఎత్తు. ఈ రెండు ఎత్తుల మధ్య పరిగెత్తాలి. చలి ఈ దారిలో ఒక్కోసారి మైనస్ 5 డిగ్రీలు ఉంటుంది. ఆక్సిజన్ గాలిలో అరవై శాతమే ఉంటుంది. పెద్ద సవాలు. ‘అయినా నేను పరిగెత్తాను. దీనికి ముందు ఒక పదిహేను రోజులు ఈ పర్వతాల్లో క్యాంప్ వేసి ఇక్కడి వాతావరణానికి నా శరీరం అలవాటు పడేలా చేసుకున్నాను.’ అంది సూఫియా. ప్రాణాపాయం లెక్కచేయక మనాలి, లేహ్‌ల మధ్య రోడ్లు బాగుండవు. ఆ దారిలో వాహనాల్లో వెళుతున్నవాళ్లే ఆక్సిజన్ చాలక ఒక్కోసారి మరణిస్తారు. ‘నాక్కూడా ఆ దారిలో ఉండే గ్రామీణులు, ఆర్మీ వాళ్లు చాలా జాగ్రత్తలు, ప్రాణాపాయ పరిస్థితులు చెప్పారు. ప్రాణాయామం, యోగా వల్ల నా లంగ్స్‌ను గట్టి పరుచుకోవడం వల్ల నేను ధైర్యం చేశాను. కాని ఆ ధైర్యం చేయడం వల్ల ఎన్నో మనోహర దృశ్యాలు చూశాను. లడాఖ్ లోయ ముఖద్వారం ‘సర్చూ’, సింధూ నది ప్రవాహం, తంగ్లంగ్ లా పాస్... ఇవన్నీ జీవితంలో ఒక్కసారైనా చూడాలి’ అందామె. సూఫియాకు సపోర్ట్ టీమ్ ఉంటుంది. అది ఆమె వెంట ఉండి ఆ పరుగును, రాత్రి బసను ప్లాన్ చేస్తుంది. రెండుసార్లు గిన్నెస్‌బుక్‌లో ఎక్కిన సూఫియా తర్వాతి అంకం ‘ప్రపంచాన్ని పరుగుతో చుట్టి రావడమే’. ఆ రోజు కూడా బహుశా చూస్తాం. తథాస్తు. -
పద్నాలుగు వేల అడుగుల ఎత్తులో.. ప్రకృతి విన్యాసం!
జమ్ము–కశ్మీర్ అంటేనే ప్రకృతి వైవిధ్యాలకు నిలయం. ఈ ప్రకృతి విచిత్రం కూడా అక్కడిదే. కశ్మీర్, లధాక్ రీజియన్‌లో ఉంది. లేహ్ నుంచి కార్గిల్‌కు వెళ్లే దారిలో కారులో ముందుకు ప్రయాణిస్తున్నప్పుడు ఎటు చూసినా మనం ఎత్తులోకి ప్రయాణిస్తున్నట్లే అనిపిస్తుంది. రోడ్డు ఎంతో దూరం కనిపించదు. పైకి వెళ్తుంటే మన ముందు ఉన్న రోడ్డు కూడా ఆకాశాన్ని తాకుతున్నట్లు కనిపించాలి కదా. కానీ ఓ వంద అడుగుల దూరం కంటే కనిపించదు. మన వాహనం ముందుకు వెళ్తుంటే మరో వంద అడుగులు మేర రోడ్డు కనిపిస్తుంటుంది. మనం పైకి వెళ్తున్నామా, కిందకు వెళ్తున్నామా అనే సందేహ నివృత్తి కోసం కారాపి గమనిస్తే కారు దానంతట అదే మెల్లగా ముందుకు సాగిపోతుంటుంది. అంటే మనం ప్రయాణిస్తున్నది కిందకే అన్నమాట. పద్నాలుగు వేల అడుగుల ఎత్తులో ప్రకృతి విన్యాసం ఇది. విశ్వాసం!! ఈ విచిత్రం పర్యాటకులకు మంచి వినోదం. అయితే స్థానికులు మాత్రం ‘ఇది ఒకప్పుడు ఇది స్వర్గానికి వెళ్లే దారి’ అంటూ అందమైన కథనం చెప్తారు. ఇక్కడ మార్కింగ్ పాయింట్‌గా ఒక పసుపు రంగు బాక్స్ ఉంటుంది. వాహనాన్ని అక్కడ ఆపి ఈ ఫీల్‌ని ఆస్వాదించవచ్చు. ఈ విచిత్రం మనదేశానికే పరిమితమా లేక ప్రపంచంలో మరెక్కడైనా ఉందా? అనే సందేహం రావడం సహజమే. ఆర్మీనియాలోని మౌంట్ అరాగాట్ కూడా ఇలాంటి విచిత్రాన్ని సొంతం చేసుకున్న పర్యాటక ప్రదేశం. సమీపంలో సింధునది మాగ్నటిక్ కొండకు పక్కనే సింధు నది ప్రవహిస్తోంది. ఇక్కడ పర్యటించడానికి జూలై నుంచి అక్టోబర్ వరకు అనువుగా ఉంటుంది. మాగ్నటిక్ హిల్ టూర్‌ను లధాక్ పర్యటనలో భాగంగా చేర్చుకోవచ్చు. ఈ ట్రిప్‌లో లధాక్, నుబ్ర, పాంగాంగ్ వంటి ప్రదేశాలను కూడా కవర్ చేయవచ్చు. బస: లేహ్‌లో హోటళ్లు ఉంటాయి. హోమ్‌స్టేలో కూడా బస చేయవచ్చు. డ్రైవింగ్ ఇష్టపడే వాళ్లు కారు అద్దెకు తీసుకుని మాగ్నటిక్ హిల్‌కు స్వయంగా నడుపుకోవచ్చు. ఆహారం: ఈ రూట్లో రెస్టారెంట్లలో చాయ్ మాత్రమే దొరుకుతుంది. కాబట్టి ఆహారం లేహ్ లోనే ప్యాక్ చేయించుకుని వెళ్లడం మంచిది. -వాకా మంజులారెడ్డి -
అత్యంత ఎత్తులో పవర్ స్టేషన్... టాటా వరల్డ్ రికార్డు
సాక్షి, వెబ్‌డెస్క్: ఇప్పటికే ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న టాటా మరో రికార్డుపై కన్నేసింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి సిద్ధమైంది. దీంతో పాటు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌ని ఏర్పాటు చేయనుంది. సోలార్‌లోకి టాటా కాలుష్య రహిత గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి కేంద్రం ప్రోత్సహకాలు అందిస్తోంది. దీంతో కార్పోరేటు కంపెనీలు సౌర విద్యుత్తుపై దృష్టి సారించాయి. అందులో భాగంగా టాటా సంస్థ సైతం దేశంలో వివిధ ప్రాంతాల్లో సోలార్ పవర్ స్టేషన్లు నిర్మాణం చేపడుతోంది. మన అనంతపురంలో 150 మెగావాట్ల పవర్ ప్లాంటుతో పాటు కేరళలోని కాసర్గోడ్లో 50 మెగావాట్లు, ఒడిషాలోని లపంగాపలో 30 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణం టాటా పవర్ చేపట్టింది. అయితే వీటి లేని ప్రత్యేకత తాజాగా చేపట్టబోయే ప్రాజెక్టులో చోటు చేసుకోనుంది. వరల్డ్ రికార్డు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పీఠభూముల్లో ఒకటైన లదాఖ్‌లో కొత్తగా సోలార్ పవర్ ప్లాంటును నిర్మించనుంది టాటా పవర్ సంస్థ, లదాఖ్ ప్రధాన పట్టణమైన లేహ్ సమీపంలో లైంగ్ అనే గ్రామం సమీపంలో భూమి నుంచి 3,600 మీటర్ల ఎత్తులో ఈ సోలార్ పవర్ స్టేషన్‌ను నిర్మించనుంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో నెలకొల్పిన సోలార్ పవర్ స్టేషన్‌గా స్విట్జర్లాండ్‌లోని జుంగ్ఫ్రాజోక్ గుర్తింపు ఉంది. 1991లో ఈ పవర్ స్టేషన్‌ని భూమి నుంచి 3,454 మీటర్ల ఎత్తులో నెలకొల్పారు. ముప్పై ఏళ్లుగా ఇదే రికార్డుగా కొనసాగుతోంది. 2023 మార్చికి పూర్తి లేహ్ సమీపంలో నిర్మించే సోలార్ పవర్ స్టేషన్ నిర్మాణం 2023 మార్చి నాటికి పూర్తి కానుంది. పవర్ స్టేషన్‌కు అనుసంధానంగా 50 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌ని సైతం టాటా పవర్ నెలకొల్పనుంది. దీని కోసం రూ.386 కోట్లు వెచ్చించనుంది. ఇండియా వేగంగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి దిశగా అడుగులు వేస్తోందని అనడానికి లేహ్‌లో చేపడుతున్న కొత్త సోలార్ పవర్ ప్రాజెక్టు ఉదాహరణ అని టాటా పవర్ సీఈవో ప్రవీర్ సిన్హా అన్నారు. -
తప్పు ఒప్పుకున్న ట్విట్టర్
న్యూఢిల్లీ: చైనా భూభాగంలో లద్దాఖ్‌ను చూపడం తమ తప్పేనని సామాజిక మాధ్యమం ట్విట్టర్ అంగీకరించింది. తప్పుగా చూపించినందుకు ట్విట్టర్ రాతపూర్వకంగా పార్లమెంటరీ కమిటీకి క్షమాపణలు తెలిపినట్లు, ఈనెలాఖరుకు ఆ తప్పుని సరిదిద్దుకుంటామని హామీ ఇచ్చినట్లు పార్లమెంటరీ కమిటీ ఛైర్పర్సన్ మీనాక్షి లేఖి తెలిపారు. భారత పటాన్ని జియో ట్యాగింగ్‌లో తప్పుగా చూపించినందుకు ట్విట్టర్ చీఫ్ ప్రైవసీ ఆఫీసర్ డామియన్ కరియన్ సంతకంతో కూడిన అఫిడవిట్ పార్లమెంటు కమిటీకి సమర్పించారు. డేటా ప్రొటెక్షన్ బిల్లుపై గత నెలలో ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈ విషయంలో ట్విట్టర్‌పై ఆగ్రహం వెలిబుచి్చంది. ట్విట్టర్ దేశద్రోహానికి పాల్పడిందని, అఫిడవిట్ రూపంలో వివరణ ఇవ్వాలని ట్విట్టర్‌కు నోటీసులు జారీచేశారు. దీంతో కమిటీ ముందు హాజరైన ట్విట్టర్ ఇండియా ప్రతినిధులు క్షమాపణ కోరారు. అయితే ఇది క్రిమినల్ నేరమని, దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించడమేనని, ట్విటర్ ఇంటర్నేషనల్ కార్యాలయం అఫిడవిట్ సమర్పించాలని కమిటీ పేర్కొంది. భారత ప్రజల విశ్వాసాలను గాయపర్చినందుకు వారు క్షమాపణ కోరారని, నవంబర్ 30 లోపు ఆ తప్పును సరిదిద్దుకుంటామని హామీ ఇచ్చినట్టు మీనాక్షి తెలిపారు. -
బుడ్డోడి సెల్యూట్‌కు గొప్ప బహుమతి!
న్యూఢిల్లీ: ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులకు సెల్యూట్ చేసి వార్తల్లో నిలిచిన ఐదేళ్ల నవాంగ్ నంగ్యాల్ మరోసారి హైలైట్ అయ్యాడు. బుడ్డోడి ‘కడక్’ సెల్యూట్‌కు ఫిదా అయిన ఐటీబీపీ సిబ్బంది అతనికి యూనిఫాం అందించి గౌరవించారు. మిలటరీ యూనిఫాం ధరించి సైనిక కవాతు చేస్తున్న నంగ్యాల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, లేహ్‌లోని చుశూల్కు చెందిన కిండర్ గార్టెన్ విద్యార్థి నంగ్యాల్ తన ఇంటి ముందు నుంచి వెళ్తున్న ఐటీబీపీ సిబ్బందికి గత అక్టోబర్ 11న సెల్యూట్ చేశాడు. అతని దేశభక్తికి ముగ్ధుడైన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుధా రామెన్ సైనిక వందనంలో చిన్నారికి కొన్ని సూచనలు చేశారు. దాంతోపాటు ఆ దృశ్యాలను వీడియో తీసి ట్విట్టర్లో షేర్ చేయగా వైరల్ అయింది. క్యూట్ సోల్జర్, భవిష్యత్ సైనికుడు, వీరుడు సిద్ధమవుతున్నాడని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. (చదవండి: సెల్యూట్‌తో అలరిస్తున్న బుడ్డోడు) -
ట్విట్టర్‌పై పార్లమెంటరీ కమిటీ ఆగ్రహం
న్యూఢిల్లీ : సామాజిక మాధ్యమం ట్విట్టర్ తన లొకేషన్ సెట్టింగ్‌లలో లద్దాఖ్‌లోని లేహ్ ప్రాంతాన్ని చైనాలో అంతర్భాగంగా చూపించడంపై ఇచ్చిన వివరణ సరిగా లేదని పార్లమెంటరీ సంయుక్త కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంలో బుధవారం ట్విట్టర్ అధికారుల్ని ప్రశ్నించిన పార్లమెంటరీ కమిటీ లేహ్ ప్రాంతాన్ని అలా చూపించడం దేశ ద్రోహం కిందకి వస్తుందని తెలిపింది. డేటా ప్రొటెక్షన్ బిల్లు పార్లమెంటరీ కమిటీ ఎదుట హాజరైన ట్విట్టర్ అధికారుల్ని కమిటీ సభ్యులు దాదా పుగా రెండు గంటల సేపు ప్రశ్నించారు. ఈ సందర్భంగా భారత్‌కు చెందిన సున్నితమైన ఈ అంశాన్ని తాము గౌరవిస్తామని ట్విట్టర్ అధికారులు తెలిపారు. తాము చేసిన పొరపాటుకు క్షమాపణ కూడా కోరారు.ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించామని అన్నారు. తమ సంస్థ అత్యంత పారదర్శకంగా పని చేస్తుందని, ఎప్పటికప్పుడు కేంద్రానికి తాము సరి చేసిన అంశాలను తెలియజెప్పామన్నారు. -
లేహ్ చైనాలో భాగం.. ట్విట్టర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్
న్యూఢిల్లీ: భారత్ భూభాగాలను తప్పుగా చూపించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీకి లేఖ రాసింది. భారత సార్వభౌమత్వాన్ని, సమగ్రతను అగౌరవపరిచేందుకు చేసే ఏ ప్రయత్నము ఆమోదయోగ్యం కాదని తీవ్రంగా హెచ్చరించింది. జమ్మూ కశ్మీర్‌లోని లేహ్ భూభాగాన్ని ట్విట్టర్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో భాగంగా చూపించడంతో ప్రభుత్వం ట్విట్టర్ సీఈఓకి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ, ఐటి కార్యదర్శి అజయ్ సాహ్నీ మాట్లాడుతూ.. ‘లేహ్ లద్దాఖ్‌కు ప్రధాన కార్యాలయం. జమ్మూ కశ్మీర్, లద్దాఖ్‌లు రెండు కూడా భారత రాజ్యాంగం పాలించే ఇండియాలోని సమగ్ర, విడదీయరాని భాగాలు. మ్యాప్‌ల ద్వారా ప్రతిబింబించే భారతదేశం సార్వభౌమత్వాన్ని, సమగ్రతను అగౌరవపరిచేందుకు ట్విట్టర్ చేసే ఏ ప్రయత్నమైనా పూర్తిగా చట్టవిరుద్ధం.. ఆమోదయోగ్యం కాదు’ అంటూ తీవ్రంగా హెచ్చరించారు. (చదవండి: లద్దాఖ్‌లో పట్టుబడ్డ చైనా జవాను) See this Twitter! When I put Hall of Fame Leh as the location, see what it shows. I tested it deliberately.@Twitter @TwitterIndia @TwitterSupport pic.twitter.com/sGMbmjJ60c — Nitin A. Gokhale (@nitingokhale) October 18, 2020 అంతేకాక ఇలాంటి ప్రయత్నాలు ట్విట్టర్‌కు అపఖ్యాతిని కలిగించడమే కాక మధ్యవర్తిగా దాని తటస్థత గురించి ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని ప్రభుత్వం లేఖలో పేర్కొంది. దీనిపై ట్విట్టర్ ప్రతినిధి స్పందిస్తూ.. భారత ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి కట్టుబడి ఉన్నాము. ఈ విషయంలోని సున్నితత్వాన్ని మేము గౌరవిస్తాము. లేఖను అంగీకరిస్తాము’ అని తెలిపారు. -
మేఘా ‘జోజిలా’ టన్నెల్ పనులు ప్రారంభం
న్యూఢిల్లీ: శ్రీనగర్ లోయ, లేహ్‌ను అనుసంధానించేందుకు ఉద్దేశించిన జోజిలా టన్నెల్ నిర్మాణ పనులు గురువారం ప్రారంభమయ్యాయి. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వీటిని లాంఛనంగా ప్రారంభించారు. నిర్దేశించుకున్న షెడ్యూల్ కన్నా ముందుగా నాలుగేళ్లలోనే ఈ ప్రాజెక్టు పూర్తి కాగలదని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇన్ఫ్రా దిగ్గజం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇ¯Œ ఫ్రాస్ట్రక్చర్ (ఎంఈఐఎల్) పోటీ సంస్థల కన్నా అత్యంత తక్కువగా కోట్ చేసి ఈ ప్రాజెక్టును దక్కించుకుంది. ఎంఈఐఎల్ రూ. 4,509.5 కోట్లకు బిడ్ వేసింది. సుమారు 14.15 కి.మీ. పొడవుండే ఈ టన్నెల్‌ను షెడ్యూల్ ప్రకారం ఆరేళ్లలో పూర్తి చేయాలి. ఇది పూర్తయితే ఆసియాలోనే అత్యంత పొడవైన టన్నెల్‌గా నిలుస్తుంది. శ్రీనగర్–లేహ్ మధ్య ప్రయాణ సమయం 3 గం.ల నుంచి 15 నిమిషాలకు తగ్గిపోతుంది. శ్రీనగర్–కార్గిల్–లేహ్ జాతీయ రహదారిపై 11,578 అడుగుల ఎత్తున ఉండటంతో ఇది వ్యూహాత్మక ప్రాజెక్టుగా మారింది. సాధారణంగా శీతాకాలంలో భారీ హిమపాతం కారణంగా శ్రీనగర్–లేహ్ మధ్య మార్గాన్ని మూసేయాల్సి ఉంటోంది. అయితే, ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏడాది పొడవునా ప్రయాణాలకు వీలవుతుంది. -
సెల్యూట్‌తో అలరిస్తున్న బుడ్డోడు
లేహ్ : చిన్న పిల్లలు ఏం చేసినా మనకు ముద్దొస్తుంటుంది. వారు చేసే అల్లరితో మనం ఉదయం నుంచి పడిన శ్రమనంతా మరిచిపోతాం. వాళ్లు గలగలా నవ్వితే ఇంట్లో పండుగ వాతావరణం వెల్లివిరుస్తుంది. కొందరు చిన్నారులు తమ చిలిపి చేష్టలతో ఆకట్టుకుంటుంటారు. తాజాగా ఒక బుడ్డోడు చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారి ఎమోషనల్‌కు గురిచేస్తుంది. ఒక పిల్లాడు తన ముందు నుంచి వెళ్తున్న సైనికులకు సెల్యూట్ చేసి అందరిచేత శభాష్ అనిపించుకున్నాడు. సైనికుల పట్ల ఇలా గౌరవం తెలుపాలని స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. లేహ్ నుంచి వెళ్తున్న భారత సైనికులకు సెల్యూట్ చేస్తున్న వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుధా రామెన్ ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజెన్లు ఎందరో బుడ్డోడి సెల్యూట్‌కు ముగ్ధులయ్యారు.కొన్ని గంటల్లోనే ఈ వీడియో వైరల్‌గా మారింది.(చదవండి : వైరలవుతున్న కేరళ బామ్మ ఆవేదన) A budding soldier of future India. From a village in Leh, he made my day. Jai Hind pic.twitter.com/4AmO2wWj9q — Sudha Ramen IFS 🇮🇳 (@SudhaRamenIFS) October 11, 2020 -
అందుబాటులోకి అటల్ టన్నెల్
రోహ్తాంగ్: హిమాలయ పర్వత సానువుల్లో ఎంతో వ్యయప్రయాసలకోర్చి నిర్మించిన, ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవే సొరంగ మార్గా(టన్నెల్)న్ని ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి, లేహ్ మధ్య 46 కి.మీ. దూరాన్ని ఈ సొరంగ మార్గం తగ్గిస్తుంది. 9.02 కి.మీ.ల పొడవైన ఈ టన్నెల్ వల్ల ప్రయాణ సమయం 5 గంటలకు తగ్గిపో తుంది. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య, ఎన్నో సవాళ్లనెదుర్కొని ఈ సొరంగ మార్గాన్ని నిర్మించింది. దేశ రక్షణలో అత్యంత వ్యూహాత్మకమైన ఈ సొరంగ మార్గాన్ని ప్రారంభించిన మోదీ దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయి కన్న కలలు సాకారమయ్యాయని అన్నారు. ఇదే సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం దేశ భద్రతా ప్రయోజనాలపై రాజీ పడిందని దుయ్యబట్టారు. అటల్ సొరంగం, తేజాస్ యుద్ధ విమానాల తయారీ మొదలైన వాటిని గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని అన్నారు. ‘మాకు దేశ భద్రతే అత్యంత ముఖ్యం. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు ఈ స్థాయిలో ఎప్పుడూ జరగలేదు. 26 ఏళ్లలో పూర్తి కావాల్సిన పనిని మా ప్రభుత్వం ఆరేళ్లలో చేసింది. కేవలం సైనిక అవసరాలే కాదు, లేహ్, లద్దాఖ్ ప్రాంత ప్రజల బతుకు అవసరాలు కూడా ఈ సొరంగం తీరుస్తుంది’అని మోదీ అన్నారు. అటల్ టన్నెల్‌గా పేరు మార్పు 2000 సంవత్సరం జూన్ 3న వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఈ సొరంగ మార్గాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. 2002 మే 26న ఈ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆరేళ్లలో దీనిని పూర్తి చెయ్యాలని లక్ష్యంగా నిర్ణయించినప్పటికీ ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఇతర కారణాలతో నిర్మాణం సాగలేదు. మొదట్లో దీనిని రోహ్తాంగ్ సొరంగం అని పిలిచేవారు. 2019లో దీనికి అటల్ సొరంగం అని పేరు మార్చారు. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఈ టన్నెల్ నిర్మాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. సొరంగం పూర్తి చేయడానికి పదేళ్లు పట్టింది. సొరంగం విశేషాలు ► సముద్ర మట్టానికి 10వేల అడుగుల ఎత్తున నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవే సొరంగమిది. నిర్మాణ వ్యయం రూ.3,300 కోట్లు. ► ఒకటే ట్యూబ్‌లో, డబుల్ లేన్‌తో ఈ సొరంగాన్ని నిర్మించారు. రోజూ 3వేల కార్లు , 1500 లారీలు రాకపోకలు సాగిం చేలా నిర్మించారు. దీంట్లో వాహనాల గరిష్టవేగం గంటకు 80 కి.మీ. ► సరిహద్దుల్లో రక్షణ పరంగా ఇది అత్యంత వ్యూహాత్మకమైనది. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినా మిలటరీ సామగ్రిని తరలించడానికి ఈ సొరంగం బాగా ఉపయోగపడుతుంది. ► భారీగా మంచు కురవడం వల్ల ఏడాదిలో ఆరునెలలు లేహ్ ప్రాంతవాసులకి ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోతాయి. ఈ సొరంగ మార్గంతో అక్కడ ప్రజలు కూడా ప్రయాణించే అవకాశం వచ్చింది. -
తప్పుడు ప్రచారం చేయడం తగదు
న్యూఢిల్లీ: గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో గాయపడిన భారత సైనికులకు సరైన చికిత్స అందించడం లేదన్న విమర్శలను భారత సైన్యం ఖండించింది. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయడం తగదని హితవు పలికింది. లేహ్‌లోని జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సైనికులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 3న పరామర్శించిన సంగతి తెలిసిందే. సంబంధిత ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అక్కడ సరైన వసతులు లేవని, సైనికులను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ కొందరు వ్యాఖ్యానాలు జోడిస్తున్నారు. దీనిపై భారత సైన్యం శనివారం స్పందించింది. ఒక ప్రకటన విడుదల చేసింది. తప్పుడు ప్రచారం చేయొద్దని కోరింది. వీర సైనికులకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలియజేసింది. లేహ్‌లోని జనరల్ హాస్పిటల్లో కొన్ని వార్డులను కరోనా ఐసోలేషన్ వార్డులుగా మార్చారని, అందుకే ఆడియో వీడియో ట్రైనింగ్ హాల్‌ను ప్రత్యేక వార్డుగా తీర్చిదిద్ది, సైనికులకు వైద్య సేవలు అందిస్తున్నట్లు వెల్లడించింది. అక్కడ సకల సదుపాయాలు ఉన్నాయని పేర్కొంది. -
వీరులకు అశ్రునివాళి
న్యూఢిల్లీ: చైనా సైనికులతో ఘర్షణలో అమరులైన 20 మంది భారత సైనికులను స్మరిస్తూ బుధవారం లద్దాఖ్ రాజధాని లేహ్‌లో నివాళి కార్యక్రమం జరిగింది. జూన్ 15న సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న లోయలో చైనా భారత్ సైనికులు ముఖాముఖి తలపడటం తెల్సిందే. అమరులైన వారిలో తెలుగుతేజం కల్నల్ సంతోష్‌బాబు ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్పందిస్తూ.. ఈ వీర జవాన్ల త్యాగాలు వృథాకావని వ్యాఖ్యానిం చారు. దేశ ఐక్యత, సార్వభౌమత్యం తమకు ప్రాధాన్యమని తేల్చి చెప్పారు. భారత్ శాంతిని కోరుకుంటోందని, అదే సమయంలో తగిన జవాబు కూడా ఇవ్వగలదని చెప్పారు. మరోవైపు ఈ దాడిలో పాల్గొన్న నలుగురు సైనికుల పరిస్థితి విషమంగా ఉందని ఆర్మీ అధికారిక వర్గాలు తెలిపాయి. చైనా వైపు కూడా దాదాపు 45 మంది సైనికులు మరణించి ఉండవచ్చని అధికారులు తెలిపారు. ఈ దాడి ఆయుధాలతోగాక పిడిగుద్దులు, రాళ్లు విసురుకోవడంతో జరిగిందని అన్నారు. అయితే చైనా సైనికులు మాత్రం రాడ్లు, మేకులు కలిగిన ఆయుధాలు ఉపయోగించినట్లు తెలుస్తోంది. వాస్తవాధీన రేఖకు లోపలే భారత్ తమ కార్యకలాపాలను సాగిస్తోందని, చైనా నుంచి దీన్నే ఆశిస్తున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాక్ శ్రీవాస్తవ చెప్పారు. అమరులైన భారత సైనికులు భికుమల్ల సంతోష్ బాబు(సూర్యాపేట), నుదరమ్ సోరెన్(మయూర్భంజ్), మన్దీప్ సింగ్ (పటియాలా), సత్నామ్ సింగ్(గుర్దాస్పూర్), కె. పలాని(మధురై), సునిల్ కుమార్(పట్నా), బిపుల్ రాయ్(మీరట్ సిటీ), దీపక్ కుమార్(రెవా), రాజేష్ ఒరాంగ్(బిర్గుమ్), కుందన్ కుమార్ ఓజా(సహిబ్గంజ్),గణేష్ రామ్(కాంకెర్), చంద్రకాంత ప్రధాన్(కందమాల్), అంకుష్(హమిర్పుర్), గుర్బిందర్(సంగ్రుర్), గుర్తెజ్ సింగ్(మన్సా), చందన్ కుమార్(భోజ్‌పూర్), కుందన్ కుమార్(సహర్సా), అమన్ కుమార్(సమస్తిపూర్), జై కిషోర్ సింగ్ (వైశాలి), గణేశ్ హన్సా్ద(ఈస్ట్ సింగ్బుమ్) -
ఉల్లిపాయలు పట్టుకెళ్తానన్న ఆర్మీ హీరో
న్యూ ఢిల్లీ: గతేడాది ఉల్లిపాయ ధరలు ఆకాశన్నంటగా ప్రస్తుతం సాధారణ స్థితికి వచ్చాయి. అయితే కొన్నిప్రాంతాల్లో ఉల్లి సమస్య ఇంకా వెంటాడుతూనే ఉందడానికి ఇక్కడ చెప్పుకునే ఘటనే నిదర్శనం. జమ్ముకశ్మీర్‌లో లేహ్ జిల్లాలో లడక్ స్కౌట్లో నయూబ్ సుబేదార్‌గా మ్యుటప్ విధులు నిర్వహిస్తున్నారు. ఆయన 1985లో దేశంలోని అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన అశోక్ చక్ర గ్రహీతను అందుకున్నారు. ఈ ఆర్మీ హీరో ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనడానికి ఢిల్లీకి చేరుకున్నారు. అయితే ఆయన ఢిల్లీ నుంచి లేహ్‌కు తిరుగు ప్రయాణమయ్యేటప్పుడు తనవెంట ఉల్లిని తీసుకెళతానని పేర్కొన్నారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. ‘ఢిల్లీలో కేవలం రూ.60కే ఉల్లి దొరుకుతోంది. కానీ లేహ్‌లో కిలో ఉల్లి ధర రూ.200ను దాటిపోయింది. అందుకే ఈ నెల 31న నేను తిరిగి వెళ్లేటప్పుడు దాదాపు ఏడెనిమిది కిలోల ఉల్లిని తీసుకెళ్తాను. అంతకన్నా ఎక్కువ తీసుకెళ్లాలని ఉన్నా పరిమిత బరువుల నిబంధన మేరకు ఆ ఆలోచన విరమించుకున్నా’నని పేర్కొన్నారు. త్వరలోనే ఉల్లి రేట్లు తగ్గుముఖం పడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఆయన ఇద్దరు కుమారులు, ముగ్గురు మనవళ్లు కూడా ఆర్మీలోనే చేరటం విశేషం. వర్షాలతో ఉల్లికి దెబ్బ.. గతేడాది ఆగస్టు- సెప్టెంబర్‌లో ఉల్లిని అధికంగా ఉత్పత్తి చేసే మహారాష్ట్రలో భారీ వర్షాలతో పంట చేతికిరాలేదు. దీంతోపాటు ఉల్లిని పండించే మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోనూ వర్షాలు ఉల్లి దిగుబడిని దెబ్బతీశాయి. దీంతో దేశవ్యాప్తంగా ఉల్లికొరత ఏర్పడింది. సాధారణంగా రూ.20 లేదా రూ.30కి లభించే ఉల్లిపాయలు ఒక్కసారిగా కనీవినీ ఎరుగని రీతిలో ధరలు పలికాయి. ఈ క్రమంలో జమ్ము, కశ్మీర్‌లోని లేహ్ ప్రాంతంలోనూ ఉల్లి ధరలు చుక్కలను తాకాయి. ఇక ఈమధ్యే ఉల్లిధరలు దిగివచ్చినప్పటికీ లేహ్‌లో మాత్రం ధరలు యథాతథంగా కొనసాగుతుండటం గమనార్హం. చదవండి: జామా మసీదు ముందు చంద్రశేఖర్ ఆజాద్ ప్రత్యక్షం ‘షి’పబ్లిక్‌డే -
వైరల్ : సైనిక దుస్తుల్లో ధోని బ్యాటింగ్..!
శ్రీనగర్ : పారామిలటరీ రెజిమెంట్‌లో సేవలందించేందుకు వెళ్లిన లెఫ్టినెంట్ కల్నల్, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని మళ్లీ బ్యాటు పట్టాడు. భారత సైన్యంలో 106 టీఏ పారామిలటరీ బెటాలియన్‌తో కలిసి 15 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న ధోని లేహ్‌లో సరదాగా కాసేపు క్రికెట్ ఆడాడు. బాస్కెట్ బాల్ గ్రౌండ్లో ధోని క్రికెట్ ఆడుతున్న ఫొటోను చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు యాజమాన్యం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ‘విభిన్న క్రీడా మైదానాల్లో.. విభిన్నమైన గేమ్ ప్లాన్లు’.. ‘#విజిల్ పోడు’ అని పేర్కొంది. సైనిక దుస్తుల్లో బ్యాటింగ్ చేస్తున్న ధోని ఫొటో వైరల్ అయింది. ఆగస్టు 15న లేహ్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ధోని సియాచిన్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించాడు. అనంతరం సియాచిన్ సైనిక పాఠశాలకు వెళ్లి అక్కడి విద్యార్థులతో కాసేపు క్రికెట్ ఆడాడు. ఇక జూలై 30వ తేదీ నుంచి ఆర్మీ బెటాలియన్‌లో శిక్షణ తీసుకోవడంతో ధోని అక్కడ విధుల్లో పాల్గొన్నాడు. ఆగస్టు15 వ తేదీతో ధోని కాల పరిమితి ముగియడంతో ఇంటికి చేరుకునేందుకు శనివారం తిరుగు ప్రయాణం అయ్యాడు. (చదవండి : ధోని తిరుగు ప్రయాణం..) కశ్మీర్ లోయలోని సైనికులతో కలిసి పెట్రోలింగ్, గార్డ్, పోస్ట్ గార్డ్ డ్యూటీలను ధోని నిర్వర్తించాడు. కశ్మీర్‌లోని మిలిటెంట్ల ఏరివేతలో ప్రధాన భూమిక పోషించే విక్టర్ ఫోర్స్‌లో ధోని పనిచేశాడు. ఆర్మీలో గౌరవ లెప్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోని.. సైన్యంతో కలిసి విధులు నిర్వర్తించేందుకు వెస్టిండీస్ పర్యటనకు దూరమైన విషయం తెలిసిందే. 2015 సంవత్సరం ఆగ్రాలో ధోని తొలిసారి సైనిక పారాట్రూపర్ గా నెలరోజుల పాటు శిక్షణ తీసుకున్నారు. 1250 అడుగుల ఎత్తులో ఏఎన్ 32 సైనిక విమానం నుంచి ధోనీ పారాచూట్ సహాయంతో కిందకు దూకి, నేల మీద సురక్షితంగా ల్యాండవ్వడంతో ఆయన పారాట్రూపర్ గా అర్హత పొందారు. ప్రపంచకప్ సమయంలో కూడా సైనికుల త్యాగానికి చిహ్నమైన ‘బలిదాన్ బ్యాడ్జ్’ను కీపింగ్ గ్లౌవ్స్‌పై ధరించిన సంగతి తెలిసిందే. -
రైల్లో విమానం లాంటి కోచ్‌లు
న్యూఢిల్లీ: అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలోనే రైల్లోనూ విమానంలో ఉండే ప్రెషరైజ్డ్ కోచ్‌లను చూడొచ్చు. చైనా సరిహద్దుల్లో నిర్మిస్తున్న బిలాస్పూర్–మనాలి–లేహ్ మార్గంలో ప్రయాణించే రైళ్లలో ఇలాంటి బోగీలను ఏర్పాటుచేయాలని రైల్వే శాఖ యోచిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే మార్గం ఇదే. కాబట్టి సముద్ర మట్టానికి సుమారు 5 వేల మీటర్ల ఎత్తులో వెళ్లే సమయంలో ప్రయాణికులు శ్వాస సంబంధ సమస్యలు ఎదుర్కోకుండా ఉండేందుకు రైల్వే శాఖ ప్రత్యామ్నాయ మార్గాలు వెదుకుతోంది. ఇందుకోసం విమానాల్లో ఉండే ప్రెషరైజ్డ్ కోచ్‌ల లాంటివి అయితే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తోంది. ఎక్కువ ఎత్తులో ప్రయాణికులు శ్వాస తీసుకునేందుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు విమానాల్లో ప్రెషరైజ్డ్ కోచ్‌లను ఏర్పాటుచేస్తారు. ప్రస్తుతం చైనాలోని క్వింగే–టిబెట్ రైల్వే లైనులోనే ఈ తరహా కోచ్‌లను వినియోగిస్తున్నారు. ఆక్సీజన్ పాళ్లు తక్కువగా ఉన్న వాతావరణంలో ప్రయాణికుల్ని తీసుకెళ్లేలా ఈ కోచ్‌లను డిజైన్ చేశారు. -
లేహ్‌లో మైనస్ 11.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని లేహ్‌లో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. లఢక్‌లోని లేహ్‌లో గురువారం రాత్రి అత్యల్పంగా మైనస్ 11.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంతకుముందు రాత్రి మైనస్ 7.1 డిగ్రీలుగా నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కార్గిల్‌లో మైనస్ 9.2 డిగ్రీలు, శ్రీనగర్‌లో మైనస్ 2.8 డిగ్రీలు, దక్షిణ కశ్మీర్‌లోని ఖాజీగంఢ్లో మైనస్ 2.4 డిగ్రీలు, గుల్మార్గ్లోని స్కీ రిసార్ట్‌లో మైనస్ 5.4 డిగ్రీలు, పహల్గామ్ వద్ద మైనస్ 2.4 డిగ్రీలు నమోదయ్యాయి. -
మీకు డ్రైవింగ్ రాదా.. ఈయన గురించి తెలుసుకోండి!
దేశంలో ప్రతిరోజూ చాలామంది డ్రైవింగ్ నేర్చుకుంటూ ఉంటారు. డ్రైవింగ్ పరీక్షల్లో పాసై లైసెన్స్ కూడా పొందుతారు. కొంతమంది మాత్రం డ్రైవింగ్ నేర్చుకోవడానికి నానాతంటాలు పడుతుంటారు. అలాంటి వారికి 45 ఏళ్ల అగ్నిహోత్రి స్ఫూర్తి అని చెప్పవచ్చు. దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందిన అరుదైన వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. రెండు చేతులూ లేకపోయినా కాళ్లతో వాహనాన్ని నడుపుతూ ఆయన తనదైన ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు. కాళ్లతో నడుపుతూ లైసెన్స్ పొందిన దేశంలోని దాదాపు మొదటి వ్యక్తిగా అగ్నిహోత్రి ఘనత సొంతం చేసుకున్నారు. ఇండోర్‌కు చెందిన అగ్నిహోత్రి సకంల్పానికి వైకల్యం అడ్డుకాదని చాటారు. స్ఫూర్తిదాయక ప్రసంగాలు ఇచ్చే వక్త అయిన ఆయన.. ప్రస్తుతం ఎల్ఎల్బీ చేస్తున్నారు. సొంతంగా ఓ గ్యాస్ ఏజెన్సీని నడుపుతున్నారు. ఆయన వాహనాన్ని నడిపేందుకు గతంలో డ్రైవర్ ఉండేవారు. కానీ, ప్రాథమిక అవసరాల కోసం ఇతరులపై ఆధారపడకూడదనేది ఆయన పాలసీ. అందుకే మొక్కవోని సంకల్పంతో రెండు చేతులూ లేకున్నా డ్రైవింగ్ నేర్చుకున్నారు. చేతులు లేకున్నా ఆయన డ్రైవింగ్ ఎలా చేస్తారనేది కొంతమందికి సందేహం రావొచ్చు. కానీ ఆయన కుడికాలితో స్టీరింగ్‌ను కంట్రోల్ చేస్తూ.. ఎడుమ కాలితో ఆక్సిలరేటర్ను ఉపయోగిస్తూ.. ఆటోమేటిక్ గేరు కారును నడుపుతారు. అగ్నిహోత్రి డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తును రవాణాశాఖ పలుమార్లు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో తనకు అనుగుణంగా ఉండేవిధంగా కారును రూపొందించుకొని.. డ్రైవింగ్ టెస్టుల్లో దానిని విజయవంతంగా నడిపి.. అగ్నిహోత్రి ఈ ఘనత సాధించారు. డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరికి వరుసగా వినతిపత్రాలు ఇస్తూ పోయిన ఆయన.. ఎట్టకేలకు సెప్టెంబర్ 30వ తేదీన శాశ్వత లైసెన్స్ సాధించారు. రోడ్డు మీద ఎంతోమంది ఇప్పటికే వాహనాలు నడిపించడానికి నానా తంటాలు పడుతుంటారు. కానీ, అగ్నిహోత్రి మాత్రం రెండు చేతులూ లేకపోయినా ఇప్పటివరకు 14,500 కి.మీ దూరాన్ని ఎలాంటి విజయవంతంగా ఎలాంటి ప్రమాదాలు చేయకుండా నడిపారు. త్వరలో జమ్ముకశ్మీర్‌లోని లెహ్ వరకు తానే వాహనాన్ని నడుపుతూ వెళ్లాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. -
'3పీ'లతో లడఖ్ అభివృద్ధి: మోడీ
లెహ్: సియాచిన్‌పై రాజీ పడే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. జమ్మూకాశ్మీర్‌లోని లడఖ్ పర్యటనకు వచ్చిన ప్రధాని ఆర్మీ జవాన్లను ఉద్దేశించిన ప్రసంగించారు. కాశ్మీర్ అభివృద్ధికి తన వంతు కృషి కృషి చేస్తానని హామీయిచ్చారు. ప్రజల ప్రేమే తనకు ఇక్కడికి రప్పించిందన్నారు. ఈ ప్రాంత బలమేంటో తనకు తెలుసునని, ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా తెలుసునని అన్నారు. లడఖ్ అభివృద్ధికి కోసం ఆయన '3పీ' ఫార్ములా ప్రకటించారు. ప్రకాష్(వెలుగు-విద్యుత్), పర్యావరణ్(పర్యావరణం), పర్యాటన్(పర్యాటకం)తో లడఖ్ అభివృద్ధికి పాటుపడతామన్నారు. నిమో బాగ్జో హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టును ప్రధాని జాతికి అంకితం చేశారు. లెహ్-కార్గిల్-శ్రీనగర్ ట్రాన్స్మిషన్ వ్యవస్థ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు.