Manchu Laxmi
-
మనోజ్‌ను దూరం పెట్టారా? విభేదాలపై స్పందించిన మంచు లక్ష్మీ
మంచు మోహన్‌బాబు కూతురు మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. నిత్యం ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తుంటారామె. ఈమధ్య మంచు కుటుంబంలో విభేదాలు తలెత్తాయని, మనోజ్‌ను కుటుంబం దూరం పెట్టిందంటూ నెట్టింట ప్రచారం జరుగుతుంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు లక్ష్మీ తనపై వచ్చే ట్రోల్స్, కుటుంబంలో విభేదాలపై స్పందించింది. 'ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నేను మాట్లాడే విధానంపై చాలామంది విమర్శలు చేస్తుంటారు. ఇంట్లో కూర్చొని ఏ పనీపాటా లేకుండా కామెంట్స్ చేసేవాళ్లని నేను పట్టించుకోను. ఇక నా ఫ్యామిలీ విషయానికి వస్తే.. అవన్నీ మా పర్సనల్. మా ఇంట్లో ఏం జరుగుతుందన్నది మా కుటుంబ విషయం. సమయం వచ్చినప్పుడు మేమంతా కలిసే కనిపిస్తాం. నేనూ, మనోజ్ ఎక్కువగా కలుస్తుంటాం. విష్ణు మా ఇద్దరి కంటే భిన్నమైన వ్యక్తి. తన పిల్లలు, బిజినెస్, వర్క్‌పైనే ఎక్కువ ఫోకస్ పెడ్తాడు. అన్నీ సోషల్ మీడియాలో పెట్టాల్సిన అవసరం లేదు' అంటూ చెప్పుకొచ్చింది. -
Fashion: డి బెల్లె బ్రాండ్ సారీలో లక్ష్మీ మంచు! చీర ధర ఎంతంటే!
నటిగా, నిర్మాతగా, టాక్ షో హోస్ట్‌గా.. ఏ రోల్ అయినా పర్ఫెక్ట్గా పోషిస్తారు లక్ష్మీ మంచు. ఫ్యాషన్‌లోనూ అదే పర్ఫెక్షన్ను చూపిస్తున్నారు. ఆ ఠీవికి కారణమైన బ్రాండ్స్‌లో ఇవీ ఉన్నాయి.. డి బెల్లె..... సూరత్‌కు చెందిన నాన్సీ లుహరువాలాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఆ ప్రయాణమే వివిధ ప్రాంతాల్లో ధరించే దుస్తులపై ఆమెకు ఆసక్తి కలిగేలా చేసింది. ఆ ఆసక్తితోనే నాన్సీ 2014లో లేబుల్ ‘డి బెల్లె’ను ప్రారంభించి డిజైనర్‌గా మారింది. ఆధునిక మహిళలను ఆకట్టుకునేలా పలురకాల దుస్తులను రూపొందించడం ఆమె డిజైనింగ్‌లోని విశిష్టత. విదేశాల్లోనూ నాన్సీ కలెక్షన్స్‌కు మంచి డిమాండ్ ఉంది. డిజైన్ బట్టే ధరలు. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. రోజ్ జ్యూయెల్స్.. దేశంలోని ప్రముఖ జ్యూయెలరీ బ్రాండ్స్‌లో ఇది ఒకటి. 1981లో మొదలైందీ సంస్థ. ‘రోజ్ ’ అనే పేరు అందం, శక్తి, రాయల్టీని సూచిస్తుంది. భారతీయ హస్తకళల నైపుణ్యాన్ని, విలువను సంరక్షించడం ఈ బ్రాండ్ లక్ష్యం. తూర్పు, పశ్చిమ దేశాల సంస్కృతి, అభిరుచుల సమ్మేళనంగా ఉంటాయి ఈ ఆభరణాలు. ధర లక్షల్లోనే.. ఆన్ లైన్లోనూ లభ్యం. బ్రాండ్ వాల్యూ చీర బ్రాండ్: డి బెల్లె ఈ ఆనియన్ పింక్ చీర ధర: రూ. 1,44,000 జ్యూయెలరీ బ్రాండ్: రోజ్ జ్యూయెల్స్ ధర: డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. అనుభవాన్ని మించిన గురువు ఉండరు. జీవన ప్రయాణంలో ఎదురయ్యే వ్యక్తులు, సంఘటనలకు మించిన పాఠాలు ఉండవు. – లక్ష్మీ మంచు -దీపిక కొండి చదవండి: Sobhita Dhulipala: శోభిత కట్టిన ఈ చీర ధర 4 లక్షల 80 వేలు! Retro Style: రెట్రో స్టైల్.. నాటి మహారాణీ చీరకట్టు హుందాతనం.. మళ్లీ ఇలా View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
నాన్న తో కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా
-
శ్రీవారిని దర్శించుకున్న విష్ణు, మంచు లక్ష్మి
సాక్షి, చిత్తూరు : ప్రముఖ సినీ నటుడు మంచు విష్ణు, మంచు లక్ష్మి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీ వేంకటేశ్వరుని సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతూ... తిరుపతిలో మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియా సినిమా షూటింగ్ ప్రారంభం అయిందని, మోసగాళ్ళు సినిమా త్వరలోనే విడుదల కానుందని అన్నారు. మోసగాళ్ళు సినిమా విడుదల సందర్బంగా స్వామి వారి ఆశీస్సులు పొందమని చెప్పారు. త్వరలోనే శ్రీను వైట్ల దర్శకత్వంలో మరో సినిమా ప్రారంభం చేయనున్నట్లు మంచు విష్ణు తెలిపారు. చదవండి: అంతకు మించి దారి లేదంటున్న హీరో సూర్య -
మిడ్‌మానేరు వద్ద మంచు లక్ష్మి షూటింగ్
సాక్షి, కరీంనగర్: శ్రీరాజరాజేశ్వర(మిడ్‌మానేరు) ప్రాజెక్టు పరిసరాలు షూటింగ్ స్పాట్‌గా మారాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ మిడ్‌మానేరు ప్రాజెక్టు వెబ్ సిరీస్ పాటల చిత్రీకరణకు వేదికగా మారుతోంది. ప్రాజెక్టు డౌన్ స్ట్రీమ్, వరదకాలువ పరిసరాలతోపాటు, ప్రాజెక్టు బ్యాక్‌వాట ర్ ఏరియాలో ప్రముఖ టీవీ ఛానళ్లు సీరియల్స్ షూటింగ్ నిర్వహించడం విశేషం. పలువురు లోకల్ టాలెంట్ కళాకారులు, యూ ట్యూబ్ ఛానల్స్ వారు పలు జానద గేయాలు చిత్రీకరిస్తున్నారు. వరదకాలువ వద్ద మంచు లక్ష్మి షూటింగ్ గత జనవరి మొదటి వారంలో వెబ్ సిరీస్ ఆన్లైన్ షూటింగ్ నిమిత్తం ప్రముఖ నటుడు మోహన్‌బాబు కూతురు మంచు లక్ష్మితో దేశాయిపల్లి వరదకాలువ వద్ద షూటింగ్ నిర్వహించారు. దర్శకుడు తరుణ్ భాస్కర్ వరదకాలువపై నుంచి ఓ అమ్మాయి నీటిలో దూకే సీన్ చిత్రీకరించారు. ఇందులో మంచు లక్ష్మి గ్రామ పెద్ద పాత్ర పోషించారు. బ్యాక్ వాటర్ ఏరియాలో టీవీ సీరియళ్ల చిత్రీకరణ సందడి వారంక్రితం మిడ్‌మానేరు ప్రాజెక్టు ముంపు గ్రామం వరదవెల్లి బ్యాక్ వాటర్ పరిసరాల్లో మా టీవీ నిర్మిస్తున్న కస్తూరి సీరియల్ షూటింగ్ సందడి చేసింది. అగ్నిసాక్షి సీరియల్ ఫేం హీరోయిన్ ఐశ్వర్య, సూర్య, గౌతంరాజు నటించారు. వైద్యశిబిరం జరిగే సన్నివేశం చిత్రీకరించారు. మూడురోజులపాటు షూటింగ్ చేశారు. వారంక్రితం జరిగిన సీరియల్ షూటింగ్ దృశ్యం జానపద గీతాలు.. మిడ్‌మానేరు ప్రాజెక్టు పరిసరాల్లో లోకల్ టాలెంటెడ్ కళాకారులు పలు జానపద గీతాలు చిత్రీకరించారు. కరీంనగర్, వేములవాడ ప్రాంతాలకు చెందిన పలువురు జానపద కళాకారులు తమ టాలెంట్‌తో నిర్వహించే గీతాలు చిత్రీకరిస్తున్నారు. మండలంలోని కొదురుపాకకు చెందిన జానపద కళాకారుడు కత్తెరపాక శ్రీనివాస్ పలు ప్రేమ గీతాలతోపాటు, జానపద గీతాలు చిత్రీకరించారు. ప్రాజెక్టు అందాలు అద్భుతం మెరుగు యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో నిర్మించిన సరియా.. సరియా.. అనే గీతంలో నటించా. ప్రాజెక్టు గేట్ల పరిసరాల్లో పాట చిత్రీకరించారు. గేట్ల మీదుగా నీరు వెళ్తుండగా సాంగ్‌లో నటించడం ఎంతో మధురానుభూతిని అందించింది. – అశ్రుత, నటి, హైదరాబాద్ ప్రాజెక్టు వద్ద సందడి మాన్వాడ వద్ద గల మిడ్‌మానేరు ప్రాజెక్టు పరిసరాలు షూటింగ్‌కు వేదికయ్యాయి. ప్రాజెక్టు గేట్లు, బ్యాక్ వాటర్ పరిసరాల్లో వివిధ యూట్యూబ్ ఛానల్స్ వారు పలు జానపద గీతాలు చిత్రీకరిస్తున్నారు. దీంతో ప్రాజెక్టు పరిసరాల్లో సందడి నెలకొంది. దీంతో గ్రామానికి సందర్శకుల తాకిడి పెరిగింది. – రామిడి శ్రీనివాస్, సర్పంచ్, మాన్వాడ -
మన ఆహారం మనమే పండించుకుందాం!
‘మనం ఏం తింటామో అదే మనం’ అంటారు. ఆ సామెతను పూర్తిగా పాటిస్తున్నారు సమంత. లాక్డౌన్ సమయాన్ని గార్డెనింగ్‌కి కేటాయించారు. ఇంటికి కావాల్సిన కూరగాయలను, పండ్లను సొంతంగా పండించి, వాటికి కావాల్సిన ఎరువులను కూడా కొన్నింటిని తయారు చేసి ఓపికగా పండించారు సమంత. వీటికి సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటున్నారు. తనతో పాటు గార్డెనింగ్ ప్రారంభించండి అని రకుల్ ప్రీత్, మంచు లక్ష్మీలకు ‘గ్రో విత్ మీ’ చాలెంజ్ విసిరారు. ఈ చాలెంజ్ స్వీకరించిన రకుల్ మాట్లాడుతూ – ‘‘గ్రో విత్ మీ’ చాలెంజ్‌కి నన్ను నామినేట్ చేసినందుకు థ్యాంక్యూ సమంత. మనం నాటిన గింజలు మొక్కలుగా మారే ప్రక్రియను గమనించడం వర్ణించలేని అద్భుతమైన అనుభూతి. మనం తినేది మనమే పండిస్తే మన శరీరానికి కావాల్సినవన్నీ అవే మనకు సమకూరుస్తాయి అని విన్నాను. గార్డెనింగ్ ద్వారా ప్రకృతితో పాటు మనతో మనం మమేకం అవుదాం’’ అన్నారు. గార్డెనింగ్ ప్రారంభించిన ఓ వీడియోను షేర్ చేశారు కూడా. లక్ష్మీ మంచు మాట్లాడుతూ– ‘‘ఈ కరోనా వల్ల మనందరం తెలుసుకున్న ఓ ముఖ్య విషయం ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చాలా అవసరం అని. మొక్కలు మనందరికీ ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. మనకు కావాల్సిన ఆహారం, స్వచ్ఛమైన గాలి ఇలా ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. ఏదైనా లేకుండా బతకొచ్చు గానీ ఆహారం లేకుండా కచ్చితంగా బతకలేం. అందుకే నేను, నివీ (లక్ష్మీ కుమార్తె నిర్వాణ మంచు) కలసి గార్డెనింగ్ ప్రారంభిస్తున్నాం’’ అని విత్తనాలు నాటుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. సమంత తన గార్డెన్లో పండించిన క్యారెట్స్‌ను చూపిస్తూ, ‘‘ఈ వారం మా ఇంట్లో అన్నీ క్యారెట్ ఐటమ్సే. క్యారెట్ హల్వా, క్యారెట్ పచ్చడి, క్యారెట్ జ్యూస్, క్యారెట్ ఫ్రై, క్యారెట్ పకోడి, క్యారెట్ ఇడ్లీ, క్యారెట్ సమోస’’ అని సరదాగా క్యాప్షన్ చేశారు. -
చెట్టులెక్కగలను
లాక్ డౌన్ సమయాన్ని కూతురితో సరదాగా గడుపుతున్నారు మంచు లక్ష్మి. ఇంటి ముందు ఉన్న మామిడి చెట్టు ఎక్కిన వీడియోను పోస్ట్ చేశారామె. ‘‘నా చిన్నప్పటి నుంచి ఈ మామిడి చెట్టు మా ఇంటి ముందే ఉంది. కానీ ఎప్పుడూ హాయ్ చెప్పి, మా పరిసరాలను చల్లగా ఉంచుతున్నందుకు థ్యాంక్స్ చెప్పే వీలు దొరకలేదు. ఈ లాక్ డౌన్ లో ఆ చాన్స్ దొరికింది. ఇన్ని రోజులూ మన చుట్టూ ఉన్నా మనం పట్టించుకోకుండా ఉన్నవాటికి కృతజ్ఞతలు తెలపాల్సిన సమయం ఇది’’ అని పేర్కొన్నారు లక్ష్మి. సరదాగా చెట్టు ఎక్కి, కుమార్తె విద్యా నిర్వాణకు మామిడికాయలు కోసిపెట్టారామె. ‘చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా’ అని ‘చెంచులక్ష్మి’ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావుని అంజలీదేవి అడిగితే... ‘చెట్టులెక్కగలనే ఓ చెంచిత..’ అంటారాయన. లక్ష్మి కూడా చెట్టులెక్కగలను అని నిరూపించుకున్నారు. -
ఆర్థిక అవగాహన స్త్రీలకే ఎక్కువ
►స్క్రీన్ మీద స్త్రీలు కనిపించడం సాధారణమే. కానీ కెమెరా వెనక పని చేస్తున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. కారణం? లక్ష్మి: లేడీ ప్రొడ్యూసర్స్ మరింతమంది రావాలి. ఎందుకంటే ఆర్థిక అవగాహన వాళ్లకు చాలా ఉంటుంది. అది మనకు తెలియక ఉమెన్ ప్రొడ్యూసర్స్‌ని తీసుకురావడం లేదు. ఎక్కువ మంది స్త్రీలు నిర్మాతలుగా ఉంటే ఇండస్ట్రీ ఇంకా సాలిడ్‌గా ఉంటుంది. ►స్త్రీలు నిర్మాతలైతే షూటింగ్ లొకేషన్లో ఎలాంటి వాతావరణం ఏర్పడుతుంది? స్త్రీలు ఏ రంగంలో ఉన్నా వాళ్లకు తెలియకుండానే ఓ రకమైన సున్నితత్వం, సురక్షితమైన వాతావరణం తీసుకువస్తారు. అఫ్కోర్స్... ఇండస్ట్రీలోకి ఇంకా ఎక్కువమంది స్త్రీలు రావాలి. మెల్లిగా మార్పు వస్తుంది. ►రామానాయుడుగారు నిర్మాతగా వంద సినిమాలుపైనే నిర్మించారు. లేడీ ప్రొడ్యూసర్స్ కూడా ఆ రికార్డుని అందుకోగలుగుతారా? సినిమాలు నిర్మించడం అనేది మాములు విషయం కాదు. 500 సినిమాల్లో యాక్ట్ చేశాను.. 1000 సినిమాలు చేశాను అని చెప్పుకునే ఘనత మాకుంటుందో ఉండదో! ఇంతకు ముందు ఓ సినిమా 20–30 రోజుల్లో పూర్తయ్యేది. ఇప్పుడు మూడొందల రోజులయినా అవ్వడం లేదు. అన్ని సినిమాలు నిర్మించడం రామానాయుడు అంకుల్కే సాటి. ►నిర్మాణంలో మగవాళ్లకి, ఆడవాళ్లకి ఉండే తేడా ఏంటి? నిర్మాతగా నేను సెట్స్‌లోకి వెళ్తే చాలామంది ఉమెన్ నా సెట్లో ఉండాలనుకుంటాను. స్క్రిప్ట్ రాసేవాళ్లలో కానీ, ప్రొడక్షన్లో కానీ ఎక్కువమందిని ప్రోత్సహించాలనుకుంటాను. ఫిమేల్ టెక్నీషియన్స్ ఎంత ఎక్కువమంది ఉంటే అంత మంచిది అనుకుంటాను. ►నిర్మాణంలో మీరు ఎదుర్కొనే చాలెంజ్‌లు ఏంటి? ఛాలెంజ్‌లు ప్రతీ రంగంలోనూ ఉంటాయి. నేను సామర్థ్యాన్ని బట్టి పని రావాలని కోరుకుంటాను కానీ ఆడపిల్ల అయినందువల్లో, పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్నందువల్లో నాకు పని ఇవ్వాలని కోరుకోను. ►ఝుమ్మంది నాదం, ఊ కొడతారా ఉలిక్కిపడతారా, గుండెల్లో గోదారి, దొంగాట వంటి సినిమాలు నిర్మించారు. ఈ మధ్య నిర్మాతగా స్లో అయ్యారెందుకని? ఈ కథను కచ్చితంగా చెప్పాలి అని నేను భావించినప్పుడు సినిమా నిర్మించాలనుకుంటాను. అలా అనిపించినప్పుడు సినిమా నిర్మిస్తూనే ఉంటాను. సినిమా నిర్మించకపోయినా టెలివిజన్‌లో ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను. అన్నీ ఒకే సమయంలో చూసుకోలేను. కాబట్టి ఒక్కొక్కటీ ఒక్కో సమయంలో చేస్తున్నాను. ►మీకు బ్యాగ్రౌండ్ ఉంది కాబట్టే సినీ నిర్మాణంలో కొనసాగగలుగుతున్నారని అనుకోవచ్చా? ప్రొడ్యూసర్ అవడానికి బ్యాగ్రౌండ్ కాదు. మనకు ఇంట్రెస్ట్ ఉందా? లేదా అన్నది ముఖ్యం. ►ఫ్యామిలీ లెగసీని మోయడం ఒత్తిడికి గురి చేస్తుందా? లెగసీ అనేది సమస్య అని నేను అనను. వారసత్వం అనేది మనకు ఫస్ట్ రెడ్ కార్పెట్ వేస్తుందేమో కానీ దానికింద ముళ్లు మాత్రం ఉంటాయి. మనం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే బ్యాగ్రౌండ్‌కి మచ్చ తెచ్చినవాళ్లం అవుతాం. నేను నటించినా, నిర్మించినా లెగసీని గుర్తుపెట్టుకుంటాను. -
తొమ్మిది గంటల్లో...
చైతన్య మాదాడి, దివి ప్రసన్న జంటగా న టించిన చిత్రం ‘హవా’. 9 గంటలు, 9 బ్రెయిన్స్, 9 నేరాలు అనేది ట్యాగ్‌లైన్. ఫిల్మ్ అండ్ రీల్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి మహేశ్ రెడ్డి దర్శకుడు. సినిమా అంతా 9 గంటల్లో జరిగే స్టోరీ కావటం విశేషం. ఈ చిత్రాన్ని పూర్తిగా ఆస్ట్రేలియాలో తెరకెక్కించారు. ఆగస్టు 23న సినిమా విడుదల కానున్న ఈ చిత్రంలోని థీమ్ సాంగ్‌ను విడుదల చేశారు నిర్మాత, నటి లక్ష్మీ మంచు. లక్ష్మీ మాట్లాడుతూ– ‘‘మేకింగ్ చాలా గ్రాండియర్‌గా ఉంది. థీమ్ సాంగ్ పిక్చరైజేషన్ ఆసక్తిగా అనిపించింది’’ అన్నారు. ‘‘నా పాత్ర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందని నమ్ముతున్నా’’ అన్నారు దివి ప్రసన్న. ‘‘ఈ థీమ్ సాంగ్ చిత్రానికి హైలెట్’’ అన్నారు చైతన్య మాదాడి. మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘లక్ష్మీప్రియాంక రాసిన థీమ్ సాంగ్ ఇది. కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ‘హవా’ ప్రేక్షకులను ఎక్కడా రిలాక్స్ అవనివ్వని కథనం హైలెట్‌గా ఉంటుంది’’ అన్నారు. -
‘టీచ్ ఫర్ ఛేంజ్’
-
‘టీచ్ ఫర్ ఛేంజ్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన లక్ష్మీ మంచు
ఇప్పటికే ‘నేను సైతం’ లాంటి కార్యక్రమంతో ఆపన్నులని ఆదుకోడానికి ముందుకు వచ్చి తన పెద్ద మనసు చాటుకున్న నటి లక్ష్మీ మంచు.. మరో సామాజిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘టీచ్ ఫర్ ఛేంజ్’ పేరుతో ఎలాంటి లాభాపేక్ష ఆశించని సంస్థను ఏర్పాటు చేయడంతో పాటు దాని ద్వారా నిరుపేద చిన్నారులకు చదువు చెప్పించే బాధ్యతను తీసుకున్నారు. ఐటీ సంస్థలకు కావాల్సిన సమాచారాన్ని ఇస్తూ డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఫ్లాట్‌ఫామ్‌లో లీడింగ్ కంపెనీగా ఉన్న పెగా సిస్టమ్స్‌తో కలిసి ‘టీచ్ ఫర్ ఛేంజ్’ ద్వారా జాతీయ స్థాయిలో సేవలు అందించనున్నట్లు ప్రకటించారు. వసతుల లేమితో ఇబ్బందులు పడే చిన్నారుల్లో అక్షరాస్యతను అభివృద్ధి చేయడంతో పాటు వారిలో నాయకత్వ నైపుణ్యాలు పెంచే విధంగా తీర్చిదిద్దనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో లక్షల సంఖ్యలో ఉన్న 3 నుంచి 5 సంవత్సరాల చిన్నారులకు నాణ్యమైన విద్యని అందించే దిశగా టీచ్ ఫర్ ఛేంజ్ కృషి చేయనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వివిధ కమ్యూనిటీలకు చెందిన చిన్నారుల్లో అక్షరాస్యత నైపుణ్యాలను మెరుగుపర్చడానికి ఈ ఎన్జీవో పని చేస్తుంది. ఇందులో భాగంగా శిక్షణ పొందిన వాలంటీర్లు ఎన్జీవో ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు విద్యను బోధిస్తారు. ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, వైజాగ్‌లలో చురుగ్గా ఉన్న ఎన్జీవో.. ఈ విద్యా సంవత్సరం నుంచి ముంబై, ఢిల్లీ, లక్నో, చెన్నైలకు కూడా తన కార్యకలాపాలను విస్తరించనుంది. ప్రాథమిక పాఠశాలలు, మున్సిపల్ స్కూల్స్‌లో అక్షరాస్యత శాతాన్ని పెంచడానికి ఉద్యమంలా చేపట్టిన టీచ్ ఫర్ ఛేంజ్ కార్యక్రమానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వంతు మద్దతు ప్రకటించాయి. 2014లో లక్ష్మీ మంచు స్థాపించిన ఈ సంస్థ ఐక్యరాజ్యసమితి రూపొందిన అభివృద్ధి విధానాల్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది (గోల్ 4 అంతిమ లక్ష్యం నాణ్యమైన విద్యని అందించడం). ఈ కార్యక్రమం ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, వైజాగ్ కొనసాగుతుండగా.. తాజాగా ముంబై, న్యూ ఢిల్లీ, చెన్నై, లక్నోకు విస్తరించారు. మొత్తం ఎనిమిది చోట్ల విజయవంతంగా దీన్ని నిర్వహిస్తున్నారు. ఇక వివిధ నగరాల్లోని వేల మంది పౌరులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే చిన్నారులకి విద్య బోధించడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఈ ప్రభావం దేశవ్యాప్తంగా వెయ్యి పాఠశాలల్లోని లక్షా 50 వేల మంది చిన్నారుల అక్షరాస్యతా వృద్ధి మీద స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విశిష్ట కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు శ్రీమతి జయాబచ్చన్, శ్రీమతి రేణుకా చౌదరి, పార్లమెంట్ సభ్యులు శ్రీమతి మూన్ మూన్ సేన్, పొలిటిషియన్ శ్రీమతి గీతారెడ్డి, ప్రముఖ నటుడు డాక్టర్ మోహన్‌బాబుతో పాటు ఆదితి రావు హైద్రీ, సునీల్ సేథ్, తాప్సీ పన్ను, రకుల్ ప్రీత్ సింగ్, రియా చక్రబర్తి, రెజీనా కసాండ్రా, సూరజ్ పంచోలి, కుబ్రా సైత్ సహా అనేకమంది సినీ, ఫ్యాషన్ రంగ ప్రముఖులు పాల్గొన్నారు. ఆసక్తి ఉన్న వాలంటీర్లు www.teachforchange.in ద్వారా దరఖాస్తు చేయవచ్చు. -
దీక్ష పోరాటం
ఆమె పేరు దీక్ష. ఆమెకు ఒక సమస్య ఉందా? లేక ఆమే ఒక సమస్యా? అనే పాయింట్‌తో ఆద్యంతం థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన చిత్రం ‘వైఫ్ ఆఫ్ రామ్’. మంచు లక్ష్మి టైటిల్ పాత్రలో విజయ్ యెలకంటి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటరై్టన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ‘‘దీక్ష జీవితంలో గుండెలు పగిలే సంఘటనలుంటాయి. ఒక న్యాయం కోసం తను చేసే పోరాటంలో ఆమె ఒకలా ఉండదు. ఎవరికీ తనపై అభిప్రాయం ఏర్పరచుకునే చాన్స్ ఇవ్వదు. ఈ పాత్ర తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచుతుంది. సమాజాన్ని ప్రభావితం చేసిన మహిళల సమక్షంలో జూన్ 1న ట్రైలర్‌ని, అదే నెలలోనే సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సామల భార్గవ్, సంగీతం: రఘు దీక్షిత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుహాసిని రాహుల్, సమర్పణ: కృతి ప్రసాద్, విద్యా నిర్వాణ మంచు, ఆనంద్. -
హాలీవుడ్‌కి హలో
హీరోలంటే కేవలం నటనకే పరిమితం కాదని మంచు మనోజ్ ప్రతీసారి నిరూపిస్తున్నారు. మోహన్‌బాబు వారసుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన స్టైల్‌ని ఏర్పాటు చేసుకున్నారు మనోజ్. న టుడిగా, గాయకుడిగా, పాటల రచయితగా, స్టంట్ మాస్టర్‌గా.. ఇలా ప్రతీ సినిమాకు తనలో ఏదో ఒక కొత్త కోణాన్ని అభిమానులకు చూపిస్తున్నారు మనోజ్. ‘నేను మీకు తెలుసా’ సినిమాలో స్వయంగా స్టంట్స్ కంపోజ్ చేసుకోవడంతో పాటు ‘కన్ను తెరిస్తే జననమేలే’ పాటను కూడా రాసిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘బిందాస్, కరెంట్ తీగ, వేదం, మిస్టర్ నూకయ్య’ వంటి చిత్రాల్లో తన పాత్రకు తానే స్వయంగా స్టంట్స్ కంపోజ్ చేసుకున్నారు. ‘పోటుగాడు’ సినిమాలో ‘ప్యార్ మే పడిపోయాను...’ అని సరదాగా గొంతు కూడా సవరించారు. ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి మ్యూజిక్ డైరెక్టర్‌గా మరో కొత్త అవతారం ఎత్తారు మనోజ్. ఈ చిత్రం ద్వారా హాలీవుడ్‌కి హలో చెబుతున్నారు. ఆస్కార్ విన్నింగ్ యాక్టర్స్ బ్రీ లార్సన్ లీడ్ యాక్టర్‌గా నటించిన హాలీవుడ్ మూవీ ‘బాస్మతీ బ్లూస్’కి సంగీత దర్శకుడిగా మారారు మనోజ్. తన స్నేహితుడు, సంగీత దర్శకుడైన అచ్చుతో కలిసి ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఇందులో లక్ష్మీ మంచు ఓ కీలక పాత్ర పోషించారు. -
హాలీవుడ్‌లోకి దూసుకెళ్తా
మంచు లక్ష్మీ తెలుగు తెరకు పరిచయం కాక ముందు కొన్ని హాలీవుడ్ చిత్రాల్లో కనిపించారు. తమ్ముడు మంచు విష్ణు మాత్రం ముందు ఇక్కడ కనిపించి, అక్కడికెళుతున్నారు. అయితే విష్ణు నటుడిగా కాకుండా నిర్మాతగా హాలీవుడ్‌కు వెళ్లనున్నారు. నయా ప్రొడక్షన్ హౌస్ ‘వియమ్ఆర్ ఎంటర్టైన్మెంట్స్’ ద్వారా ఫారిన్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయబోతున్నారు. బాగా నచ్చి, ఇక్కడ ప్రస్థావించలేని కొన్ని కథలను అక్కడ చెప్పాలనుకుంటున్నారు. అందుకే ఈ కొత్త ప్రొడక్షన్ హౌస్ ఆరంభించారు. విష్ణు దగ్గర బ్రిటీష్, ఆస్ట్రేలియాకు సంబంధించిన టñ క్నీషియన్స్ కూడా ఉన్నారు. ఈ ప్రొడక్షన్ హౌస్ ద్వారా నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ వంటి డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌తో కూడా అసోసియేట్ అవ్వాలనే ఆలోచనలో విష్ణు ఉన్నారని సమాచారం. హాలీవుడ్లో నిర్మాతగా తొలి ప్రాజెక్ట్ గత ఏడాది హైదరాబాద్‌లో జరిగిన కాల్ సెంటర్ స్కామ్ ఆధారంగా ఉండబోతోందని ఫిల్మ్‌నగర్ టాక్. -
తెలుగమ్మాయిగా గర్వపడుతున్నా!
నటిగా, టీవీ వ్యాఖ్యాతగా, నిర్మాతగా తెలుగు చలన చిత్రపరిశ్రమలో మంచి పేరు సంపాదించుకున్నారు మంచు లక్ష్మి. ఈ నెలలో ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డును గెలుచు కున్నారు. గతంలో కూడా ఆమె నంది అందుకున్నారు. ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో 2011లో విడుదలైన ‘అనగనగా ఓ ధీరుడు’ చిత్రంలో ప్రతినాయకురాలి పాత్రలో ఉత్తమ నటనను కనబరచినందుకు మంచు లక్ష్మికి తొలిసారి నంది అవార్డు వచ్చింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 2014లో విడుదలైన ‘చందమామ కథలు’ సినిమాలో లీసా స్మిత్ పాత్రలో ఆమె అద్భుతంగా నటించారని, ఏపీ ప్రభుత్వం ఆమెకు ఉత్తమ సహాయనటి విభాగంలో నంది అవార్డును అనౌన్స్ చేసింది. మంచి లక్ష్మికి అవార్డు రావడం పట్ల చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. ‘‘అవార్డు ఇచ్చిన ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు. తెలుగు అమ్మాయిగా నాకెంతో గర్వంగా ఉంది’’ అన్నారు మంచు లక్ష్మి. -
రిచ్.. స్టైలిష్.. గరుడవేగ
-
'వాట్సప్‌లో మానస సరోవర దర్శనం'
సీనియర్ నటుడు మోహన్ బాబుకు దైవ భక్తి కాస్త ఎక్కువన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆయన వారసులకు కూడా భక్తి భావం అధికమే. ప్రస్తుతం మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ మానస సరోవర యాత్రలో ఉన్నారు. యాత్రలో భాగంగా సోమవారం ఈశ్వర దర్శనం చేసుకున్న మంచు లక్ష్మీ వాట్సప్ లైవ్ ద్వారా తన తండ్రికి ముక్కంఠి దర్శనం చేయించారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ పేజ్ లో వెల్లడించిన మోహన్ బాబు.. 'నా కుమార్తె లక్ష్మిప్రసన్న మానస సరోవర యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఆ కైలాసనాథుని దర్శించుకుని ఆశీస్సులు పొందింది....వాట్స్‌యాప్ లైవ్ లో నాక్కూడా ఈశ్వరుని దర్శనభాగ్యం కలుగగా నా జీవితం ధన్యమయ్యింది. ఆ పరమశివుడు అందరినీ చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను.శంభోశంకర' అంటూ ట్వీట్ చేశారు. నా కుమార్తె లక్ష్మిప్రసన్న మానసరోవర యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకుంది.ఆ కైలాసనాథుని దర్శించుకుని ఆశీస్సులు పొందింది.... — Mohan Babu M (@themohanbabu) 11 September 2017 వాట్స్‌యాప్ లైవ్‌లో నాక్కూడా ఈశ్వరుని దర్శనభాగ్యం కలుగగా నా జీవితం ధన్యమయ్యింది.ఆ పరమశివుడు అందరినీ చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను.శంభోశంకర — Mohan Babu M (@themohanbabu) 11 September 2017 -
దాసరి మృతి; మంచు లక్ష్మీ అభ్యర్థన
హైదరాబాద్: దర్శకరత్న దాసరి నారాయణరావు మరణంతో ఆయన శిష్యుల్లో అగ్రగణ్యుడైన మోహన్‌బాబు కుటుంబం దిగ్భ్రాంతికిలోనైంది. గురువు మరణవార్త తెలిసిన వెంటనే కిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన మంచు కుటుంబం.. ఆ తర్వాత దాసరి నివాసం, అంతిమయాత్రలోనూ కీలకంగా వ్యవహరించారు. అయితే దర్శకరత్న మరణంపై స్పందించాల్సిందిగా పదేపదే అడగడంతో మీడియా ప్రతినిధులకు మంచు లక్ష్మీ ఒక అభ్యర్థన చేశారు. ‘ఇప్పుడు మాట్లాడే పరిస్థితుల్లో నేను లేను.. దయచేసి మాట్లాడించే ప్రయత్నం చేయకండి..’ అని ట్విట్టర్ ద్వారా అభ్యర్థించారు. ఇదిలాఉంటే తన తమ్ముడు మంచు మనోజ్‌ను దాసరి ఎత్తుకునిఉన్న అరుదైన ఫొటోను మంచు లక్ష్మీ షేర్ చేశారు. దాసరి ఒక శక్తి అని, అడిగినవారికల్లా కాదనకుండా సహాయం చేసేవారని లక్ష్మీ కామెంట్ పెట్టారు. దాసరి నిజమైన సినీ ప్రేమికుడని, ఆయన మరణం మా కుటుంబానికి తీరని లోటని లక్ష్మీ పేర్కొన్నారు. I humbly request the media to stop bombarding me w calls to give a statement. I am saddened beyond words. -
క్షమాపణ కోరిన మంచు లక్ష్మీ
సినీరంగంలో జరిగే పరిణామాలతో పాటు సామాజిక అంశాలపై కూడా ఈ మంచువారమ్మాయి లక్ష్మీ ప్రసన్న స్పందిస్తుంటుంది. త్వరలో కొత్త సంవత్సరంలో అడుగుపెట్టబోతున్న నేపథ్యంలో మంచు లక్ష్మీ చేసిన ఓ ట్వీట్ ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటోంది. ' గత నెల ఇదే రోజు.. కాస్ట్రో జీవించి ఉన్నాడు. అమ్మ ఆరోగ్యం మెరుగుపడుతోంది. అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలిని ఎన్నుకొనేందుకు సిద్ధమవుతోంది. మీ అందరి దగ్గర డబ్బుంది' అంటూ ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్ తాను ముందుగానే చేశానని అదే ట్వీట్‌ను మంచు లక్ష్మీ కాపీ చేసిందంటూ సదరు వ్యక్తి లక్ష్మీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేయటంతో ఆమె క్షమాపణ చెప్పింది. తనకు ఫ్రెండ్ ద్వారా వచ్చిన ఆ మెసేజ్‌లో పేరు లేకపోవటంతో క్రెడిట్ ఇవ్వకుండానే తాను ట్వీట్ చేశానని అందుకు తనను క్షమించాలని కోరింది. అంతేకాదు ఆసక్తికరమైన ట్వీట్ చేసిన ఆ వ్యక్తిని అభినందించింది. సినీ రంగంలో వారసురాళ్లుగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన వారు చాలా తక్కువ. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో వారసురాళ్లు తెర మీదకు రావడమే చాలా అరుదు. కానీ మోహన్ బాబు వారసురాలు మంచు లక్ష్మీ మాత్రం ఈ సాంప్రదాయాలకు మినహాయింపు. కలెక్షన్ కింగ్ వారసురాలిగా వెండితెర అరంగేట్రం చేసిన లక్ష్మీ నటిగానే కాక నిర్మాతగాను మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినీ రంగంతో పాటు ఇతర వ్యాపార రంగాల్లోనూ దూసుకుపోతోంది. Come to think of it.... Last month this day,Castro was around,Jayalalitha was alive,Currency was fine,Hillary was readying to party. — Lakshmi Manchu (@LakshmiManchu) 8 December 2016 Apologise.. the forward sent to me didn't have anyone's name. Awesome words. Pls take the glory https://t.co/c1GyoqZIWL — Lakshmi Manchu (@LakshmiManchu) 8 December 2016 On this day last month Castro was alive,Amma was getting better, US was preparing for its first female President and you had money.(Forward) — Lakshmi Manchu (@LakshmiManchu) 8 December 2016 -
మెగాఫోన్ పట్టనున్న సూపర్ స్టార్ సిస్టర్
సౌత్ సినీ రంగంలో ఇప్పుడిప్పుడే వారసురాళ్లు కూడా కనిపిస్తోంది. మంచు లక్ష్మీ లాంటి వారు తమ మార్క్ చూపించగా మరింత మంది సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. అయితే చాలా క్రితమే నిర్మాతగా ఎంట్రీ ఇచ్చింది ఘట్టమనేని వారసురాలు మంజులు. కృష్ణ కూతురిగా సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మంజుల నటిగాను గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నించింది. షో లాంటి సినిమాతో జాతీయ స్థాయిలో ఆకట్టుకుంది. అయితే నిర్మాతగా వరుస ఫెయిల్యూర్స్ రావటంతో కొంత కాలంగా వెండితెరకు దూరంగా ఉంటోంది. తాజాగా మరోసారి సినీ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్లాన్ చేస్తోంది మంజుల. అయితే ఈ సారి నటిగానో, నిర్మాతగానో కాకుండా దర్శకురాలిగా సత్తాచాటేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఓ కథ రెడీ చేసిన మంజుల సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తోంది. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడనుందన్న టాక్ వినిపిస్తోంది. -
చంద్రబాబును కలిసిన మోహన్‌బాబు
హైదరాబాద్: విలక్షణ నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు మంచు మోహన్ బాబు శనివారం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలుసుకున్నారు. లేక్ వ్యూ క్యాంప్ కార్యాలయంలో సీఎంను కలిసిన మోహన్ బాబు వెంట ఆయన కుమార్తె మంచు లక్ష్మి కూడా ఉన్నారు. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీయే అని, ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని మోహన్ బాబు అన్నారు. గతంలో టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన మోహన్ బాబు చాలా ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటోన్న సంగతి తెలిసిందే. -
మరో హాలీవుడ్ సినిమాలో మంచు లక్ష్మి
హాలీవుడ్ సినిమాలతోనే కెరీర్ ప్రారంభి తరువాత టాలీవుడ్లో సెటిల్ అయిన స్టార్ వారసురాలు మంచు లక్ష్మి. మోహన్ బాబు నట వారసురాలిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన లక్ష్మి నటిగా, నిర్మాతగా, వ్యాఖ్యాతగా పలు రంగాల్లో సత్తా చాటుతోంది. అయితే భారత్‌కు తిరిగి వచ్చాక హాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఈ భామ లాంగ్ గ్యాప్ తరువాత మరోసారి హాలీవుడ్ సినిమాలో నటించింది. గతంలో లాస్ వెగాస్, ఈఆర్, డెస్పరేట్ హౌస్ వైఫ్ లాంటి టీవీ సీరియల్స్‌తో పాటు పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించిన మంచు లక్ష్మి, తాజాగా బాస్మతి బ్లూస్ చిత్రంలో నటించింది. ఇప్పటికే తన షూటింగ్ పార్ట్‌తో పాటు డబ్బింగ్‌ను కూడా పూర్తిచేసింది లక్ష్మి. ఆస్కార్ విజేత బ్రీ లారెన్స్, డోనాల్డ్ సతర్లాండ్లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఎక్కువ భాగం భారత్‌లోనే షూటింగ్ జరుపుకోవటం విశేషం. ఈ సినిమా ఓ సైంటిస్ట్ కథ. తాను సృష్టించిన ఓ వరి వంగడాన్ని మార్కెట్ చేసుకోవడానికి ఇండియాకు వచ్చిన సైంటిస్ట్ ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనే కాన్పెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న బాస్మతి బ్లూస్ సినిమాను త్వరలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
'నిన్ను చూసి గర్వపడుతున్నాం'
సాధారణంగా తెలుగు సినిమాల్లో ఎక్కువశాతం పరభాషా నటులు విలన్లుగా దర్శనమిస్తుంటారు. అచ్చంగా అలానే పరభాషా చిత్రంలో మన తెలుగు నటుడు విలన్ గా నటించి సత్తా చాటాడు. దాంతో ప్రస్తుతం అతడు 'టాక్ ఆఫ్ ద టాలీవుడ్' అయ్యాడు. తెలుగు యువ హీరో సుధీర్ బాబు తొలిసారి బాలీవుడ్ మూవీ 'భాగీ' లో నెగటివ్ రోల్ లో నటించి అందరి మన్ననలు అందుకుంటున్నాడు. సుధీర్ అభినయానికి తోటి నటీనటుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రెజీనా, రకుల్ ప్రీత్ సింగ్, మంచులక్ష్మీ, సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్, ఆండీ శ్రీనివాసన్‌లు సధీర్ బాబుతో కలిసి భాగీని వీక్షించారు. 'సుధీర్ బాబు నిన్ను చూసి గర్వపడుతున్నాము. భాగీలో నీ నటన అద్భుతం. నీతో కలిసి భాగీని థియేటర్ లో చూడటం ఎంతో ఆనందాన్నిచ్చింది' అని మంచు లక్ష్మి ట్వీట్ చేశారు. టైగర్ ష్రాఫ్, శ్రద్ధాకపూర్ లు హీరో హీరోయిన్ లుగా నటించిన భాగీ చిత్రంలో విలన్ రోల్ లో సుధీర్ బాబు అలరించారు. శుక్రవారం విడుదలైన భాగీ ఈ ఏడాది విడుదలైన బాలీవుడ్ సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన మూడో చిత్రంగా నిలిచింది. షబ్బీర్ ఖాన్ దర్శకత్వంలో సాజిద్ నడియాడ్వాలా ఈ సినిమాను నిర్మించారు. దేశవ్యాప్తంగా 2750 స్రీన్లలో ఈ సినిమా విడుదలైంది. కాగా సినిమాకు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. @isudheerbabu so proud of you in #Baaghi you were just amazing. Fun watching the movie w u in the theatres pic.twitter.com/nVNStgJrWt — Lakshmi Manchu (@LakshmiManchu) April 30, 2016 -
ఇడ్లీలమ్మిన మోహన్ బాబు
టాలీవుడ్లో మోనార్క్‌గా పేరున్న మోహన్ బాబు.. రోడ్డు పక్కన ఇడ్లీలమ్ముతూ కనిపించారు. 500 పైగా సినిమాల్లో నటించిన స్టార్, భారీ వ్యాపారసంస్థలు, విద్యాసంస్థలు ఉన్న మోహన్ బాబు ఇడ్లీలమ్మటం ఏంటి అనుకుంటున్నారా..? తన కూతురు మంచు లక్ష్మీప్రసన్న నిర్వహిస్తున్న 'మేము సైతం' కార్యక్రమం కోసం ఈ పని చేశారు కలెక్షన్ కింగ్. తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల ఎదురుగా రోడ్డుమీద ఇడ్లీలు అమ్మి, అలా వచ్చిన సొమ్మును మంచు లక్ష్మి నిర్వహిస్తున్న కార్యక్రమం ద్వారా సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నారు. ఓ ప్రైవేట్ ఛానల్లో ప్రసారం కానున్న ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే చాలామంది స్టార్స్ తమవంతు సాయం అందించారు. రకుల్ ప్రీత్ సింగ్ మార్కెట్లో కూరగాయలు అమ్మగా, రానా కూలీ అవతారం ఎత్తాడు. అక్కినేని నటవారసుడు అఖిల్ ఆటో నడిపాడు. సీనియర్ హీరోయిన్ శ్రియ సూపర్ మార్కెట్లో సేల్స్ గర్ల్‌గా పనిచేసింది. తాజాగా మోహన్ బాబు ఇడ్లీలు అమ్మి తన కూతురికి సాయం చేశారు. భవిష్యత్తులో మరింత మంది స్టార్స్‌తో ఈ తరహా పనులు చేయించాలని భావిస్తున్నారు కార్యక్రమ నిర్వాహకులు. "MEEMU SAITHAM" by Dr.M.Mohan Babu started. Boney by Vidyanikethan Faculty Mr.&Mrs.Damodaram pic.twitter.com/8gag9RqbcP — Sree Vidyanikethan (@IVidyanikethan) March 24, 2016 -
రైతుబజార్లో మూటలు మోసిన రానా
మంచు లక్ష్మీ ప్రసన్న వ్యాఖ్యాతగా ప్రారంభం కానున్న ఓ కార్యక్రమం కోసం టాలీవుడ్ ప్రముఖులు తమవంతు సాయం అందిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా విరాళాలు సేకరించి, ఆ విరాళాలను సమాజసేవకు వినియోగించనున్నారు. మేము సైతం పేరుతో రూపొందుతున్న ఈ కార్యక్రమం కోసం టాలీవుడ్ యంగ్ జనరేషన్ తమ వంతు సాయం అందిస్తున్నారు. ఇప్పటికే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కేపీహెచ్‌బీ మంజీరామాల్ ఎదురుగా ఉన్న మార్కెట్లో కూరగాయలు అమ్మగా, యంగ్ సెన్సేషన్ అఖిల్ ఖమ్మంలో ఆటో నడిపాడు. తాజాగా టాలీవుడ్ మ్యాన్లీ హంక్ రానా కూడా ఈ లిస్ట్‌లో చేరిపోయాడు. రైతుబజార్లో కూరగాయల మూటలు మోస్తూ కూలీ అవతారం ఎత్తాడు రానా. కూరగాయల మూటలు మోస్తూ కొంతదూరం తీసుకెళ్లి అక్కడ వేశాడు. ఇందుకోసం ఖాకీ దుస్తులు ధరించి, మెడలో ఎర్ర తువ్వాలు వేసుకుని అచ్చంగా కూలీలా మారిపోయాడు. తన షో కోసం రానా చేసిన సాయానికి మంచు లక్ష్మీ సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేసింది. Thank u for putting the initiative together!! https://t.co/Co8KFkmRAQ — Rana Daggubati (@RanaDaggubati) February 10, 2016 So humbled @RanaDaggubati you inspire to give more. Thank you for being a part of #memusaitham. Together we can https://t.co/Eh40YGLa3d — Lakshmi Manchu (@LakshmiManchu) February 10, 2016