medipally
-
దుబాయ్ నుంచి వచ్చి.. భార్యను హతమార్చి.. ఆపై..
కరీంనగర్: దుబాయ్ నుంచి వ చ్చిన రోజే భార్యను హత్య చేశా డో భర్త. అనంతరం తా నూ క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్ప డ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పోలీసులకు లొంగిపోయాడు. ఈ సంఘటన మేడిపల్లి మండలం తొంబరావుపేటలో చోటుచేసుకుంది.పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రా మానికి చెందిన రాయంచు లింగం, జల దంపతులు. వీరికి కూతురు, కుమారుడు సంతానం. కూతురుకు పెళ్లయ్యింది. కుమారుడు ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లాడు. దంపతులు తమకున్న కొద్దిపాటి భూమి లో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం లింగం కూడా ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. అప్పటినుంచి జల ఇంట్లో ఒంటరిగా ఉంటూ వ్యవసాయం చేసుకుంటోంది.ఆదివారం గల్ఫ్ నుంచి వచ్చిన లింగం రాత్రి సమయంలో భార్యతో గొడవ పడ్డాడు. ఏం జరిగిందో తెలియదుగానీ భార్య నిద్రిస్తున్న సమయంలో పారతో తలపై బాదాడు. దీంతో తీవ్రంగా గాయపడిన జల మంచంపైనే మృతిచెందింది. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న లింగం సోమవారం వేకువజామున క్రిమి సంహారక మందు తాగి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. దీంతో పోలీసులు వెంటనే లింగంను చికిత్స నిమిత్తం జగిత్యాల ఏరియా ఆనుపత్రికి తరలించారు.మృతురాలి సోదరి బింగి సారం విజయ ఫిర్యాదు మేరకు హత్య కేసుగా న మోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్సె శ్యాంరాజు తెలిపారు. హత్యకు సంబంధించిన వివరాలు తెలి యాల్సి ఉందన్నారు. కొత్త న్యాయ చట్టాలు అమల్లోకి వచ్చాక మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఇది మొదటి హత్యకేసు అని కోరుట్ల ఇన్చార్జి సీఐ నిరంజన్‌రెడ్డి అన్నారు. -
సంచలనం రేపుతున్న చిన్నపిల్లల అమ్మకాలు
-
అమ్మకానికి చిన్నారులు బయటపడ్డ సంచలన నిజాలు
-
వాట్సాప్‌లో ఫొటోలు.. ముహూర్తం రోజున డెలివరీ..
సాక్షి, హైదరాబాద్: పాలుతాగే పసికందులను అపహరించి, విమానాలు, రైళ్లలో రాష్ట్రాలు దాటించి పిల్లలు లేని దంపతులకు విక్రయిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠా ఆటకట్టించారు రాచకొండ పోలీసులు. ఫెర్టిలిటీ సెంటర్లు, ఆస్పత్రులు, క్లినిక్‌లలో పనిచేసే ఫోర్త్‌క్లాస్ ఉద్యోగులను ఏజెంట్లుగా పెట్టుకొని, దంపతుల సమాచారం సేకరించి, మధ్యవర్తుల సహాయంతో ఐదేళ్లుగా ఈ అక్రమ దందా సాగుతోంది. ఢిల్లీ, పుణే నగరాల్లో రోజుల శిశువులను ఎత్తుకొచ్చి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు. డిమాండ్‌ను బట్టి ఒక్క పసికందును రూ.1.80 లక్షల నుంచి రూ.5.50 లక్షల చొప్పున అమ్మేస్తున్నారు. ఈ ముఠాలో కీలకంగా వ్యవహరించిన 11 మంది మధ్యవర్తులను రాచకొండ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలను మల్కాజ్గిరి డీసీపీ పీవీ.పద్మజ, శిశు సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ) అధికారులతో కలిసి రాచకొండ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి మంగళవారం మీడియాకు వెల్లడించారు.» ఈనెల 22న పీర్జాదిగూడలో మూడు నెలల పాపను విక్రయిస్తుండగా మేడిపల్లి పోలీసులు స్థానిక ఆర్ఎంపీ శోభారాణితోపాటు స్వప్న, షేక్ సలీంలను అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితులను విచారించగా వీరి తరహాలోనే ఏపీ, తెలంగాణకు చెందిన మరో 8 మంది మధ్యవర్తుల పాత్ర వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కేసును రివర్స్ ఇన్వెస్టిగేషన్ చేశారు. అన్నోజిగూడకు చెందిన బండారి హరిహర చేతన్– బండారి పద్మ, కుషాయిగూడకు చెందిన యాట మమత, ఉప్పుగూడకు చెందిన ముధావత్ రాజు, విజయవాడకు చెందిన బలగం సరోజ, ముధావత్ శారద, ముంతాజ్, జగన్నాథం అనురాధలను పట్టుకున్నారు.» ఈ మధ్యవర్తుల సహాయంతో ఢిల్లీకి చెందిన కిరణ్, ప్రీతి, పుణేకు చెందిన కన్నయ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంతానం లేని దంపతులకు పిల్లలను విక్రయిçÜ్తున్నారు. ఐదేళ్లలో 60 మంది శిశువులను విక్రయించారు. తాజా కేసులో 16 మంది పిల్లలను విక్రయానికి పెట్టగా.. ఏడుగురిని ఏపీ, 9 మందిని తెలంగాణకు చెందిన దంపతులు కొనుగోలు చేశారు. మధ్యవర్తులను విచారించిన పోలీసులు 16 మంది చిన్నారులను కాపాడారు. శిశువిహార్‌కు తరలించారు. వీరిలో 12 మంది అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలున్నారు. ప్రతి శిశువు అమ్మకంపై ఒక్క ఏజెంట్‌కు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు లాభం పొందేవారు. పరారీలో ఉన్న నిందితులు కిరణ్, ప్రీతి, కన్నయ్యల కోసం పోలీసులు గాలిస్తున్నారు.సామాజిక మాధ్యమాల్లో..: వాట్సాప్, టెలిగ్రాం వంటి సామాజిక మాధ్యమాలలో పిల్లల ఫొటోలు పంపిస్తారు. శిశువుల రంగు, ముఖ కవలికలను బట్టి ఎంపిక చేసుకుంటారు. ఫలానా ముహూర్తానికి పిల్లాడు కావాలని చెబితే చాలు ఆ సమయానికే పిల్లాడిని తీసుకొచ్చి అప్పగిస్తారు. రోజుల వయస్సున శిశువులనే దంపతులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే ఆ వయసులో అయితేనే తనకు పుట్టిన బిడ్డగా, పిల్లలకు కూడా వీరే సొంత తల్లిదండ్రులని భావిస్తారు.పిల్లలకు దూరం చేయకండి పిల్లలను రెస్క్యూ హోంకు తరలిస్తుండగా అప్పటివరకు పెంచి పోషించిన తల్లిదండ్రులు తమ పిల్లలను దూరం చేయొద్దంటూ రాచకొండ కమిషనరేట్ ముందు అడ్డుపడ్డారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు తల్లిదండ్రులను మేడిపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఓ దంపతులను ‘సాక్షి’ పలకరించగా.. పెళ్లై 12 ఏళ్లు అయినా పిల్లలు కలగలేదని, ఎన్ని ఆస్పత్రులు తిరిగినా లాభం లేకపోవడంతో ఆఖరికి దిక్కుతోచని స్థితిలో రెండున్నర ఏళ్ల క్రితం ఆరు రోజుల పసికందును కొనుగోలు చేశామని రావులపాలెంకు చెందిన ఓ జంట తెలిపారు. రూ.3.5 లక్షలు ఖర్చు చేసి 21వ రోజును ఘనంగా చేశామన్నారు. రూ.కోట్లాది ఆస్తిపాస్తులను వారసుడి పేరు మీద రాసేందుకూ సిద్ధమయ్యామని చెప్పారు. ఇలాంటి సమయంలో పిల్లాడిని పోలీసులు తమ నుంచి దూరం చేశారని కన్నీటిపర్యంతమయ్యారు. -
హైదరాబాద్: మేడిపల్లిలో దారుణం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని మేడిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. నెలల చిన్నారిని ఓ దుర్మార్గుల ముఠా అమ్మకానికి పెట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి.. చిన్నారిని అమ్ముతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. పీర్జాదిగుడా కార్పొరేషన్ రామకృష్ణ నగర్లో శోభారాణి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఈ ఘటన జరిగింది. సుమారు నాలుగు లక్షలకు చిన్నారిని ఇప్పిస్తామని డాక్టర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొదటగా పదివేలు అడ్వాన్స్ తీసుకున్నట్లు సమాచారం. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మేడిపల్లి పీఎస్‌లో బండి సంజయ్‌పై కేసు
సాక్షి, మేడ్చల్ జిల్లా: మేడిపల్లి పోలీస్ స్టేషన్లో బండి సంజయ్‌పై కేసు నమోదైంది. చెంగిచర్లలో పిట్టల బస్తి బాధితులను పరామర్శించడానికి బండి సంజయ్, అతని అనుచరులు రాగా, పోలీసులకు, బీజేపీ నాయకులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. తోపులాటలో కింద పడిన నాచారం సీఐ నందిశ్వర్ రెడ్డికి గాయాలయ్యాయి. సీఐ ఫిర్యాదుతో బండి సంజయ్‌తో పాటు మరో పది మందిపై 332, 353, 143, 149 ఐపీసీ 3, 4పీడీపీపీఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: హైదరాబాద్ ఎంపీగా సానియా మీర్జా పోటీ?! -
పోలీసుల అదుపులో తీన్మార్ మల్లన్న!
సాక్షి, హైదరాబాద్/ఉప్పల్: తీన్మార్ మల్లన్నను మంగళవారం మేడిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో దాదాపు 20 మంది పోలీసులు పీర్జాదిగూడలోని క్యూ న్యూస్ కార్యాలయంలో సోదాలు చేసినట్లు సమాచారం. వాస్తవానికి క్యూ న్యూస్ ఆఫీస్‌పై సోమవారం గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడంపై తీన్మార్ మల్లన్న రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే నాటకీయ పరిణామాల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం క్యూ న్యూస్ ఆఫీసును పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. అనంతరం తీన్మార్ మల్లన్నను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిని మేడిపల్లి పోలీసులు లేదా మల్కాజిగిరి ఏసీపీ ధ్రువీకరించడం లేదు. కాగా, తీన్మార్ మల్లన్న, తెలంగాణ విఠల్ల అరెస్టును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. -
ఇన్విజిలేటర్ మందలించాడని.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
మేడిపల్లి: పరీక్షాహాల్‌లో ఇన్విజిలేటర్ మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీ చైతన్య కాలేజీ ఇంటర్ విద్యార్థిని రమాదేవి (17) కళాశాల హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలిలా.. కర్నూల్ జిల్లా, బల్మూరు మండలం చెంచుగూడ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ నిమ్మల రాములు కుమార్తె రమాదేవి మేడ్చల్ జిల్లా ఫీర్జాదిగూడలోని శ్రీ చైతన్య కాలేజీలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. ప్రీ ఫైనల్ పరీక్షల్లో భాగంగా సోమవారం బోటనీ పరీక్ష రాస్తున్న సమయంలో ఇన్విజిలేటర్ రమాదేవిని మందలించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై పరీక్ష పూర్తికాగానే కళాశాల హాస్టల్ మూడవ అంతస్తులోని తన గదిలోకి వెళ్లి ఉరి వేసుకుంది. విషయాన్ని గమనించిన తోటి విద్యార్థులు ఆమెను కిందకు దింపి వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిననట్లు డాక్టర్లు నిర్థారించారు. విద్యార్థి సంఘాల ఆందోళన విషయం తెలియగానే ఏఐఎస్ఎఫ్, ఎంఆర్పీఎస్, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో కళాశాల ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. కళాశాలలో ఒత్తిడి, వేధింపుల వల్లనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. ఆందోళనకారులను మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. రమాదేవి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఫీజు కోసమే వేధించారు..! బల్మూర్: గత వారం తన కూతురిని ఫీజు కోసం పదేపదే అడిగారని, వేరుశనగ పంట డబ్బులు చేతికొచ్చిన తర్వాత చెల్లిస్తామని చెప్పామని నిమ్మల రాములు చెప్పారు. అయినా వినకుండా పదేపదే ఫీజు చెల్లించాలని తోటి విద్యార్థుల ముందు అవమానించడంతో భరించలేక ఆత్మహత్య చేసుకుందని ఆయన ఆరోపిస్తున్నారు. తన కుమార్తె మృతదేహన్ని కళాశాల యాజమాన్యం గాంధీ ఆస్పత్రికి తరలించి అక్కడ అడ్రస్ లేకుండాపోయిందని మండిపడ్డారు. విద్యార్థిని మృతితో చెంచుగూడెంలో విషాదం ఏర్పడింది. రాములు గ్రామంలో తనకున్న ఎకరా భూమిని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. -
కన్నతల్లితో మరో వ్యక్తి సహజీవనం.. సన్నిహితంగా నటించి
సాక్షి, హైదరాబాద్: వివాహేతర సంబంధం ఓ వ్యక్తి దారుణ హత్యకు దారితీసిన ఘటన మేడ్చల్ జిల్లాలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ గోవర్ధనగిరి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కృష్ణా జిల్లా తెలప్రోలు గ్రామానికి చెందిన వివాహితకు, కోల వెంకటరమణమూర్తి (47) అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో అక్కడి నుంచి 14 ఏళ్ల క్రితం సదరు మహిళ కుటుంబ సభ్యులను వదిలి నగరాని వచ్చింది. పీర్జాదిగూడ బీబీసాహెబ్ మక్తా అమృత కాలనీలోని వృద్ధాశ్రమంలో వెంకటరమణమూర్తి కేర్ టేకర్‌గా పనిచేస్తూ ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ ద్వారా తన తల్లి చిరునామా తెలుసుకున్న ఆమె కుమారుడు నగరానికి వచ్చాడు. వెంకటరమణమూర్తికి నచ్చజెప్పి ఆమెను ఊరికి తీసుకువెళ్లాడు. వెంకటరమణమూర్తి కొన్ని రోజులుగా ఆమెకు ఫోన్ చేస్తూ నగరానికి రావాలంటూ పట్టుబడుతున్నాడు. ఎన్నో ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చిన తన తల్లి మళ్లీ దూరమవుతుందనే ఆలోచన అతడిలో మొదలైంది. దీంతో నెల రోజుల క్రితం నగరానికి వచ్చి వెంకటరమణమూర్తితో సన్నిహితంగా ఉంటున్నట్లు నటించాడు. ప్రణాళిక ప్రకారం ఆదివారం మధ్యాహ్నం వెంటకరమణమూర్తి వద్దకు వచ్చాడు. ఇద్దరు కలిసి మద్యం తాగుతూ మాట్లాడుకున్నారు. అక్కడే ఉన్న 5 కేజీల గ్యాస్ సిలిండర్‌తో వెంకటరమణమూర్తి తల, పక్కటెముకలపై దాడి చేయడంతో పాటు తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచాడు. అదే సమయంలో సిలిండర్ కింద విసిరేసినట్లు శబ్దం రావడంతో ఇంటి యజమాని కొడుకు పైకి వెళ్లి చూశాడు. అప్పటికే వెంకటరమణమూర్తి రక్తపు మడుగులో ఉన్నాడు. నిందితుడిని గది లోపలే ఉంచి తాళం వేసి మేడిపల్లి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇన్‌స్టాలో పరిచయం.. హైదరాబాద్ పిలిపించి యువకుడిపై యువతి దాడి
సాక్షి, హైదరాబాద్: ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయమైన యువకుడిని హైదరాబాద్ పిలిపించి ఓ యువతి దాడి చేసింది. ఈ సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బెంగళూరుకు చెందిన బడిగ జీవన్(24)కు బోడుప్పల్ కు చెందిన రజిత అనే యువతి ఇన్‌స్టా ద్వారా పరిచయమైంది. అతన్ని హైదరాబాదుకు రావాలని యువతి కోరింది. ఈ నేపథ్యంలో ఈ నెల 12న జీవన్ కాచిగూడకు వచ్చి రైల్వేస్టేషన్లో వేచి ఉన్నాడు. రజితతోపాటు చింటు అనే యువకుడు వచ్చి జీవన్‌ను బోడుప్పల్‌లోని ఇంటికి తీసుకెళ్లారు. ఇంట్లో ఇద్దరూ కలిసి రూ. 2 లక్షలు డిమాండ్ చేసి ఇష్టానుసారంగా దాడికి పాల్పడ్డారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. చదవండి: దారుణం: పెళ్లి చేయలేదని తండ్రి గొంతు కోసిన కొడుకు -
బీరు కొనుగోలు ‘గొడవ’.. బార్లో యువకులపై నిర్వాహకుల దాడి
మేడిపల్లి: మద్యం సేవించడానికి బార్‌కు వెళ్లిన ఇద్దరు యువకులపై బార్ నిర్వాహకులు, సిబ్బంది దాడికి పాల్పడిన సంఘటన సోమవారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి... బోడుప్పల్ ఈస్ట్ హనుమాన్‌నగర్‌కు చెందిన దంతూరి సాయి కృష్ణ, సాయిరాం స్నేహితులు. వారిరువురు మద్యం సేవించేందుకు సోమవారం ఉప్పల్ డిపో సమీపంలోని దర్బార్ బార్‌కు వెళ్లారు. బిల్లు చెల్లించే విషయంలో వెయిటర్‌కు వీరిద్దరికి మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడంతో బార్ సిబ్బంది మూకుమ్మడిగా వీరిద్దరిపై దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను పక్కనే ఆస్పత్రిలో చేర్పించగా సమాచారం అందుకున్న బార్ సిబ్బందిలో మరికొందరు అక్కడికి వెళ్లి వారిని మరోసారి చితకబాదారు. తీవ్రంగా గాయపడిన సాయి కృష్ణ పరిస్థితి విషమంగా ఉండడంతో ఉప్పల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సాయి కృష్ణ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఏడుగురిపై కేసు నమోదు.. బార్ నిర్వాహకులు, సిబ్బంది ఏడుగురిపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కటిక కుమార్, జగన్, అమ్మోజు నవీన్, చెంచు వీరేశ్, సుదగాని నర్సింహ్మ, బర్ల రాజిరెడ్డి, చొక్కాల రాజవర్థన్పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. బార్ వద్ద ఆందోళన ... సాయి కృష్ణ, సాయిరాంపై దాడిని నిరసిస్తూ వారి కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నేతలు దర్బార్ బార్ వద్ద ఆందోళన నిర్వహించారు. బార్ అనుమతులను రద్దు చేయాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అక్కడికి వచ్చిన ఇద్దరు బారు నిర్వాహకులపై ఆందోళన కారులు దాడి చేశారు. ఈ క్రమంలో పోలీసు వాహనంపై రాళ్లు వేయడంతో అద్దం పగిలిపోయింది. సంఘటనా స్థలానికి వచ్చిన మల్కాజిగిరి ఏసీపీ శ్యాంప్రసాద్‌రావు, మేడిపల్లి ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
ఎగబడి కరుస్తున్నాయ్.. కుక్కలే కదా చంపేశారు.. చివరకు
సాక్షి, కోరుట్ల: ‘ఎగబడి కరుస్తున్నాయ్.. కుక్కలే కదా చంపితే ఏమవుతుందిలే’ అనుకుంటే కుదరదు. శునక వధ కారణంగా మేడిపల్లి మండలంలోని కొండాపూర్ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే.. కొండాపూర్‌లో కుక్కుల బెడద తీవ్రంగా ఉంది. రాత్రి వేళల్లో చాలా మంది కుక్కకాటుకు గురై ఆస్పత్రి పాలైన ఘటనలూ ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు శునకాలను చంపాలని పంచాయతీ పాలకవర్గ సభ్యుల తీర్మానించారు. పది రోజుల క్రితం కొన్నింటిని చంపేశారు. స్థానిక రాజకీయ విభేదాల కారణంగా ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా జంతు ప్రేమికులకు చేరింది. చదవండి: నిజామాబాద్‌లో చిన్నారి కిడ్నాప్ కలకలం వెంటనే స్పందించిన హైదరాబాద్‌కు చెందిన ఎర్త్ ప్రెసెన్స్ అనే జంతు ప్రేమికుల సంస్థ నిర్వాహకురాలు డాక్టర్ శశికళ వారం రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రెండు రోజుల క్రితం కొండాపూర్ సర్పంచ్, కార్యదర్శిపై కేసు నమోదు చేసినట్లు కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజు శుక్రవారం తెలిపారు. ప్రజల రక్షణ కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, తమపై కేసు నమోదు చేయడం సరికాదని సర్పంచ్ అభిలాష్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మేడిపల్లి మండలవ్యాప్తంగా ఈ సమస్య ఉన్నట్లు పలు గ్రామాల సర్పంచ్‌లు తెలిపారు. చదవండి: బైకుతో సహా నాలాలో పడిన వ్యక్తి.. లక్ జగదీష్ -
ఊరికి వెళ్తుండగా విషాదం.. కారు పల్టీలు కొట్టి..
సాక్షి, ఉప్పల్: వరంగల్ జాతీయ రహదారి పరిధిలోని నారపల్లి నందనవనం వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును అతివేగంగా నడిపి డివైడర్‌ను ఢీకొట్టడంతో..పల్టీలు కొట్టి రోడ్డుకు అవతలి వైపు బైకుపై వెళ్తున్న తండ్రీ కొడుకులను ఢీకొంది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం జనగాం జిల్లా పాలకుర్తి మండలం రాగాపురానికి చెందిన మానుపాటి సోమయ్య (70) పండుగ సెలవుల నేపథ్యంలో తన చిన్నకుమారుడు కృష్ణ, మనవడు వినేష్‌తో కలిసి శుక్రవారం ఉదయం బైకుపై కూకట్పల్లి నుంచి స్వగ్రామం రాగాపురానికి బయలుదేరారు. వీరు మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని నారపల్లికి చేరుకోగానే వరంగల్ వైపు నుండి మేడిపల్లి వైపు వస్తున్న కారు ఒక బస్సును ఓవర్టేక్ చేస్తూ డివైడర్‌ను ఢీకొని రోడ్డు అవతల నుండి వస్తున్న కృష్ణ వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన సోమయ్య, కృష్ణలు అక్కడికక్కడే మృతిచెందగా వినేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారులో ప్రయాణిస్తున్న చౌదరిగూడ ప్రాంతానికి చెందిన విక్రాంత్‌రెడ్డి (20) స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సోమయ్య కుమార్తె శారద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
నేడు, రేపు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడిందని, ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరి తల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. దీని ప్రభావంతో నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లోని ఒకట్రెండు చోట్ల సోమవారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవచ్చని, ఇతర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే సోమ, మంగళవారాల్లో ఆదిలాబాద్, కొమురం భీం, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఇతర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందన్నారు. మరోవైపు గత 24 గంటల్లో కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో 9 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. అలాగే ఏన్కూరులో 7 సెంటీమీటర్లు, వెంకటాపూర్, ఖమ్మం అర్బన్, జూలూరుపాడులలో 6 సెంటీమీటర్ల చొప్పున వర్షాలు కురిశాయి. చింతకాని, ఎల్లారెడ్డి, డోర్నకల్, బయ్యారం, అశ్వారావుపేట, మణుగూరు, కొత్తగూడెం, మధిర, గోవిందరావుపేట, నాగరెడ్డిపేట, భిక్నూరు, తల్లాడ, బోనకల్, గార్ల, జుక్కల్‌లలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. వర్షాలు ఊపందుకోవడంతో అన్నదాత కాస్తంత ఊరట చెందుతున్నాడు. ఇప్పటివరకు వర్షాలు సరిగా లేకపోవడంతో అనేక చోట్ల వేసిన విత్తనాలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. తాజా వర్షాలతో ఈ పరిస్థితి నుంచి బయటపడొచ్చని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. 11 జిల్లాల్లో అధికం... హైదరాబాద్‌లో లోటు రాష్ట్రవ్యాప్తంగా అధిక వర్షపాతం నమోదైందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. ఈ సీజన్లో జూన్ ఒకటో తేదీ నుంచి ఈ నెల ఏడో తేదీ నాటికి రాష్ట్రంలో కురవాల్సిన సాధారణ వర్షపాతం 169.66 మిల్లీమీటర్లు కాగా, 189.1 ఎంఎం కురిసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కాలంలో ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 397.4 ఎంఎం, అతితక్కువగా జోగులాంబ గద్వాల జిల్లాలో 80.9 ఎంఎం వర్షపాతం నమోదైంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 11 జిల్లాల్లో సాధారణంకంటే అధిక వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్, కొమురం భీం, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్, వరంగల్ (అర్బన్), కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైందని వ్యవసాయశాఖ వెల్లడించింది. హైదరాబాద్ జిల్లాలో మాత్రం లోటు వర్షపాతం నమోదైందని తెలిపింది. హైదరాబాద్‌లో ఈ కాలంలో సాధారణంగా 126.6 ఎంఎం వర్షం కురవాల్సి ఉండగా 100.6 ఎంఎం వర్షం మాత్రమే కురిసింది. అంటే 21 శాతంలో లోటు వర్షపాతం నగరంలో నమోదైంది. మిగిలిన 19 జిల్లాల్లో సాధారణ వర్షపాతం రికార్డు అయినట్లు తెలిపింది. 15 వరకు వరి నార్లు పోసుకోవచ్చు... దీర్ఘకాలిక వరి నార్లు పోసుకోవడానికి జూన్ 30తో గడువు ముగిసింది. కానీ స్వల్పకాలిక వరి సాగు కోసం ఈ నెల 15 వరకు నార్లు పోసుకోవచ్చని వ్యవసాయశాఖ తెలిపింది. అలాగే పత్తి, మొక్కజొన్న, కంది విత్తనాలు చల్లుకోవడానికి ఈ నెల 15 వరకు అవకాశముందని ఆ శాఖ వర్గాలు వెల్లడించాయి. సోయాబీన్ విత్తనాలు చల్లుకోవడానికి గత నెల 30తో గడువు ముగిసింది. అయితే చాలాచోట్ల వర్షాలు రాకపోవడంతో సోయా పంట చేతికి రాకుండా పోయిందంటున్నారు. దీంతో రైతులు తిరిగి వేసుకోవడానికి కూడా అవకాశం లేదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. భారీ వర్షాలతో నిలిచిన బొగ్గు ఉత్పత్తి రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురిస్తున్న భారీ వర్షాలతో పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్‌లోని ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. సింగరేణి సంస్థ రామగుండం రీజియన్‌లోని ఆర్జీ–1,2,3 ఏరియాల్లోని ఓసీపీ–1,2,3, మేడిపల్లి ఓసీపీల్లో రోజుకు 42వేల చొప్పున రెండు రోజుల్లో 84వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. మూడో రోజు నిలిచిన ‘కాళేశ్వరం’ పనులు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మూడు రోజలుగా నిలిచిపోయాయి. అన్నారం బ్యారేజీ వద్ద గోదావరిలో వరద ఉధృతికి అడ్డుకట్ట వేసి పక్కకు మళ్లిస్తున్నారు. కొత్తగూడెం జిల్లా గుండాల మండలం రోళ్లగడ్డతండా గ్రామానికి చెందిన ఓ మహిళ భద్రాచలం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. అయినవారి చావే బాధాకరం అయితే.. వర్షాల వల్ల ఉధృతంగా ప్రవహిస్తున్న మల్లన్న వాగు ను దాటి... ఆ మృతదేహాన్ని ఇంటికి చేర్చడం బంధువులకు ఆ బాధలోనూ ఓ అనివార్యత. పది మంది గ్రామస్తులు ఓ తాడు సాయంతో నానా అగచాట్లు పడి ఆ మృతదేహాన్ని అతి కష్టంగా వాగు దాటించారు. భౌతికకాయాన్ని గౌరవంగా ఇంటికి చేర్చలేకపోతున్నామని, బురద నీటి లో తడుస్తూ తీసుకురావాల్సి వచ్చిందని వాపోయారు. ప్రతి ఏటా వర్షాకాలంలో ఈ కష్టాలు తప్పడంలేదని, వాగును దాటేందుకు వంతెన లేకపోవడం వల్ల వర్షాకాలంలో ఎవరైనా చనిపోతే అది మా ప్రాణాలమీదకొస్తుందని వారు బాధగా చెప్పారు. -
‘మేడిపల్లి’కి పగుళ్లు
గోదావరిఖని(రామగుండం): ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులో బ్లాస్టింగ్లతో గ్రామంలోని ఇళ్లు పగుళ్లు తేలాయి.. భూమి పొరల్లో కదలిక ఏర్పడి గ్రామంలోని బావుల్లో నీరు ఇంకిపోయింది.. రోడ్లు నెర్రెలు బారి నడిచేందుకు ఇబ్బందిగా మారాయి.’ అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. పరిహారం చెల్లించాలంటూ ఆదివారం సింగరేణి మేడిపల్లి ఓసీపీకి వెళ్లే రహదారిపై ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ధర్నా నిర్వహించారు. నెలక్రితం అధికారులు సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చి మరవడంతోనే ఆందోళన బాటపట్టినట్లు వారు స్పష్టం చేశారు. ఇదీ పరిస్థితి.. సింగరేణి ఆర్జీ–1 డివిజన్ పరిధిలో 1994లో మేడిపల్లి గ్రామ శివారులో యాజమాన్యం ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు ఏర్పాటు చేసింది. మేడిపల్లి, లింగాపూర్ గ్రామాలకు చెందిన సుమారు వెయ్యి ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసింది. రెండు గ్రామాలకు చెందిన ఇళ్లనూ కొంత మేర స్వాధీనం చేసుకుంది. కొంతకాలానికి ఓపెన్‌కాస్ట్‌లో చేసే బ్లాస్టింగ్‌లకు మేడిపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలోని ఇళ్లు బీటలు వారాయి. మున్సిపాలిటీ వేసిన రోడ్లు పగుళ్లు తేలాయి. దీంతో ఎస్సీ కాలనీవాసులు ఓపెన్‌కాస్ట్ పనులు బంద్ పెట్టే విధంగా ఆందోళన చేయడంతో సింగరేణి యాజమాన్యం దిగివచ్చి పరిహారం చెల్లించింది. ఎస్సీ కాలనీకి ఆనుకుని ఉన్న బీసీ కాలనీ ప్రజలను ఓసీపీలో చేసే బ్లాస్టింగ్ సమస్య తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. గ్రామంలో 220కి పైగా బీసీలకు చెందిన ఇళ్ల్లతో కాలనీ ఏర్పడింది. ఇందులో చాలా ఇళ్లు పగుళ్లు తేలాయి. గోడలు కూలిపోవడంతో ఇళ్లలోకి పాములు వస్తున్నాయి. చుట్టూ మట్టి కుప్పల కారణంగా దుమ్మూధూళీ ఇబ్బంది పెడుతోంది. కాలనీ వాసులు రోగాల బారినపడుతున్నారు. గ్రామస్తులు తాగడానికి, ఇతర అవసరాల కోసం బావుల్లో నీరు ఇంకిపోవడంతో సైకిళ్లపై ఎన్టీపీసీకి వెళ్లి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. తమను కూడా నిర్వాసితులుగా గుర్తించి నష్టపరిహారం చెల్లించాలని, మేడిపల్లి గ్రామంలోని బీసీ కాలనీవాసులు గతంలో పలుమార్లు ఆందోళన చేపట్టారు. 2020 నాటికి మేడిపల్లి ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టును యాజమాన్యం మూసివేస్తున్న నేపథ్యంలో తమకు పరిహారం చెల్లింపులు లేక అభివృద్ధి పనులు చేపట్టాలని గ్రామస్తులు ఆదివారం కూడా ప్రాజెక్టుకు వెళ్లే రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ధర్నాలో నాయకులు కోరుకంటి చందర్, మహాంకాళి స్వామి, వెంగల బాపు, ముసిపట్ల రాజు, మడ్డి అంబిక, రాజబాబు, పూసాల శ్రీనివాస్ పాల్గొన్నారు. బొగ్గు రవాణాకు ఆటంకం... సింగరేణి మేడిపల్లి ఓసీపీ నుంచి ప్లేడే అయిన ఆదివారం రోజువారీగా నిర్ణయించిన 16 వేల టన్నుల బొగ్గు రవాణా కన్నా ఎక్కువగా 25 వేల నుంచి 30 వేల టన్నుల వరకు బొగ్గు రవాణా చేయాలని అధికారులు భావించారు. కానీ.. మేడిపల్లి గ్రామస్తులు ఉదయం 6 గంటలకే వచ్చి ప్రాజెక్టుకు వెళ్లే రహదారిపై బైఠాయించడంతో వందలాది మంది కార్మికులు విధులకు హాజరుకాకుండా నిలిచిపోయారు. జైపూర్ ఎస్టీపీపీ, శ్రీరాంపూర్, ఆర్జీ–1 సీఎస్పీ, హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాలకు వెళ్లే దాదాపు 80 లారీలు 10 గంటల వరకు అక్కడే ఉండిపోయాయి. ప్రాజెక్టు అధికారి ఎం.నరేందర్, డిప్యూటీ మేనేజర్ పొనుగోటి శ్రీనివాస్ నిర్వాసితుల వద్దకు వచ్చి రెండు రోజుల్లో గ్రామానికి వచ్చి సమస్య తెలుసుకుంటామని, అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. అంతర్గాం, ఎన్టీపీసీ ఎస్సైలు ప్రమోద్‌కుమార్‌రెడ్డి, చంద్రకుమార్ బందోబస్తు చేపట్టారు. -
చెంగిచర్ల ఘటనలో ఇద్దరు అరెస్ట్
సాక్షి, మేడ్చల్: చెంగిచర్ల వద్ద ఆయిల్ ట్యాంకర్ల పేలుడు, అగ్నిప్రమాదం సంఘటనలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ట్యాంకర్ల యజమానులు రాజు, జగదీష్‌లను అరెస్టు చేశారు. వీరి నుంచి 3 బైక్‌లు, 2 కార్లు, 12 పెట్రోల్ ట్యాంకర్లు, రూ.7.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన దక్షిణ భారతంలోనే మొదటిదని రాచకొండ జాయింట్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన వివరాలు వెల్లడించారు. ఆయిల్ ట్యాంకర్ల నుంచి పెట్రోల్ తీస్తుండగా ప్రమాదం సంభవించిందని, ఇలా తీసిన పెట్రోల్‌లో కిరోసిన్ కలిపి విక్రయిస్తుంటారని వెల్లడించారు. ఈ ప్రాంతంలో వీరు అక్రమంగా కార్ఖానా నిర్వహిస్తున్నారన్నారు. చమురు సంస్థలకు చెందిన ట్యాంకర్ల నుంచి వెల్డింగ్ ద్వారా పెట్రోల్ తొలగించే క్రమంలో ట్యాంకర్లకు మంటలు అంటుకుని పేలుడు జరిగిందని జోషి తెలిపారు. -
మేడిపల్లి వద్ద పేలిన ఆయిల్ ట్యాంకర్
-
మేడిపల్లికి రాహుల్‌ను తీసుకొస్తా: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మేడిపల్లి లో ఫార్మా సిటీ ఏర్పాటు ను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏకపక్ష ధోరణి తో భూసేకరణ చేపడుతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆరోపిం చారు. శనివారం ఆయన గాంధీ భవన్లో మాట్లా డారు. ఇందిరాగాంధీ హయాంలో ఇచ్చిన భూములను ప్రభుత్వం అక్రమంగా సేకరిస్తోం దని విమర్శించారు. ఫార్మా సిటీతో కాలుష్యం తీవ్రమవుతుందని ప్రజలు చెబుతున్నారని, ప్రభుత్వం మాత్రం వారి ఆందోళనను పట్టించు కోకపోవడం బాధాకరమన్నారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని మేడిపల్లికి తీసుకొస్తానన్నారు. ప్రభుత్వాన్ని నిలదీస్తామని, బలవంతపు భూసేకరణను అడ్డుకుంటామని చెప్పారు. -
అల్లుడి వేధింపులు తాళలేక..
భవనంపై నుంచి దూకి మహిళ ఆత్మహత్య బోడుప్పల్: అల్లుడు వేధింపులతో మనస్థాపానికి లోనైన ఓ మహిళ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై మహేందర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మహారాష్ట్ర సోలాపూర్‌కు చెందిన కుంచన పద్మావతి(54) ప్రదీప్ దంపతులు చాలా ఏళ్ల క్రితం నగరానికి వలసవచ్చారు. వీరి కుమార్తెను ఏడేళ్ల క్రితం రామంతాపూర్‌కు చెందిన చిట్టిప్రోలు హరిప్రసాద్‌కు ఇచ్చి వివాహం చేశారు. గత ఐదేళ్లుగా ఖాళీగా ఉంటున్న హరిప్రసాద్ భార్య, పిల్లలను పుట్టింటికి తరిమేశాడు. తరచూ అత్తగారింటికి వచ్చి గొడవపెట్టుకోవడమేగాక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఇటీవల పద్మావతి కుటుంబం ప్రశాంత్‌నగర్ కాలనీలో ప్లాట్ కొనుగోలు చేయగా అందులో తనకు వాటా ఇవ్వాలని గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఆదివారం అత్తగారింటికి వెళ్లిన అతను అత్త, భార్యను కొట్టి వెళ్లిపోయాడు. సోమవారం ఉదయం ఫోన్లో మరోసారి పద్మావతిని బెదిరించడంతో మనస్థాపం చెందిన ఆమె అపార్టుమెంట్ 4వ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంటి బయట ముగ్గు వేస్తుండగా...
బోడుప్పల్(హైదరాబాద్‌సిటీ): ఇంటి బయట ఊడ్చి ముగ్గు వేస్తున్న ఓ వృద్ధురాలు మెడలో నుంచి రెండున్నర తులాల బంగారు పుస్తెల తాడును ఇద్దరు వ్యక్తులు తెంచుకుని పారిపోయిన సంఘటన ఆదివారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుద్ధానగర్‌లో జయశ్రీ అనే మహిళ(63) ఆదివారం ఉదయం ఇంటి ముందు ఊడ్చి ముగ్గు వేస్తోంది. ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడును తెంచుకుని పారిపోయారు. జయశ్రీ వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించగా వారు సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మేడిపల్లిలో అగ్నిప్రమాదం
మేడ్చల్: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక ఫిర్జాదిగూడాలోని కార్ మెకానిక్ షెడ్లో అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పక్కనే ఉన్న ఎయిర్ కూలర్ల దుకాణానికి అగ్నికీలలు అంటుకొని పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అటుగా వెళ్తున్న వాహనదారులు ఇది గుర్తించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో రూ. 5 లక్షల ఆస్తినష్టం జరిగనట్లు సమాచారం. -
కిరోసిన్ పోసుకుని వివాహిత ఆత్మహత్య
మేడిపల్లి(కరీంనగర్ జిల్లా): మేడిపల్లి మండలం దమ్మన్నపేటలో గురువారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన స్రవంతి(25) అనే వివాహిత కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ఆర్ధిక ఇబ్బందులే ప్రధాన కారణంగా తెలుస్తోంది. భర్త బ్రతుకుదెరువు నిమిత్తం గల్ఫ్ వెళ్లాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కార్డన్ సెర్చ్: 8 మంది అరెస్ట్
హైదరాబాద్: మేడిపల్లి ఇందిరానగర్‌లో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో 250 మంది పోలీసులు ఆ ప్రాంతాన్ని జల్లెడపట్టారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేనటువంటి 36 బైక్‌లు, 3 ఆటోలు, 7 సిలిండర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు పాత నేరస్తులు సహా ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
మేడిపల్లిలో దొంగల హల్చల్
హైదరాబాద్: సైబరాబాద్ మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి దొంగలు తెగబడ్డారు. బోడుప్పల్ టెలిఫోన్ కాలనీలో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్కెట్ చేసిన దొంగలు.. రెండిళ్లలో ప్రవేశించి నాలుగు తులాల బంగారు ఆభరణాలు, నగదును ఎత్తుకు పోయారు. అలాగే, పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోని ఓ దుకాణం షట్టర్లు తొలగించి, రూ.5 లక్షల విలువైన సామగ్రిని దోచుకున్నారు. సోమవారం ఉదయం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైతుల ఉపాధిబాట
దేశాయిపేటలో పనులజాతర రోజూ 200మంది హాజరు మేడిపెల్లి : కాలం కలిసిరావడంలేదు. వేసిన పంటలు పండే పరిస్థితి కనిపించడంలేదు. చేతిలో చిల్లిగవ్వలేదు. కూలీపనులు చేయనిదే పొట్టనిండే పరిస్థితి కనించడంలేదు. అందుకే.. మోతుబరి నుంచి చిన్నరైతు సైతం ఉపాధిహామీలో చేరుతున్నారు. పలుగు, పార పట్టుకుని వందరోజుల పనులకు వెళ్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కరువు తీవ్రతకు అద్దంపడుతోంది దేశాయిపేట పల్లెదుస్థితి. దీనిపై కథనం.. మేడిపెల్లి మండలంలో 11,352 జాబ్‌కార్డులు ఉన్నాయి. సుమారు 20వేల కూలీలు తమ పేర్లు నమోదు చేసుకుని ఉన్నారు. దేశాయిపేటలో 450 జాబ్‌కార్డులు, 950 మంది కూలీలు పనులు చేస్తున్నట్లు రికార్డుల్లో ఉంది. ఇందులో సగం మంది రైతులు కూలీలుగా తమ పేర్లను నమోదు చేసుకోవడం గమనార్హం. ఖరీఫ్ ప్రారంభమైనా నేటికీ ఆశించిన మేరకు వర్షాలు కురవకపోవడం, వ్యవసాయ పనులు లేకపోవడంతో అన్నదాతలు హరితాహారం పథకంలో భాగంగా మెుక్కలకు గుంతలు తవ్వేందుకు వెళ్తున్నారు. గ్రామసమీపంలోని గుట్ట చుట్టూ మెుక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈమేరకు గ్రామానికి చెందిన దాదాపు 200మంది రైతులు, కూలీలు ఈపనుల్లో నిమగ్నమయ్యారు. ఈసందర్భంగా రైతులు, కూలీలను పలుకరించగా.. తాము ఈ పనులకు ఎందుకు వస్తున్నామనే విషయంపై వివరించారు. వారి మాటల్లోనే.. పనిజేత్తేనే కడుపునిండేది – బొల్లె నరేష్, కూలీ నేను క్రమం తప్పకుండా వందరోజుల పనికి వోతున్న. ఈ పనులు జేత్తేనే మాకుటుంబం కడుపునిండేది. ఈసారి ఇంకా వానలు పడలే. ఎవుసం పనులు మెుదలవలే. పొట్టకూటికోసం రైతులు గూడ మాతోపాటే వందరోజుల పనికస్తున్నరు. అప్పుడు అడ్డుకున్నం – కుంట తిరుపతిరెడ్డి, రైతు నాకు ఇరవై ఎకరాలుంది. వానలు పడితేనే బావులు, బోర్లలో నీళ్లచి పంటలు పండేది. ఇప్పటికీ వానలు లేవు. ఎవుసం పనులు సాగుతలేవు. పొట్టకూటికోసం ఉపాధిపనికి పోతున్నం. అప్పట్లో కూలీలను అడ్డుకున్నం. ఇప్పుడే మేమే పోతున్నం. కాలం కలిసిరాలే – క్యాతం నారాయణరెడ్డి, రైతు నేను కూలీలను తీస్కపోయి నా పొలంలో పనులు జేయించేటోన్ని. కాలం కలిసిరాలే. నమ్మకున్న నేలతల్లి సహకరించడంలేదు. భూములు బీళ్లుబారినయి. ఏం చేయాలో తోచడంలేదు. ఖాళీగా ఉంటే బతుకులేదు. అందుకే ఉపాధి పనికి వోతున్నం. పెట్టుబడికి భయమేస్తంది – క్యాతం అనసూయ, రైతు వానలు లేవు. బోర్లు, బావుల్లో నీళ్లురాలేదు. వరి నారు పోద్దామంటే వానలు పడకుంటే ఎండుతదని భయమేస్తంది. పెట్టుబడి మట్టిపాలైతే.. తేరుకునుడు కట్టం. అందుకే ఇప్పుడు పంటలపై ఆశలు వదులుకున్న. దొరికినకాడికి కూలీకి పోతున్న. కూలీల సంఖ్య పెరిగింది – నాగరాజు, ఫీల్డ్అసిస్టెంట్ దేశాయిపేటలో నాలుగువందలకు పైగా జాబ్కార్డులున్నయ్. ఎనమబై మంది కూలీలు ఏడాదిపాటు ఉపాధి పనులకు వచ్చేవారు. రెండేళ్ళుగా వర్షాలు పడుతలేదు. ఎవుసం పనులు బందైనయి. రైతులూ ఇటే వస్తున్నరు. రోజూ రెండు వందల మంది పనిలో ఉంటున్నరు.