midday meals
-
సార్.. ఈ అన్నం మాకొద్దు
కరీంనగర్/జగిత్యాలటౌన్: మధ్యాహ్న భోజనం తినలేకపోతున్నామంటూ రెండుచోట్ల విద్యార్థులు ఆందోళనకు దిగా రు. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని పురాతన పాఠశాల వి ద్యార్థులు రోడ్డెక్కగా, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం ఆరెపల్లి జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి చేరుకొని కలెక్టర్ సత్యప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్‌లోని పురాతన పా ఠశాలలో 400 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. సో మవారం 217 మంది పాఠశాలకు హాజరయ్యారు. కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలోనే ఉన్న ఈ పాఠశాలలో వారంరోజులుగా ఉడికీఉడకని అన్నం పెడుతున్నారని, అడుగు భాగం మెత్తగా, ముద్దగా మారి మాడిపోతోందని, ఆ అన్నం ఎలా తినేదంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. అరగంట పాటు ఆందోళన చేసినా ఉన్నతాధికారులెవరూ పాఠశాలకు రాలేదు. దీంతో విద్యార్థులు అన్నం తినకుండానే పడేశారు. ఆరెపల్లి పాఠశాలలో వంట మనిషిని మార్చాలని కోరుతూ కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. అన్నంలో పురుగులు, వెంట్రుకలు వస్తున్నాయని, రుచిలేని అన్నం వడ్డిస్తున్నారని, ప్రశ్నిస్తే ఇష్టమున్నచోట చెప్పుకోమంటూ వంట మనుషులు బెదిరిస్తున్నారని ప్రజావాణిలో గోడు వెళ్లబోసుకున్నారు. నాలుగు నెలలుగా అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. ప్రజావాణి ఆడిటోరియంలోకి వెళ్లి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించారు. వంటమనిíÙని తొలగించి సరైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని నిరసన విరమింపజేశారు. -
మధ్యాహ్న భోజనంలో బల్లి.. వంద మంది విద్యార్థులకు అస్వస్థత
భువనేశ్వర్: ఒడిశాలో ఓ స్కూల్లో మధ్యాహ్నభోజనం తిన్న వంద మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనంలో భాగంగా బాలాసోర్‌లోని సిర్పూర్ గ్రామంలో ఉన్న ఉదయనారాయణ్ స్కూల్లో పిల్లలకు గురువారం(ఆగస్టు8) అన్నం, కూర వడ్డించారు. భోజనంలో బల్లి పడిన విషయాన్ని కొద్దిసేపటి తర్వాత పిల్లలు గుర్తించారు.దీంతో ఎవరూ భోజనాలు తినొద్దని స్కూల్ సిబ్బంది ఆదేశించారు. అయితే అప్పటికే కొందరు పిల్లలు భోజనం తినేయడంతో అస్వస్థతకు గురయ్యారు. వీరిలో కొందరికి కడుపునొప్పితో పాటు ఛాతినొప్పి సమస్యలు వచ్చాయి. వారందరినీ దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. భోజనం విషతుల్యమవడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని బ్లాక్ విద్యాధికారి తెలిపారు. -
సార్.. అన్నంలో పురుగులు ఎట్ల తినాలి?
హైదరాబాద్: ‘సార్.. మధ్యాహ్న భోజనంలో పురు గులు వస్తున్నాయి.. ఎట్ల తినాలి’ అంటూ నాలుగో తరగతికి చెందిన ఓ విద్యార్థిని తన తల్లితో కలసి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. ఏఎస్ఐ తిరుపతయ్య కథనం ప్రకారం.. మీర్‌పేట సిర్లాహిల్స్‌కు చెందిన పూజిత స్థానిక ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. మంగళవారం పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేస్తుండగా.. అన్నంలో పురుగు రావడంతో పడేసింది. ఇది గమనించిన ఉపాధ్యాయులు అన్నం ఎందుకు పడేశావని అడగ్గా పురుగు వచ్చిందని చెప్పింది. అన్నం తినేది ఉంటేనే పాఠశాలకు రావాలని..లేకపోతే రావొద్దని ఉపాధ్యాయులు మందలించారు. దీంతో పూజిత బుధవారం మధ్యా హ్నం తల్లి రాణితో కలిసి మీర్‌పేట సీఐ మహేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేసింది. ఏఎస్ఐ తిరుపతయ్య తనిఖీ చేయగా కూరగాయలు వారం రోజుల క్రితం తెచ్చినవి కావడంతో దాదాపు పాడైపోయి ఉండడం, బియ్యం కూడా నాణ్యతగా లేకపోవడాన్ని గుర్తించారు. ఈ విషయమై ప్రధానోపాధ్యాయుడు గంగాధర్‌ను వివరణ కోరగా బాలిక రెండురోజుల నుంచి పాఠశాలకు గైర్హాజరైందని తెలిపారు. పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈఓ అన్నంలో పురుగులు వచ్చాయని బాలిక ఫిర్యాదు చేసిన విషయం తెలియగానే మండల విద్యాధికారి కృష్ణయ్య వెంటనే పాఠశాలను తనిఖీ చేశారు. కూరగాయలు, బియ్యం నాణ్యతగానే ఉన్నాయన్నారు. ఉపాధ్యాయులు బెదిరించినట్లు వస్తున్న ఆరోపణలపై వాస్తవాలు తెలియాల్సి ఉందన్నారు. మధ్యాహ్నం వరకే పాఠశాల ఉండటంతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారని, గురువారం విచారణ చేపడతామని తెలిపారు. -
అమ్మకూ మధ్యాహ్న భోజనం
అనంతపురం సెంట్రల్/ రాయదుర్గం: అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం అందించడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గర్భిణులు, బాలింతలు, చిన్నారులను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ కేవలం చిన్నారులకే భోజనం వడ్డిస్తున్నారు. శుక్రవారం నుంచి గర్భిణులు, బాలింతలకు కూడా మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నారు. జిల్లాలో 2,079 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు, 223 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో గర్భిణులు 21,480 మంది, బాలింతలు 19,870, ఏడాది లోపు పిల్లలు 20,728, ఏడాది నుంచి మూడేళ్ల లోపు పిల్లలు 64,960 , మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 52,140 మంది ఉన్నారు. రక్తహీనత నివారించడం కోసం వీరికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా వీరికి పౌష్టికాహారం అందిస్తున్నారు. నాణ్యమైన భోజనం సరఫరా.. అంగన్వాడీ కేంద్రాల ద్వారా నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేడి అన్నమే అందించాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు మెనూలో సమూలమైన మార్పులు తీసుకొస్తూ ప్రభ్తుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి మధ్యాహ్న సమయంలో పిల్లలతో పాటు గర్భిణులు, బాలింతలకు కూడా రుచికరమైన భోజనం అందించడానికి అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఇప్పటికే ఆయా అంగన్వాడీ కేంద్రాలకు నిత్యావసర సరుకులు చేరాయి. పాల కొరత ఉన్నప్పటికీ తగిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. భోజనం తర్వాత తల్లులకు 200 మిల్లీలీటర్లు పాలు, పిల్లలకు 100 ఎంఎల్ పాలు తప్పనిసరిగా అందించాలని నిర్ణయించారు. -
పురుగులు.. ఎలుకలు!
సాక్షి, మెదక్: కరోనా నేపథ్యంలో పాఠశాలలు తెరుచుకోకపోవడంతో మధ్యాహ్న భోజన బియ్యం పాడైపోతున్నాయి. సంచులను ఎలుకలు కొరికివేయడం.. పురుగులు పట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది క్వింటాళ్ల మేర వృథాగా మారాయి. రాష్ట్రంలో వివిధ యాజమాన్యాల పరిధిలో 41 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 55 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి రోజుకు 100 గ్రాముల చొప్పున.. ఆరు నుంచి పదో తరగతి వరకు రోజుకు 150 గ్రాముల చొప్పున మధ్యాహ్న భోజన బియ్యం కేటాయిస్తున్నారు. ఈ లెక్కన నెలకు సరిపడా బియ్యాన్ని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పంపిణీ కేంద్రం నుంచి తీసుకొచ్చి నిల్వ ఉంచుతున్నారు. ఇలా నిల్వ ఉంచిన వాటిలో సుమారు ముప్పావు వంతు బియ్యం ముక్కిపోయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జిల్లాలు, పాఠశాలల వారీగా లెక్కలు తీస్తున్న విద్యాశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారులకు సూచించారు. సుమారు 15 వేల క్వింటాళ్లు వృథా జూన్‌లో విద్యాసంవత్సరం ప్రారంభం కావాల్సి ఉంది. కోవిడ్ కారణంతో ఇప్పటి వరకు బడులు తెరుచుకోలేదు. అయితే ప్రభుత్వ ఉపాధ్యాయులు గత నెల నుంచే స్కూళ్లకు వస్తున్నారు. ప్రస్తుతం ఆన్లైన్లో పాఠాలు చెబుతున్నారు. మెదక్ జిల్లాలో పరిశీలిస్తే స్కూళ్లు మూతపడే నాటికి సుమారు 1,633.62 క్వింటాళ్ల సన్న బియ్యం నిల్వ ఉంది. ఇందులో 493.21 క్వింటాళ్లు పాడైపోయాయి. 236.31 క్వింటాళ్లు పాక్షికంగా.. 256.90 క్వింటాళ్లు పూర్తిగా పురుగులు పట్టి ముక్కిపోయాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 వేల క్వింటాళ్ల మేర మధ్యాహ్న భోజన బియ్యం వృథా అయినట్లు విద్యాశాఖ అధికారుల అంచనా. జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు స్కూళ్లు తెరవకపోవడంతో పాఠశాలల్లో నిల్వ ఉన్న మధ్యాహ్న భోజన బియ్యం పాడవుతున్నాయని ప్రధానోపాధ్యాయులు ఎప్పటికప్పుడూ జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి పలుమార్లు తీసుకొచ్చారు. ఎట్టకేలకు గ్రహించిన రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లాలు, పాఠశాలల వారీగా సమాచారం సేకరించారు. అంతేకాకుండా తగు జాగ్రత్తలు తీసుకుని పొడి ప్రదేశాల్లో నిల్వ చేయాలని సూచించారు. పాఠశాలలు తెరిచిన తర్వాత వాటిని వినియోగించకుండా చూడాలని ఆదేశించారు. 25% బియ్యం పాడైపోయాయి శివ్వంపేట మండలంలో 75 పాఠశాలలకు సంబంధించి 85.11 క్వింటాళ్ల బియ్యం నిల్వ ఉంది. పలు స్కూళ్లలో తడవడం, పురుగులు పట్టడం మూలంగా 25 శాతం మేర పాడైపోయాయి. పనికి రాని బియ్యంపై ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చాం. ఇప్పటి వరకైతే ఎలాంటి ఆదేశాలు రాలేదు. – బుచ్చనాయక్, ఎంఈఓ, శివ్వంపేట, మెదక్ జాగ్రత్తలు తీసుకుంటున్నాం పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన బియ్యం పురుగులు పట్టాయి. అసలే పనికి రాని వాటిని వేరు చేశాం. వాటిని వినియోగించకుండా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు ఇచ్చాం. ప్రస్తుతం ఉన్న వాటిని బల్లాలపై, కుర్చీల్లో తేమలేని చోట నిల్వ చేసేలా చర్యలు తీసుకున్నాం. – రమేష్ కుమార్, డీఈఓ, మెదక్ -
విద్యార్థులకు శుభవార్త: కేసీఆర్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల భలోపేతం దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రభుత్వ కళాశాల్లో ఇప్పటికే అనేక సంస్కరణలు చేపట్టిన సర్కార్.. దానిలో భాగంగానే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఉదయం కాలేజీలకు వచ్చిన విద్యార్థులు మధ్యాహ్ననికి మళ్లీ వెళ్లిపోతున్నారని, దీని వల్ల ప్రభుత్వ కాలేజీల్లో డ్రాపవుట్స్ పెరిగిపోతున్నారని అధికారులు గతంలో సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై శుక్రవారం విద్యాశాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి.. కాలేజీల్లో భోజన సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జూనియర్, డిగ్రీ కాలేజీల్లో విద్యార్థుల హాజరుశాతం పెరగాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. (ప్రభుత్వ విద్యావ్యవస్థను ప్రక్షాళన చేస్తాం) డ్రాపవుట్స్ నివారించడంతో పాటు, విద్యార్థులకు పౌష్టికాహారం ఇవ్వాలనే లక్ష్యంతో కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. జడ్చర్ల డిగ్రీ కాలేజీలో బొటానికల్ గార్డెన్ అభివృద్ధికి సంబంధించిన చర్చ వచ్చిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి, అక్కడి ప్రభుత్వ లెక్చరర్ రఘురామ్ తమ సొంత ఖర్చులతో జూనియర్ కాలేజీ విద్యార్థులకు భోజనం పెడుతున్న సమాచారం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందించారు. కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పెట్టాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించిందని సీఎం చెప్పారు. లెక్చరర్ రఘురామ్ విజ్ఞప్తి మేరకు జడ్చర్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీకి నూతన భవనాన్ని కూడా ముఖ్యమంత్రి మంజూరు చేశారు. -
మధ్యాహ్న భోజనం పరిస్థితేంటి?
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో పాఠశాలలను మూసివేయంతో అందులో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని ఎలా అందిస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ మేరకు కోర్టు పలు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు బుధవారం నోటీసులు జారీ చేసింది. కరోనా కారణంగా చాలా స్కూళ్లు మూతపడటంతో కోర్టు సుమోటోగా కేసును స్వీకరించి విచారించింది. కోవిడ్–19 వ్యాప్తి దృష్ట్యా ఢిల్లీతోపాటు అనేక రాష్ట్రాల్లోని పాఠశాలలు మార్చి 31 వరకు మూసివేస్తున్నట్లు ఆ రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదేశాలు జారీచేశాయి. ఒమర్ విడుదలపై వారంలో తేల్చండి జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విడుదలపై వారంలోగా వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 37 రద్దు సమయంలో రాష్ట్రంలో అల్లర్లు చెలరేగకుండా ఉండేందుకు ప్రభుత్వం గతేడాది ఆగస్టులో ఒమర్‌ను నిర్బంధించింది. ఒమర్ నిర్బంధంపై ఆయన సోదరి సారా అబ్దుల్లా దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎంఆర్. షా ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఒమర్ విడుదలకు సంబంధించి వారంలోగా వివరణ ఇవ్వాలని కేంద్రం, జమ్మూకశ్మీర్ అధికార యంత్రాంగాలను ఆదేశించింది. ‘ఒమర్‌ను విడుదల చేస్తారా? లేదా? ఒకవేళ చేయాలని భావిస్తే వెంటనే విడుదల చేయండి. లేని పక్షంలో ఈ పిటిషన్‌పై విచారణ చేపడతాం’అని పేర్కొంది. ఈ కేసులో వాదనలు వినిపించాల్సిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వేరే కోర్టులో వేరే కేసు విచారణలో ఉన్నారని ప్రభుత్వం తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. -
వికటించిన ‘మధ్యాహ్న భోజనం’
పెద్దకొత్తపల్లి/ నాగర్‌కర్నూల్: ఓ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని 44మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా మారింది. వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలోని చంద్రకల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 144 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో 125 మంది గురువారం పాఠశాలకు హాజరై ఎప్పటిలాగే మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం మూడు గంటలకు 44 మందికి తీవ్ర కడుపునొప్పితో వాంతులు చేసుకున్నారు. ఇది గమనించిన హెచ్ఎం శ్రీనివాసులు వెంటనే 108 అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, వీరిలో పదో తరగతి విద్యార్థులు మానస, ప్రేమలత, మంజుల, లక్ష్మి, వంశీలకు పరిస్థితి విషమంగా మారడంతో ఐసీయూలో ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. ఇదిలాఉండగా అధికారుల పర్యవేక్షణలోపం, నాసిరకమైన మధ్యాహ్న భోజనం అందించడం వల్లే ఇలా జరిగిందని విద్యార్థులు ఆరోపించారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతి, డీఈఓ గోవిందరాజులు అక్కడికి చేరుకుని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ ఘటనపై విచారణ జరిపి త్వరలోనే బాధ్యులపై చర్య తీసుకుంటామన్నారు. దీనిపై హెచ్ఎం శ్రీనివాసులును వివరణ కోరగా రోజూలాగే వంట ఏజెన్సీ మహిళలు తయారుచేసిన వంకాయ కూరతో కూడిన మధ్యాహ్న భోజనం అందించామన్నారు. ఈ కూరలో ఏమైనా కలిసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. నాసిరకం భోజనమే కారణమా..? విద్యార్థుల అస్వస్థతకు నాసిరకం మధ్యాహ్న భోజనమే కారణమని స్థానికులు ఆరోపించారు. మండలంలోని చంద్రకల్ ఉన్నత పాఠశాలలో గురువారం కలుషిత మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థుల్లో 44మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో చేర్పించారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. పరామర్శించిన నేతలు విషయం తెలుసుకున్న జిల్లా జెడ్పీచర్మన్ పెద్దపల్లి పద్మావతి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీపీ సూర్యప్రతాప్ గౌడ్, జిల్లా గ్రంధాలయాల సంస్థ చైర్మన్ విష్ణు తదితరులు ఆసుపత్రికి చేరుకుని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యపరిస్థితి విషమించిన విద్యార్థులకు మైరుగైన వైద్యం అందించాలని కోరారు. విచారణకు ఆదేశించిన కలెక్టర్ చంద్రకల్ ఉన్నత పాఠశాలలో కలుషిత మధ్యాహ్న భోజనం చేసి అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆసుపత్రిలో కలెక్టర్ ఈ.శ్రీధర్ పరామర్శించారు. వారితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందించాలని డీఈఓను ఆదేశించారు. -
మధ్యాహ్న భోజనంలో బల్లి
కర్ణాటక ,చెళ్లకెరె రూరల్: తాలూకాలోని నాయకనహట్టి గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 95 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. భోజనంలో బల్లి పడడమే కారణమని తెలుస్తోంది. గ్రామంలోని చెన్నబసయ్య ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో సుమారు 160 మంది విద్యార్థులు చదువుతున్నారు. మంగళవారం ఎప్పటిలానే 12.40 గంటలకు మధ్యాహ్న భోజనం చేశారు. అదే సమయంలో ఓ విద్యార్థిని తన ప్లేట్లో బల్లి పడి ఉండడాన్ని చూసి ఉపాధ్యాయులకు తెలిపింది. వెంటనే ఉపాధ్యాయులు పిల్లలు భోజనం చేయడాన్ని నిలిపేశారు. కడుపునొప్పి, వాంతులు అయితే అప్పటికే పిల్లలు భోజనం చేసి ఉండడం వల్ల చాలా మంది పిల్లలకు కడుపునొప్పి, వాంతులు ప్రారంభం అయ్యాయి. వెంటనే ఉపాధ్యాయులు విద్యార్థులను అంబులెన్స్, ఇతర వాహనాల ద్వారా సముదాయ ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం తరలించారు. 10 మంది విద్యార్థులను అంబులెన్స్ ద్వారా చెళ్లకెరె ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వీరిలో కొంతమంది విద్యార్థులు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండడాన్ని చూసి వారిని చిత్రదుర్గ జిల్లా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసి తల్లిదండ్రులు ఆందోళనతో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. భయాందోళనకు గురైన తల్లిదండ్రులు తల్లిదండ్రులు కొంతమంది ప్రధానోపాధ్యాయుడు బుడేన్‌సాబ్‌పై ఆగ్రహంతో చేయి చేసుకోవడానికి ప్రయత్నించారు. సమాచారం అందిన వెంటనే బీఈఓ వెంకటేశప్ప, తహసీల్దార్ ఎం.మల్లిఖార్జునలు ఆస్పత్రికి వెళ్లి విద్యార్థుల ఆరోగ్యస్థితిని పరిశీలించి వైద్యుల నుంచి సమాచారం సేకరించారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ఫర్వాలేదని, 15 మంది విద్యార్థులను మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించామని తెలిపారు. తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఘటనపై సమగ్ర తనిఖీ నిర్వహించి దోషులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్ఐ రఘునాథ్ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. పాఠశాల సిబ్బంది వంట వండడంలో నిర్లక్ష్యం వల్లనే ఈ సంఘటన జరిగిందని అనుమానిస్తున్నారు. బియ్యం కూరగాయలను, పాత్రలను సరిగా శుభ్రం చేయడం లేదని, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం వల్లనే బల్లి పడిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. -
ఆ రెండూ పూర్తిగా నివారించాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి : మధ్యాహ్న భోజనం నాణ్యత పెంచడంపై దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. అదే విధంగా మధ్యాహ్న భోజనంలో పిల్లలకు మరో ప్రత్యేక వంటకం ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. గర్భిణీలు, పిల్లల తల్లులు, చిన్నారులకు అందించే పౌష్టికాహారంపై సీఎం జగన్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం వీరికి అందిస్తున్న పౌష్టికాహారంపై వివరాలు తెలుసుకున్నారు. అదే విధంగా ఈ పథకంలో తీసుకురావాల్సిన మార్పులు, చేర్పులు.. నగదు బదిలీ చేసే అంశంపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. ఈ క్రమంలో రక్తహీనత, పౌష్టికాహార లోపాన్ని పూర్తిగా నివారించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో మరో 65 సెంట్రలైజ్‌్డ కిచెన్స్ ఏర్పాటుపై కూడా చర్చించారు. ఈ సమావేశంలో సీఎం జగన్‌తో పాటు మంత్రులు ఆదిమూలపు సురేష్, తానేటి వనిత పాల్గొన్నారు. పది రూపాయలు ఎక్కువైనా సరే.. నాడు-నేడు కార్యక్రమం ద్వారా రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 44,512 ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయడానికి ప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మొదటి దశలో సుమారు 15 వేలకుపైగా స్కూళ్లను ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. ఈ నేపథ్యంలో గురువారం నాటి సమావేశంలో... స్కూళ్లలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి సీఎం జగన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో నవంబర్ నుంచి స్కూళ్లలో పనులు ప్రారంభించి... మార్చికల్లా పనులు పూర్తిచేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఇందుకు బదులుగా... స్కూళ్లలో కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, ఇస్తున్న పరికరాలు అన్నీకూడా నాణ్యంగా ఉండాలని సీఎం ఆదేశించారు. సౌకర్యాల కల్పనలో ఏ ఇతర స్కూళ్లకూ తీసిపోకూడదని సూచించారు. పది రూపాయలు ఎక్కువైనా సరే సౌకర్యాల కల్పనలో మాత్రం రాజీపడవద్దని పేర్కొన్నారు. అనుకున్న ప్రకారం వచ్చే ఏడాది పాఠశాలలు ప్రారంభం అయ్యేనాటికి స్కూలు యూనిఫారమ్స్, పుస్తకాలు అందించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. -
మెనూ.. వెరీ టేస్టీ!
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు రుచికరమైన, నాణ్యమైన భోజనం వడ్డించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నిమిత్తం ఒక్కో విద్యార్థికి ఇచ్చే మొత్తాన్ని పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు రోజుకు అయ్యే వ్యయంలో 3.09 శాతం పెంచారు. ఈ పెంపు మొత్తం ఏప్రిల్ 1వ తేదీ నుంచి వర్తిస్తుందని మార్గదర్శకాల్లో పేర్కొంది. సాక్షి, నెల్లూరు: ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తున్నాయి. ఈ పథకానికి కేంద్రం 60, రాష్ట్రం 40 శాతం నిధులు భరిస్తున్నాయి. ఇక 9, 10 తరగతులకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తోంది. గతేడాది వరకు ప్రాథమిక తరగతుల ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.4.35 విడుదల చేయగా, తాజా ఉత్తర్వుల ప్రకారం రూ.4.48 చెల్లిస్తారు. ప్రాథమికోన్నత తరగతుల విద్యార్థికి రూ.6.51 నుంచి రూ.6.71 వరకు పెంచారు. 9,10 తరగతుల విద్యార్థులకు రూ.6.51 నుంచి రూ.6.71 పెంచుతున్నట్లు మార్గదర్శకాల్లో పేర్కొంది. జిల్లాలో మొత్తం ప్రభుత్వ బడులు 3,419 భోజనం పథకం అమలవుతున్న పాఠశాలలు 3,407 మొత్తం వంట ఏజెన్సీలు 3,003 అక్షయపాత్ర అమలవుతున్న స్కూళ్లు 291 మొత్తం విద్యార్థులు 2,31,260 ఇస్కాన్ సేవలున్న పాఠశాలలు 111 నాణ్యమైన భోజనం కోసం.. బడి పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం మెస్ చార్జీలు పెంచింది. మార్కెట్లో పెరిగిన నిత్యావసర సరుకులు, ఆకు కూరలు, కూరగాయలు నేపథ్యంలో పిల్లలకు నాణ్యమైన భోజనాన్ని నిర్వాహకులు వడ్డించలేకపోతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం బడి పిల్లల భోజనంలో రాజీ పడకూడదని రాష్ట్ర వాటాను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నిర్వాహకులు పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించే అవకాశం ఉంది. తరగతి గతేడాది (2008–19 )వరకు కేంద్రం రాష్ట్రం ఒక్కో విద్యార్థికి ప్రాథమిక రూ.2.61 రూ.1.74 రూ.4.35 ప్రాథమికోన్నత రూ.3.91 రూ.2.60 రూ.6.51 9, 10 తరగతులకు రూ.6.51 రూ.6.51 ––– మెస్‌చార్జీల పెంపుదల తర్వాత కేంద్రం రాష్ట్రం ఒక్కో విద్యార్థికి ప్రాథమిక రూ.2.69 రూ.1.79 రూ.4.48 ప్రాథమికోన్నత రూ.4.03 రూ.2.68 రూ.6.71 9, 10 తరగతులకు రూ. 6.71 రూ.6.71 ––– బడి తోటల పెంపకం చేస్తే ప్రభుత్వ పాఠశాలల్లో బడి తోటల పెంపకం చేస్తే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించ వచ్చిందని ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు. బడి తోటల్లో పెంచే కూరగాయలు, ఆకు కూరల వల్ల నిర్వాహకులకు కొంత వరకు ఖర్చు తగ్గుతుందనేది మరో కారణం. దీనికి తోడు విద్యార్థులకు పెరటి సాగుపై అవగాహన కల్పించే వీలు ఉంటుందని భావిస్తున్నారు. -
ఏపీ ప్రభుత్వానికి సుప్రీం జరిమానా
సాక్షి, ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మధ్యాహ్న భోజన పథకం అమలు పర్యవేక్షణ ఆన్లైన్ లింక్ ఏర్పాటులో ప్రభుత్వం విఫలమైందని లక్ష రూపాయల జరిమానా విధించింది. ఏపీతో పాటు మరో ఐదు రాష్ట్రాలకు కూడా ఈ జరిమానా వర్తిస్తుందని తీర్పులో పేర్కొంది. ఈ మేరకు న్యాయస్థానం మంగళవారం ఆదేశాలను జారీచేసింది. కాగా మధ్యాహ్న భోజన పథకం అమలులో అవినీతి జరుగుతోందంటూ గతకొంత కాలంగా ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీనిపై విచారించిన దర్మాసనం జరిమానా చెల్లించి, పథకం అమలులో పారదర్శకత పాటించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
మధ్యాహ్నం..గుడ్డు మాయం!
కర్నూలు, జూపాడుబంగ్లా: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు వారానికి ఐదు గుడ్లు ఇవ్వాల్సి ఉంది. అయితే ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవడంతో మధ్యాహ్నభోజన నిర్వాహకులు దానిని ఇవ్వకుండా చేతులెత్తేశారు. జిల్లా వ్యాప్తంగా 2,947 పాఠశాలలు ఉండా ప్రాథమిక పాఠశాలల్లో 2,00,759 మంది, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1,10,698 మంది, ఉన్నత పాఠశాలల్లో 54,076 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. విద్యార్థులకు వడ్డించే గుడ్డు 47 గ్రాముల నుంచి 52 గ్రాముల మధ్య ఉండాల్సి ఉంటుంది. ఒక్కో దానికి ప్రభుత్వం రూ.4.68ల చొప్పున చెల్లిస్తుంది. ఈ లెక్కన రోజుకు రూ.18,86,040ల మొత్తాన్ని వెచ్చిస్తున్నారు. ఏడాది క్రితం మధ్యాహ్నభోజనం తోపాటు వారానికి రెండు పర్యాయాలు భోజన నిర్వాహకులే గుడ్డును వడ్డించేవారు. వారు సక్రమంగా వడ్డించటం లేదని పేర్కొంటూ వీటిని సరఫరాను కాంట్రాక్టర్లకు అప్పగించారు. అయితే కాంట్రాక్టర్ నాసిరకమైనవి, తక్కువ బరువున్న వాటిని సరఫరా చేస్తుంటంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు పక్షం రోజుల క్రితం కాంట్రాక్టును రద్దు చేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 2,947 పాఠశాలల్లోని 4.03లక్షల మంది విద్యార్థులకు పక్షం రోజుల నుంచి మధ్యాహ్న భోజనంలో గుడ్డు ఇవ్వటం లేదు. నెలకోపర్యాయం బిల్లులు చెల్లిస్తే గుడ్డును వడ్డిస్తామని నిర్వాహకులు పేర్కొంటున్నారు. నెలలు తరబడి బిల్లులు చెల్లించకపోతే సాధ్యం కాదని చెబుతున్నారు. జిల్లా అధికారుల ఆదేశాలు వెల్లడించాం జిల్లా అధికారులు వెల్లడించిన ఆదేశాలను మధ్యాహ్నభోజన నిర్వాహకులకు తెలియజేశాం. నిర్వాహకులకు బిల్లులు రావాల్సిన మాట వాస్తవమే. వాస్తవానికి వారానికి ఐదు గుడ్లు పెట్టడం నిర్వాహకులకు కష్టసాధ్యమవుతుంది. నెల నెలా బిల్లులు ఇస్తామని జిల్లా అధికారులు పేర్కొన్నారు. నిర్వాహకుల అభిప్రాయాలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. – శ్రీనివాసులు, ఎంఈఓ, జూపాడుబంగ్లాజూపాడుబంగ్లా మోడల్ పాఠశాలలో గుడ్డులేకుండా మధ్యాహ్నభోజనం వడ్డింపు, -
అన్నం పెట్టమని అడిగితే కొట్టాడు..
సిద్దిపేట రూరల్: మధ్యాహ్న భోజనంలో మరోసారి అన్నం పెట్టమని అడిగితే ఓ వ్యాయామ ఉపాధ్యాయుడు విద్యార్థులను కమిలిపోయేలా కొట్టాడు. ఈ ఘటన చిన్నగుండవెళ్లి శివారులోని ఎల్లంకి కళాశాల మహాత్మా జ్యోతిబాపూలే (నారాయణరావు పేట) బాలుర గురుకుల విద్యాలయంలో కొనసాగుతోంది. మంగళవారం మధ్యాహ్న భోజన సమయంలో మరోసారి అన్నం పెట్టాలని అడిగిన 6, 8 తరగతులకు చెందిన విద్యార్థులు రాజేశ్, సుగీర్తి, మంజునాథ్‌ను ప్రిన్సిపాల్ రాజమణి ముందే పీఈటీ వెంకటేశ్ పైపుతో చితకబాదడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, సీపీఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులతో కలిసి ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్ రాజమణి, పీఈటీ వెంకటేశ్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న జిల్లా అసిస్టెంట్ బీసీ సంక్షేమాధికారి ఇందిర పాఠశాలకు చేరుకొని ఘటనపై ఆరా తీశారు. బాధ్యులపై చర్యలు తీసుకుం టామని ఆమె హామీ ఇచ్చారు. -
‘మధ్యాహ్న భోజన’ కార్మికులకు వేతనాలు పెంచండి
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యాహ్న భోజన పథకం కింద పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను టీఆర్ఎస్ ఎంపీలు, కార్మికులు కోరారు. ఈమేరకు ఎంపీలు కె.కవిత, బూర నర్సయ్యగౌడ్, బాల్కసుమన్, కార్మికులు శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి విన్నవించారు. కార్మికులకు కనీస వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కేంద్ర కార్మిక చట్టాలను మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు వర్తింపజేసి ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని కోరారు. తమ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు కవిత మీడియాకు తెలిపారు. కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి కనీస వేతనాలు అందేలా కృషి చేస్తామన్నారు. -
మిథ్యాన్న భోజనం
కారంచేడు: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని వండి వడ్డించాలనే ప్రభుత్వం సంకల్పం రోజురోజుకూ నీరుగారుతోంది. పెరుగుతున్న నిత్యవసరాల ధరలతో నిర్వాహకులు గగ్గోలు పెడుతున్నారు. దీనికి తోడు నెలనెలా విడుదల కాని బిల్లులు.. వీటన్నింటితో పిల్లలకు రుచికరమైన ఆహారం అందడం భారమవుతోంది. మండలంలోని 14 గ్రామాల పరిధిలో మొత్తం 28 ప్రాథమిక, 2 ప్రాథమికోన్నత, 7 ఉన్నత ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలున్నాయి. వీటిలో ప్రాథమిక, ప్రాథమికోన్న పాఠశాలల్లో 1016 మంది, ఉన్నత పాఠశాలల్లో 875 మంది మొత్తం 1891 మంది విద్యార్థులున్నారు. ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులతో కలిపి మొత్తం 2275 మంది విద్యార్థులున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో ప్రాథమిక స్థాయి విద్యార్థులకు రూ.4.13లు, 100 గ్రాముల బియ్యం, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు రూ.6.18లు, 150 గ్రాముల బియ్యంతో రోజూ ఆహారాన్ని వండి వడ్డించాలి. కానీ ప్రస్తుతం మార్కెట్లో పెరుగుతున్న నిత్యవసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రభుత్వ మెనూ గుట్టుచప్పుడు కాకుండా గాడి తప్పుతోంది. అధికారులు కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. నిర్వాహకులకు తప్పని తిప్పలు అన్ని పాఠశాలల్లో 38 ఏజెన్సీల్లో హెల్పర్స్‌తో కలిపి 57 మంది పని చేస్తున్నారు. కష్టపడి అప్పులు చేసి మరీ వండి వడ్డిస్తున్నా బిల్లులు కూడా ప్రతి నెలా సక్రమంగా రావడం లేదని నిర్వాహకులు వాపోతున్నారు. ప్రస్తుతం ఇంకా రెండు నెలల బిల్లులు రావాల్సి ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. పిల్లలను పస్తులు ఉంచలేక అప్పోసొప్పో చేసి అతికష్టం మీద భోజనం వడ్డిస్తున్నామని ఆవదేన వ్యక్తం చేస్తున్నారు. బియ్యం కూడా అస్సలు బాగుండటం లేదని నిర్వాహకులు వాపోతున్నారు. 50 కేజీల బస్తాలో 47 కేజీలు మాత్రమే బియ్యం ఉంటుంన్నాయన్నాని ఆరోపిస్తున్నారు. వంట గదులు కూడా లేవు 37 పాఠశాలలగాను కేవలం కారంచేడు సీవీసీ, దగ్గుబాడు మెయిన్ పాఠశాలలకు మాత్రమే వంటగదులున్నాయి. అవి కూడా నిరుపయోగంగానే ఉన్నాయి. మిగిలిన 35 పాఠశాలల్లో ప్రస్తుతం 9 మంజూరయ్యాయి. వీటిలో కేవలం 4 పూర్తయ్యాయి. మిగిలినవి నిధులు సరిపోక నిలిచిపోయాయి. వాటిని కట్టేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. ఆరుబయటే వంటలు చేసి వడ్డించాల్సి వస్తోందని వాపోతున్నారు. చాలామంది నిర్వాహకులు భోజనం ఇంటి వద్ద వండుకొని స్కూల్‌కు తీసుకొచ్చి పెడుతున్నారు. ఆరుబయటే వంట, వార్పు ప్రబుత్వ పాఠశాలలకు ప్రహరీలు లేకపోవడం, వంట గదులు లేకపోవడంతో వంట, వార్పు ఆరుబయటే చేసుకోవాల్సి వస్తోందని నిర్వాహకులు వాపోతున్నారు. ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెబుతుందేగానీ ఇంత వరకు అలాంటి చర్యలు చేపట్టడం లేదని వాపోతున్నారు. ఆరుబయట వంటలు చేయడం, వరండాల్లో భోజనాలు పెట్టడంతో దుమ్ము, ధూళి పడి విద్యార్థులు రోగాల బారిన పడే అవకాశాలున్నాయని వాపోతున్నారు. ఉన్నతాధికారులకు నివేదికలిచ్చాం: మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బిల్లులను ఉన్నతాధికారులకు పంపించాం. మంజూరు కావాల్సి ఉంది. విడుదలైన వెంటనే వారి ఖాతాల్లోకి జమ చేస్తాం. ఇక కుకింగ్ షెడ్స్ విషయం కూడా ఉన్నతాధికారులకు తెలిపాం. కొన్ని చోట్ల స్థలాల సమస్య, మరికొన్ని చోట్ల నిధుల లేమి లుంది. మిగిలిన పాఠశాలల్లో కూడా షెడ్స్ నిర్మించేందుకు కృషి చేస్తున్నాం. – ఎంవీ సత్యనారాయణ, ఎంఈఓ, కారంచేడు -
తొలిరోజు పస్తులే !
రాయదుర్గంటౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో వంట చేసి కళాశాలల్లో చదువుకునే విద్యార్థులకు వడ్డించడం అనే ప్రభుత్వ కొత్త కాన్సెప్ట్‌కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో అమలు కావాల్సిన మధ్యాహ్న భోజన పథకానికి మొదటిరోజు (బుధవారం) నుంచే బాలారిష్టాలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు జిల్లావ్యాప్తంగా కేవలం 7 కళాశాలల్లో మాత్రమే విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని వడ్డించారు. 63 మండలాల్లోని 42 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 5 ఎయిడెడ్ కళాశాలలు మొత్తంగా 47 కళాశాలలు ఉన్నాయి. వీటిలో మొత్తం 22 వేల మంది విద్యార్థినీ విద్యార్థులు చదువుకుంటున్నారు. బుధవారం జిల్లాలోని పెద్దపప్పూరు, తాడిపత్రి, గుదిబండ, మడకశిర, హిందూపురం, తనకల్లు, రాయదుర్గంలోని కళాశాలల్లో మాత్రమే మధ్యాహ్న భోజనం అమలైంది. రాయదుర్గంలో రెండు కళాశాలలు ఉండగా బాలికల జూనియర్ కళాశాలలో మాత్రమే భోజనం వడ్డించారు. సమీప పాఠశాల ఏజెన్సీ నుంచి మధ్యాహ్న భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని కళాశాలల ప్రిన్సిపాళ్లకు జీవో జారీ అయింది. అయితే కుకింగ్ ఏజెన్సీల ద్వారా మధ్యాహ్న భోజనం వడ్డించేలా విద్యాశాఖ నుంచి తమకు ఆదేశాలు లేకపోవడంతోనే తాము హెచ్ఎంలకు ఆదేశాలు ఇవ్వలేదని పలువురు ఎంఓఈలు పేర్కొంటున్నారు. ఈ కారణంగా 40 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొదటి రోజు మధ్యాహ్న భోజనం అమలు కాలేదు. అంతేకాదు కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించాలని ఎంఈఓ నుంచి ఆదేశాలు తమకు అందలేదని కొందరు వంట ఏజెన్సీ నిరా>్వహకులు చెబుతున్నారు. ఇలా అధికారుల మధ్య సమన్వయ లోపంతో పథకం ప్రారంభమైనా కళాశాల విద్యార్థులు పస్తులుండాల్సి వస్తోంది. అమలుపై శ్రద్ధ ఏదీ? ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నుంచి ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో మ«ధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ముందు ప్రకటించింది. దీంతో కళాశాలకు దూరం నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచే వచ్చి చదువుకునే పేద విద్యార్థులు ఎంతో సంతోషపడ్డారు. అయితే అందుకు తగిన విధివిధానాలు రూపొందించడంలో సమస్యలు తలెత్తడంతో ఆగస్టు 1 నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. అయితే ఆ దిశగా మందస్తు ఏర్పాట్లు చేసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. నెలరోజుల వ్యవధిలో ప్రభుత్వం జూనియర్ కళాశాలల వారీగా ఎంత మంది విద్యార్థులు ఉన్నారు, వారికి ప్లేట్లు, గ్లాసులు ఎన్ని కావాలి, వంట వండటానికి ఎన్ని వంటపాత్రలు కావాలన్న దానిపై కసరత్తు చేయకపోవడంతోనే అన్ని కళాశాలల్లో మొదటి రోజు భోజనం అందలేదు. ఏజెన్సీలపై అదనపు భారం పాఠశాల కుకింగ్ ఏజెన్సీలకు మూడు నెలల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీనికితోడు స్వచ్ఛంధ, ప్రైవేటు సంస్థలకు భోజన పథకాన్ని అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అదనపు వంట పాత్రలు లేవు, విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో వంట చేసి కళాశాలల్లో చదువుకునే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రకటించడంపై పలువురు విద్యావేత్తలు పెదవి విరుస్తున్నారు. వివరాలు స్పష్టంగా ఉన్నాయి కళాశాలల్లో సమీప కుకింగ్ ఏజెన్సీ ద్వారా విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాలని విద్యాశాఖ కమిషనర్చే జారీ చేసిన జీవో కాపీలను ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లకు పంపించాం. పాఠశాలల్లో అమలు చేసే మధ్యాహ్న భోజనాన్ని కళాశాల విద్యార్థులకు అమలు చేసేలా స్పష్టంగా వివరాలు జీవోలు ఉన్నాయి. అందుకు ఒక ప్రత్యేక ఖాతాను సైతం ఏర్పాటు చేసుకుంటే బిల్లులు మంజూరవుతాయి. గురువారం నుంచి అన్ని కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేసేందుకు ఎంఈఓలు కృషి చేయాలి.– చంద్రశేఖర్‌రావు, డీవీఈఓ -
ప్లేటు ఫిరాయించారు
ప్రభుత్వ పాఠశాలలు.. అందరూ బడుగు..బలహీన వర్గాల వారే. మధ్యాహ్న భోజనం ప్రభుత్వమే అందిస్తున్నా...తినేందుకు ప్లేట్లు కూడా లేని దుస్థితి. ఒకే ప్లేటులో ఇద్దరు తినడం..లేదా ఒకరు తిన్న తర్వాత మరొకరు తినాల్సిన పరిస్థితి. అందుకే ప్రతి విద్యార్థికీ భోజనం ప్లేటు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఈ ప్లేట్లు సరఫరా చేయడంలోనూ అధికార పార్టీకి చెందిన కొందరు అడ్డుకుంటూ రాజకీయం చేయడంతీవ్ర విమర్శలకు తావిస్తోంది. అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లాలో మొత్తం 3,29,145 మంది 1–10 తరగతుల విద్యార్థులకు ప్లేట్లు సరఫరా చేయాల్సి ఉంది. హైదరాబాద్‌కు చెందిన నేషనల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అనే సంస్థ ప్లేట్లు సరఫరా చేసే టెండరు దక్కించుకుంది. జిల్లాలో రవాణా బాధ్యతలను విజయ్‌కుమార్ అనే వ్యక్తికి అప్పగించారు. జనవరి నుంచి మార్చి నాటికి జిల్లా కేంద్రానికి అన్ని ప్లేట్లు వచ్చాయి. ఇక్కడి నుంచిమార్చి, ఏప్రిల్, జూన్ నెలల్లో వివిధ మండలాలకు 2,93,368 ప్లేట్లు పంపిణీ చేశారు. ఇంకా ధర్మవరం, బత్తలపల్లి, నార్పల, పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు, గోరంట్ల మండలాలు మాత్రం మిగిలిపోయాయి. ఆ ఇద్దరు ఎంఈఓలు ససేమిరా బత్తలపల్లి, ధర్మవరం ఎంఈఓలు భోజనం ప్లేట్లు తీసుకోవడానికి ససేమిరా అంటున్నారని రవాణా ఏజెన్సీ ప్రతినిధి విజయకుమార్ వాపోతున్నారు. ఓ ప్రజాప్రతినిధిని కలవమని చెప్పారని, టెండరు హైదరాబాద్‌కు చెందిన సంస్థ దక్కించుకుందని, తాము కేవలం జిల్లాలో స్కూల్ కాంప్లెక్స్ పాయింట్లకు రవాణా చేసేవరకే చూస్తున్నామని చెప్పినా... వినకుండా వెనక్కు పంపారని ఆవేదన వ్యక్తం చేశాడు. సరఫరా చేసిన తర్వాత రిసీవింగ్ సంతకం చేయకపోతే తాము ఇబ్బందులు పడతామంటున్నాడు. ఈ రెండు మండలాలు కాకుండా పుట్టపర్తి, నార్పల, కొత్తచెరువు, గోరంట్ల మండలాలకు సరఫరా చేద్దామంటే ఏడు మండలాలకు సరఫరా చేసి వారితో సంతకాలు చేయించుకుని వస్తేనే బిల్లులు చేస్తామంటూ విద్యాశాఖ అధికారులు చెబుతున్నారనీ, అలా వారికి సరఫరా చేశాక వారు సంతకం పెట్టక పోతే రవాణా చార్జీలు నెత్తిన పడతాయన్న ఉద్దేశంతో పెండింగ్ పెట్టామంటున్నాడు. కాగా..ప్లేట్ల సరఫరాలో నెలకొన్న రాజకీయం గురించి విద్యాశాఖ అధికారులకు తెలిసినా వారు పట్టించుకోవడం లేదు. కనీసం ఎంఈఓలకు ఫోన్లు చేసి గట్టిగా చెప్పడం లేదు. ప్లేట్లు సిద్ధంగా ఉన్నాయి ఏడు మండలాలకు సరఫరా చేసేందుకు భోజనం ప్లేట్లు సిద్ధంగా ఉన్నాయి. బత్తలపల్లి, ధర్మవరం ఎంఈఓలకు రోజూ ఫోన్లు చేస్తున్నాం. వారు స్పందించడం లేదు. విద్యాశాఖ అధికారులేమో అన్ని మండలాలకు సరఫరా చేసిన తర్వాతే సంతకాలు పెడతామంటున్నారు. మేము సరఫరా చేసిన తర్వాత వారు సంతకాలు చేయకపోతే నష్టపోతాం. ఎవరైనా తీసుకోకపోతే విజయవాడకు వెనక్కు పంపాలని టెండరుదారు చెప్పారు. కొద్దిరోజులు చూసి వెనక్కు పంపిస్తాం. – విజయ్‌కుమార్, ట్రాన్స్పోర్ట్ ప్రతినిధి ఫిర్యాదు చేస్తే చర్యలు ఏడు మండలాలకు భోజనం ప్లేట్లు సరఫరా చేయలేదు. టెండరుదారుతో మాట్లాడాం. రెండుమూడు రోజుల్లో అన్ని మండలాలకు సరఫరా చేస్తాం. ప్లేట్లు తీసుకోవాలని ఎంఈఓలకు ఆదేశాలు జారీ చేశాం. ఎవరైనా ప్లేట్లు తీసుకోలేదన్న విషయం ఓరల్‌గా చెబితే కుదరదు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని సరఫరా ఏజెన్సీకి చెప్పాం.– దేవరాజు, విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ -
బరువు మోస్తేనే..భోజనం!
ఈ ఫొటోలో భోజనం గంప నెత్తిన పెట్టుకుని క్యారీ చేతపట్టుకుని రోడ్డుపై నడుస్తున్న చిన్నారులు పొలం వద్దకు వెళుతున్నారనుకుంటే పొరబడినట్లే. పాఠశాలలో చదువుకుంటున్న తోటి చిన్నారులకు మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు ఇలా బరువు మోస్తున్నారు. ప్రతిరోజు ఆ పాఠశాలలో చదివే చిన్నారులు పడుతున్న ఇబ్బందులు శనివారం సాక్షి కంటపడింది. మండలంలోని చిన్నగోపవరం ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అదే గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు వంట ఏజెన్సీ నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నారు. పాఠశాల వద్ద వంటగది లేకపోవడంతో ఆమె తన ఇంటి వద్దే భోజనాన్ని తయారు చేస్తుంది. అయితే పాఠశాల ఊరి చివర ఉండటం, సుమారు కిలోమీటరు ఉండటంతో ఆ వృద్ధురాలు భోజనాన్ని పాఠశాల వద్దకు తీసుకెళ్లడం కష్టమైంది. దీంతో ఉపాధ్యాయులు ప్రతిరోజు భోజనాన్ని తీసుకువచ్చే బాధ్యత విద్యార్థులకు అప్పచెప్పారు. చేసేదేమీ లేక చిన్నారులు ఇలా భోజనం గంప నెత్తిన పెట్టుకుని నడిచి వెళుతున్న ఆ దృశ్యాన్ని చూసిన వారంతా అయ్యో పాపం ఎంత కష్టపడుతున్నారో అంటూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. దీనిపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభంశుభం తెలియని చిన్నారుల చేత బరువు మోయిస్తున్న విషయంపై హెచ్ఎం ఓబులేసును వివరణ కోరగా అందులో తప్పేముందని సమర్థించడం గమనార్హం. –గోపవరం -
కడుపు కొడుతున్నారు
ఒంగోలు టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీకి కట్టబెట్టింది. పదిహేనేళ్లుగా దీన్నే నమ్ముకొని బతుకుతున్న నిర్వాహకుల కడుపు కొట్టేందుకు రంగం సిద్ధం చేసింది. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి కేంద్రం నిధుల్లో కోత విధించడమే ఆలస్యం.. దానిని సాకుగా చూపి రాష్ట్ర ప్రభుత్వం మరొక అడుగు ముందుకువేసి ఈ పథకాన్ని ఏకంగా ప్రైవేట్ ఏజెన్సీకి కట్టబెడుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు కేంద్రం 90శాతం, రాష్ట్రం 10శాతం నిధులు నిధులు కేటాయిస్తూ వచ్చింది. ప్రస్తుతం కేంద్రం 60శాతం నిధులు ఇస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో మధ్యాహ్న భోజనాన్ని ప్రైవేట్ ఏజెన్సీల పరం చేసేసింది. ప్రకాశం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలను ఒక క్లస్టర్‌గా చేసి ఢిల్లీకి చెందిన ఏక్తా శక్తి ఏజెన్సీకి మధ్యాహ్న భోజన నిర్వహణ బాధ్యతలను అప్పగించింది. 20 కిలోమీటర్ల దూరంలో వంటశాలను ఏర్పాటుచేసి ఒకేసారి 25వేల మంది విద్యార్థులకు ఆహారం వండి ప్యాకెట్ల రూపంలో అందించనున్నారు. ఆగస్టు ఒకటవ తేదీ నుండి ఏక్తా శక్తి ఏజెన్సీ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. 2003 నుంచి అమలు.. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని 2003లో సుప్రీంకోర్టు రాష్ట్రాలను ఆదేశించింది. ఈ పథకం అమలు ద్వారా విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని నివారించడంతో పాటు డ్రాపౌట్స్‌ను తగ్గించేందుకు వీలవుతుందని çసుప్రీంకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో అప్పట్లో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న చంద్రబాబునాయుడు డ్వాక్రా మహిళలకు మధ్యాహ్న భోజన నిర్వహణ బాధ్యతలను అప్పగించాడు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డ్వాక్రా మహిళలను మధ్యాహ్న భోజన నిర్వాహకులుగా మార్చేశారు. ప్రకాశం జిల్లాలో కూడా అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని డ్వాక్రా మహిళలే నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి మధ్యాహ్న భోజనం వడ్డించి పెట్టినందుకు రూ.1.25 చొప్పున ఇస్తూ వచ్చారు. అయితే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతుండటంతో ఈ పథకం నిర్వహణ తమవల్ల కాదంటూ నిర్వాహకులు చేతులెత్తేశారు. దీంతో ఒక్కో విద్యార్థికి రూ.3.25 చొప్పున ప్రభుత్వం పెంచింది. తమకు వేతనాలు నిర్ణయించాలని ఉద్యమించడంతో 2010లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1000 చొప్పున వేతనాన్ని నిర్ణయించింది. ప్రభుత్వం బియ్యం, కోడిగుడ్లు మాత్రమే నిర్వాహకులకు అందిస్తే కందిపప్పు, కూరగాయలు, పోపుదినుసులు, వంట గ్యాస్ ఇలా ప్రతిదీ నిర్వాహకులే కొనుగోలు చేయాల్సి ఉండటంతో మధ్యాహ్న భోజనం వారికి భారంగా మారింది. దానికితోడు గత ఏడాది నవంబర్ నుంచి వేతనాలు పెండింగ్‌లో ఉండటం, ఈ ఏడాది మార్చి నుంచి నిర్వహణ బిల్లులు నిలిపివేసినా ప్రభుత్వం తమను గుర్తిస్తుందన్న ఆశతో మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఎదురుచూస్తున్న తరుణంలో ప్రైవేట్ ఏజెన్సీకి నిర్వహణ బాధ్యతలను అప్పగించి వారిని సాగనంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. నెలకు రూ,3వేలు ఖర్చవుతోంది: ఒంగోలులోని వెంకటేశ్వరకాలనీలోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు నెలకు రూ.3వేల ఖర్చవుతోంది. ప్రభుత్వం రూ.1000 గౌరవ వేతనం ఇస్తోంది. అది ఏమాత్రం చాలదు. ఒక్కో విద్యార్ధికి 3.25రూపాయల చొప్పున ఇస్తున్నా అది కూడా చాలడం లేదు. ప్రభుత్వం తమకు న్యాయం చేస్తోందని ఎదురు చూస్తున్న సమయంలో ఏజెన్సీకి అప్పగించింది.– మక్కెన మాణిక్యం -
ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
బద్వేలు : ఇప్పటివరకు మధ్యాహ్న భోజనం పథకాన్ని పాఠశాలల్లో మాత్రమే అమలు చేసేవారు. కానీ త్వరలో జూనియర్ కళాశాలల్లో కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు జిల్లాలోని జూనియర్ కళాశాలల అమలుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఆర్జేడీకి నివేదికలు అందజేస్తున్నారు. అయితే జూలై ఒకటి నుంచి అమలు చేస్తామంటున్నా ప్రస్తుతం కసరత్తు దశలోనే ఉండడంతో కొంతమేర ఆలస్యమయ్యే అవకాశముంది. ప్రభుత్వ పాఠశాలల తరహాలో ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు మధ్యాహ్న భోజనంతో విద్యార్థుల గైర్హాజరు నివారించడంతో పేదలకు విద్యను అందించేందుకు చక్కగా ఉపయోగపడుతుంది. ఆ దిశలోనే జూనియర్ కళాశాలలకు విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు కొంతమేర బడ్జెట్ కూడా కేటాయించారు. కళాశాలల్లో వసతులు, ఇతర విషయాలను పరిశీలించి సాధ్యాసాధ్యాలపై నివేదికలు పంపాలని ఇంటర్ బోర్డు కమిషనర్ విజయలక్ష్మి ఆర్జేడీలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆర్జేడీలు ఆ పనిలో తలమునకలయ్యారు. 16 వేల మందికి లబ్ధి జిల్లాలో మొత్తం 46 ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో రెండో ఏడాదికి 7,582 మంది చదువుతున్నారు. మొదటి ఏడాది ఇప్పటికే 7 వేల అడ్మిషన్లు జరిగాయని అంచనా. మరో 1,500 మంది ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరే అవకాశముంది. గతేడాది కంటే మెరుగైన ఫలితాలను ప్రభుత్వ కళాశాలలు సాధించడంతో ఈ ఏడాది గతేడాది కంటే మరో వెయ్యి అధికంగా అడ్మిషన్లు రావచ్చని అధికారులు చెబుతున్నారు. పరిశీలనకు కమిటీ ఏర్పాటు కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుపై సాధ్యాసాధ్యాలను పరిశీలన జరిపేందుకు కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో డీఈఓతో పాటు కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు ఉన్నారు. వీరు మధ్యాహ్న భోజనం అమలవుతున్న తీరును పరి శీలించారు. ఎంత ఖర్చు, వంట తదితర వివరాలను తెలుసుకున్నారు. ప్రతి కళాశాలలో వసతి, వంటగదులు, విద్యార్థుల సంఖ్య, బియ్యం అవసరం, అందుబాటులో ఉన్న ప్రభుత్వ, జెడ్పీ పాఠశాలలు, సరుకులు, కూరగాయలు, పండ్లు, గుడ్లు తదితర వివరాల సమాచారాన్ని పరిశీలించి సేకరించారు. ఒకటో తేదీ నుంచి అమలు కష్టమే.. ఉన్నత పాఠశాలల విద్యార్థుల కంటే ఇంటర్ పిల్లల కు అధిక క్యాలరీల భోజనం అవసరం. ఉన్నత పాఠశాలలో ఒక్కో విద్యార్థికి 150 గ్రాముల బియ్యం, 30 గ్రాముల పప్పులు, 75 గ్రాముల కూరగాయలు, 7.5 గ్రాముల నూనె ఇస్తారు. అయితే ఇంటర్ విద్యార్థులు శారీరకంగా, వయస్సురీత్యా పెద్దగా ఉంటారు. వీరికి ఈ స్థాయి భోజనం సరిపోదు. ఈ విషయమై వారికి ఎంత స్థాయి భోజనం అవసరమనే విషయాన్ని నిర్ధారించలేదు. కొన్ని చోట్ల పాఠశాలలుంటే వాటిలో చేయించాలనే ఆలోచన చేస్తున్నారు. అందుబాటులో లేని చోట ఇతర సౌకర్యాలు సమకూర్చుకోవాలి. వంట ఏజెన్సీలను ఎంపిక చేయాలి. వీటన్నింటిపై అంచనా వచ్చేందుకు మరికొంత సమయం పట్టే అవకాశముంది. ఈ నేపథ్యంలో అమలుకు మరికొంత సమయం పట్టవచ్చని ఉపాధ్యాయులు అంచనా వేస్తున్నారు. వివరాలు సేకరిస్తున్నాం.. జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసే విషయమై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాం. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తాం. అనంతరం వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. – చంద్రమౌలి, జిల్లా వృత్తివిద్యాధికారి, కడప -
బియ్యం లేవట..
ఖమ్మంరూరల్: ఆటలు, నృత్యాలు, హార్స్ రైడింగ్, స్పోకెన్ ఇంగ్లిష్, భావ వ్యక్తీకరణ, వ్యక్తిత్వ వికాసం తదితర అంశాల్లో గురుకుల పాఠశాలల విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చేందుకు సొసైటీలు బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. వేసవి శిక్షణ శిబిరాల్లో వారిని మెరికల్లా మారుస్తూ.. సమాజంలో ఉన్నత స్థితికి చేరేలా నిష్ణాతులైన వారిచే ప్రత్యేక శ్రద్ధపెట్టి తీర్చిదిద్దుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. శిక్షణ పొందుతున్న విద్యార్థులకు భోజనం అందించే విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు నానా తంటాలు పడుతున్నారు. బియ్యం కేటాయింపుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు ప్రత్యేక శిబిరాల నిర్వహణ తలకు మించిన భారమవుతోంది. శిబిరాల కోసం అవసరమయ్యే బియ్యం కోటా ఇవ్వలేమని పౌరసరఫరాల శాఖ తేల్చి చెప్పడంతో గురుకుల సొసైటీలు ఆందోళన చెందుతున్నాయి. సొసైటీలు ప్రతి సంవత్సరం సమ్మర్ క్యాంపు(వేసవి శిబిరం)లో భాగంగా వివిధ సొసైటీల ఆధ్వర్యంలో నడుస్తున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకుల పాఠశాలల్లో చురుకైన, ఆసక్తి ఉన్న విద్యార్థులను ఎంపిక చేసి.. క్రీడలు, డ్యాన్స్‌లు, హార్స్ రైడింగ్, స్పోకెన్ ఇంగ్లిష్, భావ వ్యక్తీకరణ, వ్యక్తిత్వ వికాసం వంటి 27 అంశాల్లో శిక్షణ ఇస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు విషయాలపై అవగాహన కల్పిస్తుండటంతో విద్యార్థులకు వసతితోపాటు భోజన సదుపాయం కూడా గురుకుల సొసైటీలు సమకూర్చాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రత్యేకంగా బియ్యం కోటా ఇవ్వాలని పౌరసరఫరాల శాఖను కోరగా.. తాము ఇవ్వలేమని చెప్పడంతో విద్యార్థులకు భోజనం ఎలా అందించాలని సొసైటీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. క్యాంపుల్లో 1,200 విద్యార్థులు ఇదిలా ఉండగా.. జిల్లాలో 14 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఒక డిగ్రీ కళాశాల ఉంది. డిగ్రీ కళాశాలలో వార్షిక పరీక్షలు నిర్వహిస్తున్నందున అక్కడ వేసవి శిబిరం నిర్వహించే అవకాశం ఉండదు. మిగిలిన 13 గురుకుల పాఠశాలల్లో క్యాంపులు ఏర్పాటు చేయాలని సొసైటీలు భావించినా.. బియ్యం కొరతతో ఏర్పాటు చేయలేకపోతున్నారు. మొత్తం 14 గురుకులాల్లో 5,089 మంది విద్యార్థినీ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రస్తుతం వేసవి శిబిరాల్లో భాగంగా ఎనిమిది చోట్ల క్యాంపులు నిర్వహిస్తున్నారు. 1,200 విద్యార్థులు శిబిరంలో పాల్గొంటున్నారు. వీరికి వసతితోపాటు భోజనం ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకోసం 7.5 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం ఇవ్వాలని సొసైటీలు ప్రతిపాదనలు చేశాయి. అయితే ప్రత్యేక బియ్యం కోటాపై ప్రభుత్వం కూడా ఎటువంటి సూచనలు చేయలేదని, కోటా విడుదల సాధ్యం కాదని పౌరసరఫరాల శాఖ తేల్చి చెప్పింది. దీంతో సొసైటీలు సర్దుబాటు ప్రయత్నాల్లో తలమునకలయ్యాయి. గత విద్యా సంవత్సరం కేటాయించిన కోటాలో పాఠశాలలవారీగా మిగులు బియ్యం ఏమైనా ఉన్నాయా.. ఇంకా వేరేవిధంగా బియ్యా న్ని ఎలా సమకూర్చుకోవాలనే ప్రయత్నాల్లో అధికారులు నిమగ్నమయ్యారు. అలా మిగిలి ఉన్న బియ్యాన్ని క్యాంపులోని పిల్లలకు సర్దుబాటు చేయాలా.. లేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలా.. అని ఆలోచిస్తున్నాయి. కాగా.. నెలరోజుల క్యాంపు నిర్వహణకు మొత్తం 7.5 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉన్నట్లు సొసైటీ అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం బియ్యం ఇవ్వాలని పౌరసరఫరాల శాఖకు ప్రతిపాదించారు. అయితే బియ్యం పంపిణీ చేస్తేనే విద్యార్థులకు న్యాయం జరుగుతుందని, లేదంటే ఆకలి కేకలు తప్పేట్లు లేదని ఉపాధ్యాయులు అంటున్నారు. -
గుడ్డు గుటకాయ స్వాహా
ప్రకాశం, చినగంజాం: పసి వయస్సు నుంచి గుడ్డును చిన్నారులకు అందించడం ద్వారా వారికి పౌష్టికాహారం నేరుగా ఇవ్వవచ్చన్న ఉద్దేశంతో ప్రభుత్వం అంగన్వాడీలకు, బడి పిల్లలు, గర్భిణులకు గుడ్లు పంపిణీ చేస్తోంది. అధికారులు నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల కక్కుర్తితో ఈ పథకం నీరుగారుతోంది. పథకం అమలులో తలెత్తుతున్న లోపాలను సవరించిన ప్రభుత్వం ఇటీవల కొత్త నిబంధనలను అమలు చేసింది. ఆ మేరకు దీనికి రాష్ట్ర ప్రభుత్వం అన్న అమృత హస్తం అని పేరుపెట్టి ఒక్కో గుడ్డు ధర రూ.4.68లుగా నిర్ణయించి రాష్ట్ర వ్యాప్తంగా గుడ్డు పంపిణీని ముగ్గురు కాంట్రాక్టర్లకు అప్పగించారు. సంబంధిత కాంట్రాక్టర్ అంగన్వాడీలకు, పాఠశాలలకు నేరుగా గుడ్డు పంపిణీ చేయాలి. మార్కెట్ ధరల్లో తరచుగా వచ్చే హెచ్చుతగ్గులతో ఎటువంటి సంబంధం లేకుండా గుడ్లను విద్యార్థులకు అందించాల్సి ఉంది. అంగన్వాడీ కేంద్రాల్లో సోమ, శనివారం మినహా అన్ని రోజుల్లో గుడ్డు పంపిణీ చేయాల్సి ఉండగా, పాఠశాలల్లో సోమ, బుధ, శుక్రవారం గుడ్డు పంపిణీ చేయాలి. గర్భిణులకు ఒక్క రోజు మినహా మిగిలిన అన్ని రోజులు గుడ్డు ఇవ్వాలి. ఒక్కో రోజుకు ఒక్కో రంగు చొప్పున నిర్ణయించి ఆ రంగును గుడ్డుపై ముద్రించి నాణ్యమైన గుడ్డు 52 గ్రాముల బరువు ఉండేలా చూసి పంపిణీ చేయాలనే నిబంధనలతో కాంట్రాక్టర్లకు అప్పగించారు. అయితే కొద్ది రోజులుగా గుడ్డు ధర కొండెక్కి కూస్తుండటంతో కాంట్రాక్టర్లు పంపిణీ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇటీవల చినగంజాం మండలంలో ఎంపీపీ ఆసోది భాగ్యలక్ష్మి పలు పాఠశాలలను సందర్శించగా గుడ్ల పంపిణీ సక్రమంగా జరగడం లేదని గుర్తించారు. నెలలో నాలుగు వారాలకు గుడ్లు విద్యార్థులకు అందజేయాల్సి ఉండగా ఒక వారం మాత్రమే ఇచ్చినట్లు గుర్తించారు. జిల్లాలో వారానికి ఒక్కసారే గుడ్ల పంపిణీ: జిల్లాలో గుడ్ల పంపిణీలో కాంట్రాక్టర్లు భారీగా కోత విధిస్తున్నారు. వారానికి మూడు గుడ్ల చొప్పున నెలకు 12 గుడ్లు వెరసి నెలలో నాలుగు సార్లు గుడ్డు పంపిణీ చేయాల్సి ఉండగా డిసెంబర్ నెలలో మూడు పర్యాయాలు, జనవరి నెలలో కేవలం ఒక్క సారి మాత్రమే గుడ్డు పంపిణీ చేశారు. జిల్లాలో మొత్తం 4244 అంగన్వాడీ కేంద్రాలు, 2857 ప్రాథమిక పాఠశాలలు, 630 ప్రాథమికోన్నత పాఠశాలలు, 800 ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో గుడ్డు పంపిణీ చేయాల్సి ఉంది. గర్భిణులకు సక్రమంగా అందని కోడి గుడ్డు: గర్భిణులు, బాలింతలకు నెలకు 25 గుడ్ల చొప్పున పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ఆ మేరకు పంపిణీ జరగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరితో పాటు మూడేళ్లలోపు చిన్నారులకు 16 గుడ్లు, మూడేళ్లు నిండిన పిల్లలకు నెలకు 8 గుడ్ల చొప్పున పంపిణీ జరగాల్సి ఉంది. పాఠశాలల్లో అడ్రస్ లేని కోడిగుడ్ల పంపిణీ: గుడ్ల పంపిణీలో కొద్దికాలంగా తీవ్ర కొరత ఏర్పడుతోంది. నెలలో కొద్ది రోజులు మాత్రమే గుడ్డు పంపిణీ చేసి మిగిలిన వాటిని పంపిణీ చేయకుండానే ఆ నెల కోటాను కాంట్రాక్టర్లు ముగించేస్తున్నారు. ఆ విధంగా చినగంజాం మండలంలో అక్టోబర్ నెలలో రెండు సార్లు, నవంబర్‌లో మూడు సార్లు, డిసెంబర్లో మూడు, జనవరి నెలలో ఒకసారి మాత్రమే గుడ్డు సరఫరా అయినట్లు ఆయా కుకింగ్ ఏజన్సీల నిర్వాహకులు తెలిపారు. అధికారులు, కాంట్రాక్టర్ల మధ్య సమన్వయ లోపం: అధికారులు, కాంట్రాక్టర్ల మధ్య సమన్వయ లోపం కారణంగా గుడ్ల పంపిణీలో లోపం తలెత్తుతోంది. గుడ్లు నెలకు ఎన్ని పంపిణీ అవుతున్నాయనే విషయాన్ని పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్లు వారిష్టమొచ్చిన రీతిలో పంపిణీ కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం కాంట్రాక్టర్లకు గుడ్డు ధరను నిర్ణయించడం.. ఆ తరువాత గుడ్డు ధరలో వస్తున్న హెచ్చు తగ్గులు పంపిణీకి ఆటంకాలుగా మారుతున్నాయని పంపిణీ చేసే వారు చెబుతున్నారు. ఈ విషయమై సాక్షి చినగంజాం ఎంఈవోను వివరణ కోరగా కాంట్రాక్టర్లు పూర్తి స్థాయిలో గుడ్డు పంపిణీ చేయక పోవడంతో విద్యార్థులకు పూర్తి స్థాయిలో మధ్యాహ్న భోజనంలో గుడ్డు పంపిణీ చేయలేక పోతున్నామని, గుడ్ల సరఫరా చేసినంత వరకు మాత్రమే వారికి బిల్లులు చెల్లిస్తున్నామని వివరించారు. -
పస్తులున్నా పట్టించుకోరా!
పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనంతోపాటు పౌష్టికాహారాన్ని అందించాలనే ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. ఆకుకూరలతోపాటు కోడ్డిగుడ్డును అందించి విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే లక్ష్యానికి ఇస్కాన్ తూట్లు పొడుస్తోంది. పరిస్థితి ఇంతలా ఉన్నా.. పస్తులుండి నిరసన తెలిపినా పట్టించుకోరా అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. కడప ఎడ్యుకేషన్: కడప మండలంలోని పలు పాఠశాలలకు మధ్యాహ్న భోజనాన్ని వడ్డించే బాధ్యతను ప్రభుత్వం ‘ఇస్కాన్’ సంస్థకు అప్పగిం చింది. విద్యార్థులకు ఇస్కాన్ సరఫరా చేస్తున్న మధ్యాహ్న భోజనంలో నాణ్యత లేదని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. దీం తో పాటు ఇస్కాన్ వారు భో జనంలో మెనూ పాటించిన దాఖలాలు లేవని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. చప్పిడి సాంబా రు, నీళ్ల పప్పు.. ముద్దకట్టిన అన్నాన్ని తినలేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. దీంతో చాలా మంది ఇళ్ల నుంచి క్యారియర్లు తెచ్చుకుంటున్న పరిస్థితి దాపురించింది. ఈ భోజనం ‘మాకొద్దు’: ఇస్కాన్ భోజనాన్ని తినలేక కడప నగరంలోని కొండాయపల్లె ప్రాథమిక పాఠశాల విద్యార్థులు అక్టోబర్ 30న డీఈఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. తర్వాత అక్టోబర్ 31, నవంబర్ 1న పాఠశాలలకు తీసుకొచ్చిన అన్నాన్ని తినకుండా భోజన వ్యాన్‌ను వెనక్కు పంపి పస్తులున్నారు. అధికారులకు మొరపెట్టుకున్నా.. పస్తులుండి నిరసన తెలిపినా çపట్టించుకునే వారే లేరని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. ఒక్క కొండాయపల్లె పాఠశాల నుంచేగాక ఇతర పాఠశాలల నుంచి కూడా ఇస్కాన్ భోజనం బాగా లేదని అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. -
కార్మికుల కడుపు కొట్టొద్దు
– సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి – ఈఎస్ఐ, పీఎఫ్ తదితర సౌకర్యాలు కల్పించాలి – సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డిమాండ్ - కలెక్టరేట్ ఎదుట మహాధర్నాకు భారీగా తరలివచ్చిన కార్మికులు కర్నూలు (న్యూసిటీ) : ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను సవరించి కార్మికులు కడుపుకొట్టొద్దని సీఐయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామాంజనేయులు ప్రభుత్వాలకు సూచించారు. కార్మికుల డిమాండ్లపై ఆయూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు నాగరాజు అధ్యక్షత వహించిన ఈ ధర్నాకు జిల్లాలోని అసంఘటిత రంగ, ఆశ, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ కార్మికులందరికీ కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.నిర్మలమ్మ మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివిధ ప్రభుత్వ పథకాల్లో పనిచేసే కార్మికులు సరైన వేతనం అందక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ఇస్కాన్ సంస్థకు కట్టబెడితే సహించమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.నాగేశ్వరరావు మాట్లాడుతూ హమాలీ, ట్రాన్స్పోర్ట్, బీడీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చి హౌసింగ్డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగులును తీసి వేస్తున్నారని మండిపడ్డారు. బెల్టుషాపులను ఎత్తివేస్తామని చెప్పి వీధికో మందు దుకాణం పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఆటో డ్రైవర్లపై దాడులను ఆర్టీఏ, పోలీసు, ఆర్టీసీ అధికారుల దాడులను ఆపాలని మోటర్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుభాన్ డిమాండ్ చేశారు. అనంతరం కార్మికులు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తర్వాత డీఆర్ఓ గంగాధర్‌గౌడ్‌ను కలిసి డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ధర్నాలో సీఐటీయూ నాయకులు గౌస్‌దేశాయ్, పుల్లారెడ్డి, సుబ్బయ్య, రాముడు, గోపాల్, రాజశేఖర్, అంజిబాబు, అంగన్వాడీ వర్కర్ల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి షబానా, ఆశా వర్కర్ల యూనియన్ నాయకుడు చంద్రుడు, సుధాకరప్ప, విజయ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.