Nagamani
-
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మహిళా కానిస్టేబుల్ పరువు హత్య
-
చెప్పుతో కొడతా!
రాజమహేంద్రవరం రూరల్: ‘జోడిచ్చుకుని కొడతా’నంటూ ఓ మహిళపై రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి విరుచుకుపడ్డారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని 27వ డివిజన్ దుర్గాలమ్మ గుడి వీధిలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ డివిజన్లో తన పెద్ద కుమార్తె కంఠంనేని శిరీష, టీడీపీ శ్రేణులతో కలిసి గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దుర్గాలమ్మ గుడి వీధిలో ప్రచారం చేస్తున్న సమయంలో పిల్లల నాగమణి అనే మహిళ ‘ఎన్నికలప్పుడే మీకు ప్రజలు గుర్తొస్తారా?’ అని మహిళ నిలదీసింది. ‘ఓయ్ అమ్మాయ్.. ఆగు’ అంటూ గోరంట్ల ఆమెను అడ్డుకోబోయారు.అయినా.. నాగమణి నిలదీయడం ఆపకపోవడంతో నిగ్రహం కోల్పోయిన గోరంట్ల ఒక్కసారిగా కోపోద్రిక్తుడై ‘జోడిచ్చుకుని కొడతాను’ అంటూ రెచ్చిపోయారు. దీంతో అక్కడున్న మహిళలంతా ఒక్కసారిగా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడి నుంచి పార్టీ శ్రేణులతో కలసి బుచ్చయ్య వెనుతిరిగారు.ఓటమి భయంతోనే ఫ్రస్ట్రేషన్పదేళ్లుగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రజల సమస్యలు పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో ఆయన ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజల నుంచి స్పందన కరువవుతోంది. దీంతో నియోజకవర్గంలోని టీడీపీ నాయకులందరినీ తాను తిరిగే గ్రామం లేదా డివిజన్‌కు తీసుకుని వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు ప్రజల నుంచి స్పందన లేకపోగా.. ప్రచారంలో మహిళలు నిలదీస్తుండటంతో గోరంట్ల ఫ్రస్ట్రేషన్‌కు గురవుతున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.అడుగడుగునా నిలదీతలేఅంతకు ముందు కూడా ఓ ఇంటివద్ద నలుగురు వ్యక్తులు.. ‘ఎన్నికల సమయంలోనే తమరికి ప్రజలు గుర్తొస్తారా’ అంటూ గోరంట్లను నిలదీశారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా పట్టించుకోలేనప్పుడు ఎందుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు. దీంతో కోపోద్రిక్తుడైన గోరంట్ల.. తమకు ఓట్లు వెయ్యవద్దని నోరు పారేసుకున్నారు. అలాంటప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారని అక్కడి వారు అడగడంతో గోరంట్ల, ఆయన అనుచరుడు కురుకూరి కిషోర్ ప్రజలపై దౌర్జన్యానికి దిగారు. వారిని స్థానిక నేతలు, టీడీపీ నాయకులు పక్కకు తీసుకుని వెళ్లడంతో వివాదం సద్దుమణిగింది. గోరంట్ల కుమార్తె శిరీష 27వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించినప్పుడు అక్కడి మహిళలు నిలదీయడంతో ఆమె అక్కడి నుంచి జారుకున్నారు. -
దుబాయ్‌లో భర్త.. మరో యువకుడి కారణంగా.. వివాహిత తీవ్ర నిర్ణయం!
సాక్షి, ఆదిలాబాద్: వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకొన్న సంఘటన మండలంలోని పార్పెల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని పార్పెల్లి గ్రామానికి చెందిన ఒడిషెల చిన్న భోజన్న బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. మూడేళ్లుగా అతడి భార్య నాగమణి(35) ఇద్దరు కుమారులతో కలిసి తల్లిగారింటి వద్ద నిర్మల్‌లోని బెస్తవార్పేట్లో నివాసం ఉంటోంది. పార్పెల్లి గ్రామానికి చిలుక వంశీ అనే వ్యక్తి నాగమణిని కొద్ది రోజులుగా చరవాణిలో లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో నాగమణి రెండు రోజుల కిందట పార్పెల్లి గ్రామానికి చెందిన చిలుక వంశీ తనను ఫోనులో వేధింపులకు పాల్పడుతున్నాడని తల్లితో చెప్పింది. ఇదే క్రమంలో బుధవారం ఉదయం 10గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఇంటికి వచ్చిన తల్లి కళావతికి కుమార్తె ఉరేసుకుని కనిపించింది. వెంటనే స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తల్లి కళావతి ఫిర్యాదు మేరకు నిర్మల్టౌన్లో కేసు నమోదు చేశారు. పార్‌పెల్లిలో ఆందోళన.. నాగమణి మృతదేహాన్ని పార్పెల్లికి అంత్యక్రియల కోసం తీసుకొచ్చారు. ఇదే క్రమంలో వంశీ అనే వ్యక్తి లైంగికంగా వేధింపులకు గురిచేయడంతోనే నాగమణి ఆత్మహత్య చేసుకుందని అతడిపై తగిన చర్యలు తీసుకోవాలని బంధువులు అతడి ఇంటి ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఎస్సై శ్రీకాంత్, సోన్ సీఐ నవీన్ కుమార్ చేరుకుని పార్‌పెల్లిలో గొడవలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. భార్య మృతితో ఇంటికి వచ్చిన భర్త.. నాగమణి ఆత్మహత్య చేసుకొని మృతి చెందిందని విషయం తెలవడంతో భర్త చిన్న భోజన్న దుబాయ్ నుంచి గురువారం ఉదయం స్వగ్రామం చేరుకొన్నాడు. దీంతో తన ఇద్దరు కుమారులు శ్రీచరణ్(12), శ్రీవర్ధన్(10)తో కలిసి భార్య మృతదేహం వద్ద రోదించిన తీరు స్థానికులను కలచివేసింది. ప్రస్తుతం ఆందోళన కొనసాగిస్తున్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
వరుసకు మామా కోడలు.. పింఛన్ తీసుకునేందుకు వచ్చి..
సాక్షి, నిజామాబాద్: మాక్లూర్ మండలంలోని చిక్లీ శివారులో వ డ్ల లారీ టీవీఎస్ ఎక్స్ఎల్ను ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందినట్లు ఎస్సై సుధీర్‌రావు శనివారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. నందిపేట మండలంలోని కంఠం గ్రామానికి చెందిన రేవల్లి భూమన్న (45), గంధం నాగమణి(35) వరుసకు మామా కోడలు అవుతారు. వీరు జన్నెపల్లి పోస్టాఫీస్‌లో పింఛన్ తీసుకునేందుకు వచ్చారు. గుంజ్లి నుంచి వడ్ల లోడ్‌తో జన్నేపల్లి వైపు వెళ్తున్న లారీ చిక్లీ శివారులో జన్నేపల్లి నుండి నందిపేట వైపు వెళ్తున్న వీరిని ఢీ కొన్నది. ఈ ఘటనలో వీరి తలలు పగిలి అక్కడికక్కడే మృతి చెందారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. ఇవి చదవండి: బాధను భరించలేక.. యువతి విషాద నిర్ణయం! -
బోడకాకరకాయలకు వెళ్లి.. పాముకాటుకు గురైన మహిళ !
మహబూబబాద్: పాముకాటుతో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన మంగళవారం ములుగు జిల్లా ఏటూరునాగారంలో జరిగింది. మండల కేంద్రానికి చెందిన బీర్ల నాగమణి (40) కూలీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం మరో ఇద్దరు మహిళలతో కలిసి సమీప అడవిలోకి బోడకాకరకాయలకు వెళ్లింది. కాయలు కోస్తుండగా పాముకాటు వేసింది. ఇది గమనించి ఇద్దరు మహిళలు.. నాగమణిని ఏటూరునాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ములుగు తరలించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందిందని భర్త మల్లయ్య తెలిపారు. మృతురాలికి ఇద్దరు పిల్లలున్నారు. -
మహిళలపై దాడి చేసినా పట్టించుకోరా?
ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ నడి బొడ్డున టవర్ సర్కిల్లో ఇద్దరు మహిళలపై నలుగురు హత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై పోలీసుల నిర్లక్ష్యం విమర్శలపాలవుతోంది. బాధితులు ఫిర్యాదుపై కనీసంగా పట్టించుకోకపోవడం, నలుగురు నిందితులను కనీసం విచారించకుండా వదిలేయడం వివాదాస్పదమవుతోంది. ఆర్మూర్ పట్టణంలోని నిజాంసాగర్ కెనాల్‌పై నివాసం ఉండే శివరాత్రి అరుణ, వింజ శోభ వరసకు అక్కా చెల్లెళ్లు. వీరిద్దరూ ఇళ్లలో కూలీ పనులు ముగించుకుని నడుచుకుంటూ తమ ఇళ్లకు వెళ్తుండగా వారి సామాజిక వర్గానికే చెందిన సంపంగి రమేష్, సంపంగి గణేశ్, సంపంగి బబ్లు, సంపంగి నాగమణి రాళ్లతో దాడి చేశారు. పాత కక్షల నేపథ్యంలో జరిగిన దాడిలో అరుణ తల పగిలి రక్తం కారడంతో తల్లి యాదమ్మ సహాయంతో ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌కు పరిగెత్తుకొని వెళ్లారు. వెంటనే పోలీసులు బాధిత మహిళలిద్దరినీ చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి పంపించి ఘటనా స్థలానికి వెళ్లి దాడికి పాల్పడిన నలుగురిని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. కానీ ఆ తర్వాత వారిని వదిలి వేయడంపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆస్పత్రిలో చికిత్స చేయించుకొని తిరిగి పోలీస్ స్టేషన్‌కు బాధిత మహిళలు వచ్చినా పోలీసులు పట్టించుకోలేదు. గత రెండు రోజులుగా తిరుగుతున్నా పట్టించుకోకపోగా.. ఇదే పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఎస్సై ఏకంగా మీపైనే కేసు పెడతాం అంటూ తమనే బెదిరించారని బాధిత మహిళలు చెబుతున్నారు. ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీస్ అంటూ ప్రచారం చేస్తుండగా ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో మాత్రం నిరుపేద మహిళలపై దాడి చేసిన వారిని కేసులు పెట్టడానికి కూడా పోలీసులు మీనమేషాలు లెక్కించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆలస్యంగా ఎఫ్ఐఆర్ ఎందుకంటే: సురేష్ బాబు, ఎస్‌హెచ్‌వో, ఆర్మూర్ ’’ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఇతర కేసుల ఒత్తిడిలో ఇద్దరు మహిళలపై దాడి చేసిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఆలస్యం అయింది. దాడి చేసిన నలుగురిపై శుక్రవారం రాత్రి 324 సెక్షన్ కేసు నమోదు చేశాము. బాధిత మహిళలపై సైతం కౌంటర్ కేస్ ఫైల్ చేశాము.’ -
అత్తను నరికిన అల్లుడు
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): అత్తను ఆమె అల్లుడే కత్తితో దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటన విజయవాడ కొత్తపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని నైనవరం ఫ్లై ఓవర్‌పై శనివారం రాత్రి చోటుచేసుకుంది. మామను కూడా చంపేందుకు ప్రయత్నించగా.. వేగంగా బైక్ నడిపి తప్పించుకోగలిగాడు. ఈ ఘటన వివరాలు... ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వైఎస్సార్ కాలనీకి చెందిన గోగుల నాగమణి (50), గురుస్వామి భార్యాభర్తలు. వీరికి ముగ్గురు సంతానం కాగా, రెండో కుమార్తె లలితను ఏకలవ్యనగర్‌కు చెందిన కుంభా రాజేశ్‌కు ఇచ్చి వివాహం చేశారు. కొంతకాలంగా రాజేశ్, లలిత మధ్య గొడవలు జరగడంతో పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారు. అప్పటి నుంచి లలిత పుట్టింట్లోనే ఉంటోంది. విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు చేసుకోగా.. కేసు చివరి దశలో ఉంది. ఈ క్రమంలో రాజేశ్ తన అత్త, మామలను చంపేందుకు ప్లాన్ చేశాడు. కాలనీ నుంచే అత్తమామలను వెంబడించి.. శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో వైఎస్సార్ కాలనీ నుంచి సాయిరాం థియేటర్ వద్ద ఉంటున్న పెద్ద కుమార్తె ఇంటికి నాగమణి, గురుస్వామి బైక్‌పై బయలుదేరారు. వీరి బైక్‌ను ఇంటి నుంచే రాజేశ్ మరో వ్యక్తితో కలిసి మరో ద్విచక్ర వాహనంపై వెంబడించాడు. నైనవరం ఫ్లై ఓవర్ మధ్యన ఉన్న పోలీస్ అవుట్ పోస్ట్ వద్దకు వచ్చేసరికి బైక్ వెనుక కూర్చున్న రాజేశ్ అత్త నాగమణిపై కత్తితో వేటు వేశాడు. భుజంపై కత్తి వేటుపడగా.. నాగమణి పెద్దగా కేకలు వేస్తూ కిందపడిపోయింది. దీంతో ఆమె మెడపై కత్తితో నరికాడు. అదే సమయంలో బైక్‌పై ఉన్న గురుస్వామి భయంతో వేగంగా అక్కడి నుంచి వెళ్లి తప్పించుకున్నాడు. కాగా, రక్తం మడుగులో పడి ఉన్న నాగమణి కొద్దిసేపు గాయాలతో విలవిల్లాడింది. ఆమె ఘటనాస్థలంలోనే మృతిచెందింది. నాగమణి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఫ్లై ఓవర్‌కు మూడు వైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. కొత్తపేట సీఐ సుబ్రహ్మణ్యం, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలే హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. నిందితుడు రాజేశ్, అతడికి సహకరించిన వ్యక్తి పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. -
అమ్మ ప్రేమకు సజీవ సాక్ష్యం: నిలువెత్తు జ్ఞాపకం
బిడ్డల భవిష్యత్తు కోసం కలలు కంటూ వాళ్ల కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది అమ్మ. రెక్కలొచ్చి పిల్లలు ఎగిరెళ్లినా వారి జ్ఞాపకాలు మాత్రం ఆమె మెడ చుట్టూ చిట్టి చేతుల్లా అల్లుకుపోతూనే ఉంటాయి. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన కంది నాగమణి పాతికేళ్ల క్రితం దేశసేవలో కానరాని దూరాలకు వెళ్లిన కొడుకును మళ్లీ కళ్లారా చూడాలనుకుంది. కొడుకు గొప్పతనాన్ని ఆ ఊరి ప్రజల ముందుకు తేవాలనుకుంది తనలాంటి కొడుకు వీధికొక్కరు పుట్టాలని నడివీధిలో విగ్రహాన్ని నిలబెట్టింది. కంది నాగమణి, శంకరయ్య దంపతులకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించేవారు. సాగునీటి వసతులు లేక వర్షాధారంపై ఆధారపడి సేద్యం చేస్తుండే వాళ్లు. నాగమణి ఇల్లు, వ్యవసాయపనులే కాదు బీడీలు చుట్టే పని కూడా చేస్తుండేది. పెద్ద కొడుకు సిద్దరాములు ఏడో తరగతి వరకు చిట్యాలలో చదువుకున్నాడు. ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరకు తాడ్వాయి మండల కేంద్రానికి వెళ్లి చదువుకున్నాడు. 1990 లో సీఆర్పీఎఫ్ జవానుగా సెలెక్టయ్యాడు. అప్పట్లో వాళ్ల గ్రామంలో నక్సల్స్ ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. పోలీస్ డిపార్టుమెంటులో చేరుతానని ముందుకెళ్లాడు. వద్దని వారించినా వెనకడుగువేయలేదు. ఇంకో అడుగు ముందుకేసి దేశం కోసం సేవ చేస్తానంటూ వెళ్లాడు. అప్పటికే ఆయనకు భార్య, ముగ్గురు కొడుకులు ఉన్నారు. గుండెలో పేలిన బాంబు 1997 డిసెంబర్ 14న అస్సాంలోని కొక్రా జిల్లాలో బోడో తీవ్రవాదులు పేల్చిన మందుపాతరలో పది మంది వరకు జవాన్లు చనిపోయారు. అందులో సిద్దరాములు ఒకరు. ఇంటికి కబురందింది. తల్లి గుండె చెరువయ్యింది. సీఆర్పీఎఫ్ అధికారులు శవాన్ని తీసుకుని తాడ్వాయికి వచ్చారు. ఆ జ్ఞాపకాల్లోనే.. కొడుకు చనిపోయి పాతికేళ్లు దాటింది. అయినా, ఆ తల్లి మాత్రం కొడుకు జ్ఞాపకాల్లోనే కాలం గడుపుతోంది. చిన్నతనంలో చేసిన అల్లరి, పెద్దయ్యాక చూపిన గుండెధైర్యం ఆమెను రోజూ వెంటాడుతూనే ఉన్నాయి. ఆమె ఆలనా పాలనా చిన్న కొడుకు విఠల్ చూసుకుంటున్నాడు. బీపీ, షుగర్ సమస్యలకు మందులు వాడుతోంది. నిత్యం కొడుకు గురించిన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ వచ్చింది. బీడీ కార్మికురాలిగా రిటైర్ అయ్యాక పీఎఫ్‌లో జమ అయిన డబ్బులపై నెలనెలా పెన్షన్ వస్తోంది. ఆ డబ్బులతో కొడుకు విగ్రహం ఏర్పాటు చేయాలని పూనుకుంది. విగ్రహం తయారీకి, ఏర్పాటుకు ఎంతోమందిని కలిసి, తన కల గురించి చెబుతుండేది. దాదాపు రూ.లక్షా 60 వేలు ఖర్చు చేసి సిద్దరాములు నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేయించింది. జై జవాన్.. గ్రామంలో ప్రధాన కూడలి వద్ద ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఈ నెల 27న జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరింపజేసింది నాగమణి. కొడుకు జ్ఞాపకాలతో విగ్రహం ఏర్పాటు చేసిన తల్లిని అందరూ అభినందించారు. నాగమణి మాత్రం నాడు తన కొడుకుతో పాటు మరో పది మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేసుకుంది. దేశసేవలో జవాన్ల త్యాగం గురించి ఈ సందర్భంగా అందరూ గుర్తుచేసుకున్నారు. పిల్లలు సైతం జై జవాన్ అంటూ దేశసేవలో జవాన్ గొప్పతనాన్ని తెలుసుకుంటున్నారు. కండ్ల ముందే తిరుగుతున్నట్టుంది చిన్నప్పటి నుంచి నా కొడుకులు ఎంతో కష్టపడి చదువుకున్నరు. తాడ్వాయికి నడుచుకుంటూ వెళ్లేవాళ్లు. పెద్దోడు ఉద్యోగంలో చేరిన తరువాత మా కష్టాలు తీరినయి. ఆరేడేండ్లు ఉద్యోగం చేసిండో లేదో చనిపోయిండు. వాడు కనుమరుగై ఇరవై ఐదేండ్లవుతున్నా నా కండ్ల ముందర ఇంకా తిరుగున్నట్టే ఉంటది. యాది జేసుకోని రోజు ఉండది. ఊళ్లో అందరితో ఎంతో ప్రేమగా ఉండేటోడు. రోజూ వాని ఫోటో చూసుకుంటూ ఇన్నేళ్లు గడిపినా. నా కొడుకు లెక్కనే ఉండే విగ్రహం అందరికీ తెలిసేలా పెట్టించాలనుకున్నా. అది ఇన్నాళ్లకి తీరింది. సైనికుడైన నా కొడుకు నాకే కాదు మా ఊరికి కూడా గొప్ప పేరు తెచ్చిపెట్టిండు. – కంది నాగమణి, అమర జవాన్ సిద్దరాములు తల్లి – ఎస్.వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి -
నాలుగేళ్ల నుంచి సాన్నిహిత్యం.. ఫోన్‌చేసి ఇబ్బంది పెడుతోందని..
సాక్షి, హైదరాబాద్(పటాన్చెరు టౌన్): ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమైన మహిళ మృతదేహమై కనిపించిన ఘటన అమీన్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ శ్రీనివాసులు రెడ్డి వివరాల ప్రకారం మండలంలోని జానకంపేటకు చెందిన తలారి నర్సింలు భార్య నాగమణి(35) ఈ నెల 1న జిన్నారం వెళ్తున్నానని ఇంట్లో కుమారుడికి చెప్పి వెళ్లిఅదృశ్యమైంది. భర్త నర్సింలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా మృతురాలు పటాన్చెరులో మరో వ్యక్తితో ఉన్నట్లు గుర్తించారు. చదవండి: (భర్తతో గొడవలు.. బ్యూటీషియన్ ఆత్మహత్య) జిన్నారం మండలం మాధారం మధిరగ్రామం దువ్వకుంటకు చెందిన జంగయ్యకు నాగమణికి నాలుగేళ్ల నుంచి సాన్నిహిత్యం ఉంది. బుధవారం ఇద్దరు రామేశ్వరంబండ వీకర్‌సెక్షన్ కాలనీ వైపు ఉన్న పెద్దకుంట వద్ద మద్యం సేవించారు. నాగమణి ఫోన్ చేసి ఇబ్బంది పెడుతుండడంతో మద్యం మత్తులో ఉన్న జంగయ్య ఆమెను హత్య చేసి, ఒంటిపై ఉన్న నగలు తీసుకుని మృతదేహాన్ని పెద్దకుంటలో పడేశారు. జంగయ్యను అదుపులోకి తీసుకొని విచారించగా హత్యానేరం ఒప్పుకున్నాడడు. ఘటనా స్థలాన్ని క్లూస్ టీం, అదనపు ఎస్పీ నితిక పంత్, డీఎస్పీ భీంరెడ్డి పరిశీలించారు. నిందితుడి నుంచి నగలు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: (భర్త లింగమార్పిడి.. మరొకరితో సహజీవనం.. అంతలోనే..) -
గాంధీ ల్యాబ్ ఇన్చార్జి నాగమణిపై వేటు
సాక్షి, సిటీబ్యూరో/గాంధీ ఆస్పత్రి: గాంధీ ఆస్పత్రి వైరాలజీ ల్యాబ్ ఇన్చార్జి నాగమణిపై వేటు పడింది. ఆమెను డిప్యుటేషన్‌పై ఫీవర్ ఆస్పత్రికి బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె స్థానంలో ఉస్మానియా మెడికల్ కాలేజీ మైక్రోబయాలజీ ప్రొఫెసర్ జ్యోతిలక్ష్మికి బాధ్యతలు అప్పగించారు. కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షల నిర్వహణ, రిపోర్టుల జారీలో తీవ్ర జాప్యానికి తోడు, ఇటీవల ఇద్దరు రోగులకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో పాజిటివ్ నిర్ధారణ కావడం, ఆ తర్వాత పుణె వైరాలజీ ల్యాబ్ పరీక్షల్లో నెగిటివ్‌గా రావడంతో గాంధీ వైరాలజీ ల్యాబ్ వైద్య సిబ్బంది పనితీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం సంబంధిత ఇన్చార్జిపై చర్యలకు ఉపక్రమించింది. అయితే.. ఇది సాధారణ మార్పేనని వైద్య ఆరోగ్య శాఖ కొట్టిపారేస్తోంది. ప్రొఫెసర్ నాగమణి బదిలీని నిరసిస్తూ గాంధీ వైరాలజీ ల్యాబ్‌లో విధులు నిర్వహించే పలువురు వైద్యులు, పారామెడికల్, కాంట్రాక్టు సిబ్బంది గురువారం విధులకు గైర్హాజరైనట్లు తెలిసింది. వైరాలజీ ల్యాబ్‌లో పని చేస్తున్న ఇతర పార మెడికల్ స్టాఫ్ సెలవులో వెళ్లడంతో వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో జాప్యం జరుగుతోంది. అసలేమైందంటే? చైనాలోని వూహాన్ నగరంలో కరోనా వైరస్ వెలుగు చూసిన అనంతరం సత్వర వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం ప్రభుత్వం గాంధీ జనరల్ ఆస్పత్రి, మైక్రో బయాలజీ విభాగంలో వైరాలజీ ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. గాంధీ మెడికల్ కాలేజీ మైక్రోబయోలజీ హెచ్ఓడీ ప్రొఫెసర్ డాక్టర్ నాగమణిని ల్యాబ్ ఇన్ఛార్జిగా నియమించారు. తొలుత పుణె వైరాలజీ ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించారు. అనంతరం గాంధీకి కిట్స్ సరఫరా చేసి, ఇక్కడే వ్యాధి నిర్దారణ పరీక్షలు చేయిస్తున్నారు. గాంధీలో నిర్వహించిన పరీక్షల్లో అనుమానం ఉంటే రెండోసారి పరీక్ష నిమిత్తం ఆయా నమూనాలను పుణెకు పంపుతున్నారు. రెండు చోట్ల పాజిటివ్‌గా నిర్ధారణ అయితేనే ప్రకటిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు స్వదేశంలో వారికి క్లోజ్ కాంటాక్ట్‌లో ఉన్నవారు అనుమానంతో ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. తాజాగా రోగుల సంఖ్య భారీగా పెరిగింది. ఇటలీ నుంచి వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజినీర్, అపోలో ఆస్పత్రి వర్కర్‌తోపాటు మొత్తం 13 మందికి చేసిన పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్‌కు దగ్గరగా వచ్చినట్లు గాంధీ వైరాలజీ ల్యాబ్ తన నివేదికలో పేర్కొంది. నివేదికలతో పాటు ఆయా అనుమానితుల నుంచి రెండోసారి శాంపిల్స్ సేకరించి పుణెకు పంపగా మొత్తం నెగిటివ్ వచ్చాయి. వ్యాధి నిర్ధారణ పరీక్షల ఫలితాలు సరిగా లేకపోవడం, పరీక్షల్లోనూ తీవ్ర జాప్యం జరుగుతుండటం, గాంధీ రిపోర్టులకు, పుణె రిపోర్టులకు తేడా ఉండటంతో ఇన్చార్జిపై వేటుకు ప్రధాన కారణంగా తెలిసింది. ఇదిలా ఉండగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ జ్యోతిలక్ష్మికి వైరాలజీ ల్యాబ్‌పై పూర్తి అవగాహన లేకపోవడం, ల్యాబ్‌లోని సిబ్బంది గురువారం విధులకు గైర్హాజరు కావడంతో వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు తెలిసింది. రిపోర్టుల కోసం పడిగాపులు కరోనా నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాం«ధీ ఆస్పత్రిలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు, నివేదికల జారీలో తీవ్ర జాప్యం జరగడంతో అనుమానితులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఐసోలేషన్ వార్డులో ఎంతసేపు ఉండాలంటూ పలువురు వైద్యులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఈ నెల 4న గాంధీ ఐసోలేషన్‌కు వచ్చిన అనుమానితులకు చెందిన నివేదికలు ఇప్పటి వరకు అందలేదని తెలిసింది. ప్రస్తుతం ఐసోలేషన్ వార్డులో గురువారం అడ్మిట్ అయిన 13 మందితో కలిసి మొత్తం 31 మంది రిపోర్టుల కోసం నిరీక్షిస్తున్నారు. ఇప్పటి వరకు వారి రిపోర్టులు రాకపోవడంతో ప్రస్తుతం వారందరినీ ఐసోలేషన్ వార్డులో ఉంచినట్లు తెలిసింది. -
ఏలూరులో మహిళ హత్య!
ఏలూరు టౌన్: అదృశ్యమైన ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో ఓ చిన్న బోదెలో శవమై తేలింది. ఈ ఘటన ఏలూరులో సోమవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఏలూరు త్రీటౌన్ పరిధిలోని శనివారపుపేట ప్రాంతానికి చెందిన గుళ్ళమిల్లి శివాజీకి, నాగమణికి కొంతకాలం క్రితం వివాహమైంది. నాగమణి (34) ఇళ్లలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. భర్త శివాజీ మానసిక వికలాంగుడు. దీంతో అతను ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్న వరుసకు మేనల్లుడైన సంతోష్ అనే వ్యక్తితో నాగమణి సన్నిహితంగా ఉంటోంది. అది కాస్తా వివాహేతర సంబంధంగా బలపడింది. ఈ నేపథ్యంలోనే సంతోష్ కొద్దిరోజులుగా నాగమణిపై అనుమానం పెంచుకున్నాడు. ఆమె పనుల కోసం ఎక్కడికి వెళ్లినా వెంబడిస్తూ ఉన్నాడు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. అప్పటి నుంచి నాగమణి అతనికి దూరంగా ఉంటోంది. నాగమణికి కంటి సమస్య రావటంతో ఈనెల 20న ఏలూరు ఆర్ఆర్పేటలో శంకర్ నేత్రాలయ ఆస్పత్రిలో చికిత్స చేయించుకునేందుకు ఆమె సోదరుడు తీసుకువెళ్లాడు. ఈ సమయంలోనూ సంతోష్ వారిని వెంబడించినట్లు తెలుస్తోంది. చికిత్స అనంతరం ఆమె ఇంటికి వెళ్ళి పోయింది. ఈనెల 21న యథావిధిగా ఆటోలో సత్రంపాడులోని ఒక ఇంటికి పని చేసేందుకు వెళ్ళింది. అప్పుడు కూడా సంతోష్ ఆమెను వెంబడించాడు. అప్పటి నుంచి నాగమణి అదృశ్యమైంది. బంధువులు ఆమె కోసం పలు ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోయింది. సోమవారం ఏలూరు దొండపాడు దత్తాశ్రమం సమీపంలోని ఒక బోదెలో నాగమణి శవమై కనిపించింది. స్థానికుల సమాచారంతో త్రీటౌన్ సీఐ మూర్తి ఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించారు. హత్యగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చి ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం సంతోష్ పరారీలో ఉన్నాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నకిలీ నాగమణి.. మోసగాళ్ల అరెస్టు
యశవంతపుర: నాగమణి, రెండు తలల పాముతో మంచి జరుగుతుందని నమ్మించి మోసం చేస్తున్న ముగ్గురు మోసగాళ్లను బెంగళూరు ఉత్తర విభాగం మహాలక్ష్మీ లేఔట్ పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్రదుర్గ హిరియూరుకు చెందిన ప్యారుబాయి, తమకూరుకు చెందిన శివణ్ణ, కృష్ణప్పలను అరెస్ట్ చేసి నకలీ నాగమణి (అవలం), రెండు తలల పామును స్వాధీనం చేసుకున్నారు. రాజాజీనగర ఇస్కాన్ దేవస్థానం సమీపంలోని ఇందిరా క్యాంటీన్ పక్కన ఓ రంగురాయి చూపుతూ అలసైన అవలం అని అమ్మడానికి సిద్ధం అవుతుండగా సమాచారం అందుకున్న పోలీసులు ప్యారుబాయిని పట్టుకున్నారు. అతడి వద్దనున్న నకిలీ అవలంతో పాటు ప్రాచీన కాలం నాటి చెంబు, తట్టలను స్వాధీనం చేసుకున్నారు. ఎపిఎంసీ యార్డ్ కాయగూరల మార్కెట్ రోడ్డులో రెండు తలల పామును అమ్ముతుండగా శివణ్ణ, కృష్ణప్పలను అరెస్ట్ చేసిన్నట్లు పోలీసులు తెలిపారు. -
ఇంజక్షన్ వికటించి మహిళ మృతి
నక్కపల్లి(పాయకరావుపేట) : గొడిచర్ల పీహెచ్సీలో ఇంజక్షన్ వికటించి ఓ మహిళ మృతిచెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలుఇలా ఉన్నాయి. ఎస్.రాయవరం మండలం గోకుల పాడుకు చెందిన కొఠారు నాగమణి(24) తన స్నేహితురాలు నానేపల్లి విజయతో కలసి సోమవారం ఉదయం గొడిచర్ల పీహెచ్‌సీకి వచ్చింది. తనతో తెచ్చుకున్న ఇంజక్షన్‌ను చేయాలని అక్కడ ఉన్న ల్యాబ్‌టెక్నీషియన్ రూపను కోరింది. అయితే ఇంజక్షన్ చేసేందుకు రూప నిరాకరించింది. బతిమాలడంతో ఆమె నాగమణికి ఇంజక్షన్ చేసింది. కొద్దిసేపటికి నాగమణి సృహతప్పిపడిపోయింది. వెంటనే రూప, నాగమణి స్నేహితురాలు విజయ ఆమెకు మంచినీరు పట్టి, సపర్యలు చేశారు. కొద్దిసేపటి తర్వాత ఆమె మరణించిందని తనకు విజయ ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చిందని మృతురాలికి వరుసకు సోదరుడైన లంక రామచంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతురాలి ఒత్తిడి మేరకు తాను ఇంజక్షన్ చేసినట్టు రూప చెబుతోంది.అయితే ఇంజక్షన్‌ను మక్కకు చేయాల్సి ఉండగా చేతికి చేయడం వల్లే వికటించి మరణించినట్టు పీహెచ్సీ వైద్యాధికారి నాగనరేంద్ర తెలిపారు.కాగా మృతురాలు కొద్ది రోజులుగా హృద్రోగంతో బాధపడుతోంది. తరచూ ఇంజక్షన్లు చేయించుకుంటోంది.దీనిలో భాగంగానే స్నేహితురాలితోకలసి గొడిచర్ల వచ్చి అక్కడ ఇంజక్షన్ చేయమని కోరిందని, ముందు నిరాకరించిన ట్యాబ్‌టెక్నీషియన్ రూప తర్వాత చేసిందని అక్కడ ఉన్న సిబ్బంది చెబుతున్నారు. అయితే ఆస్పత్రిలో డాక్టర్ అందుబాటులో ఉన్న సమయంలో హృద్రోగంతో బాధపడుతున్న రోగికి ఆయన అనుమతి తీసుకోకుండా ఇంజక్షన్ చేయడం నేరమని తెలుస్తోంది. నక్కపల్లి సీఐ సీహెచ్ రుద్రశేఖర్ పీహెచ్‌సీకి వెళ్లి విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సింహాచలం తెలిపారు. -
గుడివాడలో దంపతుల దారుణ హత్య
-
గుడివాడలో దంపతుల దారుణ హత్య
సాక్షి, గుడివాడ : కృష్ణాజిల్లా గుడివాడలో అర్థరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఒంటరిగా ఉంటున్న వృద్ధ దంపతులు.. దుండగుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. రాజేంద్రరనగర్ నాలుగో లైన్లో నివాసం ఉంటున్న బొప్పన సాయిచౌదరి (72), నాగమణి (67) ఇంట్లోకి దుండగులు చొరబడి వారిని తీవ్రంగా కొట్టి హతమార్చారు. అనంతరం ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు దోచుకు వెళ్లారు. అంతేకాకుండా ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారును కూడా దుండగులు అపహరించుకు వెళ్లారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంటి హాల్లో రక్తం మడుగులో పడిఉన్న మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్ట్ మార్టంకు తరలించారు. మరోవైపు రంగంలోకి దిగిన క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. కాగా ఈ హత్యకు పాల్పడింది దోపిడీ దొంగలా లేక ఇరతర్రా కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన కలకలం రేపడంతో ఘటనా స్థలానికి పెద్ద ఎత్తున స్థానికులు చేరుకున్నారు. మరోవైపు జిల్లా ఎస్పీ త్రిపాఠి సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
విషాదం: తలపాగ మెషిన్లో ఇరుక్కుని..
సాక్షి, ములుగు (గజ్వేల్): తలకు చుట్టుకున్న గుడ్డ యంత్రంలో ఇరుక్కొని ఓ మహిళ మృతి చెందింది. సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడిలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. చిన్నతిమ్మాపూర్‌కు చెందిన నాగమణి (35) వంటిమామిడిలోని జయలక్ష్మి రైస్ మిల్లులో పనిచేస్తోంది. ఆమె తలకు గుడ్డ చుట్టుకుని బియ్యం పట్టే యంత్రం వద్ద మట్టి పెళ్లలను వేరు చేస్తోంది. ఆమె తలగుడ్డ ప్రమాదవశాత్తూ యంత్రంలో ఇరుక్కుపోయి మెడకు బిగుసుకుపోయింది. యంత్రానికి తల బలంగా తాకడంతో అపస్మారక స్థితిలోకి జారుకుంది. అదేమిల్లులో పనిచేస్తున్న భర్త శంకర్ ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి సికింద్రాబాద్‌లోని ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. -
చైతన్య కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య
-
చైతన్య కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, విజయవాడ : కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లు చైతన్య కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఎంసెట్ మెడికల్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థిని చంద్రకా నాగమణి శనివారం మధ్యాహ్నం కళాశాల క్లాస్ రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనంతపురం జిల్లాకు చెందిన నాగమణి చైతన్య కాలేజీలోని వసతి గృహంలో ఉంటూ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటోంది. మరోవైపు పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అలాగే ఘటనా స్థలంలో సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చంద్రికా నాగమణి రాసిన సూసైడ్ లేఖలో కీలక సమాచారం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే విద్యార్థిని తల్లిదండ్రులకు పోలీసులు ఆత్మహత్య సమాచారం అందించారు. ఆత్మహత్య ఘటనపై విచారణకు ఆదేశం విద్యార్థిని చంద్రికా నాగమణి ఆత్మహత్య ఘటనపై మంత్రి గంటా శ్రీనివాసరావు విచారణకు ఆదేశించారు. ఆమె మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నా...విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర దిగ్ర్భాంతి కలిగించిందన్నారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఇంటర్మీడియెట్ బోర్డు కమిషనర్‌కు మంత్రి ఆదేశాలు ఇచ్చారు. -
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
చెన్నేకొత్తపల్లి : మండలంలోని యర్రంపల్లిలో కుటుంబకలహాతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. మండలంలోని సోమందేపల్లికి చెందిన విజయలక్ష్మి(28)కి చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దెల గ్రామానికి చెందిన నాగేంద్రతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహ సమయంలో 8 తులాల బంగారు. రూ. 2 లక్షల నగదు ఇచ్చామని మృతురాలి తల్లిదండ్రులు శ్రీలక్ష్మి, గంగాప్రసాద్‌లు తెలిపారు. అయితే తరచూ తమ కుమార్తెను భర్తతో పాటు అత్తమామలు వేధింపులకు గురిచేసే వారన్నారు. తమ కుమార్తెను వారే చంపి ఉరివేసి ఉంటారని వారు ఆరోపించారు. తమకుమార్తె చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. యర్రంపల్లిలో మరొకరు.. మండలంలోని యర్రంపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీదేవి, చిన్నవెంకట్రాముడు దంపతుల కుమార్తె నాగమణి( 22)ని ఇదే మండలంలోని ముష్టికోవెలకు చెందిన ఈశ్వరయ్యతో ఏడాది క్రితం వివాహం చేశారు. వారు సోమందేపల్లి మండలంలో మగ్గం పని చేసుకుంటూ జీవనం సాగించేవారు. అయితే కొన్ని నెలలుగా భర్త వేధింపులు అధికం అయ్యాయని పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఇంటి ఎవరూ లేని సమయంలో లుంగీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందన్నారు. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భిణీ అని వారు తెలిపారు. తమ కుమార్తె మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఎస్ఐ మహమ్మద్‌రఫీ సంఘటనా స్థలాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఆయన తెలిపారు. -
అమెరికాలో రోడ్డు ప్రమాదం : తెలుగు మహిళ మృతి
అట్లాంటా : అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలుగు మహిళ నాగమణి మృతిచెందారు. వివరాలు.. అట్లాంటాలోని న్యూటన్ కౌంటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగమణి తలకు తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటిన పీడ్‌మోన్ట్ న్యూటన్ ఆసుపత్రికి ఆమెని తరలించారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే నాగమణి మృతిచెందారు. హెన్రీ కౌంటీలో నాగమణి టీచర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త శంభు ప్రసాద్ తనికెళ్ల ప్రస్తుతం భారత్‌లోనే ఉన్నారు. సమాచారం తెలుసుకున్న కుమారుడు భరద్వాజ అట్లాంటాకు బయలుదేరారు. ఆటా టీం ఘటనా స్థలికి చేరుకొని సహాయ కార్యక్రమాలు చేపట్టింది. కరుణ్ ఆసిరెడ్డి, శివకుమార్, అనిల్ బోడిరెడ్డిలు ఆటా నుంచి కావాల్సిన సహాయసహకారాలు అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అమ్మా.. నేను కేసీఆర్‌ను మాట్లాడుతున్నా..
డబుల్ బెడ్రూం ఇంటి లబ్ధిదారు నాగమణికి సీఎం ఫోన్ ఖమ్మం రూరల్ (పాలేరు): ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి గ్రామానికి చెందిన డబుల్ బెడ్రూం లబ్ధిదారురాలికి సీఎం కేసీఆర్ ఫోన్ చేసి డబుల్ బెడ్రూం ఇళ్లపై ఆరా తీశారు. బుధవారం ఇదే గ్రామంలో డబుల్బెడ్రూం ఇళ్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం 11:28 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి సీఎం పర్సనల్ సెక్రటరీ డబుల్ బెడ్రూం ఇంటి లబ్ధిదారు నాగమణికి ఫోన్ చేసి.. కేసీఆర్ గారు మాట్లాడతారంటూ చెప్పారు. అనంతరం సీఎం కేసీఆర్ ఫోన్లో నాగమణితో మాట్లాడుతూ.. అమ్మా.. మీ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి... డబుల్ బెడ్రూం ఇళ్లు ఎలా ఉన్నాయి, గ్రామంలో ఎంతమంది ఒంటరి మహిళలున్నారని అడిగారు. ఒంటరి మహిళలకు పింఛన్ ఇస్తే ఎలా ఉంటుందని అడిగారు. మద్దులపల్లిని మరో గంగదేవిపల్లిలాగా చేసుకోవాలని, అందుకు ప్రభుత్వ సహాయసహకారాలు అందిస్తామన్నారు. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఫోన్ రావడం, సీఎంతో ఫోన్లో మాట్లాడే అవకాశం రావడంతో నాగమణి ఆనందానికి అవధుల్లేవు. సాధారణ మహిళనయిన తనతో కేసీఆర్ ఆప్యాయంగా మాట్లాడిన తీరును చెబుతూ ఉబ్బితబ్బిబైంది. -
వివాహిత ఆత్మహత్య
కదిరి టౌన్ : కదిరి ఎన్జీఓ కాలనీలో అరవింద్‌కుమార్ భార్య నాగమణి (32) అనే వివాహిత శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నట్లు పట్టణ ఎస్ఐ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె పలు చోట్ల వైద్య చికిత్సలు చేయించుకున్నా ఫలితం లేకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి పైకప్పుకు ఉరేసుకుని తనువు చాలించినట్లు వివరించారు. మృతురాలి తండ్రి నాగేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. మృతురాలికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా దంపతుల మధ్య నెలకొన్న విభేదాలే ఆత్మహత్యకు దారితీసినట్లు తెలిసింది. నిజనిజాలు పోలీసుల దర్యాప్తులో తేలాలి. -
భార్యను చంపిన కేసులో భర్తకు జీవిత ఖైదు
నల్గొండ: భార్యను చంపిన కేసులో భర్తకు జీవిత ఖైదు విధిస్తూ ఎనిమిదో అదనపు జిల్లా జడ్జి కే అజిత్ సింహారావు బుధవారం తీర్పు ఇచ్చారు. కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన గురుస్వామికి, దామరచర్లకు చెందిన నాగమణికి 2006లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. కొంతకాలం హుజూర్‌నగర్‌లో కాపురం ఉన్న వీరు.. ఆ తర్వాత అత్తగారి ఊరైన దామరచర్లకు మకాం మార్చారు. భార్యపై అనుమానం పెంచుకున్న గురుస్వామి 2011 సంవత్సరం నవంబర్ 11న ఆమె గొంతు నులిమి చంపాడు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడిని జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. -
వివాహిత ఆత్మహత్య
తాడిపత్రి : పట్టణంలోని చిన్నబజార్లో నివాసం ఉంటున్న నాగమణి (35) సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. అనారోగ్య సమస్యతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. -
వివాహిత ఆత్మహత్య
కుందుర్పి: మండల కేంద్రానికి చెందిన వివాహిత నాగమణి (20) మహిళ కడుపునొప్పి తాళలేక ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి గంగాధర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాలుగు నెలల క్రితం నాగమణికి వివాహమైంది. మూడు నెలలుగా కడుపునొప్పి ఉండేది. ఆదివారం కడుపునొప్పి తీవ్రం కావడంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. -
తల్లీ, కూతుళ్లు దారుణ హత్య
-
వివాహిత బలవన్మరణం
పోలవరం : పోలవరం మండలంలోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన అప్పన నాగమణి (40) అనే వివాహిత మంగళవారం వేకువ జామున ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కడుపు నొప్పి తాళలేక నాగమణి ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆమె సోదరుడు ముక్కు వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారని ఎస్సై కె.శ్రీహరి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
బిర్కూర్: నిజామాబాద్ జిల్లా బిర్కూర్ మండలం దుర్తి గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం విషాదం చోటు చేసుకుంది. కుటుంబకలహాలతో మనస్థాపం చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంది. దుర్తికి చెందిన నాగమణి(35)కి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. ఈమెకు రెండేళ్ల జేతశ్రీతో పాటు మూడు నెలల చిన్న పాప ఉంది. కుటుంబకలహాల నేపథ్యంలో మనస్థాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన ఇరుగుపొరుగువారు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. తల్లీబిడ్డలు ముగ్గురు మంటలకు ఆహుతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆమె భర్త వ్యవసాయ కూలి. అతను పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మద్యం మత్తులో భార్యను కొట్టి చంపాడు
హుజూర్నగర్: మద్యానికి బానిసై అతిగా మద్యం సేవించి భార్యపై దాడి చేసి ఆమెను దారుణంగా హతమార్చాడో భర్త. ఈ సంఘటన నల్లగొండ జిల్లా హుజూర్నగర్ గోవిందాపురంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న పచ్చిపాల లింగయ్య, నాగమణి(28) దంపతులకు పదేళ్ల క్రితం వివాహమైంది. ఈ క్రమంలో గత కొన్నేళ్లుగా మద్యానికి బానిసైన లింగయ్య తరచు భార్యతో గొడవపడుతుండేవాడు. శుక్రవారం రాత్రి కూడా ఫూటుగా మద్యం సేవించి ఇంటికి వచ్చిన లింగయ్య నిద్రిస్తున్న నాగమణి తలపై రాడ్ తో బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. -
టెక్కలిలో వివాహిత ఆత్మహత్య
టెక్కలి: శ్రీకాకుళం జిల్లాలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. టెక్కలి పట్టణానికి చెందిన చంద్రమౌళి, నాగమణి దంపతులకు రెండేళ్ల క్రితం వివాహమైంది. వారికి 9 నెలల బాబు ఉన్నాడు. చంద్రమౌళి స్థానికంగా ఓ ప్రైవేట్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం అతడు విధులకు వెళ్లిన సమయంలో నాగమణి ఇంట్లో ఉరేసుకుంది. భర్త తిరిగి ఇంటికి వచ్చే సరికి ఆమె ఉరికి వేలాడుతోంది. కిందికి దింపి చూడగా ఆమె అప్పటికే చనిపోయింది. చంద్రమౌళి సమాచారం మేరకు నాగమణి కుటుంబసభ్యులు అక్కడికి చేరుకున్నారు. కట్నం కోసం చంద్రమౌళి పెట్టే మానసిక వేధింపులు భరించలేకే నాగమణి ఆత్మహత్యకు పాల్పడిందని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
బండరాయితో మోది అమ్మనే చంపేశాడు..
ఆస్తి కోసం అమ్మనే చంపేశాడు బండరాయితో మోది హత్య చేసిన కొడుకు రోడ్డు ప్రమాదంగా చిత్రీకరణ కోటమర్పల్లిలో ఘటన మర్పల్లి: ఆస్తి కోసం.. నవమాసాలు మోసి కనిపెంచి పెద్దచేసిన కన్నతల్లినే చంపేశాడో కర్కోటకుడు. బండరాయితో మోది హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. ఈ సంఘటన మండల పరిధిలోని కోటమర్పల్లి గ్రామంలో శనివారం వెలుగుచూసింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సొన్నాయి బాలమణి (65), రాచయ్య దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. ఇద్దరు కుమారులతో పాటు బాలమణి భర్త రాచయ్య గతంలోనే చనిపోయాడు. కూతుళ్ల వివాహాలు జరిగాయి. బాలమణి పెద్దకొడుకు రాజు మెదక్ జిల్లా రుద్రారం నివాసి నాగమణితో పాటు అదే జిల్లా చిట్కుల గ్రామానికి చెందిన వినోదను వివాహం చేసుకొని నగరంలో ఉంటూ కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బాలమణి తమకున్న 4 ఎకరాల పొలాన్ని సాగుచేసుకుంటూ వచ్చిన డబ్బును తన అవసరాలకు ఉపయోగించుకుంటోంది. జల్సాలకు అలవాటుపడిన రాజు తల్లిని చంపేస్తే నాలుగెకరాల పొలం తనకు వస్తుందని భావించాడు. ఎలాగైనా తల్లిని హత్య చేయాలని పథకం పన్నాడు. ఈక్రమంలో అతడు శుక్రవారం రాత్రి కోటమర్పల్లికి వచ్చాడు. సదాశివపేట్ ఆస్పత్రిలో అక్క స్వరూప జ్వరంతో చికిత్స పొందుతోందని తల్లి బాలమణిని నమ్మించాడు. రాత్రి 8 గంటల సమయంలో తన మోపెడ్‌పై తల్లిని ఎక్కించుకొని సదాశివపేట్‌కు బయలుదేరాడు. మార్గమధ్యంలోని మోమిన్‌పేట్ మండలం బూర్గుపల్లి సమీపంలో వాహ నం ఆపాడు. రాజు తల్లి బాలమణి తలపై బండరాయితో మోదడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ఇలా దొరికిపోయాడు.. తల్లిని చంపేసిన రాజు హత్యను.. ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేశాడు. మర్పల్లి మండలం సిరిపురంలో ఉండే తన అక్క స్వరూప ఇంటికి అదే రాత్రి వెళ్లాడు. ‘అమ్మకు గుండెపోటు వచ్చింది.. సదాశివపేట్ని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.. బావను తీసుకెళ్తా’నని స్వరూపను రాజు నమ్మించా డు. బావ ఆశయ్యను ఘటనా స్థలానికి తీసుకెళ్లిన అతడు తన తల్లిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతిచెందిందని నమ్మబలికాడు. రాజు బావతో కలిసి తల్లి మృతదేహాన్ని స్వగ్రామం కోటమర్పల్లికి తీసుకెళ్లాడు. తన తల్లి రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని గ్రామస్తులకు చెప్పాడు. అతడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో శనివారం స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మోమిన్‌పేట్ సీఐ ఏవీ రంగా, మర్పల్లి ఎస్ఐ అరుణ్‌కుమార్ కోటమర్పల్లికి చేరుకొని రాజును విచారణ జరిపారు. తన తల్లిని చంపితే ఆస్తి(పొలం) వస్తుందని భావించి తానే చంపేశానని అంగీకరించాడు. పోస్టుమార్టం అనంతరం పోలీసు లు బాలమణి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. వృద్దురాలి హత్యతో ఆమె కుమార్తెలు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. ఈమేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. హతురాలి కూతురు స్వరూప ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అరుణ్‌కుమార్ తెలిపాడు. -
నాగమణి కలకలం!
ఎమ్మిగనూరు టు మలేషియా వయా కర్ణాటక ఎమ్మిగనూరు: నాగ‘మణి’ కర్ణాటక రాష్ట్రంలోని ఓ లాకర్లో ఉంది. కోట్లాది రూపాయల విలువ చేస్తుంది. మలేషియాకు చెందిన ఓ వ్యక్తి మాత్రమే ఆ లాకర్‌ను తెరవగలడు. అతనికి రూ.8 కోట్లు ముట్టుజెబితే మణి సొంతమవుతుంది. అప్పుడు కోట్లకు పడగలెత్తొచ్చు. మణిని కొనుగోలు చేసేందుకు ఇప్పటికే చాలా మంది ఒప్పందం చేసుకున్నారు. ఈ ప్రచారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని పలువురు వ్యాపారులను నిలువునా ముంచింది. అత్యాశకు పోయిన వీరంతా ఇళ్లను అమ్ముకొని.. వ్యాపారాలను తాకట్టుపెట్టి ఉందో లేదో తెలియని మణి కోసం ఉన్నదంతా ఊడ్చిపెట్టేశారు. నియోజకవర్గ కేంద్రమైన ఎమ్మిగనూరు సమీపంలోని అగ్రహారం గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్, సోమేశ్వర సర్కిల్లో మిఠాయి వ్యాపారం చేస్తున్న మరో వ్యక్తి నాగ‘మణి’ పేరిట కోట్లాది రూపాయలు వసూలు చేశారు. ఇటీవల గాంధీనగర్‌లో ఇల్లు కట్టుకున్న ఓ డాక్యుమెంట్ రైటర్ అతని మాయలో పడి దాన్ని రూ.45లక్షలకు విక్రయించి వారి చేతిలో పెట్టేశాడు. సోమప్ప సర్కిల్లో బట్టల వ్యాపారం చేస్తున్న ఓ శెట్టి ఏకంగా ఆరు నెలల్లోనే రూ.2 కోట్లకు పైగా అప్పు చేసి వారికి ముట్టజెప్పాడు. మరో బట్టల వ్యాపారి రూ.1.5 కోట్లు.. సెల్ షాపు నిర్వాహకుడు రూ.30 లక్షలు.. ఫర్నిచర్ దుకాణం యజమాని.. అందరూ కలసి మొత్తం రూ.8 కోట్లకు పైగా నగదు మణి మాయలో పడి చేజార్చుకున్నారు. ప్రస్తుతం వీరంతా తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారు. వీరి నుంచి వసూలు చేసిన రూ.8 కోట్లు మలేషియాకు చెందిన వ్యక్తికి అప్పగించామని.. అతను వచ్చి కర్ణాటకలోని లాకర్ తెరిస్తే నాగ‘మణి’ని సొంతం చేసుకోవచ్చని ఇప్పటికీ ఆ ఇరువురు వ్యాపారులు నమ్మబలుకుతున్నారు. వీరు ఈ ఏడాది మార్చిలో రెండు పర్యాయాలు మలేషియా వెళ్లొచ్చినట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. మరి లేని మణి వీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారో.. వసూలు చేసిన కోట్లాది రూపాయలను ఏమి చేశారో.. తిరిగి డబ్బు ఎలా చెల్లిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఆరు నెలలు గడిచిపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. సొంతింటిని పోగొట్టుకున్న డాక్యుమెంట్ రైటర్ సోదరులు ఇద్దరు పోలీసు శాఖలో పని చేస్తున్నారు. వీరు తమ అన్నకు జరిగిన మోసాన్ని తెలుసుకొని అగ్రహారం ఏజెంట్‌ను ఇటీవల దబాయించగా జూలై 15లోగా రూ.50లక్షలు తిరిగిచ్చేస్తామని.. అప్పటి వరకు ఎస్పీ దృష్టికి తీసుకుపోవద్దని వేడుకున్నట్లు సమాచారం. -
లడ్డూ కపుల్...
మైలవరం : ఏమిటీ ఈ చిత్రం విచిత్రంగా ఉంది కదూ.. భారీ స్థూలకాయులను పెళ్లి దుస్తుల్లో చూసి ఆశ్చర్యపోతున్నారా... ఇదేదో ఫేస్బుక్ ఫన్ పిక్ అనుకుంటే పొరపాటే... మైలవరంలో గురువారం ఈ భారీ స్థూలకాయులిద్దరూ ఒకటయ్యారు. ఈ అపూర్వ, అరుదైన కల్యాణాన్ని తిలకించేందుకు పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో వచ్చి నూతన జంటపై ఆశీస్సుల అక్షింతలు కురిపించారు. అబ్బాయి బాగోలేదనో... అమ్మాయి లావుగా ఉందనో చిన్నచిన్న కారణాలతో పెళ్లిల్లు రద్దు చేసుకుంటున్న ఈ రోజుల్లో 125 కేజీల బరువున్న యువతికి 130 కేజీల బరువు ఉన్న యువకుడితో జరిగిన ఈ పెళ్లి పట్టణంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మైలవరం సుగాలి తండాకు చెందిన సబావతు రామారావు కుమార్తె నాగమణి(20)కి ఎ.కొండూరు మండలం రేపూడి తండాకు చెందిన బాణావతు నాని(22)తో పొందుగల రోడ్డులోని బెరియన్ ఫెలోషిప్ చర్చిలో బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, పట్టణ ప్రజల సమక్షంలో కల్యాణం జరిగింది. వివాహం చేసుకోవడానికి మంచి మనసు ఉంటే చాలు.. రూపం ప్రధానం కాదని నిరూపించింది ఈ జంట. చిన్నతనంలో వెన్నులోకి నీరు వెళ్లడంతో ఊబకాయం వచ్చిందని భారీ కాయంవల్ల ఎటువంటి ఇబ్బందులు పడలేదని అన్ని పనులు చక్కగా చేసుకుంటున్నానని నాని తెలిపారు. పెద్దలు కుదిర్చిన వివాహమని ఇద్దరం ఒకరికి ఒకరం అన్యోన్యంగా కలిసిమెలసి ఉంటామంటున్న లడ్డూబాబు జంటకు ‘విష్ యూ ఎ హ్యాపీ మ్యారీడ్ లైఫ్’ చెప్పేద్దామా...! -
కన్నతండ్రే కాలయముడయ్యాడు
ప్రేమను పంచాల్సిన కన్నతండ్రే వారి పాలిట కాలయముడయ్యాడు. భార్యపై అనుమానం పెనుభూతమై...ఆ కోపాన్ని ముక్కుపచ్చలారని పసివారిపై చూపాడు. పాము తన బిడ్డల్ని తానే చంపుకుతిన్నట్లు..కాలనాగులా మారి కన్నబిడ్డల్ని కాటేశాడు. ప్రేమగా ఎత్తుకు పెంచిన చేతులతోనే వారి ఊపిరి ఆగేదాకా నీటముంచి..ఉసురు తీశాడు. చివరకు తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఒంగోలులో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఒంగోలు టౌన్: భార్యపై అనుమానంతో ఇద్దరు పిల్లల్ని హతమార్చిన దారుణ సంఘటన ఒంగోలులో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు... యర్రగొండపాలేనికి చెందిన పగ్గల వెంకటేశ్వర్లుకు ఐదేళ్ల క్రితం నాగమణితో వివాహమైంది. పొట్టకూటి కోసం ఒంగోలు వచ్చిన వెంకటేశ్వర్లు స్థానిక గాంధీనగర్ నాలుగో లైనులో నివాసం ఉంటూ ఒక టీస్టాల్లో టీమాస్టర్‌గా పనిచేస్తున్నాడు. వారికి ఇద్దరు కుమారులు. పెద్దబ్బాయి వెంకట దుర్గాసాయి (3), చిన్నకుమారుడు వెంకట శ్రీనివాస్ (13 నెలలు). భార్యపై ఎప్పటి నుంచో ఉన్న అనుమానం పెనుభూతమై...చివరకు కన్నబిడ్డలతో సహా భార్యను హతమార్చాలనుకున్నాడు. చిన్నారులకు, భార్యకు శుక్రవారం రాత్రి బాదంపాలలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చాడు. కొద్దిగా తాగాక అనుమానం వచ్చిన భార్య వాటిని పడేసింది. మొదటి ప్రయత్నం విఫలం కావడంతో...అర్ధరాత్రివేళ ఇద్దరు పిల్లల్ని నిండుగా నీరున్న డ్రమ్ములో ముంచి అత్యంత పాశవికంగా అంతమొందించాడు. వారు చనిపోయారని నిర్ధారించుకుని మృతదేహాలను ఇంట్లో మంచంపై పడుకోబెట్టాడు. ఆ తరువాత తాను కూడా ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. ఈలోగా మత్తు నుంచి తేరుకున్న భార్య నాగమణి భర్త ఇంట్లోకి..బయటకు తిరుగుతుండటాన్ని గమనించింది. అయితే బిడ్డలు అప్పటికే విగతజీవులయ్యారన్న సంగతి గుర్తించలేకపోయింది. భార్యతో ఘర్షణపడి..శరీరంపై చొక్కా కూడా లేకుండా పరిగెత్తుకుంటూ బజారున పడ్డాడు. నేరుగా మంగమూరు రోడ్డు సెంటర్‌కు చేరుకుని బైపాస్రోడ్డుగుండా 220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపానికి చేరుకున్నాడు. ఏదో ఒక వాహనం కిందపడి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. చివరకు సింగరాయకొండ వైపు నుంచి వస్తున్న లారీకి అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఎదురెళ్లాడు. అది గమనించిన లారీ డ్రైవర్ అతన్ని తప్పించేందుకు ప్రయత్నించాడు. అయినా లారీకి ఒక పక్క వెంకటేశ్వర్లు ఢీకొనడంతో తీవ్రంగా గాయాలపాలయ్యాడు. తీవ్ర గాయాలతో రోడ్డుపై పాక్కుంటూ మధ్యలో ఉన్న డివైడర్‌పై వెళ్లి పడిపోయి స్పృహ కోల్పోయాడు. చిన్నారుల మృతి ఘటనపై సమాచారం అందుకున్న తాలూకా ఎస్సై జీ పాండురంగారావు చిన్నారుల మృతదేహాలు తీసుకుని..రిమ్స్‌కు బైపాస్‌గుండా వెళ్తున్న సమయంలో రోడ్డుపక్కన వెంకటేశ్వర్లు పడిఉండటాన్ని గుర్తించి అతన్ని రిమ్స్‌లో చేర్చారు. అనంతరం చిన్నారుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాలను సందర్శించిన డీఎస్పీ: ఒంగోలు డీఎస్పీ పి.జాషువా గాంధీనగర్‌లో హత్యకు గురైన ఇద్దరు చిన్నారుల మృతదేహాలను శనివారం ఉదయం సందర్శించారు. తాలూకా సీఐ ఐ.శ్రీనివాసన్, ఎస్సై జి.పాండురంగారావులతో కలిసి వెళ్లిన ఆయన సంఘటన జరిగిన తీరుపై వాకబు చేశారు. చిన్నారుల తల్లి నాగమణితోపాటు కుటుంబ సభ్యులను విచారించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై తాలూకా సీఐ ఐ శ్రీనివాసన్ దర్యాప్తు చేస్తున్నారు. వెంకటేశ్వర్లు ఉద్దేశపూర్వకంగా ఇద్దరు కుమారులను హత్యచేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈమేరకు అతనిపై హత్య కేసు నమోదు చేశారు. సాయి ఇక రాడా.. ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులు తెల్లవారేసరికి విగత జీవులుగా కనిపించడంతో బంధువులు, స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. పెద్దకుమారుడు దుర్గాసాయి మృతదేహాన్ని రిమ్స్‌కు తీసుకెళ్లే సమయంలో.. బాలుడి స్నేహితుల్లో ఒకరు ‘అరే సాయి ఇక రాడా..’ అన డం అక్కడి వారి హృదయాలను ద్రవింపజేసింది. చిన్నారుల మృతదేహాలను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అక్కడున్న వారి అందరి కళ్లూ చెమ్మగిల్లాయి. -
టీడీపీకి గుడ్‌బై
గాజువాక : టీడీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు గుడివాడ నాగమణి, ఆమె తనయుడు, 65వ వార్డు మాజీ కార్పొరేటర్ గుడివాడ అమర్నాథ్ శు క్రవారం ఆ పార్టీకి రాజీనామా చేశా రు. టీడీపీలో తమ పదవులకు, పార్టీ క్రీయాశీలక సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ పత్రులను పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు పం పారు. ఇటీవల కాలంలో చోటుచేసుకున్న రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చంద్రబాబు నాయుడు వైఖరి గందరగోళంగా మారడంతో పాటు ఆ పార్టీ స్థానిక నాయకత్వం కూడా సరిగా లేకపోవడంతో రాజీనామా చేసినట్టు వారు. -
నాగమణిది హత్యే
నాగమణిది హత్యే కలిదిండి: మండలంలోని సానారుద్రవరం గ్రామానికి చెందిన నాగమణిది హత్యేన ని దర్యాప్తులో తేలిందని డీఎస్పీ జి.నాగన్న తెలిపారు. కలిదిండి పోలీస్‌స్టేషన్ లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలు వెల్లడించారు. ఆ యన తెలిపిన సమాచారం ప్రకారం.. సానారుద్రవరానికి చెందిన మారుబోయిన రామ్మోహనరావుతో పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన నాగమణి (34)కి పదేళ్ల కిందట వివాహమైంది. నాగమణి కనిపించడంలేదని తల్లి కేసిరెడ్డి పెద్దలక్ష్మి ఈనెల మూడో తేదీన ఫిర్యాదు చేయగా, కలిదిండి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మద్వానిగూడెం - ఏలూరుపాడు వంతెన స మీపంలో ఉప్పుటేరు గట్టు ముళ్లపొదల్లో మహిళ మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. నాగమణి బంధువులను అక్కడకు తీసుకువెళ్లారు. వా రు మృతదేహాన్ని చూసి నాగమణిదేనని నిర్ధారించారు. దీనికి సంబంధించి ఆమెతో వివాహేతర సంబంధం ఉన్న స్థానికుడు నాంచార్య అనే వ్యక్తి సానారుద్రవరం వీఆర్వో పోతురాజు ద్వారా పోలీసులకు లొంగిపోయా డు. అతడు ఇంటింటికీ తిరుగుతూ పాలు, పచారీ సరుకులు అమ్ముతుంటాడు. ఈ నేపథ్యంలో నాంచార్యకు నాగమణి సొమ్ము బాకీ పడింది. దీంతో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. నాగమణి ఇంట్లో ఓ వేడుక కోసం రూ.10 వేలు కావాలని సం క్రాంతి నుంచి నాంచార్యను అడుగుతూ వచ్చింది. ఈ నెల మూడో తేదీన మద్వానిగూడెం వంతెన వద్ద ఇద్ద రూ కలుసుకున్నారు. ఈ సందర్భంగా డబ్బు విషయ మై వారి మధ్య ఘర్షణ జరిగింది. అతడు సహనం కోల్పోయి ఆమె చీర చెంగును మెడకు చుట్టి బిగించటంతో చనిపోయింది. ఆమె వద్ద ఉన్న రోల్డ్‌గోల్డ్ మం గళ సూత్రాలు, చైను, పట్టీలు, పర్సులోని రూ.310 నగదు, బ్యాంక్ ఏటీఎం కార్డు తీసుకెళ్లి ఇంటి వద్ద దా చాడు. విచారణలో నాంచార్య నేరం అంగీకరించడం తో అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో కైకలూరు సీఐ వెంకటేశ్వరరావు, కలిదిండి ఎస్సై యే సేబు, సిబ్బంది పాల్గొన్నారు. -
నరబలికి యత్నం
చింతామణి, న్యూస్‌లైన్ : నిధి కోసం సొంత మనుమరాలిని బలికి సిద్ధం చేసిన కిరాతక సంఘటన తాలూకాలోని ఎర్రయ్యగారిపల్లిలో వెలుగు చూసింది. స్థానికుల కథనం మేరకు... ఎర్రయ్యగారిపలికి చెందిన వెంకటరమణకు ఇద్దరు కూతుర్లు. తనపెద్ద కూతురు నాగమణిని చింతామణికి చెందిన జనార్ధనకు ఇచ్చి 12 సంవత్సరాల క్రితం వివాహం జరిపించాడు. వీరికి అనిచేతన(8) అనే కూతురు ఉంది. ఇటీవల వెంకరమణకు మేకపోతులపల్లికి చెందిన మంత్రగాడు బాషాతో పరిచయమైంది. ఈ నేపథ్యంలోనే ఎర్రయ్యగారిపల్లిని వెంకరమణప్ప ఇంటి పక్కన ఉన్న పుట్ట కింద అపారమైన నిధి ఉందని, అమావాస్య నాడు జన్మించిన బిడ్డను బలిఇస్తే నిధిని సొంతం చేసుకోవచ్చంటూ వెంకటరమణప్పను బాషా నమ్మించాడు. దీంతో అమావాస్య నాడు జన్మించిన అనిచేతనపై వెంకరమణప్ప కన్ను పడింది. ఇదే విషయాన్ని బాషాకు చెప్పి బలికి అవసరమైన ఏర్పాటు చేయాలని సూచించాడు. ఇందుకు మంగళవారం రాత్రికి ముహూర్తం నిర్ణయించడంతో ఆ రోజు ఉదయమే అనిచేతనను పిలుచుకురమ్మని తన చిన్న కూతురు కళావతిని చింతామణికి పంపాడు. ఆమె వెళ్లి అనిచేతనను పిలుచుకుని వచ్చింది. ఉదయం నుంచి ఇంటిలో క్షుద్రపూజలు చేస్తూ వచ్చారు. అక్కడ జరుగుతున్న హంగామా చూసి బాలిక భయపడింది. అనంతరం తనను బలి ఇవ్వబోతున్నట్లు తెలుసుకున్న అనిచేతన అక్కడి నుంచి తప్పించుకుని బస్సెక్కి చింతామణికి చేరుకుంది. ఇంటికి చేరుకున్న ఆమెకు భయంతో మాటలు రాలేదు. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో కొద్దిగా స్థిమిత పడిన ఆమె అసలు విషయం తెలపడంతో స్థానికులతో కలిసి జనార్ధన వెళ్లి బాషాను పట్టుకుని చింతామణికి చేరుకున్నాడు. అనంతరం అందరి సమక్షంలో అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. సంఘటనకు సంబంధించి బాషాను పోలీసులు విచారణ చేస్తున్నారు.