Narasimha Reddy
-
మీ విచారణలో నిష్పాక్షికత లేదు
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్ రంగంలో సాధించిన అసాధారణ విజయాలకు మసిపూసేలా పనిచేస్తున్నారంటూ విద్యుత్ ఒప్పందాలపై ప్రభుత్వం నియమించిన కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి, ఎమ్మెల్యే జి.జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మీ విచారణలో నిష్పాక్షికత లేదని, నిరాధారమైన ఆరోపణలకు ఊతమిచ్చేలా వ్యవహరించడం బాధాకరమంటూ ఏడు పేజీల లేఖను జగదీశ్‌రెడ్డి శనివారం తన పీఏ ద్వారా కమిషన్‌కు పంపించారు. అనంతరం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ ఉద్దేశాలను తప్పుబట్టారు. కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి మీడియా సమావేశం పెట్టి లీకులు ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.పద్నాలుగేళ్లు తెలంగాణ సాధన కోసం ఉద్యమించిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదేళ్ల కాలంలో అనేక రంగాల్లో దేశంలోనే తెలంగాణను ప్రథమ స్థానంలో నిలిపారన్నారు. నిమిషం కరెంటు కోత లేకుండా రైతులు, పారిశ్రామికవేత్తలకు, గృహాలకు విద్యుత్ అందిస్తే... ఏదో జరిగిపోయిందన్నట్లుగా, జరిగిన నష్టాన్ని లెక్కకట్టడమే మిగిలిందన్నట్లుగా మాట్లాడడం, మరునాడే ఆరువేల కోట్ల నష్టం అని అన్ని ప్రధాన పత్రికల్లో వార్తలు రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. విచారణ జరుగుతున్న సమయంలోనే ఇలాంటి వార్తలు వచి్చనందున వారికి ఆ సమాచారం ఎలా వచి్చంది, ఏ ఆధారాలతో ఆ వార్తను ప్రచురించారనే అంశాలు కూడా విచారణలో భాగం కావలసిన అవసరం ఉందని జగదీశ్‌రెడ్డి చెప్పారు. ఛత్తీస్‌గఢ్ నుంచి రూ.3.90కి కొన్నాం తాము ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన సమయంలో రాష్ట్రంలో విద్యుత్ తీవ్ర సంక్షోభంలో ఉందని, 2700 మెగావాట్ల విద్యుత్ కొరత ఉందని జగదీశ్ రెడ్డి లేఖలో వివరించారు. ఆ పరిస్థితుల్లో తెలంగాణకు వచి్చన 400 మెగావాట్ల సీలేరు జలవిద్యుత్ కేంద్రాన్ని కూడా ఏపీ ప్రభుత్వం తీసుకుందని, ఈ పరిస్థితుల్లో విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అప్పటి సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ పీజీసీఐఎల్ మహారాష్ట్రలోని వార్ధా నుంచి డిచ్పల్లి వరకు ట్రాన్స్మిషన్ లైన్ నిర్మాణం ప్రారంభించిందని, పీజీసీఐఎల్‌లో వాటా ఉండాలంటే ఏదో ఒక సంస్ధతో విద్యుత్ ఒప్పందం ఉండాలన్న నిబంధన మేరకు ఛత్తీస్‌గఢ్‌తో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎంఓయూ చేసుకున్నారని తెలిపారు.ప్రభుత్వ రంగ సంస్థల నుంచి విద్యుత్‌ను రూ.17కు కొంటున్న పరి స్థితి ఉండగా, ఛత్తీస్‌గఢ్ నుంచి రూ.3.90కి యూని ట్ చొప్పున కొనాలని తెలంగాణ ఈఆర్సీ నిర్ణయించిందని వివరించారు. తెలంగాణ తీసుకున్నప్పుడే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు రూ.4.90కి విద్యుత్ తీసుకున్నారన్నారు. రాష్ట్ర కరెంటు డిమాండ్ మేరకు విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారని, సబ్ క్రిటికల్ టెక్నాలజీతో దేశంలో 17 ప్రాజెక్టులు నిర్మాణం అవుతున్నాయని చెప్పారు. భద్రాద్రి పవర్ ప్లాంట్‌ను 800 మెగావాట్లతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో, యాదాద్రి ప్లాంట్‌ను సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మాణం చేపట్టామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోతో సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అనే తేడా లేకుండా పోయిందని వివరించారు. -
దర్శిలో అర్ధరాత్రి టీడీపీ రౌడీల వీరంగం
దర్శి: తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రకాశం జిల్లా దర్శిలో ప్రజలు భయంతో కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏ వైపు నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు వచ్చి పడతారోనని ప్రజలు ఆందోళనతో బతుకుతున్నారు. ఆదివారం రాత్రి వైఎస్సార్సీపీ నాయకుడి ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. 30మందికి పైగా నరసరావుపేట నుంచి తెచ్చిన రౌడీలతో కలిసి వైఎస్సార్సీపీ నాయకుడు కుందురు నరసింహారెడ్డి ఇంటి విధ్వంసం సృష్టించారు. బాధితుడు నరసింహారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 11.40 సమయంలో కాలింగ్ బెల్ మోగడంతో ఇంటి తలుపు తీశారు.ఇంటి బయట ఉన్న రౌడీలు నరసింహారెడ్డి నువ్వేనా అంటూ ప్రశ్నించి దర్శిలో మేం ఓడిపోవడానికి కారణం నువ్వేనంటూ దుర్భాషలాడారు. ఈవీఎంలు ఎత్తుకెళుతుంటే అడ్డుకుంటావా అని బూతులు తిట్టారు. కర్రలు, రాడ్లతో దాడి చేశారు. ఇంటి దిమ్మెలను బాది పెద్ద పెద్ద శబ్ధాలు చేస్తూ గేటుకు ఉన్న లైట్లు పగులగొట్టి వీరంగం వేశారు. నరసింహారెడ్డి వరండా గేటు తీయకుండా పోలీసులకు ఫోన్లో ఫిర్యాదు చేశారు. బయట రౌడీలు దాడి చేయడంతో ఇంట్లో ఉన్న నరసింహారెడ్డి భార్య, పిల్లలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు.నీతో పాటు మరో 30 మంది మా టార్గెట్‌లో ఉన్నారని, మీ అందరి అంతు చూస్తామంటూ నరసింహారెడ్డిని బెదిరించారు. ఈ లోగా పోలీస్ వాహనం రావడం, చుట్టుపక్కల వారు అక్కడకు రావడంతో వారంతా పారిపోయారు. ఈ ఘటనతో నియోజకవర్గం ఉలిక్కిపడింది. దర్శిలో ఎప్పుడూ ఇలాంటి సంస్కృతి లేదని, ఇప్పుడు గొట్టిపాటి లక్ష్మి వచ్చి కొత్తగా రౌడీ సంస్కృతిని తెచ్చిందని మండిపడుతున్నారు. పోలీసు స్టేషన్లో ఫిర్యాదుటీడీపీ శ్రేణుల దాడిపై నరసింహారెడ్డి భార్య కుందురు సునీత స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇటీవల ఎన్నికల్లో తన భర్త నరసింహారెడ్డి బూత్ ఏజెంట్‌గా ఉన్న బూత్‌లో ఈవీఎంలు ఎత్తుకెళ్లనీయలేదని, అందుకే తమపై కక్ష కట్టి ఇంటిపైకి వచ్చి దాడి చేసి దుర్భాషలాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు.బూచేపల్లి పరామర్శ..టీడీపీ నాయకుల దాడి విషయం తెలుసుకున్న దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ సోమవారం నరసింహారెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఎవ్వరూ భయపడాల్సిన పని లేదని, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎటువంటి ఆపద రాకుండా అండగా ఉంటానని ఎమ్మెల్యే ధైర్యం చెప్పారు. -
KSR Live Show: జస్టిస్ పై కేసీఆర్ విమర్శలు.. రాజకీయ దుమారం..!
-
బార్ కౌన్సిల్‌కు సాయం అందించిన ఒకే ఒక్క సీఎం వైఎస్సార్
సాక్షి, హైదరాబాద్: అనంత నరసింహారెడ్డి.. ఒకసారి కాదు.. రెండుసార్లు కాదు.. వరుసగా మూడు సార్లు రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఒక న్యాయవాది 17 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగి సేవలందించడం దేశంలోనే రికార్డు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర బార్ కౌన్సిల్ తొలి చైర్మన్‌గానూ ఆయనే ఎన్నికయ్యారు. ఐదుసార్లు బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డిసిప్లినరీ కమిటీ కో–ఆప్షన్ సభ్యుడిగానూ పనిచేశారు. బార్ కౌన్సిల్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి 17 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘సాక్షి’ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. ఇప్పటివరకు బార్ కౌన్సిల్‌కు నేరుగా సాయం చేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని పేర్కొంటున్న నరసింహారెడ్డి వివరాలు ఆయన మాటల్లోనే.. సేవా భావంతోనే బార్ కౌన్సిల్‌కు... జూనియర్ న్యాయవాదిగా పని చేస్తున్న సమయంలో సివిల్ కోర్టులో ఎక్కువగా కేసులు వాదించే వాడిని. అప్పటి నుంచే న్యాయవాదుల సంక్షేమానికి ఏదో చేయాలన్న తపన ఉండేది. దీంతో నన్ను బార్ కౌన్సిల్‌కు పోటీ చేయమని చాలా మంది న్యాయవాదులు ప్రోత్సహించారు. నాటి బార్ కౌన్సిల్ చైర్మన్ ఎల్లారెడ్డి కూడా ఆహ్వానించారు. అలా 1995లో తొలిసారి బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యా. సమరసింహారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో ఆయనతో మాట్లాడి న్యాయవాదులకు సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. సహచరులు దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి(మాజీ ఏజీ), జస్టిస్ ఏ.గోపాల్‌రెడ్డి (జడ్జి)తో కలసి పలు కార్యక్రమాలు చేపట్టాం. మహానేత వైఎస్సార్‌తో అనుబంధం... 2006లో తొలిసారి బార్ కౌన్సిల్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టా. కొద్ది రోజుల తరువాత అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్‌ను కలిసే అవకాశం వచ్చింది. న్యాయవాదుల సంక్షేమం కోసం ఏం చేద్దాం అని ఆయన అడగడంతో కొన్ని వివరాలను చెప్పా. ఒక్కొక్కటిగా చేస్తూ పోదాం అంటూ న్యాయ శాఖ మంత్రిని పిలిచి వెంటనే రూ.1.65 కోట్లను మంజూరు చేశారు. అప్పటికే ఇతర రంగాలు సాంకేతిక వైపు పరుగులు ప్రారంభించడంతో నాటి సీజే జస్టిస్ మదన్‌లోకూర్ సూచన మేరకు బార్ అసోసియేషన్లలో కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇంటర్నెట్ ఏర్పాటు చేశాం. వాటి వినియోగంపై న్యాయవాదులకు శిక్షణనిచ్చాం. స్టైపెండ్ ఇవ్వాలని కోరుతున్నాం.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి న్యాయవాదులు సంక్షేమం కోసం బార్ కౌన్సిల్‌కు రూ.100 కోట్లు కేటాయించి.. రూ.25 కోట్లు మంజూరు చేశారు. అక్కడ కొత్త న్యాయవాదులకు ఐదేళ్ల వరకు స్టైపెండ్ ఇస్తున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలోనూ చేపట్టాలని కోరుతున్నా.. న్యాయవాదులు వినియోగించే స్టాంప్‌ల ద్వారా న్యాయవాదుల సంక్షేమ నిధికి కొంత మేర నిధులు చేకూరుతాయి. ప్రభుత్వ అధికారులు కూడా విధిగా ఈ స్టాంప్‌లు వినియోగించాలని చట్టం చెబుతున్నా వారు పాటించడంలేదు. అడ్వొకేట్ లా అకాడమీ ఏర్పాటు నా కల.. రాష్ట్రంలో లా అకాడమీ ఏర్పాటు చేయలన్నది నా కల. యువ న్యాయవాదులకు శిక్షణ ఇవ్వ డం, సీనియర్ న్యాయవాదులతో మార్గనిర్దేశం చేసే కార్యక్రమాలు చేయాలని భావించాం. కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నా దీనిపై అడుగు ముందుకు పడటం లేదు. మీడియేషన్ చట్టబద్ధం కానుంది.. కోర్టుల్లో విపరీతంగా పెరిగిపోతున్న కేసులకు మీడియేషనే పరిష్కారం. న్యాయవాదులకు మీడియేషన్‌పై అవగాహన కల్పించాలి. ముందుగా ఏ కేసునైనా మీడియేషన్‌కు పంపిన తర్వాతే విచారణ చేపట్టాలి. ఆ దిశగా కేంద్ర చట్టం చేస్తోంది. ఇది కార్యరూపం దాలిస్తే అధికారికంగా మీడియేటర్లను నియమిస్తారు. వారిచ్చే ఉత్తర్వులు చట్టబద్ధం అవుతాయి. అలాగే, పాత కాలపు పద్ధతులకు స్వస్తి పలికే చర్యలు తీసుకున్నాం. కోర్టుల్లో యువరానర్, మైలార్డ్ పదాలు అవసరం లేదని సర్, మేడమ్ అంటే చాలని నిర్ణయం తీసుకున్నాం. న్యాయవాదులకు ఉజ్వల భవిష్యత్ ఉంది. -
ఈ–సేవ కేంద్రాన్ని ప్రజలు, న్యాయవాదులు వినియోగించుకోవాలి
సాక్షి, హైదరాబాద్: కోర్టుకు వచ్చే ప్రజలు, న్యాయవాదులు ఈ–సేవ కేంద్రం సేవలను వినియోగించుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే సూచించారు. అందరికీ న్యాయాన్ని చేరువ చేయడం, న్యాయ సేవలను విస్తరించాలన్న దృఢ సంకల్పంతో కేంద్రం ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. కక్షిదారులు ఇక్కడ కేసు స్థితిని కూడా తెలుసుకోవచ్చని చెప్పారు. రాష్ట్ర హైకోర్టు ఆవరణలో ఈ–సేవ కేంద్రాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే శనివారం ప్రారంభించారు. సుప్రీంకోర్టు ఈ–కమిటీ ఆధ్వర్యంలో ఈ కేంద్రం పనిచేస్తుంది. ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. కోర్టు నుంచి ఏదైనా సాఫ్ట్‌కాపీ కావాలన్నా ఈ కేంద్రం నుంచి పొందవచ్చన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వర్రావు, న్యాయవాదులు పాల్గొన్నారు. కాగా, కేసు స్థితి (ప్రస్తుత స్థితి, తదుపరి విచారణ తేదీ), ఈ–కోర్టు యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి జడ్జీల సెలవుల సమాచారం తెలుసుకోవడానికి, సర్టీఫైడ్ కాపీల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు, ఉచిత లీగల్ సర్విస్లు పొందడం వంటి వివరాలు, జైలులో ఉన్న వారిని కలిసేందుకు ఈ–ములాఖత్ అపాయింట్మెంట్ కోసం, కోర్టుకు సంబంధించిన అంశాల్లో ఈ–పేమెంట్స్ కోసం, ట్రాఫిక్ చలాన్లు, ఇతర నేరాల్లో చెల్లించాల్సిన నగదు చెల్లించడానికి.. ఇలా పలు రకాల సేవలను ఈ–సేవ కేంద్రం అందించనుంది. సిబ్బందితో మాట్లాడుతున్న సీజే జస్టిస్ అలోక్ అరాధే. చిత్రంలో న్యాయమూర్తులు జస్టిస్ శ్యామ్ కోషి, జస్టిస్ వినోద్‌కుమార్, జస్టిస్ సుధీర్‌కుమార్, జస్టిస్ సాంబశివరావు నాయుడు, జస్టిస్ పుల్ల కార్తీక్, జస్టిస్ శరత్, జస్టిస్ రాజేశ్వర్‌రావు, జస్టిస్ శ్రీనివాస్‌రావు, జస్టిస్ లక్ష్మీనారాయణ తదితరులు -
కరెంటుషాక్‌తో ఒకరు.. భయంతో మరొకరు..
కల్వకుర్తి టౌన్: సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు యువకుల్లో ఒకరు నీటిగుంతలో కరెంటుషాక్‌కు గురై మరణించగా, మరొకరు భయంతో ఉరేసుకొని చనిపోయాడు. ఈ విషాదకర సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో చోటుచేసుకుంది. కల్వకుర్తికి చెందిన అనిల్(18), రాజేశ్ వాటర్ప్లాంట్లలో ఆటోడ్రైవర్లు. తమ పనులు ముగిసిన తర్వాత కల్వకుర్తి తిమ్మనోనిపల్లి వద్ద ఉన్న నరసింహారెడ్డి వ్యవసాయ పొలంలోని నీటిగుంతలో ఈత కొట్టడానికి వెళ్లారు. పక్క పొలంలో ఉన్న కుర్మిద్దకు చెందిన శివ (22)ను సైతం ఈత కొట్టడానికి పిలిచారు. ముగ్గురు కలిసి నీటిగుంతలోకి దిగారు. అయితే అది లోతుగా ఉండటంతో నీటిని బయటకు తోడేందుకు విద్యుత్ మోటారు ఏర్పాటు చేశారు. నీళ్లు తోడేస్తుండగా మధ్యలో కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో వారు గుంతలోకి దిగి ఈత కొడుతున్నారు. కొద్దిసేపటికి కరెంటు సరఫరా కావడంతో అనిల్ విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతిచెందాడు. దీంతో భయాందోళనకు గురైన శివ సమీపంలోని మరో వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానిక రైతులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
కోట్లు వెదజల్లినా.. ఓటమి మూటగట్టుకున్న వ్యాపారవేత్తలు వీళ్లే
రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్న వ్యాపారవేత్తలకు ఆ నియోజకవర్గం మింగుడు పడటం లేదు. ఎన్నికల బరిలో నిలబడి ప్రజాధరణ పొందాలని ఆశించిన ఇద్దరు ప్రముఖ వ్యాపారస్తులకు ఎదురైన అనుభవాలే దీనికి నిదర్శనమని వారు విశ్లేషించుకుంటున్నట్లు సమాచారం. చేతిలో కోట్లాది రూపాయలు ఉన్నా సరే ఆ నియోజకవర్గంలో గెలవాలంటే కష్టమేనని భావిస్తున్నారు. ఇంతకీ ఆ అసెంబ్లీ స్థానం ఏదంటే.. వీరు వ్యాపారంలో పట్టిందల్లా బంగారమే.. ఒకరకంగా చెప్పాలంటే తరాలు తిన్నా కానీ తరగని ఆస్తి సంపాదించుకున్నారు. ఆ దన్నుతో అసెంబ్లీలో అడుగు పెట్టాలని కలలు కన్నారు. కానీ వీరి ఆశలు అడియాశలు అయ్యాయి. వీరిని నియోజకవర్గ ప్రజలు పట్టించుకోవడం లేదు. మరి ఈ వ్యాపార వేత్తలు ఎవరో కాదు. ఒకరు తేరా చిన్నప్పరెడ్డి అయితే.. మరొకరు వేమిరెడ్డి నరసింహారెడ్డి.. ఇద్దరూ వ్యాపారంలో బాగానే సంపాదించారు. సూపర్ సక్సెస్ అయ్యారు. కానీ బ్యాలెట్ బరిలో మాత్రం విఫలమయ్యారు. నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన ఈ ఇద్దరూ ప్రజాధరణ పొందలేక పోయారు. నాగార్జున సాగర్‌కు చెందిన వ్యాపారవేత్త తేరా చిన్నప రెడ్డికి ఫార్మా కంపెనీలు ఉన్నాయి. వాటి ద్వారా బాగా సంపాదించారు. అలాంటి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. తొలుత 2009లో టీడీపీ తరపున నాగార్జున సాగర్ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేసి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి చేతిలో ఓడిపోయారు. చదవండి: కాంగ్రెస్ కసరత్తు.. ఎర్రబెల్లిని ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకుడెవరు? తరువాత 2014లో నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి మరోసారి టీడీపీ తరపున నుంచి పోటీ చేశారు. అయితే ఇక్కడా సేమ్ రిజల్ట్స్. దారుణ పరాజయాన్ని ఎదుర్కొన్నారు. దాదాపు రెండు లక్షల ఓట్ల తేడాతో నాడు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి చేతిలో ఓటమిని మూటగట్టుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా ఫుల్‌గా సంపాదించారు వేమిరెడ్డి నర్సింహరెడ్డి. మునుగోడుకు చెందిన ఆయన 2019లో బీఆర్ఎస్లో చేరారు. కేసీఆర్ కూడా నరసింహరెడ్డి అర్థ బలాన్ని చూసో లేక నల్లగొండలో పోటీ చేసే నేత కనిపించకనో తెలీదు కానీ కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రత్యర్థిగా లోక్‌సభ సీటు కేటాయించారు. అయితే నర్సింహరెడ్డి ఆనందం ఆవిరి కావడానికి ఎంతో సమయం పట్టలేదు. భారీ స్థాయిలో డబ్బు ఖర్చు చేసి హడావిడీ చేసినప్పటికీ అంచనాలు తలకిందులయ్యాయి. నల్లగొండ లోక్‌సభ పరిధిలో ఒక్క హుజూర్నగర్ మినహా అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ అపజయం పాలయ్యారు. కోట్లకు అధిపతులైన వరుసగా రెండు లోక్‌సభ ఎన్నికల్లో చుక్కలు చూపించిన నియోజకవర్గంగా నల్లగొండ నిలిచిపోయింది. నల్లగొండ లోక్‌సభ సీటు పేరు చెబితేనే చాలు ఈ ఇద్దరు నేతలు నిద్రలో సైతం ఉలిక్కిపడుతున్నారని జిల్లా ప్రజలు చెప్పుకుంటున్నారు. -
కాల్పులు జరిపింది ఆ ముగ్గురే!
సాక్షి, హైదరాబాద్: ‘దిశ’నిందితులపై లాల్మదార్, రవి, సిరాజుద్దీన్ అనే ముగ్గురు పోలీసులు ఎదురు కాల్పులు జరిపారని అప్పటి ఆమన్‌గల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) కొండా నరసింహారెడ్డి (ప్రస్తుతం బాచుపల్లి పీఎస్ ఇన్స్పెక్టర్గా ఉన్నారు) జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ త్రిసభ్య కమిటీ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. ‘దిశ’సీన్ రీ–కన్స్ట్రక్షన్, ఎన్కౌంటర్ సమయంలో ఎప్పుడు ఏం జరిగిందనే అంశంపై కమిషన్ బుధవారం ఆయన్ను విచారించింది. ‘పారిపోకండి, కాల్చకండి, లొంగిపోండి.. అంటూ షాద్‌నగర్ ఏసీపీ వాసం సురేందర్ రెండు మూడుసార్లు అరిచి నా నిందితులు కాల్పులు ఆపలేదు. దీంతో తొలుత లాల్‌మదార్‌ను గాలిలోకి కాల్పులు జరపాలని ఏసీపీ ఆదేశించారు. అయినా ముద్దాయిలు ఫైరింగ్ ఆపకపోయే సరికి లాల్మదార్, రవి, సిరాజుద్దీన్ ముగ్గురినీ ఎదురు కాల్పులు జరపాల్సిందిగా ఆదేశించారు..’అని నరసింహారెడ్డి తెలిపారు. నిందితులలో ఆరిఫ్, చెన్నకేశవులు కాల్పులు జరపడం తాను చూశానని పేర్కొన్నారు. ముగ్గురు పోలీసులు ఏ పొజిషన్లో ఉండి కాల్పులు జరిపారో తాను గమనించలేదన్నారు. కాల్పులు పూర్తయ్యాక నిందితుల మృతదేహాలను మీరు చూశారా? అని ప్రశ్నించగా.. లేదని సమాధానం ఇచ్చారు. కాల్పుల్లో పోలీసులు అరవింద్, వెంకటేశ్వర్లుకు గాయాలయ్యాయని, వాళ్లు స్పృహ కోల్పోయి పడిపోయారని తెలిపారు. 108 అంబులెన్స్ స్ట్రెచర్‌లో క్షతగాత్రులను షాద్‌నగర్ ఎస్ఐ, వాళ్ల సిబ్బంది పోలీసు వాహనంలో తీసుకెళ్లారని వివరించారు. అంబులెన్స్‌లో తీసుకెళ్లాలని సూచించలేదా అని ప్రశ్నించగా.. లేదని చెప్పారు. ‘దిశ’వస్తువులు బయటకు తీసినప్పుడే ఎన్కౌంటర్ ‘షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ నిందితులను చటాన్‌పల్లిలోని రవి గెస్ట్ హౌస్‌కు తీసుకురమ్మని ఆదేశించడంతో.. 2019 డిసెంబర్ 5వ తేదీన అర్ధరాత్రి ఒంటి గంటకు నలుగురు నిందితులతో చర్లపల్లి జైలు నుంచి బయలు దేరాం. ఉదయం 3 గంటల సమయంలో ఏసీపీ నలుగురు నిందితులకు ఒక్కొక్కరికి ఒక్కో కానిస్టేబుల్ చొప్పున హ్యాండ్లర్ (నిందితుల చేతికి బేడీలు వేసి పట్టుకోవడం) విధులను వేశారు. ఏ1 మహ్మద్ ఆరిఫ్‌కు హెడ్ కానిస్టేబుల్ జానకిరామ్, ఏ2 జొల్లు శివకు హెడ్ కానిస్టేబుల్ అరవింద్, ఏ3 జొల్లు నవీన్‌కు కానిస్టేబుల్ బాలు రాథోడ్, ఏ4 చెన్నకేశవులుకు కానిస్టేబుల్ శ్రీకాంత్ హ్యాండర్లుగా ఉన్నారు. హ్యాండర్ కానిస్టేబుల్స్ చేతికి లాఠీలు గానీ తుపాకులు గానీ ఇవ్వలేదు. చటాన్‌పల్లి సర్వీస్ రోడ్డుకు ఉదయం 5:30 గంటల కల్లా చేరుకున్నాం. ఉదయం 6 గంటల ప్రాంతంలో దిశ వస్తువులు దాచి ఉంచిన ప్రాంతాన్ని ఆరిఫ్ గుర్తించాడు. ఏసీపీ ఆదేశాల మేరకు ఆ ప్రాంతంలో కిందికి వొంగి మట్టిని నేనే తొలగించా. పాలిథిన్ కవర్లో సెల్‌ఫోన్ కనిపించింది. కవర్ మీద ఉన్న మట్టిని తొలగించాను. సెల్‌ఫోన్ బయటకు తీయలేదు. అదే సమయంలో ఎన్కౌంటర్ సంఘటన జరిగింది..’అని నరసింహారెడ్డి తెలిపారు. ఆరిఫ్ నా పిస్టల్ లాక్కున్నాడు ‘ముందుగా జానకిరామ్ కళ్లల్లో మహ్మద్ ఆరిఫ్ మట్టి కొట్టి వెనక్కి నెట్టేశాడు. ఆ తర్వాత తన చేతికి ఉన్న క్లచ్‌లను తానే విడిపించుకున్నాడు. వెంటనే పారిపోతున్నాడని జానకిరామ్ అరవడంతో కింద వంగి ఉన్న నేను ఎడమ వైపునకు తిరిగా. వెంటనే నా కళ్లల్లోకి కూడా ఆరిఫ్ మట్టి విసిరేశాడు. ఆ వెంటనే ఆరిఫ్ తన రెండు చేతులతో నా బెల్ట్‌కు ఉన్న పిస్టల్‌ను పర్స్‌తో సహా బలంగా లాగాడు. వెంటనే ‘అరేయ్ ఉరకండ్రా’అంటూ అరిచాడు. దీంతో మిగిలిన ముగ్గు రు నిందితులు కూడా హ్యాండ్లర్ కానిస్టేబుళ్లను వెనక్కి నెట్టేసి ముందు వైపునకు పరుగెత్తారు..’అని వివరించారు. మరి మీ పక్కనే ఉన్న ఆరిఫ్‌ను పట్టుకోవటానికి మీరు ప్రయత్నించలే దా? అని కమిషన్ ప్రశ్నించగా.. ‘ఆ సమయం లో కళ్లల్లో పడిన మట్టిని తుడుచుకుంటున్నా. వెంటనే ఆరిఫ్ వైపు నుంచి కాల్పులు మొదలయ్యాయి..’అని నరసింహారెడ్డి సమాధానం ఇచ్చారు. ఆరిఫ్ మీ పిస్టల్‌ను లాగే సమయం లో ఏసీపీ సురేందర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించగా.. తాను కిందికి వొంగి మట్టిని తవ్వుతుంటే ఏసీపీతో సహా మిగిలిన ఎస్కార్ట్ సిబ్బంది దృష్టి అంతా ఇటువైపే పెట్టారని తెలిపారు. ఎవరు మట్టి విసిరారో చూడలేదు ఎస్కార్ట్‌గా వచ్చిన అందరు పోలీసుల కళ్లల్లో మట్టి పడిందా? అని త్రిసభ్య కమిటీ ప్రశ్నించగా.. తనకు తెలియదని, అరవింద్, వెంకటేశ్వర్లు కళ్లల్లో మట్టి పడటం అయితే తాను చూశానని నరసింహారెడ్డి తెలిపారు. పంచ్ విట్నెస్‌లైన అబ్దుల్ రవూఫ్, రాజశేఖర్ ముఖ కవళికలు, శరీరాకృతులు గుర్తు లేవని, వారిని చూస్తే మాత్రం గుర్తుపడతానని చెప్పారు. కమిటీ ముందు 9 ఎంఎం పిస్టల్ ‘దిశ’ఎన్కౌంటర్ సమయంలో నరసింహారెడ్డి వద్ద ఉన్న 9 ఎంఎం పిస్టల్, దాని పర్సును కమిషన్ ముందుంచాలని మంగళవారం త్రిసభ్య కమిటీ ఆదేశించిన నేపథ్యంలో.. బుధవారం 9 ఎంఎం పిస్టల్‌ను, 10 బుల్లెట్లతో కూడిన మ్యాగజైన్‌ను తీసుకొచ్చారు. అయితే సంఘటన సమయంలో వినియోగించిన 9 ఎంఎం పిస్టల్‌ను సీజ్ చేశారని, దీంతో వేరే 9 ఎంఎం పిస్టల్‌ను తీసుకొచ్చామని, తుపాకీని పెట్టుకునేందుకు వినియోగించిన నైలాన్ పర్స్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ఉందని నరసింహారెడ్డి చెప్పారు. -
ఈడీ సోదాలు: నాయిని అల్లుడి ఇంట్లో కళ్లు చెదిరే నగదు
-
ఈడీ సోదాలు: నాయిని అల్లుడి ఇంట్లో కళ్లు చెదిరే నగదు
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) కేసులో సుదీర్ఘకాలం తరువాత ముందడుగు పడింది. తాజాగా ఈ కేసు లో నిందితుల ఇళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. ప్రధాన నిందితులు మాజీ డైరెక్టర్ దేవికారాణి, ఆమె భర్త గురుమూర్తి, కాంట్రాక్టర్ కంచర్ల శ్రీహరిబాబు, మాజీ కార్మిక మంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యక్తిగత కార్యదర్శి ముకుందరెడ్డి, నాయిని అల్లుడు శ్రీనివాసరెడ్డి ఇళ్లతో కలిపి దాదాపు ఏడు చోట్ల ఈడీ సోదాలు నిర్వహించారు. శనివారం ఉదయం 6 గంటల నుంచే నిందితుల ఇళ్లలో ఏకకాలంలో మొదలైన తనిఖీలు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ముగిశాయి. నాయిని అల్లుడు శ్రీనివాసరెడ్డి, మాజీ పీఎస్ ముకుందరెడ్డి, అతని బావమరిది వినయ్‌రెడ్డి, ఏడు డొల్ల ఫార్మా కంపెనీల అధినేత బుర్రా ప్రమోద్‌రెడ్డి ఇళ్లల్లో భారీగా నగలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో దాదాపు రూ.3 కోట్ల నగదు లభించిందని ఈడీ పేర్కొంది. ఇందులో శ్రీనివాసరెడ్డి ఇంట్లో రూ.1.50 కోట్లు, ప్రమోద్‌రెడ్డి ఇంటి నుంచి రూ.1.15 కోట్లు, ఎం.వినయ్‌రెడ్డి ఇంటి నుంచి రూ.45 లక్షలు, రూ.కోటి విలువైన నగలు, ఖాళీ చెక్కులు, ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కరోనా కారణంగా మందకొడిగా సాగిన విచారణ ఈ దాడులతో మళ్లీ వేగం పుంజుకున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ముగ్గురు కీలక నిందితులను ఈడీ అదుపులోకి తీసుకోవడంతో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. 2015–2019 మధ్యకాలంలో దాదాపు రూ.700 కోట్ల మందుల కొనుగోళ్లలో సుమారు రూ.100 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు అవినీతితోపాటు మనీలాండరింగ్ కూడా జరిగిందన్న ఏసీబీ నివేదిక(8 ఎఫ్ఐఆర్లు)తో ఈడీ రంగంలోకి దిగింది. అసలేమిటీ కేసు.. ఈఎస్ఐలోని ఐఎంఎస్‌లో మందుల కొనుగోళ్లలో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై విజిలెన్స్ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా 2019, సెప్టెంబర్‌లో ఏసీబీ రంగంలోకి దిగింది. అప్పటి డైరెక్టర్ దేవికారాణిని విచారణకు పిలిచి ఆమెతో పాటు మరో ఏడుగురిని అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. 2015 నుంచి 2019 దాకా.. దాదాపు రూ.700 కోట్ల విలువైన మందుల కొనుగోళ్లలో అప్పటి డైరెక్టర్ దేవికారాణి, మాజీ డైరెక్టర్ పద్మ ఎక్కడా నిబంధనలు పాటించలేదని, మందుల సరఫరాకు టెండర్లు పిలవకుండా, అర్హతలేని కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టారని ఏసీబీ ఆరోపించింది. మందుల కొనుగోలుకు స్పష్టమైన మార్గదర్శకాలతో 2012లోనే ప్రభుత్వం జీవో నంబర్ 51ని విడుదల చేసింది. దాని ప్రకారం రిజిస్టర్డ్ కంపెనీలను మాత్రమే టెండర్లకు పిలవాలి. అత్యవసర సమయాల్లో మాత్రమే నాన్ రిజిస్టర్డ్ కంపెనీలకు టెండర్లు ఇవ్వాలి. కానీ ఈ ఒక్క లొసుగును అడ్డంపెట్టుకుని దేవికారాణి, పద్మ, ఓమ్మీ ఫార్మా ఎండీ కంచర్ల శ్రీహరిబాబు అలియాస్ బాబ్జీలు కథ నడిపారని ఏసీబీ గుర్తించింది. అర్హతలేని కంపెనీలకు చెందిన మందులను అధిక ధరలకు శ్రీహరిబాబు కోట్ చేయగా, వాటిని వీరిద్దరూ అంగీకరించేవారు. బదులుగా వీరిద్దరి ఖాతాల్లో రూ.కోట్లు వచ్చి చేరాయి. శ్రీహరిబాబుతో పాటు నిందితులంతా దాదాపుగా 100కు పైగా డొల్ల కంపెనీలను సృష్టించి వాటికి సైతం కాంట్రాక్టులు దక్కించుకుని ప్రభుత్వ సొమ్మును తమ ఖాతాలోకి మళ్లించుకున్నారు. చాలాసార్లు ఖాళీ ఇండెంట్లపై దేవికారాణి, పద్మ సంతకాలు చేయించుకుని తమకు నచ్చిన ధర వేసుకునేవారని ఏసీబీ గుర్తించింది. ఫలితంగా నిందితులంతా అనతికాలంలో అనేక చోట్ల భూములు, ప్లాట్లు, నగలు, నగదు కూడబెట్టారు. ఏసీబీ వారందరి చిట్టాను బయటపెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితులతో పాటు వారికి సహకరించిన వారు, బినామీలు అంతా కలిసి దాదాపు 40 మంది నిందితుల జాబితాను ఏసీబీ రూపొందించింది. ఇందులో డైరెక్టర్ నుంచి మెడికల్ రిప్రజెంటేటివ్ వరకు ఉండటం గమనార్హం. ఈ మొత్తం వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందన్న అనుమానంతో విచారణ జరపాలని ఈడీకి ఏసీబీ లేఖ రాసింది. అవినీతి డబ్బుతో ఆస్తులు, జల్సాలు.. సాధారణంగా మార్కెట్ ధరకంటే ఏ సంస్థ తక్కువకు కోట్ చేస్తే వారికి టెండర్ ఇస్తారు. ఇక్కడ అసలు టెండర్లే లేవు. నచ్చిన వ్యక్తికి టెండర్లు లేకుండా అందులోనూ ఏకంగా మార్కెట్ రేటు కంటే 200 శాతం అదనపు ధరకు మందులు, మెడికల్ కిట్లను సరఫరా చేసే పనులను అప్పగించడం చూసి ఏసీబీ అధికారులే విస్మయం చెందారు. అలా ప్రభుత్వ సొమ్మును నచ్చిన కాంట్రాక్టరుకు దోచిపెట్టడం, వారిచ్చిన కమిషన్లతో వీరు ఆస్తులు కొన్నారు. విందులు–వినోదాలు, జల్సాలు, విదేశాలకు విహారయాత్రలకు వెళ్లడం చేశారు. వీరి జీతాలెంత, కొన్న ఆస్తుల విలువెంత, ఐటీ ఎంత కట్టారనే వివరాలన్నింటినీ ఏసీబీ గతంలోనే సేకరించింది. ప్రధాన సూత్రధారుల్లో ఒకడైన కంచర్ల శ్రీహరిబాబు అలియాస్ బాబ్జీ ఖాతాలో 2018లో ఏకంగా రూ.54 కోట్లు వచ్చి పడ్డాయి. అతనికి రూ.99 కోట్ల విలువైన షేర్లు, రూ.24 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. 2017–18లో అతను ఆదాయపు పన్నుశాఖకు రూ.19 కోట్లు పన్ను రూపంలో చెల్లించడం గమనార్హం. ఇతను లెజెండ్ అనే డొల్ల కంపెనీని సృష్టించి దానికి కృపాసాగర్ రెడ్డి అనే బినామీని కూడా పెట్టాడు. ఇక దేవికారాణి తనకు వచ్చిన డబ్బును ఏకంగా రియల్ ఎస్టేట్‌లో పెటుబడులు పెట్టింది. ఆమె అనుచరులు కూడా రూ.కోట్లాది విలువైన విల్లాలు, ఫ్లాట్లు కొనుగోలు చేశారు. 2020, సెప్టెంబర్‌లో దేవికారాణి దాదాపు రూ.4.47 కోట్ల రియల్ ఎస్టేట్ పెట్టుబడులను తిరిగి స్వాధీనం చేసుకుంది. నిందితుల్లో ఇద్దరు వ్యక్తులు మూడు ఫార్మా కంపెనీలు ప్రారంభించేందుకు గతంలో ప్రయత్నాలు ప్రారంభించారు. అందుకోసం భూమి కూడా కొనుగోలు చేశారు. ఇక మరో కీలక నిందితుని ఇంట జరిగిన పెళ్లికి నిందితుడైన మరో పెద్దమనిషి దాదాపు కిలో బంగారు ఆభరణాలను కానుకగా సమర్పించడం వీరి మధ్య అవినీతి బంధాన్ని చాటిచెబుతోంది. అంతేకాదు మరో నిందితుడు ఏకంగా కన్స్ట్రక్షన్స్ కంపెనీని కూడా మొదలుపెట్టినట్లు ఈడీ అనుమానిస్తోంది. మరి ఐఏఎస్ అధికారి సంగతేంటి? ఈ కేసులో అప్పట్లో ఓ ఐఏఎస్‌పై చర్యలు తీసుకోవాలని ఈఎస్ఐ సిబ్బంది గట్టిగా డిమాండ్ చేశారు. నాలుగేళ్లుగా అక్రమాలు జరుగుతున్నా సదరు అధికారి వీటిని తొక్కిపెట్టారని ఆరోపించారు. అంతేకాదు విజిలెన్స్ నివేదికలు బయటికి రాకుండా.. అవినీతి అధికారులకు సదరు అధికారి వత్తాసు పలికాడని, అసలు ఆయనే వీరిని చాలాకాలంగా కాపాడాడని ధ్వజమెత్తారు. నిందితులను సదరు అధికారి పరోక్షంగా సమర్థిస్తూ రాసిన లేఖలు లీకవడం కలకలం రేపింది. అదే సమయంలో ముకుందరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిలతోపాటు సదరు ఐఏఎస్ అధికారిని కూడా విచారించాలన్న డిమాండ్ వినిపించినా అది కార్యరూపం దాల్చలేదు. డిసెంబర్లో నిందితులను విచారించిన ఈడీ వారు చెప్పిన వివరాల ఆధారంగానే ముకుందరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి మధ్య ఏమైనా లావాదేవీలు జరిగాయా? అన్న కోణంలో విచారణ సాగిస్తోందని సమాచారం. ఇదే సమయంలో సదరు ఐఏఎస్ విషయంలో ఈడీ ఎలా ముందుకెళుతుందనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. చదవండి: ఈఎస్ఐ స్కాం: నాయిని అల్లుడి ఇంట్లో ఈడీ సోదాలు -
నరసింహ రెడ్డి కేసులో మరో 8 మంది అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో మల్కాజ్ గిరి ఏసీపీ నరసింహ రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం అధికారులు ఈ కేసుకు సంబంధించి మరో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వీరంతా పలు సందార్భాల్లో నరసింహ రెడ్డికి సాయం చేసినట్లు అధికారులు గుర్తించారు. మాదాపూర్‌లోని రెండు వేల గజాల స్థలం వివాదంలో నరసింహ రెడ్డి జోక్యం చేసుకోవడమే కాక బినామీల పేర్లతో మాదాపూర్ భూమిని దక్కించుకున్నాడు. మార్కెట్ విలువ ప్రకారం ఆ ల్యాండ్ దాదాపుగా 50 కోట్ల విలువ చేస్తుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఎనిమిది మంది కలిసి తప్పుడు పత్రాలతో భూమిని స్వాధీనం చేసుకున్నట్లుగా నిర్ధారణయ్యింది. దాంతో అధికారులు నరసింహ రెడ్డికి సాయం చేసిన ఎనిమిది మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. (చదవండి: ఏసీపీ నరసింహారెడ్డి రెండో లాకర్ ఖాళీ) -
ఏసీపీ నరసింహారెడ్డి రెండో లాకర్ ఖాళీ
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన మల్కాజిగిరి ఏసీపీ వై.నరసింహారెడ్డి రెండో లాకర్‌ను ఏసీబీ అధికారులు శుక్రవారం తెరిచారు. భారీగా నగదు, కీలక ఆధారాలు ఈ ఎస్బీఐ లాకర్లో లభిస్తాయని అధికారులు భావించారు. అయితే అది ఖాళీగా ఉండటంతో అవాక్కయ్యారు. రెండుమూడేళ్లుగా ఈ లాకర్ వినియోగంలోనే లేదని తెలుసుకుని వెనుదిరిగారు. మరోవైపు ఏసీపీకి బినామీలుగా వ్యవహరించిన వారి కోసం ఏసీబీ గాలింపు ముమ్మరం చేసింది. అందులో కొందరు నగరంలో లేరని, వారు ఫోన్లు కూడా అందుబాటులో లేవని సమాచారం. ఓ డీఐజీ ర్యాంకు అధికారికి బంగ్లా కొనివ్వ డంలో కీలకంగా వ్యవహరించాడన్న ఆరోపణలపైనా ఏసీబీ దృష్టి సారించింది. రూ.4 కోట్ల విలువైన ఆ బంగ్లాను సదరు డీఐజీ ఇప్పటికే అమ్మేసుకున్నాడని తెలిసింది. (మేరే పీచే బాస్ హై!) నెల ముందే తెలిసిందా...? తాను చేసే పనులకు డీజీపీ పేరును వాడుకున్న నరసింహారెడ్డికి డిపార్ట్మెంట్లో మంచి నెట్వర్క్ ఉంది. ఇటీవల ఏసీపీ జయరాంను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసిన వెంటనే.. తరువాత టార్గెట్ తానేనని గుర్తించి ఉంటాడని ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. సెప్టెంబర్ ప్రారంభం నుంచి ఆయన ఎవరితోనూ ఫోన్లో వాయిస్ కాల్ చేయలేదని.. వాట్సాప్, ఇతర యాప్‌ల ద్వారా బినామీలను సంప్రదించినట్లు సమాచారం. లాకర్లలో తక్కువ స్థాయిలో బంగారం లభించడం, కీలక బినామీలు నగరంలో లేకపోవడం ఏసీబీ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. అలాగే పలువురు రాజకీయ నాయకులతో కలసి చేసిన వ్యాపారాలు, నగరంలో పలు రియల్ ఎస్టేట్లలో నరసింహారెడ్డి పెట్టిన పెట్టుబడులపైనా ఏసీబీ ఆరా తీస్తోంది. -
కుమారుడు తోడుగా.. కలుపు తియ్యగా..
మడకశిర రూరల్: మండల పరిధిలోని గోవిందాపురం గ్రామానికి చెందిన నరసింహా రెడ్డి తన 1.50 ఎకరా పొలంలో వేరుశనగ పంట సాగు చేసేవాడు. అయితే, నాలుగేళ్లుగా సాగుకు సరైన సమయంలో వర్షాలు పడక పంట చేతికందలేదు. అప్పులు మాత్రం పోగయ్యాయి. దీంతో విధిలేని పరిస్థితుల్లో తన కాడ్డెదులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవడం.. అదే క్రమంలో గ్రామంలోనే ప్రభుత్వం విత్తన కాయలు అందజేయడంతో త్వరగానే వేరుశనగ సాగుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం వేరుశనగ చెట్లు ఏపుగా పెరిగాయి. కలుపు బాగా వచ్చేసింది. కాడెద్దులు లేకపోవడం.. ఉన్న వారు కలుపు తొలగించేందుకు గుంటకకు ఎక్కువ డబ్బులు అడుగుతుండడంతో ఇదిగో ఇలా తన కుమారుడు కృష్ణారెడ్డితో కలిసి కొన్ని రోజులుగా కలుపు తొలగిస్తున్నాడు. -
పదవ తరగతి విద్యార్థి అత్మహత్య
వైఎస్ఆర్ జిల్లా, పెండ్లిమర్రి: మండలంలోని మాచునూరు గ్రామ పంచాయితీలోని అరవేటిపల్లె గ్రామానికి అరవేటి నరసింహరెడ్డి(15) అనే విద్యార్థి సోమవారం అత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు... నరసింహరెడ్డి వెల్లటూరులోని 10వ తరగతి చదువుతుండేవాడు. తరచూ తలనొప్పి ఉండడంతో, ఒక వైపు పదవ తరగతి పరీక్షలు దగ్గర పడడంతో చదవాలంటే కష్టాంగా ఉందని చెబుతుండేవాడు. సోమవారం ఉదయం ఇంటి సమీపంలో ఉన్న సంపద సృష్టి కేంద్రం(డంపింగ్ యార్డు)లో తాడుతో మెడకు ఊరి వేసుకొని చనిపోయాడస. స్థానికులు, కుటుంబ సభ్యులు గమనించే సరికే ప్రాణాలు విడిచాడు. మృతదేహాన్ని పోస్టుమాస్ట నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. మృతునికి తల్లి, చెల్లెలు ఉన్నారు. తండ్రి బాస్కర్‌రెడ్డి అనార్యోగకారణంగా తొమ్మిది సంవత్సరాల క్రితం చనిపోయాడు. కుమారుడు మృతి చెందడంతో ఆకుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
జ్యుడీషియల్ కస్టడీకి నర్సింహారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలపై అరెస్టు చేసిన సిద్దిపేట అదనపు డీసీపీ నర్సింహారెడ్డిని గురువారం హైదరాబాద్‌లోని ఏసీబీ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ముందు హాజరు పరిచినట్టు ఏసీబీ డైరెక్టర్ జనరల్ రమణకుమార్ తెలిపారు. అనంతరం ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్టు ఒక ప్రకటనలో తెలిపారు. అక్రమాస్తులు కూడబెట్టాడనే ఆరోపణలపై బుధ, గురువారాల్లో సిద్దిపేటలోని నర్సింహారెడ్డి నివాసం, కార్యాలయంతో పాటు, హైదరాబాద్, మహబూబ్‌నగర్, జహీరాబాద్, షాద్‌నగర్, అయ్యవారిపల్లె, అతని బంధువులు, ఇతర అనుమానితుల నివాసాల్లో తనిఖీలు చేసినట్లు పేర్కొన్నారు. బుధవారం రాత్రి పొద్దుపోయాక నర్సింహారెడ్డిని హైదరాబాద్‌కు తరలించారు. అతని నివాసంతోపాటు బంధువుల ఇళ్లలో నిర్వహించిన తనిఖీల్లో 1.5 కేజీల బంగారం, రూ.5.33 లక్షల నగదు, రూ.6.37 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, గోల్కొండ వద్ద ఒక విల్లా, రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లి, గొల్లపల్లిలో 14 ప్లాట్లు, సిద్దిపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 20 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. వీటి విలువ రూ.5.02 కోట్లు ఉంటుందని, మార్కెట్ విలువ ప్రకారం రూ.10 కోట్ల పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు తెలిపారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించడంతో నర్సింహారెడ్డిని అరెస్టు చేసినట్లు తెలిపారు. తాండూరులోనూ ఆస్తులు? నర్సింహారెడ్డికి వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోనూ ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు మండలంలోని ఓగిపూర్‌లో విలువైన నాపరాతి గనులు ఉన్నట్లు సమాచారం. అయితే ఆయన పేరుతో కాకుండా బినామీ పేర్లపై ఈ గనులు ఉన్నట్లు తెలుస్తోంది. -
సిద్దిపేట అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి అరెస్ట్
-
అడిషినల్ డిసిపి ఇంట్లో ఏసీబీ సోదాలు
-
ఉగ్రరూపం దాలుస్తున్న వాయు కాలుష్యం
మన చుట్టూ కాలుష్యం పెరిగిపోతున్నది. ఒకప్పుడు, కేవలం పారిశ్రామిక ప్రాంతాలకే పరిమితం అయిన కాలుష్యం, అంతటా పాకిపోయింది. కాలుష్యం కేవలం ఒక వనరుకే పరిమితం కాకుండా, పంచ భూతాలు అన్ని కూడా కలుషితం అయినాయి. కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నాల కంటే, మానవాళి ఒక సాంకేతిక విరుగుడుతో తమ జీవన విధానంలో మార్పులు లేకుండా పయనం సాగిస్తున్నది. ధ్వని, నీరు, భూమి, ఆకాశంతో పాటు వాయు కాలుష్యం పెరుగుతున్నది. భూమి ఉష్ణోగ్రత పెరగడానికి గల కారణాలలో వాయు కాలుష్యం పాత్ర గణనీయమైనది. అయినా, దాని పట్ల శ్రద్ధ లేకపోవడం స్పష్టం. హైదరాబాద్ నగరంలో ప్రతి ఇంట్లో జలుబు, దగ్గు, పడిశం రావడానికి గాలిలో ఉన్న దుమ్ము, ధూళితో పాటు వాహనాల నుంచి నత్రజని, కర్బన వాయువులు కారణం కాగా, ఈ మధ్య కాలంలో కేన్సర్ కూడా సాధారణం కావడానికి ప్రాణవాయువుతో పాటు మనం పీలుస్తున్న ఇతర కేన్సర్ కారక వాయువులు కూడా ఒక బలమైన కారణం. మునిసిపల్ చెత్తను ఎందరో అనేక రకాలుగా తగలబెడుతుంటారు. వీటిలో ఉండే ప్లాస్టిక్‌ను కాల్చేయడం వల్ల భయంకరమైన డైఆక్సిన్లు, ఫ్యురాన్లు ఉత్పన్నమై ప్రాణవాయువులో కలిసిపోయి ప్రాణాంతకంగా మారుతున్న పరిస్థితి ఉంది. పట్టణ పేదలు, మునిసిపల్ కార్మికులు, అవగాహన లేని పౌరులు, అధికారులు తదితరులు చెత్తను తగలపెట్టడంలో తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. చివరకు, ప్రభుత్వం, మునిసిపల్ అధికారులు సైతం రోజూ వచ్చే టన్నుల కొద్దీ చెత్తను నిర్వహించలేక, తగలపెట్టడమే పరిష్కారంగా భావించి జవహర్ నగర్లో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో వచ్చే విద్యుత్ కంటే, ఖర్చు అయ్యే విద్యుత్ ఎక్కువగా ఉంటుంది. ఆ ప్లాంట్ నుంచి రక రకాల విష వాయువులు వెలువడి ప్రజారోగ్యం మీద దీర్ఘకాల ప్రభావం పడుతుంది. చెత్త తయారు కాకుండా విధానాలు, ప్రక్రియల మీద దృష్టి పెట్టకుండా, ‘సులువైన, ప్రమాదకరమైన పరిష్కారాలు చేపట్టడం శ్రేయస్కరం కాదు. హైదరాబాదులో జరుగుతున్న ఈ తంతు తెలంగాణలో ఇతర పట్టణాలు, నగరాలు, పల్లెలకు కూడా పాకింది. ‘చెత్తను పోగు చేయడం, తగులపెట్టడం’ ఒక సమాజహిత ప్రక్రియగా చేపడుతున్న వైనం తెలంగాణ వ్యాప్తంగా కనపడుతుంది. దీని వలన, తెలంగాణ వ్యాప్తంగా విష వాయువుల ఉత్పత్తి పెరిగి, పెద్దలు, పిల్లలు కూడా తీవ్ర అనారోగ్యానికి గురి అవుతున్నారు. ఇంటి నుంచే బయటకు వచ్చే చెత్త పరిమాణం తగ్గించాలి. ఎక్కువగా వచ్చే తడి చెత్తను ఎరువుగా స్థానికంగానే మార్చుకోవాలి. మిగతా వాటిని, ఒక దగ్గరికి చేర్చి పునఃవినియోగంలోకి తీసుకురావాలి. చెత్తను ఎట్టి పరిస్థితులలోను కాల్చరాదు. గాలి కాలుష్యం పెరగటంలో రవాణా రంగం పాత్ర చాల ఎక్కువగా ఉంది. జాతీయ రహదార్లు, చిన్న పట్టణాలు, పెద్ద ఊర్లు, ఇతర రోడ్ల పైన కూడా వాహనాల సంఖ్య పెరగడంతో గాలి కాలుష్యం పెరుగుతున్నది. తెలంగాణా వ్యాప్తంగా వ్యక్తిగత వాహనాల సంఖ్య పెరిగింది. హైదరాబాద్ నగరంలో 2005 నుంచి 2016 మధ్య వ్యక్తిగత వాహనాల సంఖ్య భారీగా పెరిగింది. జనాభా కంటే వాహనాల పెరుగుదలే ఎక్కువగా ఉందని తేలడం గమనార్హం. అధికారిక గణాంకాల ప్రకారం హైదరాబాద్ జిల్లా పరిధిలో 2014 మార్చి నాటికి 21.75 లక్షల వాహనాలుండగా.. ఆ సంఖ్య 2018 మార్చి నాటికి 29.09 లక్షలకు చేరుకుంది. ఇక గ్రేటర్‌వ్యాప్తంగా తీసుకుంటే అధికారిక గణాంకాల ప్రకారమే 50 లక్షల మార్కును దాటింది. ఇతర జిల్లాలకు చెందిన వాహనాలతో కలుపుకొంటే ఆ సంఖ్య 60 లక్షల నుంచి 70 లక్షల వరకు ఉంటుందని అంచనా. దీనితో, కొన్ని ప్రాంతాల్లో రద్దీ విపరీతం. గాలి కాలుష్యం పెరుగుతున్నది. రవాణా రంగం వలన వచ్చే వాయుకాలుష్యం తగ్గాలంటే వాహనాల ఇంధనంలో మార్పులు తీసుకు రావాలి. డిజిల్, పెట్రోల్ ఇంధనం కంటే విద్యుత్ వాహనాలు, ఇంకా ఇతర ఇంధనాల వినియోగం పెరగాలి. పారిశ్రామిక రంగం వల్ల కూడా గాలి కాలుష్యం పెరుగుతున్నది. ప్రమాదకరమైన సాల్వెంట్లు కూడా ఇష్టారీతిన వదిలివేయడం వల్ల, హైదరాబాద్ నగరం చుట్టుప్రక్కల పారిశ్రామిక ప్రాంతాలు, సమీప నివాస ప్రాంతాలలో ప్రాణవాయువు తగ్గిపోతున్నది. ఇంటిలో కూడా రకరకాల పదార్థాలు, వస్తువుల వినియోగంతో గృహాలలో కూడా గాలి కాలుష్యం పెరుగుతున్నది. వ్యవసాయంలో వాడే నత్రజని ఎరువులు, విష రసాయనాలు, పెరుగుతున్న డీజిల్, విద్యుత్, ప్లాస్టిక్ వినియోగం వల్ల కూడా పల్లెలలో గాలి కాలుష్యం పెరిగింది. హైదరాబాద్ నగరంలో వర్షపు నీరు దుమ్ము, ధూళి, సీసం తదితర కలుషితాలవల్ల భూగర్భ జలాలలో సీసం ఉన్నట్లు పరిశోధనలలో తేలింది. అనేక రకాలుగా కాలుష్యం పెరిగిపోయి, అనేక రకాలుగా విష వాయువులు అదనంగా చేరి, గాలిలో ప్రాణ వాయువు యొక్క పరి మాణం తగ్గిపోతున్నది. కాలుష్యాన్ని ఇముడ్చుకునే శక్తి ప్రకృతిలో తగ్గిపోతున్నది. అటువంటి శక్తి తగ్గిన కొద్దీ, మున్ముందు ఒక అగ్గిపుల్ల కాల్చినా కూడా కాలుష్య భారం తట్టుకోలేని పరిస్థితి వస్తుంది. అందువల్ల, పరిష్కారంగా మనం బొగ్గు, డీజిల్, పెట్రోల్ మరియు ఇతర ఇంధనాలను ‘కాల్చే’ ప్రక్రియల మీద దృష్టి పెట్టి, వాటిని ఏ ఏటికాయేడు తగ్గించుకునే లక్ష్యాలు ఏర్పరుచుకోవాలి. థర్మల్ విద్యుత్ కేంద్రాలను తక్షణమే మూసివేయాలి. వాహనాల వాడకం తగ్గించాలి. కొత్త వాహనాలు రోడ్ల మీదకు రాకుండా ‘సామూహిక’ రవాణా వ్యవస్థలకు శ్రీకారం చుట్టాలి. ప్రజలు కూడా తమ జీవన శైలిలో మార్పులు తీసుకురావాలి. పర్యావరణహిత ప్రభుత్వ విధానాల కొరకు పోరాడాలి. డి. నరసింహా రెడ్డి వ్యాసకర్త విధాన విశ్లేషకులు ఈ-మెయిల్: nreddy.donthi16@gmail. com -
రైతు ప్రాణం తీసిన ‘పసుపు–కుంకుమ’
సాక్షి, కురబలకోట (చిత్తూరు జిల్లా): ప్రభుత్వ పసుపు– కుంకుమ పథకం కారణంగా ఓ రైతు భార్య తన ‘పసుపు, కుంకుమ’ కోల్పోయింది. డ్వాక్రా గ్రూపుల్లో నగదు పంపిణీ సక్రమంగా జరక్కపోవడంతో చోటుచేసుకున్న గొడవ కారణంగా మనస్తాపం చెందిన రైతు రెండు రోజుల కిందట ఇల్లు వదిలి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం రోడ్డు పక్కన నిర్జన ప్రదేశంలో రేకుల షెడ్డులో ఆయన శవం లభ్యమైంది. ఈ విషాదకర సంఘటనకు సంబంధించి చిత్తూరు జిల్లా ముదివేడు ఎస్ఐ నెట్టి కంఠయ్య కథనం ప్రకారం.. కురబలకోట మండలం పుల్లగూరవారిపల్లెకు చెందిన పి.నరసింహారెడ్డి (66) వ్యవసాయదారుడు. అతనికి భార్య రాజమ్మ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. రాజమ్మ డ్వాక్రా గ్రూపులో ఉంది. పసుపు–కుంకుమ కింద తొలి విడత రూ. 2,500 వచ్చింది. ఆ తర్వాత రావాల్సిన డబ్బు రూ. 7,500 ఇవ్వలేదు. ఈ విషయమై ఆయన కుమారులు నాలుగు రోజుల కిందట డ్వాక్రా గ్రూపు లీడర్‌ను అడిగారు. కొంత డబ్బు ముట్టచెబితే ఇస్తామని ఆమె చెప్పడంతో వారి మధ్య గొడవ మొదలయ్యింది. అసలే ఘర్షణలు, కొట్లాటలు ఏమాత్రం నచ్చని నరసింహారెడ్డి కుమారులను వారించాడు. కోపంలో ఉన్న కుమారులు తన మాట వినకపోవడంతో నరసింహారెడ్డి మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం ముదివేడు క్రాస్‌కు పనిమీద వెళుతున్నానని వెళ్లిన ఆయన కన్పించకుండా పోయాడు. బుధవారం ఉదయం ముదివేడు క్రాస్ దగ్గర అటవీ ప్రాంతంలో రోడ్డు పక్కనున్న ఓ రేకుల షెడ్డులో రైతు శవమై కన్పించాడు. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. శవం కుళ్లిన స్థితికి చేరుకోవడంతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించి పోలీసులు మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. శవం పక్కన పురుగుమందు డబ్బాలు కన్పించాయని, దీనిపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చిన్న వివాదం కారణంగా కుటుంబపెద్ద ప్రాణాలు తీసుకోవడంతో భార్య, కుమారులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పసుపు–కుంకుమ డబ్బుల వల్ల దారితీసిన గొడవతో రైతు మృతి చెందడంపై వెలుగు అధికారులను విచారించగా.. డ్వాక్రా సభ్యురాలికి డబ్బులు ఇవ్వని సమస్య తమ దృష్టికి రాలేదన్నారు. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి
షాద్‌నగర్ టౌన్: రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సత్తా చాటాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం షాద్‌నగర్ పట్టణంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాల్‌రాజ్‌గౌడ్ ఆధ్వర్యంలో ఫరూఖ్‌నగర్ మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నర్సింహారెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం ఖాయమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తిని గ్రామ స్థాయిలోనే నాయకులు నిర్ణయించుకోవాలని సూచించారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు స్థానిక నాయకులను సంప్రదించాలని సూచించారు. ఏకగ్రీవంగా పార్టీ నాయకులంతా కలిసికట్టుగా ఉండి అభ్యర్థిని ఎంపిక చేయాలన్నారు. గతంలో గ్రామ స్థాయిలో పార్టీ పటిష్టత కోసం, సమాజ సేవ చేసే నాయకులకు పదవులు దక్కేవి కావని, నాయకుల వెంట తిరిగే వారికి పదవులు వచ్చేవన్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి మారిందని, గ్రామ కార్యకర్తలకు అధిక ప్రాధాన్యం ఉంటుందన్నారు. కాంగ్రెస్ నాయకుడు వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో షాద్‌నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించేందుకు ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా కృషిచేయాలన్నారు. ఈ సమావేశంలో పీసీసీ జనరల్ సెక్రటరీ జగదీశ్వర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ యాదయ్య యాదవ్, బాబర్‌ఖాన్, శ్రీకాంత్‌రెడ్డి, నర్సింహారెడ్డి, సుదర్శన్‌గౌడ్, నవాజ్‌గోరి, అంచరాములు, కాలేద్, చేగూరి రాఘవేందర్‌గౌడ్, జంగ నర్సింలు, సుదర్శన్‌గౌడ్, పైలయ్య, గంగనమోని సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. -
దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరం
త్రిపురారం (నాగార్జునసాగర్) : తెలంగాణ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పార్టీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి గెలుపును ఆకాంక్షిస్తూ బుధవారం త్రిపురారం మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్‌షో కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన రోజున పార్లమెంట్లో టీఆర్ఎస్ బలం రెండు సీట్లేనని, ఆ రెండు సీట్లతో ఒకేఒక్కడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగా లేనిది తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రంలో కేసీఆర్ నాయకత్వం ఎందుకు చేపట్టలేరని అన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ నేతల మాయమాటలు వినే స్థితిలో ప్రజలు లేరని.. అలాంటి పార్టీని మట్టి కరిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. దేశంలో రైతులకు 24గంటలపాటు ఉచితంగా కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనన్నారు. రాష్ట్రంలో రైతులు ఆర్థికంగా ఎదగడం కోసం రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు ప్రవేశపెట్టింది ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనేన న్నారు. సీఎం కేసీఆర్ నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజల అభివృద్ధి కోసం ప్రతి కుటుంబానికి ఏదో ఒకరకంగా సంక్షేమ ఫలాలను అందించాలనే తపనతో కల్యాణలక్ష్మి, షాద్ ముబారక్, ఆసరా పెన్షన్లు, ప్రతి కుటుం బానికి తాగునీరు, ఉచిత కరెంట్ ఇలా అనేక రకాల పథకాలను అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. నాగార్జున సాగర్‌లో డెడ్ స్టోరేజీ ఉన్నా ఆ నీటిని తోడి పంపులు పెట్టి రైతుల చివరి భూములకు సాగునీరు అందించి ఆదుకుంటామన్నారు. సాగర్ నియోజకవర్గంలో లిఫ్ట్‌లను ఏర్పాటు చేయడంతో పాటు ఆయకట్టు చివరి భూములకు నీరందించే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి జగదీశ్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పని అయిపోయిందని నేతలంతా టీఆర్ఎస్లోకి వచ్చి చేరుతున్నారని అన్నారు. నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేసేందుకు నాయకులే లేరని, అభ్యర్థి మాత్రమే మిగిలారని ఎద్దేవా చేశారు. నేను రాజకీయాలకు కొత్తేమీ కాదు : నర్సింహారెడ్డి నల్లగొండ పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి మాట్లాడుతూ తాను రాజకీయాలకు కొత్తేమీ కాదని నల్లగొండ జిల్లా ప్రజలకు తెలుసన్నారు. 20 సంవత్సరాల క్రితమే మునుగోడులో ప్రాదేశిక పోరులో నిలిచానన్నారు. ప్రజలకు సేవా చేయడానికి ముందుకు వచ్చానన్నారు. ప్రజలు ఆశీర్వదించి సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు. అధిక మెజారిటీతో గెలిపించాలి - ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అనంతరం నల్లగొండ ఎంపీ, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహాంరెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించి రికార్డు సృష్టించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్ రాంచందర్ నాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నరేందర్, నాయకులు ఎంసీ కోటిరెడ్డి, ధన్‌సింగ్‌నాయక్, మర్ల చంద్రారెడ్డి, దూళిపాల రామచంద్రయ్య, మార్తీ భరత్‌రెడ్డి, అనంతరెడ్డి, అనుముల శ్రీనివాస్‌రెడ్డి, అనుముల నర్సిరెడ్డి, అనుముల రఘుపతిరెడ్డి, పడిశల బుచ్చయ్య, బిట్టు రవికుమార్, పెద్దబోయిన శ్రీనివాస్‌యాదవ్, కామర్ల జానయ్య, కొనకంచి సత్యం, పామోజు వెంకటాచారి, జంగిలి శ్రీనివాస్, అనుముల శ్రీనివాస్‌రెడ్డి, బచ్చు సాంబయ్య ఉన్నారు. -
ఓటెత్తి కొడితే ఢిల్లీ కైవసం కావాలె..
పాలకవీడు (హుజూర్నగర్) : ఓటెత్తి కొడితే ఢిల్లీ కైవసం కావాలని, అందుకు టీఆర్ఎస్కు చెందిన ప్రతి కార్యకర్త కృషి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని టీఆర్ఎస్ నేతలు మంత్రి జగదీశ్‌రెడ్డి, హుజూర్నగర్ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి శానంపూడి సైదిరెడ్డి ప్రారంభించారు. టీఆర్ఎస్ పార్టీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి గెలుపును కాంక్షిస్తూ ఆయనతో కలిసి మండలం లోని జాన్‌పహాడ్‌దర్గా నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. ముందుగా దర్గాలో సైదులు బాబాకు చాదర్, దట్టీ సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ 70ఏళ్ల కాంగ్రెస్ పాలనలోని దరిద్రాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో అభివృద్ధి పరుచుకున్నామని తెలిపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ మాటలు వినే స్థితిలో ప్రజలు లేరని, అలాంటి పార్టీకి ఓటేస్తే మోరీల్లో వేసినట్లేనన్నారు. ఈ ఎన్నికల్లో వేమిరెడ్డి నర్సిం హారెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో రైతులకు 24గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనన్నారు. రాష్ట్రంలోని రైతులు ఆర్థికంగా ఎదగడం కోసం రైతుబందు, రైతుబీమా వంటి పథకాలు ప్రవేశపెట్టిందని కూ డా మనమేనన్నారు. ఇంకా కల్యాలక్ష్మి, షాదీముబారక్ పథకాలతోపాటు వితంతు, వికలాంగులు, వృద్ధులకు రెట్టింపు స్థాయిలో పెన్షన్లు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్లగొండ ప్రజల ఫ్లోరిన్ సమస్యను ఎందుకు పట్టించుకోలేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. రాజకీయ అవగాహనలేని వారిని నామీద ఎంపీ అభ్యర్థిగా నిలిపారని మాట్లాడుతున్న ఉత్తమ్‌ను దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో గెలవాలని మంత్రి జగదీశ్‌రెడ్డి సవాల్ విసిరారు. హుజూర్‌నగర్‌కు ముందుగానే ఎమ్మెల్యే టికెట్ కేటాయించినట్లయితే ఈ రోజు పరిస్థితి వేరేలా ఉండేదన్నారు టీఆర్ఎస్ 16ఎంపీ స్థానాలు గెలిపించుకుంటే దేశంలో గుణాత్మకమార్పుకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుడతారన్నారు. అభ్యర్థి నర్సింహారెడ్డి మా ట్లాడుతూ తనను ఆదరించి నల్లగొండ ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు జిన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు మలిమంటి దర్గారావు, వై.సత్యనారాయణరెడ్డి క్యాకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. -
పాలకుల నిర్లక్ష్యానికి చేనేత బలి
చేనేత రంగం భారత దేశంలోనే అనాది కాలంగా వస్తున్న వృత్తి. అనేక దశాబ్దాలలో ఈ రంగం అనేక మార్పులు చెంది, పరిణతి చెందుతూ తన ఉనికిని కాపాడుకుంటూ, వినియోగదారుల మన్ననలు పొందుతూ, ఇప్పటికి అనైతిక పోటీని ఎదుర్కొంటూ లక్షలాది కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్నది. ఒకప్పుడు వెలుగు వెలిగిన ఈ రంగం, 1990 దశాబ్ది చివరకు కష్టాలలో పడింది. ప్రపంచ వాణిజ్య ఏర్పాటు, అందులో భాగంగా సభ్య దేశాలు చేసుకున్న జౌళి, వస్త్రాల ఒప్పందం, తదనంతరం భారత ప్రభుత్వాలు తీసుకున్న విధాన నిర్ణయాలు చేనేత రంగానికి చేటు తీసుకు వచ్చినాయి. ఉపాధి పేరిట ఉపాధిని భక్షించే పాలక నిర్ణయాలు, చేనేత రంగాన్ని దెబ్బ తీసే పరిస్థితిని సృష్టిం చినాయి. రాజకీయ పార్టీలు, నాయకులూ, ఆయా ప్రభుత్వాలు హామీలు ఇస్తూనే, ఇంకొక పక్క అధికారం రాగానే, ఈ రంగాన్ని నిర్వీర్యం చేసే ఆధునిక జౌళి పరిశ్రమకు వత్తాసు పలుకుతూనే ఉన్నాయి. కుల రాజకీయాలు పెరుగుతున్న క్రమంలో, అనేక కులాలకు చెందిన చేనేత కుటుంబాలు ఒక ఓటు బ్యాంకుగా ఆయా రాజకీయ పార్టీలకు కనిపిం చలేదు. చేనేత వృత్తిని నమ్ముకుని, ఆయా రాష్ట్రాలలో గణనీయ సంఖ్యలో ఉన్న ఒకే కులస్తులు కొంత ఒత్తిడి చేయగల్గినా, ఎన్నికల తదనంతరం వారికిచ్చిన హామీలు గాలికి వదిలేసినారు. గత ఇరవై ఏళ్ల కాలంలో, అనేక మంది పద్మశాలీలు, ఇతర వృత్తులకు మళ్లడంతో, ‘చేనేత’ వృత్తికి రాజకీయ ప్రాధాన్యం మరింత తగ్గింది. ఈనాడు, అన్ని రాజకీయ పార్టీలలో చేనేత అనుబంధ విభాగాలు ఉన్నా, అవి ఆశించినంత మేర పార్టీ నిర్ణయాల మీద ప్రభావం చూపెట్టలేకపోతున్నాయి. ప్రధాన, జాతీయ పార్టీలలో చేనేత విభాగాలు ‘కుల’ రాజకీయాలకే పరిమితమయినాయి. గత పదిహేను ఏళ్లలో, కేంద్రంలో ఏ కూటమి అధికారంలో ఉన్నా, చేనేత రంగం ఆశి స్తున్న నిధుల కేటాయింపు పెరగలేదు. చేనేత రంగాన్ని పట్టించుకోలేదు. చేనేత రంగాన్ని నిర్లక్ష్యం చేయడంతో చేనేత కార్మికుల ఆత్మహత్యలు పెరిగాయి. 1997లో చేనేత రంగానికి ప్రణాళిక వ్యయం కేవలం రూ. 107 కోట్లే. ఈ రాజకీయ, పాలక నిర్లక్ష్యం ఫలితమే చేనేత కార్మికుల ఆత్మహత్యలు. రాజకీయంగా సాధించలేనిది, ఆత్మహత్యల ద్వారా తమ గోడు ప్రభుత్వానికి, ప్రపంచానికి వినిపించగలిగారు. ఫలితంగా 2012–13లో, చేనేత కేటాయింపు రుణమాఫీ పథకంతో కలిపి రూ.2,960 కోట్లకు పెరిగింది. చేనేత రుణ మాఫీ పథకం అమలు కాలేదు. అప్పులు పెరుగుతున్న తరుణంలో ఆదాయం పెరగక ఇబ్బందులూ పడుతున్న చేనేత కుటుంబాల మీద గోరు చుట్టు మీద రోకటి పోటు లాగ, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వల్ల సమస్యలు ఇంకా జటిలం అయినాయి. ఎన్నడూ లేని పన్నులు చేనేత మీద భారం విపరీతంగా పెంచాయి. చేనేత వస్త్రాల కొనుగోలు తగ్గిపోయింది. 2019–20 వోట్–అన్–అకౌంట్ బడ్జెట్లో చేనేతకు కేటాయించింది రూ. 456.80 కోట్లు. 2018–19లో కేటాయించింది రూ. 396.09 కోట్లు. 2017–18లో కేటాయించింది రూ. 604 కోట్లు, ఖర్చు చేసింది రూ. 468.98 కోట్లు. ఎన్నికల సమయంలో కూడా చేనేతకు కావాల్సిన నిధులు ఇవ్వలేదు. జీఎస్టీ మినహాయింపు గురించి బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావన కూడా లేదు. రుణ మాఫీ పథకానికి ఇచ్చిందే తక్కువ. దాన్ని కూడా పూర్తిగా ఖర్చు చేయలేదు. 95 శాతం చేనేత కుటుంబాలకు ఈ పథకం చేరనేలేదు. మళ్లీ రుణ మాఫీ ప్రకటించలేదు. చేనేత రంగంలోని కుటుంబాలు అప్పులతో కుదేలు అవుతున్న పరిస్థితులలో చేనేత రుణ మాఫీ 2019–20 బడ్జెట్లో ప్రకటించి ఉంటే చేనేత కార్మికులు సంతోషించేవారు. చేనేతపై వివక్ష ప్రభుత్వాలు మారినా కొనసాగుతూనే ఉంది. కేటాయింపులు ఎన్ని ఉన్నా, రాజకీయంగా పోరాడి సాధించుకున్నా, అధికారుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్ల ఈ పాటి కేటాయిం పులు సరిగ్గా ఖర్చు కాకపోవడం చేనేత రంగాన్ని పీడిస్తున్న పాలనాపరమైన అంశం. 2012–13లో రూ. 2,960 కోట్లు కేటాయిస్తే, రూ.793.28 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఎనిమిది సంవత్సరాల కాలంలో ఖర్చు వివరాలు గమనిస్తే కేటాయింపు కంటే ఖర్చు తక్కువగానే ఉంది. 2014 ఎన్నికలలో చేనేత రంగానికి ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కానీ నాయకుడు కానీ ఆశ కలిపించలేదు. తెలుగు రాష్ట్రాలలో (ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ) చేనేతలు గణనీయ సంఖ్యలో ఉన్నారు. రాబోయే ఎన్నికలలో అనేక ప్రాంతాలలో బహుముఖ పోటి ఉన్న తరుణంలో చేనేతల మద్దతు చాలా అవసరం అవుతుంది. చేనేత మద్దతు కోరే నాయకులూ పార్టీలు ఈ రంగానికి మద్దతు ఇచ్చే హామీలు ఇచ్చి విశ్వాసం కలిగిస్తేనే వారికి కావాల్సిన ఓట్లు వస్తాయి. చివరిగా, సమగ్ర చేనేత అభివృద్ధి మా లక్ష్యం అని ప్రకటిస్తే చేనేత కుటుంబాలు సంపూర్ణ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. డి. నరసింహారెడ్డి వ్యాసకర్త ప్రముఖ ఆర్థికరంగ నిపుణులు -
చిన్న గడ్డం, పెద్ద గడ్డం ఒక్కటయ్యాయి
మోర్తాడ్ (బాల్కొండ)/ పెర్కిట్: నిన్నటి వరకు రాజకీయంగా బద్ధ శత్రువులైన చిన్న గడ్డం, పెద్ద గడ్డం (చంద్రబాబు, ఉత్తమ్) అధికార యావతో ఇప్పుడు ఏకమయ్యారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఎద్దేవా చేశారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌లో ఆదివారం నిర్వహించిన గురడికాపుల ఆత్మీయసమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. బాబు పక్క రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెట్టడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు కంటే వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో నయమని, ఆయన బాబు కంటే ఎంతో ఉత్తమమైన రాజకీయం చేస్తున్నారని ప్రశంసించారు. మహా కూటమి పేరుతో తెలంగాణలో అధికారం చేజిక్కించుకుని ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడానికి బాబు యత్నిస్తున్నారని ఆర్మూర్‌లో నిర్వహించిన రజకఆత్మీయ సమ్మేళనంలో నాయిని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే బాబు తోపాటు రేవంత్ జెలు పాలవుతారని చెప్పారు. రజకులను ఎంబీసీ జాబితాలో చేర్చి రూ.వేయి కోట్ల నిధిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. -
సాక్షి 'విత్ టీఎన్ఆర్'
మాది మంచిర్యాల. నాన్న రాజిరెడ్డి. గ్రామ సర్పంచ్‌గా మూడు దఫాలు సేవలందించారు. అమ్మ చిన్నప్పుడే చనిపోతే అక్కే అమ్మలా నన్ను పెంచింది. నాన్న నా జీవితంతో అన్ని అంశాల్లో అండగా ఉన్నారు. హైదరాబాద్‌లో సరస్వతి శిశుమందిర్‌లో స్కూలింగ్, వివేకవర్థినిలో డిగ్రీ చేశాను. శ్రీనగర్‌కాలనీ: ఒకరితో అరగంట మాట్లాడాలంటే ఎంతో ఓపిక ఉండాలి. మనకు కావాల్సిన విషయం రాబట్టాలంటే ఓపికతో పాటు సమయం సందర్భం చూసుకోవాలి. మరి సెలబ్రిటీల నుంచి ప్రేక్షకులకు కావాల్సిన కొత్త విషయాలను రాబట్టాలంటే ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి..! అలాంటిది తనకు కావాల్సిన అంశాన్ని అతి సులువుగా రాబట్టేస్తాడతడు. అవతలి వారి మనసుతో కలిసిపోయి మధురంగా మాటల్లోకి దింపి పదునైన ప్రశ్న సంధిస్తాడు. అతడే తుమ్మల నరసింహారెడ్డి. ఆ పేరు చెబితే పెద్దగా తెలియపోవచ్చు.. కానీ ‘ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్’ అంటే మాత్రం యూట్యూబ్‌తో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ చిరపరితమే. సాధారణంగా ఓ వీడియోను పది నిమిషాలు చూడాలంటే బద్ధకం వస్తుంది. వెంటనే దాన్ని ఫార్వర్డ్ చేసేస్తాం. కానీ టీఎన్ఆర్ సెలబ్రిటీలతో చేసిన ఇంటర్వ్యూలు చూస్తుంటే మాత్రం సమయం కూడా మరిచిపోతాం. అవి కూడా మినిమం గంట.. 2 గంటల నుంచి మాగ్జిమం 8 గంటలు కూడా ఉంటాయి. అయినా ఇంకా చూడాలనిపిస్తుంటుంది. ఇంకే ప్రశ్నలు వేస్తాడు.. అవతలి నుంచి ఏం సమాధానం వస్తుందన్న ఉత్సుకత ఉంటుంది. అందుకే ఆయన చేసిన వీడియోలను 20 కోట్ల మంది వీక్షించారంటే అతిశయోక్తి కాదు. ‘ఐడ్రీమ్స్’ యూట్యూబ్ ఛానల్లో ‘ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్’ ద్వారా సుపరిచితమైన తుమ్మల నరసింహారెడ్డి పెద్దపెద్ద సినీస్టార్లను, డైరెక్టర్లను తన మాటల చాతుర్యంతో కట్టిపడేసి.. వీక్షకులను సైతం ఆకట్టుకున్నారు. టీఎన్ఆర్ ప్రస్థానం తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసే టీఎన్ఆర్ను ‘సాక్షి’ ప్రత్యేకంగా పలకరించినపుడు తన జర్నీని పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ఇండస్ట్రీ చాలా గొప్పది.. తెలుగు ఇండస్ట్రీ చాలా గొప్పది. లక్షలాది మందికి జీవనోపాధిగా ఉంది. కాస్టింగ్ కౌచ్ అంటూ ఇండస్ట్రీ మీద రుద్దడం తప్పు. అన్ని రంగాల్లో కాస్టింగ్ కౌచ్ ఉంది. సినిమాను వ్యాపారంగా చూసేవాళ్లతో పాటు, ప్యాషన్‌తో సినిమాను చేయాలనే తపన ఉన్నవారు వేలల్లో ఉన్నారు. సినిమాల్లో ఎవరో చెబుతున్నట్లు క్యాస్ట్ ఫీలింగ్ అన్నది నిజం కాదు. అవకాశం ఇవ్వాలని ప్రోత్సహిస్తారే తప్ప.. నిజంగా క్యాస్ట్ ఫీలింగ్ లేదు. అందరూ కలిసి సినిమాలు చేస్తారు. ఇండస్ట్రీ కొత్త కథలతో మంచి విజయాలను సొంతం చేసుకుంటుంది. అంతర్జాతీయ ఖ్యాతి పొందాలన్నదే నా ఆకాంక్ష. త్వరలో డైరెక్షన్ చేస్తా.. నటుడిగా కూడా కొన్ని సినిమాలు చేశాను. సుమంత్ హీరోగా చేసిన ‘బోణీ’ చిత్రంలో కొద్ది సమయమైనా మంచి పాత్రలో నటించాను. ‘నేనే రాజు నేనే మంత్రి’లోను చేశాను. జార్జిరెడ్డి, సుబ్రమణ్యపురంలో నటించాను. ప్రస్తుతం ఆది, నందు చిత్రాల్లో చేస్తున్నాను. నా స్వీయ దర్శకత్వంలో మానవ విలువలతో పాటు ప్రేక్షకులు మెచ్చే చిత్రాన్ని రూపొందించాలనే కోరిక ఉంది. వచ్చే ఏడాది ఆ దిశగా అడుగులు వేస్తున్నాను. నాకు గుర్తింపు చెత్తిన ఇంటర్వ్యూలను మాత్రం వదలను.. చేస్తూనే ఉంటాను.. అంటూ ముగించారు. ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్గా.. తేజగారి ఇంటర్వ్యూ వైరల్ తర్వాత నా మీద మరింత బాధ్యత పెరిగింది. దాంతో ‘ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్’ పేరుతో సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ మొదలేట్టా. అలా రామ్‌గోపాల్‌వర్మ, కృష్ణవంశీ, తనికెళ్ళ భరణి, విజయ్ దేవరకొండ, రమాప్రభ, ఆర్. నారాయణమూర్తి, కొరటాల శివ, సుకుమార్, బండ్ల గణేష్, సుధాకర్, బ్రహ్మాజీ, రవిరాజా పినిశెట్టి, రవిబాబు, సుధీర్‌బాబు, క్రిష్, మారుతి, వంశీ, చోటా కె నాయుడు, దశరథ్, ఎన్.శంకర్ వంటి సెలబ్రిటీలతో ఇప్పటి వరకూ 132 ఇంటర్వ్యూలు చేశాను. వాటిలో నాకు తనికెళ్ళ భరణి ఇంటర్వ్యూ చాలా స్పెషల్‌గా అనిపించింది. నటుడు, రచయిత, నా గురువు ఎల్బీ శ్రీరామ్ ఇంటర్వ్యూ అయితే 8 గంటలు నడిచింది. ఎక్కడా తీసివేయలేని అంశాలు ఆయన పంచుకున్నారు. ఇప్పటికీ 20 కోట్ల మంది నా ఇంటర్వ్యూస్, ప్రోమోస్ చూసారంటే నమ్మశక్యంగా లేదు.. అది చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా సినిమా అభిమానులకు, నెటిజన్లకు నా హృదయపూర్వక దన్యవాదాలు. నాకు దర్శకుడు త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్‌లను ఇంటర్వ్యూ చేయాలనుంది. ఆ ఆశ తీరుతుందో లేదో కాలమే నిర్ణయిస్తుంది.