Objections
-
విగ్రహాలకు స్థానచలనం
న్యూఢిల్లీ: నూతన పార్లమెంట్ ప్రాంగణంలో చూడగానే ఎదురుగా కనిపించే మహాత్మా గాంధీజీ, బీఆర్ అంబేడ్కర్, ఛత్రపతి శివాజీ మహరాజ్, జ్యోతిబా ఫూలే సహా పలువురు దేశ ప్రముఖుల విగ్రహాలను ప్రభుత్వం వేరే చోటుకు తరలించింది. ఉన్న చోటు నుంచి పాత పార్లమెంట్(సంవిధాన్ సదన్)లోని ఐదో నంబర్ గేట్ దగ్గరి లాన్ వద్దకు మార్చింది. ఈ లాన్లో ఇప్పటికే గిరిజన యోధుడు బిర్సా ముండా, మహారాణాప్రతాప్‌ల విగ్రహాలు ఉన్నాయి. విగ్రహాల తరలింపుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘మహాత్ముడు, అంబేడ్కర్, ఛత్రపతి శివాజీ విగ్రహాలను ఉద్దేశపూర్వకంగా అప్రాధాన్య చోట్లో ప్రతిష్టించడం అరాచకం’అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్ర ఓటర్లు బీజేపీని తిరస్కరించారు. అందుకే మహారాష్ట్రతో అనుబంధమున్న ఛత్రపతి శివాజీ, అంబేడ్కర్ల విగ్రహాలను వేరే చోటుకు మార్చేశారు. గుజరాత్లో బీజేపీ ఈసారి క్లీన్‌స్వీప్ చేయలేకపోయింది. అందుకే గుజరాతీలపై ఆగ్రహంతో గాం«దీజీ విగ్రహాన్నీ తరలించారు’ అని మరో నేత పవన్ ఖేడా వ్యాఖ్యానించారు. ‘మహానుభావుల విగ్రహాలు తొలగించి గాడ్సే, మోదీ విగ్రహాలు పెడతారా?’ అని టీఎంసీ ఎంపీ జవహర్ సర్కార్ ప్రశ్నించారు. విమర్శలపై లోక్‌సభ సచివాలయం స్పందించింది. పార్లమెంట్‌కు విచ్చేసే సందర్శకులు చూసేందుకు అనువుగా ‘ప్రేరణ స్థల్’కు విగ్రహాలను తరలించామని పేర్కొంది. ఏ విగ్రహాన్ని పక్కనపడేయలేదని స్పష్టంచేసింది. -
ఎన్నికల బాండ్ల స్కీమ్‌పై సంచలన తీర్పు
రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రాథమిక హక్కుల ఆర్టికల్ 19(1)(ఎ)ను అనుసరించి.. ఈ పథకం సమాచార హక్కును ఉల్లంఘిస్తుందని.. ఇది రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. అలాగే.. నల్లధనాన్ని అరికట్టేందుకు సమాచార హక్కును ఉల్లంఘించడం సమంజసం కాదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ మేరకు ఎలక్టోరల్ బాండ్స్ చెల్లుబాటు కాదంటూ ఏకగ్రీవ తీర్పును రాజ్యాంగ ధర్మాసనం వెల్లడించింది . ‘‘ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధం. ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే. బ్లాక్ మనీ నిర్మూలనకు ఈ స్కీమ్ ఒక్కటే మార్గం కాదు. ఇంకా అనేక మార్గాలు ఉన్నాయి. రాజకీయ పార్టీలకు విరాళాలు అనేది క్విడ్ ప్రోకో కు దారి తీస్తుంది. విరాళాలు ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచడం తగదు. ఇది సమాచార హక్కు ఉల్లంఘన కిందకే వస్తుంది. రహస్య విరాళాలు ప్రాథమిక హక్కుల ఉల్లంఘన. కాబట్టి ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్‌ను రద్దు చేయాల్సిన అవసరం ఉంది’’ అని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు వెల్లడించింది. అదే సమయంలో ఎలక్టోరల్ బాండ్స్‌ను వెంటనే నిలిపివేయాలని.. వాటిని అమ్మకూడదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2019 నుంచి ఇప్పటిదాకా జారీ చేసిన ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను మూడు వారాల్లో(మార్చి 6వ తేదీలోగా) కేంద్ర ఎన్నికల సంఘానికి అందించాలని ఎస్బీఐను సుప్రీం ఆదేశించింది. అలాగే పార్టీలకు వచ్చిన ఫండ్ ఎవరిచ్చారో తెలియ పర్చాల్సిన అవసరం ఉందని.. ఆ వివరాలను బహిర్గత పర్చాల్సిన అవసరమూ ఉందని.. ఎలక్టోరల్ బాండ్స్ ఏ రాజకీయ పార్టీకి ఎంత వచ్చాయన్న వివరాలు మార్చి 13వ తేదీ లోగా తన వెబ్సైట్లో పొందుపర్చాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీం ఆదేశించింది. మరోవైపు.. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో తీసుకున్న విరాళాలను వెనక్కి ఇచ్చేయాల్సిందేనని(ఇంకా ఎన్‌క్యాష్ అవ్వని బాండ్లను) రాజకీయ పార్టీలకు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇందుకోసం 15 రోజుల గడువు విధించింది. తీర్పుపై పిటిషనర్ల లాయర్ స్పందన ఎన్నికల బాండ్స్‌ను సుప్రీం కోర్టు ఆపేసింది పిటిషనర్ల వాదనతో పూర్తిస్థాయిలో కోర్టు ఏకీభవించింది ఇన్కమ్ ట్యాక్స్, కంపెనీల చట్టాల్లో చేసిన సవరణలను కొట్టేసింది సమాచార చట్టం ఉల్లంఘన కింద సుప్రీం కోర్టు పరిగణించింది విరాళాలు ఇచ్చేవారి వివరాలు గోప్యంగా ఉంచడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది పిటిషనర్ల తరఫు వాదించిన సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ పిటిషన్ల నేపథ్యం.. రాజకీయ పార్టీలకు అందే నిధుల్లో పారదర్శకత తీసుకువచ్చే ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2018 జనవరి 2న అమల్లోకి తెచ్చింది. ఈ పథకాన్ని సవాల్ చేస్తూ ఏడీఆర్, కాంగ్రెస్ నాయకురాలు జయా ఠాకుర్, సీపీఎం, మరో పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్నికల బాండ్లను ప్రారంభించడానికి ముందే ఈ పథకంపై సమగ్ర విచారణ అవసరమని అక్టోబరు 10న సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్(ఏడీఆర్ తరఫున) చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. దీంతో కిందటి ఏడాది అక్టోబర్ 31న వాదనలు ప్రారంభమయ్యాయి. ఈ పిటిషన్లపై మూడు రోజులపాటు విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం.. నవంబర్ 2వ తేదీన తీర్పు రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కానిస్టిట్యూషన్ బెంచ్‌లో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ఈ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో.. సీల్డ్ కవర్లో 2023 సెప్టెంబర్ 30 వరకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందిన నిధుల వివరాలు ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది కూడా. ఏంటీ ఎన్నికల బాండ్లు..? ఎన్నికల బాండ్లు ఒక ప్రామిసరీ నోట్ లాంటివి. ఇవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో లభ్యం అవుతాయి. వ్యక్తులు, కంపెనీలు వీటిని కొనుగోలు చేయవచ్చు. అలా కొనుగోలు చేసిన వాటిని నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వొచ్చు. రాజకీయ పార్టీలు తమకు వచ్చిన బాండ్లను నగదుగా మార్చుకొని పార్టీ కార్యక్రమాల కోసం వినియోగించుకుంటాయి. రాజకీయ పార్టీల విరాళాల విషయంలో పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్రంలోని అధికార బీజేపీ ప్రభుత్వం 2018లో ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే, రాజకీయ పార్టీలు తాము స్వీకరించిన విరాళాల గురించి బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చట్టం-2017 సవరణ చేసింది. దాంతో ఎన్నికల బాండ్ల విధానంలో పారదర్శకత లోపించిందని పలువురు విమర్శించారు. ఈ క్రమంలోనే ఈ పథకాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఇదీ చదవండి: విరాళాల సేకరణలో బీజేపీ టాప్.. ఆరేళ్లలో వేల కోట్లు పోగు! పిటిషనర్ల వాదన ఇదే.. కేంద్రం తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకం పారదర్శకత కొరవడంతో పాటు ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేస్తోంది అధికారప్రతిపక్ష పార్టీలకు సమాన అవకాశాలను కల్పించకపోగా అవినీతిని ప్రోత్సహిస్తోంది ఎన్నికల బాండ్ల ద్వారా ఇప్పటి వరకూ సమకూరిన నిధుల్లో అత్యధిక భాగం కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకే వెళ్లాయి విపక్ష పార్టీలకు స్వల్ప మొత్తంలోనే విరాళాలు వచ్చాయి ఈ మేరకు గణాంకాలతో సహా వివరించారు సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ కేంద్రం వాదన.. ప్రపంచంలోని అనేక దేశాలు ఎన్నికల్లో నల్లధనం ప్రభావాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. మన దేశంలో నల్లధనాన్ని అరికట్టడానికి డిజిటల్ చెల్లింపుల విధానం అమలు, 2.38 లక్షల డొల్ల కంపెనీలపై చర్యలు వంటివి కేంద్రం తీసుకుంది. స్వచ్ఛమైన డబ్బే రాజకీయ పార్టీలకు విరాళాలుగా అందేలా చేయడానికి ఎన్నికల బాండ్ల పథకం రూపంలో కేంద్రం మరో ప్రయత్నం చేసింది ఒక దశలో సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ జోక్యం చేసుకుంటూ...‘‘అధికార పార్టీకే అధిక విరాళాలు ఎందుకు వెళ్తున్నాయి. దీనికి కారణమేమిటి’’ అని ప్రశ్నించారు. ఎన్నికల బాండ్ల ద్వారా సమకూరిన మొత్తం నిధులను ఎన్నికల సంఘం వద్ద ఉంచి, దాని ద్వారా అన్ని పార్టీలకు సమానంగా పంపిణీ చేయవచ్చు కదా అని ఆయన సూచించారు. కేంద్రం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బదులిస్తూ....‘అప్పుడు అసలు విరాళాలే రావ’ని అభిప్రాయపడ్డారు. అంతకుముందు ఈ పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. ఎన్నికల బాండ్ల నిధుల మూలాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే హక్కు దేశ పౌరులకు లేదని అందులో పేర్కొన్నారు. ధర్మాసనం కీలక వ్యాఖ్యలు రాజకీయ పార్టీల నిధుల సమీకరణలో పారదర్శకత కోసం తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకం లక్ష్య సాధనలో కొన్ని సమస్యలున్నాయి గోప్యత, విశ్వసనీయత కొందరికే పరిమితమవుతోంది ఎస్బీఐ వద్ద ఉన్న వివరాలను దర్యాప్తు సంస్థల ద్వారా ఏ రాజకీయ పార్టీకి, ఎవరు ఎంత విరాళం ఇచ్చారన్నది అధికారంలో ఉన్న వారు తెలుసుకోగలరు అదే విపక్షంలో ఉన్న వారికి అటువంటి అవకాశం లేదు అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించలేనప్పుడు పథకం నిష్పాక్షికత, పారదర్శకత ప్రశ్నార్థకమవుతుంది ఇదీ చదవండి: 2023 డిసెంబర్ నాటికి రూ.15 వేల కోట్ల ఎలక్టోరల్ బాండ్ల అమ్మకం రాజకీయ అభ్యంతరాలు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం మధ్య ఎలక్టోరల్ బాండ్ల రూపంలో భారతీయ జనతా పార్టీకి రూ.5,127.97 కోట్ల మేర విరాళాలు వచ్చాయి. మిగతా అన్ని జాతీయ పార్టీలకు కలిసి కేవలం రూ.1,783.93 కోట్లు మాత్రమే వచ్చాయి. దీని ప్రకారం ఎలక్టోరల్ బాండ్లతో అధికార పార్టీకి ఎంతమేర ప్రయోజనం కలుగుతుందో అర్థం చేసుకోవచ్చని విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. -
మోదీ ఎఫెక్ట్.. మాల్దీవులకు కోలుకోలేని ఎదురుదెబ్బ!
#Maldives.. మాలె/న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రుల అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వాటిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ, సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. కేంద్రం కూడా వాటిపై తీవ్ర అభ్యంతరం వెలిబుచి్చంది. మంత్రుల వ్యాఖ్యలకు నిరసనగా వేలాది మంది భారత పర్యాటకులు మాల్దీవులకు ప్లాన్ చేసుకున్న హాలిడే ట్రిప్పులను రద్దు చేసుకుంటున్నారు. ఆ దేశ పర్యాటకానికి మన టూరిస్టులే ఆయువుపట్టు. పైగా భారత్‌తో వ్యూహత్మక బంధం మాల్దీవులకు అత్యంత కీలకం. దాంతో ఈ వివాదంపై ఆ దేశం హుటాహుటిన స్పందించింది. భారత ప్రభుత్వ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసినట్లు ఆదివారం ప్రకటించింది. వారి వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగతమని, వాటితో ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టతనిచ్చింది. ‘‘భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రజాస్వామ్యయుతంగా, బాధ్యతాయుతంగా ఉండాలే తప్ప, విద్వేషాన్ని, ప్రతికూల ప్రభావాన్ని కలిగించేలా ఉండొద్దు. అంతర్జాతీయ భాగస్వామ్య దేశాలతో సంబంధాలను దెబ్బతీయొద్దు’’ అని పేర్కొంది. మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసేవారిపై కఠిన చర్యలకు వెనుకాడబోమని స్పష్టం చేసింది. సస్పెండైన మంత్రులు మరియం షియునా, అబ్దుల్లా మజూం మజీద్, మల్షా షరీఫ్ అని తెలుస్తోంది. అసలేమైంది...? ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియో, ఫొటోలు షేర్ చేశారు. అవి ఆన్లైన్లో వైరల్‌గా మారాయి. పలువురు నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు కూడా! దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్‌గా, తోలు»ొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. మంత్రులు మజీద్, మల్షా కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేశారు. పర్యాటకంలో మాల్దీవులతో లక్షద్వీప్ ఏ మాత్రమూ సరితూగదంటూ ఎద్దేవా చేశారు. ‘‘భారత్‌లో హోటల్ గదులు అసహ్యంగా ఉంటాయి. మా దేశంతో లక్షద్వీప్‌కు పోలికేమిటి?’’ అంటూ మాల్దీవుల ఎంపీ జహీద్ రమీజ్ కూడా నోరు పారేసుకున్నారు. ఈ వ్యాఖ్యలపై మాల్దీవుల్లోని భారత హైకమిషన్ కార్యాలయం అధికారులు నిరసన తెలిపారు. దుమారం నేపథ్యంలోవారి వ్యాఖ్యలను ‘ఎక్స్’ నుంచి తొలగించారు. మంత్రుల వ్యాఖ్యలను మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ తీవ్రంగా ఖండించారు. ‘‘భారత్ మనకు కీలక మిత్రదేశం. మాల్దీవుల భద్రత, అభివృద్ధిలో చాలా కీలకం. అలాంటి దేశాధినేతను ఉద్దేశించి నీచమైన భాష వాడటం తగదు’’ అన్నారు. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని కొత్త అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుకు హితవు పలికారు. ఇంతగా నిరసనలు వ్యక్తమవుతున్నా మరియం మాత్రం ఆన్లైన్ వేదికలపై అక్కసు వెళ్లగక్కడం ఆపలేదు. దాతో పలువురు భారత నెటిజన్లు ‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’ అంటూ పిలుపునిస్తున్నారు! సెలబ్రిటీల ఖండన మాల్దీవుల మంత్రుల నోటి దురుసును క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, జాన్ అబ్రహం, శ్రద్ధా కపూర్ తదితరులు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. వారి విద్వేష వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయని అక్షయ్ అన్నారు. ‘‘మాల్దీవులకు ఏటా భారీగా పర్యాటకులను పంపే భారత్‌పై అలా మాట్లాడటం దారుణం. పొరుగువారితో స్నేహంగా మెలగాలనే అనుకుంటాం కానీ ఇలాంటి ద్వేషాన్ని మనమెందుకు సహించాలి? నేనెన్నోసార్లు మాల్దీవుల్లో పర్యటించా. ప్రతిసారీ ఆ దేశాన్ని ప్రశంసించా. కానీ మన ఆత్మగౌరవమే ఫస్ట్. ఇకపై మన దీవుల్లో పర్యటిస్తూ మన పర్యాటకానికి దన్నుగా నిలుద్దాం’’ అని పిలుపునిచ్చారు. లక్షద్వీప్‌లో అందమైన, పరిశుభ్రమైన బీచుల్లో ప్రధాని మోదీని చూడటం ఎంతో బాగుంది. మన దేశంలోనే ఇంత అద్భుతమైన బీచ్లుండటం గర్వకారణం’’ అని సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు. ‘‘అతిథి దేవోభవ సందేశంతో భారత్ ఇచ్చే అద్భుతమైన ఆతిథ్యం, విస్తారమైన మన సముద్ర తీరాలను చూడాలే తప్ప వరి్ణంచలేం. ఇందుకోసం లక్షద్వీప్‌కు వెళ్లాల్సిందే’’ అంటూ జాన్ అబ్రహం బీచ్ ఫొటోలను షేర్ చేశారు. సుందరమైన లక్షద్వీప్ బీచ్‌ల అందాలను చూసేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు నటి శ్రద్ధా కపూర్ తెలిపారు. సచిన్ కూడా ఇటీవలి లక్షద్వీప్ పర్యటన సందర్భంగా అక్కడ తాను క్రికెట్ ఆడిన వీడియో, బీచ్ ఫొటోలను షేర్ చేశారు. -
బహిష్కరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి
న్యూఢిల్లీ: వివిధ టీవీ చానళ్లకు చెందిన కొందరు జర్నలిస్టులు/యాంకర్లు నిర్వహించే కార్యక్రమాలకు, వేదికలకు తమ ప్రతినిధులను పంపించకూడదని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి మీడియా కమిటీ తీసుకున్న నిర్ణయం పట్ల న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్(ఎన్బీడీఏ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి నిర్ణయం ఆందోళనకరమని ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా నడుచుకోవడం సరైంది కాదని పేర్కొంది. గతంలో ఇలాంటి పరిణామం ఎనాడూ సంభవించలేదని గుర్తుచేసింది. ప్రమాదకరమైన ఈ ధోరణిని మానుకోవాలని ఇండియా కూటమికి విజ్ఞప్తి చేసింది. మీడియా స్వేచ్చను గౌరవించాలని కోరింది. కొందరు జర్నలిస్టులను/యాంకర్లను బహిష్కరించడం అనేది దేశాన్ని అత్యవసర పరిస్థితి(ఎమర్జెన్సీ) నాటి రోజుల్లోకి తీసుకెళ్తుందని ఎన్బీడీఏ స్పష్టం చేసింది. మీడియాపై విరుచుకుపడితే స్వతంత్ర భావాల వ్యక్తీకరణను, గొంతుకలను అణచివేసినట్లే అవుతుందని తెలియజేసింది. ఈ బహిష్కరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఇండియా కూటమికి సూచించింది. -
వివేక్ రామస్వామిలో ఈ టాలెంట్ కూడా!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరపున ఆశావహుడు, భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి Vivek Ramaswamy తనలోని టాలెంట్‌ను ప్రదర్శించారు. ఓ ఈవెంట్‌కు హాజరైన ఆయన.. ర్యాప్ కట్టి అల్లాడించారు. అయితే ఈ క్రమంలోనే ఆయన అడ్డు కూడా తగిలింది. భారత మూలాలున్న వివేక్ రామస్వామి Vivek Ramaswamy అమెరికా అధ్యక్ష ఎన్నిక అభ్యర్థుల(రిపబ్లికన్ పార్టీ) ప్రచారంలో దూసుకుపోతున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో రామస్వామి ‘డా వెక్ ది ర్యాపర్’గా గుర్తింపు పొందాడట కూడా. అందుకే ఆ టాలెంట్‌ను ప్రదర్శించారు. లోవా స్టేట్ ఫెయిర్‌కు హాజరై.. ప్రముఖ ర్యాప్ స్టార్ ఎమినెమ్ ‘లాస్ యువర్సెల్ఫ్’ ర్యాప్‌ను తన గొంతుతో కట్టి అక్కడున్నవాళ్లను అలరించారాయన. అయితే.. ఈ పరిణామం జనాలను అలరించినా.. ఎమినెమ్(50)కు నచ్చలేదు. తన మ్యూజిక్‌ను ఎక్కడా వాడొద్దంటూ సున్నితంగానే రామస్వామికి తెలియజేశారు. ఈ మేరకు మ్యూజిక్సంస్థ తరపున ఓ లేఖను రామస్వామికి పంపించినట్లు తెలుస్తోంది. ఇక మీదట ఎన్నికల ప్రచారంలో తన మ్యూజిక్‌ను వాడొద్దని లేఖలో ఎమినెమ్, రామస్వామికి తెలియజేశాడు. ఇదిలా ఉంటే.. అమెరికాలో ఎన్నికల ప్రచారంలో ఇలా తమ మ్యూజిక్ వాడొద్దంటూ కోరడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గత రెండు దఫా ఎన్నికల్లో.. రిహానా, అడెలె మ్యూజిక్‌లను ట్రంప్ తన ర్యాలీలలో అనుమతులు లేకుండానే ఉపయోగించారు. 38 ఏళ్ల వివేక్ రంగస్వామి తనను తాను ‘ట్రంప్ 2.0’గా భావిస్తున్నారు. అయితే.. 2024 అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికన్ పార్టీ తరపున నిలబడేందుకు ట్రంప్‌తోనే పోటీ పడుతున్నారు వివేక్. అంతేకాదు.. తానే గనుక అధ్యక్షుడ్ని అయితే ఎలన్ మస్క్‌ని వ్యక్తిగత సలహాదారుగా నియమించుకుంటానంటూ ఆసక్తికర వ్యాఖ్యలే చేశారు. Rapping Republican: Vivek Ramaswamy's Surprising Eminem Moment Vivek Ramaswamy, a Republican presidential candidate and successful biotech entrepreneur, recently showcased a surprising side at the Iowa State Fair. Amidst his political pursuits, Ramaswamy took the stage to rap… pic.twitter.com/4tkvM0aMk5 — GOP News (@gopnews2024) August 19, 2023 -
అణుజలం.. ఆందోళన స్వరం
జపాన్‌లో 12 ఏళ్ల క్రితం భూకంపం, సునామీ ధాటికి దెబ్బతిన్న ఫుకుషిమా దైచీ అణు విద్యుత్ కేంద్రం నుంచి వ్యర్థ జలాలను çపసిఫిక్ మహా సముద్రంలోకి విడుదల చేయడం ఆందోళన రేపుతోంది. చైనా, దక్షిణ కొరియాతో పాటు స్వదేశంలో కొన్ని సంస్థల అభ్యంతరాలను బేఖాతర్ చేస్తూ జపాన్ ప్రభుత్వం రేడియో ధార్మిక జలాలను విడుదల చేస్తోంది. ఈ నీటి విడుదల ఎంతవరకు సురక్షితం ? జపాన్ వాదనలేంటి ? నిపుణులు ఏమంటున్నారు ? ఫుకుషిమా ప్లాంట్ నుంచి పసిఫిక్ సముద్రంలోకి వ్యర్థ జలాల విడుదల వివాదాస్పదం 2011, మార్చి 11. జపాన్ను తీవ్ర భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 9.0గా నమోదైన ఈ తీవ్ర భూకంపంతో సునామీ ముంచెత్తింది. చెర్నోబిల్ అణు ప్రమాదం తర్వాత అంతటి విధ్వంసం జరిగింది. ఫుకుషిమా అణు విద్యుత్ ప్లాంట్‌లోని మూడు అణు రియాక్టర్లలోని కూలింగ్ వ్యవస్థలు దెబ్బ తిన్నాయి. దీంతో అణు రియాక్టర్లను చల్లార్చడం తప్పనిసరి అయింది. అప్పట్నుంచి భారీగా అణు వ్యర్థ జలాలు పేరుకుపోయాయి. ప్రమాదం జరిగిన పన్నెండేళ్లకు ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) అనుమతితో జపాన్‌లోని టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ (టెప్కో) అణు జలాలను శుద్ధి చేసి పసిఫిక్ మహా సముద్రంలోకి విడుదల చేసే వివాదాస్పద కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అణుజలాలతో సముద్రంలో జీవజాలం ప్రమాదంలో పడుతుందని, పర్యావరణానికి, మానవాళి ఆరోగ్యానికి ముప్పు ఉంటుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నా జపాన్ ఆగడం లేదు. జపాన్ నుంచి దిగుమతయ్యే సముద్ర ఉత్పత్తులపై చైనా నిషేధం విధించింది. జపాన్, దక్షిణ కొరియాలో ఈ జలాల విడుదల ఆపాలంటూ నిరసనలు పెరుగుతున్నాయి. అణు జలాల శుద్ధి ఇలా..! ► రేడియో ధార్మికత కలిగిన వ్యర్థ జలాలను దశల వారీగా శుద్ధి చేస్తారు. అడ్వాన్స్డ్ లిక్విడ్ ప్రాసెసింగ్ సిస్టమ్ (ఎల్పీఎస్) ద్వారా తొలి దశలో శుద్ధి చేస్తారు. ► జలాల్లో ఉన్న 62 రకాల రేడియో ధార్మిక మూలకాలను ఎల్పీఎస్ శుద్ధి చేస్తుంది. కానీ ట్రిటియం మూలకాన్ని మాత్రం అది ఫిల్డర్ చేయలేదు. ► అందుకే నీటిలో ఈ ట్రిటియం మూలకాల సాంద్రతను తగ్గించడానికి నీళ్లను మరింతగా డైల్యూట్ చేసే ప్రక్రియ చేపట్టింది టెప్కో. ట్రిటియం సాంద్రతనుæ జాతీయ భద్రతా ప్రమాణాలు నిర్దేశించిన ప్రమాణాల కంటే 40% తక్కువగా నీటిని డైల్యూట్ చేస్తోంది. జపాన్ ఏమంటోంది ? ప్రపంచంలో ఏ అణు ప్లాంట్ అయినా వ్యర్థ జలాలను సముద్రంలోకి వదిలి పెట్టడం సాధారణంగా జరిగేదేనని ఇప్పుడే ఎందుకు వివాదాస్పదం చేస్తున్నారని జపాన్ ప్రశి్నస్తోంది. సెసియం–137, స్ట్రాంటియం–90 కంటే ట్రిటియం వల్ల ముప్పు తక్కువేనని జపాన్‌లో నిపుణుల అభిప్రాయంగా ఉంది. ‘‘ట్రిటియం మూలకాలున్న నీళ్లని డైల్యూట్ చేసి సముద్రంలోకి విడిచిపెట్టడం వల్ల ప్రజల ఆరోగ్యానికి, పర్యవరణానికి ముప్పేమీ లేదు. అణుబాంబుల్ని పరీక్షించిన తర్వాత విడుదలయ్యే రేడియో ధార్మికత కన్నా శుద్ధి చేసిన అణుజలాల ద్వారా సముద్రంలో కలిసే రేడియో ధార్మికత అతి తక్కువ. ఇది కూడా కాలక్రమంలో క్షీణించిపోతుంది. దీని కోసం ఆందోళనలు అవసరం లేదు’’అని వియన్నా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన రేడియాలజిస్టు జార్జ్ స్టెయిన్‌హాజర్ అభిప్రాయపడ్డారు. పొల్యూషన్‌కి సొల్యూషన్ అంటే డైల్యూషన్ అని ఇంగ్లిషులో అంటారని నీటిని శుద్ధి చేస్తూ పోతే హానికరం కాదని స్పష్టం చేశారు. ఆ జలాలు విషతుల్యమేనా ? ప్రపంచంలో ఇతర దేశాలు సముద్రంలోకి అణు జలాలు విడుదల చేసినా వారు తీసుకున్న జాగ్రత్తలు జపాన్ తీసుకోవడం లేదని పర్యావరణ పరిరక్షణ వ్యవస్థ గ్రీన్‌పీస్ ఆరోపిస్తోంది. ఈ వ్యర్థ జలాల్లో అత్యంత ప్రమాదకరమైన స్ట్రాంటియం–90 సహా మూలకాలున్నాయంటోంది. మరో మార్గం లేదా ? జపాన్ ప్రభుత్వం, టెప్కో అత్యంత వేగంగా, తక్కువ ధరకి అయిపోతుందని సముద్రంలోకి అణుజలాలను పంప్ చేస్తున్నారని పర్యావరణ వేత్తలు ఆరోపిస్తున్నారు. ఈ జలాల నిల్వ కి మరిన్ని ట్యాంకుల్ని ఏర్పాటు చేయాలని, లేదంటే మరిగించి ఆవిరి రూపంలో వదుల్చుకోవాలని సూచిస్తున్నారు. ట్యాంకుల్లో నిల్వ ఉంచడాన్ని జపాన్ వ్యతిరేకించింది. భూకంపాలు అధికంగా వచ్చే ఆ ప్రాంతంలో ట్యాంకుల్లో భద్రపరిస్తే లీకయి భూగర్భంలో కలిస్తే మరింత ప్రమాదకరమని అంటోంది. ఇక నీళ్లను ఆవిరిగా మార్చడం, సముద్రంలోకి విడుదల చేయడం మధ్య పెద్దగా తేడాలేదని వాదిస్తోంది. మొత్తమ్మీద ఈ నీటి విడుదల కార్యక్రమం మున్ముందు ఎలాంటి ఉద్రిక్తతల్ని పెంచుతుందో వేచి చూడాలి. వ్యర్థ జలాలు ఎంత ఉన్నాయి ? ► ఫుకుషిమా–దైచీ అణు విద్యుత్ కేంద్రం ధ్వంసమైనప్పట్నుంచి అణు రియాక్టర్లను నిరంతరం చల్లగా ఉంచడానికి రోజుకి 170 టన్నుల నీటిని వాడాల్సి వస్తోంది. ► 13.4 కోట్ల టన్నుల వ్యర్థ జలాలు ఇప్పటికే పేరుకుపోయాయి. ► 1,046 ట్యాంకుల్లో వ్యర్థజలాలను భద్రపరిచారు. ► ఈ అణు జలాలను శుద్ధి చేసి వాటిలో రేడియో ధార్మికత తగ్గించి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ► విద్యుత్ ప్లాంట్ నుంచి సముద్రంలోకి ఒక కిలోమీటర్ సొరంగం తవ్వి ఆ మార్గం ద్వారా వదులుతున్నారు. ► ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి ఏకంగా 30 ఏళ్లు పడుతుందని ఒక అంచనా ► 2024 మార్చి నాటికి 31వేల టన్నులకు పైగా జలాలను సముద్రంలోకి పంపాలని నిర్వాహక సంస్థ టెప్కో ప్రణాళికలు వేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హయత్ నగర్లో హిజాబ్ వివాదం.. పోలీసులకు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: నగర శివారులోని హయత్ నగర్లో హిజాబ్ వివాదం వెలుగు చూసింది. స్కార్ఫ్‌తో వెళ్లిందని ఓ పదో తరగతి అమ్మాయిని ఇంటికి పంపించేసింది స్కూల్‌యాజమాన్యం. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లడంతో.. కేసు నమోదు చేశారు. ముఖానికి స్కార్ఫ్‌తో వెళ్లిన ఆ టెన్త్ స్టూడెంట్ను.. స్కూల్ యాజమాన్యం లోనికి రానివ్వలేదు. హిజాబ్‌తో లోనికి రానివ్వమంటూ తేల్చేసింది. దీంతో ఆమె తిరిగి ఇంటికి వెళ్లిపోయింది. తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పడంతో వాళ్లకు పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థిని స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు విద్యార్థిని స్థానిక కోర్టు న్యాయమూర్తి కూతురని సమాచారం. ఇదీ చదవండి: కురచ దుస్తులెందుకు?.. తెలంగాణ హోంమంత్రి కామెంట్లపై దుమారం -
అసలు క్లియోపాత్రా ఏ కలర్? నెట్‌ఫ్లిక్స్‌తో ఎందుకీ రచ్చ!
స్ట్రీమింగ్ సర్వీస్ నెట్‌ఫ్లిక్స్‌కి మరో వివాదపు సెగ తగిలింది. నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన డాక్యుమెంటరీ సిరీస్ ‘ఆఫ్రికన్ క్వీన్స్: క్వీన్ క్లియోపాత్ర’ ట్రైలర్ ద్వారానే రచ్చ రేపింది. చరిత్రలో ఉన్న బ్లాక్ క్వీన్స్‌ను హైలెట్ చేస్తూ నిర్మించిన ఈ సిరీస్‌లో క్లియోపాత్ర మీద తీసిన పోర్షన్ ట్రైలర్‌పై ఈజిప్ట్ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు కారణం.. క్లియోపాత్రా పాత్ర కోసం ఓ బ్లాక్ ఆర్టిస్ట్‌ను ఎంచుకోవడం!. క్వీన్ క్లియో పాత్రా దేహం నలుపు రంగు కాదని.. ఆమె ఛామన ఛాయ రంగులో ఉండేదని ప్రముఖ ఆర్కియాలజిస్ట్ జాహి హవాస్ నెట్‌ఫ్లిక్స్ క్వీన్ క్లియోపాత్రాపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమెది యూరోపియన్ మూలాలని చెప్తున్నారాయన. క్లియోపాత్రా గ్రీకుకు చెందిన వ్యక్తి. మాసిడోనియా రాజులు, రాణులతో ఆమెకు దగ్గరి పోలికలు ఉన్నాయి అని పేర్కొన్నారు. మరోవైపు క్లియోపాత్ర రంగును నలుపుగా చూపించడం ద్వారా.. ఆమె ఈజిప్ట్ గుర్తింపును తుడిచేసే ప్రయత్నం జరుగుతోందంటూ మహమొద్ అల్ సెమారీ అనే లాయర్ ఈజిప్ట్ అటార్నీ జనరల్‌కు ఓ విజ్ఞప్తి సమర్పించాడు. ఈజిప్ట్‌లో నెట్‌ఫ్లిక్స్‌ను బ్లాక్ చేయడం ద్వారా ఆ వివాదాస్పద సిరీస్ ప్రసారం కాకుండా చూడాలంటూ కోరారాయన. అయితే.. ఇది అనవసర వివాదమంటోంది ఈ సిరీస్ నిర్మాణంలో భాగం పంచుకున్న జడా పింకెట్ స్మిత్(విల్‌స్మిత్ భార్య). ఇది కేవలం బ్లాక్ క్వీన్స్ గురించి, వాళ్ల గొప్పదనం గురించి చెప్పడమేగానీ ఇతర ఉద్దేశం లేదని ఆమె ఆంటోంది. అయినప్పటికీ.. ఈజిప్ట్ మాత్రం నెట్‌ఫ్లిక్స్‌పై ఆగ్రహంతో ఊగిపోతోంది. బ్యాన్ నెట్‌ఫ్లిక్స్ ట్రెండ్‌ను నడిపిస్తోంది అక్కడి సోషల్ మీడియా. హిస్టరీ ఐకాన్.. క్లియోపాత్రా గ్రేట్ ఫిగర్స్ ఆఫ్ హిస్టరీలో ఒకరిగా పేరుంది క్లియోపాత్రాVII ఫిలోపేటర్కి. ముందున్న ఆరుగురు క్లియోపాత్రాల్లో ఎవరికీ లేని ప్రత్యేకతలున్నాయి కాబట్టే ఈమె గురించి ఇంత చర్చ. రాజకీయ వ్యూహాలు రచించడంలో క్లియోపాత్రాVII సిద్ధహస్తురాలని, కొన్ని సార్లు ఆమె ఎత్తులకు చక్రవర్తులే చిత్తయిపోయేవారని చరిత్ర చెబుతుంది. అంతేకాదు.. గొప్ప అందగత్తె అయినప్పటికీ శారీరక సుఖం కోసం ఆమె ఎంతదాకా అయినా వెళ్తుందనే ప్రచారమూ ఒకటి ఉంది. 👉 క్రీస్తు పూర్వం 48లో ఆమె ఈజిప్ట్‌ను మహారాణిగా పాలించారు. ఆమె ఈజిప్టులోని అలెగ్జాండ్రియలో క్రీస్తు పూర్వం 69లో జన్మించారు. టాలమీ వంశస్థురాలైన క్లియోపాత్రా.. పాలనలోనే కాదు పలు రంగాల్లోనూ నేర్పరి. బహుభాషా కోవిదురాలు. గొప్ప రచయిత. కాస్మోటిక్స్, హెయిర్ కేర్ మీద ఆమె ఓ పుస్తకం కూడా రాశారట. 👉 క్లియోపాత్రా అధికారం కోసం.. సోదరి బైరినైస్, తండ్రి 12వ టాలెమీ మరణాంతరం రాజైన సోదరుడు 13వ టాలెమీ (ఆచారం ప్రకారం.. ఇతన్నే వివాహం చేసుకుని ఈజిప్ట్‌కు రాణి అయ్యింది) పథకం ప్రకారం అడ్డు తొలగించుకుంది. ఆపై ఇరవై ఏళ్లపాటు ఈజిప్ట్‌ను పాలించింది క్లియోపాత్రా. 👉 రోమ్ చక్రవర్తి జూలియస్ సీజర్, అతని కుడిభుజం మార్కస్ ఆంటోనియస్లతో క్లియోపాత్రా రొమాంటిక్ రిలేషన్షిప్ నడిపింది. 👉 క్లియోపాత్రాతో జూలియస్ సీజర్ బంధాన్ని రోమన్ సైన్యాధికారులు తట్టుకోలేకపోయారు. తిరుగుబాటు చేశారు. ఆ పరిణామంతో మనస్తానం చెంది.. కత్తితో పొడుచుకుని క్లియోపాత్రా ఒడిలోనే చనిపోయాడని ఓ కథనం, శత్రువుల చేతిలోనే మరణించాడని మరో కథనం ప్రచారంలో ఉంది. 👉 క్లియోపాత్రా ఒకానొక సమయంలో నిరాదరణకు గురవడంతో తీవ్ర మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. పాముతో తన వక్షోజాలకు కాటు వేయించుకుని మరీ ప్రాణం విడిచింది. ఆమెతోపాటు ఆమె చెలికత్తెలు కూడా అదే విధంగా చనిపోయారు. అయితే.. ఇది ఒక వర్షన్. ఆమెకు ఎవరో విషం ఇచ్చి చంపారు. ఇది రెండో వర్షన్. దీంతో.. క్లియోపాత్రా మరణం చరిత్రలో మిస్టరీగానే మిగిలిపోయింది. 👉 టాలోమీ రాజవంశం.. మొదటి శతాబ్దం BCలో రోమన్ ఆక్రమణతో ముగిసింది. 👉 క్లియోపాత్రాకు మొత్తం 4 మంది సంతానమని ఈజిప్ట్ చరిత్ర పుస్తకాలు చెబుతుంటాయి. కానీ వారిలో ఒక్కరు మాత్రమే బతికారట. ఆమె క్లియోపాత్రా సెలిన్. 👉 క్లియోపాత్రా నల్లజాతి మూలాలున్న వ్యక్తేనని ఆఫ్రోసెంటిస్ట్ స్కాలర్స్ ప్రతిపాదించారు. కానీ, చాలామంది మేధావులు మాత్రం ఆమె అందగత్తె కాబట్టే చక్రవర్తులు వెర్రెత్తిపోయారని చెబుతూ ఆ వాదనను కొట్టేశారు. కొసమెరుపు.. క్లియోపాత్రాను ఆఫ్రికన్ సంతతి వ్యక్తిగా చూపించిన ఈ డాక్యుమెంటరీలో బ్రిటిష్ నటి అడెలె జేమ్స్ లీడ్రోల్లో నటించింది. :::సాక్షి వెబ్ ప్రత్యేకం -
సమాజానికి తప్పుడు సంకేతాలు పంపినట్లే!.. సుప్రీంలో యోగి సర్కార్
ఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ లఖీంపుర్ ఖేరీ హింసకు కారకుడు, కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా తనయుడు అశిష్ మిశ్రాకు బెయిల్‌ను వ్యతిరేకిస్తూ వస్తోంది ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం. అలహాబాద్ హైకోర్టు ఇదివరకే అశిష్ బెయిల్‌ను తిరస్కరించగా.. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించాడతను. అయితే.. గురువారం ఈ పిటిషన్లపై వాదన సందర్భంగా యోగి సర్కార్ తీవ్ర అభ్యంతరాలే బెంచ్ ముందు ఉంచింది. ఇది ఘోరమైన, క్రూరమైన నేరం. ఇలాంటి నేరానికి బెయిల్ ఇవ్వడం అంటే.. సమాజానికి తప్పుడు సంకేతాలు పంపినట్లే అని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్(అదనపు) గరిమా ప్రసాద్.. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరిలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ముందు వాదించారు. అంతకు ముందు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గల కారణాలేంటనే అభ్యంతరాలను వెల్లడించించాలని యూపీ సర్కార్‌ను కోరింది బెంచ్. ‘‘అతను ఈ కేసులో ఉన్నాడని మేం భావిస్తున్నాం. కానీ, ఇంత పెద్ద కేసులో ఆధారాలను నాశనం చేయాలని అతను ప్రయత్నిస్తున్నాడా?’’ అని బెంచ్.. యూపీ సర్కార్‌కు ప్రశ్నించింది. ఇప్పటిదాకా అలాంటిదేం జరగలేదని గరిమా ప్రసాద్ తెలపగా, ఆవెంటనే బాధిత కుటుంబాల తరపున వాదిస్తున్న సీనియర్ అడ్వొకేట్ దుష్యంత్ దవే బెంచ్ ముందు తీవ్ర ఆరోపణలే చేశారు. ఇది కుట్రతో ఒక ప్రణాళిక ప్రకారంగా చేసిన హత్య. ఛార్జ్‌షీట్ పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. అంతేకాదు.. సంఘంలో అధికారం ఉన్న ఓ వ్యక్తి కొడుకు. అంతే శక్తివంతమైన లాయర్లను ఈ కేసు కోసం నియమించుకున్నారంటూ దవే వ్యాఖ్యానించారు. నిందితుడికి బెయిల్ ఇవ్వడం ఒక భయంకర సందేశాన్ని పంపినట్లు అవుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారాయన. ఈ తరుణంలో.. మిశ్రా తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహత్గి.. దవే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ‘‘ఎవరు శక్తివంతమైన వాళ్లు? ఏం మాట్లాడుతున్నారు? ప్రతీ రోజూ మేం కోర్టులో వాదనలు వినిపిస్తున్నాం. బెయిల్ నిరాకరించడానికి ఇదొక కారణమేనా? అని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే తన క్లయింట్ ఏడాది కంటే ఎక్కువ కాలం కస్టడీలో ఉన్నారని, విచారణ ఇలాగే కొనసాగితే ఏడు నుంచి ఎనిమిదేళ్లు పట్టవచ్చని బెంచ్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంలో ప్రధాన ఫిర్యాదుదారు అయిన జగ్జీత్ సింగ్ ప్రత్యక్ష సాక్షి ఏమాత్రం కాదని, కేవలం ఎవరో చెప్పింది విని ఫిర్యాదు చేశాడని ముకుల్ రోహత్గి కోర్టుకు అభ్యంతరాలను వెల్లడించారు. ఎలాంటి నేర చరిత్ర లేని తన క్లయింట్‌కు బెయిల్ మంజూరు చేయాలని ఆయన సుప్రీం కోర్టు ధర్మాసనాన్ని కోరారు. అక్టోబర్ 3వ తేదీ 2021లో.. టికునియా లఖింపూర్ ఖేరీ వద్ద అప్పటి డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలో హింస చెలరేగి ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. అశిష్ మిశ్రా ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని ఓ ఎస్యూవీ.. నలుగురు రైతుల మీద నుంచి వెళ్లిందని, ఈ ఘటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు మరో వాహనం డ్రైవర్‌తో పాటు ఇద్దరు బీజేపీ కార్యకర్తలను దాడి చేసి చంపారని పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఈ హింసలో ఓ జర్నలిస్ట్ కూడా మృత్యువాత పడ్డాడు. అశిశ్ మిశ్రాతో సహా 13 మందిని నిందితులుగా చేర్చారు యూపీ పోలీసులు. ఇంతకు ముందు అశిష్‌కు బెయిల్ దక్కినట్లే దక్కి.. మళ్లీ రద్దు అయ్యింది. గతేడాది డిసెంబర్ 12వ తేదీన సుప్రీంలో దాఖలైన బెయిల్ పిటిషన్‌పై యూపీ సర్కార్ అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. నిరసనలకారుల హింసకు సంబంధించిన అఫిడవిట్‌ను తమ ముందు ఉంచాలని యూపీ సర్కార్‌ను సుప్రీం బెంచ్ ఆదేశించింది. గురువారం జరిగిన వాదనల అనంతరం.. బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌లో ఉంచుతున్నట్లు ప్రకటించింది సుప్రీం బెంచ్. -
ఏపీపీఎస్సీ కొత్త నిబంధన.. ఆ అభ్యంతరాలకు రూ.100 చెల్లించాలి
సాక్షి, అమరావతి: వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షల్లో ఇచ్చే ప్రశ్నలు, వాటి జవాబులపై అభ్యర్థులు లేవనెత్తే అభ్యంతరాలకు ఒక్కో దానికి రూ.100 చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త నిబంధన విధించింది. ఇటీవల విడుదల చేసిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు అన్నింటికీ ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. కమిషన్ నిర్వహించే వివిధ పరీక్షల్లో కీలపై వస్తున్న వేలాది అభ్యంతరాల్లో తప్పుడువే అత్యధికంగా ఉంటున్నాయి. ‘కమిషన్ నిర్వహించిన రిక్రూట్మెంట్ పరీక్ష (స్క్రీనింగ్ టెస్టు)ల్లో ఆబ్జెక్టివ్ టైప్ పేపర్లోని ప్రశ్నలు, వాటి సమాధానాల కీలకు వ్యతిరేకంగా అభ్యర్థులు తప్పుడు, అసంబద్ధమైన అభ్యంతరాలను వేలాదిగా దాఖలు చేస్తున్నారు. వీటిని పరిశీలించి పరిష్కరించే క్రమంలో ఫలితాల ప్రకటన సహా ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో విపరీత జాప్యం జరుగుతోంది. చదవండి: (ఇతర దేశాల వ్యాక్సిన్లతో పోలిస్తే మన టీకాల సత్తా ఎంత?) అందువల్ల కమిషన్ నిర్వహించే అన్ని పరీక్షలకు వర్తించేలా ఒక నిబంధన చేర్చాలని కమిషన్ నిర్ణయించింది. దీని ప్రకారం ప్రశ్న పత్రం, జవాబు కీ, ఇతర విషయాలకు సంబంధించిన వివాదాల పరిష్కారం కింద ఈ నిబంధన పెట్టాలని కమిషన్ నిర్ణయించింది. ఇకపై అభ్యర్థి ప్రశ్న, జవాబు కీకి వ్యతిరేకంగా లేవనెత్తే ప్రతి అభ్యంతరానికి రూ.100 చొప్పున నిర్ణీత గడువులోగా చెల్లించాలి. తుది పరిశీలనలో ఈ అభ్యంతరాల్లో నిజమైన వాటిని దాఖలు చేసిన అభ్యర్ధులకు ఆ మొత్తాన్ని తిరిగి కమిషన్ చెల్లిస్తుంది.’ అని కమిషన్ కార్యదర్శి హెచ్.అరుణ్‌కుమార్ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొత్త నిబంధనను అదనంగా జోడించిన నోటిఫికేషన్ల నంబర్లు: 08/2021, 16/2022, 09/2021, 17/2022, 10/2021, 18/2022, 14/2021, 14/2022, 15/2021, 15/2022, 23/2021, 24/2021, 6/2022, 11/2022, 12/2022, 19/2022, 20/2022, 21/2022, 25/2022, 28/2022 -
Hyderabad Regional Ring Road: ఇంటర్ ఛేంజర్లతో ఇక్కట్లు!
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్)కు సంబంధించిన ఇంటర్ ఛేంజర్ల (జంక్షన్లు) నిర్మాణం ఆయా ప్రాంతాల ప్రజలను కలవరానికి గురిచేస్తుంటే.. ఇంటర్ ఛేంజర్లపై ప్రజల అభ్యంతరాలు అధికారులకు కొత్త తలనొప్పి తెచ్చి పెడుతున్నాయి. చుట్టూ ఇంటర్ ఛేంజర్ నిర్మాణం..మధ్యలో కొన్ని మిల్లులు, దుకాణాలు, పెట్రోలు పంపులు.. వంటి వాణిజ్యపరమైన ప్రైవేటు నిర్మాణాలు, ఇళ్లు సైతం ఉండటం సమస్యగా మారింది. ఆర్ఆర్ఆర్ నిర్మాణంలో భాగంగా ఉపాధి కోసం ఏర్పాటు చేసుకున్న నిర్మాణాలు తొలగించాల్సి రావటం ఇప్పుడు చాలా కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తోంది. భూసేకరణ ప్రక్రియ షురూ.. హైదరాబాద్ ట్రాఫిక్ చిక్కులను కొంతమేర తగ్గించే క్రమంలో ప్రతిపాదించిన రీజినల్ రింగురోడ్డు భూసేకరణ ప్రక్రియ మొదలైంది. ఉత్తర భాగానికి సంబంధించిన 162 కి.మీ. రోడ్డుకు గాను భూసేకరణకు మార్గం సుగమం చేస్తూ 3ఏ గెజిట్ నోటిఫికేషన్లు అన్నీ విడుదలయ్యాయి. అభ్యంతరాల గడువు కూడా పూర్తి కావటంతో ఇక భూమిని సేకరించే పని మొదలైంది. దీనికి సంబంధించి సర్వే కూడా ఇటీవలే పూర్తి చేశారు. రోడ్డు అలైన్మెంట్ విషయంలో రాయిగిరి, సంగారెడ్డిలాంటి ప్రాంతాల్లో అభ్యంతరాలు వ్యక్తం కాగా, ఆయా ప్రాంతాల్లో 30 కి.మీ.కు సంబంధించిన సర్వేను అధికారులు పెండింగులో పెట్టారు. ఆయా ప్రాంతాల్లో భూ యజమానులను ఒప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కుదరని పక్షంలో చివరి అస్త్రంగా పోలీసు రక్షణ మధ్య భూమిపై హద్దులు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. ఇంటర్ ఛేంజర్లపై తీవ్ర అభ్యంతరాలు జాతీయ, రాష్ట్ర రహదారులను రీజినల్ రింగురోడ్డు దాటే ప్రాంతాల్లో నిర్మించాల్సిన ఇంటర్ ఛేంజర్లపై మాత్రం తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వీటికి సంబంధించి వందల్లో వినతులు ఢిల్లీలోని ఎన్హెచ్ఏఐ అధికారులకు చేరాయి. వాటిని ప్రాథమికంగా పరిశీలించిన అధికారులు రెండు ఇంటర్ ఛేంజర్ల విషయంలో మాత్రం ప్రైవేటు నిర్మాణాలను వాటి యజమానులు వినియోగించుకునేలా అవకాశం కల్పించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. మిగతా వాటి విషయంలో మాత్రం కచ్చితంగా ఆయా నిర్మాణాలను తొలగించాల్సిందేనన్న అభిప్రాయానికి వచ్చారు. అయితే తుది నిర్ణయం మాత్రం తీసుకోలేదు. డబుల్ ట్రంపెట్ ఇంటర్ ఛేంజర్స్ వద్ద వెసులుబాటు? రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగంలో 11 ప్రాంతాల్లో ఇంటర్ ఛేంజర్లు నిర్మించాల్సి ఉంది. హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై రాయగిరి వద్ద డబుల్ ట్రంపెట్ (గుండ్రంగా ఉండే రెండు నిర్మాణాలు) నమూనాలో ఇంటర్ ఛేంజర్ నిర్మించాల్సి ఉండగా..ఆ భూమి పరిధిలో రైస్ మిల్లులున్నాయి. ఇక జోగిపేట రోడ్డులో మరో డబుల్ ట్రంపెట్ నిర్మాణం రానుంది. ఇక్కడ పెట్రోలు బంకు వస్తోంది. అయితే ఈ రెండూ డబుల్ ట్రంపెట్ నిర్మాణాలైనందున, స్ట్రక్చర్ లూప్‌లో ఒకవైపు మాత్రమే రోడ్డు ఉండి, మిగతా మూడు వైపులా ఖాళీగా ఉంటుంది. ఆ లూప్ ఎలివేటెడ్ స్ట్రక్చర్ (వంతెన లాంటి నిర్మాణం) కావటంతో కింది నుంచి మిల్లులు, పెట్రోల్ బంకు వంటి ప్రైవేటు నిర్మాణాలకు దారి ఏర్పాటు చేసుకునే వీలుంటుంది. తీవ్ర అభ్యంతరాల నేపథ్యంలో ఈ రెండుచోట్లా ప్రైవేటు నిర్మాణాలను వాటి యజమానులు ఎలాంటి ఇబ్బందీ లేకుండా వాడుకునేలా వెసులుబాటు కల్పించే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. మిగతా చోట్ల డబుల్ ట్రంపెట్ నమూనాలు లేనందున, మధ్యలో ఉండే ప్రైవేటు నిర్మాణాలకు దారి ఏర్పాటుకు అవకాశం ఉండదు. యజమానుల్లో ఆందోళన డబుల్ ట్రంపెట్లు కాని 9 ప్రాంతాల్లో రెండు చోట్ల పెట్రోలు బంకులు, దుకాణాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వాటికి అప్రోచ్ రోడ్డు ఏర్పాటుకు సాధ్యం కాదని అధికారులంటున్నారు. దాంతో వాటి యజమానుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఊళ్లకు కొంచెం దూరంగా అలైన్మెంట్ మార్చి ఖాళీ ప్రాంతాల్లో జంక్షన్లు వచ్చేలా చూడాలని కోరుతున్నారు. అయితే రోడ్డు అలైన్మెంట్ ఖరారైనందున జంక్షన్లను మార్చటం సాధ్యం కాదని, ఒకవేళ మార్చాలంటే మరో 10 కి.మీ. దూరం నుంచి ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, అప్పుడు రోడ్డు నిర్మాణానికి మరింత భూసేకరణ చేయాల్సిన పరిస్థితి వస్తుందని అధికారులు చెబుతున్నారు. దీనిపై తుది నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. (క్లిక్ చేయండి: ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం భూసేకరణ సర్వే పూర్తి.. ఆ రెండు చోట్ల మాత్రం!) -
నన్నే పెళ్లాడతా.. యువతికి షాక్!
తనను తానే పెళ్లాడి.. ఎంచక్కా సోలో హనీమూన్ ప్లాన్ చేసుకున్న గుజరాత్ యువతికి షాక్ తగిలింది. ఆమె వివాహాన్ని అడ్డుకుని తీరతామని బీజేపీ ప్రకటించింది. వడోదరా మాజీ డిప్యూటీ మేయర్ సునీతా శుక్లా ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. వడోదరాకు చెందిన 24 ఏళ్ల క్షమా బిందు తనను తాను పెళ్లి చేసుకుంటానని(మోలోగమీ) ప్రకటించుకుంది. సాధారణ పెళ్లి లాగే అంతా పద్ధతి ప్రకారం వివాహం కోసం ఏర్పాట్లు చేసుకుంటోంది. అన్ని ఆర్భాటాలతో (ఒక్క వరుడు, బరాత్) తప్పా అన్నీ సంప్రదాయబద్దంగా జరుపుకోవాలనుకుంది. అయితే.. క్షమా ప్రకటన మీడియా, సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారి తీసింది. దేశంలో ఇదే తొలి సోలోగమీ వివాహమంటూ చర్చ కూడా నడుస్తోంది. చాలామంది వ్యతిరేకిస్తుంటే.. కొందరు ఆమెకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్షమా ప్రకటనను సునీతా శుక్లా తీవ్రంగా ఖండించారు. క్షమా వివాహాన్ని అడ్డుకుని తీరతామని ప్రకటించారామె. ‘‘ఈ తరహా వివాహాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. ఆమె ఏ గుడిలో వివాహం చేసుకోవడానికి మేం అనుమతించం. ఇలాంటి వివాహాలు హిందూ మతానికి, భారత సంప్రదాయానికి విరుద్ధం. ఇలాంటి వాళ్ల చేష్టలతో హిందువుల జనాభా తగ్గే ప్రమాదం ఉంది. మతానికి విరుద్ధంగా ఏదైనా జరిగితే.. ఏ చట్టమూ ఒప్పుకోదు’’ అని పేర్కొన్నారామె. Gujarat | I'm against the choice of venue, she'll not be allowed to marry herself in any temple. Such marriages are against Hinduism. This will reduce the population of Hindus. If anything goes against religion then no law will prevail: BJP leader Sunita Shukla (03.06) https://t.co/Jf0y13WOiE pic.twitter.com/3Cus9JMwsR — ANI (@ANI) June 4, 2022 ఇదిలా ఉంటే.. హరిహరేశ్వర్ ఆలయంలో తనను తాను వివాహం చేసుకునేందుకు జూన్ 11న ముహూర్తం ఖరారు చేసుకుంది క్షమా బిందు. తాజా ప్రకటన నేపథ్యంలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. చదవండి: దేశంలోనే తొలిసారి.. తనను తాను పెళ్లాడనున్న యువతి.. -
కర్ణాటకలో మరొకటి.. ఆలయాల వద్ద అమ్మకాలపై బ్యాన్!
కర్ణాటకలో మరో డిమాండ్ తెర మీదకు వచ్చింది. ఆలయాల దగ్గర, జాతరల్లో పండ్లు, పూలు,ఇతర వస్తువులు అమ్ముకునేందుకు ముస్లింలను అనుమతించొద్దంటూ డిమాండ్ ఊపందుకుంది. ఈ మేరకు పోస్టర్లు వెలుస్తుండడంతో.. పూర్తి నివేదిక తెప్పించుకుని చర్యలు తీసుకుంటామని కర్ణాటక ప్రభుత్వం హామీ ఇచ్చింది. కర్ణాటక ఉడుపిలోని హోసా మార్గుడి Hosa Margudi ఆలయం జాతరలో ప్రతీ ఏడాది వందకు పైగా ముస్లిం వర్తకులు స్టాల్స్ నిర్వహిస్తుంటారు. అయితే.. ఈ దఫా వాళ్లకు అనుమతి నిరాకరించారు నిర్వాహకులు. కారణం.. ఆలయాల దగ్గర, ఉత్సవాల్లో వ్యాపారం నిర్వహించుకునేందుకు ముస్లింలను అనుమతించకూడదంటూ పోస్టర్లు వెలిశాయి. దీంతో వాళ్లకు ఈసారి స్టాల్స్ పెట్టుకునేందుకు అనుమతి దొరకలేదు. ఒత్తిడి వల్లే ఉడిపిలోని వీధి వ్యాపారుల సంఘం ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఆరిఫ్ ఈ వ్యవహారంపై స్పందించాడు. ‘‘మేము వెళ్లి ఆలయ కమిటీ సభ్యులను కలిశాం. అయితే వాళ్లు హిందువుల కోసం మాత్రమే స్లాట్లను వేలం వేస్తామని చెప్పారు. వాళ్లపై కచ్చితంగా ఒత్తిడి ఉండే ఉంటుంది. అందుకే మేము చేసేది లేక వెనుదిరిగాం’’ అని ఆరిఫ్ పేర్కొన్నాడు. హిందూ సంఘాల డిమాండ్ మేరకే మేం నిషేధం విధించాం అని హోసా మార్గుడి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రశాంత్ శెట్టి స్పష్టం చేశారు. ఎండోమెంట్ చట్టాల ప్రకారం.. హిందుయేతరులకు అనుమతులు లేవని, కానీ, రెండు మతాల వాళ్లు ఈ జాతరలో పాల్గొంటుడడంతో అనుమతిస్తూ వస్తున్నామని ఆయన తెలిపారు. అయితే ఈసారి హిందూ సంఘాల నుంచి ఒత్తిళ్లు వచ్చాయని, విషయం పెద్దది కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని నిర్వాహకులు చెప్తున్నారు. హిజాబ్ తీర్పు ఎఫెక్ట్! హిజాబ్ తీర్పు తర్వాత.. ముస్లిం విద్యార్థినులకు మద్దతుగా బంద్‌కు పిలుపు ఇచ్చారు ముస్లిం వర్తకులు. ఈ నేపథ్యంలోనే హిందూ సంఘాలు వాళ్లను నిషేధించాలని పట్టుబట్టినట్లు ఆరిఫ్ ఆరోపిస్తున్నారు. మరోవైపు తోటి వ్యాపారులపై నిషేధం విధించడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షం ధ్వజమెత్తడంతో.. చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. వీధుల్లోనూ అభ్యంతరాలు దేవాలయాల జాతరల్లోనే కాకుండా వీధుల్లో కూడా అమ్ముకునేందుకు ముస్లింలను అనుమతించడం లేదంటూ కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష ఉపనేత, కాంగ్రెస్ నేత యుటి ఖాదర్ ఆరోపించారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు కూడా. అయితే న్యాయశాఖ మంత్రి మధుస్వామి మాత్రం నిషేధాన్ని తమ ప్రభుత్వం ప్రోత్సహించడం లేదని స్పష్టం చేశారు. ‘‘ప్రభుత్వం నిషేధం లాంటి వాటిని ప్రోత్సహించడం లేదు. ఆలయ పరిసరాల్లో అలాంటి బ్యానర్లు వెలిసినా.. చర్యలు తీసుకుంటాం’’ అని మధుస్వామి స్పష్టం చేశారు. మరోవైపు ఈ వ్యవహారంలో సమన్యాయం చేస్తామని, శాంతి భద్రతలు దెబ్బ తినకుండా పటిష్ట చర్యలు చేపడతామని హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర హామీ ఇస్తున్నారు. మరోవైపు కర్ణాటకలో చాలా ఆలయాల దగ్గర ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. శివమొగ్గలో ఐదు రోజుల కోటే మారికాంబ జాతర ఉత్సవాల్లోనూ ముస్లిం నిర్వాహకులకు.. నిరసనలతో ఇబ్బందులు ఎదురైనట్లు తెలుస్తోంది. -
5G Issue: 5జీతో నిజంగానే విమానాలకు ఇబ్బందా?
5జీ.. ఫిఫ్త్ జనరేషన్ మొబైల్ ఫోన్ టెక్నాలజీ. 4జీ ఎల్‌టీఈకు నెక్స్ట్ వెర్షన్. వేగవంతమైన ఇంటర్నెట్ అందించే సెల్యూలార్ టెక్నాలజీ. హైపర్ఫార్మెన్స్, ఎక్కువ నెట్వర్క్ సామర్థ్యం, ఇంటర్నెట్ డేటా వేగం, ఎక్కువ మంది యూజర్లు పొందే అనుభవం-సేవలు ఒక్కరికే అందించడం, కొత్త పరిశ్రమలకు అనుసంధానం చేయడం లాంటి వెసులుబాట్లు 5జీతో కలగనున్నాయి . త్వరలో భారత్‌లోనూ 5జీ సేవలు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో.. అమెరికాలో 5జీ సేవలపై అభ్యంతరం-విమాన సర్వీసులు నిలిపివేస్తామనే బెదిరింపుల నడుమ ఆసక్తికర చర్చ నడుస్తోంది. ‘5జీ నెట్వర్క్ సేవలతో విమానాలకు విపత్తు పొంచి ఉంది’. అమెరికన్ ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్‌లైన్స్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్, సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్‌ల బాసుల నుంచి వెల్లువెత్తుతున్న అభ్యంతరం. ఈ మేరకు ప్రముఖ యూఎస్ టెలికాం కంపెనీలు వెరిజోన్, ఏటీ&టీ కంపెనీలు చాలాకాలం నుంచి 5జీ సేవలను మొదలుపెట్టాలనే ప్రయత్నాల్లో ఉండగా.. ఆ ప్రయత్నాలకు అడ్డుపడుతూ వస్తున్నాయి ఎయిర్‌లైన్స్ కంపెనీలు. ఈ క్రమంలోనే విమాన సర్వీసులకు విఘాతం ఏర్పడుతోంది. అభ్యంతరాలు ఇవే.. సాధారణంగా విమానాలు ఎక్కిన ప్రయాణికులను.. ప్రత్యేకించి టేకాఫ్ అయ్యే లేదంటే ల్యాండ్ అయ్యే సమయంలో ఫోన్ స్విచ్ఛాప్ చేయమని కోరతారు సిబ్బంది. అందుకు కారణం.. రేడియో ఫ్రీక్వెన్సీ సమస్యలు ఎదురు కావొచ్చని!. అయితే టెక్నాలజీ అప్డేట్ అవుతున్నా కొద్దీ ఈ తరహా రిక్వెస్టులు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. కానీ, అమెరికా ఎయిర్‌లైన్స్ వినిపిస్తున్న వాదన ఏంటంటే.. 5జీ ఏర్పాట్ల వల్ల ఎయిర్‌క్రాఫ్ట్ భద్రత వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని. యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ప్రస్తావించిన అభ్యంతరాలు ఏంటంటే.. 5జీ టెలిఫోన్ నెటవర్క్స్- విమానాల్లో ఉపయోగించే రేడియో అల్టిమీటర్స్లో జోక్యం చేసుకుంటాయట. తద్వారా వాతావరణం సరిగా లేనప్పుడు విమానాల అత్యవసర ల్యాండింగ్, లోఅల్టిట్యూడ్లో హెలికాఫ్టర్లు ఎగరడం లాంటి అంశాలపై ప్రభావం పడుతుందని, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతోంది. అంతేకాదు కొన్ని సందర్భాల్లో ఆటో పైలెట్ వ్యవస్థను సైతం ప్రభావితం చేయొచ్చని అంటున్నాయి యూఎస్ ఎయిర్‌లైన్ సంస్థలు. ఈ మేరకు 2009లో టర్కీష్ ఎయిర్‌లైన్స్ ప్రమాదంలో సాంకేతిక వ్యవస్థ విఫలం కావడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపెడుతున్నారు.(ఆ ప్రమాదంలో 9 మంది చనిపోగా.. 120 మందికి గాయపడ్డారు). అమెరికాకే నొప్పా? 5జీ సేవలు ప్రపంచంలో ఇప్పటిదాకా 40 దేశాల్లో కొనసాగుతున్నాయి. అయితే అగ్రరాజ్యంలోనే ఇంత చర్చా జరగడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కానీ, మిగతా దేశాల్లోనూ ఇలాంటి సమస్యలు, అభ్యంతరాలు వచ్చాయి. 2021 ఫిబ్రవరిలో ఫ్రాన్స్ సివిల్ ఏవియేషన్ కూడా ఇలాంటి అభ్యంతరాలనే లేవనెత్తింది. ఆ సందర్భంలో అమెరికా ఎయిర్‌లైన్స్ సర్వీసుల్లాగా రాద్ధాంతం చేయకుండా.. కెనడాలో మాదిరి ఫోన్ మాస్ట్‌లను ఏర్పాటు చేయడంతో పాటు, ప్రయాణికులను టేకాఫ్, ల్యాండ్ అయిన సమయంలో ఫోన్లు స్విచ్ఛాఫ్ మాత్రమే చేయాలని కోరింది. ఇక యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ.. ‘సమస్యలను నివారించడానికి ఎయిర్‌క్రాఫ్ట్ తయారీదారులు, ఎయిర్‌లైన్స్, స్టేట్ స్పెక్ట్రమ్ రెగ్యులేటర్లతో కలిసి పని చేస్తున్నామని, యూరప్‌లో ఎలాంటి ఘటలను గుర్తించలేద’ని స్పష్టం చేసింది. ఈయూతో పోలిస్తే.. అమెరికాలో రేడియో ఫ్రీకెన్సీ జోక్యం, ఇతర ఇబ్బందులు తక్కువేనని సేప్టీ డివైజ్‌లు తయారు చేసే అమెరికన్ కంపెనీ రెసోనాంట్ కంపెనీ ప్రతినిధి జార్జ్ హోమ్స్ చెప్తున్నారు. ఫ్రీక్వెన్సీ ఇష్యూ.. కొన్ని దేశాలు 5జీ విషయంలో 600 మెగాహెర్ట్జ్ నుంచి 900 మెగాహెర్ట్జ్ మధ్య ఫ్రీక్వెన్సీని ఉపయోగిస్తున్నాయి. మరికొన్నిదేశాలు 2.3 గిగాహెర్ట్జ్ నుంచి 4.7 గిగాహెర్ట్జ్ మధ్య ఫ్రీక్వెన్సీతో డేటా స్పీడ్‌ను పెంచుతున్నాయి. ఇంకొన్ని దేశాల్లో అయితే ఏకంగా 24 గిగాహెర్ట్జ్ నుంచి 47 గిగాహెర్ట్జ్ మధ్య ఉపయోగిస్తున్నాయి. ఈ ఫ్రీక్వెన్సీలో ఎక్కువ టవర్లు అవసరం పడినప్పటికీ.. డేటా కూడా అంతే స్పీడ్‌గా వస్తుంది. ఇక అమెరికా విషయానికి వస్తే.. వెరిజోన్, ఏటీ&టీ కంపెనీలు ఏర్పాటు చేయబోయే 5జీ నెట్వర్క్స్ కోసం 3.7 గిగాహెర్ట్జ్ నుంచి 3.8 గిగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్స్ బ్యాండ్‌కు అప్‌గ్రేడ్ లభించింది. మరోవైపు ఏవియేషన్ ఉపయోగిస్తున్న రేడియో అల్టిమీటర్స్ ఏమో 4.2 గిగాహెర్ట్జ్ నుంచి 4.4 గిగాహెర్ట్జ్ బాండ్ మధ్య నడుస్తోంది. సీ-బ్యాండ్(5జీ సేవల కోసం ఉపయోగిస్తున్న ఫ్రీక్వెన్సీ), విమానాల కోసం ఉపయోగించే ఫ్రీక్వెన్సీలు దగ్గరదగ్గరగా ఉండడమే అసలు సమస్యగా మారింది. సీ-బ్యాండ్ ఎయిర్‌వేవ్స్‌తో.. ఏవియేషన్ కమ్యూనికేషన్ దెబ్బతింటుందనేది ఎయిర్‌లైన్స్ ఓనర్ల వాదన. ఎఫ్ఏఏ హెచ్చరికల తర్వాతే.. చాలా దేశాల్లో ప్రభుత్వ ఏజెన్సీలు రేడియో US స్పెక్ట్రమ్‌ను నియంత్రిస్తుంటాయి. అలాగే అమెరికాలో ఎఫ్‌సీసీ ‘ఫ్రీక్వెన్సీ కంట్రోల్’ చేస్తోంది. వాస్తవానికి 5జీ స్పెక్ట్రమ్‌లో చాలా భాగాలను 2016లోనే పక్కన పెట్టేసింది. ఆ సమయంలోనే ఎయిర్‌క్రాఫ్ట్‌ల సమస్యనే అభ్యంతరంగా లేవనెత్తింది ఎఫ్ఏఏ Federal Aviation Administration. అంతేకాదు కిందటి ఏడాది నవంబర్‌లో ఎయిర్‌లైన్స్‌ను హెచ్చరిస్తూ ఒక ప్రకటన సైతం విడుదల చేసింది. ‘5G ట్రాన్స్మీటర్లు, ఇతర సాంకేతికత జోక్యం చేసుకోవడం వల్ల నిర్దిష్ట భద్రతా పరికరాలు పనిచేయకపోవడం లాంటి పరిస్థితులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. విమాన కార్యకలాపాలను ప్రభావితం చేసే చర్యలను తగ్గించడం అవసరం అంటూ ఎయిర్‌లైన్స్ సంస్థలను సూచించింది ఎఫ్ఏఏ. ఒకరిని మించి ఒకరు అమెరికాలోనే అతిపెద్ద టెలికాం కంపెనీలుగా ఉన్నాయి వెరిజోన్, ఏటీ&టీ కంపెనీలు. వాస్తవానికి వీటికి అనుమతులు ఎప్పుడో లభించాయి. కానీ, భద్రత కారణాల దృష్ట్యా లాంచింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఈ తరుణంలో జనవరి 19 నుంచి 5జీ సేవల్ని కొన్ని ప్రధాన ఎయిర్‌పోర్ట్‌ల పరిధిలో మొదలుపెట్టాలని ఫిక్స్ అయ్యాయి. ఈలోపు ఏవియేషన్ సేఫ్టీని లేవనెత్తుతూ సర్వీసులు నిలిపివేస్తామని బెదిరింపులకు దిగాయి ఎయిర్‌లైన్స్ కంపెనీలు. 5జీ సర్వీసు మొదలైతే. విమాన సర్వీసులను బంద్ చేస్తామని హెచ్చరిస్తున్నాయి ఎయిర్‌లైన్స్. ఈ మేరకు బైడెన్ ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాశాయి. ఈలోపు కొన్ని దేశాలు(భారత్ కూడా) సర్వీసుల రద్దు, వేళల్లో మార్పునకే మొగ్గుచూపాయి. ఏం జరగనుంది.. ప్రస్తుత పరిస్థితుల్లో ఏటీ అండ్ టీ కంపెనీ 5జీ సేవల మొదలును మరోసారి వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి అమెరికా టెలికాం పరిశ్రమ, విమానయాన పరిశ్రమ రెండూ భారీగా లాభపడే ఈ వ్యవహారానికి పరిష్కారం మాత్రం త్వరగా దొరికేలా కనిపించడం లేదు. ఇది టెలికాం సహా ఇతర విభాగాలు, ప్రభుత్వాలకు సంబంధించిన సమస్య. వేర్వేరు ఫ్రీక్వెన్సీలను ఉపయోగించడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. కానీ, అమెరికాలో రెండూ సీ-బ్యాండ్‌నే ఉపయోగిస్తున్నాయి. ఈ విషయంలోనే రాజీకి రాలేకపోతున్నాయి. ఒకవేళ ఇప్పటికే ఉన్న ఆల్టిమీటర్‌లు సురక్షితమైనవిగా రేట్ చేసే అవకాశం ఉంది. లేదంటే 5G జోక్యానికి వ్యతిరేకంగా మరింత పటిష్టంగా ఉండేలా కొత్త నిబంధనల్ని ప్రభుత్వం రూపొందించొచ్చు. ప్రస్తుతం ఎయిర్‌లైన్స్, ఎఫ్‌సీసీFederal Communications Commission, ఎయిర్‌లైన్స్ నిర్వాహకుల్ని కూర్యోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తోంది బైడెన్ ప్రభుత్వం. ఈ సమస్య పరిష్కారానికి ఎంత టైం పడుతుందన్నది కచ్చితంగా తెలియడం లేదు. సమస్య ఇదేనా? ఇక్కడ సేమ్ ఫ్రీక్వెన్సీ సమస్య ఒక్కటే కాదని తెలుస్తోంది. అమెరికాలో కమర్షియల్ ఫ్లయిట్లు వాతావరణం సరిగా లేని టైంలోనూ ఆపరేట్ చేసుకునేందుకు(లిమిట్ ఆక్యుపెన్సీతో) అనుమతులు ఉన్నాయి. అయితే హజారర్డ్స్(ప్రమాదాలు) జరిగే జోన్లో విమానాలు ఎగరడం పట్ల పైలెట్లను హెచ్చరిస్తూ ఇప్పటివరకు 1450 నోటీసులు జారీ అయ్యాయి. విశేషం ఏంటంటే.. ఈ జోన్లోనే 5జీ టవర్స్ ఏర్పాటు అయ్యాయి. ఈ విషయంలోనే 5జీ సేవలపై గుర్రుగా ఉన్న విమానయాన సంస్థల బాసులు అమెరికా ప్రభుత్వానికి లేఖలు రాశారు. ఆ రూల్స్ ప్రకారం వెళ్తే.. విమానాల్ని రద్దు చేసుకోవాల్సి వస్తుందని, వాణిజ్య రంగానికి ఆటంకం వాటిల్లుతుందని లేఖలో పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదు. ::: సాక్షి, వెబ్‌స్పెషల్ -
నాది ఎక్స్పోజింగ్ అయితే! మరి ఆమె చేసిందో?
సెలబ్రిటీలకు చేదు అనుభవాలు ఎదురైనప్పుడు సోషల్ మీడియా సాక్షిగా చర్చలు నడవడం సహజం. మిస్ యూనివర్స్-2012 ఒలీవియా కల్పో తాజాగా తనకు ఎదురైన ఓ అనుభవం గురించి పోస్ట్ చేయగా.. అభిమానుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. గురువారం చోటు చేసుకున్న ఈ ఘటన ప్రకారం.. మెక్సికోలోని కాబో శాన్ లుకాస్ అనే రిసార్ట్‌కి తన సోదరి, బాయ్‌ఫ్రెండ్‌తో పాటు బయలుదేరింది. ఆ సమయంలో ఆమె పైన టాప్‌తో డ్రెస్ వేసుకుని ఉంది. అయితే క్లీవేజ్ కనిపించేలా ఆ డ్రెస్సు ఉండడంతో సిబ్బంది ఆమెను విమానంలోకి అనుమతించలేదు. దీంతో తన బాయ్‌ఫ్రెండ్ క్రిస్టియన్ మెక్కాఫెరే హూడీని తగిలించుకుని ఆమె ఫ్లైట్ ఎక్కింది. ఈ క్రమంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసిన ఆమెకు షాక్ తగిలింది. తనకంటే దారుణమైన దుస్తులతో ఉన్న మహిళను విమానంలోకి సిబ్బంది అనుమతించారు. దీంతో అక్కడి ఘటనతంతా వరుసగా ఫొటోలు, వీడియోల రూపంలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ఒలీవియా సోదరి అరోరా. తనకు ఎదురైన అమానం గురించి అందరికీ తెలియాలనే తాను ఈ నిరసన వ్యక్తం చేస్తున్నట్లు ఓ మీడియా హౌజ్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది ఒలీవియా. Come on! Who dresses like that to go on a plane. I’m glad @AmericanAir made her cover up. People today think they can just walk around scantily clad and we’re just supposed to accept it. @oliviaculpo dress like an adult. #teamamericanairlines — Missy (@melissa_U25) January 15, 2022 PR stunt, it's the simplest explanation. It worked too, BTW. — 🍊💊Jorj X McKie🍊💊 (@Jorj_X_McKie) January 15, 2022 Funny how the sister who thinks Olivia looks cute and appropriate is covered from head to toe. You look like you’re wearing a bra and spanks. Try adulting and put some actual clothes on. You’d think a former Miss Universe would have some standards. 🤷🏻♀️ — Angela (@hotstuffmedic) January 15, 2022 -
ఐపీవో.. ఓయోకి భారీ ఝలక్!
Oyo Initial Public Offering: పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ద్వారా సమీకరణకు సిద్ధమైన ఓయోకి భారీ ఝలక్ తగిలింది. ప్రత్యర్థి కంపెనీ జోస్టల్.. ఓయో ఐపీవో ప్రతిపాదనను తిరస్కరించాలంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ఓ లేఖ రాసింది. డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్(DRHP) నిబంధనలకు విరుద్ధంగా ఉందని, దానిని పక్కనపెట్టడంతో పాటు ఓయో ఐపీవో ప్రతిపాదనను తిరస్కరించాలని సెబీకి జోస్టల్ విజ్ఞప్తి చేసింది. ఆతిథ్య సేవల సంస్థ ఓయో ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (Initial public offering) ద్వారా 1.2 బిలియన్ డాలర్ల( రూ.8,430 కోట్లు) సమీకరణకు సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే ఓయో మాతృ సంస్థ ఓరావెల్ స్టేస్.. క్యాపిటల్ స్ట్రక్చర్ తుది రూపానికి రాని తరుణంలో ఐపీవోకి వెళ్లడం ఎలా కుదురుతుందని అభ్యంతరం వ్యక్తం చేస్తోంది జోస్టల్. ఈ మేరకు ఐపీవోకు అనుమతించకూడదంటూ సెబీకి విజ్ఞప్తి చేసింది. సెబీ గనుక ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే మాత్రం ఓయోకి చిక్కులు తప్పవని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఏడాది జులైలో ఫుడ్ యాప్ జొమాటో ఐపీవో విజయవంతమైన తర్వాత పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు ఓయో సిద్ధమైంది. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చేందుకు ఓయో మాతృ సంస్థ ఓరావెల్ స్టేస్ వాటాదార్లు ఇటీవలె ఆమోదం తెలిపారు. దీంతో తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ద్వారా రూ.8,430 కోట్లు సమీకరించడానికి సిద్ధమైంది. ఈ మేరకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద కంపెనీ ఈ నెల మొదట్లో ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. ఇదిలా ఉంటే ఆతిథ్య సేవల రంగంలో జోస్టల్-ఓరావెల్ స్టేస్‌లు ప్రత్యర్థులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మొదట్లో జోస్టల్‌కు అనుకూలంగా సుప్రీంకోర్టు నియమించిన మధ్యవర్తి తీర్పును సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌తో పాటు ఓయోకి వ్యతిరేకంగా దాఖలు చేసిన మరో పిటిషన్‌పైనా సంయుక్తంగా ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం అక్టోబర్ 21న విచారణ చేపట్టాల్సి ఉంది. ఓయో ఐపీవో ముఖచిత్రం ► ప్రతిపాదిత ఇష్యూలో రూ.7,000 కోట్ల విలువైన తాజా షేర్లతో పాటు ఆఫర్ ఫర్ సేల్‌లో రూ.1,430 కోట్ల విలువైన షేర్లను కంపెనీ విక్రయించనుంది. ► ఆఫర్ ఫర్ సేల్‌లో ఎస్‌వీఎఎఫ్ ఇండియా హోల్డింగ్స్ లిమిటెడ్, ఏ1 హోల్డింగ్స్, చైనా లాడ్జింగ్ హోల్డింగ్స్, గ్లోబల్ ఐవీవై వెంచర్స్ ఎల్ఎల్పీ షేర్లను విక్రయించనున్నాయి. ► ప్రస్తుతం ఓయోలో ఎస్‌వీఎఎఫ్ 46.62%, ఆర్ఏ హాస్పిటాలిటీ హోల్డింగ్స్‌కు 24.94%, రితేశ్ అగర్వాల్‌కు 8.21% వాటాలు ఉన్నాయి. ► ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను రుణాల చెల్లింపునకు, వాణిజ్య విస్తరణకు కంపెనీ వినియోగించనుంది. ► ఈ పబ్లిక్ ఇష్యూ నిర్వహించేందుకు జేపీ మోర్గాన్, సిటీ, కోటక్ మహీంద్రా క్యాపిటల్ వంటి ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్‌లను ఓయో నియమించుకుంది. చదవండి: క్యూ3లో ఐపీవో స్పీడ్ -
‘వామ్మో ఏంటా బట్టలు.. ముందు ఫ్లైట్ దిగు’
ఆడవాళ్ల వేషధారణ సొసైటీలో ఎడతెగని ఓ చర్చాంశం. అయితే తన దేశంలో వివక్ష ఎదురవుతుందనే.. ఆమె వెస్ట్రన్ దేశాలకు వలస వెళ్లింది. అక్కడ తనకంటూ ఓ గుర్తింపు దక్కించుకుంది. కానీ, ఊహించని రీతిలో అక్కడా ‘చేదు’ అనుభవమే ఎదురయ్యిందంటూ కన్నీళ్లతో వాపోయింది. కానీ.. దెనిజ్ సెపినర్(26).. టర్కీ ఫిట్నెస్ మోడల్. అయితే అక్కడి సంప్రదాయలు ఆమెను ప్రొఫెషనల్‌లోకి అనుమతించలేదు . దీంతో అమెరికాకు వలస వెళ్లింది. ఫిట్నెస్ మోడల్‌గా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా పేరు సంపాదించుకుంది. ఇంటర్నేషనల్ గుర్తింపు దక్కించుకున్న మొదటి టర్కీ బాడీ బిల్డర్ కూడా ఈమెనే. ఈ క్రమంలో బికినీ మోడలింగ్ కాంపిటీషన్లో పాల్గొనేందుకు జులై 8న మియామీ నుంచి టెక్సాస్‌కు బయలుదేరింది. అయితే ఫ్లైట్ ఎక్కిన కాసేపటికే సిబ్బంది ఒకరు వచ్చి.. ‘మీరు దిగిపోవాలి’ అన్నాడు. ఆమె అది జోక్‌గా అనుకుందట. దీంతో ‘మీ బట్టలు బాగోలేవు. మీ వల్ల ఇందులో ఉన్న ఫ్యామిలీస్ ఇబ్బంది పడతాయి. దిగిపోండి’ అని మరోసారి చెప్పాడట. కావాలంటే తన టీషర్ట్‌తో కాళ్లను కప్పేసుకుంటానని ఆమె చెప్పినప్పటికీ.. వినకుండా ‘మీరు నగ్నంగా ఉన్నారు. దిగిపోవాల్సిందేన’ంటూ ఆమెతో దురుసుగా వ్యవహరించారట. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పుకుని వాపోయిందామె.‘ఆ మాట వినగానే భయమేసింది. వణికిపోయా. వాళ్లసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. నేనేం నగ్నంగా లేను కదా. రాత్రంతా ఒంటరిగా ఎయిర్‌పోర్ట్‌లో ఉండిపోయా. నా దేశంలో స్వేచ్ఛ లేదనే ఇక్కడికి వచ్చా. కానీ, ఇలాంటి ఘటన ఎవరికీ జరగకూడదు’ అంటూ కన్నీళ్లతో వీడియోను పోస్ట్ చేసింది దెనిజ్. ట్విస్ట్ అయితే దెనిజ్ దుస్తులు మరీ బికినీ తరహాలో కురచగా ఉన్నాయని, అందుకే ఆమెను దించేశామని అమెరికన్ ఎయిర్‌లైన్స్ స్పష్టం చేసింది. ‘ఫ్లైట్స్‌లో వెళ్లేవాళ్లకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఎలా పడితే అలా బట్టలు వేసుకొస్తే.. అవతలి వాళ్లు ఇబ్బంది పడతారు కదా. ఆమె వేషధారణ అసభ్యంగా ఉందని ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం మా సిబ్బంది చేసింది. కానీ, ఆమెనే దురుసుగా ప్రవర్తించడంతో ప్రతిగా అలా చేయాల్సి వచ్చింద’ని అమెరికన్ ఎయిర్‌లైన్స్ స్పష్టం చేసింది. దీంతో ఆమెకే నెగెటివ్ కామెంట్లు వస్తుండడంతో ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌కు కాసేపు ప్రైవసీ పెట్టేసిందామె. -
ఏపీ అభ్యంతరాలకు వివరణ ఇవ్వండి
సాక్షి, అమరావతి: నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి కేటాయింపులకు మించి తెలంగాణ నీటి వినియోగంపై కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు) అభ్యంతరం తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 26 నుంచి మే 31వ తేదీ వరకు 13.4 టీఎంసీల నీటిని విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ ఏకపక్షంగా వినియోగించుకుందన్న ఏపీ అభ్యంతరాలకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పటి వరకు సాగర్ నుంచి విడుదల చేసిన 9.9 టీఎంసీల నీటిని మొత్తం కేటాయింపుల నుంచి మినహాయించుకోవాలని తెలంగాణకు సూచించింది. వచ్చే సమావేశం నాటికి దీనికి సంబంధించిన వివరాలను సమర్పించాలని పేర్కొంది. ఈ నెల ఏడో తేదీలోగా కేఆర్ఎంబీ సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ ఈఎన్సీకి కృష్ణా బోర్డు లేఖ రాసింది. ఏపీ కోటా నుంచి ఆ నీటిని మినహాయించాలి గత నీటి సంవత్సరంలో నాగార్జునసాగర్ కుడికాలువకు నీటిని విడుదల చేయవద్దని కోరినా ఈ ఏడాది ఫిబ్రవరి 26 నుంచి మే 31 వరకు 13.4716 టీఎంసీలను అనవసరంగా విడుదల చేశారని, వాటిని ఏపీ కోటా నుంచి మినహాయించాలని కృష్ణాబోర్డుకు ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి లేఖ రాశారు. దీనిపై స్పందించిన బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే.. ఏపీ ఈఎన్సీ రాసిన లేఖలో పేర్కొన్న అంశాలపై అభిప్రాయం చెప్పాలంటూ తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌ను ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఆయనకు లేఖ రాశారు. -
ఆ యాప్ వాడొద్దు: ఎస్ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
విజయవాడ: ఎస్ఈసీ నిబద్ధతపైన ఈ-వాచ్ యాప్‌తో అనుమానం వస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి సందేహం వ్యక్తం చేశారు. ఈ-వాచ్ యాప్ డేటా విషయంలో గోప్యత కనిపిస్తోందని ఆరోపించారు. ఇంత గోప్యంగా ఎందుకు అని ప్రశ్నించారు. జెడ్పీ, ఎంపీటీసీ ఎన్నికలకు తయారుచేసిన నిఘా యాప్‌ను ఎందుకు పక్కన పెట్టారని నిలదీశారు. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకువచ్చిన సీ-విజిల్ యాప్‌ను ఎందుకు తేలేదని పేర్కొన్నారు. ప్రభుత్వాలతో, సీఈసీతో సంబంధం లేకుండా కొత్త యాప్ ఎలా తెచ్చారని అడిగారు. టీడీపీ నాయకులు ఈ-వాచ్ యాప్ తయారు చేయడానికి టైం పట్టిందని ఆరోపించారు. ఇప్పటికైనా సీఈసీ తీసుకొచ్చిన సీ-విజిల్ యాప్‌ను వాడాలని కోరినట్లు తెలిపారు. ఈ వాచ్ యాప్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ బుధవారం ఎన్నికల సంఘం కార్యాలయంలో కార్యదర్శి కన్నబాబుకు లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో సీ విజిల్ యాప్ వినియోగించాలని విజ్ఞప్తి చేసినట్లు లేళ్ల తెలిపారు. ఈ వాచ్ యాప్‌పై అనేక అభ్యంతరాలున్నాయని చెప్పారు. ఎస్ఈసీ రాజ్యాంగబద్ధ సంస్థ అని గుర్తుచేశారు. నిమ్మగడ్డ ఇంత రహాస్యంగా యాప్‌ని ఎందుకు తయారుచేయాల్సి వచ్చిందో చెప్పాలని, ప్రభుత్వం గతేడాది తీసుకొచ్చిన నిఘా యాప్‌ను ఎందుకు పక్కన పెట్టారని ప్రశ్నించారు. నిఘా యాప్ పక్కన పెడితే సీ విజిల్ యాప్ వినియోగిస్తారనుకుంటే ప్రైవేట్ వ్యక్తులు రూపొందించిన ఈ వాచ్ ఎలా ఉపయోగిస్తారని అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వాచ్ యాప్ టీడీపీ కార్యాలయంలో తయారైందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. నిమ్మాడలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అరాచకాలు ఎస్ఈసీకి కనిపించవా అని ప్రశ్నించారు. ఈ వాచ్ ఎక్కడ తయారు చేశారో.. ఎలా తయారు చేశారో.. ఫిర్యాదులు చేరతాయో లేదో కూడా తెలియదని.. దీనిపై ఎన్నో అనుమానాలున్నాయని లేళ్ల అప్పిరెడ్డి సందేహాలు వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
ఆ జాబితాపై భారీగా అభ్యంతరాలు
సాక్షి, కరీంనగర్ : మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి అధికారులు రూపొందించిన వార్డుల జాబితాపై ప్రజలు, రాజకీయ నాయకుల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఈ నెల 3న ప్రకటించిన ముసాయిదా వార్డుల జాబితాపై సూచనలు, అభ్యంతరాలు తెలిపేందుకు సోమవారంతో గడువు ముగిసింది. ఈ సందర్భంగా కరీంనగర్, రామగుండం మునిసిపల్ కార్పొరేషన్లతోపాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 14 మునిసిపాలిటీల నుంచి ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహులతోపాటు పలు స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘాలు తమ అభ్యంతరాలను ఆయా మునిసిపల్ కమిషనర్లకు అందజేశాయి. ఈ అభ్యంతరాలను వారం రోజుల్లోగా పరిశీలించి, పరిష్కరించాల్సిన బాధ్యత వారిపైనే ఉంది. ఈ నెల 15లోగా కార్యక్రమం ముగించి 16న వార్డుల తుది జాబితాను తయారు చేసి, 17న ప్రభుత్వానికి నివేదిక రూపంలో పంపిస్తారు. ఒకవేళ అభ్యంతరాలను పరిష్కరించలేని పరిస్థితి ఉంటే అందుకు గల కారణాలతో పూర్తిస్థాయి నివేదికను కూడా ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది. కరీంనగర్లో అత్యధికంగా 164 అభ్యంతరాలు కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్‌లోని 60 వార్డుల(డివిజన్లు) నుంచి అత్యధికంగా 164 అభ్యంతరాలు రావడం గమనార్హం. ఇందులో అభ్యంతరాలకు చివరిరోజైన సోమవారం ఒక్కరోజే 100కు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. కాగా కిసాన్‌నగర్, అంబేద్కర్‌నగర్ వార్డులకు సంబంధించి ఏకంగా 50 అభ్యంతరాలు రాగా, కనీసం 30 వార్డుల రూపురేఖలు మార్చాలని పలువురు దరఖాస్తులు అందజేశారు. వార్డుల భౌగోళిక స్వరూపంతోపాటు ఆయా వార్డుల్లోకి చేరిన ఓటర్లకు సంబంధించి వచ్చిన దరఖాస్తులే ఎక్కువ కావడం గమనార్హం. విలీన గ్రామాలను, ఇప్పటికే నగరపాలక సంస్థలో ఉన్న బస్తీలను కలుపుతూ ఏర్పాటు చేసిన వార్డుల విషయంలో కూడా భారీగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సదాశివపల్లి, అల్గునూరు, వావిలాలపల్లి తదితర గ్రామాలకు సంబంధించిన వార్డులపై అభ్యంతరాలు అధికంగా నమోదయ్యాయి. రామగుండంలో 64 అభ్యంతరాలు రామగుండం నగరపాలక సంస్థలో 50 డివిజన్లకు గాను 64 అభ్యంతరాలు వచ్చినట్లు కమిషనర్ తెలిపారు. ఇందులో సోమవారం ముగింపు రోజునే 51 అభ్యంతరాలు రావడం గమనార్హం. గతంలో ఒక వార్డులో ఉన్న ఓట్లను ఈసారి మరో వార్డులోకి మార్చడంపైనే అధికంగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 30వ వార్డును పునర్విభజించి 32, 33, 34, 44 వార్డులుగా మార్చడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. స్థానిక ఎన్టీపీసీ టీటీఎస్, టీటీఎస్‌లోని 47, 48 డివిజన్లను పునర్విభజనలో భాగంగా ఒకే వార్డుగా మార్చారని, అయితే రెండు వార్డులకు సరిపడా ఓటర్లు ఉన్నారని, పీటీఎస్, టీటీఎస్ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న ఖాజిపల్లి, మాతంగికాలనీలను కలిపి రెండు వార్డులుగా చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. అలాగే 27వ వార్డును పునర్విభజనలో 38వ డివిజన్‌గా మార్చి 151 ఓట్లు 37వ డివిజన్లో కలిపారని, 38వ డివిజన్‌కు చెందిన ఓటర్లను అరకిలోవీుటర్ దూరంలో ఉన్న 37వ డివిజన్లో కలుపడంపై సంజయ్నగర్కాలనీవాసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా ప్రతి వార్డులో ఓటర్ల కూర్పు, సరిహద్దుల మార్పుపైనే అభ్యంతరాలు ఎక్కువగా వ్యక్తమయ్యాయి. జగిత్యాల జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో 96 అభ్యంతరాలు జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో కొత్తగా అభ్యంతరాల స్వీకరణ అవకాశం ఇవ్వగా ఈ నెల 4 నుంచి 9వరకు తక్కువ సంఖ్యలోనే సంఖ్యలోనే అభ్యంతరాలు, విజ్ఞప్తులు ఆయా మున్సిపాలిటిలకు వచ్చాయి. వాటిలోని చిన్నచిన్న మార్పులు, చేర్పులే అధికంగా ఉంటున్నాయి. ఈ నెల 9వరకు అభ్యంతరాల స్వీకరించగా జగిత్యాల మున్సిపాలిటీలో అత్యధికంగా 53, కోరుట్లలో 18, మెట్పల్లిలో 18, రాయికల్‌లో ఏడు మాత్రమే విజ్ఞప్తులు అందగా ధర్మపురిలో ఇప్పటివరకు ఒక్కటి కూడా అభ్యర్థనలు రాలేదు. వస్తున్న అరకొర అభ్యంతరాలు, విజ్ఞప్తులు సైతం పరిష్కరించగలిగేవేనని అధికారులు చెబుతున్నారు. రాయికల్‌లో వార్డుల సంఖ్య పెంచాలని అఖిలపక్ష నాయకులు విజ్ఙప్తి చేశారు. నిబంధనలకు అనుగుణంగా వార్డుల భౌగోళిక, ఓటర్ల విభజన జరుగలేదంటూ, ఇష్టానుసారంగా ఇంటి నంబర్లు తొలగించడ, చేర్చడం జరిగిందంటూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. హుజూరాబాద్‌లో 10, జమ్మికుంటలో 34 వార్డుల విభజనకు 9వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణకు తుది గడువు కావడంతో పలువురు ఆశావాహులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. హుజూరాబాద్ పురపాలికలో ఆరు రోజుల్లో 10 అభ్యంతరాలు అందాయి, వార్డు 1, 2, 4, 14, 17, 19, 23, 25, 30 వార్డుల్లోని కొన్ని ఓట్ల మార్పు కోసం అభ్యంతరాలు అందగా, 3వ వార్డులో పోలింగ్ స్టేషన్ మార్పు చేయాలని అభ్యంతరాలు అందాయి. జమ్మికుంట పురపాలికలో 34 అభ్యంతరాలు అందగా, ఇందులో ప్రధానంగా గతంలో ఉన్న వార్డులో ఉన్న ఓట్లను అదే వార్డులో ఉంచేలా చూడాలని అభ్యంతరాలు అందాయి. వార్డుల విభజన ప్రక్రియలో భాగంగా వచ్చిన అభ్యంతరాలను 16వ తేదీ వరకు పరిశీలన చేసి, అవసరమనుకుంటే స్వల్ప మార్పులు, చేర్పులు చేసి 17న తుది వార్డుల జాబితాను ప్రకటించనున్నారు. సిరిసిల్లతోపాటు అన్ని మునిసిపాలిటీల్లో అభ్యంతరాలు సిరిసిల్ల మునిసిపాలిటీల్లో 39 వార్డులు ఉండగా, 42 అభ్యంతరాలు వచ్చాయి. వార్డుల విభజనకు సంబంధించిన అభ్యంతరాలే అధికంగా ఉన్నాయి. ఇవన్నీ చిన్నచిన్న అభ్యంతరాలే కావడంతో కమిషనర్ స్థాయిలోనే పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో 28 వార్డులకు గాను 27 అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పెద్దపల్లి 11, సుల్తానాబాద్‌లో 4, మంథనిలో2 పెద్దపల్లి, సుల్తానాబాద్, పెద్దపల్లి మున్సిపాలిటీల్లో వార్డుల రూపకల్పన, ఓటర్ల చేర్పులపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 27, 28వ వార్డుల ఖరారు అశాస్త్రీయంగా ఉందని, 25వార్డులో ఓటర్ల పునః పరిశీలన జరిపించాలి్సందిగా యూత్ కాంగ్రెస్ నాయకులు కోరారు. సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని నలుగురు తమ అభ్యంతరాలను తెలియపరుస్తూ అధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా ఈ నెల 16వరకు అభ్యంతరాలపై విచారణ జరిపి తగువిధంగా చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొంటున్నారు. మంథనిలో వార్డుల కూర్పుపై కేవలం 2 అభ్యంతరాలు మాత్రమే వ్యక్తమయ్యాయి. -
ఆధార్ ప్రింట్ చేసినట్టు కాదు..!
న్యూఢిల్లీ: త్రిచక్ర వాహనాలను 2023 నుంచి, ద్విచక్ర వాహనాలను 2025 నుంచి పూర్తిగా ఎలక్ట్రిక్ రూపంలోనే అనుమతించాలన్న నీతి ఆయోగ్ ప్రతిపాదనపై అగ్రశ్రేణి ఆటో కంపెనీలు అభ్యంతరాలు వ్యక్తంచేశాయి. ఇదేమీ ఆధార్ కార్డును ప్రింట్ చేసింత ఈజీ కాదని టీవీఎస్, బజాజ్ ఆటో వ్యాఖ్యానించాయి. ఈ ప్రతిపాదనల వెనక తగినంత అధ్యయనం, సంప్రదింపులు లేవని పేర్కొన్నాయి. ‘‘ఇది ఆధార్ కార్డు కాదు. సాఫ్ట్వేర్, ప్రింట్ కార్డులు కాదు. మొత్తం సరఫరా చెయిన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ప్రస్తుత వ్యవస్థ నుంచి దానికి మళ్లాల్సి ఉంటుంది’’ అని టీవీఎస్ మోటార్ కంపెనీ చైర్మన్, ఎండీ వేణు శ్రీనివాసన్ పేర్కొన్నారు. తమ ప్రతిపాదనలపై రెండు వారాల్లో ఆటో మొబైల్ పరిశ్రమ స్పందించాలని నీతి ఆయోగ్ కోరిన నేపథ్యంలో వేణు శ్రీనివాసన్ ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. నాలుగు నెలల సమయం కోరాం... ‘‘ఓ ప్రణాళికతో ముందుకు రావడానికి మాకు నాలుగు నెలల సమయం పడుతుందని తెలియజేశాం. ప్రణాళిక ఓ నగరంతో (అత్యధిక ద్విచక్ర వాహనాలు కలిగిన నగరం) మొదలవుతుంది. ఆ తర్వాత బదిలీ అన్నది కొంత కాలానికి జరుగుతుంది’’ అని వేణు శ్రీనివాసన్ తెలిపారు. 2 కోట్ల వాహనాలు, 15 బిలియన్ డాలర్ల అమ్మకాలు, 10 లక్షల మంది ఉపాధితో కూడిన ఈ రంగంలో ఒకేసారి పూర్తిగా మార్పు అన్నది సాధ్యం కాదని చెప్పారాయన. థర్మల్ (బొగ్గు ఆధారిత) విద్యుత్‌తో నడిచే బ్యాటరీలకు మళ్లడం కాలుష్యాన్ని తగ్గించదని స్పష్టంచేశారు. కాలుష్యంలో వాహనాల పాత్ర 20 శాతం అయితే, ఇందులో ద్విచక్ర వాహనాల నుంచి వెలువడే కాలుష్యం 20 శాతమేనని, అంటే కేవలం 4 శాతం కాలుష్యం గురించి ఇదంతా చేస్తున్నట్టుగా ఉందని అభిప్రాయపడ్డారు. దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమ పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులను ఆకర్షించిందని, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. కాగా పూర్తిగా 100 శాతం ఎలక్ట్రిక్ వాహనాలకు మళ్లడం అన్నది అవసరం లేదని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ చెప్పారు. కార్లు తదితర వాహనాలను వదిలేసి, కేవలం ద్వి, త్రిచక్ర వాహనాలనే లక్ష్యం చేసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. తీవ్రంగా ఆందోళన చెందుతున్నాం: హీరో మోటోకార్ప్ 150సీసీ సామర్థ్యం వరకు, ఇంటర్నల్ కంబస్టన్ ఇంజిన్లతో కూడిన ద్విచక్ర వాహనాలను పూర్తిగా నిషేధించాలన్న నీతి ఆయోగ్ విధానంతో తలెత్తబోయే పరిణామాలపై తాము తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్టు అగ్రగామి టూవీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్ ప్రకటించింది. ఈ విధానంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. 150సీసీ సామర్థ్యంలోపు ముఖ్యంగా 100సీసీ, 110సీసీ, 125సీసీ విభాగంలో విక్రయమయ్యే అత్యధిక వాహనాలు ఈ కంపెనీవే. భాగస్వాములు అందరి ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలని కంపెనీ సూచించింది. ఎలక్ట్రిక్ వాహనాల అమలును బలవంతంగా రుద్దడానికి బదులు, మార్కెట్ పరిస్థితులు, కస్టమర్ల వైపు నుంచి ఆమోదం వంటి అంశాలతో ఎలక్ట్రిక్ వాహనాలకు మళ్లడం అనేది ఆధారపడి ఉండాలని సూచించింది. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ, దేశ జీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ రంగంపై ప్రతిపాదిత నిషేధం తీవ్ర ప్రభావం చూపుతుందని హీరో మోటోకార్ప్ ఆందోళన వ్యక్తం చేసింది. -
మమ్మల్ని రెచ్చగొట్టొద్దు
వాషింగ్టన్/బీజింగ్/న్యూఢిల్లీ: జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థ అధినేత పాక్‌కు చెందిన మసూద్ అజార్‌ను వెనకేసుకు రావద్దని చైనాకు అగ్రరాజ్యాలు గట్టి హెచ్చరిక జారీ చేశాయి. అతడిని కట్టడి చేసేందుకు ఇతర చర్యలు తీసుకునే పరిస్థితి కల్పించవద్దని స్పష్టం చేశాయి. మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఫిబ్రవరి 27వ తేదీన ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బుధవారం చైనా సాంకేతిక కారణాలతో వీటో చేసిన విషయం తెలిసిందే. చైనా చర్యను అగ్రరాజ్యాలు ఖండించాయి. ‘మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా ఇదేవిధంగా అడ్డుకోవడం కొనసాగిస్తే, మండలిలోని మిగతా సభ్య దేశాలు ఇతర చర్యలను తీసుకునే అంశాన్ని తప్పనిసరిగా పరిశీలిస్తాయి. పరిస్థితిని అక్కడిదాకా తీసుకురానివ్వద్దు. మసూద్‌కు సంబంధించి చైనా ఇలా అడ్డుపుల్ల వేయడం పదేళ్లలో ఇది నాలుగోసారి’ అని ఓ సీనియర్ దౌత్యాధికారి తెలిపారు. చైనా వస్తువులను బహిష్కరించాలి చైనా వస్తువులను బహిష్కరించాలంటూ ట్విట్టర్ వేదికగా పలువురు ప్రముఖులు తమ గళం వినిపిస్తున్నారు. ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ కూడా వీరిలో ఉన్నారు. ‘ఉగ్రవాది మసూద్ అజార్ మద్దతుదారులను, చైనాను మనం రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెంటనే వెలివేయాలి. చైనాకు వ్యాపారమే ముఖ్యం. అందుకే ఆ దేశాన్ని ఆర్థికంగా వెలివేయడం యుద్ధం కంటే కూడా ఎక్కువ ప్రభావం చూపుతుంది’ అని రాందేవ్ పేర్కొన్నారు. శాశ్వత పరిష్కారం కోసమే: చైనా మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా పలుమార్లు అడ్డుకున్న చైనా గురువారం తన చర్యను సమర్థించుకుంది. ’ఆంక్షల కమిటీ ఈ విషయంలో మరింత లోతైన పరిశీలన చేయడానికి మా చర్య దోహదపడుతుంది. సంబంధిత వర్గా(భారత్–పాక్)లు చర్చలు సాగించి అందరికీ ఆమోదయోగ్యమైన శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు ఇది సాయపడుతుంది’ అని గురువారం చైనా పేర్కొంది. ఢిల్లీలో మసూద్ బస అజార్ 1994 ప్రాంతంలో ఢిల్లీలోని పలు హోటళ్లలో బస చేయడంతోపాటు కశ్మీర్ సహా పలు రాష్ట్రాలు పర్యటించి, ఉగ్ర నేతలను కలిశాడు. ఢిల్లీలోని అత్యంత ఖరీదైన చాణక్యపురిలోని హోటల్ అశోక్‌లోనూ ఉన్నాడు. తన పూర్వీకులు గుజరాతీలని అధికారులకు చెప్పి పోర్చుగల్ నకిలీ పాస్పోర్టుతో బంగ్లాదేశ్ నుంచి దేశంలోకి ప్రవేశించాడు. కశ్మీర్లో అనూహ్యంగా పోలీసులకు చిక్కాడు. ఆ సందర్భంగా జరిగిన విచారణలో పోలీసులకు ఈ వివరాలు వెల్లడించాడు. ఇతడితోపాటు భారత్ జైళ్లలో ఉన్న మరికొందరు ఉగ్ర నేతలను తప్పించేందుకే ముష్కరులు ఎయిరిండియా విమానాన్ని హైజాక్ చేసి అఫ్గానిస్తాన్‌లోని కాందహార్‌కు తీసుకెళ్లారు. చివరికి భారత ప్రభుత్వం వారి డిమాండ్లకు తలొగ్గి, మసూద్ సహా పలువురు టెర్రరిస్టులను దేశం వెలుపలికి పంపించాల్సి వచ్చింది. -
మళ్లీ చైనా అడ్డుపుల్ల
ఐక్యరాజ్యసమితి: పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్ చేస్తున్న ప్రయత్నాలకు చైనా మరోసారి అడ్డుతగిలింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆంక్షల కమిటీ ప్రకారం మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని ఫ్రాన్స్, యూకే, అమెరికాలు ఫిబ్రవరి 27న ప్రతిపాదించాయి. ఈ విషయంలో ఏమైనా అభ్యంతరాలుంటే సభ్యదేశాలు పది పని దినాల్లోగా లేవనెత్తాలి. దీనికి బుధవారంతో గడువు ముగిసింది. చివరి నిమిషంలో సాంకేతిక కారణాలను చూపుతూ ఈ ప్రతిపాదనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేయడంతో వీగిపోయింది. మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితిలో ఇలాంటి ప్రయత్నాలు చేయడం పదేళ్ల కాలంలో ఇది నాలుగోసారి కావడం గమనార్హం. గతంలోనూ భారత్ యత్నాలను చైనా అడ్డుకుంది. చైనా నిబంధల ప్రకారమే నడుచుకుంటుందని, అజహర్‌పై అంతర్జాతీయ ఉగ్రవాది ముద్ర వేసే ప్రయత్నాలను అడ్డుకోబోతున్నట్లు ఆ దేశ అధికార ప్రతినిధి లు కాంగ్ అంతకుముందే సంకేతాలిచ్చారు. అంతర్జాతీయ ఉగ్రవాది ముద్ర వేసేందుకు అజహర్ తగిన వ్యక్తేనని అమెరికా పేర్కొంది. తాజా పరిణామంపై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ..భారత పౌరులపై దాడికి పాల్పడిన వారిని శిక్షించేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్ని అనుసరిస్తామని ప్రకటించింది. తమ ప్రయత్నాలకు చైనా మరోసారి అడ్డుపడటంపట్ల విచారం వ్యక్తం చేసింది. మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న తమ ప్రతిపాదనకు మద్దతు పలికిన అమెరికా, ఫ్రాన్స్, యూకేలకు కృతజ్ఞతలు తెలిపింది. -
36 ‘పేట’ జిల్లాపై అభ్యంతరాలు
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో మరో కొత్త ఏర్పాటుకు చకచకా అడుగులు పడుతున్నాయి. నారాయణపేట జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ 30న జీఓ 534ను విడుదల చేసిన విషయం విదితమే. ఈ మేరకు ముప్ఫై రోజుల్లోగా అభ్యంతరాలు తెలపాలని కోరారు. ఈ సందర్భంగా అభ్యంతరాలు తెలిపేందుకు గడువు గురువారం ముగిసింది. మహబూబ్‌నగర్ కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక విభాగానికి నారాయణపేట జిల్లాకు సంబంధించి 36 అభ్యంతరాలు అందాయి. వీటిని పరిశీలిస్తున్న అధికారులు రెండు రోజుల్లోగా తుది నివేదికను ప్రభుత్వానికి అందించే అవకాశముంది. ఆ వెంటనే జిల్లా ఏర్పాటుపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుందని తెలుస్తోంది. కోయిల్‌కొండ నుంచే అత్యధికం నారాయణపేట జిల్లాను ప్రస్తుత డివిజన్ పరిధిలోని మండలాలతో ఏర్పాటుచేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు నారాయణపేట రెవెన్యూ డివిజన్లోని నారాయణపేట, దామరగిద్ద, మద్దూర్, కోస్గి, మక్తల్, కృష్ణా, మాగనూర్, ఊట్కూర్, నర్వ, మరికల్, ధన్వాడలతో పాటు మహబూబ్‌నగర్ రెవెన్యూడివిజన్లోని కోయిలకొండ మండలంతో కలిపి జిల్లా ఏర్పాటుకు జీఓ విడుదల చేశారు. ఈ మేరకు అభ్యంతరాలను ఆహ్వానించగా.. ఎక్కువగా కోయిల్‌కొండ మండలానికి సంబంధించినవే వచ్చినట్లు సమాచారం. మొత్తం 36 అభ్యంతరాలు అధికారులకు అందాయి. ఇందులో కోయిల్‌కొండ మండలాన్ని మహబూబ్‌నగర్ జిల్లాలోనే కొనసాగించాలన్న డిమాండ్‌తో ఎక్కువ మంది అభ్యంతరాలు సమర్పించినట్లు సమాచారం. ఈ మేరకు అభ్యంతరాల పరిశీలనకు జాయింట్ కలెక్టర్, డీఆర్వోతో కూడిన కమిటీ ఏర్పాటుచేయగా.. రెండో రోజుల్లో పరిశీలన పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తే జిల్లా ఏర్పాటు ప్రకటన జారీ చేయనున్నారు. ఇదంతా ఒకటి, రెండు రోజుల్లో పూర్తికానుందని సమాచారం. నేడు కలెక్టర్ రాక జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ శుక్రవారం నారాయణపేటకు రానున్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కార్యాలయంలో జరిగే అధికారుల సమీక్ష సమావేశంలో పాల్గొని జిల్లా ఏర్పాటు అంశంపై చర్చించే అవకాశముంది. తొలుత కలెక్టర్ పట్టణంలోని బీసీ కాలనీలోని రేషన్ దుకాణం ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు రేషన్ బియ్యం సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అ తర్వాత సత్యనారాయణ చౌరస్తా నుంచి సుభాష్‌రోడ్‌లోని మార్కండేయ దేవాలయం సమీపం వరకు కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనులను పరిశీలిస్తారు. అనంతరం ఆర్టీఓ కార్యాలయానికి చేరుకుని సమీక్షించనున్నారు. భూములు, భవనాల గుర్తింపు తాజా అసెంబ్లీ ఎన్కినలకు ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు నూతన జిల్లాగా నారాయణపేట ఆవిర్భవించబోతోంది. ఈ మేరకు జిల్లా ఏర్పాటుకాగానే అధికారిక కార్యకలాపాలు నిర్వర్తించేందుకు కావాల్సిన కార్యక్రమాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొత్త జిల్లాలో కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన స్థలాలు, తాత్కాలిక కార్యాలయాల ఏర్పాటుకు భవనాల సేకరణలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే సర్వే నిర్వహించిన అధికారులు ప్రభుత్వ స్థలాలను గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే, కొత్త కార్యాలయాల నిర్మించేలోగా ప్రస్తుతం కార్యాలయాల ఏర్పాటుకోసం ప్రైవేట్ భవనాల యాజమానుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా పెద్దసంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. జిల్లా ఏర్పాటుపై ప్రకటన రాగానే కార్యాలయాలను ఎంపిక చేయనున్నారు. ఇదేకాకుండా కొత్త జిల్లాకు కావాల్సిన ఉద్యోగుల వివరాలను సేకరించే పని కూడా పూర్తిచేసినట్లు సమాచారం. -
సమాచార కమిషన్ అవసరమా?
న్యూఢిల్లీ: ఫిర్యాదులను ఓ ధర్మాసనం విచారిస్తుండగా అర్ధాంతరంగా దానిని రద్దు చేసి అదే ఫిర్యాదు విచారణకు మరో ధర్మాసనాన్ని ఏర్పాటు చేసిన విధానంపై సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ) ఆర్కే మాథుర్‌కు శ్రీధర్ ఫిబ్రవరిలో 2 లేఖలు రాయగా అవి ఇటీవలే బయటకొచ్చాయి. ఇలా ధర్మాసనాలు ఏర్పాటు చేస్తే సమాచార కమిషనర్ల స్వతంత్రతపై తీవ్ర అనుమానాలు రేకెత్తుతాయనీ, పారదర్శకత, జవాబుదారీతనం లేనప్పుడు ఇక ఈ సమాచార కమిషన్ ఉండటం ఎందుకని ప్రశ్నించారు. అసలేం జరిగింది.. బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎంలను 2013లో సమాచార హక్కు చట్టం పరిధిలోకి తెచ్చారు. ఆ పార్టీలు ఈ చట్టానికి కట్టుబడి సమాచారం ఇవ్వడం లేదని ఫిర్యాదులు రావడంతో వాటిపై విచారణ జరిపేందుకు 2016లో సమాచార కమిషనర్లు శ్రీధర్ సభ్యుడిగా త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటైంది. ఆరు నెలల అనంతరం కమిషనర్లకు చెప్పకుండానే మాథుర్ ఆ ధర్మాసనాన్ని రద్దు చేసి 2017 ఆగస్టులో కొత్త ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. కొత్త ధర్మాసనం ఆ ఫిర్యాదులను ఇప్పటివరకు విచారించలేదు. ప్రధాని మోదీ ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ ఉత్తీర్ణులయినట్లుగా చెబుతున్న విద్యా సంవత్సరం రికార్డులను బయటపెట్టాలని 2017లో శ్రీధర్ ఆదేశించారు. వెంటనే ఆయనను మానవ వనరుల శాఖ ఫిర్యాదులపై విచారణ బాధ్యతల నుంచి తప్పించారు. ‘కేసులను ఎవరికి అప్పగించాలనే దానిని అర్థవంతమైన పద్ధతిలో కమిషన్ సభ్యులందరూ నిర్ణయించాలి. ఫిర్యాదులను మనం ఏళ్ల తరబడి విచారించడం లేదు. కీలకమైన రాజకీయ పార్టీలపై వచ్చిన ఫిర్యాదులను విచారించకపోతే, స్వతంత్రంగా వ్యవహరించలేకపోతే ఇక మనం పారదర్శకంగా ఉన్నామని ఎలా చెప్పగలం? ఈ కమిషన్ ప్రయోజనం లేకుండా ప్రభుత్వ ఖజానాకు భారంగా మారి కొనసాగాల్సిన అవసరమేంటి?’ అని లేఖలో శ్రీధర్ ఆచార్యులు ఘాటు వ్యాఖ్యలు చేశారు.