osmania university
-
ఎంతిచ్చినా ఓయూ రుణం తీరదుపేదింటి నుంచి అమెరికాకు వెళ్లాను..
ఉస్మానియా యూనివర్సిటీ: తండ్రి స్కూల్ టీచర్. అయినా..8 మంది కుటుంబ సభ్యుల కారణంగా పేదరికం..పస్తులు తప్పలేదు. ఇంటర్ వరకు కాళ్లకు చెప్పులు కొనుక్కునే పరిస్థితి కూడా లేదు. అయినా ఎక్కడా రాజీపడకుండా బాగా కష్టపడి చదువుకొని..లక్ష్యాన్ని సాధించి అమెరికాలో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ పూర్వవిద్యార్థి గోపాల్ టీకే కృష్ణ. 77వ ఏట ఓయూలో తను చదివిన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం విద్యార్థుల తరగతి గది భవన నిర్మాణం కోసం రూ.5 కోట్ల విరాళాన్ని అందచేసి చరిత్ర సృష్టించారు. 107 ఏండ్ల ఓయూలో సుమారు కోటి మందికి పైగా విద్యార్థులు చదవుకున్నారు. దేశ ప్రధాని మొదలు సీఎంలు, మంత్రులు, ఇతర పెద్ద హోదాలలో స్థిరపడ్డారు. కానీ ఇంత వరకు ఎవరు కూడా వ్యక్తిగతంగా రూ.5 కోట్లను విరాళంగా ఇవ్వలేదు. గోపాల్ టీకే కృష్ణ తొలిసారి ఓయూకు రూ.5 కోట్ల చెక్కును అందచేసి ‘ఎంతిచ్చినా ఓయూ రుణం తీర్చుకోలేను. ఇక్కడ చదివిన చదువే నాకు ఎంతగానో తోడ్పడింది’ అని చెప్పడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. పేదరికం నుంచి ఎదిగి.. గోపాల్ టీకే కృçష్ణ పూర్వీకులది ఏపీలోని ఏలూరు జిల్లా. కానీ తమిళనాడులోని కోయంబత్తూరులో స్థిరపడ్డారు. కొన్నేళ్లు వారి కుటుంబం హైదరాబాద్‌లోని నారాయణగూడలో నివాసం ఉన్నారు. గోపాల్ కృష్ణ తండ్రి టీకే శ్రీనివాస చారి, తల్లి లక్ష్మీరాజమళ్. వీరికి 6 మంది సంతానం. అందులో నలుగురు అబ్బాయిలు. ఇద్దరు అమ్మాయిలు. శ్రీనివాసచారి తల్లిదండ్రులు కూడా కలిసి మొత్తం ఎనిమిది మంది కుటుంబ సభ్యులు ఒకే ఇంట్లో ఉండేవారు. శ్రీనివాస చారి అబిడ్స్‌లో మెథడిస్ట్ హైసూ్కల్లో టీచర్‌గా పని చేశారు. రెండో సంతానం అయిన గోపాల టీకే కృష్ణ దేశ స్వాతంత్య్ర పోరాటం సమయంలో 1947, ఫిబ్రవరి 16న జమ్మించారు. ఆ సమయంలో స్వాతంత్య్రం కోసం జరిగే ఉద్యమాలు, అల్లర్ల కారణంగా నారాయణగూడలోని ఇంటికి వెళ్లకుండా మెథడిస్ట్ స్కూల్లోనే 18 నెలల పాటు తలదాచుకున్నారు. తండ్రికి నెలకు రూ.270 వేతనం వలన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. అయినా కుటుంబంలో ముగ్గురు ఇంజినీర్లు, ఒకరు డాక్టర్ కోర్సు చదువుకొని విదేశాల్లో స్థిరపడ్డారు. నిజాం ట్రస్ట్ ఫండ్‌తో అమెరికాకు ఓయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి 1969లో అమెరికాకు వెళ్లినట్లు గోపాల్ టీకే కృష్ణ తెలిపారు. సెమిస్టర్‌కు రూ.99 ఫీజు, నెలకు రూ.100 నేషనల్ ఫెలోషిప్తో సెమిస్టర్‌కు రూ.99 ఫీజుతో ఇంజినీరింగ్ పూర్తి చేసి, రూ.10 వేల అప్పుతో పాటు నిజాం ట్రస్ట్ ఫండ్ రూ.1500 ఆరి్థక సహాయంతో అమెరికాకు వెళ్లినట్లు చెప్పారు. తర్వాత రూ.5 లక్షలను నిజాం ట్రస్ట్‌కు తిరిగి ఇచ్చినట్లు తెలిపారు. రిపబ్లికన్ పార్టీ చైర్మన్‌గా.. అమెరికాలోని అయోవా స్టేట్‌లో రిపబ్లికన్ పార్టీకి మూడు సార్లు చైర్మన్‌గా ఎన్నికయినట్లు తెలిపారు. ఎనిమిది భాషలు తెలిసిన గోపాల్ కృష్ణ అయోవాలో కంపెనీ ప్రారంభించి అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చారు. తన ముగ్గురు కొడుకులు డీన్ లాయర్‌గా, గోల్డెన్ గూగుల్ ఉద్యోగిగా, ఆల్విన్ నిర్మాణ రంగంలో పని చేస్తున్నట్లు తెలిపారు. తన పిల్లలకు రూపాయి కూడా ఇవ్వకుండా ఓయూకు రూ.5 కోట్లను అందచేసినట్లు తెలిపారు. -
భారతీయ విద్యార్ధుల్లో... అమెరికా క్రేజ్ తగ్గింది!
ఉన్నత విద్యార్జనకు సంబంధించి ప్రస్తుతం బారతీయ విద్యార్ధుల్లో అమెరికాపై ఉన్న అధిక ఆసక్తి తగ్గుముఖం పట్టిందని ప్రముఖ యుకె వర్సిటీ అసెక్స్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వల్ల విదేశీ విద్యావకాశాలు మరింతగా భారతీయులకు అందుబాటులోకి వస్తాయన్నారు. భారత్‌లో ఇటీవలే కార్యకలాపాలు ప్రారంభించిన యుకెలోని ప్రతిష్ఠాత్మక ఎసెక్స్ వర్సిటీ హైదరాబాద్‌కు చెంది ఉస్మానియా విశ్వవిద్యాలయంతో తొలి భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ నేపధ్యంలో నగరానికి వచ్చిన ఎసెక్స్ కమ్యూనికేషన్స్ అండ్ ఎక్స్టర్నల్ రిలేషన్స్ డైరెక్టర్ వెనెస్సా పోట్టెర్, భారతీయ ప్రతినిధి సందీప్ శర్మ, లు ‘సాక్షి’తో ముచ్చటించారు. వారు పంచుకున్న విశేషాలు వారి మాటల్లోనే... అరవైఏళ్ల...వర్సిటీ మాది... యునైటెడ్ కింగ్డమ్లో ఉన్న అత్యంత ప్రతిష్టాత్మక వర్సిటీ మా ఎసెక్స్. దీనిని 1964లో తొలి ఏడాది 122 మంది విద్యార్ధులతో ప్రారంభించగా ఇప్పుడు 17వేల మందికి చేరింది. యూనివర్సిటీ 3 క్యాంపస్‌లను నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 140 దేశాలకు చెందిన విద్యార్ధులు చదువుతున్నారు. పూర్వ విద్యార్ధుల అలుమ్ని సంఖ్య దాదాపుగా 1లక్షకుపైనే ఉంది. టైమ్స్ హయ్యర్ ఎడ్యకేషన్ అవార్డ్స్‌లో యూనివర్సిటి ఆఫ్ ద ఇయర్‌గా, అలాగే రిసెర్చ్ క్వాలిటీ పరంగా టాప్ 25లోనూ ఉంది. 2వేల మంది భారతీయ విద్యార్ధులే లక్ష్యం... అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు ఇక్కడ ఆఫ్‌షోర్ క్యాంపస్‌లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న సమయంలో, మా పబ్లిక్ రీసెర్చ్ విశ్వవిద్యాలయం ఒక దశాబ్దానికి పైగా భారత్‌లో కార్యాలయాన్ని కలిగి ఉంది. అలాగే పరిశోధనా రంగంలో మా విజయాలే పునాదిగా 2022–2023 విద్యా సంవత్సరంలో మేం 2,000 మంది భారతీయ విద్యార్థులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అదే విధంగా మేం అందించే స్కాలర్‌షిప్‌ల శ్రేణి కూడా అత్యంత ఆకర్షణీయమైన అంశం. కంప్యూటర్‌సైన్స్, బిజినెస్ ఇంజనీరింగ్ కోర్సుకి ఇండియా నుంచి బాగా డిమాండ్ ఉంది. ఈ ఏడాది ఇక్కడ నుంచి 2వేల మంది విద్యార్ధుల్ని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. ఏ యూనివర్సిటీలో అయినా స్కాలర్షిప్స్ కోసం విడిగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎసెక్స్‌లో అర్హతను బట్టి వర్సిటీ నుంచి అది మంజూరైపోతుంది. జాతీయ విద్యా విధానంతో మేలు... జాతీయ విద్యా విధానాన్ని స్వాగతిస్తున్నాము ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. జాతీయ విద్యా విధానం అంతర్జాతీయ విద్యావకాశాలను మరింత విస్త్రుతం చేస్తుంది. పలు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలకు, ముఖ్యంగా భారతదేశంలో పదేళ్లుగా ఉనికిని కలిగి ఉన్న ఎసెక్స్కు బాగా ప్రయోజనకరం. ఈ విద్యా విధానం భారతదేశంలో క్యాంపస్‌లను ఏర్పాటు చేయడానికి విదేశీ విశ్వవిద్యాలయాలను అనుమతిస్తుంది. ఇందుకు అనుగుణంగా మేం ఇప్పటికే గుజరాత్‌లోని సంస్థలతో మాట్లాడుతున్నాము. కోవిడ్.. మాకు ట్రాన్స్‌నేషనల్ ఎడ్యుకేషన్ ఏర్పాట్ల పరంగా సృజనాత్మక అవకాశాలను అందించింది. . ఉస్మానియా...మా తొలి భాగస్వామి... ఇండియాలో ఇప్పటికి 19 భాగస్వాములను ఏర్పరచుకున్నాం. తెలంగాణలోని ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీతో తొలి ఒప్పందం కలిగి ఉన్నాం. మరిన్ని కొత్త భాగస్వామ్యాలను పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఈ తరహా భాగస్వామ్యాల్లో బాగా అనుభవం ఉన్నవి కొన్నే కాబట్టి భాగస్వామ్యాలలు నెలకొల్పడానికి ఎక్కువ సమయం పడుతుందని అనుకుంటున్నాం. మా భాగస్వాముల కోసం విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలు, ఉమ్మడి పీహెచ్డీ పర్యవేక్షణ, ఉమ్మడి బోధన మరెన్నో రకాల భాగస్వామ్యాల పోర్ట్‌ఫోలియో మా స్వంతం. ఇక సృజనాత్మక కార్యక్రమాల జాబితాకు అంతేలేదు. చాలా వరకూ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు భాగస్వాముల ప్రయోజనాల గురించి ఆలోచన లేకుండా తెలివైన విద్యార్థులను ఎంపిక చేసుకుంటాయి. కానీ మేం పరస్పర ప్రయోజనాలను కోరుకుంటున్నాం. పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మేలు కలిగించే భాగస్వామ్యాలను కోరుకుంటున్నాము. హైదరాబాద్ మాకు చాలా ముఖ్యమైన నగరం... చాలా ముఖ్యమైన ఆసక్తికరమైన భాగస్వామిగా హైదరాబాద్‌ను పరిగణిస్తాం. సంప్రదాయంగా చూస్తే హైదరాబాద్ నగరం నుంచి అమెరికాకు ఎక్కువ దరఖాస్తులు వెళతాయి. అయితే గత మూడేళ్లుగా ఇది మారింది. ఇటీవల ఆ క్రేజ్ యుఎస్ నుంచి యుకెకు బదిలీ అయింది. మాకు వచ్చే దరఖాస్తుల సంఖ్యలో 200శాతం పెరుగుదల ఉంది. తెలంగాణ నుంచే కాకుండా భారత్ నుంచి మాకు వస్తున్న విద్యార్ధుల్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, కంప్యూటర్‌సైన్స్, డేటా సైన్స్... వంటివి ఎంచుకునేవారు ఎక్కువగా ఉన్నారు. ఒకేసారి 2 సబ్జెక్ట్స్ కలిసి చదవడం అనే ట్రెండ్‌ని వీరు అనుసరిస్తున్నారు. ముఖ్యంగా బిజినెస్ విత్ కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్ విత్ కంప్యూటర్ సైన్స్.. ఇలా కలిపి చదువుతున్నారు. (చదవండి: బస్‌భవన్‌లో స్వతంత్ర వజ్రోత్సవాలకు నరసింహ.. సత్తయ్య..) -
ఓయూలో ఐడియాలకు ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్(ఉస్మానియా యూనివర్సిటీ): ఓయూ టెక్నాలజీ కాలేజీ (సాంకేతిక విద్య) వివిధ రకాల న్యూ ఐడియాలను (కొత్త ఆలోచనలు) ఆహ్వానిస్తోంది. శుక్రవారం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రిన్సిపాల్ ప్రొ.చింత సాయిలు మాట్లాడుతూ కొత్త ఆలోచణలు, ఆవిష్కరణల అభివృద్ధికి కాలేజీలో ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అభివృద్ధి, పరిశ్రమల స్థాపనకు తోడ్పడేలా ఎవరైనా ఎలాంటి ఐడియాలు ఉన్నా తమతో షేర్ చేసుకోవచ్చన్నారు. స్వీకరించిన ఐడియాలపై పరిశోధనలు జరిపి సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్ది సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు దోహదపడేలా చేస్తామన్నారు. దీనిపై 9959167505, 9849636589 నంబర్లకు ఫోన్ చేయవచ్చన్నారు. కేంద్ర ప్రభత్వ మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ ఏర్పాటు చేసిన ఐడియా హ్యాకథాన్‌కు ఓయూ టెక్నాలజీ కాలేజీ నుంచి 10 కొత్త ఐడియాలను పంపించామన్నారు. అందులో ప్రిన్సిపాల్ ప్రొ.చింత సాయిలు, ప్రొ.తాటి జ్యోతి, పరిశోధక విద్యార్థి అభిలాష్ సమర్పించిన వ్యర్థ జలాల శుద్ధి, మైక్రోబియల్ ఫ్యూయల్ సెల్ ఉపయోగించి విద్యుత్తు ఉత్పత్తి తయారు అనే ఐడియాలు ఎంపికయ్యాయని వివరించారు. ఓయూ క్యాంపస్ టెక్నాలజీ కాలేజీలో 2022–23 విద్యా సంవత్సరం నుంచి 60 సీట్లతో కొత్తగా బీఫార్మసీ కోర్సును ప్రారంభిస్తున్నట్లు, టెక్స్టైల్స్ టెక్నాలజీ కోర్సులో 30 నుంచి 60 సీట్లకు పెంచుతున్నట్లు ప్రిన్సిపాల్ సాయిలు వివరించారు. చదవండి: నా కళ్ల ముందే కొట్టుకుపోయాయి: రాజాసింగ్ -
HYD: ప్రధాని మోదీ సభ ఎఫెక్ట్.. ఓయూలో ఉద్రిక్తత
తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న వేళ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. వర్సిటీలో అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని విద్యార్థుల సంఘాలు ధర్నాకు దిగాయి. ఈ సందర్భంగానే నిరసనకారులపై పెట్టిన కేసులను కూడా ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న ప్రధాని మోదీ సభ వద్ద నిరసనలు తెలపాలని అటుగా వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో, పోలీసులు అప్రమత్తమై విద్యార్థి సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఇది కూడా చదవండి: బీజేపీ సమావేశాలు.. తెలంగాణ పోలీస్ అత్యుత్సాహం -
ఓయూలో రాహుల్ హీట్
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు వేసవి ఎండలతో వాతావరణం వేడెక్కుతుండగా.. మరోవైపు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పొలిటికల్ హీట్ రగులుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్న నేపథ్యంలో ఓయూలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమానికి వైస్ చాన్స్‌లర్ నిరాకరించారు. ఈ నేపథ్యంలోనే ఓయూలోని పరిపాలన కార్యాలయంపై కొంతమంది దాడులకు పాల్పడటంతో కేసుల నమోదు, అరెస్టులు, రిమాండ్ వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. కొన్నాళ్లుగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కొన్ని పరిణామాలు చోటుచేసుకున్నాయి. వీసీ రవీందర్ ఏడాది క్రితం బాధ్యతలు చేపట్టిన తర్వాత సంస్కరణల దిశగా అడుగులేశారు. పీహెచ్‌డీల కాలవ్యవధిని నిక్కచ్చిగా అమలు చేయాలనే ఉద్దేశంతో పాటు క్యాంపస్ పరిధిలో భద్రత ఏర్పాట్లలో కొత్త వ్యక్తుల నియామకం, హాస్టళ్ళపై నిరంతర నిఘా వంటి చర్యలపై విద్యార్థుల నుంచి వ్యతిరేకత కన్పిస్తోంది. దీనికి తోడుగా రాహుల్ గాంధీ అంశం తెరమీదికి రావడంతో ఉద్రిక్తతలకు దారి తీసింది. వివాదానికి కారణమేంటి? రాహుల్ ముఖాముఖి వివాదంపై విభిన్న వాదనలు విన్పిస్తున్నాయి. చారిత్రక నేపథ్యం ఉన్న ఓయూకి జాతీయ నాయకులను అనుమతిస్తే వర్సిటీకి మరింత బలం చేకూరుతుందని విద్యార్థులు చెబుతుండగా.. విద్య, రాజకీయాలను వేర్వేరుగా చూడటం సరికాదని కాలేజీ రాజకీయ విభాగం అధ్యాపకుడు ఒకరు వ్యాఖ్యానించారు. అనేక సందర్భాల్లో రాజకీయ ప్రముఖులను ఆహ్వానించడం సాధారణమేనన్నారు. రాహుల్ ముఖాముఖిని ఈ కోణంలోనే చూస్తే వివాదం ఉండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఓయూ క్యాంపస్‌లోకి రాజకీయ కార్యకలాపాలను అనుమతించవద్దనే నిర్ణయం తీసుకున్నామని వీసీ రవీందర్ అంటుండగా.. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే ఈ విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారని ఓయూ విద్యార్థి నిరుద్యోగ ఫ్రంట్ చైర్మన్ చనగాని దయాకర్ చెబుతుండడం గమనార్హం. (చదవండి: ఓయూ రగడ.. ఆగని అరెస్టులు) -
రాహుల్ రాకపై కాక!
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ సందర్శన వ్యవహారం మరింత ముదురుతోంది. రాజకీయాలకు అతీతంగా రాహుల్ ఓయూకి వస్తారంటూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, వీహెచ్ ఓయూ వీసీని కలిసి అనుమతి కోరినా.. రాజకీయ సభలకు అనుమతి లేదంటూ తిరస్కరించడంతో కాంగ్రెస్ అనుబంధ విభాగాలు ఆందోళనకు దిగాయి. ఓయూ విద్యార్థి నేతలు ఆదివారం మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి యత్నించారు. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ వైస్ చాన్స్‌లర్ (వీసీ) చాంబర్ ముందు చీరలు, గాజులు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు. ఈ విద్యార్థి నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడం, వారిని పరామర్శించేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వర్సిటీ, పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓయూలో రాహుల్ పర్యటనకు అనుమతించాల్సిందిగా వీసీ ని సోమవారం మరోమారు కలవాలని నిర్ణయించారు. రెండు చోట్ల నిరసనలతో.. రాహుల్ ఓయూ పర్యటనకు అనుమతి నిరాకరించడాన్ని తప్పుబడుతూ ఓయూ నిరుద్యోగ జేఏసీ నేత కె.మానవతా రాయ్, నాయకులు చెనగాని దయాకర్, లోకేశ్‌యాదవ్, మరికొందరు నేతలు బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌ను ముట్టడించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్ కు తరలించారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి అక్కడికి చేరుకుని వారిని పరామర్శించారు. మరోవైపు ఎన్ఎస్యూఐ రాష్ట అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు వీసీ చాంబర్ వద్ద ఆందోళనకు దిగారు. గులాబీ రంగు చీర, జాకెట్, గాజులు, పూలు తీసుకొచ్చి వీసీ రవిందర్కు అందజేస్తామంటూ నిరసన చేపట్టారు. కార్యాలయం తలుపులను í మూసేయడంతో అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసులు వెంకట్‌తో పాటు ఇతర నేతలను అరెస్టు చేశారు. ఎన్ఎస్ యూఐ నేతలను పరామర్శించేందుకు జగ్గారెడ్డి బయలుదేరుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నియంత రాజ్యంలో ఉన్నామా? ఓయూలో రాహుల్ సమావేశానికి అనుమతివ్వకపోవడం, జగ్గారెడ్డి అరెస్టుపై కాంగ్రెస్ వర్గాలు భగ్గుమన్నాయి. వర్సిటీ అధికారులు టీఆర్ఎస్కు గులాముల్లా పనిచేస్తున్నారని మం డిపడ్డాయి. టీఆర్ఎస్ నేతలు ఆర్ట్స్ కాలేజీ ఎదుట సభలు పెట్టినా పట్టించుకోని అధికారులు.. ఇతర సంఘాల కార్యక్రమాలకు అనుమతించకపోవడం దారుణమన్నాయి. ► విద్యార్థి నేతలను పరామర్శించేందుకు వెళ్తున్న జగ్గారెడ్డి అరెస్టు చేయడం దారుణమని.. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామో, నియంత రాజ్యంలో ఉన్నామో అర్థం కావడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఉస్మానియాకు వస్తానంటే అడ్డుకోవడం ఎందుకని నిలదీశారు. ► జగ్గారెడ్డి, వెంకట్, విద్యార్థి నేతల అరెస్టు సరికాదని టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చిన సోనియా కుటుంబానికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. ► రాహుల్ సమావేశానికి అనుమతి ఇవ్వకపోవడం దురదృష్టకరమని, రాష్ట్రంలో వాక్ స్వాతంత్య్రాన్ని హరిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. ► జగ్గారెడ్డి, విద్యార్థి నేతల అరెస్టును టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, మాజీ ఎంపీ మల్లురవి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య తదితరులు ఖండించారు. ► ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వీహెచ్, మధుయాష్కీ, గీతారెడ్డి తదితరులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జగ్గారెడ్డి, విద్యార్థి నేతలకు సంఘీభావాన్ని ప్రకటించారు. ► నేడు కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం బల్మూరి వెంకట్, ఇతర నేతల అరెస్టులకు నిరసనగా సోమ వారం రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేయాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. నేడు మళ్లీ ఓయూకు కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే జగ్గారెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధి బృందం సోమవారం మరోమారు ఉస్మానియా వర్సిటీకి వెళ్లి రాహుల్ పర్యటనకు అనుమతించాలని కోరనుంది. ఆదివారం బంజారాహిల్స్ పీఎస్ నుంచి బయటికి వచ్చాక జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఉస్మానియా విద్యార్థుల బలిదానాలపైనే టీఆర్ఎస్ నేతలు సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అయ్యారని.. కానీ ప్రస్తుత పరిణామాలను చూసి అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయన్నారు. రాహుల్ పర్యటనకు అనుమతి కోసం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఓయూ వీసీని కలుస్తామని చెప్పారు. పార్టీ జెండాలు, కండువాలు లేకుండా రాహుల్‌తో పాటు ముగ్గురు ఎంపీలు, ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ మాత్రమే ఓయూకు వస్తామని చెప్తామని.. వీసీ అనుమతివ్వకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ప్రభుత్వం అడ్డుకోవాలని చూసినా రాహుల్‌ను ఓయూకు తీసుకెళ్లి తీరుతామన్నారు. -
అన్యాయాలపై సంధించిన సూటి ప్రశ్న!
మోసం పునాదులమీద నిలబడ్డ మీ సంకుచిత మత విశ్వాసాలని ధ్వంసం చేస్తాను కూకటివేళ్లతో సమూలంగా పెకలించి వేస్తాను మతవిద్వేషపు కళంకాన్ని ఊడ్చేస్తూ నా ఆశలు సగర్వంగా ఆకాశంలో ఎగురుతాయి – జోష్ మలీహాబాదీ అది 1972 ఏప్రిల్ 14 సాయంత్రం. జార్జిని ధూల్ పేట కిరాయి గూండాలు హత్య చేశారని ఒక మిత్రుడు హడావుడిగా వచ్చి చెప్పాడు. నమ్మలేదు. హిమాయత్ నగర్లో ఉన్న మరొక మిత్రుని దగ్గరకు వెళ్లే సరికి అప్పటికే జార్జి హత్యపై తాను రాసిన కరపత్రంతో కనిపించాడు. చావు అంత తేలికగా తన దగ్గరకు రాదని జార్జి తరచూ మాతో చెప్పేవాడు. ఏప్రిల్ 15న డీడీ కాలనీలోని ఇంటిదగ్గర శవపేటికలో జార్జి మృత దేహం మా కళ్ళముందున్నది. తన దేహంపై 32 కత్తిపోట్లు... హంతకుల ద్వేషానికి సాక్ష్యంగా! రెండువేల మంది విద్యార్థులు గుమికూడారు. కన్నీళ్ళు, నిశ్శబ్దం అలుముకున్న ఉద్విగ్న విషాద వాతావరణం. అంతలో ఎవరిదో ఒక గొంతు నుండి ‘జార్జిరెడ్డి అమర్ రహే’ నినాదం! వేల గొంతులు ఒక్కటిగా పిక్కటిల్లాయి. ఆర్ఎస్ఎస్ కార్యాలయం ముందునుంచి జార్జి శవయాత్ర సాగేటప్పుడు కట్టలు తెగిన ఉద్రేకం! మేము అప్పుడు నిగ్రహం పాటించకపోతే ఏమయ్యేదో తెలియదు. జార్జిని నారాయణగూడ శ్మశానవాటికలో ఖననం చేశాం. ఎవరీ జార్జి? అత్యంత ప్రతిభాశాలియైన విద్యార్థి. అణుభౌతిక శాస్త్రంలో స్వర్ణపతక గ్రహీత. పీహెచ్డీ పరిశోధనకు నమోదు చేసుకోవాలనుకున్నపుడు, ఫిజిక్స్ డిపార్ట్ మెంట్లో ప్రొఫెసర్లు ఎవరూ తనకి గైడ్‌గా ఉండడానికి సిద్ధపడలేదనీ, ఒక ఆస్ట్రానమీ ప్రొఫెసర్ ముందుకు వచ్చిన తర్వాతనే తాను పరిశోధనకు ఉపక్రమించాడనీ అనుకునేవాళ్ళు. పరీక్షా పత్రాలలో తన జవాబులను చదివిన ప్రొఫెసర్ ఒకరు తనని ప్రత్యక్షంగా చూడాలని బొంబాయి నుంచి వచ్చి కలిశాడు. అయితే జార్జిని యాభై సంవత్సరాల తర్వాత గుర్తు చేసుకుంటున్నది అసాధారణమైన ఈ ప్రతిభాపాటవాల వల్ల మాత్రమే కాదు. జార్జి అణగారిన ప్రజల గురించి ఆలోచించేవాడు. ఆ రోజులలో రిక్షాలు ఎక్కువగా ఉండేవి. ఒకసారి మేము రిక్షా కార్మికుల గురించి మాట్లాడుకుంటున్నాం. ‘ఒక మనిషి రిక్షాని ఎగువకి లాగుతుంటే, ఇంకో మనిషి ఆ రిక్షాలో కూర్చోవడాన్ని చూస్తే ఎలా అనిపిస్తుంద’ని జార్జి అడగడం నాకు గుర్తుంది. జార్జి స్వార్థంలేని మనిషి. జార్జి అత్యంత సాహసోపేతమైన వ్యక్తి. అన్యాయాన్ని సహించక ఎదురుతిరిగేవాడు. సిద్ధాంత రాజకీయ చర్చలలో ప్రశ్నలతో ఆలోచనలు రేకెత్తించేవాడు. వివిధ కళాశాలల విద్యార్థులతో అధ్యయన బృందాలు నెలకొల్పి పుస్తకాలపై చర్చించే వాడు. సైన్స్ కాలేజిలోని ఆస్ట్రానమీ డిపార్ట్ మెంట్ పక్కనే ఉండిన ఒక క్యాంటీన్ తన చర్చలకు ఒక కేంద్రంగా ఉండేది. అక్కడ కూర్చుని మేం వివిధ అంశాలపై చర్చిస్తూ జార్జి విశ్లేషణలను వింటూ ఉండేవాళ్ళం. అక్కడకు వచ్చేవాళ్ళలో ‘అట్లాస్ ష్రగ్డ్’, ‘ఫౌంటెన్ హెడ్’ వంటి అయన్ రాండ్ పుస్తకాలను చేతిలో పెట్టుకుని చర్చించే మార్క్సిస్ట్, సోషలిస్టు వ్యతిరేకులు కూడా వుండేవాళ్ళు. సైన్సు, తత్వశాస్త్రం, సిద్ధాంతం, విప్లవం వంటి అంశాలపై నిశితమైన చర్చలు అక్కడ ఉండేవి. అచ్చెరువొందించే తెలివితేటలూ, అన్యాయానికి స్పందించి తిరగబడడంతో పాటు, ప్రగతిశీల భావాలని ప్రోదిచేసి విద్యార్థులను సమీకరించిన కృషియే జార్జిని ప్రత్యేకంగా నిలబెట్టింది. నిర్దిష్టమైన పోలికలు లేకపోయినా జార్జి... తన నడక, నడవడికలతో విప్లవ స్ఫూర్తి ‘చే గువేరా’ని స్ఫురింపజేసేవాడు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో సైన్స్ గ్రాడ్యుయేషన్ విద్యార్థిగా ఉన్న నాకు జార్జి సహచరునిగా పనిచేసే అవకాశం లభించింది. జార్జి మరణం తర్వాత పీడీఎస్‌యూ ఆవిర్భావానికి దారులు వేసిన ప్రగతిశీల విద్యార్థుల బృందంలో నేనొకడిని. ఆనాటి పరిస్థితులపై ‘క్రైసిస్ ఇన్ క్యాంపస్’ పేరుతో ఒక డాక్యుమెంటరీ వచ్చింది. అందులో జార్జి సమాజంలో హింస గురించీ, ధిక్కారాన్ని సహించని వ్యవస్థ శాంతియుత నిరసనను ఎలా హింసతో అణచివేస్తుందో వివరిస్తాడు. ఆ చర్చ, ప్రశ్నలు ఇప్పటికీ వర్తించేవే. ‘చావు మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఎప్పుడైనా రావచ్చున’నే చే గువేరా మాటలని జార్జి ఉటంకించేవాడు. జార్జి జీవితం చావును ధిక్కరించడంలో వుంది. జార్జి మరణం సమాజంలో అన్యాయాలపై సంధించిన సూటైన ప్రశ్న! (క్లిక్: ఉస్మానియా ఎరుపెక్కిన వేళ...) 1960ల నాటి విప్లవ జ్వాల... జార్జి వంటి అసాధారణమైన వ్యక్తులను సృష్టించింది. ప్రజల కోసం మరణించిన స్ఫూర్తిగా జార్జి కొనసాగుతున్నాడు. సంక్లిష్టమైన పరిస్థితులలో, వేర్వేరు రూపాలలో జార్జి వారసత్వం ఈనాటికీ కొనసాగుతూనేవుంది. జార్జి ఆలోచనలూ, రేకెత్తించిన ప్రశ్నలూ, మెరుగైన సమసమాజ స్వప్నాలూ ఇంకా సజీవంగానే వున్నాయి. ఆ స్వప్నాలను ఎవ్వరూ చిదిమి వేయలేరు. యాభై సంవత్సరాల తర్వాత కూడా చావును ఎదిరించి గేలి చేసిన ధిక్కారానికి ప్రతీకగా, సజీవంగా జార్జి నిలిచి వున్నాడు! (క్లిక్: మలి అంబేడ్కరిజమే మేలు!) - బి. ప్రదీప్ వ్యాసకర్త జార్జిరెడ్డి సహచరుడు bpkumar05@rediffmail.com -
OU: ఓయూ తీరుపై విమర్శలు.. ‘నడకకు రేటు కడితే ఎలా..?’
సాక్షి, హైదరాబాద్: దట్టమైన అడవిని తలపించే పచ్చిక బయళ్ల మధ్య ఉస్మానియా అందాలను ఆస్వాదిస్తూ నిత్యం వేలాది మంది చేసే వాకింగ్‌కు ఓయూ అధికారులు వెలకట్టారు. ఆర్థిక వనరులను సమకూర్చుకునే పనిలో భాగంగా సెక్యూరిటీ పేరుతో యూజర్ చార్జీల వసూలుకు పూనుకున్నారు. సినిమా షూటింగ్, వాకింగ్, జిమ్, గేమ్స్ ఇలా ప్రతిదానికి ఓ రేటు నిర్ణయించారు. దీనిపై యూనివర్సిటీలో నిత్యం వాకింగ్ చేసే ముషీరాబాద్, అంబర్‌పేట నియోజకవర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వాస్తవానికి డిసెంబర్ ఒకటి నుంచే యూజర్ చార్జీలు వసూలు చేయాల్సి ఉన్నప్పటికి మొదటి వారం తరువాత ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఓయూలో వాకింగ్.. మైమరిపించే అనుభూతి యూనివర్సిటీ పరిసర ప్రాంతాల వారికి ఉస్మానియా ప్రకృతి ప్రసాదించిన వరం. నిజాం కాలం నుంచి ఇప్పటివరకు ఎంతో మంది తెల్లవారు జామున 5గంటల నుంచి ఉదయం 10గంటల వరకు, సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ఇక్కడ వాకింగ్ చేసి సేద తీరుతుంటారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్, బీపీ, షుగర్ వ్యాధులున్న వారితో పాటు అధిక బరువుతో బాధపడేవారు డాక్టర్ల సూచన మేరకు క్రమం తప్పకుండా వ్యాయామం చేసేందుకు ఇక్కడకు వస్తుంటారు. యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కళాశాల, మినీ టెక్, ఐపీఈల వెనుక దట్టమైన అడవిని తలపించే మార్గంలో వాకింగ్ చేయడం ఈ ప్రాంత వాసులకు మరిచిపోలేని అనుభూతి. పొద్దున్నే పురివిప్పి నాట్యం చేసే నెమళ్ల మధ్య నడుచుకుంటూ వెళ్తుంటే మైమరచిపోయే అనుభూతి కలుగుతుంది. సామాన్యులతో పాటు హర్యాణా గరవ్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య, విద్యావేత్త చుక్కా రామయ్య ఇలా ఎంతో మంది ప్రజాప్రతినిధులు, వ్యాపార వేత్తలు, ప్రముఖులు, ఉన్నతాధికారులు యూనివర్సిటీలో వాకింగ్ అనుభూతిని పొందినవారే. దీంతోపాటు ఓయూలోని ప్లేగ్రౌండ్స్‌లో వందలాది యువత క్రికెట్, వాలీబాల్, రన్నింగ్‌తో పాటు ఇతర ఆటలు ఆడుతూ క్రీడా స్ఫూర్తిని పొందుతున్నారు. భద్రత పేరుతో బాదుడు ఉస్మానియా యూనివర్సిటీలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని, భద్రత కరువైందని, నిర్మానుష్య ప్రాంతంలో పగలు, రాత్రి అనే తేడాలేకుండా ఆకతాయిలు మద్యం సేవిస్తున్నారని.. దీనిని నియంత్రించాలనే ఉద్దేశంతోనే యూజర్ చార్జీల నిర్ణయం తీసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఏమాత్రం పసలేదని వాకర్స్ కొట్టిపడేస్తున్నారు. యూనిర్సిటీలో గత కొన్నేళ్లుగా సెక్యూరిటీ విధులు నిర్వర్తిస్తున్న పాతవారిని ఇటీవల తొలగించి రిటైర్డ్ ఆర్మీకి చెందిన వారికి ఈ బాధ్యతలను అప్పగించినట్లు తెలిసింది. వారి జీతభత్యాలను సమకూర్చుకోవడం కోసమే యూజర్ చార్జీల ఆలోచనను తీసుకువచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వేలాది మందికి ప్రతిరోజూ ఆరోగ్య ప్రధాయినిగా ఉన్న యూనివర్సిటీలో ఎంతో మంది ప్రాణవాయువు ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంటే వారినుంచి డబ్బులు వసూలు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రజలు ప్రశి్నస్తున్నారు. ఒకరిద్దరు అసాంఘిక శక్తులు ఉంటే వారిని కట్టడి చేయాలని, గస్తీని ముమ్మరం చేయాలని కోరుతున్నారు. కుటుంబంపై భారం నేను, నా భార్య ఎన్నో ఏళ్లుగా ఉస్మానియాలో వాకింగ్ చేస్తున్నాం. ఎప్పుడూ ఎటువంటి అభద్రతా భావం మాలో కలగలేదు. ఇప్పుడు అకస్మాత్తుగా వాకర్స్‌కి మెరుగైన వసతులు కల్పిస్తామని ఒక్కొక్కరి నుంచి 200 రూపాయలు వసూలు చేయడం అన్యాయం. కొంత మంది కుటుంబ సమేతంగా వాకింగ్ చేస్తారు. వారంతా నెలకు 1000 రూపాయలు వాకింగ్ కోసం చెల్లించాలంటే చాలా భారం అవుతుంది. అధికారులు ఈ నిర్ణయం పట్ల పునరాలోచన చేయాలి. –కౌండిన్యా ప్రసాద్, వాకర్ స్వేచ్ఛగా గాలి పీల్చేందుకు ఆంక్షలా..? యూనివర్సిటీ దగ్గరగా ఉందనే ఈ ప్రాంతంలో ఇళ్లు తీసుకుని ఉంటున్నాం. ప్రతి రోజు క్రమం తప్పకుండా స్నేహితులతో కలిసి వాకింగ్ చేస్తుంటా. ఇప్పుడు అకస్మాత్తుగా యూజర్ చార్జీలు వసూలు చేయడం సరైన నిర్ణయం కాదు. నిజాం కాలం నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది ఇక్కడ వాకింగ్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. అసాంఘిక కార్యక్రమాలు అరికట్టాలంటే భద్రత పెంచి గస్తీని ముమ్మరం చేయాలి. అవసరం అనుకుంటే ఉచితంగా ఐడీ కార్డులను పంపిణీ చేయాలి. –ఎం.నర్సయ్య, వాకర్ -
ఎన్జీఆర్ఐ ఉద్యోగికి డాక్టరేట్
వరంగల్ నగరానికి చెందిన ఆడేపు శ్రీధర్‌కి ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగంలో ఆయన ఈ పట్టా అందుకున్నారు. సైన్స్ కమ్యూనికేషన్ ఇన్ సీఎస్ఐఆర్ ఆర్గనైజేషన్స్ - ఏ సెంట్రో మెట్రిక్స్టడీ ఆన్ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్‌స్టిట్యూట్ అనే అంశంపై ఆయన పరిశోధన చేశారు. ఆడేపు శ్రీధర్ రీసెర్చ్ పేపర్స్ పలు జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. హబ్సిగూడలోని సీఎస్ఐఆర్ - ఎన్జీఆర్ఏలో టెక్నికల్ ఆఫీసర్ లైబ్రరీగా ఆయన ఉద్యోగం చేస్తున్నారు. -
ఓయూలో ఇండో–పసిఫిక్ స్టడీస్ ఇన్స్టిట్యూట్
సాక్షి, న్యూఢిల్లీ: ఉస్మానియా యూనివర్సిటీలో ఈ విద్యాసంవత్సరం నుంచి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండో –పసిఫిక్ స్టడీస్ కేంద్రం ప్రారంభం కానుంది. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమా ర్ నేతృత్వంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి, ఉస్మానియా వర్సిటీ ప్రతినిధులు ఈ అంశంపై శనివారం ఢిల్లీలో విదేశాంగ శాఖలోని ఆర్థిక సంబంధాల విభాగం అధికారులతో చర్చించారు. ప్రతినిధి బృందంలో ఉన్న ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, ఓయూ వైస్ చాన్స్‌లర్ డి.రవీందర్‌లు ఇండో పసిఫిక్ స్టడీస్‌కు ఉస్మానియా అనుకూలంగా ఉంటుందని విదేశాంగ శాఖకు వివరించారు. కాగా, ఈ కేంద్రం ఏర్పాటుకు సహకారం అందిస్తామని విదేశాంగ శాఖ అధికారులు హామీ ఇచ్చారు. ఓయూ పరిధిలోని సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ (ఓయూసీఐపీ)లో ఇండో పసిఫిక్ స్టడీస్ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు అధికారులు తెలిపారు. విదేశాంగ శాఖ అధికారులు ఓయూను సందర్శించాక ఇన్స్టిట్యూట్ నిర్వహణకు సంబంధించి విధివిధానాలు ఖరారు చేయనున్నారు. సామాజిక న్యాయ శాఖ నుంచి నిధులు వర్సిటీలోని సివిల్ సర్వీసెస్ అకాడమీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, వసతి గృహాలకు కేంద్ర సామాజిక న్యాయ శాఖ నుంచి నిధుల కేటాయింపునకు ఆ శాఖ కార్యదర్శి డాక్టర్ ఆర్.సుబ్రమణ్యం హామీ ఇచ్చారని ఓయూ ఓ ప్రకటనలో తెలిపింది. -
ఒక్క పరీక్షతో.. ఏడు వర్సిటీల్లో ప్రవేశం
దేశంలోనే పురాతన యూనివర్సిటీల్లో ఒకటి ఉస్మానియా యూనివర్సిటీ. దీనితోపాటు రాష్ట్రంలోని కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీలు వివిధ కోర్సులు అందిస్తున్నాయి. ఈ ఏడు యూనివర్సిటీల్లో పీజీ, పీజీ డిప్లొమా, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే.. కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్(సీపీజీఈటీ)–2021కు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షను ఈ ఏడాది ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తోంది. కోర్సులు ► సీపీజీఈటీ2021 పరీక్ష ద్వారా ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, పీజీ డిప్లొమా కోర్సులతోపాటు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఏ, ఎంఎస్సీ, ఎంబీఏ తదితర కోర్సుల్లోనూ ప్రవేశం లభిస్తుంది. ► ఈ పరీక్ష ద్వారా ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగంలో..పలు ఎంఏ కోర్సులు, జర్నలిజం /లైబ్రరీ సైన్స్/సోషల్ వెల్ఫేర్/ డెవలప్మెం ట్ స్టడీస్ /హెచ్ఆర్ఎం/టూరిజం మేనేజ్మెంట్ కోర్సుల్లో అడ్మిషన్ పొందొచ్చు. ► ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ విభాగంలో.. పురాతన భారతీయ చరిత్ర–సంస్కృతి, పురావస్తు శాస్త్రం(ఏఐహెచ్‌సీఏ), హిందీ, ఇస్లామిక్ స్టడీస్, పర్షియన్, తెలుగు, ఉర్దూ, అరబిక్, ఇంగ్లిష్, కన్నడ, మరాఠీ, సంస్కృతం, తమిళ సబ్జెక్టులు, థియేటర్ ఆర్ట్స్ కోర్సులు ఉన్నాయి. ► ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్‌లో.. ఎంకామ్, ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యు కేషన్లో ఎంఈడీ, ఎంపీఈడీ; ► ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ విభాగంలో.. బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రాని క్స్, జియో ఇన్ఫర్మేటిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, జువాలజీ, బయోకెమిస్ట్రీ /బయోటెక్నాలజీ/ఎన్విరాన్మెంటల్ సైన్స్/ఫోరెన్సిక్ సైన్స్/ మైక్రోబయాలజీ/ జెనెటి క్స్, న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ వంటి సబ్జెక్టులు ఉన్నాయి. అర్హతలు ► సీపీజీఈటీ–2021కు సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్(బీఏ/బీకామ్/బీఎస్సీ తత్సమాన కోర్సులు) పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫైనల్ ఇయర్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే. ► బీఏ/బీఎస్సీ/బీకామ్/బీఈ/బీటెక్/బీఫార్మసీ/ ఎల్ఎల్బీ(ఐదేళ్లు)/బీసీఏ వంటి కోర్సులు చదివినవారు ఏయే కోర్సులకు తమ విద్యార్హతలు సరిపోతాయో దరఖాస్తు చేసుకునే ముందు సరిచూసుకోవాలి. ► ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులైన ఎమ్మెస్సీ/ఎంబీఏ/ఎంఏ కోర్సులకు ఇంటర్మీడియట్ (10+2) పూర్తి చేసినవారు అర్హులు. ∙పీజీ డిప్లొమా కోర్సులకు గ్రాడ్యుయేషన్ (ఆయా కోర్సులను బట్టి) పూర్తిచేసి ఉండాలి. ► ఓపెన్/దూర విద్య విధానంలో ఒకే సబ్జెక్టుతో గ్రాడ్యుయేట్ కోర్సు పూర్తి చేసినవారు పీజీ కోర్సులకు అర్హులు కారు. ► బీకామ్ అభ్యర్థులు ఎంఏ ఎకనామిక్స్ చేసేందుకు అనర్హులు. ∙ఎంఏ లాంగ్వేజెస్ కోర్సులకు బీఈ/బీటెక్ వంటి కోర్సులు చేసినవారు అనర్హులు. ► బీఎస్సీ(ఎంఎల్టీ)/బీఎస్సీ(నర్సింగ్)/బీఎస్సీ (అగ్రికల్చర్)/బీఫార్మసీ/బీఎస్సీ(హోమ్‌సైన్స్) /బీటెక్/బీఈ వారు ఎమ్మెస్సీ కోర్సులకు అనర్హులు. ► బీఈ/బీటెక్ అభ్యర్థులు ఎమ్మెస్సీ జియో ఇన్ఫర్మేటిక్స్ , ఫుడ్‌సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో పరీక్ష ఉస్మానియా యూనివర్సిటీ టీఎస్ సీపీజీఈటీను మొత్తం 94 సబ్జెక్టుల్లో నిర్వహిస్తుంది. అభ్యర్థి తన అర్హతలను బట్టి ఆయా కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంట్రన్స్ ఆన్లైన్ విధానంలో(కంప్యూటర్ ఆధారిత పరీక్ష) జరుగుతుంది. 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు జవాబులు గుర్తించాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 100 ప్రశ్నలకు 100 మార్కులుంటాయి. అభ్యర్థుల అర్హత, ఎంచుకునే కోర్సులను బట్టి పరీక్ష పేపర్లలో తేడాలుంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు. ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ► ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 25.08.2021 ► రూ.500 ఆలస్య రుసుంతో చివరి తేది: 30.08.2021 ► రూ.2000 ఆలస్య రుసుంతో చివరి తేది: 03.09.2021 ► సీపీజీఈటీ– 2021 పరీక్ష తేది: 08.09.2021 ► వివరాలకు వెబ్సైట్: www.tscpget.com -
కృత్రిమ గుండె తయారీపై..ఓయూలో పరిశోధన
ఉస్మానియా యూనివర్సిటీ: కృత్రిమ గుండె తయారీపై ఉస్మానియా విశ్వవిద్యాలయం దృష్టి సారించింది. ఇంజనీరింగ్ కాలేజీలోని సెంటర్ ఫర్ ప్రోడక్ట్ డిజైన్ డెవలఫ్‌మెంట్ ఆడిటివ్ మేనేజ్మెంట్ (సీపీడీడీఏఎం), ఉస్మానియా మెకానికల్ ఇంజ నీరింగ్ విభాగాలు సంయుక్తంగా ఈ పరిశోధన చేస్తున్నాయి. త్రీడీ ప్రింటింగ్ సాంకేతిక పరిజ్ఞానంతో ఇప్పటికే ఎముకలు, దంతాలు, మోకాలి చిప్పలు, ఏరోస్పేస్, ఆటోమొబైల్ వస్తువుల తయారీలో అనుభవం సంపాదించిన పరిశోధకులు.. తాజాగా కృత్రిమ గుండె తయారీపై దృష్టి సారించారు. గుండె ఆకృతి రూపకల్పనకు సంబంధించిన కార్యకలాపాలు ఇప్పటికే 50 శాతం పూర్తి చేశారు. మరో 6 నెలల్లో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే తయారుచేసిన గుండె పనితీరును ముందు జంతువులపై ప్రయోగించనున్నారు. ఆశించిన ఫలితాలు వచ్చిన తర్వాతే మానవులకు అమర్చనున్నారు. ఈ కృత్రిమ గుండె రూప కల్పన పరిశోధనలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ నేతృత్వంలో జరుగుతున్న ఈ పరిశోధనలో డాక్టర్ ఎల్.శివరామకృష్ణ, డాక్టర్ మధుసూదన్‌రాజు సహా మరో ముగ్గురు పరిశోధక విద్యార్థులు పాల్గొంటున్నారు. ఇప్పటికే అమెరికాలో కృత్రిమ గుండెను తయారు చేశారు. దానికి అమర్చిన బ్యాటరీ బరువు రెండున్నర కేజీలకుపైగా ఉంది. బ్యాటరీ బరువును 500 గ్రాములకు తగ్గించారు. గుండెకు సమీపంలో ఛాతీ లోపలే బ్యాటరీ అమర్చే వెసులుబాటును కల్పించేలా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. రూసా నిధులతో అభివృద్ధి: సీపీడీడీఏఎం డైరెక్టర్ శ్రీరామ్ వెంకటేశ్ ‘రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్ష అభియాన్ (రూసా) ప్రాజెక్టు ద్వారా వచ్చిన రూ.5.5 కోట్లతో వర్సిటీలో ఈ సీపీడీడీఏఎం అభివృద్ధి చేశాం. సహజమైన గుండె పనితీరుకు ఏ మాత్రం తీసి పోనివిధంగా దీన్ని తీర్చిదిద్దుతున్నాం. కేబుల్‌తో పనిలేకుండా ఛాతీ లోపల ఉన్న బ్యాటరీనీ ఎప్పుడంటే అప్పుడు రీచార్జి చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాం. గుండెపైనే కాకుండా కాలేయం, ఊపిరితిత్తులపై కూడా పరిశోధనలు చేస్తున్నాం.’ చదవండి: ‘టి ఫైబర్’తో రైతు వేదికలకు ఇంటర్నెట్.. -
‘కేటీఆర్ ఎక్కడ.. 12 కోట్ల జాబులను వెతుకుతున్నాను’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం ఉద్యోగాల కల్పన చుట్టే తిరుగుతున్నాయి. అధికార పక్షం, విపక్షాల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాల కల్పన మీద అధికార పార్టీని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై బీజేపీ నాయకులు టీఆర్ఎస్పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ తాము ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలు కల్పించామని చెప్పగా.. దీనిపై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. ఉద్యోగాల కల్పనపై ఉస్మానియా యూనివర్శిటీ సాక్షిగా చర్చకు రావాల్సిందిగా బీజేపీ నాయకుడు రామ చందర్ రావు కేటీఆర్‌కు సవాల్ విసిరారు. దీనికి బదులుగా కేటీఆర్ బీజేపీ తెలంగాణకు ఏం చేసిందో చెప్తానన్నారు. సవాల్ ప్రకారం రామచందర్ రావు సోమవారం ఉదయం ఓయూకు వెళ్లారు. కేటీఆర్ అక్కడకు రాలేదని తెలుపుతూ రామచందర్ రావు ట్వీట్ చేశారు. 'నేను ఆర్ట్స్ కాలేజీ వద్ద ఉన్నాను.. ఎక్కడున్నావు మిస్టర్ కేటీఆర్?' అంటూ ఆయన ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. దీనిపై స్పందిస్తూ రామచందర్ రావుకి కేటీఆర్ చురకలంటించారు. ప్రధాని మోదీ అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను కేటీఆర్ గుర్తు చేశారు. ఈ మేరకు ‘‘మీరు అధికారంలోకి వస్తే ఏడాదికి 2 కోట్ల చొప్పున ఉద్యోగాలు(ఇప్పటి వరకు 12 కోట్ల జాబ్స్).. జన్‌ధన్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు జమ చేస్తానని చెప్పారు కదా. వీటిని ఎంత వరకు నెరవేర్చరా అనే దాని గురించి సమాచారం సేకరించే పనిలో నేను బిజీగా ఉన్నాను. దీనికి ఎన్డీఏ సమాధానం చెప్పాలి. అసలు ఎన్డీఏ అంటే నో డాటా అవైలబుల్’’ అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. తన ప్రశ్నలకు సమాధానం ఉంటే షేర్ చేయాలని ఆయన సవాలు విసిరారు. I am busy gathering information on the 12 crore jobs (2Cr per year) & ₹15 lakhs in all Jandhan accounts promised by Hon’ble PM Shri Modi Ji NDA is the answer so far N - No D - Data A - Available Please share if you have any answers https://t.co/NQf2FFF74z — KTR (@KTRTRS) March 1, 2021 చదవండి: 1.34 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం పట్టభద్రుల పోరు.. బరిలో కోటీశ్వరులు -
ఓయూలో ఔటర్స్ ఖాళీ చేయాల్సిందే
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ కోవిడ్-19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని అన్ని హాస్టళ్లను మూసివేసిన సంగతి మనకు తెలిసిందే. విద్యార్థులకు నష్టం కలుగకుండా ఆన్లైన్ లో తరగతులు నిర్వహించింది. అయితే, ఇటీవల కొంత కాలం నుంచి అక్కడ అనధికారికంగా ఉంటున్న వారి కారణంగా యూనివర్సిటీలో శాంతిభద్రతల సమస్య ఉన్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పేర్కొన్నారు. కోవిడ్-19 నేపథ్యంలో వర్సిటీలోని హాస్టళ్లు మూసివేసినా కూడా కొందరు విద్యార్థుల ముసుగులో హాస్టల్లో ఉంటున్నారు అని పేర్కొన్నారు. హాస్టల్స్‌లో అక్రమంగా బస చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎవరైతే అనధికారికంగా హాస్టళ్లలో ఉంటున్నారో వారంతా తమకు సమాచారం ఇచ్చి, ఖాళీ చేయాల్సిందేనని అన్నారు. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవు అని పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హెచ్చరించారు. -
మేయర్‌ను కలిసిన ఉస్మానియా విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: మేయర్ బొంతురామ్మోహన్‌ను శనివారం ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యాలయం విద్యార్థులు కలిశారు. నకిలీ పత్రాలతో యూనివర్శటీ భూములను ఆక్రమించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అరికట్టాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ... యూనివర్శిటీ ప్రతిష్టను పెంచేందుకు, కబ్జాల నుండి భూములను రక్షించుటకు సమగ్ర ప్రణాళిక అవసరం. యూనివర్శిటికీ సంబంధించిన భూముల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి, దాని బయట వైపు రోడ్డును నిర్మించే ఆలోచన చేస్తాం. దీంతో ప్రజలకు రవాణా సౌకర్యంతో పాటు భూముల రక్షణకు అవకాశం ఉంటుంది.యూనివర్సిటీకి నలువైపులా ఆర్చి గేట్లను నిర్మించి, లోపల ఉన్నచెరువులు, పార్కుల సుందరీకరణ చేయాల్సి ఉంది. హాస్టళ్ల నుండి వస్తున్న మురికి నీటిని శుద్దీకరణచేసి చెరువులలోకి పంపుటకు ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తాం అని తెలిపారు. (‘సడలింపులతోనే నగరాల్లో అధిక కేసులు’) -
‘కబ్జా నుంచి ఉస్మానియా భూములను కాపాడండి’
లండన్ : ఉస్మానియా యూనివర్సిటీ భూములను కబ్జా కాకుండా కాపాడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదే ఉందని, ఉస్మానియా అలుమ్ని యూకే-యూరోప్ ప్రభుత్వాన్ని లేఖ ద్వారా కోరింది. ‘డీడీ కాలనీలో ఆక్రమించిన ఉస్మానియా భూమిలో కట్టడాలు నిర్మించడం సరైంది కాదు. అసలు జీహెచ్ఎమ్సీ ఎలా అనుమతులు ఇచ్చిందో పునః పరిశీలన చేయాల్సిందిగా కోరుతున్నాము. అనేక సామాజిక ఉద్యమాలకు ఉస్మానియా యూనివర్సిటీ జీవం పోసింది. ఉస్మానియాను అన్ని విధాలుగా కాపాడుకునే బాధ్యత ప్రభుత్వంతో పాటు పూర్వ విద్యార్థులకు ఉంటుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపి, ఉస్మానియా భూములపైన సమగ్ర సర్వే నిర్వహించాలి. భవిష్యత్తులో కబ్జాలు కాకుండా కట్టుదిట్టం చేయాలి. స్థానిక ప్రజలు కూడా ఉస్మానియాకి అండగా నిలవాలి. పోలీస్ శాఖ అక్రమ కట్టడాలు జరగకుండా చూడాలి. అవసరం అయితే ఈ వ్యవహారాన్ని న్యాయస్థానం ద్రుష్టికి కూడా తీసుకెళతాం’ అని ఉస్మానియా అలుమ్ని యూకే-యూరో ఫౌండర్ మెంబెర్, ఛైర్మెన్ గంప వేణుగోపాల్, ఫౌండర్ మెంబర్, అధ్యక్షుడు సుధాకర్ గౌడ్, ఫౌండర్ మెంబర్, ప్రధాన కార్యదర్శి మహేష్ జమ్ముల తెలిపారు. -
ఉస్మానియా వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్శిటీ భూముల పరిశీలన ఆదివారం ఉద్రికత్తకు దారితీసింది. ఓయూ భూములను పరిశీలించేందుకు వెళ్లిన తెలంగాణ పీసీసీ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. డీడీ కాలనీలో కబ్జా అయిన భూమి దగ్గరకు వెళ్లేందుకు యత్నించారు. అయితే వారిని అడ్డుకోవడంతో కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. తమను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలంటూ నిలదీశారు. ఈ కార్యక్రమంలో టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, వి.హనుమంతరావు, వంశీచంద్‌రెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. (ప్రభుత్వ వైఫల్యాలపై టీపీసీసీ ‘పోరుబాట’) కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరుబాట పట్టాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ ఓయూ భూములను పరిశీలించింది. ఉస్మానియా యూనివర్సిటీలో కొందరు బీజేపీ, టీఆర్ఎస్ నేతలు భూములు కబ్జా చేస్తున్నారన్న ఆరోపణలతో పీసీసీ నేతలు ఉస్మానియాకు వెళ్లారు. ఇక ప్రభుత్వ వైఫల్యాలపై అధ్యయనం చేసేందుకు నాలుగు కమిటీలు ఏర్పాటు చేయాలని తెలంగాణ పీసీసీ నిర్ణయించింది. ఆర్థిక వ్యవహారాలపై సీఎల్పీ నేత భట్టి నేతృత్వంలో, ఉస్మానియా భూములు, విద్యారంగాలపై మాజీ ఎంపీ పొన్నం నేతృత్వంలో, నూతన వ్యవసాయ విధానంపై అధ్యయనానికి చిన్నారెడ్డి, కోదండరెడ్డి, గోదావరి పెండింగ్ ప్రాజెక్టులపై ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి నేతృత్వంలో కమిటీలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
ఓయూలో పరిశోధక విద్యార్థి మృతి
ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా వర్సిటీలో పరిశోధక విద్యార్థి కొంపల్లి నర్సింహ (45) మృతి చెందారు. ఓయూ పీఎస్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం పాలడుగు గ్రామానికి చెందిన కొంపల్లి నర్సింహ క్యాంపస్‌లోని సైన్స్ కాలేజీ జాగ్రఫీ విభాగంలో ఇటీవల పీహెచ్డీ పూర్తి చేశారు. న్యూ పీజీ హాస్టల్లోని రూం నంబర్ 3లో ఉంటున్న అతడు ఆదివారం మృతి చెందినట్లు సీఐ తెలిపారు. గది లోపల గడియ వేసుకొని క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. నర్సింహ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. మృతుడి అంత్యక్రియల కోసం తక్షణ సహాయంగా రూ.25 వేలను అందచేసినట్లు ఓయూ రిజిస్ట్రార్ ప్రొ.గోపాల్‌రెడ్డి తెలిపారు. ఉద్యోగం రాలేదనే మానసిక క్షోభతో.. ఓయూలో పీహెచ్డీ పూర్తి చేసి పీడీఎఫ్ కోసం చదువుతున్న నర్సింహ ఉద్యోగం రాలేదని, 45 ఏళ్లు వచ్చినా జీవితంలో స్థిరపడలేదని మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. నర్సింహ కుటుంబానికి న్యాయం చేయాలని సోమవారం న్యూ పీజీ హాస్టల్ ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగారు. దీంతో క్యాంపస్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని కాంగ్రెస్ నేత వి.హన్మంతరావు, తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ ఫ్రంట్ ఛైర్మన్ చనగాని దయాకర్‌గౌడ్, విద్యార్థి జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు నిజ్జన రమేష్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలి.. ఓయూ పరిశోధన విద్యార్థి నర్సింహమృతిపట్ల ఎమ్మార్పీఎస్ టీఎస్‌రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మృతుడి కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగమివ్వాలని, నష్టపరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
ఉపకారానికి అడ్డంకులు..
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల మంజూరీకి మరిన్ని అడ్డంకులు వచ్చిపడ్డాయి. ఇప్పటివరకు ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో మంజూరీలో జాప్యం జరుగుతుండగా.. ప్రస్తుతం సంక్షేమ శాఖల వద్ద అందుబాటులో అంతో ఇంతో నిధులున్నా వాటిని పంపిణీ చేయడంలో సమస్యలు నెలకొన్నాయి. ఈ–పాస్ వెబ్సైట్లో విద్యార్థులు చదువుతున్న కోర్సుకు సంబంధించి ట్యూషన్ ఫీజును సంబంధిత యూనివర్సిటీ అప్డేట్ చేయకపోవడంతో విద్యార్థి దరఖాస్తును మంజూరు చేయడం సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. పోస్టుమెట్రిక్ కోర్సులకు సంబంధించి ఫీజులను కాలేజీకి గుర్తింపు ఇచ్చే బోర్డు లేదా యూనివర్సిటీ నిర్ధారిస్తూ ఈ–పాస్ వెబ్సైట్లో అప్డేట్ చేయాలి. అదేవిధంగా ఫీజులకు సంబంధించి వర్సిటీ నిర్ణయాలు తదితర సమాచారాన్ని మాన్యువల్ పద్ధతిలో సంక్షేమ శాఖలకు సమర్పించాలి. దీనిలో భాగంగా మెజారిటీ యూనివర్సిటీలు సమాచారాన్ని ఇచ్చినప్పటికీ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. అత్యధిక కాలేజీలున్న ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఫీజు స్ట్రక్చర్ అందకపోవడంతో సంక్షేమ శాఖాధికారులు దరఖాస్తుల పరిశీలనను పక్కనపెట్టారు. ఉపకార వేతనాలకు ఇబ్బందులు.. 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలను ఫిబ్రవరి నెలాఖరు కల్లా క్లియర్ చేయాలని సంక్షేమ శాఖలు భావించాయి. ఈ నేపథ్యంలో దరఖాస్తుల పరిశీలన మొదలు పెట్టేందుకు ఉపక్రమించగా.. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఫీజ్ స్ట్రక్చర్ అందకపోవడంతో ఆయా దరఖాస్తులను పక్కనపెట్టాయి. రాష్ట్రంలో పోస్టుమెట్రిక్ కోర్సులు చదువుతున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోనే ఉన్నారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల పరిధిలో ఉపకార వేతనాలు ఇచ్చేందుకు బడ్జెట్ అందుబాటులో ఉంది. దీనిలో భాగంగా ఫిబ్రవరి నెలాఖరులోగా సీనియర్ విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో దరఖాస్తుల పరిశీలన చేసే అధికారులకు ఫీజు స్ట్రక్చర్ కనిపించకపోవడంతో వాటి పరిశీలన నిలిపివేస్తున్నారు. పరిశీలన ప్రక్రియ నిలిచిపోతే విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అధికారులు స్పందించడం లేదు.. 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసి నాలుగు వారాలైంది. ఇప్పటివరకు ఉస్మానియా యూనివర్సిటీ యంత్రాంగం కోర్సుల వారీగా ఫీజు స్ట్రక్చర్‌ను ఈ–పాస్ వెబ్సైట్లో అప్డేట్ చేయలేదు. దీంతో ఆయా విద్యార్థుల దరఖాస్తులను పరిష్కరించలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల్లో నిధులు అందుబాటులో ఉన్నాయి. కానీ ఫీజ్ స్ట్రక్చర్ అప్డేట్ కాకపోవడంతో అధికారులు ఈ యూనివర్సిటీ పరిధిలోని దరఖాస్తులను పక్కకు పెడుతున్నారు. ఈ అంశాన్ని 15 రోజులుగా ఉస్మానియా యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లా. కానీ వర్సిటీ అధికారులు ఏమాత్రం స్పందించడం లేదు. – గౌరి సతీశ్, రాష్ట్ర కన్వీనర్, ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ -
సిటీ బస్సులను పునరుద్ధరించాలి
సాక్షి, ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ క్యాంపస్ నుంచి గతంలో నడిచే సిటీ బస్సులను పునరుద్ధరించాలని విద్యార్థులు కోరారు. ఓయూ క్యాంపస్ నుంచి కోఠిమహిళా కాలేజీ, నిజాం కళాశాల, సికింద్రాబాద్, సైఫాబాద్ పీజీ కాలేజీకి, వివిధ ఉద్యోగాల కోసం కోచింగ్ సెంటర్లకు విద్యార్థులు బస్సుల్లో వెళ్తుంటారు. అయితే.. క్యాంపస్ నుంచి బస్సులు తిరగక పోవడంతో ఆటోల్లో వెళ్లాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే టీఎస్ ఆర్టీసీ, ఏపీ ఆర్టీసీ బస్సులు క్యాంపస్ నుంచి వెళ్తుండగా.. లోకల్ బస్సులు మాత్రం క్యాంపస్ వెనుక నుంచి వెళ్లడం వల్ల విద్యార్థులతో పాటు వివిధ పనుల పై ఓయూ క్యాంపస్‌కు వచ్చే వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తార్నాక నుంచి కోఠి, నాంపల్లి వెళ్లే 3, 136 నంబర్ బస్సులు క్యాంపస్ నుంచి వెళ్తూ ఆర్ట్స్ కాలేజీ, లా కళాశాల, లేడీస్ హాస్టల్, ఇంజినీరింగ్ కాలేజీ ఆంధ్రమహిళా సభ విద్యా సంస్థల బస్ స్టాప్ వద్ద ఆగేవని, దీంతో విద్యార్థులకు ఎంతో సౌకర్యాంగా ఉండేదన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె అనంతరం క్యాంపస్ నుంచి సిటీ బస్సుల రాకపోకలను నిలిపివేసిన్నట్లు విద్యార్థులు పేర్కొన్నారు. -
నిజాలను వక్రీకరిస్తే ‘జార్జిరెడ్డి’ను అడ్డుకుంటాం
సాక్షి, హైదరాబాద్: పీడీఎస్‌యూ నిర్మాత జార్జిరెడ్డిపై నిర్మించిన సినిమాలో నిజాలను వక్రీకరిస్తే... ‘జార్జిరెడ్డి’ మూవీని అడ్డుకుంటామని పీడీఎస్‌యూ జాతీయ అధ్యక్షుడు ఎం.రామకృష్ణ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.పరశురాం హెచ్చరించారు. సినిమా జార్జిరెడ్డి ఆశయాలు, లక్ష్యాలకు వ్యతిరేకంగా ఉంటే సహించబోమన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ... కామ్రేడ్ జార్జిరెడ్డి తన ఆశయాలు, సిద్ధాంతాల కోసం నిలబడి, కలబడిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. విద్యార్థి లోకానికి మరో చేగువేరా అన్నారు. ఆయన ప్రగతిశీల విద్యార్థులను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఉస్మానియా క్యాంపస్‌లో జరిగిన అరాచకాలను అడ్డుకున్నాడన్నారు. మతోన్మాదాన్ని, కులోన్మాదాన్ని ఎదిరించాడన్నారు. అంతేకాకుండా ఆయన అణు భౌతికశాస్త్రంలో గోల్డ్‌మెడల్ సాధించాడని గుర్తుచేశారు. చదువుతో పాటు సమాజాన్ని అధ్యయనం చేసిన గొప్ప మేధావి అని కొనియాడారు. అలాంటి జార్జిరెడ్డి జీవితంలోని ముఖ్య సంఘటనలను వ్యాపార దృక్పథంతో సినిమాగా రూపొందించడం సరికాదన్నారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయకన్న తదితరులు పాల్గొన్నారు. -
ఓయూ డిగ్రీ పరీక్షలు వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా వర్సిటీ పరిధిలో ఈ నెల 19 నుంచి ప్రారంభమవ్వాల్సిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను 22వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కంట్రోలర్ ప్రొ.శ్రీరామ్ వెంకటేష్ గురువారం తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ డిగ్రీ కోర్సుల 1, 3, 5 సెమిస్టర్ పరీక్షలను వివిధ కారణాల వల్ల అధికారులు రెండోసారి వాయిదా వేశారు. ఓయూ పరిధిలోని ప్రైవేటు కాలేజీల నిర్వాహకులు సకాలంలో పరీక్ష ఫీజు పత్రాలు సమర్పించకపోవడంతో వారి విజ్ఞప్తి మేరకు పరీక్షలు వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ఈనెల 13న జరగాల్సిన పరీక్షలను తొలుత 19కి వాయిదా పడగా.. ప్రైవేటు కాలేజీల యజమానుల వినతితో ఇప్పుడు 22వ తేదీ వరకు వాయిదా వేశారు. -
పదవీకాలం ముగిసినా..
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీల వైస్ చాన్స్‌లర్ (వీసీ) పదవీకాలం ముగిసిన తరువాత నిర్ణీత వ్యవధిలోనే మళ్లీ వైస్ చాన్స్‌లర్‌ను నియమించే నిబంధన రాబోతోందా? అంటే ఉన్నత విద్యాశాఖ వర్గాల నుంచి అవుననే సమాధానం వ్యక్తమవుతోంది. ఉమ్మడి ఏపీలో రాష్ట్రంలోని వర్సిటీలకు వీసీల నియామకాలు చేపట్టడంతో నెలల తరబడి జాప్యం జరిగేది. అలాంటి జాప్యాన్ని నివారించే చర్యలపై ఉన్నత విద్యా శాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు విద్యావేత్తలు, నిపుణులు, వర్సిటీల ప్రతినిధులు తమ అభిప్రాయాన్ని వర్సిటీల చట్టాల రూపకల్పన కమిటీకి తెలియజేసినట్లు సమాచారం. రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్రంలోని 11 వర్సిటీలకు వేర్వేరు చట్టాలు, వేర్వేరు నిబంధనలు ఉన్న నేపథ్యంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రభు త్వం ఒకే రకమైన వర్సిటీలకు ఒకే రకమైన చట్టాల రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా గతేడాది ఉన్నత విద్యా మండలి ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఆ కమిటీ తమ నివేదికను రూపొందించింది. దానిపై వర్సిటీల నుంచి అభిప్రాయాలను స్వీకరించింది. ఆ అభిప్రాయాల్లో కొన్నింటిని తమ నివేదికలో పొందుపరిచే చర్యలు చేపట్టింది. సోమవారం కూడా ఓయూ మాజీ వీసీ ప్రొఫెసర్ సులేమాన్ సిద్ధిఖీ, ఓయూ లా డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ జీబీ రెడ్డి, రిజిస్ట్రార్ గోపాల్‌రెడ్డి, నిరంజన్‌చారి తదితరులతో కూడిన కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా తమకు వచ్చిన అభిప్రాయాలను పరిశీలించింది. ప్రధానంగా వీసీల పదవీ కాలం పూర్తి కాగానే నిర్ణీత వ్యవధిలోనే మళ్లీ వీసీలను నియమించాలన్న నిబంధనను పొందుపరచాలని సూచించినట్లు తెలిసింది. ప్రస్తుతం కమిటీ ఆ నిబంధననూ çపరిగణనలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నెల 7న మరోసారి సమావే«శమై తుది నివే దిక ఖరారు చేయనుంది. వీలైతే అదే రోజు లేదంటే వారంలోగా ప్రభుత్వానికి తమ సిఫారసులతో కూడిన వర్సిటీల కొత్త చట్టాల తుది నివేదిక అందజేసేందుకు చర్యలు చేపట్టింది. భౌగోళిక స్వరూపాల్లోనూ మార్పులు.. ఈ చట్టాల్లో 60 నుంచి 70 శాతం వరకు కామన్ నిబంధనలే ఉండనున్నాయి. చాన్స్‌లర్, వీసీ, రిజిస్ట్రార్ వంటి నియామకాల నిబంధనలు ఒకే రకంగా ఉండనున్నాయి. మిగతా 30 నుంచి 40 శాతం నిబంధనలు మాత్రం ఆయా యూనివర్సిటీల ప్రత్యేకతకు అనుగుణంగా ఉంటాయి. బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల్లో సబ్జెక్టు సంబంధమైన కొన్ని నిబంధనలు వేర్వేరుగా ఉండబోతున్నాయి. వర్సిటీ భౌగోళిక స్వరూపాల్లో మార్పులకు ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ త్వరలోనే నివేదికను ఇవ్వనుంది. కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత ఆయా జిల్లాలు ఏ వర్సిటీకి దగ్గరగా ఉంటాయో ఆ వర్సిటీ పరిధిలోకి తీసుకువచ్చే చర్యలు చేపట్టింది. ఆ నివేదికను తెప్పించుకొని, వీలైతే ఆ అంశాలను కూడా యూనివర్సిటీల చట్టాల్లో పొందుపరిచే అవకాశం ఉంది. నాలుగు రకాల చట్టాలు.. ముఖ్యంగా 11 యూనివర్సిటీలకు 4 రకాల చట్టాలను తీసుకొచ్చేలా కమిటీ సిఫారసు చేస్తోంది. ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, మహాత్మాగాంధీ, పాలమూరు, తెలంగాణ వంటి సంప్రదాయ వర్సిటీలకు ఒక చట్టాన్ని సిఫారసు చేసేలా నివేదికను సిద్ధం చేస్తోంది. జేఎన్టీయూ, జేఎన్ఏఎఫ్ఏయూ, బాసరలోని ఆర్జీయూకేటీ వంటి టెక్నికల్ వర్సిటీలకు ఒక చట్టాన్ని సిఫారసు చేస్తోంది. తెలుగు వర్సిటీని, భవిష్యత్తులో ఏదైనా భాషా సంబంధ వర్సిటీలు వస్తే వాటిని పరిగణనలోకి తీసుకునేలా లాంగ్వేజ్ అండ్ కల్చర్వర్సిటీల చట్టం ఉండాలని పేర్కొంటోంది. అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీకి ప్రత్యేకంగా ఒక చట్టాన్ని సిఫారసు చేస్తోంది. దీనిలో భాగంగా గత చట్టాల్లో ఉన్న లోపాలు పునరావృతం కాకుండా పరిశీలన జరుపుతోంది. -
ఆసక్తికరంగా.. జార్జ్‌రెడ్డి ట్రైలర్
సాక్షి, హైదరాబాద్: చరిత్ర మరచిపోయిన విద్యార్థి నాయకుడి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తున్న సినిమా జార్జ్‌రెడ్డి. సమ సమాజ స్థాపనే ధ్యేయంగా పోరాడి, లక్ష్య సాధనలో ప్రాణాలర్పించిన జార్జ్ రెడ్డి.. ఈ జనరేషన్‌కి తెలియకపోవచ్చేమో కానీ, 1965 నుంచి 1975 వరకు ఉస్మానియా యూనివర్శిటీలో చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఆయన జీవితం గురించి తెలుసు. అలాంటి ఉద్యమ నాయకుడి గురించి ఈ తరం తెలుసుకునేలా రూపొందిస్తున్న సినిమా.. ‘జార్జ్ రెడ్డి’.. (ఏ మ్యాన్ ఆఫ్ యాక్షన్) . దసరా సందర్భంగా చిత్ర యూనిట్ జార్జ్ రెడ్డి ట్రైలర్ రిలీజ్ చేశారు. సిల్లీ మాంక్స్, త్రీ లైన్ సినిమా బ్యానర్స్‌తో కలిసి మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి నిర్మిస్తుండగా, ‘దళం’ ఫేమ్ జీవన్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. వంగవీటి మూవీతో ఆకట్టుకున్న సందీప్ మాధవ్ జార్జ్ రెడ్డి క్యారెక్టర్లో ఒదిగిపోయాడు. సత్యదేవ్, మనోజ్ నందం, అభయ్ బేతిగంటి ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు. చేశారు. ఉస్మానియాలో ఉన్న సమయంలో ఉద్యమాల వైపు ఆకర్షితుడైన జార్జ్ రెడ్డి అభ్యుదయ ప్రజాస్వామ్య విద్యార్థి సమాఖ్య (పీడీఎస్యు)ను స్థాపించారు. ఇది భారతీయ కమ్యూనిస్టు పార్టీ (ఎంఎల్) విద్యార్థి విభాగం అనుబంధ సంస్థ. 25 ఏళ్ల వయసులో, ఉస్మానియా క్యాంపస్‌లో.. 30 మంది మూకుమ్మడిగా కత్తులతో దాడి చేసి జార్జ్ రెడ్డిని హత్య చేసిన విషయంతెలిసిందే. ఇప్పుడు ఆయన జీవితకథ ఆధారంగా సినిమా తెరకెక్కబోతోంది. త్వరలోనే విడుదల తేదీలను ప్రకటించనున్నారు. -
ఓయూ నుంచి హస్తినకు..
ఆమనగల్లు : క్షేత్రస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పనిచేసిన చోటల్లా తనదైన ముద్ర వేసిన నాయకుడు, పార్టీలకు అతీతంగా అందరితోనూ అపర చాణక్యుడనిపించుకున్న మహనీయుడు సూదిని జైపాల్ రెడ్డి. విద్యార్థి నాయకుడిగా రాజకీయాలను ఒంటబట్టించుకున్న ఆయన.. నాలుగుసార్లు శాసనసభకు, ఐదుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేసిన జైపాల్ రెడ్డి.. దక్షిణాది నుంచి చిన్న వయసులోనే ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి మధ్యలో జనతా పార్టీలో చేరి అక్కడా అగ్రనాయకుడిగా వెలుగొందిన ఆయన.. మళ్లీ హస్తం పార్టీలో చేరి కేంద్ర మంత్రి అయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ కీలక పాత్ర పోషించారు. 1969లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా.. చిన్న వయసులోనే పోలియోతో అంగవైకల్యానికి గురైనా ఆయన ఆత్మవిశ్వాసం ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఉన్నత విద్యనభ్యసించాలన్న ఆయన తపనకు వైకల్యం ఏమాత్రం అడ్డుకా లేదు. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో చురుకుగా వ్యవహరించిన జైపాల్‌రెడ్డి.. 1965లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. కల్వకుర్తి అసెంబ్లీ ని యోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 1969లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం 1972, 1978, 1983 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. 1975లో దేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడాన్ని వ్యతిరేకించారు. కాంగ్రెస్ పార్టీని వీడి జనతా పార్టీలో చేరి అగ్రనేతగా ఎదిగారు. 1984లో ఎంపీగా ఎన్నిక 1980లో తొలిసారిగా మెదక్ పార్లమెంటు స్థానం నుంచి ఇందిరాగాంధీపై పోటీచేసి ఓడిపోయారు. అనంతరం 1984లో మహబూబ్‌నగర్ పార్లమెంటు నుంచి జనతాపార్టీ అభ్యర్థిగా టీడీపీ మద్దతుతో బరిలో దిగి తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టారు. 1998లోనూ పాలమూరు నుంచి విజయం సాధించారు. అయితే 1999లో మళ్లీ కాంగ్రెస్‌లో చేరి మిర్యాలగూడ లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించారు. 2004లోనూ మిర్యాలగూడ నుంచి, 2009 చేవెళ్ల నుంచి జైపాల్‌రెడ్డి ఎంపీగా విజయం సాధించారు. అయితే.. 2014 ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేసి.. జితేందర్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. 1990–1998 మధ్యలో రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1997లో ఐకే గుజ్రాల్ ప్రభుత్వంలో తొలిసారి కేంద్రమంత్రి (సమాచార ప్రసార శాఖ)గా పనిచేసే అవకాశం లభించింది. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వంలో 2004, 2009ల్లోనూ ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. కొన్నేళ్లు ఏఐసీసీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా వ్యవహరించిన జైపాల్‌రెడ్డి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో భాగస్వాములు అయ్యారు. చేవెళ్ల ఎంపీగా.. జైపాల్‌రెడ్డికి చేవెళ్లతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆయన కాంగ్రెస్ నుంచి 2009లో చేవెళ్ల ఎంపీగా ఎన్నికై కేంద్రంలో మంత్రి పదవి చేపట్టారు. చేవెళ్ల పార్లమెంట్ ఏర్పడిన తర్వాత తొలిసారి ఆయన ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచారు. జైపాల్‌రెడ్డి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే ఈ ప్రాంతానికి ఏదైనా చేయాలనే ఆలోచనతో వికారాబాద్‌ను శాటిలైట్ టౌన్‌షిప్‌గా మార్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. చేవెళ్ల ప్రాంతంలో రహదారులు, ఇతర అభివృద్ధి పనులకు జైపాల్‌రెడ్డి ఎంతో సహకరించారు. జైపాల్‌రెడ్డి రాజకీయ ప్రస్థానమిదే.. ఉస్మానియా విద్యార్థి సంఘం నాయకుడిగా జైపాల్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం ఆరంభమైంది. 1963–64మధ్య ఉస్మానియా విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. 1966–67లో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఇదే సమయంలో యూత్ కాంగ్రెస్ జాతీయ సభ్యుడిగానూ కొనసాగారు. 1971 వరకు జాతీయ పార్టీ సభ్యుడిగా ఉన్నారు. 1969లో తొలిసారి కల్వకుర్తి నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. వరుసగా నాలుగుసార్లు అక్కడినుంచే గెలిచారు. ఈ సమయంలో పీసీసీ ప్రధాన కార్యదర్శిగానూ పనిచేశారు. ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ జాతీయ నాయకత్వ తీరును ఖండిస్తూ కాంగ్రెస్ నుంచి బయటికొచ్చారు. అనంతరం 1979లో జనతాపార్టీలో చేరారు. 1985 నుంచి 1988 వరకు జనతాపార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1980లో మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి ఇందిరాగాంధీపై పోటీ చేసి 60వేల పైచిలుకు ఓట్లతో ఓటమిపాలయ్యారు. 1984, 98లో మహబూబ్‌నగర్ నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 1999లో మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. 1999, 2004లో మిర్యాలగూడ నుంచి ఎంపీగా గెలుపొందారు. 1999–2000 వరకు సభాహక్కుల ఉల్లంఘన కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. 2009లో చేవెళ్ల ఎంపీగా ఎన్నికయ్యారు. 1990, 1996లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1991–1992 వరకు రాజ్యసభ పక్ష నేతగా వ్యవహరించారు. ఐకే గుజ్రాల్ కేబినెట్లో కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రిగా ఉన్నారు. 2004–2014 మధ్య పెట్రోలియం, పట్టణాభివృద్ధి, సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశారు. 1998లో ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కారం అందుకున్నారు. దక్షిణాది నుంచి తొలిసారి ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కారం అందుకున్న నేతగా జైపాల్‌రెడ్డి నిలిచారు.