Pedestrians
-
Right to Walk.. ఇంకెప్పుడు..?
గ్రేటర్ సిటీని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామంటున్న పాలకులు నగరం మధ్యలో ఫ్లైఓవర్లు, రోడ్ల విస్తరణ వంటి పనులపై దృష్టి పెడుతున్నా, కాలినడకన వెళ్లే వారికి అవసరమైన మేరకు ఫుట్‌పాత్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి (ఎఫ్ఓబీ)ల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరి స్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పలు ప్రధాన రహదారుల్లో సాఫీగా కొద్ది దూరం కూడా నడవలేక.. ఒకవైపు నుంచి మరో వైపు రోడ్డు దాటలేక పాదచారులు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. చాలాచోట్ల ఫుట్‌పాత్‌లు లేక, ఉన్న ఫుట్‌పాత్‌లు చాలా ప్రాంతాల్లో ఆక్రమణకు గురికావడంతో పాదచారులు విధిలేని పరిస్థితు ల్లో రోడ్లపైనే నడుస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. కిక్కిరిసిన జంక్షన్ల వద్ద రోడ్డు దాటేందుకు ప్రయత్నించేవారు కూడా రయ్ మంటూ దూసుకుపోయే వాహనాల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తోంది. కొన్నిచోట్ల ఎఫ్‌ఓబీలు ఉన్నా చాలాచోట్ల లిఫ్ట్‌ల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో నిరుపయోగంగా ఉంటున్నాయి.ఈ కారణంగా పాదచారులు ఎఫ్‌ఓబీలు ఉపయోగించకుండా ట్రాఫిక్ మధ్యలోనే రోడ్లు దాటేందుకు ప్రయత్నిస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. గత ఏడాది నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 123 మంది మృత్యువాత పడగా అనేకమంది గాయాల పాలవడం గమనార్హం. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 9,013 కి.మీ పొడవైన రోడ్లు ఉండగా ఫుట్‌పాత్‌లు కేవలం 817 కిలోమీటర్లకే పరిమితం కావడం పరిస్థితిని స్పష్టం చేస్తోంది.10% కూడా లేని ఫుట్పాత్లుజీహెచ్ఎంసీ పరిధిలో బీటీ, సీసీ, ఇతరత్రా రోడ్లన్నీ కలిపి మొత్తం 9,013 కిలోమీటర్ల రహదారులుండగా, వాటిల్లో ఫుట్‌పాత్‌లు లేదా వాక్‌వేలు కలిపి కనీసం 10 శాతం కూడా లేవు. ఉన్న ఫుట్‌పాత్‌లు దుకాణదారులు తమ అమ్మకపు సామగ్రిని ఉంచడానికి, వాహనాల పార్కింగ్‌కు, టీకొట్లు, తోçపుడు బండ్లు, ఇతరత్రా చిన్న వ్యాపారాల నిర్వహణకు పనికి వస్తున్నాయే తప్ప ప్రజలు నడవడానికి అనువుగా ఉండటం లేదు. ప్రభుత్వ సంస్థలు సైతం పబ్లిక్ టాయ్లెట్లు, ట్రాన్స్ఫార్మర్లు, రూ.5 భోజన కేంద్రాలు వంటివి ఫుట్‌పాత్‌లపైనే ఏర్పాటు చేయడం గమనార్హం. కాగా కొందరు ఇసుక, ఇటుక, కంకర వంటి వాటిని సైతం ఫుట్‌పాత్‌లపైనే ఉంచి వ్యాపారాలు చేస్తున్నారు. అన్ని రోడ్లకు ఫుట్పాత్లుండాలిఅన్ని రహదారుల వెంబడి ఫుట్‌పాత్‌లను నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అలాగే ఇప్పటికే ఉన్న ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు తొలగించి, అవి ప్రజలు నడిచేందుకు మాత్రమే ఉపయోగపడేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. జీహెచ్ఎంసీలో ఈవీడీఎం విభాగం ప్రారంభమైన తొలినాళ్లలో ఆరేళ్ల క్రితం ‘రైట్ టూ వాక్’ పేరిట 20 వేలకు పైగా ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు తొలగించింది. చిన్నాచితకా వ్యాపారులను వాటిపై నుంచి తరలించారు. తొలగింపు సమయంలో ఫుట్‌పాత్‌లు దెబ్బతిన్న ప్రాంతాల్లో కొత్తగా నిర్మిస్తామని పేర్కొన్నారు. కానీ కొత్తగా నిర్మించలేదు సరికదా.. కొన్నాళ్లకే ఆక్రమణలు తొలగించిన ప్రాంతాల్లో మళ్లీ వ్యాపారాలు వెలిశాయి.జీహెచ్ఎంసీలో రోడ్లు.. పుట్‌పాత్‌లు ఇలా (కి.మీ.లలో)⇒ మొత్తం రోడ్లు 9,013⇒ సీసీ రోడ్లు 6,167⇒ బీటీరోడ్లు 2,846⇒ ఫుట్‌పాత్‌లు 817ఫుట్‌పాత్‌ల పరిస్థితి అలా ఉంచితే.. ఒక వైపు నుంచి మరో వైపు రోడ్డు దాటి వెళ్లాలంటే పట్టపగలే చుక్కలు కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా బిజీ రోడ్లలో ఆగకుండా దూసుకొచ్చే వాహనాలతో ఒక్క అడుగు ముందుకు వేయడం కూడా కష్టంగా ఉంటుంది. బిక్కుబిక్కుమంటూ వచ్చే వాహనాల వైపు చేతిని అడ్డంగా పెడుతూ బతుకుజీవుడా అనుకుంటూ రోడ్లు దాటుతున్నవారు నిత్యం కనిపిస్తుంటారు. ఇక గ్రామీణ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన వారి పరిస్థితి చెప్పనక్కర్లేదు.ఎవరో ఒకరు తోడులేందే వారు రోడ్డు దాటలేని పరిస్థితి ఉంటోంది. పాదచారులు రోడ్లు దాటేందుకు ఫుట్ఓవర్ బ్రిడ్జీలు, పెలికాన్ సిగ్నల్స్ వంటివి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, కోట్ల రూపాయలు ఖర్చవడం తప్ప అవి ప్రజలకు ఉపయోగపడటం లేదు. నగరంలో ఉన్న అనేక ఫుట్ఓవర్ బ్రిడ్జీలు నిర్వహణ లోపంతో నిరుపయోగంగా ఉంటున్నాయి. పాదచారుల నిర్లక్ష్యం కూడా ఇందుకు కొంత తోడవుతోంది. చాలాచోట్ల లిఫ్ట్‌లు పని చేయడం లేదు. కొన్నిచోట్ల పనిచేస్తున్నా పాదచారులు వాటిని ఉపయోగించడం లేదు. అధికార యంత్రాంగం మాత్రం ప్రజలకు ఉపయోగపడుతున్నదీ, లేనిదీ పరిశీలించకుండానే కొత్తవి నిర్మించేందుకు పూనుకుంటోంది. ఉన్నవి ఉపయోగపడేలా చేసే దిశగా చర్యలు చేపట్టడం లేదు.ఎన్ని ఉన్నా ఏం లాభం?జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, నేషనల్ హైవే, టీజీఐఐసీ సంస్థలు ఏర్పాటు చేసిన ఎఫ్‌ఓబీలు పాతవి 23 ఉండగా, కొత్తగా పనులు చేపట్టిన వాటిల్లో 12 పూర్తయ్యాయి. మరో ఐదు పురోగతిలో ఉన్నాయి. ఎఫ్‌ఓబీలు ఎక్కువ ఎత్తులో ఉండటంతో చాలామంది వాటిని వినియోగించుకోవడం లేదు. వయోవృద్ధులు శారీరక సమస్యలున్న వారు అసలు ఎక్కలేక పోతున్నారు. ఎక్కగలిగే శక్తి ఉన్నవారు సైతం వాటిని ఎక్కి నడిచి దిగే కంటే ఎలాగోలా రోడ్డు దాటేయొచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లోనూ లిఫ్టులు, ఎస్కలేటర్లు వంటివి ఏర్పాటు చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాటిని ఏర్పాటు చేయడంతో ఊరుకోకుండా ప్రజలు వాటిని వినియోగించేలా చూడాలని, ఎలా వినియోగించాలో తెలియని వారి కోసం నిర్వహణ సిబ్బందిని నియమించాలని అంటున్నారు.ఫుట్‌పాత్‌లు ఉండాల్సింది ఇలా (మీటర్లలో..)⇒ దుకాణాల ముందు 3.5 4.5⇒ బస్టాప్‌లు 3.00⇒ వాణిజ్య ప్రాంతాల్లో.. 4.00⇒ ఇతర ప్రాంతాల్లో.. 2.5(నగరంలో 0.60 మీటర్ల నుంచి 3 మీటర్ల లోపే ఉన్నాయి. ఎక్కువగా మీటరు నుంచి మీటరున్నర వరకే ఉన్నాయి) రోడ్డుపైకి వెళ్లకుండా గ్రిల్స్ ఏర్పాటు చేయాలికోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఎఫ్‌ఓబీలను ప్రజలు వినియోగించుకోవాలి. కొందరు రోడ్డు పైనుంచే వెళ్తూ ప్రమా దకరమైనప్పటికీ సెంట్రల్ మీడియన్లను సైతం ఎక్కి దిగుతున్నారు. ఈ పరిస్థితి నివారణకు బ్రిడ్జికి అటూ ఇటూ కనీసం వంద మీటర్ల వరకు ప్రజలు రోడ్డు మీదకు వెళ్లేందుకు వీల్లేకుండా గ్రిల్స్ ఏర్పాటు చేయాలి. – ఆర్. శ్రీధర్, స్ట్రక్చరల్ ఇంజనీర్, రిటైర్డ్ ఈఎన్సీ, జీహెచ్ఎంసీఆ వ్యవస్థతో బ్రిడ్జీలు ఏర్పాటు చేయొచ్చుఫుట్పాత్లు ఆక్రమణకు గురవుతున్న నేపథ్యంలో, ప్రస్తుతం ఫుట్‌పాత్‌లు లేని ప్రాంతాల్లో రోడ్డు చివరి లైన్లో టూ టయర్ సిస్టమ్‌తో బ్రిడ్జిలాంటి ఏర్పాటు చేయవచ్చు. 2 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల ఎత్తుతో ఏర్పాటు చేసే ఈ బ్రిడ్జి పైనుంచి పాదచారులు వెళ్లేలా, టూ, త్రీవీలర్లు కిందనుంచి వెళ్లేలా నిర్మాణాలు చేయొచ్చు. అలాగే రోడ్డు దాటేందుకు జాకింగ్ కాన్సెప్ట్‌తో మీటర్ రేడియస్‌తో టన్నెల్ లాంటి నిర్మాణం చేయొచ్చు. గతంలో ఓ పోలీసు ఉన్నతాధికారి హయాంలో ఇలాంటి ఆలోచనలు జరిగాయి. ఆయన మారడంతో అది అటకెక్కింది. – ప్రొఫెసర్ లక్ష్మణరావు, జేఎన్టీయూఎక్కువ ఎత్తు అవసరం లేదునగరంలో ఏర్పాటు చేసిన ఎఫ్‌ఓబీలు చాలా ఎత్తులో ఉన్నందువల్ల ఎవరూ ఎక్కడం లేదు. కాబట్టి ఎత్తు కాస్త తగ్గించాలి. మెట్రో స్టేషన్లలో మాదిరిగా లిఫ్టులు, ఎక్సలేటర్లు ఉంటే అవసరమైన వారు వినియోగిస్తారు. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వద్ద ఎఫ్ఓబీ ఉన్నప్పటికీ లిఫ్టు పనిచేయక ఎక్కడం లేదు. పాదచారులు ఎక్కువగా రోడ్లు దాటే ప్రాంతాలను గుర్తించి అక్కడ రోడ్క్రాసింగ్కు వీలుగా సిగ్నల్ లైట్లు పెట్టడం మాత్రమే కాకుండా వాహనాలు కచ్చితంగా ఆగేలా చూడాలి. పాదచారుల క్రాసింగ్ ఏరియా అని తెలిసేలా ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేయాలి. పాదచారులకు సహాయకులుగా పోలీసులు లేదా ఇతర సిబ్బందిని నియమించాలి. దీనివల్ల కొందరికి ఉపాధి కూడా లభిస్తుంది. – డా. దొంతి నరసింహారెడ్డి, సామాజికవేత్తపేరుకే పెలికాన్ సిగ్నల్స్బిజీ రోడ్డును దాటాలనుకునే పాదచారుల కోసం నగరంలోని 70కి పైగా ప్రాంతాల్లో పెలికాన్ సిగ్నల్స్ ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. పాదచారి ఎవరైనా రోడ్డు దాటాలనుకున్నప్పుడు పక్కనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డబ్బాలో ఉండే స్విచ్‌ను నొక్కాల్సి ఉంటుంది. అప్పుడు రెడ్ సిగ్నల్ పడి కొన్ని సెకన్ల తర్వాత రోడ్డుకిరువైపులా రాకపోకలు సాగించే వాహనాలు నిర్ణీత సమయం ఆగిపోతాయి. అప్పుడు పాదచారులు రోడ్డు దాటాల్సి ఉంటుంది.ఒక్కసారి బటన్ నొక్కిన తర్వాత.. పదే పదే నొక్కినా పని చేయకుండా కొంత గ్యాప్ ఉంటుంది. అంటే ఎవరైనా కూడా వెంట వెంటనే నొక్కడానికి అవకాశం ఉండదన్న మాట. అయితే బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రి వద్ద, ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాల్లో ఉన్న ఈ పెలికాన్ సిగ్నల్స్ కేవలం అలంకారంగానే ఉన్నాయి. ఎప్పుడో ఏర్పాటు చేసిన ఈ సిగ్నల్స్ కొన్ని ప్రాంతాల్లో పనిచేయడం లేదు. అసలు వీటిని ఎలా వినియోగించాలో కూడా ప్రజలకు తెలియదని, అధికారులు ఈ విషయంలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.లిఫ్ట్ ఉన్నా వేస్ట్ ఎర్రగడ్డ ప్రధాన రహదారిలోని మోడల్ కాలనీ కమాన్ వద్ద ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జిని సరిగా నిర్వహించడం లేదు. లిఫ్ట్ సౌకర్యం ఉన్నా అది ఎప్పుడు పని చేస్తుందో, ఎప్పుడు పని చేయదో తెలియదు. నాలాంటి సీనియర్ సిటిజన్లు మెట్లు ఎక్కి వెళ్లలేకపోతున్నాం. ఎఫ్ఓబీ సమీపంలో చెత్తాచెదారం నిండి ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. –జేఎస్టీ శాయి, మోడల్ కాలనీ, సనత్‌నగర్.నిబంధనల పాటింపు తప్పనిసరి చేయాలిపాదచారులకు సైతం కొన్ని నిబంధనలు ఉన్నాయి. వీటి ప్రకారం పెడస్ట్రియన్ క్రాసింగ్స్‌లో, నిర్దేశించిన విధంగానే రోడ్డు దాటాలి. అలా చేయకపోవడం ఉల్లంఘన కిందికే వస్తుంది. నేను గతంలో చెన్నై వెళ్లిన ప్పుడు ఓ విషయం గమనించా. అప్పట్లో అక్కడి సెంట్రల్ రైల్వే స్టేషన్ వద్ద ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉండేది. దీంతో పాదచారులు రోడ్డు దాటడానికి వీలుగా అండర్ పాస్ ఏర్పాటు చేశారు.అయితే తొలినాళ్లలో దీన్ని వినియోగించకుండా రోడ్డు పైనుంచే దాటుతుండ టంతో ప్రమాదాలు కొన సాగాయి. దీంతో ఆ అండర్ పాస్ వద్ద ఓ కాని స్టేబుల్‌ను ఏర్పాటు చేశారు. ఎవరైనా అండర్ పాస్ కాకుండా రోడ్డు పైనుంచి క్రాస్ చేస్తే కానిస్టేబుల్ పట్టుకునేవారు. అక్కడి కక్కడే రూ.5 జరిమానా విధించి వసూలు చేసే వారు. దీంతో పాటు పెద్ద ఎత్తున అవగాహన కల్పించడంతో అండర్ పాస్ వినియోగం పెరిగింది. ఇలాంటి విధానాలు హైదారాబాద్‌లోనూ అమల్లోకి తీసుకురావాలి. – కేవీకే రెడ్డి, ట్రాఫిక్ నిపుణుడునగరంలో ఎఫ్ఓబీలున్న ప్రాంతాలుపాతవి: అనుటెక్స్ (సైనిక్‌పురి), హెచ్‌పీ పెట్రోల్‌బంక్ (రామంతాపూర్), నేషనల్ పోలీస్ అకాడమీ (రాజేంద్రనగర్), గగన్‌పహాడ్, మహవీర్ హాస్పిటల్, ఎన్ఎండీసీ (మాసాబ్‌ట్యాంక్), ఎన్టీఆర్ మార్గ్ (ట్యాంక్‌బండ్), గ్రీన్‌ల్యాండ్స్ గెస్ట్‌హౌస్, ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి, ముఫకంజా కాలేజ్ (బంజారాహిల్స్), భారతీయ విద్యాభవన్ స్కూల్ (ఫిల్మ్‌నగర్), వెల్స్ ఫార్గో (ఖాజాగూడ), ఐఎస్బీ, ఐటీసీ కోహినూర్, మియాపూర్ క్రాస్‌రోడ్స్, ఆల్విన్ క్రాస్‌రోడ్స్ (మదీనగూడ), మలేసియన్ టౌన్షిప్, కేపీహెచ్‌బీ–4 ఫేజ్, కళామందిర్ (కేపీహెచ్‌బీ కాలనీ), ఐడీపీఎల్, మెట్టుగూడ, రైల్‌నిలయం, హైదరాబాద్ పబ్లిక్‌స్కూల్ (బేగంపేట).కొత్తవి: బాలానగర్, చెన్నెయ్ షాపింగ్ మాల్ (మదీనగూడ), మియాపూర్, ఈఎస్ఐ హాస్పిటల్(ఎర్రగడ్డ), హైదరాబాద్ సెంట్రల్ మాల్, నేరేడ్మెట్ బస్టాప్, సెయింట్ ఆన్స్ స్కూల్(సికింద్రాబాద్), తార్నాక, స్వప్న థియేటర్ (రాజేంద్రనగర్), ఒమర్ హోటల్, రంగభుజంగ థియేటర్, మూసాపేట క్రాస్‌రోడ్స్. -
ఒకేఒక్క వ్యక్తి రోడ్డుపై సృష్టించిన బీభత్సం చూస్తే..వామ్మో! అని నోరెళ్లబెడతారు
-
ఒకేఒక్క వ్యక్తి రోడ్డుపై సృష్టించిన బీభత్సం చూస్తే..వామ్మో! అని నోరెళ్లబెడతారు:
కొంతమంది వేగంగా నడిపో లేక మద్యం తాగో నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి వాళ్ల ప్రాణాలనే గాక ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి పడేస్తారు. మరికొందరూ ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన లేకనో లేక అనుకోకుండానో ప్రమాదవశాత్త ఘోర ప్రమాదాల బారిన పడటం కారణమవ్వటమో జరుగుతుంది.. ఇదంతా ఒక ఎత్తైతే ఇక్కడొక వ్యక్తి కేవలం రోడ్డుపై నడుస్తూ ఏకంగా ఎన్ని ప్రమాదాలకు కారణమయ్యాడో వింటే వామ్మ! అంటారు. అతను మూర్ఖత్వంగానో లేక ట్రాఫిక్ రూల్స్ తెలియక చేశాడో తెలియదు గానీ ఏకంగా రోడ్డు మధ్యలో నడిచి తన ప్రాణాల మీదకే కాకుండా ఇతరుల ప్రాణాలపైకి ప్రమాదాన్ని తెచ్చిపెట్టాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో సదరు పాదాచారుడి రోడ్డు మధ్యలో నడవడంతో ఒక కారుతో మరొక కారు ఢీ కొని వరుస రోడ్డు ప్రమాదాలకు కారణమయినట్లు కనిపిస్తుంది. ఈ ఘటన మొత్తం సమీపంలోని సీసీఫుటేజ్‌లో రికార్డు అయ్యింది. ఈ ఘటనలో మొత్తం ఎంత నష్టం వాటిల్లిందనేది తెలియాల్సి ఉంది. Very lucky guy! pic.twitter.com/AC6w7o2NTp — Instant Karma (@Instantregretss) December 31, 2022 (చదవండి: ఘోర అగ్నిప్రమాదం..పలువురికి తీవ్ర గాయాలు) -
2022 Roundup-Hyderabad: ఓ బాట‘సారీ’!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ సిటీ... పాదచారులకు మాత్రం పిటీ. ఇక్కడ జరుగుతున్న ప్రమాదాలు, కనిపించని మౌలిక వసతులే దీన్ని స్పష్టం చేస్తున్నాయి. నగరంలో ప్రతి ఏడాదీ రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారిలో పాదచారులది రెండో స్థానం. గత ఏడాది నగర పరిధిలో జరిగిన మొత్తం ప్రమాదాల్లో బాధితులుగా మారిన వారిలో పెడ్రస్టియన్స్ పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ పరిస్థితి తలెత్తడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రాథమిక అంశాలైన ఫుట్‌పాత్‌లు మాయం కావడం, అవసరమైన అన్ని ప్రాంతాల్లోనూ పెలికాన్ సిగ్నల్స్‌తో పాటు జీబ్రా క్రాసింగ్స్, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు లేకపోవడం... ఉన్న వాటిని పాదచారులు, వాహనచోదకులు పట్టించుకోక పోవడం వల్లే ఈ దుస్థితి దాపురించింది. రెండో స్థానంలో పాదచారులు... నగర ట్రాఫిక్ పోలీసులు ఏటా ప్రమాదాలపై విశ్లేషణ నిర్వహిస్తారు. ప్రమాదాలకు కారణమవుతున్న వాహనాలు, బాధితులుగా/మృతులుగా మారుతున్న వారు ఎవరెవరు అనేది గణాంకాల ప్రకారం జాబితాలు రూపొందిస్తుంటారు. ఈ ఏడాదికి సంబంధించి హైదరాబాద్ పోలీసులు రూపొందించిన రికార్డుల ప్రకారం సిటీలో చోటు చేసుకున్న ప్రమాదాలు రెండు వేలకు పైనే ఉన్నాయి. వీటిలో అనేక మంది మృత్యువాతపడుతున్నారు. ఇలా రోడ్డు ప్రమాదాల్లో బాధితులుగా మారుతున్న వారిలో ద్విచక్ర వాహనచోదకులు తొలిస్థానంలో ఉండగా... రెండో స్థానం పాదచారులదే. ఇప్పుడే కాదు... గత కొన్నేళ్లుగా నమోదైన గణాంకాల ప్రకారం రోడ్డు ప్రమాద బాధితుల్లో పాదచారులే ఎక్కువగా ఉన్నారు. వీటికి మోక్షమెప్పుడో? రాజధానిలో ఉన్న రహదారులపై పాదచారులు భద్రంగా తిరిగేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేవు. పురాతన నగరమైన పాతబస్తీలోనే కాదు... ఇటీవలే రూపుదిద్దుకుని, నానాటికీ అభివృద్ధి చెందుతున్న హైటెక్ సిటీ పరిసరాల్లోనూ ఇవి మచ్చుకైనా కనిపించవు. ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థలోనూ పాదచారులకు అవసరమైన స్థాయిలో ప్రాధ్యానం లభించట్లేదు. ప్రణాళిక లోపం కారణంగా నగరంలో ఉన్న ఫుట్‌పాత్‌ల్లో సగం ఆక్రమణకు గురికాగా... మిగిలిన చోట్ల అనేక అడ్డంకులు వస్తున్నాయి. నగరంలో కీలక ప్రాంతాల్లో కనీసం రెండడుగుల వెడల్పుతో ఫుట్‌పాత్ ఏర్పాటు చేయాలని, దీనికి బారికేడింగ్, అవసరమైన ప్రాంతాల్లో క్రాస్ చేసేందుకు ఓపెనింగ్స్ తదితరాలతో కూడిన ప్రతిపాదనలకు పూర్తి స్థాయిలో మోక్షం లభించలేదు. ఆపరేషన్ రోప్ పై ఆశలెన్నో... ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావడానికి నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఈ ఏడాది ఆపరేషన్ రోప్ (రిమూవల్ ఆఫ్ అబ్స్ట్రక్టివ్ పార్కింగ్ అండ్ ఎంక్రోచ్మెంట్స్) అమలులోకి తీసుకువచ్చారు. దీని ప్రకారం పాదచారులకు ఇబ్బందికరంగా మారుతున్న అనేక అంశాలపై దృష్టి పెట్టారు. ఆయా ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిపై సిటీ ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. రోప్లో భాగంగా ఇప్పటి వరకు స్టాప్ లైన్ క్రాసింగ్‌పై 1,74,869, ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేయడంపై 27,217, రహదారులు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు తదితరాలపై 72,668 కేసులు నమోదు చేశారు. దీన్ని మరింత విస్తరించాలని పోలీసు విభాగం భావిస్తోంది. ఫలితంగా రానున్న రోజుల్లో పాదచారుల పరిస్థితి మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
గుజరాత్లో భక్తులపైకి దూసుకెళ్లిన కారు .. ఆరుగురు మృతి
గాంధీనగర్: గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అరవల్లీ జిల్లా కృష్ణాపూర్ సమీపంలో ఇన్నోవా కారు బీభత్సం సృష్టించింది. బనాస్‌కాంఠలోని అంబాజీ ఆలయానికి కాలినడకన వెళ్తున్న భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ భయానక ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేశ్ పటేల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షలు పరిహారం ప్రకటించారు. క్షతగాత్రలకు రూ.50వేలు సాయం అందిస్తామన్నారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అంబాజీ ఆలయంలో ప్రతి ఏటా భదర్వీ పూనం ఉత్సవాలు నిర్వహిస్తారు. గుజరాత్, రాజస్థాన్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు వస్తుంటారు. కాలినడకనే బనాస్కాంఠా వెళ్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 5 నుంచి 10 వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే భక్తులు మరాఠ్‌వాడీ వెళ్తుండగా కారు అదుపుతప్పి వారిపైకి దూసుకెళ్లింది. చదవండి: భారీ అగ్నిప్రమాదం.. 300 సిలిండర్లున్న లారీలో పేలుడు -
హైదరాబాద్‌లో ఫుట్‌పాత్‌ల వైశాల్యం ఎంతో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: నగరంలో పాదచారుల ఇబ్బందులు తొలగించేందుకు ఫుట్‌పాత్‌లపై శ్రద్ద చూపుతున్నట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. రాష్ట్రం ఆవిర్భావం నాటికి నగరంలో 452 కిలోమీటర్ల ఫుట్పాత్లుండగా, ప్రస్తుతం 817 కి.మీ.కు పెరిగినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. 2020లో మున్సిపల్ మంత్రి ఆదేశాలకనుగుణంగా రూ. 32.75 కోట్ల అంచనా వ్యయంతో ప్రతి జోన్లో కనీసం 10 కిలోమీటర్ల చొప్పున మొత్తం 75.64 కిలోమీటర్ల మేర చేపట్టిన 69 పనుల్లో 60 పనులు పూర్తయినట్లు పేర్కొంది. మిగతా పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపింది. సమగ్ర రోడ్డు నిర్వహణ ప్రాజెక్టులో భాగంగా (సీఆర్ఎంపీ) మరో 60 కి.మీ. ఫుట్‌పాత్‌ల నిర్మాణం, 6.5 కి.మీ. ఫుట్‌పాత్‌లకు మరమ్మతులు జరిగినట్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. (క్లిక్: జీహెచ్ఎంసీ సమ్మర్ కోచింగ్ క్యాంపులు ఎప్పటి నుంచి అంటే..) -
రోడ్ల పనులు సరే.. ఫుట్‌పాత్‌ల సంగతేంటి
సమగ్ర రోడ్ల నిర్వహణ పథకం కింద పెద్ద కాంట్రాక్టు ఏజెన్సీలకు రోడ్ల నిర్వహణ బాధ్యతలు అప్పజెప్పడంతో గ్రేటర్‌లోని ప్రధాన రహదారుల మార్గాల్లో వాహనదారుల ఇబ్బందులు కొంత మేర తగ్గాయి. కానీ పాదచారుల కష్టాలు మాత్రం తీరడంలేదు. ఈ బాధ్యతలు చేపట్టిన ఏజెన్సీలే ఫుట్‌పాత్‌ల పనులు కూడా చేయాల్సి ఉండగా రోడ్లతోపాటు ఫుట్‌పాత్‌ల పనులు జరగడం లేదు. దాంతో పాదచారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. వాహనాల రాకపోకలు సాఫీగా సాగేందుకు రోడ్ల పనులు చేస్తున్నప్పటికీ, ఫుట్‌పాత్‌లు తదితర పనులు చేపట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, సిటీబ్యూరో : సమగ్ర రోడ్ల నిర్వహణ పథకం కింద నగరంలో రోడ్లతోపాటు ఫుట్‌పాత్‌ల నిర్మాణాలు సమగ్రంగా చేపట్టాలి. ఇది కాంట్రాక్టు ఒప్పందంలోనూ ఉంది. కానీ దీన్ని ఎక్కడా సక్రమంగా అమలు చేయడం లేదు. రోడ్ల నిర్మాణం చేపట్టి చేతులు దులుపుకొంటున్నారే తప్ప..పాదచారులకు అత్యంత కీలకమైన ఫుట్‌పాత్‌ల పనులు చేపట్టడం లేదు. చదవండి: ఇక రోడ్లపై పాదచారులకు ప్రాధాన్యత కాంట్రాక్టు ఒప్పందం మేరకు .. ► రోడ్ల నిర్వహణలో భాగంగా క్యాచ్పిట్స్, డ్రెయిన్లు, నాలాలు, సివర్ లైన్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ► రోడ్లపై నిల్వనీరు లేకుండా చర్యలు తీసుకోవాలి. ► డెబ్రిస్ తొలగించాలి. బ్లాక్స్పాట్లు లేకుండా చూడాలి. ► ఫుట్‌పాత్, టేబుల్ డ్రెయిన్, స్పీడ్ బ్రేకర్లు, బార్ మార్కింగ్స్, సెంట్రల్ మీడియన్, లేన్ మార్కింగ్, రోడ్ స్టడ్స్, సైనేజీ బోర్డులు, కెర్బ్ పెయింటింగ్‌లు వేయాలి. ► సుందరీకరణ పనుల్ని కూడా చేయాలి. కానీ ఇవి పూర్తికాలేదు. ► కాంట్రాక్టు ఏజెన్సీలకు అప్పగించిన రోడ్లు :709 కి.మీ. ► వీటిల్లో మొదటి సంవత్సరం 50 శాతం, రెండో సంవత్సరం 30 శాతం, మూడో సంవత్సరం 20 శాతం రోడ్ల పనులు పూర్తి చేయాలి. ► ఐదు సంవత్సరాల వరకు నిర్వహణ పనులు చేయాలి. ►నిబంధనల కనుగుణంగా రోడ్ల పనులు జరిగినప్పటికీ, ఫుట్‌పాత్‌ల పనులు జరగలేదు. ► వీటిల్లో డీబీఎం, వీడీసీసీ రోడ్లున్నాయి. ►ఇవి కాక మరో 290 కి.మీ.లు బీసీ రోడ్లున్నాయి. ► ఫుట్‌పాత్‌లు మాత్రం కొత్తవి, మరమ్మతులు చేసినవి వెరసి 22 కి.మీ.లే పూర్తయ్యాయి. ►పాదచారులకు నడక మార్గాల్లేక తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ► తీవ్ర ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటి వరకు జరిగిన రోడ్లు, ఫుట్‌పాత్‌ల పనులు ప్యాకేజీల వారీగా జోన్ రోడ్లు (కి.మీ.) ఫుట్‌పాత్‌లు (కి.మీ.) ఎల్బీనగర్ 46.48 0.00 చార్మినార్ 60.02 2.25 ఖైరతాబాద్(1) 43.52 3.82 ఖైరతాబాద్(2) 45.48 2.14 శేరిలింగంపల్లి 52.83 4.57 కూకట్పల్లి 30.24 2.19 సికింద్రాబాద్ 45.22 7.65 -
వెల్లువలా వలసలు
కూటి కోసం కూలి కోసం పట్టణంలో బతుకుదామని వలస వచ్చిన బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టం మహాకవి శ్రీశ్రీ రాసిన ఈ కవితకి దృశ్యరూపం ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. కోవిడ్–19 మహమ్మారిని అడ్డుకోవడానికి దేశం లాక్డౌన్ ప్రకటించడంతో వారికి పనుల్లేవు. తిండి లేదు, నీళ్లు లేవు. ఉండడానికి చోటు లేదు. ఏదో మహమ్మారి పెనుభూతమై కాటేస్తుందన్న భయంతో సొంతింటికి చేరుకోవాలన్న ఆరాటం ఎక్కువైపోయింది. రవాణా సౌకర్యాలు లేకపోవడంతో వలసదారులు తమ కాళ్లకి పని చెప్పారు. నెత్తి మీద ఒక మూట, చంకలో పిల్ల, రెండు చేతుల నిండా పెద్ద పెద్ద బ్యాగుల్లో సామాన్లతో వలస కార్మికులు నడుస్తున్న దృశ్యాలు అన్నిచోట్లా కనిపిస్తున్నాయి. గమ్యస్థానం ఎప్పుడొస్తుందో తెలీదు, ఇల్లు చేరడానికి ఎన్నాళ్లవుతుందో అర్థం కాదు. అయినా ప్రాణాలను నిలుపుకోవాలన్న ఒకే ఒక్క ఆరాటంతో పళ్ల బిగువున అన్ని కష్టాలను నొక్కిపెట్టి కిలో మీటర్లకి కిలోమీటర్లు నడుస్తున్నారు. ఢిల్లీ, హరియాణా, గుజరాత్ నుంచి ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు కర్ణాటక నుంచి రాజస్తాన్‌కు వేలాది మంది రోడ్లపై నడుస్తున్న దృశ్యాలు అందరి గుండెల్ని పిండేస్తున్నాయి. మన దేశంలో బెంగాల్, ఒడిశా, బిహార్ నుంచి అత్యధికంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లి పని చేస్తుంటారు. చాలా ప్రాంతాల్లో కాలినడకన వెళుతున్న కార్మికుల్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఆదుకుంటున్నాయి. వారికి మంచినీళ్లు, ఆహారపొట్లాలు అందిస్తూ గమ్యస్థానాలు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ వాళ్లు అక్కడే ఉండాలని విజ్ఞప్తి చేసి, వారి బసకి ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ ఇంటికి తొందరగా చేరాలన్న ఆత్రుతలో వందలాది కిలోమీటర్లు నడిచి వెళుతున్నారు. బెంగళూరులో వెల్డర్‌గా పనిచేసే శశిరామ్ అనే వెల్డర్ బెంగళూరు నుంచి 1300 కి.మీ. దూరంలో ఉన్న రాజస్తాన్‌లో తన స్వగ్రామానికి కాలినడకన వెళ్లే సాహసం చేశాడు. ‘‘నేను ఇల్లు చేరడానికి 10 రోజులైనా పట్టొచ్చు, 12 రోజులైనా పట్టొచ్చు. కానీ నాకు వేరే దారి లేదు. బెంగళూరులో పని లేదు. తిండి లేదు. అందుకే రాజస్తాన్‌లో ఉన్న మా సొంతింటికి బయల్దేరాను’’అని శశిరామ్ అనే వెల్డర్ చెప్పారు. ‘‘మా స్వగ్రామం యూపీలో ఝాన్సీ. మా కుటుంబం అంతా భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నాం. దేశం లాక్‌డౌన్‌తో ఒక్కసారిగా పనులు నిలిచిపోవడంతో మాకు దిక్కు తోచలేదు. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఎక్కడ ఉండాలో తెలీదు. అందుకే నడక మొదలు పెట్టాం’’అని పానిపట్‌కు చెందిన రోహిత్ తెలిపారు. బస, ఆహారం ఏర్పాటు చేయండి వలస కార్మికుల కష్టాలను తీర్చడానికి రంగంలోకి దిగిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి ఎక్కడి వారు అక్కడే ఉండే ఏర్పాట్లు చేయాలన్నారు. వారందరికీ బస ఏర్పాటు చేసి ఆహారం అందించాలన్నారు. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నా వందలాది మంది జట్లు జట్లుగా గమ్యస్థానాలకు బయల్దేరిపోతున్నారు. దీంతో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హైవే అధికారుల్ని వారు క్షేమంగా ఇళ్లకు వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. యూపీలో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళుతున్న వారి కోసం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ 300 బస్సుల్ని ఏర్పాటు చేసింది. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం కార్మికులు సురక్షితంగా స్వస్థలాలకి చేరడానికి 100 బస్సుల్ని ఏర్పాటు చేసింది. పాఠశాలలన్నింటినీ బసలుగా మారుస్తామని ఎవరూ ఎక్కడికీ వెళ్లవద్దని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కార్మికులకి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వానిదే బాధ్యత: రాహుల్ వలస కార్మికుల దుస్థితికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రజల్ని ఇలాంటి పరిస్థితుల్లోకి నెట్టేయడం అతి పెద్ద నేరమని చెప్పారు. ఈ సంక్షోభ పరిస్థితుల్లో నడుస్తూ వెళుతున్న వారందరికీ మద్దతుగా నిలవడం మన బాధ్యత. ఈ సమస్య మరింత దుర్భరంగా మారడానికి ముందే ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలి’’అని రాహుల్ ట్వీట్ చేశారు. ఢిల్లీ– ఘజియాబాద్ సరిహద్దుల్లో... న్యూఢిల్లీ: లాక్డౌన్ కారణంగా అన్ని వ్యవస్థలూ మూసుకుపోవడంతో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికులు శనివారం తమ స్వస్థలాలకు పయనమయ్యారు. ఢిల్లీ–ఘజియాబాద్ సరిహద్దుకు చేరుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లో తమ ఊర్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే బస్సులు సరిపడా లేకపోవడంతో సీట్ల కోసం కార్మికులు తమలో తాము గొడవపడ్డారు. బస్సు నిండిపోయాక, బస్సు పైన కూడా కూర్చొని ప్రయాణం చేయడానికి సిద్ధమయ్యారు. బస్సుల్లో పరిస్థితి లాక్డౌన్ ఏమాత్రం అమలవుతున్నట్లుగా కనిపించడం లేదు. కొంత మంది ముఖాలకు మాస్కులు పెట్టుకున్నప్పటికీ అందులో ఎక్కువ కర్చీఫులనే కట్టుకొని కనిపించారు. ఢిల్లీలోని చార్కి దాద్రి నుంచి 110 కిలోమీటర్లు నడిచి సరిహద్దు వరకు చేరుకున్న సంతోశ్ సింగ్ (23)కు బస్సులో సీటు దొరకలేదు. దీంతో మరో 20 కిలోమీటర్లు నడిచి లాల్ కౌన్కు చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడి నుంచైనా బస్సు దొరుకుతుందనే ఆశతో నడిచి వెళుతున్నట్లు చెప్పాడు. సరిహద్దుల వద్ద పోలీసులు ఉన్నప్పటికీ కార్మికులు ఎక్కువగా ఉండటంతో నియంత్రించలేకపోతున్నారు. ఎంత మంది సరిహద్దు దాటి రాష్ట్రంలోకి వచ్చారన్న విషయాన్ని కూడా చెప్పలేమని వారు పేర్కొన్నారు. వృద్ధుడిని తమ సొంత గ్రామానికి మోసుకెళుతున్న కార్మికులు -
ఫుట్‌పాత్‌పైకి దూసుకొచ్చిన కారు : షాకింగ్ వీడియో
సాక్షి, బెంగళూరు : మద్యం మత్తులో వాహనాన్ని పాదచాలరులపైకి దూకించిన ఘటన బీభత్సం సృష్టించింది. అతిగా మద్యం సేవించిన డ్రైవర్, వాహనంపై పట్టుకోల్పోడంతో, అదుపు తప్పిన కారు బిజీగా ఉన్న ఫుట్‌పాత్‌పైకి దూసుకువచ్చింది. ఈ ఘటనలో పలువురు పాదచారులు గాయాలపాలయ్యారు. బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్ ప్రాంతంలో ఆదివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ షాకింగ్ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు, కారు డ్రైవర్ రాజేంద్రను అదుపులోకి తీసుకున్నారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అదిస్తున్నారు. గాయపడిన వారిలో గౌతమ్, శంకర్ అనే ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా, మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. #WATCH Bengaluru: A drunk person drove his car over pedestrians on a footpath at HSR Layout locality. The driver was taken into police custody & injured were admitted to hospital. Case registered. #Karnataka pic.twitter.com/mmS8e69MPw — ANI (@ANI) August 19, 2019 -
నాణేల కాలువ
‘‘ఖర్చుకోసం వెనకాడకండి. ప్రజల దాహం ముందు ఖర్చెంత? ఒక్కో గునపం దెబ్బకు ఒక్కో బంగారు నాణెమయినా భరిస్తాను’’ అని అన్నారు జుబేదా! హారూన్ రషీద్ అనే చక్రవర్తి పరిపాలనా కాలం అది. ఇరాక్ నుంచి మక్కా వెళ్లే మార్గంలో మంచినీటి కటకటతో బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. హజ్ యాత్రకు వెళ్లేటప్పుడు తమ వెంట తెచ్చుకున్న మంచినీరు అయిపోతే బాటసారులతోపాటు ఒంటెలు, గుర్రాలు దప్పికతో అల్లాడిపోయేవి, మృత్యువాతపడేవి. ప్రజలు, జంతువులు నీటికోసం అల్లాడుతున్నారన్న విషయం ఖలీఫా సతీమణి జుబేదాకు తెలిసి ఆమె హృదయం చలించిపోయింది. ఎడారి ప్రాంతంలో మంచినీటి కాలువ ప్రవహింపజేయాలి అనే యోచనను తన భర్త ఖలీఫా ముందుంచింది. దీనికి ఖలీఫా కూడా సానుకూలంగా స్పందించారు. కాలువ నిర్మాణం కోసం రాజ్యంలో ఉన్న సాంకేతిక నిపుణుల్ని అందరినీ ఆహ్వానించి, హజ్ యాత్రికుల నీటి ఎద్దడిని దూరం చేసేందుకు ఉపాయం ఏమిటో యోచించాలని ఆదేశించిందామె. ఏమాత్రం ఆలస్యం చేయక ప్రయత్నాలు మొదలెట్టారు. చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ గాలించారు. నీటి వనరులున్న ప్రాంతాలన్నీ పరిశీలించారు. పథకాలు తయారు చేశారు. ‘‘అమ్మా! సమస్యకు పరిష్కారం గోచరించింది. తాయిఫ్ లోయలో చక్కటి సెలయేరు ఉంది. అది హునైన్ కొండ వైపునకు ప్రవహిస్తుంది. ఆ నీళ్లు అమృతతుల్యంగా ఉన్నాయి. కాని దాన్ని మక్కాకు మళ్లించడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఎన్నో కొండలు, గుట్టలు, బండరాళ్లు మార్గంలో అడ్డుపడుతున్నాయి. ఈ అవరోధాన్ని తొలగించి కాలువ కట్టవలసి ఉంటుంది. అయితే అది ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని, బోలెడంత ఖర్చు అవుతుంది’’ అని విన్నవించుకున్నారు. ‘‘ఖర్చుకోసం వెనకాడకండి. ప్రజల దాహం ముందు ఖర్చెంత? ఒక్కో గునపం దెబ్బకు ఒక్కో బంగారు నాణెమయినా భరిస్తాను’’ అని తన దాతృత్వాన్ని చాటుకుంది. నిపుణులు తాయిఫ్ లోయలో పుట్టిన ఊటను మక్కాకు చేర్చేందుకు కాలువ తవ్వించారు. దారిలో వచ్చిన ఎన్నో చిన్న చిన్న ఊటల్ని ఈ కాలువలో కలుపుకుంటూ వచ్చారు. కాలువ రానురాను నదిగా మారి మక్కాకు చేరింది. నీటి పథకం పూర్తయి ప్రజలకు మంచి నీటి వసతి కలిగింది. జుబేదా సంకల్పం నెరవేరింది. ఒకరోజు మంత్రి ‘‘రాణి గారూ! కాలువ నిర్మాణానికి మొత్తం 17 లక్షల బంగారు నాణేల ఖర్చయ్యింది’’ అని చెప్పి ఖర్చు వివరాల కాగితాలను ఆమెకు అందించాడు. ఆమె చిరునవ్వుతో ఖర్చు వివరాల కాగితాలను కాలువలో పడేశారు. నేటికీ అక్కడి ప్రజలకు, లక్షలాది సంఖ్యలో ఏటా వచ్చే హజ్ యాత్రికులకు నీరు సరఫరా చేస్తోంది జుబేదా కాలవ. ముహమ్మద్ ముజాహిద్ -
షాపింగ్ మాల్స్‌కు జీహెచ్ఎంసీ షాక్
సాక్షి, హైదరాబాద్ : నగరంలో బడా దుకాణాలు, షాపింగ్ మాల్స్‌కు జీహెచ్ఎంసీ అధికారులు షాకిచ్చారు. ‘ఇది మీ దారి.. మీరు నడుచుకుంటూ వెళ్లేందుకు వీలుగా ఉండేందుకు ఏర్పాటు చేసిన మార్గం.. అయితే ఇక్కడి బడా దుకాణాల నిర్వాహకులు మీరు వెళ్లేందుకు వీలు లేకుండా ఆ రోడ్డును ఆక్రమించేశారు’’ అని నగర షాపింగ్ మాల్స్, దుకాణాల ముందు రాస్తూ జీహెచ్ఎంసీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నగరంలో చాలా చోట్ల పెద్ద పెద్ద దుకాణాలు, షాపింగ్ మాల్స్‌లు పాదచారుల రోడ్డును ఆక్రమిస్తున్నాయి. దీంతో పాదచారులు నడుచుకుంటు వెళ్లేందుకు దారివ్వకుండా ఆ ప్రాంతాన్ని ఎలా ఆక్రమించుకున్నారో తెలిసేలా వివరిస్తూ అధికారులు షాపుల ముందే రాస్తున్నారు. ఇప్పటికైనా మీకు కేటాయించిన దారిలో నడవాలని ప్రజలకు సూచిస్తున్నారు. -
బ్రిటన్ పార్లమెంటు భవనం వద్ద కారు బీభత్సం
-
బ్రిటన్ పార్లమెంటు వద్ద ఉగ్ర కలకలం
లండన్: బ్రిటన్ పార్లమెంటు భద్రత కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లను మంగళవారం మధ్యాహ్నం (భారత కాలమానం ప్రకారం) ఓ వ్యక్తి కారుతో ఢీకొట్టడంతోపాటు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సైకిళ్లపై నిరీక్షిస్తున్న ముగ్గురిని గాయపరిచాడు. దీనిని ఉగ్రచర్యగా పరిగణిస్తున్నామని పోలీసులు తెలిపారు. అతణ్ని అరెస్టు చేసి విచారిస్తున్నామనీ, లండన్ సహా బ్రిటన్‌లో తదుపరి ఉగ్రవాదులు దాడులు చేయొచ్చన్న నిఘా సమాచారమేదీ లేదని పోలీసులు తెలిపారు. ‘కారులో ఆ ఉగ్రవాది మినహా మరెవ్వరూ లేరు. ఉగ్రవాది వద్ద, కారులోనూ ఎలాంటి ఆయుధాలు లభించలేదు’ అని పోలీసులు చెప్పారు ఉగ్రవాది వయసు 25–30 మధ్య ఉండగా అతను ఎక్కడివాడో, పేరేంటో తెలియరాలేదన్నారు. లండన్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్, భారత సంతతి వ్యక్తి నీల్ బసు మాట్లాడుతూ ‘అతని గుర్తింపును, ఈ దాడి వెనుక ఉద్దేశాన్ని కనిపెట్టడమే మా తొలి ప్రాధాన్యం. ప్రఖ్యాత ప్రదేశంలో ఈ ఘటన జరిగినందున దీనిని ఉగ్ర చర్యగా మేం పరిగణిస్తున్నాం’ అని చెప్పారు. పార్లమెంటు భవనం లోపలకు వెళ్లేందుకు ఉగ్రవాది ఈ చర్యకు పాల్పడి ఉండొచ్చని సమాచారం. రోడ్లపై జనాలు బాగా రద్దీగా ఉండే సమయంలో ఈ ఘటన జరగడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు పరిసర ప్రాంతాల్లోని రోడ్లను, వెస్ట్‌మినిస్టర్ ట్యూబ్ స్టేషన్‌ను మూసేశారు. -
పార్లమెంటులోకి దూసుకువచ్చిన కారు
-
కాలిబాటలో కదిలే స్తంభాలు
సాక్షి, సిటీబ్యూరో : చార్మినార్ పరిసరాలను ముస్తాబు చేస్తున్న జీహెచ్ఎంసీ మరో అడుగు ముందుకేసింది. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం మాదిరిగా ఇక్కడ పాదచారులు తప్ప వాహనాలు వెళ్లేందుకు వీల్లేకుండా ‘బొల్లార్డ్స్’(కదిలే స్తంభాలు) ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. వివిధ మార్గాల నుంచి వచ్చి చార్మినార్‌కు చేరుకునే మార్గాల్లో వాహన నిషేధిత పాదచారుల జోన్లో వాహనాలు ముందుకు వెళ్లకుండా ఉండేందుకు వీటిని ఏర్పాటు చేస్తారు. ఇందులో భాగంగా స్థిరంగా ఉండేవి.. కదిలేవి(హైడ్రాలిక్)కూడా ఏర్పాటు చేయనున్నారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు, ఫైరింజన్లు వంటి వాహనాలు ప్రయాణించేందుకు, వీవీఐపీలు వచ్చేందుకు అనువుగా భూమిలోకి వెళ్లిపోయేలా వీటిని బిగిస్తారు. స్థిరంగా ఉండే వాటితోపాటు హైడ్రాలిక్ బొల్లార్డ్స్ ఏర్పాటుకు రూ. 2.38 కోట్లు ఖర్చు కానుంది. ఇందుకు స్టాండింగ్ కమిటీ సైతం ఆమోదం తెలిపింది. పాదచారుల పథకంలో భాగంగా చార్మినార్ నాలుగువైపులా వాహనాల్ని నిషేధిస్తూ పాదచారుల జోన్‌ను గ్రానైట్ కాబుల్స్తో ప్రత్యేకంగా రూపొందించడం తెలిసిందే. వాహనాల నిరోధంతో పాటు వాయు కాలుష్యం లేకుండా చేసేందుకు బొల్లార్డ్స్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా కొంతకాలం క్రితం చార్మినార్‌ను సందర్శించిన మున్సిపల్ పరిపాలనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ అధికారులకు సూచించారు. అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయం వద్ద బొల్లార్డ్‌లను ఏర్పాటు చేసిన అహ్మదాబాద్ కంపెనీని సంప్రదించారు. దాని కొటేషన్ల మేరకు రూ.2.38 కోట్లు ఖర్చు చేయనున్నారు. రూ.47.10 కోట్లతో ఆర్ఓబీ.. ఫలక్‌నుమా వద్ద ప్రస్తుతం ఉన్న ఆర్ఓబీకి సమాంతరంగా మరో ఆర్ఓబీని నిర్మించేందుకు రూ.47.10 కోట్ల ప్రతిపాదనలకు సైతం స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. సికింద్రాబాద్– ఫలక్‌నుమా బ్రాడ్‌గేజ్ మార్గంలో ఫలక్‌నుమా వద్ద ప్రస్తుతం ఉన్న ఆర్ఓబీ అక్కడి రద్దీకి సరిపోవడం లేదు. దాంతో తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్య పరిష్కరించాలని ప్రజలతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు సైతం ఎంతోకాలంగా కోరుతున్నారు. అందుకు స్టాండింగ్ కమటీ ఆమోదం తెలిపింది. త్వరలో పనులు చేపట్టనున్నారు. వీటితోపాటు ప్రస్తుతం డిప్యూటీ కమిషనర్లుగా పనిచేస్తున్న వారిని సర్కిల్ కమిషనర్లుగా రీ–డిజిగ్నేట్ చేస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపేందుకు ఆమోదం తెలిపారు. మూడో సారీ అతడు.. ప్రస్తుత స్టాండింగ్ కమిటీ సమావేశం గడువు ముగిసిపోవడంతో పాటు కొత్త స్టాండింగ్ కమిటీ ఎన్నికను నామినేషన్ల గడువు కూడా గురువారంతో ముగిసింది. ఎప్పటిలాగే తొమ్మిది మంది టీఆర్ఎస్, ఆరుగురు ఎంఐఎం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు వీలుగా ఆయా పార్టీల నుంచి నామినేషన్లు దాఖలైనట్లు తెలిసింది. గడచిన రెండు స్టాండింగ్ కమిటీల్లో సభ్యుడిగా ఉన్న రామ్‌నగర్ కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి మూడో స్టాండింగ్ కమిటీకి నామినేషన్ వేసినట్లు సమాచారం. శ్రీనివాస్‌రెడ్డి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడనే విషయం తెలిసిందే. నామినేషన్లు దాఖలు చేసిన వారి వివరాలు శుక్రవారం అధికారికంగా ప్రకటించనున్నారు. గురువారం సమావేశానికి మేయర్ రామ్మోహన్ అధ్యక్షత వహించగా కమిషనర్ జనార్దన్‌రెడ్డి, జోనల్, అడిషనల్ కమిషనర్లు పాల్గొన్నారు. -
పాదచారులపైకి దూసుకెళ్లిన వ్యాను
బెర్లిన్: జర్మనీలోని మ్యూన్‌స్టర్ నగరంలో శనివారం ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. ఓ వ్యానుతో కీపెన్‌కెర్ల్ విగ్రహం సమీపంలో ఉన్న పాదచారులపైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, దాదాపు 30 మంది గాయపడ్డారు. పాదచారుల్ని వ్యానుతో గాయపర్చిన అనంతరం నిందితుడు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉగ్రదాడా? కాదా? అన్న విషయమై ఇంకా ఎలాంటి స్పష్టతా లేదని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో ఉగ్రకోణాన్నీ కొట్టిపారేయలేమన్నారు. ప్రమాదస్థలికి రావద్దనీ, ఈ ఘటనపై ఎలాంటి వదంతులు వ్యాప్తి చేయొద్దని పోలీసులు ప్రజలకు ట్విటర్లో విజ్ఞప్తి చేశారు. 2016, డిసెంబర్లో ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాది అనీస్ బెర్లిన్‌లో ఓ ట్రక్కుతో పాదచారులపైకి దూసుకెళ్లడంతో 14 మంది దుర్మరణం చెందారు. -
రష్యాలో షాకింగ్ ప్రమాదం.. జనాలపైకి బస్సు
మాస్కో : రష్యాలో షాకింగ్ ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళుతున్న బస్సు కాస్త పాదచారులపైకి దూసుకెళ్లింది. దాంతో ఐదుగురు చనిపోయినట్లు ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. వారు చెప్పిన ప్రకారం వెస్ట్రన్ మాస్కోలో ఈ ప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదానికి కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞాన లోపంతోపాటు పలుకారణాలు ఉండొచ్చని తాము అనుమానిస్తున్నట్లు వెల్లడిచించారు. ‘రోడ్డుపై వెళుతున్న బస్సు అనూహ్యంగా అండర్ పాస్ మెట్ల మీదుగా వెళుతున్న పాదచారులపైకి వెళ్లింది. దాంతో మేం షాకయ్యాం. మాకు అందిన సమాచారం మేరకు ఐదుగురు చనిపోయారు’ అని పోలీసు అధికార ప్రతినిధి ఆర్టీయోం కొలెస్నికోవ్ చెప్పారు. సీసీటీవీలో లభించిన వీడియో ప్రకారం తొలుత బస్సు పాదచారుల మార్గంపైకి వచ్చింది. ఆ తర్వాత అండర్ పాస్ మెట్లమీదకు జారుకుంటూ నడుస్తున్న వారిని ఢీకొట్టుకుంటూ వెళ్లింది. ప్రస్తుతం బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
‘ముస్లింలందరినీ చంపేందుకు వెళుతున్నాను’
లండన్: ‘నేను ముస్లింలందరినీ చంపేస్తాను’ అంటూ లండన్‌లో తాజాగా వ్యాన్‌తో పాదచారులను ఢీకొట్టిన వ్యక్తి చెప్పినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. దీని ప్రకారం మొన్న జరిగిన దాడి మాదిరిగానే ఇది కూడా జాతి విద్వేషపూరిత దాడి అని తెలుస్తోంది.‘నేను ఎప్పుడైతే వెనక్కి చూశానో.. అది కారు ప్రమాదం అనుకున్నాను. కానీ ప్రజలంతా కేకలు పెడుతున్నారు.. అటుఇటూ పరుగులు పెడుతున్నారు. ఆ సమయంలో ప్రార్థనలు చేస్తున్నవారినే లక్ష్యంగా ఆ వ్యక్తి ఎంచుకున్నాడు. నేను ముస్లింలను చంపేందుకు వెళుతున్నాను అంటూ గట్టిగా కేకలు పెట్టాడు. మసీదు చాలా చిన్నగా ఉండటంతో అందులో సరిపోక చాలామంది బయటే ప్రార్థనలు చేస్తున్నారు. వారినే లక్ష్యంగా చేసుకొని దాడికి పాల్పడ్డాడు’ అని అబ్దుల్రహ్మాన్ శాలే అలామౌడీ అనే ప్రత్యక్ష సాక్షి చెప్పారు. -
లండన్‌లో మళ్లీ కలకలం..
-
లండన్‌లో మళ్లీ కలకలం.. వరుసగా ఢీకొట్టిన వాహనం
లండన్: పది రోజులు కూడా పూర్తవకముందే లండన్‌లో మరో దుర్మార్గం. గతంలో మాదిరిగానే పాదచారులపైకి ఓ వాహనం దూసుకెళ్లి భీభత్సం సృష్టించింది. సరిగ్గా లండన్‌లోని సెవెన్ సిస్టర్స్ రోడ్డులోగల ముస్లింల సంక్షేమ భవనం దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనికి సమీపంలోనే ఫిన్స్‌బరీ పార్క్ మసీదు ఉంది. అర్ధరాత్రి ప్రార్థనలు ముగిసన తర్వాత ఈ మార్గం నుంచే ముస్లిలు వెళుతుంటారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. పోలీసులు వాహన డ్రైవర్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతానికి ఈ సంఘటనను తీవ్రమైనదేనని చెబుతున్న పోలీసులు ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఉద్దేశ పూర్వకంగా అతడు ఇలా చేశాడా అనే విషయాన్ని శోధిస్తున్నట్లు తెలిపారు. దాదాపు పదిమిందిని ఈ వాహనం ఢీకొట్టింది. అంతకుముందు లండన్ బ్రిడ్జిపై కూడా ఉగ్రవాదుల వాహనం పాదచారులపైకి దూసుకెళ్లి పలువురు చనిపోయేందుకు కారణమైన విషయం తెలిసిందే. దీంతో తాజాగా జరిగిన ఘటనపట్ల పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఎక్కడికక్కడ అప్రమత్తమై మరోసారి అనుమానిత ప్రాంతాలపై దృష్టి సారించారు. మొత్తం 12మంది ఈ ఘటనలో గాయపడినట్లు తెలుస్తోంది. -
ప్రకాశం బ్యారేజీపై రాకపోకలు నిషేధం
విజయవాడ : ప్రకాశం బ్యారేజీ మరమ్మతుల కారణంగా సోమవారం అర్ధరాత్రి నుంచి పనులు పూర్తయ్యే వరకూ అన్ని రకాల వాహనాల రాకపోకలను నిషేధించామని విజయవాడ నగర కమిషనర్ గౌతమ్ సావాంగ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, కృష్ణలంక (సీతమ్మవారి పాదాలు), కుమ్మరిపాలెం, వన్‌టౌన్ వైపు నుంచి, తాడేపల్లి, సీతానగరం వైపు నుంచి ప్రకాశం బ్యారేజీవైపు రాకపోకలు సాగించే వాహనాలు ఈ మార్పును గమనించాలని, పాదచారులను కూడా అనుమతించబోమని ఆయన పేర్కొన్నారు. ట్రాఫిక్ మళ్లింపు ఇలా.. గొల్లపూడి, కుమ్మరిపాలెం, వన్‌టౌన్ ప్రాంతాల నుంచి వచ్చే అన్ని రకాల వాహనాలు గొల్లపూడి వద్ద నుంచి సితారా సెంటర్, పాలఫ్యాక్టరీ, చిట్టినగర్ మీదుగా పంజా సెంటర్, రైల్వే వెస్ట్ బుకింగ్, ఆర్టీసీ టెర్మినల్, లోబ్రిడ్జి, పోలీస్ కంట్రోల్ రూమ్, బందరు లాకులు మీదుగా తొమ్మిదో నంబరు జాతీయ రహదారికి చేరుకుని.. అక్కడి నుంచి కనకదుర్గమ్మ వారధి మీదుగా ప్రయాణించాలి. ఏలూరు రోడ్డు, బందరు రోడ్డు వైపు నుంచి వచ్చే అన్ని రకాల వాహనాలు బందర్ లాకుల మీదుగా తొమ్మిదో నంబరు జాతీయ రహదారికి చేరుకుని అక్కడి నుంచి కనకదుర్గమ్మ వారధి మీదుగా ప్రయాణించాలి. గుంటూరు, తాడేపల్లి, సీతానగరంవైపు నుంచి వచ్చే వాహనాలు, పాదచారులను ప్రకాశం బ్యారేజీపైకి అనుమతించరు. స్కవర్ గేట్ల మరమ్మతుల కోసమే.. ప్రకాశం బ్యారేజీ ప్రధాన గేట్లకు ఇరువైపులా ఉండే స్కవర్ గేట్ల మరమ్మతులకు ఇరిగేషన్ అధికారులు శ్రీకారం చుట్టారు. నదికి వరద ఎక్కువ వచ్చినప్పుడు ఇసుక, వండ్రు కొట్టుకొస్తోంది. ఇలాంటి సమయంలో గేట్లు తెరవాల్సి వస్తోంది. నదికి కృష్ణాజిల్లా వైపు ఆరు, గుంటూరు జిల్లా వైపు ఎనిమిది స్కవర్ గేట్లు ఉన్నాయి. స్కవర్ గేట్లను 1998 తరువాత తీయలేదు. నీటి అడుగున ఉండటంతో గేట్లు బాగా తుప్పుపట్టిపోయాయి. వీటిని తరచూ తీయకపోవడంతో బ్యారేజీ ఎగువన రిజర్వాయర్‌లో ఇసుక నిండిపోతోంది. దీంతో ఈ ఏడాది స్కవర్ గేట్లు తీసి మరమ్మతులు చేయాలని, లేదంటే కొత్త గేట్లు ఏర్పాటుచేయాలని ఇంజినీర్లు నిర్ణయించారు. కృష్ణాడెల్టా ఆధునికీకరణకు కేటాయించిన నిధుల్లోనే స్కవర్ గేట్ల మరమ్మతులకూ నిధులు కేటాయించినట్లు ఇంజినీర్లు చెబుతున్నారు. మంగళవారం నుంచి పనులు ప్రారంభించి పదిరోజుల్లో పూర్తిచేస్తారు. దీంతో బ్యారేజీపై రాకపోకలు నిషేధించారు. -
పాదచారికి జై..
* జంక్షన్ల ఆధునికీకరణ, ఎఫ్‌వోబీల ఏర్పాటు * అధ్యయనం చేసిన ట్రాఫిక్ పోలీసులు * ప్రభుత్వానికి చేరిన సమగ్ర నివేదిక * రెండు విడతల్లో పనులు..! సాక్షి, సిటీబ్యూరో: ‘పాదచారే రోడ్డుకు రాజు’.. అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన ఈ నానుడి నగరానికి మాత్రం సరిపోవడం లేదు. ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్న వారిలో పాదచారులది రెండో స్థానం. సిటీలో ఈ పరిస్థితులు నెలకొనడానికి అనేక కారణాలు ఉన్నాయి. హైదరాబాద్‌ను వరల్డ్ క్లాస్ సిటీగా తీర్చిదిద్దాలని భావిస్తున్న ప్రభుత్వం.. ట్రాఫిక్ స్థితిగతులను చక్కదిద్దేందుకు అధ్యయనం చేయించింది. దీనిపై సమగ్ర నివేదిక సమర్పించిన ట్రాఫిక్ పోలీసులు పాదచారి భద్రతకు పెద్దపీట వేశారు. అనేక కోణాల్లో జంక్షన్ల అభివృద్ధి సిటీలోని ట్రాఫిక్ జంక్షన్ల అభివృద్ధిలో పాదచారుల కోణానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం సిటీలో ప్రధానంగా నాలుగు రకాల జంక్షన్లు ఉన్నాయి. నాలుగు కంటే ఎక్కువ రహదారులు కలిసే జంక్షన్లు, నాలుగు రోడ్లు కూడళ్ల చౌరస్తాలతో పాటు మూడు రోడ్లతో కూడిన ‘టి’, ‘వై’ జంక్షన్లు ఉన్నాయి. ఇలా ప్రతి జంక్షన్‌లోనూ పాదచారులు రోడ్డు దాటేందుకు కచ్చితంగా ప్రత్యేక మార్కింగ్ ఏర్పాటు చేయనున్నారు. రెడ్ సిగ్నల్ పడేదాకా చౌరస్తాలో వేచి ఉండేందుకు రోడ్డుకు పక్కగా సౌకర్యవంతంగా ఉండే ప్లాట్‌ఫాములు నిర్మించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. రెయిలింగ్స్, హూటర్స్.. ఆయా జంక్షన్లలో పాదచారులు ఎక్కడపడితే అక్కడ రోడ్డు దాటేందుకు ప్రయత్నించడంతో తనచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీన్ని నివారించేదుకు రెయిలింగ్స్ ఏర్పాటును సూచించారు. జంక్షన్ స్థాయిని బట్టి అన్ని రోడ్లలోకూ ఎడమ వైపు ఫుట్‌పాత్‌ను అనుసరించి 100 నుంచి 200 మీటర్ల వరకు రెయిలింగ్ ఏర్పాటు చేస్తారు. రోడ్ క్రాసింగ్ మార్క్ ఉన్న ప్రాంతంలో వీటికి ఓపెనింగ్ ఇస్తారు. ఫలితంగా పాదచారి ఆ ప్రాంతంలో మాత్రమే రహదారి దాటే వీలుంటుంది. అంధులు రోడ్డు దాటుతున్న సమయంలో ఆ విషయం వాహన చోదకులకు స్పష్టంగా తెలిసేలా ‘హూటర్లు’ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రత్యేక శబ్దం చేసే ఈ హూటర్ సదరు పాదచారి రోడ్డు దాటే వరకు మోగుతూనే ఉంటుంది. ప్రత్యేక డిజైన్‌తో ఎఫ్‌వోబీలు జంక్షన్లు, రోడ్డు క్రాసింగ్‌కు అవకాశమున్న అన్ని ప్రాంతాల్లోనూ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌ల (ఎఫ్వోబీ) ఏర్పాటుకు ట్రాఫిక్ విభాగం అధికారులు ప్రతిపాదించారు. వీటితోపాటు పాదచారులు రోడ్డు దాటేం దుకు అవకాశమున్న వాణిజ్య, విద్యా కేంద్రాలు ఎక్కువగా ఉన్న చోట్లా వీటిని నిర్మించాలని సూచించారు. ప్రధానంగా దిల్సుఖ్నగర్, కోఠి, బేగంబజార్, అమీర్‌పేట్, మెహదీపట్నం, సికింద్రాబాద్ ప్రాంతాల్లో వీటి ప్రాధాన్యం ఎక్కువని నివేదించారు. గతంలో మాదిరిగా కేవలం బ్రిడ్జి మాత్రమే నిర్మించకుండా ప్రతి ఎఫ్‌వోబీకి లిఫ్ట్, జనరేటర్ సౌకర్యం కచ్చితంగా ఉండాలని, అప్పుడే వీటి వినియోగం ఆశించిన స్థాయిలో ఉంటుందని నివేదికలో స్పష్టం చేశారు. ‘మెట్రో’పై ప్రత్యేక దృష్టి నగరంలో మెట్రో రైల్ ప్రారంభమైన తర్వాత ఆయా ప్రాంతాల్లో పాదచారుల తాకిడి పెరుగుతుందని ట్రాఫిక్ విభాగం అధికారులు అంచనా వేస్తున్నారు. మెట్రో స్టేషన్లో రైలు దిగి సమీప ప్రాంతాలకు వెళ్లేందుకు బస్టాండ్లు, ఆటో స్టాండ్లకు చేరుకునే వారి సంఖ్య పెరుగుతుందంటున్నారు. దీనికోసం మెట్రో స్టేషన్లు ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ ‘స్కై వాక్స్’ సాధ్యం కావని భావిస్తున్న ట్రాఫిక్ పోలీసులు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా మల్టీ డెరైక్షన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్ ఉండే ఎఫ్‌వోబీల అంశాన్ని పరిశీలించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. సాధారణంగా ఎఫ్‌వోబీలు ఒక మార్గంలో ఎక్కి, మరో మార్గంలో దిగేందుకు ఉపకరిస్తాయి. ‘మెట్రో’ వద్ద ఏర్పాటు చేసేవి ఆ స్టేషన్ నుంచి ఎంట్రీ ఉన్నా.. గరిష్టంగా మూడు మార్గాల్లో ఎగ్జిట్స్ ఉండేలా డిజైన్ చేయాలని నివేదించారు. రెండు విడతల్లో పనులు.. ఇప్పటికే పోలీస్స్టేషన్ల వారీగా, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి అధ్యయనం పూర్తి చేసిన ట్రాఫిక్ విభాగం అధికారులు.. ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ప్రతిపాదిత పనులను సర్కారు రెండు విడతల్లో చేపట్టే అవకాశముందని పేర్కొంటున్నారు. తొలి విడతలో తక్షణం అమలు చేసే, వ్యయం తక్కువగా ఉండే వాటికి ప్రాధాన్యం ఇస్తారని చెప్తున్నారు. భారీ వ్యయం, స్థల సేకరణ వంటి అంశాలతో ముడిపడున్న పనులను రెండో విడతలో పూర్తి చేసే అవకాశం ఉందని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. -
డ్రైవర్ లెస్ కారులో ఇక సేఫ్ గా వెళ్లొచ్చు..
టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ఆవిష్కరించిన డ్రైవర్ లెస్ కారుతో ఇక ప్రమాద రహిత ప్రయాణం చేయొచ్చునట. లేటెస్ట్ టెక్నాలజీతో తయారు చేసిన కార్లతో అనేక ప్రమాదాలు చోటు చేసుకోవడంతో నిర్వాహకులు మరిన్ని అధ్యయనాల అనంతరం ఇప్పుడు సురక్షితమైన కార్లను రూపొందించారు. పాదచారులు ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వ్యక్తి.. కారుకు దగ్గరకు వస్తే పసిగట్టి సెన్సర్లు పనిచేయడంతో కారు... దానంతట అదే తప్పించుకొని వెళ్ళే అవకాశం ఉందని నిర్వాహకులు చెప్తున్నారు. సుమారు లక్ష మైళ్ళ దూరం ఎటువంటి ప్రమాదాలు జరగకుండా సురక్షితంగా టెస్టింగ్ దశ పూర్తయిన అనంతరం ఆ సంస్...థ కార్ల తయారీలో మరింత సురక్షితంగా ఉండే డ్రైవర్ లెస్ కార్లను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు ప్రారంభించింది. కారుకు ఏర్పాటు చేసిన స్పీకర్ సిస్టం, స్క్రీన్లు డ్రైవర్ అవసరం లేకుండానే రోడ్డు మీద సురక్షితంగా వెళ్ళే అవకాశం ఉందని పేటెంట్ వివరాలు వెల్లడిస్తున్నాయి. ఈ నూతన ఆవిష్కారంలోని కారు డోర్లు, స్క్రీన్లు పాదచారులకు సెన్సర్ల ఆధారంగా 'స్టాప్', 'సేఫ్ క్రాస్' వంటి ట్రాఫిక్ సిగ్నల్స్ ను తెలుపుతూ హెచ్చరికలు జారీ చేస్తాయి. వాహనంలోని కంప్యూటర్లు పాదచారులు వెళ్ళాల్సిన మార్గాన్ని నిర్దేశిస్తాయి. ఇద్దరికి మాత్రమే సీటు ఉండే ఈ కారు... కేవలం స్మార్ట్ ఫోన్ ద్వారా గ్యారేజ్ కు మెసేజ్ పంపిస్తే చాలు నడవడం ప్రారంభమౌతుంది. అయితే ఈ కొత్త కారు సిస్టమ్ కు సంబంధించి ఎటువంటి స్కెచ్ ను గూగుల్ ప్రస్తుతానికి విడుదల చేయలేదు. కానీ గత నెల్లో నిస్సాన్ విడుదల చేసిన సిస్టమ్ కు ఇంచుమించు దగ్గరగా ఇది ఉండే అవకాశం ఉంది. నిస్సాన్ విడుదల చేసిన డ్రైవర్ లెస్ కారు టీట్రో ఫర్ డేజ్ ను... వెహికిల్ ఫర్ ది డిజిటల్ నేటివ్ గా సామాజిక మీడియా అభివర్ణించింది. ఈ తెల్లని కారు ఇప్పుడు సవరణల అనంతరం క్లీన్ కాన్వాస్ గా రూపొందించబడింది. -
తాడేపల్లికి చేరిన ‘బెజవాడ బ్లేడ్ బ్యాచ్’
►రైలు వంతెనలను అడ్డాగా చేసుకున్న వైనం ►ప్రేమజంటలు, పాదచారులే లక్ష్యం తాడేపల్లి రూరల్: బెజవాడ బ్లేడ్ బ్యాచ్ తమ మకాం ను తాడేపల్లికి మార్చింది. ఒంటరిగా కనిపించిన వారిపై దాడిచేసి నిలువుదోపిడీ చేయడం, ప్రతిఘటిస్తే బ్లేడ్లతో శరీరంపై కోతలు పెట్టడం ఈ బ్యాచ్ పని. ఈ బ్యాచ్ ఆగడాలను భరించలేని విజయవాడ పోలీసు కమిషనర్ హార్ట్కోర్గా గుర్తించిన కొందరికి నగర బహిష్కరణ శిక్ష విధించారు. అలా బహిష్కరణకు గురైనవారు నగరంలో కనిపిస్తేచాలు, నేరం చేసినా, చేయకపోయినా కటకటాలు లెక్కించాల్సిందే. ఇలా నగర బహిష్కరణకు గురైన బ్లేడ్‌బ్యాచ్ సభ్యులు సమీపంలోని తాడేపల్లి మహానాడులో ఉంటూ.. కృష్ణా, గుంటూరు జిల్లాల సరిహద్దుగా ఉన్న కృష్ణానది రైల్వే వంతెనలను అడ్డాగా చేసుకున్నారు. రైలు వంతెనలపై వెళ్లే పాదచారులు, కృష్ణా నదికి ఇసుక తిన్నెలు, రైలు వంతెనలపైకి విహారానికి వచ్చే ప్రేమికులను టార్గెట్ చేసి బ్లేడ్ బ్యాచ్ తమ కార్యకలాపాలను యథేచ్చగా సాగిస్తోంది. వారి కర్కశత్వానికి ఆదివారం ఓ యాచకుడు కరాట సురేష్ గాయాలపాలైన సంఘటన చోటుచేసుకుంది. కృష్ణానదిలో స్నానంచేసి రైలు వంతెన కింద నుంచి ఆంజనేయస్వామి ఆలయానికి వస్తుండగా బ్లేడ్‌బ్యాచ్ కంటపడ్డాడు. ఆ బ్లేడ్‌బ్యాచ్ తనను తీవ్రంగా కొట్టి, బ్లేడుతో బెదిరించి, తన వద్ద ఉన్న సొమ్మును లాక్కొని చేతులు విరగదీసినంత పనిచేసిందని బాధితుడు సురేష్ వాపోయాడు. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చుగా అని స్థానికులు సూచించగా, ఫిర్యాదు చేస్తే చంపేస్తారేమో అని భయం వ్యక్తంచేయడం బ్లేడ్‌బ్యాచ్ ఆగడాలను తెలియజేస్తోంది. తాను మెదక్ జిల్లా నుంచి వచ్చానని, ఎలా ఫిర్యాదు చేయగలనని బాధితుడు వాపోవడం గమనార్హం! కొద్ది రోజుల క్రితం కృష్ణానది వంతెనలపై బ్లేడ్‌బ్యాచ్ సభ్యులు, స్థానికులకు మధ్య జరిగిన ఘర్షణలో ఈ ముఠా కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. విజయవాడ నగర బహిష్కరణకు గురైన రవి అనే బ్లేడ్‌బ్యాచ్ లీడర్ మహానాడుకు మకాం మార్చినట్లు తెలుస్తోంది. రవి కోసం అయన స్నేహితులు రోజూ 25 మంది నుంచి 30 మంది దాకా మహానాడుకు వచ్చి పోతుంటారు. ఇందుకు దగ్గరి దారిగా ఉన్న కృష్ణా నది రైలు వంతెనలను రాకపోకలకు వాడుతూ, తమలాగే ఈ వంతెనలపై నుంచి అనేకమంది రావడం పోవడం గమనించి వారిని దోచుకోవడం ప్రారంభించారు. ఈ రైలు వంతెనల పరిధి రైల్వే పోలీసులది కావడం, రైల్వే పోలీసుల పహారా తక్కువగా ఉండడం బ్లేడ్ బ్యాచ్‌కు కలిసి వచ్చింది. అది తమ పరిధిలోది కాకపోవడంతో తాడేపల్లి పోలీసులు ఈ వంతెనలపై దృష్టి సారించరు. జనసంచారం అంతగా లేకపోవడం, బ్రిడ్జికి అటుఇటు రైల్వే పోలీసులు గస్తీకి వస్తే పారిపోయేందుకు ముందస్తు హెచ్చరికలు చేసేవీలుంది. ఏకాంతం కోరుకునే జంటలు రైల్వే వంతెనలపైకి ఊసులాడుకుంనేందుకు వచ్చి ఈ ముఠా బారిన పడి అవమానాల పాలైన ఘటనలు లేకపోలేదు. గత నెల చివరిలో విజయవాడకు చెందిన ఓ యువజంటను బెదిరించి నగలు, నగదు అపహరించడమే కాకుండా యువకుడిపై వికృత చేష్టలకు దిగడం గమనార్హం! వినోద్ అనే రైల్వే వెండర్‌పై పలుమార్లు దాడులు చేయడం, ఆయన, అతని స్నేహితులు ఈ ముఠాతో ఘర్షణకు దిగడంతో బ్లేడ్‌బ్యాచ్ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. మూడు నెలల క్రితం ఇదే ముఠాకు చెందిన ఓ యువకుడిని స్థానికులు ప్రతిఘటించి పట్టుకోబోయారు. ఆ యువకుడు తన వద్దవున్న బ్లేడుతో చేతులపై కోసుకోవడంతో స్థానికులు హడలిపోయారు. బ్లేడ్‌బ్యాచ్‌ల అరాచకాలను అరికట్టేందుకు పోలీసులు చొరవచూపాలని స్థానికులు కోరుతున్నారు. -
ఫుట్ ఓవర్ బ్రిడ్జీల పనులు వేగిరం
* హైవేపై ఫుట్ ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం * మరి.. సర్వీసు రోడ్లు ఎప్పటికి పూర్తయ్యేనో.. * నేటికీ పూర్తికాని భూసేకరణ చౌటుప్పల్ మండలం మల్కాపురం నుంచి కృష్ణాజిల్లా నందిగామ వరకు 181.5కి.మీ.ల మేర బీఓటీ పద్ధ్దతిన జీఎంఆర్ కాంట్రాక్ట్ సంస్థ నాలుగులేన్ల రహదారి విస్తరణను రూ.2200కోట్ల వ్యయంతో ఏడాదిన్నర క్రితం పూర్తి చేసింది. కానీ, నేటికీ సర్వీసు రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయలేదు. పాదచారులు కూడా రోడ్డును దాటేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. డివైడర్‌పైనున్న బారీకేడ్లను దాటుతూ పడరానిపాట్లు పడుతున్నారు. దీంతో జాతీయ రహదారుల సంస్థ పాదచారుల కోసం ఫుట్ఓవర్ బ్రిడ్జీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. చౌటుప్పల్‌లో 2, చిట్యాలలో 1, కేతేపల్లిలో 1 చొప్పున, ఒక్కోదాన్ని రూ.1.05కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. చౌటుప్పల్‌లోని బస్టాండ్ వద్ద, భాస్కర్ థియేటర్ వద్ద మరోటి నిర్మిస్తున్నారు. చిట్యాలలో కూడ ఒకదాని నిర్మాణం పూర్తికావొచ్చింది. మరోటి నిర్మాణంలో ఉంది. కేతేపల్లిలో కూడ పూర్తి కావొచ్చింది. కాగా, చౌటుప్పల్, చిట్యాలలో ఏర్పాటు చేయద ల్చిన ఎట్ గ్రేడ్ జంక్షన్ల నిర్మాణం నేటికీ ప్రారంభం కాలేదు. సర్వీసు రోడ్లు ఎప్పుడో... చౌటుప్పల్, చిట్యాల, మునగాల, నల్లబండగూడెం, పిల్లలమర్రి, రాయినిగూడెం, నకిరేకల్‌లలో రోడ్డును విస్తరించినా సర్వీసురోడ్ల నిర్మాణం చేపట్టడం లేదు. చౌటుప్పల్‌లో రెండు వైపులా నిర్మాణాలను పూర్తిగా కూల్చివేసినప్పటికీ, తంగడపల్లి క్రాస్‌రోడ్డు ఎదురుగా ఉన్న ఓ భవనం యజమాని కోర్టుకెళ్లడంతో, అధికారులు ఆ భవనం వైపు కన్నెత్తి చూడడం లేదు. బస్టాండ్ సమీపంలో సమాధులను కూడా తొలగించలేదు. సర్వీసు రోడ్డు వేసేందుకు ప్రస్తుతం మట్టిపనులు జరుగుతున్నా, ఇవి మాత్రం అడ్డంకిగా మారాయి. చిట్యాల మండల కేంద్రంలోనూ ఒక వైపు సర్వీసురోడ్డు నిర్మాణం పూర్తయింది. మరోవైపు కిలోమీటరున్నర మేర భూసేకరణ పూర్తికాక, భవన నిర్మాణాలే కూల్చివేయలేదు. నిర్వాసితులు కోర్టుకెళ్లడమే ఇందుకు కారణం. ఫలితంగా వర్షం కురిస్తే, వరద నీరు రోడ్లవెంటే నిల్వ ఉంటోంది. రోడ్డుకంటే తక్కువ ఎత్తులో భవన నిర్మాణాలుండడంతో, దుకాణాల్లోకి వర్షపు నీరు చేరుతోంది. చౌటుప్పల్‌లోనూ ఇదే పరిస్థితి. ప్రమాదాలు నిత్యకృత్యం గతంలో ఉన్న ఇరుకు రహదారిపై ప్రమాదకరమైన మూలమలుపులుండేవి. డేంజర్ జోన్లని బోర్డులుండేవి. హైవే విస్తరణ సమయంలో క్రాసింగ్‌లన్నింటినీ సరిచేస్తామని ఇరువైపులా భూసేకరణ కూడా అధికంగా చేశారు. కానీ కొన్నిచోట్ల డేంజర్ జోన్లు కాదు.. ఏకంగా డెత్ క్రాసింగ్‌లుగా మారాయి. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం వద్ద అండర్‌పాస్ బ్రిడ్జి దిగగానే వాహనాలు తిరగలేని మూలమలుపు ఉంది. హైవే విస్తరణతో 120కిలోమీటర్లకు మించి వేగంతో వస్తున్న వాహనదారులు నేరుగా వచ్చి బోల్తా కొడుతున్నారు. చిట్యాల రైల్వే బ్రిడ్జి వద్ద ఉన్న మూలమలుపు పరిస్థితి అంతే. నార్కట్‌పల్లిలో బైపాస్ చివర, నార్కట్‌పల్లి నుంచి వచ్చే వాహనాలు కలిసే చోట జంక్షన్‌ను సరిగ్గా వేయలేదు. బ్రిడ్జి దిగే క్రమంలో వాహనాలు అతివేగంగా వస్తుంటాయి. ఇదే సమయంలో ఇక్కడ ఇరువైపులా నుంచి వచ్చే వాహనదారులు రోడ్డు దాటాలంటే ప్రమాదకరమైన పరిస్థితి నెలకొంది. సర్వీసురోడ్లు పూర్తికాకపోవడంతో ఇప్పటి వరకు చౌటుప్పల్‌లో 10మందికిపైగా, చిట్యాలలో 15 మందికిపైగా మంది మృత్యువాతపడ్డారు.