Permanent
-
హైకోర్టు శాశ్వత జడ్జీలుగా జస్టిస్ శ్రీనివాస్‌రావు,జస్టిస్ రాజేశ్వర్‌రావు
సాక్షి, హైదరాబాద్: హైకోర్టులోని అదనపు న్యాయమూర్తులు జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్‌రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావును శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని ఫిబ్రవరి 13న హైకోర్టు కొలీజియం నిర్ణయించింది. ముఖ్యమంత్రి, గవర్నర్లు దీనికి సమ్మతి తెలియ జేశారు. అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయిలతో కూడిన కొలీజియం సమావేశమై శాశ్వత న్యాయమూర్తులుగా నియామకానికి జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ రాజేశ్వర్‌రావుకు తగిన అర్హతలు ఉన్నాయని నిర్ణయించింది. వారిద్దరినీ శాశ్వత న్యాయమూర్తు్తలుగా నియమించాలని ఈ నెల 16న కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను ఆమోదించిన కేంద్రం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే వారం వారు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఓయూ నుంచి బీఏ, ఎల్ఎల్బీ..సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటలో 1969, ఆగస్టు 31న జగ్గన్నగారి శ్రీనివాస్‌రావు జన్మించారు. ఆయన తల్లిదండ్రులు లక్ష్మీబాయి, మాణిక్యరావు. పాఠశాల విద్య లింగన్నపేటలో.. గంభీరావుపేట ప్రభుత్వ కళాశాలలో ఇంటర్, హైదరాబాద్ నారాయణగూడలోని భవన్స్ న్యూ సైన్స్ కళాశాల నుంచి డిగ్రీ చేశారు. ఓయూ నుంచి బీఏ, ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1999 ఏప్రిల్ 29న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. తొలుత జి.కృష్ణమూర్తి వద్ద జూనియర్‌గా పనిచేశారు. రిట్ సర్వీస్, నాన్ సర్వీస్ మ్యాటర్స్, సివిల్, క్రిమినల్ కేసులకు సంబంధించి ట్రయల్ కోర్టులు, హైకోర్టులు, ట్రిబ్యునళ్లలో సమర్థంగా వాదనలు వినిపించారు. 2006 నుంచి స్వతంత్ర న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2015 నుంచి న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టే వరకు సింగరేణి కాలరీస్ లిమిటెడ్ స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశారు. 2022 ఆగస్టు 16న హైకోర్టు అదనపు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. దాదాపు ఈ రెండేళ్లలో కొన్ని వేల కేసుల్లో తీర్పులు వెలువరించారు. ఆయనకు భార్య శ్రీలత ఇద్దరు పిల్లలు ప్రణీత్, ప్రక్షిప్త ఉన్నారు. 2001లో ఏపీ బార్ కౌన్సిల్లో ఎన్రోల్మహబూబాబాద్ జిల్లా సూదన్‌పల్లిలో 1969 జూన్ 30న నామవరపు రాజేశ్వర్‌రావు జన్మించారు. తల్లిదండ్రులు గిరిజాకుమారి, సత్యనారాయణరావు. పాఠశాల విద్య వరంగల్‌లో.. హైసూ్కల్, ఇంటర్ గోవిందరావుపేటలో.. డిగ్రీ మహబూబాబాద్‌లో పూర్తి చేశారు. ఓయూ నుంచి లా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించారు. 2001 ఫిబ్రవరి 22న న్యాయవాదిగా ఉమ్మడి ఏపీ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయ్యారు. తొలుత సీవీ రాములు కార్యాలయంలో న్యాయవాదిగా పనిచేశారు. 2015లో ఉమ్మడి హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులై 2019 వరకు విధులు నిర్వర్తించారు. యూజీసీ న్యాయవాదిగానూ పనిచేశారు. 2016 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 2019 వరకు ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ ప్యానల్‌గా విధులు నిర్వహించారు. 2019 నవంబర్ నుంచి అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌గా పనిచేస్తూ 2022 ఆగస్టు 16న అడిషనల్ జడ్జిగా పదోన్నతి పొందారు. దాదాపు ఈ రెండేళ్ల కాలంలో కొన్ని వేల కేసుల్లో తీర్పులు వెలువరించారు. -
ఇక వాహన శాశ్వత రిజిస్ట్రేషన్లూ షోరూంలలోనే..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వాహనాలు కొనుగోలు చేసిన షోరూంలలోనే శాశ్వత రిజిస్ట్రేషషన్లు చేసేందుకు రవాణా శాఖ తాజాగా కసరత్తు చేపట్టింది. వాహన యజమానులకు ఇబ్బందులు తలెత్తకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడంపై దృష్టి సారించింది. ఇప్పటికే ఈ విధానం ఏపీలో విజయవంతంగా అమలవుతుండటంతో ఇక్కడ సైతం అదే పద్ధతిని అమలు చేసేందుకు అనుసరించాల్సిన విధివిధానాలపై అధ్యయనం చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని వాహనాల షోరూంల వివరాలతోపాటు నిత్యం నమోదయ్యే వాహనాల వివరాలను సేకరిస్తోంది. ఒక్కో డీలర్ విక్రయించే వాహనాల సంఖ్య, షోరూంలలోనే వాహనాల శాశ్వత నమోదు ప్రక్రియ చేపడితే అవసరమయ్యే సాంకేతిక పరిజా్ఙనం తదితర అంశాలపై ఈ కసరత్తు చేపట్టింది. లోక్‌సభ ఎన్నికల అనంతరం షోరూంలలోనే శాశ్వత రిజిస్ట్రేషన్ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం షోరూంలలో వాహనాలకు తాత్కాలిక రిజిస్ట్రేషన్లు (టీఆర్) చేస్తున్నారు. రవాణాశాఖ నుంచే ఈ టీఆర్‌లు అందుతున్నప్పటికీ అందుకోసం వాహనదారులు ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లట్లేదు. వాహనంతోపాటు షోరూంలోనే టీఆర్ పత్రాలను తీసుకుంటున్నారు. పర్మినెంట్ రిజిస్ట్రేషన్ (పీఆర్) కూడా షోరూంలకే బదిలీ అయితే వాహనదారులకు ఇకపై పీఆర్ స్మార్ట్ కార్డులు చేతికి అందుతాయి. 2016లోనే కేంద్రం మార్గదర్శకాలు... కేంద్రం ప్రభుత్వం రహదారి భద్రత చట్టంలో వాహనదారులకు ఊరట కలి్పంచే అనేక అంశాలను పొందుపరిచింది. వాహనాల రిజి్రస్టేషన్లను షోరూంలలోనే పూర్తి చేసేలా 2016లోనే మార్గదర్శకాలు రూపొందించింది. ఏపీ సహా పలు రాష్ట్రాలు ఈ సదుపాయాన్ని వాహనదారులకు అందుబాటులోకి తెచ్చాయి. కానీ తెలంగాణలో మాత్రం వాహనాలు కొనుగోలు చేసిన సమయంలో మొదట టీఆర్ తీసుకొని ఆ తరువాత సంబంధిత ప్రాంతీయ రవాణా కార్యాలయంలో పీఆర్ పొందే విధానం కొనసాగుతోంది. అయితే ఈ ప్రక్రియ దళారులతోపాటు కొందరు అధికారుల అక్రమార్జనకు దోహదం చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. కేంద్రం మార్గదర్శకాలు రాష్ట్రంలోనూ అమలైతే షోరూంలోనే పీఆర్ స్మార్ట్ కార్డుతోపాటు వాహనానికి హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ కూడా లభించనుంది. గ్రేటర్లో భారీగా వాహనాల అమ్మకాలు గ్రేటర్ హైదరాబాద్‌లోని పది ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో నిత్యం సుమారు 2,500 కొత్త వాహనాల అమ్మకాలు జరుగుతున్నాయి. వాటిలో 1,600కుపైగా ద్విచక్ర వాహనాలుకాగా మిగతావి కార్లు, ఇతర వాహనాలు ఉన్నాయి. ప్రస్తుతం వాహనదారుల చిరునామా పరిధిలోని ఆర్టీఓ కార్యాలయంలో శాశ్వత రిజి్రస్టేషన్ చేస్తున్నారు. ఒక్కో కార్యాలయంలో రోజుకు వందల సంఖ్యలో శాశ్వత రిజి్రస్టేషన్ల వల్ల వాహనాల రద్దీతోపాటు అందరి సమయం వృథా అవుతోంది. అలాగే ఆన్లైన్లో స్లాట్ నమోదు మొదలు అధికారుల తనిఖీ పూర్తయ్యే వరకు వాహనదారులు ఆర్టీఏ ఏజెంట్లను ఆశ్రయించాల్సి వస్తోంది. షోరూం రిజిస్ట్రేషన్లు అమల్లోకి వస్తే దళారుల అక్రమ దందాకు తెరపడనుంది. -
తెల్లవెంట్రుకలకు శాశ్వతంగా గుడ్ బై : అమేజింగ్ వీడియో
ప్రస్తుతం కాలంలో తెల్లవెంట్రుకలు ఎక్కువగా బాధించే సమస్య. 50ఏళ్ల దాటిన తరువాత నల్లుజుట్టు తెల్లగా మారితే పెద్దగా సమస్య ఉండదు. కానీ టీనేజ్లోనే తెల్ల జుట్టు రావడంతో చాలి నిరాశకు లోనవు తున్నారు. తెల్లజుట్టు పోగొట్టుకోవడానికి యువత పడని పాట్లు ఉండవు అంటే అతిశయోక్తి కాదు. మార్కెట్లో రకరకాల కాస్ట్లీ ఉత్పత్తులతోపాటు, సహజంగా దొరికే, ఆర్గానిక్ పదార్థాలతో తయారైన చిట్కాలకోసం ప్రయత్నిస్తుంటారు. ఈ నేపథ్యంలో ట్విటర్లో ఒక వీడియో హాట్ టాపిక్‌గా నిలిచింది. ఈ వీడియోలో లవంగాలు, ఉల్లిపాయల పొట్టు, టీ బ్యాగులతో కషాయం తయారుచేశారు. దీన్ని చక్కగా వడబోసుకుని ఒక సీసాలో నిల్వ ఉంచుకోవాలి. కావాలంటే ఫ్రిజ్‌లో కూడా పెట్టుకోని వాడుకోవచ్చు. ఈ కషాయాన్ని కుదుళ్లతో సహా తలకు బాగా పట్టించి, బాత్ క్యాప్ లేదా, ప్లాస్టిక్ కవర్‌తో తలను కవర్ చేసి కొద్దిసేపు వదిలివేయాలి. ఆ తరువాత వాటర్‌తో కడిగేయాలి. షాంపులాంటివి వాడకూడదు. ఇలా చేయడం ద్వారా తెల్ల వెంట్రుకలకు చక్కటి పరిష్కారం లభిస్తుందని ఈ వీడియోలో పేర్కొనడం విశేషం. దీని వల్ల జుట్టుకూడా ఒత్తుగా పెరుగుతుందట. అయితే దీనిపై నెటిజన్లు కమెంట్లు విభిన్నంగా ఉన్నాయి. నోట్: ఇది అవగాహన కోసం అందించిన వీడియో మాత్రమే. Say Goodbye to gray hair permanently pic.twitter.com/EVYDMLJkTJ — Learn Something (@cooltechtipz) April 4, 2024 -
భారత్‌లో అఫ్తాన్ ఎంబసీ శాశ్వతంగా మూత, కాంగ్రెస్ రియాక్షన్
Afghanistan Embassy అఫ్ఘానిస్తాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్‌లోని న్యూఢిల్లీ తన రాయబార కార్యాలయాన్ని శాశ్వతంగా మూసి వేసింది. ఈ విషయాన్ని ఆ దేశ రాయబార కార్యాలయం ట్విటర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 1 నుండి తన కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు సెప్టెంబర్ 30న ఎంబసీ చేసిన ప్రకటన తరువాత తాజా నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వం నుండి నిరంతర సవాళ్లను ఉటంకిస్తూ న్యూఢిల్లీలోని తన దౌత్య మిషన్‌ను శాశ్వతంగా మూసివేస్తున్నట్లు భారతదేశంలోని అఫ్ఘానిస్తాన్ రాయబార కార్యాలయం ప్రకటించింది. నవంబర్ 23 నుండి అమల్లో ఉంటుందని తెలిపింది. దురదృష్టవశాత్తు, ఎనిమిది వారాల నిరీక్షంచినప్పటికీ దౌత్యవేత్తలకు వీసా పొడిగింపు , భారత ప్రభుత్వ ప్రవర్తనలో మార్పు లేదని తెలిపింది కాంగ్రెస్ రియాక్షన్ ఈ ప్రకటన తరువాత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ మనీష్ తివారీ బీజేపీపై విమర్శలకు దిగారు. అధికార బీజేపీ సహాయనిరాకరణ కారణంగా ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ఇది స్పష్టంగా కాబూల్‌లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నమని విమర్శించారు. అంతర్జాతీయ వేదికలపై భారతదేశం ఎపుడూ నైతికత విలువలకు, సూత్రాలకు కట్టుబడి ఉందన్నారు. The closure of the Embassy of Afghanistan in New Delhi is an attempt by the NDA/ BJP Government to appease the Taliban. Listen in 👇🏾 https://t.co/7x2Wkhk2J9 — Manish Tewari (@ManishTewari) November 24, 2023 -
ఎనర్జీ అసిస్టెంట్లకు సర్కారు వరం.. వారంతా ఇక పర్మినెంట్ ఉద్యోగులు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఎనర్జీ అసిస్టెంట్ల కల నెరవేరింది. వారి జీవితాల్లో పండుగ వచ్చింది. జేఎల్ఎం గ్రేడ్–2 ఉద్యోగాలు పొందిన వారిలో నిబంధనల మేరకు అర్హత గల అందరినీ పర్మినెంట్ (రెగ్యులర్) చేస్తూ ఏపీ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీలు ఐ.పృధ్వీతేజ్, జె.పద్మాజనార్దనరెడ్డి, కె.సంతోషరావు గురువారం ఉత్తర్వులిచ్చారు. సంస్థ నియమ నిబంధనలకు అనుగుణంగా వారి జీతభత్యాలుంటాయని ఆదేశాల్లో వెల్లడించారు. 2019లో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు ఎనర్జీ అసిస్టెంట్ల పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం సృష్టించి నిరుద్యోగులకు వరంలా అందించింది. ఏపీ ఈపీడీసీఎల్‌లో దాదాపు 2,859 మంది, ఏపీ సీపీడీసీఎల్‌లో 1,910 మంది, ఏపీ ఎస్పీడీసీఎల్లో 3,114 మంది చొప్పున మొత్తం 7,883 మందికి ఉద్యోగం కల్పించింది. వీరికి రెండేళ్ల పాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుందని సీఎండీలు తెలిపారు. -
మస్క్ వేటు, షాక్‌లో స్టార్ కమెడియన్, ట్విస్ట్ ఏంటంటే?
న్యూఢిల్లీ: ట్విటర్ కొనుగోలు తరువాత టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ తన ప్రణాళికలను పక్కాగా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వ్యాపార వర్గాలను సైతం విస్మయానికి గురి చేస్తున్నారు. ముందస్తు హెచ్చరికలు లేకుండానే పేరు మార్పు, కామిక్ ఖాతాలను శాశ్వతంగా బ్యాన్ చేస్తామని ప్రకటించిన మస్క్ తొలి వేటు వేశారు. (మారుతి స్విఫ్ట్-2023 కమింగ్ సూన్: ఆకర్షణీయ, అప్డేటెడ్ ఫీచర్లతో) తాజాగా హాస్య నటి కాథీ గ్రిఫిన్‌కు భారీ షాకిచ్చారు మస్క్. ఏకంగా తన పేరుతోనే కామెడీ చేయడంతో సీరియస్‌గా స్పందించారు. ఎలాన్ మస్క్ పేరుతో కాథీ తన ట్విటర్ ఖాతాపేరును, ప్రొఫైల్ పిక్చర్నుమార్చుకోవడంతోపాటు,అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థులకు మద్దతి వ్వాల్సిందిగా ప్రజలను కోరడంతో ఆమె ఖాతాను శ్వాశతంగా సస్పెండ్ చేశారు. దీనికితోడు మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ మాస్టోడాన్‌కి మద్దతు కలడం ట్విటర్ కొత్త బాస్ మస్క్‌కు ఆగ్రహం తెప్పించింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ఇపుడు నెట్టింట వైరల్ అవుతోంది. వాక్ స్వాతంత్య్రానికి విఘాతం కలిగిస్తున్నారంటూ పలువురు మస్క్‌పై మండిపడుతున్నారు. దీనిపై స్పందించిన మస్క్, కావాలంటే ఆమె 8 డాలర్లు చెల్లించి (బ్లూ టిక్ ఫీజు) ఖాతాను తిరిగి పొందవచ్చంటూ ట్వీట్ చేశారు. (ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్: రూ.40 వేల భారీ డిస్కౌంట్) కాగా 44 బిలియన్ డాలర్లతో ట్విటర్‌ను టేకోవర్ చేసిన బిలియనీర్ మస్క్ బ్లూ టిక్ ఫీజును తీసుకురావడం సంచలనంగా మారింది. అలాగే కీలక ఎగ్జిక్యూటివ్‌లతో పాటు, పలువురు ఉద్యోగుల తొలగింపు కలకలం రేపింది. నకీలీ,పేరడీ ఖాతాలపై శాశ్వతంగా వేటు వేయనున్నట్టు ప్రకటించారు. అదీ పేరడీ అని లేబుల్ లేకుండానే ప్రముఖులు, పాపులర్ పేర్లతో అకౌంట్లు క్రియేట్ చేసి సరదా కంటెంట్ పోస్ట్ చేసేవాళ్లకు వేటు తప్పదంటూ మస్క్ ఆదివారం వరుస ట్వీట్లలో వార్నింగ్ ఇచ్చారు. గతంలో లాగా ముందస్తు హెచ్చరికలు లేకుండా, ఎలాంటి నోటీసు లేకుండా పర్మినెంట్‌గా బ్యాన్ చేస్తామంటూ తాజాగా హెచ్చరించిన సంగతి తెలిసిందే. BREAKING: @KathyGriffin has been permanently suspended from Twitter for impersonating @ElonMusk pic.twitter.com/ust86DZHKj — Benny Johnson (@bennyjohnson) November 6, 2022 But if she really wants her account back, she can have it — Elon Musk (@elonmusk) November 7, 2022 -
భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఎందుకివ్వరు?
ఐక్యరాజ్యసమితి: భారత్, జపాన్, బ్రెజిల్, ఉక్రెయిన్ లాంటి దేశాలకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఎందుకు కల్పించడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నిలదీశారు. శాశ్వత సభ్యత్వం ఇవ్వకపోవడానికి కారణాలు ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. బుధవారం జరిగిన ఐరాస సాధారణ సభ చర్చా కార్యక్రమంలో వర్చువల్‌గా ప్రసంగించారు. భదత్రా మండలిలో అన్ని గొంతుకలకు అవకాశం కల్పించాలన్నారు. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా, సెంట్రల్, ఈస్ట్రన్ యూరప్‌లకు వీటో అధికారం ఉండాలని సూచించారు. సమతూకంతో కూడిన భదత్రా మండలిని కోరుకుంటున్నామని ఉద్ఘాటించారు. ఇప్పటికే శాశ్వత సభ్యదేశ హోదా పొందిన రష్యా ఇతర దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించడంపై ఏనాడూ మాట్లాడలేదని జెలెన్స్కీ విమర్శించారు. అందుకు కారణమేంటో చెప్పాలన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఇప్పుడు ఐదు శాశ్వత సభ్యదేశాలున్నాయి. అవి రష్యా, యూకే, చైనా, ఫ్రాన్స్, అమెరికా. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మరికొన్ని దేశాలకు ఈ హోదా కల్పించాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. తమకు శాశ్వత సభ్యత్వం కల్పించాలని భారత్ కోరుతున్న సంగతి తెలిసిందే. -
స్విగ్గీ కీలక నిర్ణయం: ఉద్యోగులకు బంపర్ ఆఫర్
సాక్షి,ముంబై: ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ స్విగ్గీ మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ (Work From Anywhere) పాలసీని ప్రకటించింది. దాదాపు ఉద్యోగులందరికీ ఈ పాలసీ వర్తిస్తుందని తెలిపింది. కార్పొరేట్, సెంట్రల్ బిజినెస్, టెక్నాలజీ టీమ్‌లు రిమోట్‌గా పని చేస్తూనే ఉంటాయని కంపెనీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా సమయంలో వర్క్ ఫ్రం హోం విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన స్విగ్గీకి గత రెండేళ్లుగా ప్రొడక్టివిటీ బాగా పెరిగిందట. ఈ నేపథ్యంలోనే కంపెనీ తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్టు వెల్లడించింది. 'ఫ్యూచర్ ఆఫ్ వర్క్' విధానం ప్రకారం, కార్పొరేట్, సెంట్రల్ బిజినెస్ ఫంక్షన్, టెక్నాలజీ విభాగాల ఉద్యోగుల రిమోట్‌గా పని చేస్తారు. అయితే బేస్ లొకేషన్లలో పనిచేసేవారు మాత్రం వారంలో కొన్ని రోజులు ఆఫీసుకు రావాలని తెలిపింది. అలాగే ప్రతి త్రైమాసికానికి ఒకసారి సమావేశమవుతాయని వెల్లడించింది. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని కొనసాగించాలని మేనేజర్లు, ఇతర ఉద్యోగుల ఫీడ్‌బ్యాక్‌కు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఫ్యూచర్ ఆఫ్ వర్క్ ప్రధాన అంశం ఫ్లెక్సిబిలిటీ, ఉద్యోగులు తమ పనిని చాలా సౌలభ్యంగా చేసుకోవడంపైనే తమ ప్రధాన దృష్టి అని స్విగ్గీ హెచ్ఆర్ హెడ్ గిరీష్ మీనన్ తెలిపారు. స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ మోడల్‌ను అందించిన మొదటి కంపెనీలలో స్విగ్గీ ఒకటి. 2014లో దేశీయ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన స్విగ్గీ , 27 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలలోని 487 నగరాల ఉద్యోగులు చాలావరకు వర్క్ ఫ్రం హోం ద్వారా పని చేస్తున్నారు. -
పర్మనెంట్ బెయిల్ ఇవ్వలేం
ముంబై: కోరెగావ్–భీమా అల్లర్ల కేసులో తనకు పర్మనెంట్ మెడికల్ బెయిల్ ఇవ్వాలన్న హక్కుల నేత వరవరరావు (83) విజ్ఞప్తిని బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. ఫిబ్రవరి నుంచి తాత్కాలిక మెడికల్ బెయిల్‌పై ఉన్న ఆయన దాన్ని మరో ఆర్నెల్ల పాటు పొడిగించాలని, ముంబైలో కాకుండా హైదరాబాద్‌లో ఉండేందుకు అనుమతించాలని, విచారణ పూర్తయేదాకా పర్మనెంట్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మూడు పిటిషన్లు దాఖలు చేశారు. వాటన్నింటినీ తిరస్కరిస్తున్నట్టు జస్టిస్ ఎస్బీ శుక్రే, జీఏ సనప్‌లతో కూడిన బెంచ్ పేర్కొంది. అయితే కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకునేందుకు వీలుగా బెయిల్‌ను మూడు నెలలు పొడిగించింది. వీవీలో పార్కిన్సన్ లక్షణాలు కన్పిస్తున్నాయని ఆయన తరఫు లాయర్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఆయన్ను ఉంచిన తలోజా జైల్లో వైద్య సదుపాయాలు దారుణంగా ఉన్నాయన్న వాదనతో కోర్టు ఏకీభవించింది. రాష్ట్రంలోని అన్ని జైళ్లలో సదుపాయాలపై ఈ నెలాఖరుకల్లా సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా జైళ్ల శాఖ ఐజీని ఆదేశించింది. -
చైనా యాప్‌లకు మరో భారీ షాక్!
సాక్షి, న్యూఢిల్లీ: చైనా యాప్‌లపై కేంద్రం తాజాగా మరో కొరడా ఝళిపించింది. భారతదేశంలో టిక్‌టాక్, ఇతర 58 చైనా యాప్‌లపై శాశ్వత నిషేధం విధించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. గతేడాది జూన్‌లో వీటిపై భారత ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించగా.. ఇప్పుడు వాటిని శాశ్వత నిషేధం దిశగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. భారతీయ వినియోగదారులడేటాను అక్రమంగా సేకరించి దుర్వినియోగం చేస్తున్నాయన్న ఆరోపణలపై ఆయా సంస్థల వివరణను కోరింది కేంద్రం. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గత వారమే నోటీసులు జారీ చేసింది. అయితే వాటి వివరణతో సంతృప్తి చెందని ప్రభుత్వ 59 యాప్‌లను శాశ్వతంగా నిషేధించాలని నిర్ణయించింది. గత ఆరు నెలల్లో ప్రభుత్వం 208 యాప్‌లను నిషేధించిన విషయం తెలిసిందే. గోప్యత, జాతీయ భద్రతా రక్షణకు అనుగుణంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69ఏ కింద ఈ యాప్‌లను నిషేధించింది. -
కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేస్తాం
ఎర్రగుంట్ల: వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ముందుగా కాంట్రాక్టు కార్మికులందరిని పర్మినెంట్ చేసి, విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని వైఎస్సార్ సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు తెలిపారు. విద్యుత్ చట్ట సవరణ బిల్లు– 2018ను ఉపసంహరించాలంటూ 1104 యూనియన్ రాష్ట్ర కార్యనిర్వాహక అ«ధ్యక్షడు జగదీశ్వర్ చేస్తున్న నిరాహార దీక్షను సందర్శించి జగదీశ్వర్‌కు నిమ్మరసం ఇచ్చి సురేష్‌బాబు, సుధీర్‌రెడ్డిలు, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నారాయణ బుధవారం సాయంత్రం దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా సురేష్‌బాబు మాట్లాడుతూ కార్మిక సోదరులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయం చూస్తే చాలా బాధాకరమన్నారు. నాలుగేళ్లుగా జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కంలలో ఔట్ సోర్సింగ్ బాధితులు చాలా ఎక్కువగా కన్పిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 35 వేల మంది కార్మికులు కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్నారు. నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ సీఎం రమేష్ నియంతగా వ్యవహరిస్తున్నారన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే 600 మెగావాట్ల యూనిట్‌ను పెంచిన వ్యక్తి వైఎస్సారే అని యువతకు ఉపాధి కల్పించారన్నారు. ఈ రోజు ఆ యూనిట్లను రన్ కాకుండా నిలుపుదల చేసే పరిస్థితి ఉందన్నారు. 600 మెగావాట్లను రన్ కాకుండా చేస్తున్నారని చెప్పారు. జిల్లా వాసి అయిన సీఎండీ ఈ ప్రాంత వాసులను అన్యాయం చేస్తున్నారని చెప్పారు. బినామీగా సీఎం రమేష్, నారా లోకేష్ ద్వారా బొగ్గులో కుంభకోణం జరిగిందన్నారు. ఉక్కు పరిశ్రమ వస్తే చాలా మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు. టీడీపీ ప్రభుత్వం అవినీతిమయం టీడీపీ ప్రభుత్వంలో ప్రతి డిపార్ట్మెంట్ అవినీతిమయం అయిందని తెలిపారు. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాగానే ఆర్టీపీపీలో అన్ని యూనిట్లు పనిచేసేలా బాధ్యత తీసుకుంటామన్నారు.ఎన్నికల ముందు చంద్రబాబు ఉచిత హామీలను ఇచ్చి మోసం చేశారన్నారు. కార్మికులకు సంపూర్ణ మద్దతు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఎం. సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ కార్మికులకు వైఎస్సార్ సీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. ప్రవేటీకరణ పేరుతో టీడీపీ ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను మూయించే ఆలోచనలో ఉందన్నారు. అందులో భాగంగానే గతంలో సీసీఐను ప్రవేటీకరణ చేసి ఎందరో ఉద్యోగులను, కార్మికులను రోడ్డున వేశారన్నారు. ఈ బిల్లు వల్ల విద్యుత్ సంస్థలను కూడా ప్రవేటీకరణ చేసి పెద్ద కంపెనీలకు అప్పగించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచనలో ఉన్నాయని, అందుకే బిల్లు ఆమోదం పొందకుండా ఐక్యంగా ఉండి పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్టీపీపీని స్థానిక అధికార పార్టీ నేతలు దోచుకుంటున్నారని చెప్పారు. బ్యాక్‌డౌన్ పేరుతో ఆర్టీపీపీని నిర్వీర్యం చేస్తున్నారని చెప్పారు. ఆర్టీపీపీకి బ్రహ్మంసాగర్ నుంచి నీటిని సరఫరా చేసి దానిని మనుగడను కాపాడిన ఏకైక వ్యక్తి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని చెప్పారు. అందుకే వైఎస్ జగనన్న సీఎం అయితే మన ప్రాంతంలోని అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నారాయణ, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎం.హర్షవర్ధన్‌రెడ్డి, 1104 యూనియన్ రాష్ట్ర అ««ధ్యక్షుడు పి.చంద్రశేఖర్‌లు ప్రసంగించారు. -
‘రుణమాఫీ శాశ్వత పరిష్కారం కాదు’
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సంక్షోభాలకు రుణమాఫీ శాశ్వత పరిష్కారం కాదని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. 2019లో కేంద్రంలో అధికారంలోకి వస్తే వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ రంగంలో విశేష సేవలు అందించినందుకుగాను ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్ స్వామినాథన్‌కు ప్రైవేట్ సంస్థ ఐసీఎఫ్ఏ అగ్రికల్చర్ ప్రైజ్ ప్రకటించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో వెంకయ్య చేతుల మీదుగా అగ్రికల్చర్ ప్రైజ్ కింద లక్ష డాలర్ల బహుమతిని స్వామినాథన్‌కు అందజేశారు. అగ్రికల్చర్ ప్రైజ్‌ను మొదటిసారి అందుకున్న వ్యక్తి స్వామినాథన్ కావడం విశేషం. రైతుల సమస్యలపై పార్లమెంటు, రాజకీయ పార్టీలు, నీతి ఆయోగ్, మీడియా దృష్టి కేంద్రీకరించాలని వెంకయ్య సూచించారు. రుణ మాఫీ, ఉచిత విద్యుత్ వంటి పథకాలను తీసుకురావడం సరికాదన్నారు. ఒకసారి రైతుల రుణాలు మాఫీ చేయడం శాశ్వత పరిష్కారం కాదని పేర్కొన్నారు. రుణాలు ఇచ్చి తిరిగి కట్టవద్దని చెప్పే బ్యాంకులు ఉన్నాయా? అని ప్రశ్నించారు. శాశ్వత పరిష్కారాల కోసం శాస్త్రవేత్తలు, పాలసీ రూపకర్తలు దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. -
తిరిగితే తిరిగావు కానీ...
ఊరికి దూరంగా వున్న గురుకులం అది. చాలామంది పిల్లలు అందులో ఉండేవారు. వారికి ఒక గురువు పాఠాలు బోధించేవారు. పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. అయితే, ఒక పిల్లాడు రోజూ రాత్రి లేచి, గోడ దూకి, పట్టణంలోకి తిరగడానికి వెళ్లేవాడు. గదుల్ని పర్యవేక్షించడానికి వచ్చిన గురువు ఒక పిల్లాడు గోడ దూకి వెళ్లినట్టు గుర్తించాడు. అలాగే తాను వాడే ఒక ఎల్తైన స్టూలు కూడా లేకపోవడం గమనించాడు. లాంతరు వెలుగులో తిరిగి ఆ స్టూలు ఎక్కడుందో కనిపెట్టాడు గురువు. దాన్ని తీసేయించి, ఆ రాత్రి ఆ గోడ దగ్గరే నిల్చున్నాడు. బయటికి పోయిన కుర్రాడు అర్ధరాత్రి దాటాక తిరిగివచ్చాడు. అక్కడ స్టూలు ఉందో లేదో గుర్తించకుండా, నిల్చున్న గురువు తల మీద కాలు మోపాడు. కిందికి దిగాక తను చేసింది చూసి ఒక్కసారి భయాశ్చర్యాలకు లోనయ్యాడు. కాలు మోపిందానికి గురువు ఏ స్పందనా కనబరచకుండా, ‘నాన్నా, నువ్వు రాత్రిళ్లు తిరిగితే తిరిగావు. కానీ బయట బాగా చలిగావుంది. నీ ఆరోగ్యం జాగ్రత్త అని చెబుదామనే ఇంతసేపూ ఇక్కడ నిల్చున్నాను’ అన్నాడు. పిల్లాడి ముఖంలో మార్పు కనబడింది. ఇంకంతే, అప్పట్నించీ ఆ గోడ దూకే పని మళ్లీ చేయలేదు. -
ఎంఐ ఎ1పై పర్మినెంట్ రేట్ కట్
సాక్షి,ముంబై: చైనా మొబైల్ మేకర్ షావోమి ఎంఐ ఫాన్స్‌కు గ్రేట్ న్యూస్ అందించింది. ఇటీవల లాంచ్ చేసిన ఎంఐ ఎ1పై శాశ్వతంగా తగ్గింపు రేటును ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఇటీవల తాత్కాలికంగా రూ.2 వేల తగ్గింపును అందించిన కంపెనీ తాజాగా ఎప్పటికీ వెయ్యి రూపాయల తగ్గింపుతో కస్టమర్లకు అందించనుంది. భారత్‌లో ఈ ఏడాది సెప్టెంబర్‌లో రూ.14,999 ధరలో విడుదల చేసిన ఈ డివైస్‌ను ఇకమీదట రూ.13,999లకే అందిస్తున్నట్టు ట్విట్టర్లో తెలిపింది. వెయ్యి రూపాయల మేర పర్మినెంట్ డిస్కౌంట్‌ను అందిస్తున్నట్టు షావోమి వైస్ ప్రెసిడెంట్ మను కుమార్ జైన్ ట్వీట్ చేశారు. ఎం, ఫ్లిప్‌కార్ట్‌ద్వారా కొనుగోలు చేయవచ్చని సూచించారు. ఎంఐ ఎ1 ఫీచర్లు 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఆండ్రాయిడ్ నౌగట్ 7.1.2 2గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.1.2 నౌగాట్ 12ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా 4జీబీ ర్యామ్ 64జీబీ స్టోరేజ్ 3080 ఎంఏహెచ్ బ్యాటరీ Great news Mi Fans: announcing a permanent price drop of ₹ 1000 on Mi A1! 🙌#MiA1: picture perfect flagship dual camera phone. Now available for a perfect price of ₹13,999! Buy it from https://t.co/lzFXOcGyGQ and @Flipkart. pic.twitter.com/PWplnIMC71 — Manu Kumar Jain (@manukumarjain) December 10, 2017 -
శాశ్వత‘నిద్ర’
-
విద్యతోనే బంగారు భవిష్యత్తు
సుభాష్‌నగర్ : విద్యతోనే విద్యార్థుల భవిష్యత్ బంగారుమయమవుతుందని నిజామాబాద్ శాశ్వత లోక్‌అదాలత్ చైర్మన్ నూరుల్లా ఘోరి అన్నారు. శుక్రవారం నగరంలోని ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ చట్టానికనుగుణంగా నడుచుకోవాలని, చట్టం లేకుంటే అరాచకం రాజ్యమేలుతుందన్నారు. కళాశాలల్లో ర్యాగింగ్‌కు పాల్పడవద్దని, విద్యార్థులు సోదరభావంతో మెలగాలన్నారు. సీనియర్ న్యాయవాది మానిక్‌రాజ్ మాట్లాడుతూ చట్టం ద్వారా సంక్రమించిన హక్కులను వినియోగించుకోవాలని, వాటితోపాటు బాధ్యతలను మరువరాదన్నారు. ఎస్ఎస్ఆర్ విద్యాసంస్థల అధిపతి మారయ్యగౌడ్ మాట్లాడుతూ చట్టం ద్వారా లభించిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయవద్దని సూచించారు. సదస్సులో నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రామారావు, ఉపాధ్యక్షుడు నారాయణ, న్యాయసేవా సంస్థ పర్యవేక్షకులు పురుషోత్తం గౌడ్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. -
పాకిస్తాన్ శాశ్వత శవాసనానికి అర్హురాలు!
యోగా కార్యక్రమంతో ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచాన్ని ఒకే వేదికపైకి తేవడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయం అని బీజేపీ మిత్రపక్షం శివసేన ప్రశంసలు కురిపించింది. అయితే శరీరంలోని రుగ్మతలను తొలగించే యోగా.. ప్రజలు బాధపడుతున్న అధిక ద్రవ్యోల్బణం, అవినీతి నొప్పులు తగ్గించడానికి పనికిరాదని, యోగాలోని శవాసనానికి పాకిస్తాన్ శాశ్వత అర్హురాలంటూ శివసేన తన పత్రిక సామ్నా సంపాదకీయంలో విమర్శించింది. ప్రపంచానికే సెంటర్ స్టేజ్ గా యోగాను తీసుకురావడంతోపాటు, 130 దేశాల్లో యోగా చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కృషి మెచ్చుకోదగ్గ విషయం అని శివసేన ప్రశంసించింది. యోగా ద్వారా 130 దేశాలు నడుం వంచాయని, మోడీ కృషితో అన్ని దేశాలనూ నేలపై పడుకొనేట్లు చేయగలిగారని, అయితే ప్రస్తుతం పాకిస్తాన్ అటువంటి యోగాసనానికి శాశ్వత అర్హురాలంటూ శివసేన చురక వేసింది. అలా జరగాలంటే కేవలం ఆయుధాలతోనే సాధ్యమౌతుందంటూ విమర్శలు చేసింది. శవంలా నేలపై పడుకొనే యోగాసనమైన 'శవాసనం' యోగాలో ప్రముఖమైనది. ఆ ఆసనంలాగానే పాకిస్తాన్ ను చేయాలని శివసేన తన పార్టీ పత్రిక 'సామ్నా' ఎడిటోరియల్ లో పేర్కొంది. బీజేపీయేతర ప్రభుత్వాలున్న కొన్ని రాష్ట్రాలు మోదీ ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తున్నాయని, అయితే యోగా కూడ సైన్సేనని వ్యతిరేకించాల్సిన అవసరం లేదని తెలిపింది. ప్రధాని ఆధ్వర్యంలో జరుగుతున్న యోగా మతపరమైన, ధార్మిక కార్యక్రమం కాదని, ఇండియాలోనే కాక ఇతర దేశాల్లోనూ లక్షలమంది వివిధ ఆసనాల్లో రెండవ ప్రపంచ యోగాదినాన్ని ఘనంగా జరుపుకున్నారని శివసేన తెలిపింది. అయితే భారత్ లో అవినీతి రూపు మాపేందుకు తాము చేపడుతున్న చర్యలపై దోహాలో ప్రధాని మోదీ వివరించిన తీరును తమ పార్టీ పత్రిక సామ్నాలో విమర్శించిన శివసేన, విదేశీ గడ్డపై భారత్ పటిష్టను మంటగలపొద్దని సూచించింది. -
ఇరవై ఏళ్లుగా ఉన్నాం.. కనికరించండి...
‘ఎక్సైజ్’ ప్రైవేట్ డ్రైవర్ల విజ్ఞప్తి కొత్త వాహనాలపై నియమించాలని వేడుకోలు వరంగల్ క్రైం : కొత్త వాహనాలు వస్తే తమను పర్మినెంట్ చేస్తామని సంతోషించాం... కానీ తీసివేస్తామంటున్నారు.. అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్సైజ్ శాఖలోని ప్రైవేట్ డ్రైవర్లు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 350 మంది ఎక్సైజ్‌శాఖలో ప్రైవేట్ డ్రైవర్లుగా గత 20 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు ఎక్సైజ్ శాఖకు కొత్త వాహనాలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అరుుతే, ఈ వాహనాలపై తమను పర్మినెంట్ లేదా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమిస్తారని ప్రైవేట్ డ్రైవర్లు భావిస్తుండగా.. వీరందరినీ తొలగించాలని మంత్రి సెలవిచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డ్రైవర్లు ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు, ఎక్సైజ్ డెరైక్టర్అకున్ సభర్వాల్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇరవై ఏళ్లుగా శాఖను నమ్ముకున్నందున తమకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు. లేనిపక్షంలో హైదరాబాద్ తరహాలో వాహనాలను లోన్‌పై ఇప్పించి శాఖలోనే పెట్టుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. దీంతో అందరిపై జాలి చూపకున్నా... రెండేళ్లకు పైబడి పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలనే ఒక నిర్ణయానికి వచ్చిన ఆ శాఖ డెరైక్టర్ వీరినిశాఖలోనే కొనసాగించేలా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయం కూడా వారి పాలిట శాపంగా మారిందనే చెప్పాలి. ప్రభుత్వం ఉద్యోగం కాకుండా అతి తక్కువ వేతనంతో ప్రైవేట్‌గా పనిచేస్తున్నప్పుడు తమకు బదిలీ ఏమిటని వీరు ప్రశ్నిస్తున్నారు. కానిస్టేబుళ్ల ఫిర్యాదుతో.. ఎక్సైజ్ శాఖలోని కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లు శాఖలోని ఉన్నతాధికారులకు ప్రైవేటు డ్రైవర్లపై ఫిర్యాదు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ డ్రైవర్ల కారణంగా తనిఖీ సమాచారం గుడుంబా తయూరీదారులకు వెళ్తోందని, తద్వారా అరికట్టలేకపోతున్నామనేది వారి ఫిర్యాదుల సారాంశం. ఇదే నిజమని న మ్ముతున్న ఉన్నతాధికారులు ప్రైవేట్ డ్రైవర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. రాష్ర్ట్రంలోని అనేక ప్రాంతాలలో సీజ్చేసిన గుడుంబా, బెల్లంను కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లు, ఎస్సైలు అమ్ముకున్న సందర్భాలు ఉన్నాయి. హన్మకొండలో అయితే ఏకంగా ఒక సీఐ రెండు లారీల బెల్లాన్ని వ్యాపారికి తరలించి సొమ్ముచేసుకున్నాడు. ఇలా శాఖ ఉద్యోగుల్లో పలువురు తప్పులు చేస్తూ ప్రైవేట్ డ్రైవర్లపై ఫిర్యాదు చేయడంతో వీరి బజారున పడే పరిస్థితి నెలకొంది. -
హామీ ఏమైంది బాబూ?
కాంట్రాక్టు లెక్చరర్ల ఆందోళనకు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు మద్దతు అధికారంలోకి వస్తే సర్వీసులు క్రమబద్ధీకరిస్తామని అప్పట్లో హామీ మంత్రివర్గ కమిటీని వేసి చేతులు దులుపుకున్న వైనం ‘ఏళ్ల తరబడి ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లను వెంటనే పర్మినెంట్ చేయాలి.. వారిని తొలగించాలని చూస్తే తెలుగుదేశం పార్టీ తరఫున ఆందోళన చేపడ తాం.. ప్రభుత్వానికి బుద్ధిచెబుతాం.. ఉద్యోగ భద్రత కోసం ఆడబిడ్డలు రోడ్డెక్కడం దారుణం.. మేం అధికారంలోకి వస్తే ఈ వ్యవస్థను రద్దు చేసి వీరందరినీ పర్మినెంట్ చేస్తాం..’- ప్రతిపక్ష నాయకుని హోదాలో చంద్రబాబునాయుడు నాలుగేళ్ల క్రితం 2012 ఫిబ్రవరి 4న రాజమండ్రిలో కాంట్రాక్టు మహిళా లెక్చరర్ల దీక్షా శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం పలికిన పలుకులివి. హామీ ఇచ్చిన రెండేళ్లకే ఆయన అధికారంలోకి వచ్చారు. సీఎం అయి రెండేళ్లవుతున్నా వీరి గోడు పట్టించుకోవడం మరిచారు. విశాఖపట్నం: జాబు రావాలంటే బాబు రావాలన్న నినాదంతో నిరుద్యోగులతో పాటు రాష్ట్రంలోని 3750 మంది కాంట్రాక్టు లెక్చరర్లు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వీరిలో పీజీలు, పీహెచ్‌డీలు చేసిన వారున్నారు. బాబు వచ్చారు.. ఇక తమను రెగ్యులరైజ్ చేస్తారని ఈ కాంట్రాక్టు అధ్యాపకులు సంబరపడ్డారు. అయితే ఆయనొచ్చాక వారి జీవితాలు మరింత దుర్భరమయ్యాయి. వీరి ఆవేదనను, ఆందోళనలను పట్టించుకోలేదు. నెలనెలా ఇచ్చే జీతాలు మూడు నాలుగు నెలలకు కూడా ఇవ్వడం లేదు. దీంతో వీరి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులొచ్చాయి. వాస్తవానికి పదహారేళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలోనే కాంట్రాక్టు లె క్చరర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. అప్పట్నుంచి ఇప్పటిదాకా వేలాది మంది తమ ఉద్యోగాలు ఎప్పుడైనా రెగ్యులరైజ్ కాకపోతాయా? అనే ఆశతో పనిచేస్తున్నారు. 2000లో ప్రభుత్వ జూనియర్ లెక్చరర్లకిచ్చే బేసిక్ వేతనానికి అదనంగా రూ.4500 ఇచ్చేవారు. 2011 నుంచి దానిని రూ.18 వేలు చేశారు. 2014లో జూనియర్ లెక్చరర్ల మూలవేతనాన్ని కనీస వేతనంగా వీరికి చెల్లించాలని నిర్ణయించారు. 2015 పీఆర్సీ ప్రకారం వీరికి నెలకు రూ.37,100 చొప్పున వేతనం ఇవ్వాల్సి ఉంది. అయినా ఇప్పటికీ రూ.18 వేలే చెల్లిస్తోంది. అది కూడా మూడు నాలుగు నెలలకొకసారి ఇస్తోంది. గత డిసెంబర్ నుంచి ఇప్పటికీ వేతనాలివ్వలేదు. ఏడాది పొడవునా పనిచేస్తున్నా వీరికి పది నెలల జీతాలే ఇస్తారు. ఏప్రిల్, మే నెలల్లో వేసవి సెలవులకు వీరికి జీతాలుండవు. కానీ ఆ రెండు నెలలు కూడా వీరితో పరీక్షా పత్రాల మూల్యాంకనం, అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణ పనులు చేయిస్తుంటారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా రెగ్యులర్ లెక్చరర్లు సుమారు 2500 మంది ఉంటే ఈ కాంట్రాక్టు లెక్చరర్ల సంఖ్య 3750 వరకు ఉన్నారు. కమిటీకి తీరికలేదు.. వీరి క్రమబద్ధీకరణ అంశంపై ప్రభుత్వం 2014 సెప్టెంబర్‌లో కేబినెట్ కమిటీని నియమించింది. ఇందులో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చైర్మన్‌గా, మంత్రులు గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాథరెడ్డి, కామినేని శ్రీనివాస్ సభ్యులుగా ఉన్నారు. నెల రోజుల్లో ఈ కమిటీ తమ నివేదికను సర్కారుకు సమర్పించాల్సి ఉంది. 18 నెలలవుతున్నా ఈ కమిటీ సభ్యులు ఒక్కసారీ సమావేశం కాలేదు. ఉద్యోగ భద్రత కల్పించండి తమను క్రమబద్ధీకరించడంపై సుప్రీంకోర్టులో అభ్యంతరాలున్నాయని ప్రభుత్వం చెబుతోంది.. అదే నిజమైతే బేసిక్‌తో పాటు డీఏ చెల్లించేలా అసెంబ్లీలో తీర్మానం చేసి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కాంట్రాక్టు లెక్చరర్లు డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారని చెబుతున్నారు. పొరుగున ఉన్న తెలంగాణలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లను జూన్‌లో క్రమబద్ధీకరిస్తున్నారు. గతంలో తమను క్రమబద్ధీకరిస్తామన్న హామీని చంద్రబాబు నెరవేర్చాలని వీరు కోరుతున్నారు. -
పదవులు శాశ్వతం కాదు: మంత్రి అయ్యన్న
-
'కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తాం'
హైదరాబాద్: గురుకుల పాఠశాల ఉపాధ్యాయ, సిబ్బందికి ఉద్యోగ వయో పరిమితిని ప్రస్తుతమున్న 58 సంవత్సరాల నుంచి 60కి పెంచుతామని సాంఘికసంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు తెలిపారు. అంతేకాకుండా వారికి హెల్త్ కార్డులు అందజేస్తామన్నారు. వారి జీతాలు ట్రెజరీ ద్వారా అందిస్తామన్నారు. అంతేకాకుండా గురుకుల పాఠశాల కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామన్నారు. -
చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితిదీ!
-
చిత్తూరు షుగర్స్‌లో నో క్రషింగ్
355 మంది కార్మికుల తొలగింపు ఈ ఏడాది క్రషింగ్ నిలిపివేస్తున్నట్లు ప్రకటన ఆందోళనకు దిగిన కార్మికులు సాక్షి, చిత్తూరు: అదిగో క్రషింగ్.. ఇదిగో క్రషింగ్ అంటూ నెలరోజు లుగా దోబూచులాడిన చిత్తూరు షుగర్స్ పాలకవర్గం, అధికార వర్గం ఎట్టకేలకు చిత్తూరు సహకార చక్కెర కర్మాగారంలో ఈ ఏడాది క్రషింగ్ నిలిపివేస్తున్నట్లు శనివారం ప్రకటించాయి. అంతేకాదు కర్మాగారంలో 30 ఏళ్లకు పైగా పనిచేస్తున్న 355 మంది సీజనల్ పర్మినెంట్, కన్సాలిడేట్ కార్మికులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు రెఫరెన్స్ సీసీఎస్ ఈఎస్టీటీ ఓఎం 2015 ఉత్తర్వులు జారీచేసింది. రాత్రికి రాత్రే ఈ ఉత్తర్వులు వెలువడ్డా యి. బకాయిలు ఇవ్వలేనందునే ఈ ఏడాది కర్మాగారంలో క్రషింగ్ నిలిపివేయడంతోపాటు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో 355 మంది కార్మికులను సైతం విధులనుంచి రిలీవ్ చేస్తున్నట్లు పా లకవర్గం తీర్మానించగా ఇన్చార్జ్ ఎండీ అధికారికంగా దానికి ఆమోదముద్ర వేశారు. 12వతేదీనే పాలకవర్గం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో చూపారు. అధికారులు, చైర్మన్‌తో గొడవ నేపథ్యంలో ఈనెల 10వ తేదీ ఇన్చార్జ్ ఎండీ పదవికి రాజీ నామా చేసిన మల్లికార్జున రెడ్డి పేరు మీదనే క్రషింగ్ నిలిపివేత, కార్మికుల తొలగింపు ఉత్తర్వులు వెలువడడం విశేషం. అయితే ఇన్చార్జి ఎండీ తన పదవికి రాజీనామా చేయకమునుపే ఈ ఉత్వర్వులపై సంత కం చేశారా ? అనే అనుమానం తలెత్తుతోంది. లేకపోతే ఆయన రాజీనామానే ఓ డ్రామానా అనే సంశ యం కూడా కలుగుతోంది. కర్మాగారం కార్యాలయం, ఇం జినీరింగ్ విభాగం, మ్యాన్యుఫ్యాక్చరింగ్ విభాగాలకు చెందిన కార్మికు లు తొలగించిన వారిలో ఉన్నారు. 13 నెల లుగా వారు జీతాలు లేకుండానే పనిచేస్తున్నారు. కార్మికులకు సంబంధించి 12 కోట్ల జీతాలకు చెందిన బకాయిలతోపాటు మరో మూడు కోట్ల పీఎఫ్ బకాయిలు చెల్లించాలి. వాటి సంగతి పట్టించుకోని ప్రభుత్వం కార్మికులకు, యూనియన్ నేతలకు మాట మాత్రమైనా చెప్పకుండా తొలగింపు చర్యలకు దిగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ఎండీ పాలక వర్గం తీర్మానానికి ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న కార్మికులు శనివారం ఉదయం నుంచి కర్మాగారం వద్ద ఆందోళన చేపట్టారు. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఒక్కసారిగా వందలాది మం ది ఉద్యోగులను ఎలా తొలగిస్తారంటూ వారు ప్రశ్నిస్తున్నారు. రైతులు, కార్మికులకు చెందిన బకాయిలను చెల్లించలేని పరిస్థితిలోనే కన్సాలిడేట్ కార్మికులను రిలీవ్ చేసినట్లు చైర్మన్ ఎన్పీ రామకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు. ఆది నుంచి డ్రామానే రైతులు, కార్మికుల బకాయిలు చెల్లించి సహకార చక్కెర కర్మాగారాన్ని ముందుకు నడిపిస్తానని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు అధికారం చేపట్టిన తరువాత హామీలు తుంగలో తొక్కారు. విలువైన ఆస్తులున్న కర్మాగారాన్ని అమ్మకానికి పెట్టేందుకు బాబు ప్రభుత్వం ఆది నుంచే మొగ్గు చూపింది. ఇందుకోసం అధ్యయనం అంటూ కమిటీ వేసి చిత్తూరు షుగర్స్ అమ్మకానికి మార్గం సుగమం చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా రైతాంగంతో పాటు అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో కర్మాగారం అమ్మకానికి చంద్రబాబు తాత్కాలిక విరామం మాత్రమే ఇచ్చినట్లు కనబడుతోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది రైతులు, కార్మికుల బకాయిలు చెల్లించడంతో పాటు చిత్తూరు షుగర్స్‌లో క్రషింగ్ నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. బాబు ప్రకటనతో పాలకవర్గం డిసెంబర్ 4న కర్మాగారంలో స్లోఫైరింగ్ కార్యక్రమం నిర్వహించింది. ఆ తరువాత చంద్రబాబు జిల్లా పర్యటన నేపథ్యంలో డిసెంబర్ 11న కర్మాగారంలో పూజా కార్యక్రమాలు సైతం నిర్వహించారు. ఇదే సమయంలో ప్రభుత్వం పైసా నిధులు ఇవ్వక పోయినా పాలకవర్గం, అధికారవర్గం కర్మాగారం విలువైన స్టోర్స్‌ను తాకట్టు పెట్టి ఆప్కా బ్ వద్ద రెండు కోట్ల రుణం తెచ్చింది. రుణం కోసం డెరైక్టర్ ఆఫ్ షుగర్స్ సైతం ఆప్కాబ్‌కు సిఫారసు చేసింది. క్రషింగ్ నిర్వహించనపుడు ఆప్కాబ్ నుంచి రుణం ఎందుకు తేవాల్సి వచ్చిందో పాలకవర్గానికే తెలియాలి. -
కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయిస్తా
రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి దేవినేని ఎన్టీటీపీఎస్లో ఎంతో కాలంగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయడానికి తాను కృషి చేస్తానని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. స్థానిక ఎన్టీటీపీఎస్లో కాంట్రాక్టు కార్మికుడు నుంచి తెలుగు నాడు విద్యుత్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన పర్వతనేని సాంబశివరావుకు శుక్రవారం రాత్రి ఏకాలనీ ఎస్వీఎస్ కల్యాణ మండపంలో అభినందన సభ జరిగింది. ఈ సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడంలో థర్మల్ కేంద్రం కీలకపాత్ర పోషిస్తోందన్నారు. సాంబశివరావు రాష్ట్ర అధ్యక్షుడు కావడం తనకు సంతోషంగా ఉందని తెలిపారు. ఈసందర్భంగా సాంబశివరావును ఘనంగా సన్మానించి మెమెంటోను అందజేశారు. తొలుత ఇబ్రహీంపట్నం రింగుసెంటర్ నుంచి ఎ-కాలనీ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీటీపీఎస్ చీఫ్ ఇంజినీర్ జె. సమ్మయ్య, ఇబ్రహీంపట్నం ఎంపీపీ చీదిరాల ప్రసూన, వైఎస్ ఎంపీపీ వెంకటకృష్ణ, జెడ్పీటీసీ సభ్యురాలు రాధ, ఇబ్రహీంపట్నం గ్రామ మాజీ సర్పంచి మల్లెల పద్మనాభరావు, టీడీపీ నాయకుడు జంపాల సీతారామయ్య, తెలుగు నాడు విద్యుత్ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ, ప్రాంతీయ కమిటీ నాయకులు, కార్యవర్గ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు. -
కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలి
సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని వివిధ కార్పొరేషన్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్‌చేస్తూ బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఎన్టీయూఐ, కచరా వాహతుక్ శ్రామిక్ మంచ్, సర్వశ్రామిక్ మంచ్ ఆధ్వర్యంలో రాణిబాగ్ నుంచి ఆజాద్‌మైదాన్ వరకు జరిగింది. ఇందులో నవీముంబై, షోలాపూర్, పుణే, నాసిక్, నాగపూర్ తదితర కార్పొరేషన్లకు చెందిన దాదాపు ఐదు వేలకుపైగా పారిశుద్ధ్య కార్మికులు, ఇతర శాఖలో పనిచేసే తాత్కాలిక ఉద్యోగులు పాల్గొన్నారు. బీఎంసీలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే కార్మికులను పర్మినెంట్ చేయాలని ఇండస్ట్రియల్ కోర్టు ఆదేశించింది. ఇదే తరహాలో మిగతా కార్పొరేషన్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాసే జీవోలను తీసుకురావడం అయోమయానికి గురిచేసిందని ఆరోపించారు. వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే పనికితగ్గ వేతనం ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతరేక విధానాలను రద్దు చేయాలని, కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగులను నియమించడం మానుకోవాలని నినాదాలు చేశారు. ఈ ర్యాలీకి రిలయన్స్ ఎనర్జీ కార్మిక సంఘం, తెలంగాణ సంఘీభావ వేదిక మద్దతు పలికాయి. ర్యాలీలో ఎన్టీయూఐ అధ్యక్షుడు వాసుదేవన్, బలరాం, సైదులు, వెంకటేశ్, దుర్గేశ్ అక్కనపెల్లి, గుండే శంకర్, సత్తన్న, భారీ సంఖ్యలో కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. బీఎంసీలో పర్మినెంట్ కానున్న ‘పారిశుద్ధ్య’ కొలువులు అనేక సంవత్సరాలుగా మహానగర పాలక సంస్థ (బీఎంసీ)లో పారిశుద్ధ్యం లాంటి అత్యవసర శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని పరిశ్రమల (ఇండస్ట్రియల్) కోర్టు ఆదేశించింది. అంతేగాక వారు విధుల్లో చేరినప్పటి నుంచి చెల్లించాల్సిన వివిధ భత్యాలు (పర్మినెంట్ ఉద్యోగుల మాదిరిగా) చెల్లించాలని సూచించింది. ఈ నిర్ణయంతో బీఎంసీలో వివిధ అత్యవసర శాఖల్లో పనిచేస్తున్న 2,700 మంది కాంట్రాక్టు కార్మికులకు ఊరట లభించింది. తమను పర్మినెంట్ చేయాలని కొన్నేళ్లుగా కాంట్రాక్ట్ కార్మికులు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. బీఎంసీలోని అనేక శాఖల్లో కాంట్రాక్టు పద్ధతిలో కార్మికులు పనిచేస్తున్నారు. వీరంతా పర్మినెంట్ ఉద్యోగుల మాదిరిగానే విధులు నిర్వహిస్తున్నారు. కాని కాంట్రాక్టు కార్మికులు కావడంతో బీఎంసీ వీరిని పట్టించుకోవడం లేదు. దీంతో పారిశుద్ధ్య శాఖ కార్మిక సంఘం నాయకులు కోర్టును ఆశ్రయించారు. పారిశుద్ధ్య శాఖ లాంటి అత్యవసర శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగులను నియమించరాదని కోర్టు హెచ్చరించింది. -
బోనస్ పెంచాలని కార్మికుల సమ్మె
కాసిపేట : దీపావళి బోనస్ పెంచాలని డిమాండ్ చేస్తూ దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ కాంట్రాక్టు కార్మికులు శనివారం సమ్మె చేశారు. పర్మినెంటు, లోడింగ్ కార్మికులకు రూ.17,500 ఇప్పించి, కాంట్రాక్టు కార్మికులకు కేవలం రూ.8,500 మాత్రమే ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కంపెనీ గేటు ఎదుట నిరసన తెలిపారు. ఎన్నికల సమయంలో పర్మినెంటు కార్మికులతో సమానంగా బోనస్ ఇప్పిస్తామని హామీ ఇచ్చారని, ప్రస్తుతం విభజించి పాలించు రీతిలో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేస్తాడని ఎన్నో ఆశలతో టీఆర్ఎస్ రాములునాయక్ యూనియన్ను గెలిపిస్తే ఆదిలోనే ఇలా అన్యాయం చేశారని అసంతృప్తి వెల్లగక్కారు. మాజీ ఎమ్మెల్యే మద్దతు.. కార్మికుల నిరసనకు వివిధ కార్మిక సంఘాల నేతలతోపాటు మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ మద్దతు ప్రకటించారు. గేటు ముందు కార్మికులు చేపట్టిన దీక్షలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికల్లో రూ.20వేలు అడ్వాన్సు చెల్లిస్తామని చెప్పి గెలిచిన అనంతరం కార్మికులకు తెలియకుండ హైదరాబాద్‌లో యాజమాన్యంతో ఒప్పందం చేసుకోవడం దారుణమన్నారు. కార్మికులకు కనీసం రూ.15వేల బోనస్ ఇప్పించాలని డిమాండ్ చేశారు. అలాగే కాగజ్‌నగర్ ఎస్పీఎంలో గెలిచిన టీఆర్ఎస్ యూనియన్ కంపెనీని మూసే ప్రయత్నం చేస్తోందన్నారు. గుర్తింపు సంఘం టీఆర్ఎస్ యూనియన్ నాలుగు నెలలకే కార్మికులను విస్మరించడం దారుణమన్నారు. కార్మికులు ఐక్యంగా ఉద్యమించి హక్కులు సాధించుకోవాలని, కార్మికుల పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. యూనియన్ల నాయకులు వడ్లూరి మల్లేశ్, తిరుపతిరెడ్డి, గంట మల్లారెడ్డి, లచ్చిరెడ్డి, ప్రకాష్‌పటేల్ పాల్గొని కార్మికులకు మద్దతు తెలిపారు. అనంతరం దీక్షలో పాల్గొన్నారు. సమానంగా బోనస్ చెల్లించాలి కాసిపేట : దేవాపూర్ ఓరియంట్ సిమెంటు కంపెనీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరికీ సమానంగా బోనస్ చెల్లించాలని తెలంగాణ ఆసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి దాసరి రాజన్న డిమాండ్ చేశారు. శనివారం దేవాపూర్‌లో కార్మికుల నిరసనకు మద్దతు ప్రకటించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, సమగ్రమైన చట్టంకోసం కార్మికులంతా కలిసికట్టుగా పోరాడాలన్నారు. కంపెనీ యాజమాన్యం, గుర్తింపు సంఘం కాంట్రాక్టు కార్మికులను వర్గీకరించి సీనియర్ కార్మికులకు రూ.10వేలు, మిగతా వారికి రూ.8500 చెల్లించేలా ఒప్పందం చేసుకోవడం సరికాదన్నారు. టీఏకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూమయ్య ఉన్నారు. -
పర్మనెంట్ చేయకపోతే రాష్ట్రం చీకటే
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య హైదరాబాద్: విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేయకపోతే రాష్ట్రం అంధకారంగా మారుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంట్రా క్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని టీఆర్ఎస్ తమ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొందని, ఆ మేరకు కేసీఆర్ తన మాట నిలబెట్టుకోవాలని సూచించారు. విద్యానగర్‌లోని బీసీ భవన్లో తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన ప్రసంగిం చారు. కొన్ని శాఖల్లో క్రమబద్ధీకరించి విద్యుత్ శాఖలో పర్మినెంట్ చేయకుండా అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. సమాజానికి వెలుగులను అందించే కార్మికుల జీవితాల్లో మాత్రం చీకట్లు అలుముకున్నాయన్నారు. సమావేశంలో కాం ట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు శ్రీధర్‌గౌడ్, శ్రీకాంత్‌గౌడ్, ఎం.పృథ్వీరాజ్ గౌడ్, రాజేందర్ పాల్గొన్నారు. -
ఆర్టీసీ కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త
-
ఆర్టీసీ కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త
జిల్లాలో 500 మంది పర్మినెంట్‌కు అవకాశం సాక్షి, విజయవాడ : ఆర్టీసీలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లను పర్మనెంట్ చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 11 నుంచి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయీ) బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఈయూ ప్రతినిధులతో బుధవారం సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు. ఆర్టీసీలో ఉన్న కాంట్రాక్టు డ్రైవర్లు, కండక్టర్లును పర్మనెంట్ చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో 500 మందికి అవకాశం... 2012, డిసెంబర్ 31వ తేదీలోపు ఆర్టీసీలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారిని పర్మినెంట్ చేస్తామని ప్రకటించారు. దీంతో కృష్ణా రీజియన్ పరిధిలో 382 మంది డ్రైవర్లు, 118 మంది కండక్టర్లు మొత్తం 500 మంది పర్మనెంట్ కానున్నారు. ఇప్పటి వరకు వీరికి రెగ్యులర్ డ్రైవర్‌తో సమానంగా వేతనం వచ్చినప్పటికీ, డీఏ, హెచ్ఆర్ఏ వంటి ఇతర అలవెన్సులు వచ్చేవి కావు. ప్రస్తుతం వీరిని పర్మనెంట్ చేయడంతో అన్ని రకాల అలవెన్సులు లభిస్తాయి. ఇప్పటికే రీజియన్ పరిధిలో 5,400 మంది పర్మనెంట్ డ్రైవర్లు, కండక్టర్లు ఉన్నారు. వచ్చే ఏడాది మరికొంతమందికి అవకాశం... గతంలో ఆర్టీసీ యాజమాన్యానికి, యునియన్ నేతలకు మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం 2013 తరువాత ఆర్టీసీలో కాంట్రాక్టు పద్ధతిలో డ్రైవర్లు, కండ క్టర్లుగా చేరినవారికి రెండేళ్లు సర్వీసు పూర్తయిన వెంటనే పర్మనెంట్ చేయాల్సి ఉంది. ఇక నుంచి ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లను పర్మనెంట్ పద్ధతిలోనే తీసుకోవాలని, కాంట్రాక్టు పద్ధతిని విడనాడాలని ముఖ్యమంత్రితో జరిపిన చర్చల్లో యూనియన్ నేతలు కోరగా, సీఎం సుముఖత వ్యక్తం చేసినట్లు ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి వైవీ రావు ‘సాక్షి’కి తెలిపారు. -
కోదండరాం ఇంటి ముట్టడి
ఆ ప్రకటనతో తనకు సంబంధం లేదని కోదండరాం స్పష్టీకరణ విద్యార్థులకు అండగా ఉంటానని హామీ లాలాపేట: కాంట్రాక్టు ఉద్యోగుల పర్మనెంట్ ప్రకటనను నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు శనివారం తార్నాకలోని జేఏసీ చైర్మన్ కోదండరాం ఇంటిని ముట్టడించారు. తమ ఉద్యమానికి మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు. తొలుత ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ఓయూ క్యాంపస్ నుంచి ర్యాలీగా కోదండరాం ఇంటిని ముట్టడించేందుకు విద్యార్థులు బయలుదేరారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి విద్యార్థులను బారికేడ్లు, బందోబస్తుతో అడ్డుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు విద్యార్థి నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. భారీ సంఖ్యలో హాజరైన విద్యార్థులు చివరకు కోదండరామ్ ఇంటికి చేరుకున్నారు. పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు. విద్యార్థులకు అండగా ఓయూలోని అన్ని విద్యార్థి సంఘాల నాయకులు వచ్చారు. తెలంగాణ ఏర్పడితే కొత్త ఉద్యోగాలు వస్తాయనే ఆశతో ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తే, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేస్తానని నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనలు చేస్తున్నాడని విద్యార్థులు మండిపడ్డారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. విద్యార్థుల ఆందోళనతో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన కోదండరాం వారితో మాట్లాడారు. కేసీఆర్ ప్రకటనతో తనకు ఏ మాత్రం సంబంధం లేదని స్పష్టం చేశారు. జేఏసీగా విద్యార్థులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. జేఏసీలో ఈ విషయపై చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దీంతో విద్యార్థులు శాంతించి ఆందోళన విరమించారు. కొనసాగిన ఆందోళన కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ ప్రకటనను నిరసిస్తూ ఓయూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన శనివారం మూడో రోజుకు చేరుకుంది. విద్యార్థుల ర్యాలీని అడ్డుకోవడంతో ఓయూ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. ప్రకటన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఉద్యోగాల కోసం ఆందోళన
తార్నాక చౌరస్తాలో రాస్తారోకో, పోలీసుల లాఠీచార్జి హైదరాబాద్: ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న వారిని విస్మరించి, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించడంతో ఉస్మానియా క్యాంపస్ విద్యార్థులు రెండో రోజు ఆందోళనకు దిగారు. ఓయూ క్యాంపస్‌లోని లేడీస్ హాస్టల్ ఎదుట శుక్రవారం పరిశోధకవిద్యార్థిని కవిత ఆధ్వర్యంలో 20 మంది విద్యార్థినులు రాస్తారోకో చేపట్టారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వాహనాలను దారి మళ్లించారు. దీంతో ఆందోళన చేస్తున్న విద్యార్థినులకు యూనివర్సిటీ లైబ్రరీలో పోటీ పరీక్షల కోసం చదువుతున్న వారు జతకలిశారు. వీరంతా సీఎం కేసీఆర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తార్నాక చౌరస్తా వద్దకు వచ్చి రాస్తారోకో చేపట్టారు. విద్యార్థులకు మద్దతుగా ఏబీవీపీ, ఎన్ఎస్యూఐ, బీఎస్ఎఫ్ తదితర విద్యార్థి సంఘాల నాయకులు రంగంలోకి దిగారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో ఓ వాహనదారుడు విద్యార్థులతో గొడవకు దిగాడు. ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. 18 మంది విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి ఓయూ పోలీస్ స్టేషన్‌కు తరలించి మధ్యాహ్నం విడిచిపెట్టారు. -
జూ కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తాం
వరంగల్ పార్కుకు జయశంకర్ పేరు అటవీశాఖ మంత్రి జోగు రామన్న బహదూర్‌పురా: నెహ్రూ జూలాజికల్ పార్కుకు మరిన్ని వన్యప్రాణులను తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. జూలోని వివిధ ఎన్క్లోజర్లను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ వరంగల్ మినీ పార్కును అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసి దానికి తెలంగాణ సిద్ధాంతకర్త దివంగత ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెడతామన్నారు. జూలోని ఉద్యోగులను వాచ్మెన్, లేబర్‌గా పిలివడాన్ని మార్చి అసిస్టెంట్ సార్జెంట్‌గా ఇతర పేర్లకు మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జూ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేస్తామని ప్రకటించారు. అనంతరం జూలోని జిరాఫీకి మంత్రి అరటి పండు, ఆపిల్‌ను తినిపించారు. కార్యక్రమంలో రాష్ట్ర జూ పార్కుల డెరైక్టర్, అడిషనల్ పీసీసీఎఫ్ పి.మల్లికార్జున్ రావు, జూ క్యూరేటర్ బి.ఎన్.ఎన్.మూర్తి, జూ ఏసీఎఫ్ పి.శామ్యూల్, జూ వెటర్నరీ అసిస్టెంట్ డెరైక్టర్ డాక్టర్ అబ్దుల్ హకీం, అసిస్టెంట్ క్యూరేటర్లు మోబీన్, రమేశ్, సరస్వతి, జూ పీఆర్వో హనీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఆ పోస్టులను తెలంగాణ ఉద్యోగులకు ఇవ్వండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బదిలీ చేసిన నెహ్రూ జూలాజికల్ పార్కులోని 40 పోస్టులను ఉద్యోగులను వెంటనే తెలంగాణకు తీసుకొచ్చి జూలో కాంట్రాక్ట్, డెలీవైజ్గా పని చేస్తున్న ఉద్యోగులతో పర్మినెంట్ చేయాలని జూ యానిమల్ కీపర్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్. దేవేందర్, ఆయూబ్ కౌసర్ మంత్రికి వినతిపత్రం సమర్పించారు. -
ఔట్సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేయాలి: సీపీఎం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బందిని తక్షణమే పర్మినెంట్ చేయాలని సీపీఎం ఏపీ కమిటీ డిమాండ్ చేసింది. ఇంటింటికీ ఒక ఉద్యోగం ఇస్తామనే హామీతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం వేలాదిమంది ఉద్యోగులను తొలగిస్తోందని ఆరోపించింది. ఇప్పటికే ఫీల్డ్ అసిస్టెంట్లు సుమారు పదివేల మందిని తొలగించాలని నిర్ణయించిందని, దీనిని విరమించుకోవాలని పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఆదివారం ఒక ప్రకటనలో ఏపీ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏపీ హౌసింగ్ కార్పొరేషన్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ వర్క్ఇన్స్పెక్టర్లు, ఉద్యోగుల సర్వీసు ఈనెల 30తో ముగియనుందని, తమను తిరిగి చేర్చుకుంటారో లేదోనని వారు ఆందోళన చెందుతున్నారని వివరించారు. -
ఔట్.. సోర్సింగ్
ఆందోళనలో కాంట్రాక్టు సిబ్బంది కాలపరిమితి నెలాఖరు వరకు ఇన్నేళ్ల చాకిరీకి ఇదేనా గుర్తింపు కొనసాగించాలని వినతి విశాఖపట్నం, న్యూస్‌లైన్: జిల్లాలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కాలపరిమితి నెలాఖరుతో ముగియనుండడంతో సిబ్బంది ఆం దోళన చెందుతున్నారు. తెలంగాణలో వీరిని పర్మినెంట్ చేస్తామని చెబుతుంటే సీమాంధ్రలో మాత్రం తొలగి స్తామనడంతో సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఏళ్ల తరబడి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయని వైనం తెలిసిందే. పలు ప్రభుత్వశాఖలు ఔట్సోర్సింగ్ సిబ్బందితోనే నెట్టుకొస్తున్నాయి. కనీస వేతనానికి నోచుకోకున్నా, నెలల తరబడి జీతాలు అందకపోయినా అంకిత భావంతో పనిచేస్తున్న తమను అర్ధంతరంగా తొలగి స్తామనడం అన్యాయమని వాపోతున్నారు. ఎప్పటికైనా తమను రెగ్యులర్ చేయకపోతారా అన్న ఆశతో కొనసాగుతున్నారు. వీరికి సెలవులు, ఈఎస్ ఐ, పీఎఫ్ వంటి అదనపు ప్రయోజనాలు లేవు. కాంట్రాక్ట్ ఉద్యోగులు పర్మినెంట్ కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారన్న నెపంతో ప్రభుత్వం 2006 నుంచి ఔట్సోర్సింగ్ విధానాన్ని అమలులోకి తెచ్చింది. జిల్లావ్యాప్తంగా 150 మంది వరకు కంప్యూటర్ ఆపరేటర్లు, క్లాస్-4 ఉద్యోగులు పనిచేస్తున్నారు. విశాఖ నగరంలోని డ్వామా, డీఆర్డీఏ, బీసీ సంక్షేమశాఖ, సాంఘికసంక్షేమశాఖ, జిల్లా మహిళా,శిశు అభివృద్ధిసంస్థ, బీసీ,ఎస్సీ కార్పొరేషన్‌తో పాటుగా వుడా,జీవీఎంసీ తదితర సంస్థల్లో కంప్యూటర్ ఆపరేటర్లుగా ఎంతోమంది పనిచేస్తున్నారు. అలాగే, సంక్షేమ హాస్టళ్లలో వాచ్‌మన్,కుక్,కమాటీలుగా పనిచేస్తున్నవారు ఉన్నారు. వీరంతా చాలీచాలని వేతనాలు, నెలల తరబడి చెల్లించకపోవడం వంటి పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం క్లాస్-4 ఉద్యోగులకు రూ. 6,700లు, కంప్యూటర్ ఆపరేటర్లకు రూ.9,500 వంతున చెల్లిస్తోంది. పలు శాఖల్లో వీరు రోజూ రాత్రివరకు కూడా పనిచేస్తున్నారు. ఖాళీలు భర్తీ కాకపోవడంతో ఔట్‌సోర్సిగ్ సిబ్బంది పైనే పనిభారం పడుతోంది. తమను కొనసాగించాలంటూ వీరు మార్చిలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కాలపరిమితి జూన్30వరకు పొడిగిస్తూ ఏప్రిల్‌లో 84వ నంబర్ జీవో జారీ అయింది. తెలుగుదేశం ప్రభుత్వం వీరిని కరుణిస్తోందో ఇంటికి పంపుతుందో చూడాలి. -
పోస్టుల అమ్మకం?!
కేటీపీపీలో సీఎల్ ఉద్యోగాలకు డిమాండ్ ఇప్పటికే దొడ్డిదారిన 150 పోస్టులు భర్తీ రూ.లక్షలు సమర్పించుకుంటున్న నిరుద్యోగులు కొత్త రాష్ట్రంలో పోస్టులు పర్మనెంట్ అవుతాయని ఆశ భూ నిర్వాసితులను పట్టించుకోని అధికారులు గణపురం, న్యూస్‌లైన్ : కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం(కేటీపీపీ)లో పోస్టుల అమ్మకానికి మళ్లీ తెరలేచింది. వారం రోజులుగా కేటీపీపీలో సీఎల్(క్యాజువల్ లేబర్) పోస్టులను గుట్టుచప్పుడు కాకుండా భర్తీ చేస్తున్నట్టు తెలుస్తున్నది. గతంలో ఈ పోస్టుల భర్తీలో వివాదం జరగడంతో వారుుదా వేశారు. తెలంగాణ రాష్ట్రంలో క్యాజువల్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని కేసీఆర్ ప్రకటించడంతో ఇప్పుడు ఈ పోస్టులకు డిమాండ్ పెరిగింది. కొందరు రాజకీయ నాయకులు యువకుల వద్ద గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం వారికి పోస్టులు ఇప్పించేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రాక ముందే నియూమకాలు చేపట్టాలని మాజీ ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. భూ నిర్వాసితులను, స్థానిక నిరుద్యోగులను పట్టించుకోని కేటీపీపీ, జెన్కో అధికారులు తమ అనుంగులకు, రాజకీయ నాయకులకు పోస్టులను ధారాదత్తం చేస్తున్నారు. గతంలో ఏం జరిగిందంటే.. కేటీపీపీలోని అధికారులు రెండు మూడు సంవత్సరాలుగా సీఎల్ పోస్టులను అమ్ముకుంటున్నారు. కరీంనగర్, గోదావరిఖని, పాల్వంచ, కొత్తగూడెం, రామగుండం ప్రాంతాల వారితో పాటు సీమాంధ్రకు చెందిన వారిని దాదాపు 150 మందిని భర్తీ చేసినట్టు స్థానికులు గుర్తించారు. దీనికి వ్యతిరేకంగా స్థానికులు, భూ నిర్వాసితులు పలుమార్లు ధర్నా చేశారు. భూ నిర్వాసితులు రిలే దీక్షలు కూడా చేశారు. జెన్కో, కేటీపీపీ అధికారులను నిలదీశారు. వారి ధర్నాకు అన్ని రాజకీయ పక్షాలు సంఘీభావం తెలిపాయి. స్థానికేతరులను కొందరిని తొలగించి.. కోర్టు ఆదేశాలతో మళ్లీ పనుల్లోకి తీసుకున్నారు. ఈ తతంగం వెనుక అధికారుల సహాయ సహకారాలు ఉన్నాయనే ప్రచారం కుడా ఉంది. దాంతో స్థానికులను సీఎల్‌గా తీసుకోవాలని స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి అధికారులపైన ఒత్తిడి పెరిగింది. దీంతో జెన్కో అధికారులు జోక్యం చేసుకుని కాంగ్రెస్‌కు ఇరవై, టీడీపీకి, టీఆర్ఎస్కు పది చొప్పున సీఎల్ పోస్టులు కేటాయించారు. అయితే ఆ విధంగా మంజూరైన పోస్టులను కిందిస్థాయి రాజకీయ నేతలు.. భూ నిర్వాసితులకు కాకుండా డబ్బులు ఇచ్చిన వారికే అంటకట్టారని, లక్షల్లో డబ్బు వసూలు చేసినట్టు తెలిసింది. ఆ తర్వాత మళ్లీ రెండో విడతగా.. ఇద్దరు మాజీ ఎంపీలు, ఇద్దరు మాజీ మంత్రులు, మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేలు జన్కో సీఎండీని వేర్వేరుగా కలిసి.. తమ కార్యకర్తలకు సీఎల్ పోస్టులు కావాలని ఒత్తిడి చేసి 40 పోస్టులకు అనుమతి తీసుకువచ్చారు. అయితే ఖాళీగా ఉన్న పోస్టులు కంటే ప్రజాప్రతినిధులు ఆశిస్తున్న పోస్టుల సంఖ్య ఎక్కుగా ఉండటంతో దిక్కు దోచనిస్థితిలో అప్పటి సీఈ మహాబలేశ్వర్ జెన్కో ఉన్నతాధికారులకు తన గోడు వివరించారు. అదే సమయంలో స్థానిక భూ నిర్వాసితులు, నిరుద్యోగుల నుంచి వచ్చిన నిరసనల మూలంగా అప్పుడు నియూమకాలు వాయిదా పడ్డాయి. మళ్లీ ఇప్పుడు పోస్టుల భర్తీకి మాజీ ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఈ అక్రమ తతంగాన్ని నిలిపివేయూలని, పోస్టుల భర్తీలో తమకు ప్రాధాన్యం కల్పించాలని భూ నిర్వాసితులు కోరుతున్నారు. -
బదిలీ ఫిల్లర్లు
శ్రీరాంపూర్, నూ్యస్లైన్ : సింగరేణి యాజమన్యం బదిలీ ఫిల్లర్లపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నిబంధనలు పాటించకుండా వెట్టిచాకిరీ చేయిస్తోంది. యాజమాన్యం ఫిల్లర్లపై ఒక విధంగా, కార్మికులపై మరో విధంగా డొల్లతనం కనబరుస్తోంది. దీనికి బదిలీ ఫిల్లర్ కార్మికులే ఉదాహరణ. కంపెనీ నిబంధనల ప్రకారం ఏడాదిలో 190 మస్టర్లు పూర్తి చేసిన బదిలీ ఫిల్లర్లను పర్మినెంట్ చేయాలి. కానీ, ఐదేళ్ల నుంచి చేయకుండా మొండికేస్తున్నది. 2009 నుంచి కంపెనీలో బదిలీ ఫిల్లర్ల పర్మినెంట్ నిలవడంతో సుమారు 1200 మంది పర్మినెంట్‌కు నోచుకోకుండా వెట్టిచాకిరీ చేస్తున్నారు. గడిచిన నాలుగైదు ఏళ్ల నుంచి మెడికల్ అన్ఫిట్లు ఎక్కువ కావడంతో వారి స్థానంలో వచ్చే డిపెండెంట్ల సంఖ్య పెరుగుతోంది. ఎవరు ఉద్యోగంలో చేరిన ముందు వారికి బదిలీ ఫిల్లర్ డిసిగ్నేషన్ ఇచ్చి తట్టమోయిస్తారు. విధుల్లో చేరిన తరువాత సంవత్సరంలో 190 మస్టర్లు నిండితే వారిని కోల్ఫిల్లర్లుగా పర్మినెంట్ చేయాలని కంపెనీ నిబంధనలో ఉంది. యాజమాన్యం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కారణం కంపెనీకి ఆర్థిక నష్టం జరుగుతుందనే దురుద్ధేశంతోనే. దీంతో బదిలీ ఫిల్లర్లు తీవ్ర వేతన నష్టం చవిచూస్తున్నారు. శ్రమకు తగ్గ ఫలితం రాక అవస్థలు పడుతున్నారు. ఇదిలా ఉంటే 2009కి ముందు కూడా పర్మినెంట్ కాని వారు కొందరున్నారు. 2007, 2008లో కూడా కొంత మంది బదిలీ ఫిల్లర్లు 190 మస్టర్లు నిండక పర్మినెంట్ నోచుకోలేదు. వారు అలాగే మిగిలిపోతున్నారు. వేతనాల్లో తీవ్ర ఆర్థిక నష్టం పర్మినెంట్‌కు నోచుకోకపోవడంతో బదిలీ ఫిల్లర్లు వేతన నష్టం అవుతోంది. పర్మినెంట్ అయితే మైన్ ఆవరేజ్ కట్టి ఇవ్వాలి. మైన్ ఆవరేజ్ రాకపోవడంతో రోజు రూ.200 వరకు ఒక్కో బదిలీ ఫిల్లర్ నష్టపోతున్నాడు. ఇలా సంవత్సరానికి రూ. 2500 వరకు వేతన నష్టం జరుగుతున్నది. దీంతోపాటు పెరిగే వేతనం మీద వచ్చే ఇతర అలవెన్సులు కూడా నష్టం అవుతోంది. బదిలీ ఫిల్లర్లు చేసే యాక్టింగ్‌ను కూడా లెక్కలోకి తీసుకోరు. అదే సీఎఫ్‌గా అయ్యి ఉంటే ప్రమోషన్లు ఇచ్చేటప్పుడు ఉన్న ఖాళీల్లో భ ర్తీ చేస్తారు. పర్మినెంట్ కార్మికులతో సమానమైన పని చేసిన కూడా బదిలీ ఫిల్లర్ వీటిన్నింటిని కోల్పోతున్నారు. దీనితోపాటు ఉద్యోగ భద్రత ఉండదు. ఇదేమని ప్రశ్నించే అధికారం కూడా వారికి ఉండదు. పని లేనప్పుడు అవసరమైతే బదిలీ ఫిల్లర్లను ఇంటికి తిప్పి పంపించవచ్చు. బదిలీ ఫిల్లర్లు ఏదేని చిన్నతప్పు చేసినాయాజమాన్యం వారిని ఉద్యోగం నుంచి తొలగించే అధికారం కూడా ఉంది. దీంతో బానిసల్లా పనిచేయాల్సి వస్తుందని కార్మికులు వాపోతున్నారు. పట్టించుకోని సంఘాలు గుర్తింపు సంఘం ఎన్నికలు వచ్చిన ప్పుడల్లా అన్ని యూనియన్లు వారి ఎన్నికల మెనిఫేస్టోలో తాము గెలిస్తే బదిలీ ఫిల్లర్లను పర్మినెంట్ చేస్తాం అని పేర్కొనడం గెలిచిన తరువాత మర్చి పోవడం షరామాములూ అవుతుంది. ఎన్నో ఆశలు పెట్టుకొని తెలంగాణ వాదంలో ముందుకు వచ్చిన టీబీజీకేఎస్‌ను గెలిపిస్తే వారు కూడా పర్మినెంట్ చేయించడం లేదని కార్మికులు మండిపడుతున్నారు. గెలిచిన తరువాత గ్రూపులు కట్టి పంచాయతీలు పెట్టుకోవడం ఉన్న శ్రద్ధ కార్మికుల సమస్యలపై లేదని విమర్శలు వస్తున్నాయి. కనీసం యాజమాన్యం కూడా బాధ్యతాయుతంగా వ్యహరించాలని కోరుతున్నారు. ఇకనైన ఆలస్యం చేయకుండా తమను పర్మినెంట్ చేయాలని కార్మికుడు డిమాండ్ చేస్తున్నారు. -
కార్మికులకు పర్మినెంట్ హామీ అమలయ్యేనా ?
బోధన్ టౌన్, న్యూస్‌లైన్ : విడతల వారీగా కార్మికులను పర్మినెంట్ చేస్తామనే హామీని నిజాం దక్కన్ చక్కెర కర్మాగారం (ఎన్డీఎస్ఎల్) యాజమాన్యం పట్టించుకోవడం లేదు. దీంతో కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. కర్మాగారం ప్రభుత్వ పరం నుంచి 2002లో ప్రైైవే ట్ పరమైంది. కర్మాగారంలో సీజనల్ కార్మికులుగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 102 మంది కార్మికులను పర్మినెంట్ చేయాలని సీఐటీయూ, మజ్దూర్ యూనియన్‌తో పాటు పలు కార్మిక సంఘాల వారు ఉద్యమించారు. వారి పోరాటానికి దిగివచ్చిన యాజమాన్యం, ఏడాదికి 25 మంది కార్మికులను పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చింది. ఏటా క్రషింగ్ సీజన్ అనంతరం 25 మంది కార్మికుల చొప్పున పర్మినెంట్ చేస్తామని 30 డిసెంబర్ 2011న హామీ ఇచ్చింది. అయితే ఆ హామీ అమలులో మాత్రం యాజమాన్యం నిర్లక్ష్యం వ హిస్తోంది. పర్మినెంటు ఆర్డర్లు ఏవీ.. 2012లో చెరకు క్రషింగ్ అనంతరం 25 మంది కార్మికులను సీజనల్ నుంచి పర్మినెంట్ చేస్తున్నట్లుగా యాజమాన్యం కాపీని జారీచేసి వారిని వివిధ భాగాల్లో విధులు నిర్వహించుకుంటోంది. దీంతో పాటు 2013లో చెరుకు క్రషింగ్ ముగిసిన ఆరు నెలలకు మరో 25 మంది సీజనల్ కార్మికులను ఒప్పందం ప్రకారం పర్మినెంట్ చేస్తూ ఆర్డర్ ఇచ్చింది. యాజమాన్యం కార్మికులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం 50 మంది సీజనల్ కార్మికులను పర్మినెంట్ చేసిందే తప్ప, వారికి ఇప్పటివరకు వ్యక్తిగతంగా పర్మినెంట్ ఆర్డర్లు ఇవ్వలేదు. అంతేకాకుండా వారి విభాగంలో కాకుండా ఇతర పనులను పురమాయిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. 50 మంది పర్మినెంట్ అయిన కార్మికుల్లో తనకు ఇవ్వాల్సిన విభాగంలో కాకుండా మరో విభాగంలో పర్మినెంట్ చేస్తున్నారని ఓ కార్మికుడు ఒప్పుకోలేదు. మరో ముగ్గురు కార్మికులు మృతిచెందారు. ఈ నలుగురితో పాటు మరో 50 మంది కార్మికులు పర్మినెంట్ అవుతామనే ఆశల్లో తేలియాడుతున్నారు. 2014 చెరుకు క్రషింగ్‌కు మందు కార్మికులు ఒప్పందం ప్రకారం 25 మందిని పర్మినెంట్ చేయాలని యాజమాన్యాన్ని కొరగా, సీజన్ ముగిసిన అనంతరం చూద్దామని దాటవేశారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రం వచ్చే ముందు ఫ్యాక్టరీ ప్రైవేట్ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కేబినెట్ సబ్ కమిటీ తీర్మానం చేసింది. దీంతో తమకు రావాల్సిన పెట్టుబడి మొత్తం ఇవ్వాలని యాజమాన్యం ప్రభుత్వాన్ని కోరింది.తెలంగాణ వస్తే ఫ్యాక్టరీ ప్రభుత్వపరం అవుతుందని అలోచనలో పడ్డ ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం, మరో 25 మంది కార్మికులను పర్మినెంట్ చేయడానికి దాటవేత దోరణిని అవలంభిస్తోంది. దీంతో కార్మికులు ఉద్యమాల బాట పట్టాల్సిన పరిస్థితి దాపురించింది. కార్మికులతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ ఏటా 25 మంది సీజనల్ కార్మికులను పర్మినెంట్ చేయాల్సి ఉంది. ఇప్పుడు పర్మినెంట్ చేయకపోతే తాము ఎప్పటికి కాలేమని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్యాజవల్ కార్మికుల పరిస్థితి... ? ఎన్డీఎస్ఎల్ చక్కెర కర్మాగారంలో సుమారు 200 మంది కార్మికులు క్యాజవల్ లేబర్స్‌గా పనిచేస్తున్నారు. వీరిలో నుంచి సైతం ఏటా 25 మందిని ఎఫ్‌టీసీ కార్మికులుగా యాజమాన్యం గుర్తించాల్సి ఉంది. హక్కుల కాలరాస్తూ యాజమాన్యం కార్మికులతో కుదుర్చుకున్న ఒప్పందాలను తుంగలో తొక్కుతోంది. -
ఎన్టీఆర్ భవన్లో మేడే వేడుకలు
సాక్షి, హైదరాబాద్: కార్మికులు అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను ప్రస్తుత ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని టీడీపీ ఉపాధ్యక్షుడు ఇనుగాల పెద్దిరెడ్డి అన్నారు. కాంట్రాక్టు కార్మికుల సంఖ్య ప్రస్తుత పరిస్థితుల్లో విపరీతంగా పెరుగుతోందని, వారిని పర్మినెంట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్టీఆర్ భవన్లో మేడే సందర్భంగా గురువారం టీఎన్టీయూసీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈవూరి మృతికి సంతాపం: మాజీ మంత్రి ఈవూరి సీతారావమ్మ మృతికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సంతాపం తెలిపారు. టీడీపీ బలోపేతానికి ఈవూరి సుబ్బారావు, సీతారావమ్మ దంపతులు కృషి చేశారని చెప్పారు. అదేవిధంగా వ్యవసాయ శాస్త్రవేత్త ఆలపాటి రామారావు మృతికి బాబు సంతాపం వ్యక్తం చేశారు. -
బతుకు దుర్భరం
సాక్షి, కొత్తగూడెం: పట్టణ పరిశుభ్రత కోసం పాటుపడతారు...రెక్కలుముక్కలు చేసుకొని ఊడ్చుతారు. పేరుకుపోయిన చెత్తనంతా తొలగిస్తారు. ఎండనక వాననక, పగలనక రేయనక కష్టపడుతూనే ఉంటారు. కానీ వారిబతుకుల్లో మాత్రం వెలుగులేదు. చాలీచాలని జీతంతో, ఇల్లు గడిచీగడవక వెతలు అనుభవిస్తున్నారు. సమస్యలపై సమరం కోసం ఒక రోజు వారు పనులు మానేస్తే తెల్లవారేసరికి రోడ్లన్నీ మురికికూపాలే..మట్టిదిబ్బలే.. ఇదీ మున్సిపాలిటీలోని మహిళా పారిశుధ్య కార్మికుల దీనస్థితి. చేస్తున్న ఉద్యోగం ఏదో ఒక రోజు పర్మినెంట్ అవుతుందని ఏళ్ల తరబడి ఎదురుచూస్తూ వీళ్లు వెట్టి చాకిరి చేస్తున్నారు. జిల్లాలోని ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు మిగిలిన అన్ని మున్సిపాలిటీల్లో 80 శాతం వరకు కాంట్రాక్టు కార్మికులున్నారు. ఇందులో 45 శాతం వరకు మహిళా కార్మికులే. ఖమ్మం కార్పొరేషన్, కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు, మధిర మున్సిపాలిటీలు, సత్తుపల్లి నగర పంచాయతీల్లో ఈ మహిళా పారిశుధ్య కార్మికులు నిత్యం పట్టణాలను పరిశుభ్రం చేస్తున్నారు. కాంట్రాక్టర్లు వారికి అన్నీ సమకూరుస్తామని ఒప్పందం కుదుర్చుకొని ఆ తర్వాత చేతులెత్తేస్తున్నారు. తమ సమస్యల సాధన కోసం వారు పోరుబాట పట్టినా.. ఇంకా అవి అపరిష్కృతంగానే ఉన్నాయి. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా.. కాంట్రా క్టు కార్మికులుగానే ఉండిపోయారు. చాలీచాలని జీతాలతో కుటుంబాలు గడవక ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. వేతనం పెంచుతామన్న ప్రభుత్వ మాట కూడా నీటిమూటే అయింది. చాలీచాలని వేతనం.. కాంట్రాక్టు కార్మికులకు నెలకు రూ.6,700 వేతనంగా ఇస్తున్నారు. ఇందులో పీఎఫ్, ఈఎస్ఐ ఇతర కటింగ్స్‌పోను రూ. 5,627 కార్మికుల చేతికి అందుతోంది. ఇంటి అద్దె, పిల్లల చదువులు, పాల ఖర్చు, కరెంటు, గ్యాస్ బిల్లు, నిత్యావసర సరుకులు, కూరగాయలు.. ఇలా అన్ని ఖర్చులు లెక్కిస్తే పదివేల రూపాయాల పై మాటే.. భర్తలు ఇతర పనులు చేస్తూ ఇంత సంపాదిస్తుండటంతో అతికష్టం మీద సంసారాన్ని నెట్టుకొస్తున్నారు. కుటుంబ సభ్యులు ఎవరైనా అనారోగ్యానికి గురైనా, ఏదైనా పం డుగ వచ్చినా.. అప్పులు చేయక తప్పని పరి స్థితి. కాంట్రాక్టు కార్మికులకు రూ.8,750 వేత నం ఇవ్వాలని జీఓ ఉన్నా ప్రభుత్వం అమలు చేయడం లేదు. వీరికి ఏడాదికి పదిహేను రోజుల పాటు సెలవులు ఇస్తారు. అవి మినహా విధి నిర్వాహణలో గాయాలైనా, అనారోగ్యానికి గురైనా విశ్రాంతి ఉండదు. తప్పని పరిస్థితుల్లో సెలవు పెడితే వేతన కోత తప్పదు. జీవితమంతా ‘చెత్త’మయం.. పారిశుధ్య కార్మికులకు తప్పని సరిగా ఏడాదికి రెండు జతల యూనిఫాం, కొబ్బరినూనె, సబ్బులు, రెండు జతల చెప్పులు ఇవ్వాలి. చివరకు చేతులకు వేసుకునే గ్లౌజులు కూడా పంపిణీ చేయకపోవడం గమనార్హం. ఖమ్మం, పాల్వంచ, కొత్తగూడెంలో రాత్రిళ్లు కూడా కార్మికలు విధులు నిర్వహిస్తుంటారు. తక్కిన చోట్ల వేకువజామున విధుల్లోకి వెళ్తారు. పర్మినెంట్ కార్మికుల మాదిరిగానే వీరికి రేడియం జాకెట్లు ఇవ్వాలి. మొన్నటి వరకు కాంట్రాక్టు కార్మికుల టెండర్ ఒప్పందంలో వేతనంతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ మొత్తాన్ని చేర్చేవారు. ఇప్పుడు పొరకలు, కొబ్బరినూనె, యూనిఫాం, చెప్పులు, గ్లౌజులు, మాస్కులు అన్నీ చేరుస్తున్నారు. కానీ వారికి మాత్రం ఇవ్వడం లేదు. కాంట్రాక్టర్లు ఒప్పంద నిబంధనలను బేఖాతర్ చేస్తున్నా మున్సిపల్ కమిషనర్లు పట్టనట్లే వ్యవహరిస్తున్నారు. -
పైసలిస్తేనే పర్మినెంట్!
శ్రీకాకుళం టౌన్, న్యూస్‌లైన్: కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శులను పర్మినెంట్ చేయడం అంటే దరఖాస్తు చేస్తే సరిపోతుందా? దీనికి కొన్ని ఖర్చులుంటాయి... ఎవరి వాటాలు వారికి ఇవ్వాల్సిందే... మీరిచ్చిన డబ్బులు ఇక్కడ ఒక్క దగ్గరే ఉండిపోతాయనుకుంటున్నారా ఏంటీ? ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి పై స్థాయి అధికారులకు ఎవరి వాటాలు వారికి ఇవ్వాలి. ఎవరి వాటాలు వారికి అందితే అంతా సక్రమంగా ఫైల్ నడుస్తుంది. లేదంటే మధ్యలోనే ఆగిపోయి వెనక్కి వస్తోంది. ఇక మీ ఇష్టం. జిల్లా పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి కాంట్రాక్ట్ కార్యదర్శులను నమ్మిస్తున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే... కాంట్రాక్టు కార్యదర్శులను పర్మినెంట్ చేస్తామని ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం కొన్ని మెలికలు పెట్టింది. ఈ మెలికలే వసూళ్లకు కారణమవుతున్నాయని తెలుస్తోంది. జిల్లాలో 156 మంది కాంట్రాక్టు కార్యదర్శులు పనిచేస్తున్నారు. వీరిలో డిగ్రీ అర్హత ఉన్న వారు 135 మంది. వీరు దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 4వ తేదీ వరకు గడువు విధించింది. మిగిలిన 30 పోస్టులకు ఈనెల 11వ తేదీ వరకు గడువు ఉంది. ఇప్పటికీ కాంట్రాక్టు కార్యదర్శులుగా పనిచేస్తున్న వారికి 25 శాతం మార్కులు అదనంగా కేటాయిస్తారు. అంటే దాదాపుగా వీరందరికీ పర్మినెంట్ అవుతుందని అధికార వర్గాల సమాచారం. అయితే దరఖాస్తు చేయడం, సెలక్షన్ కమిటీ ఎంపిక తదితర ప్రక్రియలు ఉండడంతో వసూళ్లకు అస్కారమిచ్చినట్లైందని ఆ శాఖ వర్గాలే చెప్పుకుంటున్నాయి. ఈ లొసుగుల్ని అధారంగా కాంట్రాక్టు కార్యదర్శుల నుంచి రూ 50 వేల నుంచి రూ లక్ష వరకు వసూలు చేయడానికి రంగం సిద్ధమైందన్న ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. డీపీవో కార్యాలయంలో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పనుల్లో చక్రం తిప్పే ఓ ఉద్యోగి అక్రమ వసూళ్లకు బీజం చేశాడని సమాచారం. పై స్థాయి జిల్లా అధికారుల నుంచి కింది స్థాయి వరకు వాటాలు ఇవ్వాలని నమ్మబలుకుతున్నట్లు భోగట్టా. ఇది ఎంతవరకు నిజమో కానీ కాంట్రాక్టు కార్యదర్శులు మాత్రం ఇన్నాళ్లు సర్వీసు చేసిన వాళ్ల దగ్గర నుంచి కూడా వసూళ్లు చేయడం దారుణమని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
టూరిజం కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి
ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ : పర్యాటకశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, రోజువారీ వేతన ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలని సీపీఐ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్లో నిర్వహించిన ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పర్యాటకాభివృద్ధికి కాంట్రాక్ట్ ఉద్యోగులు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. గతంలో చేసుకున్న ఒప్పందాలు అమలుచేయకుండా వీరిని చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒప్పందం మేరకు ఎరియర్స్, డీఏ చెల్లించాలని డిమాండ్ చేశారు. పర్యాటక శాఖ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బు రాజమౌళి మాట్లాడుతూ లక్నవరంలో బోట్లు లేక పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వరంగల్ కోటలో లైట్ షో ఏర్పాటు పనులు త్వరగా పూర్తిచేయాలని, వడ్డెపల్లి చెరువుకట్టను హైదరాబాద్ ట్యాంక్‌బండ్ తరహాలో అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాస్‌రావు, కార్యదర్శివర్గ సభ్యుడు మోతె లింగారెడ్డి, అశోక్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, పాషా, మల్లేశ్, రాజ్‌కుమార్, కుమారస్వామి, తిరుపతి, రవి పాల్గొన్నారు. విద్వేషాలు పెంచొద్దు నయీంనగర్ :ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధానాలను కాంగ్రెస్ పార్టీ మానుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ అన్నారు. బాలసముద్రంలోని ఆ పార్టీ జిల్లా కార్యాయంలో జిల్లా అధ్యక్షుడు రేగుల రాకేష్ అధ్యక్షతన ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గసమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జాప్యం కావడం వల్లే అటు సీమాంధ్రలో, ఇటు తెలంగాణలో ఆందోళనలు జరుగుతున్నాయన్నారు. సీమాంధ్రకు రాజధానిని, ప్యాకేజీని కేంద్రం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలీఉల్లాఖాద్రీ, జిల్లా కార్యదర్శి హకీంనవీద్, నాయకులు అశోక్ స్టాలిన్, మహేందర్, హిమావంత్, రహ్మతుల్లా, ఖాదిర్అలీ, యాకాంబ్రం, శరత్, రోహిత్, జానీ, శ్రీకాంత్ పాల్గొన్నారు. -
జలవివాదాల పరిష్కారానికి శాశ్వత ట్రిబ్యునల్