PFRDA
-
ఎన్పీఎస్ ఉపసంహరణకు ‘పెన్నీ డ్రాప్’ ధ్రువీకరణ
న్యూఢిల్లీ: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) నుంచి చందాదారులు తమ నిధులను ఉపసంహరించుకునే సమయంలో ‘పెన్నీ డ్రాప్’ ధ్రువీకరణను పింఛను నిధి అభివృద్ధి, నియంత్రణ మండలి (పీఎఫ్ఆర్డీఏ) ప్రవేశపెట్టింది. పెన్నీడ్రాప్ విధానంలో చందాదారు బ్యాంక్ ఖాతాలో ఉన్న పేరు, ఎన్పీఎస్లోని పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్లోని పేరు ఏక రూపంలో ఉందా అన్నది సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ (సీఆర్ఏ) తనిఖీ చేస్తుంది. ఎన్‌పీఎస్‌తోపాటు ఎన్పీఎస్ లైట్, అటల్ పెన్షన్ యోజన (ఏపీవై)కు సంబంధించి అన్ని రకాల ఉపసంహరణలు, వైదొలగడాలు, చందాదారు బ్యాంకు ఖాతా వివరాల్లో మార్పులకు నూతన విధానం అమలు కానుంది. దీన్ని ఎలా చేస్తారంటే.. చందాదారు బ్యాంక్ ఖాతాలోకి చాలా స్వల్ప మొత్తాన్ని (రూపాయి) బదిలీ చేస్తారు. తద్వారా బ్యాంక్ ఖాతాలో ఉన్న పేరును ధ్రువీకరించుకుంటారు. నిధుల ఉపసంహరణకే కాకుండా, చందాదారులు తమ బ్యాంక్ ఖాతా వివరాల అప్డేట్కు దరఖాస్తు చేసుకున్న సందర్భాల్లోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తారు. ఈ పెన్నీడ్రాప్ విధానంలో ధ్రువీకరణ విజయవంతం కాకపోతే, నోడల్ ఆఫీస్ సహకారాన్ని సీఆర్ఏ తీసుకుంటుంది. పెన్నీడ్రాప్ విఫలమైందని, సమీప నోడల్ ఆఫీస్ లేదా పీవోపీని సంప్రందించాలంటూ చందాదారులకు ఈ మెయిల్, మొబైల్ ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు. చందాదారు నుంచి సరైన వివరాలు అందేంత వరకు నిధుల బదిలీని నిలిపివేస్తారు. -
పీఎఫ్ఆర్డీఏ చైర్మన్‌గా దీపక్ మొహంతీ
న్యూఢిల్లీ: పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) చైర్మన్‌గా దీపక్ మొహంతీను ప్రభుత్వం నియమించింది. జనవరిలో పదవీకాలం ముగిసిన సుప్రతిమ్ బంద్యోపాధ్యాయ స్థానంలో ఆయన నియామకం జరిగింది. ప్రస్తుతం పీఎఫ్ఆర్డీఏ సభ్యునిగా ఆయన పనిచేస్తున్నారు. మొహంతీ ఆగస్టు 2020లో మూడేళ్ల కాలానికి లేదా 62 ఏళ్ల వయస్సు వచ్చే వరకు పీఎఫ్ఆర్డీఏ మెంబర్‌గా (ఎకనామిక్) గతంలో నియమితులయ్యారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేసిన అపార అనుభవం కూడా ఆయనకు ఉంది. తాజా నియామకానికి సంబంధించి వెలువడిన ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, ఇళ్లు, కారు సౌకర్యం లేకుండా మొహంతీ నెలకు రూ.4.50 లక్షల కన్సాలిడేటెడ్ వేతనం పొందుతారు. పదవి బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి 65 ఏళ్లు వచ్చే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ బాధ్యతల్లో ఆయన పనిచేస్తారు. మెంబర్‌గా...మమతా శంకర్ మొహంతీ తాజా నియామకం నేపథ్యంలో ఆయన స్థానంలో పీఎఫ్ఆర్డీఏ మెంబర్‌గా (ఎకనామిక్) మమతా శంకర్ నియమితులయ్యారు. ఇండియన్ ఎకనమిక్ సర్వీస్ (1993)లో ఉన్న ఆమె ప్రస్తుతం ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖలో సీనియర్ ఎకనమిక్ అడ్వైజర్‌గా పనిచేస్తున్నారు. మూడేళ్ల కాలానికి లేదా 62 ఏళ్ల వయస్సు వచ్చే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు (ఏది ముందుగా అయితే) ఆమె ఈ బాధ్యతల్లో కొనసాగుతారని ప్రత్యేక నోటిఫికేషన్ పేర్కొంది. పెన్షన్ నిధులు ఇలా... నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) అలాగే అటల్ పెన్షన్ యోజన కింద నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తుల (ఏయూఎం) విలువ 2023 మార్చి 4వ తేదీ నాటికి రూ. 8.81 లక్షల కోట్లు. దేశంలోని పెన్షన్ పరిశ్రమను ప్రోత్సహించడం, నియంత్రించడం, అభివృద్ధి చేయడం లక్ష్యంగా 2003లో పీఎఫ్ఆర్డీఏ ఏర్పాటయ్యింది. దీనిని మొదట్లో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా నిర్దేశించడం జరిగింది. అయితే తదుపరి స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు, ఎన్‌ఆర్‌ఐలుసహా అన్ని భారత పౌరులు అందరికీ అథారిటీ సేవలను విస్తరించడం జరిగింది. వ్యవస్థీకృతంగా పెన్షన్ నిధుల ప్రోత్సాహం, అభివృద్ధి, నియంత్రణ వంటి కీలక కార్యకలపాలాను అథారిటీ నిర్వహిస్తుంది. ప్రజల వృద్ధాప్య ఆదాయ అవసరాలను, వనరులను స్థిర ప్రాతిపదికన అందించడంలో ఎన్పీఎస్ కీలక పాత్ర పోషిస్తోంది. -
అటల్ పెన్షన్ యోజనకు విశేష ఆదరణ
న్యూఢిల్లీ: సామాజిక భద్రతా పథకం– అటల్ పెన్షన్ యోజన (ఏపీవై)కు విశేష ఆధరణ లభిస్తున్నట్లు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) పేర్కొంది. ఈ పథకం కింద ఇప్పటికి 5 కోట్ల మందికిపైగా ప్రజలు నమోదయినట్లు తెలిపింది. ఒక్క 2022 క్యాలెండర్ ఇయర్లో 1.25 కోట్ల మంది చందాదారులుగా చేరినట్లు వివరించింది. 2021లో ఈ సంఖ్య 92 లక్షలు కావడం గమనార్హం. 2021 స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ఏపీవైని ప్రకటించారు. దీని విస్తృతికి పీఎఫ్ఆర్డీఏ అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఈ పథకం కింద ఒక చందాదారుడు (చేరిన వయస్సు, చందాపై ఆధారపడి) 60 సంవత్సరాల వయస్సు నుండి నెలకు రూ. 1,000 నుండి రూ. 5,000 వరకు కనీస హామీ పెన్షన్‌ను అందుకుంటాడు. చందాదారుని మరణానంతరం అదే పెన్షన్ చందాదారుని జీవిత భాగస్వామికి చెల్లించడం జరుగుతుంది. చందాదారుడు, జీవిత భాగస్వామి ఇద్దరూ మరణించినప్పుడు, చందాదారుడు 60 ఏళ్ల వరకు చెల్లించిన మొత్తం నామినీ పొందే వెసులుబాటు ఉంది. -
బ్యాంక్‌తో పనిలేదు,మొబైల్ నుంచే ఎన్పీఎస్ అకౌంట్ ఓపెన్ చేయోచ్చు!
న్యూఢిల్లీ: బ్యాంకు ఆఫ్ ఇండియా (బీవోఐ), పింఛను నిధి నియంత్రణ సంస్థ (పీఎఫ్ఆర్డీఏ) సంయుక్తంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించాయి. కే–ఫిన్‌టెక్ సాయంతో నూతన ఎన్పీఎస్ చందాదారుల చేరిక కోసం దీన్ని తీసుకొచ్చాయి. బ్యాంకు ఆఫ్ ఇండియా ఎండీ, సీఈవో ఏకే దాస్ సమక్షంలో పీఎఫ్ఆర్డీఏ చైర్మన్ సుప్రతిమ్ బందోపాధ్యాయ దీన్ని ప్రారంభించారు. దీంతో మొబైల్ ఫోన్ నుంచే ఎన్పీఎస్ ఖాతా (స్వచ్ఛంద పింఛను ఖాతా) తెరవొచ్చు. ఎటువంటి పేపర్లు అవసరం లేకుండా, మొబైల్ ఫోన్‌తో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఎన్పీఎస్ ఖాతాను తెరవొచ్చని పీఎఫ్ఆర్డీఏ, బీవోఐ ఉమ్మడి ప్రకటనలో తెలిపాయి. ఎంతో సులభంగా, వేగంగా కేవలం కొన్ని క్లిక్‌లతో ఖాతా ప్రారంభించొచ్చని ప్రకటించాయి. ఫోన్‌తో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. అది వెబ్ పేజీకి తీసుకెళుతుంది. అక్కడి డిజిటల్ దరఖాస్తును వివరాలతో పూర్తి చేయాలి. ఆధార్ నంబర్ ఇవ్వాలి. దీంతో డిజీలాకర్ సాయంతో ఫొటో, ఇతర వివరాలను ప్లాట్‌ఫామ్ తీసుకుని ప్రక్రియను పూర్తి చేస్తుంది. -
అత్యంత ప్రజాదరణ పొందిన పథకంగా అటల్ పెన్షన్ యోజన
జాతీయ పెన్షన్ వ్యవస్థ కింద అత్యంత ప్రజాదరణ పొందిన సామాజిక భద్రత పథకంగా అటల్ పెన్షన్ యోజన అవతరించింది. 4.2 కోట్ల చందాదారుల గల నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్)లో 66 శాతం లేదా 2.8 కోట్లకు పైగా చందాదారులు 2020-21 చివరిలో ఎపీవైని ఎంచుకున్నారని నేషనల్ పెన్షన్ సిస్టమ్స్(ఎన్పీఎస్) ట్రస్ట్ వార్షిక నివేదిక తెలిపింది. అసంఘటిత రంగంలో ఉన్న పేద ప్రజలకు భద్రత కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పెన్షన్ పథకమే ఈ అటల్ పెన్షన్ యోజన(ఏపీవై). ఈ పథకం 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు ఉన్న భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ(పీఎఫ్ఆర్డీఏ) అటల్ పెన్షన్ యోజనను నిర్వహిస్తుంది. ఒక వ్యక్తి 60 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు కనీసం 20 సంవత్సరాల పాటు ప్రతి నెల కొత్త మొత్తం పొదుపు చేస్తే ఆ తర్వాత వారికి నెలకు రూ.5,000 పెన్షన్ లభిస్తుంది. అటల్ పెన్షన్ యోజన కింద చందాదారులకు నెలకు రూ.1000 నుంచి రూ.5000 మధ్య గ్యారెంటీడ్ కనీస నెలవారీ పెన్షన్ అందుతుంది. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015 మేలో ప్రారంభించింది.(చదవండి: ఈడీ నోటీసులను కోర్టులో సవాల్ చేసిన సచిన్ బన్సాల్) దీనిలో చేరాలంటే బ్యాంక్ ఖాతా లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతా ఉంటే సరిపోతుంది. టెర్మినల్ వ్యాధి లేదా ఖాతాదారుడు మరణించిన పరిస్థితుల్లో మినహా పెన్షన్ ముందస్తుగా చెల్లించడం, ఏపీవై నుంచి నిష్క్రమించడం జరగదు. మీరు ముందుగా చేరితే తక్కువ మొత్తం ప్రతి నెల కట్టాల్సి వస్తుంది కాబట్టి త్వరగా మీ పేరు నమోదు చేసుకుంటే మంచిది. ప్రభుత్వ, ప్రైవేటు, గ్రామీణ బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా (ఆన్లైన్/ఆఫ్‌లైన్) ఈ పథకంలో చేరొచ్చు. -
65 ఏళ్ల తర్వాత.. జాతీయ ఫించను పథకంలో చేరొచ్చు!
న్యూఢిల్లీ: జాతీయ పింఛను వ్యవస్థ (ఎన్పీఎస్) పథకాన్ని మరింత ఆకర్షణీయంగా చేయాలన్న లక్ష్యంతో పింఛను నిధి అభివృద్ధి, నియంత్రణ సంస్థ (పీఎఫ్ఆర్డీఏ) నిబంధనలను సవరించింది. 65 ఏళ్ల తర్వాత చేరిన చందాదారులు ఈక్విటీలకు గరిష్టంగా 50 శాతం వరకు కేటాయింపులు చేసుకునేందుకు అనుమతించింది. ఎన్‌పీఎస్‌లో గరిష్ట వయసును 65 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు పెంచిన విషయం గమనార్హం. 75 ఏళ్ల వరకు ఇప్పటి వరకు ఎన్పీఎస్ పథకంలోకి 18–65 ఏళ్ల వయసు మధ్యన ప్రవేశించే అవకాశం ఉండగా.. ఇకమీదట 65 ఏళ్ల తర్వాత కూడా చేరొచ్చు. 75 ఏళ్ల వరకు పథకంలో కొనసాగొచ్చు. ఇప్పటికే రిటైర్మెంట్ వయసు ఆధారంగా ఎన్పీఎస్ ఖాతాను మూసేసిన వారు సైతం.. తాజా సవరణలతో తిరిగి కావాలనుకుంటే ఖాతాను తెరుచుకోవచ్చు. 65 ఏళ్ల తర్వాత ఎన్‌పీఎస్‌లో చేరే వారు ఆటో ఆప్షన్ కింద ఈక్విటీలకు 15 శాతం, యాక్టివ్ చాయిస్ ఆప్షన్ కింద 50 శాతాన్ని కేటాయించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇదిలావుండగా, ఆదాయపన్ను నుంచి పింఛనుకు మినహాయింపునివ్వాలని భారతీయ పెన్షనర్స్ మంచ్ డిమాండ్ చేసింది. చదవండి : మాకు పెన్షన్‌పై ఐటీ మినహాయింపు ఇవ్వండి -
పీఎఫ్ఆర్డీఏ, ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో ఉద్యోగాలు
పీఎఫ్ఆర్డీఏ, న్యూఢిల్లీలో 14 గ్రేడ్–ఏ ఆఫీసర్ పోస్టులు న్యూఢిల్లీలోని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ).. గ్రేడ్–ఏ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 14 ► పోస్టుల వివరాలు: జనరల్–05, యాక్చూరియల్–02, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్–02, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ–02, అధికార భాష(రాజభాష)–01, రీసెర్చ్ (ఎకనామిక్స్)–01, రీసెర్చ్(స్టాటిస్టిక్స్)–01. (డిగ్రీతో ఏఓ కొలువు.. నెలకు రూ.60వేల వేతనం ఇక్కడ క్లిక్ చేయండి) ► అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ డిగ్రీ, అసోసియేట్ చార్టర్డ్ అకౌంటెంట్(ఏసీఏ), మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. » వయసు: 31.07.2021 నాటికి 30ఏళ్లు మించకూడదు. ► వేతనం: పోస్టును అనుసరించి నెలకు రూ.28,150 నుంచి రూ.55,600 వరకు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష(ఫేజ్ 1,ఫేజ్2), ఇంటర్వ్యూ(ఫేజ్ 3)ఆధారంగా ఎంపిక చేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 16.09.2021 ► వెబ్సైట్: https://www.pfrda.org.in/ ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో వివిధ పోస్టులు ఇండియన్ కోస్ట్‌గార్డ్ హెడ్‌క్వార్టర్ నోయిడాలో.. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 09 ► పోస్టుల వివరాలు: చార్జ్‌మ్యాన్, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ తదితరాలు. ► అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా ఇంజనీరింగ్ (ఎలక్ట్రికల్/మెరైన్/ఎలక్ట్రానిక్స్/ప్రొడక్షన్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత విభాగంలో కనీసం 2ఏళ్ల పని అనుభవం ఉండాలి. వయసు 30ఏళ్లు మించకూడదు. ► ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను ది డైరెక్టర్ జనరల్, కోస్ట్‌గార్డ్ హెడ్ క్వార్టర్స్, డైరెక్టరేట్ రిక్రూట్మెంట్, సీ–1, ఫేజ్ 2, ఇండస్ట్రియల్ ఏరియా, సెక్టార్–62, నోయిడా, యూపీ–201309 చిరునామకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 13.09.2021 ► వెబ్సైట్: www.indiancoastguard.gov.in -
ప్రతి రోజు రూ.40 పొదుపుతో.. నెలకు రూ.10 వేల పెన్షన్
అసంఘటిత రంగంలో ఉన్న పేద ప్రజలకు భద్రత కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పెన్షన్ పథకమే అటల్ పెన్షన్ యోజన(ఏపీవై). ఈ పథకం 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు ఉన్న భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ(పీఎఫ్ఆర్డీఏ) ద్వారా అటల్ పెన్షన్ యోజన నడుస్తుంది. ఒక వ్యక్తి 60 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు కనీసం 20 సంవత్సరాల పాటు ప్రతి నెల కొత్త మొత్తం పొదుపు చేస్తే ఆ తర్వాత నెలకు రూ. 5,000 పెన్షన్ లభిస్తుంది. అటల్ పెన్షన్ యోజన కింద చందాదారులకు నెలకు రూ.1000 నుంచి రూ. 5000 మధ్య గ్యారెంటీడ్ కనీస నెలవారీ పెన్షన్ అందుతుంది. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015 మేలో ప్రారంభించింది. దీనిలో చేరాలంటే బ్యాంక్ ఖాతా లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతా ఉంటే సరిపోతుంది. టెర్మినల్ వ్యాధి లేదా ఖాతాదారుడు మరణించిన పరిస్థితుల్లో మినహా పెన్షన్ ముందస్తుగా చెల్లించడం, ఏపీవై నుంచి నిష్క్రమించడం జరగదు. మీరు ముందుగా చేరితే తక్కువ మొత్తం ప్రతి నెల కట్టాల్సి వస్తుంది కాబట్టి త్వరగా మీ పేరు నమోదు చేసుకుంటే మంచిది. పీఎఫ్ఆర్డీఏ పెన్షన్ స్కీంలో ఒకటి కంటే ఎక్కువ మంది కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే 18 సంవత్సరాలు వయస్సు గల చందాదారులు 60 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు నెలకు రూ.210 వరకు చెల్లించాల్సి ఉంటుంది. 39 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వివాహిత జంటలు విడిగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. 60 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత ఈ జంటకు నెలకు రూ.10,000 సామూహిక పెన్షన్ లభిస్తుంది. 30 లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న భార్యాభర్తలు తమ తమ ఏపీవై ఖాతాల్లో నెలకు రూ.577 పొదుపు చేయాల్సి ఉంటుంది. అంటే నెలకు ఇద్దరికీ కలిపి రూ.1154 (రోజుకి 1154/30 = రూ. 38.46) 30 ఏళ్ల వరకు పొదుపు చేస్తే 60 ఏళ్ల తర్వాత ఇద్దరికీ కలిపి ప్రతి నెల రూ. 10 వేల రూపాయల పెన్షన్ వస్తుంది. ఒకవేళ జంటకు 35 సంవత్సరాల వయస్సు ఉన్నట్లయితే వారి సంబంధిత ఏపీవై ఖాతాల్లో నెలవారీ కంట్రిబ్యూషన్ రూ.902కు పెరుగుతుంది. -
NPS: పెన్షనర్లకు కేంద్రం శుభవార్త!
మోదీ ప్రభుత్వం పెన్షనర్లకు భారీ ఊరట కలిగించింది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ(పీఎఫ్ఆర్డీఏ) తాజాగా నేషనల్ పెన్షన్ వ్యవస్థ(ఎన్పీఎస్) విత్‌డ్రాయెల్ నిబంధనలను సడలించింది. కోవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని, చందాదారుల ఎగ్జిట్ లేదా విత్‌డ్రాయెల్ డాక్యుమెంట్ల సెల్ఫ్ అటెస్డెడ్ కాపీలను డిజిటల్ రూపంలో స్వీకరించడానికి పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్(పీఒపీ)ను అనుమతించింది. 2021 జూన్ 30 వరకు ఎన్పీఎస్ విత్‌డ్రాయెల్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఒటీపీ/ఈ-సైన్ ఆధారంగా 'ఆన్లైన్ పేపర్‌లెస్ ఎగ్జిట్ ప్రాసెస్' ఎన్పీఎస్ చందాదారుల కోసం సీఆర్ఎ తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పీఎఫ్ఆర్డీఏ ఒక సర్క్యూలర్ కూడా జారీ చేసింది. ఎన్పీఎస్ విత్‌డ్రాయెల్స్‌కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను సబ్స్క్రైబర్లు డిజిటల్ రూపంలో సీఆర్ఏకు పంపొచ్చు. కోవిడ్ 19 సమయంలో ఎన్పీఎస్ విత్‌డ్రాయెల్‌కు సంబంధించి స్వయంగా డాక్యుమెంట్లు అందించడానికి పెన్షనర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని పీఎఫ్ఆర్డీఏ తెలిపింది. జూలై 21, 2020 నాటి సర్క్యులర్‌లో పేర్కొన్న సర్క్యులర్ ప్రకారం చందాదారుల ఎగ్జిట్ లేదా విత్‌డ్రాయెల్ కేసులకు సంబంధించి అనేక సందర్భాల్లో పిఆర్‌పిలు సిఆర్‌ఎకు రికార్డులు పంపించలేదని పిఎఫ్ఆర్డిఎ పేర్కొంది. కేసులు, కఠినమైన లేదా మృదువైన కాపీలు, రికార్డ్ కీపింగ్ మరియు కంట్రోల్ ప్రయోజనం కోసం విఫలం కాకుండా 2021 జూన్ 30 లోగా సంబంధిత CRA తో POP లు పంచుకోవలసి ఉంటుంది. చదవండి: వాట్సప్ సమస్యలపై గ్రీవెన్స్ ఆఫీసర్‌కి కంప్లైంట్ చేయడం ఎలా? -
రూ. 6 లక్షల కోట్లు దాటిన పింఛను నిధులు
న్యూఢిల్లీ: పింఛను పథకాల నిర్వహణలోని ఆస్తులు రూ.6లక్షల కోట్లను అధిగమించినట్టు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ (పీఎఫ్ఆర్డీఏ) ప్రకటించింది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్), ఇతర పింఛను పధకాల నిర్వహణతోపాటు, ఈ రంగ అభివృద్ధికి తోడ్పడేందుకు పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటైందే పీఎఫ్ఆర్డీఏ. ప్రస్తుతం ఎన్‌పీఎస్‌తోపాటు అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకాలను ఈ సంస్థ చూస్తోంది. ఈ రెండు పథకాల పరిధిలోని మొత్తం సభ్యుల సంఖ్య 4.28 కోట్లకు చేరుకోగా.. నిర్వహణ నిధులు రూ.6లక్షల కోట్లను దాటాయి. పీఎఫ్ఆర్డీఏ ఏర్పాటై 13 ఏళ్లు పూర్తయిన తర్వాత ఈ స్థాయి పురోగతి నమోదైంది. 2020 అక్టోబర్ నాటికి రూ.5లక్షల కోట్ల నిర్వహణ ఆస్తుల మైలురాయిని పూర్తి చేసుకోగా.. తర్వాత ఏడు నెలల్లోనే మరో రూ.లక్ష కోట్లు ఈ రెండు పథకాల పరిధిలో వృద్ధి చెందడం గమనార్హం. ఎన్పీఎస్ కింద 74.10 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వేతర విభాగం నుంచి 28.37 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. పింఛను పథకాల పట్ల సభ్యుల్లో ఉన్న విశ్వాసమే ఈ వృద్ధికి కారణమని పీఎఫ్ఆర్డీఏ చైర్మన్ సుప్రతిమ్ బందోపాధ్యాయ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా రిటైర్మెంట్ ప్రణాళిక, ఆర్థిక శ్రేయస్సు పట్ల వ్యక్తుల్లో అవగాహన పెరిగినట్టు చెప్పారు. చదవండి: ఆరేళ్లలో రూ.15లక్షల కోట్ల ముద్రా యోజన రుణాలు -
మార్చి నెలలో కొత్తగా 12.24 లక్షల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: గత మార్చి నెలలో సుమారు 12.24 లక్షల మంది కొత్త సభ్యులు ఈఎస్ఐసీ(ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) నిర్వహిస్తున్న సామాజిక భద్రతా పథకంలో చేరారు. గత ఏడాది మార్చి నెలలో ఈ సంఖ్య 11.77 లక్షలుగా ఉంది. అంటే ఆ నెలలో దేశవ్యాప్తంగా అన్ని కొత్త ఉద్యోగాలు లభించినట్లు తెలుస్తుంది. తాజా గణాంకాలు నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్(ఎన్ఎస్ఓ) విడుదల చేసిన నివేదికలో ఈ విషయం పేర్కొంది. తాజా డేటా ప్రకారం.. 2020-21లో ఈఎస్ఐసీ స్థూల నమోదు 24 శాతం తగ్గి 1.15 కోట్లకు చేరుకుంది కొవిడ్ మహమ్మారి దీనికి కారణమని, అంత క్రితం ఆర్థిక సంవత్సరంలో 1.51 కోట్ల మంది కొత్తగా ఈ పథకంలో చేరారని ఎన్ఎస్ఓ వెల్లడించింది. 2018-19లో ఈఎస్ఐసీ కొత్త చందాదారుల స్థూల నమోదు 1.49 కోట్లు అని ఎన్ఎస్ఓ నివేదిక వెల్లడించింది. సెప్టెంబర్ 2017 నుండి మార్చి 2018 వరకు సుమారు 83.35 లక్షల మంది కొత్త చందాదారులు ఈఎస్ఐసీ పథకంలో చేరారు. సెప్టెంబర్ 2017 నుంచి 2021 మార్చి వరకు ఈఎస్ఐసీలో స్థూలంగా కొత్త నమోదుల సంఖ్య దాదాపు ఐదు కోట్లు. కొత్త చందాదారుల పేరోల్ డేటా అనేది ఈఎస్ఐసీ, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ), పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ(పీఎఫ్ఆర్ డీఏ) ఆధారంగా రూపొందించబడింది. చదవండి: కోవిడ్-19 విపత్తు వేళ ఉద్యోగులకు అండగా కార్పొరేట్ -
ప్రతి రోజు రూ.7 పొదుపుతో.. నెలకు రూ.5 వేల పెన్షన్
అటల్ పెన్షన్ యోజన(ఎపీవై) అనేది భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న పెన్షన్ పథకం. దీనిని బీమా రెగ్యులేటర్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఎ) నిర్వహిస్తుంది. పదవీ విరమణ సమయంలో స్థిర పెన్షన్ కోసం పెట్టుబడి పెట్టాలని చూస్తున్న వ్యక్తుల కోసం అటల్ పెన్షన్ యోజన అనేది సరైన ఎంపిక. అసంఘటిత రంగంలోని ప్రజలకు వృద్ధాప్యంలో ఆదాయ భద్రత కల్పించడానికి ప్రభుత్వం 1 జూన్ 2015న ఈ పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కోసం మీరు ప్రతిరోజూ 7 రూపాయలు పొదుపు చేస్తే ప్రతి నెల రూ.5 వేల పెన్షన్ తీసుకోవచ్చు. ఇది 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల వారికి అందుబాటులో ఉంటుంది. 60 సంవత్సరాల తర్వాత లబ్ధిదారులకు రూ.1000 నుంచి 5,000 రూపాయల వరకు పెన్షన్ ఇవ్వబడుతుంది. పెట్టుబడిదారుడి వయస్సు, మొత్తాన్ని బట్టి పెన్షన్ నిర్ణయించబడుతుంది. మీరు పొదుపు చేసే నగదును బట్టి ప్రతి నెల రూ.1000 నుంచి రూ.5000 వరకు పొందవచ్చు. ఈ పథకంలో చేరాలంటే సేవింగ్ బ్యాంకు అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ కలిగి ఉండటం తప్పనిసరి. ఈ పథకానికి ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగాలు అనర్హులు. ఈ పథకం కింద ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సిసిడి(1 బి) కింద వినియోగదారులకు పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. చందాదారులకు నెలవారీ, త్రైమాసిక లేదా అర్ధ-వార్షిక ప్రాతిపదికన పొదుపు ఖాతా డబ్బులను జమ చేయవచ్చు. నెలకు రూ.1,000 నుంచి 5,000 రూపాయల స్థిర నెలవారీ పెన్షన్ పొందాలంటే, చందాదారుడు 18 సంవత్సరాల వయస్సులో చేరితే నెలకు రూ.42 నుంచి 210 రూపాయల వరకు ప్రీమియం చెల్లించాలి. అదే 40 సంవత్సరాల వయస్సులో చేరితే నెలకు రూ.291 నుంచి రూ.1,454 మధ్య ప్రీమియం చెల్లించాలి. ఎన్‌పిఎస్ ట్రస్ట్ వెబ్సైట్లో ఎపివై కాలిక్యులేటర్ ఉంది. దీని ద్వారా మీరు మీ వయస్సు, ప్రతి నెల పెన్షన్ ఎంత కావాలో నమోదు చేస్తే నెలకు ఎంత ప్రీమియం చెల్లించాలో చూపిస్తుంది. చదవండి: ఈ పోటీలో గెలిస్తే రూ.50 వేలు మీ సొంతం? -
కనీస రాబడులతో వినూత్న పెన్షన్ పథకం
ముంబై: వినూత్నమైన పెన్షన్ ప్లాన్లను తీసుకురావడం దిశగా పనిచేస్తున్నట్టు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ (పీఎఫ్ఆర్డీఏ) ప్రకటించింది. ఇందులో కనీస రాబడుల హామీతో ఒక పథకం ఉంటుందని పీఎఫ్ఆర్డీఏ చైర్మన్ సుప్రతిమ్ బంధోపాధ్యాయ అన్నారు. పీఎఫ్ఆర్డీఏ నియంత్రణలో ప్రస్తుతం ఎన్పీఎస్, అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకాలు కొనసాగుతుండగా.. మరింత మంది చందాదారులను ఆకర్షించేందుకు వినూత్నమైన పెన్షన్ ఉత్పత్తులను తీసుకురావడంపై దృష్టి పెట్టామని బంధోపాధ్యాయ చెప్పారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ యాక్చుయరీస్ ఆఫ్ ఇండియా నిర్వహించిన వర్చువల్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. నూతన పెన్షన్ ఉత్పత్తి తీసుకువచ్చే విషయంలో యాక్చుయరీలు సాయమందించాలని బంధోపాధ్యాయ కోరారు. యాక్చుయరీల నుంచి వచ్చే సూచనలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఎన్పీఎస్ నుంచి వైదొలిగే సమయంలో సభ్యులకు అధిక రేట్లతో కూడిన పెన్షన్ లేదా యాన్యుటీ ప్లాన్‌ను అందించే అంశంపై దృష్టి సారించినట్టు చెప్పారు. మార్కెట్ ఆధారిత బెంచ్‌మార్క్ రేట్లకు అనుగుణంగా ఉండే భిన్నమైన యాన్యుటీ ఉత్పత్తుల అవసరం ఉందన్నారు. క్రమానుగతంగా కావాల్సినంత వెనక్కి తీసుకునే ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) మాదిరి యాన్యుటీ ప్లాన్లు కావాలన్నారు. పెన్షన్ ఎంత రావచ్చన్న అంచనాలను ప్రస్తుత, నూతన చందాదారులకు అందుబాటులోకి తీసుకురావడంపై పనిచేస్తున్నట్టు బంధోపాధ్యాయ చెప్పారు. -
పెన్షన్ పరిమితి నెలకు రూ.10 వేలకు పెంపు
న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక లాంచ్ చేసిన పథకం అటల్ పెన్షన్ యోజన. 60వ ఏట నుంచి ప్రతి నెలా నిర్ణీత మొత్తంలో పెన్షన్ అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం దీనిని 2015-16 బడ్జెట్లో ప్రకటించింది. అయితే ఈ పథకం కింద ఇక నుంచి నెలకు 10 వేల రూపాయలు పొందవచ్చు. ఈ పరిమితిని 10 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. ఇప్పటి వరకు ఈ పథకం కింద నెలకు 5000 రూపాయల వరకే ప్రభుత్వం ఆఫర్ చేసేది. అనధికారిక రంగాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ పెన్షన్ స్కీమ్న కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతిపాదించిన నిర్ణయం కనుక అమల్లోకి వస్తే, ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టిన వారు, గడువు అనంతరం నెలకు 10వేల రూపాయల పెన్షన్ పొందనున్నారు. అటల్ పెన్షన్ యోజన కింద అందించే పెన్షన్ విలువ పెరగాల్సి ఉందని ఆర్థిక సేవల డిపార్ట్మెంట్ జాయింట్ సెక్రటరీ మాద్నెష్ కుమార్ మిశ్రా చెప్పారు. పెన్షన్ రెగ్యులేటరీ పీఎఫ్ఆర్డీఏ నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. నెలకు పెన్షన్‌ను రూ.10వేల వరకు అందించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఈ పథకం కింద నెలకు అందించే పెన్షన్ ఐదు శ్లాబుల్లో ఉంది. ఈ విషయంపై మార్కెట్ నుంచి పెద్ద ఎత్తున్న ఫీడ్‌బ్యాక్ తీసుకున్నామని, 60 ఏళ్ల తర్వాత అందించే రూ.5000 పెన్షన్, వచ్చే 20-30 ఏళ్లకు సరిపోదని పేర్కొన్నట్టు మిశ్రా చెప్పారు. అటల్ పెన్షన్ యోజనలో పెట్టుబడి పెట్టడానికి కనీస వయసు 18 ఏళ్లు ఉండాలి. మూడు రకాల పద్ధతుల్లో ఏపీవైకి చెల్లించవచ్చు. ఒకటి నెలవారీ, రెండు త్రైమాసికం, మూడు అర్థ సంవత్సరంలో ఈ పెట్టుబడులు పెట్టవచ్చు. పెన్షన్ పెంపుతో పాటు మరో రెండు రకాల ప్రతిపాదనలను కూడా పెన్షన్ రెగ్యులేటరీ, ఆర్థికమంత్రిత్వ శాఖకు పంపింది. ఏపీవైకి ఆటో ఎన్రోల్మెంట్, ఈ స్కీమ్‌లో ప్రవేశానికి గరిష్ట వయసును 50 ఏళ్ల వరకు పెంచడం. ప్రస్తుతం ఈ స్కీమ్‌కు 40 ఏళ్లే గరిష్ట వయసుగా ఉంది. మరో 10 ఏళ్ల పెంపుతో సబ్‌స్క్రైబర్ బేస్‌ను మరింత పెంచవచ్చని పెన్షన్ రెగ్యులరీ యోచిస్తోంది. ప్రస్తుతం ఈ పెన్షన్ పథకానికి 1.02 కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. 2017-18లో కొత్తగా 50 లక్షల మంది కొత్త సబ్స్క్రైబర్లు చేరారు. -
పెన్షన్‌దారులకు ఆ రెండు తప్పనిసరి
న్యూఢిల్లీ : నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్) సబ్స్క్రైబర్లకు మొబైల్ నెంబర్, బ్యాంకు అకౌంట్‌ను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ పీఎఫ్ఆర్డీఏ తప్పనిసరి చేస్తున్నట్టు ఆర్థిక మంత్రిత్వశాఖ పేర్కొంది. మనీ లాండరింగ్ నివారణ చట్ట మార్గదర్శకాల ప్రకారం, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ప్రస్తుతమున్న సబ్స్క్రైబర్లకు, కొత్త సబ్స్క్రైబర్లకు ఫారిన్ అకౌంట్ ట్యాక్స్ కంప్లియెన్స్ యాక్ట్, సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యురిటైజేషన్ అసెట్ రికన్స్ట్రక్షన్ అండ్ సెక్యురిటీ ఇంటరెస్ట్‌లను తప్పనిసరి చేసింది. నేషనల్ పెన్షన్ స్కీమ్‌ను సులభతరం చేసేందుకు, మెరుగుపరుచేందుకు ఎప్పడికప్పుడు పెన్షన్ అథారిటీ పలు కార్యక్రమాలను చేపడుతోంది. ఈ క్రమంలోనే సబ్స్క్రైబర్ల ప్రయోజనార్థం, ఆపరేషన్‌ను సులభతరం చేసేందుకు బ్యాంకు అకౌంట్ వివరాలను, మొబైల్ నెంబర్‌ను తప్పనిసరి చేసిన్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. సబ్స్క్రైబర్లు తప్పనిసరి నమోదు చేయాల్సిన వాటిలో వివరాలను కచ్చితంగా వెల్లడించాల్సి ఉందని, వాటిని బ్లాంక్‌గా వదిలేయకూడదని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఒకవేళ బ్లాంక్‌గా వదిలేస్తే దరఖాస్తు తిరస్కరించబడుతుందని పేర్కొంది. -
ఎన్పీఎస్ ఉపసంహరణ అవకాశం ఇక మూడేళ్లకే..
పశ్చిమగోదావరి, నిడమర్రు : జాతీయ పింఛను పథకం(ఎన్పీఎస్) ఖాతాదారులు తాము జమ చేసిన నగదులో కొంత మొత్తాన్ని ఇకపై మూడేళ్ల తర్వాతే తీసుకునేలా ఇటీవల నిబంధనలను సవరించారు. ఈ మేరకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) జనవరిలో ఓ నోటీసులో పేర్కొంది. ఇప్పటివరకూ చందాదారులు భవిష్యత్తు కోసం దాచుకోవడం ప్రారంభించిన సొమ్మును, ఎంత అత్యవసరమైనా సుదీర్ఘ కాలం పాటు తీసుకునే అవకాశం ఉండేది కాదు. ఇప్పటివరకూ పదేళ్లు పథకంలో కొనసాగిన తర్వాత మాత్రమే పాక్షిక ఉపసంహరణకు అనుమతించేవారు. తాజా ఉత్తర్వుల ప్రకారం పథకంలో చేరిన మూడేళ్ల తర్వాత నిర్దిష్ట అవసరాల కోసం ఎన్పీఎస్ నుంచి సొమ్ము తీసుకునేందుకు ఇకపై అనుమతిస్తారు. గత నెల 10వ తేదీ నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ తాజా నిబంధనలు తెలుసుకుందాం. పాక్షిక ఉపసంహరణకు గరిష్ట మొత్తం 25 శాతం.. పాక్షిక వాపసు తీసుకునేందుకు అనుమతించే గరిష్ట మొత్తం 25 శాతం మాత్రమే. ఎన్పీఎస్ ఖాతాలు రెండు రకాలు టైర్ 1 ఖాతాలో జమ చేసే సొమ్మును 60 ఏళ్ల వయసు వచ్చేవరకు ఉపసంహరించుకునే వీల్లేదు. టైర్ 2 ఖాతా తెరిచిన వారికి సేవింగ్స్ ఖాతా మాదిరి ఎప్పుడైనా ఉనసంహరణకు అనుమతిస్తారు. అంటే చందాదా రుడు చెల్లించిన మొత్తానికి 25 శాతం మించిన మొత్తాన్ని మాత్రమే అనుమతిస్తారు. ప్రభుత్వ వాటాగా చెల్లించవలసిన 10 శాతం మొత్తం నుంచి పాక్షిక ఉనసంహరణకు అనుమతించరు. మొదటి తరహా ఖాతా విషయంలోనే ఉపసంహరణ నిబంధనలు ఇప్పుడు సవరించారు. నిబంధనలు ఇలా ♦ చందాదారునికి పిల్లలు/చట్టబద్ధంగా దత్తత పొందిన పిల్లల ఉన్నత విద్యాభ్యాసానికి ♦ చందాదారుని పిల్లలు/చట్టబద్ధంగా దత్తత పొందిన పిల్లల వివాహం కోసం ♦ చందాదారుడు సొంతంగా కాని/జీవిత భాగస్వామితో గాని కలిపి నివాసగృహం/ప్లాట్ కొనుగోలు/నిర్మాణం కోసం (పూర్వీకుల ఆస్తి కాకుండా చందాదారుడు వ్యక్తిగతంగా కానీ ఉమ్మడిగా గాని గృహం/ప్లాట్ కలిగిఉంటే ఉపసంహరణకు అనుమతించరు) ♦ చందాదారుడు/జీవిత భాగస్వామి, పిల్లలు, దత్తత పిల్లలు, ఆధారిత తల్లిదండ్రులు పలు వ్యాధులతో అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్నప్పుడు వైద్య చికిత్సల కోసం అనుమతించే వ్యాధులు క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్, ప్రైమరీ, పల్మనరీ ఆర్టిరియల్ హైపర్ టెన్సన్, మల్టిపుల్ స్లి్కరోసిస్, మేజర్ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్, కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్, ఆర్టోగ్రాఫ్ సర్జరీ, హార్ట్ వాల్వ్ సర్జరీ, స్ట్రోక్, మయోకార్టియల్ ఆంఫోరష్కన్, కోమా, అంధత్వం, పక్షవాతం, యాక్సిడెంట్, ప్రాణాంతక ఇతర వ్యాధులు ఉపసంహరణకు పరిమితులు ♦ పాక్షిక ఉపసంహరణ చందాదారుడు ఈ పరిమితులకు లోబడి అనుమతిస్తారు. ♦ చందాదారుడు జాతీయ పెన్షన్ పథకంలో చేరిన తేదీ నుంచి మూడేళ్లు పూర్తి అయి ఉండాలి. ♦ చందాదారుడు దరఖాస్తు చేసిన నాటికి చందాదారుడు చెల్లించిన మొత్తానికి 25 శాతం మించిన మొత్తాన్ని మాత్రమే అనుమతిస్తారు. గరిష్ట కాలపరిమితి జాతీయ పెన్షన్ పథకం కాలపరిమితి ముగిసేలోపు గరిష్టంగా మూడుసార్లు మాత్రమే పాక్షిక ఉనసంహరణకు అనుమతిస్తారు. పాక్షిక ఉపసంహరణకు చందాదారుడు సెంట్రల్ రికార్డు కీపింగ్ ఏజెన్సీ(సీఆర్ఏ) లేదా నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్‌కు తగిన ధ్రువీకరణ పత్రాలతో నోడల్ అధికారి ద్వారా దరఖాస్తు చేయాలి. చందాదారుడు ఏదేని అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భంలో వారి కుటుంబ సభ్యులు దరఖాస్తు చేయవచ్చు. పాక్షిక ఉపసంహరణ విధానం చందాదారులు తమ పాక్షిక ఉపసంహరణ (పార్షియల్ విత్ డ్రాయల్) కోసం ఫారం 601పీడబ్లూ ఉపయోగించాలి. గత సర్క్యులర్‌లో ఉపసంహరణ దరఖాస్తు పంపుటకు వర్తించు మార్గదర్శకాలే పాక్షిక ఉపసంహరణ దరఖాస్తు పంపుటకు వర్తిస్తాయి. -
ఏపీవై చందాదారులకు కొత్త ‘ఆధార్’ పత్రం
న్యూఢిల్లీ: అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) చందాదారుల నుంచి ఆధార్ వివరాలు సేకరించేందుకు వీలుగా సోమవారం నుంచి కొత్త దరఖాస్తు పత్రాలను వినియోగించాలని పీఎఫ్ఆర్డీఏ (పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ) బ్యాంకులు, పోస్టాఫీసులను కోరింది. దీనిపై గతంలో అనేకసార్లు ఆర్థిక సేవల విభాగం, బ్యాంకులు, పోస్టాఫీసుల అధికారులతో చర్చలు జరిపామనీ, జనవరి 1 నుంచి అమలు చేసేందుకు నిర్ణయించామని పీఎఫ్ఆర్డీఏ వెల్లడించింది. -
2050 నాటికి ‘వృద్ధ భారతం’!
న్యూఢిల్లీ: ప్రస్తుతం యువభారత్‌గా ఉన్న దేశం.. 2050 నాటికల్లా వృద్ధ భారత్‌గా క్రమంగా మారనుంది. ప్రస్తుతం ప్రతి పన్నెండు మందిలో ఒకరు అరవైలలో ఉండగా.. అప్పటికల్లా ప్రతి అయిదు మందిలో ఒకరు అరవై ఏళ్ల పైబడిన వారు ఉండనున్నారు. వయస్సుపరంగా జనాభా సంఖ్యలో చోటు చేసుకుంటున్న మార్పుల గురించి పింఛను రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ పీఎఫ్ఆర్డీఏ, రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం దేశ జనాభాలో 60 ఏళ్ల పైబడిన వారి సంఖ్య 8.9 శాతంగా ఉండగా.. 2050 నాటికి ఇది 19.4 శాతానికి పెరగనుందని దేశ వయోజనుల ఆర్థిక భద్రత అంశంపై నివేదికను విడుదల చేసిన సందర్భంగా పీఎఫ్ఆర్డీఏ చైర్మన్ హేమంత్ జి. కాంట్రాక్టర్ తెలిపారు. నివేదిక ప్రకారం ప్రస్తుతం జనాభాలో 0.9 శాతంగా ఉన్న 80 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 2050 నాటికి 2.8 శాతానికి పెరగనుంది. ఈ నేపథ్యంలో పింఛను వ్యవస్థను అభివృద్ధి చేయడం దేశ శ్రేయస్సుకు కీలకమని హేమంత్ చెప్పారు. ఇది ఇటు వృద్ధులకు ఆర్థిక భద్రతనివ్వడంతో పాటు దీర్ఘకాలంలో ఎకానమీ వృద్ధికి తోడ్పడే కీలక రంగాలకు నిధులను సమకూర్చేందుకు కూడా దోహదపడగలదని ఆయన వివరించారు. -
అందరికీ పింఛను ప్రయోజనాలు దక్కాలి
⇒ ఎన్‌పీఎస్‌లో చేరేలా అసంఘటిత రంగం వారిని ప్రోత్సహించాలి ⇒ ఈక్విటీల్లో ప్రభుత్వోద్యోగుల పెట్టుబడుల పరిమితి పెరగాలి ⇒ పీఎఫ్ఆర్డీఏ చైర్మన్ హేమంత్ కాంట్రాక్టర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : దేశీయంగా అత్యధిక శాతం మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్న నేపథ్యంలో వారందరికి పింఛను ప్రయోజనాలు దక్కేలా చర్యలు అవసరమని పెన్షన్ ఫండ్ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (పీఎఫ్ఆర్డీఏ) చైర్మన్ హేమంత్ కాంట్రాక్టర్ తెలిపారు. వారు నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్)లో చేరేలా తోడ్పడేందుకు తగు ప్రోత్సాహకాలు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే దిశగా ఎన్పీఎస్పై అవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కాంట్రాక్టర్ వివరించారు. ఎన్పీఎస్కు సంబంధించి సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీగా (సీఆర్ఏ) కార్వీ కంప్యూషేర్ పూర్తి స్థాయి కార్యకలాపాల ప్రారంభం సందర్భంగా గురువారమిక్కడ జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అటల్ పెన్షన్ యోజన (ఏపీవై)లో చేరేందుకు ప్రస్తుతం 40 ఏళ్లుగా ఉన్న గరిష్ట వయోపరిమితిని 50 ఏళ్లకు పెంచాలని, అలాగే రూ. 5,000గా ఉన్న గరిష్ట పెన్షన్ కూడా రూ. 10,000కు పెం చాలని ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు కాంట్రాక్టర్ తెలిపారు. ప్రస్తుతం 46 లక్షల స్థాయిలో ఉన్న ఏపీవై ఏపీవై చందాదారుల సంఖ్య మార్చి ఆఖరు నాటికి 50 లక్షల స్థాయికి చేరగలదని చెప్పారు. ఎన్‌పీఎస్‌లో 1.49 కోట్ల చందాదారులు.. ఎన్పీఎస్లోని ప్రభుత్వోద్యోగులు కూడా ఇతర చందాదారుల తరహాలో ఈక్విటీల్లో 50 శాతం దాకా ఇన్వెస్ట్ చేసేందుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు కాంట్రాక్టర్ చెప్పారు. ప్రస్తుతం ఈ పరిమితి 15 శాతంగా ఉంది. ఈ అంశంపై పలు దఫాలు చర్చలు జరిగాయని, త్వరలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోగలదని ఆశిస్తున్నామని కాంట్రాక్టర్ చెప్పారు. ప్రస్తుతం ఎన్‌పీఎస్‌లో 1.49 కోట్ల చందాదారులు ఉన్నారని, రోజుకు 10,000 మంది చొప్పున కొత్తగా చేరుతున్నారని కాంట్రాక్టర్ చెప్పారు. సుమారు రూ. 1,70,000 కోట్ల పీఎఫ్ఆర్డీఏ నిధిని ఏడు సంస్థలు నిర్వహిస్తున్నాయని వివరించారు. ఇందులో సింహభాగం చందాదారులు ప్రభుత్వోద్యోగులే ఉంటున్నారని కాంట్రాక్టర్ చెప్పారు. కార్పొరేట్ రంగం నుంచి కూడా సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. మరోవైపు చందాదారులు ఏటా 35 శాతం మేర, సబ్స్క్రిప్షన్ సుమారు 40 శాతం మేర వృద్ధి చెందుతున్నాయని కాంట్రాక్టర్ వివరించారు. ఎన్పీఎస్ సుమారు 10.5 శాతం మేర రాబడులు అందిస్తోందని ఆయన తెలిపారు. సీఆర్ఏగా కార్వీ..: ఎన్పీఎస్ చందాదారులకి సర్వీసులు అందించేందుకు రెండో సీఆర్ఏగా (సీఆర్ఏ)గా గతేడాది లైసెన్సు దక్కించుకున్నట్లు కార్వీ గ్రూప్ చైర్మన్ సి. పార్థసారథి తెలిపారు. కేవలం 34 వారాల్లో అత్యంత తక్కువ చార్జీలతో పూర్తి స్థాయిలో సర్వీసులు ప్రారంభించగలిగామని ఆయన వివరించారు. ఎన్పీఎస్ను మరింత ప్రాచుర్యంలోకి తెచ్చే దిశగా రాబోయే రోజుల్లో కార్పొరేట్లు, ప్రభుత్వ అధికారులతో భేటీ కానున్నట్లు పార్థసారథి పేర్కొన్నారు. -
పెన్షన్ స్కీమ్‌ల కోసం రిటైర్మెంట్ అడ్వైజర్లు
• నియామకంపై పీఎఫ్ఆర్డీఏ దృష్టి • ఎన్ఆర్ఐ, గల్ఫ్ దేశాల్లో కార్మికులను ఆకర్షించే ప్రయత్నాలు న్యూఢిల్లీ: ఎన్పీఎస్ తదితర పింఛను పథకాలను నిర్వహించే పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ (పీఎఫ్ఆర్డీఏ) విస్తరణపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐ), గల్ఫ్ దేశాల్లోని కార్మికులను ఆకర్షించేందుకు వీలుగా రిటైర్మెంట్ అడ్వైజర్లను నియమించే ప్రణాళికలతో ఉంది. ‘‘ఎన్ఆర్ఐల నుంచి ఎన్‌పీఎస్‌లో చేరిక పెద్దగా లేదు. గతేడాది నవంబర్‌లో దుబాయిలో రోడ్‌షో నిర్వహించిన తర్వాత స్పందన పెరిగింది. ప్రతీ నెలా 150–160 ఎన్పీఎస్ ఖాతాలు ప్రారంభం అవుతున్నాయి. అయినప్పటికీ ఇది చాలా తక్కువే. ఇది దీన్ని మరింత పెంచాలని కోరుకుంటున్నాం. ఇందులో భాగంగా ఎన్ఆర్ఐలకు పింఛను పథకాల గురించి వివరించేందుకు వీలుగా రిటైర్మెంట్ అడ్వైజర్లను నియమించాలని అనుకుంటున్నాం’’ అని పీఎఫ్ఆర్డీఏ చైర్మన్ హేమంత్ ఓ వార్తా సంస్థకు తెలిపారు. తొలుత గల్ఫ్ ప్రాంతంలో చందాదారులను ఆకర్షించే ప్రయత్నం చేసిన తర్వాత స్పందనను బట్టి ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. -
ఎన్పీఎస్ ఖాతాల నిబంధనలు సడలింపు
న్యూఢిల్లీ: జాతీయ పింఛన్ విధానం (ఎన్పీఎస్) ఖాతా ప్రారంభించడానికి ఉన్న నిబంధనలను కేంద్రం సడలించింది. ఎన్పీఎస్ ఖాతాలు తెరవడానికి ఇదివరకు ఉన్న నిబంధనల్లో పలు మార్పులు చేస్తూ పింఛన్ నిధులు నియంత్రణ,అభివృధ్ధి మండలి (పీఎఫ్ఆర్డీఏ) నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆధార్‌తో తెరిచిన ఎన్పీఎస్ ఖాతాలకు బ్యాంక్‌ల్లో ఫిజికల్ అప్లికేషన్ ఫామ్ ఇవ్వవలసిన అవసరం లేదంటూ ఆదివారం ప్రకటించింది. ఇదివరకు ఖాతాలు ప్రారంభించిన వాళ్లు ఎలక్ట్రానిక్ సంతకం చేయడానికి బ్యాంకులకు కచ్చితంగా వెళ్లాల్సి వచ్చేది. ఆధార్ సంఖ్య ద్వారా ఖాతాలు తెరిచేవారు ఇక నుంచి బ్యాంకులకు వెళ్లి ఎలక్ట్రానిక్ సంతకం పెట్టాల్సిన అవసరం లేదంటూ పీఎఫ్ఆర్డీఏ తాజాగా వెల్లడించింది. -
ఎన్పీఎస్పై కార్పొరేట్లు దృష్టి పెట్టాలి
పీఎఫ్ఆర్డీఏ సీజీఎం దాస్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఉద్యోగులకు జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్) ప్రయోజనాలను అందించే దిశగా దీనిపై కార్పొరేట్లు మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) చీఫ్ జనరల్ మేనేజర్ అనంత గోపాల్ దాస్ సూచించారు. ప్రస్తుతం ఎన్పీఎస్ చందాదారుల సంఖ్య 1.4 కోట్ల మేర ఉండగా, నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ రూ. 1.5 లక్షల కోట్ల స్థారుులో ఉందని ఆయన వివరించారు. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ, తెలంగాణ .. ఆంధ్రప్రదేశ్ వ్యాపార సంస్థల సమాఖ్య ఎఫ్టీఏపీసీసీఐ, పీఎఫ్ఆర్డీఏ సంయుక్తంగా శుక్రవారమిక్కడ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా దాస్ ఈ విషయాలు తెలిపారు. ఎన్‌పీఎస్‌లో పెట్టుబడులు చక్రగతిన దాదాపు 10-12.5 శాతం మేర రాబడులు ఇస్తున్నాయని, వడ్డీ రేట్లు తగ్గుతున్న ప్రస్తుత తరుణంలో రిటైర్మెంట్ అవసరాలకు కావాల్సిన నిధిని సమకూర్చుకునేందుకు ఇది అత్యంత అనువైనదని ఆయన పేర్కొన్నారు. ఎన్పీఎస్ ఐచ్ఛికమే అరుునప్పటికీ.. ఇటు కంపెనీలకు ఇది అటు ఉద్యోగులకు పన్నులపరమైన ప్రయోజనాలు కూడా అందిస్తుందని తెలిపారు. ఎన్‌పీఎస్‌లో ఈక్విటీలు, బాండ్లు, ప్రభుత్వ సెక్యురిటీలతో పాటు తాజాగా ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్సలో (ఏఐఎఫ్) కూడా ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు కల్పించినట్లు దాస్ పేర్కొన్నారు. దీనిపై అవగాహన కల్పించే క్రమంలో వివిధ నగరాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని.. త్వరలో సూరత్, భోపాల్ మొదలైన ప్రాంతాల్లోనూ నిర్వహించనున్నామని ఆయన వివరించారు. మరోవైపు, ప్రస్తుతం దేశ జనాభాలో యువత సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ.. కొన్నేళ్ల తర్వాత రిటైర్మెంట్ అయ్యేవారి సంఖ్య గణనీయంగా ఉండగలదని ఫిక్కీ తెలంగాణ రాష్ట్ర మండలి చైర్మన్ దేవేంద్ర సురానా పేర్కొన్నారు. ఎఫ్టీఏపీసీసీఐ ప్రెసిడెంట్ రవీంద్ర మోదీ, వే2వెల్త్ బ్రోకర్స్ పెన్షన్ అసెట్స్ విభాగం హెడ్ ప్రసాద్ పాటిల్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. స్వల్పంగా తగ్గిన ఆర్సీఎఫ్ లాభం న్యూఢిల్లీ: రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్(ఆర్సీఎఫ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.43 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.46 కోట్ల నికర లాభం సాధించామని ఆర్సీఎఫ్ పేర్కొంది. గత క్యూ2లో రూ.2,403 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ క్యూ2లో రూ.1,772 కోట్లకు తగ్గిందని పేర్కొంది. -
వార్షికంగా రూ.1,000 జమ చేస్తే చాలు..
ఎన్పీఎస్ ఖాతా పనిచేస్తుంది: పీఎఫ్ఆర్డీఏ న్యూఢిల్లీ: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)లో మరింత మందిని భాగస్వాములను చేయడమే లక్ష్యంగా పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ ‘పీఎఫ్ఆర్డీఏ’ తాజాగా కొత్త నిర్ణయం తీసుకుంది. టైర్-1 ఖాతాలలో ఏడాదికి కనీసం రూ.1,000లు జమ చేస్తే ఆ అకౌంట్ కొనసాగుతుంది. ఈ మొత్తం ఇదివరకు రూ.6,000గా ఉంది. కనీస నిల్వ లేని కారణంగా స్తంభింపజేసిన ఖాతాలను తిరిగి క్రియాత్మకం చేయాలని కూడా పీఎఫ్ఆర్డీఏ నిర్ణయించింది. దీంతో గతంలో నిలిచిపోయిన ఖాతాలలో వినియోగదారులు తిరిగి డబ్బుల్ని జమచేసి యాక్టివేట్ చేసుకోవచ్చు. ఎన్‌పీఎస్‌లో టైర్-1, టైర్-2 అనే రెండు రకాల ఖాతాలు ఉన్నాయి. టైర్-1 అనేది నాన్ విత్ డ్రాయల్ పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్. ఇక టైర్-2 అనేది వాలంటరీ విత్‌డ్రాయల్ అకౌంట్. ఎన్‌పీఎస్‌లో భాగస్వాములు కావాలనుకునే ప్రతి ఒక్కరికి టైర్-1 అకౌంట్ తప్పనిసరి. టైర్-2 మన ఇష్టం. -
ఫండ్ మేనేజర్లను ఎంచుకునే స్వేచ్ఛ!
ఏపీవై చందాదారులకు ఇవ్వాలంటున్న పీఎఫ్ఆర్డీఏ న్యూఢిల్లీ: అటల్ పెన్షన్ యోజన(ఏపీవై) స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసే ప్రభుత్వ ఉద్యోగులకు/చందాదారులకు ఫండ్ మేనేజర్లను ఎంచుకునే స్వేచ్ఛనివ్వాలని పీఎఫ్ఆర్డీఏ భావిస్తోంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్‌ను ఎంచుకునే వెసులుబాటును కూడా అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసే వారికి కల్పించాలని పెన్షన్ ఫండ్ నియంత్రణ సంస్థ పీఎఫ్ఆర్డీఏ కోరుకుంటోంది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఆర్డీఏ) చైర్మన్ హేమంత్ జి. కాంట్రాక్టర్ పేర్కొన్నారు. మొత్తం పెట్టుబడుల్లో 5 శాతం వరకూ అల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(ఏఐఎఫ్)లో ఇన్వెస్ట్ చేయడానికి అనుమతిస్తున్నామని తెలిపారు. దీంట్లో 2 శాతం వరకూ ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఫండ్‌కు చేరుతుందని వివరించారు. -
ఆధార్‌యేతర కేవైసీపై పీఎఫ్ఆర్డీఏ కసరత్తు
న్యూఢిల్లీ: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) స్కీమ్ ఆన్లైన్ సౌలభ్యతకు సంబంధించి కొత్త చందాదారులకు తాజా కేవైసీ (నో-యువర్-కస్టమర్) నిబంధనల రూపకల్పనకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్-పీఎఫ్ఆర్డీఏ కసరత్తు చేస్తోంది. ధుృవీకరణకు సంబంధించి ఆధార్ కార్డ్ వినియోగంపై సుప్రీంకోర్టు ఆంక్షల నేపథ్యంలో ఫండ్ రెగ్యులేటర్ ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతోందని చైర్మన్ హేమంత్ కాంట్రాక్టర్ సీఐఐ గురువారం ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమం సందర్భంగా తెలిపారు. తాజా కేవైసీ రూపకల్పనకు కొద్ది సమయం పడుతుందని తెలిపారు.