prabhakar chowdary
-
టీడీపీలో భగ్గుమన్న వర్గపోరు.. తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు
-
బాబు ను భయపెట్టిన తెలుగు తమ్ముళ్లు
-
టీడీపీ నేత సంచలన నిర్ణయం.. పవన్ పోటీ చేస్తే త్యాగానికి సిద్ధం
ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు ఖరారైనట్లుగానే వ్యవహారం సాగుతోంది. అందుకే తెలుగు తమ్ముళ్ళలో నుంచి త్యాగయ్యలు బయటకు వస్తున్నారు. అనంతరపురం అర్బన్ నుంచి పవన్ కల్యాణ్ పోటీచేయాలని అక్కడి మాజీ ఎమ్మెల్యే కోరుతున్నారు. పవన్ కోసం తన సీటును త్యాగం చేస్తానని ప్రభాకర చౌదరి ప్రకటించారు. ఈ మాజీ ఎమ్మెల్యే ప్రకటన వెనుక ఉన్న మర్మం ఏంటో చూద్దాం. త్యాగం వెనక అసలు కథ అనంతపురం మున్సిపల్ ఛైర్మన్‌గాను.. అర్బన్ ఎమ్మెల్యే గాను పనిచేసిన వైకుంఠం ప్రభాకర చౌదరి తన సీటును జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం త్యాగం చేస్తానంటున్నారు. అనంతపురం జిల్లా తెలుగుదేశంలో పెత్తనం చలాయించే జేసీ బ్రదర్స్ బారి నుంచి తన సీటును కాపాడుకునే లక్ష్యంగా ప్రభాకర చౌదరి ఈ ప్రకటన చేశారనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డితో ప్రభాకర్ చౌదరికి ఎప్పటినుంచో విభేదాలు కొనసాగుతున్నాయి. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జేసీ దివాకర్ రెడ్డి ఎంపీగా ఉన్నపుడు ప్రతి విషయంలోనూ ప్రభాకర్ చౌదరి జేసీతో విభేదించారు. జేసీ బ్రదర్స్ కర్రపెత్తనాన్ని సహించేది లేదని పదేపదే స్పష్టం చేస్తూ వచ్చారు. వైకుంఠం ప్రభాకర్ చౌదరిపై ఎప్పటినుంచో ఆగ్రహంగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి... ఇటీవల కాలంలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. ప్రభాకర్ చౌదరి వద్ద కీలక నేతలుగా ఉన్న వారందరినీ తమ వైపుకు తిప్పుకున్నారు జేసీ. వచ్చే ఎన్నికల్లో తన కొడుకు పవన్ కుమార్ రెడ్డికి అనంతపురం అర్బన్ టిక్కెట్ ఇప్పించుకోవాలని జేసీ దివాకర్ రెడ్డి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభాకర్ చౌదరికి ధీటుగా జేసీ వర్గం కూడా అర్బన్‌లో పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తోంది. వైకుంఠం.. బలహీనం ప్రస్తుతం అనంతపురం టీడీపీలో వైకుంఠం ప్రభాకర్ చౌదరి బలహీన పడ్డారని ఆ పార్టీ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభాకర్ చౌదరిని పక్కనపెట్టి దివాకర్ రెడ్డి తనయుడికి టిక్కెట్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని టీడీపీ నేతలే బాహాటంగా చర్చించుకుంటున్నారు. తనకు కాకుండా ప్రత్యర్థి వర్గానికి ప్రాధాన్యత దక్కడం పై అసంతృప్తి గా ఉన్న వైకుంఠం ప్రభాకర్ చౌదరి సరికొత్త ఎత్తుగడ వేశారు. హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్-చంద్రబాబుల భేటీని తన పొలిటికల్ కెరీర్‌కు అనుకూలంగా మార్చుకునే ప్లాన్ వేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అక్కడ చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ జరగగానే.. అనంతపురంలో ప్రభాకర్ చౌదరి స్పందించారు. పవన్ కళ్యాణ్ అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని.. ఆయన కోసం నా సీటును త్యాగం చేస్తానంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఇలా చెప్పటం వల్ల పవన్ కళ్యాణ్ దృష్టిలో పడాలన్నది ప్రభాకర్ చౌదరి ఎత్తుగడ. ఎలాగూ అనంతపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయరు కనుక.. టిక్కెట్ తనకే దక్కుతుందని.. జేసీ దివాకర్ రెడ్డిపై పైచేయి సాధించవచ్చన్నది ప్రభాకర్ చౌదరి ఎత్తుగడ అని చెబుతున్నారు. తనకు కాకుండా జేసీ తనయుడికి అనంతపురం అర్బన్ టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబు భావించినా.. పవన్ కళ్యాణ్ సపోర్ట్‌తో తనకే టిక్కెట్ వచ్చేలా ప్రభాకర్ చౌదరి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీటు కాపాడుకోవడానికి టీడీపీలో ప్రతి ఒక్కరు బాగా నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
పొలిటికల్ కారిడార్: సీటు కాపాడుకునేందుకు ప్రభాకర్ చౌదరి ప్లాన్
-
ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల కన్నుమూత
పెదపూడి/రాజమహేంద్రవరం సిటీ: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్కర రామారావు (72) కరోనా బారిన పడి ఆదివారం తెల్లవారుజామున విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన, భార్య జగ్గయమ్మ 20 రోజుల క్రితం కోవిడ్ బారినపడ్డారు. వెంటనే విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చేరిన వారం రోజుల్లో జగ్గయమ్మకు కరోనా వైద్య పరీక్షల్లో నెగిటివ్ ఫలితాలు రావడంతో ఇంటికి వచ్చేశారు. భాస్కర రామారావు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పెద్దాడ గ్రామానికి 1971 నుంచి 1981 వరకు ఏకగ్రీవ సర్పంచ్‌గా పని చేశారు. 1982లో సామర్లకోట సమితి అధ్యక్షునిగా పనిచేశారు. టీడీపీలో చేరి 1984లో జిల్లా పరిషత్ చైర్మన్‌గా, 1994 నుంచి 1999 వరకు, 1999 నుంచి 2004 వరకు పెద్దాపురం ఎమ్మెల్యేగా, రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడిగా పని చేశారు. 2012 నుంచి 2017 వరకు ఎమ్మెల్సీగా పని చేశారు. 2013లో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరి 2014 డిసెంబర్లో మళ్లీ టీడీపీలో చేరారు. సీనియర్ నేతగా జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే చిట్టూరి ప్రభాకర చౌదరి మృతి కార్మిక నేత, కమ్యూనిస్ట్ ఉద్యమ నాయకుడు మాజీ ఎమ్మెల్యే చిట్టూరి ప్రభాకర చౌదరి (96) ఆదివారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మృతి చెందారు. నూరు సంవత్సరాల కమ్యూనిస్ట్ ఉద్యమంలో 80 ఏళ్లు ప్రభాకర చౌదరి ఉద్యమనేతగా ఉన్నారు. 1952లో రాజమండ్రి మొట్టమొదటి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1967లో కూడా గెలిచి రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఏడు దశాబ్దాల పాటు ప్రజల పక్షాన అవిశ్రాంత పోరాటం సాగించారు. ఆయన మృతి కమ్యూనిస్ట్ ఉద్యమానికి తీరని లోటని పలువురు నాయకులు సంతాపం ప్రకటించారు. చదవండి: కరోనా టెస్టుల్లో రికార్డు నిన్ను నమ్మం బాబూ.. -
ప్రభాకరా.. అభివృద్ధిపై ఆత్మవిమర్శ చేసుకో
సాక్షి, అనంతపురం న్యూసిటీ: ‘గత ప్రభుత్వ నిర్వాకంతో నగరంలో అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయి. రూ.191 కోట్ల పైప్‌లైన్ పనులు సకాలంలో చేయించకపోవడంతో ప్రపంచ బ్యాంకు నిధులు వెనక్కు వెళ్లాయి. ఏపీఎండీపీ పైప్‌లైన్, అమృత్ స్కీం పనులు సాగక నగరం గుంతలమయం అవడానికి, ప్రజల కన్నీటి కష్టాలకు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి నిర్లక్ష్యమే కారణం. ఇప్పటికైనా ఆయన ఆత్మ విమర్శ చేసుకోవాలి’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కోగటం విజయభాస్కర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. నగరాభివృద్ధికి ఎమ్మెల్యే ‘అనంత’ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. రూ.15 కోట్లతో పైప్‌లైన్ పనులు జరిగేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారన్నారు. రూ.4 కోట్లతో పైప్‌లైన్ కోసం తీసిన గుంతలను పూడ్చేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. సర్వజనాస్పత్రి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం రూ.250 కోట్లతో 700 పడకల సామర్థ్యంతో అదనపు భవనం ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని, ఈ విషయంలో ఎమ్మెల్యే అనంత కీలకంగా వ్యవహరించా రన్నారు. స్టాఫ్‌నర్సుల డిప్యుటేషన్‌పై సకా లంలో స్పందించి, తిరిగి వారు సర్వజనాస్పత్రికి వచ్చేలా చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేని ప్రభాకర్‌చౌదరి.. ఇప్పుడు ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డికి లేఖ రాస్తామని చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని మండిపడ్డారు. ఆపరేషన్ కోసం ఇతర ప్రాంతానికి వెళితే దాన్ని బూతద్దంలో చూడడం సరికాదన్నారు. త్వరలోనే ఆయన నగరానికి రానున్నారని, గత ప్రభుత్వం కంటే భిన్నంగా అభివృద్ధి చేసి చూపుతారన్నారు. -
చౌదరి గన్ మెన్ల దౌర్జన్యం
అనంతపురం రూరల్: అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గన్మెన్లు దౌర్జన్యాలకు తెరలేపారు. పేదలకిచ్చిన స్థలాలను ఎమ్మెల్యే పేరు చెప్పి బలవంతంగా అక్రమించుకుంటున్నారు. మీకు దిక్కున్న చోట చెప్పుకోండంటూ హుకుం జారీ చేశారని ఎ.నారాయణపురం పంచాయతీ ఇందిరమ్మ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీకి చెందిన రామాంజినమ్మ, మాబున్నీలకు 2007లో ఇందిరమ్మ కాలనీలో ఇంటి పట్టాలు మంజూరు చేశారు. ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం కింద ఇళ్లు నిర్మించుకున్నారు. 70 శాతం మేర ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి అయినా బిల్లులు రాలేదు. దీంతో ఇంటి నిర్మాణ పనులు ఆపేసి బాడుగ ఇంట్లో జీవసం సాగిస్తున్నారు. ఇదే అదునుగా భావివంచిన ఎమ్మెల్యే గన్మెన్లు హరి, నబిరసూల్‌లు ఖాళీగా ఉన్న ఆ రెండు ఇళ్లను తమ అధీనంలోకి తీసుకొని నేల మట్టం చేశారు. స్థలాలను ఆక్రమించి పక్కాగృహాల నిర్మాణం చేపడుతున్నారని బాధితులు వాపోతున్నారు. ఇదెక్కడి న్యాయం? ప్రభుత్వం తమకు మంజూరు చేసిన స్థలంలో మీరు ఎలా ఇంటి నిర్మాణ పనులు చేపడతారని ప్రశ్నిస్తే ‘మీకు దిక్కున్న చోట చెప్పుకోండి. మీ పేర్ల మీద ఉన్న పట్టాలను రద్దు చేయించాం. మీకు ఏమైనా ఉంటే తీసుకొచ్చుకోండం’టూ దౌరజ్జన్యం చేస్తున్నారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యా రు. పనులకు వెళ్లి పొట్ట నింపుకునే బడుగు జీవులపై పెత్తనం చెలాయించడాన్ని కాలనీ వాసులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ విషయంపై పలుమార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదన్నారు. ఎమ్మెల్యే గన్మెన్లు తమ పేర్ల పైన ఇంటి పట్టాలు ఉంటే ఎప్పటికైనా ప్రమాదమని తెలిసి, వారి సమీప బంధుల పేరిట పట్టాలు పొందినట్లు తెలుస్తోంది. -
ఏం అభివృద్ధి చేశావయ్యా
సాక్షి, అనంతపురం న్యూసిటీ: ‘ఐదేళ్లలో ఏం అభివృద్ధి చేశావయ్యా? రోడ్లు లేవు. కాలువల్లేవ్. గలీజు నీళ్లలతో తిరుగుతున్నామయ్యా అంటూ’ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరిని రంగమ్మ అనే వృద్ధురాలు నిలదీసింది. మంగళవారం ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, మేయర్ స్వరూప, కార్యకర్తలతో కలిసి 20వ డివిజన్ మిస్మమ్మ కాలనీలో ఎన్నికల ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీకి ఆదరణ ఉండే మిసమ్మ కాలనీలో వృద్ధురాలు ఎమ్మెల్యేను నిలదీయడంతో ఆయన అవాక్కయ్యారు. మేయర్, కార్యకర్తలు సైతం ఏమీ మాట్లాడలేకపోయారు. అభివృద్ధి ఏం చేయలేదో చెప్పాలని ఎమ్మెల్యే వృద్ధురాలిని ప్రశ్నించాడు. పింఛన్ ప్రతి నెలా రూ. 2వేలు ఇస్తున్నామని చెప్పుకునే ప్రయత్నం చేశాడు. కానీ వృద్ధురాలు ఎమ్మెల్యేపై ప్రశ్నల వర్షం కురిపించింది. పింఛన్ ఎవరికి కావాలని, కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోతే ఎలాగన్నారు. వృద్ధురాలు.. అధికార పార్టీ వైఫల్యాన్ని ఎండగట్టడంతో ఎమ్మెల్యే, మేయర్ అక్కడి నుంచి జారుకున్నారు. -
‘అనంత’ టీడీపీలో భగ్గుమన్న సెగలు
సాక్షి, అనంతపురం : అనంతపురం అర్బన్ టీడీపీలో నిరసన సెగలు భగ్గుమన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి సొంత పార్టీ నుంచే అసమ్మతి సెగ తగిలింది. ప్రభాకర్ చౌదరిపై ప్రజా వ్యతిరేకత ఉన్న కారణంగా ఆయనను మార్చాలని టీడీపీ నేత మునిరత్నం డిమాండ్ చేశారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ... ‘ అన్ని వర్గాలు ప్రభాకర్ చౌదరిని వ్యతిరేకిస్తున్నాయి. ఆయనకు సీటు ఎందుకు ఇస్తున్నారో అర్ధం కావడం లేదు. నాకు సీటు ఇస్తామని స్వయంగా చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆయన హామీని నిలబెట్టుకోవాలి. ప్రభాకర్ చౌదరికి సీటు ఇస్తే సహకరించేది లేదు. ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తాం. ఈ విషయాన్ని సుజనా చౌదరికి, యనునమలకు స్పష్టంగా చెప్పాము అని పేర్కొన్నారు. బలిజలకు అన్యాయం జరుగుతోంది.. అనంతపురం టీడీపీ అర్బన్ సీటును బలిజలకు కేటాయించాలని కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లా వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో బలిజలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఈ అనంత అర్బన్ సీటును బలిజలకు ఇస్తామని ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకోవాలని విఙ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా.. అనంతపురంలో జేసీ మాట కూడా చెల్లుబాటు కాలేదని ఆయన వర్గీయులు వాపోయారు. గుంతకల్, అనంతపురం టిక్కెట్లను సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇస్తే ఓటమి తప్పదని జేసీ హెచ్చరించినా వారికే టికెట్లను కేటాయించి చంద్రబాబు ఆయనకు షాక్ ఇచ్చారు. ఆయనను నమ్ముకుని టీడీపీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తాకు కూడా భంగపాటు తప్పలేదు. మరోవైపు జేసీ సూచించినట్లుగా శింగనమల అసెంబ్లీ స్థానాన్ని బండారు శ్రావణికి కేటాయించడంతో...సిట్టింగ్ ఎమ్మెల్యే యామినీ బాలకు మొండిచేయి ఎదురైంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తీరుపై యామినీ బాల, ఆమె తల్లి ఎమ్మెల్సీ శమంతకమణి అసహనం వ్యక్తం చేశారు. రాజకీయ అనుభవం లేని శ్రావణికి టికెట్ ఎలా ఇస్తారని మండిపడ్డారు.(అలా అయితే మాకు ఓటమే : జేసీ) -
అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి
-
సీఎం నివాసం వద్ద ఉద్రిక్తత
-
సీఎం నివాసం వద్ద ఉద్రిక్తత.. ఒంటిపై పెట్రోల్ పోసుకుని..
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసం వద్ద పెట్రోల్ పోసుకుని ఓ టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేయటంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ కార్యకర్తలు, బలిజ కులస్తులు పెద్ద సంఖ్యలో సీఎం నివాసం వద్ద ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి సీటిస్తే టీడీపీలో ఉన్న బలిజ నాయకులందరూ మూకుమ్మడిగా రాజీనామాలకు సిద్ధమని రాయలసీమ బలిజ మహా సంఘం అధ్యక్షుడు బళ్లారి వెంకట్రాముడు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ప్రభాకర్ చౌదరికి వ్యతిరేకంగా బలిజలు సీఎం ఇంటి వద్ద నిరసన చేపట్టారు. ప్రభాకర్ చౌదరికి సీటు ఇవ్వకూడదని వారు అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. ప్రభాకర్ చౌదరి స్థానంలో బలిజలకు సీటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభాకర్ చౌదరి బలిజలని అణచివేస్తున్నాడని వారు ఆరోపించారు. ప్రభాకర్ చౌదరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఓ టీడీపీ కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో పోలీసులు వెంటనే అతన్ని నిలువరించి, అదుపులోకి తీసుకున్నారు. -
ప్రభాకర్‌చౌదరికి బలిజల షాక్
అనంతపురం కల్చరల్: ఎమ్మెల్యే ప్రభాకర చౌదరికి సీటిస్తే టీడీపీలో ఉన్న బలిజ నాయకులందరూ మూకుమ్మడిగా రాజీనామాలకు సిద్ధమని రాయలసీమ బలిజ మహా సంఘం అధ్యక్షుడు బళ్లారి వెంకట్రాముడు హెచ్చరించారు. గురువారం సాయంత్రం బాలాజీ మందిరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి తనకు మళ్లీ సీటొచ్చినట్లు ప్రచారం చేసుకోవడాన్ని బలిజ సంఘం నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. ఇంత నిరంకుశంగా ఉంటూ అందరూ వ్యతిరేకిస్తుంటే ఇంకా సీటొస్తుందని ఎలా అనుకుంటారని ప్రశ్నించారు. ఇప్పటికే డాక్టర్ మునిరత్నం అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా బలంగా ఉన్న సామాజిక వర్గాన్ని విస్మరిస్తే గుణపాఠం చెప్పితీరుతామన్నారు. ఈసారి కచ్చితంగా బలిజ అభ్యర్ధిని ఎమ్మెల్యేగా చూస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వెంకటరత్నం, ఘంటా సతీష్, లక్ష్మీనారాయణ, రామశేషయ్య, రాజేష్, దినేష్ పాల్గొన్నారు. -
బీకేకు అసమ్మతి సెగ
పెనుకొండ: టీడీపీలో అసమ్మతి సెగ తారస్థాయికి చేరుకుంది. ఇప్పటికే మంత్రి కాలవ శ్రీనివాసులు, అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరిలకు వ్యతిరేకంగా ఆ పార్టీ నాయకులే ఒక్కటైన సంగతి తెలిసిందే. తాజాగా పెనుకొండ టీడీపీ ఎమ్మెల్యే బీకే పార్థసారథికి టికెట్ ఇవ్వొద్దంటూ పెనుకొండకు చెందిన ముఖ్య నాయకులు కొందరు ఏకంగా సీఎం చంద్రబాబు వద్దే తమ అసంతృప్తిని వెళ్లగక్కినట్లు టీడీపీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నేడోరేపో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు బుధవారం అమరావతిలో సమావేశం ఏర్పాటు చేసి అభ్యర్థిత్వాలు ఖరారు చేస్తున్నారు. ఇందులో ఎమ్మెల్యే పార్థసారథి సైతం టికెట్ దక్కించుకున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ సమావేశానికి ముందే రాజధానికి చేరుకున్న పలువురు అసమ్మతినేతలు ఎమ్మెల్యే బీకేకు టికెట్ ఇవ్వరాదని పెద్దఎత్తున రచ్చచేసినట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. ఎమ్మెల్యే బీకే గెలిచినప్పటి నుంచి ఆయన వ్యవహార శైలి, అవినీతి, అక్రమాలు, ఏకపక్ష ధోరణిపై భగ్గుమంటున్న పెనుకొండ జెడ్పీటీసీ సభ్యుడు నారాయణస్వామి, పరిగి జెడ్పీటీసీ సభ్యుడు సూరి, సీనియర్ టీడీపీ నాయకులు జీవీపీ నాయుడు ఇతర నాయకులు టికెట్ విషయంలో అడ్డుపడినట్లు సమాచారం. సీఎంకు సన్నిహితంగా ఉన్న మంత్రులు దేవినేని, అచ్చెన్నాయుడు, తదితర మంత్రులను సైతం కలిసిన నాయకులు ఎమ్మెల్యే బీకే వ్యవహారశైలిని వివరించినట్లు తెలిసింది. అయితే సకాలంలో నాయకులు సీఎం వద్దకు చేరే పరిస్థితి లేకపోవడంతో సీఎం ఏకపక్షంగా టికెట్ బీకేకు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే అసమ్మతి నేతల ద్వారా ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న సీఎం మళ్లీ మాట్లాడదాం అంటూ దీనిపై మౌనం వహించినట్లు తెలిసింది. రగులుతున్న అసంతృప్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బీకే తీరుపై సీనియర్లలో అసంతృప్తి రగులుతోంది. ఇప్పటికే అనేక మంది టీడీపీ ముఖ్యులు వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ సమక్షంలో వైఎస్సార్సీపీ చేరారు. సోమందేపల్లి పట్టణానికి చెందిన ఓ ప్రముఖ చేనేత నాయకుడికి సోమందేపల్లిలో ఎంతో పేరుంది. అలాంటి నాయకుడిని ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరవర్గం తీవ్ర అవమానానికి గురిచేసినట్లు చర్చ జరుగుతోంది. అయితే ఆయన పార్టీలో ఉండటం కంటే బయటికి పోవడమేæ మేలనీ, అతన్ని పెద్దగా పట్టించుకోవద్దంటూ ఎమ్మెల్యే నుంచే ఆదేశాలు అందాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక అదే గ్రామంలో దివంగత జెడ్పీ చైర్మన్ బంధువు, బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓ మాజీ ఉపసర్పంచ్ సైతం ఎమ్మెల్యే వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పరిగి, పెనుకొండ, రొద్దం, గోరంట్ల మండలాల్లో అసమ్మతి నేతలు.. ఎమ్మెల్యే నీడలా నడుస్తూ ఆయన ఓటమిని చూడాలని తహతహలాడుతున్నారు. ఇక తన సామాజిక వర్గమైన కురుబ కులస్తుల్లో సైతం ఎమ్మెల్యే వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. విచారంలో ఎంపీ నిమ్మల బీకే. పార్థసారథికే సీఎం చంద్రబాబు మరోసారి ఎమ్మెల్యే సీటు ఇచ్చేందుకు సిద్ధం కావడంతో ఎంపీ నిమ్మల క్రిష్టప్ప తీవ్ర విచారం వ్యక్తం చేసినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఐదేళ్లుగా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత ద్వేషం ఉంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఆయనకే టికెట్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిన ఎంపీ కిష్టప్ప జీర్ణించుకోలేకపోతున్నారని పార్టీ కార్యకర్తలు అంటున్నారు. ఎలాగైనా పెనుకొండ టికెట్‌ను తనకుమారుడి, లేదా తనకైనా తెచ్చుకోవాలని భావించిన నిమ్మల ఆశలకు గండిపడటంతో దిక్కుతెలియని పరిస్థితిలో ఉన్నారని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఇన్నాళ్ళు తాను ఎదుర్కొన్న అవమానాలపై ఎంపీ తన సన్నిహితుల వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏదిఏమైనా ఎమ్మెల్యే బీకే.పార్థసారథి గెలుపు కష్టసాధ్యమేనన్న ప్రచారం జరుగుతోంది. -
అనితను ఓడిస్తామని హెచ్చరిక..
-
తెగని పంచాయితీ!
ఎన్నికల వేళ అభ్యర్థుల ఎంపికపై టీడీపీ మల్లగుల్లాలు పడుతోంది. టిక్కెట్లు ఖరారు చేసేందుకు ‘అనంత’ టీడీపీ నేతలను అమరావతికి పిలిపించిన ఆ పార్టీ అధినేతచంద్రబాబు అభ్యర్థుల సంగతి ఎటూ తేల్చలేకపోయారు. ఆరు నియోజకవర్గాలకే అభ్యర్థులను ఖరారు చేసి, 8 స్థానాలను పెండింగ్‌లో ఉంచారు. వారం రోజులోపు అభ్యర్థులను ప్రకటిస్తానని, ఎవరికి టిక్కెట్ ఇచ్చినా అంతా కలిసి పనిచేయాలని సూచించారు. చంద్ర బాబు ప్రకటనతో ఆయన బావమరిది బాలకృష్ణ మినహా తక్కిన 7 నియోజకవర్గాల్లోని సిట్టింగ్‌ల్లో గుబులు మొదలైంది. అర్ధరాత్రి వరకూ సాగిన చర్చలు కొలిక్కి రాకపోవడం, కొన్నిటికి మాత్రమే హామీ ఇచ్చి, తక్కిన స్థానాలను పెండింగ్‌లో ఉంచడంతో ఆయా నియోజకవర్గాల్లో టిక్కెట్లు ఆశిస్తున్న వారంతా ఆందోళన చెందుతున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం : రానున్న ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఆపార్టీ అధినేత చంద్రబాబు జిల్లా నేతలకు కబురు పంపారు. దీంతో జిల్లాలోని 14 నియోజకవర్గాలకు చెందిన నేతలు బుధవారం ఉదయం 9 గంటలకే అమరావతిలో సీఎం నివాసం ఉంటున్న ఉండవల్లికి చేరుకున్నారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో మంత్రి జవహర్ సమక్షంలో ప్రత్యేకంగా టెంట్లు వేసి నియోజకవర్గాల వారీగా అభిప్రాయసేకరణ జరిపారు. ఆరు స్థానాల్లో అభ్యర్థులు ఖరారు! జిల్లాలోని 14 స్థానాల్లో హిందూపురం మినహా తక్కిన 13 స్థానాల్లో 7 స్థానాలకు మాత్రమే అభిప్రాయ సేకరణ జరిగింది. దీంతో అభిప్రాయసేకరణ జరగని 6 నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారైనట్లే అని మంత్రులు సూచన ప్రాయంగా నాయకులు, కార్యకర్తలకు తెలిపారు. వీటిలో తాడిపత్రి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తనయుడు జేసీ అస్మిత్‌రెడ్డి, పెనుకొండ నుంచి టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, రాయదుర్గం నుంచి కాలవ శ్రీనివాసులు, ధర్మవరం నుంచి వరదాపురం సూరి, రాప్తాడు నుంచి పరిటాల సునీత టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థులకు బరిలోకి దిగనున్నట్లు తేల్చారు. వీరితోపాటు అనంతపురం ఎంపీ అభ్యర్థిగా జేసీ పవన్ కుమార్‌రెడ్డి పేరును ఖరారు చేసినట్లు తెలిసింది. అధికారిక ప్రకటన చేయకపోయినా వీరే అభ్యర్థులుగా టీడీపీ అధిష్టానం ఆయా నేతలతో పాటు కార్యకర్తలకు సమావేశంలో చెప్పినట్లు తెలిసింది. పెండింగ్‌లో 8 స్థానాలు ప్రకటించిన 6 స్థానాలు మినహా అనంతపురం, గుంతకల్లు, శింగనమల, కళ్యాణదుర్గం, హిందూపురం, మడకశిర, కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. వీటిలో హిందూపురం మినహా తక్కిన 7 స్థానాలకు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే బాగుంటుందని నేతలు, కార్యకర్తల అభిప్రాయాలు సేకరించారు. మొదట కళ్యాణదుర్గం సమీక్ష జరిగింది. ఇందులో అభిప్రాయసేకరణ ప్రారంభం కాగానే ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి వ్యతిరేకవర్గానికి చెందిన రామ్మోహన్‌చౌదరి, మల్లిఖార్జున, నారాయణ, రమేశ్‌తో పాటు పలువురు తీవ్రస్థాయిలో వ్యతిరేకంచారు. చౌదరి అయితే ఓడిపోతారని, అతన్ని మార్చాలని పట్టుబట్టారు. దీంతో ఎమ్మెల్యే వర్గీయులు కూడా వ్యతిరేకవర్గంపై మాటల దాడికి దిగారు. పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో అక్కడంతా గందరగోళంగా మారింది. దీంతో ఎవరి అభిప్రాయాన్ని వారు కాగితాలపై రాసి ఇవ్వాలని కోరారు. ప్రభాకర్‌చౌదరికి టిక్కెట్ ఇవ్వొద్దు కళ్యాణదుర్గం టికెట్ విషయంలో జరిగిన రభసను దృష్టిలో ఉంచుకుని అనంతపురం నియోజకవర్గంపై అభిప్రాయ సేకరణ ప్రారంభం కాగానే... అభ్యర్థిత్వంపై ఎవరు ఏమీ మాట్లాడొద్దని, అభిప్రాయాలు కాగితాల్లో రాసివ్వాలని మంత్రి దేవినేని చెప్పారు. ప్రభాకర్ చౌదరి వర్గీయులకు 63 మంది అక్కడకు వచ్చేందుకు అనుమతిచ్చారు. జకీవుల్లా, జయరాం వర్గీయులను 20 మందినే అనుమతించారు. దీంతో అభిప్రాయాన్ని చెప్పకుండా చౌదరి వ్యతిరేకవర్గం సభను బాయ్‌కాట్ చేసి బయటకు వచ్చేశారు. తర్వాత పుట్టపర్తి నియోజకవర్గం సమావేశం నిర్వహించారు. మంత్రి పల్లె రఘునాథరెడ్డికి టిక్కెట్ ఇవ్వొద్దని, నియోజకవర్గంలో పార్టీ బలహీనపడటంతో పాటు కార్యకర్తలను, ద్వితీయ శ్రేణి నేతలను కూడా ‘పల్లె’ నిర్లక్ష్యం చేశారని చంద్రమోహన్ అనే కార్యకర్త మాట్లాడారు. దీంతో పల్లె రఘునాథరెడ్డి గన్‌మన్ చంద్రపై చేయి చేసుకున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే కార్యకర్తలంతా ‘పల్లె’కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పుట్టపర్తి అభిప్రాయ సేకరణలోనూ గందరగోళం జరిగింది. తర్వాత శింగనమల, మడకశిర, కదిరి, గుంతకల్లు నియోజకవర్గాలపై అభిప్రాయసేకరణ చేశారు. వీటితో పాటు హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి సంగతి కూడా తేల్చలేదు. ఇక హిందూపురం నుంచి ఎమ్మెల్యే బాలకృష్ణ సమావేశానికి రాలేదు. హిందూపురం నుంచి బాలకృష్ణే బరిలో ఉండొచ్చని టీడీపీ నేతలు చెబుతున్నారు. పదిరోజుల్లో అభ్యర్థులందరినీ ప్రకటిస్తానన్న చంద్రబాబు అభిప్రాయ సేకరణ తర్వాత 14 నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలనుద్దేశించి చంద్రబాబు ప్రసగించారు. వారం, పదిరోజుల్లోపు ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ ప్రకటిస్తానని చెప్పారు. ఎవరికి టిక్కెట్ వచ్చినా, రాకపోయినా అంతా పార్టీ కోసం పనిచేయాలని చెప్పారు. విభేదాలను పక్కనపెట్టాలని, వాటి సంగతి తాను చూసుకుంటానన్నారు. ఏదిఏమైనా బు«ధవారం సమావేశంతో గుంతకల్లు, శింగనమల స్థానాలకు కచ్చితంగా అభ్యర్థులు మారతారని స్పష్టమైంది. అనంతపురం, కళ్యాణదుర్గం, పుట్టపర్తి నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను మార్చే యోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా బుధవారం టీడీపీలో చేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ గైర్హాజరయ్యారు. గుప్తా చేరికతో ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌కు టిక్కెట్ దక్కదనే ప్రచారం సాగుతోంది. గుప్తాకు గుంతకల్లు టిక్కెట్ దాదాపు ఖాయమని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉండగా తనను కాదని గుప్తాకు టిక్కెట్ ఇస్తే పార్టీలో కొనసాగే ప్రసక్తే లేదని జితేంద్ర పార్టీ నేతలతో తే ల్చిచెప్పినట్లు తెలుస్తోంది. -
సిట్టింగ్‌లకు వ్యతిరేకంగా.. అసంతృప్తుల పోరు..
సాక్షి, అమరావతి: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు టీడీపీ అధిష్టానానికి మింగుడు పడటం లేదు. ఓ వైపు డేటా చోరీ ఆరోపణలు.. మరోవైపు సొంత పార్టీలో విభేదాలు టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మెజారిటీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వద్దంటూ అసంతృప్త నేతలు ఆందోళనకు దిగుతుండటంతో.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వారిని బుజ్జగించే పనిలో పడ్డారు. ఇందుకోసం అమరావతిలో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయినా కూడా నేతలు తమ అసంతృప్తిని చంద్రబాబు వద్ద గట్టిగానే వినిపిస్తున్నట్టుగా సమాచారం. తాజాగా పాయకరావుపేట, అనంతపురంలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలు తిరుగుబావుట ఎగరవేశారు. అనితను ఓడిస్తామని హెచ్చరిక.. పాయకరావుపేట ఎమ్మెల్యే అనితకు వ్యతిరేకంగా భారీ సంఖ్యలో అసమ్మతి నేతలు తమ గళాన్ని వినిపిస్తున్నారు. అనిత అవినీతిపై నియోజకవర్గం నేతలు రెండు పేజీల లేఖను సిద్ధం చేశారు. ఈ లేఖను వారు చంద్రబాబు నాయుడుకు అందజేయనున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో అనిత పాదయాత్రను అడ్డుకున్న నేతలు.. ఆమెకు వ్యతిరేకంగా సభలు, సమావేశాలు ఏర్పాటు చేశారు. అనితకు ఎమ్మెల్యే సీటు ఇస్తే కచ్చితంగా ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు. పాయకరావుపేట టీడీపీ సమీక్షా సమావేశంలో అనిత అవినీతిపై నిలదీయడానికి అసంతృప్త నేతలు సిద్దమవుతున్నారు. టీడీపీకి రాజీనామా యోచనలో మాజీ ఎంపీ.. సాక్షి, అనంతపురం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనంపురం ఎమ్మెల్యే టికెట్ తిరిగి ప్రభాకర్ చౌదరికి ఖరారు చేయడంతో స్థానిక టీడీపీ అసమ్మతి జ్వాలలు భగ్గుమన్నాయి. ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వడాన్ని మాజీ ఎంపీ సైఫుల్లా వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అమరావతి నుంచి అనంతపురం బయలుదేరిన సైఫుల్లా వర్గం నేతలు.. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమయ్యారు. సైఫుల్లాతో పాటు, మాజీ మున్సిపల్ చైర్మన్ నూరమ్ మహ్మద్, పార్టీ సీనియర్ నాయకులు జయరాం నాయుడు, జకీవుల్లా, లక్ష్మీపతి, 15 మంది కార్పొరేటర్లు టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. -
‘ఆయనకు టిక్కెట్ ఇవ్వొద్దు.. ఇస్తే ఓడిస్తాం’
సాక్షి,అనంతపురం : అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి చేదు అనుభవం ఎదురైంది. ఆయనపై అసమ్మతి వర్గం భగ్గుమంది. నగర టీడీపీ మాజీ అధ్యక్షుడు జయరాం నాయుడు ఆధ్వర్యంలో అసమ్మతి నేతల సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో అసమ్మతి వర్గం ఆయనపై తీవ్ర విమర్శలు చేసింది. వచ్చే ఎన్నికల్లో ప్రభాకర్ చౌదరికి టిక్కెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. ఒకవేళ ఇస్తే కచ్చితంగా ఓడిస్తామని హెచ్చరించారు. ప్రభాకర్ చౌదరి ఏకపక్ష వైఖరి వల్లే టీడీపీ సీనియర్ నేతలు నడిరోడ్డున పడ్డారని ఆరోపించారు. ఆయన ఇప్పటికే అక్రమ కేసులు ఎదుర్కొంటున్నారు, ఒక్కో కార్పోరేటర్ టికెట్ కోసం పది లక్షల చొప్పున వసూలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే బాగోతంపై త్వరలోనే సీఎంకు ఫిర్యాదు చేస్తామన్నారు. -
జేసీ అక్రమాల చిట్టా నా దగ్గర ఉంది : టీడీపీ ఎమ్మెల్యే
-
జేసీ అక్రమాల చిట్టా నా దగ్గర ఉంది : టీడీపీ ఎమ్మెల్యే
సాక్షి, అనంతపురం : ఎన్నికల వేళ అనంతపురం జిల్లాలో టీడీపీ నాయకుల వర్గపోరు మరోసారి రచ్చకెక్కింది. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఫైర్ అయ్యారు. తనపై అవాకులు, చవాకులు పేలితే సహించేది లేదని స్పష్టం చేశారు. జేసీ దివాకర్ రెడ్డి అక్రమాల చిట్టా తన వద్ద ఉందని హెచ్చరించారు. అనంతపురం లలితా కళా పరిషత్‌లో ఆదివారం జరిగిన బీసీ సదస్సులో ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ.. రాంనగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభానికి జేసీ సిద్ధమవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంట్రాక్టర్‌గా పనులు చేసినంత మాత్రానా అన్నిహక్కులు వస్తాయా? అని ప్రశ్నించారు. పీస్ మెమొరియల్ హాల్‌కు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరు పెడితే జేసీ దివాకర్ రెడ్డికి ఎందుకంత కడుపు మంట? అని మండిపడ్డారు. తన ఓపికను పరీక్షించొద్దని జేసీపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానన్నారు. ఇక అనంతపురంలో ప్రారంభానికి సిద్దంగా ఉన్న రాంనగర్ బ్రిడ్జి విషయంలోనే ఈ ఇద్దరి నేతల మధ్య వివాదం నెలకొంది. ఈ బ్రిడ్జిని ప్రారంభించేందుకు జేసీ సిద్దమవుతున్నారని ప్రభాకర్ చౌదరి అనుమానిస్తున్నారు. ఈనేపథ్యంలోనే జేసీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా ఈ ఇద్దరి నేతల మధ్య మాటల వార్ నడిచింది. -
‘జన్మభూమి’ లో టీడీపీ ఎమ్మెల్యే అత్యుత్సాహం
సాక్షి, అనంతపురం : జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అత్యుత్సాహన్ని ప్రదర్శించారు. సమస్యలపై నిలదీసిన వైఎస్సార్సీపీ కార్పొరేటర్ శ్రీదేవి, ఆమె భర్త విజయభాస్కర్‌రెడ్డిపై అట్రాసిటీ కేసు పెట్టి కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారు. జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ నేతల ఏకపక్ష వైఖరిపై కార్పొరేటర్ శ్రీదేవి, ఆమె భర్త నిలదీశారు. దీంతో టీడీపీ నేతలు శ్రీదేవి, విజయభాస్కర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే, టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు శ్రీదేవి, విజయభాస్కర్‌రెడ్డిపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కవ్వింపు చర్యలకు పాల్పడి, దూషించిన టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. -
టీడీపీ ఎమ్మెల్యే వర్గీయుల దౌర్జన్యం
సాక్షి, అనంతపురం: నగరంలో టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులు దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్ సీపీ చేపట్టిన రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. వివరాల్లోకి వెళ్తే.. 46వ డివిజన్లో వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో సాగుతున్న రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలివచ్చారు. అయితే దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ప్రభాకర్ చౌదరి అనుచరులు, టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. అయిన కూడా వైఎస్సార్ సీపీ శ్రేణులు సంయమనంతో వ్యవహరించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకోవడంతో టీడీపీ కార్యకర్తలు జారుకున్నారు. శారదనగర్‌లో వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలను కూడా ప్రభాకర్ చౌదరి వర్గీయులు చించివేశారు. దీనిపై మైనార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభాకర్ చౌదరి అభద్రతా భావంతో ఉన్నారని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ సీపీకి రోజురోజుకూ ప్రజా ఆదరణ పెరుగుతుందని తెలిపారు. రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజా సమస్యలు తమ దృష్టికి వస్తున్నాయన్నారు. టీడీపీ నేతల అవినీతిపై జనం ఆగ్రహంగా ఉన్నారని.. బహిరంగ చర్చకు రాకుండా ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూప పారిపోయారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ సీపీ కార్యక్రమాలను అడ్డుకోవాలని చూస్తే ప్రజా ఆగ్రహం తప్పదని హెచ్చరించారు. -
జేసీపై మండిపడిన టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి
-
‘నిరూపిస్తే నా తల నరుక్కుంటా’
సాక్షి, అనంతపురం: ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది టీడీపీలో వర్గ విభేదాలు రోజు రోజుకు బయట పడుతున్నాయి. టీడపీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఎంపీ జేసీ దివారక్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... జేసీకి వయస్సు మీద పడింది కానీ బుద్ధి రాలేదని అన్నారు. జేసీకి సభ్యత, సంస్కారం అసలుకు లేవు, అందుకే నీ అమ్మా, అబ్బా అంటూ తిడుతున్నారని ఆరోపించారు. జిల్లాలో దివాకర్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. జిల్లాలో ఆధికారులను, మీడియాను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. తాను తలుచుకుంటే జేసీ కంటే ఎక్కువ తిట్టగలను, కానీ సంస్కారం అడ్డొస్తోందని అన్నారు. నిరుపిస్తే తల నరుక్కుంటా... జేసీ నీకు దమ్ము, దైర్యం ఉంటే తాను అవినీతికి పాల్పడినట్లు నిరుపిస్తే తల నరికేసుకుంటానని ప్రభాకర్ చౌదరి అన్నారు. ఎంపీ దివాకర్ రెడ్డి అవినీతిలో పీహెచ్డీ చేశారని విమర్శించారు. అనంతపురం జిల్లా అభివృద్ధికి జేసీనే అడ్డుపడుతున్నారని వాఖ్యానించారు. తాను ఏ తప్పు చేయలేదని, గన్ మెన్లు లేకుండా నేను తిరిగేందుకు నేను సిద్ధం మీరు సిద్ధామా అని సవాల్ చేశారు. నా సహనానికి ఓ హద్దు ఉంది, నా సహనాన్ని పరీక్షించొదని పరీక్షిస్తే ఖబడ్దారు అని హెచ్చరించారు. జేసీ దివాకర్ రెడ్డి ఆగడాలకు తాను వ్యతిరేకంగా పోరాటం చేస్తానని అన్నారు. జేసీ తాటాకు చప్పళ్లకు బెదిరేది లేదని, దివాకర్ రెడ్డి వైఖరి దొంగే దొంగ అన్నట్లుగా వ్యహరిస్తున్నారని వాఖ్యానించారు. అనంతపురం జిల్లాలో జేసీ దౌర్జన్యాలను సహించేది లేదు. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మానసిక స్థితిపై అనుమానాలు ఉన్నాయి. మేమంతా కలసి జేసీని గెలిపిస్తే తాను మమ్మల్నే బెదిరిస్తున్నారు. ఎంపీ జేసీ వల్ల టీడీపీకి చాలా సష్టం జరుగుతుందని ప్రభాకర్ చౌదరి అన్నారు. -
అభివృద్ధికి వారిద్దరే ఆటంకం
అనంతపురం సెంట్రల్: ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, మేయర్ స్వరూప వల్ల టీడీపీకి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెడ్డపేరు వస్తోందని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం నగరంలోని ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. నాలుగేళ్లలో నగరంలో జరిగిన అభివృద్ధి శూన్యమని, అంతా అవినీతి, అక్రమాలేనని ధ్వజమెత్తారు. కోర్టురోడ్డులోని చారిత్రాత్మక భవనం పీస్ మెమోరియల్ హాల్ ఆధునికీకరణపై అనేక విమర్శలు వస్తున్నాయన్నారు. çపురాతన భవన స్థలాలను అద్దెకు ఇచ్చుకున్నారని, ఇందులో ఎవరెవరికీ ఎంత వాటాలున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. అయితే ఆయన భారతం రాసినట్లు నాలుగు పేజీల లేఖ రాస్తూ వివరణ పంపారని వివరించారు. జాతీయ రహదారిలో ఓ నేత రెండు సెంట్ల స్థలం రాయించుకుని.. ఎనిమిది సెంట్లను అక్రమించుకున్నాడని ఆరోపించారు. వీరు చేస్తున్న అవినీతి, అక్రమాలతో పార్టీకి చెడ్డపేరు వస్తోందని, త్వరలోనే ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని ప్రకటించారు. అనంతపురం నగర అభివృద్ధిని వారిద్దరూ అడుగడుగునా అడ్డుకుంటున్నారన్నారు. నగరంలో ప్లాస్టిక్ నిషేధించాలని తాను తీవ్రంగా శ్రమించగా.. దీన్ని కూడా రాజకీయం చేసి అడ్డుకున్నారని బాధపడ్డారు. అందువల్లే మరువ వంకను గతేడాది పరిశుభ్రం చేసినా.. మళ్లీ యథావిధిగా ప్లాస్టిక్‌తో నిండిపోయిందన్నారు. అలాగే రోడ్ల వెడల్పు విషయంలో కొంతమంది నుంచి భారీ మొత్తంలో డబ్బు దండుకొని కోర్టును ఆశ్రయించేలా పురమాయించారన్నారు. అంత వెడల్పు అవసరమా అంటూ రాంనగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని కూడా నిర్మించకుండా అడ్డుపుల్ల వేయడానికి యత్నించారన్నారు. పేరుకు ‘అవే’ పేరుతో నీతులు చెబుతున్నారని... అవే లేదు.. ఏం లేదంటూ చిందులు తొక్కారు. ఇంటిపైన రాళ్లు పెట్టుకున్న నీచ సంస్కృతిని ఆయనదంటూ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదిరి తీరును తూర్పారబట్టారు. వీరు చేస్తున్న అవినీతి, అక్రమాలపై చర్యలు తీసుకునే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదన్నారు. కనీసం మీడియానైనా బాధ్యతగా వీరి అక్రమాలు, అవినీతిని ప్రజలకు వివరించాలన్నారు. ఇక జిల్లా పోలీసులకు చేవ లేకుండా పోతోందని ఎంపీ జేసీ అన్నారు. పోలీసుల తీరు వల్లే శాంతి భద్రతలు కాపాడటం ఇబ్బందిగా మారిందన్నారు. ఫ్రెండ్లీ పోలీసులంటూ నేరస్తులకు కూడా రాచమర్యాదలు చేస్తున్న పరిస్థితి ఉందని ఆరోపించారు.