prasanna
-
అశ్విన్, భజ్జీ కాదు!.. టీమిండియా ఆల్‌టైమ్ అత్యుత్తమ స్పిన్నర్లు వీరే!
టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నాడు. భారత్- ఆసీస్ మధ్య జరుగుతున్న బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో రవిశాస్త్రికి ఓ ప్రశ్న ఎదురైంది. భారత క్రికెట్ జట్టులోని ముగ్గురు అత్యుత్తమ స్పిన్నర్ల పేర్లు చెప్పాలని కోరగా.. రవిశాస్త్రి ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.కాగా ప్రస్తుతం టీమిండియా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు రవిచంద్రన్ అశ్విన్. మరోవైపు.. మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సైతం 103 టెస్టుల్లో 417 వికెట్లు పడగొట్టి లెజెండరీ బౌలర్‌గా పేరు సంపాదించాడు.ఇక అశ్విన్‌తో పాటు జట్టులో కొనసాగుతున్న మరో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా 319(77 టెస్టుల్లో) వికెట్లు పడగొట్టి సత్తా చాటుతున్నాడు.అనిల్ కుంబ్లే ప్రమాదకారిఅయితే, రవిశాస్త్రి ఈ ముగ్గురిలో ఒక్కరి పేరు కూడా చెప్పకపోవడం విశేషం. తన దృష్టిలో బిషన్ సింగ్ బేడి, ఎర్రాపల్లి ప్రసన్న, అనిల్ కుంబ్లే టీమిండియా అత్యుత్తమ స్పిన్నర్లు అని పేర్కొన్నాడు. ఈ మేరకు ఫాక్స్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఉపఖండ పిచ్‌లపై అనిల్ కుంబ్లే ప్రమాదకారి. అత్యంత దూకుడుగా ఉంటాడు. అయితే, కేవలం ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటిన స్పిన్నర్. 600కు పైగా టెస్టు వికెట్లు తీయడం అంటే మాటలు కాదు.అతడు బంతితో అద్భుతాలు చేయగలడుఇక ప్రసన్న. అతడి కెరీర్ చరమాంకంలో ఉన్నపటి పరిస్థితులను పరిశీలిస్తే.. అతడు జట్టు మేనేజర్‌గా ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చాడు. నెట్స్‌లో బౌలింగ్ కూడా చేశాడు. అతడు బంతితో అద్భుతాలు చేయగలడు. బాల్‌ను రిలీజ్ చేసే విషయంలో ఎప్పుడు ఏం చేయాలో అతడికి బాగా తెలుసు.ఆయన బౌలింగ్ యాక్షన్ సూపర్వీరిద్దరు నా లిస్టులో టాప్-3లో ఉంటే.. టాప్-1లో బిషన్ సింగ్ బేడి ఉంటాడు. ఆయన బౌలింగ్ యాక్షన్ గురించి ఎంత చెప్పినా తక్కువే’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. తన అభిప్రాయం ప్రకారం బిషన్ బేడి, ప్రసన్న, కుంబ్లే అత్యుత్తమ భారత స్పిన్నర్లు అని పేర్కొన్నాడు. కాగా బిషన్ బేడీ తన కెరీర్లో 67 టెస్టుల్లో 266 వికెట్లు పడగొట్టగా.. ప్రసన్న 49 టెస్టుల్లో 189 వికెట్లు తీశాడు. మరోవైపు.. కుంబ్లే 132 టెస్టుల్లో 619 వికెట్లు కూల్చి టెస్టుల్లో భారత లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. ఇక 536 వికెట్లతో అశూ రెండోస్థానంలో ఉన్నాడుచదవండి: IPL 2025: ఆర్సీబీ కెప్టెన్ అతడే! -
కన్నతల్లిని కాదని.. ప్రియుడి వెంట నడిచి..
రొంపిచెర్ల: ప్రేమ వివాహం వద్దని ప్రియుడు కట్టిన తాళిబొట్టును తెంచినా ఆ యువతి కన్నతల్లిని ఎదిరించి ప్రేమికుడి వెంట వెళ్లిన సంఘటన రొంపిచెర్ల మండలంలో మంగళవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. గానుగచింతకు చెందిన యువకుడు రెడ్డెప్ప (21), తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన చిట్టి ప్రసన్న(19) అన్నమ్మయ్య జిల్లా పీలేరులో డిగ్రీ చదువుతున్నారు. వీరిద్దరూ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే చిట్టి ప్రసన్నకు వివాహం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. దీంతో చిట్టి ప్రసన్న ఇంటి నుంచి మంగళవారం ఉదయం రొంపిచెర్లకు చేరుకుని జరిగిన విషయం ప్రియుడు రెడ్డెప్పకు చెప్పింది. దీంతో వారిద్దరూ కట్టకింద శివాలయంలో వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న చిట్టి ప్రసన్న తల్లి కుమారై మెడలో ఉన్న తాళిబొట్టును తెచ్చి ఇంటికి రావాలని కుమారైను పిలిచింది. అయితే దీనికి కుమారై అంగీకరించలేదు. దీంతో ఈ పంచాయితీ రొంపిచెర్ల పోలీసుస్టేషన్‌కు చేరింది. ఎస్ఐ సుబ్బారెడ్డి ప్రేమికులను విచారించారు. పోలీసుల విచారణలో ప్రేమికురాలు తన ఇష్ట ప్రకారమే వివాహం చేసుకున్నాని తెలిపింది. తాను మేజర్‌నని తనకు తన భర్త కావాలని తెగేసి చెప్పింది. దీంతో పోటీసులు చేసేదేమీ లేక వారిని కలసి ఉండమని చెప్పారు. దీంతో ఇరువురు గానుగచింతకు చేరుకున్నారు. -
టాలీవుడ్ యంగ్ హీరో సస్పెన్స్ థ్రిల్లర్.. సాంగ్ రిలీజ్!
ఇటీవల అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీతో ప్రేక్షకులను అలరించిన సుహాస్ హీరో మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సుహాస్, పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం ప్రసన్న వదనం. ఈ సినిమాకు అర్జున్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని జేఎస్ మణికంఠ, టీఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇవాళ ఉగాది శుభ సందర్భంగా ఈ చిత్రంలోని 'నిన్నా మొన్న' అనే సాంగ్‌ను విడుదల చేశారు. విజయ్ బుల్గానిన్ ఈ పాటని ఆకట్టుకునే లవ్లీ మెలోడీగా కంపోజ్ చేశారు. కిట్టు విస్సాప్రగడ అందించిన సాహిత్యం మరో ఆకర్షణగా నిలిచింది. ఈ సాంగ్‌లో సుహాస్, పాయల్ కెమిస్ట్రీతో ఆకట్టుకున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం మే 3న థియేటర్లలో సందడి చేయనుంది. -
ఎందరు ఏమన్నా.. ఎస్ఐ కాబోతున్న భాను!
కరుడు కట్టిన ‘ఖాకీవనం’లోకి అడుగుపెట్టడానికి చాలా మంది యువకులు వెనకడుగు వేస్తారు. కేసులు, కోర్టులు, నేరస్తులతో బెంబేలెత్తిపోతారు. అయితే, ఆత్మవిశ్వాసమే వెన్నుదన్నుగా, అకుంఠిత దీక్షతో భానుప్రసన్న ధైర్యంగా అడుగుపెడుతోంది. ఇటీవల వెలువడిన ఫలితాల్లో ర్యాంకు సాధించి పోలీసు డిపార్ట్మెంట్లో చేరాలన్న చిన్ననాటి కలను సాకారం చేసుకుంది. మార్టూరు: ‘ఆడపిల్లవు నీవు ఎస్ఐ అవుతావా ? ఎందుకమ్మా పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేసుకోక ! ’ అంటూ అయిన వారి హేళన మాటల్ని ఆమె చాలెంజ్‌గా తీసుకుంది. అనుకున్నది సాధించింది. విజయానికి అడ్డదారులు, దొడ్డిదారులు ఉండవని నిరూపించింది. అకుంఠిత దీక్ష, పట్టుదలలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చని నేటి తరం యువతకు ఆదర్శంగా నిలిచింది బాపట్ల జిల్లా మార్టూరు మండలం జొన్నతాళి గ్రామానికి చెందిన శివరాత్రి భాను ప్రసన్న. స్థానిక బీసీ కాలనీకి చెందిన శివరాత్రి శ్రీనివాసరావు, గంగమ్మ దంపతులు తమకున్న ఒకటిన్నర ఎకరా వ్యవసాయ భూమి సాగు చేసుకుంటూ చిన్నపాటి బడ్డీ కొట్టును నడుపుకుంటున్నారు. ఇద్దరు కుమార్తెలను చదివించుకున్నారు. పెద్ద కుమార్తె భాను ప్రసన్న జొన్నతాళి గ్రామంలోని ప్రభుత్వ యూపీ పాఠశాలలో ఏడో తరగతి వరకు చదివి, మార్టూరు కాకతీయ విద్యాసంస్థలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. తరువాత నర్సరావుపేట కృష్ణవేణి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ నిమిత్తం చేరింది. పోలీసు డిపార్ట్మెంట్లో ఉద్యోగం సాధించాలనే చిన్ననాటి కల సాకారం కోసం ఇంజినీరింగ్‌లో ఉన్నప్పుడే కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. బీటెక్ పూర్తి చేశాక లక్ష్యాన్ని మరింత విస్తృత పరచుకుంది. ఎస్ఐ కావాలనే తలంపుతో ప్రయత్నాలు ప్రారంభించింది. పెళ్లి తన కెరీర్‌కు అడ్డంకిగా మారకూడదని భావించి తల్లిదండ్రులను ఒప్పించింది. చెల్లెలు కోమలికి ముందుగా వివాహం జరిపించింది భాను ప్రసన్న. మగరాయుడులా ప్యాంటు, టీషర్టు వేసుకుని పోలీసు అవుతుందంటా అనే ఇరుగు పొరుగు వారి మాటల్ని ఆమె పట్టించుకోలేదు. కూతురుకు బాసటగా శ్రీనివాసరావు నిలిచాడు. ఆయన నమ్మకం, పట్టుదలను సాకారం చేస్తూ భానుప్రసన్న మొక్కవోని దీక్షతో ఎస్ఐ పోటీ పరీక్షలో విజయం సాధించింది. ఇటీవల వెలువడిన ఫలితాల్లో మెరుగైన ర్యాంకుతో ఉద్యోగం సాధించి తానేమిటో నిరూపించుకుంది. తమ గ్రామానికి చెందిన ఓ యువతి ఎస్ఐగా ఎంపిక కావడంపై గ్రామస్తులంతా ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తుడడం విశేషం. ఎస్ఐతో సరిపెట్టుకోను ఓ పల్లెటూరుకు చెందిన నేను ఎస్ఐగా ఎంపికయ్యే దాకా జరిగిన ప్రయాణంలో కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉంది. ఈ తరం ఆడపిల్లలు ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏమీ ఉండబోదని ప్రయత్నపూర్వకంగా తెలుసుకున్నా. నిజాయతీ కలిగిన పోలీసు అధికారిగా పని చేస్తూ మహిళలు ఎదుర్కొనే సమస్యల నుంచి వారికి అండగా ఉంటా. వృత్తిపరంగా మరింతగా ఎదగడం కోసం ప్రస్తుతం కాకినాడలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా. నా వెనుక సూటిపోటి మాటలు అన్నవారే నేడు అభినందిస్తుంటే ప్రస్తుతం నాకు ఎంతో అనందంగా ఉంది. నా గ్రామానికీ, నా కుటుంబానికీ మంచి పేరు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తా. – భాను ప్రసన్న -
ఇడ్లీ హై జపానీ... టేస్ట్ హై హిందుస్థానీ
‘దేశం కాని దేశంలో మన దేశ వంటకాలను చూస్తే ప్రాణం లేచి రావడమే కాదు బ్రహ్మాండంగా భరతనాట్యం కూడా చేస్తుంది’ అంటున్నాడు ప్రసన్న కార్తిక్. ఈ ట్విట్టర్ ఖాతాదారుడు ఏదో పని మీద జపాన్‌లోని క్యోటో నగరానికి వెళ్లాడు. అక్కడ కనిపించిన ‘తడ్క’ అనే రెస్టారెంట్‌ను చూసి ‘కలయా? నిజమా? అనుకున్నాడు. ఈ రెస్టారెంట్ దక్షిణ భారతీయ వంటకాలకు ప్రసిద్ధి. దోశ, ఇడ్లీలకు ఇక్కడ మంచి డిమాండ్ ఉంది. అయితే ఈ రెస్టారెంట్ నిర్వాహకులు భారతీయులు మాత్రం కాదు... జపానీయులే. వీరు ప్రతి ఆరునెలలకు ఒకసారి చెన్నైకి వచ్చి కొత్త వంటకాలు నేర్చుకొని వెళుతుంటారు. ‘దోశ అండ్ ఇడ్లీ అన్బిలీవబుల్ అథెంటిక్. రెస్టారెంట్లో భారతీయుల కంటే జపాన్ వాళ్లే ఎక్కువమంది కనిపించారు. జపాన్‌లో తినడానికి చాప్–స్టిక్స్ ఉపయోగిస్తారు. అయితే ఈ రెస్టారెంట్ వాళ్లు మాత్రం చేతితో తినడంలోని మజాను బాగానే ప్రమోట్ చేసినట్లు ఉన్నారు. ఎవరూ చాప్–స్టిక్స్‌ను ఉపయోగించడం లేదు’ అని ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు కార్తిక్. -
శోభ.. 'నిజాయితీ' కి మారుపేరు..!
మహబూబ్‌నగర్: ఆర్టీసీ బస్సులో దొరికిన బంగారు ఆభరణాల పర్సును బాధిత మహిళకు అందజేసి నిజాయితీ చాటుకుంది ఓ ప్రయాణికురాలు. వివరాల్లోకి వెళ్తే.. ఉప్పునుంతల మండలం కాంసానిపల్లికి చెందిన నెల్లోజు ప్రసన్న ఆదివారం ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి కల్వకుర్తి నుంచి ఉప్పునుంతల వరకు అచ్చంపేట ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో ఎక్కింది. ఉప్పునుంతలలో దిగి గ్రామానికి వెళ్లి హ్యాండ్‌బ్యాగ్‌లో చూడగా బంగారు ఆభరణాలు (సుమారు రూ.3 లక్షల విలువ)న్న పర్సు కనిపించలేదు. అదే బస్సులో ప్రయాణించిన సదగోడుకు చెందిన శోభకు బస్సులోనే ఆభరణాల పర్సు దొరకగా కండక్టర్ నారాయణమ్మకు అందజేసింది. సోమవారం అచ్చంపేట డిపో ఆవరణలో బాధితురాలు ప్రసన్నకు పర్సును అందజేసి నిజాయితీని చాటుకుంది. -
అవమానాలు దిగమింగి.. గిరిజన లిపిని ఆవిష్కరించా
కృష్ణా జిల్లా సీతానగరం స్వగ్రామమైనప్పటికీ తండ్రి రైల్వేలో ఉద్యోగ రీత్యా పశ్చిమ బెంగాల్, బిహార్లలో పెరిగా. చదువు కొనే వయసు వచ్చే నాటికి ఆంధ్రప్రదేశ్‌లో స్థిరపడ్డాం. తాత స్కూలు హెడ్మాస్టర్ కావడంతో నాకు కూడా విద్యాబోధన పట్ల ఆసక్తి పెరిగింది. గిరిజనులు ఉన్నత విద్య అభ్యసించాలంటే ఎన్నో వ్యయప్రయాసలు, అవమానాలు పడాల్సి వచ్చేది. వాటిని అధిగమిస్తూ ఉన్నత విద్య పూర్తిచేశా. సత్తుపాటి ప్రసన్న శ్రీ ఆంధ్రా విశ్వవిద్యాలయంలోని బోర్డ్ ఆఫ్ స్టడీస్ ప్రొఫెసర్ – చైర్‌పర్సన్‌గా పనిచేస్తున్నారు. మైనారిటీ గిరిజన భాషలను సంరక్షణ, గిరిజన భాషలకు నూతన రచనా విధానాలు అభివృద్ధి చేస్తుంటారు. భగత, గదభ, కొలామి, కొండ దొర మొదలైన 19 గిరిజన భాషలకు లిపి (అక్షరాలను) రూపొందించిన ప్రపంచంలోనే తొలి మహిళ. ఆమె సాహిత్య రచనలలో ’ఈస్ట్ అండ్ వెస్ట్ పోస్ట్ మాడర్న్ లిటరేచర్‌లో మహిళల సైకోడైనమిక్స్’ వంటి రచనలు ఉన్నాయి. ’షేడ్స్ ఆఫ్ సైలెన్స్’, ’ఉమెన్ ఇన్ శశి దేశ్‌పాండే నవల – ఒక అధ్యయనం,’ రచించారు. వరల్డ్ అట్లాస్ ఆఫ్ ఎన్డేంజర్డ్ ఆల్ఫాబెట్స్, యూఎస్ఏ (2019)లో ప్రదర్శించబడిన తొలి భారతీయ, ఆసియా మహిళ. మైనారిటీ గిరిజన భాషలను పరిరక్షణ నిమిత్తం చేసిన విశేష కృషికి నారీ శక్తి పురస్కారం లభించింది. ‘గిరిజనురాలివి అందులోనూ మహిళవి.. ఏం సాధిద్దామని, ఎవరిని ఉద్ధరిద్దామని బయల్దేరావు.. నీకు ఇంక వేరే పనిలేదా.. వంటి అనేక అవహేళనలు, అవమానాలు దిగమింగి గిరిజనుల కోసం లిపిని రూపొందించా’ అంటున్నారు నారీశక్తి–2021 పురస్కార గ్రహీత సత్తుపాటి ప్రసన్నశ్రీ. ఇలాంటి అవమానాలు ఎన్ని ఎదురవుతున్నా తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్తానని ధీమాగా చెబుతున్నారు. మంగళవారం రాష్ట్రపతి రామ్నాద్ కోవింద్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకొన్న సందర్భంగా ఆమె సాక్షితో ముచ్చటించారు. గిరిజనుల సంక్షేమం, విద్య కోసం చేసిన ప్రస్థానం ఆమె మాటల్లోనే... ‘‘గిరిజనుల కోసం చేస్తున్న కృషికి బూస్టప్ డోస్‌లా నారీశక్తి పురస్కారం దక్కింది. సుమారు మూడున్నర దశాబ్దాలుగా గిరిజనుల కోసం చేసిన ఒంటరి పోరాటంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నా. ఎన్ని అవమానాలు ఎదురైనా విద్య ఒక్కటే శాశ్వతమని నమ్మి నాలాగా ఇతర గిరిజనులు ఇబ్బందులు పడరాదనే ఉద్దేశ్యంతో పట్టుదలతో ముందుకెళ్లా. నాన్న నా చదువుకోసం ఎన్నో త్యాగాలు చేస్తే, భర్త నా ఆశయ సాధన కోసం ఎంతో ఆసరా ఇచ్చారు. ఆయన ప్రోత్సాహంతో కొండ ప్రాంతాల్లోని గిరిజనులను కలిసి వారికి చదువు పట్ల ఆసక్తి కలిగించా. ఈ క్రమంలో సెలవు రోజుల్లో ఉదయానికే విశాఖపట్నం చేరుకొని రైల్వేస్టేషన్లోనే కొండప్రాంతాల వారి మాదిరి దుస్తులు ధరించి అరకు గిరిజన ప్రాంతాలకు వెళ్లేదాన్ని. ఆంధ్ర యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన తర్వాత గిరిజన ప్రాంతాలకు వెళ్లడానికి మరింత సులభమైంది. తెలిసిన వారు ‘ఇదంతా ఎందుకమ్మా పనిపాటా లేదా’ అని హేళన చేసేవారు. ‘నిన్ను ప్రోత్సహిస్తే మాకు ఎన్ని ఓట్లు పడతాయి?’ అని అడిగిన రాజకీయ నేతలు కూడా ఉన్నారు. అవమానాలకు, అవహేళనలకు తట్టుకోలేక వెనక్కి తగ్గి ఉంటే 30కిపైగా దేశాల్లో విజిటింగ్ ప్రొఫెసర్ అయ్యేదాన్ని కాదు. 106 రిసెర్చి ఆర్టికల్స్, 18 ఎంఫిల్స్, 32 పీహెచ్‌డీలు 32 పుస్తకాలు రచించాను. అంతర్జాతీయంగా అనేక పరిశోధనలు చేశా. అల్జీరియా, అమెరికా ఫ్రాన్స్, ఇథియోపియా తదితర దేశాల్లో నా పొయిట్రీని పాఠ్యాంశంగా పెట్టుకున్నారు. సమానత్వం కోసం మాట్లాడేవారు గిరిజనుల సమానత్వం కోసం కూడా అదేస్థాయిలో పోరాడాలి. నేను రూపొందించిన లిపిని పాఠ్యపుస్తకాలుగా మార్చితే గిరిజనులు మాతృభాషలో విద్యాభ్యాసం చేయొచ్చు. గిరిజన విద్యార్థుల డ్రాపవుట్ సంఖ్య తగ్గించొచ్చు. నూతన విద్యా విధానంలో మాతృభాషలోనే బోధన అని చేర్చారు. భవిష్యత్తులో గిరిజనులకు మాతృభాషలో విద్యాబోధన జరుగుతుందని ఆశిస్తున్నా. ఒకానొక సమయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి నా ప్రయత్నం గురించి చెప్పా. ఎనిమిది భాషల లిపి రూపొందిస్తున్నా అని చెబితే.. అవన్నీ పూర్తిచేసి వస్తే సముచిత గౌరవం దక్కేలా చేస్తానన్నారు. తొలిసారి గిరిజన మహిళకు వైస్ చాన్సలర్ హోదా దక్కేలా చూస్తానంటూ నన్ను ప్రోత్సహించారు. గిరిజనుల్లో కొండ, మైదాన ప్రాంతాల వారి విధానాలు వేర్వేరుగా ఉంటాయి. కొండప్రాంతాలవారు మనల్ని నమ్మితే∙కానీ ఏమీ చేయలేం. వారిని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. వారికి నాగరక సమాజంతో తక్కువ సంబంధం ఉండటం వల్ల వారిలో విద్య పట్ల ఆసక్తి పెంచడానికి కొంత శ్రమించాల్సి వచ్చింది. ప్రస్తుతం సెలవుల సమయంలో ఉత్తరాది నుంచే కాదు క్యూబా, కొరియా, జర్మనీ తదితర విదేశాల నుంచి కూడా యువత వచ్చి గిరిజనులకు చదువు చెబుతున్నారు. గిరిజన లిపిని పాఠ్యాంశాలుగా మార్చితే వారెంతో రుణపడి ఉంటారు. ప్రధాని నరేంద్రమోదీతో సమావేశ సమయంలో ఇదే అంశాన్ని ప్రస్తావించా. సమావేశం అనంతరం ప్రధాని మోదీ స్వయంగా నా దగ్గరకు వచ్చి ఇందాకా ఏదో చెబుతున్నారంటూ ఆసక్తిగా అన్ని విషయాలు విన్నారు. ప్రధాని సిబ్బంది నా ఫోన్ నంబరు కూడా తీసుకున్నారు. ఇదే స్థాయిలో ప్రోత్సాహం ఉండాలని కోరుకుంటున్నా’’ అంటూ సాక్షితో తన భాషా సేవ గురించి వివరించారు ప్రసన్నశ్రీ. – సూర్యప్రకాశ్ కూచిభట్ల, సాక్షి, న్యూఢిల్లీ -
కేవలం 'యాడ్స్'తో స్నేహ దంపతులు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?
స్నేహ..తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ప్రియమైన నీకు చిత్రంతో తెలుగునాట ఎంట్రీ ఇచ్చిన స్నేహ తొలి చిత్రంతోనే బంపర్ హిట్ అందుకుంది. దీంతో తెలుగులో వరుస అవకావాలు ఆమెను వరించాయి. ‘శ్రీ రామదాసు’, ‘సంక్రాంతి’,‘రాధా గోపాలం’ వంటి వరుస విజయాలతో స్నేహ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. మొదట్నుంచి గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ తన అభినయం, చీరకట్టుతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న స్నేహను చాలామంది సౌందర్యతో పోల్చేవారు. ఇక అదే సమయంలో తమిళంలో ఆపర్లు వస్తుండటంతో కోలీవుడ్‌కు వెళ్లిన స్నేహ ఆ తర్వాత టాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పింది. తమిళంలో ‘అచ్చాముందు అచ్చాముందు’ అనే సినిమా షూటింగు సమయంలో హీరో ప్రసన్నతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అలా పెద్దల అంగీకారంతో 2012లో వీరు వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే ఇద్దరూ జంటగా పలు అడ్వర్టైజ్మెంట్లలో మెరిశారు. ఇక స్నేహ-ప్రసన్న జోడీకి ప్రత్యేకంగా అభిమానులున్నారు. దీంతో పలు యాడ్ కంపెనీలు కూడా వీరిని తమ బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకున్నాయి. అలా ఇద్దరూ జోడీగా ఇప్పటికే పలు యాడ్ షూట్లలో నటించారు. కేవలం యూడ్స్ రూపంలోనే వీరు రూ. 3.50కోట్లు సంపాదించినట్లు టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు యాడ్ షూటింగ్‌లోనూ ఎంతో డెడికేషన్‌గా పనిచేస్తారని స్నేహ కపుల్స్‌కు మంచి పేరుంది. దీంతో వీరితో యాడ్స్ తెరకెక్కించేందుకు కంపెనీలు కూడా ఆసక్తిని చూపిస్తాయని సమాచారం. మొత్తానికి స్నేహ-ప్రసన్న దంపతులు అటు సినిమాలతో పాటు యాడ్ షూటింగ్స్‌లతో రెండు చేతులా సంపాదిస్తున్నారు. -
'తలుక్' మనిపించిన మోడల్స్..
-
ఎప్పటికీ ఆనందంగా...
భర్త ప్రసన్న పుట్టినరోజు సందర్భంగా తమ కుమార్తె ఆద్యంత ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు స్నేహ. 2012లో తమిళ నటుడు ప్రసన్న, హీరోయిన్ స్నేహ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 2015లో స్నేహ ఓ బాబుకి జన్మనిచ్చారు. బాబు పేరు విహాన్. ఈ ఏడాది జనవరిలో పాపకు జన్మనిచ్చారు స్నేహ. శుక్రవారం ప్రసన్న పుట్టినరోజుని పురస్కరించుకుని పాప ఆద్యంత ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు స్నేహ. అలాగే ‘‘నా సోల్‌మేట్ (ప్రసన్నని ఉద్దేశించి)కి పుట్టినరోజు శుభాకాంక్షలు. నా జీవితాన్ని ఆనందమయం చేసిన నా లవర్ బాయ్, నా గార్డియన్ ఏంజిల్ తను. మేం ఆనందంగా ఉండాలని దీవిస్తున్న అందరికీ ధన్యవాదాలు. మా జీవితం ఎప్పటికీ ఇలా ఆనందంగా సాగాలని కోరుకుంటున్నాను’’ అని రాసుకొచ్చారు స్నేహ. -
కుమార్తెని పరిచయం చేసిన నటి
కుటుంబ కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు నటి స్నేహ. చెరగని చిరునవ్వుకి కెరాఫ్ అడ్రస్‌గా నిలుస్తారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో కథానాయకిగా రాణించారు. నటిగా ఫుల్ క్రేజ్‌లో వుండగానే నటుడు ప్రసన్నను ప్రేమించి, పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో రెండో సంతానంగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు స్నేహ. పాప పుట్టి ఏడు నెలలకు పైనే అవుతున్నా ఇంతవరకు చిట్టితల్లి ఫోటోలు ఎక్కడా షేర్ చేయలేదు. ఈ క్రమంలో భర్త, నటడు ప్రసన్న 38వ పుట్టిన రోజు సందర్భంగా కుమార్తెను ప్రపంచానికి పరిచయం చేశారు స్నేహ. పాప పేరు ఆద్యంత. తల్లిదండ్రులు, అన్న విహాన్‌తో కలిసి ఉన్న చిన్నారి ఆద్యంత ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు స్నేహ. (చదవండి: స్నేహలోని కొత్త కోణం) ‘హ్యాపీ బర్త్‌డే టూ మై సోల్ మేట్.. మై లవర్ బాయ్.. గార్డియన్ ఏంజిల్.. సూపర్ డాడా. ఈ లడ్డులతో(పిల్లలు) నా జీవితాన్ని అందంగా మలిచినందుకు ధన్యవాదాలు. సదా మనం ఉన్నతంగా ఉండాలని దీవించి.. శుభాకాంక్షలు తెలిపే వారికి ఈ రోజు నా చిట్టితల్లి ఆద్యంతను పరిచయం చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది’ అంటూ కుమార్తె ఫోటోలు షేర్ చేశారు స్నేహ. ప్రస్తుతం ఇవి తెగ వైరలవుతున్నాయి. View this post on Instagram Happy birthday to my soul mate my lover boy my guardian angel 😇 n my super dada. Thanx for making my life beautiful with these laddos. Love you somuch. And very happy to introduce our little laddo #Aadhyantaa to all the lovely people who have always blessed us and wished us the best. @prasanna_actor @mommyshotsbyamrita @perfektmakeover A post shared by Sneha Prasanna (@realactress_sneha) on Aug 27, 2020 at 8:50pm PDT -
టీవీ చూస్తుందని మందలిస్తే..
కొత్తపల్లె (పామూరు): తండ్రి మందలించాడని కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండలంలోని బొట్లగూడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తపల్లె గ్రామంలో ఆదివారం ఉదయం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన చీమలదిన్నె మాధవరావు, పద్మలు కిరాణాదుకాణం నిర్వహిస్తూ పిల్లలను చదివిస్తున్నారు. కుమార్తె దేవీ ప్రసన్న(20) ఒంగోలులో అగ్రికల్చల్ బీఎస్సీ, కుమారుడు విజయవాడలో ఇంటర్మీడియెట్ చదివిస్తున్నారు. ఇటీవల లాక్‌డౌన్‌తో ఇద్దరూ ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో శనివారం రాత్రి 8 గంటల సమయంలో టీవీ చూస్తున్న ప్రసన్నను తండ్రి మాధవరావు మందలించాడు. త్వరలో ఉద్యోగాల నోటిఫికేషన్ ఉందని, చదువుకొని మంచి ఉద్యోగం సాధించాలని చెప్పాడు. అనంతరం ఎప్పటిలాగే రాత్రి భోజనం చేసి నిద్రపోయారు. దేవీ ప్రసన్న వరండాలో నిద్రపోగా మిగిలిన వారంతా పంచలో పడుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో పద్మ నిద్ర లేచి ఇంట్లోకి వెళ్లగా కుమార్తె ప్రసన్న ఉరేసుకొని వేలాడుతూ కనిపించడంతో కేకలు వేసింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను కింద దించగా అప్పటికే మృతి చెందింది. దీంతో ఒక్కసారిగా కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న ఎస్సై అంబటి చంద్రశేఖర్, ఏఎస్సై డి.లక్ష్మీప్రసాద్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కనిగిరి వైద్యశాలకు తరలించారు. బాగా చదువుకొని ఉద్యోగం సాధిస్తుదనుకుంటే.. ‘మాకష్టం మాపిల్లలకు ఉండకూడదని కష్టపడి పిల్లలను చదివిస్తున్నాం. చదువుకుని మంచి ఉద్యోగస్తురాలవుతుందనుకున్న మా కుమార్తె ఇలా మాకు దూరమవుతుందనుకోలేదు. కష్టపడి చదివితే ఉద్యోగమొస్తుందనే టీవీ ఎక్కువగా చూడద్దని చెప్పా. కానీ ఇలా మమ్ములను మా కుమార్తె విడిచి శాశ్వతంగా దూరమవుతుందనుకోలేదని’ తల్లిదండ్రులు విలపించిన తీరు స్థానికులను కంట తడి పెట్టించింది. విద్యార్థిని ఆత్మహత్య మద్దిపాడు: ఇంటర్ పరీక్షలు ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై విద్యార్థిని ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండల పరిధిలోని మల్లవరం ఎస్సీ కాలనీలో ఆదివారం ఉదయం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం...మల్లవరం ఎస్సీ కాలనీకి చెందిన బోడిపాక కీర్తి అద్దంకిలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుకుంది. రెండు రోజుల క్రితం విడుదలైన పరీక్షా ఫలితాల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెందింది. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మద్దిపాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. మృతురాలి తల్లిదండ్రులకు ఒక్కటే కుమార్తె, ముగ్గురు కుమారులు కావడంతో ఇంటి మహాలక్ష్మి మరణించిందంటూ విలపించిన తీరు స్థానికులను కలచివేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
దేవత వచ్చింది
శుక్రవారం నటి స్నేహ ఇంట్లో ఆనందం రెండింతలయింది. ఆమె రెండోసారి తల్లి కావడమే అందుకు కారణం. శుక్రవారం ఓ పాపకు జన్మనిచ్చారు స్నేహ. ‘దేవత వచ్చింది’ అంటూ ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలియజేశారు స్నేహ భర్త ప్రసన్న. 2012లో తమిళ నటుడు ప్రసన్న, స్నేహ ప్రేమ వివాహం చేసుకున్నారు. 2015 ఆగస్ట్‌లో స్నేహ ఓ బాబుకి జన్మనిచ్చారు. కుమారుడికి విహాన్ అని పేరు పెట్టారు. -
పాపకు జన్మనిచ్చిన నటి స్నేహ..
ప్రముఖ నటి స్నేహ రెండోసారి తల్లయ్యారు. శుక్రవారం రోజున ఆమె పాపకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త నటుడు ప్రసన్న ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఏంజెల్ వచ్చేసిందని అన్నాడు. దీంతో పలువురు సినీ ప్రముఖులు స్నేహ-ప్రసన్న దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తమిళ చిత్రం అచ్చముండు అచ్చముండు షూటింగ్ సమయంలో నటుడు ప్రసన్నతో స్నేహ ప్రేమలో పడ్డారు. 2012 వీరిద్దరి విహహ బంధంతో ఒకటయ్యారు. వీరికి ఇప్పటికే విహాన్ అనే బాబు ఉన్న సంగతి తెలిసిందే. కాగా, బాబు పుట్టిన తర్వాత సినిమాల గ్యాప్ ఇచ్చిన స్నేహ.. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇటీవల ధనుష్ హీరోగా తెరకెక్కిన తమిళ చిత్రం పటాస్‌లో ఆమె నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. -
స్నేహ సీమంతం వేడుక...
నటి స్నేహా రెండోసారి తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె సీమంతం వేడుక ఇటీవల చెన్నైలో కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రుల సమక్షంలో జరిగింది. 2012లో తమిళ నటుడు ప్రసన్నను ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు స్నేహ. వీరికి ఇప్పటికే కుమారుడు నిహాస్ ఉన్నాడు. సీమంతం వేడుక ఫోటోలను స్నేహా షేర్ చేయడంతో ...ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వివాహం అయిన తర్వాత కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆమె... ఓ బిడ్డకు జన్మినిచ్చారు. ఆ తర్వాత స్నేహా నటనలో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ప్రస్తుతం సీమంతం ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. -
మళ్లీ తల్లి కాబోతున్నారు
కొన్ని రోజులుగా కంగ్రాచులేషన్ మెసేజ్‌లు, ఫోన్లతో బిజీ బిజీగా ఉన్నారు స్నేహ. రెండోసారి తల్లి కానుండటమే అందుకు కారణం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మరోసారి తల్లి కాబోతున్నట్టు ప్రకటించారు స్నేహ. తమిళ నటుడు ప్రసన్న, స్నేహ ‘అచ్చముండు అచ్చముండు’ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. 2012లో వివాహం చేసుకున్న ఈ జంటకు విహాన్ అనే నాలుగేళ్ళ బాబు కూడా ఉన్నాడు. -
కరణం బలరాం భార్య, కుమార్తె వివరాలు దాచిపెట్టారు..
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణ మూర్తి ఎన్నికను సవాలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ హైకోర్టును ఆశ్రయించారు. కరణం బలరాం ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ఆయన ఎన్నికల పిటిషన్ (ఈపీ) దాఖలు చేశారు. ఇందులో కరణంతోపాటు ఎన్నికల్లో పోటీ చేసిన పలువురు అభ్యర్థులను, రిటర్నింగ్ అధికారిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. వాస్తవాలు చెప్పకపోతే ఎన్నికను రద్దు చేయొచ్చు ‘కరణం బలరాం సమర్పించిన నామినేషన్ ప్రజాప్రాతినిధ్య చట్టం, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా లేదు. చట్టప్రకారం బహిర్గతం చేయాల్సిన వాస్తవాలను వెల్లడించకపోయినప్పటికీ ఆయన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. కరణం బలరాం తన నామినేషన్లో తప్పుడు సమాచారం ఇచ్చారు. వాస్తవాలను దాచిపెట్టారు. భార్య, తనపై ఆధారపడి జీవిస్తున్న వారి వివరాలను బహిర్గతం చేయకుండా తొక్కిపెట్టారు. నామినేషన్లో భార్య పేరును కరణం సరస్వతిగా పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆయనకున్న మరో భార్య ప్రసూన గురించి ప్రస్తావించలేదు. తనపై ఆధారపడి జీవిస్తున్నవారు ఎవరూ లేరని తెలిపారు. ప్రసూన గురించి, ఆమె ఆదాయం, ఆస్తి, అప్పుల గురించి వివరించలేదు. పలువురు ప్రముఖులు, కుటుంబసభ్యుల సమక్షంలో 1985లో ప్రసూనతో బలరామకృష్ణ మూర్తి వివాహం శ్రీశైలంలో జరిగింది. కరణం బలరాం, ప్రసూనలకు అంబిక కృష్ణ 1989లో హైదరాబాద్‌లోని సెయింట్ థెరిస్సా ఆస్పత్రిలో జన్మించింది. అంబిక ఎస్ఎస్సీ సర్టిఫికెట్లో, ఆధార్ కార్డులో తండ్రి పేరు కరణం బలరామకృష్ణ మూర్తి అని ఉంది. అంబిక అన్నప్రాసన, మొదటి పుట్టినరోజు వేడుకలు, అక్షరాభ్యాస వేడుకలకు సంబంధించిన ఫొటోల్లోనూ బలరాం ఉన్నారు. అంబిక కృష్ణ ప్రస్తుతం ఎల్ఎల్బీ చదువుతోంది. బలరాం తన నామినేషన్లో ప్రసూన, అంబిక కృష్ణల వివరాలను పొందుపరచకుండా దాచిపెట్టారు. ఎన్నికల చట్ట నిబంధనల ప్రకారం.. కరణం నామినేషన్‌ను చట్ట ఆమోదయోగ్యమైన నామినేషన్‌గా పరిగణించడానికి వీల్లేదు. అందువల్ల ఆయన నామినేషన్‌ను చెల్లనిదిగా ప్రకటించాలి. బలరాం ఎన్నికను రద్దు చేయండి. అంతేకాకుండా చీరాల నియోజకవర్గం నుంచి నేను ఎన్నికైనట్లు ప్రకటించండి’ అని కృష్ణమోహన్ తన పిటిషన్లో వివరించారు. -
నా టాప్ టెన్ మూవీస్‌లో ‘కురుక్షేత్రం’ ఒకటి
‘‘35 సంవత్సరాల సినీ కెరీర్లో ఎంతో మంది దర్శక–నిర్మాతలతో పనిచేశా. స్థిరంగా కష్టపడుతూ వస్తే దాని ఫలితం తప్పకుండా ఉంటుంది. ‘కురుక్షేత్రం’ నా 150వ సినిమా. నేను నటించిన టాప్ టెన్ మూవీస్‌లో ఇదొకటిగా నిలుస్తుంది. ఈ చిత్రంలో రియాలిటీకి దగ్గరగా ఉండే పోలీస్ పాత్ర చేశా. మంచి సినిమాలను ప్రోత్సహించే తెలుగు ప్రేక్షకులు మా సినిమాను ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని అర్జున్ అన్నారు. అర్జున్ హీరోగా అరుణ్ వైద్యనాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కురుక్షేత్రం’. ప్యాషన్ స్టూడియోస్ సమర్పణలో శ్రీనివాస్ మీసాల ఈ చిత్రాన్ని ఈ నెల 13న విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో అరుణ్ వైద్యనాథన్ మాట్లాడుతూ– ‘‘తమిళంలో మంచి విజయం సాధించిన ‘నిబునన్’ చిత్రాన్ని సాయిక్రిష్ణ, మీసాల శ్రీనివాస్‌గారు తెలుగులో విడుదల చేస్తున్నందుకు నా కృతజ్ఞతలు. అర్జున్‌గారు డైరెక్టర్స్ యాక్టర్. 150 సినిమాలు చేసినా ఎక్కడా గర్వం లేకుండా డౌన్ టు ఎర్త్ పర్సన్‌లా ఉంటారు. ప్రసన్న, వరలక్ష్మి, చందన అద్భుతంగా నటించారు’’ అన్నారు. ‘‘అర్జున్‌గారి 150వ సినిమా ‘కురుక్షేత్రం’ను మా బ్యానర్లో విడుదల చేయడం గర్వంగా ఉంది’’ అన్నారు ప్యాషన్ స్టూడియోస్ అధినేత ఉమేష్ రెడ్డి. ‘‘దండుపాళ్యం 3’ సినిమా తర్వాత మేం తెలుగులో విడుదల చేస్తున్న చిత్రం ‘కురుక్షేత్రం’’ అన్నారు మీసాల శ్రీనివాస్. ‘‘అర్జున్ అంటే నాకు ఎంతో అభిమానం. మంచి మనిషి. మా అందరికీ ఎంతో స్ఫూర్తి. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి’’ అన్నారు హీరో శ్రీకాంత్. నిర్మాతలు తమ్మలపల్లి రామసత్యనారాయణ, సాయికృష్ణ పాల్గొన్నారు. -
‘కురుక్షేత్రం’ మూవీస్టిల్స్
-
ఎవరెస్టంత ఎదిగారు
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యాసంస్థల్లో చదువుకుంటున్న ఐదుగురు విద్యార్థులు గురువారం ఉదయం 4 గంటల నుంచి 7 గంటల మధ్య ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. మొత్తం 22 మంది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు వెళ్లగా వారిలో ఒకరు విరమించుకున్నారు. మిగిలిన 21 మందిలో సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యా సంస్థ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగిలో బైపీసీ రెండో సంవత్సరం చదువుతున్న జె.ప్రవీణ్, కొత్తూరు గురుకులంలో చదువుతున్న పి.భానుసూర్యప్రకాష్, విశాఖపట్నం జిల్లా వెలుగొండ గురుకులంలో జూనియర్ ఎంపీసీ చదువుతున్న జి.రాజు, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సొసైటీలోని నెల్లూరు జిల్లా చిట్టేడు గురుకులంలో సీనియర్ ఇంటర్ చదువుతున్న వెంకటేష్, తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల గురుకులంలో సీనియర్ ఇంటర్ చదువుతున్న ప్రసన్నకుమార్‌లు ఎవరెస్ట్‌ను అధిరోహించిన వారిలో ఉన్నారు. గతేడాది 9 మంది విద్యార్థులు ఈ రెండు విద్యా సంస్థల నుంచి ఎవరెస్ట్‌ను అధిరోహించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. వీరు లడక్‌లో మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో శిక్షణ పొందారు. మూడు బృందాలుగా బయల్దేరిన వీరిలో మొదటి బృందం విజయం సాధించింది. రెండో బృందం ఈ నెల 19వ తేదీ ఎవరెస్ట్‌ను అధిరోహించనుంది. ఎవరెస్ట్‌ను అధిరోహించిన విద్యార్థులకు సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు గురువారం అభినందనలు తెలిపారు. ఆత్మ విశ్వాసం పెరగాలి: సీఎం విద్యార్థులు శిఖరమంతటి ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఎవరెస్ట్‌ను అధిరోహించిన విద్యార్థులను అభినందిస్తూ గురువారం సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అత్యంత కఠినమైన శిక్షణను తట్టుకొని అనుకున్న గమ్యం చేరుకున్న విద్యార్థుల మనోస్థైర్యాన్ని సీఎం చంద్రబాబు కొనియాడారు. శిఖరారోహణ ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, పట్టుదల, కష్టాలను తట్టుకునే ధృడత్వం అలవడుతుందన్నారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన శేఖర్‌బాబును, ఆయా శాఖల అధికారులను సీఎం అభినందించారు. మరిన్ని అధిరోహణలు సాధించాలి: వైఎస్ జగన్ ఎవరెస్ట్‌ను అధిరోహించిన ఎస్సీ, ఎస్టీ గురుకులాల విద్యార్థులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని అధిరోహణలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు గురువారం వైఎస్ జగన్ ఓ ప్రకటన విడుదల చేశారు. -
పుట్టినిల్లు... మెచ్చినిల్లు
స్నేహ తన పుట్టినింట్లో గౌరవం అనే పుట్టుమచ్చ. ఏ మచ్చ లేకుండా ఎదగడమే పుట్టినింటి వైభవం. పెళ్లయ్యాక మెట్టినింటిని మేటి ఇల్లుగా చక్కదిద్దిన ఈ స్నేహ.. అత్తకు స్నేహితురాలు.. భర్తకి ప్రియనేస్తం. బిడ్డకు అమృతహస్తం.. మెట్టినిల్లు మెచ్చిన కోడలు. చాలా కూల్‌గా.. ఇంతకుముందుకన్నా ఇంకా అందంగా కనిపిస్తున్నారు.. మంచి స్పేస్‌లో ఉన్నారనిపిస్తోంది? స్నేహ: దేవుడు నా విషయంలో కైండ్‌గా ఉన్నాడు. ఇప్పుడనే కాదు నేనెప్పుడూ ఇలానే అంటుంటా. ఎందుకంటే మ్యారేజ్‌కి ముందు ఆ తర్వాత నా లైఫ్ స్మూత్‌గా ఉంది. ఇప్పుడైతే ఇంకా బ్యూటిఫుల్‌గా ఉంది. దానికి కారణం మా అబ్బాయి ‘విహాన్’. మా (భర్త ప్రసన్న) లైఫ్‌లోకి విహాన్ వచ్చాక మా హ్యాపీనెస్ డబుల్ అయింది. మ్యారీడ్ లైఫ్ గురించి ఇంత హ్యాపీగా మాట్లాడుతున్నారు. ఒక వివాహ బంధం సక్సెస్ అవ్వాలంటే మీరిచ్చే సలహా? అది చెప్పడం కష్టం. ఎందుకంటే ఒక్కో కపుల్ ఒక్కోలా ఉంటారు. మా ఫ్యామిలీలోనే చూడండి నేనొకలా, ప్రసన్న ఒకలా ఉంటాం. ‘ఇది చేస్తే మ్యారేజ్ సక్సెస్ అవుతుంది, ఇలా చేస్తే అవ్వదు’ అని రూల్స్ చెప్పలేం. మా పెళ్లయి జస్ట్ ఆరేళ్లే అయింది. ఈ ఆరేళ్లలో నేను తెలుసుకున్నది ఒకటే. మ్యారీడ్ లైఫ్ సక్సెస్‌ఫుల్‌గా సాగాలంటే ‘గివ్ అండ్ టేక్ పాలసీ’ ఉండాలి. మా మ్యారేజ్‌లో బెస్ట్ థింగ్ ఏంటంటే భార్యా భర్తలు కావడానికన్నా ముందు మేం మంచి ఫ్రెండ్స్. మేం ఎప్పుడూ గొడవపడలేదనను. ప్రతీ భార్య భర్త గొడవపడతారు. ఆ గొడవ తర్వాత మళ్లీ ఎలా కలుస్తాం అన్నది ముఖ్యం. కొన్నిసార్లు ఒక పూటలో మాట్లాడుకుంటాం. ఇంకోసారి రెండు రోజులు పడుతుంది. అయితే వారాలు, నెలలు సాగనివ్వకూడదు. ‘క్షమించడం– మర్చిపోవడం’ అన్నది చాలా ముఖ్యం. లవర్స్ నుంచి ‘మిస్టర్ అండ్ మిసెస్’ అవ్వాలనుకున్నాక ‘మ్యారేజ్ లైఫ్’ గురించి మీ ఇద్దరూ మాట్లాడుకున్న ముఖ్యమైన విషయం ఏంటి? ‘ఎలాంటి పరిస్థితుల్లో అయినా, ఎంత గొడవపడ్డా మనం మాత్రం విడాకులు తీసుకోకూడదు’ అని మాట్లాడుకున్నాం. అది కేవలం ఒక మాటగా అనుకోవడం కాదు.. మా స్ట్రాంగ్ డెసిషన్ అది. మేమిద్దరం ఎంతో కష్టపడి మా అమ్మా నాన్నల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. అంత కష్టపడి ఒప్పించి, పెళ్లి చేసుకొని చిన్న గొడవ కోసం విడిపోతే ఇక ఆ కష్టానికి అర్థం ఏముంటుంది? నా భర్త 100% పర్ఫెక్ట్ అని ఎవ్వరూ చెప్పలేరు. నా భార్య 100% కరెక్ట్ అని ఎవరూ చెప్పలేరు. కొన్నిసార్లు భర్తది తప్పు అవ్వొచ్చు, కొన్నిసార్లు భార్యది అవ్వొచ్చు. తప్పులను క్షమించుకోవాలి. ఒక బంధం ఏర్పడాలంటే ఎన్నో కుదరాలి. అందుకే ఆ బంధాన్ని ఈజీగా తుంచేసుకోకూడదు. ఇంతకీ మీరు ‘అత్త ఉన్నా ఉత్తమ కోడలు’ అనిపించుకోగలిగారా? ఒకసారి మా మామయ్యగారు మా నాన్నగారితో ‘ఒకవేళ మా అబ్బాయికి మేం ఏరికోరి ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసి, పెళ్లి చేసినా మీ స్నేహ అంత మంచి అమ్మాయిని తీసుకురాలేకపోయేవాళ్లమేమో’ అన్నారట. ఆ మాటలు విని, అత్తింట్లో తన కూతురు మంచి పేరు తెచ్చుకున్నందుకు నాన్నగారు చాలా ఆనందపడ్డారు. నిజానికి నన్ను ప్రసన్న పెళ్లి చేసుకోవడానికి వాళ్ల నాన్నగారు ఒప్పుకోవడానికి చాలా టైమ్ పట్టింది. అలాంటి ఆయన నా గురించి అలా అన్నారని మా నాన్నగారు చెప్పగానే ఆనందపడ్డాను. ఏ కోడలికైనా అత్తింటి నుంచి ఇంతకన్నా బెస్ట్ కాంప్లిమెంట్ ఏం ఉంటుంది? ఆ మాట నిలబెట్టుకోవడానికి నేను ట్రై చేస్తుంటాను. అత్తా–కోడళ్లంటే గొడవలే అని కాకుండా అత్తింట్లో ఇలా మంచి పేరు తెచ్చుకుంటే లైఫ్ స్మూత్‌గా ఉంటుంది కదా.. అవును. అత్తగారిలో అమ్మను చూడక్కర్లేదు. అలా చూడలేం కూడా. అయితే పెళ్లయిన కొన్నేళ్లకు ఇది సాధ్యపడుతుంది. అప్పుడు అత్తను కోడలు అమ్మలా.. కోడలిని అత్త కూతురిలా అంగీకరించగలుగుతారు. అత్తింట్లోకి వెళ్లేటప్పుడే ‘అత్త మనకు శత్రువు’ అనే ఫీలింగ్‌తో కోడలు వెళ్లకూడదు. ‘కొడుకుని మన నుంచి దూరం చేయడానికి ఓ అమ్మాయి వచ్చింది’ అని అత్త ఫీల్ అవ్వకూడదు. మంచి, చెడు ఏం జరిగినా కుటుంబంలో అందరూ కలసి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే కాబట్టి.. అత్తింటి బంధంలో మంచిని చూడటం అలవాటు చేసుకోవాలి. ఓ ఇంటర్వ్యూలో ‘స్నేహ నన్ను చాలా మార్చింది’ అని ప్రసన్నగారు అన్నారు. ఏం మార్చారు? చాలా. డ్రెస్సింగ్ నుంచి వాకింగ్ వరకూ అన్నీ మార్చేశాను. ప్రసన్న గారి వాకింగ్ స్టైల్ బావుండదా? బావుండదని కాదు. ఇలా అయితే ఇంకా బావుంటుందని. ‘నేను చాలా మారాను. అంతా నీవల్లే. ఈ మార్పు చాలా బాగుంది’ అని ప్రసన్న నాతో చాలాసార్లు అన్నాడు. ఐ యామ్ హ్యాపీ. తనకోసం మీరేమైనా మారారా? ఏమీ లేదు (నవ్వుతూ). జన్రల్‌గా భర్తకి తగ్గట్టు మారే భార్యలే ఎక్కువ. అలాంటి ప్రెజర్ లేదంటే మీరు లక్కీయే? ఐ యామ్ హ్యాపీ. అలాగని మార్పు విషయంలో నేనూ ప్రసన్నను ఒత్తిడి చేయలేదు. నేను చెప్పింది కరెక్ట్ అనిపించి, మారాడు. పెళ్లి తర్వాత సినిమాలు మానేసి ఇంట్లోనే ఉండాలనుకున్నాను. ‘నో నో. ఎక్కువ సినిమాలు కాకపోయినా అప్పుడప్పుడు సినిమాలు చేస్తుండాలి’ అన్నాడు. ఏ పని చేసినా చాలా ఎంకరేజ్ చేస్తాడు. ఒక యాడ్‌లో ప్రసన్నగారు మీ కాలి గోళ్లకు నెయిల్ పాలిష్ వేస్తూ ఉంటారు. రియల్ లైఫ్‌లో అలా చేస్తారా? పాలిష్ మాత్రమే కాదు కాళ్లకు ఆయిల్ మసాజ్ కూడా ఇస్తుంటారు (నవ్వుతూ). భవిష్యత్తులో మీరు కూడా ఒక అమ్మాయికి అత్తగారే. అప్పుడు మీ కోడలితో ఎలా ఉండాలనుకుంటున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? నేను వెరీ కూల్ అత్త. కొందరు అత్తల్లా ‘ఈ టైమ్‌లో ఎక్కడికి వెళ్తున్నావు? ఏ డ్రెస్ వేసుకుంటున్నావు? ఏం తింటున్నావు’ అంటూ ప్రతిదీ ప్రశ్నించే అత్తలా ఉండను. మా అబ్బాయి తనతో హ్యాపీగా ఉంటే నేను హ్యాపీ. ‘నేనెక్కువా? నీ భార్య ఎక్కువా?’ అనే సిచ్యుయేషన్స్ మా అబ్బాయికి క్రియేట్ చేయను. అసలు ఏ ఇంట్లో అయినా ఈ విషయంలోనే ఎక్కువ ప్రాబ్లమ్ వచ్చేది. మావాడికి తన భార్యే ఎక్కువ కావాలి. ఎందుకంటే వాడి జీవితాంతం నేను ఉండలేను. భార్య మాత్రం వాడి జీవితం ఆఖరి వరకూ ఉంటుంది. ఈ విషయం అర్థం చేసుకుంటే అందరి లైఫ్ చాలా బావుంటుంది. బాగా చెప్పారు. ఇక సినిమాల గురించి మాట్లాడుకుందాం.. ఎలాంటి రోల్స్ చేయాలనుకుంటున్నారు. డ్రీమ్ రోల్స్ ఏమైనా? అలాంటివి ఏమీ లేవు. ఇంకా మంచి రోల్స్ చేసి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి. ఇప్పటిదాకా తెచ్చుకున్న పేరును పోగొట్టుకోకూడదు. నెగటివ్ క్యారెక్టర్ చేయాలని ఉంది. మిమ్మల్ని నెగటివ్‌గా చూడటం కష్టమేమో? ఆ ఇమేజ్ బ్రేక్ చేయాలనుకుంటున్నాను (నవ్వుతూ). పాజిటివ్ క్యారెక్టర్స్ చాలా చేశాను. ఒక నెగటివ్ క్యారెక్టర్ కూడా ట్రై చేయాలని ఉంది. గ్లామర్ ఫీల్డ్‌లో క్లీన్ ఇమేజ్ తెచ్చుకోవటం చాలా కష్టం. కానీ మీరది అచీవ్ చేయగలిగారు. ఈ ఇమేజ్ ‘రెస్పాన్సిబుల్‌గా ఉండాలి’ అని ఎప్పుడూ గుర్తు చేస్తుంటుంది కదా? అవును. యాక్చువల్‌గా నాది ట్రెడిషనల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్. మా ఇంట్లో స్లీవ్‌లెస్ వేసుకోవడం అంటే పెద్ద విషయం. మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్. నేను ఇండస్ట్రీలోకి రావడం మా ఫ్యామిలీకి పెద్ద షాక్. మా నాన్నగారు నాతో రెండు నెలలు మాట్లాడలేదు. ఆ తర్వాత నేను రెస్పాన్సిబుల్‌గా ఉండటం చూసి, మాట్లాడటం మొదలుపెట్టారు. నా ఫస్ట్ మూవీలో ఒక సీన్లో స్లీవ్‌లెస్ వేసుకోవల్సి వచ్చింది. అప్పుడు మా నాన్నకు ఫోన్ చేసి ‘డాడీ నేను స్లీవ్‌లెస్ వేసుకున్నా.. ఐయామ్ సారీ’ అన్నాను. ‘నువ్వు కంఫర్ట్ అంటే ఓకే’ అన్నారు.. కానీ ఇప్పుడాయన గర్వంగా ఫీల్ అవుతున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను గ్లామరస్ రోల్ చేయలేదు. ఇప్పుడు అసలే చేయను. ఎందుకంటే మా అబ్బాయి చూస్తుంటాడు, మా అత్తగారు చూస్తారు. నేనెలా చేస్తాను? ఇప్పుడింకా రెస్పాన్సిబులిటీ పెరిగింది నాకు. మీ కెరీర్లో కాంట్రవర్శీ లేదు. కానీ ఈ మధ్య కొందరు హీరోయిన్లు ‘క్యాస్టింగ్ కౌచ్’ ఉందని, కొందరు లేదని అంటున్నారు. మరి.. మీరు? నమ్మరేమో.. ఫస్ట్ టైమ్ మీ నుంచే ‘క్యాస్టింగ్ కౌచ్’ అనే వర్డ్ వింటున్నా. వేరేవాళ్లు చెబుతున్న విషయాల గురించి నేను కామెంట్ చేయలేదు. నా కెరీర్ మాత్రం సాఫీగానే సాగుతోంది. కొత్త హీరోయిన్స్ మీతో ఫ్రెండ్లీగా ఉంటారా? నేను చాలామంది కొత్త హీరోయిన్స్‌ని చూశాను. వాళ్లను కలిసినప్పుడో, ట్రావెల్ చేస్తున్నప్పుడో నవ్వితే.. తిరిగి నవ్వరు కూడా. షాకింగ్‌గా అనిపిస్తుంది. నన్ను స్నేహాలాగా గుర్తించాల్సిన అవసరం లేదు. ఒక అమ్మాయి నవ్వినప్పుడు తిరిగి నవ్వితే ఏమవుతుంది? అంత యాటిట్యూడ్ ఎందుకు? వాళ్ల దగ్గరికి వెళ్లి ‘మీ సినిమాలు ఇచ్చేయండి’ అని అడగం కదా. మరి.. ఆ యాటిట్యూడ్ వాళ్లను ఎక్కడికి తీసుకెళుతుందో? పెళ్లి చేసుకున్న హీరో సినిమాలకు దూరమయ్యే ప్రసక్తే లేదు. మీలా పెళ్లి చేసుకున్న హీరోయిన్లు సినిమాలు తగ్గించాల్సిందేనా? అలా అని కాదు. నన్ను సినిమాలు మానేయమని నా అత్తింటివాళ్లు అనలేదు. ప్రసన్న కూడా ఎప్పుడూ ఆ మాట అనలేదు. మంచి రోల్స్ అనిపిస్తేనే చేస్తు్తన్నాను. ఎందుకంటే నెలలో 15–20రోజులు యాక్ట్ చేస్తూ మిగిలిన పది రోజులు విహాన్‌కి ఇచ్చేయాలనుకున్నా. విహాన్‌కి కేటాయించాల్సిన టైమ్‌ని ఓ సినిమాకి ఇచ్చానంటే ఆ సినిమా, నా క్యారెక్టర్ ఎంతో గొప్పవై ఉండాలని ఫిక్స్ అయ్యాను. మీరు షూటింగ్స్‌కి వెళ్లినప్పుడు విహాన్ని ఎవరు చూసుకుంటారు? మా అత్తగారు లేకపోతే అమ్మగారు. వాడికి జస్ట్ రెండున్నరేళ్లే. ఈ వయసు పిల్లలకు ఎక్కువ కేర్ అవసరం. నేను, అమ్మ, అత్తయ్య.. ఎవరో ఒకరు వాళ్లతో పాటు ఉండాల్సిందే. ఇంట్లో ఆడవాళ్లెవ్వరికీ వీలు పడకపోతే అప్పుడు విహాన్‌తో పాటు ప్రసన్న ఉంటాడు. ‘న్యూ జర్నీ స్టార్ట్ చేశా’ అంటూ ఈ మధ్య జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్న ఫొటోలు ట్వీటర్లో షేర్ చేశారు. ఈ కొత్త జర్నీ దేనికోసం? నేనెప్పట్నుంచో జిమ్ చేస్తున్నాను. కానీ హెవీ వెయిట్స్ చేయలేదు. వాటివల్ల ఇంకా ఫిట్‌గా ఉండొచ్చనిపించింది. అందుకే మొదలుపెట్టాను. కొంత గ్యాప్ తర్వాత తెలుగులో సినిమా సైన్ చేయడంతో మీ ఫ్యాన్స్ హ్యాపీ. రామ్‌చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో మీ పాత్ర? క్యారెక్టర్ని రివీల్ చేయలేను. అయితే నన్ను ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే.. ఆడియన్స్ ఇంకా నన్ను ప్రేమగా వెల్కమ్ చేస్తున్నారు. ‘ఏ సినిమా చేస్తున్నారు? ఏ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు?’ అని ఆసక్తిగా అడుగుతున్నారు. ఈ ప్రేమ చూస్తుంటే ఎప్పటికీ మంచి రోల్స్ చేయాలనిపిస్తోంది. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో నా రోల్ చిన్నదైనా ఒప్పుకోవడానికి కారణం ఆ పాత్ర బాగుంటుంది. ఆ మూవీలో ‘సూపర్ మచ్చీ...’ సాంగ్ పెద్ద హిట్టయిన విషయం గుర్తుండే ఉంటుంది. యాక్చువల్లీ ‘సూపర్ మచ్చీ..’ మీ స్టైల్ సాంగ్ కాదు. ఆ సాంగ్ షూట్ చేసే అప్పుడు ఎలా అనిపించింది? కరెక్టే. పైగా ఆ సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు నేను ఫైవ్ మంథ్స్ ప్రెగ్నెంట్. అందుకే ‘సూపర్ మచ్చీ..’ నా మనసుకి చాలా దగ్గరైంది. ప్రెగ్నెన్సీ తాలూకు స్వీట్ మెమొరీస్‌లో ఈ సాంగ్ ఒకటి. ఫైనల్లీ మీ అల్లరి పిల్లాణ్ణి హీరోని చేస్తారా? హీరో అయితే హ్యాపీనే. చూద్దాం ఏమవుతాడో (నవ్వుతూ). – డి.జి. భవాని -
ప్రతి ఒక్కరిలో ఓ దొంగోడు..!
‘‘అందరి అమ్మాయిల్లాగే ఆ అమ్మాయికి జీవితంపై మంచి కలలు, ఆశలు, కోరికలు ఉంటాయి. సోషల్ మీడియా కారణంగా ఆ అమ్మాయి జీవితం ఎలా మారింది? అన్నదే ‘దొంగోడొచ్చాడు’ కథాంశం’’ అని కథానాయిక అమలాపాల్ అన్నారు. బాబీ సింహా, అమలాపాల్, ప్రసన్న ముఖ్య పాత్రల్లో ‘మల్లన్న’ ఫేమ్ సుశీ గణేశన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘తిరుట్టుపయలే 2’. కల్పాతి ఎస్.అఘోరమ్ సమర్పణలో కల్పాతి ఎస్. అఘోరమ్, కల్పాతి ఎస్.గణేశ్, కల్పాతి ఎస్.సురేష్ నిర్మాతలు. ఈ సినిమాని ‘దొంగోడొచ్చాడు’ పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్రబృందం విలేకరులతో మాట్లాడారు. అమలాపాల్ మాట్లాడుతూ– ‘‘చాలారోజుల తర్వాత మళ్లీ టాలీవుడ్‌కి రావడం హ్యాపీ. సుశీగారితో ఏడాదికి ఒక సినిమా అయినా చేయాలనుంది. ఆయనతో సినిమా చేస్తే చాలా విషయాలు నేర్చుకోవచ్చు. విద్యాసాగర్‌తో మలయాళంలో పనిచేసిన రెండు సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘సోషల్ క్రైమ్ నేపథ్యంలో సాగే చిత్రమిది. తమిళంలో ఈ సినిమా నవంబర్ 30న విడుదలవుతోంది. డిసెంబరు రెండో వారంలో తెలుగులో విడుదలవుతుంది’’ అన్నారు బాబీ సింహా. ‘‘అవకాశం రావాలే కానీ.. ప్రతి ఒక్కరిలో ఓ దొంగోడు ఉంటాడు. అలాంటి మనిషి నైజాన్ని చూపించే సినిమా ఇది’’ అన్నారు సుశీ గణేశన్. నటుడు ప్రసన్న, సంగీత దర్శకుడు విద్యాసాగర్ పాల్గొన్నారు. -
డిసెంబర్ 2న తిరుట్టుపయలే–2
తమిళసినిమా: బాబిసింహా, ప్రసన్నా, అమలాపాల్ నటించిన చిత్రం తిరుట్టుపయలే–2. తిరుట్టుపయలే మొదటి భాగాన్ని నిర్మించిన ఏజీఎస్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ కల్పాత్తి అగోరమే తిరుట్టుపయలే–2కు కూడా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. జీవన్, అబ్బాస్, సోనియా అగర్వాల్ కలిసి నటించిన తిరుట్టుపయలే చిత్రం తొలి భాగం 2006 ఏప్రిల్‌లో విడుదలైంది. సాధారణంగా ఒక చిత్రం మొదటి భాగం విడుదలైన ఒకటి రెండు సంవత్సరాల్లోనే రెండో భాగం కూడా విడుదల చేస్తారు. అయితే తిరుట్టుపయలే చిత్రం 11 ఏళ్ల తర్వాత ఇప్పుడు రెండో భాగం విడుదలకు సిద్ధమవుతుండడం విశేషం. ఈ చిత్రాన్ని డిసెంబర్ 2న విడుదల చేయాలని నిర్ణయించినట్టు చిత్ర యూనిట్ తెలిపింది. -
తిరుట్టుప్పయలే–2 ఫస్ట్‌లుక్ విడుదల
తిమిళసినిమా: తిరుట్టుప్పయలే–2 చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను గురువారం విడుదల చేశారు. సుశీగణేశన్ దర్శకత్వంలో తెరకెక్కిన తిరుట్టుప్పయలే సంచలన విజయాన్ని సాధించింది. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్‌గా తిరుట్టుప్పయలే–2 రూపొందుతున్న విషయం తెలిసిందే. సుశీగణేశన్ చిన్న గ్యాప్ తరువాత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాబీసింహా, ప్రసన్న, అమలాపాల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఏజీఎస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలో ఆడియోను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను గురువారం విడుదల చేశారు. నటుడు విజయ్‌సేతుపతి ఆవిష్కరించిన ఈ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోందని దర్శకుడు తెలిపారు. చిత్రం గురించి ఆయన తెలుపుతూ చిల్లర దొంగతనాలు చేసుకుంటూ తిరిగే అబ్బాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే స్థాయికి ఎదిగితే ఎలా ఉంటుందనే తిరుట్టుప్పయలే–2 చిత్రం అని తెలిపారు. ఇది తన ఊహకన్నా సమాజంలో జరుగుతున్న సంఘటనలతో సహజత్వంగా తెరకెక్కిస్తున్న చిత్రం అని చెప్పారు. ఈ చిత్రానికి విద్యాసాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
నిపుణన్ సక్సెస్ మీట్
తమిళసినిమా: దక్షిణాదిలో యాక్షన్ కింగ్‌గా ముద్ర వేసుకుని కథానాయకుడిగా 150 చిత్రాల మైలురాయి చేరుకున్న నటుడు అర్జున్. నటుడిగానే కాకుండా, నిర్మాత, దర్శకుడిగానూ సత్తా చాటుకున్న ఈయన తాజాగా నటించిన నిపుణన్ చిత్రం 150వ చిత్రంగా నమోదు చేసుకుంది. ఇందులో అర్జున్‌తో పాటు ప్రసన్న, నటి వరలక్ష్మీశరత్‌కుమార్, వైభవ్, కృష్ట వంటి యువ నటీనటులు నటించారు. అరుణ్‌వైద్యనాథన్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రం గతవారం తెరపైకి వచ్చి విశేష ప్రేక్షకాదరణ పొందుతున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం చిత్ర యూనిట్ సక్సెస్‌మీట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అరుణ్‌వైద్యనాథన్ మాట్లాడుతూ నిపుణన్ చిత్ర కథను తయారు చేసుకున్నప్పుడే మంచి చిత్రం అవుతుందనే నమ్మకం కలిగిందన్నారు. నటుడు అర్జున్ 150వ చిత్రానికి తాను దర్శకత్వం వహించడం గర్వంగా ఉందన్నారు. ఈ చిత్రంలో తనతో పనిచేసిన కళాకారులు, సాంకేతిక వర్గం అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నానని అన్నారు. చిత్ర నిర్మాత ఉమేష్ మాట్లాడుతూ చిత్రం చూసిన పత్రికల వారి అభిప్రాయం, ప్రేక్షకుల అభిప్రాయం ఒకటే కావడంతోనే ఈ నిపుణన్ ఇంత విజయం సాధించిందని పేర్కొన్నారు. చిత్ర హీరో అర్జున్ మాట్లాడుతూ నిపుణన్ చిత్ర సక్సెస్ మీట్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. దర్శకుడు అరుణ్‌వైద్యనాథన్ నిపుణన్ చిత్ర స్క్రిప్ట్‌ను చెప్పిన విధంగానే తెరకెక్కించినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని అన్నారు. ఈ చిత్రంలో తనతో పనిచేసిన కథాకారులకు, అదే విధంగా తన 150 చిత్రాలకు పనిచేసిన వారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. ఇకపై కూడా నటుడిగా కొనసాగాలనుకుంటున్నానని, నిపుణన్ లాంటి వైవిధ్యభరిత కథా చిత్రాల్లో నటించాలని ఆశిస్తున్నానని అర్జున్ పేర్కొన్నారు. అదే విధంగా దర్శకుడిగా ప్రముఖ హీరోలతో పనిచేయాలని కోరుకుంటున్నానని, అలాంటి సందర్భం కోసం ఎదురు చూస్తున్నానని అన్నారు. కాగా ప్రస్తుతం ఈయన తన కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా సొల్లివిడవా అనే పేరుతో ఒక యూత్‌ఫుల్ ప్రేమ కథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అందులో తాను ఒక అతిథి పాత్రలో కనిపించనున్నట్లు అర్జున్ వెల్లడించారు.