Pratani Ramakrishna Goud
-
తప్పుడు ప్రచారం జరుగుతోంది
‘‘తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్’ (టీఎఫ్‌సీసీ) చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో సెప్టెంబరులో దుబాయ్‌లో నిర్వహించాలనుకుంటున్న టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ ఫంక్షన్‌కు, తమకు సంబంధం లేదని, టీఎఫ్‌సీసీకి ప్రభుత్వ గుర్తింపు లేదని తెలుగు, తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశాయి. ఈ విషయంపై శనివారం టీఎఫ్‌సీసీ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ స్పందిస్తూ– ‘‘మాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. సౌత్ ఇండియాలోని ఆర్టిస్టులకు అవార్డులు ఇవ్వనున్నాం. దీన్ని కాదనే హక్కు దామోదర ప్రసాద్, సునీల్ నారంగ్‌లకు లేదు. ‘టీఎఫ్‌సీసీ’ పేరుతో ట్రేడ్ మార్క్, టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ రిజిస్ట్రేషన్ చేయించాం. టీఎఫ్‌సీసీ నంది ఈవెంట్స్ పేరుతో దుబాయ్ ప్రభుత్వం నుండి లైసెన్స్ తీసుకున్నాం. సెప్టెంబర్ 28న దుబాయ్‌లో టీఎఫ్‌సీసీ నంది అవార్డుల వేడుక జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం టీఎఫ్‌సీసీ నంది అవార్డులకు అనుమతితో కూడిన లెటర్ కూడా ఇచ్చింది’’ అన్నారు. -
ఆగస్టులో టీఎఫ్‌సీసీ నంది అవార్డులు
తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) ఆధ్వర్యంలో ‘టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023’ వేడుక జరగనుంది. దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఆగస్టు 12న ఈ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జ్యూరీ సభ్యులను సెలెక్ట్ చేసుకున్న సందర్బంగా సోమవారం పాత్రికేయుల సమావేశంలో టీఎఫ్‌సీసీ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ– ‘‘2021, 22 సంవత్సరాల్లో విడుదలైన చిత్రాల వారు ఈ అవార్డుల కోసం టీఎఫ్‌సీసీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు చివరి తేదీ జూన్ 15. తెలంగాణ ప్రభుత్వం నుండి నంది అవార్డ్స్‌కి సంబంధించిన లెటర్ పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు సంతకం చేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఆంధ్ర ప్రభుత్వం సహకారం కూడా కోరనున్నాం. ఆగస్టు 12న దుబాయ్ ప్రిన్స్ చేతుల మీదుగా నంది అవార్డులు ఇవ్వనున్నాం’’ అన్నారు. ‘‘జ్యూరీ కమిటీకి నన్ను చైర్మన్‌గా ఉండమన్నారు. కానీ నేను జ్యూరీ మెంబర్‌గా ఉంటూ సపోర్ట్ చేస్తానని చెప్పాను. తెలంగాణ ప్రభుత్వ సహకారం తీసుకున్నట్లే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది’’ అన్నారు మురళీ మోహన్. సుమన్, బి. గోపాల్ తదితరులు మాట్లాడారు. -
మిసెస్ ఇండియా గ్లోబల్ ఫైనల్స్‌కు తెలంగాణ నటి
పెగాసిస్ వారు నిర్వహిస్తోన్న 'మిసెస్ ఇండియా గ్లోబల్' ఫైనల్స్‌కు సెలక్ట్ అయ్యారు సినీనటి అంకిత ఠాకూర్. ఈ నెల 11న కేరళలోని కొచ్చిలో ఫైనల్స్ జరగనున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి మిసెస్ ఇండియా గ్లోబల్‌కు సెలక్ట్ అయిన అంకిత ఠాకూర్ శనివారం నాడు ఫిలించాంబర్‌లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో `మిస్ ఏసియా` రష్మి ఠాకూర్, తెలంగాణ ఫిలించాంబర్ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంకిత ఠాకూర్ మాట్లాడుతూ...``తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తూ మిసెస్ ఇండియా గ్లోబల్ ఫైనల్స్‌కు చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ ప్రజలంతా ఓటింగ్ ద్వారా నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. కొచ్చిలో ఈ నెల 11న `మిసెస్ ఇండియా గ్లోబల్` ఫైనల్స్ జరగనున్నాయి` అన్నారు. `మిస్ ఏసియా`, తెలంగాణ మా అసోసియేషన్ ప్రెసిడెంట్ రష్మీ ఠాకూర్ మాట్లాడుతూ... 'పెగాసిస్ వారు కండక్ట్ చేస్తోన్న `మిసెస్ ఇండియా గ్లోబల్ ` ఫైనల్స్‌కు చేరుకున్న అంకిత ఠాకూర్ నాకు కజిన్ అవుతారు. గత కొంత కాలంగా తనకు నేను ట్రైనీగా ఉన్నాను. కచ్చితంగా తను `మిస్ ఇండియా గ్లోబల్` క్రౌన్ గెలుచుకుని వస్తుందన్న నమ్మకం ఉంది. మన తెలంగాణను రిప్రజెంట్ చేస్తోన్న అంకిత ఠాకూర్ కి ఓటింగ్ ద్వారా తెలంగాణతో పాటు తెలుగు ప్రజలంతా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా`` అన్నారు. తెలంగాణ ఫిలించాంబర్ చైర్మన్ డా.ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ...``గతంలో మిస్ ఏసియా టైటిల్ గెలుచుకున్న రష్మీ ఠాకూర్‌కు మా తెలంగాణ ఫిలించాబర్ ఎంతో సపోర్ట్ చేసింది. ఇప్పుడు అంకిత ఠాకూర్‌కు కూడా ఫుల్ సపోర్ట్ ఉంటుంది`` అన్నారు. -
టికెట్ ధరల విషయంలో ఏపీ నిర్ణయం బాగుంది
‘‘గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, జిల్లా కేంద్రాలు.. ఇలా ప్రాంతాలను బట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ ధరలు నిర్ణయించడం బాగుంది.. అలాంటి విధానం తెలంగాణ రాష్ట్రంలో కూడా వస్తే బాగుంటుంది’’ అని తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ– ‘‘తెలంగాణ ప్రభుత్వం టికెట్ల రేట్ల విషయంలో విడుదల చేసిన జీఓ 120 వల్ల చిన్న చిత్రాల నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు. ఏపీలోలాగా ప్రాంతాలను బట్టి టికెట్ రేటు ఉంటే తప్ప తెలంగాణలో చిన్న చిత్రాలు బతికి బట్టకట్టలేని పరిస్థితి. కచ్చితంగా జీవో 120ని సవరించాలి. అలాగే లీజు విధానాన్ని కూడా రద్దు చేయాలి. థియేటర్స్ యాజమాన్యాన్ని, ప్రభుత్వాలను పెద్ద నిర్మాతలు తప్పుదోవ పట్టిస్తున్నారు. టికెట్ రేట్లు పెంచుకున్నప్పుడు థియేటర్ అద్దెలు కూడా పెంచాలి.. కానీ పెంచడం లేదు. దీని వల్ల ఎగ్జిబిటర్స్ నష్టపోతున్నారు. ఇండస్ట్రీ ఆ నలుగురిది మాత్రమే కాదు. ఆ నలుగురైదుగురి దోపిడీ వల్ల చిన్న నిర్మాతలు, చిన్న హీరోలు మునిగిపోతున్నారు. అంతటా ఒకే రేటు కాకుండా పాత పద్ధతినే కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌గారిని కలిసి వివరిస్తాం’’ అన్నారు. తెలంగాణ డైరెక్టర్స్ యూనియన్ అధ్యక్షుడు ఆర్. రమేష్ నాయుడు, వైస్ ప్రెసిడెంట్ ఎస్. వంశీ గౌడ్, ‘టి మా’ జనరల్ సెక్రటరీలు సకమ్ స్నిగ్ధ, బి కిషోర్ తేజ, వైస్ ప్రెసిడెంట్ ఎ. కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఈ చిత్రంతో ఆగిపోను
‘‘రావణలంక’ లాంటి మంచి చిత్రాల్ని ప్రేక్షకులందరూ ఆదరించాలి. సినిమాపై ఆసక్తితో క్రిష్ బండిపల్లి హీరోగా నటిస్తూ, నిర్మిస్తుండటం గ్రేట్. కొత్త హీరోలను ప్రోత్సహించడం వల్ల ఇండస్ట్రీకి మరింత మంది కొత్త హీరోలు వస్తారు’’ అని తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి వ్యాపారవేత్తగా రాణించిన క్రిష్ బండిపల్లి ‘రావణలంక’ చిత్రంతో హీరోగా, నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. బీఎన్‌ఎస్‌రాజు దర్శకత్వంలో కె.సిరీస్ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. నేడు క్రిష్ బండిపల్లి పుట్టినరోజు సందర ్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీఎన్‌ఎస్‌రాజు మాట్లాడుతూ– ‘‘రామాయణాన్ని బేస్ చేసుకుని తీస్తున్న చిత్రమిది. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని రెండు పాటలకు చాలా మంచి స్పందన వచ్చింది.’’ అన్నారు. క్రిష్ బండిపల్లి మాట్లాడుతూ– ‘‘ఈ స్క్రిప్ట్ కోసం ఏడాది పని చేశాను. ఆర్.ఆర్. సత్యంగారి నేపథ్య సంగీతం బాగుంది. కచ్చితంగా చెబుతున్నా ఈ చిత్రంతో నేను ఆగిపోను.. ఇంకా ఎన్నో చిత్రాలను తీస్తాను’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ప్రసన్నకుమార్, దర్శకుడు సముద్ర, హీరోయిన్ గరీమా తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఉజ్జల్, కెమెరా: హజరత్‌షేక్ (వలి). -
అఖిల కథ
జయసింహా, అక్ష జంటగా నటించనున్న చిత్రం ‘అఖిల’. మోహన్ రావ్ దర్శకత్వం వహించనున్నారు. జై చిరంజీవ ఫిలింస్ పతాకంపై శెట్టి చిరంజీవి నిర్మించనున్న ఈ చిత్రం టైటిల్‌ని నిర్మాతలు ప్రతాని రామకృష్ణ గౌడ్, ప్రసన్న కుమార్ విడుదల చేశారు. మోహన్ రావ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. హీరో జయసింహ, హీరోయిన్ అక్ష పాత్రలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటాయి. త్వరలో షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా నిర్మించనున్నారు శెట్టి చిరంజీవిగారు’’ అన్నారు. ‘‘మోహన్ రావుగారు చెప్పిన పాయింట్ బాగుంది. ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు శెట్టి చిరంజీవి. ‘‘వైవిధ్యమైన కథాంశంతో రాబోతున్న ‘అఖిల’ సినిమాతో నాకు మంచి పేరు లభిస్తుందని భావిస్తున్నా’’ అన్నారు అక్ష. ‘‘అఖిల’ సినిమాతో తెలుగులో తొలిసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. అందరి సహకారం నాకు కావాలి’’ అన్నారు జయసింహా. ఈ చిత్రానికి సంగీతం: రాజ్ కిరణ్, కెమెరా: శేఖర్. -
లాక్డౌన్ నేపథ్యంలో..
కరోనా వైరస్ వల్ల నెలకొన్న లాక్డౌన్ నేపథ్యంలో ‘లాక్డౌన్’ అనే చిత్రం రూపొందింది. ఉమాంతకల్ప, ఆశిరోయ్, హృతికా సింగ్, రాకింగ్ రాకేష్, అపూర్వ ముఖ్య పాత్రల్లో బాబా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. షేర్ సమర్పణలో మౌంట్ ఎవరెస్ట్ పిక్చర్స్ పతాకంపై మిన్నీ నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ని నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్, అట్లూరి రామకృష్ణ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘లాక్డౌన్’ సినిమాని అనుకున్న బడ్జెట్లో టైమ్‌కి పూర్తి చేయడం విశేషం. టీజర్ ఆసక్తిగా ఉంది. సినిమా సక్సెస్ అయ్యి యూనిట్ అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాం’’ అన్నారు. సమర్పకుడు షేర్ మాట్లాడుతూ–‘‘లాక్డౌన్ సమయంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని ప్రేక్షకులకు నవ్వులు పంచేలా ఈ సినిమాను తెరకెక్కించాం. అమ్మాయిలకు మా చిత్రం ఒక ధైర్యం ఇస్తుంది. ఒక మంచి సందేశంతో పాటు వినోదం ఉంటుంది. కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రమిది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్ కిషోర్, సంగీతం, స్టోరీ, స్క్రీన్ ప్లే: షేర్. -
ఏదీ శాశ్వతం కాదు
‘సహచరుడు’ చిత్ర దర్శక–నిర్మాత ప్రభాకర్ ఇప్ప ‘అనుచరుడు’ పేరుతో రెండో చిత్రానికి శ్రీకారం చుట్టారు. ప్రభు హీరోగా నటించనున్నారు. వెరీగుడ్ సినీ స్కూల్ పతాకంపై ప్రభాకర్ ఇప్ప స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ చైర్మన్ బాల మురళి, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ సంయుక్తంగా పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ‘‘ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు అనే కథాంశంతో రూపొందనున్న సందేశాత్మక చిత్రమిది. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు హీరో ప్రభు. దర్శకుడు వరకోటి, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి రిషి కుమార్, సంగీత దర్శకుడు సాయి శ్రీనివాస్, పాటల రచయిత రామారావు, కెమెరామేన్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
నిత్యావసర సరుకులు పంపిణీ
కరోనా వైరస్ ప్రభావంతో నెలకొన్న లాక్ డౌన్ నేపథ్యంలో ‘తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్’లోని 100 మంది కళాకారులకు, సాంకేతిక నిపుణులకు ‘తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్’ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సంస్థ కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ చేతుల మీదుగా వీటిని పంపిణీ చేశారు. ‘‘గతంలో కొంత మందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. మళ్లీ ఈరోజు మరో వందమందికి పంపిణీ చేయడం అభినందనీయం’’ అన్నారు బూర నర్సయ్య గౌడ్. ‘‘పది కేజీల బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు అందించాం. త్వరలో మరికొంత మందికి అందిస్తాం’’ అన్నారు ప్రతాని రామకృష్ణ గౌడ్. ఈ కార్యక్రమంలో ‘తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్’ కార్యదర్శి కాచం సత్యనారాయణ, తెలంగాణ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. -
ఆహ్లాదంగా.. హాయిగా...
శాంతి రాజు, దీపాలి రౌత్, అఖిల్ ప్రియ, సోము ఉండర్ల, శ్రావణ్ చిన్నా, రవీందర్ ముఖ్య తారలుగా వి. అంబికా విజయ్ దర్శకత్వంలో బాన వెంకట కొండారెడ్డి నిర్మించిన∙చిత్రం ‘వై తరుని రాణా’. నటుడు ‘జెమిని’ సురేష్, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్, కాశం సత్యనారాయణ, అంజనా కార్గో సీఈఓ నరేంద్ర ఈ సినిమా ఆడియో బిగ్ సీడీ, ట్రైలర్లను విడుదల చేశారు. ‘జెమిని’ సురేష్ మాట్లాడుతూ– ‘‘చిన్నా మంచి ఫోటోగ్రాఫర్. ఇప్పుడు నటుడిగా మారాడు. తనకు సినిమాలంటే ప్యాషన్. అలాంటివాళ్లు ఎప్పుడూ విజయం సాధిస్తారు. ఈ సినిమాలోని ప్రతి పాట డైరెక్టర్ వంశీగారి సినిమాల్లో ఉన్నట్లు ఆహ్లాదంగా మనసుకు హాయిగా అనిపిస్తుంది’’ అన్నారు. ‘‘నా మీద నమ్మకంతో కొండారెడ్డిగారు అవకాశం ఇచ్చారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకూడదని బెస్ట్ రిజల్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాను’’ అన్నారు అంబికా విజయ్. ‘‘మా నాన్న కొండారెడ్డిగారు ముందు ఈ సినిమా నిర్మించనన్నారు. స్టోరీ విని, స్క్రిప్ట్‌పై మేం పడుతున్న కష్టం చూసి అంగీకరించారు. మార్చిలో సినిమా విడుదల చేయనున్నాం’’ అన్నారు నిర్మాత తనయుడు బుల్రెడ్డి. శాంతి రాజు, రాయంచ, కెమెరామేన్ బాలకృష్ణ, పాటల రచయిత సుబ్రమణ్యం పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎల్.ఎం. ప్రేమ్ రాయంచ, సదా చంద్ర, కెమెరా: రామ శ్రీనివాస్, నేపథ్య సంగీతం: ఆనంద్. -
మహిళలూ జాగ్రత్త
నవీన్ .కె. చారి, ప్రియాన్స్, మేఘనా చౌదరి, సుమయ, కావ్య, శ్రీదేవి ముఖ్య పాత్రల్లో వడ్ల జనార్థన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హలో మేడమ్’. వడ్ల నాగశారద సమర్పణలో కార్తీక్ మూవీ మేకర్స్ పతాకంపై వడ్ల గురురాజ్, వడ్ల కార్తీక్ నిర్మించారు. ఈ చిత్రం లోగోని ప్రముఖ దర్శకుడు సాగర్, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ విడుదల చేశారు. ‘‘హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. విజయం సాధించాలి’’ అన్నారు సాగర్. ‘‘చిన్న సినిమాలకు థియేటర్ల సమస్య ఉంది అనేది వాస్తవం. ఎక్కువ థియేటర్లు దక్కేలా నా వంతు సహకారం అందిస్తా’’ అన్నారు ప్రతాని రామకృష్ణ గౌడ్. ‘‘తండ్రిని దర్శకుడిగా పరిచయం చేస్తూ కొడుకు సినిమా తీయడం గ్రేట్’’ అన్నారు నిర్మాత టి. రామసత్యనారాయణ. వడ్ల జనార్ధన్ మాట్లాడుతూ– ‘‘ప్రస్తుత సమాజంలో మహిళలపై ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని చెప్పే చిత్రమిది’’ అన్నారు. ‘‘దిశా ఘటనకు ముందే ఈ సినిమా చేశాం. అమ్మాయిలపై ఓ సైకో చేసే కిరాతకాలను తెలియజేస్తున్నాం’’ అన్నారు ఘటికాచలం. -
ఈఎమ్ఐ నేపథ్యంలో...
నోయల్, భానుశ్రీ జంటగా దొంతు రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఈఎమ్ఐ’. దొంతు బుచ్చయ్య, సంగీత బమ్మిడి నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని నిర్మాతలు ప్రతాని రామకృష్ణగౌడ్, ప్రసన్నకుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దొంతు రమేష్ మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ఇది. బ్యాంకాక్‌లో కొన్ని పాటలు చిత్రీకరించనున్నాం. దాంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. మా సినిమా చూసిన తర్వాత నచ్చలేదు అనే వాళ్ల ఈఎమ్ఐ నేను చెల్లిస్తాను’’ అన్నారు. ‘‘నెలవారీ వాయిదాలు చెల్లించలేక చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. ఈ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమిది. నా పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది’’ అన్నారు భానుశ్రీ. ‘‘ప్రస్తుతం ఈఎమ్ఐ అంటే తెలియనివారుండరు. ఆ నేపథ్యంలో వినోదాత్మకంగా సాగే కథ ఇది. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అని దొంతు బుచ్చయ్య, సంగీత బమ్మిడి అన్నారు. -
‘టి మా’ అభివృద్ధికి కృషి చేస్తా
‘‘నా 55ఏళ్ల సినిమా జీవితంలో ఎన్నో కష్టనష్టాలు అనుభవించాను. అయినా, ఏ రోజూ నిరుత్సాహపడలేదు. నటులు ఎప్పుడూ నిరుత్సాహ పడకూడదు’’ అని సీనియర్ నటి, ‘టి మా’ ఉపాధ్యక్షురాలు గీతాంజలి అన్నారు. తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ నూతనంగా ఏర్పాటు చేసిన ‘టి మా’ (తెలంగాణ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) కార్యవర్గ సభ్యులను హైదరాబాద్‌లో బుధవారం ప్రకటించారు. ‘టి మా’ అధ్యక్షునిగా జేవీఆర్, ఉపాధ్యక్షులుగా గీతాంజలి, నటుడు బాలాజీ, హీరో దిలీప్ రాథోడ్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గీతాంజలి మాట్లాడుతూ– ‘‘సీతారామ కళ్యాణం’ చిత్రంతో ఎన్టీరామారావుగారు సీతగా సినీ పరిశ్రమలో నాకొక మంచి గుర్తింపునిచ్చారు. ఆ పాత్ర దొరకడం నా అదృష్టం. ప్రస్తుత పరిస్థితుల్లో నటీ నటులకు మంచి వేషాలు రావడంలేదు. అలా కనిపించి ఇలా వెళ్లిపోయే పాత్రలకు ఒకటి, రెండు రోజుల కాల్ షీట్స్ అడుగుతున్నారు. ‘టి మా’ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను’’ అన్నారు. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ– ‘‘తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్‌లో 85 సినిమాలకు సెన్సార్ పూర్తి చేశాం. ఎన్నో సినిమాల టైటిల్స్‌ను రిజిస్ట్రేషన్ చేయించాం. సభ్యులకు హెల్త్‌కార్డ్స్ అందిస్తున్నాం. తెలంగాణ ఫిలిం చాంబర్ కేవలం తెలంగాణ వారికి చెందినది మాత్రమే కాదు. భారతదేశ వ్యాప్తంగా ఐదువేల మందికి పైగా నటీనటులు, సాంకేతిక నిపుణులు మా చాంబర్లో ఇప్పటికే సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే ‘తెలంగాణ స్టేట్ ఫిలించాంబర్’ ఉంది కదా అనేది కొంత మంది ప్రశ్న. అది నలభై ఏళ్లుగా ఉంది కానీ అందులో పంపిణీదారులే ప్రముఖంగా ఉంటారు. తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలిలో నిర్మాతలే ముఖ్య పాత్ర వహిస్తారు’’ అన్నారు. ‘తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్’ ఉపాధ్యక్షుడు గురురాజ్, సెక్రటరీ కాచం సత్యనారాయణ పాల్గొన్నారు. కాగా ‘టి మా’ జనరల్ సెక్రటరీగా స్నిగ్ధ మద్వాని, జాయింట్ సెక్రటరీలుగా కిరణ్, లత, ఇమ్మడి ధర్మారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా వై.శ్రీనివాస్, ఆదర్శిని, యోగి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా గుండు రవితేజ, ప్రేమ్, శ్రీశైలం, గీతాసింగ్, గాయత్రీ, మహాలక్ష్మి, టి న్యూస్ రాజేష్, ప్రవీణ, మమత, దయ ఎన్నికయ్యారు. -
టీఎఫ్‌సీసీ అధ్యక్షుడిగా ప్రతాని
‘తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్’ (టీఎఫ్‌సీసీ) ఎన్నికలు ఆదివారం హైదరాబాద్‌లో జరిగాయి. ప్రెసిడెంట్‌గా ప్రతాని రామకృష్ణ గౌడ్, ప్రధాన సలహాదారునిగా నిర్మాత ఏ.యమ్ రత్నం, వైస్ ప్రెసిడెంట్‌గా నిర్మాత గురురాజ్, రంగా రవీంద్ర గుప్తా, అలీ భాయ్, సెక్రెటరీలుగా కె.వి. రమణా రెడ్డి, కె .సత్యనారాయణ , ఆర్గనైజయింగ్ సెక్రెటరీలుగా వి. మధు, పూసల కిశోర్, రవీంద్ర గౌడ్, జాయింట్ సెక్రెటరీలుగా సతీష్, నాగరాజు గౌడ్, జి. శంకర్ గౌడ్, కోశాధికారిగా రామానుజం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటుగా ఈసీ మెంబర్స్‌గా వి. కృష్ణ రావు, హెచ్. కృష్ణ రెడ్డి, అలెక్స్, ఇ .సదాశివరెడ్డి, రాజు నాయక్, వెంకటేష్ గౌడ్, టి. శ్రీనివాస్ గౌడ్, టి. రాజేష్, ఎమ్. వెంకటేష్, ముఖావర్ వలి, మహాలక్ష్మి, బి. నాగరాజు (జడ్చెర్ల ) ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్’ ప్రెసిడెంట్ పి.రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ – ‘‘తెలంగాణ ఫిలిం ఛాంబర్ బిల్డింగ్ నిర్మాణానికి స్థలం కేటాయిస్తాం. పది ఎకరాల్లో సినీ వర్కర్స్ ఇళ్ల కోసం స్థలం కేటాయిస్తాం. కల్చరల్ సెంటర్ కోసం స్థల కేటాయింపుతో పాటు 24 శాఖల్లోని వర్కర్స్ అందరికీ పని దొరికేలా చూస్తాం. త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారిని కలిసి ఇవ్వన్నీ ప్రభుత్వం ద్వారా చేయాలని తీర్మానించుకున్నాం’’ అన్నారు. -
ప్రభుత్వం దృష్టికి చిత్రపురి సమస్యలు
‘‘చిత్రపురి కాలనీలో 24 క్రాఫ్ట్స్‌లో పనిచేస్తున్న సినీ కార్మికులకు కాకుండా సినిమాయేతరులకు ఇళ్లు కేటాయించారు. సుమారు 5 వేలకుపైగా నిజమైన సినీకార్మికులకు ఇళ్లు కేటాయించాల్సి ఉంది. దీనికోసం ‘చిత్రపురి పోరాట సమితి’ చేస్తున్న దీక్షల్లో న్యాయం ఉంది’’ అని తెలంగాణ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు. చిత్రపురి కాలనీలో ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని, చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ కార్యవర్గ సభ్యుల అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని ‘చిత్రపురి పోరాట సమితి’ ఆధ్వర్యంలో చేస్తున్న నిరాహార దీక్షకు ప్రతాని రామకృష్ణ గౌడ్ బుధవారం మద్దతు పలికారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘26 రోజులుగా దీక్షలు చేపడుతున్నా హౌస్‌ంగ్ సొసైటీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. సినీ కార్మికులకు ఇచ్చిన స్థలాన్ని ‘కైరోస్ గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్’కి కేటాయించడం చట్ట విరుద్ధం, వెంటనే ఆ స్కూల్‌ను తొలగించాలి. ఈ సొసైటీలో జరిగిన అవకతవకలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వం కేటాంచబోయే 9 ఎకరాలను ‘చిత్రపురి పోరాట సమితి’కి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతాం’’ అన్నారు. కాగా ధర్నాలో పాల్గొంటున్నారనే కారణంతో షూటింగ్‌లకు పిలవని కొందరు సినీ కార్మికులకు ప్రతాని రామకృష్ణ గౌడ్ బియ్యం వితరణ చేశారు. ‘‘న్యాయం కోసం పోరాటం చేసే వారిని బెదిరిస్తున్నారని, ఎవరు బెదిరించినా న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం’’ అని ‘చిత్రపురి పోరాట సమితి సభ్యుడు’, డైరెక్టర్ కస్తూరి శ్రీనివాస్ అన్నారు. బి నరసింహా రెడ్డి, మహేందర్, ఓ. రవిశంకర్, మురళితో పాటు పలువురు సినీకార్మికులు పాల్గొన్నారు. -
నిర్మాతల మండలి ఎన్నికలు వద్దు
‘‘నిర్మాతల మండలి ఎన్నికల కోసం డబ్బు ఖర్చు చేసే బదులు అందరూ ఒక్కటిగా ప్యానల్‌ని ఎన్నుకుంటే బాగుంటుంది. ఈ విషయంపై తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ రామ్మోహనరావు, నిర్మాత సురేశ్‌బాబుతో కూడా మాట్లాడాను. చాలా మంది నిర్మాతల అభిప్రాయం కూడా ఇదే’’ అని తెలంగాణ ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్, నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు. తెలుగు ఫిలిం చాంబర్ నిర్మాతల మండలి ఎన్నికలు ఈ నెల 30న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతాని రామకృష్ణ గౌడ్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఎన్నికల విషయంలో ఇటీవలే నిర్మాతల మండలి సమావేశం జరిపి రెండు ప్యానల్స్‌ని ఎంపిక చేసింది.ఆ తర్వాత కొన్ని నాటకీయ పరిణామాల మధ్య రెండు ప్యానల్స్ ఒక్కటయ్యాయి. అందులో కొందరిని పక్కన పెట్టారు. నిర్మాతల మండలి బాగా ఉంటున్న క్రమంలో కొందరు కావాలని సమస్యలు సృష్టిస్తున్నారు. ఇప్పటికే కొందరు ఎల్.ఎల్. పి అంటూ చానల్స్ విషయంలో సపరేట్గా ఉండటంతో కౌన్సిల్‌కు వచ్చే ఆదాయం తగ్గింది. ఆ సమస్యను పరిష్కరిస్తామని నిర్మాత సి. కళ్యాణ్‌గారు చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నేడు ఉపసంహరణ చేసుకుంటే బాగుంటుంది. ఎన్నికల ముందే అందరు పెద్ద వాళ్లతో కూర్చుని నిర్మాతల మండలి ప్యానల్‌ని ఎంపిక చేస్తే బాగుంటుంది. నేడు నేను ఉపసంహరణ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాను, మీరు కూడా ముందుకు రావాలి’’ అన్నారు. ఈ సమావేశంలో నిర్మాతలు శంకర్ గౌడ్, జేవీఆర్, సాయి వెంకట్‌లతో పాటు మరికొందరు నిర్మాతలు పాల్గొన్నారు. -
తండ్రీ కూతుళ్ల అనుబంధం
తరుణ్ తేజ్, లావణ్య జంటగా నవీన్ నాయని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉండిపోరాదే’. డా.లింగేశ్వర్ నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ– ‘‘తండ్రీ, కూతుళ్ల మధ్య అనుబంధంపై సినిమా అంటే ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. ఇటీవల కాలంలో చిన్న సినిమాలు, కొత్త వాళ్లతో చేసే సినిమాలు బాగా ఆడుతున్నాయి. ఈ సినిమా కూడా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఉండిపోరాదే...’ పాట ఎంతో ప్రజాదరణ పొందింది. దాన్ని సినిమా టైటిల్‌గా పెట్టడంతోనే సగం సక్సెస్ అయ్యారు దర్శక–నిర్మాతలు’’ అన్నారు ఏపీ ఫిల్మ్‌చాంబర్ సెక్రటరీ మోహన్ గౌడ్. నవీన్ నాయని మాట్లాడుతూ– ‘‘పక్కింటి అమ్మాయి జీవితం చూసినట్టుగా మా సినిమా ఉంటుంది. తండ్రీ కూతుళ్ల మధ్య సాగే ఎమోషనల్ డ్రామా అందరికీ కనెక్ట్ అవుతూ, మనసులు కదిలించేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘మన జీవితంలో మధ్యలో ఎంత మంది వచ్చినా చివరి వరకూ మనల్ని ప్రేమించేది తల్లిదండ్రులే అనే సందేశంతో రూపొందిన చిత్రమిది’’ అని డా. లింగేశ్వర్ చెప్పారు. తరుణ్ తేజ్, లావణ్య, మాటల రచయిత సుబ్బారాయుడు బొంపెం, సంగీత దర్శకుడు సబు వర్గీస్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళలు తలచుకుంటే...
ఆర్.కె. ఫిలిమ్స్ బ్యానర్‌పై ప్రతాని రామకృష్ణ గౌడ్ స్వీయ దర్శకత్వంలో రచనా స్మిత్, కావ్యారెడ్డి ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మహిళా కబడ్డీ’. శనివారం రామకృష్ణగౌడ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘మహిళా కబడ్డీ’ పోస్టర్‌ను తెలంగాణ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ బాలమల్లు విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘గౌడ్ నాకు చాలా కాలం నుంచి మిత్రుడు. ఆయన తీస్తున్న ‘మహిళా కబడ్డీ’ చిత్రంలోని పాటలను విన్నాను. ఎంతో బావున్నాయి. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అని చాటి చెప్పే సినిమా ఇది’’ అన్నారు. రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ– ‘‘పాటల రికార్డింగ్ పూర్తయింది. గీతా మాధురి, మంగ్లీ, మధుప్రియ లాంటి ప్రముఖ గాయనీ మణులు పాడిన ఆరు పాటలను రికార్డ్ చేసాం. దాంతోపాటు ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. జూన్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. ఓ సాధారణ పల్లెటూరి అమ్మాయి కబడ్డీలో జాతీయ స్థాయిలో ఎలా నిలిచింది? ఆమె జర్నీలో ఉన్న సమస్యలు, మలుపులు ఏమిటి అన్న ఆసక్తికర అంశాలతో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రాజ్ కిరణ్. -
మనిషిని దెయ్యం ప్రేమిస్తే...
‘‘ఈ రోజుల్లో చిన్న సినిమాలు విడుదల కావడం చాలా కష్టంగా మారింది. వీటి మనుగడ ఉన్నప్పుడే పరిశ్రమ పచ్చగా ఉంటుంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం చిన్న సినిమాల కోసం ఓ ప్రత్యేక చానల్‌ను ఏర్పాటు చేస్తోంది. శాటిలైట్ రైట్స్ వైజ్‌గా చిన్న సినిమాలకు ఇది మంచి అవకాశం’’ అని నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు. సుజయ్, చంద్రకాంత్, తనిష్క, రష్మీ, సోని ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘నాకు మనసున్నది’. రాజశేఖర్ దర్శకత్వంలో సాయి హాసిని ప్రొడక్షన్స్ పతాకంపై నాన్చేరి దేవా శంకర్‌గౌడ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రతాని రామకృష్ణ గౌడ్ ట్రైలర్ రిలీజ్ చేసారు. రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘ఒక దెయ్యం మనిషిని ప్రేమిస్తే ఎలా ఉంటుందన్న ఆసక్తికర కథాంశంతో సాగే సినిమా ఇది. సినిమా పూర్తయి చాలా రోజులవుతున్నా విడుదల పెద్ద టెన్షన్‌గా మారింది. నిర్మాత సాయి వెంకట్‌గారు, ప్రతానిగారు, డైరెక్టర్ సిరాజ్ సపోర్ట్‌తో ఈ నెల 20న విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఇప్పటి వరకూ ఎన్నో దెయ్యం సినిమాలు వచ్చాయి. కానీ, మా సినిమా చాలా కొత్తగా ఉంటుంది’’ అన్నారు చిత్ర నిర్మాత శంకర్ గౌడ్. నిర్మాత సాయి వెంకట్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఉదయ్ శంకర్, కెమెరా: వెంకీ పెద్దాడ. -
ప్రతానికి డాక్టరేట్
తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్, నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ ‘యునైటెడ్ ధియోలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ’ (యుటిఆర్) నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ బర్కిలీకి అనుబంధంగా గుర్తింపు పొందిన యుటిఆర్ యూనివర్సిటీ రామకృష్ణ గౌడ్, నటుడు సుమన్‌లను గౌరవ డాక్టరేట్‌కి ఎంపిక చేసింది. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య, తెలంగాణ శాసన మండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ చేతుల మీదుగా రామకృష్ణ గౌడ్ గౌరవ డాక్టరేట్, 51వేల నగదు అందుకున్నారు. ఐదు వేల మంది సినీ కార్మికులకు హెల్త్ కార్డ్స్, ఐదు లక్షల ఉచిత బీమా కల్పించడంతో పాటు రెండు వందల మంది సినీ వర్కర్లకు గృహాలు ఇప్పించారు ప్రతాని. సినిమారంగంలో ఆయన చేసిన సోషల్ సర్వీస్‌కి గాను ఈ డాక్టరేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రతానికి అభినందనలు తెలిపారు. ‘‘గౌరవ డాక్టరేట్ అందుకోవడం ఆనందంగా ఉంది’’ అని ప్రతాని అన్నారు. -
కొందరి వల్ల చిత్రసీమకు చెడ్డ పేరు: నటి
సాక్షి, సిటీబ్యూరో : తెలుగు చిత్రసీమలోని కొందరు ప్రముఖులకు డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో నోటీసులు రావడంపై తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైన డ్రగ్స్ సమస్యపై ఆయన మాట్లాడుతూ.. ‘డ్రగ్స్ కేసులో బడా నిర్మాతల పిల్లలకు బదులు ఇతరుల పేర్లు వస్తున్నాయని కొందరు విమర్శించడం కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఈ విషయంపై సీరియస్‌గా ఉంది. తప్పు చేసిన వారు ఎవరైనాసరే శిక్షింపబడతారు. ఎక్సైజ్ డీజీ అకున్ సబర్వాల్ ఈ కేసును చాలా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నోటీసులు అందుకున్న వారందరూ దోషులు కారు. తప్పు చేయనివారికి తెలంగాణ ఫిల్మ్ చాంబర్ సపోర్ట్ ఉంటుంది’ అన్నారు. ‘కొందరి వల్ల తెలుగు చిత్రసీమకు చెడ్డ పేరొస్తుంది. డ్రగ్స్ పంపిణీ చేసే పబ్‌లను తక్షణం క్లోజ్ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. సినిమా అవకాశాలు రాలేదని డ్రగ్స్‌కు బానిసలు కావడం సరికాదని’ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ప్రెసిడెంట్ కవిత అన్నారు. -
ఉచితంగా హెల్త్ కార్డులు
– టీఎఫ్‌సీసీ అధ్యక్షుడు ప్రతాని తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) తృతీయ వార్షికోత్సవాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ప్రతాని రామకృష్ణ గౌడ్, ఉపాధ్యక్షుడిగా జేవీఆర్, సెక్రటరీగా సాయి వెంకట్‌తో పాటు 23 మంది జనరల్ బాడీ మెంబర్స్‌ను ఎన్నుకుని, ప్రమాణస్వీకారం చేయించారు. అదే విధంగా తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా సీనియర్ నటి కవితను, సెక్రటరీగా జెవీఆర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా 100 మంది సినీ, టీవీ నటీనటులు, కార్మికులకు ఐదు లక్షల బీమాతో కూడిన కేంద్ర ప్రభుత్వ హెల్త్ కార్డులు అందించారు. అనంతరం ప్రతాని మాట్లాడుతూ– ‘‘సినీ, టీవీ నటీనటులు, టెక్నీషియన్స్‌లో హెల్త్ కార్డుల కోసం తెలంగాణ ఫిల్మ్ చాంబర్లో దరఖాస్తు చేసుకుంటే ఉచితంగా హెల్త్ కార్డులు, చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్స్ ఇప్పిస్తాం. సభ్యులందరికీ తెలంగాణ ప్రభుత్వం నుంచి రెండు పడక గదుల ఇళ్లు ఇప్పించేందుకు కృషి చేస్తాం’’ అన్నారు. -
నిరవధిక నిరాహారదీక్షకు సిద్ధమే
‘‘తెలుగులో చిన్న సినిమాల నిర్మాతలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. సెన్సార్ జరిగినా థియేటర్ల సమస్యలతో తమ సినిమాలను విడుదల చేయలేకపోతున్నారు. ఈ సమస్యను తొందరగా పరిష్కరించకపోతే నిర్మాతలు, టెక్నిషియన్లతో కలసి నిరవధిక నిరహారదీక్ష చేస్తాం’’ అన్నారు తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి (టీఎఫ్‌సీసీ) చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్. ఇంకా ఆయన మాట్లాడుతూ –‘‘తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాను. నలుగురు నిర్మాతల గుప్పెట్లో థియేటర్లు ఉన్నాయి. వాళ్లు డిజిటల్ వ్యవస్థను తమ చేతుల్లో పెట్టుకుని చిన్న నిర్మాతలను ముంచుతు న్నారు. థియేటర్ల లీజ్ సిస్టమ్ వల్ల చిన్న సినిమాలను విడుదల చేయలేకపోతున్నారు’’ అన్నారు. ప్రభుత్వాలు ఈ సమస్యపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని టీఎఫ్‌సీసీ కార్యదర్శి సాయివెంకట్, తెలంగాణ ఆర్టిస్టుల సంఘం కార్యదర్శి జేవీఆర్ కోరారు. -
ప్రభుత్వాన్నే మోసం చేస్తున్నారు
‘‘తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టి.ఎఫ్.సి.సి.) ఏర్పాటు చేసి నాలుగేళ్లవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు ఉంది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో మేమూ ఉన్నాం. అయితే తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థలకు మాత్రమే ప్రభుత్వ గుర్తింపు ఉందని చెప్పడం తగదు’’ అన్నారు టి.ఎఫ్.సి.సి. చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్. బుధవారం ఆయన మాట్లాడుతూ– ‘‘టీఎఫ్‌సీసీలో ఇప్పటికి అమ్మకు ప్రేమతో, దీక్ష, చిన్న చిన్న ఆశ, కోమలి సినిమాలు సెన్సార్ కాగా, 10 సినిమాలు సెన్సార్‌కు రెడీగా ఉన్నాయి. అలాంటి మా సంస్థకు గుర్తింపు లేదనడం సరికాదు. మా సంస్థలో వెయ్యిమంది దర్శక–నిర్మాతలు, 3 వేల మంది టెక్నీషియన్స్ సభ్యులుగా ఉన్నారు. పక్క రాష్ట్రాల్లో డిజిటల్ చార్జీలు వారానికి 2500 ఉంటే మన దగ్గర వారానికి సుమారు 13,000 వసూలు చేస్తున్నారు. నెలకు దాదాపు 15 కోట్లు కొల్లగొడుతూ కొందరు నిర్మాతలు ప్రభుత్వాన్నే మోసం చేస్తున్నారు’’ అన్నారు. -
ఇది అగ్ర నిర్మాతల కుట్ర - ప్రతాని రామకృష్ణ గౌడ్
‘‘మంగళవారం నాడు జరిగిన నిర్మాతల సెక్టార్ చైర్మన్ ఎన్నికల్లో నన్ను చైర్మన్ పదవి నుంచి అప్రజాస్వామికంగా తొలగించారు’’ అని నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ - ‘‘ఇతర రాష్ట్రాల్లో క్యూబ్, యుఎఫ్ఓ, పిఎక్స్‌డి పద్ధతుల ద్వారా చిత్రాన్ని విడుదల చేయడానికి రూ.3 వేలు వసూలు చేస్తుండగా.. తెలుగులో రూ.11 వేలు వసూలు చేస్తున్నారు. తద్వారా చిన్న నిర్మాతలు చాలా నష్టపోతు న్నారు. కమిటీ వేసి, ఈ విషయంలో ఓ నిర్ణయానికి రావాలని నేను కోరుతుంటే జాప్యం చేస్తున్నారు. ఎందుకంటే క్యూబ్‌లో అల్లు అరవింద్, యుఎఫ్ఓ లో సురేశ్‌బాబు పార్టనర్స్. అలాగే, నిర్మాత విజయేందర్ రెడ్డితో నాకు థియేటర్ల విషయంలో పలుమార్లు గొడవ జరిగింది. ఇప్పుడు అగ్ర నిర్మాతలిద్దరూ వెనక ఉండి విజయేందర్ని ముందుకు నడిపించి, నన్ను నిర్మాతల సెక్టార్ చైర్మన్ పదవి నుండి తొలగించారు’’ అని ఆరోపించారు.