Rafale fighter jets
-
ఈశాన్యంలో వైమానిక విన్యాసాలు ప్రారంభం
న్యూఢిల్లీ: ఈశాన్య ప్రాంతంలో భారత వైమానిక దళం(ఐఏఎఫ్) విన్యాసాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రఫేల్ జెట్లతో సహా ఈస్ట్రన్ ఎయిర్ కమాండ్ పరిధిలోఉన్న సుఖోయ్–30 యుద్ధవిమానం, ఇతర అత్యాధునిక యుద్ధ విమానాలు ఇందులో పాల్గొంటున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో వాస్తవాధీన రేఖ వద్ద చైనా సైనికుల చొరబాటు యత్నం నేపథ్యంలో ఈ విన్యాసాలు ప్రారంభం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారమే ఇవి జరుగుతున్నాయని, సైనికుల ఘర్షణతో వీటికి సంబంధం లేదని భారత వైమానిక దళం స్పష్టం చేసింది. విన్యాసాలు శుక్రవారం ముగియనున్నాయి. ఇదిలా ఉండగా, 36 రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి భారత్‌కు చేరుకున్నాయని ఐఏఎఫ్ ట్వీట్ చేసింది. దీంతో ఒప్పందం మేరకు మొత్తం విమానాలు వచ్చినట్లయ్యిందని పేర్కొంది. -
‘రఫేల్’పై ఆధారాలున్నా మౌనమెందుకు?
న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతి వ్యవహారం సెగలు రాజేస్తూనే ఉంది. రఫేల్ ఫైటర్జెట్ల సరఫరా కాంట్రాక్టును దక్కించుకొనేందుకు ఫ్రాన్స్ యుద్ధ విమానాల తయారీ సంస్థ ‘డసాల్ట్ ఏవియేషన్’ భారత్‌కు చెందిన సుశేన్ గుప్తా అనే మధ్యవర్తికి 2007–12కాలంలో కమీషన్ల కింద 7.5 మిలియన్ యూరోలు(రూ.65 కోట్లు) చెల్లించినట్లు ఫ్రెంచ్ పరిశోధన పత్రిక ‘మీడియాపార్ట్’ ఆరోపించింది. కమీషన్లు చేతులు మారడానికి వీలుగా డొల్ల కంపెనీల పేరిట నకిలీ రశీదులను సృష్టించి వాడారంది. ఆ రశీదులను ప్రచురించింది. అయితే, దీనిపై భారత రక్షణ శాఖ గానీ, డసాల్ట్ ఏవియేషన్ స్పందించలేదు. యూపీఏ సర్కారు హయాంలో కుదిరిన పాత ఒప్పందాన్ని రద్దు చేసి, రూ.59వేల కోట్లతో 36 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి భారత ప్రభుత్వం 2016లో ఫ్రాన్స్ ప్రభుత్వంతో కొత్త ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ కొనుగోలు వెనుక భారీగా అవినీతి జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రఫేల్ డీల్‌లో అవినీతికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ భారత్‌లోని దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ ఎందుకు మౌనంగా ఉంటున్నాయని మీడియాపార్ట్ ప్రశ్నించింది. రఫేల్ ఒప్పందంలో విదేశీ కంపెనీలు, మోసపూరిత కాంట్రాక్టులు, నకిలీ రశీదుల ప్రమేయం కనిపిస్తోందని, 2018 అక్టోబర్ నుంచి ఆధారాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. అయినా విచారణ జరపొద్దని సీబీఐ, ఈడీ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోందని మీడియాపార్ట్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఒక్కో రఫేల్ ఫైటర్‌జెట్‌ను రూ.526 కోట్లకు కొనుగోలు చేసేందుకు యూపీఏ ప్రభుత్వ హయాంలో ఒప్పందం కుదిరిందని, ఎన్డీయే ప్రభుత్వం మాత్రం ఒక్కో విమానాన్ని రూ.1,670 కోట్లకు కొంటోందని, ఇందులో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. రఫేల్ ఒప్పందంలో యూపీఏ ప్రభుత్వ హయాంలోనే కమీషన్లు చేతులు మారాయని బీజేపీ నేత అమిత్ మాలవియా చెప్పారు. -
రఫేల్‌పై సందేహాలు!
రక్షణ కొనుగోళ్ల ఒప్పందాలపై కుంభకోణం ఆరోపణలు వచ్చాయంటే, అవి అంతూ దరీ లేకుండా అందులో కొట్టుమిట్టాడుతూనే వుంటాయని లోగడ బోఫోర్స్ స్కాం నిరూపించింది. రఫేల్ ఒప్పందం కూడా ఆ బాటలోనే పయనిస్తోందని తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. మన వైమానిక దళానికి యుద్ధ వేళల్లో సమర్థవంతంగా తోడ్పడగలదని భావించిన రఫేల్ విమానాల దిగుమతికి 2016లో మన దేశం ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. రూ. 59,000 కోట్ల విలువైన ఆ ఒప్పందం కింద భారత్‌కు 36 యుద్ధ విమానాలు అందించటానికి ఆ దేశం అంగీకరించింది. ఆ ఒప్పందానికి అనుగుణంగా నిరుడు జూలైలో తొలి విడతగా అయిదు విమానాలు మన దేశానికి చేరు కున్నాయి. అయితే అందులో కొంత మొత్తం చేతులుమారిందంటూ ఫ్రాన్స్‌కు చెందిన ‘మీడియా పార్ట్’ అనే ఆన్లైన్ సంస్థ చెబుతోంది. ఆ ఒప్పందంపై సంతకాలయ్యాక భారత్‌లోని మధ్యవర్తికి రఫేల్ ఉత్పత్తిదారైన డసాల్ట్ సంస్థ పది లక్షల యూరోలు చెల్లించటానికి అంగీకరించిందని, ‘ఖాతాదారులకు బహుమతులు’ పేరిట 5,08,925 యూరోలు ఆ మరుసటి ఏడాది చెల్లించారని ఆ సంస్థ ఆరోపిస్తోంది. సరిగ్గా 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్లమెంటుకు సమర్పించిన కాగ్ నివేదిక రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చింది. 2007లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఇవే యుద్ధ విమానాల కోసం ఖరారు చేసుకున్న ధరతో పోలిస్తే 2.86 శాతం తక్కువని తేల్చింది. ఈ విషయంలో దర్యాప్తు అవసరమేమీ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతా సమసిపోయిందనుకుంటున్న తరుణంలో సోమవారం ‘మీడియా పార్ట్’ వెల్లడించిన ముడు పుల వ్యవహారం దానికి మళ్లీ ప్రాణ ప్రతిష్ట చేసింది. అయితే ఈసారి విపక్షాలు కోరుకున్న స్థాయిలో దీనిపై రచ్చ సాగలేదు. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో కూడా జనం పెద్దగా దీన్ని పట్టించుకున్న దాఖలా లేదు. ఇందుకు భిన్నంగా బోఫోర్స్ స్కాంపై హడావుడి దీర్ఘ కాలం కొనసాగింది. 1988లో తొలిసారి స్వీడన్ రేడియో బోఫోర్స్ శతఘ్నుల కొనుగోలులో రూ. 64 కోట్లు చేతులు మారాయని వెల్లడించగానే దేశంలో పెను దుమారం లేచింది. అనంతరం 1989లో జరిగిన 9వ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పాలైంది. ఇరవై ఆరేళ్లపాటు ఆ స్కాంకు సంబం ధించి అనేకానేక అంశాలు బయటపడుతూ చివరికి 2013లో ఇటలీకి చెందిన కీలక పాత్రధారి ఒట్టా వియో కత్రోకీ మరణం తర్వాత కనుమరుగైంది. వాస్తవానికి అంతకు రెండేళ్లముందే బోఫోర్స్ దర్యాప్తు తమ వల్ల కాదని ఢిల్లీ హైకోర్టుకు సీబీఐ విన్నవించుకుంది. దాంతో పోలిస్తే రఫేల్ స్కాం హడావుడి దాదాపు లేదనే చెప్పాలి. ముడుపులు చేతులు మారాయా లేదా అన్నదే ముఖ్యం తప్ప బోఫోర్స్ స్కాంతో పోలిస్తే రఫేల్ వ్యవహారంలో ముడుపులు చాలా చిన్న మొత్తం. ‘మీడియా పార్ట్’ చెబుతున్న ప్రకారం మన కరె న్సీలో అది దాదాపు రూ. 9 కోట్లు. అయితే ముడుపుల మొత్తం ఎంతన్నది కాదు... అదెలా బయ టపడిందన్నదే కీలకం. ఫ్రాన్స్ అవినీతి వ్యతిరేక విభాగం(ఏఎఫ్ఏ) డసాల్ట్ కంపెనీకి చెందిన 2017నాటి ఖాతాలను ఆడిట్ చేస్తున్నప్పుడు రాఫేల్ యుద్ధ విమానానికి చెందిన 50 డమ్మీ నమూనాలు తయారుచేసిన సంస్థకు ఈ మొత్తం చెల్లించినట్టు గుర్తించారు. ఈ విషయాన్ని గమ నించిన ఏఎఫ్ఏ అధికారి ఫ్రెంచ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ సర్వీసెస్‌కు చెందిన ఆర్థిక నేరాల విభాగానికి తెలియజేయగా ‘దేశ ప్రయోజనాలరీత్యా’ ఇందులో దర్యాప్తు అనవసరమని ఆ విభాగం చీఫ్ ఎలినా హౌలెట్ వ్యాఖ్యానించినట్టు చెబుతున్నారు. ముడుపుల మొత్తాన్ని ‘డెఫ్సిస్’(డిఫెన్స్ సిస్టమ్స్) అనే భారత సంస్థకు చెల్లించినట్టు డసాల్ట్ ఖాతాలో నమోదైంది. ఒక్కో నమూనాకు 20,357 యూరోలు (మన కరెన్సీలో రూ. 18 లక్షలు) చొప్పున చెల్లించటం వింతగానే అనిపిస్తుంది. ఆ ధరను బట్టి చూస్తే ఒక్కో నమూనా కనీసం కారు సైజులోనైనా వుండాలి. ఇంకా విచిత్రమేమంటే ఆ నమూ నాలను పంపినట్టు తెలిపే పత్రాలుగానీ, డసాల్ట్ వాటిని అందుకున్నట్టు తెలిపే పత్రాలుగానీ లేవు. పైగా ఈ వ్యయాన్ని ఖాతాదారులకు ఇచ్చిన కానుకలుగా చూపడం మరింత మిస్టరీ. వీటి సంగ తలావుంచి అగస్టావెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల స్కాంలో ఇరుక్కుని గతంలో అరెస్టయిన సుసేన్ గుప్తాతో ఈ ‘డెఫ్సిస్’ సంస్థకు సంబంధాలుండటం ఆసక్తికరం. ఈ విషయంలో పరిశోధన సాగించిన ‘మీడియా పార్ట్’ పాత్రికేయుడు యాన్ ఫిలిప్పీన్ ఇంకో రెండు భాగాలున్నాయంటున్నాడు. ఫ్రాన్స్‌లోని ఒక చిన్న ఆన్లైన్ మీడియా సంస్థ రఫేల్ వ్యవహారంలో ఇంత శ్రద్ధగా పరిశోధన సాగించటం, కొన్ని ఆసక్తికర అంశాలు బయటపెట్టడం ఆశ్చర్యకరమే. మన ప్రభుత్వాలు ఎన్ని పటిష్టమైన చర్యలు తీసుకున్నామని చెబుతున్నా రక్షణ కొనుగోళ్లకు దళారుల బెడద మాత్రం తప్పడం లేదని తాజా సమాచారం వెల్లడిస్తోంది. ఫ్రాన్స్ ప్రభుత్వానికి హామీ ఇవ్వటంవల్లా, దేశ వ్యూహాత్మక ప్రయోజనాలు ఇమిడివున్నందువల్లా విమానాల ధర వెల్లడించటం సాధ్యంకాదని కేంద్రం లోగడ తెలిపింది. కారణాలేమైనా పారదర్శకత లేనప్పుడు రకరకాల కథనాలు గుప్పు మనడం సహజమే. ఇప్పుడు ‘మీడియా పార్ట్’ చేసింది కూడా అదే. ఫ్రాన్స్ ఆర్థిక నేరాల విభాగం చీఫ్ ఈ వ్యవహారంలో దర్యాప్తు ఎందుకు అవసరం లేదనుకున్నారో, ఇందులో దేశ ప్రయోజనాలతో ముడిపడివుండే అంశాలు ఏముంటాయో ఫ్రాన్స్ ప్రభుత్వమే చెప్పాలి. అంతవరకూ ఈ ఒప్పం దంపై సందేహాలు వెల్లువెత్తుతూనే వుంటాయి. -
భారత్‌కు రానున్న మరో మూడు రఫెల్ యుద్ధ విమానాలు
కొచ్చి: భారత వాయుసేనకు సేవలందించేందుకుగాను ఫ్రాన్స్ నుంచి కొత్తగా మరో మూడు రఫెల్ యుద్ధ విమానాలు బుధవారం రోజు రానున్నాయి. ఈ యుద్ధవిమానాలు రాత్రి 7 గంటలకు గుజరాత్లో ల్యాండ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇవి అంబాలాలోని గోల్డెన్ ఆరోస్ స్క్వాడ్రన్ శిబిరంలో చేరనున్నాయి. రఫెల్ యుద్ధవిమానాలు ఫ్రాన్స్ నుంచి నేరుగా భారత్‌కు రానున్నాయి. యూఏఈ మధ్యలో గాల్లోనే మిడ్-ఎయిర్ రీ ఫ్యూలింగ్ చేసుకుంటాయి. వీటి చేరికతో స్క్వాడ్రన్‌లోని యుద్ధ విమానాల సంఖ్య 14 కు చేరనుంది. కాగా, తొమ్మిది రాఫెల్ ఫైటర్ జెట్ల తదుపరి బ్యాచ్ ఏప్రిల్‌లో రానుంది. వీటిలో ఐదింటిని పశ్చిమ బెంగాల్‌లోని హషిమారా ఎయిర్‌బేస్‌లో చేర్చుతారు.ఏప్రిల్ చివరి నాటికి ఐదు అదనపు రాఫెల్ జెట్లను భారత్‌కు వస్తాయని ఫ్రాన్స్ రాయబారి ఇమ్మాన్యుయేల్ లెనైన్ మంగళవారం పేర్కొన్నారు. కొచ్చిలో ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. కోవిడ్-19 మహామ్మారి ఉన్నప్పటికీ అనుకున్న సమయంలో యుద్ధ విమానాలను సరఫరా చేశామని తెలిపారు. రాఫెల్ ఫైటర్ జెట్ రెండు ఎమ్88-3 సఫ్రాన్ ఇంజన్లను కలిగి ఉంది. ఈ ఇంజన్లు సుమారు 73 కిలో న్యూటన్ల థ్రస్ట్‌ను ఇవ్వగలవు. అంతేకాకుండా స్మార్ట్ ఆయుధ వ్యవస్థను కలిగి ఉంది. ఈ యుద్ధ విమానం గత ఏడాది జూలై, ఆగస్టులలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరాయి. అతి తక్కువ సమయంలో వైమానిక దళం వీటి ఆపరేషన్‌కు అనుమతులు లభించాయి.తూర్పు లడఖ్, ఇతర ప్రాంతాలలో, పెట్రోలింగ్ కోసం మోహరించారు. 2016 సెప్టెంబరులో ఫ్రాన్స్ నుంచి 36 యుద్ధ విమానాలను భారత్ ఆర్డర్‌చేసిన విషయం తెలిసిందే. Total in 2022, the 36 aircraft will have been delivered as per contract: French Envoy to India Emmanuel Lenain https://t.co/yS2sKtxBDQ — ANI (@ANI) March 30, 2021 చదవండి: ‘గోల్డెన్ గర్ల్’ శివాంగి సింగ్ -
చరిత్ర సృష్టించిన శివాంగి సింగ్
న్యూఢిల్లీ: వైమానిక దళంలో చేరిన అత్యాధునిక రఫేల్ ఫైటర్ జెట్ల దళంలోకి అడుగుపెట్టనున్న మహిళా పైలట్ ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. అంబాలా కేంద్రంగా పనిచేసే ‘గోల్డెన్ యారోస్’ 17 స్క్వాడ్రన్‌లోకి ఎంపికైన తొలి మహిళగా ఫ్లైట్ లెఫ్టినెంట్ శివాంగి సింగ్ చరిత్ర సృష్టించారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా శివాంగికి అభినందనలు తెలుపుతూ.. ‘‘దేశమంతా నిన్ను చూసి గర్విస్తోంది’’ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. కాగా వారణాసికి చెందిన శివాంగి 2017లో భారత వైమానిక దళంలో చేరారు. మిగ్-21 బైసన్ యుద్ధ విమానాలు నడిపిన అనుభవం ఆమె సొంతం. రాజస్తాన్ బార్డర్ బేస్‌లో అభినందన్ వర్ధమాన్‌తో కలిసి ఫైటర్ జెట్లు నడిపిన శివాంగి త్వరలోనే రఫేల్ స్క్వాడ్రన్‌లో చేరేందుకు అంబాలాలో అడుగుపెట్టనున్నారు. (చదవండి: నావికా నాయికలు) ఇక వారణాసిలో ప్రాథమిక విద్యనభ్యసించిన శివాంగికి చిన్ననాటి నుంచే వైమానిక దళంలో చేరాలని కలలు కనేవారు. బెనారస్ హిందూ యూనివర్సిటీలో చేరిన అనంతరం తన ఆశయాన్ని నెరవేర్చుకునే దిశగా అడుగులుపడ్డాయి. అక్కడే నేషనల్ క్యాడెట్ కార్స్ప్ 7 యూపీ ఎయిర్ స్వాడ్రాన్‌లో భాగస్వామ్యమయ్యే అవకాశం లభించింది. ఈ క్రమంలో 2016లో ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో చేరి శిక్షణ ప్రారంభించారు. కాగా భారత్- చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో రఫేల్ ఫైటర్ జెట్లు తూర్పు లద్ధాక్‌లో విధుల్లో పాల్గొంటున్నాయి. ఇక ఫ్రాన్సులో తయారైన 5 రఫేల్ ఫైటర్ జెట్లు ఈనెల 10న అంబాలా వైమానిక స్థావరం కేంద్రంగా పనిచేస్తున్న గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్‌లో అధికారికంగా చేరిన విషయం తెలిసిందే. -
రఫేల్‌కు మహిళా పైలట్
న్యూఢిల్లీ: వైమానిక దళంలో ఇటీవలే చేరిన అత్యాధునిక రఫేల్ ఫైటర్ జెట్ల దళంలోకి త్వరలో మహిళా పైలట్ ఒకరు చేరనున్నారు. మిగ్–21 ఫైటర్ జెట్ల మహిళా పైలట్ ఒకరు అంబాలా కేంద్రంగా పనిచేసే గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్‌లోకి ఎంపికయ్యారని భారత వైమానిక దళం(ఐఏఎఫ్) అధికారి ఒకరు తెలిపారు. రఫేల్ ఫైటర్ జెట్ పైలట్ కోసం చేపట్టిన అత్యంత కఠినమైన పరీక్షల్లో ఎంపికయిన ఈ మహిళా పైలట్ ప్రస్తుతం శిక్షణ పొందుతున్నారని ఆ అధికారి వెల్లడించారు. అత్యంత సమర్థమైనవిగా పేరున్న రఫేల్ యుద్ధ విమానాలకు మహిళా పైలట్ ఎంపిక కావడం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందని పేరు వెల్తడించటానికి ఇష్టపడని ఐఏఎఫ్ అధికారి ఒకరు పేర్కొన్నారు. 2018లో యుద్ధ విమానాన్ని ఒంటరిగా నడిపిన మొదటి భారతీయ మహిళా పైలట్‌గా అవనీ చతుర్వేది చరిత్ర సృష్టించారు. అప్పట్లో ఆమె మిగ్–21 బైసన్ విమానాన్ని సొంతంగా నడిపారు. యుద్ధ విమానాల కోసం ప్రయోగాత్మకంగా మహిళలను ఎంపిక చేయాలన్న ప్రభుత్వం నిర్ణయం మేరకు.. 2016 జూలైలో ఎంపికైన ముగ్గురు మహిళల బృందంలో ఈమె కూడా ఒకరు. మిగతా ఇద్దరు పైలట్లు భావనా కాంత్, మోహనా సింగ్. ప్రస్తుతం ఐఏఎఫ్‌లో 10 మంది మహిళా పైలట్లు, సహాయకులుగా మరో 18 మంది ఉన్నారు. ఐఏఎఫ్‌లో మొత్తం మహిళా అధికారుల సంఖ్య 1,875. కాగా, రఫేల్ ఫైటర్ జెట్లు ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న భారత్, చైనా సరిహద్దుల్లోని లద్దాఖ్‌లో విధుల్లో పాల్గొంటున్నాయి. ఫ్రాన్సులో తయారైన 5 రఫేల్ ఫైటర్ జెట్లు అంబాలా వైమానిక స్థావరం కేంద్రంగా పనిచేస్తున్న గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్‌లో ఈ నెల 10వ తేదీన అధికారికంగా చేరిన విషయం తెలిసిందే. మొట్టమొదటి సారిగా 1951లో అంబాలా వైమానిక స్థావరంలో ఏర్పాటయిన ఈ స్క్వాడ్రన్ పేరిట పలు రికార్డులు నమోదై ఉన్నాయి. 1955లో మొట్టమొదటి ఫైటర్ జెట్ డి హవిల్లాండ్ వాంపైర్ ఈ స్క్వాడ్రన్లోనే చేరింది. ఫ్రాన్సుతో కుదుర్చుకున్న రూ.59వేల కోట్ల ఒప్పందంలో భాగంగా జూలైలో మొదటి విడతగా ఐదు రఫేల్ యుద్ధ విమానాలు వచ్చిన విషయం తెలిసిందే. నవంబర్ కల్లా రెండో విడతలో మరో నాలుగు, 2021 చివరి నాటికి మొత్తం 36 విమానాలు చేరనున్నాయి. రష్యా నుంచి సుఖోయ్ జెట్లను కొనుగోలు చేసిన 23 ఏళ్ల తర్వాత భారత్ యుద్ధ విమానాల కొనుగోలుకు కుదుర్చుకున్న భారీ ఒప్పందమిది. -
ఫైటర్ మినిస్టర్
మహిళల రక్షణకు దేశాలు. దేశాల రక్షణకు మహిళలు.ప్రపంచం సురక్షితం అవుతోంది. రఫేల్ స్ట్రాంగ్ వెపన్. రఫేల్‌ని మించిన శక్తి.. ఉమన్. డిఫెన్స్‌లోకి వెపన్. డిఫెన్స్ మినిస్టర్‌గా ఉమన్. మహిళకు సాధికారమే..దేశానికి సార్వభౌమాధికారం. ఏ తల్లయినా బిడ్డని గాల్లోకి ఎగరేసి పట్టుకోవడం చూశామా? సాధారణంగా అలా తండ్రి చేస్తాడు! ఆడిస్తాడే కానీ.. ఫ్యాన్ తగులుతుందా, తల వెళ్లి పైకప్పుకు తాకుతుందా అని చూసుకోడు. మహిళల చేతుల్లో దేశాలు ఎందుకని అంత సురక్షితంగా ఉంటాయీ అంటే.. ఇదిగో.. వాళ్ల లాలన, పాలన పురుషులు పిల్లల్ని కాపుకాసే తీరుకు భిన్నంగా.. భద్రతతో కూడి ఉంటాయి. ఆ మహిళలు ప్రధానులే అయినా, రక్షణమంత్రులే అయినా. అందుకే కావచ్చు, దేశ చరిత్రలోనే తొలి పూర్తిస్థాయి మహిళా రక్షణ మంత్రిగా మూడేళ్ల క్రితం నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రివర్గంలోకి వచ్చినప్పుడు నెలకొన్న ఉత్తేజమే గురువారం హర్యానాలోని అంబాలాలో భారత వైమానిక దళంలోకి ఫ్రాన్స్ నుంచి తెప్పించిన రఫేల్ యుద్ధ విమానాలను ప్రవేశ పెడుతున్నప్పుడు ఆ దేశ మహిళా రక్షణ శాఖ మంత్రి ఫ్లారెన్స్ పార్లీ కూడా ఉండటం పునరుత్తేజం అయింది. నిర్మలా సీతారామన్ నేటికీ రక్షణ మంత్రిగా ఉండి ఉంటే.. రెండు దేశాల మహిళా రక్షణ శాఖల మంత్రుల సమక్షంలో రఫేల్‌ను లాంఛనంగా ఎక్కుపెట్టడం అన్నది స్త్రీ శక్తికి సంకేతంగా నిలిచిన ఒక అపూర్వ సందర్భం కూడా అయి ఉండేది. సీతారామన్ 2017 సెప్టెంబరులో రక్షణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, సార్వత్రిక ఎన్నికల తర్వాత కొత్త మంత్రివర్గంలో ఆర్థికశాఖ మంత్రి అయ్యారు. ఫ్లారెన్స్ పార్లీ 2017 జూన్ నుంచీ ఫ్రాన్స్ రక్షణశాఖ మంత్రిగా ఉన్నారు. ఫ్రాన్స్‌తోపాటు ప్రస్తుతం 21 దేశాలకు మహిళలు రక్షణ మంత్రులుగా ఉన్నారు! పూర్వపు మంత్రులను కూడా తీసుకుంటే ఈ జాబితా వందకు పైగానే ఉంటుంది. ప్రత్యేకంగా రక్షణ శాఖను చేపట్టిన మహిళలతో పాటు, రక్షణ శాఖను కూడా తామే నిర్వహిస్తున్న ప్రధానులూ ఇందులో ఉన్నారు. భారతదేశ తొలి మహిళా రక్షణ శాఖ మంత్రి శ్రీమతి ఇందిరా గాంధీనే అయినప్పటికీ ప్రధానిమంత్రిగా ఉంటూ ఆమె ఆ శాఖను చేపట్టారు తప్ప, ప్రత్యేకంగా కాదు. తొలిసారి 1975 నవంబర్ 30 నుంచి 1975 డిసెంబర్ 20 వరకు ఇరవై ఒక్క రోజులు, రెండోసారి 1980 జనవరి 14 నుంచి, 1982 జనవరి 15 వరకు రెండేళ్లు ఆమె రక్షణశాఖ బాధ్యతలను నిర్వహించారు. రక్షణ శాఖకు పూర్తిస్థాయి తొలి మహిళా మంత్రి మాత్రం నిర్మలా సీతారామనే. రఫేల్ యుద్ధ విమానాలు సరిగ్గా సమయానికి (చైనా సరిహద్దు ఉద్రిక్తతల మధ్య) మన సైనిక బలగాల్లో చేరాయి. ఈ ప్రత్యేక తరుణంలో ఫ్లారెన్స్ పార్లీ మాట్లాడిన రెండు మాటలు కూడా ఒక మహిళా మంత్రి మాత్రమే మాట్లాడగలరు అన్నంత స్నేహశీలంగా ఉన్నాయి. ఆమె ప్రసంగం లో ఎక్కడా కూడా రఫేల్‌ని వాళ్లు అమ్మినట్లు, మనం కొనినట్లు లేదు. ‘‘ఇది రెండు దేశాల విజయం’’ అన్నారు. 57 ఏళ్ల ఫ్లారెన్స్ పార్లే రక్షణ శాఖ మంత్రి అయే ముందు వరకు ఫ్రెంచ్ నేషనల్ రైల్వే కంపెనీ డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు. అంతకన్నా పూర్వం ‘ఎయిర్ ఫ్రాన్స్’కు డిప్యూటీ జనరల్ డైరెక్టర్. రాజకీయాల్లోకి రాక ముందు పౌర సేవల అధికారిగా, వ్యాపార నిపుణురాలిగా సేవలు అందించారు. పారిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ స్టడీస్ అండ్ ది నేషనల్ స్కూల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో డిగ్రీ చేశారు ఫ్లారెన్స్. 21 దేశాలకు ‘రక్షణ’ మహిళలు బంగ్లాదేశ్ (షేక్ హసీనా), దక్షిణాఫ్రికా (నొసివివె మపిసా న్క్వాకులా), నికారగువా (మార్తా ఎలినీ రూయిజ్ సెవిల్లా), కెన్యా (రేచల్ ఓమామో), ఉత్తర మాసిడోనియా (రాడ్మిల్లా సేకెరిన్స్కా), అల్బేనియా (ఆల్టా క్షాకా), సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ (మ్యారీ నోల్ కొయారా), నెదర్లాండ్స్ (ఆంక్ బిజ్లెవెల్డ్), స్పెయిన్ (మార్గరీటా నోబెల్స్), జింబాబ్వే (ఓప్పా ముచింగురి), మాల్దీవులు (మారియా అహమ్మద్ దీదీ), స్విట్జర్లాండ్ (వయోలా ఆమ్హెర్డ్), గాబన్ (రోస్ క్రిస్టీన్ రపోండా), సాలమన్ దీవులు (లనెల్ తనంగడ), ఆస్ట్రేలియా (లిండా రేనాల్డ్స్), డెన్మార్క్ (ట్రైన్ బ్రామ్సెన్), జర్మనీ (అన్నెగ్రెట్ క్రాంప్ క్యారెన్బేయర్), ఆస్ట్రియా (క్లాడలియా టేనర్), లెబనాన్ (జైనా అకార్), దక్షిణ సూడాన్ (ఏంజెలీనా టెనీ), ఫ్రాన్స్ (ఫ్లారెన్స్ పార్లీ). -
అమ్ములపొదిలోకి కొత్త అస్త్రాలు
అంబాలా: భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ మన దేశ వాయుసేన మరింత బలోపేతమైంది. భారత్ అమ్ములపొదిలోకి అయిదు రఫేల్ యుద్ధ విమానాలు వచ్చి చేరాయి. హరియాణాలోని అంబాలా వైమానిక స్థావరంలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో అధికారికంగా వాయుసేనలోకి ఐదు అధునాతన రఫేల్ యుద్ధ విమానాలను ప్రవేశపెట్టారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా తదితరుల సమక్షంలో ఈ యుద్ధ విమానాలను వాయుసేనలోని 17 స్క్వాడ్రన్ ఆఫ్ ది గోల్డెన్ ఏరోస్‌కి అప్పగించారు. దీనికి సంబంధించిన ఒక పత్రాన్ని గ్రూప్ కెప్టెన్ హర్కీరత్ సింగ్‌కు రాజ్‌నాథ్ అందించారు. రఫేల్ అప్పగింత సమయంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించడంతో పాటు విమానాలకు వాటర్ కెనాన్లతో సెల్యూట్ చేశారు. ఆ తర్వాత జరిగిన వైమానిక విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కొత్త పక్షులకు స్వాగతం అని భారత వైమానిక దళం ట్వీట్ చేసింది. రూ.59 వేల కోట్లతో 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌తో నాలుగేళ్ల క్రితమే భారత్ ఒప్పందం చేసుకుంది. గత జూలై 29న మొదటి విడతగా 5విమానాలు హరియాణాలో అంబాలా వైమానికి స్థావరానికి వచ్చాయి. సార్వభౌమాధికారంపై కన్నేస్తే ఊరుకోం: రాజ్‌నాథ్ రఫేల్ యుద్ధ విమానాలను వాయుసేనలో ప్రవేశపెట్టాక రాజ్‌నాథ్ మాట్లాడారు. లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్ని నేరుగానే ప్రస్తావించారు. మన దేశ సార్వభౌమాధికారంపై కన్ను వేసే వారందరికీ ఈ యుద్ధ విమానాల ద్వారా అతి పెద్ద , గట్టి సందేశాన్ని ఇస్తున్నామన్నారు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని, భౌగోళిక సమగ్రతను కాపాడుకోవడానికి ఎంతవరకైనా వెళతామని ఇదివరకే స్పష్టం చేశానని చెప్పారు. ‘సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో యుద్ధ విమానాలు మన అమ్ములపొదిలోకి చేరడం అత్యంత కీలకంగా మారింది. మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా మనమూ సన్నద్ధం కావాల్సి ఉంది. ప్రధాని మోదీ దేశ భద్రతకే పెద్ద పీట వేస్తారని చెప్పడానికి గర్విస్తున్నాను’అని రాజ్‌నాథ్ అన్నారు. ప్రపంచంలో రఫేల్ యుద్ధ విమానాలే అత్యుత్తమమైనవని, వాటిని కొనుగోలు చేయడం గేమ్ ఛేంజర్ అని అభివర్ణించారు. దేశ రక్షణ వ్యవస్థని బలోపేతం చేస్తున్నప్పటికీ తాము శాంతిని కాంక్షిస్తామని స్పష్టం చేశారు. భారత్, ఫ్రాన్స్ బంధాల్లో కొత్త అధ్యాయం రఫేల్ యుద్ధ విమానాలు వైమానిక దళంలోకి చేరికతో భారత్, ఫ్రాన్స్ మధ్య స్నేహ సంబంధాలు మరింత పటిష్టమయ్యాయని ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ అన్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైందని చెప్పారు. భారత రక్షణ వ్యవస్థ బలోపేతం కావడానికి తాము పూర్తిగా సహకరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. గోల్డెన్ ఏరోస్‌కే ఎందుకు ? మొదటి బ్యాచ్‌లో వచ్చిన 5 రఫేల్ యుద్ధ విమానాలు 17 స్క్వాడ్రన్ గోల్డెన్ ఏరోస్ ద్వారా సేవలు అందిస్తాయి. వాయుసేనలో గోల్డెన్ ఏరోస్‌కి ప్రత్యేక స్థానముంది. అంబాలాలో 1951 అక్టోబర్ 1న లెఫ్ట్‌నెంట్ జనరల్ డీఎల్ స్ప్రింగెట్ నేతృత్వంలో ఈ ప్రత్యేక దళం ఏర్పడింది. ఎలాంటి సంక్లిష్టమైన ఆపరేషన్లయినా ఈ దళమే చేపడుతుంది. పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధాల నుంచి గత ఏడాది బాలాకోట్ దాడుల వరకు ఎన్నో ఆపరేషన్లలో 17 స్క్వాడ్రన్ గోల్డెన్ ఏరోస్ అద్భుతమైన ప్రతిభని చూపించింది. హార్వార్డ్ 2బీ, హాకర్ హంటర్, మిగ్ 21 వంటి యుద్ధ విమానాలన్నింటినీ తొలుత గోల్డెన్ ఏరోస్ దళం నడిపింది. గత ఏడాది సెప్టెంబర్ 10న రఫేల్ యుద్ధ విమానాల కోసం ఈ దళాన్ని మళ్లీ పునరుద్ధరించారు. ఈ యుద్ధ విమానం నడపడంలో ఇప్పటికే కొందరు పైలట్లు, టెక్నీషియన్లు, ఇంజనీర్లు ఫ్రాన్స్‌లో శిక్షణ తీసుకున్నారు. -
రఫేల్ రాక.. చైనాకు స్ట్రాంగ్ కౌంటర్
అంబాలా, హరియాణా : సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత అమ్ముల పొదిలోకి ఐదు రఫేల్ యుద్ధ విమానాలు చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రఫేల్ రాకను గేమ్ చేంజర్‌గా వర్ణించారు. భారత వైమానిక దళంలోకి రఫేల్ జెట్లను ప్రవేశపెట్టడం చారిత్రాత్మక క్షణంగా వర్ణించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. ‘రఫేల్ రాకతో ప్రపంచానికి ముఖ్యంగా మనల్ని వక్ర దృష్టితో చూసే ధైర్యం చేసేవారికి ఒక బలమైన సందేశాన్ని పంపుతున్నాం. ప్రస్తుత సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఇది చాలా కీలకమైన ఘటన’ అంటూ పరోక్షంగా చైనాకు వార్నింగ్ ఇచ్చారు రాజ్‌నాథ్. అంతేకాక ‘ఎల్ఏసీ వద్ద ఉద్రిక్తతల సమయంలో ఐఏఎఫ్ చూపించిన సమయస్ఫూర్తిని, నిబద్ధతని ఈ సందర్భంగా నేను ప్రశంసిస్తున్నాను. సరిహద్దులో మోహరించిన వాయుసేన దళాలను చూస్తే.. వారు ఏలాంటి పరిస్థితిని ఎదుర్కొగలరని.. భవిష్యత్తులో యుద్ధం సంభవిస్తే.. ఐఏఎఫ్ కీలక నిర్ణయాధికారిగా ఉంటుందని’ అన్నారు రాజ్‌నాథ్. (చదవండి: రఫేల్... గేమ్ చేంజర్) దేశంలోని పురాతన వైమానిక దళ స్థావరం అంబాలా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో జరిగిన ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫోరెన్స్ పార్లీ, డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా, రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్ పాల్గొన్నారు. భారత్ - చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో రఫేల్ యుద్ధ విమానాల కోసం భారత్ 59 వేల కోట్ల రూపాయలతో ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. తొలి దశలో జులై 29న 5 రఫెల్ యుద్ధ విమానాలు భారత్ చేరుకున్న సంగతి తెలిసిందే. ఆ రఫేల్ యుద్ధ విమానాలు 17వ స్క్వాడ్రన్‌లో చేరాయి. రఫేల్ చేరికతో భారత ఎయిర్‌ఫోర్స్ సామర్ధ్యం మరింత బలోపేతమైంది. -
అంబాల : ఎయిర్‌ఫోర్స్‌లోకి రఫెల్ యుద్ధ విమానాలు
-
ఎయిర్‌ఫోర్స్‌లోకి 5 రఫెల్ యుద్ధ విమానాలు
సాక్షి, న్యూఢిల్లీ : భారత అంబుల పొదిలోకి మరికొన్ని యుద్ధ విమానాలు చేరనున్నాయి. వాయుసేనకు సేవలందించేందుకు కొత్తగా మరో ఐదు రఫెల్ యుద్ధ విమానాలు సిద్ధమయ్యాయి. ఈ గురువారం అంబాల ఎయిర్వేస్లో రఫెల్ యుద్ధ విమానాలు అధికారికంగా చేరనున్నాయి. ఈ కార్యక్రమంలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్, ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫోరెన్స్ పార్లీతో పాటు పలువురు ఇరుదేశాల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సంప్రదాయ ‘ సర్వ ధర్మ పూజ’ నిర్వహించనున్నారు. భారత్ - చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో రఫెల్ యుద్ధ విమానాల కోసం భారత్ 59 వేల కోట్ల రూపాయలతో ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ( దక్షిణాన సైనికులు.. ఉత్తరాన నిర్మాణాలు ) తొలి దశలో జులై 29న 5 రఫెల్ యుద్ధ విమానాలు భారత్ చేరుకున్నాయి. ఆ రఫెల్ యుద్ధ విమానాలు 17వ స్క్వాడ్రన్‌లో చేరాయి. రఫెల్ చేరికతో భారత ఎయిర్‌ఫోర్స్ సామర్ధ్యం బలోపేతమైంది. కాగా, తూర్పు లద్దాఖ్ ప్రాంతానికి చైనా ఇప్పటికే సుమారు 150 యుద్ధ విమానాలను, ఇతర సహాయక హెలికాప్టర్లను తరలించింది. పాంగాంగ్ సరస్సుకు దక్షిణ తీరంలో భారత సైనికులను ఎంగేజ్ చేస్తూ.. ఉత్తర తీరంలో నిర్మాణ కార్యక్రమాలను కొనసాగించే వ్యూహాన్ని చైనా అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఉపగ్రహ ఛాయాచిత్రాలు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
రఫెల్ డీల్ : రాహుల్ వ్యంగ్యాస్త్రాలు
సాక్షి, న్యూఢిల్లీ : భారత రాజకీయాల్లో వివాదాల పుట్టగా పేరొందిన రఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వాన్ని లక్క్ష్యంగా చేసుకుని.. ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. భారతీయ ఖజానాను రఫెల్ యుద్ధ విమానాల కోసం దోచుకున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా 2024 ఎన్నికల సమయానికి రఫెల్ జెట్స్ భారత సైన్యానికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని, అది తమకు ఎన్నికల్లో ఎంతో లబ్ధి చేకూరుతుందని కేంద్రమంత్రి పియూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను రాహుల్ తీవ్రంగా ఖండించారు. భారత సైన్యానికి చెందని రఫెల్‌పై గోయల్ ప్రచారం సరైనది కాదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘నిజం ఒక్కటే మార్గాలే అనేకం’ అంటూ మహ్మాత్మా గాంధీ సూక్తులను జోడించిన రాహుల్ బీజేపీ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సందించారు. కాగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రఫెల్ జెట్స్ ఒప్పందం తొలినుంచీ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. తొలి విడతలో భాగంగా ఇటీవల ఆరు యుద్ధ విమానులు భారత గడ్డపై అడుగుపెట్టాయి. అప్పటి నుంచి ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. -
దేశ రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం : సచిన్
ఢిల్లీ : క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాసర్ సచిన్ టెండూల్కర్ భారత వైమానిక దళాన్ని(ఐఏఎఫ్) ప్రశంసలతో ముంచెత్తాడు. రఫేల్ యుద్ద విమానాల రాకతో భారతీయ రక్షణ వ్యవస్థ మరింత బలోపేతంగా తయారైందని ట్విటర్ వేదికగా పేర్కొన్నాడు. ఫ్రాన్స్‌లోని దసో ఏవియేషన్ తయారు చేసిన 36 రఫేల్ యుద్ధ విమానాలను రూ. 59 వేల కోట్లకు కొనుగోలు చేయడానికి 2016లో ఎన్డీయే ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా రెండు రోజుల క్రితం ఫ్రాన్స్ నుంచి బయల్దేరిన అయిదు రఫేల్ యుద్ధ విమానాలు ఏడు వేల కి.మీ.లు ప్రయాణించి బుధవారం మధ్యాహ్నం హరియాణాలోని అంబాలా వైమానిక స్థావరానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా సచిన్ ట్విటర్ వేదికగా స్పందించారు.' అత్యాధునిక ఫైటర్ జెట్ రాఫెల్ విమానాలకు చేర్చినందుకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు హృదయపూర్వక అభినందనలు. ఈ యుద్ధ విమానాల చేరికతో మన దేశ రక్షణ వ్యవస్థ మరింత బలోపేతంగా తయారైంది. రఫేల్ విమానాల రాకతో రక్షణ దళాల్లో నూతన నవీకరణ మొదలైంది. జైహింద్' అంటూ ట్వీట్ చేశాడు.సచిన్ టెండూల్కర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో గ్రూప్ కెప్టెన్‌గా గౌరవ పదవిలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. Heartiest congratulations to #IndianAirForce for adding the state-of-the-art fighter jet Rafale, to our fleet. It’s a massive upgrade for our Defence Forces who are tirelessly protecting our nation in the skies. Jai Hind 🇮🇳 https://t.co/c6iIXjIzxd — Sachin Tendulkar (@sachin_rt) July 30, 2020 -
వెల్కమ్ రఫెల్
-
అంబాలా ఎయిర్‌బేస్‌కు రఫేల్ యుద్ధ విమానాలు
-
రఫేల్... గేమ్ చేంజర్
న్యూఢిల్లీ: చైనా అండదండలతో జిత్తులమారి పాకిస్తాన్ కూడా కయ్యానికి కాలుదువ్వుతుందన్న అంచనాలున్న నేపథ్యంలో భారత్ అమ్ములపొదిలోకి రఫేల్ చేరడంతో భారత్ వాయుసేన సామర్థ్యం మరింతగా పెరిగింది. సరిహద్దుల్లో చైనా ఆటలు ఇక సాగవని, రఫేల్ ఒక గేమ్ చేంజర్ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చైనా యుద్ధవిమానం చెంగ్డూ జే–20 కంటే రఫేల్ అత్యంత శక్తిమంతమైనదని చెబుతున్నారు. ‘‘జే–20 కంటే రఫేల్ అత్యంత శక్తిసామర్థ్యాలు కలిగినది. జే–20 అయిదో తరానికి చెందిన యుద్ధవిమానమని చైనా చెబుతున్నప్పటికీ దాని ఇంజిన్ మూడో జనరేషన్‌కి చెందినది. సుఖోయ్ యుద్ధ విమానం తరహా ఇంజిన్ అందులో ఉంది’’ అని రఫేల్ యుద్ధ విమానాన్ని పరీక్షించి చూసిన రిటైర్డ్ ఎయిర్ మార్షల్ నంబియార్ చెప్పారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దగ్గరున్న జే–20 అత్యంత ఆధునికమైనదైతే ఆ దేశం రష్యా నుంచి సుఖోయ్ యుద్ధ విమానాలను కొనాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. గగనతలం నుంచి గగనతలం లక్ష్యాలను ఛేదించే మీటియోర్ క్షిపణి వ్యవస్థ, ఉపరితల లక్ష్యాలను ఛేదించగలిగిన స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణి వ్యవస్థ, స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థ కలిగి ఉన్న రఫేల్ యుద్ధ విమానం దరిదాపుల్లోకి కూడా చైనా జే–20 రాలేదని బాలా కోట్ దాడుల వ్యూహకర్త, మాజీ ఎయిర్ మార్షల్ బీఎస్ ధనూవా అభిప్రాయపడ్డారు. -
పక్షుల్లా వచ్చేశాయ్
చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ నిప్పులు చిమ్ముకుంటూ పిడుగులు కురిపించేందుకు శత్రువుల్ని గాలిదుమారంలా చుట్టేయడానికి మన దేశ వాయుసేనకు మరింత సత్తా చేకూర్చేలా జాతి యావత్తూ ఎదురుచూపులు ఫలించేలా ఫ్రాన్స్ నుంచి బయల్దేరిన రఫేల్ యుద్ధ విమానాలు రెక్కలు కట్టుకొని మరీ పక్షుల్లా వాలిపోయాయి. అంబాలా: రెండు రోజుల క్రితం ఫ్రాన్స్ నుంచి బయల్దేరిన అయిదు రఫేల్ యుద్ధ విమానాలు ఏడు వేల కి.మీ.లు ప్రయాణించి బుధవారం మధ్యాహ్నం హరియాణాలోని అంబాలా వైమానిక స్థావరానికి చేరుకున్నాయి. రఫేల్ విమానాలు భారత్ గగనతలంలోకి ప్రవేశించగానే రెండు సుఖోయ్–30 యుద్ధ విమానాలు వాటికి ఎదురేగి వెంట వచ్చాయి. చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ భదౌరియాతో పాటుగా భారత వైమానికి దళానికి చెందిన ఉన్నతస్థాయి అధికారులు అంబాలా ఎయిర్‌బేస్‌లో స్వాగతం పలికారు. సంప్రదాయ బద్ధమైన వాటర్ కెనాన్లతో విమానాలకు సెల్యూట్ కార్యక్రమం నిర్వహించారు. శత్రువుల వెన్నులో వణుకు: రాజ్‌నాథ్ రఫేల్ యుద్ధ విమానాలు అంబాలా ఎయిర్‌బేస్‌కు చేరుకోగానే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ట్వీట్లు చేశారు. పక్షులు సురక్షితంగా దిగాయంటూ ట్వీట్ చేశారు. చైనాకు హెచ్చరికలు పంపారు. మన ప్రాదేశిక సమగ్రతకు ముప్పు కలిగించాలనుకునే వారికి రఫేల్ రాకతో వెన్నులో వణుకు పుడుతుందని అన్నారు. భారత్ భూభాగంలోకి రఫేల్ యుద్ధవిమానాలు దిగడం మన దేశ సైనిక చరిత్రలో నవ శకానికి నాందిగా అభివర్ణించారు. యుద్ధ విమానాల్లో క్షిపణులు, ఆయుధాలు, రాడార్లు, ఎలక్ట్రానిక్ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని రాజ్‌నాథ్ తన ట్వీట్లో వివరించారు. రఫేల్ యుద్ధ విమానాల రాక దేశానికే గర్వకారణమని హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఫ్రాన్స్‌లోని దసో ఏవియేషన్ తయారు చేసిన 36 రఫేల్ యుద్ధ విమానాలను రూ. 59 వేల కోట్లకు కొనుగోలు చేయడానికి 2016లో ఎన్డీయే ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. మరోవైపు, రఫేల్ యుద్ధ విమానాల రావడంపై భారత వాయుసేనకి రాహుల్ గాంధీ అభినందనలు తెలియజేశారు. ఒక్కో యుద్ధ విమానంపై రూ.526 కోట్లకు బదులుగా రూ.1670 కోట్లు ఎందుకు పెట్టాల్సి వచ్చిందని ప్రశ్నించారు. సంస్కృతంలో ప్రధాని ట్వీట్ యుద్ధ విమానాలకు స్వాగతం చెప్తూ ప్రధాని మోదీ సంస్కృతంలో ట్వీట్ చేశారు. ‘జాతి రక్షణకు మించిన ధర్మం లేదు. దేశ భద్రతకు మించిన అత్యుత్తమ యజ్ఞం లేదు’ అని అన్నారు. కీర్తి ప్రతిష్టలతో సమున్నతంగా ఆకాశాన్ని తాకాలని ఆకాక్షించారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఆగమించిన ‘బాహుబలి’
రణరంగంలో శత్రువుతో హోరాహోరీ తలపడే వేళ మన వైమానిక దళానికి సమర్థవంతంగా తోడ్పడగలదని భావిస్తున్న రఫేల్ యుద్ధ విమానాలు బుధవారం మన గడ్డపై వాలాయి. అయిదేళ్లక్రితం ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌లో పర్యటించినప్పుడు రూ. 59,000 కోట్లు వ్యయం కాగల 36 రఫేల్ యుద్ధ విమానాలు అందించడానికి ఆ ప్రభుత్వంతో అవగాహన కుదిరింది. అనంతరం 2016 సెప్టెంబర్‌లో ఒప్పందంపై సంతకాలయ్యాయి. అధినేతలమధ్య అవగాహన కుది రినప్పుడు రెండేళ్లలో... అంటే 2017లో ఈ యుద్ధ విమానాలను మన దేశానికి అందిస్తామని ఫ్రాన్స్ హామీ ఇచ్చింది. అయితే ఒప్పందం ఖరారులో జరిగిన జాప్యం వల్ల మరో మూడేళ్ల సమయం తీసుకుని తొలి విడతగా అయిదు విమానాలను మనకు అందజేశారు. ఈ యుద్ధ విమానాలు హరి యాణాలోని అంబాలా వైమానిక దళ స్థావరానికి చేరుకుంటున్న తరుణంలో బుధవారం దేశం హర్షాతిరేకాలతో హోరెత్తింది. దాదాపు అన్ని వార్తా చానెళ్లలో, సామాజిక మాధ్యమాల్లో రఫేల్ యుద్ధ విమానాలదే హడావుడంతా. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద చైనాతో మనకున్న వివాదం నేపథ్యం ఇందుకు కారణం కావొచ్చు. ఈ విమానాలను ఎల్ఏసీకి సమీపాన వున్న లదాఖ్‌కు తరలించ బోతున్నట్టు చెబుతున్నారు. రక్షణ బలగాలకు సమర్థవంతంగా సేవలందించగల మెరికల్లాంటి యుద్ధ విమానాల కోసం మన దేశం జరుపుతున్న అన్వేషణ ఈనాటిది కాదు. చుట్టూ చైనా కుంపట్లు రాజేస్తున్నదని, పాకిస్తాన్ ఎప్పటిమాదిరే కయ్యానికి కాలుదువ్వుతున్నదని... ఈ పరిణామాలన్నీ మన రక్షణ సంసిద్ధత పెరగ వలసిన అవసరాన్ని సూచిస్తున్నాయని వైమానిక దళం 2000 సంవత్సరం నుంచే చెబుతూ వస్తోంది. చివరకు 4.5 జనరేషన్ బహుళ విధ యుద్ధ విమానాలు అత్యవసరమని 2004లో తుది నిర్ణయాని కొచ్చారు. ఒకప్పుడు పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో రక్షణ దళాలకు విజయాలు సాధించిపెట్టిన మిగ్–21 బైసన్, జాగ్వార్ విమానాల వయసు మీరిందని, అవి తరచు ప్రమాదాల్లో చిక్కుకుంటున్నా యని వైమానిక దళం తెలిపింది. ఉన్నపాటుగా యుద్ధం వస్తే రణరంగంలోకి ఉరకడానికి అనువైన సాధనా సంపత్తి మన దగ్గరలేదన్న సంగతిని గుర్తు చేసింది. అయితే అదేం ప్రారబ్ధమోగానీ ఒకసారి యుద్ధ విమానాలో, మరొకటో కొనాలని నిర్ణయం జరిగాక టెండర్లు పిలవడం మొదలుకొని ఎంపిక చేయడం వరకూ అన్నీ నత్తనడక నడుస్తాయి. ఎంపిక పూర్తయ్యాక వరస ఆరోపణలు వెల్లువెత్తు తాయి. వేరే రకం ఇంతకన్నా మెరుగైనవే అయినా నాసిరకంతో సరిపెడుతున్నారని, ముడుపులు చేతులు మారడమే ఇందుకు కారణమని కథనాలు వస్తాయి. రఫేల్ యుద్ధ విమానాల ఎంపిక సమయంలోనూ అలాంటి సమస్యలు తప్పలేదు. దీన్ని ఎంపిక చేయడానికి ముందు అమెరికా తయారీ ఎఫ్/ఏ–18, ఎఫ్–16, రష్యా మిగ్–35, స్వీడన్ తయారీ గ్రిపెన్ తదితర విమానాల సామర్థ్యాన్ని పరీక్షించారు. మన అవసరాలకు అనుగుణంగా లేవన్న కారణంతో తిరస్కరించారు. చివరకు రఫేల్ తోపాటు బ్రిటన్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ దేశాల కన్షార్షియం ఉత్పత్తి చేసే టైఫూన్లు మిగిలాయి. ఈ రెండింటిలో రఫేల్ అన్నివిధాలా మెరుగైనదని తేల్చారు. ఇంతలోనే బ్రిటన్, స్విట్జర్లాండ్, సింగపూర్, సౌదీ అరేబియా వంటి దేశాలు తిరస్కరించిన రఫేల్ ఎలా నచ్చిందన్న ప్రశ్నలు తలెత్తాయి. ఇదంతా 2012నాటి మాట. అప్పట్లో ఈ విమానాలను డసాల్ట్ కంపెనీ ఉత్పత్తి చేసేది. మన దేశానికి ఒప్పందం కుదిరింది కూడా దానితోనే. కానీ సాంకేతిక పరిజ్ఞానం బదిలీ విషయంలో పేచీ పెట్ట డంతో అది కాస్తా మూలనబడింది. రూ. 54,000 కోట్ల వ్యయం కాగల ఆ ఒప్పందం ప్రకారం డసాల్ట్ సంస్థ 126 రఫేల్ యుద్ధ విమానాలను సమకూర్చాలి. మూడేళ్లలో 18 విమానాలు అందజేయడంతో పాటు మిగిలిన 108 యుద్ధ విమానాలనూ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)లో ఉత్పత్తి చేసేందుకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేస్తానని చెప్పింది. ఏమైతేనేం పాత ఒప్పందం స్థానంలో కొత్త ఒప్పందం ఖరారయింది. మొత్తానికి మన బలగాలు కోరుకుంటున్న రఫేల్ విమానాలు ముంగిట్లోకి వచ్చాయి. అయితే వీటిని ఖరారు చేసేనాటికి చైనాతో మనకు ఈ స్థాయి వివాదం లేదు. మన చుట్టూ వున్న దేశాల్లో చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకుంటున్న వైనంపై మన రక్షణ రంగ నిపుణులకు అవగాహన వున్నా, ప్రధానంగా పాకిస్తాన్‌ను దృష్టిలో వుంచుకునే 36 యుద్ధ విమానాలు సరిపోతాయని అంచనా వేశారు. కానీ మారిన పరిస్థితుల్లో పాక్‌తో వున్న అధీన రేఖ(ఎల్ఓసీ)తోపాటు చైనాను ఢీకొనడానికి ఎల్ఏసీ వద్ద కూడా మోహరించడం తప్పనిసరన్నది నిపుణుల భావన. మన వైమానిక దళానికి మంజూరైన స్క్వాడ్రన్లు 42 కాగా వాటిని 50కి పెంచాలన్న డిమాండు వుంది. కానీ మనకున్నవి ప్రస్తుతం 30 మాత్రమే. ఒక్కో స్వాడ్రన్ పరిధిలో 18 యుద్ధ విమానాలు ఉంటాయి. అంటే 2022 నాటికి రాఫెల్ యుద్ధ విమానాలన్నీ మన దగ్గరకొస్తే రెండు స్క్వాడ్రన్లు సంసిద్ధంగా వున్నట్టవుతుంది. ప్రభుత్వం చాలా చురుగ్గా నిర్ణయాలు తీసుకుంటే తప్ప మంజూరైన 42 స్క్వాడ్రన్ లకూ అవసరమైన యుద్ధ విమానాలు సమకూరవు. ఇప్పటికే సుఖోయ్–30 ఎంకేఐ, మిగ్–29 యుద్ధ విమానాలు 33 కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదిరింది. అలాగే హెచ్ఏఎల్ రూపొందించిన తేజస్ మార్క్1 తేలికపాటి యుద్ధ విమానాలు, తేజస్ మార్క్2 యుద్ధ విమానాలు, అధునాతన మధ్యశ్రేణి యుద్ధ విమానాలు(ఏఎంఏసీ) వరసగా అందబోతున్నాయి. ఇవన్నీ పూర్తిగా అందేలోగానే ఇప్పటికేవున్న సుఖోయ్–30, మిరేజ్–2000, మిగ్–29లను ఆధునీకరించడం అత్యవసరం. యుద్ధం అవసరం లేని, ఘర్షణలకు తావులేని ప్రపంచం కోసం కృషి చేయడం ముఖ్యమే. అయితే మనం బలమైన స్థితిలో వుంటేనే ఆ ప్రయత్నాలు సత్ఫలితాలిస్తాయి. ఆ కోణంలో రఫేల్ రాకను స్వాగతించాలి. -
రఫేల్ రాక.. ఆ రెండు దేశాలకు స్ట్రాంగ్ వార్నింగ్
న్యూఢిల్లీ: భారత వైమానిక దళం(ఐఏఎఫ్) దీర్ఘకాలంగా వేచిచూస్తున్న అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలు బుధవారం అంబాలా వైమానికి స్ధావరానికి చేరిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దాయాది దేశం పాక్, డ్రాగన్ దేశాలకు పరోక్షంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పక్షులు అంబాలాలో సురక్షితంగా దిగాయి. రఫేల్ ఫైటర్ జెట్స్ రాకతో మన సైనిక చరిత్రలో కొత్త శకానికి తెర లేచింది. ఈ మల్టీరోల్ విమానాలు ఐఏఎఫ్ సామర్థ్యాలను విప్లవాత్మకంగా మారుస్తాయి. మనం ఈ రఫేల్ యుద్ధ విమానాలు సొంతం చేసుకోవడం చూసి ఎవరి వెన్నులోనైనా వణుకు పడుతుంది అంటే.. అది కేవలం భారత్ భూభాగాన్ని ఆక్రమించుకోవాలని కుట్ర పన్నుతున్న వారికేన’ని రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం భారత్‌లోకి చొచ్చుకు రావాలనే కాంక్షతో రగిలిపోతోంది పాకిస్తాన్, చైనా దేశాలే. ఆ రెండు దేశాలను ఉద్దేశించే రక్షణ శాఖ మంత్రి ఈ హెచ్చరికలు చేశారని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. (‘ఏ దేశంపై దాడి చేసే ఉద్దేశం లేదు’) I would like to add, if it is anyone who should be worried about or critical about this new capability of the Indian Air Force, it should be those who want to threaten our territorial integrity. — Rajnath Singh (@rajnathsingh) July 29, 2020 రఫేల్ ఫైటర్ జెట్స్ కొనుగోలుపై విమర్శలు చేస్తోన్న కాంగ్రెస్ పార్టీకి సైతం రాజ్‌నాథ్ సింగ్ ట్విటర్ ద్వారా బదులిచ్చారు. రఫేల్ యుద్ధ విమానాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అవసరాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే ఫ్రాన్స్ నుంచి వాటిని కొనుగోలు చేయడం జరిగిందని.. ఇప్పటికే ఈ విషయంలో ఉన్న అన్ని సందేహాలకు సమాధానాలు ఇవ్వడం జరిగిందని రాజ్‌నాథ్ సింగ్ తన ట్వీట్లో పేర్కొన్నారు. -
హర్యానా: నేడు రఫెల్ యుద్ధ విమానాల రాక
-
రా.. రా.. రఫేల్!
న్యూఢిల్లీ: భారత వైమానిక దళం(ఐఏఎఫ్) ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్సు నుంచి బయలుదేరాయి. చైనాతో సరిహద్దుల్లోని తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఇవి చేరుకోవడంతో ఐఏఎఫ్ పోరాట సామర్థ్యం ఇనుమడిస్తుందని భావిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం భారత ప్రభుత్వం 36 అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్సుతో రూ.59 వేల కోట్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. మొదటి బ్యాచ్‌లో భాగంగా సోమవారం ఫ్రాన్సులోని మెరిగ్నాక్ వైమానిక కేంద్రం నుంచి 5 రఫేల్ యుద్ధ విమానాలు బయలుదేరాయి. ఇవి ఈనెల 29వ తేదీన పంజాబ్‌లోని అంబాలా వైమానిక స్థావరానికి చేరుకోనున్నాయి. మార్గమధ్యంలో యూఏఈలోని అల్‌ధఫ్రా ఎయిర్‌బేస్‌లో సోమవారం సాయంత్రం దిగాయి. ఫ్రాన్సుకు చెందిన డసో ఏవియేషన్ సంస్థ ఈ విమానాలను తయారు చేస్తోంది. గత ఏడాది అక్టోబర్‌లో మొదటి రఫేల్ జెట్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఫ్రాన్సు పర్యటన సందర్భంగా డసో అందజేసింది. ఈ విమానం ప్రత్యేకతలు.. శక్తివంతమైన ఆయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం రఫేల్ జెట్లకు ఉంది. గాలిలో నుంచి గాలిలోకి ప్రయోగించగలిగే మెటియోర్, స్కాల్ప్ క్షిపణులను ఇది తీసుకెళ్లగలదు. క్షిపణి వ్యవస్థలతోపాటు ఈ జెట్లలో భారత్ కోరిన విధంగా..ఇజ్రాయెలీ హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే, రాడార్ వార్నింగ్ రిసీవర్లు, లో–బ్యాండ్ జామర్లు, 10 గంటల ఫ్లైట్ డేటా రికార్డింగ్, ఇన్ఫ్రా రెడ్ సెర్చ్, ట్రాకింగ్ సిస్టమ్స్ వంటి అదనపు ఏర్పాట్లున్నాయి. మొత్తం భారత్‌కు వచ్చే 36 రఫేల్ విమానాల్లో 30 యుద్ధ విమానాలు(ఒకటే సీటుండేది) కాగా, 6 శిక్షణ విమానాలు రెండు సీట్లుండేవి. ఈ తేడా తప్పితే రెండింటి సామర్థ్యం ఒక్కటే. ఒక స్క్వాడ్రన్ రఫేల్ జెట్లను అంబాలా ఎయిర్ బేస్‌లో. మరో స్క్వాడ్రన్‌ను బెంగాల్‌లోని హసిమారా బేస్‌లోనూ ఉంచనున్నారు. వీటి పరిరక్షణ, నిర్వహణ ఏర్పాట్లకు ఐఏఎఫ్ రూ.400 కోట్లు వెచ్చించింది. చైనాతో కొనసాగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా తూర్పు లద్దాఖ్ సెక్టార్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి భారత్ సన్నద్ధత సామర్థ్యాన్ని పెంచేందుకు రఫేల్‌లను మోహరించనున్నట్లు అధికారులు తెలిపారు. కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో భారత్‌కు సంఘీభావ సూచకంగా వైద్య పరికరాలు, నిపుణులతో కూడిన విమానాన్ని కూడా ఫ్రాన్సు పంపిస్తోందని ఫ్రాన్సులోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. -
భారత్‌కు బయల్దేరిన రఫేల్ విమానాలు
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రఫేల్ యుద్ద విమానాలు జూలై 29న భారత్ చేరనున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధ విమానాలు బయలుదేరినట్లు ఫ్రాన్స్‌లోని ఇండియన్ ఎంబసీ అధికారులు తెలిపారు. ఐదు రఫేల్ యుద్ధ విమానాలు ఎల్లుండి భారత్‌లోని అంబాలా వైమానికి స్థావరానికి చేరనున్నాయి. భారత దేశానికి బయలుదేరే ముందు యూఏఈలోని ఎయిర్‌బేస్‌లో ఫ్రాన్స్ వైమానికి దళానికి చెందిన ట్యాంకర్ విమానం ద్వారా ఇంధనం నింపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. #WATCH Rafale jets taking off from France to join the Indian Air Force fleet in Ambala in Haryana on July 29th. (Video source: Embassy of India in France) pic.twitter.com/UVRd3OL7gZ — ANI (@ANI) July 27, 2020 ఇక భారత్ 36 రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు కోసం ఫ్రాన్స్‌తో 2016 సెప్టెంబరులో రూ.58,000 కోట్లతో ఒక ఒప్పందం చేసుకోవడం తెల్సిందే. కోవిడ్ నేపథ్యంలో వీటి సరఫరా ప్రశ్నార్థకమైన నేపథ్యంలో ఈ నెల రెండవ తేదీన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లేతో ఫోన్లో మాట్లాడారు. సకాలంలో యుద్ధ విమానాలను సరఫరా చేస్తామని రాజ్‌నాథ్‌కు పార్లే హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఈ తరుణంలో రఫేల్ యుద్ధ విమానాల రాక వాయుసేన నైతిక స్థైర్యాన్ని పెంచనుంది. -
రఫేల్ జెట్ల డెలివరీలో జాప్యం!
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా(కోవిడ్-19) విజృంభణతో ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలన్నీ దాదాపుగా స్తంభించిపోయాయి. ముఖ్యంగా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాలన్నీ లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. అంతర్జాతీయ ప్రయాణాలు సహా ఇతర కార్యకలాపాలపై ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ నుంచి భారత్‌కు చేరాల్సిన రఫేల్ యుద్ధవిమానాల సరఫరాలో జాప్యం నెలకొన్నట్లు తెలుస్తోంది. మహమ్మారి ధాటికి ఫ్రాన్స్‌లో 14 వేలకు పైగా మరణాలు సంభవిచంగా.. దాదాపు లక్షన్నర మంది దీని బారిన పడ్డారు. దీంతో మే 11 వరకు లాక్డౌన్ పొడిగించారు. అదే విధంగా భారత్‌లోనూ మే 3 వరకు లాక్డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అంబాల ఎయిర్‌బేస్‌లో కొన్ని ముఖ్య పనులు నిలిచిపోవడం సహా.. ఫ్రాన్స్‌లోనూ వైరస్ తీవ్ర పరిణామాలు చూపుతున్న నేపథ్యంలో రఫేల్ డెలివరీకి మరికొన్ని వారాలు వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అధికార వర్గాలు వెల్లడించినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ పేర్కొంది.(కరోనా: డబ్ల్యూహెచ్ఓకు షాకిచ్చిన ట్రంప్!) కాగా ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన 36 రఫేల్ యుద్ధ విమానాలు త్వరలో వైమానిక దళంలో సేవలందించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మొదటి దశలో భాగంగా దాదాపు 17 స్వ్కాడ్రాన్లు మే చివరినాటికి డెలివరీ కావాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కొన్ని వారాలు గడిచిన తర్వాతే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా దాదాపు 60 వేల కోట్ల రూపాయలు వెచ్చించి రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశంపై భారత్‌లో తీవ్ర స్థాయిలో రాజకీయ దుమారం రేగిన విషయం తెలిసిందే.(మే 11 వరకు లాక్డౌన్ పొడిగింపు) -
అభినందన్ రాఫెల్‌తో కౌంటర్ ఇచ్చుంటే..!
ముంబై: భారత వాయుసేన మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా బాంబే ఐఐటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలాకోట్ దాడుల అనంతరం పాక్‌పై దాడికి అభినందన్ వర్ధమాన్ వెళ్లిన సమయంలో మనం వాడిన యుద్ధ విమానం మిగ్ -21. అయితే ఆ రోజు అభినందన్ దాని స్థానంలో రాఫెల్ యుద్ధ విమానంలో వెళ్లి కౌంటర్ ఇచ్చి ఉంటే పరస్థితి మరోలా ఉండేదని అప్పటి ఎయిర్ ఫోర్స్ చీఫ్ బీఎస్ ధనోవా అన్నారు. చదవండి: అభినందన్ మనోధైర్యానికి మరో గుర్తింపు ఆ సమయంలో పాక్ ఎఫ్-16 యుద్ధ విమానాల్లో మిగ్-21పై దాడి చేయడంతో అది కూలిపోయి వింగ్ కమాండర్ అభినందన్ శత్రు దేశానికి చిక్కాడం తెలిసిందే. అదే ఎఫ్-16 కన్నా శక్తిమంతమైన రాఫెల్ మన చేతిలో ఉంటే ఫలితం వేరేలా ఉండేదని ఆయన తెలిపారు. ఇప్పటికైనా భారత అమ్ములపొదిలో రాఫెల్ చేరడం శుభపరిణామమని, రాఫెల్ వివాదంపై సుప్రీంకోర్టు సరైన తీర్పు ఇచ్చిందని బీఎస్ ధనోవా పేర్కొన్నారు. చదవండి: ఆ జాబితాలో అభినందన్, సారా అలీఖాన్! ఆ సమయానికి భారత్ చేతిలో రాఫెల్ యుద్ధ విమానాలు లేకపోవడానికి కారణమెవరంటూ ధనోవా పరోక్షంగా రాజకీయ పార్టీలనుద్దేశించి విమర్శలు చేశారు. నాడు అభినందన్ వర్థమాన్ రాఫెల్లో వెళ్లకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. ఏ యుద్ధ విమానాన్ని కొనాలన్నది నిర్ణయించడానికి 10 సంవత్సరాల టైం తీసుకున్నారంటూ గతంలో అధికారంలో ఉన్న పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘మెర్సిడెస్ నడిపినట్టే ఉంది’
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ యుద్ధ విమానాన్ని నడపటం తనను థ్రిల్‌కు గురిచేసిందని చెబుతూ ఇది మెర్సిడెస్ కారును నడిపినట్టే ఉందని భారత వైమానిక దళం చీఫ్ బీఎస్ ధనోవా అన్నారు. మారుతి కారును నడిపే వ్యక్తికి మెర్సిడెస్ అందిస్తే అతను హ్యాపీగా ఫీలవతాడని రఫేల్ యుద్ధ విమానాన్ని నడిపిన తనకూ అదే అనుభవం ఎదురైందని ఇండియా టుడే కాంక్లేవ్‌లో నేపథ్యంలో ఆయన చెప్పుకొచ్చారు. ఫ్రెంచ్ ఎయిర్‌బేస్ నుంచి రఫేల్‌ను ఎయిర్ చీఫ్ మార్షల్ ఈ ఏడాది జులైలో నడిపి దానిపై పట్టు పెంచుకున్నారు. భారత వైమానిక దళానికి రాఫేల్ శక్తివంతమైన వనరుగా మారుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. భారత వాయుసేన విమానాలు పురాతనమైనవన్న ఆందోళనపై స్పందిస్తూ వాయుసేనను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రాఫేల్‌తో మన వైమానిక సాధనాసంపత్తిలో గణనీయ మార్పులు చోటుచేసుకుంటాయని వ్యాఖ్యానించారు. ఏవియానిక్స్, మిసైల్, డేటా సహా పలు అంశాల్లో మనం చాలా ముందున్నామని పేర్కొన్నారు. బాలాకోట్ తరహా వైమానిక దాడుల గురించి ప్రశ్నించగా ఎలాంటి దాడులకైనా వాయుసేన సిద్ధంగా ఉందని, ప్రభుత్వమే ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. తాము సైనికేతర లక్ష్యాన్ని ఢీ కొట్టడం ద్వారా భారత్‌లో ఉగ్రవాదం ప్రేరేపిస్తే మీరు పీఓకే లేదా ఎక్కడ ఉన్నా మిమ్నల్ని లక్ష్యంగా చేసుకుంటామనే సంకేతాలను ఉగ్ర సంస్ధలకు పంపామని చెప్పారు.