Retirement Age
-
వర్సిటీ అధ్యాపకుల వయోపరిమితి పెంచాలి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న అధ్యాపకుల పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచాలన్న డిమాండ్ అన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు పలు విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఉన్నత విద్య వర్గాలు కూడా ఈ వాదనను బలపరుస్తున్నాయి. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో పదవీ విరమణ వయసు 65 ఏళ్లు ఉండగా, మెడికల్ కాలేజీల్లోనూ బోధన సిబ్బంది రిటైర్మెంట్ వయసు కూడా 65 ఏళ్లకు ఉంది. చివరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచింది. కానీ యూనివర్సిటీల్లో పనిచేస్తున్న అధ్యాపకుల రిటైర్మెంట్ వయసు మాత్రం 60 ఏళ్లుగానే ఉంది. రాష్ట్రంలో త్వరలో కొంతమంది అధ్యాపకులు రిటైర్ అయ్యే వీలుందని చెపుతున్నారు. ఇప్పటికే విశ్వవిద్యాలయాల్లో ప్రొఫె సర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల కొరత తీవ్ర స్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే రిటైర్మెంట్ల కారణంగా మరికొన్ని ఖాళీలు ఏర్పడే అవకాశం ఉంది. మరో పక్క రాష్ట్రంలోని కొన్ని వర్సిటీల వైఎస్ చాన్స్లర్ల పదవీ కాలం మరో ఐదు నెలలు మాత్రమే ఉంది. దీంతో కొత్త వీసీల నియామకం చేపడితే తప్ప యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీపై దృష్టి పెట్టే వీల్లేదు. ఈ సమయంలో బోధన సిబ్బంది కొరత విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపే వీలుందని అధ్యాపక వర్గాలు అంటున్నాయి. 2024లోనే ఉస్మానియా యూనివర్సిటీ న్యాక్ అసెస్మెంట్కు వెళ్లాల్సిన అవసరం ఉంది. న్యాక్‌లో మంచి గ్రేడ్ వస్తే తప్ప రీసెర్చ్ ప్రాజెక్టులు ఈ యూనివర్సిటీకి వచ్చే అవకాశం లేదు. ఇతర వర్సిటీల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అధ్యాపకుల పదవీ విరమణ వయసును పెంచే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. -
పదవీ విరమణ వయసు పెంపు సాధ్యం కాదు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా న్యాయాధికారుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం సాధ్యం కాదని హైకోర్టు తీర్పునిచ్చింది. హైకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలని, న్యాయాధికారుల పదవీ విరమణ వయస్సు దీనితో సమానంగా ఉండటానికి రాజ్యాంగ నిబంధనలు అంగీకరించవని స్పష్టం చేసింది. ఈ తేడా సహేతుకమైనదేనని, దీనిని అలాగే కొనసాగించాలని ఆల్ ఇండియా జడ్జిల అసోసియేషన్ కేసులో సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పిందని హైకోర్టు గుర్తు చేసింది. న్యాయాధికారుల రిటైర్మెంట్ వయస్సు పెంపుపై ఫుల్ కోర్టు (పాలనాపరమైన నిర్ణయాల కోసం హైకోర్టు న్యాయమూర్తులందరు సమావేశమవడం) నిర్ణయం తీసుకోజాలదని తేల్చి చెప్పింది. ఆ నిర్ణయాధికారం ఫుల్‌కోర్టుకు లేదని, అలా చేయడం సుప్రీంకోర్టు తీర్పును అతిక్రమించడమే అవుతుందని స్పష్టం చేసింది. పైపెచ్చు ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్టంలోని సెక్షన్ 3(1ఏ) ప్రకారం న్యాయాధికారుల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లుగానే ఉందని, దానిని సవరించనప్పుడు 62 ఏళ్లకు పెంచడం సాధ్యం కాదంది. ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించడమే అవుతుందని తెలిపింది. విశ్రాంత న్యాయాధికారి కె.సుధామణి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. విజయనగరం జిల్లా మొదటి అదనపు జిల్లా జడ్జిగా పనిచేస్తున్న కె.సుధామణి వయసు 60 ఏళ్లకు చేరుకోవడంతో ఆమెకు పదవీ విరమణ వర్తింపజేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ సుధామణి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయాధికారుల రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్లకు పెంచాలని కోరారు. ఈ వ్యాజ్యంపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది జె. సుధీర్ వాదనలు వినిపించారు. హైకోర్టు తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ వాదనలు వినిపించారు. -
సుప్రీం, హైకోర్టు జడ్జీల రిటైర్మెంట్ వయస్సు పెంచాలి
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల రిటైర్మెంట్ వయస్సును పెంచాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) కోరుతోంది. ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించింది. ప్రస్తుతం దిగువ కోర్టులు, హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల పదవీ విరమణ వయస్సు వరుసగా 60, 62, 65 ఏళ్లుగా ఉన్నాయి. ముఖ్యంగా హైకోర్టులు, సుప్రీంకోర్టు జడ్జీల పదవీ విరమణ వయస్సులను 65, 67 ఏళ్లకు పెంచాలని బీసీఐ కోరుతోంది. వివిధ కమీషన్లు, ఫోరంలకు చైర్ పర్సన్లుగా అనుభవజ్ఞులైన న్యాయవాదులను నియమించేందుకు వీలుగా నిబంధనలను సవరించాలని పార్లమెంట్‌ను కోరుతూ తీర్మానించినట్లు వెల్లడించింది. (చదవండి: పోలీసులకు రక్షణ కల్పిస్తున్న 'పాములు'!!.. ఎక్కడ.. ఎవరి నుంచి అంటే..) -
రిక్రూటైన ఐదేళ్లకే రిటైర్మెంట్?
న్యూఢిల్లీ: కరోనాతో సైన్యంలో రెండేళ్లుగా నిలిచిన నియామకాలను మొదలు పెట్టాలని కేంద్రం భావిస్తోంది. పెన్షన్ల భారం తగ్గించుకొనేందుకు ఆర్మీలో నియామకాలను మూడు రకాలుగా చేస్తారని సమాచారం. 25 శాతం మంది మూడేళ్లు, 25 శాతం ఐదేళ్లు పనిచేసి రిటైరవుతారు. మిగతా 50 శాతం రిటైరయ్యేదాకా సేవలనందిస్తారు. చదవండి: (అమిత్ షాతో ఏం చర్చించానో బయటకు చెప్పలేను: గవర్నర్ తమిళిసై) -
ఆర్థిక భద్రతా అవసరమే..
చిన్న వయసు.. ఉరకలెత్తే ఉత్సాహం, మంచి ఆరోగ్యం.. ఇవన్నీ భవిష్యత్తును గుర్తు చేయవు. ఏరోజుకారోజు హాయిగా గడిచిపోతుంటుంది. సరిగ్గా ఆ సమయంలోనే కొన్ని మంచి అలవాట్లకు చోటు కల్పిస్తే.. జీవితాంతం ఆర్థిక భద్రతకు ఢోకా లేకుండా చూసుకోవచ్చు. రేపటి రోజు కోసం మీ ప్రణాళికలో కొంత చోటు కల్పిస్తే చాలు. అందులో ఉండే మ్యాజిక్ ఆ తర్వాత తెలిసొస్తుంది. అందుకే అంటారు వయసులో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనుకేసుకోమని..! రిటైర్మెంట్ కోసం రూ.కోటి కావాలంటే.. నెలకు రూ.2,000 ఇన్వెస్ట్ చేస్తే చాలు. 25 సంవత్సరాల వయసులో మొదలు పెట్టి, ఏటా 12 శాతం రాబడులు వచ్చేట్టు చూసుకున్నా.. ఈ మొత్తం సమకూరుతుంది. కానీ, 15 ఏళ్లు ఆలస్యం చేసి 45లో మొదలు పెట్టారనుకోండి అప్పుడు రూ.కోటి కోసం నెలకు రూ.21,000 ఇన్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. సిప్ ఆరంభం.. తివారి (30) సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఐదేళ్ల క్రితమే అంటే 25 ఏళ్ల వయసు నుంచే మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రతీ నెలా రూ.2,000 చొప్పున మూడేళ్లపాటు ఇన్వెస్ట్ చేశాడు. ఆ తర్వాత వెసులుబాటు లేకపోవడంతో సిప్ ఆపేశాడు. కానీ, అప్పటి వరకు చేసిన పెట్టుబడిని అలాగే ఉంచేశాడు. ఒకరోజు ఏజెంట్ కాల్ చేసి.. రూ.72,000 పెట్టుబడి రూ.1.8 లక్షలు అయినట్టు చెప్పడంతో ఆశ్చర్యపోవడం తివారీ వంతు అయింది. ఎవరో ఫ్రెండ్ చెబితే సిప్ మొదలు పెట్టిన తివారీ.. అంత నిధిని చూసేసరికి పెట్టుబడి ప్రయోజనాన్ని అర్థం చేసుకున్నాడు. పెట్టుబడి చిన్నదైనా క్రమం తప్పకుండా కొనసాగించడం వల్ల వచ్చే ప్రతిఫలం ఇలా ఉంటుంది. రాబడి రుచి తెలిసిన తర్వాత ఎవరైనా పెట్టుబడి పెట్టకుండా ఉంటారా? అందుకే తివారీ మళ్లీ సిప్ మొదలు పెట్టడమే కాదు.. ఈ విడత రూ.2,000 చొప్పున రెండు పథకాల్లో ప్రతి నెలా ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆర్జించే ప్రతి ఒక్కరూ తమ ఆదాయ స్థాయికి అనుగుణంగా వెంటనే సిప్ ఆరంభించాలి. సిప్ అన్నది ఒక్కసారి ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆటోమేటిక్‌గా ప్రతీ నెలా నిర్ణీత తేదీన, నిర్ణీత మొత్తం పెట్టుబడిగా వెళ్లిపోతుంది. క్రమశిక్షణతో పెట్టుబడికి సిప్ వీలు కల్పిస్తుంది. సిప్ అనగానే ఏ పథకంలో ఇన్వెస్ట్ చేయాలి? అన్న సందేహం వస్తుంది. నిపుణుల సూచనల ప్రకారం లార్జ్‌క్యాప్ విభాగానికి 50–60%, మిడ్ స్మాల్‌క్యాప్ విభాగానికి 20–30%, డెట్ విభాగానికి 10–20% కేటాయింపులు చేసుకోవచ్చు. దీన్నే అస్సెట్ అలోకేషన్ అని చెబుతారు. అలాగే, మీ పోర్ట్‌ఫోలియోలో ఎన్ని పథకాలు ఉండాలన్నది నిర్ణ యించుకోవాలి. సిప్ పెట్టుబడులు సైతం మార్కెట్ ప్రతికూలతల్లో నష్టాలను చూపిస్తాయి. అయినా నిరాశ చెందకుండా ఓపికతో పెట్టుబడులను దీర్ఘకాలం పాటు కొన సాగించాలి. పీపీఎఫ్ ఖాతా డెట్ సాధనాల్లో ప్రజా భవిష్యనిధి (పీపీఎఫ్) మెరుగైన ఎంపిక. మూడు రకాల ప్రయోజనాలు దీన్నుంచి అందుకోవచ్చు. మొదట ఏటా రూ.1.5 లక్షల వరకు ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెక్షన్ 80సీ కింద పన్ను లేకుండా చూసుకోవచ్చు. ఇందులో పెట్టుబడులపై వచ్చే వడ్డీ రాబడిపైనా పన్ను ఉండదు. గడువు ముగిసిన తర్వాత వెనక్కి తీసుకునే మొత్తంపైనా పన్ను లేదు. ప్రస్తుతం ఇందులో చేసే పెట్టుబడులపై 7.1 శాతం వడ్డీ రేటు అమలవుతోంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకే ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. ప్రతీ నెలా 12,500 చొప్పున పెట్టుబడి పెడితే 15 ఏళ్లలో 22,50,000 ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది. రాబడి ప్రస్తుత 7.1 శాతం ప్రకారం రూ.16,94,599 వస్తుంది. భవిష్యత్తులో ఈ రేట్లు ఇంకా తగ్గే అవకాశం ఉంది. 15 ఏళ్ల కాల వ్యవధి తర్వాత ఐదేళ్ల చొప్పున గడువు పొడిగించుకోవచ్చు. ఆ తర్వాత కూడా ఖాతాను క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఏటా కొంత చొప్పున ఉపసంహరించుకోవచ్చు. బ్యాలన్స్‌పై వడ్డీ జమ అవుతూనే ఉంటుంది. ఏడేళ్ల తర్వాత నుంచి ఇందులో పాక్షిక ఉపసంహరణకు అనుమతి ఉంటుంది. రుణ సదుపాయానికి కూడా వీలుంది. పీపీఎఫ్ సొమ్మును కోర్టులు కూడా జప్తు చేయడానికి ఉండదు. టర్మ్ ఇన్సూరెన్స్ తమపై ఆధారపడిన వారు ఉంటే (తల్లిదండ్రులు లేదా భార్యా, పిల్లలు) తప్పకుండా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. దురదృష్టవశాత్తూ, ఏదేనీ కారణంతో మరణం సంభవిస్తే పాలసీలో ఎంపిక చేసుకున్న మేరకు పరిహారాన్ని బీమా సంస్థ కుటుంబ సభ్యులకు అందిస్తుంది. టర్మ్ కవరేజీ అన్నది తక్కువ ప్రీమియానికే ఎక్కువ కవరేజీ ఇచ్చే అచ్చమైన బీమా సాధనం. ఇందులో పెట్టుబడి కలసి ఉండదు. కట్టిన ప్రీమియం జీవించి ఉంటే వెనక్కి రాదు. మరణించిన సందర్భాల్లోనే ఈ పాలసీ నుంచి పరిహారం అందుకోగలరు. కనుక తీసుకుంటే టర్మ్ ఇన్సూరెన్స్నే తీసుకోవాలి. టర్మ్ ప్లాన్ అన్నది 30 ఏళ్లలోపు తీసుకోవడమే మంచిది. తమపై ఆధారపడిన వారు ఎవరూ లేకపోతే, ఇంకా వివాహం చేసుకోకపోతే.. ముందుగానే తీసుకోవడాన్ని పరిశీలించొచ్చు. ఎందుకంటే ఆలస్యం చేయడం వల్ల ప్రీమియం పెరిగిపోతుంది. ఈలోపు ఏవైనా ఆరోగ్య సమస్యలు బయటపడితే ప్రీమియం భారం మరింత పెరుగుతుంది. మంచి చెల్లింపుల చరిత్ర కలిగిన కంపెనీల మధ్య టర్మ్ ప్రీమియం వ్యత్యాసాన్ని పరిశీలించి.. ఆకర్షణీయమైన ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ అనుకోకుండా ఆస్పత్రిలో చేరాల్సి వస్తే.. భారీ బిల్లుతో ఆర్థికంగా కుదేలవుతున్న వారు ఎందరో ఉన్నారు. కరోనా సంక్షోభ సమయంలో ఇదే కనిపించింది. అందుకే ప్రతి ఒక్కరికి హెల్త్ కవరేజీ తప్పకుండా ఉండాల్సిందే. అందుకే హెల్త్ ప్లాన్‌ను ఆరోగ్యంపై పెట్టుబడిగా చెబుతారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే వైద్య బిల్లుల భారాన్ని తప్పించుకోవచ్చు. పొదుపు, పెట్టుబడులు క్షేమంగా ఉంటాయి. హెల్త్ ప్లాన్ లేకపోతే పెట్టుబడులు కరిగిపోతాయి. లేదంటే అప్పుల పాలు కావాల్సిన పరిస్థితి కూడా ఎదురుకావచ్చు. వైద్య చికిత్సల వ్యయాలు ఎంతో ఖరీదుగా మారాయన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏటేటా చార్జీలు పెరుగుతూనే పోతున్నాయి. అందుకని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడమే కాకుండా.. కుటుంబ సభ్యులు అందరికీ కవరేజీ తగినంత ఉండేలా చూసుకోవాలి. అరకొర కవరేజీతో తీసుకుంటే అవసరాలు తీరకపోవచ్చు. ఒక అంచనా ప్రకారం మధ్యతరగతి ప్రజల్లో 90 శాతానికి పైగా హెల్త్ కవరేజీ లేదు. ఉన్నా తగినంత కవరేజీ లేదు. ముఖ్యంగా చిన్న వయసులో వ్యాధుల రిస్క్ అంతగా ఉండదు. 40 ఏళ్లు దాటిన తర్వాత నుంచి ఈ రిస్క్ పెరుగుతుంది. యుక్త వయసులో మంచి ఆరోగ్యాన్ని చూసి హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఎక్కువ మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే, ఒక్కసారి ఆరోగ్య సమస్యలు వెలుగు చూసిన తర్వాత బీమా తీసుకోవాలంటే ప్రీమియం భారం ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. కనుక బీమా ఏదైనా కానీయండి ముందుగానే తీసుకోవాలి. ప్రీమియం తప్పకుండా చెల్లిస్తూ వెళ్లాలి. వైద్య బీమా తీసుకునే వారు 10 ఏళ్ల తర్వాత వైద్య ఖర్చులను పరిగణనలోకి తీసుకోవాలి. లేదంటే ప్రతీ పదేళ్లకు కవరేజీని సమీక్షించుకుని పెంచుకోవాలి. రుణాలకు దూరం విచక్షణ లేకుండా, ఆలోచన లేకుండా రుణాలు తీసుకోవడం నష్టానికి దారితీస్తుంది. మీ చెల్లింపుల సామర్థ్యాన్ని మించి రుణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దు. అప్పటికే రుణాలు తీసుకుని ఉంటే వాటిని తీర్చడానికే మొదట ప్రాధాన్యం ఇవ్వాలి. రుణాల మీద రుణాలు తీసుకుని చెల్లింపులు కష్టమైతే.. క్రెడిట్ స్కోరు దెబ్బతింటుంది. దీంతో భవిష్యత్తులో ముఖ్యమైన రుణాలకు సమస్యలు ఏర్పడొచ్చు. జీవితంలో లాభదాయకమైన రుణం ఏదైనా ఉందంటే అది గృహ రుణమే. పన్ను ప్రయోజాలను పరిగణనలోకి తీసుకుంటే గృహ రుణం ఒక్కదానిని పరిశీలించొచ్చు. అలాగే, అవసరానికి పిల్లల ఉన్నత విద్య కోసం రుణ బాట కూడా పట్టొచ్చు. వ్యక్తిగత రుణాలు, కన్జ్యూమర్ రుణాలన్నవి విలువను తగ్గించేవి. వీటికి దూరంగా ఉండాలి. రుణ చెల్లింపులు నెలవారీ నికర ఆదాయంలో 50 శాతాన్ని మించకూడదన్నది ప్రాథమిక సూత్రం. ద్రవ్యోల్బణానికి చోటు సగటు ద్రవ్యోల్బణం 7 శాతం ఉంటుందని అనుకుంటే నేటి రూ.లక్ష విలువ కాస్తా.. 30 ఏళ్ల తర్వాత రూ.13,000 అవుతుంది. అంటే నేడు రూ.లక్షకు లభించే ఏదేనీ సేవ కోసం 30 ఏళ్ల తర్వాత ఏడున్నర రెట్లు అధికంగా చెల్లించాల్సి వస్తుందని అర్థం చేసుకోవాలి. అందుకనే భవిష్యత్తుకు ప్లాన్ చేసుకునే సమయంలో ద్రవ్యోల్బణానికీ ప్రాధాన్యం ఇవ్వాలి. భవిష్యత్తులో పిల్లల విద్య, వివాహం, రిటైర్మెంట్ అవసరాలకు ఎంత కావాలన్నది నిర్ణయించుకునే ముందు ద్రవ్యోల్బణ రేటును అంచనాల్లోకి తీసుకోవాలి. ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని పొదుపు విలువ పెంచుకోవాలంటే.. పెట్టుబడులపై దీర్ఘకాలంలో సగటు రాబడి రేటు 14 శాతం అయినా వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలని నిపుణుల సూచన. ఈపీఎఫ్ నిధికి ప్రాముఖ్యత ఉద్యోగం మారినప్పుడు, ముఖ్యమైన అవసరాలకు ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్) నుంచి ఉపసంహరించుకోవడం చాలా మంది చేసే పని. గతంలో అంటే సంస్థను మారినప్పుడల్లా, పాత ఖాతాను బదలాయించుకోవడం తలనొప్పిగా భావించి దాన్ని మూసేసేవారు. సంస్థను మారిప్పుడల్లా కొత్త ఖాతాను తెరిచేవారు. కానీ, ఇప్పుడు యూనివర్సల్ ఖాతా నంబర్ విధానం అమల్లోకి వచ్చింది కనుక ఈ ఇబ్బందులు తొలగిపోయాయి. సంస్థను మారినా పాత ఖాతాను బ్యాలన్స్ సహా బదలాయించుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వాలి. ఇలా అవసరమైనప్పుడల్లా ఈపీఎఫ్ నిధిని ఖాళీ చేస్తుండడం వల్ల పెద్ద నిధిని సమకూర్చుకునే అవకాశాన్ని కోల్పోతారు. ఇంటి నిర్మాణానికి, తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు.. మరే ఇతర మార్గం లేనప్పుడు ఈపీఎఫ్ నిధిని పరిశీలించొచ్చు. అంతేకానీ, ఇతరత్రా అవసరాలకు భవిష్య నిధిని కదపకపోవడమే సూచనీయం. దీనివల్ల ఉద్యోగ విరమణ సమయంలో కాంపౌండింగ్ మహిమతో మంచి నిధిని అందుకోవచ్చు. కాంపౌండింగ్ పెట్టుబడులను ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయవద్దు, ఆలస్యం చేయవద్దు. వాయిదా వేయడం వల్ల కాంపౌండింగ్ మ్యాజిక్‌ను కోల్పోవాల్సి వస్తుంది. కాంపౌండింగ్ పెట్టుబడిని మరింతగా వృద్ధి చేస్తుంది. ఉదాహరణకు ప్రతి నెలా రూ.5,000 చొప్పున 15 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. అప్పుడు పెట్టుబడి 9 లక్షలు అవుతుంది. 10 శాతం రాబడి ప్రకారం అంచనా వేస్తే 15 ఏళ్లకు రూ.20 లక్షలు అవుతుంది. దీన్ని మరింత కాలం కొనసాగిస్తూ వెళితే అప్పుడు రాబడికి రాబడి కలుస్తూ పెద్ద మొత్తం సమకూరుతుంది. పొదుపు/పెట్టుబడి పొదుపునే పెట్టుబడిగా భావించే వారు కూడా ఉన్నారు. బ్యాంకు ఖాతాలో ఉంచినా, ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా దాన్ని పెట్టుబడిగా పరిగణించడం మెరుగైన ఆర్థిక జీవనానికి మార్గం కానే కాదు. ఎందుకంటే సేవింగ్స్ ఖాతాలో బ్యాలన్స్‌పై వచ్చే వడ్డీ రాబడి 3 శాతమే. ఇది ద్రవ్యోల్బణం రేటులో సగం. కరెన్సీ విలువను హరించే మేరకు రాబడి కూడా ఇవ్వనిది పెట్టుబడి సాధనం ఎలా అవుతుంది.? అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లపైనా వడ్డీ రేటు 6.5 శాతం మించి లేదు. ఇది కూడా ద్రవ్యోల్బణం రేటుకు సమానమే. పైగా ఎఫ్డీపై వచ్చే వడ్డీ ఆదాయం ఆదాయపన్ను పరిధిలోకి వస్తుంది. డెట్ ఫండ్స్‌లో రిస్క్ తీసుకుంటే రాబడి రేటు 8 శాతం అందుకోవచ్చు. ద్రవ్యోల్బణం రేటు కంటే ఎక్కువ రాబడి ఇవ్వని ఏదీ కూడా పెట్టుబడి సాధనం కాబోదు. అందుకనే సంపాదనలో ఆదా చేసిన మొత్తాన్ని మంచి రాబడినిచ్చే సాధనంలో పెట్టినప్పుడే పెట్టుబడి అవుతుంది. అన్ని సాధనాల్లోకి ఈక్విటీలు దీర్ఘకాలంలో మెరుగైనవి. 20–30 ఏళ్ల కాలంలో వీటిల్లో రాబడి 12–18 శాతం మధ్య ఉంటుందని ఆశించొచ్చు. -
పోలీస్ శాఖలో ఒకే ఒక్కడు!..సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎస్ఐ
సాక్షి, కర్నూలు: జిల్లా పోలీసు శాఖలోని స్పెషల్ బ్రాంచ్ విభాగం నంద్యాల డివిజన్ ఎస్ఐగా పనిచేస్తున్న ఎల్.రఘురామయ్య తన 30 ఏళ్ల సర్వీసు పూర్తి చేసి పదవీ విరమణ పొందాల్సి ఉంది. అయితే ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు(క్రమబద్ధీకరణ చట్టం) 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ రాజపత్రం సోమవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయానికి చేరడంతో రఘురామయ్య పదవీ విరమణ ఆగిపోయింది. చదవండి: జీతం పడకుండా తగ్గినట్లు మీకు ఎలా తెలుసు?: ఏపీ హైకోర్టు జిల్లా పోలీసు శాఖలో ఈయన ఒక్కరే పదవీ విరమణ పొందాల్సి ఉండటంతో అరుదైన ఈ అవకాశం ఆయనకు లభించిందని సహోద్యోగులు చర్చించుకోవడం కనిపించింది. ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామానికి చెందిన ఈయన 1987లో కానిస్టేబుల్ హోదాలో పోలీసుశాఖలో చేరి 2020 అక్టోబర్‌లో ఎస్ఐగా పదోన్నతి పొందారు. మరో రెండు సంవత్సరాలు సర్వీసు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: ఎవ్వరికీ జీతాలు తగ్గలేదు.. ఆ ఆలోచనను విరమించుకోండి: సీఎస్ సమీర్ శర్మ -
మనసున్న జగన్ సర్కార్
మనసున్న మనిషి పాలకుడైతే నిర్ణయాలెలా ఉంటాయో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి నిరూపించారు. సంక్రాంతికి అయిదారు రోజుల ముందే రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల కుటుంబాల్లో ఆనందోత్సాహాలు నింపారు. వారు కోరుకున్న విధంగా మాత్రమే కాదు... అంతకన్నా అధికంగా లబ్ధి చేకూర్చి అందరితోనూ శభాష్ అనిపించుకున్నారు. శుక్రవారం ప్రభుత్వ నిర్ణయాలను ప్రకటిస్తూ ఉద్యోగ సంఘాల ప్రతినిధులనుద్దేశించి చేసిన ప్రసంగం ఆయన వ్యక్తిత్వానికీ, ఆయనలోని సానుకూల దృక్పథానికీ అద్దం పట్టింది. అధికారుల కమిటీ చేసిన సిఫార్సుకు భిన్నంగా 23 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించడంతోపాటు ఎవరూ ఊహించని విధంగా ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచడంలోనే ఆయన వైఖరేమిటో అందరికీ తేటతెల్లమైంది. గురువారం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమైనప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నదేమిటో అందరికీ తెలుసు. ఉద్యోగులకు ఎంత మంచి చేయగలిగితే అంతా చేస్తానన్నది ఆ ప్రసంగం సారాంశం. ‘ఉదారంగా, మానవతా దృక్పథంతో ఉండే విషయంలో నాకన్నా బాగా స్పందించేవాళ్లూ, నాకన్నా ఎక్కువగా స్పందించేవాళ్లూ తక్కువగా ఉంటారు’ అని ఆయన అన్న మాటలు స్వోత్కర్షతో కూడినవి కాదని, వాటి వెనక మూర్తీభవించిన నిజాయితీ గూడుకట్టుకుని ఉన్నదని తాజా నిర్ణయాలు ఎలుగెత్తి చాటుతున్నాయి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి తొలి పాలకుడిగా వచ్చిన చంద్రబాబు నాయుడు అయిదేళ్లపాటు తన తప్పుడు ప్రాధమ్యాలతో, అసంబద్ధ విధానాలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్థం చేశారు. వేలాదికోట్ల రూపాయలమేర బకాయిలు మిగిల్చి నిష్క్రమించారు. ఇది చాలదన్నట్టు గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తోంది. ఫలితంగా ఏటా 15 శాతం మేర పెరగాల్సిన ఖజానా రాబడి కాస్తా క్షీణిస్తున్నది. 2018–19, 2019–20, 2020–21 ఆర్థిక సంవత్సరాల్లో వరసగా పడి పోయిన ఆదాయమే ఇందుకు సాక్ష్యం. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకత ఏమంటే... ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా పేద ప్రజల, రైతుల, అట్టడుగు కులాల, వర్గాల సంక్షేమాన్ని మరువకపోవడం. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మొదలు సమస్త రంగాలూ జవసత్వాలతో కొనసాగడానికి అనువైన విధానాలు రూపొందించడం. ఈ నిర్ణయాల ఫలితంగానే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల కొనుగోలు శక్తి మెరుగ్గా ఉండగలిగింది. మరోపక్క విద్య, వైద్య రంగాలను రెండు కళ్లుగా భావిస్తూ వాటిని బలోపేతం చేస్తున్నారు. పడిపోతున్న ఆదాయం పర్యవసానంగా ఏర్పడిన కష్టాలను పంటి బిగువన భరిస్తూ దేనికీ లోటు జరగకుండా చర్యలు తీసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉద్యోగుల ఆందోళన సాకుతో ఇబ్బందులపాలు చేయాలని తెలుగుదేశం, దాని అనుకూల మీడియా శక్తులూ కాచుక్కూర్చున్నాయి. ఉద్యోగశ్రేణులకూ, ప్రభుత్వానికీ మధ్య అగాథాన్ని సృష్టించాలని కలలుగన్నాయి. కానీ ప్రజల పట్ల నిబద్ధత, వారిపట్ల సహానుభూతి, నిండైన విశ్వసనీయత కలిగిన జగన్మోహన్ రెడ్డి ముందు అవన్నీ వీగిపోయాయి. అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారి నిర్వహించిన జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీల సదస్సులో తన పాలన ఎలా ఉండబోతున్నదో, అధికారగణంనుంచి తాను ఆశిస్తున్నదేమిటో జగన్ తేటతెల్లం చేశారు. ప్రజలతో వ్యవహరించాల్సివచ్చినప్పుడూ, వారు లేవనెత్తే సమస్యల పరిష్కా రానికి పూనుకున్నప్పుడూ ఉదార దృక్పథాన్ని ప్రదర్శించాలనీ, అందులో మానవీయ స్పర్శ మిళితం కావాలనీ కోరారు. ఆ క్షణం మొదలుకొని నిత్యం ఆయన దాన్ని ఆచరించి చూపిస్తున్నారు. అధికా రులు ఆచరించేలా చేస్తున్నారు. ఈ విషయంలో ఎక్కడ లోటుపాట్లు కనిపించినా స్వయంగా జోక్యం చేసుకుని సవరిస్తున్నారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో జరిపిన చర్చల సందర్భంలోనూ, నిర్ణయాలు తీసుకునే విషయంలోనూ ఆయన వీటినే పాటించి చూపారు. పీఆర్సీ ప్రకారం సవరించే వేతనాలను వచ్చే అక్టోబర్ నుంచి ఇవ్వాలని అధికారుల కమిటీ సిఫార్సు చేయగా, అంతకన్నా పది నెలల ముందే– ఈ నెలనుంచే అమలు చేయాలని నిర్ణయించడంగానీ, ఎన్నడూ లేనివిధంగా కొత్త స్కేళ్లను రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలని ఆదేశించడంగానీ ఆ కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతుంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కాలంనుంచీ పీఆర్సీ వేతనాల అమలులో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఎప్పుడూ అన్యాయమే జరుగుతోంది. రెగ్యులర్ ఉద్యోగులకు వర్తింపజేసిన ఏడాది, ఏడాదిన్నర తర్వాతగానీ వారికి కొత్త వేతనాలు లభించేవి కాదు. అందుకోసం ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణాలు చేయడం కూడా మామూలే. కానీ ఈ రివాజుకు భిన్నంగా వ్యవహరించడం ద్వారా తనేమిటో మరోసారి జగన్ నిరూపించారు. ఇప్పటికే ఆ వర్గాలవారికి అందే జీతాల్లో దళారీల పాత్ర లేకుండా చేశారు. ఉద్యోగ సంఘాలు కోరకుండానే జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్‌లో ఉద్యోగులకు 10 శాతం ప్లాట్లు కేటాయించారు. పైగా ఆ ప్లాట్లకయ్యే వ్యయంలో 20 శాతం రిబేట్ ఇవ్వాలని నిర్ణయించారు. నిన్నా, ఈరోజూ ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడిన సందర్భాల్లో వారిలో తననూ భాగం చేసుకుని మాట్లాడారు. ఆయన చూపిన చొరవా, ఆయన తీసుకున్న సాహసోపేత నిర్ణయాలూ ఉద్యోగ శ్రేణుల్లో స్ఫూర్తిని నింపుతాయని, వారు మరింత అంకితభావంతో పనిచేయడానికి తోడ్పడతాయని, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి దోహదపడతాయని ఆశిద్దాం. -
ఏపీ ఉద్యోగులకు సీఎం జగన్ వరాల జల్లు..పీఆర్సీ ఎంతంటే..?
-
కనీస మూల వేతనం 53.84 శాతం పెంపు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం 23% ఫిట్మెంట్ ప్రకటించడంతో ఉద్యోగుల కనీస మూలవేతనం 53.84% అంటే రూ.7 వేలు పెరగనుంది. గరిష్ట మూలవేతనం 35.01 శాతంగా రూ.59,730 పెరగనుంది. ఈ పెరుగుదలకు సంబంధించి ఏ క్షణంలోనైనా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్ 23 శాతం ఫిట్మెంట్ ప్రకటించడంతో తమకు ఎంత మేర జీతం పెరుగుతుందోనని ఉద్యోగులు లెక్కలు వేసుకుంటున్నారు. 11వ పీఆర్సీ కమిటీ నాలుగో తరగతి ఉద్యోగికి ఇవ్వాల్సిన కనీస మూల వేతనం రూ.20 వేలు, ఉన్నత స్థాయిలో పనిచేసే ఉద్యోగి గరిష్ట మూలవేతనం రూ.1.79 లక్షలుగా మాస్టర్ స్కేల్‌ను ఖరారు చేసింది. అంతకుముందు 2015లో ఇచ్చిన పీఆర్సీలో రూ.13 వేలు ఉన్న కనీస మూలవేతనాన్ని 11వ పీఆర్సీ రూ.20 వేలకు పెంచింది. గరిష్ట వేతనం గత పీఆర్సీలో రూ.1,10,850 ఉండగా ఇప్పుడు రూ.1.79 లక్షలకు పెరగనుంది. అంటే రూ.68,150 పెరుగుదల అధికంగా ఉండనుంది. ఈ మేరకు వేతన స్థిరీకరణ జరగనుంది. గత పీఆర్సీ సిఫారసుల్లో కొత్తగా ఉద్యోగంలో చేరే నాలుగో తరగతి ఉద్యోగి కనీస మూల వేతనం రూ.13 వేలుగా ఉంది. వీరికి బేసిక్ పే రూ.7 వేలు పెరగనుంది. 2018 జూలై 1 వరకు ఉన్న డీఏ విలీనం కొత్త పీఆర్సీని 2018 జూలై 1 నుంచి అమలు చేయనున్నారు. అప్పటి మూలవేతనం ఆధారంగానే వేతన సవరణ జరగనుంది. ఈ తేదీ నాటికి ఉన్న కరువు భత్యం (డీఏ)ను కొత్త వేతనంలో విలీనం చేస్తారు. 2018 జూలై ఒకటో తేదీ వరకున్న డీఏ 30.392% కొత్త వేతనంలో కలుస్తుంది. ఈ డీఏను, 23 శాతం ఫిట్‌మెంట్‌ను పాత బేసిక్ పేతో కలిపి కొత్త మూల వేతనాన్ని నిర్ధారిస్తారు. ఫిట్మెంట్ అంటే.. ఎప్పటికప్పుడు పెరిగే నిత్యావసరాల ధరలు, ఇతర ఖర్చుల ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చేసే జీతాల పెంపును ఫిట్మెంట్ అంటారు. కేంద్రం పదేళ్లకు ఒకసారి, ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లకోసారి వేతన సవరణ చేస్తోంది. నిర్ణీత గడువు నాటికి ఉద్యోగికి ఉన్న మూల వేతనానికి అప్పటికి ఉన్న డీఏను, ఫిట్‌మెంట్‌గా ఇచ్చే మొత్తాన్ని కలిపి కొత్త మూలవేతనాన్ని నిర్ధారిస్తారు. అయితే ఉద్యోగుల మూల వేతనాలకు సంబంధించి నిర్ణీత పేస్కేల్ ఉంటుంది. ఉద్యోగి కొత్త మూల వేతనాన్ని ఆ పేస్కేల్‌లో ఉన్న మొత్తానికి సర్దుబాటు చేస్తారు. దీనికి ఇతర అలవెన్సులు కలిపి మొత్తం జీతాన్ని లెక్కిస్తారు. ఉదాహరణకు మధ్యస్థాయి ఉద్యోగి మూలవేతనం రూ.44,250గా ఉంది. అతనికి 2018 జూలై 1 నాటికి ఉన్న 30.392 శాతం డీఏ అంటే రూ.10,177.. 23 శాతం ఫిట్మెంట్ అంటే రూ.13,448.. మొత్తం కలిపి రూ.23,625ను మూల వేతనానికి కలుపుతారు. అప్పుడు రూ.67,875 అతని కొత్త బేసిక్‌పే అవుతుంది. కానీ మాస్టర్‌స్కేల్‌లో ఈ బేసిక్ పే లేదు. దానికన్నా తక్కువ ఉన్న రూ.65,360, ఆపై రూ.70,850 బేసిక్‌పేలు ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు పైన ఉండే స్కేల్‌ను వర్తింపజేస్తారు. దీని ప్రకారం ఆ ఉద్యోగికి రూ.70,850 మూలవేతనం, అలవెన్సులు కలిపి పూర్తివేతనాన్ని నిర్ధారిస్తారు. ఇదీ మాస్టర్ స్కేల్.. 11వ పీఆర్సీ కమిటీ ఉద్యోగుల మాస్టర్ స్కేల్‌ను 32 గ్రేడ్లు, 83 స్టేజ్‌లుగా ఖరారు చేసింది. ప్రస్తుతం ఉన్న మూలవేతనం, వార్షిక ఇంక్రిమెంట్ ఇతర అంశాల ఆధారంగా.. ఆ తర్వాత ఉండాల్సిన కనీస మూల వేతనాలను ఖరారు చేసింది. కొత్త పే స్కేల్లో బేసిక్ పే, 100శాతం డీఏ (2018 జూలై 1 నాటికి ఉన్నది), ఫిట్మెంట్ కలిసి ఉంటాయి. మాస్టర్ స్కేల్.. 20,000–600–21,000–660–23,780–720–25,940–780–28,280–850–30,830–920–33,590–990–36,560–1,080–39,800–1,170–43,310–1,260–47,090–1,350–51,140–1,460–55,520–1,580–60,260–1,700–65,360–1,830–70,850–1,960–76,730–2,090–83,000–2,240–89,720–2,390–96,890–2,540–1,04,510–2,700–1,12,610–2,890–1,21,280–3,100–1,30,580–3,320–1,40,540–3,610–1,54,980–3,900–1,70,580–4,210–1,79,000 (83 స్టేజిలు) -
ఒకే కంపెనీలో 75 ఏళ్ల సర్వీస్... 90 ఏళ్ల వయసులో రిటైర్మెంట్..!!
A 90 Year Old Mechanic Named Bryan Webb Has Been Celebrated on Social Media After Retiring at the Age of 75: దశాబ్దం పాటు ఒకే కంపెనీలో పనిచేస్తేనే గొప్ప విషయంగా మారిన ఈ రోజుల్లో.. ఓ వ్యక్తి మాత్రం, తను పనిచేస్తున్న కంపెనీలో అమృతోత్సవం జరుపుకున్నాడు. అసలు విషయం ఎంటంటే.. బ్రిటన్‌కు చెందిన బ్రియాన్ వెబ్ కుటుంబ పరిస్థితుల కారణంగా పదహారేళ్ల వయసులోనే సంపాదించాల్సిన పరిస్థితి. అతని అదృష్టం.. వెంటనే 1946లో వోక్స్ హాల్ అనే కార్ల కంపెనీలో మెకానిక్ ఉద్యోగం లభించింది. నాలుగేళ్లలోనే మెకానిక్ నుంచి సీనియర్ మెకానిక్‌గా మారాడు. తర్వాత వివిధ పదోన్నతులు పొందుతూ వారంటీ అడ్మినిస్ట్రేటర్‌గా ఎదిగాడు. రోజులు గడిచేకొద్దీ.. సంస్థపై తనకున్న అభిమానం పెరిగిపోతూనే ఉంది. ఎంతలా అంటే.. తన 25 సంవత్సరాల సర్వీస్‌కు సంస్థ నుంచి అందిన వాచ్‌ను ఇప్పటికీ ధరించేంతలా! అయితే, ఎంత ఇష్టం ఉన్నా కాలాన్ని ఆపలేం కదా! పెరిగిపోతున్న వయసు ఆడ్డుకట్ట వేసింది. బ్రిటన్ రిటైర్మెంట్ రూల్స్ ప్రకారం పదవీ విరమణ పొందాడు. చదవండి: Lingcod Fish Interesting Facts: ఈ రాక్షస చేప నోట్లో వందల పళ్లు!!.. ఇప్పటికీ రహస్యమే.. దీంతో, 90 ఏళ్ల వయసులో 75 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని, రిటైర్మెంట్ తీసుకున్న మొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. ఇందుకు సంస్థ నుంచి ఓ స్పానర్ను బహుమతిగా పొందాడు. ఇన్ని రోజులు విధినిర్వహణలో భాగమైన తన స్పానర్.. దానినే వారు మంచి బాక్స్‌లో పెట్టి, ఓ బంగారు పూత పూసిన ఫలకంపై అతని పేరు, సర్వీస్ వివరాలను ముద్రించి బహూకరించారు. వీటితో పాటు మరికొన్ని బహుమతులు కూడా ఇచ్చారు. మిస్ అవుతున్నా.. ‘చిన్నప్పటి నుంచి కార్లు అంటే ఇష్టం. అందుకే, ఇంతకాలం ఇంత ఇష్టంగా పనిచేయగలిగా! ఇంకొన్ని రోజులు పనిచేయమన్నా పనిచేస్తా. కంపెనీని, కొలీగ్స్‌ని బాగా మిస్ అవుతున్నా’ అంటూ బ్రియాన్ వెబ్ కంపెనీకి వీడ్కోలు పలికాడు. చదవండి: Worlds Most Dangerous Foods: అత్యంత విషపూరితమైన వంటకాలు.. ప్రాణాలను పణంగా పెట్టి మరీ తింటారట!! View this post on Instagram A post shared by BBC News (@bbcnews) -
‘61 ఏళ్ల’కు సింగరేణి ఆమోదం
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయసును 60 నుంచి 61 సంవత్సరాలకు పెంచేందుకు బోర్డు అంగీకరించింది. సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ అధ్యక్షతన సోమవారం జరిగిన 557వ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ (బీవోడీ) సమావేశం ఈ మేరకు ఆమోదం తెలిపింది. సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచాలని సీఎం కేసీఆర్ ఇటీవల ఆదేశించారు. ఈ నేపథ్యంలో జరిగిన సమావేశానికి సంస్థ డైరెక్టర్లతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి బోర్డు ప్రతినిధులు హాజరయ్యారు. పదవీ విరమణ వయసు పెంపును ఈ ఏడాది మార్చి 31వ తేదీ నుంచి అమలు చేయడానికి బోర్డు అంగీకరించిందని సింగరేణి సీఎండీ శ్రీధర్ వెల్లడించారు. బీవోడీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం మొత్తం 43,899 మంది కార్మికులకు లబ్ధి కలగనుందని చెప్పారు. ఈ ఏడాది మార్చి 31 నుంచి జూన్ 30వ తేదీ మధ్యలో రిటైరైన 39 మంది అధికారులు, 689 మంది కార్మికులను కూడా విధుల్లోకి తీసుకుంటామని తెలిపారు. సింగరేణి విద్యా సంస్థల్లో కూడా పదవీ విరమణ వయసు పెంపు వర్తిస్తుందని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఇంధన శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తాని యా, కేంద్ర బొగ్గు శాఖ డైరెక్టర్ పీఎస్ఎల్ స్వామి, డిప్యూటీ కార్యదర్శి అజితేశ్ కుమార్, వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ సీఎండీ మనోజ్‌కుమార్, సింగరేణి డైరెక్టర్లు ఎస్.చంద్రశేఖర్ (ఆపరేషన్స్), ఎన్.బలరామ్ (ఫైనాన్స్), డి.సత్యనారాయణరావు (ఈఅండ్ఎం), కంపెనీ సెక్రటరీ సునీతాదేవి తదితరులు పాల్గొన్నారు. బోర్డు తీసుకున్న మరికొన్ని నిర్ణయాలివే.. ►సంస్థ పరిధిలోని కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియలో కార్మికుల కుమారులు, అవివాహిత కుమార్తెలకు మాత్రమే ఇప్పటివరకు అవకాశం కల్పించేవారు. కానీ ఇప్పుడు పెళ్లయిన లేదా విడాకులు తీసుకుని విశ్రాంత ఉద్యోగిపై ఆధారపడి ఉన్న కుమార్తెలు, ఒంటరి మహిళలకూ వయోపరిమితికి లోబడి అవకాశం కల్పిస్తారు. ►సామాజిక బాధ్యతా కార్యక్రమాల కింద 2021–22 ఆర్థిక సంవత్సరానికి రూ.60 కోట్లు వెచ్చిస్తారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ల అమలు. ►వివిధ గనులకు అవసరమైన యంత్రాలు సమకూర్చుకోవడంతో పాటు పలు కాంట్రాక్టు పనులకు కూడా ఆమోదం. రామగుండంలో కొత్తగా ప్రారంభించనున్న ఓపెన్ కాస్ట్–5 కోసం అవసరమైన రెండు నూతన రహదారుల నిర్మాణానికి కావాల్సిన బడ్జెట్‌కు కూడా ఆమోదం. ►ఫస్ట్ క్లాస్ మైన్ మేనేజర్‌గా ఉన్న మైనింగ్ అధికారుల హోదా మార్పునకు అంగీకారం. గతంలో ఎగ్జిక్యూటివ్, ఎన్సీడబ్ల్యూ ఉద్యోగ నియామకాల్లో ఉన్న లింగపరమైన ఆంక్షలను తొలగించి ఎవరైనా దరఖాస్తు చేసుకోవడానికి అంగీకారం. ►రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు శ్రీరాంపూర్ ఏరియా పరిధిలోని నస్పూర్ కాలనీ వద్ద జాతీ య రహదారి విస్తరణలో నిర్వాసితులైన స్థానికులకు సింగరేణి నిర్వాసిత కాలనీలో 85 చదరపు గజాల విస్తీర్ణం గల 201 ప్లాట్ల కేటాయింపు. సీఎంవోఏఐ కృతజ్ఞతలు సింగరేణిలో పదవీ విరమణ వయసు పెంపుతో పాటు మైనింగ్ అధికారుల హోదాను మార్చే ప్రతిపాదనకు సింగరేణి బోర్డు ఆమో దం తెలపడంపై బొగ్గుగని అధికారుల సంఘం (సీఎంవోఏఐ) హర్షం వ్యక్తం చేసింది. సీఎండీ శ్రీధర్‌కు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జక్కం రమేశ్, ఎన్వీ రాజశేఖర్‌లు సోమవారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. తమ సమస్యల పరిష్కారానికి కృషి చేసిన సింగరేణి డైరెక్టర్లకు కూడా ధన్యవాదాలు తెలిపారు. -
ఆర్టీసీలో ‘వయోపరిమితి’ లొల్లి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో ఉద్యోగ విరమణ వయస్సు పెంపు అంశంపై అధికారులు, కార్మికుల మధ్య వివాదం నెలకొంది. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని 61 ఏళ్లకు పొడగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దాన్ని ఆర్టీసీలో కూడా వర్తింపచేయాలంటూ తాజాగా ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించినట్టు సమాచారం. దీన్ని కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వయోపరిమితిని పెంచేట్టయితే, 58 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆర్టీసీలో కొనసాగాలా లేదా స్వచ్ఛంద పదవీ విరమణ పొందాలా అన్నవాటిల్లో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 2019 చివరిలో సుదీర్ఘకాలం ఆర్టీసీలో సమ్మె నడిచిన తర్వాత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల వయోపరిమితిని పెంచింది. ఆ నిర్ణయంతో గత రెండేళ్లుగా నిలిచిన పదవీ విరమణలు వచ్చే డిసెంబర్లో మొదలు కానున్నాయి. కార్మికుల వ్యతిరేకతకు కారణమిదే.. ఆర్టీసీ బస్సులు నడపటం, గంటలతరబడి నిలబడి టికెట్లు జారీ చేయటం, గ్యారేజీలో మరమ్మతు వంటి కఠినమైన విధులు వయస్సు మీరుతున్న కార్మికులకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. రిటైర్మెంటుకు చేరువయ్యేవారు ఈ పనులు చేయలేక సతమతమవుతూ ఉంటారు. దీంతో తమకు స్వచ్ఛంద పదవీవిరమణ అవకాశం కల్పించాలని చాలాకాలంగా వారు కోరుతున్నారు. వాలంటరీ రిటైర్మెంట్కు అవకాశం ఇవ్వండి ‘‘ఇప్పటికే రెండేళ్ల కాలం పొడగింపుతో డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ సిబ్బందిలో చాలామంది ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కష్టతరంగా ఉన్న విధులను 61 ఏళ్ల వయసులో చేయలేరు. వయోపరిమితి పెంపునకు ముందుగా కార్మికులకు స్వచ్ఛంద పదవీ విరమణ ఎంచుకునే అవకాశం కల్పించాలి’’. – తిరుపతి, తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు -
ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు తీపికబురు!
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని.. రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు (కార్పొరేషన్లు), గ్రాంట్–ఇన్–ఇన్స్టిట్యూషన్లు, సొసైటీలు, యునివర్సిటీలు (నాన్ టీచింగ్ స్టాఫ్), రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలోని ఇతర సంస్థల్లో సైతం అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదివారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఈ సంస్థలు తమ ఉద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును అడాప్ట్ చేసుకున్నాయని సీఎస్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు కోసం తీసుకొచ్చిన ‘తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (రెగ్యులేషన్ ఆఫ్ సూపర్‌అన్యూయేషన్) చట్ట సవరణ’గత మార్చి 30 నుంచి అమల్లోకి వచ్చిందని, ఈ నేపథ్యంలో పైన పేర్కొన్న సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపును సైతం అదే తేదీ నుంచి అమలుపర్చాలని ఆదేశించారు. ఆయా సంస్థల సర్వీసు రూల్స్‌కు ఈ మేరకు సవరణలు చేపట్టాలని కోరారు. ఇందుకు సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని తెలిపారు. పదవీ విరమణ వయసు పెంపునకు తీసుకున్న చర్యలపై నిర్దేశిత నమూనాలో రాష్ట్ర ఆర్థిక శాఖకు నివేదించాలని సూచించారు. గత నెల 30 నుంచే ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని ఆదేశించడంతో.. గత నెల 31న పదవీ విరమణ చేసిన పైన పేర్కొన్న సంస్థల ఉద్యోగుల సర్వీసు మరో మూడేళ్లు పెరిగింది. మళ్లీ వారు విధుల్లో చేరేందుకు అవకాశం లభించింది. -
పదవీ విరమణ పెంపుతో పోలీస్ శాఖలో వింత పరిస్థితి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం కురిపించిన వరాల జల్లుతో సర్కారు కొలువు చేసుకునే వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పోలీసు శాఖలో ఓవైపు పదోన్నతులు, మరోవైపు 30 శాతం ఫిట్మెంట్ పెంపు.. అన్నింటి కంటే ముఖ్యంగా రిటైర్మెంట్ వయోపరిమితిని 58 నుంచి 61 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో దాదాపు 80 వేలమంది సిబ్బంది సంబరాలు చేసుకుంటున్నారు. అదేసమయంలో పోలీసు శాఖ అంతర్గతంగా తీసుకున్న నిర్ణయంతో విచిత్రాలు చోటుచేసుకున్నాయి. పోలీసు శాఖ అదనపు ఎస్పీ నుంచి నాన్‌కేడర్ ఎస్పీలుగా 52 మందికి పదోన్నతి కల్పించేందుకు తాజాగా చర్యలు తీసుకుంది. అలాగే మొత్తం 26 మంది నాన్‌కేడర్ ఎస్పీలకు ఐపీఎస్‌హోదా కల్పించాలని నిర్ణయించింది. దీనికి ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది. ఈ క్రమంలో నేడోరేపో ఐపీఎస్ హోదా లభించే ఈ 26 మంది నాన్‌కేడర్ ఎస్పీల విషయంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఐపీఎస్ నిబంధనల ప్రకారం.. రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. వీరికి ఐపీఎస్ హోదా దక్కితే రెండేళ్లు అదనంగా సర్వీసు దక్కేది. కాగా, రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం..అది 58 నుంచి 61 ఏళ్లకు చేరుకుంది. ఆ లెక్కన ఈ 26 మంది ఒక ఏడాది ముందే రిటైర్ కానున్నారు. ఒకవేళ వీరికి ఐపీఎస్ కన్ఫర్మ్ కాకపోయినా.. మరో ఏడాది నాన్ కేడర్ ఎస్పీలుగా కొనసాగే అవకాశాలు ఎలాగూ ఉండనే ఉన్నాయి. ప్రస్తుతం ఈనెలాఖరుకు ఒకే ఒక్క నాన్‌కేడర్ ఎస్పీ రిటైర్ కావాల్సి ఉంది. రిటైర్మెంటుకు సరిగ్గా వారంరోజుల ముందు ప్రభుత్వం ఆయనకు వరుసపెట్టి శుభవార్తలు చెప్పింది. ఫిట్మెంట్ పెంపు, సర్వీసు పొడిగింపు ఇలా..! మొత్తానికి ఇవన్నీ పదవి నుంచి తప్పుకునే క్రమంలో తనకు దక్కిన అపూర్వ అవకాశంగా భావిస్తున్నానని తెలిపారు. ఆయనకు త్వరలోనే ఐపీఎస్ హోదా దక్కనుందని సమాచారం. ఇది ఆయనకు దక్కిన మూడో బోనస్. కాగా, డిపార్ట్మెంటులో ఏటా 2,000 మందివరకు రిటైర్ అవుతుంటారు. ఈ లెక్కన చూస్తే.. వీరందరికీ లాభం చేకూరినట్లే. మరో మూడేళ్ల వరకు అంటే 2024 మార్చి వరకు డిపార్ట్మెంటులో దాదాపుగా రిటైర్మెంట్లు అన్న మాటే వినిపించదు. ప్రభుత్వ ప్రకటనతో డిపార్ట్మెంటులో ఉన్న దాదాపు 80 వేల మంది సిబ్బంది సంతోషంగా ఉన్నారు. మూడువారాల్లో మూడేళ్ల సర్వీస్ మిస్..! పోలీసు శాఖలో మార్చి నెలాఖరునాటికి గ్రేటర్‌లోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలో దాదాపు 50 మంది, మిగిలిన జిల్లాల్లో దాదాపు 60 మంది వరకు అంటే మొత్తంగా 110 మంది రిటైర్ కావాల్సి ఉంది. కానీ, వీరందరికీ ఏకంగా మూడేళ్ల సర్వీసు, 30 శాతం ఫిట్మెంట్తో కలసివచ్చింది. అదే సమయంలో ఫిబ్రవరి 28న డిపార్ట్మెంటులో దాదాపు 100 మందికిపై పోలీసులు పదవీ విరమణ చేశారు. వయోపరిమితి పెంపు ప్రకటన వచ్చాక వీరంతా తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. కేవలం మూడువారాల వ్యవధిలో మూడేళ్ల సర్వీసు కోల్పోయామని నిర్వేదంలో పడ్డారు. -
‘నాకు రిటైర్మెంట్ వయసు పెంపు వద్దు’
కొడిమ్యాల: ఉద్యోగ విరమణ వయోపరిమితి పెంపుపై ఉద్యోగులంతా సంబరాలు చేసుకుంటుండగా.. ఓ ప్రధానోపాధ్యాయుడు మాత్రం తనకు పెంపు వద్దంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులుగా నల్లబ్యాడ్జీ ధరించి విధులకు హాజరవుతున్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమిలికొండ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం ఏనుగు మల్లారెడ్డి తనకు రిటైర్మెంట్ వయస్సు పెంపు వద్దని మంగళవారం ప్రకటించారు. ఉద్యోగ విరమణ వయస్సును 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచడం వల్ల నిరుద్యోగ యువతకు అవకాశాలు దక్కకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థులు చేసిన త్యాగాలను గుర్తు తెచ్చుకుని సీఎం కేసీఆర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఉద్యోగులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు
సాక్షి, హైదరాబాద్: వేతన సవరణ (పీఆర్సీ) ప్రకటన కోసం ఆత్రుతగా ఎదురు చూస్తోన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు చెప్పారు. అసెంబ్లీ వేదికగా ఉద్యోగులకు 30శాతం పీఆర్సీని ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి పీఆర్సీ అమల్లోకి వస్తుందని తెలిపారు. అలానే ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘కరోనాతో వేతన సవరణలో ఆలస్యం జరిగింది. ఉద్యోగ సంఘాలతో పలు దఫాలుగా చర్చలు జరిగాయి. త్రిసభ్య కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చించింది. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర కీలకమైనది. ఉద్యోగ సంఘాలతో స్వయంగా నేను కూడా చర్చించాను. 2014లో 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించాం. ఈ సారి 30 శాతం ఫిట్మెంట్ ఇస్తాం. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు పెంచుతాం. అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పిస్తాం. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలను త్వరలో భర్తీ చేస్తాం’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. అలానే ‘‘హోంగార్డులు, వీఏవో, వీఆర్ఏ, ఆశావర్కర్లకు, అంగన్వాడీ, విద్యా వాలంటీర్లు, సెర్ప్ సిబ్బందికి పీఆర్సీ వర్తింప చేస్తాం. అలానే పెన్షనర్ల వయోపరిమితి 75 నుంచి 70 ఏళ్లకు తగ్గిస్తాం. అర్హులైన ఉపాధ్యాయులకు బదిలీలు, ప్రమోషన్లు కల్పిస్తాం. దంపతులైన ఉద్యోగులకు అంతర్జిల్లా బదిలీలకు ఆమోదం తెలుపుతున్నాం. మహిళా ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవులు. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులను రిలీవ్ చేస్తాం అని కేసీఆర్ తెలిపారు. చదవండి: నిరుద్యోగ భృతిపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు -
ఉద్యోగుల వయోపరిమితి పెంపు సరికాదు
ముషీరాబాద్: ఉద్యోగాలు లేక రోజుకొకరు చొప్పున నిరుద్యోగులు చస్తుంటే రిటైర్మెంట్ వయస్సు 58 నుంచి 60 ఏళ్లకు పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రంలోని 16 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యమాలు చేస్తారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. మంగళవారం విద్యానగర్‌లోని బీసీ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తెలంగాణ వస్తే ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్పి ఇంతవరకు ఊరికొక ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. కనీసం వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.50 లక్షల ఉద్యోగాల భర్తీకి కూడా చర్యలు తీసుకోలేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 ఏళ్లు గడిచినా 30 వేల పోలీస్ ఉద్యోగాలు, మరో 15 వేల ఇతర ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసిందన్నారు. ఇంకా గ్రూప్–1లో 1500, గ్రూప్–2లో 4వేలు, గ్రూప్–4 సర్వీస్ 40 వేల క్లరికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయలేదన్నారు. ఇంకోవైపు రిటైర్ అయిన వేలాదిమంది ఉన్నతాధికారుల పదవీ కాలాన్ని పొడిగిస్తూ రాజకీయ అవినీతికి పునాదులు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ వయోపరిమితిని పెంచితే కిందిస్థాయి ఉద్యోగులకు ప్రమోషన్లు రావాని, అంతేకాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వానికి ఉద్యోగుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, బకాయిలుగా పేరుకుపోయిన డీఏలులు చెల్లించాలన్నారు. కేవలం వయోపరిమితి పెంచి ఉద్యోగాలకై ఎదురుచూస్తున్న నిరుద్యోగుల పొట్టకొడితే సహించేదిలేదని ఆయన హెచ్చరించారు. త్వరలో అన్ని ప్రజా సంఘాలు, యువజన , విద్యార్థి సంఘాలతో సమావేశమై పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. రిటైర్మెంట్ వయస్సు పెంచొద్దు.. ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును పెంచొద్దని తెలంగాణ స్టూడెంట్ యూనిట్ రాష్ట్ర అధ్యక్షుడు బైరు నాగరాజు గౌడ్ మంగళవారం కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుండగా, ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును పెంచడం వల్ల నిరుద్యోగం బాగా పెరుగుతుందన్నారు. ఇప్పుడున్న రిటైర్మెంట్ వయస్సును కొనసాగిస్తూ అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలనీ సీఎం కేసీఆర్‌కు నాగరాజు విజ్ఞప్తి చేశారు. -
ఆ ప్రచారం అవాస్తవం.. పుకార్లు నమ్మొద్దు..
సాక్షి, విజయవాడ: ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుండి 57 ఏళ్లకు ప్రభుత్వం తగ్గిస్తుందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ తెలిపారు. ప్రభుత్వంపై సోషల్ మీడియాలో చేస్తున్న అసత్య ప్రచారాలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇలాంటి పుకార్లు నమ్మొద్దని ఉద్యోగులకు ఆయన విజ్ఞప్తి చేశారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ఇటువంటి ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య వివాదం సృష్టించే కుట్రగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేసిన వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. -
తెలంగాణ : అడ్డదారిలో ఎక్స్టెన్షన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగులంతా రిటైర్మెంట్ వయసు పెంపు కోసం ఎదురుచూస్తుంటే కొందరు ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం తమ అనుకున్న వారి పదవీ విరమణ వయసు పెంపునకే కృషి చేస్తున్నారు. ప్రభుత్వంలో తమకున్న పలుకుబడిని ఉపయోగించుకొని ఈ తతంగానికి పాల్పడుతున్నారు. గతంలో ప్రజాప్రతినిధుల సిఫారసుతో ప్రభుత్వం చేనేత జౌళి శాఖలో ఇద్దరి పదవీ విరమణ వయసు పొడిగించగా, ఇప్పుడు కొందరు టీజీవో, టీఎన్జీవో సంఘాల నేతలు తమ వారికి ఇలాగే రిటైర్మెంట్ వయసు పొడిగించుకున్నారు. దీని కోసం తమ సంఘాల సిఫారసులను వాడుకోవడం ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ప్రభుత్వం పదవీ విరమణ వయసును పొడిగిస్తుందని వేల మంది ఎదురు చూస్తుండగా, సంఘాల నేతలు మాత్రం తమ వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తుండటంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇటీవల గవర్నమెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీలో సీనియర్ లెక్చరర్ వెంకటేశ్వర్లు, కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, చేనేత జౌళిశాఖలో పిట్టల యాదగిరి, రత్నాకర్, యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి, అగ్రికల్చర్ వర్సిటీలో సుధీర్ కుమార్, పరిటాల సుబ్బారావుల సర్వీస్‌నూ రెండేళ్లు పొడిగించడం ఉద్యోగుల ఆగ్రహానికి కారణం అవుతోంది. సాధారణ ఉద్యోగులకు అడిగే అవకాశం లేక.. ఉద్యోగ సంఘాల్లో సాధారణ ఉద్యోగులకు ప్రాథమిక సభ్యత్వం ఉన్నా తమ నేతలను అడిగే పరిస్థితిలో వారు లేరు. మెజారిటీ సంఘాలు సర్వసభ్య సమావేశాలను నిర్వహిస్తున్న దాఖలాల్లేవ్. దీంతో సాధారణ ఉద్యోగుల ఆవేదనను పట్టించుకునే వారే లేకుండాపోయారు. కాస్త పరపతి ఉన్నవారు అడిగినా.. సంఘాల నేతలు ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చి మిన్నకుండిపోతున్నారన్న విమర్శలున్నాయి. అయితే తమ ఇంట్లో వ్యక్తులు, బంధువుల కోసం మాత్రం అడ్డదారిలో పైరవీలు చేసుకొని ప్రయోజనాలు పొందుతున్నారని ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆశ.. నిరాశల్లో ఉద్యోగులు.. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇవ్వడం, తర్వాత ఆ మేరకు ప్రతిపాదనలు కూడా సిద్ధం కావడంతో ఉద్యోగులు ఎప్పుడెప్పుడు జీవో వస్తుందా అని కాలం వెళ్లదీస్తున్నారు. ఇలా ఎదురుచూస్తూనే.. అనేక మంది పదవీ విరమణ పొందుతున్నారు. కనీసం ఈసారి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున రిటైర్మెంట్ వయసును సీఎం పొడిగిస్తారని ఆశతో ఎదురుచూసినా నిరాశ తప్పలేదు. ఇప్పటికే వేల మంది పదవీ విరమణ పొందగా, 2022 వరకు మరో 23,386 మంది పదవీ విరమణ పొందనున్నారు. వీరిలో చాలా మంది రిటైర్మెంట్ వయసు పెంపు కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. దీని కోసం సంఘాల నేతలను ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. 2020 జనవరి నుంచి ఇప్పటివరకు రిటైర్ అయినవారు - 2,708 మంది వచ్చే 7నెలల్లో పదవీ విరమణ పొందనున్న వారు - 5,900 మంది 2022 డిసెంబర్ నాటికి రిటైర్ కానున్న ఉద్యోగులు - 23,386 మంది వ్యక్తిగత ప్రయోజనాలు సరికాదు.. ఉద్యోగుల సమస్యలపై ప్రశ్నించాల్సిన సంఘాల నేతలు వాటిని పక్కనపెట్టేశారు. తమ అవసరాల కోసం ప్రభుత్వం వద్ద ఉద్యోగుల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు. పీఆర్సీ, డీఏ, ఐఆర్ వంటి సమస్యలను పట్టించుకోవడం లేదు. తమకు ప్రయోజనం చేకూర్చితే చాలు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. భజనపరులకే ప్రభుత్వ ప్రయోజనం చేకూర్చుతోంది. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం విధానపర నిర్ణయం తీసుకొని ఉద్యోగులందరికి మేలు చేయాలి. – సదానంద్‌గౌడ్, పర్వతరెడ్డి, ఎస్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యుదర్శులు.. హర్షవర్దన్‌రెడ్డి, పీఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు... జంగయ్య, చావరవి, యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు... నావత్ సురేశ్, టీపీయూఎస్ అధ్యక్షుడు -
భారత సైన్యం కీలక నిర్ణయం..!
న్యూఢిల్లీ: త్రివిధ దళాల్లో పనిచేస్తున్న సిబ్బంది రిటైర్మెంట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకునే దిశగా కేంద్ర అడుగులేస్తోంది. ఈ మేరకు నూతన త్రివిధ దళాధిపతిగా బాధ్యతలు చేపట్టిన జనరల్ బిపిన్ రావత్ కూడా ఓ కీలక ప్రకటన చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్మీ జవాన్లతో పాటు వైమానిక దళంలో ఎయిర్ మెన్, నేవీలో సెయిలర్ల పదవీ విరమణ వయసును కూడా 50 సంవత్సరాలకు పెంచునున్నట్లు తెలిపారు. చదవండి: 20 ఏళ్లలో 5 వైరస్లు అక్కడినుంచే..! త్రివిధ దళాల్లో ఉన్న జవాన్ల రిటైర్మెంట్ వయసు పెంచేందుకు ఓ విధానాన్ని తీసుకున్నట్లు రానున్నట్లు బిపిన్ రావత్ పేర్కొన్నారు. ఈ విధానం వల్ల త్రివిధ దళాల్లో పనిచేస్తున్న సుమారు 15 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం సైన్యంలో పనిచేస్తున్న జవాన్లు, ఎయిర్ మెన్, సెయిలర్లు 15 నుంచి 17 ఏళ్ల మాత్రమే సర్వీసులో ఉంటున్నారు. చదవండి: అదే పాత సింహాలు ఇప్పుడు కొత్త పేరుతో దీనిపై బిపిన్ రావత్ స్పందిస్తూ.. అన్ని విధాల ట్రైనింగ్ పొందిన వారు కేవలం 15 నుంచి 17 ఏళ్లు మాత్రమే ఎందుకు సర్వీస్‌లో ఉండాలి, 30 సంత్సరాలపాటు వారెందుకు సేవ చేయకూడదంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు కేంద్రం తీసుకోబోయే నిర్ణయానికి సంకేతంగా భావిస్తున్నారు. చదవండి: ఆ రెండింటిపై హోం శాఖ అలర్ట్ -
రిటైర్మెంట్ వయస్సు తగ్గించే ఆలోచన లేదు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును తగ్గించే ప్రతిపాదనేమీ లేదని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఆదివారం స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 50 ఏళ్లకు తగ్గించనున్నారని మీడియాలో వచ్చిన కథనాలను ఆయన తోసిపుచ్చారు. ప్రస్తుతం వారి రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లుగా ఉంది. స్వార్థ ప్రయోజనాల కోసం, ప్రభుత్వంపై బురద జల్లేందుకు కొందరు ఇలాంటి తప్పుడు వార్తలను ఒక వర్గం మీడియాలో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కరోనా కారణంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్న సమయంలో కొన్ని స్వార్థ శక్తులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని ఒక ప్రకటనలో సింగ్ ఆరోపించారు. 80 ఏళ్లు దాటిన వారికి పెన్షన్ నిలిపివేత, మిగతావారి పెన్షన్‌లో 30% కోత అంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేశారన్నారు. లాక్డౌన్ సమయంలోనూ ఉద్యోగుల ప్రయోజనం కోసం చర్యలు తీసుకున్నామన్నారు. కనీస సిబ్బందితో విధులు నిర్వహించాలని, దివ్యాంగులకు అత్యవసర విధులు వేయవద్దని ఆదేశించామన్నారు. -
‘రిటైర్మెంట్ గడువు పెంచం’
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని, గడువు పొడిగించే ప్రతిపాదనేదీ లేదని కేంద్రం స్పష్టం చేసింది. పదవీ విరమణ వయస్సు ముగిసిన వారు నిబంధనల మేరకు మార్చి 31వ తేదీన రిటైర్ కావాల్సిందేనని తెలిపింది. దేశవ్యాప్తంగా నెలకొన్న అసాధారణ పరిస్థితులున్నప్పటికీ ఉద్యోగుల పదవీ కాలాన్ని పెంచడం లేదని సిబ్బంది శాఖ వివరించింది. లాక్డౌన్ కారణంగా వారు ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్నా లేదా కార్యాలయానికి హాజరవుతున్నా నిబంధన –56 ప్రకారం మార్చి 31, 2020న రిటైర్ కావాల్సిందేనని పేర్కొంది. (చదవండి: కొంపముచ్చిన మొక్కుబడి హెచ్చరికలు) ప్రభుత్వం ఆ రోజులను లెక్కించదు న్యూఢిల్లీ: గడువు ముగిసేలోగా సస్పెన్షన్ ఉత్తర్వులను సమీక్షించడం, ప్రభుత్వాధికారులు స్వచ్ఛంద పదవీ విరమణ నోటీసులను అంగీకరించడం వంటివి లాక్ డౌన్ సమయంలో పరిగణించబోమని కేంద్ర సిబ్బంది శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పలు విధుల గడువు కాలాన్ని పెంచనున్నట్లు తెలిపింది. ఉదాహరణకు ఒక పనిని పూర్తి చేయడానికి ప్రభుత్వం 20 రోజుల గడువు విధిస్తే, లాక్ డౌన్ మధ్యలో రావడం వల్ల ఆ పని ఆగిపోతుంది. ఈక్రమంలో లాక్డౌన్ కాలాన్ని ప్రభుత్వం పరిగణించదు. లాక్డౌన్ ఎత్తివేశాక ఆ పనిని పూర్తి చేసేందుకు మళ్లీ 20 రోజుల కాలం ఉంటుంది. విధిని పూర్తి చేసేందుకు 15 రోజుల కంటే తక్కువ సమయం ఉంటే, లాక్ డౌన్‌తర్వాత దాన్ని పూర్తి చేసేందుకు 15 రోజుల వరకూ గడువు ఉంటుంది. (చదవండి: మగాళ్లూ.. ఇంటి పనులు చేయండి: సీఎం) -
పదవీ విరమణ @ 61
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం 58 ఏళ్లుగా ఉన్న విరమణ వయసు 61 ఏళ్లకు పెరగనుంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం జరిగింది. దీనికి సంబంధించి తదుపరి మంత్రివర్గ సమావేశం నాటికి ఫైల్‌ను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించినట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. విరమణ వయసును 61 ఏళ్లకు పెంచితే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 2023 మార్చి 31 నాటికి పదవీ విరమణ చేయనున్న 26,133 మంది ఉద్యోగులకు మూడేళ్ల పాటు అదనపు సరీ్వసు కలిసొస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి రాష్ట్రంలో కూడా పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచడంతో పాటు 33 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులకు ఈ పెంపు వర్తింపచేయకూడదన్న ఉన్నతాధికారుల కమిటీ సిఫారసులను సీఎం పక్కన పెట్టినట్లు తెలిసింది. ఉద్యోగుల సర్వీసు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసుతో నిమిత్తం లేకుండా ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగానే 61 ఏళ్లకు సీఎం మొగ్గు చూపినట్లు సమాచారం. మూడేళ్ల పాటు నో రిటైర్మెంట్.. పదవీ విరమణ వయసు పెంపుదల ఉత్తర్వులు అమల్లోకి వస్తే 2020 ఏప్రిల్ 1 నుంచి 2023 మార్చి 31 దాకా రిటైర్మెంట్లు ఉండవు. దాదాపు 26,133 మంది ఉద్యోగులకు సంబంధించిన గ్రాట్యుటీ, పదవీ విరమణ సందర్భంగా ఇచ్చే అన్ని రకాల బెనిఫిట్లకు సంబంధించి చెల్లింపులు నిలిచిపోతాయి. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో తాత్కాలికంగా ప్రభుత్వానికి ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుంది. ప్రస్తుతం ఉన్న 58 ఏళ్లు కొనసాగిస్తే ప్రభుత్వం ప్రతినెలా రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల మేర గ్రాట్యుటీ, ఇతర బెనిఫిట్లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే సంవత్సరానికి సగటున రూ.3,500 కోట్లు మూడు సంవత్సరాల పాటు ప్రభుత్వానికి కలిసొస్తుంది. పదవీ విరమణ వయసు పెంపుదలతో ప్రభుత్వ ఉద్యోగులందరికీ మూడు సంవత్సరాల పాటు సరీ్వసు పెరుగుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు పదవీ విరమణ చేయనున్న 7,040 మందితో పాటు ఆ తర్వాత రెండేళ్లు కలుపుకొని మొత్తం 26,133 మంది ఉద్యోగులకు వెంటనే మూడేళ్ల పాటు అదనంగా ఉద్యోగంలో కొనసాగడానికి వీలు కలుగుతుంది. -
బోధనాస్పత్రుల్లో వైద్యుల వయోపరిమితి పెంపు
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లోని అధ్యాపకులు, అనుబంధ ఆస్పత్రిలోని వైద్యుల వయోపరిమితిని 65 ఏళ్లకు పెంచాలని సర్కారు నిర్ణయించింది. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వీరికి కూడా 58 ఏళ్లు మాత్రమే వయో పరిమితిగా ఉంది. అయితే, అసెంబ్లీ ఎన్నికలకు ముందు వీరి వ యోపరిమితిని 65 ఏళ్లకు పెంచాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తర్వాత దాని అమ లు ఆలస్యం కావడం, ఈలోగా ఎన్నికలకు వెళ్లడంతో వయోపరిమితి పెంపు నిలిచిపోయింది. ఈ నేపథ్యం లో గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని వైద్యులు ఒత్తిడి చేస్తున్నారు. పైగా బోధనాస్పత్రుల్లో ఏటా రిటైరయ్యే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది 57 మంది సీనియర్ అధ్యాపకులు రిటైర్ అవుతున్నారు. అందుకు తగినట్టుగా అధ్యాపకుల భర్తీ జరగకపోవడంతో వైద్య విద్య సంకటంలో పడింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) తనిఖీలకు వచ్చినపుడు బోధనా సిబ్బంది లేక ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో సీట్లు కోల్పోయిన పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో వారికి వయోపరిమితిని 65కు పెంచాలని సర్కారు నిర్ణయం తీసుకున్నట్టు వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపాయి. -
పదవీ విరమణ వయసు 60?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై వివాదాలకు తావు లేని రీతిలో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. మంత్రివర్గ విస్తరణ తరువాత ఏర్పాటయ్యే తొలి కేబినెట్ సమావేశం నాటికి దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి పదవీ విరమణ వయసు పెంపును అమలు చేయాలని భావిస్తున్నారు. ఎటువంటి షరతులు లేకుండా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 60 ఏళ్ల వయసును పరిగణనలోకి తీసుకోవాలని ఉన్నతాధికారుల బృందం ముఖ్యమంత్రికి సూచించినట్లు తెలిసింది. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ప్రస్తుతం ఉన్న 58 ఏళ్లను 61 సంవత్సరాలకు పెంచడం వల్ల న్యాయపరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉన్నదని ఉన్నతాధికారవర్గాలు అంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం 60 ఏళ్లు అమలు చేస్తున్నందున ఇక్కడ కూడా యథా తథంగా అమలు చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదన్నది ఆ వర్గాల అభిప్రాయంగా ఉంది. ఒకవేళ 61 సంవత్సరాలకు పెంచితే దానికి ప్రామాణికం ఏమిటని న్యాయస్థానాలు ప్రశ్నించే వీలుందని, అలా కాకుండా కేంద్రం అమలు చేస్తున్న విధానమే మేలన్నది ఉన్నతాధికారవర్గాల అభిప్రాయం. ఒకవేళ 61 ఏళ్లకు పెంచి 33 ఏళ్ల సర్వీసు లేదా 61 ఏళ్లు ఏది ముందయితే దాన్ని అమలు చేయాలన్న ప్రతిపాదన ఆచరణయోగ్యం కాదని ఉన్నతాధికారులు అంటున్నారు. ఎవరైనా 20 ఏళ్లకు ఉద్యోగంలో చేరితే 33 ఏళ్ల సర్వీసు తరువాత అంటే 53 ఏళ్లకు పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో 60 ఏళ్లు ఉద్యోగానికి అర్హమైనప్పుడు అంతకు ఏడేళ్ల ముందు పదవీ విరమణ ప్రతిపాదన బాగుండదన్నదే ఉన్నతాధికారుల వాదన. ఈ నేపథ్యంలో పదవీవిరమణ వయసును 60 ఏళ్లకు పరిమితం చేయాలన్నదానిపైనే ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.