Sambit Patra
-
బీజేపీ ఎంపీ అభ్యర్థి సంబీత్ పాత్ర వివాదాస్పద వ్యాఖ్యలు
భువనేశ్వర్: లోక్‌సభ ఎన్నికల వేళ పార్టీల నేతలు ప్రచారంలో చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. పూరీ జగన్నాథ స్వామిపై పూరీ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సంబిత్ పాత్ర చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సంబిత్ పాత్ర ఆదివారం పాల్గొన్న ప్రచార ర్యాలీ అనంతం మీడియాతో మాట్లాడుతూ.. పూరీ జగన్నాథ స్వామి ప్రధాని మోదీకి భక్తుడు అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రతిపక్షాలు ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండింస్తూ.. విమర్శలు గుప్పించారు.సంబిత్ పాత్ర వ్యాఖ్యలపై ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ స్పందించారు. ‘శ్రీ జగన్నాథ్ మహాప్రభు విశ్వానికినే దేవుడు. అటువంటి దేవుడినే మోదీకి భక్తుడు అనటం భగవంతున్ని కించపర్చడమే.దానిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జగన్నాథ్ స్వామి కోట్లాది మంది భక్తుల విశ్వాసలను కించిపర్చినట్లే’ అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.BJP नेता संबित पात्रा का कहना है कि महाप्रभु भगवान श्री जगन्नाथ नरेंद्र मोदी के भक्त हैं। यह महाप्रभु का घोर अपमान है। इस बयान से करोड़ों भक्तों की आस्था को चोट पहुंची है।मोदी भक्ति में लीन संबित पात्रा को यह पाप नहीं करना चाहिए था। इस घृणित बयान के लिए खुद नरेंद्र मोदी को… pic.twitter.com/di0So3FxCz— Congress (@INCIndia) May 20, 2024 సంబిత్ పాత్ర చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ‘అధికార మత్తులో ఉన్న బీజేపీ.. మన దేవుళ్లను సైతం విడిచిపెట్టడం లేదు. ఇక ప్రజలను మాత్రం ఎలా విడిచిపెడుతుంది. జగన్నాథ్ స్వామిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండింస్తున్నాం. కోట్లాది మంది జగన్నాథ్ స్వామి భక్తులను కించిపర్చినట్లే. జూన్ 4న ప్రజల సంకల్పం ముందు బీజేపీ అహకారం నాశనం అవుతుంది’ అని ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు.విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తటంతో బీజేపీ ఎంపీ అభ్యర్థి సంబిత్ పాత్ర స్పందించారు. ‘నమస్కార్ నవీన్ జీ. ఈ రోజు నరేంద్ర మోదీ రోడ్డు షోకు సంబంధించిన పలు న్యూస్ చానెల్స్‌తో మాట్లాడాను. ఎక్కడ మాట్లడినా ప్రధాని మోదీ.. శ్రీ జగన్నాథ్ స్వామికి పెద్ద భక్తుడని చెబుతా వస్తున్నా. అదేవిధంగా మోదీ.. జనన్నాథ్ స్వామికి భక్తుడు అనబోయి పొరపాటున వ్యతిరేకార్థంలో మాట్లాడాను. దీనిని పెద్ద విషయం చేయకండి. మనమంతా కొన్ని నోరుజారీ మాట్లాడుతాం’ అని సంబిత్ పాత్ర వివరణ ఇచ్చారు.Naveen Ji Namaskar!I gave number of bytes today to multiple media channels after the massive success of Shri Narendra Modiji’s Road Show in Puri today, everywhere I mentioned that Modi ji is an ardent “Bhakt” of Shri Jagannath Mahaprabhu ..by mistake during one of the bytes I… https://t.co/6Q1Kuj5E6O— Sambit Patra (Modi Ka Parivar) (@sambitswaraj) May 20, 2024 -
కేంద్ర మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం..
భువనేశ్వర్: కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా ప్రయాణించిన పడవ చిలుకా సరస్సులో సుమారు రెండు గంటల పాటు చిక్కుకుపోయింది. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. వెంటనే స్పందించిన అక్కడి సబ్బంది సరస్సులోకి మరో పడవను పంపి మంత్రిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. మంత్రితో పాటు ఆ పడవలో బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్రా మరో ఇద్దరు నేతలు ఉన్నారు. మంత్రి రూపాల ఖుర్దా జిల్లాలోని బార్కుల్ నుంచి పూరీ జిల్లాలోని సతపదాకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ‘సాయంత్రం కావటంతో చికటిపడింది. పడవ నడిపే వ్యక్తి కొత్త దారిలో పడవను తీసుకెళ్లాడు. దీంతో అసలు వెళ్లాల్సిన దారి తప్పిపోయాం. సతపద చేరుకోవడానికి మరో రెండు గంటలు పట్టింది’ అని మంత్రి రూపాలా తెలిపారు. ଚିଲିକା ମଝିରେ ୨ ଘଣ୍ଟା ଫସିଲେ କେନ୍ଦ୍ରମନ୍ତ୍ରୀ । କେନ୍ଦ୍ର ମତ୍ସ୍ୟମନ୍ତ୍ରୀ ପୁରୁଷୋତ୍ତମ ରୁପାଲା ଚିଲିକାରେ ୨ ଘଣ୍ଟା ଧରି ଫସିରହିଥିଲେ ବୋଲି ସୂଚନା ମିଳିଛି। #Chilika #UnionMinister #ParshottamRupala #OTV pic.twitter.com/9stpN2Yfvm — ଓଟିଭି (@otvkhabar) January 7, 2024 సరస్సులో పడవ చిక్కుకోవడానికి మత్స్య కారులు వేసిన చేపలు పట్టే వల అని అనుమానించామని తెలిపారు. కానీ, పడవ దారి తప్పిపోవడమే.. కారణమని మంత్రి మీడియాకు వెల్లడించారు. ఈ ఘటనతో కృష్ణా ప్రసాద్ ప్రాంతంలో మంత్రి పాల్గొనాల్సిన ఓ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. చదవండి: Delhi: కాస్త ఎండ.. అంతలోనే విపరీతమైన చలి! -
కాంగ్రెస్ షేర్ చేసిన ఆర్ఎస్ఎస్ నిక్కర్ ఫోటోపై తీవ్ర దుమారం
సాక్షి, న్యూఢిల్లీ: భారత్ జోడో యాత్ర ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఆర్ఎస్ఎస్ ధరించే ఖాకీ నిక్కర్ కాలిపోతున్న ఫోటోను షేర్ చేసింది. విద్వేష సంకెళ్ల నుంచి దేశానికి విముక్తి కల్పించి ఆర్ఎస్ఎస్-బీజేపీ చేస్తున్న నష్టాన్ని నివారించేందుకు దశల వారీగా తమ లక్ష్యాన్ని చేరుకుంటామని పేర్కొంది. దీనికి భారత్ జోడో యాత్ర ట్యాగ్‌ను జత చేసింది. To free the country from shackles of hate and undo the damage done by BJP-RSS. Step by step, we will reach our goal.#BharatJodoYatra 🇮🇳 pic.twitter.com/MuoDZuCHJ2 — Congress (@INCIndia) September 12, 2022 సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఫోటోపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఈ ఫోటోను వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది. రాహుల్ గాంధీ.. మీరు దేశంలో హింసను కోరుకుంటున్నారా? అని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. రాహుల్ చేపట్టింది భారత్ జోడో యాత్ర కాదు భారత్ తోడో, ఆగ్ లగావో యాత్ర అని సెటైర్లు వేశారు. బెంగళూరు ఎంపీ, బీజేపీ యువనేత తేజస్వీ సూర్య.. ఈ ఫోటో కాంగ్రెస్ రాజకీయాలకు ప్రతీక అని ధ్వజమెత్తారు. 'కాంగ్రెస్ రాజేసిన నిప్పు 1984లో ఢిల్లీని తగలబెట్టింది. 2002లో 59 మంది కరసేవకులను సజీవదహనం చేసింది. మరోసారి ఆ పార్టీ హింసనే ప్రేరెేపిస్తోంది. రాహుల్ గాంధీ భారత్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే... రాజ్యాంగంపై నమ్మకంతో కాంగ్రెస్ రాజకీయపార్టీగా నిలిచిపోయింది. గతంలో కాంగ్రెస్ రాజేసిన అగ్గి దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఆ పార్టీ ఉనికి కోల్పోయేలా చేసింది. ఇక అధికారం మిగిలున్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కూడా ఆ పార్టీ నామరూపాల్లేకుండా పోతుంది' అని తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ సెప్టెంబర్ 7న భారత్ జోడో యాత్రను తమిళనాడులోని కన్యాకుమారిలో మొదలుపెట్టారు. 150 రోజుల పాటు సాగనున్న ఈ యాత్ర దేశంలో 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తూ 3,570కిలోమీటర్లు సాగనుంది. ఐదు రోజులు పూర్తి చేసుకున్న ఈ యాత్ర ప్రస్తుతం కేరళలో కొనసాగుతోంది. కశ్మీర్లో ముగుస్తుంది. చదవండి: జ్ఞానవాపి మసీదుపై వారణాసి కోర్టు సంచలన తీర్పు -
మళ్లీ రచ్చకెక్కిన రఫేల్ గొడవ
ఫ్రాన్స్‌కు చెందిన యుద్ధవిమానాల తయారీసంస్థ డసాల్ట్ ఏవియేషన్ నుంచి భారత్ ‘రఫేల్’జెట్ విమానాలను కొనుగోలు చేసిన వ్యవహారం మళ్లీ పతాక శీర్షికలకెక్కింది. మీ హయాంలోనే అవినీతి జరిగిందంటూ అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌లు పరస్పరం తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకోవడం మళ్లీ మొదలుపెట్టాయి. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాలం(2007–12)లో సుశేన్ మోహన్ గుప్తా అనే మధ్యవర్తికి 75 లక్షల యూరోలు(దాదాపు రూ.65 కోట్లు) ముడుపులుగా అందాయని ఫ్రాన్స్‌కు చెందిన పరిశోధనాత్మక జర్నల్ ‘మీడియాపార్ట్’తాజాగా బహిర్గతం చేయడం బీజేపీకి కొత్త విమర్శనాస్త్రంగా మారింది. యూపీఏ హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసి 36 ఫైటర్ జెట్ల కొనుగోలు కోసం 2016 సెప్టెంబర్‌లో రూ.59వేల కోట్లతో మోదీ సర్కార్, డసాల్ట్ ఏవియేషన్ మధ్య ఒప్పందం కుదిరిన విషయం తెల్సిందే. ‘ఐ నీడ్ కమిషన్(ఐఎన్‌సీ)గా మార్చుకోండి: బీజేపీ ఎద్దేవా న్యూఢిల్లీ: ‘రఫేల్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన ముడుపుల చెల్లింపులు మీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. బహూశా ఈ చెల్లింపుల నగదు మొత్తాలతో కాంగ్రెస్, గాంధీల కుటుంబాలు సంతృప్తి చెందలేదేమో. అందుకే కాంగ్రెస్ హయాంలో కొనుగోలు చర్చలు విఫలమయ్యాయి’అని కాంగ్రెస్‌పై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా తీవ్ర విమర్శలు చేశారు. మీడియాపార్ట్ కథనం నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ముడుపులు తీసుకునే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్(ఐఎన్‌సీ) పేరును ఇకపై ఐ నీడ్ కమిషన్(ఐఎన్‌సీ)గా మార్చాలి. సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, రాబర్ట్ వాద్రా అందరూ కమిషన్లు అడిగేవారే ’అని సంబిత్ విమర్శించారు. రఫేల్ కొనుగోళ్లలో మోదీ సర్కార్ అవినీతికి పాల్పడిందంటూ ఇన్నాళ్లూ రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాలు, చెప్పిన మాటలు అన్నీ అబద్ధాలు అని మీడియాపార్ట్ కథనంతో తేలిపోయిందని సంబిత్ స్పష్టంచేశారు. మీడియాపార్ట్ తాజాగా వెల్లడించిన వాస్తవాలపై రాహుల్ మాట్లాడాల్సిందేనని సంబిత్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో అవినీతిపై మీ ప్రభుత్వమెందుకు దర్యాప్తు చేయలేదు? అన్న మీడియా ప్రశ్నకు సంబిత్ సమాధానమిచ్చారు. ‘ఆ మధ్యవర్తి సుశేన్ గుప్తాను ఇదివరకే అగస్టావెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్‌చేసింది. ఈ అంశాన్ని దర్యాప్తు సంస్థలే చూసుకోవాలి’అని ఆయన అన్నారు. ‘మా ప్రభుత్వ హయాంలో ఎలాంటి అవినీతి జరగలేదు. సుప్రీంకోర్టు, కాగ్ సైతం ఇదే విషయాన్ని ధ్రువీకరించాయి కూడా’అని ఆయన చెప్పారు. మీరెందుకు దర్యాప్తు చేయట్లేదు?: కాంగ్రెస్ ఎదురుదాడి కాంగ్రెస్ హయాంలోనే ముడుపులు చేతులు మారాయన్న బీజేపీ వాదనలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. ‘అదే వాస్తవమైతే బీజేపీ హయాంలో కేసు దర్యాప్తు ఎందుకు చేయలేకపోయారు? నిజాలను దాచే ప్రయత్నాలు బీజేపీ చేస్తోంది’అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించారు. ‘రహస్య కమిషన్లు అందాయని 2018లోనే సీబీఐ, ఈడీలకు సమాచారం ఉంది. అయినా ఆ దర్యాప్తు సంస్థలు దర్యాప్తునకు ఎందుకు మొగ్గుచూపలేదు? 2018లోనే అవినీతిపై ఇద్దరు బీజేపీ నేతలు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, ఒక సీనియర్ లాయర్ సీబీఐ డైరెక్టర్‌కు ఫిర్యాదుచేశారు. కానీ, కుంభకోణాన్ని కప్పిపుచ్చేందుకే బీజేపీ సర్కార్.. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను రాత్రికి రాత్రి పదవి నుంచి తొలగించింది. తమ అవినీతి బయటపడుతుందనే కేంద్రం దర్యాప్తునకు ఆదేశించలేదు. బీజేపీ ‘ఆపరేషన్ కవర్ అప్’కొనసాగిస్తోంది. అత్యంత ఎక్కువ ధరకు జెట్లను మోదీ సర్కార్ కొనుగోలుచేయడంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) పర్యవేక్షణతో దర్యాప్తు జరిపించాలి. జేపీసీకి మోదీ సర్కార్ ఎందుకు భయపడుతోంది? ’అని ఖేరా ప్రశ్నించారు. నిజం మనవైపే.. భయపడకండి: రాహుల్ అవినీతిమయ మోదీ ప్రభుత్వంపై పోరులో భయపడాల్సిన పని లేదని కాంగ్రెస్ కార్యకర్తలకు రాహుల్ గాంధీ ధైర్యం చెప్పారు. ‘ప్రతీ అడుగులో నిజం మనవైపే ఉన్నపుడు, మనం భయపడాల్సిన పనే లేదు. ‘ఆగకండి. అలసిపోకండి. భయపడకండి’అంటూ #RafaleScam హ్యాష్‌ట్యాగ్‌తో రాహుల్ గాంధీ మంగళవారం హిందీలో ట్వీట్‌చేశారు. రఫేల్ వివాదానికి జేపీసీ దర్యాప్తే అసలైన పరిష్కారమని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ అన్నారు. -
రఫెల్ డీల్ ముడుపుల ఆరోపణలు
-
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..
న్యూఢిల్లీ: రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీయేతర ప్రభుత్వాలు తమ ప్రాంతాల్లో ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఎవరూ చనిపోలేదని కోర్టుల్లో చెప్పాయని, కానీ ఇప్పుడు దానిపై రాజకీయాలు చేస్తున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర విమర్శించారు. బుధవారం ఆయన ప్రతిపక్ష పార్టీల తీరు గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఏ ఒక్కరూ చనిపోలేదని రాష్ట్రాలు కోర్టులకు లిఖిత పూర్వక సమాచారం ఇచ్చాయని అన్నారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇచ్చిన సమాచారాన్నే కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌లు ఈ విషయంపై రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. దేశంలో ఒకానొక పెద్ద పార్టీకి అధ్యక్షుడిగా పని చేసిన రాహుల్.. ట్విట్టర్లో రెండు లైన్ల అబద్ధాలను ప్రచారం చేశారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ ట్విట్టర్లో అలాంటి వ్యాఖ్యలు చేయడం కంటే వారి పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రప్రభుత్వాలతో మాట్లాడితే మంచిదని సూచించారు. ఢిల్లీ, మహారాష్ట్రలు తమ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందక మరణించారని ఆరోపణలు వచ్చిన కేసులపై అలాంటిదేమీ జరగలేదని ఢిల్లీ హైకోర్టు, బాంబే హైకోర్టుల్లో చెప్పాయన్నారు. కోవిడ్ సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ కొరత కారణంగా ఏ ఒక్కరూ మరణించలేదని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో మంగళవారం వెల్లడించింది. అందుకే మరణాలు: ప్రియాంక కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ లేమి కారణంగా ఎవరూ చనిపోలేదని కేంద్ర ప్రభుత్వం చెప్పడంపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ మండిపడ్డారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి మొదలైన సమయంలోనే కేంద్ర ప్రభుత్వం భారీగా ఆక్సిజన్‌ను ఇతర దేశాలకు ఎగుమతి చేసిందని, దీంతో ఆక్సిజన్ లేమి ఏర్పడిందని అన్నారు. అంతేగాక ఆక్సిజన్‌ను తరలించేందుకు ట్యాంకర్లను ఏర్పాటు చేయలేదని.. ఈ కారణాల వల్లే సెకండ్ వేవ్‌లో మరణాలు సంభవించాయని ఆమె చెప్పారు. ఈ ఏడాది కరోనా సమయంలో ఆక్సిజన్ ఎగుమతిని కేంద్రం ఏకంగా 700 శాతం పెంచిందని గుర్తు చేశారు. ఈ వ్యవహారంపై పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన సూచనలను కేంద్రం ఏ మాత్రం పట్టించుకోలేదని చెప్పారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లను నిర్మించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె విమర్శించారు. సెకెండ్‌వేవ్‌లో ఆక్సిజన్ అందక పలువురు మరణించారని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా చెప్పారు. ఆయా మరణాలను గుర్తించేందుకు తమ ప్రభుత్వం ఓ ప్యానెల్‌ను ఏర్పాటు చేసే ప్రయత్నం చేసిందన్నారు. -
ట్విట్టర్.. నీకిది సరికాదు: కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: టూల్‌కిట్ వివాదం ట్విట్టర్, కేంద్ర ప్రభుత్వాల మధ్య అగ్గి రాజేసింది. ఒక అంశంపై విచారణ కొనసాగుతుండగా ట్విట్టర్ తీర్పులు చెప్పడం సరికాదంటూ కేంద్రం అభిప్రాయపడింది. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర చేసిన ట్వీట్‌ని మానిప్యులేటెడ్ మీడియాగా ట్విట్టర్ లేబుల్ వేయడాన్ని తప్పుపట్టింది మోదీ సర్కార్. మానిప్యులేటెడ్ మీడియా లేబుల్ తొలగించాలని ట్విట్టర్‌ని కోరింది. టూల్‌కిట్ వివాదం కరోనా సంక్షోభాన్ని అడ్డుపెట్టుకుని మోదీ ప్రతిష్టను దెబ్బతీయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందంటూ ఆరోపించారు బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర. మోదీ ఇమేజ్‌కి భంగం కలిగించేలా విదేశీ మీడియాకు తప్పుడు సమాచారం ఇస్తూ కాంగ్రెస్ కుట్ర పన్నుతోందంటూ కొన్ని డాక్యుమెంట్స్‌తో ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ టూల్‌కిట్ ఎక్స్పోస్డ్ అంటూ కామెంట్ చేశారు. బీజేపీ శ్రేణులు ఈ ట్వీట్‌ని విపరీతంగా వైరల్ చేశాయి. కాంగ్రెస్ ఫైర్ సంబిత్ పాత్ర టూల్‌కిట్ పోస్ట్‌పై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ పార్టీ పేరు మీద ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండి పడింది. అంతటితో ఆగకుండా సంబిత్ పాత్రతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో పాటు మరికొందరు బీజేపీ నేతలను అరెస్ట్ చేయాలంటూ ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. ప్రస్తుతం ఈ కేసు విచారణ సాగుతోంది. ట్విట్టర్ చర్యలు సంబిత్ పాత్ర టూల్‌కిట్ పోస్ట్‌పై ట్విట్టర్‌కి కూడా ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్స్‌తో కాంగ్రెస్‌ని ఇబ్బంది పెట్టేందుకే సంబిత్ పాత్ర ఈ పోస్ట్ చేశారంటూ ట్విట్టర్‌కి వివరించింది. కాంగ్రెస్ ఫిర్యాదుపై ట్విట్టర్ స్పందించింది. సంబిత్ పాత్ర ట్వీట్‌కి మానిప్యులేటెడ్ మీడియా అంటూ లేబుల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ లేబుల్ పైనే కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. -
త్వరలోనే 4 పీఎస్‌యూల ద్వారా టీకా ఉత్పత్తి
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే భారత్ ఇతర దేశాలకు వ్యాక్సిన్ పంపింది. దానికి బదులుగా టీకా తయారీకి అవసరమైన ముడి సరుకులు పంపించాయి’’ అన్నారు బీజేపీ అధికార ప్రతినిధి సంబీత్ పాత్ర. మే 1నుంచి దేశవ్యాప్తంగా మూడో దశ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించాలని భావించినప్పటికి.. వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా ఉండటంతో అనుకున్న మేర కార్యక్రమం ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలో ప్రతి పక్షాలు కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల గురించి పట్టించుకోకుండా.. విదేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేసిందని.. ఫలితంగా దేశంలో కోవిడ్ వ్యాక్సిన్లకు తీవ్ర కొరత ఏర్పడిందని విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సంబీత్ పాత్ర స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కోవిషీల్డ్ ఫార్ములా, లైసెన్స్ విదేశాల చేతిలో ఉంది. లైసెన్స్ ఫ్రీ చేయడానికి భారత్, ఐక్యరాజ్య సమితి ద్వారా ప్రయత్నం చేస్తోంది. కోవాగ్జిన్ ఫార్ములా మన దేశానిదే. ఈ వాక్సిన్‌లో సజీవ వైరస్ ఉండడంవల్ల కట్టుదిట్టమైన వ్యవస్థ అవసరం. ఈ వ్యవస్థ భారత్ బయోటెక్ కాకుండా మరో కంపెనీ వద్ద మాత్రమే ఉంది. ఆ కంపెనీతో పాటు మరో నాలుగు పీఎస్‌యూల ద్వారా వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభించే ప్రయత్నాలు జరుగుతున్నాయి’’ అన్నారు సంబీత్ పాత్ర. ‘‘భారత్ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే ఇతర దేశాలకు వ్యాక్సిన్ పంపింది. దానికి బదులుగా వ్యాక్సిన్ తయారీకి అవసరమైన ముడి సరుకులు పంపించాయి. అలాగే విదేశాల్లోని భారతీయులకు వాక్సిన్ అందజేశారు. వ్యాక్సిన్‌పై కేజ్రీవాల్ రాజకీయాలు చేయడం మానుకోవాలి. వ్యాక్సిన్లు కొనుగోలుకు ఆర్డరు, అడ్వాన్స్ ఇవ్వకుండా కేజ్రీవాల్ ప్రజలను మభ్యపెడుతున్నారు. ఈ సంక్షోభ సమయంలో రాజకీయాలు మానుకుని ఏకతాటిపై నడవాలి’’ అని సంబీత్ పాత్ర ప్రతిపక్షాలకు సూచించారు. చదవండి: టీకాలపై తుది మాట మాదే -
సారు, కారు.. పదహారు అన్నది ఎవరు?
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కూర్చొని పాతబస్తీ మిత్రునికి సలాం కొడుతున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ధ్వజమెత్తారు. ‘మీకు బీజేపీ మేయర్ కావాలా..? ఎంఐఎం మేయర్ కావాలా..?. కాంగ్రెస్‌కు ఓటువేస్తే టీఆర్ఎస్కి వేసినట్లే.. టీఆర్ఎస్కి వేస్తే ఎంఐఎంకు పోతాది’ అంటూ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంబిత్ పాత్ర శనివారం నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. (బండి సంజయ్, అక్బరుద్దీన్‌పై కేసు నమోదు) కుటుంబ పాలన సాగుతోంది.. 'భాగ్యనగరానికి రావడం నా అదృష్టం. భాగ్యనగరం ఒక కుటుంబానికే పరిమితమయ్యింది. ఇది నిజంగా దౌర్భాగ్యం. భాగ్యనగర్ అన్నందుకు రెండు రోజుల క్రితం యువరాజు కేటీఆర్ చాలా బాధపడ్డాడు. బాధ దేనికి హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మార్చొద్దా..?. ఇక్కడ కుటుంబ పాలన సాగుతోంది. ఫ్యామిలీ ఫ్రెండ్ పాలన ఇది. దుబ్బాకలో కేసీఆర్ నివాసం ఉంది. అక్కడ బీజేపీ గెలిచింది. సర్కార్ కాదు. కార్కి పంక్చర్.. సర్ ఫామ్ హౌస్‌కి పరిమితం. ఏనాడు భారత్ అనని ఒవైసీని గెలిపిస్తే హిందూస్తాన్‌ను మార్చేస్తారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా ఎందుకు నిర్వహించరు..?. భాగ్యలక్ష్మి గుడికి తాళాలు వేశారు. అంటే పాతబస్తీ వేరే దేశంలో ఉందా.. వీసా తీసుకొని రావాలా..?. పాతబస్తీలోకి రావాలంటే ఎంఐఎం అనుమతి కావాలా..?. అలాంటి వాళ్లకు బుద్ది చెప్పాలి. అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లన్నారు. పట్టుమని ఇప్పటిదాకా 1,500 మందికి రాలేదు. ఇలా అయితే 50 ఏళ్లకు అయినా ఇళ్లు రావు. ప్రగతి భవన్లో అపరిమితంగా బెడ్రూమ్లు. సాధారణ జనాలకు మాత్రం ఇళ్లు లేవు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా ఇళ్లు నిర్మించి ఇస్తున్నాం. ఇక్కడ మాత్రం కేసీఆర్ ఇవ్వడం లేదు. కనీసం ఇటుక ఇవ్వలేదు. ఫొటోల కోసమే కేటీఆర్ వరదల్లో ఫోజులిచ్చారు. గ్లోబల్ హైదరాబాద్‌ను వరదల్లో ముంచారు. మీ కబ్జాల వల్ల 80 మంది మరణించారు. వరద సాయం పెద్ద స్కామ్. అందరూ ఎన్నికల్లో ఓటువేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి' అని జీహెచ్ఎంసీ ఓటర్లను సంబిత్ పాత్రా కోరారు. (బీజేపీలో చేరిన విక్రం గౌడ్) -
కుటుంబ పాలన సాగుతోంది..
-
బీజేపీ నేత ప్లాస్మా దానం
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 బారినపడి కోలుకుని గత నెలలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన బీజేపీ నేత సంబిట్ పాత్ర సోమవారం గురుగ్రామ్ ఆస్పత్రిలో ప్లాస్మా దానం చేశారు. గురుగ్రామ్‌లోని మెదాంత ఆస్ప్రత్రిలో ఆయన ప్లాస్మా దానం చేశారు. కాగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు ఉధృతమవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దాదాపు 2500 తాజా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 7 లక్షలకు చేరువైంది. వ్యాక్సిన్ వచ్చే వరకూ మహమ్మారికి సరైన చికిత్స కొరవడిన నేపథ్యంలో అందరి దృష్టి ప్లాస్మా థెరఫీపై కేంద్రీకృతమైంది. ఈ క్రమంలో ఢిల్లీలో తొలి ప్లాస్మా బ్యాంక్‌ను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల ప్రారంభించారు. కరోనా నుంచి కోలుకున్న వారు ముందుకు వచ్చి ప్లాస్మాను దానం చేయాల్సిందిగా కేజ్రీవాల్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకు, కరోనా వైరస్ చికిత్స కోసం ప్లాస్మా పొందడంలో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారికి ఇప్పుడు కొంత ఉపశమనం లభిస్తుందని నేను నమ్ముతున్నాను. ప్లాస్మాను దానం చేయడానికి ఇప్పుడు ఎక్కువ మంది ముందుకు వస్తారని నేను ఆశిస్తున్నాను’ అన్నారు. ఐఎల్‌బీఎస్ ఆస్పత్రిలో ఈ ప్లాస్మా బ్యాంక్‌ను ప్రారంభించినట్లు ఆప్ ట్వీట్ చేసింది. చదవండి: మీరైతే ఏం చేస్తారు.. ఇదంతా నిజమేనా? -
కరోనా: ఆస్పత్రిలో చేరిన బీజేపీ నేత
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్ నేత, జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఆస్పత్రిలో చేరారు. కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంలో పరీక్షల కోసం గుర్గావ్లోని ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. దీనిపై సంబిత్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ.. కరోనా పరీక్షల నిమిత్తం చేరినట్లు ఆస్పత్రి వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,566 కరోనా కేసులు నమోదు కాగా, 194 మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,58,333కి చేరింది. (24 గంటల్లో 194 మంది మృతి) -
ఈ ఫోటోకి ఏం అవార్డు ఇస్తారు?
శ్రీనగర్: 2017లో కశ్మీర్లో టెరరిస్టులు హతమార్చిన ఒక పోలీసు ఆఫీస్ కుమార్తె ఫోటోను జమ్మూ కశ్మీర్ పోలీసు ఆఫీసర్ ఇంతియాజ్ హుస్సేన్ తన ట్వీట్టర్లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో తన తండ్రి ఉగ్రవాదుల చేతిలో బలికావడంతో ఆ పాప ఏడుస్తోంది. ఇది చూసిన ఎవరి హృదయమయిన కరిగిపోవాల్సిందే. ఆయన ఈ ఫోటోను పోస్ట్ చేస్తూ ఈ చిత్రం రాబోయే కాలంలో కూడా మానవత్వం ఉన్న ప్రతి మనిషి మనసాక్షిని వెంటాడుతోంది. ఓదార్చడానికి కూడా వీలు లేకుండా ఏడుస్తున్న ఈ పాప 2017లో కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన పోలీసు ఆఫీసర్ కూతురు. ఈ ఫోటోకి ఏమైనా అవార్డు లభిస్తుందా? అని ఇంతియాజ్ ట్వీట్ చేశారు. This picture should haunt the conscience of humanity for times to come. An inconsolable daughter of a police officer martyred in 2017 in Kashmir. Any awards for this photograph? pic.twitter.com/TJwpZCPaF7 — Imtiyaz Hussain (@hussain_imtiyaz) May 6, 2020 తాజాగా కశ్మీర్‌కు చెందిన ముగ్గురు ఫోటో జర్నలిస్టులు చన్నీ ఆనంద్, ముక్తార్ ఖాన్, దార్ యాసిన్‌లకు జీవిత చిత్రాలను చూపించినందుకు గాను పులిట్జర్ ప్రైజ్ 2020 లభించింది. దీంతో ఇప్పుడు ఈ అధికారి చేసిన పోస్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది. వీరి ముగ్గురికి అవార్డు ఇచ్చే సమయంలో పులిట్జర్ బోర్డు తన వెబ్సైట్లో ఇండియా కశ్మీర్ భూభాగంలో కమ్యూనికేషన్‌ని బ్లాక్ చేయడం ద్వారా కశ్మీర్ స్వాతంత్ర్యాన్ని పొగొట్టిన సమయంలో అక్కడవారిని జీవితాల్ని ప్రతిబింబించే ఫోటోలు ఇవి అని పేర్కొంది. ఈ విషయం మీద కాంగ్రెస్, బీజేపీల మధ్య రాజకీయ దుమారం రేగుతోంది. వీరికి అభినందనలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఒక ట్వీట్ చేశాడు. దేశం గర్వపడేలా చేశారు అంటూ వారిని పొగడ్తలతో ముంచెత్తారు. దీనిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. Congratulations to Indian photojournalists Dar Yasin, Mukhtar Khan and Channi Anand for winning a Pulitzer Prize for their powerful images of life in Jammu & Kashmir. You make us all proud. #Pulitzer https://t.co/A6Z4sOSyN4 — Rahul Gandhi (@RahulGandhi) May 5, 2020 బీజీపీ నేత సంబిత్ పాత్ర భారత్‌కు వ్యతిరేకమైన భావాలను వర్ణించడం ద్వారా వారికి ఈ అవార్డు లభించిందని, అవార్డు అందుకున్న వారిలో ఒకరైన దార్ కశ్మీర్‌ను భారత ఆక్రమిత కశ్మీర్‌గా తన ఫోటోలలో పేర్కొన్నారని తెలిపారు. అలాంటి వారికి అవార్డు వస్తే పొడగ్తలతో ముంచేత్తుతారా? రాహుల్, కశ్మీర్ భారతదేశ భూభాగం కాదా? అని సంబిత్ పాత్ర ప్రశ్నించారు. Will Sonia Gandhi answer? Whether She and the Congress Party concur with Rahul Gandhi on the issue of Kashmir not being an integral part of India! Rahul today congratulated those who got an award for considering Kashmir as a “Contested Territory”!#AntiNationalRahulGandhi pic.twitter.com/FoAimhYPrh — Sambit Patra (@sambitswaraj) May 5, 2020 -
మీరైతే ఏం చేస్తారు.. ఇదంతా నిజమేనా?
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట చర్చనీయాంశంగా మారింది. వాళ్లు జిన్నా వంటి స్వాతంత్ర్యం కోరుకుంటున్నారంటూ షేర్ చేసిన వీడియోలో.. ‘ఫ్రెండ్స్.... ఇంకా చెప్పాల్సింది ఏమైనా ఉందా? వాళ్లు హిందుస్తాన్ కోసం పనిచేస్తున్నారా లేదా దేశానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారా? అసలు ఈ విషయంపై చర్చ అవసరమా? దేశానికి ఆవలి వైపున్న వారితో యుద్ధం చేయడం కష్టమా లేదా ఇలా దేశానికి ద్రోహం చేసే వాళ్లతో పోరాడటం కష్టమా.. మీరైతే ఏం చేస్తారు?’ అని ప్రశ్నించారు. (పౌరసత్వ చట్టం: ఎందుకీ ఆందోళనలు?) కాగా షహీన్ భాగ్‌లో సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనకు చెందినదిగా భావిస్తున్న ఈ వీడియోలో... జిన్నా వాలీ ఆజాదీ నినాదం కంటే కూడా నెహ్రూవాలా ఆజాదీ, గాంధీ వాలా ఆజాదీ అనే నినాదాలు ఎక్కువగా వినిపించడం గమనార్హం. ఇక సంబిత్ పాత్రా పోస్టుపై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ స్పందించారు. అసలు ఈ వీడియో ఎంతవరకు నిజమైనదేనా ప్రశ్నించారు. కాగా డిసెంబరు 31, 2014 కి ముందు ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ లేదా పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి ప్రవేశించిన హిందూ, సిక్కు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రిస్టియన్లకు భారత పౌరసత్వం కల్పించేలా నరేంద్ర మోదీ సర్కారు చట్టం తీసుకవచ్చిన విషయం తెలిసిందే. इनको चाहिए “जिन्ना वाली आज़ादी”!! मित्रों,अब कुछ कहना शेष रह गया है क्या? ये हिंदुस्तान के साथ है या हिंदुस्तान के विरुद्ध ..इस पर अब कोई बहस की आवश्यकता है क्या? दुख इस बात पे लगता है की किस से लड़े? ..बाहरवालो से या अपनो से .. जब घर में ही भेदी बैठा है ..तो आप क्या करेंगे? pic.twitter.com/HmAtEAuT1y — Sambit Patra (@sambitswaraj) January 10, 2020 -
‘రాహుల్‌ను అందుకే పక్కనపెట్టారు’
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక చీఫ్‌గా సోనియా గాంధీ నియామకాన్ని బీజేపీ ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత పదవితో గాంధీ వారసులు మ్యూజికల్ ఛైర్స్ ఆట ఆడుతున్నారని విమర్శించింది. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ పనికిరాడని సోనియా నియామకంతో స్పష్టమైందని బీజేపీ ప్రతినిధి సంబిట్ పాత్రా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు సోనియా, రాహుల్ కుటుంబమే దిక్కయిందని అన్నారు. బీజేపీకి పార్టీయే కుటుంబమైతే, కాంగ్రెస్ మాత్రం ఓ కుటుంబానికి చెందిన పార్టీగా ఆయన అభివర్ణించారు. కాగా, జమ్మూ కశ్మీర్ పరిణామాలపై రాహుల్ వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేవిగా ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయానికి బాధ్యత వహిస్తూ ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ రాజీనామా చేసిన నేపథ్యంలో రెండున్నర నెలల తర్వాత పార్టీ తాత్కాలిక చీఫ్‌గా సోనియా గాంధీని సీడబ్ల్యూసీ సమావేశం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. -
ప్రచారం ముగియడంతో సాష్టాంగ నమస్కారం!
పూరి: దేశంలో ఎన్నికల వేడీ రోజురోజుకు పెరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే రెండు దఫాల పోలింగ్ ముగిసింది. ఆదివారానికి మూడోదఫా పోలింగ్‌కు సంబంధించిన ప్రచారం ముగిసింది. దీంతో మూడో దఫా పోలింగ్‌లో పోటీ పడుతున్న అభ్యర్థులు ఆదివారం సాయంత్రం వరకు జోరుగా ప్రచారం నిర్వహించి.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒడిశా పూరి నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సంబిత్ పాత్ర ఆదివారం సాయంత్రం పూరి జగన్నాథస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రచారపర్వంలో బిజి బిజీగా గడిపిన పాత్ర.. ఆ పర్వ ముగిసేదశలో ఆలయంలో సాష్టాంగ ప్రణామం చేశారు. ఆయన సాష్టాంగ ప్రణామం చేసిన వీడియోను ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో నాగార్జున పాట!
భువనేశ్వర్ : ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు వినూత్న ప్రయత్నాలు చేస్తారు.ఆయా ప్రాంతాల వారిగా ఇష్టాయిష్టాలు తెలుసుకొని మరీ ప్రచారంలో అలాంటి పనులు చేస్తారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు వచ్చిన ఏ చిన్న ఛాన్స్‌ను కూడా వదులుకోరు. తాజాగా మన పొరుగున ఉన్న ఒడిశాలో తెలుగు పాట పాడి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు ఓ బీజేపీ అభ్యర్థి. సంబిత్ పాత్రా బీజేపీ జాతీయ ప్రతినిధిగా ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఒడిశాలోని పూరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా.. శుక్రవారం రాత్రి బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. సభకు వచ్చిన కొందరు తెలుగువాళ్లు సరదాగా పాట పాడమని సంబిత్‌ను కోరారు. ఇంకేముంది మన పొలిటికల్ లీడర్ కాస్త సింగర్ అవతారం ఎత్తాడు. నాగార్జున నటించిన క్రిమినల్ సినిమాలోని తెలుసా.. మనసా అనే పాటను ఆలపించారు. సంబిత్ పాడిన పాటకు అక్కడున్న జనాలంతా చప్పట్లుకొట్టారు. అద్భుతంగా పాడారంటూ ప్రశంసల జల్లు కురిపించారు. ప్రొఫెషనల్ సింగర్ మాదిరిగా పాటను ఆపపించారంటూ పొగడ్తలతో ముంచేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారగా.. నెటిజన్లు సైతం సంబిత్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. -
టార్గెట్ వాద్రా.. దాడిని ముమ్మరం చేసిన బీజేపీ
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకగాంధీ రాజకీయ ఆరంగేట్రం చేసిన నేపథ్యంలో ఆమె భర్త రాబర్ట్ వాద్రా లక్ష్యంగా బీజేపీ తన దాడిని ముమ్మరం చేసింది. గతంలో వెలుగుచూసిన అవినీతి ఆరోపణలపై ఈడీ విచారణకు హాజరయ్యేందుకు ఆయన సిద్ధమవుతున్న నేపథ్యంలో బీజేపీ తన విమర్శల దాడిని పెంచింది. పెట్రోల్, డిఫెన్స్ ఒప్పందాల ద్వారా రాబార్ట్ వాద్రా భారీ ఎత్తున ముడుపులు అందుకున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఆరోపించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ముడుపుల ద్వారా అందుకున్న డబ్బుతో లండన్‌లో వాద్రా ఎనిమిది ఆస్తులు కొన్నారని పేర్కొన్నారు. ఈ కేసులో ముద్దాయిగా ఈడీ ముందు రాబర్ట్ వాద్రా హాజరవుతున్నారని చెప్పారు. వేలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని వాద్రా దోచుకున్నారని, అవినీతి పునాదులపై కాంగ్రెస్ పార్టీ నిలబడిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని లూటీ చేసిందని, లక్ష రూపాయలు కూడా లేని వాద్రా దేశవిదేశాల్లో ప్లాట్లు ఎలా కొన్నారని, రోడ్‌పతి నుంచి కరోడ్‌పతి వరకు వాద్రా ఎలా ఎదిగారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఫ్యామిలీ అంతా బెయిల్ ఫ్యామిలీగా మారిందని ఎద్దేవా చేశారు. ప్రియాంక గాంధీ ఫ్యామిలీ బిజినెస్‌లో చేరడం పెద్ద విషయం కాదంటూ ఆమె రాజకీయాల్లో చేరడాన్ని ప్రస్తావించారు. -
‘మమతా తాలిబన్లకు దీదీ’
కోల్‌కతా : పశ్చిమబెంగాల్లో బీజేపీ, టీఎంసీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మిడ్నాపూర్‌లో తలపెట్టిన ర్యాలీని అడ్డుకున్నారు తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తలు. బీజేపీ నాయకులు ప్రయాణిస్తున్న బస్సుల మీద దాడి చేసి ర్యాలీకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు టీఎంసీ కార్యకర్తలే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అంతేకాక ‘మమతా బెనర్జీ తాలిబన్ దీదీలాగా వ్యవహరిస్తూ.. కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. బీజేపీకి పెరుగుతున్న మద్దతు చూసి ఆమె భయపడుతున్నారు. అందుకే అమిత్ షా ర్యాలీని అడ్డుకోవడమే కాక.. కార్యక్రమానికి హాజరవుతున్న మా కార్యకర్తలపై దాడి చేశారు. బస్సులపై రాళ్లు రువ్వారు. వీటన్నింటిని చూస్తూంటే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అర్థం కావడం లేద’ని వాపోయారు. రాష్ట్రంలో మమతా బెనర్జీ నేతృత్వంలో తాలిబన్ శక్తులు రెచ్చిపోతున్నాయని ఆరోపించారు. -
‘నువ్వు జంధ్యం ధరిస్తావా.. నీ గోత్రమేంటి..?’
ఇండోర్ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సోమవారం ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయం సందర్శించారు. ఈ సందర్భంగా రాహుల్ ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ ‘మీరు జంధ్యం ధరించారా.. ధరిస్తే అది ఎలాంటిది.. మీ గోత్రమేంటి’ అంటూ రాహల్‌ని ప్రశ్నించారు. అయితే రాహుల్ ఆలయాలను సందర్శించడం ఇదే ప్రథమం కాదు. గతంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ రాహుల్ సోమ్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రాహుల్ తాను శివ భక్తుడిని అని చెప్పుకున్న సంగతి తెలిసిందే. -
ఆజాద్ వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ
న్యూఢిల్లీ: తనను ఎన్నికల ప్రచారానికి పిలిచే హిందువుల సంఖ్య తగ్గిపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ప్రతిపక్ష పార్టీ హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా వ్యవహారిస్తుందని విమర్శించింది. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. ఆజాద్‌ను తక్కువ మంది ప్రచారానికి పిలువడానికి.. ఆయన హిందూ, ముస్లింలను వేరుగా చూడటమే కారణమని ఆరోపించారు. బీజేపీ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీని ప్రతిష్టను దెబ్బతీసేవిధంగా ప్రయత్నిస్తుందనే ఆరోపణలను కూడా ఆయన ఖండించారు. కాగా, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆజాద్ మాట్లాడుతూ.. ‘ నేను యూత్ కాంగ్రెస్ నాయకునిగా ఉన్నప్పటి నుంచి దేశవ్యాప్తంగా వివిధ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశాను. గతంలో నన్ను 95 శాతం హిందూ సోదరులు, 5శాతం ముస్లిం సోదరులు ప్రచారానికి పిలిచేవారు. కానీ గత నాలుగేళ్లలో నన్ను ప్రచారానికి పిలిచే హిందూ సోదరుల సంఖ్య 20 శాతం పడిపోయింది. నేను వారి తరఫున ప్రచారం చేస్తే ఓట్లు రావాని వారు భయపడుతున్నారు. అందుకే నన్ను పిలవడానికి ఇష్టపడటంలేద’ని అన్నారు. అదేవిధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కూడా ఆజాద్ పలు విమర్శలు చేశారు. -
‘బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే హిందూ పాకిస్తానే’
తిరువనంతపురం : కాంగ్రెస్ నేత శశిథరూర్ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే భారత్దేశం కాస్తా ‘హిందూ పాకిస్తాన్’ గా మారుతోందని ఆరోపించారు. మంగళవారం తిరువనంతపురంలో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే మన ప్రజాస్వామ్య రాజ్యాంగం ఏదైతే ఉందో అది అమలుకు నోచుకోదు. బీజేపీ వారి ప్రయోజనాలకు అనుగుణంగా కొత్త రాజ్యాంగాన్ని తయారుచేసుకుంటుంది. దాని ద్వారా మైనార్టీల హక్కులు అణచివేయబడతాయి. వారికి సమాన గౌరవం ఉండదు. అది భారత్‌ని కాస్తా హిందూ పాకిస్తాన్‌గా మార్చేందుకు దోహదపడుతోంది. మహాత్మ గాంధీ, నెహ్రు, సర్దార్ పటేల్, మౌలానా ఆజాద్ వంటి స్వాతంత్ర్య సమరయోధుల ఆకాంక్షలకు అది విరుద్దమని’ తెలిపారు. కాగా శశిథరూర్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర డిమాండ్ చేశారు. వారి లక్ష్యాల కోసమే కాంగ్రెస్ పాకిస్తాన్‌ను ఏర్పాటు చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ఇప్పటికి భారత్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు, హిందువులకు చెడ్డ పేరు తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. -
మౌనమెందుకు రాహుల్?: బీజేపీ
న్యూఢిల్లీ: పన్ను ఎగవేతకు సంబంధించి బావ రాబర్ట్ వాద్రాకు ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం నోటీసులు పంపడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఎందుకు మాట్లాడటం లేదని బీజేపీ బుధవారం ప్రశ్నించింది. ఈ అంశంపై రాహుల్ మాట్లాడాలని డిమాండ్ చేసింది. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ‘బావకు నోటీసులు రావడంపై రాహుల్ ఎందుకు మౌనంగా ఉన్నారు?’ అని ప్రశ్నించారు. ‘యూపీఏ ప్రభుత్వ హయాంలో మాల్యా, వాద్రాలు చట్టాలను ఉల్లంఘించి కోట్లు గడించారు. అప్పుడు సకల సౌకర్యాలతో బతికిన వారు ఇప్పుడు కష్టాలను ఎదుర్కొంటున్నారు. అక్రమార్కులను మేం ఎలా చూస్తామో, యూపీఏ ఎలా చూసిందో మీరే చెప్పాలి’ అని విలేకరులతో సంబిత్ పాత్ర అన్నారు. -
వాద్రా పన్ను ఎగవేతలపై బీజేపీ ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ బీజేపీ విమర్శల దాడికి పదునుపెట్టింది. రాహుల్ బావ, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా పన్ను ఎగవేతపై వివరణ ఇవ్వాలని రాహుల్‌ను డిమాండ్ చేసింది. 2010-11 ఆర్థిక సంవత్సరంలో పన్ను బకాయిలను చెల్లించాలని ఆదాయ పన్ను శాఖ రాబర్ట్ వాద్రాను ఆదేశించిందని బీజేపీ ప్రతినిధి సంబిట్ పాత్ర పేర్కొన్నారు. వాద్రా పన్ను ఎగవేతలపై రాహుల్ ఏం సమాధానం చెబుతారని ఆయన నిలదీశారు. 2010-11 సంవత్సరానికి రాబర్ట్ వాద్రాకు చెందిన స్కై లైట్ హాస్పిటాలిటీనీ రూ 25.8 కోట్ల పన్ను బకాయిలను చెల్లించాలని ఐటీ శాఖ కోరినట్టు వార్తలు వచ్చిన క్రమంలో బీజేపీ రాహుల్ లక్ష్యంగా విమర్శలు గుప్పించింది. సంబంధిత సంవత్సరానికి కంపెనీ ఆదాయం రూ 42.98 కోట్లు కాగా, కంపెనీ కేవలం రూ 36.9 లక్షలనే ఆదాయంగా చూపిందని ఐటీ వర్గాలు స్పష్టం చేశాయి. వాస్తవ ఆదాయంలో కేవలం 0.86 శాతాన్నేరాబడిగా చూపి కంపెనీ భారీగా పన్ను ఎగవేతకు పాల్పడినట్టు ఐటీ శాఖ విచారణలో నిగ్గు తేలింది. కాగా గతంలోనూ వాద్రా హర్యానా భూముల విషయంలో, పన్ను ఎగవేతలపై బీజేపీ గాంధీ కుటుంబం లక్ష్యంగా విమర్శలతో విరుచుకుపడింది. -
‘ఆ ఫ్యామిలీలో అందరివి నియంతృత్వ పోకడలే’
సాక్షి, హైదరాబాద్ : అధికార దాహంతో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని బీజేపీ అఖిల భారత అధికార ప్రతినిధి సంబీత్ పాత్ర విమర్శలు గుప్పించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో ప్రజల సొమ్ము దోచుకున్నారని ధ్వజమెత్తారు. మీ కుటుంబం, ప్రత్యేకంగా మీ నానమ్మ ఏమి చేసిందో గుర్తు చేసుకోవాలన్నారు. 43 ఏళ్ల క్రితం ఎమర్జెన్సీ విధించి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానించారని మండిపడ్డారు. అంతేకాక ఆర్టికల్ 21ని సస్సెండ్ చేసిన విషయాన్ని సంబీత్ గుర్తు చేశారు. ‘జూన్ 25న,1975లో దివంగత నేత ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించారు. ఇందిరా గాంధీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు. అదే బాటలో రాహుల్ వెళ్తున్నారు. నిరంకుశ దారిలో పోతున్నాడు. ప్రతి ఓటమి తర్వాత ఈవీఎం, ఈసీఐని విమర్శిస్తున్నారు. సీజేఐపై అభిశంసన పెట్టాలని చూశాడు. సంఘ కార్యకర్తలు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారు. జైలుకి వెళ్ళారు. భారత్‌ను పాలించడానికి మాకే హక్కు ఉందని ఆ కుటుంబం అనుకుంటుంది. దివంగత నేత నెహ్రూ కారణంగానే ఇంకా కాశ్మీర్ సమస్య ఉంది. ఆ కుటుంబంలో అందిరివి నియంతృత్వ పోకడలే. అప్రకటిత ఆదాయంపై రాబర్ట్ వాద్రా రూ. 85 కోట్లు ఐటీ కట్టారని వార్తలు వచ్చాయి. ఇన్ని రోజులు కట్టక పోవడం నియంతృత్వమే. వారసత్వ రాజకీయలు చేస్తున్న వారు.. ప్రజాస్వామ్య వాదులు కారు. న్యూ జిన్నా అసదుద్దీన్. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రజలను విభజన చేసే విధంగా ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనకళ్యాణ్ నీతి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రణనీతితో ఒక్కో రాష్ట్రములో అధికారంలోకి వస్తున్నాం. పరివార్ వాద, జాతి వాద, బుజ్జగింపు రాజకీయాలకి వ్యతిరేకం. తెలంగాణలో ప్రస్తుత ప్రభుత్వానికి ఓటమి తప్పదు. మేం కూడా తెలంగాణలో పుంజుకుంటున్నాం. ముందుస్తు ఎన్నికలు అనేది కేవలం ఊహాగానాలు మాత్రమే వాటిపై స్పందించాల్సిన అవసరం లేదని’ బీజేపీ నేత సంబీత్ పాత్ర స్పష్టం చేశారు.